Andhra pradesh new capital
-
రాయలసీమకు వచ్చి అనే దమ్ముందా?
సాక్షి, వైఎస్సార్ కడప: మూడు రాజధానుల అంశంపై చంద్రబాబు 48 గంటలు డెడ్‌లైన్ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. ఆయన ప్రెస్మీట్లు కామెడీ షోలా తయారయ్యాయని, అలాంటి వాటిని ఎల్లో మీడియా హైలెట్ చేసి చూపిస్తున్నాయన్నారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణించినప్పుడు జగన్మోహన్రెడ్డి రాజీనామా చేసి ముందుకు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే జగన్ మాదిరిగా చంద్రబాబు కూడా రాజీనామా చేసి ముందుకు రావాలని సవాలు చేశారు. (రాజధానులపై చంద్రబాబు డ్రామా) అమరావతి రైతుల క్షేమం కోసం శ్రీశైలం ప్రజల త్యాగం రాజధాని గురించి ఎన్నికల ముందు చెప్పలేదని బాబు అంటున్నారని కానీ ఎన్నికల మ్యానిఫెస్టోలో మూడు ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తానని జగన్ హామీ ఇచ్చారని స్పష్టం చేశారు. అయినా చంద్రబాబుకు రాయలసీమ వచ్చి మాట్లాడే దమ్ముందా? అని ప్రశ్నించారు. ఇక్కడికి వచ్చి హైకోర్టును వద్దని చెప్పగలుగుతారా? అని నిలదీశారు. బినామీలు కాపాడుకునేందుకు అమరావతి అంటూ డ్రామాలు ఆడుతున్నారని బాబును విమర్శించారు. ఇకనైనా రాయలసీమ టీడీపీ నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు రాకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి ప్రజలు బాగున్నారు అంటే అది శ్రీశైలం పరిసర ప్రాంతాల ప్రజల త్యాగమేనని ఆయన వ్యాఖ్యానించారు. రాయలసీమలోని సెంటిమెంట్ మీకు గుర్తుకు రాదా? అని ప్రశ్నించారు. బాబుకు మంచి చేయాలన్న ఆలోచనే రాదు ఇలానే చంద్రబాబు డ్రామాలు అడితే రాబోయే రోజుల్లో హైదరాబాద్‌కు వచ్చి మరీ ప్రజలు ఆయన ఇంటిని చుట్టముడతారని హెచ్చరించారు. బాబుకు సిగ్గు, శరం ఉంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై చర్చకు సిద్ధమా? అని సవాలు విసిరారు. కేవలం ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం తప్ప ఇంకేమీ లేదని విమర్శించారు. ప్రజలు బాబును నమ్మే స్థితిలో లేరని పేర్కొన్నారు. కేవలం గ్రాఫిక్స్ తో రాజధాని నిర్మాణం చేసిన ఆయనకు మంచి చేయాలన్న ఆలోచన ఎప్పుడూ రాదని ఎద్దేవా చేశారు. ఇది "రాజన్న రాజ్యం - రైతు రాజ్యం" అని, ఏ రైతు కంట కన్నీరు రానివ్వమని భరోసా ఇచ్చారు. అమరావతి రైతుల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని శ్రీకాంత్‌రెడ్డి మరోసారి గుర్తు చేశారు. (చంద్రబాబుకు మతి తప్పింది) -
ఇదే సీఎం జగన్ లక్ష్యం: అమర్నాథ్
సాక్షి, విజయవాడ: పాలనా వికేంద్రికరణ బిల్లుపై గవర్నర్ నిర్ణయం హర్షణీయమని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మూడు రాజధానుల బిల్లు అమోదాన్ని అందరం స్వాగతిస్తున్నామన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉత్తరాంధ్ర ప్రజలు రుణపడి ఉంటారని వ్యాఖ్యానించారు. ఒకే ప్రాంతం కాకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందాలన్నది సీఎం జగన్ లక్ష్యమని తెలిపారు. సీఎం జగన్ ముందు చూపు వల్ల అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. (చదవండి: వికేంద్రీకరణే అభివృద్ధి మార్గం) విశాఖపట్నంలో అన్ని రకాల వనరులున్నాయని, ఉన్నతమైన రాజధానిగా విశాఖ అవతరించ బోతుందన్నారు. దురాలోచనలతో చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి అడ్డుతగులుతున్నారని, రాజకీయాల్లో ఉండే నైతిక హక్కు ఆయన కోల్పోయారని విమర్శించారు. రియల్ ఎస్టేట్ కోసం చంద్రబాబు ఆలోచన చేస్తే.. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి సీఎం జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు. అమరావతి రైతులకు న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. -
దీనిని మేమంతా స్వాగతిస్తున్నాం: మంత్రి
సాక్షి, అనంతపురం: పరిపాలన వికేంద్రీకరణకు గవర్నర్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వటాన్ని స్వాగతిస్తున్నామని మంత్రి శంకర్ నారాయణ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఆర్డీఏ చట్టం రద్దును స్వాగతిస్తున్నామని చెప్పారు. ఏపీలో అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయమని, ఇందుకు మూడు రాజధానులు ఆయన లక్ష్యం అన్నారు. అదే విభజన గాయాలు మానాలంటే అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ తథ్యమన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసమే చంద్రబాబు అమరావతి డ్రామాలు ఆడారని, అమరావతిలో టీడీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని మంత్రి ధ్వజమెత్తారు. రైతుల కడుపు కొట్టి భూములు లాక్కున్నారని మండిపడ్డారు. సీఎంజగన్ వల్లే ఏపీ సర్వతోముఖాభివృద్ధి సాధ్యమోందని, రాయలసీమలో హైకోర్టు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. నిపుణుల నివేదిక మేరకే మూడు రాజధానుల నిర్ణయం సీఎం జగన్ తీసుకున్నారని మంత్రి పేర్కొన్నారు. (చదవండి: మూడు రాజధానులకు రాజముద్ర పడిందిలా..) పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ... రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లు రద్దును గవర్నర్ ఆమోదించడం రాష్ట్ర సమగ్రాభివృద్ధికి శుభ సూచకమని ఆనందం వ్యక్తం చేశారు. వెనుకబడిన రాయలసీమ అభివృద్ధికై కర్నూలును న్యాయ రాజధానిగా గుర్తించడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని చెప్పారు. రాయలసీమ వాసుల తరుపున సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలుకుంటున్నానని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ ఆధ్వర్యంలో దివంగత మహానేత వైఎస్సార్ కలలుకన్న రాయలసీమ, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను పూర్తిచేసి తీరుతామన్నారు. చంద్రబాబు, టీడీపీ నాయకులు అవినీతితో అమరావతిని నిర్మించాలన్న కలలు కల్లలయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ: పరిపాలన వికేంద్రీకరణతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమని ఆమె హర్షం వ్యక్తం చేశారు. మూడు రాజధానులు, సీఆర్డీఏ బిల్లుల రద్దుకు శుక్రవారం గవర్నర్ ఆమోదం తెలపడాన్ని ఆమె స్వాగతిస్తున్నట్లు చెప్పారు. విశాఖపట్నంలో పరిపాలన రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని ఆశభావం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి అంతా హైదరాబాద్‌లో ఉండడం వల్ల ఎంతగానో నష్టపోయామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఇప్పటికీ ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు వెనుకబాటులో ఉన్నాయని, మళ్లీ ప్రాంతీయ ఉద్యమాలు రాకుండా ఉండాలనే ఏకైక లక్ష్యంతోనే మూడు రాజధానులను సీఎం జగన్ తీసుకొచ్చినట్ల ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్సీ శమంతకమణి మాట్లాడుతూ... సీఎం వైఎస్ జగన్ విజన్ ఉన్న నాయకుడని, ఏపీలో మూడు రాజధానులు ఎంతో అవసరమన్నారు. శాసనమండలిలో బిల్లులు ఆమోదం పొందకుండా చంద్రబాబు కుట్ర పన్నారన్నారు. పరిపాలన వికేంద్రీకరణ బిల్లును ఆమోదించిన గవర్నర్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చారిత్రక అవసరమని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. -
మూడు రాజధానులను సందర్శిస్తా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల కోసం ప్రవేశపెట్టిన బిల్లును గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ శుక్రవారం ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని తెలుగు రాష్ట్రాల బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ప్లెమింగ్ స్వాగతిస్తూ గొప్ప పరిణామంగా కొనియాడారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా ఆ మూడు నగరాలు సంక్షేమ సౌభాగ్యాలతో విరాజిల్లాలని ఆకాంక్షించారు. శాసన రాజధాని అమరావతి, పరిపాలన రాజధాని విశాఖపట్నం, న్యాయ రాజధాని కర్నూలు నగరాలను సందర్శించేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని తెలిపారు. అయితే ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కరాళ నృత్యం తగ్గిన తర్వాత తప్పకుండా వీటిని సందర్శించేందుకు ఏపీకి వస్తానంటూ ట్వీట్ చేశారు. కాగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మూడు రాజధానుల బిల్లు ఎట్టకేలకు ఆమోదం పొందడంతో రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. (మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం) (వైజాగ్‌ని చాలా మిస్ అవుతున్నా..) -
ఇంకా ఎన్నాళ్లు ఈ ముసుగు కన్నా?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గవర్నర్‌కు లేఖ రాయడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మండిపడ్డారు. ఈమేరకు సోమవారం తన ట్విటర్ ఖాతాలో.. కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు కోవర్టు అని మళ్లీ స్పష్టమైందని ఎద్దేవా చేశారు. సొంత పార్టీ అభిప్రాయానికి వ్యతిరేకంగా చంద్రబాబుకు అనుకూలంగా రాజధాని బిల్లు ఆమోదించవద్దని గవర్నర్‌కు లేఖ రాశారని విమర్శించారు. దీనితో పార్టీ అధిష్టానం ఆగ్రహానికి గురయ్యారని వ్యాఖ్యానించారు. ఇంకా ఎన్నాళ్లు ఈ ముసుగు కన్నా? అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (వ్యవస్థలను నాశనం చేయడం మీకు కొత్త కాదుగా!) చదవండి: (ఏం చేసినా చిట్టినాయుడు స్టైలే వేరు..) -
‘ఆయనకు వచ్చిన ముప్పేంటట’
సాక్షి, గుంటూరు: అభివృద్ధి వికేంద్రీకరణకు బహుజన పరిరక్షణ సమితి మద్దతు తెలిపింది. ఈమేరకు బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో దళిత, మహిళా, ప్రజాసంఘాలు రాజధాని ప్రాంతం మందడంలో సోమవారం రిలే దీక్షలు చేపట్టారు. అభివృద్ధి వికంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని బహుజన పరిరక్షణ సమితి నాయకులు పేర్కొన్నారు. అణగారిన వర్గాలకు మేలు చేయాలని సీఎం వైఎస్ జగన్ యత్నిస్తున్నారని తెలిపారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. రైతుల ముసుగులో టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బినామీల కోసమే చంద్రబాబు ఆరాటపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎంపీ నందిగం సురేష్‌కు టీడీపీ నేతల నుంచి ముప్పు ఉందని పేర్కొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణతో చంద్రబాబుకు వచ్చిన ముప్పేంటని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు పిచ్చి వేషాలు మానకపోతే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. పేదలపై చంద్రబాబుకు ప్రేమ లేదని అన్నారు. -
‘వారి సూచన మేరకే అమరావతిపై నా ప్రకటన’
-
‘వారి సూచన మేరకే అమరావతిపై నా ప్రకటన’
సాక్షి, న్యూఢిల్లీ : రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోదేనని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. కేంద్ర నాయకత్వం సూచన మేరకే అమరావతిపై తను ప్రకటన చేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తివేంద్ర సింగ్ రావత్ సైతం వేసవి రాజధాని ప్రకటించారని గుర్తుచేశారు. గురువారం ఢిల్లీలో జీవీఎల్ మాట్లాడుతూ.. ఉత్తరాఖండ్ సీఎం ప్రకటనతో రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోదేనని మరోసారి తేలిపోయిందన్నారు. సీఆర్డీఏ చట్టం ద్వారా రైతుల భూముల సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను మభ్యపెట్టవద్దని హితవు పలికారు. తమ రాష్ట్ర పార్టీ కోరిన అన్ని పనులను కేంద్ర ప్రభుత్వం చేయదని చెప్పారు. పీపీఏల రద్దు అంశంలో కూడా కేంద్రం నేరుగా జోక్యం చేసుకోలేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా ఒప్పందాలు చేసుకునే వ్యవస్థ ఉండాలని మాత్రమే గోయల్ సూచించారని తెలిపారు. ఒక చానల్ తనపై తప్పుడు వార్తలు నడుపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు మళ్లీ కట్టుకథలు అల్లితే సమాచార మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. అమరావతిపై జాతీయ నాయకత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాతే తను మాట్లాడుతున్నట్టు చెప్పారు. -
‘ఆ ఖర్చుతో రాష్ట్ర ప్రాజెక్టులు పూర్తి చేయొచ్చు’
సాక్షి, అమరావతి : రాష్ట్ర విభజన కంటే ఎక్కువ నష్టం గత అయిదేళ్ల పాలనలో జరిగిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం తాడేపల్లిలో వైఎస్సార్సీపీ వాణిజ్య విభాగ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అభివృద్ధి వికేంద్రీకరణ, మూడు రాజధానుల ఏర్పాటు అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అయిదేళ్లలో వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయిందన్నారు.రూ. 90 వేల కోట్ల అప్పుతో ప్రారంభమైన రాష్ట్రం.. మూడు లక్షల కోట్ల అప్పుకు చేరుకుందన్నారు. దోచి పెట్టడానికే గత ప్రభుత్వంలో కేబినెట్ సమావేశాలు జరిగేవని, టీడీపీ హయాంలో రాష్ట్ర ఖజానా దివాళా తీసిందని అన్నారు. సంక్షేమాన్ని టీడీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు. ప్రజల కష్టాలు తెలుసుకొనేందుకే వైఎస్ జగన్ సుదీర్ఘ పాదయాత్ర చేశారని, అధికారం చేపట్టిన రోజు నుంచే సీఎం జగన్ ప్రజల కోసం పనిచేయడం మొదలు పెట్టాడని ప్రశంసించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది ప్రజా సంక్షేమానికి టీడీపీ అడ్డుపడుతోందని, చంద్రబాబు ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని అయినా ప్రవేశ పెట్టారా అని ప్రశ్నించారు. అవినీతితో రాష్ట్రాన్ని చంద్రబాబు అధోగతి పాలు చేశారని ధ్వజమెత్తారు. మూడు రాజధానులుతోనే అభివృద్ధి జరుగుతుందని, ప్రజలు ప్రభుత్వం మీద ఆధారపడటం తగ్గించడం కోసం గ్రామ సచివాలయ వ్యవస్థను సీఎం తీసుకొచ్చారన్నారు. రాజదానికి లక్ష కోట్లు పైనే ఖర్చు అవుతుందని సీఎం జగన్‌కు ముందే తెలిస్తే ఎన్నికలప్పుడే తాను అంత ఖర్చు చేయాలేనని చెప్పేవారని పేర్కొన్నారు. రాజధాని ఇక్కడ కట్టలేనని తెలిసే చంద్రబాబు ఇల్లు అమరావతిలో కట్టుకోలేదని, అమరావతితో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని దుయ్యబట్టారు. అమరావతి విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. వైజాగ్ ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరమని, అందుకే అక్కడ లక్షల కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని సజ్జల రామకృష్ణరెడ్డి తెలిపారు. రాజధాని మొత్తం అమరావతి నుంచి తొలగించడం లేదని, ఒక భాగాన్ని వైజాగ్ కు, మరొక భాగాన్ని రాయలసీమకు తీసుకుని వెళ్తున్నారని గుర్తు చేశారు. అమరావతి సౌకర్య వంతమైన నివాస యోగ్యం కాదని, అందుకే ఉద్యోగులు అక్కడ నివాసం ఏర్పాటు చేసుకోలేదని అన్నారు. అమరావతికి అప్పు చేసి ఖర్చు చేసే ధనంతో రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తి చేయొచ్చని పేర్కొన్నారు. రాజధానిలో ఉన్న రెండు నియోజకవర్గాల ప్రజలు చంద్రబాబును నమ్మలేదని, అందుకే అక్కడ బాబు కుమారుడుని ఓడించారని అన్నారు. సీఎం జగన్ రాజదానిని తన ఊరు తీసుకుపోవడం లేదని, మూడు రాజధానులు వ్యతిరేకించిన వారే ఒక ఏడాది తరువాత స్వాగతిస్తారని అభిప్రాయపడ్డారు. రాజదానిపై చంద్రబాబు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. జిల్లాలు వారిగా సభలు సమావేశాలు ఏర్పాటు చేసి మూడు రాజధానుల ఉపయోగాన్ని వివరించాలని సూచించారు. -
అందుకే బాబు డ్రామాలాడుతున్నారు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ప్రజలు నాయకులు మీద ఆధార పడకూడదనే గ్రామ సచివాలయం వ్యవస్థను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలో మంగళవారం ఏర్పాటు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి అనేది వికేంద్రీకరణ ద్వారానే సాధ్యమని తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతి అంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డ్రామాలాడుతున్నారని విమర్శించారు. పేదలు అమరావతిలో ఒక గజం స్థలం కొనగలిగే అవకాశం ఉందా అని, రాజధానిలో ఉద్యోగులు కూడా ఇల్లు కట్టుకొనేందుకు ఇష్టపడలేదన్నారు. చంద్రబాబు, టీడీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారుని, రాజధాని నూజివీడులో పెడుతున్నామని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని పేర్కొన్నారు. రాజధానికి ప్రభుత్వ స్థలం ఉండాలని సీఎం జగన్ అసెంబ్లీలో చెప్పారన్నారు. అమరావతిలో ప్రభుత్వ స్థలం అయితే ఉద్యోగులు, పేదలకు ఇళ్ల స్థలాలు నామమాత్రపు ధరకు ఇవ్వొచ్చున్న ఉద్దేశంతో ఆయన అసెంబ్లీలో చెప్పారని ఆయన వెల్లడించారు. 'అందుకే వికేంద్రీకరణ దిశగా అడుగులు' ఇక చంద్రబాబు చేబుతున్నట్లు పూర్తిగా రాజదానిని తరలించడం లేదని, ఒక భాగాన్ని మాత్రమే వైజాగ్ తీసుకెళ్తున్నామని సజ్జల వివరించారు. రాజధాని ప్రజలే చంద్రబాబును నమ్మలేదని, అందుకే లోకేష్‌ను చిత్తుగా ఓడించారని విమర్శించారు. హైదరాబాద్‌తో పోటీ పడగలిగే రాజధానిని ఏర్పాటు చేయాలని సీఎం జగన్ చూస్తున్నట్లు తెలిపారు. కాగా అమరావతిలో జరిగిన కుంభకోణంలో విచారణ జరుగుతుందని, రాజధాని ప్రాంత రైతులను సీఎం జగన్ ఆదుకుంటారన్నారన్నారు. అభివృద్ధి అంత హైదరాబాద్‌లో కేంద్రీకృతం కావడం వలనే రాష్ట్రం విడిపోయిందని, మళ్ళీ ఏర్పాటు వాద ఉద్యమాలు రాకూడదనే అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు రాజధానిలో కృత్రిమ ఉద్యమం చేయిస్తున్నారని, ఆయన మోసాన్ని ప్రజలకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు వివరించాలన్నారు. కాగా అమరావతి నిర్మించాలంటే లక్షల కోట్లకుపైగా ఖర్చు అవుతుందని, అప్పుల్లో ఉన్న మనం ఇప్పుడు లక్షల కోట్లు అప్పు తెచ్చి నిర్మించగలమా అని పేర్కొన్నారు. శివరామకృష్ణన్, శ్రీ కృష్ణ, జీఎన్ రావు, బోస్టన్ కమిటీలు కూడా అభివృద్ధి వికేంద్రికరణ చేయాలని సూచించాయని తెలిపారు. అమరావతిలో దళిత ఎంపీ కళ్ళలో కారం కొట్టడం ఏమిటని ప్రశ్నించారు. దళిత ఎంపీపై దాడి చేయడం ఇది రెండవసారని ఆయన పేర్కొన్నారు. ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నరకాసురుడు పాలన చేసాడు కాబట్టి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని ఏద్దేవా చేశారు. ప్రజలు బుద్ది చెప్పినా ఇంకా చంద్రబాబులో ఎలాంటి మార్పు రాలేదు రామకృష్ణ విమర్శించారు. -
చంద్రజ్యోతి బోగస్ వార్త రాసింది
-
ఏం బతుకులు మీవి..?: విజయసాయిరెడ్డి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కి మూడు రాజధానుల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలపై ఎల్లోమీడియాలో వస్తోన్న వార్తలపై వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మండిపడ్డారు. 'విశాఖలో రాజధాని ఏర్పాటుకు నేవీ తీవ్ర అభ్యంతరం చెప్పిందని బోగస్ వార్త రాసిన చంద్రజ్యోతి పైన, దాన్ని సమర్థిస్తూ సున్నిత రక్షణ సమాచారాన్ని మీడియా సమావేశంలో బయట పెట్టిన పచ్చ పార్టీ నేతల పైనా దేశద్రోహం కేసులు పెట్టాలి. ఏం బతుకులు మీవి? అమరావతి కోసం నౌకాదళాన్నీ వివాదంలోకి లాగారు' అంటూ ట్విటర్ వేదికగా విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. కాగా మరో ట్వీట్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 'మద్యం వ్యసనం నుంచి బయటపడుతున్న వారిని రెచ్చగొట్టి మళ్లీ బానిసలను చేసే దాకా చంద్రబాబు నిద్రపోయేట్టు లేరని, పద్నాలుగేళ్లు సీఎంగా చేసిన వ్యక్తి ఇంత బాధ్యత లేకుండా మాట్లాడటం దేశంలో ఎక్కడా కనిపించదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడిపుడే తాగుడుకు దూరమవుతున్న వారు తమ భార్యాపిల్లలతో ప్రశాంతంగా గడుపుతున్నారంటూ' విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. చదవండి: ఏమైంది 40 ఇయర్స్ ఇండస్ట్రీకి..? ఆ కాగితాలు భద్రంగా దాచుకో చిట్టీ 'టీడీపీ ఎమ్మెల్సీలు వాపోతున్నారట' -
మరోసారి బట్టబయలైన పచ్చ మీడియా బండారం
-
మరోసారి బట్టబయలైన పచ్చ మీడియా బండారం
సాక్షి, అమరావతి : అధికార వికేంద్రీకరణపై పచ్చ మీడియా బండారం మరోసారి బట్టబయలైంది. నేవీ పేరును ఉటంకిస్తూ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనాన్ని.. ఈస్ట్రన్ నేవల్ కమాండ్ తీవ్రంగా ఖండించింది. మిలీనియం టవర్స్‌లో సచివాలయం ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని నేవీ అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు పీఐబీ రక్షణ విభాగం పత్రికా ప్రకటన విడుదల చేసింది. దృష్టి మరల్చే యత్నం.. తప్పుడు కథనాల ప్రచారం కోసం ఎల్లో మీడియా నేవీని సైతం వదల్లేదు. విశాఖ రాజధానిపై నేవీ అభ్యంతరం చెప్పిందని ఆంధ్రజ్యోతి తప్పుడు వార్తలను ప్రసారం చేసింది. అంతేకాకుండా మిలీనియం టవర్స్‌లో సెక్రటేరియట్ ఏర్పాటు చేయవద్దంటూ ఏపీ ప్రభుత్వానికి నేవీ లేఖ రాసినట్లు ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేసింది. ఈఎస్ఐ కుంభకోణం, అమరావతి భూముల అక్రమాలపై సిట్ విచారణ నేపథ్యంలో.. ప్రజల దృష్టిని మరల్చేందుకు ఎల్లో మీడియా ఎత్తుగడ వేసింది. మిలీనియం టవర్స్‌కి ఐఎన్ఎస్ కళింగ ప్రాంతం దగ్గరగా ఉన్నందునే నేవీ అడ్డు చెప్పిందంటూ తప్పుడు కథనాలు ప్రసారం చేసింది. ఎల్లో మీడియా తప్పుడు వార్తలను తూర్పు నావికాదళం తీవ్రంగా ఖండించింది. తప్పుడు కథనాలపై కేంద్ర రక్షణశాఖ దృష్టికి తీసుకెళ్తామని అధికారవర్గాలు పేర్కొన్నాయి. -
ప్రతిపక్షం విమర్శలు అర్థరహితం
-
అప్పుడే విశాఖ రాజధాని
అత్యధిక మంది తెలుగు మాట్లాడే జిల్లాలతో కూడిన ప్రత్యేక ‘ఆంధ్రరాష్ట్రం’ ఏర్పడాలనే భాషాపరమైన సెంటిమెంటును ఇరవయ్యవ శతాబ్ది రెండవ దశాబ్ది ఆరంభం నుండి వ్యాప్తిగావించడంతో బాటు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి విడిపోవాలని తీవ్రంగా ఉడుంపట్టుబట్టిన వారిలో ‘ఉత్తర సర్కారు’ జిల్లాల నాయకులు ముఖ్యులు. వారి కోరిక, ఒత్తిడుల కారణంగా 1953 నాటి కేంద్రప్రభుత్వం అక్టోబర్ ఒకటవ తేదీ 1953న ‘ఆంధ్రరాష్ట్రం’ను ఏర్పరచింది. దీని కొనసాగింపుగా ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభలోని తెలుగు జిల్లాల ఎమ్మెల్యేలు (140 మంది) మూజువాణి ఓటుతో కర్నూలును రాజధానిగా (1937 శ్రీబాగ్ ప్రకారం) నిర్ణయించడం జరిగింది. గుంటూరులో హైకోర్టు పెట్టారు. ఆనాటికి ఆంధ్రరాష్ట్రంలో, ముఖ్యంగా నాలుగు మధ్య ఆంధ్ర జిల్లాల్లో, మరీ ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని అన్ని పార్టీల నాయకుల్లో, మరింత ప్రధానంగా ఆ జిల్లాల కాంగ్రెస్ (43 మంది శాసనసభ్యులు), కమ్యూనిస్ట్ (20 మంది శాసనసభ్యులు) నాయకుల్లో ఒకవైపు విజయవాడ–గుంటూర్లను ఆంధ్రరాష్ట్ర రాజధానిగా ఏర్పరచుకోవాలనే ఆకాంక్ష, ఆలోచన; మరోవైపు ఉమ్మడి ఏపీని, దాని రాజధానిగా హైదరాబాద్‌ను ఏర్పరచుకోవాలనే ఆలోచన ఉండేది. కానీ, అప్పటి ‘హైదరాబాద్ స్టేట్’లోని తెలంగాణ వారిలో మాత్రం ఉమ్మడి ఏపీ ఏర్పాటు, దానికి రాజధానిగా హైదరాబాద్ ఉండడం వంటి ఆలోచనలు 1953 నాటికి ఉండేవి కాదు. అయినప్పటికీ, సర్కారు జిల్లాల నాయకులు, ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల నాయకులు కర్నూలు నుండి రాజధానిని మార్చాలని ఆంధ్ర రాష్ట్రం, రాజధాని కర్నూలు పుట్టిన రెండు నెలలలోపే తీవ్రంగా ప్రయత్నించడం జరిగింది. ఆలస్యం చేస్తే ఎలాంటి మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయో అన్నట్లు నాటి కర్నూలులోని శాసనసభ పలు దఫాలుగా, ‘ఆంధ్రరాష్ట్ర రాజధాని విషయంగా’ చర్చలు జరిపి, నవంబర్ ముప్పయ్ 1953న కర్నూలు రాజధాని మార్పు గురించి తీర్మానం చేసింది. అందులో, ఏప్రిల్ ఒకటవ తేదీ 1956 వరకు మాత్రమే కర్నూలులో రాజధానిని ఉంచాలని, ఆ తరువాత విశాఖపట్టణాన్ని శాశ్వత రాజధాని చేయాలని తీర్మానించారు. ఈ తీర్మానానికి అనుకూలంగా 61 ఓట్లు, ప్రతికూలంగా 58 ఓట్లు రాగా, తటస్థులుగా 20 మంది (కమ్యూనిస్టులు) ఉన్నారు. ఉమ్మడి ఏపీ, దాని రాజధానిగా హైదరాబాదు ఏర్పాటు జరుగుతాయోలేదో తెలియకముందే మూడేళ్ల ముందే కర్నూలు రాజధానిని మార్చడంపై అసెంబ్లీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇలా, రాజధానిపై, 1953లో మద్రాసులో ఒకసారి, కర్నూలులో మరోసారి అసెంబ్లీ చర్చించడం, ఒకసారి కర్నూలును, మరోసారి విశాఖను రాజధానిగా నిర్ణయించడానికి కారణం పంతొమ్మిదవ శతాబ్దిలో గోదావరి, కృష్ణా నదులపై సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయ్యాక అక్కడి నాలుగు జిల్లాల్లో మెరుగైన ఆర్థిక, సాంఘిక మార్పులు జరగడం వలన ఆంధ్రరాష్ట్రం ఏర్పరచుకోవాలని కృష్ణా, గుంటూరు జిల్లాల నాయకులు భావించడం, విజయవాడ, గుంటూర్లలో రాజధానిని ఏర్పరచుకొని ఆంధ్రరాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర నిర్వహించాలనే బలమైన కోరిక వారిలో ఉండడమే. కానీ విజయవాడ, గుంటూరులు రాజధానిగా ఎన్నుకోకపోవడంతో ఆ జిల్లాల వారు ఉమ్మడి ఏపీ ఏర్పాటుపై కేంద్రీకరించి, తమకు అనుకూలంగా ఉన్న హైదరాబాద్‌ను రాజధానిగా చేసుకోవడం జరిగింది. అంటే, 1937 నాటి శ్రీబాగ్ ప్రకారం పొందిన కర్నూలు రాజధాని, లేదా, ఒక ప్రభుత్వపాలనా విభాగాన్ని తిరిగి పొందాలని, నవంబర్ ముప్పయ్ 1953న అసెంబ్లీ తీర్మానం ప్రకారం, విశాఖ పొందిన శాశ్వత రాజధానిని తిరిగి పొందాలని, అదే నవంబర్ ముప్పయ్ 1953న వస్తుందనుకొన్న రాజధానిని తిరిగి విజయవాడ, గుంటూర్లకు రావాలని మూడు ప్రాంతీయుల్లోనూ ఆకాంక్ష ఉంది. ఈ ఆకాంక్షలన్నీ తీర్చడానికే నేటి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అమరావతిలో లెజిస్లేచర్ విభాగాన్ని, విశాఖలో ఎగ్జిక్యూటివ్ విభాగాన్ని, కర్నూలులో జ్యుడీషియల్ విభాగాన్ని ఏర్పరచడానికి అసెంబ్లీలో నిర్ణయించడం జరిగింది. ఇలా చేస్తే ఆయా ప్రాంతాల అభివృద్ధికి కూడా ఊతం ఇస్తాయని ఆయన భావించడం జరిగింది. డా‘‘ దేవిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి రిటైర్డ్ ప్రొఫెసర్, చరిత్రశాఖ, ఎస్వీ యూనివర్సిటీ -
'పవన్ కళ్యాణ్ రాజకీయ అజ్ఞాని'
సాక్షి, అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబు, లోకేష్ ఇచ్చే ప్యాకేజీలకు పవన్ లొంగిపోయారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఘాటుగా విమర్శించారు. ప్రశ్నించేందుకు పార్టీ పెట్టిన పవన్.. పేదలకు, దళితులకు, సామాన్యులకు అండగా ఉన్న వైఎస్సార్ సీపీని మాత్రమే ప్రశ్నిస్తున్నారని, పేద రైతుల భూములు కాజేసిన చంద్రబాబును మాత్రం ప్రశ్నించడం లేదని ధ్వజమెత్తారు. రాజధాని ప్రాంతంలో పవన్ పర్యటనను ఆళ్ల తప్పుపట్టారు. గుంటూరు జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ రాజధాని ప్రాంతంలో పర్యటించే ముందు మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. జనసేన ఎమ్మెల్యే వరప్రసాద్‌కు ఉన్న పరిజ్ఞానం కూడా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు లేదని ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. చదవండి: ‘ఆయన వేషం మార్చి నటుడయ్యారు..!’ గత ఐదేళ్లు పవన్ చంద్రబాబుతో లోపాయికారిగా స్నేహం చేసి, ఆయన ఇచ్చిన ప్యాకేజీలు తీసుకున్నారు. రైతులకు చంద్రబాబు మోసం చేసినప్పుడు ఏ ఒక్క రోజు కూడా రాజధాని ప్రాంతంలో పవన్ పర్యటించలేదు. బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా ఏ రోజు కూడా పవన్ చంద్రబాబును ప్రశ్నించలేదు. రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీ నుంచి ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టలేదు. గత ఐదేళ్లు చంద్రబాబు ప్యాకేజీలకు లొంగి.. ఈ రోజు రాజధాని ప్రాంతానికి వచ్చి రైతుల సమస్యలను తెలుసుకోకుండా వారిని రెచ్చగొట్టడం ఎంతవరకు వరకు సమంజసం. మేం రాజధాని ప్రాంత రైతులం. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసి రిజర్వ్ జోన్లను తొలగించాలని కోరాం. సమస్య ఏంటో తెలుసుకోకుండా పవన్ రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు. అసలు రాజధాని అమరావతి నుంచి తరలించడం లేదు. ఇక్కడే శాసన సభ ఉంటుంది. అధికార వికేంద్రీకరణ కావాలి. ఎగ్జిక్యూటీవ్ రాజధానిగా విశాఖ, న్యాయ రాజధానిగా కర్నూలును చేయబోతున్నాం. చంద్రబాబు వదిలిపెట్టిన పనులు పూర్తి చేయాలంటే లక్షల కోట్లు అప్పు చేయాల్సి వస్తుంది. రాజధాని రైతులకు సీఎం న్యాయం చేస్తుంటే రైతులను రెచ్చగొట్టడం సరికాదు. రాజధాని అంశం రాష్ట్రం పరిధిలో ఉంటుందని తెలిసి కూడా రైతులను రెచ్చగొట్టడం సరికాదు. చంద్రబాబు ఏం చెబితే.. అదే పవన్ మాట్లాడుతున్నారు. పవన్‌కు లోక పరిజ్ఞానం లేదు. ఇది తప్పు అయితే చంద్రబాబు, లోకేష్ ఇస్తున్న ప్యాకేజీలు తీసుకొని మాట్లాడుతున్నారు. రాజధాని ప్రాంతంలో పర్యటించే ముందు ఇక్కడ ఎన్ని గ్రామాలు ఉన్నాయి..రైతులు, రైతు కూలీలు, పేదలు ఎంత మంది ఉన్నారో తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. సీఎం వైఎస్ జగన్ అడగకుండానే రైతులకు కౌలు 15 ఏళ్లు పెంచారు. కూలీలకు రూ.2,500 నుంచి రూ.5,000 వరకు పరిహారం పెంచారు. సీఎం నిర్ణయానికి హర్షించాల్సింది పోయి చంద్రబాబు, లోకేష్‌లు చెప్పినట్లు పవన్ మాట్లాడటం సరికాదు. చదవండి: నా జీవితం ఏ మగాడి సాయం లేకుండా సాగుతోంది: రేణు సుమారు 4500 ఎకరాల భూములు బినామీల పేరుతో, తెల్ల రేషన్‌కార్డు దారులతో కొనుగోలు చేయించారు. ఇవాళ కేసులు కూడా నమోదు అయ్యాయి. వీటిపై పవన్ నోరు మెదపడం లేదు. దళితుల భూములను చంద్రబాబు కాజేస్తే..ఆ భూములు తిరిగి దళితులకు సీఎం వైఎస్ జగన్ ఇప్పించారు. ఈ విషయాలపై పవన్ మాట్లాడటం లేదు. చంద్రబాబు, లోకేష్ చెప్పిన మాటలు వళ్లెవేయడంలో పవన్ ఉన్నారు. చంద్రబాబు బినామీ కంపెనీలతో వేల కోట్లు డబ్బులు దోచేశాడు. దీనిపై పవన్ మాట్లాడటం లేదు. తాత్కాలిక భవనాలకు వేల కోట్లు ఖర్చు చేసి దోచుకున్నా మాట్లాడటం లేదు. రాజధాని పేరుతో ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ కట్టకపోయినా పవన్ ప్రశ్నించడం లేదు. ఇన్ని బొక్కలు పెట్టుకొని ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన పవన్.. పేదలకు, దళితులకు, సామాన్యులకు అండగా ఉన్న వైఎస్సార్ సీపీని ప్రశ్నిస్తానని పవన్ అంటున్నారు. ఇవాళ జనసేన పార్టీ ఎమ్మెల్యే కూడా సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలకు మద్దతు తెలిపారు. పవన్ ఎందుకు ఈ విషయాలపై మాట్లాడటం లేదు. పవన్ రైతులను, జనసేన కార్యకర్తలను కూడా మోసం చేస్తున్నారు. రాజధాని పర్యటనకు తన పార్టీ ఎమ్మెల్యేను ఎందుకు పిలువలేదని ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. చదవండి: రేణుదేశాయ్ ఇబ్బందులు అందరికీ తెలుసు -
'పవన్ కళ్యాణ్ రాజకీయ అజ్ఞాని'
-
రాజమండ్రిలో వికేంద్రీకరణకు మద్దతుగా రిలే నిరాహార దీక్ష
-
ఏపీ: సెలెక్ట్ కమిటీకి నో
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ ప్రభుత్వం శాసనమండలిలో ప్రతిపాదించిన పాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుపై సెలెక్ట్ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదని మండలి కార్యాలయం తోసిపుచ్చింది. సెలెక్ట్ కమిటీని నియమించాలని చైర్మన్ ఎంఏ షరీఫ్ పంపిన ఫైలును లెజిస్లేచర్ కార్యదర్శి (ఇన్చార్జి) పి.బాలకృష్ణమాచార్య వెనక్కు పంపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. 154వ నిబంధన కింద సెలెక్ట్ కమిటీ వేయడం చెల్లదని ఆయన ఫైలుపై రాసి పంపినట్లు సమాచారం. దీంతో టీడీపీ ఎమ్మెల్సీలు బుద్దా వెంకన్న, బచ్చుల అర్జునుడు, నాగ జగదీష్, అశోక్‌బాబు లెజిస్లేచర్ కార్యదర్శిని కలిసి సెలెక్ట్ కమిటీకి నోటిఫికేషన్‌ను జారీ చేయాల్సిందిగా ఒత్తిడి తెచ్చారు. చైర్మన్ ఆదేశాలను పాటించాల్సిందేనని మండలిలో విపక్ష నేత యనమల రామకృష్ణుడు కూడా కార్యదర్శిపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా ఉంది కనుకే కమిటీ నియామకం సాధ్యం కాదని కార్యదర్శి వారికి వివరించినట్లు తెలిసింది. ఉమ్మారెడ్డి అభ్యంతరం సెలెక్ట్ కమిటీ నియామకానికి తన నిర్ణయానుసారం నోటిఫికేషన్ జారీ చేయాల్సిందిగా చైర్మన్ షరీఫ్ లెజిస్లేచర్ కార్యదర్శికి ఆదేశాలివ్వడాన్ని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. సెలెక్ట్ కమిటీ సభ్యులను వారి అనుమతి లేకుండానే షరీఫ్ ప్రకటించడం పట్ల కూడా ఆయన అభ్యంతరం తెలిపారు. సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు నిబంధనలు ఉన్నాయని, వాటిని పాటించకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ సభ్యులను నియమించరాదని కొద్ది రోజుల క్రితం లేఖ రాశారు. అందులో ఆయన నిబంధనలను ఉటంకిస్తూ.. సెలెక్ట్ కమిటీకి పంపాలనే నిర్ణయంపై మండలిలో ఓటింగ్ తీసుకోలేదని, సభ్యులను నియమించేటప్పుడు వారి నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని, వారు అంగీకరిస్తేనే ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు. సెలెక్ట్ కమిటీలో ఉండటానికి సంబంధిత సభ్యులు సమ్మతిని తెలపడానికి కనీసం రెండు మూడు రోజుల సమయం ఇవ్వాలని తేల్చిచెప్పారు. ఇదే విధంగా అభ్యంతరం తెలుపుతూ మండలి సభా నాయకుడైన మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా లేఖ రాశారు. మండలి తనకు అధికారం ఇచ్చింది కాబట్టి సెలెక్ట్ కమిటీ వేస్తానంటే కుదరదని, దానికి సాంకేతికంగా ఓటింగ్ జరిగి ఆమోద ముద్ర పడాలని పేర్కొన్నారు. కాగా.. సెలెక్ట్ కమిటీ, మరో కమిటీలో సభ్యులుగా ఉండటానికి నిరాకరిస్తూ వైఎస్సార్సీపీ సభ్యులు వెన్నపూస గోపాల్‌రెడ్డి, మహ్మద్ ఇక్బాల్‌లు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కార్యదర్శి సెలెక్ట్ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదని ఫైలును వెనక్కి పంపారని సమాచారం. మండలి చైర్మన్ నిర్ణయంతో వివాదం పాలనా వికేంద్రీకరణ బిల్లును జనవరి 21న అసెంబ్లీ ఆమోదించి అదే రోజు శాసనమండలికి పంపింది. 22న మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణలు ఈ బిల్లును మండలిలో ప్రతిపాదించారు. నిబంధనల ప్రకారం బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలంటే ప్రతిపక్షం ఆ బిల్లును మండలి పరిశీలనకు తీసుకోవడానికి ముందే నోటీసులు ఇవ్వాలి. అయితే అలా జరగకపోగా, రెండు రోజుల సుదీర్ఘ వివాదానంతరం 23వ తేదీ చైర్మన్.. తన విచక్షణాధికారాలను ఉపయోగిస్తూ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నట్లు చెప్పి సమావేశాలను వాయిదా వేయడంతో వివాదం తలెత్తడం తెలిసిందే. (చదవండి: మూడు రాజధానులతోనే మేలు) -
‘వారంతా చరిత్ర హీనులుగా మిగిలిపోతారు’
సాక్షి, విశాఖపట్నం: పరిపాలన రాజధానిగా విశాఖను ప్రతిఒక్కరు స్వాగతించాలని సీనియర్ జర్నలిస్టురమణమూర్తి ప్రజలను కోరారు. రాష్ట్ర అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా.. పరిపాలన రాజధాని ఏర్పాటును బలపరచడంతో పాటు త్వరితగతిన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను ఏర్పాటు చేయాలని విశాఖ ఆంధ్రయూనివర్శిటీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల విభాగం ఆధ్వర్యంలో సోమవారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆయనతో పాటు ప్రొఫెసర్లు డాక్టరు ప్రేమానందం, డాక్టర్ సరున్ రాజు, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షులు బి. కాంతరావు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు రమణమూర్తి మాట్లాడుతూ.. పరిపాలన రాజధాని ఏర్పాటుతో విశాఖకు, ఉత్తరాంధ్రకు మరింత మేలు జరుగుతుందని తెలిపారు. కాగా అమరావతి రైతులు చేసిన త్యాగమేమిటో ప్రజలకి చెప్పాలన్నారు. భూములతో వ్యాపారం చేసి త్యాగాలు చేశామనడం సరికాదన్నారు. అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం చెప్పిన తర్వాత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కి వేలాది మంది భూములిచ్చి త్యాగాలు చేశారని, ఉత్తరాంధ్రకు మేలు జరుగే పరిపాలన రాజధాని నిర్ణయానికి ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలన్నారు. విశాఖ రాజధానిగా మారితే ఉద్యోగ, ఉపాధి కల్పన పెరిగి నిరుద్యోగ సమస్య తగ్గుతుందని ఆయన వివరించారు. ఇక ప్రొఫెసర్ ప్రేమానందం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని మేధావులుగా మనమంతా మద్దతు పలకాలన్నారు. అధికార వికేంధ్రీకరణ ద్వారనే రాష్ట్రమంతా సమాన అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. ఒక వర్గానికి మేలు చేయడం కోసమే అమరావతి పేరుతో ఉద్యమాలు చేస్తున్నారని ఆయన అన్నారు. డాక్టర్ సరున్ రాజు మాట్లాడుతూ: విశాఖలో పరిపాలన రాజధానిని స్వాగతించాలన్నారు. విశాఖ పరిపాలన రాజధానిని అడ్డుకునేవాళ్లంతా చరిత్రహీనులగా మిగిలిపోతారన్నారు. వెనుకుబాటుకు గురైన ఉత్తరాంధ్రకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం ఒక వరం లాంటిదని, విశాఖను పరిపాలన రాజధానిగా ఏర్పాటు చేయాలన్న సీఎం జగన్ నిర్ణయాన్ని బలపరుస్తున్నామని ఆయన తెలిపారు. -
బాబు దగ్గర పవన్ కళ్యాణ్ గుమాస్తా..
సాక్షి, విజయవాడ: ఎన్నికల ముందు కర్నూలు రాజధాని కావాలని అడిగిన పవన్ కళ్యాణ్.. కర్నూలుకు హైకోర్టు వస్తే ఉద్యోగాలు వస్తాయా? అనడం అతని అజ్ఞానానికి నిదర్శనమని దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. కర్నూలు అభివృద్ధికి సీఎం జగన్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. శ్రీబాగ్ ఒప్పందంలో కర్నూలులో హైకోర్టు ఉండాలని ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. శనివారం ఆయన విజయవాడ 44వ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. సుమారు రూ.1 కోటి 60 లక్షల వ్యయంతో వేయనున్న రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్.. బాబుతో లాలూచీ పడి బీజేపీలో చేరాడని, ఈయన బాబు మేలు కోసమే పనిచేసే వ్యక్తి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బాబు దగ్గర పవన్ గుమస్తాగా పనిచేస్తున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నోట ఒకే మాట వస్తుంది.. మీ పాట్నర్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? అని పవన్‌ను ప్రశ్నించారు. దుర్మార్గంగా దోచుకున్నారు ‘ఐదేళ్లలో బాబు దుర్మార్గంగా దోచుకున్నందునే ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. పైగా పరిశ్రమలకు సబ్సిడీ కూడా ఇవ్వలేదు. టీడీపీ పాలనలో జన్మభూమి కమిటీలు అవినీతి ఊబిలో కూరుకుపోయాయి. బాబు.. మా వర్గానికే, మా వాళ్లకే అభివృద్ధి ఫలాలు అందాలనేలా పాలన సాగించారు. కానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పాలన అందాలని వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థలు తీసుకువచ్చారు. దీనిద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు చేరవేస్తాం. గతంలో పెన్షన్లు 44 లక్షలు ఉంటే ఇప్పుడా సంఖ్య 54లక్షలకు చేరుకున్నాయి’ అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. -
ఈ నెల 12న ఏపీ కేబినెట్ సమావేశం
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఈ నెల 12వ తేదీ ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మూడు రాజధానులపై ముందుకు వెళ్లే కార్యచరణ ప్రణాళికపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. -
బాబుది కుక్క తోక వంకర సామెత జీవితం..
సాక్షి, అమరావతి : చంద్రబాబు రాజకీయ వ్యభిచారిలా మాట్లాడుతున్నాడని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ధ్వజమెత్తారు. అమరావతిలో టీడీపీ నేతల బాగోతాలు బయట పడుతుంటే చంద్రబాబుకు దిక్కుతోచని పరిస్థితి నెలకొందని విమర్శించారు. తాడేపల్లిలో శుక్రవారం ఎమ్మెల్యే మాట్లాడుతూ..చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన శని అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తన కోసం, తన కుటుంబం కోసం, ఎల్లో మీడియా కోసం రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడని మండిపడ్డారు. కేసుల మాఫీ కోసమే సుజనాచౌదరి సీఎం రమేశ్‌ను బీజేపీలోకి చంద్రబాబు పంపారని ఆరోపించారు. అన్ని ప్రాంతాల సమానంగా అభివృద్ధి చెందడం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభివృద్ధి వికేంద్రీకరణను చేస్తున్నారని తెలిపారు. (‘కియా మోటార్స్ తరలింపు వార్తలు అవాస్తవం’) పక్కా ప్లాన్ ప్రకారం చంద్రబాబు,లోకేష్.. సీఎం జగన్‌పై విషం కక్కుతున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల బినామీల పేరుతో బాబు అమరావతిలో భూములు కొన్నారని, ఇన్సైడర్ ట్రేడింగ్ నుంచి బైట పడలాని ప్రయత్నిస్తున్నాడని దుయ్యబట్టారు. కియా మోటర్స్ వెళ్లిపోతుందని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని, ఇప్పుడు కియా ఎక్కడికి పోయిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతల మీద జరుగుతున్న ఐటీ దాడులు నుంచి దృష్టి మళ్లించేందుకు కియా వెళ్లిపోతుందని తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. చంద్రబాబు నోటి వెంట ఒక్క మాట నిజం రాదని, బాబుది సిగ్గు లేని జన్మ అని మండిపడ్డారు. ప్రచార పిచ్చితోనే చంద్రబాబు చచ్చిపోతారని, కుక్కతోక వంకర సామేత జీవితమని చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. (ఆ దమ్ము చంద్రబాబుకు ఉందా..?) -
రాజధానికి 53 వేల ఎకరాల భూమి అవసరమా?
సాక్షి, అమరావతి : రాజధాని విషయంలో ప్రతిపక్షనేత చంద్రబాబు ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని వైఎస్సార్సీపీ బీసీ సెల్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి విమర్శించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలోనూ మూడు రాజధానులకు మద్దతుగా నిర్వహించే కార్యక్రమాల్లో బీసీలందరూ పాల్గొనాలని పిలుపినిచ్చారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారన్నారు. సీఎం జగన్ ఒక సముచిత, చారిత్రక నిర్ణయాన్ని తీసుకున్నారని ప్రశంసించారు. మూడు రాజధానులు అనగానే చంద్రబాబు భయపడుతున్నారని విమర్శించారు. సీఎం వైఎస్ జగన్ నిర్ణయాన్ని బడుగు బలహీన వర్గాలు స్వాగతిస్తున్నాయన్నారు. (బాబుతో ప్రతాప్ కలిసి పనిచేశారు: జంగా) రాజధాని ఎక్కడికి పోవడం లేదని, శాసన రాజధానిగా అమరావతి కొనసాగుతుందని తెలిపారు. ప్రజల్ని తికమక పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రానికి లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని, రాజధానికి 53 వేల ఎకరాల భూమి అవసరమా అని ప్రశ్నించారు. 53 వేల ఎకరాలు తీసుకుని చంద్రబాబు అమరావతిలో గ్రాఫిక్స్ చూపారని, అమరావతిని బ్రమరావతిగా మార్చారని మండిపడ్డారు. చంద్రబాబు లెక్కల ప్రకారం అమరావతి నిర్మించాలంటే ఎన్ని దశాబ్దాలు పడుతుందని ప్రశ్నించారు. ఒకే చోట రాజధాని వల్ల ప్రాంతీయ అసమానతలు పెరుగుతాయని పేర్కొన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసే దిశగా ముఖ్యమంత్రి నడుస్తున్నారని, జరుగుతున్న సంక్షేమ పథకాలపై చంద్రబాబుఅక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. సంక్షేమ కార్యక్రమాలు ఆపి రాజధాని చేపట్టాలా అని, అలా చేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు అన్యాయం జరుగుతుందని జంగా కృష్ణమూర్తి తెలిపారు. -
‘అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం జగన్ లక్ష్యం’
-
రాజధానిపై చంద్రబాబు గందరగోళ ప్రకటనలు
-
‘ఇంకా ఏమేం ఉన్నాయో చెప్పండి విజనరీ’
సాక్షి, అమరావతి : ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల అంశంపై ఆయన కేంద్ర ప్రభుత్వంపై కూడా విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ‘ రాజధాని ఎక్కడుండాలనే విషయంపై కేంద్రం క్లారిటీ ఇచ్చినప్పటి నుంచి చంద్రబాబు మైండ్‌లో వైబ్రేషన్స్ పెరిగాయి. కేంద్ర ప్రభుత్వంపైనా రుసురుసలాడుతున్నాడు. రాజధాని పెట్టడం వరకే రాష్ట్రం ఇష్టమట. మార్చే అధికారం లేదంట. ఇంకా ఏమేం రూల్సున్నాయో ఒకేసారి చెప్పేయండి విజనరీ!’ అని విజయసాయిరెడ్డి ట్విట్ చేశారు. (చదవండి : రాష్ట్ర పరిధిలోనే ‘రాజధాని’) కాగా, రాష్ట్ర రాజధాని అంశంలో నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా వెల్లడించిన విషయం తెలిసిందే. తమ ప్రాదేశిక భూభాగంలో రాజధానిని ఎక్కడైనా నిర్ణయించుకునే అధికారం ఆయా రాష్ట్రాలకే ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. -
గణపవరంలో క్యాండిల్ ర్యాలీ
-
‘లోకేష్ బాబును జైలుకు పంపుతారా..?’
సాక్షి, గుంటూరు : చంద్రబాబు రెచ్చగొట్టే మాటలు నమ్మితే యువత జీవితాలు నాశనమవుతాయని వైఎస్సార్సీపీ నేత, తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. కమ్మ సామాజిక వర్గాన్ని చంద్రబాబు రెచ్చగొడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్మ సామాజిక వర్గం ఉన్న ప్రాంతాల్లోనే బాబు మీటింగులు పెడుతున్నారని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. ‘ఒక్కరోజు జైలుకెళ్లినా పరవాలేదని చంద్రబాబు రెచ్చగొడుతున్నారు. తన కుమారుడు లోకేష్ బాబును జైలుకు పంపుమంటే పంపుతారా..? కమ్మ సామాజిక ప్రజాప్రతినిధిగా మన మేలు కోసం చెప్తున్నా.. చంద్రబాబు మాటలు నమ్మి జీవితాలు పాడుచేసుకోవద్దు’ అని శివకుమార్ పేర్కొన్నారు. -
‘లోకేష్ ఓడిపోయాక రెఫరెండం ఎందుకు..?’
సాక్షి, తాడేపల్లి : చంద్రబాబు ప్రజల మద్దతు ఉన్న నాయకుడు కాదని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సి.రామచంద్రయ్య అన్నారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసే సత్తా చంద్రబాబుకు లేదని ఎద్దేవా చేశారు. సొంత ప్రయోజనాలకోసమే అమరావతిపై కృత్రిమ ఉద్యమం మొదలు పెట్టారని విమర్శించారు. రాజధాని అంశంపై చంద్రబాబు చెప్పినట్టే నడుచుకోవాలనే రూల్ ఉందా..? అని ప్రశ్నించారు. రాజధానిపై రాష్ట్రానిదే తుది నిర్ణయమని కేంద్రం స్పష్టం చేసిందని, చంద్రబాబు అండ్ కో చెప్పేదంతా అబద్ధమని తేలిపోయిందని పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. (చదవండి : చంద్రబాబుది పోరాటం కాదు..ఆస్తుల కోసం ఆందోళన) ‘రాజధాని రైతులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని విధాలుగా ఆదుకుంటారు. వారికి ఎలాంటి అన్యాయం జరగదు. రైతులకు సీఎం రెండు ఆఫ్షన్లు ఇచ్చారు. ఒకటి అభివృద్ధి చేయడం. రెండు వారి భూముల వారికి తిరిగి ఇవ్వడం. చంద్రబాబు తన వారికోసమే ఉద్యమం చేయిస్తున్నాడు. కొంత మంది పెయిడ్ లీడర్లను తయారుచేసి తిప్పుతున్నాడు. నీ పాలనలో ఒకసారైనా రిఫరెండం పెట్టావా చంద్రబాబు. అయినా, లోకేష్ ఓడిపోయాక రిఫరెండం ఎందుకు..? బాబుకు అవసరమైనప్పుడల్లా రిఫరెండం పెట్టాలా. ఆయన మాటలు విని రైతులు మోసపోవద్దు. ఇప్పటికైనా రాజధాని రైతులు దీక్ష విరమించాలి. హైదరాబాద్ నుంచి చంద్రబాబు ఎందుకు రాత్రికి రాత్రే అమరావతికి పరిగెత్తి వచ్చాడు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను అమలు చేయని తుగ్లక్ చంద్రబాబు. నాలుగు పంటలు పండే భూముల్లో రాజధాని పెట్టిన పెద్ద తుగ్లక్ ఆయన. మా విధానమే పరిపాలన వికేంద్రీకరణ. చంద్రబాబు చేసిన అవినీతికి తప్పకుండా జైలుకు వెళ్తారు. బీజేపీలోకి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పంపినా జైలుకు వెళ్లడం తప్పదు. ఆయన చచ్చిన పాము. టీడీపీ వెంటిలేటర్ మీద ఉన్న పార్టీ. టీడీపీకి సమాధి కట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. పవన్ కల్యాణ్ ఎందుకు రాజధానిలో పర్యటన చేస్తానంటున్నారు. పార్లమెంట్లో చెప్పిన తరువాత కూడా రాజకీయాలు చేస్తున్నారు’అని రామచంద్రయ్య విమర్శలు గుప్పించారు. (చదవండి : ప్రజాసేవే వైఎస్సార్సీపీ సిద్ధాంతం.. బలం..) -
రాష్ట్ర పరిధిలో ఎక్కడైనా రాజధాని: జీవీఎల్
-
బాబు తెలిసే రాద్ధాంతం చేశారు
సాక్షి, విశాఖపట్నం: స్థానిక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధమేనని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని అంశం తమ పరిధిలో ఉండదని కేంద్రం చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రాజధానిపై నిర్ణయం రాష్ట్ర పరిధి అంశమని తెలిసే చంద్రబాబు రాద్ధాంతం చేశారని ఎద్దేవా చేశారు. ఈ విషయంలో రాజధాని రైతులను బాబు మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. (రాష్ట్ర పరిధిలోనే ‘రాజధాని’) ‘బుద్ధున్నవారు ఎవరైనా విశాఖలో రాజధానికి వస్తారా’ అన్న బాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బుద్ధి లేకేనా.. విశాఖలో బాబు సదస్సులు నిర్వహించారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ల్యాండ్ పూలింగ్ పేదల ఇళ్ల కోసం చేపడుతున్నామని, ఇందులో అవినీతికి ఆస్కారమే లేదన్నారు. ల్యాండ్ పూలింగ్ విధానానికి బాబు అనుకూలమా, వ్యతిరేకమా చెప్పాలని మంత్రి ప్రశ్నించారు. చదవండి: టీడీపీ ఇన్సైడర్ ట్రేడింగ్.. ఒక్కొక్కరు ఎంత కొన్నారంటే.. -
కొందరు భ్రమలు కల్పిస్తున్నారు: జీవీఎల్
సాక్షి, అమరావతి: రాజకీయంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై బీజేపీ పోరాటం ఉంటుందని ఆ పార్టీ ఎంపీ, అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని మరోసారి స్పష్టం చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలోని 50 శాతం మంది ప్రజలు.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారని.. అలాంటి ప్రభుత్వ అధికారంలో కేంద్రం ఎందుకు జోక్యం చేసుకుంటుందని ప్రశ్నించారు. అదే విధంగా.. రాజధాని రాష్ట్ర పరిధిలోని అంశమని.. రాష్ట్ర పరిధిలో ఎక్కడైనా రాజధాని పెట్టుకోవచ్చని జీవీఎల్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని కేంద్రం స్పష్టంగా చెప్పినా తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని జీవీఎల్ వ్యాఖ్యానించారు. రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్రం అడ్డుకుంటోందని కొందరు భ్రమలు కల్పిస్తున్నారని మండిపడ్డారు. సమాఖ్య వ్యవస్థలో రాష్ట్ర పరిధిలో ఉన్న వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకోదని తాము స్పష్టంగా చెబుతున్నామన్నారు.(రాజధాని అంశంపై తొలిసారిగా స్పందించిన కేంద్రం) కాగా ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అంశంపై కేంద్రం మంగళవారం తొలిసారిగా స్పందించింది. రాజధాని ఏర్పాటు అంశం రాష్ట్రాల పరిధిలోదేనని.. ఈ విషయంలో రాష్ట్రాలదే తుది నిర్ణయమని స్పష్టం చేసింది. ఈ మేరకు లోక్‌సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్రాయ్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు.(రాష్ట్ర పరిధిలోనే ‘రాజధాని’) -
గ్రాఫిక్స్ చూపించాలని అనుకోలేదు..
-
‘ఓ తండ్రిగా ఆలోచించి నిర్ణయం..’
సాక్షి, విజయవాడ : ‘ఒక ముఖ్యమంత్రిగా నేను తీసుకునే నిర్ణయం భవిష్యత్తు తరాలపై పడుతుంది. ఒకవేళ నిర్ణయం తీసుకోకున్న ఆ ప్రభావం భవిష్యత్తు తరాలపై ఉంటుంది. రాజధానిగా చెప్తున్నా ప్రాంతంలో కనీసం సరైన రోడ్లు కూడా లేవు. గతంలో ఉన్న ముఖ్యమంత్రి, ఆయన అనుచరులు.. రాజధాని ప్రకటన కంటే ముందే భూములు కొనుగోలు చేశారు. ప్రస్తుత రాజధాని ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడానికి.. రూ. లక్షా 9వేల కోట్లు అవసరమని గత ప్రభుత్వ నివేదికలే చెప్తున్నాయి. రాజధాని కోసం గత ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం రూ. 5వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్దగా నిధులు వచ్చే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ముఖ్యమంత్రిగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని ఆలోచించాను’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. బుధవారం విజయవాడలోని గేట్‌వే హోటల్లో నిర్వహించిన ది హిందూ ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమరావతిలో ఖర్చు చేసే డబ్బులో 10 శాతం విశాఖలో ఖర్చు చేస్తే.. పదేళ్లలో విశాఖ హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలతో పోటీ పడగలదని చెప్పారు. ఒక తండ్రిగా ఆలోచించి రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ది కోసం నిర్ణయాలు తీసుకున్నానని స్పష్టం చేశారు. తన స్థానంలో ఉంటే మీరు ఏం చేస్తారని సదస్సుకు హాజరైన ఆహుతులను ప్రశ్నించారు. ముఖ్యంగా ఇంగ్లిష్ మీడియం, రివర్స్ టెండరింగ్, అభివృద్ధి వికేంద్రీకరణ అంశాలపై లెక్కలతో సహా సీఎం వైఎస్ జగన్ వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘బ్రిక్స్ దేశాలతో పోలిస్తే కాలేజీల్లో చేరే విద్యార్థుల సంఖ్య మన దేశంలో చాలా తక్కువ. 77 శాతం మంది విద్యార్థులు కాలేజీల్లో చేరడం లేదని అన్నారు. ఇంగ్లిషు మీడియం అనేది ఇప్పడు కనీస అవసరం. ఇంటర్నెట్, కంప్యూటర్ భాషలన్నీ ఇంగ్లిష్‌లో ఉంటాయి. ఈ రోజు మనం ఇంగ్లిష్ మీడియం ప్రారంభిస్తే 20 ఏళ్లలో రాబోయే ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు తయారవుతారు. ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి తండ్రి లాంటివాడు. ఒక తండ్రిగా మీరు, నేను మన పిల్లల్ని తెలుగు మీడియం స్కూళ్లకు పంపగలమా?. పేదవాళ్లు మాత్రమే తెలుగు మీడియం స్కూళ్లలో ఎందుకు చదవాలి?. 98.5 శాతం ప్రైవేట్ పాఠశాలలు ఇంగ్లిష్ మీడియంలోనే చదువు చెప్తున్నాయి. పేద విద్యార్థులను ఎందుకు బలవంతంగా తెలుగు మీడియం చెప్పే పాఠశాలలకు పంపాలి. ఇంగ్లిష్ మీడియంలో చదవడం ద్వారా విద్యార్థులు పోటీ ప్రపంచంలో నిలదొక్కుకుంటారు. మేం కేవలం ఇంగ్లిష్ మీడియాన్ని మాత్రమే తీసుకురావడం లేదు.. విద్యావ్యవస్థను మార్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఏడాది ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో బోధన ప్రారంభిస్తున్నాం. ఒక్కో ఏడాదికి ఒక్కో తరగతిని పెంచుకుంటూ పోతాం. ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరి చేస్తున్నాం. ప్రారంభ దశలో కొన్ని ఇబ్బందులు వస్తాయని తెలుసు. ఆ ఇబ్బందులను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఒకవైపు ఇంగ్లిష్ మీడియాన్ని తీసుకురావడంతోపాటు.. విద్యావ్యవస్థలో మార్పుల కోసం నాలుగు కార్యక్రమాలు చేపట్టాం. నాడు-నేడు ద్వారా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు 25వేల ప్రభుత్వ పాఠశాలల ఫొటోలు తీసి.. వచ్చే మూడేళ్లల్లో వాటి రూపురేఖలను మార్చబోతున్నాం. స్కూల్ బిల్డింగ్లు, బాత్రూమ్లు, ఫర్నీచర్ సహా అన్నింటినీ మార్చబోతున్నాం. నాడు-నేడు ద్వారా పాఠశాలల నాణ్యతను పెంచబోతున్నాం. అలాగే విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్నం భోజనం అందించేందుకు చర్యలు చేపట్టాం. వంటలు చేసే ఆయాల జీతాల పెంచాం. అమ్మఒడి ద్వారా 42 లక్షల మంది తల్లులకు ఒక్కొక్కరికి రూ. 15వేలు ఇచ్చాం. తల్లులు తమ పిల్లలను స్కూళ్లకు పంపిస్తే ఏడాది రూ. 15వేలు అందజేస్తాం. ఉన్నత విద్యలో సమూల మార్పులు తీసుకోస్తున్నాం. డిగ్రీని నాలుగేళ్లపాటు, ఇంజనీరింగ్‌ను ఐదేళ్లపాటు చదవాల్సి ఉంటుంది. చివరి ఏడాది విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ ఉంటుంది. విద్యార్థులకు 100 శాతం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కల్పిస్తున్నాం. ఏపీలో ప్రతి విద్యార్థికి విద్య రూపంలో ఎప్పటికీ తరగని ఆస్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను. మేం చేపట్టిన సంస్కరణలకు మద్దతు తెలిపిన ది హిందూ పత్రికకు ధన్యవాదాలు. భవిష్యత్తు తరాల కోసం ఆలోచించా.. ప్రతీ ముఖ్యమంత్రికి అధికారాలు, బాధ్యతలు ఉంటాయి. ఒక్క ముఖ్యమంత్రిగా నేను నిర్ణయం తీసుకోకుంటే దాని ప్రభావం భవిష్యత్ తరాలపై పడుతుంది. రాజధానిగా చెప్తున్నా ప్రాంతంలో కనీసం సరైన రోడ్లు కూడా లేవు. గతంలో ఉన్న ముఖ్యమంత్రి, ఆయన అనుచరులు.. రాజధాని ప్రకటన కంటే ముందే భూములు కొనుగోలు చేశారు. ప్రస్తుత రాజధాని ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడానికి.. రూ. లక్షా 9వేల కోట్లు అవసరమని గత ప్రభుత్వ రిపోర్టులే చెప్తున్నాయి. రాజధాని కోసం గత ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం రూ. 5వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్దగా నిధులు వచ్చే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ముఖ్యమంత్రిగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని ఆలోచించాను. ఒకవైపు అమరావతికి రూ. లక్షా 9వేల కోట్లు ఖర్చు చేయాలా?.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలా? అని ఆలోచన చేశాను. మరోవైపు విశాఖలో అన్ని మౌలిక సదుపాయాలున్నాయి. అమరావతిలో ఖర్చు చేసే డబ్బులో 10 శాతం ఖర్చు చేస్తే.. పదేళ్లలో విశాఖ హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలతో పోటీ పడగలదు. అమరావతిలో కూడా అభివృద్ధి కొనసాగుతోంది.. విశాఖ మా నగరం, మా ఊరు, మా రాజధాని. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖ ఉంటుంది. అమరావతి శాసన రాజధానిగా ఉంటుంది. అమరావతిలో కూడా అభివృద్ధి కొనసాగుతుంది. విశాఖలో సచివాలయం, హెచ్‌వోడీ, ముఖ్యమంత్రి కార్యాలయాలు ఉండనున్నాయి. ఒక తండ్రిలా నిర్ణయం తీసుకున్నాను కాబట్టే.. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ప్రతిపాదనలు చేశాం. ఒక ముఖ్యమంత్రిగా రాబోయే తరాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంటుంది. (చదవండి: రాష్ట్ర పరిధిలోనే ‘రాజధాని’) గ్రాఫిక్స్ చూపించాలని అనుకోలేదు.. రాష్ట్రంలోని ప్రజలను మభ్య పెట్టాలని, గ్రాఫిక్స్ చూపించాలని నేను అనుకోలేదు. నేను ఎంత చేయగలుగుతానో ఆ వాస్తవాలు మాత్రమే చెప్పా. జపాన్, సింగపూర్ నగరాలను సృష్టించేంత నిధులు మా దగ్గర లేవని నాకు తెలుసు. రాయలసీమతోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు నీళ్లు అందించేందుకు.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నాలు ప్రారంభిచాం. గత పదేళ్లలో శ్రీశైలానికి చేరే కృష్ణా జలాలు.. 1200 టీఎంసీల నుంచి 600 టీఎంసీలకు పరిమితమయ్యాయి. మొత్తం కృష్ణానది ఆయకట్టుకు నీరు అందించడం ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు గోదావరిలో పుష్కలమైన జలాలున్నాయి. ఏడాదికి 3వేల టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. ఒక్క అమరావతిలోనే డబ్బులు ఖర్చు చేయాలా?.. లేకపోతే ఈ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయాలా?. (చదవండి: లెజిస్లేటివ్ రాజధాని అమరావతే) రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 2వేల కోట్లు ఆదా.. ఈ ఉగాదికి ఇల్లు లేని పేదవారికి ఇళ్లపట్టాలు ఇవ్వాలని నిర్ణయించాం. అలాగే పరిపాలనలో అవినీతి లేకుండా చేసేందుకు దేశంలోనే మొదటిసారిగా ప్రక్షాళన చేపట్టాం. ఒక టెండర్ ప్రాసెస్ కంటే ముందే న్యాయమూర్తి దగ్గరకు వెళ్తుంది. జ్యుడిషియల్ ప్రివ్యూ యాక్ట్ ద్వారా టెండర్లు పిలుస్తున్నాం. కాంట్రాక్ట్ సంబంధించి టెండర్లలో ఎలాంటి మార్పునైనా న్యాయమూర్తి సూచించవచ్చు. ఏడు రోజులపాటు టెండర్ వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచుతాం. ప్రజల నుంచి వచ్చిన సూచనలు, అభ్యంతరాలు పరిగణలోకి తీసుకున్నాక.. న్యాయమూర్తి ఆ టెండర్లకు ఒకే చెప్తారు. ఆ తర్వాత అత్యంత తక్కువ కోట్ చేసిన ధరను ప్రకటిస్తారు. ఆ ధరకంటే కూడా రివర్స్ టెండరింగ్ ద్వారా ఇంకా ఎవరైనా తక్కువ ధరకు కోట్ చేస్తే వారికి ఇస్తాం. రివర్స్ టెండరింగ్ ద్వారా ఇప్పటివరకు రూ. 2వేల కోట్లు ఆదా చేశాం. ఒక్క పోలవరం ప్రాజెక్టులోనే రూ. 830 కోట్లు ఆదా చేశామ’ని తెలిపారు. -
‘ఇప్పుడు చంద్రబాబు ఏం సమాధానం చెప్తారు’
సాక్షి, అమరావతి : భవాని ఐల్యాండ్‌ను గత వారం ప్రారంభించామని పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం సచివాలయంలో మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటికే చిన్న బోట్లకు అనుమతి ఇచ్చామని.. మిగిలిన బోట్లను కూడా తనిఖీ చేసి అనుమతి ఇస్తామని తెలిపారు. మొత్తం 9 కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించినట్లు వెల్లడించారు. 20వ తేదికి కంట్రోల్ రూమ్‌లను పూర్తి చేస్తామని, కంట్రోల్ రూమ్‌ల పరిధిలోనే బోట్లు నడుపుతామని మంత్రి తెలిపారు. (బాబు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి: అవంతి) అదే విధంగా రాజధాని అంశం తమ పరిధిలో ఉండదని కేంద్రం స్పష్టం చేసిందని మంత్రి అన్నారు. ఇప్పుడు చంద్రబాబు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ‘బుద్ధి ఉన్నవాడు ఎవరైనా విశాఖపట్నం వద్దమనుకుంటారా’ అని చంద్రబాబు అనడం సిగ్గుచేటు అని మంత్రి అవంతి అన్నారు. చంద్రబాబు ఇక మీదట విశాఖలో అడుగు పెట్టడా అని ప్రశ్నించారు. విశాఖ ఏమైనా దండకరణ్యంలో ఉందా అని, విశాఖలో ఓట్లు, సీట్లు మాత్రం తమకు కావాలా అని బాబును నిలదీశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం పనిచేస్తున్నారని గుర్తు చేశారు. అమరావతిలోని అసెంబ్లీలో చంద్రబాబు కనీసం బాత్రూంలు కూడా కట్టలేదని మండిపడ్డారు. -
రాజధానిపై స్పందించిన కంచ ఐలయ్య
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఉండాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయమని ప్రొఫెసర్ కంచ ఐలయ్య తెలిపారు. రాజధానిని విభజించే హక్కు ముఖ్యమంత్రికి ఉందని స్పష్టం చేశారు. అమరావతి రైతులకు నష్టం లేకుండా చూడాలని కోరారు. రాజధాని కోసం సేకరించిన వేల ఎకరాలు ఇప్పటికీ ముట్టుకోకుండా ఉన్నాయని, మరో 20 ఏళ్లు అయిన చంద్రబాబు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేడని విమర్శించారు. భూములు కావాలన్న వారికి భూములు ఇవ్వాలని, రైతులకు ఇస్తానన్న పరిహారం 15 ఏళ్ల పాటు రూ. 50 వేల చొప్పున ఇవ్వాలని సూచించారు. అదే విధంగా మత ప్రతిపాదికన పౌరసత్వాన్ని ఇవ్వడం సరైన పద్దతి కాదని.. నిరసనలు తెలుపుతున్న ముస్లింల వేషధారణ గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. ప్రధానమంత్రి వేసుకున్న డ్రెస్ ముస్లిం వేషధారణ కాదా అని కంచ ఐలయ్య ప్రశ్నించారు. -
ఏపీలో స్థిరమైన ప్రభుత్వం ఉంది.. : కేంద్రం
-
లేని సెలెక్ట్ కమిటీకి పేర్లు పంపడమేంటి?
సాక్షి, అమరావతి : అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులపై సెలెక్ట్ కమిటీ ఏర్పాటు కాలేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. లేని సెలెక్ట్ కమిటీకి తాము పేర్లు పంపడం ఏంటని ప్రశ్నించారు. మంగళవారం ఆయన విజయవాడలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విద్యార్థి యువజన జేఏసీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేయాలంటే సభ్యుల అభిప్రాయం తీసుకొని ఓటింగ్ పెట్టాలని.. అవేవి లేకుండా ప్రతిపక్ష పార్టీలు పేర్లు ఎలా ఇస్తాయని ప్రశ్నించారు. సభలో టీడీపీకి నలుగురు సభ్యులు ఎక్కువ ఉన్నారని ప్రభుత్వ బిల్లులను అడ్డుకోవడం సరికాదన్నారు. శాసన మండలి చైర్మన్ టీడీపీ కార్యకర్తల వ్యవహరించారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు చిల్లర రాజకీయాలు మానుకోవాలని, లేదంటే ప్రజలే బుద్ది చెబుతారన్నారు. వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులను తాత్కాలిక అడ్డుకోగలరు కానీ శాశ్వతంగా అడ్డుకోలేరని సజ్జల అన్నారు. -
రాజధాని అంశంపై కేంద్రం తొలి స్పందన..
-
రాజధాని అంశంపై కేంద్రం తొలి స్పందన..
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో రాజధానుల తరలింపుపై కేంద్రం తొలిసారిగా స్పందించింది. రాజధానులు ఏర్పాటు అంశం రాష్ట్రాల పరిధిలోదేనని కేంద్రం స్పష్టం చేసింది. రాజధాని అంశంపై రాష్ట్రాలదే తుది నిర్ణయమని వెల్లడించింది. లోక్‌సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు మంగళవారం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్రాయ్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. రాష్ట్ర పరిధిలో రాజధాని ఏక్కడ పెట్టుకోవాలనే అధికారం రాష్ట్రానికే ఉంటుందని కేంద్రం తేల్చిచెప్పింది. అందులో తమ జోక్యం ఉండదని పేర్కొంది. కాగా, అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఏపీలో స్థిరమైన ప్రభుత్వం ఉంది.. : కేంద్రం రాజధాని అంశంపై జాతీయ మీడియా ఇష్టాగోష్టిలో కూడా కేంద్ర ఉన్నత వర్గాలు ఇదే అంశాన్ని స్పష్టం చేశాయి. శాసనమండలి, రాజధాని అంశాల్లో కేంద్ర జోక్యం చేసుకోదని తెలిపాయి. ఏపీలో ఐదేళ్ల పాటు స్థిరమైన ప్రభుత్వం ఉందని గుర్తుచేశాయి. రాజకీయ అంశాల్లో కేంద్రం చేసేదేమీ ఉండదని పేర్కొన్నాయి. కంగుతిన్న టీడీపీ.. ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధికి అడ్డుతగిలేలా రాజధాని అంశంపై టీడీపీ రాజకీయాలు చేస్తున్న సంగతి తెలిసిందే. రైతుల పేరిట అమరావతి గ్రామాల్లో ఆందోళన చేపట్టింది. అందులో భాగంగానే ఆ పార్టీ ఎంపీ గల్లా జయదేవ్.. లోక్‌సభలో ఈ అంశాన్ని లేవనెత్తారు. కానీ కేంద్రం మాత్రం రాజధానుల అంశంపై తమ జోక్యం ఉండబోదని వెల్లడించింది. తాము అనుకున్న దానికి విరుద్ధంగా కేంద్రం నుంచి ప్రకటన వెలువడటంతో టీడీపీ శ్రేణులు కంగుతిన్నాయి. -
మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్న డిప్యూటీ కలెక్టర్స్
-
అదే సీఎం జగన్ సిద్ధాంతం : అజేయ కల్లాం
-
అదే సీఎం జగన్ సిద్ధాంతం : అజేయ కల్లాం
సాక్షి, చిత్తూరు : అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన అని ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లాం అన్నారు. ఆదివారం ఆయన మూడు రాజధానులకు మద్దతుగా చిత్తూరు జిల్లా నారావారిపల్లి గ్రామంలో నిర్వహించిన అధికార వికేంద్రీకరణ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అజేయకల్లాం మాట్లాడుతూ.. అధికార వికేంద్రీకరణ అనేదే సీఎం జగన్ ప్రభుత్వ సిద్ధాంతం అని, ఇందులో భాగంగానే గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశామన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎం జగన్ అలోచిస్తే.. చంద్రబాబు, ఎల్లో మీడియా ఒకే చోట అభివృద్ధిని కోరుకుంటున్నాయని విమర్శించారు. గత టీడీపీ ప్రభుత్వం కొంతమంది లబ్ధి కోసమే అమరావతి రాజధాని నిర్మాణాన్ని చేపట్టిందని ఆరోపించారు. గతంలో హైదరాబాద్‌లో మాత్రమే పెద్ద పెద్ద కంపెనీలను పెట్టించారని, దాని వల్ల రాష్ట్రం చాలా నష్టపోయిందని చెప్పారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు అలా చేయకుండా తమ రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలకు అభివృద్ధిని తీసుకెళ్లి సక్సెస్ సాధించాయని తెలిపారు. రాజధాని సెంటర్లో ఉండాలని కోరుకోవడం తప్పు అని అన్నారు. రాజధాని మధ్యలో ఉండాలని చంద్రబాబు అంటున్నారని, ఢిల్లీ నుంచి అమెరికా వరకు ఎక్కడా రాజధాని మధ్యలో లేదనే విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని లూటీ చేయడమే టీడీపీ సిద్ధాంతం అని విమర్శించారు. -
వ్యుహం ప్రకారమే ఈ దాడులన్ని
-
అమరావతిని బబు బంగారు బాతుగా భ్రమించటమే
-
‘బాబు విశాఖ ప్రజలపై విషం చిమ్ముతున్నారు’
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మతిభ్రమించి మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు విమర్శించారు. జిల్లాలో మంత్రి అవంతి శ్రీనివాస్ నిర్వహించిన జీవీఎంసీ సమీక్షలో ఆయనతోపాటు ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, కురసాల కన్నబాబు, భాగ్యలక్ష్మీ, గొల్ల బాబూరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. విశాఖ ప్రజలు చంద్రబాబుకి నాలుగు సీట్లు ఇస్తే ఆయన ప్రజలపై అక్కసు వెళ్లగక్కుతున్నారన్నారు. ఒకే ప్రాంతంలో అభివృద్ది వల్ల ఇతర ప్రాంతాలకి నష్టమని చంద్రబాబు తీరువల్ల ప్రజలు నష్టపోయే పరిస్ధితి వచ్చిందని విమర్శిచారు. చంద్రబాబు తన స్ధాయి మరిచి విశాఖ, రాయలసీమపై కుట్రలు చేస్తున్నారని, పెద్దల సభలో టీడీపీ నుంచి ఎక్కవ మంది అవగాహన లేని వారే ఉన్నారు ఎద్దేవా చేశారు. కౌన్సుల్ రద్దు కాకుండా చంద్రబాబు బీజేపీ నేతలతో టచ్‌లో ఉండటం దారుణమన్నారు. చంద్రబాబువి ఊసరవెల్లి రాజకీయాలని, ఓట్లేసిన విశాఖ ప్రజలను చంద్రబాబు వెన్నుపోటు పోడుస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు మాటలకు మద్దతిస్తున్న విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక ఎమ్మెల్యేలు రోడ్లపైకి వస్తే ప్రజలు తన్నేలా ఉన్నారని, విశాఖపై కుట్రలు చేస్తున్న చంద్రబాబుతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలను పిచ్చాసుపత్రిలో చేర్పించాలని ఆయన విమర్శించారు. ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మాట్లాడుతూ: చంద్రబాబు విశాఖపై విషం చిమ్ముతున్నారన్నారు. ఉత్తరాంధ్రపై కుట్రలు పన్నుతున్న చంద్రబాబును ఈ ప్రాంతంలో అడుగుపెట్టనీయమన్నారు. విశాఖ సుందరమైన నగరం...దేశంలోనే విశాఖకు 9 వ స్ధానం ఉందని పేర్కొన్నారు. విశాఖ ప్రజలు చేసిన అన్యాయమేంటని, మిమ్మల్ని గెలిపించడమే విశాఖ ప్రజలు చేసిన శాపమా అని ప్రశ్నించారు. కాగా బీజేపీని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, అమిత్ షాను ఘోరాతి ఘోరంగా తిట్టిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేస్తామని .. రాజధాని భూములని రైతులకి తిరిగి ఇచ్చేస్తామని బీజేపీ మ్యానిఫెస్టోలోనే ఉందని తెలిపారు. వికేంద్రీకరణను బీజేపీ వ్యతిరేకిస్తే వారి మేనిఫెస్టోను వారే వ్యతిరేకించినట్లే అన్నారు. ఇక మార్చి నాటికి విశాఖకు పరిపాలనా రాజధాని వస్తుందనుకుంటున్నానని ఆయన అభిప్రాయపడ్డారు. వివిధ శాఖల అధికారులతో మంత్రి అవంతి సమీక్ష ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ: గతంలో విశాఖపై ప్రశంసలు కురిపించలేదా చంద్రబాబు అని ప్రశ్నించారు. ఇపుడు చంద్రబాబుకి విశాఖ ఎందుకు చేదుగా మారిందని, దురుద్దేశపూర్వకంగానే చంద్రబాబు విశాఖ పరిపాలన రాజధానిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. విశాఖ ప్రజలు చంద్రబాబుకి నాలుగు సీట్లు ఇస్తే మీరు ప్రజలకేం చేశారని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రతిపక్షనాయకుడు కాదు...ఒక వర్గానికి మాత్రమే నేత అన్నారు. విశాఖలో నాలుగు సీట్లు ఇచ్చిన ప్రజలే చంద్రబాబు తీరును ఛీ కొడుతున్నారని, రాబోయే జీవీఎంసీ ఎన్నికల్లో చంద్రబాబుకి ప్రజలే తగిన బుద్ది చెబుతారని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ: చంద్రబాబు ఉత్తరాంధ్ర అభివృద్దిని కుతంత్రాలతో అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకి రాజకీయ సమాధి కట్టేందుకు ఉత్తరాంధ్ర ప్రజలు సిద్దంగా ఉన్నారని విమర్శించారు. చంద్రబాబు తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, ఆయన ఒక ప్రాంతానికే పరిమితమయ్యారన్నారు. చంద్రబాబును ఈ ప్రాంతంలో అడుగుపెట్టనివ్వమని, విశాఖ పరిపాలనా రాజధానిగా వచ్చేవరకు పోరాటం చేస్తామన్నారు. వెన్నుపోటు రాజకీయాలు, కుళ్లు, కుతంత్రాలు, కుట్రలు చంద్రబాబు నైజమని విమర్శించారు. ఆదరించిన ఉత్తరాంధ్రకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని, దమ్ముంటే 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ప్రజలలోకి వెళ్లామని ఆయన సవాలు విసిరారు. ఇక ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మాట్లాడుతూ: చంద్రబాబు కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, వికేంద్రీకరణ అమలు జరిగితే రాష్ట్రం సువర్ణయుగంగా మారుతుందన్నారు. వికేంద్రీకరణబిల్లు అమలు ద్వారా ఏపీ దేశంలోనే అగ్రాగామిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఆరు నెలల సంక్షేమ పాల చూసి టీడీపీ నేతలు సైతం సీఎం జగన్‌కు జై కొడుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు తీరుమారకుంటే 23 నుంచి 3కి తగ్గిపోతుందని ఆయన ఎద్దేవా చేశారు. -
బాబు సీమలోకి వెళ్తే చీపుళ్లతో కొడతారు: జోగి రమేష్
-
బాబు సీమలోకి వెళ్తే చీపుళ్లతో కొడతారు: జోగి రమేష్
సాక్షి, కృష్ణా : రాష్ట్రాభివృద్ధి మూడు రాజధానులతోనే సాధ్యమవుతుందని పెడన నియోజకవర్గ ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న మూడు రాజధానులు, అధికార వికేంద్రీకరణ బిల్లుకు మద్దతుగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో శుక్రవారం భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. గూడురు మండలం నుంచి పెడన పట్టణం వరకు సాగిన ఈ ర్యాలీలో ప్రజలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే జోగి రమేష్ మాట్లాడుతూ.. అమరావతిలో లక్షల కోట్ల పెట్టుబడి పెట్టాలంటే సాధ్యం కాదని, భావితరాల కోసం రాష్ట్ర అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని సూచించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలని సీఎం జగన్ మూడు రాజధానులు ఉండాలన్నారని, ప్రాంతీయ అసమానతలు లేకుండా రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని తెలిపారు. చంద్రబాబు అయిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడని జోగి రమేష్ మండిపడ్డారు. జోలె పట్టుకుని రాజకీయ బిచ్చగాడిగా మారాడని వ్యాఖ్యానించారు. పెడన నియోజకవర్గంలో రెండో పంటకు నీరు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌ది అని, సీఎం వైఎస్ జగన్ పాలనలో నదులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయని ప్రశంసించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నాడు రెండో పంటకు నీరు వచ్చేవని, నేడు ముఖ్యమంత్రి జగన్ పాలనలో కూడా రెండో పంటకు నీరు వచ్చాయని అన్నారు. జూన్ నెలలో మచిలీపట్నం పోర్టు శంకుస్థాపన, పనులు ప్రారంభం అవుతాయన్నారు. పెడన నియోజకవర్గం రైల్వే కూడలిగా మారబోతుందని, పరిశ్రమలు రాబోతున్నాయని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలోకి చంద్రబాబు వెళ్తే మహిళలు చీపుళ్ళతో కొడతారని విమర్శించారు. చంద్రబాబు 16 నియోజకవర్గాలకు, 29 గ్రామాలకే నాయకుడిగా పరిమిమయ్యారని, భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ కనుమరుగు కావటం కాయమని అభిప్రాయపడ్డారు. వికేంద్రీకరణలో భాగంగా మచిలీపట్నంను జిల్లాగా ప్రకటించనున్న సీఎం జగనన్నకు కృతజ్ఞతలు తెలిపారు. వికేంద్రీకరణతో పెడన పారిశ్రామిక వాడ కాబోతోందని, ముఖ్యమంత్రి ఏడు నెలల పాలనలో అమ్మఒడి, రైతు భరోసా, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా,వాహన మిత్ర వంటి పథకాలతో ప్రజలకు సంక్షేమ పాలన అందించారన్నారు. రాష్ట్రంలో ఇల్లు లేని అక్క చెల్లెమ్మలకు ఉగాది నాటికి ఇళ్ళ స్థలాలు ఇవ్వ నున్నామని, నియోజకవర్గంలో రూ. 60 కోట్లతో సీసీ రోడ్లపనులకు శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. -
అభివృద్ధి వికేంద్రీకరణ కలిసొచ్చిన అదృష్టం
సాక్షి, న్యూఢిల్లీ : రాజధాని అంటే ఆకాశహర్మ్యాలు, అందమైన రోడ్లు, ఆహ్లాదకరమైన పార్కులు, పెద్ద పెద్ద మాల్స్, సినిమా హాల్సే కాదు. పురోభివద్ధి కారిడార్లు, పారిశ్రామిక వాడలు, వాణిజ్య కేంద్రాలు, విద్యావకాశ నిలయాలు, స్వచ్ఛమైన మంచినీరు, నిరంతర విద్యుత్, అందరికి ఆరోగ్యం, ఆధునిక ఇంటర్నెట్ కమ్యూనికేషన్లు, వ్యవసాయ పురోభివద్ధికి పరిశోధనలు, అంతర్జాతీయ వ్యాపారానికి ప్రణాళికలు, ఒప్పందాలు, పర్యావరణ పరిరక్షణకు చర్యలు....ఇలా ఎన్నో బరువులు, బాధ్యతలు. (వికేంద్రీకరణతో అన్ని వర్గాలకు న్యాయం) వీటన్నింటిని ఒకే నగరానికి పరిమితం చేయకుండా మూడు నగరాలకు విస్తరిస్తామనడం కొత్త సంప్రదాయం. అభివృద్ధి వికేంద్రీకరణకు అసలైన మార్గం. ఇదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చెబుతున్న మాట. గీసుకున్న బాట. భారత దేశంలో నగరాలు అభివద్ధి చెందిన గతకాలపు చరిత్రను పరిశీలిస్తే కొత్త సంప్రదాయంలో ఉన్న శాస్త్రీయ దృక్పథం కూడా అర్థం అవుతుంది. (మూడు రాజధానులకు మద్దతుగా పోస్టుకార్డుల వెల్లువ) 17వ శతాబ్దం నుంచి భారత్ లో ముంబై, చెన్నై, కోల్‌కతా రేవు పట్టణాలు అభివృద్ధి చెందుతూ వచ్చాయి. అప్పటికే భారతీయులకు ఎంతో నైపుణ్యం ఉండడంతో విదేశాల నుంచి ముడి సరకులను తీసుకొచ్చి వాటి ఉత్పత్తులుగా మార్చి ఎగుమతి చేయడానికి ప్రధానంగా ఈ రేవు పట్టణాలే తోడ్పడ్డాయి. కనుక అక్కడ తొలుత మార్కెట్లు కూడా అభివృద్ధి చెందాయి. బ్రిటీష్ పాలకుల హయాంలో రేవుల వద్ద సరకుల దిగుమతి, ఎగుమతి కార్యకలాపాలు మరింత విస్తరించాయి. వాటికి దేశీయ మార్కెట్లు కూడా అవసరం వచ్చి దేశ రాజధాని ఢిల్లీతోపాటు దేశంలో పలు వ్యూహాత్మక నగరాలను అభివృద్ధి చేయాల్సి వచ్చింది. వాటికి మౌలిక సౌకర్యాలు కల్పించాల్సి వచ్చింది. బ్రిటీష్ పాలకులది కేంద్రీయ పాలన కనుక పలానా ప్రాంతమని తేడా లేకుండా ఏ ప్రాంతం ఏ వ్యాపారానికి వీలుందో, ఆ ప్రాంతంలోని పట్టణాలకు మౌలిక సౌకర్యాలు కల్పించడం అనివార్యమైంది. ఆ తర్వాత వ్యవసాయోత్పత్తులు, ఇతర మార్కెట్ల అవసరాల కోసం ద్వితీయ శ్రేణి నగరాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో కాన్పూర్, అలహాబాద్, వారణాసి, ఆగ్రా, రాజస్థాన్‌లో జైపూర్, ఉదయ్‌పూర్, పంజాబ్‌లో లూథియానా, అమృత్సర్, మధ్యప్రదేశ్‌లో భోపాల్, ఇండోర్ లాంటి నగరాలు అలా అభివృద్ధి చెందినవే. (ఇతర రాష్ట్రాలదీ సమగ్రాభివృద్ధి బాటే!) దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాష్ట్రాల ప్రాతిపదిక ప్రాంతాలు, నగరాల అభివృద్ది జరుగుతూ వచ్చింది. ఒకప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న ప్రధాన నగరాలైన, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, నిజాం పాలిత ప్రాంతంతో కలిశాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతూ వచ్చింది. తెలంగాణాతో విడిపోయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోని నగరాలను, వాటి చుట్టూ ప్రాంతాలను మరింత వృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. (మూడు రాజధానుల ఆలోచన అద్భుతం) అలాంటప్పుడు మూడు నగరాలకు రాజధాని కార్యకలాపాలను విస్తరించుకునే అవకాశం లభించడం నిజంగా ఓ అదృష్టమే. ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛా వాణిజ్యం కొనసాగుతున్న నేటి పరిస్థితుల్లో ఓ రేవు పట్టణానికి ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అలాంటప్పుడు రాష్ట్ర సెక్రటేరియట్ అక్కడ ఉండడం ఎంతైన శ్రేయస్కరం. ఏ రాష్ట్రంలోనైనా అభివృద్ధి అనేది ఒకే ప్రాంతానికి పరిమితమైతే వైషమ్యాలకు, వేర్పాటు వాదాలకు దారితీస్తుందని అలా ఆవిర్భవించిన ఓ రాష్ట్రానికి వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. (కంచీ యూనివర్శిటీలో డీలిట్, అమెరికాలో పీహెచ్డీ చేసిన సమీర్ శర్మ ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌కు రాసిన పరిశోధనాత్మక వ్యాసానికి సంక్షిప్త స్వేచ్ఛానువాదం) -
‘టీడీపీ ఎమ్మెల్యేల నాటకాలను సహించం’
సాక్షి, విశాఖపట్నం: అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం సర్క్యూట్ హౌస్ నుంచి కాగడాల ర్యాలీ నిర్వహించారు. వికేంద్రీకరణపై అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా టీడీపీ ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలను మహిళలు దగ్ధం చేశారు. నగరానికి చెందిన నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సెవెన్‌హిల్స్ జంక్షన్‌లోని టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు మహిళలు ప్రయత్నించారు. వారికి పోలీసులు సర్దిచెప్పి పంపించారు. టీడీపీ నాయకులు ఉత్తరాంధ్ర ద్రోహులుగా వ్యవహరిస్తున్నారని మహిళలు ఈ సందర్భంగా ధ్వజమెత్తారు. టీడీపీ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ, గణేశ్‌కుమార్ విశాఖ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తమ ఓట్లతో గెలిచి విశాఖపట్నానికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యేల నాటకాలను విశాఖ ప్రజలు సహించబోరని హెచ్చరించారు. పదవులను అడ్డుపెట్టుకుని డబ్బు సంపాదించుకోవాలని చూస్తున్నారు తప్పా ఓట్లు వేసి గెలిపించిన తమకు న్యాయం చేయాలన్న ఆలోచన టీడీపీ ఎమ్మెల్యేలకు లేదని ధ్వజమెత్తారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలైన ఉత్తరాంధ్ర ఇప్పటికి వెనుబడి ఉందన్నారు. అధికార వికేంద్రీకరణతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చూస్తుంటే టీడీపీ నాయకులు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే తప్పకుండా విశాఖ పరిపాలనా రాజధాని కావాలని స్పష్టం చేశారు. టీడీపీ నాయకులు అడ్డుపడితే ఉత్తరాంధ్ర ప్రజల ఆగ్రహావేశాలకు గురికాక తప్పదని హెచ్చరించారు. ‘పరిపాలన వికేంద్రీకరణ కావాలి. విశాఖ రాజధాని కావాలి’ అని ప్రజలంతా కోరుకుంటున్నారని తెలిపారు. (చదవండి: కార్య నిర్వాహక రాజధానిగా విశాఖ భేష్) ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఖాయం విశాఖ కేంద్రంగా పరిపాలనా రాజధాని కోరుతూ పద్మనాభం మండలంలో రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. రైతులతో పాటు ఎడ్లబండి ఎక్కి పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఇనాం భూముల రైతులకు రైతు భరోసా ఇచ్చిన సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేయడం ఖాయమని అన్నారు. (చదవండి: మూడు రాజధానుల ప్రక్రియ ఆగదు) -
‘త్వరలో టీడీపీని బంగాళాఖాతంలో కలుపుతారు’
సాక్షి, తాడేపల్లి: రాయలసీమలో హైకోర్టు వద్దని అక్కడ ప్రజలు కోరుకుంటున్నట్లు టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అబద్దాలు చెబుతున్నారని వైఎస్సార్ క్రాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పేర్కొన్నారు. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాయలసీమలో హైకోర్టు పెట్టాలని పెద్ద ఎత్తున్న ఉద్యమాలు జరుగుతున్నాయన్నారు. హై బెంచ్ రాయలసీమలో పెడతామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే అన్నారు. కాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అన్ని ప్రాంతాలు సమానమేనని, ప్రజల ఆకాంక్ష మేరకు రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేస్తున్నారని హఫీజ్ ఖాన్ తెలిపారు. రాయలసీమలో హైకోర్టు పెట్టడం చంద్రబాబుకు ఇష్టం లేదా అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడం అనేది అక్కడి ప్రజల హక్కు అని పేర్కొన్నారు. ఇక 29 గ్రామాలకు నాయకుడిగా వ్యవహరిస్తున్న చంద్రబాబు రాబోయే రోజుల్లో టీడీపీని బంగాళా ఖాతంలో కలుపుతారని ఆయన ఎద్దేవా చేశారు. -
విశాఖే బెస్ట్
-
తేల్చుకుందాం రండి..
సాక్షి, శ్రీకాకుళం: ఉత్తరాంధ్ర అభివృద్ధికి టీడీపీ ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు అడ్డంపడుతున్నారని శ్రీకాకుళం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్చార్జ్ దువ్వాడ శ్రీనివాస్ విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైజాగ్‌ను రాజధానిగా ఎందుకు అంగీకరించడం లేదో ఎంపీ రామ్మోహన్ నాయుడు అచ్చెన్నాయుడు చర్చకు రావాలని డిమాండ్ చేశారు. వైజాగ్ రాజధాని కోసం వైఎస్సార్సీపీ కృషి చేస్తుంటే టీడీపీ నాయకులు ఎదురు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అధికార వికేంద్రీకరణతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు. సీఎం జగన్ ప్రజల నాయకుడని ఆయన తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఒక్క ప్రాంతాన్నే అభివృద్ధి చేస్తే ప్రాంతీయ విద్వేషాలు పెరిగే అవకాశముందన్నారు. అమరావతి రాజధాని కావాలంటున్న టీడీపీ నాయకులు హైదరాబాద్‌లో ఇళ్లు కట్టుకున్నారని గుర్తు చేశారు. ఉత్తరాంధ్రకు ఎప్పుడూ ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు అని, అమరావతి పేరుతో కోట్ల రూపాయలు కైంకర్యం చేశారని ధ్వజమెత్తారు. ఈ ప్రాంతంలోనే పుట్టిన అచ్చెన్నాయుడు వైజాగ్‌ను రాజధానిగా వ్యతిరేకించడాన్ని దుయ్యబట్టారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చర్చకు రావాలని సవాల్ విసిరారు. రెండెకరాల స్థాయి నుంచి వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారని అచ్చెన్నాయుడిని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడి తలపై ఉన్న గాయాలే ఆయన రక్తచరిత్రకు సాక్ష్యాలని అన్నారు. ఎంతో మంది జీవితాలను ఆయన నాశనం చేశాడని, అచ్చెన్నాయుడి అక్రమాలకు సాక్ష్యాలున్నాయని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ల రిగ్గింగ్‌తోనే రామ్మోహన్ నాయుడు ఎంపీగా గెలిచారని ఆరోపించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే తనపై టీడీపీ నాయకులు కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులకు చేతగాక తనపై అక్రమ కేసులు పెట్టారని, తాను ఏనాడు భయపడలేదన్నారు. (‘సీఎం జగన్ నిర్ణయం వల్లే మా ప్రాంతాల్లో వెలుగులు’) -
విశాఖనే బెస్ట్ ఆప్షన్ : జీఎన్ రావు
సాక్షి, హైదరాబాద్ : తమ కమిటీ నివేదికపై ఈనాడు, ఆంధ్రజ్యోతిలలో వచ్చిన వార్తలను విశ్రాంత ఐఏఎస్ అధికారి జీఎన్ రావు ఖండించారు. 13 జిల్లాలను 4 జోన్లుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించినట్టు చెప్పారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ఉండాలని తమ నివేదికలో స్పష్టంగా చెప్పామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధిపై తమ కమిటీ ఇచ్చిన నివేదికపై కొన్ని మీడియా సంస్థలు ప్రచురించిన తప్పుడు వార్తలపై జీఎన్ రావు స్పందించారు. బుధవారం హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో జీఎన్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి 13 జిల్లాల అభివృద్ధికి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందజేసినట్టు తెలిపారు. కొందరు జీఎన్ రావు రిపోర్టును తగలబెట్టడం బాధకరమని అన్నారు. తమ నివేదికపై తప్పుడు వార్తలను ప్రసారం చేయడాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా పెట్టొద్దని తాము చెప్పలేదన్నారు. తమ కమిటీ సభ్యులను ప్రభావితం చేశారనేది పూర్తిగా తప్పుడు ఆరోపణ అని అన్నారు. కమిటీలో 40 ఏళ్ల అనుభవం కలిగినవారు ఉన్నారని జీఎన్ రావు గుర్తుచేశారు. ప్రలోభాలకు లొంగే సాదాసీదా వ్యక్తులు కమిటీలో లేరని స్పష్టం చేశారు. కమిటీ సభ్యులు దేశవ్యాప్తంగా వారి వారి రంగాల్లో ఎంతో అనుభవం కలవారని చెప్పారు. మూడు, నాలుగు నెలలు కష్టపడి తాము నివేదికను తయారుచేస్తే.. దానిని తగలబెట్టడం సరికాదన్నారు. విశాఖపట్నంతోపాటు విజయవాడ, మచిలీపట్నం ప్రాంతాలకు సంబంధిచిన లాభనష్టాలను చర్చించామని వెల్లడించారు. విశాఖలో ఎటువైపు రాజధాని పెట్టుకోవచ్చో రిపోర్టులో స్పష్టంగా చెప్పామని అన్నారు. విశాఖలో అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖపట్నం బెస్ట్ ఆప్షన్ అని తెలిపారు. మూడు ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి జరగాలనే.. మూడు ప్రాంతాల్లో రాజధానులు సూచించినట్టు చెప్పారు. అభివృద్ది వికేంద్రీకరణ కోసం 4 స్థానిక కమిషనరేట్లు ఏర్పాటు చేయాలని రిపోర్టులో స్పష్టంగా పేర్కొనడం జరిగిందన్నారు. ఈ కమిషనరేట్లలో సీనియర్ అధికారాలను నియమించి.. వాటికి పూర్తి అధికారాలు ఇవ్వాలని సూచించినట్టు వెల్లడించారు. కర్నూలులో హైకోర్టు పెడితే.. నాలుగు జిరాక్స్ సెంటర్లు మాత్రమే వస్తాయని అనడం చాలా తప్పని అన్నారు. హైకోర్టుతో ట్రిబ్యునల్స్ కూడా ఏర్పడతాయని చెప్పారు. అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలు తీసుకున్నాకే సూచనలు ఇచ్చినట్టు పేర్కొన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా అధికారుల, వివిధ వర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్నామని చెప్పారు. భౌతికంగా, ఆన్లైన్ పద్ధతుల్లో అభిప్రాయాలు స్వీకరించామని.. ఆ తర్వాత డేటాను పూర్తిస్థాయిలో విశ్లేషించామని తెలిపారు. చదవండి : ఎల్లో మీడియాకు ఇప్పుడు అది భగవద్గీత..? -
విశాఖనే బెస్ట్ ఆప్షన్
-
ఎల్లో మీడియాకు ఇప్పుడు అది భగవద్గీత..?
సాక్షి, తాడేపల్లి : రాజధాని విషయంపై చంద్రబాబు నాయుడు తన ఎల్లో మీడియాతో దుష్ప్రచారం చేయిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఎల్లో మీడియా అనుకున్నట్లు రాజధాని మార్పు ఆలస్యం కాదని స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బోస్టన్, జీఎన్‌రావు కమిటీ నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించాకే మూడు రాజధానులపై నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. జీఎన్ రావు కమిటీని పనికిమాలిన కమిటీ అన్న చంద్రబాబు.. మళ్లీ ఇప్పుడు జీఎన్ రావు కమిటీ వైజాగ్‌లో ప్రకృతి వైపరిత్యాలు వస్తాయని చెప్పిందంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన ఎల్లో మీడియాతో ఇష్టం వచ్చినట్లు దుష్ప్రచారం చేయిస్తున్నారన్నారు. జీఎన్ రావు కమిటీ నివేదికను చెత్త బుట్టలో పడేయాలని చెప్పిన చంద్రబాబుకు, ఆయన ఎల్లోమీడియాకు ఇప్పుడు అది భగవద్గీతగా మారిందని విమర్శించారు. ఏ అంశంపై కూడా చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదన్నారు. ప్రతి విషయంలో చంద్రబాబు యూటర్న్ తీసుకుంటారని, అందుకే ఆయనను యూటర్న్ బాబు అంటారని ఎద్దేవా చేశారు. అన్ని వర్గాల, ప్రాంతాల శ్రేయస్సు కోసమే వికేంద్రీకరణ బిల్లును తీసుకువచ్చామని చెప్పారు. అన్ని కమిటీల నివేదికలను హైపవర్ కమిటీలో చర్చించాకే వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నామన్నారు. శాసన మండలి రద్దుకు రాజధానికి సంబంధం లేదన్నారు. ప్రభుత్వం మీద మాట్లాడడానికి ఏమి లేకపోవడంతోనే రాజధాని అంశంపై వివాదం చేస్తున్నారని ఆరోపించారు. -
బాబు సైంధవుడిలా అడ్డుపడుతున్నారు : కన్నబాబు
సాక్షి, కాకినాడ : కాపు మహిళల కోసం వైఎస్సార్ కాపు నేస్తం పథకం ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ధన్యవాదాలు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన కాపులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. బుధవారం మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలో వచ్చిన ఏడు నెలల్లోనే రైతు భరోసా, నాడు-నేడు, నేతన్న హస్తం, ఆరోగ్యశ్రీ వంటి పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని గుర్తుచేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా సీఎం వైఎస్ జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చూస్తున్నారని చెప్పారు. కానీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రతీ దానికి సైంధవుడిలా అడ్డుపడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు, టీడీపీ నాయకులు అభివృద్ధి నిరోధకులుగా మారారని కన్నబాబు మండిపడ్డారు. శాసన మండలి రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణను అడ్డుకుంటే బాబును ప్రజలు మరింత తిరస్కరిస్తారని చెప్పారు. అభివృద్దిని చంద్రబాబు ఎంత కాలం అడ్డుకుంటారో తాము చూస్తామని ఘాటుగా స్పందించారు. అమరావతిలో జరిగిన అక్రమాలు వెలికితీస్తుంటే బాబు వెన్నులో వణుకు పుడుతుందన్నారు. బినామీలకు చెందిన ఆస్తులను కాపాడుకోవడానికే బాబు కృత్రిమ ఉద్యమాలు చేయిస్తున్నారని విమర్శించారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి బాబుకు అవసరం లేదా అని సూటిగా ప్రశ్నించారు. -
అది తప్పకుండా అమలు అవుతుంది
-
మూడు రాజధానుల ఆలోచన అద్భుతం
అనంతపురం: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల ఆలోచన అద్భుతంగా ఉందని అనంతపురం జిల్లా విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. నిత్యం కరవు కాటకాలతో తల్లడిల్లే రాయలసీమలో జ్యూడీషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేయడాన్ని వారు స్వాగతించారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటువల్ల శ్రీభాగ్ ఒప్పందానికి న్యాయం జరిగిందని గుర్తు చేశారు. అధికార వికేంద్రీకరణకు మద్దతుగా అనంతపురం జేఎన్టీయూలో విద్యార్థుల సదస్సు జరిగింది. ఈ సదస్సులో విద్యార్థులు మాట్లాడుతూ.. ఏపీలో అధికార, అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ వల్ల తమకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు తాము జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు. సీఎం యాక్షన్ ప్లాన్ బాగుంది ఏపీలోని 13 జిల్లాల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ యాక్షన్ ప్లాన్ బాగుందని ఎస్కే యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పురుషోత్తం అన్నారు. మూడు రాజధానుల ఏర్పాటు వల్ల ఏపీ అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు. అభివృద్ధి ఒకేచోట ఉంటే ప్రాంతీయ అసమానతలు వస్తాయని పేర్కొన్నారు. అమరావతి రాజధానికి లక్ష కోట్ల అవసరమా? అని ప్రశ్నించారు. ఏపీలో మెగా క్యాపిటల్ అవసరం లేదని, మనకు కావాల్సింది గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ కాదు.. గ్రౌండ్ ఫీల్డ్ క్యాపిటల్ కావాలని, ఇదే విషయాన్ని బోస్టన్ గ్రూప్ కూడా స్పష్టం చేసిందని తెలిపారు. పదేళ్ల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ను వదులుకోవటం చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదమని అన్నారు. మేధావుల మద్దతు వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న అధికార వికేంద్రీకరణ నిర్ణయానికి మేధావులు మద్దతు ప్రకటించారు. ఏపీలోని 13 జిల్లాల అభివృద్ధి ప్రజల హక్కు అని వారు స్పష్టం చేస్తున్నారు. శాసనమండలి రద్దు.. ప్రతిపక్ష టీడీపీ స్వయంకృతాపరాధమేనని అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ రాష్ట్ర అభివృద్ధిపై తిరుపతిలో అవగాహన సదస్సు జరిగింది. ప్రజల అభిష్ఠానాన్ని అడ్డుకుంటూ.. మండలిలో వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను చంద్రబాబు అడ్డుకోవడం దారుణమని అన్నారు. శాసనమండలిని రద్దు చేస్తూ సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంతో పట్టిన చంద్రగ్రహణం వీడిపోయిందని హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు మూడు రాజధానులు అవసరం గురించి తిరుపతి ఎస్వీయూలో అవగాహన సదస్సు జరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేతృత్వంలో జరిగిన ఈ సదస్సులో ప్రొపెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. సదస్సులో పాల్గొన్న ప్రతి ఒక్కరు మూడు రాజధానులకు మద్దతు తెలిపారు. చంద్రబాబు తీరును తీవ్రంగా తప్పు బట్టారు. భారీ ర్యాలీ.. మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతిలో ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాయి. జేఏసీ నేత రాజా రెడ్డి నేతృత్వంలో వందలాదిమంది ర్యాలీలో పాల్గొన్నారు. ఎమ్మార్ పల్లి సర్కిల్ నుంచి అన్నమయ్య సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది. అధికార వికేంద్రీకరణ జరిగితేనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని జేఏసీ నేతలు ఈ సందర్భంగా అన్నారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారని మండిపడ్డారు. మూడు రాజధానులపై సీఎం జగన్ తీసుకొన్న నిర్ణయానికి తాము సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నామని తెలిపారు. స్వాగతిస్తున్న ప్రవాసాంధ్రులు ఏపీ సీఎం వైఎస్ జగన్ మూడు రాజధానులపై తీసుకున్న నిర్ణయాన్ని ప్రవాసాంధ్రులు స్వాగతిస్తున్నారు. సౌతాఫ్రికాలో నివాసం ఉంటున్న తెలుగువారు సీఎం వైఎస్ జగన్ కు మద్దతు తెలుపుతూ అక్కడ ప్రదర్శన నిర్వహించారు. పాలన వికేంద్రీకరణతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుపోతుందంటున్నారు. -
మూడు రాజధానులే ముద్దు
-
కదం తొక్కిన జనం
-
చంద్రబాబుకు షాకిచ్చిన ఎమ్మెల్సీలు.. కీలక భేటీకి డుమ్మా
-
చంద్రబాబు అభివృది నిరోధకడు: ఆదాల
-
వ్యక్తిగత ప్రయోజనాల కోసం అమరావతిని రాజధాని చేశారు
-
యనమల కుట్రలు పైనున్న ఎన్టీఆర్‌కు తెలుసు..
సాక్షి, విశాఖపట్నం: శానసమండలిలో పరిణామాలను మేధావులు, ప్రజలు బ్లాక్ డే గా భావిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. మండలి ఛైర్మన్ నిర్ణయం అప్రజాస్వామికమని ఆయన విమర్శించారు. శుక్రవారం విశాఖలో గుడివాడ అమర్నాథ్ ప్రెస్మీట్లో మాట్లాడుతూ..‘తాను తప్పు చేస్తున్నట్లు శాసనమండలి ఛైర్మనే ఒప్పుకున్నారు. ఆయన తీరును మేధావులు కూడా తప్పుబట్టారు. బీజేపీ, పీడీఎఫ్ సభ్యులు కూడా నిబంధనల ప్రకారం వెళ్లాలని ఛైర్మన్‌కు సూచించారు. చంద్రబాబు నాయుడు మండలి గ్యాలరీలో కూర్చుని ఛైర్మన్‌ను కనుసైగలతో శాసించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా మండలి ఛైర్మన్ వ్యవహరించారు. ఆయన నిర్ణయం వల్ల కొంత ఆలస్యం మాత్రమే జరుగుతుంది. ఏం సాధించారని చంద్రబాబు సంబరాలు చేసుకుంటున్నారు? రాష్ట్రంలో ప్రజాస్వామ్యాని ఖునీ చేసినందుకా ఆనందోత్సాహాలు? (వీధిన పడ్డ ‘పెద్ద’ల సభ పరువు) మూడు గ్రామాలకే చంద్రబాబు హీరో ప్రజాస్వామ్యవాదులంతా ఈ అంశంపై ఆలోచించాలి. మండలి గురించి సోమవారం అసెంబ్లీలో చర్చిస్తాం. చంద్రబాబు మూడు గ్రామాలకే హీరో.. 13 జిల్లాలకు విలన్. ఆయన పనికిరాని వారిని శాసనమండలికి తీసుకు వచ్చారు. కొబ్బరి చిప్పలు అమ్ముకునే బుద్ధా వెంకన్నను మండలిలో కూర్చోబెట్టారు. తాను మేధావినంటూ వరుసగా ఓడిపోయిన యనమల రామకృష్ణుడిని ఎమ్మెల్సీని చేశారు. స్పీకర్‌గా యనమల చేసిన కుట్రలు పైనున్న ఎన్టీఆర్‌కు తెలుసు. రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్‌కు సభలో మైక్ ఇవ్వని మీరా రూల్స్ గురించి మాట్లాడేది? చంద్రబాబు చేస్తున్న పోరాటాలు తాత్కాలికమే. ఆయన కుట్రలను ప్రజలంతా గమనిస్తున్నారు. చంద్రబాబు తాత దిగొచ్చినా వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోలేరు. అయితే తన స్వార్థపూరిత రాజకీయాల కోసం మండలిని ఉపయోగించుకోవడం దారుణం. మండలిని ఆనాడు ఎన్టీఆర్ రద్దు ఎందుకు చేశారో అందరికీ తెలుసు. అయితే అర్ధవంతమైన సభగా పెద్దల సభ ఉండాలనే మంచి ఆలోచనలతో వైఎస్సార్ ఆనాడు శాసన మండలిని పునరుద్దించారు. (చంద్రబాబు స్వార్థానికి బలయ్యాం!) పవన్‌కి చంద్రబాబే ఆదర్శం వ్యక్తిగత జీవితం, రాజకీయ జీవితంలో పవన్ కల్యాణ్ ఒంటరిగా వెళ్లలేరు. ఆయనది లాంగ్ మార్చ్ కాదు... రాంగ్ మార్చ్. పవన్‌కు వ్యక్తిత్వం, స్థిరత్వం, సిద్ధాంతాలు లేవు. మూడు రాజధానులు ఉంటే ఎందుకు తప్పు? అయిదేళ్లలో ఆరు పార్టీలతో పొత్తు పెట్టుకున్న ఏకైక నాయకుడు పవన్ కల్యాణ్. రాజకీయ జీవితంలో...వ్యక్తిగత జీవితంలో పవన్‌కి పక్కన ఎవరో ఒకరుండాలి. పొత్తుల విషయంలో పవన్ కి చంద్రబాబే ఆదర్శం. గాజువాక ప్రజలు ఓడించారనే పవన్ కక్ష సాధిస్తున్నారు.’ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. (నిమిషాల వ్యవధిలో మాట మార్చిన పవన్) -
ఏం సాధించారని చంద్రబాబు సంబరాలు?
-
వికేంద్రీకరణ బిల్లు పై టీడీపీ రాజకీయం చేస్తోంది
-
ప్ర్రజాస్వామ్యానికి బ్లాక్‌డే
-
ఏపీలో భగ్గుమన్న నిరసన జ్వాలలు
‘మూడు రాజధానులు’ బిల్లును టీడీపీ సభ్యులు అడ్డుకోవడంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం జిల్లాల వ్యాప్తంగా పలు చోట్ల రాస్తారోకోలు, చంద్రబాబు దిష్టిబొమ్మల దహనాలు నిర్వహించారు. ప్రజలు రోడ్లెక్కి చంద్రబాబు, టీడీపీ సభ్యుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ వెన్నుపోటు రాజకీయాలకు వ్యతిరేకంగా విశాఖపట్నం, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. విశాఖ జిల్లా: విశాఖపట్నంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం వినూత్న నిరసన చేపట్టింది. శాసన మండలిలో వికేంద్రీకరణ బిల్లును టీడీపీ అడ్డుకోవడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు గరికిన గౌరి ఆధ్వర్యంలో మహిళలు నల్ల చీరలతో భారీ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. చంద్రబాబు దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మానవహారం నిర్వహించి.. చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. ‘ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబు.. విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలంటూ’ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ధర్నాలో విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, సిటీ అధ్యక్షుడు వంశీకృష్ణ యాదవ్, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు అక్కరమాని విజయనిర్మల, కెకె రాజు, మళ్ల విజయప్రసాద్, రొంగలి జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. నర్సీపట్నంలో: వికేంద్రీకరణ బిల్లుపై టీడీపీ తీరుకు నిరసనగా ఎన్టీఆర్ మినీ స్టేడియంలో గాంధీ విగ్రహం ముందు నల్లబ్యాడ్జీలు ధరించి వైసీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. గాంధీ విగ్రహానికి వైఎస్సార్సీపీ టౌన్ అధ్యక్షుడు కోనేటి రామకృష్ణ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చింతకాయల సన్యాసిపాత్రుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శాసనమండలిలో మూడు రాజధానులకు సంబంధించిన బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపడాన్ని నిరసిస్తూ నినాదాలు చేశారు. తన స్వార్థపూరిత రాజకీయాలు మానుకొని.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి సహకరించాలని చంద్రబాబుకు హితవుపలికారు. శాసనమండలిలో చైర్మన్ వ్యవహరించిన తీరును వైఎస్సార్సీపీ నాయకులు తప్పుబట్టారు. విశాఖ నార్త్‌లో: శాసనమండలిలో టీడీపీ తీరుకు నిరసనగా విశాఖ నార్త్ కన్వీనర్ కేకే రాజు ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. బాలయ్య శాస్త్రి లేఅవుట్ నుంచి నల్ల వస్త్రాలు ధరించిన మహిళలు నిరసనలో ర్యాలీలో పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడ్డుపడుతున్న చంద్రబాబు అండ్ కో పై కేకే రాజు మండిపడ్డారు. ఎన్ఏడీ జంక్షన్లో: వికేంద్రీకరణ బిల్లుపై టీడీపీ తీరుకు నిరసనగా విశాఖ ఎన్ఏడీ జంక్షన్లో విశాఖ వాసులు మానవహారం నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి వైఎస్సార్సీపీ విశాఖ వెస్ట్ కన్వీనర్ మళ్ల విజయప్రసాద్ సంఘీభావం తెలిపారు. విశాఖ నార్త్ కన్వీనర్ కేకేరాజు మాట్లాడుతూ.. విశాఖ ప్రజల ఓట్లతో పరువు నిలబెట్టుకున్న చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు ఉత్తరాంధ్ర ద్రోహానికి పాల్పడ్డారన్నారు. విజయప్రసాద్ మాట్లాడుతూ.. శాసనమండలి చైర్మన్ తీరు రాజ్యాంగ విరుద్ధం అని మండిపడ్డారు. పదవులు, బినామీ ఆస్తుల కోసం చంద్రబాబు ఎంతటి మోసానికైనా ఒడిగడతారన్నారు. పశ్చిమగోదావరిలో: శాసనమండలి టీడీపీ వైఖరికి నిరసనగా తాడేపల్లిగూడెంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ తనయుడు విశాల్ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించిన వైఎస్సార్సీపీ అభిమానులు,కార్యకర్తలు చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసిన నిరసన తెలిపారు. కర్నూలు జిల్లా: టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాయలసీమ ప్రజలను చంద్రబాబు మరోసారి మోసం చేశాడంటూ న్యాయవాదులు టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. వికేంద్రీకరణకు వ్యతిరేకంగా చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మెల్సీ ఫరూక్ కార్యాలయం ముట్టడి మండలిలో టీడీపీ వైఖరికి నిరసనగా రాయలసీమ విద్యార్థి యువజన సంఘం నేతలు ఎమ్మెల్సీ ఎన్ఎండీ ఫరూర్ కార్యాలయాన్ని ముట్టడించారు. వికేంద్రీకరణ బిల్లును టీడీపీ వ్యతిరేకించడం పట్ల తీవ్రంగా ఖండించారు. ఇప్పటికైనా టీడీపీ తీరు మార్చుకుని కర్నూలు జ్యూడిషియల్ క్యాపిటల్‌కు మద్దతు పలకాలని, లేని పక్షంలో తీవ్రస్థాయిలో ఆందోళన చేపడతామని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి. జేఏసీ నేతలు.. చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు అనంతపురం జిల్లా: ఏపీ వికేంద్రీకరణ బిల్లుపై శాసనమండలిలో టీడీపీ తీరుకు నిరసనగా గుత్తిలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. నిరసనగా చంద్రబాబు దిష్టిబొమ్మను వైఎస్సార్సీపీ నేతలు దహనం చేశారు. కల్యాణదుర్గంలో.. వికేంద్రీకరణ బిల్లును టీడీపీ అడ్డుకోవడాన్ని నిరసనగా కల్యాణదుర్గంలో వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీ చేపట్టింది. ఆంధ్రుల ద్రోహి చంద్రబాబు అని, శాసనమండలి బిల్లులను అడ్డుకోవడం దారుణమని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. చిత్తూరు: ప్రతిపక్ష నేత చంద్రబాబు తీరుకు నిరసనగా తిరుపతి ఎస్వీయూలో నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసిన విద్యార్థులు.. రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ మండిపడ్డారు. మండలి వికేంద్రీకరణ బిల్లును టీడీపీ అడ్డుకోవడం దారుణమన్నారు. రియల్ హీరో వైఎస్ జగన్ అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువజన నేత ఓబుల్ రెడ్డి పాల్గొన్నారు. -
సీఎం జగన్‌ను కలిసిన టీడీపీ ఎమ్మెల్సీ
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలకు తాను మద్దతు ఇస్తానని చెప్పారు. గురువారం ఆమె ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరడానికే సీఎం జగన్‌ను కలిశానని స్పష్టం చేశారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సీఎం జగన్ ఎంతగానో కృషి చేస్తున్నారని కొనియాడారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. బుధవారం శాసన మండలిలో జరిగిన ఘటన దేశం మొత్తం పరిశీలించిందని, అలా జరగడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. భవిష్యత్తులు ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలన్నారు. టీడీపీ సభ్యులు ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వ బిల్లులు అడ్డుకున్నారని ఆరోపించారు. మండలి చైర్మన్ టీడీపీ కార్యకర్తగా వ్యవహరించారని విమర్శించారు. అభివృద్ధికి ఆటంకంగా ఉన్న శాసస మండలి ఉండాలా వద్దా అనే అంశంపై చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. అభివృద్ధిని అడ్డుకోవాలనే దురుద్ధేశంతో రూల్ 71ను టీడీపీ పెట్టిందని, అందుకే వ్యతిరేకంగా ఓటు వేశానని అన్నారు. కాగా, ఏపీ శాసన మండలిలో మంగళవారం టీడీపీ ప్రవేశపెట్టిన రూల్ 71ను సునీత వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఓటు వేటు వేసిన సంగతి తెలిసిందే. ఆమెతో పాటు మరో టీడీపీ ఎమ్మెల్సీ శివనాథ్‌రెడ్డి కూడా సొంత పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. -
పెద్దల సభపై నమ్మకం పోయింది..
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో పెద్దల సభపై నమ్మకం పోయిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. శాసన మండలిలో రాజకీయ ఒత్తిళ్ల వల్ల నిర్ణయాలు తీసుకోవడం చాలా దారుణమన్నారు. దేశంలో ఆరు రాష్ట్రాల్లో శాసన మండళ్లు ఉన్నాయని.. ఏపీలో మండలి తీరు బట్టి మిగతా రాష్ట్రాల్లో కూడా శాసన మండలిని రద్దు చేసే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏ పార్టీ అధ్యక్షుడు కూడా శాసనమండలి కి వచ్చి చైర్మన్ పై ఒత్తిడి తెచ్చిన సందర్భం లేదన్నారు. శాసన మండలి చైర్మన్ దైవభక్తి, నిజాయితీ గల వ్యక్తి అని.. కానీ చంద్రబాబు ఒత్తిడితో నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ముఖ కవళికల్లో కనిపించిందన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసిన అంశం శాసన మండలిలో చర్చకు రాకుండా పక్కకు పెట్టడం అత్యంత నిబంధనలకు విరుద్ధం అని దాడి వీరభద్రరావు పేర్కొన్నారు. కౌన్సిల్లో చర్చించాల్సిన అంశాలు ముందుగా సభ్యులకు తెలియజేయాలన్నారు. రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిస్తాం అని చెప్పడం కూడా రూల్స్‌కు విరుద్ధమేనన్నారు. చైర్మన్‌కు నేరుగా రూలింగ్ ఇచ్చే అధికారం లేదని.. కమిటీకి పంపించాలా లేదా అనే అంశాన్ని సభ్యుల దృష్టికి తీసుకువెళ్లి నిర్ణయం తీసుకోవాల్సిందేనని చెప్పారు. సభ్యులు ఓటింగ్ కోరితే సెలెక్ట్ కమిటీకి బిల్లు పంపిన విషయం పై ఓటింగ్ కూడా నిర్వహించాల్సిన బాధ్యత చైర్మన్ కు వుందని వివరించారు. మండలి లో నిన్న జరిగిన తీరు అప్రజాస్వామికం అని వీరభద్రరావు పేర్కొన్నారు. (చదవండి: బిల్లుపై తొలి నుంచి కుట్రపూరితంగానే...) -
గ్యాలరీలో చంద్రబాబు ఎందుకు కూర్చున్నారు?
సాక్షి, అమరావతి: అసెంబ్లీలో తీసుకున్న ప్రతి కీలక నిర్ణయాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో శాసనమండలి జరుగుతోందని, ఈ పరిస్థితుల్లో మండలి ఉండాలా? లేదా? అనే చర్చ జరగాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ, సీడీఆర్ఏ రద్దు బిల్లులను శాసనమండలి చైర్మన్ సెలెక్ట్ కమిటీకి నివేదించిన అంశంపై ఆయన గురువారం అసెంబ్లీలో మాట్లాడారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని చెప్పుకునే చంద్రబాబునాయుడు మండలి గ్యాలరీలో కూర్చోవాల్సిన అవసరమేంటి? అని ప్రశ్నించారు. ‘శాసనమండలి గ్యాలరీలో చంద్రబాబు ఉన్నారని తెలిసి.. నేను కూడా ఆసక్తిగా వెళ్లాను. నిబంధనల ప్రకారం మండలిలో బిల్లులపై ఓటింగ్ జరుగుతుందని భావించా. కానీ చైర్మన్ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపడం ఆశ్చర్యంగా అనిపించింది. సెలెక్ట్ కమిటీకి పంపాలంటే సవరణలు ప్రవేశపెట్టాలి కానీ, వాటిని ప్రవేశపెట్టలేదు. కాబట్టి ఓటింగ్ జరుగుతుందని భావించాం. కానీ, నిబంధనలకు విరుద్ధంగా చివర్లో చైర్మన్ విచాక్షణాధికారం అంటూ సెలెక్ట్ కమిటీకి పంపించారు. వికేంద్రీకరణ బిల్లు ఇప్పుడప్పుడే చట్టం కాకూడదనే కుట్రతోనే సెలెక్ట్ కమిటీకి పంపారు. సెలెక్ట్ కమిటీకి నివేదించడం వల్ల రెండు, మూడు నెలల జాప్యం జరుగుతుంది. కానీ, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు ఎంతకాలం ఆపగలరు’ అని అంబటి ప్రశ్నించారు. రైతులను మరోసారి మోసం చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, ఈ విషయాన్ని రైతులు గమనించాలని కోరారు. శాసనసభ అమరావతిలో జరుగుతుందని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారని గుర్తు చేశారు. అమరావతి రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వంతో చర్చించాలని సూచించారు. వ్యవస్థలను దెబ్బతీయడంలో చంద్రబాబు దిట్ట అని, చంద్రబాబు ప్లాన్‌లో భాగంగా అభివృద్ధి నిరోధకంగా శాసనమండలి మారుతున్నప్పుడు దాని కొనసాగింపుపై చర్చ జరగాల్సిన అవసరముందన్నారు. -
‘టీడీపీ నేతలు దళితుల భూములను లాక్కున్నారు’
సాక్షి, అమరావతి: దళితుల భూములను మభ్యపెట్టి, భయపెట్టి మరీ టీడీపీ నేతలు లాక్కున్నారని పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రాజధానిలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్ దొంగల ముసుగులు తొలగుతున్నాయని తెలిపారు. టీడిపీకి చెందిన నేతలు నారాయణ, పత్తిపాటి పుల్లారావులపై సీఐడీ నమోదు చేసిన కేసులే అందుకు ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. తాజాగా దళిత మహిళ బుజ్జమ్మ ఫిర్యాదుతో మాజీ మంత్రుల భూ భాగోతం బయపడిందని ఆయన మండిపడ్డారు. బుజ్జమ్మ లాంటి బాధిత దళితులు రాజధాని ప్రాంతంలో చాలామంది ఉన్నారని అనిల్ కుమార్ తెలిపారు. చదవండి: ఇన్సైడర్ ట్రేడింగ్: పత్తిపాటి, నారాయణపై కేసులు సీఐడీ పూర్తి స్థాయిలో విచారణ చేసి.. ఇన్సైడర్ ట్రేడింగ్ కలుగులో ఉన్న టీడీపీ నేతల బండారాన్నీ బయటపెట్టాలి పేర్కొన్నారు. పేదల పేరుతో భూములు కొనుగోలు చేసిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. బినామీల పేర్లతో కొనుగోలు చేసిన భూములను కాపాడుకునేందు పరిపాలన వికేంద్రీకరణను టీడీపీ అడ్డుకుంటుందని అనిల్ కుమార్ మండిపడ్డారు. టీడీపీ నేతలు మండలి చైర్మన్‌పై ఒత్తిడి చేసి అప్రజాస్వామిక నిర్ణయం తీసుకొనేలా చేశారని అనిల్ కుమార్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. చదవండి: ఇన్సైడర్ ట్రేడింగ్‌పై సమగ్ర విచారణ -
మండలి చైర్మన్‌కు ఆ విచక్షణాధికారం లేదు
సాక్షి, అమరావతి: పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి నివేదించే విషయంలో శాసనమండలి చైర్మన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆర్థిక, శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం మండలిలో జరిగిన ఈ వ్యవహారంపై బుగ్గన గురువారం అసెంబ్లీలో వివరణ ఇచ్చారు. శాసనసభ ఆమోదించి పంపిన బిల్లుల విషయంలో శాసనమండలికి పరిమితమైన ఆప్షన్స్ మాత్రమే ఉంటాయని, ఆ బిల్లును చర్చించి ఆమోదించడం, లేదా సవరణలతో మళ్లీ శాసనసభకు పంపించడం వంటి ఆప్షన్స్ ఉంటాయని, కానీ టీడీపీ కుట్రపూరితంగా రూల్ 71 అంశాన్ని తెరపైకి తెచ్చిందని మండిపడ్డారు. నిజానికి రూల్ 71 నిబంధన కేవలం ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలోనే ఉందని, ఏపీ అసెంబ్లీలో కూడా అది లేదని స్పష్టం చేశారు. ప్రత్యేకమైన పరిస్థితుల్లో ప్రభుత్వ పాలజీని చర్చించి మండలి తన అభిప్రాయాన్ని తెలియజేసేందుకు కొన్ని సంవత్సరాల కిందట ఈ నిబంధనను మండలిలో చేర్చారని వివరించారు. నిజానికి శాసనప్రక్రియలో గవర్నమెంట్ బిజినెస్‌కు ప్రథమ ప్రాధాన్యమివ్వాలని, ఈ మేరకు స్పష్టంగా నిబంధనలు ఉన్నా.. వాటిని ఉల్లంఘిస్తూ చైర్మన్ రూల్ 71కింద సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేశారని తెలిపారు. అలా రిఫర్ చేసే సమయంలో ఈ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించాలని తాము లేఖలు ఇచ్చినట్టు టీడీపీ చెప్పుకొచ్చిందని తెలిపారు. నిజానికి రూల్ 71 కింద బిల్లులను సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేసే అధికారమే లేదని బుగ్గన తెలిపారు. సెలెక్ట్ కమిటీకి పంపే ప్రొవిజన్ లేకపోయినా, విచక్షణాధికారం కింద బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించినట్టు చైర్మన్ చెప్పారని, కానీ, ఇది చైర్మన్ విచక్షణాధికారం కిందకు రాదని, దీనికి సంబంధించి స్పష్టంగా నిబంధనలు ఉన్నాయని స్పష్టం చేశారు. మండలిలో టీడీపీ సభ్యుల ప్రవర్తన నవ్వులాటలాగా ఉందని, మండలిలో బలముంది కదా అని అన్ని చట్టాలను, నిబంధనలను, సంప్రదాయాలను టీడీపీ తనకు అనుకూలంగా ఇష్టానుసారంగా వాడుకుంటోందని దుయ్యబట్టారు. తీర్మానాలు, బిల్లులు ప్రవేశపెట్టే సమయంలో ఆ సమయాన్ని మార్చడానికి చైర్మన్‌కు విచక్షణాధికారం ఉంటుందని, సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేయడంలో కాదని తెలిపారు. ప్రజల తరఫున ఎన్నికైన ప్రభుత్వం ప్రధాన బాధ్యత చట్టాలు రూపొందించడమని, శాసన వ్యవస్థ ప్రథమ బాధ్యత కూడా ఈ చట్టాలను ఆమోదించడమని, ఈ విషయంలో దిగువసభ అసెంబ్లీకే విశేష అధికారాలు ఉంటాయని భారత రాజ్యాంగం కూడా స్పష్టం చేస్తుందని, కానీ ప్రతిపక్ష టీడీపీ మాత్రం ఏదో రూల్ తీసుకొచ్చి.. పరిపాలనను అడ్డుకునేందుకు, చట్టాల రూపకల్పన ప్రక్రియకు మోకాలడ్డేందుకు ప్రయత్నిస్తోందని బుగ్గన తప్పుబట్టారు. నిన్న సాయంత్రం మండలిలో జరిగింది చాలా బాధాకరమని, నాలుగు గంటలసేపు గ్యాలరీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు కూర్చొన్నారని, అసలు ఎప్పుడూ మండలికి రాని చంద్రబాబు వచ్చి.. అంతసేపు కూర్చోవాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. చైర్మన్ ఎదుట కూర్చొని.. చైర్మన్‌ను ప్రభావితం చేసేవిధంగా చంద్రబాబు వ్యవహరించారని, ఈ విషయంలో తప్పు చేసినవారిదే కాకుండా తప్పు చేయించేలా ప్రభావితం చేసిన వారిది ఇంకా పెద్ద తప్పు అని మండిపడ్డారు. టీడీపీ సభ్యుడు యనమల రామకృష్ణుడు మంత్రులు సభకు తాగొచ్చారంటూ బాధ్యతారహితంగా, దారుణంగా మాట్లాడారని మండిపడ్డారు. ఇతర పార్టీల సభ్యులు సోము వీర్రాజు, మాధవ్‌తోపాటు పీడీఎఫ్, కాంగ్రెస్, స్వతంత్ర సభ్యుడు కూడా చైర్మన్ చేసింది తప్పని నిర్ద్వంద్వంగా చెప్పారని గుర్తు చేశారు. మండలి చైర్మన్ హోదాలో ఉన్న వ్యక్తిఇ తటస్థంగా వ్యవహరించాలని అన్నారు. -
‘చంద్రబాబు ఒక అరాచక శక్తి’
సాక్షి, విజయవాడ: రాష్ట్ర పాలకుడిగా చంద్రబాబు అనర్హుడని.. అందుకే ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారని సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ అన్నారు. ఈ నెపంతో రాష్ట్ర ప్రజలపై కక్ష తీర్చుకోవాలనే దురుద్దేశంతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించి అశాంతిని పెంచాలనే కుట్రతో 40 రోజులుగా ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. అభివృద్ధి వికేంద్రీకరణకు వ్యతిరేకంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు చేస్తోన్న చర్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. చంద్రబాబుకు అమరావతిపై చిత్తశుద్ధి ఉంటే.. వేల కోట్లు ఖర్చు పెట్టి శాశ్వత భవనాలు ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాశ్వత హైకోర్టు, శాసనసభ, సచివాలయాలు లేవని.. తాత్కాలిక భవనాలతో వేల కోట్లు దుర్వినియోగం చేశారని విమర్శించారు. ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో చంద్రబాబు, ఆయన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు వేల ఎకరాలను దోచేశారని ధ్వజమెత్తారు. 13 జిల్లాల అభివృద్ధిని ఆకాంక్షించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును తెచ్చారని.. టీడీపీ దీనిని అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రాభివృద్ధి అంటే అమరావతి అభివృద్ధి మాత్రమే కాదని..13 జిల్లాల అభివృద్ధి అని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు కనుసన్నల్లోనే శాసనమండలిలో ఎమ్మెల్సీలు అరాచకం సృష్టించారని తెలిపారు. చంద్రబాబు, చైర్మన్లు కలిసి శాసనమండలి ఔన్నత్యాన్ని దెబ్బతీశారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు 29 గ్రామాలకు ప్రతిపక్ష నాయకుడిగా చరిత్రలో మిగిలిపోతారని ఎద్దేవా చేశారు. అభివృద్ధిని అడ్డుకుని..చంద్రబాబు పైశాచిక ఆనందం.. నిన్నటి రోజు చరిత్రలో బ్లాక్‌డే గా మిగిలిపోతుందని సోషల్ డెమోక్రాటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మాధగాని గురునాథం అన్నారు. చంద్రబాబు మంది బలంతో చట్టాలను చుట్టంగా చేసుకోవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజల బలం ఉందని పేర్కొన్నారు. 13 జిల్లాల అభివృద్ధిని అడ్డుకుని చంద్రబాబు పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. 40 సంవత్సరాల అనుభవంతో నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు,యనమల రామకృష్ణుడు చేసిన కుటిల రాజకీయాలు మండలి సాక్షిగా బహిర్గతమయ్యాయన్నారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహి.. రాయలసీమ వాసులకు అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు అని సోషల్ డెమోక్రాటిక్ ఫ్రంట్ రాష్ట్ర నేత రాజ్‌కుమార్ మండిపడ్డారు. రాజ్యాంగ విరుద్ధంగా చంద్రబాబు మండలిలో ప్రవర్తించారని ధ్వజమెత్తారు. ఐదు కోట్ల ప్రజల అభివృద్ధిని అడ్డుకోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. రాయలసీమ రాజధాని కోసం తాము ప్రాణ త్యాగానికైనా సిద్ధమని రాజ్‌కుమార్ స్పష్టం చేశారు. -
‘స్వార్థం కోసం బాబు ఎంతకైనా తెగిస్తారు’
సాక్షి, అమరావతి : ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు తన స్వార్థం కోసం ఎంతకైనా తెగిస్తారని విమర్శించారు. శాసన సభలో అత్యధిక మెజార్టీతో ఆమోదం పొందిన రెండు చారిత్రాత్మక బిల్లులను(అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లు) చంద్రబాబు తన సొంత ప్రయోజనాల కోసం మండలిలో అడ్డుకున్నారని ఆరోపించారు. (చదవండి : పవన్‌కు బీజేపీ పెద్దలు క్లాస్ పీకినట్టున్నారు!) తన వ్యూహంలో భాగంగానే రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపేలా కుట్రపన్నారని ఆరోపించారు. చంద్రబాబు తన మనుగడ కోసం ఎంత నీచానికైనా తెగిస్తాడనడానికి బుధవారం మండలిలో జరిగిన పరిణామాలే నిదర్శమన్నారు. ఇలాంటి వ్యక్తులు రాష్ట్రానికి ఎంత ప్రమాదకరమో ప్రజలకు పూర్తిగా తెలిసిపోయిందని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. -
ప్రతిపక్షాల వైఖరి సరైంది కాదు
సాక్షి, విశాఖపట్నం: శాసన మండలి చైర్మన్ తన విచక్షణాధికారాలతో బిల్లును సెలక్ట్ కమిటీకి పంపడం శాసన మండలి చరిత్రలోనే ఇదే మొదటిసారని ఏయూ పొలిటికల్ సైన్స్ విశ్రాంతాచార్యులు ప్రొఫెసర్ కె.రవి అన్నారు. ప్రాంతీయ సమానాభివృద్ధి, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను నిబంధనలకు విరుద్ధంగా శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి పంపించడాన్ని ఆయన తప్పుపట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు శాసన మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్‌ను ప్రభావితం చేసేలా వ్యవహరించడం తప్పని మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్య మూల సూత్రాలకు విరుద్ధమని ప్రొఫెసర్ రవి పేర్కొన్నారు. టీడీపీ సభ్యుల తీరు చూస్తే అసలు వీరు ప్రజాస్వామ్య వాదులేనా, వీరికి ప్రజాస్వామ్యం మీద నమ్మకముందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. ప్రతిపక్షాల వైఖరి సరైంది కాదని విమర్శించారు. ప్రజాస్వామ్య ప్రత్యామ్నాయాలను ఆశ్రయించకుండా వికృత చేష్టలతో గొడవకు దిగి బిల్లును ఆపడం అప్రజాస్వామికమే అవుతుందని ఎద్దేవా చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ఆమోదించకుండా తిరోగమనం చెందటం ప్రజలకు నిరాశాజనకమని పేర్కొన్నారు. చదవండి: ఇది తప్పే.. సెలెక్ట్ కమిటీకి ఎలా పంపుతారు? -
దుష్ట సంప్రదాయానికి టీడీపీ తెరలేపింది
సాక్షి, అమరావతి: శాసనమండలిని అభివృద్ధి నిరోధకంగా మార్చాలని టీడీపీ యత్నిస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. గురువారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. టీడీపీ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మండలి చైర్మన్ నిర్ణయం అప్రజాస్వామికం అని... ఆయన నిర్ణయాన్ని మేధావులంతా తప్పుబడుతున్నారని చెప్పారు. ప్రజాస్వామ్యవాదులంతా ఈ అంశంపై ఆలోచించాలని కోరారు. రాజ్యాంగ విలువలను టీడీపీ అపహాస్యం చేసిందన్నారు. ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపే అవసరం లేదన్నారు. ఇది చంద్రబాబు ప్రభావం వల్లే జరిగిందన్నారు. చైర్మన్‌ను రూల్ ప్రకారం వ్యవహరించాలని కోరామని తెలిపారు. మండలిలో జరిగిన పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని ఆందోళన కలిగిస్తున్నాయని అంబటి పేర్కొన్నారు. చాలా రాష్ట్రంలో మండలి లేదని.. మన రాష్ట్రంలోనే ఉందన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడానికి రెండు సభలు దోహదపడాలని.. లేదంటే ఏమైనా ప్రభుత్వం చిన్న చిన్న పొరపాట్లు చేస్తే సవరణలు చేయాలని సూచించారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రభుత్వ బిల్లులను టీడీపీ అడ్డుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. మండలిలో మెజార్టీ ఉంటే తిరిగి పంపొచ్చని.. అలా కాకుండా బిల్లును అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. అభివృద్ధి నిరోధక శక్తిగా టీడీపీ మారిందని.. ఇటువంటి సమయంలో శాసన మండలి అవసరమా అనే చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. మండలిలో టీడీపీ తీరుపై ప్రజలంతా ఆలోచించాలన్నారు. సభలో దుష్ట సంప్రదాయానికి టీడీపీ తెరలేపిందన్నారు. జాతీయస్థాయిలో చక్రం తిప్పుతానని చెప్పే చంద్రబాబు గ్యాలరీలో ఎందుకు చైర్మన్ ఎదురుగా కూర్చున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు తీరును ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలని కోరారు. పెద్దల సభను పిల్లల సభలాగా మార్చుతున్నారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభావంతోనే మండలి చైర్మన్.. సెలెక్ట్ కమిటీకి బిల్లులు పంపారన్నారు. బిల్లులను తాత్కాలికంగా మాత్రమే అడ్డుకోగలరని.. శాశ్వతంగా అడ్డుకోలేరన్నారు. తాము స్వాగతిస్తే టీడీపీ ఎమ్మెల్సీలు వైఎస్సార్సీపీలోకి క్యూ కడతారని.. కానీ అది తమ విధానం కాదని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం.. రాజధాని విషయంలో జోక్యం చేసుకోదన్నారు. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం పవన్‌కల్యాణ్, చంద్రబాబు మానుకోవాలని హితవు పలికారు. ఇన్సైడర్ ట్రేడింగ్ చేసిన వారిపై విచారణ జరుగుతుందని.. ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని చెప్పారు. తప్పుచేసిన వారికి శిక్ష తప్పదని ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు. (చదవండి: మండలి చైర్మన్ నిర్ణయం అప్రజాస్వామికం) -
కొందరు టీడీపీ సభ్యులు కూడా ఇదే చెప్పారు..!
సాక్షి, అమరావతి: శాసనమండలి చైర్మన్ నిర్ణయం అప్రజాస్వామికం అని మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. గురువారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. శాసనమండలి చరిత్రలో నిన్నటి సంఘటన దురుద్దినం అని పేర్కొన్నారు. మండలి చైర్మన్ చంద్రబాబు చెప్పినట్టు నడుచుకున్నారని మండిపడ్డారు. 5 కోట్ల మంది ప్రజలు వైఎస్ జగన్మోహన్రెడ్డికి అధికారం ఇచ్చారని.. శాసనసభలో ఆమోదించిన బిల్లును మండలిలో టీడీపీ అడ్డుకోవడం దారుణమన్నారు. బీజేపీ, పీడీఎఫ్ సభ్యులు కూడా నిబంధనలు ప్రకారం నడుచుకోవాలని సూచించారని ఆయన ప్రస్తావించారు. చంద్రబాబుకు ఉన్న 40 ఏళ్ల అనుభవం ఇదేనా అని ప్రశ్నించారు. అసెంబ్లీ ఉన్నది చట్టాలు చేయడానికి.. చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. నారా లోకేష్ నేరుగా తనపైకి దూసుకువచ్చారని మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అలజడి సృష్టించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ ఉన్నది చట్టాలు చేయడానికే అని.. తిరస్కరించడానికి కాదని చెప్పారు. సంఖ్యాబలం ఉంటే మీ ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తారా అని నిప్పులు చెరిగారు. టీడీపీ చర్యలు వల్ల కొంత జాప్యం మాత్రమే జరుగుతుందన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని ఎలా భ్రష్టు పట్టించారో అందరికి తెలుసునని ఆయన పేర్కొన్నారు. లోకేష్ నీ స్థాయి ఏమిటో తెలుసుకో.. చైర్మన్‌తో మాట్లాడేందుకు వెళ్తుంటే లోకేష్ తనపై దౌర్జన్యం చేశారని మంత్రి బొత్స అన్నారు. లోకేష్ స్థాయి ఏమిటో ముందు తెలుసుకోవాలని సూచించారు. కొన్ని పత్రికలు తమ పై తప్పుడు కథనాలు ప్రచురించాయని మండిపడ్డారు.డివిజన్ చేయకుండా బిల్లు సెలెక్ట్ కమిటీకి ఎలా పంపుతారని ప్రశ్నించారు. అన్ని పక్షాలు రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని చెప్పాయన్నారు. కొంత మంది టీడీపీ సభ్యులు కూడా ఇదే విషయం చెప్పారన్నారు. ఈ విషయాన్ని స్వయంగా చైర్మనే తెలిపారని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. -
సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం జగన్ భేటీ
సాక్షి, అమరావతి: అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలతో గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లుపై ఏవిధంగా ముందుకు సాగాలనే అంశంపై వారితో చర్చించనున్నారు. సీఎం ఛాంబర్లో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, కురసాల కన్నబాబు సహా ప్రసాద్ రావు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి తదితర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. చదవండి: రూల్ ప్రకారం జరగలేదు... అయినా సెలెక్ట్ కమిటీకి పంపుతున్నాం కాగా ప్రాంతీయ సమానాభివృద్ధి, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను నిబంధనలకు విరుద్ధంగా శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి పంపించేలా టీడీపీ వ్యూహరచన చేసిన విషయం తెలిసిందే. ‘ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించడం నిబంధనలకు విరుద్ధం.. టీడీపీ ఇచ్చిన నోటీసు నిబంధనల మేరకు లేదు..’ అని శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ స్వయంగా చెబుతూనే ఆ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ రూలింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మండలిలో జరిగిన పరిణామాలపై ఈనాటి భేటీలో ముఖ్యమంత్రి చర్చించనున్నారు. ఇక ఈ బిల్లులు శాసన సభలో ఆమోదం పొందిన విషయం విదితమే. ఏపీ వికేంద్రీకరణ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపడం దుర్మార్గం -
ఇంగ్లిష్ మీడియం తప్పనిసరి హర్షణీయం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నాలుగోరోజు గురువారం ప్రారంభమయ్యాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ యాక్ట్ సవరణ బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంపై చర్చ జరుగుతోంది. ఈ చర్చలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ.. సామాజిక, ఆర్థిక అసమానతల వల్ల కొంతమంది వెనకబడ్డారని, సమాజంలోని ఈ అసమానతలు తగ్గాలంటే విద్య చాలా అవసరమని తెలిపారు. పోటీ ప్రపంచంలో ఇంగ్లిష్ విద్య అవసరమని తెలిపారు. ఇంగ్లిష్ మీడియం తప్పనిసరి అంటూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం ఎంతో కీలకమైనదని, హర్షించదగిందని అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన అమ్మ ఒడి పథకంతో విద్యార్థులకు ఎంతో లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలోని మధ్యాహ్న భోజన మెనూతో విద్యార్థులకు ఎంతో లాభం చేకూరుతుందని, విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం వల్ల వారి సామర్థ్యం పెరుగుతుందన్నారు. నాడు-నేడు కార్యక్రమంతో పాఠశాలల్లో వసతులు మెరుగవుతున్నాయని, ఈ నిర్ణయాల వల్ల ప్రభుత్వ పాఠశాల్లలో డ్రాపౌట్స్ తగ్గుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్య మీద ఎంతో శ్రద్ధ పెట్టి.. ప్రాధాన్యమిస్తున్నారని, ఆయన తీసుకొస్తున్న పథకాలు ప్రజల తరతరాల అభివృద్ధికి బాటలు వేస్తున్నాయని అన్నారు. నిరక్షరాస్యత రూపుమాపడమే మా ప్రభుత్వ లక్ష్యం.. సభ్యుడు కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. ‘ప్రస్తుత కాలంలో ఇంగ్లిష్ విద్య ఒక ఆస్తి. ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే ఇంగ్లిష్ చాలా అవసరం. సమాజంలోని నిరక్షరాస్యత రూపుమాపడమే మా ప్రభుత్వ లక్ష్యం. పేద విద్యార్థులకు మేలు చేసేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరిగా ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెడుతున్నాం. సమాజంలోని అసమానతలు విద్య వల్ల తగ్గుతాయి. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ దేశ నిండుభారతిని అన్న కవి భావాలను నిజం చేయాలంటే అందుకు ఇంగ్లిష్ విద్య కూడా అవసరం. ప్రపంచ భాష అయిన ఇంగ్లిష్ రాకపోతే మన ఔన్నత్యాన్ని అందరికీ చాటిచెప్పలేం’ అని పేర్కొన్నారు. రైతు కొడుకు ఇంజినీర్ కావాలని.. సభ్యుడు కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ‘పేదలు తమ పిల్లల్ని చదివించడానికి ఎంతో కష్టపడుతున్నారు. అప్పులు చేసి ప్రైవేటు స్కూళ్లలో చదివిస్తున్నారు. చాలామంది ఊళ్లను నుంచి పిల్లలను పట్టణాలకు పంపించి.. అక్కడ చదివిస్తున్నారు. ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతోంది. పదో తరగతికి వచ్చేవరకు ఆ ఒత్తిడిని తట్టుకోలేక కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నారాయణ, శ్రీచైతన్య వంటి ప్రైవేటు స్కూళ్లలోనే విద్యార్థుల ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులు అన్ని రకాల ఒత్తిళ్లను తట్టుకొని నిలబడే విధంగా శిక్షణ పొందుతున్నారు. జీవితంలో వచ్చే ఆటుపోట్లను తట్టుకునేవిధంగా తయారవుతున్నారు. చాలచోట్ల ప్రైవేటు పాఠశాలలు ఏమాత్రం వసతులు లేకుండా పశువుల కొట్టాంలా ఉన్నాయి. కానీ పెద్దమొత్తంలో ఫీజలను ప్రైవేటు స్కూళ్లు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం చాలా అవసరం. రైతు కొడుకు ఇంజినీర్ కావాలని, రిక్షావాడి కొడుకు కూడా డాక్టర్ కావాలని, పేద విద్యార్థులు కూడా పెద్ద పెద్ద చదువులు చదవాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. అంబేద్కర్ కలల సమాజాన్ని సీఎం జగన్ సాకారం చేస్తున్నారు’ అని అన్నారు. సభ్యుడు గొల్లబాబురావు మాట్లాడుతూ.. విద్యారంగంలో సంస్కరణలతో భావితరాలకు మేలు జరుగుతుందని అన్నారు. విద్య అనేది అభివృద్ధికి పునాది అని, అందుకే విద్యలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరముందని పేర్కొన్నారు. విద్యారంగంలో సంస్కరణల వల్ల సమాజంలో ఎన్నో మంచి మార్పులు వస్తాయని తెలిపారు. పేదవర్గాల సంక్షేమం కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారని కొనియాడారు. ఇంగ్లిష్ విద్య పేదలకు వరం లాంటిదని, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని తప్పనిసరి చేయడాన్ని స్వాగతించారు. సభ్యుడు తిప్పేస్వామి మాట్లాడుతూ.. ప్రతి పేదవాడికి ఇంగ్లిష్ చదువు రావాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం బిల్లును తీసుకొచ్చిందన్నారు. బిల్లు ఉద్దేశాన్ని పక్కదారి పట్టించేలా టీడీపీ వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి మాట్లాడుతూ.. ప్రాథమిక విద్యలో తెలుగు మీడియంలో ఉండి, ఉన్నత విద్య ఇంగ్లిష్ మీడియంలో ఉండటం వల్ల విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతాయని, అందువల్ల ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్ మీడియంలో బోధన సాగించాల్సి ఉందని, అందుకు వీలుగా ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చిందని వివరించారు. సభ్యుడు బుడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ.. ప్రస్తుతకాలంలో ఇంగ్లిష్ విద్య తప్పనిసరి అయిందని, ఇంగ్లిష్ విద్య పేద విద్యార్థులకు ఓ వరమని కొనియాడారు. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను మండలి చైర్మన్ షరీఫ్ బుధవారం అర్ధంతరంగా సెలెక్ట్ కమిటీకి నివేదించి.. మండలి సమావేశాలను నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు మాత్రమే నేడు కొనసాగనున్నాయి. -
నిమిషాల వ్యవధిలో మాట మార్చిన పవన్
సాక్షి, న్యూఢిల్లీ : మూడు రాజధానుల అంశంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పూటకో మాట మారుస్తున్నారు. ఒకే రోజు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేసి ప్రజల్లో నవ్వుల పాలవుతున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. తొలుత మూడు రాజధానులపై కేంద్ర ప్రభుత్వ సమ్మతి లేదని ప్రకటించారు. వెంటనే తప్పును సవరించుకొని రాజధాని మార్పుకు కేంద్రం సమ్మతి అవసరం లేదని తెలిపారు. (చదవండి : ఏమయ్యా పవన్‌నాయుడు అది నోరా.. లేక) ఓ పార్టీ అధినేతగా ఉన్న పవన్ .. రాజధాని అంశంపై పూర్తి అవగాహన లేకుండా నిమిషాల వ్యవధిలో మాటలు మార్చడం సరికాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, రాజధాని అంశంలో తాము జోక్యం చేసుకోమని బీజేపీ జాతీయ నాయకత్వం ఇంతకుముందు ప్రకటించిన విషయం తెలిసిందే. రాజధాని అంశం పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిందని, కేంద్రానికి ఎటువంటి పాత్ర ఉండబోదని స్పష్టం చేసిన సంగతి విదితమే. రాజధాని మార్పుపై పవన్ అనుసరిస్తున్న వైఖరిపట్ల సోషల్ మీడియాలో సైతం వ్యంగ్యోక్తులు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై రోజుకో మాట మాట్లాడుతున్న పవన్ వైఖరిని నెటిజన్లు తప్పుబడుతున్నారు. పార్టీ పెట్టినప్పుడు ఒకలా.. ఎన్నికల సమయంలో మరోలా మాట్లాడిన పవన్.. తాజాగా అమరావతి రైతుల వద్ద మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. గతంలో ఆయన మాట్లాడిన వీడియోలను పోస్టు చేసి.. పవన్‌నాయుడుకు క్లారిటీ ఇవ్వండయ్యా అని కొందరు నెటిజన్లు చురకలు వేస్తున్నారు. ‘మీరేం మాట్లాడుతున్నారో.. అర్థమవుతుందా’ అని విమర్శిస్తున్నారు. కాగా, హైదరాబాద్ మాదిరిగా అభివృద్ధి మొత్తం అమరావతిలోనే కేంద్రీకృతమైతే.. ప్రాంతీయ వైషమ్యాలు తలెత్తుతాయని పవన్ గతంలో చెప్పిన విషయం తెలిసిందే. -
ఎలాంటి మోషన్ మూవ్ కాలేదు: మండలి చైర్మన్
సాక్షి, అమరావతి: వికేంద్రీకరణ బిల్లును చర్చకు తీసుకున్న సమయంలో ఎలాంటి మోషన్ మూవ్ కాలేదని శాసన మండలి చైర్మన్ షరీఫ్ ప్రకటించారు. సాంకేతికంగా మోషన్ మూవ్ అయితేనే ఏదైనా నిర్ణయం తీసుకోగలమని స్పష్టం చేశారు. ‘బిల్లు మూవ్ చేసిన తర్వాత యనమల మాట్లాడారు. అప్పుడు అశోక్‌బాబు నోటీసులు ఇచ్చారు’ అని పేర్కొన్నారు. కాగా బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలంటూ టీడీపీ సభ్యులు మండలిలో గందరగోళం సృష్టించారు. మంత్రులవైపు దూసుకువెళ్లారు. ఇక బిల్లును చర్చకు తీసుకున్నప్పుడు ఎలాంటి మోషన్ మూవ్ చేయలేదు కాబట్టి.. నిబంధనల ప్రకారం దానిని సెలెక్ట్ కమిటీకి పంపకూడదని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే. ‘కొంచెం ఉంటే కొట్టేవాడు..’ : చంద్రబాబుతో టీడీపీ ఎమ్మెల్సీలు సెలెక్ట్ కమిటీకి పంపాల్సిన అవసరం లేదు: బుగ్గన -
సెలెక్ట్ కమిటీకి పంపాల్సిన అవసరం లేదు: బుగ్గన
సాక్షి, అమరావతి: వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాల్సిన అవసరం లేదని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. నిబంధనల ప్రకారం చైర్మన్ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపకూడదని పేర్కొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుపై శాసన మండలిలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 13 జిల్లాల అభివృద్ధి కోసం ప్రాంతీయ మండళ్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ‘అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్‌లో లెజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో జ్యూడిషియల్ క్యాపిటల్, విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ఉంటుంది. అమరావతిలో శాసన సభ, శాసన మండలి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఉంటాయి’ అని పేర్కొన్నారు. ఇక చర్చ సందర్భంగా టీడీపీ సభ్యుడు యనుమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. మంత్రులు సభలో ఉండకూడదంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై స్పందించిన బుగ్గన చైర్‌ను మీరెలా డిక్టేట్ చేస్తారని ప్రశ్నించారు. అదే విధంగా బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలన్న టీడీపీ సభ్యులకు సమాధామనిస్తూ... బిల్లును చర్చకు తీసుకున్నపుడు ఎలాంటి మోషన్ మూవ్ చేయలేదు కాబట్టి... ఇప్పుడు సెలెక్ట్ కమిటీ అంటూ కొత్త వాదనలను తెరమీదకు తీసుకురావడం సరికాదని హితవు పలికారు. ఈ క్రమంలో శాసన మండలిని 15 నిమిషాల పాటు చైర్మన్ వాయిదా వేశారు. చదవండి: మండలిలో లోకేష్‌కు సవాల్ విసిరిన మంత్రి బుగ్గన -
ముఖ్య విషయాలను దాచిపెట్టారు: ఇక్బాల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే పరిపాలన వికేంద్రీకరణ జరగాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అన్నారు. శాసన మండలిలో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు బిల్లుల(అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లు)ను స్వాగతిస్తున్నామని తెలిపారు. పాలన వికేంద్రీకరణ జరిగితేనే అభివృద్ధి ఫలాలు పేదవారికి అందుతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో సహజ వనరులు ఉన్నాయని.. వాటిని అందిపుచ్చుకోవాలంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని అభిప్రాయపడ్డారు. ముఖ్య విషయాలను దాచిపెట్టారు.. ఆర్థిక లోటులో ఉన్న రాష్ట్రానికి ఐకానిక్ బిల్డింగులు అవసరమని గత ప్రభుత్వం ఆలోచించ లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ విమర్శించారు. రాజధాని అంశంలో శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను కూడా చంద్రబాబు పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ‘అమరావతి ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తే ఆహారలోటు ఏర్పడుతుందని శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది. కానీ.. టీడీపీ శివరామకృష్ణన్ కమిటీలో ఉన్న ముఖ్యమైన విషయాలను దాచిపెట్టింది’ అని మండిపడ్డారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిందేనని.. అందుకోసం రెండు బిల్లులను స్వాగతిస్తున్నామని స్పష్టం చేశారు. -
పోలీసులుపై టీడీపీ నేతల రౌడీయిజం
సాక్షి, గుంటూరు : మూడు రాజధానులకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. అనుమతి లేకుండా ర్యాలీలు చేయవద్దన్నందుకు పోలీసులపై దాడికి పాల్పడ్డారు. పోలీసులుపై టీడీపీ నేతలు రౌడీయిజం చేశారు. నిలువరించేందుకు యత్నించిన కానిస్టేబుళ్లపై సైతం దాడి చేశారు. (చదవండి: బిల్లులపై మండలిలో రగడ) కాగా అన్ని ప్రాంతాల అభివృద్ధిని వ్యతిరేకిస్తూ టీడీపీ నేతలు కృష్ణా, గుంటూరు జిల్లాల బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే రెండు జిల్లాల్లో ఎక్కడా బంద్ ప్రభావం కనబడటం లేదు. రాజధాని ప్రాంతంలోనూ టీడీపీ నేతల బంద్‌కు స్పందన కరువైంది. ఓ వైపు ఆర్టీసీ బస్సులు యథావిధిగా తిరుగుతున్నాయి. మరోవైపు స్కూళ్లు, కాలేజీలు, దుకాణాలు తెరుచుకున్నాయి. ఇక అసెంబ్లీ పరిసరాల్లో చొరబడిన అసాంఘిక శక్తుల కోసం సెర్చ్ కొనసాగుతోంది. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. (చదవండి: మండలిలో టీడీపీ సైంధవ పాత్ర) అలాగే అమరావతి జేఏసీ ఇచ్చిన కృష్ణా, గుంటూరు జిల్లాల బంద్ పిలుపు ప్రభావం మచిలీపట్నంలో ఎక్కడా కనిపించడం లేదు. తెల్లవారుజాము నుంచే ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి. ఇక నూజివీడు పట్టణంలోనూ బంద్ ప్రభావం ఏమాత్రం లేదు. ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు యథావిధిగా తిరుగుతున్నాయి. స్థానిక జేఏసీ నేతలు తమకు అసలు బంద్ గురించి సమాచారమే లేదని చెబుతున్నారు. (చదవండి: సీఎం జగన్‌కు రాజధాని రైతుల కృతజ్ఞతలు) -
ఏపీ అంతటా ‘వికేంద్రీకరణ’ సంబరాలు
సాక్షి, అమరావతి: మూడు రాజధానుల బిల్లు సోమవారం అసెంబ్లీలో ఆమోదం పొందడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట వ్యాప్తంగా ప్రజలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు మంగళవారం హర్షం వ్యక్తం చేశారు. టపాసులు పేల్చి, స్వీట్లు పంచుతూ, ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా బైక్ ర్యాలీలు చేపట్టి సంబరాలు జరుపుకున్నారు. విశాఖపట్నం: మూడు రాజధానులకు మద్దతుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిది కొండా రాజీవ్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఇందులో భాగంగా కేక్ కట్ చేసి, దివంగత నేత వైఎస్సార్, సీఎం వైఎస్ జగన్, రాజ్య సభ సభ్యులు విజయ సాయిరెడ్డి ఫ్లెక్సీలకు క్షీరభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్, వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, పశ్చిమ నియోజకవర్గం కన్వీనర్ మళ్లా విజయప్రసాద్‌తో పాటు శ్రీదేవి వర్మ, రాధ, యువశ్రీ, శిరీష, శ్రీదేవి, స్వర్ణ మణి, శశికళ, బోట్టా స్వర్ణ, వరలక్ష్మి తో పాల్గొన్నారు. విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు నిర్ణయాన్ని స్వాగతిస్తూ పద్మనాభంలో భీమిలి ఇంచార్జ్ ముత్తంశెట్టి మహేష్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అదేవిధంగా స్వీట్లు పంపిణీ చేసి.. సంబరాలు జరుపుకున్నారు. వైఎస్సార్సీపీ నాయకులు గిరిబాబు, రాంబాబు, ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ కాపిటల్‌గా సోమవారం అసెంబ్లీలో బిల్లు ఆమోదంతో ఏయూలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం కాంతారావు ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా హాజరైన ఏయూ వీసీ ప్రొఫెసర్ ప్రసాద్‌రెడ్డి ఏయూ ప్రధాన ద్వారం వద్ద నింగిలోకి బెలూన్లను ఎగురవేశారు. అదేవధంగా వైఎస్సార్ విగ్రహం వద్ద కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో వీసీ ప్రొఫెసర్ ప్రసాద్‌రెడ్డిలో పాటు విద్యార్థి విభాగం నేతలు కళ్యాణ్, మోహన్‌బాబు, ప్రొఫెసర్ వెంకటరావు, ఉద్యోగులు, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. పాడేరు: విశాఖపట్నంను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు కృతజ్ఞతలు తెలిపారు. పాడేరు మండల కేంద్రం తలారిసింగ్ నుంచి ఎంపీడీఓ కార్యాలయం వరకు వైస్సార్సీపీ కార్యకర్తలు, అభిమాన శ్రేణులు 200 బైకులతో భారీ ర్యాలీ చేపట్టారు. శ్రీకాళహస్తి: ‘ఒక్క రాజధాని వద్దు మూడు రాజధానులు ముద్దు’ అంటూ శ్రీకాళహస్తిలో దళిత ఐక్య మహానాడు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో ఐక్యదళిత మహానాడు జాతీయ అధ్యక్షుడు కల్లూరు చెంగయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల తీరు దారుణమని.. దళిత ద్రోహిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతాడని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ బిల్లును టీడీపీ అడ్డుకోవడం దారుణమని.. చంద్రబాబును జిల్లాల్లో తిరగనివ్వమని కల్లూరు చెంగయ్య హెచ్చరించారు. నగరి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అందరికీ అందేలా చేయాలని రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధియే లక్ష్యంగా చేసిన మూడు రాజధానులు బిల్లు అసెంబ్లీలో సోమవారం ఆమోదం పొందడంతో నగరి నియోజకవర్గంలోని ఐదు మండలాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే రోజా భర్త ఆర్ కే శెల్వమణి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నగరి రూరల్ సత్రవాడ నుంచి ఓంశక్తి ఆలయం వరకు సుమారు ఆరు కిలోమీటర్ల దూరం నిర్వహించిన ఈ ర్యాలీలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యే రోజా అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ‘ఒక్క రాజధాని వద్దు మూడు రాజధానులు ముద్దు’ అని నినాదాలు చేస్తూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. జైజగన్.. జై జై జగన్.. అంటూ తమ అభిమాన్ని ప్రజలు, పార్టీ కార్యకర్తలు తెలియజేశారు. కాకినాడ: అధికార వికేంద్రీకరణ బిల్లుకు మద్దతుగా సర్పవరం జంక్షన్ వద్ద ప్రజలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు కేక్ కట్ చేసి, పువ్వులు పంచారు. ప్రజలకు ఓ రైతు టమోటాలు పంచారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు కురసాల సత్యనారాయణ, సీతారామాంజనేయులు, నురుకుర్తి రామకృష్ణ, బెజవాడ సత్యనారాయణ, పుల్లా కోటేశ్వరరావు, జమ్మలమడక నాగమణీ, సుజాత పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం: మూడు రాజధానులకు అనుకూలంగా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ భారీ బైక్ ర్యాలీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ తనయుడు కొట్టు విశాల్ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున సంఘిభవంగా ర్యాలీ చేపట్టారు. నెల్లూరు: సైదాపురంలో వైఎస్సార్ విగ్రహాం వద్ద వైస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు నోటి రమణారెడ్డి ఆధ్వర్యంలో.. వైఎస్సార్సీపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లుకు మద్దతుగా దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. సైదాపురం బస్టాండ్‌లో టపాసులు పేల్చి, మిఠాయిలు పంచుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. అనంతపురం: ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఎస్కే యూనివర్సిటీలో వైఎస్సార్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రపటానికి విద్యార్థులు పాలాభిషేకం చేసి.. బెలూన్లు ఎగురవేసి సంబరాలు జరుపుకున్నారు. విజయనగరం: జిల్లాలోని పార్వతీపురం లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖపట్నాన్ని ప్రభుత్వం ప్రకటించడంపై మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పట్టణ ప్రధాన రహదారిపై బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ప్రజలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
‘వారు సభ సమయాన్ని వినియోగించుకోలేకపోతున్నారు’
సాక్షి, అమరావతి: అసెంబ్లీలో టీడీపీ సభ్యులకు కావల్సినంత సమయాన్ని ఇస్తున్నప్పటికీ వారు వినియోగించుకోలేక పోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు విమర్శించారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. మండలిలో సంఖ్య బలం ఎక్కువ ఉండటంతో వికేంద్రీకరణ బిల్లుని టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అదేవిధంగా కౌన్సిల్ చైర్మన్ ప్రభుత్వ బిల్లులను సరైనా రీతిలో ప్రవేశపెట్టడం లేదని.. బిల్లుపై చర్చ పెట్టకుండ సాగదీయడం సరికాదన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి అనేది చంద్రబాబుకు అక్కర్లేదా అని సూటిగా ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మౌనంగా ఉంటున్నారని ఆయన తెలిపారు. సీఎం జగన్‌కు రాజధాని రైతుల కృతజ్ఞతలు ఇక ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ.. పెద్దల సభలో చంద్రబాబు పెద్ద తప్పులు చేయిస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు విధానం మారకపోతే చరిత్ర హీనుడుగా మిగిలిపోతాడని ఆయన దుయ్యబట్టారు. అమ్మఒడి పథకం ద్వారా 43 లక్షల తల్లులు ఆనందంగా ఉన్నారని, ప్రతి బిడ్డా చదువుకోవాలనేదే సీఎం జగన్ ఉద్దేశమని ఆయన తెలిపారు. అలాగే ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లా విజయనగరం అని తెలిపారు. విద్యారంగంలో విజయనగరం ముందుకు వెళ్తుందని తాను ఆశిస్తున్నానట్లు పేర్కొన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో కార్మికులకు ఉపాధి కల్పించే ఫ్యాక్టరీలు మూతబడ్డాయని, చంద్రబాబు ప్రభుత్వం విజయనగరం జిల్లాను చిన్న చూపు చూసిందని మండిపడ్డారు. ఈ క్రమంలో జిల్లాకు మెడికల్ కాలేజిని ప్రకటించిన సీఎం జగన్‌కు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. -
‘మండలిని రద్దు చేసే అధికారం రాజ్యాంగంలో ఉంది’
సాక్షి, విశాఖపట్నం : శాసనమండలిని రద్దు చేసే అధికారం రాజ్యాంగంలో ఉందని వైఎస్సార్సీపీ నేత దాడి వీరభద్రరావు తెలిపారు. శాసన మండలిలో టీడీపీ అనవసరంగా రాద్ధాంతం సృష్టిస్తోందని మండిపడ్డారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. మంగళవారం విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోమవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగం అద్భుతంగా ఉందన్నారు. ఆ ప్రసంగం చూడని వ్యక్తులు.. ఒక్కసారైనా చూడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మూడు ప్రాంతాలకు అభివృద్దిని వికేంద్రీకరణ చేస్తూ సీఎం వైఎస్ జగన్ చారిత్రత్మక నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. శాసనసభలో ఆమోదం పొందిన వికేంద్రీకరణ బిల్లును మండలిలో అడ్డుకోవడం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. మండలి చైర్మన్‌కు ఒక బిల్లును అడ్మిట్ చేయాలా, వద్దా అనే అధికారం లేదన్నారు. ఏ బిల్లునైనా యథాతథంగా ప్రవేశపెట్టాలని చెప్పారు. మండలిలో చర్చ జరిగిన తర్వాత దానిని మద్దతు తెలుపాలా వద్దా అన్న అంశాన్ని సభ్యులు నిర్ణయిస్తారని చెప్పారు. టీడీపీకి మెజారిటీ ఉంటే మండలిలో సవరణలు కోరవచ్చన్నారు. కౌన్సిల్లో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని.. ఇది సరైన పద్ధతి కాదని హితవు పలికారు. ఈ ప్రతిష్టంభన వెనక టీడీపీ ఉద్దేశమేమిటని చంద్రబాబును ప్రశ్నించారు. రాజ్యాంగ ప్రతిష్టంభన తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష నేత బాధ్యతను కూడా చంద్రబాబు నెరవేర్చలేకపోతున్నారని విమర్శించారు. టీడీపీని ఉప ప్రాంతీయ పార్టీగా మారుస్తున్నారని అన్నారు. చంద్రబాబు 29 గ్రామాలకే పరిమితం అవుతారా అని నిలదీశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు అవసరం చంద్రబాబుకు లేదా అని ప్రశ్నించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అమరావతి ఉంటే చాలు ఇతర ప్రాంతాలు వద్దంటున్నారని.. ఈ విషయాన్ని జనసేన కార్యకర్తలు గుర్తించాలని కోరారు. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ రాజకీయాలు తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. చదవండి : మండలిలో గందరగోళం సృష్టిస్తోన్న టీడీపీ -
మండలిలో గందరగోళం సృష్టిస్తోన్న టీడీపీ
సాక్షి, అమరావతి : నాలుగు గంటల విరామం తర్వాత తిరిగి ప్రారంభమైన ఏపీ శాసన మండలి కొద్దిసేపటికే మరో సారి వాయిదా పడింది. మండలిని 10నిమిషాలు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. కాగా, ప్రభుత్వ బిల్లులను మండలిలో ప్రవేశపెట్టకుండా టీడీపీ గందరగోళం సృష్టిస్తోంది. టీడీపీ సభ్యుల తీరును అధికారం పక్షంతో పాటు బీజేపీ, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు తప్పుపట్టారు. సభలో ముందు బిల్లులపై చర్చ జరగాలని, ఆతర్వాతే రూల్ 71పై చర్చ జరపాలని చైర్మన్‌ను పీడీఎఫ్ ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం కోరారు. చర్చ నిర్వహించే ముందు.. నిబంధనల ప్రకారం ముందు బిల్లులను పరిగణలోకి తీసుకోవాలని చైర్మన్‌ను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. పరిగణలోకి తీసుకున్నాక చర్చకు తాము అంగీకరిస్తామని తెలిపారు. రూల్ 71పైచర్చ జరిగాకనే బిల్లులను పరిగణలోకి తీసుకోవాలని ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు పట్టుబడుతున్నారు. కాగా, ప్రతిపక్ష నేతలు ఇచ్చిన 71 నోటీసు అసలు వర్తించదని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. కేబినెట్లో తీసుకున్న నిర్ణయం జీవో కాకుండా పాలసీ ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఈ నోటీసు వర్తించదు కానీ చైర్మన్ మాట మీద గౌరవంతో ముందు బిల్లును పరిగణలోకి తీసుకొని తరువాత చర్చ చేపట్టాలని సూచించారు. ఉద్దేశపూర్వకంగా టీడీపీ ప్రభుత్వ బిల్లులను సభలో ప్రవేశపెట్టకుండా చూస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. చైర్మన్ అన్ని పార్టీలను సమానంగా చూడాలని కోరారు. రాజ్యాంగ విరుద్ధంగా టీడీపీ వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. సమయాన్ని వృధా చేయడం మంచి కాదు ప్రభుత్వ బిల్లులను పరిగణలోకి తీసుకొని చర్చ జరపాలని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ విజ్ఞప్తి చేశారు. మండలి సమయాన్ని వృధా చేయడం మంచిది కాదన్నారు. బిల్లును పరిగణలోకి తీసుకున్న తర్వాత రూల్ 71పై చర్చ జరగాలని కోరారు. సభలో ఎప్పుడులేని పరిస్థితి ఈ సారి నెలకొందని అసహనం వ్యక్తం చేశారు. -
ఏమయ్యా పవన్‌నాయుడు అది నోరా.. లేక
సాక్షి, అమరావతి : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై సోషల్ మీడియాలో వ్యంగ్యోక్తులు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై రోజుకో మాట మాట్లాడుతున్న పవన్ వైఖరిని నెటిజన్లు తప్పుబడుతున్నారు. పార్టీ పెట్టినప్పుడు ఒకలా.. ఎన్నికల సమయంలో మరోలా మాట్లాడిన పవన్.. తాజాగా అమరావతి రైతుల వద్ద మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. గతంలో ఆయన మాట్లాడిన వీడియోలను పోస్టు చేసి.. పవన్‌నాయుడుకు క్లారిటీ ఇవ్వండయ్యా అని కొందరు నెటిజన్లు చురకలు వేస్తున్నారు. ‘మీరేం మాట్లాడుతున్నారో.. అర్థమవుతుందా’అని విమర్శిస్తున్నారు. కాగా, హైదరాబాద్ మాదిరిగా అభివృద్ధి మొత్తం అమరావతిలోనే కేంద్రీకృతమైతే.. ప్రాంతీయ వైషమ్యాలు తలెత్తుతాయని పవన్ గతంలో చెప్పిన విషయం తెలిసిందే. (చదవండి : ‘ఢిల్లీ కోటనే ఢీకొన్న నేత సీఎం జగన్’) (చదవండి : జనసేనతో రేపటి మీటింగ్ అందుకే: జీవీఎల్) -
జనసేనతో రేపటి మీటింగ్ అందుకే: జీవీఎల్
న్యూఢిల్లీ: రాజధాని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశమని.. ఇందులో కేంద్రం జోక్యం చేసుకోదని బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. రాజధాని మార్పుతో కేంద్రం ఎవరితోనూ ఎటువంటి సమావేశం జరపడం లేదని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... జనసేన పార్టీతో రేపటి సమావేశం కేవలం సమన్వయ కమిటీ సభ్యుల ఎంపిక కోసం మాత్రమే నని పేర్కొన్నారు. రాజధాని అంశంతో ఈ సమావేశానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కార్యాచరణపై కూడా చర్చిస్తామని తెలిపారు రాజధాని కోసమే రేపు జనసేనతో సమావేశం అన్నది పూర్తిగా అవాస్తమని వెల్లడించారు. అయితే కొన్ని మీడియాలు దురుద్దేశపూర్వకంగానే తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నాయని మండిపడ్డారు.. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వరకు ఢిల్లీలోనే సమావేశాలు నిర్వహించుకుంటామని జీవీఎల్ తెలిపారు.(మొదటి ముద్దాయి చంద్రబాబు: జీవీఎల్ ) కాగా రాష్ట్రంలో బీజేపీ- జనసేన కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా... జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. బీజేపీ, జనసేన భావజాలం ఒక్కటేనని ఉద్ఘాటించారు. ప్రత్యేక ప్యాకేజీ గురించి బీజేపీ నేతల వివరించిన తీరు తనను ఆకట్టుకుందని తెలిపారు. ఇక గతంలో పవన్.. బీజేపీకి వ్యతిరేకంగా వామపక్షాలతో కలసి పనిచేసిన సంగతి తెలిసిందే. కాగా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న అంశంపై శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా.... అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ శాసన సభ సోమవారం ఆమోదం తెలిపిన విషయం విదితమే. విశాఖపట్నం పరిపాలనా రాజధాని, అమరావతి శాసన రాజధాని, కర్నూలు న్యాయ రాజధానిగా బిల్లు ఆమోదం పొందింది. అదే విధంగా సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లును కూడా ఆమోదించింది. వామపక్షాలకు ఏమైనా బాకీ ఉన్నానా: పవన్ మూడు రాజధానులకు నా మద్దతు: జనసేన ఎమ్మెల్యే -
సభను అడ్డుకోవడానికి టీడీపీ కుట్ర..
సాక్షి, అమరావతి: చట్టసభలో టీడీపీ వైఖరిని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు అన్నారు. మంగళవారం శాసనసభ సమావేశంలో మాట్లాడుతూ.. ఎస్సీ,ఎస్టీ కమిషన్ బిల్లును సమర్థించాల్సిన ప్రతిపక్షం.. అడ్డుకోవడం దారుణమన్నారు. సభ సజావుగా జరగకుండా టీడీపీ కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ బిల్లుపై చర్చకు రాకుండా టీడీపీ యత్నిస్తుందని దుయ్యబట్టారు. గతంలో మహిళ, దిశ, బీసీ కమిషన్ బిల్లులపై కూడా టీడీపీ రాద్ధాంతం చేశాయని నిప్పులు చెరిగారు. దళితుల పట్ల టీడీపీ పట్ల వివక్షత చూపుతుందన్నారు. ‘దళితులకు రాజకీయాలు ఎందుకని చింతమని ప్రభాకర్ అనలేదా.. బాబు కేబినెట్లోని ఓ మంత్రి మాకు చదువు కోవటం రాదనలేదా’ అంటూ టీడీపీ నేతల తీరుపై ఆయన నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్ కేబినెట్లో ఐదుగురు ఎస్సీలకు మంత్రి పదవులు ఇచ్చారని సుధాకర్ బాబు పేర్కొన్నారు. చంద్రబాబు ఎందుకు తొందరపడ్డారు.. హైదరాబాద్ నుంచి సడన్‌గా అమరావతికి రావాల్సిన అవసరం ఏమిటని ప్రతిపక్ష నేత చంద్రబాబును ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు ప్రశ్నించారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. కేంద్రం రాజధాని కట్టిస్తామని చెప్పినా చంద్రబాబు ఎందుకు తొందరపడ్డారని మండిపడ్డారు. కేంద్రం శివరామకృష్ణ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత చంద్రబాబు సొంతంగా కమిటీ ఎందుకు ఏర్పాటు చేశారని జగన్మోహన్రావు ప్రశ్నించారు. ఎస్సీ,ఎస్టీలంతా జగన్ వెంటే.. ఎస్సీ,ఎస్టీ కమిషన్ బిల్లుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆదిమూలం అన్నారు. మాకు జగన్ లాంటి సీఎం కావాలని దేశంలో దళితులంతా కోరుకుంటున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీలంతా వైఎస్ జగన్ వెంటే ఉన్నారన్నాని ఆదిమూలం పేర్కొన్నారు. చదవండి: ఐదారు వేల కోట్లు ఎలా సరిపోతాయి? సర్వతోముఖాభివృద్ధే మా లక్ష్యం సంక్షేమ పథకాలు వదిలేద్దామా! -
రాష్ట్రాభివృద్ధిపై టీడీపీకి చిత్తశుద్ధి లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రాభివృద్ధిపై టీడీపీకి చిత్తశుద్ధి లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మండిపడ్డారు. బడుగు, బలహీన వర్గాలను టీడీపీ ఓటు బ్యాంక్‌గా చూస్తోందని ధ్వజమెత్తారు. సోమవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. చంద్రబాబు వ్యవహార శైలిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ వర్గాలను వాడుకుని.. కార్పొరేట్ వర్గాలకు దోచిపెట్టాలనే ఏకైక లక్ష్యంతో టీడీపీ పనిచేస్తోందని ధ్వజమెత్తారు. ఎస్సీ,ఎస్టీల సంక్షేమంపై టీడీపీకి చిత్తశుద్ధి లేదని.. భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారన్నారు. ఉద్యమం పేరుతో చంద్రబాబు.. రాజధాని ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. బినామీ భూములు పోతాయని చంద్రబాబుకు భయం పట్టుకుందని..అందుకే దొంగ ఉద్యమాలు చేయిస్తున్నారన్నారు. అమరావతి ప్రజలను ఆయన అన్ని రకాలుగా మోసం చేశారని దుయ్యబట్టారు.రాజధాని ముసుగులో టీడీపీ అరాచకాలకు పాల్పడుతోందన్నారు.అన్ని ప్రాంతాలకు సీఎం జగన్ న్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. ఎస్సీ,ఎస్టీలను అవమానపర్చడమే చంద్రబాబు నైజం.. ఎస్సీ,ఎస్టీ కమిషన్ బిల్లును అడ్డుకునేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున నిప్పులు చెరిగారు. దళితులను, గిరిజనులను అవమానపర్చడమే ఆయన నైజమని మండిపడ్డారు. సభను పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత చట్టాలను అడ్డుకోవడం దారుణమన్నారు. చంద్రబాబు ఆలోచన అంతా ఆస్తులను, పార్టీ ఉనికి కాపాడుకోవడానికేనని దుయ్యబట్టారు. అసెంబ్లీలో టీడీపీ సభ్యుల తీరును రాష్ట్ర ప్రజలంతా గమనించారని.. దళితుల పట్ల చంద్రబాబు,టీడీపీ వైఖరి బయటపడిందని పేర్కొన్నారు. -
మొదటి ముద్దాయి చంద్రబాబు: జీవీఎల్
న్యూఢిల్లీ: రాజధాని ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు మరోసారి స్పష్టం చేశారు. శివరామకృష్ణన్ కమిటీ వద్దని చెప్పినా గత టీడీపీ ప్రభుత్వం అమరావతిలో రాజధాని ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. మంగళవారం జీవీఎల్ విలేకరులతో మాట్లాడుతూ.. అమరావతి విషయంలో చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. నాడు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని తాము డిమాండ్ చేశామని.. అయితే చంద్రబాబు అందుకు ఒప్పుకోలేదని తెలిపారు. ఇప్పుడేమో ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని టీడీపీ నేతలు అంటున్నారని దుయ్యబట్టారు. తాము పెద్దన్నగా వ్యవహరిస్తే 23 మంది ఎమ్మెల్యేలున్న టీడీపీ దద్దమ్మ పాత్ర పోషిస్తుందా అని ఎద్దేవా చేశారు. ఇప్పుడు హైకోర్టు ఏర్పాటుకు తాము పూర్తిగా సహకారం అందిస్తామన్నారు. మొదటి ముద్దాయి చంద్రబాబు ‘రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్‌పై విచారణకు ఆదేశించాలి. అమరావతిలో నాలుగేళ్లలో నాలుగు బిల్డింగులు కూడా కట్టని చంద్రబాబు చేతగాని వ్యక్తి. చంద్రబాబుది దద్దమ్మ ప్రభుత్వం. అందువల్లే అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేయలేదు. అమరావతిలో మొదటి ముద్దాయి చంద్రబాబు. అమరావతి పేరుతో సేకరించిన నిధులు స్వాహా చేశారు. అమరావతిలో వేల కోట్లు దుర్వినియోగం చేశారు’ అని టీడీపీ అధినేత చంద్రబాబు తీరును జీవీఎల్ ఎండగట్టారు. కాగా రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోని అంశమని.. అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయాన్ని తాము సమర్థిస్తున్నట్లు జీవీఎల్ గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే.(3 రాజధానులు: జీవీఎల్ కీలక వ్యాఖ్యలు) అభివృద్ధి వికేంద్రీకరణ మా సిద్ధాంతం.. అభివృద్ధి వికేంద్రీకరణ తమ సిద్ధాంతమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధే తమ మొదటి ప్రాధన్యత అని పేర్కొన్నారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటుకు సహకరిస్తామని తెలిపారు. అమరావతిని చంద్రబాబు రియల్ ఎస్టేట్‌కు అడ్డాగా మార్చారని మండిపడ్డారు. జనసేనతో కలిసి తాము పోరాటం చేస్తామని... రాజధాని నిర్మాణానికి అదనంగా సేకరించిన భూములు వెనక్కి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబుకు నమస్కరిస్తున్నా: చెవిరెడ్డి సర్వతోముఖాభివృద్ధే మా లక్ష్యం అమరావతి దుస్థితికి బాబే కారకుడు! -
సారీ.. తీవ్ర మనస్తాపానికి గురవుతున్నా: స్పీకర్
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభ్యుల తీరుతో శాసన సభాపతి తమ్మినేని సీతారాం తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. టీడీపీ సభ్యుల వైఖరికి విసిగిపోయి.. సభను నడపలేనంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ శాసన సభ సోమవారం ఆమోదం తెలిపిన విషయం విదితమే. ఈ క్రమంలో మంగళవారం సైతం ప్రత్యేక సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్ ఎస్సీ కమిషన్ ఏర్పాటు బిల్లును సభ ముందుకు తీసుకువచ్చారు. ఈ క్రమంలో బిల్లుపై చర్చ సందర్భంగా అధికార పార్టీ సభ్యులు మాట్లాడుతున్న సమయంలో టీడీపీ సభ్యులు పదే పదే అడ్డుతగిలారు. సేవ్ అమరావతి అంటూ నినాదాలు చేయడంతో పాటు.. అనుచిత వ్యాఖ్యలు చేస్తూ స్పీకర్ స్థానాన్ని అగౌరవపరిచారు. దీంతో వారికి సర్దిచెప్పేందుకు స్పీకర్ ప్రయత్నించినప్పటికీ వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో టీడీపీ సభ్యుల తీరుతో విసిగెత్తిపోయిన తమ్మినేని సీతారాం.. ‘‘ప్లీజ్... ఐ యామ్ సారీ.. ఐ యామ్ ప్రొటెస్టింగ్ ది ఆటిట్యూట్ ఆఫ్ టీడీపీ ఎమ్మెల్యేస్.. నిజంగా మనస్తాపానికి గురవుతున్నా’’అంటూ సభ నుంచి వెళ్లిపోయారు. ‘రాజకీయాలకు చంద్రబాబు అనర్హుడు’ సర్వతోముఖాభివృద్ధే మా లక్ష్యం సంక్షేమ పథకాలు వదిలేద్దామా! ప్రతిపక్ష నేతవా.. సంఘ విద్రోహ శక్తివా? ఐదారు వేల కోట్లు ఎలా సరిపోతాయి? -
ముందు బిల్లుపై చర్చ జరగాలి: బుగ్గన
సాక్షి, అమరావతి: అభివృద్ధి, వికేంద్రీకరణ బిల్లును ఆర్థికశాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శాసన మండలిలో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో వికేంద్రీకరణ బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష టీడీపీ నోటీసు ఇచ్చింది. అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి బిల్లులను ప్రవేశపెట్టకుండా ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. రూల్ 71 ప్రకారం ముందు ప్రభుత్వ పాలసీపై ఇచ్చిన మోషన్‌పై చర్చ జరగాలని పేర్కొన్నారు. ఈ క్రమంలో యనమల వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపిన మంత్రి బుగ్గన.. శాసనసభలో ఆమోదించిన బిల్లులపై ముందు చర్చ జరగాలన్నారు. ‘‘శాసనసభ చేసిన చట్టానికి మండలిలో ప్రాధాన్యం ఇస్తారా..? లేక పాలసీపై మోషన్‌కు ప్రాధాన్యం ఇస్తారా...? సభలకు విలువ లేకపోతే చట్టాలు ఎలా చేస్తారు. ముందు వికేంద్రీకరణ బిల్లుపై చర్చ జరగాలి’’ అని పేర్కొన్నారు. వికేంద్రీకరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందినందున చర్చ జరగాల్సిందే అని స్పష్టం చేశారు. కాగా అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ శాసన సభ సోమవారం ఆమోదం తెలిపిన విషయం విదితమే. మూడు రాజధానులు ఏర్పాటు అంశంపై శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా సుధీర్ఘ చర్చల అనంతరం ఏపీ అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ.. సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా, అమరావతి శాసన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా బిల్లు ఆమోదం పొందింది. అనంతరం సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లును సైతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదించింది. ఐదారు వేల కోట్లు ఎలా సరిపోతాయి? సర్వతోముఖాభివృద్ధే మా లక్ష్యం సంక్షేమ పథకాలు వదిలేద్దామా! ప్రతిపక్ష నేతవా.. సంఘ విద్రోహ శక్తివా? వికేంద్రీకరణ వద్దు.. అమరావతే ముద్దు: చంద్రబాబు -
యనమలకు మంత్రి బొత్స సవాల్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు రెండో రోజు వాడివేడిగా సాగుతున్నాయి. మంగళవారం శాసనమండలిలో పరిపాలన వికేంద్రీకరణ బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా టీడీపీ సభ్యలు గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు. టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు చేసిన అసత్య ఆరోపణలపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లుకు మద్దతివ్వాలని టీడీపీ ఎమ్మెల్సీలకు బొత్స ఫోన్ చేసి ప్రలోభాలకు గురిచేశారని యనమల ఆరోపించారు. అయితే యనమల తీరుపై మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాకుండా దమ్ముంటే ఏ ఎమ్మెల్సీకి ఫోన్ చేశామో నిరూపించాలని మంత్రి బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు. ఈ సందర్భంగా బిల్లుకు సమయం కావాలని యనమల ఆడగడంపై మంత్రి బొత్స అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో ఏం చేశారో గుర్తు తెచ్చుకోవాలని, బిల్లు పెట్టి గంటలో చర్చ చేపట్టిన సందర్భాలు ఉన్నాయన్నారు. అంతేకాకుండా టీడీపీకి ఇష్టం వచ్చినట్లు సభా నడపాలా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలలో రాజధాని అంశంపై బొత్స మాట్లాడినట్లుగా వచ్చిన వార్తలను యనమల చదివి వినిపించారు. అయితే టీడీపీ పార్టీ పాంప్లెట్‌గా పనిచేసే పత్రికలను సభలో ఎలా చదువుతారని మంత్రి బొత్స తప్పుపట్టారు. చదవండి: ఐదారు వేల కోట్లు ఎలా సరిపోతాయి? సర్వతోముఖాభివృద్ధే మా లక్ష్యం సంక్షేమ పథకాలు వదిలేద్దామా! ప్రతిపక్ష నేతవా.. సంఘ విద్రోహ శక్తివా? వికేంద్రీకరణకు కేబినెట్ ఆమోదం -
చంద్రబాబుకు ఎందుకంత ఆక్రోశం..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాధాన్యత ఇస్తుంటే.. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఎందుకంత ఆక్రోశం అని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. ప్రతిపక్షం లేనిపోని ఆరోపణలు దేనికోసం చేస్తోందని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎక్కువ సమయం ప్రతిపక్షానికే ఇచ్చామని.. అయినా సీఎం మాట్లాడుతున్న సమయంలో అడుగడుగునా అడ్డు తగిలారని ధ్వజమెత్తారు. నిన్న అసెంబ్లీలో ప్రతిపక్షం వ్యవహరించిన తీరు సిగ్గుచేటు అని.. వారు వ్యవహరిస్తోన్న తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రతిపక్షం అంటే హుందాగా వ్యవహరించాలని హితవు పలికారు. ప్రాంతీయ విద్వేషాలను చంద్రబాబు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. రాజధాని పరిపాలన వికేంద్రీకరణ బిల్లు ఆమోదం కావడం చాలా సంతోషంగా ఉందని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఉత్తరాంద్ర, రాయలసీమ ప్రాంతాలు వెనుకబాటు పై ప్రతి కమిటీలోనూ స్పష్టం గా చెప్పారన్నారు. రాయలసీమ ప్రాంతాల్లో చినుకు కోసం రైతులు ఆకాశం వైపు ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నారన్నారు. శ్రీ బాగ్ ఒడంబడిక చదువుతుంటే తమ కంట కన్నీరు వచ్చిందన్నారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమకు హైకోర్టు కేటాయించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. శ్రీకాకుళం లో ఉద్దానం కిడ్నీ బాధితులకు సీఎం వైఎస్ జగన్ అండగా నిలుస్తున్నారన్నారు. రాయలసీమ వాసులకు చెరువులు ద్వారా సాగునీరు అందించాలని ముఖ్యమంత్రిని కోరామని తెలిపారు. (చదవండి: ఐదారు వేల కోట్లు ఎలా సరిపోతాయి?) (చదవండి: సర్వతోముఖాభివృద్ధే మా లక్ష్యం) -
అసెంబ్లీ వద్ద కట్టుదిట్టమైన భద్రత
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు రెండో రోజుకు చేరాయి. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుపై శాసనమండలిలో నేడు చర్చ జరగనుంది. తొలి రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా టీడీపీ శ్రేణులు పోలీసులపై రాళ్ల దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో సమావేశాల్లో రెండో రోజు భాగంగా అసెంబ్లీ వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. గరుడా కమాండ్ కంట్రోల్ నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు. అంతేకాకుండా రాజధాని గామాల్లో బంద్‌కు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రత్తమయ్యారు. రాజధాని గ్రామాల్లో తలదాచుకున్న అరాచకశక్తులకోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. కొత్త వ్యక్తులకు ఆశ్రయం కల్పించవద్దని రాజధాని ప్రాంత వాసులకు పోలీసులు సూచించారు. నిరసనలు ఎవరి గ్రామాల్లో వారు శాంతియుతంగా నిర్వహించుకోవాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
ఐదారు వేల కోట్లు ఎలా సరిపోతాయి?
సాక్షి, అమరావతి: ఐదారు వేల కోట్లతో అమరావతిని అభివృద్ధి చేసినా.. ఐదారేళ్లలో ఎలాంటి అభివృద్ధి సాధించలేమని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. లక్ష కోట్లు అవసరమైన అమరావతిలో చేయడానికి మనకి శక్తి సరిపోదని.. అదే సమయంలో విశాఖలో చేయకపోతే అభివృద్ధి జరగదని చెప్పారు. కొన్ని నిర్ణయాలు తీసుకోకపోతే నష్టపోతామని.. అలాంటప్పుడు మనకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకోకపోవడం ధర్మమేనా అని ప్రశ్నించారు. అలా చేస్తే అభివృద్ధి సాధ్యమేనా..? ఈ 8 కిలోమీటర్ల పరిధిలోని అమరావతి అభివృద్ధి చేయాలని అనుకుంటే.. రూ. లక్ష కోట్లు అవసరం ఉన్న చోట్ల మనం ఎంత ఖర్చు పెట్టగలం. అయిదేళ్లలో అయిదారు వేల కోట్ల రూపాయలు పెట్టగలుగుతాం. అయిదేళ్ల తర్వాత ఒకసారి మనమంతా ఇదే చట్టసభలో కూర్చుని రాష్ట్రంలో మన పిల్లల ఉద్యోగాల పరిస్థితి ఏంటి? మన రాజధాని పరిస్థితి ఏంటి? అని చర్చిస్తే ఎలా ఉంటుందో ఆలోచించాలని కోరుతున్నా. ఒకవైపు లక్ష కోట్లు అవసరమైన చోట్ల డబ్బుల్లేక కేవలం అయిదారు వేల కోట్లు మాత్రమే పెట్టే పరిస్థితి. ఈ అయిదారు వేల కోట్లు మాత్రమే ఖర్చుపెడితే అది సముద్రంలో ఒక నీటి బొట్టులా కనిపించను కూడా కనిపించదు. అలా చేస్తే అయిదేళ్ల తర్వాత ఎలా ఉంటామంటే మళ్లీ ఇలాగే ఉంటాం. విశాఖపట్నం పరిస్థితి చూస్తే అక్కడేమో మనం పెట్టని పరిస్థితి. ఇక్కడ (అమరావతిలో) చేయడానికి మనకు శక్తి సరిపోదు. అక్కడ (విశాఖలో) చేయకపోతే అభివృద్ధి జరగదు. సచివాలయం కదల్చకూడదు. హైకోర్టును మార్చకూడదనుకుంటే మళ్లీ అయిదేళ్ల తర్వాత పరిస్థితి ఏంటని ఆలోచించుకోవాల్సి వస్తుంది. విశాఖలో చేయాలంటే చంద్రబాబు అడ్డుకుంటున్నారని వెనుకడుగు వేస్తే అయిదేళ్ల తర్వాత కూడా మన పిల్లలు ఉద్యోగాల కోసం బెంగళూరు, చెన్నై వెళ్లాల్సిన పరిస్థితే ఉంటుంది. రాజధాని ఎక్కడంటే మళ్లీ ఇక్కడే ఈ గ్రామాల మధ్య కూర్చుని ఇదే మన రాజధాని అనుకోవాల్సిందే. మేనిఫెస్టోలో బీజేపీ ఏం చెప్పిందో చూడండి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు మోదీ వచ్చారు, అది చెప్పారు.. ఇది చెప్పారు అని మోదీ మీద కూడా అభాండాలు వేసేశారు. ఒకసారి ఇదే బీజేపీ 2019 ఎన్నికల మేనిఫెస్టో చూద్దాం...ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి బీజేపీ మ్యానిఫెస్టోలో మోదీ ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. ఏపీ హైకోర్టును శాశ్వత ప్రాతిపదికన కర్నూలులో ఏర్పాటు చేస్తామని బీజేపీ స్పష్టంగా చెప్పింది. ‘అమరావతి నిర్మాణం ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వెంచర్లా సాగుతోంది. ఏడాదికి మూడు పంటలు పండే విలువైన వ్యవసాయ భూముల్ని టీడీపీ ప్రభుత్వం తీసుకుంది. బీజేపీ అధికారంలోకి రాగానే తమ భూములు కావాలని అడిగే రైతులకు వారి భూములు వెనక్కి ఇచ్చేస్తుంది. అమరావతిలో దళితులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది వారికి న్యాయం చేస్తాం’ అని సాక్షాత్తూ బీజేపీ వాళ్లు 2019 మ్యానిఫెస్టోలో చెప్పినదాన్ని చంద్రబాబు వక్రీకరిస్తున్నారు. టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన సుజనా చౌదరి తెలిసి మాట్లాడుతున్నారో, తెలియక మాట్లాడుతున్నారో వారికే తెలియాలి. ఇలాంటి వాళ్లను తన్ని పార్టీ నుంచి బయటకు పంపించమని నేను బీజేపీ వాళ్లను కోరుతున్నా. 2021, జూన్‌కు పోలవరం పూర్తి చేస్తాం పోలవరం ప్రాజెక్టు గురించి కూడా చంద్రబాబు రకరకాలుగా వక్రీకరిస్తూ మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు గురించి నేను ఒక్క మాట చెబుతా. పోలవరం ప్రాజెక్టును రివర్స్ టెండరింగ్ చేశాం. దాదాపు రూ.830 కోట్లు ఆదా చేశాం. ఆదా చేయడమే కాకుండా ప్రాజెక్టు పనులు మొదలుపెట్టాం. వర్షాలు తగ్గిన వెంటనే ప్రాజెక్టు పనులు మొదలయ్యాయి. ప్రాజెక్టు 2021, జూన్ నాటికి పూర్తి చేస్తాం. నీళ్లు ఇస్తామని కూడా కచ్చితంగా చెబుతున్నా. ప్రాజెక్టు మంచి స్పీడ్‌లో జరుగుతోంది. చదవండి: సర్వతోముఖాభివృద్ధే మా లక్ష్యం సంక్షేమ పథకాలు వదిలేద్దామా! ప్రతిపక్ష నేతవా.. సంఘ విద్రోహ శక్తివా? -
వికేంద్రీకరణ వద్దు.. అమరావతే ముద్దు
సాక్షి, అమరావతి: పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ చేయవద్దని, అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణపై రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో చర్చకు పెట్టిన మూడు రాజధానులు, ప్రాంతీయ ప్రణాళిక అభివృద్ధి బోర్డుల బిల్లుపై చర్చలో గంటన్నరసేపు మాట్లాడిన టీడీపీ అధినేత అమరావతిని సమర్థించుకునేందుకు అధిక ప్రాధాన్యమిచ్చారు. డబ్బుల్లేవనే నెపంతో అమరావతి నిర్మాణాన్ని నిలుపుదల చేయవద్దని, అది స్వయం ఆర్థిక ప్రాజెక్టు అని, దాన్ని పూర్తిచేస్తే ఇరిగేషన్ ప్రాజెక్టులు, సంక్షేమానికి డబ్బులు వస్తాయని, అమరావతి కల్పతరువు, కామధేనువుగా ఉంటుందన్నారు. తాను చేపట్టిన ప్రాజెక్టులను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కొనసాగించారని, దీంతో వైఎస్సార్‌తోపాటు తనకు పేరొచ్చిందని చెప్పారు. వైఎస్సార్ తనయుడుగా ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని జగన్ అమరావతిని పూర్తి చేయాలని, చిన్నవాడైనా రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తున్నానని చంద్రబాబు అన్నారు. అమరావతిలో అన్ని అవసరాలకు పోనూ 10వేల ఎకరాలు మిగులుతుందని, ఆ భూముల్ని విక్రయించి అన్ని నిర్మాణాలూ చేయవచ్చన్నారు. రియల్ ఎస్టేట్ వల్లే భూముల ధరలు పెరుగుతాయి.. మూడు రాజధానులు ఎక్కడా విజయవంతం కాలేదని చంద్రబాబు అన్నారు. మూడు రాజధానుల వల్ల అభివృద్ధి సాధ్యం కాదన్నారు. రియల్ ఎస్టేట్ వల్లే భూముల ధరలు పెరుగుతాయని, తద్వారా ఆదాయం వస్తుందని చెప్పారు. అమరావతి బాండ్లకు వెళితే రూ.2 వేల కోట్లు వచ్చాయన్నారు. రాజధాని రాష్ట్రం మధ్యలో ఉండాలని, విశాఖలో రాజధాని పెట్టడంవల్ల రాయలసీమ జిల్లాలకు దూరమవుతుందని, ఆ జిల్లాల ప్రజలు 1,100 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. రాజధానులు, ప్రభుత్వ కార్యాలయాల వల్ల అభివృద్ధి జరగదని, ప్రజలు కష్టపడితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. అమరావతి అనువైందని శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది.. శివరామకృష్ణన్ కమిటీ నివేదికలను చంద్రబాబు వక్రీకరిస్తూ.. కృష్ణా–గుంటూరు జిల్లాల మధ్య అమరావతే రాజధాని నిర్మాణానికి అనువైన ప్రాంతమని సూచించిందన్నారు. అమరావతి నేల పటుత్వం విషయంలోనూ సమర్థించుకునేందుకు ఆయన ప్రయత్నించారు. అమరావతి నేల నిర్మాణాలకు మంచిదని ఐఐటీ చెన్నై నివేదిక ఇచ్చిందన్నారు. డబ్బుల్లేవని ఇక్కడ ఉండబోమనడం సరికాదని, ఇప్పటికే అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం ఉన్నాయని, ఇవి టెంపరరీ కాదని అన్నారు. ఈ భవనాల్లోనే ఉంటూ డబ్బులు వచ్చినప్పుడు మిగతా భవనాలు కట్టుకోవచ్చన్నారు. దీనిపై మంత్రి బొత్స జోక్యం చేసుకుంటూ ఇవి టెంపరరీ కాకపోతే మరో రూ.14 వేల కోట్ల అంచనా వ్యయంతో సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలకు టెండర్లు ఎందుకు ఆహ్వానించారని ప్రశ్నించారు. దీనికి బదులివ్వని చంద్రబాబు అమరావతిని ప్రధాని మోదీతోపాటు తెలంగాణ సీఎం కేసీఆర్ సమర్థించారన్నారు. భూముల విలువ పెరిగితేనే ఆదాయం వస్తుందని, అమరావతిని అలాగే చేశామని పేర్కొన్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్‌తోపాటు ప్రభుత్వ సంస్థలకు ఎక్కువ ధరలకు భూములివ్వడం, ప్రైవేట్ సంస్థలకు తక్కువ ధరకు ఇవ్వడంపై మాట్లాడకపోవడం గమనార్హం. చదవండి: సర్వతోముఖాభివృద్ధే మా లక్ష్యం అమరావతి రైతులకు వరాలు వికేంద్రీకరణకు కేబినెట్ ఆమోదం -
సంక్షేమ పథకాలు వదిలేద్దామా!
స్కూళ్లు, ఆసుపత్రుల పరిస్థితి బాగోలేదు. బాత్రూములు, కాంపౌండ్ వాల్స్ లేవు. బిల్డింగ్లు కూలిపోతున్నాయి. ఆసుపత్రులలో జనరేటర్లు లేక సెల్‌ఫోన్ లైట్ల వెలుగులో ఆపరేషన్లు చేస్తున్నారన్న వార్తలు చూశాం. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్న ఆసుపత్రులలో, స్కూళ్లలో మార్పు చేయాలని తలపెట్టిన నాడు–నేడు కార్యక్రమాన్ని కొనసాగిద్దామా? వద్దా? దాదాపు 50 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. దాదాపుగా 46 లక్షల మందికి రైతు భరోసా కార్యక్రమంతో తోడుగా ఉన్నాం. దాదాపు 43 లక్షల మంది తల్లులకు అమ్మ ఒడి పథకం కింద ఒక్కొక్కరికి ఏటా రూ.15 వేలు ఇస్తూ పిల్లలను బడిబాట పట్టించేలా చేశాం. భవిష్యత్‌లో ఇవన్నీ కొనసాగించాలా? వద్దా? సాక్షి, అమరావతి: రాష్ట్రం ఏర్పడిన 2014 వరకు ఉన్న రూ.96 వేల కోట్ల అప్పు.. బాబుగారి దోపిడీ పుణ్యమా అని 2019 నాటికి మరో లక్షా 50 వేల కోట్లకు పైగా పెరిగిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఈ లెక్కన 2 లక్షల 57 వేల కోట్ల రూపాయల అప్పుతో తమ చేతికి పాలన వచ్చిందని చెప్పారు. ఇవి కాక కార్పొరేషన్ల పేరుతో ఆయన చేసిన అప్పులు మరో 57 వేల కోట్లున్నాయని, ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు రూ.39,423 కోట్లున్నాయని చెప్పారు. సోమవారం ఆయన అసెంబ్లీలో పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించిన బిల్లుపై చర్చలో మాట్లాడారు. 2014 మార్చి నాటికి విద్యుత్ పంపిణీ సంస్థలు ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు రూ.2,893 కోట్లు ఉంటే, 2019 మార్చి నాటికి విద్యుత్ డిస్కమ్‌లు చెల్లించాల్సిన బకాయిలు రూ.21,540 కోట్లున్నా, తామే భరిస్తూ ప్రజలను సంతోష పెడుతున్నామని చెప్పారు. ‘కిందా మీద పడి రాజధాని కోసం లక్ష కోట్లు తెచ్చినా మనం దేన్ని పణంగా పెట్టాలని ఆలోచించుకోవాలి. కృష్ణా నది పరిస్థితి చూస్తున్నాం. అక్కడ నానాటికీ దయనీయమైన స్థితి. 40 ఏళ్ల సీడబ్ల్యూసీ లెక్కల ప్రకారం శ్రీశైలంలోకి వచ్చే నీళ్లు 1200 టీఎంసీలు, గత పదేళ్లుగా అది 600 టీఎంసీలకు పడిపోయింది. గత ఐదేళ్లలో అయితే 400 టీఎంసీలకు తగ్గాయి. కృష్ణా మీద 8 జిల్లాల సాగు, తాగు నీరు కోసం ఆధారపడ్డాయి. ఏటా 3 వేల టీఎంసీల గోదావరి నీరు సముద్రంలో కలుస్తోంది. వీటిని కృష్ణాలోకి తీసుకొస్తేనే నీరు అందించగలం. గోదావరి నుంచి బనకచర్ల వరకు నీరు తేవాలంటే ఇంజనీర్లు అంచనాలు తయారు చేయమంటే, రూ.68 వేల కోట్లు కావాలని లెక్కతేల్చారు. దీన్ని ఎలా తగ్గించాలని తెలంగాణ వాళ్ళతో కూడా మాట్లాడాం. ప్రతీ పైసా మిగిల్చాలని కిందా మీద పడుతున్న పరిస్థితి ఉంది. ఇంత భారీ ప్రాజెక్టును చేద్దామా? వద్దా అని నేను ఈ సభలో అడుగుతున్నాను’ అని సీఎం అన్నారు. ఇంకా ఏమన్నారంటే.. సాగు నీటి ప్రాజెక్టుల సంగతేంటి? వెనకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకు ఊపిరి పోసే ప్రాజెక్టు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి. పోలవరం ఎడమ కాల్వ నుంచి నీటిని తరలించే ఈ ప్రాజెక్టుకు రూ.16 వేల కోట్లు ఖర్చవుతుంది. ఇది వస్తే ఉత్తరాంధ్ర వెనుకబాటు తనం పోయి రైతులకు నీళ్లు వస్తాయి. ఈ ప్రాజెక్టు చేద్దామా? వద్దా? రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో ప్రాజెక్టుల పరిస్థితి మీరే చూస్తున్నారు. సమృద్ధిగా నీళ్లు వచ్చినా ప్రాజెక్టులు నింపుకోలేని పరిస్థితి. ఆర్ ఆండ్ ఆర్ ప్యాకేజీలు ఇవ్వని స్థితి. కరవు నివారణ కోసం కాల్వల సామర్థ్యం పెంచేందుకు రూ. 25 వేల కోట్లు ఖర్చవుతుంది. ఇది చెయ్యడం సాధ్యం కాదని చెప్పే మనసు ఎలా ఉంటుంది? జలయజ్ఞం ద్వారా రైతాంగానికి మేలు చెయ్యాలని నాన్నగారు తలంచారు. చంద్రబాబు జమానా కూడా అయిపోయింది. వాటిని పూర్తి చేయడానికి ఎంత ఖర్చవుతుందని ఇంజనీర్లను అడిగితే.. రూ.30 వేల కోట్లు అవుతుందని చెప్పారు. 62 శాతం ప్రజలు వ్యవసాయంపై బతుకుతున్నారు. రైతులకు శాశ్వతంగా ఉచిత విద్యుత్ ఇవ్వాలంటే ట్రాన్స్‌కోకు ప్రభుత్వం ఎంతివ్వాలని లెక్కలేస్తే.. ఏటా రూ.8 వేల కోట్లు ఇవ్వాలి. గతంలో చంద్రబాబు ఏనాడూ కూడా రూ.1200 కోట్లు...రూ.1500 కోట్లు మించి ఇవ్వలేదు. దీంతో ఆ సంస్థలు బయట నుంచి అప్పులు తెచ్చాయి. ఇదే పరిస్థితి కొనసాగితే రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి తర్వాత ప్రభుత్వాలు చేతులెత్తే పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితి రాకూడదని, రైతులకు శాశ్వతంగా ఉచిత విద్యుత్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఆలోచిస్తే 10 వేల మెగా వాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ రాష్ట్ర ప్రభుత్వమే కట్టాలనే సలహా వచ్చింది. దీని కోసం రూ.36 వేల కోట్లు ఖర్చవుతుందని అధికారులు చెప్పారు. ఇది ఖర్చు పెడితే ఏడాదికి ట్రాన్స్‌కోకు ఇచ్చే రూ.8 వేల కోట్లు సబ్సిడీ భారాన్ని తగ్గించుకోవచ్చనే ఆశ. అన్ని జిల్లాల్లోనూ మౌలిక వసతులు కల్పించాలి.. గుంటూరు, విజయవాడ, తెనాలి, మంగళగిరి, నూజివీడు, నందిగామ, మైలవరం, చివరకు నా ఇల్లున్న తాడేపల్లి ఇవన్నీ ఒక్కోదానికి రూ.500 కోట్లు ఇస్తే చాలు అభివృద్ధి సాధిస్తాయి. తాడేపల్లి, మంగళగిరి మోడల్ మున్సిపాల్టీలుగా చేయాలని అంచనాలు వేయిస్తే కేవలం రూ.1100 కోట్లు పెడితే బ్రహ్మాండమైన అభివృద్ధి సాధించి మోడల్ సిటీలుగా మారతాయి. కృష్ణకు వరదలు వస్తే విజయవాడలోని కృష్ణలంక ముంపునకు గురవుతుంది. రిటైనింగ్ వాల్ కట్టాలి. కానీ అయిదేళ్లు చంద్రబాబు సీఎంగా ఉన్నా కట్టలేదు. నాకంతట నాకే బాధ అనిపించింది. వెంటేనే రిటైన్ వాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేశాం. పల్నాడుకు తాగు, సాగునీరు లేదు. వాటిని కల్పించడానికి, మెడికల్ ఆసుపత్రిని, మచిలీపట్నంలో పోర్టు మెడికల్ కాలేజీ, ప్రకాశం బ్యారేజీ దిగువన రెండు బ్యారేజీలు, ఎగువన వైకుంఠాపురంలో మరో బ్యారేజీ కట్టాల్సిన అవసరం కూడా ఉంది. సముద్రంలోకి నీరు వృధాగా పోకుండా వీటి ద్వారా స్టోరేజీ కెపాసిటీ పెరగడమే కాకుండా మచిలీపట్నం పరిధిలోని ఆరు నియోజకవర్గాలకు కూడా తాగు, సాగునీరు అందుతుంది. ప్రతి జిల్లాలోనూ ఇలాంటివి ఉన్నాయి. విజయనగరం జిల్లాలో మెడికల్ కాలేజీ లేదు. గిరిజన ప్రాంతంలో ట్రైబల్ యూనివర్సిటీ, ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ, ట్రైబల్ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రతి చోటా కనీస అవసరాలు తీర్చే కార్యక్రమాలు చేపట్టాలంటే మనదగ్గరున్న వనరులు, డబ్బులు ఏ మేరకు ఉన్నాయి? పాఠశాలల సంగతేంటి? ► పాఠశాలల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని రూ.12 వేల కోట్లు, ఆసుపత్రులను బాగు చేయడానికి అక్షరాలా రూ.14 వేల కోట్ల అంచనాలతో పనులు చేపట్టనున్నాం. ఈ రెండు కార్యక్రమాలకు రూ.26 వేల కోట్లు ఖర్చు చేద్దామా వద్దా? ► వాటర్ గ్రిడ్‌లో భాగంగా తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, శ్రీకాకుళంలోని పలాస ప్రాంతం, పల్నాడు ప్రాంతం, ప్రకాశం జిల్లాలోని కిడ్నీ ప్రభావిత ప్రాంతాలకు రిజర్వాయర్ల దగ్గరనే వాటర్‌ను ఫిల్టర్‌చేసి పైపుల ద్వారా గ్రామాలకు మంచినీటిని అందిస్తాం. ఈ జిల్లాలకు రూ.12 వేల కోట్లతో మంచినీటిని అందించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమమే చేయాలంటే అక్షరాలా రూ.45 వేల కోట్లు అంచనా అవుతుంది. ఇలాంటివి చేయాలా? వద్దా? ► భావనపాడు, మచిలీపట్నం, ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం.. పోర్టులను కట్టడానికి రూ.15 వేల కోట్లు ఖర్చు చేద్దామా.. వద్దా? ► ఉగాది నాటికి పేదలకు 25 లక్షల ఇళ్ల స్థలాలు శాచ్యురేషన్ పద్ధతిలో ఇస్తాం. నాలుగేళ్లలో ఏటా 6 లక్షల ఇళ్లు చొప్పున వారికి కట్టించి ఇవ్వాలంటే దాదాపుగా ఏడాదికి రూ.10 వేల కోట్లు.. నాలుగేళ్లకు రూ.40 వేల కోట్లు పేద వారి కోసం ఖర్చు చేద్దామా? వద్దా? ► రాష్ట్ర జనాభాలో 90 శాతం మందికి ఆరోగ్యశ్రీ, లక్షలాది కుటుంబాలలో ఉన్నత చదువులు చదువుకొంటున్న వారికి ఫీజు రీయింబర్స్‌మెంటు, వసతి దీవెన, వడ్డీలేని రుణాలు, ఉచిత పంట బీమా, ధరల స్థిరీకరణ నిధి, ఉపద్రవాల సమయంలో ఆదుకొనేందుకు నిధి, పేదలకు నాణ్యమైన బియ్యం, రైతులకు తొమ్మిది గంటలపాటు ఉచిత విద్యుత్తు ఇంకా ఇటువంటివి చాలా చాలా చేస్తున్నాం. ఇన్ని చేస్తూ.. కేవలం రాజధాని పేరుతో 53 వేల ఎకరాలను డెవలప్ చేయడానికి మరో లక్ష కోట్లను పెట్టడమన్నది సాధ్యమేనా? చదవండి: సర్వతోముఖాభివృద్ధే మా లక్ష్యం అమరావతి రైతులకు వరాలు వికేంద్రీకరణకు కేబినెట్ ఆమోదం -
సర్వతోముఖాభివృద్ధే మా లక్ష్యం
అందరికీ మంచి చేయాలి. ఇదే నా విధానం. ఇంటింటికీ అభివృద్ధి ఫలాలు అందాలి. ఇందుకోసం అన్నింటా సంస్కరణలు కొనసాగిస్తాం. గ్రామ సచివాలయాల నిర్మాణం నుంచి రాష్ట్ర సచివాలయాల నిర్మాణం వరకూ భావితరాల, మన ప్రాంతాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మేం నిర్ణయాలు తీసుకుంటాం. దీని కోసమే వికేంద్రీకరణకు ఓటు వేస్తున్నాం. – వైఎస్ జగన్ రాజధానికి వెళ్లే మార్గంలో ఒక కారు ఎదురుగా వస్తే మరో కారు రోడ్డు దిగి వెళ్లాల్సిన పరిస్థితి. వరద ముప్పు ఉన్న ప్రాంతమిది. ఇలాంటి ప్రాంతంలో రాజధాని నిర్మించాలని ఎవరికైనా అన్పిస్తుందా? అసలు చంద్రబాబుకు ఈ గ్రామాలు ఎప్పుడైనా తెలుసా? ఎప్పుడైనా తిరిగాడా? ఇక్కడ భూములు కొనుగోలు చేశాక, రాజధాని ఇక్కడ పెట్టాలని తెలిశాకే ఈ గ్రామాల పేర్లు తెలుసు. సింగపూర్ కంపెనీ వెనక్కు వెళ్లడానికి అక్కడ కట్టలేని పరిస్థితి. చట్టం అనుమతించదు. నదీ, అటవీ భూములన్నీ తీసేస్తే మిగిలే భూమి 5,020 ఎకరాలు మాత్రమే. దీన్ని అమ్మితే లక్ష కోట్లు రావాలంటే ఎకరం రూ.20 కోట్లకు అమ్మాలి. నిజంగా ఆ పరిస్థితి ఉందా? 20 ఏళ్ల తర్వాత ఎకరం రూ.90 కోట్లకు అమ్మే పరిస్థితి వస్తేనే సెల్ప్ ఫైనాన్స్ మోడల్ అవుతుంది. అంత వరకూ భారీ పెట్టుబడి పెట్టే పరిస్థితి ఉందా? సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని, వెనుకబాటుతనాన్ని అధిగమించాలని, అన్ని వర్గాల వారికి న్యాయం జరగాలన్నదే తమ లక్ష్యం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఆ దిశగా పాలన, అభివృద్ధి వికేంద్రీకరించాలన్న వివిధ కమిటీల సూచనల మేరకు ముందడుగు వేయాలని నిర్ణయించామన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రజలందరి కోరిక మేరకు శాసన రాజధానిగా అమరావతిని కొనసాగిస్తూనే.. విశాఖపట్టణాన్ని పరిపాలన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేయడానికి ఉపక్రమించామని చెప్పారు. తనకు అన్ని కులాల వారు, మతాల వారు సమానమేనని వివరించారు. చంద్రబాబు చెబుతున్నట్లు అన్నీ ఒకేచోట కేంద్రీకృతం చేస్తూ ఆయన కలల రాజధానిని నిర్మించే ఆర్థిక స్తోమత లేదని, అందువల్లే పాలన, అభివృద్ధిని వికేంద్రీకరిస్తున్నామన్నారు. సోమవారం ఆయన అసెంబ్లీలో పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా సుదీర్ఘంగా మాట్లాడారు. గత ఐదేళ్లలో అమరావతి ప్రాంతంలో సాగిన భూదందా గురించి కళ్లకు కట్టినట్లు వివరించారు. బాబు వైఫల్యాలను ఎండగట్టారు. సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే.. నిజాలు చెబుతున్నా.. ‘ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ముఖ్యమైన రోజు.. అనుమానాలు, ఆవేశాలను మంచి ఆలోచనలతో అధిగమిస్తున్న రోజు. వెలగపూడిలో చంద్రబాబునాయుడు తాత్కాలిక సచివాయం, తాత్కాలిక అసెంబ్లీ కట్టారు. ఇందుకు ఇంటెరిమ్ గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణానికి అనుమతి ఇస్తూ 2016 ఫిబ్రవరి 11న టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులే(జీవో ఎంఎస్ నెంబర్32) నిదర్శనం. కానీ.. చంద్రబాబు మాత్రం తాను నిర్మించింది తాత్కాలిక సచివాలయం.. అసెంబ్లీ కాదంటూ అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ సమయాన్ని వృథా చేస్తున్నారు. నిజాల్ని నిజాలుగా రాష్ట్ర ప్రజలకు చెబుతున్నా. 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం అవతరించిన నాటి నుంచి.. 2014 జూన్‌లో 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పాటయ్యే వరకు, ఆతర్వాత జరిగిన పరిణామాల వరకు గమనిస్తే రకరకాల పొరపాట్లు చోటు చేసుకున్నాయి. మూడు నగరాలను కోల్పోయాం.. 1953లో ఆంధ్ర రాష్ట్రంగా అవతరించినప్పుడు మద్రాసును పోగొట్టుకున్నాం. ఉమ్మడి రాష్ట్రం కోసం కర్నూలును త్యాగం చేశాం. 58 ఏళ్ల తర్వాత 2014లో హైదరాబాద్‌ను కోల్పోయాం. అభివృద్ధి, ఉద్యోగాలకు కేంద్రంగా ఉన్న మూడు నగరాలను కోల్పోయిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే. పదేళ్ల ఉమ్మడి రాజధానిని కూడా ఓటుకు కోట్లు ఇస్తూ పట్టుబడి ఇక్కడున్న ఒక మనిషి చేసిన తప్పిదం వల్ల కోల్పోయాం. ఏ జాతికి అయినా చరిత్ర అనేక పాఠాలు చెబుతుంది. వాటి నుంచి ఎవరైనా గుణపాఠం నేర్చుకుంటేనే భవిష్యత్ ఉంటుంది. ఇప్పుడు గతంలో జరిగిన పొరపాట్లను మా ప్రభుత్వం దిద్దుబాటు చేస్తోంది అనడం కరెక్ట్. ఒక కారు ఎదురుగా వస్తే రోడ్డు దిగాల్సిందే.. టెంపరరీ అసెంబ్లీ తీసుకుంటే.. విజయవాడ ప్రకాశం బ్యారేజీ దాటితే, ఎదురుగా వాహనం వస్తే ప్రయాణించలేని విధంగా కరకట్ట ఉంది. ఇదీ రాజధానికి పోయే రాజమార్గం. ఎకనామిక్ సూపర్ పవర్‌గా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉండరాదన్న శివరామకృష్ణన్ నివేదికను నీరు గార్చేందుకు నారాయణతో సొంత కమిటీ వేశాడు. ఇందులో ఉన్నదెవరు? సుజనా చౌదరి, గల్లా జయదేవ్. వీళ్లంతా ఏ రంగంలో నిపుణులు? శివరామకృష్ణన్ నివేదిక రాకముందే తన సొంత మనుషులతో కమిటీ వేసుకున్నాడు. సెక్రటేరియట్, అసెంబ్లీ మాత్రమే కాకుండా నైన్ ఇన్ వన్ అని ఒక సినిమా చూపించాడు. లీగల్, ఎడ్యుకేషన్, ఐటీ, టూరిజం, మాన్యుఫ్యాక్చరింగ్.. అన్నీ ఇక్కడే పెడుతున్నామంటూ చెప్పాడు. ఇంత వరకూ ఒక్కదానికి కూడా అంగుళం పనికూడా జరగలేదు. కానీ సినిమా మాత్రం గొప్పగా చూపించాడు. అనేక జిల్లాలు అత్యంత వెనుకబాటులో ఉన్నాయని, అటు శివరామకృష్ణన్, శ్రీకృష్ణ కమిటీతో పాటు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం చెప్పినా.. ఇందుకు సంబంధించిన డేటాతో నిరూపించినా.. రైతన్నకు అందించాల్సిన నీటి కోసం ఈయన తాపత్రయపడలేదు. తన బినామీల భూముల రేట్ల కోసం తాపత్రయ పడ్డాడు. సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ కానే కాదు.. చంద్రబాబు గ్రాఫిక్స్‌లో చూపించిన ఐకానిక్ బ్రిడ్జ్ చూసి అమరావతిలో అడుగు పెట్టిన వారికి ద్వారంలో టెంపరరీ అసెంబ్లీకి వచ్చే బ్రిడ్జి కన్పిస్తుంది. అదే ఆయన అక్రమ నివాసానికి దారి కూడా. అదే ఒక కారు వెళ్తుంటే మరో కారు ఆగిపోవాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితిపై చంద్రబాబు మానస పుత్రికలు ఈనాడు, చంద్రజ్యోతి ఏనాడైనా ఒక్క ఫొటో వేస్తే సంతోషించి ఉండేవాళ్ల. (కరకట్ట వాస్తవ చిత్రాలను చూపించారు). మౌలిక వసతుల కోసం లక్షా 9 వేల కోట్లకు డీపీఆర్ ఇచ్చిన చంద్రబాబు ప్లేటు మార్చి సెల్ప్ ఫైనాన్స్ ప్రాజెక్టు అంటున్నాడు. నిజాన్ని దాచేసి ఈ మాటలు చెబుతున్నాడు. పేద పిల్లలకు ఇంగ్లిష్ నేర్పించకూడదని, రివర్స్ టెండర్‌కు వ్యతిరేకంగా, అధిక ధరలకు చేసుకున్న పీపీఏలను కత్తిరిస్తుంటే కూడా ఉద్యమాలు చేశాడీయన. ఈయనకు బాకా ఊదుతున్న ఎల్లో మీడియా ఇప్పటికిప్పుడు అమరావతి భూములు అçమ్మితే లక్ష కోట్ల వస్తాయని, సెల్ప్ ఫైనాన్స్ మోడల్ అని చెబుతున్నారు. ఈ వాదన ఎంత వరకు కరెక్ట్ అని పరిశీలించాం. అందులో తేలిన నిజాలు ఏంటంటే.. గ్రీన్ ట్రిబ్యునల్, రిజర్వు కన్జర్వేషన్ ప్రాంతాలు.. ఇవన్నీ కృష్ణా నదీ ప్రవాహ ప్రాంతాలని తేలింది. సెల్ప్ ఫైనాన్స్ మోడల్ కాదని స్పష్టమైంది. ఐదేళ్లలో ఖర్చు చేసింది రూ.5,674 కోట్లు మాత్రమే ఇంత భారీ ప్రాజెక్టును మేం అడ్డుకుంటున్నామని చంద్రబాబు అరుస్తున్నారు. మౌలిక సదుపాయాలకే లక్షా 9 వేల కోట్లు ఖర్చవుతుందని చెప్పిన వ్యక్తి.. రాజధాని కోసం ఏదో చేస్తున్నానని బాహుబలి సినిమా చూపించిన వ్యక్తి.. ఐదేళ్లలో ఈయన పెట్టిన ఖర్చు రూ.5,674 కోట్లు మాత్రమే. బకాయిలు కట్టకుండా రూ.2,297 కోట్లు వదిలేశారు. ఏ ప్రభుత్వమైన ఐదేళ్లల్లో రూ.5 వేల కోట్ల నుంచి ఆరువేల కోట్లు మాత్రమే ఖర్చు చేస్తుందని అర్థమవుతోంది. ఈ లెక్కన సంవత్సరానికి వెయ్యి కోట్ల నుంచి 1200 కోట్లు రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తూ.. అమరావతి పూర్తి చేయాలంటే లక్ష కోట్లు కావాలి. ఇలాగైతే ఎన్నేళ్లు పడుతుందో? బాబు ఎంతో స్పీడ్‌తో కట్టానని బిల్డప్ ఇస్తున్న స్పీడ్‌తో కట్టినా వందేళ్లు పడుతుంది. అది కూడా ఖర్చు పెరగకుండా ఉంటే. గేర్ మార్చి అన్ని అభివృద్ధి పనులు ఆపేసి ఐదు రెట్ల వేగంతో రాజధాని పూర్తి చేస్తామని చెప్పినా కనీసం 20 ఏళ్లు పడుతుంది. ఈ 20 ఏళ్లల్లో అసలు, మీద వడ్డీ కలిపితే, అది 10 శాతం వడ్డీ వేసినా, లక్ష కాస్తా 3 లక్షల 12 వేల 148 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. 30 ఏళ్లలో అయితే రూ.5 లక్షల 97 వేల కోట్లు అవుతుంది. మారుమూల గ్రామాల్లో ఎందుకు కొన్నారు? రాజధాని కోసం 29 గ్రామాల పరిధిలో 33 వేల ఎకరాలు తీసుకున్నారు. ఎవరైనా రియల్ ఎస్టేట్‌లో ఎక్కడ పెట్టుబడి పెడతారు? విజయవాడకు మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలోనో.. గుంటూరుకు రెండు మూడు కిలో మీటర్ల దూరంలోనో పెడతారు. ఎప్పుడైనా పెరుగుతుందనుకుంటారు. కానీ ఇక్కడ జరిగిందేంటి? పచ్చగా మూడు పంటలు పండే పొలాల్లో ఉన్న గ్రామాలివి. ఇవి విజయవాడ – గుంటూరుకు ఎంతో దూరంలో ఉన్నాయో తెలుసా? నిర్మాణాలకు అనువుకాని, పోవడానికి రోడ్లు కూడా లేని గ్రామాలివి. ఒకవైపు కారు అటునుంచి వస్తుంటే ఇంకో కారు వెళ్లలేని గ్రామాలివి. అప్పరాజు పాలెం విజయవాడ నుంచి 30 కి.మీ, గుంటూరు నుంచి 38 కిలోమీటర్లు. శాఖమూరు గ్రామం విజయవాడ నుంచి 29, గంటూరు నుంచి 30 కిలోమీటర్లు. పయ్యావుల కేశవ్ కొడుకు భూములు కొనుగోలు చేసిన ఐనవోలు గ్రామం విజయవాడ నుంచి 27, గుంటూరు నుంచి 34 కిలోమీటర్లు. నేలపాడు నుంచి విజయవాడ 26.3 కిలోమీటర్లు. గుంటూరు నుంచి 34.41 కిలోమీటర్లు. వెలగపూడి గ్రామం గుంటూరు నుంచి 40, విజయవాడ నుంచి 20 కిలోమీటర్లు. ఇంతింత దూరంలో భూములు కొనాలనే ఆలోచన ఎవరికైనా ఎందుకు వస్తుంది? ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పడానికి ఇది చాలదా? ఈ కొనుగోలు చేసిన భూములన్నీ ఎప్పుడు? చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక.. ఆ తర్వాత నోటిఫికేషన్ రాకమునుపు. రాజధాని గ్రామాల నోటిఫికేషన్ డిసెంబర్ 30, 2014న వచ్చింది. ఈయన సీఎం అయింది జూన్‌లో. ఈ గ్రామాల్లో రాజధాని వస్తుందని ప్రజలెవ్వరికీ తెలియదు. కానీ వీళ్లకు మాత్రమే తెలుసు. ఎడాపెడా కొనేశారు. తక్కువ ధరకు కొని రైతులను కూడా తీవ్రంగా మోసం చేశారు. మేం తేల్చిన లెక్కల ప్రకారం ఇలా కొనుగోలు చేసింది 4070 ఎకరాలు. ఇందులో చంద్రబాబు సొంత కంపెనీ హెరిటేజ్ కూడా ఉంది. నాడు ఒక మాట.. ఇవాళ మరో మాట.. విజయవాడ, గుంటూరుకు దూరంగా అమరావతి పేరుతో ఓ భ్రమరావతి సృష్టించాడు చంద్రబాబు. ఇది వర్జిన్ ల్యాండ్. ఇక్కడ వ్యవసాయం తప్ప ఏమీలేదు కాబట్టి రోడ్లు, నీరు, కరెంట్, డ్రైనేజీ వంటి మౌలిక వసతులకు ఎకరానికి రూ.2 కోట్ల చొప్పున 53 వేల ఎకరాలకు లక్షా 9 వేల కోట్లు అవసరమని చంద్రబాబు నాయుడే అంచనా వేశారు. చంద్రబాబు మానస పుత్రిక ఈనాడులో 2018 డిసెంబర్ 26న రాజధాని అంచనా గురించి కూడా వేశారు. 53 వేల ఎకరాలంటే 8 కిలోమీటర్ల పరిధి. కనీస సదుపాయాలకు లక్షా 9 వేల కోట్ల రూపాయలు కావాలని చంద్రబాబు రిపోర్టులో చెప్పారు. అప్పుడు అమరావతిలో చంద్రబాబు అన్న మాటలు చూద్దాం. (చంద్రబాబు అప్పుడు, ఇప్పుడు అన్న మాటల వీడియో ప్రదర్శించారు). ఆనాడు నాలుగైదు లక్షల కోట్లు అవుతుందని చెప్పిన ఈ పెద్ద మనిషి ఇవాళ ప్లేట్ ఎలా మార్చాడో చూశాం. అన్ని భవనాలు టెంపరరీ అని నామకరణం చేసిన ఈయన చివరకు తాను సీఎంగా ఉండి రూ.14 వేల కోట్లకు టెండర్లు కూడా పిలిచాడు. ఏ రకంగా సూట్ అయితే ఆ రకంగా మాట్లాడటం చంద్రబాబుకు అలవాటే. ప్రత్యేక హోదా గురించి ఎలాంటి కుప్పిగంతులు వేశారో ఈ సభలోనే చూశాం. రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్‌గా మార్చింది ఎవరు? చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయి హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారు. గుట్టుచప్పుడు కాకుండా ఈ ప్రాంతంలో వేల ఎకరాల భూములను ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా తాను, తన బినామీలతో కొనుగోలు చేయించారు. అందరికీ ఒకవైపు నూజీవీడు అన్నారు. నాగార్జున యూనివర్సిటీ అంటూ ఈనాడు, చంద్రజ్యోతి వార్తలు రాశాయి. ఆ రాతలన్నీ కూడా వీళ్ల లీకులతోనే వచ్చాయి. ఇదే తెలుగుదేశం నాయకులు నూజీవీడు, నాగార్జున యూనివర్సిటీ ప్రాంతంలో భూములు కొనుగోలు చేసి నష్టపోలేదు. జీవో 254ను 2014 డిసెంబర్ 30న విడుదల చేశారు. ఆ రోజు పబ్లిక్ డోమైన్లోకి రాజధాని ఏర్పాటు చేసే ఊర్ల పేర్లు వచ్చాయి. ఇవాళ ఆ భూములు పోతాయని వీళ్లు బాధపడుతున్నారు. పచ్చటి పొలాలకు సరిహద్దులు నిర్ణయించి.. స్టేట్‌ను రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మార్చారు. రాజధాని కోసం భూములా? లేక తాను, తన బినామీల కోసం రాజధానా? అని ఇదే సభ నుంచి చంద్రబాబును ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబు తన స్వార్థం కోసం రైతులను రెచ్చగొట్టారు. మరి కొందరిని ప్రలోభపెట్టారు. కొందరిని బెదిరించారు. 144 సెక్షన్ అన్నది ఇదే ప్రాంతంలోని మచిలీపట్నంలో నాలుగేళ్లుగా నిరంతరాయంగా కొనసాగించారు. మా ప్రభుత్వం వచ్చేదాకా 144 సెక్షన్ విధించారు. దీనిని యాగీ చేయడంలో వీళ్లకు ఉన్న పలుకుబడి చూసి అశ్చర్యం అనిపించింది. వికేంద్రీకరణే మేలన్న కమిటీలు.. శ్రీబాగ్ ఒడంబడికలో భాగంగానే 1953లో కర్నూలును రాజధానిగా చేశారు.1956 దాకా అదే రాజధానిగా కొనసాగింది. 2014లో రాష్ట్ర విభజన చేయడానికి ముందు 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో అనేక అంశాలపై అధ్యయనం చేసిన జస్టిస్ శ్రీకృష్ట కమిటీ అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతం కావడం వల్ల ఏ రకమైన నష్టం జరుగుతుందో ఎత్తిచూపింది. రాష్ట్ర విభజన అనంతరం రాజధాని ప్రాంతం ఎంపిక కోసం కేంద్రం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ కూడా ఇదే చెప్పింది. విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి అంతా ఒకే ప్రాంతానికి పరిమితం చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను చంద్రబాబు వక్రీకరించారు. గంటన్నర పాటు చంద్రబాబు అబద్ధాలు చెప్పారు. చంద్రబాబుకు ఇష్టమైన పాంప్లెట్ చానల్ ఈటీవీలోనే శివరామకృష్ణన్ కమిటీ ఏమి చెప్పిందో చూద్దాం.(వీడియో క్లిప్పింగ్‌లను ప్రదర్శించారు). శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇవ్వక ముందే.. అదే ప్రాంతంలో రాజధాని పెట్టాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అందుకే సలహాలు మాత్రమే ఇవ్వగలమని శివరామకృష్ణన్ నివేదికలో నిస్పృహను వ్యక్తం చేశారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్ కమిటీలు ఇంత స్పష్టంగా చెప్పినా కూడా.. ప్రాంతాల పరంగా అనేక ఆకాంక్షలు ఉన్నా కూడా.. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వాటన్నింటిని గడ్డిపరక కంటే చిన్నగా చూశారు. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీజీ(బోస్టన్ కన్సల్టెంగ్ గ్రూప్), జీఎన్ రావు కమిటీలు వేశాం. గతంలోని కమిటీల మాదిరిగానే ఇవి కూడా వికేంద్రీకరణకు ఓటు వేశాయి. ఈ నివేదికలను అధ్యయనం చేయడానికి పది మంది మంత్రులు, అధికారులతో హైపవర్ కమిటీ వేశాం. జస్టిస్ శ్రీకృష్ణ, శివరామకృష్ణన్, జీఎన్ రావు కమిటీలు.. బీసీజీ నివేదికలను పరిశీలించిన హైపవర్ కమిటీ వికేంద్రీకరణే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఏకైక మార్గమని నివేదిక ఇచ్చింది. గతంలో చేసిన తప్పులను సరిదిద్దుతూ సూచనలు చేసింది. జిల్లాల వెనుకబాటుకు సంబంధించి వాస్తవాలు చెప్పింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను సిఫార్సు చేసింది. అన్ని కులాలు, మతాలు నాకు సమానమే చంద్రబాబులాగా గ్రాఫిక్స్‌తో, అబద్ధాలతో భ్రమ కల్పించం. అమరావతికి చేయగలిగినంతా చేస్తాం. ఇక్కడే అసెంబ్లీ నిర్వహిస్తాం. అన్ని జిల్లాలు, అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని మతాలు బాగుండాలన్నదే నా విధానం. అందుకే ఈరోజు నాకు గొప్ప సహచరుడిగా కొడాలి నాని ఉన్నారని నేను గర్వంగా చెబుతున్నా. నా కార్యక్రమాలను చూసే రఘు ఎవరు? వీరంతా కమ్మవారు కాదా? ఇదే కమ్మవారు, కాపులు, ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు, రెడ్లు అందరూ ఓటేస్తేనే నాకు 151 సీట్లు వచ్చాయి. కులం మధ్య చిచ్చుపెట్టి లబ్ధిపొందడం కోసం జగన్ కమ్మవారికి వ్యతిరేకమని, విజయవాడ నుంచి రాజధానిని తీసేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని పెడితే అక్కడ కమ్మవారు లేరా? అక్కడ మా ఎంపీనే కమ్మవారు అని కొడాలి నాని ఇప్పుడే చెప్పారు. విశాఖపట్నంలో నాలుగైదు సార్లు ఎంపీగా గెలిచిన వారు కూడా కమ్మవారే. కమ్మవారిలో అభద్రతా భావం సృష్టించి ఓటు బ్యాంకును కాపాడుకోవడం కోసం కేవలం దుష్ప్రచారం కోసం చంద్రబాబు నీచానికి దిగజారారు. రాజకీయాల కోసం కులాన్ని వాడుకునే నీచానికి పాల్పడుతున్నారు. ఆ పార్టీకి బాకా ఊదే టీవీ చానళ్లు, పత్రికలు కూడా ఆ స్థాయికి దిగజారాయి. అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలు బాగుండాలి. అందరికీ మంచి చేయాలి. ఇదే నా విధానం. ఇంటింటికీ అభివృద్ధి ఫలాలు అందాలి. ఇందుకోసం అన్నింటా సంస్కరణలు కొనసాగిస్తాం. గ్రామ సచివాలయాల నిర్మాణం నుంచి రాష్ట్ర సచివాలయాల నిర్మాణం వరకూ భావితరాల, మన ప్రాంతాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మేం నిర్ణయాలు తీసుకుంటాం. దీని కోసమే వికేంద్రీకరణకు ఓటు వేస్తున్నాం. విశాఖను కార్యనిర్వాహక రాజధాని, అమరావతిని శాసన నిర్మాణ రాజధానిగా అభివృద్ధి చేస్తాం. అన్యాయానికి గురైన కర్నూలు ప్రాంతానికి నా హయాంలో మేలు చేసే అవకాశం కలిగినందుకు సంతోషిస్తున్నాం. దీనిని న్యాయ రాజధాని చేస్తాం. ఇందుకు సంపూర్ణ మద్దతు ఇవ్వాల్సిందిగా ప్రతి వ్యక్తినీ, ప్రతి కుటుంబాన్ని కోరుతున్నా. రాళ్లేస్తున్న చంద్రబాబు మనసు కూడా మార్చాలని దేవుని వేడుకుంటున్నాం. అమరావతి రైతులకు అన్యాయం జరగదు అమరావతి రైతులకు మా హయాంలో ఎలాంటి అన్యాయం జరగదు. రైతు పక్షపాతిగా, చరిత్రలో ఏ ప్రభుత్వం చేయనంతగా రైతుకు అండగా నిలబడుతున్న ప్రభుత్వం మాది. 13 జిల్లాల్లోని ఏ రైతులకూ అన్యాయం జరగనీయను. అమరావతికి కూడా న్యాయమే చేస్తాం. అమరావతి రాజధానిగా ఉంటుంది. రైతులకు ఇచ్చే వార్షిక కౌలును పదేళ్ల నుంచి 15 ఏళ్లకు పెంచుతున్నాం. 29 గ్రామాల్లో భూమి లేని పేదలకు జీవన భృతి పెన్షన్‌ను రూ. 2500 నుంచి రూ. 5000కు పెంచుతున్నాం. దీనివల్ల 21 వేల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది. అసైన్మెంట్ భూములను భూసమీకరణ కింద ఇచ్చిన వారికి తక్కువ పరిమాణంలో ఇంటి/వ్యాపార స్థలాలు ఇచ్చేలా చంద్రబాబు సర్కారు అప్పట్లో చట్టం చేసింది. అసైన్మెంట్ భూములు ఇచ్చిన పేదలైన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు దీనివల్ల అన్యాయం జరుగుతుంది. మా ప్రభుత్వం వారికి కూడా న్యాయం చేస్తుంది. పట్టా భూములు ఇచ్చిన వారితో సమానంగా ప్లాట్లు ఇస్తుంది. అమరావతిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. సహజ రీతిలో అమరావతి ఒక గొప్ప నగరంలా రూపుదిద్దుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం. కొన్ని నిర్ణయాలు తీసుకోకపోతే నష్టపోతాం మనం బాధ్యతగల నాయకత్వ స్థానంలో ఉన్నాం. కొన్ని నిర్ణయాలు చేయకపోవడంవల్ల రాష్ట్రం నష్టపోతుంది. కొన్ని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుందని అనిపిస్తున్నప్పుడు తీసుకోకపోవడం ధర్మమేనా? అని ఆలోచించాలి. రాజధాని మధ్యలోనే ఉండాలనే వాదన చంద్రబాబు గట్టిగా వినిపించారు. చంద్రబాబు చెబుతున్నట్లు రాజధాని మధ్యలో ఉండాలన్నదే కరెక్టయితే ఒక్కసారి ఢిల్లీ ఎక్కడుందో గమనించాలని అడుగుతున్నా. ఢిల్లీకి విజయవాడ మధ్య దూరం 1,856 కిలోమీటర్లు. హైదరాబాద్ 1556 కి.మీ, తిరుపతి 2000 కి.మీ, బెంగళూరు 2177 కి.మీ, చెన్నై 2200 కి.మీ.ల దూరంలో ఉంది. రాజధాని మధ్యలోనే ఉండాలన్నది కరెక్టే అయితే వెంటనే చంద్రబాబు, రామోజీరావు కలిసి రాజధాని మధ్యలో ఉండాలి, దానిని మార్చండి అని మోదీకి లేఖ రాయాలి. తమిళనాడు రాజధాని చెన్నైకి చివరి ప్రాంతం ఎంతదూరంలో ఉందో చూడండి. కర్ణాటక రాజధాని బెంగళూరు, మహారాష్ట్ర రాజధాని ముంబయి ఒక మూలనున్నాయి. రాజస్థాన్‌లో జైపూర్ ఎక్కడ ఉందో చూడండి. రాజధాని మార్చుతున్నామనేది వాస్తవం కాదు రాజధాని మధ్యలో ఉండాలని ఎవరూ కొలతలు వేసుకోవాలని ఆలోచించరు. రాజధాని ఎక్కడ పెడితే తక్కువ ఖర్చవుతుంది? జనాభా పెరుగుతుంది? రెవెన్యూ పెరుగుతుంది? అభివృద్ధి వేగంగా ముందుకు పోతుందనే అంశాలు ఆలోచించి రాజధానిని నిర్ణయిస్తారు. చంద్రబాబుకు అది అర్థం కాదు. ఆయనకు కొన్న భూములే గుర్తుకొస్తున్నాయేగానీ మరే విషయాలు అర్థం కావడంలేదు. అమరావతి విషయానికి వస్తే ఈ ప్రాంత రైతులకు, ప్రజలకు భరోసా ఇవ్వదలిచాను. రాజధానిని మార్చుతున్నారని చంద్రబాబు అంటున్న మాట ఏమాత్రం వాస్తవం కానే కాదు. రాజధానిని మేం మార్చడంలేదు. రాజధాని ఎక్కడకూ పోవడంలేదు. ఈ ప్రాంతానికి అన్యాయం చేయడంలేదు. మిగిలిన ప్రాంతాలకు కూడా న్యాయం చేస్తున్నాం. ఇక్కడే లెజిస్లేటివ్ రాజధాని ఉంటుంది. అసెంబ్లీ ఉంటుంది. చట్టాలు చేస్తాం. దీంతోపాటు మరో రెండు కొత్తవి చేర్చుతున్నాం. విశాఖపట్నంలో సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు పెడుతున్నాం. కర్నూలును జ్యుడీషియల్ కేపిటల్ చేస్తున్నాం. ఎక్కడా, ఏప్రాంతానికి అన్యాయం చేయడంలేదు. ఇక్కడ న్యాయం చేస్తూనే మిగిలిన ప్రాంతాలకు కూడా న్యాయం చేస్తున్నాం. -
ఏపీ అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుకు ఆమోదం
సాక్షి, అమరావతి : అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఆమోదం తెలిపింది. సోమవారం మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న అంశంపై శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించింది. ఈ సమావేశాలు రాత్రి 11 గంటల వరకు కొనసాగాయి. సుధీర్ఘ చర్చల అనంతరం ఏపీ అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ.. సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులకు శాసన సభ ఆమోదం తెలిపింది. విశాఖపట్నం పరిపాలనా రాజధాని, అమరావతి శాసన రాజధాని, కర్నూలు న్యాయ రాజధానిగా బిల్లు ఆమోదం పొందింది. అనంతరం సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లును సైతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సహా అధికార పార్టీ సభ్యుల హర్షధ్వానాల మధ్య ఈ బిల్లులు ఆమోదం పొందాయి. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. రాష్ట్ర చరిత్రలో చారిత్రాత్మకమైన బిల్లును ప్రవేశపెట్టి సభకు పరిచయం చేసే అవకాశం దక్కడం అదృష్టంగా పేర్కొన్నారు. తనకు ఈ అవకాశం కల్సించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. -
సభ నుంచి టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
సాక్షి, అమరావతి : పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా టీడీపీ శాసన సభ్యులు సభలో గందరగోళం సృష్టించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగానికి అడుగడుగునా అడ్డు తగిలారు. దీంతో సీఎం జగన్ సందేశం ప్రజలకు చేరకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్న టీడీపీ ఎమ్మెల్యేలపై శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారని వాపోయారు. వారిని సస్పెండ్ చేయాలని స్పీకర్‌కు విఙ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుగ్గన ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదించిన స్పీకర్ తమ్మినేని సీతారాం సభా నియమాలు ఉల్లంఘించిన పలువురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, కరణం బలరాం, బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి భవాని, చిన రాజప్ప, వాసుపల్లి గణేష్, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, వెంకట్‌రెడ్డి నాయుడు, జోగేశ్వరరావు, గద్దె రామ్మోహన్‌ను నేటి సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. -
అమరావతికి అన్యాయం చేయను : సీఎం జగన్
సాక్షి, అమరావతి : అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలనే అభివృద్ధి వికేంద్రీకరణకు ఓటేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అందుకే విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలు జ్యూడీషియల్ క్యాపిటల్‌గా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అమరావతికి అన్యాయం చేయడం లేదని, మిగిలిన ప్రాంతాలకు న్యాయం చేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. టీడీపీ నేతలకు రైతులపై ప్రేమలేదని అన్నారు. ఇలాంటి వారు ప్రపంచ చరిత్రలోనే ఉండరని ఎద్దేవా చేశారు. చంద్రబాబు వల్లే 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉండాల్సిన హైదరాబాద్‌ను పోగొట్టుకున్నామని గుర్తు చేశారు. వికేంద్రీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన శాసన సభలో సోమవారం మాట్లాడారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే... ఏపీ చరిత్రలో ఇవాళ ముఖ్యమైన రోజు ‘ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది ముఖ్యమైన రోజు. ఈ రోజు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం నిర్వహించడానికి గల కారణం ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. నన్ను మాట్లాడనీయకుండా చేస్తున్న టీడీపీ నేతల తీరును ప్రజలు గమనిస్తున్నారు. ఇక్కడ మా ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాలు అనేకంటే.. దిద్దుబాట్లు అనడం కరెక్ట్. ఆంధ్ర రాష్ట్రం 1953 అక్టోబర్1న కర్నూలు రాజధానిగా అవతరించిన నాటి నుంచి 2014 జూన్‌లో 13 జిల్లాలుగా ఆంధ్రప్రదేశ్ అవతరించేంత వరకు... ఆతర్వాత జరిగిన పరిణామాలను గమనిస్తే... రకరకాల పొరపాట్లు చోటు చేసుకున్నాయి. 1953లో ఆంధ్ర రాష్ట్రంగా అవతరిస్తూ మద్రాసును పోగొట్టుకున్నాం. ఆ తర్వాత కర్నూలును త్యాగం చేశాం. ఆ తర్వాత హైదరాబాద్‌ను పోగొట్టుకున్నాం. ఒక అభివృద్ధి కేంద్రంగా, ఉద్యోగాల కేంద్రంగా ఉన్న నగరాలను పోగొట్టుకున్న ఏకైక రాష్ట్రం మనదే. చివరకు 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉండాల్సిన హైదరాబాద్‌ను ఓటుకు కోట్లు ఇస్తూ పట్టుబడిన ఓ పెద్ద మనిషి వల్ల పోగొట్టుకున్నాం’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్.. కాగా, టీడీపీ సభ్యుల గందగోళంతో ముఖ్యమంత్రి ప్రసంగానికి అంతరాయం ఏర్పడింది. దీంతో సీఎం తన ప్రసంగాన్ని కాసేపు నిలుపుదల చేశారు. టీడీపీ సభ్యులు ఆందోళన చేస్తూ స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి గందరగోళం సృష్టించారు. టీడీపీ సభ్యులను స్పీకర్ సభ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని కొనసాగించారు. శ్రీకృష్ణ కమిటీ కూడా అదే చెప్పింది ‘1937లో శ్రీబాగ్ ఒప్పదం జరిగింది. గతంలో 1937లో అప్పట్లో మద్రాసు రాష్ట్రంతో కలిసి ఉండగా.. తెలుగువారంతా ఒకటి కావాలి అని ఆరోజు శ్రీబాగ్ ఒప్పందం చేసుకున్నారు. రాయలసీమ నుంచి పోతిరెడ్డి, కల్లూరి సుబ్బారావు లాంటి ప్రముఖ నాయకులు.. ఆంధ్ర నుంచి కాశీనాథుని నాగేశ్వరావు, కొండా వెంకటప్పయ్య లాంటి ప్రముఖులు ఒక చోట ఏకమై.. 1937లో శ్రీబాగ్ ఒప్పందం చేసుకున్నారు. ఆ రోజుల్లో తెలుగు ప్రజలంతా ఒకటిగా ఉండాలని, అన్నదమ్ములుగా బతకాలని, ప్రాంతాల మధ్య గొడవల రావొద్దని తాపత్రాయపడ్డారు. విశ్వవిద్యాలయాలు, రాజధానులు ఎక్కడ ఉండాలనేదాటిపై చర్చ జరిపి ఒక ఒప్పందానికి వచ్చారు. హైకోర్టు, రాజధాని వంటివి ఒకే ప్రాంతంలో ఉండడం కరెక్ట్ కాదని, వేర్వేరు ప్రాంతాలల్లో ఏర్పాటు చేయాలని ఒడంబికలో రాసుకున్నారు. దాంట్లో భాగంగానే 1953లో కర్నూలును రాజధానిగా చేశారు.1956దాకా అదే రాజధానిగా ఉంది. 2014లో రాష్ట్ర విభజన చేయడానికి ముందు జస్టీస్ శ్రీకృష్ట కమిటీ 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో అనేక అంశాలపై అధ్యయనం చేసింది. ప్రాంతీయ అసమానతలు, ఉద్యోగాల పరంగా అసమానతలు ఎలాంటి వాతావరణాన్ని సృష్టిస్తాయో ఆ నివేదిక వెల్లడించింది. మొదటి తెలంగాణ ఉద్యమం అభివృది రాహిత్యం వల్ల వస్తే.. రెండవ సారి అభివృద్ధి కేంద్రీకృతం కావడం వల్ల వచ్చిందని శ్రీకృష్ణ కమిటీ చెప్పింది. అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతం కావడం వల్ల ఏ రకమైన నష్టం జరుగుతుందో శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు పేర్కొంది’అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. చంద్రబాబు తీరును శివరామ కృష్ణనే తప్పుపట్టారు ‘రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంతా ఒక్క ప్రాంతానికే పరిమితం చేయడానికి వీల్లేదని శిమరామకృష్ణ కమిటీ చెప్పింది. దీనిని చంద్రబాబు వక్రీకరించి చెప్పారు. సూపర్ క్యాపిటల్ వద్దని కమిటీ చెప్పింది. మూడు ప్రాంతాల్లో పాలనా వికేంద్రీకరణ జరగాలని శివరామకృష్ణ కమిటీ సూచించింది. శివరాకృష్ణ తాను రాసిన వ్యాసాల్లో కూడా చంద్రబాబు తీరును తప్పుబట్టారు. చంద్రబాబు తీరు ఏపీకి ఆత్మహత్య సదృశంగా మారింది’అని సీఎం అన్నారు. టీడీపీ నేతలు ఎందుకు అక్కడ భూముల కొనలేదు ‘మేము అధికారలోకి వచ్చిన తర్వాత బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) రిపోర్టు కానీ, జీఎన్ రావు కమిటీ నివేదిక గానీ వికేంద్రీకరణకే ఓటేశాయి. గతంలో చేసిన తప్పుల్ని సరిదిద్దుతూ హైపవర్ కమిటీ సూచనలు కూడా చేసింది. గత ఒప్పందాలతో కానీ, గత చరిత్రతో కానీ, కమిటీ నివేదికలతోగానీ సంబంధం లేకుండా 2015లో చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారు. వస్తూ వస్తూ ఎవరికి ఏ అనుమానం రాకుండా తన వారితో, తన బినామీలతో, చివరకి తన పేరుతో కూడా ఈ ప్రాంతంలో వేల ఎకరాలు భూములు కొనుగోలు చేశారు. అందరికీ నూజివీడు దగ్గర రాజధాని అని చెప్పి భ్రమలు కల్పించారు. నాగార్జున యూనివర్సీటీ ప్రాంతంలో రాజధాని అని వారి పత్రికల్లో రాయించారు. వీళ్లు లీకులు ఇచ్చారు కాబట్టే పత్రికల్లో ఆ రాతలు వచ్చాయి. ఇలా రాతలు వచ్చినా కూడా.. ఇదే తెలుగు దేశం నాయకులు నూజీవీడు, నాగార్జున యూనివర్సీటీ ప్రాంతాల్లో ఎందుకు భూములు కొనుగొలు చేయలేదు..? నోటిఫికేషన్‌కు ముందే టీడీపీ నేతలకు రాజధాని ఏర్పాటు చేయబోయే గ్రామాల పేర్లు చెప్పారు. అందుకే అందరూ అక్కడ భూములు కొన్నారు. రాజధాని కోసం భూములా లేక చంద్రబాబు, ఆయన మనుషులు కొన్న భూముల కోసం రాజధానా..?’అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. అక్కడే భూములు ఎలా కొన్నారు? ‘చంద్రబాబు తన స్వార్థం కోసం రైతులను ప్రలోభ పెట్టి.. భయపెట్టి భూములు లాక్కున్నారు. మచిలీ పట్నంలో గత నాలుగేళ్లుగా 144 సెక్షన్ పెట్టారు. తూర్పు గోదావరి జిల్లాలో 2016 నుంచి మా ప్రభుత్వం వచ్చేదాక 144 సెక్షన్ ఉంది. మా ప్రభుత్వం రెండు రోజులు 144 సెక్షన్ పెడితే నానా యాగీ చేస్తున్నారు. 29 గ్రామాల పరిధిలో 33వేల ఎకరాల భూములు తీసుకున్నారు. ఎవరైనా కూడా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఎక్కడ పెడతాం? విజయవాడకు మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో పెడతాం. లేదా గుంటూరుకు సమీపంలో పెడతాం. కానీ ఇక్కడ ఎం జరిగింది. పచ్చగా మూడు పంటలు పండే గ్రామాలు... విజయవాడకు, గుంటూరుకు చాలా దూరంలో ఉన్న గ్రామాల్లో.. రోడ్డు కూడా సరిగా లేని గ్రామాల్లో కావాలని భూములు కొన్నారు ఎందుకు? ఇక్కడే భూములు కొనాలనే ఆలోచన ఎందుకు వస్తుంది? ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అనడానికి ఇంతకంటే రుజువేం కావాలి? ఇదంతా చంద్రబాబు సీఎం అయ్యాక జరిగింది. రాజధాని ఇక్కడ వస్తుందని ప్రజలకు తెలియదు.. కానీ టీడీపీ నేతలకు మాత్రమే తెలుసు. రైతులను మోసం చేసి 4070 ఎకరాల భూములు కొన్నారు’అని సీఎం టీడీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. అందుకే నారాయణ కమిటీ ‘వరద ముప్పు ఉన్న ప్రాంతంలో రాజధాని నిర్మించాలనే ఆలోచన ఎలా వచ్చింది. శివరామ కృష్ణ కమిటీ నివేదను నీరుగార్చేందుకు చంద్రబాబు నాయుడు నారాయణ కమిటీ వేశారు. శివరామకృష్ణ కమిటీ నివేదికను ఇవ్వకముందే చంద్రబాబు తన నిర్ణయాలను అమలు చేసేందుకు నారాయణ కమిటీ వేశారు. ఆ తర్వాత 9 నగరాలు నిర్మించబోతున్నామంటూ సినిమా చూపించారు. రాష్ట్రం మొత్తం నీటి కోసం, కూటి కోసం తపిస్తుంటే.. చంద్రబాబు మాత్రం కోట్ల కోసం పరితపించారు’అని సీఎం వైఎస్ జగన్ చురకలంటించారు. అమరావతి పేరుతో భ్రమరావతి కల్పించారు గత ఐదేళ్లలో చంద్రబాబు చూపించిన గ్రాఫిక్స్ రాజధానిని నిర్మించాలంటే రూ.లక్ష కోట్లు కావాలి. అమరావతి పేరుతో ఒక భ్రమరావతి కల్పించారు. మౌలిక వసతుల కోసం లక్షా 9వేల కోట్లతో బాబు అంచనాలు వేశారు. రాజధాని నిర్మాణానికి రూ.4-5లక్షల కోట్లు ఖర్చు అవుతుందని చంద్రబాబే చెప్పారు. గతంలో అన్ని తాత్కాలికమని చెప్పి ఇప్పడు పర్మినెంట్ అంటున్నారు. మాట మార్చడంలో చంద్రబాబు దిట్ట. చంద్రబాబు చెప్పిన అమరావతిని నిర్మించాలంటే కనీసం 100 ఏళ్లు పడుతుంది. 30 ఏళ్లలో పూర్తి చేయాలనుకుంటే 5లక్షల 97వేల కోట్లు ఖర్చ అవుతుంది. గ్రీన్ ట్రిబ్యూనల్ ఆదేశాలు, నది పరివాహక ప్రాంతాలు కావడం చేత ఈ ప్రాంతంలో రాజధాని నిర్మాణం సాధ్యం కాదు. సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ రావాలంటే ఎకరం రూ.20కోట్లకు పోవాలి. ఆ పరిస్థితి ఇక్కడ లేదు. ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నా చంద్రబాబు పట్టించుకోలేదు రాజధాని నగరంలో కనీస సదుపాలయలేకే లక్ష 9వేల కోట్లు పెట్టగలికే ఆర్థిక పరిస్థితి మనకు లేదు. రూ. 2.57లక్షల కోట్ల అప్పులతో మా పరిపాలన ప్రారంభించాం. రూ.21వేల కోట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు బకాయిలు చెల్లించాలి. ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నా చంద్రబాబు పట్టించుకోలేదు. ఈ భారం ప్రజలపై పడకుండా నేను జాగ్రత్తలు తీసుకున్నా. ప్రజలను ఇబ్బంది పెట్టలేదు. ఇటువంటి పరిస్థితుల్లో మరో లక్ష కోట్లు రాజధాని కోసం ఖర్చు చేసే పరిస్థితి ఉందా అందరూ ఆలోచన చేయాలి. కృష్ణా నదిపై 8 జిల్లాలు ఆధారపడి ఉన్నాయి. సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని కృష్ణాలోకి తీసుకొచ్చి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ విషయాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కూడా మాట్లాడాం. తక్కువ డబ్బుతో ఎక్కువ నీళ్లు ఎలా తీసుకురావాలో ఆలోచన చేశాం. ఇటువంటి ముఖ్యమైన ప్రాజెక్టులను చెద్దామా వద్దా? వెనుక బడిన ఉత్తరాంధ్రకు ఊపిరి పోసే ప్రాజెక్టు. ఉత్తరాంధ్ర సజల స్రవంతి వస్తే ఆ ప్రాంత వెనుకబాటు తనం పోతుంది. ఈ ప్రాజెక్టుకు రూ.16వేల కోట్లు ఖర్చు అవుతుంది. కరువు నివారణ కోసం కాల్పలు వెడల్పు చేసి ప్రాజెక్టుల సామర్థ్యం పెంచాలి. కరువు నివారణ పనుల కోసం రూ.25వేల కోట్లు ఖర్చవుతుంది. రైతులకు శాశ్వతంగా ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు 10వేల మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.36వేల కోట్టు ఖర్చు చేస్తున్నాం. సంక్షేమం వద్దా..! రాష్ట్రంలోని బడులు, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు లేక దారుణమైన పరస్థితుల్లో ఉన్నాయి. వాటి బాగుకోసం రూ.24 కోట్లు అవసరం. ప్రభుత్వాస్పత్రుల బాగు కోసం మరో రూ.14 వేల కోట్ల ఖర్చవుతుంది. వాటర్‌గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికీ మంచినీరు అందించేందుకు రూ.45 వేల కోట్లు ఖర్చవుతుంది. ఉగాది నాటికి పేదలకు 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తాం. ఇందుకు రూ.40 వేల కోట్లు ఖర్చవుతుంది. 50 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. 43 లక్షల మంది తల్లులకు అమ్మ ఒడి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. 90 శాతం మందికి ఆరోగ్య శ్రీ, ఫీజురియంబర్స్మెంట్ సదుపాయం కల్పిస్తున్నాం. ఇన్ని ఖర్చుల మధ్య ఒక ప్రాంత అభిృద్ధికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అవసరమా..? రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు నిలిపేసి.. ఒక నగరానికి ఖర్చు చేయడం సాధ్యమేనా..? ఏదో ఒక రోజు అమరావతి కూడా మహానగం అవుతుంది. అందుకోసమే అసెంబ్లీని అమరావతిలోనే కొనసాగిస్తున్నాం. ఈ ప్రాంతంపై కోపం ఉంటే ఇక్కడే అసెంబ్లీ ఎందుకు పెడతాం. నేను కూడా సింగపూర్ నుంచి ఒకరిని.. జపాన్ నుంచి ఒకరిని తీసుకొచ్చి ప్రజల్ని మోసం చేయను. మన దగ్గర పరిమిత సొమ్ముని ఎంత జాగ్రత్తగా ఖర్చు పెట్టాలో చూడాలి. విశాఖ ఇప్పటికే రాష్ట్రంలో నెంబర్‌వన్ నగరం. విశాఖ రాజధాని అయితే పదేళ్లలో హైదరాబాద్‌తో మన పోటీ పడొచ్చు. ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి రాకూడదు. అందరికీ మంచి చేయాలన్నదే నా విధానం పట్టా భూములను ఇచ్చిన రైతులతో సమానంగా అసైన్డ్ భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు ఇస్తాం. అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వడంతోనే మాకు 151 సీట్లు వచ్చాయి. జగన్ కమ్మవారికి వ్యతిరేకమని చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు. విశాఖలో కమ్మవారు లేరా? విశాఖలో మా ఎంపీ కూడా కమ్మే. ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు.. కమ్మవారిలో అభద్రతా భావాన్ని పెంచేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారు. రాజకీయం కోసం కులాన్ని వాడుకునే నీచ స్థాయికి బాబు దిగజారారు. అందరికీ మంచి చేయాలన్నదే నా విధానం. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే అభివృద్ధి వికేంద్రీకరణకు ఓటేసున్నాం. అమరావతికి అన్యాయం చేయడం లేదు రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని బీజేపీ మేనిఫెస్టోలో ఉంది. అమరావతిని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చారని ఆరోపించింది. తెలుగు బీజేపీ నేతలు తెలిసి మాట్లాడుతున్నారో...తెలియక మాట్లాడుతున్నారా? అలాంటి వ్యక్తులను పార్టీ నుంచి బయటకు పంపించాలి. పోలవరంలో రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.830 కోట్లను ఆదా చేశాం.2021 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం. శరవేగంగా పోలవరం ప్రాజెక్టులు జరుగుతున్నాయి. అమరావతికి అన్యాయం చేయడంలేదు. అమరావతి రైతులకు ఎలాంటి అన్యాయం జరుగదు. అమరావతి రైతులకు న్యాయమే చేస్తాం. అమరావతి ఒక రాజధానిగా ఉంటుంది. లెజిస్లేటీవ్ రాజధానిగా ఉంటుంది. చట్టాలు ఇక్కడే చేస్తాం.. సభలు ఇక్కడే జరుగుతాయి. అమరావతి గొప్ప నగరంగా రూపుదిద్దుతాం. భావితరాల భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోని నిర్ణయాలు తీసుకుంటాం. దీనిలో భాగంగానే వికేంద్రీకరణకు ఓటు వేస్తున్నాం’ అని సీఎం జగన్ తన ప్రసంగాన్ని ముగించారు. -
చంద్రబాబు కావాలనే అలా చేస్తున్నారు: సీఎం జగన్
సాక్షి, అమరావతి : చంద్రబాబు నాయుడు శాసన సభలో అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ సమయాన్ని వృథా చేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. సోమవారం శాసన సభలో వికేంద్రీకరణ బిల్లుపై చంద్రబాబు నాయుడు దాదాపు 50 నిమిషాలు మాట్లాడారు. అసలు విషయాన్ని పక్కన పెట్టి ఇతర అంశాలు మాట్లాడుతూ.. సభా సమయాన్ని వృథా చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ కలుగజేసుకొని ప్రతిపక్ష నాయకుడు సభను తప్పుదోవ పట్టిస్తూ సమయాన్ని వృథా చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. 21మంది టీడీపీ సభ్యుల్లో ఐదుగురు మాట్లాడితే.. 151మంది ఉన్న తమ సభ్యుల్లో కేవలం ఏడుగురు మాత్రమే మాట్లాడారని గుర్తు చేశారు. ప్రజలు నిద్రపోయేవరకు మాట్లాడాలనే ఉద్ధేశంతోనే చంద్రబాబు ఇంకా మైకు వదలడం లేదని ఎద్దేవా చేశారు. తాను మాట్లాడేది ప్రజలు వినకూడదని చంద్రబాబు అనుకుంటున్నారని.. అయినప్పటికీ ఆయనకు మరింత సమయం ఇస్తామని సీఎం జగన్ చెప్పారు. ఈ సందర్భంగా స్పీకర్ కలగజేసుకొని చంద్రబాబును 10 నిమిషాల్లో ప్రసంగం ముగించాలని ఆదేశించగా.. మరో గంట సమయం కావాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. దీంతో స్పీకర్ టీడీపీ నేతలపై మండిపడ్డారు. ‘అసెంబ్లీ టీడీపీ జాగీరు కాదని.. ఇది అందరిదీ.. ప్రతి ఒకరికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని’ స్పష్టం చేశారు. -
‘సమాచారం ఇవ్వమంటే బాబు పట్టించుకోలేదు’
సాక్షి, అమరావతి : శివరామకృష్ణన్ కమిటీ గురించి చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలేనని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. అమరావతి ప్రాంతంలో ఎత్తైన భవనాలు అనుకూలం కాదని శివరామకృష్ణన్ కమిటీ చెప్పిందని ఆయన గుర్తు చేశారు. మూడు రాజధానుల బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ‘ఇక్కడ వ్యవసాయ భూమిని తీసుకోవద్దని, అది రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దారితీస్తుందని కమిటీ స్పష్టంగా చెప్పింది. ఉత్తరాంధ్ర, రాయలసీమలో ప్రభుత్వ భూమి ఉందా అని కమిటీ సమాచారం ఇవ్వమంటే.. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. 25 గంటల్లోనే రాజధానిపై ఫోన్ ద్వారా తమ అభిప్రాయం చెప్పాలని కోరితే.. కేవలం 1500 మంది ప్రజలు మాత్రమే చెప్పారు. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు తమ అభిప్రాయం చెప్పలేదు. వరదలు వస్తే... అమరావతి ప్రాంతం ఎలా మారుతుందో బాబుకు తెలియదా. ఆయన తెలిసి మాట్లాడుతున్నారో.. తెలియక వాదిస్తున్నారో అర్థం కావడం లేదు’అని బుగ్గన విమర్శలు గుప్పించారు. -
మూడు రాజధానులపై రాష్ట్రవ్యాప్తంగా హర్షం
సాక్షి,అమరావతి: మూడు రాజధానుల ఏర్పాటు కోసం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుపై సోమవారం రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ కాగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కడప: రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటుకు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టినందుకు ప్రొద్దుటూరు పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ ర్యాలీ చేపట్టారు. అదేవిధంగా వైఎస్సార్ విగ్రహం వద్ద బాణసంచా పేల్చి సంబరాలు చేశారు. ప్రజలు, అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ భారీ ర్యాలీలో పాల్గొన్నారు. కర్నూలు: కర్నూలును జూడిషియల్ క్యాపిటల్‌గా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినందుకు కర్నూలు వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలోని కొండారెడ్డి బురుజు వద్ద మిఠాయిలు పంపిణీ చేస్తూ సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అదనపు కార్యదర్శి తేర్నకల్ సురేందర్ రెడ్డి, నగర అధ్యక్షుడు రాజావిష్ణువర్థన్ రెడ్డి పాల్గొన్నారు. పులివెందుల: అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టినందుకు పులివెందులలో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. పులాంగళ్ల సర్కిల్లో బాణాసంచా పేల్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. అనంతపురం: మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టినందుకు హిందూపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. మూడు రాజధానుల బిల్లు ఆమోదించడంపై కదిరిలో పార్టీ నాయకులు సంబరాలు చేశారు. పార్టీ కార్యకర్తలు బాణసంచా కాల్చుతూ.. భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. నెల్లూరు: రాష్ట్రానికి మూడు రాజధానులు కావాలని కోరుతూ కావలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు భారీ ర్యాలీ చేపట్టారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం వల్ల అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. విశాఖపట్నం: అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టినందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నేతలు, కార్యకర్తలు ధన్యవాదాలు తెలిపారు. పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్ రాయవరం మండలాల్లో పార్టీ కార్యకర్తలు బాణసంచా కాల్చి, ర్యాలీలు చేపట్టి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు వీసం రామకృష్ణ, చిక్కాల రామారావు, బొలిశెట్టి గోవిందు పాల్గొన్నారు. శ్రీకాకుళం: పరిపాలన వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టినందుకు హర్షం వ్యక్తం చేస్తూ శ్రీకాకుళం ఏడు రోడ్ల జంక్షన్ వద్ద వైఎస్సార్సీపీ నేతలు ధర్మాన రామ్మనోహర్ నాయుడు, అందవరపు సూరిబాబు, మెంటాడ స్వరూప్‌లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పలాస: నియోజకవర్గంలోని కాశీబుగ్గ బస్టాండ్ వద్ద వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నేతలు, కార్యకర్తలు పూలమాల వేశారు. తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. విశాఖపట్నాన్ని రాజధానిగా అసెంబ్లీ బిల్లును ప్రవేశపెట్టినందుకు కార్యకర్తలు, నేతలు సంఘీభావం తెలిపారు. విశాఖ క్యాపిటల్ నిర్ణయానికి మద్దతుగా విశాఖ నార్త్ కన్వీనర్ ఆధ్వర్యంలో బాలయ్య శాస్త్రి లేఔట్ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నేతలు, కార్యకర్తలు బైక్ ర్యాలీ చేశారు. కేబినెట్ నిర్ణయాన్ని సమర్ధిస్తూ విశాఖలోని వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి మద్దిలపాలెం వినాయక టెంపుల్ మీదుగా కొనసాగిన భారీ ర్యాలీలో వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, పార్టీ కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్, పార్టీ కన్వీనర్లు కేకే రాజు, మల్ల విజయప్రసాద్, వైఎస్సార్సీపీ నాయకులు కొయ్య ప్రసాద్‌రెడ్డి, రొయ్య జగన్నాథం, జాన్ వెస్లీ, రొయ్య వెంకటరమణ పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి: నిడదవోలు పట్టణంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మూడు రాజధానులకు మద్దతుగా భారీ మోటార్ సైకిల్ ర్యాలీని కార్యకర్తలు నిర్వహించారు. అసెంబ్లీలో అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడురాజధానులు తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా ఉంగుటూరు నియోజకవర్గ పరిధిలోని భీమడోలు, గణపవరం, నిడమర్రు గ్రామాల కార్యకర్తలు, ప్రజలు ఉంగుటూరు మండల కేంద్రంలో సంఘీభావ బైక్ ర్యాలీలు నిర్వహించారు. ఈ గ్రామాల ప్రజలు సీఎం వైఎస్ జగన్ నిర్ణయానికి మద్దతు పలికారు. తాడేపల్లిగూడెంలో మూడు రాజధానులకు అనుకూలంగా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ తనయుడు కొట్టు విశాల్ పాల్గొన్నారు. దేవరపల్లి వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కార్యలయం వద్ద మూడు రాజధానులకు మద్దతుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు వేడుకలు నిర్వహించారు. చింతలపూడిలో సోమవారం అసెంబ్లీలో మూడు రాజధానుల తీర్మానం ప్రవేశ పెట్టినందుకు పార్టీ కార్యకర్తలు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బుట్టాయిగూడెంలో ఆంధ్రప్రదేశ్ సమతుల్య అభివృద్ధి కోసం అసెంబ్లీలో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి పార్టీ కార్యకర్తలు, ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. దీంతోపాటు భారీగా బాణాసంచా కాల్చి, ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు. మూడు రాజధానులకు అనుకూలంగా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ద్వారకాతిరుమలలో అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి.. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నేతలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం చిన్న వెంకన్న పాదాల చెంత కొబ్బరికాయలు కొట్టి వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా: రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన ధ్యేయం అంటూ... జగ్గయ్యపేట పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో తన్నీరు నాగేశ్వరావు, చౌడవరపు జగదీష్, షేక్. మదార్ సాహెబ్, నూకల సాంబ, నంబూరి రవి, జుబేర్, ఫిరోజ్ ఖాన్, ప్రజలు పాల్గొన్నారు. -
మూడు రాజధానులకు మద్దతుగా జిల్లాలో భారీ ర్యాలీ!
సాక్షి, తూర్పు గోదావరి: రాజధాని వికేంద్రీకరణకు అసెంబ్లీలో ఆమోదం లభించడంతో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. రాజమండ్రిలోని మోరంపూడి జంక్షన్ నుంచి క్వారీ సెంటర్ వరకు జరిగిన ఈ ర్యాలీలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా పిఠాపురంలో సైతం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు సోమవారం పాదయాత్రను నిర్వహించారు.మరోవైపు రంపచోడవరంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు రామన్న దొర, మంగా బొజ్జయ్య, పండా రామకృష్ణ తదితరుల పాల్గొన్నారు. కాకినాడ: రాష్ట్ర అభివృద్ధికై సీఎం వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మూడు రాజధానుల బిల్లుకు మద్దతుగా వైఎస్సార్ సీపీ కార్యాలయ నుంచి బలాజీ చెరువు సెంటర్ వరకు భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో నగర వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు ఫ్రూటీ కుమార్, యాళ్ల పట్టాభి, రావూరి వెంకటేశ్వరరావు, నల్లబిల్లి సుజాత, బెండా విష్ణు, పెదబాబు పాల్గొన్నారు. రామచంద్రపురం: మూడు రాజధానుల బిల్లుపై అసెంబ్లీలో అమోదం ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేస్తూ వైఎస్సార్ సీపీ నాయకులు ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో పార్లమెంటరీ అధ్యక్షుడు తోట త్రిముర్తులు ఇతర నాయకులు పాల్గొన్నారు. అమలాపురం: రాజధాని వికేంద్రీకరణ నిర్ణయానికి అసెంబ్లీ ఆమోదం అభించడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అదేవిధంగా కుడుపూడి చిట్టబ్బాయి ఆధ్వర్యంలో అమలాపురంలో ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుడుపూడి సూర్యనారాయణ రావు, చెల్లుబోయిన శ్రీను, వంటెద్దు వెంకయ్య నాయుడు ఇతరులు పాల్గొన్నారు. -
‘సీఎం జగన్ నిర్ణయం వల్లే మా ప్రాంతాల్లో వెలుగులు’
సాక్షి, అమరావతి : వెనకబడిన ప్రాంతాల్ని విస్మరిస్తే సమస్యలు తప్పవని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు. అది గమనించే సీఎం జగన్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. రాజధానిగా అమరావతి కొనసాగితే మళ్లీ ఉద్యమాలు వచ్చేవని ఆయన స్పష్టం చేశారు. అప్పుడు అందరం కలిసి ఉండటం సాధ్యమయ్యేదా అని టీడీపీ ఎమ్మెల్యేలను ధర్మాన ప్రశ్నించారు. మూడు రాజధానుల బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. వికేంద్రీకరణ బిల్లును స్వాగతిస్తున్నానని ఈ సందర్భంగా ధర్మాన తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుంటే.. వెనక నుంచి అడ్డుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ధైర్యంగా తీసుకున్న నిర్ణయం వల్లే.. తమ ప్రాంతాల్లో వెలుగులు వచ్చాయని ధర్మాన ఆనందం వ్యక్తం చేశారు. (చదవండి : రాజధానులు ఎంతెంత దూరం) టీడీపీ పాలనలో చర్చలు లేవు.. రాజధానిని చంద్రబాబు పూర్తిగా వ్యాపార ధోరణితోనే చూశారని ధర్మాన విమర్శించారు. రాజధాని నిర్మాణం అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను గుర్తించే విధంగా ఉండాలని చెప్పారు. ఈ విషయాన్ని గత టీడీపీ ప్రభుత్వం విస్మరించిందని గుర్తు చేశారు. ఎవరితో చర్చింకుండానే టీడీపీ పాలనలో నిర్ణయాలు తీసుకున్నారని మండిపడ్డారు. శివరామకృష్ణ కమిటీ పర్యటన పూర్తి కాకముందే గత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వానికి రాజ్యాంగంపై నమ్మకం లేదని, సుప్రీం కోర్టుపై గౌరవం లేదని ధర్మాన అన్నారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ శివరామకృష్ణన్ కమిటీ చెప్పిన విధంగానే సీఎం జగన్ చేశారని తెలిపారు. విశాఖ ఏమైనా మారుమూల ప్రాంతమా అని టీడీపీ ఎమ్మెల్యేలను ధర్మాన నిలదీశారు. చదవండి : అమరావతి రాజధాని నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం రాజధాని రైతులకు వరాలు చంద్రబాబుకు సవాల్ విసిరిన కొడాలి నాని -
‘అవును.. అమరావతిలో భూములు కొన్నా’
సాక్షి, అమరావతి : రాజధాని ఏర్పడుతుందనే అమరావతిలో భూములు కొన్నానని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అంగీకరించారు. రాజధానిలో భూములు ఉండాలనే తన కొడుకు పేరుపై భూములు కొన్నానని అసెంబ్లీ సాక్షిగా నిజం ఒప్పుకున్నారు. రాజధాని అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సభలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా పయ్యావుల మాట్లాడుతూ.. అమరావతిలో రాజధానిఏర్పడబోతుందని తెలిసే భూములు కొన్నానని స్పష్టం చేశారు. రాజధానిలో భూములు కొంటే తప్పేంటని ప్రశ్నించారు. (చదవండి : రాజధానులు ఎంతెంత దూరం) భూముల కొంటే తప్పులేదని.. 2014 జూన్ నుంచి డిసెంబర్‌లోగా టీడీపీ నేతలు అంతా ఒకే చోటభూములు ఎలా కొన్నారని బుగ్గన నిలదీశారు. రాజధాని అక్కడ..ఇక్కడ అని అమయాక ప్రజలను గందరగోళాని గురిచేసి.. టీడీపీ నేతలు మాత్రం అమరావతిలో భూములు కొన్నారని బుగ్గన ఆరోపించారు. గుంటూరు,కృష్టా జిల్లాల్లో రాజధాని అని ఉద్దేశపూర్వకంగా లీకులు ఇచ్చి.. అందరిని మభ్యపెట్టి టీడీపీ నేతలు మాత్రం అమరావతిలో భూములు కొన్నారన్నారు. కచ్చితంగా ఇది ఇన్సైడర్ ట్రేడింగే అని బుగ్గన అన్నారు. దీనిపైప్రభుత్వం కచ్చితంగా చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. (చదవండి : చంద్రబాబుకు సవాల్ విసిరిన కొడాలి నాని) ప్రజలను మభ్యపెట్టేలా పయ్యావుల మాట్లాడుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఇల్లు కట్టుకునేందుకు 4 ఎకరాల భూముటు కొంటారాఅని పయ్యావులను ప్రశ్నించారు. రాజధాని ఏర్పడే విషయం టీడీపీ నేతలకు ముందుగానే అందిందని.. అందుకే అమరావతిలో వేల ఎకరాల భూములు కొన్నారని ఆరోపించారు. ఇన్సైడర్ ట్రేడింగ్‌పై తమ ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకుంటుందని పేర్కొనానరు. (చదవండి : ‘షో బ్యాగ్.. సీ బ్యాగ్ అనేది చంద్రబాబు పాలసీ’) -
అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి: సుచరిత
సాక్షి, అమరావతి: పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు హోంమంత్రి మేకతోటి సుచరిత పూర్తి మద్దతు తెలిపారు. ఇదొక చరిత్రాత్మక రోజు, శతాబ్దాల రాష్ట్ర భవిష్యత్తుకు చక్కని పునాది అని ఆమె కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో పరిపాలన వికేంద్రీకరణ బిల్లుపై సుచరిత మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటైన దగ్గరి నుంచి కులాలు, మతాలు, ప్రాంతాలకతీతంగా అందరి అభివృద్ధి, సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో ప్రజాసంక్షేమం మంచి నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రాంతీయ అసమానతలు, అనుమానాలకు తావులేని అభివృద్ధి జరగాలని, అన్ని ప్రాంతాల ఆకాంక్షలను, అభిప్రాయాలను గౌరవించాలని, అందుకు చట్టసభలు వేదికగా కావాలని, అప్పుడే ప్రజల ఆకాంక్షలు సజీవంగా ఉండి.. అన్ని ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని అన్నారు. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలని, అందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి వైఎస్ జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ.. లబ్ధిదారులకు సేవలన్నీ తమ గడప వద్దకే తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. పరిపాలన వికేంద్రీకరణ దిశగా తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే సరికొత్త విప్లవానికి నాంది పలుకనుందని ధీమా వ్యక్తం చేశారు. ఇలాంటి గొప్ప నిర్ణయాలు అమలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో పనిచేయడం నిజంగా తమకు గర్వకారణంగా ఉందన్నారు. చదవండి: చంద్రబాబుకు సవాల్ విసిరిన కొడాలి నాని రాజధానులు ఎంతెంత దూరం శాసనాలు చేసే రాజధానిగా అమరావతి రాజధాని రైతులకు వరాలు 72 ఏళ్లు గడిచినా రాజధాని కూడా లేదు... స్పీకర్ వినతి.. కచ్చితంగా విచారణ జరిపిస్తాం: సీఎం -
మూడు రాజధానులపై టీడీపీ కార్యకర్తల అత్యుత్సాహం
సాక్షి, అనంతపురం: టీడీపీ నేతలు, కార్యకర్తలు మరోసారి అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తూ విద్యార్థి, యువజన సంఘాలు సోమవారం సంబరాలు చేసుకున్నాయి. అదేవిధంగా విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ.. జై జగన్ అంటూ.. భారీ ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఓర్వలేని టీడీపీ నేతలు, కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించి సీఎం జగన్‌కు మద్దతుగా జరిగే కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. దౌర్జన్యానికి పాల్పడిన టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. టీడీపీ నేతల తీరును తప్పుపట్టిన విద్యార్థి సంఘాలు.. ఏపీలోని 13 జిల్లాల అభివృద్ధికి టీడీపీ అడుగడుగునా అడ్డుపడుతోందని మండిపడ్డాయి. చంద్రబాబు స్వార్థ రాజకీయాలు మానుకోవాలని విద్యార్థి నాయుకులు డిమాండ్ చేశారు. చదవండి: చంద్రబాబు సంఘవిద్రోహ శక్తా? -
చంద్రబాబుకు సవాల్ విసిరిన కొడాలి నాని
సాక్షి, అమరావతి : స్వార్థ ప్రయోజనాల కోసం అమరాతిపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా సామాజిక అంశాన్ని లేవనెత్తిన బాబు.. రాజధాని తరలిపోతే కమ్మ కులస్తులకు అన్యాయం జరుగుతుందని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మూడు రాజధానుల బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. కేవలం కమ్మవారి కోసమే ఇక్కడ రాజధాని పెట్టారా..? అని మంత్రి ప్రశ్నించారు. కులంపై ద్వేషంతో రాజధాని తరలించడం లేదని కొడాలి నాని స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. (చదవండి : చంద్రబాబు సంఘవిద్రోహ శక్తా?) ‘ఉత్తరాంధ్ర ప్రజలు మంచివారు. పురందేశ్వరి కమ్మ కాదా. కంభంపాటి హరిబాబు కమ్మ కాదా. వైజాగ్‌లో ఉన్న నేతలు ఏ సామాజికవర్గానికి చెందినవారు. లోకేశ్ తోడల్లుడికి చెందిన గీతం వర్సిటీ విశాఖలో ఉంది. 50 నుంచి 80 శాతం వ్యాపారాలు కమ్మవారివే. కమ్మవారిపై కోపం ఉంటే కర్నూలు, కడప రాజధానిగా పెట్టేవారు కదా. ఇప్పుడు కమ్మవారికి రెండు రాజధానులు వచ్చాయి. బెదిరింపులకు సీఎం జగన్ భయపడరు. జోలె పట్టుకుని అడుక్కుంటే ఎవరూ జాలి చూపించరు. కృష్ణా, గుంటూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి. వాటిని అభివృద్ధి చేయాలి. అప్పటి పీసీసీ ప్రెసిడెంట్ తెలంగాణ వాదం లేదంటే.. కేసీఆర్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలిచారు. గతంలో వైఎస్ జగన్ కూడా ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి గెలిచారు’అని మంత్రి తెలిపారు. (చదవండి : ‘ఢిల్లీ ఏమైనా మధ్యలో ఉందా’) సవాల్ స్వీకరించాలి.. ‘అమరావతినే ప్రజలు రాజధానిగా కోరుకుంటున్నారనే నమ్మకం మీకుంటే.. టీడీపీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి. మీపై మీకు నమ్మకం ఉంటే రాజీనామా చేసి గెలవాలి. దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉన్నారు. నాకు వైఎస్సార్ లాంటి మరణాన్ని ఇవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా. వైఎస్సార్ మరణానంతరం ఆయన పేరుపై పార్టీ పెట్టి 5 లక్షల మెజారిటీతో వైఎస్ జగన్ ఎంపీగా గెలిచారు. చంద్రబాబు ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కున్నారు. కొడుకును కూడా బాబు గెలిపించుకోలేకపోయారు’అని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. (చదవండి : రాజధానులు ఎంతెంత దూరం) -
‘షో బ్యాగ్.. సీ బ్యాగ్’ చంద్రబాబు పాలసీ
సాక్షి, అమరావతి : చంద్రబాబు నాయుడుకు సుదీర్ఘ అనుభవం ఉందని గతంలో అధికారం కట్టబెడితే.. ఎన్ని విధాలుగా అవినీతికి పాల్పడవచ్చో, ఎన్నిరకాలుగా స్కామ్‌లు చేయవచ్చో చేసి చూపించారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్మే కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. రాజధాని ఎక్కడ వస్తుందో తన అనుచరులకు ముందుగానే లీకులు ఇచ్చి పేద రైతుల భూములను కొట్టేశారని ఆరోపించారు. సోమవారం శాసన సభలో వికేంద్రీకరణ బిల్లుపై ఎమ్మెల్యే కాకాణి మాట్లాడుతూ.. అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో చంద్రబాబుకు చెందిన వ్యక్తులు తక్కువ ధరకే వేల ఎకరాల భూములను కొన్నారని ఆరోపించారు. చంద్రబాబు రాజధాని నిర్మాణాన్ని బాధ్యతగా తీసుకోకుండా తనకు అనుకూలంగా మార్చుకొని పేద రైతులను మోసం చేశారని మండిపడ్డారు. వికేంద్రీకరణకు అందరూ మద్దతు ఇస్తుంటే.. తన అక్రమ ఆస్తులు తరలిపోతాయనే చంద్రబాబు ఆందోళన చేయిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు శ్రీబాగ్ ఒడంబిక గురించి తెలియదు కానీ ‘క్యాష్ బ్యాగ్’ గురించి బాగా తెలుసని ఎద్దేవా చేశారు. ‘షో బ్యాగ్.. సీ బ్యాగ్’ అనేదే చంద్రబాబు పాలసీ అని విమర్శించారు. చంద్రబాబుకు సొంత అభివృద్ధి, సొంత ప్రయోజనాలే ముఖ్యమన్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా చంద్రబాబు లబ్ది పొందారని ఆరోపించారు. రాజధాని ప్రకటనకు ముందే టీడీపీ నేతలు భూములు కొనలేదా అని నిలదీశారు. నారాయణ దగ్గర పనిచేసే అటెండర్లు, క్లర్క్‌ల పేరుతో 55 ఎకరాలు కొన్నారన్నారు. చంద్రబాబు రెండు ఎకరాల నుంచి రూ.2లక్షల కోట్లకు ఎలా ఎదిగారో చెప్పాలని డిమాండ్ చేశారు. 800 మంది తెల్లరేషన్ కార్డు దారులు కూడా రాజధానిలో భూములు కొన్నట్లు చూపిస్తున్నారని.. వారంతా చంద్రబాబు బినామీదారులే అని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం హయంలో దళితులు, నిరుపేదలు దారుణంగా మోస పోయారన్నారు. అధికారం ముసుగులో టీడీపీ నేతలు చేసిన దోపిడీని మొత్తాన్ని త్వరలోనే బయటకు తీస్తామన్నారు. రాజధాని విషయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కాకాణి పేర్కొన్నారు. -
చంద్రబాబు సంఘ విద్రోహ శక్తా?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఒక కీలక ఘట్టాన్ని ఆవిష్కరించబోతున్నాయని, ప్రపంచంలోని తెలుగువారంతా ఈ ప్రత్యేక సమావేశాలను ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో పరిపాలన వికేంద్రీకరణ బిల్లుపై అంబటి మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, మూడు ప్రాంతాల అభివృద్ధిని కాంక్షిస్తూ చరిత్రాత్మక సమావేశాల్లో పరిపాలన వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టారని, ఈ బిల్లును రాష్ట్ర ప్రజలందరూ హర్షించాలని కోరారు. ‘ఐదేళ్ల క్రితం 13 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైంది. అంతకుమునుపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముందు కర్నూలు రాజధానిగా కొంతకాలం ఆంధ్ర రాష్ట్రం పరిపాలన కొనసాగింది. తెలుగువారంతా ఒకేప్రాంతంగా ఉండాలన్న భాషాప్రయోక్త రాష్ట్రాల భావనతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను హైదరాబాద్ రాజధానిగా ఏర్పాటు చేశారు. తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర నాలుగు ప్రాంతాలను కలిపి ఉమ్మడి రాష్ట్రం కొనసాగింది. మన భాష ఒక్కటే.. యాసలు వేరు. సమైక్య ఉద్యమం జరిగినప్పుడు నందమూరి తారకరామారావు ‘తెలుగుజాతి మనది నిండుగ వెలుగుజాతి మనది’ అన్న పాటతో చైతన్యం కల్పించారు. తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ ఒక్కటే అని ఆనాడు నందమూరి చాటిచెప్పారు. కానీ ఆయన వారసులుగా చెప్పుకునేవారు, టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు తుళ్లూరు నాది, మందడం నాది, ఉద్దండరాయపురం నాది.. అన్ని కలిసిన అమరావతి నాదే నాదే అంటున్నారు. విశాఖపట్నం నాది కాదు, కర్నూలు నాది కాదు, అమరావతి మాత్రమే నాది అనే సంకుచిత స్థాయికి చంద్రబాబు ఎందుకు దిగజారిపోయారు’ అని అంబటి మండిపడ్డారు. గతంలో తాను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు హైదరాబాద్ నాది.. హైదరాబాద్‌లోని ప్రతి అంగుళం నాది అనే భావనతో శాసనసభకు వెళ్లేవాడినని, కానీ పరిణామక్రమంలో హైదరాబాద్ ఏమైందో అందరికీ తెలుసునని అన్నారు. దినదిన ప్రవర్థమానంగా ఎదుగుతూ ఏకైక మహానగరంగా హైదరాబాద్ ఎదిగిందని, మన హైదరాబాద్ బ్రహ్మాండంగా ఎదిగిందని మనమంతా గర్వించామని, కానీ, తెలంగాణ ఉద్యమం, సమైక్య ఉద్యమాలు జరిగి.. చివరకు హైదరాబాద్ నుంచి మెడ పట్టుకొని మనల్ని బయటకు గెంటారా? లేదా? అని ప్రశ్నించారు. ఈ మహానగరం మాదేనని తెలంగాణవారు తిరుగుబాటు చేశారని, రాజధాని ఏర్పాటు సంబంధించి ఇప్పటికైనా గుణపాఠాలు నేర్చుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, రాజధాని ఏర్పాటు చేయాల్సిన బాధ్యతను ప్రజలు ఆయనపై పెడితే.. ఆయన మాత్రం అసలైన అమరావతిని విస్మరించి.. అమరావతి పేరిట కృష్ణా జిల్లా వైపును ఎన్నుకున్నారని మండిపడ్డారు. గుంటూరు జిల్లాలో ఉన్న అసలైన అమరావతిని నిర్లక్ష్యం చేసి.. ఆ పేరును వాడుకొని అటువైపు.. అమరావతిలో ల్యాండ్‌పూలింగ్ పేరిట చంద్రబాబు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని మండిపడ్డారు. అమరావతి పేరిట చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయలేదా? అని ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారిగా అమరావతిలో పెద్ద కుంభకోణానికి చంద్రబాబు పాల్పడ్డారని, రాజధాని విషయంలో ఆయన బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఈ ఐదేళ్లలో అమరావతిలో ఒక్క శాశ్వత నిర్మాణం కూడా చేయలేదని, అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు.. ఇలా అన్ని తాత్కాలిక నిర్మాణాలు మాత్రమే చేపట్టారని గుర్తు చేశారు. బలహీనవర్గాలను దెబ్బతీసేందుకు రాజధాని విషయంలో చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరించారని, ఆయన, టీడీపీ నేతలు బినామీ పేర్లతో అమరావతిలో పెద్ద ఎత్తున భూములు కొన్నారని ఆరోపించారు. పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌లో ఉండే సౌకర్యాన్ని వదిలిపెట్టి.. అర్ధంతరంగా చంద్రబాబు ఎందుకు పారిపోయి వచ్చారని ప్రశ్నించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, చంద్రబాబు కలిసి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను రెచ్చగొట్టి దౌర్జన్యం చేయాలని చంద్రబాబు కుట్ర పన్నారని ఆరోపించారు. చంద్రబాబు ప్రతిపక్ష నేతా? లేక సంఘవిద్రోహ శక్తా? అని ధ్వజమెత్తారు. రాజధాని కోసం చంద్రబాబు పోరాటం చేయడం లేదని, కేవలం తన బినామీల కోసమే ఆయన పోరాటం చేస్తున్నారని అంబటి స్పష్టం చేశారు. అందరూ బాగుండాలనేవిధంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన చేస్తున్నారని, అన్ని ప్రాంతాల ప్రజలు బాగుండాలనే ముఖ్యమంత్రి లక్ష్యమని పేర్కొన్నారు. అధికార వికేంద్రీకరణ వల్ల చంద్రబాబుకు వచ్చే నష్టమేంటని అంబటి సూటిగా ప్రశ్నించారు. ఇలా అధికారాన్ని వికేంద్రీకరించడం వల్ల మళ్లీ ఎలాంటి ఉద్యమాలు రావు అని అన్నారు. నిజమైన రైతులకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అన్యాయం చేయబోదని పేర్కొన్నారు. ఇప్పుడున్నవారంతా నిజమైన రైతులు కారని పేర్కొన్నారు. అమరావతి విషయంలో సుజనా చౌదరి, కన్నా లక్ష్మీనారాయణ ఒకే వాదన వినిపిస్తున్నారని, కానీ, రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో పేర్కొన్న విషయాన్ని గుర్తించాలన్నారు. కమలంలో పచ్చపుష్పాలు ఎక్కువయ్యాయని అంబటి ఎద్దేవా చేశారు. అమరావతి నిర్మాణమంతా రియల్ ఎస్టేట్ వ్యాపారంలా మారిందని బీజేపీ తన మేనిఫెస్టోలో పేర్కొందని తెలిపారు. చంద్రబాబునాయుడు మొదట ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియాన్ని వ్యతిరేకించారని, తర్వాత సమర్థించారని తెలిపారు. ఇప్పుడు విశాఖను వ్యతిరేకించిన వారు, తర్వాత సమర్థిస్తారని పేర్కొన్నారు. చంద్రబాబుకు, టీడీపీ నేతలకు అమరావతిపై ప్రేమ లేదని, కేవలం వారు కొనుక్కున్న భూములపైనే ప్రేమ ఉందని విమర్శించారు. అమరావతి రైతులకు ఎలాంటి సమస్యలున్నా చర్చకు సిద్ధమని పేర్కొన్నారు. అమరావతి విషయంలో చంద్రబాబు మాటలు విని ఎవరూ మోసపోవద్దని కోరారు. -
ఎగ్జిక్యూటివ్ రాజధానిపై ఉద్యోగ సంఘాల హర్షం
సాక్షి, విశాఖపట్నం: అసెంబ్లీలో సోమవారం విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ కాపిటల్‌గా ప్రకటించడంపై పలు ఉద్యోగసంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఉద్యోగసంఘాల నేతలు స్వీట్లు పంచుకొని బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షులు ఈశ్వరరావు, జీవీఎంసీ సంఘం నేత ఆనందరావు, ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రవిశంకర్‌తోపాటు పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. కృష్ణా: అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లును సోమవారం ప్రవేశపెట్టడంతో మద్దతుగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు జిల్లాలోని కైకలూరు తాలూకా సెంటర్ దగ్గర బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చదవండి: రాజధాని రైతులకు వరాలు శ్రీకాకుళం: పాలన వికేంద్రీకరణ బిల్లుకు మద్దతుగా జిల్లాలోని నరసన్నపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ధర్మన పద్మప్రియ ఆధ్వరంలో సోమవారం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వైఎస్సార్ అభిమానులు, కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు. తూర్పు గోదావరి: మూడు రాజధానుల బిల్లుకు సోమవారం ఆమోదముద్ర వేసిన సందర్భంగా ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా జిల్లాలోని పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట, అయినవిల్లి, మామిడికుదురులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పేరి కామేశ్వరరావు, నాగవరపు నాగరాజు, కొర్లపాటి కోటబాబు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
‘ఢిల్లీ ఏమైనా మధ్యలో ఉందా’
సాక్షి, అమరావతి : తమిళనాడులో ఉన్నప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు గుంటూరు, కృష్ణా జిల్లాలు అభివృద్ది చెందే ఉన్నాయని మంత్రి కొడాలి నాని అన్నారు. అమరావతి వల్ల ఈ రెండు జిల్లాలకు వచ్చేదేమీ లేదని పేర్కొన్నారు. మూడు రాజధానుల బిల్లుపై చర్చ సందర్భంగా కొడాలి నాని అసెంబ్లీలో మాట్లాడారు. ఈ బిల్లును ప్రవేశ పెట్టినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతఙ్ఞతలు తెలిపారు. సామాజిక అంశాన్ని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. రాజధాని తరలిపోతే కమ్మ కులస్తులకు అన్యాయం జరుగుతుందని.. రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు అసత్య ప్రచారం చేస్తున్నారని నాని మండిపడ్డారు. కేవలం కమ్మవారి కోసమే ఇక్కడ రాజధాని పెట్టారా..? అని ప్రశ్నించారు. (చదవండి : రాజధానులు ఎంతెంత దూరం) మధ్యలో ఉంటేనా అభివృద్ధి చెందుతుందా..? ‘డబ్బా మీడియా, చెత్త పేపర్లతో చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఏపీకి మధ్యలో ఉంటేనే అమరావతి అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు చెప్తున్నారు. భారత దేశానికి ఢిల్లీ మధ్యలో ఉందా..? రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు ఆలోచించడం లేదు. వ్యక్తిగత ప్రయోజనాలే కోసమే పరితపిస్తున్నారు. చంద్రబాబుకు స్పష్టత కరువైంది. ఇది అసలు అమరావతి కాదు. ఇది చంద్రబాబు అమరావతి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ భూములను తీసుకోవాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టంగానే చెప్పారు’ అని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. (చదవండి : 72 ఏళ్లు గడిచినా రాజధాని కూడా లేదు...) -
మూడు రాజధానులకు పూర్తి మద్దతు : రాపాక
సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని ఒకేచోట కేంద్రీకృతమైతే.. ఆ ప్రాంత ప్రజలు మాత్రమే అభివృద్ధి చెందుతారని, ఈ నేపథ్యంలో 13 జిల్లాలూ.. అన్ని ప్రాంతాల అభివృద్ధి దృష్టి పెట్టాలని, అన్ని ప్రాంతాల అభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో పరిపాలన వికేంద్రీకరణ బిల్లుపై రాపాక మాట్లాడారు. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్‌ను మాత్రమే అభివృద్ధి చేశారని, మన ఆదాయాన్ని సైతం హైదరాబాద్ అభివృద్ధికి వెచ్చించారని, కనీసం అప్పుడు వెనుకబడిన జిల్లాలను పట్టించుకోలేదని రాపాక పేర్కొన్నారు. దీంతో రాష్ట్ర విభజన తర్వాత మనం తిరిగొచ్చాక ఉండటానికి ఇల్లు కూడా లేని పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటికీ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ప్రజల వలస వెళ్తూ రాష్ట్రమంతా పనిచేస్తున్నారని, తినడానికి సరైన తిండి కూడా లేని దుర్భర పరిస్థితుల్లో కడుపునిండా తిండి కోసం వాళ్లు ఎంతో కష్టపడుతున్నారని తెలిపారు. వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయితే.. అక్కడి వలసలు ఆగుతాయని, అదేవిధంగా కర్నూలులో జ్యుడీషియల్ రాజధాని ద్వారా అనంతపురం ప్రజలు బెంగళూరు వలస వెళ్లడం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి గురించి ప్రతిపక్షం కూడా ఆలోచించాలని కోరారు. అమరావతిలో జరిగిన అవినీతి గురించి బుగ్గన వివరంగా చెప్పారని, దీంతో అసెంబ్లీ సాక్షిగా అక్కడ ఎంత మోసం జరుగుతుందో ప్రజలకు కూడా తెలిసిందన్నారు. తనకు రాష్ట్రాభివృద్ధే ముఖ్యమని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పడాన్ని స్వాగతించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయిననాటి నుంచి వరుసగా పథకాలు అమలుచేస్తున్నారని, అమ్మ ఒడిలాంటి ప్రతిష్టాత్మక పథకాల ద్వారా ఇచ్చిన ప్రతి హామీని సమర్థవంతంగా అమలు చేస్తున్నారని కొనియాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు 4.50 లక్షల ఉద్యోగాలు సృష్టించి ఇవ్వడం ఒక చరిత్ర అని ప్రశంసించారు. ప్రజలకు మంచి చేయాలన్న దృక్పథం, నిరంతరం ప్రజల కోసం ఆలోచన ఉన్న వ్యక్తి వైఎస్ జగన్ అని అన్నారు. అధికారంలోకి వచ్చిననాటి నుంచి ప్రజల జీవితాల్లో వెలుగునింపడం కోసం ఆయన పనిచేస్తున్నారని అన్నారు. మూడు రాజధానులకు రాష్ట్రంలోని ప్రతిచోటా మద్దతు లభిస్తోందని, ప్రజాభిప్రాయం మూడు రాజధానులకు అనుకూలంగా ఉందని పేర్కొన్నారు. మూడు రాజధానుల బిల్లుకు తన తరఫున, జనసేన తరఫున రాపాక పూర్తి మద్దతు తెలియజేశారు. చదవండి: రాజధానులు ఎంతెంత దూరం శాసనాలు చేసే రాజధానిగా అమరావతి రాజధాని రైతులకు వరాలు 72 ఏళ్లు గడిచినా రాజధాని కూడా లేదు... స్పీకర్ వినతి.. కచ్చితంగా విచారణ జరిపిస్తాం: సీఎం ఎందుకు భయం.. విశాఖ ఏమైనా అరణ్యమా? భూముల బండారం బట్టబయలు చేసిన బుగ్గన అప్పుల్లో.. అమరావతి నిర్మించగలమా? -
రాజధానులు ఎంతెంత దూరం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రతిపాదించిన వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న అంశంపై శాసనసభ ప్రత్యేక సమావేశాలు వాడివేడిగా ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం వికేంద్రీకరణ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసిన అనంతరం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. (చదవండి : రాజధాని రైతులకు వరాలు) సమావేశాలు ప్రారంభం కాగానే రాష్ట్ర సమతుల అభివృద్ధికి అధికార వికేంద్రీకరణ బిల్లును ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధరెడ్డి , రాజధాని ప్రాంతీయ అభివృద్ధి మండలి (సీఆర్డీఏ) ను రద్దు చేస్తూ మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ గత తెలుగుదేశం పార్టీ వైఫల్యాలను ఎండగట్టారు. అలాగే రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తారని ముందస్తు సమాచారంతో ఆ పరిసర ప్రాంతాల్లో వేలాది ఎకరాలను టీడీపీ నాయకులు ముందుగానే కొనుగోలు చేసుకుని ఇన్సైడర్ ట్రేడింగ్‌కు ఎలా పాల్పడినారో సమగ్రంగా వివరించారు. భూములు కొనుగోలు చేసిన టీడీపీ నేతల పేర్లు, వారి బినామీ పేర్ల జాబితాను బయటపెట్టారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి వికేంద్రీకరణ ఎందుకు అవసరం? గతంలో చేసిన తప్పిదాలు, వాటివల్ల జరిగిన నష్టాలను వివరించారు. చరిత్రలో రాజధానులు ఏర్పాటుకు దోహదం చేసిన అంశాలు, రాజధాని ఎంపిక, నిర్మాణాల విషయంలో శ్రీకృష్ణ కమిటీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు (బీసీజీ), హైపవర్ కమిటీల నివేదికలు ఏం చెప్పాయన్న వివరాలను సభలో వివరించారు. (చదవండి : ఎందుకు భయం.. విశాఖ ఏమైనా అరణ్యమా?) రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ప్రస్తుతం చెల్లిస్తున్న పరిహారాన్ని మరింత పెంచుతున్నట్టు మంత్రి బొత్స సభలో వెల్లడించారు. ఆయా గ్రామీల సమగ్రాభివృద్ధికి మరిన్ని చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంశంపై సుదీర్ఘంగా సాగిన చర్చలో వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు పాల్గొని చంద్రబాబు వైఫల్యాలను ఎండగట్టారు. ఆయా రాష్ట్రాల భౌగోళిక పరిస్థితులు వాటి రాజధానులు ఎలా ఉన్నాయో ఉదహరించారు. చర్చలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, రాజకీయాలకన్నా తాను రాష్ట్ర అభివృద్ధినే కాంక్షిస్తానని స్పష్టం చేశారు. వికేంద్రీకరణలో భాగంగా పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం చేస్తే అది మిగతా ప్రాంతాలకు దూరమవుతుందన్న ప్రతిపక్ష వాదనను అధికారపక్ష సభ్యులు తీవ్రంగా ఖండించారు. అభివృద్ధికి ప్రాతిపదికలను ఉదాహరణలతో వివరించారు. ఆయా రాష్ట్రాల రాజధానులు ఎంతెంత దూరంలో వెలిశాయన్న వివరాలను వెల్లడించారు. దేశ రాజధాని ఢిల్లీ అనేక రాష్ట్రాలకు దూరంగా ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. రాజధానులు వాటి మధ్య దూరాలపై కొన్ని ఉదాహరణలు : -
శాసనాలు చేసే రాజధానిగా అమరావతి
సాక్షి, అమరావతి: అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును సమర్థిస్తున్నట్టు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తెలిపారు. శాసనసభలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. రాజధాని విషయంలో గత ప్రభుత్వం వాస్తవాలను ప్రజల ముందుకు రాకుండా చేసిందని ఆరోపించారు. అమరావతి రాజధాని అనగానే మొదటగా సంతోషపడిన వాళ్లలో తానూ ఒకడినని, కానీ తర్వాత మోసపోయామని తెలుసుకున్నానని చెప్పారు. అమరావతిలో రాజధాని నిర్మాణం అనుకూలం కాదని పర్యావరణవేత్తలు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. కౌలు రైతు వ్యవస్థను చంద్రబాబు ధ్వంసం చేశారని దుయ్యబట్టారు. రాజధానిని కొంతమందికే పరిమితం చేసేలా చంద్రబాబు వ్యవహరించారని, దళిత సోదరులు అనుమతి తీసుకోకుండా భూములు లాక్కున్నారని ఆరోపించారు. భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా రైతుల నుంచి భూములు గుంజుకున్నారని తెలిపారు. కానీ సీఎం జగన్ ఇలా వ్యవహరించలేదని.. కమిటీ నివేదికలు, ప్రజల అభీష్టం మేరకే ముందుకు వెళ్తుతున్నారని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో పదేళ్లు ఉండేందుకు అవకాశం ఉన్నా ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయిన చంద్రబాబు అనాలోచిత నిర్ణయం వల్లే ఈ దౌర్భగ్య పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రికి రాత్రే హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారని గుర్తు చేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్ బయటపడుతుందనే భయంతో చంద్రబాబు రైతులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. టీడీపీ బినామిలతో ఉద్యమాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. అమరావతిలోనే శాసనసభ శాసనాలు చేసే రాజధానిగా అమరావతి మారినందుకు సంతోషంగా ఉందని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. రాజధాని తరలింపుపై అనుమానాలు పటాపంచలయ్యాయని తెలిపారు. శాసనసభ ఇక్కడే ఉంటుందని, కింగ్ మేకర్లను తామేనని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయ భవిష్యత్తు ముఖ్యం కాదని, రాష్ట్ర భవిష్యత్తు ప్రధానమని స్పష్టం చేశారు. అమరావతిని అగ్రికల్చరర్ జోన్‌గా ప్రకటించాలని కోరారు. శాసనసభ, సచివాలయంతో సామాన్యులకు పనేం ఉండదన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా పాలనను ప్రజల ముందుకు తెచ్చామన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోరుకుంటున్నారని తెలిపారు. చంద్రబాబు బలవంతంగా ప్రయోగించిన భూసేకరణ చట్టాన్ని రద్దు చేయాలని కోరారు. రాజకీయాల్లో ఉన్నంతవరకు వైఎస్ జగన్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు. చదవండి: రాజధాని రైతులకు వరాలు 72 ఏళ్లు గడిచినా రాజధాని కూడా లేదు... స్పీకర్ వినతి.. కచ్చితంగా విచారణ జరిపిస్తాం: సీఎం ఎందుకు భయం.. విశాఖ ఏమైనా అరణ్యమా? భూముల బండారం బట్టబయలు చేసిన బుగ్గన అప్పుల్లో.. అమరావతి నిర్మించగలమా? -
రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చింది చంద్రబాబు కాదా..?
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చింది చంద్రబాబు కాదా.. అని మంత్రి బొత్స సత్యనారాయణ సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత అన్ని ప్రాంతాల అభివృద్ధిని గత టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ధ్వజమెత్తారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పట్టించుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. సోమవారం ఆయన శాసనసభ సమావేశంలో మాట్లాడుతూ.. ప్రాంతీయ అసమానతలు, అవసరాల వల్లే రాష్ట్ర విభజన జరిగిందని.. గత పాలకుల నిర్ణయాల వల్ల ప్రాంతీయ అసమానతలు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అభివృద్ధి అంటే 5 కోట్ల మందికి జరగాలని, ఏ ఒక్కరికో..ఏ ఒక్క ప్రాంతానికో కాదన్నారు. హై పవర్ కమిటీ ద్వారా పూర్తిస్థాయిలో సమీక్ష జరిపామని.. వికేంద్రీకరణ వల్లే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యం అని తెలిపారు. వనరులన్నీ ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కాకూడదని. అందుకే సీఆర్డీఏ రద్దు చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. ‘చంద్రబాబుకు జ్వరం వస్తే.. రాష్ట్రం మొత్తానికి జర్వం వస్తుంది. చంద్రబాబు బాగుంటే..రాష్ట్రం మొత్తం బాగున్నట్లా..’ అని ప్రశ్నించారు. టీడీపీ నేతల్లాగా దోచుకోవడం మాకు తెలియదని.. ఐదేళ్లలో చేయాల్సిన అభివృద్ధి పనులే మాకు తెలుసునని చెప్పారు. చరిత్రలో నిలిచిపోయే పనులు చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్ర విభజకు మద్దతు ఇచ్చింది చంద్రబాబు కాదా.. మళ్లీ అటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నారని ప్రశ్నించారు. విశాఖలో తన కుటుంబ సభ్యులపై భూములు ఉన్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం అని బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు. (చదవండి: రాజధాని రైతులకు వరాలు) -
72 ఏళ్లు గడిచినా రాజధాని లేదు...
సాక్షి, అమరావతి : చంద్రబాబు నాయుడు అనాలోచిత రాజకీయ నిర్ణయాల కారణంగానే ఆంధ్రరాష్ట్ర ప్రజలు రాజధాని లేకుండా మిగిలిపోయారని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. దేశానికి స్వాతంత్ర్య వచ్చి 72 ఏళ్లు గడిచినా.. ఇంకా కరువు ప్రాంతంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఒక్క ప్రాంతాన్ని మాత్రమే అభివృద్ధి చేసి మిగతా ప్రాంతాలపై కుట్రపూరింతగా వివక్ష చూపడం వల్లనే వెనుకబడి పోతున్నాయని అన్నారు. కేవలం వెనుకబాటు తనం కారణంగానే తెలంగాణ ఉద్యమం వచ్చిందని, విభజన అనంతరం హైదరాబాద్ నుంచి పారిపోయి రావడానికి చంద్రబాబు నాయుడే కారణమని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర నుంచి ఇప్పటికీ ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. సోమవారం శాసన సభలో వికేంద్రీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా మంత్రి కన్నబాబు సుదీర్ఘ ప్రసంగం చేశారు. ‘ప్రాంతాలపై వివక్ష చూపడం ఏ ప్రభుత్వానికి సరైనది కాదు. 1953లో ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడిప్పుడు కర్నూలును రాజధానిగా నిర్మించాలి అనుకున్నాం. అంతలోనే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుతో తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయాం. 2014లో రాష్ట్ర విభజనతో మళ్లీ హైదరాబాద్ నుంచి సర్దుకుని రావాల్సి వచ్చింది. పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్నా.. చంద్రబాబు నాయుడు ఎందుకు పారిపోయి రావాల్సి వచ్చింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వీటన్నింటిపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చసాగుతోంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జీఎన్‌రావు, బీసీజీ, హైపవర్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలన్ని వికేంద్రీకరణ జరపాలని నిర్థారించాయి. వీటకంటే ముందే కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణ కమిటీ కూడా వికేంద్రీకరణకే ముగ్గుచూపింది. సూపర్ క్యాపిటల్‌ను నిర్మించవద్దని కూడా సూచించింది. శివరామకృష్ణ కమిటీ ప్రధానంగా మూడు సూచనలు చేసింది. గ్రీన్‌ఫీల్డ్ నగరం, ఉన్న నగరాన్ని విస్తరించడం, అభివృద్ధి వికేంద్రీకరణ. గత ప్రభుత్వం గ్రీన్ ఫీల్డ్‌సిటీ పద్దతిని ఎంచుకుని బొక్కబోర్లా పడింది. అమరావతి నిర్మాణం చేపట్టింది. కానీ ఆ ప్రయత్నం విఫలమైంది. చివరికి రైతుల నుంచి భూములు తీసుకున్నందుకు కనీసం వాళ్లకు ఫ్లాట్లు కూడా ఇవ్వలేకపోయింది. దీనికి చంద్రబాబు నాయుడు రాజకీయ నిర్ణయాలే కారణం. ఐదేళ్ల పాటు విదేశీ బృందాలు, గ్రాఫిక్స్‌లు, సినిమా డైరెక్టర్లను తెచ్చి డిజైన్లు చేశారు. రాష్ట్రాన్ని చంద్రబాబు తీవ్రంగా తప్పుదోవ పట్టించారు.’అని అన్నారు. -
రాజధాని రైతులకు ఏపీ ప్రభుత్వం వరాలు
సాక్షి, అమరావతి: రాజధాని గ్రామాల ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గత ప్రభుత్వం కంటే మిన్నగా రాజధాని గ్రామాలకు మేలు చేస్తామని పేర్కొన్నారు. ఏపీ శాసనసభ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజధాని గ్రామాల్లో భూమిలేని నిరుపేదలకు ఇస్తున్న పెన్షన్‌ను రూ.2500 నుంచి రూ.5వేలకు పెంచబోతున్నామని తెలిపారు. రాజధానికి భూములు ఇచ్చిన పట్టా రైతులతో సమానంగా అసైన్డ్ భూములు ఇచ్చిన అసైన్డ్ దారులకు రిటర్న్ ప్లాట్లు కేటాయిస్తామని చెప్పారు. భూములిచ్చిన రైతులకు గతంలో జరీబుకైతే రూ.50 వేలు, మెట్ట భూమికి అయితే రూ.30 వేలు 10 ఏళ్లకు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. అలాగే ప్రతి ఏటా జరీబు భూమికి రూ.5వేలు, మెట్టభూమికి రూ.3వేలు పెంచాలని గతంలో నిర్ణయించారని, ఈ యాన్యునిటీని 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయించామని చెప్పారు. 10 ఏళ్ల తర్వాత జరీబు భూమికి ఇచ్చే యాన్యునిటీ రూ.1 లక్ష రూపాయిలు, మెట్ట భూమికి రూ.60 వేలు అవుతుందన్నారు. ఇప్పుడు ఒప్పందం ఉన్న 10 ఏళ్ల తర్వాత వచ్చే ఐదేళ్ల పాటు కూడా ఇదే రీతిలో యాన్యునిటీని చెల్లిస్తామని స్పష్టం చేశారు. (చదవండి: భూముల బండారం బట్టబయలు చేసిన బుగ్గన) -
స్పీకర్ వినతి.. విచారణ జరిపిస్తాం: సీఎం
సాక్షి, అమరావతి: అమరావతిలో టీడీపీ నేతల భూకొనుగొళ్ల బండారం బయటపెడుతూ ఆర్థిక, శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో చేసిన ప్రకటనపై సభాపతి తమ్మినేని సీతారాం స్పందించారు. రాజధాని పేరుతో గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబునాయుడు, ఆయన బినామీలు పెద్ద ఎత్తున భూ కుంభకోణాలకు పాల్పడ్డారని వివరిస్తూ.. టీడీపీ హయాంలో ఆ పార్టీ నేతలు దోచుకున్న భూముల వివరాలను రాజేంద్రనాథ్ సభముందు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై స్పీకర్ స్పందిస్తూ.. అమరావతి భూముల వ్యవహారంపై ప్రజలకు నిజానిజాలు తెలిసేందుకు, నిజాలు నిగ్గుతేల్చేందుకు పకడ్బందీగా సమగ్ర విచారణ జరపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరారు. దీనికి సీఎం వైఎస్ జగన్ స్పందిస్తూ.. సభాపతి నుంచి వచ్చిన ఆదేశాలను కచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు. శాసనసభకు ప్రత్యేక ఐడెంటిటీ ఉంటుందని, సభాపతికి క్వాజీ జ్యుడీషియల్ అధికారాలు ఉంటాయని, స్పీకర్ జడ్జితో సమానమని పేర్కొన్నారు. ఏదైన అంశంపై విచారణ చేపట్టాలని అడిగే అధికారం స్పీకర్‌కు ఉంటుందని స్పష్టం చేశారు. మీకు అంత ఉలుకెందుకు? అమరావతి భూకుంభకోణాలపై విచారణ జరపాలని స్పీకర్ కోరడంతో టీడీపీ సభ్యులు సభలో గగ్గోలు చేశారు. అచ్చెన్నాయుడు తదితర టీడీపీ సభ్యులు రాద్ధాంతం సృష్టించే ప్రయత్నం చేశారు. దీంతో స్పీకర్ వారిమీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సభాపతిగా విచారణ కోరే అధికారం తనకుందని, హద్దుమీరి టీడీపీ సభ్యులు మాట్లాడరాదని, హద్దుల్లో ఉండాలని మందలించారు. విచారణ జరిపించాలని కోరితే మీకెందుకు అంత ఉలుకు? అని టీడీపీ నేతలను సూటిగా ప్రశ్నించారు. ఈ అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ విచారణ కోరే అధికారం స్పీకర్‌కు ఉంటుందని, స్పీకర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చెప్పినవారు క్షమాపణ చెప్పాలని కోరారు. ఇలాంటి ప్రతిపక్ష నేత ఉండటం తమ ఖర్మ అని పేర్కొన్నారు. -
ఎందుకు భయం.. విశాఖ ఏమైనా అరణ్యమా?
సాక్షి, అమరావతి: ‘విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ రాజధాని పెడతామంటే.. ప్రతిపక్ష టీడీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారు.. విశాఖపట్నం ఏమైనా అరణ్యమా?’ అని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సూటిగా ప్రశ్నించారు. సోమవారం శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో పరిపాలన వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ తీరుపై, ఎల్లో మీడియా ప్రచారంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో మావోయిస్టులు ఉన్నారని ఎల్లో మీడియాతో టీడీపీ నేతలు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ నుంచి గత ప్రభుత్వం అమరావతికి ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. అమరావతిలో జరిగింది రాజధాని నిర్మాణామా? లేక రియల్ ఎస్టేట్ వ్యాపారమా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం 1600 ఎకరాల భూములను 125 ఆర్గనైజేషన్లకు కేటాయించిందని, 1300 ఎకరాలను ప్రైవేటు సంస్థలకు ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రభుత్వ సంస్థలకు ఒకవిధంగా, ప్రైవేటు సంస్థలకు మరోవిధంగా భూకేటాయింపులు జరిపి.. అనేక అవకతవకలకు పాల్పడిందని విమర్శించారు. అమరావతిలోని భూములను టీడీపీ స్వాహా చేసిందని, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి.. అన్ని ప్రాంతాల మీద భారాన్ని మోపి.. అమరావతిలో తాను, తనకు చెందిన 20, 30 మంది మాత్రమే అభివృద్ధి చెందాలని చంద్రబాబు చూస్తున్నారని, అందుకే అమరావతిలోని భూములన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో దుర్భరమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయని,అనంతపురం జిల్లాలో అత్యల్ప వర్షపాతం నమోదవుతుందని, వానల కోసం అక్కడి ప్రజలు కప్పలకు పెళ్లిళ్లు చేస్తుంటారని తెలిపారు. అనంతపురంలోని దుర్భర కరువు పరిస్థితులను చూసి అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కంటతడి పెట్టారని, ఇక్కడి ప్రజలకు కనీసం గంజి కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదుకోవాలని సూచించారని గుర్తు చేశారు. ఇక, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి ఎక్కువగా వలసలు చోటుచేసుకుంటున్నాయని, అక్కడ బతుకుదెరువు లేక, చేసుకోవడానికి పనిలేక అక్కడి ప్రజలు వలస వెళుతున్నారని, శ్రీకాకుళం మత్య్సకారులు పాకిస్థాన్‌లో పట్టుబడితే.. సీఎం జగన్ కల్పించుకొని వారిని విడిపించి.. ఇక్కడికి తీసుకొచ్చారని, వారికి ఐదు లక్షల చొప్పున సీఎం ఆర్థికసాయం అందించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో తమ ప్రభుత్వం రాజధాని పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయబోదని బుగ్గన స్పష్టం చేశారు. వందేళ్ల తప్పులను సరిదిద్దాలనుకుంటున్నామని, ఐదేళ్లది కాదని తెలిపారు. ప్రజానామస్మరణ చేసుకుంటూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుకెళుతున్నారని చెప్పారు. -
భూముల బండారం బయటపెట్టిన బుగ్గన
సాక్షి, అమరావతి : రాజధాని పేరుతో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు, ఆయన బినామీలు పెద్ద ఎత్తున భూ కుంభకోణాలకు పాల్పడ్డారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేతలు దోచుకున్న భూముల వివరాలను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాక్షిగా ఆయన బట్టబయలు చేశారు. రాజధాని ప్రకటన ముందు చంద్రబాబు నాయుడు అక్రమంగా భూములు కొనుగోలు చేసేందుకు తొలుత గుంటూరు, ఆ తరువాత నూజివీడును రాజధానిగా ప్రచారం చేశారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. (మూడు రాజధానులు.. రెండు ఆప్షన్లు!) ఈ క్రమంలోనే టీడీపీ నేతలు 4070 ఎకరాల భూములను అక్రమంగా కొనుగోలు చేసినట్లు మంత్రి సభలో వివరించారు. ఇన్సైడర్ ట్రేడింగ్‌తో పాటు రాజ్యాంగ్నాన్నీ ఉల్లంఘించారని విమర్శించారు. వికేంద్రీకరణ బిల్లుపై చర్చలో భాగంగా.. అమరావతి ప్రాంతంలో టీడీపీ నేతలు అక్రమంగా కొనుగోలు చేసిన భూముల వివరాలను మంత్రి బుగ్గన సభలో చదవి వినిపించారు. (అప్పుల్లో.. అమరావతి నిర్మించగలమా?) ‘కంతేరులో హెరిటేజ్ పేరుతో 15 ఎకరాలను అక్రమంగా కొనుగోలు చేశారు. తుళ్లురులో టీడీపీకి చెందిన ముఖ్యనేత దినకర్ భూములను కొన్నారు. వేమురి రవికుమార్ కుటుంబ సభ్యులుపై కూడా అమరావతి ప్రాంతంలో భూమలు ఉన్నాయి. జీవీఎస్ ఆంజనేయులు 40 ఎకరాల భూములు కొనుగోలు చేశారు. పయ్యవుల కేశవ్, ధుళీపాళ్ల నరేంద్ర, కంభంపాటి రామ్మోహన్‌రావులకూ భూములున్నాయి. యనమల రామకృష్ణుడు వియ్యంకుడికి తాడికొండలో భూములు ఉన్నాయి. టీడీపీ నేతలకు చెందిన బినామీలు కూడా పెద్ద ఎత్తున భూములు కొనుగోలుకు పాల్పడ్డారు. నారా లోకేష్‌కు చెందిన బినామీలు వందల ఎకరాల్లో భూములు దోచుకున్నారు. బుచ్చయ్య చౌదరి, మురళీమోహన్ బినామీల పేర్లతో భూములు కొనుగోలు చేశారు. లంక భూములు, పోరంబోకు, అసైన్డ్ భూముల్లో ప్లాట్లు తీసుకున్నారు. సుజనా చౌదరి, దమ్మలపాటి శ్రీధర్‌లు కూడా అక్రమంగా ప్రభుత్వ భూములను కొన్నారు. ఇంత వీరిలో పాటు అనేకమంది టీడీపీ నేతలు 40 వేల కోట్ల కుంభకోణం చేశారు. (సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టిన బొత్స) అమరావతి ప్రాంతంలో 1600 ఎకరాల భూములను 125 ఆర్గనైజేషన్లకు కేటాయించారు. 1300 ఎకరాలను ప్రైవేటు సంస్థలకు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఎకరాకు రూ.4 కోట్ల చొప్పున అప్పగించారు. ప్రైవేటు సంస్థలకు మాత్రం ఎకరాకు రూ.50 లక్షల చొప్పున కట్టబెట్టారు. రాజధాని పేరు చెప్పి అన్ని భూములను టీడీపీ నేతలు స్వాహా చేశారు. ఇంత స్కామ్‌లో అమరావతిని రాజధానిగా కట్టాలంటారా?. వ్యాపార ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు అమరావతిని చేపట్టారు. అమాయకులను బెదిరించి భూములు లాక్కున్నారు. అమరావతిలో జరిగింది రాజధాని నిర్మాణామా? లేక రియల్ ఎస్టేట్ వ్యాపారమా?. ’ అని అన్నారు. చదవండి: రాజధానిలో అక్రమాలకు ఆధారాలివిగో.. -
అప్పుల్లో.. అమరావతి నిర్మించగలమా?
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో శివరామకృష్ణ కమిటీ పర్యటనలో ఉండగానే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నారాయణ కమిటీని వేసిందని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణ కమిటీ నివేదికను గత ప్రభుత్వం కనీసం అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిపై అన్ని కమిటీల నివేదికలను పరిశీలించిన తరువాతనే అభివృద్ధి వికేంద్రీకరణ జరపాలని నిర్ణయించామని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా పట్టాణాభివృద్ధిలో పీహెచ్‌డీలు చేసిన వారిని కమిటీలో సభ్యులుగా నియమించామని సభలో తెలిపారు. సోమవారం శాసన సభలో వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రసంగించారు. (అసెంబ్లీ ముందుకు వికేంద్రీకరణ బిల్లు) ‘విభజన అనంతరం ఏపీ ఆదాయం తక్కువగా ఉందని, అప్పులు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. వరద వస్తే 70 శాతం అమరావతి మునిగిపోయే అవకాశం ఉందని, దూర ప్రాంతాల నుంచి ప్రజలు అమరావతికి రాకుండా అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తున్నాం. ఏపీలో వెనుకబడిన జిల్లాలు ఉన్నాయని మూడు కమిటీలూ తేల్చిచెప్పాయి. ఐదేళ్ల పాటు గ్రాఫిక్స్‌తో చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్యపెట్టారు. వ్యవసాయం మీద మన రాష్ట్రం ఆధారపడి ఉంది. ఐదేళ్లలో 66 వేలకోట్లు రెవిన్యూ లోటు వచ్చింది. 3 లక్షల కోట్లకు పైగా అప్పులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గొప్ప నగరాలు నిర్మించగలమా?. భావితరాలు నష్టపోయే విధంగా గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు తీసుకుంది’ అని అన్నారు. చదవండి: (ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు) సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టిన బొత్స చంద్రబాబు విజన్ 2020 గుట్టువిప్పిన రోజా.. -
సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టిన బొత్స
సాక్షి, అమరావతి : అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా సీఆర్డీఏ రద్దు బిల్లును మున్సిపల్ శాఖమంత్రి బొత్స సత్యనారాయణ సభలో ప్రవేశపెట్టారు. అలాగే అమరావతి అథారిటీ బిల్లును కూడా ఆయన సభ ముందు ఉంచారు. అంతకుముందు అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. దీనిపై మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. అమరావతి శాసన రాజధాని, విశాఖ పరిపాలనా రాజధాని, కర్నూలును న్యాయ రాజధానిగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. విశాఖలోనే రాజ్‌భవన్, సెక్రటేరియట్ ఉంటుందన్నారు. అదే విధంగా కర్నూలులో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ బోర్డును కూడా ఏర్పాటు చేయనున్నట్లు బుగ్గన ప్రకటించారు. అమరావతి మెట్రోపాలిటన్‌రీజియర్ అథారిటీ ఏర్పాటుకు సంకల్పించామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిపై అన్ని కమిటీల నివేదికలను పరిశీలించిన తరువాతనే అభివృద్ధి వికేంద్రీకరణ జరపాలని నిర్ణయించామని మంత్రి స్పష్టం చేశారు. బిల్లు ఎంతో చారిత్రాత్మకం సభలో వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సుదీర్ఘంగా ప్రసంగించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లు ఎంతో చారిత్రాత్మకం అన్నారు. ‘రాష్ట్ర అభివృద్ధి కోసమే ఈ బిల్లును రూపొందించాం. సమ్మిళిత అభివృద్ధి మన బాధ్యత. రాజ్యాంగం తమపై పెట్టిన బాధ్యతను నెరవేరుస్తున్నాం. స్థానిక జోన్లను ఏర్పాటు చేస్తాం. ప్రాంతీయ మండళ్లనూ ఏర్పాటు చేస్తాం. ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మండళ్లపై ఉంటుంది. ప్రాంతాల వారిగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రచించాం. దీనిలో భాగంగానే శాసన రాజధానిగా అమరావతి, పరిపాలన రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలులో ఏర్పాటు చేయదలచుకున్నాం. న్యాయపరమైన అంశాలన్నీ కర్నూలులోనే జరుగుతాయి. హైకోర్టు అనుమతి తరువాతనే వీటిని ఏర్పాటు చేస్తాం. శ్రీబాగ్ ఒప్పందంలోనే వికేంద్రీకరణ.. పన్ను కట్టే ప్రతివారికి న్యాయం జరిగితీరాలి. కృష్ణదేవరాయలు స్థానిక సంస్థలను ఎంతో అభివృద్ది చేశారు. సామాన్య ప్రజలెవరూ రాజభవనాలను కోరుకోరు. అభివృద్ధిలో సమన భాగస్వామ్యం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆంధ్ర అనే పదం వచ్చిన తరువాతనే తెలుగు వచ్చింది. 1937లో జరిగిన శ్రీ బాగ్ ఒడంబడికలో రాయలసీమ, ఆంధ్రా అభివృద్ధికి ఒప్పందాలు జరిగాయి. రాయలసీమ వెనుకబడి ఉందని అప్పుడే గుర్తించారు. వర్షాభావ పరిస్థితుల వల్లే రాయలసీమ ప్రాంతం చాలా వెనుకబడి ఉంది. శ్రీ బాగ్ ఒడంబడికలోనే వికేంద్రీకరణ అవసరమని చెప్పారు. దానికి అనుగుణంగానే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వ్యవసాయ భూములను రియల్ ఎస్టేట్‌గా మార్చొద్దు గత వందేళ్ల చరిత్రను చూస్తే అభివృద్ధి ముఖ్యమని కనిపిస్తోంది.1920లోనే తెలంగాణ ప్రాంతంలోని హైదరాబాద్‌లో ఆంధ్ర మహాసభను పెట్టారు. ఉప ప్రాంతాలు అభివృద్ధి జరగకపోతే ఉద్యమాలు తప్పవు. తెలంగాణ ఏర్పాటు కూడా అదే కోవకు చెందుతుంది. కోస్తాంధ్ర, రాయలసీమకు ఎక్కడా పోలిక లేదు. ఉప ప్రాంతాలకు ప్రత్యేక అవసరాలున్నాయి. ప్రాంతీయ ఉద్యమాలు రాకుండా ఉండాలంటే ఉప ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. తెలంగాణ ఏర్పాటుపై నియమించిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ అనేక అంశాలను పరిశీలించింది. ఆ కమిటీ కూడా తెలంగాణ కన్నా.. రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడి ఉందని కమిటీ రిపోర్టులో తెలిపింది. ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం రాజధానిపై నియమించిన శివరామకృష్ణ కమిటీ కూడా 13 జిల్లాలను సమానంగా అభివృద్ధి చేయాలని సూచించింది. ఒకే నగరాన్ని అభివృద్ధి చేయవద్దని కమిటీ తెలిపింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడి ఉందని తేల్చిచెప్పింది. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు వ్యవసాయానికి అత్యంత అనుకూలమని కమిటీ అభిప్రాయపడింది. వ్యవసాయ భూములను రియల్ ఎస్టేట్‌గా మార్చవద్దని కూడా సూచించింది. జియలాజికల్ సర్వే కూడా పెద్ద పెద్ద భవనాలు, కట్టడాలు నిర్శించవద్దని కమిటీ తెలిపింది. మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలని చెప్పింది’ అని అన్నారు. -
హై పవర్ కమిటీ నివేదికకు కేబినెట్ ఆమోదం
అమరావతి: హై పవర్ కమిటీ నివేదికకు ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సోమవారం ఉదయం సమావేశమైన మంత్రిమండలి భేటీ పలు కీలక అంశాలపై చర్చించింది. రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి సంబంధించి శాసనసభలో ప్రతిపాదించే బిల్లుపై చర్చించి ఆమోదముద్ర వేసింది. అలాగే రాజధాని రైతులకు చెల్లిస్తున్న పరిహారానికి సంబంధించి కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు ఇచ్చే పరిహారాన్ని పెంచుతూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. రైతులకు చెల్లిస్తున్న పరిహారం రూ. 2500 నుంచి రూ. 5000కు పెంచడాన్ని మంత్రిమండలి ఆమోదించింది. అలాగే, పరిహారం చెల్లింపు 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వరకూ ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే రాష్ట్రంలో 11 వేలకు పైగా రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక సీఆర్డీఏను అమరావతి మెట్రో పాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీగా మార్చుతూ నిర్ణయం తీసుకుంది. ఏపీ కేబినెట్ నిర్ణయాలు రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం రాజధాని రైతులకు మెరుగైన ప్యాకేజీ రూ.2500 నుంచి 5వేలకు పరిహారం పెంపు భూములు ఇచ్చిన రైతులకు కౌలు 15 ఏళ్లకు పెంపు శాసన రాజధానిగా అమరావతి పరిపాలన రాజధానిగా విశాఖపట్నం న్యాయ రాజధానిగా కర్నూలు స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం మంత్రివర్గం భేటీ అనంతరం స్పీకర్ అధ్యక్షతన జరిగిన శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి, ఇక టీడీపీ తరఫున ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు హాజరయ్యారు. మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం జరిగింది. కాగా సీఆర్డీఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. చదవండి: సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ అమరావతికి అన్నీ ప్రతికూలతలే మూడు కమిటీలూ వికేంద్రీకరణకే ఓటు అమరావతిలో అలజడికి కుట్రలు.. మూడు ప్రాంతాల సమగ్రాభివృద్ధే ధ్యేయం -
‘చంద్రబాబుకు అసెంబ్లీలో అంత సీన్ లేదు’
సాక్షి, ఏపీ అసెంబ్లీ : రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పనిచేస్తున్నారని మంత్రి కొడాలి నాని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ నిర్ణయం అన్ని ప్రాంతాలకు న్యాయం చేస్తుందన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ముష్టి ఎత్తుకుంటూ సీఎం వైఎస్ జగన్‌పై ఆరోపణలు చేస్తే ఊరుకోమని మంత్రి హెచ్చరించారు. రాష్ట్రంలో పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించి సోమవారం ఏపీ అసెంబ్లీలో చర్చ జరగనుంది. ఈ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ది కోసమే మూడు రాజధానుల ప్రతిపాదన అని తెలిపారు. అమరావతిలో శాసన రాజధాని కొనసాగుతుందన్నారు. విశాఖపట్నంలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేస్తారని చెప్పారు. గతంలో ఉన్న ఒప్పందాల మేరకు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు పిచ్చి కుక్కలా రోడ్డునపడి తిరుగుతున్నారని మండిపడ్డారు. అమరావతి రైతులను నిండా ముంచింది చంద్రబాబేనని విమర్శించారు. గత ఐదేళ్లలో అమరావతిని కట్టలేని చంద్రబాబు.. తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడమేమిటని ప్రశ్నించారు. చంద్రబాబు ఔట్ డేటేడ్ పొలిటీషియన్ అని వ్యాఖ్యానించారు. సీఎం వైఎస్ జగన్ నిర్ణయం అన్ని ప్రాంతాలకు న్యాయం చేస్తోందని మరోసారి స్పష్టం చేశారు. ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగదు.. : గడికోట ఏపీ అసెంబ్లీలో నేడు కీలకమైన అంశాలను చర్చించనున్నట్టు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ముట్టడి పేరుతో టీడీపీ యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. సీఆర్డీఏ, అభివృద్ది వికేంద్రీకరణ బిల్లులతో పాటు మరికొన్ని బిల్లులను సభలో ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలన్నదే టీడీపీ యత్నం అని మండిపడ్డారు. చంద్రబాబు ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతిలో ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగదని భరోసానిచ్చారు. తమది రైతు ప్రభుత్వమని.. రాజధాని రైతులకు న్యాయం చేస్తామని పునరుద్ఘాటించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పిన లక్ష కోట్ల రూపాయల రాజధాని ప్రస్తుత ఆర్థిక పరిస్థితిలో సాధ్యం కాదని తెలిపారు. కేంద్రం నుంచి సాయం అందడం కూడా అనుమానమేనని అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణను చంద్రబాబు అడ్డుకోవడం సరికాదని హితవుపలికారు. అన్ని ప్రాంతాలను అభివృద్ది చేయడమే సీఎం వైఎస్ జగన్ లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు. రైతులను ముంచింది చంద్రబాబే : అప్పలరాజు అమరావతి రైతులను నిండా ముంచింది చంద్రబాబేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు అన్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో టీడీపీ నేతలు భూములను కొట్టేశారని విమర్శించారు. రైతుల ముసుగులో టీడీపీ నేతలు డ్రామాలాడుతున్నాని మండిపడ్డారు. చదవండి : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం -
కొన్నవి చూపిస్తే పేదలకు పంచుతాం
♦ సాక్షిలో అవాస్తవాలు రాస్తున్నారు ♦ పత్రిక ఎండీ, ఎడిటర్, ప్రమోటర్లు, విలేకరిపై పరువు నష్టం దావా ♦ భూదురాక్రమణ కథనాలపై మంత్రులు నారాయణ, పుల్లారావు సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధానిలో తాము భూములు ఎక్కడ కొన్నామో చూపిస్తే వాటిని పేదలకు పంచుతామని మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. సాక్షి పత్రికలో తమపై కావాలని బురద జల్లుతున్నారని ఆరోపించారు. సాక్షి పత్రికలో బుధవారం ప్రచురితమైన భూదురాక్రమణ కథనాలపై మంత్రులు సీఎం కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి మాట్లాడుతూ.. రాజధానిలో ఏ లావాదేవీ జరిగినా లోకేశ్‌బాబుకు, తనకు, నారాయణకూ సంబంధం ఉందంటున్నారని, ఇలాగైతే పదేళ్లలో రాష్ట్రంలో జరిగిన రిజిస్ట్రేషన్లు, అగ్రిమెంట్లలో జగన్ పాత్ర ఉందని అనాల్సివస్తుందన్నారు. రాసిన వ్యక్తుల్లో ఎవరికి భూములున్నా సాక్షి మేనేజ్మెంట్కు రాసిస్తామని చెప్పారు. ఈ కథనాలు రాసిన సాక్షి ప్రమోటర్, ఎండీ, ఎడిటర్, వార్త పంపిన విలేకరిపై సివిల్, క్రిమినల్ పరువు నష్టం దావా వేస్తామని చెప్పారు. ఎడిటర్స్ గిల్డ్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తామన్నారు. తప్పుడు వార్తలు రాయడం, దానిపై బొత్స సత్యనారాయణ వంటి నేతలు ఇష్టానుసారం మాట్లాడడం సరికాదన్నారు. పత్రిక, చానల్ ఉంది కదా అని అవాస్తవాలు రాస్తే పత్రికలను ఏంచేస్తున్నారో చూస్తున్నారుగా అంటూ హెచ్చరిక ధోరణిలో మాట్లాడారు. నారాయణ మూడు వేల ఎకరాలు కొన్నాడని ఎవరెవరి పేర్లో చెబుతున్నారని, రాజారెడ్డి, పుల్లారెడ్డి తన బినామీలంటున్నారని, ఇంతవరకూ రాజారెడ్డి పేరే తాను వినలేదన్నారు. సూటిగా సమాధానం చెప్పని పుల్లారావు లింగమనేని ఎస్టేట్స్‌తో క్విడ్‌ప్రోకో జరగడం వాస్తవం కాదా అని విలేకరులు ప్రశ్నించగా పుల్లారావు నేరుగా స్పందించకుండా క్విడ్‌ప్రోకో చర్రిత జగన్‌దేనన్నారు. ఎమ్మెల్యేలు పార్టీలు మారుతున్న విషయాన్ని పక్కదారి పట్టించడానికి ఇలా రాస్తున్నారని ఆరోపించారు. జగన్మోహన్రెడ్డి పద్ధతి మార్చుకోకపోతే ప్రతిపక్ష స్థానాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుందన్నారు. బాలకృష్ణ వియ్యంకుడి కోసం సీఆర్డీఏ పరిధిని జగ్గయ్యపేట వరకూ విస్తరించడం వాస్తవం కాదా అని విలేకరుల ప్రశ్నించగా ఒకరి కోసం డిజైన్ మార్చే పరిస్థితి ఉందంటూనే మళ్లీ పాత విషయాలపై మాట్లాడారు. మంత్రి రావెల కిషోర్‌బాబు తన భార్య పేరు మీదే భూములు కొన్న విషయాన్ని ప్రస్తావించగా దానికి సమాధానం చెప్పకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కరపత్రిక మంత్రివర్గంపై ఇలా బురద జల్లుతోందని ఆరోపించారు. సాక్షి కథనాలను ఖండించడానికి ఆవేశంగా మీడియా పాయింట్ వద్దకొచ్చిన మంత్రులు నారాయణ, పుల్లారావు తమ భూముల గురించి లోతుగా ప్రశ్నలు అడిగితే నీళ్లు నమిలారు. ఆశ్చర్యం కలిగించాయి: నారాయణ మంత్రి నారాయణ మాట్లాడుతూ సాక్షిలో వచ్చిన కథనాలు తనకు ఆశ్చర్యం కలిగించాయని, నిజాలు తెలుసుకుని రాయాలని సూచించారు. ఏదో రకంగా రాజధానిని అడ్డంగించాలని ప్రయత్నించి కోర్టులో కేసులు వేయించారని, రైతుల్ని రెచ్చగొట్టారని అయినా రాజధాని నిర్మిస్తుండడంతో ఓర్వలేక ఇలా బురద జల్లుతున్నారని ఆరోపించారు.తాను మూడు వేల ఎకరాలు ఎక్కడ కొన్నానో చూపిస్తే పేదలకు పంచేస్తానన్నారు. అసైన్డ్ భూములకు పరిహారం ఇచ్చే విషయంలో అవకతవకల గురించి ప్రశ్నించగా నిబంధనల ప్రకారమే అంతా చేశామన్నారు. -
ప్రభుత్వం చేతికి 20న రాజధాని కోర్ మాస్టర్ ప్లాన్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని కోర్ మాస్టర్ ప్లాన్ ఈ నెల 20న రాష్ట్ర ప్రభుత్వానికి అందనుంది. సింగపూర్ వాణిజ్యశాఖ మంత్రి ఈశ్వరన్ ఈ మేరకు ప్లాన్ తీసుకుని హైదరాబాద్ రానున్నారు. అదే రోజు ఈశ్వరన్ 13 సీట్లున్న ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బయలుదేరి వెళతారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈశ్వరన్ రాజమండ్రికి చేరుకుని పుష్కరాల్లో పాల్గొని మాస్టర్ ప్లాన్‌ను సీఎం చంద్రబాబుకు అందించనున్నారు. సీఎం, ఈశ్వరన్‌లు అక్కడే కోర్ సిటీ కేపిటల్ ప్లాన్‌పై చర్చించనున్నారు. ఏపీ రాజధాని నిర్మాణానికి సంబంధించి సింగపూర్ ప్రభుత్వం మూడు దశల్లో మాస్టర్ ప్లాన్లు రూపొందించింది. మార్చి 30న సీఆర్డీఏ పరిధిలో మాస్టర్ ప్లాన్ అందించింది. సీఆర్డీఏలో కొంత ప్రాంతాన్ని సెంట్రల్ ప్లానింగ్ ఏరియా (సీపీఏ)గా గుర్తిస్తూ రెండో దశ ప్రణాళికను మే 25న అందించిన సింగపూర్ ప్రభుత్వం చివరి ప్రణాళిక ఈ నెల 20న అందించనుంది. రాజధానిలో రాజ్‌భవన్, అసెంబ్లీ, హైకోర్టు, ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన నిర్మాణాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే విషయాలు ఈ మాస్టర్ ప్లాన్‌లో పొందుపరిచినట్లు సమాచారం. సీడ్ కేపిటల్ ఏరియా 217 చ.కిమీలు అంటే 53,612 ఎకరాల్లో ప్రధాన రాజధాని ప్రాంతం విస్తరించేలా సింగపూర్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రూపొందించింది. సీడ్ కేపిటల్ మాస్టర్ ప్లాన్ అందిన తర్వాత ఏపీ ప్రభుత్వం స్విస్ ఛాలెంజ్ విధానంలో రాజధాని నిర్మాణానికి మాస్టర్ డెవలపర్‌ను ఎంపిక చేయనుంది. 21న జరిగే మంత్రివర్గ సమావేశంలో సీడ్ కేపిటల్ మాస్టర్ ప్లాన్‌పై చర్చించనున్నారు. స్విస్ ఛాలెంజ్ విధానంలో సింగపూర్ కంపెనీలు పాల్గొంటాయని ఇదివరకే ఈశ్వరన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
చంద్రబాబు చేతికి 'రాజధాని మాస్టర్ ప్లాన్'
-
చంద్రబాబు చేతికి 'రాజధాని మాస్టర్ ప్లాన్'
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సోమవారం సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నగర(కేపిటల్ సిటీ) మాస్టర్‌ప్లాన్‌ను ఈశ్వరన్ సమర్పించారు. ఇప్పటికే సింగపూర్ కంపెనీలు రాజధాని ప్రాంత(కేపిటల్ రీజియన్) మాస్టర్‌ప్లాన్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన విషయం తెలిసిందే. రాజధాని మాస్టర్ ప్లాన్‌పై కాసేపట్లో ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. చంద్రబాబుతో పాటు సింగపూర్ ప్రతినిధులు పాల్గొంటారు. మధ్యాహ్నం మూడు గంటల వరకూ ఈ రాజధాని హైలెవల్ కమిటీ భేటీ కొనసాగనుంది. ఈ సమావేశంలో మాస్టర్‌ప్లాన్‌లో పొందుపరిచిన అంశాలపై చర్చిస్తారు. అలాగే భూములు ఇచ్చిన రైతులకు సమీప గ్రామాల్లో భూములను ఏపీ సర్కార్ కేటాయించనుంది. అలాగే మాస్టర్ ప్లాన్‌పై ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరించనుంది. -
నేడు సర్కారుకు రాజధాని మాస్టర్‌ప్లాన్
* హైదరాబాద్ చేరిన సింగపూర్ వాణిజ్య మంత్రి ఈశ్వరన్ * నేడు సచివాలయంలో సీఎం చంద్రబాబుతో ఉన్నతస్థాయి భేటీ * అభ్యంతరాలు వెలిబుచ్చేందుకు నెలరోజుల గడువిచ్చే అవకాశం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నగర(కేపిటల్ సిటీ) మాస్టర్‌ప్లాన్ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం చేతికి అందనుంది. ఈ మాస్టర్‌ప్లాన్‌ను తీసుకుని సింగపూర్ వాణిజ్య మంత్రి ఈశ్వరన్ ఆదివారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈశ్వరన్, ఆయనతోపాటు వచ్చిన సింగపూర్ కంపెనీల ప్రతినిధులు రాత్రికి ప్రైవేట్ హోటల్లో బస చేశారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సచివాలయంలో ఈశ్వరన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలసి ఉన్నతస్థాయి సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఈశ్వరన్ కేపిటిల్ సిటీ మాస్టర్‌ప్లాన్‌ను ఏపీ సీఎంకు సమర్పిస్తారు. ఆ మాస్టర్‌ప్లాన్‌లో పొందుపరిచిన అంశాలపై చర్చిస్తారు. ఇప్పటికే సింగపూర్ కంపెనీలు రాజధాని ప్రాంత(కేపిటల్ రీజియన్) మాస్టర్‌ప్లాన్‌ను రాష్ట్రప్రభుత్వానికి సమర్పించిన విషయం తెలిసిందే. సోమవారం కేపిటల్ సిటీ మాస్టర్‌ప్లాన్‌ను సమర్పించనుందని ప్రభుత్వ కమ్యూనికేషన్ సలహాదారు పరకాల ప్రభాకర్ ‘సాక్షి’కి తెలిపారు. సింగపూర్ సమర్పించిన సిటీ కేపిటల్ మాస్టర్ ప్రణాళికపై రాష్ట్రప్రభుత్వం సమీక్ష నిర్వహిస్తుందని, అందులో ఏమైనా మార్పులు, చేర్పులు చేయాల్సివస్తే సూచిస్తుందని, అందుకు అనుగుణంగా మార్పులు చేశాకనే సిటీ కేపిటల్ మాస్టర్ ప్రణాళికను ప్రజల ముందుంచుతామని పరకాల తెలిపారు. కేపిటల్ సిటీ మాస్టర్ ప్రణాళికను సమర్పించడంతో ఇక స్విస్ చాలెంజ్ విధానంలో మాస్టర్ డెవలపర్ ఎంపికపై దృష్టి పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. మాస్టర్ డెవలపర్‌ను ఎంపిక చేశాక ఆ మాస్టర్ డెవలపర్ వివిధ కంపెనీల నుంచి స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా పెట్టుబడులను తీసుకువస్తారని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం విధానంలో కంపెనీలు పనిచేస్తాయని పరకాల చెప్పారు. ఇక సింగపూర్ సీడ్ కేపిటల్ మాస్టర్‌ప్లాన్‌ను మాత్రమే సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. సీఎం చంద్రబాబు, ఈశ్వరన్‌లు ఉన్నతస్థాయి సమావేశానంతరం విలేకరులతో మాట్లాడతారన్నారు. కేపిటల్ మాస్టర్‌ప్లాన్‌కు తుది రూపమిచ్చాక దానిపై అభ్యంతరాలు, సలహాలు, సూచనల కోసం ప్రభుత్వం నోటిఫై చేయనుంది. నోటిఫై చేసిన తేదీ నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి నెల రోజులపాటు సమయమివ్వనున్నారు. ఇరువురు నేతల మధ్య ప్రైవేట్ భేటీ ఇదిలా ఉండగా సింగపూర్ వాణిజ్య మంత్రి ఈశ్వరన్, ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్య సోమవారం ప్రైవేట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో వారిద్దరే ఉంటారు. స్విస్ చాలెంజ్ విధానంలో మాస్టర్ డెవలపర్ బాధ్యతలను కూడా సింగపూర్ సంస్థలకే అప్పగించాలని నిర్ణయించిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు, ఈశ్వరన్ ప్రైవేట్ భేటీకి ప్రాధాన్యమేర్పడింది. ఈ భేటీలో ఎటువంటి రహస్య అవగాహనలు చేసుకుంటారో ఎవరికీ తెలియదు. వారిద్దరి మధ్య మాత్రమే ఆ రహస్య భేటీ వ్యవహారాలు ఉంటాయి. -
పంట భూముల నుండి రైతులను గెంటేయవద్దు
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణం పేరిట ప్రస్తుత ప్రభుత్వం సాగిస్తున్నదంతా దాని సాకున నల్లధన కుబేరుల జూదగొండి ప్రయోజనాలను కాపాడటమేనని రచయితలమూ, ఆలోచనాపరుల మూ అయిన మేము బలంగా అభిప్రాయపడుతున్నాం. ప్రపంచాన్ని తలదన్నేంత మహోన్నత రాజధానిని నిర్మాణం చేయమని రాష్ట్ర ప్రజలు పాలకులను ఆదేశించలేదు. చంద్రబాబు తరహాలో జరిగిన హైదరాబాద్ అభివృద్ధి, ప్రజానుకూల నమూనా కాదు. దాని వైఫల్యాలను చరిత్ర నమోదు చేసింది. రాజధాని కనీస అవసరాలైన పాలనా భవనాలు, గృహ సముదాయాల కోసం కొన్ని వందల ఎకరాల భూమి ఉంటే చాలు. 30 వేలు- లక్ష ఎకరాలు సమీ కరించటమన్నది దేశ విదేశీ ధనస్వాముల దోపిడీ ప్రయోజనాల కోసమే తప్ప సాధారణ ప్రజల లబ్ధి కోసం కాదని మా అభిప్రాయం. రాజధానికి అవసరమైన ప్రభుత్వ భూములు నిర్దేశిత ప్రాంతంలో ఉన్నాయి. అదనంగా రైతుల భూములను సమీకరించనక్కరలేదు. ముక్కారు పంటలు పండే పొలాలను కాంక్రీటు వనాలుగా మార్చనక్కరలేదు. తరతరాలుగా అక్కడ జీవిస్తున్న వేలాది కుటుంబా లను వలస జీవులుగా గెంటివేయనక్కరలేదు. మన దేశానికి ఆయువుపట్టు లాంటి గ్రామీణ జీవనంలో డబ్బుకు మించిన, అది కొనుగోలు చేయలేని సాంస్కృతిక ఔన్నత్యం ఒకటుంది. ఒక కుటుంబమంటే తల్లీ, తండ్రీ; భార్యా, భర్తా, పిల్లలు ఎలాగో గ్రామం అంటే ‘భూ మి, నారు, పశువు, పాడి, పంట, అనేక కుటుంబాల’ ఆత్మిక కలయిక. వారి జీవన విధ్వంస మంటే సాంస్కృతిక విధ్వంసం కూడానని మేము భావిస్తున్నాం. రాజధాని ప్రదేశం ఎంపికకు వాస్తు మౌఢ్యాన్ని అడ్డు పెట్టుకోవడాన్ని మేము అసహ్యిం చుకుంటున్నాం. ఆహారధాన్యాల ఉత్పత్తికి కొరతను తెచ్చి, విదేశాల నుండి వాటిని దిగుమతి చేసుకోవా ల్సిన దుస్థితికి దేశాన్నీ, రాష్ట్రాన్నీ దిగజార్చే విధంగా, వేలాది ఎకరాల పంటభూముల్ని రాజధాని నిర్మా ణం కోసం సమీకరించే రాష్ట్ర ప్రభుత్వ విధానాలను, చర్యలను మేము ఖండిస్తున్నాం. సాధారణ పరిపాలనా రాజధానిని ప్రభుత్వ భూముల్లో, పంటలు పండని భూముల్లో నిర్మించా లని మేం డిమాండ్ చేస్తున్నాం. ప్రజల వాస్తవిక సమస్యలైన ఆత్మహత్యలు, అధిక ధరలు, నిరుద్యోగం, అందరికీ అందుబాటులో విద్య, వైద్యం, రైతాంగానికి గిట్టుబాటు ధరలు, శ్రామికులకు కనీస వేతన చట్టాలూ, మహి ళలూ, దళితుల పట్ల కొనసాగుతున్న వివక్ష, భాషా-సాంస్కృతిక వికాసం వంటి సమస్యలను వేగంగా పరిష్కరించే దిశగా పనిచేయమని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుగు రచయితలుగా, ఆలోచనాపరులుగా విజ్ఞప్తి చేస్తున్నాం. కె. రవిబాబు, దివికుమార్, సి.వి. చలసాని ప్రసాద్, నిర్మలానంద, శీలా వీర్రాజు, వరవరరావు, డా. ఎస్వీ సత్యనారాయణ, వరలక్ష్మి, వేల్పుల నారా యణ, వల్లూరి శివప్రసాద్, పెద్దిబొట్ల సుబ్బరామ య్య, అద్దేపల్లి రామమోహనరావు, అంపశయ్య నవీన్, కె.శివారెడ్డి, కడియాల రామమోహనరాయ్, సింగమనేని నారాయణ, బి. సూర్యసాగర్, పెను గొండ లక్ష్మీనారాయణ, కాత్యాయనీ విద్మహే, రాచ పాళెం చంద్రశేఖరరెడ్డి, భూపాల్, పి.సత్యవతి, నలిమెల భాస్కర్, ముత్తేవి రవీంద్రనాథ్, దర్భ శయనం శ్రీనివాసాచార్య, పి.ఎస్. నాగరాజు, ఎన్ వేణుగోపాల్, నండూరి రాజగోపాల్, వి.వి.న. మూర్తి, కొల్లూరి, సింగంపల్లి, అశోక్‌కుమార్, బెం దాళం కృష్ణారావు, అల్లంశెట్టి చంద్రశేఖర్, ఖాదర్ మొహియుద్దీన్, చెరుకూరి సత్యనారాయణ ఇంకా కృష్ణా, గుంటూరు, హైదరాబాద్, శ్రీకాకుళం, విశా ఖ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, వరంగల్, ఖమ్మం, విజయనగరం, ప్రకాశం, నెల్లూరు, చిత్తూ రు, కర్నూలు, కడప, అనంతపురం, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు, కర్నాటక రాష్ట్రానికి చెందిన 150 మంది రచయితలు. -
ట్రైబ్యునల్ అధికారాలు రిటైర్డ్ జడ్జికి అప్పగింత !
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ప్రాంతంలో భూవివాదాలు, నిర్మాణ సమస్యలకు సంబంధించి బిల్లింగ్ ట్రైబ్యునల్ ఏర్పాటు చేయనున్నట్టు సీఆర్డీఏ ముసాయిదా బిల్లు 2014లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. అందుకుగానూ ఆరుగురు సభ్యులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కమిటీలో చైర్మన్ సహా ఆరుగులు సభ్యులు ఉంటారు. అయితే కమిటీ సభ్యులలో రిటైర్డ్ జడ్డిని నియమించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ట్రైబ్యునల్‌లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బెంచ్‌లను ఏర్పాటు చేసే అధికారం రిటైర్డ్ జడ్జికి అప్పగించే యోచనలో ఉంది. కాగా, ప్రతిబెంచ్లో కనీసం ఇద్దరు సభ్యులు, ఒకరు న్యాయ సభ్యుడు, మరొకరు సాంకేతిక సభ్యుడు చైర్మన్, సభ్యులను నియమించే అధికారం ప్రభుత్వానికి ఉంది. -
బడ్జెట్‌కు ముందు స్మార్ట్ సిటీల ఎంపిక: వెంకయ్య
ముంబై: స్మార్ట్ సిటీలు అభివృద్ధి చేయడానికి నగరాల ఎంపికను వచ్చే బడ్జెట్ సమావేశాల ముందు ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు సోమవారమిక్కడ వెల్లడించారు. స్మార్ట్ సిటీల రూపురేఖలకు తుది మెరుగులు దిద్దుతున్నామని.. వచ్చే నవంబర్ నాటికి ఇది పూర్తయ్యే అవకాశముందని అన్నారు. ఒక్కో రాష్ట్రంలో రెండు, మూడు స్మార్ట్ సిటీలు ఉండేలా చూస్తామన్నారు. తాను ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిని స్మార్ట్‌సిటీగా నిర్మించాలని భావిస్తున్నానన్నారు. -
భూప్రకంపన జోన్ లో విజయవాడ
నూతన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఏర్పాటు కానుందనే దానిపై మరికొద్దిరోజుల్లో స్పష్టత రానుంది. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని నిర్మాణానికి ఎక్కువ అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ప్రాంతం భూప్రకంపన జోన్ లో ఉందంటూ భారత భూవిజ్ఞాన శాస్త్ర సంస్థ(జీఎస్ఐ) శాస్త్రవేత్తలు బాంబు పేల్చారు. ఇక్కడ భూమి కంపించే అవకాశాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. ఈ ప్రాంతం భారత భూవిజ్ఞాన శాస్త్ర సంస్థకు చెందిన హైదరాబాద్ లోని భూకంపనాల అధ్యయన దక్షిణవిభాగం ఈ విషయాన్ని తెలిపింది. నైరుతి గుణదల, మంగళగిరిలోని కొండ ప్రాంతాలు అత్యంత సున్నితమైన ప్రాంతాలని జూన్ లో సమర్పించిన నివేదికలో పేర్కొంది. ఒక అంతస్థు భవనాలు నిర్మించడానికి కూడా ఇవి అనువైన ప్రాంతాలు కాదని స్పష్టం చేసింది. ఇంద్రకీలాద్రి కొండల్లోని తూర్పు ఘాట్ ప్రాంతానికి భూకంపనాల ముప్పు ఉందని పేర్కొంది. నిడమర్రు నైరుతి ప్రాంతం, తాడేపల్లి తూర్పువైపు, నున్న దక్షిణ ప్రాంతంతో పాటు కృష్ణా నది పరివాహక ప్రాంతంలోనూ భూకంపనాలకు అవకాశముందని జీఎస్ఐ తెలిపింది. విజయవాడకు 300 కిలోమీటర్ల పరిధిలో భూప్రకంపనాలు సంభవించేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని హైదరాబాద్ ఐఐఐటీ పరిశోధకులు అంచనా వేశారు. అయితే భూకంపాలు ఎప్పుడు సంభవిస్తాయనేది కచ్చితంగా చెప్పలేమని హైదరాబాద్ ఐఐఐటీ పరిశోధకరాలు డాక్టర్ నీలిమా సత్యం అన్నారు. ఉపద్రవం వచ్చినప్పుడు మాత్రమే దాని తీవ్రత తెలసుస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం గుర్తించిన- భూకంప ముప్పు ఉన్న 63 నగరాల్లో విజయవాడ కూడా ఉందని తెలిపారు. పర్యావరణ అసమతుల్యత, అపక్రమత కారణంగా భూకంపాలు వచ్చే అవకాశం ఎక్కువని వివరించారు. -
'రాజధాని నిర్మాణానికి సింగపూర్ సహాయం'
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి సింగపూర్ సహాయం తీసుకుంటామని ఆ రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ వెల్లడించారు. ఇంటిగ్రేటెడ్ క్యాపిటెల్ నిర్మాణంలో భాగస్వాములు కావడానికి సింగపూర్ ముందుకు వచ్చిందని ఆయన వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లో మంత్రి నారాయణ సింగపూర్ ప్రభుత్వ ఆధికారులతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిలో అన్ని వసతులు ఒకే చోట ఉండేలా నిర్మాణం చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖపట్నం నగరాలను మెగాసిటీలుగా అభివృద్ధి చేస్తామని నారాయణ వెల్లడించారు. -
'రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే రాజధాని నిర్మాణం'
హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన రాజధాని అంశం త్వరలోనే ఓ కొలిక్కి రానుంది. కొత్త రాజధాని ఏర్పాటు నిర్ణయానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని కమిటీ చైర్మన్ శివరామకృష్ణన్ ఈ రోజు వివరణ ఇచ్చారు. రాజధాని నిర్మాణం అనేది తమ పరిధిలో ఉండదని.. అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని ఆయన తేల్చిచెప్పారు. ఈ మేరకు శనివారం భేటీ అయిన శివరామకృష్ణన్ కమిటీ సుదీర్ఘ చర్చల అనంతరం వివరణ ఇచ్చింది. రాజధాని నిర్మాణం అనేది తమ చేతుల్లో ఉండదని, అది కేవలం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుందని శివరామకృష్ణన్ కమిటీ తెలిపింది. తాము సలహాలు, సూచనలు మాత్రమే ఇస్తామని ఆ కమిటీ చైర్మన్ శివరామకృష్ణన్ తెలిపారు. 'ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ్ని కలిసాం. ఆయన రాజధాని ఫలనా చోట ఉండాలని మాకు సూచించలేదు. అలాగే మా సభ్యుల బృందం గవర్నర్, హైకోర్టు చీఫ్ జస్టిస్ లను కలిసాం. త్వరలోనే ప్రతిపక్ష నాయకున్ని కూడా కలుస్తాం' అని ఆయన స్పష్టం చేశారు. దీనిపై ఆగస్టు 10 లోపు తుది నివేదికను కేంద్రానికి సమర్పించాల్పి ఉందన్నారు. రాజధాని నిర్మాణానికి రహదారులు, నీటి వనరులు అతి ముఖ్యమైనవిగా ఆయన పేర్కొన్నారు. కొత్తగా రాజధాని నగరాన్ని నిర్మించడం కష్టమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రస్తుతం ఉన్న నగరాల్లో ఏదో నగరాన్ని ఎంపిక చేసుకోవాలన్నారు. -
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఎంపికపై చర్చ
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతోఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఎంపిక కోసం సూచనలు చేయడానికి ఏర్పాటు చేసిన శివరామ కృష్ణన్ కమిటీ శనివారం భేటీ అయ్యింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఎంపికపై చర్చ జరిగింది. గతంలో కమిటీ పర్యటన వివరాలను కమిటీ సభ్యులు .... చంద్రబాబుకు తెలియచేశారు. కాగా గుంటూరు, విజయవాడ సమీపంలో రాజధాని ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను బాబు అడిగి తెలుసుకుంటున్నారు. కమిటీ సభ్యులు ఇప్పటికే విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ తదితర ప్రాంతాలను సందర్శించి వివిధ రంగాల నిపుణులతో సంప్రదింపులు జరిపారు. మరోవైపు గుంటూరు, విజయవాడ మధ్య రాజధాని ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తున్నామని ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారు. ఒకవేళ ఈ రెండు నగరాల మధ్య అవకాశం లేనిపక్షంలో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఏదో ఒక ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేసే విషయమై గురువారం విశాఖపట్నంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో కమిటీ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. -
నేడు చంద్రబాబుతో శివరామకృష్ణన్ కమిటీ భేటీ
రాజధాని అంశంపై చర్చ! సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఎంపికకోసం సూచనలు చేయడానికి కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ శనివారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశం కానుంది. కమిటీ కొద్దిరోజుల కిందట సీఎంతో సమావేశం కావాలనుకున్నా వీలు పడలేదు. ఈ నేపథ్యంలో కమిటీ శనివారం ఆయనతో సమావేశమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని అంశంపై చర్చించనుంది. కమిటీ సభ్యులు ఇప్పటికే విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ తదితర ప్రాంతాలను సందర్శించి వివిధ రంగాల నిపుణులతో సంప్రదింపులు జరిపారు. మరోవైపు గుంటూరు, విజయవాడ మధ్య రాజధాని ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తున్నామని ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారు. ఒకవేళ ఈ రెండు నగరాల మధ్య అవకాశం లేనిపక్షంలో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఏదో ఒక ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేసే విషయమై గురువారం విశాఖపట్నంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో కమిటీ సమావే శం ప్రాధాన్యం సంతరించుకుంది.