Smart Cities
-
మూడు నగరాల ముచ్చట
(సియోల్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి డోకూరి వెంకటేశ్వర్‌రెడ్డి) ఈశాన్య ఆసియాలో దక్షిణ కొరియాను ఆర్థిక హబ్‌గా నిలపాలన్న లక్ష్యంతో 2003లో ది ఇంచియాన్ ఫ్రీ ఎకనామిక్ జోన్ (ఐఎఫ్ఈజెడ్)ను ఏర్పాటు చేశారు. ఆ దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చడమే దాని ప్రధాన ఉద్దేశం. ఇక్కడే రూ.5 లక్షల కోట్ల వ్యయంతో మూడు అంతర్జాతీయ స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేశారు. మూసీ పునరుజ్జీవం, ముచ్చర్లలో ఫ్యూచర్ సిటీ బృహత్తర ప్రాజెక్టులపై అధ్యయనానికి రాష్ట్ర మంత్రుల బృందం దక్షిణ కొరియాలోని సియోల్ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మూడో రోజైన బుధవారం ఇంచియాన్ నగరంలో అభివృద్ధి చేసిన 3 అంతర్జా తీయ స్మార్ట్ సిటీలను మంత్రులు, అధికారుల బృందం పరిశీలించింది. పనిలోపనిగా స్టోర్స్ యూనివర్సిటీని కూడా సందర్శించింది. సాంగ్డో నగరంలో ఐటీ, బయోటెక్నాలజీ (బీటీ), సేవల పరిశ్రమలు, చెయోంగ్నాలో ఫైనాన్స్, హైటెక్ ఇండస్ట్రీలు, యోంగ్జోంగ్లో లాజిస్టిక్, టూరిజం పరిశ్రమలను అభి వృద్ధి చేశారు. ప్రస్తుతం 122.34 చదరపు కిలో మీటర్లు (చ.కి.మీ.) విస్తీర్ణంలో ఉన్న ఈ మూడు నగరాల్లో 5,43,653 జనాభా నివాసం ఉంటోంది. 3 గంటల్లో ఇతర నగరాలకు..ఇంచియాన్ నుంచి షాంఘై, బీజింగ్, హాంగ్‌కాంగ్ వంటి నగరాలకు మూడు గంటల్లో చేరుకోవచ్చు. దీంతో ఎగుమతి, దిగుమతి కేంద్రాలకు ఇంచియాన్ నిలయంగా మారింది. పబ్లిక్, మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్‌లతో పాటు ఇంచియాన్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఓడరేవు, ఫెర్రీ టెర్మినల్స్తో మెరుగైన రవాణావ్యవస్థ ఉంది. ఇంచియాన్లోని అంతర్జాతీయ విశ్వవిద్యాలయం ఉండటంతో పరిశ్రమ అవసరాలకు తగ్గిన నిపుణులు, నైపుణ్యమున్న ఉద్యోగులకు కొరతే లేదు. అన్ని రకాల మౌలిక సదుపాయాలున్న స్థలాలు, దీర్ఘకాలంపాటు లీజు, నిర్మాణ వ్యయంలో రాయితీలు, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ (ఐపీ) భద్రత, విదేశీ సంస్థలకు ప్రత్యేక పన్ను మినహాయింపులు వంటివి అందిస్తున్నారు.స్టార్టప్ పార్క్..ఇప్పటివరకు ఐఎఫ్ఈజెడ్లో 14.8 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ)లు వచ్చాయి. ఇందులో 206 గ్లోబల్, 3,481 స్థానిక సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. సెమీ కండక్టర్లు, రోబో, డ్రోన్ వంటి పరిశ్రమలకు చెందిన సంస్థలతో పాటు గ్రీన్ క్లైమెట్ ఫండ్ (జీసీఎఫ్) వంటి ఐక్యరాజ్య సమితికి చెందిన 15 కార్యాలయాలు న్నాయి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, యువతను ఆకర్షించేందుకు ఇంచియాన్ నగరంలో స్టార్టప్ పార్క్‌ను కూడా నెలకొల్పారు. ప్రస్తుతం ఇందులో 422 స్టార్టప్స్ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. సుమారు 208 బిలియన్ వాన్ నిధులను సమీకరించాయి. ఇంచియాన్ గ్లోబల్ క్యాంపస్‌తో పాటు 6 కొరియన్ వర్సిటీలు, విదేశీ విశ్వ విద్యాలయాలున్నాయి. -
12 కొత్త ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు.. తెలంగాణ, ఏపీలో ఇవే..
దేశవ్యాప్తంగా మరిన్ని ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీల అభివృద్ధికి కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎన్ఐసీడీపీ) కింద కొత్తగా 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీల అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వం రూ.28,602 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు కేంద్రమంత్రి పీయూష్‌గోయల్ తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు.ఎన్ఐసీడీపీ ద్వారా ప్రభుత్వం ఖర్చు చేయబోతున్న నిధులతో మౌలిక సదుపాయాలు వృద్ధి చేస్తామని మంత్రి చెప్పారు. దాంతో ఆయా నగరాల్లో దాదాపు రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. దాంతో ప్రత్యక్షంగా 10 లక్షల మంది, పరోక్షంగా మరో 30 లక్షల మంది ఉపాధి పొందుతారని పేర్కొన్నారు. కొత్తగా అభివృద్ధి చెయబోయే 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు దేశవ్యాప్తంగా పారిశ్రామిక హబ్‌లుగా మరుతాయన్నారు. 10 రాష్ట్రాలు, 6 ఇండస్ట్రీ కారిడార్లను కవర్ చేసేలా వీటిని ఎంచుకుంటున్నట్లు తెలిపారు.ఇదీ చదవండి: పదేళ్లలో ‘జన్‌ధన్’ విజయాలు.. సమస్యలు‘దేశవ్యాప్తంగా కొత్తగా తీసుకొస్తున్న 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలతో కలిపి మొత్తం వీటి సంఖ్య 20కు చేరింది. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఇప్పటివరకు నాలుగు ప్రాజెక్టులు అమలు చేశాం. మరో నాలుగు ప్రాజెక్టుల పనులు వేగంగా ప్రారంభమయ్యాయి. కొత్తగా ఈ విభాగంలో 12 సిటీలో చేరాయి. ప్రతి కారిడార్‌లో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ హబ్‌లు, రవాణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ఈ నగరాల్లో పెట్టుబడిదారులకు అత్యాధునిక సౌకర్యాలతో భూమిని కేటాయించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాజ్‌పురా, పాటియాలా-ఉత్తరాఖండ్, ఆగ్రా-ఉత్తరప్రదేశ్, గయా-బిహార్, డిగి పోర్ట్-మహారాష్ట్ర, జహీరాబాద్, కొప్పర్తి- తెలంగాణ, బోధ్పూర్-రాజస్థాన్, ఒర్వకల్లు-ఏపీ, పాలక్కాడ్-కేరళ, జమ్ముకశ్మీర్/ హరియాణాలోని నగరాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నాం. ఈ పారిశ్రామిక స్మార్ట్ సిటీల్లో రైలు, ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు, జాతీయ రహదారులు, విమానాశ్రయాలు, ఓడరేవులతో పాటు నీరు, విద్యుత్, గ్యాస్, టెలికాం కనెక్టివిటీతో సహా స్థిరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నారు’ అని మంత్రి చెప్పారు. -
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్‌ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు.. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
బీజేపీ నేతలెక్కడ?.. ఇవేనా స్మార్ట్ సిటీలు: అఖిలేష్ యాదవ్ సెటైర్లు
లక్నో: కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై సమాజ్‌వాద్ పార్టీ చీఫ్, ఎంపీ అఖిలేష్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీలోని పలు పట్టణాలను స్మార్ట్ సిటీలు చేస్తామని బీజేపీ నేతలు గొప్పగా చెప్పుకున్నారు. కానీ, అవే ప్రాంతాలు నేడు వరద నీటిలో మునిగిపోయాయని ఎద్దేవా చేశారు.కాగా, అఖిలేష్ యాదవ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. యూపీలో చిన్నపాటి వర్షాలకే దారుణ పరిస్థితులు ఎదుర్కొవాల్సి వస్తోంది. బీజేపీ నేతలు పలు పట్టణాలను స్మార్ట్ సిటీలు చేస్తామని చెప్పారు. కానీ, అవే పట్టణాలు నేడు వర్షపు నీటితో మునిగిపోయాయి. ప్రతీచోటా వరద నీరు నిలిచిపోవడంతో వ్యర్థాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. స్మార్ట్ సిటీల సంగతి దేవుడెగురు.. ముందుగా వరద నీరు నిల్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. #WATCH | Etawah, UP: Samajwadi Party chief & MP Akhilesh Yadav says, " Those people (BJP) who told that we will make a smart city in UP, we can see their smart city, it is waterlogging everywhere and waste materials. Accidents are happening, people's vehicles are falling into… pic.twitter.com/WWAVC8XIuL— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 10, 2024రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి కూడా అధ్వాన్నంగా తయారైంది. వర్షపు నీరు రోడ్లపై ఉన్న కారణంగా గుంతలు ఎక్కడ ఉన్నాయో తెలియక వాహనాలు కిందపడిపోతున్నారు. రాష్ట్రంలో వైద్యశాఖకు సంబంధించిన సదుపాయాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. హత్రాస్ ఘటన కూడా పాలనా వైఫల్యం కారణంగానే జరిగింది. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయింది. యువత ఉద్యోగాలు, నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని’ కామెంట్స్ చేశారు. Current situation at LBS road #KurlaSo fed up with this flooding every year. There is never a day we have enjoyed rains. We have always lived with the tension of floods and the damages due to it. #MumbaiRains@richapintoi @rushikesh_agre_ @Mumbaikhabar9 @gallinews pic.twitter.com/EGf5k5DMXG— AliAsgar (@Aladeen110) July 8, 2024 #WATCH | Uttar Pradesh CM Yogi Adityanath inspects the flood-affected areas in Lakhimpur Kheri. pic.twitter.com/jEql0jA97J— ANI (@ANI) July 10, 2024 Lucknow rains લખનૌમાં ભારે વરસાદથી અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ#rain #UttarPradesh #road #kashi #banarasi #heavyrain #maharashtra #MumbaiRains #underpass #up #yogi #news pic.twitter.com/bvXoR5rJFq— BB News Gujarat (@bbnewsgujarat) July 8, 2024 -
మంత్రి పొన్నం ప్రకటనతో పరేషాన్..!
కరీంనగర్: ఇప్పటికే భూ ఆక్రమణల విచారణతో అతలాకుతమవుతున్న నగరపాలకసంస్థకు పులిమీద పుట్రలా స్మార్ట్‌సిటీ విచారణ వచ్చి పడనుంది. కేంద్ర, రాష్ట ప్రభుత్వాల భాగస్వామ్యంతో స్మార్ట్‌సిటీ నిధులతో నగర రూపురేఖలు మారేలా అభివృద్ధి పనులు జరగడం తెలిసిందే. ఈ పనుల్లో కొంతమంది అధికారులు చేతివాటం ప్రదర్శించారంటూ గతంలోనే అనేక ఫిర్యాదులు వెల్లువెతాయి. తాజాగా స్మార్ట్‌సిటీ పనుల్లో అవినీతి అక్రమాలపై విచారణ జరిపిస్తామన్న రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటనతో అధికారుల్లో గుబులు మొదలైంది. నగరపాలక అధికారుల్లో గుబులు.. స్మార్ట్‌సిటీ పనులపై విచారణ అంటేనే అధికారుల్లో వణుకుపుడుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో స్మార్ట్‌సిటీ పనుల్లో అక్రమాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. తొలుత హౌసింగ్‌బోర్డుకాలనీ తదితర ప్రాంతాల్లో విజిలెన్స్ అధికారులు విచారణ జరిపినప్పటికీ, పూర్తిస్థాయిలో మాత్రం దృష్టి పెట్ట లేదు. కేవలం వ్యక్తిగత ఫిర్యాదుల ఆధారంగానే విచారణ సాగినట్లు సమాచారం. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ స్మార్ట్‌సిటీ అక్రమాలపై విచారణ జరిపిస్తామని మరోసారి వెల్లడించడం హాట్‌టాపిక్‌గా మారింది. మొత్తం పనులపై విచారణ జరిపితే, చాలా విషయాలు బయటకు రానున్నాయి. దీంతో సాంకేతికంగా బాధ్యులుగా తేలే చాన్స్ నగరపాలకసంస్థ అధికారులకే ఉండడంతో, ఈ విచారణ వారి మెడకు చుట్టుకొనే అవకాశం ఉంది. ఇప్పటికే భూ ఆక్రమణలకు సంబంధించి నగరపాలకసంస్థ రెవెన్యూ విభాగం అధికారుల పాత్రపై పోలీసులు ఆరా తీస్తుండగా, మరో వైపు స్మార్ట్‌సిటీ పనులపైనా విచారణ జరిగితే కొంతమంది ఇంజినీరింగ్ అధికారుల అక్రమాల బాగోతం బయటపడనుంది. మరికొద్ది రోజుల్లో విచారణపై స్పష్టత రానుంది. రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి స్మార్ట్‌సిటీ జాబితాలో చోటులభించడంతో కరీంనగర్ నగరపాలకసంస్థకు నిధుల వరద వచ్చి పడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమాన భాగస్వామ్యంతో రూ.వెయ్యి కోట్లతో నగరంలో అభివృద్ధి పనులు చేపట్టారు. ఇప్పటికే రూ.740 కోట్లు విడుదల కాగా, ఇందులో రూ.539 కోట్లు చెల్లించారు. మరో రూ.200 కోట్లు చెల్లించాల్సి ఉంది. స్మార్ట్‌సిటీ కింద చేపట్టిన రోడ్లు, డ్రైనేజీలు, ఫుట్‌పాత్‌లు, స్మార్ట్ వీధిదీపాలు, నిర్మాణం దాదాపు పూర్తయింది. కొన్ని కూడళ్ల నిర్మాణం పూర్తి కాగా, మరికొన్ని అసంపూర్తిగా ఉన్నాయి. ఇక కమాండ్ కంట్రోల్, లైబ్రరీ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనాలు, పార్క్‌లు తదితర అభివృద్ధి పనులు కూడా పూర్తి కావాల్సి ఉంది. ఇష్టారీతిన అంచనాలు.. రూ.వందలకోట్లతో చేపట్టిన స్మార్ట్‌సిటీ పనుల్లో కొంతమంది నగరపాలకసంస్థ అధికారులు కాంట్రాక్టర్లతో కలిసి చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలున్నాయి. ప్రధానంగా గతంలో బల్దియాలో అంతా తానై వ్యవహరించిన ఓ ఇంజినీరింగ్ అధికారి కనుసన్నల్లో చేసిన అంచనాలే తప్పినట్లు ఫిర్యాదులు వచ్చాయి. అభివృద్ధి పనులకు సంబంధించిన అంచనాలను ఇష్టారీతిన పెంచి, స్మార్ట్‌సిటీ నిధులను కాంట్రాక్టర్ల జేబుల్లోకి మళ్లించినట్లు అభియోగాలున్నాయి. రూ.50 లక్షలతో పూర్తయే జంక్షన్ పనికి, రూ.కోటికి పైగా బిల్లు చేసిన వైనం నగరపాలకసంస్థ ఉన్నతాధికారులను విస్మయానికి గురిచేసింది. వ్యవసాయ మార్కెట్ ఆవరణలో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్ భవన నిర్మాణంలోనూ అంచనాలు, బిల్లులపై అనేక ఆరోపణలు వచ్చాయి. లెస్ క్వాలిటీ.. నగరంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్‌సిటీ పనుల్లో నాణ్యతా లోపం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. తమ లాభాల కోసం అంచనాలు భారీగా పెంచినప్పటికీ, చేసిన పనుల్లో నాణ్యత పాటించకపోవడంతో వాటి మనుగడ కష్టంగా మారింది. కలెక్టరేట్ రోడ్డు, హౌసింగ్‌బోర్డు కాలనీ, అంబేడ్కర్ స్టేడియం, టవర్‌సర్కిల్ తదితర ప్రాంతాల్లో నాణ్యతా లోపాలు బయటపడ్డాయి. సీసీరోడ్డు కుంగిపోగా, డ్రైనేజీలు నిర్మాణంలోనే కూలిపోయాయి. ఫుట్పాత్లైతే చెప్పాల్సిన అవసరం లేదు. నగరంలో ఫుట్‌పాత్‌లపై వేసిన టైల్స్ 90 శాతం సక్రమంగా లేవు. టవర్‌సర్కిల్ వద్ద డ్రైనేజీల నుంచి ఫుట్‌పాత్‌ల మీదుగా వచ్చే వరదనీళ్లు ఫౌంటేన్ల మాదిరిగా మారాయి. కూడళ్లకు వినియోగించిన మెటీరియల్ కూడా నాసిరకం వాడారనే ఆరోపణలున్నాయి. ఎక్కడో ఒకటి అరా తప్ప దాదాపు అన్ని పనుల్లో నాణ్యతా ప్రమాణాలు అంతంతమాత్రంగానే ఉన్నాయనే ఫిర్యాదులున్నాయి. ఇవి చదవండి: మా పిల్లల ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వండి -
సౌదీ స్మార్ట్ సిటీ ‘నియోమ్’ ప్రపంచాన్ని ఎందుకు ఆకర్షిస్తోంది?
ఆధునిక నిర్మాణాలకు సౌదీ అరేబియా పెట్టిందిపేరు. ప్రపంచంలోని ఏ పెద్ద కట్టడానికి సంబంధించిన ప్రస్తావన వచ్చినా ముందుగా సౌదీ అరేబియా పేరే వినిపిస్తుంది. అయితే ప్రస్తుతం సౌదీ అరేబియా భారీ స్మార్ట్ సిటీ నిర్మాణంలో తలమునకలై ఉంది. ఇది ప్రపంచంలోనే ప్రత్యేకంగా నిలవనుంది. నియోమ్.. ఇది అనేది వాయువ్య సౌదీ అరేబియాలోని టబుక్ ప్రావిన్స్‌లో నిర్మాణంలో ఉన్న అద్భుత స్మార్ట్ సిటీ. ఈ ప్రదేశం ఎర్ర సముద్రానికి ఉత్తరంగా, ఈజిప్టుకు తూర్పున అకాబా గల్ఫ్ సమీపంలో, జోర్డాన్‌కు దక్షిణంగా ఉంది. 500 బిలియన్ అమెరికన్ డాలర్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ భవిష్యత్ నగరం సంపూర్ణంగా ‘స్వచ్ఛమైన శక్తి’తో మనుగడ సాగించనుంది. ఈ అధునాతన సిటీలో కార్లు ఉండవు. రోడ్లు కూడా ఉండవు. జీరో కార్బన్ ఉద్గారాలతో స్మార్ట్ సిటీ కాలుష్య రహితంగా ఉండనుంది. కాగా ఈ నగరంలో మౌలిక సదుపాయాల కల్పనలో 20 శాతం పనులు పూర్తయ్యాయని నియోమ్ సీఈఓ నద్మీ అల్ నాస్ర్ మీడియాకు తెలిపారు. మానవాళి ఎదుర్కొంటున్న అనేక కీలక సవాళ్లను పరిష్కరించడానికి ప్రయత్నాలు సాగిస్తున్నామన్నారు. నియోమ్ అనేది గ్రీకు పదం. నియో అంటే కొత్తది. ఎం అనేదానిని అరబిక్ పదం ముస్తాక్బాల్ నుంచి తీసుకున్నారు. దీని అర్థం భవిష్యత్తు. నియోమ్ అనే పదాన్ని క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ పేరు నుంచి కూడా తీసుకున్నారని చెబుతారు. ఎర్ర సముద్ర తీరంలో 26,500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ మెగాసిటీ ప్రాజెక్ట్‌ను చేపట్టనున్నట్లు 2017 అక్టోబరులో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్) ప్రకటించారు. రియాద్‌లో జరిగిన ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇనిషియేటివ్ కాన్ఫరెన్స్‌లో ఎంబీఎస్ ఈ ప్రకటన చేశారు. ఇది సౌదీ అరేబియా- 2030 విజన్లలో ఒకటి. దీనిని సౌదీ ఆర్థిక వ్యవస్థను మరింత వృద్ధి చేసే లక్ష్యంలో నిర్మిస్తున్నారు. నియోమ్ అనేది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ నిర్మాణాలకు భిన్నంగా స్వతంత్రంగా పనిచేస్తుందని, దానికంటూ సొంత పన్ను, కార్మిక చట్టాలు, ‘స్వయంప్రతిపత్త న్యాయ వ్యవస్థ’ ఉంటుందని ఎంబీఎస్ తెలిపారు. నియోమ్‌లో పోర్ట్‌లు, ఎంటర్ప్రైజ్ జోన్లు, పరిశోధనా కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలు, క్రీడా కేంద్రాలు, వినోద వేదికలు ఉంటాయని ఎంబీఎస్ తెలిపారు. నియోమ్ పునరుత్పాదక ఇంధన వనరుల నుండి వంద శాతం శక్తిని అందుకుంటుంది. సూర్యరశ్మి, గాలి, హైడ్రోజన్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని మాత్రమే నియోమ్ వినియోగిస్తుంది. ఫలితంగా ఈ సిటీలో కర్బన ఉద్గారాల విడుదల ప్రస్తావనే ఉండదు. ఈ నగరానికున్న మరొక ప్రత్యేకత ఏమిటంటే కర్మాగారాల నుంచి వెలువడే వ్యర్థాలతో కూడిన నీటిని సముద్రంలోకి తరలించరు. దానిని తిరిగి పారిశ్రామిక ముడి పదార్థంగా వినియోగిస్తారు. వ్యవసాయం విషయంలో కూడా నియోమ్ ప్రపంచంలోనే ప్రత్యేకంగా నిలవనుంది. గ్రీన్‌హౌస్‌ల ఏర్పాటుతో ప్రపంచంలోనే ఆహార స్వయం సమృద్ధిగల నగరాన్ని సృష్టించనున్నారు. సౌదీ అరేబియా ప్రస్తుతం 80 శాతం మేరకు ఆహారాన్ని దిగుమతి చేసుకుంటున్నది. ఇది కూడా చదవండి: అమెరికా అంతరిక్ష ప్రయోగాలలో హిట్లర్ సన్నిహితుడు? 1969లో ఏం జరిగింది? -
ప్రజా రవాణా వ్యవస్థకు దూరమవుతున్న జనం.. ఎందుకంటే!
ప్రజా రవాణా వ్యవస్థ పట్ల నగర వాసులకు ఆసక్తి సన్నగిల్లుతోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. వేళాపాళలేకుండా రావడం, గంటలకొద్దీ వేచి చూడడం, ప్రయాణం ఆలస్యం కావడం, బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉండడంతో నగర వాసులు ప్రజా రవాణాకు దూరమవుతున్నారు. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 46 నగరాల్లో 2 లక్షల మంది పైగా తమ అభిప్రాయాలను సర్వేలో వ్యక్తపరిచారు. 15 వేల మంది పైగా బస్సు డైవర్లు, కండక్టర్ల అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు. రద్దీ ఎక్కువ.. నమ్మకం లేదు విపరీతమైన రద్దీ కారణంగా బస్సులు ఎక్కడానికి భయపడుతున్నామని 68 శాతం మంది ప్రయాణికులు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో వెళితే సమయానికి గమ్యస్థానానికి చేరతామన్న నమ్మకం లేదని 64 శాతం మంది చెప్పారు. భద్రత పట్ల 36 శాతం మంది ఆందోళన వెలిబుచ్చారు. బస్టాపుల్లో బస్సులు ఆపడం లేదని 27 శాతం మంది ఫిర్యాదు చేశారు. ఆన్లైన్ చేయాలి ప్రజా రవాణా వ్యవస్థలో టెక్నాలజీ వినియోగం పెరగాలని జనం కోరుకుంటున్నారు. బస్సులు ఏయే మార్గాల్లో, ఏ సమయంలో వెళుతున్నాయి.. ఎక్కెడెక్కడ ఆగుతాయనే సమాచారం ఆన్లైన్లో అందుబాటులో ఉండాలని 57 శాతం మంది కోరుకున్నారు. ఎక్కువ ప్రయాణాలు చేసే వారిలో 54 శాతం మంది ఆన్లైన్ ద్వారా డబ్బులు చెల్లించేందుకు మొగ్గు చూపుతున్నారు. సింగిల్ జర్నీ చేసే వారిలో 53 శాతం మంది నగదు చెల్లించేందుకే ఇష్టపడుతున్నారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లలో ఎక్కువ శాతం క్యాష్ పేమెంట్లకే ఆసక్తి చూపుతున్నారు. ట్రాఫిక్ జామ్‌లతో తంటా నగరాల్లో ట్రాఫిక్ జామ్‌లతో సతమతమవుతున్నామని 59 శాతం మంది డ్రైవర్లు, కండక్టర్లు వాపోయారు. ట్రాఫిక్ కారణంగానే సమయానుకూలంగా బస్సులు నడపలేకపోతున్నామని చెప్పారు. ఇక బస్సు సిబ్బందిని అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. దాదాపు 50 శాతం మంది రోగాల బారిన పడుతున్నారు. 34 శాతం మంది బస్సు డ్రైవర్లకు బీమా భద్రత లేదు. ఆటో, క్యాబ్ డ్రైవర్లలో 45 శాతం మందికి ఆరోగ్య బీమా సౌకర్యం అందని ద్రాక్షగానే ఉంది. ఒత్తిడి, ఆందోళన, కీళ్లు-ఒళ్లు నొప్పులు ఎక్కువగా వేధించే సమస్యలని వెల్లడించారు. సర్వే ఎందుకంటే.. స్మార్ట్ సిటీ మిషన్ కార్యక్రమంలో భాగంగా ‘ట్రాన్స్‌ఫోర్ట్ ఫర్ ఆల్ చాలెంజ్’ పేరుతో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ ఈ సర్వే చేపట్టింది. 2021 అక్టోబర్ నుంచి 2022 ఏప్రిల్ వరకు సర్వే నిర్వహించింది. ప్రజా రవాణా వ్యవస్థలో సమస్యలను గుర్తించి, వాటికి పరిష్కార మార్గాలు అన్వేషించడానికి ఇదంతా చేస్తోంది. ప్రజా రవాణా వ్యవస్థకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున సమాచారం సేకరించడం ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు. సర్వేలో గుర్తించిన సమస్యల పరిష్కారానికి రెండో దశలో ప్రయత్నాలు చేస్తామన్నారు. అంకుర సంస్థలు ఏమైనా పరిష్కారాలు ఉంటే స్టార్టప్ ఇండియా పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. (క్లిక్: కేపీహెచ్‌బీ టూ ఓఆర్ఆర్.. మెట్రో నియో పట్టాలెక్కేనా!) -
Karimnagar: ‘స్మార్ట్’ పనులకు.. ఒక్క రూపాయి ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, కరీంనగర్: కరీం‘నగరం’స్మార్ట్ సిటీ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. సీఎం కేసీఆర్, మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక చొరవతో 2017లో జూన్ 23వ తేదీన కరీంనగర్‌కు స్మార్ట్‌సిటీ హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2019 ఫిబ్రవరి 25వ తేదీన స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో స్మార్ట్‌సిటీ నిర్మాణం, ఆధునీకరణ పనులు మొదలయ్యాయి. గతంలో ఉన్న 50 డివిజన్ల నుంచి 31 డివిజన్లు ఎంపికకాగా మొదటిదశలో 11 రోడ్లను వీటిలో 9 ఆధునిక సీసీరోడ్లు అందుబాటులోకి వచ్చాయి. జీవన ప్రమాణాల్లో 22వ స్థానం, నగరపాలక పనితీరులో 21వ స్థానాన్ని కరీంనగర్ దక్కించుకుంది. ఓడీఎఫ్ ప్లస్‌ప్లస్ స్థానం సాధించింది. నగరపాలక సంస్థ ఇప్పటివరకు స్వచ్ఛ సర్వేక్షణ్‌లో 2015లో 259వ ర్యాంకు, 2017లో 201, 2018లో 73 ర్యాంక్ సాధించగా, 2019లో 99వ ర్యాంక్‌కు పడిపోయింది 2020లో కస్తా మెరుగుపడి 72వ ర్యాంక్ సాధించింది. 2021లో 10లోపు ర్యాంకు సాధించడానికి చర్యలు తీసుకుంటున్నారు. స్మార్ట్‌సిటీ పనులకోసం కేంద్రం ఇప్పటివరకు రూ.196 కోట్లు విడుదల చేయగా రాష్ట్రం మాత్రం ఒక్క రూపాయి ఇవ్వలేదు. నాడు...నేడు... కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లు ఉండగా 600 కిలోమీటర్ల మేరకు డ్రైనేజీలు, 650 కిలోమీటర్లకుపైగా ప్రధాన అంతర్గత రోడ్లు ఉన్నాయి. వివిధ కాలనీలతోపాటు నగరంలోని నడిబోడ్డున ఉన్న భగత్‌నగర్‌కు కనీస రహదారి లేక ఇబ్బందులు పడేవారు. కలెక్టరేట్ రోడ్డు మొ త్తం నీటితో నిండిపోయి రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి ఉండేది. స్మార్ట్‌సిటీగా కరీంనగర్ నగరపాలక సంస్థను ఎంపిక చేయడంతో పట్టణం అభివృద్ధిబాట పట్టింది. రూ.1878 కోట్లతో మొ దటగా 54 పనులు చేపట్టాలని డిటైల్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్) రూపొందించారు. స్మార్ట్‌సిటీ(ఎస్ఆర్ఎం) కింద రూ.975 కోట్లు కేటాయించగా, కన్వెర్జన్స్గా రూ.472 కోట్లు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) కింద రూ.393 కోట్లు కేటాయించి ముందుకుసాగుతున్నారు. మొదటి దశ పనులు స్మార్ట్‌సిటీలో భాగంగా రూ.1878 కోట్లతో డీపీఆర్‌లు రూపొందించగా మొదటిదశలో రూ. 416 కోట్లతో 11 పనులకు ఆమోదం తెలుపగా రూ.266.66 కోట్లతో 9 పనులు కొనసాగుతున్నాయి. రూ.3.80 కోట్లతో సర్కస్ మైదానం పార్క్ పనులు, రూ. 7.20 కోట్లతో పురాతన పాఠశాల మైదానం పార్క్ పనులు, రూ. 53.70 కోట్లతో ప్యాకేజీ–3 కింద హౌసింగ్‌బోర్డు రహదారుల నిర్మాణం పనులు, రూ.18 కోట్లతో అంబేద్కర్ స్టేడియం స్పోర్ట్ కాంప్లెక్స్ పనులు, రూ.16.90 కోట్లతో టవర్ సర్కిల్ అభివృద్ధి పనులు, రూ.84 కోట్లతో ప్యాకేజీ–1 కింద ప్రధాన రహదారుల నిర్మాణం, రూ. 80 కోట్లతో ప్యాకేజీ–2 కింద రోడ్ల పనులు చేపడుతున్నారు. రూ.2.43 కోట్లతో కంప్యాక్టర్ స్టేషన్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. రెండోదశ పనులు సుమారు రూ.500 కోట్లతో పనులు చేయడానికి ఆమోద ముద్ర వేస్తూ జూలై 8వ తేదీ 2020న నిర్ణయం తీసుకున్నారు. రూ.78 కోట్లతో డంపుయార్డ్ ఆధునీకరణ, రూ. 68 కోట్లను మూడు జోన్లలో రోజు వారి మంచినీటి పథకానికి కేటాయించారు. స్మార్ట్‌సిటీలో ఈ–బస్సుల కోసం రూ.20 కోట్లు, ఈ–స్మార్ట్‌క్లాస్ రూంలకోసం రూ.21 కోట్లు, రూ.150 నుంచి రూ.180 కోట్లతో కమాండ్ కంట్రోల్‌రూం నిర్మాణంకోసం బోర్డు ఆమోద ముద్ర వేసింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి రూ.52 కోట్లు, సీసీ కెమెరాలు, ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడానికి రూ.20 కోట్లు, అలుగునూర్ చౌరస్తా అభివృద్ధికి రూ.5 కోట్లు, మల్టిపర్పస్ పార్క్‌ల నిర్మాణానికి రూ.3 కోట్లు, స్మృతివనం కోసం ప్రతిపాదించిన ప్రకారం ఎంతైనా నిధులు వినియోగించుకునే అవకాశం, రూ.11 కోట్లతో సోలార్‌సిస్టం ఏర్పాటుకు, రూ. 07 కోట్లతో ఇంకుడు గుంతల నిర్మాణంకోసం కేటాయించారు. ఇంకా నిధుల కొరత నిధులు విడుదల లేకపోవడంతో స్మార్ట్ సిటీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. డీపీఆర్ ప్రకారం మొదట 54 పనులకు ఆమోదం తెలిపి పనులు ప్రారంభించారు. వివిధవర్గాల విజ్ఞప్తుల మేరకు మరో 6 పనులు వాటికి కలుపుకుని మొత్తం 60 పనులు చేయడానికి డీపీఆర్ సిద్ధం చేశారు. వీటిలో 10 పూర్తిస్థాయిలో కాగా మరో10 పనులు వచ్చే మూడునెలల్లోనే అందుబాటులోకి వస్తాయని మున్సిపల్ కమిషనర్ క్రాంతి చెబుతున్నారు. ఇవికాకుండా మరో 5 పనులు టెండర్లు పూర్తయి అనుమతికోసం వేచి చూస్తున్నాయి. మరో30 పనులు డీపీఆర్ సిద్ధం చేసి ఉంచారు. వీటికి అనుమతి లభించడంతో త్వరలో టెండర్లు పిలవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పనులకు అనుమతి మొదటిదశ పనులకు రూ.196 కోట్ల పనులకు అనుమతి లభించింది. రూ.174 కోట్ల పనులు పూర్తి చేయగా వీటిలో రూ.119 కోట్లు కాంట్రాక్టర్‌కు చెల్లించారు. ఎస్పీవీ వద్ద రూ. 18 కోట్ల రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం వద్ద రూ. 61 కోట్ల రూపాయలున్నాయి. వచ్చే రెండునెలల్లో రూ.18 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంది. ఇవికాకుండా రూ.375 కోట్ల పనులు కొనసాగుతున్నాయి. ఇవి వచ్చే మూడు నెలల్లోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరో రూ.200 కోట్ల రూపాయల డీపీఆర్‌లు సిద్ధంగా ఉన్నాయి. వీటిని త్వరలో ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం మూలంగా నిధులు సరైన సమయంలో విడుదల చేయకపోవడంతో పనులు నెమ్మదిగా సాగుతున్నాయని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్‌సిటీ కింద రూ. 900 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.196 కోట్లు విడుదల చేసింది. వీటి నుంచి రూ.192 కోట్ల నిధులు స్మార్ట్‌సిటీ ఖాతాకు జమ అయ్యాయి. అంతేమొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ షేర్ కింద వాటా జమ చేయాలి.. ఇంతవరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. కేంద్ర వాటాలోని రూ.900 కోట్ల రూపాయల నుంచి సగం వాటా సుమారు రూ.400 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉండగా ఎలాంటి నిధులు మంజూరు చేయలేదు. సీఎం అస్యూరెన్స్ కింద కరీంనగర్‌కు ప్రత్యేకంగా రూ.350 కోట్లు కేటాయించారు. ఇప్పటివరకు రూ.147 కోట్లు విడుదల చేశారు. వీటిని స్మార్ట్‌సిటీలో ఎంపిక కాని డివిజన్లు, శివారు ప్రాంతాల అభివృద్ధికి వినియోగిస్తున్నారు. చదవండి: కష్టాలు తెలుసుకుని కన్నీళ్లు తుడిచేందుకే.. -
ఏపీ: సర్కార్ బడికి న్యూ లుక్..
సాక్షి, విశాఖపట్నం: డిజిటల్ తరగతులు.. క్రీడా మైదానాలు.. ఆవరణలో పచ్చదనం.. విద్యార్థుల ఆరోగ్యం.. ఇతర మౌలిక సదుపాయాలతో కార్పొరేషన్ పాఠశాలలు భాసిల్లుతున్నాయి. జీవీఎంసీ తీర్చిదిద్దిన ఈ మోడల్ స్కూళ్లను చూసి అచ్చెరువొందిన ఫ్రెంచ్ ప్రతినిధులు మరికొన్ని పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చారు. ఈ పాఠశాలలను మరింత స్మార్ట్‌గా మార్చేందుకు ఫ్రెంచ్ డెవలప్మెంట్ ఏజెన్సీ(ఏఎఫ్‌డీ) రూ.52 కోట్ల గ్రాంట్ అందించనుంది. సిటీస్ అంటే ఏంటి.? నగరాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు విభిన్న ప్రాజెక్టులతో ముందుకెళ్తున్న మహా విశాఖ నగర పాలక సంస్థ మరో ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. సిటీ ఇన్వెస్ట్మెంట్ టు ఇన్నోవేటివ్, ఇంటిగ్రేటెడ్ అండ్ సస్టైన్ (సిటీస్) ఛాలెంజ్ పేరుతో 2019లో జరిగిన పోటీలో 15 నగరాలకు సంబంధించి మొత్తం 26 ప్రాజెక్టులు ఎంపికవ్వగా.. ఇందులో జీవీఎంసీకి చెందిన ఓ ప్రాజెక్టు అవార్డు సొంతం చేసుకుంది. స్మార్ట్‌సిటీలుగా ఎంపికైన 100 నగరాల్లో 15 ప్రధాన నగరాల మధ్య కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఛాలెంజ్ ప్రాజెక్టుల్లో జీవీఎంసీ పాఠశాలలను ఆధునికీకరించిన విభాగంలో ఫ్రెంచ్ ప్రభుత్వాన్ని ఆకర్షించింది. ఈ ప్రాజెక్టుకు ఫిదా అయిన ఫ్రాన్స్ ప్రభుత్వానికి అనుబంధ సంస్థైన ఫ్రెంచ్ డెవలప్మెంట్ ఏజెన్సీ(ఎఎఫ్‌డీ) పాఠశాలలు అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చింది. ఎంత నిధులు..? మొత్తం రూ.65 కోట్లతో గ్రేటర్ పరిధిలోని 40 పాఠశాలలను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో రూ.52 కోట్లు ఫ్రెంచ్ ప్రభుత్వ సంస్థ ఏఎఫ్‌డీ మంజూరు చేస్తుంది. మిగిలిన రూ.13 కోట్లు జీవీఎంసీ కేటాయిస్తుంది. ఏఏ పాఠశాలలను అభివృద్ధి చేస్తారు.? మొత్తం 40 పాఠశాలలను ఎంపిక చేశారు. భీమిలి జోన్లో 6 స్కూల్స్, జోన్–3లో 7 పాఠశాలలు, జోన్–4లో 7, జోన్–5లో 11, అనకాపల్లిలో 9 పాఠశాలలను ఎంపిక చేశారు. ఇందులో 34 ప్రాథమిక పాఠశాలు కాగా, 6 హైస్కూల్స్ ఉన్నాయి. పాఠశాలలను ఎలా ఎంపిక చేశారు.? సిటీస్ ప్రాజెక్టుకు అనుగుణంగా స్కూల్స్‌లో స్మార్ట్ క్యాంపస్, క్రీడా ప్రాంగణానికి అనువైన స్థలం ఉండటంతో పాటు బాల బాలికల నిష్పత్తి, పాఠశాల అభివృద్ధి చేస్తే బాలికలు చదువుకునేందుకు వచ్చే అవకాశాలు, అభివృద్ధికి ఆస్కారం ఉన్న పాఠశాలలను ఎంపిక చేశారు. ఎలా అభివృద్ధి చేస్తారు..? విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తారు. సామాజిక వసతులతో పాటు అభ్యసనకు అవసరమైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఆటస్థలం, పాఠశాల ఆవరణలో పచ్చదనం పెంపొందించడం, డిజిటల్ తరగతి గదులు, విద్యార్థులు ఆరోగ్య వ్యవహారాలను ఎప్పటికప్పుడు పరిశీలించేలా రికార్డులు నిర్వహణ ఇలా అనేక అంశాల్లో పాఠశాలను అభివృద్ధి చేసేలా ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది. -
పురపాలకానికి నిధుల వరద
సాక్షి, హైదరాబాద్: పురపాలక శాఖకు బడ్జెట్లో నిధుల వరద పారింది. 2020–21లో ఈ శాఖకు రూ.12,287.29 కోట్లు ఇవ్వగా.. ఈసారి (2021– 22లో) రూ.14,112.24 కోట్లకు పెంచారు. ఇందు లో నిర్వహణ పద్దు కింద కేటాయింపులు రూ.1,261.98 కోట్ల నుంచి రూ.3,978.01 కోట్లకు పెరగగా.. ప్రగతిపద్దు కేటాయింపులు రూ.11,020.31 కోట్ల నుంచి రూ.10,134.23 కోట్లకు తగ్గాయి. హైదరాబాద్ నగరానికి ఈసారి కూడా భారీగా కేటాయింపులు ఉన్నాయి. నిర్వహణ పద్దు కింద జల మండలికి రుణాలను రూ.900 కోట్ల నుంచి రూ.738.52 కోట్లకు తగ్గించారు. అభివృద్ధి పనుల కోసం కొత్తగా రూ.668 కోట్లను కేటాయించారు. కృష్ణా డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులో భాగంగా సుంకిశాల ఇంటేక్ నుంచి హైదరాబాద్‌కు నీటి సరఫరా చేసే పనుల కోసం రూ.725 కోట్ల రుణానికి ఓకే చెప్పారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు రూ.వెయ్యి కోట్లు, ఓఆర్ఆర్ కోసం హెచ్ఎండీఏకు రూ.472 కోట్లు రుణాలుగా కేటాయించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర వాటాగా స్మార్ట్‌సిటీలకు రూ.288.60 కోట్లు, అమృ త్ నగరాలకు రూ.203.02 కోట్లు కేటాయించారు. పట్టణాల్లో పనుల కోసం.. రాష్ట్ర పథకాల కింద మూసీ పరీవాహక ప్రాంత అభి వృద్ధికి రూ.200 కోట్లు, టీయూఎఫ్ఐడీసీకి రూ.219.33 కోట్లు, హైదరాబాద్ ప్రజలకు 20వేల లీటర్ల ఉచిత నీటిసరఫరా కోసం జలమండలికి రూ.250 కోట్లు, కొత్త ఎయిర్‌స్ట్రిప్‌లకు రూ.75.47 కోట్లు, వరంగల్ మెట్రో ప్రాజెక్టుకు రూ.150.94 కోట్లు, హైదరాబాద్ అర్బన్ అగ్లోమెరేషన్ పనులకు రూ.1,962.22 కోట్లు కేటాయించారు. యాదాద్రికి రూ.350 కోట్లు గత బడ్జెట్ తరహాలోనే యాదాద్రి ఆలయ అభివృద్ధి సంస్థ (వైటీడీఏ)కు రూ.350 కోట్లు, వేములవాడ ఆలయాభివృద్ధి సంస్థ (వైటీడీఏ)కు రూ.50 కోట్లు ఇచ్చారు. పదిలక్షలపైన జనాభా గల నగరాలకు ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ల కింద హైదరాబాద్ నగరానికి రూ.318 కోట్లు, ఇతర నగరాలకు రూ.354 కోట్లను ప్రతిపాదించారు. స్వచ్ఛ భారత్‌కు భారీగా.. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద స్వచ్ఛ భారత్‌కు రూ.783.75 కోట్లు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై)కు రూ.166.50 కోట్లను బడ్జెట్లో కేటాయించారు. మున్సిపాలిటీలకు రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులను రూ.889 కోట్ల నుంచి రూ.672 కోట్లకు తగ్గించారు. పురపాలికలకు ఆరోగ్య రంగం కింద ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లుగా రూ.107.51 కోట్లను కొత్తగా కేటాయించారు. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు వడ్డీలేని రుణాల కింద నిధుల కేటాయింపులను రూ.226.41 కోట్ల నుంచి 566.02 కోట్లకు పెంచారు. -
స్మార్ట్ సిటీలు.. కావాలా..వద్దా?
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ వరంగల్, కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులపై నీలినీడలు కమ్ముకున్నాయి. రాష్ట్ర వాటాగా ఇవ్వాల్సిన నిధుల్లో ఒక్క రూపాయి కూడా వీటికి విడుదల చేయకపోవడంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆసక్తి లేకపోతే ఈ రెండు నగరాలను స్మార్ట్‌సిటీల జాబితా నుంచి తొలగించి కొత్తవాటిని ఎంపిక చేస్తామని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ తెలంగాణ సర్కారుకు తేల్చిచెప్పింది. ఇందుకువీలుగా ఈ ప్రాజెక్టులకు కేంద్రం ఇప్పటివరకు విడుదల చేసిన నిధులను వెనక్కి ఇచ్చేయాలని కోరింది. కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్య దర్శి దుర్గాశంకర్ మిశ్రా గత జూన్ 4న సీఎస్ సోమేశ్‌కుమార్‌కు ఈ మేరకు ఓ లేఖను రాశారు. ఇది ఆలస్యంగా వెలుగుచూసిం ది. లేఖ రాసేనాటికి గ్రేటర్ వరంగల్, కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులకు కేంద్రం రూ.196 కోట్ల చొప్పున విడుదల చేసింది. అంతే మొత్తం మ్యాచింగ్ గ్రాంట్‌గా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. రాష్ట్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోగా... తామిచ్చిన నిధులనూ పూర్తిగా బదలాయించకుండా అట్టిపెట్టుకోవడంపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. స్మార్ట్ సిటీ మిషన్ మార్గదర్శకాల ప్రకారం కేంద్రం విడుదల చేసిన నిధులను ఏడు రోజుల్లోగా రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల స్పెషల్ పర్పస్ వెహికల్స్ (ఎస్పీవీ)కు బదలాయించాల్సి ఉంటుందని, సమాన మొత్తంలో రాష్ట్ర వాటా నిధులను ఇవ్వాల్సి ఉంటుందని గుర్తు చేసింది. తక్షణమే ఈ నిధులను ఎస్పీవీలకు అందించేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని సీఎస్ సోమేశ్‌కుమార్‌కు కేంద్రం సూచించింది. 2016 మేలో గ్రేటర్ వరంగల్, ఆగస్టులో కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులను కేంద్రం రాష్ట్రానికి మంజూరు చేసింది. వీటికి నిధుల విడుదల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ కేంద్రం లేఖ రాసి 5 నెలలు గడిచిపోయిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పనుల పురోగతిపై ‘సాక్షి’దృష్టిసారించింది. ఆ వివరాలివి.... గ్రేటర్ వరంగల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ►స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు అంచనా వ్యయం: రూ.2,350 కోట్లు ►పనుల ప్రారంభం 2017 నవంబర్ 17 ►మొత్తం ప్రాజెక్టులు: 94 ►పనులు పూర్తయిన ప్రాజెక్టులు 17. ఖర్చు చేసిన నిధులు రూ.61.35 కోట్లు ►పురోగతిలో ఉన్న ప్రాజెక్టుల పనులు 32. అవసరమైన నిధులు రూ.1,271 కోట్లు ►టెండర్ దశలో 14 ప్రాజెక్టులు, అంచనా వ్యయం రూ.359 కోట్లు ►డీపీఆర్‌లు ఆమోదించిన ప్రాజెక్టులు 14. అంచనా వ్యయం రూ.66.12 కోట్లు ►డీపీఆర్ తయారీ దశలో 17 ప్రాజెక్టులు. అంచనా వ్యయం రూ.592 కోట్లు. సీఎం హామీల అమలుకు ఇప్పటికే చాలా నిధులు ఇచ్చాం రాష్ట్రానికి మంజూరు చేసిన స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులను రద్దు చేస్తామని కేంద్రం రాసిన లేఖ పాతది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మొత్తం నిధులను వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లకు విడుదల చేశాం. పనుల పురోగతిని బట్టి రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులను విడుదల చేస్తాం. ఈ రెండు నగరాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీల అమలులో భాగంగా ఇప్పటికే చాలా నిధులను విడుదల చేశాం. – అరవింద్‌కుమార్, రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి రూ.196 కోట్లకు 138 కోట్లు మాత్రమే జమ కేంద్ర ప్రభుత్వం వరంగల్ స్మార్ట్‌సిటీ మిషన్ అంచనా వ్యయంలో ఇప్పటివరకు రూ.196 కోట్లు విడుదల చేసింది. ఇందులో స్మార్ట్‌సిటీ ఖాతా (ఎస్పీవీ)కు రూ.138 కోట్లు మాత్రమే జమ అయ్యాయి. మరో రూ.58 కోట్లు జమ కావాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద రూ.500 కోట్ల నిధులు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. గ్రేటర్ వరంగల్‌లో భద్రకాళి చెరువు రీ జనరేషన్ ల్యాండ్ స్కేపింగ్, బండ్ రిటర్నింగ్ వాల్, 13 ట్రాఫిక్ సిగ్నల్స్, ఏంజీఎంలో 750 కేఎల్డీ మురుగునీటి శుద్దీకరణ ప్లాంటు, రీజినల్ లైబ్రరీ పునరుద్ధరణ, సుబేదారి జంక్షన్ పుట్‌పాత్ పనులు పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఫస్ట్‌ఫేజ్‌లో 4 స్మార్ట్‌సిటీ రోడ్లు (3.95 కిలోమీటర్లు) పనులు పురోగతిలో ఉన్నాయి. 10.62 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు నడుస్తున్నాయి. రూ.26.5 కోట్లతో నాలుగు ప్రధాన రహదారుల్లో స్వాగత తోరణాల పను లు పురోగతిలో ఉన్నాయి. రూ.65.5 కోట్లతో భద్ర కాళి బండ్ పనులు నడుస్తున్నాయి. రూ.8.36 కోట్లతో స్వీపింగ్ మిషన్లు, ఇతర వాహనా లను కొనుగోలు చేశారు. కేంద్రం ఇచ్చినా... రాష్ట్రం వద్దే ఆగిన రూ.71 కోట్లు కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ.900 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.196 కోట్లు విడుదల చేసింది. వాటిలో రూ.125 కోట్ల నిధులు మాత్రమే స్మార్ట్‌సిటీ ఖాతాకు జమ అయ్యాయి. మరో 71 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వద్దే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ వాటా నుంచి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. రూ.266.66 కోట్ల అంచనాలతో ప్రస్తుతం 9 పనులు కొనసాగుతున్నాయి. రూ.84 కోట్లతో ప్యాకేజీ–1 కింద ప్రధాన రహదారుల నిర్మాణం, రూ.80 కోట్లతో ప్యాకేజీ–2 కింద రోడ్ల అభివృద్ధి పనులు చేపడుతున్నారు. రెండో విడతగా రూ.131.40 కోట్లతో 7 పనులకు డీపీఆర్‌లు సిద్ధం చేశారు. వీటిలో 24 గంటల నీటి సరఫరా, నగర ముఖద్వారాల నిర్మాణం, ఈ– ఎడ్యుకేషన్, మరుగుదొడ్ల నిర్మాణం, హోల్‌సేల్ కూరగాయల మార్కెట్ లాంటివి ఉన్నాయి. కరీంనగర్ ప్రాజెక్టు స్వరూపం.. ►కరీంనగర్ స్మార్ట్‌సిటీ పనుల ప్రారంభం: 2017 మార్చి 31న ►స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుల అంచనా మొత్తం: రూ.1,878 కోట్లు ►రెట్రోఫిట్టింగ్ (అదనపు హంగులు) పనులకు రూ.267 కోట్లు, ►వినోదాత్మక, పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి రూ.76 కోట్లు ►ప్రజారవాణా సదుపాయాల అభివృద్ధికి రూ.337 కోట్లు ►మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.540 కోట్లు ►విద్యుత్ సరఫరా వ్యవస్థ అభివృద్ధికి రూ.83 కోట్లు ►ఇతర అవసరాలకు రూ.110 కోట్లు ►ఇంటలిజెంట్ రవాణాకు రూ.226 కోట్లు ►24/7 నీటి సరఫరాకు రూ.140 కోట్లు ►స్మార్ట్ విద్యావిధానానికి రూ. 15 కోట్లు ►స్మార్ట్ గవర్నెన్స్‌కు రూ.36 కోట్లు ►ఇతర అవసరాలకు రూ.22 కోట్లు -
కరోనాకు చెక్; తిరుపతికి ఫస్ట్ ర్యాంక్
సాక్షి, అమరావతి: స్మార్ట్ సిటీల్లో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలు బాగున్నాయ్.. మిగతా పట్టణాలతో పోలిస్తే మెరుగ్గా ఉన్నాయ్.. అంటూ స్మార్ట్ సిటీ మిషన్ కితాబిచ్చింది. ఈ మేరకు ఓ నివేదిక ఇచ్చింది. తిరుపతిలో కరోనా నియంత్రణ చర్యలు అద్భుతంగా ఉన్నట్టు పేర్కొంది. స్మార్ట్ నగరాల పనితీరును బట్టి సాధారణం, బాగా చే స్తున్నవి, అద్భుతంగా చేస్తున్నవి.. ఇలా మూడు గ్రేడ్లుగా విభజించి, అక్కడి సేవలను పరిశీలించి స్మార్ట్‌సిటీ మిషన్ ర్యాంకులిచ్చింది. మన రాష్ట్రంలో విశాఖ, అమరావతి, కాకినాడ, తిరుపతిలు స్మార్ట్ నగరాలు. ఈ నాలుగింటిలో తిరుపతికి మొదటి ర్యాంకు వచ్చింది. వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలు ఇక్కడ బాగున్నట్టు తన నివేదికలో తేల్చింది. నివేదికలోని ముఖ్యాంశాలు.. ► తిరుపతికి సంబంధించి విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల ఇళ్ల వద్ద మార్కింగ్ వేశారు. క్వారంటైన్ పర్యవేక్షణ బాగుంది. ► ఇంటింటికీ వెళ్లి నిత్యావసరాలు, కిరాణా సరుకులు అందజేస్తున్నారు ► వార్డు సెక్రటరీలు, సిబ్బంది ఆయా వార్డుల్లో పటిష్టంగా, ప్రజలను నొప్పించకుండా సేవలందిస్తున్నారు. ► విశాఖపట్నంలో పబ్లిక్ అనౌన్స్మెంట్ విధానం చాలా బావుంది ► అంతర్జాతీయ ప్రయాణికులను గుర్తించడంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ చక్కగా పనిచేస్తోంది ► కాకినాడలో 24 గంటల హెల్ప్ డెస్క్‌లు, ఎమర్జెన్సీ కాల్ బాక్స్‌ను ఏర్పాటు చేశారు ► అమరావతిలో పబ్లిక్ అవేర్నెస్ బ్యానర్లు విరివిగా ఏర్పాటు చేయడంతో పాటు హోమియో మందులు సరఫరా చేస్తున్నారు. (చదవండి: ఢిల్లీ వెళ్లొచ్చిందెవరు? ) -
కొత్తగా 5 స్మార్ట్ నగరాలు..
న్యూఢిల్లీ : ఈ ఏడాది కొత్తగా 5 స్మార్ట్ నగరాలను అభివృద్ధి చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2020-21 సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను శనివారం నిర్మల పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టెక్స్టైల్ రంగానికి మరింత ప్రోత్సహం అందిస్తామని చెప్పారు. మొబైల్ తయారీ పరిశ్రమలకు మరింత ప్రోత్సహం అందజేస్తామన్నారు. నేషనల్ టెక్స్టైల్ మిషన్‌కు రూ.1480 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. (బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) అలాగే యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడానికి కొత్త పథకానికి తీసుకురానున్నట్టు చెప్పారు. గ్లోబలైజేషన్‌కు అనుగుణంగా పరిశ్రమల అభివృద్దికి తోడ్పాటు అందిస్తామన్నారు. ల్యాండ్ బ్యాంక్, ఇతర ప్రభుత్వ అనుమతుల కోసం ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. మౌలిక వసతులు అభివృద్ధికి సంబంధించి పీపీపీ విధానం తీసుకోస్తున్నట్టు చెప్పారు. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. (మరింత ఈజీగా జీఎస్టీ: నిర్మలా సీతారామన్) -
ఇస్మార్ట్ సిటీ దిశగా శ్రీకాకుళం
స్మార్ట్ సిటీ దిశగా శ్రీకాకుళం పరుగులు పెట్టనుంది. అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన 13 నగరాల్లో చిక్కోలుకు స్థానం దక్కడంతో హర్షం వ్యక్తమవుతోంది. టీడీపీ హయాంలో స్మార్ట్ సిటీ అంటూ హడావుడి చేసినా నిధులు విడుదల చేయకపోవడంతో మాటలకే పరిమితమైంది. పది రోజుల క్రితం పరిశీలన కోసం ముగ్గురు అధికారుల బృందాన్ని పంపిన ప్రభుత్వం.. వారి నివేదిక ఆధారంగా వెనువెంటనే నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ సిటీ పథకం అమలైతే శ్రీకాకుళం నగరంతోపాటు విలీనం కానున్న ఏడు పంచాయతీలు కూడా అభివృద్ధి పథంలో నడుస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. సాక్షి, శ్రీకాకుళం : ప్రతి ఏటా రూ.90 కోట్లతో అభివృద్ధి పనులు.. మూడేళ్లలో రూ.270 కోట్లు వెచ్చించి శ్రీకాకుళం నగరాభివృద్ధి.. ఇదీ గత ప్రభుత్వం ఆర్భాటంగా చేసిన ప్రకటన. వాస్త వం మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉం ది. స్మార్ట్ సిటీ పథకంలో ప్రజలకు సౌకర్యాలను కల్పించే పనులను అంతంతమాత్రంగానే చోటు కల్పించారు. ఏడు రోడ్లు కూడలి నుంచి నవభారత్ జంక్షన్ వరకు ఉన్న రోడ్డు ను విస్తరించే పనులను చేపట్టారు. సుమారు రూ.2 కోట్ల విలువైన పనులను కాంట్రాక్టర్‌తో జరిపించారు. అతనికి చెల్లింపులు మాత్రం రూ.50 లక్షల వరకు మాత్రమే జరిగింది. అలాగే ఆదివారపు పేట నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు ఉన్న నాగావళి నది గట్టునకు రిటైనింగ్ వాల్ నిర్మించి అక్కడ రూ.8 కోట్లతో పార్కును నిర్మించేందుకు కూడా అంచనాలు రూపొందించారు. ఇవన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. అక్కడ కూడా కాంట్రాక్టర్‌తో కొద్దిపాటి పనిచేయించి రూ.20 లక్షల వరకు బిల్లును చెల్లించారు. సకాలంలో బిల్లులు ఇవ్వపోవడంతో కాంట్రాక్టర్లు పనులను నిలిపివేశారు. రూ.90 కోట్లతో తొలి ఏడాది పనులు చేపడతామని ప్రకటించినా కనీసం రూ.9 కోట్ల పనులను కూడా చేపట్టలేదు. జరిగిన రూ.3 కోట్ల పనుల్లో రూ.కోటి వరకు మాత్రమే బిల్లు చెల్లింపులు జరిగాయి. ఇలా స్మార్ట్ సిటీ పథకాన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. పది రోజుల్లోనే నిర్ణయం ప్రస్తుత ప్రభుత్వం స్మార్ట్ సిటీ పథకంపై పది రోజుల్లోనే ఓ నిర్ణయాన్ని తీసుకుంది. రివర్స్ టెండరింగ్ కోసం అన్ని కాంట్రాక్టు పనులను నిలిపివేయాలని ఆదేశించిన ప్రస్తుత ప్రభుత్వం స్మార్ట్ సిటీ పథకం పరిశీలన కోసం పది రోజుల క్రితం ముగ్గురు అధికారుల బృందాన్ని పంపిన విషయం పాఠకులకు తెలిసిందే. వారు నగరంలో విస్తృతంగా పర్యటించి మునిసిపల్ అధికారులు, ఉడా అధికారులతో చర్చించి నగర ప్రజలకు అవసరమైన పనులను గుర్తించారు. గత ప్రభుత్వ హయాంలో స్మార్ట్ సిటీ పథకం ద్వారా ఏయే పనులను చేయాలనుకున్నారో, అవి ఏ స్థాయిలో ఉన్నాయో, అవి ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడతాయో తెలుసుకొని అన్ని వివరాలతో ఐదు రోజుల క్రితం ప్రభుత్వానికి నివేదించారు. దీనిని పరిశీలించిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్, మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రెండు రోజుల క్రితం మునిసిపల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమీక్షించారు. అందులో త్రిసభ్య కమిటీ నివేదించిన పనులపై చర్చించారు. ముఖ్యంగా రోడ్లు, కాలువలు, తాగునీరు తదితర సమస్యలతోపాటు పార్కుల అభివృద్ధి, ఇతర ప్రజా సౌకర్యాల కల్పనపై దృష్టి సారించాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. తక్షణం అవసరమైన పనులను తొలిదశలో చేపట్టాలని ఆదేశించారు. మొత్తం 13 స్మార్ట్ సిటీలకు ఐదేళ్లలో రూ.5,183 కోట్లు అవసరమవుతాయని అంచనా రూపొందించగా శ్రీకాకుళం నగరానికి రూ.350 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు కేటాయించవచ్చని మునిసిపల్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం మునిసిపల్ ఇంజినీరింగ్ అధికారులు రోడ్లు, కాలువల నిర్మాణం, మరమ్మతులు, ప్రధాన కాలువల నిర్మాణం, పాడైపోయిన పార్కులు, తదితర వాటిని పరిశీలించి అంచనాలు రూపొందించడంలో నిమగ్నమయ్యారు. స్మార్ట్ సిటీ పథకం గురించి అధికారికంగా ఉత్తర్వులు వెలువడిన వెంటనే పనులను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. -
అప్నా సిటీ నం.1
సాక్షి, హైదరాబాద్: మన భాగ్యనగరం అరుదైన గుర్తింపు పొందింది. టాప్100 స్మార్ట్‌నగరాల జాబితాలో మన దేశం నుంచి మూడు నగరాలకు చోటు దక్కగా వాటిల్లో హైదరాబాద్ ముందుంది. స్మార్ట్ నగరాల జాబితాలో గ్రేటర్ హైదరాబాద్ విశ్వవ్యాప్తంగా 67వ ర్యాంకును దక్కించుకుంది. దేశరాజధాని ఢిల్లీ 68వ స్థానం, ముంబై 78వ స్థానం దక్కించుకోవడం గమనార్హం. విశ్వవ్యాప్తంగా బెస్ట్ స్మార్ట్‌సిటీగా సింగపూర్ నిలవగా రెండోస్థానంలో జూరిచ్, మూడోస్థానంలో ఓస్లో, నాలుగోస్థానంలో జెనీవా, ఐదో స్థానంలో కొపెన్‌హెగెన్ నగరాలు నిలిచినట్లు తాజా అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనాన్ని స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్, సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్ సంస్థలు 102 నగరాలపై అధ్యయనం నిర్వహించిన అనంతరం ఈ ర్యాంక్‌లను ప్రకటించాయి. పౌర సేవలను బట్టి ర్యాంకులు 102 నగరాలను 4 గ్రూపులుగా విభజించామని, ఆయా నగరాల్లో స్మార్ట్టెక్నాలజీ వినియోగం, పౌరులకు అందుతున్న సేవలను పరిగణనలోకి తీసుకొని ఈ ర్యాంకింగ్‌లు ఇచి్చనట్లు నిర్వాహకు లు తెలిపారు. ఈ ర్యాంకింగ్‌ల ప్రకారం హైదరాబాద్, న్యూఢిల్లీ నగరాలు ‘సీసీసీ’, ముంబై ‘సీసీ’రేటింగ్ పొందాయన్నారు. ఈ జాబితాలో అగ్రభాగాన నిలిచిన సింగపూర్, జూరిచ్ నగరాలు ‘ఏఏఏ’ర్యాంకింగ్ సాధించాయన్నారు. ఈ జాబితా రూపొందిం చిన ఐఎండీ సంస్థ అధ్యక్షుడు బ్రూనో లెని్వన్ వివరణనిస్తూ విశ్వవ్యాప్తంగా స్మార్ట్‌నగరాలు పలు రంగాల్లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో ముందుంటున్నాయన్నారు. విదేశీ బహుళజాతి సంస్థలు స్మార్ట్‌సిటీల్లో తమ వ్యాపార ప్రణాళికలను విస్తరించేందుకు ముందుకొస్తున్నాయన్నారు. నగరపాలక సంస్థలు పౌరులకు అందిస్తున్న ఆన్లైన్ సేవలు, ఇంటిపన్నులు, నల్లాబిల్లులు, పారిశుద్ధ్యం, ఇతర సమస్యలపై ఆన్లైన్ ఫిర్యాదుల స్వీక రణ, వాటిని పరిష్కరిస్తున్న తీరు, తిరిగి పౌరులకు అందిస్తున్న ఫీడ్‌బ్యాక్ వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు వెల్లడించారు. స్మార్ట్ మొబైల్యాప్ల సృజన, వాటికి లభిస్తున్న ఆదరణను కూడా పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. సూపర్ సింగపూర్ సింగపూర్‌లో పౌరుల భద్రత , మెరుగైన ప్రజారవాణా, ట్రాఫిక్ రద్దీని నియంత్రిం చే చర్యలు, ఆక్సీజన్ అందించేందుకు తీసుకుంటున్న చర్యలు అత్యద్భుతంగా ఉండడంతోనే ఈ సిటీ ఈ జాబితాలో అగ్రభాగాన నిలిచిందని బ్రూనో లెని్వన్ తెలిపారు. జూరిచ్లోనూ ప్రజారవా ణా, స్మార్ట్బైక్ల వినియోగాన్ని పెంచడం వంటి మె రుగైన అంశాల కారణం గా ఈ సిటీ 2వస్థానం దక్కించుకుందన్నారు. -
‘స్మార్ట్ సిటీ పనుల్లో ఎమ్మెల్యే అక్రమాలు’
సాక్షి, కాకినాడ: స్మార్ట్ సిటి పనుల్లో కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే కొండబాబు భారీగా ముడుపులు దండుకున్నారని వైఎస్సార్సీపీ నాయకుడు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. వేసిన రోడ్ల మీదనే మళ్లీ రోడ్లు వేస్తున్నారని, పార్కుల్లో పాత గోడలకే రంగులేసి కొత్తగోడలు చూపిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. పనుల క్వాలీటి కంట్రోల్ పరిశీలించడం లేదని, ఎక్కడా నాణ్యత కానరావడం లేదని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే స్మార్ట్ సిటీ పనుల మీద సమీక్ష చేస్తామని, పనుల నాణ్యత మీద విచారణ జరుపుతామని ద్వారంపూడి స్పష్టం చేశారు. అవినీతి జరిగిందని తేలితే ప్రజా ప్రతినిధులు, కాంట్రాక్టర్లు, అధికారుల మీద చర్యలు తప్పవని హెచ్చరించారు. కొన్ని పనులకు టెండర్లు లేకుండా నామినేషన్ల మీద పనులు అప్పగించారని విమర్శించారు. స్మార్ట్ సిటీ పనుల మీద విజిలెన్స్, మున్సిపల్ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. -
ఏదీ..స్మార్ట్ సిటీల జాడ..?
సాక్షి, విజయనగరం మున్సిపాలిటీ: స్మార్ట్ సిటీ..మంత్రం నిద్రావస్థలో మగ్గుతోంది. తాము అధికారంలోకి రాగానే ప్రతి జిల్లా కేంద్రంతో పాటు అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీలను స్మార్ట్ సిటీలుగా రూపాంతరం చెందేలా చర్యలు తీసుకుంటామన్న ప్రస్తుత ప్రభుత్వ మాటలు నీటి మీద రాతలయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రకటించిన ఈ కార్యక్రమం జిల్లాలోని ఎంపిక చేసిన ఐదు పట్టణ ప్రాం తాల్లోని ఒక్క వార్డులో అమలుకు నోచుకోని పరిస్థితి ఉంది. కేవలం ఆర్భాటాల కోసం పాలన ప్రారంభంలో మున్సిపల్ పాలకవర్గాలు స్మార్ట్ పేరు చెప్పుకుంటూ నిర్వహించిన కార్యక్రమాలు అంత బూటకమని తేలిపోయింది. ఈ విషయంపై ప్రచారానికి పోయిన ప్రభుత్వం, అధికార యం త్రాంగం ప్రస్తుతం ఎలాంటి సమీక్షలు నిర్వహించకుండా నిమ్మకుండడంపై సర్వత్రా విమర్శలు వక్తం అవుతున్నాయి. స్మార్ట్ సిటీల అమలు మాట దేవుడెరుగు కానీ ప్రజలకు కనీస వసతులు దక్కక నానా పాట్లు పడుతున్నారు. ప్రయోజనం శూన్యం.. రాష్ట్ర వ్యాప్తంగా పేరొందిన చిన్నపాటి పట్టణాలు నుంచి పెద్ద నగరాలను సైతం స్మార్ట్ సిటీగా తయారు చేయాలన్న భావనతో 2014లో స్మార్ట్‌వార్డుల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. ముందుగా ఆయా ప్రాంతాలు, పట్టణాలను స్మార్ట్‌గా తీర్చిదిద్దేందుకు దత్తత విధానాన్ని తెరపైకి తెచ్చారు. ఏ ఒక్క శ్రీమంతుడు ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా కార్యక్రమాలు చేపట్టిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో మొత్తం వార్డుల్లో 20 శాతాన్ని 2016 మార్చి నెలాఖరులోగా స్మార్ట్‌గా తీర్చిదిద్దాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నిబంధనలను ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇలా దశల వారీగా స్మార్ట్ వార్డులను తీర్చిదిద్దూతూ పట్టణ ప్రాంతాలను స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, యంత్రాంగం గొప్పలు చెప్పుకున్నారు. దీనిలో భాగంగానే విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో వైస్ చైర్మన్ కనకల మురళీమోహన్ ప్రాతినిధ్యం వహిస్తున్న 9వ వార్డుతో పాటు 3, 5, 13, 15, 22, 24, 32లను ఎంపిక చేశారు. అంతేకాకుండా బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు మున్సిపాలిటీలు, నెల్లిమర్ల నగర పంచాయతీల్లో వార్డులను ఎంపిక చేస్తారు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ వార్డు ప్రజలకు సమస్యల కష్టాల తీరి నట్లేనన్న భావన వ్యక్తం అవుతోంది. అయితే ఐదు పట్టణ ప్రాంతాల్లో ఎంపిక చేసిన ఏ ఒక్క వార్డులో ఈ పథకం అమలుకు నోచుకోలేదు. పలు వార్డుల్లో గతంలో కన్నా పరిస్థితులు మరింత దయనీ యంగా మారిందన్న వివర్శలు వినిపిస్తున్నాయి. తొలి విడతలో ఎంపికైన వార్డులిలే.. ప్రాంతం మొత్తం వార్డులు స్మార్ట్‌వార్డులుగా మార్చాల్సిన సంఖ్య విజయనగరం కార్పొరేషన్ 40 8 బొబ్బిలి మున్సిపాలిటీ 30 6 పార్వతీపురం మున్సిపాలిటీ 30 6 సాలూరు మున్సిపాలిటీ 29 6 నెల్లిమర్ల నగరపంచాయతీ 20 4 స్మార్ట్ వార్డుగా మారాలంటే... ప్రభుత్వం నిర్దేశకాల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో వార్డులు స్మార్ట్‌గా రూపుదిద్దుకోవాలంటే ప్రధానంగా ఐదు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. వార్డు పరిధిలోని గృహాలన్నింటికీ శతశాతం మంచి నీటి కుళాయి కనెక్షన్లు కల్పించాలి. అంతేకాకుండా నిరంతరం వాటి ద్వారా నీటి సరఫరా చేయాల్సి ఉంటుంది. శతశాతం వార్డులోని గృహాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలి. పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా ఇంటింటి చెత్త సేకరణ పక్కాగా నిర్వహించడంతో పాటు సేకరించిన చెత్తను కుప్పలుగా వదిలేయకుండా ఎప్పటికప్పుడు డంపింగ్‌యార్డుకు తరలించాలి. తడి పొడిచెత్తలను వేరు చేయాలి. స్మార్ట్ వార్డులుగా తీర్చిదిద్దాల్సిన వార్డుల్లో పచ్చదనాన్ని అభివృద్ధి చేయాలి. వార్డు పరిధిలో ప్రధాన జంక్షన్లు ఉంటే అక్కడ మొక్కలు నాటాల్సి ఉంటుంది. నీటి సంరక్షణలో భాగంగా ఇంకుడు గుంతలు నిర్మించాలి. వీటితో పాటు జన్మభూమి – మా ఊరు కార్యక్రమంలో అమలు చేయాల్సిన 20 అంశాల్లో ప్రగతి సాధించాలి. -
స్మార్ట్ సిటీగా ‘బిగ్ ఆపిల్’
బార్సిలోనా : ప్రపంచంలోనే అత్యంత ఆకర్షయణీయ నగరం(స్మార్ట్ సిటీ)గా న్యూయార్క్ నిలిచింది. స్పెయిన్‌కు చెందిన ప్రఖ్యాత ఐఈఎస్ఈ బిజినెస్ స్కూల్ పరిశోధన సంస్థ విడుదల చేసిన ఐఈఎస్ఈ సిటీస్ ఇన్ మోషన్ ఇండెక్స్- 2018 ప్రకారం ‘బిగ్ ఆపిల్ సిటీ’ వరుసగా రెండోసారి ఈ ఘనత సాధించింది. ఐఈఎస్ఈ విడుదల చేసిన జాబితా ప్రకారం లండన్, పారిస్, టోక్యో, రెజావిక్, సింగపూర్, సియోల్, టొరంటో, హాంగ్‌కాంగ్, ఆమ్స్టర్డామ్ నగరాలు టాప్ టెన్‌లో చోటు దక్కించుకున్నాయి. కాగా యూరప్ నుంచి 12, ఉత్తర అమెరికా నుంచి 6, ఆసియా నుంచి 4 నగరాలు టాప్ 25 స్మార్టెస్ట్ సిటీలుగా నిలిచాయి. మెరుగైన నగరాల కోసం... తొమ్మిది ప్రామాణిక అంశాల ఆధారంగా సుమారు 80 దేశాలకు చెందిన 165 సిటీల నుంచి 25 స్మార్ట్ సిటీలను ఎంపిక చేసినట్లు ఐఈఎస్ఈ తెలిపింది. సుస్థిరాభివద్ధి, ప్రతిభావంతులైన మానవ వనరులు, శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థ, వివిధ సామాజిక నేపథ్యాలు, పర్యావరణం, పాలన, పట్టణ ప్రణాళిక, అంతర్జాతీయ సంబంధాలు, సాంకేతికత, రవాణా తదితర అంశాల్లో టాప్‌గా నిలిచిన న్యూయార్క్‌ను స్మార్టెస్ట్ సిటీగా గుర్తించినట్లు ఐఈఎస్ఈ పేర్కొంది. గత నాలుగేళ్లుగా ర్యాంకులను ప్రకటిస్తున్నామన్న ఐఈఎస్ఈ ప్రతినిధులు.. ఐదో ఎడిషన్‌లో(2018) నూతన అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపారు. ఉగ్రదాడుల సంఖ్య, తలసరి ఆదాయం, ఉష్ణోగ్రత పెరుగుదల వంటి అంశాలు ఈ జాబితా ఎంపికలో కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు. ర్యాంకింగ్ వ్యవస్థ వల్ల పాలకుల్లో పోటీ ఏర్పడుతుందని, తద్వారా మెరుగైన నగరాలు రూపుదిద్దుకుంటాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. -
గంటకి ఆరు ఇళ్లు కూల్చివేత
సాక్షి, హైదరాబాద్ : రోడ్డుని విస్తరించాలి.. కమ్యూనిటీ హాల్ నిర్మించాలి లేదంటే నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి.. కారణం ఏదైతేనేం మన దేశంలో వేలాది ఇళ్లునేలమట్టమవుతున్నాయి. లక్షలాదిమంది ప్రజలు రోడ్డున పడిపోతున్నారు. 2017 సంవత్సరంలోనే గంటకి ఆరు ఇళ్లు కూల్చేశారు. ప్రతీ రోజూ 700 మంది గూడుచెదిరింది. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించకుండా, పునరావాసం ఏర్పాట్లు చూడకుండానే ఇదంతా చేయడంతో నిర్వాసితుల గుండె పగిలింది. గత ఏడాది 53,700ఇళ్లను కూల్చేశారని, 2.6 లక్షల మందిని బలవంతంగా ఖాళీ చేయించారని హౌసింగ్ అండ్‌ల్యాండ్ రైట్స్ నెట్వర్క్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. స్మార్ట్ జపంతో కొంప కొల్లేరు ఇప్పుడు అందరూ స్మార్ట్ జపమే చేస్తున్నారు. దేశంలో ప్రతీనగరాన్ని స్మార్ట్ సిటీ చేసేస్తామని ప్రభుత్వం ప్రకటించి గుడిసెల్ని తొలగిస్తూ ఉండడంతో నిలువ నీడ లేక రోడ్డున పడుతున్న వారి సంఖ్య ఎక్కువైపోయింది. గత ఏడాది వివిధ రాష్ట్రాల్లో గుడిసెల్ని తొలగించే కార్యక్రమాలు 213 వరకు జరిగాయి. ఇందులో నగరాల సుందరీకరణకు సంబంధించి 99, రోడ్లు, హైవేల విస్తరణ కోసం 53, ప్రకృతి విపత్తుల నిర్వహణ కోసం 16, వన్యప్రాణులు, అటవీ ప్రాంతాల సంరక్షణ పేరుతో 30 వరకు జరిగాయి. చిన్న కారణాలకూ ఇళ్ల తొలగింపు ఒకరి ఇష్టాయిష్టాలకు వ్యతిరేకంగా, కుటుంబాల గోడు వినకుండా ఇళ్లను బలవంతంగా కూల్చివేయడం మానవ హక్కుల్ని కాలరాయడమేనని ఐక్యరాజ్య సమితి చెబుతున్నా పట్టించుకునే వారు లేరు. చిన్న చిన్న కారణాలకు కూడా అన్ని నగరాల్లోనూ ఈ ఇళ్ల తొలగింపు కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది .ఢిల్లీలో ఫ్లైఓవర్ల బ్యూటిఫికేషన్ కోసమే 1500 ఇళ్లను తొలగించారు. కథ్‌పుట్లి అనే కాలనీలోని 2 వేల ఇళ్లను తొలగించారు. ముంబైలో టాన్సా పైప్‌లైన్ సమీపంలో ఉన్న 16,717 ఇళ్లనుతొలగించారు. ఇక కోల్‌కతాలో బుక్ ఫెయిర్‌కి వెళ్లడం కోసం రోడ్డు వేయడానికి 1200 మంది కుటుంబాలను ఖాళీ చేయించారు. ఇండోర్‌లో టాయిలెట్స్ లేవన్న సాకుతో 700 ఇళ్లు నేలమట్టం చేశారు. అసోంలో అభయారణ్యాలకు సమీపంలో నివాసం ఉంటున్న బోడో, రాభా, మిషింగ్ వంటి గిరిజన తెగలకు చెందిన వెయ్యి కుటుంబాలను బలవంతంగా ఖాళీ చేయించారు. వారి ఇళ్లను తొలగించడానికి ఏనుగుల సహకారాన్ని తీసుకున్నారు. అందరికీ ఇళ్లు హామీని నిలబెట్టుకోవడం కోసం ఉన్న ఇళ్లను తొలగించడం చర్చనీయాంశంగా మారుతోంది. 2022 నాటికి అందరికీ ఇళ్లు అన్న కేంద్ర పథకాన్ని అమలు చేయడం కోసం గత ఏడాది 6,937 ఇళ్లను కూల్చేశారు. నిరాశ్రయులైన వారిలో 60శాతం మంది తమ గూడు చెదిరిపోవడానికి ప్రభుత్వాలదే కారణమని నిందిస్తున్నారు. మొత్తానికి నగరాలు అందంగా ముస్తాబవుతూ,స్మార్ట్‌గా మారుతున్నాయో లేదో కానీ నిలువ నీడలేని వారి సంఖ్య మాత్రం పెరిగిపోతోంది. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
నరేంద్ర మోదీ స్మార్ట్ సిటీలివిగో!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2014లో అధికారంలోకి రాగానే ‘మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా’ అంటూ వినిపించిన అభివృద్ధి నినాదాలు ప్రజలను ఎంతగా ఆకర్షించాయో దేశంలోని వంద నగరాలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అత్యాధునిక మౌలిక వసతులు కలిగిన ‘స్మార్ట్ సిటీ’లుగా మారుస్తానన్న హామీ కూడా అంతకంటే ఎక్కువే ఆకర్షించింది. మరి మోదీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయిన సందర్భంగా ఆయన స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తానన్న నగరాలు ఇప్పుడు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ట్విటర్ పారడీ అకౌంట్ ‘ఎట్‌ద రేట్ ఆఫ్ హిస్టరీపిక్ ’ మంగళవారం నాడు ట్విటర్ యూజర్ల అభిప్రాయాన్ని కోరగా, దాదాపు రెండువేల మంది తమదైన శైలిలో ట్వీట్లు చేశారు. ఎక్కువ మంది ఫొటోలు, చిత్రాలతో స్పందించారు. కొందరు సింగపూర్, స్విట్జర్లాండ్, హాంకాంగ్ తరహాలో భారత నగరాలు అభివృద్ధి చెందినట్లు ఆర్కిటెక్చర్ డిజైన్లను పంపించగా, మరొకరు బుల్లెట్ రైలు ఇదిగో అంటూ లారీపైకి రైలు డబ్బా ఎక్కించిన ఫొటోషాప్ ఇమేజ్‌ని పంపించారు. భారత్ సిలికాన్ సిటీగా పేరుపడ్డ బెంగళూరు నగరం పకోడాపూర్గా మారిందని సూచిస్తూ ఇంకొకరు గ్రాఫిక్ డిజైన్‌ను పంపించారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్ ఇలా మారిందంటూ మరొకరు డిస్నీఐలాండ్ ఇంపోజ్డ్ చిత్రాన్ని పంపించారు. నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్‌ను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ గుజరాత్‌గా అభివర్ణిస్తూ ఒంటెకు రెందు రాకెట్ బూస్టర్లను అమర్చుకొని, దానిపై రాకెట్లా దూసుకుపోతున్న ఓ వ్యక్తి ఫొటోను పోస్ట్ చేశారు. ఇక నాగపూర్‌లోని ఆరెస్సెస్ కార్యాలయం అమెరికాలోని వైట్‌హౌజ్‌గా మారిందంటూ వైట్‌హౌజ్ భవనం ఫొటేనే పొస్ట్ చేశారు. వర్షాలకు కొట్టుకుపోయే భారతీయ రోడ్లను చూసి కోపం వచ్చిందేమో నీళ్లతో గుంతలు పడిన రోడ్డులో రవాణా ట్రక్కు కూరుకుపోయిన ద్యశ్యం ఫొటోను పంపించారు. ప్రయాణికులకు 24 గంటలపాటు తాగునీరు అందిస్తూ, ట్రక్కులకు ప్రత్యేక పార్కింగ్ వసతి కల్పిస్తున్న మధ్యప్రదేశ్‌లోని స్మార్ట్ సిటీ అంటూ ఒకరు పోస్టింగ్ పంపించారు. గోవాలోని పాంజిం నగరంలో అతి పెద్ద స్విమ్మింగ్ పూల్ అంటూ జలమయమైన ఓ రహదారి ఫొటోను మరొకరు పోస్ట్ చేశారు. ట్విటర్లో అందరు వ్యంగ్యంగానే స్పందించారు. అందరి బాధ ఒకటే అధికారంలోకి వచ్చిన కొత్తలోనే వంద నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇంతవరకు ఒక్క నగరాన్నైనా సంపూర్ణ స్మార్ట్ సిటీగా మార్చలేకపోయిందన్నదే! -
మిలటరీ కేంద్రాలకు ఐటీ హంగులు
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని 2 వేల మిలటరీ కేంద్రాలను స్మార్ట్ సిటీస్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఆధునీకరణ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్ట్ కింద 58 మిలటరీ కేంద్రాలను ఎంపిక చేసినట్లు ఆర్మీ ఉన్నతాధికారులు ప్రకటించారు. ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతాలను కూడా ఈ పథకం కింద అభివృద్ధి చేస్తున్నట్లు ఆధికారులు తెలిపారు. సరిహద్దుల్లో కీలకంగా ఉండే మిలటరీ కేంద్రాలను పూర్తిస్థాయిలో ఈ కార్యక్రమంలో అభివృద్ధి చేస్తారు. ముఖ్యంగా ఐటీ, ఇంటర్నెట్ నెట్‌వర్క్‌ను ఆయా కేంద్రాల్లో ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగాన్ని ఆధునీకరిస్తోంది. అందులో భాగంగా మౌలిక వసతులు కల్పన, రహదారులు, ఇతర సదుపాయాలను ఏర్పాటు చేస్తోంది. -
మరో 30 స్మార్ట్ సిటీలు
మూడో జాబితా ప్రకటించిన కేంద్రం కరీంనగర్, అమరావతిలకూ చోటు అగ్రస్థానంలో తిరువనంతపురం సాక్షి, న్యూఢిల్లీ: స్మార్ట్ సిటీ మిషన్‌లో భాగంగా అభివృద్ధిచేసే నగరాల మరో జాబితాను కేంద్రం శుక్రవారం విడుదల చేసింది. తాజాగా ప్రకటించిన మూడో జాబితాలో మొత్తం 30 నగరాలకు చోటు దక్కింది. ఇందులో కేరళ రాజధాని తిరువనంతపురం తొలిస్థానంలో, ఆ తరువాత వరసగా ఛత్తీస్‌గఢ్‌లోని నయారాయ్‌పూర్, గుజరాత్‌లోని రాజ్‌కోట్ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి కరీంనగర్(తెలంగాణ), ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలకు కూడా స్థానం దక్కింది. పట్టణ పరివర్తన అన్న అంశంపై ఇక్కడ జరిగిన జాతీయ వర్క్‌షాప్ సందర్భంగా పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు ఈ జాబితాను విడుదల చేశారు. దీంతో ఇప్పటి దాకా ప్రకటించిన స్మార్ట్ సిటీల సంఖ్య 90కి చేరింది. 40 స్మార్ట్ సిటీలకుగాను మొత్తం 45 పట్టణాలు పోటీపడ్డాయని, కానీ 30 మాత్రమే ఎంపికయ్యాయని మంత్రి చెప్పారు. తదుపరి దఫాలో 20 పట్టణాల నుంచి 10 స్మార్ట్ సిటీలను ఎంపికచేస్తామని తెలిపారు. తాజాగా ఎంపికైన 30 నగరాల్లో రూ. 57,393 కోట్ల మేర పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. మౌలిక వసతులకు రూ. 46,879 కోట్లు, పాలనాపరమైన సాంకేతిక పరిష్కారాలకు రూ. 10,514 కోట్లు ఇందులో ఉన్నట్లు తెలిపారు. మొత్తం 90 నగరాలకు చెందిన పెట్టుబడి ప్రతిపాదనలు రూ. 1,91,155 కోట్లకు చేరుకున్నాయని వివరించారు. తాజా జాబితాలోని ఇతర పట్టణాలు పట్నా, ముజఫర్‌పూర్, పుదుచ్చేరి, గాంధీనగర్, శ్రీనగర్, సాగర్, కర్నల్, సాత్నా, బెంగళూరు, షిమ్లా, డెహ్రాడూన్, తిరుప్తూపర్, పింప్రిచించ్వాడ్, బిలాస్పూర్, పాసీఘా ట్, జమ్మూ, దాహోద్, తిరునల్వేలి, తూతుక్కుడి, తిరుచిరాపల్లి, ఝాన్సీ, ఐజ్వాల్, అలహాబాద్, అలీగఢ్, గ్యాంగ్‌టక్. -
స్మార్ట్‌సిటీ జాబితాలోకి కొత్తగా 40 పట్టణాలు
గాంధీనగర్: పట్టణాభివృద్ధిలో భాగంగా ‘స్మార్ట్ సిటీస్’ జాబితాలోకి మరో 40 పట్టణాలను చేర్చుతామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు బుధవారం వెల్లడించారు. ఈ నెలలో లేదా వచ్చే నెలలో కొత్త పట్టణాల జాబితాను విడుదలచేయనున్నారు. కొత్త వాటితో కలుపుకుని జాబితా వందకు చేరనుంది. గత ఏడాది జనవరిలో ప్రారంభించిన ఈ పథకం కింద ప్రతీ పట్టణంలో మౌలికవసతులను మెరుగుపరిచేందుకు రూ.200కోట్ల నిధులు కెటాయించారు. -
2030లో స్మార్ట్‌సిటీలు ఎలా ఉంటాయి?
ప్రపంచంలోని 60 శాతం జనాభా 2030 నాటికి స్మార్ట్ సిటీలలో నివసిస్తారని మేధావులు భావిస్తున్నారు. అప్పటికి ప్రజల జీవన విధానం ఎలా ఉంటుంది? జీవన ప్రమాణాలు ఎలా ఉంటాయి? ఇప్పటిలాగే అప్పుడు కూడా రాజకీయ నాయకుల దయాదాక్షిణ్యాలు, వారి నిర్ణయాలపైనే ప్రజల జీవితాలు ఆధారపడతాయా? అన్న అంశంపై ప్రపంచంలోని సాంకేతిక నిపుణులు, మేధావుల మధ్య చర్చ నడుస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానమే ప్రజల జీవితాలను నిర్దేశిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని పట్టణ ప్రణాళికలను అమలు చేయగా, స్మార్ట్ సిటీల్లో ప్రజల అవసరాల కన్నా సాంకేతిక పరిజ్ఞానానికే ఎక్కువ విలువనిస్తారు. ముందస్తు ప్రణాళికల ద్వారా ఇంతకుముందు పట్టణాలను నిర్మించగా స్మార్ట్ సిటీలను అప్పటికప్పుడు కావల్సిన అవసరాలకు అనుగుణంగా నిర్మిస్తుంటారు. అన్ని సమస్యలకు సాంకేతిక పరిష్కారాలే ఉంటాయి. ఉదాహరణకు చైనా రాజధాని బీజింగ్ నగరంలోలాగా వాయు కాలుష్యం తీవ్రంగా ఉంటే వాయువులోని కాలుష్యాన్ని గ్రహించి స్వచ్ఛమైన వాయువును వదిలే టవర్లు ప్రతి అపార్ట్మెంట్లో, ప్రతి ఇంటిలో ఉంటాయి. బీజింగ్ వాయు కాలుష్యాన్ని నిర్మూలించేందుకు 23 అడుగుల ఎత్తయిన టవర్ ద్వారా ప్రయోగాలు జరుపుతున్న విషయం తెలిసిందే. చెట్లు, పుట్టలతో గ్రామీణ వాతావరణం కనుమరుగై పట్టణాల పేరుతో కాంక్రీట్ నగరాలు ఏర్పడ్డాయి. దానివల్ల పర్యావరణ పరిస్థితులు కూడా దెబ్బతిన్నాయి. సాంకేతిక పరిజ్ఞానం వల్ల కాంక్రీట్ కట్టడాలే స్మార్ట్ సిటీల్లో పచ్చని చెట్లతో కళకళలాడే రోజులు వస్తాయి. ఈ రోజు నగరంలో ఉష్ణోగ్రత ఎంతుంది? వాయుకాలుష్యం శాతమెంత? ధ్వని కాలుష్యం ఎంతుంది? ట్రాఫిక్ ఎక్కడెక్కువుంది? ఎక్కడ తక్కువుంది? ఇలాంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి పంపించే సెన్సర్లు ఉంటాయి. ఆ డేటాను బట్టి రియల్ టైమ్‌లో, రియల్ పరిష్కారాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. ఇలా పలు పరిస్థితులను ఒకే పరికరం అంచనా వేసే పద్ధతి ఇప్పటికే చికాగో నగరంలో ప్రవేశపెట్టారు. ఈ పరికరాలు అక్కడ వీధి విద్యుత్ స్తంభాలకు ఏర్పాటు చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల అపార్ట్మెంట్ కల్చర్ కూడా మారవచ్చని, మళ్లీ ప్రజలు సమూహాలుగా జీవించే అవసరం రావచ్చని నిపుణులు భావిస్తున్నారు. రాజకీయ నాయకులు ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా సాంకేతిక పరిజ్ఞానంపైనే ఆధారపడాల్సి వస్తుందని అంటున్నారు. -
అమరావతిపై మాకొక విజన్ ఉంది
- ఒక మెగాసిటీగా, ఆర్థిక శక్తిగా నిర్మించేందుకు ప్రణాళిక - పట్టణాలన్నీ స్మార్ట్ నగరాలుగా మార్చుతాం - 2030 నాటికి 50 శాతం జనాభా పట్టణాల్లో నివసించేలా లక్ష్యం - భారత ఆర్థిక సదస్సులో సీఎం బాబు సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణాలన్నింటినీ స్మార్ట్ నగరాలుగా తీర్చిదిద్దేలా ముందుకు సాగుతున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. అమరావతిపై తమకొక విజన్ ఉందని, ఒక మెగాసిటీగా, ఆర్థిక శక్తిగా నిర్మించేందుకు ప్రణాళిక రచించామని తెలిపారు. శుక్రవారం ఇక్కడ జరిగిన ఇండియన్ ఎకనమిక్ సమ్మిట్(భారత ఆర్థిక సదస్సు)లో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ‘పట్టణీకరణ వేగవంతంగా సాగుతున్నందున 2050 నాటికి ప్రపంచ పట్టణ జనాభా రెట్టింపవనుంది. ఇదొక సవాలు. 2011 జనాభా లెక్కల ప్రకారం 37.7 కోట్ల మంది భారతీయులు పట్టణాల్లో నివసిస్తున్నారు. దేశ ఆర్థిక వృద్ధి వేగవంతమవుతున్న కొద్దీ పట్టణీకరణ మరింత పెరుగుతుంది. 2031 నాటికి 60 కోట్ల మంది భారతీయులు పట్టణాల్లో నివసిస్తారు. ముందస్తు ప్రణాళిక లేకుంటే నగరాల్లో మురికివాడలు పెరిగిపోతాయి. అందువల్ల ప్రభుత్వాలు ముందుచూపుతో ఉండాలి. నగరాలు వృద్ధి ఛోదకాలు. ఆంధ్రప్రదేశ్‌లో 2030 నాటికి 50 శాతం జనాభా పట్టణాల్లో నివసించేలా లక్ష్యాన్ని పెట్టుకున్నాం. నగరాలు కేవలం ఉపాధి కల్పించడమే కాకుండా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా ఉండాలన్నదే మా ఆకాంక్ష. ఆ రకంగా మా నగరాలు స్మార్ట్ నగరాలుగా, హరిత నగరాలుగా, స్థిర ప్రగతి గల నగరాలుగా మారుతాయి. రాజధాని అమరావతి నగరంపై మాకొక విజన్ ఉంది. అవసరాలు తీర్చేదిగా, సమర్థవంతమైన వ్యవస్థలు ఉండేదిగా నూతన రాజధాని ఉంటుంది. 2022 నాటికి దేశంలోని టాప్-3 నగరాల్లో ఒకటిగా ఉండాలన్నది మా విజన్. 2029 నాటికి దేశంలోని అత్యంత సంతృప్తికర రాష్ట్రంగా, 2050 నాటికి అత్యధికులు ఎంచుకునే గమ్యం కావాలన్నదే మా లక్ష్యం’ అని సీఎం పేర్కొన్నారు. తయారీ, సేవ రంగాల అనుసంధానంతో రాజధాని వృద్ధి విభజన అనంతరం నూతన రాజధానిని అభివృద్ధి చేయడంలో ఇబ్బందులు ఎదుర్కున్నామని సీఎం అన్నారు. అనేక ఆలోచనల అనంతరం ఒక మెగా సిటీ నిర్మించాలనుకున్నామని, ఇది రాజధానిగానే కాకుండా ఒక ఆర్థిక శక్తిగా మారాలని యోచించామని తెలిపారు. పనిచేస్తున్న ప్రదేశానికి, నివాసానికి ఐదు నిమిషాల్లో నడక ద్వారా చేరగలిగేలా ప్రణాళికలు ఉన్నాయన్నారు. తయారీ, సేవల రంగాలను అనుసంధానం చేయడం ద్వారా నగరాన్ని వృద్ధి చేస్తామని చెప్పారు. నా ఇటుక, నా అమరావతి కార్యక్రమం ద్వారా ప్రజలను రాజధాని అభివృద్ధిలో భాగస్వాములను చేశామని పేర్కొన్నారు. ఇప్పటివరకు 56 లక్షల ఇటుకలను రూ. 10 చొప్పున కొనుగోలు చేశారు. దాదాపు 2.26 లక్షల మంది దాతలు అమరావతి నిర్మాణానికి ముందుకొచ్చారు..’ అని వివరించారు. పలువురు పారిశ్రామిక వేత్తలతో భేటీ.. సదస్సు అనంతరం బాబు పలువురు పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని వివరించారు. జనరల్ ఎలక్ట్రికల్స్(జీఈ) కంపెనీ వైస్ చైర్మన్ జాన్ రైస్, హెచ్‌పీ కంపెనీ కంట్రీ మేనేజింగ్ డెరైక్టర్ నీలమ్ దవన్, వరల్డ్ ఎకనమిక్ ఫోరం మేనేజింగ్ బోర్డు సభ్యుడు ఫిలిప్ రోస్లర్, యస్ ఇనిస్టిట్యూట్ సీనియర్ ప్రెసిడెంట్ ప్రీతి సిన్హా తదితరులతో చంద్రబాబు భేటీ అయ్యారు. కాగా ప్రముఖ వయోలిన్ మాస్టర్ డాక్టర్ ఎల్.సుబ్రమణ్యం, గాయని కవితా కృష్ణమూర్తి సీఎంను కలిసి అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక సంగీత కేంద్రం నె లకొల్పాలని కోరారు. -
అమరావతిలో స్మార్ట్‌సిటీకి మా సపోర్ట్: బ్రిటన్
పుణె, ఇండోర్‌లో కూడా.. న్యూఢిల్లీ: పుణె, ఇండోర్, అమరావతి నగరాల్లో స్మార్ట్‌సిటీల అభివృద్ధికి మద్దతునిస్తామని తమ ప్రభుత్వం సంకేతాలు ఇచ్చిందని బ్రిటన్ అంతర్జాతీయ వ్యవహారాల సహాయ సెక్రటరీ ప్రీతి పటేల్ తెలిపారు. పట్టణాభివృద్ధి, స్మార్ట్‌సిటీల అభివృద్ధి విషయమై భారత్-బ్రిటన్ పరస్పర సహకారంతో ముందుకెళుతున్నాయని చెప్పారు. భారత పర్యటనకు వచ్చిన ఆమె శనివారం ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మట్లాడుతూ.. మోదీని కలువడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు ఆమె చెప్పారు. భారత్-బ్రిటన్ ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధి గురించి తాను ప్రధాని మోదీతో చర్చించినట్టు తెలిపారు. ప్రధాని మోదీ ఆర్థిక సంస్కరణల ఎజెండాకు బ్రిటన్ మద్దతు తెలుపుతున్నట్టు తెలిపారు. భారత్‌లోని పెద్ద ప్రాజెక్టులకు లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో బాండ్లు జారీచేయడం ద్వారా లండన్ నగరం ఆర్థిక సహకారం అందజేస్తున్నదని ప్రీతి పటేల్ చెప్పారు. ఆదివారం బోఫాల్‌లో పర్యటించి మధ్యప్రదేశ్ సీఎంతో భేటీ అవుతానని, ఈ భేటీలో పట్టణాభివృద్ధి గురించి చర్చిస్తామని ఆమె తెలిపారు. ఉగ్రవాద నిరోధం విషయంలో భారత్-బ్రిటన్ భుజంభుజం కలిపి ముందుకుసాగుతున్నాయన్నారు. British Govt has given indication of support for smart cities development in Pune, Indore, Amravati: Priti Patel pic.twitter.com/rbfSF4insW — ANI (@ANI_news) 13 August 2016 -
కరీంనగర్ ఇక స్మార్ట్ సిటీ
రాష్ట్రానికి తెలిపిన కేంద్ర ప్రభుత్వం సీఎస్‌కు లేఖ సాక్షి, న్యూఢిల్లీ: స్మార్ట్ నగరాల జాబితాలో కరీంనగర్‌కు చోటు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం తొలుత హైదరాబాద్, వరంగల్ నగరాలను స్మార్ట్ నగరాల మిషన్ ద్వారా అభివృద్ధికి ప్రతిపాదించింది. అయితే ఈ పథకం కింద వచ్చే నిధులు హైదరాబాద్ వంటి మహా నగరానికి సరిపోవని భావించి హైదరాబాద్ స్థానంలో కరీంనగర్‌ను ప్రతిపాదించింది. సాధ్యాసాధ్యాలను, సాంకేతిక అంశాలను పరిశీలించిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ స్మార్ట్ నగరాల జాబితాలో కరీంనగర్‌కు స్థానం కల్పించింది. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖలోని స్మార్ట్ సిటీస్ డివిజన్ డెరైక్టర్ మునీష్ కుమార్ గార్గ్ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శికి లేఖ రాశారు. మొత్తం దేశవ్యాప్తంగా 100 నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయాలని తలపెట్టిన కేంద్రం రాష్ట్రాల ప్రతిపాదనలతో 98 నగరాలకు జాబి తాలో చోటు కల్పించింది. అయితే నిధుల కొరత కారణంగా తొలి ఏడాది 20 నగరాలకు, రెండో ఏడాది 40 నగరాలకు, మూడో ఏడాది 40 నగరాలకు నిధులు కేటాయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులోభాగంగా తొలి ఏడాది 20 నగరాలను ఎంపిక చేసింది. అలాగే మలి విడతకు సంబంధించి 40 నగరాల ఎంపికలో భాగంగా ఫాస్ట్ ట్రాక్ పోటీలో మరో 13 నగరాలను ఎంపిక చేసింది. ఈ 13 నగరాల్లో వరంగల్‌కు స్థానం దక్కిన సంగతి తెలిసిందే. మిగిలిన 27 నగరాలను అక్టోబర్ కల్లా ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇలా ఎంపికైన నగరాలకు కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరం నుంచే నిధులు కేటాయించనుంది. ‘వెనుకబాటు’ నిధులు విడుదల చేయాలి వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేటాయించిన నిధుల్లో రెండో విడతగా రూ. 450 కోట్లను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అశోక్ లావాసాను కోరినట్టు తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ వేణుగోపాలచారి గురువారం ఇక్కడ మీడియా సమావేశంలో తెలిపారు. ఇదే సమావేశంలో ఎంపీ బి.వినోద్‌కుమార్ స్మార్ట్ సిటీ జాబితాలో కరీంనగర్‌కు స్థానం లభించేలా చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. కరీంనగర్‌ను స్మార్ట్ సిటీగా మార్చేందుకుగానూ సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించేందుకు కేంద్రం రూ. 2 కోట్లు మంజూరు చేసిందని, ఈ దిశగా త్వరలో కరీంనగర్ నగర ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించి నివేదికను సిద్ధం చేస్తామని తెలిపారు. కరీంనగర్ ప్రజలకు మరిన్ని సౌకర్యాలు అందించి గొప్ప ఆకర్షణీయ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులందరం కృషి చేస్తామని చెప్పారు. -
నగరాన్ని ఎలాగూ మార్చలేం పేరైనా మారుద్దాం
అవలోకనం మనం ప్రయాణిస్తున్న విమానం కెంపెగౌడ విమానాశ్రయాన్ని చేరుతుండగా... మీరిప్పుడు ‘‘బంగొలోరు’’లో లేదా ‘‘బంగొలూరు’’లో దిగబోతు న్నారని ఎయిర్ హోస్టెస్ చేసే ప్రకటనను వింటారు. ప్రస్తుతం ఆ నగరం పేరును చాలా మంది పలికేది అలాగే. 2014లో బీజేపీ ఆ నగరంతో పాటూ కర్ణాటకలోని మరో 11 ఇతర నగరాల పేర్లను కూడా మార్చింది. బెంగుళూరుగా ఉన్న రాజధాని నగరం పేరును బెంగళూరు అని మార్చింది. కానీ రాష్ట్రానికి వెలుపల ఉన్న ప్రజలకు ఈ కొత్త పేరుతో అంతగా పరిచయం లేకపోవడంతో ఏర్పడ్డ గందరగోళం నుంచి ‘‘బంగొలూరు’’ పుట్టుకొచ్చింది. గురుగావ్‌ను గురుగ్రామ్‌గా మారుస్తూ బీజేపీ మరో పేరు మార్పును కూడా చేసింది. ఆర్ఎస్ఎస్ చాలా కాలంగానే గురుగ్రామ్ అనే పేరును వాడు తోంది. కాకపోతే దాన్ని ప్రభుత్వం ఇప్పుడు అనుసరించింది. గురుగావ్ అనే పదం ఒకప్పటి అసలు పేరుకు భ్రష్టరూపం కాబట్టి, ఈ పేరు మార్పు అవస రమని మద్దతుదార్ల వాదన. మహాభారత కాలం నాటి యుద్ధ శాస్త్ర నిపు ణుడైన గురువు ద్రోణుడు, పాండవులు అక్కడే జీవించినట్టుంది. పేరు మార్పును వ్యతిరేకించే వారిలో చాలా మంది సుదీర్ఘకాలంగా గురుగావ్ కేంద్రంగా వ్యాపారం సాగించే వ్యాపారవేత్తలు. పేరు మార్చడం వల్ల గురుగావ్‌కు ఉన్న ‘‘బ్రాండ్’’ ప్రతిష్ట మసకబారిపోతుందని వారి వాదన. అది ఉత్తర భారతదేశంలోనే అతి పెద్ద సాఫ్ట్వేర్, ఐటీ సేవల కేంద్రం. పలు ప్రపంచస్థాయి వ్యాపారసంస్థలు తమ భారత కార్యాలయాలను గురుగావ్ లోనే ఏర్పాటు చేసుకున్నాయి. ఇంతకూ ఎవరి వాదన సరైనది? పేరు మార్పు మద్దతుదార్లదా, లేక దాన్ని వ్యతిరేకించేవారిదా? మన దేశంలో నగరాల పేర్లను మార్చడం, 20 ఏళ్ల క్రితం బీజేపీ-శివసేన ప్రభుత్వం బొంబాయి పేరును మార్చడంతో మొదలైంది. అయితే అది గురుగ్రామ్ కంటే భిన్నమైనది. తాము ఏ భాషలో మాట్లాడుతామనే దాన్ని బట్టి దాన్ని బొంబాయి, ముంబై అనేగాక బుంబై అని కూడా చాలా మంది పిలుస్తుండేవారు. ఆ పేరు మార్పుకు వ్యతిరేకులు కూడా బొంబాయి బ్రాండు ప్రతిష్ట దెబ్బ తింటుందనే ఇదే వాదనను అప్పట్లో వాడారు. ఇప్పుడు వెనక్కు తిరిగి చూస్తే, 20 ఏళ్లలో మొత్తంగా ఒక తరం తిరిగే సరికి పేరు మార్పువల్ల బొంబాయి బ్రాండ్ ఇమేజ్ ఏమీ దెబ్బతిన్నట్టు అనిపించదు. ముంబై సమస్యలు వ్యవస్థాగతమైనవి. బయటి నుంచి వచ్చేవారికి ఆ నగరం ఉద్యో గావకాశాలను కల్పిస్తుంది. కానీ వారి జీవన ప్రమాణాలు అధ్వానంగా ఉంటాయి. అక్కడి కొన్ని మంచి పరిసరాల్లోని ఆస్తి విలువ న్యూయార్క్ లేదా లండన్ నగరాల్లో కంటే ఎక్కువ. దీంతో ఒక మధ్యతరగతి వ్యక్తి లేదా కుటుం బం ఆ నగరంలో సౌకర్యంగా బతకడం కష్టం. ఇక ప్రజా రవాణా మూడో ప్రపంచ దేశాల స్థాయిది. నిత్యమూ దాదాపు 10 మంది లోకల్ రైలు ట్రాక్‌ల మధ్య మరణిస్తుంటారు. పెట్టుబడులు పెట్టాలనుకునే వారెవరైనా వెనక్కు తగ్గితే ఇలాంటి కారణాల వల్లనే తప్ప, కొత్త పేర్ల వల్ల కాదు. ముంబై పేరు మార్పు వెంబడి మద్రాసు పేరును మార్చారు. చెన్నైగా మారిన మద్రాసు 1990లకు ముందెన్నడూ ఆ పేరు విని ఎరుగని తమిళేతరు లను ఆశ్చర్యంలో ముంచెత్తింది. మద్రాసు, బ్రిటిష్‌వారు నిర్మించిన నగరం. భారతదేశంలోని వారి మొట్టమొదటి కోట ఫోర్ట్ సెయింట్ జార్జి చుట్టూ అది అభివృద్ధి చెందింది. నేడక్కడ తమిళనాడు శాసన సభ ఉంది. ఇక ఆ తర్వాత కమ్యూనిస్టులు కలకత్తా పేరును మార్చారు. ఆ నగరం పేరును కూడా ఎప్పుడూ మూడు రకాలుగా పలుకుతుండేవారు. బెంగాలీలో మాట్లాడుతుంటే కొల్కత్తా అని, ఇంగ్లిషులో అయితే కల్కటా అని, హిందీ లేదా గుజరాతీలలో కాల్కత్తా అని పిలిచేవారు. ‘‘బంగొలూరు’’ విషయం లోలాగే కొత్త పేరుతో పరిచయం లేనివారు ఇంగ్లిషు స్పెల్లింగ్‌లోని ‘ఏ’ ని ‘ఓ’ గా మార్చి కొల్కొత్తాగా మార్చారు. కమ్యూనిస్టుల హయాంలో. కోల్‌కతా కూడా నగరంలోని ఒక రోడ్డు పేరును ప్రత్యేకించి మార్చింది. హారింగ్టన్ వీధి హో చి మిన్ సరానిగా మారింది. ఈ పేరు మార్పునకు కారణం, అమెరికన్ కాన్స్లేట్ ఆ రోడ్డులో ఉండటమే. అది అమెరికన్లకేమీ ఇబ్బంది కలిగించి ఉంటుందనుకోను. కాక పోతే అది పరిణతితో కూడిన చర్య కాదు. ధిక్కారాన్ని అలాంటి పద్ధతుల్లో వ్యక్తం చేయడం సాహసోపేతమైనదిగానీ లేదా తెలివైనదిగానీ కాదు. ఇక తిరిగి పేర్లను పలకడానికి సంబంధించిన విషయానికి వద్దాం. పేర్ల మార్పునకు మద్దతుదారులు... దాన్ని విదేశీ విలువల తిరస్కరణగా, స్థానిక గుర్తింపునకు ప్రాధాన్యాన్ని ఇవ్వడంగా చూపుతున్నారు. అయితే ఇతర భారతీ యులు ఆ ప్రదేశం పేరును ఎలాబడితే అలా వికృత పరుస్తుండటం ఈ వాదనను మసకబారుస్తోంది. గుజరాత్ మొట్టమొదటి ముస్లిం రాజ్య పాలకుడు అహ్మద్ ఆరు వందల ఏళ్ల క్రితం నిర్మించిన అహ్మదాబాద్ నగరం పేరును మార్చాలని బీజేపీ చాలా కాలంగా భావిస్తోంది. సోలాంకి వంశపు రాజైన క ర్ణుని పేరిట ఆ నగరాన్ని కర్ణావతిగా పిలవాలని బీజేపీ కోరుకుంటోంది. అయితే గుజరాతీలంతా ఆ నగరాన్ని ‘‘అమ్దాబాద్’’గా పరిగణిస్తారు. కాబట్టి, ఇప్పటికే దాని పేరు మార్పు అనధికారికంగా జరిగిపోయింది. రాష్ట్రేతరులు మాత్రమే దాన్ని అహ్మ దాబాద్ అని పిలుస్తారు. చాలా మందికి ఇబ్బందిగా అనిపించవచ్చుగానీ, ఈ పేర్ల మార్పు వల్ల పెద్ద నష్టమేమీ వాటిల్లినట్టు అనిపించదు. అలా అని దాని వల్ల కలిగిన మేలూ లేదు. కాకపోతే ఈ పేరు మార్పు జ్వరం ఎందుకిలా పట్టుకుందనేదే ప్రశ్న. 20 ఏళ్లుగా ఉన్న ఈ జ్వరం ఇంకా మండిపోతూనే ఉండటానికి కారణమేమిటనేది సుస్పష్టమే. మన రాజకీయపార్టీలు కొద్ది రోజులపాటూ వార్తల్లో ప్రముఖ స్థానాన్ని సంపాదించుకోవడానికి అది తేలిక మార్గం. ఆ పేరు మార్పు వల్ల కలిగే ఫలితం కేవలం సంకేతాత్మకమైనదే అయినా, మీడియా అలాంటి వాటి పట్ల ఆసక్తిని చూపుతుంది. అయితే, అధ్వానంగా రూపకల్పన చేసి, అధ్వానంగా నిర్వహిస్తున్న పట్టణ ప్రాంతాలను స్మార్ట్ నగరాలుగా పరివర్తన చెందిం చేదే నిజమైన మార్పు. అది చేయడమే చాలా కష్టం. ఆ పని చేయడానికి సరిపడే వనరులు మనకు లేవు. పైగా, పేదరికం, నిరక్షరాస్యత, హింస, ప్రజా రోగ్యం, ఆకలి అనే నిజమైన సమస్యలతో సతమతమౌతున్న మన దేశం లాంటి దేశాలున్న ప్రాంతంలో అది ప్రాధాన్యం కలిగిన అంశం కూడా కాదు. మెరుగైన నగరాలు మన ప్రాధాన్యం కాలేవు. నిజమైన మార్పు సాధ్యం కాదు కాబట్టి, పేరు మార్పుతోనైనా సంతృప్తి చెందాలి. ఆకార్ పటేల్, వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
తిరుపతికి స్మార్ట్ కల చెదిరింది...
► 3.07 మార్కుల తేడాతో చేజారిన అవకాశం ► మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం ►మార్చి మొదటి వారం నుంచి రెండో దశ ► సక్సెస్ సాధించిన కన్సల్టెన్సీ వైపు కమిషనర్ ఆసక్తి తిరుపతి: దేశంలో వంద స్మార్ట్ నగరాల జాబితాలో చోటు దక్కించుకున్న తిరుపతి, తొలిదశలో అభివృద్ధి చేయనున్న టాప్ 20 నగరాల జాబితాలో స్థానం కోల్పోయింది. ఇప్పుడు తాజాగా మలి దశ పోటీకి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మార్గదర్శకాలను కచ్చితంగా పాటించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. గత ఏడాది దేశవ్యాప్తంగా వంద స్మార్ట్ నగరాలను ఎంపిక చేయాల్సి ఉండగా, 98 నగరాల జాబితాను కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు. ఏడాది వ్యవధిలో మూడు పర్యాయాల్లో వీటిని అభివృద్ధి చేయాలని భావించారు. ఈ నేపథ్యంలో తొలిదశలో 20 నగరాలు, మలిదశలో 40, ఆ తరువాత మిగిలిన నగరాలకు నిధులు కేటాయించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇందులో భాగంగా ఏపీలో తిరుపతితో పాటు విశాఖ, రాజమండ్రి నగరాలను ఎంపిక చేశారు. ఈ నెల 28న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు టాప్- 20 నగరాల జాబితాను ప్రకటించారు. ఆధ్యాత్మిక నగరం కావడంతో తిరుపతికి చోటుఖాయంగా భావించారు. కానీ తిరుపతి వాసులకు నిరాశ మిగిలింది. విశాఖ, రాజమండ్రి నగరాలు మాత్రమే రాష్ట్రం నుంచి తొలి జాబితాలో చోటు దక్కించుకున్నాయి. తేడా 3.07 మార్కులే టాప్-20 స్మార్ట్ నగరాలను ఎంపిక చేసేందుకు కేంద్రం వివిధ మార్గదర్శకాలతో కఠిన నిబంధన పెట్టింది. తాగునీరు, రవాణా, డ్రైనేజీ, స్వచ్ఛభారత్, పన్నుల వసూళ్లు, ఆదాయం, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాల్లో నగరాల పనితీరు, చేపట్టబోయే పనులు వంటి వాటి ఆధారంగా మార్కులను కేటాయించారు. ఈ మార్గదర్శకాల ఆధారంగా ఆయా నగరాలు కన్సెల్టెన్సీల ద్వారా తయారుచేసిన డీపీఆర్‌ను కేంద్రానికి అందజేశాయి. వాటిని బేరీజువేసి ఆయా నగరాలకు మార్కులను కేటాయించారు. ఈ మార్కుల ఆధారంగా టాప్ 20 నగరాలను ప్రకటించారు. ఇందులో తిరుపతికి చోటు దక్కలేదు. సరైన డీపీఆర్‌ను అందించలేకపోవడంతో 51.78 మార్కులు వచ్చాయి. 20వ నగరంగా ఎంపికైన భోపాల్ నగరానికి 55.45 పాయింట్లు వచ్చాయి. 3.07 మార్కులతో తిరుపతి టాప్ 20లో స్థానం దక్కించుకోలేకపోయింది. మరో అవకాశం టాప్-20 స్మార్ట్ నగరాల్లో తక్కువ మార్కులతో వెనుకంజలో ఉన్న నగరాలకు కేంద్రం నిబంధనలను సడలించి సత్వరమే మలి దశకు మార్గదర్శకాలు విడుదల చేసింది. మరో ఏడాది తరువాత 40 నగరాలను ఎంపిక చేయాల్సి ఉండగా మలిదశ ఎంపికను ఈ యేడాది ఆగస్టు కల్లా ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తోంది. నాలుగు రోజుల క్రితం కేంద్రం ఇందుకు సబంధించిన మార్గదర్శకాలను విడుదలచేసి వెబ్సైట్లో ప్రవేశపెట్టింది. మార్చి మొదటి వారంలో స్మార్ట్ ప్రతిపాదనలకు శ్రీకారం చుట్టాలని ఆదేశించారు. ఈ ఏడాది ఏప్రిల్ మొదటి వారం నుంచి జూన్ 30 వరకు అన్నివిధాలా నివేదికలను సిద్ధం చేసి కేంద్రానికి అందించాలి ఉంది. ఆగస్టు మొదటి వారంలో మలి దశలో టాప్ 40 స్మార్ట్ నగరాలను కేంద్రం ఎంపిక చేయనుంది. టాప్ 40లో తిరుపతిని నిలబెడతాం స్మార్ట్ నగరాల ఎంపికలో మనం అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. అయితే డ్రాప్టింగ్‌లో కేంద్రాన్ని సంతృప్తి పరచలేకపోయాము. కారణాలు ఏమైనా మలిదశ పోటీకి పూర్తి ఆత్మవిశ్వాసంతో సిద్ధంగా ఉన్నాము. గత అనుభవం నేర్పిన పాఠాలను దృష్టిలో ఉంచుకుని మలిదశ లో తిరుపతిని అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నాం. - వినయ్‌చంద్, కమిషనర్ -
స్మార్ట్తోనైనా మురికి వదులుతుందా?
ఆ రెండు నగరాల్లోని దాదాపు 50 శాతం మంది ఇప్పటికీ మురికివాడల్లోనే ఉంటున్నారు. మూడురోజులకు ఒకసారిగానీ నీళ్లు రాని కాలనీలు అక్కడ ఉన్నాయి. ఆ నగరాల్లో మౌలిక సదుపాయాలు అంతంతే. అవే విశాఖపట్నం.. కాకినాడ. దేశవ్యాప్తంగా తొలి విడతలో ఆకర్షణీయ నగరాలు(స్మార్ట్ సిటీస్)గా అభివృద్ధి చేయనున్న 20 నగరాల జాబితాలో రాష్ట్రం నుంచి ఈ రెండు నగరాలకు చోటు లభించింది. స్మార్ట్ సిటీస్ పోటీలో ఇవి నెగ్గుకొచ్చినా.. వీటికున్న ‘మురికి’ వదిలి ‘స్మార్ట్’గా మారతాయా? అన్నది సందేహంగానే ఉంది. భారీఎత్తున మురికివాడలుండడంతో వేగంగా వసతులు కల్పించడం సులువు కాదని నిపుణులు అంటున్నారు. ఈ రెండింటినీ స్మార్ట్‌గా మార్చాలంటే నిధుల వరద పారాల్సి ఉంటుందని, కానీ వీటిని సమకూర్చుకోవడం అనుకున్నంత సులువు కాదని వారభిప్రాయపడుతున్నారు. - సాక్షి, హైదరాబాద్ సగం మందికిపైగా మురికివాడల్లోనే.. 2011 జనాభా లెక్కల ప్రకారం.. విశాఖపట్నంలో 18.97 లక్షలమంది జనాభా ఉంటే అందులో 7.70 లక్షల మంది మురికివాడల్లోనే ఉన్నారు. కాకినాడదీ ఇదే పరిస్థితి. అక్కడ 3.84 లక్షల మంది జనాభా ఉంటే.. అందులో 1.12 లక్షలమంది మురికివాడల్లోనే ఉంటున్నారు. రెండు నగరాల్లోనూ అధునాతన సదుపాయాలు అంతంతే. భారీగా నిధులు అవసరం.. ఈ నేపథ్యంలో రెండు నగరాల్ని ‘స్మార్ట్’గా మార్చాలంటే భారీఎత్తున నిధులు ఖర్చు చేయాల్సివుంది. స్మార్ట్ సిటీల్లో అత్యాధునిక సేవలందించేందుకు 20 ఏళ్లలో ఒక్కొక్కరిపై రూ.43,386 చొప్పున ఖర్చవుతుందని కేంద్రం అంచనా వేసింది. ఈ లెక్కన విశాఖలో 20 ఏళ్లలో రూ.8,230 కోట్లు అవసరం. అంటే ఏటా రూ.411 కోట్లు కావాలి. అలాగే కాకినాడకు 20 ఏళ్లల్లో రూ.1,666 కోట్లు కావాలి. అంటే ఏడాదికి రూ.84 కోట్లు అవసరమని మున్సిపల్ అధికారులు లెక్కలేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్మార్ట్ సిటీలకిచ్చిన కొలమానాల ప్రకారం ఈ నిధుల్ని సమకూర్చుకోవడం, వాటిని వినియోగించి వసతులు కల్పించడం సాధ్యమేనా? అని వారు సందేహం వెలిబుచ్చుతున్నారు. ప్రస్తుతం ప్రతిపాదనల దశకే రెండేళ్లు పట్టింది. మరో మూడేళ్లే మిగిలుంది. పైగా స్మార్ట్ సిటీలకు కేంద్రం వయబిలిటీ గ్యాప్ ఫండ్(వ్యత్యాస నిధి) మాత్రమే ఇస్తుందని, వీటి అభివృద్ధిని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) ద్వారానే చేసుకోవాలని కేంద్రం ఇప్పటికే స్పష్టంచేసింది. ఈ పరిస్థితుల్లో విశాఖ, కాకినాడల్లో ఒక్కొక్కరిపై 20 ఏళ్లలో రూ.50 వేలు చొప్పున ఖర్చుపెట్టినా స్మార్ట్ కొలమానాలు అధిగమించలేమేమోనన్న భావనను అధికారులే వ్యక్తం చేస్తుండడం గమనార్హం. ఎంతగా పన్నులేసినా సాధ్యమేనా? మరోవైపు స్మార్ట్ హోదా దక్కించుకున్న నగరాల్లో పన్నుల తీరెలా ఉంటుందోనన్న ఆందోళనా మొదలైంది. పన్నులేయడం, రికవరీల్లో వేగం పెంచడం, కరెంటు చార్జీలు, ఆస్తిపన్ను, నీటిపన్ను, పారిశుద్ధ్య పన్ను వంటివన్నీ భారీగా పెంచే అవకాశాలుంటాయి. అయితే పన్నులేసినా సేవలెలా అందిస్తారన్నది అంచనా వేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మురికివాడలు భారీగా ఉండటంతో స్మార్ట్ సిటీలో వేగంగా వసతులు కల్పించడం దుర్లభంగా కనిపిస్తోందంటున్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులపైనే ఆధారపడి వసతులు ఆధారపడి ఉంటాయని, రాష్ట్రాలనుంచి వచ్చే రికవరీలు, ఆదాయాలపై ఆశలు పెట్టుకుంటే ‘స్మార్ట్’గా మారే అవకాశం తక్కువని పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు చెప్పడం విశేషం. స్మార్ట్ సిటీకి కొన్ని ప్రధాన కొలమానాలివీ.. హెక్టారు పరిధిలో(ట్రాన్సిట్ కారిడార్‌లో) 175 మంది నివసించేలా ఉండాలి. 24 గంటలూ తాగునీటి సరఫరాతోపాటు 100% గృహాలకు నేరుగా తాగునీటి కనెక్షన్లు ఉండాలి. వందశాతం ఇళ్లకు మరుగుదొడ్ల సౌకర్యం ఉండాలి. వందశాతం కాలనీలకు రోడ్ల అనుసంధానం ఉండాలి. 100% ఇళ్లకూ విద్యుత్ కనెక్షన్లు ఉండాలి. 24 గంటలూ విద్యుత్ సరఫరా ఉండాలి. అన్ని ఇళ్లకూ టెలిఫోన్ కనెక్షన్‌తోపాటు మొబైల్ సదుపాయం ఉండాలి. ప్రతి 15,000 మందికీ ఓ ఆస్పత్రి ఉండాలి. ప్రతి లక్ష మందికీ 200 పడకలతో కూడిన మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, 500 పడకలతో కూడిన జనరల్ హాస్పిటల్ ఉండాలి. -
'స్మార్ట్ సిటీల ఎంపిక ఢిల్లీలో జరగలేదు'
-
'స్మార్ట్ సిటీల ఎంపిక ఢిల్లీలో జరగలేదు'
న్యూఢిల్లీ: స్మార్ట్ సిటీల ఎంపికను తాము చేయలేదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. ప్రపంచ, జర్మనీ బ్యాంకు, ఐఐయూఏ ఎంపిక చేశాయని చెప్పారు. మూడు ప్యానెళ్లు స్మార్ట్ సిటీల ఎంపికను చేపట్టాయని ఆయన తెలిపారు. ఇందులో రాజకీయ పార్టీల జోక్యం ఏమాత్రం లేదని ఆయన అన్నారు. స్మార్ట్ సిటీలకోసం నాడు కేంద్రం కేవలం మార్గదర్శకాలు మాత్రమే జారీ చేసిందని, ఆ సమయంలో స్మార్ట్ సిటీల ఎంపికకోసం పాటించాల్సిన ప్రమాణాలు కూడా చెప్పామని ఆయన తెలిపారు. మెరిట్ ప్రాతిపదికన నగరాల ఎంపిక జరిగిందని వెంకయ్యనాయుడు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసి విడుదల చేసిన స్మార్ట్ సిటీల జాబితాలో తెలంగాణలోని ఒక్క నగరానికి కూడా చోటుదక్కలేదు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వివరణ ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేయడంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కేంద్రమంత్రిపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వెంకయ్యనాయుడు వివరణ ఇచ్చారు. -
స్మార్ట్ సిటీల తొలి జాబితా విడుదల
-
స్మార్ట్ సిటీల తొలి జాబితా విడుదల
న్యూఢిల్లీ: స్మార్ట్ సిటీల తొలి జాబితాలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన నగరాలు విశాఖపట్నం, కాకినాడలకు స్థానం దక్కింది. 20 నగరాల పేర్లతో కూడిన స్మార్ట్ సిటీల తొలి జాబితాను గురువారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్మార్ట్ సిటీల ఎంపికలో పారదర్శక విధానం పాటించామన్నారు. ఆకర్షణీయ నగరాల కోసం రూ. 3 లక్షల కోట్లు కేటాయించినట్టు చెప్పారు. ఆకర్షణీయ నగరాలతో జీవన ప్రమాణాలు మెరుగవుతావుతాయని అన్నారు. స్మార్ట్ సిటీ చాలెంజ్ లో తెలంగాణ నగరాలకు అవకాశం దక్కలేదు. ఒక పాయింట్ తేడాతో వరంగల్ అవకాశం కోల్పోయింది. విశాఖ 8, కాకినాడ 14 స్థానాల్లో నిలిచాయి. తొలి జాబితాలోని స్మార్ట్ సిటీలు 1. భువనేశ్వర్ 2. పుణె 3. జైపూర్ 4. సూరత్ 5. కొచ్చి 6. అహ్మదాబాద్ 7. జబల్పూర్ 8. విశాఖపట్నం 9. సోలాపూర్ 10. దావణగెరె 11. ఇండోర్ 12. న్యూఢిల్లీ 13. కోయంబత్తూరు 14. కాకినాడ 15. బెల్గావి 16. ఉదయపూర్ 17. గువాహటి 18. చెన్నై 19. లుథియానా 20. భోపాల్ -
సురక్షితమైతేనే నగరం సుందరం
సమకాలీనం స్మార్ట్ సిటీ అంటే ఏమిటోగానీ, స్వచ్ఛమైన గాలి, నీరు లభించే వాతావరణం సగటు నగర జీవికి కావాలి. విపత్తుల్లోనూ ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు భద్రతను కల్పించాలి. హరితాన్ని, జలవనరుల్ని పరిరక్షిస్తూ నిలకడైన అభివృద్ధిని సాధించే ఆవాసయోగ్య నగరాలే స్మార్ట్‌సిటీలు. ఆ లెక్కన మన నగరాలెంత భద్రమైనవి? పారిస్ సదస్సులో దేశాలన్నీ ఏ చర్యలకు కట్టుబడతాయో ప్రకటించినట్టే... నగరాల పరిరక్షణకు, పర్యావరణ భద్రతకు పాలకులు, అధికారులు, పౌర సమాజం తమ నిబద్ధతను ప్రకటించాలి. ఆశావహ సంకేతాలిచ్చిన పారిస్ పర్యావరణ సదస్సు నేర్పిన పాఠమేమిటి? మనందరి కింకర్తవ్యమేమిటి? నిడివిలో చిన్నవిగా ఉన్నా ఇవి చాలా పెద్ద ప్రశ్నలు. సమాధానాలు, కార్యాచరణలు మరీ పెద్దవి. పర్యావరణ పరిరక్ష ణకు భూతాప పరిమితిని రెండు డిగ్రీల సెల్సియస్ దాటనీకుండా నియం త్రించాలని 190కి పైగా దేశాలు కుదుర్చుకున్న ఒప్పందం ఆహ్వానించదగ్గదే! దాదాపు రెండు వారాలు సాగిన ఈ సదస్సు తర్వాత, భాగస్వామ్య దేశాలన్నీ తమ తమ స్థాయిలలో బద్ధులమై ఉంటామని ప్రకటించిన ఉద్దేశాల (ఐఏన్డీసీ)ను, కుదుర్చుకున్న ఒప్పందాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన మీదట... ప్రపంచ మేధావులు క్రోడీకరిస్తున్న ఆచరణీయ ముఖ్యాంశాలు ఐదు: 1. అభివృద్ధికి నూతన నిర్వచనం, నిలకడైన ప్రగతికి వినూత్న పంథా అవసరం, 2. డిజిటల్ విప్లవ వేగంతో స్వచ్ఛ-ఇంధన వినియోగం వైపు పరివర్తన జరగాలి, 3. ఉత్పత్తి-వ్యాపార-వాణిజ్య రంగాలు కర్బన ముద్రలను (కార్బన్ ఫుట్‌ప్రింట్స్) తగ్గించే సరికొత్త ‘వాతావరణ పరిభాష’ను అలవరచుకోవాలి, 4. నగర-పట్టణీకరణ వ్యూహాలు... శిలాజ ఇంధనాల స్థానే పునర్వినియోగ ఇంధనాల్ని వాడటం వంటి చర్యల ద్వారా ‘కర్బన మూల్యం చెల్లింపుల‘కు సిద్ధపడాలి, 5. వాతావరణ మార్పు దుష్పరిణామాల్ని తట్టుకునే చర్యల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులను, వ్యయాలను పెంచే ఆర్థిక విధానాల ను అమలుపర్చాలి. ప్రభుత్వాలు, పౌర సంస్థలు, వ్యక్తులు చిత్తశుద్ధితో పాటి స్తేనే ఆశించిన లక్ష్యాలు నెరవేరి, ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా... కర్బన ఉద్గారాలకు, భూతాపోన్నతికి మానవ కారణాల్లో నగర, పట్టణీకరణ ప్రధాన సమస్య అని సదస్సు నొక్కి చెప్పింది. మన దేశంలో ఈ సమస్య మరింత తీవ్ర స్థాయిలో ఉంది. అందుకు మన హైదరాబాద్ ఒక ప్రత్యక్ష నిదర్శనం. మరో తెలుగు రాజధాని అమరావతి నిర్మాణమే ఓ పర్యావరణపరమైన పెద్ద సవాల్! గ్రామాల నుంచి అపరిమిత వలసల వల్ల పెరుగుతున్న జనాభా, తగిన ప్రణాళికలు లేకుండాసాగే ‘కుహనా అభివృద్ధి’, పెరుగుతున్న ఆర్థిక అంతరాలు సగటు మనిషి జీవన ప్రమాణాల్ని పతనం చేస్తున్నాయి. వాతావరణాన్ని ఛిద్రం చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఒకటి మహా నగర ఎన్నికల ముంగిట్లో, మరొకటి రాజధాని నిర్మాణ సన్నాహాల్లో ఉన్న ఈ సంధి కాలంలో వాటి బాగోగులు సర్వత్రా చర్చనీ యాంశాలే! మన మహానగరాల్లో ఆకర్షణీయత ఎంత? ఆవాసయోగ్యత ఎంత? అన్నది కోటి రూకల ప్రశ్న! అభివృద్ధి అంటే అభద్రతా? అధోఃగతా? నేటి పాలకులెవరిని కదిలించినా ప్రధాన నగరాలన్నింటినీ ‘స్మార్ట్ సిటీ’లు చేస్తామని అరచేత స్వర్గం చూపిస్తున్నారు. ఇంతకీ స్మార్ట్ సిటీ అంటే ఏంటి? ఏమో! కానీ, స్వచ్ఛమైన గాలి, నీరు లభించే వాతావరణంతో సగటు నగర జీవి జీవన ప్రమాణాల్ని పెంచి, విపత్తుల్లోనూ జీవితాలకు, స్థిరచరాస్తులకు భద్రతను కల్పించే నగరాల్ని స్మార్ట్ సిటీలు అనొచ్చేమో! సహజ వాతావ రణాన్ని కాపాడే హరితాన్ని, జలవనరుల్ని పరిరక్షిస్తూ నిలకడైన అభివృద్ధి సాధించే ‘ఆవాసయోగ్య’ నగరాలే స్మార్ట్‌సిటీలు. అలా లెక్కిస్తే మన నగరా లెంత భద్రమైనవి? ఎంత స్మార్ట్‌గా ఉన్నాయి? మొన్న హైదరాబాదు, ముంబాయి, నిన్న చెన్నై, రేపు... మరో నగరం! ఇంకా పెను ప్రమాదం ముందుందని అంతర్జాతీయ అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. 2031 నాటికి భారత నగర, పట్టణ జనాభా 60 కోట్లు దాటుతుందని ‘గ్లోబల్ కమిషన్ ఆన్ క్లైమేట్ అండ్ ఎకానమీ’ వెల్లడించింది. ఇది అమెరికా జనాభాకు రెట్టింపు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో పట్టణ జనాభా 37 కోట్లు మాత్రమే! ఇంత స్వల్ప వ్యవధిలో ఇంతగా నగర, పట్టణీకరణ చైనాలో తప్ప మరెక్కడా జరగలేదు. భవిష్యత్తు ప్రమాదాల్ని పసిగట్టి ఇప్పట్నుంచే నియంత్రణ చర్యల్ని చేపట్టడంలో చైనాతో మనకసలు పోలికే లేదు. ఎన్ని విమర్శలున్నా... నగరాలు, పట్టణాల నిలకడైన అభివృద్ధి ప్రణాళికల్లో, జనాభా వృద్ధిని నియం త్రించడంలో చైనాను అందుకోవడం భారత్‌కు అయ్యే పనికాదు. మెకిన్సే గ్లోబల్ సంస్థ అధ్యయనం ప్రకారం, వచ్చే పదేళ్లలో పది లక్షల జనాభా దాటే మన నగరాల సంఖ్య 68కి చేరనుంది. అప్పుడేంటి పరిస్థితి? కేంద్ర ప్రభుత్వం ఇటీవలే రెండు ముఖ్య కార్యక్రమాల్ని చేపట్టింది. ‘స్మార్ట్ సిటీ’ల అభివృద్ధి, ‘అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్’ (అమృత్). ఓ కార్యక్రమం కింద వంద, మరో కార్యక్రమం కింద 500 నగరాలు- పట్టణాల అభివృద్ధి లక్ష్యంగా పేర్కొన్నారు. ‘‘ప్రణాళికాబద్ద పట్టణాభివృద్ధి భూమికపైనే భారత ప్రగతి కథాగమనం సాగిస్తామ’’ని కేంద్రం ప్రకటిం చింది. యూపీఏ హయాంనాటి జేఎన్ఎన్యూఆర్ఎమ్ పథకంలోని వైఫల్యా లను ఏ మేరకు పరిగణనలోకి తీసుకుంటున్నారో అనుమానమే! ప్రకృతి విపత్తుల కోణంలో తగు భద్రత కోసం రూపొందించిన విధాన ముసాయిదా (2014)లో ఉన్న పర్యావరణ ప్రభావ అంచనా (ఈఐఏ)... తీరా రాజపత్రం (2015)లో కనిపించకపోవడమే ఈ అనుమానానికి కారణం. ఆ రెండు నగరాల కథ! చరిత్రాత్మకమైన భాగ్యనగరం నేడు వాతావరణ పరంగా ఓ అభాగ్యనగరమే! సమీప భవిష్యత్తులోనే ఓ మహా మురికి కూపం అయినా కావచ్చు. అసా ధారణ స్థాయి వలసలు, లెక్కకు మించుతున్న జనాభా, అపరిమిత విస్తరణ, అడ్డగోలు నగరాభివృద్ధి, పౌర సదుపాయాల పరమైన వ్యూహం- ప్రణాళిక లేమి కలిసి పర్యావరణ భద్రత లోపిస్తోంది. భవిష్యత్తు మరింత భయం కలిగించేలా ఉంది. కులీకుతుబ్‌షాకు ప్రీతిపాత్రమైన హైదరాబాద్ ఒకప్పుడు చెరువులు, కుంటలకూ, హరితానికీ ప్రతీతి. సమశీతోష్ణ నగరమనే ఖ్యాతి ఉం డేది. అందుకే, రాష్ట్రపతి వేసవిలో, శీతాకాలంలో ఇక్కడికి విడిది వస్తుంటారు. ఆ పరిస్థితి మారి, ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నాయి. కబ్జాదా రుల భూదురాక్రమణలు, పాలకుల నిర్లక్ష్యం, రియల్టర్ల దౌష్ట్యాల ఫలితంగా చెరువులు, పార్కులు దాదాపు కనుమరుగయ్యాయి. కాలుష్యం విపరీతంగా పెరిగింది. నగరంలో సుమారు 50 చదరపు కిలోమీటర్ల పరిధిలో గ్రీన్‌బెల్ట్ (హరిత తోరణం) ఉందని జీహెచ్ఎంసీ చెబుతోంది. అంటే మొత్తం విస్తీర్ణం లో సుమారు 8 శాతం. బెంగళూరు విస్తీర్ణంలో 13 శాతం హరిత తోరణం ఉంది. చండీగఢ్ నగర విస్తీర్ణంలో 30 శాతం హరిత తోరణంగాఉంది. అందుకే అది హరిత నగరంగా దేశానికే ఆదర్శమైంది. ఇక రాజధాని ఢిల్లీలో 5.95 శాతం, చెన్నైలో 2.01 శాతం, ముంబాయిలో 5.11 శాతం హరిత తోరణం ఉంది. హైదరాబాద్‌లో ప్రజారవాణా వ్యవస్థ అస్తవ్యస్థంగా, ఆధారపడ లేనిదిగా మారడంతో, వ్యక్తిగత వాహనాల సంఖ్య అనూహ్యంగా పెరుగు తోంది. గ్రేటర్ పరిధిలో అది 43 లక్షలకు చేరుకుంది. 3,500 ఆర్టీసీ బస్సుల్లో రోజూ 20 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఇక 1.50 లక్షల ఆటోల్లో 4 లక్షల మంది, ఎంఎంటీఎస్ రైళ్లలో లక్షలాది మంది రాకపోకలు సాగిస్తు న్నారు. ద్విచక్ర వాహనాలపైనే నిత్యం 20 లక్షల మంది ప్రయాణిస్తున్నట్టు అంచనా. పలు శివారు ప్రాంతాలకు ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులో లేక వ్యక్తిగత వాహనాల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ఫలితంగా ఓ వైపు ఇంధన బడ్జెట్, మరోవైపు వాయు, శబ్ద కాలుష్యాలు పలు రెట్లు పెరుగు తున్నాయి. నగర తాగునీటి, మురుగునీటి వ్యవస్థలైతే ఓ ఇంద్రజాలమే! ఇక్ష్వాకుల కాలం నాటి పైపులైన్ల వ్యవస్థ స్వల్ప మరమ్మతులతో కొనసా గుతోంది. తాగునీటిని నగరానికి రప్పించడానికి చూపే శ్రద్ధాసక్తుల్లో పదో వంతయినా... మురుగు నీటిని బయటకు పంపడంపై లేదు. ఫలితంగా నగరం దుర్గంధ కూపంగా మారుతోంది. వరదనీటి కాలువలు, మురుగునీటి కాలువలు, తాగునీటి పైపు లైన్లు పలుచోట్ల కలగలిసిపోతున్నాయి. జబ్బులు పెచ్చుపెరిగి అనారోగ్య భాగ్యనగరాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ఇక కొత్తగా ఊపిరిపోసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమ రావతిది మరోచరిత్ర! సహజ న్యాయ సూత్రాలకు, సుప్రీంకోర్టు తీర్పు లకు విరుద్ధంగా బహుళ పంటల హరిత భూముల్ని హరించి, అనైతిక పునాదుల పైనే ఆ నగరం పురుడు పోసుకుంటోంది. వరదలకు పేరైన కృష్ణాతీరంలో ఈ స్థావరం... వరదలు, భూకంపాల జోన్ అని నిపుణుల కమిటీ చేసిన హెచ్చరి కల్ని బేఖాతరంటూ సాగుతున్న పురో‘గతి’! యాభై వేల ఎకరాల అటవీ భూముల్ని డీనోటిఫై చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ వినతిపై కేంద్రం అభ్యం తరాలు వ్యక్తం చేసింది. పర్యావరణ భద్రతా చర్యల కార్యాచరణపై పలు సందేహాలున్నాయి. నిర్మాణ అనుమతుల్ని సూత్రప్రాయంగా నిరాకరించిన జాతీయ హరిత ట్రిబ్యునల్ ముందు కేసు విచారణలో ఉంది. ఇక్కడ కూడా ‘నిబద్ధత’ వెల్లడించాలి! పారిస్ సదస్సులో పాల్గొన్న దేశాలన్నీ తమ స్థాయిలో ఏమేం చర్యలకు కట్టు బడతాయో ‘నిబద్ధత’ (ఐఎన్డీసీ) ప్రకటించినట్టే నగరాల పరిరక్షణకు, పర్యా వరణ భద్రతకు పాలకులు, అధికారులు, సంస్థలు, పౌర సమాజం, వ్యక్తులు తమ నిబద్ధతను ప్రకటించాలి. ప్రకటించిన ప్రతి అంశాన్నీ తు.చ. తప్పక ఆచరించాలి. ‘విశ్వస్థాయిలో ఆలోచించు-స్థానికంగా ఆచరించు’ అన్న సూత్ర మిక్కడ అక్షరాలా సరిపోతుంది. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ (సీజీఆర్) ఆధ్వర్యంలో ‘సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్’ (సెస్)లో ఇటీవల హైదరాబాద్ ఆవాసయోగ్యతపై లోతైన చర్చ జరిపింది. పలువురు నిపుణులు పాల్గొన్న ఈ సదస్సు సమస్య మూలాల్ని, తీవ్రతకు కారణమౌతున్న అంశాల్ని చర్చించడంతో పాటు నివారణ, ముందు జాగ్రత్త చర్యలను విపులీకరించింది. మహానగర ఎన్నికల ముంగిట్లో రాజకీయ పార్టీలు ‘ఎన్నికల హరిత ప్రణాళిక’లను ప్రకటించాలని, ఆచరించాలని డిమాండ్ చేసింది. పౌరుల్ని భాగస్వాముల్ని చేసి, తగు సంప్రదింపుల ద్వారా అభివృద్ధి కార్యక్రమాల్ని రూపొందించాలని, వాటిని వ్యాపార దృక్ప థంతో కాక జనహితంలో, చిత్తశుద్ధితో ఆచరించేందుకు మార్గదర్శకాల్ని సూచించింది. సుస్థిరాభివృద్ధికి ఐక్యరాజ్యసమితి ప్రకటించిన 17 లక్ష్యాల్లో రెండంశాలు, మన మహానగరాల పరిరక్షణకు సరిగ్గా సరిపోతాయి. ఒకటి, ‘సమ్మిళిత, సురక్షిత, పరిస్థితులకనుకూలంగా ఒదిగే, నిలకడైన పర్యావరణ విధానాల్ని రూపొందించుకోవాలి’. రెండు, ‘‘విపత్తుల్లో... మృతులు, బాధితుల సంఖ్యను, ప్రత్యక్ష ఆర్థిక నష్టాలను నిలకడగా తగ్గించుకోగలిగే దీర్ఘకాలిక చర్యలుండాలి’’ సురక్షిత నగరాలే సుందర నగరాలు, చూడచక్కని నగరాలు (స్మార్ట్ సిటీలు) సుమా!! దిలీప్‌రెడ్డి, సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఈమెయిల్: dileepreddy@sakshi.com -
స్వయం పోషకంగా స్మార్ట్ నగరాలు
అధికారులు ప్రణాళికలు రూపొందించాలి: సీఎం సాక్షి, విజయవాడ బ్యూరో: జాతీయస్థాయిలో స్మార్ట్ నగరాల పోటీకి గాను తిరుపతి, కాకినాడ, విశాఖలు స్థిరంగా, స్వయంపోషకంగా ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పెట్టుబడుల్ని రాబట్టేలా, పెద్దఎత్తున యాత్రికులను ఆకర్షించేలా ప్రణాళికలుండాలన్నారు. శనివారం రాత్రి తన కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత స్మార్ట్ నగరాలపై జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ స్థాయిలో స్మార్ట్ నగరాల పోటీకి రాష్ట్రం నుంచి ఈ మూడు నగరాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ మూడు నగరాల నవీకరణపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి శ్రీనివాసమ్ వరకూ 1.6 కిలోమీటర్ల మేర ఆకాశమార్గాన్ని నిర్మించేలా అధికారులిచ్చిన ప్రజెంటేషన్‌ను ముఖ్యమంత్రి తిలకించారు. తిరుపతి స్మార్ట్ సిటీ ప్లాన్‌పై ముఖ్యమంత్రి పలు మార్పులు, చేర్పులు సూచించారు. మొత్తం నగర నవీకరణకు రూ.2,636 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. విశాఖ స్మార్ట్ నగరం రూపకల్పనపై మున్సిపల్ కమిషనర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆటో రిక్షాల నుంచి ఇ-రిక్షా స్థాయికి ఎదిగేలా ప్రజారవాణా వ్యవస్థను ప్రణాళికలో పొందుపరిచినట్లు అధికారులు తెలిపారు. అందమైన సాగరతీరం, చుట్టూ పర్వత శిఖరాలే విశాఖ నగరానికి వన్నె తెస్తున్నాయని కైలాసగిరి, మధురవాడ, కంభాలకొండ ప్రాంతాలను ఆకర్షణీయ ప్రాంతాలుగా మలిచి విశాఖను ప్రపంచ పర్యాటక గమ్య స్థానాల్లో ఒకటిగా మార్చాలని సీఎం కోరారు. సమావేశంలో పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ పీవీ రమేష్, సీఎంవో ముఖ్య కార్యదర్శి సతీష్‌చంద్ర, కార్యదర్శి సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
టాప్-20లో హైదరాబాద్‌ను నిలబెడదాం
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 100 స్మార్ట్ సిటిల్లో హైదరాబాద్ నగరాన్ని టాప్-20లో నిలిపేందుకు జీహెచ్ఎంపీ ప్రణాళికలు రూపొందిస్తోందని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ తెలిపారు. కేంద్రానికి ఇచ్చే నివేదికపై జీహెచ్ఎంసీ సీనియర్ అధికారులు, కన్సల్టెంట్‌తో ఆయన సోమవారమిక్కడ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సోమేశ్ కుమార్ మాట్లాడుతూ కేంద్రానికి పంపే స్మార్ట్ సిటీ నివేదికను ఉత్తమ ప్రమాణాలతో రూపొందించాలని, జీహెచ్ఎంసీ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ పథకాలను నివేదికలో పొందుపరచాలన్నారు. హైదరాబాద్‌ను విశేష నగరంగా రూపొందించేందుకు కార్యక్రమాలు సూచించాలని, హెరిటేజ్ పరిరక్షణ, హరిత హైదరాబాద్, పరిశుభ్ర హైదరాబాద్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఈ గవర్నన్స్, సంక్షేమ పథకాలు మరింత సమర్థవంతంగా నిర్వహణపై చేపట్టాల్సిన చర్యలను సూచిస్తూ నివేదిక రూపొందించాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో సీసీపీ దేవందర్ రెడ్డి, అదనపు కమిషనర్లు కెనడీ, శంకరయ్యతో పాటు పలువురు కన్సల్టెంట్లు పాల్గొన్నారు. -
నా సొంతూరుకే ఇవ్వలేదు ... ఇంకా విజయవాడకా ?
విజయవాడ : ‘నా సొంత నగరం నెల్లూరునే స్మార్ట్ సిటీగా ఎంపిక చేయలేదు. విజయవాడను ఏవిధంగా ఎంపిక చేస్తాం. కేంద్ర పట్టాణాభివృద్ధి శాఖ మంత్రిగా నేను, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ నెల్లూరులోనే ఉన్నాం. అయినా ఆ నగరాన్నే ఎంపిక చేయనప్పుడు విజయవాడ ఎలా అవుతుంది’ అంటూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు వ్యగ్యంగా వ్యాఖానించారు. శనివారం సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో విజయవాడను స్మార్ట్ సిటీగా ఎంపిక చేయకపోవడంపపై విలేకరులు కేంద్ర మంత్రిని ప్రశ్నించగా ఆయన పైవిధంగా స్పందించారు. జీతాలే ఇవ్వలేకపోతున్నారు... పట్టణాలకు వస్తున్న ఆదాయం, అందిస్తున్న పౌరసేవలు తదితర అంశాలను తీసుకుని ర్యాంకింగ్‌లు ఇచ్చామని, విజయవాడకు ర్యాంకు రాకపోవడం వల్లనే ఎంపిక కాలేదని వివరణ ఇచ్చారు. విజయవాడ కార్పొరేషన్ సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉందని ఆయన గుర్తు చేశారు. భవిష్యత్తులో ర్యాంకును మెరుగుపరుచుకుంటే స్మార్ట్ సిటీగా ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయంటూ తేల్చి చెప్పారు. మాటమార్చిన వెంకయ్య... ఆరు నెలల క్రితం విజయవాడకు వచ్చిన వెంకయ్యనాయుడు మాట్లాడుతూ విజయవాడ నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామంటూ హామీ ఇచ్చారు. కేంద్ర పట్టాభివృద్ధి శాఖ ఆయన చేతిల్లోనే ఉండటంతో నగరం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని నగరవాసులు భావించారు. ఇప్పుడు వెంకయ్యనాయుడు మాట మార్చడంపై పలువురు విస్మయానికి గురవుతున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపైనా అదే తంతు... రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంపైనా వెంకయ్యనాయుడు మాటమార్చారని నగర ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత నగరానికి వచ్చిన వెంకయ్యనాయుడు రాష్ట్ర విభజన సమయంలో తాను మాత్రమే రాజ్యసభలో నిలబడి నాటి ప్రధాని మంత్రి మన్మోహన్సింగ్ చేత రాష్ట్రానికి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రకటన చేయించానంటూ చెప్పుకొచ్చారు. యూపీఏ ప్రభుత్వం ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామంటూ ప్రకటించినందున కేంద్రంలో ఇప్పుడు తమ ప్రభుత్వమే ఉన్నందున రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేక హోదా వస్తుందంటూ చెప్పడంతో ప్రజలు నమ్మారు. నెపం యూపీఏపై నెట్టేస్తూ... అయితే ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వడంపై ఆయన మాటమార్చుతూ యూపీఏ ప్రభుత్వం విభజన బిల్లులో ప్రత్యేక హోదా పెట్టకపోవడం వల్ల ఇవ్వడం సాధ్యపడటం లేదని, తమ వంతు కృషి చేస్తామని చెప్పడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంకయ్యనాయుడు వంటి సీనియర్ నేత మాట మార్చడంపై రాజకీయ పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
బలవంతంగా పన్నులు వసూలు చేయం: వెంకయ్య
హైదరాబాద్ : స్మార్ట్ సిటీలపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సోమవారం హెచ్ఐసీసీలో రీజనల్ వర్క్ షాప్ ప్రారంభించారు. 12 రాష్ట్రాల నుంచి 40 నగరాల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు ప్రసంగిస్తూ స్మార్ట్ సిటీల నిర్మాణంలో ప్రజలను భాగస్వాములను చేయాలని, వీటి ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.. స్మార్ట్ సిటీల్లో కార్పొరేటర్లు, మేయర్ల పాత్రే కీలకమని వెంకయ్య అన్నారు. దేశంలోని నగరాల పరిస్థితి దారుణంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం సరికాదని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్రాలను కేంద్రం ఆదుకుంటుందని, నగరాల అభివృద్ధికి యూజర్ ఛార్జీలు వసూలు చేయక తప్పదని అన్నారు. బలవంతంగా పన్నులు వసూలు చేయమని, సౌకర్యాలు ఎక్కువ కావాలంటే పన్నులు కట్టాల్సిందేనని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. ఈ వర్క్ షాపుకు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఏపీ మంత్రి నారాయణ హాజరయ్యారు. -
స్మార్ట్ సిటీల జాబితా ఇదీ..
⇒ ఏపీలో విశాఖ, తిరుపతి, కాకినాడ ⇒ తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ ⇒ అన్ని నగరాలతో కూడిన పూర్తి జాబితా వెల్లడి న్యూఢిల్లీ రెండు తెలుగు రాష్ట్రాలతో సహా.. అన్ని రాష్ట్రాలలో ఎంపిక చేసిన స్మార్ట్ సిటీల జాబితా వెలువడింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, తిరుపతి, కాకినాడలను, తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్ నగరాలను ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి ఒక్కో నగరాన్ని ఎంపిక చేసుకున్నారు. పూర్తి జాబితా ఇదీ... ఆంధ్రప్రదేశ్ - విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ తెలంగాణ - గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్ అండమాన్ నికోబార్ - పోర్ట్ బ్లెయిర్ అరుణాచల్ ప్రదేశ్ - పాసిఘాట్ అసోం - గువాహటి బీహార్ - ముజఫర్‌పూర్, భాగల్పూర్, బీహార్షరీఫ్ చండీగఢ్ ఛత్తీస్‌గఢ్- రాయ్‌పూర్, బిలాస్పూర్ దాద్రా నగర్ హవేలి- సిల్వాసా డామన్ డయ్యు- డయ్యు ఢిల్లీ గోవా - పణజి గుజరాత్ - గాంధీనగర్, అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్‌కోట్, దహోద్ హర్యాణా- కర్నల్, ఫరీదాబాద్ హిమాచల్ ప్రదేశ్ - ధర్మశాల జార్ఖండ్ - రాంచీ కర్ణాటక - మంగళూరు, బెలాగవి, శివమొగ్గ, హుబ్బాలి-ధార్వాడ్, తుమకూరు, దావణగెరె కేరళ - కొచ్చి లక్షద్వీప్- కవర్రటి మధ్యప్రదేశ్ - భోపాల్, ఇండోర్, జబల్పూర్, గ్వాలియర్, సాగర్, సత్నా, ఉజ్జయిని మహారాష్ట్ర- నవీ ముంబై, నాసిక్, థానె, గ్రేటర్ ముంబై, అమరావతి, షోలాపూర్, నాగ్‌పూర్, కళ్యాణ్-డోంబివాలి, ఔరంగాబాద్, పుణె మణిపూర్ - ఇంఫాల్ మేఘాలయ - షిల్లాంగ్ మిజొరాం - ఐజ్వాల్ నాగాలాండ్ - కోహిమా ఒడిషా - భువనేశ్వర్, రూర్కెలా పుదుచ్చేరి - ఔల్గారెట్ పంజాబ్ - లూధియానా, జలంధర్, అమృతసర్ రాజస్థాన్ - జైపూర్, ఉదయ్‌పూర్, కోట, అజ్మీర్ సిక్కిం - నామ్చి తమిళనాడు - తిరుచిరాపల్లి, చెన్నై, తిరుపూర్, కోయంబత్తూర్, వెల్లూరు, సేలం, ఈరోడ్, తంజావూరు, తిరునల్వేలి, దిండిగల్, మదురై, తూత్తుకూడి త్రిపుర - అగర్తలా ఉత్తరప్రదేశ్ - మొరాదాబాద్, అలీగఢ్, సహారన్పూర్, బరేలి, ఝాన్సీ, కాన్పూర్, అలహాబాద్, లక్నో, వారణాసి, ఘజియాబాద్, ఆగ్రా, రాంపూర్ ఉత్తరాఖండ్ - డెహ్రాడూన్ పశ్చిమబెంగాల్ - న్యూటౌన్ కోల్‌కతా, బిధన్నగర్, దుర్గాపూర్, హల్దియా -
ఏపీలో మూడు స్మార్ట్ నగరాలు ఇవే..!
కేంద్రానికి అందిన రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, కరీంనగర్‌లను ప్రతిపాదించిన తెలంగాణ ప్రభుత్వం సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి నగరాలను స్మార్ట్ నగరాలుగా అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర పట్టణాభివృద్ధిశాఖకి ప్రతిపాదనలు పంపింది. స్మార్ట్ సిటీస్ మిషన్‌లో భాగంగా 100 నగరాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం తొలివిడతలో 20 నగరాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు కోరింది. ఇందుకు జూలై 31ని గడువుగా నిర్ధారించింది. మూడు అంచెల్లో ఈ స్మార్ట్ సిటీలను ఎంపిక చేయనున్నారు. తొలివిడతలో తమకు కేటాయించిన స్మార్ట్ నగరాల సంఖ్యకు అనుగుణంగా రాష్ట్రాలు ప్రతిపాదనలు సిద్ధం చేస్తాయి. రెండో అంచెలో కేంద్రం రాష్ట్రాల నుంచి వచ్చిన స్మార్ట్ నగరాల ప్రతిపాదనలను పరిశీలించి మిగిలిన నగరాలతో పోల్చి చూస్తాయి. మూడో అంచెలో తుది జాబితాను ప్రకటించి నిధులు సమకూరుస్తాయి. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనకు కేటాయించిన నగరాల సంఖ్య(3)కు అనుగుణంగా వైజాగ్, కాకినాడ, తిరుపతి నగరాలను స్మార్ట్ సిటీ మిషన్‌కు ప్రతిపాదించింది. తెలంగాణకు కేటాయించిన నగరాల సంఖ్య 2. కాగా స్మార్ట్ సిటీ మిషన్ కింద గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లను ఎంపిక చేయాలని కేంద్రానికి శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. -
స్మార్ట్ సిటీల ఎంపికలో రాజకీయం లేదు
న్యూఢిల్లీ : స్మార్ట్ సిటీల ఎంపికలో రాజకీయం లేదని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. జనాభా ప్రాతిపదికనే స్మార్ట్ సిటీలను ఎంపిక చేశామని ఆయన శనివారమిక్కడ తెలిపారు. స్మార్ట్ సిటీ విధివిధానాలను కేంద్రం రూపొందిస్తుందని, అయితే రాష్ట్రానికే నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తుందన్నారు. స్మార్ట్ సిటీలు, అమృత్ సిటీల నిర్మాణంలో స్థానిక సంస్థలను అనుసంధానం చేయాలని వెంకయ్య అభిప్రాయపడ్డారు. ఎన్డీయే ప్రభుత్వం తలపెట్టిన స్మార్ట్ సిటీల ప్రాజెక్ట్ కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు, తెలంగాణ నుంచి 5 నగరాలను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా మొత్తం 100 నగరాలను ఎంపిక చేయగా, వాటిలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే తొమ్మిది ఎంపిక కావటం గమనార్హం. ఏపీ నుంచి చిత్తూరు, కర్నూలు, విజయవాడ, గుంటూరు ఎంపిక కాగా, తెలంగాణ నుంచి హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్, నల్గొండ, కరీంనగర్‌లను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. -
'గతం గుర్తుచేసుకుని బాధ పడాల్సినవసరం లేదు'
-
'గతం గుర్తుచేసుకుని బాధ పడాల్సినవసరం లేదు'
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడు కొత్త పథకాలకు శ్రీకారం చుట్టారు. అమృత్, అందరికీ గృహాలు, స్మార్ట్ సిటీస్ మిషన్ పథకాలను న్యూఢిల్లీలో గురువారం ఆయన అధికారికంగా ప్రారంభించారు. వీటిలో భాగంగా 100 ఆకర్షణీయ నగరాల అభివృద్ధి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. సామాన్యుడిని దృష్టిలో పెట్టుకుని మరిన్ని పథకాలు రూపొందిస్తామన్నారు. ప్రపంచ దేశాలతో పోటీపడగలమా అన్న సందేహం వద్దని ఆయన పేర్కొన్నారు. ప్రణాళికా బద్దంగా ముందడుగు వేస్తే లక్ష్యాన్ని చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. నగరాలు ఎలా అభివృద్ధి చెందాలన్నదానిపై చర్చిద్దామని, గతాన్ని గుర్తుచేసుకుని బాధపడాల్సిన అవసరంలేదన్నారు. పేదోళ్లకు ఇళ్లు కట్టించడమే కాదు, ఆత్మవిశ్వాసంతో బతికేలా చేద్దామని ప్రధాని మోదీ చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో 5 ఆకర్షణీయ నగరాలు, అమృత్ పట్టణాల ఆధునికీకరణను చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణకు 2, ఆంధ్రప్రదేశ్ నుంచి 3 ఆకర్షణీయ నగరాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఎంపిక చేసిన ఒక్కో నగరానికి ఏడాదికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. -
ఆంధ్రాకు 3, తెలంగాణకు 2
* దేశవ్యాప్తంగా స్మార్ట్ నగరాల సంఖ్య ఖరారు * నామినేట్ చేయాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచన * యూపీకి అత్యధికంగా 13, తమిళనాడుకు 12, మహారాష్ట్రకు 10 * ‘అమృత్’ పథకంలో ఏపీకీ 31, తెలంగాణకు 15 పట్టణాల ఎంపిక సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా స్మార్ట్ సిటీస్ పథకం ద్వారా అభివృద్ధి చేయనున్న నగరాల ఎంపికకు పేర్లు నామినేట్ చేయాల్సిందిగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ రాష్ట్రాలకు సూచించింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు, తెలంగాణ నుంచి రెండు నగరాలను నామినేట్ చేయాలని తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కేవలం ఐదు నగరాలకు అవకాశం దక్కగా.. ఉత్తరప్రదేశ్‌కు ఏకంగా 13 నగరాలకు, తమిళనాడుకు 12, మహారాష్ట్రకు 10, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలకు చెరో ఆరు నగరాలను నామినేట్ చేసేందుకు కేంద్రం అవకాశం ఇచ్చింది. స్మార్ట్ సిటీస్ పథకాన్ని ప్రధాని మోదీ ఈ గురువారం ఇక్కడి విజ్ఞాన్ భవన్లో ప్రారంభించనున్నారు. పట్టణ జనాభా, పట్టణ స్థానిక సంస్థల సంఖ్య అంశాలను ప్రాతిపదికగా తీసుకుని ఈరెండు అంశాలకు 50:50 నిష్పత్తి చొప్పున వెయిటేజీ ఇచ్చి రాష్ట్రాలకు నామినేట్ చేయాల్సిన సంఖ్యను కేంద్రం సూచించింది. ప్రతి రాష్ట్రానికి, ప్రతి కేంద్ర పాలిత ప్రాంతానికి ఒక స్మార్ట్ సిటీ దక్కేలా నామినేషన్ సంఖ్యను కేటాయించారు. తొలి విడతలో నామినేషన్ల సంఖ్య నిర్ధారించేందుకు ఆయా రాష్ట్రాల్లోని నగరాలు అంతర్గతంగా పోటీపడగా.. రెండో దశలో ఇతర రాష్ట్రాల నగరాలతో పోటీపడనున్నాయి. ఈ వంద స్మార్ట్ నగరాల ఎంపిక అనంతరం అవి తగిన ప్రణాళికలు రూపొందిస్తాయి. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, నిపుణుల బృందం, రాష్ట్రాలు కలిసి ప్రణాళిక రచిస్తాయి. ఈ వంద నగరాల్లో ప్రతిభా క్రమంలో వచ్చిన టాప్-20 నగరాలకు 2015-16 ఆర్థిక సంవత్సరంలోనే నిధులు కేటాయిస్తారు. మరో 40 నగరాలకు 2016-17లో నిధులు కేటాయిస్తారు. తదుపరి సంవత్సరం మరో 40 నగరాలకు నిధులు కేటాయిస్తారు. 70 శాతం స్మార్ట్ నగరాలు 12 రాష్ట్రాలలోనే(యూపీ, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఎంపీ, కర్ణాటక, ఏపీ, రాజస్థాన్, పంజాబ్, హరియాణ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్) అభివృద్ధి చెందనున్నాయి. వీటిలో 8 బీజేపీ, దాని మిత్రపక్షాల పాలిత రాష్ట్రాలు.‘అమృత్’ పథకంలో కూడా అభివృద్ధి చేయనున్న 476 పట్టణాల్లో 225 ఈ 12 రాష్ట్రాలలోనే ఉండటం గమనార్హం. ‘అమృత్’లో తెలుగు రాష్ట్రాలకు 46 అటల్ పట్టణ నవీకరణ పథకం(అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్) కింద రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 46 నగరాలను కేంద్రం ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 31, తెలంగాణ నుంచి 15 నగరాలను ఈ పథకం కింద అభివృద్ధి చేయనుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం 4,041 పట్టణ స్థానిక సంస్థలు పనిచేస్తున్నాయి. ఇందులో దాదాపు 500 పై చిలుకు నగరాలు ఒక లక్ష కంటే అధికంగా ఉన్నాయి. దేశంలోని 73 శాతం పట్టణ జనాభా ఈ 500 పట్టణాల్లోనే ఉంది. అందుకే ఈ పట్టణాల అభివృద్ధికి సంబంధించిన ఈ అమృత్ పథకాన్ని కూడా ప్రధాని గురువారం నాడే ప్రారంభించనున్నారు. ఇప్పటివరకు 476 పట్టణాలను ఎంపిక చేశారు. మరో 24 పట్టణాలను ఎంపిక చేయాల్సి ఉంది. అయితే, లక్ష జనాభా కంటే తక్కువగా ఉన్నప్పటికీ వాటికున్న ప్రత్యేకతల్ని బట్టి పర్వత ప్రాంత పట్టణాలు, పర్యాటక ప్రాముఖ్యత, గంగా నది పరిసరాల్లో ఉన్న పట్టణాలనూ ఈ జాబితాలో ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్ ‘అమృత్’ పట్టణాలు (31) 1. గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్, 2. విజయవాడ, 3. గుంటూరు 4. నెల్లూరు, 5. కర్నూలు, 6. రాజమండ్రి, 7. తిరుపతి, 8. కాకినాడ 9. కడప, 10. అనంతపురం, 11. విజయనగరం, 12. ఏలూరు 13. ప్రొద్దుటూరు, 14. నంద్యాల, 15. ఒంగోలు, 16. ఆదోనీ, 17. మదనపల్లె 18. చిత్తూరు, 19. మచిలీపట్నం, 20. తెనాలి, 21. చీరాల 22. హిందూపురం, 23. శ్రీకాకుళం, 24. భీమవరం, 25. ధర్మవరం 26. గుంతకల్లు, 27. గుడివాడ, 28. నర్సరావుపేట, 29. తాడిపత్రి 30. తాడేపల్లి గూడెం, 31. చిలకలూరిపేట తెలంగాణలో ‘అమృత్’(15) 1. హైదరాబాద్, 2. వరంగల్, 3. నిజామాబాద్, 4. కరీంనగర్, 5. ఖమ్మం, 6. రామగుండం, 7. మహబూబ్‌నగర్, 8. మంచిర్యాల, 9. నల్లగొండ, 10. ఆదిలాబాద్, 11. కొత్తగూడెం, 12. సిద్దిపేట, 13. సూర్యాపేట, 14. మిర్యాలగూడ , 15. జగిత్యాల -
స్మార్ట్ సిటీలుగా పోర్టు నగరాలు
-
స్మార్ట్ సిటీలుగా పోర్టు నగరాలు
రూ. 50 వేల కోట్లతో ప్రణాళిక: గడ్కారీ న్యూఢిల్లీ: దేశంలోని ప్రధానమైన 12 పోర్టు నగరాలను రూ. 50 వేల కోట్లతో స్మార్ట్ సిటీలుగా నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఒక్కొక్క దానికి రూ. 3 నుంచి 4 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, షిప్పింగ్ శాఖ మంత్రి నితిన్ గ డ్కారీ ఆదివారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘12 పోర్టు నగరాలను గ్రీన్ స్మార్ట్ సిటీలుగా మార్చాలని నిర్ణయించాం. ఆరు నెలల్లో పనులు మొదలు పెట్టి ఐదు ఏళ్లలో పూర్తి చేస్తాం’ అని తెలిపారు. కేంద్రం అధీనంలోని ఈ 12 పోర్టుల్లో రూ. 2.64 లక్షల కోట్ల విలువైన భూములు ఉన్నట్లు అంచనా వేశారు. ముంబై పోర్టులో 753 హెక్టార్ల భూమిని గుర్తించారు. ‘ పోర్టుల్లోని ప్రభుత్వ భూములను జీపీఎస్ వ్యవస్థ ద్వారా గుర్తించాం. వీటిని బిల్డర్లకు అమ్మాలనుకోవట్లేదు. మేమే అభివృద్ధి చేస్తామ’ని తెలిపారు. అయితే ఈ నగరాల్లో ఇళ్లు నిర్మించడానికి ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తామని చెప్పారు. పోర్టు నీటిని రీసైకిల్ చేస్తామని, వ్యర్థ పదార్థాలను బయో గ్యాస్‌కు వినియోగిస్తామని పేర్కొన్నారు. స్మార్ట్ సిటీలకు ఎంపికైన పోర్టు నగరాలు కాండ్లా, ముంబై. జవహర్లాల్ నెహ్రూ పోర్టు ట్రస్ట్(జేఎన్పీటీ), మార్ముగావ్, కొత్త మంగళూరు, కొచ్చి, చెన్నై, ఎన్నూర్, వీవో చిదంబర్నర్, విశాఖపట్నం, పారాదీప్, కోల్‌కతా(హ ల్దియాతో కలిపి). -
స్మార్ట్ సిటీల కోసం టాస్క్‌ఫోర్స్
వైజాగ్, అజ్మీర్, అలహాబాద్‌ల కోసం కార్యాచరణ ప్రణాళిక సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నం(ఆంధ్రప్రదేశ్), అజ్మీర్(రాజస్తాన్), అలహాబాద్(ఉత్తరప్రదేశ్) నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి పరిచేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని భారత్, అమెరికాలు నిర్ణయించాయి. ఆ టాస్క్‌ఫోర్స్ మూడు నెలల్లోగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాల్సి ఉంటుంది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు, యూఎస్ వాణిజ్య శాఖ మంత్రి పెన్నీ ప్రిజ్కర్ల మధ్య మంగళవారం జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నగరాల వారీగా టాస్క్‌ఫోర్స్ కమిటీలు ఏర్పాటుచేసి ఈ కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఈ భేటీలో నిర్ణయించారు. ఈ టాస్క్‌ఫోర్స్ కమిటీల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, అమెరికా వాణిజ్య, అభివృద్ధి సంస్థ(యూఎస్టీడీఏ) ప్రతినిధులు ఉంటారు. ఆయా టాస్క్‌ఫోర్స్ కమిటీలు సంబంధిత నగరాల నిర్ధిష్ట లక్షణాలు, ప్రాజెక్టు అవసరాలు, పెట్టుబడుల ఆకర్షణ కోసం రాబడి నమూనాలు తదితర అంశాలను చర్చించి కార్యాచరణ రూపొందించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. విశాఖ, అజ్మీర్, అలహాబాద్ నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి పరిచేందుకు మూడు రాష్ట్రాలతో జనవరి 25న యూఎస్టీడీఏ ఒప్పందం కుదుర్చుకుందని పెన్నీ ప్రిజ్కర్ వివరించారు. ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్ ముఖ్యమంత్రులతో మాట్లాడానన్నారు. తాజా పరిణామాలతో స్మార్ట్ సిటీల స్వప్నం వాస్తవ రూపం దాల్చనుందని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. స్మార్ట్ సిటీల నిర్మాణానికి అవసరమైన నిధులను ఎఫ్‌డీఐ లేదా ఎఫ్ఐఐల ద్వారా సేకరిస్తామన్నారు. టాస్క్‌ఫోర్స్ కమిటీల్లో కేంద్రం తరపున పట్టణాభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా, సంయుక్త కార్యదర్శులు డాక్టర్ సమీర్ శర్మ, ప్రవీణ్ ప్రకాశ్‌లు ప్రాతినిథ్యం వహిస్తారని వివరించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెంటనే ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ ముఖ్యమంత్రులకు వెంకయ్యనాయుడు ఫోన్లో వివరించారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రితో కూడా త్వరలో మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ టాస్క్‌ఫోర్స్ కమిటీలో రాష్ట్రం తరపున పురపాలక శాఖ మంత్రి పి.నారాయణతో పాటు విశాఖ మున్సిపల్ కమిషనర్, పురపాలన కార్యదర్శి ప్రాతినిధ్యం వహించనున్నట్టు తెలిపారని వెంకయ్యనాయుడు మీడియాకు వివరించారు. విశాఖపట్నం విద్యార్థి చెక్కపై రూపొందించిన నరేంద్ర మోదీ, ఒబామాల కరచాలనం చిత్రాన్ని సమావేశం అనంతరం పెన్నీకి వెంకయ్యనాయుడు బహూకరించారు. -
‘స్మార్ట్’గా మారుస్తా
⇒ చిత్తూరు, తిరుపతిని స్మార్‌టసిటీలు చేస్తా ⇒ పండ్ల తోటల హబ్‌గా జిల్లా ⇒ ఆన్లైన్లో రైతు ఉత్పత్తుల విక్రయాలు ⇒ రెండు రోజుల్లోనే చెరకు బకాయిల చెల్లింపులు ⇒ చిత్తూరు సభలో చంద్రబాబు హామీలు సాక్షి, చిత్తూరు: చిత్తూరు, తిరుపతి నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. జిల్లాను పండ్లతోటల హబ్‌గా చేస్తానని, డెయిరీకి ప్రోత్సాహం అందిస్తానని కూడా చెప్పారు. రెండు రోజుల్లో చెరకు రైతుల బకాయిలను చెల్లిస్తామని ప్రకటించారు. గురువారం చిత్తూరులో జరిగిన రైతు సాధికారత సభలో చంద్రబాబు మాట్లాడుతూ జన్మనిచ్చిన చిత్తూరును మరవనన్నారు. కరువు జిల్లాలో తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదన్నారు. హంద్రీ-నీవా పూర్తిచేసి జిల్లా ప్రజలకు తాగునీరు అందిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట తప్పేదిలేదన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా రుణమాఫీ చేస్తున్నట్లు చెప్పారు. 80 నుంచి 90 శాతం మంది అర్హులకు పింఛన్లు ఇస్తున్నట్లు చెప్పారు. రాబోయే కాలంలో ప్రతి కుటుంబంలో సభ్యులందరికీ ఐదు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. జిల్లాలో చక్కెర ఫ్యాక్టరీల పరిధిలో రూ.20 కోట్లు చెరకు బకాయిలను రెండు రోజుల్లో చెల్లించనున్నట్లు చెప్పారు. పండ్లతోటల రైతులకు ఎకరాకు రూ.10వేల చొప్పున ఇస్తున్నట్లు ప్రకటించారు. 50 శాతం సబ్సిడీతో రైతులకు మైక్రోన్యూట్రిన్స్ సప్లై చేస్తామన్నారు. వర్మీ కల్చర్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. జిల్లాలోని చెరువులు, కుంటలు, చెక్‌డ్యాములు, కాలువలను ఆధునీకరించాలని నిర్ణయించామని చెప్పారు. జిల్లాలో 1,75లక్షల ఎకరాల్లో డ్రిప్ ఇరిగేషన్ ఉందని, ఈ ఏడాది మరో 20 వేల ఎకరాల్లో డ్రిప్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దా దాపు 40వేల ఎకరాల్లో స్ప్రింక్లర్లతో వ్యవసాయం అభివృద్ధి చేయనున్నట్లు బాబు చెప్పారు. జిల్లాను పండ్లతోటల హబ్‌గా చేస్తామని, మామిడి ఎగుమతులు పెరి గేలా చూస్తామని తెలిపారు. రైతుల ఉత్పత్తులు ఆన్లైన్లో జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ రూ. 16వేల కోట్లు లోటు బడ్జెట్ ఉన్నా ఇచ్చిన మాటమేరకు రుణమాఫీ చేసినట్లు చెప్పారు. ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుతామన్నారు. 40.38లక్షల మందికి రుణమాఫీ చేసినట్లు తెలిపారు. 22.79 వేల కుటుంబాలకు రుణవిముక్తి పత్రాలు ఇస్తున్నామన్నారు. పొరపాట్లు జరిగి ఉంటే రెండో దశలో పూర్తిచేస్తామన్నారు. చిత్తూరు జిల్లా లో 3.5లక్షల మంది రైతులకు రుణవిముక్తి కలిగిందన్నారు. అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎంపీ శివప్రసాద్, జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణీ, ఎమ్మెల్యే డీఏ.సత్యప్రభ, కార్పొరేషన్ మేయర్ కఠారి అనురాధ, కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్, జేసీ భరత్‌గుప్త, జెడ్పీ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి, తుడా కార్యదర్శి మాధవీలత, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
కేంద్రం నుంచి విధివిధానాలేం రాలేదు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: స్మార్ట్ సిటీలపై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన విధివిధానాలేమీ రాలేదని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె.తారక రామారావు స్పష్టంచేశారు. బుధవారం అసెంబ్లీలో డిమాండ్లపై చర్చ జరుగుతున్న సమయంలో బీజేపీ సభ్యుడు కె.లక్ష్మణ్ జోక్యం చేసుకొని స్మార్ట్‌సిటీలపై అసలు కేంద్రం నుంచి ఎటువంటి మార్గదర్శకాలు వచ్చాయో సభకు వెల్లడించాలని కోరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తాను ఇటీవల కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును కలిసినప్పుడు స్మార్ట్‌సిటీల గురించి మాట్లాడానని, ఎటువంటి ప్రతిపాదనలు తయారుచేయలేదని.. మార్గదర్శకాలు ఖరారు కాలేదని చెప్పారని వెల్లడించారు. అయితే రాష్ట్రంలో ఏ నగరాలను స్మార్ట్‌సిటీలుగా ప్రకటిస్తారో చెప్పమని కోరానని వివరించారు. గ్రామ, పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు: పోచారం వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గ్రామ, పట్టణప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. మున్సిపాలిటీలను కొన్నింటిని కార్పొరేషన్లుగా చేసినా వాటిలో ఆ స్థాయిలో మార్పులు రాలేదని వివరించారు. ఔటర్‌రింగ్ రోడ్లను ఆర్ అండ్ బీకి ఇచ్చిన నిధులతోనే చేపడతామని అన్నారు. రాష్ట్రంలో ఒక్క డెంగీ మరణం కూడా సంభవించలేదని మంత్రి జోగురామన్న స్పష్టం చేశారు. బీజేపీ సభ్యుడు చింతల రామచంద్రారెడ్డి సుదీర్ఘంగా మాట్లాడుతుండగా.. స్పీకర్ పదేపదే ముగించమని కోరారు. 1100 నోటిఫైడ్ స్లమ్‌లు:చింతల హైదరాబాద్ నగరంలో 1100 నోటిఫైడ్ మురికివాడలు ఉన్నాయని బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో 62 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు ఉంటే బడ్జెట్లో రూ. 5,436 కోట్లు కేటాయిస్తే ఎలా సరిపోతాయని ప్రశ్నించారు. హుస్సేన్‌సాగర్‌ను రూ. 100కోట్లతో ప్రక్షాళన చేయాలంటున్నారని... అయితే అందులోని రసాయన కలుషిత నీరు ఎక్కడికి పంపుతార ని నిలదీశారు. కాంగ్రెస్ సభ్యుడు పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడు తూ ఖమ్మం నగరాన్ని స్మార్ట్‌సిటీగా ప్రకటించిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్ సభ్యుడు శ్రీనివాసగౌడ్ మాట్లాడుతూ పట్టణాలు సమస్యల వలయంలో ఉన్నాయన్నారు. తండాలను అభివృద్ధి చేయాలని కోరారు. టీడీపీ సభ్యుడు వివేక్‌గౌడ్ మాట్లాడుతూ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో రాజీవ్ స్వగృహ, జేఎన్ఎన్యూఆర్ఎం కింద నిర్మించిన కాల నీల్లో మౌలిక సదుపాయాలు లేవనీ, వాటిని పరిష్కరించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పంచాయితీరాజ్ శాఖ ద్వారా జరుగుతున్న పనుల్లో జవాబుదారీతనం ఉండేలా చర్యలు చేపట్టాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే కిష్ణారెడ్డి అన్నారు. రాష్ట్రంలో పట్టణాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఎమ్మెల్యే గణేశ్‌గుప్త అన్నా రు. -
మన స్మార్ట్ సిటీలకు సింగపూర్ సాయం
భారతదేశంలో స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయడానికి తాము సాయం చేస్తామంటూ సింగపూర్ ముందుకొచ్చింది. వాటితో పాటు పట్టణాభివృద్ధికి సంబంధించిన ఇతర ప్రాజెక్టులలోనూ భాగస్వామ్యం వహిస్తామంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని నిర్మాణంలో కూడా పాలు పంచుకునేందుకు ఆసక్తి చూపింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడితో జిరగిన సమావేశాల్లో సింగపూర్ అగ్ర నాయకులు ఈ విషయాలను వెల్లడించారు. సింగపూర్ ప్రధానమంత్రి లీ సీన్ లూంగ్‌ను వెంకయ్యనాయుడు కలిశారు. ప్రస్తుతం సింగపూర్‌లో ఉన్న ఆయన.. దక్షిణ కొరియాలోని సియోల్‌లో ఆసియా పసిఫిక్ మంత్రుల సదస్సులో పాల్గొన్న తర్వాత ఢిల్లీకి తిరిగి వస్తారు. భారతదేశంలో మొత్తం వంద స్మార్ట్ సిటీలను ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారతదేశంలో శరవేగంగా సాగుతున్న అభివృద్ధి, ఆయన చొరవను సింగపూర్ ప్రధాని, మాజీ ప్రధాని కూడా అభినందించారు. -
తెలంగాణలో ఐదు స్మార్ట్ సిటీలు
* జాబితాలో హైదరాబాద్ , వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం * ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఐదు ప్రధాన నగరాలను శరవేగంతో అభివృద్ధి చేసే బాధ్యతను తాను తీసుకుంటానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కేంద్రం రూపొందించే స్మార్ట్‌సిటీల జాబితాలోకి హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం నగరాలను చేర్చేలా ప్రతిపాదనలు పంపించనున్నట్లు చెప్పారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్ (ఖమ్మం), జలగం వెంకట్రావు(కొత్తగూడెం) మంగళవారం సచివాలయంలో సీఎం కేసీఆర్‌ను కలిసారు. ఖమ్మం నగరాన్ని స్మార్ట్‌సిటీగా ప్రకటించి అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. దీంతో రాష్ట్రంలో 5 నగరాలు కీలకం కాబోతున్నాయని, ఆయా నగరాల సమగ్రాభివృద్ధిపై దృష్టి సారిం చినట్లు కేసీఆర్ చెప్పారు. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి జరిగితేనే స్మార్ట్‌సిటీ పేరుకు సార్థకత ఉంటుందన్నారు. హైదరాబాద్ నగరంలోనే డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉందన్నారు. అసెంబ్లీ, రాజ్‌భవన్, సీఎం నివాసాల ముందే చిన్న వర్షం పడినా నీళ్లు నిలిచిపోతాయన్నారు. నాలాలు కబ్జాకు గురయ్యాయని, ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకే రూ. 10 వేల కోట్లు అవసరమని అధికారులు అంచనా వేసినట్లు చెప్పారు. ఖమ్మంలో అండర్ డ్రైనేజీ వ్యవస్థ లేదని, కరీంనగర్, నిజామాబాద్ నగరాల్లో కూడా అస్తవ్యస్తంగా ఉందని సీఎం పేర్కొన్నారు. నగరాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వా లన్నారు. బడ్జెట్ సమావేశాల తర్వాత తానే ఈ నగరాలను సందర్శించి, సమస్యలు పరి ష్కారమయ్యేలా చూస్తానన్నారు. ఖమ్మం శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. రఘునాథపాలెం, కొణిజెర్ల, వైరా, చింతకాని తదితర మండలాలకు నగరం విస్తరించిన విషయాన్ని గుర్తుచేశారు. నల్లగొండలోనూ మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాల్సి ఉందన్నారు. రామగుండం తరహాలో కొత్తగూడెం కూడా అభివృద్ధి చెందుతుందని, అక్కడ 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ వస్తుందని, 10 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. కొత్తగూడెంలో టౌన్షిప్ అభివృద్ధి కానున్నందున నగరాన్ని జాగ్రత్తగా తీర్చిదిద్దాలన్నారు. వాటర్‌గ్రిడ్ ద్వారా అన్ని నగరాలకు మంచి నీటిని అందివ్వనున్నట్లు కేసీఆర్ తెలిపారు. నగరాల్లో ప్రతి వ్యక్తికి రోజుకు 135 లీటర్ల చొప్పున నీటిని అందించడం, రహదార్లు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం తదితర అంశాలపై దృష్టి సారిస్తామని చెప్పారు. కాగా ముఖ్యమంత్రిని కలవడం వెనుక రాజకీయ ఉద్దేశాల్లేవని కాంగ్రెస్ ఎమ్మెల్యే అజయ్‌కుమార్ విలేకరులకు తెలిపారు. ఖమ్మం నగరాన్ని స్మార్ట్‌సిటీల జాబితాలో చేర్చి కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని కోరడానికే కలిసినట్లు చెప్పారు. -
వడివడిగా ‘మెట్రో పొలిస్’ ఏర్పాట్లు
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జరుగనున్న అంతర్జాతీయ సదస్సు ‘11వ మెట్రో పొలిస్ సదస్సు’కు అధికార యంత్రాంగం ఏర్పాట్లలో వేగం పెంచింది. ఈనెల 7 నుంచి 10వ తేదీ వరకు సదస్సు జరుగనున్నప్పటికీ, 6వ తేదీ నుంచే కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. దీని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్‌ను షోకేస్‌గా చూపేం దుకు, నగర బ్రాండ్ ఇమేజ్ పెంచుకునేందుకు ఇది మంచి వేదిక కానుందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో నగర రహదారుల నుంచి వీధి లైట్ల వరకు ప్రతి అంశంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులు విడిది, పర్యటించే మార్గాలను తీర్చిదిద్దుతున్నారు. వై ఫై, 4జీ సేవల్నీ అందుబాటులోకి తెస్తున్నారు. సదస్సులో పాల్గొనేవారు రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు గురువారం (నేటి) వరకు సమయం ఉండగా, బుధవారం రాత్రి వరకు 1920 మంది ప్రతినిధులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. కాగా, ఈ సదస్సులో ‘స్మార్ట్ సిటీస్, అర్బన్ హౌసింగ్, అర్బన్ ఈక్విటీ, మెట్రో పోలిస్-గవర్నెన్స్, సిటీ మేనేజ్మెంట్-సర్వీసెస్, అర్బన్ ఫైనాన్స్, అర్బన్ హెల్త్’ అంశాలపై చర్చించనున్నారు. వీటిల్లో సిటీ మేనేజ్మెంట్-సర్వీసెస్‌కు సంబంధించి ఎంపిక చేసిన ఏడు అంశాలను చర్చిస్తారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, సహా పలువురు ప్రముఖులు హాజరవుతారు. ప్రతినిధులతో ప్రత్యేక సదస్సులు.. సదస్సుకు వివిధ దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నందున.. ఆయా ప్రభుత్వాలతో ప్రత్యేకంగా సమావేశమయ్యేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా విజ్ఞప్తులు వచ్చాయి. ఈమేరకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, మేయర్ల మధ్య ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఆయా అంశాల్లో సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి తదితర అంశాలపై చర్చలు జరిపి ఆయా దేశాలు ఎంఓయూలు కుదుర్చుకునేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. జోహన్స్‌బర్గ్, బెర్లిన్, బార్సిలోనాకు చెందిన ప్రతినిధులు వీటిపై బాగా ఆసక్తి చూపుతున్నారు. బిజినెస్ టూ బిజినెస్ (బీ2బీ)గా వ్యవహరించే వేదికల్లో మన దేశం.. ఇతర దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. వీటిలో హైదరాబాద్‌ను ప్రత్యేక అంశంగా తీసుకొని కూడా చర్చిస్తారు. చార్మినార్, ఐటీ కారిడార్, ట్యాంక్ బండ్‌పై ప్రతినిధుల క్షేత్రస్థాయి పర్యటనల్ని ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసా రం చేస్తారు. టీవీ ప్రసారాలతో పాటు ఇంటర్నెట్ నుంచి సైతం వీక్షించే ఏర్పాట్లు చేస్తున్నారు. సదస్సుకు హాజ రయ్యే ప్రతినిధులకు అందజేసేందుకు ఏరోజు కారోజు నాలుగు పేజీల పత్రికను సైతం వెలువరించనున్నారు. ప్రత్యేక విందులు.. ప్రతినిధులు, వీవీఐపీల కోసం 6వ తేదీన తారామతి బారాదరిలోను, 7న ఫలక్నుమాలోను, 8న జలవిహార్‌లో ప్రత్యేకంగా రాత్రి విందులు ఏర్పాటు చేశారు. ‘అర్బన్ హాకథాన్’ పేరుతో ప్రజలకు కొత్త సదుపాయా లు అందుబాటులోకి తెచ్చేందుకు సాఫ్ట్వేర్ రూపకల్పనకు సంబంధించిన పోటీలు నిర్వహిస్తారు. -
ప్రపంచంలో అతి తక్కువ ఖరీదైన నగరం.. ముంబై
లండన్: ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఖరీదైన నగరంగా(జీవించడానికి, పనిచేయడానికి) ముంబై నిలిచింది. ఇక అత్యంత ఖరీదైన నగరంగా హాంగ్‌కాంగ్‌ను తోసిరాజని లండన్ మొదటి స్థానంలోకి దూసుకువచ్చిందని ఇంగ్లండ్‌కు చెందిన రియల్టీ సంస్థ శావిల్స్ నివేదిక పేర్కొంది. అద్దెలు, జీవించడానికి, పనిచేయడానికి లండన్ అత్యంత ఖరీదైనదంటున్న ఈ నివేదిక పేర్కొన్న కొన్ని ముఖ్యాంశాలు..., కంపెనీలు ఒక్కో ఉద్యోగికి చేసే వార్షిక వ్యయం లండన్‌లో 1,20,568 డాలర్లుగా ఉంది. అదే ముంబైలో అయితే ఇది 29,742 డాలర్లు. 12 నగరాలతో రూపొందిన ఈ అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో ముంబైది చివరి స్థానం. లండన్ తర్వాత 1,15,717 డాలర్ల వార్షిక ఉద్యోగ వ్యయంతో హాంకాంగ్ రెండో అత్యంత ఖరీదైన నగరంగా నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో న్యూ యార్క్(1,07,782 డాలర్లు), ప్యారిస్(1,05,550 డాలర్లు)లు నిలిచాయి. 63,630 డాలర్లు వార్షిక ఉద్యోగ వ్యయంతో ఆస్ట్రేలి యాకు చెందిన సిడ్నీ అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. 43,171 డాలర్లతో షాంఘై 10వ స్థానంలో, 32,179 డాల ర్లతో రియోడీజెనీరో 11వ స్థానంలో నిలిచాయి. 2008లో ఐదో స్థానంలో ఉన్న లండన్ ఈ ఏడాది మొదటి స్థానంలోకి వచ్చింది. అయితే 2011లో హాంకాంగ్ 1,28,000 డాలర్లతో అత్యంత ఖరీదైన నగరంగా అవతరించింది. ఈ ఏడాది మొదటి స్థానంలోకి వచ్చినప్పటికీ లండన్ 2011 నాటి హాంకాంగ్ స్థాయిని అందుకోలేకపోయింది. ఇక రెసిడెన్షియల్ ప్రోపర్టీ విషయానికొస్తే ఇప్పటికీ హాంకాంగ్‌దే పై చేయి. లండన్‌తో పోల్చితే హాంకాంగ్‌లో నివాస ప్రాపర్టీ ధరలు 40% అధికం. -
బడ్జెట్‌కు ముందు స్మార్ట్ సిటీల ఎంపిక: వెంకయ్య
ముంబై: స్మార్ట్ సిటీలు అభివృద్ధి చేయడానికి నగరాల ఎంపికను వచ్చే బడ్జెట్ సమావేశాల ముందు ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు సోమవారమిక్కడ వెల్లడించారు. స్మార్ట్ సిటీల రూపురేఖలకు తుది మెరుగులు దిద్దుతున్నామని.. వచ్చే నవంబర్ నాటికి ఇది పూర్తయ్యే అవకాశముందని అన్నారు. ఒక్కో రాష్ట్రంలో రెండు, మూడు స్మార్ట్ సిటీలు ఉండేలా చూస్తామన్నారు. తాను ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిని స్మార్ట్‌సిటీగా నిర్మించాలని భావిస్తున్నానన్నారు. -
కఠిన నిర్ణయాలతోనే ‘స్మార్ట్’
* స్మార్ట్ సిటీల పథకంపై కేంద్ర మంత్రి వెంకయ్య * పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలి * స్మార్ట్ సిటీల జాతీయ సదస్సులో పిలుపు సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వం చేపట్టిన ‘వంద స్మార్ట్ సిటీల’ పథకంలో చోటు ఆశిస్తున్న నగరాలకు అభివృద్ధి కోసం కఠిన నిర్ణయాలు తీసుకోగల సంసిద్ధత ఉండాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ‘సౌకర్యవంతమైన జీవనం, మెరుగైన జీవన ప్రమాణాలు, సుపరిపాలన, చక్కటి ఆరోగ్య, విద్యా సేవలు, రోజూ 24 గంటల విద్యుత్, నీరు, నాణ్యమైన రవాణా, పారిశుద్ధ్యం, ఉపాధి, సైబర్ అనుసంధానం అందించడం ఈ సిటీల ఉద్దేశం’ అని పేర్కొన్నారు. శుక్రవారమిక్కడ స్మార్ట్ సీటీల పథకంపై జరిగిన జాతీయ సదస్సులో వెంకయ్య ప్రసంగించారు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పట్టణాభివృద్ధి మంత్రులు, కార్యదర్శులు పాల్గొన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ రూపొందించిన స్మార్ట్ సిటీల ముసాయిదాపై చర్చించారు. వెంకయ్య మాట్లాడుతూ.. ‘ఈ సిటీలకు జాగరూకతగల, సేవలకు డబ్బు చెల్లించగల పౌరులు, సమర్థ నాయకత్వం, జవాబుదారీతనం గల సుపరిపాలన అవసరం. ఇవన్నీ సమకూరితేనే పథకం విజయవంతమవుతుంది. సమర్థవంతమైన పట్టణ పరిపాలనకు.. సేవల ధరలను పెంచగల, సంస్కరణలను అమలు చేయగల, అక్రమ కట్టడాలను నిర్మూలించి, కబ్జాలను అరిక ట్టే నాయకత్వం కావాలి’ అని అన్నారు. దేశంలో ప్రస్తుతం 37 కోట్ల మంది పట్టణాల్లో నివసిస్తున్నారని, వచ్చే 15 ఏళ్లలో వీరి జనాభా మరో 15 కోట్లకు, 2050 నాటికి మరో 50 కోట్లు పెరుగుతుందని వివరించారు. పట్టణ సంస్థల రాజకీయ నాయకత్వం సరైన వనరులు సమకూర్చకపోవడంతో జవహర్లాల్ నెహ్రూ పట్టణ నవీకరణ పథకం విఫలమైందని, స్మార్ట్ సిటీల పథకంలో ఇలాంటి వాటిని సహించబోమని అన్నారు. ఈ సిటీల పథకం ముసాయిదాపై రాష్ట్రాలు వారం రోజుల్లో అభిప్రాయాలను పంపాలన్నారు. ముసాయిదా పత్రంలోని ముఖ్యాంశాలు.. - ఈ నగరాల్లో 20 ఏళ్లపాటు తలసరి పెట్టుబడి వ్యయం రూ. 43,386 గా అత్యున్నతాధికార నిపుణుల కమిటీ(హెచ్‌పీఈసీ) అంచనా వేసింది. నీటి సరఫరా, రవాణా తదితరాల పెట్టుబడులన్నీ ఇందులో ఉన్నాయి. వంద స్మార్ట్ సిటీల్లో 10 లక్షల జనాభాను సగటుగా లెక్కించి మదింపు చేశారు. అంటే 100 నగరాల్లో 20 ఏళ్ల పాటు రూ. 7లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాలి. - పారిశ్రామిక వాడలు, ఎగుమతుల జోన్లు, వాణిజ్య, సేవల కేంద్రాలు, ఫైనాన్షియల్ కేంద్రాల ద్వారా ఆర్థికవృద్ధి సాధించేందుకు ప్రణాళికలు రూపొందిస్తారు. - పథకం విజయవంతం కావడానికి అభివృద్ధి ప్రాణాళికలు రూపొందిస్తారు. దీనికి రూ. 5 వేల కోట్లు కావాలి. - 13 అంశాలకు ప్రాధాన్యమిచ్చారు. వీటిలో రవాణా, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, వ్యర్థపదార్థాల నిర్వహణ, మురుగునీటి కాల్వలు, టెలిఫోన్ నెట్వర్క్, వైఫై, ఆరోగ్యం, విద్య, అగ్నిమాపక నిర్వహణ తదితరాలు వీటిలో ఉన్నాయి. -
తెలంగాణలో ఐదు, ఏపీలో నాలుగు స్మార్ట్ సిటీలు
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం 100 స్మార్ట్ సిటీల జాబితాను విడుదల చేసింది. తెలంగాణలో అయిదు, ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు స్మార్ట్ సిటీలను కేంద్రం నిర్మించనుంది. 7060 కోట్లుతో వంద స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయనుంది. తెలంగాణలో స్మార్ట్ సిటీల జాబితాలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్,నల్గొండ కాగా, ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు,విజయవాడ, కర్నూలు, చిత్తూరు ఉన్నాయి. కాగా కేంద్రబడ్జెట్లో 100 నగరాలను స్మార్ట్ సిటీలు అభివద్ధి చేస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన విషయం తెలిసిందే. స్మార్ట్ సిటీ అంటే.. ... స్మార్ట్, శాటిలైట్‌గా ఎంపిక చేసిన నగరాల్లో రవాణా, శానిటేషన్, త్రాగునీరు, గహనిర్మాణం, జీవనవిధానాల్లో మార్పు. పబ్లిక్ అండ్ కమర్షియల్ సౌకర్యాలు, వైఫై కనెక్లివిటీ, జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్) బేస్డ్ అర్బన్ ప్లానింగ్, విజ్వరల్డ్ విభాగాలతో అనుసంధానించనున్నారు. బైస్కిల్ మార్గాలు, వాక్‌వేలు, చెరువుల అభివద్ధికి ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టే అవకాశం ఉంటుంది. smart citys, telangana, andhra pradesh, hyderabad, guntur, vijayawada, guntur, karimnagar, nalgonda, nizamabad,స్మార్ట్ సిటీలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ -
స్మార్ట్ విలేజ్ మరింత మేలు
వంద స్మార్ట్ నగరాలను నిర్మించాలన్న యోచనతో పాటు స్మార్ట్ గ్రామాల నిర్మాణం గురించి కూడా ప్రధాని దృష్టి పెట్టాలి. స్మార్ట్ విలేజ్ ఏర్పడితే స్థానికంగా జరిగిన ఉత్పత్తికీ, స్థానికంగా జరిగే సేకరణకీ, స్థానికంగా జరిగే పంపిణీకీ మధ్య దానికదే ఒక లంకె ఏర్పడుతుంది. భారతీయ రైతాంగం అలా ఎప్పుడూ నిర్లక్ష్యానికి ఎందుకు గురౌతూ ఉం టుందో నాకు ఏనాటికీ అర్థం కాని విషయం. చిన్న పాటి వ్యయాలతోనే మన రైతులు పుష్కలంగా పంటలు పండిస్తూ ఉంటారు. ఉత్తేజం కలిగించే విధం గా ఒక ఆర్థిక ప్యాకేజీని కనుక ఇచ్చినట్టయితే, రైతులు ఈ దేశాన్ని ఆహా రంతో, పళ్లూ కూరగాయలతో ముంచెత్తుతారు. అత్యధికంగా వ్యవసాయోత్ప త్తులను ఎగుమతి చేసే దేశంగా భారత్ అవతరించడం ఖాయం. 2013-14 సంవత్సరంలో రైతులు రికార్డు స్థాయిలో 264.4 మిలియన్ టన్నుల ఆహారధాన్యాలను పండించారు. 4.8 శాతం పెంపుతో చమురు గింజల ఉత్పత్తి కూడా రికార్డు స్థాయిలో 34.5 మిలి యన్ టన్నులకు చేరుకుంది. మొక్కజొన్న కూడా 8.52 శాతం అధికంగా దిగుబడి సాధ్యమైంది. అంటే 24.2 మిలియన్ టన్ను ల మొక్కజొన్న ఉత్పత్తి అయింది. అపరాలు లేదా పప్పుధాన్యా ల ఉత్పత్తి మున్నెన్నడూ లేని రీతిలో 19.6 మిలియన్ టన్నుల దిగుబడిని మన రైతులు సాధ్యం చేశారు. ఇది గతేడాది కంటె 7.10 శాతం ఎక్కువ. పత్తి ఉత్పత్తి కూడా రికార్డు స్థాయిలోనే జరి గింది. వ్యవసాయోత్పత్తులలో ఇంత భారీ పెరుగుదల ఉన్నప్ప టికీ 2013-14 సంవత్సరం వార్షిక బడ్జెట్లో వ్యవసాయ రంగా నికి దక్కింది రూ. 19,307 కోట్లు. ఇది మొత్తం ప్రణాళికా వ్య యంలో ఒక్క శాతం కంటె తక్కువ. ఈ బడ్జెట్లో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వ్యవసాయం, సహకార విభాగాలకి రూ. 22,652 కోట్లు కేటాయించారు. సేద్యమంటే చిన్న చూపే సేద్యాన్ని నిర్లక్ష్యం చేయడమనే మాట 1991లో ఆర్థిక సంస్కరణలను ప్రవేశ పెట్టినప్పటి నుంచి వింటున్నాం. అప్పటి ఆర్థికమంత్రి మన్మోహన్ సింగ్ ఇచ్చి న ప్రసిద్ధ బడ్జెట్ ప్రసంగంలో పారిశ్రామిక రంగం మీద వరాల జల్లు కురిపిం చి, తరువాత పేరాలో మాత్రం ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే మూలాధార మని చెప్పడం నాకింకా గుర్తు. కానీ వ్యవసాయం రాష్ట్ర జాబితాలోని అంశం. అందుకే ఆ రంగానికి అవసరమైన చేయూతను ఇచ్చే బాధ్యతను మన్మోహన్ సింగ్ రాష్ట్రాల మీద పెట్టారు. అప్పుడు ఆయనొక సంగతి విస్మరించారు. పరిశ్రమలు కూడా రాష్ట్ర జాబితాలోనివే. ఆ అంశాన్ని కూడా నాటి కేంద్ర ఆర్థిక మంత్రి రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించి ఉండవలసింది. దీనితో ఆయన పక్షపాత వైఖరి ఎలాంటిదో సుస్పష్టంగానే కనిపిస్తుంది. పదకొండో పంచవర్ష ప్రణాళికా కాలంలో (2007-08 - 2011-12) వ్యవసాయరంగం ఎంతో తృప్తిని కలిగిస్తూ 4.1 శాతం వృద్ధి రేటును సాధిం చింది. అయినప్పటికీ ఆ రంగానికి దక్కినది మరీ ఘోరంగా ఒక లక్ష కోట్లే. ప్రత్యక్షంగా, పరోక్షంగా 60 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్న రంగమది. అలాంటి రంగానికి ఐదేళ్లకి గాను లక్ష కోట్లు ఖర్చు చేయడమంటే అది ఏమూ లకి? పన్నెండో పంచవర్ష ప్రణాళిక (2012-13 -- 2017-18)లో ఆ కేటా యింపును రూ. 1.5 లక్షల కోట్లకు పెంచారు. అయితే, 2014-15 ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక రంగానికి రూ. 5.73 లక్షల కోట్లు పన్ను మినహా యింపును ఇచ్చారు. ఆర్థిక రాడార్ తెర మీద నుంచి రైతులు అదృశ్యమైపో యారని నేను చాలాకాలంగా చెబుతూనే ఉన్నాను. పరిశ్రమలకు పన్ను బాధ లేదు 2004-05 సంవత్సరం నుంచి కార్పొరేట్ భారతానికి రూ. 31 లక్షల కోట్ల మేర పన్ను మినహాయింపు లభించింది. దీనితో ఉత్పత్తి పెరుగుతుందనీ, కొత్త ఉద్యోగాలు వస్తాయనీ అంతా ఆశించారు. అయితే, గడచిన పదేళ్లలో 1.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించారు గానీ, పారిశ్రామికోత్పత్తులలో ఎలాంటి పురోగతీ లేదు. దీనికి పరాకాష్ట ఏమిటంటే- కార్పొరేట్ రంగం రూ. పది లక్షల కోట్ల మిగులును వెనకేసుకోవడం, దాదాపు పది లక్షల కోట్ల రూపా యల మేర బ్యాంకుల రుణాలను (మొండిబకాయిలన్నమాట) ఎగవేయడం. చట్టబద్ధంగా పేదవర్గాలకు రావలసిన ఆర్థిక మద్దతు వారికి ఎలా రాకుండా పోతున్నదో, ఉన్న వనరులను సంపన్న వర్గాలకు ఎలా సౌకర్యంగా మళ్లిస్తున్నారో ఇదంతా చూస్తుంటే అర్థమవుతుంది. వ్యవసాయ రంగం 60 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నదని ఇంత క్రితమే చెప్పుకున్నాం. అందులో 82.2 శాతం చిన్న, మధ్య తరహా రైతులే. వీరికి ఆర్థిక మద్దతు లేకున్నా ఎలా గో నెట్టుకొస్తున్నారు. అయితే 60 శాతం రైతాంగం పస్తులతో బాధ పడుతు న్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. వ్యవసాయం ఏమాత్రం లాభసాటి కాని వ్యాపకంగా తయారవుతూ ఉండడంతో 42 శాతం రైతులు సేద్యానికి వీడ్కోలు పలకాలని చూస్తున్నారు. వ్యవసాయం పూర్తిగా నిలిచిపోయి, వ్యవ సాయం మీద ఆధారపడిన వారంతా పట్టణాలకీ నగరాలకీ చేరుకునే విష యం మీద ప్రధాన స్రవంతి ఆర్థిక నిపుణులు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఇలా నగరాలకు వస్తున్న వారికి ఎక్కువగా ఆలయాలు ఆశ్రయమిస్తున్నాయి. తరు వాత సెక్యూరిటీ గార్డులుగాను, లిఫ్ట్బాయ్లుగాను వీరు కాలం వెళ్లదీస్తు న్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలసలు జర గడమంటే ఆర్థిక వృద్ధికి అదే సూచిక అని ప్రపంచ బ్యాంకు ప్రవచించింది. దానినే భారత ఆర్థిక నిపుణులు చిలకపలుకుల్లా వల్లిస్తున్నారు. 2013-14 ఆర్థిక సర్వే కూడా ఇదే చెప్పింది. రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ ఈ వాదననే ఎలుగెత్తి చాటారు. స్మార్ట్ విలేజ్ల సంగతి పట్టదేం! నరేంద్ర మోడీ ఈ పరిస్థితిని చక్కదిద్దే చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంటారని ఆశపడ్డాను. సేద్యం ఆర్థికంగా లాభసాటిగా మార్చాలంటూ ఆయన తన ఎన్నికల సభలలో చాలాసార్లు పేర్కొన్నారు. గ్రామాలకు ఆధునిక సౌకర్యాలు కల్పించడం గురించి కూడా మోడీ పలుసార్లు ప్రస్తావించారు. అభివృద్ధిని గ్రామాలకు తీసుకువెళ్లడమే రాజకీయ చింతనలో మలుపు అవుతుంది. దీనికి శ్రీకారం చుడితేనే వ్యవసాయానికి పునర్వైభవం చేకూరి, రైతు ముఖం మీద నవ్వు వెల్లివిరుస్తుంది. వంద స్మార్ట్ నగరాలను నిర్మించాలన్న యోచనతో పాటు స్మార్ట్ గ్రామాల నిర్మాణం గురించి కూడా ప్రధాని దృష్టి పెట్టాలి. స్మార్ట్ విలేజ్ ఏర్పడితే స్థానికంగా జరిగిన ఉత్పత్తికీ, స్థానికంగా జరిగే సేకరణకీ, స్థానికంగా జరిగే పంపిణీకీ మధ్య దానికదే ఒక లంకె ఏర్పడుతుం ది. స్మార్ట్ గ్రామం అనగానే, ఇంటర్నెట్తో బంధం ఏర్పడడమే కాదు, సుస్థిర మైన వ్యవసాయ పద్ధతులకు మద్దతు కూడా లభిస్తుంది. చిన్న తరహా పరిశ్ర మలకూ సేద్యానికీ మధ్య కూడా లంకె ఏర్పడుతుంది. రైలు, రోడ్డు మార్గా లతో గ్రామం అనుసంధానమై, విద్య, ఆరోగ్యం వంటి అవసరాలు తీరే మార్గం ఏర్పడుతుంది. అలాంటి మార్పు గురించే దేశం ఎదురుచూస్తోంది కూడా. గ్రామీణ ప్రాంతం అలాంటి రూపురేఖలను సంతరించుకోవాలని గడచిన 67 సంవత్సరాల నుంచి దేశం ఆశిస్తున్నది. స్మార్ట్ గ్రామం పెరిగిపో తున్న ఆర్థిక అసమానతలను తగ్గించడమే కాదు, దేశం నలుమూలలా, మారుమూల ఉన్న ప్రతి వ్యక్తికి మంచి రోజులు తేగలదు. అదే సమయంలో వలసల కారణంగా పట్టణాల మీద నగరాల మీద పెరుగుతున్న ఒత్తిడిని కూడా స్మార్ట్ గ్రామం తగ్గించగలుగుతుంది. - దేవేంద్ర శర్మ వ్యాసకర్త వ్యవసాయ రంగ విశ్లేషకులు