దేశవ్యాప్తంగా మరిన్ని ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీల అభివృద్ధికి కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎన్‌ఐసీడీపీ) కింద కొత్తగా 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీల అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వం రూ.28,602 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు కేంద్రమంత్రి పీయూష్‌గోయల్ తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
ఎన్‌ఐసీడీపీ ద్వారా ప్రభుత్వం ఖర్చు చేయబోతున్న నిధులతో మౌలిక సదుపాయాలు వృద్ధి చేస్తామని మంత్రి చెప్పారు. దాంతో ఆయా నగరాల్లో దాదాపు రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. దాంతో ప్రత్యక్షంగా 10 లక్షల మంది, పరోక్షంగా మరో 30 లక్షల మంది ఉపాధి పొందుతారని పేర్కొన్నారు. కొత్తగా అభివృద్ధి చెయబోయే 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు దేశవ్యాప్తంగా పారిశ్రామిక హబ్‌లుగా మరుతాయన్నారు. 10 రాష్ట్రాలు, 6 ఇండస్ట్రీ కారిడార్‌లను కవర్ చేసేలా వీటిని ఎంచుకుంటున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: పదేళ్లలో ‘జన్‌ధన్’ విజయాలు.. సమస్యలు
‘దేశవ్యాప్తంగా కొత్తగా తీసుకొస్తున్న 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలతో కలిపి మొత్తం వీటి సంఖ్య 20కు చేరింది. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఇప్పటివరకు నాలుగు ప్రాజెక్టులు అమలు చేశాం. మరో నాలుగు ప్రాజెక్టుల పనులు వేగంగా ప్రారంభమయ్యాయి. కొత్తగా ఈ విభాగంలో 12 సిటీలో చేరాయి. ప్రతి కారిడార్‌లో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ హబ్‌లు, రవాణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ఈ నగరాల్లో పెట్టుబడిదారులకు అత్యాధునిక సౌకర్యాలతో భూమిని కేటాయించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాజ్‌పురా, పాటియాలా-ఉత్తరాఖండ్, ఆగ్రా-ఉత్తరప్రదేశ్, గయా-బిహార్, డిగి పోర్ట్-మహారాష్ట్ర, జహీరాబాద్, కొప్పర్తి- తెలంగాణ, బోధ్‌పూర్-రాజస్థాన్, ఒర్వకల్లు-ఏపీ, పాలక్కాడ్-కేరళ, జమ్ముకశ్మీర్/ హరియాణాలోని నగరాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నాం. ఈ పారిశ్రామిక స్మార్ట్ సిటీల్లో రైలు, ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు, జాతీయ రహదారులు, విమానాశ్రయాలు, ఓడరేవులతో పాటు నీరు, విద్యుత్, గ్యాస్, టెలికాం కనెక్టివిటీతో సహా స్థిరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నారు’ అని మంత్రి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment