స్మార్ట్ సిటీలుగా పోర్టు నగరాలు | port cities has tobecome smart cities | Sakshi
Sakshi News home page

స్మార్ట్ సిటీలుగా పోర్టు నగరాలు

Published Mon, Feb 23 2015 2:54 AM | Last Updated on Sat, Sep 2 2017 9:44 PM

port cities has tobecome smart cities


 రూ. 50 వేల కోట్లతో ప్రణాళిక: గడ్కారీ
 న్యూఢిల్లీ: దేశంలోని ప్రధానమైన 12 పోర్టు నగరాలను రూ. 50 వేల కోట్లతో స్మార్ట్ సిటీలుగా నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఒక్కొక్క దానికి రూ. 3 నుంచి 4 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, షిప్పింగ్ శాఖ మంత్రి నితిన్ గ డ్కారీ ఆదివారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘12 పోర్టు నగరాలను గ్రీన్ స్మార్ట్ సిటీలుగా మార్చాలని నిర్ణయించాం. ఆరు నెలల్లో పనులు మొదలు పెట్టి ఐదు ఏళ్లలో పూర్తి చేస్తాం’ అని తెలిపారు. కేంద్రం అధీనంలోని ఈ 12 పోర్టుల్లో రూ. 2.64 లక్షల కోట్ల విలువైన భూములు ఉన్నట్లు అంచనా వేశారు. ముంబై పోర్టులో 753 హెక్టార్ల భూమిని గుర్తించారు.  ‘ పోర్టుల్లోని ప్రభుత్వ భూములను జీపీఎస్ వ్యవస్థ ద్వారా గుర్తించాం. వీటిని బిల్డర్లకు అమ్మాలనుకోవట్లేదు. మేమే అభివృద్ధి చేస్తామ’ని తెలిపారు. అయితే ఈ నగరాల్లో ఇళ్లు నిర్మించడానికి ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తామని చెప్పారు. పోర్టు నీటిని రీసైకిల్ చేస్తామని, వ్యర్థ పదార్థాలను బయో గ్యాస్‌కు వినియోగిస్తామని పేర్కొన్నారు.  
 స్మార్ట్ సిటీలకు ఎంపికైన పోర్టు నగరాలు
 కాండ్లా, ముంబై. జవహర్‌లాల్ నెహ్రూ పోర్టు ట్రస్ట్(జేఎన్‌పీటీ), మార్ముగావ్, కొత్త మంగళూరు, కొచ్చి, చెన్నై, ఎన్నూర్, వీవో చిదంబర్నర్, విశాఖపట్నం, పారాదీప్, కోల్‌కతా(హ ల్దియాతో కలిపి).
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement