varaprasad
-
జనసేన ఎమ్మెల్యే వరప్రసాద్ ను నిలదీసిన టీడీపీ, జనసేన నేతలు
-
అద్భుత ఆవిష్కరణకు ఘన గౌరవం
కరోనా మహమ్మారి కల్లోల కాలంలో ప్రపంచమంతా టీకాల కోసం ఎదురుచూపులు చూసింది. ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నో దేశాలకు టీకాల సరఫరాదారుగా భారత్ నిలిచింది. అయితే, పాతికేళ్ల క్రితమే దేశ టీకాల చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖించింది శాంతా బయోటెక్ సంస్థ. సంకల్ప బలంతో, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో హెపటైటిస్–బి టీకాను ఆవిష్కరించింది. అది కూడా చవకగా అందజేసింది. దాన్ని సుసాధ్యం చేసింది... ఆ సంస్థ వ్యవస్థాపకులు, దీర్ఘదర్శి, రేపటితో 75వ వసంతంలోకి అడుగిడుతున్న ‘పద్మభూషణ్’ కె.ఐ. వరప్రసాద్‌రెడ్డి. ఈ నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... దేశ ప్రగతిలో భాగస్వాములైన ప్రముఖులకు ఇచ్చే ప్రతిష్ఠాత్మక ‘వై.ఎస్.రాజశేఖరరెడ్డి జీవన సాఫల్య పురస్కారం’ ఆయనకు అందించింది. నేడు దేశం స్వాతంత్య్ర అమృతోత్సవాలు జరుపు కొంటోంది. పాతికేళ్ళ క్రితం స్వాతంత్య్ర స్వర్ణోత్సవాలు జరుపుకొంది. ఆ శుభవేళల్లో దేశ బయోటెక్ రంగంలో సువర్ణాక్షరాలుగా లిఖించిన తొలి అధ్యాయం పురుడు పోసుకుంది. తొట్ట తొలిగా పూర్తి స్వదేశీ వ్యాక్సిన్ రూపకల్పన జరిగిన శుభ సంరంభం అది! సుమారు 30 ఏళ్ళ క్రితం దేశంలో హెప టైటిస్–బి అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఎయిడ్స్ కంటే ప్రమాదకారిగా ప్రపంచాన్ని వణికిస్తోంది. జెనీవాలో జరుగుతున్న ఒక సమావేశానికి శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు వరప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. ఒక ప్రసంగకర్త మన దేశ సామర్థ్యంపై, మన ప్రభుత్వాల ఉదాసీనతపై, మనవారి ప్రతిభపై లోకువగా మాట్లాడారు. మనల్ని బిచ్చగాళ్ళ కింద జమకట్టారు. ఆ నిందను నిర్మూల్యం చేస్తూ అనేక దేశాలకు వ్యాక్సిన్లు పంపే మహోన్నత స్థితికి చేరుకున్నాం. హెపటైటిస్–బి వ్యాక్సిన్ స్ఫూర్తితో శాంతా బయోటెక్నిక్స్ 13 రకాల ఇతర అద్భుతమైన వ్యాక్సి న్లను సృష్టించే స్థాయికి చేరుకుంది. లాభాపేక్ష లేకుండా అతి తక్కువ ధరలో పుట్టిన ప్రతి బిడ్డకు వ్యాక్సిన్‌ను అందించాలన్నది శాంతా బయోటెక్నిక్స్ పెట్టుకున్న నియమం. దానిని సాధించడం ఆషామాషీ కాదు. విదేశాల నుంచి సాంకేతికతను దిగుమతి చేసుకోవడం ఖరీదైన వ్యవహారం. వరప్రసాద్‌రెడ్డి నాన్నగారు కొంత పొలం అమ్మి యిచ్చిన డబ్బుకు తోడు, బంధు వులు, ఆత్మబంధువులు మరి కొంత ఇచ్చారు. అయినా అది సరిపోదు. అదిగో! అప్పుడే యూసఫ్ బిన్ అలావీ అబ్దుల్లా రూపంలో అమృత హస్తం చేయి చాచింది. అది మాజీ ప్రధాని పీవీ నర సింహారావు చలువ. వరప్రసాద్ రెడ్డి పడుతున్న కష్టాలను గమనించిన పీవీ ఈ అబ్దుల్లాను పంపారు. అబ్దుల్లా ఒమన్ విదేశీ వ్యవహారాల మంత్రి. హెపటైటిస్–బి వ్యాక్సిన్ అవసరం తెలిసిన వ్యక్తి. తాను పెట్టుబడి పెట్టి, వ్యక్తిగత స్థాయిలో గ్యారంటీగా ఉంటూ బ్యాంక్ రుణాలు తెచ్చి, ఆ యజ్ఞంలో భాగస్వాములయ్యారు. నిర్మాణం చేపట్టే నాటికి సుశిక్షుతులైన శాస్త్ర వేత్తలు లేరు. నిపుణుత, సమర్థత, నిబద్ధత కలిగిన గొప్ప బృందాన్ని సమీకరించుకొని రంగంలోకి దిగింది. అనుమతులకు, అమ్మకాలకు, పంపకాలకు అడుగడుగునా అడ్డంకులే ఎదురయ్యాయి. వ్యాక్సిన్ సామర్థ్యంపై విదేశీ కంపెనీ దుష్ప్రచారం చేసింది. సత్ సంకల్పం కాబట్టి కాలమేఘాలు తొలిగి పోయాయి. శాంతా బయోటెక్ రూపొందించిన వ్యాక్సిన్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. హెపటైటిస్ ఎంతో భయంకరమైన వ్యాధి. వేగంగా మనుషులను నిర్వీర్యులను చేస్తుంది. లివర్ సిరోసిస్ వచ్చి ఆరోగ్యం దెబ్బతింటుంది. కొంత మందిని శవాలుగా మార్చింది, కొంతమందిని జీవ చ్ఛవాలు చేసింది. అందుకే అర్జెంటుగా వ్యాక్సిన్లు తయారు చేసి పుట్టిన ప్రతిబిడ్డకూ వాడాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఘోషించింది. అత్యవసరమే అయినప్పటికీ నాణ్యత, సమర్థతపై అన్ని పరీక్షలూ జరిగి తీరాల్సిందేనన్నది శాంతా సంస్థ పట్టుదల. అన్ని పరీక్షల్లో గెలిచి, నూటికి నూరు శాతం సంపూ ర్ణమైన అర్హత సంపాయించుకున్న తర్వాతే వ్యాక్సి న్లను మార్కెట్లో ప్రవేశపెట్టింది. అలా వరప్రసాద్ రెడ్డి అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. ఈ ప్రయాణంలో, శాంతా సంస్థ అడుగడు గునా మానవత్వాన్ని చాటుకుంది. అది భారత్ నుంచి లాహోర్‌కు సుహృద్భావ యాత్రగా బస్సు వేసే చారిత్రక సందర్భం. ఆ బస్సు కంటే హెప టైటిస్ వ్యాక్సిన్లే మాకు ముఖ్యమని పాకిస్తాన్ వేడు కుంది. ఆ సందర్భంలో ప్రధానమంత్రి కార్యా లయం శాంతా బయోటెక్నిక్స్‌ను సంప్రదించింది. మానవీయ కోణంతో మిలియన్ వ్యాక్సిన్లను శాంతా సంస్థ ప్రధాన మంత్రి కార్యాలయం ద్వారా పాకి స్తాన్‌కు ఉచితంగా అందించి మానవత్వాన్ని చాటు కుంది. భారతీయ ఖ్యాతిని, ఆత్మను నిలబెట్టింది. యునిసెఫ్ విషయంలోనూ ఎంతో ఉదారాన్ని చూపించింది. యితఃపూర్వం ఒక్కొక్క వ్యాక్సిన్ 18 డాలర్లకు కొనుగోలు చేసే యునిసెఫ్‌కు కేవలం 23 సెంట్లకే అందజేసింది. ‘శాంతా’ చూపిన ఈ విత రణశీలత వల్ల యునిసెఫ్ ప్రపంచంలోని ఎన్నో పేద దేశాలకు ఉచితంగా హెపటైటిస్ వ్యాక్సిన్లు అందించి పుణ్యం మూట గట్టుకుంది. శాంతా బయోటెక్నిక్స్ వేసిన తొలి అడుగు అతి పెద్దది, అతి గొప్పది. అతి తక్కువ ధరకే వ్యాకిన్ అందించిన ప్రభావంతో మార్కెట్లో వ్యాక్సిన్ ధరలు 40వ వంతుకు పడిపోయాయి. అనేక బహుళజాతి సంస్థలు శాంతా సంస్థవైపు చూడడం మొదలుపెట్టాయి. ఆ తర్వాత బయోటెక్ రంగంలో ఎన్నో కంపెనీలు పుట్టుకొచ్చాయి. వీటన్నిటికి స్ఫూర్తిగా నిలిచి తొలి గవాక్షం తెరిచింది మాత్రం శాంతా బయోటెక్నిక్స్ అన్నది మరువ రానిది. - మాశర్మ, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, కాలమిస్ట్ జీవితం దేవుడిచ్చిన వరం. ఆ వరాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకొని, ఆ జీవన సాఫల్యాన్ని తృప్తిగా ఆస్వాదిస్తూ, తోటివారికి తోడు పడుతూ జీవిత పరీక్షలో కృతార్థులమయ్యా మని చెప్పగల ఆత్మవిశ్వాస సంపన్నులు అరుదు. అలాంటి అరుదైన వ్యక్తులలో ఒకరు తెలుగుతేజం డాక్టర్ కోడూరి ఈశ్వర వరప్రసాద్ రెడ్డి. జన్మనిచ్చిన తల్లిదండ్రులు శాంతమ్మ, వెంకట రమణారెడ్డి గార్లనే కాదు – అక్షర భిక్ష పెట్టిన గురువులను కూడా విస్మరించని సంస్కార వంతుడు వరప్రసాద్ రెడ్డి. మాతృమూర్తి పేరు తోనే ‘శాంతా బయోటెక్’ను నెలకొల్పారు. చాగంటి వారి వ్యాఖ్యానంతో బాపు బొమ్మలతో ‘మాతృ వందనం’ అనే పుస్తక ప్రచురణతో పాటు, రెండు దశాబ్దాలుగా ప్రతి సంవత్సరం ‘మాతృ వందనం’ కార్యక్రమం జరుపుతున్నారు. కొంత మంది లబ్ద ప్రతిష్ఠుల మాతృమూర్తులను సత్క రించడం, ఒక వేద పండితుణ్ని సన్మానించి ఆధ్యా త్మిక ప్రవచనం ఏర్పాటు చెయ్యడం, రెండు ఆసుపత్రులలో నిత్యాన్నదానాలను నిర్వహించడం మొదలైనవి ఆయన అపారమైన మాతృభక్తికి నిదర్శనాలు. ‘తల్లీ నిన్ను దలంచి’, ‘తండ్రీ నిన్ను దలంచి’, ‘తండ్రి పరమ పూజ్యుడు’, ‘అమ్మకు జేజే నాన్నకు జేజే గురువుకు జేజే’ వంటి పుస్తకాలను వెలువరించి జననీ జనకులకు ఎంతటి ఉన్నత స్థానమివ్వాలో ఆచరణాత్మకంగా సూచించారు. సమాజ వికాసానికి విద్య గీటురాయి అని వరప్రసాద్ విశ్వాసం. ఆ అభిప్రాయంతోనే అనేక విద్యా సంస్థలను పోషిస్తున్నారు. తను చదువు కొన్న నేలబడి మొదలుకొని కాకినాడ ఇంజనీరింగ్ కళాశాల వరకు – అన్నిటికీ భవన నిర్మాణాలకు విరాళాలనిచ్చారు. తన ఉన్నతికి కారకులైన గురు వులనెందరినో సత్కరించారు. మద్రాసులోని కేసరి పాఠశాల, నటుడు మోహన్‌బాబు విద్యా నికేతన్, సరస్వతీ విద్యాలయ శాఖలు... ఇలా ఎన్నో విద్యా సంస్థలకు కోట్ల కొలది రూపాయ లను విరాళాలుగా ఇచ్చారు. 6 విద్యా సంస్థ లలో ఉత్తమ విద్యార్థు లకు ఏటేటా శాంతమ్మ గారి పేర స్వర్ణ పతకా లను బహూకరిస్తున్నారు. అబ్దుల్ కలాం సూచన మేరకు 11 లక్షల మంది విద్యార్థులను తన ఉప న్యాసాలతో ఉత్తేజితుల్ని చెయ్యడం, ‘ఫోకస్’ సంస్థకు బాసటగా నిలిచి యువ ఉద్యోగులకు నీతి నిజాయితీల విలువను చాటడం – విద్య పట్ల ఆయన ఆసక్తికి కొన్ని ఉదాహరణలు. వేద పాఠశాలల నిర్మాణ నిర్వహణలకు ఆర్థిక సహాయం, వేద విద్యార్థులకు ఉపకార వేతనా లివ్వడం, 100 గంటలపాటు వేదాలను రికార్డు చేయడానికి, వేద సంబంధ పుస్తకాలను ప్రచురిం చడానికి చేయూతనివ్వడం – సనాతన ఆర్ష ధర్మం పట్ల ఆయన అభిమానానికి తార్కాణాలు. అనేక దేవాలయాలకు విరాళాలివ్వడమే గాక శ్రీపురం, వేదాద్రిలలోని అన్నదానాలకు భూరి విరాళాలి వ్వడం ఆయన దానధర్మ నిరతికి సాక్ష్యాలు. అనేక అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు నిధులివ్వడం, కేన్సర్ బారినపడి చివరి మజిలీకి చేరువవుతున్న అభాగ్యులకు ‘స్పర్శ’ వంటి సంస్థల ద్వారా ప్రశాంతతను చేకూర్చడం ఆయన మానవతా దృష్టికి మచ్చు తునకలు. వైద్యులకు, నర్సులకు శిక్షణనిచ్చే ‘పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్’, కార్నియాపై పరిశోధనలకు ఊతమిచ్చిన ఎల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రి మొదలైన వైద్య సంస్థలకు సహకారం, వికలాంగులకు బధిరాంధులకు ఉపకరణాలు సమకూర్చడం అభినందనీయం. చిన్నతనం నుండి వరప్రసాద్ రెడ్డికి సంగీత సాహిత్యాలంటే మక్కువ. శ్రావ్యమైన పాటలను బాల్యం నుంచి పదిలపరచుకొనే అలవాటున్న ఆ రస పిపాసి అనేక మ్యూజిక్ ఆల్బమ్స్‌ను రూపొం దించారు. హాసం, శాంత–వసంత ట్రస్ట్ ప్రచుర ణలుగా శతాధిక గ్రంథాలను ప్రచురించారు. మరి కొన్నిటికి ఆర్థిక సహాయం చేశారు. మిత్రులు ఎంబీఎస్ ప్రసాద్ సంపాదకులుగా హాస్య సాహి త్యాలకు పెద్ద పీట వేస్తూ మూడేళ్లకు పైగా ‘హాసం’ పత్రికను నడిపారు. డా.సి. నారాయణ రెడ్డి, ముళ్లపూడి వెంకటరమణ, రావి కొండల రావు, తనికెళ్ల భరణి వంటి రచయితల రచనలతో పాటు సుమారు 50 పుస్తకాలను ప్రచురించారు. స్వయంగా ‘మనసు పలికే...’, ‘పరిణత వాణి’ వంటి పుస్తక రచనలు చేశారు. ప్రతి మగాడి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుం దన్న సామెతగా ఆయన నిస్వార్థ సేవకు సర్వదా సానుకూలంగా సహకరిస్తున్న వసంత ధర్మ పత్నిగా లభించడం ఆయన అదృష్టం. ‘పద్మ భూషణ్’ నుంచి తాజాగా వైఎస్సార్ జీవన సాఫల్య పురస్కారం వరకు వందల పురస్కారాలు అందుకొన్న వరప్రసాద్ సార్థక నామధేయులు. డా పైడిపాల, వ్యాసకర్త రచయిత, సినీ పరిశోధకుడు (రేపు డా‘‘ వరప్రసాద్ రెడ్డి 75వ జన్మదినోత్సవం) -
ఆర్థిక వ్యవస్థపై దెబ్బ తగిలినా.. ప్రజల ప్రాణాలే..
సాక్షి, అమరావతి : కరోనా నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. మంగళవారం తాడేపల్లిలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఆరిమండ వరప్రసాద్ రెడ్డి,నలంద విద్యాసంస్థలు..పేదలకు ఏర్పాటు చేసిన నిత్యావసర కిట్స్ వాహనాన్ని ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనాకు ముందు జాగ్రత్తగా ఇంట్లోనే ఉండాలని సూచించారు. ఆర్థిక వ్యవస్థపై దెబ్బ తగిలినా.. ప్రజల ప్రాణాలే మిన్న అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భావించారని ఆయన తెలిపారు. (ట్రంప్ టీంలో మన దిగ్గజాలు) ప్రజలకు సేవ చేసేందుకు ప్రజా ప్రతినిధులు కూడా ముందుకు రావాలని సూచించారు. వైద్యులు, వాలంటీర్లు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారని,అందరూ ముందుకు వచ్చి సేవ చేయడానికి ముందుండాలని పిలుపునిచ్చారు. లాక్ డౌన్ సందర్బంగా ఎంతో మంది సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ఆరిమండ వరప్రసాద్ రెడ్డి అన్నారు. సీఎం వైఎస్ జగన్ రేషన్ ఇచ్చినట్లే తాము కూడా నిత్యావసరాలు పంచుతున్నామని తెలిపారు. చాలా మంది పేదలకు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని, అందుకే వారికి ఈ కిట్స్ అందజేస్తున్నామని పేర్కొన్నారు. (కష్టాల్లో ఉన్నారు.. తీసుకురండి ) -
ఎస్సీ ఎస్టీ బిల్లుకూ అడ్డుపడతారా?
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు బిల్లుపై చర్చ జరగకుండా ప్రతిపక్ష టీడీపీ అడుగడుగునా అడ్డుపడటం మంగళవారం శాసనసభలో తీవ్ర వాగ్యుద్ధానికి దారి తీసింది. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలతో సభను అడ్డుకునేందుకు ప్రయత్నించగా దళితుల హక్కులను కాలరాసేలా వ్యవహరించడంపై వైఎస్సార్ సీపీ సభ్యులు మండిపడ్డారు. స్పీకర్ అనుమతితో మంత్రి విశ్వరూప్ ఈ బిల్లును సభ ముందుంచారు. దీనిపై మాట్లాడేందుకు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వరప్రసాద్‌కు అవకాశం ఇచ్చారు. చంద్రబాబు దళిత ద్వేషి: వరప్రసాద్ బిల్లుపై చర్చను అడ్డుకుంటూ టీడీపీ ఆందోళనకు దిగడంపై ఎమ్మెల్యే వరప్రసాద్ మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీలను అవమానించిన చరిత్ర చంద్రబాబుదని గుర్తు చేశారు. ఎవరైనా దళితులుగా పుట్టాలని కోరుకుంటారా? అని చులకనగా మాట్లాడిన వ్యక్తి రాజకీయాల్లో కొనసాగేందుకు అర్హుడేనా అని ప్రశ్నించారు. నవరత్నాలు పేదలకు ఎలా ఉపయోగపడుతున్నాయో టీడీపీ నేతలు ఆలోచన చేయాలన్నారు. పేదలు ఉన్నత చదువులు చదవకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. పసుపు కుంకుమ పేరుతో టీడీపీ ఖజానాను ఖాళీ చేసిందని మంత్రి అనిల్ అన్నారు. ఎస్సీలను తొలగించిన చరిత్ర బాబుది: పుష్ప శ్రీవాణి దళితులంటే టీడీపీకి ఎంత వ్యతిరేకత ఉందో బిల్లుపై చర్చను అడ్డుకోవడం ద్వారా తెలుస్తోందని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి చెప్పారు. మంత్రివర్గం నుంచి ఎస్సీలను తొలగించిన చరిత్ర చంద్రబాబుదన్నారు. నామినేటెడ్ పదవులు, పనుల్లో సగం రిజర్వేషన్లు కల్పిస్తున్న ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. ఐదుగురు ఎస్సీలకు మంత్రి పదవులు ఇచ్చారని, ఎస్టీల్లో ఒకరికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారన్నారు. కాగా, దళితుల సంక్షేమం టీడీపీకి పట్టదని ఎమ్మెల్యే నాగార్జున విమర్శించారు. మహిళా మంత్రులను అవమానిస్తున్నారు: రోజా ఎస్సీ ఎస్టీ బిల్లుపై మాట్లాడుతున్న మహిళా మంత్రిని అడ్డుకోవడం టీడీపీ దిగజారుడుతనానికి నిదర్శనమని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతంలో చంద్రబాబు ఎందుకు శాశ్వత కట్టడాలు చేపట్టలేదని ప్రశ్నించారు. తనను కేసీఆర్ పొగిడినట్లు చంద్రబాబు చెబుతున్నారని అయితే నిజానికి చంద్రబాబు లాంటి డర్టీ పొలిటీషియన్ లేరని ఆయన అన్నారని తెలిపారు. మహిళా మంత్రులు మాట్లాడుతుంటే టీడీపీ నేతలు అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వర్గాలు బతికే దాన్ని సామాజిక రాజధాని అంటారని, సామాజిక వర్గానికి ఒక రాజధాని కావాలని వీళ్లు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రాజధాని ప్రాంతంలో ప్రత్తిపాటి పుల్లారావు, ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబ సభ్యులు భూములు కొన్నారని, నక్కా ఆనంద్‌బాబు ఎందుకు కొనలేదని ప్రశ్నించారు. అనంతపురం నుంచి వచ్చి పయ్యావుల కేశవ్ భూములు కొన్నారని, కానీ యామినిబాల ఎందుకు కొనుగోలు చేయలేదని నిలదీశారు. బిల్లుకు అడ్డుపడుతున్న టీడీపీ తీరుపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కె.కన్నబాబు, సుధాకర్‌బాబు, గొల్ల బాబూరావు, జోగారావు, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. -
‘రాజకీయాలకు చంద్రబాబు అనర్హుడు’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు సమావేశాలు సందర్భంగా ముందుగా మాజీ ఎమ్మెల్యే కోట రామారావు మృతికి అసెంబ్లీ సంతాపం తెలియజేసింది. అనంతరం ఎస్సీ కమిషన్ ఏర్పాటు బిల్లును మంత్రి విశ్వరూప్ సభ ముందుకు తీసుకొచ్చారు. దీనిపై చర్చలో భాగంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ.. దళితులని అవమానించిన చరిత్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదని ఆరోపించారు. తాను ఎన్నో అవమానాలు పడిన వ్యక్తిగా ఒక్కటి చెప్పదల్చుకున్నానని.. చంద్రబాబుకు చేతనయితే ఎస్సీ, ఎస్టీల్లో అసమానతాలను తగ్గించే యత్నం చేయాలన్నారు. చంద్రబాబు పరిపాలనలో ఎస్సీ, ఎస్టీలకు చేసేందేమీ లేదన్నారు. ఎస్సీ, ఎస్టీలు తరతరాలుగా పేదవారిగా మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. చేతులు జోడించి విపక్షాన్ని అడుతున్నాని.. టీడీపీ ఎమ్మెల్యేలు మానవతా దృష్టితో ఆలోచించాలని హితవు పలికారు. ఎస్సీ కమిషన్ ఏర్పాటు బిల్లుకు అడ్డుపడవద్దని వరప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని కూడా టీడీపీ వ్యతిరేకించిందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసిన వరప్రసాద్.. రాజకీయాల్లో ఉండటానికి చంద్రబాబు అర్హుడు కాదన్నారు. పేదవాళ్లు బాగు పడొద్దనేది చంద్రబాబు ఉద్దేశమని వరప్రసాద్ తెలిపారు. దళితులకు ఉన్నత విద్యను అడ్డుకున్న చరిత్ర చంద్రబాబుదన్నారు. చదవండి: సర్వతోముఖాభివృద్ధే మా లక్ష్యం సంక్షేమ పథకాలు వదిలేద్దామా! ప్రతిపక్ష నేతవా.. సంఘ విద్రోహ శక్తివా? ఐదారు వేల కోట్లు ఎలా సరిపోతాయి? -
ఇంగ్లిష్ మీడియంపై రాజకీయం చేయడం సరికాదు
-
ఇంగ్లిష్తో కాన్ఫిడెన్స్ లెవల్స్ పెరుగుతాయ్!
సాక్షి, అమరావతి: ఒకటి నుంచి ఆరో తరగతి వరకు అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెడుతున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ బుధవారం అసెంబ్లీలో ప్రకటించారు. ప్రభుత్వ సూళ్ల స్థితిగతులను బాగు చేస్తామని, ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలోనే భర్తి చేస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యాప్రమాణాలు పెంచుతున్నట్టు తెలిపారు. పిల్లలకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకుంటున్నట్టు సభకు చెప్పారు. ఎయిడెడ్, అన్ఎయిడెడ్ విద్యాసంస్థలపై చాలా ఫిర్యాదులు అందాయలని, ఈ ఫిర్యాదుల మీద చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ.. ఇంగ్లిష్ మీడియంపై రాద్ధాంతం చేస్తూ.. పిల్లల భవిష్యత్తుతో చెలగాటం ఆడవద్దని ప్రతిపక్ష సభ్యులను కోరారు. ఇంగ్లిష్ మీడియంతో విద్యార్థుల కాన్ఫిడెన్స్ లెవల్స్ పెరుగుతాయని, పోటీప్రపంచంలో నెగ్గుకురాగలమన్న ధీమా వారిలో ఏర్పడుతుందన్నారు. సంపన్నులు, మధ్యతరగతి ప్రజలు తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు పంపి ఇంగ్లిష్ మీడియంలో చదివిస్తున్నారని, ఇక, గ్రామీణ ప్రజలు, నిరుపేదలు అప్పులు చేసైనా తమ పిల్లలన ఇంగ్లిష్ మీడియం చదివించాలని ఆశ పడుతున్నారని, ఈ క్రమంలో ప్రభుత్వ స్కూళ్లన్నింటిలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని సీఎం తీసుకోవడం సంతోషం కలిగించిందని పేర్కొన్నారు. ఇంగ్లిష్ భాషలో చదివి ఉండకపోతే తాను ఆర్బీఐ అధికారిగా, ఐఏఎస్ అధికారిగా అయ్యేవాడిని కాదని, ఇంగ్లిష్ భాషలో ఎన్నో పరీక్షలు రాశానని తన అనుభవాలను పంచుకున్నారు. ఇంగ్లిష్ మీడియం విద్యార్థులకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇస్తుందని, దీనిపై రాద్ధాంతం రాజకీయాలు చేయవద్దని ఆయన కోరారు. ఇంగ్లిష్ మీడియం వల్ల తెలుగుకు నష్టం జరగదని, తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరి చేయడం వల్ల భాష ఎప్పటిలాగే కొనసాగుతుందన్నారు. పై చదవుల్లో ఇంగ్లిష్ మీడియం మాత్రమే ఉండటం వల్ల పెద్ద కాలేజీలకు వెళ్లిన విద్యార్థులు ఆ భాషను అర్థం చేసుకోలేక ఆత్యహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ఉందని, ఇంగ్లిష్ మీడియం విద్యార్థుల్లో కాన్ఫిడెన్స్ లెవల్స్ పెంచుతుందన్నారు. పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ తెలుగు మీడియం చదివిన వారికి ఒక్కసారిగా ఇంగ్లిష్ మీడియం రాదని తెలిపారు. చిన్నప్పటి నుంచి ఇంగ్లిష్ మీడియంలో చదివించడం ద్వారా విద్యార్థులు ఆ భాష మీద పట్టు పెంచుకుంటారని తెలిపారు. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ స్కూళ్లలో ఒక్కచోట కూడా ఇంగ్లిష్ మీడియం పెట్టలేదని అన్నారు. ఎవరి పిల్లలు ఎక్కడ చదువుతున్నారో అందరికీ తెలుసునని పేర్కొన్నారు. ఇప్పుడు తెలుగు మీడియం మీద టీడీపీ రాద్ధాంతం చేస్తోందని, తాను పీహెచ్డీ చేసే సమయంలో ప్రీ-పీహెచ్డీ పరీక్షను తెలుగులో రాస్తే.. దానిపై తెలుగుయువత విభాగం రాద్ధాంతం చేసిందని, తనను డిస్క్వాలిఫై చేయమని ఆనాడు గొడవకు దిగిందని గుర్తు చేశారు. తనకు పీహెచ్డీ పట్టా ఇవ్వవద్దని ఆందోళన చేయడంతో తాను హైకోర్టుకు వెళ్లాల్సి వచ్చిందని వివరించారు. -
వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిన్న వయస్సులోనే గొప్ప నిర్ణయాలు తీసుకుంటున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ అన్నారు. పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం ఉద్యోగాలు కల్పించే బిల్లుపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. ఇది గొప్ప విషయమని, ఈ చట్టం ద్వారా సీఎం వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు. స్థానికులకు 75శాతం ఉద్యోగాలు కేటాయించడం వల్ల నిరుద్యోగ సమస్య తీరుతుందని అన్నారు. మనస్సాక్షి లేని వ్యక్తి చంద్రబాబు అని, ఆయన తన హయాంలో యువతకు ఉద్యోగాలు కల్పించకుండా మోసం చేశారని విమర్శించారు. ఈ బిల్లులోని నిబంధనలు ఉల్లంఘించినవారిపై పెనాల్టీ విధించేలా చట్టంలో చేర్చాలని కోరారు. ఈ బిల్లు అమలు విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే.. వారిపై చర్యలు తీసుకునే అవకాశముండాలన్నారు. వెనుకబడిన ప్రాంతాలకు సబ్సిడీ అందించాలని కోరారు. పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం ఉద్యోగాలతో నిరుద్యోగ యువత వలసలు ఇకపై ఉండబోవని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు అన్నారు. పేదలపై సీఎం వైఎస్ జగన్‌కసు అపారమైన ప్రేమ ఉందని తెలిపారు. 2014లో ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే.. లక్షలాది ఉద్యోగాలు వచ్చి ఉండేవన్నారు. చంద్రబాబు హోదాను తాకట్టుపెట్టి.. ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించారని, చంద్రబాబు చేసిన తప్పులు యువతకు శాపంగా మారాయన్నారు. స్కిల్ డెవలప్మెంట్ శిక్షణతో యువతకు ఉద్యోగాలు, ఉపాధి దొరుకుతాయన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం ఉద్యోగాలు కల్పించడం మంచి నిర్ణయమని కొనియాడారు. ప్రజలకు మేలు చేసే మంచి బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నా.. చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవం వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు. -
గూడూరు ప్రజలకు రుణపడి ఉంటా
-
బీసీలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదే
-
‘రాజకీయ చరిత్రలో నేడు సువర్ణ అధ్యాయం’
సాక్షి, ఏలూరు : రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీసీల స్థితిగతులను అధ్యయనం చేయించి బీసీలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో ప్రాధాన్యత కల్పిస్తూ, బీసీల అభ్యున్నతికి తాము ఏం చేయబోతున్నామో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించనున్న బీసీ డిక్లరేషన్ రాజకీయ చరిత్రలో నేడు సువర్ణ అధ్యాయం అని ఆ పార్టీ నేత బొత్సా సత్యనారాయణ అన్నారు. ఏలూరు నగరంలో ఆదివారం రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని బీసీ సామాజి కవర్గాల ప్రజలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున బీసీ గర్జన మహాసభ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా మహాసభ ప్రాంగణం వద్ద బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఎన్నికల వేళ మాత్రమే చంద్రబాబుకు బీసీలు గుర్తుకు వస్తారని ధ్వజమెత్తారు. బీసీలు ఆర్థికంగా ఎదగాలంటే వైఎస్ జగన్ ప్రభుత్వం రావాలని ఆకాంక్షించారు. చంద్రబాబు నాయుడివి ఓటు బ్యాంక్ రాజకీయాలని, నాలుగేళ్లుగా ఆయనకు బీసీలు గుర్తుకు రాలేదా అని బొత్సా సూటిగా ప్రశ్నించారు. వైఎస్ జగన్ వల్లే సాధ్యం వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ మాట్లాడుతూ.. బీసీలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు. ఎన్నికల వేళ బీసీ కులాలకు ఏదో మేలు చేస్తామని, ఆయన మాయమాటలు చెబుతున్నారన్నారు. గత ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ అయినా అమలు చేశారా అని సూటిగా ప్రశ్నించారు. అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో బీసీలకు ఎంతో మేలు జరిగిందని, మరోసారి బీసీలకు మేలు జరగాలంటే వైఎస్ జగన్ వల్లే సాధ్యమని వరప్రసాద్ అభిప్రాయపడ్డారు. -
తిరుపతిలో బీసీ సన్నాహక సదస్సు
సాక్షి, తిరుపతి : తుమ్మలగుంటలోని వైఎఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం బీసీ గర్జనపై రాయలసీమ రీజియన్ సన్నాహక సదస్సు జరిగింది. బీసీల సంక్షేమమే ధ్యేయంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 17న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నిర్వహిస్తున్న బీసీ గర్జన మహాసభను విజయవంతం చేయాలని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఈ ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలు రాజకీయంగా.. ఆర్థికంగా.. సామాజికంగా అభివృద్ధి చెందకుండా చంద్రబాబు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని మండిపడ్డారు. బీసీల అభ్యున్నతికి కట్టుబడి ఉన్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిబ్రవరి 17వ తేదీన ఏలూరులో బీసీ గర్జనను నిర్వహించి వారి సంక్షేమం కోసం డిక్లరేషన్ ప్రకటిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వరప్రసాద్, మేకపాటి రాజమోహన్ రెడ్డి, మిథున్‌రెడ్డి, బీసీ సెల్ రాష్ట్రాధ్యక్షుడు జంగా కృష్ణామూర్తి, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సంజీవయ్య, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, కుప్పం ఇంచార్జి చంద్రమౌళి, రాయలసీమ, నెల్లూరు జిల్లా కో ఆర్డినేటన్లు తదితరులు పాల్గొన్నారు. -
‘కడప స్టీల్ ఫ్యాక్టరీ సీఎం రమేష్‌దే’
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా’ అంశంపై గత నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ఆ పార్టీ ఎంపీలు, మాజీ ఎంపీలు పునరుద్ఘాటించారు. శుక్రవారం పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులు ప్రదర్శించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిరసన వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కడప స్టీల్ ప్లాంట్ వ్యయం రూ.18 వేల కోట్లుగా చెప్తున్నారు. అది కేంద్ర ప్రభుత్వం నిర్మించాలనుకున్న ప్రాజెక్టు.. దాంతో మీకేం పని అని ప్రశ్నించారు. అది చంద్రబాబు బినామీ అయిన సీఎం రమేష్ స్టీల్ ఫ్యాక్టరీ అని వ్యాఖ్యానించారు. ‘ఏం చేశాడు బాబు ఏపీకి. ప్రపంచంలో ఉన్న అందమైన బిల్డింగ్‌ల ఫొటోలు తెచ్చి గ్రాఫిక్స్ ప్రజెంటేషన్ ఇస్తాడు. వాటికి డీపీఆర్ రిపోర్టులు ఉండవు. ఎంత ఖర్చో ఉండదు. రాజధాని నిర్మాణానికి 48 వేల కోట్లు ఖర్చు అని అంచనా వేశారు. అభివృద్ధిని గ్రాఫిక్స్‌లో చూపిస్తున్నారు. ప్రణాళిక వ్యయంలో బీసీలు, ఎస్సీ, ఎస్టీల సబ్‌ప్లాన్ నిధులు ఖర్చు చేయడం లేదు. పేద ప్రజల నోళ్లు కొట్టి కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నాడు. లంచాలు దండుకుంటున్నాడు. ఇలాంటి దుర్మార్గపు ముఖ్యమంత్రిని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. తీరని ద్రోహం.. ఏపీకి ద్రోహం చేసింది బాబు మాత్రమేనని మాజీ ఎంపీ వరప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 ఏళ్లు ప్రత్యేక హోదా సాధిద్దామని ఓట్లు వేయించుకొన్న బాబు తర్వాత ప్లేటు ఫిరాయించాడని మండిపడ్డారు. ‘హోదా సంజీవని కాదని చెప్పి ప్యాకేజీకి సై అన్నారు. హదా కోసం పోరాడుతుంటే వైఎస్సార్సీపీ నేతల్నిహేళన చేశారు. ఏపీకి తీరని ద్రోహం చేశారు. విభజన హామీలను సాధించలేదు. ఎన్నికల వేళ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదు’ అని నిప్పులు చెరిగారు. నిరసన కార్యక్రమంలో వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. -
‘కేవలం పునాది వేస్తారు.. నమ్మించేస్తారు’
సాక్షి, న్యూఢిల్లీ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వరప్రసాద్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు. అన్నింటికి కేవలం పునాది మాత్రమే వేసి బాబు ప్రజలను నమ్మిస్తారని అన్నారు. రాజధానిలో అన్నీ తాత్కాలిక భవనాలే అని మండిపడ్డారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద వైఎస్సార్సీపీ గురువారం చేపట్టిన ‘వంచనపై గర్జన దీక్ష’ లో ఆయన మాట్లాడారు. చంద్రబాబు, భారతీయ జనతాపార్టీలు ఆంధ్రప్రదేశ్‌ని ఏవిధంగా మోసం చేశారో ప్రజలకు తెలియజెప్పడానికే ‘వంచనపై గర్జన దీక్ష’ చేపట్టామని అన్నారు. విభజన హామీలను తీసుకురాలేని అసమర్థుడు చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. బీజేపీతో ఉన్నప్పుడు కనీసం కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి కూడా బాబు మాట్లాడలేదని ధ్వజమెత్తారు. కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మించే ఉద్దేశం చంద్రబాబుకు లేదని అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారం కోల్పోనుందనే కాంగ్రెస్‌తో జతకట్టారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంటుకు వినిపించేందుకే.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం పార్లమెంటుకు వినిపించాలనే వంచనపై గర్జన దీక్ష చేపట్టామని వైఎస్సార్సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. హోదా కోసం మొదటినుంచీ పోరాడుతోంది తమ పార్టీయేనని అన్నారు. హోదా సాధనే లక్ష్యంగా తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పనిచేస్తున్నారని తెలిపారు. తమ పార్టీకి చెందిన ఐదు మంది ఎంపీలు రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చామని గుర్తు చేశారు. నరేంద్రమోదీ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టిన ఏకైక పార్టీ వైఎస్సార్సీపీయేనని చెప్పారు. ఏపీకీ అన్యాయం చేసిన వారిలో మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాన్ ముద్దాయిలని అన్నారు. -
హామీలను తీసుకురాలేని అసమర్థుడు చంద్రబాబు
-
‘ఏపీని రెంటికి చెడ్డ రేవడిలా తయారుచేశారు’
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంటులో తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన నాటినుంచి రాజ్యసభ లోపల, వెలుపలు ఆందోళనలను తీవ్రతరం చేశారు. గురువారం కూడా పార్లమెంటులోని గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీ వరప్రసాద్ ఆందోళన చేపట్టారు. ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. విపత్తును విఠలాచార్య సినిమా లాగా జయించానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. విపత్తులను ఆపడానికి చంద్రబాబు ఏమైనా భగవంతుడా అని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు ఇంతవరకు కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా తెలుపలేదని అన్నారు. ఇటు ప్రత్యేక హోదా రాక.. అటు ప్యాకేజీ నిధులూ లేక.. ఏపీని రెంటికి చెడ్డ రేవడిలా చంద్రబాబు తయారు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. టెక్నాలజీ అనే పదానికి అర్థం తెలియని చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని విమర్శించారు. చంద్రబాబు తన స్వార్ధ ప్రయోజనాల కోసం సొంత మామను వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. పెథాయ్ తుపాన్ కారణంగా జనం అల్లాడుతుంటే చంద్రబాబు రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లలో అందరికీ స్వీట్లు పంచుతున్నారని విమర్శించారు. వరప్రసాద్ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా తెస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు దానిని గాలికి వదిలేశారని విమర్శించారు. వైఎస్సార్ సీపీ ఒత్తిడితో చంద్రబాబు మళ్లీ ప్రత్యేక హోదా పాట పాడుతున్న విషయాన్ని గుర్తుచేశారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక హోదా కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడారని తెలిపారు. ప్రజల నుంచి చంద్రబాబు ఊసరవెల్లిలాగా రంగులు మార్చారని వ్యాఖ్యానించారు. దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణం చేయాలని రాష్ట్రం నుంచి కేంద్రానికి ఒక లేఖ కూడా చంద్రబాబు రాయలేదని మండిపడ్డారు. కేంద్రం నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా.. ఓ ప్రైవేటు పోర్టును కాపాడేందుకు దుగ్గరాజపట్నం పోర్టు కోసం బాబు ప్రయత్నించలేదని ఆరోపించారు. కడప స్టీల్ ప్లాంట్ విషయంలోనూ చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. రాజ్యసభ రేపటికి వాయిదా.. విపక్షాల ఆందోళన నడుమ రాజ్యసభ శుక్రవారానికి వాయిదా పడింది. సభ ప్రారంభమైన తర్వాత విపక్ష సభ్యులు ఆందోళనకు దిగడం సభ కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడింది. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్ సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, ప్రభాకర్ రెడ్డిలు వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. -
తెలంగాణ జడ్జీల సంఘం అధ్యక్షుడి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా 14వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి, తెలంగాణ న్యాయాధికారుల సంఘం అధ్యక్షుడు వైద్య వరప్రసాద్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. వరప్రసాద్‌కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సర్వీసు నిబంధనల ప్రకారం 48 గంటలపాటు ప్రభుత్వ ఉద్యోగి జైల్లో ఉంటే ఆ ఉద్యోగిని సస్పెండ్ చేయవచ్చు. వరప్రసాద్‌కు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించిన నేపథ్యంలో ఆయనపై సస్పెన్షన్ వేటు పడటం ఖాయమని తెలుస్తోంది. సోమవారం హైకోర్టు ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను వెలువరించే అవకాశం ఉంది. వరప్రసాద్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారంటూ హైకోర్టుకు నాలుగు నెలల క్రితం ఫిర్యాదు వచ్చింది. ఈ ఫిర్యాదు ఆధారంగా ప్రాథమిక విచారణ జరపాలని ఏసీబీని కోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రాథమిక విచారణ జరిపిన ఏసీబీ అధికారులు వరప్రసాద్ ఆదాయానికి మించి ఆస్తులు కూడిబెట్టినట్లు ఆధారాలు సేకరించారు. వాటిని ప్రధాన న్యాయమూర్తి ముందుంచారు. ప్రధాన న్యాయమూర్తి వాటిని పరిశీలించి వరప్రసాద్‌పై కేసు నమోదు చేసేందుకు ఏసీబీకి అనుమతినిచ్చారు. దీంతో ఏసీబీ అధికారులు వరప్రసాద్‌పై ఈ నెల 13వ తేదీన కేసు నమోదు చేసి, 14న హైదరాబాద్, సిరిసిల్ల, మహారాష్ట్రలలో ఉన్న ఆయన ఇళ్లు, బంధువులు, స్నేహితుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. రాత్రి వరకు తనిఖీలు కొనసాగించిన అధికారులు వరప్రసాద్‌కు రూ. 1.50 కోట్ల మేర ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. వాటి విలువ బహిరంగ మార్కెట్లో రూ. 3 కోట్లుగా తేల్చారు. అనంతరం బుధవారం రాత్రి వరప్రసాద్‌ను అరెస్ట్ చేశారు. తెల్లవారుజామున ఏసీబీ కోర్టులో హాజరుపరచగా ఆయనకు కోర్టు 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. బినామీగా స్నేహితుడు.. తనిఖీల్లో లభించిన ఆధారాలతో వరప్రసాద్ ఆస్తులకు ఆయన స్నేహితుడు సుదర్శన్ బినామీగా ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మహారాష్ట్రలో ఉన్న సుదర్శన్‌ను ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు. వరప్రసాద్ రెండు సార్లు అమెరికా వెళ్లడంతోపాటు చైనా, హాంకాంగ్, మలేసియా, మకావు, సింగపూర్ దేశాలకు కుటుంబ సభ్యులతో వెళ్లారని, ఇందుకు రూ.లక్షల రూపాయలు వెచ్చించారని ఏసీబీ అధికారులు తెలిపారు. కొండాపూర్‌లోని ఇంటిని కూడా విలాసవంతంగా నిర్మించి రూ.లక్షల విలువ చేసే రిక్లయినర్ కుర్చీలు, ఏసీలను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టం చేశారు. -
జడ్జి వరప్రసాద్‌పై కేసు నమోదు
-
అలిపిరి దాడి భువనేశ్వరే చేయించారంటే..?
సాక్షి, న్యూఢిల్లీ : ‘చంద్రబాబు నాయుడు తన ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌తో అడ్డదిడ్డమైన మాటాలు మాట్లాడిస్తున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆయన కుటుంబ సభ్యులే హత్యాయత్నం చేశారని చెప్పిస్తున్నారు. అలిపిరిలో దాడి మావోయిస్టులు చేసింది కాదు.. భువనేశ్వరి చేయించారని ఎవరైనా అంటే ఒప్పకుంటారా? అలాంటి నీచమైన వ్యాఖ్యలు చేయాల్సిన ఖర్మ మాకు లేదు’ అని వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన వైఎస్సార్సీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, వరప్రసాద్, బొత్స సత్యనారాయణలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. పక్కా పథకం ప్రకారమే వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగిందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఈ కుట్రలో చంద్రబాబు నాయుడు, లోకేశ్, హర్షవర్దన్, శివాజీలు భాగస్వాములన్నారు. వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్న ఘటనపై ఏపీ డీజీపీ చేసిన వ్యాఖ్యలు అభ్యంతకరంగా ఉన్నాయన్నారు. ‘అలిపిరి ఘటనలో చంద్రబాబు గాయపడితే హుటాహుటిన వైఎస్సార్ తిరుపతికి వెళ్లి పరామర్శించారు. చంద్రబాబుపై దాడికి నిరసనగా వైఎస్సార్ ధర్నా చేశారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్న సంఘటనను తక్కువ చేసి మాట్లాడుతున్నారు. హత్యాయత్నాన్ని ఖండించిన నేతలను తప్పుబడుతున్నారు. గవర్నర్‌ను కూడా తప్పుబట్టారు. చంద్రబాబు వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి. కేసు సంబంధించిన పూర్వాపరాలు తెలుసుకోకుండానే నిందితుల గురించి డీజీపీ చెప్పడం దారుణం. ఏపీ పోలీసు శాఖ ప్రభుత్వానికి కొమ్ముకాస్తుంది. వాస్తవాలు బయటకు రావాలంటే థర్డ పార్టీ విచారణ జరగాల్సిందే’ అని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. డీజీపీ ప్రకటన విచారణ నీరుగార్చేలా ఉంది : వైవీ సుబ్బారెడ్డి విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో వైఎస్ జగన్‌పై హత్యాయత్నం పాపులారిటీ కోసమే చేశారని డీజీపీ చెప్పడం దారుణమని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. డీపీపీ ప్రకటన విచారణను నీరుగార్చేలా ఉందని ఆరోపించారు. వైఎస్ జగన్ అప్రమత్తంగా ఉండటం వల్లే ప్రాణపాయం తప్పిందన్నారు. వైఎస్ జగన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే.. ముఖ్యమంత్రి, మంత్రులు బాధ్యతారాహిత్యమైన ప్రకటనలు చేశారని విమర్శించారు. టీడీపీ నేతల ప్రోద్బలంతోనే శ్రీనివాస్ హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు. టీడీపీ నేతల అండలేకుంటే క్రిమినల్ కేసులున్న శ్రీనివాస్‌కి ఎన్వోసీ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. క్యాంటీన్ యజమాని హర్షవర్దన్.. చంద్రబాబు, లోకేశ్‌లకు సన్నిహితుడని ఆరోపించారు. నిజాలు బయటపడాలంటే కేంద్ర సంస్థలతోనే దర్యాప్తు చేయించాలని వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వ విచారణపై నమ్మకం లేదు: మేకపాటి వైఎస్ జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే టీడీపీ కుట్ర చేసి హత్యాయత్నానికి పాల్పడిందని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. సరైన విచారణ జరిగితేనే నిజాలు బయటకొస్తాయన్నారు. పాత్రధారుడిపైనే కాదు సూత్రధారులపైనా విచారణ జరగాలని డిమాండ్ చేశారు. సీఎం సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు: వరప్రసాద్ వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగిందని పోలీస్ రిమాండ్ రిపోర్ట్‌లో స్పష్టమైనా.. సీఎం చంద్రబాబు నాయుడు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ నేత వరప్రసాద్ మండిపడ్డారు. ప్రతిపక్ష నేతపై జరిగిన హత్యాయత్నాన్ని ప్రభుత్వం, డీజీపీ చిన్నదిగా చేసి చూపిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుపై దాడి జరిగితే వైఎస్సార్ హుందాగా వ్యవహరించారని గుర్తుచేశారు. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు నీచంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర సంస్థలచే విచారణ చేయిస్తే నిజాలు బటయకొస్తాయని వరప్రసాద్ పేర్కొన్నారు. -
బాబు అవినీతిపై కేసులేవీ?
సాక్షి, హైదరాబాద్: అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన చంద్రబాబుపై కేసులు ఎందుకు పెట్టడం లేదని వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ బీజేపీని నిలదీశారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో వరప్రసాద్ మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పాలన, అవినీతిని ఆయన ఎండగట్టారు. ‘టీడీపీ మేనిఫెస్టో అంతా అబద్ధాల పుట్ట. నాలుగేళ్లుగా అబద్ధాలు, అవినీతితో బాబు పాలన సాగిస్తున్నారు. ఎంతో అవినీతికి పాల్పడ్డారు. ఎన్నికల సంఘం నివేదిక ప్రకారం దేశంలో ధనిక సీఎం చంద్రబాబే. దేశంలోనే ఏపీ ఇప్పుడు అవినీతిలో నంబర్ వన్ స్థానంలో ఉంది. రాజధాని భూముల్లో అంతా అవినీతే. అలాంటి వ్యక్తిపై బీజేపీ నేతలు కేసులు ఎందుకు పెట్టడం లేదు’ అని వరప్రసాద్ అన్నారు. ‘రాజకీయ లబ్ధి కోసమే వైఎస్ జగన్‌పై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు. జగన్ దోషి అని ఏ కోర్టు చెప్పింది?.. రాజకీయ కక్షలతో ఆయనపై కేసులు పెట్టారన్నది అందరికీ తెలుసు. చంద్రబాబు ఏ తప్పు చేయకపోతే కోర్టు నుంచి స్టేలు ఎందుకు తెచ్చుకుంటున్నారు. దమ్ముంటే.. అంత నిజాయితీ పరుడైతే విచారణను ఎదుర్కోవాలి’ అని వరప్రసాద్ చంద్రబాబుకు సవాల్ విసిరారు. జాతీయ, అంతర్జాతీయ సర్వేల్లో సైతం ఏపీ అవినీతి గురించి ప్రస్తావించిన అంశాన్ని ఈ సందర్భంగా వరప్రసాద్ గుర్తు చేశారు. -
‘బాబు అసమర్థతే కారణం’
సాక్షి, తిరుపతి: ప్రత్యేక హోదాపై పూటకో మాట మార్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. అదివారం ఉదయం ఆయన మీడియా సమావేశంలో అవిశ్వాసం, తదితర అంశాలపై స్పందిచారు. వైఎస్ఆర్సీపీ ఒత్తిడి వల్లే పార్లమెంట్లో అవిశ్వాసం పెట్టారని, నాలుగేళ్లుగా టీడీపీ డ్రామాలు ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు ఇప్పటివరకు 30 దేశాలు తిరిగాడని.. కానీ అమరావతిలో ఒక్క ఇటుక కూడా పడలేదని ఎద్దేవ చేశారు. బీజేపీతో టీడీపీ లాలూచీ నిజం కాదా? బీజేపీ తప్పులను గతంలో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. బాబు అసమర్థత వల్లే రాష్ట్రానికి నిధులు రాలేదని ఆరోపించారు. చంద్రబాబు కేవలం కమీషన్ల కక్కుర్తి కోసమే పోలవరం ప్రాజెక్టును చేపట్టారే తప్పా ఎలాంటి మంచి ఉద్దేశంతో కాదని వరప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
చంద్రబాబు అవినీతి వల్లే..
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కారణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వరప్రసాద్ విమర్శించారు. అసలు పూటకో మాట మాట్లాడే చంద్రబాబు రాజకీయాలకు పనికిరారని మండిపడ్డారు. ప్రస్తుతం కేంద్రంపై టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ప్రధాన కారణం ప్రజల్లో విశ్వాసం కోల్పోవడమేనని వరప్రసాద్ ఎద్దేవా చేశారు. ప్రధానంగా చంద్రబాబు అవినీతి, అసమర్థత వల్ల ఏపీ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఏపీకి బీజేపీ-టీడీపీ రెండూ ద్రోహం చేశాయన్న వరప్రసాద్.. చంద్రబాబు ద్రోహి నంబర్‌వన్ అనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. ప్రత్యేక హోదా కోసం మొదట ఆమరణ దీక్ష చేసింది మాత్రం ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే విషయాన్ని ఈ సందర్భంగా వరప్రసాద్ గుర్తు చేశారు. ప్రత్యేకహోదా అనేది నేటికీ సజీవంగా ఉందంటే అందుకు కారణం జగనేనన్నారు. ఏపీకి హోదా కోసం ఏమేమి చేయాలో అన్నింటినీ వైఎస్సార్సీపీ చేసిందన్నారు. తాము కేంద్రంపై 13సార్లు అవిశ్వాసాన్ని పెట్టినా చర్చకు అనుమతి ఇవ్వలేదన్నారు. లోక్‌సభలో టీడీపీ ఎంపీలు సృష్టించిన గందరగోళం కారణంగానే తాము పెట్టిన అవిశ్వాసంపై చర్చకు రాలేదన్నారు. ఇదే విషయాన్ని లోక్‌సభ స్పీకర్ కూడా సభ సాక్షిగా చెప్పిన విషయాన్ని వరప్రసాద్ పేర్కొన్నారు. ఇకనైనా అవకాశ వాద రాజకీయాలను టీడీపీ వదిలిపెట్టాలని హితవు పలికారు. ఇప్పటికైనా బీజేపీ.. ఏపీకి హోదాను ప్రకటిస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. మరోనేత మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ..‘ మేము అవిశ్వాసం పెట్టినప్పుడు అవహేళన చేశారు. ఇప్పడు మధ్యలో వచ్చి నేనే చాంపియన్ అని చంద్రబాబు అంటున్నారు. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి.. ప్యాకేజీకి ఒప్పుకుంది చంద్రబాబు. ఎవరు ఎలా చేస్తున్నారో ఏపీ ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు ఆలోచనంతా జగన్‌ను ఇబ్బంది పెట్టడంపైనే. చంద్రబాబు-మోదీ రాష్ట్రానికి చాలా ద్రోహం చేశారు’ అని వ్యాఖ్యానించారు. సంబంధిత కథనాలు: నేడే అవిశ్వాసం టీడీపీ అవిశ్వాస తీర్మానం వెనుక కేంద్ర సర్కార్ కనుసైగ! -
‘టీడీపీకి ఆ హక్కు లేదు’
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీల అమలు సాధించేవరకు అలుపెరుగని పోరాటం చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీలు స్పష్టం చేశారు. టీడీపీ- బీజేపీ పొత్తు, పార్లమెంట్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాలపై చర్చించేందుకు వైవీ సుబ్బారెడ్డి నివాసంలో వైఎస్సార్సీపీ నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం మేకపాటి రాజమోహన్ రెడ్డి, వర ప్రసాద్, వైవీ సుబ్బారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తమ పదవులకు రాజీనామా చేశామని, ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి పోరాటం చేశామని మాజీ ఎంపీలు వివరించారు. గతంలో తమ పార్టీ అవిశ్వాసం పెడితే ఏపీ సీఎం చంద్రబాబు నాయడు హేళన చేశారని.. ఆరోజే టీడీపీ ఎంపీలు మాతో కలిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని వారు అభిప్రాయపడ్డారు. చంద్రబాబు రోజుకో డ్రామా ఆడుతున్నారని, అవిశ్వాసం పెట్టే నైతిక హక్కు టీడీపీకి లేదని మండిపడ్డారు. ఇదంతా టీడీపీ- బీజేపీల మ్యాచ్ ఫిక్సంగ్‌లో భాగంగానే ఈ డ్రామా జరుగుతోందని ఆరోపించారు. ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా నేడు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్ మాజీ ఎంపీలు ధర్నా చేశారు. -
టీడీపీ రోజుకో డ్రామా ఆడుతోంది
-
ఇకపై ప్రజాక్షేత్రంలోకి..
రాజీనామాల ఆమోదంతో ప్రత్యేకహోదా పోరాటంలో తమ చిత్తశుద్ధి మరోసారి రుజువైందని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీలు చెప్పారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షను దేశవ్యాప్తంగా తెలిపామన్నారు. ఉప ఎన్నికలు ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. హోదా, విభజన హామీల కోసం ఇకపై ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తామన్నారు. ఇకనైనా టీడీపీ నేతలకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ల ఎంపీలు రాజీనామాలు చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సవాల్ చేశారు. రాజీలేని పోరాటం చేశాం: మేకపాటి ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో నాలుగేళ్లుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోందని నెల్లూరు పార్లమెంట్ మాజీ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమ పార్టీ చెందిన ఐదుగురు ఎంపీల రాజీనామాలను స్పీకర్ ఆమోదించారని చెప్పారు. రాష్ట్ర ప్రజల హక్కు అయిన హోదా ఉద్యమాన్ని దేశప్రజలందరికీ తెలిసేలా ఢిల్లీ వేదికగా పోరు సాగించామని చెప్పారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, హోదాతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. హోదా కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాజీలేని పోరాటం చేశామన్నారు. హోదా ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాజీనామాలు చేశామని తెలిపారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని దేశ ప్రజలందరికీ వివరించామని, ఢిల్లీలో ఆమరణ దీక్షలు కూడా నిర్వహించామని చెప్పారు. స్పీకర్ ధర్మాన్ని నెరవేర్చారని, రెండు మూడు సార్లు తమతో మాట్లాడి రాజీనామాలు ఉపసంహరించే ప్రయత్నం చేశారని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతోందని వివరించి తమ రాజీనామాలు ఆమోదించాల్సిందిగా కోరామన్నారు. మార్చి 15న అవిశ్వాసానికి నోటీసు ఇచ్చామని, దానిపై చర్చ జరగకపోవటంతో వరుసగా 13 సార్లు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చామని తెలిపారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పనిచేసే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం మనందరి ఖర్మ అని మేకపాటి ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా విషయంలో రోజుకో రకంగా మాట్లాడి, డ్రామాలాడిన చంద్రబాబుకు ప్రజలే గట్టిగా బుద్ధి చెబుతారన్నారు. టీడీపీ ఎంపీలు డ్రామాలు వేయకుండా చిత్తశుద్ధితో రాజీనామాలు చేసుంటే కచ్చితంగా కేంద్రం దిగి వచ్చేదన్నారు. తమకు ఉప ఎన్నికలను ఎదుర్కొంటామని సృష్టం చేశారు. నిత్యం ప్రగల్భాలు పలికే చంద్రబాబుకు అందరు కలిసి బుద్ధి చెప్పాలన్నారు. నీత్ ఆయోగ్ సమావేశానికి వెళ్లిన చంద్రబాబు.. మోదీ ఎడమచేతి కరచాలనం కోసం ఎంతగానో తపించిపోయి వంగివంగి మరీ కరచాలనం చేశారన్నారు. ఉప ఎన్నికల్లో ప్రత్యేక హోదానే ప్రధానాంశం..: వైవీ ఉప ఎన్నికల్లో ప్రత్యేక హోదానే ప్రధాన అంశమని వైఎస్సార్ కాంగ్రెస్ నేత వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఎంపీల రాజీనామా ఆమోదిస్తున్నట్టు లోక్‌సభ సచివాలయం నుంచి ప్రకటన వెలువడిన కొద్దిసేపటికి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఈ రోజైనా మా రాజీనామాలు ఆమోదించడాన్ని స్వాగతి స్తున్నాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధించడం కోసం ఏప్రిల్ 6న రాజీనామాలు చేశాం. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేశాం. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా స్పందించకుండా కేంద్రం, స్పీకర్ రాష్ట్రానికి అన్యాయం చేశారు. వీటన్నింటికీ నిరసనగా మేం మా పార్లమెంటు సభ్యత్వానికి ఏప్రిల్ 6న అంటే లోక్‌సభకు ఇంకా 14 నెలల సమయం ఉందనగా రాజీనామాలు చేశాం. త్వరలోనే ఈ ఐదు పార్లమెంటు స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగుతాయి. ప్రత్యేక హోదాయే మా ప్రధాన అంశం. ప్రజలు తమ ఆకాంక్షలను ఈ ఎన్నిక ద్వారా కేంద్రానికి తెలియపరుస్తారు. మేం ఇక ప్రజల్లోకి వెళతాం. రాష్ట్రానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవిధంగా అన్యాయం చేశాయో వివరిస్తాం. వాళ్ల మద్దతు కూడగడతాం..’ అని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ఎంపీల రాజీనామాలు డ్రామాలని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించగా.. ‘‘మావి కాదు డ్రామాలు.. టీడీపీ వాళ్లవి డ్రామాలు’ అని ధ్వజమెత్తారు. బీజేపీతో కుమ్మక్కయ్యారని వస్తున్న విమర్శలను వైవీ ఖండించారు. ‘‘13సార్లు అవిశ్వాస తీర్మానం ఎవరు పెట్టారు? మీరు పెట్టారా? మేమా? కుమ్మక్కయ్యేవాళ్లమయితే అవిశ్వాస తీర్మానం పెడతామా? కలసి కాపురం చేసి ఇప్పుడొచ్చి మేం కుమ్మక్కయ్యామని అంటావు? అమరావతిలో ఉన్నప్పుడేమో మోదీ దాడి చేస్తున్నాడని అంటావు. ఢిల్లీ వచ్చి కాళ్లూ గడ్డాలు పట్టుకుంటావు. నిజంగా రాష్ట్రప్రయోజనాలపై చిత్తశుద్ధి ఉంటే నీతిఆయోగ్ సమావేశంలో మన వాదన వినిపించి వాకౌట్ చేసి ఉండాల్సింది. నువ్వు ఆ పనిచేశావా? ’’ అంటూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఎన్నికలు కావాలని తాము ఆశిస్తున్నామని, ఎన్నికలు వద్దని చంద్రబాబు అనుకుంటున్నారని చెప్పారు. ఎన్నికలు వస్తేనే మా రాజీనామాలకు సార్థకత వస్తుందన్నారు. మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం: వరప్రసాదరావు ప్రత్యేకహోదా సాధన కోసం రాజీనామా చేసి చిత్తశుద్ధిని నిరూపించుకున్నామని తిరుపతి మాజీ ఎంపీ వి.వరప్రసాదరావు అన్నారు. రాజీనామాలు ఆమోదించటం సంతోషంగా ఉందన్నారు. దమ్ము ధైర్యం ఉంటే టీడీపీ ఎంపీలు రాజీనామా చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. రాజీనామాలు ఆమోదం పొందిన సందర్భంగా ఎంపీ వరప్రసాద్ సాక్షితో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రత్యేకహోదాను హేళన చేశారని, హోదా సంజీవిని కాదన్నారని చెప్పారు. ధైర్యముంటే, మనస్సాక్షి ఉంటే టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలన్నారు. వైఎస్సార్ సీపీ ప్రత్యేక హోదా కోసం పోరాడుతూ ముందుకు వెళ్తోందని, రాబోయే ఎన్నికల్లో పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడతారని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం ఏదోరకంగా ప్రజల్ని మోసం చేసి తాము కూడా పోరాడుతున్నామని చెప్పుకునేందుకు టీడీపీ డ్రామాలాడుతోందని మండిపడ్డారు. టీడీపీ ఎంపీల డ్రామాలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. లోక్‌సభ మూసివేశాక లోపలకు వెళ్లి ఫొటోలు, వీడియోలు తీసి.. ప్రత్యేక హోదా కోసం ఏదో చేశామని చెప్పుకునేందుకు హడావుడి చేశారని, రాబోయే రోజుల్లో మరిన్ని డ్రామాలు ఆడబోతున్నారని చెప్పారు. తాము ఎన్నికలను సవాల్‌గా తీసుకుంటున్నామన్నారు. ప్రజా సంకల్పయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డికి పెద్దఎత్తున ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారంటే.. ఆయన ప్రత్యేకహోదా కోసం చూపిస్తున్న ప్రాధాన్యతను బట్టే అని చెప్పారు. 29 సార్లు ఢిల్లీ వెళ్లి ఏమీ తీసుకురాలేని అసమర్థుడు చంద్రబాబు అని విమర్శించారు. రాష్ట్రం కోసం పదవీత్యాగం సంతోషదాయకం రాష్ట్రం కోసం పదవులు వదులుకోవడం సంతోషదా యకంగా ఉందని కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి అన్నారు. రాష్ట్రానికి పదేళ్లు కాదు, పదిహేనేళ్లు ప్రత్యేక హోదా కావాలంటూ బీజేపీ, టీడీపీ కలసి కోరాయని, అదే నినాదంతో 2014 ఎన్నికలకు వెళ్లారని, అధికారంలోకి వచ్చిన ఆ రెండు పార్టీలు హోదా మాటే మరిచాయని విమర్శించారు. ప్రత్యేక హోదా సంజీవిని కాదు, ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అంటూ సీఎం ప్రకటనలు చేశారని, ఇలాంటి తరుణంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం ప్రత్యక్ష పోరాటం చేశామని చెప్పారు. అన్నీ ప్రయత్నాలు చేసి తుదకు పదవులకు రాజీనామాలు చేశామని వివరించారు. రాజీనామాలు ఆమోదించడంలో కూడా ఆలస్యం చేశారని చెప్పారు. ఇకపై ప్రజల మధ్యనే ఉంటూ ప్రత్యక్ష పోరాటం చేస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలుపుకోవడంలో రెండు పార్టీలు విస్మరించిన వైనాన్ని దేశవ్యాప్తం చేశామన్నారు. బీజేపీ, టీడీపీలకు బుద్ధిచెప్పేలా అడుగులు ఇక బీజేపీ, టీడీపీలకు బుద్ధిచెప్పేలా తమ అడుగులు ఉంటాయని మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి తెలిపారు. రాజీనామా ఆమోదం పొందిన నేపథ్యంలో ‘సాక్షి’తో మిథున్‌రెడ్డి మాట్లాడారు. ప్రత్యేక హోదా సాధన కోసం పోరాటాలను మరింత ఉధృతం చేస్తామన్నారు. హోదా కోసం తాము చేసిన రాజీనామాలను ఆమోదించేందుకు కూడా ఇంతో సమయం తీసుకున్నారంటే ప్రత్యేక హోదా ఆకాంక్ష ప్రజల్లో ఎంత బలీయంగా ఉందో అర్థమవుతుందన్నారు. వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రత్యేక హోదాను సాధించి తీరుతామన్నారు. ఇక ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు రెండు నాల్కల ధోరణి వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. ఎన్నికలంటే బాబుకు ఫీవర్ వస్తుందన్నారు. ప్రత్యేక హోదాను సాధించేందుకు రాజీలేని పోరాటం చేస్తామని తెలిపారు. – సాక్షి, నెట్వర్క్ -
దేశంలోనే నెంబర్ వన్ అవినీతి పాలన చంద్రబాబుదే
-
వైఎస్ జగన్‌కు, చంద్రబాబుకు అంత వ్యత్యాసమా!
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ స్పీకర్ తమ రాజీనామాలు ఆమోదించడంపై వైఎస్సార్సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాద్, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాశ్ రెడ్డిలు హర్షం వ్యక్తం చేశారు. స్పీకర్ సుమిత్రా మహాజన్‌తో భేటీ అనంతరం ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మరోసారి వ్యక్తిగతంగా లేఖలు ఇవ్వాలని ఆమె సూచించారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు కనుక రాజీనామాలపై ఎట్టి పరిస్థితుల్లోనే వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసిన నేపథ్యంలో రాజీనామాల ఆమోదానికి ఆమె ఒకే చెప్పారు. ప్రజల్లోకి వెళ్లి పోరాటాలు కొనసాగిస్తామన్నారు. అదే విధంగా పార్టీ ఫిరాయించిన ఎంపీలపై కూడా చర్యలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్‌ను కోరినట్లు మేకపాటి వివరించారు. రాజీనామాల ఆమోదానికి సంబంధించి సాయంత్రం అధికారిక వెలువడనుందని తెలిపారు. రాజీనామా చేయించి మరీ.. : వరప్రసాద్ ఏపీ సీఎం చంద్రబాబుకు డ్రామాలాడటం తప్పా ఏమీ తెలియదంటూ ఎంపీ వరప్రసాద్ ఎద్దేవా చేశారు. ఏనాడు కూడా హోదా కావాలని కేంద్రాన్ని చంద్రబాబు అడగలేదన్నారు. ఎన్నికలంటే భయం లేదని చెప్పుకునే చంద్రబాబు.. వైఎస్సార్సీపీ నుంచి వచ్చిన 23 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. నంద్యాల ఉప ఎన్నికలో అవినీతి డబ్బుతో గెలిచారని ఆరోపించారు. ఇతరుల పార్టీ నుంచి నేతలు వస్తే.. రాజీనామాలు చేయించి మరీ పార్టీలో చేర్పించుకున్న చరిత్ర వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంతమన్నారు. ఉప ఎన్నికలకు వెళ్తాం : వైవీ సుబ్బారెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు రాజీనామాలు చేశామని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. టీడీపీ డ్రామాలు చేస్తోందని, ఏపీ ప్రజలకు ఈ విషయం పూర్తిగా అర్థమైందన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కూడా చర్యలు తీసుకుంటే ఉప ఎన్నికలకు వెళ్తామన్నారు. కమిటీ ఛైర్మన్‌తో మాట్లాడానని స్పీకర్ తమకు చెప్పినట్లు సుబ్బారెడ్డి వెల్లడించారు. దేశంలోనే నెంబర్ వన్ అవినీతి పాలన చంద్రబాబుదేనని, అబద్ధాల పునాదుల మీద చంద్రబాబు అధికారం చెలాయిస్తున్నారని పేర్కొన్నారు. లోక్‌సభలో అసభ్యంగా ప్రవర్తించింది టీడీపీ ఎంపీలేనన్న వరప్రసాద్.. హోదా కోసం వైఎస్సార్సీపీ చిత్తశుద్ధితో పోరాటం కొనసాగిస్తుందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వైఎస్ జగన్‌తోనే సాధ్యమని రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారని స్పష్టం చేశారు. తొలుత నోటీసులిచ్చాం : మిథున్‌రెడ్డి అవిశ్వాస తీర్మానంపై నోటీసులు తొలుత ఇచ్చింది, ఏపీ ప్రయోజనాల కోసం పోరాడుతున్నది తమ పార్టీనేనని వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. హోదా కోసం ప్రజలతో కలిసి పోరాటాలు ఇంకా ఉధృతం చేస్తామన్నారు. సంజీవని లాంటి హోదా వస్తేనే ఏపీ అభివృద్ధి చెందుతుందన్నారు. విలువు అమ్ముకుని బాబు రాజకీయాలు : వైఎస్ అవినాష్‌రెడ్డి రోజుకో ప్రకటనతో సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రజలను మభ్యపెడుతున్నారని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. ఉప ఎన్నికల వస్తే పోటీ చేస్తామంటారని, కానీ ఫిరాయింపు ఎంపీలపై చర్యలు ఎందుకు తీసుకోరని ఈ సందర్భంగా చంద్రబాబును అవినాష్‌రెడ్డి ప్రశ్నించారు. వైఎస్సార్సీపీకి ఉప ఎన్నికలు కొత్త కాదన్న ఆయన.. తాము ప్రజలను నమ్ముకుని రాజకీయాలు చేస్తామని తెలిపారు. చంద్రబాబులాగా విలువలను అమ్ముకుని రాజకీయాలు చేయడం లేదని ఎద్దేవా చేశారు. ఫిరాయింపులకు పాల్పడిన ఎంపీలపై కూడా చర్యలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కోరినట్లు వివరించారు. -
పెట్టింది వైఎస్సార్.. పీకేది చంద్రబాబే
సాక్షి, విజయవాడ: నలభైఏళ్ల రాజకీయ అనుభవం ఉందనే చంద్రబాబు నాయుడు.. జీవితంలో నేర్చుకున్నది ఏమీలేదు కాబట్టే ఇంకా దుర్భాషలాడే స్థాయిలో ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పి. వరప్రసాద రావు అన్నారు. ముఖ్యమంత్రి వినియోగించిన ‘పీకుడు’ పదాన్ని పాజిటివ్‌గా తీసుకుంటే, పీకేవాళ్లెవరో, పెట్టేవాళ్లెవరో ఇట్టే తేల్చయవచ్చని చెప్పారు. విజయవాడలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు సంబోధించింది మహానేత వైఎస్సార్‌నా, లేక వైఎస్ జగన్నా తెలియకున్నా తాను మాత్రం సమాధానం చెబుతానని వరప్రసాద్ అన్నారు. జగన్ ఇంకా అధికారం చేపట్టలేదన్న సంగతి గుర్తుచేసిన ఆయన.. టీడీపీది పీకే రాజకీయమైతే.. వైఎస్సార్సీపీది పెట్టే రాజకీయమని స్పష్టం చేశారు. పీకేది చంద్రబాబే: ►గడిచిన నాలుగేళ్లలో చంద్రబాబు నాయుడు 10 లక్షల పెన్షన్లను పీకేశారు. వృధాప్య పెన్షన్ వయసును 60 నుంచి 65 సంవత్సరాలకు పెంచి పెన్షన్లు పీకేశారు. ►దాదాపు 10 లక్షల మంది పేదల రేషన్ కార్డుల్ని పీకేశారు. ►2 లక్షల మంది కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను విధుల నుంచి పీకేసిన ఘటన బాబుదే ►తాను సీఎంగా ఉన్న కాలంలో 60కిపైగా ప్రభుత్వ సంస్థలను పీకేశారు.. అంటే మూసేశారు. ►నాడు గొప్పగా అమలైన ఉచిత విద్యుత్ పథకాన్ని పీకేశారు. ►జన్మభూమి కమిటీల పేరుతో దుర్మార్గపు కమిటీలను వేసి జనాన్ని పీక్కుతింటున్నారు. ►మీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగానీ, కలెక్టర్‌గానీ పేదలకు ఇల్లో, ఇంకేదో సాయం చేసే స్థితిలోలేరు.. ఎందుకంటే వాళ్ల అధికారాలన్నీ మీరు పీకేశారు.. వాటిని జన్మభూమి కమిటీల చేతుల్లో పెట్టారు. ►ఇంత అహంకారంతో మాట్లాడే మిమ్మల్ని ప్రజలే పీకేసే రోజు వస్తుంది. పెట్టింది వైఎస్సారే: ►ఈ రాష్ట్ర ప్రజలకు ఏ ముఖ్యమంత్రైనా మంచి చేశారంటే అది ఒక్క వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు మాత్రమే. ►ఆయన పేదల కోసం ఆరోగ్యశ్రీని పెట్టారు. ►ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రకులాల పేద పిల్లల చదువుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పెట్టారు. ►డ్వాక్రా మహిళలకు పావల వడ్డీ పథకం పెట్టి వారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. ►2004-2008 మధ్య కాలంలో అంబులెన్స్‌లు, మందుల సరఫరా ఎలా జరిగిందో ప్రజలకు గుర్తుంది. ►నా నియోజకవర్గం(తిరుపతి పార్లమెంట్ పరిధి)లో మూడు ఎస్ఈజెడ్లు పెట్టారు. తద్వారా వందలాది పరిశ్రమలు, వేల మందికి ఉపాధి కల్పించారు. అసమర్థత.. ఇష్టారీతి ప్రవర్తన@బాబు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజాస్వామ్యాన్ని ఇసుమంతైనా గౌరవించని వ్యక్తి చంద్రబాబు నాయుడు. మీ అసమర్థత వల్లే ప్రత్యేక హోదా రాలేదు. మా ఎమ్మెల్యేలను కొని, వాళ్లను మంత్రులు చేశారు. ఇష్టారీతిగా నియంతమాదిరి వ్యవహరిస్తున్నారు. మీకు ప్రజాస్వామ్యం పట్ల విలువలేదని తెలుసుకాబట్టే మేం(వైఎస్సార్సీపీ) అసెంబ్లీనిని బహిష్కరించాం. కేంద్రం నుంచి వచ్చే నిధులను మీ పేరున్న పథకాలుగా చెప్పుకోవడంకాదు.. ఈ జీవితం మొత్తంలో ప్రజలకు నేనిది చేశాను.. అని చెప్పగలిగే ధైర్యం చంద్రబాబుకు లేదు. కాబట్టే ఆయన దుర్భాషలకుదిగుతున్నారు’’ అని వరప్రసాద్ పేర్కొన్నారు. -
ఆ ఘనత చంద్రబాబుదే..!
సాక్షి, విశాఖపట్నం : స్వాతంత్య్రం వచ్చాక విపరీతంగా అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి అయిన ఘనత ఒక్క చంద్రబాబుదేనని ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన వైఎస్సార్సీపీ ఎంపీ వరప్రసాద్ అన్నారు. ప్రత్యేక హోదా విలువ చంద్రబాబుకు తెలియదన్నారు. 29 సార్లు ఢిల్లీ వెళ్లి వట్టిచేతులతో తిరిగివచ్చిన ముఖ్యమంత్రి కూడా ఆయనేనని ఎద్దేవా చేశారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉండి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయించలేని అమసర్థ ముఖ్యమంత్రి చంద్రబాబేనంటూ నిప్పులు చెరిగారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా వైఎస్సార్సీపీ చేపట్టిన ‘వంచన వ్యతిరేక దీక్ష’లో వరప్రసాద్ మాట్లాడారు. ‘ప్రత్యేక హోదా తేలేకపోవడం వల్ల గత నాలుగు సంవత్సరాల్లో లక్షాముప్పై వేల కోట్ల రూపాయలు రాష్ట్రం అప్పులుపాలు కావాల్సి వచ్చింది. స్వాతంత్య్రం వచ్చాక గత 60-70 ఏళ్లలో ఉమ్మడి రాష్ట్రం కోసం కేవలం 90 వేల కోట్ల రూపాయల అప్పు తెస్తే.. ఇప్పుడు కేవలం నాలుగేళ్లలో ఏపీని అప్పుల పాలు చేశారు’ అని ఆయన మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేసిన వ్యక్తి చంద్రబాబేనని, ఫిరాయించిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరినా.. నేటికి చర్యలు తీసుకోలేదని తప్పుబట్టారు. ఢిల్లీలో ఉన్న అహంకారి నరేంద్రమోదీ అని, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం నిరసన చేపడుతున్నామని తెలిసి కూడా ఆయన కనీసం స్పందించలేదని ఆక్షేపించారు. కేంద్రం తీరుకు నిరసనగా ఐదుగురు ఎంపీలం రాజీనామాలు చేశామన్నారు. ఈ రోజు చంద్రబాబు మోసానికి, వంచనకు వ్యతిరేకంగా ఈ దీక్ష చేపట్టామన్నారు. పదిరోజుల క్రితం చంద్రబాబు ధర్మపోరాట దీక్ష ఎందుకు చేశారో ఎవరికి తెలియదని ఎద్దేవా చేశారు. అన్ని హామీలు ఇచ్చి నెరవేర్చని ముఖ్యమంత్రి చంద్రబాబేనని, ప్రజలను ఆయన ఏ విధంగా మోసం చేస్తున్నారో అందరూ తెలుసుకోవాలని అన్నారు. కంపెనీలకు సీఈవోలు ఉంటారని, కానీ మన రాష్ట్ర దౌర్బాగ్యం ఏమిటంటే చంద్రబాబు కూడా సీఈవోగా వ్యవరిస్తున్నారు తప్పితే సీఎంలా వ్యవహరించడంలేదని విమర్శించారు. జన్మభూమి కమిటీలను పెట్టి పరిపాలన సాగిస్తూ చంద్రబాబు ప్రభుత్వానికి, పార్టీకి తేడా లేకుండా చేశారని అన్నారు. జన్మభూమి కమిటీల నుంచి ప్రజలను విముక్తి కలిగించాలంటే.. వచ్చే ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్‌ను గెలిపించాలని, అబద్ధాలతో, రంగులు మారుస్తూ ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబును తరిమితరిమికొట్టాలని వరప్రసాద్ పిలుపునిచ్చారు. -
‘బాబు కాదు.. ప్రజలు ధర్మ దీక్ష చేయాలి’
సాక్షి, అగిరిపల్లి : ప్రత్యేక హోదా ఉద్యమానికి ఊపిరిలూదిన వ్యక్తి వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనని వైఎస్సార్ సీపీ నాయకుడు వరప్రసాద్ అన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమ భవిష్యత్ కార్యాచరణపై వైఎస్ జగన్ ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవికి రాజీనామా చేసినందుకు గర్వంగా ఉందన్నారు. ఆమరణ నిరాహార దీక్ష అనంతరం సొంత నియోజకవర్గానికి వెళ్తే ప్రజలు సంఘీభావాన్ని తెలిపారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా రాజీనామా చేసివుంటే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేదని అన్నారు. ధర్మ పోరాట దీక్ష అనే పేరుతో చంద్రబాబు దీక్ష చేయడంపై మండిపడ్డారు. ఆ పేరుతో దీక్ష చేయాల్సింది ప్రజలని అన్నారు. వాస్తవానికి చంద్రబాబు ఇచ్చిన 600 హామీలను నిలబెట్టుకోవాలని ప్రజలు ధర్మపోరాట దీక్ష పేరుతో నిరసన తెలపాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రావాలంటే కచ్చితంగా వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాల్సిందేనని చెప్పారు. జగన్ వంటి దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడు మాత్రమే రాష్ట్ర ప్రయోజనాలకు ఎవరికైనా ఎదురునిలబడగలరని అన్నారు. -
ప్రజాస్వామ్య చరిత్రలో తొలిసారి: వైఎస్ఆర్సీపీ
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంపై తొమ్మిదోసారి ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు స్వీకరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కోరుతున్నారు. అవిశ్వాస తీర్మానంపై వంద మందికి పైగా ఎంపీల మద్ధతు కూడగట్టామని, సభలో స్పీకర్ నేడు చర్చ చేపట్టాలని వైఎస్ఆర్సీపీ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంపీలు రాజీనామాలతో పాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం ప్రజాస్వామ్య చరిత్రలో తొలిసారి అని వైఎస్ఆర్సీపీ ఎంపీ వరప్రసాద్ పేర్కొన్నారు. ఏదో సాకు చూపించి తీర్మానంపై చర్చ చేపట్టకుండా సభను వాయిదా వేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎంపీల మద్దతు ఉన్నప్పటికీ తీర్మానంపై చర్చనుంచి తప్పించుకోవడానికి బీజేపీ చూస్తుందని అభిప్రాయపడ్డారు. మరోవైపు కేవలం తన రాజకీయలబ్ది కోసమే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ జపం చేస్తున్నారని విమర్శించారు. లాలూచీ కోసమే చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వస్తున్నారని, టీడీపీ అసమర్ధత వల్లే ప్రత్యేక హోదా ఇవ్వడం లేదన్నారు. గత నాలుగేళ్ల నుంచి చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ ఎంపీలకు విప్ జారీ కాగా, తమ ఎంపీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసింది. నేటి నుంచి చివరిరోజు వరకు పార్టీ ఎంపీలందరూ పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావాలని కోరింది. పార్టీ నిర్ణయానికి అనుగుణంగా సభలో వ్యవహరించాలని ఆదేశించింది. -
‘చంద్రబాబు అసమర్ధత వల్లే ఇదంతా’
సాక్షి, తిరుపతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అసమర్థత వల్లే ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా రాలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వరప్రసాద్, పార్టీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డిలు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం తిరుపతిలో వాళ్లు మీడియాతో మాట్లాడారు. దేశంలో చంద్రబాబు అంత అవినీతిపరుడైన సీఎం మరొకరు లేరని ఈ సందర్భంగా నేతలు మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ పోరాటం నేపథ్యంలో చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టిందన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలనుసారం ఎంపీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఎంపీ వరప్రసాద్ తెలిపారు. అదే రోజు ఏపీ భవన్ వద్ద ఆమరణ దీక్షలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రత్యేక హోదాపై నిజంగా చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తమ పార్టీ ఎంపీలతో రాజీనామాలు చేయించి.. దీక్షలో పాల్గొనేలా చేయాలని సవాలు విసిరారు. ఇక కేసుల భయంతోనే బాబు దొంగ నాటకాలు ఆడుతున్నారని.. ఇప్పటికైనా బాబు రెండు నాల్కల ధోరణిని మానుకోవాలని సూచించారు. ఈ నెల 6న వైసీపీ ఎంపీల ఆమరణ దీక్షకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు భూమన తెలిపారు. -
చంద్రబాబు రాత్రికి రాత్రే రంగులు మార్చారు
-
జంప్ జిలానీలను కాపాడేందుకే టీడీపీ డ్రామాలు!
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా పోరాటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ పేరొస్తుందోనని భయపడి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాత్రికి రాత్రే రంగులు మార్చారని ఆ పార్టీ ఎంపీ వరప్రసాద్ మండిపడ్డారు. నిన్నటి వరకు వైఎస్ఆర్సీపీ ప్రతిపాదించిన అవిశ్వాసానికి మద్దతు ఇస్తున్నానని చెప్పిన అనూహ్యంగా నిర్ణయాన్ని మార్చుకుని, లేదు మేం వేరుగా వెళ్తున్నామంటూ చంద్రబాబు ప్రకటించాడన్నారు. ఢిల్లీలో పార్లమెంట్ ఆవరణలో ఎంపీ వరప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ఆర్ సీపీకి భయపడి తెలుగుదేశం పార్టీ అవిశ్వాసానికి వస్తుందని, అంతేగానీ వారికి టీడీపీకి ప్రత్యేక హోదాపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నోటీసులు ఇచ్చారని, అన్ని పార్టీల నేతలను కలిసి మద్దతు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. ప్రత్యేక హోదాకు ప్రాణం పోసింది వైఎస్ఆర్సీపీ అని, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన పోరాటాలతోనే హోదా ఉద్యమం ఉధృతమైందన్నారు. టీడీపీలోకి ఫిరాయించిన ఎంపీలపై అనర్హత వేటు పడుతుందనే భయంతోనే చంద్రబాబు ఎన్డీఏ నుంచి భయటకు వచ్చారని చెప్పారు. అవిశ్వాసానికి ముందుకు రాకపోతే వైఎస్ఆర్సీపీ విప్ జారీ చేస్తుందని, చర్చ, ఓటింగ్ జరిగితే టీడీపీలోకి ఫిరాయించిన ఎంపీలపై వేటు పడుతుందన్న భయంతోనే హోదా విషయంలో ముందుకొచ్చారని చంద్రబాబు కుటిలనీతిని వైఎస్ఆర్సీపీ ఎంపీ వరప్రసాద్ బహిర్గతం చేశారు. -
హోదా తీసుకురాని అసమర్థుడు బాబు
-
హోదా తీసుకురాని అసమర్థుడు బాబు
సాక్షి, న్యూఢిల్లీ : నాలుగేళ్ల పాటు ఎన్డీఏలో భాగస్వామిగా కొనసాగుతూ ప్రత్యేక హోదా తీసుకురాని అసమర్థుడు చంద్రబాబు నాయుడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వరప్రసాద్‌లు మండిపడ్డారు. రాజకీయవసరాల కోసమే ఇప్పుడు టీడీపీ రాజీనామా డ్రామాలాడుతోందని వాళ్లన్నారు. ‘అనుక్షణం ఎత్తుగడలతో ప్రజలను బాబు వంచిస్తున్నారు. ‘ ప్రత్యేక హోదా ఇవ్వరని బాబుకి ఇప్పుడు తెలిసిందా? ప్యాకేజీ కి ఒప్పుకుని మోసం చేశారు. హోదా వచ్చి ఉంటే ఈ పాటికే పరిశ్రమలొచ్చి అభివృద్ధి చెందేది’ అని మేకపాటి అభిప్రాయపడ్డారు. కేసులకు భయపడి బాబు ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో పోరాడలేకపోతున్నారని ఆయన అన్నారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా సహా అన్ని సాధిస్తామన్న తమ మాటలను బాబు వక్రీకరిస్తున్నారని మేకపాటి చెప్పారు.‘ మేం తొలి నుంచి ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నాం. హోదాకోసం అవిశ్వాస తీర్మానం పెడుతామని పేర్కొన్నారు. బాబు నీచ రాజకీయాలు చేస్తున్నారు. దుగరాజపట్నం పోర్టు రాకుండా బాబు అడ్డుపడుతున్నారని’ వరప్రసాద్ తెలిపారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏపీకి తీరని ద్రోహం చేశాయని, హోదాపై కేంద్రానివి కుంటుసాకులని ఆయన ఆక్షేపించారు. -
మృతదేహంతో పోలీస్‌స్టేషన్ వద్ద ధర్నా
నిడదవోలు : ఒడిశాలో అనుమానాస్పదంగా మృతిచెందిన దళిత యువకుడు, లారీడ్రైవర్ మోసుగంటి వరప్రసాద్(42)ది హత్యేనని ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ రాష్ట్ర కన్వీనర్ పిల్లి డేవిడ్ కుమార్ ఆరోపించారు. వరప్రసాద్ మృతదేహంతో కుటుంబ సభ్యులు, దళితులు బుధవారం మండలంలోని సమిశ్రగూడెం పోలీస్ స్టేషన్ వద్ద భారీ ఎత్తున ధర్నా చేశారు. డేవిడ్‌కుమార్ మాట్లాడుతూ.. వరప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడని చిత్రీకరిస్తున్నారని, అతనిది హత్యేనని, నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. వరప్రసాద్ వద్దకు ఇటీవల పెరవలి మండలం నడుపల్లికోటకు చెందిన షేక్ వలీ వచ్చి ఖండవల్లికి చెందిన లారీ ఓనర్ రవి(బాబి)కి రూ.3000 అప్పు ఉన్నావు కదా, అందుకు ఆయన లారీపై పనిచేయాలని చెప్పాడు. లేకుంటే ఆయన నిన్ను ఏదో ఒకటి చేస్తాడని బెదిరించి వరప్రసాద్‌ను డ్యూటీకి తీసుకెళ్లాడు. ఈనెల 14న లారీ ఓనర్ రవి పెండ్యాలకు వచ్చి వరప్రసాద్ ఆచూకీ తెలియడం లేదని, ఫోన్ పనిచేయడం లేదని అతని భార్య శ్రీలతతో చెప్పాడు. తిరిగి లారీ ఓనర్ ఈనెల 15న మృతుడు తల్లికి ఫోన్‌చేసి ఒడిశా రావాలని చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు అక్కడకు వెళ్లగా, ఓ మెడికల్ కాలేజీలో మృతదేహానికి పోస్టుమార్టం చేసి ఓ పక్కన ఉంచారు. ఏమైందని అడిగితే వరప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడని, ఓనర్ అంబులెన్సులో మృతదేహాన్ని పెట్టి కనిపించకుండా పోయాడని చెప్పారు. దీంతో దళిత నాయకులు మృతదేహాన్ని పరిశీలించి హత్యగా నిర్ధారించారు. న్యాయం చేయాలని కోరుతూ సమిశ్రగూడెం పోలీస్‌స్టేçÙన్ వద్ద బుధవారం ధర్నా చేశారు. హత్యకేసు నమోదు చేసి, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వరప్రసాద్ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కోరారు. -
ఏపీకి రైల్వే జోన్ ప్రకటించాలి
-
'మేమేమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదు'
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్‌తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బంద్ విజయవంతమైందని ఆ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరవాలన్నారు. తాము గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, ప్రధాని మోదీ, చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలనే అమలు చేయాలని అడుగుతున్నామన్నారు. హోదాపై స్పష్టత వచ్చేవరకూ తమ పోరాటం కొనసాగుతుందని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ లోపల ఒకమాట, బయట మరోమాట మాట్లాడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. వాగ్దానం చేశాక ఇంకా చర్చలెందుకు లోక్ సభ స్పీకర్ అన్ని పార్టీలతో మాట్లాడారని, బీఏసీలో మాట్లాడాక ప్రత్యేక హోదాపై చర్చను పరిశీలిస్తామన్నారని ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు. వాగ్దానం చేశాక ఇంకా చర్చలెందుకని తాము అడిగామన్నారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి, మళ్లీ చర్చలంటున్నారని మేకపాటి ధ్వజమెత్తారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. విభజన చట్టంలోని అన్ని హామీలను అమలు చేయాలని మేకపాటి సూచించారు. రెండేళ్లు వేచి చూశాం.. ప్రత్యేక హోదా కోసం రెండేళ్లు వేచి చూశామని వైఎస్ఆర్ సీపీ ఎంపీ వరప్రసాద్ అన్నారు. ఇక వేచి చూసే ప్రసక్తే లేదని, ఏపీకి ద్రోహం చేస్తే ఊరుకునేది లేదని ఆయన అన్నారు. ఐదేళ్లలో రెండేళ్లు గడిచిపోయాయని, హామీలను ఎప్పుడు అమలు చేస్తారని వరప్రసాద్ డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ఇచ్చేవరకూ వైఎస్ఆర్ సీపీ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని హామీకి విలువ లేకపోతే ఎలా? ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని వైఎస్ఆర్ సీపీ ఎంపీ బుట్టా రేణుక డిమాండ్ చేశారు. ప్రత్యేక ప్యాకేజీ కాదని, హోదానే కావాలన్నారు. ప్రధాని హామీకి విలువ లేకపోతే ఎలా అని ఆమె ప్రశ్నించారు. -
బంగారం చోరీ చేసిన నిందితుడి అరెస్టు
లాకర్లోని మూడు కేజీల నూట అరవై నాలుగు గ్రాముల బంగారాన్ని చోరీ చేసిన నిందితుడ్ని పోలీసులు పట్టుకున్న సంఘటన మంగళవారం ఆకివీడులో జరిగింది. ఈ నెల 20వ తేదీ అకివీడులోని కార్పొరేషన్ బ్యాంక్‌లో 3కేజీల 164 గ్రాముల బంగారాన్ని ఓ వ్యక్తి లాకర్లో దాచుకున్నాడు. దీనిని గమనించిన బ్యాంక్ అప్రయిజ్ కె. వరప్రసాద్ లాకర్లోని బంగారాన్ని చోరీ చేశాడు. చోరీ చేసిన బంగారం విలువ 68.20 లక్షలు ఉంటుంది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడ్ని మంగళవారం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి మూడు కేజీల నూట ముప్పయి ఆరు గ్రాములు బంగారాన్ని రికవరీ చేశారు. -
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దిష్టిబొమ్మ దహనం
తెలంగాణ న్యాయమూర్తుల అసోసియేషన్ నేతలపై సస్పెన్షన్ ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా కామారెడ్డి బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు న్యాయవాదులు బార్ అసిసోయేషన్ ఆధ్వర్యంలో కోర్టుల నుంచి ర్యాలీ నిర్వహించారు. రైల్వే బ్రిడ్జి వద్ద రోడ్డుపై బైఠాయించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయమూర్తుల నియామకంలో అన్యాయాన్ని నిరసిస్తూ తెలంగాణ న్యాయమూర్తులంతా రాజీనామాలకు సిద్ధపడిన నేపథ్యంలో నాయకత్వం వహించిన అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రవీందర్‌రెడ్డి, వరప్రసాద్‌లను సస్పెండ్ చేశారని, వారిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రా న్యాయమూర్తులను తెలంగాణకు కేటాయించడాన్ని వెనక్కు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు క్యాతం సిద రాములు, సీనియర్ న్యాయవాదులు వీఎల్ నర్సింహారెడ్డి, మంద వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గన్నారు. -
ఐఏఎస్‌గా పనిచేశా.. ఈ పరిపాలన చూడలేదు!
రాజమండ్రి(తూర్పుగోదావరి జిల్లా): తాను ఐఏఎస్‌గా పనిచేశానని, తానెప్పుడూ ఇటువంటి పరిపాలన చూడలేదని తిరుపతి ఎంపీ వరప్రసాద్ పోలీసులపై మండిపడ్డారు. ఆదివారం ఆయనను రాజమండ్రిలో పోలీసులు అడ్డుకున్నారు. కాపుల రిజర్వేషన్ కోసం నిరాహార దీక్షకు దిగిన ముద్రగడ పద్మనాభంను పరామర్శించేందుకు రాజమండ్రి వెళ్లారు. పోలీసులు ఆయనను చూసేందుకు అనుమతి నిరాకరించడంతో వెనుదిరిగారు. రాజమండ్రిలో 144 సెక్షన్ అమలులో ఉందని ఎంపీ వరప్రసాద్‌కు తెలిపారు. దీనికి ఆయన స్పందిస్తూ.. తాను ఐఏఎస్ పనిచేశానని, తానెప్పుడూ ఇటువంటి పరిపాలన చూడలేదని అన్నారు. 144 సెక్షన్ అమలులో ఉన్నప్పటికీ తాము నలుగురురైదుగురు కలిసి గుమిగూడ కూడటం లేదు కదా అన్నారు. అనుమతి నిరాకరించడంతో ఎంపీ వరప్రసాద్ వెనుదిరిగారు. -
చెల్లెలి కోసం వచ్చిన స్నేహితురాలిపై..
ఆలమూరు: చెల్లెలి కోసం ఇంటికి వచ్చిన ఆమె స్నేహితురాలిపై ఓ యువకుడు లైంగిక దాడి చేసిన ఘటన తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది. అంతేకాకుండా ఆ విషయాన్ని ఎవరికైనా చెప్తే ఇంటర్నెట్ లో వీడియో అప్లోడ్ చేస్తానని.. కుటుంబ సభ్యులను చంపేస్తానిని బెదిరింపులకు దిగాడు. ఈ ఘటన జిల్లాలోని ఆలమూరు మండలం జొన్నాడలో శనివారం వెలుగు చూసింది. వివరాలు.. స్థానిక ఎస్సీ పేటకు చెందిన 17 ఏళ్ల బాలిక గత నెల 9న స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న ఆమె సోదరుడు తాడేపల్లి వరప్రసాద్(19)ను ‘మీ చెల్లెలు ఎక్కడుంది’ అని అడిగింది. గదిలో ఉందని చెప్పడంతో బాలిక గదిలోకి వెళ్లగానే తలుపు గడియ పెట్టి కత్తితో బెదిరించి ఆమె పై లైంగిక దాడి చేశాడు. ఆ దృశ్యాలను వీడియోలో చిత్రీకరించానని, విషయం బయటకు చెప్తే సోషల్‌మీడియాలో పెట్టి పరువు తీస్తానని బెదిరించాడు. అంతేకాక బాలిక కుటుంబ సభ్యులను సైతం చంపుతానని హెచ్చరించాడు. దాంతో ఆ బాలిక జరిగిన ఘాతుకం గురించి ఎవరికీ చెప్పలేదు. కాగా శుక్రవారం వరప్రసాద్ స్నేహితుల మొబైల్ ఫోన్లలో లైంగికదాడికి సంబంధించిన దృశ్యాలు స్థానికుల కంటబడ్డాయి. విషయం తెలుసుకున్న బాలిక తండ్రి కుమార్తెను నిలదీయగా.. జరిగిన దారుణం గురించి చెప్పింది. దీంతో ఆయన శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు వరప్రసాద్ పరారీలో ఉన్నాడు. -
'రోహిత్ మరణం ఆ కుటుంబానికి తీరని లోటు'
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో విద్యార్థుల ఆమరణ దీక్షకు తిరుపతి ఎంపీ వరప్రసాద్ సంఘీభావం తెలిపారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రోహిత్ మరణం అతని కుటుంబానికి తీరని లోటని అన్నారు. రోహిత్ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఇవ్వాలని వరప్రసాద్ డిమాండ్ చేశారు. కాగా, హెచ్‌సీయూలో సస్పెన్షన్‌కు గురైన ఐదుగురు విద్యార్థుల్లో గుంటూరుకు చెందిన వేముల రోహిత్ అనే పీహెచ్డీ విద్యార్థి కలత చెంది ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. రీసెర్చ్ స్కాలర్ రోహిత్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ సెంట్రల్ యూనివర్సిటీలో ఏడుగురు విద్యార్థులు కొన్నిరోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సంగతి విధితమే. -
'ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు'
తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించాలన్న అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి లేదని తిరుపతి వైఎస్ఆర్ సీపీ ఎంపీ వరప్రసాద్ విమర్శించారు. ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు ప్రత్యేక హోదాపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయని, నిరుద్యోగ సమస్య తీరుతుందని వరప్రసాద్ అన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రంలో టీడీపీ మంత్రులు పదవులు వదులుకోవాలని వరప్రసాద్ అన్నారు. -
వెహికల్ ఇన్స్పెక్టర్ను దుర్బాషలాడిన జడ్పీటీసీ భర్త
కరీంనగర్ : అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్‌తో పెగడాపల్లి జెడ్పీటీసీ గజ్జెల వసంత భర్త స్వామి దుర్బాషలాడారు. బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వరప్రసాద్ రోజూ వారీగా అలగనూరు వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదేసమయంలో నెంబర్ ప్లేట్ లేని జేసీబీని వరప్రసాద్ సీజ్ చేసి ఆర్టీవో కార్యాలయానికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న జడ్పీటీసీ భర్త స్వామి ఈ రోజు ఉదయం ఆర్టీవో కార్యాలయానికి వెళ్లి నా బండినే... పట్టుకుంటావా అని వరప్రసాద్‌పై దుర్బాషలాడాడు. ఈ తతంగం మొత్తాన్ని వరప్రసాద్ సెల్ ఫోన్లో రికార్డు చేశాడు. ఈ విషయంపై తిమ్మాపూర్ ఎల్ఎండీ పోలీస్‌స్టేషన్‌లో స్వామిపై వరప్రసాద్ ఫిర్యాదు చేశాడు. -
అతడు ఆమెలా.. ఆమె అతడిలా!
వారిద్దరూ నవ దంపతులు. ఉన్నత చదువులు చదివారు. అయినా సంప్రదాయాన్ని మరువలేదు. కుటుంబ ఆచారం మేరకు వివాహమైన మరుసటి రోజు వరుడు మహిళ వేషధారణలోను, వధువు పురుషుని వేషధారణలోను కులదైవం గంగానమ్మను దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం దేవినేనివారిగూడెంకు చెందిన వరప్రసాద్‌కు ప్రశాంతితో ఆదివారం వివాహమైంది. సోమవారం నవదంపతులిద్దరూ వరుడు ఇంటికి చేరుకునే ముందు సంప్రదాయాన్ని పాటించారు. వరుడు మహిళ అలంకరణలో, వధువు పురుష వేషధారణలో గంగానమ్మను దర్శించుకున్నారు. - ద్వారకాతిరుమల -
ఏమయ్యారో?
ఇద్దరు పిల్లలు సహా వివాహిత అదృశ్యం నెల రోజులైనా తెలియని ఆచూకీ మునగపాక: ఇద్దరు పిల్లలతో సహా భార్య అదృశ్యమై నెల రోజులు దాటుతున్నా ఆచూకీ లభించకపోవడంతో బాధితుడు ఆందోళన చెందుతున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని నాగులాపల్లి గ్రామానికి చెందిన కరెట్ల వరప్రసాద్ విశాఖకు చెందిన సత్యదేవిని 2010లో వివాహం చేసుకున్నాడు. నాగులాపల్లికి సమీపంలో అద్దె ఇంట్లో ఉండేవారు. వీరికి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. అయిదు నెలల క్రితం నాగులాపల్లిలోని సొంతింటికి మారారు. తరువాత అత్తతో సత్యదేవికి విభేదాలు రావడంతో విశాఖలో ఉంటున్న తల్లితండ్రుల వద్దకు వెళ్లిపోయింది. గత నెల 1న తిరిగి భర్త వద్దకు వచ్చింది. పది రోజుల తరువాత కూరగాయల కోసం ప్రసాద్ అనకాపల్లి వెళ్లి ఇంటికి వచ్చి చూడగా భార్యా పిల్లలు కనపించకపోవడంతో ఆందోళనకు గురై అత్తమామలు, కుటుంబ సభ్యుల వద్ద వాకబు చేశాడు. ఆచూకీ లభించకపోవడంతో అదే నెల 11న మునగపాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ పరిధి కాదని కేసు నమోదుకు మునగపాక పోలీసులు అంగీకరించకపోవడంతో అనకాపల్లి పట్టణ పోలీసు స్టేషన్లో అదే నెల 21న ఫిర్యాదు చేయడం తెలిసిందే. నాటి నుంచి నేటివరకు వారి ఆచూకీ దొరక లేదు. పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి తనకు న్యాయం చేయాలని వరప్రసాద్ వేడుకుంటున్నాడు. తన భార్య, పిల్లల ఆచూకీ కనిపిస్తే 8185051114 నంబర్‌కు సమాచారం ఇవ్వగలరని కోరాడు. -
'మెడికల్ కాలేజీ ల పెంపుకు కేంద్రం చొరవ తీసుకోవాలి'
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ కాలేజిల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ వరప్రసాద్ అన్నారు. మెడికల్ కాలేజీ ల పెంపుకు కేంద్రం చొరవ తీసుకోవాలని వరప్రసాద్ తెలిపారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి విజ్క్షప్తి పత్రాన్ని సమర్పించారు. కేంద్ర ప్రభుత్వ అధికారులను కలిసిన వరప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. ఎక్కువ మంది డాక్టర్లు తయారైతేనే, ప్రజలకు వైద్యసౌకర్యాలు అందుబాటులో ఉంటాయి అని వరప్రసాద్ అన్నారు. -
ఎంపీపీల రిజర్వేషన్ల సంఖ్య ఖరారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1096 ఎంపీపీ స్థానాల కు సంబంధించిన రిజర్వేషన్ల సంఖ్యను పంచాయతీరాజ్ కమిషనర్ వరప్రసాద్ నేతృత్వంలోని అధికారుల బృందం నిర్ధారించింది. ఈ సంఖ్య ఆధారంగా జిల్లాల కలెక్టర్లు మండలాల జనాభా, రొటేషన్ విధానాన్ని పరిగణనలోకి తీసుకుని ఏ మండలం ఏ కేటగిరీ (రిజర్వేషన్) కిందకు వస్తుందో ప్రకటి స్తారు. పూర్తి జాబితాను ఎన్నికల నోటిఫికేషన్ (ఈ నెల 17న) సమయంలో వెల్లడిస్తారు. అలాగే ఏ జెడ్పీటీసీ ఎవరికి రిజర్వ్ అరుు్యందన్న విషయూన్ని కూడా ఇదే తరహాలో కలెక్టర్లే ప్రకటిస్తారు. ఎంపీపీ చైర్పర్సన్ల రిజర్వేషన్ల సంఖ్యను జిల్లాల వారీగా కమిషనర్ వరప్రసాద్ కలెక్టర్లకు పంపించారు. మొత్తం 1096 ఎంపీపీ స్థానాల్లో యాభై శాతం విధిగా మహిళలకు కేటాయించాలి. ఆ విధంగా వారికి 548 స్థానాలు మాత్రమే దక్కాల్సి ఉంది. కానీ కొన్ని జిల్లాల్లో మండలాలు బేసి సంఖ్యలో ఉండడం వల్ల మహిళలకు ఒక సీటు అదనంగా అంటే 549 స్థానాలను రిజర్వ్ చేశారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని 49 మండలాలను పూర్తిగా ఎస్టీలకే (మహిళలకు 25) రిజర్వ్ చేశారు. అంటే ఎంపీపీ అధ్యక్షులుగా ఎస్టీలనే ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఏజెన్సీయేతర ప్రాంతాల్లోనూ జనాభా ప్రాతిపదికన ఎస్టీలకు 73 మండలాలను (మహిళలకు 37) రిజర్వ్ చేశారు. ఇక ఎస్సీలకు రాష్ట్రవ్యాప్తంగా 202 (మహిళలకు 101), బీసీలకు 356 (మహిళలకు 178), మండలాలను కేటారుుంచగా అన్ రిజర్వ్డ్ కింద 416 (మహిళలకు 208) మండలాలున్నారుు. -
పంచాయతీలను బలోపేతం చేయాలి
ఇందూరు, న్యూస్‌లైన్ : గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడానికి అధికారులు కృషి చేయాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ వరప్రసాద్ అన్నారు. నూతనంగా సర్పంచులు ఎన్నికైన నేపథ్యంలో గ్రామాలను పటిష్టం చేయాలని, ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన మంగళవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా పంచాయతీరాజ్ అధికారులతో సమీక్షించారు. తాగు,సాగునీరు, విద్యుత్‌దీపాలు, డ్రైనేజీ, రోడ్లు ఇతర సౌకర్యాలు లేని గ్రామాలను గుర్తించాలన్నారు. సర్పంచులతో ప్రణాళిక తయారు చేసుకుని సౌకర్యాల కల్పనకు ఎన్ని నిధులు అవసరమవుతాయో నివేదికను సిద్ధం చేసుకోవాలన్నారు. పంచాయతీల అదాయం తక్కువగా ఉందని, దీంతో గ్రామాల అభివృద్ధికి నిధులు సరిపోవడంలేదన్నారు. ఇందుకు గ్రామాల వారీగా పన్నుల వసూళ్లు డిమాండ్ ఎంత ఉందో, ఎంత వసూలు చేశారు, ఇంకా ఎంత చేయాలి, గ్రామాభివృద్ధికి ఎన్ని నిధులు అవసరమో తెలుసుకోవాలన్నారు. రాజీవ్ స్వశక్తి యోజన పథకం(ఆర్‌జీపీఎస్‌ఏ) కింద పంచాయతీలకు కొత్త భవనాలు, సిబ్బంది కొరత తీర్చడం, కంప్యూటర్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తామన్నారు. మండల స్థాయిలో రిసోర్సు సెంటర్లను ఏర్పాటు చేసి, ప్రతి గ్రామ పంచాయతీలో కొత్త ఏడాదిలో కంప్యూటర్లను ఇస్తామని కమిషనర్ వెల్లడించారు. ఈ-పంచాయతీ ఆన్లైన్ ద్వారా మొత్తం వివరాలు అన్ని ఇందులో నమోదు అవుతాయన్నారు. పంచాయతీ కార్యదర్శుల భర్తీకి.. జిల్లాల్లో ఖాళీ ఉన్న గ్రామ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని, జిల్లాల వారీగా నోటిఫికేషన్లు వేయాలని, అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని కమిషనర్ వరప్రసాద్ ఆదేశించారు. ప్రస్తుతం పని చేస్తు కాంట్రాక్టు కార్యదర్శులకు ఇందులో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. వీరికి 25శాతం వెయిటేజీ ఇస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి రాత పరీక్ష ఉండదని, డిగ్రీ మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుందన్నారు. జిల్లాకు మంజూరైన బీఆర్జీ నిధులు,పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీపీఓ సురేశ్‌బాబు, జెడ్పీ సీఈఓ రాజారాం, పంచాయతీరాజ్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.