మహబూబ్‌నగర్ జిల్లాను దత్తత తీసుకుని టీడీపీ నేత చంద్రబాబు నాయుడు ఏం ఒరగబెట్టాడని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మండిపడ్డారు. తమ నేత పాలమూరుకు చేసిన మంచి ఏమిటో తెలపాలని ఆయన టీడీపీ నేతలను నిలదీశారు. సోమవారం ఆయన టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయం విలేకరులతో మాట్లాడారు. ఇక, పాలమూరు ప్రాజెక్టులకు సబంధించి 90శాతం పనులు గత పాలకులే పూర్తి చేశారనడం అబద్దమని, దీనిపై ఏ చర్చకైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
కాంగ్రెస్ నాయకురాలు డి.కె అరుణకు ప్రాజెక్టులపై అవగాహనే లేదని, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవాలంటూ కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం తీరుపై ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రం విడిపోయినా, చంద్రబాబు నాయుడు తెలంగాణపై కక్ష కట్టడం దుర్మార్గమని పేర్కొన్నారు. చంద్రబాబుకు ఏపీలో పాలన చేతగాక తెలంగాణ ప్రాజెక్టులపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
‘బాబు దత్తత తీసుకుని ఏం ఒరగబెట్టాడు?’
Published Tue, May 3 2016 6:13 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM
Advertisement
Advertisement