Mangalagiri Assembly Constituency
-
చంద్రబాబు చెప్పినా.. ఏపీలో ఆగని టీడీపీ దాష్టీకం
అమరావతి, సాక్షి: నోటితో నవ్వి, నొసటితో వెక్కిరించినట్లుంది టీడీపీ తీరు. కవ్వింపు చర్యలకు దిగొద్దని చంద్రబాబు నాయుడు చెబుతున్నా.. అదేదో అధిష్టానం ఇచ్చిన మొక్కుబడి హెచ్చరికగా భావిస్తూ రెచ్చిపోతున్నాయి టీడీపీ శ్రేణులు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులతో సహా ఎవరినీ వదలకుండా.. దాడులు కొనసాగిస్తున్నాయి. తాజాగా మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని పెదవడ్లపూడిలో వైఎస్సార్సీపీ కార్యకర్త పట్ల టీడీపీ నాయకులు దాడి చేసి అమానవీయంగా ప్రవర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వైఎస్సార్సీపీ కార్యకర్త కృష్ణవేణి భర్త పాలేటి రాజ్‌కుమార్‌ను గ్రామానికి టీడీపీ నాయకుడు జవ్వాది కిరణ్‌చంద్ ఆదివారం తన అనుచరుల ద్వారా ఊరి మధ్యకు రప్పించాడు. అందరూ చూస్తుండగా దారుణంగా దాడి చేశారు. ఒంటిపై దుస్తులు విప్పి మరీ చితకబాదారు. అనంతరం టీడీపీ కార్యకర్తలు లోకేశ్ ఫొటో ఉన్న ఫ్లెక్సీ చేత్తో పట్టుకోగా, విలపిస్తున్న రాజ్‌కుమార్‌ను దాని ఎదురుగా మోకాళ్లపై కూర్చోబెట్టారు. ‘నన్ను క్షమించండి.. చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, ఇతరుల గురించి ఏరోజూ ఏం మాట్లాడను’ అని చెప్పించారు. అనంతరం రాజ్‌కుమార్.. తనను మన్నించమని టీడీపీ నేత కిరణ్‌చంద్ కాళ్లు పట్టుకున్నాడు. అయితే తన కాళ్లు కాదని.. ఫ్లెక్సీలో లోకేశ్ కాళ్లు కూడా పట్టుకోమని ఆ టీడీపీ నేత ఆదేశించాడు. బాధితుడు వారు చెప్పినట్లే చేశాడు. తన కుటుంబాన్ని క్షమించాలని పదే పదే విజ్ఞప్తి చేశాడు. పెద్దవడ్లపూడి నుంచి ఐదు వాహనాల్లో బొప్పుడి గ్రామానికి వెళ్లి ఆ భార్యాభర్తల పై దాడి చేసింది జవ్వాది కిరణ్ కుమార్, అతని అనుచరులుగా స్పష్టంగా తేలింది. అంతేకాదు.. బలవంతంగా కారులో ఎక్కించుకుని రాత్రంతా రాజకుమార్ పైన దాడి చేస్తూ తెల్లవారుజామున బోయిపాలెం రోడ్ లో వదిలేసి వెళ్లిపోయారు తెలుగుదేశం నాయకులు. తీవ్రంగా గాయపడిన రాజ్ కుమార్‌ను ఆస్పత్రికి తరలించారు. ఈ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయినప్పటికీ పోలీసుల నుంచి ఎలాంటి చర్యలూ లేకపోవడం గమనార్హం. అంతేకాదు రాజ్‌కుమార్ గతంలో చేసిన పోస్టులంటూ కొన్నింటిని వైరల్ చేస్తూ.. దాడిని సమర్థిస్తున్నారు టీడీపీ సానుభూతిపరులు.This is the situation in Andhra Pradesh!Heart-wrenching visuals from Mangalagiri, Andhra Pradesh.@JaiTDP leaders are targeting Dalits in the state who raise their voices against them. They are literally threatening the lives of Dalits, forcing them to apologize to @naralokesh… pic.twitter.com/6Id1s8Lwxt— YSR Congress Party (@YSRCParty) June 9, 2024 -
సినబాబుకి మరోసారి మంగళమేనా!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మూడు శాఖల మాజీ మంత్రి, మాజీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌కు పరీక్షా సమయమిది. మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసిన ఆయన ఈసారైనా గట్టెక్కగలిగితే ఊపిరి పీల్చుకున్నట్లే. లేదంటే రాజకీయంగా అధోగతే అనే అనుమానాలు స్వపక్షీయుల్లోని సీనియర్లు, శ్రేణుల నుంచే వినిపిస్తున్నాయి. పోలింగ్ అనంతరం విభిన్న కోణాల్లో వేసుకుంటున్న అంచనాలలో అంతర్గత అనుమానాలు అనేకం ఉన్నప్పటికీ బయటకు మాత్రం టీడీపీ గెలుపుపై మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. తొలి అడుగులే తడబాటుతో.. రాష్ట్ర విభజనానంతరం అధికారంలోకి వచ్చి అమరావతిని రాజధాని కేంద్రంగా ప్రకటించి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని విస్తతపరచిన నాటి పాలకపక్షానికి గుంటూరు, కష్ణా జిల్లా ప్రజలు తగురీతినే బుద్ధి చెప్పారు. 2019 సాధారణ ఎన్నికల్లో, ఆ తరువాత జరిగిన గుంటూరు, విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీకి కర్రుకాల్చి వాతపెట్టారు. కరకట్ట వెంట అక్రమ కట్టడంలో నివాసం ఉంటూ వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకుండానే ఎమ్మెల్సీగా ఎంపికై మూడు శాఖల మంత్రిగా కొనసాగిన లోకేష్ మంగళగిరి నియోజకవర్గానికి ప్రత్యేకంగా చేసిందంటూ ఏమీలేదనే విమర్శలు అప్పట్లోనే వెల్లువెత్తాయి. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఆళ్ల రామకష్ణారెడ్డి(ఆర్కే) చేతిలో పరాజయం పాలైన లోకేష్ ఆ తరువాత అయినా రాజకీయంగా వ్యూహాత్మక అడుగులు వేశారా అంటే అదీ లేదు. టీడీపీ ఆవిర్భావ సమయంలో 1983, 1985 ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు మినహా గెలిచిన దాఖలాలు లేవు. 1994లో సీపీఎం నుంచి రామ్మోహన్రావు గెలుపొందారు. బీసీ సామాజికవర్గం నుంచి గోలి వీరాంజనేయులు, మురుగుడు హనుమంతరావు, కాండ్రు కమల విజయం సాధించారు. ఆళ్ల రామకష్ణారెడ్డి రెండు పర్యాయాలు గెలుపొందడానికి పెదకాకాని వాస్తవ్యుడు కావడం, వ్యక్తిగతంగా మంచి గుర్తింపు ఉండటం, అన్నిటికన్నా మించి వై.ఎస్. కుటుంబానికి సన్నిహితులు కావడం. బీసీలకు చెందిన నియోజకవర్గంగా గుర్తింపున్న మంగళగిరి నుంచి తాను పోటీ చేయడమంటే సాహసించినట్లేనని లోకేష్ అభిప్రాయపడ్డారే తప్ప అందుకు తగిన విధంగా క్షేత్రస్థాయిలో దష్టి సారించిన దాఖలాలు లేవు. వైఎస్సార్ సీపీ వ్యూహాత్మక అడుగులు.. వరుసగా రెండు పర్యాయాలు గెలిచిన ఆళ్ల స్థానంలో స్థానికురాలు, విద్యావంతురాలైన మురుగుడు లావణ్యను పోటీకి దింపడమే వైఎస్సార్ సీపీ విజయానికి తొలిమెట్టుగా పరిశీలకుల అభిప్రాయం. నియోజకవర్గంలో మెండుగా ఓటర్లు కలిగిన సామాజికవర్గానికి చెందిన లావణ్యది రాజకీయ నేపథ్యమున్న కుటుంబం. తల్లి కాండ్రు కమల మాజీ ఎమ్మెల్యే, మామ రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం ఉన్న వ్యక్తి. ప్రస్తుతం ఎమ్మెల్సీ కూడా. వీటికితోడు ఆ సామాజికవర్గానికి చెందిన స్థానిక సీనియర్ నాయకులైన చిల్లపల్లి మోహన్‌రావు, గంజి చిరంజీవి తదితరులకు వైఎస్సార్ సీపీ రాష్ట్రస్థాయి పదవులు కట్టబెట్టింది. కార్పొరేషన్ల డైరెక్టర్లుగా, దుర్గగుడి పాలకమండలి సభ్యులుగాను నియమించింది. ఎమ్మెల్యే ఆళ్ల ముందుచూపుతో దుగ్గిరాల (పసుపు) మార్కెట్ యార్డు చైర్మెన్ పదవిని ఎస్సీ, మైనార్టీలకు, మంగళగిరి ఏఎంసీని యాదవ, పద్మశాలి వర్గీయులకు అప్పగించారు. ఇక పార్టీ నాయకత్వం సోషల్ ఇంజినీరింగ్‌లో ఆచితూచి అడుగులేసింది. ఈ విషయంలో టీడీపీ ఎక్కడా సరితూగలేదు. అభివృద్ధికి దిక్సూచిగా.. మంగళగిరి, తాడేపల్లి మండలాలను కలిపి కార్పొరేషన్‌గా చేయడం, ప్రత్యేక గ్రాంటుగా రూ.130 కోట్లను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేటాయించడం, ఎవరూ ఊహించని రీతిలో గౌతమబుద్ధ రోడ్డును అభివద్ధి చేయడం, తొమ్మిది అర్బన్ హెల్త్ సెంటర్లు, సర్వ హంగులతో వై.ఎస్.ఆర్ క్రీడాప్రాంగణాన్ని తీర్చిదిద్దడం, అంతర్గత రహదారుల విస్తరణ, అభివద్ధి, విభిన్న సామాజికవర్గాల వారికి భవనాలు, కల్యాణ మండపాలను నిర్మించడం, ప్రధానమంత్రి దష్టికి తీసుకెళ్లి అభినందనలు అందుకునేలా పద్మశాలీయులకు మగ్గంలో శిక్షణ ఏర్పాట్లు నెలకొల్పడం తదితరాలు నియోజకవర్గ అభివద్ధికి దిక్సూచిగా నిలిచాయి. పల్లెల్లో డొంకరోడ్లు, సిమెంటు రోడ్లు, అంబేడ్కర్, జగ్జీవన్ రామ్, జ్యోతిరావుపూలే, సర్ధార్ వల్లభాయ్ పటేల్ తదితర ప్రముఖుల విగ్రహాల ఏర్పాట్లు నియోజకవర్గానికి అదనపు హంగులుగా మారాయి. ఆర్కే సొంతంగా నిధులు సమకూర్చడం, అవినీతికి తావు లేకుండా పనులు చేయడం, తరతమ భేదం లేకుండా అన్ని సామాజికవర్గాలకు చేరువగా ఉండటం పార్టీకి అన్నివిధాలా కలిసొచ్చింది. కార్పొరేట్ తరహాలో లోకేష్ బృందం.. మంగళగిరి నుంచే పోటీచేయాలని నిర్ణయించుకున్న లోకేష్ అందుకు తగిన ప్రణాళికలతో ముందుకు వెళ్లలేదని స్వపక్షీయులే అంటున్నారు. అధికారంలో ఉన్న సమయంలో కాని, ఆ తరువాతైనా వ్యూహం కొరవడిందంటున్నారు. నియోజకవర్గానికి చుట్టపుచూపుగా రావడం, అతితక్కువ మందిని కలవడం, స్థానికేతరుడు కావడం, ఆయన బందం కార్పొరేట్ తరహాలో వ్యవహారాలు నడపడం ప్రజలను అంతగా ఆకట్టుకోలేకపోయాయనే విమర్శలు తొలి నుంచే ఉన్నాయి. తోపుడుబండ్లు, బడ్డీ కొట్లు ఇవ్వడం, పెళ్లికానుక పేరుతో రూ.5,000, సుమారు ఓ ఏడాదిపాటు రెండు చోట్ల అన్న క్యాంటీన్లను నడపడం వలన పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందంటున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే నిత్యం ప్రజల్లోనే తిరుగుతూ ఉండటాన్ని, లోకేష్ అందుబాటులో లేకపోవడాన్ని ప్రజలు బేరీజు వేసుకునే స్థితి. కూటమి నేతలతో అంటీముట్టనట్లు.. ఎన్నికలకు కూటమి కట్టినప్పటికీ నియోజకవర్గంలో జనసేన, బీజేపీలతో అంటీముట్టనట్లే పార్టీ వ్యవహరించిందని టీడీపీ ముఖ్యులే అభిప్రాయపడుతూ వచ్చారు. సమన్వయ సమావేశం కూడా జరగకపోవడం గమనార్హం. ముస్లిం, క్రిస్టియ¯Œ ఓటర్లు దూరమవుతారనే భయంతో బీజేపీ వారిని దరిజేరనిచ్చిన దాఖలాలు దాదాపు లేవు. బీజేపీ, జనసేనలకు చెందిన యడ్లపాటి రఘునాథబాబు, పాతూరి నాగభూషణం, జగ్గారపు శ్రీనివాసరావు, పంచుమర్తి ప్రసాదరావు, పూర్ణచంద్రరావు, శివన్నారాయణ, చిల్లపల్లి శ్రీనివాసరావు, గాదె వెంకటేశ్వరరావు తదితర నాయకులు నియోజకవర్గం వారైనప్పటికీ వారితో కలిసి పనిచేసిన సందర్భాలు తక్కువే. వీరిలో జనసేనకు చెందిన ఒకరిద్దరికి కాస్త ప్రాధాన్యం ఇచ్చారే తప్ప బీజేపీని పట్టించుకోలేదు. సీనియర్ నాయకులకే లోకేష్ అందుబాటులో ఉండరని, సెక్యూరిటీ వారిని దాటుకుని వెళ్లలేమని, కార్పొరేట్ తరహా రాజకీయాలు కొనసాగుతున్నప్పుడు తమలాంటి వారి సంగతి ఏంటనే ప్రశ్న సామాన్య ఓటర్ల మధ్య చర్చకు దారితీయడం నష్టదాయకంగా మారిందని అంచనా వేస్తున్నారు. లోకేష్ చుట్టూ ఆయన సామాజికవర్గం నేతలు చేరడం, తమ వాడైనందున ఓట్లు వేయండని హెచ్చరిక ధోరణిలో చెప్పడం, పెత్తందారీ పోకడలతో వ్యవహరించడం, మా మాట వినకపోతే మీకు ఉపాధి ఉండదని, కౌలుకు భూములు కూడా ఇచ్చేది లేదని కొందరు భయపెట్టే రీతిలో మాట్లాడటం కూడా ఓట్లకు చేటు తెచ్చేవే అనే వ్యాఖ్యానాలు పరిశీలకుల నుంచి వినిపిస్తున్నాయి.:::సాక్షి, ప్రత్యేక ప్రతినిధి -
మంగళగిరి పోలింగ్ బూత్‌లో పవన్ ఓవరాక్షన్
గుంటూరు, సాక్షి: జనసేన పార్టీ అధినేత, నటుడు పవన్ కల్యాణ్ ఓవరాక్షన్‌కు దిగారు. సోమవారం ఉదయం తన భార్య అన్నా లెజినోవాను, కొందరు అనుచరులను వెంట పెట్టుకుని పోలింగ్ సెంటర్లోకి తీసుకెళ్లి హల్ చల్ చేశారు. మంగళగిరిలోని శ్రీ లక్ష్మి నరసింహ కాలనీలో 197వ బూత్‌లో పవన్ ఓటేసేందుకు వచ్చారు. ఆ సమయంలో తన భార్యను వెంటపెట్టుకుని బూత్‌లోకి తీసుకెళ్లారు. అలాగే.. అక్కడ సెంటర్లో ఓటే లేని అనుచరుల్ని వెంట తీసుకెళ్లారు. బూత్‌లో కలియ దిరుగుతూ ఫొటోలకు ఫోజులిచ్చారు. పవన్ భార్య అన్నా లెజినోవాకు సైతం అక్కడ ఓటు లేదని సమాచారం. అయినా అధికారులు వాళ్లను లోపలికి ఎలా అనుమతించారా? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు కొందరు.మరోవైపు పవన్ అలా వాళ్లందరినీ లోపలికి తీసుకెళ్తుంటే.. క్యూ నిల్చున్న కొందరు ఓటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే అక్కడే ఉన్న పోలింగ్ సిబ్బంది ఆ అభ్యంతరాల్ని పట్టించుకోకపోవడం గమనార్హం. -
మంగళగిరి మారుమోగింది.. ‘జై జగన్.. సీఎం జగన్’
గుంటూరు, సాక్షి: అది మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్.. కాస్త ఎండపూట ఇసుకేస్తే రాలనంత జనం చేరారు. సంక్షేమ సారథికి మద్దతు పలికేందుకు అశేషంగా తరలివచ్చిన జన సునామే అది. ఆ అభిమానం ఇంతటితో ఆగలేదు.. సీఎం జగన్ ప్రసంగించే సమయంలో సీఎం సీఎం.. జై జగన్.. జయహో జగన్ అంటూ నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగేలా చేశారు. మంగళగిరిలో పచ్చ బ్యాచ్ మొదటి నుంచి ఒకరమైన ప్రచారంతో ముందుకు పోతోంది. బీసీ జనాభా అత్యధికంగా ఉండే చోట.. అగ్ర కులానికి, అందునా గత ఎన్నికల్లో ఓడిన తమ చిన్నబాస్ నారా లోకేష్‌ను బరిలోకి దింపింది. బీసీ కులాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను సైతం చంద్రబాబు పట్టించుకోలేదు. కానీ, సీఎం జగన్ సామాజిక న్యాయం పాటించారు. గత ఎన్నికల్లో గెలిచిన ఆర్కే(ఆళ్ల రామకృష్ణారెడ్డి)ని తప్పించి మరీ.. బీసీ సామాజిక వర్గానికి, అందునా ఒక మహిళను వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నిలబెట్టారు. మురుగుడు లావణ్య ప్రచారానికి వెళ్లిన చోటల్లా.. ప్రజలు ఆదరించడం మొదలుపెట్టారు. అదే సమయంలో నారా లోకేష్‌కి ఆదరణ కరువు కావడంతో.. టీడీపీకి ఏమాత్రం మింగుడు పడలేదు.దీంతో మంగళగిరిలో నారా కుటుంబం ప్రచారాన్ని.. ఐటీడీపీ అండ్‌కో పేజీలు సోషల్‌మీడియాలో జాకీలు పెట్టడం ప్రారంభించారు. అక్కడా ప్రతికూల కామెంట్లే వినిపించాయి. అప్పటికీ కూడా మంగళగిరిలో టీడీపీ జెండానే ఎగురుతుందంటూ లోకేష్ అండ్ కో ప్రచారం చేస్తూ వచ్చాయి. ఈలోపే..సీఎం జగన్ మంగళగిరి ప్రచార సభకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు#MemanthaSiddham, #YSJaganAgain. ఆయన ప్రసంగిస్తున్నంత సేపు.. జయజయధ్వానాలు పలికారు. ఎటుచూసినా జన సమూహంతో పండగ వాతావరణం కనిపించింది. ‘‘చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, ఆత్మీయతలు పంచుతున్న నా ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ, ప్రతి అవ్వకూ, ప్రతి తాతకూ, ప్రతి సోదరుడికీ, ప్రతి స్నేహితుడికీ.. మీ అందరి ఆప్యాయతలకు మీ బిడ్డ, మీ జగన్ రెండు చేతులు జోడించి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు..’ అంటూ ప్రసంగం ప్రారంభంలో సీఎం జగన్ చెప్పిన మాటలు.. ఆపై కొనసాగిన స్పీచ్ మంగళగిరి ప్రజల్లో ఉత్సాహం నింపింది. ఫ్యాన్ గుర్తుకు తమ ఓటేసి.. కూటమి నేతలను తిప్పికొడతామంటూ తమ నినాదాలతో స్పష్టం చేశారు మంగళగిరి వాసులు. ..‘‘14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానని ఈ పెద్దమనిషి అంటుంటాడు, ఆ యన పాలనలో ఏనాడైనా ఇన్ని స్కీములు ఇచ్చా డా? ఇప్పటి మాదిరిగా ఏనాడైనా అవ్వాతాతలకు ఇంటింటికీ పింఛన్ ఇచ్చాడా? రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా? ఈ పెద్దమనిషి చంద్రబాబు పేరు చెబితే పేదలకు చేసిన కనీసం ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా?’’.. అంటూ సీఎం జగన్ అడిగిన ప్రశ్నలకు లేదూ.. లేదూ.. అంటూ రెండు చేతులు ఊపుతూ ప్రజలు మద్దతు తెలిపారు. ఈ ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో తెచ్చిన పథకాలు గురించి వివరిస్తున్నప్పుడు అవునూ.. అవునూ.. అంటూ ప్రజలు పెద్దఎత్తున మద్దతు పలికారు. స్థానికంగా ఉండే లావణ్యమ్మ(మురుగుడు లావణ్య)కు ఓటేయాలన్నప్పుడు కూడా ప్రజల నుంచి.. సిద్ధం అనే సమాధానమే వినిపించింది. మొత్తంగా.. గ్రాఫిక్స్ అనే వాళ్ల గూబ గుయ్యి మనేలా.. కూటమి వెన్నులో వణుకు పుట్టేలా.. మంగళగిరి ‘జై జగన్’ నినాదాలతో మారుమోగింది. -
ఈ పథకాలు ఎంత అవసరమో ఆలోచించండి: సీఎం జగన్
గుంటూరు, సాక్షి: సాధ్యంకాని హామీలతో టీడీపీ అధినేత చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చారు. కానీ, మేం 99 శాతం హామీలు అమలు చేసి మేనిఫెస్టోకు ఒక విశ్వసనీయత తీసుకొచ్చాం. ఇప్పుడు కూడా మేనిఫెస్టో ఆధారంగానే ఎన్నికల్లో ఓటేయమని అడుగుతున్నాం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గుంటూరు మంగళగిరిలో శుక్రవారం ఉదయం వైఎస్సార్సీపీ నిర్వహించిన ఎన్నికల ప్రచార భేరీలో ఆయన ప్రసంగించారు.‘‘మంగళగిరి సిద్ధమేనా? దేవుడి దయతో వాతావరణం కాస్త చల్లగా ఉంది. మీ చిక్కటి చిరునవ్వుల నడుమ, ఇందరి ప్రేమానురాగాలు, ఇందరి ఆప్యాయతలు, ఇందరి ఆప్యాయతల నడుమ మీ అందరికి కూడా.. నా ప్రతి అక్కకూ, నా ప్రతి చెల్లెమ్మకి, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితునికీ .. మీ బిడ్డ మీ జగన్ రెండు చేతులు జోడించి , హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.జరగబోయే ఎన్నికలు.. కేవలం మూడు రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగనుంది. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతున్న ఎన్నికలు కావు. ఈ జరగబోయే ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు. జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. మళ్లీ ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే... పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోటమే. ఇదే.. ఇదే.. చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోలకు అర్థం. ప్రతీ ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. పొరపాటును చంద్రబాబుకి ఓటేయడం అంటే.. కొండచిలువ నోట్లో తల పెట్టడమే అని గుర్తు పెట్టుకోవాలి. అందరికీ ఈ విషయాలు చెబుతూ.. నా మాటలపై ఆలోచన చేయండి. గత 59 నెలల మీ బిడ్డ పాలనలో గతంలో ఎప్పుడూ లేని విధంగా.. ఏకంగా రూ.2.70 లక్షల కోట్ల రూపాయిలు వివిధ పథకాలకు మీ బిడ్డ 130 సార్లు బటన్ నొక్కితే నేరుగా నా అక్కచెల్లమ్మల ఖాతాల్లోకి, వాళ్ల చేతుల్లోకి జమ అవుతున్నాయి. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు. మీ బిడ్డ బటన్‌నొక్కడం.. నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్లడం. మీ బిడ్డ రాక మునుపు, మీ బిడ్డ పాలనకు మునుపు ఈ విధంగా బటన్లు నొక్కడం, నేరుగా ఖాతాల్లోకి వెళ్లడం గతంలో ఎప్పుడైనా జరిగిందా? ఆలోచన చేయండి.ఏకంగా.. గతంలో ఎప్పుడూ చూడని విధంగా 2లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలు మీ బిడ్డ పాలనలోనే వచ్చాయి. దశాబ్దాలుగా ఉన్న ఉద్యోగాలు 4 లక్షలు. కేవలం 59 నెలల పాలనలోనే రెండు లక్షల ఉద్యోగాలిచ్చాం. గత చరిత్రలో ఇది ఎప్పుడూ జరగలేదని సగర్వంగా చెబుతున్నా. ఇందులో లక్షా 35 వేల మంది మన కళ్లముందు సచివాలయాల్లో కనిపిస్తున్నారు.ఇంతకుముందు అంతా ఎన్నికల మేనిఫెస్టో అంటే ఎన్నికలప్పుడు వస్తారు. రంగురంగుల కాగితాలతో, రంగురంగుల ఆశలకు అబద్ధాలకు రెక్కలు కట్టి చెప్పేవారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే పరిస్థితి. కనీసం వెతికినా దొరికేది కాదు. ఆ సంప్రదాయాన్ని మార్చి, గతంలో ఎప్పుడూ చూడని విధంగా దేశంలోనూ ఎక్కడా చూడని విధంగా.. ఏకంగా 99% హామీలు నెరవేర్చి, ఆ మేనిఫెస్టోను నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకే పంపించి, మీ బిడ్డ పాలనలో ఇవన్నీ జరిగాయా? లేదా? మీరే టిక్కు పెట్టండి, మీ జగన్ ఇవన్నీ చేశాడు.. మీరే మీ బిడ్డకు ఆశీస్సులు ఇవ్వండి అంటూ మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకొచ్చింది మీ బిడ్డ పాలనలోనే. ఆలోచేన చేయండి.. ఇది మీ బిడ్డ పాలనలో కాదా?.ఇప్పుడు నేను గడగడా కొన్ని పథకాల పేర్లు మచ్చుకు చెబుతాను.. ఈ పథకాలన్నీ గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? ఈ పథకాలన్నీ మీకు అందాయా అని మీరే ఆలోచించండి. గవర్నమెంట్ బడి పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, ఇంగ్లీష్ మీడియం నుంచి ఐబీ దాకా ప్రయాణం, టోఫెల్ క్లాసులు, బైలింగువల్ టెక్స్ట్ బుక్‌లు మన పిల్లల చేతుల్లోనే కనిపిస్తున్నాయి.బడులు తెరిచేసరికే విద్యాకానుక, బడుల్లో గోరుముద్ద, పిల్లల చదువులకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ చరిత్రలో ఎప్పుడూ జరగని రీతిలో ఓ అమ్మ ఒడి.. గతంలో ఉన్నాయా? గతంలో జరిగిందా?. పూర్తి ఫీజులతో...ఏ అక్కా...ఏ చెల్లెమ్మా తన పిల్లల చదువుల కోసం అప్పులపాలు అవ్వకూడదని, పెద్ద చదువుల కోసం పూర్తి ఫీజులతో ఒక జగనన్న విద్యాదీవెన, ఓ జగనన్న వసతి దీవెన.. ఇంజినీరింగ్, మెడిసిన్ చదువుతున్న వాళ్లు 93 శాతం ఫీజు రియంబర్స్మెంట్ పొందుతున్నది ఈ 59 నెలల కాలంలోనే. ఇంటర్నేషనల్ యూనివర్సిటీలతో ఆన్లైన్ సర్టిఫైడ్ కోర్సులను డిగ్రీ స్థాయిలో.. ఇలా చదువుల్లో మీ బిడ్డ తెచ్చిన విప్లవాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా? ప్రతీ ఒక్కరూ ఆలోచన చేయండి. 15 ఏళ్ల తర్వాత.. ఐబీ సర్టిఫికెట్ పదో తరగతి పాసైతాడు. మరో మూడేళ్లకు డిగ్రీ చేసి.. అంతర్జాతీయ యూనివర్సిటీల నుంచి కోర్సులతో పట్టా పుచ్చుకుంటాడు. అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతూ.. ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది. పేదల భవిష్యత్తు మారాలి.. అందుకు మీ బిడ్డ అడుగులు వేయడం ఎంత అవసరమో ఆలోచన చేయండి.గతంలో ఎన్నడూ జరగని విధంగా, చూడని విధంగా.. నా అక్కచెల్లెమ్మలను వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడాలని, వాళ్లకు ఏదో ఒక ఆదాయాలు ఉండాలని, అక్కచెల్లెమ్మలకు.. ఒక ఆసరా, చేయూత, సున్నావడ్డీ, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, నా అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల స్థలాలు వారిపేరిట రిజిస్ట్రేషన్ చేయించే కార్యక్రమంతో పాటు అందులో 20 లక్షల ఇళ్లు కడుతున్న కార్యక్రమం కూడా చేపట్టాం. అక్కచెల్లెమ్మల కోసం ఇంతగా ఆలోచన చేసిన ప్రభుత్వం..మహిళా సాధికారత కోసం ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూసారా?నా అవ్వాతాతలకు ఇంటికే రూ.3000 పెన్షన్ గతంలో ఎప్పుడైనా జరిగిందా?. ఇంటి వద్దకే రేషన్. ఇంటి వద్దకే పౌర సేవలు. ఇంటి వద్దకే పథకాలు రావడం.. గతంలో ఎప్పుడైనా జరిగాయా?. రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా రైతుభరోసా ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతున్నాను. రైతన్నలకు ఓ ఉచిత పంటలబీమా, సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ, పగటి పూటే 9 గం.ల ఉచిత విద్యుత్, ఒక ఆర్బీకే వ్యవస్థ...ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా? అని అడుగుతున్నాను.స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ.. సొంత ఆటోలు, టాక్సీలు నడుపుతున్న డ్రైవరన్నలకు ఓ వాహన మిత్ర, నేతన్నలకో నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసాతో పాటు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్లకు, పక్కనే తోపుడు బళ్లలో ఉన్నవాళ్లకు, ఇడ్లీ కొట్టు పెట్టుకున్న వాళ్లకు, శ్రమజీవులకు తోడుగా ఉంటూ ఓ చేదోడు, ఓ తోడు అనే పథకం అందిస్తున్నాం. లాయర్లకు ఒక లా నేస్తం. ఇలా పేదలకు తోడుగా ఉంటూ.. స్వయం ఉపాధి రంగంలో ఇంత మందికి తోడుగా ఉంటున్న పరిస్థితి గతంలో ఎప్పుడైనా జరిగాయా?. ఈ పథకాలు గతంలో ఉండేటివా?..ఏ పేదవాడు అప్పులు పాలవ్వకూడదని.. ఏ పేదవాడు వైద్యం అందక ఇబ్బంది పడకూడదు.. వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఆరోగ్యశ్రీని విస్తరించాం. ఏ పేదవాడికి అయినా వైద్యం కోసం 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం. రెస్ట్ పీరియడ్‌లో పేదవాడికి ఆరోగ్య ఆసరా. పేదవాడికి అండగా గ్రామంలోనే విలేజ్ క్లినిక్. గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్. ప్రతీ ఇంటిని జల్లెడ పడుతూ.. ఇంటికే ఆరోగ్య సురక్ష. ఇంతగా ఆరోగ్యం మీద దృష్టి పెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందా?.వీటన్నింటితో పాటు ఏ గ్రామానికి వెళ్లినా కూడా.. 600 రకాల సేవలు అందించే సచివాలయం. ఏ గ్రామానికి వెళ్లినా.. 60-70 ఇళ్లకు ఒక వలంటీర్‌తో కూడిన వ్యవస్థ. నాలుగు అడుగులు ముందుకు వేస్తే రైతన్నను చేయి పట్టుకు నడిపిస్తూ ఓ ఆర్బీకే. మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే ప్రతి పేదవాడికీ వైద్యంపరంగా అండగా ఉంటూ విలేజ్ క్లినిక్. ఇంకో నాలుగు అడుగులు ముందుకు వేస్తే నాడునేడు ద్వారా బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం బడి. గ్రామానికే ఫైబర్ గ్రిడ్, గ్రామంలోనే డిజిటల్ లైబ్రరరీ. ఇవన్నీ కాక గ్రామంలోనే నా అక్కచెల్లెమ్మల రక్షణ కోసం మహిళా పోలీస్. అక్కచెల్లెమ్మల ఫోన్లో దిశ యాప్. ఈ పథకాలు, ఈ మార్పులు, ఈ లంచాలు.. వివక్ష లేని పాలన గతంలో జరిగిందా?.. అక్కచెల్లెమ్మలకు, అవ్వాతాతలకు అండగా నిలిచిన పాలన ఇది. ఆలోచన చేయండి.మరో పక్క చంద్రబాబునే గమనించండి. పద్నాలుగేళ్లు సీఎంగా చేసిన వ్యక్తి.. ఆయన పేరు చెబితే ఒక్కటంటే ఒక్కటైనా పథకం లేదు. ఆయన పాలన ఎలా ఉండేదో గమనించండి. చంద్రబాబు అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు. అధికారం తప్పితే.. ఆయన మాయలు, ఆయన మోసాలు ఎలా ఉంటాయో. ఈ పాంప్లెట్ గుర్తుకు తెచ్చుకోండి. 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు.. ఇదే ముగ్గురితో కలిసి కూటమిగా ఏర్పడ్డాడు. ఈ ఫాంప్లెట్‌ను ముఖ్యమైన హామీలంటూ స్వయంగా సంతకం పెట్టి పంపించాడు. 2014-19 మధ్య ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఈ పాంప్లెట్లో చెప్పినవి ఒక్కటైనా జరిగాయా? నేను మిమ్మల్ని అడుగుతాను మీరే సమాధానం చెప్పండి.రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నారు. మరి రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ అయ్యాయా? రెండో హామీ.. పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నారు. మరి రూ.14,205 కోట్లు పొదుపు సంఘాల రుణాల్లో.. ఒక్క రూపాయైనా మాఫీ చేశారా?. ఆలోచన చేయండి. మూడో హామీ.. ఆడ బిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు మీ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నారు. నేను అడుగుతున్నా.. రూ.25 వేల కథ దేవుడెరుగు.. ఏ ఒక్కరి అకౌంట్లలో అయినా ఒక్క రూపాయి అయినా వేశారా?. నాలుగో ముఖ్యమైన హామీ.. ఇంటింటికీ ఉద్యోగం.ఉద్యోగం ఇవ్వకపోతే రూ.2 వేలు నిరుద్యోగ భృతి ప్రతి నెలా అన్నారు. ఐదేళ్లు అంటే 60 నెలలు, నెలకు రెండు వేలు చొప్పున ప్రతి ఇంటికీ రూ.1,20,000 ఇచ్చారా?. ఐదో హామీ.. అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. మీ అందరినీ కూడా నేను అడుగుతున్నాను. ఇన్ని వేల మంది ఇక్కడున్నారు కదా. చంద్రబాబు హయాంలో చంద్రబాబు మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. రూ.10,000 కోట్లతో బీసీ సబ్‌ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు జరిగిందా?. విమెన్ ప్రొటెక్షన్ ఫోర్సు ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా? సింగపూరుకు మించి అభివృద్ధి చేస్తామన్నాడు చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు జరిగిందా? ఒక్కటంటే.. ఒక్క హామీ నెరవేరిందా?. పోనీ ప్రత్యేక హోదా అయినా ఇచ్చాడా? దాన్నీ అమ్మేశాడు. మరి నేను అడుగుతున్నాను. ఇలాంటి వాళ్లను నమ్మొచ్చా? ఆలోచన చేయండి.మళ్లీ.. కొత్త మేనిఫెస్టో డ్రామా. మళ్లీ ఇదే ముగ్గురూ. మళ్లీ చంద్రబాబూ.. సూపర్ సిక్స్ అంట. నమ్ముతారా?, సూపర్ సెవెన్ అంట. నమ్ముతారా?. ఇంటింటికీ కేజీ బంగారం అంట. నమ్ముతారా?. ఇంటింటికీ బెంజికారు అంట. నమ్ముతారా?. మరి ఆలోచన చేయమని అడుగుతున్నా అని సీఎం జగన్ ప్రసంగించారు. -
జగన్ కోసం మంగళగిరి సిద్ధం.. జననేతకు బ్రహ్మరథం (ఫొటోలు)
-
వాళ్ల దగ్గర ఉన్నంత డబ్బు లేదు.. మంగళగిరి ముఖాముఖిలో చంద్రబాబు, లోకేష్‌ను ఏకేసిన సీఎం జగన్
-
బాబు బ్యాచ్ ఇళ్ల పట్టాలు ఆపారు.. ఓట్లకు వస్తే నిలదీయండి: సీఎం జగన్
సాక్షి, మంగళగిరి: ఎన్నికల్లో మన బతుకులు మార్చే నాయకుడిని ఎన్నుకోవాలన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఓటు వేసేటప్పుడు అప్రమత్తంగా లేకుంటే మళ్లీ మోసపోతామని సూచించారు. రంగురంగుల మేనిఫెస్టోతో వస్తున్న చంద్రబాబు విషయం జాగ్రత్తగా ఉండాలన్నారు. సూపర్ సిక్స్, సెవెన్ అంటూ వస్తున్న చంద్రబాబు గతంలో చేసిన అన్యాయాన్ని గుర్తుచేసుకోవాలని సూచించారు. కాగా, సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర మంగళగిరికి చేరుకుంది. ఈ సందర్భంగా సీఎం జగన్ చేనేత కార్మికులతో ముఖాముఖి అయ్యారు. ఈ క్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. గత చంద్రబాబు పాలనను మీరు చూశారు. 58 నెలల కాలంలో మీ బిడ్డ పాలనను చూశారు. ప్రతీ పేదవాడి గుండెల్లో నిలిచేలా మీ బిడ్డ అడుగులు వేశాడు. 58 నెలల పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజల నుంచి వింటున్నాను. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలకు సూచనలు తీసుకుంటున్నాను. చంద్రబాబుకు ఉన్నంత నెగిటివిటీ అనుభవం నాకు లేదు. చేనేత కార్మికులను కూడా చంద్రబాబు మోసం చేశాడు. 2014లో కూటమిగా వచ్చి చంద్రబాబు ఏం చేప్పారో గుర్తు చేసుకోండి. ఓటు వేసేటప్పుడు అప్రమత్తంగా లేకుంటే మళ్లీ మోసపోతాం. గతంలో 98 శాతం హామీలను ఎగ్గొట్టారు. 2 శాతం హామీలను మాత్రమే నెరవేర్చారు. గత పాలనకు, మన పాలనకు తేడాను మీరే గమనించారు. చంద్రబాబు రంగురంగుల మేనిఫెస్టోతో వస్తున్నారు. సూపర్ సిక్స్, సెవెన్ అంటూ వస్తున్నారు. గతంలో కూడా ముగ్గురు కలిసే వచ్చారు. ఒక్కరికైనా సెంట్ స్థలం ఇచ్చారా?. మనం స్థలం ఇస్తే కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారు. ఒక్క ఇళ్లైనా ఇచ్చారా?. చేనేత కార్మికులకు ఇల్లు, మగ్గం అని చంద్రబాబు మోసం చేశారు. నేతన్న నేస్తం పథకం కింద రూ.970కోట్లు చేనేత కార్మికులకు అందించాం. మగ్గం ఉన్న ప్రతీ కుటుంబానికి చేయూతనిచ్చిన ప్రభుత్వం మనది. కుల, మత, రాజకీయాలకు అతీతంగా లబ్ధి జరిగింది. గతంలో ఎప్పుడైనా ఇలాంటి పథకం అములు చేసిన సందర్భం ఉందా?. నేతన్నల సంక్షేమం, అభివృద్ధి కోసం రూ.3706 కోట్లు ఖర్చు చేశాం. 1.06లక్షల మందికి లబ్ధి జరిగింది. గతంలో లంచాలు ఇస్తే కూడా సంక్షేమ పథకం అందని పరిస్థితి ఉండేది. దళారులు లేకుండా అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించాం. నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నగదు జమ చేసిన ప్రభుత్వం మనది. ఎన్నికల్లో మన బతుకులు మార్చే నాయకుడిని ఎన్నుకోవాలి. 2014 ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చలేదు. వాలంటీర్ వ్యవస్థతో అవ్వాతాతలకు పెన్షన్ అందించిన ప్రభుత్వం మనది. పెన్షన్‌ను రూ.3వేలకు పెంచి అందించే అవకాశం నాకు వచ్చింది. 50 శాతం వెనుకబడిన వర్గాలకు టికెట్ ఇచ్చిన ఘనత మనదే. దేశ రాజకీయ చరిత్రలోనే ఇది ఒక రికార్డు. బీసీలు ఎక్కువగా ఉన్నా.. చంద్రబాబు బీసీలకు సీటు ఇవ్వలేదు. కుప్పంలో కూడా బీసీలే ఎక్కువ.. అక్కడా బీసీలకు టికెట్ ఇవ్వరు. మనం మాత్రం చేనేత వర్గానికి చెందిన చెల్లెమ్మెకు టికెట్ ఇచ్చాము. మంగళగిరిలో లక్షా 20వేల ఇళ్లున్నాయి. లక్షా 8వేల ఇళ్లకు నేరుగా సంక్షేమ పథకాలు అందించాం. 90 శాతం ఇళ్లకు లంచాలకు తావులేకుండా లబ్ధి జరిగింది. నేరుగా వారి ఖాతాల్లోనే నగదు జమ చేసిన ప్రభుత్వం మనదిఅని తెలిపారు. పేదలకు మంచి జరిగితే అడ్డుకునే వాడు రాజకీయ నాయకుడా?. మేనిఫెస్టోలో చెప్పే ప్రతీ హామీని నెరవేర్చిన ప్రభుత్వం మనది. మంగళగిరిలో పేదలకు 54వేల ఇళ్ల స్థలాలు ఇస్తే చంద్రబాబు అడ్డుకున్నాడు. కోర్టులకు వెళ్లి పిటిషన్లు వేసి చంద్రబాబు అడ్డుకున్నాడు. మీ ఇళ్ల పట్టాలు అడ్డుకున్నది చంద్రబాబే. అందుకే ఓటు వేయమని అడిగినప్పుడు చంద్రబాబును నిలదీయండి’ అని కోరారు. -
Jana Sena Clash: ‘దక్షిణ’ నాదంటే నాదే!
సాక్షి, విశాఖపట్నం: జనసేన విశాఖ దక్షిణ నియోజకవర్గం సీటు రసకందాయంలో పడింది. ఈ టికెట్ నాదంటే నాదని ఇద్దరు నాయకుల మధ్య వార్ జరుగుతోంది. ఈ సీటును కార్పొరేటర్లు సాధిక్, కందుల నాగరాజులతో పాటు మూగి శ్రీనివాస్‌లు ఆది నుంచీ ఆశిస్తున్నారు. తీరా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించి జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ తెరపైకి వచ్చారు. జనసేన అభ్యర్థుల జాబితాల్లో విశాఖ దక్షిణ అభ్యర్థి పేరును ప్రకటించలేదు. అయినా ఈ సీటును తనకే ఖరారు చేశారంటూ వంశీకృష్ణ స్వయంగా ప్రకటించుకుని ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించేశారు. వంశీ అభ్యర్థిత్వంపై దక్షిణం సీటును ఆశిస్తున్న ఈ ముగ్గురు నేతలూ తీవ్రంగా మండిపడుతున్నారు. ఆ నియోజకవర్గంలో ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నారు. ‘వంశీ వద్దు.. స్థానికులే ముద్దు’ అంటూ నినాదాలు చేస్తూ రోడ్డెక్కారు. కొద్దిరోజుల క్రితం ఒక మేకను తీసుకొచ్చి వంశీతో పోలుస్తూ ఈ సీటును బలి చేయొద్దని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఆ సమయంలో వంశీ వర్గీయులు తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారంటూ జనసేన మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో జనసేన రెండు వర్గాలుగా చీలిపోయింది. వంశీ ఎన్నికల ప్రచారానికి వ్యతిరేక వర్గీయులు దూరంగా ఉంటున్నారు. మరోపక్క వంశీకృష్ణకు టికెట్ కేటాయింపు ప్రకటన వట్టిదేనని, అంతా బూటకమని కందుల బహిరంగంగానే చెబుతున్నారు. పవన్ ఆ సీటును తనకే ఖరారు చేస్తున్నారని ప్రచారం చేసుకుంటున్నారు. మంగళగిరికి కందుల జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను కలిసి విశాఖ దక్షిణ సీటు తనకే కేటాయించాలని కోరేందుకు కందుల నాగరాజు గురువారం మంగళగిరికి పయనమయ్యారు. వంశీకృష్ణకు సీటిస్తే ఓడిపోతారని, తనకిస్తే గెలుస్తానని చెప్పడానికి వెళ్లారు. సీటు ఇస్తారన్న హామీతోనే గతంలో జనసేనలో చేరానని, ఒకవేళ తనకు టికెట్ కేటాయించకపోతే పార్టీకి గుడ్‌బై చెబుతానని పవన్‌కు స్పష్టం చేయనున్నట్టు ఆయన వర్గీయులు చెబుతున్నారు. మంగళగిరి పంచాయతీలో దక్షిణ టికెట్‌పై ఏం తేలుస్తారోనని జనసేన శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ఇవి చదవండి: ‘సైకిల్’ దొంగ దొరికాడోచ్! -
‘మంగళగిరిలో లోకేష్‌ను మడత పెట్టేస్తాం’
గుంటూరు: మంగళగిరి నియోజకవర్గంలో బీసీ సీటులో నారా లోకేష్ పోటీ చేయటం దారుణమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. జోగి రమేష్ బుధవారం మంగళగిరి వైఎస్సార్సీపీ సామాజిక సాధికార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైఎస్సార్సీపీ లోకేష్‌ను మడత పెట్టేస్తుందని అన్నారు. వైఎస్సాఆర్సీపీ దెబ్బకు లోకేష్ పారిపోతాడని అన్నారు. మంగళగిరి అని పలకటమే చేతకాని లోకేష్ మంగళగిరిలో పోటీ చేయటమా? అని ఎద్దేవా చేశారు. ఎన్నికలు వస్తున్నాయి రకరకాల వేషాలలో దొంగలు వస్తున్నారు జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు పిలునిచ్చారు. సీఎం జగన్‌కు అండగా ఉండాలి.. అట్టడుగు వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అన్ని విధాల పైకి తీసుకురావాలని ఎంతోమంది మేధావులు ఆలోచన చేశారని మంత్రి మెరుగు నాగార్జున అన్నారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కరే మేధావుల ఆలోచనలనకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అన్ని విధాల పైకి తీసుకొచ్చారు తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా సామాజిక న్యాయాన్ని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని.. ఆయనకు అందరూ అండగా ఉండాలని అన్నారు. బీసీలను అణగదొక్కి లోకేష్ పోటీ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటు పేదలకు దేవుడని వైఎస్సార్సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త గంజి చిరంజీవి అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లోనే సామాజిక న్యాయం అమలవుతుందని తెలిపారు. మంగళగిరిలో బీసీలను అణగదొక్కి లోకేష్ పోటీ చేస్తున్నాడని మండిపడ్డారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అగ్రవర్ణాల సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కనపెట్టి మంగళగిరి సీటును బీసీలు కేటాయించారని అన్నారు. వైఎస్సార్సీపీ మరోసారి గెలిపించుకోకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోతారని ఎంపీ నందిగాం సురేష్ అన్నారు. దొంగల ముఠా.. పచ్చ మీడియా చెప్పే విషయాలను రాసే కథనాలను ప్రజలు నమ్మవద్దని తెలిపారు. -
మంగళగిరిలో లోకేశ్ ఓటమి తథ్యం
మంగళగిరి/తాడేపల్లి రూరల్: గడిచిన రెండు దఫాలుగా మంగళగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసిందని, త్వరలో జరగనున్న ఎన్నికల్లోనూ తమ పార్టీ అభ్యర్థి గంజి చిరంజీవి తప్పక విజయం సాధిస్తారని రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 31న మంగళగిరిలో వైఎస్సార్ సీపీ తలపెట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర ఏర్పాట్లను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ఈ నియోజకవర్గంలో గతంలో తెలుగుదేశం పార్టీ గెలిచిన దాఖలాలు లేవన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి నారా లోకేశ్ ఓటమి తథ్యమన్నారు. మంగళగిరిలో వైఎస్సార్ సీపీ నుంచి వెనుకబడిన సామాజిక వర్గానికి (చేనేత) చెందిన వ్యక్తి పోటీలో నిలబడుతున్నారని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు వైఎస్ జగన్ ఇస్తున్న ప్రాధాన్యత దేశంలో మరే ఇతర రాష్ట్రంలో ఏ పార్టీ ఇవ్వడం లేదన్నారు. నియోజకవర్గంలో బీసీ, బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలు వైఎస్సార్ సీపీ అభ్యర్థిని గెలిపించుకుంటారని, అలాగే రాబోయే ఎన్నికల్లో ఆయా వర్గాల ప్రజలు వైఎస్ జగన్‌ను మరోమారు ముఖ్యమంత్రి చేస్తారని నమ్మకంగా చెప్పారు. మంగళగిరిలో మిద్దే సెంటర్లో నిర్వహించే సామాజిక సాధికార యాత్ర మహాసభకు ముందు పెద్దఎత్తున పాదయాత్ర జరుగుతుందని చెప్పారు. ఈ పాదయాత్రలో కార్యకర్తలు, బడుగు బలహీన వర్గాలు, దళిత సోదర సోదరీమణులు పాల్గొనాలని, మహాసభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో కాంగ్రెస్ చనిపోయింది కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏనాడో చనిపోయిందని విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని అడ్డుగోలుగా విడగొట్టి, ఏపీ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందని అన్నారు. రాబోయే తరాలకు సైతం ఆ పార్టీ తీరని ద్రోహం చేసిందన్నారు. ఆ పార్టీ ఏపీకి చేసిన ద్రోహాన్ని ఇక్కడి ప్రజలు ఎప్పటికీ క్షమించరని, కాంగ్రెస్ పార్టీ చరిత్రపుటల్లో కలిసిపోయిందని అన్నారు. ఈ బస్సుయాత్ర ఏర్పాట్లను రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త గంజి చిరంజీవి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, నియోజకవర్గ పరిశీలకుడు రాపాక శ్రీనివాస్ స్థానిక నాయకులతో కలసి విజయసాయిరెడ్డి పరిశీలించారు. 24 గంటల్లో సమస్య పరిష్కారం విజయసాయిరెడ్డి చొరవతో తెనాలి–మంగళగిరి రహదారికి ఆర్అండ్బీ శాఖ అధికారులు మంగళవారం మరమ్మతులు చేపట్టారు. విజయసాయిరెడ్డి సోమవారం మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వర్షాల కారణంగా దెబ్బతిన్న తెనాలి–మంగళగిరి రహదారి విషయాన్ని ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, పార్టీ సమన్వయకర్త గంజి చిరంజీవి విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయంలో విజయసాయిరెడ్డి చొరవ తీసుకోవడంతో అధికారులు 24 గంటల్లోనే రోడ్డు మరమ్మతులు చేపట్టారు. ఐదారు రోజుల్లో మరమ్మతు పనులు పూర్తవుతాయని ఆర్ అండ్ బీ అధికారులు తెలిపారు. సమస్యను పరిష్కరించిన ఎంపీ విజయసాయిరెడ్డికి స్థానిక వైఎస్సార్సీపీ నాయకులకు, ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.