గ్రేటర్లో టీడీపీపై ప్రజలకు నమ్మకముంది: చంద్రబాబు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజలకు అచంచలమైన విశ్వాసం ఉందని టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. తాము అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ను ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేశామన్నారు.
హైటెక్ సిటీ నిర్మాణంతో హైదరాబాద్ దశ మారిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఆనాడు టీడీపీ చేసిన అభివృద్ధే ఇప్పుడు అందరూ అనుభవిస్తున్నారని అన్నారు. స్మార్ట్ సిటీల ప్రయోగం అప్పట్లోనే తాను అమలు చేశామని చంద్రబాబు అన్నారు. తమ హాయంలో బిల్గేట్స్, క్లింటన్ కూడా హైదరాబాద్ వచ్చారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.