మంగళగిరి పోలింగ్‌ బూత్‌లో పవన్‌ ఓవరాక్షన్‌ | AP Elections 2024: Pawan With Wife At Polling Centre Over Action | Sakshi
Sakshi News home page

రూల్స్‌ బ్రేక్‌.. భార్యతో మంగళగిరి పోలింగ్‌ బూత్‌లో పవన్‌ ఓవరాక్షన్‌

Published Mon, May 13 2024 10:19 AM | Last Updated on Mon, May 13 2024 12:32 PM

AP Elections 2024: Pawan With Wife At Polling Centre Over Action

గుంటూరు, సాక్షి: జనసేన పార్టీ అధినేత, నటుడు పవన్‌ ‍కల్యాణ్‌ ఓవరాక్షన్‌కు దిగారు. సోమవారం ఉదయం తన భార్య అన్నా లెజినోవాను,  కొందరు అనుచరులను వెంట పెట్టుకుని పోలింగ్‌ సెంటర్‌లోకి తీసుకెళ్లి హల్‌ చల్‌ చేశారు. 

మంగళగిరిలోని శ్రీ లక్ష్మి నరసింహ కాలనీలో 197వ బూత్‌లో పవన్‌ ఓటేసేందుకు వచ్చారు. ఆ సమయంలో తన భార్యను వెంటపెట్టుకుని బూత్‌లోకి తీసుకెళ్లారు. అలాగే.. అక్కడ సెంటర్‌లో ఓటే లేని అనుచరుల్ని వెంట తీసుకెళ్లారు. బూత్‌లో కలియ దిరుగుతూ ఫొటోలకు ఫోజులిచ్చారు. పవన్‌ భార్య అన్నా లెజినోవాకు సైతం అక్కడ ఓటు లేదని సమాచారం. అయినా అధికారులు వాళ్లను లోపలికి ఎలా అనుమతించారా? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు కొందరు.

మరోవైపు పవన్‌ అలా వాళ్లందరినీ లోపలికి తీసుకెళ్తుంటే.. క్యూ నిల్చున్న కొందరు ఓటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే అక్కడే ఉన్న పోలింగ్‌ సిబ్బంది ఆ అభ్యంతరాల్ని పట్టించుకోకపోవడం గమనార్హం.

మంగళగిరి పోలింగ్‌ బూత్‌లో పవన్‌ ఓవరాక్షన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement