సాక్షి, హైదరాబాద్ : రెండేళ్లుగా సీఎం చంద్రబాబులో అసహనం పెరిగిపోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వరప్రసాద్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏ ఒక్కరు దళితుడిగా పుట్టాలని కోరుకోరని గతంలో చంద్రబాబు అన్న విషయాన్ని గుర్తు చేశారు. చిన్నకులాల వాళ్లంటే ఆయనకు చులకన భావం ఉందని ఎంపీ పేర్కొన్నారు. ‘మత్స్యకారులను మీ అంతు చూస్తానని చంద్రబాబు అన్నారు.. అంటే.. చంద్రబాబుకు ఎంత అహంకారం. నాయిబ్రాహ్మణులు కనీస వేతనాలు అడిగితే కళ్ళు ఎర్రజేసి వారిపై చిందులేస్తారా ? బీసీ, ఎస్సీ, ఎస్టీల ఓట్లు మాత్రం చంద్రబాబుకు కావాలి. కానీ, వారి బాగోగులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని’ ఎంపీ వరప్రసాద్ ధ్వజమెత్తారు.
అసలు చంద్రబాబులో మానవత్వం ఉందా అని ఎంపీ ప్రశ్నించారు. బీజేపీపై నేను యుద్ధం ప్రకటిస్తానని చెప్పినా బాబు.. ఢిల్లీ వెళ్లి చతికిల పడ్డారని వరప్రసాద్ ఎద్దేవా చేశారు. దీన్ని బట్టి మోదీ అంటే బాబులో ఎంత భయం ఉందో అర్థమవుతుందన్నారు. 40 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉన్న వ్యక్తి చెప్పిన హామీలన్నీ నెరవేర్చేవారు. ఆయనకు కనీస రాజకీయ జ్ఞానం కూడా లేదని ఎంపీ మండిపడ్డారు. సత్తా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కాదు అని వరప్రసాద్ పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యం విలువ, ఓటు విలువ, దళితుల విలువ గురించి చంద్రబాబుకు రాబోయే రోజుల్లో తెలుస్తుందని ఎంపీ అన్నారు. దివంగత నేత వైఎస్సార్ కలలు నెరవేర్చాలనే వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ప్రజల మద్దతుతోనే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఎంపీ వరప్రసాద్ విశ్వాసం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment