మద్యం మత్తులో డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌ కారు బీభత్సం.. చితకబాదిన స్థానికులు | Drunk Film Director CRASHES SUV Into Kolkata Market | Sakshi

మద్యం మత్తులో డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌ కారు బీభత్సం.. చితకబాదిన స్థానికులు

Apr 7 2025 8:12 AM | Updated on Apr 7 2025 10:12 AM

Drunk Film Director CRASHES SUV Into Kolkata Market

కోల్‌కతా: మద్యం మత్తులో ఓ సీరియల్‌ డైరెక్టర్‌ బీభత్సం సృష్టించారు. మద్యం మత్తులో కారును వేగంగా నడుపుతూ జనంపైకి దూసుకెళ్లారు. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఆరుగురు పరిస్థితి విషమంగా మారింది.    

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం ఉదయం దక్షిణ కోల్‌కతాలో రద్దీగా ఉండే ప్రాంతంలో ఓ కారు జనాలపైకి దూసుకెళ్లింది. కారు బీభత్సంలో ఒకరు మృతి చెందిగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

చితకబాదిన స్థానికులు
ప్రమాదం జరిగిన సమయంలో కారులో ప్రముఖ బెంగాలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ చానల్‌కు చెందిన ఓ డైలీ సీరియల్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉన్నట్లు తెలిపారు. ఘటన అనంతరం నిందితుల్ని స్థానికులు దేహశుద్ధి చేశారు. అనంతరం, వారిని పోలీసులకి అప్పగించారు.పోలీసుల విచారణలో మద్యం మత్తులో ఉన్నది  బెంగాలీ సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు సిద్ధాంత దాస్ అలియాస్ విక్టోతో పాటు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీయా బసు ఉన్నట్లు నిర్ధారించారు.  

ఘటనకు ముందు ఏం జరిగింది
ఘటనకు ముందు డైరెక్టర్‌,ప్రొడ్యూసర్‌ తాము నిర్మించిన ఓ టీవీ షో సూపర్‌ హిట్‌ కావడంతో దక్షిణ కోల్‌కతాలోని సౌత్ సిటీ మాల్‌ పబ్‌లో శనివారం అర్థరాత్రి 2గంటల వరకు పార్టీ చేసుకున్నారు. పార్టీలో పాల్గొన్న పలువురు ఎవరికి వారు ఇంటికి వెళ్లిపోగా సిద్ధాంత, శ్రీయా ఇద్దరు పూటుగా మద్యం సేవించి రాత్రంతా నగరంలో డ్రైవింగ్ చేస్తూ తిరిగారు.

ఆరుగురి పరిస్థితి విషమం
సరిగ్గా ఆదివారం ఉదయం సుమారు 09:30 గంటల సమయంలో ప్రొడ్యూసర్‌,డైరెక్టర్‌ ప్రయాణిస్తున్న కారు ఠాకుర్‌పుకూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాదచారులపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. నలుగురిని కస్తూరి నర్సింగ్ హోమ్‌కు, మరో ఇద్దరిని తీవ్ర గాయాలతో సీఎంఆర్‌ఐ హాస్పిటల్‌కు తరలించాం. నిందితుల వాహనాన్ని సీజ్‌ చేసి విచారణ ప్రారంభించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement