నేటి సినిమాకు కథతో పనిలేదు: దాసరి
దర్శకరత్నకు బొల్లిముంత అవార్డు ప్రదానం
తెనాలి: కథతో పనిలేకుండా హీరో అంగీకరిస్తేనే సినిమాలు తీస్తున్న ధోరణి బాధ కలిగిస్తోందని దర్శకరత్న దాసరి నారాయణరావు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం గుంటూరు జిల్లా తెనాలిలో బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు రావిపాటి వీరనారాయణ అధ్యక్షతన ప్రత్యేక సభ నిర్వహించారు. ఈ సందర్భంగా బొల్లిముంత శివరామకృష్ణ సాహితీ కళా అవార్డును దాసరి నారాయణరావుకు ‘సాక్షి’ దినపత్రిక ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి ప్రదానం చేశారు.
అనంతరం దాసరి మాట్లాడుతూ బొల్లిముంత శివరామకృష్ణ ‘ప్రజానాయకుడు’లో రాసిన డైలాగులను నేటి రాజకీయ నాయకులకు చూపితే వాళ్లు బతకడం కష్టమని వ్యాఖ్యానించారు. సాక్షి ఈడీ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ వివిధ రంగాల్లో అనితరసాధ్యమైన ప్రయోగాలు చేస్తూ శిఖర సమానుడిగా వెలుగుతున్న దాసరికి.. సమాజంలో మార్పు కోసం జీవితాంతం పోరాటం చేసిన బొల్లిముంత అవార్డును ప్రదానం చేయటం సముచితమన్నారు. పత్రికారంగ ంలో దాసరి చేసిన సేవలు గొప్పవని పేర్కొన్నారు.