మంగళగిరి ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్‌కు ప్రజల బ్రహ్మరథం
ఇక్కడ మొదటి నుంచి టీడీపీ ఆదరణ నిల్
అయినా ప్రజలు మావైపే అంటూ సోషల్ ప్రచారం
కానీ, సీఎం జగన్ కోసం సిద్ధం అంటున్న మంగళగిరి వాసులు
సీఎం.. సీఎం.. జై జగన్ నినాదాలతో మారుమోగిన మంగళగిరి
గుంటూరు, సాక్షి: అది మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్.. కాస్త ఎండపూట ఇసుకేస్తే రాలనంత జనం చేరారు. సంక్షేమ సారథికి మద్దతు పలికేందుకు అశేషంగా తరలివచ్చిన జన సునామే అది. ఆ అభిమానం ఇంతటితో ఆగలేదు.. సీఎం జగన్ ప్రసంగించే సమయంలో సీఎం సీఎం.. జై జగన్.. జయహో జగన్ అంటూ నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగేలా చేశారు.
మంగళగిరిలో పచ్చ బ్యాచ్ మొదటి నుంచి ఒకరమైన ప్రచారంతో ముందుకు పోతోంది. బీసీ జనాభా అత్యధికంగా ఉండే చోట.. అగ్ర కులానికి, అందునా గత ఎన్నికల్లో ఓడిన తమ చిన్నబాస్ నారా లోకేష్‌ను బరిలోకి దింపింది. బీసీ కులాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను సైతం చంద్రబాబు పట్టించుకోలేదు. కానీ, సీఎం జగన్ సామాజిక న్యాయం పాటించారు. గత ఎన్నికల్లో గెలిచిన ఆర్కే(ఆళ్ల రామకృష్ణారెడ్డి)ని తప్పించి మరీ.. బీసీ సామాజిక వర్గానికి, అందునా ఒక మహిళను వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా నిలబెట్టారు. మురుగుడు లావణ్య ప్రచారానికి వెళ్లిన చోటల్లా.. ప్రజలు ఆదరించడం మొదలుపెట్టారు. అదే సమయంలో నారా లోకేష్‌కి ఆదరణ కరువు కావడంతో.. టీడీపీకి ఏమాత్రం మింగుడు పడలేదు.
దీంతో మంగళగిరిలో నారా కుటుంబం ప్రచారాన్ని.. ఐటీడీపీ అండ్‌కో పేజీలు సోషల్‌మీడియాలో జాకీలు పెట్టడం ప్రారంభించారు. అక్కడా ప్రతికూల కామెంట్లే వినిపించాయి. అప్పటికీ కూడా మంగళగిరిలో టీడీపీ జెండానే ఎగురుతుందంటూ లోకేష్ అండ్ కో ప్రచారం చేస్తూ వచ్చాయి. ఈలోపే..
సీఎం జగన్ మంగళగిరి ప్రచార సభకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు#MemanthaSiddham, #YSJaganAgain. ఆయన ప్రసంగిస్తున్నంత సేపు.. జయజయధ్వానాలు పలికారు. ఎటుచూసినా జన సమూహంతో పండగ వాతావరణం కనిపించింది. ‘‘చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, ఆత్మీయతలు పంచుతున్న నా ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ, ప్రతి అవ్వకూ, ప్రతి తాతకూ, ప్రతి సోదరుడికీ, ప్రతి స్నేహితుడికీ.. మీ అందరి ఆప్యాయతలకు మీ బిడ్డ, మీ జగన్ రెండు చేతులు జోడించి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు..’ అంటూ ప్రసంగం ప్రారంభంలో సీఎం జగన్ చెప్పిన మాటలు.. ఆపై కొనసాగిన స్పీచ్ మంగళగిరి ప్రజల్లో ఉత్సాహం నింపింది. ఫ్యాన్ గుర్తుకు తమ ఓటేసి.. కూటమి నేతలను తిప్పికొడతామంటూ తమ నినాదాలతో స్పష్టం చేశారు మంగళగిరి వాసులు.
..‘‘14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానని ఈ పెద్దమనిషి అంటుంటాడు, ఆ యన పాలనలో ఏనాడైనా ఇన్ని స్కీములు ఇచ్చా డా? ఇప్పటి మాదిరిగా ఏనాడైనా అవ్వాతాతలకు ఇంటింటికీ పింఛన్ ఇచ్చాడా? రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా? ఈ పెద్దమనిషి చంద్రబాబు పేరు చెబితే పేదలకు చేసిన కనీసం ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా?’’.. అంటూ సీఎం జగన్ అడిగిన ప్రశ్నలకు లేదూ.. లేదూ.. అంటూ రెండు చేతులు ఊపుతూ ప్రజలు మద్దతు తెలిపారు. ఈ ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో తెచ్చిన పథకాలు గురించి వివరిస్తున్నప్పుడు అవునూ.. అవునూ.. అంటూ ప్రజలు పెద్దఎత్తున మద్దతు పలికారు. స్థానికంగా ఉండే లావణ్యమ్మ(మురుగుడు లావణ్య)కు ఓటేయాలన్నప్పుడు కూడా ప్రజల నుంచి.. సిద్ధం అనే సమాధానమే వినిపించింది. మొత్తంగా.. గ్రాఫిక్స్ అనే వాళ్ల గూబ గుయ్యి మనేలా.. కూటమి వెన్నులో వణుకు పుట్టేలా.. మంగళగిరి ‘జై జగన్’ నినాదాలతో మారుమోగింది.
Comments
Please login to add a commentAdd a comment