
సాక్షి, అమరావతి : రాజధాని ఏర్పడుతుందనే అమరావతిలో భూములు కొన్నానని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అంగీకరించారు. రాజధానిలో భూములు ఉండాలనే తన కొడుకు పేరుపై భూములు కొన్నానని అసెంబ్లీ సాక్షిగా నిజం ఒప్పుకున్నారు. రాజధాని అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సభలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా పయ్యావుల మాట్లాడుతూ.. అమరావతిలో రాజధానిఏర్పడబోతుందని తెలిసే భూములు కొన్నానని స్పష్టం చేశారు. రాజధానిలో భూములు కొంటే తప్పేంటని ప్రశ్నించారు.
(చదవండి : రాజధానులు ఎంతెంత దూరం)
భూముల కొంటే తప్పులేదని.. 2014 జూన్ నుంచి డిసెంబర్‌లోగా టీడీపీ నేతలు అంతా ఒకే చోటభూములు ఎలా కొన్నారని బుగ్గన నిలదీశారు. రాజధాని అక్కడ..ఇక్కడ అని అమయాక ప్రజలను గందరగోళాని గురిచేసి.. టీడీపీ నేతలు మాత్రం అమరావతిలో భూములు కొన్నారని బుగ్గన ఆరోపించారు. గుంటూరు,కృష్టా జిల్లాల్లో రాజధాని అని ఉద్దేశపూర్వకంగా లీకులు ఇచ్చి.. అందరిని మభ్యపెట్టి టీడీపీ నేతలు మాత్రం అమరావతిలో భూములు కొన్నారన్నారు. కచ్చితంగా ఇది ఇన్‌సైడర్ ట్రేడింగే అని బుగ్గన అన్నారు. దీనిపైప్రభుత్వం కచ్చితంగా చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.
(చదవండి : చంద్రబాబుకు సవాల్ విసిరిన కొడాలి నాని)
ప్రజలను మభ్యపెట్టేలా పయ్యావుల మాట్లాడుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఇల్లు కట్టుకునేందుకు 4 ఎకరాల భూముటు కొంటారాఅని పయ్యావులను ప్రశ్నించారు. రాజధాని ఏర్పడే విషయం టీడీపీ నేతలకు ముందుగానే అందిందని.. అందుకే అమరావతిలో వేల ఎకరాల భూములు కొన్నారని ఆరోపించారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై తమ ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకుంటుందని పేర్కొనానరు.
Comments
Please login to add a commentAdd a comment