TDP - BJP alliance
-
దోచుకోవడంలో ‘స్కిల్’ నిజమే
సాక్షి, అమరావతి: ప్రజాధనాన్ని కొల్లగొట్టి అరెస్ట్ అయిన చంద్రబాబుకు సంబంధించిన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా మరోసారి కొరఢా ఝుళిపించింది. ఈ కేసులో ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు చంద్రబాబు ముఠాకు సహకరించిన షెల్ కంపెనీ డిజైన్ టెక్ ఎండీ వికాస్ వినాయక్ కన్విల్కర్, సీమెన్స్ కంపెనీ అప్పటి ఎండీ సుమన్ బోస్‌కు చెందిన రూ.23.54 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను అటాచ్ చేసింది. ఢిల్లీ, ముంబయి, పూణేల్లోని స్థిరాస్తులతోపాటు వారి పేరిట ఉన్న షేర్లు, బ్యాంకు ఖాతాల్లోని నిధులను అటాచ్ చేసినట్టు ఈడీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇదే కేసులో గతంలో డిజైన్ టెక్కు చెందిన రూ.31.20 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో మొత్తంగా రూ.54.74 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లయింది. తద్వారా 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం బరితెగించి సాగించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం మరోసారి చర్చనీయాంశంగా మారింది. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అవినీతికి పాల్పడినట్టు మరోసారి జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సిట్ చంద్రబాబును అరెస్ట్ చేయడం రాజకీయ కక్ష సాధింపు చర్య కాదన్నది స్పష్టమైంది. ఎందుకంటే కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ కూడా టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగినట్టు.. షెల్ కంపెనీల ద్వారా నిధులు అక్రమంగా తరలించినట్టు ఆధారాలతో సహా నిర్ధారించి కఠిన చర్యలను వేగవంతం చేయడమే అందుకు నిదర్శమని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో ఈడీ దూకుడు పెంచడంతో ‘స్కిల్’ క్రిమినల్స్‌లో గుబులు మొదలైంది.గత ఏడాది డిజైన్ టెక్ సిస్టమ్స్ ఎండీ, సీమెన్స్ ఎండీలను అరెస్టు చేసినట్లు ఈడీ చేసిన ట్వీట్ ప్రజాధనం కొల్లగొట్టడమే లక్ష్యంగా అడుగులు⇒ 2014లో అధికారంలోకి రాగానే ప్రజాధనాన్ని కొల్లగొట్టడమే చంద్రబాబు లక్ష్యంగా చేసుకున్నారు. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరిట ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్‌ను తెరపైకి తెచ్చారు. భారత్‌లో ఆ కంపెనీ ఎండీగా ఉన్న సుమన్ బోస్, డిజైన్ టెక్ ఎండీ వికాస్ వినాయక్ కన్విల్కర్ సహకారంతో చంద్రబాబు అక్రమాలకు తెర తీశారు. ఏపీఎస్ఎస్డీసీ ద్వారా డిజైన్ టెక్ కంపెనీకి డబ్బు ఇచ్చేందుకు 2016లో సీఎంగా చంద్రబాబు చేసిన డిజిటల్ సంతకం ⇒ కేబినెట్ ఆమోదం లేకుండానే చంద్రబాబు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎస్ఎస్డీసీ) ఏర్పాటు చేసి, అనంతరం ఏపీఎస్ఎస్డీసీతో సీమెన్స్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నట్టు మభ్యపుచ్చారు. సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, ఇతర అంశాలకు సంబంధించిన ఇన్వాయిస్లు, ప్రాథమిక నివేదిక ప్రకారం రూ.370 కోట్లు మాత్రమే ఉన్న ప్రాజెక్ట్ విలువను అమాంతం రూ.3,300 కోట్లకు పెంచేశారు. ⇒ ప్రభుత్వం పది శాతం నిధులు సమకూరిస్తే సీమెన్స్, డిజైన్ టెక్ 90 శాతం నిధులు పెట్టుబడి పెట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు 2015 జూన్ 30న ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం సీమెన్స్–డిజైన్ టెక్ కంపెనీలు ప్రాజెక్ట్ వ్యయంలో 90 శాతాన్ని గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా సమకూరుస్తాయంటూ త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నారు. ⇒ ప్రాజెక్టు వ్యయంగా చెప్పుకున్న రూ.3,300 కోట్లలో 90 శాతం కాదు కదా కనీసం ఒక్క రూపాయి విలువైన ఆర్ధిక సహకారంగానీ, వస్తు సహాయాన్ని గానీ అందించ లేదు. కానీ ఏపీఎస్ఎస్డీసీ తన 10 శాతం వాటాను జీఎస్టీతో కలిపి రూ.371 కోట్లు డిజైన్ టెక్ కంపెనీకి చెల్లించేసింది. దీనిపై అప్పటి ఆర్ధిక శాఖ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ మరీ నిధులు విడుదల చేయాలని సీఎం హోదాలో చంద్రబాబు ఆదేశించారు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా ఏపీఎస్ఎస్డీసీ ద్వారా డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లు మంజూరు చేశారు. ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ నిధులు కొల్లగొట్టేందుకుగాను చంద్రబాబు ఏకంగా మొత్తం 13 నోట్ ఫైళ్లలో సంతకాలు చేశారు. ⇒ డిజైన్ టెక్కు చెల్లించిన రూ.371 కోట్లలో సాఫ్ట్వేర్ కొనుగోలు కోసం రూ.56 కోట్లు చెల్లించారు. మిగతా రూ.315 కోట్లను షెల్ కంపెనీల ద్వారా బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి వివిధ దశల్లో అక్రమంగా తరలించారు. షెల్ కంపెనీల సృష్టికర్తలు, దళారుల కమీషన్లు పోనూ రూ.241 కోట్లు హవాలా మార్గంలో హైదరాబాద్‌లోని చంద్రబాబు బంగ్లాకు తరలించారు.కడిగిపారేసిన కాగ్రాజ్యాంగబద్ధ సంస్థ కాగ్ కూడా చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నిర్ధారించింది. ఆ ప్రాజెక్టులో రూ.355 కోట్ల మేర ఖజానాకు గండి పడిందని నిగ్గు తేల్చింది. వాస్తవ లెక్కల ప్రకారం ప్రాజెక్ట్ విలువను రూ.370 కోట్లుగా చూపించి ఉంటే ప్రభుత్వం తన వాటాగా రూ.33 కోట్లు మాత్రమే విడుదల చేయాలి. అయితే అంచనాలను అమాంతం పెంచేసి రూ.3,300 కోట్లుగా చూపించి ప్రభుత్వ వాటా 10 శాతంతోపాటు జీఎస్టీ, ఇతర అంశాలను కలిపి ఏకంగా రూ.371 కోట్లు విడుదల చేశారు. రూ.333 కోట్లు కొల్లగొట్టారు. ప్రాజెక్టు మొదలు కాకుండానే నిధులు విడుదల చేయడంతో ప్రభుత్వం రూ.22 కోట్లు వడ్డీ రూపంలో రావాల్సిన ఆదాయాన్ని కోల్పోయింది. వెరసి ప్రభుత్వ ఖజానాకు రూ.355 కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ తెలిపింది.ఏ–1గా తేలడంతో బాబు అరెస్ట్⇒ 2018లోనే కేంద్ర జీఎస్టీ అధికారులు షెల్ కంపెనీల్లో నిర్వహించిన తనిఖీల్లో ఈ వ్యవహారం బయట పడింది. దీనిపై అప్పట్లోనే జీఎస్టీ అధికారులు రాష్టఏసీబీకి సమాచారం ఇచ్చారు. కానీ చంద్రబాబు ఒత్తిడితో ఆ అంశాన్ని తొక్కిపెట్టారు. ఆ వెంటనే ఏపీఎస్ఎస్డీసీ ఆఫీసులో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫైళ్లను మాయం చేశారు. ⇒ 2019లో పూణెకు చెందిన ఓ సామాజిక కార్యకర్త ఈ కుంభకోణం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. దీంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్కిల్ స్కామ్‌పై విచారణకు సీఐడీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించింది. సిట్ దర్యాప్తులో చంద్రబాబు అవినీతి బాగోతం అంతా బట్టబయలైంది. ఈ కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ అంతా చంద్రబాబే అన్నది నిర్ధారణ అయింది. ఈ కేసు విచారణ కోసం చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, షెల్ కంపెనీల ప్రతినిధి మనోజ్ పార్థసానిలకు సిట్ నోటీసులు జారీ చేయగానే వారిద్దరూ విదేశాలకు పరారయ్యారు. దాంతో ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేస్తున్నారని భావించి ఆయన్ను గత ఏడాది సెపె్టంబర్ 9న అరెస్ట్ చేసింది. ఈ కేసులో చంద్రబాబును ఏ–1గా పేర్కొంటూ ఆయనతోపాటు 9 మంది నిందితులను అరెస్ట్ చేసినట్టైంది. ⇒ సిట్ రిమాండ్ రిపోర్ట్‌తో ఏకీభవించిన విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం చంద్రబాబుకు రిమాండ్ విధించింది. దాంతో చంద్రబాబు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 52 రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉన్న అనంతరం బెయిల్‌పై విడుదల అయ్యారు.పరికరాలు సరఫరా చేయకుండానే చేసినట్టుగా..యువతకు ఉపాధి నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తామనే ప్రాజెక్ట్ పేరిట నిధులు కొల్లగొట్టినట్టు తమ దర్యాప్తులో వెల్లడైందని ఈడీ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టంగా వెల్లడించింది. ఈడీ తెలిపిన వివరాల ప్రకారం.. సీమెన్స్ కంపెనీకి అప్పటి ఎండీ సుమన్ బోస్, డిజైన్ టెక్ కంపెనీ ఎండీ వికాస్ వినాయక్ కన్విల్కర్ తమ సన్నిహితులు ముకుల్ చంద్ర అగర్వాల్ (స్కిల్లర్ కంపెనీ ప్రతినిధి), సురేశ్ గోయల్ (చార్టెడ్ అకౌంటెంట్) ద్వారా ప్రజాధనాన్ని అక్రమంగా దారి మళ్లించారు. ఏపీ ప్రభుత్వానికి ఎటువంటి పరికరాలు సరఫరా చేయకుండానే చేసినట్టుగా బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి నిధులు విడుదల చేశారు. ఆ నిధులను షెల్ కంపెనీల బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించి, ఏయే బ్యాంకు ఖాతాల నుంచి సింగపూర్‌కు తరలించారు.. తిరిగి ఆ నిధులు దేశంలోని ఏయే ఖాతాలకు వచ్చాయన్న విషయాన్ని ఈడీ గుర్తించింది. ఇప్పటికే రూ.70 కోట్లు హవాలా మార్గంలో తరలించినట్టు నిర్ధారించింది. చంద్రబాబుకు సన్నిహితులు, ఆ కుంభకోణంతో ప్రమేయమున్న షెల్ కంపెనీల ప్రతినిధులు మొత్తం 26 మందికి నోటీసులు జారీ చేసి పలువురిని విచారించింది. ఈ కేసులో నిందితులు సుమన్ బోస్, వికాస్ ఖన్విల్కర్, ముకుల్‌చంద్ర అగర్వాల్, సురేశ్ గోయల్‌లను అరెస్టు చేయడంతోపాటు విశాఖపట్నంలోని పీఎంఎల్ఏ న్యాయస్థానంలో చార్జ్‌షీట్ దాఖలు చేసింది.ఇక టీడీపీ ప్రభుత్వ పెద్దల పాత్రపై ఈడీ కన్నుస్కిల్ స్కాం కేసులో ప్రధాన నిందితుడి (ఏ1)గా చంద్రబాబును పేర్కొంటూ న్యాయస్థానంలో దాఖలు చేసిన చార్జ్‌షీట్ కాపీని సిట్ ఈ ఏడాది మార్చిలోనే ఈడీకి పంపింది. ఇప్పటికే షెల్ కంపెనీ అక్రమాలను వెలికి తీసి, కఠిన చర్యలు చేపట్టిన ఈడీ.. ఈ కుంభకోణం సూత్రధారులు, అంతిమ లబ్ధిదారులు అయిన టీడీపీ ప్రభుత్వ పెద్దల పాత్రపై దర్యాఫ్తు వేగవంతం చేస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. దాంతో ఫేక్ న్యూస్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చినట్టు ప్రచారం చేస్తున్నారు. అయితే ఈడీ మంగళవారం జారీ చేసిన అధికారిక ప్రకటనలో చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చినట్టు ప్రకటించ లేదు. షెల్ కంపెనీల ప్రతినిధులపై తీసుకున్న చర్యలను తెలిపింది. సీబీఐకి అప్పగించాలి రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో గతంలో చంద్రబాబుపై సిట్ నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న కేసులను సీబీఐకి అప్పగించాలని కోరుతూ సామాజిక కార్యకర్త తిలక్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుల్లో ప్రధాన నిందితుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉండటంతో సిట్ దర్యాప్తు పారదర్శకంగా సాగదని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. కాబట్టి సీబీఐకి అప్పగించాలని కోరారు. ఈ పిటిషన్ న్యాయస్థానంలో విచారణలో ఉంది. -
కేంద్రానికి టీడీపీ మద్దతు ఉపసంహరించుకోవాలి: ఎంపీ గొల్లబాబురావు
సాక్షి,విశాఖపట్నం: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామని హామీ ఇచ్చిన విషయాన్ని వైఎస్ఆర్సీపీ ఎంపీ గొల్లబాబురావు గుర్తు చేశారు. ఈ విషయమై ఆయన మంగళవారం (సెప్టెంబర్ 16) మీడియాతో మాట్లాడారు. ‘ఇచ్చిన మాటను పవన్, బీజేపీ నేతలు చంద్రబాబు నిలబెట్టుకోవాలి. పార్లమెంట్లో నేను అడిగిన ప్రశ్నకు సమాధానంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదని చెప్పారు.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వైఖరి స్పష్టం చేయాలి. టీడీపీ నేతల రాజీనామాలతో ఎటువంటి ప్రయోజనం లేదు.కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు ఒత్తిడి తేవాలి. లేదా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే లక్షలాదిమంది రోడ్డున పడతారు’అని బాబురావు అన్నారు. ఇదీ చదవండి.. తిరుమలలో మంత్రి ఆనంను నిలదీసిన భక్తులు -
బిల్లుపై బాదుడు
సాక్షి, అమరావతి: ప్రతి నెలా మనం వాడుకున్న విద్యుత్‌కు తగ్గట్టు బిల్లు రావడం సహజం. కానీ ఇప్పుడు బిల్లు పైనే చార్జీలు పడటం వినియోగదారులను షాక్‌కు గురి చేస్తోంది. బిల్లుపై మళ్లీ బిల్లు ఏమిటని ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వేళ విద్యుత్తు వినియోగదారులపై ప్రతి నెలా దాదాపు రూ.30 కోట్ల వరకూ ఆర్ధిక భారం పడింది! అది కూడా విద్యుత్ చార్జీ లపై వేసే చార్జీ కావడం విశేషం. అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచబో మని ఉమ్మడి మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన చంద్రబాబు మాట నిలబెట్టుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.ఇదీ సంగతి...!ఇప్పుడు నెలవారీ విద్యుత్ బిల్లు చెల్లించేందుకు వివిధ రకాల యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. చివరి రోజైనా సరే ఇంటి నుంచే క్షణాల్లో కట్టవచ్చు. ప్రతి నెలా బిల్లు చెల్లించాల్సిన తేదీతో సహా మెసేజ్ రూపంలో యాప్‌లు గుర్తు చేస్తుంటాయి. పని ఒత్తిడిలో మర్చిపోకుండా ఆటో పే ఆప్షన్ కూడా ఉంది. అయితే ఇకపై థర్డ్ పార్టీ యాప్‌లతో విద్యుత్ బిల్లులు చెల్లించడం సాధ్యం కాదు. డిస్కమ్‌ల వెబ్సైట్, వాటి మొబైల్ యాప్‌లోనే విద్యుత్తు బిల్లుల చెల్లింపులు చేయాలి. ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి జూలై 1 నుంచి ఈ నిబంధన అమలులోకి వచ్చిందని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్స్) వెల్లడించాయి.చెల్లింపులపై చార్జీలు ఎలా అంటే..నూతన విధానాల ప్రకారం వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి సంబంధిత డిస్కమ్‌ల యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని విద్యుత్తు బిల్లులు చెల్లించవచ్చు. ఏపీసీపీడీసీఎల్ వినియోగదారులు www.apcpdcl.in ద్వారా, ఈపీడీసీఎల్ వినియోగదారులు www. apeasternpower. com ద్వారా, ఎస్పీడీసీఎల్ వినియోగదారులు www.apspdcl.in వెబ్సైట్ ద్వారా కూడా బిల్లులు కట్టవచ్చు. అయితే ఇక్కడే ఓ మెలిక ఉంది. నెట్ బ్యాంకింగ్ ద్వారా కరెంట్ బిల్లు చెల్లిస్తే ప్రతి లావాదేవీకి రూ.2.50 చొప్పున చార్జీ పడుతుంది. భారత్ క్యూఆర్ ద్వారా కడితే బిల్లు మొత్తంపై 0.85 పైసలు చార్జీ పడుతుంది. డెబిట్ కార్డులు ద్వారా కడితే బిల్లు మొత్తం అమౌంట్లో 0.90 శాతం అదనంగా చెల్లించాలి. క్రెడిట్ కార్డులు, ఇతర పేమెంట్ పద్ధతుల ద్వారా బిల్లు చెల్లించాలంటే 1 శాతం అదనంగా పడుతుంది. ఉదాహరణకు రూ.5 వేలు విద్యుత్తు బిల్లు కట్టాలంటే రూ.50 అదనంగా సమర్పించుకోవాలి. ఇలా రాష్ట్రంలోని దాదాపు 1.92 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులు ప్రతి నెలా చెల్లించే దాదాపు రూ.3 వేల కోట్ల విద్యుత్ బిల్లులపై 1 శాతం అదనంగా వేసుకుంటే రూ.30 కోట్లు భారం పడుతుంది. కాగా ఫోన్‌పే, పేటీఎం లాంటి యూపీఐ యాప్‌ల ద్వారా ఇన్నాళ్లూ ఫ్లాట్ ఫామ్ చార్జీ కింద బిల్లుకు కేవలం రూ.1 మాత్రమే వసూలు చేయడం గమనార్హం.నిర్లక్ష్యంగా డిస్కమ్‌లు...తాజాగా విద్యుత్తు బిల్లుల చెల్లింపులన్నీ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్) ద్వారానే జరగాలని ఆర్బీఐ నిర్దేశించింది. అయితే ప్రధాన ప్రైవేట్ బ్యాంకులు ఈ బిల్ పేమెంట్ సిస్టమ్‌ను ఎనేబుల్ చేసుకోలేదు. దీంతో డిస్కమ్‌లు తమ వెబ్సైట్, యాప్‌లో చెల్లించమని సూచించడం మినహా అదనపు భారం నుంచి ఊరట కల్పించే నిర్ణయాలు తీసుకోలేదు. కనీసం ప్రజల్లో అవగాహన కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బిల్లుల చెల్లింపులపై గందరగోళం నెలకొంది. బిల్లు కట్టడం ఆలస్యమైతే విద్యుత్ సర్వీసులను నిలిపివేయడం, లేట్ పేమెంట్ చార్జీలు విధించటం లాంటి చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో విస్తృతంగా ప్రచారం చేపట్టాల్సిన విద్యుత్తు సంస్థలు ఉదాశీనంగా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.టీడీపీ అంటే షాకులే..76 యూనిట్లు విద్యుత్ వినియోగానికి 2015–16లో టీడీపీ హయాంలో రూ.140.10 బిల్లు రాగా 2018–19లో రూ.197.60 వచ్చింది. అంటే బిల్లు 41.04 శాతం పెరిగింది. నాడు 78 యూనిట్లకు 39.57 శాతం, 80 యూనిట్లకు 38.21 శాతం పెంచేశారు. వైఎస్సార్సీపీ హయాంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే 100 యూనిట్లలోపు విద్యుత్ వినియోగంపై చార్జీలు ఏపీలోనే తక్కువగా ఉండేవి. ఇతర చోట్ల యూనిట్ రూ.8.26 వరకూ ఉంటే ఏపీలో రూ.3.11 చార్జీ పడేది. 75 యూనిట్ల వరకు వినియోగానికి టారిఫ్ సగటు సరఫరా వ్యయంలో 50 శాతం కంటే తక్కువే విధించారు. వ్యవసాయానికి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ (సెకీ) ద్వారా 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను సగటు కొనుగోలు ధర యూనిట్ రూ.5.10 చొప్పున ఉన్నప్పటికీ గత ప్రభుత్వం రూ.2.49కే సేకరించేలా చర్యలు తీసుకుంది. దీంతో ఏటా దాదాపు రూ.3,750 కోట్లు ఆదా కానుంది. 2021లో విద్యుత్ కొనుగోళ్లలో రూ.4,925 కోట్లు ఆదా కాగా ఇందులో రూ.3,373 కోట్లను వినియోగదారులకే తిరిగి ఇచ్చేశారు. -
కుర్చీలపై కన్ను!
సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 12వ తేదీన నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో మంత్రి పదవులు ఎవరిని వరిస్తాయనే అంశంపై పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నాయి. టీడీపీ నుంచి 135 మంది ఎమ్మెల్యేలుగా గెలిచినందున ఆశావహుల సంఖ్య భారీగా ఉంది.అయితే మొత్తం 24 మంత్రి పదవులే ఇచ్చే అవకాశం ఉన్నందున అందులోనే మూడు పార్టీలకు సర్దుబాటు చేయడం కత్తిమీద సాములా మారింది. జనసేనకు కనీసం ఐదు మంత్రి పదవులు దక్కుతాయనే ప్రచారం జరుగుతుండగా బీజేపీకి రెండు పదవులు ఇచ్చే అవశాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ రెండు పార్టీలకూ ఇవ్వగా మిగిలిన మంత్రి పదవులను టీడీపీ సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. అచ్చెన్నా..! రామ్మోహనా!ఉమ్మడి శ్రీకాకుళం నుంచి టీడీపీ సీనియర్ నేత, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి మంత్రివర్గంలో బెర్త్ ఖాయమనే ప్రచారం జరుగుతోంది. అయితే కేంద్ర మంత్రివర్గంలో ఆయన సోదరుడి కుమారుడు రామ్మోహన్ నాయుడికి అవకాశం దక్కితే మాత్రం అచ్చెన్నాయుడికి ఛాన్స్ ఉండకపోవచ్చనే వాదన వినిపిస్తోంది. ఒక కుటుంబంలో ఒకరికే పదవి ఇచ్చే యోచన ఉంటే వీరిలో ఒకరికే అవకాశం లభించవచ్చు. అదే జిల్లా నుంచి కూన రవికుమార్, కొండ్రు మురళీమోహన్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. విజయనగరం జిల్లా నుంచి గెలిచిన కళా వెంకట్రావు, అదితి గజపతిరాజు పేర్లు సైతం పరిశీలనలో ఉన్నాయి.విశాఖ జిల్లాలో ఈసారి గంటా శ్రీనివాసరావుకు మంత్రి పదవి దక్కకపోవచ్చని చెబుతున్నారు. చింతకాయల అయ్యన్న పాత్రుడికి కచ్చితంగా మంత్రి పదవి ఇస్తారని.. మహిళ, ఎస్సీ కోటాలో వంగలపూడి అనితకు అవకాశం లభిస్తుందనే చర్చ నడుస్తోంది. ఉమ్మడి తూర్పు గోదావరి నుంచి జ్యోతుల నెహ్రూ, నిమ్మకాయల చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలో ఒకరిని మంత్రివర్గంలోకి తీసుకునే వీలుందని చెబుతున్నారు. సీనియర్ల అవసరం ఉందని భావిస్తే యనమల రామకృష్ణుడిని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చని భావిస్తున్నారు. ఆయన కుమార్తె దివ్య తుని నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా యనమలకు తగిన ప్రాధాన్యం ఉంటుందని భావిస్తున్నారు.నిమ్మలకు పక్కాఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నిమ్మల రామానాయుడికి మంత్రివర్గంలో పక్కాగా చోటు దక్కుతుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. క్లిష్ట సమయంలో పార్టీ కోసం చురుగ్గా పని చేసి చంద్రబాబు, లోకేశ్‌కి దగ్గరవడంతో ఆయనకు అవకాశం కచ్చితంగా లభిస్తుందని చెబుతున్నారు. బీసీ కోటాలో పితాని సత్యనారాయణ పేరు బలంగా వినిపిస్తోంది. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుకి మంత్రి పదవిపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. ఆయన మంత్రిగా పని చేయరని పార్టీలో కొందరు చెబుతుండగా, ఇస్తే తీసుకుంటారని మరి కొందరు వాదిస్తున్నారు.చింతమనేని ప్రభాకర్ పేరు కూడా రేసులో వినిపిస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి కొల్లు రవీంద్ర ఖాయంగా మంత్రి అవుతారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. బీసీ నేతగా పని చేసిన అనుభవం, ప్రతిపక్షంలోనూ చురుగ్గా వ్యవహరించడంతో ఆయనకు అవకాశం ఖాయమని భావిస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ప్రత్తిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావు, ధూళిపాళ్ల నరేంద్ర, కన్నా లక్ష్మీనారాయణ, రామాంజనేయులు, నక్కా ఆనంద్‌బాబు పేర్లు సైతం వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరికి అవకాశం లభించవచ్చని చెబుతున్నారు.నారాయణకు మళ్లీ ఛాన్స్ ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, డి. బాలవీరాంజనేయస్వామిలో ఒకరికి మంత్రి పదవి దక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నెల్లూరు జిల్లా నుంచి గెలిచిన వారిలో పి.నారాయణ గ్యారంటీగా మంత్రి అయ్యే ఛాన్స్ ఉంది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయనతోపాటే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని సమాచారం. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పేర్లు కూడా చంద్రబాబు పరిశీలనలో ఉన్నాయి.చిత్తూరు జిల్లా నుంచి అమర్నాథ్రెడ్డి, పులివర్తి నానిలో ఒకరిని మంత్రిగా చేస్తారని చెబుతున్నారు. కడప జిల్లా నుంచి రెడ్డప్పగారి మాధవి, వరదరాజులరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. కర్నూలు జిల్లా నుంచి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి మంత్రి అవుతారని చెబుతున్నారు. అనంతపురం జిల్లా నుంచి గెలిచిన వారిలో పయ్యావుల కేశవ్, పరిటాల సునీతలో ఒకరికి ఛాన్స్ దక్కవచ్చు. కాల్వ శ్రీనివాసుల పేరు కూడా పరిశీలనలో ఉంది.పవన్‌కు పదవిపై అస్పష్టతే..జనసేన నుంచి గెలిచిన 21 మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురికి మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్‌కి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే విషయంపై స్పష్టత రాలేదు. నాదెండ్ల మనోహర్ మంత్రివర్గంలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. కొణతాల రామకృష్ణ, పంతం నానాజీ, కందుల దుర్గేష్, పులపర్తి రామాంజనేయులు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.బీజేపీ కోటాలో సుజనాబీజేపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడైన సుజనా చౌదరికి మంత్రివర్గంలో చోటు పక్కాగా ఉంటుందని చెబుతున్నారు. కామినేని శ్రీనివాస్ పేరు కూడా వినిపిస్తున్నా ఎంత వరకు అవకాశం దక్కుతుందనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుజనా చౌదరి పోటీలో ఉన్నందున ఆయనకు అవకాశాలు సన్నగిల్లాయి. సత్యకుమార్, విష్ణుకుమార్రాజులో ఒకరిని మంత్రి పదవి వరించే అవకాశం ఉందని చెబుతున్నారు. -
మళ్లీ వైఎస్సార్సీపీదే విజయం
సాక్షి, నరసరావుపేట : ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్సీపీ మరోసారి అధికారంలోకి రానుందని ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థ ఆరా సృష్టం చేసింది. ఆ సంస్థ ఎండీ షేక్ మస్తాన్ శనివారం తన స్వగ్రామం పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం మద్దిరాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల అంచనాలను వెల్లడించారు.ఆంధ్రప్రదేశ్‌లో 49.41 శాతం ఓట్లతో వైఎస్సార్సీపీ 94–104 ఎమ్మెల్యే స్థానాలు గెలుపొందే అవకాశం ఉందన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి 47.55 శాతం ఓటు షేర్‌తో 71–81ఎమ్మెల్యే స్థానాలు పొంది ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సహా ఇతర పార్టీలకు ఒక్క స్థానం కూడా వచ్చే అవకాశం లేదన్నారు. ఇతరులకు 3 శాతం ఓట్లు పడవచ్చన్నారు. లోక్‌సభ ఫలితాలలో వైఎస్సార్సీపీ 13–15 ఎంపీ స్థానాలు, టీడీపీ కూటమి 10–12 స్థానాలు పొందే అవకాశం ఉందన్నారు. ఆరా మస్తాన్ ఇంకా ఏం చెప్పారంటే.. షర్మిలకు కనీసం డిపాజిట్ దక్కదు కడప ఎంపీగా పోటీ చేసిన పీసీసీ ప్రెసిడెంట్ షర్మిల ఓడిపోవడంతోపాటు కనీసం డిపాజిట్ కూడా దక్కదు. కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చడం ద్వారా వైఎస్సార్సీపీ 3 ఎంపీ స్థానాలను కోల్పోతుంది. మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజంపేట ఎంపీ స్థానంలో ఓడిపోతున్నారు. బీజేపీ, జనసేనతో పొత్తు వల్ల టీడీపీకి గతంలో కంటే కొంత ఓటు శాతం పెరిగినప్పటికీ అధికారం మాత్రం దక్కడం లేదు. తెలంగాణలో బీజేపీకే ఎక్కువ ఎంపీలు తెలంగాణ లోక్‌సభ ఫలితాల్లో బీజేపీకి 8–9 ఎంపీ స్థానాలు, కాంగ్రెస్‌కు 7–8 ఎంపీలు, ఎంఐఎంకు ఒక్క స్థానం దక్కే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో రెండో స్థానం పొందిన బీఆర్ఎస్కు ఒక్క స్థానం కూడా దక్కే అవకాశం లేదు. కాంగ్రెస్‌కు 38.43 శాతం, బీజేపీకి 36.65 శాతం, బీఆర్ఎస్కు 18.99 శాతం ఓట్లు నమోదవుతాయి. మా సర్వే ఫలితాలు వంద శాతం నిజం కావాలని కోరుకుంటున్నా. గతంలో మా అంచనా ఫలితాలు నిజమయ్యాయి.ఈసారి కూడా అదే జరగనుంది. పార్టీల ప్రలోభాలు, ఒత్తిళ్లకు లోను కాకుండా వృత్తిని వృత్తిగా భావించి ఫలితాలను వెల్లడించాను. వైఎస్సార్సీపీ అభ్యర్థులను మార్చడం కొన్ని చోట్ల మేలు చేసింది. పేదలు–పెత్తందార్ల మధ్య యుద్ధం అన్న జగన్ మాటలు పని చేశాయి. బీజేపీతో పొత్తు వల్ల ఓట్ల పరంగా నష్టపోయినా, పోల్ మేనేజ్మెంట్ పరంగా టీడీపీకి ఉపయోగపడింది. 4 శాతం ముస్లిం రిజర్వేషన్ల రద్దు అంశం కూటమికి ఇబ్బందిగా మారింది.వైఎస్సార్సీపీ వైపు మహిళలు, గ్రామీణ ఓటర్లుముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పాలన వైపు మహిళలు, గ్రామీణులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మొగ్గు చూపినట్టు మా సర్వేలో తేలింది. కరోనా వల్ల కొంత సమయం వృథా అయినా, పాలనలో నూతన విధానాలు, వలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల చెంతకు పాలన తేవడంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం 71 శాతానికి పైగా ఉన్న గ్రామీణ ఓటర్ల అభిమానాన్ని పొందింది. పింఛన్‌దారులు సంతోషంగా ఉన్నారు. మహిళల ఖాతాల్లో ప్రతి రెండు మూడు నెలలకు ఏదో ఓ పథకం ద్వారా ఆర్థిక వెసులుబాటు కలి్పంచడంతో రాష్ట్రంలో 56 శాతం మహిళలు వైఎస్సార్సీపీకి ఓటు వేశారు.కూటమికి మహిళలు కేవలం 42 శాతం మాత్రమే మద్దతిచ్చారు. పురుషులు కూటమికి 51.56 శాతం, వైఎస్సార్సీపీకి 45.53 శాతం ఓటు వేశారు. మహిళలు పురుషుల కన్నా సుమారు 4.7 లక్షల మంది అధికంగా ఓటు వేయడం, అందులోనూ 56 శాతం మంది వైఎస్సార్సీపీకి మద్దతు ఇవ్వడంతో మరోసారి అధికారం నిలబెట్టుకుంటోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు వైఎస్సార్సీపీకి అండగా నిలవడంతో 2019లో వచ్చిన ఓటు శాతాన్ని వైఎస్ జగన్ నిలుపుకున్నారు. -
పీకేవన్నీ తప్పుడు అంచనాలే
సాక్షి, అమరావతి: ఎన్నికల ఫలితాలపై ప్రశాంత్ కిశోర్(పీకే) అంచనా తప్పుతోంది. దానిని కప్పిపుచ్చుకునేందుకు ‘ది వైర్’ వెబ్సైట్, చానల్ కోసం ప్రఖ్యాత జర్నలిస్టు కరణ్‌థాపర్ చేసిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టాయి. హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీకి 2022 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని.. తెలంగాణ అసెంబ్లీకి 2023 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని అప్పట్లో పీకే జోస్యం చెప్పారు. అయితే హిమాచల్‌ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చింది. ఇదే అంశాన్ని కరణ్‌థాపర్ ఎత్తిచూపుతూ.. సార్వత్రిక ఎన్నికల్లో 300కు పైగా లోక్‌సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ఏ ప్రాతిపదికన చెబుతున్నారని నిలదీశారు. దీనిపై పీకే స్పందిస్తూ తాను హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్, తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పలేదని బుకాయించారు. కానీ అప్పట్లో పీకే చెప్పిన జోస్యంపై జాతీయ మీడియా సంస్థలు ప్రచురించిన వార్తల క్లిప్పింగ్‌లను కరణ్‌థాపర్ చూపడంతో ఆయన తెల్లబోయారు. పత్రికల్లో వచ్చే వార్తలకు విశ్వసనీయత ఉండదంటూ తప్పించుకునేందుకు యత్నించగా... ఇదే అంశంపై అప్పట్లో పీకే స్వయంగా చేసిన ట్వీట్లను ఎత్తిచూపారు. దీంతో అడ్డంగా దొరికిపోయిన పీకే ఉక్రోషంతో ఊగిపోయారు. మీరు జర్నలిస్టే కాదంటూ కరణ్‌థాపర్‌పై విరుచుకుపడ్డారు. బిహార్‌లో రాజకీయాలు కలసి రాకే... పశ్చిమ బంగా ఎన్నికల తర్వాత ఇక ఎన్నికల వ్యూహకర్తగా పని చేయబోనంటూ ప్రతిజ్ఞ చేసిన పీకే ఐప్యాక్ నుంచి తప్పుకున్నారు. బిహార్‌లో రాజకీయ అరంగేట్రం చేశారు. తొలుత బిహార్ సీఎం నితీష్‌కుమార్ పంచన చేరి జేడీ(యూ) కీలక నేతగా చలామణి అయ్యారు. కొన్నాళ్లకు ఆయనతో విభేదించి సొంత పార్టీ స్థాపించి బిహార్‌లో పాదయాత్ర చేశారు. దానివల్ల ఏమాత్రం ప్రయోజనం లేకపోవడంతో రాజకీయంగా ఇక మనుగడ సాగించలేమని తెలిసి డబ్బుల కోసం ఎవరు ప్యాకేజీ ఇస్తే వారికి అనుకూలంగా జోస్యం చెప్పడం అలవాటు చేసుకున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు పంచన చేరి ఆ పార్టీకి అనుకూలంగా జోస్యం చెబుతూ వస్తున్నారు. ఏపీలోనూ ఆయన అంచనాలు తారుమారే గతేడాది చివర్లో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం శాసనసభల ఎన్నికల్లోనూ పీకే జోస్యాలు చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందని ఆయన చెబితే కాంగ్రెస్ గెలిచింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ గెలుస్తుందని చెబితే ఆ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికార పీఠం అధిష్టించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోనూ పీకే జోస్యం తప్పడం ఖాయమని, గత ఎన్నికల్లో టీడీపీ తరఫున వకాల్తా పుచ్చుకున్న లగడపాటి మాదిరిగానే ప్రశాంత్ కిశోర్ కూడా ఫలితాలు వెలువడ్డాక మాయం కావడం తథ్యమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బాబు పలుకులే చెబుతూ..ప్రశాంత్‌కిశోర్ ప్రస్తుతం ఏ పార్టీకీ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయడం లేదన్న మాటల్లో ఎంతమాత్రం నిజం లేదని పశ్చిమ బంగా సీఎం మమతా బెనర్జీ ఏప్రిల్ 12న ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టారు. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ–బీజేపీ కూటమికి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నారనీ, అందుకే ఏపీలో చంద్రబాబుకు, పశ్చిమ బంగాలో బీజేపీకి అనుకూలంగా జోస్యం చెబుతున్నారని ఆమె స్పష్టం చేశారు. దీనిని బట్టి చంద్రబాబు విసిరిన ప్యాకేజీ తీసుకుని టీడీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పీకే పనిచేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అందుకే ఆయన బాబే గెలుస్తారంటూ అవకాశం వచ్చినప్పుడల్లా చెబుతున్నట్టు తేటతెల్లమైంది. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్టుతో భయపడిన నారా లోకేశ్ ఢిల్లీలో తలదాచుకున్న సమయంలో పీకేను కలిశారు. తమకు ఎన్నికల వ్యూహకర్తగా పని చేయాలని వేడుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు బెయిల్‌పై విడుదలయ్యాక పీకేను ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు, అక్కడి నుంచి విజయవాడకు సీఎం రమేష్ స్పెషల్ ఫ్లైట్‌లో తీసుకొచ్చారు. ఉండవల్లిలో చంద్రబాబుతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమయంలోనూ తాను ఏ పార్టీకీ వ్యూహకర్తగా పని చేయడం లేదని పీకే చెప్పిన విషయం అబద్ధమని తరువాత అందరికీ తెలిసిందే. -
May 20th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
May 20th AP Elections 2024 News Political Updates9:01 PM, May 20th, 2024తూర్పు గోదావరి జిల్లా :ఓర్వలేకే టీడీపీ కుట్రలకు, భౌతిక దాడులకు పాల్పడుతుంది: హోంమంత్రి తానేటి వనితకుట్రలు, భౌతిక దాడులు ఈ కూటమి నేతలు చేస్తున్న తీరు చూస్తుంటే జగనన్నకు ఈ రాష్ట్ర ప్రజలు ఇస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక అని స్పష్టమవుతోంది.మళ్ళీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కడుపు మంటతో టీడీపీ నాయకులు దాడులకు దిగుతున్నారు.ఇటీవల నల్లజర్లలో సైతం స్వయంగా నామీదకు దాడికి పాల్పడ్డారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఖచ్చితంగా వారికి తగిన బుద్ధి చెబుతారు.టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల్లో ఒక భయాన్ని సృష్టించేందుకు తీవ్ర స్థాయిలో కృషి చేశారుప్రజలకు తెలుసు జగనన్న పేదలకు భూములు ఇచ్చేవాడే కానీ లాక్కునేవాడు కాదని.పోలీసులు వైఎస్సార్సీపీకి కొమ్ముకాశారు అనడం అవాస్తవం.అలాగైతే ఇటీవల స్వయంగా నామీద జరిగిన దాడికి పోలీసులు ఏం చేశారో చెప్పాలి.టీడీపీ, జనసేన నేతలు కలసి అధికార దాహంతో వైఎస్సార్సీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారు. 4:41 PM, May 20th, 2024మంగళగిరి:సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్‌ని కలిసిన వైఎస్సార్సీపీ నేతలుఅనంతరం మీడియాతో మాట్లాడిన వైఎస్సార్సీపీ నేతలుపోలింగ్ తర్వాత జరిగిన హింసాకాండపై సిట్ చీఫ్‌ని కలిశాం: అంబటి రాంబాబుటీడీపీతో కొందరు పోలీస్ అధికారులు కుమ్మక్కై అయ్యారనే దానిపై ఇసి ఆదేశాలతో బయటపడిందిఈసి ఆదేశాలతో ఏర్పాటైన సిట్ ఛీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ ని కలిసి ఫిర్యాదు చేశాంహింసాత్మక ఘటనలలో కొందరు ఐపిఎస్ అధికారుల పాత్ర కూడా ఉందిఎన్నికల సమయంలో అధికారులని మార్చడం సహజంకానీ ఎపిలో జరిగిన బదిలీలలో పురందేశ్వరి లేఖ ఆధారంగానే జరిగిందిఅధికారులని మార్చిన చోటే హింసాత్మక ఘటనలు జరిగి అధికారులు సస్పెండ్లు జరిగాయిఅనంతపురం, తిరుపతి, పల్నాడు జిల్లాలలో ఎస్పీలని పురందేశ్వరి ఫిర్యాదు ఆధారంగా మార్చిన చోటే హింస జరిగింది... అక్కడే సస్పెన్షన్లు జరిగాయిఇద్దరు ఐపిఎస్లని సస్పెండ్ చేశారంటే పోలీసుల పాత్ర అర్ధమవుతుందిపోలీసు శాఖ టీడీపీతో పూర్తిగా కుమ్మక్కైందిఇది చాలా దురదృష్టకరమైన పరిస్ధితిపోలీస్ యంత్రాంగం బాద్యత వహించాలివైఎస్సార్ సిపి ఇచ్చిన ఫిర్యాదులని కనీసం ఎన్నికల సమయంలో తీసుకోలేదువైఎస్సార్ పై తప్పుడు సెక్షన్లు, కేసులని నమోదు చేయాలని చూస్తున్నారుతప్పుడు కేసులని నివారించాలని కోరాంపోలీస్ అధికారుల కాల్ డేటాని పరిశీలించాలని కోరాంప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సిట్ ఛీఫ్ ని కోరాందేశంలోనే పోలీస్ అధికారులు టిడిఇతో కుమ్మక్కు కావడం చాలా సీరియస్ అయిన విషయంవినీత్ బ్రిజ్ లాల్ మంచి సమర్ధవంతమైన అధికారి అని నమ్ముతున్నాం.నాగరిక సమాజంలో ఈ తరహా సంఘటనలు జరగకూడదుపెద్దారెడ్డి ఇంటికి వెళ్లి సిసి కెమారాలు ద్వంసం చేసి టీడీపీ జెండాలు ఎగురవేయడం ఏమిటిఅధికారుల మార్పు వల్ల టీడీపీకి మేలు జరుగుతుందనే ఇలా చేశారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా కూటమి కుట్రలు చేసింది: జోగి రమేష్హింసాత్మక సంఘటనలు ప్రేరేపించడానికి కూటమే కారణంకలెక్టర్లు, ఎస్పీలు మార్చిన చోటే పెద్ద ఎత్తున హింసాత్మక సంఘటనలు జరిగాయిప్రజాస్వామ్యంలో హింసని ప్రేరేపించింది చంద్రబాబేమళ్లీ సిఎంగా వైఎస్ జగన్ వస్తారుప్రజాస్వామ్యంలో ఈ ఎన్నికలు ఒక మచ్చలా మిగిలాయిపూర్తి స్ధాయిలో విచారణ జరిపి బాద్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి ఎస్సీ, ఎస్టీ, బిసిలు వైఎస్ జగన్‌కి అండగా ఉన్నారనే కక్షతో హింసకి పాల్పడ్డారు: రావెల కిషోర్బాబుచాలా గ్రామాలలో ఎస్సీ, బిసీలు ఊళ్లకి ఊళ్లే ఖాళీ అవుతున్నాయి.టీడీపీ పై చర్యలు తీసుకోవాలిగ్రామాలలో సాధారణ పరిస్ధితులు వచ్చేలా చర్యలు తీసుకోవాలిఘటనలకి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలిప్రజాస్చామ్యాన్ని పునరుద్దించాలి 3:41 PM, May 20th, 2024విజయవాడఢీజీపీ హరీష్ కుమార్ గుప్తాకి ప్రాధమిక నివేదిక అందజేసిన సిట్ ఛీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ఎన్నికల అనంతర హింసాత్మక ఘటనలపై ఈసి ఆదేశాల మేరకు సిట్ విచారణరెండు రోజుల పాటు నాలుగు బృందాలగా క్షేత్ర స్ధాయిలో పర్యటనపల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాలలో పర్యటించిన సిట్ బృందాలుహింసాత్మక ఘటనలకి కారణాలు విశ్లేషిస్తూ ప్రాధమిక నివేదిక150 పేజీల ప్రాధమిక నివేదిక డిజిపికి అందజేసిన సిట్ ఛీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ 2:20 PM, May 0th, 2024ఏపీలో కొత్త పోలీస్ అధికారుల నియామకంఈసీ సస్పెండ్ చేసిన అధికారుల అధికారుల స్థానంలో కొత్తవాళ్ల నియామకం నరసరావుపేట డీఎస్పీ గా - ఎం.సుధాకర్ రావు గురజాల డీఎస్పీగా - సీహెచ్ శ్రీనివాసరావు తిరుపతి డీఎస్పీగా - రవి మనోహరచారి తిరుపతి ఎస్ బీ డీఎస్పీగా - ఎం.వెంకటాద్రి తాడిపత్రి డీఎస్పీగా - జనార్దన్ నాయుడు నియామకంపల్నాడు DSB - I సీఐగా- సురేష్ బాబు పల్నాడు DSB - II సీఐగా - U. శోభన్ బాబు కారంపూడి ఎస్సై గా - కె.అమీర్ నాగార్జున సాగర్ ఎస్సై గా - ఎం.పట్టాభి 2:06 PM, May 20th, 2024కాసేపట్లో డీజీపీకి సిట్ నివేదికఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలపై సిట్ ప్రాధమిక నివేదిక సిద్దంఉదయం నుంచి డిజిపి ప్రధాన కార్యాలయంలోనే కూర్చుని ప్రాధమిక నివేదిక సిద్దం చేస్తున్న ఐజీ వినీత్ బ్రిజ్ లాల్మరికాసేపట్లో డిజిపి హరీష్ కుమార్ గుప్తాకి సిట్ ప్రాధమిక నివెదికసిట్ ప్రాధమిక నివేదికపై తీవ్ర ఉత్కంఠగత రెండు రోజులగా పల్నాడు, అనంతపురం,తిరుపతి జిల్లాలలో సిట్ బృందాలు క్షేత్రస్ధాయి పర్యటన33 ఎఫ్ఐఆర్ లు, సీసీ కెమెరా ఫుటేజ్ లు పరిశీలనఘటనలు జరిగిన గ్రామాలు సందర్శన1:32 PM, May 20th, 2024చింతమనేని ఎక్కడ?పరారీలో దెందులూరు కూటమి అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పోలింగ్ టైంలో అల్లర్లకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్ పెదవేగి మండలం కొప్పులవారిగూడెం పీఎస్‌పై చింతమనేని దాడిసినీ ఫక్కీలో దాడి చేసి అరెస్టైన వ్యక్తిని విడిపించిన చింతమనేనిచింతమనేనితో పాటు మరో 14 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు16 రాత్రి నుంచే అజ్ఞాతంలోకి.. బెంగళూరు వెళ్లినట్టు ప్రాథమిక సమాచారంఆయనతో పాటు మరో 14 మంది ఉన్నట్టు పోలీసుల గుర్తింపునూజివీడు డీఎస్పీ పర్యవేక్షణలో 6 ప్రత్యేక బృందాల ఏర్పాటు12:51 PM, May 20th, 2024మంగళగిరిపల్నాడు హింసలో బాధితులుగా పలువురు మహిళలుమహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన చినగణేషునిపాడు మహిళలుటీడీపీ నేతలు ఎస్సీ, బీసీ మహిళల ఇళ్లపై దాడులు జరపడంతో భయాందోళనకు గురై ఓ గుడిలో రెండ్రోజుల పాటు తలదాచుకున్న మహిళలుపోలీసుల సాయంతో బంధువుల ఇళ్లకు వెళ్లినట్టు మహిళా కమిషన్ కు ఫిర్యాదుతమకు న్యాయం చేయాలని, నిందితులను శిక్షించాలని కమిషన్ ను కోరిన మహిళలుసాక్షితో మాట్లాడిన మహిళా కమిషన్ చైర్మన్ గజ్జల వెంకటలక్ష్మిపల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్తగణేశునిపాడుకు చెందిన ఎస్సీ, బీసీ మహిళల్ని దాదాపు 24 గంటలపాటు బంధించి వారిని చిత్రహింసలకు గురిచేశారు: గజ్జల వెంకటలక్ష్మిబాధితులకు రక్షణ కల్పించాలని, నిందితులకు కఠినశిక్షలు పడేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, ఎస్పీకి లేఖ రాFeg: గజ్జల వెంకటలక్ష్మిఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలనే టార్గెట్ చేసుకుని వారిపై దాడులు చేయడం దుర్మార్గం: గజ్జల వెంకటలక్ష్మిప్రజాస్వామ్య విలువలకు ఇలాంటి వాతావరణం పూర్తి విరుద్ధం: గజ్జల వెంకటలక్ష్మిమహిళలకు స్వేచ్ఛగా నచ్చిన వారికి ఓటు వేసే హక్కు లేదా..?: గజ్జల వెంకటలక్ష్మివారికి నచ్చని వారికి ఓట్లేసినంత మాత్రాన చంపేస్తారా..? : గజ్జల వెంకటలక్ష్మిచంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడూ మహిళలపై చాలా చిన్నచూపుతో వ్యవహరించారు: గజ్జల వెంకటలక్ష్మిఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలనే టార్గెట్ చేసుకుని వారిపై దాడులకు ఉసిగొల్పుతోన్న చంద్రబాబు తీరుపై మహిళలు ఆగ్రహంతో ఉన్నారు: గజ్జల వెంకటలక్ష్మిఎలక్షన్ కమిషన్ నిబంధనల వల్ల బాధితులను పరామర్శించలేదు: గజ్జల వెంకటలక్ష్మిత్వరలోనే బాధితులను కలిసి వారికి ధైర్యం చెప్తాం: గజ్జల వెంకటలక్ష్మి 12:11 PM, May 20th, 2024విజయనగరండిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి కీలక వ్యాఖ్యలుఎంపీ పోస్టల్ బ్యాలెట్ ను తహసీల్దార్ కార్యాలయం స్ట్రాంగ్ రూమ్ నుండి లెక్కింపు కేంద్రానికి తరలించడం లో అధికార్ల సమాచార లోపం వుంది.వైస్సార్సీపీ అభ్యర్థి ఏజెంట్ ను ఈ ప్రక్రియ కోసం పంపించాము.టీడీపీ అభ్యర్థి ఏజెంట్ హాజరు కాక పోవడం వారి ఇష్టం. అయినా రాజకీయం చేసే ప్రకటనలు చేస్తున్నారు.కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతం గా జరగాలని వైస్సార్సీపీ మనస్పూర్తి గా కోరుకుంటుంది.గతం లో గెలిచినా, ఓడినా లేకితనం రాజకీయాలు చేయలేదు.12:00 PM, May 20th, 2024పోలీసుల అదుపులో బళ్ల బాబీఎన్నికల ఫలితాలు వెలవడక ముందే నరసాపురంలో జనసేన నాయకుల దౌర్జన్యంపశ్చిమగోదావరి మొగల్తూరు మండలం కేపీ పాలెం బీచ్ సమీపంలో జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ అనుచరుడు బళ్ల బాబీ.. ఆటోలో వెళ్తున్న కుటుంబం పై దాడికారుకు ఆటో సైడ్ ఇవ్వలేదని ఆటోను వెంబడించి.. అందులోని ఇద్దరు మహిళలు,పిల్లలు, మరో ఇద్దరిపై దాడి చేసిన బాబీ అతని స్నేహితులుమీరు ఎవరు వైఎస్ఆర్ సీపీకి ఓటు వేశారా? జనసేనకు ఓటు వేశారా...? అంటూ నిలదీసిన బాబి అండ్ కోమీరు బీసిల్లా ఉన్నారు వైఎస్ఆర్ సీపీకే ఓటు వేసి ఉంటారని బాబి అతడి స్నేహితులను దాడి.. ఆపై అక్కడి నుంచి జారుకున్న బ్యాచ్‌నరసాపురం ఆసుపత్రికి బాదితులను తరలించిన స్థానికులుఆసుపత్రిలో బాధితులను పరామర్శించి.. వారి నుండి వివరాలు అడిగి తెలుసుకున్న డీఎస్పీ శ్రీనివాస్..కేసు నమోదు చేసి బళ్ల బాబీని అదుపులకు తీసుకున్న పోలీసులు11:32 AM, May 20th, 2024విజయవాడఎన్నికల సంఘానికి నేడు సిట్ ప్రాధమిక నివేదికపోలింగ్ అనంతర అల్లర్లపై నివేదిక సిద్ధం చేస్తున్న సిట్ ఇన్‌ఛార్జి వినీత్ బ్రిజ్‌లాల్‌నేడు ప్రాథమిక నివేదిక డీజీపీకి సమర్పణఇప్పటికే అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పర్యటించిన నాలుగు బృందాలుతాడిపత్రి, చంద్రగిరి, మాచర్ల, గురజాల, నరసారావుపేట ఘటనలపై కీలక ఆధారాలు సేకరణకేసుల విచారణపై సమీక్ష పూర్తి చేసిన సిట్కేసుల విచారణపై ఇకపై కూడా పరివేక్షణ కొనసాగించనున్న సిట్రానున్న రోజుల్లో మరింత లోతుగా విచారణ చేయనున్న సిట్డీజీపీకి నివేదిక సమర్పించిన తర్వాత ప్రెస్ నోట్ విడుదల చేయనున్న సిట్11:01 AM, May 20th, 2024గుంటూరుసాయంత్రం సిట్ చీఫ్ వినీత్ బ్రిజిలాల్ ను కలవనున్న వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందంపోలింగ్ నాడు తర్వాత జరిగిన హింసాత్మక సంఘటనలపై ఫిర్యాదుపల్నాడు, అనంతపురం, తిరుపతి తదితర ప్రాంతాలలో వైఎస్సార్సీపీ శ్రేణులపై జరిగిన దాడుల ఆశారాలను అందించే అవకాశంఓటర్లను భయబ్రాంతులకు గురిచేసిన అంశాలపై కూడా సిట్ కి వివరించనున్న పార్టీ బృందం10:38 AM, May 20th, 2024ప్రకాశంఎల్లో మీడియా పై మాజీమంత్రి బాలినేని ఆగ్రహంతప్పుడు కథనాలు ప్రచురిస్తే ఖబడ్దార్నాపై తప్పుడు కథనాలు ప్రసారం చేసిన మహాటీవి పై పరువునష్టం దావా వేస్తాఎవరెన్ని కుట్రలు చేసినా...అబద్ధాలు ప్రచారం చేసుకున్నా..కూటమి చిత్తుగా ఓడిపోవడం ఖాయంరాబోయేది వైస్సార్సీపీ ప్రభుత్వమే130 సీట్లకు పైగా వైస్సార్సీపీ కైవసం చేసుకోబోతోందిజూన్ 9 న ముఖ్యమంత్రి గా జగన్మోహన్ రెడ్డి ప్రమాణం చేస్తారు10:14 AM, May 20th, 2024కాకినాడ సిటీ, పిఠాపురంలో అల్లర్లకు ఛాన్స్!కాకినాడ సిటీ, పిఠాపురంపై కేంద్ర నిఘా విభాగం(ఇంటెలిజెన్స్ బ్యూరో) అలర్ట్‌కౌంటింగ్‌కు ముందు, తర్వాత హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం!కాకినాడ, పిఠాపురంపై ఎన్నికల సంఘానికి ఐబీ నివేదికకాకినాడలోని ఏటిమొగ, దుమ్ములపేట, రామకృష్ణారావుపేటపై ప్రత్యేక దృష్టిఎన్నికల్లో గొడవలు చేసిన, ప్రేరేపించిన వ్యక్తులపై ఇప్పటికే పోలీసుల నిఘా10:00 AM, May 20th, 2024ఈసీకి సిట్ రిపోర్ట్ఏపీలో అల్లర్లపై నేడు ఎన్నికల సంఘానికి సిట్ నివేదికఏపీ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలపై చివరి అంకానికి చేరుకున్న సిట్ దర్యాప్తుతాడిపత్రిలో ముగిసిన సిట్ విచారణపల్నాడు, తిరుపతిలో ఇవాళ మూడో రోజు కొనసాగనున్న విచారణక్రొసూరు, అచ్చంపేట మండలాల్లో నేడు పర్యటించనున్న సిట్ బృందాలుఏపీలో అల్లర్లపై నేడు డీజీపీకి సిట్ నివేదికసెక్యూరిటీ వైఫల్యం వల్లే అల్లర్లు జరిగినట్లు సిట్ ప్రాథమిక అంచనాఆ వెంటనే ఈసీకి నివేదిక పంపనున్న డీజీపీసమగ్ర దర్యాప్తు కోసం సిట్‌కు గడువు పొడిగించాలని కోరే అవకాశంసమగ్ర కథనం: సిట్ నివేదికలో కీలకాంశాలు9:27 AM, May 20th, 2024ఆగని పచ్చ చిలుక పలుకులుమరోసారి వైఎస్సార్సీపీపై విషం చిమ్మిన ప్రశాంత్ కిషోర్‌చంద్రబాబు డైరెక్షన్లోనే పని చేస్తున్న మాజీ ఎన్నికల వ్యూహకర్తఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓడిపోతుందంటూ బర్కాదత్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలుబీజేపీకి మాత్రం సానుకూలంగానే పీకే స్వరంఐ-ప్యాక్ టీంతో భేటీ సమయంలో సీఎం జగన్ గెలుపు వ్యాఖ్యలుపీకే చెప్పిన దానికంటే ఎక్కువ సీట్లు వస్తాయంటూ వ్యాఖ్యానించిన సీఎం జగన్‌పీకే చేసేది ఏం లేదని.. అంతా ఐప్యాక్ టీం కష్టం ఉందన్న సీఎం జగన్జగన్ వ్యాఖ్యలపై పీకేకు నూరిపోసిన చంద్రబాబువైఎస్సార్‌సీపీ శ్రేణుల్ని ఢీలా పరిచేందుకు ఎల్లో మీడియా ప్రయత్నాలు9:05 AM, May 20th, 2024పల్నాడుమాచర్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహంకాళి పిచ్చయ్య బైక్ తగలబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులురాత్రి ఇంటిముందు పార్క్ చేసిన బైక్ ను తగలబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులుతెలుగుదేశం పార్టీకి చెందిన వారే తగలబెట్టి ఉంటారని అనుమానం8:00 AM, May 20th, 2024అనంతపురం: సిట్ అధికారులకు వినతి పత్రం అందజేసిన తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సతీమణి రమాదేవితమ ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడిన టీడీపీ నేతలపై, తమ ఇంట్లో సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన పోలీసులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని సిట్ అధికారులను కోరారు 7:30 AM, May 20th, 2024విజయవాడఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు ముమ్మరంనేటి సాయంత్రానికి డీజీపీకి ప్రాధమిక నివేదిక ఇవ్వనున్న సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్నాలుగు బృందాలగా సిట్ దర్యాప్తుపల్నాడు జిల్లాలో క్షేత్రస్ధాయిలో పర్యటించిన రెండు బృందాలుపల్నాడు జిల్లాలోని రెండు బృందాలని పర్యవేక్షించిన అదనపు ఎస్పీ సౌమ్యలతతిరుపతి జిల్లా చంద్రగిరిలో పర్యటించిన మరొక బృందంఅనంతపురం జిల్లాలోని తాడిపర్తిలో మరొక బృందం పర్యటనడీఎస్పీ ఆద్వర్యంలో ఇద్దరు సీఐలతో ప్రతీ బృందం క్షేత్రస్ధాయిలో సమాచార సేకరణఎప్పటికపుడు నాలుగు బృందాల నుంవి సమాచారాన్ని తీసుకుని నివేదిక సిద్దం చేసే పనిలో హెడ్ క్వార్టర్స్ నుండి పర్యవేక్షిస్తున్న మరో అదనపు ఎస్పీమొత్తంగా 33 ఎఫ్ఐఆర్లను పరిశీలించిన సిట్ బృందాలుదాదాపు 300 మందికి నిందితులు ఈ హింసాత్మక ఘటనలలో పాల్గొన్నట్లు ఎఫ్ఐఆర్లలో నమోదుఇప్పటికే వంద మందికి పైగా నిందితులు అరెస్ట్సీసీ కెమెరా ఫుటేజ్‌లు పరిశీలనక్షేత్రస్ధాయి పర్యటనలో కీలక సమాచారాన్ని రాబట్టిన సిట్ బృందాలుపోలీస్ ఉన్నతాధికారుల వైఫల్యంపైనా పరిశీలనసస్పెండ్ అయిన పల్నాడు జిల్లా ఎస్పీ బిందుమాధవ్, అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్‌ల పనితీరుపైనా సిట్ అనుమానాలుటీడీపీ రౌడీలు ఘర్షణలకి దిగడానికి ఈ ఇద్దరి ఎస్పీల వైఫల్యమే కారణమంటూ ఇప్పటికే ఈసీకి సిట్ బృందాలకి కూడా ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీనాలుగు బృందాల క్షేత్రస్ధాయి సమాచార సేకరణ ఆధారంగా నేటి సాయంత్రం 4 గంటల లోపు డీజీపీకి ప్రాధమిక నివేదిక ఇవ్వనున్న సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్సిట్ ఇచ్చే ప్రాధమిక నివేదికని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపనున్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తాపూర్తిస్ధాయి దర్యాప్తుకి మరికొన్ని రోజుల సమయం పొడిగించాలని కోరే అవకాశంసిట్ ప్రాధమిక నివేదిక ఆధారంగా కేంద్ర ఎన్నికల కమీషన్ తదుపరి చర్యలకి అవకాశం7:00 AM, May 20th, 2024మార్చినచోటే మారణకాండ ‘సిట్’కు ఆధారాలు అందించిన మంత్రి అంబటిచంద్రబాబు, పురందేశ్వరి కుట్రతో చెలరేగిన హింస ఓటమి భయంతో బాబు రాక్షసత్వంతలలు పగులుతున్నా పోలీసులు స్పందించలేదుడబ్బులకు లొంగిపోయిన వారిపై చర్యలు తీసుకోవాలితొండపిలో ప్రాణ భయంతో గ్రామాన్ని వీడిన ముస్లిం మైనార్టీలు 6:30 AM, May 20th, 2024ముందస్తు బెయిల్ లేకుండా విదేశాలకు చంద్రబాబుఫైబర్‌నెట్ కేసులో సుప్రీంలో కొనసాగుతున్న విచారణశంషాబాద్ విమానాశ్రయంలో అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులుసుదీర్ఘ వివరణ అనంతరం ఎట్టకేలకు అనుమతిపర్యటన గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలునాలుగు రోజుల క్రితమే గుట్టుగా వెళ్లిపోయిన లోకేశ్ -
పెత్తందారులకు మళ్లీ షాకే!
సాక్షి, అమరావతి : పెత్తందార్లకు మళ్లీ షాక్ ఇచ్చేందుకు పేదలు, దిగువ మధ్య తరగతి ప్రజలంతా సిద్ధమయ్యారు. ఇంటింటా అభివృద్ధి కొనసాగాలని.. రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నారు. మళ్లీ జగన్ వస్తేనే సంక్షేమాభివృద్ధి పథకాలు కొనసాగుతాయని బలంగా నమ్ముతున్నారు. సాధికారత కోసం ఎన్నికల మహా సంగ్రామంలో కీలక ఘట్టమైన పోలింగ్ ప్రక్రియలో ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్లు నొక్కి ఓట్లేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించేందుకు పేదలంతా సిద్ధమయ్యారు.గత ఎన్నికల్లో 50 శాతం ఓట్లు.. 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థులను గెలిపించి, వైఎస్సార్సీపీకి ప్రజలు చారిత్రక విజయాన్ని అందించారు. 2019 మే 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి.. తొలి ఏడాదిలోనే 95 శాతం హామీలు అమలు చేసి ఎన్నికల మేనిఫెస్టోకు సరైన నిర్వచనం చెప్పారు. 59 నెలల్లో 99 శాతం హామీలు అమలు చేశారు. ఎలాంటి వివక్ష చూపకుండా, లంచాలకు తావులేకుండా.. అర్హతే ప్రామాణికంగా అందరికీ సంక్షేమ పథకాలు అందించారు.సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో పేదల ఖాతాల్లో రూ.2.70 లక్షల కోట్లు జమ చేశారు. నాన్ డీబీటీ పథకాల ద్వారా మరో రూ.1.79 లక్షల కోట్ల ప్రయోజనాన్ని చేకూర్చారు. డీబీటీ, నాన్ డీబీటీ కలిపి పేదలకు మొత్తం రూ.4.49 లక్షల కోట్ల లబ్ధి చేకూరింది. వాటిని సది్వనియోగం చేసుకున్న పేదలు.. జీవనోపాధులను మెరుగుపర్చుకుని తమ కాళ్లపై తాము నిలబడగలుగుతున్నారు. రాష్ట్రంలో పేదరికం చంద్రబాబు హయాంలో 11.77 శాతం ఉంటే.. 2022–23 నాటికి అది 4.19 శాతానికి తగ్గడమే అందుకు నిదర్శనం. సాధికారత కోసం పేదలంతా సిద్ధం విభజన తర్వాత 2014 ఎన్నికల్లో వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని.. ఇంటికో ఉద్యోగం లేదా నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానంటూ 650కిపైగా హామీలు ఇచ్చిన చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసింది. 2019 ఎన్నికల్లో వేరుపడిన ఆ పార్టీలు ఇప్పుడు మళ్లీ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తూ అలవికాని హామీలు ఇచ్చాయి.ఆ హామీల అమలు సాధ్యం కాదని నిర్ధారణకు వచ్చిన బీజేపీ.. టీడీపీ కూటమి మేనిఫెస్టోను ముట్టుకోవడానికి కూడా వెనుకంజ వేసింది. సీఎం జగన్ గత ఎన్నికల తరహాలోనే అమలు చేయదగిన హామీలతోనే కేవలం రెండే రెండు పేజీలతో మేనిఫెస్టోను విడుదల చేశారు. కూటమికి ఇక్కడ సారథ్యం వహిస్తున్న చంద్రబాబు.. చెప్పిన మాటపై నిలబడడని, మోసం చేస్తారనే అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకు పోయింది. చెప్పిన హామీలన్నీ అమలు చేసిన సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం కుదిరింది. దీంతో సాధికారత కోసం మళ్లీ జగనే రావాలని పేదలంతా బలంగా కోరుకుంటున్నారు. భవిష్యత్తు మరింత గొప్పగా మార్చుకునేందుకు..⇒ రాష్ట్రంలో 70 శాతం ప్రజల జీవనాధారం వ్యవసాయం. సీఎం జగన్ గ్రామాల్లో ఆర్బీకే (రైతు భరోసా కేంద్రాలు)లను ఏర్పాటు చేసి, విత్తు నుంచి విక్రయం దాకా రైతుల చేయిపట్టి నడిపిస్తున్నారు. రైతు భరోసా ద్వారా పెట్టుబడి సహాయం.. ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిస్తున్నారు. రైతులపై ఎలాంటి భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని తెచ్చారు. పండించిన పంటల ఉత్పత్తులను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రకృతి విపత్తుల వల్ల పంట నష్టపోతే.. ఆ సీజన్ ముగిసేలోగా పరిహారాన్ని అందించి రైతులకు దన్నుగా నిలుస్తున్నారు. తద్వారా వ్యవసాయాన్ని పండుగగా మార్చారు. ⇒ గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలు సొంత ఊళ్లోనే సులభంగా అన్ని పనులను చక్కబెట్టుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ వైద్య ఖర్చుల పరిమితిని రూ.25 లక్షలకు పెంచడం.. జగనన్న సురక్ష, విలేజ్ హెల్త్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా ప్రజల ఆరోగ్యానికి సీఎం జగన్ భరోసా కల్పించారు. పునర్ వ్యవస్థీకరణ ద్వారా 26 జిల్లాలను ఏర్పాటు చేశారు. ⇒వైఎస్సార్ చేయూత, ఆసారాతో మహిళలకు సీఎం జగన్ అండగా నిలిచారు. ఆ పథకాల ద్వారా అందించిన ఆర్థిక సాయంతో⇒‘పేదలంటే మారుమూల పల్లెల్లో, పట్టణాల్లోని మురికి వాడల్లోనే ఉండాలి.. పెత్తందారుల ఇళ్లలో పనులు చేస్తూ, వాళ్లు తినగా మిగిలింది తింటూ బతకాలి.. పిల్లలను స్కూల్ లెవల్ వరకు తెలుగు మీడియంలో మాత్రమే చదివించాలి.. ఇంగ్లిష్ మీడియంలో చదివించాలనే ఆలోచనే రాకూడదు.. టెన్త్ తర్వాత పెత్తందారుల ఫ్యాక్టరీలో ప్యాకింగ్ విభాగంలో, లోడింగ్.. అన్లోడింగ్ సెక్షన్లో, సెక్యూరిటీ గార్డులుగా పెట్టుకోమని బతిమిలాడాలి..అమరావతిలో పేదలనే వారు అసలు ఉండకూడదు.. ఎన్నో ఏళ్లుగా ఇలా కొనసాగుతోంటే ఈ సీఎం జగన్ వచ్చాక, ఆ పరిస్థితి మార్చేస్తున్నారు.. సీఎం ఇలా చేస్తే మేము చూస్తూ ఊరుకుంటామా.. కోర్టుల్లో కేసులేశాం.. లేని వివాదాలు సృష్టించాం.. భయాందోళనలు పెంచేశాం.. డబ్బు సంచులతో ఎన్ఆర్ఐలను దింపాం.. పనోళ్లను పనోళ్లుగా ఉంచకుండా పేదరికాన్ని తగ్గించేస్తే మేమంతా ఏమైపోవాలి?’ అని చంద్రబాబు ఆయన పెత్తందారుల గ్యాంగ్ ఊగిపోతోంది. ⇒ ఈనాడు రామోజీ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్ని మందులు వాడినా హిస్టీరియా తగ్గడం లేదు. రాత్రిళ్లు ఉన్నట్లుండి లేచి కూర్చుంటున్నారట. అదిగో జగన్.. జగన్.. మళ్లీ వస్తున్నాడు అంటూ కలవరిస్తున్నారట! తప్పకుండా ఆయన కల నెరవేరుతుంది. పేదరికంపై, పేదలపై, దిగువ మధ్యతరగతి వర్గాలపై విషం నింపుకున్న ఈ పెత్తందారులు ఫలానా మంచి పని చేశామని ఒక్కటంటే ఒక్కటి చెప్పుకోలేని దుస్థితిలో నిస్సిగ్గుగా మంచి చేస్తున్న ప్రభుత్వంపై దుర్మార్గంగా నిందలు వేస్తున్నారు. దు్రష్పచారాలు చేస్తున్నారు. వీరందరి వలువలూడదీసి తరమడానికి ఓటర్లంతా సిద్ధంగా ఉన్నారు. ఊరూరా అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు బారులు తీరి కనిపిస్తున్నారు. ఆ రెండు బటన్లు ఎప్పుడెప్పుడు నొక్కుదామా అని వేచి చూస్తున్నారు. -
