ఈ వారంలో సినీ అభిమానులను అలరించేందుకు చిత్రాలు రెడీ అయ్యాయి. గతవారంలో చిన్న సినిమాలు పెద్దఎత్తున రిలీజ్ కాగా.. ఈసారి ఆ సంఖ్య కాస్త తగ్గింది. ఈ వారం థియేటర్లు, ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలేవో ఓ లుక్కేద్దాం.
కామెరూన్ విజువల్ వండర్
ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో 'అవతార్: ది వే ఆఫ్ వాటర్ (అవతార్-2)’ ఒకటి. జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 16న ప్రేక్షకులు ముందుకు రానుంది.
పాన్ ఇండియా చిత్రంగా 'శాసనసభ'
ఇంద్రసేన, ఐశ్వర్యారాజ్ జంటగా వేణు మడికంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శాసనసభ’. తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 16న రిలీజ్ కానుంది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు.
అరుణ్ విజయ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్
అరుణ్ విజయ్ హీరోగా నటించిన తమిళ చిత్రం ‘సినం’. జీఎన్‌ఆర్ కుమారవేలన్ దర్శకత్వంలో ఆర్. విజయ్‌కుమార్ నిర్మించిన చిత్రం ఇది. ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్‌ను తెలుగులో ‘ఆక్రోశం’ పేరుతో సీహెచ్ సతీష్ కుమార్, జగన్మోహనిలు విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం 16న రిలీజ్ కానుంది.
తెలుగులో మొదటి మోషన్ క్యాప్చర్ సినిమా
అల్లు వంశీ, ఇతి ఆచార్య హీరో-హీరోయిన్లుగా పరిచయమైన చిత్రం ‘పసివాడి ప్రాణం’. ఎన్.ఎస్.మూర్తి దర్శకుడిగా తెలుగులో ఇప్పటివరకూ రాని వినూత్నమైన ‘లైవ్ కమ్ యానిమేషన్’ టెక్నాలజీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చిరంజీవి ‘పసివాడి ప్రాణం’లో నటించి మెప్పించిన ఇప్పటి సీరియల్ నటి సుజిత ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. డిసెంబరు 16న సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.
శ్రీలీల నటించిన సినిమా తెలుగులో..
విరాట్, శ్రీలీల హీరో హీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్ ‘‘ఐ లవ్ యు ఇడియట్’’. ఎపి అర్జున్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అవిరుద్ర క్రియేషన్స్ బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్, శ్రీమతి వసంత సమర్పణలో సాయి కిరణ్ బత్తుల, సుదర్శన్ గౌడ్ బత్తుల, ఎపి.అర్జున్ నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 17న గ్రాండ్‌గా విడుదలవుతోంది.
సుందరాంగుడు
కృష్ణసాయి, మౌర్యాని, ఈషా, రీతూ, సాక్షి హీరో హీరోయిన్లుగా దర్శకుడు వినయ్‌బాబు తెరకెక్కించిన చిత్రం ‘సుందరాంగుడు’. ఏవీ సుబ్బారావు సమర్పణలో చందర్ గౌడ్, యం.యస్.కె. రాజు నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 17 న థియేటర్లలో విడుదలవుతోంది.
ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు ఇవే!
ఆహా
- ఇంటింటి రామాయణం (తెలుగు) డిసెంబరు 16
నెట్‌ఫ్లిక్స్
- డాక్టర్ జి (హిందీ) డిసెంబరు 11
- అరియిప్పు (మలయాళం)డిసెంబరు 16
- కోడ్‌నేమ్: తిరంగా (హిందీ) డిసెంబరు 16
- ఇండియన్ ప్రిడేటర్: బీస్ట్ ఆఫ్ బెంగళూర్ (హిందీ సిరీస్) డిసెంబరు 16
- ద రిక్రూట్ (వెబ్‌సిరీస్) డిసెంబరు 16
జీ5
- స్ట్రాంగ్ ఫాదర్స్, స్ట్రాంగ్ డాటర్స్ (హాలీవుడ్) డిసెంబరు 12
డిస్నీ+హాట్‌స్టార్
- నేషనల్ ట్రెజర్: ఎడ్జ్‌ఆఫ్ హిస్టరీ (వెబ్‌సిరీస్) డిసెంబరు 14
- గోవిందా నామ్‌మేరా (హిందీ) డిసెంబరు 16
అమెజాన్ ప్రైమ్ వీడియో
- ఫిజిక్స్ వాలా (హిందీ సిరీస్) డిసెంబరు 15
Comments
Please login to add a commentAdd a comment