Varaprasad Rao Velagapalli
-
‘వాళ్లు తెలుగు మీడియంలో చదువుతున్నారా?’
సాక్షి, అమరావతి: ఆంగ్ల విద్యపై ఆందోళన చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యుల పిల్లలు తెలుగు మీడియంలో చదువుతున్నారా? అని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంగ్ల భాషను తీసుకురావడం వల్ల అణగారిన వర్గాల్లో నూతనోత్తేజం వచ్చిందన్నారు. సోమవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ ‘రాష్ట్రంలో ఆంగ్ల విద్యా విధానం తీసుకురావడం శుభపరిణామం. ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. నేను ఆంగ్ల భాషలో చదువుకోవడం వల్లే ఉన్నతస్థాయికి వచ్చానని గర్వంగా చెబుతున్నా. రిటైర్డ్ ఐఏఎస్, మాజీ ఎంపీగా ఆంగ్ల భాషలో పట్టు ఉండటం వల్లే నేను మంచి పేరు సంపాదించా’నని ఆయన తెలిపారు. -
ఈ క్షణాలు తీపి గుర్తులు: రతన్ టాటా
సాక్షి, విశాఖపట్నం : విశ్వవిద్యాలయాలకు పరిశ్రమలతో ఇంటరాక్షన్ పెరగాలని పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా అభిలాషించారు. అంతేకాకుండా యూనివర్సిటీల్లో పరిశోధనలు విస్త్రతంగా జరగాలని ఆకాంక్షించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వవిద్యార్థుల వార్షిక సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తన జీవితంలో ఈ క్షణాలు తీపిగుర్తులుగా మిగిలిపోతాయన్నారు. విశాఖపట్నం క్లీన్ సిటీగా అభివర్ణించారు. ఈ నగరంపైపై ఇప్పటివరకూ దృష్టి సారించలేదని.. ఇకపై పెడతామన్నారు. విశాఖలో టాటా గ్రూప్ ఏ రంగంలో పరిశ్రమ ఏర్పాటు చేయాలనే అంశంపై ముంబైలో చర్చించి ఓ నిర్ణయానికి వస్తామని తెలిపారు. ఇక ఇదే సమ్మేళనంలో పూర్వ విద్యార్థిగా పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వరప్రసాద్ మాట్లాడుతూ.. నలభై ఏళ్ల తర్వాత ఈ విశ్వవిద్యాలయానికి పూర్వ విద్యార్థిగా రావటం చాలా ఆనందంగా ఉందన్నారు. -
దుగ్గరాజు పట్నంపై ప్రభుత్వం నిర్లక్ష్యం
సాక్షి, అమరావతి: దుగ్గరాజు పట్నం ఓడరేవు తీసుకొని వచ్చేంత వరకు తమ పార్టీ పోరాటం ఆగదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వరప్రసాద్ పేర్కొన్నారు. ఓ ప్రైవేట్ పోర్టును కాపాడేందుకే దుగ్గరాజు పట్నం పోర్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆయన మండిపడ్డారు. సోమవారం దుగ్గరాజు పట్నం పోర్టు నిర్మాణం పురోగతి కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేతను కలిసి ఆయన వినతిపత్రం సమర్పించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, లోకేష్‌ను కలిసి ఈ విషయంపై చర్చిద్దామని వచ్చానని తెలిపారు. 2018వరకు దుగ్గరాజు పట్నం తొలి దశ పనులు పూర్తికావాల్సి ఉన్నా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదని ఆరోపించారు. చంద్రబాబు ఒక్క లెటర్ రాస్తే.. కేంద్రం ఎనిమిది వేల కోట్లు విడుదల చేయడానికి సిద్దంగా ఉందని నితిన్ గడ్కరీ తెలిపిన విషయాన్ని గుర్తుచేశారు. అంతేకాకుండా బకింగ్ హామ్ కెనాల్ ప్రాజెక్ట్ కూడా అభివృద్ధికి నోచుకోవడం లేదని విమర్శించారు. అయితే బకింగ్ హామ్ కెనాల్‌కు మూడు వేల కోట్ల కేటాయింపులు జరిగేల చర్యలు తీసుకుంటామని సీఎస్ హామీ ఇచ్చినట్లు వరప్రసాద్ తెలిపారు. -
‘బాబుకు పాలించే అర్హత లేదు’
సాక్షి, తిరుపతి: దొంగ హామీలతో అధికారం చేపట్టిన చంద్రబాబుకు పాలించే అర్హత లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వరప్రసాద్ అభిప్రాయపడ్డారు. సోమవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారం చేపట్టిన తర్వాత టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడం సిగ్గుచేటన్నారు. ఏపీలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఎద్దేవ చేశారు. దుగరాజు పట్నం పోర్టు రాకపోవడానికి నూటికి నూరు పాళ్లు చంద్రబాబే కారణమని మండిపడ్డారు. కృష్ణపట్నం పోర్టు కోసమే దుగరాజు పట్నంను అడ్డకున్నారని ధ్వజమెత్తారు. మన్నవరం ప్రాజెక్టు రాకతో బతుకులు మారతాయని ఆశపడిన జిల్లా ప్రజలు చంద్రబాబు అసమర్థతో నిరాశకు గురయ్యారని వివరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సీఎం అయితేనే మన్నవరం ప్రాజెక్టు బాగుపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. -
‘బాబు అసమర్థతే కారణం’
సాక్షి, తిరుపతి: ప్రత్యేక హోదాపై పూటకో మాట మార్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. అదివారం ఉదయం ఆయన మీడియా సమావేశంలో అవిశ్వాసం, తదితర అంశాలపై స్పందిచారు. వైఎస్ఆర్సీపీ ఒత్తిడి వల్లే పార్లమెంట్లో అవిశ్వాసం పెట్టారని, నాలుగేళ్లుగా టీడీపీ డ్రామాలు ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు ఇప్పటివరకు 30 దేశాలు తిరిగాడని.. కానీ అమరావతిలో ఒక్క ఇటుక కూడా పడలేదని ఎద్దేవ చేశారు. బీజేపీతో టీడీపీ లాలూచీ నిజం కాదా? బీజేపీ తప్పులను గతంలో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. బాబు అసమర్థత వల్లే రాష్ట్రానికి నిధులు రాలేదని ఆరోపించారు. చంద్రబాబు కేవలం కమీషన్ల కక్కుర్తి కోసమే పోలవరం ప్రాజెక్టును చేపట్టారే తప్పా ఎలాంటి మంచి ఉద్దేశంతో కాదని వరప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రేణిగుంట రైల్వేస్టేషన్లో వరప్రసాద్‌కు ఘనస్వాగతం
-
దోచుకున్న సొమ్ముతో ఎన్నికలకు: వరప్రసాద్
సాక్షి, హైదరాబాద్: ఇచ్చిన హామీలు నెరవేర్చ మని అడుగుతున్న బడుగు, బలహీన వర్గాలపై చంద్రబాబు దూషణ లకు దిగుతున్నారని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆయనకు బుద్ధిచెబు తారని హోదా కోసం రాజీనామా చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వెలగపల్లి వరప్రసాద్ అన్నారు. బుధవారం వరప్రసాద్ హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నాలుగేళ్లు అధికారంతో దోచుకున్న సొమ్ముతో ఎన్నికలకు సిద్ధమవుతున్న బాబు బీసీలు, ఎస్సీ, ఇతర వర్గాలను చిన్నచూపు చూస్తున్నారని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో వారే ఆయనకు తగిన రీతిలో బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. ఎన్నికల హామీని నెరవేర్చాలని కోరిన మత్స్యకారులను మీ అంతు చూస్తానని చంద్రబాబు బెదిరించారని, తాజాగా కనీస వేతనాలు అడిగిన నాయీబ్రాహ్మణులను బెదిరించారని, దీన్ని బట్టి ఆయనకు ఎంత అహంకారమో స్పష్టమవుతోందన్నారు. సాగునీటి ప్రాజెక్టులను తనఖా పెడతారా? రాష్ట్రంలోని పది సాగునీటి ప్రాజెక్టులను బ్యాంకులకు తనఖా పెట్టడానికి వీలుగా ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై వైఎస్సార్ కాంగ్రెస్ రైతువిభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర రైతాంగాన్ని ఏం చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారని ఆయన ప్రశ్నించారు. -
‘ఢిల్లీ వెళ్లి చతికిల పడిన చంద్రబాబు’
సాక్షి, హైదరాబాద్ : రెండేళ్లుగా సీఎం చంద్రబాబులో అసహనం పెరిగిపోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వరప్రసాద్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏ ఒక్కరు దళితుడిగా పుట్టాలని కోరుకోరని గతంలో చంద్రబాబు అన్న విషయాన్ని గుర్తు చేశారు. చిన్నకులాల వాళ్లంటే ఆయనకు చులకన భావం ఉందని ఎంపీ పేర్కొన్నారు. ‘మత్స్యకారులను మీ అంతు చూస్తానని చంద్రబాబు అన్నారు.. అంటే.. చంద్రబాబుకు ఎంత అహంకారం. నాయిబ్రాహ్మణులు కనీస వేతనాలు అడిగితే కళ్ళు ఎర్రజేసి వారిపై చిందులేస్తారా ? బీసీ, ఎస్సీ, ఎస్టీల ఓట్లు మాత్రం చంద్రబాబుకు కావాలి. కానీ, వారి బాగోగులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని’ ఎంపీ వరప్రసాద్ ధ్వజమెత్తారు. అసలు చంద్రబాబులో మానవత్వం ఉందా అని ఎంపీ ప్రశ్నించారు. బీజేపీపై నేను యుద్ధం ప్రకటిస్తానని చెప్పినా బాబు.. ఢిల్లీ వెళ్లి చతికిల పడ్డారని వరప్రసాద్ ఎద్దేవా చేశారు. దీన్ని బట్టి మోదీ అంటే బాబులో ఎంత భయం ఉందో అర్థమవుతుందన్నారు. 40 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి చెప్పిన హామీలన్నీ నెరవేర్చేవారు. ఆయనకు కనీస రాజకీయ జ్ఞానం కూడా లేదని ఎంపీ మండిపడ్డారు. సత్తా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కాదు అని వరప్రసాద్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం విలువ, ఓటు విలువ, దళితుల విలువ గురించి చంద్రబాబుకు రాబోయే రోజుల్లో తెలుస్తుందని ఎంపీ అన్నారు. దివంగత నేత వైఎస్సార్ కలలు నెరవేర్చాలనే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ప్రజల మద్దతుతోనే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఎంపీ వరప్రసాద్ విశ్వాసం వ్యక్తం చేశారు. -
రెండేళ్లుగా చంద్రబాబులో అసహనం పెరిగిపోయింది
-
‘విచారణ అంటే చంద్రబాబు భయపడుతున్నారు’
సాక్షి, తిరుపతి : కళియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి నగల మీద సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వరప్రసాద్ డిమాండ్ చేశారు. అయితే విచారణకు మాత్రం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భయపడుతున్నారని ఆయన తెలిపారు. టీటీడీ వివాదంపై ఎంపీ వరప్రసాద్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. టీటీడీ వివాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. అయితే టీటీడీలో జరుగుతున్న అన్యాయాలను లేవనెత్తిన రమణ దీక్షితులను తొలగించడం దారుణమని పేర్కొన్నారు. ఆరోపణలు చేసిన వారికి చట్ట ప్రకారం ప్రభుత్వమే రక్షణ కల్పించాలని సూచించారు. తిరుమల పోటులో అర్చకులకు తెలియకుండా తవ్వకాలు జరిపారని చచెప్పారు. దీని వెనుక ఉన్న మతలబు ఏంటో.. చివరికి అధికారులకు కూడా తవ్వకాల గురించి తెలియదని చెబుతున్నారు. తిరుమల స్వామి వారి నగల మీద ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా వైఎస్సార్సీపీ టీటీడీ వివాదంపై విచారణకు డిమాండ్ చేస్తుందన్నారు. రమణ దీక్షితులకు, మాకు ఎలాంటి సంబంధం లేదని వైఎస్సార్సీపీ నేత వరప్రసాద్ స్పష్టం చేశారు. -
వర్ల రామయ్య పిల్లలు ఫోన్ వాడరా?
సాక్షి, విజయవాడ: బస్సులో ప్రయాణిస్తున్న యువకుడి పట్ల ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య అనుచిత ప్రవర్తన, అభ్యంతరకర వ్యాఖ్యలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ఎంపీ వరప్రసాద్ శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. వర్ల తీరును ఆక్షేపించారు. (చదవండి: నువ్వు మాదిగా? ఇంకేం చదువుతావ్) ‘‘మచిలీపట్నం బస్టాండ్‌లో ఆకస్మిక తనిఖీకి వెళ్లిన వర్ల రామయ్య.. తన స్థాయిని మర్చిపోయి ఓ యువకుడిని ఉద్దేశించి వాడు, వీడు అని దుర్భాషలాడారు. పక్కనున్న టీడీపీ నాయకులు ఆయన్ని ఇంకాస్త రెచ్చగొట్టారు. ఇంగితజ్ఞానం కూడా మర్చిపోయి.. నీ కులమేంటని ప్రశ్నించారు. ఫోన్ వాడితే పనికిరాకుండాపోతావని తిట్టిపోశారు. ఏం? వర్ల రామయ్యగారి పిల్లలు ఫోన్లు వాడరా? పేదలకు ఒక న్యాయం, రామయ్య బిడ్డలకు ఒక న్యాయమా? అసలు కులం అడగటం ఏం సంస్కృతి? ఆయన అనాల్సిన మాటలేనా అవి!’’ అని ఎంపీ వరప్రసాద్ వాపోయారు. యథా బాబు.. తథా రామయ్య: గతంలో దళితులను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా దారుణంగా మాట్లాడారు. కనీసం క్షమాపణలు చెప్పినట్లు కూడా చెప్పలేదు. ఇక ఆయన కింద పనిచేసే నాయకులు అంతకంటే గొప్పగా మాట్లాడతారని అనుకోలేం’ అని వరప్రసాద్ పేర్కొన్నారు. -
పెట్టింది వైఎస్సార్.. పీకేది చంద్రబాబే
సాక్షి, విజయవాడ: నలభైఏళ్ల రాజకీయ అనుభవం ఉందనే చంద్రబాబు నాయుడు.. జీవితంలో నేర్చుకున్నది ఏమీలేదు కాబట్టే ఇంకా దుర్భాషలాడే స్థాయిలో ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పి. వరప్రసాద రావు అన్నారు. ముఖ్యమంత్రి వినియోగించిన ‘పీకుడు’ పదాన్ని పాజిటివ్‌గా తీసుకుంటే, పీకేవాళ్లెవరో, పెట్టేవాళ్లెవరో ఇట్టే తేల్చయవచ్చని చెప్పారు. విజయవాడలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు సంబోధించింది మహానేత వైఎస్సార్‌నా, లేక వైఎస్ జగన్నా తెలియకున్నా తాను మాత్రం సమాధానం చెబుతానని వరప్రసాద్ అన్నారు. జగన్ ఇంకా అధికారం చేపట్టలేదన్న సంగతి గుర్తుచేసిన ఆయన.. టీడీపీది పీకే రాజకీయమైతే.. వైఎస్సార్సీపీది పెట్టే రాజకీయమని స్పష్టం చేశారు. పీకేది చంద్రబాబే: ►గడిచిన నాలుగేళ్లలో చంద్రబాబు నాయుడు 10 లక్షల పెన్షన్లను పీకేశారు. వృధాప్య పెన్షన్ వయసును 60 నుంచి 65 సంవత్సరాలకు పెంచి పెన్షన్లు పీకేశారు. ►దాదాపు 10 లక్షల మంది పేదల రేషన్ కార్డుల్ని పీకేశారు. ►2 లక్షల మంది కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను విధుల నుంచి పీకేసిన ఘటన బాబుదే ►తాను సీఎంగా ఉన్న కాలంలో 60కిపైగా ప్రభుత్వ సంస్థలను పీకేశారు.. అంటే మూసేశారు. ►నాడు గొప్పగా అమలైన ఉచిత విద్యుత్ పథకాన్ని పీకేశారు. ►జన్మభూమి కమిటీల పేరుతో దుర్మార్గపు కమిటీలను వేసి జనాన్ని పీక్కుతింటున్నారు. ►మీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగానీ, కలెక్టర్‌గానీ పేదలకు ఇల్లో, ఇంకేదో సాయం చేసే స్థితిలోలేరు.. ఎందుకంటే వాళ్ల అధికారాలన్నీ మీరు పీకేశారు.. వాటిని జన్మభూమి కమిటీల చేతుల్లో పెట్టారు. ►ఇంత అహంకారంతో మాట్లాడే మిమ్మల్ని ప్రజలే పీకేసే రోజు వస్తుంది. పెట్టింది వైఎస్సారే: ►ఈ రాష్ట్ర ప్రజలకు ఏ ముఖ్యమంత్రైనా మంచి చేశారంటే అది ఒక్క వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు మాత్రమే. ►ఆయన పేదల కోసం ఆరోగ్యశ్రీని పెట్టారు. ►ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రకులాల పేద పిల్లల చదువుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పెట్టారు. ►డ్వాక్రా మహిళలకు పావల వడ్డీ పథకం పెట్టి వారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. ►2004-2008 మధ్య కాలంలో అంబులెన్స్‌లు, మందుల సరఫరా ఎలా జరిగిందో ప్రజలకు గుర్తుంది. ►నా నియోజకవర్గం(తిరుపతి పార్లమెంట్ పరిధి)లో మూడు ఎస్ఈజెడ్లు పెట్టారు. తద్వారా వందలాది పరిశ్రమలు, వేల మందికి ఉపాధి కల్పించారు. అసమర్థత.. ఇష్టారీతి ప్రవర్తన@బాబు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజాస్వామ్యాన్ని ఇసుమంతైనా గౌరవించని వ్యక్తి చంద్రబాబు నాయుడు. మీ అసమర్థత వల్లే ప్రత్యేక హోదా రాలేదు. మా ఎమ్మెల్యేలను కొని, వాళ్లను మంత్రులు చేశారు. ఇష్టారీతిగా నియంతమాదిరి వ్యవహరిస్తున్నారు. మీకు ప్రజాస్వామ్యం పట్ల విలువలేదని తెలుసుకాబట్టే మేం(వైఎస్సార్సీపీ) అసెంబ్లీనిని బహిష్కరించాం. కేంద్రం నుంచి వచ్చే నిధులను మీ పేరున్న పథకాలుగా చెప్పుకోవడంకాదు.. ఈ జీవితం మొత్తంలో ప్రజలకు నేనిది చేశాను.. అని చెప్పగలిగే ధైర్యం చంద్రబాబుకు లేదు. కాబట్టే ఆయన దుర్భాషలకుదిగుతున్నారు’’ అని వరప్రసాద్ పేర్కొన్నారు. -
ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబును తరిమికొట్టాలి
-
నల్లజెండాలతో పాదయాత్ర
విజయవాడ: ప్రజలను వంచించిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి దీక్ష చేసే అర్హత లేదని, ఏప్రిల్ 30న వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్రలో పాల్గొనే అందరూ నల్లజెండాలు పట్టుకుని, నల్లబాడ్జీలు ధరించి పాదయాత్ర చేస్తారని ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన వైఎస్సార్సీపీ తిరుపతి ఎంపీ వరప్రసాద్ తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ..నాలుగేళ్ల నుంచి చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఈ నాలుగేళ్ల పాలనలో ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఏప్రిల్ 30న ఏపీకి జరిగిన అన్యాయాన్ని నల్లజెండాలతో పెద్ద ఎత్తున తెలియజేస్తామని వివరించారు. మరో వైఎస్సార్సీపీ నేత ధర్మాన ప్రసాద రావు మాట్లాడుతూ..హోదా హామీ అమలు కాకపోవడానికి కారణం చంద్రబాబేనన్నారు.హోదాకు వంచన చేసింది ముమ్మాటికీ చంద్రబాబేనని మండిపడ్డారు. ఈ నెల 30వ తేదీని వంచన దినంగా పాటిస్తామని విలేకరుల సమావేశంలో వెల్లడించారు.విశాఖలో ఏప్రిల్ 30న వంచన దినాన్ని పెద్ద ఎత్తున జరుపుతామని వివరించారు. వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రలో పాల్గొనే అందరూ నల్లజెండాలు, నల్లబ్యాడ్జీలు ధరించి, ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసన ద్వారా ప్రజలకు, కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పారు. -
ఏపీకి ప్రత్యేక హోదా వైఎస్ జగన్ వల్లే సాధ్యం
-
చంద్రబాబు వల్లే హోదా వెనక్కు
నెల్లూరు(సెంట్రల్) : ముఖ్యమంత్రి చంద్రబాబు వల్లే ఆందదప్రదేశ్కు ప్రత్యేక హోదా హామీ వెనక్కు పోయిందని తిరుపతి పార్లమెంట్ సభ్యులు వెలగపల్లి వరప్రసాద్‌రావు విమర్శించారు. హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఎంపీ పదవులకు రాజీనామా చేసి, ఆమరణదీక్ష చేసిన అనంతరం మొదటి సారిగా గురువారం రాత్రి ఆయన నెల్లూరుకు చేరుకున్నారు. ఎంపీ వరప్రసాద్‌కు జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్ రైల్వేస్టేషన్లో ఎంపీకి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వరప్రసాద్‌రావు మాట్లాడుతూ నాలుగేళ్లుగా దొంగనాటకాలు ఆడి, బీజేపీతో చంద్రబాబు దోస్తీ కట్టారన్నారు. హోదా విషయంపై సీఎం చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడారన్నారు. అదేవిధంగా తమ రాజీనామాలపై హేళనగా మాట్లాడిన టీడీపీ నేతలు ఇప్పుడు హోదా కోసం దీక్ష చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు చేసే దొంగ దీక్షలను ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. రాబోవు ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవాలనే మోసంతోనే దొంగ దీక్షకు చంద్రబాబు పూనుకున్నారని విమర్శించారు. తమ నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో, ప్రజల ఆకాంక్ష కోసం పదవులను త్రుణపాయంగా వదులుకుంటామని స్పష్టం చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో పోరాటాల ద్వారా హోదాను సాధించుకుంటామన్నారు. తలుపులు మూసిన తరువాత ఆందోళనా? తెలుగుదేశం పార్టీ ఎంపీలు పార్లమెంట్లో తలుపులు మూసి వేసిన తరువాత ఆందోళన అంటూ బయట నాటకాలు ఆడారని ఆరోపించారు. వాళ్లకు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ జరుగుతున్నప్పుడు ఎందుకు పోరాటం చేయలేదని ప్రశ్నించారు. తాము హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడితే దాదాపుగా 100 మందికిపైగా ఎంపీలు తమకు మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. ప్రధాన మంత్రి మోదీ ఇంటి ముందు తాము ఆందోళన చేశామని టీడీపీ ఎంపీలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. వాళ్లు చేసింది ప్రధాని ఇంటి ముందు కాదని, ఎక్కడో చేసి అనుకూల మీడియా ద్వారా ప్రధాన మంత్రి ఇంటి ముందు అని చెప్పుకుంటున్నారని ఆరోపించారు. రానున్న రోజుల్లో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో హోదా కోసం ఉద్యమం తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. ప్రధానంగా తమ రాజీనామాలు స్పీకర్ ఫార్మెట్‌లోనే ఇచ్చామన్నారు. ఆమరణ దీక్ష భగ్నం చేసిన తరువాత కూడా రాష్ట్రపతిని కలిశామని పేర్కొన్నారు. ఎంపీని కలిసిన ఎమ్మెల్యే కాకాణి రాజీనామా చేసిన తరువాత నెల్లూరుకు మొదటిసారిగా వచ్చిన తిరుపతి పార్లమెంట్ సభ్యులు వి.వరప్రసాద్రావును వైఎస్సార్సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి హోటల్ అనురాగ్లో కలిశారు. గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ హోదా కోసం వైఎస్సార్సీపీ ఎంపీలు చేసిన ఆమరణ దీక్ష ఫలితం తప్పకుండా ఉంటుందన్నారు. హోదా పోరాటంలో ప్రతి ఒక్కరం భాగస్వాములుగా ముందుకు పోతామన్నారు. -
చంద్రబాబు దీక్షకు దిగటం హాస్యాస్పదం..
సాక్షి, విజయవాడ : ప్రత్యేక హోదాపై నాలుగేళ్లుగా కాలయాపన చేసి.. ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు దీక్షకు దిగటం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వరప్రసాద్ ఎద్దేవా చేశారు. మరోసారి ప్రజలను మోసం చేసేందుకే ఆయన దీక్ష చేపడుతున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంపై ఏ మాత్రం గౌరవం లేని వ్యక్తి.. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదాను కాలరాసి.. చంద్రబాబు చేస్తున్న దీక్ష కొంగజపం లాంటిదని వరప్రసాద్ విమర్శించారు. నాలుగేళ్లుగా కేంద్రంతో సక్యతగా ఉంటూ.. ఇప్పుడు కేంద్రానికి వ్యతిరేకంగా దీక్ష చేపడుతున్నానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమన్నారు. పీఎం నరేంద్ర మోదీ గ్రాఫ్ పడిపోతుందని భావించిన చంద్రబాబు మళ్లీ కొత్త చక్రాలను వెతుక్కుంటూ.. బయటకు వచ్చి ఏదో విధంగా ప్రజలను మభ్యపెట్టేందుకు దీక్ష చేపడుతుందన్నారు. విజయవాడ వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వరప్రసాద్ గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీక్ష ప్రజాస్వామ్య ఆయుధమని, కానీ చంద్రబాబు లాంటి ప్రజాస్వామ్య వ్యతిరేకులు దీక్ష చేపడితే.. దాని అర్థం మారిపోతుందన్నారు. పరిపాలన అంతా జన్మభూమి కమిటీల్లోనే పెట్టారని, కలెక్టర్లకు అధికారాలు లేకుండా చేశారని వరప్రసాద్ విమర్శించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులెలా ఇస్తారని అన్నారు. హోదాపై ప్రజల్లో చైతన్యం వచ్చిందంటే వైఎస్సార్ సీపీ వల్లేనని, హోదా వచ్చి ఉంటే ఏపీ ఇంత మొత్తంలో అప్పు చేయాల్సి వచ్చేదా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో చంద్రబాబు ఏరోజు హోదా గురించి మాట్లాడలేదన్నారు. 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు ఈ దీక్ష చేస్తున్నారని తెలిపారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ కూడా మోసం చేసిందని, చంద్రబాబు కులాల మధ్య చిచ్చు పెట్టారని వరప్రసాద్ అన్నారు. సీఎంగా కొనసాగే హక్కు చంద్రబాబుకు ఉందా అని ఆయన ప్రశ్నలు సంధించారు. ప్రజలను మోసం చేయడంలోనే చంద్రబాబుకు అనుభవం ఉందని, ప్రతి రంగంలో ఉన్నవారిని మోసం చేసి ఓట్లు వేయించుకుని, తన తప్పు లేదన్నట్లు చంద్రబాబు బీజేపీపై నెపాన్ని నెడుతున్నారన్నారు. మొదట నుంచి హోదా కోసం పోరాటం చేసింది వైఎస్సార్ సీపీనే అని, చివరకు పార్లమెంట్లో 13సార్లు అవిశ్వాసం పెట్టామని, హోదా కోసం వైఎస్సార్ సీపీ ఎంపీలందరూ రాజీనామా చేశామని ఎంపీ వరప్రసాద్ పేర్కొన్నారు. -
ఆందోళనలో ఎంపీ వరప్రసాద్ ఆరోగ్యం ,ఆస్పత్రికి తరలింపు
-
క్షీణించిన ఎంపీ వరప్రసాద్ ఆరోగ్యం ,ఆస్పత్రికి తరలింపు
-
క్షీణించిన ఎంపీ వరప్రసాద్ ఆరోగ్యం.. ఆస్పత్రికి తరలింపు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రత్యేక హెదా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్ సీపీ ఎంపీల ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణిస్తోంది. శనివారం మేకపాటి ఆరోగ్యం క్షీణించి ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా తిరపతి ఎంపీ వరప్రసాద్ ఆరోగ్యం కూడా క్షీణించింది. ఆయన శనివారం సాయంత్రం నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. దీనితో పాటు డీ హైడ్రేషన్‌కు గురయ్యారు. పలు పరీక్షలు జరిపిన రామ్‌మనోహర్‌లోహియా వైద్యులు పరిస్థితి ఆందోళన కరంగా ఉందని, దీక్ష వెంటనే విరమించాలని వరప్రసాద్‌కు సూచించారు. రక్తంలో షుగర్ లెవల్స్ 72కు పడిపోయాయని, దీక్ష కొనసాగించడం ప్రమాదకరం అని డా. భల్లా వైద్య బృందం తెలిపింది. ఈ పరిస్థితులపై ఏపీ భవన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్పందించారు. వైస్సార్ సీపీ ఎంపీలు దీక్ష విరమించాలని కోరారు. ఇప్పటికే మేకపాటి ఆరోగ్యం క్షీణించిందని తాజాగా వరప్రసాద్ సైతం అనారోగ్యానికి గురయ్యారని తెలిపారు. వైద్యుల సూచన మేరకు దీక్ష విరమించాలని, వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అయితే వైద్యుల విన్నపాన్ని వరప్రసాద్ సున్నితంగా తిరస్కరించారు. దీంతో వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన దీక్షాస్థలికి చేరుకున్నారు. బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. -
రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు ఢిల్లీ పర్యటన
-
లాలూచీ కోసమే చంద్రబాబు ఢిల్లీ పర్యటన
-
ప్రజాస్వామ్య చరిత్రలో తొలిసారి: వైఎస్ఆర్సీపీ
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంపై తొమ్మిదోసారి ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు స్వీకరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కోరుతున్నారు. అవిశ్వాస తీర్మానంపై వంద మందికి పైగా ఎంపీల మద్ధతు కూడగట్టామని, సభలో స్పీకర్ నేడు చర్చ చేపట్టాలని వైఎస్ఆర్సీపీ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంపీలు రాజీనామాలతో పాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం ప్రజాస్వామ్య చరిత్రలో తొలిసారి అని వైఎస్ఆర్సీపీ ఎంపీ వరప్రసాద్ పేర్కొన్నారు. ఏదో సాకు చూపించి తీర్మానంపై చర్చ చేపట్టకుండా సభను వాయిదా వేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎంపీల మద్దతు ఉన్నప్పటికీ తీర్మానంపై చర్చనుంచి తప్పించుకోవడానికి బీజేపీ చూస్తుందని అభిప్రాయపడ్డారు. మరోవైపు కేవలం తన రాజకీయలబ్ది కోసమే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ జపం చేస్తున్నారని విమర్శించారు. లాలూచీ కోసమే చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వస్తున్నారని, టీడీపీ అసమర్ధత వల్లే ప్రత్యేక హోదా ఇవ్వడం లేదన్నారు. గత నాలుగేళ్ల నుంచి చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ ఎంపీలకు విప్ జారీ కాగా, తమ ఎంపీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసింది. నేటి నుంచి చివరిరోజు వరకు పార్టీ ఎంపీలందరూ పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావాలని కోరింది. పార్టీ నిర్ణయానికి అనుగుణంగా సభలో వ్యవహరించాలని ఆదేశించింది. -
చంద్రబాబు రాత్రికి రాత్రే రంగులు మార్చారు
-
జంప్ జిలానీలను కాపాడేందుకే టీడీపీ డ్రామాలు!
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా పోరాటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ పేరొస్తుందోనని భయపడి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాత్రికి రాత్రే రంగులు మార్చారని ఆ పార్టీ ఎంపీ వరప్రసాద్ మండిపడ్డారు. నిన్నటి వరకు వైఎస్ఆర్సీపీ ప్రతిపాదించిన అవిశ్వాసానికి మద్దతు ఇస్తున్నానని చెప్పిన అనూహ్యంగా నిర్ణయాన్ని మార్చుకుని, లేదు మేం వేరుగా వెళ్తున్నామంటూ చంద్రబాబు ప్రకటించాడన్నారు. ఢిల్లీలో పార్లమెంట్ ఆవరణలో ఎంపీ వరప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ఆర్ సీపీకి భయపడి తెలుగుదేశం పార్టీ అవిశ్వాసానికి వస్తుందని, అంతేగానీ వారికి టీడీపీకి ప్రత్యేక హోదాపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నోటీసులు ఇచ్చారని, అన్ని పార్టీల నేతలను కలిసి మద్దతు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. ప్రత్యేక హోదాకు ప్రాణం పోసింది వైఎస్ఆర్సీపీ అని, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన పోరాటాలతోనే హోదా ఉద్యమం ఉధృతమైందన్నారు. టీడీపీలోకి ఫిరాయించిన ఎంపీలపై అనర్హత వేటు పడుతుందనే భయంతోనే చంద్రబాబు ఎన్డీఏ నుంచి భయటకు వచ్చారని చెప్పారు. అవిశ్వాసానికి ముందుకు రాకపోతే వైఎస్ఆర్సీపీ విప్ జారీ చేస్తుందని, చర్చ, ఓటింగ్ జరిగితే టీడీపీలోకి ఫిరాయించిన ఎంపీలపై వేటు పడుతుందన్న భయంతోనే హోదా విషయంలో ముందుకొచ్చారని చంద్రబాబు కుటిలనీతిని వైఎస్ఆర్సీపీ ఎంపీ వరప్రసాద్ బహిర్గతం చేశారు.