ఆ గట్టున సినిమా స్టార్లు.. ఈ గట్టున రియల్ స్టార్లు
ఎన్నికలు వచ్చేశాయి.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు నిలబడగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అటు బీజేపీ, జనసేనలతో జతకట్టి ప్రజల్లోకి వెళ్తోంది. ఈ సందర్భంగా ఎన్డీయే కూటమి రకరకాలవాళ్ళను ప్రచారానికి దించుతోంది.బాలయ్య బాబు వంటి సినిమా స్టార్లు ఒకవైపు ప్రచారం చేస్తుండగా ఏకంగా పవన్ కళ్యాణ్ సైతం అటు పిఠాపురంలో పోటీ చేస్తూనే వేరే నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తరఫున జబర్దస్త్ టీమ్ మొత్తం కొన్నాళ్లపాటు ప్రచారం చేయగా ఇక మెగా కాంపౌండ్‌లోని హీరోలు వరుణ్ తేజ్, వైష్ణవ తేజ్ వంటివాళ్ళు సైతం ప్రజల్లోకి వెళ్లి కూటమికి ఓటేయాలని అడుగుతున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి సైతం తమ్ముడు పవన్‌ను పిఠాపురంలో గెలిపించాలని కోరుతూ వీడియో విడుదల చేశారు. ఇలా కూటమి వైపు మొత్తం పెద్దపెద్ద సినిమా స్టార్లు ప్రచారం చేస్తున్నారు.లబ్ధిదారులే జగన్ స్టార్ క్యాంపెయినర్లు అటు ప్రచారం అలా ఉండగా ఇటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సారధ్యంలోని వైఎస్సార్సీపీ మాత్రం ప్రజలే ప్రచార సారధులుగా ముందుకు సాగుతోంది. ఓ వైపు అంతా తానై సీఎం జగన్ ప్రచారం చేస్తుండగా మరోవైపు ఆయన ప్రభుత్వంలో లబ్దిపొందినవాళ్లు ఆయన కోసం ప్రచారం చేస్తున్నారు. తెలుగుదేశం హయాంలో పెన్షన్ కోసం ఇబ్బంది పడిన ఓ తాత.. అమ్మ ఒడి అందుకున్న ఓ అక్క.. జగనన్న విద్యాకానుక అందుకున్న ఒక కుర్రాడి తల్లి.. ఆసరా అనుకున్న ఓ అక్క.. ఇలా పేదలే సీఎం జగన్ తరఫున ప్రచారం చేస్తున్నారు. మీ అందరికీ మంచి జరగాలి అంటే మళ్ళీ జగన్ గెలవాలి అని ఇంటింటికి వెళ్లి చెబుతున్నారు. ఆ గట్టున సినిమా క్యాంపెయినర్లుగా ఉండగా ఈ గట్టున పేదలే స్టార్ క్యాంపెయినర్లుగా నిలబడి వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకొచ్చేందుకు పని చేస్తున్నారు.-సిమ్మాదిరప్పన్న. -
May 8th: ఏపీ ఎన్నికల సమాచారం
AP Political And Elections News Updates In Telugu8:18 PM, May 8th, 2024షర్మిల, సునీతలకు కడప కోర్టు మరోసారి షాక్ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసు ప్రస్తావించరాదన్న కడప కోర్టు జారీ చేసిన అర్డర్‌ను డిస్మిస్ చేయాలంటూ సునీత వేసిన పిటిషన్‌ను కొట్టేసిన కోర్టుఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సునీతకడప కోర్టులోనే తేల్చుకొవాలన్న హైకోర్టుహైకోర్టు అదేశాల మేరకు విచారణ చేపట్టిన కడప కోర్టుఇరువురి వాదనలు విన్న కడప కోర్టుసునీత, షర్మిల దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసిన కడప కోర్టుతప్పుడు సమాచారంతో పిటిషన్ వేశారంటూ సునీత, షర్మిలకు రూ.10 వేల జరిమానాజరిమానానుజిల్లా లీగల్ సెల్ కు కట్టాలన్న కడప కోర్టు2:30 PM, May 8th, 2024కుప్పంలో బాబు ఓడిపోతున్నాడు: లక్ష్మి పార్వతి సంఘ విద్రోహులు చంద్రబాబు అండ్ కొఎన్టీఆర్ వెన్నుపోటులో పురందేశ్వరి ప్రధాన పాత్ర పోషించిందినేతి బీరకాయలో నెయ్యి లాంటిది పురందేశ్వరి మంచితనంపురందేశ్వరి కూడా చంద్రబాబు లాంటి మనిషిFIRలో వైఎస్సార్ పేరును చేర్చిన కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరడం ఏమిటి..?వీరందరినీ చంద్రబాబు ఆడిస్తున్నారురాజకీయ నీచుడు చంద్రబాబుబాబు కంటే సీఎం జగన్ అధిక పెట్టుబడులు తీసుకొచ్చారుఏపీ అభివృద్ధిలో విశాఖ కీలకంఏం మాట్లాడాలో అర్ధంకాక బాబు ఇచ్చిన స్క్రిప్ట్ మోడీ చదివాడుసీఎం జగన్‌ను గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారుఉత్తరాంధ్ర అభివృద్ధి జరగాలి అంటే సీఎం జగన్ అధికారంలోకి రావాలినేను రాష్ట్రం మొత్తం తిరిగానుగీతం మూర్తి ఎన్టీఆర్ వెన్నుపోటులో కీలక పాత్ర పోషించిన దుర్మార్గుడుగీతం భరత్‌ను ఓడించాలిగీతం అంటేనే భూ కబ్జాలుఏయూను నాశనం చెయ్యాలనే ఉద్దేశంతోనే గీతంను అభివృద్ధి చేశారు.1:50 PM, May 8th, 2024మోదీకి కుటుంబం లేదన్న వ్యక్తి చంద్రబాబు: జోగి రమేష్జోగి రమేష్ కామెంట్స్ఎన్డీఏ కూటమి కొత్త కూటమి ఏమి కాదు .2014లో ఇదే కూటమి జతకట్టింది.కలిసి పోటీ చేయడం ఎందుకు.. విడిపోవడం ఎందుకు..పవన్ వలన మేము గెలవలేదని చంద్రబాబు అన్నాడు.మోడీకి కుటుంబం లేదు అన్న వ్యక్తి బాబు.మేనిఫెస్టోలో ఒక్క పథకం కూడా చంద్రబాబు అమలు చేయలేదు.అందుకే గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు..కుట్రలతో ఇప్పుడు కూటమి ఏర్పాటు చేశారు.పొత్తులు ముక్కలవడం ఖాయం .అన్నం పెట్టే జగన్న కు ప్రజలు మద్దతుగా ఉన్నారురెండు ఓట్లు ఫ్యాన్ కే వేస్తామని ప్రజలు అంటున్నారు.మంచి చేశాడు కాబట్టే ప్రజల గుండెల్లో జగన్ ఉన్నారు 1:30 PM, May 8th, 2024టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలి: తానేటి వనితటీడీపీ నేతల రౌడీయిజంపై చర్యలు తీసుకోవాలిటీడీపీ నేతల దాడులు నశించాలిప్రజాస్వామ్యం పరిరక్షించాలినేనున్న ఇంటిపై దాడి చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది?ఎవరు ఎంత రెచ్చగొట్టినా కార్యకర్తలు రెచ్చిపోవద్దుప్రజల్లో మనం ఉన్నాము సర్వేలు బాగున్నాయిప్రజలంతా కూడా జగనన్న పరిపాలనకు ముక్తులై.. మనకే ఓటేయాలని ఎదురుచూస్తున్నారుటీడీపీ కార్యకర్తలు రౌడీ రాజకీయాలు, గూండా రాజకీయాలు చేస్తున్నారుభౌతికంగా దాడులు చేసి.. మనం చేసినట్టు లైవ్‌లు పెట్టారు.గోపాలపురం నియోజకవర్గంలో ఒక రెడ్ బుక్ ఉందని అంటున్నారు.ఒక్కసారి కూడా ఎన్నిక కాని వారు గూండా రాజకీయాలు చేస్తున్నారురాత్రి జరిగిన దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసామునేనేమీ వారికి ఛాలెంజ్‌లు కూడా చేయలేదుమా నాయకుడు చేసిన మంచే మాట్లాడాను.జగనన్న నాకు హోం మంత్రి పదవి ఇచ్చారుజగనన్న నాకు రాజ్యాధికారం ఇచ్చారుదళితలమైన నాపై దాడులు చేస్తూ కించపరిచేలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారుఈరోజు నాపై దాడి చేశారు అధికారం లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి?నోటికి వచ్చిన వాగ్దానాలు ఇస్తున్నారు.చట్టం ఎవరికీ చుట్టం కాదు.ప్రతీ కార్యకర్త ఎలక్షన్‌పై దృష్టి పెట్టాలి. 12:30 PM, May 8th, 2024చంద్రబాబుపై ఎమ్మెల్సీ రుహుల్లా ఫైర్మైనార్టీల 4% రిజర్వేషన్ గురించి మోదీతో మాట్లాడే దమ్ము చంద్రబాబుకు ఉందా?.విజయవాడ పర్యటనలో మోదీతో చంద్రబాబు మైనార్టీల గురించి మాట్లాడించాలి.హజ్ యాత్రకు వెళ్లే మైనార్టీలను సీఎం జగన్ ఆర్థికంగా అందుకున్నారు.గుంటూరులో దళితులపై దేశద్రోహి కేసులు పెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు.రాష్ట్రంలో ఉన్న మైనారిటీలు అందరూ ఈ విషయంపై ఆలోచించాలి.మైనారిటీలను ఓట్ల కోసం వాడుకుంది చంద్రబాబు నాయుడురాష్ట్రంలో మైనార్టీలు అంటే చంద్రబాబు, బీజేపీకి చిన్న చూపు.సీఎం జగన్ మైనార్టీలకు అభివృద్ది చేశారుమైనార్టీల ద్రోహి చంద్రబాబు నాయుడుమైనార్టీలకు ద్రోహం చేయడానికి చంద్రబాబు మోదీతో జత కట్టారు 12:00 PM, May 8th, 2024పవన్‌పై ముద్రగడ సంచలన కామెంట్స్పవన్ కళ్యాణ్ నిఖార్సైన కాపో కాదో లోకానికి తెలియాలినేను నిఖార్సైన కాపుని.. నా కుటుంబం కూడా స్వచ్చమైన కాపు కుటుంబంపవన్ కుటుంబం స్వచ్చమైన కాపు ఐతే చరిత్ర బయట పెట్టమనండి.మాటి మాటికీ కాపు ముసుగులో ఉండి కాపులకు సాయం చేయ్యరా అని అడుగుతున్నావ్.మా వంగా గీతా కాపు కాదా?కొందరు దుష్టుల వల్ల నా కూతురు దూరమైపోయిందిమళ్ళీ వచ్చే జన్మలోనే కలుసుకుందాం 11:30 AM, May 8th, 2024అభివృద్ధి అంటే జగనే: దేవినేని అవినాష్ప్రతీ గడపలో జగన్ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారుఅభివృద్ధి లేదు అంటున్న టీడీపీ నేతలు మూడో డివిజన్లో పర్యటించాలిఐదేళల్లో జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూసి ఓటు వేయమని కోరుతున్నాంఈ డివిజన్ మొత్తం సీసీ రోడ్లు వేసిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుందిటీడీపీ ఎమ్మెల్యేకు ఈ ప్రాంతం, నియోజకవర్గ అభివృద్ధిపై చిత్త శుద్ధి లేదుఅభివృద్ధి సంక్షేమం చూసి మీ బిడ్డగా ఒక్క అవకాశం ఇవ్వాలిఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఆశీర్వదించండి 11:00 AM, May 8th, 2024ఎమ్మెల్యే అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్ కామెంట్స్సీఎం జగన్ ప్రభుత్వంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు.జగనన్న పథకాలపై ఈసీకి ఫిర్యాదుకు చేసి వాటిని ఆపిన దుర్మార్గుడు చంద్రబాబు.చంద్రబాబుకు పేద ప్రజల పట్ల అంత అసూయ ఎందుకు?.ప్రజలను ఇబ్బంది పెట్టడం చంద్రబాబుకు అలవాటే.గతంలో చంద్రబాబు పసుపు కుంకులకు ఎలక్షన్ సమయంలో పర్మిషన్ ఇచ్చారు.ఎలక్షన్ కోడ్ రాకముందు అందించిన సంక్షేమ పథకాలను ఎందుకు ఆపారు.ఎన్నికల కమిషనర్ ఈ విషయాన్ని పున: పరిశీలన చేయాలి.విద్యాదీవెన ఆపిన కారకులు చంద్రబాబు, జనసేన, బీజేపీదుర్మార్గపు ఆలోచనలకు కేరాఫ్ అడ్రస్ వీరి ముగ్గురే.పేద ప్రజలపై కక్ష సాధింపు చర్యలు వద్దు.సీఎం జగన్ పేద ప్రజలకు కవచంలా అండగా ఉంటారు. 10:30 AM, May 8th, 2024బాబుకు ఓటమి భయం పట్టుకుంది: మంత్రి పెద్దిరెడ్డిమంత్రి పెద్దిరెడ్డి కామెంట్స్కుప్పంలో చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందిఇందుకే పిచ్చి పట్టినట్లు బాబు మాట్లాడుతున్నారుసీఎం జగన్‌తో పాటు నాపై చంద్రబాబు ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారువేల కోట్లు నేను సంపాదించానని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటుచంద్రబాబు ఆరోపణలకు రుజువులు ఉన్నాయా?.ఈసారి కుప్పంలో చంద్రబాబును ప్రజలు రాజకీయంగా భూస్థాపితం చేయనున్నారు. 10:00 AM, May 8th, 2024చంద్రబాబుపై మాట మార్చిన మోదీ..నాడు చంద్రబాబు పోలవరాన్ని ఏటీఎం మార్చుకున్నాడని మోదీ వ్యాఖ్యలునేడు చంద్రబాబుపై మోదీ ప్రశంసలు. వెన్నుపోటు, పార్టీలు మార్చడం, తిట్టినవారి చంకనెక్కడంలో బాబు నిపుణుడు.మోదీ కూడా చంద్రబాబులాగే మాట్లాడుతున్నాడు. వచ్చే ఎన్నికల్లో మన ఫ్యాన్ గుర్తుకు ఓటువేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించండి. చంద్రబాబు గురించి గత ఎన్నికల ముందు మోడీ గారు ఏమన్నారో గుర్తుందా? పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నాడని, వెన్నుపోట్లు, పార్టీలు మార్చడం, తిట్టినవారి చంకనెక్కడంలో చంద్రబాబు నిపుణుడని, అత్యంత అవినీతిపరుడని చెప్పారు. కానీ ఇప్పుడు అదే మోడీ గారు ఎన్డీయే గూటికి చేరిన చంద్రబాబుని ఇంతకంటే… pic.twitter.com/rSUlLqQzQB— YS Jagan Mohan Reddy (@ysjagan) May 7, 2024 08:45 AM, May 8th, 2024మోదీ, బాబుకు వడ్డే శోభనాద్ధీశ్వర రావు సవాల్ప్రధాని మోదీ, చంద్రబాబుకి మాజీ మంత్రి వడ్డే శోభనాద్ధీశ్వర రావు సవాల్ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ని రద్దు చేయించగలరా?ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సిఫార్సు చేసింది కేంద్ర ప్రభుత్వమే కదా?.ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కి అసెంబ్లీలో పయ్యావుల కేశవ్ మద్దతు పలకలేదా?టీడీపీ లోపల మద్దతు పలుకుతూ, పైకి మాటల గాంభీర్యం ప్రకటించడం కరెక్టేనా?ఈటీవీ, అన్నదాతల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనుకూల కథనాలు ప్రసారం చేయడం వాస్తవం కాదా?ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై చంద్రబాబు మోదీని ప్రశ్నించాలి, నిలదీయాలి.మోదీ విజయవాడ పర్యటనలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయించే హామీని ఇవ్వగలవా చంద్రబాబు? 07:35 AM, May 8th, 2024టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు: తానేటి వనితహోంమంత్రి తానేటి వనిత కామెంట్స్.. టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది. మహిళ అని చూడకుండా దాడికి ప్రయత్నించారు. హోంమంత్రి దాడి చేయడమంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా?. మాకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారు. 07:15 AM, May 8th, 2024తానేటి వనితపై టీడీపీ నేతల దాడి యత్నం..తూర్పుగోదావరిలో రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌నల్లజర్లలో టీడీపీ కార్యకర్తల బీభత్సంహోంమంత్రి తానేటి వనితపై దాడికి యత్నం. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది. హోంమంత్రిని సురక్షితంగా గదిలో ఉంచిన సెక్యూరిటీ. వైఎస్సార్సీపీ ప్రచార వాహనాన్ని ధ్వంసం చేసిన టీడీపీ కార్యకర్తలు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణుల మూకుమ్మడి దాడి.టీడీపీ శ్రేణుల దాడిలో వైఎస్సార్సీపీ నేతలకు తీవ్ర గాయాలు. టీడీపీ శ్రేణుల దాడిలో వాహనాలు, ఫర్నీచర్ ధ్వంసంసీసీ కెమెరాలో రికార్డయిన టీడీపీ నేతల దాడి దృశ్యాలు. నల్లజర్లలో భారీగా పోలీసుల మోహరింపు. 07:00 AM, May 8th, 2024గాజువాక రోడ్‌షోలో సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..మరో ఆరు రోజుల్లో జరగనున్న కురుక్షేత్ర మహా సంగ్రామం జగన్‌కు ఓటు వేస్తే పథకాల కొనసాగింపు, చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాల ముగింపు, ఇదే చరిత్ర చెప్పే సత్యంప్రతి రంగంలోనూ అనూహ్యమైన మార్పులు తీసుకురాగలిగాం, బటన్ నొక్కుతూ నేరుగా లబ్ధి అందజేశాంగతంలో దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం జరిగింది13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చడమే కాక ప్రజలకు మరింత దగ్గరయిన ప్రభుత్వం మీ బిడ్డదివిశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేయడమే కాక జూన్ 4 న మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసేది, తర్వాత పాలన కొనసాగించేది విశాఖ నుంచే..ఈ 59 నెలల్లో మీ బిడ్డ చేసిన అభివృద్ది గమనించండి అని చెబుతున్నా, చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా గ్రామ స్వరాజ్యానికి అర్ధం చెప్పాడు మీ బిడ్డలంచాలకు, వివక్షకు తావులేకుండా ఇంటివద్దకే పౌరసేవలు, అన్ని పథకాలు, ఇది కాదా అభివృద్దిఉద్దానం సమస్యను గతంలో ఎవరైనా పట్టించుకున్నారా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ ప్రతి ఏడాది మొదటి స్ధానమే, మీ బిడ్డ పాలనలో ఏకంగా రూ. లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చాయిసస్టెయినబుల్ డెవలప్మెంట్ అంటే ఇది కాదా అని అడుగుతున్నారాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోవడానికి కూటమిగా ఏర్పడి ప్రయత్నిస్తున్నారునాడు నేడు ద్వారా స్కూల్స్, ఆసుపత్రులు రూపురేఖలు మారుతున్నాయి,ప్రధాని విమర్శలు చూస్తుంటే నాకు ఒకటనిపించింది, మోదీ గారు ఇదే చంద్రబాబు గురించి ఎన్నికల ముందు ఏమన్నారో గుర్తు తెచ్చుకోండి, వెన్నుపోట్లు, అత్యంత అవినీతిపరుడన్న నోటితోనే ఇవాళవారితో ఉంటే ఒకలా, లేకపోతే మరోలా మాటమారుస్తున్నారు, రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా*బాబు, దత్తపుత్రుడు, మోదీ గారు కలిసి ఆడుతున్న ఈ డ్రామాలో రాష్ట్ర ప్రజలకు మీ హామీ ఏంటి, ప్రత్యేక హోదా ఇస్తామని జట్టు కట్టారా, స్టీల్ ప్లాంట్ ప్రేవేట్ పరం చేయమని జట్టు కట్టారా అందరూ ఆలోచించండిమీ జగన్ ఆమోదం లేదు కాబట్టే స్టీల్ ప్లాంట్ ప్రేవేటీకరణ విషయంలో కేంద్రం వెనకడుగు వేసింది, జగన్ ఒప్పుకోలేదు కాబట్టే అది జరగలేదు, ఈ ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపేలా బాబు, దత్తపుత్రుడు బీజేపీ కూటమిని ఓడించి నా తమ్ముడు అమర్‌కు ఓటేసి దేశానికి ఒక గట్టి మెసేజ్ ఇక్కడి నుంచి పంపండి 06:50 AM, May 8th, 2024నేడు ఏపీలో మోదీ ప్రచారంనేడు ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంమధ్యాహ్నం ప్రత్యేక విమానం తిరుమలకు మోదీరాజంపేట లోక్‌సభ పరిధిలో కలికిరిలో ఎన్నికల ప్రచారంసాయంత్రం విజయవాడలో రోడ్ షో 06:40 AM, May 8th, 2024అప్పుడూ ఇప్పుడూ 'అంతే'పేదల పొట్ట కొట్టడమే లక్ష్యంగా వికృతరూపం దాల్చిన బాబు పెత్తందారీ పోకడవారికి లబ్ధి జరిగేది ఏదైనా అడ్డుకోవడమే ఆయన లక్ష్యంఅప్పట్లో ఇళ్ల స్థలాల పంపిణీ, ఇంగ్లిష్ మీడియం చదువులు అడ్డుకునేందుకు ఎల్లోగ్యాంగ్ చేయని ప్రయత్నంలేదు.. ఇప్పుడు ఎన్నికల కోడ్‌ను అడ్డంపెట్టుకుని ఎప్పటినుంచో కొనసాగుతున్న డీబీటీలకూ అడ్డంకులుతొలి నుంచీ పేదలకు మేలు జరగకుండా కోర్టులకు వెళ్లి మరీ అడ్డుకున్న బాబు బ్యాచ్‌తాజాగా కోడ్ పేరుతో విద్యా దీవెన, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, మహిళలకు చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాలను అడ్డుకున్న పచ్చముఠా.. ఐదేళ్లుగా కొనసాగుతున్న పథకాలపైనా కుట్రలుతెలంగాణలో ఇన్పుట్ సబ్సిడీకి ఓకే చెప్పిన ఈసీ.. ఏపీలో మాత్రం నో 06:30 AM, May 8th, 2024మీడియాతో ఏపీ సీఈవో ఎంకే మీనాప్రభుత్వం ఇచ్చే పథకాలనేవీ ఆపమని ఎన్నికల సంఘం చెప్పలేదుకొంత కాలం తర్వాత ఇవ్వమని ఎన్నికల సంఘం స్పష్టం చేసిందిపోస్టల్ బ్యాలెట్ వినియోగానికి మరో రోజు గడువు పొడిగింపుకొన్ని చోట్ల 12-డి ఫారాలు అందడంలో జాప్యం జరిగిందిఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోని ఇవాళ, రేపు ఓటేసుకోవచ్చుసెక్యూర్టీకి డ్యూటీకి వెళ్లిన వారికి ఈ నెల 9వ తేదీన కూడా అవకాశంఅలాగే సొంత సెగ్మెంట్లల్లోవి ఫెసిలిటేషన్ సెంటర్లల్లో కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకోవచ్చువచ్చే నెల మూడో తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ గడువు పొడిగించడం కష్టంఇప్పటికే సుమారు 20 రోజుల సమయం ఇచ్చాంకొన్ని ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద ఓటర్లను ప్రలోభ పెడుతున్నారుకొందరు ఓటుకు డబ్బులను డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారుఒంగోలులో కొందరు ఉద్యోగులు ఈ ప్రలోభాలకు లోనైనట్టు నిర్థారణకు వచ్చాంకొందరు వచ్చిన మొత్తాన్ని తిప్పి పంపారుదీనిపై విచారణ చేపడుతున్నాంతప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాంపోలింగ్ సందర్భంగా అక్రమాలకు పాల్పడిన ఓ పోలీస్ కానిస్టేబులును సస్పెండ్ చేశాంలీడర్లకు సెక్యూర్టీగా ఉన్న సిబ్బంది.. రేపటి ప్రధాని బందోబస్తులో ఉన్న వాళ్లకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా వెసులుబాట్లు కల్పిస్తున్నాంపల్నాడులో హోలో గ్రామ్ ద్వారా ఓటర్లను ప్రలోభ పెడుతున్నారుపల్నాడు ఎపిసోడ్ పై విచారణ చేపడుతున్నాం -
మోసం.. వంచన.. అప్పుడూ, ఇప్పుడూ బాబు మేనిఫెస్టో అదే..
2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసిన సీఎం జగన్👉: 58 నెలల్లో నవరత్నాల పథకాల ద్వారా పేదల ఖాతాల్లో నేరుగా రూ.2,66,810 కోట్లు జమ 👉: సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా నాన్ డీబీటీ రూపంలో మరో రూ.95,001 కోట్లు 👉: డీబీటీ, నాన్ డీబీటీ కలిపి రూ.3,61,811 కోట్లు.. ఏటా సగటున రూ.72,362 కోట్లు వ్యయం 👉: సీఎం రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చేస్తున్నారంటూ గగ్గోలు పెట్టిన చంద్రబాబు అండ్ గ్యాంగ్ 👉: టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో అమలుకు ఏటా రూ.1.65 లక్షల కోట్లకుపైగా అవసరం 👉: అంటే.. ఇప్పటి కంటే ఏటా రూ.92,638 కోట్లకుపైగా అదనంగా అవసరం 👉: టీడీపీ మేనిఫెస్టో అమలుకు ఐదేళ్లలో మొత్తంగా రూ.8.25 లక్షల కోట్లకుపైగా అవసరం 👉: డీబీటీ, నాన్ డీబీటీ పథకాలకు వ్యయం చేసిన దాని కంటే అదనంగా రూ.4,63,189 కోట్లు అవసరం 👉: సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేస్తానంటూ చంద్రబాబు ప్రగల్భాలు 👉: పద్నాలుగేళ్ల బాబు పాలనలో ప్రతిఏటా రెవెన్యూ లోటేనని సాక్ష్యాలతో వివరించిన సీఎం జగన్👉: ఉమ్మడి రాష్ట్రంలో హైటెక్ సిటీ పేరుతో మురళీమోహన్ వంటి బినామీలకే సంపద సృష్టించిన చంద్రబాబు 👉: 2014–19 మధ్య అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా బినామీలకు భూ సంపద సృష్టించిన వైనం 👉: ఇప్పుడు అమరావతి నిర్మాణానికి ఖజానా నుంచి ఖర్చు పెట్టి బినామీలకు సంపద సృష్టించేలా ఎత్తుగడ 👉: 2014 ఎన్నికల తరహాలోనే ఇప్పుడూ ప్రజలను మోసం చేస్తున్నారని మేనిఫెస్టోను ముట్టుకోని బీజేపీ 👉: పథకాల అమలుకు నిధులు ఎలా తెస్తారో వివరణ ఇవ్వాలంటున్న రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు 👉: వివరణ ఇవ్వకపోతే తాను మోసం చేస్తున్నట్లు చంద్రబాబు అంగీకరించినట్లేనని స్పష్టీకరణసాక్షి, అమరావతి: ఎన్నికల్లో అలవికాని హామీలు ఇస్తూ అధికారంలోకి వచ్చాక ఒక్క హామీని కూడా అమలు చేయకుండా మోసం చేసిన చరిత్ర ఉన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఈసారి విశ్వరూపం ప్రదర్శించారు. జనసేన, బీజేపీలతో జత కట్టినా ఘోర పరాజయం తప్పదనే నిర్ణయానికి వచ్చి ఉనికి చాటుకోవడం కోసం ఆచరణలో అమలుకు వీలుకాని రీతిలో హామీలతో ముంచెత్తుతూ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేసిన తరహాలోనే ఈసారీ ప్రజలను వంచించడానికి సిద్ధమయ్యారని గ్రహించిన బీజేపీ.. మేనిఫెస్టోను ముట్టుకోవడానికి కూడా ముందుకు రాలేదని టీడీపీ వర్గాలే చర్చించుకుంటుండటం గమనార్హం. 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన సీఎం వైఎస్ జగన్.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశారు. గత 58 నెలల్లో నవరత్నాలు–సంక్షేమ పథకాల ద్వారా అర్హతే ప్రామాణికంగా.. ఎలాంటి వివక్ష చూపకుండా.. అవినీతికి తావు లేకుండా.. అత్యంత పారదర్శకంగా పేదల ఖాతాల్లో నేరుగా రూ.2,66,810 కోట్లను జమ చేశారు. నాన్ డీబీటీ పథకాల ద్వారా మరో రూ.95,001 కోట్లు వ్యయం చేశారు. డీబీటీ, నాన్ డీబీటీ పథకాల ద్వారా ఇప్పటిదాకా రూ.3,61,811 కోట్లు వ్యయం చేశారు. అంటే ఏడాదికి సగటున రూ.72,362 కోట్లు ఖర్చు చేశారు. సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లోకి సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి డబ్బులు జమ చేస్తుంటే.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి శ్రీలంకగా మార్చేస్తున్నారని చంద్రబాబు గగ్గోలు పెడితే.. ఎల్లో మీడియా అదే పల్లవి అందుకుంది.అదనంగా రూ.4,63,189 కోట్లు ఎలా తెస్తావ్ బాబూ? టీడీపీ మేనిఫెస్టోలో సూపర్ సిక్స్‌తోపాటు పేర్కొన్న ఇతర హామీల అమలుకు ఏటా రూ.1.65 లక్షల కోట్లకుపైగా అవసరమని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. అంటే.. ప్రస్తుతం సీఎం జగన్ డీబీటీ, నాన్ డీబీటీ పథకాలకు చేస్తున్న వ్యయం కంటే అదనంగా ఏటా రూ.92,638 కోట్లు అవసరం. ఐదేళ్లలో ఆ పథకాల అమలుకు మొత్తంగా రూ.8.25 లక్షల కోట్లు అవసరం. అంటే.. ప్రస్తుతం సీఎం జగన్ డీబీటీ, నాన్ డీబీటీ పథకాలకు ఐదేళ్లలో చేసిన వ్యయం కంటే అదనంగా రూ.4,63,189 కోట్లు కావాలి. ఈ డబ్బులు ఎలా తెస్తావని ప్రశి్నస్తుంటే సంపద సృష్టించి సంక్షేమ పథకాలను అమలు చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారు తప్పించి స్పష్టంగా లెక్క చెప్పలేక తప్పించుకుంటున్నారు. హైటెక్ సిటీలో, అమరావతిలో బినామీలకే సంపద సృష్టి గతంలో సంపద సృష్టించానని, ఇప్పుడూ సంపద సృష్టించి.. దాని ద్వారా వచ్చే ఆదాయంతో సంక్షేమ పథకాలు అమలు చేస్తానని చంద్రబాబు చెబుతోన్న మాటల్లో వీసమెత్తు నిజం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో 1995–2004 మధ్య సీఎంగా ఉన్న చంద్రబాబు.. హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో మురళీమోహన్ వంటి బినామీలు, వందిమాగధులతో భారీ ఎత్తున భూములు కొనుగోలు చేయించారు. ఆ తర్వాత హైటెక్ సిటీ పేరుతో ప్రభుత్వ ఖజానా నుంచి మౌలిక సదుపాయాలకు ఖర్చు చేసి బినామీలకు సంపద సృష్టించారు. విభజన తర్వాత 2014 ఎన్నికల్లో గెలిచి, అధికారంలోకి వచ్చాక.. విజయవాడ–గుంటూరు ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేసే చోటు గురించి బినామీలు, వందిమాగధులకు ముందుగా లీకులు ఇచ్చి ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారు. వేలాది ఎకరాల భూములు తక్కువ ధరలకే కొల్లగొట్టారు. ఆ భూ సంపదను రెట్టింపు చేయడానికి రాజధానిగా అమరావతిని చేశారు. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వస్తే.. ప్రభుత్వ ఖజానా నుంచి అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు భారీ ఎత్తున నిధులు ఖర్చు చేసి.. బినామీలు, వందిమాగధులు కాజేసిన భూ సంపదను మరింతగా పెంచడానికి ఎత్తులు వేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రాన్ని, విభజన తర్వాత రాష్ట్రాన్ని 14 ఏళ్లు సీఎంగా చంద్రబాబు పాలించా రు. ఆ 14 ఏళ్లు.. ప్రతి ఏటా రెవెన్యూ లోటే. ఎడాపెడా అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని రుణాల ఊబిలోకి నెట్టిందీ చంద్రబాబే. 2014 నుంచి 2019 వరకు అప్పుల కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్‌రేట్ (సీఏజీఆర్) 21.87 శాతం. కానీ.. సీఎం జగన్ హయాంలో 2019 నుంచి 2024 వరకు చూస్తే అది 12.13 శాతం. దీన్ని బట్టి చంద్రబాబే ఎడాపెడా అప్పులు తెచ్చినట్లు స్పష్టమవుతోంది. 👉: అప్పుల మొత్తాన్ని చూసినా... చంద్రబాబు అధికారంలోకి రాక ముందు అంటే 2014 జూన్ 7 నాటికి రాష్ట్రానికి రూ.1,53,346 కోట్ల అప్పు ఉంటే.. 2019 మే 29 నాటికి అది రూ.4,12,288 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం ఆ అప్పులు రూ.7,03,471 కోట్లకు చేరాయి. 👉: సంపద సృష్టించానని చంద్రబాబు ప్రగల్భాలు పలుకుతున్నారు. కానీ.. వాస్తవానికి చంద్రబాబు హయాం (2014–19)లో మూలధన వ్యయం ఏటా సగటున రూ.15,227 కోట్లు ఖర్చు చేస్తే.. సీఎం జగన్ గత ఐదేళ్లు ఏటా సగటున రూ.17,757 కోట్లు ఖర్చు చేశారు. 👉: జీడీపీలో రాష్ట్ర వాటా చంద్రబాబు హయాంలో సగటున 4.47 శాతం ఉంటే.. సీఎం జగన్ హయాంలో అది 4.83 శాతానికి పెరిగింది. కోవిడ్ లాంటి క్లిష్ట సమయాన్ని కలిపినా 4.83 శాతం మన వాటా ఉందంటే ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందన్నది స్పష్టమవుతోంది. 👉: చంద్రబాబు హయాంలో జీఎస్డీపీలో పన్నుల భారం సగటున 6.57 శాతం ఉంటే.. జగన్ హయాంలో అది 6.35 శాతమే. అంటే.. సీఎం జగన్ హయాంలోనే పన్నుల భారం తక్కువ. ఇది ఆర్బీఐ (రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా), కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) తేల్చిన లెక్క.అప్పుడు అమెరికా అవుతుందా? పేదరిక నిర్మూలనే ధ్యేయంగా.. అవసరమైన మేరకు తక్కువగా అప్పులు చేస్తూ.. ప్రజలపై తక్కువగా పన్నుల భారం మోపుతూ.. ఆరి్థక క్రమశిక్షణ పాటిస్తూ.. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా సీఎం జగన్ పేదల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుంటే రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చేస్తున్నారంటూ చంద్రబాబు, ఎల్లో మీడియా గగ్గోలు పెట్టాయి. ఒకవేళ చంద్రబాబు అధికారంలోకి వచ్చి.. టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్న పథకాలకు ఐదేళ్లలో రూ.8.25 లక్షల కోట్లు ఖర్చు చేస్తే రాష్ట్రం అమెరికా అవుతుందా? అని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు.నిధులు ఎలా తెస్తారో చెప్పండిటీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్న పథకాల అమలుకు ఏటా రూ.1.65 లక్షల కోట్లు అవసరం. ప్రస్తుతం సీఎం జగన్ డీబీటీ, నాన్ డీబీటీ పథకాలకు చేస్తున్న వ్యయం కంటే రూ.92,638 కోట్లు అదనంగా అవసరం. ఈ లెక్కన ఐదేళ్లలో ఆ పథకాల అమలుకు అదనంగా రూ.4,63,189 కోట్లు అవసరం. ఆ నిధులను ఎలా తెస్తారో చంద్రబాబు స్పష్టం చేయాలని ఆర్థిక నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే.. 2014 ఎన్నికల తరహాలోనే ఇప్పుడూ ప్రజలను మోసం చేస్తున్నానని చంద్రబాబు అంగీకరించినట్లేనని స్పష్టం చేస్తున్నారు. -
పేదలకు మంచి చేస్తుంటే వాళ్లు తట్టుకోలేక పోతున్నారు.. కూటమి గెలిస్తే పథకాలు ఆపేస్తారంట..!
-
చంద్రబాబు, పవన్‌కు పొలిటికల్ ట్విస్ట్.. బీజేపీ కీలక ప్రకటన!
సాక్షి, హైదరాబాద్: ఏపీలో ఎన్నికల వేళ కూటమిలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. టీడీపీ, జనసేనకు బీజేపీ ఊహించని షాకిచ్చింది. ముస్లిం రిజర్వేషన్ల రద్దుపై బీజేపీ కట్టుబడి ఉంటుందని.. తెలుగుదేశం, జససేన నిర్ణయాలకు అనుకూలంగా ఉండలేమని బీజేపీ చెప్పకనే చెప్పేసింది.ఇక, ముస్లిం రిజర్వేషన్ల అంశంపై ఇప్పటికే డీప్ ఫేక్ వీడియోల వ్యవహారం సోషల్ మీడియా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ ముస్లిం రిజర్వేషన్లపై ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేసింది. ఈ సందర్భంగా కేంద్ర పార్టీ నిర్ణయాన్ని ఏపీ బీజేపీ మరోసారి పునర్ఘటించింది. ఈ క్రమంలో ముస్లిం రిజర్వేషన్ల రద్దుకే కట్టుబడి ఉన్నామని బీజేపీ స్పష్టం చేసింది. దీంతో.. టీడీపీ, జనసేన నిర్ణయాలకు తాము అనుకూలంగా లేమని బీజేపీ చెప్పకనే చెప్పేసింది. Truth: If BJP comes into power, we will make an end of the unconstitutional Muslim reservations. Meanwhile it's the right of SC, ST & OBC people of Telangana. We will ensure them that they get it. Therefore, We will end the Muslim Reservations.Fake Video: If BJP comes to power,… pic.twitter.com/4OxR8LP9Z9— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) April 30, 2024బాబును నమ్మని బీజేపీ ఈ ఎన్నికల్లో మళ్లీ బీజేపీతో పొత్తుకు చంద్రబాబు వెంపర్లాడినప్పటికీ, ఆ పార్టీ జాతీయ నాయకత్వం తొలుత అంగీకరించలేదు. చంద్రబాబు ఢిల్లీలోని తన ఏజెంట్లు, బీజేపీలో ఉన్న తన అనుంగులు, ఇతరత్రా పైరవీలు చేశారు. అయినా బీజేపీ పెద్దలు ఆయన్ని నమ్మలేదు. ఢిల్లీలో రాత్రింబవళ్లు పడిగాపులు గాసి, కాళ్లా వేళ్లా పడి చిట్టచివరకు పొత్తు పెట్టుకోగలిగారు. బీజేపీ పొత్తయితే పెట్టుకొంది కానీ, చంద్రబాబును ఆ పార్టీ పెద్దలు నమ్మడంలేదన్న విషయం ప్రతి సందర్భంలోనూ బయటపడుతోంది. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన గెలుపే అసాధ్యమైతే, మేనిఫెస్టో విషయంలోనూ మరోసారి అభాసుపాలు కాకూడదని బీజేపీ అధిష్ఠానం భావించింది. దీంతో ఈసారి మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి ఓ పరిశీలకుడిని మాత్రమే పంపి మమ అనిపించింది. కనీసం రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి, పార్టీ రాష్ట్ర నాయకులు కూడా హాజరుకాలేదు.అంతేకాదు.. మేనిఫెస్టోలో కనీసం ప్రధాని మోదీ ఫొటోగానీ, కమలం గుర్తు గానీ ముద్రించేందుకు బీజేపీ పెద్దలు అంగీకరించలేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, హోంమంత్రి అమిత్‌షా, రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఫొటోలు ముద్రించేందుకు కూడా ఒప్పుకోలేదు. అయితే, చంద్రబాబు తెలివిగా మేనిఫెస్టో కాపీలపై మోదీ, ఇతర నాయకుల ఫొటోలు లేకుండా, కమలం గుర్తును మాత్రం వేయించారు. బీజేపీ దీనికీ అంగీకరించలేదు. దాన్ని మార్చాల్సిందేనని పరిశీలకుడు సిద్ధార్థనాథ్‌సింగ్ పట్టుబట్టారు. దీంతో మేనిఫెస్టో ముఖచిత్రంలో అప్పటికప్పుడు మార్పులు చేశారు. -
టచ్ మీ నాట్... దూరం జరగండమ్మా
మొత్తానికి రాష్ట్రంలో టీడీపీ సారధ్యంలో ఏర్పడిన ఎన్డీయే కూటమి మనసులు కలవని బలవంతపు కాపురం అని తేలిపోయింది. తప్పనిసరి తంతు తప్ప అందులో తమకేం పెద్ద పాత్ర లేదని బీజేపీ భావిస్తోంది. అందుకే మీ పాట్లేవో మీరు పడండి... అందులో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి నాయుడుగారు అని స్పష్టంగా చెబుతోంది. వాస్తవానికి టీడీపీ.. జనసేన... బీజేపీల కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టోను విడుదల చేసే కార్యక్రమానికి చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.దీనికి జాతీయ బీజేపీ నేత సిద్దార్థ నాథ్ సింగ్ సైతం ఢిల్లీ నుంచి వచ్చారు. అయితే ఆ మ్యానిఫెస్టో కాపీ మీద ఎక్కడా మోడీ ఫోటో లేదు. కేవలం చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. అంతేకాకుండా ఆ మ్యానిఫెస్టో కాపీని విడుదల చేసే సమయంలో వరుసగా ఈ ముగ్గురు నాయకులూ నిలబడి ఫోటోలకు.. పత్రికలకు ఫోజులిచ్చారు. అయితే ఆ సందర్భంగా ఆ కాపీని చేత్తో పట్టుకుని బాబు, పవన్ పక్కన నిలబడేందుకు సైతం సింగ్ విముఖత చూపించారు. ఎవరో వచ్చి ఆ కాపీని సింగ్‌కు ఇస్తుండగా అక్కర్లేదు.. అంటూ నేను దాన్ని తాకను అనేలా సంజ్ఞ చేసారు. ఆ తరువాత అయన మీడియాతో మాట్లాడుతూ ఈ మ్యానిఫెస్టో ఈ ఇద్దరిదే.. మా బీజెపికి ఏమీ సంబంధం లేదని చెప్పేసారు. అంతేకాకుండా రాష్ట్ర బిజెపి నుంచి సైతం ఈ కార్యక్రమానికి ఎవరూ.. ఆఖరుకు అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం హాజరు కాలేదు. దీంతో ఇది జస్ట్ పవన్... జనసేనల పొత్తు అని తేలిపోయింది.అసలేం జరిగింది ?గతంలో 2014 లో సైతం ఇలాగే మూడు పార్టీలు పొత్తులో ఎన్నికలకు వెళ్లాయి. అప్పుడు చంద్రబాబు దాదాపు ఆరువందల హామీలు ఇచ్చి.. ఆ తరువాత మాటతప్పి.. మ్యానిఫెస్టోను పార్టీ వెబ్సైట్ నుంచి మాయం చేసారు. ఇప్పుడు ఆ మ్యానిఫెస్టోను సీఎం వైఎస్ జగన్ బయటకు తీసి.. ఒక్కో హామీని ప్రజలకు గుర్తు చేస్తూ ఈ హామీ ఇచ్చారు. అమలు చేసారా అక్కా.. రుణమాఫీ చేసారా అన్నా.. పెన్షన్ ఇచ్చారా తాతా.. డ్వాక్రా రుణాలు మాఫీ చేసారా చెల్లి.. ఉద్యోగాలు ఇచ్చారా తమ్ముడూ.. చూడండి ఈ హామీలకు అప్పట్లో మోడీ.. పవన్ సైతం గ్యారెంటీలుగా ఉన్నారు. వాళ్ళ ఫోటోలు సైతం ఉన్నాయ్. మళ్ళీ అలాంటి వాళ్లకు ఓట్లెద్దామా అంటూ ఊరూరా ప్రచారం చేయడంతో.. చంద్రబాబు ఇచ్చే అమలుసాధ్యం కానీ హామీలవల్ల మేమెందుకు ప్రజలకు జవాబుదారీ కావాలి...? మేమెందుకు పరువుపోగొట్టుకోవాలని భావించిన బీజేపీ ఈసారి ఆ హామీల విషయంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయద్దు నాయుడుగారు.. మీరు మీరు.. ఏదోలా తగలడండి అనేసింది. అంతేకాకుండా దానిమీద మోదీ ఫోటో సైతం వేసేందుకు కేంద్రం ఒప్పుకోలేదని తెలిసింది. అందుకే ఈసారి మ్యానిఫెస్టో మీద కేవలం.. చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే ఉన్నాయ్. మరోవైపు బాబు ఇస్తున్న హామీలకు మా కేంద్రానికి, బీజేపీకి ఎలాంటి బాధ్యత లేదని వాళ్ళు తేల్చేశారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్ల విషయంలో కూడా చంద్రబాబు తమను మోసం చేసినట్లు కేంద్రం గుర్తించింది. పీవీఎన్ మాధవ్, జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు వంటివాళ్లకు టిక్కెట్లు ఇవ్వకుండా కేవలం టీడీపీ నాయకులనే బీజెపి నేతలుగా చూపించి టిక్కెట్లు ఇచ్చుకుని అసలైన బీజెపి నేతలను మోసం చేసారని అధిష్టానం గమనించింది. అంటే ఎన్ని చేసినా.. ఎంత చేసినా కుక్కతోక వంకరే అని.. చంద్రబాబులోని మోసపూరిత గుణం మారదని స్పష్టతకు వచ్చిన కేంద్రం.. అసలు ఈ దరిద్రమే మాకువద్దు. మీ చావు మీరు చావండి. మీ ఎన్నికలు.. మ్యానిఫెస్టోలో మాకు ఏమీ సంబంధం లేదని తేల్చేసింది.:::: సిమ్మాదిరప్పన్న -
బయటపడ్డ చంద్రబాబు నిజస్వరూపం
-
టీడీపీకి రెబెల్స్ పోటు.. అయోమయంలో బాబు
-
కూటమిలో కొత్త ట్విస్ట్.. చంద్రబాబుకు షాకిచ్చిన బీజేపీ!
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి రాజకీయం రసవత్తరంగా మారింది. కూటమిలో ఇప్పటికే పలు ట్విస్ట్‌లు చోటుచేసుకోగా.. తాజాగా బీజేపీ సంచలన ప్రకటన చేసింది. బీజేపీ ప్రకటనతో టీడీపీ అధినేత చంద్రబాబుకు కొత్త టెన్షన్ మొదలైంది. కాగా, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గురువారం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలపై దాదాపు గంటకు పైగా చర్చించారు. ఈ క్రమంలోనే ముస్లిం రిజర్వేషన్లపై కూడా వారిద్దరూ చర్చించారు. దీంతో, రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకమని బీజేపీ స్పష్టం చేసింది. ఇక, వీరి సమావేశం అనంతరం విలేకరులు సమావేశంలో పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. తాము ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకమని గోయల్ తేల్చి చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీలకు మాత్రమే తాము అనుకూలమని గోయల్ స్పష్టం చేశారు. ముస్లింలకు మాత్రం రిజర్వేషన్లు ఇచ్చేదేలేదని ప్రకటన చేశారు.అయితే, బీజేపీ ప్రకటన కారణంగా చంద్రబాబుకు కొత్త టెన్షన్ క్రియేట్ అయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ ప్రకటనతో ఏపీలో కూటమికి ముస్లిం ఓటర్లు దూరమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక, ఏపీలో వైఎస్సార్సీపీ మైనార్టీల విషయంలో సామాజిక న్యాయం పాటిస్తోంది. తాజాగా కూటమి నేతల ప్రకటనతో వైఎస్సార్సీపీ గెలుపునకు మరింత అనుకూలంగా మారే అవకాశం ఉందని వారు విశ్లేషిస్తున్నారు. -
టీడీపీకి ఓటేస్తే.. బీజేపీకి వేసినట్టే
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఉనికే లేని బీజేపీని టీడీపీ నెత్తిన పెట్టుకుని మతతత్వ రాజకీయాలకు ఊపిరిపోస్తోందని, ఏపీలో టీడీపీకి ఓటేస్తే.. బీజేపీకి వేసినట్టేనని ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ నాగుల్‌మీరా ఆందోళన వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ అనైతిక పొత్తుపై స్పందించిన ఆయన గురువారం ‘సాక్షి’తో మాట్లాడారు. ఏపీలో టీడీపీ భుజంపై గన్ పెట్టిన బీజేపీ దానిని.. ముస్లిం సమాజంపైకి గురిపెట్టిందన్నారు. సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ చట్టాలతో దేశంలో ముస్లింల ఉనికికే ప్రమాదం తెచ్చిన బీజేపీతో టీడీపీ జత కట్టడం ముస్లి సమాజానికి చేటు తేవడమేనన్నారు. ఉమ్మడి పౌరస్మృతి(యూనిఫామ్ సివిల్ కోడ్) చట్టాన్ని అమలు చేసి ముస్లిం షరీయ చట్టాన్ని కనుమరుగు చేస్తారన్నారు. దీని వల్ల ముస్లిం ఆస్తి పంపకాలు, నిఖా వంటి అనేక కీలక అంశాల్లో ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేశారు. ముస్లింలకు వైఎస్సార్ ఇచి్చన 4 శాతం(బీసీ–ఈ)రిజర్వేషన్‌ను పూర్తిగా ఎత్తివేస్తామని ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, మరో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారని, అదే జరిగితే ఏపీలోనూ ముస్లింల పిల్లలకు విద్య, ఉద్యోగాల్లో తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పారు. ముస్లిం సంప్రదాయమైన హిజాబి(బుర్ఖా)ను పూర్తిగా నిషేధిస్తారని చెప్పారు. వక్ఫ్ చట్టాన్ని రద్దు చేసి ముస్లింల అభ్యున్నతి కోసం ఉన్న వక్ఫ్ ఆస్తులను అన్యాక్రాంతం చేయడానికి బీజేపీ ప్రధాన అజెండాలో టీడీపీ పాలుపంచుకుంటోందని దుయ్యబట్టారు. బీజేపీ–టీడీపీ కూటమి అధికారంలోకొస్తే ముస్లింలపై దేశ ద్రోహం కేసులు పెరుగుతాయన్నారు. సీఎం జగన్ అన్ని విధాలా ముస్లింలను ఆదరించారని చెప్పారు. ఉపముఖ్యమంత్రి, మండలి డిప్యూటీ చైర్మన్, ముగ్గురికి ప్రభుత్వ సలహాదారులుగా అవకాశం ఇవ్వడంతో పాటు ఎంతోమందికి స్థానిక ప్రభుత్వాల్లో అవకాశం కల్పించారన్నారు. జగన్‌తోనే ముస్లిం సమాజానికి భద్రత, మేలు ఉంటాయని నాగుల్ మీరా స్పష్టం చేశారు. -
నన్ను చూడొద్దు..ఎన్డీఏను చూడండి
‘గత 58 నెలల మీ బిడ్డ పాలనలో మీ ఇంటికి మంచి జరిగి ఉంటేనే ఓటు వేసి ఆశీర్వదించండి’. –బస్సు యాత్రలో ప్రజలకు విన్నవిస్తున్న సీఎం వైఎస్ జగన్ ‘నన్ను కాదు.. ఎన్డీఏను చూసి కూటమికి ఓటు వేయండి. కూటమిలో భాగస్వామికాని వైఎస్సార్సీపీకి రెండోసారి అవకాశం ఇవ్వడంలో అర్థం లేదు’. –ప్రజాగళం సభల్లో ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నటీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మీ ఇంట్లో మంచి జరిగిందా.. లేదా? మంచి జరిగి ఉంటేనే నాకు ఓటు వేయండి: సీఎం జగన్ ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం పేరుతో చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా నిర్వహిస్తున్న బహిరంగ సభల్లో గత 58 నెలల పాలనలో సంక్షేమాభివృద్ధి పథకాలు.. సుపరిపాలన వల్ల చేసిన మంచిని వివరిస్తున్నారు. సంస్కరణలతో విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో అగ్రభాగాన నిలపడం గురించి స్పష్టికరిస్తున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో జట్టుకట్టి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు చేసిన మోసాలు, అరాచకాలను ఎండగడుతున్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో వేరుపడిన చంద్రబాబు.. ఇప్పుడు మళ్లీ వాటితో కలిసి మోసం చేయడానికి వస్తున్నారని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మీ బిడ్డ పాలనలో మీ ఇంటికి మంచి జరిగి ఉంటేనే ఓటు వేసి ఆశీర్వదించాలని వినమ్రంగా కోరుతున్న సీఎం జగన్‌కు జనం అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. సాక్షి, అమరావతి: ప్రజాగళం సభల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రజలకు చేస్తున్న విజ్ఞప్తిని పరిశీలిస్తే.. రాష్ట్రంలో 2014–19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు ఆయన ప్రజలకు చేసిందేమీ లేదని అంగీకరించినట్లు స్పష్టమవుతోంది. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో పది శాతం కూడా అమలు చేయకుండా ప్రజలను వంచించారు. ఇటు ప్రజలకు.. అటు రాష్ట్రానికి చేసిన మంచేమీ లేకపోవడంతో తన పరిపాలనను చూసి ఓటు వేయాలని అడిగే నైతికతను చంద్రబాబు కోల్పోయారు. అందుకే తన పరిపాలనను చూసి కాకుండా, ఎన్డీఏకు ఓటు వేయాలని చంద్రబాబు కోరుతుండటం చర్చనీయాంశమైంది. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. మద్య నిషేధానికి మంగళం పాడి, రూ.2కే కిలో బియ్యాన్ని రూ.5.50కు పెంచేసి అప్పట్లో మోసం చేశారు. మొన్నటికి మొన్న.. విభజన నేపథ్యంలో 2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో జట్టు కట్టిన చంద్రబాబు.. 650కి పైగా హామీలిచ్చి కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు నేతృత్వంలో 2014 జూన్ 8న కొలువుదీరిన సర్కార్ మాటలతో మాయ చేస్తూ పాలన సాగించింది. చంద్రబాబు, మోదీ, పవన్ కల్యాణ్ ఫొటోలతో, చంద్రబాబు సంతకం చేసి మరీ ఇంటింటికీ లేఖలు పంపి ఇచ్చిన ప్రధాన హామీల్లో రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేయకుండా వంచించారు. రూ.14,205 కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీ చేయకుండా అక్క చెల్లెమ్మలను బాబు దగా చేశారు. ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతిగా నెలకు రూ.2 వేలు చొప్పున ఇస్తామని నమ్మబలికి యువతను మోసగించారు. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయకుండా వంచించారు. బీసీ సబ్ ప్లాన్ కింద ఏడాదికి రూ.పది వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు వ్యయం చేస్తామని చెప్పి, ఆనక మాట తప్పి బలహీన వర్గాలకు వెన్నుపోటు పొడిచారు. అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం, పక్కా ఇళ్లు కట్టిస్తామని చెప్పి ఏ ఒక్కరికీ ఇంటి స్థలం ఇవ్వకుండా వంచించారు. పవర్ లూమ్స్, చేనేత రుణాలు మాఫీ చేయకుండా మోసం చేశారు. అరకొరగా ఇచ్చే సంక్షేమ పథకాల ఫలాలు దక్కాలంటే తమకు లంచాలు ఇవ్వాల్సిందేనంటూ నాడు జన్మభూమి కమిటీలు అరాచకం సృష్టించాయి. వీటన్నింటిని గుర్తించిన జనం.. 2019 ఎన్నికల్లో కేవలం 23 శాసనసభ స్థానాలకే టీడీపీని పరిమితం చేసి చంద్రబాబుకు విశ్వసనీయ లేదని చాటి చెప్పారు. పది నెలల క్రితం రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడులో బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో సూపర్ సిక్స్ పథకాలంటూ ప్రకటించిన మినీ మేనిఫోస్టును జనం పట్టించుకోకపోవడం ద్వారా చంద్రబాబుకు విశ్వసనీయత లేదని మరోమారు నిరూపించారు. వీటన్నింటి వల్ల ఇప్పుడు తనను చూసి కాకుండా, ఎన్డీఏకు ఓట్లు వేయాలని ప్రజలను అభ్యరి్థంచడం ద్వారా తనకు విశ్వసనీయత లేదని చంద్రబాబు ఒప్పేసుకున్నట్లయిందని రాజకీయ పరిశీలకులు విశ్లేసిస్తున్నారు. విషయం లేకే బాబు విన్యాసాలు బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని భావించి, గత ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి వేరుపడిన చంద్రబాబు.. ప్రధాని నరేంద్ర మోదీని వ్యక్తిత్వహననం చేస్తూ తిట్ల పురాణం అందుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా అధికారంలోకి రావాలనే నెపంతో పవన్ కళ్యాణ్‌ను వేరుగా పోటీ చేయించారు. కానీ.. ఇప్పుడు ప్రజా క్షేత్రంలో వైఎస్ జగన్‌ను ఒంటరిగా ఎదుర్కోవడం అసాధ్యమని గ్రహించి.. ఉనికి చాటుకోవడానికి బీజేపీ, జనసేనతో చంద్రబాబు మళ్లీ జట్టుకట్టారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీఏకు ఓటు వేయాలని అభ్యర్థిస్తూనే.. కూటమిలో భాగస్వామికాని వైఎస్సార్సీపీని రెండోసారి గెలిపించి చాన్స్ ఇవ్వడంలో అర్థం లేదంటూ విచిత్ర విన్యాసాలకు తెరతీశారు. తాను అధికారంలో ఉన్నప్పుడు కమీషన్ల కక్కుర్తితో పోలవరం నిర్మాణ బాధ్యతల కోసం ప్రత్యేక హోదాను 2016 సెపె్టంబరు 7న కేంద్రానికి తాకట్టు పెట్టారు. ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరిస్తూ సంతకం చేశారు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీతోనే రాష్ట్రానికి ప్రయోజనమంటూ బుకాయించారు. కమీషన్ల కోసం పోలవరంలో చంద్రబాబు విధ్వంసం సృష్టించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పోలవరాన్ని కమీషన్ల కోసం ఏటీఎంగా మార్చుకున్నారని ప్రధాని మోదీ అప్పట్లో మండిపడటం ఎవరూ మరచిపోలేదు.నాడు కేంద్రానికి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన చంద్రబాబే.. ఇప్పుడు 22 మంది లోక్‌సభ సభ్యులు ఉన్న వైఎస్సార్సీపీ ప్రత్యేక హోదాను సాధించలేక పోయిందని ఆరోపించడం రాజకీయ పరిశీలకులను విస్మయానికి గురిచేస్తోంది. విషయం లేకే చంద్రబాబు ఇలాంటి విచిత్ర విన్యాసాలకు తెరతీశారని వ్యంగోక్తులు విసురుతున్నారు. -
April 17th: ఏపీ ఎన్నికల సమాచారం
April 17th AP Elections 2024 News Political Updates.. 09:32 PM, Apr 17th, 2024 కృష్ణాజిల్లా: చంద్రబాబు, పవన్‌లకు షాక్ మచిలీపట్నం వారాహి విజయభేరి సభలో చంద్రబాబు పవన్‌లకు షాక్ సభను పట్టించుకోకుండా మద్యం షాపులకు క్యూ కట్టిన జనసేన, టీడీపీ శ్రేణులు మందేసి చిల్ అవుతున్న ఇరుపార్టీల కార్యకర్తలు చంద్రబాబు మాట్లాడుతుండగానే వెళ్లిపోతున్న పసుపు క్యాడర్ 07:24 PM, Apr 17th, 2024 కుటుంబాల్లో చిచ్చు పెట్టడంలో చంద్రబాబు దిట్ట: వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్‌రెడ్డి చంద్రబాబు నీచమైన ఆలోచనలు చేసే వ్యక్తి కుటుంబాల్లో చిచ్చు పెట్టడంలో చంద్రబాబు దిట్ట షర్మిల, సునీతను చంద్రబాబు ట్రాప్ చేశాడు చంద్రబాబు స్క్రిప్ట్‌నే వాళ్లు చదువుతున్నారు అవినాష్‌రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు సిట్ దర్యాప్తును సీబీఐ పరిగణనలోకి తీసుకోలేదు తనకు నచ్చిన వాళ్ల దగ్గరే సీబీఐ వాంగ్మూలం తీసుకుంది రాజశేఖర్ అనే వ్యక్తిని హత్య జరిగే ముందురోజే కాణిపాకం పంపారు చెవ్వులు వినపడని రంగన్నను ఇంటి వద్ద ఉంటారు వివేకా హత్య డ్రామా ప్లే చేసిందే సునీత, రాజశేఖర్‌రెడ్డి షర్మిల కడపలోనే ఎందుకు పోటీ చేస్తోంది? షర్మిలకు డబ్బులు ఇచ్చేందుకే బాబు టికెట్లు అమ్ముకుంటున్నాడు 06:23 PM, Apr 17th, 2024 మేమంతా సిద్ధం బస్సు యాత్ర రేపటి షెడ్యూల్ మేమంతా సిద్ధం - 17వ రోజు గురువారం (ఏప్రిల్ 18) షెడ్యూల్ సీఎం జగన్ ఉదయం 9 గంటలకు తేతలి రాత్రి బస నుంచి బయలుదేరుతారు. తణుకు, రావులపాలెం, జొన్నాడ మీదుగా పొట్టిలంక చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. కడియపులంక, వేమగిరి, మోరంపూడి జంక్షన్, తాడితోట జంక్షన్, చర్చి సెంటర్, దేవి చౌక్, పేపర్ మిల్ సెంటర్ దివాన్ చెరువు, రాజానగరం మీదుగా ST రాజపురం రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. 06:19 PM, Apr 17th, 2024 జుగుప్సాకరంగా బాలకృష్ణ వ్యాఖ్యలు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫైర్ బాలకృష్ణ, లోకేష్, ఎల్లో మీడియా కోడ్ ఉల్లంఘనపై ఈసీకి ఫిర్యాదు చేశాం బాలకృష్ణ వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయి సీఎం ఇమేజ్‌ని డామేజ్ చేసేలా బాలకృష్ణ మాట్లాడారు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు ఈసీకి ఫిర్యాదు చేసినా టీడీపీ నేతల తీరు మారలేదు బుద్ది లేకుండా అసభ్యకర పదజాలం వాడుతున్నారు హిందుపురం మొహం చూడని బాలకృష్ణ స్వర్ణాంధ్ర యాత్ర చేయటం సిగ్గుచేటు సీఎస్‌పై తప్పుడు కథనాలు రాయటం సరికాదు ఎన్నారైలు పేదల ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు ఎన్నారైల తీరును ఖండిస్తున్నాము ఎన్నారైలు రాష్ట్రంపై ప్రేమతో సేవ చేయాలి రాజకీయ ప్రయోజనాలకు సహకరించటం సరికాదు 06:11 PM, Apr 17th, 2024 ప్రశాంత్ కిశోర్ పై బెంగాల్ సీఎం మమతాబెనర్జీ కీలక వ్యాఖ్యలు చంద్రబాబు కోసం ప్రశాంత్ కిశోర్ పని చేస్తున్నారు దీనిపై నాకు స్పష్టమైన సమాచారం ఉంది బాబు, బీజేపీని గెలిపించేందుకు ప్రశాంత్ కిశోర్ పని చేస్తున్నారు ప్రస్తుతం నా కోసం ప్రశాంత్ కిశోర్ పని చేయడం లేదు ప్రశాంత్ కిశోర్ కు ఏవో సమస్యలున్నాయి ఇటీవలే చంద్రబాబును కలిసిన ప్రశాంత్ కిశోర్ బాబును కలిశాక కూటమి గెలుస్తుందంటూ ప్రశాంత్ కిశోర్ ప్రచారం మమతా వ్యాఖ్యలతో స్పష్టమైన చంద్రబాబు, ప్రశాంత్ కిశోర్ బంధం 05:18 PM, Apr 17th, 2024 సీఎం హత్యాయత్నం కేసు విచారణ.. చంద్రబాబుకు ఎందుకీ ఉలిక్కిపాటు? చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కనుమూరి రవిచంద్రా రెడ్డి మండిపాటు బోండా ఉమాని ఇరికించే ప్రయత్నం జరుగుతుందని చంద్రబాబు గగ్గోలు పెడుతున్నాడు అసలు బోండా ఉమా ఈ కేసులో ఉన్నాడని మికేలా తెలుసు? అంటే సీఎం జగన్ పై దాడి చేయించింది మిరే అని అంగీకరిస్తున్నారా..? చంద్రబాబుకి ఈ కేసులో విచారణ తన వరకు వస్తుందని భయపడుతున్నాడా? సీఎం జగన్‌కి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఇలాంటి చర్యలకు చంద్రబాబు దిగజారుతున్నాడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి జనాదరణ లేక ఇలా తెగిస్తున్నారు మూడు పార్టీలకు ఎల్లో మీడియా తోడై తప్పుడు ప్రచారం చేస్తున్నారు రామోజీరావు మార్గదర్శి స్కాం సొమ్ము కాపాడుకునేందుకు చంద్రబాబుకి కొమ్ము కాస్తున్నాడు సీఎం జగన్‌కి బస్సు యాత్రలో జనం బ్రహ్మరథం పడితే చూసి ఓర్వలేకపోతున్నారు చంద్రబాబు 14 ఏళ్లు ఏం చేశాడో చెప్పుకోలేకపోవడం సిగ్గుచేటు ఎన్నికలకు ముందే టీడీపీ దివాలా తీసేసింది సీఎం జగన్‌పై దాడి కేసులో అసలు దొంగ చంద్రబాబు అని అర్థమవుతోంది బోండా ఉమని విచారించకుండానే చంద్రబాబు మాట్లాడుతున్నాడు దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు చంద్రబాబు మాట్లాడుతున్నాడు 05:02 PM, Apr 17th, 2024 ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలి: ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికారు 2015లో ఓటుకు నోటు కేసు జరిగింది 2017లో సుప్రీం కోర్టులో కేసు వేశాను గత ఐదు నెలల్లో చిన్న చిన్న కారణాలతో కేసు వాయిదా కోరారు రేపు కేసు విచారణ జరగబోతుంది అన్ని సాక్షాలు ఉన్నా కేసు విచారణ ఆలస్యం కావడం తప్పుడు సంకేతాలు పంపుతుంది ఏడేళ్లయినా విచారణ జరగకపోతే ఇక సామాన్యులకు న్యాయం అందుతుందా? ఓటు కు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికారు తెలంగాణ ఏసిబి ఈ కేసును సరిగా విచారణ చేయడం లేదు అందుకే సీబిఐ ఈ కేసు దర్యాప్తు చేయాలి ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలి ఇవి కాక మరో మూడు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి మత్తయ్య, సెబాస్టియన్ కూడా దీనిపై సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు అలాగే మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్ కూడా ఈ కేసును మధ్యప్రదేశ్ కు బదిలీ చేయాలని సుప్రీం కోర్టును కోరారు ఈ కేసులో సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది ఇన్ని కేసులున్నా, చంద్రబాబు సిగ్గు లజ్జా లేకుండా బుకయిస్తున్నారు ఏడేళ్లయినా చిన్న కారణాలతో సాగదీస్తున్నారు రెడ్ హ్యాండెడ్‌గా ఆడియో, వీడియోలో దొరికినా దొరలా తిరుగుతున్నారు నోట్ల కట్టలతో దొరికిన వ్యక్తి తెలంగాణ సీఎం అయ్యారు నోట్లు పంపిన వ్యక్తి సీఎం కావాలని తిరుగుతున్నారు అన్ని సాక్ష్యాలు ఉన్నా కేసు ఆలస్యం అయితోంది ముద్దాయి ఎవరో అందరికీ తెలిసినా దర్జాగా తిరుగుతున్నారు ఇకనైనా న్యాయ వ్యవస్థపై నమ్మకం కలిగేలా సంకేతాలు ఉండాలి ఓటుకి నోటుకు సంబంధించి ఐదు కేసులు సుప్రీంకోర్టులో ఉన్నాయి. అయిదు కోట్లకి బేరం కుదుర్చుకుని, యాభై లక్షలు రేవంత్ ఇస్తూ పట్టుబడ్డారు కేసీఆర్ ప్రభుత్వం ఇన్నాళ్లు ఈ కేసులో ఆలస్యం చేసింది ఇప్పుడు మాత్రం కేసు బదిలీ అడుగుతున్నారు రాజకీయ స్వార్థంతో కేసు గురించి పట్టించుకోలేదు 03:57 PM, Apr 17th, 2024 రేపటి నుంచే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం రేపు ఉదయం 9 గంటలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల రేపు నాలుగో విడత లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో 96 ఎంపీ స్థానాలకు ఎన్నికలు రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ, 25 నామినేషన్లకు చివరి తేదీ 26న నామినేషన్ల పరిశీలన, 29న విత్‌డ్రాకు గడువు, మే 13న పోలింగ్ 02:52 PM, Apr 17th, 2024 అమరావతి : జనసేన అభ్యర్థులకు బీఫారాలు అందజేసిన పవన్ తొలి బీఫాంను నాదెండ్ల మనోహర్ కు అందజేసిన పవన్ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు బీఫారాలు అందజేసిన పవన్ పాలకొండ అభ్యర్థి జయకృష్ణ గైర్హాజరు ఈ ఎన్నికలు అత్యంత కీలకమన్న పవన్ క్షేత్రస్థాయిలో ప్రతిఒక్కరు పర్యటనలు, ప్రచారం చేయాలని విజ్ఞప్తులు బీజేపీ, టీడీపీ నేతలు కలిసి రావడం లేదన్న అభ్యర్థులు ఎలాగైనా కలుపుకుని ముందుకెళ్లాలని సూచన 02:47 PM, Apr 17th, 2024 కుప్పంలో ఈనెల 19న చంద్రబాబు నామినేషన్ చంద్రబాబు తరపున నామినేషన్ వేయనున్న భువనేశ్వరి 19న మ.12.33 గంటలకు చంద్రబాబు తరపున నామినేషన్ 02:45 PM, Apr 17th, 2024 బాలకృష్ణ పై మండిపడ్డ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి నా పై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలి నేను మద్యం, ఇసుక వ్యాపారం చేస్తున్నట్టు దమ్ముంటే బాలకృష్ణ నిరూపించాలి బాలకృష్ణ ఇసుకవ్యాపారం చేస్తున్నారని నేనూ ఆరోపిస్తా ప్రజల ఆశీస్సులతో నాలుగోసారి గెలుస్తా: బాలనాగిరెడ్డి 02:40 PM, Apr 17th, 2024 మళ్లీ జగనే ఏపీ నెక్ట్స్ సీఎం : హీరో విశాల్ ప్రజల కోసం పనిచేసే వ్యక్తి జగన్ వేల కిలో మీటర్ల పాదయాత్రతో ప్రజల కష్టాలను దగ్గరగా చూశారు విద్య విషయంలో ఏపీ సూపర్ విద్యార్థులకు మంచి ప్లాట్‌ఫామ్ ఇస్తున్నారు: హీరో విశాల్ 02:36 PM, Apr 17th, 2024 రాజమండ్రిలో ఎల్లుండి ఎంపీ అభ్యర్థిగా పురంధేశ్వరి నామినేషన్ ఎల్లుండి మధ్యాహ్నం 1:30 గంటలకు నామినేషన్ వేయనున్న పురంధేశ్వరి 02:35 PM, Apr 17th, 2024 సీఎం జగన్ పై దాడి ఘటనలో బోండా ఉమ పాత్ర ఉండొచ్చు కేశినేని నాని విజయవాడ : బోండా ఉమ ఒక రౌడీ షీటర్ విజయవాడలో బోండా ఉమ ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు బోండా ఉమ కాళకేయుడు, కీచకుడు: కేశినేని నాని 02:32 PM, Apr 17th, 2024 రేపు మంగళగిరిలో నారా లోకేష్ నామినేషన్ అమరావతి: కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న నారా లోకేష్ రేపు ఉదయం 9 గంటలకు శ్రీసీతారాముల ఆలయం నుంచి ర్యాలీ భారీగా జనసమీకరణ చేయాలని పార్టీ నేతలకు విజ్ఞప్తి మంగళగిరి కాకపోతే చుట్టు పక్కల నుంచి తీసుకురావాలని పార్టీ అధిష్టానం సూచనలు 02:30 PM, Apr 17th, 2024 ఢిల్లీ: రేపు సుప్రీం కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని, దర్యాప్తు సీబిఐకి అప్పగించాలని పిటిషన్ పిటిషన్లు దాఖలు చేసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గత విచారణలో వాయిదా కోరిన చంద్రబాబు న్యాయవాది సిద్దార్థ లుత్రా విచారణ జరపనున్న జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఎస్.వి.ఎన్ భట్టి ధర్మాసనం 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు ఎర చూపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన బాబు ఈ వ్యవహారాన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న తెలంగాణ ఏసీబీ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని ప్రలోభ పెట్టిన చంద్రబాబు ఫోన్లో మాట్లాడిన ఆడియో బయటపెట్టిన ఏసీబీ "మనోళ్లు బ్రీఫ్డ్ మీ" వాయిస్ చంద్రబాబుదేనని నిర్ధారించిన ఫోరెన్సిక్ 01:00 PM, Apr 17th, 2024 అనపర్తి సీటుకు టీడీపీ ఎసరు ? బీజేపీ కోటలో ఉన్న సీటును మార్చేందుకు టీడీపీ ప్రయత్నాలు మాజీ సైనిక ఉద్యోగికి ఇచ్చిన సీటును మార్చవద్దని అధిష్టానానికి ఫిర్యాదులు అనపర్తి సీటును మార్చే ప్రయత్నాలను ఆపాలని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఫిర్యాదు చేసిన మాజీ సైనిక ఉద్యోగ సంఘాలు ఎక్స్ సర్వీస్ మెన్ ఎమ్మెస్ఆర్కే.రాజు కు ఇచ్చిన సీటును మారిస్తే దేశవ్యాప్తంగా మాజీ సైనిక ఉద్యోగులను అవమానించినట్లు అవుతుందని ఫిర్యాదులు 12:00 PM, Apr 17th, 2024 రాయచోటి లో టీడీపీకి భారీ షాక్. మాజీ మునిసిపల్ వైస్ చైర్మన్ ఇందాదుల్లాతో సహ పలు కీలక నాయకులు మైనారిటీ నాయకుడు హబీబుల్లా ఖాన్ ఆధ్వర్యంలో టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరిక. కొత్తగా వైఎస్సార్సీపీలోలో చేరిన నాయకులకు ఖండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎంఎల్ఏ రమేష్ కుమార్ రెడ్డిలు. సీఎం జగన్ పాలన నచ్చింది, ఎంతగానో ఆకట్టుకుంది, జగన్ వెంట నడవాలని పార్టీ లో చేరామంటున్న నూతన నేతలు. 11:00 AM, Apr 17th, 2024 రాష్ట్రాన్ని దోచుకున్న ఘనత చంద్రబాబుది: పెద్దిరెడ్డి పుంగనూరు నియోజకవర్గం లో కొనసాగుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం. పులిచర్ల మండలంలో నేడు 12 పంచాయతీల్లో మంత్రి పర్యటన. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, ఎంపిగా మిథున్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన మంత్రి. పుంగనూరు నియోజకవర్గం లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశాం: పెద్దిరెడ్డి ఇంకా కొన్ని పనులు చేయాల్సి ఉంది. గండికోట నుండి నీరు ఇచ్చేందుకు సీఎం వైఎస్ జగన్ మనకు ఇక్కడ మూడు ప్రాజెక్టులు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. చంద్రబాబు నాయుడు కోర్టుకు వెళ్లి ఆ ప్రాజెక్టులను అడ్డుకున్నారు. త్వరలో ఆ పనులు పూర్తి చేసి, ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు అందిస్తాం గతంలో ఎన్నడూ లేని విధంగా పుంగనూరు నియోజకవర్గం అభివృద్ధి చేయగలిగాం. మన నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ సాధించే విధంగా మనమంతా కృషి చేయాలి. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన ఎన్నికల హామీలు అన్ని పూర్తి చేశారు. చంద్రబాబు 2014లో 100 పేజీల మేనిఫెస్టో, 600 హామీలు ఇచ్చారు. అందులో ఏ ఒక్కటి కూడా చంద్రబాబు అమలు చేయలేదు. ఐదేళ్లు తాత్కాలిక రాజధాని నిర్మాణం అని సొంత అజెండాతో చంద్రబాబు పనిచేశారు. కరోనాతో రెండేళ్లు పోయినా హామీలు అమలు చేసిన ఘనత వైఎస్ జగన్‌ది. నేడు సూపర్ సిక్స్, మీ భవిష్యత్తు కు నా గ్యారంటీ అంటూ మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు సిద్దమయ్యాడు. సంక్షేమ పథకాలు ఇస్తే రాష్ట్రం శ్రీలంక అవుందన్న చంద్రబాబు హామీలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఎన్నికలు కోసం చంద్రబాబు అమలు చేయడం వీలుకాని హామీలు అన్ని ఇస్తున్నారు. కేవలం పేదరికాన్ని కొలమానంగా తీసుకుని పథకాలు అందించిన గొప్ప ముఖ్యమంత్రి వైఎస్ జగన్. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు వారికి కావాల్సిన వారికి మాత్రమే పథకాలు, లబ్ది అందించేవారు. సిఎం వైఎస్ జగన్ ఆలోచన వలన ప్రతి ఇంటికి నేడు నేరుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. పాఠశాల విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందిస్తున్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా 25 లక్షల వరకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా మిథున్ రెడ్డి ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నా. వైఎస్ జగన్ లాంటి గొప్ప ముఖ్యమంత్రిని గతంలో ఎప్పుడూ చూడలేదు. మన కోసం శ్రమించే వైఎస్ జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలి 10:20 AM, Apr 17th, 2024 దేవినేని నెహ్రు పేదల కోసం పనిచేశారు: దేవినేని అవినాష్ దశాబ్దాలుగా దేవినేని నెహ్రూతో సన్నిహితంగా ఉండే నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది నెహ్రూ జీవితాంతం పేద ప్రజల కోసం పని చేశారు ఎన్టీఆర్ ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చి వైఎస్సార్‌తో కలిసి ప్రజాసేవ చేశారు నెహ్రూ చేసిన మంచిపనులు చిరస్థాయిగా నిలిచిపోయాయి కొండ ప్రాంతాల ప్రజలు నెహ్రును ఎప్పటికీ మరిచిపోయారు నెహ్రూ ఆశయ సాధన కోసం, రాబోయే రోజుల్లో మరింత కష్టపడి పనిచేస్తాం చనిపోయి ఏడేళ్లయినా నెహ్రూ మీద అభిమానం అందరికి అలాగే ఉంది నెహ్రూ అభిమానులకు నెహ్రూ కుటుంబంగా ఎల్లప్పుడు అండగా ఉంటాం 09:40 AM, Apr 17th, 2024 రేపటి నుంచి నామినేషన్ల పర్వం షురూ.. రేపటి నుంచే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ప్రారంభం రేపు నాలుగో విడత లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ షురూ రేపు ఉదయం 9 గంటలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల ఏపీ , తెలంగాణ సహ పది రాష్ట్రాలలో 96 ఎంపీ సీట్లకు నాలుగో విడత లో ఎన్నికలు ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ 26 నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 29 నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం మే 13న పోలింగ్ 08:30 AM, Apr 17th, 2024 కూటమిలో ఇంకా కొలిక్కిరాని సీట్ల పంచాయితీ.. కూటమి సీట్లపై ఇప్పటికీ అయోమయంలో చంద్రబాబు రఘురామకృష్ణరాజు కోసం రకరకాల విన్యాసాలు నర్సాపురం ఎంపీ లేదా ఉండి అసెంబ్లీ స్థానాల్లో ఒకటి ఇవ్వాలని ప్రయత్నాలు నర్సాపురం నుంచి బీజేపీని తప్పించడానికి ప్రత్యామ్నాయాలు ఏలూరు ఎంపీ అభ్యర్థిని మారుస్తారనే ప్రచారం దెందులూరు, అనపర్తి, మాడుగల స్థానాలపైనా లీకులు మరికొన్ని స్థానాల్లోనూ మార్పు తథ్యమని హడావుడి నామినేషన్ల పర్వం మొదలవుతున్నా ఇంకా రాని స్పష్టత 07:20 AM, Apr 17th, 2024 రొయ్యకు మీసం.. బాబుకు మోసం పుట్టుకతోనే వచ్చాయ్: సీఎం జగన్ చంద్రబాబుకు పది మంది సేనానులు.. మీ గురి ఎవరిపై?.. భీమవరం మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ ప్రజలకు అందుతున్న పథకాలు, వ్యవస్థలపై బాణాలా? నేను ఒక్కడినే కానీ ఒంటరిని కాదు.. నాకు తోడుగా పేదల సైన్యం రాష్ట్రమంతటా కోట్ల హృదయాలు జగన్‌ను కోరుకుంటున్నాయి రొయ్యకు మీసం.. బాబుకు మోసం పుట్టుకతోనే వచ్చాయ్ బాబుకు – అభివృద్ధికి ఏం సంబంధం? అంతా సెల్ఫ్ డబ్బా.. సింగపూర్ కట్టాడా? మైక్రోసాఫ్ట్ తెచ్చాడా? బుల్లెట్ ట్రైను తెచ్చాడా? కొత్త పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు తెచ్చాడా? జిల్లాకో హైటెక్ సిటీ కనిపించిందా? బాబు రిపోర్ట్ అంతా బోగస్.. మన ప్రోగ్రెస్ రిపోర్ట్ మీరే చూడండి కొంగ జపం ఎందుకని నిలదీస్తే నాపై శాపనార్థాలు.. కోపంతో ఊగిపోతున్నారు దత్తపుత్రుడు కార్లు, భార్యల మాదిరిగా నియోజకవర్గాలనూ మారుస్తున్నాడు నిన్ను మిగతా వాళ్లూ అనుసరిస్తే అక్కచెల్లెమ్మల బతుకులు ఏం కావాలి? 07:00 AM, Apr 17th, 2024 ఏపీలో ఫ్యాను గాలి ప్రచండం.. ఏ ఊళ్లో ఏ నోట విన్నా ఈ మాటే జాతీయ మీడియా, పొలిటికల్ కన్సల్టెన్సీ సర్వేలదీ అదే మాట రాజకీయ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులదీ ఆ మాటే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వైఎస్సార్సీపీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ బస్సు యాత్రలో జగన్‌కు అడుగడుగునా నీరాజనాలు పలుకుతుండటమే తార్కాణం జనసేన, బీజేపీతో జత కలిసిన టీడీపీకి మరోసారి ఘోర పరాభవం ఖాయం సీఎం జగన్‌పై నమ్మకమే వైఎస్సార్సీపీ చారిత్రక విజయానికి బాట చంద్రబాబు మోసకారి కావడం వల్లే ఘోర ఓటమి బాటలో కూటమి 06:50 AM, Apr 17th, 2024 ఓ భూం.. భూమి స్వాహా! భూ‘దండు’ పాళ్యం బ్యాచ్–3 కర్త, కర్మ, క్రియ చంద్రబాబే.. అమరావతి భూ దోపిడీలో చినబాబూ సూత్రధారే తెరవెనుక పాత్రధారులుగా బాబు అండ్ కో బినామీ పేర్లతో పేదల భూములపై పచ్చదండు దాడి రాజధాని లీక్స్‌తో రూ.2 లక్షల కోట్ల భూ దురాక్రమణ నారాయణ, లింగమనేని, సుజనా, ప్రత్తిపాటి, ధూళిపాళ్ల దోపిడీ లీలలు.. కొమ్మాలపాటి, కోడెల,పయ్యావుల, మురళీ మోహన్ల భూ దందా 06:45 AM, Apr 17th, 2024 అవినీతిలో మేటి పత్తిపాటి.. సీసీఐలో పత్తి కొనుగోలు పేరిట రూ.650 కోట్లు హాంఫట్ మాజీ మంత్రి ప్రత్తిపాటి అక్రమాల చిట్టా యడవల్లిలో దళితుల భూముల కాజేతకు కుట్ర రేషన్ బియ్యం మాఫియా కింగ్‌గానూ పేరు తక్కువ ధరకు అగ్రిగోల్డ్ భూముల స్వాదీనం భార్య వెంకాయమ్మ పేరుతో రిజిస్ట్రేషన్ 06:40 AM, Apr 17th, 2024 పవన్ కళ్యాణ్ తడి గుడ్డతో గొంతు కొస్తారని తెలిసిపోయింది: వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్ నగరాల సామాజిక వర్గానికి చెందిన ప్రజలంతా నాకు కూటమిలో సీటు వస్తుందని అనుకున్నారు డిల్లీ నుండి ఊడిపడిన సుజనా చౌదరి ఎప్పుడూ వార్డు మెంబర్‌గా కూడా పోటీ చేయలేదు అవకాశాలు, కేసులను బట్టి సుజనా పార్టీ మారిపోయాడు బ్యాంకులను కొల్లగొట్టిన సుజనా చౌదరి కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిలబడ్డారు సుజానాకు పశ్చిమ సీటు ఇచ్చారు ఇప్పుడు నేను సామాన్యుడైన అసిఫ్ వైపు నిలబడాలా.. సుజనా వంటి కార్పొరేట్ శక్తి వైపు నిలబడాలా? టీడీపీ, జనసేన బ్రోకర్లు నా ఇంటికి వచ్చినపుడు నేను తిరస్కరించాను నగరాల ఆత్మ గౌరవం కోసం నేను సుజనాను వ్యతిరేకించాను సీఎం జగన్ నగరాలకు మేయర్, దుర్గగుడి చైర్మన్, శ్రీశైలం లో 50సెంట్ల భూమి ఇచ్చారు బీసీలకు గుర్తింపు ఇచ్చారు, నగరాల కార్పొరేషన్ ఏర్పాటు చేశారు అనేక పదవులు, గౌరవం, గుర్తింపు ఇచ్చిన సీఎం జగన్ వైపు ఉండాలా.. రాత్రికిరాత్రి సుజనా ను దింపిన కూటమి వైపు ఉండాలా పవన్ కళ్యాణ్ తడి గుడ్డతో గొంతు కొస్తారని తెలిసిపోయింది టీడీపీలో ఆ సామాజిక వర్గానికి తప్ప ఎవరికీ అవకాశం ఉండదని తెలిసింది వైఎస్సార్సీపీలో చేరిన నాలుగు రోజులకే సీఎం జగన్ నన్ను బస్సు యాత్రలో పలకరించి బస్సులోనికి రమ్మన్నారు అభ్యర్థులతో పాటు నన్ను కూడా బస్సు పైకి ఎక్కించారు వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆసిఫ్‌ని గెలిపించాలి లేని గ్లాసు గుర్తు కోసం జనసేన నాయకులు తాపత్రయ పడుతున్నారు సుజనా లోకల్ కాదు.. నేను లోకల్, ఆసిఫ్ లోకల్ సుజనా పేద ప్రజల మనిషి కాదు.. ప్రైవేట్ జెట్లలో తిరిగే వ్యక్తి 06:40 AM, Apr 17th, 2024 సీఎం జగన్ అంటే ప్రజలకు ఒక నమ్మకం: వంగా గీతా రాజకీయ నాయకులంటే గౌరవం పోయింది..ప్రభుత్వాలంటే నమ్మకం పోయింది. సంక్షేమ పధకాలు రాజకీయ నాయకులు...అధికారుల చట్రంలో ఉండేవి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పేదల కోసం సచివాలయం,వాలంటీర్ వ్యవస్ధను తీసుకువచ్చింది ఒక్క సిఎం జగనే కుల మతాలు..పార్టీలు చూడకుండా శాచురేషన్ పద్దతిలో అర్హులకు సంక్షేమ పధకాలు అందించారు. మళ్ళీ వచ్చే ప్రభుత్వం వైఎస్ఆర్ సిపిదే పిఠాపురంలో కూడా గెలుపు వైఎస్సార్సీపీదే -
పురందేశ్వరికి కొత్త ట్విస్ట్.. రూట్ మార్చిన జీవీఎల్!
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూటమిలో కొత్త ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. టికెట్ దక్కని కొందరు నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. తమకు టికెట్ దక్కించుకునేందుకు వీలున్న మార్గాలన్నింటినీ వెతుకుతూ పార్టీలకు షాకిస్తున్నారు. తాజాగా ఆ లిస్ట్‌లోకి బీజేపీ ఎంపీ, సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు కూడా చేరారు. కాగా, విశాఖ పార్లమెంట్ స్థానం విషయంలో జీవీఎల్ పట్టువిడవటం లేదు. ఎలాగైనా విశాఖ నుంచి పోటీ చేయాలని ఫిక్స్ అయ్యారు. అయితే, ఇప్పటికే విశాఖ సీటును టీడీపీ నేత భరత్‌కు ఇచ్చినప్పటికీ జీవీఎల్ మాత్రం ఇంకా ఆశలు వదులుకోలేదు. ఈ క్రమంలో తనకే టికెట్ దక్కేలా లాబీయింగ్‌కు దిగారు. తాజాగా, ఉత్తరాది నేతలో జీవీఎల్ మంతనాలు ప్రారంభించారు. అలాగే, ఉత్తరాది వ్యాపారులతో కూడా జీవీఎల్ సమావేశమయ్యారు. జీవీఎల్.. రూట్ మార్చి ఉత్తరాది నేతలతో చర్చించి బీజేపీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. విశాఖ సీటు తనకే దక్కేలా వ్యూహరచన చేస్తున్నారు. మరోవైపు.. జీవీఎల్‌కు మద్దతుగా జన జాగరణ సమితి నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఈ క్రమంలో జీవీఎల్‌కు మద్దతుగా బీజేపీ నేతలు ఢిల్లీకి వెళ్లి జేపీ నడ్డాను కూడా కలవడంతో విషయం మరోసారి చర్చకు వచ్చింది. ఇదిలా ఉండగా.. ప్రచారంలో భాగంగా జీవీఎల్ షాకిలిస్తున్నారు. టీడీపీ నేత భరత్ ప్రచారానికి జీవీఎల్ దూరంగా ఉంటున్నారనే చర్చ నడుస్తోంది. టీడీపీ కార్యక్రమాలకు కూడా జీవీఎల్ వెళ్లడం లేదు. అంతేకాకుండా పురంధేశ్వరి, చంద్రబాబు తీరుపై జీవీఎల్ గుర్రుగా ఉన్నట్టు సమాచారం. -
పొత్తు చిత్తే! బీజేపీ, జనసేన శ్రేణులు టీడీపీ సభలకు దూరం
► చంద్రబాబు కాళ్లబేరం.. బీజేపీ నేతలతో తిట్లు తిని పవన్ కళ్యాణ్‌లు కుదుర్చుకున్న పొత్తు కింది స్థాయిలో ఎక్కడా పొసగడం లేదు. వైఎస్ జగన్‌ను ఒంటరిగా ఎదుర్కోలేక కలిసిన మూడు పార్టీలకు జనంలోనే కాదు ఆయా పార్టీల్లోనూ నిరాదరణే ఎదురవుతోంది. ఆ పార్టీల అగ్ర నేతల హడావుడే తప్ప, కింది స్థాయిలో ఎక్కడా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కలిసి పని చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ► సీట్లు దక్కని నేతలు తమ నియోజకవర్గాల్లో కూటమి తరఫున పని చేసేందుకు ఏమాత్రం ఇష్టపడడం లేదు. చంద్రబాబు సభలు పెట్టినా, వారు ఆ ఛాయలక్కూడా వెళ్లడం లేదు. ఆయన విశాఖలో ఎన్నికల ప్రచారం నిర్వహించినా మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి దూరంగా ఉన్నారు. తెనాలిలో పవన్ కళ్యాణ్ నిర్వహించిన సభకు అక్కడి టీడీపీ ఇన్చార్జి, మాజీ మంత్రి ఆలపాటి రాజా డుమ్మా కొట్టారు. ►చంద్రబాబు సభల్లో చాలా చోట్ల బీజేపీ,జనసేన నాయకులను వేదికపైకి రానివ్వడం లేదు. ఆ పార్టీల అభ్యర్థులు ఉన్నచోట మొక్కుబడిగా పిలుస్తున్నా మిగిలిన నియోజకవర్గాల్లో వారిని దరిదాపుల్లోకి సైతం రానీయడం లేదు.టీడీపీ అభ్యర్థులున్న చోట్ల బీజేపీ, జనసేన నాయకులను పట్టించుకోవడంలేదు. ►అనంతపురం జిల్లాలో బాలకృష్ణ చేపట్టిన యాత్రలో జనసేన, బీజేపీ జాడే కనిపించడం లేదు. మరోవైపు చంద్రబాబు ఒక్కడే నిర్వహిస్తున్న సభలతోపాటు పవన్ కళ్యాణ్, పురందేశ్వరి కలిసి నిర్వహిస్తున్న కూటమి సభలు కూడా అట్టర్‌ఫ్లాప్ అవుతున్నాయి. ఆ సభలకు జనం రావడం గగనమవుతోంది. దీంతో చంద్రబాబు ఒక్కడే వచ్చింనా, కూటమిగా వచ్చింనా ప్రయోజనం మాత్రం శూన్యమేనని ఇట్టే తెలుస్తోంది. ►నాయకులే కలవనప్పుడు ఇక ఆ పారీ్టల మధ్య ఓట్ల బదిలీ ఎలా జరుగుతుందన్నది విశ్లేషకులు ప్రశ్న. సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య ఓట్ల బదిలీ జరిగే అవకాశాలు కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు. పేరుకు మాత్రమే ఈ మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పటికీ.. నేతలు, కార్యకర్తల మధ్య ఏ దశలోనూ పొసగడం లేదు. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పిఠాపురంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నా, టీడీపీ పూర్తిగా సహకరించడం లేదు. అక్కడ టీడీపీ ఇన్‌ఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ.. క్యాడర్ ఎవరూ జనసేనకు సహకరించకుండా కట్టడి చేసి తానొక్కడే పవన్ కళ్యాణ్ వద్దకు వెళుతూ ఆయన కోసం పని చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నారు. కింది స్థాయిలో టీడీపీ క్యాడర్ కూడా జనసేన పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉంది. తమ సీటును తాడూ బొంగరం లేని పార్టీ ఎగరేసుకుపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీటును అన్యాయంగా జనసేనకు వదిలేసి సిగ్గు లేకుండా తిరుగుతున్నారని ఇటీవల వర్మను ఒక గ్రామంలో టీడీపీ కార్యకర్తలు నిలదీసి వెళ్లగొట్టారు. కోనసీమ జిల్లాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు పి.గన్నవరం, అమలాపురంలో సంయుక్తంగా నిర్వహించిన సభలకు జనం రాలేదు. రావులపాలెంలో నిర్వహించిన సభకు 3 వేల మంది కూడా రాలేదు. కూటమి తొలి సభే తుస్సు: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఫిబ్రవరి 28న జరిగిన కూటమి తొలి సభే తుస్సుమంది. ఆ సభకు 6 లక్షల మంది జనం వస్తారని హంగామా చేసినా, వచ్చింది వేలల్లోనే. కార్యకర్తల కోసం కేటాయించిన గ్యాలరీల్లో సభ ప్రారంభం నుంచి చివరి వరకు సగం పైగా ఖాళీగానే ఉండిపోయాయి. ఈ నెల 5న నరసాపురం, పాలకొల్లులో చంద్రబాబు నిర్వహించిన కూటమి సభలు పేలవంగా జరిగాయి. పాలకొల్లు సభలో చంద్రబాబు జనసేన రాష్ట్ర నేత బన్నీ వాసును ప్రచార రథం ఎక్కనీయక పోవడంతో ఆయన అలిగి వెళ్లిపోయారు. తణుకులో బాబు, పవన్‌ల నిలదీత ఈ నెల 10వ తేదీన తణుకులో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను జనసేన పార్టీల నేతలు అడ్డుకుని నిలదీశారు. ఆశించిన స్థాయిలో జనం రాకపోగా, నిలదీతతో ఇద్దరు నేతలు ఖంగుతిన్నారు. తనకు ప్రకటించిన సీటును టీడీపీకి వదిలేశారని ఆగ్రహంతో ఉన్న జనసేన ఇన్‌ఛార్జి ఇన్చార్జి విడివాడ రామచంద్రరావు సభకు గైర్హాజరవ్వగా ఆయన అనుచరులు సభా వేదిక వద్దకు చేరుకుని ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. అక్కడే టీడీపీ, జనసేన కార్యకర్తలు తోపులాటకు దిగారు. గుంటూరు జిల్లా తాడికొండలో చంద్రబాబు నిర్వహిచిన సభలో జనసేన నాయకులను ప్రచార వాహనంపైకి ఎక్కంచి బీజేపీ నేతలను పక్కకు తోసివేశారు. తెనాలిలో పవన్‌కళ్యాణ్ సభకు అక్కడి టీడీపీ ఇన్‌ఛార్జి, మాజీ మంత్రి ఆలపాటి రాజా డుమ్మా కొట్టి నాదెండ్ల మనోహర్ కోసం తాను పని చేసేది లేదని చెప్పకనే చెప్పారు. ప్రధాని మోడీ వచ్చింన సభే విఫలం గత నెల 17వ తేదీన చిలకలూరిపేటలో ప్రధాని మోడీ హాజరైన కూటమి సభ విఫలమవడం పొత్తు పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది. ఎంత ప్రయత్నించినా జనం అనుకున్న స్థాయిలో రాకపోగా సభను నిర్వహించడంలో టీడీపీ నేతలు విఫలమవడంతో అడుగడుగునా అడ్డంకులు ఏర్పడ్డాయి. దీంతో మోడీ.. టీడీపీ నేతలపై అసహనం వ్యక్తం చేశారు. ఈ నెల 6న చంద్రబాబు క్రోసూరు, సత్తెనపల్లిలో చేపట్టిన ప్రజాగళం సభల్లో జనసేన, బీజేపీ నేతలు కనిపించలేదు. సత్తెనపల్లి సభ జనం లేక అట్టర్‌ఫ్లాప్ అయ్యింది. టీడీపీ తీరుపై జనసేన, బీజేపీ నేతల ఆగ్రహం బాపట్ల జిల్లాలో ఇప్పటి వరకు మూడు ప్రజాగళం సభలు జరగ్గా ఒక్కటీ విజయవంతం కాలేదు. బాపట్ల, వేమూరు, రేపల్లెలో జరిగిన సభలకు జనం కరువయ్యారు. ఆ సభలకు జనసేన, బీజేపీ నేతలు ఒకరిద్దరిని ప్రచార వాహనంపైకి పిలవడమే తప్ప కార్యకర్తలు ఎక్కడా కనిపించ లేదు. టీడీపీ తమకు సభల గురించి చెప్పడం లేదని, అస్సలు తమను పట్టించు కోవడంలేదని జనసేన, బీజేపీ నేతలు వాపోతున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో గత నెల 31న జరిగిన చంద్రబాబు సభలో పెట్టిన ఫ్లెక్సీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పేరు లేకపోవడంతో ఆ పార్టీ నేతలు గొడవకు దిగారు. అంతటా అదే తీరు ► ఉమ్మడి విశాఖ జిల్లా గాజువాకలో ఈ నెల 14న చంద్రబాబు నిర్వహించిన సభకు బీజేపీ నేతలు హాజరు కాలేదు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్రరెడ్డి సహా జిల్లా నాయకులెవ్వరూ హాజరవకపోడం చర్చనీయాంశమైంది. కూటమి పార్టీల నాయకుల జాడ కూడా కనిపించలేదు. చంద్రబాబు పర్యటనకు పెందుర్తి సీటు దక్కని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి దూరంగా ఉన్నారు. చివర్లో చంద్రబాబు ఆయన్ను పిలిపించుకుని మాట్లాడినా బండారు శాంతించలేదు. ►తూర్పుగోదావరి జిల్లాలో కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు నియోజకవర్గాల్లో చంద్రబాబు సభలు ఆశించిన స్థాయిలో జరగలేదని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. కొవ్వూరులో జరిగిన సభలో కూటమి నాయకులు కనిపించలేదు. గోపాలపురం నియోజకవర్గం నల్లజర్లలో జరిగిన సభకు బీజేపీ, జనసేన నేతలు వెళ్లలేదు. ఈ నెల 10వ తేదీన నిడదవోలులో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరైన సభకు జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్‌ను ప్రచార వాహనంపైకి పిలిచి ఆ సీటును త్యాగం చేసిన టీడీపీ నేత బూరుగుపల్లి శేషారావును మాత్రం పట్టించుకోలేదు. దీంతో శేషారావు అనుచరులు గొడవకు దిగారు. ►నెల్లూరు జిల్లా కావలిలో గత నెల 29న చంద్రబాబు.. బీజేపీ, జనసేనలతో కలిసి నిర్వహించిన బహిరంగ సభ జనం లేక వెలవెలబోయింది. జనం లేకపోవడంతో మధ్యాహ్నం 3 గంటలకు జరగాల్సిన సభ నాలుగు గంటలు ఆలస్యంగా జరిగింది. అప్పటి వరకు చంద్రబాబు బస్సులోనే ఉండిపోయారు. ఈ నెల 29న ఉదయగిరిలో జరిగిన సభకు ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు గైర్హాజరాయ్యారు. ►కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో గత నెల 31న చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన సభకు టీడీపీ అభ్యర్థి జయ నాగేశ్వరరెడ్డి.. బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన నాయకులు ఎవ్వరినీ ఆహ్వనించ లేదు. కర్నూలులోనూ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్.. కూటమి పార్టీలను పట్టించుకోకుండా ఒంటరిగానే ప్రచారం నిర్వహిస్తున్నారు. ►ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూటమి సమావేశాలు తూతూ మంత్రంగా సాగుతున్నాయి. స్వయంగా చంద్రబాబు, బాలకృష్ణ ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నా.. బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ఎక్కడా కనిపించడం లేదు. గత నెల 28న చంద్రబాబు రాప్తాడులో నిర్వహించిన సభలో బీజేపీ ఊసే లేదు. శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం సభలోనూ బీజేపీ వాళ్లు ఎవరూ లేరు. తమకు ఆహ్వనం లేదని స్థానిక జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేసి, సభకు దూరంగా ఉన్నారు. -
బాబు రాసిన పచ్చ స్క్రిప్ట్.. ఫాలో అవుతున్న పురంధేశ్వరి!
నమ్మినోళ్లను నట్టేటముంచడం. అధికారులపై అభాండాలు వేయడం. ఈసీకి ఫిర్యాదులు చేయడం.. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి వర్క్ స్టైల్ ఇది. ఆమె తీరుతో కమలానికి.. ఇమేజ్ కంటే డ్యామేజే ఎక్కువ అవుతోంది. మరిది చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టునే.. వదిన ఫాలో అవుతున్నారు. గుడ్డిగా అర్ధంపర్థంలేని ఆరోపణలు చేస్తూ పలుచనవుతున్నారు. చిన్నమ్మను ఓడిస్తామంటున్నారు రాజమండ్రివాసులు. ఒకసారి విశాఖ.. మరోసారి బాపట్ల.. ఇప్పుడేమో రాజమండ్రి. ఏ ఒక్కచోటా స్థిరంగా పోటీ చేయకుండా ఎప్పటికప్పుడు నియోజకవర్గాలు మారే నేతల్లో పురందేశ్వరి ముందుంటారు. ఆమెకొక సొంతనియోజకవర్గమే లేదు. స్థిరమైన పార్టీ కూడా లేదు. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ ఇలా అన్ని పార్టీల్లో చక్కర్లుకొట్టారు. ఇక, పురందేశ్వరి మెడకు రోజుకో వివాదం చుట్టుకుంటోంది. ఆమె వ్యవహార శైలిపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రచారంలోనూ ఆమె పలుచన అవుతున్నారు. రాజమండ్రిలో అభివృద్ధే జరగలేదంటూ పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలపై స్థానికులు మండిపడుతున్నారు. పురందేశ్వరిని పొలిటికల్ టూరిస్టుగా అభివర్ణిస్తున్నారు రాజమండ్రి వాసులు. మడ అడవులే లేని రాజమండ్రి పార్లమెంటరీ ప్రాంతంలో జగనన్న కాలనీలు నిర్మించేందుకు అధిక డబ్బు చెల్లించి భూసేకరణ చేశారంటూ ఆరోపిచడం ఆమె అమాయకత్వానికి నిదర్శనమంటున్నారు. ఎన్టీఆర్ బిడ్డగా తనను అందరూ ఆదరిస్తారని, తాను అందరి మనిషినని చెప్పుకుంటున్నారు పురందేశ్వరి. అయితే అన్నగారి బిడ్డ.. టీడీపీలో ఎందుకు లేరో చెప్పాలన్నది ఎన్డీఆర్ అభిమానుల ప్రశ్న. రాజమండ్రి గురించి పురందేశ్వరికి కనీస అవగాహన కూడా లేదన్నారు ఎంపీ మార్గాని భరత్. టీడీపీ పెద్దలిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ టైమ్ పాస్ చేస్తున్నారని సెటైర్లు సంధించారు. ఆమె బీజేపీలో ఉన్నారా? లేక టీడీపీలో ఉన్నారా? అంటూ ప్రశ్నించారు. నిజానికి పురందేశ్వరి తాను ఏపీ బీజేపీ అధ్యక్షురాలినన్న సంగతే మర్చిపోయారు. కేవలం బాబు ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. సొంతపార్టీ లీడర్లపై కుట్రలు, కుతంత్రాలు పన్నుతూ.. ఏపీ బీజేపీ ప్రయోజనాలను గాలికొదిలేశారు. అంతేకాదు చిన్నమ్మకు మరో రికార్డు కూడా ఉంది. ఆమె పోటీచేసిన ఏ నియోజకవర్గంలోనూ గెలిచినా, ఓడినా అభివృద్ధి మాత్రం అస్సలు పట్టించుకోరు. -
April 10th: ఏపీ ఎన్నికల సమాచారం
April 10th AP Elections 2024 News Political Updates 10:25 AM, April 10th 2024 వైఎస్సార్సీపీలోకి పోతిన మహేష్ వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు జనసేన నేత పోతిన మహేష్, మాజీ ఎమ్మెల్యేలు పాములు రాజేశ్వరి, రమేష్ రెడ్డి వైఎస్సార్సీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో రాయచోటి మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి, పోతిన మహేష్ వైఎస్సార్సీపీలో చేరిక. వీరి ముగ్గురికి పార్టీ జెండా కప్పి వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. పోతిన మహేష్ ఇటీవలే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్రమైన ఆరోపణలు 10:10 AM, April 10th 2024 జనసేన, టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి చేరికలు.. పశ్చిమగోదావరి జిల్లాలో వైఎస్సార్సీపీలోకి చేరికలు.. నరసాపురం మండలం చామకూరి పాలెం గ్రామంలో ప్రజా ఆశీర్వాద ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు జనసేన, తెలుగుదేశం పార్టీ నుండి సుమారు వందమంది వైఎస్సార్సీపీలో చేరిక పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ప్రభుత్వ చీఫ్ ముదునూరి ప్రసాదరాజు 9:51 AM, April 10th 2024 టీడీపీకి మరో సీటు అమ్మేసిన పవన్ కల్యాణ్ పాలకొండలోనూ టీడీపీ అభ్యర్థే నిమ్మక జయకృష్ణను జనసేన అభ్యర్థిగా ప్రకటించిన పవన్ కల్యాణ్ వారం కిందటే టీడీపీ నుండి జనసేనలో చేరిన జయకృష్ణ జనసేన కోసం పనిచేసిన గిరిజనులను ముంచేసిన పవన్ కల్యాణ్ అవనిగడ్డ, పాలకొండ రెండు సీట్లు టీడీపీ అభ్యర్థులకే ఇచ్చిన పవన్ కల్యాణ్ మొత్తం 21 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన పవన్ కల్యాణ్ చంద్రబాబు పంపిన మనుసులకే సీట్లిచ్చిన పవన్ కల్యాణ్ భీమవరం, అవనిగడ్డ, పాలకొండ, రైల్వే కోడూరు, అనకాపల్లి, పి గన్నవరం, పోలవరం సీట్లు చంద్రబాబు మనుషులకే కేటాయింపు వైసీపీ నుండి వెళ్లినవారికి విశాఖ సౌత్, తిరుపతి, పెందుర్తి, మచిలీపట్నం ఎంపీ సీట్లు కేటాయింపు నాదెండ్ల మనోహర్ ఆశీస్సులు ఉన్నవారికి తాడేపల్లిగూడెం,యలమంచిలి, నెల్లిమర్ల, నిడదవోలు, రాజోలు, నరసాపురం, కాకినాడ రూరల్ సీట్లు కేటాయింపు జనసేన పార్టీ అభ్యర్థుల జాబితాలో బీసీలకు తీరని ద్రోహం చేసిన పవన్ కల్యాణ్ జనసేన ను వరుసగా వీడుతున్న బీసీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ చౌదరి కోసం బీసీ నేతలకు హ్యాండ్ ఇచ్చిన పవన్ కల్యాణ్ జనసేన జెండా మోసిన వారిని నిండా ముంచేసిన పవన్ కల్యాణ్ పక్క పార్టీ నేతల ప్యాకేజీ ముందు అభాసుపాలైన జనసేన విధేయత 9:31 AM, April 10th 2024 మహిళా కానిస్టేబుల్‌పై టీడీపీ నేత దాడి.. కేసు బుచ్చెయ్యపేట మండలంలోని మంగళాపురంలో విధి నిర్వహణలో ఉన్న సచివాలయ మహిళా పోలీస్ కానిస్టేబుల్‌పై దాడిచేసిన టీడీపీ నాయకురాలు మాజీ ఎంపీటీసీ సభ్యురాలు అల్లంకి ఉమాదేవిపై బుచ్చెయ్యపేట పోలీసులు కేసు నమోదు ఈ నెల 6న పింఛన్ నగదు తీసుకునేందుకు సచివాలయానికి వెళ్లిన టీడీపీకి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యురాలు ఉమాదేవి పింఛన్ నగదు తన వద్దకు వచ్చి ఇవ్వాలని మహిళా పోలీస్ జంపా మహాలక్ష్మితో గొడవ విధి నిర్వహణలో ఉన్న మహిళా పోలీస్‌పై పరుష పదజాలంతో తిడుతూ, ఆమె మెడపై గోర్లతో గాట్లు పెట్టి మెడలో ఉన్న చైన్‌ను లాగి తెంచేసిన వైనం అక్కడే విధి నిర్వహణలో ఉన్న తోటి సచివాలయ సిబ్బంది వీడియో తీస్తుండగా ఫోన్ లాక్కుని నేలకేసి కొట్టి, తమ ఊరిలో ఎలా ఉద్యోగం చేస్తారో? చూస్తానంటూ బెదిరింపులు ఉమాదేవిపై చర్యలు తీసుకోవాలంటూ బాధిత మహిళా పోలీస్ మహాలక్ష్మి బుచ్చెయ్యపేట పోలీస్‌లకు ఫిర్యాదు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు బుచ్చెయ్యపేట పోలీసులు వెల్లడి 9:20 AM, April 10th 2024 షర్మిలకు షాకిచ్చిన సామాన్యుడు. సీఎం జగన్‌కు ఎందుకు ఓటెయ్యాలో చెప్పిన సామాన్యుడు. షర్మిల, కాంగ్రెస్‌కు ట్విస్ట్ ఇచ్చిన వ్యక్తి. ప్రతిపక్షాలు కుట్రలు చేసినా సీఎంగా మళ్లీ జగనే ఉండాలని ఆకాంక్షించాడు. జనం గుండెల్లో గుడి కొట్టుకోవడం ఇదే.. వైఎస్ జగన్ గారికి, వైఎస్సార్ సీపీకి ప్రజలు మళ్లీ ఎందుకు ఓటేయాలో వారే చెబుతున్నారు వినండి.. ఈ యువకుడే కాదు.. రాష్ట్రంలోని ఎవరినీ అడిగినా ఇలాగే చెప్తారు.. ప్రతిపక్షాల కుట్రలు ప్రజల దగ్గర సాగవు. pic.twitter.com/r1poaJ0ZnH — Vijayasai Reddy V (@VSReddy_MP) April 9, 2024 9:00 AM, April 10th 2024 కూటమి కార్యకర్తల తన్నులాట.. రాజమండ్రిలో పురంధేశ్వరి సమక్షంలో ఆత్మీయ సమావేశం ప్రేమ, అనురాగం, ఆప్యాయతలతో తన్నుకుని బ్యానర్లు చించివేత తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతల మధ్య బాహాబాహీ. రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సమక్షంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ప్రేమ, అనురాగం, ఆప్యాయతలతో తన్నుకుని బ్యానర్లు చించుకున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు. తిలకించండి. pic.twitter.com/v79dbCahn9 — Vijayasai Reddy V (@VSReddy_MP) April 9, 2024 8:45 AM, April 10th 2024 సీఎం రమేష్, అయ్యన్నకు ఈసీ నోటీసులు.. సీఎం రమేష్, అయ్యన్నపాత్రుడికి ఎన్నికల కమిషన్ నోటీసులు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఇద్దరు నేతలు సంజాయిషీ ఇవ్వాలని కోరిన రిటర్నింగ్ అధికారి. ఈనెల ఆరో తేదీన నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో చీర, రూ.2 వేలు పంచిన సీఎం రమేష్, అయ్యన్నపాత్రుడు. డబ్బులు పంపిణీ చేస్తున్న సమయంలో ప్రశ్నించిన ఫ్లైయింగ్ స్క్వాడ్‌పై చిందులేసిన సీఎం రమేష్. అదే సందర్భంలో చీఫ్ సెక్రటరీపై అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై సంజాయిషీ కోరిన రిటర్నింగ్ అధికారి జైరాం. 8:15 AM, April 10th 2024 మేమంతా సిద్ధం డే 12.. షెడ్యూల్ ఇలా.. ఉదయం 9 గంటలకు గంటావారిపాలెం దగ్గర నుంచి ప్రారంభం కానున్న బస్సు యాత్ర. సాయంత్రం 4 గంటలకు అయ్యప్ప నగర్, పిడుగురాళ్ల దగ్గర బహిరంగ సభ ధూళిపాళ్ల వద్ద రాత్రి బస చేయనున్న సీఎం జగన్ Memantha Siddham Yatra, Day -12. ఉదయం 9 గంటలకు గంటావారిపాలెం దగ్గర నుంచి ప్రారంభం సాయంత్రం 4 గంటలకు అయ్యప్ప నగర్, పిడుగురాళ్ల దగ్గర బహిరంగ సభ ధూళిపాళ్ల వద్ద రాత్రి బస #MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/YjhvEpKLEX — YSR Congress Party (@YSRCParty) April 10, 2024 7:45 AM, April 10th 2024 పాలకొండ అభ్యర్థిని ప్రకటించిన పవన్.. పాలకొండ జనసేన అభ్యర్ధిగా నిమ్మక జయకృష్ణ ఇటీవల టీడీపీ నుంచి జనసేనలో చేరిన నిమ్మక జయకృష్ణ జనసేన నుంచి విశాఖ సౌత్ అభ్యర్థిపై కొనసాగుతున్న సస్పెన్స్ 7:15 AM, April 10th 2024 పురందేశ్వరికి షాకిచ్చిన టీడీపీ నేతలు రాజమహేంద్రవరంలో పురందేశ్వరికి నిరసన సెగ మిత్రపక్షాల సమన్వయ కమిటీ సమావేశంలో టీడీపీ నేతల ఆందోళన ఫ్లెక్సీలో టీడీపీ నేత బొడ్డు వెంకటరమణ చౌదరి ఫొటో లేదని ఆగ్రహం ఫ్లెక్సీ చించి రోడ్డుపై బైఠాయింపు.. స్తంభించిన ట్రాఫిక్ పురందేశ్వరి మౌనంపై బీజేపీ నేతల ఆగ్రహం ∙ ఇప్పటికే సోము వీర్రాజు వర్గం దూరం నూజివీడులో టీడీపీ అభ్యర్థి పార్థసారథికి గుబులు రెబల్ అభ్యర్థి ముద్దరబోయినకు జై కొట్టిన తెలుగుదేశం శ్రేణులు ఉండి ఎమ్మెల్యే రామరాజు కంటతడి సీటు వదులుకునేందుకు సిద్ధంగా లేనని స్పష్టీకరణ 7:00 AM, April 10th 2024 పవన్‌కు షాకిస్తున్న జనసైనికులు.. చంద్రబాబు చట్రంలో చిక్కుకున్న జనసేన అధినేత పవన్ పార్టీకి భవిష్యత్తు లేకుండా చేస్తున్న చంద్రబాబు గెలవని స్థానాలు జనసేనకు కట్టబెట్టిన టీడీపీ అధినేత.. ఇచ్చిన స్థానాల్లోనూ తన మనుషులే ఉండేలా కుట్రలు అన్నింటికీ తల ఊపుతున్న పవన్ పవన్‌పై అసంతృప్తితో జనసేన నేతలు, అభిమానులు పార్టీకి భవిష్యత్తు లేదని నిర్ధారణ.. ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న నేతలు పార్టీకి పట్టున్న ఉభయ గోదావరి జిల్లాల్లోనే పలువురు బయటకు వీరిలో అనేక మంది గత ఎన్నికల్లో పోటీ చేసి, గట్టి పోటీ ఇచ్చిన వారే 6:45 AM, April 10th 2024 బీసీ నేతలకు పవన్ కల్యాణ్ వెన్నుపోటు జనసేనలో బీసీ నేతలకు నో టిక్కెట్ అర్థబలం ఉన్న నేతల కోసం బలహీన వర్గాల నేతలకు పవన్ హ్యాండ్ పవన్ మోసం చేయడంతో పార్టీని వీడుతున్న బీసీ నేతలు క్రిష్ణా జిల్లాలో ఒకేరోజు ఇద్దరు బీసీ నేతలు జనసేనకి గుడ్ బాయ్ విజయవాడ పశ్చిమ ఇన్ ఛార్జ్ పోతిన మహేష్ రాజీనామా కైకలూరు జనసేన ఇన్ ఛార్జ్ బీవీ రావు రాజీనామా నగరాలు, యాదవ సామాజికవర్గాల నేతలు కావడంతో సీటివ్వని పవన్ కల్యాణ్ సుజనా చౌదరి కోసం నగరాల నేత పోతిన మహేష్ కి హ్యాండ్ ఇచ్చిన పవన్ కామినేని శ్రీనివాస్ చౌదరి కోసం యాదవ నేత బీవీరావుకి హ్యాండ్ ఇచ్చిన పవన్ మరోవైపు గోదావరి జిల్లాల్లోనూ వరుసగా బీసీ నేతలు రాజీనామా ఇప్పటికే శెట్టిబలిజ నేతలు పితాని బాలక్రిష్ణ, మాజీ మేయర్ సరోజ లు రాజీనామా ఉభయగోదావరి జిల్లాల్లో ఒక్క శెట్టిబలిజ, గౌడ వర్గ నేతలకు సీటివ్వని జనసేన గుంటూరులో నాదెండ్ల మనోహర్ కోసం బీసీ నేతలకు హ్యాండ్ ఇచ్చిన పవన్ 6:30 AM, April 10th 2024 చంద్రబాబు, రఘురామరాజుకి బీజేపీ ఝలక్ సీట్ల మార్పునకు అంగీకరించని బీజేపీ బీజేపీ ప్రకటించిన జాబితాలో మార్పులకు ససేమిరా నర్సాపురం ఎంపీ అభ్యర్థి శ్రీనివాస వర్మ కే మద్దతు అధికారికంగా ప్రకటించిన బిజెపి ఏపీ ఇన్ ఛార్జ్ సిద్దార్థనాథ్ సింగ్ నర్సాపురం, ఏలూరు ఎంపీ సీట్లు మార్చాలని చంద్రబాబు ప్రతిపాదన చంద్రబాబు ప్రతిపాదనకు ససేమిరా అన్న బిజెపి రఘురామకృష్ణం రాజుకి నర్సాపురం సీటుపై ఆశలు గల్లంతు మోదీ నియమించిన శ్రీనివాస వర్మను మార్చేది లేదన్న సిద్ధార్థనాథ్ సింగ్ ఎమ్మెల్యే సీట్ల మార్పుపైనా క్లారిటీ ఇవ్వని బిజెపి అనపర్తి, జమ్మలమడుగు, తంబళ్లపల్లి సీట్ల మార్పు ప్రతిపాదనపై సందిగ్ధత -
కూటమిలో క్రోధాగ్ని నిరసనల భగభగలు
సాక్షి, రాజమహేంద్రవరం/నూజివీడు/కాళ్ల: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో కుమ్ములాటల పర్వం కొనసాగుతోంది. తెలుగు సంవత్సరాది వేళా నిరసనల సెగ చల్లారలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి స్వపక్ష శ్రేణుల్లోనే విభేదాల అగ్గి రాజేస్తోంది. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలోని ద్వారకామాయి ఫంక్షన్ హాలులో సోమవారం రాత్రి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సమన్వయ సమావేశం రసాభాసగా మారింది. రాజమహేంద్రవరం బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఎంపికైన తరువాత తొలిసారి ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పురందేశ్వరి పాల్గొన్నారు. సభా వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, పురందేశ్వరి, కూటమి రాజానగరం నియోజకవర్గ అభ్యర్థి, జనసేన నేత బత్తుల బలరామకృష్ణ ఫొటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీనిలో టీడీపీ రాజానగరం నియోజకవర్గ ఇన్చార్జి బొడ్డు వెంకట రమణ చౌదరి ఫొటో లేకపోవడంపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ కోసం సీటు త్యాగం చేసిన నేత ఫొటో ఎందుకు పెట్టలేదని పురందేశ్వరిని నిలదీస్తూ ఆ ఫ్లెక్సీని చించి పారేశారు. ఫ్లెక్సీలో ఉన్న మోదీ ఫొటోనూ చించివేస్తున్నా వారిని వారించేందుకు పురందేశ్వరి కనీసం యత్నించకపోగా, చిరునవ్వులు చిందిస్తూ అలాగే వేదికపై కూర్చోవడం విమర్శలకు దారి తీసింది. ఆమె తీరుపై బీజేపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ శ్రేణుల నిరసనల నేపథ్యంలో ఫంక్షన్ హాలు నుంచి ఆమె మెల్లగా జారుకున్నారు. సాధారణంగా పార్టీ అగ్రనేతల ఫొటోలు, ఫ్లెక్సీలను ఎవరైనా చించితే నాయకులు, కార్యకర్తలు సహించలేరు. కానీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వైఖరి ఇందుకు భిన్నంగా ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ► పశ్చిమగోదావరి జిల్లా ఉండి సీటు మార్చే యోచనలో టీడీపీ అధిష్టానం ఉండటంతో ఎమ్మెల్యే మంతెన రామరాజు భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. కాళ్ల మండలం పెదఅమిరం నిర్మలాదేవి ఫంక్షన్ హాలులో మంగళవారం నిర్వహించిన టీడీపీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. సమావేశంలో టీడీపీ నాయకులు స్పందిస్తూ.. ఉండి అభ్యర్థిని మారిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాజీనామాలకూ వెనుకాడబోమని స్పష్టం చేశారు. సమావేశానికి పార్టీ పరిశీలకుడిగా వచ్చిన ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు సమక్షంలోనే వారు ఈ విషయాన్ని తేల్చిచెప్పడం గమనార్హం. ఎమ్మెల్యే మంతెన రామరాజు మాట్లాడుతూ.. తన సీటును వదులుకోవడానికి సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. ఏ తప్పూ చేయకుండా త్యాగానికి సిద్ధం కావాలనడం న్యాయం కాదని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమాన్నీ విధిగా చేయడం తన తప్పా అని ప్రశ్నించారు. కార్యకర్తల నిర్ణయమే తనకు శిరో«దార్యమని, వేరే వ్యక్తికి సీటు కేటాయిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. పార్టీ నేతల అభిప్రాయాలను అధిష్టానం దృష్టికి తీసుకువెళతానని గన్ని వీరాంజనేయులు చెప్పారు. తొలి నుంచీ పురందేశ్వరికి చుక్కెదురు వాస్తవానికి ఎంపీ అభ్యర్థిగా ఎంపికైన పురందేశ్వరికి మొదటి నుంచీ ఇక్కడ చుక్కెదురవుతూనే ఉంది. రాజమహేంద్రవరం వచ్చిన వెంటనే ఆమె స్థానిక బీజేపీ నాయకులను కలుపుకొని వెళ్లాల్సింది పోయి.. వేరుకుంపటి పెట్టారు. పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజును పూర్తిగా పక్కన పెట్టారు. ఈ పరిణామం సోము వర్గంతోపాటు పార్టీ శ్రేణులను దూరం చేసింది. దీంతో సభలు, సమావేశాల్లో ఆమెకు నిరసనల సెగ ఎదురవుతూనే ఉంది. అనపర్తి ఎమ్మెల్యే టికెట్‌ను తొలుత టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి కేటాయించి.. పొత్తు అనంతరం బీజేపీకి ఇవ్వడంపైనా టీడీపీ వర్గాల్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమైంది. అక్కడ ఎంపీ అభ్యర్థి పురందేశ్వరి, స్థానిక బీజేపీ నాయకులను వ్యతిరేకిస్తూ రామకృష్ణారెడ్డి స్వతంత్రంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయినా పురందేశ్వరి పెదవి విప్పకపోవడంపై ఆమె టీడీపీకి లాభం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఫ్లెక్సీలో ప్రధాని మోదీ ఫొటో చించుతున్నా స్పందించకపోవడం ఈ వాదనకు బలం చేకూరుస్తోందని బీజేపీ శ్రేణులు అంటున్నాయి.