
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం మార్చి 5న ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన ధర్నాకు అనుమతి లభించిందని వైఎస్సార్‌సీపీ ఎంపీ వరప్రసాదరావు తెలిపారు. సోమవారం ఆయన ఢిల్లీలో డీసీపీ మధుర్‌వర్మను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో రాజీలేని పోరాటం చేస్తున్నామన్నారు.
ఇందులో భాగంగా వచ్చే నెల 5న ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్‌లో ధర్నా నిర్వహించబోతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటారని వివరించారు.