ghmc elections
-
వరద సాయం ఎప్పుడిస్తారు?
సాక్షి,హైదరాబాద్: గతేడాది సంభవించిన వరదల కారణంగా నష్టపోయిన హైదరాబాద్ వాసులకు వరద సాయం ఎప్పుడిస్తారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ కుమార్ ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు అయిపోగానే బ్యాంకు ఖాతాల్లో రూ.10వేల నగదు సాయం ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఎందుకు జమ చేయలేదో జవాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం మంత్రి కేటీఆర్‌కు ఆయన లేఖ రాశారు. ‘రాత్ గయి బాత్ గయి’తరహాలో రూ.10వేలు నగదు ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్న తర్వాత బాధితులను గాలికొదిలేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. వరద సాయం పొందిన వారి వివరాలు పబ్లిక్ డొమైన్లో పెట్టి పారదర్శకంగా ఎందుకు వ్యవహరించడం లేదని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని దాదాపు 5 లక్షల మంది గతేడాది అక్టోబర్ నుంచి వరదసాయం కోసం ఎదురుచూస్తున్నారని, దీన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో దాదాపు రూ.200 కోట్ల వరకు నష్టం జరిగిందని ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయని, ఈ పరిహారాన్ని కూడా ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలని కోరారు. 8 నెలల క్రితమే వరదలు ముంచెత్తి నష్టాన్ని కలిగించినా రాష్ట్ర ప్రభుత్వం మేలుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ఇప్పటివరకు వరద సాయం ఎందుకు ఇవ్వలేదో, ఎప్పుడు ఇస్తారో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని ఆ లేఖలో కోరారు. డ్రైనేజీ వ్యవస్థ, నాలాల విస్తరణ, మ్యాన్‌హోల్స్, ఓపెన్‌నాలా సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. -
ఎంఐఎం టార్గెట్ 50!
సాక్షి, హైదరాబాద్ : పక్కా స్కెచ్‌తో గ్రేటర్ ఎన్నికల బరిలోకి దిగిన పతంగి పార్టీ.. తాను అనుకున్న సీట్లలో గెలిచి సత్తా చాటుతాననే అంచనాల్లో ఉంది. పరిస్థితులు అనుకూలిస్తే తన పూర్వ వైభవాన్ని దక్కించుకోవాలనేది ఆ పార్టీ వ్యూహం. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికల్లో పోటీ పడే స్థానాల మొదలు ప్రచార పర్వంలోనూ తమదైన వ్యూహాలను ఎంఐఎం నేతలు అనుసరించారు. ఈసారి మజ్లిస్ పోటీ చేస్తున్న డివిజన్లు 51 మాత్రమే.. అందులో కచ్చితంగా 50 గెలిచి తీరాలన్నది టార్గెట్.. అందుకే గెలిచేందుకు ఎక్కువ అవకాశమున్న డివిజన్లనే ఎంపిక చేసుకుని మరీ అభ్యర్థులను నిలిపింది. పక్కా ప్రణాళికతో ప్రచారం సాగించిన ఆ పార్టీ.. సదరు డివిజన్లలో గెలుపుపై లెక్కలు వేసుకుంటోంది. గతంతో పోలిస్తే ఈసారి ఎంఐఎం కాస్త భిన్నంగా వ్యవహరించింది. జనంలో తనపై ఎలాంటి అనుమానాలు, అపోహలకు తావివ్వకుండా వ్యవహరించటంతోపాటు ప్రచారంలో మాటలను కూడా సూటిగా సంధించింది. అధికార పార్టీతో అనుకూలంగా ఉంటుందన్న ముద్ర ఆ పార్టీపై బలంగా ఉంది. అది కొంతవరకు చేటు చేస్తుందేమోనన్న సంశయంతో ఈసారి తన ప్రచారశైలితో దానికి చాన్స్ లేకుండా చేసింది. టీఆర్ఎస్తో పొత్తు, అవగాహన ఏమాత్రం లేదని ప్రజలకు చెబుతూ వచ్చింది. అటు టీఆర్ఎస్ అన్నిచోట్లా పోటీ చేస్తుండటమే దీనికి నిదర్శనమనే వాదనను వినిపించింది. అక్కడితో ఆగకుండా అవకాశం దొరికినప్పుడల్లా టీఆర్ఎస్పై మాటల దాడి చేసింది. తాము తలుచుకుంటే రెండు నెలల్లోనే రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందన్న మాటలు ఆ పార్టీ ఎమ్మెల్యేల నుంచి వినవచ్చాయి. అంతేకాక టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను అనుభవం లేని వ్యక్తిగా పేర్కొనడం కూడా ఇందులో భాగమేనన్నది రాజకీయ విశ్లేషకుల మాట. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజేంద్రనగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్–మజ్లిస్‌లు బాహాబాహీకి దిగాయి. అధికార పార్టీపై స్వయంగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీనే విరుచుకుపడ్డారు. ఆ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలన్న ఉద్దేశంతో చివరి వరకు తీవ్రంగా పోరాడారు. ఒక్క ఓటు కూడా తన నుంచి చీలి కారు గుర్తుకు పోకుండా జాగ్రత్త పడ్డారు. కానీ ఫలితం అనుకూలంగా రాలేదు. అయినప్పటికీ, ఇప్పుడు బల్దియా ఎన్నికల్లో దాదాపు అదే పంథాను మజ్లిస్ వ్యవహరించింది. తనకు పట్టున్న చోట టీఆర్ఎస్కు సందివ్వకుండా మాటల దాడితో ఉక్కిరిబిక్కిరి చేసింది. బీజేపీ విమర్శలే తమ అస్త్రాలుగా.. గతంతో పోలిస్తే తాజా ఎన్నికల్లో బీజేపీ చాలా దూకుడుగా వ్యవహరించింది. కొద్ది రోజుల క్రితమే జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో సాధించిన విజయంతో బీజేపీ ఊపు మీద ఉంది. ఫలితాలు ఎలా వస్తాయో గానీ ప్రచారంలో మాత్రం ఆ పార్టీ చాలా దూకుడుగా వ్యవహరించింది. దీన్ని మజ్లిస్ అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నించింది. బీజేపీ సంధించే విమర్శలను తన అస్త్రాలుగా మలుచుకునే ప్రయత్నం చేసింది. ఇటీవల బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వాడిన ‘పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్’ను వీలైనంత ఎక్కువగా వినియోగించుకునే ప్రయత్నం చేసింది. అసదుద్దీన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా ప్రచారంలో దీన్ని బాగా వాడుకున్నారు. బీజేపీ దూకుడుకు కళ్లెం వేయాలంటే ‘తాము’ఏకతాటిపై ఉండాలంటూ మైనారిటీ ఓటర్లలోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. పనిలోపనిగా, మైనార్టీయేతర ఓట్లు ఎక్కువగా ఉండే డివిజన్లలో బడుగు బలహీన వర్గాలకు మజ్లిస్ పార్టీ అండగా ఉంటుందన్న కోణంలో ప్రచారం చేశారు. ప్రధాని మోదీ నుంచి స్థానిక బీజేపీ అభ్యర్థి వరకు.. ఎవరినీ వదిలిపెట్టకుండా విమర్శలను సంధించారు. కాంగ్రెస్ పార్టీ బలహీనపడిందని పేర్కొంటూ, ఆ పార్టీ సంప్రదాయ ఓట్లకు కూడా మజ్లిస్ నేతలు గాలం వేశారు. చక్రం తిప్పే చాన్స్ కోసం.. జీహెచ్ఎంసీ గత కౌన్సిల్ టీఆర్ఎస్కు సొంతంగా 99 స్థానాలున్నాయి. దీంతో మేయర్ సీటును సొంతంగా ఆ పార్టీ సాధించుకుంది. కానీ అంతకుముందు కౌన్సిల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు రాకపోవటంతో మజ్లిస్ సాయం తీసుకుంది. దీంతో మేయర్ స్థానాన్ని కాంగ్రెస్‌తో కలసి మజ్లిస్ పంచుకుంది. ఇప్పుడు కూడా అలాంటి చాన్స్ వస్తే బాగుంటుందనేది ఆ పార్టీ నేతల మాటలను బట్టి తెలుస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏదైనా కారణం చేత టీఆర్ఎస్కు తక్కువ సీట్లొస్తే తాను కింగ్‌మేకర్ కావచ్చన్నది ఆ పార్టీ నేతల భావన. అది జరగాలంటే కచ్చితంగా 50 స్థానాల్లో గెలిచి సత్తా నిరూపించుకోవాలని పార్టీ నాయకులు టార్గెట్‌గా పెట్టుకున్నారు. హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే గౌలీపురా, ఘాన్సీబజార్, బేగంబజార్లలో గత ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. ఈసారి ఆ రెండుచోట్లా పాగా వేయాలని మజ్లిస్ పట్టుదలతో ఉంది. అదెంత వరకు నెరవేరుతుందో మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది. -
బీజేపీ నేతలు జాతర్లకు వచ్చినట్లు వస్తున్నారు..
సాక్షి, హైదరాబాద్: మ్యానిఫెస్టోలు, ప్రొగ్రెస్ రిపోర్టులు వెబ్సైట్లో పెట్టి తీసేయడం టిఆర్ఎస్కు మాత్రమే సాధ్యమని మాజీ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. మేడిపండు కంటే దారుణంగా టీఆర్ఎస్ ప్రొగ్రెస్ రిపోర్టు ఉందని ఎద్దేవా చేశారు. ఎవరి సొమ్మని 17,500 కోట్లు మెట్రోరైలుకు ఖర్చు చేశారని ప్రశ్నించారు. నిజానికి మెట్రో ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ ప్రారంభించగా, కేసీఆర్ దాన్ని ఆపేశారన్నారు. 'నీవల్ల ప్రజలకు అసౌకర్యం కలిగింది. ముక్కు నేలకు రాస్తావా? తప్పు ఒప్పుకుంటావా?' అంటూ కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ విడుదల చేసింది అభివృద్ధి ప్రణాళిక కానే కాదని, అదొక అవినీతి నివేదిక అని, దీనిపై విచారణ జరిపించి నిజనిజాలు బయటకు తేల్చాలని తెలిపారు. 'రాష్ట్రంలో ఒక్క మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేయలేదు. యాదాద్రి, భద్రాద్రి ఎక్కడ ఉంది?అన్నీ గత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన విద్యుత్ ప్రాజెక్టులే. విద్యుత్ కొనుగోలు చేయడం కూడా ప్రగతేనా? ఐటికి 2100 కోట్లు ఖర్చు చేశామంటున్న టీఆర్ఎస్.. యానిమేషన్ గేమింగ్ 400 కోట్లతో కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. ఏడు సంవత్సరాల నుంచి దాన్ని ఎందుకు పూర్తి చేయలేదు. చర్చకు రమ్మంటే ముఖం చాటేసిన టీఆర్ఎస్ నాయకులు ప్రజలకు క్షమాపణలు చెప్పాలి' అని డిమాండ్ చేశారు. (సీఎం దొరగారు మాస్టర్ ప్లాన్: విజయశాంతి) గ్రేటర్ ఎన్నికల కోసం బీజేపీ నాయకులు జాతరలు, సంతలకు వచ్చినట్లు వస్తున్నారని, ఒక్క నవోదయ స్కూల్ తెలంగాణకు కేటాయించని స్మృతి ఇరానీ ఏ ముఖం పెట్టుకుని వచ్చారంటూ విమర్శించారు. తెలంగాణకు ఏం చేశారో చెప్పుకుని కేంద్ర మంత్రులు ఓట్లు అడిగితే బాగుండేదన్నారు. ఉత్తరప్రదేశ్‌లో అశాంతి పాలన చేసిన యోగిఆదిత్య తెలంగాణలో కూడా అలానే ఉండాలని ఇక్కడకు వస్తున్నారా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎప్పుడూ మతపరమైన వ్యాఖ్యలు చేయదు, వాటిని సమర్దించదని పేర్కొన్నారు. విద్యుత్ చార్జీలు చెల్లించడంలో రైతులు ఆలస్యం చేశారని ట్రాన్స్ ఫార్మర్కు తాళం వేసిన పరిస్థితులు తెలంగాణలో నెలకొనడం దౌర్భాగ్యమని అన్నారు. ('అలా మాట్లాడితే బీజేపీని మతతత్వ పార్టీ అంటున్నారు') -
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేము..
రాజకీయాల్లోకి రావాలంటే తగినంత పరిజ్ఞానం ఉండాలి.. అంతకుమించి ధైర్యం ఉండాలి.. వెనుక అండదండలు ఉండాలని లెక్కలు వేస్తుంటారు. కానీ, ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక ముందు ఒక లెక్క అంటోంది నగర యువ నారి. ఈ ఏడాది మహిళలు ముఖ్యంగా యువతులు తమ సత్తా ఏంటో నిరూపించుకోవడానికి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. చదువుకున్న యువతులు డిగ్రీ పట్టా చేతబట్టుకొని మరీ రంగంలోకి దిగారు. సమస్యలు ఎందుకు పరిష్కారం కావో తేల్చుకుంటాం అంటున్నారు. చూసేవారికి వీరు వేసే అడుగు చిన్నదిగానే అనిపించవచ్చు. ‘మేం ఈ రోజు వేసే మొదటి అడుగు తర్వాత రాబోయే వారిలో స్ఫూర్తిని నింపాలి. చిన్నవయసులో రాజకీయాల్లోకి వస్తేనే సమాజ సేవలో మరింత చురుకుగా పాల్గొనగలం. మమ్మల్ని చూసి అమ్మాయిలు ఇంకా ఈ రంగంలోకి రావడం పెరగాలి. అప్పుడే సమాజానికి మేలు జరుగుతుంది’ అంటున్న యువతుల స్వరం ఇది. జాబ్ వదులుకున్నా ఇన్నాళ్లూ జనం ఎలా ఉన్నారో ఇప్పుడు కాలనీల్లో తిరుగుతుంటే అర్థమవుతోంది. ప్రచారంలో భాగంగా ఎక్కడకు వెళ్లినా కనీస సౌకర్యాలు లేక ప్రజలు అల్లాడటం చూస్తున్నాను. సమాజసేవ చేయడానికి ఇప్పటికే లేట్ చేశాను అనిపించింది. నిన్ననే నేను కలగన్న పెద్ద కంపెనీలో 40 వేల రూపాయల జీతంతో జాబ్‌లో జాయిన్ అవ్వమని ఆఫర్ లెటర్ వచ్చింది. కానీ, వదిలేసుకున్నాను. అందుకు ఇంట్లో అమ్మనాన్నలు ఏమీ అనలేదు. వాళ్లు నా ఇష్టానికే ప్రాధాన్యం ఇచ్చారు. నాన్న రాజకీయాల్లో ఉన్నారు. నాకూ అలా ఆసక్తి పెరిగింది. గెలుస్తాననే నమ్మకం ఉంది. ఫలితం ఏదైనా పూర్తి సమయం సమాజ సేవకే కేటాయిస్తాను. – టి.వి.తపస్విని యాదవ్ (21), మీర్జాల్గూడ, మల్కాజిగిరి డిగ్రీ చేసి ఇటొచ్చా పొలిటీషియన్ అవ్వాలనే ఆలోచన నాకు జూనియర్ కాలేజీ నుంచి ఉండేది. బిబిఏ చేశాను. రాజకీయాలంటే ఆసక్తితోపాటు యూత్ ఈ రంగంలోకి వస్తే మోడర్న్ ఐడియాలజీతో ఈ కాలానికి తగ్గట్టు పనులు చేయగలరు. మా నాన్నగారికి జీడిమెట్లలో వ్యవసాయ మోటార్లకు అవసరమైన ఎలక్ట్రికల్ బాక్సులు తయారుచేసే యూనిట్ ఉంది. ఎవరిపైనా ఆధారపడాల్సిన పని లేదు. మా ఇంట్లో ఎవరూ రాజకీయాల్లో లేరు. నా ఇంట్రస్ట్ పాలిటిక్స్ అని చెప్పినప్పుడు నాన్న ఎంకరేజ్ చేశారు. ప్రచారానికి నా స్నేహితులతో కలిసి వెళుతున్నాను. ‘ఇంత చిన్న వయసులో మాకేం సాయం చేస్తావు?’ అనే మాటలు కూడా అక్కడక్కడా వింటున్నాను. ఏం చేయగలనో వివరంగా చెబుతున్నాను. – పెరుమాళ్ల వైష్ణవి (21), సుభాష్‌నగర్, సనత్‌నగర్ రెండిట్లోనూ ఉంటాను డాక్టర్ని అయ్యి పేదవాళ్లకు ఉచితంగా చికిత్స చేయాలన్నది చిన్నప్పటి నుంచీ నా కల. ఆ లక్ష్యంతోనే ఎంబీబిఎస్ చేస్తున్నాను. ఇప్పుడు థర్డ్ ఇయర్లో ఉన్నాను. మా నాన్న ఏసీ టెక్నిషియన్‌గా పనిచేస్తారు. మాకు చిన్న షాప్ ఉంది. మా అన్న మహమ్మద్ ఫాజిల్ చాలా చిన్న వయసులోనే పాలిటిక్స్‌లోకి వచ్చారు. తన లక్ష్యం చూస్తూ పెరిగాను. మా ఏరియాలో పేదల పరిస్థితులను స్వయంగా చూస్తూ ఉన్నాను. గెలిస్తే పేదలకు ఉపయోగపడే పనులు చేయవచ్చు. రాజకీయాల్లో ఉంటే సర్వీస్ ఇంకా బాగా చేయవచ్చు అనిపించింది. ఎంబీబిఎస్ పూర్తి చేసి డాక్టర్‌గా రాణిస్తాను. అలాగే, రాజకీయ నాయకురాలిగానూ పేదలకు అండగా ఉంటాను. – అమీనా సమ్రీన్ (21), నల్లకుంట వివక్ష తొలగిస్తాను! నేను ఎంబీయే చేశాను. బాస్కెట్‌బాల్‌లో జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నాను. అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణిగా ఎదగాలనుకున్నాను. కానీ, స్పోర్ట్స్ అకాడమీలో చాలా సమస్యలు ఫేస్ చేశాను. అబ్బాయిలకైతే ఇద్దరేసి కోచ్లుంటారు. అమ్మాయిలకు ఒక కోచ్ దొరకడం కూడా గగనం. ఎవరికైనా చెప్పినా సరిగ్గా పట్టించుకోరు. చాలా విసుగ్గా అనిపించింది. మా నాన్న ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్. ఎన్నికల్లో నిలబడతానని నాన్నతో చెప్పినప్పుడు వెంటనే ‘ఓకే’ చెప్పారు. అంతేకాదు, మా ప్రాంతం మొన్నటి వరదలకి బాగా దెబ్బతింది. సామాన్యురాలిగా కంటే కార్పోరేటర్ స్థాయిలో మెరుగైన సేవలు అందించవచ్చు. క్రీడావిభాగంలో అమ్మాయిలకు ప్రోత్సాహం అందించాలి, మా ప్రాంతంలో కనీస అవసరాలు ప్రజలకు అందేలా చూడాలి. ఈ లక్ష్యంతో ఎలక్షన్లో పోటీ చేస్తున్నాను. – ఎ.మౌనిక (26), రామ్‌గోపాల్‌పేట్, సికింద్రాబాద్ మంచి చేసే అవకాశం డిగ్రీ వరకు చదువుకున్నాను. ఈ మధ్యే నాకు పెళ్లయ్యింది. మా వారు కారు డ్రైవర్‌గా పని చేస్తారు. అద్దె ఇంట్లో ఉంటున్నాం. మాది లో క్లాస్ ఫ్యామిలీ. కరోనా వల్ల ఫుడ్‌కు కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. పస్తులున్న రోజులు కూడా ఉన్నాయి. ప్రభుత్వ పథకాల కోసం అప్లయ్ చేయడానికి ఆఫీసులకు వెళితే అక్కడ ఎలాంటి రెస్పాన్స్ ఉండటం లేదు. లీడర్ ఉన్నారు కదా అని కార్పోరేటర్ దగ్గరకు ఎన్నిసార్లు తిరిగినా పనులు కాలేదు. పైగా, ఫలానా పథకం నుంచి లబ్ధి పొందాలంటే లంచం అడిగారు. చదువుకున్న నాలాంటివారి పరిస్థితే ఇలా ఉంటే.. చదువురాని వారి పరిస్థితి ఏంటి అనుకున్నాను. నలుగురికి మంచి చేసే అవకాశం వస్తే బాగుండు అనుకున్నాను. అప్పుడే ఈ ఎలక్షన్లో పోటీ చేయాలనే ఆలోచన వచ్చింది. ఇండిపెండెంట్‌గా పోటీచేస్తున్నాను. – మౌనిక రాజేష్ (25), ఇందిరానగర్, ఉప్పల్ -
ఢిల్లీ చేరుకున్న పవన్‌కల్యాణ్
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: బీజేపీ జాతీయ నాయకులతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ సోమవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. నాదెండ్ల మనోహర్‌తో కలిసి ఢిల్లీ వచ్చిన పవన్ మంగళవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు పలువురు నాయకులతో భేటీ అవుతారని జనసేన వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో బీజేపీ, జనసేనలో ఏ పార్టీ అభ్యర్థిని పోటీకి దించాలనే అంశంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తన ప్రచారం గురించి కూడా పవన్ వారితో చర్చిస్తారని పేర్కొన్నాయి. -
బీజేపీలో విషయమేది.. విషం తప్ప!
సాక్షి, హైదరాబాద్ : ‘ఎవరైనా మేమిది చేశాం, ఇంకా ఇవి చేస్తామని చెప్పి ఓట్లడుగుతారు. కానీ బీజేపీ దగ్గర విషయం లేదు. ఎందుకంటే వాళ్లు హైదరాబాద్‌కు చేసిందేమీ లేదు. అందుకే విషం చిమ్ముతున్నారు. ఆరేళ్లుగా ప్రశాంతంగా ఉన్న నగరంలో నాలుగు ఓట్ల కోసం మతం పేరిట చిచ్చుపెట్టాలని చూస్తున్నారు’ అని రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు అన్నారు. ‘ఏ ఎన్నిక అయినా ప్రజల మనోగతాన్ని ప్రతిబింబిస్తుంది. 74 లక్షల మంది ఓట్లు వేసే గ్రేటర్ ఎన్నిక ప్రజాభిప్రాయానికి ప్రతీక (రిఫరెండం) కాదు అని ఒక రాజకీయ నాయకుడిగా నేను అంటే అది తప్పే. కార్పొరేషన్, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ముఖ్యమైనవే. అలాగని ఈ ఎన్నికను భూతద్దంలో చూడాల్సిన పనికానీ, విస్మరించాల్సిన అవసరం కానీ లేదు. అన్ని ఎన్నికల మాదిరిగానే గ్రేటర్ ఎన్నిక కూడా ప్రజల మనోగతాన్ని ప్రతిబింబిస్తుంది. మేము పనిచేశాం కాబట్టి ఈ ఎన్నికల్లో ప్రజలు మాకు బలమైన మెజారిటీ ఇస్తారు’ అని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో హైదరాబాద్ పాత్ర అత్యంత కీలకమని చెప్పిన కేటీఆర్.. మరో మూడేళ్లలో నాలా అభివృద్ధి పథకాన్ని ప్రాధాన్యంగా తీసుకుని హైదరాబాద్ నగర రూపురేఖలు మారుస్తామన్నారు. జీహెచ్ఎంసీతో పాటు పరిసర మున్సి పాలిటీలు, కార్పొరేషన్లను ‘గ్రేటర్ హైదరాబాద్ అథారిటీ’ పేరిట ఒకే గొడుగు కిందకు తెచ్చే ఆలోచన ఉందన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు కేంద్రం నుంచి నయాపైసా సాయం అందలేదని, పెయిడ్ వర్కర్స్‌ను పెట్టుకుని గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ విషం చిమ్ముతోందన్నారు. అభివృద్ది కావాలో... అరాచకం కావాలో హైదరాబాద్ ప్రజలు తేల్చుకోవాలన్నారు. గత గ్రేటర్ ఎన్నికల్లో సెంచరీ మిస్సయిన టీఆర్ఎస్.. ప్రస్తుత ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో భారీ విజయం సాధిస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ. సాక్షి : రాష్ట్రానికి హైదరాబాద్‌ను ఆర్దిక ఇంజిన్ అని చెప్తున్నారు. ఆరేళ్ల పాలనలో ఈ ఇంజిన్‌ను గాడిన పెట్టేందుకు ఎలాంటి ప్రయత్నం చేశారు? కేటీఆర్ : తెలంగాణకు హైదరాబాద్ గుండెకాయ లాంటిది. రాష్ట్ర జీఎస్డీపీలో 45 నుంచి 50శాతం హైదరాబాద్ నుంచే వస్తోంది. రాష్ట్ర పురోగతిలో హైదరాబాద్ పాత్ర కీలకం. అధికారం చేపట్టిన కొత్తలో ఉన్న తాగునీరు, విద్యుత్ వంటి సమస్యలను పరిష్కరించడం ద్వారా ప్రస్ఫుటమైన మార్పు తెచ్చాం. పారిశుధ్యం, చెత్త సేకరణ, రవాణా, డంప్ యార్డుల ఆధునికీకరణ, చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి, పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగాల కల్పన, శాంతి భద్రతల పరిరక్షణ తదితరాల్లో ఎంతో ప్రగతి సాధించాం. పేకాట క్లబ్లులు, గుడుంబా గబ్బు, ఆకతాయిల ఆగడాలు, పోకిరీల పోకడలు లేవు. మత కల్లోలాలు, అనవసరపు అల్లర్లు లేవు. 5 లక్షల సీసీ కెమెరాలు, 4.7 లక్షల ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేశాం. ఆకలేస్తే అన్నపూర్ణ.. సుస్తీ చేస్తే బస్తీ దవాఖానా.. ఇలా మౌళిక వసతుల మీద దృష్టి పెట్టాం. రూ.6వేల కోట్లతో ఎస్ఆర్డీపీ, రోడ్ల నిర్వహణకు సీఆర్ఎంపీ, రూ.1,800 కోట్లతో లింక్ రోడ్లు, మెట్రో రెండో దశకు శ్రీకారం చుట్టడం లాంటివి ఎన్నో చేశాం. సాక్షి : రాబోయే ఐదేళ్లలో మీ దృష్టి దేనిపై కేంద్రీకరిస్తారు? కేటీఆర్ : రాష్ట్రంలో మా ప్రభుత్వం మరో మూడేళ్లు అధికారంలో ఉంటుంది కాబట్టి చెరువులు, కుంటలు, నాలాలు, మూసీ అభివృద్ది చేయడంతో పాటు ఎస్ఎన్డీపీ ద్వారా మంచి మార్పు తెస్తాం. మానవ తప్పిదాలతో రసాయనాలు, చెత్తా చెదారం కలిసి వరద నీరు, మురుగునీటి కాలువలు దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. నగరాన్ని అపరిశుభ్రం చేయకుంటే పరిశుభ్రంగా ఉంటుందనే టోక్యో తరహా భావన మన ప్రజల్లో రావాల్సిన అవసరం ఉంది. ఇండోర్ తరహాలో ప్రజలు, ఉద్యోగుల్లో మార్పు సాధించేందుకు ప్రయత్నిస్తాం. సాక్షి : మీరు చెప్తున్న అభివృద్ధి ప్రణాళిక అమలుకు కావాల్సిన నిధులు ఎక్కడి నుంచి తెస్తారు? కేటీఆర్ : రాష్ట్రమైనా, నగరమైనా అభివృద్ది కోసం అప్పులు తేవాల్సిందే. అయితే ఉత్పాదక రంగం కోసం చేసే అప్పులను పెట్టుబడిగా చూడాలి. ఉదాహరణకు మూసీ ప్రాజెక్టు కోసం రూ.4 వేల నుంచి రూ.5 వేల కోట్లు అప్పు చేస్తే, రూ.6వేల కోట్ల విలువ చేసే భూమి వినియోగంలోకి వస్తుంది. అప్పుల ద్వారా సంపద సృష్టించవచ్చు. ప్రధాని మోదీ ఓ సందర్భంలో ఇచ్చిన సలహా మేరకు మున్సిపల్ బాండ్ల ద్వారా రూ.వేయి కోట్లు తెచ్చి ఎస్ఆర్డీపీ చేపట్టాం. ఎఫ్ఆర్బీఎం పరిమితికి లోబడే రుణాలు తెస్తున్నాం. సాక్షి : ఇటీవలి వరదలు నగరంలో మౌళిక వసతుల లేమిని ఎత్తిచూపాయి. గతంలో అనేక కమిటీలు చేసిన సిఫారసులు ఎందుకు అమలు చేయడం లేదు? కేటీఆర్ : మేం అధికారంలోకి వచ్చిన తర్వాత తాగునీరు, సాగునీరు, విద్యుత్, సంక్షేమ కార్యక్రమాలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చాం. ఇటీవల కురిసిన వరదలు నగరంలోని డ్రైనేజీలు, నాలాలు, చెరువుల్లో లోపాలను ఎత్తిచూపాయి. దశాబ్దాల తరబడి సాగిన అక్రమ నిర్మాణాలు, అధికారుల నిర్లక్ష్యంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. రాబోయే మూడు నాలుగేళ్లలో నాలా అభివృద్ది పథకాన్ని ప్రాధాన్యంగా తీసుకుని పూర్తి చేస్తాం. నీటి వనరుల పరిరక్షణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తాం. నగర శివారు కాలనీల్లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ కోసం రూ.3,700 కోట్లు కావాలి. కోర్‌సిటీని కలుపుకుంటే రూ.15వేల కోట్లకు పైగా నిధులు అవసరం. షా కన్సల్టెన్సీ నగరాన్ని పది ఫ్లడ్ వాటర్ జోన్లుగా విభజించి నివేదిక ఇచ్చింది. వాటిని అధ్యయనం చేసి పరిష్కారం కోసం చిత్తశుద్దితో పనిచేస్తాం. కేంద్రానికి బాధ్యత లేదా? సాక్షి : వరద సాయం మీద గుడిలో ప్రమాణం చేసేదాకి వెళ్లింది బాధితులకు పూర్తిగా అందచేయడంలో ఎక్కడ వైఫల్యం జరిగింది? కేటీఆర్: వరద బాధితులను ఆదుకునేందుకు కేంద్రం నుంచి నయాపైసా సాయం అందలేదు. మేము 6.5 లక్షల మందికి రూ.650 కోట్లు వరద సాయం వేగంగా అందజేశాం. అక్కడక్కడా లోపాలు ఉండొచ్చు. ఇక్కడ సమస్య వస్తే స్పందించాల్సిన బాధ్యత కేంద్రం మీద లేదా? జీహెచ్ఎంసీలో గెలిస్తే బాధితులకు రూ.25వేలు చొప్పున ఇస్తామని బీజేపీ నేతలు చెప్తున్నారు. మేము పరిహారం ఇచ్చిన వారి జాబితా మీకు ఇస్తాం. రూ.25 వేలు చొప్పున ఇవ్వండి. మోకాలు అడ్డం పెట్టి పిచ్చి రాజకీయం చేస్తున్నారు. కేంద్రమంత్రిగా కిషన్‌రెడ్డి ఒక్క రూపాయి కూడా తేలేదు. ఏ ముఖం పెట్టుకుని బీజేపీ నేతలు ఓట్లు అడుగుతారు. హైదరాబాద్‌లో బీజేపీ అభివృద్ధి నమూనా ఏంటో చెప్పాలి. లక్ష కోట్ల రూపాయల ప్యాకేజీ తెస్తారా? అభివృద్ది కావాలో, అరాచకం కావాలో హైదరాబాద్ ప్రజలు తేల్చుకోవాల్సిన సందర్భం వచ్చింది. మా నినాదం విశ్వనగరం.. వారి నినాదం విద్వేష నగరం. ఆరేండ్లుగా ప్రశాంతంగా ఉన్న నగరంలో ఇప్పుడు మతం పేరిట చిచ్చు పెడుతున్నారు. ఓట్లు, నాలుగు సీట్ల కోసం ఇంతగా దిగజారాలా? బీజేపీ మా మీద చార్జిషీట్ విడుదల చేసింది. వాళ్ల మీద లక్ష చార్జిషీట్లు వేయాల్సి వస్తుంది. ఒక్కో ఖాతాలో రూ.15 లక్షలు జమ, నల్లధనం ఎక్కడికి పోయాయి? కేంద్ర ప్రభుత్వ దివాళాకోరు విధానాలతో దేశంలో తొలిసారి ఆర్థిక మాంద్యం వచ్చింది. జీఎస్టీ పరిహారం చెల్లింపు విషయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు. సాక్షి: జీహెచ్ఎంసీతో పాటు పరిసర మున్సిపాలిటీలు, కార్పోరేషన్లను ఒకే గొడుగు కిందకు తెచ్చే ఆలోచన ఏదైనా ఉందా? కేటీఆర్ : గ్రేటర్ లండన్ అథారిటీ, గ్రేటర్ టోక్యో అథారిటీ తరహాలో పాలనను వికేంద్రీకరించాలనేది నా వ్యక్తిగత ఆలోచన. ముఖ్యమంత్రి, కేబినెట్‌కు నివేదించి... వారు ఆమోదిస్తే గ్రేటర్ హైదరాబాద్ అథారిటీ ఏర్పాటుపై ఆలోచిస్తాం. సాక్షి: దుబ్బాక ఉపఎన్నికలో ఓటమి వల్లే గ్రేటర్ ఎన్నికలకు త్వరగా వెళ్లారనే విమర్శ మీపై ఉంది. గ్రేటర్ ఎన్నికల షెడ్యూలు కూడా కేవలం 14 రోజుల్లో ముగుస్తుండటంపై మీరేమంటారు? కేటీఆర్ : జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం మూడు నెలలు ముందుగానే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. గతంలో అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఆరు నెలల ముందే వెళ్లాం. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఓట్లు వేసేది ఈ ప్రజలే. ప్రజస్వామ్యంలో ప్రజల వద్దకు వెళ్లేందుకు భయమెందుకు. మా మీద, ప్రజల మీద మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. డిసెంబర్ నాలుగున ఓట్ల లెక్కింపుతో అన్నీ తేలుతాయి. ప్రజల ఆశీర్వాదంతో ఈసారి సెంచరీ సాధిస్తాం. సాక్షి : ఇతర పార్టీలకంటే ఎన్నికల సన్నద్దతలో మీరు ముందున్నట్లు కనిపించినా చాలా చోట్ల అభ్యర్థులు మార్చేందుకు కారణమేంటి? కేటీఆర్ : కేవలం టీఆర్ఎస్లో మాత్రమే 150 మంది అభ్యర్థులను ఒకేచోట కూర్చోబెట్టి బీ ఫారాలు ఇచ్చే పరిస్థితి ఉంది. కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లిలో బీజేపీ ఆఫీసులను ఆ పార్టీ కార్యకర్తలే ధ్వంసం చేశారు. మా పార్టీలో క్రమశిక్షణ ఉంది. అసంతృప్తి ఉన్నా సద్దుమణుగుతుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు ఎక్కువ సీట్లు ఇచ్చేందుకు కొన్ని చోట్ల సిట్టింగ్‌లను మార్చాల్సి వచ్చింది. సాక్షి: దుబ్బాక ఉపఎన్నికలో రెండు జాతీయ పార్టీలు రాష్ట్ర నాయకత్వాన్ని మోహరించినట్లుగానే మీరు కూడా జీహెచ్ఎంసీలో మంత్రులు, ఎమ్మెల్యేలను ఇన్చార్జిలు నియమించడాన్ని ఎలా సమర్థించుకుంటారు? కేటీఆర్ : గత గ్రేటర్ ఎన్నికల్లో మేం ఇదే రీతిలో మోహరించాం. ఈసారి కూడా అదే పద్దతిలో మా పార్టీ నేతలు పనిచేస్తున్నారు. దుర్భిణీలో చూడొద్దు సాక్షి : గతంలో పార్టీ వెంట ఉన్న యువత దూరమవుతున్న భావన కలగడం లేదా? కేటీఆర్ : మీరు దుబ్బాక ఉప ఎన్నికను దుర్భిణీలో చూస్తున్నారు. గతంలో మహబూబ్‌నగర్ ఉపఎన్నికలో గెలిచిన బీజేపీ ఆ తర్వాత చతికిలపడింది. పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో గెలిచి... స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతింది. 2014 తర్వాత టీఆర్ఎస్ గెలిస్తే వార్త కాదు.. ఓడితే వార్త అన్నట్లుగా పరిస్థితి తయారైంది. సంప్రదాయ పద్ధతుల్లోనే కాకుండా... సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ప్రజలతో నిరంతరం టచ్‌లో ఉంటున్నా. అందుబాటులో ఉంటున్నా. సాక్షి: గతంలో టీఆర్ఎస్– కాంగ్రెస్ నడుమ ఉన్న ఎన్నికల పోరు ఇప్పుడు టీఆర్ఎస్– బీజేపీ అన్నట్లుగా మారింది. మీరు కాంగ్రెస్‌ను బలహీనపరచడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందా? కేటీఆర్ : మీతో ఉండటం ఇష్టం లేని వారు ఎటుపోతారనేది వారిష్టం. కాంగ్రెస్ అంతర్గత బలహీనతను వేరేవాళ్ల మీద రుద్దడం సరికాదు. కాంగ్రెస్ మీద నాయకులకు, ప్రజలకు విశ్వాసం పోయిందనే అభిప్రాయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో మేము మొదటి స్థానంలో ఉంటాం, రెండో స్థానంలో ఎవరుంటారో వాళ్లు తేల్చుకోవాలి. సాక్షి: మీ పార్టీ అసంతృప్త నేతలతో బీజేపీ మంతనాలు జరపడాన్ని ఎలా చూస్తున్నారు? కేటీఆర్ : ఒక పార్టీ అసంతృప్తవాదులతో ఇంకొకరు మాట్లాడటం సర్వసాధారణం. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలి. అసంతృప్తిపై ఆలోచించాలి. అప్పుడప్పుడు మార్పులు జరగడం రాజకీయాల్లో సహజం. సమాజంలో తక్కువ... సోషల్‌మీడియాలో ఎక్కువ సాక్షి : రాజకీయ విమర్శలు వ్యక్తిగత దూషణ దాకా వెళ్లడాన్ని ఎలా చూస్తారు? కేటీఆర్ : పత్రికలు, ప్రసారసాధనాల్లో దూషించే వారికే ఎక్కువ స్పేస్ వస్తోంది. పెయిడ్ వర్కర్స్‌ను పెట్టుకుని బీజేపీ సమాజంలో తక్కువ.. సామాజిక మాద్యమాల్లో ఎక్కువ అన్నట్లుగా తయారైంది. ఈ ఎన్నికల్లో విషం చిమ్మకుండా విషయం చెప్పమనండి. ఎంతసేపూ గుడి, మతం.. ఇదేనా? సాక్షి : ఎంఐఎంతో గ్రేటర్ ఎన్నికల్లో పొత్తు ఉందా? కేటీఆర్ : ఎంఐఎంకు మేయర్ పదవి ఇస్తామనడంలో అర్థం ఉండాలి. జీఎస్టీ వంటి వాటిపై కేంద్రంలో బీజేపీకి మేము అంశాల వారీ మద్దతు ఇచ్చినట్లుగానే, ఎంఐఎం కూడా మాకు కొన్ని అంశాలపై మద్దతు ఇచ్చింది. ఎన్నడైనా మేము ఎన్నికల్లో కలిసి పోటా చేశామా? గతంలో గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులపై ఐదు చోట్ల గెలిచాం. ఈసారి మరో ఏడు కలుపుకుని పన్నెండు స్థానాల్లో గెలుస్తాం. సాక్షి : మీరు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవుల భర్తీలో ఆలస్యమెందుకు జరుగుతోంది? కేటీఆర్ : నామినేటెడ్ పదవుల భర్తీలో జాప్యం జరిగిన మాట నిజమే. ఇటీవల ముగ్గురిని ఎమ్మెల్సీలుగా నామినేట్ చేశాం. చట్టసభల్లో ప్రాతినిధ్యం లేని పద్మశాలి, నాయీ బ్రాహ్మణులకు కూడా ప్రాతినిధ్యం కల్పిస్తాం. పార్టీ కోసం కష్టపడే వారికి నామినేటెడ్ పదవుల ద్వారా గౌరవం, గుర్తింపు ఇస్తాం. పెద్ద పదవేదీ ఖాళీగా లేదు సాక్షి : గ్రేటర్ ఎన్నికల్లో మీ పార్టీ భారీ విజయం సాధిస్తే మీరు మరో పెద్ద పదవిలోకి వెళ్తారనే ప్రచారం వినిపిస్తోంది? కేటీఆర్ : పెద్ద పదవులేవీ ఖాళీగా లేవు. నాకున్న బాధ్యతలతో సంతృప్తిగా ఉన్నా. కేసీఆర్ నాయకత్వంలో ప్రజలు ముందుకు వెళ్తున్నాం. ఆయన నాయకత్వం రాష్ట్రానికి మరో పది పదిహేనేళ్లు అవసరం ఉంది. ఈ విషయంలో చర్చ, ఊహాగానాలు అవసరం లేదు. సాక్షి : జీహెచ్ఎంసీని పూర్తిగా అప్పుల ఊబిలోకి తీసుకెళ్లారన్న విమర్శపై మీరేమంటారు? కేటీఆర్ : ఆరేళ్ల కాలంలో జీహెచ్ఎంసీకి ఏమేమి చేశామో మేము ప్రగతి నివేదిక సమర్పించాం.. ఆరున్నరేళ్ల కాలంలో కేంద్రం హైదరాబాద్‌కు ఏమి చేసిందో బీజేపీ చెప్పాలి. అదికాకుండా బురద రాజకీయం చేస్తోంది, విద్వేషాలను రెచ్చగొడుతోంది. వారు ఏమి చేశారో... ఏమి చేస్తారో చెప్పకుండా పనికి మాలిన రాజకీయం చేస్తున్నారు. -
దమ్ముంటే లక్ష కోట్లు తెండి
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ నాయకులు బాధ్యతారహితంగా అలవిగాని హామీలు ఇవ్వడం మానుకొని... దమ్ముంటే హైదరాబాద్‌కు కేంద్రం నుంచి లక్ష కోట్ల రూపాయల ప్యాకేజీని తేవాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు సవాల్ విసిరారు. వరదసాయం కింద కేంద్రం నుంచి నయాపైసా తేలేకపోయిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఎన్నికల వేళ... అడ్డగోలుగా మాట్లాడుతోందని మండిపడ్డారు. ‘తెలంగాణకు హైదరాబాద్ ఆర్థిక ఇంజిన్ లాంటిది. నగరం బాగుంటేనే రాష్ట్రంతో పాటు రైతులు బాగుంటారు. నగరాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాం. హైదరాబాద్‌లో అశాంతి చెలరేగితే అమెజాన్, గూగుల్, యాపిల్ వంటి కంపెనీలు రావు. నగరంలో బిర్లామందిర్, తాడ్‌బండ్ ఆంజనేయస్వామి వంటి గుడులు ఎన్నో ఉండగా, చార్మినార్ భాగ్యలక్ష్మి గుడి వద్దే బీజేపీ నేతలు ధర్నా పేరిట ఎందుకు కెలుక్కోవాలి. వారం రోజుల పాటు వాళ్లు కావాల్సినంత వినోదం పంచుతారు. బీజేపీ నేతలకు దమ్ముంటే హైదరాబాద్‌కు లక్ష కోట్ల రూపాయల ప్యాకేజీ ఇస్తామని కేంద్రంతో ప్రకటన ఇప్పించాలి’అని బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి కేటీఆర్ సవాల్ విసిరారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న 150 మందికి శుక్రవారం ఇక్కడి తెలంగాణ భవన్లో బీ ఫారాలు అందజేశారు. ఈ సందర్భంగా గత ఆరేళ్లుగా హైదరాబాద్ నగరంలో రూ.67 వేల కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలతో కూడిన ప్రగతి నివేదికను విడుదల చేశారు. ‘రాష్ట్రానికి సంబంధించి ఇది కీలకమైన ఎన్నిక. విద్వేష, విషప్రచారంతో కూడినహైదరాబాద్ కావాలా? అశాంతి కావాలా? అభివృద్ది కావాలా? అని ప్రజల్లో చర్చ పెట్టండి. గ్రేటర్ ఎన్నికలను రొటీన్‌గా కొట్లాడొద్దు. అభ్యర్థులు గర్వం, అహం లేకుండా టికెట్లు రాని వారిని కూడా కలుపుకొని వెళ్లండి. ప్రగతి నివేదిక మన పార్టీ అభ్యర్థులకు ప్రచార అస్త్రం. శనివారం ఉదయం పార్టీ అభ్యర్థులు అందరూ బీ– ఫారాలు సమర్పించాలి’అని కేటీఆర్ సూచించారు. ఈసారి సెంచరీ కొట్టాల్సిందే ‘గత ఎన్నికల్లో ఒక్క సీటు తేడాతో గ్రేటర్లో సెంచరీ మిస్సయ్యాం. ఈసారి ప్రజల ఆశీర్వాదంతో వందస్థానాల్లో గెలుపొందేలా పార్టీ అభ్యర్థులు రేయింబవళ్లు కష్టపడాలి. ఈ నెల 28న ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగసభతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భారీ సంఖ్యలో డివిజన్ల నుంచి కార్యకర్తలు తరలివచ్చేలా ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించండి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో నేను కూడా శనివారం నుంచే రోడ్ షోలలో పాల్గొంటా’అని కేటీఆర్ ప్రకటించారు. ప్రభుత్వ సొమ్ముతో జరిమానాలు కడతారా... ఇదెక్కడి విడ్డూరం? ‘కరోనా సమయంలో ప్రజలకు అండగా నిలవడంతో పాటు వలస కార్మికులను కడుపులో పెట్టుకుని కాపాడుకున్నాం, వలస కార్మికులను తరలించేందుకు కేంద్రం నయాపైసా ఇవ్వకున్నా రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాలుగా ఆదుకుంది. ఇటీవలి వరదల సమయంలో మనం ప్రజల్లో ఉండి వరదసాయాన్ని అందించాం. కేంద్రం ఇప్పటివరకు నయాపైసా ఇవ్వకున్నా... బల్దియాలో గెలిస్తే ఇంటికి రూ.25 వేలు ఇస్తామని బీజేపీ నేతలు చెప్తున్నారు. యువతను ఆకట్టుకునేందుకు బాధ్యతారహితంగా ప్రకటనలు చేస్తున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడుతున్న వారికి జరిమానా కట్టేందుకు... గుజరాత్, కర్నాటక, యూపీల్లో ఎక్కడైనా ప్రభుత్వ సొమ్ము చెల్లించారా’అని కేటీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఆరేళ్లుగా శాంతిభద్రతల సమస్య లేదని, తాగునీటి సమస్యలు 95 శాతం వరకు పరిష్కరించామని అన్నారు. టికెట్ల కేటాయింపులో సామాజికన్యాయం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అన్ని వర్గాలకు అవకాశం ఇస్తూ టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయం పాటించినట్లు కేటీఆర్ వెల్లడించారు. 150 డివిజన్లలో 50 శాతం కింద 75 స్థానాలు మహిళలకు రిజర్వు అయితే... తాము అంతకంటే ఎక్కువగా 85 చోట్ల అవకాశమిచ్చామన్నారు. బీసీలకు 75, ఎస్టీలకు 3, ఎస్సీలకు 13, మైనారిటీలకు 17 స్థానాల్లో టికెట్లు ఇచ్చామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ, మహిళా కేటగిరీల్లో అన్ని సామాజికవర్గాలకు అవకాశం ఇచ్చామన్నారు. తమిళనాడు నుంచి వచ్చి స్థిరపడిన అరవ మాలలకు రెండు, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడిన 8 మందికి గ్రేటర్ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు, మంత్రుల మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్ గౌడ్లతో పాటు నగరానికి చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. బీ ఫారాలు జారీ.. ప్రతిజ్ఞ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న 150 మంది అభ్యర్థులకు కేటీఆర్ బీ ఫారాలు అందజేశారు. నగర ప్రజల సంక్షేమం, అభివృద్ది కట్టుబడి ఉంటామని, అవినీతికి ఆస్కారం లేకుండా జీహెచ్ఎంసీ, ప్రభుత్వం, పార్టీ గౌరవాన్ని నిలబెడతామని, పార్టీ, ప్రజల పట్ల విధేయులుగా ఉంటామని అభ్యర్థులతో కేటీఆర్ ప్రతిజ్ఞ చేయించారు. ప్రోగ్రెస్ రిపోర్ట్ @ 6 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గడిచిన ఆరేళ్లలో హైదరాబాద్ నగరంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలతో కూడిన ప్రగతి నివేదికను టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు శుక్రవారం విడుదల చేశారు. ‘హైదరాబాద్– ది రైజింగ్ గ్లోబల్ సిటీ’పేరిట రూపొందించిన ఈ నివేదికలో రంగాల వారీగా మౌలికవసతుల కల్పన కోసం ప్రభుత్వం చేపట్టిన పనులు, వెచ్చించిన నిధుల వివరాలను వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాలను కలుపుకొని 1.60 కోట్ల జనాభాతో దేశంలోని మెట్రో నగరాల్లో ఆరో స్థానంలో, అర్బన్ ఎకానమీలో దేశంలోనే ఐదో స్థానంలో ఉన్నట్లు ప్రగతి నివేదికలో వెల్లడించారు. ►మెట్రో రైలు, రోడ్లు, నీటి సరఫరా, పారిశుధ్యం, డబుల్ బెడ్రూం ఇళ్లు, విద్యుత్, శాంతిభద్రతలు తదితరాల కోసం ఆరేళ్లలో రూ.67,149.23 కోట్లు వెచ్చించాం. ► దేశంలోనే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో రూ.17,290 కోట్లతో నిర్మితమైన ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో రైలు వ్యవస్థ హైదరాబాద్‌లో ఉంది. 66 స్టేషన్లతో 72 కి.మీ. పొడవుతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తోంది. ► ఎస్ఆర్డీపీ, హెచ్ఆర్డీసీఎల్, సీఆర్ఎంపీ, ఓఆర్ఆర్ ప్రాజెక్టుల ద్వారా రోడ్డు సౌకర్యం కోసం రూ.14,738.55 కోట్ల వ్యయం. 9 ఫ్లైఓవర్లు, 4 అండర్‌పాస్‌లు, 3 రోడ్‌ఓవర్ బ్రిడ్జీలు, 1 కేబుల్ బ్రిడ్జి నిర్మాణం. ► రూ.313.65 కోట్లతో 126.2 కిమీ పొడవుతో 137 రోడ్ల నిర్మాణం. మియాపూర్ హెచ్‌టీ లైన్, పాత ముంబై రోడ్డు హెచ్‌టీ లైన్, ప్రశాసన్‌నగర్ లింక్ రోడ్ల పూర్తి. ►రూ.709.49 కోట్లతో 709.49 కి.మీ పొడవునా రోడ్డు నిర్వహణ కార్యక్రమం. ► 158 కి.మీ పొడవునా రూ.3,309 కోట్లతో ఓఆర్ఆర్ అభివృద్ది. ► రూ.14,175 కోట్లతో 4,725 కి.మీ. పొడవైన తాగునీరు, మురుగునీటి పైపులైన్ల నిర్మాణం ►రూ.2,374.36 కోట్లతో నిరంతర విద్యుత్ సరఫరా. ► శాంతిభద్రతల కోసం రూ.1,940.33 కోట్లు, పోలీసు వ్యవస్థ ఆధునీకీకరణ, లక్షకు పైగా సీసీ కెమెరాల ఏర్పాటు. ► రూ.9,700 కోట్లతో 111 చోట్ల లక్ష డబుల్‌బెడ్ రూం ఇళ్లు. ► రూ.1,716.33 కోట్లతో స్వచ్చ హైదరాబాద్, స్వచ్ఛ ఆటోలు, 3 వేలకు పైగా పబ్లిక్ టాయిలెట్లు. రూ.332.70 కోట్లతో హరితహారం. ఆరేళ్లలో 8 కోట్లకు పైగా మొక్కల పెంపకం ► 250 కోట్లతో పార్కులు ► రూ.156.59 కోట్లతో ప్రజారవాణా మెరుగు, రూ.45 కోట్లతో బస్షెల్టర్ల నిర్మాణం. పాదచారుల కోసం 430 కి.మీ. పొడవైన ఫుట్‌పాత్‌లు. ► రూ.66.97 కోట్లతో వైకుంఠధామాలు, రూ.97.37 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు. ► ఐటీ, పారిశ్రామిక రంగంలో మౌలిక వసతులకు రూ.2,115.93 కోట్లు. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడుల రాక... 15 లక్షల మందికి ఉద్యోగాలు. ► రూ.30.51 కోట్లతో బస్తీ దవాఖానాలు, రూ.152.03 కోట్లతో 150 అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా రోజుకు 40 వేల మందికి భోజనం. -
ఎలాంటి తెలంగాణ కావాలో తేల్చుకోండి
సాక్షి, హైదరాబాద్ : ‘‘తెలంగాణలో కొందరు విద్వేషపు విత్తనాలు నాటుతూ మత సామరస్యం దెబ్బతీసే విధంగా ప్రయ త్నాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎవరైనా మత కలహాలు, బాంబు పేలుళ్ల వంటి పిచ్చి ప్రయత్నాలు చేస్తే ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తుంది. తెలంగాణకు ఆర్థిక యంత్రంగా ఉన్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని దెబ్బతీసే ప్రయత్నాలను సహించేది లేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విద్వేషంతో నిండిన హైదరాబాద్ కావాలో లేక విజ్ఞతతో ఆలోచించే తెలంగాణ కావాలో ప్రజలు తేల్చుకోవాలి. ‘హమారా హైదరాబాద్’ అంటూ నగరాన్ని కొందరి హైదరాబాద్‌గా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేము గల్లీ పార్టీ.. వారిది ఢిల్లీ పార్టీ.. ఈ రెండింటిలో ఏది కావాలో ప్రజలు తేల్చుకోవాలి’’ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం జరిగిన ‘మీట్ ది ప్రెస్’లో కేటీఆర్ మాట్లాడారు. గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరేస్తామనే బీజేపీ నేతల ప్రకటనలపై స్పందిస్తూ అక్కడ కేసీఆర్ జాతీయ జెండా ఎగరేస్తారని, తాము మాత్రం బల్దియాపై గులాబీ జెండా ఎగరేస్తామన్నారు. గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి తాము సవాళ్లు విసరబోమని, విపక్షాలు సవాలు చేస్తే స్పందిస్తామన్నారు. ‘‘గ్రేటర్ ఎన్నికల్లో పార్టీని నేనే గెలిపించాలనే భ్రమల్లో లేను. పెద్ద లీడర్‌ను అనుకోవడం లేదు. కేసీఆర్ రూపంలో మాకు సమర్థుడైన నాయకుడు ఉన్నారు. నా పొజిషన్‌తో సంతృప్తిగా ఉన్నా. నాకు వేరే ఏమీ అవసరం లేదు’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ మహిళా కార్పొరేటరే మేయర్... ‘‘గ్రేటర్ ఎన్నికల్లో మాకు ఎవరితోనూ దోస్తీ లేదు. గత ఎన్నికల్లో 150 డివిజన్లలో పోటీ చేసి పాతబస్తీలోఎంఐఎం అభ్యర్థులపై ఐదు చోట్ల గెలుపొందాం. ఈసారి పాతబస్తీలో పది స్థానాల్లో ఎంఐఎంపై విజయం సాధిస్తాం. మజ్లిస్ పార్టీకి మేయర్ పదవి ఇస్తామని కొందరు చెబుతున్నారు. మాకేమైనా పిచ్చా.. ఎందుకిస్తాం? గతంలో 99 స్థానాల్లో గెలిచి మేయర్ పీఠాన్ని సాధించుకున్నాం. డిసెంబర్ 4న టీఆర్ఎస్కు చెందిన మహిళా కార్పొరేటర్ మేయర్ అవుతారు’’ అని కేటీఆర్ స్పష్టం చేశారు. ‘దుబ్బాకలో ఓటమి ఒలికిపోయిన పాల లాంటివి. వాటి గురించి ఆలోచించదలుచుకోలేదు. 2016 గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ 105 చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. గతంలోనూ బీజేపీ మహబూబ్‌నగర్ ఉప ఎన్నికలో గెలిచినా మళ్లీ విజయం సాధించలేదు. కానీ టీఆర్ఎస్ 2014 నుంచి ఇప్పటివరకు ఎన్నో ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందింది. అయినా కొందరు మా అపజయాన్నే వార్తగా పైశాచిక ఆనందం పొందుతున్నారు. మేము ఎవరి బీ–టీం కాదు. అంతర్గత కారణాలతోనే కాంగ్రెస్ బలహీనమైంది. గ్రేటర్ ఎన్నికల్లో రెండో స్థానంలో ఎవరుంటారో బీజేపీ, కాంగ్రెస్ తేల్చుకోవాలి. మేము మాత్రం ప్రజల ఆశీర్వాదాన్ని కోరుతూ ప్రచారంలోకి వెళ్తాం. గెలుపు ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాం. గ్రేటర్ మేనిఫెస్టోపై సరైన సమయంలో స్పందిస్తాం’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. బీజేపీకి తెలిసింది విద్వేషాలు సృష్టించడమే... ‘‘కేంద్ర ప్రభుత్వ పనితీరు వల్లే లాక్డౌన్ తర్వాత దేశం ఆర్థిక మాంద్యంలో చిక్కుకుంది. కేంద్రం ఓ మిథ్య. ఆరేళ్లుగా తెలంగాణ నుంచి రూ. 2.72 లక్షల కోట్లు పన్నుల రూపంలో సమకూరినా రాష్ట్రానికి మాత్రం రూ. 1.40 లక్షల కోట్లు మాత్రమే వచ్చాయి. వరదలతో హైదరాబాద్ నష్టపోయినా కేంద్రం నుంచి నయాపైసా సాయం అందలేదు. దీనిపై బీజేపీ నేతలు మాట్లాడటం లేదు. వాళ్లకు తెలిసింది ఒకటే విద్య.. హిందూ–ముస్లిం, ఇండియా–పాకిస్తాన్, ఎంఐఎం–టీఆర్ఎస్ అనే పిచ్చిమాటలతో విద్వేషాలు సృష్టించడం’’ అని కేటీఆర్ ధ్వజమెత్తారు. 70 ఏళ్లుగా నాలాలు, చెరువుల ఆక్రమణల వల్లే హైదరాబాద్‌లో వరద నష్టం జరిగింది. వరదల బారిన పడిన కాలనీలకు చెందిన 6 లక్షల మందికి ఇప్పటికే రూ. 650 కోట్ల మేర ఆర్థిక సాయం చేశాం. మరికొందరు అర్హులకు జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత సాయం అందిస్తాం. ఎల్ఆర్ఎస్ విషయంలో కేంద్రం చేసేదేమీ లేదు. ఈ విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకొనేది సీఎం కేసీఆర్ మాత్రమే. స్థిరా>స్థికి పాస్‌బుక్ ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో కోటి కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది’’ అని కేటీఆర్ తెలిపారు. పెట్టుబడులకు అయస్కాంతంలా హైదరాబాద్.. ‘తెలంగాణ ఏర్పాటుకు ముందు ఉన్న అపోహలను తొలగించి రాష్ట్రం, హైదరాబాద్‌ను అగ్రస్థానంలో నిలబెట్టింది కేసీఆరే. ఆరేళ్లలో ఎవరితోనూ మేము గిల్లికజ్జాలు పెట్టుకోలేదు. ఆరేళ్లుగా హైదరాబాద్ ప్రశాంతంగా ఉంది. పెట్టుబడులకు హైదరాబాద్ అయస్కాంతంలా మారింది. నిరంతర విద్యుత్, స్వచ్ఛ హైదరాబాద్, శానిటేషన్‌లో హైదరాబాద్ దేశానికి రోల్ మోడల్‌గా ఉంది. చెత్త నుంచి 63 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తాం. రూ. 1,800 కోట్లతో సమగ్ర రోడ్డు ప్రణాళిక, 8 వేల పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాం. నాలాల ఆక్రమణల తొలగించేలా గ్రేటర్ ఎన్నికల తర్వాత సమగ్ర చట్టం తెస్తాం. హైదరాబాద్‌లో గత ఆరేళ్లలో రూ. 60 వేల కోట్లు ఖర్చు చేశాం. రెండు, మూడు రోజుల్లో నయాపైసాతో సహా లెక్కలు చెప్తాం. మేము చెప్పేది అబద్ధమైతే శిక్షించండి. నిజమైతే ఆశీర్వదించండి’’ అని కేటీఆర్ కోరారు. గ్రేటర్లో సీఎం ప్రచార సభ షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదన్నారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి రాజమౌళిచారి, సూరజ్, రవికాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జీహెచ్ఎంసీ ఎన్నికలకు వైఎస్సార్ సీపీ దూరం
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయటం లేదని పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా. గట్టు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. గురువారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీని బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కాగా, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను టీఆర్ఎస్ గురువారం విడుదల చేసింది. 20 మందితో రెండో జాబితాను ప్రకటించింది. 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తూ బుధవారం సాయంత్రం తొలి జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 125 మంది టీఆర్ఎస్ అభ్యర్ధుల జాబితా విడుదల చేసింది. చదవండి : గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయాలంటే.. -
టికెట్ కోసం బీజేపీ నాయకురాలి ఆత్మహత్యాయత్నం
సాక్షి, హైదరాబాద్ : త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో టికెట్ రాలేదని బీజేపీ నాయకురాలు విజయలలితా రెడ్డి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. నాచారం డివిజన్ బీజేపీ నాయకురాలైన విజయలలితా రెడ్డి నాచారం టికెట్ ఆశించారు. టికెట్ రాకపోవటంతో మనస్తాపానికి గురయ్యారు. గురువారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. దీంతో అనుచరులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తనకు టికెట్ రాకుండా చేశారని ఆమె ఆరోపించారు. కాగా, బీజేపీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థుల మొదటి జాబితాను ఇది వరకే విడుదల చేసింది. 21 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ అభ్యర్థులు.. పత్తర్‌గట్టి– అనిల్‌బజాజ్(ఓసీ); మొగుల్‌పుర– మంజుల(ఓసీ); పురానాపూల్– సురేందర్‌కుమార్(బీసీ); కార్వాన్– కె.అశోక్(బీసీ); లంగర్‌హౌస్– సుగంద పుష్ప(బీసీ); టోలిచౌకి– రోజా(బీసీ); నానల్‌నగర్– కరణ్‌కుమార్(బీసీ), సైదాబాద్– కె.అరుణ(ఓసీ); అక్బర్‌బాగ్– నవీన్‌రెడ్డి(ఓసీ); డబీర్‌పుర– మిర్జా అఖిల్ అఫండి(మైనార్టీ); రెయిన్‌బజార్– ఈశ్వర్ యాదవ్(బీసీ); లలితాబాగ్– చంద్రశేఖర్(ఎస్సీ); కుర్మగూడ– శాంత(బీసీ); ఐఎస్ సదన్– జంగం శ్వేత(ఓసీ); రియాసత్‌నగర్– మహేందర్‌రెడ్డి(ఓసీ); చాంద్రాయణగుట్ట– నవీన్‌కుమార్(బీసీ); ఉప్పుగూడ– శ్రీనివాసరావు(బీసీ); గౌలిపుర– భాగ్యలక్ష్మీ(బీసీ); శాలిబండ– నరే ష్(బీసీ); దూద్‌బౌలి– నిరంజన్‌కుమార్(బీసీ); ఓల్డ్ మలక్‌పేట్– రేణుక(బీసీ). -
చీఫ్ జస్టిస్ బెంచ్‌కు జీహెచ్ఎంసీ ఎన్నికల పిల్ బదిలీ
-
రేవంత్‌కు పీసీసీ పగ్గాలు..!
సాక్షి, హైదరాబాద్ : దుబ్బాకలో ఘోర పరాజయం అనంతరం కాంగ్రెస్ పార్టీలో పీసీసీ మార్పు అంశం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. సీనియర్ల నుంచి పార్టీ కార్యకర్తలు సైతం ఉత్తమ్‌ను తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. విజయశాంతి, మధుయాష్కీ, జంగారెడ్డి లాంటి నేతలు నిరసన స్వరం వినిపించారు. రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని మార్చకపోతే భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలను ఎదుర్కొక తప్పదని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తున్నారు. మరోవైపు ఎంపీ రేవంత్‌రెడ్డికి పీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్‌లోని ఓ వర్గం డిమాండ్ చేస్తోంది. టీఆర్ఎస్ సర్కార్‌పై దూకుడుగా వ్యవహరిస్తూ.. ప్రజా సమస్యలపై గళమెత్తుతున్న రేవంత్‌కు పార్టీ పగ్గాల అప్పగిస్తే తెలంగాణలో కాంగ్రెస్‌కు పూర్వవైభవం వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే హస్తం పార్టీలోని ఓ వర్గం మాత్రం రేవంత్ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రాష్ట్రంలో బలోపేతం దిశగా బీజేపీ అడుగులు గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ఎన్నికల నేపథ్యంలో రాజధాని మరోసారి రాజకీయ రణరంగాన్ని తలపిస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఈ ఎన్నికలను అధికార టీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్, బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. డిసెంబర్ మొదటి వారంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ యోచిస్తోంది. ఈ నేపథ్యంలో పొత్తులపై పార్టీలు ప్రధానంగా దృష్టిసారించాయి. ఇప్పటికే టీఆర్ఎస్-ఎంఐఎం ఓ అవగహనకు రాగా.. కలిసి పోటీచేస్తాయా లేక విడివిడిగా చేస్తాయా అనేది ఇంకా తేలాల్సి ఉంది. దీనిపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తొలివిడత చర్చలు జరిపారు. మరోవైపు వామపక్షాలతో కలిసి నడిచేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఇక దుబ్బాక విజయంతో అనుహ్యంగా రేసులోకి వచ్చిన బీజేపీ.. ఏకంగా మేయర్ పీఠంపై కన్నేసింది. 70 స్థానాలే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. రాజధాని పరిధిలో జరితున్న ఎన్నికలు కావడంతో టీఆర్ఎస్తో పాటు బీజేపీ సైతం అంతే దూకుడుగా వ్యవహరిస్తోంది. జీహెచ్ఎంసీపై కాషాయదళం కన్ను జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించి.. రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయాలని కాషాయదళం ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలోనే ఇతర పార్టీలోని సీనియర్లను ఆహ్వానిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి డీకే అరుణ వంటి జనాధారణ నాయకులను చేర్చుకున్న బీజేపీ.. రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు జరపాలని భావిస్తోంది. దీనిలో భాగంగానే మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతిని బీజేపీకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సైతం ఆమెతో చర్చలు జరిపారు. పార్టీలో చేరితే పెద్ద పదవినే కట్టబెడాతమని హామీ కూడా ఇచ్చినట్లు సమాచారం. అయితే బీజేపీ ఆఫర్‌పై ఆలోచనలలో పడిన రాములమ్మ.. కాషాయ తీర్థం పుచ్చుకునేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చసాగుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల లోపు పార్టీలో చేరతారని, ఈ మేరకు ఢిల్లీ పర్యటనకు షెడ్యూల్ కూడా ఖరారైనట్లు బీజేపీ నేతల ద్వారా తెలుస్తోంది. ఆమెతో పాటు మరికొందరి నేతలపై కూడా ఢిల్లీ పెద్దలు గాలం వేసినట్లు సమాచారం. -
జీహెచ్ఎంసీ ఎన్నికలకు రంగం సిద్ధం
-
ఆదరబాదరగా ఎన్నికలు నిర్వహించద్దు
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్(జీహెచ్ఎంసీ) ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి గురువారం సమావేశాలు నిర్వహించారు. ఎన్నికల కమిషనర్ రాజకీయ పార్టీలతో జరిపిన వరుస భేటీల్లో భాగంగా సీపీఐ, బీజేపీ నేతలు సమావేశం అయ్యారు. ఈ భేటీలో సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి, బీజేపీ నుంచి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చింతల, ఆంటోని రెడ్డిలు పాల్గొన్నారు. అన్నిపార్టీలతో గ్రేటర్ ఎన్నికల నిర్వహణపై కమిషనర్ చర్చించారు. కాగా ఈ భేటీలకు గుర్తింపు పొందిన 11 పార్టీలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆహ్వానించింది. ఒక్కో రాజకీయ పార్టీకి 15 నిమిషాల సమయం కేటాయించి, జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణపై సమాలోచనలు జరిపింది. భేటీ అనంతరం చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వరదల సాయం అందరికీ అందలేదన్నారు. ఒక్కో డిజవిన్లో జనాభా సంఖ్యలో చాలా తేడా ఉందని, లోపాలు సరిదిద్దుకుని ఎన్నికలకు వెళ్లాలని సూచించారు. బీసీలకు అన్యాయం జరుగుతోంది: కాంగ్రెస్ పార్టీ నేత మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. నవంబర్ 7వ తేదీ విడుదల చేసిన ఓటర్ల జాబితా వార్డుల వారిగా విడుదల చేశారని అది సరైన పద్ధతి కాదన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం న్యాయంగా ఎన్నికలు నిర్వహించాలన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో 25 శాతం పోలింగ్ కేంద్రాలను అదనంగా పెంచాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు సమయాన్ని మరో 15 రోజులు పెంచాలన్నారు. మున్సిపల్ సిబ్బంది ఇతర పనుల్లో బిజీగా ఉన్నారని, తూతూ మంత్రంగా ఎన్నికలు నిర్వహించొద్దన్నారు. ఎన్నికల ప్రక్రియకు అవసరం అయిన అన్నింటికీ మళ్లీ రీ షెడ్యూల్ ఇవ్వాలని కోరారు. సుప్రీం కోర్టు ఆదేశాలు ఉల్లంఘించకూడా రిజర్వేషన్లుఉండాలని, బీసీలకు అన్యాయం జరుగుతోందని తెలిపారు. ప్రస్తుతం 50 సీట్లు మాత్రమె కేటాయిస్తున్నారని, వాస్తవానికి 75 సీట్లు బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఎన్నికల్లో పోటీకి అనర్హులు అనే నిబంధన ఉందని, దాన్ని కొనసాగించాలన్నారు. ప్రకటనల విషయాల్లో అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాలన్నారు. ఎన్నికలకు భయపడటం లేదు: పీసీసీ నేత నిరంజన్ మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ ఎన్నికలను ఆదరబాదరగా నిర్వహించొద్దని తెలిపారు. తాము ఎన్నికలకు భయపడటం లేదని స్పష్టం చేశారు. గతంలో జరిగిన లోటుపాట్లు సరిచేయలని సూచించామని పేర్కొన్నారు. అభ్యర్థుల పేర్లు హిందీలో కూడా ప్రచురించాలని కోరినట్లు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించాలి: సమావేశం అనంతరం టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించేలా చూడాలని ఎస్ఈసీ కోరామని తెలిపారు. సెక్యూరిటీ డిపాజిట్, అభ్యర్థి ఖర్చును పెంచాలన్నారు. మాస్కులు తప్పనిసరి చేయాలన్నారు. విశాలమైన పోలింగ్ కేంద్రాలు గుర్తించాలని కోరినట్లు తెలిపారు. కోవిడ్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వికలాంగులకు, కోవిడ్ పాజిటివ్ కేసుల్లో పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశామన్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు భరత్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాపై నిఘా పెంచి, ఒక ప్రత్యేక సెల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేయాలన్నారు. సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాన్ని అరికట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఓటు హక్కు ఎలా ఇచ్చారు? ఎన్నికల కమిషన్‌తో సమావేశం ముగిసిన అనంతరం బీజేపీ నేతలు మాట్లాడుతూ... ‘ఓటరు జాబితాలో అవకతవకలను ఈసీ దృష్టికి తెచ్చాం. పోలింగ్ బూత్ వారీగా ఓటర్ జాబితా ఇవ్వాలని కోరాం. అధికారులు కార్పొరేటర్లతో కుమ్మక్కై బీజేపీ అనుకూల ఓట్లను తొలగించారు. జీహెచ్ఎంసీ అధికారులను ప్రిసైడింగ్ అధికారులుగా నియమించొద్దు. కేంద్ర ప్రభుత్వ సిబ్బందితో ఎన్నికలు నిర్వహించాలి. బీసీ రిజర్వేషన్లు ఇతర మున్సిపాలిటీల్లో ఒక రకంగా... జీహెచ్ఎంసీలో మరో రకంగా ఎలా కేటాయిస్తారు?. శాస్త్రీయ విధానంలో ఇంటి నెంబర్లు ఎందుకివ్వలేదు?. అనుమతి లేకుండా నిర్మించిన ఇళ్లలో ఉన్నవారికి ఓటు హక్కు ఎలా ఇచ్చారు?. డీలిమిటేషన్ లేదంటూనే ఓట్లను తారుమారు చేశారు’ అని ఆరోపించారు. -
‘ప్రజల నుంచి విజ్ఞప్తులను ఆహ్వానిస్తున్నాం’
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న సౌకర్యాలన్ని కాంగ్రెస్ హయాంలో నెలకొల్పినేవని మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ఆరున్నర ఏళ్ల పాలనలో హైదరాబాద్‌ను ఎలాంటి అభివృద్ధి చేయకుండా మాటలకే పరిమితం చేసిందని విమర్శించారు. హైదరాబాద్‌లో సోమవారం జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి హాజరయ్యారు. అలాగే జూమ్ ద్వారా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్కమ్ ఠాగూర్ పాల్గొని సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ.. గ్రేటర్ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రజా మేనిఫెస్టోను రూపొందిస్తుందని తెలిపారు. చదవండి: ఊపందుకుంటున్న ‘గ్రేటర్’ ఎన్నికల ఏర్పాట్లు ప్రజల నుంచి విజ్ఞప్తులను ఆహ్వానిస్తున్నామన్నారు. అందుకోసం 8639721075 నెంబర్‌కు వాట్సప్ చేయగలరని సూచించారు. లేదా speakuphyderabad@gmail.Com చేయవచ్చని తెలిపారు. వారం, పది రోజుల పాటు వినతులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. వరద బాధితులకు ఇచ్చే పరిహారం పూర్తిగా అవినీతిమయం అయ్యిందని, నిజమైన బాధితులకు కాకుండా టీఆర్ఎస్ కార్యకర్తల జేబుల్లోకి వెళ్లాయని మండిపడ్డారు. వరద పరిహారం పై చీటింగ్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. -
‘గ్రేటర్’ ఎన్నికలకు తొందరొద్దు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ముందస్తు ఎన్నికలు జరపాలనే అంశంపై టీఆర్ఎస్ పునరాలోచనలో పడింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఇటీవల సంభవించిన వరద నష్టం నుంచి నగరవాసులు పూర్తిగా కోలుకోకముందే ఎన్నికలకు వెళ్తే నష్టం జరుగుతుందనే భావన పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు వరద సహాయక చర్యల్లో తలమునకలై ఉన్న అధికార యంత్రాంగం కూడా స్వల్ప వ్యవధిలో ఎన్నికల సన్నాహాలు చేయలేమనే నిస్సహాయత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పరిస్థితి కుదుటపడిన తర్వాతే జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలనే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీసుకెళ్లినట్లు సమాచారం. కనీసం 45 రోజుల తర్వాతే ఎన్నికల షెడ్యూలు విడుదల చేయాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. ఈ ప్రతిపాదనకు సీఎం అంగీకరిస్తే డిసెంబర్ నెలాఖరులో షెడ్యూలు విడుదల చేసి జనవరి మూడో వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశముందని విశ్వసనీయ సమాచారం. సహాయక చర్యల్లో అధికారులు బిజీ.. గ్రేటర్ పరిధిలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా చాలా చోట్ల అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ఇంకా పలు కాలనీలు బురదలోనే ఉండటంతో అధికార యంత్రాంగం సహాయక చర్యల్లో మునిగిపోయింది. కనీసం అడుగు పెట్టే పరిస్థితి లేని జనావాసాల్లో తాత్కాలిక మరమ్మతులపై జీహెచ్ఎంసీ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో గ్రేటర్ ఎన్నికల షెడ్యూలు విడుదల చేస్తే సన్నద్ధం కావడం అసాధ్యమని అధికారులు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. 22 అసెం బ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించిన జీహెచ్ఎంసీని ‘మినీ అసెంబ్లీ’గా పరిగణిస్తా రు. దీంతో అధికార యంత్రాం గాన్ని భారీగా మోహరించాల్సి రావడంతో ఎన్నికల వాయిదాకు అధికారులు మొగ్గు చూపుతున్నారు. అంతా సర్దుకున్నాకే.. మూడ్రోజుల కింద గ్రేటర్ పరిధిలోని మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ కార్పొరేటర్లతో మంత్రి కేటీఆర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. గ్రేటర్ ఎన్నికలను వాయిదా వేయాలని పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కేటీఆర్‌ను కోరినట్లు సమాచారం. వరద బాధితులకు రూ.10 వేల చొప్పున పరిహారం పంపిణీ గందరగోళంగా మారిన ప్రస్తుత సమయం లో ఎన్నికలకు వెళ్తే వ్యతిరేకత వస్తుందని ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా, ముందస్తు ఎన్నికలు జరిగితే పార్టీ యంత్రాంగాన్ని తక్కువ వ్యవధిలో సమన్వయం చేయడం సాధ్యం కాదని పేర్కొన్నారు. -
గ్రేటర్ ఎన్నికల్లో జనసేనతో బీజేపీ జట్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ స్నేహానికి రంగం సిద్ధమైంది. టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమని, 2023లో తెలంగాణలో పాగా వేస్తామని చెప్పుకుంటున్న బీజేపీ, సినీ హీరో పవన్ కల్యాణ్ గ్లామర్‌పైనే ఆధారపడి మనుగడ సాగిస్తున్న జనసేన ఈ కొత్త స్నేహంలో భాగస్వాములు. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు ఇందుకు వేదిక కానున్నాయని, ఈ మేరకు ఇరు పార్టీల మధ్య చర్చ లు దాదాపు పూర్తయి ఓ అవగాహనకు వచ్చాయనే చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇప్పటికే ఈ రెండు పార్టీలు ఏపీలో కలిసి పనిచేస్తున్నాయి. తెలంగాణ లోనూ వీటి మైత్రిపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం. చదవండి: ఇంతకన్నా దిగజారుడు రాజకీయాలు ఉండవు -
తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత
-
ఓటుందో.. లేదో.. చెక్ చేసుకోండి
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథి వెల్లడించారు. మున్సిపల్ డివిజన్ల డీ లిమిటేషన్, రిజర్వేషన్లు, ఎన్నికలు పాత జీహెచ్ఎంసీ చట్టం ప్రకారమా.. కాదా.. అన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉందన్నారు. ఈ అంశాలపై ప్రభుత్వ స్పందన మేరకు, వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారై తమకు అందాక నోటిఫికేషన్ విడుదలకు ఏర్పాట్లు చేస్తామన్నారు. డివిజన్ల డీ లిమిటే షన్‌కు సంబంధించి వైఖరిని వెల్లడించాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసినట్టు చెప్పారు. పాత చట్టం ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తే రిజర్వేషన్లలో మార్పులు జరుగుతాయని, సంబంధించిన జీవోలకు అనుగుణంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేయాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ను ప్రకటించే వరకు ఓటర్లు తమ ఓట్లను నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అసెంబ్లీ ఓటర్ల జాబితాలో పేరుందో.. లేదో.. చెక్ చేసుకుని, లేకపోతే పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటర్ల కోసం ఎస్ఈసీ మొబైల్యాప్ కూడా అందుబాటులో ఉంచిందని, ఎస్ఈసీ వెబ్సైట్లోనూ తమ ఓటు ఉందా లేదా అన్న విషయాన్ని ప్రజలు చూసుకోవచ్చన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో వివిధ అంశాలను ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూ్యలో పార్ధసార«థి వివరించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ఓటరే కీలకం... జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడంలో ఓటర్‌దే కీలకపాత్ర. ఓటు హక్కున్న ప్రతీ పౌరుడు ఓటు వేయ డాన్ని బాధ్యతగా తీసుకో వాలి. వచ్చే ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేం దుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. ఓటర్లలో చైతన్యం పెంచేందుకు పోస్టర్లు, ప్రకటనలతో పాటు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ద్వారా ప్రచారం, సెలబ్రిటీల సందేశాలు వంటివి చేపడుతున్నాం. సవాళ్లతో కూడుకున్నదే... కరోనా భయం నేపథ్యంలో ఓటింగ్‌లో పాల్గొనేలా ప్రజలను మోటివేట్ చేసే చర్యలు తీసుకుంటున్నాం. ఓటేసేందుకు అవసరమైన సురక్షిత చర్యలను చేపడుతున్నాం. బిహార్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలను జారీచేసింది. వాటిని కచ్చితంగా అమలు చేయడంతో పాటు రాష్ట్రంలోని పరిస్థితులకు అనుగుణంగా మరిన్ని ప్రత్యేక చర్యలపై దృష్టి పెట్టాం. అన్ని పరిశీలించాకే ఈ–ఓటింగ్.. కరోనా నేపథ్యంలో ఓటింగ్ పెంచేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తున్నాం. ఓటేసేందుకు పరిస్థితులు అనుకూలించని వయోవృద్ధులు, దివ్యాంగులు, ఎన్నికల సిబ్బంది కోసం ఈ–ఓటింగ్‌ను ప్రయోగాత్మకంగా చేపట్టాలని భావిస్తున్నాం. అయితే ఐటీశాఖ నుంచి సాఫ్ట్వేర్ అందాక, రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకున్నాకే పైలట్ బేసిస్‌తో చేపట్టడంపై నిర్ణయం తీసుకుంటాం. ఏర్పాట్లు పూర్తికావొస్తున్నాయి... ఎన్నికలకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లు పూర్తి కావొస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) నుంచి అసెంబ్లీ ఓటర్ల జాబితా డేటా త్వరలోనే రానుంది. దీనిపై గ్రేటర్ హైదరాబాద్ ఏరియా వరకు 26 శాసనసభ నియోజకవర్గాల వారీగా 30 మంది జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లు కార్పొరేషన్ డివిజన్ల వారీగా అసెంబ్లీ జాబితాలతో ఓటర్ల జాబితాలను మ్యాపింగ్ చేసి ఎస్ఈసీకి ఇవ్వగానే పోలింగ్ స్టేషన్లపై నిర్ణయం తీసుకుంటాం. ఈ ప్రక్రియకు ముందు పోలింగ్‌బూత్‌ల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న భవనాల ఎంపికను అధికారులు పూర్తిచేస్తారు. బూత్‌కు వెయ్యిమంది ఓటర్లు... ఒక్కో పోలింగ్ బూత్‌లో వెయ్యి మంది ఓటర్లుండేలా చూడాలని ఈసీ ఇదివరకే సూచించింది. దీనికనుగుణంగా ఏర్పాట్లుచేస్తాం. వెయ్యికంటే తక్కువ మందికి ఒక బూత్ చేయాలనే ఆలోచన ఉన్నా బిల్డింగ్లు, సిబ్బంది ఏ మేరకు అందుబాటులో ఉంటాయనేది పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. ఫేస్ రికగ్నిషన్ పద్ధతి... 150 పోలింగ్ బూత్‌లలో ఫేస్ రికగ్నిషన్ అమలుకు ఏర్పాట్లు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌ను ఆదేశించాం. వీటి కోసం ఎంపిక చేసే భవనాల్లో సరైన వెలుతురు, ఇంటర్నెట్, ఇతర సౌకర్యాలు ఉండేలా ఏర్పాటు చేయాలని సూచించాం. ఐటీ శాఖ, టెక్నాలజీ సర్వీసెస్ విభాగం సహకారంతో ఈ ప్రక్రియను చేపడుతున్నాం. ఈవీఎంలా, బ్యాలెటా.. త్వరలోనే నిర్ణయం జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ బ్యాలెట్ పేపర్లతోనా.. ఈవీఎంలతోనా.. అన్న దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. దీనిపై అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు అందాయి. ఏ విధానంతో ఎలాంటి సమస్యలు అన్న దానిని పరిశీలించి, నిపుణుల సలహాలు తీసుకున్నాక దీనిని ప్రకటిస్తాం. (చదవండి: బ్యాలెట్‌తోనే జీహెచ్ఎంసీ పోరు!) -
ఆ మాటలను మీడియా ఆపాదించింది
సాక్షి, హైదరాబాద్: ‘నవంబర్‌లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలుంటాయని నేను అన్నట్టు కొన్ని మీడియా సంస్థలు రిపోర్టు చేశాయి. జీహెచ్ఎంసీ యాక్టు ప్రకారం నవంబర్ రెండోవారం తర్వాత ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, కనుక పార్టీ నాయకులు సిద్ధంగా ఉండాలని మాత్రమే నేను అనడం జరిగింది. ఎన్నికల షెడ్యూల్, నిర్వహణ పూర్తిగా ఎన్నికల కమిషన్ పరిధిలోని అంశం. సదరు మీడియా సంస్థలు నేను అనని మాటలను నాకు ఆపాదించడం జరిగింది’అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు బుధవారం ట్వీట్ చేశారు. మంగళవారం జీహెచ్ఎంసీ పరిధిలోని మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో నిర్వహించిన సమావేశంలో బల్దియా ఎన్నికలపై కేటీఆర్ సంకేతాలిచ్చినట్టు పత్రికల్లో వార్తలు రావడంతో ఆయన ఈ మేరకు వివరణ ఇచ్చారు. -
బ్యాలెట్‌తోనే జీహెచ్ఎంసీ పోరు!
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలను బ్యాలెట్ పేపర్లతోనే నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణకు తగిన సంఖ్యలో వీవీప్యాట్ మెషీన్లు అందుబాటులో లేనందున వాటితో సాధ్యం కాకపోవచ్చుననే నిర్ధారణకు ఎస్ఈసీ వచ్చినట్టు తెలుస్తోంది. ప్రతీ ఈవీఎం మెషీన్‌కు వీవీప్యాట్‌ను జతచేయాలన్న సుప్రీంకోర్టు తాజా ఆదేశాలకు అనుగుణంగా బ్యాలెట్ పేపర్ల వైపే మొగ్గు చూపుతున్నట్టు ‘సాక్షి’కి ఎస్ఈసీ వర్గాలు తెలిపాయి. వీవీప్యాట్లను సరఫరా చేయాలంటూ ఇదివరకే ఈసీఐఎల్, బెల్ కంపెనీలను ఎస్ఈసీ కోర గా, అవి అనుమతి కోసం ఈసీకి రాశాయి. ఈసీ నుంచి అనుమతి లభించి, ఆ కంపెనీలు ఈ ఎన్నికలకు అవసరమైన సంఖ్యలో వీవీప్యాట్ యంత్రాలు తయారు చేసేప్పటికి కాలాతీతమౌతుందనే అభిప్రాయంతో ఎస్ఈసీ ఉన్నట్టుగా తెలుస్తోంది. అందువల్లే బ్యా లెట్ బాక్స్‌లతోనే ఎన్నికలకు సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు సమాచారం. అయితే దీనిపై రెండు, మూడ్రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ముగిసిన గడువు.. త్వరలోనే ఈసీ, జీహెచ్ఎంసీ, వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల అభిప్రాయాలు కూడా ఎస్ఈసీ తీసుకోనుంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులకు ఏ విధానమైతే సులభంగా ఉంటుందన్న దానిపై స్పష్టతనివ్వాలని కోరినట్టు తెలిసింది. ఈ ఎన్నికలను బ్యాలెట్ పేపర్లు లేదా ఈవీఎంలతో నిర్వహించాలన్న దానిపై అభిప్రాయాలు తెలపాలంటూ రాజకీయ పార్టీలను ఎస్ఈసీ కోరిన గడువు కూడా బుధవారంతో ముగిసింది. టీఆర్ఎస్తో పలు పార్టీలు బ్యాలెట్ పేపర్ల వైపే మొగ్గుచూపగా, బీజేపీ మాత్రం ఈవీఎంలతోనే నిర్వహించాలని సూచించింది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మాత్రం ఏ విధానం వల్ల ఎలాంటి ప్రయోజనమో ఎస్ఈసీ చెప్పకుండా, ముందుగానే బ్యాలెట్లతో నిర్వహించాలని నిర్ణయించి రాజకీయ పార్టీల అభిప్రాయాలను కోరడంలో ఔచిత్యమేంటని ప్రశ్నించింది. ఎన్నికలు ఏ పద్ధతిలో నిర్వహిస్తే ఓటర్లకు రిస్క్ తక్కువగా ఉంటుందన్న దానిపై శాస్త్రీయంగా అధ్యయనం చేసి ఎస్ఈసీ చెబితే దానిపై తమ నిర్ణయం చెబుతామంటూ టీపీసీసీ ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ బుధవారం లేఖను పంపింది. రెండింటిలోనూ రిస్కే.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈవీఎం లేదా బ్యాలెట్ పత్రాలు.. ఏ రకంగా ఎన్నికలు నిర్వహించినా రిస్కేనని, ఈ రెండు పద్ధతుల్లోనూ సానుకూల, వ్యతిరేక అంశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఓటర్‌కు కోవిడ్ ఉన్నా లక్షణాలు కనిపించని అసింప్టమేటిక్‌గా ఉంటే ఏ విధానంలో నిర్వహించినా తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇతరులకు సోకే అవకాశాలే ఎక్కువనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అదీగాకుండా కెమికల్స్‌తో ప్రింట్ చేసిన న్యూస్ పేపర్ లేదా బ్యాలెట్ పేపర్‌పై వైరస్ ఎక్కువ సేపుండే అవకాశాలు తక్కువనేది ఇప్పటికే స్పష్టమైనందున ఆ పద్ధతి వైపే ఎస్ఈసీ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలు ఎప్పుడు..? ఇక జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడుంటాయన్న దానిపై ఇంకా ఎస్ఈసీ స్పష్టతనివ్వడం లేదు. ప్రభుత్వం నుంచి వార్డుల వారీగా ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల నివేదిక అందగానే ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్టుగా అధికార వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఎన్నికలు జరిపేందుకు అవసరమైన వివిధ ప్రక్రియలను పూర్తి చేయడంలో నిమగ్నమైనట్టు తెలిపాయి. జీహెచ్ఎంసీ పాత చట్టం ప్రకారమే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నందున వచ్చే ఫిబ్రవరి 10తో ప్రస్తుత పాలకమండలి పదవీకాలం ముగియడానికి 3 నెలల ముందు ఎన్నికలు నిర్వహించే వీలుంది. దీన్ని బట్టి నవంబర్ 2, 3వ వారం నుంచి డిసెంబర్ చివరివరకు ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించేందుకు అవకాశాలున్నాయి. సంక్రాంతి పండుగ ముగిశాక వచ్చే మంచి రోజుల్లో ఎన్నికలు జరపాలనుకుంటే మాత్రం జనవరి 15 నుంచి 25వ తేదీల మధ్య ఎన్నికలు జరిగే అవకాశాలున్నట్టుగా అంచనా వేస్తున్నారు. -
బాధిత కుటుంబాలను ఆదుకుంటాం: తలసాని
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి వర్షాలకు హైదరాబాద్‌లో వేర్వేరు ఘటనల్లో నాలాలో పడి మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర పశు సంవర్థక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ క్షమాపణ చెప్పారు. ఇలాంటి ఘటనలు జరగడం తప్పేనని, బాధిత కుటుంబాలను తప్పనిసరిగా ఆదుకుంటామని తెలిపారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంగళవారం మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నందునే కాంగ్రెస్ పార్టీ నాటకాలకు తెరలేపిందని విమర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 150 డివిజన్లలో పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకడం కూడా కష్టమేనన్నారు. మంత్రి కేటీఆర్ పనితీరుపై కాంగ్రెస్ నేతల సర్టిఫికేట్లు అవసరం లేదని, ప్రచార యావతోనే విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. -
గెలుపు సులువే: తలసాని
సాక్షి, కవాడిగూడ: త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు అర్హులైన ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదయ్యే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రతి కార్పొరేటర్‌పై ఉందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం లోయర్ ట్యాంక్ బండ్‌లోని పింగళి వెంకట్రామయ్య ఫంక్షన్ హాల్లో నగరానికి చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి కార్పొరేటర్ తమ తమ డివిజన్‌పరిధిలో ఉన్న గ్రాడ్యుయేట్లను గుర్తించి వారు ఓటరుగా నమోదు చేయించుకునే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. విస్తృతంగా వర్షాలు కురుస్తున్నందున కార్పొరేటర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పారు. ప్రజల నుండి ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని సూచించారు. కరోనా మహమ్మారి నియంత్రణ కోసం లాక్ డౌన్ అమలు చేసిన సమయంలో ప్రతి కార్పొరేటర్ ఎంతో శ్రమించారని, ప్రజల ఇబ్బందులను గుర్తించి వారికి అండగా నిలిచారని ప్రశంసించారు. కార్పొరేటర్లు తమ డివిజన్లలోని పెండింగ్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, లేదా తన దృష్టికి తెచ్చినా అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఇంకా ఏమన్నారంటే.. రాబోయే ఎమ్మెల్సీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్ స్థాయి నుంచి అందరూ కృషి చేసి తగిన విధంగా ప్రచారం చేస్తే గెలుపు కష్టమేం కాదు. అందుకుగాను ప్రతి కార్పొరేటరూ కృషి చేయాలి. ఇద్దరు ముగ్గురు కలిసి కమిటీలుగా ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్క ఓటరు జాబితాలో ఉండేలా కృషి చేయాలి. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఎన్నెన్నో అభివృద్ధి పనులు జరిగాయి. వాటి గురించి ప్రజల్లోకి బాగా వెళ్లేలా ప్రచారం చేయాలి. తక్షణం మేలుచేయగల , ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాల గురించి వచ్చేనెల ఐదో తేదీలోగా రాతపూర్వకంగా ఆయా విభాగాల వారీగా తెలియజేస్తే సంబంధిత ప్రభుత్వశాఖల ద్వారా పనులు త్వరితంగా జరిగేలా చేస్తాం. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఎన్నో పనులు చేశాం. రానున్న మూడునెలలపాటు ముమ్మర ప్రచారం చేయాలి. ఇప్పటికే చేస్తున్నా, ఇంకా పెరగాలి. ముఖ్యమంత్రి, మునిసిపల్ మంత్రి కేటీఆర్ చేస్తున్న పనుల గురించి ఇప్పటికే ప్రజలకు తెలుసు. కార్పొరేటర్లు పూనుకుంటే 25 శాతం ఓట్లు అదనంగా వస్తాయి. కాంగ్రెస్ ప్రజల కోసం చేసిందేమీ లేదు. ఇక బీజేపీ దేశభక్తి పేరిట ఎన్నికల లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తుంది.అవేవీ దీర్ఘకాలంలో పనిచేయవు. టీఆర్ఎస్ ఆరేళ్లలో నగరంలో చేసిన అభివృద్ధి పనులతోనే మనం ఈజీగా గెలవగలం. సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు ప్రభాకర్, జనార్ధన్ రెడ్డి, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, గాంధీ, సాయన్న, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఎన్నికల కసరత్తు షురూ సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ సమాయత్తమవుతోంది. కరోనాతో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించాలా లేక ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎం)ల ద్వారా నిర్వహించాలా ..అన్న అంశంపై అభిప్రాయం చెప్పాలని ప్రధాన రాజకీయ పక్షాలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి సోమవారం లేఖలు రాశారు. ఈ నెలాఖరులోపు తమ అభిప్రాయాన్ని చెబితే.. మెజారిటీ అభిప్రాయం మేరకు ముందుకు వెళ్లనున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉంటే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అన్ని ఎన్నికలు ఇప్పటి వరకు బ్యాలెట్ పద్ధతినే నిర్వహిస్తూ వచ్చారు. ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నందున పకడ్బందీ ఏర్పాట్ల మధ్య నిర్వహించే యోచనలో ఉన్నారు. -
కాంగ్రెస్, టీఆర్ఎస్ కుమ్మక్కు: డీకే అరుణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ పుంజుకుంటోందని భయపడి టీఆర్ఎస్ ప్రభుత్వం హైడ్రామా చేస్తోందని మాజీ మంత్రి, బీజేపీ నేత డీకే అరుణ విమర్శించారు. శనివారం ‘జూమ్’లో ఆమె మీడియాతో మాట్లాడుతూ... 2019 డిసెంబర్ నాటికే 2 లక్షల ఇండ్ల నిర్మాణం పూర్తి చేస్తామని టీఆర్ఎస్ చెప్పిందని గుర్తు చేశారు. జీహచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. జీహెచ్ఎంసీలో బీజేపీ ముందు ఉండి.. టీఆర్ఎస్ పార్టీ వెనుకబడిపోతుందన్న సమాచారం సీఎం కేసీఆర్‌కు ముందుగానే వచ్చిందన్నారు. రెండు రోజులు జీహెచ్ఏంసీ పరిధిలో పర్యటించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డబుల్ బెడ్ రూం ఇండ్ల క్వాలిటీపై మాట్లాడకపోవడం ఆశ్చర్యకరమన్నారు. మళ్లీ మున్సిపల్ ఎన్నికల్లో టీఆరెస్-కాంగ్రెస్ కలుస్తందనడానికి ఇదే సంకేతమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో క్వాలిటీ లేదని తానే స్వయంగా పరిశీలించానని చెప్పారు. బీజేపీని ఎదురుకోలేక కాంగ్రెస్-టీఆర్ఎస్ కలిసి తిరుగుతున్నాయని, జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయని కేటీఆర్ ఉరుకులాడుతున్నాడరని అరుణ విమర్శించారు. బీజేపీకి భయపడే అధికార టీఆర్ఎస్ ప్రతిపక్ష కాంగ్రెస్‌తో కలిసిందని ఆమె ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతోందని భావించే కాంగ్రెస్‌ను టీఆర్ఎస్ పెంచిపోషిస్తోందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి పోటీచేసేటట్లు కనిపిస్తున్నాయన్నారు. టీఆర్ఎస్-కాంగ్రెస్‌లు కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాయని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో పేదలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో టీఆర్ఎస్ వైఫల్యం చెందిందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్-కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని పేర్కొన్నారు. ఎక్కడ ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఉన్నాయో ప్రకటన చేయాలన్నారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మంత్రి తలసాని చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. ప్రధాన మంత్రిని విమర్శించే స్థాయి తలసానికి లేదని ఆమె మండిపడ్డారు. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు వ్యతిరేక గాలులు విస్తున్నాయన్నారు. సీఎం అనుమతి లేకుండా తలసాని.. భట్టి ఇంటికి వెళ్లగలరా అని డీకే అరుణ ప్రశ్నించారు. -
కార్పొరేషన్లపై టీఆర్ఎస్ కన్ను
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పాలక మండలి పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరున ముగియనుంది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల పాలకమండళ్ల పదవీ కాలపరిమితి వచ్చే ఏడాది మార్చితో పూర్తికానుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఆరంభంలో మూడు మున్సిపల్ కర్పొరేషన్లకు ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో టీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. 2016 ఫిబ్రవరిలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 150 డివిజన్లకుగాను 99 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో అదే స్థాయిలో ఫలితాలను సాధించేలా టీఆర్ఎస్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. మున్సిపల్ శాఖ మంత్రి హోదాలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జీహెచ్ఎంసీపై ప్రత్యేక దృష్టి సారించి, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరుపై వరుస సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ మొదటిదశ పనులను ఈ ఏడాది అక్టోబర్‌లోగా పూర్తి చేయాలని గడువు నిర్దేశించారు. మరోవైపు జీహెచ్ఎంసీలో మౌలిక వసతుల పనులకు కోవిడ్ విపత్కర పరిస్థితుల్లోనూ శంకస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లపైనా దృష్టి వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల నిమిత్తం ఇప్పటికే పార్టీ నేతలను కేటీఆర్ అప్రమత్తం చేశారు. కరోనా కారణంగా ఈ ఏడాది మార్చిలో వరంగల్, ఖమ్మం నగర పర్యటనలను కేటీఆర్ వాయిదా వేసుకున్నారు. ఆ రెండు కార్పొరేషన్ల పరి ధిలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై దృష్టి పెట్టాల్సిందిగా సంబంధిత జిల్లా మంత్రులు, ఎమ్మె ల్యేలను ఆదేశించారు. అక్టోబర్ నాటికి అభివృద్ధికార్యక్రమాలను పూర్తి చేసి, తర్వాత పూర్తిగా ఎన్నికలపైనే దృష్టి సారించేలా టీఆర్ఎస్ ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటోంది. ఆయా కార్పొరేషన్ల పరిధిలో డివిజన్లవారీగా పార్టీ పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఇటీవల జరిగిన పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో కేటీఆర్ సూచించినట్లు సమాచారం. దుబ్బాక బాధ్యతలు హరీశ్‌కే! దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో ఆ స్థానం ఖాళీ అయినట్లు శాసనసభ కార్యాలయం నోటిఫై చేసింది. దుబ్బాక ఉప ఎన్నికలు ఎప్పుడనేదానిపై స్పష్టత లేనప్పటికీ, పొరుగునే ఉన్న సిద్దిపేట సెగ్మెంట్‌కు చెందిన మంత్రి హరీశ్‌రావుకు ఆ బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. పార్టీ నేతలు, కేడర్ మధ్య సమన్వయంతోపాటు ఉపఎన్నికల కోణంలో పార్టీ యంత్రాంగాన్ని సం సిద్ధం చేసే బాధ్యత హరీశ్‌పై పెట్టినట్లు తెలిసింది. -
జీహెచ్ఎంసీ ఎన్నికలే లక్ష్యం..
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సి పల్ కార్పొరేషన్ పాలక మండలి పదవీ కాలం వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగియనుంది. 2016 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లకు గాను 99 చోట్ల పార్టీ అభ్యర్థు లు కార్పొరేటర్లుగా విజయం సాధించడంతో పా టు సొంత బలంతో జీహెచ్ఎంసీ పీఠాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. జీహెచ్ఎంసీ పాలక మం డలి పదవీ కాలం ఏడాది లోపు ముగియనుండటంతో, మరోమారు గ్రేటర్ పీఠాన్ని దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అభివృద్ధి మంత్రంతో ప్రజల్లోకి వెళ్లిన టీఆర్ఎస్, వచ్చే ఎన్నికల్లోనూ అదే నినాదంతో ప్రజల్లోకి వెళ్లేలా వ్యూహా న్ని రూపొందిస్తోంది. ఈ ఏడాది అక్టోబర్‌లోగా జీహెచ్ఎంసీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు చేపట్టిన కీలక అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయడంపై మున్సిపల్ శాఖ మంత్రి హోదా లో ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ప్రత్యేక దృష్టి సారించారు. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, ప్రచారం తదితరాల్లో అంతా తానై వ్యవహరించిన కేటీఆర్ వచ్చే ఏడాది జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో మరోమారు పార్టీ వ్యూహం అమ ల్లో కీలక పాత్ర పోషించేలా వ్యూహ రచన చేస్తున్నారు. 2018 ముందస్తు ఎన్నికల్లో వరుసగా రెం డో పర్యాయం అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన అన్ని రకాల ఎన్నికల్లో నూ ఏకపక్ష విజయాన్ని నమోదు చేస్తూ వస్తోంది. గతేడాది ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్ర త్యర్థి పార్టీలపై స్వల్ప ఆధిక్యత చూపిన టీఆర్ఎస్, స్థానిక సంస్థలు, మున్సిపల్, సహకార ఎన్నికల్లో మాత్రం విజయాలను నమోదు చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఏకపక్ష విజయం సాధించేం దుకు ఇప్పటి నుంచే పార్టీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని నిర్ణయించింది. డివిజన్ల వారీగా నివేదికలు.. గత ఎన్నికల్లో అభివృద్ధి ఎజెండాతో ప్రజల్లోకి వెళ్లిన టీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లోనూ ఇదే అంశాన్ని ప్రచారాస్త్రంగా చేసుకోవాలని భావిస్తోంది. దీనిలో భాగంగా స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ కింద చేపట్టిన ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, తాగునీరు తదితర పనులను ఈ ఏడాది అక్టోబర్ నాటికి పూర్తి చేసేలా మున్సిపల్ మంత్రి హోదాలో కేటీఆర్ గడువు నిర్దేశించారు. 2020–21 వార్షిక బడ్జెట్లో హైదరాబాద్ మౌలిక సౌకర్యాల కల్పనకు రూ.10 వేల కోట్లు కేటాయించడంతో పాటు, ఐదేళ్ల పాటు ఏటా రూ.10 వేల కోట్లు కేటాయిస్తామని వెల్లడించారు. ఓవైపు అభివృద్ధి పనులను కొనసాగిస్తూనే డివిజన్ల వారీగా పార్టీ పరిస్థితిపైనా కేటీఆర్ దృష్టి సారించారు. మున్సిపల్ ఎన్నికల తరహాలో జీహెచ్ఎంసీ డివిజన్ల పరిధిలో పార్టీ పరిస్థితిని అంచనా వేసేందుకు త్వరలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులతో కేటీఆర్ సమావేశమవుతారు. డివిజన్ల వారీగా ప్రస్తుత కార్పొరేటర్ల పనితీరు, పార్టీ యంత్రాంగం తదితరాలపై పార్టీ నేతలు క్షేత్ర స్థాయిలో పర్యటించి నివేదికలు రూపొందిస్తారు. నివేదికలు అందిన తర్వాత జీహెచ్ఎంసీ పరిధిలో పార్టీ పనితీరును మదింపు చేసి యంత్రాంగాన్ని అప్రమత్తం చేసేలా కేటీఆర్ కార్యాచరణ రూపొందిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
ఇక ఆ ఎన్నికలపై టీఆర్ఎస్ కన్ను
సాక్షి, సిటీబ్యూరో/గచ్చిబౌలి: మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. దాదాపు ఏడాదికాలంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈలోగా ప్రజలను ఆకట్టుకునేందుకు అభివృద్ధి కార్యక్రమాల వేగం పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. వీలైనన్ని ఎక్కువ పనులుపూర్తిచేయాలన్నది లక్ష్యం. ఇందులో భాగంగా మునిసిపల్, ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు జీహెచ్ఎంసీ జోనల్‌కమిషనర్లు, తదితర ఉన్నతాధికారులతో శేరిలింగంపల్లి జోన్లో జీహెచ్ఎంసీ పనుల తీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ప్రజలకందే సేవలు పెరగాలని, అభివృద్ధి బాగా కనిపించాలని దిశానిర్దేశం చేశారు. ఫుట్‌పాత్‌లు, స్కైవేలు, బస్షెల్టర్లు, బస్ బేలు, జంక్షన్ల అభివృద్ధి పనులు, జీబ్రా క్రాసింగ్స్, ఫుట్ఓవర్ బ్రిడ్జిలు,పార్కుల్లో పబ్లిక్ టాయ్లెట్లు, స్ట్రీట్ వెండింగ్ జోన్లు, శ్మశాన వాటికలు, రోడ్ల నిర్వహణ పనులు తదితరమైన వాటికి సంబంధించిన లక్ష్యాలు.. పురోగతి తదితరవివరాలను అధికారులనుఅడిగి తెలుసుకున్నారు. రోడ్ల పనుల వేగం పెరగాలి.. రోడ్ల నిర్వహణను ప్రైవేటు ఏజెన్సీలకు ఇచ్చినప్పటికీ పనులు తగిన వేగంతో జరగడం లేవని అభిప్రాయపడ్డారు. చాలా స్లోగా ఉన్నాయని, ఈ పనుల వేగం పెరగాలని ఆదేశించారు. కొన్ని ఏజెన్సీలు ఇంకా బీటీ మిక్స్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోకపోవడం.. పనులు ప్రారంభించకపోవడాన్ని ప్రస్తావించారు. ఈపనుల వేగం పెరగాలని, ఎస్సార్డీపీ పనుల వేగం కూడా పెరగాలన్నారు. ఈ రెండు అంశాలపై శనివారం ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తానన్నారు. మోడల్ మార్కెట్లను త్వరితంగా అందుబాటులోకి తేవాలన్నారు. అక్రమ నిర్మాణాలను త్వరితంగా కూల్చివేసేందుకు ఆధునిక ఉపకరణాలేమేమి ఉన్నాయి.. వాటి ధరలు.. పనితీరు..వాటిని జీహెచ్ఎంసీ సమకూర్చుకోవడానికి సంబంధించి చర్చించారు. గతంలో హైదరాబాద్ స్టాక్ ఎక్సే్ఛంజ్ భవనం కూల్చివేతకు వినియోగించిన యంత్రం ఈ సందర్భంగా ప్రస్తావనకొచ్చింది. అలాంటి ఒక యంత్రం అద్దెకు తీసుకుంటున్నట్లు, భారీ భవంతుల కూల్చివేతలకు దాన్ని వినియోగించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఎఫ్ఓబీల నిర్మాణంలో ఫుట్‌పాత్‌లకు భంగం కలుగకుండా స్థలం ఉంటే దాన్ని సేకరించాలని సూచించారు. తక్కువ స్థలంలో చిట్టడవుల పెంపకానికి ‘మియావాకి’ విధానాన్ని అనుసరించాలని సూచించారు. శేరిలింగంపల్లి జోన్లలో చేపట్టిన వివిధ పనులకు సంబంధించి జోనల్ కమిషనర్ హరిచందన పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ప్లాస్టిక్ రీసైకిల్డ్ టైల్స్ ఫుట్‌పాత్‌లు, స్ట్రీట్ వెండింగ్ జోన్లు తదితరమైనవి బాగున్నాయని, మిగతా అన్ని జోన్లలోనూ వాటిని అమలు చేయాలని సూచించారు. ఖైరతాబాద్ జంక్షన్లో లైటింగ్ ఏర్పాట్లు బాగున్నాయన్నారు. వివిధ పనుల్లో నూతనత్వాన్ని, సృజనాత్మకంగా ఆలోచనలు చేయాలని సూచించారు. దుర్గంచెరువుపై ఏర్పాటు చేసే లైటింగ్ గురించి ప్రస్తావించారు. సమావేశంలో కమిషనర్ లోకేశ్‌కుమార్, జోనల్ కమిషనర్లు, సీసీపీ, సీఈలు తదితరులు పాల్గొన్నారు. -
బల్దియా.. జల్దీయా?
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరిపై గులాబీదళం దృష్టి సారించింది. మరోసారి బల్దియా పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ‘ముందస్తు’ వ్యూహాలకు పదునుపెడుతోంది. ఇటీవల హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా ప్రజాప్రతినిధుల సమావేశం, కంటోన్మెంట్ బోర్డు సభ్యుల సమావేశాలను నిర్వహించడం ద్వారా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఈ మేరకు సంకేతాలిచ్చినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ(జీహెచ్ఎంసీ) పాలకవర్గం పదవీకాలం 2021 ఫిబ్రవరితో ముగియనుంది. అయితే, ఆ లోపే ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుందనే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి పురపోరు ఆలస్యం కావడమే ముఖ్యకారణంగా కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 141 నగర/పురపాలికల్లో జడ్చర్ల, నకిరేకల్ మినహా మిగతా మున్సిపాలిటీల కాలపరిమితి గత జూన్ 2వ తేదీతో ముగిసింది. కొత్త పురపాలక చట్టం తీసుకురావాలనే ఉద్దేశంతో వీటికి ప్రత్యేకాధికారులను నియమించింది. ఒకవైపు పురచట్టంపై కసరత్తు చేస్తూనే.. మరోవైపు మున్సి‘పోల్స్’కు సన్నాహాలు చేసింది. వార్డుల విభజన, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితా రూపకల్పనలో చోటు చేసుకున్న పొరపాట్లపై పలువురు హైకోర్టును ఆశ్రయించడంతో పురపోరుకు బ్రేక్ పడింది. ప్రభుత్వ వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో ఇప్పటికే పలుమార్లు వాయిదా విచారణ ఈ నెల 9న ధర్మాసనం ముందుకు రానుంది. ఆరోజు గనుక కేసు తేలితే సరేసరి. లేనిపక్షంలో మున్సిపల్ ఎన్నికలతోపాటే బల్దియాకు కూడా నగారా మోగించే అవకాశముంది. డిజిటల్ సైన్యం! శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో తిరుగులేని అధిక్యతను కనబరిచిన గులాబీ పార్టీ.. పురపాలికల్లోనూ అదే హవా కొనసాగించాలని భావిస్తోంది. అయితే, వివిధ పార్టీల నేతల చేరికతో దూకుడు మీద ఉన్న బీజేపీని నిలువరించేందుకు మున్సిపల్ ఎన్నికలను వినియోగించుకోవాలని అనుకుంటోంది. ఇప్పుడిప్పుడే బలపడుతున్న బీజేపీని చావుదెబ్బ కొట్టాలంటే సాధ్యమైనంత త్వరగా పురపోరును నిర్వహించాలని ఆ పార్టీ నాయకత్వం ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. పట్టణాల్లో బీజేపీకి సంప్రదాయ ఓటుబ్యాంకు ఉంది. దీనికితోడు ఆర్టికల్ 370 రద్దుతో మోదీ ఇమేజ్ కూడా పెరిగింది. ఈ గ్రాఫ్ పెరగకుండా మున్సి‘పోల్స్’తోపాటు గ్రేటర్ ఎన్నికలు త్వరగా ముగించడం ద్వారా బీజేపీ దూకుడుకు చెక్ పెట్టాలని టీఆర్ఎస్ యోచిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే సోషల్‌వార్‌ను మొదలు పెట్టింది. సామాజికమాధ్యమాల్లో బీజేపీకి దీటుగా కౌంటర్లు ఇవ్వడం ద్వారా ప్రజల్లో ప్రభుత్వవాణిని గట్టిగా వినిపిస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా డిజిటల్ సైన్యాన్ని రంగంలోకి దించింది. వీరికి ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తోంది. హైదరాబాద్‌లో అభివృద్ధి పనులపై కూడా ప్రత్యేక దృష్టి సారించింది. ఫ్లై ఓవర్ల నిర్మాణం, ఎస్ఆర్డీపీ పనులు, రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణం ప్రాజెక్టుల పనులను త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులకు లక్ష్యంగా నిర్ణయించింది. కౌన్సిల్ తీర్మానిస్తే... ముందస్తు ఎన్నికలు నిర్వహించాలనుకుంటే ప్రస్తుత పాలకవర్గాన్ని రద్దు చేయాల్సివుంటుంది. అయితే, ప్రభుత్వానికి కేవలం ఆరు నెలల ముందు మాత్రమే కౌన్సిల్‌ను రద్దు చేసే అధికారం ఉంది. అదే కౌన్సిల్ మెజార్టీ సభ్యులు తీర్మానిస్తే మాత్రం వెంటనే పాలకవర్గం రద్దు కానుంది. సభ్యత్వ తీరుపై అసంతృప్తి పార్టీ సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పార్టీ బలోపేతాన్ని సవాలుగా తీసుకుంటోంది. గ్రేటర్ పరిధిలో సభ్యత్వ నమోదు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తానే స్వయంగా రంగంలోకి దిగారు. సభ్యత్వ నమోదు సంస్థాగత కమిటీల ఏర్పాటుపై దిశా నిర్దేశం చేశారు. గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలతో పలు పర్యాయాలు సమావేశమై డివిజన్, బస్తీ కమిటీలతోపాటు సోషల్ మీడియా కమిటీల ఏర్పాటు అవసరాన్ని గుర్తు చేస్తున్నారు. -
బీసీ కులాలను సాధించుకుంటాం
హైదరాబాద్: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమస్ఫూర్తితోనే తెలంగాణలో బీసీ జాబితానుంచి తొలగించిన 26 కులాలను తిరిగి సాధిస్తామని తెలంగాణ బీసీ కులాల జేఏసీ అధ్యక్షుడు కందిబోయిన శ్రీనివాస్ అన్నారు. కూకట్‌పల్లిలో ఆదివారం జరిగిన బీసీ కులాల ఆత్మగౌరవ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. అంతకుముందు తెలంగాణ 26 బీసీ కులాల లోగోను జేఏసీ నాయకులు ఆవిష్కరించారు. బీసీ జాబితా నుంచి తొలగించిన 26 కులాలను తిరిగి చేర్చేందుకు అవసరమైతే ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్నామని శ్రీనివాస్ స్పష్టం చేశారు. 26 కులాలకు చెందిన వారంతా ఐక్యతతో పోరాడి మన హక్కులను సాధించుకుందామని పిలుపునిచ్చారు. తొలగించిన కులాలన్నింటితో త్వరలోనే నగరంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం పలువురు జేఏసీ సభ్యులు మాట్లాడుతూ..2014 వరకు బీసీలుగా ఉన్న తమకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తీరని అన్యాయం జరిగిందన్నారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో న్యాయం చేస్తానని హామీనిచ్చిన కేసీఆర్ తమకు ఇప్పటివరకూ అపాయింట్మెంటే ఇవ్వలేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు తమను పట్టించుకోని కేసీఆర్‌ను ఇప్పుడు ఎన్నికల ముందు అసలు నమ్మవద్దన్నారు. రానున్న ఎన్నికల్లో తమ సమస్యకు ఎవరు పరిష్కారం చూపితే వారికే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఒక కుటుంబంలో పెద్ద కొడుకు బీసీ అయితే చిన్న కుమారుడు ఓసీ ఎలా అవుతాడని ప్రశ్నిం చారు. తమ పిల్లల చదువులను, జీవితాలను నాశనం చేయవద్దని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు బాబూరావు, శ్రీరామచంద్రమూర్తి, యుగంధర్, వెంకటి, జల్లు హేమచందర్‌రావు పాల్గొన్నారు. -
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు పరాభవం
-
నగరానికి శస్త్రచికిత్స
- అప్పుడే రహదారులు, మౌలిక సమస్యలకు పరిష్కారం -‘మై జీహెచ్ంఎంసీ’ యాప్ ఆవిష్కరణలో మంత్రి కేటీఆర్ - నగరంలోని రహదారులపై అసంతృప్తిగా ఉన్నా - సీఎం నుంచి సామాన్యుల వరకూ ఇదే అభిప్రాయం సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని రహదారులు, ఇతర మౌలిక సమస్యల పరిష్కారానికి శస్త్రచికిత్స చేయాల్సిందేనని, తరతరాలుగా వారసత్వంగా సంక్రమించినసమస్యల పరిష్కారానికి ఇది అత్యవసరమని మున్సిపల్ మంత్రి కె.తారకరామారావు అభిప్రాయపడ్డారు. వివిధ పౌర సదుపాయాలతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) రూపొందించిన ‘మై జీహెచ్ఎంసీ’ మొబైల్ యాప్‌ను శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలోని రహదారులు ఇతర సమస్యలపై తాను ఏమాత్రం సంతృప్తికరంగా లేనని, ముఖ్యమంత్రి నుంచి సామాన్యుల వరకూ అందరూ ఇదే అభిప్రాయంతో ఉన్నారని చెప్పారు. రహదారులు, నీటి నిల్వ ప్రాంతాలు, తదితర సమస్యలు ఇప్పుడే కొత్తగా వచ్చినవి కావని, అవి నగరానికి వారసత్వంగా సంక్రమించాయని, దీనికి తాము ఎవరినీ నిందించబోమని, డ్రైవింగ్ సీట్లో ఉన్న తమతోనే వీటిని పరిష్కరించడం సాధ్యమవుతుందని, అందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సమస్యలన్నీ వెంటనే పరిష్కారం కావాలనే తపన ఉంటుం దని, అయితే ‘అబ్రకదబ్ర’ అనగానే అది సాధ్యం కాదని, దశల వారీగా ఆర్నెల్ల నుంచి ఏడాదిలోగా నగరంలో చెప్పుకోదగ్గ మార్పుచేర్పుల్ని చూపిస్తామన్నారు. తొలుత ఫుట్‌పాత్‌లు, జంక్షన్ల అభివృద్ధి, పచ్చదనం కార్యక్రమాల కోసం మూడు స్పెషలిస్టుల కమిటీలను నియమిస్తామని, ఈ అంశాల్లో ఎలాంటి సమస్యలూ లేకుండా ప్రజలకు సదుపాయాలు కల్పించడమే వాటి బాధ్యతని అన్నారు. పారిశుధ్యం, వీధిదీపాలు, వీధికుక్కల బెడద వంటి సమస్యలు కూడా పరిష్కరిస్తామన్నారు. గ్రేటర్‌లోని తొమ్మిది వేల కి.మీ.ల రోడ్లకు 350 కి.మీ.లు మాత్రమే ఫుట్‌పాత్‌లు, 1,500 కి.మీ.లు మాత్రమే వర ద నీటి కాలువలు ఉండటం సిగ్గుచేటన్నారు. సాంకేతికతతో కొత్త పుంతలు.. నా.. మన అనే భావన కలుగుతుందనే ఈ యాప్‌కు ‘మై జీహెచ్ఎంసీ’ అని నామకరణం చేసినట్లు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశా రు. అటు అధికారుల్లోనూ, ఇటు ప్రజల్లోనూ ఇది మనదే అని చెప్పేందుకే ఈ పేరు పెట్టినట్లు తెలిపారు. జీహెచ్ఎంసీలో సాంకేతికతను వినియోగించుకుని సమస్య ల పరిష్కారంలో కొత్తపుంతలు తొక్కుతామన్నారు. కార్యక్రమంలో భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఎంజీ గోపాల్, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ సురేంద్రమోహన్ పాల్గొన్నారు. -
నచ్చకుంటే బండకేసి కొడతారు
♦ ప్రజల నిర్ణయాలు నిర్దాక్షిణ్యంగా ఉంటాయి జాగ్రత్త ♦ వారి మన్ననలు లేకుంటే భవిష్యత్తు ఉండదు ♦ ‘గ్రేటర్’ టీఆర్ఎస్ కార్పొరేటర్లకు సీఎం కేసీఆర్ హితబోధ సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘‘ప్రజలు తీసుకునే నిర్ణయాలు చాలా నిర్ధాక్షిణ్యంగా ఉంటాయి. వారికి నచ్చితే మెచ్చుకుంటారు. మళ్లీ మళ్లీ అవకాశాలు కల్పిస్తారు. నచ్చకుంటే బండకేసి కొడతారు. జాగ్రత్తగా ఉండండి.’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు టీఆర్ఎస్ పట్టణ ప్రజాప్రతినిధులకు హితబోధ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్ కార్పొరేటర్లకు ఏర్పాటు చేసిన మూడు రోజుల పునశ్చ రణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లనుద్దేశించి సుదీర్ఘ ప్రసంగం చేశారు. ‘‘జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అఖండ విజయా న్ని సొంతం చేసుకుంది. ఇందులో తొలిసారి గెలిచిన వారే ఎక్కువగా ఉన్నారు. ఈ గెలుపు ప్రజలిచ్చిన అవకాశంగా భావించండి. తిరిగి గెలవాలంటే ప్రజల మన్ననలు పొందాల్సిందే. ఆ మేరకు కష్టపడాలి’’ అని సీఎం సూచించారు. అధికారంలో ఉండి చేయాల్సిన పనులు కూడా చేయకపోవడమనేది నేరం చేసినట్లేనన్నారు. హైదరాబాద్ నగరం తనకున్న విశిష్ట లక్షణంతో ఇన్నాళ్లు మనగలిగిం దని, గత పాలకులు చేసింది శూన్యమన్నారు. వర్షపు నీటిని అదుపు చేసే కనీస సాంకేతిక విధానాన్ని గత పాలకులు విస్మరించారని కేసీఆర్ విమర్శించారు. నగరంలో కీలక ప్రదేశాలైన అసెంబ్లీ, రాజ్‌భవన్, సీఎం క్యాంప్ ఆఫీస్ ప్రాంతాల్లో నీళ్లు నిలిచి ఉండటం శోచనీయమన్నారు. హైదరాబాద్‌లో లోతట్టు ప్రాంతాలు మునగకుండా నివారించాలంటే రూ. 11 వేల కోట్లు అవసరమని అధికారులు చెప్పడం ఆందోళన కలిగించిందన్నారు. నగర మేయర్‌కు నివాసం లేకుండా సాగిన 60 ఏళ్ల పాలన దారుణమన్నారు. నగర జనాభాకు అనుగుణంగా కూరగాయల మార్కెట్లు, బస్టాపులు, పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణంపై కార్పొరేటర్లు దృష్టి సారించాలన్నారు. నాగ్‌పూర్, ఢిల్లీ నగరాలను సందర్శించి అక్కడి అభివృద్ధి కార్యక్రమాలను అధ్యయనం చేయాలని కార్పొరేటర్లకు సీఎం సూచించారు. విభజించారు.. అభివృద్ధిని అడ్డుకున్నారు.. మానవ వనరుల్ని వినియోగంలోకి రాకుండా కొన్ని శక్తులు అభివృద్ధిని అడ్డుకున్నాయని కేసీఆర్ ఆరోపించారు. కులాల పేరిట గ్రామ పొలిమేరలు, అటవీ ప్రాంతాల్లోకి ప్రజలను తరిమేశారని, జనాభాలో సగభాగమైన మహిళల్ని వంటింటికి పరిమితం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తద్వారా ఉత్పాదక రంగానికి ప్రజల్ని దూరం చేశారన్నారు. అన్ని వర్గాలు ఏకమైతేనే అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రజలకు సేవచేస్తే పదవులు వాటంతట అవే వస్తాయన్నారు. మనిషి ఎదుగుదలకు జ్ఞానమే కారణమని, ఇందుకోసం నిత్య విద్యార్థిగా సాధన చేయాల్సిందేనని, ప్రజాప్రతినిధులకు ఈ సూత్రం చాలా ఉపయోగకరమన్నారు. కార్యక్రమంలో ఆస్కీ (అడ్మినిస్ట్రేటీవ్ స్టాఫ్ కాలేజి) చైర్మన్ పద్మనాభయ్య, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, మహేందర్‌రెడ్డి, కె.తారకరామారావు, స్థానిక ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అధికారులతో జర భద్రం... అధికారగణంతో జాగ్రత్తగా మెల గాలని కార్పొరేటర్లకు కేసీఆర్ సూచిం చారు. ‘‘కొన్ని సందర్భాల్లో అధికారులు మీ వద్దకు వచ్చి లేనిపోని మాటలు చెప్పి చెడగొట్టే ప్రయత్నం చేస్తరు. వాటిని విశ్లేషించి నీతి నిజాయతీలతో ముందుకెళ్లండి. ప్రజల రుణం తీర్చుకునే దిశగా సాగండి’’ అని సీఎం పేర్కొన్నారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, గడువులోగా హామీని అమలు చేస్తామన్నారు. నగరంలో చెత్త తొలగింపు కష్టమైన విషయం కాదని, కార్పొరేటర్లు తలచుకుంటే నగరాన్ని అద్దంలా తీర్చిదిద్దొచ్చన్నారు. ఐలాండ్ పవర్ సప్లయ్ ద్వారా నగరానికి నిరంతర విద్యుత్ సదుపాయాన్ని కల్పిస్తామన్నారు. -
మలక్‌పేట ఎమ్మెల్యే బలాల అరెస్టు
ఎంబీటీ నాయకుడిపై దాడి కేసులో.. హైదరాబాద్: ఎంబీటీ నాయకుడిపై దాడి చేసిన కేసులో ఎమ్మెల్యే అహ్మద్ బలాలను మలక్‌పేట పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ గంగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల పోలింగ్ రోజైన ఫిబ్రవరి 2వ తేదీ సాయంత్రం అక్బర్‌బాగ్ డివిజన్ ప్రభుత్వ పాఠశాల వద్ద ఎంబీటీ నాయకుడు అంజదుల్లా ఖాన్‌పై ఎమ్మెల్యే బలాల, కార్పొరేటర్ మినాజుద్దీన్లు 40 మంది కార్యకర్తలతో కలసి దాడి చేశారు. దీంతో గాయపడిన అంజదుల్లాఖాన్‌ను యశోదా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. బాధితుడు అంజదుల్లాఖాన్ ఫిర్యాదు మేరకు అప్పట్లో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడికి పాల్పడిన ఎంఐఎం నాయకులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి, స్టేషన్ బెయిల్ ఇచ్చినట్లు సమాచారం. కాగా పోలీసులు అదే కేసులో ఎమ్మెల్యే అహ్మద్ బలాల తోపాటు కార్పొరేటర్ మినాజుద్దీన్లను శనివారం అరెస్ట్ చేశారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
‘లెక్క’ చెప్పలేదు
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖర్చుల వివరాలివ్వని అభ్యర్థులు సమర్పించకుంటే అనర్హత వేటు పడే ప్రమాదం సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిశాక ఫలితాలు వెలువడిన 45 రోజుల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల ఖర్చుల వివరాలను అధికారులకు సమర్పించాలి. లేని పక్షంలో రాబోయే మూడేళ్ల వరకు ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీకి వీలుండదు. అయినప్పటికీ జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఇంకా 412 మంది తమ వివరాలను అధికారులకు సమర్పించలేదు. ఈ నెల 20 వరకు మాత్రమే దీనికి గడువుంది. ఈ మేరకు అధికారులు వారికి నోటీసులు జారీ చేశారు. నిర్ణీత గడువులోగా లెక్కలు సమర్పించని పక్షంలో తగిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత నిబంధనల మేరకు లెక్కలు తెలపని వారు మూడేళ్ల వరకు పోటీ చేయడానికి అనర్హులు. ఉప ఎన్నికలొస్తే తప్ప జీహెచ్ఎంసీ, అసెంబ్లీ ఎన్నికలు జరిగేదే ఐదేళ్లకోసారి. అంటే.. మళ్లీ ఎన్నికలు జరిగే సమయానికి వీరి పోటీకి ఆటంకాలు ఉండవు. అలాంటప్పుడు అనర్హత వేటు వేసినా, వేయకపోయినా వారికి జరిగే నష్టమేమీ లేదు. ఈ ధీమాతోనే ఓడిపోయిన పలువురు అభ్యర్థులు దీనిపై దృష్టి సారించలేదని తెలుస్తోంది. గెలిచిన వారు ఎన్నికల లెక్కలు చూపని పక్షంలో కార్పొరేటర్లుగా అనర్హులవుతారు. దీంతో వారు అప్రమత్తంగానే ఉన్నట్లు తెలుస్తోంది. గడువు వరకు అధికారులు వేచి చూస్తున్నారు. మరోవైపు ఎన్నికల లెక్కలు తెలపాల్సిందిగా ఓడిన వారిని హెచ్చరిస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థుల మాదిరిగా తిరిగి ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆరేళ్ల వరకు అనర్హత వేటు వేస్తేనే ఇలాంటి వారుస్పందిస్తారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఎన్నికల సంఘం ఈ అంశంపై శ్రద్ధ చూపితే బాగుంటుందని వారు భావిస్తున్నారు -
'గ్రేటర్'లో పార్టీ ఓటమిపై దిగ్విజయ్ సమీక్ష
హైదరాబాద్: ఏఐసీసీ నేత, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ తెలంగాణ కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. నేటి సాయంత్రం ఆయన హైదరాబాద్ కు వచ్చారు. ఫిబ్రవరి 2న జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ ఓటమిపై రాష్ట్ర నేతలతో సమీక్ష జరుపుతున్నారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్ లో కాంగ్రెస్ ఓటమిపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి పార్టీ ఓటమి అంశంపై దిగ్విజయ్ కి వివరణ ఇచ్చుకున్నారు. రేపు శుక్రవారం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలతో విజయవాడలో భేటీ అవ్వనున్నారు. విజయవాడలో పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో దిగ్విజయ్ పాల్గొననున్నారు. -
న్యాయపోరాటం చేస్తాం: కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని, ఈ విషయాన్ని శాస్త్రీయ ఆధారాలతో నిరూపిస్తామని మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి, టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. గాంధీభవన్‌లో శనివారం మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌పై శాస్త్రీయంగా చెబుతున్నా ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదన్నారు. నారాయణఖేడ్‌లో బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరినా నిర్లక్ష్యం చేసిందన్నారు. నోటా ఆప్షన్ తొలగించడం, ఈవీఎంలకు ప్రింటర్లు లేకుండా ఎన్నికలను నిర్వహించడం, పేపర్ బ్యాలెట్‌ను నిర్వహించాలని కోరినా పట్టించుకోకపోవడం వంటి అంశాలపై న్యాయపోరాటం చేస్తామన్నారు. త్వరలో జరగనున్న వరంగల్, ఖమ్మం, సిద్దిపేట పురపాలక ఎన్నికలనైనా పేపర్ బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు పేర్కొన్నారు. -
టీడీఎల్పీని టీఆర్ఎస్లో విలీనం చేస్తున్నాం
► స్పీకర్‌కు లేఖ రాసిన టీడీపీ చీలికవర్గం ► సంతకాలు చేసిన మూడింట రెండొంతుల మంది టీడీపీ ఎమ్మెల్యేలు ► మెజారిటీ తమకే ఉందని లేఖలో స్పష్టీకరణ ► టీఆర్ఎస్లో విలీనం చేయాలని అభ్యర్థన ► మమ్మల్ని టీఆర్ఎస్ జాబితాలోకి మార్చండి: ఎర్రబెల్లి సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్లో టీడీఎల్పీ విలీనంపై ఊహించిందే జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల ప్రక్రియ ముగిసిన వారం రోజుల్లోనే తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేసే కార్యక్రమం చివరి అంకానికి వచ్చింది. టీడీపీకి చెందిన మొత్తం సభ్యుల్లో మూడింట రెండొంతుల మంది టీఆర్ఎస్లో చేరిపోవడంతో.. తెలంగాణ తెలుగుదేశం శాసనసభాపక్షాన్ని (టీటీడీఎల్పీ) టీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్లు ఎర్రబెల్లి దయాకర్‌రావు నాయకత్వంలో తెలుగుదేశం చీలిక వర్గం శాసనసభ్యులు స్పీకర్ ఎస్.మధుసూదనాచారికి లేఖ రాశారు. దశల వారీగా తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్లో చేరిన పది మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను శుక్రవారం స్పీకర్‌కు అందజేశారు. టీ టీడీపీ శాసనసభాపక్షంలోని 15 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో విలీనం కావాలని గురువారం రాత్రి జరిగిన సమావేశంలో నిర్ణయించారని... మెజారిటీ సభ్యుల నిర్ణయం మేరకు టీఆర్ఎస్లో విలీనం అవుతున్నామని లేఖలో ఎర్రబెల్లి పేర్కొన్నారు. ఇలా విలీనం కావడానికి రాజ్యాంగం (పదో షెడ్యూలు, 4వ పేరా)లోని నిబంధనల ప్రకారం కావాల్సిన మెజారిటీ తమకు ఉందని చెప్పారు. తమ విలీనాన్ని గుర్తించి టీఆర్ఎస్ శాసనసభ్యుల జాబితాలోనే తమ పది మంది పేర్లను చూపించాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ లేఖపై టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస యాదవ్, జి.సాయన్న, టి.ప్రకాశ్‌గౌడ్, తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, కె.పి.వివేకానంద, చల్ల ధర్మారెడ్డి, ఎస్.రాజేందర్‌రెడ్డి సంతకాలు చేశారు. చట్టంలో ఏముందంటే... ఒక రాజకీయ పార్టీకి చెందిన చట్టసభ సభ్యులు వేరే పార్టీలో విలీనం కాదలచుకుంటే... ఆ చట్టసభలో ఆ పార్టీకి ఉన్న మొత్తం సభ్యుల్లో మూడింట రెండువంతుల మంది దానికి అంగీకరించాల్సి ఉంటుంది. రాజ్యాంగంలో పదో షెడ్యూల్లోని నాలుగో పేరాలో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నిబంధన మేరకే తెలుగుదేశం పార్టీ చీలికవర్గం శాసనసభ్యులు తమను తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో విలీనం చేయాలని స్పీకర్‌కు లేఖ రాశారు. స్పీకర్ గుర్తించిన తర్వాత నిర్వహించే శాసనసభ సమావేశాల నుంచి వీరిని అధికారికంగా టీఆర్ఎస్ సభ్యులుగా పరిగణిస్తారు. వారు టీఆర్ఎస్ సభ్యుల సరసన కూర్చుంటారు. రాజ్యాంగం పదో షెడ్యూల్లోని నిబంధన.. (2) For the purposes of subparagraph (1) of this paragraph, the merger of the original political party of a member of a House shall be deemed to have taken place if, and only if, not less than twothirds of the members of the legislature party concerned have agreed to such merger. -
పుర ఎన్నికలు మార్చి 5న!
- ఈ నెల 20న ఎన్నికల ప్రకటన జారీ.. 15 రోజుల్లోనే ఎన్నికల నిర్వహణ - షెడ్యూల్ కుదిస్తూ ‘పుర’ ఎన్నికల నిబంధనలకు సవరణలు చేసిన సర్కారు సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అపూర్వ విజయంతో దూకుడు మీదున్న టీఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి రాష్ట్రంలో పుర పోరుకు తెర తీయనుంది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు సిద్దిపేట, అచ్చంపేట మున్సిపాలిటీలకు మార్చి 5న ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఎన్నికల ప్రకటన ఈ నెల 20న జారీ కానుంది. కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఎన్నికలు ముగిసిపోనున్నాయి. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. మార్చిలో శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాకముందే ఈ నాలుగు పురపాలికలకు ఎన్నికలు నిర్వహించేలా చకచకా ఏర్పాట్లు చేస్తోంది. వాటిలోని డివిజన్లు, వార్డులకు రిజర్వేషన్లను ప్రకటిస్తూ వచ్చే సోమ లేదా మంగళవారం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఆ వెంటనే పైన పేర్కొన్న తేదీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది. వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, అచ్చంపేట పురపాలికల డివిజన్/వార్డు రిజర్వేషన్లను పురపాలక శాఖ ఇప్పటికే సిద్ధం చేసింది. వరంగల్, ఖమ్మంల్లో డివిజన్ల రిజర్వేషన్లను ప్రకటిస్తూ ప్రభుత్వం... సిద్దిపేట, అచ్చంపేటల్లో వార్డు రిజర్వేషన్లు ప్రకటిస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేయడమే తరువాయి అని అధికార వర్గాలంటున్నాయి. ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించకుండానే సిద్దిపేట మున్సిపాలిటీలో ఆరు శివారు గ్రామాలను విలీనం చేయడాన్ని స్థానికులు ప్రశ్నిస్తూ హైకోర్టులో కేసువేయడంతో అక్కడ ఎన్నికల నిర్వహణపై కొంతకాలంగా స్టే అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో స్థానికుల నుంచి ఇటీవల అభ్యంతరాలు స్వీకరించి పరిష్కరించిన పురపాలక శాఖ, స్టే తొలగింపు కోసం వచ్చే సోమవారం హైకోర్టులో పిటిషన్ వేయనుంది. ఆ రోజు హైకోర్టు స్టే తొలగించే పక్షంలో ఆ రోజు సాయంత్రంలోగా రిజర్వేషన్లను ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే ఊపులో మిగతా ఎన్నికలు రాష్ట్రమంతటా తమకు అనుకూల పవనాలు వీస్తున్న ఈ తరుణంలోనే మిగతా ఎన్నికలనూ పూర్తి చేసే దిశగా అధికార పార్టీ పావులు కదుపుతోంది. శనివారం జరగనున్న మెదక్ జిల్లా నారాయణఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నికలోనూ ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే స్థాయి విజయం సాధిస్తామని టీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు కాస్త ముందు వరంగల్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలోనూ టీఆర్ఎస్ రికార్డు మెజారిటీతో గెలవడం తెలిసిందే. అందుకే ఇదే ఊపులో వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు, వాటితో పాటు ఖాళీగా ఉన్న సిద్ధిపేట, అచ్చంపేట మున్సిపాలిటీలకూ వీలైనంత త్వరగా ఒకేసారి ఎన్నికలు జరపాలన్న నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు. రెండు కార్పొరేషన్లలో సీఎం పర్యటనలు నగర ఓటర్లను ఆకట్టుకోవడంలో భాగంగా... ఎన్నికలు జరగాల్సిన వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లలో సీఎం కేసీఆర్ పర్యటనలు ఖరారయ్యాయని సమాచారం 15, 16 తేదీల్లో ఖమ్మంలో సీఎం పర్యటిస్తారని చెబుతున్నారు. వరంగల్లోనూ పర్యటిస్తారని సమాచారం. 19న ఆయన వరంగల్ జిల్లా మేడారంలో సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్తారని, పర్యటనల తేదీలు ఆలోగా ఖరారవుతాయని తెలిసింది. సీఎం పర్యటనలు ముగియగానే ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తారని అంచనా వేస్తున్నారు. పుర ఎన్నికల షెడ్యూల్ 15 రోజులకు కుదింపు జీహెచ్ఎంసీ ఎన్నికల తరహాలోనే రాష్ట్రంలోని ఇతర పురపాలికల ఎన్నికల షెడ్యూల్‌ను సైతం కుదిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.జి.గోపాల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకోసం తెలంగాణ పురపాలికల ఎన్నికల నిర్వహణ నిబంధనలను సవరించారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం 26-21 రోజుల వ్యవధిలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇకపై వాటిని 15 రోజుల్లో ముగించేలా షెడ్యూల్‌ను కుదించారు. - నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నుంచి నామినేషన్ల దాఖలుకు సెలవులతో సంబంధం లేకుండా గరిష్టంగా 3 రోజులు కేటాయిస్తారు. ఇది ఇప్పటిదాకా 4-7 రోజులుండేది. - నామినేషన్ల దాఖలు గడువు ముగిసిన మర్నాడే పరిశీలన (స్క్రూటినీ) నిర్వహిస్తారు. సెలవులున్నా ఇందులో మార్పుండదు. ఇప్పటిదాకా నామినేషన్ల గడువు ముగిశాక 3 రోజుల వ్యవధిలో పరిశీలన జరిపేవారు. - పరిశీలన మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలలోపు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశమిస్తారు. ఇదిప్పటిదాకా 3 రోజులుండేది. - ఉపసంహరణ తర్వాత 9వ రోజు పోలింగ్ నిర్వహిస్తారు. ఇప్పటిదాకా 12 రోజుల వ్యవధి ఉండేది. - వార్డుల్లో కనీసం 8 గంటల పాటు పోలింగ్ నిర్వహించాలంటూ ప్రభుత్వం మరో సవరణ తీసుకొచ్చింది. నామినేషన్ల ఉపసంహరణలో సవరణ నామినేషన్ ఉపసంహరణ నిబంధనల్లోనూ ప్రభుత్వం సవరణలు చేసింది. ఉపసంహరణ పత్రాలను నిర్ణీత వ్యవధిలో సదరు అభ్యర్థి సమర్పించకపోయినా తన ధ్రువీకరణతో కూడిన ఉపసంహరణ పత్రాలను తన ఎన్నికల ప్రతిపాదకుడి ద్వారా గానీ, ఎన్నికల ఏజెంట్ ద్వారా గానీ గడువులోగా ఎన్నికల అధికారికి సమర్పిస్తే దాన్ని కూడా ఇకపై పరిగణనలోకి తీసుకుంటారు. -
'ఓటమితో కుంగిపోయే పరిస్థితి లేదు'
విజయవాడ : గ్రేటర్ ఓటమితో కుంగిపోయే పరిస్థితి లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. గతంలో గ్రేటర్‌కు జరిగిన ఎన్నికల్లో కంటే ఈ సారి జరిగిన ఎన్నికల్లో లక్షన్నర ఓట్లు తమ పార్టీకి వచ్చాయన్నారు. బుధవారం విజయవాడలో నారా లోకేష్ మాట్లాడుతూ... తెలంగాణలో అధికార టీఆర్ఎస్కి టీడీపీనే ప్రధాన ప్రత్యర్థి అని తెలిపారు. మూడు దశాబ్దాల టెస్ట్ మ్యాచ్ ఆడిన చరిత్ర టీడీపీకి ఉందని చెప్పారు. టీ-20 మ్యాచుల్లా ఆరు నెలల్లో అన్ని కావాలని కోరుకోమన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు రూ. 60 వేల కోట్లు అవసరమవుతాయన్నారు. అందుకు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో వేచి చూస్తామన్నారు. కాపుల విషయంలో మాత్రం చిత్తశుద్ధితో ఉన్నారమన్నారు.2019 ఎన్నికల్లో యువకులతో ముందుకు వెళ్తామన్నారు. -
మేయర్ ఎన్నికను ఆపివేయాలి: కాంగ్రెస్
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలను తాత్కాలికంగా ఆపివేయాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డిని కోరారు. బుధవారం సాయంత్రం టీకాంగ్రెస్ నేతలు ఎలక్షన్ కమిషనర్ ను కలిశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చాలా అవకతవకలు జరిగాయని నేతలు ఆరోపించారు. ఈ నెల 5న జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎం లలో అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికల్లో జరిగిన అక్రమాలు వెల్లడయ్యే వరకు రేపు జరగనున్న ఎన్నికను ఆపాలని టీకాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డికి విజ్ఞప్తి చేశారు. -
వెయ్యి మందికి డిపాజిట్లు గల్లంతు
* గ్రేటర్ ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతైన వారు 1009 * టీఆర్ఎస్కు 15 డివిజన్లలో, ఎంఐఎంకు 10 డివిజన్లలో హైదరాబాద్: ఎంతటి వారికైనా గెలుపోటములు సహజం. పెద్ద పార్టీ అయినా.. చిన్న పార్టీ అయినా అంతే. అగ్రస్థాయిలో రికార్డు సాధించిన పార్టీలోనూ డిపాజిట్లు దక్కని వారుంటారు. తక్కువ సీట్లలో గెలిచిన వారిలోనూ అత్యధిక ఓట్లు పొందిన వారూ ఉంటారు. అలాంటి విచిత్రమే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ చోటు చేసుకుంది. భారీ విజయాలు నమోదైన పార్టీల్లోనూ డిపాజిట్లు గల్లంతైన వారున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో మొత్తం 1333 మంది పోటీ చేయగా, వారిలో గెలుపు పోతే పోయింది కానీ కనీసం డిపాజిట్ కూడా దక్కలేదే అని వాపోతున్న వారు 1009 మంది ఉన్నారు. వీరికి కనీస డిపాజిట్ కూడా దక్కలేదు. గ్రేటర్ ఎన్నికల్లో 99 డివిజన్లలో విజయంతో రికార్డు సృష్టించిన టీఆర్ఎస్ పార్టీ నుంచి సైతం డిపాజిట్లు కోల్పోయిన వారున్నారు. అలాగే 60 స్థానాల్లోనే పోటీ చేసి 44 స్థానాలు గెలుచుకున్న ఎంఐఎంలోనూ డిపాజిట్లు పోగొట్టుకున్నవారున్నారు. పోటీ చేసిన మొత్తం అభ్యర్థుల్లో డిపాజిట్లు కోల్పోయిన వారిలో ఇండిపెండెంట్లదే అగ్రస్థానం. మొత్తం పోలైన ఓట్లలో ఆరోవంతు ఓట్ల కంటే తక్కువ (దాదాపు 16.67 శాతం) ఓట్లు వస్తే డిపాజిట్ గల్లంతైనట్లు పరిగణిస్తారు. నామినేషన్ సందర్భంగా వారు చెల్లించిన డిపాజిట్ మొత్తాన్ని తిరిగి ఇవ్వరు.ప్రధాన పార్టీల విషయానికి వస్తే డిపాజిట్లు గల్లంతైన వారిలో కాంగ్రెస్ పార్టీ అగ్రస్థానంలో ఉంది. ఆ పార్టీనుంచి పోటీ చేసిన 149 మంది అభ్యర్థుల్లో 126 మంది అభ్యర్థులకు కనీస డిపాజిట్లు దక్కలేదు. ఇక టీడీపీలో 36 మందికి, బీజేపీలో 20 మందికి, టీఆర్ఎస్లో 15 మందికి డిపాజిట్లు దక్కలేదు. ఎంఐఎం పది స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. పార్టీ అభ్యర్థులు కాంగ్రెస్ 126 బీఎస్పీ 55 టీడీపీ 36 సీపీఎం 26 లోక్‌సత్తా 25 బీజేపీ 20 టీఆర్ఎస్ 15 సీపీఐ 16 ఎంబీటీ 15 ఏఎన్సీ 12 ఎంఐఎం 10 ఎస్పీ 5 డబ్ల్యుపీఓఐ 3 డీబీపీ 3 జేడీయూ 2 టీవైఎస్పీ 1 ఏఐఎఫ్బీ 1 టీఎస్ఎల్పీ 1 ఎస్‌డబ్ల్యుపీ 1 జీఎస్పీ 1 ఇండిపెండెంట్లు 634 -
ఇంకాస్త కష్టపడాల్సింది!
వివిధ పార్టీల్లో అంతర్మథనం కొన్ని డివిజన్లలో రెండో స్థానం విజయానికి అడుగు దూరంలో ఆగిన వైనం సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిశాక ప్రస్తుతం వివిధ వర్గాలు.. ముఖ్యంగా రాజకీయ పరిశీలకులు ఫలితాల తీరు తెన్నులపై అధ్యయనం చేస్తున్నారు. పార్టీలు ఇంకొంచెం కష్టపడితే మరికొన్ని సీట్లు సొంతమయ్యేవని అభిప్రాయ పడుతున్నారు. జీహెచ్ఎంసీలోని 150 డివిజన్లలో పోటీ చేసి 99 స్థానాలు సొంతం చేసుకున్న టీఆర్ఎస్ అభ్యర్థులు మరికొంత కష్టపడితే మరిన్ని చోట్ల గెలిచేవారు. ఆ పార్టీ 38 డివిజన్లలో రెండో స్థానంలో ఉంది. ఇంకాస్త కష్టపడితే దాదాపు 20 డివిజన్లలో గెలవగలిగేవారని లెక్కలు కడుతున్నారు. టీడీపీ- బీజేపీలు నిజంగా పొత్తు ధర్మాన్ని పాటించి ఉంటే రెండు పార్టీల సీట్లూ గణనీయంగా పెరిగేవి. బీజేపీ గెలిచింది నాలుగు డివిజన్లలోనే అయినప్పటికీ.... 35 చోట్ల రెండో స్థానంలో నిలిచింది. మిత్రపక్షానికి టీడీపీ సహకరించి ఉంటే.. ఉభయ పార్టీలూ మరికొంత కష్టపడితే ఇందులో సగం వచ్చినా సీట్లు పెరిగేవి. టీడీపీది కూడా ఇదే పరిస్థితి. గెలిచింది ఒక్కటే సీటు. మరికొంత చెమటోడిస్తే.. పార్టీలోని అన్ని వర్గాలనూ కలుపుకొని పోయి ఉంటే.. ఇంకొన్ని సీట్లు వచ్చి ఉండేవని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఎంఐఎం పోటీ 60 సీట్లలో పోటీ చేసి... 44 చోట్ల గెలిచింది. మరో ఐదు డివిజన్లలో రెండో స్థానంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 149 డివిజన్లలో పోటీ చేసి... రెండు సీట్లతో సరిపెట్టుకుంది. 11 డివిజన్లలో రెండో స్థానంలో ఉన్న పార్టీ ఎక్కువ చోట్ల మూడో స్థానానికి పడిపోయింది. కాంగ్రెస్ పార్టీ 79 డివిజన్లలో మూడో స్థానంలో ఉంది. -
కేటీఆర్‌కు ‘గ్రేటర్’ కానుక
అదనపు బాధ్యతగా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అప్పగింత సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల బాధ్యతలను భుజానికెత్తుకొని టీఆర్ఎస్కు చరిత్రాత్మక విజయాన్ని అందించిన రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావుకు ‘గ్రేటర్’ కానుక లభించింది! గ్రేటర్ ఎన్నికల తర్వాత కేటీఆర్‌కు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ బాధ్యతలను అప్పగిస్తానని ఎన్నికల ప్రచార సభలో చేసిన ప్రకటనను సీఎం కేసీఆర్ ఆదివారం నెరవేర్చారు. కేటీఆర్‌కు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖను అదనపు బాధ్యతగా అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీరాజ్, ఐటీ శాఖలు యథాతథంగా కేటీఆర్ వద్దే ఉంటాయి. పురపాలక శాఖ ఇప్పటివరకు సీఎం వద్ద ఉంది. దీంతో చిన్న అంశంపై అనుమతి కావాలన్నా ముఖ్యమంత్రి వద్దకు వెళ్లాల్సి రావడంతో అధికారులు ఇబ్బంది పడేవారు. ఫలితంగా సీఎం సంతకానికి నోచుకోక పురపాలక శాఖకు సంబంధించిన వందల ఫైళ్లు సీఎంవోలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉంటున్నాయి. మంత్రి కేటీఆర్ ఈ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఈ ఫైళ్లకు మోక్షం లభిస్తుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. -
'బాబు వైఖరితోనే గ్రేటర్లో ఓటమి'
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుసరించిన వైఖరి కారణంగా గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైందని రాజ్యసభ మాజీ సభ్యుడు యలమంచిలి శివాజీ అన్నారు. గుంటూరులో ఆదివారం ఆయన సాక్షి ప్రతినిధితో ఫోన్లో మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఏపీ సీఎం చంద్రబాబు స్నేహపూర్వకంగా మెలగడం వల్ల ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ ఫ్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేయలేకపోయారని అన్నారు. ఈ విధానం వల్ల టీడీపీ కేడర్‌కు బాబు ధైర్యాన్ని ఇవ్వలేకపోవడంతోపాటు టీఆర్ఎస్ అభ్యర్థులకు ధీటుగా ప్రచారం చేయలేకపోయారని శివాజీ పేర్కొన్నారు. ముఖ్యమంత్రులు ఇద్దరూ స్నేహంగా ఉన్న సమయంలో తాము స్థానికులతో ఎందుకు వివాదాలకు పోవాలని భావించి సీమాంధ్ర ఓటర్లు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఫలితాలు ఊహించినవేనని, ఒక ప్రాంతీయపార్టీ మరో రాష్ట్రంలోని స్థానిక ఎన్నికల్లో గెలిచిన దాఖలాలు లేవని, చరిత్ర ఇదే చెబుతోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్తగా ఏర్పాటైన రాష్ట్రంలోని పరిస్థితులను చక్కదిద్దుకునే ప్రయత్నం చేయకుండా పక్క రాష్టంలో పార్టీని బలపరిచే దిశగా ప్రయత్నాలు చేయడం శ్రేయస్కరం కాదని శివాజీ అన్నారు. -
తెలంగాణ ఉద్యోగులకు తీపి కబురు
► బడ్జెట్ కేటాయింపులు, గవర్నర్ ప్రసంగంపై చర్చ ► ఔట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాల పెంపుపై నిర్ణయం ► దుమ్ముగూడెం రీ డిజైన్ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం ► తెలంగాణ ఉద్యోగులకు 3.14 శాతం డీఏ పెంపుపై నిర్ణయం హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ భేటీ ఆదివారం ప్రారంభమైంది. ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా బడ్జెట్ కేటాయింపులు, గవర్నర్ నరసింహన్ ప్రసంగంపై చర్చ జరుగ నున్నట్టు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల బాధ్యతలను విజయవంతంగా నిర్వహించినందుకుగానూ తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్‌ను ఈ సందర్భంగా కేబినెట్ అభినందించింది. తెలంగాణ ఉద్యోగులకు 3.14 శాతం డీఏ పెంపుపై నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాంట్రాక్ట్ ఉద్యోగుల రైగ్యులరైజ్ కోసం కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యాక్ట్‌ను తెలంగాణకు అన్వయించుకునే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. దుమ్ముగూడెం రీ డిజైన్ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆర్థిక, ఆరోగ్య శాఖలతో పాటు వివిధ శాఖల్లో కొత్త పోస్టుల నియమకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఔట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మరొక స్లాబ్‌ను ఏర్పరిచే ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. -
ఇదీ మేయర్ లెక్క..
* ఎన్నికైన కార్పొరేటర్లు 150 * ఎక్స్ అఫీషియో సభ్యులు 67 మంది * మొత్తం ఓటర్లు 217 సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్‌ను ఎన్నుకోవడంలో మరో ట్విస్ట్ ఎదురయ్యింది. మేయర్ ఎన్నికలో 217 మందికి ఓటు హక్కు ఉంది. ఎన్నికైన 150 మంది కార్పొరేటర్లతో పాటు 67 మంది ఎక్స్అఫీషియో సభ్యులు వీరిలో ఉన్నారు. ఎమ్మెల్సీలను ఎక్స్ అఫీషియో సభ్యులుగా చేసేందుకు ఇటీవల జీవోను సవరించడంపై హైకోర్టులో ఉన్న కేసు సోమవారం విచారణకు రానుండటం.. ఆగమేఘాల మీద సదరు జీవోను రద్దుచేస్తూ ఆర్డినెన్స్ తేవడం.. తదితర పరిణామాల నేపథ్యంలో మేయర్‌ను ఎన్నుకోనున్న ఎక్స్అఫీషియో సభ్యులు ఎందరన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. తాజా సమాచారం మేరకు అర్హత కలిగిన ఎక్స్‌అఫీషియోలు 67 మంది ఉన్నారు. ఏపీకి కేటాయించిన రాజ్యసభ సభ్యులకు సైతం ఇక్కడ మేయర్ ఎన్నికలో ఓటు హక్కు కల్పించారు. తామిక్కడి ఓటర్లయినందున తమకు కూడా ఓటు హక్కు ఉండాలని ఎంఏ ఖాన్ కోరడంతో ఆ మేరకు ప్రభుత్వానికి నివేదించి... వారికి అవకాశం కల్పించారు. ఈ మేరకు మేయర్ ఎన్నికకు హాజరు కావాల్సిందిగా కోరుతూ కార్పొరేటర్లతో పాటు వీరందరికీ ఆహ్వానపత్రాలు పంపడంతో వారు ఈ నెల 11న మేయర్ ఎన్నికకు హాజరు కానున్నారు. ఎన్నిక జరిగే హాల్లోకి వెళ్లేముందు అంతకుముందు తామెక్కడా మేయర్ ఎన్నికలో ఓటు వేయలేదని డిక్లరేషన్ పత్రంపై సంతకం చేయాలి. వీరిలో కనీసం సగం మంది హాజరైతే మేయర్ ఎన్నికకు కోరం ఉన్నట్లు లెక్క. అంటే కనీసం 109 మంది హాజరైతే మేయర్ ఎన్నికను నిర్వహిస్తారు. అయితే టీఆర్ఎస్కు సంఖ్యా బలమున్నందున మేయర్ ఎన్నిక లాంఛనమే కానుంది. ఎక్స్ అఫీషియోలుగా ఓటు హక్కు వినియోగించుకోనున్న వారిలో పదిమంది రాజ్యసభ సభ్యులు, నలుగురు లోక్‌సభ సభ్యులు, 24 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. తెలంగాణలోని 40 మంది ఎమ్మెల్సీల్లో 29 మందికి ఇక్కడ ఓటు హక్కు ఉండగా, మిగ తా వారు ఇతర పురపాలికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు హక్కులేని వారు.. ఎమ్మెల్సీల్లో కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావులకు ఇక్కడ ఓటు హక్కు లేదు. ఎంపీ విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి కూడా లేదు. వీరు ఇప్పటికే ఇతర పురపాలికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లుల నిర్ధారించుకున్నారు. ఎమ్మెల్సీలు.. 1. భూపాల్‌రెడ్డి, 2 సుంకరిరాజు, 3.కె.జనార్దన్‌రెడ్డి , 4. భూపతి రెడ్డి , 5. సతీష్‌కుమార్, 6. కర్నె ప్రభాకర్, 7. వి.స్వామిగౌడ్, 8. ఎండి సలీం, 9.నాయిని నరసింహారెడ్డి , 10. గంగాధ ర్‌గౌడ్, 11. డి.రాజేశ్వరరావు, 12. పూల రవీందర్, 13. మహమూద్‌అలీ, 14. కసిరెడ్డి నారాయణరెడ్డి ,15. పి.సుధాకర్‌రెడ్డి ,మ16. మహ్మద్ అలీ షబ్బీర్, 17. పల్లా రాజేశ్వర్, 18. యాదవరెడ్డి, 19. బి.వెంకటేశ్వర్లు, 20. ఎం.శ్రీనివాసరెడ్డి, 21. నేతి విద్యాసాగర్, 22. రాములు నాయక్, 23. పట్నం నరేందర్‌రెడ్డి, 24. భానుప్రసాదరావు, 25. సయ్యద్ అల్తాఫ్ హైదర్ రజ్వి, 26ఎంఎస్ ప్రభాకర్, 28. నారదాసు లక్ష్మణరావు, 29. సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రి. -
ఓడినా ప్రజల మధ్యే ఉంటాం: కిషన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాజకీయాల్లో గెలుపు ఒక్కటే లక్ష్యం కాదని, సైద్ధాంతిక భూమికతో ప్రజల సమస్యల పరిష్కారానికి పోరాడుతూనే ఉంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజల తీర్పును శిరసావహిస్తామని, ఓటమిని అంగీకరిస్తున్నామని పేర్కొన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ కూటమికి 18 శాతం ఓట్లు వచ్చాయని చెప్పారు. గెలుపు, ఓటమితో నిమిత్తం లేకుండా ప్రజల్లో ఉంటామని పేర్కొన్నారు. ప్రభుత్వ పని తీరులోని లోపాలను ప్రజలకు వివరించడంలో విఫలమైనట్లు ఆయన విశ్లేషించారు. గ్రేటర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు అధికార టీఆర్ఎస్ పనిచేయాలని సూచించారు. హైదరాబాద్ అభివృద్ధికి సహకరిస్తామని చెప్పారు. ఓటమిపై పార్టీలో అంతర్గతంగా పూర్తిస్థాయిలో సమీక్షించుకుంటామని పేర్కొన్నారు. పోలింగ్ శాతం తగ్గడంతో బీజేపీకి నష్టం వాటిల్లిందన్నారు. అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తే పరిస్థితి కొంత బాగుండేదన్నారు. ఎన్నికల్లో పార్టీకి జరిగిన నష్టాన్ని పూడ్చుకుని, పునాదులను బలోపేతం చేసేందుకు కృషిచేస్తామని చెప్పారు. టీడీపీతో పొత్తు వల్ల ఓడిపోయామనే ఆలోచన, అభిప్రాయాలు రాలేదన్నారు. -
పాతబస్తీలోనూ ‘కారు’ షికారు
* సీట్లు దక్కకున్నా...పెరిగిన ఓటు బ్యాంక్ * మజ్లిస్‌కు తగ్గిన ఓటు బ్యాంక్ * మెరుగుపడిన కాంగ్రెస్ ఓటింగ్ శాతం సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పాతబస్తీలోనూ కారు గాలి వీచింది. అధికార టీఆర్ఎస్ పార్టీ పాగావేయలేకపోయినా ఓటు బ్యాంకు మాత్రం పెంచుకోగలిగింది. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల కంటే ఈసారి టీఆర్ఎస్కు ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది పాతబస్తీ లో మజ్లిస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసినా సాధారణ ఎన్నికల కంటే ఓట్ల సంఖ్య గణనీయంగా తగ్గడం విశేషం. ఇక కాం గ్రెస్ పార్టీ పరిస్థితి అంతంత మాత్రమే ఉండగా, టీడీపీ బీజేపీ కూటమికి గతంలో మాదిరిగానే ఆదరణ లభించలేదు. పార్టీల వారీగా ఓటింగ్ సరళిని పరిశీలిస్తే.... టీఆర్ఎఎస్కు పెరిగిన బలం..... టీఆర్ఎస్కు పాతబస్తీలో బలం పెరిగింది. 2014లో జరి గిన ఎన్నికల కంటే ఈ సారి ఓటింగ్ శాతం పెంచుకోగలిగింది. గత సాధారణ ఎన్నికల్లో చార్మినార్ నియోజకవర్గంలో టీఆర్ఎస్కు 8275 ఓట్లు రాగా, ఈసారి 11,359 ఓట్లు పడ్డాయి. యాకుత్‌పురా నియోజకవర్గంలో గతంలో 7862 ఓట్లు లభించగా ఈ సారి 37,963 ఓట్లు దక్కాయి. బహుదూర్‌పురాలో 3719 ఓట్లు రాగా, ఈసారి 13,595 పైగా ఓట్లు పడటం విశేషం. చాంద్రాయణగుట్టలో 7278 లభించగా ఈసారి వాటి సంఖ్య 28, 257కు చేరుకుంది. మలక్‌పేటలో గత ఎన్నికల్లో 11,378 ఓట్లు పోలైతే ఈ సారి మాత్రం 44,025 ఓట్లు పోల య్యాయి. గోషామహల్లో 6312లో ఈ సారి 52,402 ఓట్లు లభించాయి. నాంపల్లిలో 6312 ఓట్లు లభించగా ఈసారి 32,120 ఓట్లు లభించాయి. మజ్లాస్కు తగ్గిన ఓటింగ్ మజ్లిస్ పార్టీకి ఓటింగ్ శాతం తగ్గుముఖం పట్టింది. చార్మినార్ నియోజకవర్గంలో గత సాధారణ ఎన్నికల్లో 62, 941 ఓట్లు లభించగా ఈసారి 54,8811 ఓట్లు పడ్డాయి. చంద్రాయణగుట్టలో 80,393 గాను 63,140ఓట్లు, యాకుత్‌పురాలో 66843 గాను ఈ సారి 55857 ఓట్లు, బహుదూర్‌పురాలో 1,06,874 ఓట్లు లభిం చగా 79,606 ఓట్లు దక్కాయి. గోషామహల్లో గత ఎన్నికల్లో పోటీకి దిగలేదు. ఈసారి 18,898 ఓట్లు లభించాయి. నాంపల్లిలో 64,066 ఓట్లు లభించగా ఈ సారి 55,090 ఓట్లు లభించాయి. మలక్‌పేటలో గత ఎన్నికల్లో 58,976 ఓట్లు లభిం చగా ఈ సారి మాత్రం 35,615 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. కాంగ్రెస్ పెరిగిన ఓట్లు కాంగ్రెస్ పార్టీకి కూడా పాతబస్తీలో ఓటు బ్యాంక్ కొంతమేరకు పెరిగింది. సాధారణ ఎన్నికల్లో చార్మినార్ నియోజకవర్గంలో 5598 ఓట్లు లభించగా, ఈసారి 13,320 ఓట్లు పడ్డాయి. చంద్రాయణగుట్టలో 5120 ఓట్లు రాగా ఈ సారి 3707, యాకుత్‌పురాలో 6608 ఓట్లు లభించగా ఈసారి 6911 ఓట్లు లభించాయి. బహుదూర్‌పురాలో 4857 ఓట్లకు రాగా ఈసారి 5195 గోషామహల్లో 45964 ఓట్లు లభించగా ఈసారి 17,234 లభించాయి. నాంపల్లిలో 8818ఓట్లు 4372 ఓట్లు లభించాయి. మలక్‌పేటలో గత ఎన్నికల్లో 8320 ఓట్లు లభించగా 35615 ఓట్లు పోలయ్యాయి. టీడీపీ-బీజేపీకి కూటమిని గతంలో మాదిరిగానే పాతబస్తీ ఓటర్లు తిరస్కరించారు. -
ఖేడ్‌లో వేడెక్కుతున్న రాజకీయం
పెరుగుతున్న నేతల మధ్య మాటలవేడి తూటాల్లా పేలుతున్న ప్రసంగాలు నారాయణఖేడ్ : ఉప ఎన్నిక పోరు వేడెక్కింది. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ వేడి రగులుతోంది. అన్ని పార్టీల నుంచి రాష్ర్టస్థాయి నేతలు నారాయణఖేడ్ బాట పట్టారు. పోలింగ్‌కు వారం రోజుల సమయమే ఉండడంతో అన్ని పార్టీల నాయకులూ ఖేడ్‌లో మకాం పెట్టారు. ఈనెల 13న పోలింగ్ జరగనుంది. 11తో ప్రచార పర్వం ముగుస్తుంది. ఇప్పటివరకు హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేసిన నాయకులు ఆ ఎన్నికలు ముగియడంతో ఖేడ్ ఉప ఎన్నికలో సత్తా చాటేందుకు ఖేడ్ పట్టణంలో అడ్డా బిటాయించారు. అన్ని పార్టీల నాయకులు నారాయణఖేడ్ చేరుకొని ప్రచార వాగ్బాణాలు సంధిస్తున్నారు. జోరుమీదున్న కారు.. ఎమ్మెల్యే కిష్టారెడ్డి హఠాన్మరణంతో నారాయణఖేడ్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించేందుకు సుమారు ఆరునెలల సమయం పట్టింది. ఈలోగా టీఆర్ఎస్ నాయకులు, మంత్రి హరీశ్‌రావు నాలుగైదు నెలల ముందు నుంచే నారాయణఖేడ్‌కు వస్తూ పోతూ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆయన పర్యటనలు, పనుల వేగం పెంచారు. ఇక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగానే ఆయన పూర్తిగా నారాయణఖేడ్‌పైనే దృష్టి సారించారు. వారం రోజులుగా ఆయన నిత్యం 15 గ్రామాల్లో పర్యటిస్తున్నారు. మంత్రితోపాటు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి సైతం ముమ్మర పర్యటనలు చేస్తున్నారు. వీరు నియోజకవర్గంలో సుమారు 30రోజుల నుంచి పర్యటిస్తున్నారు. ఈనెల 10న సీఎం కేసీఆర్ వస్తున్నందున భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ తరఫున ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, చింతా ప్రభాకర్, బాబూమోహన్, జెడ్పీ చైర్మన్ రాజమణి , టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్ తదితరులు పర్యటిస్తున్నారు. రంగంలో కాంగ్రెస్, టీడీపీ అగ్రనేతలు.. కాంగ్రెస్ నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పలు సభల్లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీఎల్పీ నాయకుడు జానారెడ్డి పాల్గొన్నారు. వీరితోపాటు డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డి, మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్, జగ్గారెడ్డి, శశిధర్‌రెడ్డి, గంగారాం పర్యటిస్తున్నారు. టీడీపీ తరఫున రేవంత్‌రెడ్డి పర్యటనలు నిర్వహిస్తున్నారు. అంతకుముందు ఎర్రబెల్లి దయాకర్‌రావు సైతం ప్రచారం నిర్వహించారు. వీరితోపాటు పార్టీకి చెందిన రమరణ, మోత్కుపల్లి నర్సింహులు, వంటేరు ప్రతాపరెడ్డి, శశికళ పర్యటిస్తున్నారు. పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో అన్ని పార్టీల నేతల మాటలు తూటాల్లా పేలుతూ మరింత వేడి పుట్టిస్తున్నాయి. -
మరోసారి గెలిచిన వీరులు!
పార్టీలు ... డివిజన్లలో మార్పు సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన వారిలో ఇరవై మందికి పైగా గత పాలక మండలిలో, మరో పదిమంది 2002లో కార్పొరేటర్లుగా గెలిచిన వారు ఉన్నారు. వీరిలో చాలామంది గతంలో టీడీపీ, కాంగ్రెస్‌లలో ఉండ గా... ప్రస్తుతం అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థులుగా గెలుపొందారు. కొందరు అవే డివిజన్ల లో రెండోసారి గెలుపొందగా... మరికొందరు ఇతర డివిజన్ల నుంచి విజయం సాధించారు. గతంలో ఉన్న కొన్ని డివిజన్లు రద్దు కావడం.. కొన్నింటిలో రిజర్వేషన్ల మార్పుతో పోటీ చేయలేకపోవడం వంటికారణాలతో ఇతర డివిజన్ల నుంచి బరిలో దిగారు. ఎంఐఎం కార్పొరేటర్లు పార్టీ మారనప్పటికీ... కొందరి డివిజన్లు మారాయి. అలాంటి వారిలో మాజీమేయర్ మాజిద్ హుస్సేన్ తదితరులు ఉన్నారు. గత పాలక మం డలిలో బీజేపీ ఫ్లోర్‌లీడర్‌గా పనిచేసిన బంగారి ప్రకా శ్ ఇప్పుడు వేరే డివిజన్ నుంచి గెలుపొం దారు. ఎంఐఎం కోఆప్షన్ సభ్యురాలు అయేషారూబినా ఈసారి అహ్మద్‌నగర్ డివిజన్ నుంచి గెలిచారు. వీరిలో కొందరు మూడోసారి ఎన్నికైన వారు ఉన్నారు. వివరాలిలా ఉన్నాయి. రెండో పర్యాయం కార్పొరేటర్లుగా ఎన్నికైన వారిలో జిట్టా రాజశేఖరరెడ్డి (వనస్థలిపురం), సయ్యద్ మిన్హాజుద్దీన్ (అక్బర్‌బాగ్), మీర్ వాజి ద్ అలీఖాన్, తారాబాయి (ఫలక్‌నుమా), సున్నం రాజ్‌మోహన్ (పురానాపూల్), మహ్మద్ యూసుఫ్ (దత్తాత్రేయనగర్), కె.సత్యనారాయణ (జూబ్లీహిల్స్), జగన్ (జగద్గిరిగుట్ట) ఉన్నారు. -
మనసులు ‘గెలిచారు’
* గ్రేటర్ ఎన్నికల్లో ఏకపక్ష మద్దతు * కేసీఆర్‌పై ప్రజల్లో అచంచల విశ్వాసం * సెటిలర్లదీ గులాబీ బాటే సాక్షి, సిటీ బ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ డివిజన్లో చూసినా టీఆర్ఎస్ తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించడం ప్రజల ఏకపక్ష నిర్ణయానికి దర్పణం పట్టింది. పాతబస్తీలోని కొన్ని ప్రాంతాల్లో మినహా మిగతా అన్నిచోట్లా గులాబీ జెండా రెపరెపలాడింది. నగర ఓటర్లు అంతా ఒక్కవైపే మొగ్గు చూపినట్లు ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. జీహెచ్ఎంసీ చరిత్రలో గతంలో ఎన్నడూ ఇలాంటి ‘తీర్పు’ రాలేదనిరాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, ఎంఐఎంలను పక్కన పెట్టిన గ్రేటర్ ఓటర్లు టీఆర్ఎస్పై అంచంచల విశ్వాసాన్ని చూపించారు. ఈ ఆదరణకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే కారణమన్న అభిప్రాయం వినిపిస్తోంది. 19 నెలల టీఆర్ఎస్ పాలనలో చేపట్టిన పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఉచిత విద్యుత్, ఉచిత నీరు, ఇంటి పన్ను మినహాయింపు, కిలో రూపాయి బియ్యం, వృద్ధాప్య, వికలాంగుల పింఛన్ల పెంపు, రేషన్ కార్డుల వంటివి పేద, మధ్య తరగతి వర్గాలను విశేషంగా ఆకట్టుకున్నాయి. షాదీ ముబారక్, విద్య, ఉపాధి రంగాల్లో 12 శాతం రిజర్వేషన్లు, రుణాల్లో సబ్సిడీ పెంపు వంటివి మైనారిటీలను పార్టీకి బాగా దగ్గర చేశాయని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. నగరంలో కరెంటు కోతలు లేకుండా చూడడంతో పాటు పారిశ్రామిక రంగానికి 24 గంటలూ విద్యుత్ సరఫరా చేసి అన్ని వర్గాల మనసు దోచుకున్నారు. బస్తీల్లోని నిరుపేదలకు రేషన్ కార్డులు, వృద్ధులకు పింఛను రూ.500 నుంచి రూ.1000కి, వికలాంగులకు రూ.1500కు పెంచడం వంటివి బాగా ప్రభావం చూపాయి. ఐటీ, ఇతర పారిశ్రామిక రంగాల్లో సరళీకృత విధానాలతో ఆ వర్గాల్లో కేసీఆర్ నమ్మకాన్ని పెంచారు. సెటిలర్లు టీఆర్ఎస్నే తమ పార్టీగా భావించడం గొప్ప విశేషం. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు గెలిచిన స్థానాల్లో ప్రజలు ఈసారి టీఆర్ఎస్కు పట్టం కట్టారు. కూకట్పల్లి మినహా నగరంలోని అన్ని ప్రాంతాల్లో సెటిలర్లు టీఆర్ఎస్కు మద్దతు పలకడం ఇతర పార్టీలకు మింగుడు పడడం లేదు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన సెటిలర్లు అక్కడ చంద్రబాబు అమలు చేస్తున్న విధానాలను చూసి టీడీపీపై నమ్మకం కోల్పోయారు. కల్లబొల్లి కబుర్లతో కాలక్షేపం చేసే చంద్రబాబు కంటే ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కేసీఆర్నునమ్ముకోవడమే మేలని వారంతా భావించినట్టు ఎన్నికల ఫలితాలు తేటతెల్లం చేస్తున్నాయి. -
99 మ్యాజిక్ ..?
సాక్షి,సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపొందిన సీట్లు 99. ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగింది కూడా 99 హాళ్లలో. అదే విశేషం. జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్లను దాదాపు 25 ప్రాంతాల్లోని 99 హాళ్లలో లెక్కించారు. ఈ విషయం తెలిసిన కొందరు ఇంకా ఎక్కువ హాళ్లలో లెక్కిస్తే ఎక్కువ సీట్లు వచ్చేవేమో అని సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. -
‘దో’స్తానా.. సాగేనా?
టీఆర్ఎస్... మజ్లిస్ల మైత్రిపై సందేహాలు సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీఆర్ఎస్... మిత్రపక్షమైన మజ్లిస్‌తో అధికారం పంచుకుంటుందా? లేక ఒంటరిగా ముందుకు సాగుతుందా? ప్రస్తుతం గ్రేటర్లో ప్రధాన చర్చనీయాంశమిదే. ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మజ్లిస్ పార్టీని మిత్రపక్షంగా పేర్కొంటూ.. మేయర్ పీఠం విషయంలో అవసరమైతే సహకారం అందించేందుకు మజ్లిస్ ఉందని ప్రకటించిన విషయం విదితమే. ఎన్నికల్లో టీఆర్ఎస్కు పూర్తి స్థాయి మెజార్టీ దక్కడంతో మజ్లిస్ పార్టీ మద్దతు అవసరం లేకుండా పోయింది. జీహెచ్ఎంసీలో మజ్లిస్ రెండో అతిపెద్ద పార్టీగా అవతరించినా.. మేయర్ పీఠం కోసం అవసరమయ్యే మెజార్టీ మాత్రం సాధించలేకపోయింది. ఫలితంగా ఆ సీటు విషయమై ఎటువంటి ఆలోచనలూ పార్టీలో కనిపించడం లేదు. సీఎం కేసీఆర్ స్వయంగా మజ్లిస్ తమ మిత్రపక్షమని చెప్పడంతో డిప్యూటీ మేయర్ పదవి ఆ పార్టీకి దక్కవచ్చని రాజకీయ పరిశీలకుల అంచనా. జీహెచ్ఎంసీలో పూర్తి స్థాయి మెజార్టీ దక్కించుకున్న టీఆర్ఎస్.. మజ్లిస్‌తో మైత్రిని కోరని పక్షంలో డిప్యూటీ మేయర్ పదవిని ఆ పార్టీకి ఇవ్వక పోవచ్చన్న ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. సొంత పార్టీ నుంచి విజయం సాధించిన మైనార్టీలకు డిప్యూటీ మేయర్ పదవి కట్టబెట్టే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఫలితాలు వెలువడిన తర్వాత ఇప్పటి వరకు అధికార టీఆర్ఎస్ నుంచి మజ్లిస్ పార్టీ నేతలకు ఎలాంటి మైత్రీ సమాచారం అందకపోవడంతో అనుబంధంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల పక్షానికి మొగ్గు..? జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రెండో అతి పెద్ద పార్టీగా అవతరించిన మజ్లిస్.... రాజకీయ పరిణామాలను బట్టి అవసరమైతే ప్రతిపక్షంలో కూర్చొని...ప్రజల పక్షం వహించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో మెజార్టీ లేకున్నా కాంగ్రెస్‌తో అధికారాన్ని పంచుకొని మూడేళ్ల పాటు పాలన పగ్గాలు చేపట్టింది. ఈసారి టీఆర్ఎస్ ఎవరి మద్దతు లేకున్నా సొంతంగా మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. దీంతో మజ్లిస్ పార్టీతో మైత్రిఅవసరం లేకుండా పోయింది. మేయర్, డిప్యూటీ మేయర్ల ఎంపికలో టీఆర్ఎస్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి తమవైఖరిని వెల్లడించాలనే యోచనలో మజ్లిస్ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. -
ఈ గెలుపు బాధ్యత పెంచింది
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సాధించిన అఖండ విజయం ప్రభుత్వ బాధ్యతను మరింత పెంచిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని ఆరుగురు టీఆర్ఎస్ కార్పొరేటర్లతో కలిసి మారేడ్‌పల్లిలోని తన నివాసంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు నచ్చడం వల్లే గ్రేటర్ ప్రజలు చరిత్రాత్మక తీర్పునిచ్చారని అభిప్రాయపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోను తమ ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేస్తుందన్నారు. నగరానికి నిరంతర విద్యుత్ సరఫరా, మంచినీటి సమస్య పరిష్కారానికి రెండు రిజర్వాయర్ల నిర్మాణాన్ని అతి త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచడంతో పాటు అన్ని సంక్షేమ కార్యక్రమాలూ నిర్విరామంగా కొనసాగిస్తామన్నారు. ఉప ఎన్నికలపై ఏమీ చెప్పలేను తాను స్పీకర్‌కు రాజీనామా సమర్పించానని... దీనిపై ఆయన నిర్ణయం మేరకు చర్యలుంటాయని ఓ ప్రశ్నకు సమాధానంగా తలసాని చెప్పారు. ఉప ఎన్నికల విషయమై తానేమీ చెప్పలేనన్నారు. పక్క రాష్ట్రం వాళ్లకు ఇక్కడేం పని? పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి పదే పదే తానే హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానని చెప్పుకోవడం ఆపేయాలని తలసాని సూచించారు. ఇక్కడేం జరిగినా అరగంటలో వస్తానని చెప్పిన ఆ ముఖ్యమంత్రి తన సొంత రాష్ట్రంలోని తునిలో హింసాత్మక సంఘటనలు జరిగితే మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ హైదరాబాద్‌లోనే తిష్ట వేశారని విమర్శించారు. భవిష్యత్‌లో హైదరాబాద్ అభివృద్ధికి వారి సహకారం అవసరం లేదన్న రీతిలో ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తామే నిధులిస్తున్నామని చెప్పిన బీజేపీ నేతలు ప్రగల్భాలు ఆపాలని హితవు పలికారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారంటూ మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి చేసిన ఆరోపణలపై స్పందిస్తూ... కాంగ్రెస్ దైన్య స్థితికి ఆ పార్టీలో ముఖ్యమంత్రి రేసులో ఉన్న 30 మంది బడా నేతలను నిలదీయాలని సూచించారు. ప్రజా సమస్యలను విస్మరించిన పార్టీలకు ఇదే తరహా ఫలితాలు వస్తాయన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు కొలను లక్ష్మీ బాల్‌రెడ్డి, ఎన్.శేషుకుమారి, ఉప్పాల తరుణి నాయి, కె.హేమలత, అత్తేలి అరుణ శ్రీనివాస్ గౌడ్, ఆకుల రూప తదితరులు పాల్గొన్నారు. -
ఉప ఎన్నికకు వెళ్దామా..
-మున్సిపల్స్ తేలటంతో.. ఉప ఎన్నికపై టీఆర్ఎస్లో చర్చ -సనత్‌నగర్‌లో మంత్రులు కేటీఆర్, తలసాని పర్యటనలు -తలసాని రాజీనామా ఆమోదిస్తే.. అదేబాటలో మరో ముగ్గురు ఎంఎల్ఏలు సాక్షి, సిటీబ్యూరో: మున్సిపల్స్ తెలిసిపోయింది. నగర జనం అధికార టీఆర్ఎస్కు వెంట నడవటంతో అధికార టీఆర్ఎస్లో కొత్త చర్చకు తెర లేచింది. టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించి టీఆర్ఎస్లో చేరిన తలసాని శ్రీనివాసయాదవ్ రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తే ఉప ఎన్నికకు సిద్ధమయ్యే దిశగా ఏర్పాట్లు ముమ్మరం అయ్యాయి. ఆ దిశగానే రాష్ట్ర మంత్రి కేటీఆర్ శనివారం ఉదయం సనత్‌నగర్ నియోజకవర్గంలోని హమాలీబస్తీతోపాటు బేగంపేటలోని ఓల్డ్ కస్టమ్స్బస్తీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని కేటీఆర్ ప్రకటించారు. ఇదిలా ఉంటే గ్రేటర్లో పదహారు శాసనసభ నియోజకవర్గాల్లో స్పష్టమైన ఆధిక్యత కనబరిచిన టీఆర్ఎస్ సనత్‌నగర్‌లో భారీ మెజారిటీ సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పీకర్ వద్ద ఉన్న రాజీనామా అంశం తెరమీదకు వచ్చే అవకాశం ఉందని... దాంతో ఓ వేళ జరిగితే ఇదే స్పూర్తితో పనిచేయాలని క్యాడర్‌కు ఇప్పటికే సాంకేతాలు వెళ్లినట్లు సమాచారం. తలసానితో పాటు..ఆ ముగ్గురివి కూడా ఒక వేళ సనత్‌నగర్ శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక జరిగితే.... దీనితో పాటు కూకట్పల్లి, మహేశ్వరం, కంటోన్మెంట్ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరిగే అవకాశం లేకపోలేదన్న చర్చ టీఆర్ఎస్లోని ముఖ్య నేతల్లో జోరందుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులుగా కూకట్పల్లి నుండి మాధవరం కృష్ణారావు, మహేశ్వరం నుండి తీగల కృష్ణారెడ్డి, కంటోన్మెంట్ నుంచి సాయన్న విజయం సాధించారు. అనంతరం వారు టీఆర్ఎస్లో చేరారు. వీరిలో కృష్ణారావుకు 2014లో ఎంఎల్ఏగా 43186 ఓట్ల మెజారిటీ వస్తే, తాజా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూకట్పల్లి నియోకజవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థులకు వచ్చిన మెజారిటీ 46014 ఓట్లు. అంటే 2014తో పోలిస్తే అదనంగా 2828 ఓట్లు అధికం. ఇదే సనత్‌నగర్‌కు వచ్చే సరికి 2014లో తలసానికి 27,461 ఓట్ల మెజారిటీ రాగా, తాజా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు మొత్తం 59,784 ఓట్లు వచ్చాయి. ఇవి టీడీపీ,బీజేపీ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కంటే సుమారు 25916 ఓట్లు అధికం. ఇదే పరిస్థితి మహేశ్వరం నియోజకవర్గంతో పాటు, కంటోన్మెంట్‌లోనూ కనిపించింది. పార్టీ ఫిరాయింపులు ప్రోత్సాహిస్తున్నామన్న అపవాదు లేకుండా ఉండేందుకు తలసానితో పాటు మిగిలిన చోట్ల కూడా ఉపఎన్నికకు వెళ్లే అవకాశాన్ని టీఆర్ఎస్ సీరియస్‌గానే పరిశీలించే అవకాశం ఉందని ఆ పార్టీ ముఖ్యనేత ఒకరు సూత్రప్రాయంగా అంగీకరించారు. శనివారం రాత్రి సాక్షితో సదరు నేత మాట్లాడుతూ ప్రజలంతా మా పక్షమే ఉన్నారని గ్రేటర్ ఎన్నిక ద్వారా రుజువు అయిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల విమర్శలు ఎందుకు ఎదుర్కోవాలని ప్రశ్నించారు. అందుకే ఉపఎన్నికలకు వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. అయితే తరచూ ఎన్నికలకు తమ అధినేత, సీఎం కేసీఆర్ విముఖత చూపిస్తున్నారని తెలిపారు. అయితే ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని తెలడంతో ... ఉపఎన్నిక అవసరం ఏ మేరకు ఉంటుందన్న అంశాన్నీ కేసీఆర్ పరిశీలనలోకి తీసుకునే ఛాన్స్ ఉందని సదరు టీఆర్ఎస్ ముఖ్యనేత అన్నారు. -
పార్టీ మారి...విజయాన్ని చేరి!
ఎల్బీనగర్: ఎల్బీనగర్ నియోజకవర్గంలో చివరి నిమిషంలో పార్టీలు మారిన కొందరు జంప్ జిలానీలను అనూహ్యంగా విజయలక్ష్మి వరించింది. హయత్‌నగర్ డివిజన్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరి లోకి దిగిన సామ తిరుమల రెడ్డి గతంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో పని చేశారు. బల్దియా ఎన్నికల నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్లోకి దూకి...విజయం సాధించారు. చంపాపేట్, వనస్థలిపురం డివి జన్ల నుంచి సామ రమణారెడ్డి, జిట్టా రాజశేఖర్‌రెడ్డిలు గత బల్దియా ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులుగా గెలుపొందారు. ఈసారి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన అనంతరం మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు అధికార పార్టీ అభ్యర్థులుగా అవే సిట్టింగ్ స్థానాల నుంచి ఎన్నికకావడం విశేషం. గడ్డిఅన్నారం డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా పని చేసిన భవాని ప్రవీణ్ కుమార్ చివరి నిమిషంలో టీఆర్ఎస్లో చేరి కార్పొరేటర్‌గా విజయం సాధించారు. వీరందరూ పార్టీలు మారినా గెలుపొందడంతో సంబరాలు చేసుకుంటున్నారు. -
రేపు రాష్ట్ర కేబినెట్ భేటీ
గ్రేటర్ మేనిఫెస్టో, బడ్జెట్, మంత్రిత్వ శాఖల మార్పులే ఎజెండా! కేటీఆర్‌కు మున్సిపల్ శాఖ అప్పగింతపై నిర్ణయం సాక్షి, హైదరాబాద్: వచ్చే బడ్జెట్ సమావేశాలు, మంత్రిత్వ శాఖల మార్పులు, గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టో ఎజెండాగా రాష్ట్ర మంత్రివర్గం ఆదివారం సమావేశం కానుంది. మధ్యాహ్నం రెండున్నర గంటలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఈ భేటీ జరుగనుంది. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం నేపథ్యంలో ఈ కేబినెట్ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల హైదరాబాద్ ప్రజలకు ఇచ్చిన పలు హామీలు, గ్రేటర్ మేనిఫెస్టోలో పొందుపరిచిన పలు అంశాలకు సంబంధించి ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. మరోవైపు వచ్చే నెలలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీంతో బడ్జెట్ సమావేశాల తేదీలను సైతం ఖరారు చేసే అవకాశాలున్నాయి. ఇక కేబినెట్లో ఒకరిద్దరు మంత్రుల శాఖలను మార్చే అంశంపై చర్చ జరగనుంది. తన దగ్గరున్న మున్సిపల్ శాఖను మంత్రి కేటీఆర్‌కు అప్పగించనున్నట్లు గ్రేటర్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రకటించిన విషయం విదితమే. మంత్రి కేటీఆర్ ఇప్పటికే పంచాయతీరాజ్‌తో పాటు ఐటీ, సాంకేతిక శాఖకు సారథ్యం వహిస్తున్నారు. ఆయనకు మున్సిపల్ శాఖ బాధ్యతలు అప్పగిస్తే.. పంచాయతీరాజ్ శాఖను వేరొకరికి అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు శాఖల మార్పుపై ఈ కేబినెట్ భేటీలో చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే సమావేశం ఎజెండా వివరాలను అధికారికంగా ప్రకటించలేదు. -
గ్రేటర్ ఫలితాలపై నాయకుల స్పందన
ప్రజల తీర్పును శిరసావహిస్తాం.. ‘‘గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తీర్పును శిరసావ హిస్తాం. ఎన్నికల ఫలితాలు విశ్లేషించుకొని ఓటమికి కారణాలను మదింపు చేసుకుంటాం. టీఆర్ఎస్ ప్రభుత్వం, మంత్రులు ఇచ్చిన అలవిగాని వాగ్దానాలు, ప్రజలను భయాందోళనలకు గురి చేయడం, అడుగడుగునా అధికార దుర్వినియోగం వంటివి ఎన్నికల్లో ప్రభావం చూపాయి..’’ - టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఓటమికి కారణాలు సమీక్షిస్తాం ‘‘జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలను స్వాగతిస్తున్నాం. మా ఓటమికి గల కారణాలు సమీక్షిస్తాం. లోతుగా పరిశీలిస్తాం. ఆశించిన ఫలితాలు రాకపోవడం బాధాకరం. ప్రత్యామ్నాయ శక్తిగా ఏర్పడడానికి కృషి చేస్తాం..’’ - కేంద్ర కార్మికశాఖ మంత్రి దత్తాత్రేయ ఓటమిపై విశ్లేషిస్తాం... జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజల తీర్పు బాధాకరమే అయినా దాన్ని శిరసావహిస్తాం. టీఆర్ఎస్ కల్పించిన భ్రమలను, ఆచరణ సాధ్యం కాని హామీలను ప్రజలు నమ్మినట్టుగా కనిపిస్తున్నది. ఈ ఓటమికి కారణాలను అంతర్గతంగా విశ్లేషించుకుంటాం. భవిష్యత్తులో పార్టీని నిర్మిస్తాం. - మల్లు భట్టివిక్రమార్క, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు సవాల్‌పై కేటీఆరే వెనక్కి తగ్గారు.. ‘‘గ్రేటర్ ఎన్నికల్లో విజయం సాధించిన అన్ని పార్టీల అభ్యర్థులకు శుభాకాంక్షలు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి. గ్రేటర్లో టీఆర్ఎస్ వందసీట్లు సాధిస్తే రాజకీయ సన్యాసం చేసే సవాల్‌పై మంత్రి కేటీఆరే వెనక్కి తగ్గారు..’’ - టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్‌రెడ్డి టీఆర్ఎస్ బాధ్యత పెరిగింది ‘‘గ్రేటర్ ఎన్నికల్లో ప్రజాతీర్పు శిరోధార్యం. టీఆర్ఎస్ నాయకులు ఊహించిన దానికన్నా ప్రజలు ఆ పార్టీకి ఎక్కువ సీట్లు కట్టబెట్టారు. టీఆర్ఎస్ బాధ్యత మరింత పెరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి..’’ - సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి టీఆర్ఎస్ను ప్రజలు విశ్వసించారు ‘‘మాటలు ఎక్కువగా చెప్పినా.. కరెంటు, నీరు విషయంలో సీఎం కేసీఆర్ ప్రయత్నాన్ని ప్రజలు విశ్వసించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల గ్రాఫిక్స్ ప్రజలను ఆకర్షించాయి. ప్రతిపక్షాలు బలహీనంగా ఉండడం కూడా వారికి లాభించింది. అందుకే టీఆర్ ఎస్ నాయకులు కూడా ఊహించని విధంగా జీహెచ్ఎంసీలో సీట్లు వచ్చాయి. ఈ విజయ గర్వంతో కళ్లు నెత్తిమీదకు ఎక్కించుకోకుండా బాధ్యతాయుతంగా పనిచేయాలి..’’ - కె. నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి ప్రజాతీర్పును గౌరవిస్తాం ‘‘జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజాతీర్పును గౌరవిస్తున్నాం. గెలిచిన అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు. ప్రజల పక్షాన టీడీపీ పోరాటం కొనసాగుతుంది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు టీఆర్ఎస్ కృషి చేయాలి..’’ - ట్విట్టర్లో నారా లోకేశ్ హామీల అమలుకోసం పోరాడుతాం ‘‘టీఆర్ఎస్కు మా అభినందనలు. వారు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలి. జీహెచ్ఎంసీలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాడుతాం. హామీల అమలుకోసం ప్రజలతో కలసి సంఘటిత ఉద్యమాలను నిర్మిస్తాం..’’ - బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆత్మవిమర్శ చేసుకుంటాం ‘‘టీఆర్ఎస్ ఇచ్చిన హామీల అమలును ప్రజలు విశ్వసించినట్టుగా ఈ తీర్పు కనబడుతోంది. డబుల్ బెడ్రూం సహా ఇతర హామీలను అమలు చేయాలంటూ క్షేత్రస్థాయి నుంచి ఉద్యమాలను నిర్మిస్తాం. ఈ ఎన్నికల ఫలితాలను సమీక్షించుకుని, లోపాలను సరిదిద్దుకుంటాం..’’ - బీజేపీ శాసనసభాపక్ష నేత కె.లక్ష్మణ్ ఇది ప్రభుత్వ విజయం: ఈటల సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ సాధించిన విజయం తమ ప్రభుత్వానిదని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ప్రభుత్వానికి మద్దతు పలికిన నగర ప్రజలకు శుక్రవారం ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పరిపాలన తీరుకు ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదమే ఈ అపూర్వ విజయానికి కారణమని అభిప్రాయపడ్డారు. డిపాజిట్ గల్లంతైన విపక్షాలు ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని హితవు పలికారు. ఊహించిన దానికంటే ఎక్కువే..: డీఎస్ సాక్షి, హైదరాబాద్: ఊహించిన దానికంటే ప్రజల ఆదరణ ఎక్కువగా ఉందని, కేసీఆర్ పాలన పట్ల, హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి తీసుకున్న సంకల్పాన్ని నెరవేర్చేందుకు మద్దతుగా నిలిచారని ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు డీఎస్ పేర్కొన్నారు. ప్రతిపక్షాలు నగర అభివృద్ధికి నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ‘‘ఇది స్పష్టమైన, వన్‌సైడ్ గెలుపు. ఏ పార్టీకీ గతంలో ఇవ్వని ఫలితం ఇది...’’ అని మంత్రి తలసాని పేర్కొన్నారు. ‘ఈ విజయం సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైంది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మారుస్తాననన్న మాటలను ప్రజలు నమ్మి సీఎంపై బాధ్యత పెట్టారు’ అని మంత్రి జగదీశ్వర్‌రెడ్డి వివరించారు. -
టీడీపీకి చావుదెబ్బ
♦ జీహెచ్ఎంసీలో ఉనికి కోల్పోయిన తెలుగుదేశం ♦ 45 స్థానాల నుంచి ఒక్క సీటుకు పరిమితం ♦ ఏమాత్రం ప్రభావం చూపని చంద్రబాబు, లోకేశ్ ప్రచారం ♦ బీజేపీ- టీడీపీ పొత్తు విఫలం.. ♦ 2014లో గెలిచిన 9 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలోనూ దారుణ పరాభవం సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చావు దెబ్బతిన్నది. గ్రేటర్ హైదరాబాద్‌లో మాదే బలం అని గట్టిగా చెప్పుకొన్న ఆ పార్టీ... కేవలం ఒక్క సీటుకే పరిమితమైంది. మొత్తంగా 150 డివిజన్లలో బీజేపీతో పొత్తును కూడా పక్కనపెట్టి ఏకంగా 97 సీట్లలో పోటీ చేసినా... దాదాపుగా ఉనికినే కోల్పోయింది. కూకట్పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్‌బీ కాలనీలో మందడి శ్రీనివాస్‌రావు ఒక్కరే టీడీపీ నుంచి గెలుపొందారు. బీజేపీ పోటీ చేసిన 68 సీట్లలో మూడింట గెలిచి టీడీపీ కన్నా పైచేయి సాధించింది. టీడీపీ-బీజేపీ పొత్తులో ఎక్కువ బలాన్ని ఊహించుకుని బీజేపీకి కేటాయించిన సీట్లలో సైతం చివరి నిమిషంలో తెలుగుదేశం బీ-ఫారాలతో పో టీ చేసిన నేతలు తమతో పాటు బీజేపీ అభ్యర్థుల ఓటమికి కూడా కారణమయ్యారు. ఘోర పరాజయం.. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీడీపీ తెలంగాణవ్యాప్తంగా ఘోర పరాజయం పాలయింది. కానీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 సీట్లలో తొమ్మిదింటిని గెలుచుకుని ఉనికి చాటుకుంది. అయితే టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే... టీడీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీని వీడారు. టీడీపీలో కీలక నేతలుగా ఎదిగిన తలసాని శ్రీనివాస్‌యాదవ్, తీగల కృష్ణారెడ్డి తొలుత పార్టీని వీడగా... మాధవరం కృష్ణారావు, జి.సాయన్న వారిని అనుసరించారు. ఎల్బీ నగర్ నుంచి గెలిచిన ఆర్.కృష్ణయ్య టీడీపీకి దూరంగా ఉంటున్నారు. వీరితో పాటు గ్రేటర్‌లోని 24 నియోజకవర్గాల పరిధిలో గతంలో గెలిచిన 45 మంది కార్పొరేటర్లలో సుమారు 35 మంది మాజీలు, పార్టీ ముఖ్య నాయకులు ఈసారి టీఆర్ఎస్లో చేరి విజయం సాధించడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీని వీడిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలతో పాటు పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల డివిజన్లలోనూ టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. గ్రేటర్లో టీడీపీ ఒకే సీటుకు పడిపోతుందని వారితోపాటు ఇతర పార్టీల నేతలు కూడా ఊహించకపోవడం గమనార్హం. బాబు, లోకేశ్‌ల మాటలను నమ్మని సీమాంధ్రులు 2014 ఎన్నికల్లో టీడీపీ గ్రేటర్ పరిధిలో ఎమ్మెల్యే స్థానాలు సాధించినది సీమాంధ్రుల ఓట్ల కారణంగానే. ఈసారి కూడా ఆ ధీమాతోనే గ్రేటర్లో మెరుగైన సీట్లు సాధిస్తామని టీడీపీ నేతలు భావించారు. అందులో భాగంగానే ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌లు ఎన్నికల్లో ప్రచారం చేశారు. లోకేశ్ దాదాపు ఐదు రోజుల పాటు విస్తృతంగా ప్రచారం చేయగా, చంద్రబాబు శివారు నియోజకవర్గాల్లో రెండు రోజుల పాటు పర్యటించారు. హైదరాబాద్‌ను ప్రపంచపటంలో నిలిపింది తానేనని, గ్రేటర్లో టీడీపీ విజయం చారిత్రక అవసరమని, సీమాంధ్రులకు అండగా ఉంటామని చంద్రబాబు చెప్పిన మాటలను వారు విశ్వసించలేదు. ఇక మంత్రి కె. తారకరామారావు ప్రచారం ముందు చంద్రబాబు తనయుడు లోకేశ్ ప్రచారం వెలవెలబోయింది. చివరికి టీడీపీకి కంచుకోటలుగా భావించిన డివిజన్లలోనూ టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. గ్రేటర్లో ‘దేశం’ మనుగడ ప్రశ్నార్థకమే.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన తలసాని, తీగల, మాధవరం కృష్ణారావు, సాయన్న ఇప్పటికే టీఆర్ఎస్లో చేరారు. మాజీ మంత్రులు సి.కృష్ణయాదవ్ , కె.విజయరామారావులతో పాటు పలు నియోజకవర్గాల ఇన్చార్జులు, ముఖ్య నాయకులు గులాబీ గూటికి చేరారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీలు కూడా టీఆర్ఎస్లో చేరనున్నట్లు ఇప్పటికే ప్రచారం జరిగినా... పార్టీ అధినేత ఇచ్చిన పలు హామీలతో ఆగిపోయారు. ఇక తాజాగా గ్రేటర్ ఫలితాల నేపథ్యంలో వీరందరితో పాటు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ మాజీ నేత వివేకానంద కూడా కారు ఎక్కుతారనే ప్రచారం జరుగుతోంది. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య రాజకీయాలను వీడి బీసీ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు. కాపులను బీసీల్లో చేర్చే ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఆయన ఇప్పటికే కార్యాచరణకు పిలుపిచ్చి కార్యరంగంలోకి దిగారు. ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారారు. మిగతా నియోజకవర్గాల ఇన్చార్జులు, నాయకులు కూడా టీఆర్ఎస్లోకే వెళ్లే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో టీడీపీ మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోయింది. -
వద్దన్నా అంటగట్టారు.. ఆగం చేశారు
టీడీపీతో పొత్తే గుదిబండగా మారిందంటున్న బీజేపీ సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలి తాలు బీజేపీని షాక్‌కు గురిచేశాయి. గ్రేటర్ శివారు ప్రాంతాల్లో టీడీపీ బలంగా ఉందని, పొత్తు వల్ల పరస్పర లాభం ఉంటుందని చేసిన వాదనలన్నీ గాలి మాటలేనని తేలిపోవడంతో ఆ పార్టీ పునరాలోచనలో పడింది. టీడీపీతో పొత్తువల్ల నష్టమే ఉంటుందని వాదించిన నేతల అభిప్రాయాలకు ఈ ఎన్నికలతో బలం చేకూరింది. టీడీపీతో పొత్తు వద్దన్నా కొందరు ‘పెద్ద’ నేతల ఒత్తిడితో భరించాల్సి వచ్చిందని, ఇప్పుడు ఆగమైపోతున్నామని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. పొత్తు లేకుంటే కనీసం కార్యకర్తలకు టికెట్లు ఇవ్వడం ద్వారా చాలా డివి జన్లలో పార్టీ పునాదులైనా మిగిలేవంటున్నారు. ఇటు పొత్తు పెట్టుకుని పార్టీని లేకుండా చేసుకుని, అటు పొత్తున్నా ఓడిపోయి... ఎటూకాని పరిస్థితి వచ్చిందంటున్నారు. పొత్తుల వల్ల పోటీ చేసే సీట్లపై స్పష్టత లేకపోవడం, ఆఖరు నిమిషం వరకు టికెట్ల కేటాయింపులు చేయకపోవడం, రాష్ట్ర నేతల మధ్య సమన్వయం లోపం వంటివాటితో గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ చావుదెబ్బ తినాల్సి వచ్చిందని నేతలు చెబుతున్నారు. కేంద్రంలో అధికారం ఉన్నా గ్రేటర్ హైదరాబాద్‌లో ముఖం చూపించుకోలేని విధంగా నాలుగు సీట్లకే పరిమితం కావడం సిగ్గుపడాల్సిన విషయమని ఆ పార్టీనేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటిదాకా టీడీపీతో పొత్తుకోసం జిల్లాల్లో పార్టీని బలిపెట్టారని.. ఇప్పటికైనా టీడీపీతో పొత్తును వదులుకోవాల్సిందేని జిల్లాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో పార్టీ బలంగా ఉందని, నాయకత్వ పదవులు కూడా హైదరాబాద్ నేతకే కట్టబెడుతూ వచ్చారని అంటున్నారు. బీజేపీకి జిల్లాల్లోనే భవిష్యత్తు ఉందని, ఆ దిశగా ఆత్మవిమర్శ చేసుకోవాలని కోరుతున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలుండీ... హైదరాబాద్‌లో ఒక ఎంపీ, ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ ఉన్నప్పటికీ.. బీజేపీ కేవలం నాలుగు డివిజన్లలోనే విజయం సాధించడంపై పార్టీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేయాలంటే కేంద్ర నిధులు తప్పనిసరని... టీడీపీ-బీజేపీ కూటమిని గెలిపిస్తే ఆ కల నెరవేరుతుందని చేసిన ప్రచారం ఏ మాత్రం ఫలించలేదంటున్నారు. నిజానికి గత గ్రేటర్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసిన బీజేపీ... కాచిగూడ, మెహిదీపట్నం, గౌలిపురా, కుర్మగూడ, గుడిమల్కాపూర్ డివిజన్లలో విజయం సాధించింది. కానీ ఇప్పుడు ఆ స్థానాలు కూడా గ ల్లంతవడం బీజేపీ నేతలను కలవరపెడుతోంది. పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు బి.వెంకటరెడ్డి సతీమణి బి.పద్మ పోటీచేసిన బాగ్ అంబర్‌పేట డివిజన్లో కూడా విజయం సాధించలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. వాస్తవానికి గ్రేటర్లో బీజేపీకి స్పష్టమైన ఓటు బ్యాంకు ఉన్నా... టీడీపీతో పొత్తు కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఒంటరిగా పోటీ చేసి ఉంటే కనీసం రెండంకెల సంఖ్యలోనైనా విజయం సాధించేవారంటున్నారు. అమీర్‌పేట, జూబ్లీహిల్స్ వంటి చోట్ల మిత్రపక్షాల అభ్యర్థులే ఒకరిపై ఒకరు పోటీ పడటంతో ఓట్లు చీలి టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు అవకాశం కల్పించిందని చెబుతున్నారు. -
30 రోజుల్లో మార్చేశారు
అభివృద్ధి నినాదానికే రాజధాని ఓటు విజయవంతమైన టీఆర్ఎస్ ‘మిషన్ -100’ సాక్షి, హైదరాబాద్: ఇరవై నెలల క్రితం జరిగిన సాధారణ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీఆర్ఎస్కు వచ్చిన శాసనసభ స్థానాలు... కేవలం మూడు! కానీ తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏకంగా పదహారు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తిస్థాయిలో పాగా వేసింది! మిగతా ఏడు చోట్లా హోరాహోరీగా పోరాడింది. 100 డివిజన్లలో విజయమే లక్ష్యంగా ‘మిషన్-100’ నినాదంతో బరిలోకి దిగి టీడీపీ, కాంగ్రెస్, బీజేపీల కంచుకోటలను టీఆర్ఎస్ బద్దలు కొట్టడం వెనక పదునైన వ్యూహం, పక్కా కార్యాచరణ దాగున్నాయి. గత సాధారణ ఎన్నికల్లో సరైన క్యాడర్ లేని కారణంగా అనేక స్థానాల్లో ఓటమి పాలైన దృష్ట్యా జీహెచ్ఎంసీ ఎన్నికను టీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు మొదలుకుని పార్టీ నేతలంతా రాజధాని అంతటా సుడిగాలి ప్రచారం చేశారు. ముఖ్యంగా 30 రోజుల వ్యవధిలోనే పరిస్థితిని టీఆర్ఎస్కు పూర్తి అనుకూలంగా మార్చేశారు. ‘హైదరాబాద్ విశ్వనగరం కావాలంటే కేసీఆర్ నాయకత్వాన్ని, ఆయన అభివృద్ధి నినాదాన్ని బలపర్చండి’ అంటూ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో మంత్రులు, 50 మందికి పైగా ప్రజాప్రతినిధులు తదితర నాయకులు ఇంటింటినీ చుట్టేశారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు నుంచే మంత్రులు, ఇతర వ్యూహ బృందాలు డివిజన్ కేంద్రాల్లో బస చేసి, పోలింగ్ బూత్‌లవారీగా ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ వెళ్లారు. బలహీనంగా ఉన్నచోట్ల పార్టీ ముఖ్యులతో ప్రచారసభలు నిర్వహించి, ప్రాంతం, సామాజికవర్గాలవారీగా ప్రత్యేక సమావేశాలు పెట్టి, ‘మమ్మల్ని బలపరచండి’ అంటూ చేసిన విజ్ఞప్తులు కూడా బాగా ఫలించాయి. ఇక గ్రేటర్ ప్రచారాన్నంతా భుజాన వేసుకున్న కేటీఆర్ విద్యార్థులు, ఐటీ, మెడికల్, బిజినెస్, సినిమా తదితర ప్రముఖులు, ప్రొఫెషనల్స్‌తో ముఖాముఖి నిర్వహించి తమ విజన్‌ను పక్కాగా ఆవిష్కరించగలిగారు. ఫలితంగా ఉప్పల్, ఎల్బీ నగర్, శేరిలింగంపల్లి, మల్కాజిగిరి, కూకట్పల్లి తదితర అసెంబ్లీ స్థానాల పరిధిలోని పలు డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులకు ఏకంగా 8 నుండి 15 వేల వరకు మెజారిటీ రావడం విశేషం. -
గులాబీ శ్రేణుల్లో జోష్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ విజయంతో టీఆర్ఎస్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ ఎన్నికల్లో ఊహించినదాని కంటే ఎక్కువ డివిజన్లు గెలుచుకోవడంతో పార్టీ శ్రేణులు సంబరం చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత జరిగిన మెదక్, వరంగల్ లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలు మొదలు.. ఎమ్మెల్యే కోటా, స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల వరకు టీఆర్ఎస్ జైత్రయాత్ర సాగిస్తోంది. అదే క్రమంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ విజయదుందుబి మోగించింది. గడచిన 22 నెలల కాలంలో రాష్ట్రంలో చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి విస్తృతంగా ప్రచారం చేసిన టీఆర్ఎస్.. నగర ప్రజల్లో విశ్వాసాన్ని పెంచగలిగింది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చి దిద్దేందుకు తమ వద్ద ఉన్న ప్రణాళికను సీఎం సహా మంత్రులు, ఇతర నేతలు ప్రజల్లోకి తీసుకుపోగలిగారు. ఐడీహెచ్ కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లపై విసృ్తతంగా ప్రచారం చేశారు. తాము గ్రేటర్ పీఠం దక్కించుకుంటే జంట నగరాల్లోని ప్రజలకు ఇదే తరహాలో డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి ఇస్తామని అధికార పార్టీ హామీ ఇచ్చింది. దీనికితోడు పెన్షన్లు, కుటుంబ సభ్యుల సంఖ్యపై పరిమితి లేకుండా ఆరు కేజీల రేషన్ బియ్యం, ఇళ్లపట్టాలు, ఇళ్ల క్రమబద్ధీకరణ, విద్యుత్, నీటి కుళాయిల బిల్లుల రద్దు వం టివి తమకు కలిసి వ చ్చాయన్న భావన లో టీఆర్ఎస్ నా యకత్వం ఉంది. పకడ్బందీగా.. గ్రేటర్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక మొదలు ప్రచార వ్యూహం దాకా టీఆర్ఎస్ పకడ్బందీ ప్రణాళికతో వ్యవహరించింది. కేబినెట్లోని మంత్రులందరికీ ప్రచార బాధ్యతలు అప్పజెప్పింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆయా జిల్లా సీనియర్ నేతలు డివిజన్ల వారీగా బాధ్యతలు పంచుకుని ప్రజల వద్దకు వెళ్లారు. సీఎం కేసీఆర్ మీట్ ది ప్రెస్ ద్వారా నిర్వహించిన ఇ-క్యాంపేయిన్, ప్రచారం ముగింపునకు ఒకరోజు ముందు నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగం, నగర ప్రజలకు ఇచ్చిన హామీలు తమకు తిరుగులేని మెజారిటీని సాధించి పెట్టాయని నేతలు పేర్కొంటున్నారు. ఫలితాలు వెలువడడం మొదలు కాగానే పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌కు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. టీఆర్ఎస్కు 42 శాతం ఓట్లు గ్రేటర్ ఎన్నికల్లో ఓటర్లు టీఆర్ఎస్ వైపు మొగ్గుచూపారు. శుక్రవారం రాత్రి పొద్దుపోయే వరకు తేల్చిన లెక్కల ప్రకారం.. ఆ పార్టీ సుమారు 14,17,190 (పటాన్చెరు మినహా) ఓట్లతో 42 శాతం ఓట్లను పొందింది. అలాగే 9, 97,011 ఓట్లతో ఎంఐఎం 29 శాతం, టీడీపీ, బీజేపీ కూటమి 7,42,955 ఓట్లతో 18 శాతం, 3,09,231 ఓట్లతో కాంగ్రెస్ 9 శాతం ఓట్లను సాధించాయి. -
ఏపీ గాలిని ఎత్తిచూపిన ‘ఏకవీర’
♦ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు సెటిలర్ల పట్టం ♦ వారికి విశ్వాసం కల్పించిన 19 మాసాల కేసీఆర్ పాలన ♦ ఏపీలో చంద్రబాబు హామీలను తుంగలో తొక్కడమూ కారణమే ♦ ఏపీ ప్రజాభిప్రాయానికి అద్దం పట్టిన సెటిలర్ల ఓటింగ్ సరళి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సెటిలర్లు అధికార టీఆర్ఎస్కు మద్దతుగా నిలిచారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్‌బీ) డివిజన్ ఒక్కటి మినహా సెటిలర్ల ప్రాబల్యమున్న అన్ని డివిజన్లలోనూ టీఆర్ఎస్ జయకేతనం ఎగురవేసింది. సరిగ్గా 22 మాసాల కిత్రం జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పట్టంకట్టిన ఓటర్లు ఈ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీని పూర్తిగా దూరం పెట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గత 19 నెలల కాలంలో తాను తీసుకున్న పలు చర్యల ద్వారా సెటిలర్లకు విశ్వాసం కల్పించడమూ దీనికి కారణం. దీనికి తోడు, ఆంధ్రప్రదేశ్‌లో అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆ తరవాత మాట మార్చడం, హామీలను నెరవేర్చకపోవడం కూడా హైదరాబాద్‌లోని సెటిలర్లు టీఆర్ఎస్కు మద్దతు పలకడానికి కారణంగా నిలిచింది. ఏపీలో నివసిస్తున్న తమవారికి రుణాలు మాఫీ కాకపోవడం, డ్వాక్రా రుణాలను రద్దు చేయకపోవడం, అభివృద్ధి కార్యక్రమాల్లో ఒక వర్గానికే ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలు కూడా సెటిలర్లు టీఆర్ఎస్కు మద్దతిచ్చేందుకు దోహదపడ్డాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏపీ రాజధాని కోసం బలవంతంగా భూములు సేకరించడం, ఒక వర్గం వారికి మేలు చేకూర్చేలా నిర్ణయాలుండటం కూడా హైదరాబాద్‌లోని ఏపీ వాసులకు మింగుడు పడలేదని కూకట్‌పల్లిలో నివసించే చొక్కాపు వెంకటరమణ పేర్కొన్నారు. ‘ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ వర్గానికీ ఇబ్బంది కలిగించడం లేదు. అక్కడ ఏపీలోనేమో అన్ని వర్గాలనూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వ్యవసాయ, డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని వాడవాడనా చెప్పారు. దాంతో ఇక్కడున్న మేం కూడా మావారి శ్రేయస్సు కోసం గత సాధారణ ఎన్నికల్లో ఏపీకి వెళ్లి మరీ ఓట్లేసి వచ్చాం. తీరా అధికారంలోకి వచ్చాక బాబు అన్నీ మర్చిపోయారు’ అని వెంకటరమణ వాపోయారు. రాష్ట్రం విడిపోతే హైదరాబాద్‌లోని సెటిలర్లకు ఇబ్బంది తప్పదన్న ప్రచారం వట్టిదేనని తేలిపోవడం, తమను జాగ్రత్తగా చూసుకుంటామని కేసీఆర్ పదేపదే చెప్పడం వల్ల తాము ఈసారి టీఆర్ఎస్కు మద్దతిచ్చామని మియాపూర్‌కు చెందిన వేములపాటి మురళీకృష్ణ చెప్పారు. స్థానిక ఇంజనీరింగ్ కళాశాలలో పని చేస్తున్న మురళీకృష్ణ గత శాసనసభ ఎన్నికల్లో టీడీపీకి ఓటేశారు. ‘ఏపీలో నా తండ్రి నుంచి సంక్రమించిన భూ మిపై వ్యవసాయ రుణం తీసుకున్నా. దాదాపు రూ.2 లక్షలు మాఫీ అవుతాయని ఆశపడ్డా. తీరా చంద్రబాబు చేసిన మోసం వల్ల వడ్డీతో కలిపి నేను రూ.2.75 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. దాంతో మళ్లీ జీవితంలో బాబుకు ఓటేయకూడదని నిర్ణయించుకున్నా’ అని చెప్పారాయన. అమరావతిలో మౌలిక సదుపాయాలేవీ లేకుండానే, ‘ఉన్నపళంగా అక్కడికి రావాల్సిందే’నంటూ చంద్రబాబు ప్రభుత్వం ఒత్తిడి తేవడాన్ని ఏపీ ప్రభుత్వోద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ‘‘పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఉండే అవకాశముంది. కానీ, చంద్రబాబు మొండి పటుట్దలకు పోయి మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అందుకే టీఆర్ఎస్కు ఓటేశా’’ అని ఖైరతాబాద్ వెంకటరమణ కాలనీలో ఉండే సచివాలయం ఉద్యోగి వెంకటలక్ష్మి చెప్పారు. కాంగ్రెస్‌పై కోపమింకా పోలేదు... టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌కు మద్దతిచ్చేందుకు సెటిలర్ల మనసొప్పలేదు. అందుకు వారు ససేమిరా అన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టిన పాపం కాంగ్రెస్‌దేనన్న ఆగ్రహం వారిలో ఇంకా ఏ మాత్రమూ తగ్గలేదు. రాష్ట్రం విడిపోవడానికి కారణమైన కాం గ్రెస్‌ను తానెప్పటికీ సమర్థించబోనని సోమాజిగూడలోవాసి ఛాయాదేవి చెప్పారు. సచివాలయంలో డిప్యూటీ కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన ఆమె, ఈ ఎన్నికల్లో సెటిలర్లు టీఆర్ఎస్కు మద్దతివ్వడానికి చంద్రబాబుపై వ్యతిరేకతే ప్రధాన కారణమన్నారు. టీఆర్ఎస్ పట్ల సెటిలర్లలో ఎవరికైనా వ్యతిరేకత ఉన్నా వారికి మరో ప్రత్యామ్నాయమంటూ లేకపోయిందని పోస్టల్ శాఖలో పనిచేసే కల్యాణచక్రవర్తి చెప్పారు. వైఎస్సార్ సీపీ పోటీలో లేకపోవడం కూడా టీఆర్ఎస్కు కలి సొచ్చింది. వనస్థలిపురంలో నివాసముండే అనంతపూర్‌కు చెందిన రామ్మూర్తి అదే చెప్పారు. ఈసారి తాను టీఆర్ఎస్కు ఓటేశానని, వైఎస్సార్సీపీ గనక పోటీలో ఉంటే మరోలా ఆలోచించేవాడినని అన్నారాయన. -
కొత్త చరిత్రకు శ్రీకారం
టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా అవతరించింది: కే టీఆర్ ఇది అపూర్వ విజయం ఫలితాలు సీఎం దీక్షాదక్షతకు గీటురాయి బాధ్యత మరింత పెరిగిందని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: ‘‘కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాం. టీఆర్ఎస్ ఇప్పటికే కేసీఆర్ ఆధ్వర్యంలో చరిత్ర తిరగరాసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లభించిన అపూర్వ విజయం ఇది. టీఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించింది. ప్రజల దీవెనలు, హైదరాబాద్‌లోని సబ్బండవర్ణం ఆదరించింది. అందుకే అపూర్వ విజయం సొంత మైంది. మా గెలుపు పరిపూర్ణం. కుల, మత, ప్రాంతాలకు అతీతం గా అభివృద్ధి చేసి ఇదే పరంపరను కొనసాగి స్తాం..’’ అని మంత్రి కె.తారకరామారావు అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, లక్ష్మారెడ్డి, మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు డి.శ్రీనివాస్ లతో కలిసి శుక్రవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ విలేకరులతో మాట్లాడారు. ఈ ఎన్నికల ఫలితాలు పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ దీక్షా దక్షతకు, పనితీరుకు గీటురాయి అని అన్నారు. అపూర్వమైన విజయం అందించిన నగర ప్రజలకు శిరసు వహించి ధన్యవాదాలు తెలుపుతున్నామని, జీహెచ్ఎంసీ మేనిఫెస్టోను అమలు చేస్తామని తెలిపారు. ప్రజల్లో టీఆర్ఎస్కు ఉన్న ఆదరణ, కేసీఆర్‌కు ఉన్న పట్టు రుజువైందని, ఈ ఫలితాలతో తమ బాధ్యత పదింతలైందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు ఇకనైనా మారుతాయని భావిస్తున్నామని అన్నారు. -
ఇది అందరి విజయం
పేదల ఎజెండాయే.. మా ఎజెండా: కేసీఆర్ మేం కష్టపడితే వచ్చింది కాదు.. ప్రజలు ఇష్టపడి ఇచ్చిన విజయమిది అద్భుతమైన విజయం అందించిన ప్రజలకు ధన్యవాదాలు జీహెచ్ఎంసీ మేనిఫెస్టోను తు.చ. తప్పకుండా అమలు చేస్తాం హైదరాబాద్‌ను నిజమైన విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం ప్రతిపక్షాలు ఇప్పటికైనా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రజలు అంత అలవోకగా విజయం ఇవ్వరు. ఇది ప్రజలు ఇష్టపడితే వచ్చిన విజయం. మేం కష్టపడితే వచ్చింది కాదు. మా ఎజెండా.. పేదల ఎజెండా. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా మేం ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోను తూ.చ . తప్పకుండా అమలు చేస్తాం. జంట నగర వాసులకు లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి ఇస్తం. ఈ బడ్జెట్లో కేటాయింపులు జరుపుతం. మేనిఫెస్టోలోని అంశాలన్నీ మాకు ముఖ్యమే. డబుల్‌బెడ్ రూం ఇళ్లకు టాప్ ప్రియారిటీ ఉంటుంది..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. శుక్రవారం రాత్రి జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం తెలంగాణ భవన్లో సీఎం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే... శిరసు వంచి నమస్కరిస్తున్నా.. చరిత్ర తిరగరాస్తూ.. గతంలో ఏ పార్టీకి ఇవ్వనన్ని స్థానాలిచ్చి అద్భుతమైన విజయం చేకూర్చిన జంట నగర ప్రజలందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నా. కార్పొరేటర్లుగా గెలిచిన వారికి అభినందనలు. అందరి కృషి వ ల్లే ఈ విజయం దక్కింది. ఇది ఏ ఒక్కరి విజయం కాదు. గత చరిత్రలో ఏ పార్టీ చూసినా... 52 స్థానాలకు మించి రాలేదు. హైదరాబాద్ నగర చర్రిత చూస్తే ఏ ఒక్క పార్టీ నేరుగా అధికారం చేపట్టలేదు. ఈ ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు. టీఆర్ఎస్ నేతలకు నాది ఒక్కటే విజ్ఞప్తి. ఎట్టి పరిస్థితుల్లో గర్వం, అహంకారం రావొద్దు. ప్రజలు ఎంత గొప్ప విజయం అందిస్తే.. అంత అణకువతో పోవాలి. పార్టీ నాయకత్వం, ప్రభుత్వంపై బాధ్యత చాలా పెరిగింది. నగరంలోని మంత్రులు, ఎమ్మెల్యేలపైనా చాలా బరువు మోపారు. హైదరాబాద్ ప్రజలకు నాది ఒక్కటే వాగ్దానం. ఎంత గొప్ప మెజారిటీ ఇచ్చారో.. అంతే గొప్పగా సేవ చేసి నిరూపించుకుంటాం. ఇక్కడి వాళ్లంతా మా బిడ్డలే.. పోలింగ్ ముగిశాక నన్ను కలిసిన మంత్రులు.. మన నుంచి ప్రజలు ఎక్కువగా రెండు పనులు ఆశిస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా పేద ప్రజలు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఆశిస్తున్నట్లు చెప్పారు. కచ్చితంగా రాబోయే బడ్జెట్లో పెట్టి, లక్ష ఇళ్లు కడతాం. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో 99 శాతం అమలు చేశాం. అదే తరహాలో జీహెచ్ఎంసీ మేనిఫెస్టోను అమలు చేస్తాం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో కొందరు అపోహలు సృష్టించారు. సెటిలర్స్‌ను, ఆంధ్రా వాళ్లను ఏదో చేస్తామని, టీఆర్ఎస్ అంటే ఏదో భూతమని భయపెట్టారు. కొన్ని పిచ్చి ప్రయత్నాలు చేశారు. ఈ ఎన్నికల్లో కూడా చేయని ప్రయత్నం లేదు. హైదరాబాదీలంతా టీఆర్ఎస్ వైపే, కేసీఆర్ వైపే ఉన్నామని పిడికిలెత్తి స్పష్టంచేశారు. హైదరాబాద్‌లో ఉన్న వాళ్లంతా మా బిడ్డలే. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఆంధ్రా ప్రాంత సోదరులు కావొచ్చు వారంద రినీ కడుపులో పెట్టుకుని చూసుకుంటాం. ఏ ప్రభుత్వానికైనా ప్రథమ కర్తవ్యం తన రాష్ట్రంలోని ప్రజలకు రక్షణ, ఉపాధి కల్పించడం. ఆ కర్తవ్యం మా గుండెల్లో ఉంది. నిన్న మొన్నటి వరకు ఎవరికైనా అపోహలు ఉన్నా అవి నేటితో పటా పంచలు అయ్యాయి. 4 వెయ్యి పడకల ఆసుపత్రులు డబుల్ బెడ్రూం ఇళ్లతో పాటు జంట నగరానికి రెండు రిజర్వాయర్లను శరవేగంగా చేపట్టి, తాగునీటి సమస్య, పీడ లేకుండా చేస్తాం. హైదరాబాద్‌లో ఒక్క సెకను కూడా విద్యుత్ పోకుండా అందిస్తం. హైదారబాద్ నెవర్ స్లీప్స్ మాదిరిగా తయారు చేస్తాం. శాంతి భద్రత విషయంలో రాజీ ధోరణి ఉండదు. ఎవరైనా, ఎంతపెద్ద వారైనా కఠినంగా డీల్ చేస్తం. రాజీ పడం. స్కై వేలు, మల్టీ లెవల్ ఫ్లైఓవర్స్, సిగ్నల్ ఫ్రీ జంక్షన్స్, డ్రెయినేజీ వ్యవస్థను బాగు చేయడం వంటి చర్యలు చేపడతాం. హైదరాబాద్‌లో 50 ఏళ్లుగా వింటున్నాం. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల పేర్లే వింటున్నం. మరోటి లేదు. సమైక్య రాష్ట్రంలో పేదలకు ఉచిత వైద్యం అందించే ఆసుపత్రులు ఈ రెండు తప్ప మరోటి లేదు. అవి కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి. కింగ్ కోఠీ ఆసుపత్రిని వెయ్యి పడకలకు అప్‌గ్రేడ్ చేస్తాం. మరో మూడు వెయ్యి పడకల ఆసుపత్రులు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాం. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులను తలదన్నేలా వీటిని నిర్మిస్తం. ఎమ్మారై సహా అన్ని రకాల పరీక్షలను జరిపేలా కార్పొరేట్ ఆసుపత్రులను తలదన్నే రీతిలో ఏడాదిలోనే నిర్మిస్తం. ప్రస్తుతం నగరంలో ఉన్న రెండు ఆసుపత్రుల సంఖ్యను ఆరుకు పెంచుతం. ఉస్మానియా ఆసుపత్రిలో ఉన్న స్థలంలోనే కొత్త భవనాలు నిర్మిస్తం. ఇప్పటికే మొదలు పెట్టిన కూరగాయల మార్కెట్లు, శ్మశాన వాటికలు, బస్‌బేలు, టాయిలెట్లు, కమ్యూనిటీ హాళ్లను నిర్మిస్తం. ‘ట్రూలీ గ్లోబల్ సిటీ-హైదరాబాద్’ అని పేరు వచ్చేలా నిజమైన విశ్వనగరంగా తీర్చి దిద్దడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. ఒక్క చెవి నారాయణను చూడలేను ప్రతిపక్షాలకు చేసే మనవి ఒక్కటే. ప్రజా తీర్పును కోరే సమయంలో అవాకులు చవాకులు కాకుండా, అసంబద్ధమైన వ్యక్తిగత విమర్శలు కాకుండా సరైన పంథాలో, సహేతుక విమర్శలు చేస్తే బావుంటుంది. కానీ చాలా మంది చాలా మాట్లాడారు. ఇవ్వాళ టీఆర్ఎస్ గెలవాల్సిన చారిత్రక అవసరం ఉంది అని హైదరాబాదీలు నిర్ణయం చేశారు. చంద్రబాబు, బీజేపీ నాయకులు ఏవేవో అన్నారు. కాంగ్రెస్ నాయకులైతే ఇష్టమొచ్చిన పద్ధతిలో మాట్లాడారు. వాటన్నింటినీ తోసి పుచ్చి హైదరాబాద్ ప్రజలు కుల, మత, ప్రాంత వివక్ష లేకుండా అద్భుతంగా గెలిపించారు. డంబాచారాలు మాట్లాడే వారికి సింగిల్ డిజిట్ వచ్చే పరిస్థితి వచ్చింది. సీపీఐ నారాయణ నా మిత్రుడు. ఒక్కచెవి నారాయణను చూడలేను. ఆయన జోలికి ఎవరూ వెళ్లొద్దు. రెండు చెవుల నారాయణనే చూడాలి. ఆయన ప్రజా కార్యకర్త. ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. అయన తెరువు ఎవరూ పోవద్దు. నిర్మాణాత్మక సలహాలివ్వండి.. విపక్షాలకు నా విజ్ఞప్తి ఏంటంటే.. నిర్మాణాత్మక సలహాలు ఇవ్వండి. కొత్త రాష్ట్రం మనది. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని పోవాలి. వరంగల్‌లో మీరు అడ్డదిడ్డంగా మాట్లాడితే.. అక్కడి ప్రజలు డిపాజిట్లు రాకుండా చేశారు. హైదరాబాద్‌లో మీరెన్ని అవాకులు మాట్లాడినా.. సింగిల్ డిజిట్‌తో సరిపెట్టారు. ఈ పరిస్థితిని గమనించి, నిర్మాణాత్మకమైన సలహాలు ఇచ్చి ముందుకు సాగుదాం. కొత్త రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చి దిద్దుకుందాం. ప్రజల సేవలో తరిద్దాం. అర్థం పర్థం లేని విమర్శలు, వ్యక్తిగత నిందారోపణలు ఇప్పటికైనా మానుకుని ప్రజలు ఇచ్చిన ఫలితం గమనించండి. వరంగల్ ఫలితం తర్వాతే మారుతారనుకున్నా.. కనీసం హైదరాబాద్ ఫలితం తర్వాతనైనా మీరు మారుతారాని ఆశిస్తున్నాం. కలిసి వెళ్తేనే అభివృద్ధి.. పరేడ్ గ్రౌండ్లో చెప్పిన మాటలను కార్పొరేటర్లు గుండెల్లో పెట్టుకోవాలి. జీహెచ్ఎంసీలో లంచం ఇచ్చే అవసరం లేకుండా ఇంటి పర్మిషన్ తెచ్చుకునేలా పనిచేయాలి. ఆ రోజు వస్తేనే మనం గెలిచిన గెలుపునకు విలువ ఉంటుంది. ఎన్నికల సందర్భంలో కొద్దిపాటి ఆవేశాలకు గురైనా స్పోర్టివ్‌గా తీసుకుని అలాయ్ బలాయ్ తీసుకోవాలి. అందరినీ కలుపుకొని వెళితేనే అభివృద్ధి సాధ్యం. ఎవరి ఒళ్లు వారు దగ్గర పెట్టుకుని వ్యవహరిస్తే మంచిది. పార్టీ నేతలు, గెలిచిన కార్పొరేటర్లతో చర్చించి మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపికపై నిర్ణయం చేస్తం. సెక్షన్ 8ని ప్రజలు తిరస్కరిస్తరు.. ప్రజలు ప్రతిపక్షాలను ఎంత ఘోరంగా తిరస్కరించించారో సెక్షన్ 8ని కూడా అలాగే తిరస్కరిస్తరు. అర్థం లే ని ప్రేలాపనలు మానుకోవాలి. ఎక్స్ అఫీషియో ఆర్డినెన్స్ వేస్ట్ కాదు. భవిష్యత్తులో పనిచేస్తుంది. ఎన్నికను కుదిలించాలనుకుంది కూడా సంస్కరణల కోసమే. తక్కువ సమయంలో అయితే బావుంటదని భావించినం. హైకోర్టు వేరే విధంగా ఆదేశించింది కాబట్టి.. ఆ తీర్పును గౌరవించి ఆ ప్రకారమే ఎన్నికలను నిర్వహించాం. ఎక్స్ అఫీషియో మెంబర్స్ విషయంలో ఇది కొత్త చరిత్ర కాదు. నీలం సంజీవరెడ్డి నుంచి కిరణ్‌కుమార్ రెడ్డి వరకు ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. ఓటింగులో పాల్గొన్నారు. అది ఈరోజు అవసరం లేని పరిస్థితే కనిపిస్తోంది. భవిష్యత్ కోసమైనా సరే చట్టంలో ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని తెచ్చాం. చరిత్ర తిరగరాస్తూ.. గతంలో ఏ పార్టీకి ఇవ్వనన్ని స్థానాలిచ్చి అద్భుతమైన విజయం చేకూర్చిన జంట నగర ప్రజలందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నా. అందరి కృషి వల్లే ఈ విజయం దక్కింది. ఇది ఏ ఒక్కరి విజయం కాదు. గత చరిత్రలో ఏ పార్టీ చూసినా... 52 స్థానాలకు మించి రాలేదు. ఈ ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు. - ముఖ్యమంత్రి కేసీఆర్ -
సూపర్ 'కారు' 99
....గ్రేటర్ తమాషా ఎగిరిన ‘పతంగ్‌లు’... 44 తెలుగుదేశం... ‘ఏకైక’లోకేశం పూచిన ‘పువ్వులు’... నాలుగే సీఎల్పీకి 1.. పీసీసీకి 1... మొత్తం 2 చరిత్రాత్మక విజయం.. విస్పష్ట ప్రజాతీర్పు...! జీరో టు హండ్రెడ్ నినాదంతో తొలిసారి గ్రేటర్ బరిలోకి దిగిన టీఆర్ఎస్ను నగర ప్రజలు భుజాలకెత్తుకున్నారు! గ్రేటర్ కిరీటాన్ని అందించారు. బల్దియా ఎన్నికల చరిత్రలో ఇప్పటిదాకా ఎవరికీ అందని అద్భుత విజయాన్ని కట్టబెట్టారు. తొలిసారి మూడింట రెండొంతుల మెజారిటీని అందించి అధికార పగ్గాలు అప్పజెప్పారు. కారు జోరుకు ప్రతిపక్షాలు కకావికలమయ్యాయి. టీడీపీ-బీజేపీ కూటమి కేవలం ఐదు స్థానాలతో సరిపెట్టుకోగా.. గతంలో ఎంఐఎంతో మేయర్ పీఠాన్ని పంచుకున్న కాంగ్రెస్ రెండు సీట్లకే పరిమితమైంది. ఇక ఎంఐఎం తన పట్టు నిలుపుకుంది. 44 స్థానాల్లో నెగ్గి రెండో స్థానంలో నిలిచింది. గ్రేటర్ ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించిన మంత్రి కేటీఆర్ గులాబీ పార్టీని విజయతీరాలకు చేర్చారు. సాక్షి ప్రత్యేక ప్రతినిధి : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల చరిత్రను తిరగరాసింది. మూడింట రెండొంతుల సీట్లు సాధించి విజయకేతనం ఎగురవేసింది. 2009లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తగిన సంస్థాగత బలం లేదని పోటీ నుంచి తప్పుకున్న టీఆర్ఎస్ ఈసారి ఏకంగా 99 డివిజన్లలో విజయఢంకా మోగించి రికార్డు సృష్టించింది. 2014 సాధారణ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో మూడు శాసనసభ నియోజకవర్గాల్లో మాత్రమే విజయం సాధించిన టీఆర్ఎస్... ఈ ఎన్నికల్లో ఒకటి అర తప్ప అన్ని నియోజకవర్గాల్లో డివిజన్లను తన ఖాతాలో వేసుకుంది. సెటిలర్లు ఎక్కువగా నివసించే కూకట్పల్లి, శేరిలింగంపల్లి, ఎల్బీ నగర్, ఉప్పల్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్ నియోజకవర్గాల్లో మూడు మినహా అన్నింటా ఘన విజయం సాధించింది. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీని కోలుకోలేని రీతిలో మట్టి కరిపించింది. ఆ పార్టీలు ఈ ఎన్నికల్లో సోదిలో కూడా లేకుండా పోయాయి. టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ 4 స్థానాల్లో విజయం సాధించగా, టీడీపీ ఒకే ఒక స్థానంలో గెలుపొందింది. కాంగ్రెస్ అతి కష్టమ్మీద 2 స్థానాలను దక్కించుకుంది. అందులో ఒకటి మెదక్ జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ఉండగా, రెండోది నాచారం డివిజన్. మజ్లిస్ ఇత్తేహదుల్ ముస్లిమిన్ (ఎంఐఎం) 44 డివిజన్లు గెలుచుకుని రెండో స్థానంలో నిలిచింది. ఎంఐఎం ఇప్పుడు జీహెచ్ఎంసీలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించనుంది. టీఆర్ఎస్ తరఫున గ్రేటర్ బరిలో దిగిన రాజకీయ ప్రముఖుల కుటుంబ సభ్యులు ఘనవిజయం సాధించగా.. ఆర్కేపురం నుంచి పోటీ చేసిన మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కోడలు అనితారెడ్డి మాత్రం పరాజయం పాలయ్యారు. ఇక కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆ పార్టీ ప్రముఖ నేతల కుటుంబ సభ్యులు అందరూ ఓటమిపాలయ్యారు. అన్ని వర్గాలను ఆకట్టుకున్న అధికార పార్టీ గ్రేటర్ హైదరాబాద్‌ను చేజిక్కించుకునేందుకు అధికార పార్టీ అన్ని వర్గాల ప్రజల మద్దతు కూడగట్టేందుకు పక్కా వ్యూహాలను రూపొందించుకుని ముందుకు సాగింది. నగరంలో ఉన్న మురికివాడల ప్రజలను దగ్గర చేసుకునేందుకు వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీనిచ్చింది. ఐడీఎల్ కాలనీలో పేదలకు ఇళ్లు నిర్మించి విస్తృతంగా ప్రచారం చేసుకుంది. నగరంలో లక్ష మంది పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చింది. దీంతో పేదలు దాదాపుగా అధికార పార్టీకే మద్దతు పలికారు. ఇక విజయంలో కీలకమైన మధ్య తరగతిని.. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మారుస్తామన్న అధికార పార్టీ నినాదం బాగా ఆకట్టుకుంది. మరిన్ని ఐటీ కంపెనీలను తీసుకురావడం, ఉన్న ఐటీ కంపెనీలు కొత్త క్యాంపస్‌లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇవ్వడం మధ్యతరగతికి సంతోషం కలిగించింది. హైదరాబాద్ విశ్వనగరమైతే పెట్టుబడులు భారీగా వస్తాయని ప్రజలు విశ్వసించారు. తద్వారా జీవన ప్రమాణాలు పెరగడమే కాకుండా ఉద్యోగావకాశాలు విరివిగా లభిస్తాయని యువత గట్టిగా నమ్మింది. దీంతో ఓట్లు వేయడానికి ప్రాధాన్యత ఇచ్చే పేదలు, మధ్య తరగతి వర్గాలు పూర్తిగా టీఆర్ఎస్ వైపు మొగ్గారు. దీంతో ఆ పార్టీ అభ్యర్థులకు కొన్ని చోట్ల పది వేలు, అంతకంటే ఎక్కువగా మెజారిటీ ఓట్లు లభించాయి. ‘‘2014 శాసనసభ ఎన్నికల్లో మేం గ్రేటర్లో 3 స్థానాల్లో గెలిచాం. ఇప్పుడు మాకు ప్రజల మద్దతు ఉంది కాబట్టి 80 డివిజన్ స్థానాలు వస్తాయని గట్టిగా నమ్మాం. కానీ ప్రజలు మమ్మల్ని పూర్తి స్థాయిలో విశ్వసించారు. ఈ విజయంతో మా బాధ్యత మరింతగా పెరిగింది’’ అని టీఆర్ఎస్ గ్రేటర్ ప్రచార రథ సారథి మంత్రి కె.తారకరామారావు ‘సాక్షి’తో అన్నారు. కాంగ్రెస్‌కు ‘నాయకత్వ లేమి’ సమస్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తమ ఘనతే అని చెప్పుకున్నా గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన కాంగ్రెస్.. ఈ ఎన్నికల్లోనూ పత్తా లేకుండా పోయింది. కేవలం 2 డివిజన్లలో మాత్రమే విజయం సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. పార్టీ శ్రేణులను ముందుండి నడిపించే నాయకత్వం లేని కారణంగానే పరాజయాల నుంచి బయటపడలేకపోతోందని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. జీహెచ్ఎంసీలో మొత్తం 150 సీట్లకు ఆ పార్టీ పోటీ చేసినా సీనియర్ నేతలెవ్వరూ అభ్యర్థుల తరఫున ప్రచారానికి వెళ్లలేదు. పార్టీ జాతీయ నేత దిగ్విజయ్‌సింగ్ ప్రచారానికి వచ్చినప్పుడు బయటకు వచ్చిన నేతలు ఆ తర్వాత ప్రచారంలో తిరిగిన దాఖలాలే లేవు. సీఎంకు గవర్నర్ అభినందనలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్కు అభినందనలు వెల్లువెత్తాయి. కేసీఆర్‌కు గవర్నర్ నరసింహన్ ఫోన్లో అభినందనలు తెలి పారు. సినీ నటులు నందమూరి బాల కృష్ణ, కృష్ణ, మోహన్‌బాబు కూడా సీఎంకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. బాబు ప్రచారం చేసినా ‘ఒక్కటే’ గ్రేటర్లో తమ ఉనికి చాటుకోవడానికి ఏపీ సీఎం చంద్రబాబు రెండ్రోజుల పాటు టీడీపీ, బీజేపీ కూటమి తరఫున ప్రచారం చేసినా టీడీపీకి ఒకే ఒక్క సీటు దక్కింది. కూకట్పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్‌బీ డివిజన్‌ను మాత్రమే ఆ పార్టీ గెలుచుకుంది. టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎల్బీనగర్, ఉప్ప ల్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్‌తో పాటు ఆ పార్టీకి కంచుకోటగా భావించే కూకట్పల్లి నియోజకవర్గంలో బాబు విస్తృతంగా పర్యటించారు. ఆయన కుమారుడు లోకేశ్ హైదరాబాద్ అభివృద్ధికి తన తాత, తండ్రి తోడ్పడ్డారని ఎంత గా చెప్పినా ఓటర్లు పట్టించుకోలేదు. అన్నిచోట్లా క్లీన్‌స్వీప్.. గ్రేటర్ పరిధిలోని ఎల్బీ నగర్, ఉప్పల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ స్వీప్ చేసింది. ఈ నియోజకవర్గాల్లోని అన్ని డివిజన్లలో ఆ పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీ సాధించారు. కూకట్పల్లి నియోజకవర్గంలో ఒకటి మినహా అన్ని డివిజన్లను అధికార పార్టీ గెలుచుకుంది. వీటిలో మల్కాజిగిరి మినహా మిగిలిన నియోజకవర్గాల్లో టీడీపీ, బీజేపీ శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న రాజేంద్రనగర్‌లో ఆ పార్టీకి ఒక్క డివిజన్ కూడా దక్కలేదు. సెంట్రల్ సిటీలోనూ ఇదే పరిస్థితి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న అంబర్‌పేటలో ఆ పార్టీకి ఒక్క సీటూ దక్కలేదు. అంబర్‌పేటలో అన్ని డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. బీజేపీ శాసనసభాపక్షం నేత లక్ష్మణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ముషీరాబాద్‌లోనూ బీజేపీకి పరాజయమే ఎదురైంది. ఈ నియోజకవర్గంలో ఎంఐఎం ఒక్క డివిజన్లో విజయం సాధించగా.. మిగిలిన అన్ని చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, సికింద్రాబాద్‌తో పాటు ఒక్క డివిజన్ ఉన్న కంటోన్మెంట్ నియోజకవర్గంలోనూ టీఆర్ఎస్ జయ కేతనం ఎగురవేసింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 2, ముషీరాబాద్ నియోజవర్గంలో ఒక డివిజన్లో ఎంఐఎం గెలవడం మినహా సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గాన్ని క్లీన్‌స్వీప్ చేసింది. ఇక హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పాతబస్తీలో ఎంఐఎం మరోసారి తన ఉనికిని చాటుకుంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడు నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. పార్టీలు పోటీ చేసిన, గెలిచిన స్థానాలు.. పార్టీ పోటీ గెలుపు టీఆర్ఎస్ 150 99 ఎంఐఎం 60 44 బీజేపీ 66 4 కాంగ్రెస్ 149 2 టీడీపీ 95 1 బీఎస్పీ 55 0 సీపీఐ 21 0 సీపీఎం 22 0 లోక్‌సత్తా 26 0 రిజిస్టర్డ్ పార్టీలు 49 0 స్వతంత్రులు 640 0 ‘గ్రేటర్’ వివరాలు.. జీహెచ్ఎంసీ విస్తీర్ణం 625 చ.కి.మీ. మొత్తం ఓటర్లు 74,24,080 పురుషులు 39,69, 007 మహిళలు 34,53,910 ఇతరులు 1,163 మొత్తం వార్డులు 150 -
అన్నింటా అదేజోరు!
సనత్‌నగర్... సీన్ రివర్స్ సనత్‌నగర్: సనత్‌నగర్ నియోజకవర్గంలో సీన్ రివర్స్ అరుుంది. గత అసెంబ్లీ ఎన్నికలకు పూర్తి భిన్నంగా ఓటర్లు తీర్పునిచ్చారు. కారు స్పీడ్‌కు సైకిల్ తుక్కైంది. ఐదు డివిజన్లలో గులాబీ జెండా రెపరెపలాడింది. నియోజకవర్గం సెటిలర్స్‌కు పెట్టింది పేరు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ను కాదని టీడీపీకి అత్యధిక మెజార్టీ తెచ్చింది కూడా సెటిలర్స్ ఓటింగే. ప్రస్తుత ఎన్నికల్లో సెటిలర్స్ ఎక్కువగా ఉండే జెక్కాలనీ, సుందర్‌నగర్, మోడల్‌కాలనీ, ఎస్ఆర్టీ, ఎస్ఆర్నగర్ సీ-టైప్ క్వార్టర్స్, అమీర్‌పేట్ డివిజన్లోని కుందన్‌బాగ్, శాంతిబాగ్, ఎస్ఆర్నగర్, బన్సీలాల్‌పేట్ డివిజన్లోని పద్మారావునగర్ తదితర ప్రాంతాల ప్రజలు కారుకు జై కొట్టారు. సత్తా చాటిన తలసాని.. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన తలసాని శ్రీనివాస్‌యాదవ్ 27,455 మెజార్టీతో గెలుపొందారు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్లో చేరగంతో పరిస్థితి పూర్తిగా వూరి పోరుుంది. అసెంబ్లీ ఎన్నికల్లో వుంత్రి తలసానికి వచ్చిన మెజార్టీని మించి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అన్ని డివిజన్ల నుంచి మెజార్టీ నమోదు కావడం విశేషం. నియోజకవర్గంలో సనత్‌నగర్, అమీర్‌పేట్, బేగంపేట్, రాంగోపాల్‌పేట్, బన్సీలాల్‌పేట్ డివిజన్లను కలుపుకుని మొత్తం టీఆర్ఎస్కు 30,563 ఓట్ల మెజార్టీ వచ్చింది. కూనకు షాక్... గత అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన సనత్‌నగర్ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి కూన వెంకటేష్‌గౌడ్ బేగంపేట్ డివిజన్ నుంచి తన సతీమణి కూన సత్యకళను కార్పొరేటర్ అభ్యర్థిగా బరిలోకి దించినా ఫలితం లేకపోయింది. ఎమ్మెల్యేగా పోటీ చేసిన కూన తన సతీమణిని గెలిపించుకోలేక పోవడంతో కార్యకర్తలు డైలామాలో పడ్డారు. కార్వాన్.. ఎంఐఎందే కార్వాన్.. కార్వాన్లో ఎంఐఎం తన పట్టు నిలబెట్టుకుంది. నియోజకవర్గ పరిధిలోని ఏడు డివిజన్లలో ఎంఐఎం ఐదు డివిజన్లలో పోటీచేయగా అన్నిం టిలోనూ విజయం సాధించింది. అధికార టీఆర్ఎస్ పార్టీ 2 డివిజన్లలో విజయం సాధించింది. 2014 సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్కు 10760 ఓట్లు పడగా, కాంగ్రెస్ 6512 కాగా టీడీపీ, బీజేపీకి 48614, ఎంఐఎంకు 86391 ఓట్లు వచ్చాయి. కూకట్పల్లి... కుప్పకూలిన ‘పచ్చ’కోట టీఆర్ఎస్కు ఎక్కడా పోటీ ఇవ్వని టీడీపీ సిటీబ్యూరో: కూకట్పల్లి నియోజకవర్గంలో టీడీపీకి కోలుకోలేని దెబ్బతగిలింది. మొదటి నుంచి టీడీపీకి పెట్టనికోటగా నిలిచిన ఈ నియోజకవర్గం గ్రేటర్ ఎన్నికల్లో కుదేలైంది. మొదటి నుంచి కనీసం నాలుగు డిజన్లనైనా గెలుచుకోవాలని ఆశపడ్డ టీడీపీ అడ్రస్ లేకుండా పోయింది. మొత్తం 8 డివిజన్లకుగాను ఏడింటిని గులాబీ తన ఖాతాలో వేసుకోగా, చావుతప్పి కన్నులొట్ట బోయినట్లుగా కేపీహెచ్‌బీ డివిజన్లో మాత్రమే టీడీపీ గెలుపొందగలిగింది. గ్రేటర్ మొత్తంలో టీడీపీ గెలుచుకున్న స్థానం ఇదొక్కటే కావడం గమనార్హం. ఏపీ సీఎం చంద్ర బాబుతో సహా ఆయన తనయుడు లోకేష్‌బాబు, టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి కాలికి బలపం కట్టుకుని తిరిగినా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. 2014 సాధార ణ ఎన్నికల ఫలితాలతో పోల్చుకుంటే ఇక్కడ టీఆర్ఎస్ బాగా పుంజుకుంది. గత ఎన్నికల్లో 56,688 ఓట్లు రాగా.. తాజా గ్రేటర్ ఫలితాల్లో రెండింతలు ఎక్కువ ఓట్లను సాధించింది. స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు టీఆర్ఎస్లో చేరడం, ఆ తర్వాత అభివృద్ధి పనులు పుంజుకోవడం ఆ పార్టీకి కలిసొచ్చిందని చెప్పవచ్చు. హైదర్నగర్ను దత్తత తీసుకున్న మంత్రి కేటీఆర్ ఆ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. నియోజకవర్గంలో మెజారిటీ వర్గమైన సెటిలర్స్ ఓట్లను సాధించేందుకు టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. గత సాధారణ ఎన్నికల సమయంలో టీడీపీకి 99,874 ఓట్లు రాగా.. ఇప్పుడు 46,256 ఓట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ సోయిలో లేకుండా పోయింది. నియోజకవర్గంలో ఏ అభ్యర్థికి కూడా డిపాజిట్లూ దక్కని దుస్థితి ఎదురైంది. పటాన్చెరు.. విలక్షణ తీర్పు పటాన్చెరులో కాంగ్రెస్.. రామచంద్రాపురం, భారతీనగర్‌లో టీఆర్ఎస్ హవా రామచంద్రాపురం: గ్రేటర్ ఎన్నికల్లో పటాన్చెరు నియోజక వర్గం పరిధిలో ఓటర్లు విలక్షణమైన తీర్పునిచ్చారు. పటాన్చెరు డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి శంకర్ యాదవ్ తన సమీప టీఆర్ఎస్ అభ్యర్థి ఆర్.కుమార్యాదవ్పై 1,388 ఓట్ల తేడాతో విజయం సాధించారు. రామచంద్రాపురం డివిజన్లో ఎనిమిది మంది పోటీ చేశారు. 19813 ఓట్లు పోల్ కాగా టీఆర్ఎస్ అభ్యర్థి తొంట అంజయ్య 5,591 ఓట్ల మెజారిటీతో టీడీపీ తన సమీప అభ్యర్థి కరికె సత్యనారాయణ యాదవ్‌పై విజయం సాధించారు. భారతీనగర్ డివిజన్లో మొత్తం తొమ్మిది మంది పోటీ పడగా, 19,490 ఓట్లు పోలయ్యాయి. కాగా టీఆర్ఎస్ అభ్యర్థి సింధూ ఆదర్శ్‌రెడ్డి తన సమీప బీజేీపీ అభ్యర్థి గోదావరిపై 168 ఓట్లతో విజయం సాధించారు. భారతీనగర్‌లో కాంగ్రెస్‌తో పాటు మిగతా వారంతా డిపాజిట్లు కోల్పోయారు. ఉప్పల్... కారు ఊపేసింది ఉప్పల్ నియోజకవర్గంలోని 10 డివిజన్లలో ఒక్క నాచారం మినహా మిగతా 9 డివిజన్లలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. కాప్రా, ఏఎస్‌రావునగర్, చర్లపల్లి, మీర్పేట్ హెచ్‌బీ కాలనీ, చిలుకానగర్, హబ్సిగూడ, రామంతాపూర్, ఉప్పల్, మల్లాపూర్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులు భారీ మెజారిటీతో విజయం సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు 68,226 ఓట్లు నమోదు కాగా, ఈ గ్రేటర్ ఎన్నికల్లో లక్షకు పైగా ఓట్లు వచ్చాయి. ఉప్పల్ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్ధి మేకల అనలారెడ్డి సమీప ప్రత్యర్ధి రజిత పరమేశ్వర్‌రెడ్డి నుంచి గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. అనలారెడ్డికి 10,510 ఓట్లు లభించగా, రజితకు 9,364 ఓట్లు లభించాయి. కేవలం 1146 ఓట్ల తేడాతో అధికార పార్టీ అభ్యర్ధి విజయం సాధించారు. మిగతా చోట్ల ప్రత్యర్ధులపైన భారీ మెజారిటీతోనే టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. మహేశ్వరం... తీగలకు ఎదురుదెబ్బ దిల్సుఖ్నగర్: మహేశ్వరం నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. ఆర్కేపురం డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన కోడలు డాక్టర్ తీగల అనితారెడ్డి బీజేపీ అభ్యర్థి రాధా ధీరజ్‌రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. సరూర్‌నగర్ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి పారుపల్లి అనితా దయాకర్‌రెడ్డి తన సమీప టీడీపీ అభ్యర్థి ఆకుల అఖిలపై గెలుపొందడంతో పరువు దక్కినట్లయ్యింది. 2009 బల్దియా ఎన్నికల్లో ఆర్.కె.పురం, సరూర్‌నగర్ డివిజన్లను టీడీపీ గెలుచుకోగా ఈసారి ఘోరంగా ఓటమి పాలైంది. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, రేవంత్‌రెడ్డి, మంత్రి రావెల కిషోర్‌బాబు తదితరులు ప్రచారం చేసినా ఎలాంటి ఫలితం కనిపించలేదు. గత సార్వత్రిక ఎన్నికల్లో రెండు డివిజన్లలో టీడీపీ హవా కొనసాగింది. ప్రస్తుత ఎన్నికల్లో ఒక డివిజన్ అధికార పార్టీకి దక్కగా మరో డివిజన్లో కమలం వికసించింది.2014 సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్కు 42,517 ఓట్లు రాగా..ప్రస్తుత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి 22,739 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఓట్లు తగ్గినా ఒక డివిజన్లో పార్టీ అభ్యర్థి గెలుపొందడం విశేషం. రాజేంద్రనగర్... మట్టికరిచిన టీడీపీ సిటీబ్యూరో: రాజేంద్రనగర్ నియోజక వర్గంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా మట్టి కరిచింది. నియోజవర్గ పరిధిలోని ఐదు డివిజన్లలో టీఆర్ఎస్ మూడు, ఎంఐఎం రెండింటిలో విజయం సాధించాయి. దీంతో సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ప్రాబల్యం కోల్పోయారు. టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధపడిన ఆయన చివరి నిమిషంలో వెనకంజ వేశారు. దీన్ని గమనించిన ఓటర్లు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెప్పి, టీఆర్ఎస్కే పట్టం కట్టారు. గతంలో ఎన్నికల్లో కాంగ్రెస్ ఒకటి, టీడీపీ ఒకటి, ఎంఐఎం రెండు స్థానాలు గెలుచుకొన్నాయి. ఈసారి ఎంఐఎం రెండు స్థానాలు గెలుచుకొని తమ పట్టు నిలబెట్టుకుంది. ప్రస్తుత ఎన్నికల్లో టీఆర్ఎస్ 47518 ఓట్లు, టీడీపీ 22900, కాంగ్రెస్ 17788, ఎంఐఎం 34110 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ గణనీయంగా పుంజుకోగా, టీడీపీ ఘోరంగా దెబ్బతింది. ఎంఐఎం రెండు స్థానాల్లో గెలిచినా భారీగా ఓట్లను కోల్పోయి ప్రాభల్యాన్ని తగ్గించుకుంది. కుత్బుల్లాపూర్... సైకిల్ అడ్రస్ గల్లంతు సిటీబ్యూరో: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఫలితాలు తారుమారయ్యాయి. గత సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిపై 40 వేల ఓట్ల మెజారిటీతో టీడీపీ ఎమ్మెల్యే వివేకానంద గెలుపొందగా, తాజా గ్రేటర్ ఫలితాల్లో టీడీపీ అడ్రస్ గల్లంతైంది. సాధారణ ఎన్నికల్లో 1.14 లక్షల ఓట్లు సాధించిన టీడీపీ ప్రస్తుతం 53,641 ఓట్లకు పడిపోయింది. నియోజకవర్గ పరిధిలోని 8 డివిజన్లలోనూ టీఆర్ఎస్ క్లీన్‌స్వీప్ చేసింది. పోలైన ఓట్లలో 47 శాతానికి పైగా టీఆర్ఎస్ ఖాతాలోనే పడడం విశేషం. సాధారణ ఎన్నికల్లో వచ్చిన 40 వేల ఓట్లు సాధించిన కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో మూడో వంతు సాధించడమే గగనంగా మారింది. టీడీపీ తరఫున పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు సహా అతిరథులు ప్రచారం చేసినా ఈ ప్రాంతంలో అధికంగా ఉన్న సెటిలర్లను తమ వైపు తిప్పుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారు. స్థానిక ఎమ్మెల్యే వ్యవహార శైలి, ఒంటెత్తు పోకడ కూడా పార్టీ అభ్యర్థుల కొంప ముంచిందని పార్టీ వర్గాలు సైతం అంగీకరిస్తున్నాయి. పార్టీ నుంచి వలసలను ఆయన ఆపలేకపోయారని వారు ఆరోపిస్తున్నారు. గెలిచే సత్తా ఉన్న అభ్యర్థులకు టికెట్లు ఇవ్వకపోవడంతో వారు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుని గ్రేటర్ ఎన్నికల్లో విజయం సాధించడం విశేషం. -
ఆద్యంతం...ఆసక్తికరం
కూకట్పల్లి: కూకట్పల్లి సర్కిల్లో టీడీపీకి పెట్టని కోటలాంటి హైదర్‌నగర్ డివిజన్లో టీఆర్ఎస్ విజయబావుటా ఎగురవేసింది. ఎన్నికల లెక్కింపు ఆద్యంతం ఆసక్తికరంగా మారింది. ఇక్కడ గతంలో అనేకసార్లు టీడీపీ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈసారి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఇటుదృష్టి సారించడం తో పాటు మంత్రి కేటీఆర్ ఈ డివి జన్ను దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు. దీంతోప్రభుత్వానికి అనుకూలంగా ఓట్లు పడినట్టు చర్చించుకుం టున్నా రు. ఓట్ల లెక్కింపు సందర్భం గా అన్ని రౌండ్లలోనూ టీడీపీకి ఆధిక్యం కని పించగా...కేవలం రెండో రౌండ్లోనే టీఆర్ఎస్కు 1,372 ఓట్ల మెజారిటీ వచ్చింది. దీంతో ఆ పార్టీ అభ్యర్ధి 438 ఓట్లు తేడాతో విజయం సాధించారు. మొదటి రౌండ్లో టీడీపీకి 433 ఓట్ల మెజారిటీ రాగా.. రెండో రౌండ్లో టీఆర్ఎస్కు 1,372 మెజారిటీ వచ్చిం ది. మూడో రౌండ్ లో టీడీపీకి 54, నాలుగో రౌండ్లో 304 ఓట్ల మెజారిటీ కనిపించింది. ఐదో రౌండ్లో టీడీపీకి 62 ఓట్లు ఆధిక్యం వచ్చింది. నాలుగు రౌండ్లలో కలిపి తెలుగుదేశం అభ్యర్థికి 934 ఓట్లు మాత్రమే మెజారిటీ వచ్చింది. దీంతో రెండో రౌండ్లో వచ్చిన 1372 ఓట్లు టీఆర్ఎస్ను విజ యం వైపు నడిపించాయి. టీడీపీ టికెట్ ఆశించి ఇండిపెండెంట్‌గా రంగంలోకి దిగిన కడియాల సుబ్బారావుకు 459 ఓట్లు వచ్చాయి. ఈ చీలికే తెలుగుదేశం విజయావకాశాలను దెబ్బ తీసిందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. టీడీ పీ అభ్యర్థుల ఎంపికలో చివరి వరకూ కొనసాగిన ఉత్కంఠ కొంపముంచిందని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. టీఆర్ఎస్ను కాపాడిన మురికివాడలు హైదర్‌నగర్ డివిజన్లో టీఆర్ఎస్కు అన్ని ప్రాంతాల్లో ఓట్లు తగ్గిపోగా... కేవ లం హైదర్ నగర్, నందమూరి నగర్, కృష్ణవేణి నగర్, శంశీగూడ ప్రాంతాలలో 1372 ఓట్ల మెజారిటీ రావడంతో విజయం సాధించింది. ఈ ప్రాంతంలో ప్రజలు ఏకపక్షంగా టీఆర్ఎస్కు ఓట్లు వేసినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. -
ప్రశాంతంగా రీ పోలింగ్
47.10 శాతం నమోదు చార్మినార్: పాతబస్తీలోని పురానాపూల్ డివిజన్లో శుక్రవారం రీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుం డా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. నగర సంయుక్త పోలీసు కమిషనర్ శివ ప్రసా ద్ స్వయంగా శాంతి భద్రతలను పర్యవేక్షించారు. శుక్రవారం ఉదయం 7గంటలకు ప్రారంభమైన రీ పోలింగ్ సాయంత్రం 5 వరకూ కొనసాగింది. అభ్యర్థులు స్వయంగా పోలింగ్ కేంద్రాలను సందర్శించి... సరళిని పరిశీలించారు. వివిధ ప్రాం తాల ప్రజలు ఉత్సాహంగా ఓటు హక్కును విని యోగించుకున్నారు. ఈ నెల 2న 54.08 శాతం ఓట్లు పోలవ్వగా...శుక్రవారం రీ పోలింగ్‌లో 47.10 శాతం పోలయ్యాయి. -
మారిన రాతలు
అప్పుడు మేయర్లు.. ఇప్పుడు కార్పొరేటర్లు మాజీ మేయర్ కార్తీక రెడ్డి ఓటమి మళ్లీ గెలిచిన బంగారి ప్రకాశ్ సిటీబ్యూరో: గత పాలక మండలిలో మేయర్లుగా... వివిధ పార్టీల ఫ్లోర్‌లీడర్లుగా వ్యవహరించిన వారిలో కొంద రు ఓటమి పాలైతే... మరికొందరు విజయం సాధిం చారు. గతంలో కాంగ్రెస్, ఎంఐఎం ఒప్పందం మేరకు బండ కార్తీక రెడ్డి, మాజిద్ హుస్సేన్‌లు మేయర్లుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. గతంలో తాను గెలి చిన తార్నాక డివిజన్ నుంచే మరోసారి పోటీ చేసిన కార్తీకరెడ్డి ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పట్లో అహ్మద్ నగర్ నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికైన మాజిద్ హుస్సేన్ ఈసారి మెహదీపట్నం నుంచి గెలిచారు. ఇంతకుముందు బీజేపీ ఫ్లోర్‌లీడర్‌గా వ్యవహరించిన బంగారి ప్రకాశ్‌కు ఈసారి ఆ పార్టీ టికెట్ లభించలేదు. దీంతో నామినేషన్లకు ముందు టీఆర్ఎస్లో చేరారు. ఆ పార్టీ టికెట్‌పై గుడిమల్కాపూర్ నుంచి గెలిచారు. గతంలో ఆయన మెహదీపట్నం నుంచి గెలుపొందా రు. కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ కాలేరు వెంకటేశ్, టీడీపీ ఫ్లోర్‌లీడర్ సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డిలు టీఆర్ఎస్లో చేరారు. గతంలో తాము పోటీ చేసిన స్థానాలు మహిళలకు రిజ ర్వు కావడంతో వారి సతీమణులను బరిలో దింపారు. టీఆర్ఎస్ టికెట్‌పై వారిద్దరూ గెలిచారు. సింగిరెడ్డి భార్య స్వర్ణలతా రెడ్డి సైదాబాద్ నుంచి... కాలేరు వెంక టేశ్ భార్య పద్మ గోల్నాక నుంచి ఎన్నిక య్యారు. నూరు శాతం ట్యాంపరింగ్ చేశారు: బండ కార్తీకరెడ్డి గ్రేటర్లో వంద సీట్లు గెలుస్తామని చెప్పి.. దాన్ని సాధించేందుకు టీఆర్ఎస్ నేతలు నగరమంతా ఈవీఎంల ట్యాంపరింగ్ చేశారని బండ కార్తీకరెడ్డి ఆరోపించారు. గతంలో మేయర్ పీఠాన్ని అధిష్ఠించిన కార్తీకరెడ్డి.. ఈసారి తార్నాక డివిజన్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. న్యాయంగా ఓట్ల లెక్కింపు జరిగితే టీఆర్ఎస్కు వంద సీట్లు వచ్చేంత సీన్ లేదని... తమ పంతం నెగ్గించుకునేందుకే ట్యాంపరింగ్ చేశారని ఆమె ఆరోపించారు. ఫలితాల అనంతరం గద్గద స్వరంతో మాట్లాడుతూ... ‘ఎన్నో కాలనీల వాళ్లు నాకు ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చారు. అయినప్పటికీ ఏ బూత్లోనూ నా అంచనా మేరకు ఓట్లు రాలేదు’ అన్నారు. మరో వార్డు అడ్డగుట్టలోని 24వ నెంబరు బూత్‌లో 566 ఓట్లు మాత్రమే పోల్ కాగా... తొలుత టీఆర్ఎస్కు 932 ఓట్లు వచ్చినట్లు చెప్పారన్నారు. అరచి గోల చేస్తే మళ్లీ ఈవీఎం బటన్లు నొక్కి... టీఆర్ఎస్కు 399, కాంగ్రెస్‌కు 95, 11 బీఎస్పీకి, ఇతరర పార్టీలకు మరికొన్ని వచ్చినట్టు చెప్పారని తెలిపారు. అన్నీ కలిపితే పోలైన ఓట్ల కంటే ఎక్కువే ఉన్నాయని అన్నారు. నగరమంతా ట్యాంపరింగ్ జరిగిందనేందుకు ఇదే నిదర్శనమని ఆమె చెప్పా రు. గత ఎన్నికల్లో 52 సీట్లు వచ్చిన కాంగ్రెస్‌కు ఈసారి కనీసం 50 రాగలవని అంచనా వేశామని... ట్యాంపరింగ్ వల్లే తమ పార్టీకి సీట్లు రాలేదన్నారు. -
ఒకే ఒక్కరు..గెలిచిందిలా!
యువజనం వెంట రాగా.. కలిసివచ్చిన సానుభూతి నాచారంలో జెండా ఎగరేసిన కాంగ్రెస్ అభ్యర్థిని సిటీబ్యూరో: గత ఎన్నికల్లో ఓడిపోయారన్న సానుభూతి.. డివిజన్లో ఏర్పాటు చేసిన జిమ్‌లతో యువజనానికి చేరువకావడంతో పాటు టీఆర్ఎస్, టీడీపీ వైఫల్యాలను అడుగడుగునా సొమ్ము చేసుకునే వ్యూహంతో నాచారం డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని శాంతిశేఖర్ (సాయిజెన్ శేఖర్) విజయాన్ని సొం తం చేసుకున్నారు.ఉప్పల్ నియోజకవర్గ ఇన్చార్జి బండారి లక్ష్మారెడ్డి సైతం డివిజన్‌లోనే మకాం వేసి ప్రత్యర్థులను చిత్తు చేసే వ్యూహం అమలు చేయటం తో శాంతి అతి స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. ముఖ్యం గా టీఆర్ఎస్, టీడీపీ అభ్యర్థులు ఒకే సామాజిక వర్గం వారు కావడంతో రెండు పార్టీలకు ఓట్లు చీలిపోవటం కూడా కాంగ్రెస్ అభ్యర్థికి కలిసివచ్చింది. పటాన్చెరువు నియోజకవర్గంలో కాం గ్రెస్ పార్టీ అభ్యర్థి ఒకరు గెలిచినప్పటికీ... జంట నగరాల్లో గెలిచిన ఒకే ఒక్క అభ్యర్థిగా శాంతిశేఖర్ రికార్డు సృష్టించారు. సాయిజెన్ శేఖర్ కంట తడి కాప్రా: నాచారం డివిజన్ నుంచి గెలుపొందిన కాం గ్రెస్ అభ్యర్థి శాంతి సాయిజెన్ భర్త సాయిజెన్ శేఖర్ ఆనందాన్ని తట్టుకోలేక కన్నీటిపర్యంతమయ్యా రు. రిటర్నింగ్ అధికారులు తుది ఫలితాలను వెల్లడిం చిన వెంటనే ఆయన ఉక్కిరిబిక్కిరయ్యారు. హాలులో ఉన్న ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి మేడల జ్యోతితో పాటు కాప్రా సర్కిల్ ఉప కమిషనర్ సత్యనారాయణ, మల్కాజిగిరి ఏసీపీ రవిచందన్రెడ్డిలకు కంటతడి పెడుతూనే పాదాభివందనం చేశారు. సహచరులను, ఆత్మీయులను ఆనందబాష్పాలతో ఆలిం గనం చేసుకున్నారు. ఉప్పల్ నియోజకవర్గంలో అన్ని డివిజన్లను టీఆర్ఎస్ కైవసం చేసుకోగా... కాంగ్రెస్ అభ్యర్థి శాంతి సాయిజెన్ మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థి మేడల జ్యోతిపై 152 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. -
పురానాపూల్ మజ్లిస్ ఖాతాలోకి...
వివాదాస్పదంగా మారి.. రీపోలింగ్ జరిగిన పురానాపూల్ డివిజన్ మజ్లిస్ ఖాతాలోకి వెళ్లింది. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సున్నం రాజ్ మోహన్ 2,877 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రాజ్‌మోహన్‌కు 8,553 ఓట్లు రాగా... కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ గౌస్‌కు 5,676 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి మధుకర్ యాదవ్‌కు 1,295 ఓట్లు, టీఆర్ఎస్ అభ్యర్థికి 747 ఓట్లు వచ్చాయి. -
అయ్యో సెంచరీ... జస్ట్ మిస్..!
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చివరి నిమిషంలో ఉత్కంఠ రేపాయి. ఈ ఫలితాలలో ముందునుంచీ ప్రభంజనం చాటిన టీఆర్ఎస్ పార్టీ వందకు పైగా సీట్ల గెలుచుకుంటుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం రాత్రి 8.00 గంటలకు తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. అప్పటికీ కొన్ని డివిజన్లలో ఓట్ల లెక్కింపు ఇంకా పూర్తి కాలేదు. తొమ్మిది గంటల సమయంలో విలేకరులతో మాట్లాడిన జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి సైతం ఇప్పటికే తమ దగ్గరున్న సమాచారం ప్రకారం వందకుపైగా స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించినట్లు ప్రకటించారు. దీంతో టీఆర్ఎస్ సెంచరీ కొట్టడం ఖాయమని ఆ పార్టీ శ్రేణులు భరోసాతో ఉన్నాయి. కానీ, పది గంటల సమయంలో వెలువడిన తుది ఫలితాలు ఆ పార్టీ అంచనాలను తలకిందులు చేశాయి. టీఆర్ఎస్ 99 స్థానాల్లో విజయం సాధించింది. ఒక్క సీటు తేడాతో టీఆర్ఎస్ సెంచరీ చేజారినట్లయింది. చివరగా ఓట్ల లెక్కింపు జరిగిన అయిదు డివిజన్లలో ఆఖరి రౌండ్లో ఆధిక్యతలు తలకిందులు కావటంతో ఈ పరిస్థితి తలెత్తింది. అప్పటివరకు సెంచరీ కొడుతామని జోష్‌లో ఉన్న పార్టీ శ్రేణులు అయ్యో సెంచరీ మిస్.. అయ్యిందంటూ నిట్టూర్పు వ్యక్తం చేశాయి. -
టీఆర్ఎస్ని అభినందించిన కిషన్‌రెడ్డి
హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అభినందించారు. ఈ ఎన్నికల సందర్భంగా నగర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. సదరు హామీలను అధికార పార్టీ నెరవేరుస్తుందని కిషన్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజల సమస్యలపై తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు కార్పొరేటర్లు పోరాడుతారని ఆయన స్పష్టం చేశారు. ఓ వేళ హామీల అమలులో టీఆర్ఎస్ వెనుకడుగు వేస్తే ప్రజలను సంఘటితం చేసి ఉద్యమం చేస్తామని జి.కిషన్‌రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి శుక్రవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. -
11న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఎలాంటి సమస్య లేకుండా, ప్రశాంతంగా జరిగిందని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ సాయంత్రం ఆరు గంటల్లోపే 50 డివిజన్లలో ఫలితాలు వెల్లడి చేశామన్నారు. ఓట్ల లెక్కింపులో ఒకటి, రెండుచోట్ల కొద్దిపాటి అంతరాయం కలిగినా వెంటనే ఆ సమస్యను పరిష్కరించామన్నారు. కేవలం జాంబాగ్‌లో మాత్రమే రెండుసార్లు కౌంటింగ్ నిర్వహించినట్లు చెప్పారు. మరోవైపు పురానా పూల్‌లో కౌంటింగ్ కొనసాగుతోందని తెలిపారు. ఈ నెల 11న మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరుగుతుందని చెప్పారు. ప్రిసైడింగ్ అధికారిగా హైదరాబాద్ కలెక్టర్ వ్యవహరిస్తారని జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు. -
సెంచరీకి చేరువలో ఆగిన టీఆర్ఎస్
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 'సెంచరీ'కి అడుగు దూరంలో ఆగింది. గ్రేటర్ పోరులో 99 స్థానాలను సాధించడంతో పార్టీ వర్గాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో 'వంద' మార్కు చుట్టూనే రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధాలు జరిగాయి. నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు తార స్థాయికి చేరాయి. టీఆర్ఎస్ వంద సీట్లు గెలుచుకుంటే రాజకీయ సన్యాసం చేస్తానని తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరిన విషయం తెలిసిందే. మరోవైపు ఇక కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ కూడా టీఆర్ఎస్ 100 డివిజన్లు గెలుచుకుంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. -
మాకు రెండు చెవుల నారాయణ కావాలి
హైదరాబాద్ : 'నాకు సీపీఐ నారాయణ మంచి మిత్రుడు. ఆయనను ఒక్క చెవితో చూడటం నాకు ఇష్టం లేదు. ఆయన చెవి జోలికి ఎవరూ పోవద్దు. పార్టీ నేతలతో పాటు మీడియా మిత్రులకు కూడా చెబుతున్నా' అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కాగా గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి వంద సీట్లు వస్తే చెవి కోసుకుంటానని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. దీనిపై కేసీఆర్ పైవిధంగా స్పందించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై కేసీఆర్ శుక్రవారం తెలంగాణ భవన్లో ప్రెస్మీట్లో మాట్లాడారు. నారాయణ జోలికి ఎవరూ పోవద్దని, తమకు రెండు చెవుల నారాయణ కావాలంటూ ఛలోక్తులు విసిరారు. నారాయణ తనకంటే కేశవరావుకు మరింత మంచి మిత్రుడని, ఆ విషయాన్ని కూడా నాయకులు, కార్యకర్తలు గుర్తుంచుకోవాలని కేసీఆర్ అన్నారు. ఎన్నికల వరకు ప్రతిపక్షాలు ఎలా మాట్లాడినా... ఇకపై మాత్రం నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా కోరారు. -
టీఆర్ఎస్ చరిత్ర తిరగరాసింది: కేసీఆర్
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ చరిత్ర తిరగరాసిందని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. గతంలో ఏ పార్టీ కూడా ఇవ్వనన్ని స్థానాలు ఇచ్చి అద్భుత విజయాన్ని అందించిన జంట నగరాల ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం తెలంగాణ భవన్లో కేసీఆర్ ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రేటర్ ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. జీహెచ్ఎంసీ అయిన తర్వాత గత చరిత్రలో ఏ పార్టీకి 52 స్థానాలకు మించి రాలేదన్నారు. హైదరాబాద్ నగర చరిత్ర చూసినా... ఏ ఒక్క పార్టీ నేరుగా జీహెచ్ఎంసీలో అధికారం చేపట్టిన చరిత్ర లేదన్నారు. ఇది ఏ ఒక్కరిదో కాదని, అందరి సమిష్ట కృషి వల్లే ఈ విజయం సాధ్యమైందని కేసీఆర్ తెలిపారు. శ్రమించి, కష్టపడి పనిచేసిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గ్రేటర్ పార్టీ అధ్యక్షుడు, నగర టీఆర్ఎస్ నాయకులతో పాటు అహోరాత్రులు కష్టపడిన కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ''టీఆర్ఎస్ నాయకత్వానికి మరోసారి విజ్ఞప్తి. ఎట్టి పరిస్థితుల్లో గర్వం, అహంకారం రాకూడదు. ఎంత విజయం చేకూరిస్తే అంత అణకువతో పోవాలి. పార్టీ మీద, నాయకత్వం మీద.. ముఖ్యంగా ప్రభుత్వం మీద చాలా పెద్ద బాధ్యత పెరిగింది. నగరం నుంచి ఉన్న మంత్రుల మీద పెద్ద బరువు మోపారు. ప్రజలు ఎప్పుడు నిర్ణయం ఇచ్చినా, అలవోకగా ఇవ్వరు. టీఆర్ఎస్కు అందిన విజయం ప్రజలు ఇష్టపడితే తప్ప.. మనం కష్టపడితే వచ్చే ఓట్లు కావు. మీరు ఎంత గొప్ప విజయం ఇచ్చారో, అంతే గొప్పగా సేవ చేసి నిరూపించుకుంటాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు... ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ప్రజలు మననుంచి చాలా ఎక్కువ ఆశిస్తున్నారని, డబుల్ బెడ్రూం ఇళ్లపై ఎక్కువ ఆశలు ఉన్నాయని చెప్పారు. కచ్చితంగా రాబోయే బడ్జెట్లో జంటనగరాల ప్రజలకు లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించి ఇస్తామని చెబుతున్నా. ఇంత కడితే నాలుగైదు ఏళ్లలో పేదలందరికీ ఇళ్లు అందించే అవకాశం ఉంటుంది. అపోహలు సృష్టించారు జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను తు.చ. తప్పకుండా ఆచరించి తీరుతాం. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో తప్పనిసరి ఉచిత విద్య ఒక్కదాన్నే అమలుచేయలేకపోయాం, దాన్ని కూడా త్వరలోనే అమలుచేస్తాం. పేదల ఎజెండానే మా ఎజెండాగా సాగుతాం. ఉద్యమ సందర్భంలోను, తర్వాత ఎన్నికల్లోను కొందరు అనేక అపోహలు సృష్టించారు. టీఆర్ఎస్ వాళ్లు సెటిలర్లను, ఆంధ్ర ప్రాంతీయులను ఇబ్బంది పెడతారని మభ్యపెట్టారు. కానీ హైదరాబాదీయులంతా టీఆర్ఎస్ వైపే... తామంతా కేసీఆర్‌తోనే ఉంటామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఉండేవాళ్లంతా మా బిడ్డలే. మహారాష్ట్ర నుంచి వచ్చినా, కర్ణాటక నుంచి వచ్చినా, ఆంధ్ర ప్రాంత సోదరులు ఇక్కడే బతుకుతామని వచ్చినా అంతా సమానమే. ఏ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమైనా తమ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పించడం, వారికి ఉపాధి కల్పించడం. అది మా గుండెల్లో ఉంది. నిన్న మొన్నటి వరకు ఎవరికైనా అపోహలు ఉన్నా అవి పటాపంచలు అయ్యాయి. ఒక్క సెకను కూడా కరెంటు పోనివ్వం నగరానికి మంచినీళ్ల సమస్య లేకుండా చేస్తాం. ముంబై తరహాలో ఐలండ్ పవర్ సప్లై ద్వారా హైదరాబాద్ నగరంలో ఒక్క సెకను కూడా కరెంటు పోకుండా చూస్తాం. శాంతి భద్రతల విషయంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో రాజీధోరణి అవలంబించదు. ఎంత పెద్దవాళ్లయినా ఐరన్ హ్యాండ్‌తో అణచివేస్తాం. కొత్తగా ఆస్పత్రులు 50 ఏళ్ల నుంచి ఇక్కడ ఉస్మానియా, గాంధీ తప్ప మరో పెద్ద ప్రభుత్వాస్పత్రి లేదు. కచ్చితంగా కింగ్ కోఠి ఆస్పత్రిని 1000 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేస్తాం. మరో రెండు వెయ్యి పడకల ఆస్పత్రులు కూడా నిర్మిస్తాం. కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి ప్రాంతంలో ఒకటి, రాజేంద్రనగర్.. చాంద్రాయణగుట్ట ప్రాంతంలో ఒకటి, ఎల్బీనగర్ లాంటి ప్రాంతాల్లో ఒకటి కట్టిస్తాం. ఎంఆర్ఐతో సహా.. అన్ని రకాల పరీక్షలు కూడా ఉచితంగా అందుబాటులో ఉంటాయి. అపోలో, కిమ్స్, యశోద ఆస్పత్రిలో ఏ స్థాయిలో ఉంటాయో ఈ పేదల ఆస్పత్రులను ఏడాదిలోగా నిర్మించి పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తాం. మొత్తం ఆరు ఆస్పత్రులు వస్తాయి. ఉస్మానియాలో ఉన్న స్థలంలో కూడా అదనపు భవనాలు కట్టిస్తాం. ప్రతిపక్షాలు అవాకులు, చవాకులు మానాలి హైదరాబాద్‌ను నిజమైన అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు భగవంతుడు ఇచ్చిన అన్ని శక్తులు వెచ్చించి కృషిచేస్తాం. ప్రతిపక్షాలు ఇక అవాకులు, చవాకులు వాగకుండా, సరైన పంథాలో నిర్మాణాత్మక సహకారం అందించాలి. ప్రతిపక్షాలకు ఒకటే విజ్ఞప్తి.. మంచి సలహాలు ఇవ్వండి. మిమ్మల్ని సింగిల్ డిజిట్‌తోనే సరిపెట్టారు కాబట్టి ఇక అనవసరమైన అర్థంపర్థం లేని విమర్శలు, వ్యక్తిగత నిందారోపణలు చేయొద్దు. వరంగల్ ఫలితం తర్వాతే మారుతారని ఆశించా.. కనీసం హైదరాబాద్ ఫలితం తర్వాతైనా మారండి. హైకోర్టు తీర్పును గౌరవిస్తాం హైకోర్టు తీర్పును గౌరవించి, వాళ్లు చెప్పిన ప్రకారమే ఎన్నికలు నిర్వహించాం. ఎక్స్ అఫీషియో సభ్యులు ఎప్పుడూ ఉన్నారు.. వాళ్లు ఓటింగులో కూడా పాల్గొనచ్చు. అయితే ఇప్పుడు ఆ అవసరం కూడా ఉండకపోవచ్చు. చట్టం ద్వారా చేయాలని హైకోర్టు చెప్పింది.. దాన్ని మేం తప్పకుండా పాటిస్తున్నాం. లంచాలు ఇవ్వాల్సిన అవసరం ఉండకూడదు పరేడ్ గ్రౌండులో ప్రజలకు నేను మాట ఇచ్చాను.. చాలామంది యువ కార్పొరేటర్లు గెలిచారు. వాళ్లు ప్రజలను తమ గుండెల్లో పెట్టుకోవాలి. జీహెచ్ఎంసీలో లంచం ఇవ్వక్కర్లేకుండా ఇంటి పర్మిషన్ తీసుకోగలిగేలా అందరూ కృషిచేయాలి. అప్పుడే మనం గెలిచిన గెలుపునకు ఒక సార్థకత ఉంటుంది. ఈ బాధ్యత నగరంలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల మీద మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రతిపక్షాలు, మిత్రపక్షాలు అని మాకు వేరేగా ఏమీ ఉండవు. మేం మాత్రం అందరినీ కలుపుకొని వెళ్తాం. భవిష్యత్తులో ఇలాంటి వివాదాలు, గొడవలు పునరావృతం కాకుండా అన్ని పార్టీలు కృషి చేయాలి, పోలీసులు కూడా జాగ్రత్తలు వహించాలి. మేయర్ విషయం మీద అందరం కలిసి కూర్చుని చర్చించుకుని ఒక నిర్ణయానికి రావాల్సి ఉంది. ఏడాదిలోగా లక్ష కుటుంబాల ప్రజలు డబుల్ బెడ్రూం ఇళ్లలోకి వెళ్లేలా కూడా చూస్తాం''. -
వారసుల సంగతేంటి?
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బరిలోకి దిగిన వివిధ రాజకీయ పార్టీల నేతల వారసుల్లో కొందరిని అదృష్టం వరించగా, మరికొందరు ఓటమి పాలయ్యారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ముఖేష్ గౌడ్ వారసులు ఓటమి చవిచూశారు. ముఖేష్ గౌడ్ కుమారుడు, కుమార్తె కూడా ఓడిపోయారు. కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా జాంబాగ్‌లో పోటీ చేసిన విక్రమ్ గౌడ్ ఎంఐఎం అభ్యర్థి చేతిలో పరాజయం పొందారు. ఇక గన్ ఫౌండ్రీ డివిజన్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కుమార్తె శిల్పకు కూడా నిరాశే మిగిలింది. గెలిచిన వారసుల వివరాలు: ముషీరాబాద్‌లో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాసరెడ్డి బంజారాహిల్స్‌లో కేశవరావు కుమార్తె విజయలక్ష్మి ఖైరతాబాద్ నుంచి దివంగత కాంగ్రెస్ నేత పీ జనార్దన్ రెడ్డి కుమార్తె విజయారెడ్డి మోహదీపట్నం నుంచి మాజీ మేయర్ మాజిద్ అల్వాల్ నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యే కనకారెడ్డి కోడలు చింతల విజయశాంతి మరోవైపు ఓడిపోయినవారిలో మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి ఆర్కె పురం నుంచి తీగల కృష్ణారెడ్డి కోడలు తీగల అనితారెడ్డి -
'నాన్నకు ప్రేమతో'
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా టీఆర్ఎస్లో సాధారణ కార్యకర్తగా రాజకీయాల్లోకి ప్రవేశించిన ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. 'ఐకాన్ ఆఫ్ ద ఇయర్'గా అవార్డులు అందుకున్న కేటీఆర్ 'నాన్నకు ప్రేమతో' బల్దియా పీఠాన్ని కానుకగా అందించారు. గ్రేటర్ మేయర్ పీఠాన్ని అధిరోహిస్తామని ఘంటాపథంగా చెప్పిన ఆయన.. ఆ మేరకు పార్టీ నేతల సమష్టి కృషితో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయకేతనాన్ని ఎగురవేశారు. గ్రేటర్ ఎన్నికల్లో ఆయన అమలు చేసిన వ్యూహం ఫలించిందనే చెప్పవచ్చు. మొత్తం 150 డివిజన్లకు అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి రెబల్స్‌ను బుజ్జగించడం, ప్రచార బాధ్యతలు చేపట్టి, సుడిగాలి ప్రచారంతో కేటీఆర్ సుమారు వంద డివిజన్లలో రోడ్ షోలు నిర్వహించి, ప్రత్యర్థులను బెంబేలెత్తించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో వార్ వన్ సైడే అని నిరూపించారు. తన కాన్వాయ్ మొత్తం నగరంలో ప్రచారం కోసం తిరిగితే ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రజలు ఇబ్బంది పడతారంటూ.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యక్షంగా ప్రచారం చేపట్టలేదు. కేవలం ఒక్క బహిరంగ సభకు మాత్రమే పరిమితమయ్యారు. అయితే.. ఆ లోటును కేటీఆర్ భర్తీ చేశారనే చెప్పొచ్చు. కేసీఆర్ పేరును పెంచకపోయినా ఫర్వాలేదు కానీ చెడగొట్టకుండా చూసుకుంటే తాను విజయం సాధించినట్లే అన్న కేటీఆర్.. దానికి మించిన స్థాయిలో విజయం సాధించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించడంతో సోషల్ మీడియాలో కేసీఆర్, కేటీఆర్ ఫొటోలతో 'నాన్నకు ప్రేమతో' అనే స్లోగన్‌తో ప్రస్తుతం వైరల్ అవుతోంది. -
అధికార పార్టీకి దరిదాపుల్లో లేవు...
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ హవా ఏకపక్షంగా కొనసాగుతోంది. అధికార పార్టీకి ప్రతిపక్షాలు ఏమాత్రం పోటీని ఇవ్వలేకపోయాయి. మేయర్ పదవిని సొంతంగా ఏర్పాటు చేసుకుని ఆధిక్యాన్ని టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. అలాగే ఎంఐఎం మాత్రం రెండో స్థానంలో నిలిచింది. ఇక బీజేపీ-టీడీపీ కూటమిగా ఏర్పడి 'కారు' జోరును తగ్గించేందుకు చేసిన యత్నాలు ఏమాత్రం ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. ఆ కూటమి కేవలం మూడో స్థానానికే పరిమితం అయింది. ఆర్ కె పురం (బీజేపీ), ఘన్సీ బజార్ (బీజేపీ), బేగంబజార్ (బీజేపీ), కేబీహెచ్‌బీ (టీడీపీ)లో విజయం సాధించింది. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు అయింది. కేవలం పటాన్చెరు, నాచారంలో మాత్రమే గెలుపొందింది. -
రాత్రి 7గంటలకు కేసీఆర్ ప్రెస్‌మీట్
హైదరాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శుక్రవారం రాత్రి 7 గంటలకు ప్రెస్మీట్లో మాట్లాడనున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై ఆయన మాట్లాడనున్నట్లు సమాచారం. మరోవైపు గ్రేటర్ ఫైట్‌లో టీఆర్ఎస్ స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకుపోతోంది. శివారు డివిజన్ల అన్నింటిలోనూ టీఆర్ఎస్ జయకేతనం ఎగురువేసింది. దీంతో సొంతంగానే మేయర్ పీఠాన్ని ఏర్పాటు చేసుకోనుంది. ఇక ఎంఐఎం రెండో స్థానంలో నిలవగా, బీజేపీ-టీడీపీ అంతగా ప్రభావం చూపలేకపోయాయి. అలాగే కాంగ్రెస్ చివర స్థానంలో నిలిచింది. మెదక్ జిల్లా పటాన్ చెరులో మాత్రం బోణీ కొట్టింది. -
పటాన్ చెరులో బోణీ కొట్టిన కాంగ్రెస్
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బోణీ కొట్టింది. మెదక్ జిల్లా పటాన్ చెరు డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి శంకర్ యాదవ్ గెలుపొందారు. మరోవైపు కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి విక్రమ్ గౌడ్ పరాజయం పొందారు. అలాగే మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి కూడా ఓటమి పాలైన విషయం తెలిసిందే. గ్రేటర్ ఫైట్‌లో కాంగ్రెస్ కేవలం నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. -
మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి ఓటమి
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి పరాజయం పాలయ్యారు. తార్నాక డివిజన్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆమె.. టీఆర్ఎస్ అభ్యర్థి ఆలకుంట సర్వసతి చేతిలో ఓటమి పొందారు. మరోవైపు గ్రేటర్లో కారు జోరు కొనసాగుతోంది. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం టీఆర్ఎస్ మొదటి స్థానంలో ఎంఐఎం రెండో స్థానంలో కొనసాగుతున్నాయి. ఆ తర్వాత స్థానాల్లో బీజేపీ-టీడీపీ కూటమి ఉండగా, ఇక కాంగ్రెస్ నాలుగో స్థానంతో నిలిచింది. -
గ్రేటర్ తొలి ఫలితం టీఆర్ఎస్దే
హైదరాబాద్ : గ్రేటర్ పీఠాన్ని ఎవరు అధిరోహించబోతున్నారనే ఉత్కంఠకు తెర పడినట్లే. మొట్టమొదటి ఫలితం కూడా వెలువడింది. మాదాపూర్ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి జగదీశ్వర్ విజయం సాధించారు. గ్రేటర్లో 150 డివిజన్లకు ఈ నెల 2న పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయమే ప్రారంభం కావాల్సి వుండగా పాతబస్తీలోని పురానాపూల్ డివిజన్లో రీపోలింగ్ దృష్ట్యా మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. పురానాపూల్ రీపోలింగ్ సాయంత్రం ఐదు గంటలకు ముగియనుంది. ఆ తరువాతే అధికారికంగా ఫలితాలు వెల్లడయ్యే అవకాశముంది. ఓట్ల లెక్కింపు కోసం 24 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 5,626 మంది విధుల్లో పాల్గొంటున్నారు. 1674 టేబుళ్లు, 827 రౌండ్ల ద్వారా ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. రాత్రి 8 గంటలకల్లా మొత్తం ఫలితాలు వెల్లడిస్తామని అధికారులు చెబుతున్నారు. అలాగే మెదక్ జిల్లాలో గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బీహెచ్ఈఎల్లో హోలిక్రాప్ నర్సింగ్ స్కూల్లో పటాన్చెరు, రామచంద్రాపురం, భారతీనగర్ డివిజన్ల ఓట్లు లెక్కిస్తున్నారు. ముందుగా పోస్టల్‌బ్యాలెట్ ఓట్లు లెక్కించారు. కౌంటింగ్ సెంటర్లోకి వెళ్లేవారందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేశాకే లోపలికి అనుమతిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 127 ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కిస్తున్నారు. సాయంత్రం ఐదుగంటల తర్వాత ఫలితం వెలువడనుంది. -
జీహెచ్ఎంసీలో దూసుకుపోతున్న కారు
హైదరాబాద్: అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో ముందునుంచి ఊహించినట్లే.. టీఆర్ఎస్ దూసుకుపోతోంది. తొలి రౌండు నుంచి చాలా వరకు డివిజన్లలో టీఆర్ఎస్ తన ఆధిక్యాన్ని కనబరుస్తూ వచ్చింది. మెజారిటీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు తమ సమీప ప్రత్యర్థుల కంటే ముందంజలో ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచే లెక్కింపు ప్రారంభమైనా... పురానాపూల్ డివిజన్‌కు రీపోలింగ్ కొనసాగుతున్న దృష్ట్యా నిర్ణీత సమయం (సాయంత్రం 5 గంటలు) ముగిసే వరకు ఫలితాలను వెల్లడించలేదు. సాయంత్రం 5 గంటల తర్వాతే ఫలితాలను ప్రకటించారు. ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్‌ల నుంచి లెక్కింపు కౌంటర్లకు చేర్చేటప్పటి నుంచి మొత్తం కౌంటింగ్ ప్రక్రియ అంతటినీ వీడియో రికార్డింగ్ చేశారు. జంట నగరాల్లో ఉన్న మొత్తం 24 కేంద్రాల్లో 150 డివిజన్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు మొదలైంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. -
గ్రేటర్ లో కొనసాగుతున్న కౌంటింగ్
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఆరంభించారు. మొత్తం 24 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తాన్ని వీడియోలో చిత్రీకరిస్తున్నారు. ఇక కౌంటింగ్ హాల్లోకి సెల్ఫోన్లు, అలాగే ఎన్నికల ఫలితాల అనంతరం ర్యాలీలు, విజయోత్సవాలపై నిషేధం విధించారు. సాయంత్రం అయిదు గంటల తర్వాతే ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. మరోవైపు కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. అలాగే 144 సెక్షన్ కొనసాగుతోంది. అలాగే మసబ్ ట్యాంక్ లో కౌంటింగ్ జరుగుతోంది. మోహదీపట్నం, అహ్మద్ నగర్, విజయనగర్ కాలనీ, ఆసిఫ్ నగర్, మల్లేపల్లి, రెడ్ హిల్స్ డివిజన్లలో కౌంటింగ్ మొదలైంది. ఇక పాతబస్తీ పురానాపూల్ డివిజన్లో రీపోలింగ్ కొనసాగుతోంది. -
మూడు రోజుల్లో రెండోసారి: పురానాపూల్ లో రీ పోలింగ్
హైదరాబాద్: మూడురోజుల వ్యవధిలోనే రెండోసారి ఓటేస్తున్నారు గ్రేటర్ లోని పురానాపూల్ డివిజన్ ఓటర్లు. ఫిబ్రవరి 2న జరిగిన ఎన్నికల్లో ఆ డివిజన్ లో ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీ లమధ్య తలెత్తిన ఘర్షణల కారంణంగా మళ్లీ పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం భావించిన దరిమిలా శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి రీపోలింగ్ ప్రారంభమైంది. 36 బూత్ లతో మొత్తం 34, 413 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుంది. మరోవైపు గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ శుక్రవారం మధ్యహ్నం 3 గంటల నుంచి ప్రారంభం కానుంది. -
బాలకృష్ణను అనర్హుడిగా ప్రకటించాలి
కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: ఏపీలో ఎమ్మెల్యేగా కొనసాగుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటేసిన ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణపై అనర్హత వేటు వేయాలని ఎన్నికల సంఘానికి గురువారం కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. బాలకృష్ణ ఓటు వేయడం చట్ట విరుద్ధమన్నారు. ఏదైనా రాష్ర్టంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే సంబంధిత రాష్ట్రంలోనే ఓటు హక్కు ఉండాలని ప్రజా ప్రాతినిధ్య చట్టం చెబుతోందన్నారు. ఏపీలోని అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యేగా ఉంటూ తెలంగాణలోని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటెలా వేస్తారని ప్రశ్నించారు. -
ఆర్డినెన్స్‌తో సరి!
ఎమ్మెల్సీల ఎక్స్అఫీషియో హోదాపై ఆర్డినెన్స్ తెచ్చిన ప్రభుత్వం రాత్రి ఆమోదముద్ర వేసిన గవర్నర్ నరసింహన్ ఆ వెంటనే ఉత్తర్వు జారీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలతో ఆగమేఘాలపై స్పందించిన వైనం మేయర్ ఎన్నికలో ఎమ్మెల్సీలు ఓటు వేసేందుకు అడ్డు తొలగినట్టే సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికల్లో ఎమ్మెల్సీలు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది. దీనికి గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత గవర్నర్ నరసింహన్ ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీలుగా ఎమ్మెల్సీలకు ఎక్స్ అఫీషియో సభ్యత్వాన్ని కట్టబెడుతూ జీహెచ్ఎంసీ చట్టాన్ని సవరిస్తూ కొద్దిరోజుల క్రితం జారీ చేసిన ఉత్తర్వు (జీవో 207)ను రద్దు చేసింది. దాని స్థానంలో తనకున్న ప్రత్యేకాధికారాలతో ఆర్డినెన్స్‌ను తెచ్చింది. ఆగమేఘాలపై.. ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేసే నాటికి లేదా గవర్నర్ ద్వారా నామినేట్ అయ్యే నాటికి గ్రేటర్ పరిధిలో నమోదైన ఎమ్మెల్సీలకే ఎక్స్ అఫీషియో హోదాలో మేయర్ ఎన్నికలో ఓటు వేసే అధికారం ఉంటుందన్న జీహెచ్ఎంసీ చట్టాన్ని ప్రభుత్వం సవరించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఎక్కడ్నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైనా/నామినేట్ అయినా తర్వాత జీహెచ్ఎంసీ పరిధిలో ఓటరుగా నమోదు చేసుకున్నవారికి ఎక్స్ అఫీషియో సభ్యత్వం కల్పిస్తూ కొద్దిరోజుల క్రితమే ఉత్తర్వు జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న హైకోర్టు ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ ఉత్తర్వు జారీ విధానాన్ని జీర్ణించుకోవటం కూడా కష్టమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీంతో ఈ ఉత్తర్వు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. శాసన వ్యవస్థ ద్వారా కాకుండా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా చట్టసవరణ సరికాదంటూ పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఎన్నికల్లో లబ్ధి పొందే ఉద్దేశంతోనే ఈ ఉత్తర్వు జారీ చేసిందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ వాదన విన్న ధర్మాసనం ప్రభుత్వం ఉత్తర్వు తేవటానికి అనుసరించిన విధానంపై తీవ్ర వ్యాఖ్యలు చేసి మధ్యంతర ఉత్తర్వు జారీ చేస్తామని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారం వివాదాస్పదమవుతుండటాన్ని గుర్తించిన ప్రభుత్వం... ఓ అడుగు ముందుకేసి తనకున్న ప్రత్యేకాధికారాల ద్వారా ఆర్డినెన్స్ తేవాలని నిర్ణయించింది. అనుకున్నదే తడువుగా గురువారం ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఆమోదానికి పంపగా ఆయన రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆమోదముద్ర వేశారు. ఆ వెంటనే ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. ప్రభుత్వ వాదనలు విన్న హైకోర్టు దానిపై లోతైన అధ్యయనం అవసరమంటూ విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈలోపే ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవటం గమనార్హం. ఆర్డినెన్స్ చట్టబద్ధమే అయినందున మేయర్ ఎన్నికలో ఎమ్మెల్సీలు ఎక్స్అఫీషియో సభ్యులుగా ఓటు హక్కు వినియోగించుకోవటానికి మార్గం సుగమమైంది. -
దగ్గరుండి దాడులు చేయిస్తారా ?
పాతబస్తీ ఘటనలపై గవర్నర్ నరసింహన్ సీరియస్ ప్రజాప్రతినిధులు దాడులకు ప్రోత్సహించడమేంటని ఆగ్రహం బాధ్యులైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సీపీకి ఆదేశం ముందస్తుగా భద్రతా చర్యలు తీసుకున్నామని కమిషనర్ వివరణ సకాలంలో స్పందించడం వల్లే గొడవలు నివారించగలిగామని వెల్లడి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : జీహెచ్ఎంసీ ఎన్నికల రోజున పాతబస్తీలో చోటు చేసుకున్న విధ్వంసకర ఘటనలపై గవర్నర్ నరసింహన్ సీరియస్ అయ్యారు. ప్రత్యేకించి ఒక పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు దగ్గరుండి ఇతర పార్టీల నేతలపై దాడులు చేయించడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. టీపీసీసీ అధినేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శాసన మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీపై పాతబస్తీలో ఎంఐఎం దాడులు చేయడంపై వంటి ఘటనలను కాంగ్రెస్ నేతృత్వంలో అఖిలపక్షం బుధవారం సాయంత్రం గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై ఒక నివేదిక సమర్పించాలని గవర్నర్ నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డిని ఆదేశించారు. గురువారం ఉదయం పోలీసు కమిషనర్ రాజ్‌భవన్‌కు వెళ్లి దాదాపు గంటసేపు పాతబస్తీలో చోటుచేసుకున్న ఘటనలను వివరించారు. ముందు జాగ్రత్తగా పాతబస్తీలో బలగాలను మోహరించామని, అందువల్లే రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తల మధ్య గొడవలను నివారించగలిగామని వివరించారు. జరిగిన ఘటనలు అప్పటికప్పుడు చోటుచేసుకున్నవేనని, అయినా వెంటనే స్పందించి పెద్దవి కాకుండా నివారించగలిగామని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. పాతబస్తీలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లడానికి కారకులైన అందరిపైనా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని గవర్నర్ ఈ సందర్భంగా ఆదేశించారు. ప్రజాస్వామ్యానికి తలవంపులు తెస్తాయి జీహెచ్ఎంసీ పోలింగ్ సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలపై గవర్నర్ మనస్తాపం చెందారు. ఇలాంటి పరిణామాలు ప్రజాస్వామ్యానికి తలవంపులు తెస్తాయని ఆయన ఆవేదన చెందినట్లు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. ఎంఐఎం ఫిర్యాదు మేరకు పురానాపూల్ కాంగ్రెస్ అభ్యర్థిని అదుపులోకి తీసుకోవడంపైనా ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఓట్ల లెక్కింపు రోజు రీపోలింగా? పురానాపూల్ డివిజన్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని పోలింగ్ రోజే కాంగ్రెస్ ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లింది. పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే కాంగ్రెస్ అభ్యర్థిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం, ఈ డివిజన్ లలో పలుచోట్ల విధ్వంసకర ఘటనలు చోటు చేసుకోవడం, రిగ్గింగ్ జరిగినట్లు ఆరోపణలు రావడం.. అన్నీ వరుసగా జరిగిపోయాయి. అదేరోజు రాత్రి అక్కడి ప్రిసైడింగ్ అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాల్సిన ఎన్నికల సంఘం బుధవారం అర్ధరాత్రి దాకా ఒక నిర్ణయానికి రాలేదు. ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే రీ పోలింగ్ జరపడానికి వీలుగా.. ఓట్ల లెక్కింపును పోలింగ్ ముగిసిన మూడో రోజు చేపడుతారు. కానీ ఈ విషయంలో సమర్థంగా వ్యవహరించడంలో రాష్ట్ర ఎన్నికల సంఘం విఫలమైందని పార్టీలు విమర్శిస్తున్నాయి. ఓట్ల లెక్కింపు రోజునే రీ పోలింగ్ జరపాల్సి రావడం వెనుక ఏదో మతలబు ఉందని కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. అధికార పార్టీ నుంచి అనుమతి కోసం ఎన్నికల సంఘం వేచి చూడటం వల్లే ఈ జాప్యం జరిగిందని బీజేపీ ఎమ్మెల్యే ఒకరు విమర్శించారు. -
'మా గతే టీఆర్ఎస్కూ పడుతుంది'
సాక్షి, హైదరాబాద్: మజ్లిస్ పార్టీని నెత్తికెక్కించుకుంటే ఇప్పుడు మాకు (కాంగ్రెస్ నేతలకు) పట్టినగతే టీఆర్ఎస్కు కూడా పట్టక తప్పదని రాజ్యసభసభ్యుడు, ఏఐసీసీ కార్యదర్శి వీ హనుమంతరావు హెచ్చరించారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మరో బిన్‌లాడెన్ లాగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అసెంబ్లీ ఆవరణలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఎంఐఎంను నెత్తిన పెట్టుకుని తమ పార్టీ నాయకులు కొందరు తప్పు చేశారని వ్యాఖ్యానించారు. మజ్లిస్‌కు ఆనాడు మద్ధతు చేసిన నాయకులే ఇప్పుడు తన్నులు తినాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు. ఒవైసీకి మద్దతు పలకడాన్ని సీఎం కేసీఆర్ మానుకోవాలని వీహెచ్ సూచించారు. మజ్లిస్ విషయంలో కేసీఆర్ తీరును మార్చుకోకుంటే భవిష్యత్తులో తమ పార్టీ నాయకులకు పట్టినగతి ఆయనకు తప్పదని హెచ్చరించారు. మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ బాధ్యతలను తీసుకున్న తర్వాత ఎంఐఎం సంగతి ఏమిటో అర్థమవుతోందన్నారు. ఒవైసీ సోదరులకు మద్దతును ఇవ్వడమంటే పాముకు పాలు పోసి పెంచినట్టేనని పేర్కొన్నారు. అసదుద్దీన్‌పై కేసు పెట్టాల్సిందేనని డిమాండ్ చేశారు. అసదుద్దీన్ ఆగడాలపై ప్రధాని మోదీ స్పందించాలన్నారు. కాంగ్రెస్‌ను ఖతం చేయడానికి మోదీతో జతకడ్తామని అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు అవకాశవాదానికి పరాకాష్ట అని వీహెచ్ విమర్శించారు. టీపీసీసీ అధ్యక్షునిపైనే దాడి జరిగితే తమ పార్టీ ఏమీ చేయలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ఉత్తమ్, జానారెడ్డి, షబ్బీర్ అలీ నాయకత్వమే కారణమన్నారు. ఇకనుంచి హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీని తామే నడుపుకుంటామని వీహెచ్ చెప్పారు. -
పాతబస్తీలో రీపోలింగ్: ఆయనను దూరం పెట్టండి!
హైదరాబాద్: పాతబస్తీలోని పూరానాపూల్ డివిజన్లో శుక్రవారం జరగనున్న రీ పోలింగ్‌కు డీసీపీ సత్యనారాయణను దూరంగా ఉంచాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. పూరానాపూల్‌లో మంగళవారం జరిగిన పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్, ఎంఐఎం శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ డివిజన్లో రీపోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. అయితే పోలింగ్ సందర్భంగా డీసీపీ సత్యనారాయణ వ్యవహరించిన తీరుపైనా ఫిర్యాదులు రావడంతో ఎన్నికల విధులకు ఆయనను దూరం ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. 52 డివిజన్ పూరానాపూల్లోని 36 పోలింగ్ బూత్‌లలో శుక్రవారం ఉదయం 7గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 34,413 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 225 మంది ఎన్నికల సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొంటారు. ఈ రీపోలింగ్ కారణంగానే జీహెచ్ఎంసీ ఎన్నికల కౌటింగ్ ను శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభించి.. సాయంత్రం ఐదు గంటల తర్వాత ఫలితాలు ప్రకటించాలని అధికారులు నిర్ణయించారు. -
సాయంత్రం 5 గంటల తర్వాత ఫలితాలు
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలను శుక్రవారం సాయంత్రం 5 గంటల తర్వాతే వెల్లడిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దనరెడ్డి చెప్పారు. ఓట్ల లెక్కింపు విషయమై ఆయన గురువారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. మధ్యాహ్నం 3 గంటల నుంచే కౌంటింగ్ మొదలవుతుందని, మొదటి అరగంట పోస్టల్ బ్యాలెట్ ద్వారా వచ్చిన ఓట్లను లెక్కిస్తారని అన్నారు. అయితే.. పురానాపూల్‌లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రీ పోలింగ్ ఉన్నందున.. అది ముగిసిన తర్వాత మాత్రమే మొదటి ఫలితాన్ని వెల్లడిస్తారని అన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉందని, అందువల్ల కేవలం పాస్‌లు ఉన్నవారు మాత్రమే కేంద్రాల వద్దకు రావాలని జనార్దన రెడ్డి చెప్పారు. పాస్‌లు లేనివాళ్లు అక్కడకు రావల్సిన అవసరం లేదని, ఎటూ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఫలితాలను వెల్లడిస్తున్నందున ఆ కాంపౌండ్ వద్ద ఉన్నా, ఇంట్లో ఉన్నా తేడా ఏమీ ఉండబోదని చెప్పారు. ఈవీఎంలు వచ్చిన తర్వాత కౌంటింగ్ దగ్గర వివాదాలు ఏమీ ఉండబోవని, కౌంటింగ్ ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేస్తామని ఆయన అన్నారు. అలాగే, ఫలితాలు వెల్లడైన తర్వాత కూడా పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీలు ఏవీ నిర్వహించకూడదని కమిషనర్ చెప్పారు. -
'ఆన్లైన్ ఓటింగ్ నిర్వహించాలి'
హైదరాబాద్: పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఆన్లైన్ ద్వారా ఓటింగ్ నిర్వహిస్తే బాగుంటుందని ఐటీ, పంచాయతీ శాఖ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో గురువారం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ల జాతీయ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. గ్రేటర్ ఎన్నికలలో పోలింగ్ చాలా తక్కువ శాతం నమోదైందని... ఆన్లైన్ ద్వారా ఓటింగ్ నిర్వహిస్తే ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశముంటుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ల జాతీయ సదస్సు నిర్వహించడంపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి హర్షం వ్యక్తం చేశారు. ఈ సదస్సులో అన్ని సర్వీసు కమిషన్లకు కావాల్సిన నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి సదస్సు హైదరాబాద్‌లో తొలిసారి నిర్వహిస్తున్నందుకు గర్వపడుతున్నామని చక్రపాణి చెప్పారు. -
ఎన్నికల ఘర్షణ కేసుల్లో... అరెస్టుల పరంపర
సిటీబ్యూరో: గ్రేటర్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా మంగళవారం నగరంలో జరిగిన ఘర్షణలకు సంబంధించి పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్టులు చేశారు. బీజేపీ నాయకునిపై దాడి చేసిన ఎంఐఎం నాయకులను బుధవారం చాదర్‌ఘాట్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం పోలింగ్ బూత్‌లో నిలబడి ప్రచారం నిర్వహిస్తున్న బీజేపీ నాయకుడు పట్టుభాయ్పై ఎంఐఎం నాయకులు హలీమ్, ఇఫ్రాల్లు ఇక్కడ ప్రచారం చేయవద్దంటూ దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. పట్టుభాయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దాడికి పాల్పడ్డ ఇరువురినీ అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్‌కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ సత్తయ్య తెలిపారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఇంటి ఆవరణలోని టీఆర్ఎస్ కార్యాలయంపై దాడి కేసులో మంగళవారం అరెస్టయిన మలక్‌పేట ఎమ్మెల్యే బలాల, మరో కార్యకర్తను చాదర్‌ఘాట్ పోలీస్స్టేషన్లు బుధవారం గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఐపీసీలోని 147, 448, 427, 149 సెక్షన్ల కింద నమోదైన ఈ కేసులో నిందితులకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. బీజేపీ నాయకులపై దాడికి పాల్పడిన మాజీ కార్పొరేటర్ ఖాజా బిలాల్ అహ్మద్‌పై రెయిన్‌బజార్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చే శారు. కుర్మగూడ డివిజన్ ఆయేషా రిజ్వాన్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ వద్ద మంగళవారం సాయంత్రం రెయిన్‌బజార్ మజ్లీస్ పార్టీ మాజీ కార్పొరేటర్ ఖాజా బిలాల్ అహ్మద్ బీజేపీ నాయకులపై దాడికి పాల్పడినట్లు కుర్మగూడ మాజీ కార్పొరేటర్ సహదేవ్ యాదవ్ ఫిర్యాదు చేశారు. పోలింగ్ పూర్తయ్యాక పోలింగ్ బూత్ నుంచి వస్తున్న బీజేపీ నాయకులపై బిలాల్ తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు ఐపీసీ 341, 506, 323 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సోమాజిగూడ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి సంగీతాయాదవ్, భర్త డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్‌యాదవ్‌ను పంజగుట్ట పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. బీఎస్ మక్తాలో అనుమతి లేకుండా వాహనంలో తిరగడం, కాంగ్రెస్ కండువా, టోపీ ధరించడం, ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నించడం తదితర ఆరోపణలపై చర్యలు తీసుకున్నారు. టప్పాచబుత్ర ఠాణా పరిధిలోని మోజంషాహి స్కూల్లో దొంగ ఓటు వేయడానికి వచ్చిన మైనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం యూసుఫ్నగర్లోని పోలింగ్ స్టేషన్ నెం.21లోకి వచ్చిన ఈ బాలుడిని పట్టుకున్న ప్రిసైడింగ్ అధికారి పోలీసులకు అప్పగించారు. దీనిపై టప్పాచబుత్ర ఠాణాలో కేసు నమోదైంది. లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ప్రశాంత్‌నగర్ అంబేద్కర్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం బూత్ 17లో ఎంఐఎం అభ్యర్థిని, అనుచరులు సమయం అయిపోయాక కూడా అరగంట పాటు ఉన్నారు. విషయం తెలుసుకున్న బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థినిలు, కార్యకర్తలు అక్కడకు చేరుకొని ఆందోళనకు దిగారు. ఆందోళనకారులపై పోలీసులు లాఠీలు ఝులిపించారు. దీంతో కార్యకర్తలు తిరగబడి పోలీసులపై దాడి చేశారు. ఈ ఘర్షనలో కార్యకర్తలు, పోలీసులు గాయపడ్డారు. గాయపడ్డ బీజేపీ కార్యకర్త అన్నపూర్ణరాజు పోలీసులపై ఫిర్యాదు చేయగా, పోలీసులు ఆందోళనకారులపై ఫిర్యాదు చేశారు. ఇరువురి ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీడియో పుటేజీలు పరిశీలించి భాద్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. పోలింగ్ నేపథ్యంలో మంగళవారం ఈఘటనలు జరిగాయి. బేగంబజార్ ఠాణా పరిధిలో ఎంఐఎం నాయకుడు అయూబ్ ఖాన్ పోలింగ్ బూత్‌కు ఓటర్లను తరలిస్తూ ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఓటువిడుపు..
‘గ్రేటర్’ సమరం ముగిసింది. ఇంతవరకు ప్రచార పోరులో తలమునకలైన అభ్యర్థులు.. ఈవీఎంలు స్ట్రాంగ్ రూంకు చేరడంతో రిలాక్సయ్యారు. గల్లీగల్లీ తిరుగుతూ ప్రచారంతో హోరెత్తించిన వారు ఇప్పుడు వివిధ వ్యాపకాలతో సేదతీరుతున్నారు. కొందరు మహిళా అభ్యర్థులు ఇంట్లో ఇల్లాలి పాత్రలో ఇమిడిపోగా.. మరికొందరు తమ వ్యాపారాల్లో నిమగ్నమయ్యారు. ఇంకొందరు స్నేహితులతో ఎన్నికల సరళిపై చర్చించుకోసాగారు. సీనియర్ నేతలు పిల్లలతో ఆడుకుంటూ సరదాగా గడుపుతున్నారు. - సాక్షి నెట్వర్క్ -
45 సీట్లపై మజ్లిస్ ఆశలు!
పాతబస్తీలో వన్‌వే... సంఖ్య తగ్గదంటున్న పార్టీ వర్గాలు సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ సరళి బట్టి 45కు పైగా డివిజన్లలో విజయం తథ్యమని మజ్లిస్ పార్టీ అంచనా వేస్తోంది. పాతబస్తీలోని పూర్తి స్థాయి డివిజన్లతోపాటు నగరంలోని పలు డివిజన్లపై సైతం ఆశలు పెట్టుకుంది. ఎట్టి పరిస్థితుల్లో సంఖ్య తగ్గదన్న ధీమా పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. డివిజన్ల డీలిమిటేషన్, సిట్టింగ్ సీట్ల రిజర్వేషన్ల తారుమారు జరిగినా ఓటింగ్ సరళిలో మాత్రం మార్పులేదని భావిస్తున్నారు. అయితే పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మారిన రాజకీయ సమీకరణలతో పాతబస్తీలోని మూడు నాలుగు డివిజన్ల్లో ధీటైన పోటీ జరిగినట్లు ఓటింగ్ సరళి బట్టి స్పష్టమవుతుందంటున్నారు. ఈసారి ఎన్నికల్లో 150 డివిజన్లకు గాను 60 స్థానాల్లో ఎంఐఎం త మ అభ్యర్ధులను బరిలోకి దింపింది. గత ఎన్నికల్లో 70 డివిజన్లలో పోటీ చేసి 43 స్థానాలను దక్కించుకుంది. గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే ఈసారీ పునరావృత్తం అయ్యే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. కాగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో ఉన్న స్నేహపూర్వక బంధం కాస్త ఈసారి శత్రుపక్షంగా మారింది. దీంతో పురానాపుల్, ఘాన్సీబజార్, శాలిబండా, లంగర్‌హౌస్, రెడ్‌హిల్స్, మల్లేపల్లి, జాంబాగ్ తదితర డివిజన్లలో గట్టిపోటీ తప్పదని పరిశీలకులు భావిస్తున్నారు. ఆజాంపురా, ఓల్ట్ మలక్‌పేట, బోలక్పూర్, బోరబండ, అంబర్‌పేట తదితర డివిజన్లలోనూ పోటాపోటీ ఉందని భావిస్తున్నారు. -
24 ప్రాంతాల్లో గ్రేటర్ ఓట్ల లెక్కింపు
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ గ్రేటర్ పరిధిలో 24 ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల పరిశీలకుల పర్యవేక్షణలో కౌంటింగ్ జరుతుందని... కౌంటింగ్ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని.. తొలిత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరుగుతుందని చెప్పారు. పాతబస్తీలో రీ పోలింగ్‌కు అవకాశం లేదని... ప్రిసైడింగ్ అధికారి నివేదిక కూడా అదే విషయం చెబుతోందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. -
పాతబస్తీ దాడులపై సీపీ సమీక్ష
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఓల్డ్ సిటీలో జరిగిన దాడులపై పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. బుధవారం పోలీసు ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ఓల్డ్ సిటీ దాడుల నిందితులను గుర్తించి... వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ తనపై దాడి చేశారని బీజేపీ అభ్యర్ధి బుధవారం చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో అక్బరుద్దీన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. -
రిగ్గింగ్ జరిగిందంటూ అఖిలపక్ష నేతల ఫిర్యాదు
హైదరాబాద్ : అఖిలపక్ష నేతలు బుధవారం ఎలక్షన్ కమిషనర్ నాగిరెడ్డిని కలిశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పలు డివిజన్లలో రిగ్గింగ్ జరిగిందంటూ వారు ఈ సందర్భంగా ఎలక్షన్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. గొడవలు జరిగిన ప్రాంతాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని అఖిలపక్ష నేతలు విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఇదే అంశంపై అఖిలపక్ష నేతలు జానారెడ్డి, లక్ష్మణ్, రమణ, శివకుమార్ తదితరులు గవర్నర్ నరసింహన్‌ను కలవనున్నారు. -
ఎమ్మెల్యే బలాలకు బెయిల్
హైదరాబాద్: తెలంగాణ డిప్యూటీ సీఎం మహముద్ అలీ తనయుడు అజం అలీపై దాడికి యత్నించిన కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బుధవారం ఉదయం బొల్లారం పోలీస్ స్టేషన్ నుంచి బలాలను నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చారు. మంగళవారం జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలు రిగ్గింగ్ చేశారని ఆరోపిస్తూ బలాల డిప్యూటీ సీఎం ఇంటి ఎదురుగా ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. బలాలను చాదర్‌ఘాట్ పోలీసులు అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆయనపై 341, 448, 427, 506, 147, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
అధికారంతో టీఆర్ఎస్ అక్రమాలు: టీడీపీ
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఓటమి భయంతో అధికార పార్టీ టీఆర్ఎస్ ఓటర్లను ప్రలోభపెట్టి గెలిచేందుకు కుట్రలు పన్నిందని టీడీపీ ఆరోపించింది. పాతబస్తీతోపాటు శివారు డివిజన్లలో టీఆర్ఎస్ నేతలు దాడులు చేసినా, విచ్చలవిడిగా డబ్బులు పంచినా అధికారులు చేష్టలుడిగిపోయారని విమర్శించింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి, ఫ్లోర్‌లీడర్ ఎర్రబెల్లి దయాకర్ రావు, సీనియర్ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, ఇ.పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, అరవింద్‌కుమార్ గౌడ్ మంగళవారం ఎన్టీఆర్ ట్రస్ట్భ వన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ కూడా చేయని టీఆర్ఎస్ ఈసారి అధికార బలంతో మేయర్ స్థానంపై కన్నేసి అక్రమాలకు తెరలేపిందని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యవాదులు, నియంతల మధ్య ఎన్నికలు జరిగాయని, అయినా ఫలితం టీడీపీ, బీజేపీ కూటమికే అనుకూలమని పేర్కొన్నారు. పత్రికల్లో ఫుల్‌పేజీ ప్రకటనల వ ల్ల ఓట్లు రాలవనే విషయాన్ని టీఆర్ఎస్ నేతలు గుర్తుంచుకోవాలని చెప్పారు. టీడీపీ విజయాన్ని టీఆర్ఎస్, ఎంఐఎం ఆపలేవన్నారు. -
దాడులు.. దౌర్జన్యాలు
గ్రేటర్‌లోని పలు ప్రాంతాల్లో రెచ్చిపోయిన మజ్లిస్ ‘మూడు పార్టీల’పై ఎంఐఎం కార్యకర్తల వరుస దాడులు రణరంగంగా మారిన పాతబస్తీ ఉత్తమ్ కారు అద్దాలు ధ్వంసం.. షబ్బీర్‌పై పిడిగుద్దులు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఇంటి ముట్టడి.. ఆయన కుమారునిపై దాడికి యత్నం జంగంమెట్‌లో బీజేపీ అభ్యర్థిపై ఎమ్మెల్యే అక్బరుద్దీన్ దాడి వ్యూహాత్మక వైఖరి అనుసరించడంలో పోలీసుల వైఫల్యం సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల సందర్భంగా మజ్లిస్ పార్టీ రెచ్చిపోయింది. గ్రేటర్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో మంగళవారం పాతబస్తీతో పాటు నగరంలోని అనేక ప్రాంతాల్లో దుందుడుకు స్వభావంతో ఉద్రిక్తతలకు కారణమైంది. అధికారపక్షం, ప్రధాన ప్రతిపక్షం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా అందరి పైనా కాలుదువ్వింది. ఎంఐఎం పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయి ప్రముఖులపైనా పిడిగుద్దులతో దాడులకు పాల్పడ్డారు. ఆ పార్టీకి చెందిన ఓ ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలు స్వయంగా దాడులు, బెదిరింపుల్లో పాల్గొన్నారు. కాగా, వ్యూహాత్మకంగా వ్యవహరించడం, మజ్లిస్‌ను అడ్డుకోవడంలో పోలీసులు విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఠాణా పైనే దాడికి దిగిన ఎంఐఎం.. ఎంఐఎం ఎమ్మెల్యే పాషా ఖాద్రీ, పురానాపూల్ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి గౌస్ మధ్య ఆది నుం చీ నువ్వానేనా అనే పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ నేపథ్యంలో జలాల్కుంట ప్రాంతంలో ఎదురైన ఇరు వర్గాలు పరస్పరం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసుకోవడం, గౌస్‌పై ఖాద్రీ దాడికి యత్నించడంతో వివాదం చెలరేగింది. దీంతో ఎమ్మెల్యేతో పాటు గౌస్‌ను అరెస్టు చేసిన పోలీ సులు మీర్‌చౌక్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. పాషా ఖాద్రీని సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు. విషయం తెలుసుకున్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మీర్‌చౌక్ పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన ఇరువురూ.. తమ సొంత పూచీకత్తుపై గౌస్‌ను తీసుకుని బయలుదేరారు. మరోవైపు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మీర్‌చౌక్ ఠాణాకు వచ్చారు. ప్రధాన గేటును తన్నుకుంటూ లోపలకు వెళ్లిన ఆయన పోలీసుస్టేషన్లో బీభత్సం సృష్టిం చారు. ఖాద్రీతో పాటు అరెస్టైన ఇద్దరు ఎంఐ ఎం కార్యకర్తల్ని బలవంతంగా అక్కడ నుంచి బయటకు తీసుకువచ్చారు. ఆ సమయంలో పోలీసులు చేసిన విజ్ఞప్తినీ ఎంపీ పట్టించుకోకపోవడంతో వారు మిన్నకుండిపోయారు. ఉత్తమ్ వాహనం, షబ్బీర్‌పై దాడి.. తమ అనుచరుల్ని తీసుకువెళ్తున్న ఓవైసీ బృందానికి పురానాపూల్ ప్రాంతంలో గౌస్‌తో వెళ్తున్న ఉత్తమ్ వాహనం ఎదురైంది. దీంతో విచక్షణ కోల్పోయిన ఎంఐఎం కార్యకర్తలు అసద్ సమక్షంలోనే పీసీసీ చీఫ్ వాహనంపై కర్రలతో దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. ఓవైసీ వాహనం ముందు భాగంలో ఎడమ వైపు నిల్చుని ఉండగా.. వెనుక సీటులో కుడివైపు కూర్చున్న షబ్బీర్‌పై ఆ పార్టీ కార్యకర్తలు పిడిగుద్దులు కురిపించారు. దాదాపు ఎనిమిదిసార్లు దాడి చేయడంతో ఆయన కంటితో పా టు పలు చోట్ల గాయాలయ్యాయి. దీంతో రం గంలోకి దిగిన పోలీసులు షబ్బీర్‌పై దాడి చేసిన వ్యక్తుల్ని అరెస్టు చేయడంతో పాటు లాఠీచార్జ్ చేసి ఇరు పార్టీల కార్యకర్తల్నీ చెదరగొట్టారు. విక్రమ్‌గౌడ్‌పై దాడికి యత్నం.. జాంబాగ్ డివిజన్ పరిధిలోని సుభాన్‌పుర పోలింగ్ స్టేషన్లో ఎంఐఎం కార్యకర్తలు దొంగ ఓట్లు వేస్తున్నారనే సమాచారంతో కాంగ్రెస్ అభ్యర్థి విక్రమ్‌గౌడ్ తన అనుచరులతో అక్కడికి చేరుకున్నారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్యా వాగ్వాదం చోటు చేసుకుంది. మజ్లిస్ కార్యకర్తలు విక్రమ్‌గౌడ్‌పై దాడికి యత్నించారు. పోలీసులు ఇరు వర్గాలను అక్కడ నుంచి చెదరగొట్టాయి. మరోవైపు రెడ్‌హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి ఆయేషా ఫర్హాన్‌ను ఎంఐఎం నేత షకీల్ రంగారెడ్డి జిల్లా ఉద్యాన శాఖ కార్యాలయం వద్ద కత్తితో బెదిరించారని, ఫర్హాన్ ప్రాధేయపడినా పోలీసులు స్పందించలేదనే విమర్శలున్నాయి. యాకత్‌పుర పరిధిలోని కూర్మగూడ పోలింగ్ బూత్‌లో బీజేపీ పోలింగ్ ఏజెంట్స్ సాయిప్రణీత్, సమీష్, నరేందర్‌లపై ఎంఐఎం కార్యకర్తలు దాడి చేశారు. చావ్నీ ప్రాంతంలో టీఆర్ఎస్ అభ్యర్థి హన్మంతరావుపై ఎంఐఎం మాజీ కార్పొరేటర్ ముర్తుజా దాడి చేశారు. అక్బర్‌బాగ్ ప్రాంతంలో ఎంబీటీ అభ్యర్థి అంజదుల్లా ఖాన్‌పై ఎంఐఎం కార్యకర్తలు దాడి చేశారు. జంగంమెట్‌లో అక్బరుద్దీన్... చాంద్రాయణగుట్టలోని జంగంమెట్ ప్రాం తంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ రెచ్చిపోయారు. అక్కడి బీజేపీ అభ్యర్థి మహేందర్‌తో పాటు ఆయన భార్యపైనా అనుచరులతో కలసి దాడి చేశారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను మోహరించారు. లంగర్‌హౌస్ ప్రాంతంలో బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులపై కాలుదువ్వారు. వాగ్వాదానికి దిగడంతో పాటు రాళ్ల దాడులూ చేశారు. లాఠీచార్జ్ చేసిన పోలీసులు వీరిని చెదరగొట్టారు. మల్లేపల్లిలోని బూత్ నం.11, 12, రెడ్‌హిల్స్‌లోని బూత్ నం.33, పురానాపూల్, దూబ్బౌలిల్లో ఇతర పార్టీలకు చెందిన ఏజెంట్లను బయటకు గెంటేసి ఎంఐఎం కార్యకర్తలు రిగ్గింగ్ చేస్తున్నారనే వార్తలు కలకలం రేపాయి. నగరంలో చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించి ఎంఐఎం సహా ఇతర పార్టీలకు చెందిన వారిపై కేసులు నమోదు చేశామని, దర్యాప్తు అనంతరం చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. డిప్యూటీ సీఎం ఇంటిపై దాడి.. ఆజంపుర ప్రాంతంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఇంటిపై ఎంఐఎం కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. మలక్‌పేట ఎమ్మెల్యే బలాల తన అనుచరులతో కలసి వెళ్లి ఈ చర్యకు పాల్పడ్డారు. ఆకస్మికంగా ఇంటిని ముట్టడించి మహమూద్ అలీ కుమారుడు ఆజం అలీపై దాడికి ప్రయత్నించారు. ఎమ్మెల్యే తన అనుచరులతో దాడి చేస్తుండగా డిప్యూటీ సీఎం సెక్యూరిటీ సిబ్బంది పది మంది అక్కడ నుంచి పారిపోయారు. అక్కడకు చేరుకున్న పోలీసులు లాఠీచార్జ్ చేశారు. డిప్యూటీ సీఎం కువూరుడిపై దాడి చేశారన్న విషయుం తెలుసుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు ఆజంపుర చౌరస్తాలో ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, నగర సీపీ మహేందర్‌రెడ్డి తదితరులు డిప్యూటీ సీఎం ఇంటికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. రిగ్గింగ్‌లను అడ్డుకుంటున్నం దుకే ఎంఐఎం ఎమ్మెల్యే తన ఇంటిపైనా తనపైనా దాడి చేశారని, ఎమ్మెల్యేను వెంటనే అరెస్ట్ చేయాలని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ కువూరుడు ఆజం అలీ డిమాండ్ చేశారు. ఎంఐఎం దాడులకు తాము భయపడబోమని, ఎంతటివారినైనా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. మలక్‌పేటలోని అన్ని డివిజన్లలో ఓడిపోతామనే భయంతో ఎంఐఎం ఈ దుశ్చర్యలకు పాల్పడిందని ఆరోపించారు. ఎమ్మెల్యే బలాల అరెస్టు: డీసీపీ రవీందర్ డిప్యూటీ సీఎం ఇంటిపైనా ఆయన కుమారునిపైనా దాడి కేసులో మలక్ పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాలను అదుపులోకి తీసుకుని బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ తెలిపారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘ఆజంపురలో డిప్యూటీ సీఎం ఇంటి ఆవరణలోనే టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఉంది. తన అనుచరులతో కలిసి దీనిపై దాడి చేసిన బలాలపై క్రిమినల్ ట్రెస్పాస్, విధ్వంసం, దాడి తదితర సెక్షన్ల కింద చాదర్‌ఘాట్ పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేసి అరెస్టు చేశాం. ఇతర బాధ్యుల్ని గుర్తించి చర్యలు తీసుకుంటాం’ అని అన్నారు. ఎమ్మెల్యేను బుధవారం ఉదయం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచే అవకాశం ఉంది. అయితే ఎమ్మెల్యే బలాల ను విడిపించడానికి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దిన్తో పాటు ఆరుగురు ఎమ్మెల్యేలు బొల్లారం పోలీసుస్టేషన్‌కు వచ్చారు. ఎంఐఎం కార్యకర్తలు పెద్ద సంఖ్యలో స్టేషన్‌కు వస్తుండటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దోషులను కఠినంగా శిక్షిస్తాం: నాయిని హైదరాబాద్: ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఇంటిపైనా.. ఆయన కుమారుడు ఆజం అలీపైనా ఎంఐఎం నాయకులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, దోషులను వెంటనే అరెస్ట్ చేస్తామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. ఆజం అలీని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అహ్మద్ బలాల ఆటలు సాగవని, డిప్యూటీ సీఎం ఇంటిపైనే దాడి చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఐఎం అక్రమాలు అడ్డుకున్నందుకే ఆజం అలీపై దాడి చేశారని, దోషులను వదిలేది లేదని చెప్పారు. అనంతరం డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మాట్లాడుతూ.. బోగస్ ఓట్లను అడ్డుకున్నందుకే దాడికి పాల్పడితే ఎలా? అని ప్రశ్నించారు. ఎంఐఎం దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేస్తామని చెప్పారు. డిప్యూటీ సీఎం ఇంటిపైనా ఆయన కుమారుడు ఆజం అలీపైనా ఎంఐఎం ఎమ్మెల్యే బలాల తన అనుచరులతో దాడి చేసిన విషయం తెలుసుకున్న ఐటీ మంత్రి కేటీఆర్ మహమూద్ అలీని పరామర్శించారు. -
వార్ వన్ సైడే?
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా సర్వేలు, ఎగ్జిట్‌పోల్ అంచనాల్లో వెల్లడి సగానికిపైగా డివిజన్లలో గెలుపు గులాబీ పార్టీదే! సీఎం కేసీఆర్‌పై మధ్యతరగతి, పేదల్లో విశ్వాసం ఇతర పార్టీల ఎమ్మెల్యేలున్న చోట కూడా కారు జోరు ‘గ్రేటర్’ మేయర్ పీఠం అధికార పార్టీకే ప్రతిపక్ష హోదాకే పరిమితంకానున్న మజ్లిస్ మూడో స్థానంలో టీడీపీ-బీజేపీ కూటమి దారుణంగా కాంగ్రెస్ పరిస్థితి సాక్షి ప్రత్యేక ప్రతినిధి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) విజయకేతనం ఎగురవేసే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. మునుపెన్నడూ లేనివిధంగా జీహెచ్ఎంసీలోని మొత్తం 150 డివిజన్లలో సగానికంటే ఎక్కువగా ఆ పార్టీయే గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే మరే పార్టీతో పొత్తు అవసరం లేకుండానే... టీఆర్ఎస్ సొంతంగా మేయర్ పీఠాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టిస్తుంది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మారుస్తామన్న హామీతో మధ్యతరగతిని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మిస్తామన్న వాగ్దానంతో పేదవర్గాల మద్దతును టీఆర్ఎస్ పూర్తిగా కూడగట్టుకున్నట్లు పోలింగ్ సరళిని చూస్తే అవగతమవుతోంది. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక ఫలితం జీహెచ్ఎంసీలో పునరావృతమవుతుందని రాజకీయ పరిశీలకులు, సర్వేలు చేసిన విశ్లేషకులు చెబుతున్నారు. ‘‘ఓటు వేయడానికి వచ్చిన ప్రతి పది మందిలో ఏడుగురు టీఆర్ఎస్కు వేశారు. కొద్దిచోట్ల మాత్రమే టీఆర్ఎస్తో టీడీపీ-బీజేపీ కూటమి పోటీ పడ్డాయి..’’ అని ఎగ్జిట్‌పోల్ నిర్వహించిన ఎస్ఎంఎఫ్ఎస్ సంస్థ ప్రతినిధి నాగన్న చెప్పారు. ఇప్పటిదాకా జీహెచ్ఎంసీలో కీలకపాత్ర పోషిస్తూ వచ్చిన ‘మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం)’ ఈసారి ప్రతిపక్ష హోదాకే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తోంది. 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్-మజ్లిస్ అవగాహనకు వచ్చి పదవీకాలాన్ని చెరిసగం పంచుకున్న సంగతి తెలిసిందే. ఈసారి ఏ పార్టీతో పొత్తు అవసరం లేకుండానే టీఆర్ఎస్ ఐదేళ్ల పాటు జీహెచ్ఎంసీని పాలిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. టీఆర్ఎస్కు ఇప్పటికే మెజారిటీ సంఖ్యలో ఎక్స్ అఫీషియో సభ్యులున్నారు. దాదాపు 74 లక్షల మంది ఓటర్లున్న జీహెచ్ఎంసీలో 45 శాతం ఓట్లు పోలయ్యాయి. గత ఎన్నికలతో పోలిస్తే 3 శాతం ఓట్లు ఎక్కువగా పోలైనట్లు అధికారులు చెబుతున్నారు. అటు ఎన్నికల సంఘం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం విసృ్తతంగా ప్రచారం నిర్వహించినా ఓటింగ్ శాతంలో పెద్దగా తేడా లేదు. మూడో స్థానంలో టీడీపీ-బీజేపీ కూటమి తెలుగుదేశం- బీజేపీ కూటమి ఈ ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితం కానుంది. ఈ కూటమి 20-25 డివిజన్లు గెలుచుకునే అవకాశముందని పోలింగ్ సరళిని బట్టి అర్థమవుతోంది. ఆ కూటమి తరఫున ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, పలువురు కేంద్ర మంత్రులు ప్రచారంలో పాల్గొన్నారు. చంద్రబాబు తన ప్రచారంలో ఎక్కడా తెలంగాణ సీఎంపై ఎలాంటి విమర్శలు చేయలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వంపైనా సుతిమెత్తని ఆరోపణలకే పరిమితమయ్యారు. ఇది టీడీపీ నేతలు, శ్రేణుల్లో ఆందోళనకు కారణమైంది. ‘మా పార్టీకి సరైన ఫలితాలు రాకపోతే దానికి బాధ్యుడు అధినేత చంద్రబాబే..’ అని టీడీపీ ఎమ్మెల్యే ఒకరు పేర్కొన్నారు. గ్రేటర్ ఫలితాల తరువాత మరో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక గత్యంతరం లేని స్థితిలో టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో దిగిన బీజేపీ పరిస్థితి కూడా బాగోలేదు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనూ టీఆర్ఎస్కు స్పష్టమైన ఆధిక్యం ఉన్నట్లు పోలింగ్ సరళి వెల్లడిస్తోంది. దిగజారిన కాంగ్రెస్ పరిస్థితి కాంగ్రెస్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూట గట్టుకునే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికలు జరుగుతాయని తెలిసినా టీపీసీసీ నాయకత్వం దానికి తగ్గట్లుగా సంసిద్ధం కాకపోవడం, కేడర్‌లో నైతిక స్థైర్యాన్ని నింపలేకపోవడం దెబ్బతీసింది. పోటీలో ఉన్న అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించడానికి ఆపార్టీ ఎమ్మెల్యేలెవరూ రాలేదు. తాము బాధ్యత తీసుకుంటామని ఎన్నికల ముందు చెప్పిన సీనియర్లు కూడా ప్రచారం దరిదాపుల్లోకి వెళ్లలేదు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ పాల్గొన్న సభల్లో మాత్రమే కాంగ్రెస్ సీనియర్ నేతలు కనిపించారు. దానికితోడు కొందరు మాజీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్తో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారనే ఆరోపణలూ వచ్చాయి. గత ఎన్నికల్లో శాసనసభకు పోటీచేసి ఓడిపోయిన ఓ టీఆర్ఎస్ నేత భార్యను ఓడించడానికి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఒకరు తమ పార్టీ తరఫున డమ్మీ అభ్యర్థిని రంగంలోకి దింపడంతోపాటు టీడీపీ అభ్యర్థి విజయం కోసం రూ.కోటి ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. పాత మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ హవా గ్రేటర్లో విలీనానికి ముందున్న పాత మున్సిపాలిటీలు సహా నగరంలోని అనేక నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ హవా స్పష్టంగా కనిపించింది. టీడీపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న ఎల్బీనగర్ నియోజకవర్గంలోని 11 డివిజన్లలో టీఆర్ఎస్ 8 స్థానాలను గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. మిగతా మూడింటిలో రెండు టీడీపీ, ఒకదానిని కాంగ్రెస్ సాధించే పరిస్థితి ఉంది. బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప్పల్ నియోజకవర్గంలో టీడీపీ-బీజేపీ కూటమికి ఒక్క సీటు కూడా దక్కే సూచనలు లేవు. ఇక్కడి 11 డివిజన్లలో పదింటిని టీఆర్ఎస్, ఒకదాన్ని కాంగ్రెస్ గెలుచుకునే అవకాశముంది. టీడీపీ ప్రాతినిధ్యం ఉన్న శేరిలింగంపల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్, టీడీపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. గత శాసనసభ ఎన్నికల్లో కూకట్పల్లి నుంచి గెలిచిన మాధవరం కృష్ణారావు టీఆర్ఎస్లో చేరారు. ఆ నియోజకవర్గంలోని 9 డివిజన్లలో టీఆర్ఎస్ 7 చోట్ల, టీడీపీ 2 చోట్ల విజయం సాధించే అవకాశాలున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్‌గిరిలోని 9 స్థానాల్లో 8 చోట్ల టీఆర్ఎస్, ఒకదానిలో కాంగ్రెస్ విజయం సాధించే పరిస్థితి కనిపించింది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తలసాని శ్రీనివాస్‌యాదవ్ నియోజకవర్గం సనత్‌నగర్ పరిధిలోని అన్ని డివిజన్లలో టీఆర్ఎస్ గెలిచే అవకాశాలున్నాయి. సికింద్రాబాద్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లోనూ ప్రత్యర్థుల కంటే టీఆర్ఎస్ ముందంజలో ఉన్నట్లు పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. -
ఇదీ.. పోలింగ్ తీరు
గ్రేటర్ వ్యాప్తంగా మంగళవారం చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పాతబస్తీలో కొంత ఉద్రిక్తత ఏర్పడగా.. మిగతా ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. గ్రేటర్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఈసారి పోలింగ్ శాతం దాదాపు తక్కువగానే నమోదుకావడం ఒకింత విస్మయానికి గురిచేసింది. నియోజకవర్గాల వారీగా ఆయా సర్కిళ్లు..డివిజన్లలో పోలింగ్ సరళిపై ‘సాక్షి ’ విశ్లేషణ... సనత్‌నగర్, లష్కర్: సిటీబ్యూరో : సనత్‌నగర్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లోని 11 డివిజన్లలో గ్రేటర్ ఎన్నికల పోలింగ్ రెండు మూడు చెదురు ముదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. బౌద్ధనగర్ డివిజన్లోని అంబనగర్ పోలింగ్ బూత్ వద్ద ఉదయం 9.30గం.ల సమయంలో కాంగ్రెస్-టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య స్వల్ప వివాదం చోటుచేసుకొంది. అలాగే తార్నాక డివిజన్లోని లాలాగూడ పోలింగ్ బూత్ వద్ద, మెట్టుగూడ డివిజన్లోని దూద్‌బావి పోలింగ్ బూత్ వద్ద సాయంత్రం టీఆర్ఎస్-కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణకు దిగడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ తరుణంలో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను దూరంగా తరిమేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో మధ్యాహ్నం 1గంట సమయానికి కూడా 14-20 శాతంలోపే పోలింగ్ నమోదైంది. సనత్‌నగర్ నియోజకవర్గం పరిధిలో ఉదయం 12 గంటల వరకు మందకొడిగా అత్యధికంగా రాంగోపాల్‌పేట్‌లో 52.23 శాతం పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా అమీర్‌పేట్‌లో 38.98 పోలింగ్ నమోదైంది. ఎల్బీనగర్లో... ఎల్బీనగర్: ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలో మంగళవారం జరిగిన గ్రేటర్ ఎన్నికలు ప్రశాతంగా ముగిసాయి. ఈవీఎంలు మొరాయించడంతో కొన్నిచోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. హస్తినాపురం డివిజన్లోని ధాతునగర్‌లో తమ సమస్యలను పరిష్కరించనందుకు నిరసనగా కాలనీవాసులు రెండు గంటల పాటు పోలింగ్‌ను బహిష్కరించారు. విషయం తెలుసుకున్న ఆర్డీఓ సుధాకర్‌రావు ధాతునగర్ను సందర్శించి కలెక్టర్‌తో చర్చించి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనేందుకు ముందుకు వచ్చారు. మన్సూరాబాద్ డివిజన్ బూత్నెం-51 సిటీ మోడల్ స్కూల్లో ఈవీఎం మొరాయించడంతో దానిని వెంటనే మార్చి కొత్తది ఏర్పాటు చేశారు. వనస్థలిపురంలోని బూత్ నెం-9లో ఈవీఎం కొద్దసేపు మొరాయించింది. దీంతో అధికారులు వెంటనే మరొకటి అందుబాటులోకి తేవడంతో పోలింగ్ కొనసాగింది. కర్మన్‌ఘాట్ క్రాంతిక్లబ్ వద్ద బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకోవడంతో పోలీసులు వెంటనే జోక్యం చేసుకున్నారు. రాజేంద్రనగర్, కార్వాన్, నాంపల్లి: సిటీబ్యూరో : రాజేంద్రనగర్, కార్వాన్, నాంపల్లి సర్కిల్స్‌లో చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఐదు డివిజన్లలోనూ పోలింగ్ ఉదయం నుంచి సాయంత్రం 5 గంటలకు క్రమంగా పుంజుకుంది. పూర్వపు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ రాజేంద్రనగర్‌లో తమ ఓటు వినియోగించుకున్నారు. ఇక మంగళవారం రాత్రి ఎన్నికల విధులకు వచ్చిన ఉపాధ్యాయులు తమకు టీఏ, డీఏ మొత్తం చెల్లిస్తేనే ఈవీఎంలు ఇస్తామంటూ రాజేంద్రనగర్ సర్కిల్ ఎన్నికల కేంద్రంలో ఆందోళనకు దిగారు. జిల్లా కలెక్టర్ రావాల్సిందేనని ఎన్నికల సిబ్బంది పట్టుపట్టారు. ఇక్కడ పోలింగ్ దాదాపు 55 శాతం జరిగింది. నాంపల్లిల్లో ఓట్లు గల్లంతు... నాంపల్లి నియోజకవర్గంలో పలు డివిజన్లల్లో ఓట్లు గల్లంతయ్యాయి. రెడ్‌హిల్స్‌లోని సైఫాబాద్ సైన్స్ కాలేజీ, నిలోఫర్ హెల్త్ స్కూల్, ప్రభు సాయి హైస్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు పలువురు ఓటు వేసేందుకు వచ్చి లిస్టులో పేర్లు లేకపోవడంతో వెనుదిరిగారు. నాంపల్లిలో 43 శాతం, మెహిదీపట్నంలో 34 శాతం పోలింగ్ నమోదైంది. కార్వాన్లో గొడవ... కార్వాన్‌లోని ఏడు డివిజన్లలో పోలింగ్ ఉదయం మందకొడిగా సాగింది. కార్వాన్ డివిజన్లో పలుచోట్ల ఈవీఎంలు మొరాయించటంతో ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. టోలీచౌకి డివిజన్లో అత్యధికంగా 54 శాతం పోలింగ్ జరిగింది. లంగర్‌హౌస్‌లో టీఆర్ఎస్, బీజేపీ వర్గాలు సాయంత్రం గొడవకు దిగడంతో ఉద్రికత్త నెలకొంది. శేరిలింగంపల్లిలో ప్రశాంతం సాక్షి, సిటీబ్యూరో: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మాదాపూర్, హఫీజ్‌పేట్, మియాపూర్, చందానగర్, హైదర్‌నగర్, వీవీనగర్, ఆల్విన్‌కాలనీ డివిజన్లలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం మందకొడిగా ప్రారంభమైంది. మాదాపూర్‌లో 38.88 శాతం, మియాపూర్ 37.25 శాతం, హఫీజ్‌పేట డివిజన్ పరిధిలో 39.85 శాతం, చందానగర్ 39.9 శాతం, ఆల్విన్ కాలనీలో 45 శాతం, హైదర్‌నగర్‌లో 47 శాతం, వీవీనగర్‌లో 45 శాతం ఓటింగ్ నవె ూదైంది. ముషీరాబాద్‌లో... ముషీరాబాద్ : ముషీరాబాద్ నియోజకవర్గంలో పోలింగ్ మందకొడిగా సాగింది. ఆరు డివిజన్లలో 2,88,574 ఓటర్లు ఉండగా, 330 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. కాని ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి కనబరచలేదు. పోలింగ్ ముగిసేసరికి సుమారు 48 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. అత్యధికంగా ముషీరాబాద్‌లో 53.56 శాతం నమోదైంది. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ సిటీబ్యూరో: స్వల్ప సంఘటనలు మిన హా ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం వరకు పుంజుకుంది. గత ఎన్నికల్లో కంటే ఈసారి ఓటింగ్ శాతం పెరిగినట్లు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. మహిళలు, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాలకు సమీపంలో ప్రధాన పార్టీల కార్యకర్తలు ఓటర్లకు స్లిప్‌లు పంపిణీ చేయటానికి ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసుకున్నారు. కాగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని యూసుఫ్‌గూడ డివిజన్లో 35.92 శాతం పోలింగ్ నమోదైంది. రహమత్‌నగర్‌లో 50 శాతం, ఎర్రగడ్డలో 59.14, బోరబండలో 50.62, వెంగళరావునగర్‌లో 44, షేక్‌పేట డివిజన్లో 46 శాతం పోలింగ్ జరిగింది. ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోని బంజారాహిల్స్ డివిజన్లో47.90 శాతం పోలింగ్ నమోదు కాగా, జూబ్లీహిల్స్‌లో 45.34, వెంకటేశ్వరకాలనీలో 46.58, ఖైరతాబాద్‌లో44.7, సోమాజిగూడలో 43.36 శాతం, హిమాయత్‌నగర్ డివిజన్లో 35.60 శాతం పోలింగ్ నమోదైనట్లు సమాచారం. మలక్‌పేట/ మహేశ్వరం/యాకుత్‌పుర: దిల్సుఖ్నగర్: వులక్‌పేట, మహేశ్వరం, యాకత్‌పుర నియోజకవర్గాల పరిధిలోని డివిజన్లలో మంగళవారం జరిగిన గ్రేటర్ ఎన్నికలు చెదురువుుదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా వుుగిశారుు. అన్ని డివిజన్లలో కూడా 50 శాతం లోపే ఓటింగ్ జరిగింది. సాయంత్రం 3.30 తరువాత పోలింగ్ ముగిసే సమయానికి ఓటర్లు ఎక్కువ సంఖ్యలో చేరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారి ఎన్నికల్లో సాధారణ ఓటర్లతో పాటు యువ ఓటర్లు భారీగా పోలింగ్‌లో పాల్గొన్నారు. ఓటరు లిస్టులో పేర్లు ఉండి గుర్తింపు కార్డులు లేక కొంతవుంది, ఓటరు కార్డులు ఉండి కూడా ఓటరు లిస్టులో పేర్లు లేకపోవడంతో చాలా వుంది ఓటు హక్కు వినియోగించుకోలేకపోయూరు. అంబర్‌పేట.. అంబర్‌పేట: చెదురుమదురు సంఘటనలు మినహా అంబర్‌పేట నియోజకవర్గంలో ఎన్నికలు సజావుగా సాగాయి. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బాగ్‌అంబర్‌పేట డివిజన్ శివవాణి పాఠశాల వద్ద బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య స్వల్ప వివాదం తలెత్తి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అక్కడే ఉన్న పోలీసులు తక్షణమే స్పందించి ఆందోళనకారులను పంపించారు. అదే విధంగా డీడీ కాలనీ సుందర్‌నగర్ సత్యసాయి పాఠశాల వద్ద స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. కూకట్పల్లి సర్కిల్లో... మూసాపేట: కూకట్పల్లి సర్కిల్ పరిధిలో కొన్ని చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. గత ఎన్నికలను పోల్చుకుంటే ఈసారి పోలింగ్ శాతం పెరిగిందని చెప్పవచ్చు. కేపీహెచ్‌బీ డివిజన్లో 50.25 శాతం, బాలాజీనగర్‌లో 50.88 శాతం, అల్లాపూర్‌లో 46.09 శాతం, మూసాపేటలో 47.12 శాతం, ఫతేనగర్‌లో 52.08 శాతం పోలింగ్ నమోదైంది. ఓల్డ్బోయిన్పల్లిలో 41.39 శాతం, బాలానగ ర్లో 48.19 శాతం, కూకట్‌పల్లిలో 42.49 శాతం, వివేకానందనగర్‌కాలనీలో 41.16 శాతం, హైదర్‌నగర్ 46.63 శాతం, ఆల్విన్‌కాలనీలో 41.16 శాతం పోలింగ్ నమోదైంది. పాతనగరంలో... సాక్షి, సిటీబ్యూరో: పాత నగరంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య పోలింగ్ ముగిసింది. ఉదయం పోలింగ్ ప్రశాంతంగా జరిగినప్పటికీ మధ్యాహ్నం తర్వాత మజ్లిస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని జంగమ్మెట్ డివిజన్ బీజేపీ అభ్యర్థిపై జరిగిన దాడి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో బీజేపీ కార్యకర్తలు ఫలక్‌నుమా జూనియర్ కాలేజీ ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో ఒక్కసారిగా పోలింగ్ మందగించింది. కుత్బుల్లాపూర్ కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్‌లో పోలింగ్ సరళి అభ్యర్థులను కలవర పెట్టింది. మందకొడిగా పోలింగ్ ప్రారంభమై చివరి వరకు అదే రీతిలో కొనసాగింది. దీంతో పోలింగ్ శాతం 2009 గ్రేటర్ ఎన్నికల్లో 49 శాతం కంటే తక్కువగా నమోదైంది. కుత్బుల్లాపూర్ సర్కిల్లో మొత్తం 8 డివిజన్లు... 4,67,464 మంది ఓటర్లు ఉండగా కేవలం 2,12,605 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో 45.67 శాతం ఓటింగ్ నమోదైంది. 437 పోలింగ్ స్టేషన్లు ఉన్న ఈ ప్రాంతంలో 91 కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటల వరకు కేవలం 37.52 శాతమే పోల్ కాగా..చివరిలో గంటలో 8 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. ఉప్పల్, మల్కాజిగిరిలో... సిటీబ్యూరో: ఒకటి, రెండు స్వల్ప ఘటనలు మినహా ఉప్పల్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో గ్రేటర్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ప్రజలు ఉదయం నుంచి సాయంత్రం వరకు తమకు వీలైన వేళల్లో వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహిళలు, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉప్పల్‌లో.... ఉప్పల్ నియోజకవర్గంలోని ఉప్పల్, చిలుకానగర్, హబ్సిగూడ, రామంతాపూర్, కాప్రా, ఏఎస్‌రావునగర్, చర్లపల్లి, హెచ్‌బీకాలనీ, మల్లాపూర్, నాచారం డివిజన్లలో ఉదయం 7 నుంచి 10 గంటల వరకు 15 శాతం ఓటింగ్ నమోదు కాగా, మధ్యాహ్నం 3 గంటల వరకు కాప్రాలో 45 శాతం, ఉప్పల్ సర్కిల్లో 44.76 శాతం చొప్పున ఓటింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు కాప్రాలో 49.50 శాతం, ఉప్పల్‌లో 45.05 శాతం వరకు నమోదైనట్లు అధికారులు తెలిపారు. మల్కాజిగిరిలో.. మల్కాజిగిరి, మచ్చబొల్లారం, అల్వాల్, నేరేడ్మెట్, వెంకటాపురం, వినాయక్‌నగర్, మౌలాలి, ఈస్ట్ ఆనంద్‌బాగ్, గౌతమ్‌నగర్ డివిజన్లలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓటింగ్ ప్రశాంతంగా జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు అల్వాల్‌లో 46.01 శాతం, మల్కాజిగిరిలో 44.26 శాతం ఓటింగ్ నమోదైంది. -
జర్నలిస్టుపై దాడి.. ఎంపీ అసద్‌పై కేసు
యాకుత్‌పురా: సియాసత్ ఉర్దూ దినపత్రిక విలేకరిపై దాడికి పాల్పడిన ఘటనలో మజ్లిస్ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఆయన అనుచరులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్ యాదగిరిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా సియాసత్ విలేకరి ముబాషీర్(35) మంగళవారం చెత్తబజార్ నుంచి వెళుతున్నాడు. విధి నిర్వహణలో ఉన్న ముబాషీర్ తనకు ఎదురుపడటంతో ఎంపీ అసదుద్దీన్, ఆయన అనుచరులు అతన్ని అడ్డుకున్నారు. ముబాషీర్‌పై దాడి చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ 341, 323, 504, 506, ఆర్/డబ్ల్యూ-34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదులో అసదుద్దీన్, ఆబేద్‌తోపాటు పలువురు ఆయన అనుచరుల పేర్లు పేర్కొన్నాడు. -
ఫాంహౌస్ నుంచే ఆరా తీస్తున్న కేసీఆర్
జగదేవ్‌పూర్ (మెదక్): జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ సరళిపై తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం నుంచే ఆరా తీసినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం కూడా వ్యవసాయ క్షేత్రంలోనే గడిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల బాధ్యులుగా ఉన్న మంత్రి కేటీఆర్ కు ఫోన్ చేసి.. పోలింగ్ గురించి పూర్తి వివరాలు అడిగితెలుసుకున్నట్లు సమాచారం. అలాగే ఉదయం సతీమణి శోభరాణితో కలిసి పంటలను పరిశీలించినట్లు తెలిసింది. బుధవారం సాయంత్రం సీఎం కేసీఆర్ హైదరాబాద్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. ఫాంహౌస్ వద్ద పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది. శనివారం ఫామ్‌హస్‌కు వచ్చిన సీఎం కేసీఆర్ అప్పటినుంచి ఇక్కడే ఉంటూ పంటలను పరిశీలిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల పరిణామాలను ఆయన ఇక్కడి నుంచి తెలుసుకుంటున్నారు. -
ఎన్నికల సిబ్బందికి పాడైపోయిన ఆహారం
కాచిగూడ: జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సిబ్బందికి అధికారులు కనీస సౌకర్యాలు కల్పించలేదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు అందించిన టిఫిన్, భోజనం పాడైపోవడంతో.. మంచినీరు తాగి విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పాడిందని సిబ్బంది వాపోయారు. కాచిగూడ డివిజన్ పోలింగ్ కేంద్రాలకు పంపించిన భోజనాలు, టిఫిన్స్ సోమవారం రాత్రి వండినవి కావడంతో పాటు ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేయడం వల్ల అవి పాడైపోయాయి. దీంతో తినడానికి వీలు లేకుండా ఉన్నాయని సిబ్బంది తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి విధి నిర్వహణకోసం వచ్చిన సిబ్బందికి కనీసం తిండికూడ పెట్టలేని స్థితిలో జీహెచ్ఎంసీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. సిబ్బందికి కనీస సౌకర్యాలను కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలయమ్యారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. -
డిప్యూటీ సీఎం తనయుడిపై ఎంఐఎం దాడి!
హైదరాబాద్: అజంపురలోని తెలంగాణ డిప్యూటీ సీఎం మహముద్ అలీ నివాసం వద్ద మంగళవారం సాయంత్రం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కార్యకర్తలు రిగ్గింగ్ చేశారని ఆరోపిస్తూ ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాల డిప్యూటీ సీఎం ఇంటి ఎదురుగా ఆందోళనకు దిగారు. నివాసం వద్ద ఉన్న ఆయన తనయుడు అజం అలీపై ఎమ్మెల్యే బలాల దాడికి యత్నించారు. దీంతో బలాల తీరును నిరసిస్తూ టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఆందోళనకు దిగడంతో ఇక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాడికి యత్నించిన ఎమ్మెల్యే బలాలను చాదర్‌ఘాట్ పోలీసులు అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు మహముద్ అలీ కుటుంబాన్ని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పరామర్శించారు. టీఆర్ఎస్ను చూసి ఎంఐఎం భయపడుతోందని, అందుకే దాడికి ప్రయత్నించిందని డిప్యూటీ సీఎం తనయుడు అజం అలీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. -
పాతబస్తీలో టెన్షన్... టెన్షన్
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఓల్డ్‌సిటీలో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. పురానాపూల్‌లో కాంగ్రెస్ - ఎంఐఎం పార్టీ నాయకుల మధ్య ఘర్షణ జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు ఎంఐఎం ఎమ్మెల్యే పాషాఖాద్రి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహ్మద్ గౌస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గౌస్ అరెస్ట్‌కు నిరసనగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగడంతో.. పోలీసులు గౌస్‌ను విడుదల చేశారు. అదే సమయంలో అక్కడకు ఎంపీ అసదుద్దీన్ చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. ఉత్తమ్ కారుపై ఎంఐఎం కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఆయన కారు ధ్వంసమైంది. పోలీసులు లాఠీచార్జ్ చేసి ఆందోళన కారులను చెదరగొట్టారు. ఈ ఘటనపై ఉత్తమ్ తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్యాన్ని అధికార టీఆర్ఎస్ పార్టీ ఖూనీ చేస్తోందన్నారు. పోటీలో ఉన్న తమ పార్టీ అభ్యర్ధి గౌస్‌ను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఎన్నికల సంఘం కూడా టీఆర్ఎస్కు తొత్తులా వ్యవహారిస్తోందని ఆయన ఆరోపించారు. ఇలాంటి ఎన్నికలు నిర్వహించడం దేనికి...నేరుగా కార్పొరేటర్లను ప్రకటిస్తే సరిపోతుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అధికార పార్టీ తీరుకు నిరసనగా డీజీపీ ఆఫీస్ ముందు ధర్నాకు దిగుతామని ఉత్తమ్ హెచ్చరించారు. -
ఓటింగ్‌ను బహిష్కరించిన రోషన్‌దౌలా బస్తీవాసులు
హస్తినాపురం డివిజన్ పరిధిలోని రోషన్‌దౌలా బస్తీవాసులు జీహెచ్ఎంసీ ఎన్నికలను బహిష్కరించారు. కలెక్టర్ వచ్చి తమ సమస్యలు పరిష్కరించేంత వరకు ఓటు వేసేది లేదన్నారు. సుమారు 500 మంది స్థానికులు బైఠాయించి నిరసన తెలిపారు. ఎన్నో ఏళ్ల నుంచి రోషన్‌దౌలాలో స్మశానవాటిక సమస్య ఉందని దాన్ని వెంటనే తీర్చాలని డిమాండ్ చేశారు. సంఘటనాస్థలానికి పోలీసులు భారీగా మోహరించారు. -
గ్రేటర్ లో ఓటేసిన ప్రముఖులు
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేంచాలనుకున్న అధికారులు ఆ మేరకు సాధ్యమైనన్ని ఎక్కువ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేయడమేకాక, కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. ఈసీ చేపట్టిన ఈ చర్యలపై ఓటర్లు సంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. నగరంలోని పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంగళవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభంమైన కొద్ది సేపటికే జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్థన్ రెడ్డి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డిలు కుటుంబసభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. ఓటర్లందరూ విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. నగరంలో ఓటేసిన మరికొందరు ప్రముఖుల వివరాలిలా ఉన్నాయి.. - ప్రముఖులందరిలోకీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ముందుగా ఓటు వేశారు. ఉదయం 7:15కే రాంగనర్ లోని జేవీ హైస్కూల్ లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో దత్తన్న ఓటు హక్కును వినియోగించుకున్నారు. - టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ జూబ్లీహిల్స్ లో ఓటు వేశారు. - మంత్రి కేటీఆర్.. నందినగర్ (బంజారాహిల్స్)లో ఏర్పాటుచేసిన పోలింగ్ తో ఓటు వేశారు. హైదరాబాద్ ఉజ్వల భవిష్యత్ కోసం నగర వాసులంతా ఓటు వేయాల్సిందిగా యువనేత పిలుపునిచ్చారు. - బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి కాచిగూడలో ఓటు వేశారు. - హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి కుందన్ బాగ్ లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. - టీడీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్.. రాజేంద్ర నగర్ డివిజన్ లోని బాబుల్ రెడ్డి నగర్ లో ఓటేశారు. - ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణిలు జూబ్లీ హిల్స్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. - హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి రిసాలాగూడలో ఓటువేశారు. - కూకట్ పల్లి డివిజన్ లోని 114 పోలింగ్ కేంద్రంలో ఓటేసిన మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ - సినీ నటుడు అల్లు అర్జున్ జూబ్లీహిల్స్ లోని టెలిఫోన్ ఎక్సేంజ్ పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. -
నేను ఓటేశా.. మీరూ బయటకు రండి
పౌరుడిగా తన బాధ్యత నెరవేర్చి ఓటేశానని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. బంజారాహిల్స్‌లోని పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. నగర పౌరులంతా కూడా బయటికొచ్చి స్వేచ్ఛగా తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరారు. తనకు తెలిసినంత వరకు జంట నగరాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లోను ఎలాంటి ఇబ్బందులు లేవని, ఏర్పాట్లన్నీ సక్రమంగానే ఉన్నాయని అన్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని, అందువల్ల ప్రజాస్వామ్యంలో పౌరులంతా తమ ప్రాథమిక కర్తవ్యాన్ని నెరవేర్చేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లి ఓటు వేయాలని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిని కాంక్షించేవాళ్లంతా ముందుకొచ్చి ఓటేయాలని కోరారు. పోలింగ్ స్లిప్ అందకపోతే ఇంటర్నెట్లో tsec.gov.in అనే వెబ్సైట్లో చూసుకుని ఆ నెంబరు ప్రకారం ఓటేయొచ్చని, అందరూ ఓటుహక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు. -
గ్రేటర్ లో అధికారుల 'ఓటు' స్ఫూర్తి
హైదరాబాద్: పోలింగ్ వేళ బల్దియా కమిషన్ జనార్థన్ రెడ్డి, ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డిలు ఓటర్లకు స్ఫూర్తిగా నిలిచారు. జీహెచ్ఎంసీ పరిధిలో మంగళవారం ఉదయం పోలింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే కుటుంబంతో కలిసివచ్చి ఓటువేసిన ఆ ఇద్దరు అధికారులు ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా గ్రేటర్ వాసులకు పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో కుందబాగ్ పరిధిలోని చిన్మయి హైస్కూల్లోని పోలింగ్ బూత్‌లో ఇరువురు అధికారులు ఓటు వేశారు. గ్రేటర్ ఎన్నికల దృష్ట్యా 25,624 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటుచేశామని, ఎన్ఎస్ఎస్, ఎన్ సీసీ వాలంటీర్ల సహాయం కూడా తీసుకుంటున్నామని కమిషనర్ జనార్థన్ రెడ్డి చెప్పారు. ఈ సారి పోలింగ్ శాతం పెరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈవీఎంల మొరాయింపు గ్రేటర్ పరిధిలోని పలు డివిజన్లలో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ప్రక్రియ ఇంకా ప్రారంభంకాలేదు. కాప్రా డివిజన్ లోని 39వ కేంద్రం, హయత్ నగర్ డివిజన్లో సిద్ధార్థ స్కూల్లో ఏర్పాటుచేసిన ఈవీఎంలో సాంకేతికలోపం తలెత్తింది. రాజేంద్ర నగర్ డివిజన్ లోని లక్ష్మీ గూడలో, కూకట్ పల్లిలోని పలు బూత్ లలోనూ ఇదే పరిస్థితి. సీతాఫల్మండి డివిజన్ పరిధిలోని బూత్ నెంబర్ 10లో ఈవీఎం మొరాయించింది. దీంతో కాసేపు పోలింగ్ పక్రియ ఆగిపోయింది. దాని స్థానంలో మరో ఈవీఎంను ఏర్పాటు చేసేందుకు ఎన్నికల అధికారులు ప్రయత్నిస్తున్నారు. -
'గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో రూ.2.58 కోట్లు స్వాధీనం'
హైదరాబాద్: నగరంలో రేపు(మంగళవారం) జీహెచ్ఎంసీ ఎన్నికల జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి అయినట్టు ఎన్నికల అధికారి జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు. అంధులు ఓటు వేసేందుకు వీలుగా బ్రెయిలి లిపి బ్యాలెట్ సౌకర్యం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోలింగ్ స్టేషన్లలో వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో 2.58 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. రూ.1.5 లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నట్టు ఎన్నికల అధికారి జనార్ధన్ రెడ్డి వెల్లడించారు. -
ఓటర్లకు డబ్బులు పంపిణీ అంటూ ఆందోళన
రంగారెడ్డి జిల్లా: జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. కుత్బుల్లాపూర్ మండలం బాల్‌రెడ్డినగర్ కాలనీలో డబ్బుల పంపిణీ చేస్తున్నారన్న సమాచారంతో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్ధి ఇందుకూరి సూర్యప్రభ నాయకులతో కలసి ఆందోళనకు దిగారు. అధికార టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందన్న భయంతో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తోందని ఆమె ఆరోపించారు. ఒక్కో ఓటరుకు రూ.200 పంపిణీ చేస్తున్నారని.. సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని సూర్యప్రభ పోలీసులను కోరారు. -
రివాల్వర్‌తో సీఐ హల్చల్.. ఉద్యోగులపై దాడి
కుత్బుల్లాపూర్: జీహెచ్ఎంసీ ఎన్నికల సిబ్బందిపై ఓ సీఐ రివాల్వర్‌తో హల్చల్ సృష్టించాడు. ఎన్నికల విధులకు వచ్చిన ఉద్యోగులపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు చేయి చేసుకున్న ఘటన కుత్బుల్లాపూర్‌లో చోటుచేసుకుంది. కుత్బుల్లాపూర్ చింతల్ ఇక్ఫాయ్ స్కూల్‌కు ఎన్నికల విధుల కోసం ఉన్నతాధికారులు కొంతమంది ఉద్యోగులను నియమించుకున్నారు. వారిలో కొంత మందిని వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా సోమవారం సాయంత్రం అధికారులు ఆదేశించారు. దీంతో వేతనాల విషయంలో అధికారులకు, ఉద్యోగులకు వివాదం రావడంతో ఆగ్రహించిన ఉద్యోగులు ఆందోళనకు దిగారు. దీంతో బాలానగర్ సీఐ భిక్షపతిరావు రంగప్రవేశం చేశాడు. ఆందోళనకు దిగిన వారిలో ఓ ముగ్గురిని కొట్టాడు. రివాల్వర్ చేత్తో పట్టుకుని అక్కడున్న వారిని భయాందోళనకు గురి చేశాడు. తాము ఆహారం లేకుండా ఉదయం నుంచి పనిచేసి భత్యం కోసం డిమాండ్ చేస్తుంటే పోలీసులు వ్యవహరించిన దురుసు తీరు పట్ల ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. -
బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ ఫిర్యాదు
హైదరాబాద్ సిటీ: జీహెచ్ఎంసీ ఎన్నికలకు సమయం దగ్గర పడే కొద్ది అన్ని రాజకీయ పార్టీల్లో టెన్షన్ మొదలైంది. డివిజన్లలో డబ్బు పంచే వారిపై నాయకులు నిఘా పెట్టి పోలీసులకు అప్పగిస్తున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన కుమారస్వామి అనే టీఆర్ఎస్ కార్యకర్త సోమవారం ఉదయం రామంతపూర్‌లో ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న ఆరోపణతో కొందరు బీజేపీ కార్యకర్తలు అతణ్ణి పట్టుకుని చితకబాదారు. అనంతరం ఉప్పల్ ఎమ్మెల్యే ఇంటికి తీసుకెళ్లి ఉప్పల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న 16 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. చికిత్స నిమిత్తం అతనిని ఆస్పత్రికి తరలించారు. తాను టిఫిన్ చేసి బయటకు వస్తుండగా అనవసరంగా పట్టుకుని కొట్టారని కుమారస్వామి పేర్కొన్నాడు. బీజేపీ నాయకులు తమ కార్యకర్తను కొట్టారని టీఆర్ఎస్ కార్యకర్తలు రామంతపూర్ పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. -
ఈసీ రూల్స్ కాగితాలకే పరిమితమా?- నిరంజన్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం సభ్యులపై నిషేధం విధించాలని పీసీసీ అధికార ప్రతినిధి జి.నిరంజన్ ఎన్నికల కమిషన్‌ను డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా పాతబస్తీలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. ఎన్నికల నియామలికి విరుద్దంగా మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నా... ఎన్నికల పరిశీలకులకు వినపడటం లేదా అని అడిగారు. గాంధీభవన్‌లో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాత నగరంలో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారంతో ప్రజల్లోకి దూసుకెళ్లి వారి ఆదరాభిమానాలు పొందుతుంటంతో ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ పిచ్చికుక్కలా మెరుగుతూ ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. ఈ సందర్భంగా అసిఫ్‌నగర్‌లో అక్బరుద్దీన్ చేసిన ప్రసంగ వీడియోను ప్రదర్శించారు. కొంత కాలంగా ఎంఐఎం నేతలు ప్రజలను రెచ్చగొడుతున్నా ఈసీ నిమ్మకు నీరెత్తినట్లు ఉండానికి కారణం ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు కేవలం కాగితాలకే పరిమితమా? అని అడిగారు. ఎంఐఎం నేతలపై చర్యలు తీసుకునే ధైర్యం ఈసీకి లేకపోతే అదే విషయాన్ని ప్రజలకు చెప్పాలని వారే చూసుకుంటారన్నారు. ఎన్నికల నియామావలి 243-కె, 243 జెడ్ఏ ప్రకారం ఎంఐఎం నేతలను ఎన్నికల్లో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎంఐఎం సోదరులు అసదుద్దీన్, అక్బరుద్దీన్‌లను పాతబస్తీ నుంచి తరిమికొట్టే రోజు త్వరలోనే వస్తుందన్నారు. -
'5న ఇక్కడే ఉంటాను.. ఎక్కడికీ పారిపోను'
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న ఫిబ్రవరి 5వ తేదీన హైదరాబాద్‌లో ఉండొద్దంటూ తనను ఉద్దేశించి తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీపీఐ నాయకుడు నారాయణ స్పందించారు. తనను మంచి మిత్రుడని అంటూనే పరోక్షంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన కేసీఆర్‌కు హితవు పలికారు. 'హైదరాబాద్ ఎవరబ్బ సొత్తుకాదు. నేను 5వ తేదీన యిక్కడేవుంటాను. భయపడి పారిపోయేవాడిని కాను. నా ప్రకటన పాక్షికంగానే చెప్పారు. నేను 5వ తేదీన వివరంగా చెబుతాను. ప్రజలపేరుతో నాపై రెచ్చకొట్టాలనే కుటిల ప్రయత్నం మానుకోండి. హుందాగా ప్రవర్తించడం మంచిదని సలహా యిస్తున్నాను' అని నారాయణ తన ఫేస్బుక్ అకౌంట్లో ఆదివారం పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా మేయర్ పీఠాన్ని గెలుపొందితే.. తాను చెవులు కోసుకుంటానని సీపీఐ నేత నారాయణ అన్నట్టు వచ్చిన వ్యాఖ్యలను కేసీఆర్ శనివారం హైదరాబాద్‌లో జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభలో ప్రస్తావించారు. ఆయన మాట్లాడుతూ 'నాకో మంచి దోస్తు ఉన్నడు. సీపీఐ నారాయణ. జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ ఒంటరిగా మేయర్ పీఠం గెలుచుకుంటే చెవులు కోసుంటా అన్నారు. నారాయణ గారూ.. మీరు ఐదో తేదీన హైదరాబాద్‌లో ఉండకండి. ఎవరన్నా చెవులు కోస్తే మళ్లీ మేమే ఈఎన్టీలో ఆపరేషన్ చేయించాలి. ఇదివరకే ఓసారి గాంధీ జయంతిన చికెన్ తిని, తప్పు ఒప్పుకుని ఏడాది పాటు చికెన్‌కు దూరం అయ్యిండు. చెవులు కోసుకోవడం ఏమిటి.. బేల మాటలు కాకుంటే..'అని వ్యాఖ్యానించారు. -
నేటితో ముగియనున్న గ్రేటర్ ఎన్నికల ప్రచారం
హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుందని జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి ఆదివారం హైదరాబాద్‌లో వెల్లడించారు. ఈ రోజు సాయంత్రం 5.00 గంటలకు ఈ ఎన్నికల ప్రచారానికి తెరపడనుందని తెలిపారు. ఈ ఎన్నికల్లో మొత్తం 7, 802 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. 3, 200 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించినట్లు చెప్పారు. అంధుల కోసం ప్రత్యేక బ్యాలెట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నేటి సాయంత్రం 5.00 గంటల నుంచి పోలింగ్ ముగిసే వరకు మద్యం దుకాణాలు మూసి ఉంచుతారని బి.జనార్దన్‌రెడ్డి చెప్పారు. -
'కేసీఆర్ అలా చెప్పడం ఆశ్చర్యం కలిగించింది'
హైదరాబాద్ : మున్సిపల్ శాఖను తనకిస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం ఆశ్చర్యం కలిగించిందని ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో సాక్షితో కేటీఆర్ మాట్లాడుతూ... జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో 100కు పైగా డివిజన్లలో పర్యటించినట్లు చెప్పారు. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. ఒక్క అవకాశం ఇస్తే.. హైదరాబాద్ రూపు రేఖలు మారుస్తామని ప్రజలకు హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని కచ్చితంగా కైవసం చేసుకుంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసేందుకు మున్సిపల్ శాఖను ఐటీ మంత్రి కేటీఆర్‌కి అప్పగిస్తానని శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో దీనిపై స్పందన తెలపాలని కేటీఆర్‌ను సాక్షి మీడియా కోరింది. దీంతో కేటీఆర్‌పై విధంగా స్పందించారు. మున్సిపల్ శాఖను ప్రస్తుతం కేసీఆరే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. -
నేనొస్తే వారి పప్పులుడకవు ...
నేను తెలంగాణలో సీఎం క్యాండిడేట్ని. చంద్రబాబుతో కలిసి జిల్లాలల్ల ఎన్నికల పర్యటనలు చేశా. బీసీ నేతగా నాకున్న ఇమేజ్ పార్టీకి ఉపయోగపడడం వల్ల ఏపీలో టీడీపీకి కలిసొచ్చింది. తెలంగాణలో ఓడిపోగానే చంద్రబాబుకు పార్టీ నాయకులు యాదికొచ్చిన్రు. సీఎంగా పనికొచ్చిన నాయకుడు ఫ్లోర్‌లీడర్‌గా పనికిరాడట. పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా పనికిరాడట... మళ్లీ గదే రేవంత్, ఎర్రబెల్లి, రమణలు అవసరమైనరు... అని సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రేటర్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే. బీసీ నాయకుడిగా జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ఈయనను ఎన్నికల సమయంలో టీడీపీలో చేర్చుకొని శివారుల్లోని ఓ నియోజకవర్గం నుంచి టికెట్టు ఇచ్చిన చంద్రబాబు తెలంగాణలో ఘోర ఓటమి తరువాత సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదు. దాంతో ఆయన కూడా ‘ నా ఉద్యమ జీవితం ముందు ఈ పార్టీ ఓ లెక్కా’ అని మళ్లీ బీసీల సమస్యలపై జాతీయ స్థాయిలో పోరాటానికే మొగ్గు చూపారు. అంత వరకు బాగానే ఉన్నా... ఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆయన పార్టీలో మళ్లీ తళుక్కుమన్నారు. బీసీ కార్డు అవసరమై పార్టీ నేతలే పిలిచారో... పార్టీ ధీనస్థితి చూసి జాలితో ఆయనే వచ్చారో తెలియదు గానీ డిసెంబర్ 12న నిజాం కాలేజ్ గ్రౌండ్స్‌లో ప్రత్యక్షమై టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అదే సమయంలో టీడీపీ-బీజేపీలను భుజానికెత్తుకొని బీసీల పార్టీలు ఇవి రెండేనని మరోసారి చంద్రబాబు, బీజేపీ నేతల దృష్టిలో పడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఎల్.బి.నగర్లో తనను నమ్ముకున్న వాళ్లకు టికెట్లు ఇప్పించి, వారి తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. అయినా తనకు తెలంగాణ నాయకత్వ బాధ్యతలు చూస్తున్న రమణ, ఎర్రబెల్లి, రేవంత్‌రెడ్డి తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని కొంత అసంతృప్తితో ఉన్నారు. తానొస్తే వాళ్లు ఎక్కడ పలచన అవుతారో... బీసీ నేతగా తనకున్న ఇమేజ్ ముందు ఎక్కడ తేలిపోతామో ... అనే భయంతోనే పార్టీ కార్యక్రమాలకు రాకుండా దూరం పెడుతున్నారని తన సని్నిహ తులతో చెపుతున్నారీ బీసీ నేత. -
వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు
ఫిబ్రవరి 2న జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్‌కు హాజరయ్యే వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నట్లు జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి , కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. వికలాంగులకు, నడవలేని వారికి సాధ్యమైనన్ని పోలింగ్ కేంద్రాల్లో వీల్చైర్లు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. వృద్ధులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సౌకర్యాలను సహచర ఓటర్లు కూడా స్వాగతించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. వీరిని పోలింగ్ కేంద్రాల సమీపంలోకి అనుమతించాల్సిందిగా పోలీసులకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలిపారు. రెండు లక్షలకుపైగా తొలగింపు... ఎన్నికల నియమావళి మేరకు ఇప్పటివరకు 2,00,745 అక్రమహోర్డింగులు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, కటౌట్లు,పోస్టర్లను తొలగించినట్లు పేర్కొన్నారు. ఇందులో 7,654 కటౌట్లు, 52,672 ఫ్లెక్సీలు, 60,000 బ్యానర్లు, 81,000 పోస్టర్లు ఉన్నాయని తెలిపారు. ఇప్పటి వరకు అక్రమంగా తరలిస్తున్న రూ. 2,54,28,200 స్వాధీనపరచుకున్నట్లు తెలిపారు. శుక్రవారం గాంధీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రూ. 37 లక్షలు స్వాధీనపరచుకున్నట్లు తెలిపారు. పోలింగ్ సిబ్బంది 7 గంటలకల్లా చేరుకోవాలి... ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 7 గంటలలోపు తమకు కేటాయించిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు చేరుకోవాలని తెలిపారు. పొరుగుజిల్లాల నుంచి వచ్చేవారి కోసం నగరంలోని ఇమ్లీబన్, జూబ్లీ బస్టాండ్ల నుంచి ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. - సాక్షి, సిటీబ్యూరో -
'వదిన భువనేశ్వరి ఓటు టీఆర్ఎస్కే'
చంద్రబాబు మాట ఎలా ఉన్నా.. తమ వదిన భువనేశ్వరి మాత్రం టీఆర్ఎస్కే ఓటు వేయడం ఖాయమని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో శనివారం సాయంత్రం నిర్వహించిన భారీ బహిరంగ సభలో పలు చెణుకులు విసిరారు. హైదరాబాద్‌ను వదల బొమ్మాళీ వదల అని చంద్రబాబు అంటున్నారని, ఆయన్ను తాము పొమ్మనలేదని చెప్పారు. ఆయన వ్యాపారమంతా.. తమ వదిన భువనేశ్వరి చూస్తుందని, ఈయన కంటే ఆమే బాగా చూస్తోందని అన్నారు. కావాలంటే 15 రోజులకు ఓసారి వచ్చి లెక్కలు చూసుకుని పోవాలని తెలిపారు. భువనేశ్వరి కూడా ఇక్కడే ఉంటున్నారు కాబట్టి, ఆమెకు నిజాయితీ ఉందని, ఆమె మాత్రం గ్యారంటీగా తమకే ఓటు వేస్తారని అన్నారు. చంద్రబాబుకు వాస్తవాలు తెలియవు కాబట్టి ఇక్కడే ఉంటానంటున్నారని విమర్శించారు. నేను అమరావతికి, ముంబైకి వెళ్లి ఇక్కడే ఉంటానంటే కుదురుతుందా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో తనకు ఉండబుద్ధి వేయట్లేదని, హైదరాబాద్ నుంచి పాలించాలంటే విదేశాల్లో ఉన్నట్లు ఉంటుందని విజయవాడలో చెబుతారన్నారు. గోదావరి నీళ్లు, కరెంటు అన్ని విషయాల్లో పంచాయతీ పెడుతున్నారని మండిపడ్డారు. నీ పని నువ్వు చేసుకో, మా పని మేం చేసుకుంటామని స్పష్టం చేశారు. -
బాబూ.. నీ నెత్తుటి ముద్రలు అలాగే ఉన్నాయి
హైదరాబాద్ అభివృద్ధిలో అడుగడుగునా తన ముద్రలు ఉన్నాయని చెప్పిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బషీర్‌బాగ్‌లో రైతులపై ఆయన కాల్పులు జరిపించారని, ఆ నెత్తుటి ముద్రలు ఇప్పటికీ ఉన్నాయని గుర్తు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో శనివారం సాయంత్రం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అనుకున్న సమయం కంటే ఆలస్యంగా వచ్చిన కేసీఆర్ కుడి చేతికి.. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ దట్టీ కట్టారు. ఈ సందర్భంగా ఆయన ఇతర పార్టీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణకు గుండెకాయ లాంటి హైదరాబాద్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరుగుతున్నాయని, అనేక త్యాగాలు, పోరాటాలు, ఆత్మబలిదానాల ఫలితంగా తెలంగాణ ఏర్పడిందని ఆయన అన్నారు. ఈ తెచ్చుకున్న తెలంగాణ ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుని ప్రయాణాన్ని ప్రారంభించిదన్నారు. ఈ సమయంలో జరుగుతున్న ఎన్నికలు చాలా ముఖ్యమైనవని, ఓటు వేసేవాళ్లు చాలా జాగ్రత్తగా ఆలోచించి వేయాలని కోరారు. యూపీఏ సర్కారు తెలంగాణ ఇవ్వడానికి హైదరాబాద్‌పై రాజీ పడతారా అని అడిగిందని, ఈ విషయంలో ఏ కొంచెం రాజీపడినా 2006 నాటికే తెలంగాణ వచ్చేదని అన్నారు. గుండెకాయ లేని మొండెం ఇస్తామంటే తీసుకోడానికి తాము సిద్ధంగా లేమని, హైదరాబాద్‌తో కూడిన తెలంగాణనే ఇవ్వాలని అడిగినట్లు చెప్పారు. అందుకే రాష్ట్ర సిద్ధికి పద్నాలుగున్నర సంవత్సరాలు పట్టిందన్నారు. నిన్న మొన్న హైదరాబాద్‌లో తిరిగిన చంద్రబాబు లాంటివాళ్లు దాదాపు వచ్చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని కుట్రలు పన్ని అడ్డుకున్నారని, చివర్లో కూడా హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలన్నారని, ఇలాంటి తరుణంలో గట్టిగా నిలబడి, పోరాటం చేసి హైదరాబాద్‌తో సహా తెలంగాణ తెచ్చుకున్నట్లు చెప్పారు. చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్‌లో పని ఉందని, ప్రజలు అక్కడ అవకాశం ఇచ్చారు కాబట్టి అక్కడి బజారు ఊడ్చుకోవాలంటే హిందూపురం నుంచి ఇచ్ఛాపురం వరకు బోలెడు బజార్లున్నాయని, హైదరాబాద్ బజారు మేమే ఊడ్చుకుంటామని చెప్పానన్నారు. తెలంగాణలో వచ్చే ఆదాయం ఇక్కడి ప్రజల అభివృద్ధికే ఖర్చుపెడుతున్నామని చెప్పారు. మన డబ్బు మనకే మిగులుతోంది కాబట్టి పింఛను వెయ్యి, 1500 చొప్పున ఇస్తున్నామన్నారు. ఏపీలో మనిషికి 4 కిలోల బియ్యం ఇస్తుంటే తెలంగాణలో 6 కిలోల బియ్యం ఇస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రం విడిపోతే తెలంగాణ అంధకారం అవుతుందని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు గానీ.. ఇక్కడ బ్రహ్మాండంగా కరెంటు సప్లై చేసుకుంటున్నట్లు తెలిపారు. పరిశ్రమలకు కూడా కోత లేకుండా 24 గంటల కరెంటు ఇస్తున్నామన్నారు. ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో రూ. 51 వేలు ఇస్తున్నామని, దేశంలో ఎక్కడా లేని విధంగా పేదల ఆత్మగౌరవం కోసం డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించి ఇస్తున్నట్లు గుర్తుచేశారు. ఇంకా ప్రాజెక్టులు కట్టుకోవాలి, మంచినీళ్లు తెచ్చుకోవాలని.. చాలా సాధించాల్సి ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. బల్దియా ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. చంద్రబాబు నాయుడు వచ్చి కితకితలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని.. దీనిపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బల్దియాలో గులాబి జెండా ఎగిరితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపాలిటీ చెట్టాపట్టాలు వేసుకుని తిరిగితే బ్రహ్మాండమైన అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. మూసీనదిని మురికి, కంపు నదిగా మార్చిన ఘనత కాంగ్రెస్, టీడీపీలది కాదా అని ప్రశ్నించారు. మంచినీటి చెరువు హుస్సేన్ సాగర్‌ను కాలుష్య కాసారంగా మార్చింది కూడా వాళ్లేనన్నారు. పెద్దమనిషి అని తాను భావించిన దత్తాత్రేయ కూడా ఉల్టాపల్టా మాట్లాడుతున్నారన్నారు. కేంద్రం ఇచ్చిన డబ్బులతోనే కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇళ్లు కడతారని ఆయన అంటున్నారని.. కానీ కేంద్ర మంత్రిగా ఆయన నిజాయితీగా మాట్లాడాలని చెప్పారు. దేశంలో ఎక్కడైనా ఈ పథకం ఉందా అని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అక్కడి ముఖ్యమంత్రులు ఇలాంటి పథకం చేపట్టారా అని అడిగారు. చంద్రబాబుతో తిరిగి ప్రచారం చేశారని.. ఆయన పాలించే ఏపీలోనైనా డబుల్ బెడ్రూం స్కీం ఉందా అని నిలదీశారు. హైదరాబాద్ మీద ప్రేమ ఉందని, ఇక్కడే ఉంటానని చంద్రబాబు అంటున్నారు, ఆయన ముద్రలు అడుగడుగునా ఉన్నాయని అంటున్నారని ఎద్దేవా చేశారు. బషీర్‌బాగ్ పోలీసు కాల్పుల్లో నలుగురు రైతులను కాల్చి చంపిన ముద్రలు ఇప్పటికీ ఉన్నాయని, అసెంబ్లీ ఎదుట అక్కచెల్లెళ్లను గుర్రాలతో తొక్కించిన ముద్రలు ఉన్నాయని, కాంట్రాక్టు ఉద్యోగ వ్యవస్థ ముద్ర వేసింది ఆయనేనని, దాన్ని తిప్పి వాళ్లను పర్మినెంటు చేసి వాళ్ల కడుపు నింపే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. పెట్టుబడి దారులకు అండగా నిలబడి కార్మికుల కడుపు కొట్టారని మండిపడ్డారు. నారాయణకు ఎవరైనా చెవి కోస్తే ఆస్పత్రిలో చేర్చాలి.. సీపీఐ నాయకుడు నారాయణ గురించి కూడా ఆయన పలు విమర్శలు చేశారు. టీఆర్ఎస్ సొంతబలంతో గెలిస్తే తాను చెవికోసుకుంటానని ఆయన అన్నారంటూ.. ''5వ తేదీన హైదరాబాద్‌లో ఉండకు.. ఎవరైనా చెవి కోస్తే ఈఎన్టీ దవాఖానలో చేర్పించాలి'' అన్నారు. ఇప్పుడు కూడా చెవి కోసుకుంటా, కాలు కోసుకుంటానన్న బేల ముచ్చట్లు ఎందుకని ఎద్దేవా చేశారు. వరంగల్‌లో కూడా కొందరు చెవి కోసుకుంటా, మెడ కోసుకుంటా.. ఇంకేవో కోసుకుంటామన్నారని, 2వ తేదీన ఎవరెవరికి ఏం కోయాలో ప్రజలే చూసుకుంటారని చెప్పారు. -
గ్రేటర్లో టీడీపీపై ప్రజలకు నమ్మకముంది: చంద్రబాబు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజలకు అచంచలమైన విశ్వాసం ఉందని టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. తాము అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్‌ను ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేశామన్నారు. హైటెక్ సిటీ నిర్మాణంతో హైదరాబాద్ దశ మారిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఆనాడు టీడీపీ చేసిన అభివృద్ధే ఇప్పుడు అందరూ అనుభవిస్తున్నారని అన్నారు. స్మార్ట్ సిటీల ప్రయోగం అప్పట్లోనే తాను అమలు చేశామని చంద్రబాబు అన్నారు. తమ హాయంలో బిల్‌గేట్స్, క్లింటన్ కూడా హైదరాబాద్ వచ్చారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. -
ఓయూ పరీక్షలు వాయిదా
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు జరిగే వివిధ కోర్సుల పరీక్షలను వాయిదా వేసినట్లు ఉస్మానియా యూనివర్సిటీ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. వాయిదా పడిన పరీక్షల వివరాలు, తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారో తదితర వివరాలు, తేదీలను ఉస్మానియా వెబ్సైట్లో చూడొచ్చని అధికారులు పేర్కొన్నారు. -
‘గ్రేటర్’ ప్రచారానికి రేపటితో తెర
జంట నగరాలను చుట్టివచ్చిన గులాబీ దళాలు రోడ్‌షోలతో హోరెత్తిన ప్రచారం రహ దారులపైనే గడిపిన మంత్రులు మంత్రి కేటీఆర్ విస్తృత పర్యటనలు నేడు పరేడ్ గ్రౌండ్స్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల ప్రచారం ఆదివారంతో ముగియనుంది. తొలిసారి గ్రేటర్లో పాగా వేసేందుకు నూటా యాభై డివిజన్లలో బరిలోకి దిగిన అధికార టీఆర్ఎస్ జంట నగరాల్లో ముమ్మరంగా ప్రచారం చేసింది. ‘జీరో టు హండ్రెడ్’ నినాదంతో దాదాపు రాష్ట్ర మంత్రులంతా ప్రచారంలో పాల్గొన్నారు. పార్టీ తరపున గ్రేటర్ ఎన్నికల బాధ్యతలు చూసిన మంత్రి కేటీఆర్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మంత్రులు సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆయా జిల్లాల సీనియర్ నాయకులకు ప్రచార బాధ్యతలు అప్పజెప్పిన పార్టీ అధినేత, సీఎం కేసీఆర్... ఈ-పబ్లిసిటీలో భాగంగా తెలంగాణ భవన్లో మీట్ ది ప్రెస్ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లారు. శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. అభ్యర్థుల ఎంపికకు ముందే టీఆర్ఎస్ నాయకత్వం గ్రేటర్ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాలకు మంత్రులు, సీనియర్ నేతలను ఇన్చార్జులుగా నియమించింది. ఒక్కో డివిజన్ బాధ్యతను ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీకి అప్పగించి విస్తృతంగా ప్రచారం చేసింది. విశ్వనగరమే నినాదం ‘60 ఏళ్లుగా అందరికీ అవకాశం ఇచ్చారు. ఈసారి మాకు అవకాశమివ్వండి. చారిత్రక నగరమైన హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం..’ అంటూ టీఆర్ఎస్ ప్రచారం చేసింది. మేనిఫెస్టోలో పలు హామీలు ఇవ్వడంతోపాటు గత 18 నెలల కాలంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలనూ వివరించింది. మంత్రులు తమకు అప్పజెప్పిన నియోజకవర్గాల పరిధిలోని డివిజన్లలో విస్తృతంగా తిరిగారు. బస్తీలు, కాలనీల్లో పాదయాత్రలు నిర్వహించారు. ఇంటింటి ప్రచారం, బహిరంగ సభలు నిర్వహించారు. కుల సంఘాలు, యూనియన్లు, ఆయా వర్గాల భేటీలతో టీఆర్ఎస్ వినూత్నంగా ప్రచారం చేసింది. మంత్రి కేటీఆర్ వరుసగా ఏడు రోజుల పాటు 120 చోట్ల రోడ్‌షోలలో ప్రసంగించారని టీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి. నేడు సీఎం బహిరంగ సభ గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి సీఎం కేసీఆర్ కేవలం మీట్ ది ప్రెస్‌లో పాల్గొనడం మినహా ఎలాంటి ప్రచారం చేయలేదు. అయితే ఎన్నికల ప్రచారం మరో ఇరవై నాలుగు గంటల్లో ముగుస్తుందనగా సికింద్రబాద్ పరేడ్ గ్రౌండ్లో శనివారం నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన పాల్గొంటున్నారు. ఈ సభను శనివారం సాయంత్రం 4 నుంచి 10 గంటల దాకా నిర్వహించేందుకు అనుమతి తీసుకున్నారు. నూటా యాభై డివిజన్ల నుంచి బూత్‌ల వారీగా జనాన్ని ఈ బహిరంగ సభకు సమీకరించాలని టార్గెట్ పెట్టుకున్నామని పార్టీ సీనియర్ నాయకుడొకరు చెప్పారు. సభా ప్రాంగణంలో ఇప్పటికే మూడు వేదికలు సిద్ధం చేశారు. ప్రధాన వేదికను సీఎం కేసీఆర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేటాయించారు. రెండో వేదికను బరిలో ఉన్న అభ్యర్థులకు... మరో వేదికను పార్టీ ప్రచార కళా బృందాల ఆట పాటలకు కేటాయించారు. ఈ సభకు జనం భారీగానే హాజరవుతారని అధికార పార్టీ భావిస్తోంది. సుమారు 2 వేల మంది పోలీసులను మోహరించనున్నట్లు సమాచారం. సభా ప్రాంగణంలో 50 ఎల్ఈడీలను, సభా ప్రాంగణం నుంచి ప్రధాన మార్గాల్లో కిలోమీటరు పరిధిలో మైకులను ఏర్పాటు చేస్తున్నారు. -
అందుబాటులో ఉండే నేతలు కావాలి
కామన్ మ్యాన్ Voice ఉన్న ఊరును వదిలి ఉపాధి కోసం నగరానికి వచ్చారు. పదేళ్లుగా ఇక్కడే ఉంటున్నారు. ఇదే ఇప్పుడు సొంతూరైంది. ప్రతి ఎన్నికల్లోనూ ఇక్కడే ఓటేస్తున్నారు. కానీ బతుకు బండికి భరోసా మాత్రం దొరకలేదంటున్నాడు విద్యానగర్‌కు చెందిన సుధాకర్‌రెడ్డి. ఏ నాయకుడూ ఇతవరకు సాయం అందించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ‘బతుకు బండి లాగించడానికి చేసిన ప్రయత్నాలు కొన్ని విఫలమయ్యాయి. కుటుంబమంతా కష్టపడి పని చేస్తేనే ఫలితం ఉంటుందని నిర్ణయించుకుని మీర్చి బజ్జి బండి పెట్టా. నాతో పాటు భార్య, ఇద్దరు పిల్లలు కష్టపడతారు. రోడ్డుపై కాస్త ఇబ్బంది కలిగితే అంతా చిర్రుబుర్రులాడుతుంటారు. పదే ళ్లుగా ఈ వ్యాపారాన్నే నమ్ముకొని బతుకున్నాం. మాకు నేతలు, ప్రభుత్వాలు తోడ్పాటు దొరకలేదు. ప్రతి ఎన్నికల్లో ఓటు వేస్తున్నామే తప్ప తమలాంటి వారికి ఏవిధంగా అండగా నిలవాలనే ఆలోచన నాయకులకూ లేదు’ అని పేర్కొన్నాడు. ‘మాలాంటి చిరు బతుకులకు అండగా ఉండే నేతలు కావాలి. పొదుపు సంఘాలకు ఇచ్చే ప్రోత్సాహకాలు మాకూ ఇస్తే బాగుపడతాం. నాయకులు ఎన్నికలప్పుడే కాకుండా గెలిచాక కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరుతున్నాడు. - అంబర్‌పేట -
పేదల పక్షాన మజ్లిస్
⇒ పేదలకు రూ. 5కే భోజనం స్వచ్ఛమైన తాగు నీరు.. ⇒ తొలిసారి గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల సిటీబ్యూరో: ఆల్ ఇండియా మజ్లిస్-ఏ- ఇత్తేహదుల్ ముస్లిమీన్ పార్టీ పేదల పక్షాన నిలుస్తుందని, ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు, నిరుపేదలకు రూ. 5 కే భోజనం అందించడమే తమ ఎన్నికల అజెండా అని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా మజ్లిస్ తొలిసారి జీహెచ్ఎంసీ -2016 ఎన్నికల మేనిఫెస్టోను శుక్రవారం అసద్ విడుదల చేశారు. మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు.. గ్రేటర్లో ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన, రోడ్ల అభివృద్ధి, నూతనంగా మల్టీలెవల్ ఫై ్లఓవర్స్ నిర్మాణం. చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు, మీర్ ఆలం ట్యాంక్ సుందరీకరణ.నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు సమీకృత ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ అమలు. మరిన్ని బస్షెల్టర్లు, ప్రత్యేక బస్సు మార్గాల (బస్బే) ఏర్పాటు. సిటీ ఆర్టీసీ బస్సుల నష్టాన్ని జీహెచ్ఎంసీ భరించడానికి వ్యతిరేకం నగరవ్యాప్తంగా ఎల్ఈడీ దీపాలు ఏర్పాటు కంప్యూటర్ ఆధారంగా నిర్వహణ. ఘన వ్యర్థాల నిర్వహణకు పక్కా ప్రణాళిక అమలు. మరిన్ని స్వీపింగ్ యూనిట్ల ఏర్పాటు, చెత్త ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు. శివారు ప్రాంతాల్లో నాలాల విస్తరణ, విస్తరణతో ఆస్తులు కోల్పోయేవారికిమెరుగైన పరిహారం అందజేత. గ్రేటర్ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు సరఫరా. మురికివాడల్లో తాగునీటిని శుద్ధి చేసేందుకు 1500 ఆర్ఓ వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు. భూగర్భజలాలను పెంచేందుకు వర్షపునీటి సంరక్షణకు చర్యలు. నగరంలోని పేదలకు రూ.5కే నాణ్యమైన భోజనం అందజేత. ఇందుకోసం మరిన్ని భోజన కేంద్రాల ఏర్పాటు.గౌలిపురా, అంబర్‌పేట, న్యూ బోయిగూడ, జియాగూడ, చంచల్‌గూడలో ఆధునిక కబేళాల ఏర్పాటు.నగరంలోని ఆరోగ్య కేంద్రాల బలోపేతానికి కృషి. 112 అర్బన్ ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీల భర్తీ, కొత్తగా 33 అర్బన్ హెల్త్ సెంటర్ల మంజూరు.నగరంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్రీడల ప్రోత్సాహానికి మినీ, మల్టీపర్పస్స్పోర్ట్స్ కాంప్లెక్స్, క్రీడా మైదానాలు వ్యాయామ కేంద్రాల ఏర్పాటు. క్రీడా ఫెలోషిప్ పథకం అమలు. సిటీలో సుమారు 1000 ఈ-లైబ్రరీల ఏర్పాటు, రీడింగ్ రూమ్స్ పథకం పునఃప్రారంభం.విపత్తు నివారణ ప్రణాళికలకు రూపకల్పన. వీధి వ్యాపారుల రక్షణ చట ్టం అమలు చేస్తాం. వీధి వ్యాపారాల కోసం హాకర్స్ జోన్స్ ఏర్పాటు.నగరానికి 40 టీఎంసీల కృష్ణా, గోదావరి జలాలు కేటాయించే విధంగా చర్యలు, రెండు స్టోరేజ్ ప్లాంట్ అమలు, శామీర్‌పేట, చౌటుప్పల్‌లో 40 టీఎంసీల స్టోరేజ్ ప్లాంట్లు నిర్మాణం. ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు పూర్తి. విద్యుత్ సబ్ స్టేషన్ల ఏర్పాటు, అదనపు ట్రాన్స్ఫార్మర్ల సౌకర్యం. నగర ంలో సీసీ టీవీల నిఘా విస్తరణ. -
నేను మీ అభ్యర్థిని..
హోరెత్తుతోన్న ఐవీఆర్ఎస్ ప్రచారం ఓటర్లకు వెల్లువెత్తుతోన్న మొబైల్ కాల్స్ సామాజిక సైట్లలోనూ అదే జోరు సిటీబ్యూరో: ‘నేను ------- మీ పార్టీ అభ్యర్థిని. మీ డివిజన్ నుంచి పోటీచేస్తున్నాను. నన్ను గెలిపిస్తే డివిజన్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తాను. మీ అమూల్యమైన ఓటు నాకు వేసి గెలిపించాలి. మీరు తప్పకుండా ఫిబ్రవరి 2న మీ ఓటు హక్కు వినియోగించుకోవాలి’. ఏంటీ సందేశం అనుకుంటున్నారా.. ఇప్పుడు ఇంటింటి ప్రచారం మాటెలా ఉన్నా.. ఓటర్ల మొబైల్ ఫోన్లకు పోటీచేస్తున్న అభ్యర్థుల తరఫు నుంచి ఈ తరహా ఫోన్ రికార్డు సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఫోన్ మోగితే చాలు సిటీజన్లు ఇది ఏ అభ్యర్థి రికార్డు సందేశమో అని నిట్టూరుస్తున్నారు గ్రేటర్ సిటీజన్లు. ఈ తరహా ఐవీఆర్ఎస్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం) ప్రచారం జోరు ఇపుడు సిటీలో పతాక స్థాయికి చేరింది. అభ్యర్థుల అవసరాలకు తగ్గట్టుగా పలు ప్రైవే టు ఏజెన్సీలు రంగంలోకి దిగి ఈ తరహా ప్రచారం చేసిపెడుతున్నాయి. ఇంటింటి ప్రచారానికి వెళ్లినప్పుడుడు అందరు ఓటర్లను కలుసుకోలేకపోయినా.. ఈ ఐవీఆర్ఎస్ విధానం ద్వారా ముందుగా రికార్డు చేసిన సందేశాన్ని యువకులు, ఉద్యోగులు, కార్మికులకు వినిపిస్తే వారి ఓటు తమ ఖాతాలో పడుతుందని భావిస్తున్నారు మన నేతశ్రీలు. మహానగరంలో సొంత వాహనం లేకున్నా సెల్‌ఫోన్ లేని వారు అరుదు. దీంతో పలు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఈ తరహా ప్రచారం వైపు మొగ్గుచూపుతున్నారు. ఇక పనిలోపనిగా సంక్షిప్త సందేశాల ద్వారా కూడా ‘మీ ఓటు మాకే వేయాలన్న’ సందేశాలను పంపిచేస్తున్నారు. ఇక సోషల్ మీడియా సైట్లు ఫేస్బుక్, వాట్సప్ గ్రూపులు సైతం ఎన్నికల ప్రచారానికి కరదీపికలుగా మారడం ఈసారి గ్రేటర్ ఎన్నికల వైచిత్రి. ఫలానా అభ్యర్థికి మీ అమూల్యమైన ఓటేయాలని ఫేస్బుక్లో ఎవరైనా పోస్టు చేస్తే చాలు లైకులే లైకులు.. కామెంట్లే కామెంట్లు. ఇక వాట్సప్ గ్రూపుల్లోనూ చాంతాడంత సందేశాలతో పలు గ్రూపుల్లో ఉన్న మహానగర ఓటరు మహాశయులు ఎన్నికల ప్రచారంలో తరిస్తున్నారు మరి. అభ్యర్థుల గుణగణాలు, వ్యక్తిత్వం, చేస్తున్న ఖర్చు, గతంలో అభ్యర్థులు స్థానికంగా చేసిన సేవలు.. విద్యార్హతలు, ఆస్తిపాస్తులు ఒక్కటేమిటి ఇప్పుడిలాంటి అంశాలన్నీ సామాజిక సైట్లలో హాట్ టాపిక్‌గా మారి చర్చోపచర్చలకు దారితీస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ హైటెక్ ప్రచార బాణీ చూసి సామాన్యుడు మాత్రం ముక్కున వేలేసుకుంటున్నాడు. -
టీఆర్ఎస్కు షాక్ ఇవ్వండి
బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్ ముషీరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి టిఆర్ఎస్ పార్టీకి షాక్ ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం అడిక్‌మెట్ డివిజన్లో అభ్యర్థి కె.ప్రసన్నతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బస్తీల్లో ఇంటింటికి తిరిగి కమలం గుర్తుకు ఓటేయాలని కోరారు. ఎం.పీ, ఎమ్మెల్యే, కార్పొరేటర్ ముగ్గురూ ఒకటే పార్టీకి చెందినవారైతే అడిక్‌మెట్ మరింతగా అభివృద్ధి చెందుతుందన్నారు. అనంతరం అడిక్‌మెట్ బీజేపీ కార్యాలంయలో విలేకరులతో మాట్లాడుతూ టీఆర్ఎస్ నేతలకు నగర ప్రజలపై నమ్మకం లేకనే పక్క జిల్లాల నుంచి కార్యకర్తలను తెచ్చుకున్నారన్నారు. అధికార పార్టీ ఎన్నికల కోడ్‌ను ఉల్లఘించి రూ. కోట్లు వెదజల్లుతోం దని ఆరోపించారు. తెలంగాణ ఆవిర్భావం రోజున ప్రధానిని పిలవమని కోరితే ఆయన వస్తే తమ గ్రాఫ్ తగ్గిపోంతుందని భయపడి నేడు ప్రధానిపై విమర్శలు చేయడం తగదన్నారు. అధికారంలోకి వచ్చి 18నెలలు గడిచినా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని ఆరోపించారు. కేటీఆర్, కవితలు మజ్లిస్‌కు తమకు పొత్తు లేదని చెబుతుండగా, ముఖ్యమంత్రి కేసీఆర్ మజ్లిస్ మిత్రపక్షమని బహిరంగంగా ప్రకటించారన్నారు. నగరంలో మంచినీరు లేక ప్రజలు అల్లాడుతుంటే, నగరానికి వచ్చే సింగూర్ నీటిని గజ్వేల్, సిద్దిపేటలకు తరలించాలంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటింటికి నల్ల ఏ విధంగా ఇస్తారన్నారు. 31 తరువాత టీఆర్ఎస్ బయట వ్యక్తులను పంపాలి... వివిధ జిల్లాల నుంచి గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన టిఆర్ఎస్ కార్యకర్తలు 31వ తేదీ సాయంత్రం నగరం విడిచి వెళ్లిపోవాలన్నారు. వాళ్లు నగరం విడిచి వెళ్లేలా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో తమ పార్టీకి చెందిన యువమోర్చా నాయకులు వారిని వెళ్లగొడతారన్నారు. కార్యక్రమంలో విన్ను ముది రాజ్, బొట్టు శ్రీను, సాయికృష్ణ యాదవ్, జగదీష్, కౌండిన్య ప్రసాద్, అనురాధ, ఓంప్రకాష్, కిషోర్, రామస్వామి తదితరులు పాల్గొన్నారు. -
విజయమే లక్ష్యం
నేడు పరేడ్ గ్రౌండ్స్‌లో టీఆర్ఎస్ బహిరంగ సభ భారీగా జన సమీకరణకు కసరత్తు సీఎం కేసీఆర్ ప్రసంగంపై అభ్యర్థుల ఆశలు సిటీబ్యూరో: అధికార టీఆర్ఎస్ పార్టీ బల్దియా ఎన్నికల్లో గెలుపే లక్ష్యం గా శనివారం పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న బహిరంగ సభకు భారీగా జన సమీకరణ చేయాలని గ్రేటర్ పార్టీ విభాగం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ఈ సభలో ప్రధాన ఉపన్యాసం చేయనున్నారు. దీంతో పార్టీ శ్రేణులను భారీ గా తరలించేందుకు ముఖ్య నేతలు ముమ్మర యత్నాలు చేస్తున్నారు. ఒక్కో డివిజన్ నుంచి వెయ్యి మందికి తక్కువ కాకుండా సభకు తరలించాల్సిందిగా అభ్యర్థులకు దిశా నిర్దేశం చేసినట్లు సమాచారం. జన సమీ కరణ విషయం లో డివిజన్లకు ఇన్చార్జులుగా నియమితులైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ లు చొరవ తీసుకోవాలని పార్టీ ఆదేశించింది. వాహనాలను సొంతంగా సమకూర్చుకోవాలని అభ్యర్థులకు సూ చించింది. బహిరంగ సభ నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌కు చేరుకు నే అన్ని దారులు గులాబీ తోరణా లు, కటౌట్లు, ఫ్లెక్సీలతో నిండిపోయా యి. సభకు హాజ రయ్యే వారికి అసౌకర్యం కలుగకుండా ట్రాఫిక్‌పరంగా జాగ్రత్త లు తీసుకుంటున్నారు. వాహనాల పా ర్కింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లు పరిశీలన సిటీబ్యూరో: టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను నగర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాద వ్, పద్మారావు గౌడ్లు శుక్రవారం పరిశీలించారు. సభకు నగరం నలుమూలల నుంచి లక్షలాదిగా జనం తరలిరానున్న నేపథ్యంలో ఎక్కడా అసౌకర్యానికి తావులేకుండా వేదిక, పార్కింగ్ ఏర్పాట్లు ఉండాలని నిర్వాహకులకు మంత్రులు సూచించారు. విజన్ పైనే ఆశలు గ్రేటర్లో ఎన్నికలకు సంబంధించిఐటీ, పంచాయతీ రాజ్ శాఖల మంత్రి కేటీఆర్, నిజామాబాద్ ఎంపీ కవిత స్టార్ ప్రచాకర్తలుగా హోరెత్తిస్తున్న విషయం విదితమే. కొంతమంది మం త్రులూ ప్రచారంలో పాల్గొని హామీల వర్షం గుప్పిస్తున్నారు. ఎవరెంతగా ప్రచారం చేసినాసీఎం కేసీఆర్ ప్రసంగం పైనే అభ్యర్థులు కోటి ఆశలు పెట్టుకున్నారు. రాబోయే ఐదేళ్లకు టీఆర్ఎస్ విజన్‌ను ఆవిష్కరిస్తేనే ఓటర్లలో నమ్మకం పెరుగుతుందని అభ్యర్థులు చెబుతున్నారు. -
బాబుకు ఇక్కడ అడుగు పెట్టే హక్కు లేదు
హోం మంత్రి నాయిని సైదాబాద్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు హైదరాబాద్‌లో అడుగు పెట్టే హక్కు లేదని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన చేసిన కుట్రలే వెయ్యి మంది విద్యార్థుల బలిదానానికి కారణమయ్యాయని మండిపడ్డారు. మళ్లీ ఏ ముఖం పెట్టుకుని ఓట్ల కోసం తిరుగుతున్నారని నాయిని ప్రశ్నించారు. ఐఎస్‌సదన్ డివి జన్‌కు చెందిన టీపీసీసీ కార్యదర్శి కోట్ల శ్రీనివాస్ తన పదవికి రాజీనామా చేసి శుక్రవారం హోం మంత్రి నాయిని సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఐఎస్ సదన్‌లో ఏర్పాటు చేసిన సభలో కోట్ల మెడలో గులాబీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నాయిని మాట్లాడుతూ టీడీపీ అంటేనే తెలంగాణ ద్రోహుల పార్టీ అని ఆరోపించారు. ‘నీవు ఆంధ్రాకి ముఖ్యమంత్రివి. నీ నూకలు అక్కడే చెల్లుతలేవు. ఇక ఇక్కడేం చెల్లుతుందని’ ప్రశ్నిం చారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక 1.80 లక్షల మందికి పట్టాలు ఇచ్చామని తెలి పారు. అద్దె ఇళ్లలో ఉంటున్నవారికి నగర శివారులో వెయ్యి ఎకరాలలో సీఎం అపార్ట్మెంట్లు కట్టించి ఇస్తారని పేర్కొన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ఐఎస్ సదన్ డివిజన్ అభ్యర్థి సామ స్వప్నసుందర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, అమరవాది లక్ష్మీనారాయణ, నర్సింహారెడ్డి, మన్నె రంగా, సామ సుందర్‌రెడ్డి, మామిడోజు శంకరాచారి, లక్ష్మణ్‌రావు, పన్నాల పర్వతాలు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
క్లైమాక్స్
► పతాక స్థాయికిపార్టీల ప్రచారం ► బాబు, కేసీఆర్‌లపై కాంగ్రెస్ నిప్పులు ► తాను ఇక్కడే ఉంటానని బాబు భరోసా ► రోడ్డు షోలతో వేడి పెంచిన బీజేపీ, ఎంఐఎం ► నేడు భారీ బహిరంగ సభకు టీఆర్ఎస్ సన్నాహాలు సిటీబ్యూరో: గ్రేటర్లో ఎన్నికల ప్రచారం క్లైమాక్స్‌కు చేరుతోంది. ఆదివారం సాయంత్రంతో ఎన్నికల ప్రచార గడువు ముగుస్తోంది. దీంతో అన్ని పార్టీలూ ప్రచారంలో వాడిని... ప్రత్యర్థులపై విమర్శల దాడిని పెంచేశాయి. ఏఐసీసీ నేత దిగ్విజయ్ సింగ్ శుక్రవారం నగరంలోని నాలుగు నియోజకవర్గాల్లో విస్తృత పర్యటనలు చేసి టీడీపీ, టీఆర్ఎస్లపై దుమ్మెత్తిపోశారు. ఏపీ సీఎం చంద్రబాబు రెండో రోజు వివిధ సభల్లో పాల్గొని టీడీపీ-బీజేపీ క్యాడర్లో స్థైర్యం నింపే దిశగా ప్రసంగించారు. తాను ఎక్కడికీ పోనని, ఇక్కడే ఉంటానని పునరుద్ఘాటించారు. బాబుకు తోడు తొమ్మిది మంది ఏపీ మంత్రులు సైతం నగర ప్రచారంలో తలమునకలయ్యారు. బీజేపీ నేతలు మురళీధర్‌రావు, బండారు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డిలు ఖైరతాబాద్, కార్వాన్, అంబర్‌పేటలలో పర్యటించారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ముషీరాబాద్‌తో పాటు పాత బస్తీలో పాదయాత్రలు చేశారు. భారీ సభకు టీఆర్ఎస్ ఏర్పాట్లు ఎన్నికల ప్రచారానికి ముగింపు పలుకుతూ శనివారం మధ్యాహ్నం పరేడ్ గ్రౌండ్లో టీఆర్ఎస్ పార్టీ భారీ సభను నిర్వహించనుంది. ప్రతి డివిజన్ నుంచి కనీసం వెయ్యి మందిని సమీకరిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనే సభ కావటంతో టీఆర్ఎస్ మంత్రులు, ముఖ్య నాయకులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఏపీ సర్కారు కార్యాలయాలకు ఫిబ్రవరి2న సెలవు
-జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు సాధారణ సెలవు -ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ ఐ.వై.ఆర్. హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ వచ్చే నెల 2వ తేదీన సాధారణ సెలవును ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే నెల 2వ తేదీన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీలుగా ఆ రోజు సాధారణ సెలవుగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు శుక్రవారం జీవో జారీ చేశారు. -
‘కూటమి’తోనే నగరాభివృద్ధి: కేంద్రమంత్రి హన్సరాజ్
బీజేపీ, టీడీపీ కూటమి ద్వారానే గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి సాధ్యమవుతుందని కేంద్ర సహాయ మంత్రి హ న్సరాజ్ గంగ్వార్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పూల్‌బాగ్ చమాన్ ప్లే గ్రౌండ్ వద్ద రోడ్ షో లో జంగమ్మెట్, శాలిబండ డివిజన్ల బీజేపీ అభ్యర్థులు కౌడీ మహేందర్, పొన్న వెంకటరమణలతో కలిసి ఆయన ప్రసంగించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ మహా నగరాల అభివృద్ధి కోసం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారన్నారు. హైదరాబాద్ మహా నగరంలో బీజేపీ, టీడీపీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటే మరింత అభివృద్ధి చేసేందుకు వీలుంటుందన్నారు. టీఆర్ఎస్, మజ్లీస్ పార్టీలకు తగిన రీతిలో ఓటు ద్వారా సమాధానం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో బీజేపీ గ్రేటర్ ప్రధాన కార్యదర్శి టి. ఉమా మహేంద్ర, సీనియర్ నాయకులు ఊరడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్తోనే అభివృద్ధి: మంత్రి తలసాని
టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే హైదరాబాద్ అన్ని రంగాలలో అభివృద్ధి చెంది విశ్వనగరంగా గుర్తింపు లభిస్తుందని... ఆదిశగా సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. నాచారం డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి మేడల జ్యోతి మల్లికార్జున్‌గౌడ్ ఎన్నికల ప్రచారం శుక్రవారం నాచారంలోని హెచ్ఎంటీ నగర్, వీఎస్‌టీకాలనీ, స్నేహపురికాలనీ కాలనీలలో జరిగింది. ఈ సందర్భంగా కాలనీలలో పాదయాత్ర చేస్తూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ కారుగుర్తుకు ఓటు వేసి మేడల జ్యోతిమల్లికార్జున్గౌడ్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యతో పాటు స్థానికనేతలు మల్లికార్జున్‌గౌడ్, రాగిరి మోహన్‌రెడ్డి, నందికొండ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నా మనసంతా హైదరాబాద్‌పైనే..
హైదరాబాద్ : 'హైదరాబాద్ నుంచి పారిపోయానని కొందరు విమర్శిస్తున్నారు. భయం అనే పదం నా డిక్షనరీలోనే లేదు. నేనెక్కడికీ పోను. నా మనసంతా హైదరాబాద్‌పైనే ఉంది. ఇక్కడికి మళ్లీ వస్తా. తగిన సమయాన్ని కేటాయించి పార్టీని బలోపేతం చేస్తాం. రెండు తెలుగు రాష్ట్రాలకు న్యాయం చేకూరేలా ప్రయత్నిస్తా..’’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం రాత్రి నగరంలోని శిల్పారామం వద్ద రోడ్‌షో ముగింపు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. మాదాపూర్ నుంచే నుంచే రాష్ట్ర ప్రభుత్వానికి రూ.50 వేల కోట్ల ఆదాయం వస్తోందని, దీంతోనే తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలు చేపడుతోందని పేర్కొన్నారు. కుగ్రామంగా ఉన్న మాదాపూర్‌ను తానే ఐటీ హబ్‌గా తీర్చిదిద్దానన్నారు. బిల్‌క్లింటన్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చి.. మైక్రోసాఫ్ట్ కంపెనీని నెలకొల్పడంతో మిగిలిన కంపెనీలు వరుస కట్టాయన్నారు. కాగా ఓటుకు కోట్లు దెబ్బతో చంద్రబాబు హైదరాబాద్ వదిలి పరారయ్యారని, ఆరు నెలల నుంచి ఇక్కడ అసలు కనిపించడం లేదు. తెలంగాణలో టీడీపీ పరిస్థితి నాయకుడు లేని సేనల తీరుగా మారిందని తెలంగాణ నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. -
రేపు పరేడ్ గ్రౌండ్స్‌లో టీఆర్ఎస్ బహిరంగ సభ
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో శనివారం టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలపై కేసీఆర్ ఈ సభలో పలు కీలక అంశాలను ప్రస్తావించనున్నారని సమాచారం. అయితే ఈ సభ ఏర్పాట్లను తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ నేటి మధ్యాహ్నం పరేడ్ గ్రౌండ్స్‌లో దగ్గరుండి పర్యవేక్షించనున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం జనవరి 31తో ముగియనుంది. రేపు సాయంత్రం 4.00 గంటలకు టీఆర్ఎస్ బహిరంగ సభ ప్రారంభం కానుంది. -
కేసీఆర్‌పై బాబు సాఫ్ట్ కార్నర్!
-
పాతబస్తీలో దిగ్విజయ్ బహిరంగ సభ
-
నా రాజకీయం మొదలైంది ఇక్కడే....
-
అమరావతికే దిక్కులేదు..
-
బాబూ.. నీ 13 జిల్లాలు ఊడ్చుకో పో
-
'గ్రేటర్ పీఠం మాదే'
హైదరాబాద్‌ను డల్లాస్, వాషింగ్టన్, బీజింగ్ సరసన నిలబెడతాం ఇన్నాళ్లూ పాలించినవారే మళ్లీ ఓట్లడుగుతున్నారు అరవై ఏళ్లలో వారేం చేశారు? తాగడానికి రక్షిత నీరు కూడా ఇవ్వలేదు మూసీని మురికి కూపంగా మార్చారు.. హుస్సేన్‌సాగర్‌ను కాసారంలా చేశారు 1,100 చెరువులకు ఇప్పుడు.. 119 మాత్రమే మిగిలాయి మేం పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్తున్నాం జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కొత్త సచివాలయ భవనాలకు శంకుస్థాపన ఉస్మానియా ఆసుపత్రిలో పురాతన కట్టడాల జోలికి పోం ఖాళీ స్థలంలో రెండు భారీ టవర్లు నిర్మిస్తాం: సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పీఠం టీఆర్ఎస్ దక్కించుకుంటుందని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ధీమాగా చెప్పారు. హైదరాబాద్‌ను డాలస్, వాషింగ్టన్, బీజింగ్ వంటి అంతర్జాతీయ నగరాల సరసన నిలబడేలా విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని స్పష్టంచేశారు. గురువారమిక్కడ ఆయన ఈ-పబ్లిసిటీ కార్యక్రమంలో భాగంగా విలేకరులతో మాట్లాడారు. ‘‘ఈ ఎన్నికల్లో మేం (టీఆర్ఎస్) తప్ప అన్నీ పాత పార్టీలే. ఇన్నాళ్లు పాలించిన వారే మళ్లీ ఓట్లడుగుతున్నారు. వారి పాలనలో ఏం ఒరిగింది? విద్యుత్ కోసం 30 ఏళ్లు గోస పడ్డం. ఇన్వర్టర్లు.. కన్వర్టర్లు.. స్టెబిలైజర్లు.. జనరేటర్లు ఇంతేగా... అరవై ఏళ్లలో ఏం జరిగింది? రక్షిత నీరివ్వలేని పరిస్థితికి తెచ్చారు. మూసీని మురికి కూపంగా మార్చారు. హుస్సేన్‌సాగర్‌ను కాలుష్య కాసారంగా మార్చారు. నాలాలు కబ్జాలు, భూ కబ్జాలు.. వీటన్నిటికీ వీరే కారణం. మళ్లీ వారే ఓట్లేయమని వస్తున్నరు. దీనిపై జంట నగరాల ప్రజలు విశ్లేషించుకోవాలి..’’ అని సీఎం అన్నారు. చెరువులు ఎవరి హయాంలో మాయమయ్యాయి? హైదరాబాద్ అనేక అంశాల్లో ఉండాల్సిన స్థాయిలో లేదని, మౌలిక సౌకర్యాలు సరిగా లేవని సీఎం అన్నారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో రూ.200 కోట్లతో వివిధ పనులు చేపట్టినట్లు వివరించారు. ‘‘సిటీ ఆఫ్ లేక్స్ అని పేరున్న హైదరాబాద్‌లో 1,100 చెరువులు, కొలనులు ఉండేవి. ఇప్పుడు 119 మాత్రమే మిగిలాయి. ఇవన్నీ ఎవరి హయంలో మాయమయ్యాయో గమనించాలి. హుస్సేన్‌సాగర్ హైదరాబాద్ వరం. దాన్ని కుళ్లి కంపుకొట్టేలా చేశారు. దీని ప్రక్షాళన కార్యక్రమాన్ని ఆస్ట్రియా కంపెనీకి అప్పజెప్పాం. కోటి జనాభా ఉన్న నగరంలో యాభై వేల మందికి ఒక మార్కెట్ చొప్పున 200 ఉండాలి. వీటి నిర్మాణానికి ప్రభుత్వం స్థలాలు సేకరించింది. నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నాం. పబ్లిక్ టాయిలెట్స్ నాలుగైదు వందలైనా ఉండాలి. కానీ వందా నూటా యాభై కూడా లేవు. అందుకే 250 టాయిలెట్ల నిర్మాణం మొదలు పెట్టాం. శ్మశాన వాటికల ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చాం. నగరంలో చెత్త ఎత్తిపోయడానికి డంపింగ్ యార్డులు లేవు. జవహర్‌నగర్ యార్డును కలుషితం చేశారు. నగరం నాలుగు మూలల్లో నాలుగు స్థలాలు ఎంపిక చేశాం. ఇది చారిత్రక నగరం. కొన్ని పాత భవనాలు కూల్చక తప్పదు. డెబ్రిస్ రీసైకిల్ చేసే చర్యలు తీసుకుంటున్నాం’’ అని సీఎం వివరించారు. రోగుల సహాయకులకు నైట్ షెల్టర్లు నగరంలోని వివిధ ఆసుపత్రులకు వచ్చే రోగుల సహాయకుల కోసం విశ్రాంతి భవనాలు (నైట్ షెల్టర్లు) నిర్మిస్తామని సీఎం చెప్పారు. దీనిపై ఇప్పటికే ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలతో మాట్లాడినట్టు వివరించా రు. ‘‘బస్తీలో బహుళ ప్రయోజన కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం చేపడతాం. నగరంలో 3,800 సిటీ బస్సుల్లో నిత్యం 40 లక్షల నుంచి 45 లక్ష ల మంది ప్రయాణిస్తున్నా.. సరైన బస్టాపుల్లేవు. కొత్తవాటి నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నాం. ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర మరో బస్సు టెర్మినల్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రద్దీని తగ్గించేందుకు చర్లపల్లి వద్ద మరో స్టేషన్ ఏర్పాటుకు కృషి చేస్తున్నాం. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల సంఖ్య 10 లక్షలకు చేరుకున్నందున రెండో రన్‌వే నిర్మాణం కోసం జీఎంఆర్‌తో మాట్లాడాం. దేశంలో ఏ నగరానికి లేని హంగులు హైదరాబాద్‌కు ఉన్నాయి. రాజకీయాలకు, వ్యక్తిగత ఇష్టాలకు పోకుండా హెచ్ఎండీఏ రీ ఇంజనీరింగ్ జరిగింది. మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాం..’’ అని కేసీఆర్ తెలిపారు. పాజిటివ్ దృక్పథంతో ముందుకు.. గ్రేటర్ ఎన్నికల్లో తమ పార్టీ పాజిటివ్ దృక్పథంతో ముందుకు వె ళ్తోందని సీఎం చెప్పారు. ‘ఒక్క విద్యుత్ అంశం చాలు.. మాకు ఓటేయడానికి..’ అని అన్నారు. ‘‘జంట నగరాల్లో గుడిసెలు, రేకుల ఇళ్లలో ఉంటున్న వారికి లక్ష పట్టాలు ఇచ్చాం. ఆటో ట్యాక్స్ రద్దు చేశాం. రూ.70 కోట్ల బకాయిలు మాఫీ చేశాం. 10 లక్షల మంది ఆటో డ్రైవర్లకు, 15 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించాం. ఇన్ని చేస్తున్నా కొన్ని పార్టీల ధోరణి మారడం లేదు. వరంగల్ తీర్పు తర్వాత పద్ధతి మార్చుకోవాలని కోరాను. కానీ మారడం లేదు’’ అని అన్నారు. సచివాలయం ఎర్రగడ్డలోనే.. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కొత్త సచివాలయం భవనాల సముదాయానికి శంకుస్థాపన చేస్తానని ముఖ్యమంత్రి ప్రకటించారు. బహుశా ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రిలోనే కొత్త సచివాలయం ఉంటుందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అలాగే ఉస్మానియా ఆస్పత్రిలో పురాతన కట్టడాల జోలికి పోకుండా.. ఖాళీ స్థలంలో రెండు భారీ బహుళ అంతస్తుల నిర్మాణం చేపడుతామని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎన్నికల తర్వాత శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. వివిధ అంశాలపై సీఎం ఏమన్నారంటే.. డబుల్ బెడ్రూం ఇళ్లు: జంట నగర ప్రజలకు డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు వెయ్యి ఎకరాల స్థలాన్ని గుర్తించాం. వచ్చే ఏడాది లక్ష ఇళ్లు నిర్మించబోతున్నాం. సకల సదుపాయాలతో టవర్లు నిర్మిస్తాం. అద్దె ఇళ్లలో ఉన్న వారికి కూడా డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయిస్తాం. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి రాజకీయం ఉండదు. దేశానికి ఆదర్శంగా ఉండేలా జర్నలిస్టులకు కూడా 750-800 చదరపు అడుగుల మేర ఫ్లాట్లు నిర్మించి ఇస్తాం. విద్యుత్: విద్యుత్ కోసం గతంలో ధర్నాలు జరిగాయి. పవర్ హాలిడేలు ప్రకటించారు. ఇప్పుడు 24 గంటలు పరిశ్రమలకు సరఫరా చేస్తున్నాం. కాంగ్రెస్, టీడీపీలు గతంలో ఈ పని ఎందుకు చేయలేక పోయాయి. టీఆర్ఎస్ చేసి చూపెట్టింది. ముంబై తరహాలో ‘ఐలాండ్ పవర్ సిస్టం’ అమలు చేస్తాం. నగరంలో కనురెప్ప పాటు కూడా కరెంటు పోకుండా చూస్తాం. జంట జలాశయాలు: నగర దాహార్తి తీర్చేందుకు 20 టీఎంసీల సామర్థ్యంతో జంట జ లాశయాలు నిర్మిస్తున్నాం. 170 కి.మీ. దూరం నుంచి కృష్ణా, 200కి.మీ. దూరం నుంచి గోదావరి నీళ్లు వస్తున్నాయి. రహదారుల అభివృద్ధి: రహదారుల అభివృద్ధికి ‘స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్’ సిద్ధంగా ఉంది. బ్రిక్స్ బ్యాంక్ నుంచి రూ.25 వేల కోట్ల రుణం అడిగాం. రూ.30 వేల కోట్లతో హైదరాబాద్‌ను అయిదారేళ్లలో విశ్వనగరంగా తీర్చి దిద్దుతాం. స్కైవేలు, మల్టీ లేయర్ ఫ్లై ఓవర్లు, ట్రాఫిక్ జంక్షన్లను అభివృద్ధి చేస్తాం. స్ట్రామ్ వాటర్ డ్రెయిన్లు లేకపోవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. రూ.1,100 కోట్లు ఖర్చు పెట్టాలి. కనీసం మూడు నాలుగేళ్ల సమయంలో సమస్య పరిష్కరిస్తాం. నగరానికి తాగునీరు సరఫరా చేస్తున్న హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ (హెచ్ఎండబ్ల్యూఎస్) కోసం రూ.12 వేల కోట్లు ఖర్చు పెట్టాలి. -
ఇక్కడే ఉంటా.. అభివృద్ధి చేస్తా..
‘గ్రేటర్’ ప్రచారంలో ఏపీ సీఎం చంద్రబాబు టీడీపీ ధైర్యానికి మారుపేరు ఎన్టీఆర్ అయినా నేనైనా ఇందిర, రాజీవ్, సోనియాకే భయపడలేదు ఇక్కడి ప్రభుత్వానికి భయపడాల్సిన అవసరం లేదు భాగ్యనగరాన్ని అభివృద్ధి చేసేందుకు నిజాంకు 400 ఏళ్లు పట్టింది కానీ నేను తొమ్మిదేళ్లలోనే అభివృద్ధి చేసి చూపించా నా మనసంతా హైదరాబాద్‌పైనే.. రోడ్‌షోలో కేసీఆర్‌ను ఎక్కడా నేరుగా విమర్శించని టీడీపీ అధినేత సాక్షి, హైదరాబాద్: ‘‘హైదరాబాద్‌లో చంద్రబాబుకు ఏం పని అని కొందరంటున్నారు.. నేను ఎక్కడికీ పోలేదు.. ఏపీకి సీఎంగా ఉన్నా హైదరాబాద్‌ను వదిలిపోలేదు. ముఖ్యమంత్రిగా ఏపీలో ఉంటా.. టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా తెలంగాణలో ఉంటా..’’ అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ ధైర్యానికి మారుపేరని, ఎన్టీఆర్ అయినా తానైనా ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీలకే భయపడలేదని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వానికి భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో సీమాంధ్రుల ఓట్లే లక్ష్యంగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు రోడ్‌షోలకు శ్రీకారం చుట్టారు. గ్రేటర్ ఎన్నికల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో టీడీపీ, బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా రెండ్రోజుల ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చిన చంద్రబాబు గురువారం పటాన్చెరు నుంచి రోడ్‌షో ప్రారంభించారు. పటాన్చెరు చౌరస్తాలో ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ఆయన అక్కడ్నుంచి.. శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లోని పలు డివిజన్లలో ప్రచారం నిర్వహించారు. పార్టీ నాయకులు సీమాంధ్రులు ఎక్కువగా నివసించే ప్రాంతాల మీదుగానే చంద్రబాబు రోడ్‌షో రూట్‌మ్యాప్ రూపొందించారు. పలుచోట్ల ప్రసంగించిన ఆయన.. సీమాంధ్రుల సమస్యలు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టీడీపీపై చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ సానుభూతి పొందే ప్రయత్నం చేశారు. సీమాంధ్ర కు చెందిన 26 కులాలను తెలంగాణ ప్రభుత్వం బీసీ జాబితా నుంచి తొలగించిందని పేర్కొన్నారు. హైదరాబాద్ అందరిదని, దాని అభివృద్ధిలో టీడీపీ పాత్ర కీలకమైనదని గుర్తుచేశారు. హైదరాబాద్‌లో నివసించే వారందరికీ భద్రత ఉండాలన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టాలంటే తెలంగాణ ప్రభుత్వం సహకరించలేదని పేర్కొన్నారు. సీఎంలుగా కలుసుంటాం.. ‘‘జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా రెండు రాష్ట్రాలపైనా నాకు హక్కు ఉంది. తెలంగాణ గురించి మాట్లాడేందుకు నేనెవ్వరికీ భయపడను. తెలంగాణను అభివృద్ధి చేసిందే తెలుగుదేశం. తెలంగాణలో పటేల్, పట్వారీ వ్యవస్థను తొలగించి నిజమైన స్వాతంత్య్రం తెచ్చింది ఎన్టీఆర్ అయితే.. హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో చేర్చింది నేను’’ అని బాబు తన రోడ్‌షోలో వ్యాఖ్యానించారు. ఏపీ సీఎంగా తాను ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా తెలంగాణ అభివృద్ధికి నిధుల కేటాయింపు గురించి కేంద్రంతో మాట్లాడుతూనే ఉన్నానని చెప్పారు. ‘‘అమరావతి శంకుస్థాపన కోసం నేను స్వయంగా వెళ్లి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పిలిస్తే.. చండీయాగానికి నన్ను పిలిచారు. ప్రభుత్వాలు వేరు రాజకీయాలు వేరు. ప్రభుత్వాల పరంగా కేసీఆర్‌తో సహకరించుకుంటాం. రాజకీయంగా మాత్రం విరోధులమే’’ అని చెప్పారు. కేసీఆర్‌ను నేరుగా విమర్శించకుండా.. గతంలో చంద్రబాబు తన ప్రసంగాల్లో కేసీఆర్‌పైనే నేరుగా విమర్శలు చేసేవారు. ఎన్నికల ప్రచార సభల్లో అయితే తానే కేసీఆర్‌కు గురువును అనే తరహాలో ప్రసంగించేవారు. కానీ గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో కే సీఆర్‌ను గానీ, టీఆర్ఎస్ పార్టీని గానీ విమర్శించే సాహసం చేయలేదు. కేసీఆర్‌ను విమర్శించాల్సి వచ్చిన ప్రతీసారి తెలంగాణ ప్రభుత్వం పేరునే ఉపయోగించారు. చంద్రబాబుకు తెలంగాణలో ఏం పని అని మీడియా సమావేశంలో కేసీఆర్ అన్న మాటలపైనా ఆచితూచి వ్యాఖ్యానించారు. ‘నేను అక్కడా ఉంటా... ఇక్కడా ఉంటా..’ అనే ధోరణితోనే మాట్లాడారు తప్ప కేసీఆర్‌ను పేరు పెట్టి ఎక్కడా విమర్శించకపోవడం గమనార్హం. బాబు వెంట టీడీపీ నేతలు ఎల్.రమణ, ఎ.రేవంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మాగంటి గోపీనాథ్‌లతో పాటు బీజేపీ నేతలు ఉన్నారు. సిటీ నుంచి హరీశ్ తడీపార్: రేవంత్ తమకు అవకాశం ఇవ్వాలని కేటీఆర్ హైదరాబాద్ ప్రజలను కోరుతున్నారని, అయితే చిన్న పిల్లలు అడిగినట్లు ఇచ్చేందుకు హైదరాబాద్ చాక్లెట్, ఐస్‌క్రీం కాదని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. దొంగలను పోలీసులు ఊరి బయట వదిలినట్లు కేసీఆర్, కేటీఆర్ కలసి హరీశ్‌ను గ్రేటర్ హైదరాబాద్ నుంచి తడీపార్ (నగర బహిష్కరణ) చేశారని వ్యాఖ్యానించారు. నారాయణఖేడ్‌లో టీడీపీ ఓడిపోతే తాను రాజీనామా చేయాలన్న హరీశ్ సవాలుపైనా స్పందించారు. టీఆర్ఎస్లో చేరిన తమ పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, వారి స్థానంలో టీఆర్ఎస్ గెలిచి చూపిస్తే తాను రాజీనామా చేస్తానని చెప్పారు. హైదరాబాద్‌కు ఐటీని తెచ్చింది నేనే.. హైదరాబాద్‌కు ఐటీని తీసుకొచ్చింది తానేనని, హైటెక్‌సిటీ నిర్మాణంతో హైదరాబాద్ కొత్తరూపు సంతరించుకుందని చంద్రబాబు వివరించారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసేందుకు నిజాం నవాబులకు 400 ఏళ్లు, సికింద్రాబాద్ అభివృద్ధికి ఆంగ్లేయులకు 100 ఏళ్లు పడితే తాను తొమ్మిదేళ్లలోనే అభివృద్ధి చేసి చూపించానన్నారు. ‘‘ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, ఔటర్‌రింగ్ రోడ్డు నిర్మాణాలకు పునాది పడింది తెలుగుదేశం హయాంలోనే. రైతు బిడ్డలు పొలాలు వదిలి సాఫ్ట్వేర్ బాట పట్టారంటే అది మా ఘనతే. మెట్రోరైలు ప్రాజెక్టు అనుమతులు మా హయాంలోనే వచ్చాయి. ఆ ప్రాజెక్టు నిర్మాణం ఎందుకు ఆలస్యం అవుతుందో టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పాలి. టీడీపీ అధికారంలో ఉంటే మూడేళ్లలోనే మెట్రో ప్రాజెక్టును పూర్తి చేసి ఉండేవాళ్లం. గ్రేటర్లో టీడీపీ, బీజేపీ వల్లే అభివృద్ధి సాధ్యం’’ అని బాబు చెప్పారు. -
బాబూ.. నీ 13 జిల్లాలు ఊడ్చుకో పో
గ్రేటర్ ఎన్నికల ప్రచారం ఉధృతమైంది! గురువారం రెండు రాష్ట్రాల సీఎంలు రంగంలోకి దిగారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్లగా.. ఏపీ సీఎం చంద్రబాబు శివారు ప్రాంతాల్లో రోడ్‌షోలు నిర్వహించారు. అయితే అందరూ ఊహించినట్టుగా సీఎంలు చురకత్తులు తిప్పుకోలేదు! కేసీఆర్.. బాబుపై సుతిమెత్తని విసుర్లతో సరిపెట్టారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో తదుపరి చర్యలపై ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘అది ఇప్పుడెందుకు? గ్రేటర్ ఎన్నికల తర్వాత చూద్దాం..’ అంటూ కేసీఆర్ నవ్వుతూ అన్నారు. ఇక చంద్రబాబు.. కేసీఆర్ పేరెత్తడానికి కూడా జంకినట్టు కనబడ్డారు. తన రోడ్‌షోలో ఎక్కడా కేసీఆర్‌ను పల్లెత్తు మాట అనలేదు. దీంతో బాబు రాకతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ కాస్తయినా బలం పుంజుకుంటుందని ఆశించిన తెలుగు తమ్ముళ్లు పూర్తిగా జావగారిపోయారు! 1 ఆంధ్రప్రదేశ్‌లో ఉద్ధరించావు కానీ.. హైదరాబాద్ మిగిలిందా? అమరావతికే దిక్కులేదు.. హైదరాబాద్కేం చేస్తావు? తొమ్మిదేళ్లు పాలించావు.. విద్యుత్ కొరత ఎందుకు తీర్చలేదు? తాగునీటి సమస్య ఎందుకు పరిష్కరించలేదు? అప్పుడు చేయనిది ఇప్పుడు చేస్తామంటే జనం నమ్ముతారా? తెలంగాణ వస్తే ఏదో జరిగిపోతుందన్నారు బాబు వంటి వారు ప్రాంతీయ కక్షలు రెచ్చగొట్టినా నగరం ప్రశాంతంగా ఉంది భాగ్యనగరంలో ఇళ్లకు మంచినీళ్లు ఎవరిస్తారో తెలియని దుస్థితి కాంగ్రెస్‌ది వెంకయ్యనాయుడూ.. 20 స్మార్ట్‌సిటీల్లో తెలంగాణకు ఒక్కటీ లేదా? తెలంగాణపై ఎందుకు ఈ వివక్ష? సాక్షి, హైదరాబాద్: ‘చంద్రబాబూ.. ఊడ్చుకోవాలంటే నీకు హిందూపురం నుంచి ఇచ్ఛాపురం దాకా చాలా ఉంది. ఎన్నో నగరాలు, పట్టణాలు ఉన్నాయి. గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఉన్నాయి. హైదరాబాద్‌లో ఊడుస్తా అంటే ఎట్టా? ఇక్కడేం అవసరం? నువ్వు ఏపీ సీఎం.. అక్కడంతా ఉద్ధరించినవు కానీ హైదరాబాద్ మిగిలిందా ఊడ్చడానికి...?’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఏపీ సీఎం చంద్రబాబును ఎద్దేవా చేశారు. ‘‘చంద్రబాబు తొమ్మిదేళ్ల పాటు పాలించారు. విద్యుత్ కొరత ఎందుకు తీరలేదు. తాగునీటి సమస్యను ఎందుకు పరిష్కరించలేదు. తొమ్మిదేళ్ల కాలం చాలలేదా..? ప్రచారానికి రావడమే అనవసరమైన విషయం. 17 ఏళ్ల టీడీపీ సుదీర్ఘ పాలనలో జరగనిది ఇప్పుడు చేస్తామంటే నమ్ముతారా? నువ్వు చేసుకోవడానికి నీ రాష్ట్రంలో ఏమైనా చేసుకోవచ్చు. నీది ఇక్కడ వృథా ప్రయాస..’’ అని దుయ్యబట్టారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో గురువారమిక్కడ కేసీఆర్ విలేకరులతో మాట్లాడారు. ‘‘నేనేదో ఆంధ్రా వాళ్లను గతంలో తిట్టానని కాంగ్రెస్, బీజేపీ నేతలు నోరు పారేసుకుంటున్నారు. అప్పుడు తెలంగాణను వ్యతిరేకించిన వాళ్లను రాక్షసులు అన్నా. తెలంగాణను వ్యతిరేకించే ఈ ప్రాంతం వారిని కూడా సన్నాసులు, దద్దమ్మలు అన్నా. అది ఉద్యమ నేతగా నా కర్తవ్యం. తెలంగాణ ఏర్పడ్డాక టీఆర్ఎస్ ఫక్తు రాజకీయ పార్టీ అని ప్రకటించిన. హైదరాబాద్‌లో ఉన్న ఏ బిడ్డ అయినా మా బిడ్డే అని చెప్పా. హైదరాబాదీ అని గర్వించు.. కేసీఆర్ మీ వెంట ఉంటాడని అన్నా. తెలంగాణ వస్తే ఏదో జరిగిపోతుందన్నారు. 18 నెలలు పూర్తయ్యింది. జంట నగరాల్లో ఏమన్నా జరిగిందా? చంద్రబాబు సెక్షన్ 18 అమలు చేయాలన్నాడు. ఏపీ పోలీసు స్టేషన్లు ఇక్కడ ఏర్పాటు చేస్తానన్నాడు. చంద్రబాబు వంటి వాళ్లు ప్రాంతీయ కక్షలు రెచ్చగొట్టినా ఏం గొడవలు జరగలేదు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉంది. నాలుగు ఓట్లకు కక్కుర్తిపడి రెచ్చగొట్టకండి. కాంగ్రెస్, టీడీపీలు చిల్లర రాజకీయాలు మానుకోవాలి’’ అని ధ్వజమెత్తారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిపిస్తే ఉచితంగా తాగునీరు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తోందని, తాగునీటిని ఎవరు సరఫరా చేస్తారో కూడా తెలియని దుస్థితిలో ఆ పార్టీ ఉందని వ్యాఖ్యానించారు. ‘‘తాగునీటి సరఫరా బాధ్యత హైదరాబాద్ జలమండలిది. దానికి జీహెచ్ఎంసీకి ఏం సంబంధం? ఇంత పేలవంగా, అనాలోచితంగా ఎలా మాట్లాడుతారు?’’ అని ప్రశ్నించారు. అమరావతికే దిక్కులేదు.. ‘‘హైదరాబాద్‌కు కేంద్రం నుంచి నిధులు తెస్తమని చంద్రబాబు ప్రచారం చేస్తుండ్రు. ఆయన అమరావతికే దిక్కులేదు. హైదరాబాద్‌కు ఏం తెస్తరు’’ అని కేసీఆర్ ప్రశ్నించారు. ‘‘అమరావతి శంకుస్థాపనకు పిలిస్తే నేనూ వెళ్లిన. కొత్తగా రాజధాని నిర్మించుకుంటున్నారు కాబట్టి మన వంతుగా కొంత సాయం ప్రకటిస్తే బావుంటుందని నా మిత్రులు చెబితే సరే అనుకున్న. డబ్బు ప్రకటిద్దామనుకున్న. కానీ అక్కడ టీపాయి మీద రెండు కుండలు తెచ్చి పెడితే పరేషాన్ అయిన. అవి ఏంటని వెంకయ్యనాయుడును అడిగా. మట్టి, నీళ్లు అని చెప్పిండు. ప్రకటన ఏదీ లేదని చెప్పిండ్రు. ప్రధాని ఉండగా నేను ప్రకటిస్తే.. ‘నాకంటే గొప్పోనివైనవా..’ అనుకోడా? ప్రధాని మట్టి నీళ్లు ఇచ్చి వెళ్తే.. నేను ఎలా ప్రకటిస్తా. ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడుకు చెప్పా ఆయనా నవ్వారు’’ అని వివరించారు. రాత్రికి రాత్రి ఏది సాధ్యం కాదు టీఆర్ఎస్ను గెలిపించి, మేయర్ పీఠంపై కూర్చోబెట్టినా రాత్రికి రాత్రే సమస్యలు తీరుతాయని తాను అబద్ధపు మాటలు చెప్పనని సీఎం అన్నారు. లోతట్టు ప్రాంతాల ముంపు సమస్య లేకుండా చేయడానికే కనీసం మూడు నాలుగేళ్ల సమయం పడుతుందన్నారు. రాష్ట్ర ఆదాయం (స్టేట్ ఓన్ రెవెన్యూ) 15 శాతం గ్రోత్ ఉందని, ఈసారి రూ.60వేల కోట్లు కేవలం ప్లాన్ బడ్జెట్ ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పొలిటికల్ టైస్టు అని వస్తున్న విమర్శలపైనా స్పందిస్తూ.. ఎవరు ఆ చర్యలకు పాల్పడుతున్నారో ప్రజలకు తెలుసునన్నారు. పార్టీలోకి చేరికలను తాను తెలంగాణ శక్తుల పునరేకీకరణగా భావిస్తున్నానన్నారు. కేంద్రం వ్యవహార శైలి బాధిస్తోంది ‘‘దేశంలో 20 స్మార్ట్‌సిటీలను ప్రకటి స్తే ఏపీలో రెండు ఉన్నాయి. తెలంగాణలో ఒక్కటీ లేదు. కాకినాడ, విశాఖపట్నం ఉంది. తెలంగాణలో మాత్రం కాకి ఎత్తుకపోయింది. దీనికి సమాధానం వెంకయ్యనాయుడే చెప్పాలి’’ అని సీఎం అన్నారు. ఒక్కోసారి కేంద్రం వ్యవహార శైలి తెలంగాణ ప్రజలను బాధిస్తోందన్నారు. ‘‘ప్రపంచ బ్యాంకు ఎంపిక చేసిందని ప్రచారం చేసి పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రాలుగా ఏపీని ప్రకటిస్తారు. చివరకు జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లను కూడా ప్రకటించారు. దీన్ని ఏం అనుకోవాలి? క్రిసిల్ రేటింగ్ అని ఉంటుంది. తెలంగాణకు ఏ ప్లస్ ఇచ్చిండ్రు. టీఎస్ ఐపాస్ కింద ఇంక్యుబేటర్ సెంటర్ నిర్మిస్తే సత్యం నాదెళ్ల, రతన్ టాటా, సుందర్ పిచాయ్ వచ్చి వెళ్తారు. కేంద్రం నుంచి మాత్రం ఉలుకూ పలుకూ లేదు. తెలంగాణ పట్ల ఎందుకు పక్షపాతం వైఖరి. దేనికైనా ఒక అంతం ఉండాలి. ఎవరో మంత్రిని తీసుకు వస్తారు. కరువు నివేదిక ఇవ్వలేదని మాట్లాడిస్తరు. కేంద్రానికి,రాష్ట్రానికి ఉండేది రాజ్యాంగపరమైన సంబంధం. రాజకీయపరమైన చిల్లర, చిలిపి ప్రచారం చేసి ఒక రాజకీయ పార్టీని అప్రదిష్ట పాలు చేయాలాని చూడడం సరికాదు. వెంకయ్యనాయుడు తెచ్చిన ప్యాకేజీ ఏందీ? లీకేజీ అయ్యింది ఎక్కడ ? ప్రాసల కోసం మాట్లాడాలంటే నేనూ మాట్లాడతా’’ అని కేసీఆర్ అన్నారు. టీఆర్ఎస్.. సింగిల్ లార్జెస్ట్ పార్టీ ‘‘మేయర్ సీటు మాదే. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీఆర్ఎస్ అవతరిస్తది. అన్ని సర్వేలూ అదే చెబుతున్నాయి. రెండోది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. మూడో దశలో ఎంఐఎం ఉండనే ఉంది. ఎంఐఎం మా మిత్రపక్షమే. మేం కలిస్తే మిగతా వారికి అవకాశం ఎక్కడిది?’’ అని సీఎం ప్రశ్నించారు. ‘‘కేబినెట్లో మహిళలకు చోటు లేదు కాబట్టి మేయర్ పదవి ఇస్తారా అని అడుగుతున్నారు. మంత్రివర్గంలో మహిళలు ఉండాలన్న రూలేం లేదు. వారికి మేం ఎక్కడ అవకాశం ఇవ్వాలో అక్కడ ఇచ్చాం. డిప్యూటీ స్పీకర్, విప్‌గా మహిళలే ఉన్నారు. ఫలితాలు తేలాక మేయర్ ఎవరో డిసైడ్ అవుతుంది’’ అని అన్నారు. రాజకీయాంశాలే కాకుండా.. మీడియా నుంచి ఎదురైన పలు ప్రశ్నలకు సీఎం సమాధానాలు ఇచ్చారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో తదుపరి చర్యలు ఉంటాయా అని ఓ విలేకరి ప్రశ్నించగా.. దానిపై గ్రేటర్ ఎన్నికల తర్వాత చూద్దామని నవ్వుతూ అన్నారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా హైదరాబాద్‌ను నాలుగైదు జిల్లాలుగా విభజించబోతున్నామని చెప్పారు. తన రాజకీయ వారసత్వాన్ని ప్రజలే నిర్ణయిస్తారని మరో పశ్నకు సమాధానంగా చెప్పారు. వీలైతే వచ్చే బడ్జెట్ సమావేశాల్లో బీసీ సబ్ ప్లాన్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని వెల్లడించారు.