రేవంత్‌రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు | the complaint on Revantreddy | Sakshi
Sakshi News home page

రేవంత్‌రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు

Published Tue, Jan 5 2016 6:14 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

the complaint on Revantreddy

మంత్రి కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చే సిన తెలంగాణ టీడీపీ నేత ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ టీ న్యాయవాదుల జేఏసీ మంగళవారం జుబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లో ఈ నెల 3వ తేదీన జరిగిన ఒక రేవంత్‌రెడ్డి.. మంత్రి కేటీఆర్ పై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న మంత్రిని కించపచి తమ మనోభావాలను దెబ్బతీశారని వారు వివరించారు. మంత్రిపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన ఆయనపై చట్టరీత్యా కఠినచర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు కొంతం గోవర్దన్‌రెడ్డి, పులిగారి గోవర్దన్‌రెడ్డి, సీహెచ్ ఉపేంద్ర, కె.నరేందర్, రవిమోహన్ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement