CM YS Jagan Open Challenge To Chandrababu Naidu And Pawan Kalyan - Sakshi
Sakshi News home page

175 చోట్ల ఒంటరిగా పోటీ చేసే ధైర్యముందా?

Published Wed, Mar 1 2023 3:58 AM | Last Updated on Wed, Mar 1 2023 1:11 PM

CM YS Jagan Open Challenge To Chandrababu And Pawan Kalyan - Sakshi

గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన సభకు హాజరైన అశేష జనసందోహంలో ఓ భాగం. ఇన్‌సెట్‌లో సీఎం జగన్‌

చంద్రబాబుకు, దత్తపుత్రుడికి సవాల్‌ విసురుతున్నా.. 175 నియోజకవర్గాలకు 175 చోట్ల ఒంటరిగా పోటీ చేసి గెలిచే ధైర్యం ఉందా? ఆ ధైర్యం వాళ్లకు లేదు.. ఎందుకంటే జీవితంలో ఏ రోజూ వారు ప్రజలకు మంచి చేయలేదు కాబట్టి. కానీ మీ బిడ్డకు ఆ ధైర్యం ఉంది.. కారణం మేం మంచి చేశాం కనుకనే. చేసిన మంచి గురించి చెప్పుకుని మళ్లీ అధికారంలోకి వస్తానన్న నమ్మకం, ధైర్యం మీ బిడ్డకు ఉంది. రాబోయే రోజుల్లో కుట్రలు ఇంకా ఎక్కువ కనిపిస్తాయి. రాజకీయాల్లో అన్యాయాలు పెరుగు­తాయి. అన్నీ గమనించండి. నిర్ణయం తీసుకునేటప్పుడు మాత్రం బాగా ఆలోచించండి. మీ ఇంట్లో మంచి జరిగిందా? లేదా? అన్న ఒకే ఒక్కటి ప్రామాణికంగా తీసుకోండి. మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు మీరే సైనికులుగా తోడుగా నిలబడండి.
–  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి, గుంటూరు: వచ్చే ఎన్నికల్లో యుద్ధం కరువుతో ఫ్రెండ్‌షిప్‌ ఉన్న చంద్రబాబుకు, వరుణ దేవుడి ఆశీస్సులున్న మనందరి ప్రభుత్వానికి మధ్య జరుగుతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఐదేళ్ల పాలనలో ప్రజలకు ఒక్క మంచి పని కూడా చేయని చంద్రబాబు ఇక చెప్పుకునేందుకు ఏమీ లేకపోవడంతో దుష్ట చతుష్టయంతో కలసి దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన 98.5 శాతం హామీలను నెరవేర్చి ఈ రోజు సంతృప్తిగా ఓటు అడగడానికి వస్తున్నామని, ఎమ్మెల్యేలు ప్రతి గడపనూ సందర్శిస్తున్నారని చెప్పారు. మంగళవారం గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్‌ యార్డు వద్ద నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్సార్‌ రైతు భరోసా, మాండూస్‌ తుపాన్‌ బాధిత రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీని బటన్‌ నొక్కి జమ చేసిన అనంతరం సీఎం జగన్‌ ప్రసంగించారు. ఆ వివరాలివీ..  
రైతులకు పంట నష్ట పరిహారం– పెట్టుబడి రాయితీకి సంబంధించిన చెక్‌ను విడుదల చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

నాడు డీపీటీ.. నేడు డీబీటీ 
ప్రభుత్వ పాఠశాలల్లో పేద పిల్లలకు ఇంగ్లిష్‌ మీడియం వద్దన్న చంద్రబాబుకు, అదే స్కూళ్లను నాడు–నేడుతో రూపురేఖలు మార్చేసి సీబీఎస్‌ఈ విధానంలో ఇంగ్లిష్‌ మీడియం తెచ్చిన మీ బిడ్డ ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరుగుతోంది. మొదటి సంతకంతోనే డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పి మోసగించి పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలను రోడ్డుమీదకు తెచ్చిన చంద్రబాబుకు... వైఎస్సార్‌ ఆసరా, సున్నావడ్డీ, వైఎస్సార్‌ చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, జగనన్న అమ్మఒడి, 30 లక్షల ఇళ్ల పట్టాలిచ్చి ఇప్పటికే 22 లక్షల గృహ నిర్మాణాలను చేపట్టిన చేస్తున్న మీ బిడ్డ ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరుగుతోంది.

