Theatres Combo collections
-
చిన్న సినిమాకు థియేటర్లలో ఊహించని క్రేజ్!
ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా నటించిన చిత్రం ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143'. ఓక యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శ్రీనాథ్ పులకురం దర్శకత్వం వహించగా.. భువన్ రెడ్డి కొవ్వూరి ఈ సినిమాను నిర్మించారు . జూన్ 21న విడుదలైన ఈ చిత్రం విశేష ఆదరణ దక్కించుకుంటోంది. ముఖ్యంగా యూత్, ఫామిలీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ వారం విడుదలైన చిత్రాల్లో మా ప్రభుత్వ జూనియర్ కళాశాల కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. కేవలం మౌత్ టాక్‌తోనే ఈ సినిమాకు ఆదరణ వస్తోంది. సినిమాలో కాలేజీ సన్నివేశాలను ఆడియన్స్ బాగున్నాయని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ మూవీని ఎంజాయ్ చేస్తూ తమ కాలేజీ రోజులను ప్రేక్షకులు గుర్తు చేసుకున్నారు. మదర్ సెంటిమెంట్ సన్నివేశాలు, పాటలు సైతం ఆడియన్స్‌ను అలరిస్తున్నాయి. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు సినిమా బాగుందని ప్రశంసలు కురిపిస్తున్నారని దర్శకుడు శ్రీనాథ్ పులకురం తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల కీలక పాత్రలు పోషించారు. -
ఈ వారం థియేటర్స్, ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలివే..!
ఈ వారంలో సినీ అభిమానులను అలరించేందుకు చిత్రాలు రెడీ అయ్యాయి. గతవారంలో చిన్న సినిమాలు పెద్దఎత్తున రిలీజ్ కాగా.. ఈసారి ఆ సంఖ్య కాస్త తగ్గింది. ఈ వారం థియేటర్లు, ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలేవో ఓ లుక్కేద్దాం. కామెరూన్ విజువల్ వండర్ ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో 'అవతార్: ది వే ఆఫ్ వాటర్ (అవతార్-2)’ ఒకటి. జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 16న ప్రేక్షకులు ముందుకు రానుంది. పాన్ ఇండియా చిత్రంగా 'శాసనసభ' ఇంద్రసేన, ఐశ్వర్యారాజ్ జంటగా వేణు మడికంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శాసనసభ’. తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 16న రిలీజ్ కానుంది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. అరుణ్ విజయ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ అరుణ్ విజయ్ హీరోగా నటించిన తమిళ చిత్రం ‘సినం’. జీఎన్ఆర్ కుమారవేలన్ దర్శకత్వంలో ఆర్. విజయ్‌కుమార్ నిర్మించిన చిత్రం ఇది. ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్‌ను తెలుగులో ‘ఆక్రోశం’ పేరుతో సీహెచ్ సతీష్ కుమార్, జగన్మోహనిలు విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం 16న రిలీజ్ కానుంది. తెలుగులో మొదటి మోషన్ క్యాప్చర్ సినిమా అల్లు వంశీ, ఇతి ఆచార్య హీరో-హీరోయిన్లుగా పరిచయమైన చిత్రం ‘పసివాడి ప్రాణం’. ఎన్.ఎస్.మూర్తి దర్శకుడిగా తెలుగులో ఇప్పటివరకూ రాని వినూత్నమైన ‘లైవ్ కమ్ యానిమేషన్’ టెక్నాలజీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చిరంజీవి ‘పసివాడి ప్రాణం’లో నటించి మెప్పించిన ఇప్పటి సీరియల్ నటి సుజిత ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. డిసెంబరు 16న సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. శ్రీలీల నటించిన సినిమా తెలుగులో.. విరాట్, శ్రీలీల హీరో హీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ‘‘ఐ లవ్ యు ఇడియట్’’. ఎపి అర్జున్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అవిరుద్ర క్రియేషన్స్ బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్, శ్రీమతి వసంత సమర్పణలో సాయి కిరణ్ బత్తుల, సుదర్శన్ గౌడ్ బత్తుల, ఎపి.అర్జున్ నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 17న గ్రాండ్‌గా విడుదలవుతోంది. సుందరాంగుడు కృష్ణసాయి, మౌర్యాని, ఈషా, రీతూ, సాక్షి హీరో హీరోయిన్లుగా దర్శకుడు వినయ్‌బాబు తెరకెక్కించిన చిత్రం ‘సుందరాంగుడు’. ఏవీ సుబ్బారావు సమర్పణలో చందర్ గౌడ్, యం.యస్.కె. రాజు నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 17 న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు ఇవే! ఆహా ఇంటింటి రామాయణం (తెలుగు) డిసెంబరు 16 నెట్‌ఫ్లిక్స్ డాక్టర్ జి (హిందీ) డిసెంబరు 11 అరియిప్పు (మలయాళం)డిసెంబరు 16 కోడ్‌నేమ్: తిరంగా (హిందీ) డిసెంబరు 16 ఇండియన్ ప్రిడేటర్: బీస్ట్ ఆఫ్ బెంగళూర్ (హిందీ సిరీస్) డిసెంబరు 16 ద రిక్రూట్ (వెబ్‌సిరీస్) డిసెంబరు 16 జీ5 స్ట్రాంగ్ ఫాదర్స్, స్ట్రాంగ్ డాటర్స్ (హాలీవుడ్) డిసెంబరు 12 డిస్నీ+హాట్‌స్టార్ నేషనల్ ట్రెజర్: ఎడ్జ్ఆఫ్ హిస్టరీ (వెబ్‌సిరీస్) డిసెంబరు 14 గోవిందా నామ్‌మేరా (హిందీ) డిసెంబరు 16 అమెజాన్ ప్రైమ్ వీడియో ఫిజిక్స్ వాలా (హిందీ సిరీస్) డిసెంబరు 15 -
ఈ వారం ఓటీటీ, థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలివే ..!
కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో చిన్న సినిమాల హవా నడుస్తోంది. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. చిన్న చిత్రాలైనా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. అయితే అదే ఊపులో ఈవారం కూడా మిమ్మల్ని అలరించేందుకు సిద్ధమైపోయాయి. ఈ వారంలో థియేటర్లతో పాటు ఓటీటీకి వస్తున్న సినిమాలేంటో ఓ లుక్కేద్దాం. అల్లరి నరేష్ 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' అల్లరి నరేష్, ఆనంది హీరో,హీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌తో కలిసి హాస్య మూవీస్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈనెల 25న థియేటర్లలో ఈ సినిమా సందడి చేయనుంది. మనిషి తోడేలుగా మారితే... వరుణ్ ధావన్, కృతిసనన్ జంటగా తెరకెక్కిన హారర్ కామెడీ చిత్రం 'భేదియా'. ఈ చిత్రంలో దీపక్ డోబ్రియాల్, అభిషేక్ బెనర్జీ కూడా కీలక పాత్రల్లో నటించాడు. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి తోడేలుగా మారడం వల్ల ఎలాంటి ఇబ్బందులు నేపథ్యంలో రూపొందించిన చిత్రమే 'భేదియా'. తెలుగులో ‘తోడేలు’ పేరుతో అల్లు అరవింద్ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. అమర్ కౌశిక్ ఈచిత్రానికి దర్శకత్వం వహించారు. తెలుగులో వస్తున్న 'లవ్‌టుడే' తమిళంలో సూపర్ హిట్ మూవీ 'లవ్‌టుడే'. అదే పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు. ప్రదీప్ రంగనాథన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో హిట్ టాక్ సాధించింది. నవంబరు 25న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో సత్యరాజ్, రాధిక శరత్ కుమార్, యోగిబాబు, రవీనా రవి, ఇవానా ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి దినేష్ పురుషోత్తమన్ చాయాగ్రహణం, యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఆసక్తికరమైన కథ కథనాలతో సాగే ఈ చిత్రం టాలీవుడ్ ప్రేక్షకులను అలరించనుంది. యాక్షన్ సినిమా 'రణస్థలి' మాటల రచయిత పరుశురాం శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రణస్థలి. ఏజే ప్రొడక్షన్ పతాకంపై సురెడ్డి విష్ణు నిర్మిస్తున్నారు. ఇందులో ధర్మ, ప్రశాంత్, శివజామి, నాగేంద్ర, విజయ్ రాగం తదీతరులు నటిస్తున్నారు. నవంబరు 26న ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇటీవలే ప్రముఖ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి చేతుల మీదు రణస్థలి ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ కథలో హింస అంశాన్ని స్పృశించిన తీరు ఆలోచన రేకెత్తిస్తుంది. ఈ కథలో రణం ఎవరెవరి మధ్య, ఎందుకు సాగిందన్నది కీలకం’ అని చిత్ర బృందం చెబుతోంది. ఈ వారం ఓటీటీలో వస్తున్న చిత్రాలు/వెబ్ సిరీస్‌లివే నెట్‌ఫ్లిక్స్ వెన్స్డే (వెబ్‌సిరీస్) నవంబరు 23 ద స్విమ్మర్స్ (హాలీవుడ్) నవంబరు 23 గ్లాస్ ఆనియన్ (హాలీవుడ్) నవంబరు 23 బ్లడ్, సెక్స్ అండ్ రాయల్టీ (డ్యాకుమెంటరీ సిరీస్) నవంబరు 23 ద నోయల్ డైరీ (హాలీవుడ్) నవంబరు 25 ఖాకీ: ది బిహార్ చాప్టర్ (హిందీ సిరీస్) నవంబరు 25 పడవేట్టు (మలయాళం) నవంబరు 25 అమెజాన్ ప్రైమ్ గుడ్ నైట్ ఊపీ (మూవీ) నవంబరు 23 జీ5 చుప్ (బాలీవుడ్) నవంబరు 25 డిస్నీ+హాట్‌స్టార్ ప్రిన్స్ (తెలుగు) నవంబరు 25 ద గార్డియన్ ఆఫ్ ది గెలాక్సీ హాలిడే స్పెషల్ (హాలీవుడ్) నవంబరు 25 ఆహా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ (తెలుగు మూవీ) నవంబరు 25 ఎన్బీకే అన్‌స్టాపబబుల్ (సీజన్-2 ఎపిసోడ్ 4) నవంబరు 25 సోనీ లివ్ గర్ల్స్ హాస్టల్ (హిందీ సిరీస్) నవంబరు 25 మీట్ క్యూట్ (తెలుగు మూవీ) నవంబరు 25 -
థియేటర్లలో కాంబో దోపిడీ
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను అడ్డుపెట్టుకుని సినిమా థియేటర్లు దోపిడీకి తెరలేపారు. మల్టీప్లెక్స్ థియేటర్లలో కాంబో ప్యాక్ పేరుతో టిక్కెట్లను అమ్ముతున్నారు. కౌంటర్ల ద్వారా టిక్కెట్ల అమ్మకాలను నిలిపివేసి కాంబో ప్యాక్‌తో టిక్కెట్లను అమ్ముతూ థియేటర్ల యజమాన్యాలు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ప్రతి టిక్కెట్‌పై అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ ప్యాక్‌లో కనీసం నాలుగు టిక్కెట్లు తీసుకోవాలని నిబంధన పెడుతున్నారు. మరోవైపు చిన్న థియేటర్లు కూడా బ్లాక్‌లో టిక్కెట్లు అమ్ముతూ దోచేస్తున్నాయి. అగ్ర హీరోల సినిమాలు చూడాలన్న అభిమానుల ఆశలు తీరడం లేదు. ఇప్పటికే సొంతూళ్లకు వెళ్లేందుకు ఆర్టీసీ, రైళ్ల చార్జీల రూపంలో అదనంగా వసూలు చేయడానికి తోడు పండుగ సమయంలో కుటుంబం మొత్తం ఆనందంగా సినిమా వీక్షించడం కూడా భారంగా మారిందని సినీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులు అసహనంతో వెనుతిరిగుతున్నారు.