నా మనసంతా హైదరాబాద్‌పైనే..
హైదరాబాద్ : 'హైదరాబాద్ నుంచి పారిపోయానని కొందరు విమర్శిస్తున్నారు. భయం అనే పదం నా డిక్షనరీలోనే లేదు. నేనెక్కడికీ పోను. నా మనసంతా హైదరాబాద్‌పైనే ఉంది. ఇక్కడికి మళ్లీ వస్తా. తగిన సమయాన్ని కేటాయించి పార్టీని బలోపేతం చేస్తాం. రెండు తెలుగు రాష్ట్రాలకు న్యాయం చేకూరేలా ప్రయత్నిస్తా..’’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం రాత్రి నగరంలోని శిల్పారామం వద్ద రోడ్‌షో ముగింపు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
మాదాపూర్ నుంచే నుంచే రాష్ట్ర ప్రభుత్వానికి రూ.50 వేల కోట్ల ఆదాయం వస్తోందని, దీంతోనే తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలు చేపడుతోందని పేర్కొన్నారు. కుగ్రామంగా ఉన్న మాదాపూర్‌ను తానే ఐటీ హబ్‌గా తీర్చిదిద్దానన్నారు. బిల్‌క్లింటన్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చి.. మైక్రోసాఫ్ట్ కంపెనీని నెలకొల్పడంతో మిగిలిన కంపెనీలు వరుస కట్టాయన్నారు.
కాగా ఓటుకు కోట్లు దెబ్బతో చంద్రబాబు హైదరాబాద్ వదిలి పరారయ్యారని, ఆరు నెలల నుంచి ఇక్కడ అసలు కనిపించడం లేదు. తెలంగాణలో టీడీపీ పరిస్థితి నాయకుడు లేని సేనల తీరుగా మారిందని తెలంగాణ నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.