latest movies
-
ఈ వారం ఓటీటీల్లో 34 సినిమాలు రిలీజ్.. అవేంటంటే? (ఫొటోలు)
-
సలార్ కి పోటీనా..! పాన్ ఇండియా ఛాలెంజ్
-
మాస్ రాజా ఫిల్మ్ ఫెస్టివల్
-
ఈ వారం థియేటర్/ఓటీటీలో రానున్న సినిమాలివే..!
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఓటీటీ ట్రెండ్ నడుస్తోంది. సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు థియేటర్లలో సందడి చేయగా.. ఆ తర్వాత చిన్న సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. ఇక ఫిబ్రవరి మొదటి వారంలోనే పలు సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ వారం సినీ ప్రేక్షకులకు కనువిందు చేయనున్న సినిమాలపై ఓ లుక్కేద్దాం. థియేటర్లతో పాటు ఓటీటీలో రిలీజ్‌కు సిద్ధమైన సినిమాలేవో ఓసారి చూసేద్దాం. సందీప్ కిషన్- మైఖేల్ టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం మైఖేల్. రంజిత్ జయకోడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్గా నటించింది. విజయ్ సేతుపతి ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఫిబ్రవరి3న ప్రేక్షకుల ముందుకు రానుంది. సుహాస్- రైటర్ పద్మభూషణ్ కలర్ ఫోటో ఫేమ్ సుహాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రైటర్ పద్మభూషణ్. షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో టీనా శిల్పరాజ్ హీరోయిన్గా నటిస్తుంది.చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా పోస్టర్లు, టీజర్ ఇప్పటికే పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేస్తున్నాయి. ఫిబ్రవరి 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. జయప్రద- సువర్ణ సుందరి సీనియర్ నటి జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘సువర్ణసుందరి’. సురేంద్ర మాదారపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ చిత్రాన్ని ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించారు. డాక్టర్ ఎమ్వీకే రెడ్డి సమర్పణలో ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై తెరకెక్కించారు. కరోనా ప్రభావంతో వాయిదా పడిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 3న భారీ స్థాయిలో విడుదల కానుంది. ప్రేమదేశం త్రిగుణ్, మేఘా ఆకాష్ జంటగా నటించిన చిత్రం ‘ప్రేమదేశం’. శ్రీకాంత్ సిద్ధమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మధుబాల ప్రత్యేక పాత్రలో నటించారు. శిరీష సిద్ధమ్ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 3న రిలీజ్ కానుంది. బుట్టబొమ్మ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో అవార్డులు అందుకున్న అనిఖా సురేంద్రన్ తెలుగులో హీరోయిన్గా నటిస్తున్న చిత్రం బుట్టబొమ్మ. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్.. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అర్జున్ దాస్, సూర్య వశిష్ట ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు నెట్‌ఫ్లిక్స్ పమీలా (హాలీవుడ్) జనవరి 31 గంతర్స్ మిలియన్స్ (వెబ్‌సిరీస్) ఫిబ్రవరి 1 క్లాస్ (వెబ్‌సిరీస్- సీజన్-1) ఫిబ్రవరి 3 ట్రూ స్పిరిట్ ఫిబ్రవరి 3 ఇన్‌ఫయీస్టో (హాలీవుడ్) ఫిబ్రవరి 3 స్ట్రామ్ బాయిల్ ఫిబ్రవరి 3 వైకింగ్ ఊల్ఫ్ ఫిబ్రవరి 3 డిస్నీ+హాట్‌స్టార్ బ్లాక్ పాంథర్ వాఖండా ఫరెవర్ (హాలీవుడ్) ఫిబ్రవరి 1 సెంబి (తమిళ్) ఫిబ్రవరి 3 ఆహా అన్‌స్టాపబుల్ సీజన్-2 విత్ ఎన్బీకే- ఫిబ్రవరి 3 ముఖచిత్రం(తెలుగు)- ఫిబ్రవరి 3 కపుల్ ఆన్ బ్యాక్‌ట్రాక్( కొరియన్ మూవీ ఇన్ తెలుగు)- ఫిబ్రవరి 4 కామెడీ స్టాక్ ఎక్సేంజ్- ఫినాలే ఎపిసోడ్- ఫిబ్రవరి 4 సోనీలివ్ జహనాబాద్ ఆఫ్ లవ్ అండ్ వార్ (హిందీ) ఫిబ్రవరి 3 -
ఈ వారం థియేటర్లు, ఓటీటీలో సందడి చేసే సినిమాలివే..!
క్రిస్మస్ సందర్భంగా ఈవారం థియేటర్లకు కొత్త సినిమాలు క్యూ కట్టాయి. సినీ ప్రేక్షకులకు విందు పంచేందుకు రెడీ అయ్యాయి. ఇప్పటికే జేమ్స్ కామెరూన్ 'అవతార్-2' థియేటర్లలో అలరిస్తోంది. ఈ వారం థియేటర్లతో పాటు ఓటీటీలో విడుదలకు సిద్ధమైన చిత్రాలపై ఓ లుక్కేద్దాం. (ఇది చదవండి: రవితేజ 'ధమాకా' ట్రైలర్ అవుట్.. మాస్ యాక్షన్ అదిరిపోయింది) రవితేజ 'ధమాకా': మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం 'ధమాకా'. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు త్రినాథ రావు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన పెళ్లి సందD ఫేమ్ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈనెల 23న థియేటర్లలో సందడి చేయనుంది. 18 పేజెస్ లవ్ స్టోరీ: నిఖిల్ సిద్దార్థ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం 18 పేజెస్. ‘జీఏ 2’ పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ కథ అందించారు. ఆయన శిష్యుడు, ‘కుమారి 21ఎఫ్’ డైరెక్టర్ సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈనెల 23న ప్రేక్షకులను అలరించనుంది. 'లాఠీ'తో వస్తున్న విశాల్: విశాల్ తాజా చిత్రం 'లాఠీ'. సునయన కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ప్రభు ముఖ్య పాత్ర పోషించారు. ఆర్. వినోద్ కుమార్‌ను దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నటులు నందా, రమణ కలిసి రాణా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. ఈ భారీ చిత్రానికి సుబ్రమణ్యం చాయాగ్రహణం, యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో రూపొందింది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 22వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. నయన్‌తో కనెక్ట్: లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన మరో లేటెస్ట్ హార్రర్ చిత్రం 'కనెక్ట్'. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై నయన్ స్వయంగా నిర్మించింది. తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. డిసెంబర్ 22న ఈ సినిమా విడుదల కానుంది. ‘సర్కస్’ రణ్వీర్ సింగ్, పూజాహెగ్డే, జాక్వెలైన్ ఫెర్నాండెజ్, వరుణ్ శర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం సర్కస్. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్, బాద్షా, లీజో జార్జ్ సంగీతమందించారు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈనెల 23 విడుదల కానుంది. ఓటీటీకీ రెడీ అయిన చిత్రాలు ♦ ఆహా ►'మసూద'- డిసెంబర్ 21 ♦ నెట్‌ఫ్లిక్స్ ► జయ జయ జయ జయహే-డిసెంబర్ 22 ♦ వెబ్‌సిరీస్‌లు నెట్‌ఫ్లిక్స్ ఎమిలి ఇన్ పారిస్ - డిసెంబరు 21 ఎలైస్ ఇన్ బోర్డర్ ల్యాండ్ - డిసెంబరు 22 గ్లాస్ ఆనియన్: నైవ్స్ అవుట్ మిస్టరీ - డిసెంబరు 23 ద ఫాబ్యూలస్ - డిసెంబరు 23 ద టీచర్ - డిసెంబరు 23 అమెజాన్ ప్రైమ్ టామ్ క్లాన్సీస్ జాక్ ర్యాన్- డిసెంబరు 21 జీ5 షడ్యంత్ర -డిసెంబరు 18 పిచర్స్ -డిసెంబరు 23 డిస్నీ+హాట్‌స్టార్ బిగ్బెట్ - డిసెంబరు 21 సోనీ లివ్ కాఠ్మాండు కనెక్షన్ - డిసెంబరు 23 తారా వర్సెస్ బిలాల్- డిసెంబరు 23 -
ఈ వారం థియేటర్స్, ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలివే..!
ఈ వారంలో సినీ అభిమానులను అలరించేందుకు చిత్రాలు రెడీ అయ్యాయి. గతవారంలో చిన్న సినిమాలు పెద్దఎత్తున రిలీజ్ కాగా.. ఈసారి ఆ సంఖ్య కాస్త తగ్గింది. ఈ వారం థియేటర్లు, ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలేవో ఓ లుక్కేద్దాం. కామెరూన్ విజువల్ వండర్ ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో 'అవతార్: ది వే ఆఫ్ వాటర్ (అవతార్-2)’ ఒకటి. జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 16న ప్రేక్షకులు ముందుకు రానుంది. పాన్ ఇండియా చిత్రంగా 'శాసనసభ' ఇంద్రసేన, ఐశ్వర్యారాజ్ జంటగా వేణు మడికంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శాసనసభ’. తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 16న రిలీజ్ కానుంది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. అరుణ్ విజయ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ అరుణ్ విజయ్ హీరోగా నటించిన తమిళ చిత్రం ‘సినం’. జీఎన్ఆర్ కుమారవేలన్ దర్శకత్వంలో ఆర్. విజయ్‌కుమార్ నిర్మించిన చిత్రం ఇది. ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్‌ను తెలుగులో ‘ఆక్రోశం’ పేరుతో సీహెచ్ సతీష్ కుమార్, జగన్మోహనిలు విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం 16న రిలీజ్ కానుంది. తెలుగులో మొదటి మోషన్ క్యాప్చర్ సినిమా అల్లు వంశీ, ఇతి ఆచార్య హీరో-హీరోయిన్లుగా పరిచయమైన చిత్రం ‘పసివాడి ప్రాణం’. ఎన్.ఎస్.మూర్తి దర్శకుడిగా తెలుగులో ఇప్పటివరకూ రాని వినూత్నమైన ‘లైవ్ కమ్ యానిమేషన్’ టెక్నాలజీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చిరంజీవి ‘పసివాడి ప్రాణం’లో నటించి మెప్పించిన ఇప్పటి సీరియల్ నటి సుజిత ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. డిసెంబరు 16న సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. శ్రీలీల నటించిన సినిమా తెలుగులో.. విరాట్, శ్రీలీల హీరో హీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ‘‘ఐ లవ్ యు ఇడియట్’’. ఎపి అర్జున్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అవిరుద్ర క్రియేషన్స్ బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్, శ్రీమతి వసంత సమర్పణలో సాయి కిరణ్ బత్తుల, సుదర్శన్ గౌడ్ బత్తుల, ఎపి.అర్జున్ నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 17న గ్రాండ్‌గా విడుదలవుతోంది. సుందరాంగుడు కృష్ణసాయి, మౌర్యాని, ఈషా, రీతూ, సాక్షి హీరో హీరోయిన్లుగా దర్శకుడు వినయ్‌బాబు తెరకెక్కించిన చిత్రం ‘సుందరాంగుడు’. ఏవీ సుబ్బారావు సమర్పణలో చందర్ గౌడ్, యం.యస్.కె. రాజు నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 17 న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు ఇవే! ఆహా ఇంటింటి రామాయణం (తెలుగు) డిసెంబరు 16 నెట్‌ఫ్లిక్స్ డాక్టర్ జి (హిందీ) డిసెంబరు 11 అరియిప్పు (మలయాళం)డిసెంబరు 16 కోడ్‌నేమ్: తిరంగా (హిందీ) డిసెంబరు 16 ఇండియన్ ప్రిడేటర్: బీస్ట్ ఆఫ్ బెంగళూర్ (హిందీ సిరీస్) డిసెంబరు 16 ద రిక్రూట్ (వెబ్‌సిరీస్) డిసెంబరు 16 జీ5 స్ట్రాంగ్ ఫాదర్స్, స్ట్రాంగ్ డాటర్స్ (హాలీవుడ్) డిసెంబరు 12 డిస్నీ+హాట్‌స్టార్ నేషనల్ ట్రెజర్: ఎడ్జ్ఆఫ్ హిస్టరీ (వెబ్‌సిరీస్) డిసెంబరు 14 గోవిందా నామ్‌మేరా (హిందీ) డిసెంబరు 16 అమెజాన్ ప్రైమ్ వీడియో ఫిజిక్స్ వాలా (హిందీ సిరీస్) డిసెంబరు 15 -
ఈ వారంలో థియేటర్లు, ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలివే
సినీ ప్రేక్షకులకు ఈ వారం మరింత వినోదం అందనుంది. మిమ్మల్ని అలరించేందుకు ప్రతి వారంలాగే కొత్త కొత్త చిత్రాలు సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ వారం ఓటీటీలో అగ్రహీరోల చిత్రాలు వచ్చేస్తున్నాయి. ఈ వారం థియేటర్లతో పాటు ఓటీటీకి రానున్న చిత్రాల వివరాలేంటో ఓ లుక్కేద్దాం పదండి. భయపెట్టేందుకు సిద్ధమైన 'మసూద'..!: సీనియర్ నటి సంగీత, తిరువీర్, సాయికిరణ్ ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'మసూద'. హారర్ డ్రామా నేపథ్యంలో దర్శకుడు రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విజయవంతమైన బ్లాక్బస్టర్ల తర్వాత స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ తన మూడో చిత్రంగా ‘మసూద’ను ప్రకటించింది. ఈ చిత్రం ఈనెల 18న థియేటర్లలో విడుదల కానుంది. మాస్ కథతో వస్తున్న‘గాలోడు’ సుధీర్, గెహ్నా సిప్పి జంటగా నటించిన చిత్రం ‘గాలోడు’. రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకుడు. ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఉత్కంఠభరిత కథతో..: ఎన్.రావన్‌రెడ్డి, శ్రీనిఖిత, అలంకృత షా, రవీంద్ర బొమ్మకంటి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'అలిపిరికి అల్లంత దూరంలో'. ఈ చిత్రానికి ఫణి కల్యాణ్ సంగీతమందిస్తున్నారు. రెడ్డి రాజేంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రమేశ్ దబ్బుగొట్టు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 18న థియేటర్లలో రిలీజ్ కానుంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్ ప్రేమ కథ: శ్రీ ధనలక్ష్మీ మూవీస్ పతాకంపై బీసు చందర్ గౌడ్ నిర్మిస్తున్న ప్రేమ కథాచిత్రం ‘సీతారామపురంలో ఒక ప్రేమ జంట’. ఎం. వినయ్ బాబు దర్శకత్వంలో రణధీర్, నందినీ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 18న అత్యధిక థియేటర్లలో విడుదలకు సిద్దమవుతోంది. హిందీలో దృశ్యం-2..: అజయ్ దేవగణ్, శ్రియా శరన్, టబు ప్రధాన పాత్రల్లో హిందీలో తెరకెక్కుతున్న చిత్రం 'దృశ్యం-2'. మలయాళంలో సూపర్ హిట్ మూవీ దృశ్యానికి సీక్వెల్‌గా వస్తోంది. ఇప్పటికే తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రానికి అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించగా ఈనెల 18న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లివే మెగాస్టార్ ‘గాడ్‌ఫాదర్’: మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్. మలయాళ మూవీ లూసీఫర్ రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఊహించని స్థాయిలో రెస్పాన్స్ సొంతం చేసుకుంది. దసరా సందర్భంగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన గాడ్ ఫాదర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈనెల 19 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. రాజ్‌తరుణ్ 'పెళ్లి సందడి': రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన వెబ్‌సిరీస్ అహ నా పెళ్లంట. ఏబీసీడీకి దర్శకత్వం వహించిన సంజీవరెడ్డి ఈ వెబ్‌సిరీస్‌కు దర్శకత్వం వహించగా, రాహుల్ తమడ, సాయిదీప్ రెడ్డి బొర్రా నిర్మించారు. రొమాంటిక్ కామెడీ జోనర్లో తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్ నవంబర్ 17న జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీకి కార్తి థ్రిల్లర్ మూవీ: కార్తీ హీరోగా, రాశీ ఖన్నా, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం సర్దార్. వాటర్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించాడు. అక్టోబర్ 21న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈనెల 18 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. మరికొన్ని హాలీవుడ్ చిత్రాలు /వెబ్‌సిరీస్‌లు నెట్‌ఫ్లిక్స్ ది వండర్ (హాలీవుడ్) నవంబరు 16 1899 (హాలీవుడ్) నవంబరు 17 రిటర్న్ టు క్రిస్మస్ క్రీక్ (హాలీవుడ్) నవంబరు 17 ఇలైట్ (హాలీవుడ్) నవంబరు 18 స్లంబర్‌ల్యాండ్( హాలీవుడ్) నవంబరు 18 అమెజాన్ ప్రైమ్ వీడియో హాస్టల్‌డేజ్ సీజన్-3 (వెబ్‌సిరీస్-హిందీ) నవంబరు 16 ది సెక్స్‌లైవ్స్ ఆఫ్ కాలేజ్‌గర్ల్స్ (వెబ్‌సిరీస్) నవంబరు 18 డిస్నీ+హాట్‌స్టార్ ఇరవతం (తమిళ్/తెలుగు) నవంబరు 17 సీతారామం (తమిళ్) నవంబరు 18 సోనీ లివ్ అనల్ మీలే పని తులి (తమిళ్) నవంబరు 18 వండర్ ఉమెన్ (తెలుగు) నవంబరు 18 -
అవి ఉన్నంత కాలం ప్రేమ ఎప్పుడు ఓడిపోదు.. 'నిన్నే చూస్తూ' ఆడియో రిలీజ్
శ్రీకాంత్ గుర్రం, బుజ్జి (హేమలతా రెడ్డి) హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం 'నిన్నే చూస్తూ'. కె.గోవర్ధనరావు దర్శకత్వంలో.. వీరభద్ర క్రియేషన్స్ బ్యానర్‌పై పోతిరెడ్డి హేమలత రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా ఆడియోను ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ చేతులమీదుగా విడుదల చేశారు. ఈ పాటలకు రమణ్ రాథోడ్ సంగీతమందించారు. చిత్ర నిర్మాత హేమలత రెడ్డి గారు మాట్లాడుతూ.. 'ఈ సినిమా ఆడియోను మణిశర్మ రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా ప్రేమ ఎప్పుడూ ఓడిపోకూడదు అనే ఆలోచనతో పెద్దలకు ప్రేమికులకు అర్థమయ్యే రీతిలో తెరకెక్కించాం. ఈ పాటలు మాకు కచ్చితంగా మంచి పేరు తీసుకొస్తాయి. ఈ నెల చివరి వారంలో ఈ సినిమాను విడుదల చేస్తాం.' అని అన్నారు. చిత్ర దర్శకుడు కె.గోవర్ధనరావు మాట్లాడుతూ..'ప్రేమించే మనుషులు, మనసులు ఉన్నంతవరకు ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు. అని చెప్పే ప్రేమకథా చిత్రానికి సీనియర్ యాక్టర్స్ ను సుమన్, సుహాసిని, బాను చందర్, శాయాజి షిండే, కిన్నెర లాంటి వారు పని చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే వీరందరినీ డైరెక్షన్ చేసే అవకాశం కల్పించిన నిర్మాత హేమలత రెడ్డి గారికి కృతజ్ఞతలు' అని అన్నారు. -
పల్లెటూరి నేపథ్యంలో సాగే ప్రేమకథ 'నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా'
తేజ్ కూరపాటి, అఖిల జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా'. వెంకట్ వందెల దర్శకత్వంలో ముల్లేటి నాగేశ్వరావు, ముల్లేటి కమలాక్షి, గుబ్బల వేంకటేశ్వరావులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీని ఈనెల 14న థియేటర్లలో ప్రేక్షకులను అలరించనుందని చిత్రబృందం ప్రకటించింది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి తెలుగు నిర్మాతల మండలి కార్యదర్శి మెహన్ వడ్లపట్ల, యం.ఆర్.సి. వడ్ల పట్ల , నిర్మాతలు సి.హెచ్వీ.యస్.యన్ బాబ్జీ, కాసుల రామకృష్ణ, రవీంద్ర గోపాల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెలుగు నిర్మాతల మండలి కార్యదర్శి మెహన్ వడ్లపట్ల మాట్లాడుతూ.. 'ఇంతకుముందు ముల్లేటి నాగేశ్వరావు చాలా మంచి సినిమాలు తీశారు. 15 ఏళ్ల గ్యాప్ తరువాత నిర్మించిన ఈ సినిమా పాటలు, టీజర్, ట్రైలర్ చాలా బాగున్నాయి. ఈ నెల 14న వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి' అని అన్నారు. యం.ఆర్.సి. వడ్లపట్ల చౌదరి మాట్లాడుతూ.. 'ముల్లేటి వారు సినిమాను ఒక తపస్సులా భావించి చాలా కష్టపడి తీశారు. మంచి కథను సెలెక్ట్ చేసుకొని తీశారు.ఈ సినిమా తరువాత ముల్లేటి ఫ్యామిలీతో మరో సినిమా తీస్తున్నాం. ఈ నెల 14 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి' అని అన్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ముల్లేటి నాగేశ్వరావు మాట్లాడుతూ.. 'మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. మంచి కాన్సెప్ట్ తో పల్లెటూరి నేపధ్యంలో సాగే చక్కటి ప్రేమకథలో యూత్‌కు కావాల్సిన వినొదాన్ని మిక్స్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. తేజ్ కూరపాటి ఈ సినిమాలో చాలా బాగా నటించాడు. హీరోయిన్‌కు ఇది మొదటి సినిమా అయినా చాలా చక్కగా నటించింది. మంచి కథతో వస్తున్న ఈ సినిమాను ఫ్యామిలీ అందరూ వచ్చి చూసేలా ఉంటుంది.' అని అన్నారు. చిత్ర దర్శకుడు వెంకట్ వందెల మాట్లాడుతూ..'మంచి కంటెంట్‌తో రెగ్యులర్ స్టోరీకు భిన్నంగా వస్తున్న ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది.ప్రతి ఒక్కరికీ రీచ్ అవ్వాలనే ఉద్దేశ్యంతో సరైన థియేటర్స్ దొరకనందున మేము సినిమాను వాయిదా వేసుకుంటూ వచ్చాం. చివరకు మాకు అనుకున్న థియేటర్స్ లభించడంతో ఈ నెల 14న రిలీజ్ చేస్తున్నాం. అందరూ మా సినిమాను అశీర్వదించాలని కోరుతున్' అని అన్నారు. -
సింగిల్ క్యారెక్టర్‌తో వస్తున్న 'హలో మీరా'.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
సింగిల్ క్యారెక్టర్ మూవీ 'హలో మీరా'తో డైరెక్టర్‌గా పరిచయమవుతున్నారు కాకర్ల శ్రీనివాసు. గార్గేయి యల్లాప్రగడ ప్రధాన పాత్రలో ఓ వైవిధ్యభరితమైన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో ప్రధాన పాత్ర అయిన మీరాను చూపిస్తూ కథలోని కోణాన్ని చూపించారు. కేవలం సింగిల్ క్యారెక్టర్‌తో సినిమాను నడిపించడమే ప్రత్యేకత. సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్‌గా కథ మొత్తం కూడా మీరా అనే పాత్ర చుట్టూ తిరుగుతూ ఉంటుంది. లూమియర్ సినిమా బ్యానర్‌పై జీవన్ కాకర్ల సమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ పోస్టర్లో మీరా వెనకాల కనిపిస్తున్న ప్రకాశం బ్యారేజ్, ఆకాశంలో పక్షులు ఎగురు తుండటం చూస్తుంటే ఈ సినిమాలో ఊహకందని సస్పెన్స్ ఉంటుందని తెలుస్తోంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు మునుపెన్నడూ లేని అనుభూతినిస్తుందని దర్శకుడు అంటున్నారు.అతి త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. సూరి సాధనాల అసోసియేట్ డైరెక్టర్ గా పని చేశారు. -
గరం సత్తితో డీజే టిల్లు ఫేమ్ సిద్ధూ హిలేరియస్ ఇంటర్వ్యూ
-
‘అంతిమ్’లో పోలీస్‌గా నటించేటప్పుడు కొంచెం భయపడ్డాను: సల్మాన్ ఖాన్
Salman Khan: బాలీవుడ్ కండల హీరో సల్మాన్ ఖాన్ హీరోగా, ఆయుష్ శర్మ ప్రతినాయకుడిగా కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం ‘అంతిమ్’. ప్రస్తుతం ఈ మువీ బాక్సాఫీస్ వద్ద బారీ వసూళ్లు రాబడుతోంది. నవంబర్ 26న రిలీజ్ అయిన యాంటిమ్ చిత్రం కేవలం 3 రోజుల్లోనే 17 కోట్ల రూపాయలు వసూళ్లు చేసింది. చిత్రం విజయంపై బాయ్ తాజాగా మీడియాతో సంభాషించారు. 'అంతిమ్' మువీలో పోలీసుగా నటించడానికి భయపడ్డానని, గతంలో పోషించిన పోలీసు పాత్రలతో పోల్చితే ఇది విభిన్నమైన పాత్ర అని, చిత్రం మొత్తం చాలా సరదాగా సాగిపోతుందని మీడియాకు తెలిపారు. ప్రస్తుతం సల్మాన్ 'అంతిమ్' ప్రమోషన్స్‌పై దృష్టి సారించారు. దీనిలో భాగంగా దేశంలోని మెట్రో నగరాలకు వెళ్లనున్నారు. చిత్రం బృందంతో కలిసి 'అంతిమ్' ప్రచారం కోసం గుజరాత్, ఢిల్లీ, తన స్వస్థలమైన ఇండోర్‌కు వెళ్లినట్లు సమాచారం. -
నేటి సినిమాకు కథతో పనిలేదు: దాసరి
దర్శకరత్నకు బొల్లిముంత అవార్డు ప్రదానం తెనాలి: కథతో పనిలేకుండా హీరో అంగీకరిస్తేనే సినిమాలు తీస్తున్న ధోరణి బాధ కలిగిస్తోందని దర్శకరత్న దాసరి నారాయణరావు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం గుంటూరు జిల్లా తెనాలిలో బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు రావిపాటి వీరనారాయణ అధ్యక్షతన ప్రత్యేక సభ నిర్వహించారు. ఈ సందర్భంగా బొల్లిముంత శివరామకృష్ణ సాహితీ కళా అవార్డును దాసరి నారాయణరావుకు ‘సాక్షి’ దినపత్రిక ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి ప్రదానం చేశారు. అనంతరం దాసరి మాట్లాడుతూ బొల్లిముంత శివరామకృష్ణ ‘ప్రజానాయకుడు’లో రాసిన డైలాగులను నేటి రాజకీయ నాయకులకు చూపితే వాళ్లు బతకడం కష్టమని వ్యాఖ్యానించారు. సాక్షి ఈడీ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ వివిధ రంగాల్లో అనితరసాధ్యమైన ప్రయోగాలు చేస్తూ శిఖర సమానుడిగా వెలుగుతున్న దాసరికి.. సమాజంలో మార్పు కోసం జీవితాంతం పోరాటం చేసిన బొల్లిముంత అవార్డును ప్రదానం చేయటం సముచితమన్నారు. పత్రికారంగ ంలో దాసరి చేసిన సేవలు గొప్పవని పేర్కొన్నారు.