Assembly Special sessions
-
మన్మోహన్ సింగ్‌కు తెలంగాణ అసెంబ్లీ నివాళి
హైదరాబాద్, సాక్షి: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తెలంగాణ అసెంబ్లీ నివాళి అర్పించింది. ఏడు రోజుల సంతాప దినాల నిర్వహణలో భాగంగా.. ఇవాళ(డిసెంబర్ 30) ప్రత్యేక సెషన్ నిర్వహించింది. సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా.. ప్రతిపక్ష బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ ఆ తీర్మానానికి మద్దతు ప్రకటించారు. అలాగే మన్మోహన్‌కు దేశఅత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలనే తీర్మానానికి సైతం అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అనంతరం అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ వచ్చింది. తెలంగాణ ప్రజలకు మన్మోహన్‌కు రుణపడి ఉంటారు. 60 ఏళ్ల తెలంగాణ కల సాకారం ఆయనను తెలంగాణ సమాజం గుండెల్లో పెట్టుకుంటుంది. తెలంగాణ అంటే మన్మోహన్‌కు ప్రత్యేక అభిమానం ఉండేదని ఆయన సతీమణి తెలిపారు. ఆయన కుటుంబం చాలా నిరాడంబరంగా ఉంటుంది. గొప్ప విలువలతో తన కుటుంబాన్ని నడిపించారు. మన్మోహన్ పరిపాలనతోనే మనం గొప్ప ఆర్థిక శక్తిగా నిలబడగలిగాం. మన్మోహన్‌తో తెలంగాణకు ఉన్న బంధం ఎప్పటికీ మరవలేం. ప్రజలంతా గుర్తు పెట్టుకునే విధంగా మన్మోహన్ విగ్రహం ఏర్పాటు చేస్తాం. ప్రజలకు ఉపయోగపడే సంస్కరణల్లో ఆయన వెనకడుగు వేయలేదు. భూసేకరణ చట్ట సవరణ ద్వారా కోట్లాది మందికి లబ్ధి చేకూర్చారు. భూసేకరణ చట్టం-2013 ద్వారా చేతి వృత్తులు, కుల వృత్తుల వారు లబ్దిపొందారు. మన్మోహన్ చేసిన కృషిని అందరూ గుర్తుంచుకోవాలి. పోడు భూములకు కూడా పట్టాలు ఇవ్వగలుగుతున్నామంటే అది ఆయన చలువే. అంబేద్కర్ స్పూర్తితో పరిపాలన చేశారు. మన్మోహన్ గొప్ప ఆర్థికవేత్త, తత్వవేత్త, మానవతావాది. ఐటీ రంగాన్ని శాసించగలుగుతున్నామంటూ ఆయన సంస్కరణలే కారణం అని చెప్పుకొచ్చారు.ఎవరు ఎన్ని విమర్శలు చేసినా.. పనే ధ్యాసగా పనిచేశారు. బ్యూరోక్రాట్‌గా వివిధ దశల్లో పనిచేసి మన్మోహన్ దేశ ప్రధాని అయ్యారు. నీతి, నిజాయితీతో మన్మోహన్‌తో పోటీ పడేవారు లేరు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా.. తన పనే లక్ష్యంగా మన్మోహన్ ముందుకు సాగారు. మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి. 👉డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామెంట్స్.. ప్రతీ ఒక్కరి కోసం ఆహార భద్రతా చట్టం తీసుకొచ్చారు. దేశ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పాలన అందించారు. మన్మోహన్ సంస్కరణలతో అనేక కుటుంబాలు పేదరికం నుంచి బయటపడ్డాయి. సమాచార హక్కు చట్టాన్ని 2005లో తీసుకువచ్చారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం దేశ గతినే మార్చేసింది. ఆర్థిక మాంద్యం బారినపడకుండా ఉపాధి హామీ పథకం కాపాడింది. దేశ సామాజిక పరిస్థితులను అవగాహన చేసుకుని చట్టాలు చేశారు. ప్రతీ ఒక్కరి కోసం ఆహార భద్రతా చట్టం తీసుకొచ్చారు. దశాబ్దాలుగా కొట్లాడుతున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చారు. విపక్షాలను ఒప్పించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేలా చేశారు. మన్మోహన్ మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం. మన్మోహన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. అసామాన్యమైన మహా మనిషి మన్మోహన్. దేశం కోసం ఆయన కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా ప్రపంచ దేశాల్లో నిలబెట్టారు. మన్మోహన్ భారత్‌లో పుట్టినందుకు గర్వపడుతున్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నాం. 👉 కేటీఆర్ కామెంట్స్..మన్మోహన్ సింగ్ నిబద్ధతతోనే తెలంగాణ ఏర్పడింది. సీఎం రేవంత్ ప్రతిపాదనను స్వాగతిస్తున్నాం. మన్మోహన్ తెలివితేటలను గుర్తించింది మన తెలంగాణ బిడ్డ పీవీనే. ఎన్నో సంస్కరణలు చేసిన వ్యక్తి మన్మోహన్ సింగ్. ఎన్ని రకాలుగా ఆయన్ని అవమానించినా మౌనంగా భరించారు. అయినా అవన్నీ పంటి కింద బిగబట్టి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన వ్యక్తి. పీవీ నర్సింహారావు తెలంగాణ బిడ్డ. ఢిల్లీలో మెమోరియల్ లేదు. అక్కడ మెమోరియల్ ఏర్పాటు చేయాలని శాసన సభ తీర్మానం చేయాలి.రాజకీయాలతో సంబంధం లేని ఆర్థిక వేత్తగా ఉన్న మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రపంచం అంతా దేశం వైపు చూసే విధంగా మన్మోహన్ సింగ్ ఆర్థిక నిర్ణయాలు ఉన్నాయి. లాయల్టీకి నిలువుటద్దంగా నిలిచిన గొప్ప మహనీయుడు మన్మోహన్ సింగ్. కేసీఆర్‌కు షిప్పింగ్ పోర్టుపోలియో ఇస్తే డీఎంకే అభ్యంతరం వ్యక్తం చేయగానే కేసీఆర్ తెలంగాణ కోసం అది త్యాగం చేశారు. తెలంగాణ ఏర్పాటు మన్మోహన్ సింగ్ నాయకత్వంలో జరిగింది. తెలంగాణ డెలిగేషన్ తీసుకొని మన్మోహన్ సింగ్‌ను కలిశాం. 5 నిమిషాలు కాదు, ఎక్కువ సమయం కావాలని అడిగాం. సమస్య తీవ్రత తెలుసుకొని గంటన్నర సమయం ఇచ్చారు. ఓబీసీ అంశాలపై బలహీన వర్గాల డెలిగేషన్ ఢిల్లీ వెళ్లి కలిసింది.మన్మోహన్ సింగ్‌కు జరిగిన గౌరవ వీడ్కోలు.. మన పీవీ నరసింహారావుకు దక్కలేదు. ఢిల్లీలో అందరి ప్రధాన మంత్రులకు ఘాట్స్ ఉన్నాయి. పీవీకి తప్ప. పీవీకి ఢిల్లీలో స్మారకం ఏర్పాటు చేసేలా సభలో తీర్మానం పెట్టాలని కోరుతున్నాం. మన్మోహన్ సింగ్ విగ్రహం ఎక్కడ ఏర్పాటు చేసినా మేమంతా వస్తాం.👉మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్..దేశాభివృద్ధికి మన్మోహన్ సింగ్ అనేక గొప్ప విధానాలు తెచ్చారు. సాధారణ స్థాయి నుంచి ఉన్నతస్థాయికి ఎదిగారు. మన్మోహన్సింగ్ను ఆర్థికమంత్రిగా పీవీ నరసింహారావు ఎంపిక చేశారు. గ్రామీణ పేదలకు పని కల్పించే ఉపాధి హామీ పథకం తెచ్చారు. బీజేపీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి కామెంట్స్..పీవీ నరసింహారావు గురించి సభలో గుర్తు చేస్తున్నారు.పీవీని పదేళ్లు పట్టించుకోకపోతే.. బీజేపీ పీవీకి భారతరత్న ఇచ్చింది.పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పీవీకి భారత రత్న ఇవ్వలేదు.మన్మోహన్ సింగ్ మరణం పట్ల కేంద్ర ప్రభుత్వం వారం రోజులు సంతాప దినాలు ప్రకటిస్తే..రాహుల్ గాంధీ న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం వియత్నాం వెళ్లారట!రాజకీయాలకు అతీతంగా మన్మోహన్ సింగ్‌కు సంతాపం ప్రకటించాలి.మన్మోహన్‌కు దక్కిన గౌరవంతో పాటు అవమానం గుర్తు చేస్తున్నాం.సంతాప సభలో రాజకీయాలు ఎందుకు?. సభలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్..ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ.మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్..సంతాప తీర్మానం రోజు దాని గురించే మాట్లాడాలి.నిజంగా ఆర్ఎస్ఎస్ నేతలు కూడా మహేశ్వర్ రెడ్డి లాగా మాట్లాడరు.మధ్యలో వెళ్లిన మహేష్ రెడ్డి చించుకుంటూ మాట్లాడుతున్నారు.రాహుల్ గాంధీ ఎటు వెళ్లారు అన్నది ఇక్కడ చర్చ కాదు.సంతాప తీర్మానం గురించి మాత్రమే మాట్లాడితే బాగుంటుందిఏలేటి మహేశ్వర్ రెడ్డి కామెంట్స్..కాంగ్రెస్ పార్టీ ఎందుకు మధ్యలో కలగజేసుకుంటుంది.దేశం అంతా మన్మోహన్ సింగ్ గురించి వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటన చేసి జరుపుతుంటే..రాహుల్ గాంధీ వేడుకల కోసం వియత్నం వెళ్లలేదా?కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్‌ను అవమానించినట్లు కాదా ?మన్మోహన్ సింగ్ విగ్రహం గురించి మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ.. పీవీకి కూడా విగ్రహం పెడితే బాగుండు.కూనంనేని కామెంట్స్..దేశ గతి, గమనాన్ని మన్మోహన్ మార్చారు. మన్మోహన్‌కు నివాళి అర్పించే కార్యక్రమంలో రాజకీయాలు తగదు.సంతాప సభల్లో వేరే అంశాలను జోడించడం ఇంతకు ముందెన్నడూ చూడలేదునివాళి కార్యక్రమంలో ఇలా చేయడం వల్ల మన్మోహన్ ఆత్మ క్షోభిస్తుందినివాళి కార్యక్రమంలో ఆయన గొప్పతనాన్ని చెప్పాలినిజాయతీ, నిబంద్ధతకు నిలువుటద్దం మన్మోహన్ సింగ్. హరీష్ రావు కౌంటర్..కేసీఆర్ గురించి మాట్లాడుకోవాలంటే ఆయనకు సభ ఏం గౌరవం ఇచ్చింది.సభ సభ లాగా జరగడం లేదుపీఏసీ చైర్మన్ మీకు నచ్చినట్లు ఇచ్చుకున్నారు.కేసీఆర్‌ను అడిగి పీఏసీ చైర్మన్ ఇచ్చారా?తెలంగాణ కోసం కేసీఆర్ రెండున్నర ఏళ్ల పాటు ఉన్న కేంద్ర పదవిని వదిలేశారు.శాసనసభ్యుల అనర్హత పై మీరు నిర్ణయం తీసుకున్నారా?ఆ లెక్కన వస్తే మేము చాలా మాట్లాడగలుగుతాం.కానీ ఇప్పుడు మన్మోహన్‌కు మాత్రమే పరిమితమవుతున్నాం. స్పీకర్ కామెంట్స్..కేసీఆర్ ప్రస్తావన రాగానే కలగజేసుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ప్రత్యేక సమావేశాల కోసం కేసీఆర్‌కు స్వయంగా నేనే కాల్ చేశాను.అసెంబ్లీ సమావేశానికి రావాలని కేసీఆర్‌ను స్వయంగా ఆహ్వానించాను.కానీ, ఆయన రాలేదుహరీష్ రావు కామెంట్స్..మన్మోహన్ సింగ్ పెద్దల సభలో 33 ఏళ్లు ఉన్నారుఈరోజు శాసనసభతో పాటు పెద్దల సభ, మండలి కూడా సమావేశమై నివాళి అర్పిస్తే బాగుండేది.శాసన మండలిలో మన్మోహన్‌కు నివాళి అర్పిస్తే మరింత గౌరవంగా ఉండేదిశాసన మండలి సభ్యులు సైతం సంతాపం తెలిపేందుకు అడుగుతున్నారు.నెక్లెస్ రోడ్డుకు పీవీ పేరు పెట్టాం. పీవీ ఘాట్ ఏర్పాటు చేశాం.స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ పేరు పెట్టాలి.మన్మోహన్‌కు భారతరత్న ఇవ్వాలి.దేశం ఆర్థికంగా బలోపేతం కావాడానికి మన్మోహన్, పీవీ కృషి ఎంతో ఉంది.కేసీఆర్ నాయకత్వంలో పీవీకి భారతరత్న ఇవ్వాలని ఇదే అసెంబ్లీలో తీర్మానం చేశాం.కేంద్రం కూడా స్పందించి పీవీకి భారతరత్న ఇచ్చింది.మన్మోహన్‌ను మౌన ముని అని అంటారుమన్మోహన్పై చిన్న అవినీతి మరక కూడా లేదు.ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా చెరగని ముద్ర వేశారు.ఏఐసీసీ మీటింగ్‌లో మన్మోహన్ కంట తడి పెట్టారు.కాంగ్రెస్ ఓటమికి సంస్కరణలే కారణమని ఏఐసీసీలో చర్చించినా మన్మోహన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు.మన్మోహన్ తెచ్చిన ఆర్డినెన్స్‌ను రాహుల్ చించేసినా ప్రధానిగా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కేసీఆర్‌కు స్పీకర్ గడ్డం ప్రసాద్ ఫోన్..👉నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నామని సభకు రావాలని కేసీఆర్‌కు తెలిపిన స్పీకర్. మరోవైపు.. అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి దూరంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. -
రేపు అసెంబ్లీ ప్రత్యేక భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ సోమవారం ప్రత్యేకంగా సమావేశం కానుంది. దేశాన్ని ఆర్థిక చిక్కుల నుంచి బయటపడేసి, అభివృద్ధి పథంలో పయనించేలా మార్గనిర్దేశం చేసిన మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు నివాళులు అర్పించనుంది. దేశానికి మార్గం చూపిన ఆయనకు భారత రత్న ఇవ్వాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇటీవల జరిగిన శాసనసభ శీతాకాల సమావేశాల అనంతరం ఈ నెల 21న సభ నిరవధికంగా వాయిదాపడిన సంగతి తెలిసిందే.అయితే సభను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇంకా ప్రోరోగ్ చేయకపోవడంతో.. ఈ నెల 30న సోమవారం ప్రత్యేక భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. దీనిపై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఆదేశాల మేరకు సోమవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభించనున్నట్టు శాసనసభ వ్యవహారాల కార్యదర్శి డాక్టర్ నరసింహాచార్యులు శనివారం లేఖ విడుదల చేశారు. ఈ ప్రత్యేక సమావేశం ఒక్కరోజుకే పరిమితం చేయనున్నారు. మన్మోహన్‌ను కొనియాడుతూ తీర్మానం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈనెల 3వ తేదీ వరకు ఏడు రోజుల పాటు సంతాప దినాలుగా పాటిస్తున్నాయి. ఈ క్రమంలో మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటాన్ని గుర్తు చేసుకుంటూ, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో ఆయన కృషిని కొనియాడుతూ తీర్మానం చేయడం ద్వారా నివాళి అర్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఆధునిక భారత దేశ ఆర్థిక సంస్కర్తగా పేరుగాంచిన మన్మోహన్‌కు ‘భారతరత్న’ఇవ్వాలని కోరుతూ తీర్మానం చేసే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.ప్రత్యేక భేటీకి ప్రతిపక్ష నేత కేసీఆర్మాజీ ప్రధాని మన్మోహన్‌కు నివాళి అర్పించేందుకు సోమవారం నిర్వహిస్తున్న అసెంబ్లీ ప్రత్యేక భేటీకి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలిసింది. మన్మోహన్ నేతృత్వంలోని కేబినెట్లో కొంతకాలం కేంద్ర మంత్రిగా పనిచేసిన కేసీఆర్.. పలు సందర్భాల్లో ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక తెలంగాణ ఏర్పాటులో మన్మోహన్ సహకారాన్ని రికార్డుల్లో చేర్చాలని కోరుతూ అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు కూడా. ఈ నేపథ్యంలో మన్మోహన్ కృషిని కొనియాడుతూ, నివాళి అర్పించే అసెంబ్లీ ప్రత్యేక భేటీకి ప్రతిపక్ష నేతగా కేసీఆర్ హాజరవుతారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. -
బీజేపీ ఆపరేషన్ కమలం విఫలం.. అందుకే విశ్వాస తీర్మానం: సీఎం కేజ్రీవాల్
న్యూఢిల్లీ: బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య రాజకీయ విబేధాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఢిల్లీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. ఈక్రమంలో సోమవారం ఢిల్లీ అసెంబ్లీ సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా సొంత ప్రభుత్వంపైనే సీఎం కేజ్రీవాల్ విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఆపరేషన్ లోటస్, లిక్కర్ కుంభకోణంపై సభలో అధికార ఆప్, ప్రతిపక్ష బీజేపీ సభ్యుల పరస్పర నిందారోపణలు, నినాదాలతో మారుమోగింది. అయితే ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేందుకే ఆప్ విశ్వాస తీర్మానం పెట్టిందని సభలో బీజేపీ ఎమ్మెల్యేలు విమర్శించారు. అసెంబ్లీలో ఆప్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో బీజేపీ సభ్యలను బలవంతంగా సభ నుంచి బయటకు పంపించారు. చదవండి: రాజీనామా తర్వాత తొలిసారి మీడియాతో ఆజాద్.. అందుకే కాంగ్రెస్‌ను వీడానంటూ.. విశ్వాస తీర్మాణాన్ని ప్రవేశ పెట్టిన సందర్భంగా సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సభలో బీజేపీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరును ఖండించారు. బీజేపీ ఎమ్మెల్యేలు విషయాలు చర్చకు రాకుండా.. రచ్చ చేయాలనే ఉద్దేశంతోనే సభకు వస్తున్నారని ఆరోపించారు. ఆప్‌ను వీడి బీజేపీలో చేరితో ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 20 కోట్లు ఆఫర్ చేసిందని మండిపడ్డారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు నిజాయితీ పరులని, ఒక్క ఎమ్మెల్యే కూడా అమ్ముడుపోలేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో బీజేపీ ఆపరేషన్ కమలం విఫలమైందని రుజువు చేసేందుకే సభలో విశ్వాస తీర్మానం పెట్టినట్లు తెలిపారు. చాలా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను బీజేపీ పడగొట్టిందని.. ఢిల్లీలోని అలాంటి ప్రయత్రాలు చేసిందని విమర్శించారు. 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్‌కు 62 మంది ఎమ్మెల్యేలు ఉండగా, బీజేపీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. -
Delhi Assembly: మాటల యుద్ధం
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం రణరంగాన్ని తలపించింది. ఆపరేషన్ లోటస్, లిక్కర్ కుంభకోణంపై సభలో అధికార ఆప్, ప్రతిపక్ష బీజేపీ సభ్యుల పరస్పర నిందారోపణలు, నినాదాలతో మారుమోగింది. ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనే ఆరోపణలపై చర్చించేందుకు, తాము సాధించిన విజయాలను వివరించేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపర్చింది. అయితే, బీజేపీ తమ వారిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందని పేర్కొంటూ ఆప్ సభ్యులు డబ్బు–డబ్బు(ఖోకా–ఖోకా) అంటూ నినాదాలు ప్రారంభించారు. పోటీగా బీజేపీ సభ్యులు కేజ్రీవాల్ సర్కార్ లిక్కర్ కుంభకోణానికి పాల్పడిందని ఆరోపిస్తూ మోసం–మోసం (ధోఖా–ధోఖా) అంటూ ప్రతినినాదాలకు దిగారు. దీంతో డిప్యూటీ స్పీకర్ రాఖీ బిర్లా వారిని సముదాయించేందుకు యత్నించారు. నిబంధనలకు విరుద్ధంగా సభా కార్యక్రమాలను సెల్ఫోన్లో చిత్రీకరిస్తున్నారంటూ అధికార, ప్రతిపక్ష సభ్యులు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఈ విషయంలో తన ప్రశ్నకు జవాబివ్వకుండా, కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్నారంటూ బీజేపీకి చెందిన మొత్తం 8 మందినీ డిప్యూటీ స్పీకర్ రాఖీ బిర్లా మార్షల్స్‌తో బయటకు గెంటించి వేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలోని గాంధీజీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. అభద్రతాభావంలో ప్రధాని మోదీ ఆప్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై జరిగిన చర్చ సందర్భంగా సీఎం కేజ్రీవాల్, మాట్లాడారు. తమ పార్టీ ఎమ్మెల్యేలెవరూ బయటకు వెళ్లలేదని నిరూపించేందుకు ఈ నెల 29న అసెంబ్లీలో బలపరీక్ష చేపట్టాలనుకుంటున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు బీజేపీ చేపట్టిన ఆపరేషన్ లోటస్ కాస్తా ఆపరేషన్ బురద జల్లుడుగా మారిందని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు బీజేపీ సీరియల్ కిల్లర్ మాదిరిగా కాచుక్కూర్చుందన్నారు. ప్రధాని మోదీలో అభద్రతాభావం పెరిగిపోయిందని డిప్యూటీ సీఎం సిసోడియా పేర్కొన్నారు. -
‘మహా’ స్పీకర్‌గా నర్వేకర్.. అత్యంత పిన్నవయస్కుడిగా రికార్డు!
ముంబై: మహారాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు సభాపతి ఎన్నిక నిర్వహించారు. నూతన స్పీకర్‌గా బీజేపీ అభ్యర్థి రాహుల్ నర్వేకర్(45) ఎన్నికయ్యారు. ఆయనకు 164 ఓట్లు రాగా, మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) అభ్యర్థి, శివసేన ఎమ్మెల్యే రాజన్ సాల్వీకి కేవలం 107 ఓట్లు పోలయ్యాయి. దేశంలో ఇప్పటిదాకా అత్యంత పిన్నవయస్కుడైన అసెంబ్లీ స్పీకర్‌గా రాహుల్ నర్వేకర్ రికార్డుకెక్కారని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. రాహుల్ మామ, ఎన్సీపీ నేత రామ్‌రాజే నాయక్ మహారాష్ట్ర శాసనమండలి చైర్‌పర్సన్‌గా పనిచేస్తున్నారు. కొత్త స్పీకర్ వెంటనే రంగంలోకి దిగారు. శివసేన శాసనసభాపక్ష నేతగా అజయ్ చౌదరిని తొలగించారు. ఆ స్థానంలో సీఎం షిండేను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. తిరుగుబాటుకు ముందు షిండేనే ఎల్పీ నేతగా ఉన్న విషయం తెలిసిందే. 288 మంది సభ్యులున్న అసెంబ్లీలో ప్రస్తుతం ఒక స్థానం ఖాళీగా ఉంది. శివసేన సభ్యుడు రమేశ్ లాట్కే మరణంతో ఖాళీ ఏర్పడింది. డిప్యూటీ స్పీకర్, ఎన్సీపీ నేత నరహరి జిర్వాల్ ఓటు వేయలేదు. కొందరు శివసేన ఎమ్మెల్యేలు పార్టీ విప్‌ను ధిక్కరించి, ప్రత్యర్థికి ఓటు వేశారని, వారిపై తగిన చర్యలు తీసుకుంటామని నరహరి జిర్వాల్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న 287 మంది ఎమ్మెల్యేలకు గాను 271 మంది ఓటు వేశారు. వివిధ కారణాలతో పలువురు గైర్హాజరయ్యారు. పూర్తి పారదర్శకంగా స్పీకర్ ఎన్నిక జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి బాలాసాహెబ్ థోరట్ ఒక ప్రకటనలో ప్రశంసించారు. శివసేన రెబల్ ఎమ్మెల్యేలు పటిష్టమైన భద్రత మధ్య సమీపంలోని హోటల్ నుంచి అసెంబ్లీకి చేరుకున్నారు. మహారాష్ట్ర నూతన సర్కారు బలపరీక్ష సోమవారం అసెంబ్లీలో జరుగనుంది. శివసేన ఎమ్మెల్యేలకు రెండు విప్‌లు శివసేన రెండు వర్గాలు విడిపోయింది. స్పీకర్ ఎన్నికలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే వర్గాలు పార్టీ ఎమ్మెల్యేలకు వేర్వేరు విప్ జారీ చేశాయి. షిండే వర్గం బీజేపీ అభ్యర్థి రాహుల్ నర్వేకర్‌గా అనుకూలంగా, ఠాక్రే వర్గం శివసేన అభ్యర్థి రాజన్ సాల్వీకి అనుకూలంగా ఓటు వేశాయి. పార్టీ విప్‌ను కొందరు సభ్యులు ఉల్లంఘించారని ఆరోపిస్తూ శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు(ఠాక్రే వర్గం) డిప్యూటీ స్పీకర్‌కు ఓ లేఖ అందజేశారు. పార్టీ ఆదేశాలను 39 మంది ఎమ్మెల్యేలు ధిక్కరించారని సభలో సునీల్ ప్రభు చెప్పారు. తమ వర్గంలో లేని 16 మందికి కూడా విప్ జారీ చేశామని షిండే వర్గం ఎమ్మెల్యే దీపక్ చెప్పారు. సేన శాసనసభాపక్ష కార్యాలయానికి సీల్ విధాన భవన్లో శివసేన శాసనసభాపక్ష కార్యాలయాన్ని ఏక్నాథ్ షిండే వర్గంఆదివారం మూసివేసింది. తలుపులు బిగించి, తెల్లకాగితం అతికించి, దానిపై టేప్ వేశారు. శివసేన శాసనసభా పక్షం ఆదేశాల మేరకు ఆఫీసును మూసివేస్తున్నట్లు రాశారు. కసబ్‌కు కూడా ఇంత సెక్యూరిటీ లేదు: ఆదిత్య రెబల్ ఎమ్మెల్యేల కోసం ప్రభుత్వం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం పట్ల శివసేన ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే అసహనం వ్యక్తం చేశారు. ఉగ్రవాది కసబ్‌కు కూడా ఇంత సెక్యూరిటీ లేదని అన్నారు. ఇలాంటి పరిస్థితి ముంబైలో ఎప్పుడూ చూడలేదన్నారు. ‘‘ప్రభుత్వానికి భయమెందుకు? ఎవరైనా జారుకుంటారని భయపడుతున్నారా?’’ అని ఎద్దేవా చేశారు. -
Maharashtra political crisis: ముంబైకి రెబల్ ఎమ్మెల్యేలు
ముంబై: మహారాష్ట్ర శాసనసభ స్పీకర్ ఎన్నిక, సభలో ప్రభుత్వ బలనిరూపణకు రంగం సిద్ధమయ్యింది. రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఆదివారం, సోమవారాల్లో రెండు రోజులపాటు జరుగనున్నాయి. గోవాలో ఉన్న శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు శనివారం సాయంత్రం చార్టర్డ్ విమానంలో ముంబైకి చేరుకున్నారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఉదయమే గోవాకు వెళ్లి, రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి ముంబైకి తిరిగివచ్చారు. వారు ముంబైలోని ఓ హోటల్లో బస చేస్తున్నట్లు సమాచారం. ఆదివారం వారంతా హోటల్ నుంచి నేరుగా అసెంబ్లీకి బయలుదేరుతారు. ఉద్ధవ్ లేఖను సవాలు చేస్తాం: రెబల్ వర్గం ‘శివసేన నేత’ పదవి నుంచి షిండేను తొలగిస్తూ ఉద్ధవ్ ఠాక్రే జారీ చేసిన లేఖను సవాలు చేస్తూ సరైన వేదికను ఆశ్రయిస్తామని రెబల్ వర్గం ఎమ్మెల్యే దీపక్ కేసార్కర్ శనివారం చెప్పారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణాలతో షిండేను శివసేన నేత పదవి నుంచి తప్పిస్తూ ఉద్ధవ్ ఠాక్రే జూన్ 30 తేదీతో లేఖ విడుదల చేశారు. షిండే అదేరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉద్ధవ్ లేఖ మహారాష్ట్ర ప్రజలను అవమానించేలా ఉందని దీపక్ కేసార్కర్ విమర్శించారు. తిరుగుబాటు వర్గం ఎమ్మెల్యేలంతా తమ నాయకుడిగా షిండేను ఎన్నుకున్నారని గుర్తుచేశారు. -
కేంద్రం ముందుకు మండలి రద్దు తీర్మానం..
-
శాసన మండలి రద్దుపై మరో ముందడుగు
సాక్షి, అమరావతి : శాసనమండలిని రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. తొలుత శాసనసభ అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ తీర్మానాన్ని పంపారు. అనంతరం తీర్మానాన్ని పరిశీలించిన సీఎస్.. కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం హోంశాఖ అధికారులకు పంపారు. దీంతో మండలి రద్దు విషయంలో ప్రభుత్వం మరో ముందడుగేసినట్లయింది. పార్లమెంట్ ఉభయ సభలతో పాటు, రాష్ట్రపతి ఆమోదం తెలిపిన అనంతరం సభ పూర్తిగా రద్దు కానుంది. మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీ సోమవారం ఏకగ్రీవంగా తీర్మానం చేసిన విషయం తెలిసిందే. దీనిపై సభ్యులు రోజంతా సుదీర్ఘంగా చర్చించి.. రాజకీయ ప్రయోజనాలకు కాకుండా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మండలిని రద్దు చేస్తున్నట్లు సభ్యులంతా తమ ప్రసంగాల్లో స్పష్టం చేశారు. -
మండలి రద్దుకు తీర్మానం
-
ముఖం చెల్లక.. అసెంబ్లీకి రాలేక
సాక్షి, అమరావతి: శాసన మండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో జరిగిన చర్చకు చంద్రబాబు ముఖం చాటేయక తప్పని పరిస్థితి ఏర్పడిందని టీడీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. మండలిలో రెండు బిల్లుల్ని ప్రజాస్వామ్యస్ఫూర్తికి విరుద్ధంగా సెలెక్ట్ కమిటీకి పంపిన తీరుపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత రావడం, మండలి రద్దుపై గతంలో చెప్పిన మాటలకు, ఇప్పుటి వాదనకు పొంతన లేకపోవడంతో.. కావాలనే చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు సభకు రాలేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నెల 22న మండలిలో వ్యవహరించిన తీరు, బిల్లుల్ని సెలెక్ట్ కమిటీకి పంపిన విధానం, గ్యాలరీలో చంద్రబాబు చేసిన హడావుడిపై అసెంబ్లీలో నిలదీస్తారనే అనుమానంతో ఆ మరుసటి రోజు అసెంబ్లీకి డుమ్మా కొట్టారు. తాజాగా మండలి రద్దు తీర్మానం కోసం నిర్వహించిన సమావేశానికీ గైర్హాజరయ్యారు. తాము చేసిన తప్పులపై అసెంబ్లీలో నిలదీస్తారనే భయంతోనే వ్యూహాత్మకంగా సభకు రాకుండా తప్పించుకున్నారనే వాదన వినిపిస్తోంది. 40 సంవత్సరాల అనుభవం, దేశ రాజకీయాల్లోనే సీనియర్ నేతగా చెప్పుకుంటూ.. కీలకమైన అంశంపై చర్చ జరుగుతుంటే హాజరుకాకుండా డుమ్మా కొట్టడం ఏంటని రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మండలిపై చర్చించకూడదంటూ కొత్త పల్లవి సోమవారం జరిగిన చర్చకు హాజరుకాకుండా మీడియా సమావేశం పెట్టి తన వాదన వినిపించడానికి చంద్రబాబు పరిమితమవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక టీడీపీ ఎమ్మెల్యేలు అధినేత బాటలో తమ అభిప్రాయాలతో టీవీ ఛానళ్లలో హోరెత్తించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. శాసన మండలి ఉండాలా? వద్దా? అంశంపై అసెంబ్లీలో చర్చిద్దామని ముఖ్యమంత్రి నాలుగు రోజుల క్రితమే ప్రకటించారు. అయితే మండలిలో జరిగిన వ్యవహారాలపై అసెంబ్లీలో చర్చించకూడదంటూ చంద్రబాబు తమ నిర్ణయాన్ని సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. 2004లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం మండలి పునరుద్ధరణకు అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు, 2007లో మండలి పునరుద్ధరించినప్పుడు చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించారు. తాజాగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రద్దు చేస్తున్నప్పుడు కూడా అదే విధంగా.. మండలి రద్దు చేసే అధికారం సీఎంకు లేదని, అసెంబ్లీకి తీర్మానం చేసే అధికారం లేదని కొత్త పల్లవి అందుకోవడంపై విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒకే అంశంపై పరస్పర విరుద్ధంగా మాట్లాడడం ఆయన స్వార్థ రాజకీయ ప్రయోజనాల్ని తేటతెల్లం చేసిందని అంటున్నారు. ఏం చెప్పాలో తెలియకే: టీడీపీలో చర్చ అసెంబ్లీకి హాజరైతే ఈ ద్వంద్వ నీతిపై అధికార పక్షం నిలదీస్తుందనే జంకుతో సాకులు చూపి డుమ్మా కొట్టారని చెబుతున్నారు. రెండు వైఖరులపై నిలదీస్తే ఏం చెప్పాలో తెలియకే తాము అసెంబ్లీకి వెళ్లలేదని టీడీపీ ఎమ్మెల్సీ ఒకరు వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో నిలదీస్తే సమాధానం చెప్పే ధైర్యం లేకపోవడం వల్లే చంద్రబాబు వెళ్లలేదనే చర్చ టీడీపీలో జరిగిందని ఆ పార్టీ నేత ఒకరు పేర్కొన్నారు. మండలి రద్దయితే నష్టం వైఎస్సార్‌సీపీకేనని చెబుతున్నా.. తన కుమారుడు రాజకీయ నిరుద్యోగి మారిపోతాడనే ఆందోళనలో చంద్రబాబు ఉన్నారని, ఆ కారణంగానే మండలి రద్దును వ్యతిరేకిస్తున్నారనే టీడీపీ సీనియర్ల మధ్య చర్చ సాగినట్లు తెలిసింది. -
మండలితో ఎలాంటి లాభం లేదు
సాక్షి, అమరావతి: శాసనమండలి ఉండాల్సిందేనని ఇప్పుడు చెబుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, 2004లో మండలి వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని స్పష్టంగా చెప్పారు. శాసనాలు ఆలస్యం అవుతాయని పేర్కొన్నారు. 2004 శాసనమండలి పునరుద్ధరణ బిల్లును వ్యతిరేకిస్తూ చంద్రబాబు అప్పుడు ఏమన్నారో సోమవారం అసెంబ్లీలో ప్రదర్శించారు. ఆయన ఏమన్నారంటే.. ‘‘శాసనమండలి పునరుద్ధరించాలనే నిర్ణయం వల్ల వీళ్లల్లో (కాంగ్రెస్) కొంతమందికి రాజకీయ పునరావాసం కల్పిస్తారేమో గానీ.. దీనివల్ల రాష్ట్రానికి, ప్రజలకు ఏం లాభం లేదు. బ్రహ్మాండమైన శాసనాలు వస్తాయనేది, రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుందనేది వాస్తవం కాదు. చరిత్రను చూసినా ఇది అవసరం లేదు. ఒకప్పుడు అక్షరాస్యత ఎక్కువ ఉండేది కాదు. చదువుకునే వాళ్లు అసెంబ్లీకి ఎక్కువ వచ్చేవాళ్లు కాదు. అందుకే శాసనమండలికి మేధావులను తీసుకొచ్చి చర్చించాలన్న ఉద్దేశం ఉండేది. ఈ రోజు శాసనసభలో 294 మందిలో మంచి క్వాలిటీ వచ్చింది. చదువుకున్న వాళ్లు, బాగా అనుభవం ఉండేవాళ్లు వచ్చారు. 1930లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో రాష్ట్రాలు రెండో సభ కావాలంటే పెట్టుకోవచ్చు కానీ, దీనివల్ల ఏం లాభం ఉండదని, అప్పట్లో కాంగ్రెస్ కూడా వ్యతిరేకించింది. 1934 అక్టోబర్ 26న బాబూ రాజేంద్రప్రసాద్ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ, దీనివల్ల ఏమాత్రం లాభం ఉండదని, నష్టం ఉంటుందని, ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని, శాసనాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంటుందని చాలా స్పష్టంగా చెప్పారు. 1950 నుంచి చూస్తే... 8 రాష్ట్రాల్లో మాత్రం రెండు సభలొచ్చాయి. కాలక్రమేణా మూడు రాష్ట్రాల్లో రద్దయ్యి ఐదు రాష్ట్రాల్లో మాత్రం మండలి ఉంది. మండలి వల్ల రూ.20 కోట్లు ఆర్థిక భారం పడుతుంది. బిల్లుల ఆమోదంలో కాలయాపన జరుగుతుంది. అసెంబ్లీ నుంచి ఒక బిల్లు పంపిస్తే అక్కడికి పోవడం, తిరిగొస్తే మళ్లీ చర్చించడంతో కాలయాపన అవుతుంది. ఆర్థిక సంబంధమైన బిల్లుల విషయంలో మండలికి పటిష్టమైన అధికారాలు లేవు. ఈ బిల్లులన్నీ శాసనసభే ఆమోదిస్తుంది. ఏదైనా బిల్లును చట్టం కాకుండా అడ్డుకునే శక్తి మండలికి నాలుగు నెలలు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత దానంతట అదే చట్టమవుతుంది. ఏవైనా రాజ్యాంగ సవరణలు చేయాల్సి వస్తే అసెంబ్లీ తప్ప మండలికి ఏమాత్రం ప్రమేయం లేదు. ఆఖరుకు రాష్ట్రపతి ఎన్నికల విషయంలోనూ మండలి సభ్యులకు ఓటింగ్ హక్కు లేదు. పరిమిత అధికారాలు తప్ప ఏమీ మండలికి ఉండవు. అందులో కూడా పెద్ద మేధావులు వస్తారని లేదు.ఎవరిని పెడతారో తెలుసు. ప్రజాధనం దుర్వినియోగం చేసే మండలి బిల్లు వల్ల లాభం కాదు నష్టమొస్తుంది. ప్రజలకు భారమవుతుంది. దీని వల్ల ఏ ప్రయోజనం లేదని వ్యతిరేకిస్తున్నాను..’’ మండలి వద్దని అప్పుడు చెప్పా..: చంద్రబాబు మండలిని రద్దు చేస్తూ సోమవారం అసెంబ్లీ తీర్మానం చేసిన నేపథ్యంలో చంద్రబాబు ఏమన్నారంటే... ‘‘శాసనమండలి రద్దు విచారకరం. కౌన్సిల్‌ను రద్దు చేసే అధికారం శాసనసభకు లేదు. గతంలో మండలి వద్దని నేను చెప్పాను. కానీ ఇప్పుడు రద్దు సమంజసం కాదు. పరిస్థితుల ఆధారంగా సిద్ధాంతాలు మారుతుంటాయి. శాసనమండలి రద్దు చేయాలని అప్పట్లో ఎన్టీ రామారావు నిర్ణయించారు. అది టీడీపీ సిద్ధాంతం. దాన్ని సమర్థించాం. కానీ పాదయాత్ర చేస్తున్నప్పుడు మండలి ప్రాధాన్యత ప్రజల నుంచి తెలుసుకున్నాను. మండలి ఉంటే బడుగు బలహీనవర్గాలకు అవకాశం వస్తుంది. కౌన్సిల్ స్వతంత్ర ప్రత్తిపత్తి కలిగినది. 10 రాష్ట్రాలు మండలి కావాలంటున్నాయి. టీచర్లు, మేధావులు మండలికొస్తారు. ఆర్థిక భారం అని చెప్పడం ఓ సాకే. ఎందుకంటే ఏడాదికి 40 రోజులకు మించి సభ ఎప్పుడూ జరగదు. కౌన్సిల్‌కు రాజకీయాలు ఆపాదించడం సరికాదు..’’ -
ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రతిపక్షమే అడ్డు
ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలంటే టీడీపీ నేతలు సైంధవుల్లా అడ్డుపడుతున్నారని అధికార పక్ష సభ్యులు ధ్వజమెత్తారు. ఓడిపోయిన నేతలకు శాసనమండలి పునరావాస కేంద్రంగా మారిందన్నారు. రాజకీయాల కోసం చట్టాలను వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. శాసనమండలి రద్దు తీర్మానంపై సోమవారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా ప్రభుత్వ విప్‌లు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, దాడిశెట్టి రాజా, మంత్రి పేర్ని నాని, అధికార పక్ష ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, మేరుగ నాగార్జున, విడదల రజని, గుడివాడ అమర్నాథ్, కొలుసు పార్థసారథి తదితరులు మాట్లాడారు.ప్రజాస్వామ్యానికి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని.. ప్రజలు ఆమోదించిన,ప్రభుత్వ నిర్ణయాలను మండలిలో అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. అధికార పక్ష సభ్యులు ఏమన్నారంటే... సాక్షి, అమరావతి: శాసనసభ తీసుకున్న ప్రజోపయోగ నిర్ణయాలను మండలి అడ్డుకుంటోందని.. అసలు అలాంటి సభ మనకు అవసరమా? అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. ప్రజాతీర్పును అపహాస్యం చేస్తూ అప్రజాస్వామికంగా, అభివృద్ధి నిరోధకంగా వ్యవహరిస్తున్న టీడీపీకి, ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు శాసనమండలిని రద్దు చేయొద్దని చెప్పే అధికారం లేదని అన్నారు. శాసనమండలి రద్దు తీర్మానంపై సోమవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో ధర్మాన ప్రసంగించారు. గతంలో శాసనమండలిని రద్దు చేసినప్పుడు ధర్మవాక్యాలు వల్లించిన చంద్రబాబు ఈవేళ సభకు జవాబు చెప్పలేక పారిపోయారని ఎద్దేవా చేశారు. గతంలో పలువురు ప్రముఖులు ఎగువ సభ రద్దు అవసరాన్ని నొక్కిచెప్పిన విషయాల్ని ఆయన తన ప్రసంగంలో వివరించారు. ధర్మాన ప్రసంగం ఆయన మాటల్లోనే.. ప్రజోపయోగ నిర్ణయాల్ని అడ్డుకుంటారా? ప్రపంచంలో 178 దేశాల్లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అమలులో ఉంటే కేవలం 68 దేశాల్లో మాత్రమే మండలి వంటి ఎగువ సభలు ఉన్నాయి. చాలా దేశాలు రద్దు చేస్తున్నాయే తప్ప కొత్తగా తీసుకొస్తున్నవి లేవు. బ్రిటీష్ వాళ్లు.. వారి అవసరాల కోసం ప్రజల ఆకాంక్షలను పక్కనబెట్టి వీటిని ఏర్పాటు చేశారు. అందుకే మహాత్మాగాంధీ మొదలు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జవహర్లాల్ నెహ్రూ, గోపాలస్వామి అయ్యర్, ఎన్జీ రంగా లాంటి మహనీయులు వ్యతిరేకించారు. కొందర్ని మేనేజ్ చేయడానికి ఈ పెద్దల సభలు ఉపయోగపడతాయని ఆనాడే గాంధీ పసిగట్టారు. ప్రస్తుతం ఆ విషయం మనకు కరెక్ట్‌గా సరిపోయే సందర్భం. ఎన్నికల్లో గెలవలేక పరాజయం పొందినవారికి మండలి పునరావాస కేంద్రంగా మారింది. ఖజానాపై భారం పడుతుంది. ప్రజలచే తిరస్కరణకు గురైన వ్యక్తులు గ్యాలరీలలో కూర్చొని ప్రభావితం చేస్తున్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే శాసనసభ ఔన్నత్యాన్ని పడగొట్టాలని ఎత్తుగడలు వేస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా? సెలెక్ట్ కమిటీని పద్ధతి ప్రకారం వేయలేదు. ఆ సభలో ఉండే చైర్మన్ రూల్స్ వక్రీకరించి నిర్ణయం తీసుకున్నారు. సీఆర్డీఏ బిల్లును ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో టీడీపీ వాళ్లకు తెలియదా? మండలి అవసరం లేదని చంద్రబాబే చెప్పాడు అమరావతి ప్రాంత ప్రజలే చంద్రబాబు కుమారుడు లోకేష్‌ను ఓడిస్తే తిరిగి దొడ్డిదారిన తెచ్చి శాసనమండలిలో కూర్చోబెట్టి మంత్రిని చేశారు. ఆయన మండలిలో కూర్చొని ఇది తప్పు..అది తప్పని చెబుతున్నారు. ఇది ప్రజాతీర్పును అపహాస్యం చేసినట్టవుతుందా? కాదా? శాసనమండళ్లనే కాదు రాజ్యాంగపరమైన రాజ్యసభ రద్దుకు కూడా 1971, 72, 1975లలో ప్రయత్నాలు జరిగాయి. దేశ, ప్రజాక్షేమానికి భిన్నంగా వ్యవహరించినప్పుడు ఎవరో ఒక దేశ భక్తుడు ఈ ప్రయత్నం చేస్తూనే వస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఆ అవసరం వచ్చింది. మండలి అవసరం లేదని చంద్రబాబే అన్నాడు. అంతకుముందే మహాత్మాగాంధీ, నెహ్రూ, అంబేడ్కర్ ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు కాబట్టి..గాంధీజీ చెప్పిన మార్గంలోనే నడుద్దాం. సీఎం జగన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి మనస్ఫూర్తిగా మద్దతు తెలుపుతున్నా’ అని ధర్మాన పేర్కొన్నారు. మండలి రద్దు 5 కోట్ల ప్రజల ఆకాంక్ష ప్రజా శ్రేయస్సు కోసం సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే శాసనమండలి అడుగడుగునా అడ్డు తగులుతోంది. మండలిలో టీడీపీ సభ్యులు స్వార్థ ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. రెండు కళ్ల సిద్ధాంతంతో వ్యవహరించి ఉమ్మడి రాష్ట్రం రెండు ముక్కలుగా విడిపోవడానికి చంద్రబాబు కారణమయ్యారు. సోనియాతో కుమ్మక్కై రాష్ట్రాన్ని విడగొట్టారు. ఆ తర్వాత ప్రత్యేక హోదా వద్దంటూ ప్రత్యేక ప్యాకేజీ కోసం తాపత్రయపడ్డారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పక్కనపెట్టి తన స్వార్థం కోసం అమరావతిని రాజధాని చేశారు. కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారు. ప్రజా సమస్యలను, పోలవరం ప్రాజెక్ట్‌ను మర్చిపోయారు. భవనాలు కట్టడమే అభివృద్ధి కాదు. దీనికి భిన్నంగా మా నాయకుడు వైఎస్ జగన్ 6 నెలల్లో అనేక కార్యక్రమాలు చేపట్టి పాలనను ప్రజల చెంతకు చేరుస్తుంటే సహించలేకపోతున్నారు. అమరావతిలో 4,500 ఎకరాల ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది. రియల్ ఎస్టేట్ ప్రయోజనాలే పరమావధిగా చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు. 151 మంది ఎమ్మెల్యేలున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెట్టిన ప్రతి బిల్లునూ తిప్పిపంపడమే లక్ష్యంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ప్రజా తీర్పును అగౌరవపరుస్తున్నారు. శాసనమండలిని రద్దు చేయాలన్నది రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష. మండలి రద్దు చాలా సమంజసం. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపాలంటే మండలి రద్దే మంచిది. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని పూర్తిగా సమర్థిస్తున్నా. – ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని),ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు పొలిటికల్ క్రిమినల్ పొలిటికల్ క్రిమినల్ ఎవరని చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతాడు చంద్రబాబే అని. చంద్రబాబును రాష్ట్రం నుంచి తరిమికొట్టేలా ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చినా ఆయన దొంగ రాజకీయాలు చేస్తున్నారు. గాయం చేసిన బాధ తెలిసిన వాడే సాయం చేయగలడన్నట్లు సీఎం వైఎస్ జగన్ పాదయాత్ర ద్వారా ప్రజల గాయాలను తెలుసుకుని వారు కోరుకున్న విధంగా చట్టాలు చేస్తుంటే చంద్రబాబు అడ్డు తగులుతున్నారు. ప్రజలు ఛీకొట్టిన నాయకుడు గ్యాలరీలో కూర్చుని ఆదేశిస్తే శాసనసభ ఆమోదించిన బిల్లును అవమానిస్తారా. తన దగుల్బాజీ రాజకీయాన్ని నిలదీస్తామనే చంద్రబాబు సభకు రాకుండా పారిపోయారు. పెద్దల సభకు వైఎస్ జగన్ అనుభవజ్ఞులైన నాయకులను పంపితే చంద్రబాబు తన ఇంట్లోని దద్దమ్మను పంపారు. అఖిల భారత మేధావుల సంఘానికి అధ్యక్షుడినని తనకు తానే స్వయంగా ప్రకటించుకున్న యనమలకు సింగపూర్ వెళ్లి జ్ఞానదంతం పీకించుకున్నా జ్ఞానం రాలేదు. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలంటే ముందు నోటీసు ఇవ్వాలని ఈ మేధావికి తెలియదా. ప్రజాభిప్రాయానికి, ప్రజాతీర్పుకు విలువ ఇవ్వని మండలి ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. రాజ్యాంగాన్ని గౌరవించని పెద్దల సభకు శుభం కార్డు వేయాలి. – ఆర్కే రోజా, ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ ప్రజాస్వామ్య ‘స్పిరిట్’తో మండలి తెస్తే టీడీపీ ఆల్కహాల్‌గా మార్చేసింది ప్రజల కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనం కోసం శాసనమండలిని చంద్రబాబు ఉపయోగించుకుంటున్నారు. సీఎం వైఎస్ జగన్ రాజకీయం చేయాలనుకుంటే ద్రవ్య బిల్లును ప్రవేశపెట్టేవారు. రాజకీయాలు ఫెయిర్‌గా ఉండాలనేది ముఖ్యమంత్రి అభిమతం. సీఎం వైఎస్ జగన్ అనుకుంటే ఆర్డినెన్స్ ద్వారా అయినా చట్టం తెచ్చేవారు కాదా? ప్రజాస్వామ్య బద్ధంగా ముందుకు వెళ్తుంటే టీడీపీ రాజకీయం చేస్తోంది. మండలి రద్దు నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించాలి. ఇలాంటి మండలిని ఇంకా ఉండాలా? అని ఆలోచించాలి. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలనే స్పిరిట్‌తో ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి మండలిని తీసుకొస్తే.. చంద్రబాబు ఆ మండలిని ఆల్కహాల్‌గా మార్చేశారు. దేవాలయం లాంటి పెద్దల సభను దెయ్యాల కొంపగా మార్చారు. – చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ప్రభుత్వ విప్ ప్రజాస్వామ్యవాదుల్ని ఆశ్చర్యపరిచింది శాసనమండలిలో ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా సాగిన రాజకీయ క్రీడ ప్రజాస్వామ్య వాదుల్ని ఆశ్యర్యానికి గురి చేసింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయాలన్నీ ఆయన ప్రయోజనాల కోసమే. శాసనమండలిలో చంద్రబాబు, టీడీపీ సభ్యులు ప్రవర్తించిన తీరును ప్రజాస్వామ్యవాదులంతా ఎండగట్టాల్సిందే. ఆయన పాలనలో దాడులు, అసమానతలు, ప్రాంతాలు, కులాల మధ్య వైషమ్యాలు చూశాం. రాష్ట్ర విభజనకు ఆయన లేఖ ఇచ్చారు. హోదా విషయంలో అనేకసార్లు యూటర్న్ తీసుకున్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం వికేంద్రీకరణ బిల్లు తెస్తే.. మండలిలో టీడీపీ సభ్యులు ఎలా ప్రవర్తించారో అందరికీ తెలుసు. మండలి రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. – మేరుగ నాగార్జున, ఎమ్మెల్యే ప్రజాభిమతాన్ని అడ్డుకోవడమేనా? చంద్రబాబు లాంటి వ్యక్తులకు రాజకీయ క్రీడగా మారిన శాసనమండలి, ప్రజా ప్రభుత్వం చేసిన చట్టాలను అడ్డుకోవడానికే పరిమితమవుతోంది. ప్రభుత్వ నిర్ణయాలను మండలి అడ్డుకోవడం వెనుక చంద్రబాబు కుతంత్రాలున్నాయి. వ్యవస్థలన్నీ ఆధిపత్య వర్గం చేతిలో ఉన్న సమయంలో వైఎస్ జగన్ పాలనను వికేంద్రీకరించి, గ్రామ సచివాలయాల ద్వారా ప్రజల ముంగిటకు తెచ్చారు. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు పేదలను బానిసలను చేశాయి. విద్యుత్ సంస్కరణల పేరుతో చంద్రబాబు ఆ రంగాన్ని దోచుకుతిన్నారు. గ్రీన్ జోన్ పేరుతో అమరావతి రైతులను దగా చేసి, సింగపూర్ కంపెనీలకు మేలు చేకూర్చే ఒప్పందాలు చేసుకోవడమా చంద్రబాబు చేసిన రాజధాని అభివృద్ధి?. రైతులకు చేసిన పాపమే చంద్రబాబుకు శాపమైంది. అందుకే ఆయనకు 23 సీట్లు వచ్చాయి. కౌన్సిల్లో ఏదో జరిగిపోయిందని టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. దేశ చరిత్రలోనే వైఎస్ జగన్ మాదిరిగా 51 శాతం ఓట్లతో గెలిచిన నాయకుడు లేడు. ఎన్టీఆర్‌కు 1983లో 43 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. 51 శాతం ఓట్లతో 151 సీట్లు సాధించిన ఏకైక మగాడు వైఎస్ జగన్. – కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే ప్రభుత్వ సొమ్మును దోపిడీ చేసిన చరిత్ర యనమలది మండలిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు తన బినామీలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రాజధాని పేరుతో చంద్రబాబు భారీ దోపిడీకి తెగబడ్డారు. మండలిలో టీడీపీ సభ్యులు సైంధవుల్లా వ్యవహరిస్తున్నారు. యనమల రామకృష్ణుడు వేసుకునే సూటు, బూటు కూడా ప్రభుత్వ సొమ్మే. ప్రభుత్వ సొమ్మును ఇంటి అద్దెలకు వాడుకున్న చరిత్ర యనమలది. ఇందుకు సంబంధించి జీవోలు ఉన్నాయి. రూ.లక్షల ప్రజాధనంతో దంత చికిత్సకు సింగపూర్ వెళ్లిన ఘనుడు యనమల. తన 39 ఏళ్ల రాజకీయ చరిత్రలో దుర్మార్గం తప్ప సొంత జిల్లాకు, తన నియోజకవర్గానికి ఏమీ చేయకుండా ఎన్టీఆర్‌కు పొడిచినట్లే ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. శాసనసభ్యులను ఆబోతులతో పోల్చిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా. – దాడిశెట్టి రాజా, ప్రభుత్వ విప్ చంద్రబాబు అంటే వెన్నుపోటే గుర్తొస్తుంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను చూస్తే ఆయన ప్రవేశపెట్టిన అమ్మ ఒడి లాంటి సంక్షేమ పథకాలు గుర్తొస్తాయి. చంద్రబాబును చూస్తే వెన్నుపోటు కళ్లముందు కదలాడుతుంది. చంద్రబాబు దొడ్డిదారి రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. మేనిఫెస్టోను వందకు వంద శాతం నెరవేర్చేలా సీఎం వైఎస్ జగన్ పనిచేస్తున్నారు. ఐదేళ్లు అవకాశం ఇచ్చిన ప్రజలకు చంద్రబాబు ఏమీ చేయలేకపోయారు. ఒక్క ముస్లిం, మైనారిటీకి కూడా చంద్రబాబు తన మంత్రివర్గంలో చోటు కల్పించలేదు. మండలిపై కూడా చంద్రబాబు రెండు నాలుకల సిద్ధాంతాన్ని చూపించారు. ఈ ప్రభుత్వం ప్రజలకు అత్యంత జవాబుదారీతనంతో వ్యవహరిస్తోంది. – విడదల రజని, ఎమ్మెల్యే ఉత్తరాంధ్ర ప్రజల మనసుల్ని గాయపరిచింది శాసనమండలిలో టీడీపీ సభ్యులు తీసుకున్న నిర్ణయం ఉత్తరాంధ్ర ప్రజల మనసును గాయపరిచింది. విశాఖను పరిపాలన రాజధాని చేస్తామంటే చంద్రబాబు అడ్డుకుంటున్నారు. స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత ఉత్తరాంధ్రకు ఒక గుర్తింపు వస్తున్న తరుణంలో టీడీపీ నేతలు దానిని చెడగొట్టే ప్రయత్నం చేశారు. మండలి రద్దుపై శాసన సభలో ఎలా చర్చిస్తారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తునారు. సభలో చర్చించకుండా ఈనాడు, ఆంధ్రజ్యోతిలో చర్చించాలా?. పెద్దల సభలో పెద్దలు లేరు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తులు, అవినీతి పరులు, ఆర్థిక నేరస్తులు, కొబ్బరి చిప్పలు అమ్ముకునేవారే టీడీపీ ఎమ్మెల్సీలుగా ఉన్నారు. వికేంద్రీకరణ బిల్లుతో ఉత్తరాంధ్రకు ఎంతో మేలు జరుగుతుంది. దానిని అడ్డుకుని చంద్రబాబు మూడు గ్రామాలకు హీరో కావొచ్చు. కానీ.. 13 జిల్లాలకు విలన్ అయ్యారు. – గుడివాడ అమర్నాథ్, అనకాపల్లి ఎమ్మెల్యే చంద్రబాబుది నక్షత్రకుడి పాత్ర రాయలసీమది ఘనమైన చరిత్ర. రాజకీయ అవసరాల కోసం హత్యా రాజకీయాలు, కక్షలు, కార్పణ్యాలు మాత్రమే సీమలో ఉన్నాయని చిత్రీకరించి టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచే దుష్ప్రచారం మొదలు పెట్టింది. శ్రీమహావిష్ణువు స్వయంభువుగా వెలసిన తిరుపతి రాయలసీమలోనే ఉంది. తాళ్లపాక అన్నమాచార్యులు, వేమన, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వంటి వారు రాయలసీమ వారు కాదా? ఎన్టీఆర్‌తో అద్భుతమైన హిట్ చిత్రాలు నిర్మించిన కేవీ రెడ్డి, బీఎన్ రెడ్డి వంటి వారు రాయలసీమ వారు కాదా?. రాయలసీమ, ఉత్తరాంధ్రను అభివృద్ధి పథంలో నడిపించాలని సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షిస్తున్నారు. ఒకప్పుడు మండలిలో మహానుభావులు ఉంటే.. ఇప్పుడు కాల్‌మనీ సెక్స్ రాకెట్ నిందితులు, ఒక్కసారి కూడా ప్రత్యక్షంగా ఎన్నికల్లో గెలవని వారు, భవిష్యత్తులో ఏ ఎన్నికల్లో గెలవలేని వారు ఉన్నారు. జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు ఆయన తాత రాజారెడ్డి గురించి ప్రతిపక్ష సభ్యులు ప్రస్తావిస్తున్నారు. ‘రాజారెడ్డి లాంటి ఉత్తమోత్తమమైన వ్యక్తి చాలా అరుదుగా రాజకీయాల్లో ఉంటారు. ఆయనతో 23 ఏళ్లు సన్నిహితంగా మెలిగిన వ్యక్తిగా చెబుతున్నాను. కమ్యూనిస్టు నాయకుడు, ప్రముఖ పాత్రికేయుడు, గొప్ప దార్శనికుడు గజ్జెల మల్లారెడ్డికి అత్యంత ప్రాణసఖుడు రాజారెడ్డి. ఇలాంటి గొప్ప వ్యక్తి గురించి నీచంగా మాట్లాడటం చంద్రబాబుకే చెల్లింది. – భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే జగన్ వల్ల నాకు శాప విముక్తి పొలిటికల్ ట్రాప్‌లో పడి ఎన్టీఆర్ అంతటి గొప్ప వ్యక్తికి వెన్నుపోటు పొడిచానని, అందుకు 15 సంవత్సరాలు రాజకీయంగా తెరమరుగయ్యానని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ వైఎస్ జగన్మోహన్రెడ్డి వల్ల తనకు శాపవిముక్తి జరిగిందన్నారు. గొప్ప వ్యక్తుల వల్లే శాప విముక్తి జరుగుతుందని పేర్కొన్నారు. సోమవారం శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు అంశాన్ని ప్రస్తావించగా స్పీకర్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. విస్తృత చర్చ జరగాలి..: ఇదిలా ఉండగా, ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ సభాపతులు అనుసరించాల్సిన నిబంధనలు మార్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు. దీనిపై స్పీకర్ స్పందిస్తూ.. అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో జరిగిన స్పీకర్ల సమావేశాల్లో ఫిరాయింపుల నిరోధక చట్టాలపై మంచి చర్చలు జరిగాయన్నారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి తమ పార్టీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాల్సిందేనని తమ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కచ్చితంగా చెబుతున్నారని తాను చాలా స్పీకర్ల సమావేశాల్లో చెప్పానని తెలిపారు. దీనిపై రాజ్యాంగ సమీక్ష జరగాలనే అభిప్రాయం వ్యక్తమైందన్నారు. బోస్ ఆవేదనను తాను అర్థం చేసుకున్నానని, దానిపై విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరముందని స్పీకర్ అన్నారు. అసెంబ్లీ ఆమోదిస్తే కౌన్సిల్ అడ్డుకోవడం ఏమిటి? భావితరాల భవిష్యత్ కోసం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు చేసే చట్టాలను అడ్డుకోవడానికే శాసనమండలిని చంద్రబాబు లాంటి వాళ్లు వాడుకుంటున్నారు. మహా యజ్ఞాన్ని రాక్షసులు అడ్డుకున్నట్లుగా జగన్ ప్రజా శ్రేయస్సు కోసం చేసే ప్రతి పనినీ చంద్రబాబు అడ్డుకుంటున్నారు. శాసనసభలో ఆమోదించిన చట్టానికి సూచనలు చేయాల్సిన బాధ్యత గల మండలి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. అందుకే మండలిని రద్దు చేయాల్సిందే. ఇంగ్లిష్ మీడియం విద్య బిల్లు, ఎస్సీ, ఎస్టీలకు విడివిడిగా కమిషన్ ఏర్పాటు చేసే చట్టాలను అసెంబ్లీ ఆమోదిస్తే కౌన్సిల్ అడ్డుకోవడం ఏమిటి. శాసనసభలో తాటకి మాదిరిగా చంద్రబాబు, కౌన్సిల్లో సుబాహు మాదిరిగా ఆయన కుమారుడు అభివృద్ధి యజ్ఞాన్ని అడ్డుకుంటున్నారు. కుట్రలు, కుతంత్రాలుతో నిండిన చంద్రబాబు నాయకత్వంలో ఉన్న టీడీపీ దుర్మార్గాలకు తెర తీస్తోంది. శాసన మండలి రద్దు గురించి చంద్రబాబు చెప్పే సుద్దులు విడ్డూరంగా ఉన్నాయి. 40 ఏళ్ల ఇండస్ట్రీ 2004లో మండలి పునరుద్ధరణపై వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను అందరూ గమనించాలి (అప్పుడు అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడిన వీడియో ప్రదర్శించారు). రాజకీయ పునరావాస కేంద్రంగా మారిన మండలి రాష్ట్రానికి ఆర్థిక భారమన్న చంద్రబాబు ఇప్పుడు కావాలనడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనం. చంద్రబాబు రాష్ట్ర విభజనకు అనుకూలమని లేఖ ఇచ్చారు. రాష్ట్రాన్ని విడగొట్టిన తరువాత మీరెవరు విడగొట్టేందుకు అని బస్సులో బయల్దేరారు. వాజ్‌పేయి ప్రభుత్వాన్ని మతతత్వ పార్టీ అని, తాను మద్దతు ఇవ్వనని చెప్పిన చంద్రబాబు తరువాత ఆ పార్టీతోనే జత కట్టారు. ప్రధాని మోదీ కాళ్లకు దండం పెట్టి బీజేపీతో అంటకాగారు. పత్రికారంగంలో దుర్మార్గ పోకడలు హేయం. – పేర్ని నాని, రవాణా, సమాచార శాఖ మంత్రి -
ప్రజా ప్రయోజనాల కోసమే..
చంద్రబాబులా బాహుబలి లాంటి గ్రాఫిక్స్ సినిమాలు చూపించకుండా మనకున్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలని ఆశ పడితే అది తప్పా? ప్రజలకు మంచి చేసే నిర్ణయాల్లో ఆలస్యం జరగకూడదు. కుట్రలతో మంచి పనులు ఆగిపోవడం నాకిష్టం లేదు. అందుకే మండలి రద్దు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని ప్రజలంతా అర్థం చేసుకుని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా. ‘ద టైమ్ ఈజ్ ఆల్వేస్ రైట్ టు డూ.. వాట్ ఈజ్ రైట్..’ (మంచి చేయాలనుకున్నప్పుడు ఏ సమయమైనా మంచిదే) అని చెప్పిన అమెరికా పౌర హక్కుల నేత మార్టిన్ లూథర్ కింగ్ సూక్తిని ఈ సందర్భంగా అంతా గుర్తు చేసుకోవాలి. -సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: ప్రజలకు మేలు జరగకుండా అడ్డుకునే రాజకీయ కుట్రలు, కుతంత్రాలతో నడుస్తున్నందు వల్లే శాసన మండలిని రద్దు చేయాల్సిన అవసరం ఏర్పడిందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. మండలి రద్దు తీర్మానంపై సోమవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో సీఎం జగన్ దీనికి కారణాలను సోదాహరణంగా వివరించారు. అసలు శాసనమండలి ఏర్పాటు ఉద్దేశం ఏమిటి? దీన్ని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులేమిటి? గతంలో దీన్ని సమర్థించిన పత్రికలు, టీడీపీ ఇప్పుడు ఎలా యూటర్న్ తీసుకున్నాయి? అనే అంశాలను వివరించారు. నాడు రామోజీరావు కోసం శాసనమండలిని రద్దు చేయాలని ఎన్టీఆర్ ప్రభుత్వం తీర్మానం చేస్తే అద్భుత నిర్ణయమని ప్రశంసిస్తూ సంపాదకీయాలు రాసిన ఈనాడుకు ఇవాళ ప్రజా ప్రయోజనాల కోసం తాము తీసుకున్న నిర్ణయం తప్పు ఎలా అవుతుందని నిలదీశారు. ఇదేనా మీ ద్వంద్వనీతి? అని ప్రశ్నించారు. సీఎం ప్రసంగంలో ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలా.. వద్దా? ‘‘అధ్యక్షా.. ముఖ్యమైన నిర్ణయం కోసం ఈరోజు శాసనసభ సమావేశమవుతున్న సంగతి మనతోపాటు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇవాళ మనందరి ముందు ఉన్న ప్రశ్న కేవలం మండలి భవిష్యత్తుకు సంబంధించింది కాదు. ప్రజాస్వామ్యాన్ని మనమంతా బతికించుకోవాలా.. వద్దా? అన్న ప్రశ్న మనముందు ఉంది. ప్రజా ప్రభుత్వాలు సజావుగా పని చేయలా.. వద్దా? అన్న ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 (2) ప్రకారం సీఎం నేతృత్వంలోని క్యాబినెట్ నేరుగా శాసనసభకు జవాబుదారీగా ఉంటుంది. ఎందుకంటే ఇది నేరుగా ప్రజలు ఎన్నుకున్న సభ కాబట్టి. భరించలేక వద్దనుకున్నాయి.. ఇప్పుడు శాసనమండలి దేశంలో 28 రాష్ట్రాలకు గాను కేవలం ఆరు చోట్ల మాత్రమే ఉంది. (కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బిహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర). మండలిని భరించలేక ఈ వ్యవస్థ వద్దని పశ్చిమ బెంగాల్, అసోం, మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాలు ఉపసంహరించుకున్నాయి. నాడు మాకు బలమున్నా కొనుగోలు చేసి గెలిచారు స్థానిక సంస్థల ఎమ్మెల్సీల ఎన్నికల్లో కడప, కర్నూలు, నెల్లూరులో మాకు బలమున్నా అతి నీచంగా కొనుగోలు చేసి గెలిచారు. అప్పుడూ ఈ ఎల్లో మీడియా చంద్రబాబును ఒక్కరోజైనా ప్రశ్నించలేదు. టీడీపీ ఎమ్మెల్యేలను లాక్కుని చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కకుండా చేసే అవకాశం ఉన్నా అలాంటి దిక్కుమాలిన రాజకీయాలకు నేను పూర్తిగా దూరం. ఇదే విషయాన్ని తొలిరోజే సభలో చెప్పా. ఇప్పటికీ ఆ మాటకే కట్టుబడి ఉన్నా అని చెప్పడానికి గర్వపడుతున్నా. రాజకీయాలను మార్చడానికి ఈ చట్టసభలో అడుగుపెట్టామే తప్ప రాజకీయాలు చేయడానికి కాదు. మండలి తప్పనిసరి కాదు రాజ్యాంగాన్ని తయారు చేసిన కమిటీ శాసన మండలి తప్పనిసరి అనుకుని ఉంటే ప్రతి రాష్ట్రంలోనూ రద్దు చేయడానికి వీలులేని విధంగా మండలిని ఏర్పాటు చేసి ఉండేది. రెండో సభను ఆప్షనల్‌గా రాష్ట్ర శాసనసభ నిర్ణయానికే వదిలేసి మండలి రద్దు అధికారాన్ని కూడా ఆర్టికల్ 169 ప్రకారం అసెంబ్లీకే అప్పగించారు. దేశంలో చదువుకున్న వారి సంఖ్య అతి తక్కువగా ఉన్న రోజుల్లో.. మేధావులు, విజ్ఞులు శాసనసభకు ఎన్నికయ్యే అవకాశాలు తక్కువగా ఉన్న రోజుల్లో ప్రత్యేకంగా మండలి ఏర్పాటు చేసుకునే వీలు రాష్ట్రాలకు కల్పించారు. నేటి శాసనసభలో అలాంటి దుస్థితి లేదు. ఇదే శాసనసభలో ముగ్గురు పీహెచ్డీ చేసినవారు, 38 మంది పీజీ చేసినవారు, 13 మంది డాక్టర్లు, 14 మంది ఇంజనీర్లు, 68 మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు. వీరిలో ముగ్గురు సివిల్ సర్వీసెస్ అధికారులు, ఇద్దరు గ్రూప్ – 1 అధికారులు, 1 ప్రొఫెసర్, 1 జర్నలిస్టు, ఇద్దరు ఉపాధ్యాయులు, రైతులు కూడా ఉన్నారు. వీరంతా ప్రజలు నేరుగా ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు. ఇలాంటప్పుడు మండలి అవసరం ఏముంది? సోమవారం శాసన మండలి రద్దు తీర్మానంపై చర్చిస్తున్న అసెంబ్లీ కాలయాపనకే కౌన్సిల్.. ప్రజల చేత ఎన్నుకోబడ్డ శాసనసభ ఆమోదించిన బిల్లులను కేవలం రాజకీయ కోణంతో తాత్కాలికంగా అడ్డుకునేందుకు మాత్రమే పనిచేస్తున్న మండళ్లను ఏమనాలి? కాలయాపన, ప్రజా ప్రయోజనాలకు విఘాతం తప్ప ఎలాంటి మంచి జరిగే అవకాశం కనిపించడం లేదు. ప్రజా ప్రయోజనం లేని మండలిపై డబ్బులు ఖర్చు చేయడం శుద్ధ దండగ. ట్రెజరీ నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టేందుకు ఈ మండలికి అర్హత లేదు. ఇటువంటి మండలికి రాష్ట్ర ప్రభుత్వం ఏటా దాదాపు రూ.60 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇంత సొమ్ము ఇటువంటి దండగ పనికి ఖర్చు చేయడం ధర్మమేనా? అని అంతా ఆలోచించాలి. మండలికి శాసనసభ జవాబుదారీ కాదు. పేదలు రూపాయి కూడా ఖర్చు చేయకుండా వారి పిల్లలకు ఇంగ్లిష్ మీడియం చదువుల కోసం బిల్లు తెచ్చినా, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం తెచ్చిన ప్రత్యేక కమిషన్ బిల్లు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులను అడ్డుకున్న మండలి కారణంగా ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలుగుతోంది. ప్రజలకు మంచి చేయాల్సింది పోయి రాజకీయ కోణంలో ఆలోచిస్తూ ఎలా హాని చేయాలి? బిల్లులను ఎలా అడ్డుకోవాలి? కత్తిరించాలి? అనే దిక్కుమాలిన ఆలోచనలు చేసే అలాంటి సభ మనకు అవసరమా? అన్నది ఆలోచన చేయాలి. నాడు ఈనాడు సమర్థించలేదా..? మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శాసనమండలిని రద్దు చేసినప్పుడు టీడీపీ పాంప్లేట్ పేపర్ ఈనాడు దాన్ని సమర్థిస్తూ సంపాదకీయాలు రాసింది. అప్పుడు ఈనాడు ఏమేం రాసిందంటే... (క్లిప్పింగ్‌లను సీఎం చదివారు) అనుభవంలో వాటి (మండళ్ల) నిష్ప్రయోజకత్వాన్ని గుర్తించి కొన్ని రాష్ట్రాలు తర్వాత ఆ బురదను కడుక్కున్నాయి. అందుకు పార్లమెంట్ కూడా ఆమోదముద్ర వేసింది. అందుచేత ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం లెజిస్లేటివ్ కౌన్సిల్‌ను రద్దు చేయాలని నిర్ణయిస్తే దానికి రాజకీయ దురుద్దేశాలు ఆపాదించి రభస చేయనవసరం లేదు. నిరర్ధకమే కాక గుదిబండలా కూడా తయారైన కౌన్సిల్ రద్దు గురించి అంతగా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. లెజిస్లేటివ్ కౌన్సిల్ రద్దు వల్ల ఏదో జరగరాని ప్రమాదం జరిగినట్లు గుండెలు బాదుకోవాల్సిన అవసరమూ లేదు. ప్రజలు అఖండమైన మెజార్టీతో గెలిపించిన ప్రజాప్రతినిధులు చేసిన నిర్ణయాన్ని అంగీకరించకుండా అడ్డుకోవాలనుకోవడం ప్రజాస్వామ్యానికి పంగనామం పెట్టడమే అవుతుంది.రాజకీయంగా సంభవించిన పరాజయాన్ని మరో మార్గంలో విజయంగా మార్చుకోవటానికి పన్నే వ్యూహాలు ఏ పార్టీకైనా మంచిపేరు తీసుకురాలేవు. ఈ వాస్తవాన్ని ప్రతిపక్షం గుర్తించి సవ్యమైన పద్ధతిలో కృషి చేసినప్పుడే మళ్లీ పుంజుకునే అవకాశం లభించవచ్చు. అంత ఓర్పు లేక అడ్డదారులు తొక్కితే పరిస్థితి మరింత దుస్థితిగా పరిణమిస్తుంది. ఇలా ఎంత చక్కగా రాశారు అధ్యక్షా అప్పట్లో! రామోజీ కోసం రద్దు చేశారు.. ఆనాడు మండలిని ఒక మనిషి కోసం రద్దు చేశారు అధ్యక్షా. ఆ మనిషి సాక్షాత్తూ ఈనాడు అధినేత రామోజీరావు. ఆనాటి రాజకీయాల గురించి కాస్తో కూస్తో అవగాహన ఉన్నవారందరికీ ఈ విషయం తెలుసు. ఆ రోజు ఒక మనిషి కోసం ఏకంగా మండలినే రద్దు చేసిన పరిస్థితి. అటువంటి మనిషి కోసం రద్దు చేస్తేనే ఇటువంటి గొప్ప సంపాదకీయాలు రాశారు. ఈరోజు కోట్లాది మంది ప్రజల ప్రయోజనాల కోసం చేస్తున్న చట్టాలకు రాజకీయ కోణంతో అడ్డుతగులుతున్నారు. అనవసర ఆర్థిక భారం దృష్ట్యా మండలి రద్దు నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పేందుకు గర్వపడుతున్నా. మండలిని కొనసాగిస్తే వచ్చే ఏడాది మా పార్టీకి మెజారిటీ వస్తుందని తెలిసినా ప్రజల అవసరాలు, ప్రభుత్వ బాధ్యతలను దృష్టిలో పెట్టుకుని మండలి రద్దు కోసం తీర్మానం చేస్తున్నాం. ఆకర్ష్ అంటూ సిగ్గుమాలిన రాతలు.. ఆపరేషన్ ఆకర్ష్ అంటూ చంద్రబాబు పత్రికలు సిగ్గుమాలిన రాతలు రాస్తున్నాయి. ఇంత దిగజారిన రాతలు చంద్రబాబు పత్రికల్లో చూస్తున్నాం. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే వీళ్లంతా చంద్రబాబు హయాంలో పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే ఏ రోజైనా కనీసం నోరెత్తారా? తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు ఇస్తూ చంద్రబాబు ఆడియో, వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోతే ఎల్లో మీడియా కనీసం నోరెత్తలేదు. మా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు 23 మంది మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాజ్యాంగానికి తూట్లు పొడిస్తే ఈనాడు, ‘చంద్ర’జ్యోతి, టీవీ 5 ఎందుకు ప్రశ్నించలేదు? నోరెత్తకపోగా చంద్రబాబు గొప్ప రాజనీతి చాణక్యుడని, ఆయన పరిపాలన చూసి ముగ్దులై ఎమ్మెల్యేలు వెళ్లిపోయారంటూ దిక్కుమాలిన కథనాలు రాశాయి. చర్చ జరగాలనే మూడు రోజులు టైం మండలి రద్దు గురించే సభ పెడుతున్నామని గురువారం నాడే చెప్పాం. ప్రజలు చర్చించుకోవాలని సమయమిచ్చినా ఎమ్మెల్సీలను రూ. 5 కోట్లకు కొంటున్నామని టీడీపీ అనుకూల పత్రికల్లో దుష్ప్రచారం చేస్తున్నారు. మేం సమయం ఇవ్వకుంటే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపణలు చేసేవారు. విలువలు, విశ్వసనీయత లేని వారు ఎవరో, అవసరానికి తగ్గట్టు మాటలు మార్చే నైజం ఎవరిదనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ప్రత్యేక హోదా విషయంలో, మోదీ విషయంలో, కాంగ్రెస్ పార్టీ విషయంలో, బీజేపీ విషయంలో, మండలి విషయంలో చంద్రబాబు ఎన్నెన్ని యూటర్న్లు తీసుకున్నాడో గత ఐదేళ్లలో చాలా చూశాం. నిజంగా మాటలు ఎవరు మార్చారో ఒక్కసారి వీటిని చూస్తే తెలుస్తుంది (బాబు వివిధ సందర్భాల్లో చేసిన పరస్పర విరుద్ధ వ్యాఖ్యల క్లిప్పింగ్‌లను ప్రదర్శించారు). అవసరం తీరిన తరువాత ఎవరినైనా వెన్నుపోటు పొడవటానికి ఏమాత్రం వెనుకాడని వ్యక్తి బాబు. చంద్రబాబు యూటర్నులు కాంగ్రెస్ పార్టీ గురించి ముందు.. - కాంగ్రెస్ పార్టీ ఓ పార్టీనా? చెత్త పార్టీ. ఇది సోనియాగాంధీ సామ్రాజ్యం కాదు. ఇది ఇటలీ కాదు ఇది ఇండియా - కాంగ్రెస్‌కు సహకరిస్తే వారిని ఏమనాలి...? ఆ పార్టీనే శాశ్వతంగా బాయ్‌కాట్ చేయాలి. అప్పుడు కూడా కసి తీరదు - సోనియా, రాహుల్ ఇంతవరకు ఒక్క మాట అయినా విభజన గురించి మాట్లాడారా? మీకు చేతకాదా? మీరు నాయకులా? ఏమనుకుంటున్నారు మీ గురించి అని అడుగుతున్నా. - ఆ మహాతల్లి (సోనియా)కి ఎక్కడ లేని డబ్బు పిచ్చి. డబ్బులు లేకపోతే ఆవిడకు నిద్ర పట్టదు. సోనియా ఇటలీ నుంచి వచ్చింది. మన కష్టాలు తెలిసిన వ్యక్తా? కాదు. - కాంగ్రెస్‌ను ఎండగడతాం. ఈ దేశంలో కాంగ్రెస్‌ను దోషిగా నిలబెడతా. కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్ మీదకు వెళ్లిపోయింది. ఆ వెంటిలేటర్ ఎప్పుడు తీసేస్తే అప్పుడు చనిపోతుంది. - కాంగ్రెస్ పార్టీ దుర్మార్గమైన ఆలోచన చేస్తోంది. నీచమైన రాజకీయాలు చేస్తోంది. æ సోనియాగాంధీ ఈ దేశానికి వచ్చి, ఈ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించి ఈ రోజు అభద్రతాభావంతో బతికే పరిస్థితి తీసుకువచ్చిందంటే చాలా దుర్మార్గం - తెలుగుదేశం పార్టీ మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీతో రాజీ పడలేదు. కాంగ్రెస్ పార్టీతో పోరాడాం. కాంగ్రెస్‌తో లాలూచీ పడే పరిస్థితి ఎప్పటికీ తెలుగుదేశం పార్టీకి ఉండదు. ఉండబోదు తరువాత - కాంగ్రెస్, మేమూ కలసి పనిచేస్తున్నాం. మా మధ్య సమస్య ఉండదు. మేము కలసి పనిచేయాల్సిన అవసరం ఉంది. - పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేసింది కాంగ్రెస్ పార్టీ. విభజన చట్టంలో పెట్టింది కాంగ్రెస్‌పార్టీ. 90 శాతం డబ్బులు ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. - మోదీ ఎన్నికల్లో ఓడిపోతున్నారు. కొత్త ప్రధాని వస్తారు. - మేము కూర్చొని మాట్లాడుతున్నాం. రాహుల్‌ను కూడా ఆయన పార్టీలో చర్చించమని కోరా. మేం ఓ ఉమ్మడి వేదిక మీదకు వస్తాం. కలసి ఎలా పనిచేయాలన్నది నిర్ణయిస్తాం. నరేంద్ర మోదీ గురించి ముందు.. - మోదీ సమర్థుడు. ఆయన ప్రధాని కాబోతున్నారు. ఎవరూ అడ్డుకోలేరు. నాదీ నరేంద్రమోదీదీ విన్‌విన్ కాంబినేషన్. - అభివృద్ధి కోసం మోదీతో కలసి పనిచేయాలని భావిస్తున్నాను. - స్వాతంత్య్రం వచ్చిన తరువాత చాలామంది ప్రధానమంత్రులు వచ్చారు. కానీ భారతదేశం ప్రతిష్టను ప్రపంచం మొత్తం చాటి చెప్పిన ఏకైక ప్రధానమంత్రి నరేంద్రమోదీ. - సమర్థుడైన మోదీ నాయకత్వంలో భారతదేశం త్వరలోనే సూపర్వపర్గా తయారవుతుంది. - మోదీ అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాంటి వ్యక్తి ప్రధానమంత్రి అయ్యారు. తరువాత... - గురువుకు నామాలు పెట్టింది నరేంద్ర మోదీ. తల్లిని చూడలేదు. తల్లికి బిచ్చం పెట్టనివాడు దేశాన్ని ఉద్దరిస్తాడంట. - నరేంద్రమోదీ కంటే మిగతా నాయకులంతా మెరుగైన వారే. - నరేంద్రమోదీ కరుడుగట్టిన ఉగ్రవాది. మంచివాడు కాదు. - నరేంద్ర మోదీకి ఈ దేశంలో ఉండటానికి అర్హత లేదు. - హుందాతనం ఏమైంది. పోలవరం ఈయన ఇచ్చాడంటాడు... ఈయన ఇచ్చేదేంటి పోలవరం. మన రాజధాని శంకుస్థాపనకు ఆయన్ని పిలిచాను. ఏం ఇచ్చారు...మట్టీ, నీళ్లు మన ముఖాన కొట్టాడు. - మన రాష్ట్రానికి నమ్మక ద్రోహం చేసిన వ్యక్తి నరేంద్రమోదీ ప్రత్యేక హోదా గురించి ముందు .. - ప్రత్యేక హోదా ఇవ్వాలి ఐదేళ్లు ఇచ్చారు. నరేంద్రమోదీని కోరుతున్నా 15 ఏళ్లు ఇవ్వండి. ఐదేళ్లలో పరిశ్రమలు రావాలంటే రెండుమూడేళ్లవుతుంది. అది ప్రారంభమయ్యేలోగా ప్రత్యేక హోదా పోతే మళ్లీ అభివృద్ధి ఆగిపోతుంది. అందుకే కనీసం 15ఏళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతున్నా. తరువాత - కావాలని కొందరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ప్రత్యేక హోదా ఇస్తే అదేదో సంజీవని కింద అన్నీ అయిపోతాయని. ప్రత్యేక హోదా వస్తే ఏమవుతుందండి? రెండే వస్తాయి. ఒకటి ఈఏపీ... రెండు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీములు. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీములు తగ్గించేశారు. 62 శాతం నుంచి 52శాతానికి వచ్చింది. ఇక ఈఏపీ ఏంటీ... కేంద్ర ప్రభుత్వం ఎన్ని ప్రాజెక్టులు ఇస్తే ...మళ్లా వాళ్లు మంత్రిమండలిలో ఆమోదించాలి. - నేను మొదట అడిగింది ప్రత్యేక హోదానే. కాదు ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తారన్నారనుకో. నేను కాదనను కదా. కోడలు మగ బిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా? - ప్రత్యేక హోదాతోనే మొత్తం అయిపోతుంది. స్వర్గం అయిపోతుందని చెబుతున్నారు. పదేళ్లు , పదిహేనేళ్లు ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాలు స్వర్గాలు అయిపోలేదేం... - ఈ రోజు కేంద్రం ఇచ్చిందానికి అభినందిస్తూనే...వాళ్లు ఎంతిచ్చినా తీసుకోవడం...ముందుకు పోవడం తప్పా మనకు మరో మార్గం లేదు. మళ్లీ : ప్రత్యేక హోదా మినహా మనకు మరో మార్గం లేదు. చంద్రబాబూ ఈ ప్రశ్నలకు బదులేది? - ఎస్సీ ఎస్టీలకు గతంలో ఒకటే కమిషన్ ఉండేది. వారి క్షేమాన్ని కాంక్షించి ఇప్పుడు వేర్వేరుగా కమిషన్లు తెచ్చాం. దీన్ని అడ్డుకోవడం చంద్రబాబు చేసిన తప్పు కాదా? - రూపాయి ఖర్చు లేకుండా పేద పిల్లలకు ఉచితంగా ఇంగ్లిష్ మీడియం చదువులు తేవడం న్యాయమా.. అన్యాయమా? - ఏ అన్యాయం జరిగిందని ఆయన అమరావతి రైతులతో ఉద్యమాలు చేయిస్తున్నారు? రైతులకు కౌలు (యాన్యుటి) 15 ఏళ్లకు పెంచడం అన్యాయమా? - రాజధానిలో భూమి లేని నిరుపేదలకు జీవనభృతి రూ.2,500 నుంచి రూ.5 వేలకు పెంచడం అన్యాయమా? - అసైన్డు రైతులకు కూడా మామూలు రైతులతో సమానంగా ప్లాట్లు ఇవ్వడం మేం చేసిన తప్పా? - రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు అందించాలనే సంకల్పంతో ముందుకు సాగితే నేరమా? - వెనకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేసే సంకల్పంతో విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా మార్చాలనుకోవడం నేరమా? - స్వాతంత్య్రానికి పూర్వం 1937నాటి శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలును న్యాయ రాజధానిగా ఏర్పాటు చేయాలనుకోవడం తప్పా? -
మండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం
-
మండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన శాసనమండలి రద్దు తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. సభకు హాజరైన 133 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. అనంతరం తీర్మానం ఆమోదం పొందినట్లు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. రాజ్యాంగంలోని 169 అధికరణ ప్రకారం రద్దు నిర్ణయం తీసుకున్నట్లు స్పీకర్ తెలిపారు. మండలిని రద్దు చేయాలని సోమవారం ఉదయం రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా పెద్దల సభను రద్దు చేయాలని తీర్మానించి.. దానిని సీఎం జగన్ శాసనసభ ముందు ఉంచారు. దీనిపై రోజంతా సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. రాజకీయ ప్రయోజనాలకు కాకుండా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మండలిని రద్దు చేస్తున్నట్లు సభ్యులంతా తమ ప్రసంగాల్లో స్పష్టం చేశారు. (మండలి రద్దుకు గర్వపడుతున్నాం: సీఎం జగన్) చర్చలో భాగంగా మండలి రద్దు తీర్మానంపై ప్రసంగించిన సీఎం జగన్.. దీనికి ఆమోదం తెలపాలని సభ్యులను కోరారు. అనంతరం సభలో ఓటింగ్‌కు పెడుతున్నట్లు అసెంబ్లీ స్పీకర్ సీతారాం ప్రకటించారు. ముందుగా సభలో సభ్యులు కాని మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోష్‌లను పక్కన కూర్చోవాలని సూచించారు. అనంతరం సభలో ఓటింగ్ చేపట్టి.. ఆమోదం పొందినట్లు ప్రకటించారు. అనంతరం సభ నిరవధికంగా వాయిదా పడింది. అసెంబ్లీ ఆమోదించిన ఈ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కేంద్రానికి పంపనుంది. పార్లమెంట్ ఉభయ సభలతో పాటు, రాష్ట్రపతి ఆమోదం తెలిపిన అనంతరం సభ పూర్తిగా రద్దు కానుంది. కాగా ఏపీలో శాసనమండలి రద్దు కావడం ఇది రెండోసారి. తొలిసారి మే 31, 1985న నాటి సీఎం ఎన్టీఆర్ రద్దు చేసిన విషయం తెలిసిందే. -
చంద్రబాబు దిగజారి వ్యవహరిస్తున్నారు
-
మండలి రద్దు తీర్మానంకు మద్దతు : రాపాక
సాక్షి, అమరావతి : శాసనమండలిని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన తీర్మానానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నానని జనసేన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తెలిపారు. వికేంద్రీకరణ బిల్లుకు మండలిలో టీడీపీ అడ్డుతగలడం దారుణమన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలను స్వాగత్తిస్తున్నానని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రతి సందర్భంలోనూ టీడీపీ అడ్డుపడటం దురదృష్టకరమన్నారు. శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ భాగంగా రాపాక వరప్రసాద్ మాట్లాడారు. అసెంబ్లీలో మేధావులు, డాక్టర్లు, ఐపీఎస్ అధికారులు ఉండగా.. ఇక పెద్దల సభ ఎందుకంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలతో తాను కూడా ఏకీభవిస్తున్నా అని అన్నారు. ఇంతమంది రాజకీయ ప్రముఖులు ఉన్నాక.. మళ్లీ మండలి అవసరం లేదని రాపాక స్పష్టం చేశారు. శాసనసభలో రాపాక మాట్లాడుతూ.. ‘154 మంది శాసన సభ్యలు ఆమోదం తెలిపిన బిల్లును మండలి తిరస్కరించడం దురదృష్టకరం. ఇంగ్లీష్ మీడియం బిల్లును కూడా మండలిలో టీడీపీ అడ్డుకుంది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఆయన స్థాయికి దిగజారి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. ఏకంగా మండలి చైర్మన్ షరీఫ్‌ను కూడా ఆయన ప్రభావితం చేశారు. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపుతున్నాను అని చెప్పడానికి చైర్మన్ ఎంతో ఇబ్బంది పడ్డారు. ఈ విధంగా చేయడం చంద్రబాబుకు సరికాదు. అన్నాతమ్ముడిలా.. కలిసి జీవించే మాల, మాదిగలను రెండుగా చీల్చిన చరిత్ర చంద్రబాబు నాయుడిది. బ్రిటీష్ సాంప్రదాయాలను పాటిస్తూ విభజించి పాలించే అనే విధంగా ఆయన ప్రవర్తిస్తున్నారు. గడిచిన ఆరు నెలల్లోనే అనేక సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. సీఎం జగన్ ప్రజాసంక్షేమమే లక్ష్యంగా పరిపాలన చేస్తున్నారు. ముఖ్యంగా విద్యాభివృద్ధి కొరకు సీఎం జగన్ చేపడుతున్న చర్యలు అభినందనీయం. అన్ని వర్గాలు, ప్రాంతాలను అయన సమానంగా చూస్తున్నారు’ అని తన ప్రసంగంలో పేర్కొన్నారు. -
శాసన మండలిపై టీడీపీ దొంగాట!
సాక్షి, అమరావతి: ‘‘నేను అధికారంలో ఉన్నా ప్రజలకే రిస్కు.. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకే రిస్కు.. ఏదేమైనా నాకు అనుకూలంగా ఉన్నంతవరకే.. నా వరకు రానంతవరకే.. నా పార్టీ గనుక మునిగిపోయే పరిస్థితి వస్తే.. ఎందాకైనా వెళ్లడానికి నేను రెడీ అన్నట్లుగా ఉంది’’ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి అంటూ సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు... ఊసరవెల్లి మాదిరిగా ఎప్పటికప్పుడు రంగులు మారుస్తారంటూ రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తారన్న విషయం తెలిసిందే. ఏ విషయాన్ని అయినా తనకు అనుకూలంగా మార్చుకుంటూ ద్వంద్వ వైఖరి ప్రదర్శించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అంటూ ఆయన తీరుపై విమర్శలు గుప్పిస్తారు. ఇక తాజాగా శాసన మండలి రద్దు విషయంలోనూ ఆయన అనుసరిస్తున్న విధానంపై అదే రీతిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పలు కీలక బిల్లులను శాసన మండలిలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటున్న విషయం విదితమే. అసెంబ్లీలో చర్చించి, ఆమోదించిన బిల్లులపై సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన ప్రధాన కర్తవ్యాన్ని మరచి.. టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం మండలిని వాడుకుంటుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. (ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం) ఈ నేపథ్యంలో శాసన మండలిని రద్దు చేస్తూ రాష్ట్ర కేబినెట్ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శాసన సభలో ప్రవేశపెట్టారు. అయితే ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం సభకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో మండలి అంశంలో గతంలో చంద్రబాబు వ్యవహరించిన తీరు సర్వత్రా చర్చనీయాంశమైంది. 2004లో శాసన సభలో చంద్రబాబు మాట్లాడిన మాటలు ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జూలై 8, 2004లో అసెంబ్లీలో మండలి ఏర్పాటుపై చంద్రబాబు అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే. పదవులు అధికారం కోసం కాంగ్రెస్ వాళ్లు ఆత్రంగా ఉన్నారంటూ ఆనాడు ఆయన వ్యాఖ్యలు చేశారు.(అందుకే చంద్రబాబు సభకు రాలేదు: ధర్మాన) ఆనాడు చంద్రబాబు ఏమన్నారంటే.. ‘‘అధికారపక్షం ఏం చేసినా చెల్లుతుందనుకుంటున్నారు. కేవలం పదవుల కోసమే మండలిని పునరుద్ధరిస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు మండలి వల్ల ఎలాంటి లాభం లేదు. ఒకప్పుడు అక్షరాస్యతా శాతం తక్కువగా ఉండేది. కాబట్టి పెద్దలు అవసరం. ఇప్పుడు ఎమ్మెల్యేల్లో మంచి క్వాలిటీ ఉంది. అనుభవం ఉంది. మండలి వస్తే, శాసనాలు పాస్ కావడంలో ఆలస్యం అవుతుంది. ప్రజాధనం భారీగా దుర్వినియోగం అవుతుందని మన్స్ఫర్డ్ కమిటీ కూడా చెప్పింది. 1930 రౌండ్ కాన్ఫరెన్స్‌లో కాంగ్రెస్‌పార్టీ కూడా మండలిని వ్యతిరేకించింది. అక్టోబరు 26, 1934న అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో కూడా బాబు రాజేంద్రప్రసాద్ మండలిని వ్యతిరేకించారు. మండలి వల్ల లాభం ఉండదని రాజేంద్రప్రసాద్ అన్నారు. 1950 నుంచి కేవలం 8 రాష్ట్రాల్లోనే శాసన మండలి ఏర్పాటైంది. వాటిలో 3 చోట్ల రద్దయింది మండలి వల్ల ఏటా రూ. 20 కోట్ల ఆర్థిక భారం. ఒక బిల్లు మండలికి వెళ్లి అక్కడ పాస్ అయినా లేదా తిప్పి పంపితే మళ్లీ కాలాయాపన. ఏ బిల్లునైనా ఆపే అధికారం మండలికి కేవలం 4 నెలలే ఉంటుంది. కనీసం రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసే హక్కు కూడా మండలి సభ్యులకు లేదు.(‘చంద్రబాబు కోరుకున్నదే.. మేము అమలు చేస్తున్నాం’) ఇక ఆర్థికేతర విషయంలో మండలికి పటిష్టమైన అధికారాలంటూ ఏమీ లేవు. ఆర్థిక బిల్లులన్నీ శాసన సభే ఆమోదించే పరిస్థితి వస్తుంది. రాజ్యాంగ సవరణలు వచ్చినా శాసన సభకు తప్ప మండలికి ప్రమేయం ఉండదు. పరిమిత అధికారాలు తప్ప ఏమాత్రం ఉపయోగం ఉండదు. మేధావులు కూడా మండలికి వస్తారనుకోవడం లేదు. 1958లో నీలం సంజీవరెడ్డి నేతృత్వంలో మండలి ఏర్పాటేతే అది ఒక పునరావాస కేంద్రంగా మారింది. 1978లో చెన్నారెడ్డి ప్రభుత్వంలో వ్యతిరేకించిన ప్రతిపక్ష నేతలను కలుపుకోవడానికి మండలిని వాడుకున్నారు. ప్రజలపైన ఆర్థిక భారం పడుతుందనే ఉద్దేశంతో మే 31, 1985న నాటి సీఎం ఎన్టీఆర్ రద్దు చేశారు. జనవరి 23, 1990న మండలి కావాలని చెన్నారెడ్డి తీర్మానం చేస్తే నాటి యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం తిరస్కరించింది. మండలి పెట్టాలంటే రెఫరెండం పెట్టాలి. చాలా రాష్ట్రాలు మండలి కావాలని అడిగినా కేంద్రం ఒప్పుకోలేదు. అనేక కారణాల వల్ల మండలి కావాలన్న బిల్లు లోక్‌సభలో లేదా రాజ్యసభలో తిరస్కరిస్తున్నారు’’ అని చంద్రబాబు మండలిపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అయితే ఇప్పుడు తన రాజకీయ ప్రయోజనాలకు భంగం కలుగుతుందనే కారణంతో శాసన సభ.. మండలిని రద్దు చేసే తీర్మానంలో చర్చపై కనీసం పాల్గొనలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. -
అసెంబ్లీలో మండలి రద్దు తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం జగన్
-
మండలి రద్దుకు తీర్మానం ప్రతిపాదించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సంచలన నిర్ణయానికి వేదికగా మారింది. రాష్ట్ర శాసన మండలిని రద్దు చేయాలన్న తీర్మానం శాసనసభ ముందుకొచ్చింది. సోమవారం శాసనసభ సమావేశం ప్రారంభమైన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండలిని రద్దు చేసే తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి ప్రతిపాదించిన తీర్మానంపై సభ చర్చ చేపట్టింది. (ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం) మండలి రద్దు తీర్మానంపై డిప్యూటీ సీఎం, వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని చర్చను ఆరంభించారు. ఏపీ శాసన మండలి రద్దు తీర్మానానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధానిని తరలించడం లేదని, మరో రెండు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అమరావతిలో భూముల కొనుక్కున్న టీడీపీ నేతలే కావాలని రచ్చ చేస్తున్నారు. ప్రాంతీయ అసమానతలను నివారించేందుకే మూడు రాజధానులు అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం విడిపోవడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడే అని స్పష్టం చేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గం శాసన మండలిని రద్దు చేయాలన్న ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. మంత్రివర్గం నిర్ణయానికి ఆమోదముద్ర వేసిన అనంతరం శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం శాసనసభా వ్యవహారాల కమిటీ (బీఏసీ)ని సమావేశపరిచారు. ఈ సమావేశానికి ప్రతిపక్ష టీడీపీ నాయకులు హాజరుకాలేదు. బీఏసీ నిర్ణయం మేరకు శాసనసభ ప్రారంభం కాగానే మండలిని రద్దు చేయాలన్న తీర్మానాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సభలో ప్రవేశపెట్టారు. ప్రభుత్వం ప్రతిపాదించిన పలు బిల్లులతో పాటు వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు వంటి కీలకమైన బిల్లులను మండలి తిరిస్కరించిన విషయం తెలిసిందే. (‘సీఎం జగన్ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం’) -
రాజకీయ దురుద్దేశంతో బిల్లులను అడ్డుకున్నారు
-
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు..!
-
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసన మండలిని రద్దు చేస్తూ రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకువచ్చిన పలు కీలక బిల్లులకు అడ్డు తగులుతున్న శాసన మండలి రద్దే సరైందని మంత్రివర్గం భావించింది. ఈ మేరకు మండలి రద్దుకు సంబంధించి శాసన సభలో సోమవారం ప్రవేశపెట్టే తీర్మానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతోపాటు కేబినెట్ భేటీలో భోగాపురం ఎయిర్పోర్ట్, మచిలీపట్నం పోర్టులపై మంత్రివర్గం చర్చించినట్టు తెలిసింది. మరికాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశం కానుంది. శాసన మండలి రద్దు తీర్మానాన్ని ప్రభుత్వం కేంద్రం ఆమోదానికి పంపనుంది. (చదవండి : ప్రజలకు మేలు చేయని మండలి అవసరమా?) ⇒ ఏపీలో మండలి రద్దు కావడం ఇది రెండోసారి ⇒ శాసన మండలిని మే 31, 1985న రద్దు చేసిన నాటి సీఎం ఎన్టీఆర్ ⇒ మార్చి 30, 2007న తిరిగి మండలి పునరుద్దరణ ⇒ 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి విడిగా శాసన మండలి ⇒ మండలి రద్దుపై తీర్మానం చేయనున్న శాసన సభ ⇒ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్న ప్రభుత్వం ⇒ ఆర్టికల్ 169 ద్వారా ఏ రాష్ట్ర మండలినైనా రద్దు చేసే అధికారం ⇒ పార్లమెంట్ తర్వాత రాష్ట్రపతి ఆమోదంతో రద్దు కానున్న మండలి ⇒ ఇప్పటికే చాలాచోట్ల మండలిని పక్కనపెట్టిన రాష్ట్రాలు ⇒ దేశవ్యాప్తంగా కేవలం 6 రాష్ట్రాల్లోనే శాసన మండలి ⇒ తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, బిహార్, యూపీలోనే పెద్దల సభ ⇒ మండలిని పునరుద్దరించాలంటూ 5 రాష్ట్రాల్లో వినతులు ⇒ అసోం, మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, బెంగాల్లో మండలి కోసం వినతులు ⇒ మండలి పునరుద్దరించాలన్న ఐదు రాష్ట్రాల వినతుల పట్ల కేంద్రం విముఖత ⇒ మండలి వల్ల ఆర్థికంగా రాష్ట్రంపై భారీగా భారమన్న భావనలో కేంద్రం -
ప్రారంభమైన ఏపీ మంత్రివర్గ సమావేశం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం సోమవారం ఉదయం ప్రారంభమైంది. శాసనమండలి రద్దుపై ఈ భేటీలో చర్చిస్తున్నట్లు సమాచారం. మండలి భవితవ్యంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేబినెట్ నిర్ణయం తర్వాత అసెంబ్లీ చర్చించి, ఆ తర్వాత తీర్మానం చేయనుంది. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్, మచిలీపట్నం పోర్టులపై మంత్రివర్గం చర్చించనుంది. (శాసనమండలిపై నేడే నిర్ణయం) కాగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల శ్రేయస్సును కాంక్షిస్తూ, పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న ధ్యేయంతో శాసన సభలో ఆమోదించిన అభివృద్ధి–పరిపాలన వికేంద్రీకరణ, అమరావతి మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు బిల్లులను శాసన మండలిలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అడ్డుకుంది. అలాగే అభివృద్ధి–పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల విషయంలో నిబంధనలను పాటించలేదని, ఇది తప్పేనని, అయినా సెలెక్ట్ కమిటీకి పంపిస్తానని శాసన మండలి చైర్మన్ షరీఫ్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో శాసన మండలిని రద్దు చేయాల్సిందిగా ఈ సందర్భంగా పలువురు సభ్యులు ప్రభుత్వానికి సూచించారు.(టీడీపీ తప్పుడు ప్రచారం.. వెలుగులోకి అసలు నిజం..!) -
శాసనమండలిపై నేడే నిర్ణయం
సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసన మండలి విషయంలో ప్రభుత్వం నేడు నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల శ్రేయస్సును కాంక్షిస్తూ, పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న ధ్యేయంతో శాసన సభలో ఆమోదించిన అభివృద్ధి–పరిపాలన వికేంద్రీకరణ, అమరావతి మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు బిల్లులను శాసన మండలిలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అడ్డుకున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీలో చర్చించి, ఆమోదించిన బిల్లులపై సలహాలు, సూచనలు ఇవ్వడం శాసన మండలి ప్రధాన కర్తవ్యం. కానీ, ప్రతిపక్షం రాజకీయ కారణాలతో కీలక బిల్లులకు అడ్డుపడుతుండడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు ఏర్పాటు, పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం బిల్లులను సైతం మండలిలో టీడీపీ వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో మండలిపై నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. రద్దుకు అనుకూలంగానే నిర్ణయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సోమవారం ఉదయం 9.30 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. లెజిస్లేటివ్ రాజధానితోపాటు ఎగ్జిక్యూటివ్ రాజధాని, జ్యుడీషియల్ రాజధాని ఏర్పాటు బిల్లు, సీఆర్డీఏ స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు బిల్లు మండలిలో నిలిచిపోయిన నేపథ్యంలో తదుపరి చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నారు. అలాగే శాసన మండలి రద్దుకు అనుకూలంగా కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతోపాటు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, మచిలీపట్నం పోర్టు నిర్మాణాలపైనా కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అర్హులైన పేదలందరికీ ఉగాది పర్వదినం రోజున ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చేందుకు అవసరమైన భూముల సేకరణపైనా చర్చించనున్నారు. కేబినెట్ భేటీ అనంతరం సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశంలో.. బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపిన తర్వాత తలెత్తిన పర్యవసానాలపై స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు. ఏపీ శానస మండలిని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర సర్కారు అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి, ఆమోదించనున్నట్లు అధికార వర్గాల సమాచారం. మండలిని రద్దు చేయాలని ఎమ్మెల్యేల సూచన అభివృద్ధి–పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల విషయంలో నిబంధనలను పాటించలేదని, ఇది తప్పేనని, అయినా సెలెక్ట్ కమిటీకి పంపిస్తానని శాసన మండలి చైర్మన్ షరీఫ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజల నుంచి నేరుగా ఎన్నికైన సభ్యులు ఆమోదించిన బిల్లులను మండలిలో నిలిపివేయడంపై గురువారం అసెంబ్లీలో చర్చ జరిగింది. శాసన మండలిని రద్దు చేయాల్సిందిగా ఈ సందర్భంగా పలువురు సభ్యులు ప్రభుత్వానికి సూచించారు. ఈ అంశంపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు మేలు చేసే బిల్లులను అడ్డుకుంటున్న మండలి అవసరమా? అనేదానిపై సోమవారం విస్తృతంగా చర్చించి, నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు.