డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ, సాక్షి: పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నింటికి ముగింపేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 99 శాతం హామీలు అమలు చేశామని, జగన్‌కు ఓటేస్తేనే పథకాలు కొనసాగుతాయని చెప్పారాయన. సోమవారం మధ్యాహ్నాం బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం పరిధిలోని అంబాజీపేటలో ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు.
పేదవాడికి మంచి చేయడం మీ బిడ్డ జగన్ నైజం. ఇప్పుడు జగన్ ఒక్కడు ఒకవైపు ఉన్నాడు. మరోవైపు కూటమి ఉంది. జగన్ ఒకవైపు.. మోసాల చంద్రబాబు, దత్తపుత్రుడు, రామోజీరావు, నోటాకు వచ్చినన్ని సీట్లు రాని బాబు కాంగ్రెస్ పార్టీ. వీళ్లందరితో మనం యుద్ధం చేయబోతున్నాం. మరో రెండు వారాల్లో జరిగే కురుక్షేత్ర యుద్దానికి పి.గన్నవరం సిద్ధమా?.
బాబుకు ఓటేస్తే చంద్రముఖి మళ్లీ నిద్ర లేస్తుంది. రక్తం తాగేందుకు మీ తలుపు తడుతుంది. బాబును నమ్మామంటే విష సర్పాన్ని నమ్మడమే. పేదల్ని గెలిపించాలని జగన్ తపన పడుతున్నాడు. ఈ ఎన్నికలు జగన్‌కు, చంద్రబాబుకు మధ్య కాదు. ఈ ఎన్నికలు పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు కేవలం ప్రజా ప్రతినిధుల్ని ఎనుకున్నేందుకు మాత్రమే కాదు.. ఈ ఎన్నికలు పేదల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. మీ బిడ్డ జగన్13 సార్లు బటన్ నొక్కి 2 లక్షల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా జమ చేశాడు. మరి ఈ జగన్‌ను ఓడించాలని చంద్రబాబు కోరుతున్నారు అని సీఎం జగన్ నిలదీశారు.
చంద్రబాబూ.. ఎందుకు జగన్‌ను ఓడించాలి?
- పెన్షన్లు అందకుండా చంద్రబాబు ప్రయత్నిస్తే.. ఇంటింటికి పెన్షన్లు అందించింది జగన్.. అలాంటి జగన్‌ను ఓడించాలా?
- పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చినందుకు జగన్‌ను ఓడించాలా?
- గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా 58 నెలల పాలన కాలంలో సంక్షేమం అదించినందుకా? జగన్‌ను ఓడించాలి
- అక్కాచెల్లెమ్మలకు తోడుగా నిలిచినందుకా? జగన్‌ను ఓడించాలి
- ప్రజలకు మంచి చేసేందుకు జగన్‌ను ఓడించాలా చంద్రబాబూ?
- లేదంటే.. చంద్రబాబు కోసం జగన్‌ను ఓడించాలా?
గతంలో ఇదే కూటమి ముఖ్యమైన హామీలంటూ మేనిఫెస్టోతో ప్రజల్లోకి వచ్చింది. చంద్రబాబు, దత్తపుత్రుడు, మోదీ పేర్లతో.. ఫొటోలతో మేనిఫెస్టో ప్రకటించారు. మరి అందులో ఒక్క హామీ అయినా అమలు చేశారా?. చంద్రబాబుకి ఓటేస్తే మళ్లీ మోసపోవడమే అని సీఎం జగన్ అన్నారు. ఇంటింటికి బెంజ్ కారు అంట. సూపర్ సిక్స్ అంట. చంద్రబాబుకి అసలు ఓటేందుకు వేయాలి? అనేది.. మేనిఫెస్టో ద్వారా ఒక్క హామీని కూడా నెరవేర్చని చంద్రబాబుకి అసలు ఎవరైనా ఓటేస్తారా?. ఇలాంటి వ్యక్తిని ఎవరైనా నమ్ముతారా? అని సీఎం జగన్ ప్రజల్ని ప్రశ్నించారు.
వలంటీర్లు ఇంటికి రావాలన్నా.. మన చదువులు బాగుపడాలన్నా.. మన వ్యవసాయం, ఆస్పత్రులు మెరుగుపడాలన్నా.. రెండు బటన్లు ఫ్యాన్ గుర్తు మీద నొక్కాలి. 175కి 175 అసెంబ్లీ, 25కి 25 ఎంపీ స్థానాలు తగ్గేదే లేదు. సిద్ధమేనా?.. అని సీఎం జగన్ అశేష ప్రజావాహిని ఉద్దేశించి అన్నారు.
మంచి చేసిన ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయట ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింక్‌లోనే ఉండాలి. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులతో.. వైఎస్సార్‌సీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నిలబడుతున్న విప్పర్తి వేణుగోపాల్, అమలాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాపాక వర ప్రసాదరావులను గెలిపించాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు.
ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్లలో మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అందుకే ఇంట్లో వాళ్లతో కూర్చుని చర్చించండి. ఆలోచించి ఓటేయండి. మనం ఒక సినిమా చూస్తాం. సినిమాలో హీరో, విలన్ ఎవరో మనకు తెలియదు. అందులో హీరో మనకు నచ్చుతాడు. కేవలం మంచి చేస్తాడు.. మానవత్వం ఉంది కాబట్టే హీరో నచ్చుతాడు. కానీ, విలన్ మోసాలు చేస్తాడు. అబద్ధాలు చెప్తాడు. కుట్రలు చేస్తాడు. అందుకే విలన్ నచ్చడు. నిజజీవితంలో హీరో ఎవరో, విలన్ ఎవరో ఆలోచన చేయండి. రాబోయే ఎన్నికల్లో ఓటేసే ముందు ఆలోచన చేయండి’’ అంటూ పేరుపేరునా ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు చెబుతూ ప్రసంగం ముగించారు.
Comments
Please login to add a commentAdd a comment