జీహెచ్ఎంసీలో శనివారం మూడోరోజు నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఇవాళ ఒక్కరోజే అభ్యర్థులు 997 నామినేషన్లు దాఖలు చేశారు.
హైదరాబాద్ : జీహెచ్ఎంసీలో శనివారం మూడోరోజు నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఇవాళ ఒక్కరోజే అభ్యర్థులు 997 నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటివరకు మొత్తం 1,097 నామినేషన్లు దాఖలయ్యాయి. టీఆర్ఎస్ నుంచి 227 నామినేషన్లు దాఖలు కాగా.. టీడీపీ నుంచి 181, కాంగ్రెస్ నుంచి 200 నామినేషన్లు... బీజేపీ నుంచి 93... ఎంఐఎం నుంచి 27 నామినేషన్లు దాఖలయ్యాయి. సీపీఐ నుంచి 14... స్వతంత్ర అభ్యర్థులు 249 నామినేషన్లు వేశారు. నామినేషన్ల పర్వం ఆదివారంతో ముగియనుంది.