AP Political And Elections News Updates In Telugu
8:18 PM, May 8th, 2024
షర్మిల, సునీతలకు కడప కోర్టు మరోసారి షాక్
ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసు ప్రస్తావించరాదన్న కడప కోర్టు జారీ చేసిన అర్డర్‌ను డిస్మిస్ చేయాలంటూ సునీత వేసిన పిటిషన్‌ను కొట్టేసిన కోర్టు
ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సునీత
కడప కోర్టులోనే తేల్చుకొవాలన్న హైకోర్టు
హైకోర్టు అదేశాల మేరకు విచారణ చేపట్టిన కడప కోర్టు
ఇరువురి వాదనలు విన్న కడప కోర్టు
సునీత, షర్మిల దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసిన కడప కోర్టు
తప్పుడు సమాచారంతో పిటిషన్ వేశారంటూ సునీత, షర్మిలకు రూ.10 వేల జరిమానా
జరిమానానుజిల్లా లీగల్ సెల్ కు కట్టాలన్న కడప కోర్టు
2:30 PM, May 8th, 2024
కుప్పంలో బాబు ఓడిపోతున్నాడు: లక్ష్మి పార్వతి
- సంఘ విద్రోహులు చంద్రబాబు అండ్ కొ
- ఎన్టీఆర్ వెన్నుపోటులో పురందేశ్వరి ప్రధాన పాత్ర పోషించింది
- నేతి బీరకాయలో నెయ్యి లాంటిది పురందేశ్వరి మంచితనం
- పురందేశ్వరి కూడా చంద్రబాబు లాంటి మనిషి
- FIRలో వైఎస్సార్ పేరును చేర్చిన కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరడం ఏమిటి..?
- వీరందరినీ చంద్రబాబు ఆడిస్తున్నారు
- రాజకీయ నీచుడు చంద్రబాబు
- బాబు కంటే సీఎం జగన్ అధిక పెట్టుబడులు తీసుకొచ్చారు
- ఏపీ అభివృద్ధిలో విశాఖ కీలకం
- ఏం మాట్లాడాలో అర్ధంకాక బాబు ఇచ్చిన స్క్రిప్ట్ మోడీ చదివాడు
- సీఎం జగన్‌ను గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు
- ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగాలి అంటే సీఎం జగన్ అధికారంలోకి రావాలి
- నేను రాష్ట్రం మొత్తం తిరిగాను
- గీతం మూర్తి ఎన్టీఆర్ వెన్నుపోటులో కీలక పాత్ర పోషించిన దుర్మార్గుడు
- గీతం భరత్‌ను ఓడించాలి
- గీతం అంటేనే భూ కబ్జాలు
- ఏయూను నాశనం చెయ్యాలనే ఉద్దేశంతోనే గీతంను అభివృద్ధి చేశారు.
1:50 PM, May 8th, 2024
మోదీకి కుటుంబం లేదన్న వ్యక్తి చంద్రబాబు: జోగి రమేష్
- జోగి రమేష్ కామెంట్స్
- ఎన్డీఏ కూటమి కొత్త కూటమి ఏమి కాదు .
- 2014లో ఇదే కూటమి జతకట్టింది.
- కలిసి పోటీ చేయడం ఎందుకు.. విడిపోవడం ఎందుకు..
- పవన్ వలన మేము గెలవలేదని చంద్రబాబు అన్నాడు.
- మోడీకి కుటుంబం లేదు అన్న వ్యక్తి బాబు.
- మేనిఫెస్టోలో ఒక్క పథకం కూడా చంద్రబాబు అమలు చేయలేదు.
- అందుకే గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు..
- కుట్రలతో ఇప్పుడు కూటమి ఏర్పాటు చేశారు.
- పొత్తులు ముక్కలవడం ఖాయం .
- అన్నం పెట్టే జగన్న కు ప్రజలు మద్దతుగా ఉన్నారు
- రెండు ఓట్లు ఫ్యాన్ కే వేస్తామని ప్రజలు అంటున్నారు.
- మంచి చేశాడు కాబట్టే ప్రజల గుండెల్లో జగన్ ఉన్నారు
1:30 PM, May 8th, 2024
టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలి: తానేటి వనిత
- టీడీపీ నేతల రౌడీయిజంపై చర్యలు తీసుకోవాలి
- టీడీపీ నేతల దాడులు నశించాలి
- ప్రజాస్వామ్యం పరిరక్షించాలి
- నేనున్న ఇంటిపై దాడి చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది?
- ఎవరు ఎంత రెచ్చగొట్టినా కార్యకర్తలు రెచ్చిపోవద్దు
- ప్రజల్లో మనం ఉన్నాము సర్వేలు బాగున్నాయి
- ప్రజలంతా కూడా జగనన్న పరిపాలనకు ముక్తులై.. మనకే ఓటేయాలని ఎదురుచూస్తున్నారు
- టీడీపీ కార్యకర్తలు రౌడీ రాజకీయాలు, గూండా రాజకీయాలు చేస్తున్నారు
- భౌతికంగా దాడులు చేసి.. మనం చేసినట్టు లైవ్‌లు పెట్టారు.
- గోపాలపురం నియోజకవర్గంలో ఒక రెడ్ బుక్ ఉందని అంటున్నారు.
- ఒక్కసారి కూడా ఎన్నిక కాని వారు గూండా రాజకీయాలు చేస్తున్నారు
- రాత్రి జరిగిన దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసాము
- నేనేమీ వారికి ఛాలెంజ్‌లు కూడా చేయలేదు
- మా నాయకుడు చేసిన మంచే మాట్లాడాను.
- జగనన్న నాకు హోం మంత్రి పదవి ఇచ్చారు
- జగనన్న నాకు రాజ్యాధికారం ఇచ్చారు
- దళితలమైన నాపై దాడులు చేస్తూ కించపరిచేలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు
- ఈరోజు నాపై దాడి చేశారు అధికారం లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి?
- నోటికి వచ్చిన వాగ్దానాలు ఇస్తున్నారు.
- చట్టం ఎవరికీ చుట్టం కాదు.
- ప్రతీ కార్యకర్త ఎలక్షన్‌పై దృష్టి పెట్టాలి.
12:30 PM, May 8th, 2024
చంద్రబాబుపై ఎమ్మెల్సీ రుహుల్లా ఫైర్
- మైనార్టీల 4% రిజర్వేషన్ గురించి మోదీతో మాట్లాడే దమ్ము చంద్రబాబుకు ఉందా?.
- విజయవాడ పర్యటనలో మోదీతో చంద్రబాబు మైనార్టీల గురించి మాట్లాడించాలి.
- హజ్ యాత్రకు వెళ్లే మైనార్టీలను సీఎం జగన్ ఆర్థికంగా అందుకున్నారు.
- గుంటూరులో దళితులపై దేశద్రోహి కేసులు పెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు.
- రాష్ట్రంలో ఉన్న మైనారిటీలు అందరూ ఈ విషయంపై ఆలోచించాలి.
- మైనారిటీలను ఓట్ల కోసం వాడుకుంది చంద్రబాబు నాయుడు
- రాష్ట్రంలో మైనార్టీలు అంటే చంద్రబాబు, బీజేపీకి చిన్న చూపు.
- సీఎం జగన్ మైనార్టీలకు అభివృద్ది చేశారు
- మైనార్టీల ద్రోహి చంద్రబాబు నాయుడు
- మైనార్టీలకు ద్రోహం చేయడానికి చంద్రబాబు మోదీతో జత కట్టారు
12:00 PM, May 8th, 2024
పవన్‌పై ముద్రగడ సంచలన కామెంట్స్
- పవన్ కళ్యాణ్ నిఖార్సైన కాపో కాదో లోకానికి తెలియాలి
- నేను నిఖార్సైన కాపుని.. నా కుటుంబం కూడా స్వచ్చమైన కాపు కుటుంబం
- పవన్ కుటుంబం స్వచ్చమైన కాపు ఐతే చరిత్ర బయట పెట్టమనండి.
- మాటి మాటికీ కాపు ముసుగులో ఉండి కాపులకు సాయం చేయ్యరా అని అడుగుతున్నావ్.
- మా వంగా గీతా కాపు కాదా?
- కొందరు దుష్టుల వల్ల నా కూతురు దూరమైపోయింది
- మళ్ళీ వచ్చే జన్మలోనే కలుసుకుందాం
11:30 AM, May 8th, 2024
అభివృద్ధి అంటే జగనే: దేవినేని అవినాష్
- ప్రతీ గడపలో జగన్ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు
- అభివృద్ధి లేదు అంటున్న టీడీపీ నేతలు మూడో డివిజన్‌లో పర్యటించాలి
- ఐదేళల్లో జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూసి ఓటు వేయమని కోరుతున్నాం
- ఈ డివిజన్ మొత్తం సీసీ రోడ్లు వేసిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుంది
- టీడీపీ ఎమ్మెల్యేకు ఈ ప్రాంతం, నియోజకవర్గ అభివృద్ధిపై చిత్త శుద్ధి లేదు
- అభివృద్ధి సంక్షేమం చూసి మీ బిడ్డగా ఒక్క అవకాశం ఇవ్వాలి
- ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఆశీర్వదించండి
11:00 AM, May 8th, 2024
ఎమ్మెల్యే అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్ కామెంట్స్
- సీఎం జగన్ ప్రభుత్వంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు.
- జగనన్న పథకాలపై ఈసీకి ఫిర్యాదుకు చేసి వాటిని ఆపిన దుర్మార్గుడు చంద్రబాబు.
- చంద్రబాబుకు పేద ప్రజల పట్ల అంత అసూయ ఎందుకు?.
- ప్రజలను ఇబ్బంది పెట్టడం చంద్రబాబుకు అలవాటే.
- గతంలో చంద్రబాబు పసుపు కుంకులకు ఎలక్షన్ సమయంలో పర్మిషన్ ఇచ్చారు.
- ఎలక్షన్ కోడ్ రాకముందు అందించిన సంక్షేమ పథకాలను ఎందుకు ఆపారు.
- ఎన్నికల కమిషనర్ ఈ విషయాన్ని పున: పరిశీలన చేయాలి.
- విద్యాదీవెన ఆపిన కారకులు చంద్రబాబు, జనసేన, బీజేపీ
- దుర్మార్గపు ఆలోచనలకు కేరాఫ్ అడ్రస్ వీరి ముగ్గురే.
- పేద ప్రజలపై కక్ష సాధింపు చర్యలు వద్దు.
- సీఎం జగన్ పేద ప్రజలకు కవచంలా అండగా ఉంటారు.
10:30 AM, May 8th, 2024
బాబుకు ఓటమి భయం పట్టుకుంది: మంత్రి పెద్దిరెడ్డి
- మంత్రి పెద్దిరెడ్డి కామెంట్స్
- కుప్పంలో చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది
- ఇందుకే పిచ్చి పట్టినట్లు బాబు మాట్లాడుతున్నారు
- సీఎం జగన్‌తో పాటు నాపై చంద్రబాబు ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారు
- వేల కోట్లు నేను సంపాదించానని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటు
- చంద్రబాబు ఆరోపణలకు రుజువులు ఉన్నాయా?.
- ఈసారి కుప్పంలో చంద్రబాబును ప్రజలు రాజకీయంగా భూస్థాపితం చేయనున్నారు.
10:00 AM, May 8th, 2024
చంద్రబాబుపై మాట మార్చిన మోదీ..
నాడు చంద్రబాబు పోలవరాన్ని ఏటీఎం మార్చుకున్నాడని మోదీ వ్యాఖ్యలు
నేడు చంద్రబాబుపై మోదీ ప్రశంసలు.
వెన్నుపోటు, పార్టీలు మార్చడం, తిట్టినవారి చంకనెక్కడంలో బాబు నిపుణుడు.
మోదీ కూడా చంద్రబాబులాగే మాట్లాడుతున్నాడు.
వచ్చే ఎన్నికల్లో మన ఫ్యాన్ గుర్తుకు ఓటువేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించండి.
చంద్రబాబు గురించి గత ఎన్నికల ముందు మోడీ గారు ఏమన్నారో గుర్తుందా? పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నాడని, వెన్నుపోట్లు, పార్టీలు మార్చడం, తిట్టినవారి చంకనెక్కడంలో చంద్రబాబు నిపుణుడని, అత్యంత అవినీతిపరుడని చెప్పారు. కానీ ఇప్పుడు అదే మోడీ గారు ఎన్డీయే గూటికి చేరిన చంద్రబాబుని ఇంతకంటే… pic.twitter.com/rSUlLqQzQB
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 7, 2024
08:45 AM, May 8th, 2024
మోదీ, బాబుకు వడ్డే శోభనాద్ధీశ్వర రావు సవాల్
ప్రధాని మోదీ, చంద్రబాబుకి మాజీ మంత్రి వడ్డే శోభనాద్ధీశ్వర రావు సవాల్
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ని రద్దు చేయించగలరా?
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సిఫార్సు చేసింది కేంద్ర ప్రభుత్వమే కదా?.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కి అసెంబ్లీలో పయ్యావుల కేశవ్ మద్దతు పలకలేదా?
టీడీపీ లోపల మద్దతు పలుకుతూ, పైకి మాటల గాంభీర్యం ప్రకటించడం కరెక్టేనా?
ఈటీవీ, అన్నదాతల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనుకూల కథనాలు ప్రసారం చేయడం వాస్తవం కాదా?
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై చంద్రబాబు మోదీని ప్రశ్నించాలి, నిలదీయాలి.
మోదీ విజయవాడ పర్యటనలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయించే హామీని ఇవ్వగలవా చంద్రబాబు?
07:35 AM, May 8th, 2024
టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు: తానేటి వనిత
హోంమంత్రి తానేటి వనిత కామెంట్స్..
టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది.
మహిళ అని చూడకుండా దాడికి ప్రయత్నించారు.
హోంమంత్రి దాడి చేయడమంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా?.
మాకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారు.
07:15 AM, May 8th, 2024
తానేటి వనితపై టీడీపీ నేతల దాడి యత్నం..
- తూర్పుగోదావరిలో రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్
- నల్లజర్లలో టీడీపీ కార్యకర్తల బీభత్సం
- హోంమంత్రి తానేటి వనితపై దాడికి యత్నం.
- అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది.
- హోంమంత్రిని సురక్షితంగా గదిలో ఉంచిన సెక్యూరిటీ.
- వైఎస్సార్‌సీపీ ప్రచార వాహనాన్ని ధ్వంసం చేసిన టీడీపీ కార్యకర్తలు.
- వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణుల మూకుమ్మడి దాడి.
- టీడీపీ శ్రేణుల దాడిలో వైఎస్సార్‌సీపీ నేతలకు తీవ్ర గాయాలు.
- టీడీపీ శ్రేణుల దాడిలో వాహనాలు, ఫర్నీచర్ ధ్వంసం
- సీసీ కెమెరాలో రికార్డయిన టీడీపీ నేతల దాడి దృశ్యాలు.
- నల్లజర్లలో భారీగా పోలీసుల మోహరింపు.
07:00 AM, May 8th, 2024
గాజువాక రోడ్‌షోలో సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
మరో ఆరు రోజుల్లో జరగనున్న కురుక్షేత్ర మహా సంగ్రామం జగన్‌కు ఓటు వేస్తే పథకాల కొనసాగింపు, చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాల ముగింపు, ఇదే చరిత్ర చెప్పే సత్యం
ప్రతి రంగంలోనూ అనూహ్యమైన మార్పులు తీసుకురాగలిగాం, బటన్ నొక్కుతూ నేరుగా లబ్ధి అందజేశాం
గతంలో దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం జరిగింది
13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చడమే కాక ప్రజలకు మరింత దగ్గరయిన ప్రభుత్వం మీ బిడ్డదివిశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేయడమే కాక జూన్ 4 న మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసేది, తర్వాత పాలన కొనసాగించేది విశాఖ నుంచే..
ఈ 59 నెలల్లో మీ బిడ్డ చేసిన అభివృద్ది గమనించండి అని చెబుతున్నా,
చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా గ్రామ స్వరాజ్యానికి అర్ధం చెప్పాడు మీ బిడ్డలంచాలకు, వివక్షకు తావులేకుండా ఇంటివద్దకే పౌరసేవలు, అన్ని పథకాలు, ఇది కాదా అభివృద్ది
ఉద్దానం సమస్యను గతంలో ఎవరైనా పట్టించుకున్నారా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ ప్రతి ఏడాది మొదటి స్ధానమే, మీ బిడ్డ పాలనలో ఏకంగా రూ. లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చాయి
సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ అంటే ఇది కాదా అని అడుగుతున్నా
రాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోవడానికి కూటమిగా ఏర్పడి ప్రయత్నిస్తున్నారు
నాడు నేడు ద్వారా స్కూల్స్, ఆసుపత్రులు రూపురేఖలు మారుతున్నాయి,
ప్రధాని విమర్శలు చూస్తుంటే నాకు ఒకటనిపించింది, మోదీ గారు ఇదే చంద్రబాబు గురించి ఎన్నికల ముందు ఏమన్నారో గుర్తు తెచ్చుకోండి, వెన్నుపోట్లు, అత్యంత అవినీతిపరుడన్న నోటితోనే ఇవాళ
వారితో ఉంటే ఒకలా, లేకపోతే మరోలా మాటమారుస్తున్నారు, రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా*బాబు, దత్తపుత్రుడు, మోదీ గారు కలిసి ఆడుతున్న ఈ డ్రామాలో రాష్ట్ర ప్రజలకు మీ హామీ ఏంటి, ప్రత్యేక హోదా ఇస్తామని జట్టు కట్టారా, స్టీల్ ప్లాంట్ ప్రేవేట్ పరం చేయమని జట్టు కట్టారా అందరూ ఆలోచించండి
మీ జగన్ ఆమోదం లేదు కాబట్టే స్టీల్ ప్లాంట్ ప్రేవేటీకరణ విషయంలో కేంద్రం వెనకడుగు వేసింది, జగన్ ఒప్పుకోలేదు కాబట్టే అది జరగలేదు, ఈ ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపేలా బాబు, దత్తపుత్రుడు బీజేపీ కూటమిని ఓడించి నా తమ్ముడు అమర్‌కు ఓటేసి దేశానికి ఒక గట్టి మెసేజ్ ఇక్కడి నుంచి పంపండి
06:50 AM, May 8th, 2024
నేడు ఏపీలో మోదీ ప్రచారం
నేడు ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం
మధ్యాహ్నం ప్రత్యేక విమానం తిరుమలకు మోదీ
రాజంపేట లోక్‌సభ పరిధిలో కలికిరిలో ఎన్నికల ప్రచారం
సాయంత్రం విజయవాడలో రోడ్ షో
06:40 AM, May 8th, 2024
అప్పుడూ ఇప్పుడూ 'అంతే'
పేదల పొట్ట కొట్టడమే లక్ష్యంగా వికృతరూపం దాల్చిన బాబు పెత్తందారీ పోకడ
వారికి లబ్ధి జరిగేది ఏదైనా అడ్డుకోవడమే ఆయన లక్ష్యం
అప్పట్లో ఇళ్ల స్థలాల పంపిణీ, ఇంగ్లిష్ మీడియం చదువులు అడ్డుకునేందుకు ఎల్లోగ్యాంగ్ చేయని ప్రయత్నంలేదు..
ఇప్పుడు ఎన్నికల కోడ్‌ను అడ్డంపెట్టుకుని ఎప్పటినుంచో కొనసాగుతున్న డీబీటీలకూ అడ్డంకులు
తొలి నుంచీ పేదలకు మేలు జరగకుండా కోర్టులకు వెళ్లి మరీ అడ్డుకున్న బాబు బ్యాచ్‌తాజాగా కోడ్ పేరుతో విద్యా దీవెన, రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, మహిళలకు చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాలను అడ్డుకున్న పచ్చముఠా..
ఐదేళ్లుగా కొనసాగుతున్న పథకాలపైనా కుట్రలు
తెలంగాణలో ఇన్‌పుట్ సబ్సిడీకి ఓకే చెప్పిన ఈసీ.. ఏపీలో మాత్రం నో
06:30 AM, May 8th, 2024
మీడియాతో ఏపీ సీఈవో ఎంకే మీనా
ప్రభుత్వం ఇచ్చే పథకాలనేవీ ఆపమని ఎన్నికల సంఘం చెప్పలేదు
కొంత కాలం తర్వాత ఇవ్వమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది
పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి మరో రోజు గడువు పొడిగింపు
కొన్ని చోట్ల 12-డి ఫారాలు అందడంలో జాప్యం జరిగింది
ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోని ఇవాళ, రేపు ఓటేసుకోవచ్చు
సెక్యూర్టీకి డ్యూటీకి వెళ్లిన వారికి ఈ నెల 9వ తేదీన కూడా అవకాశం
అలాగే సొంత సెగ్మెంట్లల్లోవి ఫెసిలిటేషన్ సెంటర్లల్లో కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకోవచ్చు
వచ్చే నెల మూడో తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ గడువు పొడిగించడం కష్టం
ఇప్పటికే సుమారు 20 రోజుల సమయం ఇచ్చాం
కొన్ని ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు
కొందరు ఓటుకు డబ్బులను డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారు
ఒంగోలులో కొందరు ఉద్యోగులు ఈ ప్రలోభాలకు లోనైనట్టు నిర్థారణకు వచ్చాం
కొందరు వచ్చిన మొత్తాన్ని తిప్పి పంపారు
దీనిపై విచారణ చేపడుతున్నాం
తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం
పోలింగ్ సందర్భంగా అక్రమాలకు పాల్పడిన ఓ పోలీస్ కానిస్టేబులును సస్పెండ్ చేశాం
లీడర్లకు సెక్యూర్టీగా ఉన్న సిబ్బంది.. రేపటి ప్రధాని బందోబస్తులో ఉన్న వాళ్లకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా వెసులుబాట్లు కల్పిస్తున్నాం
పల్నాడులో హోలో గ్రామ్ ద్వారా ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు
పల్నాడు ఎపిసోడ్ పై విచారణ చేపడుతున్నాం
Comments
Please login to add a commentAdd a comment