
మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి ఓటమి
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి పరాజయం పాలయ్యారు. తార్నాక డివిజన్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆమె.. టీఆర్‌ఎస్ అభ్యర్థి ఆలకుంట సర్వసతి చేతిలో ఓటమి పొందారు. మరోవైపు గ్రేటర్లో కారు జోరు కొనసాగుతోంది. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం టీఆర్ఎస్ మొదటి స్థానంలో ఎంఐఎం రెండో స్థానంలో కొనసాగుతున్నాయి. ఆ తర్వాత స్థానాల్లో బీజేపీ-టీడీపీ కూటమి ఉండగా, ఇక కాంగ్రెస్ నాలుగో స్థానంతో నిలిచింది.