Updates..
మీ ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు: సీఎం జగన్
► సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘మీ ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఇవాళ్ల రైతులకు సంబంధించి రెండు మంచి కార్యక్రమాలు చేస్తున్నాము. 50 లక్షలకుపైగా రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీగా ఏటా రూ.13,500 భరోసా అందిస్తున్నాము. ఈ ఏడాది ఇప్పటికే రెండు విడతల్లో 50.92 లక్షల మందికి రూ.5,853.74 కోట్లు లబ్ధిచేకూరింది. మూడో విడత కింద 51.12 లక్షల మందికి రూ. 1.090.76 కోట్లు జమ చేస్తున్నాం.
నాలుగేళ్లలో ఒక్కో కుటుంబానికి రూ.54వేల చొప్పున సాయం అందించాం. ఈ నాలుగేళ్ల కాలంలో రైతు భరోసా కింద రూ.27,062 కోట్లు సాయం అందజేశాము. ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే అదే సీజన్‌లో పరిహారం అందిస్తున్నాము. మాండూస్ తుఫాన్ వల్ల పంట నష్టపోయిన 91,237 మంది రైతులకు రూ. 76,99 కోట్లు అందిస్తున్నాం.
వ్యవసాయం బాగుంటేనే రైతులు బాగుంటారు. రైతుల బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. నాలుగేళ్లుగా వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయి. నాలుగేళ్ల కాలంలో ఎక్కడా కరువు అనే మాటే లేదు. చంద్రబాబు పాలనలో ప్రతీ ఏటా కరువే ఉంది. కరువుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు. మాజీ సీఎం హయంలో ఏటా కరువు మండలాల ప్రకటనే ఉండేది.
మన ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు చూసి ప్రతిపక్షానికి కడుపుమంటగా ఉంది. రాష్ట్రంలో ఈరోజు యుద్ధం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో కరువుతో స్నేహం చేసిన చంద్రబాబుకు మీ బిడ్డకు మధ్య యుద్ధం జరగబోతోంది. వచ్చే ఎన్నికల్లో ఇంగ్లీష్ మీడియం వద్ద చంద్రబాబుకు మీ బిడ్డకు యుద్ధం జరగబోతోంది. రాష్ట్రంలో గజ దొంగల ముఠా ఉంది. ఈ ముఠా పని దోచుకో.. పంచుకో.. తినుకో మాత్రమే. గజదొంగల ముఠాలో ఇంకొకరు దత్తపుత్రుడు. దుష్టచతుష్టాయానికి తోడు దత్తపుత్రుడు జతకలిశాడు.
చంద్రబాబు ఎందుకు సంక్షేమ పథకాలు పెట్టలేకపోయాడు. ఆ డబ్బులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్లాయి?. ఇప్పుడు కూడా అదే బడ్జెట్, అదే రాష్ట్రం. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి వ్యతిరేకం అన్నాడు చంద్రబాబు. మీ బిడ్డ పాలనకు.. చంద్రబాబు పాలనకు వ్యత్యాసాన్ని గమనించాలి. మంచి చేశాం, మంచి జరిగిందని అనిపిస్తే తోడుగా ఉండండి. ఇచ్చిన హామీలు అన్ని నెరవేస్తున్నాం. చంద్రబాబుకు, దత్తపుత్రుడికి సవాల్ విసురుతున్నాను. 175కి 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యం ఉందా?. మీ బిడ్డకు భయంలేదు. చేసిన మంచి చెప్పుకునే మళ్లీ అధికారంలోకి వస్తాం’ అని అన్నారు.
► కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతే అసలైన శాస్త్రవేత్త అని నమ్మిన వ్యక్తి సీఎం జగన్. ఏ సీజన్‌లో పంట నష్టం ఆ సీజన్‌లోనే అందిస్తున్న ఏకైన సీఎం వైఎస్ జగన్. దేశంలోనే వందశాతం రైతు బీమా ప్రీమియం భరించిన ఏకైన రాష్ట్రం ఏపీ. చంద్రబాబు హయంలో అన్నీ కరువు కాటకాలే అని అన్నారు.
► తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ.. సీఎం జగన్ పాదయాత్ర రాష్ట్రంలో ప్రజల గుండె చప్పుడు. రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమ పాలన అందుతోంది. రైతు భరోసా, అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, చేయూత వంటి పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరం. జగనన్న సేవకుడు శివకుమార్ అన్ని అన్నారు. నియోజకవర్గంలో పేదలకు 26వేల ఇళ్లు ఇచ్చిన ఘనత సీఎం జగనన్నకే దక్కింది. తెనాలి గడ్డ.. జగనన్న అడ్డ అని అన్నారు.
► రైతుల గుండెల్లో సీఎం జగన్ చిరస్థాయిగా నిలిచిపోతారు. దేశ చరిత్రలో రైతు సంక్షేమం కోసం పాటుపడిన ఏకైక సీఎం వైఎస్ జగన్. పాదయాత్రతో రాష్ట్ర దశదిశను మార్చిన వ్యక్తి సీఎం జగన్.
► రైతుల గురించి సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా.. రైతు బాగుంటనే రాష్ట్రం బాగుంటుంది అని కామెంట్స్ చేశారు.
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది.#YSRRythuBharosa pic.twitter.com/kgtewgmrAZ
— YS Jagan Mohan Reddy (@ysjagan) February 28, 2023
► తెనాలి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్.
► గుంటూరు జిల్లా తెనాలికి బయలుదేరిన సీఎం జగన్.
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో వరుసగా నాలుగో ఏడాది కూడా వైఎస్సార్ రైతు భరోసా అమలుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తోంది. ఈ ఏడాది మూడో విడతగా 51.12 లక్షల మందికి రూ.1,090.76 కోట్లను సీఎం జగన్ మంగళవారం తెనాలి మార్కెట్‌యార్డులో జరిగే కార్యక్రమంలో నేరుగా వారి ఖాతాల్లోకి జమచేయనున్నారు.
► రైతులకు ఏటా రూ.12,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని ఎన్నికల మానిఫెస్టోలో హామీ ఇవ్వగా, అంతకంటే మిన్నగా ఏటా రూ.13,500 చొప్పున అందిస్తున్నారు. వరుసగా నాల్గో ఏడాదిలో కూడా ఇప్పటికే రెండు విడతల్లో రూ.11,500 సాయం అందించారు. మూడో విడతగా ఒక్కొక్కరికి మరో రూ.2వేల చొప్పున 51.12 లక్షల మంది రైతన్నల ఖాతాల్లో రూ.1,090.76 కోట్లను సీఎం జగన్ నేడు జమచేయనున్నారు.
► ఇక 2022 డిసెంబర్‌లో మాండూస్ తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన 91,237 మంది వ్యవసాయ, ఉద్యాన రైతన్నలకూ రూ.76.99 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ మొత్తాన్ని రబీ సీజన్ ముగియక ముందే వారి ఖాతాల్లో జమచేస్తున్నారు. ఈ మొత్తంతో కలిపి ఇప్పటివరకు 22.22 లక్షల మంది రైతన్నలకు రూ.1,911.78 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని అందించారు. ఇలా గడిచిన మూడేళ్ల తొమ్మిది నెలల్లో రైతులకు మొత్తం మీద నేరుగా రూ.1,45,751 కోట్ల లబ్ధిని చేకూర్చారు.
Comments
Please login to add a commentAdd a comment