ఎంపీ వరప్రసాద్
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా పోరాటంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ పేరొస్తుందోనని భయపడి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాత్రికి రాత్రే రంగులు మార్చారని ఆ పార్టీ ఎంపీ వరప్రసాద్ మండిపడ్డారు. నిన్నటి వరకు వైఎస్‌ఆర్‌సీపీ ప్రతిపాదించిన అవిశ్వాసానికి మద్దతు ఇస్తున్నానని చెప్పిన అనూహ్యంగా నిర్ణయాన్ని మార్చుకుని, లేదు మేం వేరుగా వెళ్తున్నామంటూ చంద్రబాబు ప్రకటించాడన్నారు. ఢిల్లీలో పార్లమెంట్ ఆవరణలో ఎంపీ వరప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్‌ఆర్ సీపీకి భయపడి తెలుగుదేశం పార్టీ అవిశ్వాసానికి వస్తుందని, అంతేగానీ వారికి టీడీపీకి ప్రత్యేక హోదాపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదన్నారు.
అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నోటీసులు ఇచ్చారని, అన్ని పార్టీల నేతలను కలిసి మద్దతు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. ప్రత్యేక హోదాకు ప్రాణం పోసింది వైఎస్‌ఆర్‌సీపీ అని, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన పోరాటాలతోనే హోదా ఉద్యమం ఉధృతమైందన్నారు. టీడీపీలోకి ఫిరాయించిన ఎంపీలపై అనర్హత వేటు పడుతుందనే భయంతోనే చంద్రబాబు ఎన్డీఏ నుంచి భయటకు వచ్చారని చెప్పారు. అవిశ్వాసానికి ముందుకు రాకపోతే వైఎస్‌ఆర్‌సీపీ విప్ జారీ చేస్తుందని, చర్చ, ఓటింగ్ జరిగితే టీడీపీలోకి ఫిరాయించిన ఎంపీలపై వేటు పడుతుందన్న భయంతోనే హోదా విషయంలో ముందుకొచ్చారని చంద్రబాబు కుటిలనీతిని వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ వరప్రసాద్ బహిర్గతం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment