Union Budget 2024-25: తెలుగు రాష్ట్రాలకు రైల్వే కేటాయింపులు ఇవే.. | Railway Budget Allocations For Telugu States In Budget 2024 | Sakshi
Sakshi News home page

Union Budget 2024-25: తెలుగు రాష్ట్రాలకు రైల్వే కేటాయింపులు ఇవే..

Published Thu, Feb 1 2024 3:16 PM | Last Updated on Thu, Feb 1 2024 4:35 PM

Railway Budget Allocations For Telugu States In Budget 2024 - Sakshi

దేశ ఆర్థిక వృద్ధిలో ఎంతో కీలకమైన 2024-25 ఆర్థిక సంవత్సరానికిగానూ కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని పలు సంస్థలకూ కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు ఉంటాయని ముందుగా భావించారు. కానీ ఇది మధ్యంతర బడ్జెట్‌ కావడంతో ఆశించినమేర కేటాయింపులు లేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తెలుగురాష్ట్రాల్లో రైల్వేలకు సంబంధించి మంత్రి అశ్వినీవైష్ణవ్‌ మాట్లాడారు.

తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి రూ.5,071 కోట్లు ప్రకటించారు. రాష్ట్రంలో 100శాతం విద్యుదీకరణ పూర్తయిందని రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్‌ అన్నారు. రాష్ట్రంలో రైల్వేపై పెట్టుబడులు గణనీయంగా పెరిగాయన్నారు. ఖాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీకి పీఎం శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.

ఏపీలో రైల్వేల అభివృద్ధికి రూ.9138 కోట్లు కేటాయించినట్లు మంత్రి చెప్పారు. 2009 నుంచి 2014 వరకు రూ.886 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. అప్పటి నుంచి నిధులు పెంచుతున్నట్లు పేర్కొన్నారు. ఏడాదికి 240 కి.మీ ట్రాక్ పనులు జరుగుతున్నట్లు వెల్లడించారు. ఏపీలో 98 శాతం విద్యుద్దీకరణ పూర్తి అయినట్లు వివరించారు.

ఇదీ చదవండి: బడ్జెట్‌ 2024-25 కథనాల కోసం క్లిక్‌ చేయండి

విశాఖ రైల్వే జోన్ కోసం 53 ఎకరాల భూమిని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగినట్లు వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం నుంచి ఇంకా భూమి అప్పగించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ పూర్తిచేసి కేంద్రానికి అప్పగిస్తే పనులు ప్రారంభిస్తామన్నారు. రైల్వే జోన్ ఏర్పాటు కోసం డీఎపీఆర్‌ సైతం సిద్ధమైందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement