tenali
-
మాజీ ఎమ్మెల్యే తనయుడి రిసెప్షన్‌కు హాజరైన వైఎస్ జగన్
గుంటూరు: జిల్లాలోని తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నా బత్తుని శివకుమార్ తనయుడు సత్యనారాయణ చౌదరి వివాహ రిసెప్షన్ కు మాజీ ముఖ్యమంత్రి,వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. తెనాలి ఏఎస్ఎన్ ఇంజినీరింగ్ కాలేజ్ ప్రాంగణంలో జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్లో వధూవరులు మధువంతి, సత్యనారాయణ చౌదరిలకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు వైఎస్ జగన్.వైఎస్ జగన్ రెడ్డి రాకతో భారీ స్థాయిలో అభిమానం సంద్రం తరలివచ్చింది. భారీ సంఖ్యలోవైఎస్సార్సీపీ కార్యకర్తలు , అభిమానులు నాయకులు తరలివచ్చారు. తెనాలిలో జగనన్న కారు వెంట పరిగెడుతు జగనన్నకు ఘనస్వాగతం పలికారు అభిమానులు. -
సరిహద్దుల్లో సాహసమే వెన్నెముకగా...
‘ఓ పక్షీ! నీ పాట ఇక్కడ పాడబోకు ఎగిరిపో... నీ వనాలెక్కడున్నాయో వెతుక్కుంటూ’ అనేది కవి వాక్యం. బీటెక్ చదువుతున్న మహాలక్ష్మి టెక్ దారిలో వెళ్లకుండా... బీఎస్ఎఫ్ (సరిహద్దు భద్రతా దళం)కు ఎంపికైంది. తెనాలి అయితానగర్ అమ్మాయి మహాలక్ష్మి ఇండో–బంగ్లాదేశ్ సరిహద్దుల్లో సగర్వంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తోంది..ఎన్సీసీలో చేరిన రోజుల్లో ఎంతోమంది సాహసికులైన సైనికుల గురించి తెలుసుకునే అవకాశం మహాలక్ష్మికి వచ్చింది. ఆ సమయంలోనే ‘నేను సైతం సైన్యంలోకి’ అనే లక్ష్యానికి బీజం మహాలక్ష్మి మదిలో పడింది. మహాలక్ష్మి తల్లి వెంకాయమ్మ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సు, తండ్రి రాజుది పెయింటింగ్ వృత్తి. చాలీచాలని సంపాదనైనా ఆ దంపతులు బిడ్డలిద్దరినీ చదివించారు. మహాలక్ష్మి చదువుతో పాటు ఆటపాటల్లోనూ ప్రతిభ చూపేది. ఎన్సీసీ మాస్టారు బెల్లంకొండ వెంకట్ ప్రోత్సాహంతో ఎన్సీసీలో చేరింది. రెండు జాతీయ శిబిరాలకు హాజరయ్యే అవకాశం వచ్చింది. కాలేజి గ్రౌండులో వ్యాయామం చేసేందుకు వస్తుండే బాలయ్య అన్నయ్య రన్నింగ్, హైజంప్‌లో అథ్లెటిక్స్‌లో సాధన చేయించాడు.జోనల్ అథ్లెటిక్ మీట్లో రన్నింగ్‌లో ఫస్ట్ వచ్చింది. చదువే లోకం అనుకునే అమ్మాయికి ఎన్సీసీ, ఆటలు పరిచయం కావడంతో కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్లు అనిపించింది. తనలోని శక్తిసామర్థ్యాలకు పదును పెట్టుకునే అవకాశం వచ్చింది. టెన్త్ తర్వాత సెయింట్ మేరీస్ ఇంజినీరింగ్ కాలేజిలో పాలిటెక్నిక్‌లో చేరిన మహాలక్ష్మి, తర్వాత అదే కాలేజిలో బీటెక్ సెకండియర్‌లో చేరింది. ప్రస్తుతం ఫైనలియర్లో ఉండాల్సింది. ఈలోగా 2022లో సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) పరీక్షలు రాసి ఉత్తీర్ణురాలైంది. 2023లో బీఎస్ఎఫ్కు ఎంపికైంది. పశ్చిమబెంగాల్ బైకాంతపూర్‌లోని బీఎస్ఎఫ్ క్యాంపులో 11 నెలల శిక్షణ పూర్తి చేసుకుంది. గత అక్టోబరు 28న పశ్చిమబెంగాల్లోని బీఎస్ఎఫ్ 93 బెటాలియన్‌లో పోస్టింగ్ ఇచ్చారు. అదే రాష్ట్రంలో ఇండో–బంగ్లాదేశ్ బోర్డర్లోని జపర్సల వద్ద మహాలక్ష్మి సైనికురాలిగా ఉద్యోగ విధులు నిర్వహిస్తోంది.ప్రస్తుతం క్రిస్మస్ సెలవులకని సొంతూరు తెనాలికి వచ్చింది. శిక్షణ రోజుల గురించి ప్రస్తావించినప్పుడు ఇలా చెప్పింది.... ‘బైకాంతపూర్‌లోని క్యాంపులో శిక్షణ చాలా కఠినంగా ఉండేది. చిన్నప్పటి నుంచి ఆడిన ఆటలు, చేసిన వ్యాయామాల వల్ల కష్టం అనిపించేది కాదు. తెల్లవారుజాము నాలుగు గంటల్నుంచే రన్నింగ్, ఇతర వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. తర్వాత తరగతులు ఉంటాయి. ఏకే 47తో సహా రకరకాల వెపన్లు విడగొట్టటం, నిర్ణీత వ్యవధిలో అమర్చటం, బుల్లెట్లను లోడు చేయడం, ఫైరింగ్... మొదలైనవి ఎన్నో సాధన చేయించేవారు. సాయంత్రం 5 గంటల నుంచి సరిహద్దులో డ్యూటీ చేయాలి. కష్టమే అయినా ఇష్టంగా చేయగలిగాను’‘సైన్యంలో పనిచేస్తున్నావట కదా... మంచి విషయం అమ్మా’ అని అభినందించే వారే కాదు... ‘సరిహద్దుల్లో ఉద్యోగమా! అంత కష్టమెందుకమ్మా. ఇక్కడే ఏదో ఉద్యోగం చూసుకోవచ్చు కదా!’ అని సలహా ఇచ్చేవారు ఉన్నారు. సైన్యంలో జెండర్ బారియర్స్ తొలగిపోతున్న కాలం ఇది. పురుషులతో సమానంగా అమ్మాయిలు సత్తా చాటుతున్న కాలం ఇది. ఇలాంటి కాలంలో.... నిరాశపరిచే మాటలు వారి హృదయాలను చేరవు. దేశభక్తి ఉన్న హృదయాలకు భయాలతో పనేమిటి! కమాండర్ స్థాయికి చేరుకోవాలని...ఎన్సీసీలో ఉన్నప్పుడు ఎంతోమంది గొప్ప సైనికుల గురించి, వారి త్యాగాల గురించి తెలుసుకునే అవకాశం వచ్చింది. ఆ వీరులు, త్యాగధనుల గురించి వింటున్న క్రమంలో ‘ఏదో ఒకరోజు నేను కూడా సైన్యంలో పనిచేస్తాను’ అనుకునేదాన్ని.అయితే అదెంత కష్టమో నాకు తెలియంది కాదు. ప్రోత్సహించేవారి కంటే నిరూత్సాహపరిచేవారే ఎక్కువగా ఉంటారు. కష్టాన్ని ఇష్టపడేవారే విజేతలు అవుతారు. శిక్షణ కాలంలో బైకాంతపూర్ క్యాంప్‌లో ‘ఇంత కష్టమా’ అనిపించలేదు. ‘ఇన్ని విషయాలు తెలుసుకున్నాను కదా’ అనుకున్నాను. దేశభక్తి గురించి అధికారులు చెప్పిన మాటలు నాలో స్ఫూర్తిని కలించాయి. ఆ స్ఫూర్తితోనే దేశ సరిహద్దుల రక్షణకు అంకితమయ్యాను. బాగా కష్టపడి బీఎస్ఎఫ్లో కమాండర్ స్థాయికి చేరుకోవాలనేది నా కల.– వై.మహాలక్ష్మి – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి -
కంప్యూటర్ కమాండర్.. సిద్ధార్థ
తెనాలి: ఈ చిన్నోడు సామాన్యుడు కాదు. కంప్యూటర్ లాంగ్వేజెస్, డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో దిట్ట. కంప్యూటర్ సైంటిస్టులకే పాఠాలు చెబుతాడు. ఐఐటీ విద్యార్థులకు (IIT Students) రోల్ మోడల్. కంప్యూటర్ ప్రపంచం మెచ్చిన డేటా సైంటిస్ట్ (Data Scientist). పన్నెండేళ్ల వయసులో ఏడో తరగతి చదువుతూ సాఫ్ట్వేర్ కంపెనీలో డేటా సైంటిస్ట్‌గా ఉద్యోగం చేసిన ఘనుడు. ప్రపంచంలో అతి పిన్న వయస్కుడైన డేటా సైంటిస్ట్‌గా గూగుల్‌తోనే చెప్పించుకున్న తెనాలి చిన్నోడు. పేరు పిల్లి సిద్ధార్థ శ్రీవాత్సవ్ (Siddharth Srivastav Pilli). ఇప్పుడు వయస్సు 17 ఏళ్లు. చదువుతున్నది ఇంటర్మిడియట్ ద్వితీయ సంవత్సరం. హైదరాబాద్ ఐఐటీలో (Hyderabad IIT) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజినీరుగానూ పని చేస్తున్నాడు. వారంలో మూడు రోజులు చదువు.. మూడు రోజులు ఉద్యోగం. ఏడో తరగతి నుంచి ఇదే పని. చిన్నప్పటి నుంచే కంప్యూటర్‌పై పట్టు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ప్రియమానస, రాజ్‌కుమార్ దంపతుల ఏకైక కుమారుడు సిద్ధార్థ. తల్లిదండ్రులు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావడంతో సిద్ధార్థకు చిన్నతనం నుంచీ కంప్యూటర్‌పై బలమైన అభిరుచి కలిగింది. కొడుకు ఆసక్తిని గమనించిన తండ్రి నాలుగో తరగతి నుంచే కంప్యూటర్ బేసిక్స్, టెక్నాలజీ, లాంగ్వేజెస్ నేర్పించారు. నాలుగైదేళ్లు గడిచేసరికి సిద్ధార్థకు కంప్యూటర్‌పై పట్టు చిక్కింది. అడ్వాన్స్ లెవెల్‌కు చేరుకోగలిగాడు.సొంతంగా ఆన్లైన్లో కొన్ని నమూనా ప్రాజెక్టులూ చేయటంతో ఆత్మవిశ్వాసం కలిగింది. అప్పుడే ఉద్యోగం చేస్తానని తండ్రితో చెప్పాడు. తండ్రి పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు. మరింత పరిజ్ఞానం కోసం తండ్రి అతడిని ఓ కంప్యూటర్ సంస్థలో చేర్చాలని తీసుకెళ్లగా.. బాలుడన్న కారణంతో చేర్చుకోలేదు. దీంతో తండ్రి ఆన్లైన్ కోర్సుల్లో చేర్పించారు. ఇలా వీడియోలు చూస్తూ స్వయంగా అధ్యయనం ప్రారంభించిన సిద్ధార్థ వాటిపై గట్టి పట్టు సాధించాడు. ఉద్యోగ సాధన ఉద్యోగం చేస్తానని మరోసారి చెప్పినా భారత్‌లో సాధ్యం కాదని తండ్రి చెప్పేశారు. పట్టువదలని సిద్ధార్థ తనే ఓ రెజ్యూమె తయారు చేసుకుని ఆన్లైన్లో అప్లోడ్ చేశాడు. కొన్ని కంపెనీలు ఫోన్లో సంప్రదించాయి. అతడి కంప్యూటర్ పరిజ్ఞానానికి అబ్బురపడుతూనే.. వయసు, చదువు తక్కువన్న భావనతో పట్టించుకోలేదు. సుదీర్ఘ ఇంటర్వ్యూ చేసిన మోంటెగ్న్ కంపెనీ సీఈవో ‘నీతో వండర్స్ చేయిస్తా’ అంటూ ఉద్యోగం ఇచ్చారు. చదువుకు ఆటంకం కలగకూడదని తండ్రి షరతు విధించడంతో మూడు రోజులు ఉద్యోగానికి ఓకే చేశారు. పాఠశాల యాజమాన్యం సహకారంతో ఏడో తరగతిలోనే ఐటీ ఉద్యోగిగా నెలకు రూ.25 వేల జీతంతో చేరాడు.కొద్దికాలంలోనే అదే హోదాతో మరో సంస్థకు మారాడు. నెలకు రూ.45 వేల వేతనంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో వినూత్నమైన గేమ్ డిజైనింగ్‌లో కృషి చేశాడు. మూడురోజులు స్కూలుకు, మూడురోజులు ‘ఇన్ఫినిటీ లెర్న్’ ఐటీ సంస్థలో డేటా సైంటిస్ట్‌గా చేస్తూనే, అమెరికన్ కంపెనీ ‘రైట్ ఛాయిస్’ తరపున అక్కడి విద్యార్థులకు కోడింగ్ క్లాసులూ నిర్వహించాడీ బాల మేధావి. అవార్డులు, అవకాశాలు.. సిద్ధార్థ ప్రతిభను గుర్తించిన బైజూస్ కంపెనీ ‘యంగ్ జీనియస్’ అవార్డుతో సత్కరించింది. తెలంగాణ ప్రభుత్వం ఈ బుడతడిని స్వయంగా ఆహ్వానించి భూకంపాలను ముందుగానే గుర్తించే కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టును అప్పగించింది. పదో తరగతి తర్వాత హైదరాబాద్‌లోనే గటిక్ కాలేజిలో ఇంటర్లో చేరాడు. మరోవైపు అక్కడి ట్రిపుల్ ఐటీలో రీసెర్చ్ ఇంజినీరుగానూ పరిశోధన కొనసాగించాడు. ఇంకోవైపు కోడింగ్ క్లాసులూ చెబుతున్నాడు. అక్కడితో ఆగకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పైనా ఫ్రీలాన్సర్‌గా చేయసాగాడు. ఇవన్నీ గమనించిన ఐఐటీ–హైదరాబాద్ అతడికి ఆర్టిఫిషియల్ ఇంజినీరుగా ఉద్యోగాన్నిచ్చింది.చదవండి: అమెరికాలోనూ ‘చాయ్.. సమోసా’ప్రస్తుతం సిద్థార్థ ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతూనే.. ఏడాదిగా ఐఐటీలో ఏఐ, మెషీన్ లెర్నింగ్ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్నాడు. ఇటీవల శాంసంగ్ కంపెనీ జాతీయస్థాయిలో నిర్వహించిన ‘సాల్వ్ ఫర్ టుమారో’ పోటీలో టాప్ టెన్‌లో ఒకడిగా వచ్చాడు. కృత్రిమ మేధలో అతడి నవీన ఆలోచన అందులో ఎంపికైందని సిద్థార్థ తండ్రి రాజ్‌కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. 2022–23లో ‘సాక్షి’ ఎక్స్‌లెన్స్ అవార్డునూ సిద్ధార్థ అందుకున్నాడు. ‘సాక్షి’ మీడియా చైర్పర్సన్ వైఎస్ భారతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు. జాతీయస్థాయి న్యూస్ ఛానల్స్ ఇతని ఇంటర్వ్యూలను ప్రసారం చేశాయి.ఇదే లక్ష్యం.. తల్లిదండ్రుల ప్రోత్సాహం, జుకర్ బర్గ్, సుందర్ పిచాయ్‌ల జీవిత చరిత్రలు, బిల్ గేట్స్ మాటలు, స్టీవ్ జాబ్స్ పనితీరుతో తన కలల సౌధాన్ని నిర్మించుకున్నట్టు సిద్ధార్థ చెప్పాడు. ప్రపంచ టాప్ ఫైవ్‌లోని గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం కంపెనీల్లో రీసెర్చ్ అండ్ అనాలసిస్ విభాగాల్లో ఆర్టిషిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టుల్లో భాగస్వామిగా ఉండాలని, మంచి గేమ్ డిజైన్ చేయాలనేది తన ఆకాంక్ష అని చెప్పాడు. ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులు కూడా చేస్తానని, వీలైతే మైక్రోసాఫ్ట్ లాంటి అప్లికేషన్‌కు రూపకల్పన చేయాలనే ఆశయంతో ప్రతి క్షణం కష్టపడుతున్నట్టు తెలిపాడు. -
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని మృతి
వాషింగ్టన్ : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన విద్యార్థిని నాగశ్రీ వందన పరిమళ మృతి చెందగా ఆమె ఇద్దరు స్నేహితులు గాయపడినట్లు స్థానిక పోలీసు అధికారులు తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వ్యాపారి గణేష్, రమాదేవి దంపతుల కుమార్తె నాగశ్రీ వందన పరిమళ (26) ఉన్నత చదువుల కోసం 2022 డిసెంబర్లో అమెరికాకు వెళ్లారు. అక్కడ టెన్నెసీ రాష్ట్రంలోని మెంఫిస్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్)చదువుతున్నారు.అయితే ఈ తరుణంలో గత శుక్రవారం రాత్రి ఆమె తన స్నేహితులతో కలిసి కారులో వెళుతుండగా, రాక్‌వుడ్ ఎవెన్యూ సమీపంలో ట్రక్ వెనుక నుంచి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో నాగశ్రీ వందన పరిమళతో పాటు ఆమె స్నేహితులకు పవన్, నికిత్లకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు అత్యవసర చికిత్స నిమిత్త ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వందన మరణించగా.. పవన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.కాగా, రోడ్డు ప్రమాదంలో నాగశ్రీ వందన పరిమళ మృతి చెందడంతో తెనాలిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వందన భౌతిక కాయాన్ని స్వగ్రామానికి తరలించేందుకు అక్కడి అధికారులు, తెలుగు సంఘాలు ఏర్పాట్లు చేస్తున్నారు. -
అమెరికాలో తెనాలి యువతి దుర్మరణం
-
‘పోస్ట్’ మార్టమ్... శవాలగదిలో ఉద్యోగమా?
మనుషులు వెళ్లడానికి ఇష్టపడని ప్రదేశాలలో శ్మశానం ఒకటి అని చెబుతుంటారు. అయితే అసహజ మరణాలకు సంబంధించిన శవాలు శ్మశానానికన్నా ముందు చేరుకునే ప్రదేశం మార్చురీ. అక్కడ కొద్దిసేపు గడపాలంటేనే ఇబ్బంది పడేవాళ్లు, భయపడేవాళ్లు ఉంటారు. అలాంటిది పోస్ట్‌మార్టం గదిలో రోజూ ఉద్యోగం చేయడం అంటే ఎంతో ధైర్యం కావాలి. ఆ గుండె ధైర్యం రామ్ప్రసన్నలో ఉంది. తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టమ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రామ్‌ప్రసన్న... ‘ఆడవాళ్లు ఈ ఉద్యోగం చేయడం ఏమిటి!!’ అనే లింగవివక్షతతో కూడిన మాటలు... ‘చేయడానికి నీకు ఈ ఉద్యోగమే దొరికిందా!’లాంటి వెక్కిరింపులు ఎదుర్కొన్నా... ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గలేదు. వృత్తి జీవితంపై గౌరవాన్ని తగ్గించుకోలేదు... ఇచ్చోటనే...నిండా పాతికేళ్లు కూడా నిండని యువకుడి శవం. ‘బహుశా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉండి ఉండొచ్చు’ అని ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్తుంది. భర్త వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న యువతి... తన పిల్లల్ని తలుచుకొని కళ్లనీళ్ల పర్యంతం అవుతున్నట్లు అనిపిస్తుంది. ‘ఇద్దరు ఆడపిల్లల పెళ్లి చేయాలి. వారి పెళ్లి చూడకుండానే వరద నన్ను మింగేసింది’... మధ్యతరగతి తండ్రి శవం అదేపనిగా రోదిస్తున్నట్లుగా ఉంటుంది. శవాలు మౌనంగా చెప్పే కథలు ఎన్నో విన్నది రామ్‌ప్రసన్న. అలా అని శ్మశాన వైరాగ్యంలాంటిది తెచ్చుకోలేదు. వృత్తిని వృత్తిలాగే ధైర్యంగా నిర్వహిస్తోంది.‘నాకు ఉద్యోగం వచ్చింది అనగానే సంతోషించిన వాళ్లు శవాల గదిలో అని చెప్పగానే నోరు తెరిచారు. ఆడపిల్లవు...అక్కడెలా చేస్తావంటూ అడిగేవాళ్లు. ఎక్కువ రోజులు ఉండలేవు. వచ్చేస్తావు అన్నవాళ్లూ ఉన్నారు. అందుకే ఆడవాళ్లు ఎవరూ రాని ఈ వృత్తిలో కొనసాగుతున్నా’ అంటుంది తెనాలిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం అసిస్టెంట్ (శవపరీక్ష సహాయకురాలు)గా విధులు నిర్వర్తిస్తున్న రామ్ ప్రసన్న.ఆసుపత్రి వెనుక వైపు కాస్తంత దూరంగా ఉండే మార్చురీలోకి నిత్యం వచ్చే శవాలతోనే తన వృత్తిజీవితం ముడిపడివుంది. ఆత్మహత్యకు పాల్పడినవాళ్లు, రోడ్డు ప్రమాదాల మృతులు, నీళ్లలో కొట్టుకు వచ్చిన మృతదేహాలు... నిత్యం ఆసుపత్రికి వస్తూనే వుంటాయి. అన్నింటికీ శవపరీక్ష నివేదిక కీలకమని తెలిసిందే. సంబంధిత వైద్యుడు శవపరీక్ష చేస్తే అందుకు తగినట్టుగా మృతదేహాన్ని సిద్ధం చేయటం, వైద్యుడికి సహాయపడటం సహాయకురాలిగా రామ్‌ప్రసన్న ఉద్యోగం.భర్త ప్రోత్సాహంతో...ప్రమాదాల్లో రక్తమోడుతున్న మృతదేహాలూ, నీటిలో ఉబ్బిపోయినవీ, డీ కంపోజింగ్‌కు చేరువైనవి... చూడటమే కష్టం. నెలకు పదిహేను నుంచి ఇరవై వరకు వచ్చే ఇలాంటి మృతదేహాలను శవపరీక్షకు సిద్ధం చేయాలంటే ఎంత ధైర్యం కావాలి? సన్నగా, రివటలా ఉండే రామ్‌ప్రసన్న ఆ విధులను వస్త్రాలకు అతుకులు కుట్టినంత శ్రద్ధగా, అలవోకగా చేస్తోంది.రామ్‌ప్రసన్న దూరవిద్యలో బీఏ చేసింది. కూలి పనులకు వెళుతుండే భర్తకు తోడుగా తాను కూడా ఏదో ఒక ఉద్యోగం చేయాలనుకుంది. డీసీహెచ్ఎస్ నుండి వెలువడిన నోటిఫికేష¯Œ లో పోస్ట్‌మార్టమ్ అసిస్టెంట్ పోస్టు కనిపించటంతో దరఖాస్తు చేసింది. ఇంటర్వ్యూ కూడా పూర్తయ్యాక తెనాలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టింగ్ ఇచ్చారు. భర్త ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండాప్రోత్సహించాడు.భయం అనిపించలేదు... ఆసక్తిగా అనిపించింది!తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి చరిత్రలో పోస్టుమార్టమ్ సహాయకులుగా ఇప్పటివరకు పురుషులే ఉండేవారు. శవపరీక్షకు ముందు మద్యం సేవించటం తప్పనిసరి అన్నట్టుగా ప్రవర్తించే వారు కొందరు. ఇలాంటి వారు మృతుల బంధువుల నుంచి మద్యానికి డబ్బులు వసూలు చేసేవారు. అలాంటి ఉద్యోగంలో ఇప్పుడు ఒక ఆడపిల్లను చూడడం చాలామందికి వింతగా ఉంది. ఆ ఆశ్చర్యం సంగతి ఎలా ఉన్నా మృతదేహాల రక్తసంబంధీకులకు ఇప్పుడు మద్యం కోసం పీడన లేదు. ‘ఈ ఉద్యోగంలోకి వచ్చాక తొలిసారి శవపరీక్షలో పాల్గొన్నాను. మరణానికి కారణాలు తెలుసుకోవటం ఆసక్తిగా అనిపించింది. భయం అనిపించలేదు. ఉద్యోగాన్ని అంకితభావంతో చేస్తున్నాను.’ అంటుంది రామ్‌ప్రసన్న. ‘మహిళలు ఇలాంటి ఉద్యోగాలు మాత్రమే చేయగలరు. ఇలాంటి ఉద్యోగాలు మాత్రమే చేయాలి’ అనే అప్రకటిత తీర్పులకు, పురుషాధిపత్య ధోరణులకు రామ్‌ప్రసన్న వృత్తిజీవితం, అంకితభావం చెంపపెట్టులాంటిది. ఈ ఉద్యోగం నాకు గర్వకారణంనేను చేస్తున్న ఉద్యోగంపై కొందరి సందేహాలు, భయాలు వింటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నేను వేరే లోకంలో ఉద్యోగం చేయడం లేదు. గ్రహాంతర జీవులు, ప్రమాదకర వ్యక్తుల మధ్య ఉద్యోగం చేయడం లేదు. నిన్నటి వరకు వాళ్లు మనలాంటి మనుషులే. మన మధ్య ఉన్న వాళ్లే. ్రపాణదీపం ఆరిపోగానే వారిని పరాయి వాళ్లుగా చూసి భయపడడం తగదు. నేను భయపడుతూ ఉద్యోగం చేయడం లేదు. గర్వంగా చేస్తున్నాను. అంకితభావంతో చేస్తున్నాను.– రామ్‌ప్రసన్న – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి -
ఒక్కొక్కడిని ఏరి ఏరి జైల్లో పెడతా?
-
కళ్ల ఎదుటే సాక్షాలు కనిపిస్తున్నా.. శిక్ష ఎందుకు లేదు?
-
మధిర సహాన మృతిపై వైఎస్సార్సీపీ నేతల తీవ్ర విచారం
సాక్షి,గుంటూరు: టీడీపీ రౌడీషీటర్ నవీన్ దాడిలో గాయపడి మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన మధిర సహాన చివరకు ఓడిపోయింది. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. సహాన మరణంపై సమాచారం అందుకున్న వైఎస్సార్సీపీకి మాజీ మంత్రులు మేరుగు నాగార్జున, విడదల రజిని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మేయర్ మనోహర్ నాయుడు, నూరి ఫాతిమా, డైమండ్ బాబు యువతి కుటుంబాన్ని పరామర్శించారు.అనంతరం మాజీ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. ‘ఇవన్నీ ప్రభుత్వ హత్యలే. సహన విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నారో అందరూ చూస్తున్నారు. అక్కడి మంత్రి ఏమైపోయారు. ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. దిశ యాప్ లేకపోవటం వల్లే రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది. సహాన మరణ వార్తపై వైఎస్ జగన్ విచారం వ్యక్తం చేశారు. రేపు (బుధవారం)సహన కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్నారు’ అని అన్నారు. సహానా మరణంపై మాజీ మంత్రి విడదల రజిని విచారం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఇందుకు సహానలాంటి ఘటనలే నిదర్శనం. సహాన శరీరంపై గాయాలున్నాయి. బయటకు చెప్పుకోలేని అభద్రతాభావంలో సహన తల్లిదండ్రులు ఉన్నారు. మహిళలకు రక్షణ లేదన్న భావన వ్యక్తం అవుతోంది. దిశ లాంటి చట్టాలను వైఎస్ జగన్ హయాంలో తీసుకొచ్చారు. దిశ లాంటి చట్టాల అవసరం ఉంది. మహిళల రక్షణ పట్ల ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
యువతులను ట్రాప్ చేయడమే నవీన్ వృత్తి
సాక్షి ప్రతినిధి, గుంటూరు: తెలుగుదేశం పార్టీ నేత, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అనుచరుడు, రౌడీషి టర్ నవీన్ టీడీపీ నాయకులతో ఉన్న సంబంధాలను ఆసరా చేసుకొని పాల్పడిన దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎవరిమీద పడితే వారిపై దౌర్జన్యాలు చేయడమే కాకుండా, యువతులను ట్రాప్ చేసి, వారి డబ్బుల తోనే జల్సాలు చేయడమే అతను వృత్తిగా పెట్టుకొన్నట్లు వల్లభాపురం గ్రామస్తులు చెబుతున్నారు. గతంలో గుంటూరులో ఒక యువతిని ప్రేమిస్తున్నట్లు చెప్పి లొంగతీసుకున్నాడు. తర్వాత తెనాలి మండలం ఈమని గ్రామానికి చెందిన వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమె డబ్బులతోనే తెనాలిలో ఇల్లు తీసుకుని ఉంటున్నట్లు సమాచారం. ఆరు నెలల క్రితం తెనాలి యువతిని వలలో వేసుకొని, ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు.ఆమె ఏటీఎం కార్డు కూడా నవీన్ దగ్గరే ఉందని, ఆమె డబ్బులు పెద్ద ఎత్తున వాడుకున్నాడని, తిరిగి డబ్బులు అడిగినందుకే ఇరువురి మధ్య వివాదం జరుగుతోందని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే దాడి చేసి ఉంటాడని చెబుతున్నారు. కారులో వెళ్తుండగా సడన్ బ్రేక్ వేయడంతో ముందుకు పడి తలకు దెబ్బ తగిలిందని నవీన్ పోలీసులకు చెబుతున్నాడు. బ్రేక్ వేస్తే తల వెనుక దెబ్బ తగిలే ఆస్కారం లేదని వైద్యులు చెబుతున్నారు. ఇది ఖచ్చితంగా దాడేనని వారు స్పష్టం చేస్తున్నారు. దాడికి ముందు లైంగిక దాడి జరిగిందా! లేదా!అన్న విషయంపై పరీక్షలు నిర్వహించారు.ఇంకా ఫలితాలు రావాల్సి ఉంది. నవీన్ పథకం ప్రకారమే ఆ యువతిని బయటకు తీసుకువెళ్లి దాడి చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. నవీన్ ఒక్కడే ఈ పనిచేశాడా? అతని స్నేహితుల హస్తం కూడా ఉందా అన్నదానిపై విచారణ జరుపుతున్నారు. యువతి తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో నవీన్‌తోపాటు ఇద్దరు స్నేహితులు లైంగికంగా వేధించి దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. అధికార పార్టీతో అతనికి ఉన్న సంబంధాల నేపథ్యంలో ఈ కేసును నీరు గార్చేందుకు పోలీసులపై పెద్ద ఎత్తున ఒత్తిళ్లు వస్తున్నట్లు సమాచారం.మరింత విషమించిన యువతి ఆరోగ్యం నవీన్ చేతిలో తీవ్రంగా గాయపడిన యువతి ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారింది. మెదడులో రక్తస్రావం జరుగుతూనే ఉండటంతో అమెను కాపాడేందుకు జీజీహెచ్ వైద్యులు చేస్తున్న ప్రయత్నాలు ఫలితం ఇవ్వడంలేదు. సోమవారం ఉదయం ఒకసారి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని, పల్స్ పూర్తిగా పడిపోయినట్లు చెబుతున్నారు. ఆ యువతి ఆరు వారాల గర్భిణి అని వైద్యులు నిర్ధారించారు. -
ఇదేనా చంద్రబాబు మీ సూపర్ సిక్స్ టీడీపీపై అన్నాబత్తుని శివకుమార్
-
టీడీపీ నేత అఘాయిత్యం.. యువతి ఆరోగ్య పరిస్థితి విషమం
సాక్షి, తెనాలి: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. ప్రతీరోజూ ఏదో ఒక చోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా టీడీపీ రౌడీ షీటర్ చేతిలో ఓ యువతి తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది.వివరాల ప్రకారం.. అధికార టీడీపీకి చెందిన నేత, రౌడీషీటర్ నవీన్ చేతిలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మధిర సహాన ఆరోగ్యం విషమంగా మారింది. వెంటిలేటర్ తీసేస్తే మధిర సహన చనిపోతుందని డాక్టర్లు చెప్పడంతో బాధితురాలి తల్లిదండ్రులు దిక్కుదోచని స్థితిలో గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఆమె బాడీపై కమిలిన గాయాలు ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో బాధితురాలిని హింసించి అత్యాచారం చేసినట్టు తెలుస్తోంది.గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మధిర సహాన ఆస్పత్రిలో నర్సుగా విధులు నిర్వహిస్తుంది. ఈ తరుణంలో శనివారం సాయంత్రం కొల్లిపర మండలం వల్లభాపురానికి చెందిన టీడీపీ నేత,రౌడీ షీటర్ నవీన్.. మధిర సహానను కారులో తీసుకెళ్లాడు. అనంతరం కొన్ని గంటల తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లిన సహానను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాడు. బాధితురాలి తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.కుమార్తె ఆస్పత్రిలో ఉందనే సమాచారం కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. అప్పటికే బ్రెయిన్ డెడ్ అయ్యి ఉన్న కుమార్తెను బతికించుకునేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. నాలుగు ఆస్పత్రులు తిరిగినా లాభం లేకపోవడంతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలికి చికిత్స అందిస్తుండగా.. వెంటిలేటర్ తీస్తే ప్రాణాలు పోతుందని వైద్యులు చెప్పారు. దీంతో ఏం చేయాలో పాలుపోక కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.ఇక, ఘటనలో నిందితుడు నవీన్‌కు తాజాగా పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. అయితే, కూటమి నేతలు నవీన్‌ను కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని ఆమె తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. -
టీడీపీ రౌడీషీటర్ చేతిలో గాయపడిన యువతి పరిస్థితి విషమం
-
రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు.. మధిర సహాన తల్లిదండ్రులు
సాక్షి,అమరావతి : అధికార టీడీపీకి చెందిన నేత, రౌడీషీటర్ నవీన్ ఓ గుండె కోతను మిగిల్చాడు. నవీన్ చేతిలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మధిర సహాన ఆరోగ్యం విషమంగా మారింది. వెంటిలేటర్ తీసేస్తే మధిర సహన చనిపోతుందని డాక్టర్లు చెప్పడంతో బాధితురాలి తల్లిదండ్రులు దిక్కుదోచని స్థితిలో గుండెలవిసేలా రోదిస్తున్నారు.గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మధిర సహాన ఆస్పత్రిలో నర్సుగా విధులు నిర్వహిస్తుంది. ఈ తరుణంలో శనివారం సాయంత్రం కొల్లిపర మండలం వల్లభాపురానికి చెందిన టీడీపీ నేత,రౌడీ షీటర్ నవీన్..మధిర సహానను కారులో తీసుకెళ్లాడు. అనంతరం కొన్ని గంటల తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లిన సహానను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాడు. బాధితురాలి తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.కుమార్తె ఆస్పత్రిలో ఉందనే సమాచారం కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. అప్పటికే బ్రెయిన్ డెడ్ అయ్యి ఉన్న కుమార్తెను బతికించుకునేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. నాలుగు ఆస్పత్రులు తిరిగినా లాభం లేకపోవడంతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలికి చికిత్స అందిస్తుండగా.. వెంటిలేటర్ తీస్తే ప్రాణాలు పోతుందని వైద్యులు చెప్పారు. దీంతో ఏం చేయాలో పాలుపోక కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనలో నిందితుడు నవీన్‌కు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ సందర్భంగా మధిర సహాన కుటుంబ సభ్యులు మాట్లాడుతూ..‘రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. మా కుమార్తె మధిర సహానాను దారుణంగా కొట్టారు. ఒంటినిండా గాయాలు ఉన్నాయి. నిందితులు దాడి చేయడంతో మా కుమార్తెకు బ్రెయిన్ డెడ్ అయ్యింది. వెంటిలేటర్ తీసేస్తే ఆమె చనిపోతుందని డాక్టర్లు చెప్తున్నారు. ఈ దారుణానికి కారణమైన రౌడీషీటర్ నవీన్‌ను కఠినంగా శిక్షించాలి. నవీన్‌తో పాటు మరో ఇద్దరు ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి’ రోదిస్తున్నారు. -
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెనాలి హారిక మృతి
వాషింగ్టన్: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన వెటర్నరీ డాక్టర్ జెట్టి హారిక(25) అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. దీంతో, ఆమె స్వస్థలం గుంటూరు జిల్లాలో విషాదఛాయలు నెలకొన్నాయి. కుటుంబ సభ్యులు హారిక మృతదేహం కోసం భారత రాయబార కార్యాలయం వద్ద ఎదురుచూపులు చూస్తున్నారు.వివరాల ప్రకారం.. అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెనాలికి చెందిన వెటర్నరీ డాక్టర్ జెట్టి హారిక మృతి చెందింది. హారిక అమెరికాలోని ఓక్లహోమా స్టేట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డి మరణించారు. కాగా, హారిక ఏడాదిన్నర క్రితం వెటర్నరీలో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. ఇంతలోనే ఇలా మృతిచెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.ఇక, ఆమె తల్లిదండ్రులు జెట్టి శ్రీనివాసరావు, నాగమణి. జెట్టి శ్రీనివాస్ దేవాదాయ శాఖ ఉద్యోగిగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె మృతదేహాన్ని స్వస్థలానికి తెచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు. -
‘నారాయణ’ యాజమాన్యం నిర్లక్ష్యానికి మా కుమారుడు బలి
తెనాలిరూరల్: నారాయణ కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు మరణించాడని తెనాలి బుర్రిపాలెం రోడ్డులోని బీసీ కాలనీకి చెందిన కర్రె విజయ్‌కుమార్ దంపతులు ఆవేదన వ్యక్తంచేశారు. తమకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదని కన్నీటిపర్యంతమయ్యారు. ఈ మేరకు ఆదివారం తెనాలిలో విజయకుమార్ దంపతులు విలేకరులతో మాట్లాడారు. ‘మాకు కుమారుడు గిరీష్ అర్వంత్(15), కుమార్తె ఉన్నారు. కుమారుడు గిరీష్‌ను హైదరాబాద్‌లోని హయత్‌నగర్ పరిధిలో గల కోహెడ నారాయణ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేర్పించాము. ఈ నెల 12వ తేదీన కాలేజీ హాస్టల్లో చేరిన గిరీష్ తరచూ ఫోన్ చేసి తనకు అక్కడ బాగాలేదని ఇంటికి వచ్చేస్తానని చెబుతున్నాడు. మేం అర్వంత్‌కు సర్దిచెబుతూ వచ్చాం. అక్కడ ఇబ్బందులను భరించలేక అర్వంత్ ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి హాస్టల్ గోడ దూకి బయటకు రావాలని ప్రయత్నించాడని, ఈ క్రమంలో కరెంట్ షాక్ తగిలి మృతిచెందాడని కాలేజీ యాజమాన్యం తెలిపింది. వెంటనే మేం వెళ్లి మా కుమారుడి మృతదేహాన్ని తీసుకువచ్చి అంత్యక్రియలు పూర్తిచేశాం. మా కుమారుడి విషయంలో నారాయణ కాలేజీ యాజమాన్యం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అంతమంది చదువుతున్న కాలేజీ, హాస్టల్ నుంచి మా బిడ్డ బయటకు వెళ్లే ప్రయత్నం చేస్తే యాజమాన్యం ఏం చేస్తుంది? మాకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదు.’ అని విజయకుమార్ దంపతులు కన్నీటిపర్యంతమయ్యారు. -
తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ పూజలు
-
తెనాలి.. ‘సప్తాహ ముద్దపప్పు’ తినాలి
ఆ రోజుల్లో: మాఘ మాసం వచ్చి0దంటే.. తెనాలి రామలింగేశ్వరపేటలోని శంకర మఠం ముద్దపప్పు సప్తాహాలతో ఘుమఘుమలాడేది. వారం రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమానికి తెనాలి చుట్టుపక్కల గల ఆరు అగ్రహారాల నుంచి వేద పండితులతోపాటు అన్ని కులాల్లోని ముద్దపప్పు ప్రియులు ముద్దపప్పు భోజనం ఆరగించి.. మఠంలోనే నిద్రించేవారు. 50 ఏళ్ల క్రితం వరకు కొనసాగిన ఈ ముద్దపప్పు సప్తాహాల విశేషాల్లోకి వెళితే.. తెనాలి: ఎనిమిదో శతాబ్దపు తత్వవేత్త.. అద్వైత గురువు జగద్గురు ఆదిశంకరాచార్యులు పేరిట తెనాలి రామలింగేశ్వరపేటలోనూ శంకర మఠం ఏర్పాటైంది. దేవీచౌక్‌లోని చినరావూరు పార్కు రోడ్డులో కుడిపక్క పది సెంట్ల విస్తీర్ణంలో ఈ మఠం విస్తరించి ఉంది. మఠం వ్యవస్థాపకురాలు వేలమూరి లింగమ్మ. కాషాయధారి ఎవరొచ్చి నా మఠంలోనే బస చేసేవారు. అప్పట్లో ఇక్కడ హోమాలు, యజ్ఞాలతోపాటు మాఘ మాసంలో ముద్దపప్పు సప్తాహాలు నిర్వహించేవారు. మాఘశుద్ధ పాడ్యమి రోజు నుంచి మొదలై వారం రోజులపాటు ముద్దపప్పు వేర్వేరు అనుపానాలతో ముద్దపప్పు సప్తాహాలు జరిగేవి. వీటికితోడు హరికథ, బుర్రకథ, పురాణ పఠన కాలక్షేపాలతో శంకర మఠం ఓ వెలుగు వెలిగింది. సుమారు 50 ఏళ్ల క్రితం వరకూ ఈ సప్తాహాలు జరిగేవి. సప్తాహాలు ఇలా: నలభీమ పాకంలో చెయ్యి తిరిగిన నరసరావుపేట వంటవారు కృష్ణా నదీ తీరమైన కొల్లూరు పొలాల్లో పండిన ఏడాది వయసు గల కందిపప్పును గోధుమ రంగు వచ్చే వరకు వేయించి.. బాగా ఉడకబెట్టి.. ఉప్పు, పసుపు వేసి ముద్దపప్పు వండేవారు. దీనికి అనుపానాలుగా అంగలకుదురు పుల్ల దోసకాయల్ని వినియోగించి.. అనకాపల్లి ఆవపిండి, చినరావూరు గానుగ నువ్వుల నూనె, బుడంపాడు ఎర్ర మిరపకాయలతో కొట్టిన కారం, వేటపాలెం రాళ్ల ఉప్పు వేసి.. దేవతా దోసావకాయ తయారు చేసేవారు. వలివేరు మెట్ట పొలాల్లో కాసిన ఎర్ర గుమ్మడి కాయలు, ముదురు బెండకాయల ముక్కలకు ప్రశస్తమైన ఇంగువ తిరగమోత (తాలింపు) వేసి.. గుమ్మడి ముక్కల పులుసు గొప్పగా చేసేవారు. అనంతవరంలో పండిన వడ్ల దంపుడు బియ్యంతో అన్నం వండేవారు. వేజెండ్ల గ్రామపు నెయ్యి.. సంగం జాగర్లమూడి బర్రెలు బకింగ్‌హాం కాలువ గట్టున గడ్డిమేసి ఇచ్చిన చిక్కటి పాలతో జిడ్డు గడ్డ పెరుగు కుండల్లో తోడు పెట్టేవారు. ఇంగువ మినప వడియాలు, పెసర ఎర్ర అప్పడాలు వేయించేవారు. పచ్చల తాడిపర్రు అరిటాకులు పరిచి.. పంక్తులుగా వడ్డన చేయగా.. అలనాటి ఆ ముద్దపప్పు భోజనం చేసిన వారంతా తాదాత్మ్యం చెందేవారు. నాటి సప్తాహాలను వారణాసి మణెమ్మ మహిళ దగ్గరుండి చేయించేవారు. శుభకార్యాల్లో వంటలకు అప్పట్లో ఆమె ప్రసిద్ధి. మఠం వ్యవస్థాపకురాలు లింగమ్మ కుమారుడు శంకరశాస్త్రి ఉన్నత విద్యను అభ్యసించి ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ మఠం నిర్వహణ చూస్తుండేవారు. తర్వాత శంకరమఠం శ్రీశృంగేరీ శారదా పీఠం అధీనంలోకి వెళ్లింది. మణెమ్మ మా అమ్మ మాది ప్రకాశం జిల్లా అద్దంకి. కుటుంబ పోషణ నిమిత్తం మా కుటుంబం తెనాలి చేరుకుంది. శుభకార్యాల్లో వంటలు చేయడంలో మా అమ్మ వారణాసి మణెమ్మ పేరు తెచ్చుకుంది. శంకర మఠం కేంద్రంగా జరిగిన ముద్దపప్పు సప్తాహాలు, కార్తీక సమారాధనలు మణెమ్మ చేతుల మీదుగానే జరిగేవి. మా అమ్మ 26 ఏళ్ల క్రితం చనిపోయారు. ఇప్పటికీ ఆమె పేరిట ఏటా కార్తీకమాస సమారాధనల్ని మఠంలో చేస్తున్నాం. – రాయప్రోలు సుందరమ్మ. మణెమ్మ పెద్ద కుమార్తె, సదాశివశాస్త్రి, మనవడు ఆ రోజుల్లో గొప్పగా ఉండేది ఆధ్యాత్మిక ప్రచారంలో ఒక వెలుగు వెలిగిన శంకర మఠం తర్వాతి కాలంలో ఆ ప్రాభవాన్ని కోల్పోయింది. గొప్పగా నడిచిన ముద్దపప్పు సప్తాహాలు నిలిచిపోయాయి. భోజనం వడ్డనకు ముందు మా తండ్రి ములుకుట్ల సదాశివశాస్త్రి హరికథా కాలక్షేపం తప్పనిసరిగా ఉండేది. – ములుకుట్ల విశ్వనాథశాస్త్రి,భక్తి ప్రచారక ధూపదీప నైవేద్యం ఇస్తున్నా శంకర మఠం శ్రీశృంగేరీ పీఠం ఆధ్వర్యంలో ఉంది. 30 ఏళ్లుగా ధూపదీప నైవేద్యం పెడుతున్నా. మఠం ఆవరణలోని ఇంట్లో ఉండేవాళ్లం. మఠంతో సహా ఇల్లు శిథిలావస్థకు చేరటంతో అద్దె ఇంట్లోకి మారాల్సి వచ్చి0ది. – యనమండ్ర నరసింహమూర్తి, అర్చకస్వామి -
నిమ్మ.. ‘ధర’హాసం
తెనాలి: నిమ్మ ధరలు ఆశాజనకంగా ఉండడంతో ఆ రైతుల మోముల్లో ‘ధర’ హాసం కనిపిస్తోంది. దిగుబడి కొంతమేర తగ్గినప్పటికీ, మార్కెట్లో గరిష్ట ధరలకు క్రయ, విక్రయాలు సాగడంతో రైతులు దిల్ఖుష్ గా ఉన్నారు. నిమ్మకాయల ఉత్పత్తిలో దేశంలో అగ్రస్థానంలో ఉన్న ఏడు రాష్ట్రాల్లో ఆంధప్రదేశ్ ఒకటి. రాష్ట్రంలో గూడూరు, ఏలూరు మార్కెట్ల తర్వాత నిమ్మకాయలకు ప్రసిద్ధి తెనాలి మార్కెట్. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆరు వేల ఎకరాలకుపైగా నిమ్మతోటలు సాగులో ఉంటే అందులో అత్యధిక విస్తీర్ణం తెనాలి డివిజనులోనే ఉంది. కృష్ణా జిల్లాలో తిరువూరు ప్రాంతంలో 800 ఎకరాల్లో నిమ్మతోటలున్నాయి. ఆ జిల్లా రైతులు దగ్గర్లోని ఏలూరు మార్కెట్‌కు వెళుతుంటారు. తెనాలి మార్కెట్ యార్డు ఆవరణలోని నిమ్మ మార్కెట్లో ప్రతిరోజూ లావాదేవీలు జరుగుతుంటాయి. ఇక్కడ్నుంచి ఉత్తర భారతదేశంలోని కాశీ, కోల్‌కతా, ఢిల్లీ, కాన్పూర్‌కు ఎగుమతి చేస్తున్నారు. సీజనులో 12 లారీలకుపైగా అన్ సీజనులో నాలుగైదు లారీల సరుకు ఎగుమతి అవుతుంటుంది. నికరమైన ఆదాయం నిమ్మతోటలు ఏటా జూలై, డిసెంబరు, మే నెలల్లో మూడు కాపులనిస్తాయి. ఒక కాపు మూడేసి నెలలు దిగుబడి నిస్తుంటాయి. ప్రతి కాపునకు సుమారు 200 టిక్కీల వరకు కాయ దిగుబడి వస్తుంది. కాయ సైజు ఆధారంగా ఒక్కో టిక్కీకి 55 కిలోలు వస్తాయి. కొన్నేళ్లుగా నిమ్మతోటల రైతులకు నికరమైన ఆదాయం వస్తున్నందున, కౌలు ధరలు పెరిగాయి. ఎకరా కౌలు రూ.90 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు చేరిన సందర్భాలున్నాయి. ఎరువులు, పురుగు మందులు, నీటితడులకు కలిపి ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకూ ఖర్చు చేయాల్సివస్తుంది. అయినా సరే నిమ్మసాగు లాభిస్తున్నందున మెట్ట ప్రాంతం నుంచి డెల్టా, మాగాణి భూములకు విస్తరించింది. ఈ ఏడాది భేషుగ్గా... గతంకన్నా ఈ ఏడాది నిమ్మ సాగు రైతులకు సంతృప్తినిచ్చింది. తెనాలి నిమ్మ మార్కెట్లో కిలో రూ.50 నుంచి రూ.70 మధ్య విక్రయాలు జరుగుతూ వచ్చాయి. గత ఏప్రిల్‌లో కనిష్ట ధర రూ.68, గరిష్టంగా రూ.80కి పైగా కొనుగోళ్లు జరిగాయి. ఏప్రిల్ 24న కిలో రూ.90లకు అమ్మకాలు జరిగాయి. ఏప్రిల్ 28 నుంచి కిలో రూ.65లపైన మార్కెట్ లావాదేవీలు కొనసాగుతూ వచ్చాయి. మే ఒకటో తేదీన గరిష్ట ధర రూ.78 పలికింది. ఫుల్ జోష్‌లో ఉన్న రైతులకు, సీజను ముగింపు దశలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత ధరల్లో తగ్గుదల కొంత నిరాశపరిచింది. ఎన్నికల కోసం నాలుగు రోజులు సెలవులివ్వటం, తర్వాత వర్షాలు పడటంతో వ్యాపారులు రేటు తగ్గించినట్టు చెబుతున్నారు. అయినప్పటికీ కిలో రూ.30కిపైగా కొనుగోళ్లు జరుగుతుండటం ఒకింత ఊరట. ఎకరాకు రూ.70 వేల నుంచి రూ.1.25 లక్షల వరకు కౌలుకు తీసుకున్న రైతులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. జూన్‌లో వచ్చే ఏరువాక పౌర్ణమికి నిమ్మ తోటలకు రైతులు మళ్లీ కౌలు ఒప్పందాలు చేసుకుంటారు. గతంలో తీవ్ర నష్టాలు లాభదాయకమైన నిమ్మతోటల సాగు 2017, 2018 సంవత్సరాల్లో రైతులకు చేదు అనుభవాలను మిగిల్చింది. 2017 ఏప్రిల్‌లో కిలో రూ.20–30 మధ్య పలికిన ధర, మరో నెలకు రూ.12–20 మధ్యకు దిగజారింది. జూన్‌లో మరింతగా పతనమై రూ.5 నుంచి రూ.10లకు పడిపోయింది. జులైలో రూ.7లకు మించలేదు. మళ్లీ 2018లోనూ అదే పరిస్థితి ఎదురైంది. కిలో ఆరేడు రూపాయలకు మించటం లేదని రైతులు గొల్లుమన్నారు. కోత కూలీ కూడా దక్కదన్న భావనతో కాపు కోయకుండా వదిలేసిన సందర్భాలున్నాయి. ఖర్చులు లెక్కేసుకుంటే ఒక్కో నిమ్మకాయకు రైతుకు మిగిలేది కేవలం 10 పైసలు మాత్రమే. అప్పట్లో ఈ పరిణామాలు నిమ్మ తోటల కౌలు ఒప్పందాలపైనా నష్టాల ప్రభావం చూపాయి. ఎకరా కౌలు రూ.65 నుంచి రూ.70 వేలకు మించలేదు.కరోనాలో ఆదుకున్న ప్రభుత్వం కరోనా మహమ్మారి నిమ్మతోటల కౌలుదార్లను బెంబేలెత్తించింది. దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా అమ్మకాలకు బ్రేక్ పడింది. తర్వాత కూడా ఇతర రాష్ట్రాల్నుంచి ఆర్డర్లు లేకుండాపోయాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో మార్కెటింగ్ శాఖ చొరవ తీసుకుని వారానికి మూడు రోజులు కొనుగోళ్లు చేసి, ఆదుకోవడంతో కొంతలో కొంత కోలుకోగలిగాం. అప్పట్లో కేవలం నెల రోజుల్లో 850 టన్నులను రైతుల్నుంచి కొనుగోలు చేసి ఎగుమతి చేసింది. లారీల సమ్మె రోజుల్లోనూ నిమ్మ రైతులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం నిలకడగా మంచి ధర లభిస్తుండటంతో ఫర్వాలేదని చెబుతున్నారు.మిగులు గ్రాములు లెక్కిస్తే మేలు నిమ్మ కాపు కాస్త తగ్గినప్పటికీ నిమ్మకాయ ధరలు ఈ ఏడాది సంతృప్తికరంగా ఉన్నాయి. మార్కెట్ యార్డులో మిగులు గ్రాములు లెక్కలోకి తీసుకోవటం లేదు. 10 కిలోల 500 గ్రాములు తూకం వస్తే 10 కిలోలకే లెక్కిస్తున్నారు. దీనివల్ల రైతులకు నష్టం. గ్రాములను కూడా పరిగణనలోకి తీసుకుంటే మాకు మేలు జరుగుతుంది. – కొత్త రమేష్ బాబు, నిమ్మ రైతు, సంగంజాగర్లమూడి -
16 ఏళ్లకే ఏఐ ఇంజనీర్! మన తెనాలి కుర్రాడే..
తెనాలి: తెనాలికి చెందిన 16 ఏళ్ల పిల్లి సిద్ధార్థ శ్రీవాత్సవ్ చిరు ప్రాయంలోనే ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్ ఇంజనీర్‌గా అరుదైన ప్రతిభ సాధించాడు. అయితే గతంలోనే ఇతడు ఆసియాలోనే అతి పిన్నవయసు డేటా సైంటిస్ట్‌గా గుర్తింపు పొందాడు. హైదరాబాద్ ఐఐటీలో కొత్తగా ప్రారంభించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో బాధ్యతలు స్వీకరించాడు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ప్రియమానస, రాజ్‌కుమార్ దంపతుల ఏకైక కుమారుడు సిద్ధార్థ. చిన్నతనం నుంచి కంప్యూటర్‌పై మక్కువ చూపడంతో తల్లిదండ్రులు ప్రోత్సహించారు. నాలుగో తరగతి నుంచే కంప్యూటర్ బేసిక్స్, టెక్నాలజీ, లాంగ్వేజెస్ నేర్చుకున్నాడు. నాలుగైదేళ్లు గడిచేసరికి అడ్వాన్స్ లెవెల్‌కు చేరుకోగలిగాడు. సొంతంగా ఆన్లైన్లో కొన్ని నమూనా ప్రాజెక్టులు చేస్తూ, ఆన్లైన్ కోర్సులతో సిద్ధార్థ వాటిపై పట్టు సాధించాడు. మోంటెగ్న్ కంపెనీ సీఈవో సిద్ధార్థకు ఉద్యోగానికి ఆఫర్ చేశారు. ఆవిధంగా ఏడో తరగతిలో ఐటీ ఉద్యోగిగా నెలకు రూ.25 వేల వేతనంతో చేరాడు. తర్వాత ఇనిఫినిటీ లెర్న్ అనే సంస్థలో డేటా సైంటిస్ట్‌గా నెలకు రూ.45 వేల వేతనం అందుకుంటూ, ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్లో వినూత్న గేమ్ డిజైనింగ్‌లో కృషిచేస్తున్నాడు. వారంలో మూడురోజులు పాఠశాలకు, మూడురోజులు ‘ఇన్ఫినిటీ లెర్న్’ ఐటీ సంస్థలో డేటా సైంటిస్ట్‌గా చేస్తూనే, అమెరికన్ కంపెనీ ‘రైట్ ఛాయిస్’ తరపున అక్కడి విద్యార్థులకు కోడింగ్ క్లాసులు నిర్వహించాడీ బాలమేధావి.మార్చిలో జూనియర్ ఇంటర్ పూర్తిచేసిన సిద్ధార్థను బైజూస్ కంపెనీ ‘యంగ్ జీనియస్’ అవార్డుతో సత్కరించింది. ‘సాక్షి’ ఎక్సలెన్స్ అవార్డును అందుకున్నాడు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి భూకంపాలను ముందుగానే గుర్తించడమనే కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుకూ పనిచేశాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఐఐటీ కొత్తగా ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని ఆరంభించింది. గత వారం నిర్వహించిన ఇంటర్వ్యూలో మెషీన్ లెరి్నంగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజినీరుగా సిద్ధార్థకు అవకాశం కల్పించింది. -
తెనాలి ఎమ్మెల్యేపై యువకుడి దాష్టీకం
తెనాలి: గుంటూరు జిల్లా తెనాలి వైఎస్సార్సీపీ అభ్యర్థిపై సామాజికవర్గం ముసుగులో కూటమికి చెందిన ఓ యువకుడు ఆయన భార్య సమక్షంలోనే అవమానించి... రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరించారు. ఆగ్రహించిన ఆయన చేయి చేసుకోవడంతో సోషల్ మీడియాలో దు్రష్పచారానికి తెగబడ్డారు. అంతేగాకుండా ఈసీకి ఫిర్యాదు చేసి ఆయన్ను తిర గనీయకుండా గృహనిర్బంధం చేశారు. అయితానగర్‌లో సోమవారం ఉదయం ఓటు వేసేందుకు భార్యతో సహా వచ్చిన ఎమ్మెల్యే శివకుమార్‌ను అప్పటికే క్యూలో ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి గొట్టిముక్కల సుధాకర్ అడ్డుకున్నాడు.క్యూలో వెళ్లకుండా నేరుగా లోపలకు వెళ్లడమేంటన్న మిషతో దుర్భాషలాడాడు. అయినా మౌనంగా లోపలకు వెళ్లి ఓటేసి వస్తుంటే, మళ్లీ అదే వ్యక్తి అడ్డుకున్నాడు. కులాల పేర్లు ప్రస్తావిస్తూ ‘ఆ పార్టీలో ఉండటమేమిటి’ ను వ్వు కమ్మోడివి కావా?’ అని రెచ్చగొట్టాడు. ఇంకా కవి్వంపు చర్యలకు పాల్పడటమే గాకుండా భార్య ముందే అసభ్యంగా మాట్లాడటంతో తట్టుకోలేకపోయిన శివకుమార్ అతడి చెంపపై కొట్టాడు.సుధాకర్ కూడా తిరిగి చేయి చేసుకోవడంతో ఎమ్మెల్యే పక్కనే ఉన్న కార్యకర్తలు అతడికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటనను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీనిని ఆసరాగా చేసుకుని టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదుచేసి, పోలింగ్ సరళిని పర్యవేక్షించే అవకాశం లేకుండా గృహనిర్బంధం విధించేలా చేశారు. ఈ ఘటనపై పోలీస్ కేసు నమోదు చేశారు. మనోహర్‌తో కలిసి చేసిన కుట్ర తనను రెచ్చగొట్టి ఏదోలా గొడవ సృష్టించి పోలింగ్ రోజున డ్యామేజ్ చేయాలని జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్, గొట్టిముక్కల సుధాకర్ కుట్ర పన్నారని ఎమ్మెల్యే శివకుమార్ ఆరోపించారు. -
మనోహర్ ఆస్తి పెరిగింది!
తెనాలిరూరల్: జనసేన పార్టీ తరఫున తెనాలి అభ్యర్థిగా నామినేషన్ వేసిన నాదెండ్ల మనోహర్ తన ఆస్తి రూ 22.89 కోట్లుగా ప్రకటించారు. 2019 కన్నా రూ. 12 కోట్లు పెరిగినట్టు అఫిడడవిట్‌లో పేర్కొ న్నారు. తనపేరిట రూ. 1,48, 03,300 విలువ చేసే చరాస్తులు ఉండగా తన భార్య పేర రూ. 2,49,33,338, కుమారుడి పేర రూ. 3,63,966 చరాస్తులు ఉన్న ట్టు చూపారు.తన పేర రూ, 1.95 కోట్ల విలువ చేసే 6.32 ఎకరాల వ్యవసాయ భూమి, తన భార్య పేరిట ద్వారకా తిరుమల, కర్ణాటకలలో రూ. 8.75 కోట్ల విలువ చేసే 8.54 ఎకరాల వ్యవసాయ భూమి, శేరిలింగంపల్లిలో రూ. 2,99,15,000 విలువ చేసే ఫ్లాట్, జూబ్లి హిల్స్‌లో రూ. 4,59,40. 000 విలువ చేసే ప్లాట్ ఉన్నట్టు చూపారు. తన పేరిట రూ. 43,96,641 వాహన రుణం ఉండగా తన భార్యకు రూ. నాలుగు కోట్లు రుణం ఉందని చూపారు. ఇక తనపై ఎటువంటి కేసులు లేవని స్పష్టం చేశారు. కాగా 2019లో తన ఆస్తి రూ. 10,68,78,117గా మనోహర్ చూపారు. తెనాలిలో మనోహర్ నామినేషన్ తెనాలిరూరల్: నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రపసాద్, బీజేపీ నేతలు, జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలతో ఐతాన గర్ లింగారావు సెంటరు నుండి భారీ ర్యాలీగా గాం«దీచౌక్, శివాజీచౌక్‌ల మీదుగా సబ్‌కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. తన భార్య మనోహరం, ఆలపాటి రాజా తదితరులతో కలసి రిటరి్నంగ్ అధికారి ప్రఖర్ జైన్‌కు నామినేషన్ పత్రాలను అందజేశారు. -
అది రాయి దాడి కాదు.. పవన్ అభిమానినే చితకబాదిన జనసైనికులు
తెనాలి రూరల్: జనసేన అధినే పవన్‌కళ్యాణ్ పర్యటనలో జన సైనికులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పవన్ అభిమాని అయిన ఓ కాపు యువకుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. పవన్ కల్యాణ్‌పై రాళ్లు విసిరాడని పుకారు చెలరేగడంతో అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు. బాధితుడు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పొన్నూరు మండలం మామిళ్లపల్లికి చెందిన సరిగిరి దిలీప్‌నాయుడు తెనాలిలో ఆదివారం సాయంత్రం జరిగిన పవన్‌కళ్యాణ్ రోడ్ షో, బహిరంగ సభలో పాల్గొనేందుకు వచ్చాడు. ఇక్కడి సుల్తానాబాద్‌లోని హెలీప్యాడ్ నుండి పవన్ కల్యాణ్ కొంత దూరం కారు నుండి అభిమానులకు అభివాదం చేస్తూ వచ్చి వారాహి వాహనంలోకి మారారు. ఈ మార్గంలోనే ఉషోదయ కళ్యాణమండపం వద్ద దిలీప్ పవన్ రాక కోసం వేచి ఉన్నాడు. పవన్ కల్యాణ్ అటుగా వెళ్లగానే ఓ యువతితో దిలీప్ అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఆమె తండ్రి అతనిపై దాడి చేశాడు. పక్కనే ఉన్న జన సైనికులు కలుగజేసుకుని దాడి చేస్తుండడంతో సమీపంలోని చెట్టు ఎక్కాడు. అయినా జనసైనికులు కిందకు లాగడంతో తనను రక్షించుకునేందుకు అందుబాటులో ఉన్న రాయి తీసుకున్నాడు. రాళ్లతో దాడి చేస్తున్నాడని జనసైనికులు కేకలు వేయడంతో అక్కడే ఉన్న మరి కొందరు పవన్ కల్యాణ్‌పై రాళ్లు వేశాడని కేకలు మొదలు పెట్టారు. యువకులు పెద్ద ఎత్తున గుమికూడి దిలీప్‌పై దాడి చేస్తున్న క్రమంలో కల్యాణమండపం ఆవరణలోకి పరుగెత్తాడు. వెంబడించిన జనసైనికులు అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు. కళ్యాణ మండపం సమీపంలోనే విధుల్లో ఉన్న గుంటూరు స్పెషల్‌బ్రాంచి ఇన్స్పెక్టర్ ఎస్ వెంకట్రావు, మరో మహిళా ఎస్ఐ, తెనాలి రూరల్, త్రీ టౌన్ స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుళ్లు శివ, తిరుమలరావు, ఇతర సిబ్బంది హుటాహుటిన దాడి జరిగిన ప్రదేశానికి వెళ్లారు. బాధితుడు దిలీప్‌ను పొలీసులు చుట్టముట్టి అతని ప్రాణాలను రక్షించారు. పవన్ కల్యాణ్ అభిమానినైన నేను ఆయనపై రాళ్లు ఎందుకు వేస్తానంటూ బాధితుడు వాపోయాడు. ప్రస్తుతం అతను పోలీసుల అదుపులో ఉన్నాడు. వివాదానికి కారణమేంటన్నదీ విచారిస్తున్నారు. -
పవన్ ఆపసోపాలు.. హైదరాబాద్ ఫాంహౌస్‌కు జంప్
‘‘రెండు రోజులు ప్రచారం చేయలేని వాడు ఎమ్మెల్యే అవుతాడా?. హైదరాబాద్ ఫాంహౌస్‌లకు అలవాటు పడిన వాడు పిఠాపురంలో ఇల్లు కట్టుకుంటాడా?. పార్ట్‌టైం పాలిట్రిక్స్ చేస్తే జనం నమ్ముతారా?. స్టంట్లలో డూపులను పెట్టినట్టు.. జనసేన సింబల్ కింద టీడీపీ నేతలతో పోటీ చేయిస్తావా?. ఇదేనా నిఖార్సయిన రాజకీయం?. ఇదేనా గోదావరి ప్రజల ముందుకెళ్లి తేల్చుకునే అంశం?’’ అంటూ పవన్‌కల్యాణ్‌పై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. జ్వరం కారణంగా పవన్ కల్యాణ్ తెనాలి పర్యటనను రద్దు చేసుకున్నారు. హైదరాబాద్‌కు వెళ్లిపోయిన పవన్.. మూడు రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒక్కరోజు ఎండలో తిరిగేసరికి జ్వరం వచ్చి వెంటనే ఆస్పత్రికి పరుగెత్తే పరిస్థితి వచ్చింది.. దీంతో అయన టూర్ కోసం ఈరోకు ఎదురు చూసిన జనసైనికులు.. అక్కడి ఓటర్లు అయ్యో.. సేనాని దమ్ము ఇంతేనా.. ముదురు కబుర్లు చెప్పడం.. నోటికొచ్చినట్లు అరవడం.. స్క్రిప్టెడ్ డైలాగ్స్ చెప్పడం తప్ప ఆయనకు పట్టుమని రెండ్రోజులు కూడా ప్రజల్లో ఉండే స్టామినా లేదా అని నవ్వుకుంటూన్నారు. ఇక ఈయన మిగతా నియోజకవర్గాల్లో టూర్లు చేస్తారా.. క్యాడర్ కోసం అన్ని జిల్లాలు ఈ నిప్పులుగక్కే ఎండల్లో తిరిగి ప్రచారం చేయగలరా? పిఠాపురం ఒక్కదానికే ఆయన ఆపసోపాలు పడిపోతుంటే మిగతా జిల్లాలకు వస్తారన్న నమ్మకమే పోతోంది అంటున్నారు. ఆయన్ను నమ్ముకుని టిక్కెట్లు తెచ్చుకుని డబ్బులు ఖర్చు చేసి పోటీకి దిగిన మా పరిస్థితి ఏమిటని అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. దీంతో ఆగండాగండి రెండ్రోజులు రెస్ట్ తీసుకుని.. బ్రాయిలర్ కోడి మళ్లీ కోలుకుని కూతకు వస్తుంది అని కొందరు పంచులు వేస్తున్నారు. మరో వైపు, పిఠాపురంలో పవన్ కల్యాణ్ పిల్లి మొగ్గలు వేస్తున్నారు. గతంలో టీడీపీని గెలిపిస్తే నన్ను నా తల్లిని తిట్టారు.. టీడీపీ వాళ్ళను వదిలిపెట్టను అన్నారు. కానీ, మళ్ళీ టీడీపీతో అంటకాగుతున్నారు. ఇక ఇప్పుడు పిఠాపురంలో పోటీకి దిగిన పవన్ కళ్యాణ్‌కు ఇప్పుడు ఎన్నికలు అంటే అసలు భయం పట్టుకుని తనను తానూ ఓ యోధుడిగా భావించుకుని రాజకీయాలు చేస్తున్నారు. పవన్ గతంలో భీమవరం.. గాజువాక.. రెండుచోట్లా ఓడిపోవడంతో షాక్ తిన్నారు. దీంతో ఇప్పుడు పిఠాపురంలో ఎలాగైనా గెలిపించాలని అర్థిస్తున్నారు. సీఎం అవ్వాలనుకుంటే నన్నెవడ్రా ఆపేది అనే డైలాగ్స్ దగ్గర్నుంచి ప్లీజ్.. నన్ను గెలిపించండి.. అర్థిస్తున్నాను అనేవరకు పవన్ వచ్చారు. -సిమ్మాదిరప్పన్న -
గీతాంజలి కుటుంబాన్ని పరామర్శించిన కోన వెంకట్
సాక్షి, గుంటూరు: సోషల్ మీడియా ట్రోలింగ్‌తో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి కుటుంబ సభ్యులను ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు కోన వెంకట్ పరామర్శించారు. గీతాంజలి కుటుంబ సభ్యులకు రూ. 50 వేల ఆర్థిక సాయాన్ని అందించారు. ఎప్పుడు ఏం అవసరం వచ్చినా తనకు చేయమని తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియా శాడిజానికి గీతాంజలి బలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పవిత్ర ఆత్మను ట్రోలింగ్‌తో చంపేశారని అన్నారు. సోషల్ మీడియా సైకోయిజానికి తాను కూడా బాధితుడినేనని అన్నారు కోన వెంకట్. ఈ వేధింపులకు చెక్ పెట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. వీటిని అడ్డుకునేందుకు వీలైతే కొత్త చట్టాలను తేవాలని కోరారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని చెప్పుకుంటే ట్రోల్ చేస్తున్నారని, జనాన్ని భయపెడుతున్నారని అన్నారు. కాగా తనకు ప్రభుత్వం ఇంటి స్థలం ఇవ్వడంతో సొంతింటి కల నెరవేరిందంటూ తెనాలికి చెందిన గీతాంజలి ఓ ప్రైవేట్ ఇంటర్వ్యూలో భావోద్వేగానికి లోనైంది. ఇంటి పట్టా రిజిస్టరై చేతికి వచ్చిన సందర్భంలో ఇచ్చిన ఇంటర్వ్యూపై.. టీడీపీ, జనసేన సోషల్ మీడియా సైకోలు అసభ్య పదజాలంతో దూషించారు. గీతాంజలి వీడియోను ఉద్దేశపూర్వకంగా సోషల్‌మీడియాలో పోస్ట్ చేసి.. ఆమెను అతిదారుణంగా ట్రోల్ చేశారు. దీంతో తీవ్ర మనోవేదనలకు గురైన ఆమె రైలు కిందపడి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే గాయాలతో ఉన్న ఆమెను ఆస్పత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన ఏపీలో తీవ్ర దుమారం రేపింది. సోషల్ మీడియాలో వేధించిన సైకోలను వదల్లొద్దంటూ డిమాండ్ బలంగా వినిపించింది. చదవండి: ‘పవన్ కూడా వెన్నుపోటు.. మరీ ఇంత దుర్మార్గమా?’ -
గీతాంజలి కేసు వేగవంతం...రహస్య ప్రాంతంలో నిందితులు
-
కొనసాగిన నిరసనలు
సాక్షి, నెట్వర్క్: తెనాలికి చెందిన గొల్తి గీతాంజలిని అసభ్యకర మెసేజ్‌లతో వేధించి, ఆమె ఆత్మహత్యకు కారణమైన టీడీపీ, జనసేన పార్టీలపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గీతాంజలిపై ఈ రెండు పార్టీల సోషల్ మీడియా మూకలు అసభ్య సందేశాలతో దాడి చేయడాన్ని ఖండిస్తూ ప్రజలు చేస్తున్న నిరసనలు గురువారమూ కొనసాగాయి. పలు ప్రాంతాల్లో కొవ్వొత్తుల ర్యాలీలు జరిగాయి. ట్రోలింగ్ గూండాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విజయవాడలో న్యాయవాదులు గురువారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో విజయవాడ న్యాయస్థానాల సముదాయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ జరిగింది. టీడీపీ గూండాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీఆర్వో వి.శ్రీనివాసరావుకు న్యాయవాదులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ టీడీపీ చర్యలతో మహిళలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు సుజాత, ఉషాజ్యోతి, సౌమ్య, జ్యోతి, సి.హెచ్.సాయిరామ్, పిళ్లా రవి, కె.జయరాజు, మన్మధరావు, కె.ప్రభాకర్, నిర్మల్ రాజేష్ , సూర్యనారాయణరెడ్డి, పూర్ణ, భార్గవ్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో విశ్వబ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో టవర్ క్లాక్ వద్ద గీతాంజలి చిత్రపటానికి నివాళులర్పించారు. కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు. వైఎస్సార్సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వారికి సంఘీభావం తెలిపారు. చిత్తూరు జిల్లా పలమనేరులో ప్రజలు నిరసన ప్రదర్శన చేశారు. వైఎస్సార్సీపీ నేతల ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి నివాళులరి్పంచి, గీతాంజలి జోహార్ అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో ఎంపీపీ కిలపర్తి రాజేశ్వరి, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు గొర్రుపోటు రమాదేవి తదితరుల ఆధ్వర్యంలో గురువారం రాత్రి కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ చేశారు. -
బోండా ఉమా అనుచరుడే !..గీతాంజలి కేసులో తొలి అరెస్ట్
-
గీతాంజలి కేసులో దర్యాప్తు ముమ్మరం
-
గీతాంజలి మృతిపై బీసీ కమిషన్ సీరియస్
విజయవాడ: తెనాలిలో గీతాంజలి మృతిపై బీసీ కమిషన్ సీరియస్ అయింది. గీతాంజలి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని బీసీ కమిషన్ సభ్యుడు డాక్టర్ ఎన్ మారేష్ ఆదేశాలు జారీ చేశారు. రైల్వే,స్థానిక పోలీసులతో బీసీ కమిషన్ సభ్యులు మాట్లాడారు. వేధింపులకు గురి చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. గీతాంజలి ఆత్మహత్య ఘటనపై సాక్షితో బీసీ కమిషన్ మెంబర్ మారేష్ మాట్లాడారు. ‘గీతాంజలి మరణం వెనుక కుట్ర కోణం ఉంది. ప్రభుత్వం వల్ల మేలు జరిగిందని చెప్పిన లబ్ధిదారులు భయబ్రాంతులకు గురై చనిపోతే ఇంకెవరూ అలా మాట్లాడకూడదనేది ప్రత్యర్ధుల కుట్ర. బీసీలు విశ్వాసానికి ప్రతీక.. నవరత్నాల ద్వారా బీసీల జీవన ప్రమాణాలు పెరిగాయి. ప్రభుత్వం ద్వారా మేలు పొందిన ప్రభుత్వానికి అండగా ఉంటారనే అక్కసుతోనే ఈ కుట్ర. చేసిన తప్పేంటి.. లబ్ధి కలగడంతో ఆనందపడడమే ఆమె చేసిన తప్పా. గీతాంజలి మరణం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ. సోషల్ మీడియాను మంచికి ఉపయోగించుకోవాలి. గీతాంజలి ఘటన జరిగిన తర్వాత కూడా ఆమెపై కొందరు దుష్ప్రచారం చేయడం బాధాకరం. బీసీలు కన్నెర్ర చేసే బీసీ వ్యతిరేకులు రోడ్లపై తిరగలేరు. ఆ రాజకీయ పార్టీలు ఇంకెంతమంది బీసీలను బలి తీసుకుంటాయి. రైల్వే అధికారులు, పోలీసులతో మాట్లాడాం. బీసీ సామాజిక వర్గానికి చెందిన విశ్వ బ్రాహ్మిన్ మహిళ చనిపోవడం బాధాకరం. అంబేద్కర్ ఇచ్చిన వాక్ స్వాతంత్రాన్ని హరిస్తున్నారు. ఎంతో మానసిక ఒత్తిడికి గురై గీతాంజలి చనిపోయింది’ అని మారేష్ అన్నారు. -
గీతాంజలి ఉదంతం: సీఎం జగన్ విచారం.. రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా
సాక్షి, అమరావతి: తెనాలి మహిళ గీతాంజలి ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురించేసిందని అన్నారు. గీతాంజలి కుటుంబాన్ని ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆడపిల్లల గౌరవ ప్రతిష్టలకు, మర్యాదలకు భంగం కలిగించే ఏ ఒక్కరినీ కూడా చట్టం వదిలిపెట్టదని సీఎం జగన్ స్పష్టం చేశారు. కాగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కారణంగా తన కుటుంబానికి ఎంతో మేలు జరిగిందంటూ గీతాంజలి ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూపై ప్రతిపక్షాలకు చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు అనుచిత వ్యాఖ్యలు పోస్టు చేయడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందంటూ కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: టీడీపీ, జనసేన ఆన్లైన్ మృగాల వికృత క్రీడ.. ఓ చెల్లెమ్మను చంపేశారు! -
వాళ్లను వదిలిపెట్టొద్దు.. గీతాంజలి భర్త ఆవేదన
సాక్షి, గుంటూరు జిల్లా: తెనాలిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. టీడీపీ, జనసేన ట్రోలింగ్స్ తట్టుకోలేక గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె భర్త బాలచందర్, ఇతర కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. గీతాంజలిది చిన్న పిల్ల మనస్తత్వం అని, ఇలా జరుగుతుందని మేము ఊహించలేదన్నారు. వీడియో మాట్లాడినప్పుడు చాలా ఆనంద పడిందని, ఆ వీడియోకి సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లకు తనలో తానే బాధపడిందని, ఫోన్ చూస్తూ నిత్యం ఏడ్చేదన్నారు. ‘‘తెల్లవారుజామున 3 గంటల వరకు ఫోను చూస్తూ ఏడుస్తూనే ఉంది. ఇంకా ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు ఉండవని చివరగా ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంది. ఒక మహిళ మీద ఇలాంటి ట్రోలింగ్స్ ఎవరైనా చేస్తారా?. ట్రోలింగ్స్ తట్టుకోలేక మా అమ్మాయి దూరమైంది. ఎవరైతే ట్రోలింగ్ చేసారో వాళ్ల మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: టీడీపీ, జనసేన ఆన్లైన్ మృగాల వికృత క్రీడ.. ఓ చెల్లెమ్మను చంపేశారు! -
మనస్థాపంతో రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం..!
-
నాదెండ్ల మనోహర్‌పై నీళ్ల బాటిల్‌తో దాడి
తెనాలి(గుంటూరు జిల్లా): పొత్తు పెట్టుకున్నప్పటికీ తెనాలిలో టీడీపీ–జనసేన నేతల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న తీవ్ర విభేదాలు గురువారం బట్టబయలయ్యాయి. జనసేన సీనియర్ నేత, తెనాలి అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌పై టీడీపీ వర్గీయులు నీళ్ల బాటిల్‌తో దాడి చేశారు. ఈ బాటిల్ ఆయన తలకు తగిలింది. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, జనసేన అసెంబ్లీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గురువారం సాయంత్రం తెనాలిలో జనచైతన్య పాదయాత్ర ప్రారంభించారు. బోసు రోడ్డులోని జనసేన పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన పాదయాత్ర వీనస్ టాకీస్ దగ్గరకు చేరుకుంది. అక్కడ టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ (రాజా) వచ్చి కలిశారు. ఆ వెంటనే రాజాకు మద్దతుగా టీడీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పోటీగా జనసేన కార్యకర్తలు నాదెండ్ల మనోహర్ జిందాబాద్.. అంటూ నినాదాలు ప్రారంభించారు. దీంతో అక్కడ తోపులాట జరిగింది. ఈ తోపులాటలో టీడీపీ మహిళా కార్యకర్త ఒకరు ఇరుక్కుపోయారు. ఈ సమయంలో∙ఎవరో నీళ్ల బాటిల్‌ను నాదెండ్ల మనోహర్‌పైకి బలంగా విసిరారు. ఆయన తప్పుకోవాలని ప్రయత్నించినప్పటికీ తలకు తగిలింది. ఈ ఘటనతో అందరూ కంగుతిన్నారు. ఆలపాటి రాజా వర్గమే అక్కసుతో ఈ దాడికి పాల్పడిందని జనసేన వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఆలపాటి రాజా టీడీపీ నుంచి తెనాలి టికెట్ ఆశించారని, ఆయనకు కాకుండా పొత్తుల్లో భాగంగా జనసేన నేత నాదెండ్ల మనోహర్‌కు ఇవ్వడంవల్లే ఈ దాడి చేశారని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలతో పాదయాత్రకు వచ్చిన అనేక మంది యాత్ర పూర్తికాకుండానే వెళ్లిపోయారు. -
ఆలపాటి ఔట్.. అధికారికంగా చెప్పేసిన లోకేష్
తెనాలి: తెనాలి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీకి ప్రయత్నాలు చేస్తున్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆశల అడియాసలయ్యాయి. ఆయనకు పార్టీ టికెట్ లేదని సాక్షాత్తూ నారా లోకేశ్ మంగళ వారం తేల్చి చెప్పేశారు. 2024 ఎన్నికలకు జనసేన, టీడీపీ పొత్తుల నేపథ్యంలో తెనాలి నుంచి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ రంగం సిద్ధం చేసుకుంటున్న విషయం తెలిసిందే. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ పోటీచేస్తారని, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ రెండు నెలల క్రితమే మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో తెనాలి జనసేన నేతలకు స్పష్టంచేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ పార్టీ వర్గాలను మభ్యపెడుతూ తానూ పోటీలో ఉన్నట్టుగా ప్రచారం చేసుకుంటూ వచ్చారు ఆలపాటి. పైగా ప్రజా చైతన్యయాత్ర పేరుతో నియోజకవర్గంలో పాదయాత్ర కూడా చేపట్టారు. వార్డులవారీ సమావేశాల్లో పాల్గొంటున్నారు. నాదెండ్ల మనోహర్‌తో పోలిస్తే పార్టీ సర్వేలో తనకే ఎక్కువ స్కోరు ఉన్నట్టుగా కార్యకర్తలు, నాయకులకు చెప్పారు. చివరి నిముషంలో తనకే టికెట్ వస్తుందని నమ్మబలుకుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళవారం దీనిపై స్పష్టత ఇచ్చినట్టు తెలిసింది. గుంటూరు ఎంపీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తే చెయ్... లేదంటే నీదారి నువ్వు చూసుకొమ్మని లోకేశ్ చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. బుర్రిపాలెంకు చెందిన ప్రవాస భారతీయుడు పెమ్మసాని చంద్రశేఖర్ ఇప్పటికే గుంటూరు ఎంపీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసేందుకు సన్నాహాల్లో ఉన్నారు. దీనితో ఆలపాటికి ఏం చేయాలో పాలుపోవటం లేదంటున్నారు. -
ఓ తెనాలి – తత్ దిన పత్రిక
ఆ పత్రిక కార్యాలయం అంతా సందడి సందడిగా ఉంది. ఇన్చార్జి క్యాబిన్లో నుంచి పొగలు సెగలు వస్తున్నాయి.బయట డెస్క్‌లో జర్నలిస్టు ధర్మారావు దిగాలుగా కూర్చుని ఉన్నాడు. అతని సహచరుడు లోకనాథం అతని దగ్గరకు వచ్చి, ‘ఏం బ్రదర్ డల్‌గా ఉన్నావ్? క్యాబిన్ నుంచి పొగలు సెగలు వస్తున్నాయి. బాస్ ఏమైనా తిట్టాడా?’ అని అడిగాడు.‘అంతేగా?’ అన్నాడు.‘ఎందుకయ్యా! రోజూ ఇలా. ఒకప్పుడు నువ్వు రాసే ఐటమ్స్ అంటే ఇటు పత్రికలోను అటు జనంలోనూ ఎంత హాట్ హాట్‌గా ఉండేవి? అంత చేయి తిరిగిన జర్నలిస్టువి, కాస్త మనసు కూడా చంపుకొని మసాలా వార్తలు రాశా వనుకో! నీ అనుభవానికి ఆ మసాలా తోడైతే వేడి వేడి మిరపకాయ బజ్జీల్లా ఉండవా నీ ఐటమ్స్? ఎందుకయ్యా! జర్నలిజం విలువలు, తొక్కా అంటూ నిన్ను నువ్వే పనిష్ చేసుకుంటావు? మనకు కావలసింది జీతం, ప్రశాంతంగా ఉండటం. సమాజం, నైతికత, బాధ్యత అంటూ పనికి మాలిన బిల్డప్పులు ఎందుకు? నేను రోజూ ఇలా చెబుతూనే ఉంటాను, నువ్వు మాత్రం మనసు మార్చుకోక తిట్లుతింటూనే ఉంటావు. ఇంతకీ అసలు ఏం జరిగింది?’ అడిగాడు లోకనాథం. ‘గాంధీనగర్‌లో ఒక మానవీయ కోణానికి సంబంధించి మంచి స్టోరీ రాశాను. అది తీసుకెళ్లి ఇస్తే నా మొహం మీద విసిరేసి, ఇప్పుడు ఈ స్టోరీలు ఎవడికి కావాలి? ఆ రోజులు పోయాయని ఎన్నిసార్లు చెప్పను? ఇప్పుడు కావాల్సిందంతా స్పైసీ... ‘సాగర సంగమం’ సినిమాలో స్టెప్పులు కావాలి... ఆవృతాలు, ఆవులు, గేదెలు ఎవడికి కావాలి అన్నట్టుగా, నామీద ఇంత ఎత్తున ఎగిరేడు’ గద్గద స్వరంతో చెప్పాడు ధర్మారావు. ‘మరి నేను చెప్పేది అదే. తెలివితేటలు ఉండ గానే సరిపోదు. కాస్తంత లౌక్యం కూడా కావాలి బతకాలంటే. సరే సరే నాకు టైం అయిపోతుంది’ అంటూ లోకనాథం కేబిన్ తలుపు తీసుకొని లోపలికి వెళ్ళాడు. పొగలు సెగలు కక్కుతున్న ఇన్చార్జి చింపిరి జుత్తుతో సిగ రెట్ల మీద సిగరెట్లు తాగుతూ కనిపించాడు. ‘రావయ్యా రా! నీ కోసమే చూస్తున్నా. బ్యానర్ స్టోరీ రెడీ అయిపోయింది. సెకండ్ ఐటమ్ ఏం వేద్దామా అని చూస్తున్నాను. టైం అయిపోతూ ఉంది. ఇంకా ఏం డిసైడ్ కాలేదు. నువ్వే మైనా వండుకొచ్చావా?’ ఆత్రంగా అడిగాడు ఇన్చార్జి. ‘మీరేం కంగారు పడకండి సార్! నేను ఉన్నాగా? చిల్లీస్ చికెన్, చికెన్ 65, చైనీస్ నూడుల్స్... ఏమైనా సరే అరగంటలో వండి వార్చేస్తా? ఇప్పుడు మన పత్రికతో ఏ డ్రైనేజీ గానీ, మూసీ నది గానీ పోటీ పడలేవు. మీకెందుకుకంగారు? ఇదిగోండి ఇది చూడండి. ఇది నా వంటకం కాదు గాని ఒక తెనాలి అవాకులు చవాకులు. భలే గమ్మత్తుగా ఉన్నాయి ఆరోపణలు’ అంటూ చేతిలో ఉన్న ప్రింట్ అవుట్ అందించాడు.సీరియస్‌గా ఐటెం చదవడం మొదలు పెట్టాడుఇన్చార్జి. హెడ్డింగ్ చూశాడు: ‘సజ్జలకే 140 కోట్లు.’ ♦ ‘ప్రభుత్వ సలహాదారులకు 680 కోట్లు వ్యయం. ♦ 89 మంది సలహాదారులకు అంత ప్రజాధనం వెచ్చించడం అవసరమా? ♦ నాదెండ్ల మనోహర్ ధ్వజం ఇన్చార్జి ముఖంలో టెన్షన్ చెరిగిపోయి పెదాల మీద చిరునవ్వు మొదలైంది.‘ఇదీ ఐటమ్ అంటే.. ధర్మారావు గాంధీనగర్‌లో పేదల బతుకులు అది ఇది అంటూ చెత్త ఐటమ్ తెచ్చాడయ్యా! దాంతో నా మూడంతా పాడైపోయింది. ఇదీ మసాలాఅంటే. అవును గానీ మనలో మాట, ఒక్క సజ్జలకే 140 కోట్లు అంటాడు ఏంటయ్యా? సలహాదారులకి 680 కోట్లా? అసలు అంత బడ్జెట్టే లేదు కదయ్యా!ఈ తెనాలి బుర్రేమైనా చెడిపోయిందా? లేదంటే లోకేష్‌కి పోటీగా తయారవుదాం అనుకుంటున్నాడా?’ అడిగాడు ఇన్చార్జి.‘‘అదేం కాదు సార్! తెనాలి నుంచి పోటీ చేయా లనుకుంటున్నాడు. తెనాలిలో తనకు టిక్కెట్ వస్తుందో రాదో అనేది ఒక టెన్షన్. తీరా టికెట్ దక్కించుకున్నా అసమ్మతి సెగతో మళ్ళీ ఓడిపోతానేమో అని భయం పట్టు కుంది. దాంతో పూర్తిగా ‘తెనాలి’ అయిపోయాడు. అందుకే ఏది పడితే అది మాట్లాడుతున్నాడు.’’ ‘నిజమేనయ్యా! కానీ ఐదేళ్లకి కోటీ నలభై లక్షలు కాబోలు. దాన్ని అర్థం చేసుకోలేక 140 కోట్లనేసినట్టున్నాడు. బడ్జెట్లో లేని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? పైగా సలహా దారులు ఉన్నది 46 మందేగా 89 మంది ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే... నువ్వే చెప్పావుగా? అతగాడు మైండ్చెడి తెనాలి అయిపోయాడని. సరే ఏదైతే అదవుతుంది? ఈరోజు మనకి చికెన్ 65 లాంటి మసాలా స్టోరీ దొరికింది. పాఠకులు ఇవన్నీ ఎక్కడ పట్టించుకుంటారు? మన పత్రికకు ఇంగువ కట్టిన గుడ్డ లాంటి ఇమేజ్ ఉండనే ఉందిగా! బాస్ అయితే హ్యాపీ ఫీల్ అవుతాడు. తిట్టుకుంటే జనాలు ‘తెనాలి’ని తిట్టుకుంటారు. సరే సరే నువ్వు మాత్రం ఈ మూడు నెలలు మూసీ నది మన పేపర్ని చూసి కుళ్లుకునేంత మురుగు స్టోరీలు ఇవ్వాలి సుమా!’ అంటూ స్టోరీకిరంగులు హంగులు అద్దే పనిలో పడ్డాడు ఇన్చార్జి. ‘తప్పకుండా సార్! ఇక నేను వస్తా’ అంటూ లోకనాథం క్యాబిన్ తలుపు తీసుకొని చిద్విలాసంగా నవ్వుకుంటూ బయటకు వచ్చాడు. ఒక మూల దీనంగా కూర్చున్న సిసలైన జర్నలిస్టు ధర్మారావు వైపు జాలిచూపు విసిరేసి, ‘బాబుని చూసైనా నేర్చుకోడు జాబు నిలబెట్టుకోవాలని ఆలోచించడు’ అని తనలో తను సణుక్కుంటూ వెళ్ళిపోయాడు. - వ్యాసకర్త సీనియర్ సంపాదకులు - పి. విజయ బాబు -
గుంటూరు జిల్లా తెనాలిలో తారస్థాయికి టికెట్ వార్
-
చంద్రబాబుపై ఆలపాటి తిరుగుబాటు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: తెనాలి సీటు విషయంలో జనసేన, తెలుగుదేశం మధ్య చిచ్చు రాజుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ (రాజా) తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. బుధవారం గుంటూరులో నియోజకవర్గంలోని రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు, మండల, పట్టణ పార్టీ, అన్ని అనుబంధ విభాగాల నేతల నేతలతో రాజా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. తెనాలి సీటు తెలుగుదేశం పార్టీకి కేటాయించకపోతే ఈ నేతలంతా మూకుమ్మడి రాజీనామాలు చేయనున్నట్లు తెలిసింది. తెనాలి సీటును జనసేన నేత నాదెండ్ల మనోహర్‌కు ఇస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా కాలం క్రితమే ప్రకటించారు. దీంతో కొద్దికాలం రాజకీయాలకు దూరంగా ఉన్న రాజా తర్వాత మళ్లీ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. నాదెండ్ల మనోహర్‌తో కలిసి చర్చలు జరపడం, కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం చేశారు. నాదెండ్ల మనోహర్‌ను రాజ్యసభకు పంపించి ఈ సీటు రాజాకు ఇస్తున్నట్లు చంద్రబాబు ఇటీవల చెప్పారు. దీంతో రాజా ప్రజా పాదయాత్ర పేరుతో తెనాలి నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభించారు. రాజ్యసభకు వెళ్లడానికి మనోహర్ ఇష్టపడలేదు. తెనాలిలోనే ఎన్నికల కార్యాలయం ప్రారంభించారు. తెనాలిలోనే ఉంటూ టీడీపీ, జనసేన ముఖ్య నేతలను కలుస్తూ సీటు తనదేనని చెబుతున్నారు. తనకు సహకరించాలని కోరుతున్నారు. దీంతో తెనాలి సీటు దక్కదన్న అభిప్రాయానికి వచి్చన ఆలపాటి రాజా గుంటూరు వెస్ట్ లేదా పెదకూరపాడు కేటాయించాలని కోరుతున్నట్లు తెలిసింది. ఈ సీట్లు ఇచ్చేందుకు అధిష్టానం ఇష్టపడటంలేదు. దీంతో రాజా పార్టీ అధిష్టానంపై తిరుగుబాటుకు సిద్ధమైనట్లు సమాచారం. ఆయన పార్టీకి చెందిన ముఖ్య నేతలందరినీ మంగళవారం తన ఇంటికి పిలిపించుకుని, వారితో చర్చలు జరిపారు. పొత్తులో భాగంగా సీటును జనసేన పార్టీకి ఇస్తే సహించబోమని ఈ సమావేశం అనంతరం నేతలు మీడియాకు తెలిపారు. పార్టీ తెనాలి పట్టణ అధ్యక్షులు తాడిబోయిన హరిప్రసాద్, మాజీ అధ్యక్షుడు ఖుద్దూస్, మాజీ ఎంపీపీలు కేశన కోటేశ్వరరావు, సూర్యదేవర వెంకటరావు, మాజీ జెడ్పీటీసీ శాఖమూరి చిన్నా, వైకుంఠపురం మాజీ చైర్మన్ జొన్నాదుల మహేష్, అర్బన్ బ్యాంకు మాజీ చైర్మన్ సోమవరపు నాగేశ్వరరావు, కౌన్సిలర్లు ఆడుసుమిల్లి వెంకటేశ్వరరావు, దేసు యుగంధర్, తాడిబోయిన బ్రహ్మేశ్వరరావు, ఇతర టీడీపీ నాయకులు వీరమాచినేని వెంకటేశ్వరరావు, ఈదర వెంకట పూర్ణచంద్, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, రావి చిన్ని, రావి సూర్యకిరణ్ తేజ, లాయర్ మద్ది మల్లికార్జునరావు తదితరులతో రాజా ఈ సమావేశం నిర్వహించారు. బుధవారం గుంటూరులో జరిగే సమావేశంలో రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాలని వారు నిర్ణయించినట్లు తెలిసింది. -
గుంటూరు జిల్లా తెనాలి సీటు పై తెలుగుదేశం జనసేన మధ్య వార్
-
కార్పొరేట్ స్కూళ్ల కంటే ఏపీ ప్రభుత్వ బడులు అద్భుతం: అంబటి రాయుడు
సాక్షి, తెనాలి : కార్పొరేట్ స్కూళ్ల కంటే ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లలో సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయని ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు కొనియాడారు. తెనాలి నియోజకవర్గం సంగం జాగర్లమూడిలోని రైతు భరోసా కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రభుత్వ పాఠశాలను రాయుడు పరిశీలించారు. విద్యార్థులు కూడా తమ భవిష్యత్తు బాగుంటుందని నమ్మకంతో ఉన్నారని తెలిపారు. ‘ఏపీలో స్కూళ్లలో ఉన్న సదుపాయాలు దేశంలో ఎక్కడా లేవు. మధ్యాహ్న భోజన పథకంలో ఇచ్చే ఆహారం రుచికరంగా ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ఏపీ నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదుగుతోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. వైద్య ఆరోగ్య రంగంలో ఏ రాష్ట్రం మన రాష్ట్రంతో సరితూగలేదు. రైతు భరోసా కేంద్రాల వల్ల రైతులు ఆనందంగా ఉన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు సంక్షేమ పథకాలతో ప్రజలంతా ఆనందంగా ఉన్నారు’ అని రాయుడు అన్నారు. ఇదీచదవండి... ఎమ్మెల్యే డోల శ్రీబాలవీరాంజనేయస్వామికి ఝలక్ -
వైఎస్సార్సీపీ పాలనలోనే సాధికారత
తెనాలి (పట్నంబజారు): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుల, మత, ప్రాంత, రాజకీయ పక్షపాతం లేకుండా ప్రతి పేదవాడి ఇంటి ముంగిటకు సంక్షేమాన్ని తీసుకెళ్లారని మంత్రులు ఆదిమూలపు సురేష్, జోగి రమేష్ చెప్పారు. వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా గురువారం తెనాలిలో జరిగిన బహిరంగ సభలో మంత్రులు మాట్లాడారు. గత ప్రభుత్వ పాలనలో కులాల మధ్య చిచ్చు పెట్టారని, కేవలం ఒక సామాజిక వర్గం, జన్మభూమి కమిటీలు నిర్ణయించిన వారికే పాలన అందించారని మంత్రి సురేష్ తెలిపారు. అణగారిన వర్గాలు, బడుగు, బలహీన వర్గాల పేదలకు పరిపాలనను చేరువ చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. గత ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై ఎన్ని దాడులు చేసిందో అందరికీ అనుభవమేనన్నారు. సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టాక అసమానతలు లేని సమాజాన్ని నిర్మిస్తున్నారని చెప్పారు. జవాబుదారీతనం, పారదర్శకత, అవినీతి లేని పాలన, సమర్థవంతమైన నాయకత్వం నాలుగు స్థంభాలుగా రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నారన్నారు. 70 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సాధికారత కల్పించారని తెలిపారు. సామాజిక సాధికారత కోసం తాము యాత్ర చేస్తుంటే రిమాండ్ ఖైదీ కోసం భువనేశ్వరి యాత్ర చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదల పక్షపాత పార్టీ అని మంత్రి జోగి రమేష్ చెప్పారు. నాలుగున్నరేళ్ల పాలనలో చేసింది చెప్పేందుకే సామాజిక సాధికార యాత్రను చేస్తున్న దమ్మున్న నేత సీఎం జగన్ అని అన్నారు. ఇప్పటివరకు రూ.2.31 లక్షల కోట్లు ప్రజల కోసం ఖర్చుపెట్టిన ఘనత సీఎం జగన్‌దే అని అన్నారు. 2019లో ఓటు వేయని వారు కూడా వైఎస్ జగన్ పరిపాలన చూసి 2024లో ఆయన్ని ముఖ్యమంత్రిని చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రానున్న ఎన్నికల్లో 175 సీట్లకు 175 సీట్లను గెలవబోతున్నామని ధీమా వ్యక్తంచేశారు. సినిమాల్లో హీరోగా ఉండే వ్యక్తి రాజకీయాల్లో కామెడీ యాక్టర్‌గా మారిపోయారని పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి విమర్శించారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్‌ను తట్టుకోలేక టీడీపీ, జనసేన భూస్థాపితం కావడం తథ్యమన్నారు. సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే పాలన చేర్చిన ఘనత సీఎం జగన్‌కు దక్కుతుందన్నారు. రాష్ట్రంలో జగనన్న రావడానికి ముందు అన్నీ స్కామ్‌లేనని, జగనన్న వచ్చాక అన్నీ స్కీములేనని, ఇప్పుడు రాష్ట్రం సుభిక్షంగా ఉందని అన్నారు. టీడీపీ మైనార్టీలకు చేసింది ఏమిలేదని చెప్పారు. మాయమాటలతో బీసీల ఓట్లు వేయించుకునే రాజకీయాలకు సీఎం వైఎస్ జగన్ చెల్లు చీటి రాశారని ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి చెప్పారు. జన్మభూమి అనే పనికిమాలిన కమిటీల ద్వారా టీడీపీ సిగ్గుమాలిన పాలన చేసిందని, అందుకు భిన్నంగా పరిపాలన అంటే ఎలా ఉండాలో చూపించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని అన్నారు. వైఎస్ జగన్ పాలనలో సామాజిక న్యాయం జరిగిందని, ఇంకా చేస్తానని ఆయన స్పష్టంగా చెబుతున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ చెప్పారు. పేదవారి కోసం అనేక సంక్షేమ పథకాలు చేపట్టి అంబేడ్కర్ భావజాలాన్ని, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయాలను సీఎం జగన్ ముందుకు తీసుకెళ్తున్నారని ఎమ్మెల్సీ పోతుల సునీత చెప్పారు. సీఎం జగన్ బీసీ సాధికారతను చేతల్లో చూపించారని మాజీ ఎంపీ బుట్ట రేణుక తెలిపారు. తెనాలి నియోజకవర్గంలో సీఎం వైఎస్ జగన్ ఆశీస్సులతో రూ.1,800 కోట్ల తో సంక్షేమం, అబివృద్ధి పనులు చేసినట్లు ఎమ్మెల్యే అన్నాబత్తుని చెప్పారు. దేశ చరిత్రలో 30 లక్షల మందికి ఇళ్ళ స్థలాలు ఇచ్చిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. ఎంపీ ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యేలు రోశయ్య, షేక్ మహ్మాద్ ముస్తాఫా, జెడ్పీ చైర్పర్సన్ హెన్రీ క్రిస్టినా పాల్గొన్నారు. సామాజిక సాధికార రణభేరి ఇది తెనాలి: దేశంలో ఏ రాష్ట్రంలో, ఏ సీఎం చేయని విధంగా రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ సామా జిక న్యాయాన్ని నెలకొల్పారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలంతా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా తలెత్తుకొని తిరిగేలా చేశారని తెలిపారు. కులాలు, మతాలు, పార్టీలు, జెండాలు, అజెండాలు లేకుండా అందరం మనసున్న జగనన్న బాటలోనే నడుస్తామని చెప్పారు. ఇది సామాజిక సాధికార రణభేరి అని, సీఎం వైఎస్ జగన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మంచి జరిగింది కాబట్టే, సీఎం వైఎస్ జగన్‌ను ఆశీర్వదించమని కోరుతున్నామని అన్నారు. వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర గురువారం తెనాలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నేతృత్వంలో ప్రారంభమైంది. కొలకలూరు బాపయ్యపేట వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పార్టీ వర్గాలు ఘనంగా స్వాగతం పలికాయి. అక్కడే కుండల తయారీలో ఉన్న శాలివాహనులను పలకరించిన అనంతరం మంత్రులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వికేంద్రీకరణ మంత్రంతో గత నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో 3.5 కోట్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలకు సాధికారత చేకూరిన విధానాన్ని ప్రజలకు వివరించి, వైఎస్ జగన్‌ను ఆశీర్వదించాలని ప్రజలను ధైర్యంగా కోరతామని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్, మాజీ ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్యేలు హఫీజ్‌ఖాన్, ముస్తాఫా, కొలుసు పార్థసారథి, ఎమ్మెల్సీలు పోతుల సునీత, కల్పలతారెడ్డి పాల్గొన్నారు. -
‘జగనన్న నాయకత్వాన్ని నిలబెట్టుకుందాం’
సాక్షి, గుంటూరు: అధికారంలో ఉన్న నాలుగున్నరేళ్లు చేసిన పనుల్ని చెబుతూ ప్రజల్లోకి వెళ్లేందుకు ఎంతో ధైర్యం ఉండాలని, జగనన్న సారధ్యంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఆ దమ్ముందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. గురువారం సాయంత్రం తెనాలి మార్కెట్ సెంటర్లోని అన్నాబత్తుని పురవేదికకు వద్ద అశేష జనవాహిని మధ్య సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభలో వైఎస్సార్సీపీకి చెందిన అన్ని వర్గాల నేతలు ప్రసంగించారు. ►పూలే,అంబేద్కర్, వైఎస్సార్ ఆశయాల సాధనకు కృషి చేస్తున్న వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి. 40 ఏళ్ల రాజకీయంలో చంద్రబాబు ప్రజలకు చేసిందేమీ లేదు. స్కిల్ స్కామ్ లో దొరికిపోయి.. జైల్లో ఉండి కూడా బాబు బుకాయిస్తున్నాడు. నారా భువనేశ్వరికి ఇదే నా సూటి ప్రశ్న. మీ తండ్రిని వెన్నుపోటు పొడిస్తే ఎందుకు మాట్లాడలేకపోయారు. మీ దుర్మార్గపు రాజకీయాల కోసం ప్రజల్ని వాడుకోవద్దని కోరుతున్నా. సామాజిక సాధికారత కోసం గతంలో ఎన్నోపోరాటాలు జరిగాయి. ఉద్యమాలు, పోరాటాలు లేకుండానే బీసీ,ఎస్సీ,ఎస్టీలకు మేలు చేసిన వ్యక్తి సీఎం జగన్. మహిళలను పసుపు కుంకుమ పేరుతో మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. మహిళలకు సాధికారత చేకూర్చిన మనసున్న నాయకుడు జగన్. మహిళలకు రాజకీయంగా సాధికారత కల్పించిన ఘనత జగనన్నదే. జగనన్నకు మనమంతా సైనికుల్లా నిలబడాలి :::ఎమ్మెల్సీ పోతుల సునీత ►75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ప్రతీ పార్టీలు ఎన్నికల్లో తీపికబుర్లు చెప్పడం తర్వాత మోసం చేయడం చూశాం. గతంలో బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకు ఎంతో అన్యాయం జరిగింది. టీడీపీ సమయంలో జన్మభూమి కమిటీలను తృప్తి పరిస్తేనే పథకాలు అందేవి. ఎవరైనా చనిపోతేనే పెన్షన్ ఇచ్చేవారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అర్హత ఉంటే చాలు. చంద్రబాబు వందల ఎకరాలను వారికి కావాల్సిన వారికి కట్టబెట్టేవారు. ఆశ్రమాలు కట్టుకునే వారికి కేటాయించేవారు. పట్టుమని పేదలకు పది ఎకరాలు కొని ఇచ్చిన చరిత్ర చంద్రబాబుకు లేదు. కానీ బీసీలకు పెద్దపీట వేసిన ఒకే ఒక్క ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వం. సమాజంలో ఉన్న అన్ని వనరులను సమానంగా పంచడమే సామాజిక సాధికారిత. 32 లక్షల మందికి సొంతింటి కల నెరవేర్చిన మగాడు జగన్ మోహన్ రెడ్డి. కరోనా టైంలో వాలంటీర్ల ద్వారా ప్రతీ ఒక్కరికీ పథకాలను అందించిన గొప్ప నాయకుడు జగన్. రాయపాటి సాంబశివరావుకో...కోట్లు ఖర్చు చేసిన వారికో చంద్రబాబు రాజ్యసభ టిక్కెట్లు ఇచ్చేవారు. కానీ బీసీలను రాజ్యసభకు పంపించిన ఘనత జగన్ మోహన్ రెడ్డికే దక్కింది. జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో పేదలయాత్ర జరుగుతోంది. ఈయాత్ర ద్వారా రాష్ట్రంలోని పేదలంతా ఏకమవుతున్నారు. జగన్ మోహన్ రెడ్డిని మనమంతా మళ్లీ గెలిపించుకోవాలి :::ఎమ్మెల్యే కొలుసు పార్ధసారథి ►ప్రతీ బీసీ, ఎస్సీ, ఎస్టీ తమకొక గుర్తింపు కావాలని ఎన్నో ఉద్యమాలు చేశారు. గత ప్రభుత్వాలు బీసి,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలను ఓటు బ్యాంకుగా వాడుకున్నాయి. వెనకబడిన వర్గాలకు మంచి చేయాలన్న ఆలోచన చేయలేదు. జగన్ మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత బీసి,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకు రాజ్యాధికారం,ప్రాధాన్యత దక్కింది. నాలుగున్నరేళ్లలో మహిళలకు ఎంతో ప్రాధాన్యత కల్పించారు. మహిళలకు సాధికారత కల్పించి తలెత్తుకు తిరిగేలా చేశారు. పేదరికంలో ఉన్నామన్న భావనను తొలగించారు. అమ్మఒడి,నాడు-నేడు ద్వారా పేదలకు విద్యావకాశాలు కల్పించారు. గతంలో అరకొరగా పథకాలిచ్చి మార్కెటింగ్ చేసుకునేవాళ్లు. జగన్ మోహన్ రెడ్డి పేదల ఇంటి వద్దకే పథకాలు అందించి మేలు చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డికి అండగా ఉంటే మన పిల్లల భవిష్యత్తు మరింత గొప్పగా ఉంటుంది. జగన్ మోహన్ రెడ్డికి అందరూ అండగా ఉండాలి. మళ్లీ జగన్‌ను గెలిపించుకోవాలి. :::మాజీ ఎంపీ బుట్టా రేణుక ►జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన కార్యక్రమాలు దేశంలో మరే రాష్ట్రంలోనూ జరగడం లేదు. మధ్యవర్తి లేకుండా నేరుగా పేదలకే లబ్ధి చేకూరుస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి మాదిరి మరే సీఎం బీసీలకు మేలు జరగలేదు. నాలుగున్నరేళ్లలో చేసిన పనులు చెప్పి ప్రజల్లోకి బస్సుయాత్ర చేయడానికి ధైర్యం కావాలి. మళ్లీ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వాన్ని మనం నిలబెట్టుకోవాలి. :::ఎమ్మెల్సీ, గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు డొక్కామాణిక్య వరప్రసాద్ ►నాలుగున్నరేళ్లలో చేసింది చెప్పేందుకు సామాజిక సాధికారయాత్ర చేస్తున్న దమ్మున్న నేత జగన్ మోహన్ రెడ్డి. అన్ని వర్గాల పార్టీ వైఎస్సార్సీపీ. మూడు ప్రాంతాల్లో బిసి,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకు బస్సుయాత్రలో పాల్గొనే అవకాశం కల్పించారు. 25 మంది మంత్రుల్లో 17 మంది బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకే ఇచ్చారు. 2లక్షల 31వేల కోట్లు బటన్ నొక్కి పేదలకు పంచిన మనసున్న వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి. వార్డు మెంబర్లుగా కూడా నోచుకోలేని మనల్ని మంత్రుల్ని చేశారు. అమ్మా భువనేశ్వరమ్మా...నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు బొక్కలోకి వెళ్లాడమ్మా. మీనాన్నకు వెన్నుపోటు పొడిచింది నీకే కదమ్మా తెలుసు. బస్సుయాత్రలోనైనా నిజం చెప్పమ్మా!. రెండెకరాలతో రెండు లక్షల కోట్లు ఎలా సంపాదించాడో చెప్పమ్మా. హరికృష్ణ,తారకరత్నను ఎలా వాడుకున్నారో నువ్వే చెప్పాలమ్మా?. మా నాయకుడు జగనన్న దమ్మున్న మగాడు. ఒకడు మీసాలు మెలేస్తాడు.. తొడలు కొడతాడు. 175 సీట్లలో పోటీ చేయమంటే జగన్ మోహన్ రెడ్డిని ఢీకొట్టడం నా వల్ల కాదంటాడు. మీరంతా సినిమాల్లోనే హీరోలు. రాజకీయాల్లో కామెడీ ఆర్టిస్టులు. చంద్రబాబు,దత్తపుత్రుడు,ఉత్తపుత్రుడు కలిసి వచ్చినా జగనన్నను ఏం చేయలేరు. రాబోయే ఎన్నికల్లో 175 కి 175 గెలవబోతున్నాం రాసిపెట్టుకోండి. జగన్ మోహన్ రెడ్డిని మనమంతా కాపాడుకోవాలి. తెనాలిలో అన్నాబత్తుని శివకుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలి. ::: మంత్రి జోగిరమేష్ ►జగనన్న కటవుట్ చూస్తేనే వేలమంది జనం మన మీటింగ్ లకు వస్తున్నారు. అదే జగనన్నే రోడ్డుమీదకు వస్తే.. ఆ సునామీలో టీడీపీ,జనసేన భూస్థాపితం అవ్వడం ఖాయం. రాబోయే రోజుల్లో జగనన్నకు ముందు జగనన్న తర్వాత పుస్తకాలు రాబోతున్నాయి. మన పిల్లలకు మంచి చేస్తున్న జగనన్న మీద రోజూ బురద జల్లుతున్నారు. మన జగనన్నను కాపాడుకోవాల్సిన అవసరం మనపై ఉంది. హైదరాబాద్ లో ఉండి రాజకీయాలు చేసేవాళ్లు మనకు అవసరం లేదు. లోకల్ గా మనమధ్య ఉండే వారే మనకు కావాలి :::ఎమ్మెల్యే,హఫీజ్ ఖాన్ ►గత పాలకులు కులాల మధ్య చిచ్చుపెట్టి ఆర్ధిక అతమానతలు సృష్టించారు. బీసీ,ఎస్సీలు మీరింతే .. మాకు ఓట్లకోసమే పనిచేస్తారని వాడుకున్నారు. అందరినీ సమానంగా చూస్తామని ఓట్లు వేయించుకుని మోసం చేశారు. సమసమాజ స్థాపన కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి. సమసమాజ స్థాపన చేసే నాయకుడి కోసం ఎదురు చూశారు. మేం ఎదురుచూసిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి రూపంలో వచ్చారు. అంబేద్కర్ భావజాలం కలిగిన నాయకుడు జగన్. జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలో సమ సమాజ స్థాపనకు అడుగులు పడ్డాయి. మాటల్లో కాకుండా చేతల్లో సామాజిక న్యాయం,సాధికారత చేసి చూపించిన నేత సీఎం జగన్. ఆలయాల్లోకి ప్రవేశం లేని పరిస్థితుల నుంచి ఆలయాల్లో పాలకమండలి సభ్యులుగా ఎదిగామంటే అదీ జగన్ తీసుకున్న చొరవ. అవినీతికి తావులేకుండా జగనన్న సుపరిపాలన అందిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 80% హామీలు నెరవేర్చిన ఘనత జగన్ మోహన్ రెడ్డికే దక్కింది. ప్రభుత్వం జవాబుదారీ తనంతో ఎలా పనిచేస్తుందో ప్రజలకు వివరించేందుకే ఈ సామాజిక సాధికార బస్సుయాత్ర. ఓ రిమాండ్ ఖైదీ కోసం టీడీపీ నేతలు రోడ్డెక్కారు. తమ వ్యాపారాల కోసం నారా భువనేశ్వరి యాత్ర. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు మళ్లీ ప్రజల్లోకి వస్తున్నారు. గంటకు లక్షలు ఖర్చు పెట్టే లాయర్లు పెట్టుకుని కూడా చంద్రబాబు ఎందుకు బయటికి రాలేకపోతున్నారు. గతంలో స్టేలు తెచ్చుకుని బయటికి వచ్చినపుడు చంద్రబాబుకు కోర్టులు మంచివన్నారు. ఇప్పుడు అదే కోర్టులను తప్పుబడుతున్నారు. ఈ రాష్ట్రానికి జగన్ మోహన్ రెడ్డే శాశ్వత ముఖ్యమంత్రి. రాబోయే కురుక్షేత్రంలో పేదల పక్షాన జగనన్న నిలిచారు. పెత్తందారుల పక్షాన ప్రతిపక్షాలున్నాయి. ఎప్పుడూ చట్టసభలను చూడని కులాల్లోని వారిని కూడా చట్టసభలకు పంపించిన గొప్ప నాయకుడు జగన్ మోహన్ రెడ్డి. :::మంత్రి ఆదిమూలపు సురేష్ ►జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో గతంలో ఎవరూ చేయలేనంత అభివృద్ధి తెనాలికి జరిగింది. 25 వేల మందికి ఇళ్ల పట్టాలిచ్చాం. జగన్ మోహన్ రెడ్డి కులాన్ని చూడలేదు. పేదవాడిని చూసి మేలు చేశారు. తెనాలిలో నెలకు పది కోట్ల రూపాయలు ఒకటో తేదీన పింఛన్లు ఇస్తున్నాం. మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓట్లేయమని చెప్పే దమ్మున్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి. సామాజిక సాధికారత చేశారు కాబట్టే జగన్ మోహన్ రెడ్డి దమ్ముగా చెప్పగలుగుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కుతున్నాడని విమర్శిస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కింది రాష్ట్రంలోని అన్ని వర్గాల్లోని పేదల కోసమే. తెనాలి నియోజకవర్గంలో 1800 కోట్ల రూపాయలు సంక్షేమం రూపంలో అందించారు. ఇచ్చింది జగన్ మోహన్ రెడ్డి...పంచింది మేము...తీసుకున్నది జనం. ఇందులో ఎక్కడైనా అబద్ధముందా?. నేను చెప్పిన లెక్క కరెక్ట్ కాదని ఎవరైనా చెబితే మళ్లీ పోటీ చేయను. ఈ రాష్ట్రంలో సామాజిక సాధికార బస్సుయాత్ర చేసే దమ్ము వైసీపీ పార్టీకే ఉంది. జగన్ మోహన్ రెడ్డికి మేం అండగా ఉంటాం.. మళ్లీ గెలిపిస్తాం. ఈ దేశంలో సంక్షేమ క్యాలెండర్ తెచ్చిన వన్ అండ్ ఓన్లీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రమే. తెనాలి గడ్డ జగనన్న అడ్డా. మన భవిష్యత్తు బాగుండాలంటే మళ్లీ జగన్ మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలి. వైనాట్ 175 కి తెనాలి నుంచి నాంది పలుకుతున్నాం. ::: అన్నాబత్తుని శివకుమార్, తెనాలి ఎమ్మెల్యే సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి ఎమ్మెల్యేలు ముస్తఫా, కిలారు రోశయ్య, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి, గుంటూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కత్తెర హెనీక్రిస్టినా, పలు కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు. -
తెనాలిలో వైఎస్సార్ సీపీ సామాజిక సాధికార యాత్ర
-
పొలం బాట పట్టిన విద్యార్థులు
తెనాలి: తెనాలిలోని కేంద్రీయ విద్యాలయం (కేవీ) విద్యార్థులు పొలం బాట పట్టారు. గ్రామాల్లో మట్టి నమూనాలను సేకరించారు. తమ విద్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటైన ల్యాబ్‌లో ఆయా నమూనాలకు భూసార పరీక్షలను నిర్వహిస్తారు. ఆ వివరాలతో భూమి ఆరోగ్య కార్డులు సిద్ధం చేస్తారు. సంబంధిత రైతులకు వారి భూమి ఆరోగ్య పరిస్థితులను ఆయా గ్రామాల్లో జరిగే గ్రామసభల్లో వెల్లడిస్తారు. విద్యార్థులేంటి.. నేల ఆరోగ్యాన్ని చెప్పడమేంటి! సాధారణంగా మట్టి నమూనాలు సేకరించి.. నేల ఆరోగ్యాన్ని గుర్తించేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక విభాగం పని చేస్తుంది. సంబంధిత అధికారులు మట్టి నమూనాలు సేకరించి.. పరీక్షలు జరిపి.. వివరాలు వెల్లడిస్తారు. అందుకు భిన్నంగా కేంద్రీయ విద్యాలయం విద్యార్థులే ఈ పనికి పూనుకున్నారు. భారత వ్యవసాయ, రైతు సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో పైలట్ ప్రాజెక్ట్‌గా పాఠశాలల్లో భూసార మట్టి నమూనాల పరీక్షలు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 10 కేంద్రీయ విద్యాలయాలను ఎంపిక చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెనాలి కేంద్రీయ విద్యాలయానికి మాత్రమే ఇందులో స్థానం లభించింది. భూసార పరీక్షల నిర్వహణకు విద్యాలయానికి అవసరమైన పరికరాలు, రసాయనాలను ప్రభుత్వం సమకూర్చింది. ఇద్దరు టీచర్లకు శిక్షణ ఇచ్చారు. వీరిలో ఒకరు ఈ ప్రాజెక్టుకు నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. వ్యవసాయ శాఖ, ఆత్మ విభాగం సహకారంతో వీరు పనిచే సేలా కార్యక్రమాన్ని రూపొందించారు. తెనాలి కేంద్రీయ విద్యాలయంలో 9, 11 తరగతుల విద్యార్థుల్లో 19 మంది ఈ ప్రాజెక్టులో ఇప్పటికే శిక్షణ తీసుకున్నారు. రెండు రోజులుగా తెనాలి మండలంలోని గుడివాడ, నందివెలుగు గ్రామాల్లోని మెట్ట పొలాల్లో మట్టి నమూనాలను సేకరించారు. ‘ఆత్మ’ గుంటూరు డిప్యూటీ డైరెక్టర్ రామాంజనేయులు పర్యవేక్షణలో స్కూల్ నోడల్ అధికారి కేవీ రాజేంద్రప్రసాద్, ఆర్.రామిరెడ్డి సమక్షంలో మొత్తం 52 నమూనాలను సేకరించారు. విద్యాలయంలో ఏర్పాటైన భూసార పరీక్షా కేంద్రంలో వీటికి పరీక్షలు నిర్వహిస్తారు. ప్రత్యేకంగా అందించిన రెండు యాప్‌ల్లో వివరాలను పొందుపరుస్తారు. తద్వారా రైతుల వారీగా భూమి ఆరోగ్య కార్డులు తయారవుతాయని రాజేంద్రప్రసాద్ వెల్లడించారు. అనంతరం ఆయా కార్డులతో సంబంధిత గ్రామ సభలు నిర్వహించి.. రైతుల వారీగా వారి భూమిలో నత్రజని, ఫాస్పరస్, పొటాíÙయం సహా 10 రకాల పోషకాల స్థాయిలను వివరిస్తారు. వ్యవసాయ వికాసానికి.. విద్యార్థులకు వ్యవసాయ విజ్ఞానాన్ని నేర్పించటం, రసాయనాలు అధికంగా వాడకుండా సహజ ఎరువులను వినియోగించేలా రైతులకు సూచిస్తూ భూమి ఆరోగ్యాన్ని పరిరక్షించటం ఆశయాలుగా కేంద్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టును చేపట్టింది. కేంద్రీయ విద్యాలయాలను భాగస్వాములను చేసింది. తగిన శిక్షణ ఇవ్వటంతో అమలుకు శ్రీకారం చుట్టాం. – కేవీ రాజేంద్రప్రసాద్, నోడల్ అధికారి ప్రాజెక్టులో చేరటం సంతోషంగా ఉంది చదువుతోపాటు వ్యవసాయంపై అవగాహనకు ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులో చేరటం చాలా సంతోషంగా ఉంది. భూసార పరీక్షలను చేసి రైతులకు ఉపయోగపడతాం. రైతుల కోసం పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉంది. – ఎన్.శివగగన్, 9వ తరగతి -
ఫొటోషూట్‌కు వెళ్లి వస్తుండగా.. ఒక్కసారిగా తీవ్ర విషాదం!
వికారాబాద్: ఫొటో షూట్‌కు వెళ్లి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన ప్రకారం.. గుంటూరు జిల్లా తెనాలి మండలం నందులపేట గ్రామానికి చెందిన మల్లికార్జున్ వృత్తిరీత్యా ఫొటోగ్రాఫర్. ఓ సారీ ఫంక్షన్ ఆర్డర్ ఫొటోషూట్‌కు కొడుకు దీపక్‌సాయి మరో ఇద్దరు సహాయకులు అబ్దుల్ రావుఫ్, వీరవెంకట్‌తో కలిసి శంకర్‌పల్లిలోని త్రిపుర రిసార్ట్స్‌కి వెళ్లారు. షూట్ ముగించుకుని వారి సొంతకారులో తిరుగు ప్రయాణమయ్యారు. ఎగ్జిట్ నంబర్ 12 వద్ద మొదటి లైన్లో వెళ్తున్న భారీ వాహనం నెమ్మదిగా వెళ్తుండడంతో ఆ వాహనాన్ని దాటవేసి పక్కలైన్లో వెళ్తున్న డీసీఎంను వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో మల్లికార్జున్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా కుమారుడు, సహాయకులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
100 శాతం జీఈఆర్.. తొలి మండలంగా తెనాలి అర్బన్
ఈ చిత్రంలోని బాలుడి పేరు.. ఆదిముళ్ల నాగచైతన్య. గుంటూరు జిల్లా తెనాలి ఇందిరానగర్ కాలనీలో ఇతడి కుటుంబం ఉంటోంది. ఇంటికి కొంచెం దూరంలోనే ఉన్న మున్సిపల్ హైస్కూలులో ఐదో తరగతి చదువుతూ మధ్యలో మానేశాడు. చదువుపై ఆసక్తి లేదని చెప్పడంతో తల్లిదండ్రులూ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో స్థానిక సచివాలయం నుంచి ఒక విద్యా కార్యదర్శి వచ్చి పిల్లాడిని చదివించాలని వారికి నచ్చజెప్పారు. ఫీజులు కట్టలేమని చెబితే దగ్గర్లోని కాన్వెంటులో ఉచితంగా చదివిస్తామని హామీ ఇచ్చారు. దీంతో పిల్లాడూ సరేనన్నాడు. ఇప్పుడు రోజూ కాన్వెంటుకు వెళుతున్నాడని బాలుడి తల్లి సౌజన్య సంతోషంతో చెబుతున్నారు. తెనాలి: బడి బయట ఉన్న పిల్లలను, మధ్యలో బడి మానేసినవారిని గుర్తించి తిరిగి పాఠశాలల్లో చేర్పించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. 2005 సెప్టెంబర్ 1–2018 ఆగస్టు 31 మధ్య పుట్టినవారంతా సెప్టెంబర్ 4 నాటికి ఏదో ఒక స్కూల్/కాలేజీలో నమోదై ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఎవరైనా బడి/కాలేజీకి దూరంగా ఉంటే వారిని చేర్పించాలని ప్రభుత్వం.. వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గుంటూరు జిల్లా తెనాలి అర్బన్ మండలం విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్)లో నూటికి నూరు శాతం లక్ష్యాన్ని సాధించిన తొలి మండలంగా అవతరించింది. ఈ మండలంలో బడి బయట చదువుకు దూరంగా ఉన్న మొత్తం 935 మందిని పాఠశాల/కాలేజీలో చేర్పించారు. జూలై మొదటి వారం నుంచే ప్రత్యేక డ్రైవ్.. గ్రామ/ వార్డు సచివాలయాల సహకారంతో పాఠశాల విద్యాశాఖ నూరు శాతం జీఈఆర్ సాధనకు జూలై మొదటి వారం నుంచే ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. ఈ క్రమంలో 47 సచివాలయాలు కలిగిన తెనాలి అర్బన్ మండలం 100 శాతం లక్ష్యాన్ని సాధించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవోల పర్యవేక్షణలో వలంటీర్లు, వార్డు సచివాలయ విద్యా కార్యదర్శులు ఇంటింటా సర్వేను ఒక ఉద్యమంలా చేపట్టారు. ఒక్కో సచివాలయం పరిధిలో వందలాదిమంది బడి ఈడు పిల్లల సమాచారాన్ని సేకరించారు. విద్యాశాఖ.. వార్డు/ గ్రామ వలంటీర్లకు అందజేసిన యాప్‌లో వారి వివరాలను పొందుపరిచారు. పదో తరగతిలోపు విద్యార్థులను వారు కోరుకున్న ప్రభుత్వ/ ప్రైవేటు పాఠశాలలకు పంపారు. స్థోమత లేని పేదింటి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. అందుకు ఇష్టపడని పిల్లలను తల్లిదండ్రుల అభిమతం ప్రకారం ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలలకు పంపారు. ఇంటర్ ఫెయిలైనవారు, మధ్యలో మానేసినవారిని కాలేజీ/ఐటీఐ/ పాలిటెక్నిక్ కోర్సుల్లో చేర్చారు. మరికొందరిని వారు కోరినట్టుగా కోచింగ్ క్లాసులకు పంపారు. ఈ విధంగా తెనాలి అర్బన్ మండలంలో 935 మంది మళ్లీ బడి/కళాశాల బాటపట్టారు. కాగా అర్బన్ మండలంతోపాటు తెనాలి రూరల్ మండలం కూడా నూరు శాతం జీఈఆర్ లక్ష్యాన్ని సాధించింది. ఇక్కడ కూడా బడి బయట ఉన్నట్టు గుర్తించిన 355 మంది పిల్లలను బడి/కళాశాలల్లో చేర్పించారు. కోరిన పాఠశాలల్లోనే చేర్పించాం.. రాష్ట్రంలో నూరు శాతం జీఈఆర్ సాధించిన తొలి మండలంగా తెనాలి అర్బన్ నిలవడం పట్ల చాలా సంతోషంగా ఉంది. అందరి సమన్వయంతో రూరల్ మండలంలోనూ ఈ లక్ష్యాన్ని సాధించాం. పిల్లలు, వారి తల్లిదండ్రులు కోరుకున్న విద్యాసంస్థల్లోనే చేర్పించాం. – మేకల లక్ష్మీనారాయణ, మండల విద్యాశాఖాధికారి, తెనాలి, గుంటూరు జిల్లా చాలా సంతృప్తిగా ఉంది.. కరోనా తర్వాత మైగ్రేషన్, డేటాలో వయసు తప్పు వంటి సాంకేతిక సమస్యలను అధిగమించి మా సచివాలయం పరిధిలో 563 మందిని సర్వే చేశాం. చదువుకు దూరంగా ఉన్న ఇద్దరు పేద పిల్లలను గుర్తించి వారిని ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలలో చేర్పించాం. చాలా సంతృప్తిగా ఉంది. – గంగవరపు స్వాతి, వార్డు ఎడ్యుకేషన్ సెక్రటరీ, 35వ సచివాలయం, తెనాలి, గుంటూరు జిల్లా -
నేషనల్ వాటర్ హీరో’కు మరో అరుదైన అవార్డు
తెనాలి: ‘నేషనల్ వాటర్ హీరో’ అవార్డు గ్రహీత, తెనాలికి చెందిన పొదిలి రాజశేఖరరాజు మరో ప్రతిష్టాత్మక గౌరవాన్ని అందుకున్నారు. చత్తీస్‌ఘడ్‌లోని రాయ్‌పూర్‌లో శనివారం జరిగిన 2వ ఎన్విరాన్మెంటల్ సోషల్ గవర్నెన్స్ ఇండియా సమ్మిట్‌లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో ఇచ్చే ‘ఇండియా రెస్సాన్సిబుల్ లీడర్స్ అవార్డు–2023’ను అందుకున్నారు. ఆయనకు ఇండియా సీఎస్సార్ ఫోరం అధ్యక్షుడు డాక్టర్ రోషన్‌కుమార్ ఈ అవార్డును బహూకరించారు. రాజశేఖరరాజు పలు కార్పొరేట్ కంపెనీల్లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్సార్) విభాగాధిపతిగా సేవలందిస్తున్నారు. సేవ చేసే అవకాశాన్ని తనకు భగవంతుడు ప్రసాదించాడని, ఉత్తమంగా చేయటం తన బాధ్యతగా భావించానని ‘సాక్షి’తో రాజశేఖర్‌రాజు చెప్పారు. చదవండి మైమ‘రుచి’!.. ప్రతి రెస్టారెంట్లోనూ స్పెషల్ మెనూ -
అందుకే సీఎం జగన్‌ను కలిశాను.. రైతులు సంతోషంగా ఉన్నారు: అంబటి రాయుడు
సాక్షి, గుంటూరు: విద్యారంగంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మంచి మార్పులు తీసుకువచ్చిందని టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు ఎంతో బాగున్నాయంటూ ప్రశంసలు కురిపించారు. ఇటీవలే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు కూడా గుడ్‌బై చెప్పిన అంబటి రాయుడు ప్రజాక్షేత్రంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా.. తెనాలి రూరల్ మండలం కొలకలూరులో రైతు భరోసా కేంద్రాన్ని(ఆర్బీకే) పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన.. రైతులతో కాసేపు ముచ్చటించారు. రైతులు సంతోషంగా ఉన్నారు ‘‘రైతు భరోసా కేంద్రాలను పరిశీలించాను. అన్ని ప్రాంతాలు తిరిగి విషయాలు తెలుసుకుంటున్నాను. రైతులందరూ ప్రభుత్వపరంగా తమకు మంచి మద్దతు అందుతుందని చెప్తున్నారు. తాము సంతోషంగా ఉన్నామని చెప్తున్నారు’’ అని అంబటి రాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వ పాఠశాలల గురించి మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతున్న చర్యలు బాగున్నాయన్నారు. అందుకే సీఎం జగన్‌ను కలిశాను విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ప్రభుత్వం బాటలు వేస్తోందని కొనియాడారు. ఇక స్పోర్ట్స్ గురించి మాట్లాడేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశానన్న అంబటి రాయుడు.. రాష్ట్రంలో క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పినట్లు తెలిపారు. ప్రజలకు సేవ చేయాలని తమ తాత నుంచి నేర్చుకున్నానన్న అంబటి రాయుడు.. గత కొన్నాళ్లుగా ప్రజలతో మమేకమవుతూ పర్యటనలు చేస్తున్నారు. అరుదైన ఘనత కాగా ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అంబటి రాయుడు.. ఆ జట్టు ట్రోఫీ గెలవడంతో అరుదైన రికార్డులు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సుదీర్ఘకాలం పాటు ముంబై ఇండియన్స్, సీఎస్కేకు ఆడిన రాయుడు.. ఏకంగా ఆరుసార్లు టైటిల్ చాంపియన్‌గా నిలిచాడు. ముంబై మూడు, చెన్నై మూడుసార్లు విజేతగా నిలిచిన సందర్భాల్లో జట్టులో భాగమై.. రోహిత్ శర్మ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు. చదవండి: గుంటూరులో క్రికెటర్ అంబటి, ప్రజలతో మమేకం, త్వరలో ప్రకటన -
స్వదేశీ అబ్బాయి.. విదేశీ అమ్మాయి
తెనాలి: ఆస్ట్రేలియా అమ్మాయి..తెనాలి అబ్బాయి ప్రేమించుకుని హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఈ సంఘటన గుంటూరు జిల్లాలో శనివారం రాత్రి జరిగింది. కొల్లిపరకు చెందిన ఇంద్రసేనారెడ్డి ఎంఎస్ చేయడానికి ఆ్రస్టేలియా వెళ్లారు. చదువు పూర్తయ్యాక ఆ్రస్టేలియాలోని మెల్బోర్న్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆ దేశ పౌరసత్వమూ లభించింది. తన కంపెనీలోనే పనిచేస్తోన్న ఆ్రస్టేలియా యువతి సారా ఎలిజబెత్ కౌల్టర్ను ప్రేమించాడు. యువతి కూడా ప్రేమను అంగీకరించడంతో ఈ విషయాన్ని ఇరువురూ వారి కుటుంబాలకు చెప్పారు. హిందూ సంప్రదాయాన్ని పరిచయం చేయాలన్న ఉద్దేశంతో కొల్లిపరలో సంప్రదాయ వివాహానికి ఇంద్రసేనారెడ్డి చేసిన ప్రతిపాదనకు ఎలిజబెత్ సమ్మతించారు. దీంతో ఇంద్రసేనారెడ్డి తల్లిదండ్రులు కూసం శ్రీనివాసరెడ్డి, పద్మజ, బంధుమిత్రుల సమక్షంలో కొల్లిపరలోని జీవీఆర్ కళ్యాణమండపంలో శనివారం వైభవంగా వివాహం జరిగింది. కుమార్తె పెళ్లికి ఎలిజబెత్ తల్లిదండ్రులు జాన్ కౌల్టర్, అన్నెట్టీ దంపతులు, సోదరి, సోదరుడు, అతడి భార్య హాజరయ్యారు. హిందూ సంప్రదాయ పద్ధతిలో పురుషులు షర్టు, పట్టు పంచెలు, మహిళలు చీరె, జాకెట్ ధరించారు. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఈ వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. -
బీన్స్ గింజపై ఆస్కార్ ‘నాటు నాటు’
తెనాలి(గుంటూరు జిల్లా): లాస్ ఏంజిలిస్‌లో ఇటీవల జరిగిన 95వ ఆస్కార్ అవార్డ్స్‌లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌ను అందుకున్న ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు..ఊర నాటు’ పాటను ప్రవాస భారతీయ చిత్రకారుడు బీన్స్ గింజపై చిత్రీకరించారు. దర్శక ప్రముఖుడు రాజమౌళి తీసిన ఈ సినిమాలో ‘నాటు నాటు’ పాటను జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌పై చిత్రీకరించారు. ఆస్కార్ అవార్డును సంగీత దర్శకుడు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ అందుకున్నారు. కువైట్‌లోని పాహీల్ అల్ వతానీ ఇండియన్ ప్రైవేట్ స్కూలులో చిత్రకళ విభాగం అధిపతి ఎ.శివనాగేశ్వరరావు వైట్ బీన్స్ గింజపై సూక్ష్మంగా చిత్రీకరించారు. రామ్‌చరణ్, ఎన్టీఆర్ డ్యాన్స్ మూమెంట్‌ను, మధ్యలో ఆస్కార్ అవార్డును తీర్చిదిద్దారు. చిత్రకారుడనైన తాను, ఈ సూక్ష్మచిత్రంతో ఆర్ఆర్ఆర్ బృందానికి శుభాకాంక్షలు చెబుతున్నట్టు శివనాగేశ్వరరావు ‘సాక్షి’కి ఫోనులో వెల్లడించారు. శివనాగేశ్వరరావు స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. చదవండి: రూ.6 కోట్లు ఉంటే.. అంతరిక్షంలోకి! నెరవేరనున్న భారతీయుల కల -
సినిమా తలపించేలా షాకింగ్ ట్విస్ట్.. ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకున్నాడని..
తెనాలి రూరల్: తెనాలిలో ప్రైవేటు ఉపాధ్యాయుడిపై శుక్రవారం రాత్రి హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. అయితే తాను ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకున్నాడన్న కారణంతో అతని మిత్రులే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. క్షతగాత్రుడు పల్లపురం గణేష్‌బాబు గతంలో నందులపేటలో నివసించేవాడు. అదే ప్రాంతానికి చెందిన బాషా, బాబి, అరవింద్ ఇతర యువకులు గణేష్ బాబుకు మిత్రులుగా ఉండేవారు. వీరిలో బాషా నందులపేటకు చెందిన యువతిని ప్రేమించేవాడు. 2018 డిసెంబర్లో ఫొటోగ్రాఫర్ రబ్బాని, మరో యువకుడిపై కత్తితో దాడి చేసిన కేసులో నిందితుడు. ఈ కేసులో జైలుకు వెళ్లగా అతడు ప్రేమించిన వ్యక్తి గణేష్‌బాబుకు దగ్గరైంది. ఇద్దరూ గతేడాది వివాహం చేసుకున్నారు. ప్రైవేటు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గణేష్‌బాబు ప్రస్తుతం నాజరుపేటలో నివసిస్తున్నాడు. పాఠశాల అనంతరం ఇంటివద్ద విద్యార్థులకు ట్యూషన్లు చెప్పుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శుక్రవారం రాత్రి బాషా, బాబి, అరవింద్ నాజరుపేటలోని గణేష్‌బాబు ఇంటికి వెళ్లి అతడిని బయటకు వెళదామని పిలిచారు. వారి వెంట మరో బుల్లెట్‌పై నందులపేట వెళ్లగా అక్కడ బాషా, మిగిలిన ఇద్దరూ కత్తితో గణేష్‌బాబు గొంతు కోసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. కత్తితో దాడి అనంతరం బుల్లెట్‌పై ఎక్కించుకుని మరో ప్రాంతానికి తీసుకెళుతుండగా, గణేష్‌బాబు వాహనం నుంచి దూకి వారి నుంచి తప్పించుకుని నెహ్రూ రోడ్డులోని ప్రైవేటు వైద్యశాలకు వెళ్లి చేరాడు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం తాడేపల్లిలోని ప్రైవేటు వైద్యశాలకు పంపారు. గణేష్‌బాబు నివసించేది వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో, అతడిపై కత్తితో దాడి జరిగింది టూ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు ప్రాంతాలనూ వన్‌టౌన్, టూ టౌన్ సీఐలు కె.చంద్రశేఖర్, ఎస్.వెంకట్రావు పరిశీలించారు. టూ టౌన్ పరిధిలో ఘటన జరగడంతో ఆ పోలీసులే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేసు దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు బాష, మరో యువకుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరా ఫుటేజ్లనూ పోలీసులు పరిశీలించి సాక్ష్యాలను సేకరించినట్టు తెలిసింది. తాను ప్రేమించిన యువతిని వివాహం చేసుకున్నాడన్న కారణంతో బాషా, మిత్రులతో కలసి ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. -
కోడెల శివరామ్‌కు బిగ్ షాక్!
తెనాలిరూరల్: టీడీపీ నేత, శాసనసభ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరామ్‌పై చీటింగ్ కేసు నమోదైంది. తన కంపెనీలో పెట్టుబడి పెట్టించి మోసం చేశాడని బాధితులు కోర్టును ఆశ్రయించగా, కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు. శివరామ్, అతడి భార్య పద్మప్రియ విజ్ఞప్తి మేరకు శివరామ్‌కే చెందిన కైరా ఇన్ఫ్రా కంపెనీలో 2016లో గుంటూరు జిల్లా తెనాలి మండలం పెదరావూరు గ్రామానికి చెందిన పాలడుగు బాలవెంకటసురేష్ రూ.24.25 లక్షల పెట్టుబడి పెట్టారు. మరో ముగ్గురు సుమారు రూ.కోటి వరకు పెట్టుబడి పెట్టారు. అందుకు సంబంధించి చెక్కుల ద్వారా లావాదేవీ జరిపారు. వీరి పెట్టుబడి, అందుకు తగిన ప్రతిఫలాన్ని మరుసటి ఏడాది 2017లో తిరిగి ఇచ్చేలా శివరామ్, అతడి భార్య ఒప్పందం చేసుకున్నారు. ఎన్నిసార్లు అడిగినా డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో బాధితులు తెనాలి కోర్టును ఆశ్రయించారు. బాలవెంకటసురేష్ పిటిషన్‌పై కోర్టు నుంచి వచ్చిన ఆదేశాల మేరకు శివరామ్‌పై 420, 407, 403, 386, 389, 120బి, 506, 509 ఐపీసీ, 156(3) సీఆర్పీసీ సెక్షన్ల కింద రూరల్ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకటేశ్వర్లు బుధవారం రాత్రి కేసు నమోదు చేశారు. -
తెనాలి అమ్మాయి.. డోలు నేర్చుకుని! అరుదైన ఘనత.. 35 రకాల తాళాలతో..
రాజ్‌భవన్‌లో.. సోమవారం, మార్చి 6న హైదరాబాద్ గవర్నర్ తమిళిసై కొంతమంది మహిళలకు సత్కారం చేశారు. అదే సందర్భంగా ఏర్పాటైన గాత్ర కచ్చేరిలో అందరి దృష్టి లలిత మనీషా మీద పడింది. అందుకు కారణం ఆమె డోలు వాద్యం పై విన్యాసం చేస్తూ ఉండటమే. తెలుగునాట నాదస్వరం వాయించే స్త్రీలు కొద్దిమందైనా ఉన్నారు. కాని డోలు వాయించే వారు అతి తక్కువ. రెండు రాష్ట్రాలకు కలిసి డోలు విద్వాంసురాలిగా ఇటీవల గుర్తింపు పొందుతున్నది 24 ఏళ్ల లలిత మనీషా. తెనాలి అమ్మాయి లలిత మనీషాది తెనాలి. వీరి తల్లి మస్తాన్‌బీ, తండ్రి షేక్ వెంకటేశ్వర సాహెబ్ నాదస్వర విద్వాంసులు. ఇద్దరూ వందలాది ప్రదర్శనలు ఇచ్చారు. మస్తాన్ బీ వంశంలో 300 వందల ఏళ్లుగా నాదస్వరం కొనసాగుతూ ఉంది. అయితే డోలు వాయించిన మహిళలు లేరు. మస్తాన్ బీకి ఇద్దరు కూతుళ్లు. పెద్దమ్మాయి నాగ భ్రమరాంబ గాత్ర విద్వాంసురాలిగా శిక్షణ తీసుకుంది. ఇప్పుడు చదువు నిమిత్తం అమెరికా వెళ్లింది. చిన్నమ్మాయి లలిత మనీషా డోలు నేర్చుకోవడంలో ఆసక్తి చూపింది. ‘నేను ఏడవ తరగతి చదువుతున్నప్పుడు వరుసకు వదిన అయ్యే ఒకామె డోలు నేర్చుకోవడానికి ప్రయత్నించింది. ఆమెకు రాలేదు. నేను నేర్చుకోవడానికి ప్రయత్నించాను. నాకు వచ్చేసింది. డోలు వాయిద్యానికి తాళంతో పాటు శక్తి కూడా కావాలి. నాలో అవి రెండూ గమనించి మా అమ్మా నాన్నలు ప్రోత్సహించారు’ అంటుంది మనీషా. కుంభకోణం వెళ్లి డోలు వాయిద్యాన్ని సాధన చేయాలంటే ఇక్కడ అనుకూలంగా లేదని తొమ్మిదో తరగతి డిస్కంటిన్యూ చేసి కుంభకోణంలో డోలు విద్వాంసుడు టి.ఆర్.సుబ్రహ్మణ్యం దగ్గర సంవత్సరం పాటు శిష్యరికం చేసింది లలిత మనీషా. గురువు ఇంట్లోనే ఉంటూ డోలు నేర్చుకుని వచ్చింది. ఆ తర్వాత తెలుగు యూనివర్సిటీ నుంచి సర్టిఫికెట్ కోర్సు, డిప్లమా కూడా పూర్తి చేసింది. డిగ్రీ ఉండాలి కనుక బీసీఏ చేసి డోలు వాయిద్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకుంది. ఆ కోర్సు అన్నామలై యూనివర్సిటీ కింద చిదంబరంలో ఉంది. ‘అక్కడ మా బేచ్‌లో మొత్తం 50 మంది విద్యార్థులు ఉంటే నేనొక్కదాన్నే అమ్మాయిని. అందుకని నన్ను అందరూ బాగా చూసుకునేవారు. మిగతా దక్షిణాది రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా డోలు వాద్యం మగవారిదే అని భావించడం వల్ల ఇప్పటి వరకూ ఒక్క ఆడపిల్ల కూడా ఆ కోర్సు చేయలేదు. దాంతో మొత్తం దేశంలోనే డోలు వాయిద్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఏకైక అమ్మాయిగా నేను నిలిచాను’ అంటుంది మనీషా. నిజంగా ఇది తెలుగువారి గర్వకారణమే. మంగళవాయిద్యం డోలు, సన్నాయి మంగళకరమైన వాయిద్యాలు. దక్షిణ భారతంలో శుభకార్యక్రమాలకు సన్నాయి మేళం తప్పనిసరి. అయితే కర్నాటక సంగీతంలో కూడా సన్నాయి, డోలు ప్రాశస్త్యం మెండుగా ఉంది. డోలు సహ వాయిద్యంగా ఉంటోంది. ‘గాత్ర కచ్చేరిలో గాని వయొలిన్, ఫ్లూట్ కచ్చేరిలో గాని మృదంగాన్ని సహ వాయిద్యంగా తీసుకుంటారు. డోలును కూడా తీసుకునేవారు ఉంటారు. కర్నాటక సంగీతంలో డోలు వాయిద్యకారిణిగా నేను గుర్తింపు పొందాలనుకుంటున్నాను. డోలు వాయించడానికి 108 రకాల తాళాలు ఉన్నాయి. ఉద్దండులు లోతుకు వెళితే ఇంకా వినూత్న తాళాలు వేస్తారు. నేను ఇప్పటి వరకూ 35 రకాల తాళాలు డోలు మీద వేయగలను. మా అమ్మా నాన్నలతో కలిసి అనేక కచ్చేరీలు చేస్తున్నాను. శ్రీశైలం, భద్రాచలం, హరిద్వార్, పూరీ, ద్వారకా, కాశీ పుణ్యక్షేత్రాలలో కచ్చేరీలు ఇచ్చాను. అలాగే తమిళులు డోలు, సన్నాయి కచ్చేరీలను ఇష్టపడతారు. వారి ఆహ్వానం మేరకు మదురై, తంజావూరు... ఇలా అనేక నగరాల్లో ప్రదర్శనలు ఇచ్చాను. ఇంకా నేను చాలా సాధించాల్సి ఉంది’ అంది మనీషా. – ఇన్పుట్స్: బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి -
మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం జగన్
-
సీఎం సారూ.. ఆదుకోండి.. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి జగన్
సాక్షి ప్రతినిధి, గుంటూరు: వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్, మాండూస్ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించే కార్యక్రమానికి గుంటూరు జిల్లా తెనాలి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని పలువురు అనారోగ్య బాధితులు కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు. హెలిప్యాడ్ నుంచి సమావేశానికి వస్తున్న సమయంలో, సమావేశం వద్ద వారు ముఖ్యమంత్రిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో ముఖ్యమంత్రి స్పందించి వారికి మెరుగైన వైద్యం అందించడమే కాకుండా, దానికి అయ్యే ఖర్చును కూడా విడుదల చేయాలని కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డిని ఆదేశించారు. బాపట్ల జిల్లా అమర్తలూరుకు చెందిన పోలియో బాధితురాలు కొల్లూరు జాన్సీ థైరాయిడ్, మానసిక వ్యాధులతో బాధపడుతున్నట్లు ఆమె తండ్రి కిషోర్ ముఖ్యమంత్రికి తెలిపారు. ప్రస్తుతం మంచంలో ఉన్నందున ఆమెకు వస్తున్న పింఛన్‌ను రూ.3 వేల నుంచి రూ.5 వేలకు పెంచాలని, సీఎంఆర్ఎఫ్ కింద ఆర్థికసాయం అందించాలని కోరారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం కంచర్లపాలెం గ్రామానికి చెందిన బుల్లా శ్రీనివాస్ ముఖ్యమంత్రిని కలిసి తన కుమారుడు కార్తీక్ తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడని, బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం రూ.26 లక్షలు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.26 లక్షలు ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారు. నకిరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన గడిబోయిన శివలక్ష్మి బ్లడ్‌కేన్సర్ చికిత్స కోసం రూ.20 లక్షలు ఖర్చుచేశారు. వీరికి సీఎంఆర్ఎఫ్ కింద రూ.11 లక్షలు మంజూరయ్యాయి. మిగిలిన మొత్తంతోపాటు ఇతర శస్త్రచికిత్సల కోసం ఆర్థికసాయం చేయాలని కోరారు. వేమూరు మండలం చంపాడు గ్రామానికి చెందిన పాపిడిపాగు హదస్సాకు అగ్నిప్రమాదంలో రెండుకాళ్లు పూర్తిగా గాయపడ్డాయి. చికిత్స నిమిత్తం అయ్యే రూ.8.5 లక్షలను సీఎంఆర్ఎఫ్ కింద మంజూరు చేయాలని కోరారు. కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన గోవాడ సురేష్‌కుమార్.. తనకు మెటబాలిక్ బేరియాట్రిక్, గాల్‌బ్లాడర్‌లోని రాళ్లకి సంబంధించిన శస్త్రచికిత్స కోసం రూ.15 లక్షలు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారని తెలిపారు. ఆ మొత్తం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఐతానగర్‌కు చెందిన దివ్యాంగులు కందుల అహల్య, కందుల అమూల్య తమకు ఆర్థికసాయం చేయాలని కోరారు. ఏలూరు జిల్లా పెదపాడు మండలం వీరమ్మకుంట పంచాయతీకి చెందిన కర్నాటి వెంకటనాగమణి.. తనకు రెండు కిడ్నీలు పాడయ్యాయని, దీనికి చికిత్స కోసం రూ.25 లక్షలు ఖర్చయ్యాయని సీఎంకు చెప్పారు. మరో రూ.10 లక్షలు అవసరమని తెలిపారు. ఆ మొత్తాన్ని సీఎంఆర్ఎఫ్ కింద నిధులు మంజూరు చేయాలని కోరారు. ముత్తంశెట్టిపాలేనికి చెందిన దామర్ల చంద్రశేఖర్ పుట్టు మూగ, చెవిటి. పదోతరగతి వరకు చదువుకున్నానని, తన అర్హతల మేరకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని ముఖ్యమంత్రిని కోరారు. -
175 చోట్ల ఒంటరిగా పోటీ చేసే ధైర్యముందా?
చంద్రబాబుకు, దత్తపుత్రుడికి సవాల్ విసురుతున్నా.. 175 నియోజకవర్గాలకు 175 చోట్ల ఒంటరిగా పోటీ చేసి గెలిచే ధైర్యం ఉందా? ఆ ధైర్యం వాళ్లకు లేదు.. ఎందుకంటే జీవితంలో ఏ రోజూ వారు ప్రజలకు మంచి చేయలేదు కాబట్టి. కానీ మీ బిడ్డకు ఆ ధైర్యం ఉంది.. కారణం మేం మంచి చేశాం కనుకనే. చేసిన మంచి గురించి చెప్పుకుని మళ్లీ అధికారంలోకి వస్తానన్న నమ్మకం, ధైర్యం మీ బిడ్డకు ఉంది. రాబోయే రోజుల్లో కుట్రలు ఇంకా ఎక్కువ కనిపిస్తాయి. రాజకీయాల్లో అన్యాయాలు పెరుగుతాయి. అన్నీ గమనించండి. నిర్ణయం తీసుకునేటప్పుడు మాత్రం బాగా ఆలోచించండి. మీ ఇంట్లో మంచి జరిగిందా? లేదా? అన్న ఒకే ఒక్కటి ప్రామాణికంగా తీసుకోండి. మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు మీరే సైనికులుగా తోడుగా నిలబడండి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, గుంటూరు: వచ్చే ఎన్నికల్లో యుద్ధం కరువుతో ఫ్రెండ్షిప్ ఉన్న చంద్రబాబుకు, వరుణ దేవుడి ఆశీస్సులున్న మనందరి ప్రభుత్వానికి మధ్య జరుగుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఐదేళ్ల పాలనలో ప్రజలకు ఒక్క మంచి పని కూడా చేయని చంద్రబాబు ఇక చెప్పుకునేందుకు ఏమీ లేకపోవడంతో దుష్ట చతుష్టయంతో కలసి దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన 98.5 శాతం హామీలను నెరవేర్చి ఈ రోజు సంతృప్తిగా ఓటు అడగడానికి వస్తున్నామని, ఎమ్మెల్యేలు ప్రతి గడపనూ సందర్శిస్తున్నారని చెప్పారు. మంగళవారం గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ యార్డు వద్ద నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్సార్ రైతు భరోసా, మాండూస్ తుపాన్ బాధిత రైతులకు ఇన్పుట్ సబ్సిడీని బటన్ నొక్కి జమ చేసిన అనంతరం సీఎం జగన్ ప్రసంగించారు. ఆ వివరాలివీ.. రైతులకు పంట నష్ట పరిహారం– పెట్టుబడి రాయితీకి సంబంధించిన చెక్‌ను విడుదల చేస్తున్న సీఎం వైఎస్ జగన్ నాడు డీపీటీ.. నేడు డీబీటీ ప్రభుత్వ పాఠశాలల్లో పేద పిల్లలకు ఇంగ్లిష్ మీడియం వద్దన్న చంద్రబాబుకు, అదే స్కూళ్లను నాడు–నేడుతో రూపురేఖలు మార్చేసి సీబీఎస్ఈ విధానంలో ఇంగ్లిష్ మీడియం తెచ్చిన మీ బిడ్డ ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరుగుతోంది. మొదటి సంతకంతోనే డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పి మోసగించి పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలను రోడ్డుమీదకు తెచ్చిన చంద్రబాబుకు... వైఎస్సార్ ఆసరా, సున్నావడ్డీ, వైఎస్సార్ చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, జగనన్న అమ్మఒడి, 30 లక్షల ఇళ్ల పట్టాలిచ్చి ఇప్పటికే 22 లక్షల గృహ నిర్మాణాలను చేపట్టిన చేస్తున్న మీ బిడ్డ ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరుగుతోంది. జన్మభూమి కమిటీలనే గజదొంగల ముఠాతో మొదలుపెడితే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడితో కలిసి దోచుకో, పంచుకో, తినుకో (డీపీటీ) స్కీంలు సృష్టించిన చంద్రబాబుకు, గ్రామ రూపురేఖలను సమూలంగా మార్చేసిన మన ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరుగుతోంది. కళ్లెదుటే కనిపిస్తున్న గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం చదువులు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్ విధానం, అందుబాటులోకి రానున్న డిజిటల్ గ్రంథాలయాల ద్వారా గ్రామాల స్వరూపం మారిపోతోంది. ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా ఏ ఒక్క అర్హుడూ మిస్ కాకూడదన్న ఉద్దేశంతో సోషల్ ఆడిట్ చేసి పేదలకు రూ.1.93 లక్షల కోట్లను డీబీటీ ద్వారా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి మీ ప్రభుత్వం జమ చేసింది. అప్పుడెందుకు ఇవ్వలేదంటే... ఆ రోజూ, ఈ రోజూ ఒకే బడ్జెట్ అయినా అప్పులలో పెరుగుదల గ్రోత్ రేటు మాత్రం అప్పటికన్నా ఇవాళ తక్కువే. మీ బిడ్డ మాత్రమే ఎందుకు బటన్న్నొక్కగలుగుతున్నాడు? చంద్రబాబు బటన్¯ నొక్కే స్కీంలు ఎందుకు లేవన్నది ఆలోచన చేయండి. అప్పట్లో ఆ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో ఆలోచన చేయండి. ఆ డబ్బులన్నీ గ్రామస్థాయిలో మొదలుపెడితే జన్మభూమి కమిటీల నుంచి గజదొంగల ముఠా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడు, వీళ్లందరి బాస్ చంద్రబాబు కలసి దోచుకో, పంచుకో, తినుకో అని పంచుకున్నారు. పేదలు ఒకవైపు.. పెత్తందార్లు మరోవైపు ఎస్సీ కులాలలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? బీసీల తోకలు కత్తిరిస్తాం.. పేదలకు ఇళ్లు, ఇళ్ల స్ధలాలు ఇవ్వడానికి వ్యతిరేకమన్న పెత్తందారీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు, మనకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు గ్రామ స్థాయి నుంచి కేబినెట్ వరకూ రాజకీయ సాధికారిత కల్పించాం. నామినేటెడ్ పదవుల నుంచి పాలించే పదవుల దాకా ప్రతి అడుగులోనూ భాగస్వాములుగా చేశాం. ఈ రోజు యుద్ధం జరుగుతోంది కులాల మధ్య కాదు. ఇవాళ రాష్ట్రంలో జరుగుతోంది క్లాస్ వార్. పేదవాడు ఒకవైపు, పెత్తందార్లు మరోవైపు ఉన్నారు. పొరపాటు జరిగిందంటే రాజకీయాల్లో ఇక ఎవరూ మాట ఇవ్వడం, మాట మీద నిలబడటం అన్న మాటకు అర్థమే లేకుండా పోతుంది. రాజకీయ వ్యవస్ధలో మార్పు రావాలి. విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలియాలి. ఒక మాట చెబితే, ఆ మాట నిలబెట్టుకోలేకపోతే.. ఆ వ్యక్తి రాజకీయాలలో ఉండడానికి అర్హుడు కాదన్న పరిస్థితులు రావాలి. సభకు హాజరైన అశేష జనవాహినిలో ఓ భాగం టార్గెట్ 175 దిశగా అడుగులు.. ఈ రోజు మీ బిడ్డకు ఉన్నదల్లా దేవుడి దయ, మీ అందరి చల్లని ఆశీస్సులు మాత్రమే. మీ బిడ్డకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 లేకపోవచ్చు. దత్తపుత్రుడు తోడు ఉండకపోవచ్చు. మీ బిడ్డ ఏరోజూ వాళ్లమీద ఆధారపడలేదు. మీకు మంచి జరిగింది అనిపిస్తే మీ బిడ్డకు తోడుగా ఉండాలని కోరుతున్నా. మీ బిడ్డకు భయం లేదు. అందుకే 175 టార్గెట్ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నాం. దుష్ట చతుష్టయానికి కడుపు మంట వ్యవసాయం దండగన్న చంద్రబాబుకు, రైతుకు ఇచ్చిన ప్రతి మాటా తప్పిన చంద్రబాబుకు, ఆయన భజన బృందానికి, దుష్ట చతుష్టయానికి మన ప్రభుత్వంపై కడుపు మండుతోంది. అయినా కడుపు మంటకు మందు లేదు. అసూయకు అసలే మందు లేదు. మనది పేదల ప్రభుత్వం. మనది రైతన్నల ప్రభుత్వం. రైతులను వంచించిన చంద్రబాబు ఒకవైపున, అన్నదాతలకు అండగా నిలుస్తున్న మనందరి ప్రభుత్వం మరోవైపున నిలిచి ఇవాళ యుద్ధం జరుగుతోంది. సభాస్థలి కిక్కిరిసిసోవడంతో బయటే ఉండిపోయిన ప్రజలు రైతు బాగుంటేనే రాష్ట్రం బాగు ► ఇవాళ రెయిన్ గన్లు లేవు.. రెయిన్ మాత్రమే ఉంది ► మనందరి ప్రార్థనలను దేవుడు ఆలకించి రైతులకు అండగా నిలిచారు ► అన్యాయస్తుడు సీఎంగా ఉన్నప్పుడు కచ్చితంగా కరువు తాండవిస్తుంది ► వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్తో రూ.1,090.76 కోట్లు.. 51.12 లక్షల మందికి లబ్ధి ► ఇన్పుట్ సబ్సిడీతో మరో రూ.76.99 కోట్లు పరిహారం.. 91,237 మందికి ప్రయోజనం ► నాలుగేళ్లుగా ఏటా 12 లక్షల టన్నుల మేర పెరిగిన ఆహార ధాన్యాల దిగుబడి ► గత ప్రభుత్వ హయాంలో సగటున దిగుబడి 154 లక్షల టన్నులు.. ఇవాళ 166 లక్షల టన్నులు ► గత సర్కారు హయాంలో రూ.40,237 కోట్లతో 2.65 కోట్ల టన్నుల ధాన్యం సేకరణ ► ఈ మూడేళ్ల 8 నెలల వ్యవధిలో రూ.55,444 కోట్లతో 2.94 కోట్ల టన్నుల సేకరణ ► గతంతో పోలిస్తే ఉద్యాన పంటల విస్తీర్ణం 1,43,901 హెక్టార్లు పెరుగుదల ► మనందరి ప్రభుత్వంలో రైతులకు చెల్లించిన బీమా సొమ్ము రూ.6,685 కోట్లు ► గత సర్కారు హయాంలో రూ.3,411 కోట్లు మాత్రమే n ఆక్వా రైతులకు రూ.2,647 కోట్లు విద్యుత్ సబ్సిడీ ► ఉచిత విద్యుత్ కోసం రూ.27,800 కోట్లు వ్యయం n వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ.1,834 కోట్లు అందచేశాం -
తెనాలికి సీఎం వరాలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ విజ్ఞప్తి మేరకు నియోజకవర్గంలో పలు కార్యక్రమాల కోసం నిధులను మంజూరు చేస్తున్నట్లు మంగళవారం పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ► తెనాలిలో మున్సిపల్ భవనం కోసం రూ.15 కోట్లు ► షాదీ ఖానా కోసం రూ.4 కోట్లు ► ఎస్సీ కాలనీలో స్మశానవాటిక కోసం రూ.9 కోట్లు ► కొల్లిపర మండలంలో అగ్రికల్చర్ మినీ మార్కెట్ యార్డు భూముల కొనుగోలు కోసం రూ.5 కోట్లు ► దుగ్గిరాల– కొల్లిపర రోడ్డు విస్తరణకు రూ.10 కోట్లు డ్రోన్‌ను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నదాతలు ఆశీస్సులు అందించాలి అన్నదాతలకు అన్ని విధాలా అండగా ఉంటున్న సీఎం వైఎస్ జగన్‌కి సంపూర్ణ ఆశీస్సులు అందించాలి. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల కోసం నూటికి నూరు శాతం బీమా ప్రీమియాన్ని భరిస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్. సున్నా వడ్డీ రుణాలు ఇస్తున్నాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం నుంచి విక్రయం వరకు అండగా నిలుస్తున్నాం. రైతే అసలైన శాస్త్రవేత్త అని నమ్మి వ్యవసాయ సలహా మండలి ఏర్పాటు చేసి లక్ష మంది రైతులతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఇవన్నీ కొన్ని పత్రికలకు, టీడీపీ నాయకులకు పట్టడం లేదు. గాడిదలకు ఏం తెలుసు గంధపు చెక్కల వాసన అన్న మాదిరిగా వ్యవహరిస్తున్నారు. – కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి వారి నోటిని వేటితో కడగాలి? పేద ఎస్సీ మహిళా కౌలు రైతునైన నాకు సెంటు భూమి కూడా లేదు. 6 ఎకరాలు కౌలుకు తీసుకుని పసుç³#, వరి సాగు చేస్తున్నా. కరోనా సమయంలో పసుపు రూ. 5,500 ఉంటే మీరు రూ.6,850 ప్రకటించడంతో లబ్ధి పొందాం.గతేడాది పసుపు వర్షాలతో దెబ్బతింటే ఇన్సూరెన్స్ కింద రూ.80వేలు వచ్చాయి. టైలరింగ్ కూడా చేస్తున్న నాకు చేయూత సాయం అందుతోంది. మీరు పాదయాత్ర చేసినప్పుడు ప్రజలు బ్రహ్మరథం పట్టగా కొంతమంది మాత్రం మీరు వెళ్లిన తర్వాత తుడిచేశారు. ఇప్పుడు కొందరు పాదయాత్ర చేస్తున్నారు. వారి మాటలూ వింటున్నాం. మరి వాళ్ల నోటిని వేటితో కడగాలి? – పి.మేరిమ్మ, రేవేంద్రపాడు, దుగ్గిరాల మండలం, గుంటూరు జిల్లా -
కదిలి వచ్చిన తెనాలి (ఫొటోలు)
-
Tenali: వైఎస్సార్ రైతు భరోసా సభకు పోటెత్తిన జనాభిమానం..(ఫొటోలు)
-
వైఎస్ఆర్ రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్
-
కౌలు రైతులకూ రైతుభరోసా అందించాం : సీఎం వైఎస్ జగన్
-
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో వరుసగా నాలుగో ఏడాది కూడా వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విడుదల చేశారు. ఈ ఏడాది మూడో విడతగా 51.12 లక్షల మందికి రూ.1,090.76 కోట్లను సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లోకి జమచేశారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘మీ ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఇవాళ్ల రైతులకు సంబంధించి రెండు మంచి కార్యక్రమాలు చేస్తున్నాము. 50 లక్షలకుపైగా రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. వరుసగా నాలుగో ఏడాది మూడో విడత వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తున్నాం. తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీగా ఏటా రూ.13,500 భరోసా అందిస్తున్నాము. ఈ ఏడాది ఇప్పటికే రెండు విడతల్లో 50.92 లక్షల మందికి రూ.5,853.74 కోట్లు లబ్ధిచేకూరింది. మూడో విడత కింద 51.12 లక్షల మందికి రూ. 1.090.76 కోట్లు జమ చేస్తున్నాం. నాలుగేళ్లలో ఒక్కో కుటుంబానికి రూ.54వేల చొప్పున సాయం అందించాం. ఈ నాలుగేళ్ల కాలంలో రైతు భరోసా కింద రూ.27,062 కోట్లు సాయం అందజేశాము. ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్లో పరిహారం అందిస్తున్నాము. మాండూస్ తుఫాన్ వల్ల పంట నష్టపోయిన 91,237 మంది రైతులకు రూ. 76,99 కోట్లు అందిస్తున్నాం. వ్యవసాయం బాగుంటేనే రైతులు బాగుంటారు. రైతుల బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. నాలుగేళ్లుగా వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయి. నాలుగేళ్ల కాలంలో ఎక్కడా కరువు అనే మాటే లేదు. 2014-19 మధ్య గత ప్రభుత్వంలో ఓ అన్యాయస్థుడు సీఎంగా ఉన్నాడు. చంద్రబాబు పాలనలో ప్రతీ ఏటా కరువే ఉంది. కరువుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు. మాజీ సీఎం హయంలో ఏటా కరువు మండలాల ప్రకటనే ఉండేది. నాలుగేళ్లుగా ప్రతి చెరువు, రిజర్వాయర్ నిండాయి. రాష్ట్రంలో నాలుగేళ్లుగా భూగర్భ జలాలు పెరిగాయి. నాలుగేళ్లుగా ఆహార ధాన్యాల దిగుబడి సగటున 166 లక్షల టన్నులకు పెరిగింది. నాలుగేళ్లుగా రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ జరిగింది. ధాన్యం సేకరణ కోసం ఇప్పటి వరకు రూ. 55వేల కోట్లకుపైగా ఖర్చు చేశాం. రైతు భరోసా ద్వారా రూ.27వేల కోట్లు అందజేశాం. పట్టా ఉన్న రైతులకే కాకుండా అసైన్డ్ భూముల రైతులు, కౌలు రైతులలకూ రైతు భరోసా అందించాము. ఆర్బీకేల ద్వారా రైతన్నలకు విత్తనం నుంచి ఎరువుల వరకు తోడుగా నిలిచాం. మన ఆర్బీకేలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి. టీడీపీ పాలనలో ఐదేళ్లలో 30.85 లక్షల మంది రైతులకు రూ. 3,411 కోట్లు మాత్రమే అందించారు. మన ప్రభుత్వంలో గడిచిన నాలుగేళ్లుగా రైతులకు రూ.6,685 కోట్ల సాయం అందించాం. రైతన్నకు ఎలాంటి కష్టం వచ్చినా అండగా నిలుస్తున్నాం. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను మేం తీర్చుతున్నాం. సున్నా వడ్డీ కింద ఇప్పటి వరకు రూ,1,834 కోట్లు చెల్లించాం. వ్యవసాయం దండగా అన్న చంద్రబాబుకు మన ప్రభుత్వం మీద కడుపు మండుతోంది. కడుపు మంటకు, అసూయకు అసలే మందు లేదు. చంద్రబాబుది పెత్తందార్ల పార్టీ. మనది పేదల ప్రభుత్వం, రైతన్న ప్రభుత్వం’ అని అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Tenali: వైఎస్సార్ రైతు భరోసా నిధులు జమ చేసిన సీఎం జగన్ (ఫోటోలు)
-
తెనాలి చేరుకున్న సీఎం వైఎస్ జగన్
-
మీ ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు: సీఎం జగన్
Updates.. మీ ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు: సీఎం జగన్ ► సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘మీ ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఇవాళ్ల రైతులకు సంబంధించి రెండు మంచి కార్యక్రమాలు చేస్తున్నాము. 50 లక్షలకుపైగా రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీగా ఏటా రూ.13,500 భరోసా అందిస్తున్నాము. ఈ ఏడాది ఇప్పటికే రెండు విడతల్లో 50.92 లక్షల మందికి రూ.5,853.74 కోట్లు లబ్ధిచేకూరింది. మూడో విడత కింద 51.12 లక్షల మందికి రూ. 1.090.76 కోట్లు జమ చేస్తున్నాం. నాలుగేళ్లలో ఒక్కో కుటుంబానికి రూ.54వేల చొప్పున సాయం అందించాం. ఈ నాలుగేళ్ల కాలంలో రైతు భరోసా కింద రూ.27,062 కోట్లు సాయం అందజేశాము. ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్లో పరిహారం అందిస్తున్నాము. మాండూస్ తుఫాన్ వల్ల పంట నష్టపోయిన 91,237 మంది రైతులకు రూ. 76,99 కోట్లు అందిస్తున్నాం. వ్యవసాయం బాగుంటేనే రైతులు బాగుంటారు. రైతుల బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. నాలుగేళ్లుగా వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయి. నాలుగేళ్ల కాలంలో ఎక్కడా కరువు అనే మాటే లేదు. చంద్రబాబు పాలనలో ప్రతీ ఏటా కరువే ఉంది. కరువుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు. మాజీ సీఎం హయంలో ఏటా కరువు మండలాల ప్రకటనే ఉండేది. మన ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు చూసి ప్రతిపక్షానికి కడుపుమంటగా ఉంది. రాష్ట్రంలో ఈరోజు యుద్ధం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో కరువుతో స్నేహం చేసిన చంద్రబాబుకు మీ బిడ్డకు మధ్య యుద్ధం జరగబోతోంది. వచ్చే ఎన్నికల్లో ఇంగ్లీష్ మీడియం వద్ద చంద్రబాబుకు మీ బిడ్డకు యుద్ధం జరగబోతోంది. రాష్ట్రంలో గజ దొంగల ముఠా ఉంది. ఈ ముఠా పని దోచుకో.. పంచుకో.. తినుకో మాత్రమే. గజదొంగల ముఠాలో ఇంకొకరు దత్తపుత్రుడు. దుష్టచతుష్టాయానికి తోడు దత్తపుత్రుడు జతకలిశాడు. చంద్రబాబు ఎందుకు సంక్షేమ పథకాలు పెట్టలేకపోయాడు. ఆ డబ్బులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్లాయి?. ఇప్పుడు కూడా అదే బడ్జెట్, అదే రాష్ట్రం. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి వ్యతిరేకం అన్నాడు చంద్రబాబు. మీ బిడ్డ పాలనకు.. చంద్రబాబు పాలనకు వ్యత్యాసాన్ని గమనించాలి. మంచి చేశాం, మంచి జరిగిందని అనిపిస్తే తోడుగా ఉండండి. ఇచ్చిన హామీలు అన్ని నెరవేస్తున్నాం. చంద్రబాబుకు, దత్తపుత్రుడికి సవాల్ విసురుతున్నాను. 175కి 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యం ఉందా?. మీ బిడ్డకు భయంలేదు. చేసిన మంచి చెప్పుకునే మళ్లీ అధికారంలోకి వస్తాం’ అని అన్నారు. ► కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతే అసలైన శాస్త్రవేత్త అని నమ్మిన వ్యక్తి సీఎం జగన్. ఏ సీజన్లో పంట నష్టం ఆ సీజన్లోనే అందిస్తున్న ఏకైన సీఎం వైఎస్ జగన్. దేశంలోనే వందశాతం రైతు బీమా ప్రీమియం భరించిన ఏకైన రాష్ట్రం ఏపీ. చంద్రబాబు హయంలో అన్నీ కరువు కాటకాలే అని అన్నారు. ► తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ.. సీఎం జగన్ పాదయాత్ర రాష్ట్రంలో ప్రజల గుండె చప్పుడు. రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమ పాలన అందుతోంది. రైతు భరోసా, అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, చేయూత వంటి పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరం. జగనన్న సేవకుడు శివకుమార్ అన్ని అన్నారు. నియోజకవర్గంలో పేదలకు 26వేల ఇళ్లు ఇచ్చిన ఘనత సీఎం జగనన్నకే దక్కింది. తెనాలి గడ్డ.. జగనన్న అడ్డ అని అన్నారు. ► రైతుల గుండెల్లో సీఎం జగన్ చిరస్థాయిగా నిలిచిపోతారు. దేశ చరిత్రలో రైతు సంక్షేమం కోసం పాటుపడిన ఏకైక సీఎం వైఎస్ జగన్. పాదయాత్రతో రాష్ట్ర దశదిశను మార్చిన వ్యక్తి సీఎం జగన్. ► రైతుల గురించి సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా.. రైతు బాగుంటనే రాష్ట్రం బాగుంటుంది అని కామెంట్స్ చేశారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది.#YSRRythuBharosa pic.twitter.com/kgtewgmrAZ — YS Jagan Mohan Reddy (@ysjagan) February 28, 2023 ► తెనాలి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్. ► గుంటూరు జిల్లా తెనాలికి బయలుదేరిన సీఎం జగన్. సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో వరుసగా నాలుగో ఏడాది కూడా వైఎస్సార్ రైతు భరోసా అమలుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తోంది. ఈ ఏడాది మూడో విడతగా 51.12 లక్షల మందికి రూ.1,090.76 కోట్లను సీఎం జగన్ మంగళవారం తెనాలి మార్కెట్‌యార్డులో జరిగే కార్యక్రమంలో నేరుగా వారి ఖాతాల్లోకి జమచేయనున్నారు. ► రైతులకు ఏటా రూ.12,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని ఎన్నికల మానిఫెస్టోలో హామీ ఇవ్వగా, అంతకంటే మిన్నగా ఏటా రూ.13,500 చొప్పున అందిస్తున్నారు. వరుసగా నాల్గో ఏడాదిలో కూడా ఇప్పటికే రెండు విడతల్లో రూ.11,500 సాయం అందించారు. మూడో విడతగా ఒక్కొక్కరికి మరో రూ.2వేల చొప్పున 51.12 లక్షల మంది రైతన్నల ఖాతాల్లో రూ.1,090.76 కోట్లను సీఎం జగన్ నేడు జమచేయనున్నారు. ► ఇక 2022 డిసెంబర్లో మాండూస్ తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన 91,237 మంది వ్యవసాయ, ఉద్యాన రైతన్నలకూ రూ.76.99 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ మొత్తాన్ని రబీ సీజన్ ముగియక ముందే వారి ఖాతాల్లో జమచేస్తున్నారు. ఈ మొత్తంతో కలిపి ఇప్పటివరకు 22.22 లక్షల మంది రైతన్నలకు రూ.1,911.78 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని అందించారు. ఇలా గడిచిన మూడేళ్ల తొమ్మిది నెలల్లో రైతులకు మొత్తం మీద నేరుగా రూ.1,45,751 కోట్ల లబ్ధిని చేకూర్చారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వైఎస్సార్ రైతు భరోసా నగదు పంపిణీ చేయనున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం గుంటూరు జిల్లాలోని తెనాలిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నాలుగో ఏడాది మూడో విడతలో భాగంగా వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్, ఇటీవల పంటలు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ చేయనున్నారు. షెడ్యూల్ ఇదే.. - సీఎం జగన్ మంగళవారం ఉదయం 9.50 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి.. 10.15 గంటలకు తెనాలి చేరుకుంటారు. - ఉదయం 10.35 గంటలకు స్ధానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలోని బహిరంగ సభా వేదికకు చేరుకుంటారు. - నాలుగో ఏడాది మూడో విడత వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్, ఇటీవల పంటలు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ కార్యక్రమంలో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. - అనంతరం 12.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1.10 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
తెనాలిలో ఈ నెల 27న సీఎం జగన్ పర్యటన
-
తెనాలిలో చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు ప్రారంభం
తెనాలి: గుంటూరు జిల్లా తెనాలిలోని కోర్టు భవనాల సముదాయంలో నూతనంగా నిర్మించిన ‘చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు’ ను బుధవారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాదరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి.కృష్ణమోహన్, జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్ వడ్డిబోయిన సుజాత, జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప హాజరయ్యారు. జస్టిస్ దుర్గాప్రసాదరావు మాట్లాడుతూ..మైనార్టీ తీరని మహిళలపై జరిగే అత్యాచారాలను అత్యంత త్వరితగతిన విచారణ జరిపించి బాధితులకు న్యాయం, నేరస్తులకు తగిన శిక్ష పడేలా చూడాలని అటు ప్రభుత్వం, ఇటు న్యాయస్థానాలు భావిస్తున్నాయని చెప్పారు. పోక్సో నేరాలను తీవ్రమైనవిగా పరిగణించి సత్వర న్యాయం చేయాలన్న సంకల్పంతో సాధ్యమైనన్ని ఎక్కువ పోక్సో కోర్టులను అవసరమైన ప్రదేశాల్లో నెలకొల్పుతున్నట్టు తెలిపారు. ఈ క్రమంలోనే గుంటూరులో పోక్సో కోర్టు ఉన్నప్పటికీ తెనాలిలో కూడా మరో పోక్సో కోర్టును ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధపడిందన్నారు. ఇక్కడ 16 మండలాలకు సంబంధించిన పోక్సో కేసులను విచారణ చేస్తారని చెప్పారు. -
కే. విశ్వనాథ్: ఇనుమడించిన పల్లెటూరు ప్రతిష్ట.. ‘సూపర్ స్టార్’కు శిక్షణ
తెనాలి: కల్మషం లేని పల్లె జీవితాలు.. పాడి పంటలతో భాసిల్లుతుండే పల్లెటూళ్లకు కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ తన సినిమాల్లో పెద్దపీట వేశారు. మనవైన సంస్కృతీ సంప్రదాయాల ప్రస్తావన తప్పనిసరి. వీటన్నిటి మేళవింపుతో వినోదాత్మకమైన సినిమాతో చక్కని సందేశాన్ని ఇచ్చారు. అదికూడా కళాత్మకంగా, షడ్రుచుల సమ్మేళన విందు భోజనం అనిపించిన సంతృప్తితో ప్రేక్షకులు తెరబాట నుంచి ఇంటిబాట పట్టేలా ఉంటుంది. జనం మెచ్చిన ఈ సినీపరి‘శ్రమ’ను గుర్తించి ఎన్నో అవార్డులు అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వైఎస్సార్ జీవితకాల పురస్కారంతో ఇటీవలే సత్కరించింది. అంతలోనే ఆయన ఇకలేరన్న వార్త వినాల్సి రావటం దురదృష్టకరం. ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లె సమీపంలో భట్టిప్రోలు మండలంలోని పెదపులివర్రు కె.విశ్వనాథ్ స్వస్థలం. కృష్ణాతీరంలో ఒకప్పుడు వాఘ్రపురంగా చారిత్రక ప్రసిద్ధి చెందిన ఈ గ్రామం చోళరాజులు, విజయనగర రాజులు, జమీందారుల పాలనలో విలసిల్లింది. 19వ శతాబ్ది మొదటిపాదం వరకు లలిత కళాకారులు, వేద, ఆగమశాస్త్ర పండితులు, సాహిత్య కోవిదులు, సంగీత విద్వాంసులు, ఆయుర్వేద వైద్యులు, భరతనాట్య కోవిదులు, చిత్రకారులు, శిల్పులు, మంత్రద్రష్టలు, స్వాతంత్య్ర యోధులకు నిలయం ఈ గ్రామం. సినీ సంభాషణలు, పాటల రచనలో వెండితెరను ఏలిన సముద్రాల రాఘవాచారి (సీనియర్ సముద్రాల), సముద్రాల రామానుజాచారి (జూనియర్ సముద్రాల), సినీతార హలం ఈ ఊరి బిడ్దలు. సుప్రసిద్ధ సంగీత దర్శకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు బాల్యం ఇక్కడే గడచింది. ఇదే ఊరి బిడ్డ, సినీదర్శకుడు కె.విశ్వనాథ్ తన సృజనతో ప్రతిష్టాత్మక గౌరవాలను పొందటం ద్వారా మాతృభూమి పెదపులివర్రును పులకరింపజేశారు. ‘సూపర్ స్టార్’కు శిక్షణ అప్పట్లో అంటే 53 ఏళ్ల క్రితం బాబూ మూవీస్ కొత్త తారలతో ప్రయోగాత్మకంగా తీసిన తొలి సాంఘిక ఈస్ట్‌మన్ కలర్ చిత్రం ‘తేనె మనసులు’. ఆదుర్తి సుబ్బారావు దర్శకుడు. కె.విశ్వనాథ్ సహ దర్శకుడు. తెనాలి సమీపంలోని బుర్రిపాలెం యువకుడు ఘట్టమనేని కృష్ణ తొలి సినిమా అది. సినిమా కోసమని కృష్ణకు నడకలో, వాచకంలో శిక్షణ ఇచ్చింది విశ్వనాథ్ కావటం విశేషం. ఆ అనుబంధం తర్వాత కూడా కొనసాగింది. కృష్ణతో ‘కన్నె మనసులు’ తీశారు. మళ్లీ ‘ప్రైవేట్ మాస్టర్’లో కృష్ణను నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రకు ఉపయోగించారు. ‘ఉండమ్మా బొట్టుపెడతా’, ‘నేరము–శిక్ష’ సినిమాలను కృష్ణతో చేశారాయన. ఆ తర్వాత దర్శకత్వ రంగంలో విశ్వనాథ్ తనదైన ‘కళాతపస్వి’గా చరిత్రను సృష్టించుకొంటే, కృష్ణ సూపర్‌స్టార్‌గా ఎదగడం తెలిసిందే. తెనాలితో అనుబంధం హీరో కృష్ణతోనే కాదు. ఊర్వశి శారద హీరోయిన్గా తీసిన అవార్డు సినిమా ‘శారద’కు దర్శకుడు విశ్వనాథే. ఇదే సినిమాకు తెనాలికి చెందిన అభ్యుదయ రచయిత బొల్లిముంత శివరామకృష్ణ సంభాషణలు సమకూర్చారు. బొల్లిముంత కన్నుమూశాక, ఏటా ఆయన పేరుతో ఇస్తున్న పురస్కారాన్ని 2012లో కె.విశ్వనాథ్ తెనాలిలో అందుకున్నారు. ఈ సందర్భంగా సమీపంలోని అంగలకుదురులో కళాకారుడు, రచయిత రావినూతల శ్రీరామమూర్తి, విశ్వనాథ్‌కు స్వర్ణ కంకణ ధారణ చేశారు. అంతకు ముందు 1974లో తెనాలిలో కల్చరల్ ఫిలిం సొసైటి తరపున విశ్వనాథ్‌ను సత్కరించారు. సినిమాల మంచి చెడ్డలను బేరీజు వేస్తూ, ఉత్తమ చిత్రాలను ప్రోత్సహిస్తున్న ఫిలిం సొసైటి నిర్వాహకుడు డాక్టర్ పి.దక్షిణామూర్తి అంటే ఆపేక్షగా ఉండేవారు. సొంతూరుపై తరగని మమకారం ఎంతగా ఎదిగినా, నగరంతో జీవితం ముడిపడినా.. విశ్వనాథ్‌కు సొంతూరు అంటే అమితమైన మమకారం. ఇక్కడి ప్రజలన్నా ప్రేమ. గ్రామంలోని శివాలయం అంటే ఎంతో ఇష్టం. తాను తీసిన ప్రతి సినిమాలో భట్టిప్రోలు మండలం పెదపులివర్రు పేరు వినిపిస్తుంది. సొంత గ్రామంలో నిర్వహించే దసరా, మహాశివరాత్రి ఉత్పవాలకు ఆలయాల్లో పూజలు నిర్వహించేవారు. పండగ వస్తే చిన్ననాటి స్నేహితుడు కొడమంచిలి వెంకట సుబ్బారావుకు పట్టువస్త్రాలు పంపేవారు. ఇప్పుడు విశ్వనాథ్ కన్ను మూశారని తెలిసి ఆయనతో పరిచయం ఉన్న వారంతా శోకసంద్రంలో మునిగిపోయారు. స్వాతంత్య్రయోధుని కుటుంబం విశ్వనాథ్ తాత కాళహస్తిలింగం స్వాతంత్య్రయోధుడు, పండితుడు. 1930లో కాంగ్రెస్ కార్యకర్తకు ఆతిథ్యం ఇచ్చినందుకు ఆరునెలలు జైలుశిక్ష అనుభవించారు. జైలు భోజనం నిరాకరించినందుకు ఆలీపురం క్యాంపు జైలుకు పంపారు. అక్కడ కూడా భోజనం లేకుండా నిత్యసంధ్యానుష్టానాలు జరుపుకున్నారు. జైలు డాక్టర్ వీరి గురించి తెలుసుకుని గోధుమపిండి, పాలు, నూనె వంటివి ఏర్పాటు చేశారు. విశ్వనాథ్ తండ్రి కాశీనాథుని సుబ్రహ్మణ్యం పెదపులివర్రు శివాలయంలో ప్రధాన అర్చకులుగా 1956 వరకు పని చేశారు. తల్లి సరస్వతి. సినీ నిర్మాణ సంస్థ వాహినిలో ఉద్యోగం రావటంతో సుబ్రహ్మణ్యం మకాం చెన్నైకి మారింది. విశ్వనాథ్ నాలుగో తరగతి వరకు గ్రామంలోని పాఠశాలలో చదువుకున్నారు. తర్వాత గుంటూరులో హిందూ, ఏసీ కాలేజీల్లో చదివారు. బీఎస్సీ పూర్తి చేశారు. చెన్నైలోని వాహిని స్టూడియోలో సౌండ్ ఇంజినీరుగా కెరీర్ ఆరంభించారు. -
Puneeth Rajkumar: ఐరన్ స్క్రాప్‌తో పునీత్ రాజ్‌కుమార్ విగ్రహం
తెనాలి: కర్ణాటకకు చెందిన ప్రముఖ సినీనటుడు డాక్టర్ పునీత్ రాజ్‌కుమార్ అభిమానుల వినతిపై ఆయన నిలువెత్తు ఐరన్ స్క్రాప్ విగ్రహాన్ని గుంటూరు జిల్లా తెనాలిలోని సూర్య శిల్పశాల శిల్పకారులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర తయారు చేశారు. టన్నున్నర ఐరన్ స్క్రాప్‌ను వినియోగించి నాలుగు నెలలు శ్రమించి తొమ్మిది అడుగుల విగ్రహాన్ని సిద్ధం చేశారు. బెంగళూరులోని ఓ ప్రధాన కూడలిలో ప్రతిష్టించనున్నారు. -
విమాన ప్రమాదం: అంజూను మర్చిపోలేం.. షాక్‌కు గురైన సహ విద్యార్థులు
సాక్షి, తెనాలి: నేపాల్‌లోని పొఖారాలో జరిగిన విమాన ప్రమాదంలో కోపైలట్ అంజూ ఖతివాడ మరణించడంతో.. తెనాలిలోని ఆమె సహ విద్యార్థులు షాక్‌కు గురయ్యారు. నేపాల్‌లోని విరాట్ నగర్‌కు చెందిన అంజూ 1995లో తెనాలిలోని వివేకానంద జూనియర్ కాలేజ్‌లో ఇంటర్ విద్యాభ్యాసం చేశారు. ఆ బ్యాచ్‌లో నేపాలీలు మొత్తం 125 మంది వరకు ఉన్నారని.. అందులో అంజూ అందరితో కలివిడిగా.. చదువులో చురుగ్గా ఉండేది. బైపీసీలో 72 శాతం మార్కులు సాధించిందని.. వాట్సాప్ గ్రూప్ ద్వారా అందరితో టచ్‌లో ఉండేదని సహ విద్యార్థి లింగం మకుటం శివకుమార్ చెప్పారు. ఆమె భర్త కూడా పైలట్ అని.. ఓ విమాన ప్రమాదంలో మరణించారని పేర్కొన్నారు. బీమా డబ్బుతో అంజూ పైలట్ శిక్షణ తీసుకుందని చెప్పారు. 6,400 గంటలకు పైగా విమానం నడిపిన అంజూ ఇలా ప్రమాదంలో మరణించడాన్ని నమ్మలేకపోతున్నామన్నారు. అంజూను ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. కాగా, అంజూ మృతిపై వివేక విద్యాసంస్థల డైరెక్టర్ వీరనారాయణ సంతాపం తెలిపారు. చదవండి: (శ్రీహరికోటలో మరో విషాదం.. వికాస్‌సింగ్ భార్య ఆత్మహత్య) -
ఇంగ్లండ్‌లో ప్రజా చైతన్యం ఎక్కువ
తెనాలి: ఇంగ్లండ్‌లో ప్రజాప్రతినిధులు జవాబుదారీతనంతో వ్యవహరిస్తారని, ప్రజల్లో కూడా చైతన్యం ఎక్కువని హ్యాంప్‌షైర్ కౌంటీ కౌన్సిలర్ అరుణ్ ముమ్మలనేని చెప్పారు. అక్కడి నాయకులు గాలివాటుగా వాగ్దానాలు చేయడం కుదరదని, అలా చేసినందువల్ల దేశ ప్రధానమంత్రి సైతం పదవి నుంచి వైదొలగినట్టు గుర్తుచేశారు. స్వస్థలం వచ్చిన అరుణ్ ఆదివారం గుంటూరు జిల్లా తెనాలిలోని మిత్రుడు కుర్రా శ్రీనివాసరావు నివాసంలో విలేకరులతో మాట్లాడారు. తన వృత్తి ఉద్యోగమని, రాజకీయం ప్రవృత్తి మాత్రమేనని తెలిపారు. పుట్టినగడ్డలో పలు సేవాకార్యక్రమాలు చేస్తున్న ఆయన తెలిపిన వివరాలు.. ► నా స్వస్థలం రేపల్లె దగ్గర్లోని చాట్రగడ్డ. పెరిగిందీ, చదువుకుందీ అమ్మమ్మగారి ఊరైన అమృతలూరు మండలం, మోపర్రు గ్రామం. కాకినాడ, హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ చేశాక సీఎంసీ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. తర్వాత ఇంగ్లండ్ వెళ్లాను. ► హ్యాంప్‌షైర్ కౌంటీలోని బేజింగ్‌స్టోక్ వాయవ్య నియోజకవర్గం ప్రతినిధిగా గతేడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో అధికార కన్సర్వేటివ్ పార్టీ నుంచి భారీ మెజారిటీతో ఎన్నికైన తొలి శ్వేత జాతీయేతరుడిని. ► పార్టీ బేజింగ్‌స్టోక్ ఉపాధ్యక్షుడిగానూ కొనసాగుతున్నా. అక్కడి ప్రాథమిక సభ్యుల ఆమోదంతో ఎంపీగా పోటీచేసేందుకు అర్హత లభించింది. బేజింగ్‌స్టోక్, బారో కౌన్సిల్‌కూ ఎన్నికయ్యాను. స్త్రీ శిశు, కుటుంబ సంక్షేమ అడ్వయిజరీ ప్యానల్ చైర్మన్‌గానూ వ్యవహరిస్తున్నాను. ప్రస్తుతం ఇంగ్లండ్‌లోని రక్షణ మంత్రిత్వశాఖకు ఫ్రీలాన్స్ కన్సల్టెంటుగా ఉన్నా. ► ఇంగ్లండ్‌లో స్థిరపడ్డాక తెలుగువారితో ఓ సంఘం ఏర్పాటులో భాగస్వామినయ్యా. బేజింగ్‌స్టోక్ కల్చరల్ ఫోరం చైర్మన్‌గానూ చేస్తున్నా. తెలుగు బడి పేరుతో వారాంతాల్లో మన వాళ్ల పిల్లలకు తెలుగు నేర్పుతున్నాం. ► ఇంగ్లండ్‌లో నిజమైన అర్హులకే సంక్షేమ పథకాలు లభిస్తాయి. అనర్హులు వాటిని ఆశించరు కూడా. ► ప్రతి ఒక్కరి ఆదాయం, ఖర్చు లెక్కలు ప్రభుత్వానికి తెలుస్తుంది. అవినీతికి ఆస్కారం ఉండదు. 10వ తరగతి వరకు నిర్బంధ విద్య ఉంటుంది. ► సేవా కార్యక్రమాల్లో భాగంగా చాట్రగడ్డలో వృద్ధాశ్రమానికి వితరణ, మోపర్రు, పరిసరాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు భోజనం ప్లేట్లు, పుస్తకాలు, యూనిఫాంలు అందించాను. ► కోవిడ్ రోజుల్లోకూడా పలు సేవలు చేశాం. ప్రతిభావంతులైన పేద విద్యార్థులను చదివిస్తున్నాను. -
సూపర్ స్టార్ కృష్ణ పేరుతో అవార్డు
‘‘సినీ రంగంలో విశిష్ట సేవలందించిన వ్యక్తికి ప్రతి ఏడాది ‘సూపర్ స్టార్ కృష్ణ స్మారక అవార్డు’ ప్రదానం చేస్తాం’’ అని ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ (మా ఏపీ)’ అధ్యక్షుడు, డైరెక్టర్ దిలీప్ రాజా అన్నారు. తెనాలిలోని ‘మా ఏపీ’ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రజలు తమకు ఇష్టమైన ముగ్గురు నటుల పేర్లను ‘మా – ఏపీ’ కార్యాలయానికి పంపాలి. పంపిన వారి వివరాలు, ఫోన్ నంబర్ తప్పనిసరిగా ఉండాలి. ప్రజా బ్యాలెట్లో ఎక్కువ ఓట్లు వచ్చిన ఒకరిని ‘సూపర్ స్టార్ కృష్ణ స్మారక అవార్డు’కు జ్యూరీ ఎంపిక చేస్తుంది. తెనాలిలో జరిగే ఈ అవార్డు వేడుక తేదీని మహేశ్‌బాబుతో చర్చించిన అనంతరం తెలియజేస్తాం’’ అన్నారు. -
రాకెట్లా దూసుకెళ్తున్న ఏపీ శాస్త్రవేత్త.. సాయిదివ్య స్పెషల్ ఇదే..
తెనాలిరూరల్: దేశ చరిత్రలో తొలిసారి ప్రయోగించిన ప్రైవేట్ రాకెట్ ప్రారంభ్(విక్రమ్–ఎస్) విజయవంతం అవడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చారిత్రక ఘట్టంలో తెనాలి యువతి భాగస్వామి అయ్యింది. పట్టణానికి చెందిన యువ శాస్త్రవేత్త సాయిదివ్య కూరపాటి రూపొందించిన 200 గ్రాముల పేలోడ్‌ను విక్రమ్–ఎస్ ద్వారా అంతరిక్షంలోకి పంపారు. ఉపగ్రహ కమ్యూనికేషన్ రంగంలో పీహెడీ స్కాలర్ అయిన సాయిదివ్య తన భర్త కొత్తమాసు రఘురామ్‌తో కలసి ఎన్–స్పేస్‌టెక్ ఇండియా పేరిట సంస్థను ఏర్పాటు చేసి ఉపగ్రహ తయారీపై ప్రయోగాలు చేస్తున్నారు. గతంలో సాయిదివ్య మైక్రో శాటిలైట్ ‘లక్ష్య శాట్’ను తయారు చేయగా యూకేలోని బీ–2 స్పేస్ సంస్థ ఆస్తరావరణం(స్టాటోస్పియర్)లోకి పంపింది. ప్రస్తుతం ఆమె తయారుచేసిన పేలోడ్‌ను హైదరాబాద్‌లోని స్కైరూట్ ఏరో స్పేస్ సంస్థకు పంపగా, అక్కడ నుంచి శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌కు పంపారు. ప్రారంభ్ రాకెట్ ద్వారా సాయిదివ్య తయారు చేసిన పేలోడ్‌తోపాటు మరో రెండు సంస్థలు తయారు చేసిన పేలోడ్లను ప్రయోగించారు. - తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగానికి సన్నాహాలు జరుగుతున్న నాటి నుంచి సాయిదివ్య స్కైరూట్ సంస్థతో సంప్రదిస్తూ వచ్చారు. తెనాలిలోని తన పరిశోధన కేంద్రంలోనే పేలోడ్ తయారు చేశారు. దీనిని ఇతర పేలోడ్లతో అనుసంథానించడం, రాకెట్ అంతరభాగంలో సరిపోయే విధంగా రూపొందించేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. వాతావరణంలో ఉన్న తేమ, ఇతర వివరాలను నమోదు చేసేలా పేలోడ్‌ను రూపొందించారు. - తెనాలిలో తయారైన పేలోడ్‌ను హైదరాబాద్ పంపారు. అక్కడ కొన్ని ప్రాథమిక పరీక్షల అనంతరం రాకెట్లో అమర్చేందుకు షార్కు పంపారు. రాకెట్లో అమర్చి, పనితీరును పరిశీలించారు. పేలోడ్ నుంచి వస్తున్న సిగ్నల్స్, ఇతర సమాచార వ్యవస్థను అధ్యయనం చేశారు. విజయవంతంగా రాకెట్ నింగిలోకి దూసుకెళ్లగా అందులో తెనాలిలో తయారుకాబడిన పేలోడ్ ఉండడం విశేషం. టూ వే కమ్యూనికేషన్ శాటిలైట్ తయారీ విక్రమ్–ఎస్ ప్రయోగం విజయవంతం కావడంతో త్వరలో విక్రమ్–1 పేరిట మరో ప్రైవేట్ రాకెట్ తయారీకి రంగం సిద్ధం చేస్తున్నారు. విక్రమ్–ఎస్‌లోని పేలోడ్లు కేవలం వాతావరణంలోని తేమ వంటి వివరాలను మాత్రమే నమోదు చేశాయి. విక్రమ్–1లో టూ వే కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. విక్రమ్–ఎస్‌ను సబ్–ఆర్బిటల్‌లోకి మాత్రమే ప్రయోగించారు. కేవలం 89.5 కిలోమీటర్లు దూరం ఈ రాకెట్ వెళ్లగా, భవిష్యత్తులో తయారుకానున్న విక్రమ్–1ను ఆర్బిటల్(కక్ష్య)లోకి పంపే ఆలోచనలో ఉన్నారు. ఈ రాకెట్లో అమర్చే పేలోడ్లలో టూ వే కమ్యూనికేషన్ వ్యవ్థను అమరుస్తారు. కక్ష్యలోని శాటిలైట్‌తో సంప్రదించడం, దాని నుంచి సమాచారం రాబట్టడం చేస్తారు. ఇందు కోసం సాయిదివ్య పేలోడ్ తయారు చేస్తున్నారు. కమ్యూనికేషన్ వ్యవస్థ కోసం సెన్సార్లను ఏర్పాటు చేయనున్నారు. అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యం.. స్పేస్ టెక్నాలజీని విద్యార్థులు, రీసెర్చ్ చేసే వాళ్లకు అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతోనే ఎన్–స్పేస్ టెక్ ఇండియా సంస్థను నెలకొల్పాం. ఉపగ్రహాలు, రాకెట్ల ద్వారా నింగిలోకి పంపే పేలోడ్ల తయారీ, వాటికి సంబంధించిన ప్రయోగాలను వీరికి అందుబాటులోకి తీసుకురావడం వల్ల భవిష్యత్తులో ఈ రంగంలో మరింత మంది రాణించే అవకాశం ఉంటుంది. దీని ద్వారా ప్రైవేటు ఉపగ్రహల తయారీ రంగం మరింత అభివృద్ధి చెందుతుంది. తొలి ప్రైవేటు రాకెట్ ప్రయోగంలో భాగస్వాములం అవడం సంతోషంగా ఉంది. – కూరపాటి సాయిదివ్య, యువ శాస్త్రవేత్త -
గుంటూరు బ్యూటీషియన్ హత్యకేసు.. వివాహేతర సంబంధమే కారణమా?
సాక్షి, గుంటూరు(తెనాలిరూరల్): బ్యూటీషియన్ హత్య కేసులో ఆమె భర్తను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. గురువారం స్థానిక గాంధీనగర్ ఘంటావారి వీధిలోని బ్యూటీ పార్లర్లో ఉన్న స్వాతిని ఆమె భర్త వెంకట కోటయ్య కత్తితో దారుణంగా నరికి చంపి, ఆపై ఆమె శవంపై పూల మాలలు వేసి నివాళులర్పించి మరీ రూరల్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయిన విషయం తెలిసిందే. స్థానిక టూటౌన్ సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను డీఎస్పీ స్రవంతి రాయ్ వెల్లడించారు. అనుమానంతోనే నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు డీఎస్పీ వివరించారు. ఆమె కథనం ప్రకారం.. చెంచుపేట జెండాచెట్టు బజారుకు చెందిన లారీ డ్రైవర్ పరిమి వెంకటేశ్వరరావు కుమార్తె స్వాతికి లారీ డ్రైవర్ కాకర్ల వెంకట కోటయ్యతో 18 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇంటర్, తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. స్వాతి గాంధీనగర్‌లో బ్యూటీపార్లర్ నిర్వహిస్తోంది. చదవండి: (ఫేస్బుక్లో పరిచయైన యువతితో పెళ్లికి సిద్ధం.. రూ.39లక్షలు..!) ఆమె ఇంటి పక్కన ఉండే ఓ వ్యక్తితో ఆమెకు వివాహేతర సంబంధం ఉందని వెంకట కోటయ్య అనుమానించేవాడు. ఈ విషయంపై తరచూ ఆమెతో ఘర్షణ పడేవాడు. ఈ నెల 15వ తేదీన కూడా భార్యతో గొడవ పడి కొట్టడంతో ఆమె చెంచుపేటలోని తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి రోజూ తల్లిదండ్రుల ఇంటి వద్ద నుండే గాంధీనగర్‌లోని బ్యూటీ పార్లర్‌కు వచ్చి వెళుతోంది. దీంతో భార్యపై కక్ష పెంచుకున్న వెంకట కోటయ్య గురువారం మధ్యాహ్నం బ్యూటీ పార్లర్ వద్దకు వచ్చి స్వాతిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో ఆమె రక్తపుమడుగులో కుప్పకూలి అక్కడికక్కడే మరణించింది. భార్య మృతి చెందిందని నిర్ధారించుకున్న వెంకట కోటయ్య ముందుగానే తన వెంట తెచ్చుకున్న పూల దండలను ఆమె మృతదేహంపై వేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్లి ఇద్దరు కొడుకులకు తల్లిని చంపేసినట్లు చెప్పాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో టూటౌన్ సీఐ ఎస్.వెంకట్రావు, ఎస్ఐ శివరామయ్య, సిబ్బంది ఉన్నారు. చదవండి: (గుంటూరులో దారుణం.. బ్యూటీపార్లర్‌లో భార్యను చంపిన భర్త) -
భార్యను కత్తితో నరికి... మృతదేహానికి పూలమాల వేసి...
తెనాలిరూరల్: ఓ వ్యక్తి తన భార్యను బతికున్నంతకాలం అనుమానంతో వేధించాడు. చివరికి ఆమెను కత్తితో నరికి చంపేశాడు. రక్తపుమడుగులో పడి ఉన్న మృతదేహంపై మాత్రం పూలు, పూలమాలలు ఉంచి నివాళి అర్పించాడు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. గుంటూరు జిల్లా తెనాలిలో ఈ ఘటన గురువారం జరిగింది. తెనాలికి చెందిన స్వాతి (38)కి, ప్రకాశం జిల్లా పుల్లలచెరువుకు చెందిన లారీ డ్రైవర్ కాకర్ల వెంకట కోటయ్యతో సుమారు 17 ఏళ్ల కిందట వివాహమైంది. తెనాలిలో నివాసం ఉంటున్న వీరికి ఇంటర్, తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. గతంలో స్వాతి పట్టణంలోని ఓ బ్యూటీ పార్లర్లో పని చేస్తూ అక్కడే బ్యూటీషియన్ కోర్సు నేర్చుకుంది. తొలుత తెనాలిలోని పాండురంగపేటలో ఉన్న వీరు ఇటీవల నాజరుపేటలో మరో అద్దె ఇంట్లో చేరారు. ప్రస్తుతం స్వాతి నందులపేట ఘంటావారివీధిలో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో స్వాతికి మరో యువకుడితో అక్రమ సంబంధం ఉందని వెంకట కోటయ్యకు అనుమానం ఏర్పడింది. భార్యతో తరచూ గొడవపడేవాడు. ఇటీవల ఇద్దరికీ ఘర్షణ జరగగా, స్వాతి పుట్టింటికి వెళ్లి పోయింది. కొద్దిరోజుల కిందట ఆమెను మళ్లీ తన వద్దకు తీసుకువచ్చిన వెంకట కోటయ్య తీరులో ఏమాత్రం మార్పు రాలేదు. భార్యపై మరింత అనుమానం పెంచుకుని వేధిస్తూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో గురువారం స్వాతి బ్యూటీ పార్లర్లో ఉండగా, మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వెంకట కోటయ్య వెళ్లి గొడవపడి కత్తితో ఆమె ముఖం, మెడపై విచక్షణారహితంగా దాడి చేశాడు. స్వాతి అక్కడికక్కడే మృతిచెందింది. వెంకట కోటయ్య ముందుగానే తెచ్చుకుని బయట ఉంచిన పూలు, పూలమాలలను రక్తపు మడుగులో పడి ఉన్న స్వాతి మృతదేహంపై వేసి నివాళి అర్పించాడు. అనంతరం తాము అద్దెకు ఉండే ఇంటి సమీపంలోని తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భార్యను హత్య చేసినట్లు చెప్పి లొంగిపోయాడు. రూరల్ పోలీసులు ఈ విషయాన్ని టూ టౌన్ పోలీసులకు తెలియజేయడంతో సీఐ ఎస్.వెంకట్రావు, ఎస్ఐ శివరామయ్య తమ సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే స్వాతి హత్య జరిగినట్లు తెలుస్తోందని సీఐ తెలిపారు. తన కుమార్తె స్వాతిపై అనుమానంతోనే భర్త కోటయ్య ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ఆమె తండ్రి వెంకటేశ్వరరావు చెప్పారు. ఈ విషయమై ఇద్దరూ తరచూ గొడవపడేవారని తెలిపారు. -
నేటి నుంచి 15వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం
తెనాలి: గుంటూరు జిల్లా తెనాలిలో ఈ నెల 14వ తేదీ నుంచి 15వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం నిర్వహించనున్నట్లు చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ–తెనాలి అధ్యక్షుడు డాక్టర్ రావిపాటి వీరనారాయణ, కార్యదర్శి బొల్లిముంత కృష్ణ తెలిపారు. స్థానిక వివేక పబ్లిక్ స్కూలులో ఆదివారం వారు విలేకరులతో మాట్లాడుతూ చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో తెనాలి మున్సిపాలిటీ, వివేక విద్యాసంస్థల సౌజన్యంతో పది రోజులపాటు ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు చెప్పారు. పది రోజులు వివిధ దేశాల బాలల సినిమాలను ప్రదర్శిస్తామన్నారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో సోమవారం ఉదయం 10 గంటలకు బాలల చిత్రోత్సవం ప్రారంభమవుతుందని, అనంతరం 11 గంటలకు చైనా చిత్రం ‘లిటిల్ బిగ్ సోల్జర్’, ఒంటి గంటకు దక్షిణ కొరియా చిత్రం ‘డాగ్స్’, మధ్యాహ్నం 3 గంటలకు హిందీ సినిమా ‘హమ్ ఔర్ ఆప్’ ప్రదర్శిస్తామని తెలిపారు. రెండో రోజు మంగళవారం బుర్రిపాలెంరోడ్డులోని వివేకానంద సెంట్రల్ స్కూలులో ప్రదర్శనలు ఉంటాయని చెప్పారు. పట్టణంలోని మున్సిపల్, సమీప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్థుల కోసం వారి స్కూళ్లలోనే చిత్రాలను ప్రదర్శిస్తామని పేర్కొన్నారు. జిల్లాలోని ఏ పాఠశాల నుంచి అయినా ఆహ్వానం వస్తే, అక్కడకి వెళ్లి ఉచితంగా బాలల చిత్రాలను ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఆసక్తిగల ఉన్నత పాఠశాలల యాజమాన్యాలు 9959431235 నంబరులో సంప్రదించాలని కోరారు. -
రూ. 10వడ్డీ అంటే.. బయట ఐదుకు తీసుకొచ్చి మరీ ఇచ్చారు.. అప్పుడే అసలు కథ..
సాక్షి, గుంటూరు(తెనాలి): అధిక వడ్డీ ఆశ చూపి పలువురిని మోసగించిన కేసులో ఎట్టకేలకు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మండూరు గ్రామానికి చెందిన రెడ్డి వెంకాయమ్మ అలియాస్ రెడ్డి లత, ఆమె భర్త వెంకట శివకృష్ణారావుతోపాటు షేక్ హసీనా అనే మహిళను చుండూరు పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం వీరికి రిమాండ్ విధించింది. వీరిపై సెక్షన్–420, డిపాజిటర్స్ యాక్ట్, చిట్‌ఫండ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్టు చుండూరు సీఐ కళ్యాణ్‌రాజు వెల్లడించారు. అసలేం జరిగిందంటే.. మండూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కోడలు, రియల్టరైన రెడ్డి లత పెట్టుబడి కోసం అదే గ్రామానికి చెందిన ఉయ్యూరు శ్రీలత అనే మహిళకు 20 శాతం వాటా ఆశచూపింది. శ్రీలత గ్రామంలో తనకు తెలిసిన వారిని ఆశ్రయించి వారికి రూ.10 వడ్డీ ఇస్తానని చెప్పి కొందరి నుంచి రూ.లక్షల డబ్బు వసూలు చేసింది. షేక్ హసీనా అనే మహిళ తన ఇంటి సమీపంలోని సగర కులానికి చెందిన మహిళలకు రూ.5 వడ్డీ ఆశ చూపి మరికొన్ని రూ.లక్షలు సమకూర్చింది. మొత్తం కలిపి శ్రీలత చేతులమీదుగా రూ.1.83 కోట్ల వరకు రెడ్డి లతకు అప్పగించినట్టు బాధితులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: (Hyderabad: పాతబస్తీలోని కాలాపత్తర్‌లో దారుణం.. వీడియోకాల్‌లో..) కేవలం శ్రీలత నుంచి మాత్రమే మొత్తం డబ్బులు తీసుకున్న రెడ్డి లత ఆ తర్వాత ప్లేటు ఫిరాయించింది. గొల్లుమన్న బాధితులు పురుగుమందు డబ్బాలతో ధర్నాకు దిగారు. నోట్లు, పత్రాలు లేకుండా ఇచ్చిన అప్పులు కావటంతో వీరి మొర ఎవరూ ఆలకించలేదు. ఈ నేపథ్యంలో ఈనెల 4న ఉయ్యూరు శ్రీలత పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అప్పటికే ఈ కేసు విషయంలో పోలీసులు కూపీ లాగుతూ వచ్చారు. రెడ్డి లత, ఆమె భర్త వెంకట శివకృష్ణారావు హైదరాబాద్‌లో ఉంటున్న బంధువుకు కోటి రూపాయల వరకు బాకీ పడ్డారు. ఇటీవల ఆ బకాయిని తిరిగి చెల్లించినట్టు పోలీసులు గుర్తించారు. అలాగే కూచిపూడి లాకుల వద్ద కొంత స్థలాన్ని కూడా రెడ్డి లత కొన్నట్టు గుర్తించారు. కొద్దిరోజుల క్రితం ఆ స్థలాన్ని వేరొకరికి అమ్మేందుకు యత్నించగా, బాధితులు అక్కడకు వెళ్లి గుడిసెలు వేసుకుని ఆందోళన చేశారు. దీంతో కొనేందుకు వచ్చిన పార్టీ వెనక్కు వెళ్లిపోయింది. ఈ అమ్మకాలు, కొనుగోళ్లు అన్నీ బ్యాంకు లావాదేవీల ద్వారానే జరిగాయని తెలుసుకున్న పోలీసులు రెడ్డి లత, ఆమె భర్త వెంకట శివకృష్ణారావును, వడ్డీ ఆశతో ఈ మోసంలో పాత్రధారి అయిన హసీనాను అరెస్టు చేశారు. ఇదే కేసులో మరికొన్ని అరెస్టులు ఉంటాయని తెలుస్తోంది. ఈ కేసులో మొత్తం ఏడుగురు బాధితులు రూ.1.28 కోట్ల వరకు మోసపోయినట్టు సమాచారం. చదవండి: (మహిళా డాక్టర్ ఆత్మహత్య.. అదే కారణమా?.. మరేదైనానా?) -
ఎన్టీఆర్‌తో నటించేటప్పుడు విలువలు నేర్చుకున్నా
‘‘నేను చిన్నతనం నుంచి ఎన్టీఆర్‌గారిని ఆదర్శంగా తీసుకునేదాన్ని. ఆయనతో నటించేటప్పుడు క్రమశిక్షణ, సిన్సియారిటీ, అంకితభావం, నిబద్ధత, మాటతీరు.. వంటి విలువలు నేర్చుకున్నాను’’ అని సీనియర్ నటి ఎల్.విజయలక్ష్మి అన్నారు. దివంగత నటుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా తెనాలిలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఎన్టీఆర్ అవార్డు అందుకున్నారు ఎల్.విజయలక్ష్మి. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో ఆమెకు హీరో బాలకృష్ణ గౌరవ సత్కారం చేశారు. అనంతరం ఎల్.విజయలక్ష్మి మాట్లాడుతూ– ‘‘ఎంతో అభిమానంతో అమెరికా నుంచి నన్ను పిలిపించి గౌరవించడం చూస్తుంటే కళ్లు చెమర్చుతున్నాయి. ఇందుకు బాలకృష్ణ, ఆలపాటి రాజా, బుర్రా సాయిమాధవ్‌లకు థ్యాంక్స్. వివాహం అయ్యాక సినిమాలు మానేసి అమెరికా వెళ్లాను. అక్కడ సీఏ చదివానంటే ఎన్టీఆర్‌గారి స్ఫూర్తి వల్లే. రామానాయుడు, ఎన్టీఆర్‌గార్ల తరం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. మళ్లీ ఇలాంటి వేడుకలకు రావాలనుంది’’ అన్నారు. బాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘విజయలక్ష్మిగారు వందకుపైగా సినిమాల్లో నటిస్తే అందులో 60కి పైగా నాన్నగారితో నటించారు. ఆమె మహిళా సాధికారతకు ప్రతీక. ఆమె ఎక్కిన మెట్లను భావితరాలు ఆదర్శంగా తీసుకోవాలి’’ అన్నారు. ‘‘1964లో మా బేనర్లో(సురేశ్ ప్రొడక్షన్స్) నిర్మించిన ‘రాముడు భీముడు’ సినిమాలో విజయలక్ష్మిగారు నటించారు. అందులో ‘‘దేశమ్ము మారిందే..’ అనే సాంగ్ కోసం ఆమె ఎంత కష్టపడ్డారో నాన్నగారు (రామానాయుడు) చెబుతుండేవారు’’ అన్నారు నిర్మాత డి.సురేశ్ బాబు. ఈ వేడుకలో రచయిత పరుచూరి గోపాలకృష్ణ, దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, డైరెక్టర్ వైవీఎస్ చౌదరి, నిర్మాతలు సి.కల్యాణ్, ప్రసన్న కుమార్, బసిరెడ్డి, రామసత్యనారాయణ, జూబ్లీహిల్స్ మాజీ కార్పొరేటర్ ఖాజా సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఎల్. విజయలక్ష్మికి ఎన్టీఆర్ అవార్డు
అలనాటి అందాల తార, ప్రముఖ నర్తకి ఎల్. విజయలక్ష్మిని ఎన్టీఆర్ అవార్డు వరించింది. తెనాలిలో జరుగుతున్న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ నటించిన అన్ని సినిమాలు ఏడాది పాటు పెమ్మసాని (రామకృష్ణ) థియేటర్లో ప్రదర్శితమవుతున్నాయి. ఇక్కడ జరిగే కార్యక్రమంలో ప్రతి నెలా ఎన్టీఆర్ కుటుంబం నుండి ఒకరు పాల్గొంటారు. ఎన్టీఆర్‌తో పనిచేసిన ఒక లెజెండరీ పర్సన్‌కు ప్రతి నెలా అవార్డు, గోల్డ్ మెడల్ ప్రదానం చేస్తారు. అక్టోబర్ నెలకిగాను ఎన్టీఆర్ పురస్కారానికి ఎల్. విజయలక్ష్మి ఎంపికయ్యారు. బాలనటిగా ‘సిపాయి కూతురు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఆమె ‘జగదేకవీరుని కథ, ఆరాధన, గుండమ్మ కథ, నర్తనశాల, పూజా ఫలం, బొబ్బిలి యుద్ధం, రాముడు–భీముడు, భక్త ప్రహ్లాద’ వంటి ఎన్నో సినిమాల్లో నటించారు. ముఖ్యంగా ఎన్టీఆర్‌తో సుమారు 15 సినిమాలకు పైగా నటించారు విజయలక్ష్మి. 50 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరంగా అమెరికాలో స్థిరపడ్డారామె. ఈ నెల 30న తెనాలిలో జరిగే కార్యక్రమంలో అవార్డు అందుకోవడానికి ఆమె ఇక్కడికి రానున్నారు. కాగా ‘ఎన్టీఆర్ శతజయంతి’ కార్యక్రమానికి గౌరవ అధ్యక్షుడిగా నందమూరి బాలకృష్ణ, అధ్యక్షుడిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బుర్రా సాయిమాధవ్ వ్యవహరిస్తున్నారు. -
ఆసియాలోనే అతి పిన్నవయసు డేటా సైంటిస్ట్
అతనో అద్భుతం.. అసాధ్యాలను సుసాధ్యం చేయగల బాలనగధీరుడు. అంతర్జాతీయ స్థాయిలో అసమాన ప్రతిభాపాటవాలను చాటి అబ్బురపరిచిన జ్ఞానయోధుడు.. 15 ఏళ్లకే ఆసియాలోనే అతిపిన్న వయసున్న డేటా సైంటిస్టుగా గుర్తింపు పొందిన శక్తిమాన్.. తెలంగాణ ప్రభుత్వమూ అతని మహత్తర ప్రజ్ఞకు ముగ్ధురాలైంది. భూకంపాల రాకను ముందుగానే గుర్తించే ప్రాజెక్టు రూపకల్పన బాధ్యతను అప్పగించింది. ఈ బృహత్తర ఆవిష్కరణను భుజానికెత్తుకున్న బాలమేధావి ఎవరో కాదు.. పిల్లి సిద్ధార్థ శ్రీవాత్సవ్. స్వస్థలం తెనాలి. తెనాలి: ప్రియ మానస, రాజ్‌కుమార్ దంపతుల ముద్దుల కొడుకు పిల్లి సిద్ధార్థ శ్రీవాత్సవ్. సిద్ధార్థకు చిన్ననాటి నుంచి కంప్యూటర్ అంటే మక్కువ ఎక్కువ. అతడి ఆసక్తిని గుర్తించిన తండ్రి నాలుగో తరగతినుంచే కంప్యూటర్ బేసిక్స్, టెక్నాలజీ, లాంగ్వేజెస్‌ను నేర్పిస్తూ వచ్చారు. నాలుగైదేళ్లు గడిచేసరికి సిద్ధార్థకు కంప్యూటర్‌పై పట్టు చిక్కింది. అడ్వాన్స్ లెవెల్‌కు చేరుకోగలిగాడు. సొంతంగా ఆన్లైన్లో కొన్ని నమూనా ప్రాజెక్టులు చేశాడు. ఉద్యోగం చేస్తానని తండ్రిని కోరాడు. కానీ ఆయన పెద్దగా పట్టించుకోలేదు. కంప్యూటర్ సంస్థలో అతడిని చేర్చాలని తీసుకువెళ్లగా బాలుడన్న కారణంతో తిరస్కరించారు. చేసేదిలేక రాజ్‌కుమార్ ఆన్లైన్ కోర్సులను కొనిచ్చారు. ఆ వీడియోలు చూస్తూ స్వయం అధ్యయనం ప్రారంభించిన సిద్ధార్థ వాటిపై కమాండ్ సాధించాడు. సడలని సంకల్పం ఉద్యోగం చేయడం భారత్‌లో సాధ్యం కాదని తండ్రి నిరాశపరిచినా సిద్ధార్థ పట్టు సడలలేదు. స్వయంగా రెజ్యూమ్ తయారుచేసుకుని ప్రముఖ కంపెనీలకు పంపాడు. కొన్ని కంపెనీలు ఫోన్లో సంప్రదించాయి. అతడి కంప్యూటర్ పరిజ్ఞానానికి అబ్బురపడినా వయసు తెలిసి మిన్నకున్నాయి. ఈ విషయం మోంటెగ్న్ కంపెనీ సీఈఓ వరకు వెళ్లడంతో ఆయన సిద్ధార్థను స్వయంగా పిలిపించుకుని సుదీర్ఘ ఇంటర్వ్యూ చేశారు. ‘నీతో వండర్స్ చేయిస్తా’నంటూ ఉద్యోగ ఆఫర్ ఇచ్చారు. చదువుకు ఆటంకం కలగరాదన్న తండ్రి షరతుతో వారంలో మూడురోజుల ఉద్యోగానికి సిద్ధార్థ ఓకే చేశాడు. పాఠశాల యాజమాన్యం సహకారంతో ఏడో తరగతిలోనే ఐటీ ఉద్యోగిగా నెలకు రూ.25 వేల జీతంతో చేరాడు. ప్రస్తుతం ఇనిఫినిటీ లెర్న్ అనే సంస్థలో డేటా సైంటిస్ట్‌గా నెలకు రూ.45 వేల వేతనం అందుకుంటున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో వినూత్నమైన గేమ్ డిజైనింగ్‌లో కృషి చేస్తున్నాడు. చదువుకు ఆటంకం కలగకుండానే.. స్వస్థలం తెనాలి అయినా సిద్ధార్థ కుటుంబం హైదరాబాద్‌లోనే ఉంటోంది. సిద్ధార్థ హైదరాబాద్‌లోని శ్రీచైతన్యలో పదోతరగతి చదువుతున్నాడు. వారంలో మూడురోజులు స్కూలుకు వెళ్లే అతను మూడురోజులు ‘ఇన్ఫినిటీ లెర్న్’ ఐటీ సంస్థలో ఉద్యోగానికి వెళ్తాడు. అంతేకాకుండా అమెరికన్ కంపెనీ ‘రైట్ ఛాయిస్’తరపున అక్కడి విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా కోడింగ్ క్లాసులనూ నిర్వహిస్తున్నాడు. అందుకే సిద్ధార్థను బైజూస్ కంపెనీ ‘యంగ్ జీనియస్’ అవార్డుతో సత్కరించింది. బృహత్తర బాధ్యత ఈ నేపథ్యంలో సిద్ధార్థకు తెలంగాణ ప్రభుత్వం బృహత్తర బాధ్యతను అప్పగించింది. భూకంపాల రాకను ముందుగానే గుర్తించే కేంద్రప్రభుత్వ రీసెర్చ్ ప్రాజెక్టుకు రూపకల్పన చేయాలని కోరింది. తెలంగాణ ఐటీ మంత్రిత్వశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జయేష్ రంజన్ స్వయంగా సిద్ధార్థను ఆహ్వానించి ఈ ప్రాజెక్టును అప్పగించారు. సిద్ధార్థ పరిశోధనలు ఫలిస్తే ఆ పరిజ్ఞానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తారని అతడి తండ్రి రాజ్‌కుమార్ ‘సాక్షి’తో చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలో ఈ ప్రాజెక్టు రీసెర్చ్ కొనసాగిస్తున్న సిద్ధార్థ.. మరోవైపు కోడింగ్ క్లాసులు చెబుతూ ఉద్యోగం చేస్తూ బాగానే ఆర్జిస్తున్నాడు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌పైనా ఫ్రీలాన్సర్‌గా చేస్తున్నాడు. (క్లిక్: పుష్పపై ‘ఫైర్’.. స్మగ్లర్ వీరప్పన్‌కే ముచ్చెమటలు పట్టించి..) లక్ష్యాల సాధనకు ప్రతిక్షణం కష్టపడతా.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోపాటు జుకర్ బర్గ్, సుందర్ పిచాయ్‌ల జీవితచరిత్రలు, బిల్‌గేట్స్ మాటలు, స్టీవ్‌జాబ్స్ పనితీరు నాకు ఆదర్శం. వారి ప్రేరణతోనే నా కలల సౌధాన్ని నిర్మించుకుంటున్నా. ప్రపంచ టాప్ ఫైవ్‌లోని గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం కంపెనీల్లో రీసెర్చ్ అండ్ అనాలసిస్ విభాగాల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టుల్లో భాగస్వామిని కావాలని ఉంది. మంచి గేమ్ డిజైన్ చేయాలనేది నా లక్ష్యం. ప్రజోపయోగ ప్రాజెక్టులు చేయాలనేది ధ్యేయం. వీలైతే మైక్రోసాఫ్ట్ లాంటి అప్లికేషన్ రూపొందించాలని ఉంది. నా లక్ష్యాల సాధనకు ప్రతిక్షణం కష్టపడతా. – పిల్లి సిద్ధార్థ శ్రీవాత్సవ్, డేటా సైంటిస్టు -
రక్తక్షేత్రం వెలుగులో దళిత ఉద్యమ ప్రజ్వలనం
కారంచేడు తర్వాత దక్షిణ భారతంలోనే పేర్కొనదగిన ఉద్యమం చుండూరు దళిత ఉద్యమం. గుంటూరు జిల్లాలో విజయవాడ – చెన్నై రైలు మార్గంలో ఉన్న ఊరు చుండూరు. 1991 ఆగస్ట్ 6న దళితులను ఆధిపత్య కులాల వారు ఊచకోత కోసిన అమానవీయ ఘటన జరిగింది. అదే చుండూరు ఘటనగా ప్రసిద్ధి చెందింది. తెనాలి ప్రాంతంలో హరిత విప్లవం ద్వారా భూములు సస్యశ్యామలం అయినాయి. దళిత వాడ కూడా బలంగా ఉంది. మాలలు, మాదిగలు కలిసి సుమారు 500 కుటుంబాలు కాపురాలు ఉంటున్నాయి. వీరిలో కారంచేడు ఉద్యమం తర్వాత సామాజిక చైతన్యం వచ్చింది. ప్రతి ఇంట్లో చదువుకున్న పిల్లాడో, పిల్లో ఉన్నారు. కొందరు ఉద్యోగులూ ఉన్నారు. ఈ చైతన్యానికి ఆధిపత్య కులాలవారు తట్టుకోలేక పోయారు. ముఖ్యంగా హైస్కూళ్ళలో ఎస్సీ విద్యార్థులు పక్కపక్క బెంచీల్లో కూర్చోవడం, విద్యా సహకారాన్ని పొందడం... ఇవన్నీ అగ్రకుల గ్రామాల్లో చర్చనీయ అంశాలయ్యాయి. కొన్ని చోట్ల ప్రేమ ఘట్టాలు జరగటం కూడా విద్వేషం రావడానికి మూల కారణం అయ్యింది. ఫలితంగా 8 మంది దళితులు ఆధిపత్య కులాల వారి దాడిలో మరణించారు. ఆ తర్వాత జరిగిన ఉద్యమంలో మరో ఇద్దరు దళితులు ప్రాణాలు కోల్పోయారు. వీరందరినీ ఊరు నడి బొడ్డున ‘రక్త క్షేత్రం’లో పాతి పెట్టాం. చుండూరు బాధితుల పక్షాన జరిగిన ఉద్యమానికి నేను నాయకత్వం వహించడం వలన అంబేడ్కర్ ఆలోచనల్ని జాతీయస్థాయి పోరాటంలో మమేకం చేసే అవకాశం కలిగింది. ఉద్యమం ముఖ్యంగా ఢిల్లీ అంబేడ్కర్ భవన్లో కొన్నివందల మంది ఆశ్రయం తీసుకుని, అక్కడ నుంచి బయలుదేరి బోట్ క్లబ్ వరకు 13 కిలోమీటర్లు ర్యాలీగా వచ్చి సాయంత్రం వరకూ ధర్నా నిర్వహించాం. 1991 అక్టోబర్ 2న గాంధీ జయంతి నాడు ఢిల్లీ కోటను ముట్టడించాం. ఢిల్లీలోని 120 మంది ఎస్సీ, ఎస్టీ ఎంపీల ఫోరం బలపరచడంతో ఈ ఉద్యమానికి బలం చేకూరింది. మాజీ హోం మినిస్టర్ బూటా సింగ్, ప్రతిపక్షంలో కీలక పాత్ర పోషిస్తున్న పార్లమెంట్ సభ్యులు రామ్ విలాస్ పాశ్వాన్, ప్రధాన మంత్రి పీవీ నరసింహారావుకు సమస్య పట్ల అవగాహన కలిగించడంలో ముఖ్య పాత్ర వహించారు. అక్టోబర్ నాలుగవ తేదీ ప్రధానమంత్రి – ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. బాధిత కుటుంబాలతో పాటు నేనూ చర్చలకు హాజరయ్యాను. చర్చలు చుండూరు కేసు విచారణకు, దాడి జరిగిన చుండూరులోనే ప్రత్యేక కోర్టు పెట్టాలనేది ముఖ్యమైన డిమాండ్. 440 బాధిత కుటుంబాలకూ ఇళ్ళ స్థలంతో సహా ఒక ఇల్లు నిర్మించడం, ప్రతి కుటుంబానికీ ఒక ఎకరం పొలం ఇవ్వడం, బాధిత కుటుంబాలలో పదవ తరగతి ఉత్తీర్ణులైన వాళ్ళందరికీ ఉద్యోగాలు, చనిపోయిన కుటుంబాలలో 18 సంవత్సరాలు వయసు దాటిన వారందరికీ ఉద్యోగాలు ఇవ్వడం, చుండూరులో ఒక రెసిడెన్షియల్ హైస్కూల్ ఏర్పాటు, 150 మంది ముద్దాయిలందరనీ అరెస్ట్ చేయడం వంటివి బాధితులు ప్రధానమంత్రిని చేసిన మరికొన్ని డిమాండ్లు. (క్లిక్: పై కోర్టుల్లోనూ రిజర్వేషన్లు ఉండాలి) చుండూరు ఉద్యమం భారతదేశ దళిత ఉద్యమానికి చుక్కాని. 111 మంది ఎస్సీ, ఎస్టీ ఎంపీలని ఏకం చేసి రాష్ట్రపతి భవన్‌కు దళిత ఉద్యమం ర్యాలీ చేయించిన మహోన్నత చారిత్రక ఘటన. అప్పటి రాష్ట్రపతి వెంకట్రామన్ ప్రత్యేక కోర్టు నివేదనను తిరస్కరించడంతో... రాష్ట్రపతి దళితుడు కావాలి అనే నినాదం చేయడం ద్వారా ఇప్పుడు ఒక నారాయణన్, ఒక గోవింద్, ఒక ద్రౌపదీ ముర్మూలు ఆ పీఠాన్ని అధిష్టించడానికి అవకాశం కల్పించిన ఉద్యమం. ‘ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ ఎట్రాసిటీ యాక్ట్–1989’ ననుసరించి చుండూరులోనే ప్రత్యేక కోర్టును సాధించిన ఉద్యమం. కమ్యూనిస్టులూ కుల సమస్య గురించి చర్చించేలా చేసిన ఉద్యమం. మూడు దశాబ్దాల తర్వాత ‘రక్త క్షేత్రం’ ఆగస్ట్ 6ను దళిత బహుజన మైనారిటీల రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా పోరాడే బాధ్యతను మనకు అప్పజెబుతున్న రోజుగా భావిద్దాం. అంబేడ్కర్ మార్గంలో విజయ సోపానాన్ని అధిరోహించేద్దాం. (క్లిక్: ఆంగ్ల సహన పాఠం నేర్చుకుందామా?) - డాక్టర్ కత్తి పద్మారావు సామాజిక ఉద్యమకారుడు (చుండూరు ఘటనకు మూడు దశాబ్దాలు) -
పుంగనూరు పొట్టి ఆవు@ రూ.4.10 లక్షలు
సాక్షి, గుంటూరు: ప్రపంచంలోనే అరుదైన పుంగనూరు జాతి పొట్టి ఆవును రూ.4.10 లక్షలకు హరిద్వార్‌లోని బాబా రామ్‌దేవ్ ఆశ్రమం కొనుగోలు చేసింది. తెనాలి పట్టణంలోని రామలింగేశ్వపేటకు చెందిన కంచర్ల శివయ్య దేశవాళీ ఆవులను పెంచుతున్నారు. ఆయన దగ్గర ఒంగోలు, పుంగనూరు, కపిల, సాహిల్, గిర్ జాతి ఆవులు వంద వరకు ఉన్నాయి. ఇందులోని ఒక పుంగనూరు ఆవును ప్రముఖ యోగాచార్యుడు, పతంజలి ఆయుర్వేద మందుల ఉత్పత్తిదారు అయిన బాబా రామ్‌దేవ్ ఆశ్రమం కొనుగోలు చేసింది. మూడున్నర సంవత్సరాల వయసు గల తొలి చూడి ఆవును రూ.4.10 లక్షలకు విక్రయించినట్టు శివయ్య కుమారుడు కంచర్ల శివకుమార్ వెల్లడించారు. ఆదివారం ఈ ఆవును ప్రత్యేక వ్యానులో హరిద్వార్ తరలించారు. చదవండి: సీజన్ వచ్చేసింది.. వణికించే వ్యాధుల జాబితా! లక్షణాలు, ముందు జాగ్రత్తలు -
వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌కు కంఠెవరం బాలిక
సాక్షి, తెనాలి: అనతికాలంలోనే అద్భుత విజయాలు సొంతం చేసుకుని అందరి ప్రశంసలూ అందుకుంటుంది కంఠెవరం బాలిక నాగం జ్ఞాన దివ్య. త్వరలో అంతర్జాతీయస్థాయిలోనూ మెరవనుంది. ఫిట్నెస్ కోసమని సాధన ప్రారంభించిన ఏడాదిలోనే టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో జరగనున్న వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది. పవర్ లిఫ్టింగ్ సబ్ జూనియర్ విభాగంలో సత్తా చాటనుంది. కుటుంబ నేపథ్యం ఇదీ.. గుంటూరు జిల్లా తెనాలి మండలం కఠెవరంలోని కేబుల్ ఆఫీసులో పనిచేసే నాగం వెంకటేశ్వరరావు, సుధారాణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె పూజిత బీటెక్ ఫస్టియర్ చదువుతోంది. రెండో కుమార్తె జ్ఞానదివ్య గత మార్చిలో ఇంటర్ పూర్తిచేసింది. దివ్య ఫిట్నెస్ కోసమని గ్రామంలోని మాతృశ్రీ వెయిట్‌లిఫ్టింగ్ అకాడమీలో ఏడాది కిందట చేరింది. నిత్యం సాధన చేసింది. ఆమె ఆసక్తిని గమనించిన ఫవర్ లిఫ్టర్ కొల్లిపర నాగశిరీష దివ్యను ప్రోత్సహించారు. పవర్‌లిఫ్టింగ్‌లో మెళకువలు నేర్పారు. నందివెలుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న నాగశిరీష పవర్‌లిఫ్టింగ్‌లో నేషనల్ గోల్డ్‌మెడలిస్ట్. తనలాగే జ్ఞాన దివ్య కూడా జాతీయస్థాయిలో సత్తా చాటాలనే ఉద్దేశంతో చక్కని తర్ఫీదునిచ్చారు. నాగశిరీష, ఆళ్ల వెంకటరెడ్డి, సోమిశెట్టి కోటేశ్వరరావు, సుభాన్‌వలి తదితర లిఫ్టర్ల సలహాలతో దివ్య అనేక పతకాలు సాధించింది. దివ్య విజయాలు ఇవీ.. ► 2021 నవంబరు 21, 22 తేదీల్లో జగ్గయ్యపేటలో జరిగిన స్టేట్‌మీట్ క్లాసిక్ కేటగిరీలో బంగారు పతకం. ► కేరళలోని అలప్పుజలో జరిగిన జాతీయస్థాయి 84 ప్లస్ కేటగిరీలో బంగారు పతకం. ► అనకాపల్లిలో జరిగిన దక్షిణ భారత పోటీల్లో ఎక్విప్డ్ విభాగంలో రజతం. ► మంగళగిరిలో గత జూన్ 9న జరిగిన స్టేట్‌మీట్ ఎక్విప్డ్‌లో 84 ప్లస్ విభాగం స్క్వాడ్‌లో 187.5 కిలోలు, డెడ్‌లిఫ్ట్‌లో 160 కిలోలు, బెంచ్ ప్రెస్‌లో 55 కిలోల బరువులనెత్తి బంగారు పతకాలు కైవసం. ► హైదరాబాద్‌లో ఈనెల 5న జరిగిన నేషనల్ సెలక్షన్స్‌లో స్క్వాడ్‌లో బంగారు, బెంచ్‌ప్రెస్, డెడ్‌లిఫ్ట్‌లో రజత పతకాలు. ► ఈనెల 16న విశాఖపట్టణంలో జరిగిన 9వ రాష్ట్రస్థాయి క్లాసిక్ పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో బంగారు పతకం. ► ఆగస్టు 12, 13, 14 తేదీల్లో కేరళలో జరగనున్న నేషనల్స్‌కు అర్హత. ► ఆగస్టు ఆఖరు నుంచి టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో జరిగే వరల్డ్ చాంపియన్‌షిప్‌కు ఎంపిక. (క్లిక్: సీసాల పడవ.. భలే ఉందిరా బుల్లోడా!) -
తెనాలిలో నాటికల పోటీలు; ఉత్తమ ప్రదర్శన ‘వృద్ధోపనిషత్’
సాక్షి, తెనాలి: వైఎస్ రాజశేఖరరెడ్డి నాటక కళాపరిషత్ ప్రథమ జాతీయస్థాయి నాటికల పోటీల్లో గంగోత్రి, పెదకాకాని సమాజం ప్రదర్శించిన వృద్ధోపనిషత్ నాటికకు ఉత్తమ ప్రదర్శన బహుమతి లభించింది. దీంతోపాటు మరో నాలుగు బహుమతుల్ని ఈ నాటిక కైవసం చేసుకోవడం విశేషం. స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రమ్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి నాటక కళాపరిషత్ ప్రథమ జాతీయస్థాయి ఆహ్వాన నాటికల పోటీల్లో విజేతలకు బుధవారం రాత్రి బహుమతుల ప్రదానం జరిగింది. గంగోత్రి, పెదకాకాని సమాజం ప్రదర్శించిన ‘వృద్ధోపనిషత్’ నాటిక ఉత్తమ ప్రదర్శనగా ఎంపికైంది. నటించి, దర్శకత్వం వహించిన ప్రసిద్ధ రంగస్థల/సినీ నటుడు నాయుడు గోపి ఉత్తమ సహాయ నటుడిగా, ఉత్తమ దర్శకుడిగా బహుమతులు అందుకున్నారు. సంగీతం అందించిన శ్రీరమణకూ బహుమతి లభించింది. నటుడు ఎన్.సూర్యకు జ్యూరీ బహుమతి వచ్చింది. ► అరవింద ఆర్ట్స్, తాడేపల్లి వారి ‘స్వర్గానికి వంతెన’ నాటిక కూడా పోటాపోటీగా బహుమతుల్ని కైవసం చేసుకుంది. ఉత్తమ ద్వితీయ ప్రదర్శన బహుమతితోపాటు నటించి, దర్శకత్వం వహించిన గంగోత్రి సాయి ఉత్తమ క్యారెక్టర్ నటుడు బహుమతిని గెలుచుకున్నారు. ఉత్తమ రచన బహుమతిని సుప్రసిద్ధ కథ, నాటక రచయిత వల్లూరు శివప్రసాద్‌కు బహూకరించారు. ఉత్తమ ఆహార్యం బహుమతి థామస్‌కు, జ్యూరీ బహుమతి సత్యనారాయణకు లభించాయి. ► కళాంజలి, హైదరాబాద్ వారి ‘మనిషి మంచోడే’ నాటిక ఉత్తమ తృతీయ ప్రదర్శనగా నిలిచింది. శర్వాణి గ్రామీణ గిరిజన సాంస్కృతిక సేవాసంఘం, శ్రీకాకుళం, బొరివంక వారి ‘ది డెత్ ఆఫ్ మేనీటర్’ నాటికలో టైగర్ రాజు పాత్రధారి బెందాళం శోభన్‌బాబు ఉత్తమ నటుడు బహుమతిని గెలిచారు. ► హర్ష క్రియేషన్స్, విజయవాడ వారి ‘అగ్నిసాక్షి’ నాటికలో ఆమనిగా నటించిన అమృతవర్షిణి ఉత్తమ నటి బహుమతిని అందుకున్నారు. స్నేహ ఆర్ట్స్, వింజనంపాడు వారి ‘కొండంత అండ’ నాటికలో రాంబాబు పాత్రధారి నెమలకింటి వెంకటరమణ ఉత్తమ విలన్ బహుమతిని, ‘మనిషి మంచోడే’ నాటికలో టైగర్ బాలు పాత్రధారి గుంటూరు చలపతి ఉత్తమ హాస్యనటుడు బహుమతిని అందుకున్నారు. ‘ది డెత్ ఆఫ్ మేనీటర్’ నాటికకు ఉత్తమ రంగాలంకరణ బహుమతిని రమణ స్వీకరించారు. న్యాయనిర్ణేతలుగా ఎన్.రవీంద్రారెడ్డి, ఎం.రాంబాబు, ఎ.నర్సిరెడ్డి వ్యవహరించారు. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖలేదా నసీమ్, ఇతర అతిథులు బహుమతుల్ని ప్రదానం చేశారు. (చదవండి: జైహింద్ స్పెషల్: కోటప్పకొండ దొమ్మీ) -
షాకింగ్ వీడియో: తెనాలిలో కారు బీభత్సం
సాక్షి, గుంటూరు: జిల్లాలోని తెనాలిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. హై స్పీడ్‌లో ఉన్న కారు అదుపు తప్పి.. పట్టణంలోని టెలిఫోన్ ఎక్స్చేంజ్ రోడ్డు పక్కన రిక్షాలు మరమ్మతులు చేస్తున్న ముగ్గురు వ్యక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కారు కింద పడి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికులు, పోలీసులు వెంటనే తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, తెనాలిలోని ఐతానగర్‌కు చెందిన ఇద్దరు మైనర్లు కారు నడిపినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో, వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
దర్శకుడు శంకర్‌తో ఒక్క ఫొటో దిగాలనుకున్నా
సాక్షి, గుంటూరు(తెనాలి): సాయిమాధవ్ బుర్రా.. తెలుగు సినిమాకు స్టార్ రైటర్. లెజండరీ దర్శకుల చిత్రాలెన్నింటికో తన మాటలతో వన్నెలద్దెన రచయిత. ఆయన రాసిన మాటలు బాక్సాఫీసు వద్ద తూటాల్లా పేలడమే కాదు.. ప్రజల నోళ్లల్లో నిత్యం నానుతున్నాయి. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ విజయానందంలో ఉన్న సాయిమాధవ్ సుప్రసిద్ధ దర్శకుడు శంకర్ సినిమాతోపాటు నటుడు, దర్శకుడు అర్జున్ తొలిసారిగా తెలుగులో తీస్తున్న సినిమాకు రచయితగా పనిచేస్తున్నారు. సాయిమాధవ్ స్వస్థలం తెనాలి అన్న విషయం తెలిసిందే. ఏటా ఆయన ఇక్కడ జాతీయస్థాయి సాంఘిక, పద్యనాటక పోటీలను నిర్వహిస్తారు. ప్రస్తుతం ఎన్టీఆర్ శత జయంతి మహోత్సవాలను జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో కొద్దిసేపు ముచ్చటించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ►‘జెంటిల్మెన్’ చూశాక దర్శకుడు శంకర్‌ను ఒక్కసారైనా కలిసి ఫొటో దిగితే చాలనుకున్నాను. తెలుగులో తొలిసారిగా ఆయన తీస్తున్న సినిమాకు సంభాషణలు రాస్తానని ఊహించలేదు. జరుగుతోంది. సింపుల్‌గా ఉండే గొప్ప మనిషి శంకర్. అర్జున్ తన కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్గా తెలుగులో తీస్తున్న మొదటి సినిమాకు అవకాశం రావటం సంతోషం. ►ప్రసిద్ధ దర్శకులతో విభిన్నమైన సినిమాలకు పనిచేస్తున్నందుకు గర్వపడటం లేదు. వారి నుంచి కొత్త విషయాలు తెలుసుకోవచ్చని సంతోషిస్తున్నా. క్రిష్, రాజమౌళి దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఇప్పుడు శంకర్ దగ్గర మరికొన్ని నేర్చుకున్నా. అర్జున్ సినిమా స్క్రిప్టు అద్భుతం. చదవండి: (విజయ్ దేవరకొండ ఫ్యాన్ గర్ల్.. వీపుపై టాటూ.. వీడియో వైరల్) ►ఏ సినిమాకైనా బడ్జెట్‌ను కథ నిర్ణయిస్తుంది. సంసారం సాగరం సినిమాకు భారీ బడ్జెట్ అవసరముండదు. రాజమౌళి, శంకర్ కథలకు బడ్జెట్ ఎక్కువ. నా వరకు కథ, ప్రొడక్షన్ హౌస్, రెమ్యూనరేషను ముఖ్యం. ఇటీవల ఆకాశవాణి, గమనం సినిమాలకు రాశాను. కథలు నచ్చాయి. చేశాను. కమ ర్షియల్‌గా ఆలోచిస్తే అలాంటి సినిమాలు తీయరు. అలాంటి ప్రొడక్షన్స్‌లో పనిచేయటం నాకు అవసరం. స్వార్థమే. చిన్న సినిమా చేస్తే త్యాగాలు చేసినట్టేమీ కాదు. నేను రాసే కథలూ త్వరలో వెండితెరపై రాబోతున్నాయి. ►చిన్ననాటి నుంచి నాటకరంగంతో అనుబంధముంది. తల్లిదండ్రులు నాటక కళాకారులే. హైస్కూలు రోజుల్లోనే ముఖానికి రంగేసుకున్నా. బుల్లితెరకు రచనలు చేయడం సినిమా అవకాశాలు తెచ్చిపెట్టింది. నాటకానికి చేతనైనంత చేయాలనే కళల కాణాచి పేరుతో జాతీయస్థాయి నాటకోత్సవాలను జరుపుతున్నాం. భారీ పారితోషికాలతో వీణా అవార్డులు ఇస్తున్నాం. ►నేను ఎన్టీఆర్ ఆరాధకుణ్ణి. అందుకే తెనాలిలో ఆయన శతజయంతి మహోత్సవాలను ఏడాదిపాటు నిర్వహిస్తున్నా. వారంలో ఐదురోజులు ఎన్టీఆర్ సినిమాలను ఉచితంగా ప్రదర్శిస్తున్నాం. వారాంతాల్లో సదస్సులు, ఎన్టీఆర్ పేరుతో రంగస్థల, సినిమా అవార్డులను బహూకరిస్తున్నాం. ఎన్టీఆర్ రాజకీయాలకు అతీతమైన వ్యక్తి. నేను స్వతహాగా కమ్యూనిస్టును. -
తెనాలిలో డాక్టర్ వైఎస్సార్ కళాపరిషత్ ఆవిర్భావం
తెనాలి: దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేరుతో తెనాలిలో కళాపరిషత్ ఏర్పాటైంది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కళాపరిషత్ ఆధ్వర్యంలో జూలై 10–13వ తేదీ వరకు ప్రథమ జాతీయస్థాయి నాటికల పోటీలను ప్రఖ్య చిల్డ్రన్ ఆర్ట్స్ అకాడమీ, పట్టణ రంగస్థల కళాకారుల సంఘం సంయుక్తంగా నిర్వహించనున్నాయి. దీనికి సంబంధించిన వివరాలను తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం అధ్యక్షుడు ఎం.సత్యనారాయణశెట్టి బుధవారం వెల్లడించారు. నాటిక పోటీల ప్రారంభ సభకు మంత్రులు రోజా, అంబటి రాంబాబు, విడదల రజిని, డాక్టర్ మేరుగ నాగార్జున, స్థానిక ఎమ్మెల్యే హాజరవుతారని చెప్పారు. అదే రోజు 2019, 2020, 2021 సంవత్సరాలకుగాను వేదగంగోత్రి ప్రసాద్, జొన్నల పేరిరెడ్డి, బొమ్మారెడ్డి ప్రభాకరరెడ్డికి డాక్టర్ వైఎస్సార్ జీవన సాఫల్య పురస్కారాలను ప్రదానం చేస్తామని చెప్పారు. 13న పోతవఝుల పురుషోత్తమశర్మకు 2022 సంవత్సరానికి ఇదే పురస్కారాన్ని బహూకరిస్తామని తెలిపారు. కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి గరికపాటి సుబ్బారావు మాట్లాడుతూ..10న ‘స్వర్గానికి వంతెన, ‘వృద్ధోపనిషత్ నాటికలను, 11న ‘ది డెత్ ఆఫ్ ఏ మేనిటర్, ‘అజ్ఞాత వాసం’ నాటికలను, 12న ‘ఐదు పదులు, ‘మనిషి మంచోడే నాటికలను, 13న ‘అగ్నిసాక్షి, ‘బహురూపి’ నాటికలను ప్రదర్శించనున్నట్లు వివరించారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఈ పోటీలు జరుగుతాయని చెప్పారు. -
డైనోసార్ ‘గుడ్డు’రట్టు.. నేటి పక్షుల పూర్వీకులు నాటి రాకాసి బల్లులేనట..!
సాక్షి, గుంటూరు: మాంసాహార రాకాసి బల్లుల (డైనోసార్లు) గ్రూపు నుంచి పక్షులు పరిణామం చెందాయనే భావన ఇప్పటి వరకు శాస్త్ర లోకంలో ఉంది. అయితే వాటి పునరుత్పత్తి గురించి ఎవరికీ పెద్దగా అవగాహన లేదు. ఈ నేపథ్యంలో తాజాగా సౌరోపాడ్ (వెజిటేరియన్) డైనోసార్లు, పక్షులకు పునరుత్పత్తి ప్రక్రియ దగ్గరగా ఉందని తేల్చారు. ఈ మేరకు సరీసృపాల స్వర్ణయుగంగా పేర్కొనే క్రిటేషియస్ యుగం (దాదాపు వంద మిలియన్ ఏళ్లకు పూర్వం) నాటి టైటనోసారిక్ డైనోసార్ల శిలాజీకరణం చెందిన గుడ్లను తెనాలికి చెందిన పాలీయాంథాలజీ శాస్త్రవేత్త డాక్టర్ గుంటుపల్లి వీఆర్ ప్రసాద్ కనిపెట్టారు. ఆయన పరిశోధన పత్రం జూన్ 7న నేచర్ గ్రూప్ జర్నల్ సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో ప్రచురితమైంది. టైటనోసారిక్ డైనోసార్ల గూడు భారతదేశంలో విస్తృతంగా.. అతిపెద్ద జంతువుల్లో సౌరోపాడ్ కుటుంబానికి చెందిన డైనోసార్ ఒకటి. తీసుకునే ఆహారాన్ని బట్టి వీటిని వెజిటేరియన్స్‌గా భావిస్తారు. క్రిటేషియస్ యుగంలో ఇవి భారతదేశంలో విస్తృతంగా ఉండేవి. సరీసృపాల్లో పునరుత్పత్తి కోశంలో ఒకేచోట గుడ్లు వస్తాయి. గర్భాశయంలో గుడ్డు లోపల పొర, పైన పెంకు తయారవుతాయి. ఒకేసారి అన్ని గుడ్లు విడుదలవుతాయి. పక్షుల్లో ఇందుకు భిన్నం. పునరుత్పత్తి నాలుగు భాగాలుగా విభజితమై ఉంటుంది. గుడ్ల నుంచి పైన పెంకు తయారీ వరకు నాలుగు దశలుగా జరిగి గుడ్డు ఒకేసారి విడుదలవుతుంది. పక్షుల్లో కొన్ని ప్రతికూల పరిస్థితులు, ఒత్తిడి ఫలితంగా ఒక్కోసారి గుడ్డు లోపల గుడ్లు తయారవుతుంటాయి. గుడ్డు లోపల గుడ్డు గుడ్డు లోపల గుడ్లు.. సరీసృపాలు అన్నింటిలానే ఆ జాతిలోని డైనోసార్లలోనూ పునరుత్పత్తి ఒకేలా ఉంటుందనే భావన సరికాదని ప్రొఫెసర్ గుంటుపల్లి వీఆర్ ప్రసాద్ తన పరిశోధనలో తేల్చారు. పక్షుల్లో ఉన్నట్టుగానే డైనోసార్లలోనూ పునరుత్పత్తి ఉందని చెబుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లా పడ్లియాలో సౌరోపాడ్ డైనోసార్ల గూళ్లను, వాటిలో శిలాజీకరణం చెందిన లోపభూయిష్టమైన గుడ్లను ప్రొఫెసర్ ప్రసాద్ గుర్తించారు. పక్షుల గుడ్ల తరహాలో వీటిలో గుడ్డు లోపల గుడ్డును కనుగొన్నారు. సరీసృపాలు, పక్షుల గుడ్లలో ఎక్కువ పొరలు ఉండటం సహజమే అయి నా, గుడ్డు లోపల గుడ్లు ఉంటాయనేది శాస్త్ర ప్రపంచానికి ఇంత వరకు తెలియదని ఆయన ‘సాక్షి’కి వివరించారు. పరిశోధనల అనంతరం ఈ శిలాజ అవశేషాలను పడ్లియా సమీపంలోని మధ్యప్రదేశ్ ప్రభుత్వ డైనోసార్ శిలాజ జాతీయ పార్కులో భద్రపరచినట్టు తెలిపారు. ఈ రకమైన పరిశోధన మనదేశంలో జరగడం ఇదే ప్రథమం. అందు లోనూ పరిశోధకుడు తెలుగు శాస్త్రవేత్త కావడం విశేషం. ఈ పరిశోధనలో ప్రొఫెసర్ ప్రసాద్‌తోపాటు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన పాలీయాంథాలజీ పరిశోధక విద్యార్థిని హర్ష ధిమాన్, మధ్యప్రదేశ్‌కు చెందిన విశాల్‌వర్మ పాలుపంచుకున్నారు. -
రెండంతస్తుల శోభ
తెనాలి: జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణాల్లో గుంటూరు జిల్లా తెనాలిలో సరికొత్త ప్రయోగం అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా అమలవుతున్న ఈ విధానంలో పునాదుల నుంచి గోడలతో సహా ఇళ్లను పటిష్టంగా నిర్మిస్తున్నారు. దీనివల్ల భవిష్యత్‌లో ప్రతి ఇంటిపైనా మరో రెండు అంతస్తులు (జీ+2) నిర్మించుకునే అవకాశం ఏర్పడుతుంది. ఈ విధానంలో ఇళ్లు నిర్మించడంపై లబ్ధిదారులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో తెనాలి పట్టణం, రూరల్ మండలం, కొల్లిపర మండలాలతో కలిపి రికార్డు స్థాయిలో 27 వేల ఇళ్ల పట్టాలను పేదలకు పంపిణీ చేశారు. తొలి దశలో 17 వేల ఇళ్ల నిర్మాణానికి అనుమతి లభించింది. డెల్టా ప్రాంతమైన తెనాలిలోని లే–అవుట్లలో మెరక సమస్యలను అధిగమించి ప్రస్తుత వేసవిలో ఇళ్ల నిర్మాణం ఆరంభమైంది. ప్రస్తుత సీజనులో కనీసం 10 వేల ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేయాలని సంకల్పంతో శరవేగంతో పనులు జరుగుతున్నాయి. సిరిపురం లే–అవుట్లో బోర్లలో రెడీమిక్స్ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని.. ఇక్కడ నిర్మాణంలో ఉన్న ఇళ్లపై లబ్ధిదారులు భవిష్యత్‌లో మరో రెండు అంతస్తులు నిర్మించుకునేలా ఆధునిక బోర్ కటింగ్ యంత్రంతో ఒక్కో ఇంటికి 10 అడుగుల లోతు, అడుగు డయామీటరుతో తొమ్మిది బోర్లు తీస్తున్నారు. ఒక్కో బోరులో 12 ఎం.ఎం. ఇనుప రాడ్లు నాలుగు చొప్పున కడుతున్నారు. పైన పైల్ కాపింగ్ మరో ప్రత్యేకత. దానిపై ప్లింత్బీమ్కు 10 ఎం.ఎం. స్టీల్ రాడ్లు ఐదేసి చొప్పున వాడుతున్నారు. ప్లింత్ బీమ్‌పై 9 అంగుళాల గోడ నాలుగు అడుగులు మేర కట్టి, ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న ఇసుకతో నింపి బెడ్ వేస్తున్నారు. అక్కడి నుంచి ఒక్కో కాలమ్‌కు 10 ఎం.ఎం. రాడ్లు నాలుగు చొప్పున 9 కాలమ్స్‌ను శ్లాబ్ వరకు తీసుకెళుతున్నారు. లోడ్ బేరింగ్ కోసం పునాదిని పకడ్బందీగా వేయడం, డిజైన్‌లో లేనప్పటికీ 9 కాలమ్స్ నిర్మించటంతో ఇంటి నిర్మాణం పూర్తయిన తరువాత ఎప్పుడు కావాలంటే అప్పుడు అదే ఇంటిపై మరో రెండు అంతస్తుల నిర్మాణం నిరభ్యంతరంగా చేసుకోవచ్చని ఇళ్ల నిర్మాణ పర్యవేక్షకుల్లో ఒకరైన ఏఆర్ఏ కనస్ట్రక్షన్స్ నిర్వాహకుడు అడుసుమల్లి వెంకటేశ్వరరావు వెల్లడించారు. కట్టుబడి చాలా బాగుంది సిరిపురం లే–అవుట్లో నాకు ఇంటిస్థలం ఇచ్చారు. డబ్బులు చాలక లబ్ధిదారులు ఎవరికి వారు ఇల్లు కట్టుకోలేని స్థితిలో ఉండటంతో ఇంటి నిర్మాణాల బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంది. పర్యవేక్షకులను నియమించి కట్టుబడి బాగా చేయిస్తున్నారు. పునాదులు, గోడలు పటిష్టంగా వేస్తున్నందున మళ్లీ ఎప్పుడైనా మేం పైన మరో రెండంతస్తులు వేసుకునే అవకాశం ఉండేలా కడుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. – అద్దంకి హేమలత, 10వ వార్డు, తెనాలి ఊపందుకున్న నిర్మాణాలు తెనాలి పట్టణ లబ్ధిదారులకు కేటాయించిన పెదరావూరు, సిరిపురం లే–అవుట్లలో పేదల ఇళ్ల నిర్మాణం ఊపందుకుంది. లే–అవుట్లలోనే తాత్కాలిక గిడ్డంగులను నిర్మించి ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే ఇసుకతో సహా ఇనుము, సిమెంట్, ఇటుకలను ముందుగానే చేర్చటం కలిసొచ్చింది. లే–అవుట్లలో అవసరమైన నీటి వసతి, విద్యుత్ లైట్లను ఏర్పాటు చేశారు. మెప్మా సహకారంతో లబ్ధిదారులకు రూ.50 వేల వంతున రుణ సదుపాయం కల్పిస్తున్నారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రత్యేకంగా లే–అవుట్లలో క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నారు. బోర్లు తీయడం నుంచి ప్లింత్‌బీమ్, పైల్ కాపింగ్, కాలమ్స్ అన్నీ ఆయన డిజైన్ ప్రకారం ఏడెనిమిది మంది పర్యవేక్షకులతో ఇళ్ల నిర్మాణం కొనసాగిస్తున్నారు. -
బస్తీమే సవాల్.. ఛాలెంజ్‌గా మారిన ట్రాఫిక్ నియంత్రణ
సాక్షి, గుంటూరు, తెనాలి, నరసరావుపేట: నగర/పట్టణాల్లో జనాభా నానాటికీ పెరుగుతోంది. జీవనం ఉరుకులు పరుగుల మయమవుతోంది. దీనికి అనుగుణంగా వాహనాల వినియోగమూ పెరుగుతోంది. ఫలితంగా ట్రాఫిక్ సమస్య తీవ్ర రూపం దాలుస్తోంది. వాహనాల రద్దీతో నిత్యం రోడ్లు కిటకిటలాడుతున్నాయి. రాకపోకల నియంత్రణ పోలీసులకు సవాల్‌గా మారుతోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో అయితే తలకు మించిన భారమే అవుతోంది. గుం‘టూరు కష్టమే’ గుంటూరు నగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. సమీపంలోని గ్రామాల నుంచి ప్రజలు వలస వస్తున్నారు. ఇప్పటికే శివారు ప్రాంతాలు చాలా వరకు నగరంలో కలిసిపోయాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం గుంటూరు నగర జనాభా 6.76 లక్షలు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 9 లక్షలకుపైగా ఉంటుందని అధికారుల అంచనా. నగరంలో మొత్తం అన్ని రకాల వాహనాలు కలిపి సుమారుగా 6,43,000 వరకు ఉంటాయని తెలుస్తోంది. దీంతో నగరంలో రద్దీ పెరిగింది. దీనికి తగ్గట్టు ప్రధాన రహదారుల విస్తరణ జరగకపోవడంతో నగరం ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకుపోతోంది. పార్కింగ్ సమస్య వేధిస్తోంది. పరిష్కారం దిశగా ప్రభుత్వం.. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రహదారుల విస్తరణ, వంతెనల నిర్మాణమే శరణ్యమని ప్రభుత్వం గుర్తించింది. శంకర్‌విలాస్ వద్ద బ్రిడ్జి విస్తరణ లేదా కొత్త వంతెన నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డులో ఉన్న గడ్డిపాడు రైల్వేగేట్, శ్యామలానగర్, నెహ్రూనగర్, సంజీవయ్య నగర్, సీతారామ్‌నగర్ రైల్వేగేట్ల వద్ద ఆర్వోబీ, ఆర్‌యూబీలు నిర్మించడంపైనా ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీనిలోభాగంగా ఆర్అండ్బీ, జీవీఎంసీ అధికారులు ఇటీవల పరిశీలన చేశారు. నందివెలుగు రోడ్డు రైల్వే వంతెన పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. పలు రోడ్ల విస్తరణకూ ప్రతిపాదనలు ఉన్నాయి. ఆంధ్రా ప్యారిస్‌లోనూ పాట్లు గుంటూరు జిల్లాలో ఏకైక స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ, ఆంధ్రా ప్యారిస్‌గా గుర్తింపు పొందిన తెనాలిలోనూ ట్రాఫిక్ పాట్లు తప్పడం లేదు. ఆక్రమణలతోపాటు రోడ్లపైనా వ్యాపారాల వల్ల ఈ సమస్య జఠిలమవుతోంది. తెనాలి పట్టణ జనాభా రెండు లక్షలకుపైగానే ఉంటుంది. అన్ని రకాల వాహనాలు కలిపి 1.10 లక్షల వరకు ఉంటాయని తెలుస్తోంది. సమీపంలోని వేమూరు, మంగళగిరి నియోజకవర్గాల నుంచి రోజూ 40 నుంచి 50 వేల మంది వరకు రాకపోకలు సాగిస్తుంటారు. పెరిగిన జనాభా, వాహనాలకు అనుగుణంగా పట్టణంలో రోడ్ల విస్తరణ జరగలేదు. పార్కింగ్ సమస్య కూడా వేధిస్తోంది. వీధివ్యాపారులకు ప్రత్యేక స్థలం, పార్కింగ్ జోన్ల కేటాయింపు కాగితాలకే పరిమితమైంది. పరిష్కారమార్గం ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రోడ్ల విస్తరణ, వంతెనల నిర్మాణమే మార్గం. గతంలో మార్కెట్ వంతెన వద్ద స్కైవాక్ బ్రిడ్జి నిర్మాణం కోసం అధికారులు సర్వే చేశారు. నెహ్రూ, బోస్, మెయిన్, బుర్రిపాలెం రోడ్లను విస్తరించాలి. మరో కొత్త వంతెన అవసరం ఉంది. కాలువ రోడ్లను విస్తరించే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉంది. పేటలోనూ ‘నడక’యాతనే పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట పట్టణంలోనూ ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ జనాభా 1.18 లక్షలు. ఇప్పుడు 1.50 లక్షల వరకు ఉంటుందని అధికారుల అంచనా. అన్ని రకాల వాహనాలు కలిపి 1,00,000 వరకు ఉంటాయని తెలుస్తోంది. చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచీ పట్టణానికి నిత్యం రాకపోకలు జరుగుతుంటాయి. దీంతో పట్టణంలోని రోడ్లు రద్దీగా ఉంటున్నాయి. ట్రాఫిక్ నియంత్రణ పోలీసులకు సవాల్‌గా మారుతోంది. పార్కింగ్ సమస్య వేధిస్తోంది. ట్రాఫిక్ సిగ్నల్స్ సరిగా పనిచేయడం లేదు. ఫ్లైఓవర్ మంజూరు చేసిన సీఎం వైఎస్ జగన్ నరసరావుపేటలో ప్రస్తుతం రెండు ఫ్లైఓవర్లు, ఒక అండర్‌గ్రౌండ్ బ్రిడ్జి ఉంది. జిల్లా కేంద్రమైనందున రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్ల నిర్మాణం ఆవశ్యకత అధికమైంది. దీంతో రెండు ఆర్‌యూబీలు, ఓ ఫ్లైఓవర్ మంజూరు చేయాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికీ తీసుకెళ్లారు. మల్లమ్మసెంటర్ నుంచి గడియారం స్తంభం సెంటర్‌వరకు ఫ్లైఓవర్ మంజూరు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. లాల్‌బహుదూర్ కూరగాయల మార్కెట్ సెంటర్ వెనుకగా చిత్రాలయ థియేటర్ ఎదురుగా ఆర్యుబీ నిర్మాణానికి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకొచ్చారు. వీటితోపాటు రోడ్ల విస్తరణ పూర్తయితే ట్రాఫిక్ సమస్య తీరినట్టే. కిలోమీటర్ మేర బారులు గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. ఒక్కోసారి కిలోమీటర్ మేర వాహనాలు బారులు తీరుతుంటాయి. శ్యామలానగర్ రైల్వే గేట్ పడిందంటే అంతే సంగతులు. వెంటనే ఇక్కడ రైల్వే అండర్ బ్రిడ్జ్‌ను నిర్మించాలి. గడ్డిపాడు రైల్వే గేట్ వల్ల ట్రాఫిక్ ఆగిపోతోంది. ఇక్కడ ఆర్వోబీ నిర్మించాలి. – మాన్నిడి సుధమారుతిబాబు, నల్లపాడు, గుంటూరు పూర్తి స్థాయిలో దృష్టి సారించాం ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు నిత్యం చర్యలు తీసుకుంటున్నాం. వారం రోజుల క్రితం డీఐజీ, ఎస్పీ సమీక్ష చేశారు. ట్రిఫిక్ నియంత్రణపై దృష్టిసారించాం. పలు ప్రాంతాల్లో డివైడర్లు తొలగించాలని జీఎంసీకి ప్రతిపాదలు పంపాం. పార్కింగ్ జోన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. – వీవీ రమణకుమార్, డీఎస్పీ, గుంటూరు సిటీ ట్రాఫిక్ పరిష్కారానికి సమష్టిగా కృషి తెనాలి పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి సమష్టిగా కృషి చేస్తాం. దీనికి ప్రజల సహకారమూ అవసరం. ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసు శాఖ తరఫున అన్ని చర్యలూ చేపడుతున్నాం. ప్రధాన కూడళ్లలో వన్ వే, ఫ్రీ లెఫ్ట్ వంటివి ఏర్పాటు చేశాం. – జోగి శ్రీనివాస్, ట్రాఫిక్ ఎస్ఐ, తెనాలి రోడ్లు విస్తరించాలి నరసరావుపేటలో ట్రాఫిక్‌పై పోలీసులు దృష్టిపెట్టాలి. రోడ్లను విస్తరించాలి. వీధి వ్యాపారులకు ప్రత్యేక జోన్ కేటాయిస్తే మేలు. పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేయాలి. ఆటోవాలాలను నియంత్రించాలి. – గుదే రామయ్య, బరంపేట, నరసరావుపేట ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా మళ్లిస్తాం నరసరావుపేట పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు సమష్టిగా కృషి చేస్తున్నాం. ఔటర్ రింగ్‌రోడ్డును ఉపయోగించి ఇకపై వినుకొండ, పల్నాడు, చిలకలూరిపేట, సత్తెనపల్లి, గుంటూరు వైపు వెళ్లాల్సిన వాహనాలను మళ్లిస్తాం. దీనివల్ల పట్టణంలో రద్దీ తగ్గుతుంది. ట్రాఫిక్ సిగ్నల్స్, సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తాం. – సి.విజయభాస్కరరావు , డీఎస్పీ, నరసరావుపేట -
భార్యతో విడాకులు.. ఆమె ఫ్రెండ్‌తో సాన్నిహిత్యం.. రవికిరణ్ అదృశ్యం.. కారణం అదేనా?
సాక్షి, తెనాలి(గుంటూరు): వేమూరు నియోజకవర్గంలోని అమృతలూరు మండలం మూల్పూరుకు చెందిన నూతక్కి రవికిరణ్ అనే యువకుడి అదృశ్యం ఇప్పుడు మిస్టరీగా మారింది. మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు, అతడు హత్యకు గురైనట్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారని సమాచారం. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని, తెనాలిలోని ఓ రౌడీషీటరు, అతడి సహచరులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. మూల్పూరుకు చెందిన నూతక్కి రవికిరణ్ తెనాలిలోని ఓ ప్రైవేటు నెట్‌వర్క్‌లో టెక్నీషియన్‌గా చేస్తున్నాడు. గత నెల 20న అతడు అదృశ్యమయ్యాడు. అప్పట్నుంచి తల్లిదండ్రులు రవికిరణ్ ఆచూకీ కోసం వెతికారు. ఫలితం లేకపోవడంతో గతనెల 26న అమృతలూరు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎమ్మార్పీఎస్ నాయకులు రంగంలోకి దిగి విచారణ మొదలుపెట్టారు. రవికిరణ్ తెనాలిలో హత్యకు గురయ్యాడని వాళ్లు అనుమానించారు. అమృతలూరు పోలీసుల విచారణపైనా వారు సందేహాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు రవికిరణ్ తల్లి సువార్తమ్మ నుంచి స్టేట్మెంట్ను తీసుకుని హత్య కోణంలో దర్యాప్తుచేయసాగారు. రవికిరణ్ వివాహితుడు. తెనాలిలోని ఓ ప్రైవేటు నర్సింగ్‌హోమ్‌లో నర్సుగా పనిచేస్తున్న భార్యతో అతడికి విభేదాలొచ్చాయి. ఇద్దరూ విడిపోయారు. అదే నర్సింగ్‌హోమ్‌లో నర్సుగా చేస్తున్న భార్య స్నేహితురాలైన మరో యువతితో రవికిరణ్‌కు సాన్నిహిత్యం పెరిగింది. తెనాలికి చెందిన ఓ రౌడీషీటర్ ఆ యువతి ద్వారానే గతనెల 20న రవికిరణ్‌కు ఫోన్ చేయించి పిలిపించారని, ఆ తర్వాతే అతడు అదృశ్యమయ్యాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. చదవండి: తాగిన మత్తులో నోరు జారాడు.. మైకం నుంచి తేరుకునే లోపే.. తెనాలి యువతితో సంబంధమున్న రౌడీషీటర్ రవికిరణ్‌ను కొట్టటంతో అతడు చనిపోయాడని, శవాన్ని మాయం చేశారని చెబుతున్నారు. పోలీసులతోనూ ఇదే విషయం చెప్పారు. దీనిపై పోలీసులు రౌడీషీటరును, ఆ యువతిని, వారికి సహకరించిన మరికొందరినీ విచారిస్తున్నట్టు సమాచారం. ఫోన్ కాల్స్, వారు సంచరించిన ప్రదేశాలు దాదాపుగా ట్రేస్ అయ్యాయని, ఇక భౌతిక సాక్ష్యాల కోసం పోలీసులు అన్వేషిస్తున్నారని విశ్వసనీయంగా తెలిసింది. ఇదే విషయమై చుండూరు సీఐ కళ్యాణ్‌రాజ్ వివరణ కోరగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. -
మాజీ మంత్రి యడ్లపాటి వెంకట్రావు కన్నుమూత
తెనాలి/సాక్షి, న్యూఢిల్లీ: గుంటూరు జిల్లా తెనాలి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తొలితరం నేత, మాజీ మంత్రి యడ్లపాటి వెంకట్రావు (102) సోమవారం హైదరాబాద్‌లోని కుమార్తె జితా రవిశ్రీ నివాసంలో కన్నుమూశారు. ఆయన భౌతికకాయాన్ని తెనాలి బుర్రిపాలెం రోడ్డులోని స్వగృహానికి తీసుకొచ్చారు. వెంకట్రావు భార్య అలిమేలుమంగమ్మ గతేడాది మృతిచెందారు. తనయుడు జయరామ్, కోడలు హిమకుమారి కూడా అంతకుముందే కాలం చేశారు. యడ్లపాటి వెంకట్రావు అంత్యక్రియల్ని బుధవారం తెనాలిలో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. బుధవారం ఉదయం బుర్రిపాలెంరోడ్డులోని వెంకట్రావు స్వస్థలం నుంచి అంతిమయాత్ర బయలుదేరుతుందని చెప్పారు. హైదరాబాద్‌లో వెంకట్రావు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, రేపు తెనాలిలో జరిగే అంత్యక్రియల్లోనూ పాల్గొననున్నారు. యడ్లపాటి భౌతికకాయాన్ని తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు దేసు శ్రీనివాసరావు, వివిధ పార్టీల నేతలు నన్నపనేని రాజకుమారి, డాక్టర్ గోగినేని ఉమ, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, నక్కా ఆనందబాబు, పాటిబండ్ల రామకృష్ణ, దాసరి బాలవర్ధనరావు, చలసాని ఆంజనేయులు, పారిశ్రామికవేత్త కొత్త సుబ్రహ్మణ్యం, రోటరీ క్లబ్ అధ్యక్షుడు ఈదర వెంకటపూర్ణచంద్ తదితరులు సందర్శించి నివాళులర్పించారు. సుదీర్ఘ రాజకీయ జీవితం.. తెనాలికి సమీపంలోని అమృతలూరు మండలం బోడపాడులో మోతుబరి రైతు కుటుంబంలో 1919 డిసెంబర్ 16న వెంకట్రావు జన్మించారు. తురుమెళ్లలో హైస్కూలు విద్య తర్వాత గుంటూరులోని ఏసీ కాలేజిలో ఎఫ్ఏ, బీఏ చేశారు. 1941లో చెన్నైలోని లా కాలేజీలో చేరారు. 1945 నుంచి న్యాయవాదిగా తెనాలిలో స్థిరపడ్డారు. 1973 వరకు ప్రాక్టీసులో ఉంటూనే రాజకీయాల్లో కొనసాగారు. ఎన్జీరంగా అనుచరుడిగా ఆయన స్థాపించిన స్వతంత్ర పార్టీతో రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ పార్టీ తరఫున వేమూరు నియోజకవర్గం నుంచి పోటీచేసి 1962, 1965 ఎన్నికల్లో ఓడిపోగా, 1967 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. తరువాత వరుసగా రెండుసార్లు శాసనసభకు ఎన్నికైన యడ్లపాటి ఆ నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొట్టిన ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. డాక్టర్ చెన్నారెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయం, న్యాయశాఖ మంత్రిగా, టంగుటూరి అంజయ్య మంత్రివర్గంలో వ్యవసాయశాఖ మంత్రిగా చేశారు. వడ్లమూడి వద్ద 1977లో ఏర్పాటైన సంగం డెయిరీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1989 నుంచి టీడీపీలో అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించారు. పదేళ్లపాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. 1995లో గుంటూరు జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. తర్వాత రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఉపరాష్ట్రపతి సంతాపం యడ్లపాటి వెంకట్రావు మృతిపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం వ్యక్తం చేశారు. హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ, పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు కూడా సంతాపం తెలిపారు. -
భారీ స్ప్రేయర్.. 10 గంటల్లో 100 ఎకరాలు పూర్తి.. పెట్రోలు ఖర్చు రూ. 300 లోపే!
రైతును మించిన శాస్త్రవేత్త లేడంటారు... వినూత్న ఆలోచనలకు, ఆవిష్కరణలకు చదువుతో పనిలేదు. అవసరమే అన్నీ నేర్పిస్తుంది. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలోని మండల కేంద్రం అమృతలూరు రైతు మల్లెపెద్ది రామకృష్ణ ఇందుకో నిదర్శనం. ఇంటర్ చదువుకొని వ్యవసాయంలో స్థిరపడ్డారు. పురుగుమందు పిచికారీలో సమయాన్ని, ఖర్చును ఆదా చేసే ట్రాక్టర్ మౌంటెడ్ స్పేయర్‌ను సొంత ఆలోచనతో పెద్ద రైతుగా తన అవసరాల మేరకు తయారు చేసుకొని వాడుతున్నారు. ఈ ఆవిష్కరణతో గంటకు 10 ఎకరాల చొప్పున, కేవలం 10 గంటల్లో తన వందెకరాల పైరుకు మందు పిచికారీని పూర్తి చేస్తుండటం విశేషం. మాగాణి భూమిలో ఖరీఫ్‌లో వరి తర్వాత రెండో పంటగా వంద ఎకరాల్లో మినుము సాగు చేస్తున్నారు రామకృష్ణ. ఈ పంటకు తెగుళ్ల బెడద ఎక్కువ. సాధారణ పవర్ స్ప్రేయర్‌తో ముగ్గురు, నలుగురితో మందు పిచికారీ చేయించినా, కనీసం అయిదు రోజులు వ్యవధి పట్టేది. స్ప్రేయింగ్ చేయటానికి, ట్యాంకుల్లో నీళ్లు కలిపే వారితో సహా కూలీ ఖర్చులు హీనపక్షం రూ.లక్ష తప్పనిసరి. మరూకా పురుగు ఆశిస్తే వెంటనే చేను మొత్తం పిచికారీ చేయాలి. ఇక్కడ ఒకవైపు నుంచి రెండోవైపునకు పని పూర్తి చేసే సరికి కొన్ని రోజులు పట్టేది. ఆలోగా ఆవైపు చేనును పురుగు తినేసేది. ఇలాంటి సమస్యలకు పరిష్కారం ఏమిటా అనే మథనంలోంచి పెద్ద రైతులకు ఉపయోగపడే ఈ వినూత్నమైన భారీ మౌంటెడ్ స్ప్రేయర్ పుట్టుకొచ్చింది. 1800 లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ భారీ స్ప్రేయర్‌తో గంటకు పదెకరాల్లో పురుగుమందును ప్రస్తుత రబీలోనే తొలిసారి పిచికారీ చేస్తున్నారు రామకృష్ణ. ఆవిధంగా వందెకరాల పొలంలో 10 గంటల్లోనే పిచికారీ పూర్తిచేస్తున్నారు. ఎటొచ్చినా 50 అడుగుల దూరంలో వానజల్లులా మొక్క మొత్తం పూర్తిగా తడుపుతున్నారు. పదెకరాలకు 1800 లీటర్ల చొప్పున వందెకరాలకు 18 వేల లీటర్ల నీటి పిచికారీతో పనిలో పనిగా.. పొలానికి అవసరమైన నీటితడి కూడా సమకూరుతోంది. ఇప్పుడా వందెకరాల్లోని మినుము పైరు కేవలం 45 రోజుల వయసులోనే ఏపుగా పెరిగి భారీ దిగుబడులకు భరోసానిస్తోంది. సేంద్రియ/ప్రకృతి వ్యవసాయం చేసే పెద్ద రైతులక్కూడా ఈ భారీ స్ప్రేయర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. 2.5 లీ. పెట్రోలుతో వందెకరాల్లో పిచికారీ ట్రాక్టరుకు వెనుక వైపు 650 లీటర్ల చొప్పున సామర్థ్యం కలిగిన రెండు ట్యాంకులు ఒకదానిపై ఒకటి బిగించారు. ముందుభాగంలో 500 లీటర్ల సింటెక్స్ ట్యాంకును అమర్చారు. అంటే మొత్తం 1800 లీటర్లు. 5 హెచ్‌పీ మోటారు, మరో వైపర్ మోటారును బిగించారు. వీటన్నిటినీ ట్యాంకులకు అనుసంధానం చేశారు. మోటారు ఆన్ చేయగానే వైపర్ మోటారు తిరుగుతుంది. వెనుకభాగంలో రెండువైపులా గల వైపర్స్ తిరుగుతూ వీటి చివర గల నాజిల్స్‌లోంచి మందు పిచికారీ అవుతుంది. ట్రాక్టరు తిరిగేందుకు అనువుగా విత్తనాలు చల్లేటపుడే దారులు సిద్ధం చేసుకున్నారు. ఈ భారీ స్ప్రేయర్‌కు కావాల్సిన ఒక్కో పరికరాన్ని ఒక్కోచోట నుంచి సమకూర్చుకున్నట్టు రామకృష్ణ చెప్పారు. ఇందుకు రూ.1.50 లక్షల ఖర్చయ్యిందన్నారు. మోటార్లకు కావాల్సిన పెట్రోలు ట్యాంకులో సామర్థ్యం ముప్పాతిక లీటరు మాత్రమే. కేవలం రెండున్నర లీటర్ల పెట్రోలుతో వంద ఎకరాల్లో మందు పిచికారీకి సరిపోతోంది. అంటే ప్రెటోలు ఖర్చు రూ.300 లోపే. ఈ రకంగా రామకృష్ణ వినూత్న ఆవిష్కరణతో తన సమస్యను అధిగమించటమే కాకుండా, తన స్ప్రేయర్‌ను తోటి రైతులకూ అద్దెకు ఇస్తూ వారి ఖర్చునూ తగ్గిస్తున్నారు రామకృష్ణ (99595 95060). – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి చదవండి: రైతు ఆదాయం పెంచే పట్టు యంత్రం -
సాఫ్ట్వేర్ ఇంజినీర్ మిస్సింగ్.. భార్యపై అనుమానం, శారీరక వేధింపులతో
సాక్షి, తెనాలి రూరల్(గుంటూరు): కోర్టు వాయిదాకు వచ్చి వెళ్తున్న సమయంలో అదృశ్యమైన సాఫ్ట్వేర్ ఇంజినీర్ కేసును పోలీసులు ఛేదించారు. భార్య కుటుంబీకులే అతడిని హతమార్చారని తేల్చారు. దీంతో హతుడి మామ, ఇద్దరు బావమరుదులు సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. స్థానిక వన్‌టౌన్ సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం విలేకర్ల సమావేశంలో డీఎస్పీ కె.స్రవంతిరాయ్ కేసు వివరాలను వెల్లడించారు. ఆమె కథనం ప్రకారం.. కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నాడని.. వేమూరు మండలం చావలి గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ నలుకుర్తి సుబ్బయ్యకు తెనాలి మండలం మల్లెపాడుకు చెందిన జయశ్రీతో 2011లో పెళ్లైంది. భార్యపై అనుమానంతో సుబ్బయ్య ఆమెను మానసికంగా, శారీరకంగా వేధిస్తుండేవాడు. దీంతో జయశ్రీ 2018లో భర్త, అత్త, మరిదిపై తెనాలి త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో వరకట్న వేధింపుల కేసు పెట్టింది. కేసు వాయిదాలు నడుస్తున్న క్రమంలో 2019లో కోర్టు ప్రాంగణం సమీపంలో జయశ్రీ కుటుంబసభ్యులు, సుబ్బయ్య కుటుంబసభ్యులు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. చదవండి: వైరల్ వీడియో: అందరూ చూస్తుండగానే రోడ్డుపై కర్రలతో హల్చల్ దీనిపై వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. ఈ కేసులు కోర్టులో నడుస్తున్నాయి. ఈ క్రమంలో తన భార్య ప్రవర్తన మంచిది కాదని సుబ్బయ్య కోర్టులో బహిరంగంగా చెప్పాడు. మరోవైపు పెద్ద బావమరిది జయచంద్ర కాపురాన్ని లేనిపోనివి చెప్పి సుబ్బయ్య చెడగొట్టాడు. ఇటీవల వివాహమైన రెండో బావమరిది సుధాకర్ కాపురాన్నీ చెడగొట్టే యత్నం చేస్తున్నాడని తెలుసుకున్న జయశ్రీ కుటుంబ సభ్యులు ఎలాగైనా సుబ్బయ్యను అంతమొందించాలని పథకం రచించారు. చంపి.. పెట్రోల్ పోసి తగలబెట్టారు ఈ నేపథ్యంలో గత డిసెంబర్ 31న కోర్టు వాయిదాకు తెనాలి వచ్చి వెళ్తున్న సుబ్బయ్యను బావమరుదులు జయచంద్ర, సుధాకర్, మామ రవి కారులో వెంబడించారు. తెనాలి–చందోలు రహదారిలో కూచిపూడి లాకులు దాటాక యలవర్రు వంతెన సమీపంలో కారుతో అడ్డగించి ఒక్కసారిగా హెల్మెట్‌తో దాడి చేశారు. షాక్‌లో ఉన్న సుబ్బయ్యను కారులో ఎక్కించి, కండువాను మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం కారు డిక్కీలోకి మృతదేహాన్ని మార్చి కొల్లిపర మండలం అన్నవరపులంకకు తీసుకెళ్లారు. అక్కడ తమ బంధువులైన కాకాని రమేష్, అతని కుమారుడు సతీష్‌బాబుతో కలసి కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం అయిలూరు పంచాయతి ములకలపల్లి లంక గ్రామానికి వెలుపల కృష్ణా నది ఒడ్డున పిచ్చి తుమ్మ చెట్లలో మృతదేహాన్ని తీసుకెళ్లి పడేశారు. అనంతరం పెట్రోలు పోసి తగులబెట్టారు. చదవండి: మైనర్‌ను గర్భవతిని చేసిన ఘనుడు.. పెళ్లి చేసుకోవాలని కోరితే.. వీఆర్వో వద్ద లొంగుబాటు కోర్టు వాయిదాకు వచ్చిన తన సోదరుడు కనిపించటం లేదంటూ సుబ్బయ్య తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదుతో వన్‌టౌన్ పోలీసులు జనవరి 2న అదృశ్యం కేసు నమోదు చేశారు. సుబ్బయ్య మామ, బావమరుదులు, భార్య, అత్త, చిన మామపై నిఘా ఉంచారు. మృతుడి కాల్ డేటా, నిందితుల కాల్ డేటాను లోతుగా పరిశీలించారు. 31న అనేకసార్లు ఫోన్లు చేసిన నిందితులు అనంతరం వాటిని స్విచాఫ్ చేసినట్టు గుర్తించారు. సతీష్‌బాబు కొత్త సిమ్ వాడుతున్నట్టు తెలుసుకున్న పోలీసులు అన్నవరపులంక వెళ్లి అతని కదలికలపైనా నిఘా పెట్టారు.దీంతో పోలీసులకు తెలిసిపోయిందనే భయంతో నిందితులు మల్లెపాడు వీఆర్వో వద్దకు వెళ్లి లొంగిపోయారు. వీరిని గురువారం సాయంత్రం అరెస్ట్ చేశామని డీఎస్పీ చెప్పారు. నిందితులు వినియోగించిన కారు, రెండు మోటారుసైకిళ్లు, మృతుడి మోటారుసైకిల్తోపాటు అతని ఎముకలు, బూడిదను గుర్తించి స్వాధీనపర్చుకున్నట్టు డీఎస్పీ వివరించారు. ప్రాథమిక ఆధారాల్లేకున్నా నిందితులను గుర్తించి, సాక్ష్యాలనూ సేకరించిన వన్‌టౌన్ సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ ఉమామహేశ్వరరావును డీఎస్పీ అభినందించారు. నిందితులను కోర్టులో హాజరుపరిచారు. -
ప్రేమ వివాహం.. వేధింపులు.. ఇక భర్తతో కలిసి ఉండలేనని..
సాక్షి, గుంటూరు(తెనాలి): కుటుంబ కలహాల నేపథ్యంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. కోర్టు ప్రాంగణంలోకి పెట్రోలు సీసా, ప్లకార్డులతో వచ్చి, పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా, గమనించిన న్యాయవాదులు, పోలీసులు అతని వద్ద నుంచి పెట్రోలు సీసా, లైటర్ లాక్కుని స్టేషన్‌కు తరలించారు. ఇదిలా ఉంటే తనపై భర్త పెట్రోలు పోసి నిప్పంటించేందుకు ప్రయత్నించాడని, తాను తప్పించుకున్నానని అతని భార్య తెలిపింది. పోలీసులు, బాధిత మహిళ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తెనాలి 12వ వార్డుకు చెందిన ఆటో డ్రైవర్ చెరుకూరి ప్రదీప్‌జయచంద్ర సుమారు పదేళ్ల క్రితం తెనాలికే చెందిన హరితను ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన కొద్ది రోజులకే భార్యను వేధించడం ప్రారంభించాడు. 2019 వరకు ఓపిక పట్టిన ఆమె ఇక భర్తతో కలిసి ఉండలేనని పుట్టింటికి వెళ్లిపోయి, వారి సహకారంతో వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టగా ప్రస్తుతం కోర్డులో నడుస్తోంది. చినరావూరులో వార్డు వలంటీర్‌గా పని చేస్తున్న ఈమె ఇంటికి తరచూ ప్రదీప్‌జయచంద్ర వెళ్లి దాడి చేయడం, ధూషించడం చేస్తుండేవాడు. చదవండి: (పెళ్లయి ఇద్దరు పిల్లలున్నా ప్రియున్ని మరిచిపోలేదు.. భర్తకు తెలిసి..) ఈ క్రమంలో బుధవారం రాత్రి11.30 గంటల ప్రాంతంలో ఆమె ఇంటికి వెళ్లి ధూషించడంతో పాటు విద్యుత్ ఫ్యూజు తొలగించాడు. దీంతో బాధితురాలు గుంటూరులోని దిశ పోలీస్‌స్టేషన్‌కు సమాచారమివ్వగా, వారు తెనాలి వన్‌టౌన్ పోలీసులను బాధితురాలి ఇంటికి పంపారు. అదే సమయంలో టవల్‌తో ఆమె మెడకు ఉరి వేసేందుకు ప్రదీప్‌జయచంద్ర యత్నిస్తున్నాడు. పోలీసులు అతన్ని స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. తిరిగి గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో హరిత ఇంటికి వెళ్లి జయచంద్ర ఆమెపై పెట్రోలు పోసి, నిప్పంటించేందుకు యత్నించగా కేకలు వేయడంతో చుట్టపక్కల వాళ్లు రావడంతో పరారయ్యాడు. ఇది జరిగిన కొద్ది గంటలకు పెట్రోలు సీసా, తనకు న్యాయం కావాలంటూ ప్లకార్డులతో అతను కోర్టు ప్రాంగణానికి చేరుకున్నాడు. తన తప్పు లేకుండా వన్‌టౌన్ ఎస్ఐ చాణక్య తనపై దాడి చేశాడని ఆరోపిస్తూ ఒంటిపై పెట్రోలు పోసుకుని లైటర్‌తో నిప్పంటించుకునేందుకు యత్నించాడు. అక్కడే ఉన్న న్యాయవాది హరిదాసు గౌరీశంకర్, పోలీసు కానిస్టేబుళ్లు పెట్రోలు సీసా, లైటరును లాక్కుని నీళ్లు పోశారు. సమాచారం అందుకున్న వన్‌టౌన్ పోలీసులు జయచంద్రను స్టేషన్‌కు తరలించారు. భర్తపై హరిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతనిపై ఐపీసీ 307 సెక్షను కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జయచంద్రపై దాడి చేశారన్న ఆరోపణల గురించి ఎస్ఐ చాణక్యను వివరణ కోరగా, బుధవారం రాత్రి దిశ పోలీస్‌స్టేషన్ నుంచి వచ్చిన సమాచారం మేరకు తమ సిబ్బంది హరిత ఇంటికి వెళ్లారని, లేకుంటే అదే సమయంలో జయచంద్ర ఆమెను హతమార్చి ఉండేవాడని తెలిపారు. వెంటనే స్టేషన్‌కు తీసుకువచ్చి కౌన్సెలింగ్ ఇచ్చి పంపామని చెప్పారు. -
పాక్ యుద్ధంలో అమరుడైన సైనికుడికి కేటాయించిన భూమి కోసం దశాబ్ధాలుగా పోరాటం!
తెనాలి: రాజధాని ఏరియాలో దళితులకు ఇళ్ల స్థలాలనిస్తే, సమతౌల్యత దెబ్బతింటుందని కోర్టును ఆశ్రయించి అడ్డుకున్న టీడీపీ, అధికారంలో ఉండగా దివంగత సైనికుడికి ఇవ్వాల్సిన భూమికి సైతం రాజధాని పేరుతో మొండిచెయ్యి చూపింది. పాకిస్తాన్‌తో యుద్ధంతో వీరమరణం పొందిన సైనికుడికి ప్రభుత్వం కేటాయించిన భూమి కోసం అతడి మాతృమూర్తి, దశాబ్దాలుగా చేసిన పోరాటానికి ఫలితం దక్కలేదు. టీడీపీ ప్రభుత్వ వైఖరితో తనకు జరిగిన అన్యాయానికి మనస్తాపంతో ఆమె అనారోగ్యానికి గురైంది. తాను తనువు చాలించేలోగానైనా న్యాయం జరగాలని 92 ఏళ్ల ఆ వీరమాత వేడుతోంది. ఆ తల్లి పేరు తోట వెంకాయమ్మ. భర్త 35 ఏళ్ల క్రితమే కాలం చేశాడు. స్థానిక గంగానమ్మపేటలో ఇల్లు మినహా మరేం లేదు. ఆమె నలుగురు కుమారుల్లో ఒకరైన తోట వీరనాగప్రసాద్ యుక్తవయసులోనే సైన్యంలో చేరాడు. చేరిన కొద్దికాలానికే 1965లో వచ్చిన ఇండియా – పాకిస్తాన్ యుద్ధంలో అమరుడయ్యాడు. అతని తాగ్యానికి నివాళిగా 1966లో ప్రభుత్వం అప్పట్లో గుంటూరు జిల్లా పరిధిలోని చినగంజాంలో 2.5 ఎకరాల వర్షాధారమైన భూమిని (సర్వే నెం.701/1) కేటాయించింది. వీరనాగప్రసాద్ అవివాహితుడు కావటంతో ఆ భూమిని తల్లి వెంకాయమ్మకు ఇచ్చారు. పేరుకైతే భూమిని ఇచ్చారుగానీ, అధికారుల అర్థంకాని నిర్ణయాలు, అంతులేని అలసత్వంతో ఆ భూమి ఇప్పటికీ తనకు దక్కనేలేదు. అసంబద్ధ నిర్ణయాలతో కోర్టుల చుట్టూ.. 1965లో ఇచ్చిన భూమిని మరో మూడేళ్లకు ప్రభుత్వ అవసరాల కోసమంటూ మరొకరికి కేటాయించారు. అక్కడే సర్వే నంబరు 704/2లో అంతే విస్తీర్ణంలో భూమిని వెంకాయమ్మకు ఇచ్చారు. 1982లో దానినీ స్వాధీనం చేసుకుంది. 396/4, 396/5 సర్వే నంబర్లలోని 2.85 ఎకరాల చెరువు భూమిని ఇచ్చారు. ఒండ్రు మట్టితో గల ఆ భూమి సుభిక్షమైందని నమ్మబలికారు. అదైనా తీసుకుందామని వెళ్లిన వెంకాయమ్మ కుటుంబసభ్యులను పంచాయతీవారు అడ్డుకున్నారు. చెరువు భూమి పంచాయతీదేనని, రెవెన్యూకు సంబంధం లేదని నిరోధించారు. పైగా న్యాయస్థానాన్నీ ఆశ్రయించారు. తమ ప్రమేయం లేని వ్యవహారంలో వెంకాయమ్మ కోర్టు వాయిదాలకు తిరగాల్సి వచ్చింది. కోర్టులో పంచాయతీకి అనుకూలంగా తీర్పు రావటంతో ప్రభుత్వమిచ్చిన భూమినీ కోల్పోయింది. ‘ప్రకాశం’కు చేరిన పొలం వ్యవహారం.. ఈలోగా జిల్లాల విభజన జరగటంతో చినగంజాం ప్రకాశం జిల్లాలోకి వెళ్లింది. జరిగిన విషయాన్ని వెల్లడిస్తూ ప్రకాశం జిల్లా కలెక్టరుకు వెంకాయమ్మ దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి ప్రకాశం జిల్లా కలెక్టర్ కె.దేవానంద్ స్పందించారు. వెంకాయమ్మ కుటుంబం తెనాలిలోనే ఉంటున్నందున వారికి గుంటూరు జిల్లాలోనే వ్యవసాయ భూమిని కేటాయించాలంటూ 2009 ఏప్రిల్ 13న లేఖ రాశారు. బ్యూరోక్రసీ జాప్యంతో ఆ లేఖ 2016 ఫిబ్రవరి 15న తగుచర్యల నిమిత్తం జిల్లా కలెక్టరేట్ నుంచి తెనాలి ఆర్డీవో కార్యాలయానికి చేరింది. అనువైన భూమి కోసం అప్పటి ఆర్డీవో జి.నరసింహులు డివిజనులోని తహసీల్దార్లను నివేదిక కోరారు. నివేదికతో సహా అప్పటి ప్రభుత్వానికి పంపారు. రాజధాని పేరుతో మొండిచెయ్యి.. దీనిపై అప్పటి టీడీపీ ప్రభుత్వం ‘కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధి కల్పన కోసం పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహించటం, వివిధ పరిపాలన విభాగాలను స్థాపించటం వంటి భవిష్యత్ అవసరాల దృష్ట్యా గుంటూరు జిల్లా ప్రభుత్వ ఖాళీస్థలం చాలా అవసరమైనందున దరఖాస్తుదారు అభ్యర్థన ఆచరణీయం కాదు’ అంటూ తిరస్కరించింది. దీనితో మనస్తాపం చెందిన ఆ మాతృమూర్తికి అనారోగ్యం ప్రాప్తించింది. తన గోడునంతా వివరిస్తూ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శికి దరఖాస్తును పంపారు. న్యాయం చేయాలంటూ అభ్యర్థించారు. చదవండి: Inspirational Story: నా కొడుకుకు కళ్లులేకపోతేనేం.. నా కళ్లతో లోకాన్ని పరిచయం చేస్తా! -
తెనాలి కుర్రోడు.. తగ్గేదే లే.. చదివింది 8.. నెలకు రూ.3లక్షలకుపైనే..
అతడో యూట్యూబ్ వ్లాగర్. 8వ తరగతిలోనే చదువుకు ఫుల్స్టాప్ పెట్టేశాడు. ఫ్యాన్సీ షాపులో పని చేస్తూ రోజుకు రూ.20 సంపాదించేవాడు. నెలకు రూ.30 వేలు వస్తాయని తెలిసి దక్షిణాఫ్రికాకు ప్రయాణం కట్టాడు. ఆ వచ్చే రూ.30 వేలలో రూ.20 వేలు ఇంటి అద్దెకు ఖర్చయిపోయేవి. తినీ, తినక రోజులు గడిపాడు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ కలల మార్గంలో సాహస ప్రయాణం చేశాడు. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు విన్నాడు. చేతిలో రూపాయి లేకపోయినా 20 దేశాల్ని చుట్టి వచ్చాడు. వెళ్లిన ప్రతిచోటా అక్కడి విశేషాలతో కూడిన వీడియోలు తీసి ‘ఉమా తెలుగు ట్రావెలర్’ పేరిట యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తూ వచ్చాడు. ఆ వీడియోలు నచ్చటంతో అతడి చానల్‌కు 7లక్షల మంది ఫాలోవర్లు చేరారు. ఇప్పుడు అదే చానల్ ద్వారా అతడు నెలకు రూ.3 లక్షలకు పైగా ఆదాయం పొందుతున్నాడు. తెనాలి: ‘ఉమా తెలుగు ట్రావెలర్’.. మాలెంపాటి ఉమాప్రసాద్ అనే 33 ఏళ్ల యువకుడు నడుపుతున్న యూట్యూబ్ చానల్ పేరిది. కేవలం 18 నెలల్లో ఆఫ్రికా, మధ్య ఆసియాలోని 20 దేశాలను చుట్టేసి.. ఆయా దేశాల్లోని గ్రామాలు, అక్కడి గిరిజన జాతుల జీవన స్థితిగతులు, ఆహార, ఆచార, వ్యవహారాలపై తీసిన 340 వీడియోలతో 7 లక్షల ఫాలోవర్లు, 115 మిలియన్ల వ్యూస్ సాధించాడు. ఎనిమిదేళ్లలో 197 దేశాలను చుట్టి, అక్కడి వింతలు, విశేషాలను తెలుగు ప్రజలకు అందించాలనే ఏకైక ఆశయంతో పయనిస్తున్న తెనాలి కుర్రోడి విజయ గాథలోకి తొంగిచూస్తే.. చదువు మానేసి.. ఫ్యాన్సీ షాపులో పనిచేసి.. కృష్ణా జిల్లా మూలపాలెంలో ఆర్థికంగా ఉన్నత కుటుంబానికి చెందిన మాలెంపాటి రామశేషయ్య, నాగమల్లేశ్వరి దంపతుల ముద్దుల తనయుడు ఉమాప్రసాద్. రెండేళ్ల వయసులోనే ఆ ఇంటి ఆర్థిక పరిస్థితులు తల్లకిందులయ్యాయి. దీంతో ఉమాప్రసాద్ కుటుంబం తల్లి నాగమల్లేశ్వరి పుట్టినిల్లయిన తెనాలి సమీపంలోని బూతుమల్లికి వచ్చేసింది. తెనాలిలోని ఇంగ్లిష్ మీడియం స్కూల్లో 8వ తరగతి వరకు చదివిన ఉమాప్రసాద్, అంతటితో చదువుకు ఫుల్స్టాప్ పెట్టేశాడు. కుటుంబానికి సాయపడేందుకు ఫ్యాన్సీ షాపులో రోజుకు రూ.20 కూలితో పనిలో చేరాడు. 6 నెలల తరువాత తెనాలి ఆర్టీసీ బస్టాండ్‌లోని సైకిల్ స్టాండ్‌లో రూ.1,500 వేతనంతో పనికి కుదిరాడు. అక్కడా కొద్దిరోజులే పనిచేశాడు. ఆ తరువాత ఓ మెస్లోను, నిర్మాణ కంపెనీలోను, చెన్నై, హైదరాబాద్, అసోంలో రకరకాల పనుల్లో గడిపాడు. చివరకు సెక్యూరిటీ కంపెనీలో రూ.18 వేల జీతానికి చేరాడు. నాలుగేళ్లకు జీతం రూ.25 వేలకు చేరుకుంది. రూ.లక్షన్నర పోగేసి.. ప్రపంచ దేశాలను చుట్టి రావాలనేది ఉమాప్రసాద్ కల. కొంచెం ఖాళీ దొరికితే చాలు యూట్యూబ్‌లో ట్రావెల్ వీడియోలు చూస్తుండేవాడు. తన కలను నెరవేర్చుకునేందుకు 2018 నాటికి రూ.1.50 లక్షలు పోగేసుకున్నాడు. తన కలల ప్రపంచంలోకి అడుగుపెట్టాలని తొలిసారిగా నేపాల్ వెళ్లాడు. స్కూటర్, మోటార్ సైకిల్, లారీ.. ఇలా ఏది కనబడినా లిఫ్ట్ అడిగి మరీ నేపాల్ చేరుకున్నాడు. అక్కడ జర్మనీ టూరిస్ట్ జంటతో పరిచయం పెంచుకున్నాడు. తగిన సంపాదన లేకుండా ప్రపంచ యాత్ర చేయడం కష్టమని, తిరిగి వెళ్లిపొతే మంచిదని ఆ జంట చెప్పడంతో డీలా పడిపోయాడు. తిరిగి స్వదేశానికి రాగా.. సెక్యూరిటీ కంపెనీలో ఉద్యోగం పోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం దొరకలేదు. మరోవైపు నిలకడ లేనోడని బంధుమిత్రులు సూటిపోటి మాటలతో ఆడిపోసుకునేవారు. బంధువుల్లో ఒకరు దక్షిణాఫ్రికాలోని మాలిలో ఉద్యోగం ఉందని.. నెలకు రూ.30 వేలు జీతం ఇస్తారని చెప్పటంతో 2019లో మాలి చేరుకున్నాడు. అక్కడ వాటర్ ప్లాంట్‌లో పనిచేస్తూ ప్రపంచయాత్ర చేసే మార్గాలను అన్వేషించసాగాడు. ఏడాది తర్వాత 2020 మార్చి 22న స్వదేశానికి వచ్చేయాలనుకున్నాడు. సరిగ్గా అదే రోజు ఇండియాలో లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. చేసేదిలేక మాలిలోనే ఉండిపోయాడు. కలల బీజం నాటింది అమ్మే తన యాత్రకు కొంత విరామం ఇచ్చి సొంతూరికి వచ్చిన ఉమాప్రసాద్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ప్రపంచ యాత్ర చేయాలనే తన కలకు బీజం వేసింది తన తల్లి నాగమల్లేశ్వరి అని చెప్పాడు. తన తల్లి ఉన్నత చదువులు చదవడంతో ఆమెకు జియోగ్రఫీ మేగజైన్లు, ఇంగ్లిష్ సినిమాలపై ఆసక్తి ఉండేదని.. వాటిని తల్లి తనకు కూడా పరిచయం చేసిందని చెప్పాడు. 19 ఏళ్లకే పెళ్లి చేసి, ప్రపంచ దేశాల విహారానికి పంపాలని తల్లి నాగమల్లేశ్వరి భావించారని.. ఆరి్థక పరిస్థితులు దెబ్బతినటంతో పెళ్లి సంగతటుంచి తానే సంపాదించాల్సి వచి్చందని చెప్పాడు. మాలిలో ఉద్యోగం చేయడం ద్వారా తన కలలకు ఓ రూపం వచ్చిందని, త్వరలోనే మళ్లీ తన యాత్రను పునఃప్రారంభిస్తానని ఉమాప్రసాద్ చెప్పాడు. ప్రపంచంలోని 197 దేశాలను చుట్టివచ్చి అక్కడి విశేషాలను తెలుగు ప్రజలకు అందించాలనేది తన ఆశయమని చెప్పాడు. అక్కడే మలుపు తిరిగింది.. మాలిలోనే ఉండే నీ కల నెరవేర్చుకోవచ్చు కదా అని స్నేహితులు చెప్పడంతో ఉమాప్రసాద్ ఆలోచించాడు. వారి ప్రోత్సాహంతో ప్రణాళికలు రచిస్తుండగా.. అతడి సెల్‌ఫోన్ కిందపడి పూర్తిగా దెబ్బతింది. ఉమా ఆసక్తిని గమనించిన వాటర్ ప్లాంట్ యజమాని ఇచి్చన రూ.30 వేలతో మే నెల 22న స్మార్ట్ ఫోన్, రూ.130తో సెల్ఫీ స్టిక్ కొన్నాడు. ఆ రోజే అతడి జీవితం కొత్త మలుపు తీసుకుంది. ఇండియాలో సాగయ్యే కూరగాయల్ని పండిస్తున్న ఆఫ్రికా వాసి మూసాతో తొలి వీడియో తీశాడు. ‘ఉమా తెలుగు ట్రావెలర్’ పేరుతో యూట్యూబ్‌లో వ్లాగ్ (వీడియోతో కూడిన బ్లాగ్) క్రియేట్ చేసి అప్లోడ్ చేశాడు. అలాగే వరుసగా 14 వీడియోలు పెట్టాడు. ఫాలోవర్లు 800 మంది వచ్చారు. ఆఫ్రికాలోని స్ట్రీట్ ఫుడ్‌పై తీసిన 15వ వీడియోతో అతడి జీవితం మారిపోయింది. జూన్ 1నుంచి అతడి వ్లాగ్కి విపరీతంగా ట్రాఫిక్ పెరిగింది. రోజుకు 15 వేల మంది ఫాలోవర్లను రికార్డు చేసింది. అదే అతడిలో ఆత్మవిశ్వాసం పెంచింది. కట్ చేస్తే ఏడాదిన్నర వ్యవధిలో దక్షిణాఫ్రికా, మధ్య ఆసియాలోని టాంజానియా, కెన్యా, ఉగాండా, జాంబియా, రష్యా సహా 20 దేశాలను సందర్శించాడు ఉమా ప్రసాద్. ఆ అభిరుచి ప్రస్తుతం యూట్యూబ్ చానల్ ద్వారా నెలకు రూ.3 లక్షలకు పైగా ఆదాయాన్ని అతడికి తెచ్చిపెడుతోంది. -
తెనాలిలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు..!
-
తెనాలి శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గోల్డెన్ పీకాక్ అవార్డు
తెనాలి: గ్రేటర్ నొయిడాలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ పరిశోధన, అభివృద్ధి కేంద్రం (ఆర్ అండ్ డీ) డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న తెనాలి శాస్త్రవేత్త డాక్టర్ తోట చిరంజీవి ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ పీకాక్ ఎకో ఇన్నోవేషన్–2021 అవార్డు అందుకున్నారు. రిఫైనరీలో వెలువడే వ్యర్థాలను విలువైన మెటీరియల్‌గా మార్చే, పర్యావరణ సమస్యలను పరిష్కరించే భారత్ జీఎస్సార్ క్యాట్ అనే ఉత్ప్రేరకాన్ని డాక్టర్ చిరంజీవి, ఆయన బృందం అభివృద్ధి చేసింది. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య నేతృత్వంలోని అవార్డుల జ్యూరీ సిఫార్సుల ఆధారంగా ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (ఐఓడీ) ఈ అవార్డును అందజేసింది. వీరు అభివృద్ధి చేసిన గ్యాసోలిన్ సల్ఫర్ తగ్గింపు ఉత్ప్రేరకం (భారత్ జీఎస్సార్ కాట్) ప్రయోగశాలలో విస్తృతమైన పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలతో భారతదేశంలో తొలిసారిగా చేసిన ఒక ప్రత్యేకమైన ఉత్పత్తి. దీనిని భారీస్థాయిలో ఉత్పత్తి చేసి, భారతీయ రిఫైనరీల్లో విజయవంతంగా ఉపయోగిస్తున్నారు. భారత్ జీఎస్సార్ కాట్‌కు పలు జాతీయ, అంతర్జాతీయ పేటెంట్లు లభించాయి. న్యూఢిల్లీలో వర్చువల్ విధానంలో ఈ అవార్డు ప్రకటించి, శుక్రవారం తనకు పంపినట్టు డాక్టర్ చిరంజీవి శనివారం వెల్లడించారు. -
శిల్పకళకు 'త్రీడీ' తళుకులు
తెనాలి: కాంస్య విగ్రహాలు, ఐరన్ స్క్రాప్ విగ్రహాలతో గుర్తింపును పొందిన తెనాలి సూర్య శిల్పశాల శిల్పులు మరో అడుగు ముందుకేశారు. తమ నైపుణ్యానికి త్రీడీ టెక్నాలజీని ఆలంబనగా చేసుకుని మినీయేచర్ విగ్రహాల తయారీకి పూనుకున్నారు. ఇటీవల మృతిచెందిన కన్నడ సినిమా పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మినీయేచర్ విగ్రహాలను చేసి, శుక్రవారం విలేకరుల ముందు ప్రదర్శించారు. దేవాలయాల రూపశిల్పి అయిన తండ్రి నుంచి వారసత్వంగా శిల్పకళను అందిపుచ్చుకున్న కాటూరి వెంకటేశ్వరరావు తన పరిధిని విస్తరించారు. ఆలయాలు, రాజగోపురాల రూపకల్పనతోనే సరిపెట్టకుండా.. సిమెంటు, ఫైబర్, కాంస్యం వంటి విభిన్న పదార్థాలతో విగ్రహాలు తయారుచేస్తూ వచ్చారు. ఫైన్ఆర్ట్స్లో మాస్టర్స్ డిగ్రీ చేసిన కొడుకు రవిచంద్ర కలిసిరావటంతో వారి సృజన ఎల్లలు దాటింది. ఐరన్ స్క్రాప్‌తో భారీ విగ్రహాలను తయారుచేసి అంతర్జాతీయ ఖ్యాతిని సాధించారు. తాజాగా కాటూరి వెంకటేశ్వరరావు రెండో కుమారుడు శ్రీహర్ష త్రీ–డీ టెక్నాలజీతో విగ్రహాల తయారీలో శిక్షణ పొందాడు. తమ శిల్పశాల ఆర్ట్ గ్యాలరీలో తొలిగా పునీత్ రాజ్‌కుమార్ మినీయేచర్ విగ్రహాలను చేశారు. బస్ట్ సైజు 12 అంగుళాల్లో, ఫుల్ సైజ్ 15 అంగుళాల ఎత్తులో వీటిని తయారు చేశారు. వీటిని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఇంట్లో, ఆఫీసుల్లో టేబుల్‌పై ఉంచుకోవచ్చు. మారుతున్న కాలానికి అనుగుణంగా సరికొత్తగా చేస్తున్న ఈ మినీయేచర్ విగ్రహాలతో తమ శిల్పశాల ఖ్యాతి మరింతగా ఇనుమడిస్తుందని శిల్పి శ్రీహర్ష అన్నారు. -
3 టన్నుల ఇనుముతో 14 అడుగుల అంబేడ్కర్ విగ్రహం
తెనాలి: తెనాలి శిల్పకారులు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 14 అడుగుల విగ్రహాన్ని ఇనుప వ్యర్థాలతో తయారు చేశారు. సూర్య శిల్పశాల నిర్వహకులైన తండ్రీకొడుకులు కాటూరి వెంకటేశ్వరరావు, కాటూరి రవిచంద్రలు 3 టన్నుల ఇనుప వ్యర్థాలను ఉపయోగించి, 3 నెలల శ్రమతో అంబేడ్కర్ విగ్రహాన్ని వీరు తీర్చిదిద్దారు. శిల్పశాల ఎదుట ఈ విగ్రహాన్ని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆదివారం ఆవిష్కరించారు. అంబేడ్కర్ విగ్రహంతో ఎమ్మెల్యే శివకుమార్ -
అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం ప్రారంభం
తెనాలి: గుంటూరు జిల్లా తెనాలిలో అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. తెనాలి మునిసిపాలిటీ సహకారంతో చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్న రెండురోజుల చలన చిత్రోత్సవాన్ని స్థానిక తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రొజెక్టర్ స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలనతో ఎమ్మెల్యే శివకుమార్‌తోపాటు చైర్పర్సన్ సయ్యద్ ఖాలీదా నసీమ్, బాలనటుడు మాస్టర్ భానుప్రకాష్, సినీ దర్శకుడు నాగమురళి తెడ్ల అతిథులుగా పాల్గొన్నారు. ప్రారంభ సభకు ఫిలిం సొసైటీ చైర్మన్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ అధ్యక్షత వహించారు. ఈ చలన చిత్రోత్సవం స్ఫూర్తితో తెనాలిలో ఇదే కళాక్షేత్రంలో ప్రతినెలా ఓ ఆదివారం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అంతర్జాతీయ బాలల సినిమాలను ప్రదర్శింపజేస్తామని చెప్పారు. తెనాలి మునిసిపాలిటీ, ఫిలిం సొసైటీ పెద్దల కమిటీ సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపడుతుందన్నారు. -
బుడుగుల సినిమా పండుగకు రండి
తెనాలి: ఆంధ్రా ప్యారిస్ తెనాలిలో అంతర్జాతీయ బాలల సినిమా పండుగకు వేళయింది. చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో తెనాలి మున్సిపాలిటీ సహకారంతో ఆది, సోమవారాల్లో అంతర్జాతీయ చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్‌ను నిర్వహించనున్నారు. తెనాలిలోని వివేక పబ్లిక్ స్కూలు ప్రాంగణంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ చైర్మన్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ, కార్యదర్శి బొల్లిముంత కృష్ణ, ఉపాధ్యక్షుడు డాక్టర్ కె.రామరాజు వివరాలను తెలియజేశారు. స్థానిక తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఆదివారం ఉదయం ఈ ఫిలిం ఫెస్టివల్‌ను ప్రారంభిస్తారు. మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలేదా నసీమ్ ముఖ్యఅతిథిగా, బాలల చిత్రాల దర్శకుడు నాగమురళి తెడ్ల, ప్రముఖ బాల నటుడు ఎ.భానుప్రకాష్ తదితరులు హాజరవుతారు. మధ్యాహ్నం నుంచి బాలల చిత్రాల ప్రదర్శన ఉంటుంది. ఫిలిం ఫెస్టివల్ రెండోరోజు సోమవారం తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ సొసైటీస్ ఆఫ్ ఇండియా కార్యదర్శి బీహెచ్ఎస్ఎస్ ప్రకాష్‌రెడ్డి, సినిమా దర్శకుడు ఎ.సురేష్ పాల్గొంటారు. రెండు రోజుల్లో వివిధ దేశాలకు చెందిన మొత్తం 11 బాలల సినిమాలను ప్రదర్శిస్తారు. తెనాలిలో రెండురోజుల ప్రదర్శనలకే పరిమితం కాకుండా మరో అయిదు రోజులపాటు జిల్లాలోని వివిధ పట్టణాల్లో అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాన్ని నిర్వహించనున్నామని చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ చైర్మన్ డాక్టర్ వీరనారాయణ చెప్పారు. సమావేశంలో కనపర్తి రత్నాకర్ రూపొందించిన సంస్థ లోగో, ప్రదర్శించనున్న సినిమా పోస్టర్లను ఆవిష్కరించారు. ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించే బాలల సినిమాలు ఇవే.. ఆదివారం: ‘ది సాంగ్ స్పారో’ (ఇరాన్), చార్లీ చాప్లిన్ సినిమా, తెనాలి నటులు నటించిన ‘రా.. కిట్టు’ (తెలుగు), దాదా (ఉజ్బెకిస్తాన్), చిల్డ్రన్ ఆఫ్ హెవెన్ (ఇరాన్). సోమవారం: మెల్బోర్న్ (ఇరాన్), మిస్టర్ బోన్స్ (సౌతాఫ్రికా), ‘దారి’ (లఘుచిత్రం), కలర్ ఆఫ్ పారడైజ్ (ఇరాన్), గుబ్బచ్చి గలు (కన్నడ), చార్లీ చాప్లీన్ నటించిన ‘ది ఛాంపియన్ అండ్ ఏ విమెన్’. -
వచ్చే ఏడాది నుంచి పాఠశాలలకు ర్యాంకింగ్ విధానం అమలు
తెనాలి టౌన్: వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలోని పాఠశాలలకు ర్యాంకింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్టు పాఠశాల విద్య ప్రిన్సిపల్ సెక్రటరి బి.రాజశేఖర్ తెలిపారు. తెనాలి మండలం కొలకలూరులోని జెడ్పీ హైస్కూల్‌ను పాఠశాల విద్య ప్రిన్సిపల్ సెక్రటరి బిరాజశేఖర్, కమిషనర్ వి.చినవీరభద్రుడు, అధికారుల బృందం శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసింది. పాఠశాలలో చేపట్టిన నాడు–నేడు పనులు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించింది. అనంతరం ఉపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో రాజశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువు చెప్పడమే ముఖ్యమైన అంశంగా ఉపాధ్యాయులు తీసుకోవాలని సూచించారు. సిలబస్ పూర్తి చేయడం ముఖ్యం కాదని, విద్యార్థులకు చదవడం, రాయడం, అర్థమయ్యేలా బోధించడం ముఖ్యమన్నారు. జనవరి 5వ తేదీన తిరిగి పాఠశాలకు వస్తామని, అప్పటికల్లా విద్యార్థులంతా ఇంగ్లిష్, తెలుగు సబ్జెక్టుల్లో రాసి, చదవగలిగేలా చూడాలన్నారు. వీరి వెంట స్కూల్ ఎడ్యుకేషన్ అడ్వయిజర్ మురళి, సమగ్ర శిక్షా ఎస్పీడీ కె.సెల్వి, ఎస్ఈఆర్టీ డైరెక్టర్ బి.ప్రతాపరెడ్డి, డీఈవో ఆర్ఎస్ గంగాభవాని, సమగ్ర శిక్షా ఏపీసీ ఎం.వెంకటప్పయ్య, డీవైఈవె కె.నారాయణరావు ఉన్నారు. -
అమెరికా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తెనాలి శిల్పులు
తెనాలి: ఇనుప వ్యర్థాలతో శిల్పకళా ఖండాలను తీర్చిదిద్దుతూ అంతర్జాతీయ గుర్తింపును పొందిన తెనాలికి చెందిన కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్రలు అమెరికా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదయ్యారు. స్థానిక సూర్య శిల్పశాల నిర్వాహకులైన ఈ తండ్రీకొడుకులు పదేళ్లుగా ఇనుప వ్యర్థాలతో అద్భుతమైన కళాకృతులను రూపొందిస్తున్నారు. వీటిలో 75 వేల ఇనుప నట్లతో మహాత్మాగాంధీ, ప్రధాని మోదీ నిలువెత్తు విగ్రహాలు ఉన్నాయి. ఇవికాకుండా జీప్, ఆటో, స్కూటర్, మహిళ, సింహంతో సహా మరెన్నో కళాఖండాలను ఇనుప నట్లతో తయారు చేశారు. ఇంతవరకు 100 టన్నుల ఇనుప వ్యర్థాలను ఇందుకోసం వినియోగించారు. ఇంత భారీ మొత్తంలో ఐరన్ స్క్రాప్‌ను వాడి, తయారైన భారీ శిల్పకళాఖండాలను దేశంలోని పలు రాష్ట్రాలతో సహా విదేశాలకు పంపారు. వీటన్నిటిని గుర్తించి వెంకటేశ్వరరావు, రవిచంద్ర పేర్లు అమెరికా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు చేసింది. ఈ మేరకు సంబంధిత సంస్థ శనివారం వీరికి అధికారిక సమాచారాన్ని పంపింది. -
పెట్రోల్ బంకులో చొరబడి మందుబాబుల హల్చల్
-
పెట్రోల్ బంకులో చొరబడి మందుబాబుల హల్చల్..
గుంటూరు: తెనాలిలో మందుబాబులు పట్టపగలు వీరంగం సృష్టించారు. మురిపాలంలో గల పెట్రోల్ బంకులో ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు అడ్డుపడిన కానిస్టేబుల్‌ను చితక్కొట్టారు. కాగా, ఈ దృశ్యాలన్నీ బంకులో ఉన్న సీసీ ఫుటెజీలో రికార్డు అయ్యాయి. దీంతో పెట్రోల్ బంకు నిర్వాహకులు.. పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికులను, బంకు సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
ప్రతి ఆర్బీకేలో ఓ శాస్త్రవేత్త
తెనాలి: జర్మనీ ప్రభుత్వ సహకారంతో వచ్చే ఏడాది రాష్ట్రంలో రూ.200 కోట్లతో ఇండో–జర్మన్ గ్లోబల్ ఆగ్రో ఇకాలజీ రీసెర్చ్ అండ్ లెర్నింగ్ సెంటర్ ఏర్పాటు కానుందని ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి.విజయకుమార్ చెప్పారు. రానున్న ఐదేళ్లలో ప్రకృతి వ్యవసాయం చేసే 10 వేల రైతులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్ది, ప్రతి ఆర్బీకేలోనూ ఒక శాస్త్రవేత్త పనిచేసేలా చూడాలన్నది ప్రభుత్వ సంకల్పమన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, ప్రభుత్వం తరఫున లక్ష మంది విద్యావంతులైన ప్రకృతి రైతులకు శిక్షణ ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశంతో ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ ఇందుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా కొల్లిపర మండలం అత్తోట గ్రామాన్ని ఎంచుకున్నారు. గ్రామం వెలుపల ఆశ్రమంలో బుధవారం ఏర్పాటైన తరగతుల్లో తెనాలి ప్రాంతంలోని వివిధ గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న 50 మంది విద్యావంతులైన యువ రైతులు పాల్గొన్నారు. వీరికి ఆర్గానిక్ సర్టిఫికేషన్, ఆర్గానిక్ ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఫార్మర్ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్.. అనే అంశాలపై శిక్షణ ఇచ్చారు. అనంతరం విజయకుమార్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ వైవిధ్యమైన పంటలతో భూమిని 365 రోజులూ కప్పి ఉంచేలా తగిన ప్రణాళికతో ప్రకృతి వ్యవసాయం చేయాలని సూచించారు. దీనివల్ల పోషక విలువలు కలిగిన ఆహార పంటలు వస్తాయనీ, అధిక దిగుబడులతో పాటు ఆదాయమూ పెరుగుతుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగంలో 1.40 కోట్ల ఉద్యోగాలుంటే, ఆటోమొబైల్ పరిశ్రమల్లో 1.20 కోట్ల ఉద్యోగాలే ఉన్నాయని, వ్యవసాయరంగంలో 150 కోట్ల ఉద్యోగాలున్నట్టు విజయ్‌కుమార్ వివరించారు. -
ఈ పాపం టీడీపీదే
సాక్షి ప్రతినిధి, గుంటూరు, తెనాలి, తెనాలి రూరల్: నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైన వ్యవహారంలో తెరపై సూత్రధారులు తెనాలి కొత్తపేటకు చెందిన జి.అమ్మేశ్వరరావు, మల్లేశ్వరరావులు కాగా, తెరవెనుక టీడీపీ ప్రముఖులు కథ నడిపినట్లు స్పష్టమవుతోంది. పిటిషన్లు వేయడానికి కారణమైన వీరిద్దరికి టీడీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. గతంలో ఓ కార్మిక సంఘంలో పని చేసిన అమ్మేశ్వరరావుతో పాటు ఒక కుల సంఘం నేతగా ఉన్న ఎం.మల్లేశ్వరరావులు పేదలకు ఇళ్ల స్థలాలను ఇప్పిస్తామని నమ్మబలికి, వారి నుంచి ధృవీకరణ పత్రాలు, సంతకాలు సేకరించారు. వీటి ద్వారా 2016లో అప్పటి మండల తహశీల్దారుపై అమ్మేశ్వరరావు హైకోర్టులో కేసు వేశారు. అదే కేసులో పిటిషనుదారుల్లో చాలా మంది పేర్లతో మళ్లీ గత డిసెంబర్లో పేదలందరికీ ఇళ్లు పథకంపై పిటిషను దాఖలు చేశారు. హైదరాబాద్‌కు చెందిన సివిల్ న్యాయవాదికి తాను ఈ పత్రాలు ఇచ్చినట్టు అమ్మేశ్వరరావు స్థానికుల వద్ద అంగీకరించాడు. అదేమని అడిగితే ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల స్థలం సరిపోదని, అందుకే హైదరాబాద్‌లో సివిల్ న్యాయవాదికి ఇచ్చి పిటిషన్ వేయించినట్టు చెబుతున్నాడు. ‘మీ అంతట మీరే కేసు వేశారా? ఎవరి ప్రోద్భలమైనా ఉందా? ఇళ్ల స్థలాల అర్జీలకంటూ సంతకాలు తీసుకుని, వారి పేర్లతో పిటిషన్ వేయటం ఏమిటి’ అన్న బాధితుల ప్రశ్నలకు అతను సమాధానం ఇవ్వడం లేదు. కొత్తపేటలోని పట్టాభి రోడ్డులో డ్రైనేజి కాలువ పక్కన చిన్న ఇంటిలో నివసించే అమ్మేశ్వరరావు.. హైకోర్టు లాయరుకు భారీ ఫీజులు చెల్లించి.. కోర్టులో పిటిషన్ వేసేంత స్థోమత లేదని స్థానికులు చెబుతున్నారు. ఈ కేసు కోసం సుమారు 10 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టినట్లు తెలిసింది. ప్రస్తుతం టీడీపీ నాయకులతో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్న అమ్మేశ్వరరావుకు ఆ పార్టీకి చెందిన పెద్దలు సహకరించడం వల్లే ఇది సాధ్యమైందని తెలుస్తోంది. టీడీపీ పెద్దలు తెరవెనుక నుంచి ఇచ్చిన సూచనల మేరకు కొంత మంది ఆ పార్టీ నేతల ద్వారా ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. అయితే పిటిషన్ వేసిన వారిలో మృతి చెందిన మహిళ ఉండటం, పేర్లు సరిచూసుకోక పోవడం తదితర కారణాల వల్ల ఇట్టే దొరికి పోవాల్సి వస్తోందని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో జి.అమ్మేశ్వరరావు నివసిస్తున్న ఇల్లు మాకు ఏ పాపం తెలియదు ‘మేం తెనాలి చంద్రబాబుకాలనీ వాసులం. మాకు తెలియకుండా, మా ప్రమేయం లేకుండా మా సంతకాలు ఫోర్జరీ చేసి గౌరవ హైకోర్టులో మాకు ప్రభుత్వం వారు ఇచ్చిన ఇళ్ల స్థలాల గురించి కేసు వేసి స్టే ఉత్తర్వులు తీసుకున్నట్లు మాకు టీవీలు, పేపర్ల ద్వారా తెలిసింది. నాలుగేళ్ల క్రితం గుండెమెడ అమ్మేశ్వరరావు, ఎం. మల్లేశ్వరరావులు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామంటే ఆధార్‌కార్డులు, రేషన్ కార్డు జిరాక్స్‌లు ఇచ్చాము. తర్వాత ఎన్నిసార్లు అడిగినా స్పందించలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక మాకు ఇళ్ల స్థలాలు వచ్చాయి. మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు వేయలేదు. మాకు తెలియకుండా మా వివరాలతో కేసు వేసిన కుట్రదారులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోండి’ అంటూ గుంటూరు జిల్లా తెనాలికి చెందిన తుమ్మపూడి అశోక్‌కుమార్, పరుచూరు బేబీ సరోజిని, కొండా నాగమంజుల, కనికరం రాంబాబు, శేని సత్యవతి, ఎస్ లీలాప్రసాద్, చనగవరపు శివకుమారి, షేక్ జిలాని, భీమిశెట్టి రామ్మోహన్రావు తదితరులు తెనాలి త్రీటౌన్ పోలీసు స్టేషన్లో బుధవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. కుట్రదారులను విచారించండి ఈ ప్రభుత్వ వచ్చిన తర్వాత ‘నవరత్నాలు–పేదలందరికి ఇళ్లు’ పథకంలో భాగంగా తమకు ఇళ్ల స్థలాలు మంజూరు అయ్యాయని, స్థలాన్ని తమకు స్వాధీనం చేశారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. తాము ఇళ్ల స్థలాల కోసం ఏ కోర్టులోనూ ఎటువంటి కేసులు వేయలేదని, ఏ ప్లీడర్ను కలవలేదని ఫిర్యాదులో వివరించారు. తమ వద్ద నుంచి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు తీసుకున్న గుండెమెడ అమ్మేశ్వరరావు, ఎం. మల్లేశ్వరరావు వారి రాజకీయ స్వలాభం కోసం తమ సంతకాలు ఫోర్జరీ చేసి హైకోర్టులో వేసిన ఈ కేసుతో తమకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ కుట్రకు పాల్పడిందెవరో పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కోరారు. పేదల్లో కలవరం పేదలందరికీ ఇళ్ల పథకానికి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో 369, జీవో 488, జీవో 99లను సవాలు చేస్తూ గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పొదిలి శివమురళి, మరో 128 మంది గతేడాది డిసెంబర్లో హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన హైకోర్టు న్యాయమూర్తి మల్లవోలు సత్యనారాయణమూర్తి ఈనెల 8న ఇళ్ల పథకానికి బ్రేక్ వేస్తూ తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని పత్రికల ద్వారా తెలుసుకున్న పొదిలి శివమురళి ఈ కేసుతో తమకు సంబంధం లేదంటూ మీడియా ముందుకు రావడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ఇళ్ల పథకాన్ని నిలిపివేయమని ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పులో తెనాలివాసుల పేర్లు ఉన్నాయన్న సమాచారం చాలా మంది పేదల్లో కలవరం కలిగించింది. పలువురు తమ పేరు ఉందేమోనన్న ఆందోళనతో పట్టణ 23వ వార్డులోని సచివాలయానికి వెళ్లారు. పిటిషనులో తమ పేర్లు ఉన్నాయేమో చూడాలని సచివాలయం సిబ్బందిని కోరారు. పిటిషన్లో పేర్లు లేని మరికొంత మంది కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామంటే అమ్మేశ్వరరావుకు డబ్బులు ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు. చాలాసార్లు అతడి కోసం తిరిగి, ఆశలు వదిలేసుకున్నామని మీడియాకు తెలిపారు. పిటిషన్లో చనిపోయిన మహిళ పేరు ఇళ్ల స్థలాలపై హైకోర్టులో వేసిన పిటిషన్లో తెనాలికి చెందిన కొండెం ప్రమీల పేరు ఉంది. ఈ పిటిషన్‌ను గత ఏడాది డిసెంబర్లో వేశారు. అయితే కొండెం ప్రమీల అనారోగ్యంతో గత ఏడాది మార్చి 4వ తేదీ చనిపోయినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. చనిపోయిన ఈమె ఎలా పిటిషన్ వేస్తుందని ఆ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో ఇద్దరి పేర్లు రిపీట్ అవ్వగా, కొందరి అడ్రస్‌లు తప్పుడువి ఇచ్చారు. చాలా మంది పిటిషన్లో పేర్కొన్న చిరునామాలలో ఉండటం లేదు. తొలుత ఈ వ్యవహారాన్ని ‘సాక్షి’ బయటపెట్టగానే తెలుగుదేశం నేతలు భుజాలు తడుముకోవడం పలు అనుమానాలకు దారితీసింది. పిటిషన్ దారుల్లో మొదటి వ్యక్తిగా చెబుతున్న పొదిలి శివమురళి తాను తమ కులపెద్ద ఎం.మల్లేశ్వరరావుకు ఆధార్‌కార్డు ఇచ్చానని చెబితే, తెనాలి ఎమ్మెల్యే పేరు చెప్పినట్లుగా వక్రీకరిస్తూ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా విలేకరుల సమావేశం పెట్టడంతో ఇందులో తెలుగుదేశం నాయకుల పాత్ర ఉన్నట్లు స్పష్టంగా అర్థం అవుతోంది. కేసు వేయించింది ఆలపాటి రాజాయే – తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ మండిపాటు ఇళ్ల స్థలాల పథకంపై హైకోర్టులో కేసు వేయించింది మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా అని తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మండిపడ్డారు. ఇళ్ల స్థలాల పథకంపై హైకోర్టును ఆశ్రయించిన పిటిషనుదారుల్లో ప్రథముడైన పొదిలి శివమురళి వీడియో సాక్షిగా చెప్పిన అంశాన్ని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా వక్రీకరించి, తనకు ఆపాదించాలని చూశారని విమర్శించారు. రికార్డు స్థాయిలో ఇళ్ల నిర్మాణం ద్వారా తెనాలిలో ఇక తనకు స్థానం లేదన్న దుగ్ధతో ఆలపాటి రాజానే ఈ కేసు వేయించారని చెప్పారు. దీని వెనుక ప్రజల్లో అనుమానాలు రేకెత్తించాలనే భారీ కుట్ర ఉందంటూ బుధవారం విలేకరుల సమావేశంలో నిప్పులు చెరిగారు. ముందుగా పిటిషనుదారుల్లో ఒకరైన పొదిలి శివమురళి మాట్లాడిన వీడియోను, దాని ఆధారంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆలపాటి రాజా ప్రెస్‌మీట్ వీడియోను మీడియా ఎదుట ప్రదర్శించారు. తాను నాయీబ్రాహ్మణ కులస్తుడినని, తన కులపెద్ద ఎం.మల్లేశ్వరరావుకు ఇళ్ల స్థలాల కోసమని డబ్బులు, ధృవీకరణ పత్రాలు ఇచ్చానని శివమురళి చెబితే, ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌కు ఇచ్చానని చెప్పాడంటూ రాజా తనపై ఆరోపణ చేయటం ఏమిటని శివకుమార్ ప్రశ్నించారు. ఇళ్ల స్థలాలను అడ్డుకునే కుట్ర టీడీపీ కేంద్ర కార్యాలయంలోనే పురుడుపోసుకుందని చెప్పారు. పంచాయతీ కార్యాలయాలపై పార్టీ రంగులు తొలగించాలంటూ టీడీపీకి చెందిన వెంకట్రావుతో కేసు వేయించిందీ రాజానేనని చెప్పారు. క్రిమినల్ మైండ్ కలిగిన రాజా, కోర్టుల్లో తనకు అపారమైన పలుకుబడి ఉందని చెప్పుకుంటూ, సెటిల్మెంట్లు చేయటం అలవాటని ఆరోపించారు. టీడీపీకి చెందిన నన్నపనేని సుధాకర్ దగ్గర కోర్టు కేసు విషయంలో రాజా రూ.25 లక్షలు తీసుకున్నాడని తాను ఏడాది క్రితం ఆరోపించినట్టు ఆయన గుర్తు చేశారు. ఆ తర్వాత రెండు నెలలకు రూ.10 లక్షలు తిరిగి ఇచ్చాడనే విషయాన్ని సుధాకర్ స్వయంగా తనకు చెప్పారని తెలిపారు. -
హైకోర్టును మోసం చేశారు
నిజమేనా...? అత్యున్నత న్యాయస్థానాన్ని,రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏకంగా న్యాయ వ్యవస్థనే ఈ స్థాయిలో మోసం చేయడం సాధ్యమా? దుర్మార్గపుటెత్తుగడలతో... అమాయకుల పేరిట.. వారికి తెలియకుండా పిటిషన్ తయారు చేసి... 31 లక్షల మంది నిరుపేదల సొంతిళ్లకు బ్రేకులేశారంటే ఏ స్థాయి దుర్మార్గమిది? నిరుపేదల ఆశలను చిదిమేయడానికి కంకణం కట్టుకున్న నయవంచన ఎవరిది? వారి వెనకున్న కుట్రదారులెవరు? అయినా వీళ్ల కక్ష ఎవరిమీద? ఓ 50–70 గజాల్లో ఉండటానికింత పైకప్పు వేసుకుంటున్న నిరుపేదల మీదా? లేక వారి సొంతింటి కలలకు పూచీదారుగా నిలుచున్న ప్రభుత్వం మీదా? ఉన్నత న్యాయస్థానాల్లోనే ఈ అరాజకీయ క్రీడలు మొదలెట్టేశారంటే వీళ్లనేమనుకోవాలి? వీరు వ్యతిరేకిస్తున్నది తమ రాజకీయ ప్రత్యర్థులనా? లేక ప్రజలనా? ఇల్లు కట్టుకోబోతున్నాం నేనెందుకు కేసు వేస్తా? మల్లేశ్వరరావు అనే వ్యక్తి ఇళ్లస్థలాలు ఇప్పిస్తానని చెబితే ఆధార్, రేషను కార్డు ఇచ్చా. సంతకం చేయించుకున్నాడు. చాలా ఏళ్లయింది. ఎప్పుడు అడిగినా వస్తాయి... వస్తాయి అనేవాడు. తర్వాత ఆ విషయమే మర్చిపోయాం. ఇప్పుడు నా భార్య పేరిట నేలపాడులో ఇంటి స్థలం వచ్చింది. ఇల్లు కట్టుకోబోతున్నాం. కోర్టులో కేసు విషయం మాకు తెలీదు. మేమెందుకు వేస్తాం? ఆ పిటిషన్‌తో సంబంధం లేదు. – పొదిలి శివమురళి, పిటిషనర్ నంబర్–1గా పేర్కొన్న వ్యక్తి. సాక్షి, ప్రతినిధి గుంటూరు/తెనాలి: 27 వేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని... 31 లక్షల మందికి కేటాయించి... ఊళ్లను తలపించే కాలనీలు కట్టడానికి సంకల్పించింది వైఎస్ జగన్ ప్రభుత్వం. నిజానికిది గత ప్రభుత్వాల ఊహలక్కూడా అందని విషయం. ప్రభుత్వ దృఢదీక్షతో స్థలాల కేటాయింపు పూర్తయి... తొలిదశలో 15.6 లక్షల మంది ఇళ్ల నిర్మాణాలూ మొదలయ్యాయి. కాకపోతే దీనిపై గుంటూరు జిల్లా తెనాలిలోని పొదిలి శివమురళి, మరో 128 మంది పేరిట పిటిషన్ దాఖలైంది. మహిళల పేరిటే ఎందుకివ్వాలి? ఇళ్లు చిన్నవికదా? ఆ ఇళ్ల సదుపాయాల సంగతేంటి? ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్న ఈ పిటిషన్‌పై విచారణ... వాదనలూ పూర్తయి... ఇళ్ల నిర్మాణాలన్నింటినీ తాత్కాలికంగా నిలిపేయాలంటూ న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ఈ నెల 8న ఆదేశాలిచ్చారు. దీనిపై రాష్ట్రప్రభుత్వం హైకోర్టులో హౌస్‌మోషన్ దాఖలు చేసింది. ఈ విషయాలన్నీ పత్రికల్లో చూసే వరకూ అసలు తమ పేర్లతో పిటీషన్ వేసినట్లు తెనాలి వాసులకు తెలియదు. దీంతో... తాము పిటిషన్ వేయకున్నా తమ పేర్లు వినిపిస్తున్నాయంటూ కొందరు ‘సాక్షి’ని ఆశ్రయించారు. వారి వద్దకు వెళ్లి ఒక్కొక్కరినీ ఆరా తీసేసరికి నిర్ఘాంతపోయే నిజాలు బయటపడ్డాయి. ‘‘అయ్యా! ఈ పిటిషన్‌తో మాకెలాంటి సంబంధమూ లేదు. ఈ ప్రభుత్వ హయాంలో నా భార్యకు స్థలమిచ్చి ఇల్లు మంజూరు చేశారు. కట్టుకుంటున్నాం. మా ఇంటిని మేమే నిలిపేసుకుంటామా?’’ అనేది ప్రధాన పిటిషనర్‌గా (నెంబర్–1) పేర్కొన్న పొదిలి శివ మురళి ప్రశ్న. మరి మురళికి సంబంధం లేకుండా తన పేరిట పిటిషన్ ఎవరు వేశారు? వారికి కావాల్సిందేంటి? వారి వెనక ఎవరున్నారు? పేదల ఇళ్లపై ఎందుకింత పెద్ద కుట్ర చేశారు? న్యాయ ప్రక్రియ అపహాస్యం... అన్యాయం జరిగిన వారికి న్యాయం చెయ్యటమే కోర్టుల పరమోద్దేశం. దానికోసమే న్యాయ ప్రక్రియ. మరి ఈ ప్రక్రియ మొత్తాన్ని అపహాస్యం చేసి... ఓ 31 లక్షల మందికి అన్యాయం చేయాలనే ఉద్దేశంతో కోర్టులనే మోసం చేస్తే ఏమనుకోవాలి? ప్రధాన పిటిషనర్‌గా ఉన్న శివ మురళి మాత్రమే కాదు. అఫిడవిట్ దాఖలు చేశారంటూ పేర్కొన్న గోపిది కూడా ఇదే మాట. ‘‘ఆరేళ్ల కిందట ఓ వ్యక్తి ఇంటి స్థలం ఇíప్పిస్తానని తలా రూ.5వేలు తీసుకున్నాడు. ఆధార్, రేషన్ కార్డులు తీసుకుని సంతకాలు చేయించుకున్నాడు. కాళ్లరిగేలా తిప్పించుకున్నాడు కానీ ఇప్పటికీ ఏమీ జరగలేదు. మోసపోయానని తెలిసినా పోలీసుల దగ్గరికే వెళ్లలేకపోయా. కోర్టులో కేసు ఎలా వేస్తా?’’ అనేది గోపి ప్రశ్న. దీన్నిబట్టే న్యాయప్రక్రియను ఎంత దుర్వినియోగం చేశారో అర్థంకాకమానదు. ఇక పిటిషన్లో 14, 15 పేర్లుగా ఉన్న షేక్ నయాబ్ రసూల్, షేక్ మాబులా ప్రస్తుతం ఉపాధి కోసం వేరే ఊరు వెళ్లారు. ఫోన్లోనే మాట్లాడారు. ‘‘నాలుగేళ్ల కిందట ఇంటి స్థలం కోసం ఎం.ఎస్.రావు అనే వ్యక్తికి రూ.25 వేలు, «ధ్రువపత్రాలు కూడా ఇచ్చా’’ అని నయాబ్ చెప్పగా... అదే వ్యక్తికి రూ.40 వేలు ఇచ్చానని మాబులా చెప్పాడు. ‘‘ఈ ప్రభుత్వం మా ఇంటి ఆడవారి పేరిట ఇంటిస్థలం ఇచ్చింది. మేమెందుకు కేసు వేస్తాం?’’ అని ఇద్దరూ ఎదురు ప్రశ్నించారు. అప్పుడు దళారుల చుట్టూ... ఇçప్పుడు కోర్టు రికార్డుల్లో పలువురు పిటిషనర్లు ‘సాక్షి’ని సంప్రదించాక... వారందరితో మాట్లాడాక ఒక విషయం ప్రధానంగా అర్థమయింది. దాదాపు పిటిషనర్లంతా దీంతో తమకు సంబంధం లేదన్నవారే. పైపెచ్చు అందరూ ఐదారేళ్ల కిందట టీడీపీ హయాంలో సొంత ఇంటి కోసం దళారుల చుట్టూ తిరిగి, ఒక్కొక్కరూ పరిస్థితిని బట్టి రూ.5వేల నుంచి రూ.40 వేల వరకూ లంచంగా ముట్టజెప్పిన వారే. ఆ క్రమంలో చాలామంది తమ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇవ్వటంతో పాటు పలు పత్రాలపై సంతకాలు కూడా చేశారు. తెనాలిలోని కొత్తపేట, మారీసు పేట, సీబీఎన్ కాలనీల్లో ఒక్కోచోట ఒక్కో దళారీ ఈ విధంగా పేదలపై ఇళ్లస్థలం పేరుతో వల వేశారు. స్థలం రాకపోగా, డబ్బులూ తిరిగివ్వలేదు. ఏళ్లు గడిచేసరికి ఆ విషయమే మర్చిపోయారు. వీరంతా పేదలే. కానీ వారి పేర్లు పిటిషనర్లుగా ప్రత్యక్షమయ్యాయి. ఈ మొత్తం ప్రక్రియను నడిపించింది కొందరైతే... వారి వెనక బలంగా నిలుచున్న శక్తులు మాత్రం వేరే ఉన్నట్టు స్పష్టంగానే తెలియకమానదు. మేమెలాంటి కేసూ వేయలేదు... గత టీడీపీ ప్రభుత్వ హయాంలో తహశీల్దారు ఆఫీసు దగ్గరకు తరచూ వెళుతూ... పనులు చేయిస్తుండే ఓ బ్రోకర్ కలిశాడు. ఇంటిస్థలం ఇప్పిస్తానన్నాడు. తలా రూ.5 వేలు తీసుకున్నాడు. ఆధార్ కార్డులు, రేషను కార్డులు ఇచ్చాం. సంతకాలు చేయించుకున్నాడు. ఇది జరిగి ఆరేడు సంవత్సరాలవుతోంది. ఇదిగో వస్తాయనేవాడు. నాలుగైదు నెలల కిందట అడిగితే నవరత్నాల కింద ప్రభుత్వం ఇస్తుందని చెప్పాడు. ఇపుడు నేనూ, నా భార్య విడిపోయాం. మేమెవ్వరం కోర్టులో ఎలాంటి కేసూ వేయలేదు. – గుండిమెడ గోపి, చినరావూరు పార్కు రోడ్డు, తెనాలి కేసుల సంగతి మాకేం తెలీదు... కోర్టులో కేసు సంగతి నాకేం తెలీదు. అదెలా జరిగిందో అర్థంకావటం లేదు. ఈ ప్రభుత్వంలో నాకు అమ్మ ఒడి డబ్బులు వచ్చాయి. కాపు నేస్తం కింద సాయం అందింది. ఇంటిస్థలం కూడా వచ్చింది. నేనెందుకు కేసు వేస్తాను? – శానంశెట్టి వాణి, మారీసుపేట, తెనాలి ఎవరికీ ఆధార్ కార్డు, రేషను కార్డు ఇవ్వలేదు... నాకు అమ్మ ఒడి డబ్బులు పడ్డాయి. ఇంటి స్థలం పట్టా ఇచ్చారు. భర్త తిరుపతిరావు తాపీ పని. నేను టైలరింగ్ చేస్తాం. నేనెలాంటి కేసూ వేయలేదు. మాకేం అవసరం? రోజు కష్టంమీద బతికే వాళ్లం. మా ఆధార్ కార్డు, రేషను కార్డు కూడా ఎవరికీ ఇవ్వలేదు. – చైని సుభాషిణి, సీబీఎన్ కాలనీ, తెనాలి పోలీసు స్టేషన్‌కే వెళ్లలేని వారు కోర్టుకా? టీడీపీ హయాంలో కొందరు దళారులు ఇళ్లస్థలాల పేరుతో మా సంఘంలోని పేదలను మభ్యపెట్టి డబ్బులు కాజేశారు. వాళ్లకు జరిగిన మోసంపై పోలీసులను కూడా ఆశ్రయించలేని ఆ పేదలు ప్రభుత్వంపై కోర్టుకెలా వెళతారు? దీనిపై లోతుగా విచారణ చేయించాలి. – రిమ్మనపూడి నరసింహారావు, తెనాలి నాయీబ్రాహ్మణ సేవాసంఘం ప్రభుత్వం ధర్మాసనం దృష్టికి తేవాలి... కోర్టులో వేసిన కేసుతో సంబంధం లేదని పిటిషనర్లు చెబుతున్నారు కనుక ఆ విషయాన్ని ప్రభుత్వం తన అప్పీల్లో ధర్మాసనం దృష్టికి తీసుకురావాలి. కేసుతో సంబంధం లేదన్న విషయాన్ని అఫిడవిట్ల రూపంలో కోర్టు ముందుంచాలి. పిటిషనర్లకు తెలియకుండా, వారి ప్రమేయం లేకుండా వారి పేరుతో పిటిషన్ దాఖలు చేయడం కోర్టును మోసం చేయడమే. – సీవీ మోహన్‌రెడ్డి, సీనియర్ న్యాయవాది ఏదో జరిగి ఉండాలి... పిటిషనర్లే ఆ పిటిషన్‌తో సంబంధం లేదంటున్నారంటే దీని వెనుక ఏదో జరిగి ఉండాలి. పిటిషనర్లను మోసం చేసి వారి సంతకాలను దుర్వినియోగం చేసి ఉండాలి. వారి సంతకాలు తీసుకున్నది ఎవరు..? వారి తరఫున కేసు ఫైల్ చేసిన అడ్వొకేట్ ఆన్ రికార్డ్ ఎవరు? పిటిషనర్ల సంతకాలు సరైనవేనా? తదితర విషయాలపై విచారణ జరపాల్సిన అవసరం ఉంది. పిటిషనర్ల సమ్మతి లేకుండా పిటిషన్ దాఖలు చేయడం కోర్టును మోసం చేయడమే. కోర్టు ధిక్కారం కిందకు వస్తుంది. పిటిషనర్లంతా కేసుతో సంబంధం లేదని అఫిడవిట్లో చెబితే, అసలు తీర్పే అమల్లో ఉండదు. – సర్వ సత్యనారాయణ ప్రసాద్, సీనియర్ న్యాయవాది -
AP: హరికథ కళాకారిణి రాధాబృందావని హఠాన్మరణం
తెనాలి: పట్టణానికి చెందిన ప్రముఖ హరికథా భాగవతారిణి, టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు హరికథకురాలు టి.రాధాబృందావని (58) మంగళవారం ఇక్కడి ఆర్ఆర్ నగర్‌లోని స్వగృహంలో గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆమెకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రముఖ భాగవతార్ తిరువాయిపాటి రామారావు కుమార్తె రాధాబృందావని. ప్రముఖ మృదంగ విద్వాంసుడు తిరుపతి రామానుజ సూరి కుమారుడు తిరు వెంగళయ్య సూరి భార్య. తొలుత ప్రఖ్యాత హరికథా భాగవతార్ తెల్లాకుల వెంకటేశ్వర గుప్త వద్ద శిష్యరికం చేసినా, తర్వాత తండ్రి గురువుగా హరికథ సాధన చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో సహా అనేక రాష్ట్రాల్లో హరికథాగానం చేశారు. కుసుమ హరనాథ్ హరికథను గానం చేస్తున్న ఏకైక కళాకారిణిగానూ గుర్తింపు పొందారు. -
తెనాలిలోనే సినిమా పేర్ల రిజిస్ట్రేషన్
తెనాలి: గుంటూరు జిల్లా తెనాలిలోని సీమాంధ్ర ఫిలిమ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థకు కొత్త సినిమాలకు టైటిల్స్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిమ్ నోటిఫికేషన్ నుంచి అనుమతి లభించింది. స్థానిక చెంచుపేటలోని రత్న ఫార్చ్యూన్ కల్యాణమండపంలో శుక్రవారం సీమాంధ్ర ఫిలిమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యవస్థాపకుడు, సినీ దర్శకుడు దిలీప్‌రాజా వివరాలను వెల్లడించారు. చదవండి: తెలంగాణ పర్వతారోహకుడికి సీఎం జగన్ భారీ ఆర్థిక సహాయం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిమ్ సర్టిఫికేషన్ ఆమోదంతో సినిమాలకు టైటిల్స్, బ్యానర్ రిజిస్ట్రేషన్, పబ్లిసిటీ క్లియరెన్సులు, లాబ్ లెటర్లు, డ్యూరేషన్ సర్టిఫికెట్లను జారీ చేసే అవకాశం తమ సంస్థకు లభించిందని చెప్పారు. తాము ఆమోదించిన టైటిల్స్‌కు కేంద్ర సెన్సార్ కార్యాలయం అనుమతిని ఇస్తుందన్నారు. అక్టోబరు మొదటి వారం నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు దిలీప్‌రాజా వెల్లడించారు. నిర్మాత చదలవాడ హరిబాబు, సినీ హీరోయిన్ మౌనికరెడ్డి, మిలటరీ ప్రసాద్, బి.జయకుమార్ ఉన్నారు. చదవండి: పరీక్ష రాయడానికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. -
గుంటూరులో లారీ బీభత్సం.. తల్లీకూతుళ్ల దుర్మరణం
సాక్షి, గుంటూరు: తెనాలి మార్కెట్ యార్డులో లారీ బీభత్సం సృష్టించింది. స్కూటీపై వెళ్తున్న తల్లీకూతుళ్లపైకి లారీ వేగంగా దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో కూతురితోపాటు తల్లి అక్కడికక్కడే మృతి చెందారు. కూతురిని స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లారీ అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఉపాధ్యాయుడికి దేహశుద్ధి
ప్రత్తిపాడు (గుంటూరు): విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి బాలిక బంధువులు దేహశుద్ధి చేసిన ఘటన ప్రత్తిపాడు మండలం వట్టిచెరుకూరులో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వట్టిచెరుకూరుకు చెందిన 12 ఏళ్ల బాలిక స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. సోమవారం పాఠశాలకు వెళ్లిన బాలికతో తరగతి గదిలో హిందీ ఉపాధ్యాయుడు రవిబాబు అసభ్యంగా ప్రవర్తించినట్టు బాలిక చెబుతోంది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన బాలిక మంగళవారం బడికి వెళ్లనని భీష్మించింది. ఎందుకని తల్లిదండ్రులు అడగ్గా.. ఈ విషయం చెప్పింది. దీంతో తల్లిదండ్రులు, బంధువులు స్థానికులతో కలిసి మంగళవారం ఉదయం పాఠశాలకు వెళ్లి హిందీ ఉపాధ్యాయుడు రవిబాబును బయటకు పిలిచి మూకుమ్మడిగా దాడి చేశారు. రవిబాబు పారిపోయేందుకు ప్రయత్నించగా.. అతడిని వెంబడించి పట్టుకుని మరీ దేహశుద్ధి చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరికొందరు ఉపాధ్యాయులనూ కొట్టడంతో పాఠశాలలో ఉద్రిక్తత నెలకొంది. చేబ్రోలు సీఐ మధుసూదనరావు, ఎస్ఐ రాజ్‌కుమార్ అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థిని చదవకపోవడం వల్లే కాస్త మందలించినట్టు ఉపాధ్యాయుడు చెబుతున్నారు. ఘటనపై డీఈవో ఆర్ఎస్ గంగాభవాని ఆదేశాల మేరకు బుధవారం స్థానిక పాఠశాలలో తెనాలి డివిజన్ ఉప విద్యాధికారి శ్రీనివాసరావు విచారణ చేపట్టనున్నారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక అందజేస్తామని ఇన్చార్జి ఎంఈవో రమాదేవి తెలిపారు. -
తేనెలూరే తెనాలి జిలేబీ.. తింటే మైమరచిపోవాల్సిందే!
తెనాలి జిలేబీని నోట్లో వేసుకున్నామంటే తన్మయత్వంతో కళ్లు మూసుకుంటాం.. నోట్లో కరిగిపోతున్న ఆ జిలేబీ ముక్క మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ మైమరచిపోతాం. ఒక్కసారి రుచి చూశామా.. ఇక జిహ్వ చాపల్యం చెప్పనలవి కాదు. మళ్లీ మళ్లీ కావాలంటూ మారాం చేస్తుంది. ఆ అద్భుత రుచి కోసం అర్రులు చాస్తుంది. బంగారు వర్ణంతో ధగధగలాడినా.. నలుపు రంగుతో నిగనిగలాడినా.. తేనెలూరే ఆ తెనాలి జిలేబీ టేస్టే వేరు.. తిని తీరాల్సిందే! సాక్షి, తెనాలి: తెనాలిలో బోస్ రోడ్డు నుంచి వహాబ్చౌక్కు దారితీసే యాకూబ్‌హుస్సేన్ రోడ్డును ‘జిలేబీ కొట్ల బజారు’ అంటారు. అక్కడుండే జిలేబీ దుకాణాల వల్ల దానికి ఆ పేరు స్థిరపడింది. 1965 నుంచి ఇక్కడ జిలేబీ వ్యాపారం సాగుతోంది. చీమకుర్తి సుబ్బయ్య అనే వ్యక్తి అక్కడ జిలేబీ తయారీకి ఆద్యుడు. రంగువేయని బెల్లంతో జిలేబి తయారీని ఆరంభించాడు. నలుపు రంగుతో ఉండే ఈ జిలేబీ స్థానంలో రంగు వేసిన బెల్లంతో ఆకర్షణీయ జిలేబీని తెచ్చిన ఘనత మాత్రం బొట్లగుంట రామయ్యకు దక్కుతుంది. 1972లో వ్యాపారంలోకి వచ్చిన రామయ్య.. తెనాలి జిలేబీకి బ్రాండ్ ఇమేజ్ను తెచ్చి ‘జిలేబీ రామయ్య’ అయ్యారు. ఆంధ్రాపారిస్లో తయారైన జిలేబీ అంటే హాట్ కేక్‌లా అమ్ముడుపోతుంది. స్థానికుల దగ్గర్నుంచి, ప్రముఖుల వరకూ లొట్టలేసుకుంటూ తింటారంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం తెనాలిలోని జిలేబీ బజారులో ఆరు దుకాణాలున్నాయి. పట్టణంలో వేర్వేరు చోట్ల మరో ఏడెనిమిదుంటాయి. చక్కెర స్వీట్లతో పోలిస్తే.. జిలేబీనే శ్రేష్టం ఇతర స్వీట్లతో పోలిస్తే ధరలోనూ, నాణ్యతలోనూ జిలేబీనే శ్రేష్టం. పెరిగిన ధరల కారణంగా ప్రస్తుతం కిలో జిలేబీ రూ.140 పలుకుతున్నా, చక్కెర స్వీట్లతో చూస్తే దీని ధర తక్కువే. పైగా బెల్లంతో తయారీ అయినందున శరీరానికి ఐరన్ దొరుకుతుంది. రంగు వేయని బెల్లంతో చేసిన జిలేబీ మరింత సురక్షితం. వేడి వేడి జిలేబీ తింటే విరేచనాలు కట్టుకుంటాయని స్థానికులు చెబుతున్నారు. అమ్మకానికి సిద్ధంగా రంగు వేయని జిలేబీ తయారీ విధానం.. ► చాయ మినప్పప్పు, బియ్యం పిండి, మైదా సమపాళ్లలో కలిపి 6–8 గంటలు నానబెడతారు. ► కొద్దిగా గోరు వెచ్చని నీళ్లు కలిపి మెత్తటి ముద్దలా, చపాతీల పిండి కంటే జారుడుగా చేస్తారు. ► చిన్న రంధ్రం కలిగిన వస్త్రంలో మూటగా తీసుకుని, బాణలిలో మరిగిన నూనెలో చేతితో వలయాలుగా పిండుతారు. ► వేగిన తర్వాత వాటిని.. పక్కన వేరొక స్టవ్‌పై ఉండే బాణలిలో వేడిగా సిద్ధంగా ఉంచుకున్న బెల్లం పాకంలో వేసి.. బయటకు తీస్తారు. ► ఇక వేడి వేడి జిలేబీ రెడీ జిలేబీ తిన్నాకే.. చుట్టుపక్కల దాదాపు వంద గ్రామాలకు తెనాలి కూడలి అయినందున జిలేబీ వ్యాపారం విస్తరించింది. మరిన్ని దుకాణాలు వెలిశాయి. తెనాలి వచ్చిన గ్రామీణులు ముందుగా జిలేబీని తిన్నాకే ఇతర పనులు చూసుకుంటారు. అతిథులకు జిలేబీ ప్యాకెట్ బహుమతిగా ఇవ్వటం సంప్రదాయమైంది. ఈ ప్రాంతం నుంచి విదేశాల్లో స్థిరపడినవారు, బంధువులు వచ్చిపోయేటప్పుడు జిలేబీని తీసుకురమ్మని చెబుతుంటారు. చెన్నైలో తెలుగు సినీ పరిశ్రమ ఉన్నంతకాలం సినీ ప్రముఖులకు తెనాలి జిలేబీ వెళ్లేదని వ్యాపారి సోమశేఖరరావు చెప్పారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి ‘మెట్రో’లకే కాదు.. విదేశాల్లోని తెలుగువారికీ ఇక్కడ్నుంచి జిలేబీ పార్శిళ్లు వెళుతుంటాయి. కరోనా విపత్కర పరిస్థితుల్లో కొన్ని నెలలు మూతపడిన జిలేబీ దుకాణాలు, మళ్లీ ఆదరణ పొందుతున్నాయి. ప్రస్తుతం రోజుకు ఒక్కో దుకాణంలో సగటున 50 కిలోలపైనే అమ్ముడుపోతోంది. అన్ని దుకాణాల్లో కలిపి నెలకు సుమారు రూ.10.50 లక్షల వ్యాపారం జరుగుతోంది. అదే మా జీవనాధారం.. మా తాత పేరు జిలేబీ రామయ్య. చిన్నప్పుడు ఆయన దుకాణంలోనే పనిచేశా. పెద్దయ్యాక వేరుగా వ్యాపారం చేస్తున్నా. జిలేబీ ప్రియుల సూచన మేరకు ఇప్పుడు నల్లబెల్లంతో తయారు చేస్తున్నాం. దేశవిదేశాలకూ సరఫరా చేస్తున్నాం. – కావూరి జనార్దనరావు, వ్యాపారి తింటానికే వస్తుంటాను.. తెనాలి జిలేబీని ఒక్క సారి రుచి చూస్తే, మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. తరచూ జిలేబీ బజారుకు వస్తుంటాను. విరేచనాలు కట్టుకోవాలంటే వేడి వేడి జిలేబీ తింటే సరి. – భాస్కరుని లక్ష్మీనారాయణ, వినియోగదారుడు -
నాణేనికి మరోవైపు.. ‘అట్టర్’లతో అసలుకే ఎసరు!
ఉప్పలపాడు పక్షి కేంద్రం వేలాది వలస పక్షులకు స్వర్గధామం. మూడు దశాబ్దాలుగా ప్రసిద్ధిగాంచిన ఈ ఆవాసానికి ఇప్పుడు అట్టర్‌ల (నీటికుక్కలు) రూపంలో పెద్ద చిక్కొచ్చి పడింది. మాంసాహార క్షీరదాలైన ఈ అట్టర్లు వలస పక్షులను కబళిస్తున్నాయి. ఇంపార్టెంట్ బర్డ్ ఏరియా సైట్‌గా బోంబే నేచురల్ సొసైటీ గుర్తింపు పొందిన ఈ పక్షి కేంద్రం భవితవ్యంపై ఇప్పుడు నీలినీడలు అలుముకున్నాయి. అట్టర్లు.. వాటి కథాకమామీషు ఏంటంటే.. తెనాలి : సహజసిద్ధంగా ఏర్పడే పక్షుల ఆవాసాలకు భిన్నమైంది గుంటూరు జిల్లాలోని ఉప్పలపాడు పక్షి కేంద్రం. మాగాణి భూముల్లోని చెరువులో పక్షి ప్రేమికుల ప్రోత్సాహం, గ్రామస్తుల సహకారం, ప్రభుత్వ తోడ్పాటుతో మూడు దశాబ్దాలుగా ప్రత్యేకత సంతరించుకున్న ఈ పక్షి కేంద్రం.. ఇటీవల అరుదైన క్షీరద జాతికి ఆవాసమైంది. ఐక్యరాజ్య సమితి తరఫున ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రీసోర్సెస్ (ఐయూసీఎన్) సంస్థ రెడ్‌లిస్ట్‌లో చేర్చిన ఈ అట్టర్లు ఇక్కడ విహరిస్తున్నాయి. స్థానికులు నీటికుక్కలుగా పిలుచుకుంటున్న ఈ ఆట్టర్‌లు పక్షి కేంద్రం చెరువులో స్వేచ్ఛగా సంచరిస్తుండం తెలిసిన పర్యావరణ ప్రేమికులు, ఆరోగ్యకర ఆవరణకు స్పష్టమైన సూచికలుగా సంతోషిస్తున్నారు. ఇది నాణేనికి ఓ వైపు. మరోవైపు.. వలస పక్షులకు స్వర్గధామంలాంటి ఈ పక్షి కేంద్రంలోకి అట్టర్‌ల ప్రవేశం, దీని మనుగడకు ప్రమాదకరమన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. వలస పక్షులపై అట్టర్‌ల దాడి ఇందుకు ఆస్కారమిస్తోంది. ఏటా 20వేల పక్షుల రాక తెనాలి–గుంటూరు వయా నందివెలుగు రహదారి మార్గంలో గల ఉప్పలపాడులోని 8–9 ఎకరాల చెరువులోని చెట్లపై కిక్కిరిసినట్టుండే పక్షి కేంద్రానికి సీజన్ల వారీగా రమారమి 20 వేల పక్షులు వస్తుంటాయి. ఇతర చోట్లకు భిన్నంగా ఇక్కడ ఏడాది పొడవుగా ఇవి ఇక్కడే ఉండటం మరో ప్రత్యేకత. వర్షాకాలం ఆరంభంలో నత్తగొట్టు కొంగలు (ఓపెన్ బిల్డ్ స్టార్క్), తెల్ల కొంకణాలు (వైట్ ఐబీస్) రాకతో సీజను మొదలు.. గూడబాతు (స్పాట్‌బిల్డ్ పెలికాన్), కలికి పిట్ట (డార్టర్), ఎర్రకాళ్ల కొంగ (పెయింటెడ్ స్టార్క్), శాంతి కొంగ (కాటిల్ ఇగ్రెంట్), చిన్న తెల్లకొంగ (లిటిల్ ఇగ్రెంట్), చింత వొక్కు (నైట్ హెరాన్), తట కంకణం (గ్లోజీ ఐబిస్) వంటి పక్షులు సహా 25 రకాలు వస్తుంటాయి. తెల్ల పెలికాన్ పక్షులు, శీతాకాలంలో కొన్ని విదేశీ వలస పక్షులూ వస్తుంటాయి. అటవీశాఖ వీటికోసం కృత్రిమ గూళ్లను కూడా నిర్మించింది. సందర్శకులకూ తగిన ఏర్పాట్లు సైతం చేసింది. అట్టర్లు మాంసాహార క్షీరదాలు పక్షి కేంద్రం చెరువులో స్మూత్ కోటెడ్ అట్టర్ (నీటి కుక్క)ల విహారాన్ని గత జనవరిలో గ్రామస్తులు గమనించారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ వీటి కదలికలను రికార్డు చేసింది. అట్టర్ అనేది మాంసాహార క్షీరదం. ప్రపంచంలో 13 జాతుల అట్టర్లు ఉంటే, మనదేశంలో మూడు జాతులున్నాయి. ఉప్పలపాడు చెరువులో కనిపించిన స్మూత్ కోటెడ్ ఆట్టర్ వీటిలో ఒకటి. శరీరం చేపలా మృదువుగా ఉంటుంది. హిమాలయాల దక్షిణ భాగం నుంచి దేశంలోకి విస్తరించినట్టు చెబుతారు. శాస్త్రీయ నామం లూట్రజేల్ పెర్సిపిసిల్లేట్. ఒక మగ అట్టర్, నాలుగైదు ఆడ అట్టర్లు పిల్లలతో సహా కుటుంబంగా జీవిస్తుంటాయి. పెలికాన్‌లను కబళిస్తున్న అట్టర్లు ఇలాంటి అరుదైన అట్టర్లు, జనావాసంలోని ఉప్పలపాడు వంటి పక్షి కేంద్రంలోకి రావటం విశేషమైతే, వీటివల్ల అక్కడ ఆవాసంగా జీవిస్తున్న వలస పక్షుల మనుగడకు ప్రమాదమన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కొన్నిరకాలు చేపలు, గూళ్లలోంచి జారిన పక్షి పిల్లలు, ఇతర జీవులను ఆహారంగా తీసుకునే అట్టర్లు, పక్షి కేంద్రంలోని భారీ పెలికాన్‌ను కబళిస్తున్న దృశ్యాలను పలువురు సందర్శకులు ప్రత్యక్షంగా చూశారు. అట్టర్‌ల సంచారం జీవవైవిధ్యానికి తోడ్పడేది వాస్తవమే. అయితే.. పక్షులను తినేయటం కొనసాగితే, ప్రశాంతంగా గడుపుతున్న వలస పక్షులు ఎగిరిపోయే ప్రమాదముంది. అలాగే, ఐబీఏ సైట్ (ఇంపార్టెంట్ బర్డ్ ఏరియా సైట్)గా బోంబే నేచురల్ సొసైటీ గుర్తింపు పొందిన ఈ పక్షి కేంద్రం భవితవ్యంపై నీలినీడలు పరుచుకుంటాయని, దీని మనుగడకే ప్రమాదకరం కాగలదన్న భయాందోళనలను పక్షి ప్రేమికులు వ్యక్తంచేస్తున్నారు. -
బండ్ల శిరీష తాతయ్య ఇంట సంబరాలు
తెనాలి: తెలుగువారి చరిత్రలో తొలిసారి అంతరిక్షయానం చేసి రికార్డు సృష్టించిన గుంటూరు జిల్లా తెనాలి అమ్మాయి బండ్ల శిరీష విజయాన్ని ఆమె బంధువులు పండుగలా చేసుకున్నారు. వర్జిన్ గెలాక్టిక్ సంస్థ చేపట్టిన అంతరిక్ష ప్రయాణంలో వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ సహా ఆరుగురు పాల్గొన్న విషయం తెలిసిందే. న్యూ మెక్సికో నుంచి ఆదివారం రాత్రి 8 గంటలకు ఆరంభమైన అంతరిక్షయాత్ర 90 నిమిషాల తర్వాత విజయవంతంగా తిరిగి అక్కడకే చేరుకుంది. తెనాలికి చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్ బండ్ల పుల్లయ్య మునిమనుమరాలైన శిరీష తాతయ్య రాపర్ల వెంకటనరసయ్య, అమ్మమ్మ రమాదేవి ఇక్కడి బోసురోడ్డులోని అపార్టుమెంట్లో నివసిస్తున్నారు. వీరితో పాటు బంధువులు రామకృష్ణబాబు కలిసి వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్షయాత్ర ప్రత్యక్ష ప్రసారాన్ని టీవీ చానళ్లలో చూశారు. చిన్ననాటి కలను నెరవేర్చుకుని రోదసీలోకి వెళ్లిన తమ మనుమరాలు శిరీష క్షేమంగా తిరిగి వచ్చినందుకు వెంకటనరసయ్య, రమాదేవి ఆనందం వ్యక్తం చేశారు. తెనాలికి చెందిన ప్రవాస భారతీయుడు, మాజీ అంతరిక్ష శాస్త్రవేత్త చందు సాంబశివరావు ఇక్కడికి వచ్చి శిరీష తాతయ్య, అమ్మమ్మలను సత్కరించి, స్వీట్లు తినిపించారు. -
శిల్ప కళాకారుడు అక్కల మంగయ్య మృతి
తెనాలి: శిల్పకళలో తెనాలి కళా నైపుణ్యాన్ని ఖండాంతరాలకు చాటిన అక్కల సోదరుల్లో పెద్దవాడైన అక్కల మంగయ్య(82) శుక్రవారం రాత్రి అనారోగ్యంతో మృతిచెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. మంగయ్య భౌతికకాయానికి శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. 1939లో జన్మించిన మంగయ్య ఎస్ఎస్ఎల్సీ చదివి, తండ్రి రామయ్య స్థాపించిన శిల్పశాలలో శిల్ప విద్యనభ్యసించారు. తండ్రికి చేదోడుగా ఉంటూనే తన ఊహాశక్తిని జోడించి శిల్పకళలో నైపుణ్యాన్ని సాధించారు. వేంకటేశ్వరస్వామి విగ్రహాల తయారీలో జాతీయస్థాయి ఖ్యాతినార్జించారు. అందివచ్చిన ముగ్గురు సోదరులతో కలిసి దేశంలోని వివిధ నగరాలకు శ్రీవారి విగ్రహాలను తయారుచేసి ఇచ్చారు. అమెరికాలోని మిసిసిపి, టెక్సాస్, కాలిఫోర్నియా, లివర్మోర్ సిటీ, ఆఫ్రికా, మారిషస్ దేశాల్లోని తెలుగువారి ఆలయాలకు వేంకటేశ్వరుడు, ఇతర దేవతా విగ్రహాలు, సర్వాంగ ఆభరణాలు, మకరతోరణాలను చేసి ఇచ్చారు. శ్రీవారికి టీటీడీ రూ.3.50 కోట్లతో చేయించిన వజ్రకిరీటం నమూనాతో అమెరికాలోని ఆలయం కోసం నవరత్న ఖచిత కిరీటాన్ని తీర్చిదిద్దిన ఆయన ప్రతిభకు భక్తులు నీరాజనాలర్పించారు. వీటితోపాటు దేశనాయకులు, రాజకీయ ప్రముఖుల కాంస్య, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఫైబర్ విగ్రహాల తయారీలోనూ సిద్ధహస్తులుగా పేరుగడించారు. నాటి ముఖ్యమంత్రులు టి.అంజయ్య, కోట్ల విజయభాస్కరరెడ్డి, మాజీ రాష్ట్రపతి శంకర్‌దయాళ్‌శర్మచే మంగయ్య సత్కారం అందుకున్నారు. -
75 వేల ఇనుప వ్యర్థాలతో గాంధీ విగ్రహం
సాక్షి, తెనాలి: శిల్పకళలో ఖండాంతర ఖ్యాతిని కలిగిన గుంటూరు జిల్లా తెనాలి పట్టణం, ఇనుప వ్యర్థాలతో తీర్చిదిద్దిన కళాకృతుల్లోనూ ఘనత వహిస్తోంది. ఇనుప వ్యర్థాలతో జీవం ఉట్టిపడే శిల్పాలను చేస్తూ, విదేశాల్లోనూ ప్రదర్శిస్తోన్న స్థానిక సూర్య శిల్పశాల నిర్వాహకులైన తండ్రీకొడుకులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్రలు తాజాగా భారీ ధ్యాన గాంధీ విగ్రహాన్ని రూపొందించారు. 10 అడుగుల ఎత్తుతో తయారు చేసిన ఈ విగ్రహానికి 75 వేల ఇనుప నట్లను వినియోగించారు. గిన్నిస్ బుక్ రికార్డు కోసం చేసిన ఈ విగ్రహాన్ని ఆదివారం తమ శిల్పశాల ఎదుట ప్రదర్శనకు ఉంచారు. చదవండి: ఐఏఎఫ్‌లో ఫ్లైయింగ్ ఆఫీసర్‌గా ఆటో డ్రైవర్ కుమారుడు కృష్ణానది ఒడ్డున ఘాతుకం: ప్రేమికుడిని బంధించి.. యువతిపై అత్యాచారం -
Arun Mummalaneni: యూకే ఎన్నికల్లో ‘అరుణోదయం’
తెనాలి టౌన్: గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ముమ్మలనేని అరుణ్ (45) యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లోని హ్యాంప్‌షైర్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో బేజింగ్ స్టోక్ ఆగ్నేయ నియోజకవర్గం నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేసి గెలుపొందారు. అక్కడ ఈ నెల 6న ఎన్నికలు జరిగాయి. 7న వెలువడిన ఫలితాల్లో కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థిగా అరుణ్ గెలిచారు. కాగా, ఈ నియోజకవర్గం నుంచి మొదటిసారిగా ఒక తెలుగు వ్యక్తి కౌన్సిలర్‌గా గెలుపొందడం విశేషం. ఈ పదవిలో అరుణ్ నాలుగేళ్ల పాటు కొనసాగనున్నారు. రేపల్లె సమీపంలోని మైనేనివారిపాలెం గ్రామంలో జన్మించిన అరుణ్ అమృతలూరు మండలం మోపర్రులో అమ్మమ్మ ఇంటి వద్ద పెరిగారు. ప్రస్తుతం యూకేలో డిఫెన్స్ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్నారు. అరుణ్ తండ్రి వెంకటరావు ఎక్స్ సరీ్వస్‌మెన్. తల్లి కృష్ణకుమారి గృహిణి. అరుణ్ కొత్తగూడెంకు చెందిన యువతిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. చదవండి: Sara Chhipa: మెమరీ క్వీన్.. సారా! ప్రవాస ఆంధ్రులకు రూ.10 లక్షల ప్రమాద బీమా -
విమానం నడిపిన విద్యార్థులు
తెనాలి: విమానం ఎక్కడమే చాలా మంది సామాన్యులకు కల లాంటిది. కానీ తెనాలి మున్సిపల్ స్కూల్ విద్యార్థులకు విమానంలో విహరించడమే కాదు.. ఏకంగా దాన్ని నడిపే అవకాశం కూడా లభించింది. వివరాలు.. గుంటూరు జిల్లా తెనాలి మారీసుపేటలోని చెంచు రామానాయుడు మున్సిపల్ ఉన్నత పాఠశాల ఎన్సీసీ క్యాడెట్లు పి.గంగాభవాని(9వ తరగతి), షేక్ నజీర్ అహ్మద్ (10వ తరగతి) శుక్రవారం సాయంత్రం గన్నవరం ఎయిర్‌పోర్టు బ్యారెల్‌లో ప్రాక్టికల్ ట్రైనింగ్‌లో భాగంగా ఎన్సీసీ అధికారి పులి భాస్కరరావుతో కలిసి శిక్షణ విమానాన్ని పరిశీలించారు. 8వ ఆంధ్రా కమాండింగ్ అధికారి, పైలెట్ అయిన పంకజ్ గుప్తా వారికి అన్ని అంశాలనూ క్షుణ్నంగా వివరించారు. విద్యార్థుల ఆసక్తిని గమనించి రెండు సీట్ల విమానంలో తాను పక్కనే కూర్చొని.. ఆ ఇద్దరితో చెరోసారి విమానాన్ని నడిపించారు. ఒక్కొక్కరు 20 నిమిషాల చొప్పున గాల్లో తేలిపోయారు. గన్నవరం ఎయిర్‌పోర్టు బ్యారెల్‌లో ఎన్సీసీ అధికారి పులి భాస్కరరావుతో నజీర్ అహ్మద్, గంగాభవాని శిక్షణలో భాగంగా.. యుద్ధ విమానం ఎలా పనిచేస్తుంది? ఏయే విమానాలుంటాయి? తదితర అంశాలపై ఎన్సీసీ విద్యార్థులకు శిక్షణ ఇస్తుంటారు. విజయవాడలోని 8వ ఆంధ్రా ఎయిర్ స్క్వాడ్రన్ ఈ బాధ్యతలు నిర్వర్తిస్తుంది. ఆంధ్రలో ఎయిర్‌వింగ్ పరిధిలో 13 హైసూ్కళ్లుంటే, గుంటూరు జిల్లాలో 3 ఉన్నాయి. అందులో తెనాలి మునిసిపల్ స్కూలు ఒకటి. ఇక్కడి క్యాడెట్లకు అధికారులు యుద్ధ విమానాల గురించి బోధిస్తారు. ప్రాక్టికల్స్‌లో భాగంగా గన్నవరం ఎయిర్‌పోర్టు బ్యారెల్‌లో ప్రత్యక్షంగా విమానాన్ని చూపించి.. దాని గురించి వివరిస్తారు. ఈ క్రమంలో ఆంధ్రా కమాండింగ్ అధికారి, విమానం పైలెట్ అయిన పంకజ్ గుప్తా.. తెనాలి విద్యార్థుల ఆసక్తిని గమనించి.. శిక్షణ విమానాన్ని స్వయంగా నడిపే అవకాశం కల్పించారు. విమానం ఎక్కడమే గొప్ప అనుకునే రోజుల్లో, హైస్కూలు స్థాయిలోనే శిక్షణ విమానాన్ని నడపటం సంతోషంగా ఉందని విద్యార్థులు పేర్కొన్నారు. -
'ఖాకీ బతుకులు' నవలా రచయిత కన్నుమూత
తెనాలి : స్పార్టకస్ కలం పేరుతో పోలీస్ వ్యవస్థలోని మరో కోణాన్ని ‘ఖాకీ బతుకులు’ నవలగా చిత్రీకరించి సాహితీలోకంలో, పోలీస్‌శాఖలో సంచలనం రేపిన విశ్రాంత హెడ్ కానిస్టేబుల్ గంటినపాటి మోహనరావు(68) ఆదివారం రాత్రి కన్నుమూశారు. గుంటూరు జిల్లా తెనాలి పోలీస్ క్వార్టర్స్‌లోని నివాసంలో ఆయన ప్రాణాలొదిలారు. ఆయనకు భార్య మేరీ, కుమార్తె ప్రత్యూష, కుమారుడు ప్రేమ్‌చంద్ ఉన్నారు. సాయంత్రం ఇక్కడే అంత్యక్రియలు పూర్తిచేశారు. తెనాలిలో ఎస్బీ హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న 1980–83 మధ్యకాలంలో మోహనరావు ‘ఖాకీ బతుకులు’ నవల రాశారు. తనకన్నా ముందు 1940–75 మధ్య పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేసిన తన తండ్రి ప్రకాశం జీవితానుభవాలతో రాసిన ఈ నవల, 1996లో పుస్తకరూపం దాల్చింది. పోలీస్ బాస్‌ల కన్నెర్ర... పాతికేళ్ల కిందట వెలువడిన ఈ నవలపై అప్పటి పోలీస్ బాస్‌లు కన్నెర్రజేశారు. ఫలితంగా ఉద్యోగాన్ని కోల్పోయారు. దీనిపై న్యాయపోరాటం చేయాల్సి వచ్చింది. కేసును అప్పగించిన న్యాయవాదులపై నమ్మకాన్ని కోల్పోయి తన కేసును తానే వాదించుకున్నారు. 13 ఏళ్ల సుదీర్ఘ పోరాటం ఫలించి 2011లో ఉద్యోగం వచ్చింది. అయితే అనంతరం 10 నెలలే హెడ్ కానిస్టేబుల్ హోదాలో పనిచేసి పదవీవిరమణ పొందారు. సస్పెన్షన్‌లో ఉన్న కాలాన్ని సర్వీసులో చేర్చకపోవడం, అప్పట్లో రావాల్సిన సగం వేతనాన్ని నిరాకరించటంపై మళ్లీ న్యాయస్థానం తలుపుతట్టారాయన. స్పందించిన కోర్టు మోహనరావుకు 13 ఏళ్ల పెన్షనరీ ప్రయోజనాలను కల్పించాలని తీర్పునిచ్చింది. దీనిపై 2012 చివర్లో అప్పటి జిల్లా ఎస్పీ హైకోర్టుకు వెళ్లి స్టే ఉత్తర్వులు పొందారు. 13 ఏళ్ల సర్వీసును పరిగణనలోకి తీసుకోకుండానే పింఛన్ ఇచ్చారు. ఎమర్జెన్సీ తర్వాత పరిణామాలతో ‘ఖాకీ బతుకులు’ రెండో భాగం రాస్తానని మోహనరావు అప్పట్లో ప్రకటించారు. అయితే అనారోగ్యం కారణంగా అది కార్యరూపం దాల్చలేదు. -
ఏమైందమ్మా నాకు.. భయమేస్తోందమ్మా..
తెనాలి: ‘అమ్మా! ఇక నేను స్కూలుకు వెళ్లలేనా? ఏమైందమ్మా నాకు.. ఎందుకొస్తోందీ నొప్పి..? భయమేస్తోందమ్మా..’అంటూ బేలగా అడుగుతున్న పదేళ్ల కన్నబిడ్డకు ఏమని సమాధానం చెప్పాలో తెలియక ఆ తల్లి గుండె తల్లడిల్లుతోంది. ఉబికివస్తున్న కన్నీటిని పంటిబిగువున ఆపుకొని.. ‘లేదు బుజ్జీ... నువ్వు కోలుకుంటావ్.. నీ ఫ్రెండ్స్‌తో కలిసి ఆడుకుంటావు.. బడికి వెళ్తావు... సరేనా!’అంటూ ఊరడిస్తున్న ఆ తల్లి బిడ్డ ప్రాణాలకు ఊపిరిలూదేందుకు బతుకుపోరాటం చేస్తోంది. గుండె మార్పిడే చికిత్స తెనాలికి చెందిన పిన్నెల స్వర్ణకుమారి కుమార్తె పదేళ్ల అమృతవర్షిణి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. గత ఏడాది పాప అనారోగ్యానికి గురవడంతో ఆస్పత్రిలో చేర్చారు. ఊపిరితిత్తుల దగ్గర నెమ్ము చేరిందని, గుండెల్లో సమస్య ఉంది... నెమ్ము తగ్గాక గుండె డాక్టరుకు చూపించండి అని వైద్యులు సలహా ఇచ్చారు. డిశ్చార్జయి ఇంటికొచ్చాక, గుండె డాక్టరు దగ్గరికి తీసుకెళామనుకుకుంది స్వర్ణకుమారి. అంతలోనే కరోనా లాక్‌డౌన్‌తో బస్సులు నిలిచిపోవడం, బిడ్డకు ఆరోగ్యం బాగానే ఉండటంతో ఆస్పత్రికి తీసుకెళ్లలేదు. మూడు నెలల క్రితం ఓ రోజు అర్ధరాత్రి నిద్రపోతున్న అమృతవర్షిణి, పెద్దగా కేకలు వేస్తూ మంచంపై నుంచి కింద పడిపోయింది. అప్పటి నుంచి ఆస్పత్రుల చుట్టూ బతుకు పోరాటం మళ్లీ మొదలైంది. గుంటూరు, విజయవాడ నగరాల్లోని పలు ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించారు. గుండె పెద్దదైందని, చుట్టూ కండ చేరిందని వైద్యులు చెప్పారు. దీనికి చికిత్స లేదని, జీవితాంతం మందులు వాడాల్సిందేనని పేర్కొన్నారు. చివరకు డాక్టర్ గోపాలకృష్ణ గోఖలేకు అమృతవర్షిణిని చూపించారు. ఆయన సూచనపై మరికొన్ని పరీక్షలు చేయించాక, గుండె మార్పిడే చికిత్సగా తేల్చారని స్వర్ణకుమారి కన్నీటిపర్యంతమయ్యారు. ఆ తల్లికి జీవితమంతా కష్టాలే.. స్వర్ణకుమారి జీవితమంతా కష్టాలే. కార్మికులైన తల్లిదండ్రులు సంపాదన సరిపోక బిడ్డల్ని చదివించలేదు. 13 ఏళ్ల వయసులో వస్త్రదుకాణంలో చేరింది. ప్రేమించానంటూ ఓ యువకుడు వెంటబడటంతో నిజమేనని నిమ్మింది. కులాలు వేరైనా ఐదేళ్ల తర్వాత 2009లో ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లయిన రెండేళ్లకు స్వర్ణకుమారి ఎనిమిది నెలల గర్భంతో ఉండగా పెద్దాపరేషను చేసి బిడ్డను తీయాల్సి వచ్చింది. 15 రోజులకు పైగా ఆ బిడ్డను బాక్సులో పెట్టారు. ఆ బిడ్డకు అమృతవర్షిణిగా పేరుపెట్టుకుని మురిసిపోయారు. ప్రసవం తర్వాత స్వర్ణకుమారికి ఒంట్లో నీరు చేరింది. పనులు చేసుకోలేని స్థితిలో ఉండగా, భర్త ఆమెను ఆస్పత్రిలో చేర్చి ఎటో వెళ్లిపోయాడు. అప్పటికే స్వర్ణకుమారి తండ్రి చనిపోయాడు. స్టీలు కంపెనీలో పనికెళ్లే తల్లి పని మానుకుని, తనను కనిపెట్టుకుని ఉండిపోయింది. భర్తకు గతంలోనే మరొకామెతో వివాహమైందని తెలిశాక స్వర్ణకుమారి మౌనంగా ఉండిపోయింది. పాపకు నాలుగేళ్లు వచ్చాక, బిడ్డతో కలిసి తను బట్టల షాపునకు, తల్లి డాల్ మిల్లు పనికి వెళ్తూ పొట్టపోసుకుంటున్నారు. ఇటీవల బిడ్డ దుస్థితి తెలిస్తే తండ్రిగా ఆదుకుంటాడేమోనని స్వర్ణకుమారి భర్తకు ఫోన్ చేయగా ‘నువ్వెవరో నాకు తెలీదు.నాకేం సంబంధం లేదు’ అంటూ తేల్చేయడంతో చిన్నబుచ్చుకుంది. తాము రూ.32 లక్షలు చూసుకుంటే, గుండె దాతను, ఆపరేషన్‌ను తాను చూసుకుంటానని డాక్టర్ గోఖలే సార్ చెప్పారని పేర్కొంది. ఆ డబ్బుల కోసమే తెలిసిన దేవతలనే కాకుండా తెలియని దాతలను వేడుకుంటున్నానని గద్గద స్వరంతో చెబుతోంది. దాతలు తెనాలి గాందీచౌక్‌లోని సిండికేట్ బ్యాంక్‌లో ఉన్న ఖాతా నంబరు 32722010025070 (ఐఎఫ్ఎస్సీ కోడ్: ఎస్‌వైఎన్‌బీ0003272)లో సాయం జమచేసి ఆదుకోవాలని వేడుకుంటోంది. దాతలు సంప్రదించాల్సిన స్వర్ణకుమారి సెల్ నంబరు 79956 71750 చదవండి: నే గెలిచా... లేవండీ! లిఫ్ట్ అడిగి దాడి చేసి.. చివరికి.. -
పక్షి ప్రేమికుల ప్రోత్సాహం, నీటి కుక్కల విహారం
తెనాలి: సహజ సిద్ధంగా ఏర్పడే పక్షుల ఆవాసాలకు భిన్నమైనది ఉప్పలపాడు పక్షి కేంద్రం. ఇది ఇప్పుడో అరుదైన క్షీరద జాతికి ఆవాసమైంది. గుంటూరు జిల్లాలోని తెనాలి–గుంటూరు వయా నందివెలుగు రహదారి మార్గంలోని ఈ పక్షి కేంద్రంలో ఆట్టర్ (నీటి కుక్క)లు ఇప్పుడు విహరిస్తున్నాయి. పక్షి ప్రేమికుల ప్రోత్సాహం, గ్రామస్తుల సహకారం, ప్రభుత్వ తోడ్పాటుతో ఇక్కడి చెరువులో మూడు దశాబ్దాలుగా అభివృద్ధి చెందిన పక్షి కేంద్రమిది. ఇందులో నల్లతుమ్మ, ఇంగ్లిష్ తుమ్మ చెట్లు అరుదైన పక్షులకు ఆవాసం. కిక్కిరిసినట్టుండే ఈ పక్షి కేంద్రానికి సీజన్ల వారీగా 15–20 వేల పక్షులు వస్తుంటాయి. ఇతర చోట్లకు భిన్నంగా ఇక్కడ ఏడాది పొడవునా ఇవి కొనసాగుతుండటం మరో ప్రత్యేకత. వర్షాకాలం ఆరంభంలో నత్తగొట్టు కొంగలు (ఓపెన్ బిల్డ్ స్టార్క్), తెల్ల కొంకణాలు (వైట్ ఐబీస్) రాకతో సీజను మొదలు, గూడబాతు (స్పాట్ బిల్డ్ పెలికాన్), కలికి పిట్ట (డార్టర్), ఎర్రకాళ్ల కొంగ (పెయింటెడ్ స్టార్క్), శాంతి కొంగ (కాటిల్ ఇగ్రెంట్), చిన్న తెల్లకొంగ (లిటిల్ ఇగ్రెంట్), చింత వొక్కు (నైట్ హెరాన్), తట కంకణం (గ్లోజీ ఐబిస్) వంటి పక్షులు సహా 25 రకాలు వస్తుంటాయి. తెల్ల పెలికాన్ పక్షులు, శీతాకాలంలో కొన్ని విదేశీ వలస పక్షులూ వస్తుంటాయి. అటవీ శాఖ వీటికోసం కృత్రిమ గూళ్లను నిరి్మంచింది. సందర్శకులకూ తగిన ఏర్పాట్లుచేసింది. ఈ పక్షి కేంద్రాన్ని ఐబీఏ సైట్ (ఇంపార్టెంట్ బర్డ్ ఏరియా సైట్)గా బాంబే నేచురల్ సొసైటీ గుర్తించింది. కాగా, ఈ ఆట్టర్ల విహారం తమ దృష్టికి రావడంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వీటిని రికార్డు చేసినట్లు జిల్లా అటవీ అధికారి శివప్రసాద్ ‘సాక్షి’తో చెప్పారు. దేశంలో మూడు జాతులు ఆట్టర్ అనేది మాంసాహార క్షీరదం. ప్రపంచంలో 13 జాతుల ఆట్టర్‌లు ఉంటే, మనదేశంలో మూడు జాతులున్నాయి. ఉప్పలపాడు చెరువులో కనిపించిన స్మూత్ కోటెడ్ ఆట్టర్ వీటిలో ఒకటి. శరీరం మృదువుగా ఉంటుంది. హిమాలయాల దక్షిణ భాగం నుంచి దేశంలోకి విస్తరించినట్లు చెబుతారు. దీని శాస్త్రీయ నామం లూట్రజేల్ పెర్సిపిసిల్లేట్. ఒక మగ ఆట్టర్, నాలుగైదు ఆడ ఆట్టర్‌లు, వాటి పిల్లలతో సహా కుటుంబంగా జీవిస్తుంటాయి. పొలుసు చేపల (చేపల్ని తినే చేపలు)ను ఇవి ఎక్కువగా తింటాయి. పక్షి గూళ్లలోంచి పడిపోయిన పిల్ల పక్షులు, మరికొన్ని జీవులు వీటి ఆహారం. ఆట్టర్‌లు చెరువును ప్రక్షాళన చేస్తాయని వైల్డ్‌లైఫ్, జీవవైవిధ్య పరిశోధనలో పలు జాతీయ అవార్డులు అందుకున్న డాక్టర్ తులసీరావ్ చెప్పారు. అటవీ భూములు తగ్గిపోవటం, కాలుష్యం, వేటగాళ్ల కారణంగా అంతరించిపోతున్న జంతు జాతుల్లో ఆట్టర్ కూడా ఒకటి. ఐక్యరాజ్య సమితి తరఫున ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ (ఐయూసీఎన్) సంస్థ ప్రకటించిన రెడ్‌లిస్ట్‌లో దీనిని చేర్చారు. -
పుట్టిన రోజు వేడుకలు.. రెవెన్యూ సెక్రటరీ సరెండర్
సాక్షి, తెనాలి అర్బన్: వార్డు సచివాలయంలో రెవెన్యూ సెక్రటరీ విధులు పక్కన పెట్టి పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం వివాదాస్పదంగా మారింది. జేసీ స్పందించి విచారణకు ఆదేశించారు. నిజమేనని తేలడంతో ఆరుగురు వార్డు వలంటీర్లను విధుల నుంచి తొలగించడంతో పాటు రెవెన్యూ సెక్రటరీని కలెక్టర్‌కు సరెండర్ చేస్తూ మున్సిపల్ కమిషనర్ ఎం.జశ్వంతరావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు.. స్థానిక ఐదో వార్డు సచివాలంలో పి.స్రవంతి రెవెన్యూ సెక్రటరీగా పని చేస్తున్నారు. గత నెల 19న ఆమె పుట్టిన రోజు వేడుకల్ని వార్డు వలంటీర్లు నిర్వహించారు. దాన్ని ఓ వలంటీర్ సెల్లో రికార్డు చేసి రెండు రోజుల కిందట సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. చదవండి: (ఏలూరు బాధితులకు అండగా ప్రభుత్వం) ఇది వైరల్ కావడంతో జేసీ వెంటనే స్పందించి విచారణ జరపాలని తెనాలి మున్సిపల్ కమిషనర్ ఎం.జశ్వంతరావును ఆదేశించారు. ఆయన శనివారం సంబంధిత వార్డు రెవెన్యూ సెక్రటరీ స్రవంతి, వలంటీర్లు తాడిబోయిన రత్నకుమారి, సోముపల్లి అలేఖ్య, ఎం.ప్రభుకుమార్, షేక్ రేహమున్నీసా, ఎం.లావణ్య, టి.లీలా హరీష్‌ను పిలిపించి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారి నుంచి లిఖితపూర్వంగా వివరణ తీసుకున్నారు. విధులకు అటంకం కలిగిస్తూ వేడుకలు జరుపుకోవడాన్ని తీవ్రంగా పరిగణించిన కమిషనర్ ఆరుగురు వార్డు వలంటీర్లను విధుల్ని నుంచి ఆదివారం తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అవార్డు రెవెన్యూ సెక్రటరీని జిల్లా కలెక్టర్‌కు సరెండర్ చేశారు. చదవండి: (42,313 ఎకరాల్లో 5 పారిశ్రామిక పార్కులు) -
అపరిమిత డేటా… 30 రోజులు ఉచితం
విజయవాడ : జియో ఫైబర్ తన హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలను ఆంధ్రప్రదేశ్ లో మరో మూడు పట్టణాలకు విస్తరించింది. తెనాలి, హిందూపూర్, బొబ్బిలి లలో ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 26 పట్టణాల్లో జియో ఫైబర్ హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు అయ్యింది. ఇప్పటికే విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, ఏలూరు, ఒంగోలు, విజయనగరం, శ్రీకాకుళం తదితర పట్టణాల్లో వినియోగదారులు జియో ఫైబర్ సేవలను ఆస్వాదిస్తున్నారు. ఈ సందర్భంగా జియో ఆంధ్రప్రదేశ్ సీఈఓ మండపల్లి మహేష్ కుమార్ మాట్లాడుతూ, ‘మొబైల్ కనెక్టివిటీ పరంగా ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే జియో వేగంగా , విస్తృతంగా దూసుకువెళ్లి నెంబర్ వన్ ఆపరేటర్ గా నిలిచింది. ఇదే పరుగును బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ రంగంలో కూడా కొనసాగించి జియో ఫైబర్‌ను ఈ పట్టణాల్లో ప్రతీ ఇంటికి తీసుకెళ్లి, ఆ ఇంట్లో ప్రతీ ఒక్కరికీ డిజిటల్ ప్రపంచాన్ని పరిచయం చేయాలనుకుంటున్నాం’ అని అన్నారు. 'నయే ఇండియా కా నయా జోష్' పేరుతో జియో సరికొత్త ప్లాన్స్ ప్రకటించింది. ఈ ప్లాన్స్ రూ.399 నుంచి ప్రారంభమౌతాయి. అపరిమిత డేటా వాడుకోవచ్చు. అంతేకాదు... 150 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 30 రోజుల ఉచిత ట్రయల్ కూడా ఆఫర్ చేస్తోంది. 4కే సెట్ టాప్ బాక్స్ ఉచితం. కొత్త యూజర్లకు 10 ఓటీటీ యాప్స్ సబ్స్క్రిప్షన్ ఉచితం. 30 రోజుల ఫ్రీ ట్రయల్‌లో భాగంగా 10 ఓటీటీ యాప్స్ యాక్సెస్ చేయొచ్చు. వాయిస్ కాలింగ్ ఉచితం. ఒకవేళ 30 రోజుల్లో సర్వీస్ నచ్చకపోతే కనెక్షన్ వద్దని చెప్పొచ్చు. ఎలాంటి కండీషన్స్ ఉండవు. ఈ 30 రోజుల ఫ్రీ ట్రయల్ కొత్త కస్టమర్లకు మాత్రమే. ఇప్పటికే జియోఫైబర్ కస్టమర్లుగా ఉన్నవారికి కూడా లాయల్టీ బెనిఫిట్స్ లభిస్తాయి. కొత్త టారిఫ్ ప్లాన్స్ ప్రకారం ప్రస్తుత కస్టమర్లను అప్‌గ్రేడ్ చేసి ఆయా ప్రయోజనాలను అందిస్తారు. ఆసక్తిగల కస్టమర్లు ఇక్కడ తమను తాము నమోదు చేసుకోవచ్చు. https://www.jio.com/registration కొత్తగా ప్రకటించిన జియో ఫైబర్ 4 ప్లాన్ల వివరాలు ఇవిగో... Rs 399 Plan: జియోఫైబర్ రూ.399 ప్లాన్ తీసుకుంటే 30 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ ఉపయోగించొచ్చు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. Rs 699 Plan: జియోఫైబర్ రూ.699 ప్లాన్ తీసుకుంటే 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ ఉపయోగించొచ్చు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. Rs 999 Plan: జియోఫైబర్ రూ.999 ప్లాన్ తీసుకుంటే 150 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ ఉపయోగించొచ్చు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రూ.1000 విలువైన 11 ఓటీటీ యాప్స్ సబ్స్క్రిప్షన్స్ ఉచితం. Rs 1499 Plan: జియోఫైబర్ రూ.1499 ప్లాన్ తీసుకుంటే 300 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ ఉపయోగించొచ్చు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రూ.1500 విలువైన 12 ఓటీటీ యాప్స్ సబ్స్క్రిప్షన్స్ ఉచితం. -
నీట్లో తెలుగుతేజం
సాక్షి, అమరావతి/తెనాలి: తెనాలికి చెందిక గుత్తి చైతన్య సింధు వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్లో సత్తా చాటింది. శుక్రవారం విడుదల చేసిన నీట్ ఫలితాల్లో సింధు జాతీయ స్థాయిలో 6వ ర్యాంకు సాధించగా, ఉమెన్ కేటగిరీలో 4వ ర్యాంకు సొంతం చేసుకుంది. అదేవిధంగా ఏపీలో మొదటి ర్యాంకర్‌గా నిలిచింది. నీట్లో 720 మార్కులకుగాను సింధూకు 715 మార్కులు వచ్చాయి. అలాగే కొట్టా వెంకట్ జాతీయ స్థాయిలో 13వ ర్యాంకు సాధించగా, భవం మానస 16వ ర్యాంకు సాధించింది. జాతీయ స్థాయిలో టాప్ 50లో రాష్ట్రానికి చెందిన విద్యార్థులు 8 మంది ఉన్నారు. 62,051 నీట్‌కు నమోదు చేసుకోగా 57,721 మంది పరీక్ష రాశారు. ఇందులో 33,841 (58.63 శాతం) మంది అర్హత సాధించారు. టాప్–10లో ముగ్గురు తెలంగాణ విద్యార్థులు నీట్లో హైదరాబాద్‌కు చెందిన తుమ్మల స్నిఖిత జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు, తెలంగాణలో మొదటి ర్యాంకు సాధించి సత్తా చాటింది. టాప్ 10 జాతీయ ర్యాంకుల్లో ఆ రాష్ట్ర విద్యార్థులు ముగ్గురు ఉండగా, టాప్ 50 ర్యాంకుల్లో ఏకంగా ఏడుగురు ఉన్నారు. అనంత పరాక్రమ (11వ ర్యాంకు), బారెడ్డి సాయి త్రిషా రెడ్డి (14వ ర్యాంకు), శ్రీరామ్ సాయి శాంతవర్ధన్ (27వ ర్యాంకు), ఆర్షశ్ అగర్వాల్ (30వ ర్యాంకు), మల్లేడి రుషిత్ (33వ ర్యాంకు), ఆవుల సుభాంగ్ (38వ ర్యాంకు) సాధించారు. బాలికల విభాగంలో తొలి 20 ర్యాంకుల్లో తెలంగాణకు చెందిన నిత్య దినేష్ (ఆలిండియా 58వ ర్యాంకు) 17వ స్థానాన్ని పొందారు. ఎయిమ్స్, జిప్మర్ సహా అన్ని ప్రముఖ మెడికల్ కాలేజీల్లో ఈ ఏడాది నుంచి నీట్ ర్యాంకుల ప్రాతిపదికనే సీట్లను భర్తీ చేయనున్నారు. డాక్టర్ కావాలన్న కలను నెరవేర్చుకుని.. ఎంసెట్ (మెడికల్/అగ్రికల్చర్)లో స్టేట్ ఫస్ట్ ర్యాంకుతో మెరిసిన తెనాలికి చెందిన గుత్తి చైతన్య సింధు నీట్లో జాతీయ స్థాయిలో ఆరో ర్యాంకు సాధించింది. తన తల్లిదండ్రుల్లాగే డాక్టర్ కావాలన్న కలను నెరవేర్చుకునే అవకాశం దక్కించుకుంది. తెనాలికి చెందిన ప్రముఖ వైద్యుడు, స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాల రిటైర్డ్ సూపరింటెండెంట్ డాక్టర్ గుత్తి సుబ్రహ్మణ్యం మనుమరాలైన చైతన్య సింధు తల్లిదండ్రులిద్దరూ వైద్యులే. తండ్రి.. డాక్టర్ కోటేశ్వరప్రసాద్ ఈఎన్టీ, ఎనస్థీషియా నిపుణుడు కాగా తల్లి డాక్టర్ సుధారాణి గైనకాలజిస్ట్. సింధు.. టెన్త్‌లో ఏ1 గ్రేడ్‌తో, ఇంటర్లో 98 శాతంతో ఉత్తీర్ణురాలైంది. -
బుట్ట నిండింది
రహదారికి ఇరువైపులా ఉండే చింతచెట్లు అవి. ఎంతగా చల్లదనాన్ని ఇస్తున్నా, ఆ రోడ్డుపై ఉరుకులు పరుగులతో ప్రయాణించే ఎవరూ వాటికేసి చూడరు. వేసవి వచ్చిందనగానే కొందరు మహిళలు మహిళలు ఆ చెట్లకేసి చూస్తుంటారు. చెట్లు చిగురేస్తే చాలు.. వారి గుండెల్లో ఆశలు మోసులెత్తుతాయి. తెలతెలవారుతూనే చింతచెట్టు ఎక్కుతారు. చిగురుకోసం చిటారుకొమ్మకైనా వెళతారు. బుట్టనిండితే వారి కళ్లు ఆనందంతో మెరుస్తాయి. అవసరమైతే రెండు మూడేసి చెట్లు లంఘించేందుకు ఏమాత్రం వెనుదీయరు. ఎందుకంటే కొన్ని నెలలపాటు ఆ చిగురే వారికి జీవన వనరు. గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని పెదరావూరు గ్రామానికి చెందిన చీరాల నాగేంద్రం, మోరబోయిన భారతిలకు ఇదే ఉపాధి. ఏడాది పొడవునా వరినాట్లు, కలుపు తీయటం సహా పొలం పనులు చేస్తుండే వీరు, చిగుర్ల కాలంలో చింతచెట్లపై ఆధారపడతారు. చెట్లు చిగురించటం ఆరంభించిన దగ్గర్నుంచి కాపు దిగేవరకు చింత చిగురు కోతలో ఉంటారు. ప్రతిరోజూ కనీసం మూడుగంటలపాటు ఆ కొమ్మా ఈ కొమ్మా తిరుగుతూ చిగురు కోసుకుంటారు. ‘ఒక్కోసారి ఒక్క చెట్టుకే బుట్ట సరిపడా వత్తాది... లేకుంటే రెండు మూడేసి చెట్లు ఎక్కాల్సిందే’ నని నాగేంద్రం చెప్పింది. బుట్టనిండా చింతచిగురుతో తెనాలికి బయలుదేరి వెళతారు. గిరాకీ ఉన్నరోజు రూ.300 లేకుంటే కనీసం రూ.200 గిట్టుబాటవుతుంది. ఆ డబ్బయినా వస్తుందనే ఆశతోనే వీరు ప్రాణాలను లెక్కజేయకుండా భారీ చింతచెట్లను అవలీలగా ఎక్కేస్తుంటారు. ప్రమాదం కదా? అంటే.. ‘చిన్నప్పట్నుంచీ ఎక్కుతూనే ఉన్నాం... ఏం కాదు’ అని తేలిగ్గా కొట్టేశారు. నాగేంద్రంకు కొడుకు, భారతికి కుమార్తె, ఇద్దరు కొడుకులు ఉన్నారు. కాయకష్టంతోనే తమ కడుపులు నిండేవని, చింత చిగురు మరికొంత ఆధరువుగా ఉంటోందని చెప్పారు. ఏదేమైనా చిటారు కొమ్మల్లోంచి అటూ ఇటూ తిరుగుతూ చిగురు కోసం వారు పడుతున్న కష్టాన్ని చూసి, రోడ్డు వెంట వెళ్లేవారు ‘అమ్మో.!’ అనుకోకుండా ఉండలేరు. – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి -
10 అడుగుల వైఎస్సార్ కాంస్య విగ్రహం
తెనాలి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజైన ఈ నెల 8వ తేదీ రైతు దినోత్సవంగా జరుపుకోనున్న సందర్భంగా ప్రతిష్ట నిమిత్తం డాక్టర్ వైఎస్సార్ కాంస్య విగ్రహం గుంటూరు జిల్లా తెనాలిలో రూపుదిద్దుకుంది. తెనాలికి చెందిన శిల్పకళాసోదరులు పెదపాటి రామాచారి, మల్లికార్జునరావులు ఈ విగ్రహాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. 10 అడుగుల ఎత్తు కలిగిన డాక్టర్ వైఎస్సార్ విగ్రహానికి 450 కిలోల కంచును ఉపయోగించగా, విగ్రహ తయారీకి 75 రోజులు పట్టిందని శిల్పకారుడు రామాచారి తెలిపారు. కాగా, ఈ విగ్రహాన్ని 8న శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో రాష్ట్ర శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాం ఆవిష్కరించనున్న నేపథ్యంలో విగ్రహాన్ని ఆదివారం తెనాలి నుంచి ఆముదాలవలసకు తరలించారు. డాక్టర్ వైఎస్ విగ్రహంతో శిల్పి పెదపాటి రామాచారి -
సీఎం జగన్ కృషికి భారీ ప్రతిరూపం
సాక్షి, తెనాలి: కరోనా కట్టడిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న శ్రమ ప్రపంచానికే స్ఫూర్తిదాయకంగా నిలిచిందనడానికి ప్రతిరూపంగా భారీ పెయింటింగ్ రూపకల్పనకు శనివారం గుంటూరు జిల్లా తెనాలిలో శ్రీకారం చుట్టారు. స్థానిక మున్సిపల్ మార్కెట్ సెంటర్లో రోడ్డుపై 78 అడుగుల పొడవు, 154 అడుగుల వెడల్పుతో మొత్తం 12,012 చదరపు అడుగుల విస్తీర్ణంలో అతిపెద్ద పెయింటింగ్ వేయనున్నారు. దీనిని 50 గంటల్లో పూర్తి చేయనున్నారు. మున్సిపల్ పాఠశాల చిత్రకళా ఉపాధ్యాయుడు టి.విజయప్రకాష్, ఇతర ఉపాధ్యాయులు, ఎన్సీసీ అధికారి బెల్లంకొండ వెంకట్, పులి భాస్కర్, పరిశ సర్దార్తో కలిసి దీనిని రూపొందిస్తున్నారు. ఈ భారీ పెయింటింగ్ రికార్డును సృష్టిస్తుందని వారు చెబుతున్నారు. (అవును.. మేము కరోనాపై గెలిచాం) -
తెనాలిలో అంతులేని అవినీతి
అప్రంటిస్‌షిప్ సర్టిఫికెట్ల మంజూరులో గోల్మాల్. ఒకే ఏజెన్సీ నుంచి కొన్నేళ్లుగా మందుల కొనుగోళ్లు. కిలో మీటరు కూడా కదలని అంబులెన్స్ నిర్వహణకు నెలనెలా బిల్లులు. ఆర్థో ఇంప్లాంట్స్.. డైరెక్టుగా ఆపరేషన్ థియేటర్‌కు సరఫరా. ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేయించుకున్న రోగులకు అందని డైట్.. ఏమైందో తెలియని ఆర్థిక సాయం.. ఇదీ అంతులేని తెనాలి జిల్లా ఆస్పత్రి అవినీతి కథ. అక్కడ అందే వైద్య సేవలకంటే అందులో జరిగిన అవకతవకలే ఎక్కవ. రెండు రోజులుగా జరుగుతున్న ఏసీబీ అధికారులు తనిఖీల్లో నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. ఆస్పత్రి అధికారులు నిబంధనలకు తిలోదకాలిచ్చిన తీరు విస్మయానికి గురి చేస్తోంది. సాక్షి, గుంటూరు/తెనాలి అర్బన్: అవినీతి ప్రక్షాళనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ఏడాది 14400 టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కాల్ సెంటర్‌కు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవినీతిపై అనేక ఫిర్యాదు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలోని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఏసీబీ ఏఎస్పీ అల్లం సురేశ్‌బాబు నేతృత్వంలో మూడు బృందాలుగా తనిఖీలు నిర్వహించాయి. ఇందులో దిమ్మతిరిగే అవినీతి, అక్రమాలు, నకిలీ లీలలు బయటపడ్డాయి. ఏకంగా పది నకిలీ అప్రంటిస్‌షిప్ సర్టిఫికెట్ల జారీ చేసినట్టు అధికారులు గుర్తించారు. ఏడాది పాటు ఆస్పత్రిలో అప్రంటిస్‌షిప్ చేసినట్టు గతంలో సూపరింటెండెంట్లుగా పనిచేసిన డాక్టర్ సులోచన, నాగేశ్వరరావు సంతకంతో సరి్టఫికెట్లు మంజూరు చేశారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏఎన్ఎం పోస్టులను భర్తీ చేసింది. ఇందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏడాది పాటు అప్రెంటిస్íÙప్ చేసి ఉండాలని నిబంధన విధించింది. ఏఎన్ఎం పోస్టులకు సెలక్ట్ అయిన వారు నకిలీ సర్టిఫికెట్లను వినియోగిస్తున్నారంటూ పారామెడికల్ బోర్డు సెక్రటరీ రాసిన లేఖ మేరకు సూపరింటెండెంట్ ఇప్పటికే విచారణ చేశారు. అందులో నకిలీ సరి్టఫికెట్లుగానే తేలింది. దీనిని ఏసీబీ అధికారులు కూడా ధ్రువీకరించారు. ఈ నకిలీ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఏఎస్పీ సూపరింటెండెంట్‌కు సూచించారు. 2016 నుంచి ఒకరితోనే కొనుగోళ్లు 2016 సంవత్సరం నుంచి కామాక్షి మెడికల్స్ తెనాలి అనే సంస్థ నుంచి మందులు, సర్జికల్ ఐటమ్స్‌ను ప్రభుత్వాస్పత్రికి కొనుగోలు చేస్తున్నట్టు ఏసీబీ దృష్టికి వచ్చింది. అదే విధంగా ఆర్థో ఇంప్లాంట్స్‌ను కూడా ఐక్యత ఆర్థో ఇంప్లాంట్స్ గుంటూరు, శ్రీ సాయి శ్రీనివాస ఇంప్లాంట్స్ విజయవాడ కంపెనీల నుంచే తీసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆర్థో ఇంప్లాంట్స్‌ను స్టోర్స్‌కు కాకుండా సరాసరి ఆపరేషన్ థియేటర్‌కు సరఫరా చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఆస్పత్రి నిధు లతో ఏపీఎంఎస్ఐడీసీ సప్లై చేయని మందులు, సర్జికల్ వస్తులను కొనుగోలు చేయాలంటే రెండేళ్లకోసారి టెండర్లు నిర్వహించి కలెక్టర్ అనుమతి పొందిన వ్యాపారులతోనే ఒప్పదం చేసుకోవాలి. అయితే ఇందుకు విరుద్ధంగా ఆస్పత్రి అధికారుల వ్యవహారశైలి ఉంది. రూ.38–40వేలు బిల్లులు.. కిలో మీటరు కూడా కదల్లేని, కాలం చెల్లిన అంబులెన్స్ వాహనానికి నెలకు రూ.38–40 వేల వరకూ డీజిల్, ఇతర మరమ్మతుల పేర్లతో బిల్లులు చేశారు. రెండేళ్లుగా ఈ తరహా పద్ధతి నడుస్తోంది. బిల్లుల మంజూరు కోసం కేసులకు హాజరు కాకపోయినప్పటికీ హాజరవుతున్నట్టు రికార్డుల్లో నమోదు చేస్తున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇందులో దాదాపు రూ.4లక్షలకు పైగా అవినీతి జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే అవుట్ సోర్సింగ్‌లో పనిచేసే డ్రైవర్ శ్రీనివాస్ ఆస్పత్రి అధికారుల సాయంతో తన సొంత అంబులెన్స్ ఉపయోగిస్తూ డిజిల్ సొమ్మును వైద్యశాల ఖాతా నుంచి డ్రా చేసుకుంటున్నాడు. అదే విధంగా గుర్తింపులేని అభయ డయాగ్నొస్టిక్స్ సెంటర్లో వ్యాధి నిరోధక పరీక్షలు నిర్వహించినట్టుగా 2016కు ముందు బిల్లులు డ్రా చేసినట్టు ఏసీబీ దృష్టికి వచ్చింది. ఈ బిల్లులన్నీ నకిలీవేనని తెలుస్తోంది. ‘డైట్’ సొమ్ము స్వాహా ఆరోగ్య శ్రీ కింద శస్త్ర చికిత్సలు చేయించుకున్న ఇంపేషెంట్లకు రోజు రూ.100 చొప్పున డిశ్చార్జ్ అయ్యేంత వరకూ చెల్లించేలా 2018 ఏప్రిల్‌లో ప్రభుత్వం జీవో తీసుకువచ్చింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు డైట్ ఇస్తున్నందున ఆరోగ్య శ్రీ కింద ఇచ్చే డైట్ చార్జీలను రోగి డిశ్చార్జీ అయ్యే సమయంలో బ్యాంకు ఖాతాలో జమ చేయాలి. అయితే మూడు వేల మంది రోగులకు తెనాలి ఆస్పత్రిలో డైట్ చార్జీలు చెల్లించలేదని ఏసీబీ గుర్తించింది. అదే విధంగా వైద్యశాలలో 23 మంది సెక్యూరిటీ గార్డులు ఉండగా వీరిలో 16 మంది మాత్రమే విధులకు వినియోగిస్తున్నారని, మిగిలిన వారిని మేల్ నర్సులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా, ఇతర పనులకు వాడుకుంటున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో ఫార్మసీ, డైట్ బిల్లులను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. ఫుడ్ శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు. శానిటరీ, లైటింగ్ సరిగా లేకపోవడం, సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ఏసీబీ అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. ఈ తనిఖీల్లో సీఐలు శ్రీధర్, రవిబాబు, గంగరాజు, ఎస్ఐ మూర్తి, సిబ్బంది పాల్గొన్నారు. -
వివాహ వేళ.. విషాద గీతిక
వివాహ మహోత్సవాన గుండెల్లో మూటకట్టుకుని వచ్చిన ఆనంద క్షణాలు రెప్పపాటులో ఆర్తనాదాలుగా మారాయి.. పెళ్లింట ఆకట్టుకున్న వివిధ వర్ణాల కట్టూబొట్టులు నెత్తుటి చెమ్మలో తడిచి ఎర్రటి రంగు పులుముకున్నాయి. బంధుమిత్రుల మధ్య సాగిన యోగక్షేమాల ముచ్చట్లు మూడు గంటలు కూడా గడవకముందే విషాదాంతమయ్యాయి. ట్రాక్టర్ వేగంతో పోటీ పడుతూ కలవరపెట్టిన కుదుపులు.. ఐదు కుటుంబాలను అంతులేని ఆవేదనతో కుదిపేశాయి. గురువారం చుండూరు మండలం చినపరిమి– కూచిపూడి మధ్య పెళ్లి ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో ఐదు ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. వీరిలో మేమూ వస్తామంటూ మారాం చేసి మరీ ట్రాక్టర్ ఎక్కిన ఇద్దరు చిన్నారుల జీవితాలు అర్ధంతరంగా చితిపైకి చేరాయి. కళ్లెదుటే మాంసం ముద్దలుగా మారిన బిడ్డను చూసి.. తల్లిదండ్రుల కన్నపేగులు తీరని శోకంతో కమిలిపోయాయి. ఉదయాన్నే రయ్యిమంటూ సంబరంగా పొలిమేర గట్టు దాటిన పెళ్లి ట్రాక్టర్.. మధ్యాహ్నం వేళకు తన ముంగిటే చావు కేక పెట్టడంతో చినపరిమి గుండెలు వేదనతో ముక్కలయ్యాయి. తెనాలిరూరల్: వివాహ వేడుకకు వెళ్లిన వారి ఇంట విషాదం చోటుచేసుకుంది. చుండూరు మండలం చినపరిమి అంబేడ్కర్ నగర్‌కు చెందిన యువతికి తెనాలి పట్టణ చినరావూరుకు చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. తెనాలిలో గురువారం వివాహం జరిగింది. వేడుకకు యువతి స్వగ్రామం నుంచి ట్రాక్టర్‌పై 50 మంది తెనాలి వచ్చారు. మధ్యాహ్నం భోజనాలు ముగించుకుని అదే ట్రాక్టరులో స్వగ్రామానికి బయలుదేరారు. మరో రెండు నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకుంటారనగా.. చినపరిమి శివారులోని మలుపు వద్ద ఎదురుగా వస్తున్న మోటారు సైకిల్‌ను తప్పించే క్రమంలో ట్రాక్టరు ట్రక్కు రోడ్డు పక్కన కాల్వలోకి బోల్తా పడింది. దీంతో ఉన్నం పద్మ(35), గోరోజిన్నం అన్నమ్మ(40) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ గుత్తికొండ శ్యామ్ (13) మృతిచెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. గాయపడిన వారిలో దగ్గుబాటి హర్షవర్దన్(9), కట్టుపల్లి నిఖిల్(7) వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన గోళ్ల నాగరాజమ్మ (34) గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలకు తరలించారు. చికిత్స పొందుతూ ఆమె గురువారం రాత్రి మృతి చెందారు. గాయపడిన గుత్తికొండ శ్యామ్, టీ రమాదేవి, సౌజన్య, నాగలక్ష్మి, డీ వెంకటేశ్వర్లు, సంకీర్తన, ప్రకాశరావు, అద్భుత్, ఎస్తేర్‌రాణి, సుబ్బారావులను తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వీరిలో శ్యామ్‌ను మెరుగైన చికిత్స కోసం గుంటూరుకు తీసుకెళ్లారు. మిన్నంటిన హాహాకారాలు.. ఘటనా స్థలం బాధితుల హాహాకారాలతో మిన్నంటింది. మృతి చెందిన పద్మ, అన్నమ్మ మృతదేహాలను తెనాలి వైద్యశాలకు తరలించారు. అడుతూ పాడుతూ ఉన్న తమ ముద్దుల చిన్నారులు విగత జీవులుగా మారడంతో తల్లిదండ్రులు వేదనకు అంతులేకుండా ఉంది. వైద్యశాల వద్ద మృతుల కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. మృత్యు కౌగిలిలో అమ్మమ్మ, మనవడు.. చినపరిమికి చెందిన అన్నమ్మ తన కుమార్తె ఏసుమరియమ్మను నగరం మండలం కల్లిపాలేనికి చెందిన యువకుడికి ఇచ్చి వివాహం చేసింది. వీరికి కుమార్తె, నిఖిల్ సంతానం. నాలుగు రోజుల క్రితం నిఖిల్ తన అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. ఆమెతో కలసి వివాహానికి వెళ్లాడు. తోటి పిల్లలతో అక్కడ ఆడుకుంటూ సందడి చేశాడు. తిరుగు ప్రయాణంలో అమ్మమ్మ వెంటే ట్రాక్టరులో కూర్చున్నాడు. బిడ్డకు ఎండ తగలకుండా అన్నమ్మ చీర కొంగును కప్పి రక్షణ కల్పిస్తూ వచ్చింది. అంతలోనే ప్రమాదం జరగడంతో అన్నమ్మ అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్ర గాయాలపాలైన నిఖిల్ తెనాలి వైద్యశాలలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. తల్లడిల్లిన తల్లిదండ్రులు అంబేడ్కర్‌నగర్‌కు చెందిన దగ్గుబాటి మురళి, నాగలక్ష్మిలకు ఇద్దరు మగ పిల్లలు. వ్యవసాయ కూలీలైన వీరు పిల్లలను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. చిన్నవాడైన హర్షవర్దన్ నాలుగో తరగతి చదువుతున్నాడు. చలాకీగా ఉండే వాడు. ట్రాక్టరు ప్రమాదంలో చిన్నారి విగత జీవిగా మారడంతో తల్లిదండ్రుల వేదన అంతులేకుండాపోయింది. ఎమ్మెల్యే మేరుగ పరామర్శ.. ప్రమాదం గురించి తెలుసుకున్న వేమూరు ఎమ్మెల్యే డాక్టర్ మేరుగ నాగార్జున తెనాలి వైద్యశాలకు చేరుకున్నారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. వేగంగా మలుపు తిప్పడంతోనే ప్రమాదం: సౌజన్య, క్షతగాత్రురాలు గ్రామంలో బస్టాప్‌కు సమీపంలో మలుపు వద్ద వేగంగా వెళ్లడంతోనే ప్రమాదం జరిగింది. ఎదురుగా మోటారుసైకిల్ వేగంగా వచ్చి ట్రాక్టర్‌కు తగిలింది. ఇంజిన్ మీద కూర్చున్న వారు దూకేశారు. ట్రక్కు బోల్తా కొట్టడంతో అందులో ఉన్న మాకు గాయాలయ్యాయి. పరిమితికి మించిప్రయాణం ప్రమాద సమయంలో ట్రాక్టరు ట్రాలీలో పరిమితికి మించి ప్రయాణిస్తుండటం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో యజమాని ట్రాక్టర్ శ్రీనివాసరావు ట్రాక్టర్ నడుపుతున్నాడు. ట్రాక్టర్లో సుమారు 40 మంది ఉండటంతో మలుపు తిరిగేటప్పుడు అదుపు తప్పి బొల్తా కొట్టిందని స్థానికులు అంటున్నారు. ప్రమాద ఘటన తెలిసిన వెంటనే అక్కడికి తెనాలి డీఎస్పీ కే శ్రీలక్ష్మి సిబ్బందితో చేరుకున్నారు. చుండూరు సీఐ బీ నరసింహారావు, ఎస్ఐలు రాజేష్, జీ పాపారావు, ఇతర సిబ్బంది, స్థానికుల సాయంతో క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. -
‘గొల్లాస్ గ్యాంగ్’ అరెస్ట్
సాక్షి, అమరావతిబ్యూరో: పదిహేను, ఇరవై ఏళ్ల క్రితం దోపిడీ దొంగలు జన నివాస ప్రాంతాలకు దూరంగా ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని రాత్రిపూట ఆ ఇళ్ల తలుపులు పగులగొట్టి ఇంట్లో నిద్రిస్తున్న వారిని భయభ్రాంతులకు గురిచేసి దోపిడీలకు పాల్పడేవారు. ఇలాంటి దోపిడీలకు పాల్పడే ముఠాల్లో పెద్దింటి గొల్లాస్ గ్యాంగ్ ముందువరుసలో ఉంటుంది. రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో ఈ ముఠాలు దోపిడీలకు తెగబడేవి. సరిగ్గా ఇరవై ఏళ్ల తర్వాత ఆ ముఠా తరహాలోనే విజయవాడ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఉయ్యూరు మండలం కాటూరులో ఈ నెల 10న అర్ధరాత్రి ఓ ఇంట్లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దోపిడీకి పాల్పడ్డారు. దుండగులు 62 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.వెయ్యి నగదుతోపాటు ఓ సెల్‌ఫోన్‌ను ఎత్తుకెళ్లారు. కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు విచారణ చేసి తెనాలికి చెందిన పెద్దింటి గొల్లాస్ గ్యాంగ్‌కు చెందిన ఐదుగురు దోపిడీ ముఠా సభ్యులను అరెస్టు చేశారు. నగర పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు మంగళవారం ఉయ్యూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. తలుపులు పగలగొట్టి బీభత్సం.. ఉయ్యూరు మండలం కాటూరు గ్రామంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి నాగ రజనీకాంత్ కుటుంబసభ్యులతో కలిసి ఉంటున్నారు. ఈ నెల 10వ తేదీన అర్ధరాత్రి ఆరుగురు వ్యక్తులు ముఖానికి ముసుగులు, చేతులకు గ్లౌజులు, నిక్కర్లు ధరించి ఇంటి తలుపును గునపాలు, బండరాయితో ఆయన ఇంటి తలుపులు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. తలుపులు బద్ధలవుతున్న శబ్దం విన్న రజనీకాంత్ అతని భార్య హాలులోకి వచ్చేసరికి దోపిడీ దొంగలు వారిని కత్తులు, గునపాలతో బెదిరించి చేతులు కట్టేశారు. ఇంట్లో విలువైన వస్తువులు ఇవ్వాలని బెదిరించారు. తమ వద్ద ఉన్న 62 గ్రాముల బంగారు ఆభరణాలు ఇవ్వగా.. కోళ్లఫారం వ్యాపారివి నీ వద్ద ఇంతేనా ఉండేదని ప్రశ్నించగా.. రజనీకాంత్ తనకు కోళ్లఫారం లేదని.. పక్కింట్లోని వ్యక్తిదని పేర్కొనడంతో దొంగలు కొంత శాంతించారు. తర్వాత బంగారు ఆభరణాలతోపాటు ఒక ఐఫోన్‌ను రూ. వెయ్యి నగదును తీసుకెళ్లిపోయారు. చివరగా దొంగల సృష్టించి భయోత్పాతానికి రజనీకాంత్ దంపతులు తమ వద్ద ఉన్న వెండి ఆభరణాలు ఇవ్వగా వాటిని తిరిగి వారికే ఇచ్చేశారు. ఆధారాలు సేకరించి.. బాధితుల ఫిర్యాదు మేరకు ఉయ్యూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ఘటనా స్థలానికి వెళ్లి దోపిడీ జరిగిన తీరు పరిశీలించారు. ఘటనా స్థలం డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం సేకరించిన వివరాలను విశ్లేషించారు. దొంగల పాద ముద్రలు దొరికాయి. బాధితుల చెప్పిన వివరాల మేరకు దోపిడీకి వచ్చిన నేరగాళ్లు వచ్చిరాని తెలుగులో మాట్లాడినట్లు తెలిసింది. దీంతో అంతరాష్ట్ర ముఠా పనేనని అనుమానించారు. మిర్యాలగూడ దోపిడీతో కేసు కొలిక్కి.. కాటూరులో దోపిడీ ఏ ముఠా చేసిందనే కోణంలో దర్యాప్తు చేస్తుండగా.. అచ్చం ఈ తరహా దోపిడీనే డిసెంబర్లో తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడలో జరిగినట్లు తెలిసింది. వెంటనే సీసీఎస్ పోలీసులు అక్కడకు వెళ్లి బాధితులతో మాట్లాడగా.. అక్కడ కూడా నలుగురు వచ్చీరాని తెలుగులో మాట్లాడారని, ఒక్కడు మాత్రం కోస్తా యాసలో స్పష్టమైన తెలుగు మాట్లాడినట్లు వారు తెలిపారు. దీంతో ఈ తరహా దొంగతనాలు చేసే ముఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని దర్యాప్తు చేపట్టి.. చివరకు ఈ దోపిడీకి పాల్పడింది తెనాలికి చెందిన పెద్దింటి గొల్లాస్ గ్యాంగ్ అని గుర్తించారు. తాత ముత్తాల నుంచి ఇదే వృత్తి.. దీంతో ఈ ముఠా సభ్యులు ఎక్కడెక్కడ ఉన్నారు? అని పరిశోధించగా చివరకు తోట్లవల్లూరు మండలం బొడ్డపాడు గ్రామంలో పాల శివ, అతని కుమారుడు పాల వేణు, తమ్ముడు పాల లక్ష్మినారాయణ, పెనుమాక మహేష్, మేకల ఏసు, దొడ్డి పోతురాజులు అద్దెకు ఇల్లు తీసుకుని జీవిస్తున్నట్లు గుర్తించారు. దోపిడీ వీరి పనేని తేలడంతో పోలీసులు వారిలో ఐదుగురిని అరెస్టు చేయగా పాల లక్ష్మినారాయణ పరారీలో ఉన్నాడు. పాల శివపై 35 వరకు దోపిడీ కేసులు ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పలు కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. పక్కా రెక్కీ.. అనంతరమే దోపిడీ.. ఎవరికీ అనుమానం రాకుండా రాత్రి సమయాల్లో కోళ్లు, గొర్రెలు, మేకలు, బడ్డీ కొట్లు వంటి చిన్నచిన్న దొంగతనాలకు పాల్పడే ఈ ముఠాకు పాల శివ నేతృత్వం వహిస్తాడు. కాటూరు గ్రామంలో నివాస ప్రాంతాలకు దూరంగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి రజనీకాంత్ ఇంటిని టార్గెట్‌గా చేసుకున్నారు. రెక్కీ నిర్వహించారు. ఈ నెల 10వ తేదీన అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో అందరూ పాల శివ ఆటోలో బయలుదేరి వెళ్లారు. ఆటోను రజనీకాంత్ ఇంటి సమీపంలో ఉన్న కోళ్లఫారం దగ్గర ఉన్న వెంచర్లో పార్క్ చేశారు. ఆ తర్వాత రజనీకాంత్ ఇంటి ప్రహరీ గోడను దూకి మొదట గునపంతో తలుపు తీయడానికి యత్నించారు. సాధ్యపడకపోవడంతో ఇంటి వెనుకవైపు ఉన్న పెద్ద బండరాయితో తలుపును బద్ధలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. -
తెనాలిలో చంద్రబాబు సభ అట్టర్‌ప్లాప్..
సాక్షి, గుంటూరు : రాజధాని పేరుతో టీడీపీ చేస్తున్న కృత్రిమ ఉద్యమానికి జనం మద్దతు లేదని మరోసారి స్పష్టం అయింది. అమరావతి జేఏసీ పేరిట తెనాలిలో నిర్వహించిన సభ జనం లేక అట్టర్‌ప్లాప్ అయింది. ఈ సభకు 20 వేల మందిని సమీకరించాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశించినప్పటికీ.. కేవలం 2వేల మంది కూడా హాజరుకాలేదు. జనం లేకపోవడంతో టీడీపీ నేతలు సభను ఆలస్యంగా ప్రారంభించారు. మధ్యాహ్నం 3 గంటలకు జరపాల్సిన సభను.. చివరకు రాత్రి 8 గంటల సమయంలో నిర్వహించారు. అయితే వచ్చిన కొద్ది మంది కూడా మధ్యలోనే వెళ్లిపోవడంతో సభ వెలవెలబోయింది. చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన కూడా ఎవరు పట్టించుకోలేదు. దీంతో ఆయన ప్రసంగిస్తున్న సమయానికి సభలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. దీంతో చంద్రబాబు తన బాధను ఖాళీ కుర్చీలకే చెప్పుకోవాల్సి వచ్చింది. జిల్లాలోని పలు నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నేతలు కూడా ఈ సభకు హాజరుకాకపోవడం గమనార్హం అయితే సభ విఫలం కావడంపై చంద్రబాబు జిల్లా టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. అమరావతి పేరిట రాద్ధాంతం చేస్తున్న చంద్రబాబుకు.. ఈ ఘటనతో మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. -
తెనాలిలో చంద్రబాబు సభ అట్టర్ ఫ్లాప్
-
విద్యార్థులు, యువతపై టీడీపీ దాడులు
తెనాలి అర్బన్/కుప్పం: పాలన వికేంద్రీకరణ బిల్లుకు అడ్డు పడుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు, టీడీపీ తీరుకు నిరసనగా విద్యార్థులు, యువకులు గుంటూరు జిల్లా తెనాలి, చిత్తూరు జిల్లా కుప్పంలో శాంతియుతంగా నిర్వహిస్తున్న ర్యాలీలపై టీడీపీ శ్రేణులు శనివారం దాడులకు తెగబడ్డాయి. తెనాలిలో వైఎస్సార్సీపీ నేత ఒకరు తీవ్రంగా గాయపడగా, రెండుచోట్లా పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. వికేంద్రీకరణ బిల్లును శాసన మండలిలో టీడీపీ అడ్డుకోవటాన్ని నిరసిస్తూ శనివారం వైఎస్సార్ సీపీ, యువజన విభాగం, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తెనాలిలోని లింగారావు సెంటర్లో చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. అక్కడి నుంచి విద్యార్థులు, యువకులు ర్యాలీగా మార్కెట్ వద్దకు చేరుకోగా.. అక్కడ దీక్ష చేపట్టిన టీడీపీ శ్రేణులు అమరావతికి మద్దతుగా నినాదాలు చేస్తు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ముఖ్యమంత్రిని అనుచిత వ్యాఖ్యలతో దూషించటంతో వైఎస్సార్ సీపీ నాయకులు చంద్రబాబు, టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంలో టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీ నాయకులపైకి దూసుకొచ్చి తోపులాటకు దిగారు. పోలీసు అధికారులు రోప్‌లు ఏర్పాటు చేసి ఇరువర్గాల వారిని పక్కకు పంపారు. ఇంతలో టీడీపీ శ్రేణులు కోడిగుడ్లు, టమోటాలతో వైఎస్సార్ సీపీ నాయకులపై దాడి చేశారు. ఈ గొడవ నడుస్తుండగానే గుర్తు తెలియని వ్యక్తి టీడీపీ దీక్ష శిబిరానికి నిప్పు పెట్టగా.. టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ నాయకుడు చుండూరు గోపీకృష్ణపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. చికిత్స పొందుతున్న అతడిని తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పరామర్శించారు. ద్రవిడ యూనివర్సిటీలో రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులపై టీడీపీ శ్రేణులు శనివారం దాడికి పాల్పడ్డాయి. వికేంద్రీకరణ విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా వర్సిటీ విద్యార్థులు శాంతియుత ర్యాలీ చేపట్టగా.. ఒక్కసారిగా టీడీపీ నాయకులు దూసుకొచ్చారు. సీఎం వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, విద్యార్థులను, వైఎస్సార్సీపీ నాయకులను చుట్టుముట్టి పిడిగుద్దులతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు, వైఎస్సార్సీపీ నాయకులకు స్వల్ప గాయాలయ్యాయి. -
ఆ రంగస్థల నటుడికి ఏవీ సుబ్బారావు అవార్డు
సాక్షి, తెనాలి: ఆయన పద్య గానం పౌరాణిక నాటక రంగాన్ని ప్రకాశింపజేసింది. తెనాలి కళారంగ ఆణిముత్యాల్లో ఒకడిగా నిలిపింది. రంగస్థలంపై శ్రీరాముడు, శ్రీకృష్ణుడు పాత్రల్లో పరకాయ ప్రవేశం అనిర్వచనీయం. అందుకే అర్ధశతాబ్దం పాటు నాటక ప్రియులను ఆయన రంజింపజేశారు. ప్రేక్షక మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయనే తెనాలికి చెందిన ‘గానకోకిల’ ఏవీ సుబ్బారావు. ఇంతటి కళా ప్రముఖుడి స్మారకార్థం ఏటా ఒక ప్రముఖ రంగస్థల నటుడికి ఏవీ సుబ్బారావు వర్ధంతి రోజైన డిసెంబరు 26న అవార్డును ప్రదానం చేస్తూ.. కళాకారుల పత్రిష్టను ఎలుగెత్తి చాటుతున్నారు. ఏవీ సబ్బారావు రంగస్థల సమాఖ్య వారి శ్రీపూర్ణశ్రీ నాట్యకళాసమితి ఆధ్వర్యంలో గురువారం తెనాలిలోని శివాజీచౌక్‌లో 9వ వార్షిక అవార్డును అనంతపురానికి చెందిన ప్రముఖ నటుడు ‘కళాతపస్వి’ ఆకులేటి నరసింహమూర్తికి ప్రదానం చేయనున్నారు. ఇదే వేదికపై రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 40 మంది కళామూర్తులను సత్కరించనున్నారు. సినీ సంభాషణల రచయిత సాయిమాధవ్ బుర్రా, పౌరాణిక నటుడు గుమ్మడి గోపాలకృష్ణ, తెనాలి సబ్‌కలెక్టర్ కె.దినేష్‌కుమార్ తదితర ప్రముఖులు కార్యక్రమానికి హాజరుకానున్నారు. నాటకాలపై ఆసక్తితో రంగస్థలం వైపు.. ఏబీ సుబ్బారావుగా రంగస్థల ఖ్యాతి పొందిన ఆరాధ్యుల వెంకట సుబ్బారావు స్వస్థలం తెనాలి సమీపంలోని అనంతవరం. పేద రైతు కుటుంబం. పెద్దగా చదువు లేదు. పొలం పనులతోనే జీవనం. నాటకాలపై ఆసక్తి ఆయన్ని కళాకారుడిని చేస్తే, నిరంతర శ్రమ, కఠోరదీక్ష ఎంతో ఎత్తుకు ఎదిగేలా చేశాయి. గ్రామంలో పక్క బజారులో ఉండే రంగస్థల నటుడు కుప్పా సూర్యనారాయణ శిష్యరికంతో సుబ్బా రావు కళామతల్లి సేవకు అంకితమయ్యారు. పాత్రలో పరకాయ ప్రవేశం.. శ్రీరాముడు పాత్రకు పద్యాలు, పాటలు, సంభాషణలను సుబ్బారావు వంటపట్టించుకున్నారు. ‘బాలనాగమ్మ’ ఫేం వల్లూరి వెంకట్రామయ్య ఆహ్వానంపై రెండేళ్లు ఆ బృందంలో ‘కార్యవర్ధి రాజు’గా నటించారు. ఆక్రమంలో 1958లో గుంటూరులో జరిగిన రాష్ట్రస్థాయి పద్యనాటక పోటీల్లో ‘పాండవోద్యోగ విజయం’లో ఏవీ సుబ్బారావు శ్రీకృష్ణుడిగా నటించారు. ఆ యన అద్భుత ప్రదర్శనతో మరోసారి అక్కడే నా టకం ఏర్పాటు చేసి, పూర్తయ్యాక ఆయన్ని 75 తులాల వెండి కిరీటంతో సత్కరించారు. ఇక అప్పటి నుంచి సుబ్బారావు వెనుదిరిగి చూడలేదు. పద్య గానం మధురం.. ఆంధ్ర రాష్ట్రమంతా సుబ్బారావు పద్య గానంలోని మాధుర్యాన్ని తనివితీరా ఆస్వాధించింది. 1960లో శ్రీ పూర్ణశ్రీ నాట్య కళాసమితిని స్థాపించారు. ఈ సమాజంలోనే 30 ఏళ్లపాటు నాటక ప్రదర్శనలిచ్చారు. రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఢిల్లీ, ఒడిశా, పశ్చిమబెంగాల్, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాల్లో ఆయన ప్రదర్శనలు పేక్షక మన్ననలు పొందాయి. మూడు తరాల కళాకారులతో.. మూడు తరాల కళాకారులతో నటించిన మరో ఘనత కూడా సుబ్బారావుకు ఉంది. ఈల పాట రఘురామయ్య, పీసపాటి నరసింహమూర్తి, షణ్ముఖి ఆంజనేయరాజు వంటి హేమాహేమీలతో కలిసి శ్రీకృష్ణుడి పాత్రను ఒకే వేదికపై పంచుకున్నారు. ఆంజనేయుడు పాత్రలో నరసింహమూర్తి ఆకులేటి నరసింహమూర్తి ఆరు వేల ప్రదర్శనలు.. మొత్తం మీద సుబ్బారావు ఆరు వేల ప్రదర్శనలిచ్చారు. ఆయన పద్యాలను హెచ్ఎంవీ, ఏవీఎం సంస్థలు గ్రామఫోన్, ఆడియో క్యాసెట్ల రూపంలో విడుదల చేశాయి. రెండు చిత్రాల్లో కాంతారావు, రావి కొండలరావుకు ప్లేబ్యాక్ పద్యాలు గానం చేశారు. 2010 డిసెంబర్ 26న సుబ్బారావు కన్నుమూశారు. ఆయన స్మారకార్థం కళారంగంలోనే స్థిరపడిన ఆయన ముగ్గురు కుమారులు ప్రతిఏటా పౌరాణిక పద్యనాటక ప్రదర్శనలు ఏర్పాటు చేసి ఆ రంగంలో నిష్ణాతులైన వారికి ‘ఆంధ్ర గానకోకిల ఏవీ సుబ్బారావు అవారు’ ను ప్రదానం చేస్తున్నారు. ఆంజనేయుడి పాత్రలో ఆకులేటి.. ఏవీ సుబ్బారావు అవార్డును స్వీకరించనున్న ఆకులేటి నరసింహమూర్తి అనంతపురం జిల్లా శింగనమల దగ్గర్లోని ఆకులేడు గ్రామ వాసి. 1950లో జన్మించారు. చిన్నతనం నుంచే రాగాలాపన చేసేవారు. గ్రామంలోని హార్మోనిస్టు సుబ్బరాజు దగ్గర ఆంజనేయుడి వేషం, పద్యాలు నేర్చారు. పది నాటకాల్లో నటించారు. తదుపరి అనంతపురంలో శ్రీవెంకటేశ్వర నాట్యమండలి సమాజంలో గురువు దగ్గర మూడేళ్ల పాటు పద్యనాటక సాధన తర్వాత వసంతోత్సవాల్లో ఏవీ సుబ్బారావు శ్రీరాముడిగా, నరసింహమూర్తి ఆంజనేయుడిగా పలు గ్రామాల్లో ఇచ్చిన ప్రదర్శనలు సూపర్ హిట్ అయ్యాయి. నరసింహమూర్తి కాస్తా.. ఆకులేటి ఆంజనేయుడయ్యారు. ప్రఖ్యాత నటులు షణ్ముఖి ఆంజనేయరాజు, ఈలపాట రఘురామయ్య, పీసపాటి నరసింహమూర్తి, ధూళిపాళ్ల, ఆచంటి వెంకటరత్నం నాయుడు, అమరపు సత్యనారాయణ, ఏవీ సుబ్బారావు కుమారులు వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావు, గుమ్మడి విమలకుమారితో వేదికను పంచుకున్నారు. కర్నూలు జిల్లాలో ఇచ్చిన ఓ ప్రదర్శనలో 50 కిలోల వెండిగదను బహుమతిగా అందుకున్నారు. ఇప్పుడు కూడా ఏమాత్రం గాత్రం తగ్గకుండా ప్రదర్శనలిస్తుండటం విశేషం. -
ఆయేషా మృతదేహానికి నేడు రీ పోస్ట్‌మార్టం
సాక్షి, అమరావతి/తెనాలి రూరల్: దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన బీఫార్మసీ విద్యార్థిని సయ్యద్ ఆయేషా మీరా మృతదేహానికి రీ పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు సీబీఐ అధికారులు సిద్ధమయ్యారు. హత్య జరిగిన 12 ఏళ్ల అనంతరం మృతదేహాన్ని వెలికి తీసి, శవ పరీక్ష నిర్వహించనున్నారు. ఆరు నెలల క్రితమే రీ పోస్ట్‌మార్టం చేయడానికి సీబీఐ అధికారులు సిద్ధపడగా, మత పెద్దలు అంగీకరించడం లేదని ఆయేషా తల్లిదండ్రులు చెప్పడంతో వారు వెనక్కి తగ్గారు. కోర్టు ఉత్తర్వులతో చేపడతామని అప్పట్లో సీబీఐ అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో ఆయేషా తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించగా, రీ పోస్ట్‌మార్టం చేయడానికి కోర్టు నుంచి అనుమతి లభించింది. 14న రీ పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు తమకు సహకరించాలని సీబీఐ అధికారులు తెనాలి సబ్ కలెక్టర్‌కు ఈ నెల 12న లేఖ రాశారు. తెనాలి చెంచుపేటలోని ఈద్గా మైదానాన్ని శుక్రవారం తహసీల్దార్ కె.రవిబాబు, ఇతర అధికారులు, పోలీసులు పరిశీలించి ఆయేషా సమాధిని గుర్తించారు. -
తెనాలిని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తాం
-
రోజుల శిశువును వదిలి..
సాక్షి, తెనాలి(గుంటూరు) : ఆ తల్లికి ఏం కష్టమెచ్చిందో... ఏమో రోజుల శిశువును వైద్యశాలలో వదిలేసి వెళ్లిపోయింది. బిడ్డ కోసం ఎవరూ రాకపోవటంతో వైద్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల కథనం ప్రకారం తెనాలి అమరావతి ఫ్లాట్లకు చెందిన దాసరి మహేశ్వరి గతనెల 29న జిల్లా వైద్యశాలలో ఆడశిశువును ప్రసవించింది. బిడ్డ నెలలు తక్కువగా పుట్టటంతో ఎస్ఎన్సీయూ వార్డులోని ఇంక్యుబేటర్‌లో ఉంచారు. ఈనెల 10వ తేదీన మహేశ్వరిని వైద్యులు డిశ్చార్జి చేశారు. దీంతో ఆమె బిడ్డను ఇంక్యుబేటర్‌లోనే వదిలేసి వెళ్లిపోయింది. రోజులు గడుస్తున్నా బిడ్డ కోసం ఎవరూ రాకపోవటంతో గమనించిన వైద్యులు, సిబ్బంది అధికారులకు విషయం తెలియజేశారు. దీంతో వారు త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. త్రీటౌన్ సీఐ హరికృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎస్బీఐ డిప్యూటీ మేనేజర్ ఆత్మహత్య
సాక్షి, గుంటూరు : తెనాలిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) డిప్యూటీ మేనేజర్ అంకిరెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మూడు నెలల క్రితమేతెనాలి బ్రాంచ్‌లో చేరిన అంకిరెడ్డి.. మంగళవారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. అంకిరెడ్డి మృతిపై కుటుంబీకులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. బ్యాంకు అధికారుల వేధింపుల వల్లే తన భర్త మృతి చెందారని అంకి రెడ్డి భార్య చెబుతుండగా.. భార్య, అత్తమామల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన తండ్రి ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. -
బాలికకు నీలి చిత్రాలు చూపిన మృగాడు
తెనాలి రూరల్: పదేళ్ల బాలికకు నీలి చిత్రాలు చూపాడో మృగాడు. గుంటూరు జిల్లా తెనాలిలోని చంద్రబాబునాయుడు కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పసుపులేటి దుర్గాప్రసాద్‌కు 16 ఏళ్ల క్రితం వివాహమైనా పిల్లలు కలగలేదు. వేధింపుల కారణంగా భార్య అతన్ని వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. వెదురు బొంగుల నిచ్చెనలు తయారు చేసి, విక్రయించడం, స్థానికంగా కొద్ది మొత్తాలు వడ్డీకి ఇవ్వడం చేస్తుంటాడు. ఇతనికి సెల్ఫోన్లో నీలిచిత్రాలు చూడడం వ్యసనంగా మారింది. అంతటితో సరిపెట్టుకోకుండా ఇంటి సమీపంలోని బాలికలను పిలిచి ఫోన్లో వారికి ఆ చిత్రాలను చూపించే సైకోలా మారాడు. గతంలో అదే ప్రాంతంలోని ఓ బాలికతో ఈ విధంగానే ప్రవర్తించగా, స్థానికులు దేహశుద్ధి చేశారు. తాజాగా శనివారం ఇంటి వద్ద ఆడుకుంటున్న పదేళ్ల బాలికను పిలిచి సెల్ఫోన్లో చిత్రాలు చూపించాడు. చిన్నారి భయపడి, రోదిస్తూ ఇంటికి వెళ్లి తల్లికి చెప్పుకుంది. ఆమె వచ్చి స్థానికులతో కలిసి దుర్గాప్రసాద్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించింది. -
నన్నపనేని వ్యాఖ్యలపై ఆగ్రహ జ్వాలలు
సాక్షి, అమరావతి: దళితుల వల్లే దరిద్రం అని అహంకారంగా మాట్లాడిన రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్మన్ నన్నపనేని రాజకుమారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో ఉన్న చినకాకాని మహిళా ఎస్సై అనూరాధను ఉద్దేశించి అహంకారంగా మాట్లాడం సిగ్గుచేటన్నారు. గతంలో కూడా అనేక మంది ప్రజా ప్రతినిధులు దళితులపై రకరకాల పేరుతో అవమానకర వ్యాఖ్యలు చేశారని, వ్యంగ్యంగా మాట్లాడినా చర్యలు తీసుకున్న సందర్భాలు లేనందునే ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయన్నారు. ఎస్సైకి తగిన రక్షణ కల్పించి, భవిష్యత్‌లో ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దిష్టిబొమ్మల దగ్ధం తెనాలి : దళిత ఎస్ఐ విధులను ఆటంకపరుస్తూ ‘దళితుల వలన ఈ దరిద్రం పట్టింది’ అంటూ దళితులను కించపరచేలా మాట్లాడిన మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి వ్యాఖ్యలకు నిరసనగా, దీనిని ఖండించని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఆలపాటి రాజేంద్రప్రసాద్ దిష్టిబొమ్మలను పట్టణ గాంధీచౌక్‌లో గురువారం దహనం చేశారు. టీడీపీ పల్నాడులో హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం, న్యాయవిభాగం సంయుక్త ఆధ్వర్యంలో నిరసన జరిగింది. జిల్లాలోని పెదకాకాని ఎస్ఐ అనూరాధ విధుల్లో ఉండగా, నన్నపనేని రాజకుమారి, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి వనితలు పరుష పదజాలంతో దూషించి దళితుల మనోభావాలను దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించారని ఆరోపించారు. అనంతరం వినతిపత్రాన్ని మండల తహసీల్దార్, తెనాలి ఆర్డీవో కార్యాలయాల్లో అందజేశారు. పార్టీ ఎస్సీ విభాగం తెనాలి నియోజకవర్గ అధ్యక్షుడు కనపర్తి అనిల్, రాష్ట్ర కార్యదర్శి కె.దేవయ్య, లీగల్‌సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కేఎం విల్సన్, డి.మల్లికార్జునరెడ్డి, జె.ఎలిజబెత్ రాణి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.ప్రసాదరావు, కొమ్ము రాయల్ పాల్గొన్నారు. దళితులకు క్షమాపణ చెప్పాలి తెనాలి టౌన్ : దళిత ఎస్ఐ విధులకు ఆటకం కలిగిస్తూ ఆమెను కించపరిచే విధంగా మాట్లాడిన మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు మాదిగ కార్పొరేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు రావూరి రవిబాబు (జెవీఆర్) గురువారం ఒక ప్రకటనలో చెప్పారు. రాజకుమారి దళితులకు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి దేవయ్య డిమాండ్ చేశారు. రాజకుమారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు మహిళా ఎస్ఐని అవమానించిన మహిళా కమిషన్ రాష్ట్ర మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని బడుగు, బలహీన వర్గాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కంతేటి యలమందరావు డిమాండ్ చేశారు. గురువారం పెదకాకాని పోలీస్‌స్టేషన్‌లో సీఐ యు.శోభన్‌బాబును కలసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. విధులు నిర్వహిస్తున్న మహిళా ఎస్ఐపై రాజకుమారి బృందం వేలు చూపిస్తూ అవమానకరంగా మాట్లాడారని పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో బడుగు, బలహీన వర్గాల సంక్షేమ సంఘం ప్రతినిధులు కుక్కల రాంప్రసాద్, కూరపాటి సరస్వతి, బెజ్జం గోపి, బండి ప్రసాద్, బండ్లమూడి బానుకిరణ్, పాటిబండ్ల విల్సన్‌బాబు తదితరులు ఉన్నారు. ఆళ్లమూడిలో నిరసనలు భట్టిప్రోలు: నన్నపనేని రాజకుమారి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా భట్టిప్రోలు మండలం ఆళ్లమూడి వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో గురువారం రాత్రి నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతర రాజకుమారి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ యువజన విభాగం కార్యదర్శి పంతగాని బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. సాటి మహిళ అని చూడకుండా పెదకాకాని మహిళా ఎస్ఐ అనూరాధపై దుర్భాషలాడటం విచారకరమన్నారు. కార్యక్రమంలో నాంచారయ్య, ప్రవీణ్‌కుమార్, వెంకట్రావు, అశోక్, ప్రశాంత్‌రాజ్, చంటి పాల్గొన్నారు. పెదపులివర్రు పంచాయతీ పరిధిలోని కోళ్లపాలెం అంబేడ్కర్ విగ్రహం వద్ద గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. నిరసనలో నాగరాజు, చీకటి నాగేశ్వరరావు, బుస్సా మణేశ్వరరావు, ఎన్ నాగరాజు, దోవా సంసోన్, సూర్యచంద్రరరావు పాల్గొన్నారు. రాజకుమారి ఇలా మాట్లాడటం సరికాదని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు నాగమల్లేశ్వరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అదే విధంగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మహిళా ఎస్ఐపై దురుసుగా ప్రవర్తించడం శోచనీయమన్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. (చదవండి: నోరు పారేసుకున్న నన్నపనేని) -
అభిమానిగా అడుగుపెట్టి.. నేడు!
సాక్షి, గుంటూరు: శివ చెర్రి...సినిమా పరిశ్రమలో మెగా కుటుంబానికి, రాష్ట్రంలోని ఆ హీరోల అభిమానులకు సుపరిచితమైన పేరు. మెగా హీరోల సినిమాలకు ఆడియో ఫంక్షన్ల నుంచి, హైదరాబాద్ వెలుపల వారు పాల్గొనే పలు సభలు, సమావేశాలకు కీలక బాధ్యతల్లో తరచుగా వినిపిస్తుందా పేరు. ఆ క్రమంలోనే ఇప్పుడు సినీ ఎగ్జిక్యూటివ్ నిర్మాత అయ్యాడు. ఒకప్పుడు సినిమా ఫంక్షన్ల పాస్‌ల కోసం పాకులాడిన ఈ తెనాలి కుర్రోడు నేడు తన ఆధ్వర్యంలోనే మెగా హీరోల ఆడియో ఫంక్షన్లు జరిగేంతలా ఎదిగాడు. సినిమా అభిమానులంటే పనీపాట లేనివాళ్ల వ్యాపకమని చిన్నచూపు చూసే సమాజానికి, నిజమైన ‘అభిమానం’ జీవితాన్నిస్తుందని నిరూపించాడు. సినిమా నిర్మాణ రంగంలో తెనాలి కీర్తిప్రతిష్టలను నిలబెడతానని చెబుతున్నాడు శివ చెర్రీ. రాంచరణ్ అభిమాని నుంచి సినీ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా... శివ చెర్రి అసలు పేరు పసుపులేటి శివ. మధ్యతరగతి కుటుంబం. తండ్రి హజరత్ సినిమా థియేటర్లో క్యాంటిన్ నడిపేవారు. నష్టం రావటంతో కుటుంబంతో సహా కొల్లూరు మకాం మార్చారు. అక్కడో చిన్న క్యాంటిన్ తీసుకున్నారు. నాలుగేళ్ల తర్వాత తెనాలి తిరిగొచ్చారు. అప్పటికి శివకు పదోతరగతి పూర్తవటంతో ఇక్కడే ఇంటర్లో చేరాడు. హైస్కూలులో రెండేళ్లు విద్యార్థి నాయకుడిగా, హౌస్ కెప్టెన్‌గా వున్న అనుభవం కలిగిన శివకు ఏదొకటి చేయాలన్న ఉత్సాహం. తాను అభిమానించే సినీనటుడు రామ్‌చరణ్ సినిమా మగధీర రిలీజయ్యే సమయం. తోటి స్నేహితులను కూడగట్టి, చరణ్ ఫాన్స్ అసోసియేషన్ స్థాపించాడు...అధ్యక్షుడయ్యాడు. చేతిలో రూపాయి లేకున్నా, సభ్యుల చందాలు రూ.80 వేలతో సినిమా విడుదల రోజున పట్టణాన్ని ఫ్లెక్సీలతో నింపేశాడు...తొలియత్నంలోనే తెనాలి సినీ అభిమానులు శివకేసి చూశారు. తర్వాతి సినిమాకు మరింత ఆర్భాటం చేశారు. తొలినుంచీ సినిమాపై గల పిచ్చి, తండ్రి చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడు కావటం ఇందుకు పురిగొల్పాయంటారు శివ. మరోవైపు చరణ్, చిరంజీవి జన్మదినాల్లో సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాల నిర్వహణ, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయటం మామూలే... శివచెర్రీగా..పసుపులేటి శివ హైదరాబాద్‌లో చిరంజీవి ఆధ్వర్యంలో నడిచే బ్లడ్‌బ్యాంకుకు శనివారం వెళితే ‘మెగా’ నటులను కలుసుకోవచ్చని తెలిసి.. ప్రతి శుక్రవారం డెల్టా ప్యాసింజరుకు వెళ్లటం, ఉదయాన్నే బ్లడ్‌బ్యాంకుకు వెళ్లి, సాయంత్రం వరకు అక్కడ ఎదురుచూడటం...నిత్య కార్యక్రమంగా చేసుకున్నాడు. ఒకరోజు చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడు, బ్లడ్‌బ్యాంక్ సీఈఓ స్వామినాయుడు దృష్టిలో పడ్డాడు. చిన్నవయసులోనే రక్తదానం వంటి పలు సేవాకార్యక్రమాలు నిర్వహించడం తెలుసుకున్న అతను టచ్‌లో ఉండమని చెప్పాడు. ఒకరోజు స్వామినాయుడు నుంచి పిలుపురావడంతో అమ్మతో కలిసి హైదరాబాద్ వెళ్లటం శివ జీవితానికి మలుపు. ‘శివలో సేవాగుణం ఉంది...ఇక్కడ వదిలేసి వెళ్లండి...మేం చూసుకుంటాం’ అనటంతో బట్టలు, రూ.3 వేల నగదు ఇచ్చేసి అమ్మ వెళ్లిపోయింది’ అని చెప్పారు శివ. స్పోకెన్ ఇంగ్లిష్, కంప్యూటర్ కోర్సులో చేర్పించారు. తర్వాత అక్కడే బీకెట్ పూర్తిచేశారు. అప్పుడే రాష్ట్ర ‘రామ్‌చరణ్ యువశక్తి’ని ప్రారంభించి, రాష్ట్రమంతా తిరిగి, అన్ని జిల్లాల్లో యువశక్తి విభాగాలను ఆరంభించారు. దీంతో పసుపులేటి శివ, శివ చెర్రీగా స్థిరపడిపోయారు. ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా.. ఈ క్రమంలో రామ్‌చరణ్, అల్లు అర్జున్‌తో సహా మెగా కుటుంబంతో సాన్నిహిత్యం పెరిగింది. ఆడియో ఫంక్షన్లు, టీజర్ల విడుదల సహా అన్ని కార్యక్రమాల్లోనూ తన బాధ్యతలు తప్పనిసరైంది. బయట హీరోలతోనూ సంబంధాలు ఏర్పడ్డాయి. హీరో సందీప్‌కిషన్ ఆహ్వానంపై అతనికి మేనేజరుగా వెళ్లాడు. అదే హీరో వెంకటాద్రి టాకీస్ స్థాపించి, ‘నిను వీడని నీడను నేను’ సినిమాకు శ్రీకారం చుట్టినపుడు, శివ చెర్రీకి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా అవకాశం కల్పించారు. ఆ సినిమా హిట్ కావటంతో రెండోసినిమా ‘తెనాలి రామకృష్ణ బీఏ.,బీఎల్’ చిత్రం జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుందని శివ వెల్లడించారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా 20 మంది స్నేహితులకూ ఉపాధి చూపాననీ, ఎప్పటికైనా సొంతంగా ప్రొడక్షన్ సంస్థను స్థాపించాలనేది తన తాజా కలగా శివ చెప్పారు. తెనాలిలో ఏటా వినాయక చవితి వేడుకల్లో పాల్గొనటం శివకు అలవాటు, ఏటా ఒక సినిమా హీరోను ఇక్కడకు తీసుకొస్తున్నారు. ఈసారి సంపూర్ణేష్‌బాబు, విశ్వక్సేన్తో ఇక్కడ చవితి సందడి చేయించారు. తన ఎదుగుదలకు కారణమైన సినిమాకు, మెగా కుటుంబానికి రుణపడి ఉంటానని చెబుతారు శివ. -
వృద్ధ దంపతులపై కోడలి దాష్టీకం!
సాక్షి, తెనాలి: వృద్ధాప్యంలో ఉన్న తమను ఆదరించకపోగా, ఆస్తి కోసం వేధిస్తూ భౌతిక దాడులకు పాల్పడుతూ తప్పుడు కేసుతో పోలీస్ స్టేషన్లో నిర్బంధానికి గురిచేసిన కోడలు నుంచి తమకు రక్షణ కల్పించాలని కొల్లిపర మండల గ్రామం శిరిపురానికి చెందిన డక్కుమాల విక్టోరియమ్మ, జీవరత్నం దంపతులు అధికారులను వేడుకున్నారు. సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ‘స్పందన’లో అర్జీనిచ్చారు. తెనాలి ఆర్డీవో ఎ.శ్యామ్‌సుందర్ అర్జీలను స్వీకరించారు. అర్జీలో విక్టోరియమ్మ పేర్కొన్న వివరాలిలా ఉన్నాయి. తాడిగిరిపాడులో నివసిస్తున్న డక్కుమాల విక్టోరియమ్మ, జీవరత్నం దంపతులు కోడలు భాగ్యలక్ష్మి వేధింపులను తట్టుకోలేక శిరిపురం చేరుకున్నారు. అక్కడే కూలిపనులు చేసుకుంటూ మూడు సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేసి పూరిల్లు వేసుకుని నివసిస్తున్నారు. కొన్నాళ్ల తర్వాత కొడుకు గోపాలరావు, కోడలు భాగ్యలక్ష్మి కూడా శిరిపురం వచ్చారు. తల్లిదండ్రులు ఉండే స్థలంలోనే మరో ఇల్లు వేసుకుని వేరుకాపురం ఉంటున్నారు. వీరి మంచీచెడూ చూడటం లేదు. కోడలు పేరిట తాడిగిరిపాడులో ఇందిరమ్మ ఇల్లు ఉంది. అయితే తల్లిదండ్రులు ఉంటున్న నివాస స్థలాన్ని కూడా కోడలు పేరుతో రాసివ్వమంటూ కొడుకు గోపాలరావు ఒత్తిడి చేస్తున్నాడు. బతికున్నంతకాలమైనా స్థలాన్ని తమ అధీనంలోనే ఉంచమని వేడుతున్నా వినలేదు. హృద్రోగంతో బాధపడుతున్న మామ, అత్త విక్టోరియమ్మను ఆస్తి కోసం కోడలు విచక్షణారహితంగా కొట్టింది. అప్పటికీ స్థలం ఇచ్చేందుకు అంగీకరించకపోవటంతో కొల్లిపర పోలీస్‌స్టేషనులో తప్పుడు ఫిర్యాదు ఇచ్చారు. దీంతో పోలీసులు 23వ తేదీ సాయంత్రం 5 గంటల్నుంచి అర్ధరాత్రి వరకు వృద్ధ దంపతులను నిర్బంధించారు. కొల్లిపర పోలీసులు కూడా కోడలుకే మద్దతునిస్తూ, స్టాంపు పత్రాలపై సంతకం చేయమని ఒత్తిడి తెచ్చారు. నివసిస్తున్న స్థలం మినహా మరే ఆధారం లేని తమను రోడ్డుకీడ్చారని, గతిలేని స్థితిలో అదే ఊరిలో ఉంటున్న అల్లుడి ఇంటికి వెళ్లాల్సి వచ్చిందని వృద్ధులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కోడలి వల్ల తమకు ప్రాణభయం ఉందని, రక్షణ కల్పించి, తమ ఇంటిలో తాము ఉండేలా న్యాయం చేయాలని విక్టోరియమ్మ భర్తతో సహా ఆర్డీవోను వేడుకుంది. మనుమలను దూరం చేశారు.. వృద్ధాప్యంలో ఒంటరి జీవితం నరకప్రాయమని, కనీసం చనిపోయేంతవరకైనా తనతో కోడలు, మనుమ సంతానం కలిసుండేలా ఆదేశించాలని పట్టణ సుల్తానాబాద్‌కు చెందిన వృద్ధురాలు ధనావత్ పట్నీబాయి (70) ‘స్పందన’లో ఆర్డీవోను కలిసి అర్జీనిచ్చారు. భర్త మరణంతో తాను సుల్తానాబాద్‌లోని సొంతంటిలో పెద్దకొడుకు కుటుంబంతో కలసి ఉంటున్నట్టు తెలిపారు. ప్రధానోపాధ్యాయుడైన తన పెద్ద కొడుకు మునినాయక్ గత మే నెల 27న ఆటోప్రమాదంలో మరణించాడని, ఉమ్మడి కుటుంబం అయినా కొడుకు చనిపోయాక ఫ్యామిలీ సర్టిఫికెట్లో తన పేరు లేకుండా చేశారని పట్నీబాయి చెప్పారు. ఆధార్‌లో మార్పులు చేయించుకు వస్తానంటూ కోడలు పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లినట్టు తెలిపారు. ఇప్పుడేమో ‘నేను రాను...మీతో నాకు అవసరం లేదు’ అంటోందని చెప్పారు. ఎవరూ లేకపోవటంతో పెళ్లివయసుకొచ్చిన చిన్న కుమార్తెతో ఉంటున్నానని, ఆమె వివాహం తర్వాత మళ్లీ ఒంటరినవుతానని ఆవేదనగా అన్నారు. ముఖ్యంగా ఆరేళ్లలోపు వయసు కలిగిన ముగ్గురు మనుమ సంతానంతో సహా కోడలు తన ఇంటి వద్ద ఉండేలా చూడాలంటూ ఆర్డీవోను అభ్యర్థించారు. – ధనావత్ పట్నీబాయి -
గూగుల్ పే కస్టమర్ కేర్ పేరిట మోసం
సాక్షి, గుంటూరు : గూగుల్ పే కస్టమర్ కేర్ పేరిట వ్యక్తి నుంచి నగదు కాజేసిన ఘటనపై కేసు నమోదయ్యింది. పట్టణ చెంచుపేటకు చెందిన కె. శ్రీనివాస్ గూగుల్ పే ద్వారా రూ.4,230 బిల్లును మంగళవారం రాత్రి చెల్లించాడు. బ్యాంకు ఖాతాలో నగదు డిడక్ట్ అయినా, ట్రాన్సాక్షన్ ఫెయిల్ అని రావడంతో బుధవారం ఉదయం గూగుల్ పే కస్టమర్ కేర్‌ను సంప్రదించే ప్రయత్నం చేశాడు. ఫోన్‌కు సమాధానం రాలేదు. కొద్దిసేపటికే 8144185193 నంబర్ నుంచి శ్రీనివాస్‌కు ఫోన్ వచ్చింది. తాను గూగుల్‌పే కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నానంటూ చెప్పాడు. తన ఐడీ నంబర్ అంటూ ఒక నంబర్ తెలిపాడు. ఖాతాలో డిడక్ట్ అయిన నిధులను తిరిగి జమ చేసేందుకు, తమ నుంచి వచ్చే ఎస్ఎంఎస్ను మరో నంబరుకు ఫార్వార్డ్ చేయమని చెప్పడంతో శ్రీనివాస్ అలాగే చేశాడు. కొద్ది సేపటికే ఐదు విడతల్లో తన బ్యాంకు ఖాతాలోని రూ.99,995 నగదు మాయమయ్యిందని, బ్యాంకుకు వెళ్లి స్టేట్మెంట్ తీసుకుని అక్కడి అధికారులను సంప్రదించగా తాము ఏమీ చేయలేమని చెప్పినట్లు శ్రీనివాసు తెలిపాడు. దీంతో చేసేది లేక పోలీసులను ఆశ్రయించాడు. -
చంద్రయాన్–2 విజయంలో తెనాలి తేజం!
సాక్షి, తెనాలి: భారత అంతరిక్ష ప్రయోగాల్లో మరో మైలు రాయిని ఇస్రో అందుకుంది. ఎంతో సంక్లిష్టమైన ప్రాజెక్టుగా పేరొందిన చంద్రయాన్–2ను సోమవారం విజయవంతంగా ప్రయోగించి అంతరిక్ష ప్రయోగాల్లో మనదేశ సత్తాను ప్రపంచానికి మరోసారి ఘనంగా చాటింది. 120 కోట్ల ప్రజల ఆకాంక్షలను, ఆశలను గగనానికి మోసుకెళ్లిన జీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగ విజయంలో గుంటూరు జిల్లా, తెనాలికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ పావులూరు సుబ్బారావు పాత్రకూడా ఉండడం మనందరం గర్వించదగిన విషయం. రాకెట్లకు కావాల్సిన కీలకమైన ఉపకరణాలను ఈయన సంస్థ సరఫరా చేస్తుండడం విశేషం.. తెనాలి వారే.. డాక్టర్ పావులూరి సుబ్బారావు స్వస్థలం తెనాలి సమీపంలోని గోవాడ గ్రామం. ఆయన 1952లో జన్మించారు. తండ్రి పావులూరి శివరామకృష్ణయ్య, తల్లి అమ్మెమ్మ. స్కూలు ఫైనల్ వరకు తెలుగు మీడియంలో చదివిన సుబ్బారావు స్వయంకృషితో రాణించారు. కాలికట్ ఇంజినీరింగ్ కాలేజీలో బీఈ, బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్‌లో ఎంఈ చేశాక, బెంగళూరు యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పొందారు. ‘ఇస్రో’లో శాస్త్రవేత్తగా చేరి, భారత అంతరిక్ష కార్యక్రమాల్లో నైపుణ్యం సాధించారు. మరింత సృజనాత్మకతతో రాణించాలన్న భావనతో ఉన్న ఆయనను అంతరిక్ష వ్యాపారం ఆకర్షించింది. ఫలితంగానే అనంత్ టెక్నాలజీస్ (1993) స్థాపనకు దారితీసింది. రక్షణ, పరిశోధన (డీఆర్డీఓ)లో సిస్టమ్స్ డిజైన్, అభివృద్ధి చేసి, ఫ్యాబ్రికేషన్ చేసే వ్యాపారాన్ని అనంత్ టెక్నాలజీస్ చేపట్టింది. ఉపగ్రహ ప్రయోగ వాహకాలైన పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ ప్రయోగాల్లో, జాతీయ అభివృద్ధికి తోడ్పడే ఏరోస్పేస్ ప్రయోగాలన్నింటిలో విస్తృతంగా పాల్గొంది. అగ్ని, ఆకాశ్, బ్రహ్మోస్, పృథ్వి క్షిపణుల నిర్మాణం, తేలిక రకపు విమానాల తయారీలోనూ పాలుపంచుకున్నారు. చంద్రయాన్, మంగళయాన్ మిషన్స్‌లో శాటిలైట్ కాంపొనెంట్స్ నిర్మాణంలో పాల్గొని ‘మామ్’ శాటిలైట్ మెయిన్‌ఫ్రేమ్ మొత్తాన్ని అభివృద్ధి చేసినట్టు సుబ్బారావు చెప్పారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) చేపట్టిన తొలి భారీ అంతరిక్ష ప్రాజెక్టు చంద్రయాన్ –1. పదేళ్ల క్రితం అతితక్కువ ఖర్చుతో చేసిన ఈ ప్రయోగంతో చంద్రుడిపై నీటి ఆనవాళ్లను పసిగట్టారు. మళ్లీ ఇప్పుడు చంద్రయాన్–2 విజయవంతంగా ప్రయోగించి దేశ కీర్తిప్రతిష్టలను ప్రపంచ యవనికపై ఇస్రో మరోసారి చాటింది . ‘చంద్రుడు ఆవాసంగా నివాసం...అవకాశాలు’ అనేది తాజా ప్రయోగం ముఖ్య ఉద్దేశం. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)నుంచి ఇస్రో బాహుబలి రాకెట్‌గా పేరొందిన జీఎస్ఎల్వీ మార్స్3–ఎం1 ఉపగ్రహ వాహక నౌక ద్వారా జరిగిన ఈ ప్రయోగం విజయవంతంలో ఓ తెలుగుతేజం భాగస్వామ్యం ఉంది. ఆయనే తెనాలికి చెందిన ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త డాక్టర్ పావులూరి సుబ్బారావు. కీలక ఉపకరణాలు సరఫరా: ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేసిన అనుభవంతో డాక్టర్ సుబ్బారావు స్థాపించిన ఏటీఎల్ స్పేస్ సిస్టమ్స్ అండ్ ఎక్విప్మెంట్ సంస్థ టెలిమెట్రీ, టెలికమాండ్, పవర్, ఆటిట్యూడ్, ఆర్బిట్ కంట్రోల్, ఆన్–బోర్డ్–కంప్యూటర్ వంటి ఎన్నో పరికరాలు ఇస్రోకు అందించింది. రాకెట్ ప్రయోగాల్లో వీటిని కీలకంగా చెబుతారు. ఈ సంస్థ తయారుచేసిన స్టార్ సెన్సార్ వంటి అత్యాధునికమైన స్పందన నమోదుచేసే ముఖ్యమైన పరికరాల్ని ఇస్రో తన శాటిలైట్లలో వినియోగిస్తోంది. వాటివల్ల స్పేస్ క్రాప్ట్–నక్షత్రాల మధ్య గల దూరాలను గుర్తించటానికి వీలవుతుందని, పరిశోధనల్లో ఇదెంతో కీలకమని డాక్టర్ సుబ్బారావు ‘సాక్షి’తో ఫోనులో చెప్పారు. ఇస్రో వాహకనౌకలకు కావాల్సిన ఏవియానిక్స్ సిస్టమ్స్‌ను కూడా ఏటీఎల్ అందిస్తోంది. నావిగేషన్, గైడెన్స్, కంట్రోల్, ఆధునిక టెలిమెట్రీ, ఆర్ఎఫ్ సిస్టమ్స్, పవర్ మాడ్యూల్స్, డీసీ/డీసీ, ఇనెర్పియల్ సెన్సింగ్ యూనిట్, స్టేజీ హెర్నేసింగ్ అండ్ ఇంటెగ్రేషన్ వంటి వాటిని ఈ సంస్థ సమకూరుస్తున్నారు. సొంతంగా రాకెట్ ప్రయోగం ఇస్రో ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ప్రొడక్షన్ ధ్రువీకరించిన ఏటీఎల్‌లో 300 పైగా సుశిక్షితులైన నిపుణులు, ఇంజినీర్లు పనిచేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి అసెంబ్లింగ్ యూనిట్లతోపాటు పరీక్షించే సదుపాయం కూడా సంస్థలో ఉంది. ప్రస్తుతం నాలుగు టన్నుల శాటిలైట్ల నిర్మాణ ప్రారంభ దశ నుంచి పరీక్షకు సిద్ధంచేసే వరకు పూర్తి సదుపాయాలను ఏర్పాటు చేసుకుంటున్నట్టు డాక్టర్ సుబ్బారావు తెలిపారు. అత్యంత సృజనాత్మకమైన ఈ సదుపాయంతో ఇస్రోతో పాటు ఇతర దేశాలకూ శాటిలైట్లు తయారు చేసిస్తామని చెప్పారు. ఏటీఎల్ ఆధ్వర్యంలో ఇప్పటికే ‘ఏ1 శాట్’ అనే సొంత శాటిలైట్‌ను రష్యా అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించామని, ప్రస్తుతం అది దక్షిణ అమెరికాలో ఇంటర్నెట్ సేవలను అందిస్తున్నట్టు వివరించారు. 25 ఏళ్లుగా భాగస్వామ్యం: ఆర్బిటర్, ల్యాండర్ వంటి బహుముఖ వ్యవస్థలు కలిగివున్న బాహుబలి (జీఎస్ఎల్వీ ఎంకే–3) ఉపగ్రహం, చంద్రయాన్–2 మిషన్ ప్రత్యేకత తెలిసిందే. ఇందులోని మూడు ముఖ్యమైన దశలకు చెందిన ఏవియానిక్స్ సిస్టమ్స్‌ను నిర్మించి ఇస్రోకు అందించినది హైదరాబాద్‌కు చెందిన అనంత్ టెక్నాలజీస్ లిమిటెడ్ (ఏటీఎల్) సంస్థ. ఎలక్ట్రానిక్ సిస్టమ్స్‌ను కూడా అందిస్తోందీ సంస్థ. ఏటీఎల్ వ్యవస్థాపకుడు, సీఎండీ తెనాలికి చెందిన ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త డాక్టర్ పావులూరి సుబ్బారావు కావటం విశేషం. ఇస్రో విజయాల్లో 25 ఏళ్లుగా అనంత్ టెక్నాలజీస్ లిమిటెడ్ (ఏటీఎల్)కు భాగస్వామ్యముంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ, తన తిరువనంతపురం యూనిట్ నుంచి పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీలకు ఏవియానిక్స్ సిస్టమ్స్‌ను అందిస్తోంది. కమ్యూనికేషన్స్, రిమోట్ సెన్సింగ్ నావిగేషనల్, సైంటిఫిక్ శాటిలైట్స్ లాంటి అన్ని రకాల ఉపగ్రహాల్లో ఎలక్ట్రానిక్ కక్ష ఉపవ్యవస్థల రియలైజేషన్, డెలివలీ విభాగాలను చాలాకాలంగా ఏటీఎల్ బెంగళూరు యూనిట్ నుంచి అందిస్తోంది. -
ప్రజా చావుకార సర్వే!
సాక్షి, తెనాలి: భార్యాబిడ్డలతో నిక్షేపంగా జీవిస్తున్న యువకుడు మరణించినట్లు ప్రజాసాధికార సర్వే సిబ్బంది నిర్లక్ష్యంగా నమోదు చేశారు. మరోవైపు కుటుంబ రేషను కార్డులో అతడి పేరు తొలిగిపోయింది. సర్వేలో భవన నిర్మాణ పనుల్లో దినసరి కూలికి వెళ్లే అతను రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. అవసరమైన శస్త్రచికిత్స కోసం ‘ఆరోగ్యశ్రీ’ని ఆశ్రయించినప్పుడు, అన్లైన్లో తన పేరు మృతుల జాబితాలో ఉన్నందున ఉచిత వైద్యం ఉందని తెలిసి నివ్వెరపోయాడు. ఆ అభాగ్యుడు తెనాలి వైకుంఠపురం దేవస్థానం సమీపకాలనీలో నివసించే దండమూరి శ్రీనివాస్. శ్రీనివాస్ భవన నిర్మాణ పనుల కార్మికుడు. భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. తండ్రి పన్నెండేళ్ల క్రితం చనిపోయాడు. తల్లి రమణ ప్రైవేటు ఆసుపత్రిలో పార్ట్ టైమ్ ఉద్యోగంతో నెలకు రూ.4 వేలు సంపాదిస్తున్నారు. అన్నయ్య సతీష్ వివాహం అనంతరం అత్తగారింట ఉంటున్నాడు. శ్రీనివాస్ 11 నెలల క్రితం తాపీ మేస్త్రితో కలిసి అతడి ద్విచక్రవాహనంపై గుంటూరు వెళ్తుండగా మరో ద్విచక్ర వాహనం ఢీకొంది. తాపీ మేస్త్రి, శ్రీనివాస్ ఇద్దరూ కిందపడ్డారు. శ్రీనివాస్ ఎడమ చేతికి తీవ్ర గాయమైంది. తెనాలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యుడు శస్త్రచికిత్స చేయాలని చెప్పారు. అక్కడున్న ఆరోగ్యశ్రీ కౌంటరులో వివరాలు నమోదుచేయిస్తే, అనుమతి రాగానే చేస్తామని హామీనిచ్చారు. ఆన్లైన్లో మృతుల జాబితాలో... రేషను కార్డు, ఆరోగ్యశ్రీ కార్డుతో శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఆస్పత్రిలోని ఆరోగ్యమిత్ర కౌంటరుకు వెళ్లారు. కార్డు వివరాలను పరిశీలించిన అక్కడి సిబ్బంది, ఆన్లైన్లో దండమూడి శ్రీనివాస్ పేరు చనిపోయిన వ్యక్తుల జాబితాలో ఉందని చెప్పడంతో వారు నిర్ఘాంతపోయారు. గాయపడి ఎదురుగా ఉన్న వ్యక్తిని చనిపోయాడని ఎలా చెబుతారని ప్రశ్నిస్తే, తామేం చేయలేమని ఆరోగశ్రీ వర్తించదని ఖరాకండీగా చెప్పేశారు. తహసీల్దారు కార్యాలయానికి వెళ్లినా, అప్పటికప్పుడు ఏమీ చేయలేమని చెప్పారు. వైద్యుల సూచనతో విజయవాడలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం దగ్గర్లోని ఆరోగ్యశ్రీ ప్రత్యేక విభాగం వద్దకు క్షతగాత్రుడిని కారులో తీసుకెళ్లారు. అక్కడ సిబ్బందికి అతడిని చూపించి, పరిస్థితిని వివరించగా, ఆపరేషను నిమిత్తం లేఖ ఇచ్చారు. దానితో స్థానిక ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేశారు. తిరుపతిలో శస్త్రచికిత్స ఆవశ్యకత శస్త్రచికిత్స తర్వాత కూడా చెయ్యి స్వాధీనం రాకపోవంతో శ్రీనివాస్‌కు మరోసారి వైద్యులు పరీక్షలు చేశారు. ప్రమాదంలో కలిగిన ఒత్తిడితో నరాలు దెబ్బతిన్నాయని హైదరాబాద్ లేదా తిరుపతిలో చికిత్స చేయించుకోవాలని చెప్పటంతో అంతా కలిసి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు వెళ్లారు. అక్కడ ఆరోగ్యశ్రీ లేఖ పనిచేయలేదు. కేవలం అక్కడ వైద్య పరీక్షలు, లెబోరేటరీ పరీక్షలకే రూ.50 వేల ఖర్చయిందని శ్రీనివాస్ సోదరుడు సతీష్ చెప్పారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే తిరుపతిలో ఉచితంగా ఆపరేషన్ చేస్తారని వివరించారు. ప్రజాసాధికార సర్వేలో దొర్లిన పొరపాటును సవరించి, రేషను కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులో పేరు చేర్చాలని తెనాలి తహసీల్దారు కార్యాలయానికి, గుంటూరు జిల్లా పౌరసరఫరాల అధికారి దగ్గరకు నాలుగు నెలలుగా తిరుగుతూనే ఉన్నా ఫలితం లేదని శ్రీనివాస్ కుటుంబ సభ్యులు వాపోతున్నారు. మరోవైపు 11 నెలలుగా చేతికి కట్టుతో ఇంట్లోనే ఉంటున్నందున శ్రీనివాస్ కుటుంబానికి జరుగుబాటుకే కష్టంగా ఉంది. తల్లి, సోదరుడు ఆదుకుంటున్నారు. దీనికితోడు తిరుగుడుకు, వైద్యపరీక్షలకు అప్పులు చేస్తున్నారు. అన్న అర్జీతో.. తమ్ముడి పేరునూ తొలగించారు... పెళ్లి చేసుకుని అత్తగారింట ఉంటున్న దండమూడి సతీష్ ప్రత్యేకంగా రేషను కార్డు తీసుకోవాలని భావించాడు. ముందుగా తన తల్లి రమణ పేరిట గల తెల్లరేషను కార్డులోంచి తన పేరును తొలగించాలని అర్జీ పెట్టుకున్నాడు. చిత్రంగా అతడి పేరుతోపాటు, అతడి తమ్ముడు దండమూడి శ్రీనివాస్ పేరునూ తొలగించి, 2019 ఫిబ్రవరిలో జరిగిన ‘జన్మభూమి–మా ఊరు’ సభలో కేవలం తల్లి దండమూడి రమణ పేరుతో కార్డు మంజూరు చేశారు. కార్డుపై తల్లి, ఇద్దరు కొడుకుల ఫొటో ఉన్నా వారి పేర్లు లేకపోవడం గమనార్హం. -
'పాత్రల్లో పరకాయప్రవేశం నా స్టైల్'
సాక్షి, తెనాలి(గుంటూరు) : సాయిమాధవ్ బుర్రా.. తెలుగు సినిమాకు ఆయనో స్టార్ రైటర్. ప్రతిష్టాత్మక చిత్రాలకు అవకాశాలు ఆయన్నే వెతుక్కుంటూ వస్తున్నాయి. బాక్సాఫీసు హిట్లవ్వటమే కాదు.. అందులోని సంభాషణలు ప్రజల నోళ్లలో వర్ధిల్లుతున్నాయి. సైరా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, రాజమౌళి ఆర్ఆర్ఆర్తో సహా పలు సినిమాలతో బిజీ గా ఉన్న సాయిమాధవ్, స్వస్థలమై న తెనాలికి వచ్చిన సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే.. కొత్తదనాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారు.తెలుగు సినిమా రంగం ఇప్పుడు చాలా బాగుంది. ఇటీవల రిలీజైన్ చిన్న సినిమాలు ‘బ్రోచేవారెవరురా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ పెద్ద హిట్లు. రెగ్యులర్ సినిమాలను జనం చూడటం లేదు. ఏదొక కాన్సెప్ట్ ఉండాలి. మేకర్స్ కంటే ఆడియన్స్ హైలెవెల్లో ఉంటున్నారు. ప్రతిష్టాత్మక బ్యానర్లు తీస్తున్న వైవిధ్యమైన సినిమాలకు సంభాషణలు రాసే అవకాశాలు వస్తున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకునేందుకు ఎక్కువగానే కష్టపడుతున్నాను. ఏ సినిమాకు సంభాషణలు రాసేటప్పుడు, అందులోని పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేస్తుంటాను. నా అభిప్రాయాలు ఆ పాత్రపై రుద్దను. సంభాషణలు రాసేందుకు కలం పట్టుకున్నప్పుడు నేనెప్పుడూ ఆ పాత్రలానే ఆలోచిస్తుంటాను. అందుకే అవి ప్రజల్లోకి వెళ్తున్నాయి. హాలీవుడ్ స్థాయిలో ‘సైరా ఉయ్యాలవాడ’.. ప్రస్తుతం చిరంజీవి ‘సైరా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ పూర్తయింది. తెనాలి వచ్చేముందే పూర్తి సినిమా చూశాను. చాలా అద్భుతంగా వచ్చింది. ఉయ్యాలవాడ చరిత్రను తెరకెక్కించటమే పెద్ద సాహసం. అద్భుతమైన కథ. తెలుగు సినిమా స్థాయిని హైట్స్‌కు తీసుకెళ్తుందని నమ్ముతున్నా. హాలీవుడ్ సినిమా చూస్తున్నట్టే ఉంటుంది. చిరంజీవి నటవిశ్వరూపం ఇందులో చూడొచ్చు. తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ.. చరిత్ర అనగానే విమర్శలుంటాయి. క్రిష్, నేను కలసి గౌతమీపుత్ర శాతకర్ణి చేద్దామనుకున్నప్పుడు ఆయనకు చరిత్ర రెండు లైన్లకన్నా లేదన్నారు. దర్శకుడు క్రిష్ పరిశోధించి, తీసిన చిత్రం ఎంత హిట్టయిందో తెలిసిందే. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విషయంలోనూ అంతే. ఆయన తొలి స్వాతంత్య్ర సమరయోధుడు అనేందుకు మనదగ్గర బోలెడన్ని ఆధారాలున్నాయి. దర్శకుడు సురేంద్రరెడ్డి, పరుచూరి వెంకటేశ్వరరావు, భూపతిరాజా, సత్యానంద్ అందరూ ఉయ్యాలవాడ స్వస్థలానికి వెళ్లి, కష్టపడి కలసి కథ సిద్ధంచేశారు. నేను సంభాషణలు సమకూర్చా. వాస్తవ పాత్రలతో అల్లిన కల్పిత కథ ఆర్ఆర్ఆర్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాదీ చారిత్రక నేపథ్యమే. వాస్తవ పాత్రలతో అల్లిన కల్పితగాథ అనుకోవచ్చు. వాస్తవానికి బాహుబలికి నేనే రాయాల్సింది. మిస్సయింది. ఆర్ఆర్ఆర్ అవకాశం ఇచ్చారు. రాజమౌళి కథ విన్నప్పుడే షాకయ్యాను.. ఇలా కూడా ఆలోచించవచ్చా అని..! సైరా గానీ, ఆర్ఆర్ఆర్ గానీ తెలుగు సినిమాకు నెక్టŠస్ లెవెల్‌కు తీసుకెళ్తాయి. రాజుగారి గది–3 నేను రాస్తున్న మరో సినిమా. రాజమౌళి సహాయకుడు అశ్విని దర్శకత్వంలో ‘ఆకాశవాణి’ అనే సినిమాకు చేశాను. టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ స్క్రిప్టు సిద్ధమైంది. ప్రీ ప్రొడక్షన్ జరుగుతోంది. త్వరలో షూటింగ్ అనౌన్స్ చేస్తారు. రేణుదేశాయ్‌ను ఒక క్యారెక్టర్‌కు అనుకున్నారు. త్వరలో తెలుస్తుంది. విభిన్నమైన కథాంశాలతో కూడిన సినిమాలకు రాయటం అదృష్టంగా భావిస్తున్నా.