సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు సమావేశాలు సందర్భంగా ముందుగా మాజీ ఎమ్మెల్యే కోట రామారావు మృతికి అసెంబ్లీ సంతాపం తెలియజేసింది. అనంతరం ఎస్సీ కమిషన్ ఏర్పాటు బిల్లును మంత్రి విశ్వరూప్ సభ ముందుకు తీసుకొచ్చారు. దీనిపై చర్చలో భాగంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ.. దళితులని అవమానించిన చరిత్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదని ఆరోపించారు. తాను ఎన్నో అవమానాలు పడిన వ్యక్తిగా ఒక్కటి చెప్పదల్చుకున్నానని.. చంద్రబాబుకు చేతనయితే ఎస్సీ, ఎస్టీల్లో అసమానతాలను తగ్గించే యత్నం చేయాలన్నారు.
చంద్రబాబు పరిపాలనలో ఎస్సీ, ఎస్టీలకు చేసేందేమీ లేదన్నారు. ఎస్సీ, ఎస్టీలు తరతరాలుగా పేదవారిగా మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. చేతులు జోడించి విపక్షాన్ని అడుతున్నాని.. టీడీపీ ఎమ్మెల్యేలు మానవతా దృష్టితో ఆలోచించాలని హితవు పలికారు. ఎస్సీ కమిషన్ ఏర్పాటు బిల్లుకు అడ్డుపడవద్దని వరప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని కూడా టీడీపీ వ్యతిరేకించిందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసిన వరప్రసాద్.. రాజకీయాల్లో ఉండటానికి చంద్రబాబు అర్హుడు కాదన్నారు. పేదవాళ్లు బాగు పడొద్దనేది చంద్రబాబు ఉద్దేశమని వరప్రసాద్ తెలిపారు. దళితులకు ఉన్నత విద్యను అడ్డుకున్న చరిత్ర చంద్రబాబుదన్నారు.
చదవండి:
సర్వతోముఖాభివృద్ధే మా లక్ష్యం
Comments
Please login to add a commentAdd a comment