జన్మభూమి కమిటీలనే గజదొంగల ముఠాతో మొదలుపెడితే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడితో కలిసి దోచుకో, పంచుకో, తినుకో (డీపీటీ) స్కీంలు సృష్టించిన చంద్రబాబుకు, గ్రామ రూపురేఖలను సమూలంగా మార్చేసిన మన ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరుగుతోంది. కళ్లెదుటే కనిపిస్తున్న గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం చదువులు, వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్‌ విధానం, అందుబాటులోకి రానున్న డిజిటల్‌ గ్రంథాలయాల ద్వారా గ్రామాల స్వరూపం మారిపోతోంది. ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా ఏ ఒక్క అర్హుడూ మిస్‌ కాకూడదన్న ఉద్దేశంతో సోషల్‌ ఆడిట్‌ చేసి పేదలకు రూ.1.93 లక్షల కోట్లను డీబీటీ ద్వారా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి మీ ప్రభుత్వం జమ చేసింది.  

అప్పుడెందుకు ఇవ్వలేదంటే... 
ఆ రోజూ, ఈ రోజూ ఒకే బడ్జెట్‌ అయినా అప్పులలో పెరుగుదల గ్రోత్‌ రేటు మాత్రం అప్పటికన్నా ఇవాళ తక్కువే. మీ బిడ్డ మాత్రమే ఎందుకు బటన్‌న్‌నొక్కగలుగుతున్నాడు? చంద్రబాబు బటన్‌¯ నొక్కే స్కీంలు ఎందుకు లేవన్నది ఆలోచన చేయండి. అప్పట్లో ఆ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో ఆలోచన చేయండి. ఆ డబ్బులన్నీ గ్రామస్థాయిలో మొదలుపెడితే జన్మభూమి కమిటీల నుంచి గజదొంగల ముఠా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడు, వీళ్లందరి బాస్‌ చంద్రబాబు కలసి దోచుకో, పంచుకో, తినుకో అని పంచుకున్నారు.  

పేదలు ఒకవైపు.. పెత్తందార్లు మరోవైపు 
ఎస్సీ కులాలలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? బీసీల తోకలు కత్తిరిస్తాం.. పేదలకు ఇళ్లు, ఇళ్ల స్ధలాలు ఇవ్వడానికి వ్యతిరేకమన్న పెత్తందారీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు, మనకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు గ్రామ స్థాయి నుంచి కేబినెట్‌ వరకూ రాజకీయ సాధికారిత కల్పించాం. నామినేటెడ్‌ పదవుల నుంచి పాలించే పదవుల దాకా ప్రతి అడుగులోనూ భాగస్వాములుగా చేశాం. ఈ రోజు యుద్ధం జరుగుతోంది కులాల మధ్య కాదు.

ఇవాళ రాష్ట్రంలో జరుగుతోంది  క్లాస్‌ వార్‌. పేదవాడు ఒకవైపు, పెత్తందార్లు మరోవైపు ఉన్నారు. పొరపాటు జరిగిందంటే రాజకీయాల్లో ఇక ఎవరూ మాట ఇవ్వడం, మాట మీద నిలబడటం అన్న మాటకు అర్థమే లేకుండా పోతుంది. రాజకీయ వ్యవస్ధలో మార్పు రావాలి. విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలియాలి. ఒక మాట చెబితే, ఆ మాట నిలబెట్టుకోలేకపోతే.. ఆ వ్యక్తి రాజకీయాలలో ఉండడానికి అర్హుడు కాదన్న పరిస్థితులు రావాలి.
సభకు హాజరైన అశేష జనవాహినిలో ఓ భాగం    

టార్గెట్‌ 175 దిశగా అడుగులు.. 
ఈ రోజు మీ బిడ్డకు ఉన్నదల్లా దేవుడి దయ, మీ అందరి చల్లని ఆశీస్సులు మాత్రమే. మీ బిడ్డకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 లేకపోవచ్చు. దత్తపుత్రుడు తోడు ఉండకపోవచ్చు. మీ బిడ్డ ఏరోజూ వాళ్లమీద ఆధారపడలేదు. మీకు మంచి జరిగింది అనిపిస్తే మీ బిడ్డకు తోడుగా ఉండాలని కోరుతున్నా. మీ బిడ్డకు భయం లేదు. అందుకే 175 టార్గెట్‌ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నాం. 

దుష్ట చతుష్టయానికి కడుపు మంట 
వ్యవసాయం దండగన్న చంద్రబాబుకు, రైతుకు ఇచ్చిన ప్రతి మాటా తప్పిన చంద్రబాబుకు, ఆయన భజన బృందానికి, దుష్ట చతుష్టయానికి మన ప్రభుత్వంపై కడుపు మండుతోంది. అయినా కడుపు మంటకు మందు లేదు. అసూయకు అసలే మందు లేదు. మనది పేదల ప్రభుత్వం. మ­నది రైతన్నల ప్రభుత్వం. రైతులను వంచించిన చంద్ర­బాబు ఒకవైపున, అన్నదాతలకు అండగా నిలుస్తున్న మనం­దరి ప్రభుత్వం మరోవైపున నిలిచి ఇవాళ యుద్ధం జరుగుతోంది.  
సభాస్థలి కిక్కిరిసిసోవడంతో బయటే ఉండిపోయిన ప్రజలు 

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగు
► ఇవాళ రెయిన్‌ గన్లు లేవు.. రెయిన్‌ మాత్రమే ఉంది
► మనందరి ప్రార్థనలను దేవుడు ఆలకించి రైతులకు అండగా నిలిచారు  
► అన్యాయస్తుడు సీఎంగా ఉన్నప్పుడు కచ్చితంగా కరువు తాండవిస్తుంది
► వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌తో రూ.1,090.76 కోట్లు.. 51.12 లక్షల మందికి లబ్ధి
► ఇన్‌పుట్‌ సబ్సిడీతో మరో రూ.76.99 కోట్లు పరిహారం.. 91,237 మందికి ప్రయోజనం
► నాలుగేళ్లుగా ఏటా 12 లక్షల టన్నుల మేర పెరిగిన ఆహార ధాన్యాల దిగుబడి
► గత ప్రభుత్వ హయాంలో సగటున దిగుబడి 154 లక్షల టన్నులు.. ఇవాళ 166 లక్షల టన్నులు
► గత సర్కారు హయాంలో రూ.40,237 కోట్లతో 2.65 కోట్ల టన్నుల ధాన్యం సేకరణ
► ఈ మూడేళ్ల 8 నెలల వ్యవధిలో రూ.55,444 కోట్లతో 2.94 కోట్ల టన్నుల సేకరణ
► గతంతో పోలిస్తే ఉద్యాన పంటల విస్తీర్ణం 1,43,901 హెక్టార్లు పెరుగుదల 
► మనందరి ప్రభుత్వంలో రైతులకు చెల్లించిన బీమా సొమ్ము రూ.6,685 కోట్లు
► గత సర్కారు హయాంలో రూ.3,411 కోట్లు మాత్రమే n ఆక్వా రైతులకు రూ.2,647 కోట్లు విద్యుత్‌ సబ్సిడీ
► ఉచిత విద్యుత్‌ కోసం రూ.27,800 కోట్లు వ్యయం n వైఎస్సార్‌ సున్నా వడ్డీ కింద రూ.1,834 కోట్లు అందచేశాం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement