
బడ్జెట్‌కు ముందు స్మార్ట్ సిటీల ఎంపిక: వెంకయ్య
ముంబై: స్మార్ట్ సిటీలు అభివృద్ధి చేయడానికి నగరాల ఎంపికను వచ్చే బడ్జెట్ సమావేశాల ముందు ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు సోమవారమిక్కడ వెల్లడించారు. స్మార్ట్ సిటీల రూపురేఖలకు తుది మెరుగులు దిద్దుతున్నామని.. వచ్చే నవంబర్ నాటికి ఇది పూర్తయ్యే అవకాశముందని అన్నారు. ఒక్కో రాష్ట్రంలో రెండు, మూడు స్మార్ట్ సిటీలు ఉండేలా చూస్తామన్నారు. తాను ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిని స్మార్ట్‌సిటీగా నిర్మించాలని భావిస్తున్నానన్నారు.