సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సి పల్ కార్పొరేషన్ పాలక మండలి పదవీ కాలం వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగియనుంది. 2016 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోని 150 డివిజన్లకు గాను 99 చోట్ల పార్టీ అభ్యర్థు లు కార్పొరేటర్లుగా విజయం సాధించడంతో పా టు సొంత బలంతో జీహెచ్‌ఎంసీ పీఠాన్ని టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. జీహెచ్‌ఎంసీ పాలక మం డలి పదవీ కాలం ఏడాది లోపు ముగియనుండటంతో, మరోమారు గ్రేటర్ పీఠాన్ని దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. 2016లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అభివృద్ధి మంత్రంతో ప్రజల్లోకి వెళ్లిన టీఆర్‌ఎస్, వచ్చే ఎన్నికల్లోనూ అదే నినాదంతో ప్రజల్లోకి వెళ్లేలా వ్యూహా న్ని రూపొందిస్తోంది.
ఈ ఏడాది అక్టోబర్‌లోగా జీహెచ్‌ఎంసీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు చేపట్టిన కీలక అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయడంపై మున్సిపల్ శాఖ మంత్రి హోదా లో ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ప్రత్యేక దృష్టి సారించారు. 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, ప్రచారం తదితరాల్లో అంతా తానై వ్యవహరించిన కేటీఆర్ వచ్చే ఏడాది జరిగే జీహెచ్‌ఎంసీ ఎన్నికలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో మరోమారు పార్టీ వ్యూహం అమ ల్లో కీలక పాత్ర పోషించేలా వ్యూహ రచన చేస్తున్నారు.
2018 ముందస్తు ఎన్నికల్లో వరుసగా రెం డో పర్యాయం అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన అన్ని రకాల ఎన్నికల్లో నూ ఏకపక్ష విజయాన్ని నమోదు చేస్తూ వస్తోంది. గతేడాది ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్ర త్యర్థి పార్టీలపై స్వల్ప ఆధిక్యత చూపిన టీఆర్‌ఎస్, స్థానిక సంస్థలు, మున్సిపల్, సహకార ఎన్నికల్లో మాత్రం విజయాలను నమోదు చేసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ ఏకపక్ష విజయం సాధించేం దుకు ఇప్పటి నుంచే పార్టీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని నిర్ణయించింది.
డివిజన్ల వారీగా నివేదికలు..
గత ఎన్నికల్లో అభివృద్ధి ఎజెండాతో ప్రజల్లోకి వెళ్లిన టీఆర్‌ఎస్ వచ్చే ఎన్నికల్లోనూ ఇదే అంశాన్ని ప్రచారాస్త్రంగా చేసుకోవాలని భావిస్తోంది. దీనిలో భాగంగా స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ కింద చేపట్టిన ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, తాగునీరు తదితర పనులను ఈ ఏడాది అక్టోబర్ నాటికి పూర్తి చేసేలా మున్సిపల్ మంత్రి హోదాలో కేటీఆర్ గడువు నిర్దేశించారు. 2020–21 వార్షిక బడ్జెట్‌లో హైదరాబాద్ మౌలిక సౌకర్యాల కల్పనకు రూ.10 వేల కోట్లు కేటాయించడంతో పాటు, ఐదేళ్ల పాటు ఏటా రూ.10 వేల కోట్లు కేటాయిస్తామని వెల్లడించారు.
ఓవైపు అభివృద్ధి పనులను కొనసాగిస్తూనే డివిజన్ల వారీగా పార్టీ పరిస్థితిపైనా కేటీఆర్ దృష్టి సారించారు. మున్సిపల్ ఎన్నికల తరహాలో జీహెచ్‌ఎంసీ డివిజన్ల పరిధిలో పార్టీ పరిస్థితిని అంచనా వేసేందుకు త్వరలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులతో కేటీఆర్ సమావేశమవుతారు. డివిజన్ల వారీగా ప్రస్తుత కార్పొరేటర్ల పనితీరు, పార్టీ యంత్రాంగం తదితరాలపై పార్టీ నేతలు క్షేత్ర స్థాయిలో పర్యటించి నివేదికలు రూపొందిస్తారు. నివేదికలు అందిన తర్వాత జీహెచ్‌ఎంసీ పరిధిలో పార్టీ పనితీరును మదింపు చేసి యంత్రాంగాన్ని అప్రమత్తం చేసేలా కేటీఆర్ కార్యాచరణ రూపొందిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
జీహెచ్‌ఎంసీ ఎన్నికలే లక్ష్యం..
Published Sun, Mar 22 2020 3:39 AM | Last Updated on Sun, Mar 22 2020 4:53 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment