Union Budget 2024-25
-
Union Budget 2024: బడ్జెట్‌కు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: 2024–25 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌కు సోమవారం లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. గత వారం బడ్జెట్‌పై చర్చ ముగిశాక తాజాగా పార్లమెంట్ దిగువసభ తన ఆమోదం తెలిపింది. దీంతోపాటు సభ ఆమోదించిన బడ్జెట్ పద్దుల మేరకు సంచిత నిధి నుంచి మొత్తాలను వినియోగించేందుకు అనుమతించే ద్రవ్య వినిమయ బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. రైల్వే, విద్య, ఆరోగ్యం, మత్స్యరంగాలకు సంబంధించిన గ్రాంట్ల వినియోగానికి సంబంధిన బిల్లుకూ లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా ప్రతిపాదించిన పన్ను శ్లాబుల సంబంధ ఫైనాన్స్ బిల్లుపై లోక్‌సభలో చర్చ జరగనుంది. రాజ్యసభలో వ్యవసాయం, పునరుత్పాదక శక్తి, సహకార రంగం, గృహ పట్టణాభివృద్ధికి కేటాయింపులపై చర్చ జరగనుంది. ఫైనాన్స్ బిల్లుపై రాజ్యసభలో చర్చ జరిగినా మార్పులు సిఫార్సు చేయబోదు. కేవలం ఆ బిల్లులను తిరిగి లోక్‌సభకు పంపగలదు. ఫైనాన్స్ బిల్లు ఆమోదం పొందాక బడ్జెట్ తంతు మొత్తం ముగుస్తుంది. ఉద్యానవనాల కోసం రూ.18వేల కోట్లు రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా వచ్చే ఐదేళ్లలో ఎగుమతి కోసం ఉద్దేశించి 100 ఉద్యానవనాల క్లస్టర్ల ఏర్పాటు కోసం మొత్తంగా రూ.18,000 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సోమవారం రాజ్యసభలో చెప్పారు. వంటనూనెల దిగుమతి వ్యయం తగ్గించుకోవడంతోపాటు దేశీయంగా నూనెగింజల దిగుబడి పెంచేందుకు రూ.6,800 కోట్లను ఆయిల్‌సీడ్ మిషన్‌కు కేటాయిస్తున్నట్లు చౌహాన్ వెల్లడించారు. స్వాతంత్య్ర సిద్ధించాక సేద్యరంగం బాగు కోసం కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిందేమీలేదని వ్యాఖ్యానించారు. దీనిపై విపక్ష సభ్యులు తీవ్ర నిరసన తెలిపారు. దిగి్వజయ్‌సింగ్ వంటి కాంగ్రెస్ నేతలు మాట్లాడేందుకు ప్రయతి్నంచినా ఛైర్మన్ ధన్‌ఖడ్ అనుమతించలేదు. దీంతో విపక్ష సభ్యులు వాకౌట్‌చేశారు. -
మోదీ చక్రవ్యూహంలో దేశం
న్యూఢిల్లీ: మోదీ సర్కారుపై విపక్ష నేత రాహుల్‌గాంధీ సోమవారం ముప్పేట దాడి చేశారు. ‘‘దేశమంతటా తీవ్ర భయోత్పాత వాతావరణాన్ని నెలకొల్పారు. దేశంపై ప్రధాని మోదీ పెను సమస్యల చక్రవ్యూహం పన్నారు. అది దేశమంతటినీ సర్వనాశనం చేస్తోంది’’ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్ర బడ్జెట్‌పై లోక్‌సభలో చర్చలో మాట్లాడిన రాహుల్ మోదీపైనా, ఎన్డీఏ ప్రభుత్వ పాలనపైనా సునిశిత విమర్శలు చేశారు. ఘాటైన పదజాలంతో కూడిన పదునైన వ్యాఖ్యలు చేశారు. అధికార పక్ష సభ్యులు తీవ్రంగా ప్రతిఘటించినా, నిబంధనలు అనుమతించబోవంటూ స్పీకర్ ఓం బిర్లా పదేపదే వారిస్తున్నా వెనక్కు తగ్గలేదు. బడ్జెట్ కేవలం బడా వ్యాపారవేత్తలకు ప్రయోజనాలకు, సర్కారు రాజకీయ గుత్తాధిపత్యానికి కొమ్ము కాసేలా ఉదంటూ విమర్శించారు. ‘‘ఈ మోదీ మార్కు సమస్యల చక్రవ్యూహాన్ని విపక్ష ఇండియా కూటమి ఛేదిస్తుంది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధతకు, దేశవ్యాప్తంగా కులగణనకు సభ ఆమోదం లభించేలా చేసి తీరుతుంది’’ అని ప్రకటించారు. అభిమన్యుడిలా దేశం... నేటి హరియాణాలోని కురుక్షేత్రలో వేల ఏళ్ల కింద జరిగిన యుద్ధంలో ఆరుగురు ఒక్కటై చక్రవ్యూహం పన్ని బాలుడైన అభిమన్యున్ని పొట్టన పెట్టుకున్నారంటూ మహాభారత గాథను రాహుల్ ఉటంకించారు. ‘‘హింస, భయోద్వేగాలతో కూడిన చక్రవ్యూహమది. దాన్ని పద్మవ్యూహమని కూడా అంటారు’’ అంటూ బీజేపీ ఎన్నికల గుర్తు కమలాన్ని పరోక్షంగా గుర్తు చేశారు. ‘‘నేడు 21వ శతాబ్దంలో మన దేశంపై మోదీ ఓ నయా చక్రవ్యూహాన్ని పన్నారు. అభిమన్యునికి పట్టిన గతినే దేశానికి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశ యువతను, రైతులను, మహిళలను, చిన్న, మధ్యతరహా వ్యాపారులను సర్వనాశనం చేసేందుకు రాత్రింబవళ్లు ప్రయతి్నస్తున్నారు. ఆరుగురు వ్యక్తులు కేంద్ర స్థానంలో ఉండి చక్యవ్యూహాన్ని నియంత్రిస్తున్నారు. వాళ్లు మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పారిశ్రామికవేత్తలు అంబానీ–అదానీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌దోవల్, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్’’ అని చెప్పుకొచ్చారు. చివరి నలుగురూ సభలో లేనందున వారి పేర్ల ప్రస్తావనను అనుమతించబోనని స్పీకర్ స్పష్టం చేశారు. దాంతో అనంతరం ఆరుగురి పేర్లనూ రాహుల్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. రాహుల్ ప్రసంగం పొడవునా అధికార ఎన్డీఏ కూటమి సభ్యులంతా పెద్దపెట్టున నిరసనలకు దిగారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు జోక్యం చేసుకోబోయారు. కానీ రాహుల్ అందుకు అవకాశమివ్వలేదు. సభలో లేనివారి పేర్లు ప్రస్తావించొద్దని స్పీకర్ స్పష్టం చేయడంతో అంబానీ, అదానీలను తన ప్రసంగం పొడవునా ఏ1, ఏ2గా సంబోధించారు. ‘‘ఏ1, ఏ2లను కాపాడేందుకు రిజిజు కూడా ప్రయతి్నస్తున్నారు. మీరిలా చేస్తే మాకే లాభం. వారిద్దరినీ ఇంకెంతగా కాపాడే ప్రయత్నం చేస్తారో చేయండి’’ అంటూ ఎద్దేవా చేశారు. చక్రవ్యూహం... మూడు శక్తులు మోదీ చక్రవ్యూహం వెనక మూడు శక్తులున్నాయని రాహుల్ అన్నారు. ‘‘మొదటిది గుత్తాధిపత్య ధోరణి. దేశ సంపదనంతా ఏ1, ఏ2 (అంబానీ, అదానీ) ఇద్దరికే మాత్రమే దోచిపెట్టే ప్రయత్నం. రెండోది సీబీఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు. వీటి సాయంతో విపక్షాలను అణగదొక్కే కుట్రలు. మూడోది అన్నింటినీ గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తున్న రాజకీయ, అధికారస్వామ్యం. మోదీ చక్రవ్యూహానికి గుండెకాయ వంటి ఈ శక్తులు దేశాన్ని నాశనం చేస్తున్నాయి’’ అంటూ దుయ్యబట్టారు.మధ్యతరగతికి వెన్నుపోటు కేంద్ర బడ్జెట్లో మధ్యతరగతిని దారుణంగా వెన్నుపోటు పొడిచారని రాహుల్ ఆరోపించారు. ‘‘మోదీకి కాస్తో కూస్తో మద్దతుగా నిలిచిన వర్గం మధ్యతరగతి. కొవిడ్ సమయంలో ఆయన మొబైల్ టార్చిలు వేయమంటే వేసింది. పళ్లాలు మోగించండంటే మోగించింది. అలాంటి వర్గంపై బడ్జెట్లో పెను భారం వేశారు. తద్వారా వారి వెన్నులోనూ, ఛాతీలోనూ కత్తులు దింపారు మోదీ’’ అన్నారు. ‘‘ఇదీ మా మంచికే. మధ్యతరగతి ఇక ఇండియా కూటమి వైపు మొగ్గుతుంది’’ అని జోస్యం చెప్పారు. ‘‘మోదీ చక్రవ్యూహపు దు్రష్పభావాన్ని కేంద్ర బడ్జెట్ బలహీనపరుస్తుందని, యువత, రైతులు, కారి్మకులు, చిరు వ్యాపారులను ఆదుకుంటుందని ఆశించా. కానీ వ్యాపార, రాజకీయ గుత్తాధిపత్యాలను కాపాడటమే ఏకైక లక్ష్యంగా బడ్జెట్ రూపొందింది. దేశంలోని టాప్ 500 కంపెనీల్లో యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశం కలి్పస్తారట! బడ్జెట్లో విత్త మంత్రి పేర్కొన్న ఈ పథకం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే 99 శాతం మంది యువతకు అది అందని ద్రాక్షే. నిరుద్యోగ చక్రవ్యూహం, పేపర్ లీకేజీ చక్రవ్యూహం, అగ్నివీర్ చక్రవ్యూహం... ఇలా విద్యార్థులు, యువత, సైన్యంతో పాటు ఏ రంగాన్నీ వదలకుండా సమస్యల సుడిగుండంలో ముంచెత్తారు’’ అంటూ మండిపడ్డారు. ‘‘మీరు సృష్టించిన అన్ని చక్రవ్యూహాలనూ మేం ఛేదించేస్తాం. దేశవ్యాప్త కులగణనే అందుకు సరైన అస్త్రం’’ అన్నారు. ‘‘దేశ యువత, వెనకబడ్డ వర్గాలు అభిమన్యులని ఈ చక్రవ్యూహ సృష్టికర్తలు అపోహ పడుతున్నారు. కానీ నిజానికి వాళ్లంతా ఆ వ్యూహాన్ని ఛేదించే అర్జునులు’’ అని హెచ్చరించారు. అగి్నవీర్ వంటి సున్నితమైన పథకంపై విమర్శలు సరికావంటూ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అభ్యంతరం వెలిబుచ్చారు.మాది శివుని ఊరేగింపు ఇండియా కూటమిని శివుని పెళ్లి ఊరేగింపుతో రాహుల్ పోల్చారు. ‘‘అందులో ఎవరైనా పాల్గొనవచ్చు. మోదీ చక్రవ్యూహం కేవలం ఆరుగురికే పరిమితం. ఆ చక్రవ్యూహానికి, శివుని ఊరేగింపుకు పోరాటమిది’’ అన్నారు.‘హల్వా’ ఫొటోపై విసుర్లు ప్రసంగం సందర్భంగా లోక్‌సభలో రాహుల్ ప్రదర్శించిన బడ్జెట్ హల్వా ఫొటో కలకలానికి దారి తీసింది. బడ్జెట్ ముద్రణకు ముందు దాని తయారీ ప్రక్రియలో పాల్గొన్న ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో కలిసి కేంద్ర ఆర్థిక మంత్రి హల్వా తయారు చేయడం రివాజు. అలా ఈసారి నిర్మలా సీతారామన్ బృందం బడ్జెట్ హల్వా తయారు చేస్తున్న ఫొటోను చూపిస్తూ, ‘‘ఇందులో కని్పస్తున్న 20 మంది అధికారుల్లో దళితులు, ఆదివాసీలు ఒక్కరు కూడా లేరు. మైనారిటీ, ఓబీసీ వర్గాల నుంచి ఒక్కొక్కరు మాత్రమే ఉన్నారు’’ అంటూ రాహుల్ ఆక్షేపించారు. రాహుల్ ఆ ఫొటోను ప్రదర్శిస్తున్న సమయంలో నిర్మల రెండు చేతుల్లో ముఖం దాచుకుంటూ కని్పంచారు. -
ఆదాయపన్ను.. ఆదా ఎలా!
ఆదాయపన్ను పాత, కొత్త విధానాల్లో ఏది అనుకూలం? ఎక్కువ మందిని వేధిస్తున్న సందేహం ఇది. 2024–25 కేంద్ర బడ్జెట్లో కొన్ని సవరణలు ప్రతిపాదించడం ద్వారా ఎక్కువ మందిని నూతన పన్ను విధానం వైపు ఆకర్షించే ప్రయత్నం చేశారు విత్త మంత్రి. శ్లాబుల పరిమితుల్లో మార్పులతోపాటు.. స్టాండర్డ్ డిడక్షన్‌ను కూడా పెంచారు. దీనివల్ల కొత్త విధానంలో రూ.17,500 వరకు ఆదా చేసుకోవచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమయంలో ప్రకటించారు. కానీ, పాత పన్ను వ్యవస్థలో వివిధ సెక్షన్ల కింద పన్ను ప్రయోజనాలను పూర్తిగా వినియోగించుకుంటే ఇంతకంటే ఎక్కువే ఆదా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. తక్కువ, అధిక ఆదాయం పరిధిలోని వారికి నూతన పన్ను విధానమే అనుకూలమన్నది విశ్లేషకుల నిర్వచనం. మధ్యాదాయ వర్గాలకు, మినహాయింపు ప్రయోజనాలను పూర్తిగా వినియోగించుకుంటే పాత విధానం అనుకూలం. తమ ఆదాయం, పెట్టుబడులు తదితర వివరాల ఆధారంగానే తమకు ఏది అనుకూలమన్నది నిర్ణయించుకోగలరు. ఇందుకు సంబంధించిన వివరాలను అందించే ప్రాఫిట్ ప్లస్ కథనం ఇది. కొత్త విధానంలో తాజా మార్పులు నూతన విధానంలో 5 శాతం పన్ను, 10 శాతం పన్ను శ్లాబుల్లో రూ.లక్ష చొప్పున అదనంగా పరిమితి పెంచారు. అలాగే నూతన విధానంలో వేతన జీవులు, పెన్షనర్లకు స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.50,000 నుంచి రూ.75,000కు పెంచారు. → నూతన విధానంలో మొదటి రూ.3లక్షల్లోపు ఆదాయం ఉంటే పన్ను పరిధిలోకి రారు. → స్టాండర్డ్ డిడక్షన్‌తో కలిపి చూసుకుంటే రూ.7.75 లక్షల ఆదాయం దాటని వేతన జీవులు, పెన్షనర్లు రూపాయి పన్ను చెల్లించక్కర్లేదు. రూ.3–7లక్షల ఆదాయంపై సెక్షన్ 87ఏ కింద రిబేట్ అమల్లో ఉంది. దీనికి రూ.75వేల స్టాండర్డ్ డిడక్షన్ అదనం. ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటున్న వారికి స్టాండర్డ్ డిడక్షన్ రూ.15,000 ఉంటే రూ.25,000 చేశారు. అంటే ఫ్యామిలీ పెన్షన్ తీసుకునే వారు రూ.7,25,000 లక్షల ఆదాయం వరకు పన్ను చెల్లించక్కర్లేదు. మినహాయింపులు → నూతన పన్ను విధానంలో కేవలం కొన్ని మినహాయింపులే ఉన్నాయి. సెక్షన్ 80సీసీడీ(2) కింద ఎన్పీఎస్ పెట్టుబడులపై పన్ను ప్రయోజనం పొందొచ్చు. ఉద్యోగితోపాటు, ఉద్యోగి తరఫున సంస్థలు ఈపీఎఫ్ చందాలను జమ చేస్తుండడం తెలిసిందే. అదే విధంగా ఉద్యోగి ఎన్పీఎస్ ఖాతాకు సైతం సంస్థలు జమ చేయవచ్చు. ఉద్యోగి మూలవేతనం, కరువు భత్యంలో 10 శాతం గరిష్ట పరిమితి ఇప్పటి వరకు ఉంటే, దీన్ని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 14 శాతం చేశారు. కనుక ఉద్యోగి ఎన్పీఎస్ ఖాతా తెరిచి, సంస్థ ద్వారా అందులో జమ చేయించుకోవడం ద్వారా అదనపు పన్ను మినహాయింపు ప్రయోజనం పొందొచ్చు. → సెక్షన్ 24 కింద నూతన పన్ను విధానంలోనూ ఇంటి రుణంపై పన్ను ప్రయోజనం ఉంది. కాకపోతే ఆ ఇంటిని అద్దెకు ఇవ్వాలి. అప్పుడు ఇంటి రుణంపై ఒక ఆర్థిక సంవత్సరంలో చెల్లించే వడ్డీ మొత్తంపైనా పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. → కన్వేయన్స్ అలవెన్స్, సెక్షన్ 10(10సీ) కింద స్వచ్ఛంద పదవీ విరమణ ప్రయోజనం గరిష్టంగా రూ.5లక్షలు, సెక్షన్ 10(10) కింద గ్రాట్యుటీ రూ.20లక్షలపైనా పన్ను లేదు. → ఉద్యోగి రాజీనామా లేదా పదవీ విరమణ సమయంలో సెలవులను నగదుగా మార్చుకోవడం వల్ల వచ్చే మొత్తం రూ.25 లక్షలపైనా సెక్షన్ 10(10 ) పన్ను లేదు. పాత పన్ను విధానం → రూ.5 లక్షల వరకు ఆదాయంపై 87ఏ కింద రిబేట్ ఉంది. దీంతో 60 ఏళ్ల వయసులోని వారికి రూ.50వేల స్టాండర్డ్ డిడక్షన్‌తో కలిపి రూ.5.50 లక్షల వరకు పన్ను చెల్లించక్కర్లేదు. → 60–80 ఏళ్ల వయసులోని వారికి రూ.3 లక్షల వరకు, 80 ఏళ్లు నిండిన వారికి రూ.5 లక్షల వరకు ఆదాయం ఉంటే కనీస పన్ను మినహాయింపు పరిధిలోనే ఉంటారు. మినహాయింపులు →గృహ రుణం తీసుకుని దాని అసలుకు ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా చెల్లించే రూ.1.5 లక్షలపై సెక్షన్ 80సీ కింద పన్ను లేదు. →సెక్షన్ 24(బి) కింద గృహరుణం వడ్డీకి చెల్లించే మొత్తం రూ.2లక్షల వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో పన్ను మినహాయింపు లభిస్తుంది. ఒకవేళ రుణంపై కొనుగోలు చేసిన ఇంటిని వేరొకరికి అద్దెకు ఇస్తే వచ్చే ఆదాయం నుంచి.. రుణానికి చెల్లించే వడ్డీ మొత్తాన్ని మినహాయించుకోవచ్చు. →సెక్షన్ 80ఈఈ కింద మొదటిసారి ఇంటిని రుణంపై సమకూర్చుకున్న వారు ఏటా రూ.50,000 అదనపు మొత్తాన్ని వడ్డీ చెల్లింపుల నుంచి మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ కొనుగోలు చేసిన ఇంటి ధర రూ.45 లక్షల్లోపు ఉంటే ఈ పరిమితి సెక్షన్ 80ఈఈఏ కింద రూ.1.50లక్షలుగా ఉంది. → సెక్షన్ 80సీ కింద గరిష్టంగా రూ.1.5 లక్షల ఆదాయపన్ను మినహాయింపు కోసం.. జీవిత బీమా ప్రీమియం చెల్లింపులతోపాటు, సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, ఎన్పీఎస్, ఈపీఎఫ్, పీపీఎఫ్, ఐదేళ్ల ట్యాక్స్‌ఫ్రీ బ్యాంక్ ఎఫ్డీ, ఈఎల్ఎస్ఎస్, యులిప్ ప్లాన్‌లో పెట్టుబడులు, పిల్లల స్కూల్ ట్యూషన్ ఫీజులను చూపించుకోవచ్చు. → పెన్షన్ ప్లాన్‌లో (ఎన్పీఎస్)లో పెట్టుబడికి సైతం గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు సెక్షన్ 80సీసీడీ(1) కింద మినహాయింపు పొందొచ్చు. కాకపోతే సెక్షన్ 80సీలో భాగంగానే ఇదీ ఉంటుంది. సెక్షన్ 80సీసీడీ (1బీ) కింద రూ.50,000 వరకు అదనంగా ఎన్పీఎస్ పెట్టుబడులపై పన్ను ప్రయోజనం ఉంది. అంటే మొత్తం రూ.2లక్షలు. → సెక్షన్ 80డీ కింద హెల్త్ ఇన్సూరెన్స్‌కు చెల్లించే ప్రీమియం గరిష్టంగా రూ.25,000 మొత్తంపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ60 ఏళ్లలోపు తల్లిదండ్రులకు ప్రీమియం చెల్లిస్తుంటే, మరో రూ.25,000 మొత్తంపైనా పన్ను మినహాయింపు పొందొచ్చు. 60 ఏళ్లు నిండిన వారికి హెల్త్ ప్రీమియం రూ.50,000 వరకు పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. వ్యాధి నివారణ పరీక్షల కోసం చేసే వ్యయాలు రూ.5,000పైనా అదనపు పన్ను మినహాయింపు ప్రయోజనం ఉంది. హెల్త్ ఇన్సూరెన్స్ లేని తల్లిదండ్రుల వైద్య చికిత్సల కోసం చేసే వ్యయం రూ.50,000 మొత్తంపైనా పన్ను మినహాయింపు కోరొచ్చు. → సెక్షన్ 80డీడీబీ కింద కేన్సర్, డిమెన్షియా తదితర తీవ్ర వ్యాధుల్లో చికిత్సలకు చేసే వ్యయాలపై పన్ను మినహాయింపు పొందొచ్చు. 60 ఏళ్లలోపు వారికి రూ.40వేలు కాగా, అంతకుమించిన వయసు వారి చికిత్స కోసం ఈ పరిమితి రూ.లక్షగా ఉంది. → బ్యాంక్ సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీ ఆదాయం రూ.10,000 వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో సెక్షన్ 80 టీటీఏ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. సెక్షన్ 80టీటీబీ కింద 60 ఏళ్లు నిండిన వారికి బ్యాంక్ సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీ పరిమితి రూ.50,000గా ఉంది. → సెక్షన్ 80ఈ కింద ఉన్నత విద్య కోసం తీసుకున్న రుణానికి చేసే వడ్డీ చెల్లింపులపై పూర్తి పన్ను మినహాయింపు తీసుకోవచ్చు. 8 ఏళ్లపాటు ఈ ప్రయోజనం ఉంటుంది. → అద్దె ఇంట్లో ఉంటూ, పనిచేస్తున్న సంస్థ నుంచి ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) పొందే వారు, ఆ మొత్తంపై సెక్షన్ 10(13ఏ) కింద పన్ను ప్రయోజనం క్లెయిమ్ చేసుకోవచ్చు. 1. పనిచేస్తున్న సంస్థ నుంచి ఒక ఏడాదిలో పొందిన వాస్తవ హెచ్ఆర్ఏ మొత్తం. 2. వాస్తవంగా చెల్లించిన అద్దె నుంచి తమ వార్షిక వేతనంలో 10 శాతాన్ని తీసివేయగా మిగిలిన మొత్తం. 3. మెట్రోల్లో నివసించే వారి మూల వేతనంలో 50 శాతం/ పల్లెల్లో నివసించే వారు అయితే మూల వేతనంలో 40 శాతం. ఈ మూడింటిలో ఏది తక్కువ అయితే అంత మేర తమ ఆదాయంపై పన్ను చెల్లించక్కర్లేదు. ఉదాహరణకు హైదరాబాద్‌లో నివసించే శ్రీరామ్ నెలవారీ స్థూల వేతనం రూ.50,000 (సంవత్సరానికి రూ.6లక్షలు). అతడి మూలవేతనం, డీఏ కలిపి రూ.30,000. హెచ్ఆర్ఏ కింద సంస్థ ప్రతినెలా రూ.10,000 ఇస్తోంది. కానీ శ్రీరామ్ రూ.12,000 కిరాయి ఇంట్లో ఉంటున్నాడు. ఈ ఉదాహరణలో శ్రీరామ్ రూ.84,000ను హెచ్ఆర్ఏ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. → ఇంకా సెక్షన్ 80సీ కింద గుర్తింపు పొందిన సంస్థలకు విరాళాలతోపాటు మరికొన్ని మినహాయింపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. నిపుణులు ఏమంటున్నారు? ఎంత మేర పన్ను తగ్గింపులు, మినహాయింపులు క్లెయిమ్ చేసుకుంటారన్న అంశం ఆధారంగానే పాత, కొత్త పన్ను విధానంలో ఏది ఎంపిక చేసుకోవాలన్నది ఆధారపడి ఉంటుంది. ఒక పేపర్‌పై తమ ఆదాయం, పెట్టుబడులు, బీమా ప్రీమియం వివరాలను నమోదు చేసుకుని, హెచ్ఆర్ఏ లెక్క తేలి్చన అనంతరం ఏ విధానం అనుకూలమో నిర్ణయించుకోవాలి. మొత్తం ఆదాయంలో ఎంత మేర పన్ను తగ్గింపులను క్లెయిమ్ చేసుకుంటున్నారు, ఏ విధానం అనుకూలమో స్పష్టత తెచ్చుకున్న తర్వాతే రిటర్నుల దాఖలుకు ముందుకు వెళ్లాలి. సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల మేర ఇన్వెస్ట్ చేస్తూ.. ఇంటి రుణం, విద్యా రుణం తీసుకుని చెల్లింపులు చేస్తూ.. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంతోపాటు, హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసుకునేట్టు అయితే అధిక ఆదాయ శ్లాబుల్లో ఉన్న వారికి సైతం పాత విధానమే మెరుగని షేర్ డాట్ మార్కెట్ బిజినెస్ హెడ్ వైభవ్ జైన్ తెలిపారు. ఈ క్లెయిమ్‌లు చేసుకోని వారికి కొత్త విధానాన్ని సూచించారు. నూతన విధానంలో పెద్దగా పన్ను ప్రయోజనాలు లేకపోయినా సరే.. కొత్తగా ఉద్యోగంలో చేరి, రూ.7 లక్షల్లోపు ఆదాయం ఉన్న వారికి ఎంతో ప్రయోజనమని ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ లోహిత్భాటియా తెలిపారు. ఎంపికలో స్వేచ్ఛ..ఆదాయపన్ను రిటర్నులు వేసే సమయంలో కొంత శ్రద్ధ వహించక తప్పదు. ఎందుకంటే కొత్త పన్ను విధానమే డిఫాల్ట్‌గా ఎంపికై ఉంటుంది. నూతన విధానంలోనే రిటర్నులు వేసే వారు అన్ని వివరాలు నమోదు చేసి సమరి్పంచొచ్చు. పాత విధానంలో కొనసాగాలనుకుంటే కచి్చతంగా ‘నో ఫర్ ఆప్టింగ్ అండర్ సెక్షన్ 115బీఏసీ’’ అని సెలక్ట్ చేసుకోవాలి. వేతన జీవులు ఏటా రిటర్నులు వేసే సమయంలో రెండు పన్ను విధానాల్లో తమకు అనుకూలమైనది ఎంపిక చేసుకోవచ్చు. వ్యాపార ఆదాయం ఉంటే మాత్రం ఇలా ఏదో ఒకటి ఎంపిక చేసుకునే స్వేచ్ఛ లేదు. వీరు పాత విధానంలోనే కొనసాగదలిస్తే ఫారమ్ 10–ఐఈఏ సమరి్పంచాలి. కాకపోతే జీవితంలో ఒక్కసారి మాత్రం నూతన పన్ను విధానానికి మారిపోయే ఆప్షన్ ఉంటుంది. ఒక్కసారి ఈ అవకాశం వినియోగించుకుని నూతన విధానంలోకి మారితే, తిరిగి పాత విధానంలోకి వెళ్లే అవకాశం ఉండదు. ఇప్పటికే 66 శాతం మేర నూతన పన్ను విధానంలో రిటర్నులు వేస్తున్నట్టు సీబీడీటీ చెబుతోంది. ఏది ప్రయోజనం..? → కేవలం స్టాండర్డ్ డిడక్షన్ వరకే క్లెయిమ్ చేసుకునేట్లయితే రూ.7,75,000 లక్షల్లోపు ఆదాయం ఉన్న వేతన జీవులు, పెన్షనర్లకు నిస్సందేహంగా నూతన విధానమే మెరుగని ఇక్కడి టేబుల్ చూస్తే అర్థమవుతుంది. స్వ యం ఉపాధి, ఇతరులకు రూ.7లక్షల వరకు నూతన విధానంలో పన్ను లేదు. పాత విధానంలో అయితే స్టాండర్డ్ డిడక్షన్ కలుపుకుని రూ.5.50లక్షల మొత్తంపై వేతన జీవులు, పెన్షనర్లకు పన్ను వర్తించదు. ఆ తర్వాత ఆదాయంపై 20% పన్ను పడుతోంది. → రూ.7,75,000 ఆదాయం కలిగి.. పాత పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ.50వేలతోపాటు, సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షలు కలిపి మొత్తం రూ.7 లక్షల వరకే పన్ను ఆదాయంపై మినహాయింపులను క్లెయిమ్ చేసు కునే వారికీ నూతన పన్ను విధానం లాభం. → రూ.7 లక్షలకు మించకుండా ఆదాయం కలిగిన వారు పాత విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ సహా రూ.2లక్షలకు పైన పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేసుకునేట్టు అయితే అందులో కొనసాగొచ్చు. క్లెయిమ్ చేసుకోలేని వారికి కొత్త విధానం నయం. → అలాగే, రూ.11 లక్షల ఆదాయం కలిగిన వారు రూ.3,93,700కు మించి పన్ను మినహాయింపులు (స్టాండర్డ్ డిడక్షన్ కలుపుకుని) క్లెయిమ్ చేసుకున్నప్పుడే పాత విధానం ప్రయోజనకరం. → రూ.16 లక్షల పన్ను ఆదాయం కలిగిన వారు రూ.4,83,333కు మించి పన్ను మినహాయింపులు (స్టాండర్డ్ డిడక్షన్ కలుపుకుని) క్లెయిమ్ చేసుకున్నప్పుడే పాత విధానం ప్రయోజనకరం. → రూ.50వేల స్టాండర్డ్ డిడక్షన్, సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షలు, 24(బీ) కింద గృహ రుణ వడ్డీ రూ.2 లక్షలు, హెచ్ఆర్ఏ ప్రయోజనం రూ.80వేలు (రూ.50వేల వేతనంపై సుమారు), హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం రూ.25వేలు, ఎన్పీఎస్ పెట్టుబడి రూ.50వేలను క్లెయిమ్ చేసుకుంటే పాత విధానంలో నికరంగా రూ.10.55 లక్షల ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన పరిస్థితి ఉండదు. నోట్: మూడు టేబుళ్లలో ఉన్న గణాంకాలు 60ఏళ్లలోపువారికి ఉద్దేశించినవి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
రాష్ట్రం కోసం బడ్జెట్ లో ఏమీ సాధించలేకపోయా..
-
ఇల్లమ్మితే... బోలెడు నష్టం!
కేంద్ర బడ్జెట్ 2024లో ఇండెక్సేషన్ బెనిఫిట్‌ను తొలగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా మండిపడ్డారు. ఇండెక్సేషన్ బెనిఫిట్‌ను తొలగిస్తే.. రియల్ ఎస్టేట్‌లో భారీగా నల్లధనం వచ్చి చేరుతుంది. కాబట్టి దీన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని అన్నారు.ప్రపంచవ్యాప్తంగా, పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ప్రోత్సహించారు. అయితే ఇప్పుడు ఇండెక్సేషన్‌ను తొలగించడం ద్వారా పెట్టుబడిదారీ వర్గం వెనుకడుగు వేస్తుంది. ఇండెక్సేషన్‌ను తీసివేయడం అంటే పన్ను విధించడం కాదు.. పెట్టుబడిదారులకు జరిమానా విధించడంతో సమానం అని అన్నారు.2024 బడ్జెట్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించిన ప్రతిపాదనలో పాత ఆస్తులను విక్రయించే వ్యక్తులు అధిక పన్ను చెల్లించాల్సి ఉంటుందని రాఘవ్ చద్దా తెలిపారు.బడ్జెట్లో, ప్రభుత్వం స్థిరాస్తులపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును 20 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించింది. అయితే ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేయడానికి ఇండెక్సేషన్ ప్రయోజనాలను తొలగించింది. ఇండెక్సేషన్‌ను పునరుద్దరించకపోతే.. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు తగ్గుతాయి, ప్రజలు తమకు నచ్చిన డ్రీమ్ హోమ్‌లను కొనుగోలు చేయడం సాధ్యం కాదని చద్దా అన్నారు.ఇండెక్సేషన్ అనేది బాండ్లు, స్టాక్‌లు, రియల్ ఎస్టేట్ వంటి పెట్టుబడులను ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సర్దుబాటు చేసే పద్ధతి. సాధారణంగా ఇందులో పెట్టుబడి ప్రస్తుత ధరలకు అనుగుణంగా ఉంటాయి. అయితే ద్రవ్యోల్బణం వల్ల వాస్తవ పెట్టుబడి విలువ తగ్గిపోతుంది. ఈ సమయంలో అప్పటికి ఉన్న ధరలకు అనుకూలంగా అడ్జస్ట్ చేయడానికి ఇండెక్సేషన్ ఉపయోగపడుతుంది.Removal of ‘Indexation’ benefit from the Investor is a grave mistake by the Government. I explain in detail. Please watch. pic.twitter.com/AhB7vViy0n— Raghav Chadha (@raghav_chadha) July 25, 2024 -
భారమవుతున్న విద్యారుణాలు!
బ్యాంకులు అందిస్తున్న విద్యారుణాలు భారమవుతున్న తరుణంలో బడ్జెట్ 2024-25 ప్రసంగంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అనుకూల నిర్ణయాలు తీసుకుంటుందని చాలామంది భావించారు. కానీ ప్రస్తుతం ఉన్న రూ.4 లక్షల ఉన్నత విద్యారుణాన్ని రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. గుడ్డి కంటే మెల్ల మేలు అన్నట్లు వడ్డీలపై నిర్ణయాన్ని వెల్లడించకుండా రుణ పరిమాణాన్ని పెంచడం ఒకింత మేలు చేసే అంశమే అయినా, భవిష్యత్తులో క్రీయాశీలకంగా మరిన్ని నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.2047లోపు ‘వికసిత భారత్’ లక్ష్యంగా విత్త మంత్రి నిర్మలా సీతారామన్ మానవ వనరుల అభివృద్ధి, ఉద్యోగకల్పన, రెసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బలోపేతం వంటి అంశాలపై దృష్టి సారించారు. ఉన్నత విద్యను అభ్యసించడానికి వీలుగా ప్రస్తుతం ఉన్న రుణ సదుపాయాన్ని రూ.4 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. అయితే బ్యాంకులు ఎలాంటి పూచీకత్తు లేకుండా ఈ రుణాలను మంజూరు చేయడం లేదు. రుణాల జారీ అంశాన్ని అకడమిక్ మార్కులకు లింక్ పెడుతున్నారు. దాంతో రుణ గ్రహీతలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. గతంలో బ్యాంకులు విద్యా రుణాలను దాదాపు 4 శాతం వడ్డీకే అందించేవి. ప్రస్తుతం అది సుమారు 12.5 శాతానికి చేరింది.ఇదీ చదవండి: 379 అక్రమ రుణ వెబ్సైట్లు, 91 ఫిషింగ్ సైట్ల తొలగింపుప్రభుత్వం స్పందించి 2047 కల్లా ‘వికసిత భారత్’ లక్ష్యాన్ని చేరుకునేలా విద్యా రుణాలను మరింత సులభతరం చేసి, తక్కువ వడ్డీలకే వాటిని అందిచేలా చర్యలు తీసుకోవాలని నిపుణులు కోరుతున్నారు. దాంతోపాటు ఉన్నత విద్య చదువుతున్న సమయంలోనే కళాశాలలు, కంపెనీలు పరస్పరం ఒప్పందం కుదుర్చుకునేలా మరిన్ని ఏర్పాట్లు చేయాలని చెబుతున్నారు. దానివల్ల విద్యార్థి దశలోనే రియల్‌టైమ్ అనుభవం రావడంతో చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగంలో స్థిరపడే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. -
Parliament Budget Session 2024: మాటల యుద్ధం
న్యూఢిల్లీ: అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదాలు, నినాదాలతో లోక్‌సభ గురువారం దద్దరిల్లింది. పలుమార్లు వాయిదా పడింది. కేంద్ర బడ్జెట్‌పై ప్రారంభమైన చర్చ పూర్తిగా పక్కదారి పట్టింది. తొలుత కాంగ్రెస్ ఎంపీ, పంజాబ్ మాజీ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ మాట్లాడుతూ బీజేపీ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి రవనీత్‌సింగ్ బిట్టూ తాత, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్‌సింగ్ హత్య ఘటనను ప్రస్తావించారు. దీనిపై బిట్టూ అభ్యంతరం వ్యక్తం చేశారు. చన్నీ, బిట్టూ మధ్య మాటల యుద్ధం జరిగింది. కాంగ్రెస్ నేత సోనియా గాం«దీతోపాటు చన్నీపై బిట్టూ వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. దీంతో విపక్ష ఎంపీలు ఒక్కసారిగా ఆయనపై విరుచుకుపడ్డారు. బిట్టూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సభ్యుడు అమరీందర్‌సింగ్ రాజా వెల్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయతి్నంచారు. రాహుల్ గాంధీ ఆయనను ఆపేశారు. బిట్టూతోపాటు పలువురు బీజేపీ ఎంపీలు వెల్‌లోకి ప్రవేశించేందుకు ప్రయతి్నంచగా స్పీకర్ స్థానంలో ఉన్న సంధ్యా రే సభను వాయిదా వేశారు. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. సభ సజావుగా జరిగేలా చూడాలని స్పీకర్ ఓం బిర్లాను కోరారు. సభ్యులంతా సభ గౌరవాన్ని కాపాడాలని స్పీకర్ అన్నారు. నిబంధనలు అతిక్రమించకూడదని చెప్పారు. తర్వాత చన్నీ తన ప్రసంగం కొనసాగించారు. రైతులకు ఇచి్చన హామీలను మోదీ ప్రభుత్వం నిటబెట్టుకోలేదని విమర్శించారు. రైతులను ఖలిస్తానీలు చిత్రీకరించారని బీజేపీ నేతలపై మండిపడ్డారు. సభను చన్నీ తప్పుదోవ పట్టిస్తున్నారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు. చన్నీ మాట్లాడుతూ రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ చన్నీ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఆయనపై సభా హక్కుల తీర్మానం ప్రవేశపెట్టాలని అన్నారు. ఈ సందర్భంగా అధికార, విపక్ష సభ్యుల మధ్య మళ్లీ వాగ్వాదం కొనసాగింది. తర్వాత సభ రెండుసార్లు వాయిదా పడింది. పార్లమెంట్ బయట బిట్టూ మీడియాతో మాట్లాడారు. చన్నీ జాతి వ్యతిరేక శక్తిగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇండియా నుంచి పంజాబ్‌ను విడదీయాలన్నదే ఆయన ఉద్దేశంగా కనిపిస్తోందన్నారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ: చన్నీ దేశంలో నరేంద్ర మోదీ పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని చరణ్‌జిత్ సింగ్ చన్నీ మండిపడ్డారు. 20 లక్షల మంది ప్రజలు ఎన్నుకున్న ఎంపీని(అమృత్‌పాల్ సింగ్) జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) కింద నిర్బంధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లు వేసిన ప్రజల సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించే అవకాశం ఆయనకు ఇవ్వడం లేదని, ఇది ఎమర్జెన్సీ కాక మరేమిటని ప్రశ్నించారు. చన్నీ లోక్‌సభలో ఈ అంశాన్ని లేవనెత్తారు. అయితే, అమృత్‌పాల్ పేరును నేరుగా ప్రస్తావించలేదు. లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని ఖదూర్‌సాహిబ్ నియోజకవర్గం నుంచి వివాదాస్పద సిక్కు మత బోధకుడు, ఖలిస్తాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ స్వతంత్ర అభ్యరి్థగా 2 లక్షల మెజారీ్టతో గెలిచిన సంగతి తెలిసిందే. ఆంధ్రా–బిహార్ బడ్జెట్: సౌగతా రాయ్ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతా రాయ్ లోక్‌సభలో విమర్శలు గుప్పించారు. అది ఆంధ్రా–బిహార్ బడ్జెట్ అని ఆక్షేపించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శిక్షణ పొందిన ఆర్థికవేత్త కాదని అన్నారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా కేవలం ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచి్చన సూచనల ఆధారంగా బడ్జెట్ రూపొందించారని విమర్శించారు. గతంలో ఆర్థిక మంత్రులుగా పనిచేసిన మన్మోహన్ సింగ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో, పి.చిదంబరం హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారని, నిర్మలా సీతారామన్ మాత్రం జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చదువుకున్నారని సౌగతా రాయ్ వ్యాఖ్యానించారు. -
ఆ వాటాల విక్రయమంటే కన్నబిడ్డలను అమ్ముకోవడమే
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వరంగ సంస్థల వాటాల విక్రయం (డిజ్ ఇన్వెస్ట్మెంట్) ద్వారా ఈ ఏడాది రూ.50 వేల కోట్ల ఆదాయం రాబట్టాలని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రస్తావించడం పట్ల రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు గురువారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వరంగ సంస్థల వాటాల విక్రయమంటే కన్నబిడ్డలను మరొకరికి అమ్ముకోవడమే అని విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌పై శ్రీధర్‌బాబు స్పందిస్తూ పీఎస్‌యూలను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక కొత్త వాటిని స్థాపించకపోగా, లాభాల్లో ఉన్న సంస్థల వాటాలను అమ్మి సొమ్ము చేసుకుంటోందని ఆరోపించారు. బ్యాంకులు కాకుండా పీఎస్‌యూల వార్షిక లాభాలు రూ.2,64,000 కోట్లుగా ఉన్నాయన్నారు. బ్యాంకులను జాతీయం చేసి పేదల దగ్గరికి చేర్చింది స్వర్గీయ ఇందిరాగాంధీ అని, ఇప్పుడా బ్యాంకుల ద్వారా గతేడాది మోదీ ప్రభుత్వానికి రూ.2.11 లక్షల కోట్ల డివిడెంట్ లభించిందని శ్రీధర్‌బాబు తెలిపారు.నష్టాల్లో ఉన్న పీఎస్‌యూలకు అపారమైన ఆస్తులున్నాయని, కానీ అవి దివాలా తీశాయని ప్రధాని చెబుతున్నారని విమర్శించారు. వాటి అప్పుల కన్నా ఆస్తుల విలువ ఎక్కువని పేర్కొన్నారు. 13 మహారత్న, 14 నవరత్న, 72 మినీరత్న పీఎస్‌యూలన్నీ లాభాల్లో ఉన్నాయని, వీటిని నిర్వీర్యం చేసి వాటాలు అమ్ముకుంటే కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదని శ్రీధర్‌బాబు హెచ్చరించారు.రక్షణరంగ ఉత్పత్తుల తయారీపై రూ.వెయ్యి కోట్ల పెట్టుబడిముందుకొచ్చిన వెమ్ టెక్నాలజీస్: మంత్రి శ్రీధర్బాబుసాక్షి, హైదరాబాద్: రక్షణరంగ పరికరాల ఉత్పత్తి సంస్థ వెమ్ టెక్నాలజీస్ మొదటి దశ ప్రాజెక్టులో భాగంగా రూ.1,000 కోట్ల పెట్టుబడులు పెడుతోందని ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. జహీరాబాద్ నిమ్జ్‌లో 511 ఎకరాల్లో ఏర్పాటవుతున్న ఈ సమీకృత ఉత్పాదన కేంద్రం వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ట్రయల్ ప్రొడక్షన్‌కు సిద్ధమవుతుందని వెల్లడించారు. మొదటి దశ పూర్తయితే 1,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు.గురువారం సచివాలయంలో వెమ్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు మంత్రితో సమావేశమయ్యారు. సంస్థకు కేటాయించిన భూమిలో ఇంకా స్వాధీనం చేయాల్సిన 43 ఎకరాలకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతికి.. శ్రీధర్‌బాబు సూచించారు. ఉత్పత్తికి 33 కేవీ విద్యుత్ లైన్లను నాలుగు నెలల్లో ఏర్పాటు చేయాలని ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. సమావేశంలో వెమ్ టెక్నాలజీస్ సీఎండీ వెంకటరాజు పాల్గొన్నారు. -
జీఎస్టీ శ్లాబులు తగ్గింపు..?
జీఎస్టీ శ్లాబులను మరింత సరళతరం చేయాలని ప్రభుత్వం యోచిస్తుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ ఛైర్మన్ సంజయ్ అగర్వాల్ తెలిపారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) నిర్మాణాన్ని క్రమబద్ధీకరించేందుకు ప్రస్తుతం అమలవుతున్న నాలుగు శ్లాబులను మూడుకు తగ్గించేలా చర్చలు సాగుతున్నాయని చెప్పారు.ఈ సందర్భంగా సంజయ్ అగర్వాల్ మాట్లాడుతూ..‘ప్రస్తుతం అమలవుతున్న జీఎస్టీ శ్లాబుల విధానంలో చాలా వస్తువుల వర్గీకరణపై వివాదాలున్నాయి. వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. పన్ను చెల్లింపులను మరింత సరళతరం చేసేందుకు ప్రస్తుతం ఉన్న నాలుగు జీఎస్టీ శ్లాబులను మూడుకు తగ్గించేలా చర్చలు జరుగుతున్నాయి. జులై 2017లో జీఎస్టీను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఆదాయ వృద్ధి మెరుగుపడింది’ అన్నారు.ఇదీ చదవండి: ఈఎస్ఐ పథకంలోకి భారీగా చేరిన ఉద్యోగులుకేంద్ర బడ్జెట్ 2024-25 ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ..‘జీఎస్టీ ప్రయోజనాలను పెంచడం కోసం పన్ను నిర్మాణాన్ని మరింత సరళీకృతం చేసేందుకు ప్రయత్నిస్తాం. జీఎస్టీ పరిధిని ఇతర రంగాలకు విస్తరిస్తాం’ అని చెప్పారు. మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ రాబడుల్లో స్థిరమైన వృద్ధి నమోదైంది. ఏప్రిల్ 2024లో ఆల్ టైమ్హై రూ.2.10 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. ప్రస్తుతం జీఎస్టీ శ్లాబులు 5%, 12%, 18%, 28%గా ఉన్నాయి. -
ఆయనతో పోలిస్తే చంద్రబాబు మరీ అంత వీకా?
మీడియా చేతిలో ఉంటే చాలు తిమ్మిని బొమ్మి చేయవచ్చు. బొమ్మిని తిమ్మి చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఢీ కొట్టగలిగినవారే దేశంలోనే లేరంటే అతిశయోక్తి కాదు. అమరావతి రాజదాని నిర్మాణానికి కేంద్రం పదిహేనువేల కోట్ల రూపాయల సాయం చేయడానికి ముందుకువచ్చింది కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయం ప్రకటించినప్పుడు ఆంద్రులంతా సంతోషించారు. చంద్రబాబు నాయుడు అమలు చేయతలపెట్టిన స్కీములకు ఈ మేరకు ఉపశమనం కలుగుతుందని అనుకున్నారు. కానీ.. అసలు విషయం తెలిశాక..ఇందులోనూ ఇంత మతలబు ఉందనే అభిప్రాయం కలుగుతుంది. అమరావతికి కేంద్రం గ్రాంట్ గా ఇవ్వడం లేదని, ప్రపంచ బ్యాంక్ నుంచి రుణ సాయం ఇప్పిస్తుందని, ఇందులో మాచింగ్ గ్రాంట్ విషయం కేంద్ర,రాష్ట్రాలు చర్చించి నిర్ణయించుకుంటాయని ఆమె చెప్పారు. అంటే ఇందులోను గ్యారంటీ లేదన్న మాట. అవసరమైతే రాష్ట్రం కూడా భరించవలసి ఉంటుందన్నమాట. ఇక పోలవరం ప్రాజెక్టు పేరు కేంద్ర బడ్జెట్ లో ప్రస్తావించినందుకే టీడీపీ, జనసేనలు మురిసిపోయాయి. అలాగే పారిశ్రామికవాడలకు ఇచ్చే రాయితీలు గురించి మాట వరసకు చెప్పారు తప్ప ఎంత మేర ఆర్దిక సాయం చేసేది నిర్దిష్టంగా తెలపకపోయినా తెలుగుదేశం మీడియా ఆహో,ఓహో అంటూ ఊదరగొట్టాయి. రాజును మించిన రాజభక్తిని ప్రదర్శించాయి. బీహారు రాష్ట్రానికి మాత్రం కేంద్రం నేరుగా 58,900 కోట్ల రూపాయల ఆర్దిక సాయాన్ని వివిధ ప్రాజెక్టుల రూపేణా ఇవ్వదలచింది. అంటే అదంతా గ్రాంట్ అన్నమాట. రూపాయి అప్పుగా ఉండదు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులకు సంబంధించిన ఎంపీల మద్దతు లేనిదే మోదీ ప్రభుత్వం నిలబడడం కష్టం. అయినా నితీష్ ధైర్యంగా ప్రత్యేక హోదా అడిగారు. చంద్రబాబు ఆ ఊసే ఎత్తలేదు. బీహారుకు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, అంతకు మించిన సాయాన్ని మోదీ ప్రభుత్వం ఇస్తోంది. ఏపీకి మాత్రం అప్పుకు సాయం చేస్తామని అన్నారు. ఎక్కడ ఉంది బలహీనత. కొంతమంది విమర్శిస్తున్నట్లు చంద్రబాబుపై గతంలో కేంద్రం ఇచ్చిన నోటీసుల కత్తి వేలాడుతోందా?లేక చంద్రబాబే కేంద్రంతో గొడవ పెట్టుకుని గతంలో మాదిరి దెబ్బతింటానని భయపడుతున్నారా?. 2014-19 టరమ్ లో తొలుత ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ ఇస్తామని ఆనాటి ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లి ప్రకటించారు. దానిని చంద్రబాబు స్వాగతించారు. ఆ తర్వాత కాలంలోమళ్లీ ప్రత్యేక హోదానే కావాలన్నారు. అది వేరే సంగతి.ప్యాకేజీ కూడా అప్పట్లో రుణసాయం కిందే ఇవ్వచూపారు. దానికే చంద్రబాబు అప్పట్లో అంగీకరించడం విమర్శలకు దారి తీసింది. సరిగ్గా అదేరీతిలో ఇప్పుడు అమరావతి నిర్మాణానికి రుణం తీసుకోవడానికి ఒప్పుకున్నారు. స్వయంగా చంద్రబాబే అది అప్పే అని తేల్చి చెప్పారు. జనం అంతా ఏపీకి పప్పన్నం లాంటి సాయం వచ్చిందని అనుకుంటే అది కాస్త అప్పన్నం అని తేలిపోయింది. ఈ మాత్రం దానికే ఈనాడు పత్రిక ఏమని హెడింగ్ పెట్టిందో చూడండి. ‘‘రాజధానికి రాజసం’’ అని పెట్టి తమ రాజభక్తిని ప్రదర్శించుకున్నారు. మరో టీడీపీ పత్రిక ఆంధ్రజ్యోతి ‘‘హ్యాపీ ఏపీ’’ అని ఆనంద తాండవం చేసింది. వారికి ఇష్టం అయితే ఇలా..అదే జగన్ ప్రభుత్వం చేస్తే అప్పుల చిప్ప అని హెడింగ్ పెట్టేవారు. అయితే ఇక్కడ చంద్రబాబు సమర్ధించుకున్న తీరు కూడా ఆసక్తికరమైనదే. పదిహేనువేల కోట్ల మేర కేంద్రం ఇచ్చేది అప్పే అయినా ,ముప్పై ఏళ్లతర్వాత తీర్చేది కాబట్టి ఇబ్బంది ఉండదు అని చెబుతున్నారు. అంటే అప్పటివరకు ఏపీ ప్రజల నెత్తిన ఈ రుణభారం ఉంటుందని అంగీకరించడమే కదా!. వివిధ ఏజెన్సీల నుంచి వచ్చే ఈ అప్పులకు కేంద్రం పూచికత్తు ఇస్తుందని అన్నారు. నిజానికి ఏ విదేశీరుణానికి అయినా కేంద్రం గ్యారంటీలు ఇస్తుందన్నది తెలిసిందే.గతంలో ప్రపంచ బ్యాంక్ ఇదే ప్రాజెక్టుకు రుణం ఇవ్వడానికి నో చెప్పింది.దానికి కారణం అది పర్యావరణ నియమాలకువ్యతిరేకంగా ఉండడం,కొందరు రైతులు నిరసనలు తెలుపుతుండడం. నిధులు ఏ రూపేణా వచ్చినా అది రాష్ట్రానికి ఉపయోగమేనని చంద్రబాబు ఉవాచ. మరి జగన్ ప్రభుత్వంపై తెగ ఆడిపోసుకున్నారు కదా? అని ఎవరైనా అడిగితే అధికారం కోసం ఎన్ని అయినా అంటాం అని సమాధానం ఇస్తారేమో తెలియదు. పోలవరం ప్రాజెక్టు కునిధులు ప్రత్యేకంగా కేంద్ర బడ్జెట్ లో పెట్టకపోయినా, పూర్తి చేసే బాధ్యత తమదేనని కేంద్రం చెప్పిందట.అంటే అది ఎప్పటికి పూర్తి చేస్తారో, ఎంత మొత్తం ఇస్తారో, నిర్వాసితుల సమస్య ఎప్పటికి తీర్చుతారో తెల్చకుండా పోలవరం అంటేనే పులకరించిపోతే ఏమి చేయాలి!. పోనీ ప్రాజెక్టును కేంద్రానికి అప్పగిస్తున్నట్లు ఏమైనా చెప్పారా?అదేమీ లేదు. వెనుకబడిన ప్రాంతాల ప్యాకేజీ బుందేల్ ఖండ్ తరహాలో ఉంటుందని సమాచారం ఉందని చంద్రబాబు చెబుతున్నారు. కానీ నిర్మలా సీతారామన్ అనడం లేదు. పారిశ్రామిక రాయితీలు ఈ ప్యాకేజీలో భాగమేనని ఆయన అంటు్నారు.చంద్రబాబు వీటన్నిటిపైన ప్రధాని మోదీకి ధన్యవాదాలు కూడా తెలిపేశారు. రాష్ట్ర అవసరాలను గుర్తించి రాజధాని, పోలవరం,పారిశ్రామికరంగంతో పాటు వెనుకబడిన అభివృద్దికి దృష్టి సారించినందుకు మోదీకి, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇంతకీ ఏమి సాధించారని చంద్రబాబు ఇంతగా కేంద్రాన్ని పొగిడారో తెలియదు. .. దీనిని బట్టే చంద్రబాబు రాజకీయంగా ఎంత బలహీనంగా ఉంది అర్దం అవుతుంది.ధైర్యం చేసి నితీష్ మాదిరి గట్టిగా అడగలేకపోయారు.వారు ఇచ్చిందే మహా గొప్ప విషయం అన్నట్లు చంద్రబాబు సరిపెట్టుకున్నారు. కాకపోతే ఏపీ ప్రజలను తనకు ఉన్న మీడియా బలంతో మభ్యపెట్టడానికి మాత్రం యత్నించారు. అబద్దపు వాగ్దానాలనువిని ఓట్లు వేసిన ప్రజలు ఈ ప్రచారాన్ని నమ్మకుండా ఉంటారా? అన్నది వారి విశ్వాసం కావచ్చు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
బడ్జెట్ కేటాయింపులపై జడ శ్రవణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్
-
Parliament Budget Session 2024: కేంద్ర బడ్జెట్‌పై సభా సమరం
న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయసభల్లో బుధవారం కేంద్ర బడ్జెట్‌పై అధికార, విపక్షాల తీవ్ర వాగ్యుద్ధం చోటుచేసుకుంది. సమాఖ్య స్ఫూర్తికి, పేదలకు బడ్జెట్ ఫక్తు వ్యతిరేకంగా ఉందంటూ విపక్షాలు దుయ్యబట్టాయి. అధికార ఎన్డీఏ కూటమి భాగస్వాములను ప్రసన్నం చేసుకోవడానికే మోదీ సర్కారు పరిమితమైందని ఆరోపించాయి. రాజ్యసభ, లోక్‌సభ సమావేశం కాగానే బడ్జెట్ కేటాయింపులపై చర్చకు అవకాశం ఇవ్వాలంటూ పట్టుబట్టాయి. సభాపతులు అందుకు నిరాకరించడంతో ఉభయ సభల నుంచీ కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ వాకౌట్ చేశాయి. కుర్చీ కాపాడుకునే బడ్జెట్! ‘‘బడ్జెట్లో బిహార్, ఆంధ్రప్రదేశ్‌లకు పకోడా, జిలేబీ దక్కాయి. మిగతా రాష్ట్రాలన్నింటికీ మోదీ మొండిచేయి చూపారు’’ అంటూ రాజ్యసభలోవిపక్ష నేత ఖర్గే దుయ్యబట్టారు. ఇతర కార్యకలాపాలను పక్కన పెట్టి ముందుగా బడ్జెట్‌పై చర్చ చేపట్టాలంటూ నోటీసులిచ్చారు. వాటన్నింటినీ చైర్మన్ తిరస్కరించడంపై విపక్ష సభ్యులంతా మండిపడ్డారు. ‘కేవలం ఐదు రాష్ట్రాలకే పరిమితమైన బడ్జెట్’, ‘కురీ్చని కాపాడుకునే బడ్జెట్’ అంటూ నినాదాలకు దిగారు. బడ్జెట్ కేటాయింపులు విపక్షపూరితమంటూ విపక్ష ఎంపీలు బుధవారం ఉదయం లోక్‌సభ ప్రవేశద్వారం వద్ద బైఠాయించి నిరసనకు దిగారు. ఈ అంశాన్నే ముందు చర్చకు చేపట్టాలంటూ సభలో పదేపదే డిమాండ్ చేశారు. వారి తీరుపై స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహించారు. బైఠాయించి ఎవరినీ లోనికి రానీయకపోవడం ఏం పద్ధతని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ బి.మహతాబ్ బడ్జెట్‌పై చర్చ ప్రారంభించారు. నయా మధ్యతరగతిని సాధికారతకు బడ్జెట్ పెద్దపీట వేసిందన్న ఆయన వ్యాఖ్యలను కాంగ్రెస్ సభ్యురాలు కుమారి సెల్జా తీవ్రంగా ఆక్షేపించారు. కేంద్ర బడ్జెట్ ఎవరి కోసమో చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. ‘ఇది వికసిత్ బడ్జెట్ కాదు, విచలిత్ బడ్జెట్’ అంటూ ఎద్దేవా చేశారు. తుమ్మితే ఊడేలా ఉన్న సంకీర్ణానికి మోదీ సారథ్యం వహిస్తున్నారంటూ తృణమూల్ నేత అభిషేక్ బెనర్జీ ఎద్దేవా చేశారు. అందుకే కీలక ఎన్డీఏ భాగస్వాములను తృప్తి పరిచేందుకు బిహార్, ఏపీలకే బడ్జెట్లో పెద్దపీట వేశారని ఆరోపించారు. బెనర్జీ వ్యాఖ్యలు తృణమూల్ పాలిత పశి్చమబెంగాల్కే వర్తిస్తాయంటూ కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తిప్పికొట్టారు. దయానిధి మారన్ (డీఎంకే), సుప్రియా సులే తదితరులు బడ్జెట్‌పై విమర్శలు గుప్పించారు. విపక్ష సభ్యులనుద్దేశించి బీజేపీ ఎంపీ అభిజిత్ గంగోపాధ్యాయ చేసిన విమర్శలు వివాదమయ్యాయి. దాంతో వాటిని రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ చెప్పారు.పార్లమెంట్ ప్రాంగణంలో విపక్షాల నిరసన కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపు తీరుపై ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష పాలిత రాష్ట్రాలకు బడ్జెట్లో మొండిచేయి చూపారని మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరిపై బుధవారం పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన తెలిపారు. దేశ సమాఖ్య వ్యవస్థ పవిత్రతపై మోదీ ప్రభుత్వం దాడి చేసిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. విపక్ష పాలిత రాష్ట్రాలపై వివక్ష చూపించారని, ఇదెక్కడి న్యాయమని నిలదీశారు. కాంగ్రెస్ ఎంపీలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు అఖిలేష్ యాదవ్ సహా డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ, వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీల ఎంపీలు నిరసనలో పాల్గొన్నారు.నిర్మల మాతాజీ! ఖర్గే సంబోధన కూతురన్న ధన్‌ఖడ్ రాజ్యసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా సంబోధనల సంవాదం జరిగింది. చాలా రాష్ట్రాలకు బడ్జెట్లో అన్యాయం జరిగిందని విపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతుండగానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు వివరణ ఇచ్చేందుకు చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ అవకాశమిచ్చారు. దాంతో ఖర్గే ఆగ్రహించారు. నిర్మలను ఉద్దేశించి, ‘‘మాతాజీ! మీరు మాట్లాడటంలో ఎక్స్పర్ట్ అని నాకు తెలుసు. కానీ ముందుగా దయచేసి నన్ను పూర్తి చేయనివ్వండి’’ అన్నారు. మాతాజీ సంబోధనపై చైర్మన్ అభ్యంతరం తెలిపారు. ‘‘ఆర్థిక మంత్రికి 64 ఏళ్లు. మీకు 82. ఆమె మీకు మాతాజీ కాదు, కూతురి వంటిది’’ అన్నారు. అనంతరం ఖర్గే చర్చను కొనసాగిస్తూ నిర్మల కర్నాటక నుంచి రాజ్యసభకు ఎన్నికైనందున బడ్జెట్లో ఆ రాష్ట్రానికి ఎంతో ఇస్తారనుకుంటే అసలేమీ ఇవ్వలేదంటూ ఎత్తిపొడిచారు. -
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్@ 2.90 లక్షల కోట్లు
సాక్షి, హైదరాబాద్: వాస్తవిక కోణాన్ని ప్రతిబింబిస్తూనే అదనపు ఆదాయ రాబడులు, ఆర్థిక ప్రగతిని దృష్టిలో ఉంచుకుని 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభు త్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2.90 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలు చేసేందుకు సిద్ధమైంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ.2,75,890 కోట్లను ప్రతిపాదించిన ప్రభుత్వం దాని కంటే 5 శాతం మేర కేటాయింపుల పెంపుతో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రతిపాదించనున్నట్లు ఆర్థిక శాఖ వర్గాల ద్వారా తెలిసింది. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖమంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనమండలిలో పరిశ్రమలు, ఐటీ, శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అంతకంటే ముందు ఉదయం 9 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. రాబడుల్లో సంస్కరణలు అప్పుల భారం పెరిగిపోతున్న నేపథ్యంలో అదనపు ఆదాయాన్ని రాబట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే పలు సంస్కరణలు చేపట్టింది. జీఎస్టీ లీకేజీలు అరికట్టాలని, గనుల రాయల్టీ చెల్లింపు ఎగవేతలను నిరోధించాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ ఏడాదిలో భూముల మార్కెట్ విలువల సవరణ జరిగితే రూ.5 వేల కోట్ల వరకు అదనపు ఆదాయం వస్తుందని అంచనా వేస్తోంది. మరోవైపు ఈ బడ్జెట్లో పన్నేతర ఆదాయం కింద భూముల అమ్మకాలను ప్రతిపాదించే అవకాశం కూడా ఉంది. మద్యం రేట్లు పెంచడం, ఎలైట్ షాపుల ఏర్పాటు లాంటి విధాన నిర్ణయాలను తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో రూ.15 వేల కోట్ల వరకు ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. ఈ పెరిగిన ఆదాయానికి తోడు, ఆర్థిక వృద్ధి కూడా కేటాయింపులకు ఊతమిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని పద్దులూ కీలకమే! ఈసారి బడ్జెట్లో అన్ని శాఖల పద్దులూ భారీగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రుణమాఫీతో కలిపి వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.64 వేల కోట్లు, సాగునీటి శాఖకు రూ.26–28 వేల కోట్లు, విద్యా శాఖకు రూ.21 వేల కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ.45 వేల కోట్ల వరకు, సంక్షేమ శాఖలకు రూ.40 వేల కోట్లు, మున్సిపల్ శాఖకు రూ.12 వేల కోట్లు ప్రతిపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈసారి రుణమాఫీకే రూ.31 వేల కోట్లు ఖర్చు కానున్నాయి. అందులో ఇప్పటికే రూ.6 వేల కోట్ల వరకు ఖర్చయింది. ఆగస్టు నెలాఖరు నాటికి మిగిలిన రూ.25 వేల కోట్లు వెచ్చించాల్సి ఉంది. ఇక ఆరు గ్యారంటీలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ.53 వేల కోట్లు కేటాయించారు. మహాలక్ష్మి, గృహజ్యోతి, గృహలక్షి్మ, పథకాలు ఇప్పటికే అమల్లో ఉండగా, మరిన్ని పథకాలు అమలు చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న విధంగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల ఏర్పాటుకు బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించవచ్చని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.20 వేల కోట్లు అవసరం కాగా, అందులో ఏ మేరకు నిధులు ప్రతిపాదిస్తారన్న దానిపై స్పష్టత రాలేదు. సాగునీటి శాఖకు సంబంధించి రూ.9 వేల కోట్లు ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరం కాగా, అప్పులు, వేతనాలు, ఈ ఏడాది పూర్తి చేయాల్సిన ప్రాధాన్యతా ప్రాజెక్టులకు రూ.28 వేల కోట్లు అవసరమపి ఆ శాఖ కోరింది. శాఖల వారీ కేటాయింపులకు తోడు అప్పుల చెల్లింపు, ఉద్యోగుల వేతనాలు, పింఛన్లు, కొత్త ఉద్యోగాల కల్పన కోసం వేతనాలు, సాధారణ వ్యయం, విద్యుత్ సబ్సిడీలు (గృహజ్యోతి, వ్యవసాయానికి ఉచిత విద్యుత్) తదితర అనివార్య చెల్లింపులు కూడా చేయాల్సి ఉంది. పింఛన్ల పెంపు కష్టమేనా? ఎన్నికలకు ముందు ఆసరా పింఛన్లు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అయితే ప్రస్తుతం అమల్లో ఉన్న పింఛన్ ప్రకారం ఏడాదికి రూ.11 వేల కోట్ల నిధులు అవసరమవుతున్నాయి. కాగా హామీ ఇచ్చిన ప్రకారం పెంచితే నెలకు రూ.1,000 కోట్ల చొప్పున ఏడాదికి మరో రూ.12 వేల కోట్లు అవసరమవుతాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత బడ్జెట్లో పింఛన్ల పెంపు ప్రతిపాదన ఉంటుందా లేదా అన్నది సందేహాస్పదంగా మారింది. అయితే వాస్తవిక కోణంలో బడ్జెట్ రూపకల్పనకు ప్రాధాన్యమిచ్చినందున ఈ ఏడాదికి పింఛన్ల పెంపు ఉండకపోవచ్చనే తెలుస్తోంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.45వేల కోట్ల వరకు ప్రతిపాదించే అవకాశముందని ఆర్థిక శాఖ వర్గాలంటున్నాయి. ఆర్థిక వృద్ధి ఆసరాగా..! పార్లమెంటులో ఇటీవల ప్రవేశపెట్టిన సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం ఈసారి 6.5 నుంచి 7 శాతం వరకు ఆర్థిక వృద్ధి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాతీయ స్థాయి వృద్ధి కంటే తెలంగాణ వృద్ధి మరో 2–3 శాతం వరకు ఎక్కువగానే ఉండే అవకాశాలున్నాయి. ఈ వృద్ధికి తోడు రెవెన్యూ రాబడుల్లో చేపడుతున్న సంస్కరణల కారణంగా వచ్చే అదనపు ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఓటాన్ అకౌంట్లో పెట్టిన రూ.2.75 లక్షల కోట్ల బడ్జెట్‌ను మరో రూ.10 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్ల వరకు పెంచుతూ పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. -
Union Budget 2024: సైబర్ చోరులూ... హ్యాండ్సప్!
డిజిటల్ చెల్లింపుల్లో భారత్ దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో 46 శాతం వాటా మనదే. వీటిలో ఏకంగా 80 శాతం యూపీఐ చెల్లింపులే. మరోవైపు సైబర్ నేరగాళ్లు కూడా అదే స్థాయిలో పేట్రేగిపోతున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్లపై పదేపదే సైబర్ దాడులు, చిరుతిళ్ల తయారీ దిగ్గజం హల్దీరామ్స్‌పై రాన్సమ్వేర్ దాడి వంటివి ఇందుకు కేవలం ఉదాహరణలే. గీత ఐదేళ్లలో మన దగ్గర సైబర్ దాడుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. జాతీయ సైబర్ దాడుల నమోదు పోర్టల్‌కు ఈ ఏడాది ఇప్పటిదాకా సగటున రోజుకు కనీసం 7,000 పై చిలుకు ఫిర్యాదులందాయి. వీటి వాస్తవ సంఖ్య ఇంకా భారీగా ఉంటుందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. సైబర్ నేరాల్లో భారత్ ప్రస్తుతం ప్రపంచంలో పదో స్థానంలో ఉంది. నానాటికీ తీవ్రరూపు దాలుస్తున్న ఈ బెడదకు అడ్డుకట్ట వేసే దిశగా 2024–25 కేంద్ర బడ్జెట్లో పలు చర్యలకు మోదీ ప్రభుత్వం ఉపక్రమించింది. సైబర్ భద్రతకు నిధులు పెంచింది. కీలకమైన ఆన్లైన్ వ్యవస్థలు, డేటా భద్రత, సైబర్ నేరాల కట్టడి, కృత్రిమ మేధలో పరిశోధనలకు రూ.1,550 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.238 కోట్లు కేంద్ర స్థాయిలో సైబర్ భద్రత, నేరాలకు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించే నోడల్ ఏజెన్సీ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్–ఇన్)కు దక్కాయి. మొత్తమ్మీద సైబర్ భద్రత ప్రాజెక్టులకు రూ.759 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఇవి ఏకంగా 90 శాతం అధికం కావడం విశేషం! సైబర్ సెక్యూరిటీ కృత్రిమ మేధ ప్రాజెక్టుల కోసం కేంద్ర హోం శాఖకు కేటాయించిన భారీ నిధుల్లోని మొత్తాలను వెచి్చంచనున్నారు. ఆ శాఖ అదీనంలో పని చేసే భారత సైబర్ నేరాల (కట్టడి) సమన్వయ కేంద్రం (ఐ4సీ) ఈ తరహా నేరాలపై ఉక్కుపాదం మోపే విషయంలో నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. కేంద్ర దర్యాప్తు సంస్థలకు పూర్తి సహాయ సహకారాలు అందించనుంది. కీలకమైన ఈ ఏజెన్సీకి ఈసారి నిధులను 84 శాతం పెంచారు. గతేడాది కేవలం రూ.86 కోట్లు ఇవ్వగా ఈసారి రూ.150.95 కోట్లు వెచ్చించనున్నారు. సైబర్ సెక్యూరిటీ ప్రాజెక్టులకు నిధులను 90 పెంచడమే గాక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు సైబర్ దాడుల ముప్పు ఎదుర్కొన్నప్పుడు తక్షణం స్పందించి అప్రమత్తం చేసే హెచ్చరిక సంస్థ సెర్ట్–ఇన్‌కు కూడా నిధులు పెంచారు. మహిళలు, చిన్నారుల రక్షణకు.. మహిళలు, చిన్నారులు సైబర్ వలలో చిక్కుతున్న ఉదంతాలు పెరుగుతున్నందున వాటికి అడ్డుకట్ట వేయడంపైనా కేంద్రం దృష్టి సారించింది. అందుకోసం బడ్జెట్లో రూ.52.8 కోట్లు కేటాయించారు. డిజిటల్ వ్యక్తిగత సమాచార పరిరక్షణ చట్టం, 2023 కింద ఏర్పాటుచేసిన డాటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు జీతభత్యాలు తదితరాల కోసం రూ.2 కోట్లు కేటాయించారు. ఏఐకి ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు కృత్రిమ మేధ రంగం అభివృద్ధి, విస్తరణ కోసం వచ్చే ఐదేళ్లలో రూ.10,300 కోట్లు ఖర్చుచేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం గత మార్చిలో ప్రారంభించిన ఇండియా ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్‌ను పరుగులు పెట్టించనున్నారు. ఇండియాఏఐ మిషన్‌కు ఈసారి రూ.551 కోట్లు కేటాయించడం ఇందులో భాగమే. మొత్తమ్మీద సైబర్ సెక్యూరిటీ, ఏఐ ఇన్నోవేషన్‌కు ఈ బడ్జెట్లో రూ.840 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఇది 84 శాతం ఎక్కువ! ఇక ఏఐ, మెషీన్ లెరి్నంగ్పై విస్తృత పరిశోధనలు చేస్తున్న ఐఐటీ ఖరగ్‌పూర్‌లోని ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ విభాగానికి రూ.255 కోట్ల నిధులిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల వెల్లడించారు.ఫిర్యాదుల వరద... భారత్‌లో సైబర్ దాడుల ఉధృతి మామూలుగా లేదు. సొమ్ములు పోయాయంటూ జాతీయ సైబర్ దాడుల నమోదు పోర్టల్‌కు ప్రజలు, సంస్థల నుంచి రోజూ అందుతున్న 7,000 పై చిలుకు ఫిర్యాదుల్లో ఏకంగా 85 శాతం ఆన్లైన్ మోసాలే! మన దేశంలో ఆన్లైన్ మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు 2019లో కేవలం 26 వేలు కాగా 2021లో 4.5 లక్షలకు, 2023 నాటికి ఏకంగా 15.5 లక్షలకు పెరిగాయి. ఇక ఈ ఏడాది మే నాటికే 7.4 లక్షల ఫిర్యాదులు నమోదయ్యాయి! 2023లో భారత్‌లో ప్రతి 129 మందిలో ఒకరు సైబర్ దాడుల బారిన పడ్డట్టు మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్, అనాలిసిస్ గణాంకాల్లో వెల్లడైంది. ఢిల్లీలో అత్యధికంగా ప్రతి లక్ష మందిలో 755 మంది సైబర్ బాధితులున్నారు. ఈ జాబితాలో హరియాణా (381) తర్వాత తెలంగాణ (261) మూడో స్థానంలో ఉంది.మన కంపెనీలే లక్ష్యం కొన్నేళ్లుగా భారత కంపెనీలే లక్ష్యంగా సైబర్ దొంగలు రెచి్చపోతున్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఈ ఏడాది రెండో త్రైమాసికంలో సైబర్ నేరగాళ్లకు భారతీయ కంపెనీలే రెండో అతిపెద్ద లక్ష్యంగా మారాయి. నకిలీ ట్రేడింగ్ యాప్‌లు, రుణ, గేమింగ్, డేటింగ్ యాప్‌లతో పాటు ఆన్లైన్లో పదేపదే చూసే, వెదికే కంటెంట్‌ను ఎవరగా వేస్తూ మెల్లిగా ముగ్గులోకి దింపి ఖాతాల్లో ఉన్నదంతా ఊడ్చేసే ఘటనలు భారత్‌లో ఎక్కువైనట్టు పారికర్ సంస్థ హెచ్చరించింది. సైబర్ సెక్యూరిటీకి అందరికంటే ఎక్కువగా అమెరికా ఈ ఏడాది రూ.1.08 లక్షల కోట్లు వెచి్చస్తోంది. బ్రిటన్ రూ.7,891 కోట్లు కేటాయిస్తోంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
తెలంగాణపై వివక్ష.. కేంద్ర బడ్జెట్‌పై అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ పట్ల వివక్ష చూపారంటూ రాష్ట్ర శాసనసభ తీవ్ర అసంతృప్తిని, నిరసనను తెలియజేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్ చర్చల్లోనే కేంద్ర బడ్జెట్‌కు సవరణలు చేసి తెలంగాణకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. బుధవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయం ముగిశాక.. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పట్ల చూపిన వివక్షపై విస్తృతంగా చర్చించారు. మంత్రి శ్రీధర్‌బాబు చర్చను ప్రారంభించగా.. తర్వాత కేటీఆర్, బీజేపీపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజిద్ హుస్సేన్ (ఎంఐఎం), కూనంనేని సాంబశివరావు (సీపీఐ), వివేక్ వెంకటస్వామి (కాంగ్రెస్) తదితరులు మాట్లాడారు. చివరగా ఈ తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం సభను స్పీకర్ ప్రసాద్‌కుమార్ గురువారానికి వాయిదా వేశారు. అసెంబ్లీ చేసిన ఏకగ్రీవ తీర్మానం ఇదీ.. ‘‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం.. భారతదేశం అన్ని రాష్ట్రాల సమాఖ్య. అన్ని రాష్ట్రాల సమీకృత, సమ్మిళిత అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం బాధ్యత. ఈ ఫెడరల్ స్ఫూర్తిని కేంద్ర ప్రభుత్వం విస్మరించింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచీ ఇదే ధోరణి కొనసాగుతోంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల సుస్థిర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలి. కానీ విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను అమలు చేయటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. ఇది తెలంగాణ ప్రగతిపై తీవ్ర ప్రభావం చూపింది. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి, మంత్రులు పలు దఫాలుగా ప్రధాన మంత్రిని, ఇతర కేంద్ర మంత్రులను కలసి వివిధ విజ్ఞప్తులు చేశారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం కోరటంతోపాటు చట్ట ప్రకారం రావాల్సిన నిధులు, అపరిష్కృతంగా ఉన్న అంశాలపై అనేక అభ్యర్థనలు అందించారు. కానీ కేంద్ర ప్రభుత్వం వీటిని పట్టించుకోకుండా.. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పట్ల పూర్తిగా వివక్ష చూపింది. తెలంగాణ పట్ల కేంద్రం అనుసరించిన తీరుపై శాసనసభ తీవ్ర అసంతృప్తిని, నిరసనను తెలియజేస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్ చర్చల్లోనే కేంద్ర బడెŠజ్ట్కు సవరణలు చేసి.. తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ సభ తీర్మానం చేస్తోంది..’’ -
డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహకాలు తగ్గింపు
రూపే డెబిట్ కార్డ్‌లు, యూపీఐ ద్వారా చేసే డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహానికి బడ్జెట్లో కేటాయింపులు తగ్గించారు. ఫిబ్రవరిలోని మధ్యంతర బడ్జెట్లో ప్రతిపాదించిన రూ.3,500 కోట్లతో పోలిస్తే ఇటీవల ప్రవేశపెట్టిన పూర్తికాల బడ్జెట్లో కేటాయింపులను రూ.1,441 కోట్లకు తగ్గిస్తున్నట్లు చెప్పారు.గత ఏడాది బడ్జెట్లో రూపే డెబిట్ కార్డులు, తక్కువ మొత్తంలో జరిగే బీహెచ్ఐఎం-యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించేందుకు యూనియన్ రూ.2,485 కోట్లును కేటాయించారు. ఫిబ్రవరి, 2024లో విడుదల చేసిన మధ్యంతర బడ్జెట్లోనూ ఇందుకోసం రూ.3,500 కోట్లను ప్రతిపాదించారు. కానీ తాజా కేంద్ర పద్దుల లెక్కల్లో మాత్రం ఈ ప్రోత్సాహకాలను రూ.1,441 కోట్లకు తగ్గించారు.ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25.. రియల్టీ ఇన్వెస్టర్లకు చుక్కెదురు..?బడ్జెట్లో కేంద్రం విడుదల చేసే డిజిటల్ పేమెంట్ ప్రోత్సాహక నిధులు ఫిన్‌టెక్, బ్యాంకింగ్ పరిశ్రమపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కొన్ని థర్డ్‌పార్టీ పేమెంట్ యాప్‌లు ఈ విభాగంలో ఆధిపత్యం సాగిస్తున్నాయని ఆర్బీఐ హెచ్చరించింది. ఆ సంస్థలు అందించే సేవల్లో ఏదైనా అంతరాయం ఏర్పడినప్పుడు వినియోగదారులు ఇబ్బందులుపడాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. భారతీయ వ్యాపారుల లావాదేవీలు 69 శాతం డిజిటల్ చెల్లింపుల ద్వారానే జరుగుతున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. పాన్ షాపులు, పండ్లు, పూల విక్రయదారులు, ఫుడ్ స్టాల్స్, కిరాణా దుకాణాలు వంటి వీధి వ్యాపారులు కూడా డిజిటల్ పేమెంట్స్ మీద ఆసక్తి చూపుతున్నారు. రాబోయే రోజుల్లో డిజిటల్ లావాదేవీలు మరింత పెరుగుతాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. -
ఇక బీఎస్ఎన్ఎల్కు తిరుగుండదు!!
ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ పునర్వైభవాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రైవేటు టెలికం సంస్థలు టారిఫ్‌లను పెంచడంతో వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు. దీనికితోడు కేంద్ర బడ్జెట్లో అధికంగా నిధులు కేటాయించడంతో మరింత వినియోగదారులు ఇటువైపు వస్తారని ఇక తిరుగుండదని భావిస్తున్నారు.2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో టెలికాం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని టెలికాం ప్రాజెక్ట్‌లు, ప్రభుత్వ రంగ సంస్థలకు రూ.1.28 లక్షల కోట్లు కేటాయించారు. మొత్తం కేటాయింపులో సింహభాగం నిధులు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంబంధిత ఖర్చుల కోసమే కేటాయించారు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) టెక్నాలజీ అప్‌గ్రేడేషన్, పునర్నిర్మాణం కోసం రూ.82,916 కోట్లు కేటాయించడం విశేషం.“బడ్జెట్ అంచనా 2024-25లో ఈ డిమాండ్ కోసం మొత్తం నికర కేటాయింపు రూ.1,28,915.43 కోట్లు ( రూ.1,11,915.43 కోట్లు, మరో రూ.17,000 కోట్లతో కలిపి). ఇందలో యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ కింద లభించే నిల్వల నుంచి రూ.17,000 కోట్ల అదనపు కేటాయింపు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు పరిహారం, భారత్‌నెట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వంటి పథకాలకు ఉద్దేశించినది” అని బడ్జెట్ పత్రంలో పేర్కొన్నారు.ఆగస్టులో 4జీ సేవలను ప్రారంభించడానికి సిద్ధమైన బీఎస్ఎన్ఎల్ దీనికి ముందే యుద్ధప్రాతిపదికన భారీ సంఖ్యలో 4జీ టవర్లను ఏర్పాటు చేస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వారంలోనే సుమారు వెయ్యి 4జీ టవర్లను ఏర్పాటు చేసింది. 4జీ, 5జీ నెట్‌వర్క్‌ల కోసం దేశవ్యాప్తంగా సుమారు 1.12 లక్షల టవర్లను ఇన్స్టాల్ చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్న బీఎస్ఎన్ఎల్కు బడ్జెట్ కేటాయింపులు మరింత ఊపును ఇవ్వనున్నాయి. -
బడ్జెట్ 2024-25.. రియల్టీ ఇన్వెస్టర్లకు చుక్కెదురు..?
కేంద్ర బడ్జెట్ 2024-25 ప్రసంగంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్థిరాస్తి విక్రయంపై సూచిక(ఇండెక్సెషన్)ను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. రియల్ ఎస్టేట్ విక్రయాలకు సంబంధించిన దీర్ఘకాలిక మూలధన లాభం (ఎల్టీసీజీ)పై పన్నును 20 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గిస్తున్నామని చెప్పారు. ఈ నిర్ణయంతో రియల్టీ ఇన్వెస్టర్లకు తీవ్రంగా నష్టం జరిగే ప్రమాదం ఉందని నిపుణులు భావిస్తున్నారు.ఇప్పటివరకు రియల్ఎస్టేట్ పెట్టుబడులపై ఇండెక్సేషన్‌ను సర్దుబాటు చేసి దానికి అనుగుణంగా ఆస్తి విక్రయం సమయంలో 20 శాతం పన్ను విధించేవారు. ఉదాహరణకు..20 ఏళ్ల కిందట కొనుగోలు చేసిన స్థలాలను విక్రయించేపుడు ఆ ఇరవై ఏళ్లకు అనువుగా ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేసి(ఇండెక్సెషన్), ఆ స్థలానికి ప్రభుత్వ విలువను లెక్కించి దానిపై 20 శాతం పన్ను విధించేవారు. కొత్త నిబంధనల ప్రకారం..ఇండెక్సెషన్ను పూర్తిగా తొలగించారు. మార్కెట్ విలువ ప్రకారం స్థలాన్ని విక్రయిస్తే దానిపై 12.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు జులై 23, 2024 నుంచే అమల్లోకి వస్తాయని కేంద్రమంత్రి చెప్పారు.ఇదీ చదవండి: క్లీన్ ఎనర్జీకి బడ్జెట్లో ప్రతిపాదనలు.. ఎవరికి లాభమంటే..ప్రస్తుత ఆస్తిని విక్రయించి, కొత్త దానిపై తిరిగి పెట్టుబడి పెట్టే వారికి కేంద్ర నిర్ణయం వల్ల ఎలాంటి ప్రభావం ఉండదని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రియల్టీ రంగం ఏటా చెందుతున్న అభివృద్ధి సూచీ ప్రకారం ఐదేళ్ల కంటే తక్కువ కాలవ్యవధితో ఇన్వెస్ట్ చేసే పెట్టుబడిదారులకు ప్రభుత్వ నిర్ణయం ప్రతికూలంగా ఉంటుందని నిపుణులు విశ్వసిస్తున్నారు. ఇదిలాఉండగా, కొత్త నిబంధనలు తక్షణం అమలులోకి వచ్చినప్పటికీ 2001కి ముందు ఉన్న పాత ఆస్తులకు ఇండెక్సేషన్ ప్రయోజనాలను తొలగించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. -
ఏపీకి కేంద్ర నిధులపై అసలు నిజాలు బయట పెట్టిన కృష్ణంరాజు
-
బడ్జెట్ ప్రకటన.. టాటా కంపెనీకి రూ.19,000 కోట్లు లాభం!
తాజా బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన టాటాకు చెందిన కంపెనీ టైటాన్‌కు ఒక్కరోజులో దాదాపు రూ.19,000 కోట్ల లాభాన్ని తెచ్చింది. బంగారం, వెండిపై దిగుమతి పన్నును 6% తగ్గించడంతో టైటాన్ షేర్లు దాదాపు 7% పెరిగాయి. టాటా గొడుగు కింద ఉన్న జువెలరీ సంస్థ టైటాన్ బ్రాండ్ తనిష్క్ కారణంగా దాని స్టాక్ విలువలో వృద్ధిని సాధించింది.బీఎస్ఈ డేటా ప్రకారం, టైటాన్ షేరు 6.63 శాతం పెరిగి రూ.3,468.15 వద్ద ముగిసింది. ట్రేడింగ్ సెషన్లో, షేర్లు 7.30% పెరుగుదలతో ఒక రోజు గరిష్ట స్థాయి రూ.3,490కి చేరుకున్నాయి. ప్రారంభంలో టైటాన్ షేర్లు రూ.3,252 వద్ద ప్రారంభమయ్యాయి. రానున్న రోజుల్లో కంపెనీ షేర్లు మరింత పెరగవచ్చని నిపుణులు భావిస్తున్నారు.పెట్టుబడిదారుల ధృక్కోణంలో ఇది చాలా లాభదాయకం. ఉదాహరణకు, ఒక వ్యక్తి 10,000 టైటాన్ షేర్లను కలిగి ఉంటే, ఒక్కో షేరుకు రూ. 215.55 పెరుగుదలతో, వారు ఆ 10,000 షేర్లపై రూ.21,55,500 లాభం పొందుతారు. గతంలో టైటాన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,88,757.16 కోట్లుగా ఉండగా, మంగళవారం (జూలై 23) నాటికి రూ.3,07,897.56 కోట్లకు పెరిగింది. అంటే కంపెనీ వాల్యుయేషన్ రూ.19,140.4 కోట్లు పెరిగింది.బంగారం, వెండిపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 6 శాతానికి, ప్లాటినంపై 6.4 శాతానికి తగ్గించాలని తాజా బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. బంగారం, వెండి, ప్లాటినంపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించాలన్నది రత్నాలు, ఆభరణాల పరిశ్రమ నుంచి చాలా కాలంగా ఉన్న డిమాండ్. ఈ నిర్ణయం తర్వాత, దేశ ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం ధరలు 5% పైగా తగ్గాయి. ట్రేడింగ్ సెషన్లో వెండి రూ. 5,000 పైగా క్షీణించింది. -
KSR Live Show: కేసుల భయం.. బాబు సైలెంట్.. బడ్జెట్ లో ఏపీ కి టోపీ..
-
నిర్మలమ్మ తక్కువసేపు చదివిన పద్దుల చిట్టా.. (ఫొటోలు)
-
క్లీన్ ఎనర్జీకి బడ్జెట్లో ప్రతిపాదనలు.. ఎవరికి లాభమంటే..
దేశీయంగా చిన్న, మధ్య తరహా న్యూక్లియర్ రియాక్టర్లను ఏర్పాటు చేసేలా చర్యలు చేపడుతామని బడ్జెట్ సమావేశాల్లో కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. 2070 నాటికి జీరో ఉద్గారాలతో క్లీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.న్యూక్లియర్ రియాక్టర్ల ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం, ప్రైవేట్ కంపెనీలు కలిసి పనిచేయాలని సూచించారు. భారతీయ మార్కెట్‌పై దృష్టి సారించే విదేశీ కంపెనీలు ఈ రంగంలో అభివృద్ధి చెందేందుకు చాలా అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. బడ్జెట్లో ప్రతిపాదించిన ‘భారత్ స్మాల్ రియాక్టర్లు’, ‘భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ల’కు సమీప భవిష్యత్తులో చాలా గిరాకీ ఏర్పడుతుందంటున్నారు. బడ్జెట్లో ప్రకటించిన విధంగా న్యూక్లియర్ టెక్నాలజీలో రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు ప్రభుత్వం నిధులు అందుబాటులో ఉంచుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.కార్బన్ నిర్మూలన ప్రణాళికల్లో భాగంగా అణు విద్యుత్ సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే 1000 MWe(మెగావాట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కెపాసిటీ) సామర్థ్యం ఉన్న సంప్రదాయ అణు కర్మాగారాలు భారీ ఇంజినీరింగ్ నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. భద్రతా సమస్యల కారణంగా భూమి లభ్యత, స్థానిక ప్రజల నుంచి వ్యతిరేకత వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇదీ చదవండి: కేంద్ర మంత్రుల జీతాలకు కేటాయింపులుఇదిలాఉండగా, వరల్డ్ న్యూక్లియర్ అసోసియేషన్ ప్రకారం 300 మెగావాట్ల కంటే తక్కువ సామర్థ్యం ఉండే వాటిని స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లగా నిర్వచించారు. వీటిని ఏర్పాటు చేసేందుకు తక్కువ సమయమే పడుతుంది. వీటి ద్వారా వచ్చే విద్యుత్తును సులభంగా సరఫరా చేయవచ్చు. మాడ్యులర్ డిజైన్ ప్లాంట్లను రిమోట్ ఏరియాల్లో నిర్మించేలా అనుమతులు కూడా త్వరితగతినే లభిస్తాయి. అందుకే ప్రభుత్వం బడ్జెట్లో ఈమేరకు ప్రతిపాదనలు చేసినట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ రియాక్టర్ల నిర్మాణం, ఇంజినీరింగ్ టెక్నాలజీ, విద్యుత్ పరికరాలు, భద్రత సేవలందించే సంస్థలు ప్రభుత్వ నిర్ణయంతో లాభపడనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. -
‘వందేభారత్‌పైనే శ్రద్ధనా?’ రైల్వే మంత్రి ఏమన్నారంటే..
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన 2024-25 బడ్జెట్లో ఉద్యోగ కల్పన, గ్రామీణాభివృద్ధిపై అధికంగా దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది. ఆర్థిక మంత్రి తన 83 నిమిషాల సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగంలో రైల్వే అనే పదాన్ని ఒక్కసారి మాత్రమే ప్రస్తావించారు. దీంతో ప్రభుత్వం రైల్వేలకు ఏమి చేస్తున్నదనే ప్రశ్న పలువురి మదిలో మెదిలింది. అలాగే ప్రభుత్వం వందేభారత్‌పై పెడుతున్న శ్రద్ధ.. పేదల రైళ్ల విషయంలో పెట్టడం లేదంటూ పలు ఆరోపణలు వినవస్తున్నాయి. వీటిపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు.బడ్జెట్ వెలువడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో తక్కువ ఆదాయవర్గానికి చెందినవారు అధికంగా ఉన్నారని, వీరికి సంబంధించిన రైళ్ల విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నదన్నారు. అటు వందేభారత్పైన, ఇటు సాధారణ ప్రయాణికులు రైళ్లపైన కూడా దృష్టి పెడుతున్నదన్నారు. రైలును రూపొందించే విధానం ప్రతి రైలుకు ప్రామాణికంగా ప్రత్యేకంగా ఉంటుందని, దానికి అనుగుణంగా నిర్దిష్ట సంఖ్యలో ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లు, నాన్-ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లు ఉంటాయన్నారు. అల్ప ఆదాయ వర్గానికి చెందినవారు తక్కువ చార్జీలకే ప్రయాణించేలా చూడటమే రైల్వేల ప్రధాన లక్ష్యమన్నారు. దేశంలో కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, గేజ్ మార్పిడి, డబ్లింగ్‌లో గణనీయమైన పెట్టుబడితో సహా గత ఐదేళ్లలో రైల్వేలపై మూలధన వ్యయం 77 శాతం పెరిగిందని 2023-24 ఆర్థిక సర్వే తెలిపిందన్నారు. 2014కు ముందు రైల్వేలకు మూలధన వ్యయం సుమారు రూ. 35,000 కోట్లు అని, నేడు ఇది రూ. 2.62 లక్షల కోట్లు అని, ఈ తరహా పెట్టుబడులు పెట్టినందుకు ప్రధానికి, ఆర్థిక మంత్రికి కృతజ్ఞతలు చెబుతున్నానని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. -
పాత పన్ను విధానం రద్దు? ఆర్థిక మంత్రి చెప్పిందిదే..
Union Budget 2024: పన్ను చెల్లింపుదారులు ఆసక్తిగా ఎదురుచూసిన 2024-25 కేంద్ర బడ్జెట్‌ను ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేయకుండా కొత్త పన్ను విధానాన్ని ప్రోత్సహించేలా కొన్ని చర్యలను ఈ బడ్జెట్లో ఎన్డీఏ సర్కారు ప్రకటించింది.ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది నుంచి పాత పన్ను విధానాన్ని ప్రభుత్వం రద్దు చేస్తుందా అనుమానం సర్వత్రా నెలకొంది. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. పాత పన్ను విధానాన్ని ఎప్పుడు రద్దు చేయాలనే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆర్థిక మంత్రి తెలిపారు."పాత పన్ను విధానాన్ని ఏం చేయాలన్నదానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పన్ను విధానాన్ని సరళీకృతం చేయాలన్నదే మా ఉద్దేశం అని మాత్రమే చెప్పగలం. పాత పన్ను విధానం ఉంటుందో లేదో చెప్పలేను" అన్నారామె.కొత్త పన్ను విధానాన్ని ప్రోత్సహిస్తూ తాజా బడ్జెట్లో పలు ప్రయోజనాలను ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇందులో స్టాండర్డ్ డిడక్షన్ రూ. 50,000 నుంచి రూ. 75,000కి పెంచడం, స్లాబ్‌లను విస్తరించడం వంటివి ఉన్నాయి. దీంతో జీతం పొందే పన్ను చెల్లింపుదారులు సంవత్సరానికి రూ.17,500 వరకు ఆదా చేసుకోవచ్చని ఆమె చెప్పారు.కొత్త పన్ను విధానాన్ని 2020లో ప్రవేశపెట్టారు. గత సంవత్సరం బడ్జెట్లో దీన్ని డిఫాల్ట్ చేశారు. పాత పన్ను విధానం ఇంటి అద్దె, సెలవు ప్రయాణ భత్యాలు, అలాగే సెక్షన్లు 80C, 80D, 80CCD(1b), 80CCD(2) కింద తగ్గింపులతో సహా అనేక తగ్గింపులు, మినహాయింపులను అందిస్తుంది. కొత్త పన్ను విధానంలో ఈ మినహాయింపులు, తగ్గింపులు లేవు. -
15 వేల కోట్ల అప్పుకు ఇంద్రన్న సంబరాలు..
-
బంగారం అగ్గువ..
-
ప్రజలను ముంచేసిన కూటమి.. ఎంపీ గొల్ల బాబురావు కామెంట్స్
-
ఉద్యోగులను నిరాశపరిచింది..
ఆదాయపన్ను శ్లాబ్‌లలో పెద్ద మార్పులు లేవు. నేషనల్ పెన్షన్ స్కీమును యథావిధిగా కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ రెండు అంశాలలోనే ఉద్యోగులు, ఉపాధ్యాయులు వెసులుబాటు ఉండాలని కోరుకుంటున్నారు. ఐదు లక్షల ఆదాయానికి పన్ను నుండి మినహాయింపు కావాలని కోరుకుంటున్నారు. కానీ మూడు లక్షల దగ్గరనే ఆగిపోయింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమును రద్దు చేసి, పాత పెన్షన్ స్కీమును పునరుద్ధరించాలని కోరుకుంటున్నారు. కానీ ఎటువంటి మార్పులూ లేవు. నిత్యావసర సరుకుల ధరలు వేగంగా పెరుగుతున్న క్రమంలో అందుక నుగుణంగా ఆదాయపు పన్ను శ్లాబ్‌లలో కూడా మార్పులు చేయాలి.బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, బడ్జెట్ తర్వాత మీడియాలో ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ... ఈ బడ్జెట్ మధ్యతరగతి వారికి చేయూతనిస్తుందన్నారు. కానీ బడ్జెట్లో మధ్యతరగతికి వెసులుబాటు కల్పించే ప్రతిపాదనలేమీ కనిపించలేదు. ఈ బడ్జెట్ కూడా మాటల బడ్జెట్‌గానే కనిపించింది. విద్యారంగానికీ, శిక్షణ –ఉపాధి రంగానికీ కలిపి లక్షా 48 వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. మొత్తం బడ్జెట్లో ఇది 3 శాతమేనన్న మాట! విద్యారంగం ఒక్కదానికి మాత్రమే కేటాయింపులు చూస్తే 2.5 శాతం లోపే ఉంటాయి. బడ్జెట్ ప్రసంగంలో ప్రాథమిక విద్య నుండి యూనివర్సిటీ విద్య వరకు ఒక్క మాట కూడా లేదు. దీన్ని బట్టి విద్య పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ఆసక్తీ లేనట్లు కనిపిస్తోంది. విద్య ప్రైవేటీకరణ యథేచ్ఛగా జరిగిపోవడానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు ఈ బడ్జెట్ ద్వారా తెలుస్తోంది.– అలుగుబెల్లి నర్సిరెడ్డి, వ్యాసకర్త తెలంగాణ శాసనమండలి సభ్యులు -
ఏపీ బడ్జెట్ పై ఎంపీ గురుమూర్తి కామెంట్స్
-
వికసిత భారత్ లక్ష్యం నెరవేరేనా?
మోదీ ప్రభుత్వం కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన మొదటి పూర్తిస్థాయి బడ్జెట్లో అద్భుతాలు ఏమీ లేవనే చెప్పాలి. అయితే ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభిస్తూ ఉద్యోగాల కల్పన, నైపుణ్యాల అభివృద్ధి, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎమ్ఎస్ఎమ్ ఈలు); అలాగే మధ్యతరగతిని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ ఉత్పాదకతలో పెరుగుదల; ఉద్యోగాలు, నైపుణ్యాలకు ప్రాధాన్యం; సమ్మిళిత మానవ వనరుల అభివృద్ధి, సామాజిక న్యాయం, తయారీ సేవలు, పట్టణాభివృద్ధి, ఇంధన రంగం, మౌలిక వసతుల కల్పనలో మెరుగుదల, ఆవిష్కరణలు– పరిశోధనల అభివృద్ధికి ప్రోత్సాహకాలు, భవిష్యత్ సంస్కరణలు లాంటి అంశాలకు ప్రాధాన్యమిస్తున్నామన్నారు. తద్వారా ‘వికసిత్ భారత్’ లక్ష్యానికి చేరుకునే రోడ్డు మ్యాప్‌ను రూపొందిస్తున్నామని చెప్పారు. 48 లక్షల 20 వేల 512 కోట్ల రూపాయల బడ్జెట్లో... కేటాయింపులు, నిర్దేశిత లక్ష్యాలు గత బడ్జెట్‌కి కొన సాగింపుగానే కనిపిస్తున్నాయి.బడ్జెట్‌కు ఒకరోజు ముందుగా ప్రకటించిన ఆర్థిక సర్వేలో చెప్పినట్లుగా నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి 2030 నాటికి ప్రతి ఏటా 78.5 లక్షల ఉద్యోగాల సృష్టి జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ లక్ష్యాన్ని చేరుకోవటానికి బడ్జెట్లో ఉద్యోగాల కల్పనకూ, ఉన్నత విద్యా ప్రమాణాల పెంపునకూ, నైపుణ్యాల అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చినట్లు కనిపి స్తోంది. విద్య, నైపుణ్యాల అభివృద్ధికే 1.48 లక్షల కోట్ల రూపాయలను కేటాయించారు. రాబోయే ఐదు సంవ త్సరాలలో ఐదు ఉద్యోగ పథకాల ద్వారా 4.1 కోట్ల యువతకి ఉద్యోగాల కల్పన కోసం రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. నైపుణ్య అభివృద్ధిలో భాగంగా 20 లక్షల మంది యువతకు శిక్షణ ఇవ్వటం ద్వారా, ఐదేళ్లలో కోటి మంది యువతకి ప్రయోజనం చేకూర్చే ఇంట ర్నషిప్ పథకాన్ని ప్రకటించారు.మూడు ఉద్యోగ అను సంధాన ప్రోత్సాహకాల ద్వారా లక్ష మంది విద్యార్థులకు 10 లక్షల రూపాయల విద్యా రుణాలు ఇవ్వటం ద్వారా, క్రెడిట్ గ్యారంటీ పథకంతో ఎంఎస్ఎమ్ఈలకు 100 కోట్ల రుణాలను ఇవ్వడం ద్వారా, 11 లక్షల కోట్ల రూపాయలను మౌలిక వసతుల కల్పనపై ఖర్చు చేయడం ద్వారా, ముద్ర యోజన రుణాలను 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచటం ద్వారా ఉపాధి ఉద్యోగ అవకాశాలను పెంచి నిరుద్యోగ సమస్యకి కళ్ళెం వేయవచ్చని ప్రభుత్వం భావించినట్లు ఉంది. అయితే కొంత కాలంగా నిరుద్యోగ సమస్యను ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్ కేటాయింపుల ద్వారా ఇదే వ్యూహాన్ని అనుసరిస్తున్నప్పటికీ నిరుద్యోగాన్ని అదుపు చేయడంలో సఫలం కాకపోవడం గమనార్హం.25 వేల గ్రామాలకు కొత్తగా రోడ్లు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా పట్టణాలలో కోటి ఇళ్ళ నిర్మాణం, రాబోయే ఐదు సంవత్సరాలలో గృహ నిర్మాణంపై 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలనే నిర్ణయం, ఉపాధి హామీ పథకానికి ప్రాధాన్యం ఇవ్వటం కొంతమేరకు ఆహ్వానించదగిన పరిణామమే. కానీ, వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయించిన 1.52 లక్షల కోట్ల రూపాయలు, గ్రామీణాభివృద్ధికి కేటాయించిన 2.66 లక్షల కోట్ల రూపాయలు ఆ యా రంగాలను బలోపేతం చేయ డానికి సరిపోవు. ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు అదుపు లోనే ఉన్నాయని ఆర్థిక మంత్రి చెబుతున్నా నమ్మ శక్యంగా లేదు.ఈ బడ్జెట్లో కొన్ని కేటాయింపులు ఘనంగా కనిపించినా అవి మొత్తం ఖర్చు చేస్తారా అనేది అను మానమే. ఎందుకంటే... గత బడ్జెట్లో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, ఇంధనం లాంటి ఏడు కీలక రంగా లకు కేటాయించిన కేటాయింపులలో దాదాపు 1.21 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేయలేక పోయి నారనే విషయాన్ని గమనించాలి. ఆర్థిక సర్వేలో చెప్పినట్లు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై దృష్టి పెట్టకుండా, విద్య – ఉపాధి రంగాల మధ్య అంతరాన్ని పూడకుండా, వ్యవసాయ వృద్ధిని చోదకంగా మార్చకుండా... అంచనా వేస్తున్న ఏడు శాతం వృద్ధిరేటుతో భవిష్యత్తు లక్ష్యాలను అందుకోలేమనే అభిప్రాయాలు వ్యక్తమ వుతున్నాయి.– డా. తిరునహరి శేషు, వ్యాసకర్త అర్థశాస్త్ర ఉపన్యాసకులు, కాకతీయ విశ్వవిద్యాలయం, 98854 65877 -
కార్యాచరణ ముఖ్యం!
మారుతున్న రాజకీయాల కారణాలే ఈసారి బడ్జెట్‌ను ప్రభావితం చేసినట్టు న్నాయి. ఉపాధి లేని యువతకు పరి ష్కారం దిశగా అడుగులేసింది బడ్జెట్. విద్య, పారిశ్రామిక అవసరాలకు మధ్య పెరిగిన నైపుణ్య అంతరాన్ని తగ్గించే ప్రయత్నం కనిపిస్తోంది. జాతీయ ఆదా యంలో కీలకభూమిక పోషించే మహిళను వెన్నుతట్టి ప్రోత్సహించే కేటాయింపులు అనివార్యమయ్యాయి. ప్రైవేటు పెట్టుబడు లకు ఊతకర్ర ఇచ్చినా ఫలితాలు అంతంత మాత్రమేనని సర్కార్ గుర్తించింది. ప్రభుత్వ పెట్టుబడి వ్యయం పెంచడమే పరిష్కా రమని గుర్తించింది. సహజ వ్యవసాయ పద్ధతుల మేలుకొలుపు నకు బడ్జెట్ పెద్దపీట వేసింది. ఆశయాలు గొప్పవే. ఆశించిన పురోగతికి కేటాయింపులే గీటురాయి కావు. సరైన వ్యూహ రచన చేస్తేనే లక్ష్యాలను చేరుకోవడం సాధ్యం. దేశ తక్షణ అవసరాలను బడ్జెట్ గమనించింది. అయితే దీన్ని కార్యాచరణలోకి తెచ్చేముందు సవాళ్ళనూ గుర్తించాలి!స్థూల జాతీయోత్పత్తి లక్ష్యాలు తగ్గాయి. 2023–24లో జీడీపీ 8.2గా ఉంది. 2024–25లో ఇది 6.5–7.0గా ఉంటుందని అంచనా వేశారు. ద్రవ్యలోటును 5.6 శాతానికి తగ్గించేందుకే ఇలా చేసినట్టు కనిపిస్తోంది. ఇదే క్రమంలో రెవెన్యూ లోటును తగ్గించాలని భావించారు. కోవిడ్ తర్వాత ప్రైవేటు పెట్టుబడు లకు అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. దీనివల్ల పెద్దగా పెట్టుబడులు వచ్చిందేమీ లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ పెట్టుబడి వ్యయాన్ని పెంచారు. స్థూల ఆర్థిక విధానాన్ని సుస్థిర పర్చేందుకు బడ్జెట్ ప్రయత్నించింది.సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్నది కేంద్రం లక్ష్యం. బడ్జెట్ కేటాయింపులూ ఈ విధంగానే ఉన్నాయి. అయితే, ఏక కాలంలో ఈ విధానం అమలు చేయడం సరికాదు. దీనివల్ల ఆహార ఉత్పత్తి తగ్గుతుందని అనేక అధ్యయనాలు చెబుతు న్నాయి. ప్రస్తుత విధానాలు కొనసాగిస్తూనే మార్పు దిశగా అడుగులేయాలి. సహజ వ్యవసాయానికి ఊతమిచ్చే కొత్త వంగ డాల అభివృద్ధి అత్యంత కీలకం. దేశవ్యాప్తంగా 10 వేల బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్స్ ప్రారంభిస్తామన్నారు. ఇది మంచి పరి ణామమే. ఇందులో శ్రమ సాంద్రత భాగస్వామ్యమవుతుంది. ఇందులో మహిళా శక్తి కీలకం. వారిని ప్రోత్సహించేలా ఉండాలి. దీనివల్ల గ్రీన్ జాబ్స్‌ను సృష్టించవచ్చు.దేశ ఆర్థికాభివృద్ధిలో మహిళా భాగస్వామ్యం కీలకం. పలు సర్వేలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. ఇది నిధుల కేటాయింపుతోనే సాధ్యం కాదు. వారిని ఉపాధి వైపు నడిపించేందుకు అవ సరమైన ప్రణాళికలు అవసరం. ‘కౌశల్ యోజన’ వంటి పథకా లను కేంద్రం బడ్జెట్లో ప్రస్తావించింది. నైపుణ్యం పెంచుతామని చెప్పింది. నిజానికి దేశంలో మహిళలు ఎంతమంది ఉపాధి పొందుతున్నారు? ఇందులో నైపుణ్యంతో కూడిన ఉద్యోగాలు ఎన్ని? బడ్జెట్లో మరో ముఖ్యాంశం కేర్ఎకానమీ. వృద్ధులు, పిల్లల సంరక్షణ ఇందులో భాగం. ఈ దిశగా ఉపాధి అవకాశాలూ పెరుగుతున్నాయి. ఈ విభాగాల్లో 70 శాతం మహిళలే ఉంటారు. కాబట్టి కచ్చితమైన ప్రణాళికలు ఉండాలి. భారత్ పురోభివృద్ధిలో ఉందని ప్రపంచ బ్యాంకు చెబుతోంది. అయితే, భద్రతతో కూడిన ఉపాధి అవకాశాలుండాలని సూచిస్తోంది. ఇప్పటికీ భార త్లో 90 శాతం మహిళలు ఇన్ ఫార్మల్ ఉపాధిలోనే ఉన్నారు. ఈపీ ఎఫ్, సెలవులు వంటివి అందు కోవడం లేదు.పట్టాలున్న యువతలో సరిపోయే పరిజ్ఞానం లేనందువల్ల పరిశ్రమలు వారిని ఉద్యోగంలోకి తీసుకోవడం లేదు. దీంతో దేశవ్యాప్తంగా నిరుద్యోగం పెరిగిపోతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని యువతను సంతృప్తిపర్చాల్సిన అవసరం ఏర్పడింది. ఉపాధి అవకాశాలు, విద్యకు మధ్య నైపుణ్యం అంతరంగా ఉంది. చదువుతో పాటు నైపుణ్యం పెంచితే తప్ప సమస్య పరిష్కారం కాదు. ప్రైవేటు పెట్టుబడులు పెరిగితే, పరిశ్రమలు పెరుగు తాయని ఇంత కాలం ప్రభుత్వం భావించింది.కానీ ఎన్ని రాయితీలు ఇచ్చినా వచ్చిన పెట్టుబడులు తక్కువ. పెరిగిన ఉపాధి తక్కువే. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ పెట్టుబడి వ్యయం పెంచింది. ముఖ్యంగా నైపుణ్యం పెంచడంపై దృష్టి పెట్టింది. అయితే, దీనికి కేటాయించిన నిధులు తక్కువే. ఇక్కడో ముఖ్యమైన విషయాన్ని గుర్తించాలి. నైపుణ్యం పెంపునకు కచ్చితమైన అధ్యయనం చేయాలి. అవసరమైన ప్రణాళికలు రూపొందించాలి. అప్పుడే యువతను నాణ్యమైన ఉద్యోగాల వైపు తీసుకెళ్ళడం సాధ్యం. ఏ సెక్టార్ నుంచి ఎలాంటి నైపుణ్యం కావాలనే విషయాన్ని గుర్తించాలి. దీంతో పాటు నాణ్యమైన విద్యా విధానాలను ముందుకు తేవాల్సిన అవసరం ఉంది.– ప్రొ. ఇ. రేవతి, వ్యాసకర్త, ‘సెస్’ డైరెక్టర్, హైదరాబాద్ -
స్టార్టప్స్‌కు జోష్.. ఏంజెల్ ట్యాక్స్ తొలగింపు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అంకుర సంస్థలకు ఊరటనిచ్చే దిశగా అన్ని తరగతుల ఇన్వెస్టర్లకు ఏంజెల్ ట్యాక్స్‌ను తొలగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దేశీయంగా స్టార్టప్ వ్యవస్థకు, ఎంట్రప్రెన్యూర్షిప్నకు, నవకల్పనలకు ఊతమివ్వడానికి ఇది తోడ్పడగలదని ఆమె తెలిపారు.సముచిత మార్కెట్ విలువకు మించిన వేల్యుయేషన్లతో అన్‌లిస్టెడ్ కంపెనీలు లేదా స్టార్టప్‌లు సమీకరించే నిధులపై విధించే ఆదాయ పన్నును ఏంజెల్ ట్యాక్స్‌గా వ్యవహరిస్తారు. ఇది స్టార్టప్‌లతో పాటు ఇన్వెస్ట్ చేసే మదుపర్లకు సమస్యగా మారింది. గతంలో ఏంజెల్ ట్యాక్స్ స్థానిక ఇన్వెస్టర్లకే పరిమితం కాగా 2023–24లో కేంద్రం దీన్ని విదేశీ పెట్టుబడులకు కూడా వర్తింపచేస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా బడ్జెట్లో దీన్ని తొలగించాలంటూ పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యం ప్రోత్సాహ విభాగం (డీపీఐఐటీ) సిఫార్సు చేసింది.నూతన ఆవిష్కరణలకు, భారత్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా మారడానికి మార్గం సుగమం చేసే దిశగా ఇది కీలక అడుగని టీ హబ్ సీఈవో మహంకాళి శ్రీనివాస్ రావు తెలిపారు. ఇది అంకుర సంస్థలతో పాటు వాటికి మద్దతుగా నిల్చే ఇన్వెస్టర్లు, ప్రైవేట్ ఈక్విటీలు, వెంచర్ ఫండ్స్‌కూ సానుకూలమని న్యాయ సేవల సంస్థ ఇండస్‌లా పార్ట్నర్ లోకేష్ షా చెప్పారు. -
చిన్న సంస్థలకు ఊతం.. రుణ హామీ పథకం
న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) తోడ్పాటు అందించే దిశగా బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చర్యలు ప్రతిపాదించారు. యంత్ర పరికరాల కొనుగోలు కోసం ఎటువంటి కొలేటరల్ లేదా థర్డ్ పార్టీ గ్యారంటీ లేకుండా టర్మ్ లోన్స్ తీసుకునే వెసులుబాటు లభించేలా రుణ హామీ పథకాన్ని ప్రకటించారు.దీనికోసం విడిగా సెల్ఫ్–ఫైనాన్సింగ్ గ్యారంటీ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇది ఒక్కో దరఖాస్తుదారుకు రూ. 100 కోట్ల వరకు రుణాలకు (తీసుకున్న రుణ మొత్తం ఎంతైనా సరే) హామీ ఇస్తుందని పేర్కొన్నారు. దీన్ని పొందేందుకు రుణగ్రహీత ముందస్తుగా నిర్దిష్ట గ్యారంటీ ఫీజును, రుణ బ్యాలెన్స్ తగ్గే కొద్దీ వార్షిక ఫీజును కట్టాల్సి ఉంటుంది.ఎస్ఎంఈలకు గడ్డు కాలంలో కూడా రుణ సదుపాయం అందుబాటులో ఉండేలా చూసేందుకు కొత్త విధానాన్ని కేంద్రం ప్రతిపాదించింది. తమ పరిధిలో లేని కారణాల వల్ల స్పెషల్ మెన్షన్ అకౌంటు (ఎస్ఎంఏ) దశలోకి చేరిన ఎంఎస్ఎంఈలు ఆ తదుపరి మొండి బాకీల్లోకి జారిపోకుండా సహాయం పొందేందుకు ఇది ఉపయోగపడగలదని పేర్కొంది. కొత్త అసెస్మెంట్ విధానం..: ఎంఎస్ఎంఈలకు రుణాల విషయంలో కొత్త మదింపు విధానాన్ని మంత్రి ప్రతిపాదించారు. అసెస్మెంట్ కోసం బైటి సంస్థలపై ఆధారపడకుండా ప్రభుత్వ రంగ బ్యాంకులు దానికి సంబంధించి అంతర్గతంగా సొంత విధానాన్ని రూపొందించుకోవాలని పేర్కొన్నారు. సంప్రదాయ అసెస్మెంట్ విధానంతో పోలిస్తే ఈ మోడల్ మెరుగ్గా ఉండగలదని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇక ఎంఎస్ఎంఈలు, సంప్రదాయ చేతి వృత్తుల వారు తమ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించుకునేందుకు తోడ్పాటు అందించేలా ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో ఈ–కామర్స్ ఎక్స్పోర్ట్ హబ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. -
Union Budget 2024: తెలంగాణకు ఇచ్చింది గుండు సున్నా
-
ఏపీకి టోపీ.. బీహార్ కు నిధుల వరద
-
ఏపీకి ఇచ్చేది రుణమా ?.. లేక గ్రాంటా ?
-
పల్లెకు 3.0 ధమాకా
కేంద్రంలో మూడోసారి కొలువుదీరిన మోదీ 3.0 సర్కారు.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు నడుం బిగించింది. కీలకమైన కేంద్ర ప్రభుత్వ పథకాల (ఫ్లాగ్షిప్)కు ఈసారి బడ్జెట్లో దండిగానే నిధులు కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరం (2023–24)లో గ్రామీణాభివృద్ధికి (మౌలిక సదుపాయాలతో సహా) రూ. 2,38,204 కోట్లు కేటాయించగా (సవరించిన అంచనా రూ. 2,38,984 కోట్లు).. ఈ సారి బడ్జెట్లో (2024–25) దీన్ని రూ. 2,65,808 కోట్లకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ముఖ్యంగా ఉపాధి హామీకి మళ్లీ భారీగా నిధులతో పాటు గ్రామీణ రోడ్ల కోసం నాలుగో దశ, అదనంగా మరో 3 కోట్ల ఇళ్ల నిర్మాణం (పట్టణ, గ్రామీణ)పై ఫోకస్ చేయడం విశేషం!జోరుగా ‘ఉపాధి’..2024–25 కేటాయింపు: రూ.86,000 కోట్లు2023–24 కేటాయింపు: రూ.60,000 కోట్లు గతేడాది బడ్జెట్లో నిధుల కోతకు గురైన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి (ఎంజీఎన్ఆర్ ఈజీఏ) మళ్లీ కేటాయింపులు జోరందుకున్నాయి. ముఖ్యంగా మోదీ సర్కారు ఈ పథకాన్ని నీరుగారుస్తుందన్న విమర్శల నేపథ్యంలో 2024–25 బడ్జెట్లో కేటాయింపులు 40 శాతం మేర పెరగడం విశేషం. అయితే, 2023–24 సవరించిన అంచనాల (రూ. 86,000 కోట్లు)తో పోలిస్తే దాదాపు అదే స్థాయిలో ఉన్నాయి.గ్రామీణ రోడ్లు.. నాలుగో దశ షురూ2024–25 కేటాయింపు:రూ.19,000 కోట్లు2023–24 కేటాయింపు: రూ.17,000 కోట్లు (సవరించిన అంచనా)గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం అమలు చేస్తున్న ఈ ఫ్లాగ్షిప్ స్కీమ్ (ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన పీఎంజీఎస్‌వై)కు ఈసారి బడ్జెట్లో ప్రాధాన్యం లభించింది. ఈ స్కీమ్ నాలుగో దశను సీతారామన్ ప్రకటించారు. ‘పీఎంజీఎస్‌వై ఫేజ్–4లో భాగంగా 25,000 పల్లె ప్రాంతాలను పక్కా రోడ్లతో అనుసంధానం చేయనున్నాం. ఆయా ప్రాంతాల్లో జనాభా పెరుగుదలకు అనుగుణంగా రోడ్లను అభివృద్ధి చేస్తాం’ అని మంత్రి పేర్కొన్నారు. 2023–24 సవరించిన అంచనాలు రూ. 17,000 కోట్లతో పోలిస్తే, 2024–25 పూర్తి స్థాయి బడ్జెట్లో కేటాయింపులు దాదాపు 12 శాతం పెరగడం గమనార్హం. స్కీమ్ మొదలైనప్పటి నుంచి ఈ ఏడాది జనవరి వరకు మొత్తం 8,15,072 కిలోమీటర్ల పొడవైన రోడ్లకు అనుమతులు మంజూరు కాగా, 7,51,163 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం పూర్తయింది.సొంతింటికి దన్ను (పీఎంఏవై)2024–25 కేటాయింపులు: రూ.80,671 కోట్లు2023–24 కేటాయింపులు: రూ.54,103 కోట్లు (సవరించిన అంచనా)ఠిపేదలు, మధ్య తరగతి వర్గాలకు సొంతింటి కల నెరవేర్చేలా బడ్జెట్లో ఈ పథకానికి నిధులు భారీగా పెంచారు. గ్రామీణ ప్రాంతాల్లో పేద, బలహీన వర్గాలకు 2.95 కోట్ల ఇళ్లను నిర్మించాలనేది లక్ష్యం కాగా, 2023 మార్చి నాటికి 2.94 కోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. కాగా, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వచ్చే ఐదేళ్లలో అదనంగా మరో 3 కోట్ల ఇళ్ల నిర్మాణాన్ని ఈ స్కీమ్ కింద చేపట్టనున్నట్లు తాజా బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇందులో రెండు కోట్ల ఇళ్లను గ్రామాల్లో, కోటి ఇళ్లను పట్టణ పేదలు, మధ్య తరగతి కుటుంబాలకు అందించనున్నట్లు పేర్కొన్నారు. పీఎంఏవై (అర్బన్) 2.0 స్కీమ్ కోసం ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు సీతారామన్ వివరించారు. ఇందులో భాగంగా వడ్డీ రాయితీ, చౌక రుణాల రూపంలో రూ. 2.2 లక్షల కోట్ల సాయం అందిస్తామని చెప్పారు. రుణ ఆధారిత సబ్సిడీ స్కీమ్ (సీఎల్ఎస్ఎస్) కోసం ఈ బడ్జెట్లో రూ.4,000 కోట్లను కేంద్రం కేటాయించింది. మొత్తం మీద పీఎంఏవై (అర్బన్)కు ఈ బడ్జెట్లో రూ.30,170 కోట్లు దక్కాయి. 2023–24తో పోలిస్తే ఇది 20.19 శాతం ఎక్కువ.స్వచ్ఛ భారత్ మిషన్..2024–25 కేటాయింపు: రూ. 12,192 కోట్లు2023–24 కేటాయింపు: రూ.9,550 కోట్లు (సవరించిన అంచనా)దేశంలో బహిరంగ మలమూత్ర విసర్జనను పూర్తిగా తుడిచిపెట్టడానికి (ఓడీఎఫ్) 2014లో ఆరంభమైన ఈ స్వచ్ఛ భారత్ పథకం (ఎస్బీఎం) కిందికి ఘన వ్యర్ధాల (చెత్త నిర్మూలన), జల వ్యర్థాల నిర్వహణను కూడా తీసుకొచ్చారు. ఈ మిషన్ కింద, గ్రామీణ ప్రాంతాల్లో ఓడీఎఫ్ స్టేటస్‌ను పూర్తిగా సాధించినట్లు కేంద్రం ప్రకటించింది. దీన్ని స్థిరంగా కొనసాగించడంతో పాటు అన్ని గ్రామాల్లోనూ ఘన వ్యర్థాల నిర్వహణ, మురుగు నీటి నిర్వహణను అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. స్వచ్ఛ భారత్ (అర్బన్) పథకానికి ఈ బడ్జెట్లో రూ.5,000 కోట్లు కేటాయించారు. 2023–24 బడ్జెట్ అంచనా (రూ.5,000 కోట్లు)తో పోలిస్తే అదే స్థాయిలో ఉన్నప్పటికీ, సవరించిన అంచనా (రూ.2,550 కోట్లు)తో పోలిస్తే నిధులు రెట్టింపయ్యాయి. ఇక స్వచ్ఛభారత్ (గ్రామీణ) స్కీమ్‌కు రూ.7,192 కోట్లు కేటాయించారు. సవరించిన అంచనా (రూ.7,000 కోట్లు)తో పోలిస్తే స్వల్పంగా పెరిగింది.తాగునీటికి కాస్త పెంపు.. 2024–25 కేటాయింపు: రూ.69,927 కోట్లు2023–24 కేటాయింపు: రూ.69,846 కోట్లు (సవరించిన అంచనా)గ్రామీణ కుటుంబాలన్నింటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందరికీ అందించేందుకు 2019–20లో జల్ జీవన్ మిషన్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్‌ను ప్రకటించారు. 2024 నాటికి దీన్ని సాధించాలనేది కేంద్రం లక్ష్యం. కాగా, దేశంలోని మొత్తం 19.26 కోట్ల గ్రామీణ కుటుంబాలకు గాను ఇప్పటివరకు 14.22 కోట్ల కుటుంబాలకు తాగు నీటి సదుపాయం (కుళాయి కనెక్షన్లు) కల్పించినట్లు అంచనా.పట్టణ పేదల ఇళ్లకు.. 2.2 లక్షల కోట్లు» సరసమైన రేట్లకు రుణాలు.. వడ్డీ రాయితీ» మొత్తం రూ.10 లక్షల కోట్లతో పీఎంఏవై అర్బన్ 2.0» రెంటల్ హౌసింగ్ మార్కెట్లకు ప్రోత్సాహం» పారిశ్రామిక కార్మికుల కోసం అద్దె ఇళ్లుమహిళలు కొనే ఆస్తులపై సుంకం తగ్గింపు!న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ఆవాస్ యోజన–అర్బన్ పథకం కింద వచ్చే ఐదేళ్లలో కోటి మంది పట్టణ పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు గృహ నిర్మాణాల నిమిత్తం రూ.2.2 లక్షల కోట్ల సాయం అందించాలని కేంద్రం నిర్ణయించింది. సరసమైన రేట్లతో రుణాలు అందించేందుకు వీలుగా వడ్డీ రాయితీని కూడా ప్రతిపాదించింది. మంగళవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు ప్రకటన చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం (పీఎంఏవై) కింద 3 కోట్ల అదనపు గృహాలను ప్రకటించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఈ మేరకు నిధుల కేటాయింపు జరుపుతున్నామని చెప్పారు. కేంద్రసాయం రూ.2.2 లక్షల కోట్లతో కలిపి మొత్తం రూ.10 లక్షల కోట్ల పెట్టుబడితో పీఎంఏవై అర్బన్ 2.0 పథకాన్ని చేపడతామని తెలిపారు. రెంటల్ హౌసింగ్ మార్కెట్లను ప్రోత్సహించేందుకు వీలుగా కేంద్రం విధానాలను రూపొందిస్తుందని చెప్పారు. అద్దె ఇళ్ల లభ్యతను పెంచడంతో పాటు నాణ్యత, పారదర్శకతకు అవసరమైన విధానాలు, నియమ నిబంధనలు రూపొందిస్తామని తెలిపారు. పారిశ్రామిక కార్మికుల కోసం డార్మెటరీ తరహా వసతులతో అద్దె గృహాలు నిర్మిస్తామని ఆర్థికమంత్రి వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో దీనిని చేపడతామన్నారు. రాష్ట్రాలు స్టాంప్ డ్యూటీ తగ్గించాలిమహిళలు కొనుగోలు చేసే ఆస్తులపై సుంకాన్ని మరింత తగ్గించే అంశంపై కేంద్రం దృష్టి సారిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. పట్టణాభివృద్ధి పథకాల్లో దీనినొక తప్పనిసరి అంశంగా చేయనున్నట్లు చెప్పారు. అధిక స్టాంప్ డ్యూటీ వసూలు చేసే రాష్ట్రాలు వాటిని తగ్గించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఆస్తుల కొనుగోలు లావాదేవీలపై రాష్ట్రాలు విధించే పన్నును స్టాంప్ డ్యూటీగా పేర్కొంటారు. ఆస్తుల రిజిస్ట్రేషన్ సమయంలో దీనిని చెల్లించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఇదొక ప్రధాన ఆదాయ వనరు. ఇలావుండగా పన్ను ప్రయోజనాల విషయంలో ఆధార్ నంబర్‌కు బదులుగా ఆధార్ నమోదు ఐడీ వినియోగాన్ని నిలిపివేయాలని సీతారామన్ ప్రతిపాదించారు. పెద్ద నగరాలకు రవాణా ఆధారిత అభివృద్ధి ప్రణాళికదేశంలో 30 లక్షలకు పైగా జనాభా కలిగిన 14 పెద్ద నగరాలకు రవాణా ఆధారిత అభివృద్ధి ప్రణాళికను కేంద్రం ప్రతిపాదించింది. నగరాల సృజనాత్మకతో కూడిన పునర్ అభివృద్ధి కోసం ఓ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందిస్తామని తెలిపింది. నగరాలను అభివృద్ధి కేంద్రాలు (గ్రోత్ హబ్‌లు)గా తీర్చిదిద్దేందుకు వీలుగా రాష్ట్రాలతో కలిసి పనిచేస్తామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. టౌన్ ప్లానింగ్ పథకాల వినియోగంతో నగర చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధి, ఆర్థిక, రవాణా ప్రణాళిక ద్వారా దీనిని సాధిస్తామని చెప్పారు. -
వివక్ష కాదు.. కక్ష.. బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, దీనిపై బుధవారం శాసనసభలో చర్చిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిరసనను తెలియజేస్తూ తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపిస్తామని చెప్పారు. బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణ అనే పదాన్నే నిషేధించిన కేంద్రం వైఖరిని ఎండగట్టడానికి శాసనసభలో జరిగే చర్చలో అన్ని పార్టీలు పాలుపంచుకోవాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చర్చలో పాల్గొనాలని సూచించారు. ‘కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్షతో కాదు.. కక్ష పూరితంగా వ్యవహరించింది..’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్‌ను కుర్చీ బచావో బడ్జెట్‌గా అభివరి్ణంచారు. నితీశ్, నాయుడు డిపెండెంట్ అలయెన్స్‌గా ఎన్డీఏ మారిందని ధ్వజమెత్తారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ విషయంలో వైఖరిని మార్చుకుని, బడ్జెట్‌ను సవరించి విభజన హామీలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కోరిన అంశాలకు అనుగుణంగా కేటాయింపులు జరపాలని కోరారు. మంగళవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. పెద్దన్నలా వ్యవహరించాలని కోరినా.. ‘మా ప్రభుత్వం, మంత్రివర్గ సహచరులు 18 సార్లు ఢిల్లీ వెళ్లి ప్రధానిని, కేంద్ర హోం మంత్రి,ని ఇతర మంత్రులను కలిశారు. స్వయంగా నేను మూడుసార్లు ప్రధానిని కలిసి తెలంగాణ అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలని కోరా. రాష్ట్రానికి వచ్చినప్పుడు అభివృద్ధి విషయంలో పెద్దన్నలా వ్యవహరించాలని ప్రధానికి చెప్పాం. కానీ మొత్తం బడ్జెట్లో తెలంగాణ అనే పదం పలకడానికే కేంద్రం ఇష్టపడలేదు. వారి మనసులో తెలంగాణ పట్ల ఇంత కక్ష ఉందని అనుకోలేదు. పునర్విభజన చట్టాన్ని ప్రస్తావిస్తూ ఏపీకి నిధులు కేటాయించిన కేంద్రం, అదే చట్టం ప్రకారం తెలంగాణకు నిధులు ఎందుకు కేటాయించలేదు?..’అని సీఎం నిలదీశారు. వికసిత్ భారత్‌లో తెలంగాణ భాగం కాదా? ‘బయ్యారం, ఖాజీపేట కోచ్‌ఫ్యాక్టరీ, పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు, గిరిజన యూనివర్సిటీకి నిధుల ఊసు లేదు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనేది బోగస్ నినాదం. వికసిత్ భారత్‌లో తెలంగాణ భాగం కాదని ప్రధాని భావిస్తున్నారా? ఇది వికసిత్ భారత్ బడ్జెట్ కాదు.. కుర్చీ బచావో బడ్జెట్. బిహార్, ఏపీకి తప్ప ఇతర రాష్ట్రాలకు నిధులు కేటాయించలేదు. ఇంతటి వివక్ష, కక్షపూరిత వైఖరి ఎప్పుడూ చూడలేదు. బీజేపీని 8 సీట్లలో గెలిపించిన రాష్ట్రానికి ఇంత మోసం చేస్తారా? కేంద్ర వైఖరికి నిరసనగా కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రివర్గానికి రాజీనామా చేసి బయటకు రావాలి. ప్రధానిని మేం పెద్దన్నగా భావిస్తే.. ఆయన దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. కేవలం క్విడ్ ప్రో కో విధానంలో కుర్చీ కాపాడుకునేందుకే ప్రధాని బడ్జెట్లో ప్రాధాన్యతనిచ్చారు. తెలంగాణ హక్కుల కోసం పార్లమెంట్లో కాంగ్రెస్ నిరసన తెలుపుతుంది. బడ్జెట్‌ను సవరించి బయ్యారం ఉక్కు కర్మాగారం, ఖాజీపెట్ కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు ప్రాజెక్టు, మెట్రో విస్తరణ, మూసీ అభివృద్ధికి నిధులు ఇవ్వాలి. లేకపోతే బీజేపీకి తెలంగాణలో నూకలు చెల్లినట్లే. కిషన్‌రెడ్డి మౌనం, బానిస మనస్తత్వంతో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది. మంత్రి పదవి కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోదీ వద్ద తాకట్టు పెట్టొద్దు..’అని రేవంత్ అన్నారు. త్వరలో దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశం ‘ఏపీలో అమరావతికి వేల కోట్లు ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వం, హైదరాబాద్‌లో అభివృద్ధి పనులకు, మౌలిక వసతుల కల్పనకు నిధులు ఎందుకు ఇవ్వదు? పోలవరానికి నిధులు ఇచ్చినప్పుడు.. తెలంగాణలో పాలమూరు ఎత్తిపోతలకు ఎందుకు ఇవ్వరు? బిహార్, ఏపీ కోసం బడ్జెట్ పెట్టినట్లు ఉంది. కుర్చీ లాలూచీలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాలరాస్తే ఊరుకోం. పార్లమెంట్లో నిరసనకు బీజేపీ ఎంపీలూ, ఎంఐఎం కూడా కలిసి రావాలి. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోంది. అందుకే త్వరలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని భావిస్తున్నా. ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక సీఎంలు ఒప్పుకున్నారు. కేరళ, ఆంధ్రప్రదేశ్ కలిసి వస్తాయో లేదో చూస్తాం. వివక్షతోనే తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఇలాగే కొనసాగితే మరో ఉద్యమం తప్పదని కేంద్ర ప్రభుత్వానికి చెబుతున్నాం.’అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. చర్చలో కేసీఆర్ పాల్గొనాలి.. ‘బుధవారం ప్రశ్నోత్తరాల తరువాత స్పీకర్ అనుమతితో కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి చర్చించాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుకు సూచిస్తున్నా. ఈ చర్చలో ఎవరు విలీనాల ప్రక్రియలో ఉన్నారో.. ఎవరు చీకటి ఒప్పందాలు చేసుకున్నారో బయటపడుతుంది. తెలంగాణ హక్కులు, నిధులపై జరిగే చర్చలో కేసీఆర్ పాల్గొనాలని సూచిస్తున్నా. లేకపోతే కేసీఆర్ కూడా మోదీకి మోకరిల్లినట్లే భావించాల్సి వస్తుంది..’అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సమావేశంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సాగుకు రూ.1.52లక్షల కోట్లు
న్యూఢిల్లీ: వ్యవసాయానికి బడ్జెట్లో కేంద్రం పెద్దపీట వేసింది. బడ్జెట్‌కు సంబంధించిన తొమ్మిది ప్రాధాన్య అంశాల్లో వ్యవసాయ ఉత్పాదకతను ఒకటిగా చేర్చింది. మధ్యంతర బడ్జెట్లో పేర్కొన్న పథకాలను కొనసాగిస్తూనే కొత్త విధానాలకు శ్రీకారం చుట్టింది. సాగు ఉత్పాదకతను పెంచడమే లక్ష్యంగా కేటాయింపులు జరిపింది. వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2024–25బడ్జెట్ ప్రసంగంలోవెల్లడించారు. పరిశోధనలకు ప్రోత్సాహం‘వ్యవసాయ పరిశోధనలను సమగ్రంగాసమీక్షించడం ద్వారా ప్రతికూల వాతావరణాన్ని సైతం తట్టుకుని అధిక ఉత్పాదకతనిచ్చే సరికొత్త వంగడాల దిశగా ప్రోత్సహిస్తాం. ఈ మేరకు నిధులు కూడా అందజేస్తాం. ప్రైవేటు రంగానికి కూడా ఇందులో భాగస్వామ్యం కల్పిస్తాం. ప్రభుత్వ, ప్రభుత్వేతర వ్యవసాయ రంగ నిపుణులు ఈ పరిశోధనలను పర్యవేక్షిస్తారు. 32 వ్యవసాయ అలాగే ఉద్యాన పంటలకు సంబంధించి ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకోగలిగే, అధిక దిగుబడినిచ్చే 109 కొత్తవంగడాలను రైతులు సాగుచేసేందుకు వీలుగా విడుదల చేస్తాం. 10 వేల బయో ఇన్పుట్ రిసోర్స్ కేంద్రాలువచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా కోటి మంది రైతులను సర్టిఫికేషన్, బ్రాండింగ్‌తో కూడిన ప్రకృతి వ్యవసాయం దిశగా ప్రోత్సహిస్తాం. శాస్త్రీయ సంస్థలు, ఆసక్తి కలిగిన గ్రామపంచాయతీల ద్వారా దీనిని అమలుచేస్తాం. 10 వేల అవసరాధారిత బయో ఇన్పుట్ రిసోర్స్ కేంద్రాలు (సేంద్రియ ఎరువుల కేంద్రాలు) ఏర్పాటు చేస్తాం. సహకార సంఘాలు,స్టార్టప్‌లకు ప్రోత్సాహంఅధిక వినియోగ కేంద్రాలకు సమీపంలో భారీ స్థాయిలో కూరగాయల ఉత్పత్తి క్లస్టర్లు అభివృద్ధి చేస్తాం. రైతు–ఉత్పత్తిదారు సంఘాలను ప్రోత్సహిస్తాం. అలాగే కూరగాయల సేకరణ, నిల్వ, మార్కెటింగ్‌తో సహా కూరగాయల సరఫరా వ్యవస్థల కోసం సహకార సంఘాలు, స్టార్టప్‌లను ప్రోత్సహిస్తాం. పప్పు దినుసులు, నూనెగింజల్లో స్వయం సమృద్ధిపప్పు దినుసులు, నూనెగింజల్లో స్వయం సమృద్ధి సాధన దిశగా వాటి ఉత్పత్తి, నిల్వ, మార్కెటింగ్‌ను బలోపేతం చేస్తాం. మధ్యంతర బడ్జెట్లో ప్రకటించిన విధంగా వేరుశనగ, నువ్వులు, సోయాబీన్, పొద్దుతిరుగుడు తదితర నూనెగింజలకు ‘ఆత్మనిర్భరత’ సాధన కోసం ఓ ప్రత్యేక వ్యూహానికి రూపకల్పన చేస్తాం. డిజిటల్ క్రాప్ సర్వేపైలట్ ప్రాజెక్టు విజయవంతమైన నేపథ్యంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో..వచ్చే మూడేళ్లలో దేశవ్యాప్తంగా రైతులు, వారి భూముల కోసం వ్యవసాయంలో డిజిటిల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) అమలు చేస్తాం. ఈ ఏడాది 400 జిల్లాల్లో డీపీఐ ద్వారా ఖరీఫ్ పంటల డిజిటల్ సర్వే నిర్వహిస్తాం. 6 కోట్ల మంది రైతులు, వారి భూముల వివరాలను రైతు, భూమి రిజిస్ట్రీల్లో పొందుపరుస్తాం. ఐదు రాష్ట్రాల్లో జన్ సమర్థ్ ఆధారిత కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేస్తాం.రొయ్యల ఉత్పత్తి ఎగుమతిరొయ్యల సాగు కేంద్రాల నెట్వర్క్ ఏర్పాటుకు ఆర్థిక సాయంఅందజేస్తాం. నాబార్డ్ ద్వారా రొయ్యల సాగు, శుద్ధి, ఎగుమతికి నిధులుఅందజేస్తాం.జాతీయ సహకార విధానంసహకార రంగ సర్వతోముఖాభివృద్ధికి వీలుగా జాతీయ సహకార విధానాన్ని కేంద్రం తీసుకువస్తుంది.వేగవంతమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, పెద్దయెత్తున ఉపాధి కల్పన, అవకాశాలు లక్ష్యంగా ఈ విధానాన్ని రూపొందిస్తాం..’ అని ఆర్థికమంత్రి వెల్లడించారు.భూసారం పెంపు,జీవవైవిధ్యానికిదోహదంసుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం, రసాయన ఎరువులు, క్రిమిసంహారాలపై ఆధారపడటాన్ని తగ్గించడం లక్ష్యంగా రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించాలని కేంద్రం భావిస్తోంది. ప్రకృతి వ్యవసాయం భూసారాన్ని పెంచడమే కాకుండా జీవవైవిధ్యానికి దోహదపడుతుంది. రైతుల సాగు ఖర్చులు తగ్గేలా చేయడం ద్వారా వారి లాభదాయకతను పెంపొదిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ప్రోత్సహిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రైతులు వాతావరణ సూచనలు, పంటలకు సంబంధించిన సలహా సేవలు, మార్కెట్ ధరల గురించిన సమాచారం తెలుసుకునేందుకు ఈ డిజిటిల్ ఫ్రేమ్‌వర్క్ ద్వారా వీలు కలుగుతుంది.యూరియాకు బడ్జెట్లో సబ్సిడీ తగ్గింపు సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో యూరియాకు సబ్సిడీ తగ్గింది. 2022–2023లో 1,65,217 కోట్లు సబ్సిడీపై ఖర్చు చేయగా, 2023–24లో రూ. 1,28,594 కోట్లకు తగ్గిపోయింది. 2024–25లో బడ్జెట్‌ను మరింత తగ్గించి 1,19,000 కోట్లు మాత్రమే కేటాయించారు. పోషకాధార ఎరువుల సబ్సిడీ కింద 2022–23లో రూ. 86,122 కోట్లు ఖర్చు చేయగా, 2024–25లో ఇంకా తగ్గించి రూ. 45,000 కోట్లు కేటాయించారు. అంటే కంపెనీలు పెంచే ఎరువుల ధరల భారాన్ని ఇకపై రైతులే భరించాల్సి ఉంటుందని రైతు నేతలు విమర్శిస్తున్నారు. అలాగే 2019 నుంచి కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ, అనుబంధ రంగాలకు కేటాయింపులు తగ్గిపోతూ వస్తున్నాయి. 2019–20 సంవత్సర మొత్తం బడ్జెట్లో వ్యవసాయ రంగానికి 5.44 శాతం కేటాయించగా, ఇప్పుడు 2024–2025లో໖ 3.15 శాతానికి పడిపోయింది. ఇక పంటల బీమా పథకానికి కూడా 2023–24లో రూ. 15,000 కోట్ల ఖర్చు అంచనా వేసిన ప్రభుత్వం ఈ ఏడాది దానిని రూ. 14,600 కోట్లకు తగ్గించింది. వ్యవసాయ రుణాలపై వడ్డీ రాయితీకి 2023–24 లో రూ. 23,000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈ సంవత్సరం రూ. 22,000 కోట్లు మాత్రమే కేటాయించింది. మద్దతు ధరలకు చట్టబద్దత ఏదీ? కన్నెగంటి రవి, రైతు స్వరాజ్య వేదిక, తెలంగాణరాష్ట్ర కమిటీకనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కలి్పంచాలని కోరుతూ దేశవ్యాప్తంగా రైతులు గత ఏడేళ్లుగా ఆందోళనలు చేస్తున్నారు. మోదీ ప్రభుత్వం ఈ బడ్జెట్ సందర్భంగా ఈ చట్టం ప్రస్తావన చేయలేదు. పైగా వ్యవసాయ రంగానికి నిధుల కేటాయింపు కూడా తగ్గించింది. -
రక్షణ కట్టుదిట్టం..
న్యూఢిల్లీ: చైనా కవ్వింపులు, పాక్ ముష్కరుల చొరబాట్లతో సరిహద్దుల వెంట అప్రమత్తంగా ఉండే సైన్యంతోపాటు భూతల, గగనతల రక్షణ వ్యవస్థల మరింత పటిష్టతే లక్ష్యంగా మోదీ సర్కార్ మరోమారు రక్షణ రంగానికి పెద్దపీట వేసింది. 2024–25 ఆర్థికసంవత్సరంలో రక్షణ రంగానికి రూ.6,21,940.85 కోట్లు కేటాయించింది. అత్యాధునిక డ్రోన్లు, యుద్ధవిమా నాలు, నౌకలు, ఆయుధాలు, ఇతర సైనిక ఉపకరణాల కొనుగోలు కోసం ఏకంగా రూ.1,72,000 కోట్లను కేటాయించారు. తాజా కేంద్ర బడ్జెట్లో రక్షణరంగ వాటా 12.9 శాతానికి పెరగడం విశేషం. గత ఆర్థికసంవత్సరంతో పోలిస్తే ఈసారి రక్షణరంగానికి కేటాయింపులు 4.79 శాతం పెంచారు. రక్షణ రంగంలో స్వావలంబనే లక్ష్యంగా సైనిక ఉపకరణాల స్థానిక తయారీని మరింత ప్రోత్సహించేందుకు మోదీ సర్కార్ నడుం బిగించింది. అందుకే స్థానిక ఉపకరణాల సేకరణ కోసం రూ.1,05,518.43 కోట్లను కేటాయించింది. దీంతో బీజేపీ సర్కార్ లక్షిత రక్షణరంగంలో ఆత్మనిర్భరత మరింతగా సాకారంకానుంది. లక్షల కోట్ల బడ్జెట్‌ను రక్షణరంగానికి కేటాయించిన విత్తమంత్రి నిర్మలకు కృతజ్ఞతలు అంటూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ‘ఎక్స్’లో ట్వీట్‌చేశారు. ‘‘ ఆధునిక ఆయుధ సంపత్తి సమీకరణతో త్రివిధ బలగాల శక్తిసామర్థ్యాలు మరింత ద్విగుణీకృతం కానున్నాయి. దేశీయ సంస్థలు తయారుచేసిన సైనిక ఉపకరణాలు, ఆయుధాలతో దేశం రక్షణరంగంలోనూ ఆత్మనిర్భరతను వేగంగా సాధించనుంది’’ అని రాజ్‌నాథ్ అన్నారు.అగ్నిపథ్ పథకం కోసం రూ.5,980 కోట్లుగత బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి సరహద్దుల వెంట రహదారుల నిర్మాణానికి కేటాయింపులు 30 శాతం పెరగడం విశేషం. బీఆర్వోకు కేటాయించిన రూ.6,500 కోట్ల నిధులతో సరిహద్దుల వెంట మౌలికవసతుల కల్పన మెరుగుపడనుంది. రక్షణరంగ పరిశ్రమల్లో అంకుర సంస్థలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఐడెక్స్ పథకానికి రూ.518 కోట్లు కేటాయించారు. అంకుర సంస్థలు, సూక్ష్మచిన్నమధ్యతరహా పరిశ్రమలు, ఆవిష్కర్తలు ఇచ్చే కొత్త ఐడియాలను ఆచరణలో పెట్టేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు.కోస్ట్‌గార్డ్ ఆర్గనైజేషన్‌కు రూ.7,651 కోట్లు కేటాయించారు. తేజస్ వంటి తేలికపాటి యుద్ధవిమానాలను తయారుచేస్తూ నూతన విమానాల డిజైన్, రూపకల్పన, తయారీ కోసం కృషిచేసే హిందుస్తాన్ ఏరోనాటిక్స్‌కు రూ.1,600 కోట్లు కేటాయించారు. రాష్ట్రీయ రైఫిల్స్ విభాగం కోసం రూ.10,535 కోట్లు కేటాయించారు. ఎన్సీసీ కోసం రూ.2,726 కోట్లు, త్రివిధ దళాల్లో అగ్నిపథ్ పథకం నిర్వహణ కోసం రూ.5,980 కోట్లు కేటాయించారు. -
Union Budget 2024–25: ద్రవ్యలోటు కట్టడిలో విజయం
ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు కట్టడికి కేంద్రం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో లోటు 4.9 శాతానికి పరిమితం చేయాలని పూర్తిస్థాయి బడ్జెట్ నిర్దేశించుకుంది.ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ అంచనాలు 5.1 శాతం కన్నా తాజా లెక్కలు తక్కువగా ఉండడం గమనార్హం. రెవెన్యూ వసూళ్లు బాగుండడం దీనికి ప్రధాన కారణం. 2025–26 ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి కట్టడి చేయాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్లు ఫిబ్రవరి మధ్యంతర బడ్జెట్లో ఆర్థికమంత్రి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆదాయాలు రూ.32.07 లక్షల కోట్లు వ్యయాలు రూ.48.21 లక్షల కోట్లు లోటు రూ.16.14 లక్షల కోట్లు రుణాలు మినహా రిసిట్స్ రూ.32.07 లక్షల కోట్లుగా ఉంటుందని తాజా బడ్జెట్ అంచనావేసింది. వ్యయాలు రూ.48.21 లక్షల కోట్లుగా పేర్కొంది. రిసిట్స్ విషయంలో నికర పన్ను వసూళ్ల లక్ష్యం రూ.25.83 లక్షల కోట్లుగా బడ్జెట్ అంచనా. వెరసి ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం రూ.16.14 లక్షల కోట్లుగా ఉంటుందని బడ్జెట్ అంచనా వేసింది. అంటే జీడీపీ అంంచనాల్లో ఇది 4.9 శాతమన్నమాట. తొలి అంచనా రూ.16.85 లక్షల కోట్లకన్నా ఇది తక్కువ.‘‘2021లో నేను ప్రకటించిన ఆర్థిక స్థిరత్వ బాట మన ఆర్థిక వ్యవస్థకు బాగా ఉపయోగపడింది. వచ్చే ఏడాది లోటును 4.5 శాతం కంటే తక్కువకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రభుత్వం లక్ష్యాన్ని సాధించడానికి కట్టుబడి ఉంది. 2026–27 నుండి ప్రతి సంవత్సరం ద్రవ్య లోటును పూర్తి కట్టడిలో ఉంచడానికి మా ప్రయత్నం ఉంటుంది. తద్వారా కేంద్ర ప్రభుత్వ అప్పులు జీడీపీతో పోల్చితే క్షీణరేటు మార్గంలో కొనసాగుతాయి’’ అని ఆర్థికమంత్రి అన్నారు. తగ్గిన మార్కెట్ రుణ లక్ష్యం... ద్రవ్యలోటు కట్టడి లక్ష్య సాధనకు స్థూల మార్కెట్ రుణ పరిమాణాన్ని కూడా రూ.12,000 కోట్లు తగ్గించడం కీలకాంశం. ఫిబ్రవరినాటి రూ.14.13 లక్షల కోట్ల అంచనాను తాజాగా రూ.14.01 లక్షల కోట్లకు బడ్జెట్ తగ్గించింది. డేటెడ్ సెక్యూరిటీల ద్వారా సమీకరించే స్థూల, నికర మార్కెట్ రుణాలు వరుసగా రూ. 14.01 లక్షల కోట్లు, రూ.11.63 లక్షల కోట్లకు చేరుతాయి. ఈ రెండు సంఖ్యలూ 2024 ఫిబ్రవరి మధ్యంతర బడ్జెట్ అంచనాకన్నా తక్కువ కావడం గమనార్హం. 2023–24లో స్థూల మార్కెట్ రుణ పరిమాణం రూ.15.43 లక్షల కోట్లు.‘ప్రత్యేక సాయం’తో రాష్ట్రాభివృద్ధికి ఊతంకేంద్ర బడ్జెట్లో బిహార్‌కు ప్రకటించిన ‘ప్రత్యేక సాయం’వల్ల రాష్ట్రాభివృద్ధికి ఊతం లభిస్తుంది. గతంలో రాష్ట్రం తీవ్ర నిర్లక్ష్యానికి గురవడంతో ‘ప్రత్యేకహోదా’డిమాండ్ వచ్చింది. సాంకేతిక కారణాలవల్ల బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి వీలుకాని పక్షంలో ఏదోరకంగా ప్రత్యేకంగా సాయం ప్రకటించాలని కేంద్రాన్ని కోరాం.గతంలో కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలు కేంద్రంలో అధికారాన్ని పంచుకున్న సమయంలో బిహార్‌కు తగిన నిధులు ఇవ్వలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మేము అధికారంలోకి వచ్చాకే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోంది. – నితీశ్‌కుమార్, బిహార్ ముఖ్యమంత్రియువత, రైతుల విస్మరించారుయువత, రైతుల ప్రయోజనాలను ఈ బడ్జెట్లో పూర్తిగా విస్మరించారు. బీజేపీ తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి రాజకీయఒత్తిళ్లకు తలొగ్గింది. అందులో భాగంగానే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు వివిధ అభివృద్ధి పథకాలను ప్రకటించారు. దేశంలో అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్‌కు మాత్రం ఉత్తిచేయి చూపించారు. ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, బిహార్ సీఎం నితిశ్‌కుమార్ నాయకత్వంలోని జేడీ(యూ) పార్టీలు కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన మిత్ర పక్షాలు కావడంతో తమ రాష్ట్రాలకు నిధులకోసం ఒత్తిడి తీసుకువస్తున్నారు. – అఖిలేశ్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు -
అది అప్పే.. అయినా ఉపయోగమే: సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం అమరావతి కోసం ప్రకటించిన రూ.15 వేల కోట్లు అప్పేనని, అయినా అది లాభదాయకమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అసెంబ్లీ ఆవరణలో మంగళవారం ఆయన కేంద్ర బడ్జెట్‌పై కొందరు మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. వివిధ ఏజన్సీల ద్వారా వచ్చే నిధులు కొన్ని అప్పు రూపేణా వస్తాయని చెప్పారు. అవి దాదాపు 30 ఏళ్ల తర్వాతే తీర్చేవి కాబట్టి అప్పటికి అంత భారమేమీ ఉండదన్నారు. ఈ ఏజెన్సీల నుంచి వచ్చే అప్పును కేంద్రం తన పూచీకత్తుతో ఇస్తుందని చెప్పారు. వచ్చే నిధుల్లో కొంత కేంద్ర గ్రాంట్ కూడా క్యాపిటల్ అసిస్టెన్స్ రూపేణా కలుస్తుందని, అది లాభమేనన్నారు. కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి అన్ని విధాలా తోడ్పాటు ఇచ్చేలా ఉందని చెప్పారు. తమ ప్రతిపాదనలు చాలా వరకు ఆమోదించారని, రాజధాని నిర్మాణానికి పెద్ద మొత్తంలో నిధులు ఇవ్వడం వల్ల ఆర్ధిక కార్యకలాపాలు పెరుగుతాయని తెలిపారు. దీని వల్ల రాష్ట్రానికి పన్నుల రూపేణా ఆదాయం పెరుగుతుందని వివరించారు. నిధులు ఏ రూపేణా వచి్చనా, అది రాష్ట్రానికి ఎంతో ఉపయోగమని స్పష్టం చేశారు. రాష్ట్రం ఆర్థికంగా కష్టాల్లో కూరుకుపోయి ఉందని, అందుకు ఈ నిధులు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. రాజధాని నిర్మాణం బండి వేగం పుంజుకోవాలంటే ఈ నిధులు ఎంతో ఉపకరిస్తాయన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఇంత మేర నిధులు అని పెట్టకపోయినా, పూర్తి చేసే బాధ్యత తమదేనని కేంద్రం చెప్పిందని, తమకు అది చాలన్నారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే సాయం బుందేల్ ఖండ్ ప్యాకేజీ తరహాలో ఉంటుందనే సమాచారం ఉందని, అది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. పారిశ్రామిక రాయితీలు కూడా ఈ ప్యాకేజీలో భాగంగా వచ్చే అవకాశం ఉందని, ఇందులో నియమ నిబంధనలు పరిశీలించాక వాటిని అనుకూలంగా మలుచుకుంటామని తెలిపారు. వెనుకబడిన జిల్లాల జాబితాలో ప్రకాశంను కూడా చేర్చటం ఆ జిల్లాకు ఎంతో ఉపయోగమన్నారు. ప్రధాని, ఆర్థిక మంత్రికి అభినందనలు అంతకుముందు ఎక్స్ వేదికగా కేంద్ర బడ్జెట్‌పై చంద్రబాబు స్పందించారు. రాష్ట్ర అవసరాలను గుర్తించి రాజధాని, పోలవరం, పారిశ్రామిక రంగాలతోపాటు ఏపీలోని వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించినందుకు ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి ఎన్ సీతారామన్‌కు ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం అందించిన ఈ తోడ్పాటు ఏపీ భవిష్యత్తు పునరి్నర్మాణానికి దోహదం చేస్తుందన్నారు. ప్రగతిశీల, విశ్వాసాన్ని పెంచే బడ్జెట్ సమరి్పంచినందుకు తాను వారిని అభినందిస్తున్నానని చెప్పారు. -
ప్రిస్క్రిప్షన్ బాగు.. బాగు..
న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్యశాఖకు 2024–25 బడ్జెట్లో రూ.90,958.63 కోట్లను కేటాయించారు. ఇది 2023–24 సవరించిన అంచనాల కంటే (రూ.80,517.62 కోట్లు) 12.96 శాతం ఎక్కువ కావడం గమనార్హం. అలాగే ఈ బడ్జెట్లో కేన్సర్ చికిత్సకు ఉపయోగించే మూడు కీలక మందుల (ట్రాస్తుజుమబ్ డెరక్స్‌టెకన్, ఒసిమెర్టినిబ్, డుర్వాలుమాబ్)పై కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా మినహాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ‘కేన్సర్ రోగులకు ఉపశమనం ఇచ్చేందుకు మరో మూడు మందులపై కస్టమ్స్ డ్యూటీని మినహాయిస్తున్నాం. అలాగే ఎక్స్‌రే ట్యూబ్స్, మెడికల్ ఎక్స్‌రే మిషన్లలో వాడే ఫ్లాట్ ప్యానెల్ డిటెక్టర్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (బీసీడీ)లో మార్పులు చేస్తున్నాం’ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆయుష్ మంత్రిత్వ శాఖకు గత ఏడాది రూ.3వేల కోట్లు ఇవ్వగా, ఈసారి 3,712.49కోట్లకు పెంచారు. ఆరోగ్య శాఖకు కేటాయించిన మొత్తం రూ.90,958.63 కోట్లలో రూ.87,656.90 కోట్లను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు, ఆరోగ్య పరిశోధన విభాగానికి రూ.3,301.73 కోట్లను కేటాయించారు. గత ఏడాది ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు రూ.77,624.79 కోట్లు ఇవ్వగా ఈసారి రూ.100కోట్ల మేర పెరగడం విశేషం. కేంద్ర ప్రాయోజిత పథకాలైన జాతీయ ఆరోగ్య మిషన్‌కు కేటాయింపులు గత ఏడాది రూ.31,550.87 కోట్లు ఉండగా, ఈసారి అది 36,000 కోట్లకు పెరిగింది. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎం జేఏవై)కి కేటాయింపులు రూ. 6,800 కోట్ల నుంచి రూ.7,300 కోట్లకు పెరగడం గమనార్హం. జాతీయ టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్‌కు కేటాయింపులను రూ.65 కోట్ల నుంచి రూ.90 కోట్లకు పెంచారు. నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్‌కు గత ఏడాది మాదిరే రూ.200 కోట్లు కేటాయించారు. స్వయంప్రతిపత్తి విభాగాలకు గత ఏడాది (రూ.17,250.90) కేటాయించిన దాని కంటే స్వల్పంగా పెంచుతూ రూ.18,013.62 కోట్లు కేటాయించారు. ఢిల్లీ ఎయిమ్స్‌కు గత ఏడాది రూ.4,278 కోట్లు కేటాయించగా ఈసారి బడ్జెట్లో రూ.4,523 కోట్లు ఇచ్చారు. భారత మెడికల్ కౌన్సిల్‌కు గత ఏడాది రూ.2295.12 కోట్ల ఇవ్వగా ఈసారి రూ.2,732.13 కోట్లు కేటాయించారు.మూడు కేన్సర్ మందులు 20% మేర తగ్గుతాయికేన్సర్ చికిత్సలో వాడే మూడు రకాల మందులపై కస్టమ్స్ సుంకాన్ని మినహాయించడంపై ఆరోగ్యరంగ నిపుణులు హర్షం వ్యక్తంచేశారు. ఈ సుంకం తగ్గింపు వల్ల మందుల ధరలు 10–20 శాతం మేర తగ్గుతాయని ఢిల్లీలోని సీకే బిర్లా ఆస్పత్రికి చెందిన సర్జికల్ ఆంకాలజీ డైరెక్టర్ డాక్టర్ మన్దీప్ సింగ్ మల్హోత్రా చెప్పారు. అయితే, ఆరోగ్య సంరక్షణ వ్యయాన్ని జీడీపీలో 2.5 శాతానికి పెంచాలన్న సుదీర్ఘ డిమాండ్‌ను ఈ బడ్జెట్ కూడా నెరవేర్చకపో వడంపై నిపుణులు పెదవి విరుస్తున్నారు. -
బిహార్‌కు కేటాయింపులు.. ఏపీకి అప్పులు
సాక్షి, అమరావతి: కేంద్రంలో అధికారంలో ఉన్న కూటమిలో భాగస్వామిగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి ప్రత్యేకంగా కేటాయింపులు చేయించడంలో విఫలమయ్యారు. బిహార్‌కు మాత్రం కేంద్ర బడ్జెట్లో భారీ కేటాయింపులు చేయగా ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం అప్పులు ఇప్పిస్తామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. బిహార్‌కు ఒక న్యాయం ఆంధ్రప్రదేశ్‌కు మరో న్యాయం అనే రీతిలో కేంద్ర బడ్జెట్ ఉందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధానికి వివిధ డెవలప్మెంట్ ఏజెన్సీల ద్వారా ప్రత్యేక మద్దతుగా ఈ ఆర్థిక సంవత్సరం రూ.15 వేలకోట్లు ఇప్పించే ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. అయితే బడ్జెట్ డాక్యుమెంట్లలో ఎక్కడా రాజధాని కోసం కేటాయింపులు చేయలేదు. అంటే వివిధ ఏజెన్సీల ద్వారా ఇప్పించే రూ.15 వేలకోట్లు అప్పుగానే అని తేలిపోయింది. భవిష్యత్‌లో కూడా రాజధానికి అవసరమైన అప్పులు ఇప్పిస్తామని సీతారామన్ చెప్పారు. ప్రత్యేక ఆర్థిక మద్దతు అని పేర్కొన్నారు తప్ప ఎక్కడా గ్రాంటు, ఆర్థికసాయం అని చెప్పలేదు. ఈ నేపథ్యంలో ఏపీకి అప్పులు ఇప్పించడానికి మాత్రమే కేంద్రం ముందుకు వచ్చిందని, ఇదే విషయాన్ని బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించి చేతులు దులుపుకొన్నారని, దీనివల్ల రాష్ట్రానికి అప్పులు తప్ప పెద్దగా ప్రయోజనం లేదని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. బిహార్ రాష్ట్రానికి మాత్రం జాతీయ రహదారులకు ఏకంగా రూ.26 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానికి మాత్రం ఏజెన్సీల ద్వారా రూ.15 వేలకోట్లు ఇప్పించే ఏర్పాటు చేస్తామని పేర్కొనడం అంటే ఏపీ పట్ల చిన్నచూపు చూడటమేనని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలకు కట్టుబడి ఉన్నామంటూ ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగంలో ముక్తాయింపు ఇచ్చారు తప్ప ప్రత్యేకంగా కేటాయింపులేమీ చేయలేదు. మంత్రి ప్రసంగం నోటిమాటతో సంతృప్తి చెందాలనే చందంగా ఉందని పలువురు పేర్కొంటున్నారు. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లా అభివృద్ధికి సాయం కొనసాగుతుందని బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు తప్ప ఎక్కడా కేటాయింపులు చేయలేదు. ఇక గిరిజన యూనివర్సిటీకి, సెంట్రల్ యూనివర్సిటీకి బడ్జెట్లో ఏమీ ఇవ్వలేదు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న పెట్రోలియం యూనివర్సిటీకి మాత్రం రూ.168 కోట్లు కేటాయించారు. పునర్విభజన చట్టంలోని పలు వైద్య, విద్యాసంస్ధలకు బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు చేయలేదు. చంద్రబాబు ప్రధానమంత్రి, కేంద్ర హోం, ఆర్థిక మంత్రులను కలిసి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా సాయం చేయాలని కోరారు. అయినా కేంద్ర ఆర్థికమంత్రి ఏపీకి ప్రత్యేకంగా అప్పులు ఇప్పిస్తామని ప్రకటించడం గమనార్హం. ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం నిబంధనలకు లోబడే ఈ అప్పును ఇప్పిస్తారా లేదా ఆ నిబంధనల మినహాయింపులతో ఇప్పిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. -
ఆర్థిక శక్తి
న్యూఢిల్లీ: దేశంలో మహిళల అభివృద్ధిని ప్రోత్సహించేందుకు 2024–25 బడ్జెట్ లో పెద్దపీట వేసినట్లు కేంద్రం తెలిపింది. వివిధ మంత్రిత్వశాఖలు, పథకాల కింద బాలికలు, మహిళల కోసం రూ. 3 లక్షల కోట్లకుపైగా కేటాయింపులు చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దేశ ఆర్థికాభివృద్ధిలో మహిళలు పోషిస్తున్న పాత్రను మరింత పెంచాలన్న ప్రభుత్వ చిత్తశుద్ధికి ఈ కేటాయింపులే నిదర్శనమన్నారు. ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో ఉద్యోగాల్లో చేరేలా ప్రోత్సహించేందుకు దేశంలో మహిళా హాస్టళ్లను ఏర్పాటు చేస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. పనిచేసే తల్లులకు ఆలంబనగా ఉండేందుకు పని ప్రదేశాల్లో శిశు సంరక్షణ కేంద్రాలను నిర్మిస్తామన్నారు. ఈ విషయంలో పరిశ్రమల సహకారం తీసుకుంటామని వివరించారు. మహిళలకు ప్రత్యేకంగా నైపుణ్య శిక్షణ, స్వయం సహాయక బృందాలకు మార్కెట్ అవకాశాలు లభించేలా చూస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు...: పెరిగిన మహిళా ఉద్యోగులు :..దేశంలో మహిళా ఉద్యోగుల సంఖ్య పెరిగిందని కేంద్రం తెలిపింది. ఈ ఏడాది మే నాటికి కొత్తగా 2.4 లక్షల మంది మహిళలు ఉద్యోగాల్లో చేరారని చెప్పింది. ఇది గతేడాది గణాంకాలతో పోలిస్తే 12.1% అధి కమని వివరించింది. అలాగే 2024 ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసికంలో మహిళా కార్మికశక్తి 24 శాతానికి పెరిగినట్లు కేంద్రం వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే మొత్తమీద 17.2% మహిళా ఉద్యోగులు పెరిగారని.. సమ్మిళిత కార్మికశక్తి దిశగా ఇది సానుకూల పరిణామమని పేర్కొంది.స్త్రీ, శిశు సంక్షేమానికి కేటాయింపులు ఇలా..» స్త్రీ, శిశు సంక్షేమానికి రూ. 26,092 కోట్లుకేటాయించింది. ఇది గతేడాది సవరించినఅంచనాలు రూ. 25,448 కోట్ల కంటే 2.5 శాతం అధికం.» చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు ఉద్దేశించిన సాక్షంఅంగన్వాడీ, పోషణ్ 2.0 పథకాలకు అత్యధికంగా రూ. 21,200 కోట్లు» శిశు సంరక్షణ సేవలు,సంక్షేమానికి ఉద్దేశించిన మిషన్ వాత్సల్య కార్యక్రమానికి గతేడాది తరహాలోనే రూ. 1,472 కోట్లు.» సంబాల్, సామర్థ్య ఉప పథకాలతో కూడిన మిషన్ శక్తి పథకానికి రూ. 3,145 కోట్లు.ఇందులో బేటీ బచావో.. బేటీ పఢావో లాంటి పథకాలతో కూడిన సంబాల్ పథకానికి రూ. 629 కోట్లు.» పిల్లల అభివృద్ధి, శిక్షణ, పరిశోధనా సంస్థ ఎన్‌ఐపీసీసీడీకిరూ. 88.87 కోట్లు, చిన్నారుల దత్తతను పర్యవేక్షించేసీఏఆర్ఏ (కారా)కు రూ. 11.40 కోట్లు.» మహిళా భద్రతను పెంచేందుకు ఉద్దేశించిన నిర్భయా ఫండ్కురూ. 500 కోట్లు.» ఐక్యరాజ్య సమితిఅనుబంధ సంస్థ యూనిసెఫ్‌కు 5.60 కోట్లు.కేటాయింపులు హర్షణీయం‘ఏ దేశానికైనా మహిళలే వెన్నెముక.దేశ సుస్థిరాభివృద్ధికి మహిళా సాధికారత, భాగస్వామ్యం కీలకం.కేంద్ర బడ్జెట్లో మహిళలకు రూ.3 లక్షల కోట్లకుపైగా కేటాయించడంఈ వాస్తవాన్ని ప్రతిబింబిస్తోంది. మహిళా హాస్టళ్లు, శిశుసంరక్షణ కేంద్రాల ఏర్పాటు, అతివలకు నైపుణ్య శిక్షణలాంటి ప్రతిపాదనలు హర్షణీయం. - రేఖా శర్మ జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ -
కేంద్ర పన్నుల్లో పెరిగిన తెలంగాణ వాటా
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర పన్నుల్లో తెలంగాణకు రూ. 26,216.38 (2.102 శాతం) కోట్ల వాటా లభించనుంది. అందులో ఆదాయ పన్ను రూ. 9,066.56 కోట్లు, కార్పొరేషన్ పన్ను రూ. 7,872.25 కోట్లు, కేంద్ర జీఎస్టీ æరూ. 7,832.19 కోట్లు, కస్టమ్స్ రూ. 1,157.45 కోట్లు, కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ రూ. 243.98 కోట్లు, సరీ్వస్ టాక్స్ రూ. 0.86 కోట్లు, ఇతర పన్నులు రూ. 43.09 కోట్లు ఉన్నాయి.ఈ మేరకు 2024–25 బడ్జెట్ ప్రతిపాదనల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. గతేడాది బడ్జెట్లో కేంద్ర పన్నుల రూపంలో తెలంగాణకు రూ. 23,066.20 కోట్లు కేటాయించగా దానితో పోలిస్తే ఈసారి బడ్జెట్లో పన్నుల వాటా రూ. 3,150.18 కోట్లు అధికం కావడం విశేషం.రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ సంస్థలకు బడ్జెట్ కేటాయింపులు ఇవీ..⇒ ఈ ఏడాది బడ్జెట్లో హైదరాబాద్ ఐఐటీ (ఎక్స్‌టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టులు)కి నిధుల కేటాయింపులో కోత విధించారు. గతేడాది రూ. 300 కోట్లు బడ్జెట్లో కేటాయించి మొత్తం రూ. 522.71 కోట్లు ఖర్చు చేయగా ఈ ఏడాది ఐఐటీ హైదరాబాద్ (ఈఏపీ)లకు రూ. 122 కోట్లు మాత్రమే కేటాయించారు. ⇒ తెలంగాణలోని గిరిజన యూనివర్సిటీ కోసం ప్రత్యేకంగా కేటాయింపులేవీ చేయలేదు. దేశంలోని అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు కలిపి కేటాయింపులు చేశారు. అయితే గతేడాది తెలంగాణ, ఏపీలోని గిరిజన విశ్వవిద్యాలయాలకు కలిపి రూ. 37.67 కోట్లు కేంద్రంకేటాయించింది.⇒ హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్‌కు కేటాయింపుల్లో కోత విధించారు. గతేడాది రూ.115 కోట్లు కేటాయించగా తాజా బడ్జెట్లో కేవలం రూ.10.84 కోట్లే కేటాయించారు. ⇒ సింగరేణి కాలరీస్‌కు రూ. 1,600 కోట్లు, హైదరాబాద్‌లోని అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఆఫ్ ఎక్స్‌ప్లొరేషన్ అండ్ రీసెర్చ్‌కు రూ. 352.81 కోట్లు, హైదరాబాద్ సహా దేశంలోని 7 నైపర్ సంస్థలకు కలిపి రూ. 242 కోట్ల మేర కేంద్రం కేటాయించింది. ⇒ హైదరాబాద్‌లోని ఇన్‌కాయిస్‌కు రూ. 28 కోట్లు, హైదరాబాద్ సహా మరో మూడు ప్రాంతాల్లో ఉన్న డైరెక్టరేట్ ఆఫ్ హిందీ సంస్థకు రూ. 16.54 కోట్ల మేర కేటాయింపులు చేసింది. ⇒హైదరాబాద్ సహా 12 నగరాల్లో ఉన్న సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీ–డాక్)కు రూ. 270 కోట్లు, నేషనల్ ఫిషరీస్ డెవలస్‌మెంట్ బోర్డుకు రూ. 16.78 కోట్లు, స్వాతంత్య్ర సమరయోధులకు (పెన్షన్లు) రూ. 603.33 కోట్లు, హైదరాబాద్ జాతీయ పోలీసు అకాడమీ సహా పోలీసు విద్య, శిక్షణ, పరిశోధనకు మొత్తం రూ. 1,348.35 కోట్లు కేంద్ర బడ్జెట్లో కేటాయించారు. ⇒హైదరాబాద్‌లోని సీడీఎఫ్‌డీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ సహా దేశంలోని ఇతర స్వయం ప్రతిపత్తి సంస్థలకు కలిపి రూ. 940.66 కోట్లు, మణుగూరు సహా కోటా (రాజస్తాన్)లోని భార జల ప్లాంట్లకు రూ. 1,485.21 కోట్ల మేర కేటాయించారు. -
దార్శనిక బడ్జెట్ మరింత వృద్ధికి, మెరుగైన భవితకు బాటలు: మోదీ
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ మరింత వృద్ధికి, మెరుగైన భవిష్యత్తుకు బాటలు పరిచేలా ఉందంటూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. సమాజంలోని ప్రతి వర్గం సంక్షేమాన్నీ దృష్టిలో పెట్టుకుని రూపొందిన దార్శనిక బడ్జెట్‌గా అభివర్ణించారు. ‘‘భారత్‌ను ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో ఈ బడ్జెట్ కీలకపాత్ర పోషించనుంది. వికసిత భారత్‌కు గట్టి పునాదులు వేయనుంది’’ అని అభిప్రాయపడ్డారు.‘‘యువత, వెనకబడ్డ వర్గాలు, మహిళలు, ముఖ్యంగా మధ్యతరగతి సంక్షేమంపై బడ్జెట్ ప్రధానంగా దృష్టి పెట్టింది. ఉత్పత్తి, మౌలిక తదితర కీలక రంగాల వృద్ధికి ఊపునిచ్చేలా పలు చర్యలున్నాయి. సమాజంలోని ప్రతి రంగానికీ సాధికారత కల్పించే బడ్జెట్ ఇది. యువతకైతే ఆకాశమే హద్దుగా అవకాశాలు కల్పించనున్నాం. వారికి ఇతోధికంగా ఉపాధి కల్పించడంతో పాటు భారీగా స్వయం ఉపాధి అవకాశాలు అందించాలన్న ఎన్డీఏ ప్రభుత్వ ఆశయాలకు బడ్జెట్ సాకార రూపమిచ్చింది.కోటిమంది యువతకు అత్యున్నత సంస్థల్లో ఇంటర్న్‌షిప్ చేసే సువర్ణావకాశం దక్కనుంది. ఉన్నత విద్యకు రుణసాయం అందనుంది. ఉపాధి ఆధారిత ప్రోత్సహకాల పథకం కోట్లాది ఉద్యోగాలను సృష్టించనుంది. వ్యవసాయ రంగంలో సంపూర్ణ స్వావలంబన దిశగా, మధ్యతరగతిని మరింత బలోపేతం చేసేందుకు బడ్జెట్లో పలు చర్యలున్నాయి.కోటిమంది రైతులను సహజ సాగుకు మళ్లించడం తదితర లక్ష్యాలతో రైతు సంక్షేమానికి పెద్దపీట వేశాం. మా గత పదేళ్ల పాలనలో 25 కోట్ల మంది భారతీయులను పేదరిక కోరల నుంచి విముక్తం చేశాం. నయా మధ్యతరగతి ఆకాంక్షలకు రెక్కలు తొడిగేలా బడ్జెట్లో పలు చర్యలున్నాయి. గిరిజనులకు మరింత సాధికారత దక్కనుంది’’ అని ప్రధాని వివరించారు.బడ్జెట్ ముఖ్యాంశాలు..విద్య, ఉద్యోగ కల్పన రంగాలు⇒ పీఎం స్కీం ప్యాకేజీలు: ఉద్యోగ కల్పన, నైపుణ్య శిక్షణ కోసం వచ్చే ఐదేళ్లలో రెండు లక్షల కోట్లతో 5 పథకాల అమలు.⇒ బడ్జెట్ కేటాయింపులు: విద్య, ఉద్యోగ, నైపుణ్య శిక్షణ కోసం రూ.1.48 లక్షల కోట్లు కేటాయింపు.⇒ తొలిసారి ఉద్యోగం చేరినవారికి ప్రోత్సాహకం: ఒక నెల వేత నం చెల్లింపు. మూడు వాయిదాల్లో కలిపి గరిష్టంగా రూ.15 వేల వరకు ప్రయోజనం. 2.1 కోట్ల మంది యువతకు ప్రయోజనం⇒ ఉన్నత విద్యకు సహకారం: పైచదువుల కోసం రూ.10 లక్షల వరకు రుణం సదుపాయం.⇒ యువతకు పెయిడ్ ఇంటర్న్‌షిప్: వచ్చే ఐదేళ్లలో 500కుపైగా కంపెనీల్లో కోటి మంది యువతకు పెయిడ్ ఇంటర్న్‌షిప్. చేరినప్పుడు రూ.6 వేలు ఆర్థిక సాయం. తర్వాత ప్రతినెలా రూ.5వేలు ఇంటర్న్‌షిప్ అలవెన్స్.తయారీ రంగంలో ఉద్యోగాలకు ప్రోత్సాహం⇒ తొలిసారి ఉద్యోగంలో చేరినవారికి నాలుగేళ్ల పాటు ఈపీఎఫ్ఓ చందా చెల్లింపులో ప్రోత్సాహకాలు. 30 లక్షల మంది యువతకు ప్రయోజనం.⇒ కొత్తగా/అదనంగా ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు రెండేళ్లపాటు ప్రోత్సాహకాలు. కంపెనీలు ప్రతి కొత్త ఉద్యోగికి సంబంధించి ఈపీఎఫ్ఓకు చెల్లించే యాజమాన్య వాటాలో గరిష్టంగా నెలకు రూ.3వేల వరకు రీయింబర్స్మెంట్. దీనితో 50 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయని అంచనా.వ్యవసాయ రంగం..⇒ 32 అగ్రి/హార్టికల్చర్ పంటల్లో వాతావరణ మార్పులను తట్టుకుని అధిక దిగుబడి ఇచ్చే 109 రకాలకు ప్రోత్సాహం⇒ వేగంగా జాతీయ అభివృద్ధి కోసం ‘నేషనల్ కో–ఆపరేషన్ పాలసీ’ అమలు⇒ కొత్తగా 5 రాష్ట్రాల్లో రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు⇒ రొయ్యల పెంపకానికి ప్రోత్సాహం⇒ భారీ స్థాయిలో కూరగాయల సాగుపై ప్రత్యేకంగా ఫోకస్⇒ పప్పు ధాన్యాలు, నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించే దిశగా.. దిగుబడి పెంపు, నిల్వ, మార్కెటింగ్‌కు ఏర్పాట్లు⇒ దేశవ్యాప్తంగా కోటి మంది రైతులు సేంద్రియ సాగువైపు మళ్లేలా చర్యలు. సేంద్రియ పంటలకు బ్రాండింగ్, సర్టిఫికేషన్. 10వేల బయో ఇన్పుట్ రీసోర్స్ సెంటర్ల ఏర్పాటు.రాష్ట్రాలకు కేంద్ర ప్రత్యేక సాయం..బిహార్: ⇒ రూ.26 వేల కోట్లతో భారీ స్థాయిలో రహదారుల అభివృద్ధి⇒ 2,400 మెగావాట్ల కొత్త విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు⇒ కొత్తగా ఎయిర్‌పోర్టులు, మెడికల్ కాలేజీలు, క్రీడా సదుపాయాలుఆంధ్రప్రదేశ్: ⇒ అమరావతి కోసం రుణ మార్గాల్లో రూ.15 వేల కోట్ల నిధులు.⇒ పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు.ఒడిశా: ⇒ రాష్ట్రంలో పర్యాటకాన్ని విస్తృత స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేకంగా సాయం.చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు..⇒ ముద్రా రుణాల్లో తరుణ్ కేటగిరీ కింద గతంలో రుణం తీసుకుని చెల్లించిన వారికి పరిమితి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంపు.⇒ పరిశ్రమలు భారీ యంత్రాలు, పరికరాలను కొనుగోలు చేసుకోవడానికి రూ.100 కోట్ల వరకు పూచీకత్తు లేని రుణాలు.పట్టణ, గ్రామీణాభివృద్ధికి తోడ్పాటుగా..⇒ పట్టణాల్లో వచ్చే ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్లతో పేద, మధ్యతరగతి వర్గాలకు కోటి ఇళ్ల నిర్మాణం.⇒ దేశవ్యాప్తంగా పలు పట్టణాల్లో 100 స్ట్రీట్ ఫుడ్ హబ్‌ల అభివృద్ధి.⇒ 30 లక్షలకుపైగా జనాభా ఉన్న 14 నగరాల్లో ‘ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్’ పథకం అమలు⇒ దేశంలోని 100 పెద్ద పట్టణాల్లో భారీ ఎత్తున నీటి సరఫరా, మురుగునీటి శుద్ధి, చెత్త తొలగింపు ప్రాజెక్టులు⇒ గ్రామీణ ప్రాంతాల్లో మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులకు రూ.2.66 లక్షల కోట్లు.మహిళా సంక్షేమం..⇒ మహిళల కోసం ప్రత్యేకించిన నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు. ఉద్యోగం చేసేవారి కోసం వర్కింగ్ విమెన్ హాస్టళ్లు⇒ పదేళ్ల కిందటితో పోలిస్తే మహిళా సంక్షేమం, సాధికారత కోసం 218.8 శాతం నిధులు పెంపు⇒ మహిళలు కొనే ఆస్తులకు రిజిస్ట్రేషన్/స్టాంపు చార్జీలు తగ్గింపుమరిన్ని ‘ప్రత్యేక’ అంశాలు..⇒ విష్ణుపాద్, మహాబోధి ఆలయాల వద్ద టూరిజం కారిడార్లు.. టూరిజం కేంద్రంగా నలంద విశ్వవిద్యాలయం.⇒ 3 కేన్సర్ మందుల దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు. -
చదువులు ‘ఉన్నతం’
న్యూఢిల్లీ: దేశీయ విద్యాసంస్థల్లో ఉన్నత చదువులు అభ్యసించే విద్యార్థులకు రూ.10 లక్షల వరకు విద్యా రుణాలు అందించనున్నట్లు బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. విద్యా రుణాలకు సంబంధించి ఏటా లక్ష మంది విద్యార్థులకు రుణాలపై మూడు శాతం సబ్సిడీతో ఈ–వోచర్లు నేరుగా అందించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.విద్యార్థులు, విద్యారంగానికి ఇది మేలు చేస్తుందని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ పేర్కొన్నారు. యువత ఆకాంక్షలను నెరవేర్చడం, నాణ్యమైన విద్య, మెరుగైన నైపుణ్యాలు అందుబాటులోకి రావడంతోపాటు వచ్చే ఐదేళ్లలో 4.1 కోట్ల ఉద్యోగాలను కొత్తగా సృష్టించవచ్చన్నారు.మేనేజ్మెంట్ విద్య బోధించే ప్రతిష్టాత్మక బిజినెస్ స్కూళ్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లకు వరుసగా రెండో ఏడాదీ కేంద్రం కేటాయింపులు కుదించింది. గత ఆర్థిక ఏడాది సవరించిన అంచనాలతో పోలిస్తే పాఠశాల విద్యకు కేటాయింపులు రూ.535 కోట్లకుపైగా పెంచగా ఉన్నత విద్య గ్రాంట్‌ను రూ.9,600 కోట్లకుపైగా కుదించింది. మొత్తమ్మీద విద్యారంగానికి కేటాయింపులు రూ.9,000 కోట్లకుపైగా తగ్గాయి. విద్యాశాఖకు 2024–25 బడ్జెట్లో రూ.1.25 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఆవిష్కరణలు, సృజనాత్మకతకు ప్రోత్సాహం విద్యాసంస్థలలో ఆవిష్కరణలు, సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు బడ్జెట్లో మరో రూ.161 కోట్లు అదనంగా కేటాయించారు. ప్రపంచ స్థాయి విద్యాసంస్థలకు కేటాయింపులు రూ.1,300 కోట్ల (సవరించిన అంచనాలు) నుంచి రూ.1,800 కోట్లకు పెరిగాయి.యూజీసీకి నిధుల కేటాయింపులు గతేడాది సవరించిన అంచనాలు రూ.6,409 కోట్లతో పోలిస్తే ఈసారి 60.99 శాతం తగ్గించి రూ.2,500 కోట్లకు కుదించారు. ఐఐఎంలకు బడ్జెట్లో కోతలు తప్పలేదు. గతేడాది బడ్జెట్లో ఐఐఎంలకు కేటాయింపులు సవరించిన అంచనాలు రూ.608.23 కోట్లతో పోలిస్తే రూ.300 కోట్లకు కుదించగా ఈసారి మరింత కోత పడింది. ఈ ఏడాది సవరించిన అంచనాలు రూ.331 కోట్లతో పోలిస్తే కేటాయింపులు రూ.212 కోట్లకు కుదించారు. సెంట్రల్ వర్సిటీలకు మరికొంత.. దేశంలో అత్యున్నత సాంకేతిక విద్యకు నిలయాలైన ఐఐటీలకు కూడా బడ్జెట్ కేటాయింపులు గతేడాది సవరించిన అంచనాలతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. సవరించిన అంచనాలు రూ.10,384.21 కోట్లతో పోలిస్తే కేటాయింపులు రూ.10,324.50 కోట్లకు తగ్గాయి. కేంద్రీయ విశ్వవిద్యాలయాల (సెంట్రల్ వర్సీటీలు) కేటాయింపులు మాత్రం 28 శాతం పెరిగాయి.సెంట్రల్ వర్సిటీలకు సవరించిన అంచనాలు రూ.12,000.08 కోట్లతో పోలిస్తే కేటాయింపులు రూ.15,472 కోట్లకు పెరిగాయి. పాఠశాల విద్యకు సంబంధించి కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, ఎన్సీఈఆరీ్ట, పీఎంశ్రీ స్కూళ్లు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్వహించే గ్రాంట్ ఇన్ ఎయిడ్ స్కూళ్లకు బడ్జెట్లో కేటాయింపులు పెరిగాయి. -
పసిడి..వెండి.. ఊరట!
న్యూఢిల్లీ: ఇటు బులియన్ పరిశ్రమకు అటు ఆభరణాల ప్రియులకు ఊరటనిస్తూ ఆర్థికమంత్రి కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకాలు ప్రస్తుతం 15 శాతంకాగా, ఈ రేటును 6 శాతానికి తగ్గిస్తున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. ఇందులో ప్రాథమిక కస్టమ్స్ సుంకం (బీసీడీ) 10 నుంచి 5 శాతానికి తగ్గగా, అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్ (ఏఐడీసీ) 5 శాతం నుంచి 1 శాతానికి చేరింది.ఇక విలువైన లోహాల నాణేలు, హుక్, క్లాస్ప్, క్లాంప్, పిన్, క్యాచ్, స్క్రూ బ్యాక్ వంటి చిన్న భాగాలకు సంబంధించిన బంగారం–వెండి ఫైండింగ్స్, బంగారం, వెండి కడ్డీలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని కూడా 15 శాతం నుంచి 6 శాతానికి బడ్జెట్ తగ్గించింది. మరింత మెరుగుదల అవసరమైన బంగారం, వెండి డోర్లపై కస్టమ్స్ సుంకం 14.35 శాతం నుంచి 5.35 శాతానికి తగ్గించారు. ‘‘దేశంలో బంగారం, విలువైన లోహ ఆభరణాల పరిశ్రమకు ఊతం ఇవ్వడానికి బంగారం– వెండిపై కస్టమ్స్ సుంకాలను 6 శాతానికి తగ్గించాలని నేను ప్రతిపాదిస్తున్నాను’’ అని ఆర్థికమంత్రి తెలిపారు. ప్లాటినం, పల్లాడియం, ఓస్మియం, రుథేనియం, ఇరిడియంలపై లెవీని కూడా 15.4 శాతం నుంచి 6.4 శాతానికి బడ్జెట్లో తగ్గించారు.రాజధానిలో రూ.3,350 తగ్గుదల ఇక ఆర్థిక మంత్రి కీలక ప్రకటన నేపథ్యంలో స్పాట్ మార్కెట్లో పసిడి, వెండి ధరలు భారీగా పడ్డాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాములు పూర్తి స్వచ్ఛత (99.9 శాతం ప్యూరిటీ) పసిడి ధర క్రితం ముగింపుతో పోలి్చతే రూ.3,350 తగ్గి, రూ.72,300కు దిగివచి్చంది. 99.5 స్వచ్ఛత ధర కూడా ఇదే స్థాయిలో దిగివచ్చి రూ.71,950 స్థాయికి చేరింది.వెండి కేజీ ధర సైతం రూ.3,500 (4 శాతం) తగ్గి రూ.87,500కు దిగివచ్చింది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబై విషయానికి వస్తే, 99.9 స్వచ్ఛత, 99.5 స్వచ్ఛత 10 గ్రాముల ధరలు క్రితం ముగింపుతో పోలి్చతే రూ.3,614 రూ.3,602 చొప్పున తగ్గి వరుసగా రూ.69,602, రూ.69,323కు దిగివచ్చాయి. ఇక వెండి కేజీ ధర రూ.3,275 తగ్గి రూ.84,919కి దిగింది. ఫ్యూచర్స్‌లో రూ.4,000 డౌన్ ఆర్థికమంత్రి ప్రకటన వెంటనే ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్ (ఎంసీఎక్స్)లో చురుగ్గా ట్రేడవుతున్న బంగారం ఆగస్టు కాంట్రాక్ట్ 10 గ్రాముల ధర క్రితం ముగింపుతో పోలి్చతే దాదాపు రూ.4,000 పడిపోయి (5 శాతంపైగా) రూ.68,500కు చేరింది. కేజీ వెండి ధర సైతం రూ.88,995 నుంచి రూ.84,275కు దిగివచి్చంది. అంతర్జాతీయంగా ధర ఇలా... అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ న్యూయార్క్ కమోడిటీ ఎక్సే్చంజ్‌లో ఈ నెల 16వ తేదీన ఔన్స్‌కు (31.1గ్రా) ఆల్‌టైమ్ హై 2,489 డాలర్లను తాకిన పసిడి ఆగస్టు కాంట్రాక్ట్ ధర మంగళవారం 2,400 డాలర్లపైన ట్రేడవుతోంది. తీపికబురే కానీ... కస్టమ్స్ సుంకాలు తగ్గించడం తక్షణ డిమాండ్‌కు సంబంధించి బులియన్ పరిశ్రమ, వినియోగదారుకు తీపి కబురే అయినప్పటికీ ఈ నిర్ణయంపై రానున్న కాలంలో భౌగోళిక ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా బంగారం ధరల పెరుగుదల, దేశీయంగా డాలర్ మారకంలో రూపాయి విలువల కదలికలు ప్రభావం చూపుతాయి.డిజిటల్ పెట్టుబడికి అవకాశంకస్టమ్స్ సుంకం తగ్గింపు బులియన్ మార్కెట్‌ను తక్షణం ప్రభావితం చేసే అంశమే. ఇది పెట్టుబడిదారులకు సానుకూల చర్య అయినప్పటికీ, చైనాసహా ప్రపంచ వ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇప్పటికీ బంగారం ధరలను ప్రభావితం చేయవచ్చు. 2.5% వార్షిక వడ్డీని అందించే సావరిన్ గోల్డ్ బాండ్స్ వంటి డిజిటల్ ఆప్షన్లలో పెట్టుబడి పెట్టడానికి ఇది తగిన సమయం. – మహేంద్ర లూనియా, విఘ్నహర్తా గోల్డ్ లిమిటెడ్ చైర్మన్ -
డెరివేటివ్స్అంటే దడే!
న్యూఢిల్లీ: బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(డెరివేటివ్స్) లావాదేవీలపై పన్నును పెంచేందుకు ప్రతిపాదించారు. ఇందుకు అనుగుణంగా ఎఫ్‌అండ్‌వో సెక్యూరిటీస్‌లో ట్రాన్సాక్షన్ ట్యాక్స్(ఎస్టీటీ)ను పెంచారు. దీంతో సెక్యూరిటీల ఆప్షన్ విక్రయంపై ప్రస్తుతమున్న ఆప్షన్ ప్రీమియంలో 0.625 శాతం పన్ను 0.1 శాతానికి పెరగనుంది. ఇక సెక్యూరిటీల ఫ్యూచర్స్ విక్రయంపై సైతం 0.0125 శాతం నుంచి 0.02 శాతానికి పెంచారు. అక్టోబర్ 1 నుంచి పన్ను పెంపు అమల్లోకి రానుంది.నిజానికి ఎఫ్‌అండ్‌వో విభాగంలో ఇటీవల కొంతకాలంగా రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా ఆసక్తి చూపుతున్నారు. దీనిపై సెబీ, ఆర్థిక శాఖ, స్టాక్ ఎక్సే్ఛంజీలతోపాటు ఆర్థిక సర్వే సైతం ఆందోళన వ్యక్తం చేసింది. డెరివేటివ్స్ విభాగంలో రిటైలర్ల పారి్టసిపేషన్ భారీగా పెరిగిపోతుండటంతో జూదానికి దారితీస్తుందని ఆర్థిక సర్వే పేర్కొంది. ఈ నేపథ్యంలో సీతారామన్ ఎఫ్‌అండ్‌వో లావాదేవీలపై పన్నులను పెంచేందుకు నిర్ణయించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సెబీ చీఫ్ మాధవి పురి బచ్, ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ ఇటీవలే ఎఫ్‌అండ్‌వో లావాదేవీలు పెరుగుతుండటంపై రిటైలర్లకు హెచ్చరికలు జారీ చేశారు. రిటైలర్లను డెరివేటివ్స్ అత్యధికంగా ఆకట్టుకుంటున్న కారణంగా విశ్లేషకులు సైతం రిస్కులను అర్ధం చేసుకోగలిగినవాళ్లు మాత్రమే లావాదేవీలను చేపట్టమంటూ అప్రమత్తం చేస్తున్నారు. సాధారణ ఇన్వెస్టర్లు వీటిని చేపట్టకపోవడమే మేలని సూచిస్తున్నారు. టర్నోవర్ దూకుడు డెరివేటివ్స్ విభాగంలో నెలవారీ టర్నోవర్ 2024 మార్చికల్లా కొన్ని రెట్లు ఎగసి రూ. 8,740 లక్షల కోట్లను తాకింది. 2019 మార్చిలో కేవలం రూ. 217 లక్షల కోట్లుగా నమోదుకావడం గమనార్హం! ఇదే కాలంలో నగదు విభాగంలోనూ రోజువారీ సగటు టర్నోవర్ రూ. లక్ష కోట్లను తాకగా.. ఎఫ్‌అండ్‌వోలో రూ. 330 లక్షల కోట్లకు చేరింది. ఎఫ్‌అండ్‌వో అంటే? ఒక షేరు లేదా కమోడిటీ విలువ ఆధారంగా కుదుర్చుకునే తాత్కాలిక కాంట్రాక్ట్‌ల లావాదేవీలను ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌గా పేర్కొనవచ్చు. అత్యధిక శాతం ట్రేడర్లు రిసు్కల రక్షణ(హెడ్జింగ్)కు, ధరల కదలికలపై అంచనాలు, షేర్లు లేదా కమోడిటీల ధర వ్యత్యాసాల లబ్ధికి సైతం వీటిలో లావాదేవీలను చేపడుతుంటారు. వెరసి వీటిని స్వల్పకాలిక లాభార్జనకు స్పెక్యులేటివ్ టూల్‌గా వినియోగిస్తుంటారు. అయితే మార్కెట్ ఆటుపోట్లు, లెవరేజ్.. తదితర రిస్క్‌ల కారణంగా అత్యధికస్థాయిలో నష్టాలు సైతం వాటిల్లుతుంటాయి.సెబీ ఇటీవలి నివేదిక ప్రకారం రిటైల్ ఇన్వెస్టర్లలో 89 శాతంమంది డెరివేటివ్స్‌లో నష్టపోతున్నారు. 2021–22 ఏడాదిలో వీరికి సగటున రూ. 1.1 లక్ష చొప్పున నష్టాలు నమోదయ్యాయి. కరోనా కాలంలో ఎఫ్‌అండ్‌వో ఇన్వెస్టర్ల సంఖ్య 500 శాతం దూసుకెళ్లింది. 2019లో ఈ సంఖ్య 7.1 లక్షలుకాగా.. 2021కల్లా 45.24 లక్షలకు జంప్‌చేసింది.5 రెట్లు అధికమైనా.. డెరివేటివ్స్‌లో ఎస్టీటీ 5 రెట్లు పెరగనున్నట్లు సిట్రస్ అడ్వయిజర్స్ వ్యవస్థాపకుడు సంజయ్ సిన్హా పేర్కొన్నారు. ఇటీవల ఈ విభాగంలో లావాదేవీలు భారీగా పెరిగిన నేపథ్యంలో పన్ను పెంపు ఊహించిందేనని తెలియజేశారు.అయితే పన్ను పెంపు అమల్లోకిరానున్న 2024 అక్టోబర్ 1 నుంచి ఎక్సే్ఛంజీల టర్నోవర్ చార్జీలు తగ్గనున్నట్లు కొటక్ సెక్యూరిటీస్ డిజిటల్ బిజినెస్ హెడ్ ఆశిష్ నందా పేర్కొన్నారు. ఉదాహరణకు ఆప్షన్స్‌పై రూ. 10,000 రౌండ్ ట్రిప్ ప్రీమియంపై ఎస్టీటీ రూ. 3.75 పెరుగుతుందనుకుంటే.. టర్నోవర్ చార్జీలు రూ. 3.5–4 స్థాయిలో తగ్గనున్నట్లు వివరించారు. దీంతో నికరంగా ప్రభావం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు.ఎల్‌టీసీజీలో సవరణలుకేంద్రానికి రూ. 15,000 కోట్ల అదనపు ఆదాయంబడ్జెట్లో వివిధ ఆస్తుల(సెక్యూరిటీలు, స్థిరాస్తులు) హోల్డింగ్ కాలావధి ఆధారంగా క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్‌లను క్రమబదీ్ధకరించారు. ఏడాదికి మించి లిస్టెడ్ ఫైనాన్షియల్ ఆస్తుల హోల్డింగ్‌తోపాటు.. రెండేళ్లకు మించి ఆర్థికేతర ఆస్తులు, అన్‌లిస్టెడ్ ఆస్తుల హోల్డింగ్స్ దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ (ఎల్టీసీజీ) జాబితాలో చేరనున్నాయి.అన్‌లిస్టెడ్ బాండ్లు, డిబెంచర్లను మినహాయించి(వీటికి సంబంధిత స్లాబ్‌లు వర్తిస్తాయి) వివిధ ఆస్తులపై దీర్ఘకాలిక లాభాల పన్ను సగటున 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచారు. ఇక స్వల్పకాలిక క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్‌ను 15 శాతం నుంచి 20 శాతానికి పెంచారు. ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్, బిజినెస్ ట్రస్ట్ యూనిట్లు వీటిలోకి వస్తాయి. అయితే ఆర్థికేతర ఆస్తులపై 20 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించారు.అయితే ఇండెక్సేషన్ లబ్ధిని ఎత్తివేశారు. ఎల్టీసీజీ పన్ను మినహాయింపు పరిమితి రూ. లక్ష నుంచి రూ. 1.25 లక్షలకు పెంచారు. కాగా... మూలధన లాభాలపై పన్ను(క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్) రేట్ల సవరణ కారణంగా రూ. 15,000 కోట్లమేర అదనపు ఆదాయం సమకూరే వీలున్నట్లు రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా అంచనా వేశారు. బైబ్యాక్ షేర్లపైనా పన్నుడివిడెండ్ తరహాలో విధింపు బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం డివిడెండ్ తరహాలో బైబ్యాక్ చేసే షేర్లపై వాటాదారులు పన్ను చెల్లించవలసి ఉంటుంది. అక్టోబర్ 1నుంచి అమల్లోకి రానున్న నిబంధనలతో ఇకపై బైబ్యాక్ షేర్లకు వాటాదారులపై పన్ను విధించనున్నారు.వెరసి కంపెనీలు చేపట్టే బైబ్యాక్‌లో భాగంగా షేర్లకు చెల్లించే సొమ్ముపై డివిడెండ్ తరహాలో వాటాదారులపైనే పన్ను భారం పడనుంది. ఇది ఇన్వెస్టర్లపై పన్ను భారాన్ని మరింత పెంచనుంది. మరోవైపు ఎస్టీటీతోపాటు.. స్వల్పకాలిక లాభాలపై పన్ను పెంపునకు తాజా బడ్జెట్ తెరతీసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ బైబ్యాక్ షేర్లకు కంపెనీలే పన్ను చెల్లిస్తున్నాయి.మ్యాచ్ విన్నింగ్ బడ్జెట్..ప్రపంచ కప్ గెలిచిన తర్వాత.. టీమ్ ఇండియా కోసం ఆర్థిక మంత్రి సీతారామన్ ద్వారా ఒక మ్యాచ్ విన్నింగ్ బడ్జెట్ ఇది. సామాన్యుల ప్రయోజనాలపై బడ్జెట్ దృష్టి సారిస్తుంది. అనుభవజు్ఞడైన కెప్టెన్ నాయకత్వంలో దేశం నాడిని పెంపొందించే కచి్చత, వివరణాత్మక, పరిశోధించి రూపొందించిన బడ్జెట్. – హర్‡్ష గోయెంకా, చైర్మన్, ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్. పెట్టుబడులను ఆకర్షిస్తుంది..ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించడానికి, స్థిర భవిష్యత్తును ప్రోత్సహించడానికి రూపొందించిన దార్శనికత, ఆచరణాత్మక బ్లూప్రింట్. ఇది వినియోగాన్ని ప్రేరేపిస్తుంది. గణనీయంగా పెట్టుబడులను ఆకర్షిస్తుంది. ద్రవ్యోల్బణాన్ని స్థిరీకరిస్తుంది. భారత్‌ను సాంకేతికతతో నడిచే, విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టింది. – పవన్ ముంజాల్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్, హీరో మోటోకార్ప్.సమగ్ర రోడ్‌మ్యాప్..ప్రజల–కేంద్రీకృత బడ్జెట్. ఇది ఆర్థిక స్థిరత్వంతో సమానమైన వృద్ధిని సమతుల్యం చేస్తుంది. ఉద్యోగాల కల్పనపై దృష్టి సారిస్తూనే సుస్థిర, సమాన వృద్ధి కోసం ప్రభుత్వం సమగ్ర రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించింది. – సంజీవ్ పురి, ప్రెసిడెంట్, సీఐఐ. -
ఆయిల్ కంపెనీలకు చేదువార్త
న్యూఢిల్లీ: ఆయిల్ కంపెనీలను బడ్జెట్ నిరాశపరిచింది. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియంలకు 2023–24 ఆర్థిక సంవత్సరంలో వచి్చన రికార్డు లాభాల (దాదాపు రూ.81,000 కోట్లు) కారణంగా గత ఆర్థిక సంవత్సరం ప్రకటించిన రూ. 30,000 కోట్ల మూలధన మద్దతును ఆర్థికమంత్రి రద్దు చేశారు.నిజానికి ఈ మద్దతును రూ.15,000 కోట్లకు తగ్గించాలని 2024 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో ప్రతిపాదించిన నిర్మలా సీతారామన్, తాజా బడ్జెట్లో ఈ మద్దతును పూర్తిగా రద్దు చేయడం గమనార్హం.వ్యూహాత్మక నిల్వలకు రూ.5,000 కోట్లు ఇక సరఫరాల్లో అంతరాయాలను నిరోధించడానికి కర్ణాటకలోని మంగళూరు అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో నిర్మించిన వ్యూహాత్మక భూగర్భ నిల్వల క్షేత్రాలను నింపడానికి వీలుగా ముడి చమురును కొనుగోలు చేయడానికి రూ. 5,000 కోట్లను బడ్జెట్లో ప్రతిపాదించారు. షేర్లు డీలా... తాజా నిర్ణయం నేపథ్యంలో ఎన్ఎస్ఈలో ఐఓసీ షేర్ ధర క్రితం ముగింపుతో పోలి్చతే 2 శాతం నష్టపోయి రూ.166 వద్ద ముగిసింది. బీపీసీఎల్ షేర్ ధర 1 శాతం తగ్గి రూ.306 వద్ద ముగిసింది. హెచ్‌పీసీఎల్ షేరు ధర స్వల్ప నష్టంతో 347 వద్ద స్థిరపడింది.క్రూజ్ పర్యాటకానికి ప్రోత్సాహంవిదేశీ షిప్పింగ్ కంపెనీలపై సులభతర పన్ను దేశీ క్రూజ్ విభాగంలో కార్యకలాపాలు నిర్వహించే విదేశీ షిప్పింగ్ కంపెనీలకు సులభతర పన్నుల విధానాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. క్రూజ్ పర్యాటకంలో ఉపాధి అవకాశాలను పెంచేందుకు ఈ చర్య తీసుకున్నారు. సముద్ర జలాలపై నడిచే పర్యాటక ఓడలను క్రూజ్‌లుగా చెబుతారు. దేశంలో క్రూజ్ పర్యాటకానికి భారీ అవకాశాలున్నట్టు మంత్రి చెప్పారు.ఈ విభాగంలో భారత షిప్పింగ్ పరిశ్రమ వాటాను పెంచేందుకు, ఉపాధి అవకాశాలను పెంచేందుకు యాజమాన్యం, లీజింగ్ పరంగా సంస్కరణలు తీసుకొస్తామని ప్రకటించారు. క్రూజ్ పర్యాటకానికి భారత్‌ను ఆర్షణీయ కేంద్రంగా మారుస్తామని, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తామని చెప్పారు. ‘‘క్రూజ్ షిప్పింగ్‌ల నిర్వహణలో పాలు పంచుకునే ప్రవాసులకు ఊహాత్మకమైన పన్ను విధానం ప్రతిపాదిస్తున్నాం. విదేశీ కంపెనీ, నాన్ రెసిడెంట్ షిప్ ఆపరేటర్ రెండూ ఒకే హోల్డింగ్ కంపెనీ కింద ఉంటే లీజ్ రెంటల్ రూపంలో ఆర్జించే ఆదాయంపై పన్ను మినహాయింపును కలి్పస్తున్నాం’’అని వివరించారు. ఈ దిశగా సెక్షన్ 44బీబీసీని ప్రతిపాదించారు. 2025 ఏప్రిల్ 1 నుంచి సవరణలు అమల్లోకి వస్తాయని చెప్పారు. ఎన్పీఎస్పై మరింత పన్ను ప్రయోజనంనూతన పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చే దిశగా కేంద్ర సర్కారు జాతీయ పింఛను పథకంలో (ఎన్పీఎస్) పెట్టుబడులకు ప్రోత్సాహకాన్ని పెంచింది. ఉద్యోగి తరఫున ప్రైవేటు సంస్థలు జమ చేసే ఎన్పీఎస్ వాటాపై పన్ను మినహాయింపు పరిమితిని 14 శాతం చేసింది. ఉద్యోగి మూల వేతనం, కరువు భత్యంలో (గరిష్ట పరిమితి రూ.లక్ష) 10 శాతం జమలపైనే ప్రస్తుతం పన్ను మినహాయింపు ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం ఇది 14 శాతంగానే ఉండగా.. ప్రైవేటు రంగ ఉద్యోగులకు సైతం ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రయోజనాన్ని పెంచారు. ఆదాయపన్ను చట్టంలోని పాత పన్ను వ్యవస్థలో ఉద్యోగి తరఫున సంస్థలు చేసే ఎన్పీఎస్ జమలపై పన్ను మినహాయింపు 10 శాతంగానే కొనసాగుతుంది. ఉదాహరణకు పార్థసారథి మూలవేతనం, కరవు భత్యం రూ.1,00,000 ఉందనుకుంటే.. తాజా మార్పుతో ప్రతి నెలా రూ.4,000 చొప్పున ఏడాదికి రూ.48వేల మొత్తంపై పన్ను లేకుండా చూసుకోవచ్చు. మైనర్ల పేరిట తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఎన్పీఎస్ ఖాతా తెరిచేందుకు ‘ఎన్పీఎస్ వాత్సల్య’ ప్లాన్‌ను కూడా ప్రకటించారు. ఈకామర్స్ ఎగుమతులకు దన్నుహబ్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఈకామర్స్ రంగం ద్వారా ఎగుమతులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో హబ్‌ల ఏర్పాటుకు ప్రతిపాదించింది. ఇందుకు ప్రభుత్వ, ప్రయివేట్ విధానం(పీపీపీ)లో వీలు కలి్పంచనుంది. అవాంతరాలులేని నియంత్రణ, లాజిస్టిక్ మార్గదర్శకాల ద్వారా ఒకే గొడుగుకింద వాణిజ్యం, ఎగుమతి సంబంధ సరీ్వసులకు ఇవి తెరతీయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. వెరసి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు(ఎంఎస్ఎంఈలు), సంప్రదాయ చేనేత, హస్తకళలు తదితర శ్రామికులు తమ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించేందుకు వీలు చిక్కనున్నట్లు తెలియజేశారు.ప్రస్తుతం ఈకామర్స్ విభాగం ద్వారా దేశీ ఎగుమతులు కేవలం 5 బిలియన్ డాలర్లకు పరిమితంకాగా.. చైనా నుంచి వార్షికంగా 300 బిలియన్ డాలర్లు ఎగుమతులు నమోదవుతున్నాయి. రానున్న కాలంలో 50–100 బిలియన్ డాలర్లకు దేశీ ఎగుమతులను పెంచేందుకు అవకాశముంది. బడ్జెట్ ప్రతిపాదిత కేంద్రా(హబ్)ల ద్వారా తొలుత చిన్న తయారీదారులు ఈకామర్స్ సంస్థలు(అగ్రిగేటర్ల)కు ఉత్పత్తులను విక్రయిస్తారు.తదుపరి ఇతర మార్కెట్లలో అగ్రిగేటర్లు వీటిని విక్రయిస్తాయి. ప్రధానంగా ఆభరణాలు(జ్యువెలరీ), దుస్తులు, హస్తకళలు తదితరాలకు భారీ అవకాశాలున్నాయి. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకునే బాటలో ఆర్బీఐసహా సంబంధిత శాఖలతో వాణిజ్య శాఖ విభాగం డీజీఎఫ్టీ కలసి పనిచేస్తోంది. ఫలితంగా ఈ హబ్‌లకు ఎగుమతులు క్లియరెన్స్‌లను కలి్పస్తారు. అంతేకాకుండా వేర్‌హౌసింగ్, కస్టమ్స్ క్లియరెన్స్, రిటర్నుల ప్రాసెసింగ్, లేబిలింగ్, టెస్టింగ్, ప్యాకేజింగ్లను వీటికి జత చేస్తారు.డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం రూ. 50,000 కోట్లు ప్రభుత్వ సంస్థలలో వాటాల విక్రయం(డిజిన్వెస్ట్‌మెంట్) ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) రూ. 50,000 కోట్లు సమీకరించవచ్చని తాజా బడ్జెట్ అంచనా వేసింది. మధ్యంతర బడ్జెట్లోనూ ఇదేస్థాయిలో ప్రభుత్వం అంచనాలు ప్రకటించింది. ఇక కేంద్ర ప్రభుత్వ కంపెనీల(సీపీఎస్ఈలు) నుంచి రూ. 56,260 కోట్ల డివిడెండ్ లభించవచ్చని భావిస్తోంది.మధ్యంతర బడ్జెట్లో వేసిన అంచనాలు రూ. 48,000 కోట్లకంటే అధికంకావడం గమనార్హం! మరోవైపు ఆర్బీఐ, పీఎస్‌యూ బ్యాంకుల నుంచి ఈ ఏడాది రూ. 2,32,874 కోట్ల డివిడెండ్ అందుకునే చాన్స్ ఉన్నట్లు బడ్జెట్ ఊహిస్తోంది. ఇందుకు ప్రధానంగా ఆర్బీఐ నుంచి రూ. 2.11 లక్షల కోట్ల అనూహ్య డివిడెండ్ లభించడం ప్రభావం చూపింది. మధ్యంతర బడ్జెట్ ఈ పద్దుకింద రూ. 1.02 లక్షల కోట్లు మాత్రమే అంచనా వేసింది.దివాలా వ్యవహారాల్లో ఇక మరింత పారదర్శకతఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్ ఏర్పాటు దివాలా కోడ్ (ఐబీసీ) పక్రియను మరింత మెరుగుపరచడంపై బడ్జెట్ దృష్టి సారించింది. ఇందుకు సంబంధించి స్థిరత్వం, పారదర్శకత, సమయానుకూల ప్రాసెసింగ్, వాటాదారులకు సంబంధించి మెరుగైన పర్యవేక్షణ సాధన లక్ష్యంగా ‘ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్’ను ఆవిష్కరిస్తున్నట్లు ఆర్థికమంత్రి తెలిపారు. 2016 నుంచి అమల్లోకి వచ్చిన దివాలా కోడ్ పటిష్టత కోసం తగిన మార్పులను తీసుకురావడం జరుగుతుందని మంత్రి తెలిపారు. కోడ్‌ను ఇప్పటి వరకూ ఆరు సార్లు సవరించిన సంగతి తెలిసిందే. ఐబీసీ 1,000 కంటే ఎక్కువ కంపెనీల దివాల అంశాలను పరిష్కరించిందని, ఫలితంగా రుణదాతలకు నేరుగా రూ. 3.3 లక్షల కోట్ల రికవరీ జరిగిందని ఆమె చెప్పారు. ప్రస్తుతం దేశ రాజధానిలో ఉన్న ప్రధాన బెంచ్సహా 15 నగరాల్లో ఎన్సీఎల్టీ బెంచ్‌లు ఉన్నాయి. అంతేకాకుండా, నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఢిల్లీ, చెన్నైలలో బెంచ్‌లను కలిగి ఉంది. రికవరీని వేగవంతం చేసేందుకు మరిన్ని ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపారు. టెలికం పరికరాల దిగుమతులకు చెక్10 శాతం నుంచి 15 శాతానికి సుంకాల పెంపు దేశీయంగా టెలికం గేర్ తయారీకి దన్నుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్లో దిగుమతి సుంకాల పెంపునకు తెరతీశారు. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు(పీసీబీఏ)లుగా వ్యవహరించే మదర్‌బోర్డులపై 5 శాతం పెంపును ప్రతిపాదించారు. వెరసి టెలికం పీసీబీఏలపై బేసిక్ కస్టమ్ డ్యూటీ ప్రస్తుత 10 శాతం నుంచి 15 శాతానికి పెరగనుంది.అయితే కమ్యూనికేషన్ పరికరాల తయారీలో వినియోగించే కీలక 25 మినరల్స్‌పై డ్యూటీని పూర్తిస్థాయిలో మినహాయించింది. వీటిలో అణువిద్యుత్, పునరుత్పాదక ఇంధనం, రక్షణ, టెలికం రంగాలలో వినియోగించే లిథియం, కాపర్, కోబాల్ట్ తదితరాలున్నాయి.రూ.50 లక్షలు మించితేనే రిటర్నుల పునః మదింపుపన్ను చెల్లింపుదారులకు సంబంధించి కొన్ని సానుకూల చర్యలకు బడ్జెట్లో చోటు లభించింది. ఎగవేసిన పన్ను ఆదాయం రూ.50లక్షలకు మించి ఉన్నప్పుడే.. అసెస్మెంట్ సంవత్సరం ముగిసిన మూడు నుంచి ఐదేళ్లలోపు తిరిగి మదింపు చేయవచ్చని ప్రకటించారు. సోదాలకు సంబంధించి కూడా ప్రస్తుతం అసెస్మెంట్ సంవత్సరం ముగిసిన పదేళ్ల వరకు అవకాశం ఉండగా, దీన్ని ఆరేళ్లకు తగ్గించారు.పన్నుల విషయంలో అనిశి్చత, వివాదాలను ఈ చర్యలు తగ్గిస్తాయని మంత్రి చెప్పారు. ఎలాంటి కేసుల్లోనూ ఐదేళ్ల తర్వాత సంబంధిత పన్ను రిటర్నులను తిరిగి మదించకుండా నిబంధనల్లో సవరణలు తీసుకొస్తామని ప్రకటించారు. పన్ను వివాదాల పరిష్కారానికి వీలుగా ‘వివాద్ సే విశ్వాస్ పథకం 2.0’ను తీసుకొస్తామన్నారు. సమతౌల్యత సాధన..ప్రజాదరణ, విధాన చర్యల మధ్య సమతుల్యతను సాధించడానికి ప్రభుత్వం ప్రయతి్నంచింది. రైతులకు ద్రవ్య మద్దతు, వ్యక్తిగత ఆదాయపు పన్నులో అధిక మినహాయింపు పరిమితులు, పెరిగిన ప్రామాణిక తగ్గింపులు వంటి కార్యక్రమాలు ఖర్చు చేయదగ్గ అధిక ఆదాయాన్ని అందిస్తాయి. ఇది వ్యయాలను పెంచడానికి దారి తీస్తుంది. – కుమార్ రాజగోపాలన్, సీఈవో, రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా.కీలక పురోగతి..ఊహించినట్లుగా 2024 యూనియన్ బడ్జెట్ సౌర, పునరుత్పాదక ఇంధన రంగాలకు ప్రాధాన్యత ఇచ్చింది. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద ఒక కోటి రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేయాలనే లక్ష్యం ఒక ముఖ్యమైన పురోగతిగా నిలుస్తుంది. కస్టమ్ డ్యూటీ మినహాయింపు జాబితా నుండి సోలార్ గ్లాస్, గ్లాస్, కాపర్ వైర్ కనెక్టర్లను తొలగించడం వివేకవంతమైన చర్య. అభివృద్ధి చెందుతున్న దేశీయ పరిశ్రమకు మద్దతుగా ఈ నిర్ణయం కీలకం. – విశ్వేశ్వర రెడ్డి, సీఎండీ, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అద్భుతమైనది ఏమీ లేదు..ఆతిథ్య రంగానికి సంబంధించి ఎటువంటి నిర్దిష్ట చర్యలు లేకపోవడం నిరాశ కలిగించింది. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఈ రంగం వృద్ధిని వేగవంతం చేయడానికి బడ్జెట్లో అద్భుతమైనది ఏమీ లేదు. – ప్రదీప్ శెట్టి, ప్రెసిడెంట్, ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అసోసియేషన్స్వ్యవసాయానికి దన్నువ్యవసాయం భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచినందున ఆహార భద్రత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, అలాగే వ్యవసాయంలో ఉత్పాదకతను పెంపొందించడంపై కేంద్ర బడ్జెట్ ప్రాధాన్యతను స్వాగతిస్తున్నాము. ఉత్పాదకతను మెరుగుపరచడం, వాతావరణాన్ని తట్టుకునే పంటలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించడానికి ప్రతిపాదిత సమగ్ర సమీక్ష భారతీయ వ్యవసాయం వాతావరణ ప్రభావాన్ని తట్టుకోగలదని నిర్ధారించడానికి ఒక ప్రేరణనిస్తుంది. – అరుణ్ అలగప్పన్, కోరమాండల్ ఇంటర్నేషనల్.వృద్ధి ఆధారితంఅభివృద్ధి ఆధారిత బడ్జెట్. ఇది స్వల్పకాలిక డిమాండ్ ఉద్దీపన, ఆర్థిక క్రమశిక్షణను కొనసాగిస్తూ మధ్యకాలిక వృద్ధి ఆవశ్యకతలపై దృష్టి సారించింది. ఉద్యోగాల కల్పన, నైపుణ్యానికి బలమైన ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్ అందరినీ కలుపుకొని ఉంది. – అనీశ్ షా, ప్రెసిడెంట్, ఫిక్కీ.సాహసోపేతందీర్ఘకాలిక ఆర్థిక వివేకాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రూపొందించిన సాహసోపేత బడ్జెట్ ఇది. దేశంలో తయారీ, ఎంఎస్ఎంఈల పటిష్ట పాత్ర ద్వారా ఉద్యోగ కల్పన యొక్క సుదీర్ఘ, మరింత స్థిర మార్గంపై దృష్టి పెడుతుంది. – సంజయ్ నాయర్, ప్రెసిడెంట్, అసోచామ్.మౌలిక రంగ పురోగతి లక్ష్యంవివిధ ముఖ్య ప్రాజెక్టులు, కేటాయింపుల ద్వారా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం వల్ల నిస్సందేహంగా సిమెంట్, ఇతర నిర్మాణ సామగ్రికి డిమాండ్ పెరుగుతుంది. ఆర్థిక ఏకీకరణపై దృష్టి సారించి పరివర్తనాత్మకంగా, ముందుకు చూసేదిగా బడ్జెట్ ఉంది. ఇది మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉపాధి కల్పన, ఇంధన భద్రతపై బలమైన దృష్టిని కలిగి ఉంది. – నీరజ్ అఖౌరీ, ప్రెసిడెంట్, సిమెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్.ఉపాధి కల్పనకు ఊతంబడ్జెట్లో పురోగామి ప్రతిపాదనలు చేశారు. దీనితో ఉత్తరాంధ్రలో కనీసం 2,00,000 ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంది. వివిధ రంగాల అభివృద్ధికి గణనీయంగా అవకాశాలు కలి్పంచడం ద్వారా దేశీయంగా ఉపాధి కల్పన ముఖచిత్రాన్ని మార్చే విధంగా బడ్జెట్ ఉంది. – గేదెల శీనుబాబు, సీఈవో, పల్సస్ గ్రూప్ -
స్టాక్ మార్కెట్‌పై పన్నుల పిడుగు
రూపాయి: 83.72 ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ అటు ఇంట్రాడే, ఇటు ముగింపు రెండింటిలో చరిత్రాత్మక కనిష్టాలను చూసింది. ఇంట్రాడేలో 83.72 స్థాయిని తాకితే, చివరికి క్రితం ముగింపుతో పోలి్చతే 3 పైసలు నష్టంతో 83.69 వద్ద ముగిసింది. క్యాపిటల్ గెయిన్స్‌పై పన్ను రేట్ల పెంపు రూపాయి నష్టానికి కారణం. న్యూఢిల్లీ: వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా సంకీర్ణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్ స్టాక్ మార్కెట్‌ను మెప్పించలేకపోయింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగ సమయంలో తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సూచీలు చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సెక్యూరిటీలపై సెక్యూరిటీ లావాదేవీల పన్ను(ఎస్టీటీ), స్వల్పకాలిక మూలధన రాబడి(ఎస్టీసీజీ), ధీర్ఘ కాలిక మూలధన రాబడి(ఎల్టీసీజీ)లపై పన్నుల పెంపు ప్రతిపాదనలు ఇన్వెస్టర్లను తీవ్ర నిరాశపరిచాయి.అయితే పన్ను మినహాయింపులు, కస్టమ్స్ సుంకం తగ్గింపు, ద్రవ్యోలోటు కట్టడికి చర్యల ప్రకటనలతో సూచీలు మళ్లీ పుంజుకొని స్వల్ప నష్టాలతో ముగిశాయి. రియలీ్ట, క్యాపిటల్ గూడ్స్, ఇండస్ట్రీయల్, ఫైనాన్సియల్ సరీ్వసెస్, మెటల్, కమోడిటీస్, టెలికం షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. కన్జూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంసీజీ, ఐటీ, సరీ్వసెస్, ఫార్మా, టెక్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఇంట్రాడేలో తీవ్ర ఒడిదుడుకులు బడ్జెట్ రోజు ఉదయం స్టాక్ మార్కెట్ లాభాలతో మొదలైంది. సెన్సెక్స్ 222 పాయింట్లు పెరిగి 80,725 వద్ద, నిఫ్టీ 60 పాయింట్ల లాభంతో 24,569 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. ఎఫ్అండ్ఓ సెక్యూరిటీలపై ఎస్టీటీ, ఎల్టీసీజీ, ఎస్టీసీజీ పన్నుల పెంపు ప్రకటనలతో ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తాయి. సెన్సెక్స్ 1,278 పాయింట్లు క్షీణించి 79,224 పాయింట్ల వద్ద, నిఫ్టీ 235 పాయింట్లు కుప్పకూలి 24,074 పాయింట్ల వద్ద కనిష్టాలను తాకాయి.పన్ను మినహాయింపులు, కస్టమ్స్ సుంకం తగ్గింపు ప్రకటన తరువాత.., కన్జూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంసీజీ షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. దీంతో సూచీలు కనిష్టాల నుంచి రికవరీ అయ్యాయి. చివరికి సెన్సెక్స్ 73 పాయింట్లు నష్టపోయి 80,429 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 30 పాయింట్లు కోల్పోయి 24,479 వద్ద ముగిసింది. ‘‘బడ్జెట్లో మూలధన వ్యయాలకు అధిక కేటాయింపులు ఉండొచ్చని ఆశించారు. స్వల్పకాలిక మూలధన లాభాలపై (ఎస్టీసీజీ) పన్ను 20 శాతానికి పెంచడం; దీర్ఘకాలిక మూలధన లాభాలపై (ఎల్టీసీజీ) పన్ను 12.5 శాతానికి పెంపు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సెక్యూరిటీలపై సెక్యూరిటీ లావాదేవీల పన్ను(ఎస్టీటీ)0.1%, 0.02 శాతం పెంపు అంశాలు స్టాక్ మార్కెట్‌కు కచి్చతంగా ప్రతికూల అంశాలు.స్వల్ప కాలం పాటు ఎదురయ్యే ప్రతికూలతలను ఎదుర్కొనేందుకు ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉండాలి. గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన అధిక కేటాయింపు ప్రకటనలు మార్కెట్ నష్టాలు తగ్గించాయి’’ మెహ్తా ఈక్విటీస్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సే తెలిపారు. ⇒ వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లు, గ్రామీణాభివృద్ధి రూ.2.66 లక్షల కోట్లు కేటాయింపుతో పాటు ఉద్యోగ కల్పనలకు పెద్ధ పీట వేయడంతో కన్జూమర్, ఎఫ్ఎంసీజీ షేర్లు రాణించాయి. ఐటీసీ షేరు 5%, టాటా కన్జూమర్స్ ప్రొడెక్ట్స్, డాబర్ షేర్లు 3% పెరిగాయి. గోద్రేజ్ కన్జూమర్ ప్రోడెక్ట్స్, హెచ్‌యూఎల్, మారికో, బ్రిటానియా, కోల్గేట్, యూనిటెడ్ బేవరేజెస్, యూనిటెడ్ స్పిరిట్స్, బలరామ్‌పుర్ చినీ షేర్లు 2% నుంచి ఒకశాతం లాభపడ్డాయి. -
ఏపీకి ఇచ్చింది రుణమే! గ్రాంట్ కాదు!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్ ప్రతిపాదించిన బడ్జెట్ విద్యారంగాన్నీ, వ్యవసాయాన్నీ పెద్దగా పట్టించుకోలేదు. నిరుద్యోగులకూ ఒరగబెట్టింది ఏమీ లేదు. అలాగే కేటాయింపుల్లో బిహార్, ఆంధ్రప్రదేశ్‌లకు దక్కిందీ అంతంతే! ఏపీ కొత్త రాజధానికి 15 వేల కోట్లు ఇస్తామంటున్నది ఋణమే తప్ప గ్రాంట్ కాదు. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద మొత్తంలో కేటాయించినా ఉద్యో గాల కల్పనకు అది దోహదపడడం లేదన్నది ఇప్పటికే నిరూపి తమయ్యింది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌కు ఒకరోజు ముందు ప్రకటించిన ఎకనమిక్ సర్వేతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపా దించిన వార్షిక బడ్జెట్‌కు చాలా అంశాల పరంగా ఎలాంటి లింక్ కని పించడం లేదు. 2047 కల్లా ‘వికసిత్ భారత్’ను సాకారం చేయాలని ప్రతి పాదించినా... దాన్ని ఎలా సాక్షాత్క రింప చేస్తారనే విషయంలో కచ్చి తమైన కార్యాచరణ, చర్యలు ప్రకటించలేదు. గతం నుంచి చూస్తే ఎకనమిక్ సర్వే ఆర్థిక రంగ పరిస్థి తులు, ప్రస్తుత స్థితిగా ఎత్తిచూపేదిగా ఉంటూ వస్తోంది. సాధా రణంగా దీనికి అనుగుణంగా బడ్జెట్లో ఆ యా రంగాలకు చేసే కేటాయింపులు, ఇతర అంశాలు ఆధారపడి ఉంటాయి.ప్రతిపాదిత బడ్జెట్లోని కీలకరంగాలు, ముఖ్యమైన అంశా లను పరిశీలించినా స్పష్టత కనిపించలేదు. ఉపాధి, నైపుణ్యా భివృద్ధి, ఎమ్మెస్ఎంఈలు, మధ్యతరగతి అనే వాటి గురించి ప్రధానంగా పేర్కొన్నారు. వీటిలో మొదటి మూడు అంశాలు ఒక దానికి ఒకటి లంకె కలిగినవి. ఐతే ఈ అంశాలను గురించి చెప్పాక కూడా ప్రభుత్వ ప్రాధాన్యాలు మారే అవకాశాలున్నాయి. అన్నింటికంటే కూడా అత్యధికంగా ఆందోళన కలిగించే అంశం ద్రవ్యోల్బణం. దాని గురించి బడ్జెట్లో ప్రస్తావనే లేదు. వ్యవసాయ రంగానికి పెద్దగా నిధులు పెంచింది ఏమీ లేదు. పాత విధానానికి కొనసాగింపును ఈ బడ్జెట్ కేటాయింపులు ప్రతిబింబిస్తున్నాయి. ఆర్థిక సర్వే వ్యవసాయేతర రంగంలో కనీసం 75 లక్షల ఉద్యోగాలను కల్పించాలని చెప్పినా ఆ మేరకు బడ్జెట్లో ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఎమ్మెస్‌ఎంఈల కంటే దిగువ స్థాయిలో ఉండే అసంఘటిత రంగంలో 2016 నుంచి 2022–23 వరకు 54 లక్షల ఉద్యోగాలు పోయాయి. ప్రధానంగా... పెద్దనోట్ల రద్దు, జీఎస్టీని ఒత్తిడితో అమలుచేయడం, కోవిడ్ పరిస్థితుల ప్రభావం దీనికి కారణాలు. దాదాపు 18 లక్షల యూనిట్లు మూతపడ్డాయి. దీనిని సరిచేసే చర్యలు పూర్తిస్థాయిలో చేపట్టలేదు. రెగ్యులేటరీ మెకానిజాన్ని రిలాక్స్ చేసి రుణాల కల్పన (క్రెడిట్ ఫెసిలిటీ) చేస్తామని చెబుతున్నారు. ఇది వాంఛ నీయమే. నైపుణ్యాల అభివృద్ధి (స్కిల్ డెవలప్మెంట్)తోనే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పడం తప్పుదారి పట్టించడమే అవుతుంది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో నైపుణ్యాలకు మెరుగులు దిద్దడం అనేది విద్యారంగంతో లింకు కలదిగా గుర్తించాలి. పన్నెండో తరగతి దాకా నాణ్యతతో కూడిన విద్యా భ్యాసాన్ని అందించడంలో భాగంగా నైపుణ్యాల శిక్షణను కూడా అందజేయాలి. బడ్జెట్లో కొత్తగా తూర్పు (ఈస్ట్రన్ స్టేట్స్) రాష్ట్రాలు అని పేర్కొన్నారు. ఇది కొత్త ఆవిష్కరణగా భావించాలా? ఈ రాష్ట్రాల కింద పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, బిహార్, ఒరిస్సాల గురించి చెప్పారు. అయినా వీటిలో కేవలం ఆంధ్రప్రదేశ్, బిహార్‌ల గురించి ప్రస్తావించారు. దేశంలో ప్రస్తుతం ఏర్పడిన రాజకీయ పరిస్థితులతో ఈ రెండు రాష్ట్రాలకు రాజకీయంగా ప్రాధాన్యం పెరిగిన విషయం తెలిసిందే. ఈ రెండు రాష్ట్రాలు పెద్ద ఆర్థిక ప్యాకేజీని, ప్రత్యేక హోదా వంటివి కోరుకుంటుండగా వాటికి కంటితుడుపుగానే కేటాయింపులు చేశారు. ఆంధ్రప్రదేశ్ విషయా నికొస్తే... కొత్త రాజధాని కోసం రూ. 15 వేల కోట్లు రుణం (ప్రపంచబ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్‌ల ద్వారా ఇచ్చే అవకాశాలు) ఇప్పిస్తామన్నారు. రాజధానికి కేంద్రం బడ్జెట్ ద్వారా గ్రాంట్ రూపంలో కాకుండా రుణకల్పన వెసులుబాటు కల్పిస్తామనడం సరికాదు. ఈ రాష్ట్రాలకు పరిశ్రమల కల్పన, మరింత మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఉద్యోగాలు, ఉపాధి కల్పనకు చర్యలు తీసుకోవాల్సి ఉండగా అది జరగడం లేదు. ప్రభుత్వ పరంగా మౌలిక సదుపాయాల వృద్ధికి రోడ్లు, బ్రిడ్జీలు వంటివి నిర్మిస్తున్నారు. అవి ఉద్యోగాలు, ఉపాధి కల్పనకు ఉపయోగపడలేక పోతున్నాయి. ప్రైవేట్ కన్జమ్షన్ డిమాండ్‌ను పెంచలేకపోతే ప్రైవేట్ పెట్టుబడులు రావనేది లాజిక్. ప్రస్తుతమున్న పరిస్థితులు చూస్తే మాత్రం ఉపాధి కల్పన సరిగా లేక భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తం మీద బడ్జెట్ చెప్పుకోదగినంత గొప్పగా లేదనేది సత్యం.ప్రొ‘‘ డి. నర్సింహారెడ్డి వ్యాసకర్త పూర్వ డీన్, స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ -
రైతులకు ‘అమృతం’ ఇవ్వడం మరిచిన కేంద్రం
రైతుల ఆదాయం రెట్టింపు చేసే లక్ష్యం గురించి కేంద్ర ‘అమృత్ కాల్’ బడ్జెట్లో ఎటువంటి ప్రస్తావనా లేదు. వాతావరణ ప్రతికూల ప్రభావాల సవాళ్ల నేపథ్యంలో వ్యవసాయ రంగానికి ‘ఒక కొత్త దారి’ అవసరమని తెలిసినప్పటికీ, ఆ దిశగా అడుగులు పడలేదు. ప్రకృతి వ్యవసాయం వైపు కోటి మంది రైతులను మళ్ళిస్తామని ఆర్థిక మంత్రి చెప్పినా దానికి జరిపిన కేటాయింపులు ఏ మూలకూ రావు.వ్యవసాయ అభివృద్ధి బాగా ఉన్నది, ఆహార ఉత్పత్తి పెరుగుతున్నది అని కేంద్రప్రభుత్వం ప్రకటన చేసింది. కానీ రైతుల ఆదాయం గురించీ, దానిని రెట్టింపు చేసే లక్ష్యం గురించీ, ఈ మధ్య కాలంలో రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక నష్టాల గురించీ అటు ఆర్థిక సర్వేలోగానీ, ఇటు కేంద్ర బడ్జెట్లోగానీ ఎటువంటి ప్రస్తావనా చేయకపోగా, వారి సమస్య పరిష్కారానికి తగిన స్పందన కనబరచలేదు.భారత వ్యవసాయం మంచి పనితీరును కనబరిచిందనీ, అయితే భూతాపం పెరుగుతున్న నేపథ్యంలో ప్రకృతిలో సంభవిస్తున్న వాతావరణ ప్రతికూల ప్రభావాలు, పెరుగుతున్న పంట ఖర్చులు వంటి కొన్ని సవాళ్ల నేపథ్యంలో ఈ రంగానికి ‘ఒక కొత్త దారి’ అవసరమని జనవరి 31న పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2022–23 ఆర్థిక సర్వే తెలిపింది. 2023–24 ఆర్థిక సర్వే కూడా ఇంచుమించు ఇదే మాట చెప్పింది. అయినా 2024–25 సంవత్సరం బడ్జెట్లో కేటాయింపులు పాత బాటనే పట్టినాయి. ఎన్నికల నుంచి అధికార భారతీయ జనతా పార్టీ పాఠాలు నేర్చుకోలేదు. ప్రైవేటీకరణ, దిగుమతులు, విదేశీ విధానాల విషయాల్లో పాతబాటనే సాగుతోంది. మారుతున్న వాతావరణం వ్యవసాయంపై ప్రతికూల ప్రభావం చూపుతోందని చెప్పిన నివేదిక, ఆహార ఉత్పత్తి పెరిగింది అని చెబుతున్నది. ఈ వైరుద్ధ్యం మీద ఉన్నశంక తీర్చే ప్రయత్నం ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం చేయలేదు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వరదలు, అకాల వర్షాలు ఒక వైపు నష్టపరుస్తుంటే పంటల దిగుబడి ఎట్లా పెరుగుతున్నది? ప్రధానంగా, రైతుల ఆర్థిక పరిస్థితి మీద అంచనా మాత్రం చేయలేదు. బడ్జెట్ కేటాయింపులలో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి కొత్త ఆలోచన విధానం ఏదీ కనపడటం లేదు. కేంద్ర ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో 9 ప్రాధాన్యాలను ప్రస్తావించారు. అందులో మొట్టమొదటిది, వ్యవసాయంలో దిగుబడి పెంచడం, వ్యవసాయాన్ని దృఢంగా సవాళ్ళను ఎదుర్కొనే విధంగా తయారు చేయటం. అయితే, ఎట్లా సాధిస్తారు? బడ్జెట్లో కేటాయింపులతో ఇది సాధ్యమయ్యే పని కాదు. ప్రకృతి వ్యవసాయానికి కోటి మంది రైతులను మారుస్తామని తన ప్రసంగంలో ఆర్థిక మంత్రి చెప్పినా వాస్తవానికి ఇది కొత్త పథకం కాదు. 2023–24లో దానికి ఇచ్చింది రూ.459 కోట్లు మాత్రమే. ఈసారి అది కూడా తగ్గించి రూ.365.64 కోట్లు ఇచ్చారు. 2023–24లో ప్రకృతి వ్యవసాయానికి సవరించిన బడ్జెట్ రూ.100 కోట్లు మాత్రమే. ప్రకృతి వ్యవసాయం కాకుండా పంటల దిగుబడిని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ఉపాయం ఏది?వ్యవసాయానికి ఒక కొత్త దారి అవసరమని పదే పదే ఆర్థిక సర్వేలు చెప్పినా, వ్యవసాయ బడ్జెట్లో ఆ దిశగా ఆలోచన చేయలేదు. వ్యవసాయానికి కేటాయింపులు తగ్గించారు. 2022–23లో రూ.1,24,000 కోట్లుగా ఉన్న వ్యవసాయ కేటాయింపులు 2023– 24లో రూ.1,15,531.79 కోట్లకు తగ్గాయి. ఇది 7 శాతం తగ్గింపు. 2024–25లో వ్యవసాయ పరిశోధనలకు పెద్ద పీట వేస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించినా పరిశోధనలకు ఇచ్చినవి మొత్తం రూ.9,941 కోట్లు మాత్రమే. ప్రకటించిన స్థాయిలో కేటాయింపులు లేవు. 2022–23లో ఇదే పద్దుకు ఇచ్చినవి రూ. 8,513.62 కోట్లు. 2023–24లో ఇచ్చినవి రూ.9,504 కోట్లు. పశుగణ అభివృద్ధికి, మత్స్య రంగానికి కలిపి రూ.7,137 కోట్లు ఈసారి ఇచ్చారు. అంతకుముందు సంవత్సరాలలో వరుసగా కేటాయించింది రూ.6576.62 కోట్లు, రూ.5,956.70 కోట్లు. నిధులు పెరిగినట్లు కనిపిస్తున్నప్పటికీ ఈ రంగాల అభివృద్ధిని నిలువరిస్తున్న మౌలిక అంశాల మీద దృష్టి పెట్టలేదు. వ్యవసాయ శాఖ ఆఫీసు ఖర్చులు 167 శాతం పెంచిన ప్రభుత్వం, ప్రధాన మంత్రి పంటల బీమా పథకానికి 13 శాతం కోత విధించింది. ఈసారి ఇచ్చింది కేవలం రూ.13,625 కోట్లు మాత్రమే. ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో, నకిలీ విత్తనాల బారినపడి, రైతులకు పంట నష్టం పెరుగుతుంటే ఆదుకునే ఒకే ఒక్క బీమా పథకాన్ని ఇంకా విస్తృతం చేయాల్సి ఉండగా తగ్గించడం శోచనీయం.కొత్త ఉపాధి కల్పన పథకం ప్రవేశపెట్టి రూ.10 వేల కోట్లు బడ్జెట్ కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. నెలవారీ జీతం తీసుకునే యువతకు (సంవత్సరానికి రూ.లక్ష వరకు) కొంత భృతి చెల్లించే ఈ పథకం లక్ష్యం అంతుబట్టకుండా ఉన్నది. గ్రామీణ భారతంలో ఉన్న ఉపాధికి, దాని రక్షణకు కేటాయింపులు చేయడం లేదు. ఈ పథకం కేవలం పారిశ్రామిక ఉత్పత్తి రంగాలకు రాయితీగా ఇస్తునట్టు కనబడుతున్నది. శ్రామిక శక్తికి అవసరమైన వసతుల కల్పనకు, సంక్షేమానికి, ఉద్యోగ రక్షణకు కాకుండా ఫ్యాక్టరీలలో ఉపాధికి ఈ రాయితీ ఇవ్వడం అంటే ఆ యా కంపెనీలకు ఇవ్వడమే! పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల శ్రామికుల ఉత్పాదకత శక్తి పడిపోతున్నది. ఆహార ద్రవ్యోల్బణం వల్ల సరి అయిన పరిమాణంలో పౌష్టిక ఆహారం శ్రామిక కుటుంబాలకు అందడం లేదు. ఈ సమస్యలను కేంద్ర ప్రభుత్వం గుర్తించకపోవటం దురదృష్టకరం. పర్యావరణానికి దోహదపడే చేతివృత్తుల ఉపాధికి ఈ పథకం ఇచ్చివుంటే బాగుండేది.వివిధ మార్గాల ద్వారా 2024–25లో కేంద్రం ఆశిస్తున్న ఆదాయం రూ. 46,80,115 కోట్లు. పోయిన సంవత్సరం మీద రాబోయే సంవత్సరంలో పెరిగిన కేంద్ర ప్రభుత్వ ఆదాయం రూ.2,50,000 కోట్లు. కానీ పెరిగిన ఈ ఆదాయాన్ని గ్రామీణ ప్రాంతాల మీద పెట్టడం లేదు. కరోనా లాంటి కష్టకాలంలో ఉపాధి ఇచ్చి ఆదుకున్న వ్యవసాయానికి కాకుండా ఇతర రంగాలకు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సంసిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం మీద అప్పుల భారం పెరుగుతున్నది. 2022–23 నాటికే ఇది రూ.1,54,78,987 కోట్లకు చేరింది. మౌలిక సదుపాయాల మీద పెట్టుబడులకు రూ. 11 లక్షల కోట్లు ప్రకటించింది ప్రభుత్వం. ఇది ఆశ్చర్యం కలిగించకమానదు. అభివృద్ధి అందరికీ కాకుండా కొందరికే పోతున్నది అని నివేదికలు చెబుతున్నప్పటికీ, అభివృద్ధి తీరులో మార్పులకు కేంద్ర ప్రభుత్వ సిద్ధంగా లేదు. వేల కోట్ల పెట్టుబడులతో నిర్మించే రోడ్లు, వంతెనలు వగైరా మౌలిక వసతులు నాసిరకం నిర్మాణం వల్ల, లేదా ప్రకృతి వైపరీత్యాల వల్ల కూలిపోతుంటే పరిస్థితిని సమీక్షించకుండా, సమస్య లోతులను గుర్తించకుండా పదే పదే ఈ రకమైన పెట్టుబడుల మీద ప్రజా ధనం వెచ్చించడం వృథా ప్రయాసే అవుతుంది.డా‘‘ దొంతి నరసింహారెడ్డి వ్యాసకర్త వ్యవసాయ రంగ నిపుణులు -
ఇకపై తగ్గనున్న మొబైల్ ఫోన్ ధరలు.. ఎందుకంటే?
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2024-25లో సాంకేతిక రంగానికి ప్రోత్సాహకాలను అందించింది. మొబైల్ ఫోన్స్, ఛార్జర్లు, పీసీబీఏ సుంకాలను 20 నుంచి 15 శాతానికి తగ్గించారు. దేశంలో మొబైల్ ఫోన్స్ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. దేశం నుంచి ఎగుమతులు కూడా విరివిగా జరుగుతున్నాయి.గత ఆరేళ్లలో మొబైల్ ఫోన్స్ ఉత్పత్తి ఏకంగా మూడు రెట్లు పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. మొబైల్ పరిశ్రమ గణనీయంగా వృద్ధి చెందటంతో బేసిక్ కస్టమ్స్ డ్యూటీని తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. అంతే కాకుండా ఈ ఏది జనవరిలోనే కేంద్ర ప్రభుత్వం మొబైల్ ఫోన్ విడిభాగాల దిగుమతి సుంకాలను కూడా 15 నుంచి 10 శాతానికి తగ్గించింది.యాపిల్, ఒప్పో, వివో మొదలైన కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ టారిఫ్ స్లాబ్ హేతుబద్ధీకరణ ప్రతిపాదనను కూడా అంగీకరించింది. దిగుమతి సుంకాలు తగ్గించడంతో భారతదేశంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు బాగా తగ్గుతాయని స్పష్టమవుతోంది. -
బడ్జెట్ బూస్ట్, మా ఆదాయం రూ. 2500 కోట్లకు పెరగొచ్చు- నితిన్ కామత్
2024 బడ్జెట్లో సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను (ఎస్టిటి) రెట్టింపు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జెరోధా సీఈవో ఎక్స్‌లో స్పందించారు. తాజా కేంద్ర బడ్జెట్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదనతో తమకు రెట్టింపు లాభాలొస్తాయంటూ ట్వీట్ చేశారు.Budget summary for usSTT on options goes up from 0.062% to 0.1%. STT on futures goes up from 0.0125% to 0.02% from October 1st. We collected about Rs 1500 crores of STT last year, @zerodhaonline. If the volumes don't drop, this will increase to about Rs 2500 crores at the new…— Nithin Kamath (@Nithin0dha) July 23, 2024 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ కొలువు దీరిన తరువాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో స్టాక్ మార్కెట్లకు సంబంధించి అనేక మార్పులను ప్రకటించారు. ముఖ్యంగా సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను (ఎస్టిటి)ను ప్రస్తుత 0.01 శాతం నుండి 0.02 శాతానికి పెంచారు. అక్టోబర్ 1 నుండి ఇది అమల్లోకి రానుంది. ఈ పెంపు ద్వారా తాము రూ. 2,500 కోట్లు ఆర్జించే అవకాశం ఉందని వ్యవస్థాపకుడు, సీఈవో నితిన్ కామత్ తెలిపారు. గత ఏడాది ఈ పన్ను ద్వారా 1500కోట్లు వసూలు అయ్యాయి. ఇపుడిక ట్రేడింగ్ వాల్యూమ్‌లు తగ్గకపోతే కొత్త ధరల ప్రకారం రూ. 2,500 కోట్ల వరకు పెరగొచ్చని లెక్కలు చెప్పారు.బడ్జెట్ 2024-మార్కెట్-ప్రతిపాదనలుస్థిరాస్తి విక్రయానికి సంబంధించిన పన్నుల కోసం ఇండెక్సేషన్ ప్రయోజనాన్ని కూడా తొలగించింది. అలాగే ఆస్తి విక్రయంపై మూలధన లాభాల పన్నును ప్రస్తుత 20 శాతం నుండి 12.5 శాతానికి తగ్గించింది.దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును 10శాతం నుంచి 12.5శాతానికి పెంచారు.స్వల్పకాలిక మూలధన లాభాల పన్నును 15శాతం నుంచి 20శాతానికి పెంచారు. ఈ రెండూ నేటి నుంచి అమలులోకి రానున్నాయి. -
కేంద్ర మంత్రుల జీతాలకు కేటాయింపులు
కేంద్ర బడ్జెట్ 2024-25లో మంత్రిమండలి, క్యాబినెట్ సెక్రటేరియట్, ప్రధాన మంత్రి కార్యాలయ నిర్వహణ, ఇతర ఖర్చుల జాబితాను విడుదల చేశారు. ఇందుకోసం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ .1,248.91 కోట్లు ఖర్చు చేయనున్నట్లు అంచనా వేశారు. ఇది 2023-24లో కేటాయించిన రూ.1,803.01 కోట్ల కంటే తక్కువ.ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రకటించిన పద్దుల పత్రాల్లో మంత్రి మండలి ఖర్చుల వివరాలను తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను మంత్రి మండలి ఖర్చుల కోసం మొత్తం రూ.828.36 కోట్లు కేటాయించారు. 2023-24లో ఇది రూ.1,289.28 కోట్లుగా ఉంది. కేబినెట్ మంత్రులు, మాజీ ప్రధాన మంత్రుల జీతాలు, ఇతర అలవెన్సులు ప్రయాణాల ఖర్చుల కోసం ఈ నిధులను వెచ్చిస్తారు.జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్‌కు రూ.202.10 కోట్లు ఇచ్చారు. 2023-24లో ఇది రూ.299.30 కోట్లుగా ఉంది. ఈ మొత్తం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ అడ్మినిస్ట్రేటివ్ ఖర్చుల కోసం ఉపయోగిస్తారు. ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయానికి (2023-24లో రూ.76.20 కోట్లు) మొత్తం రూ.72.11 కోట్లు అందించారు. ఈ కార్యాలయంతోపాటు నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అడ్మినిస్ట్రేటివ్ ఖర్చుల కోసం ఈ నిధులను వాడుకుంటారు.కేంద్ర బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండికెమికల్ వెపన్స్ కన్వెన్షన్ (సీడబ్ల్యూసీ) పరిపాలనా ఖర్చుల కోసం 2023-24లో రూ.70.28 కోట్లు కేటాయించిన కేంద్రం ఈసారి రూ.75.24 కోట్లు ఇచ్చింది. ప్రధానమంత్రి కార్యాలయం పరిపాలనా ఖర్చుల కోసం రూ.65.30 కోట్లు (2023-24లో రూ. 62.65 కోట్లు) కేటాయించారు. మాజీ గవర్నర్లకు సచివాలయ సహాయం చెల్లింపుల కోసం బడ్జెట్లో రూ.1.80 కోట్లు (2023-24లో రూ.1.30 కోట్లు) కేటాయించారు. -
ఆటో పరిశ్రమపై కురవని వరాల జల్లు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఇందులో విద్య, వైద్యం, డిఫెన్స్ మొదలైన రంగాలకు వేలకోట్లు కేటాయించారు. కాగా రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న ఆటోమొబైల్ రంగానికి సంబంధించి ప్రత్యేకంగా ఎటువంటి ముఖ్యమైన ప్రకటనలు లేకపోవడం గమనార్హం.భారతదేశంలో ఆటోమొబైల్ రంగం వేగంగా విస్తరిస్తోంది, ఇది ప్రపంచవ్యాప్తంగా మూడవ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా నిలిచింది. ఈ వృద్ధిని దృష్టిలో ఉంచుకుని, పరిశ్రమను మరింతగా పెంచేందుకు అనేక ప్రకటనలను ఉండొచ్చని నిపుణులు భావించారు. అయితే ఈ బడ్జెట్లో అలాంటి ప్రకటనలేవీ లేదు.బడ్జెట్లో ఫేమ్ 3 సబ్సిడీ గురించి ఎలాంటి ప్రకటన లేదు. అంతే కాకుండా హైబ్రిడ్ వాహనాలపై పన్ను తగ్గింపులకు సంబంధించి కూడా ఎటువంటి ప్రకటనలు చేయలేదు. దిగుమతి చేసుకునే వాహనాల మీద కూడా ఎటువంటి ట్యాక్స్ తగ్గింపులు వెల్లడికాలేదు. మొత్తం మీద కేంద్ర బడ్జెట్ ఆటోమొబైల్ రంగం మీద అటువంటి వరాలజల్లు కురిపించలేదు. -
Budget 2024-25: ‘అది ప్రభుత్వ ఆస్తులను విక్రయించడం కాదు’
కేంద్ర బడ్జెట్ 2024ను పార్లమెంట్లో సమర్పించిన తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విలేకరుల సమావేశంలో ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘ప్రభుత్వ రంగ సంస్థల డివిడెండ్లు మెరుగుపడుతున్నాయి. దీర్ఘకాలిక మూలధన లాభాలపై 12.5% పన్నుపై చాలా చర్చలు జరిగాయి. నిజానికి సగటు పన్ను కంటే చాలా తగ్గించాం. పన్నుల విధానాన్ని మరింత సరళతరం చేసేందుకు దీన్ని ప్రవేశపెట్టాం. ప్రభుత్వ సంస్థల వాల్యూయేషన్లు పెరిగాయి. వాటి పనితీరు చాలా మెరుగుపడింది. ఆదాయ సమీకరణకు కేవలం పన్నులు విధించడమే మార్గం కాదు. పన్నేతర మార్గాలు చాలా ఉన్నాయి. ఈ మార్గాల్లో ప్రభుత్వానికి గత మూడేళ్లుగా ఆదాయం సమకూరుతోంది’ అన్నారు.కేంద్ర బడ్జెట్ 2024-25 ముఖ్యాంశాల కోసం క్లిక్ చేయండిప్రభుత్వ సంస్థల ఆస్తులను విక్రయిస్తున్నారనే ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానమిస్తూ..‘ఇది ఆస్తులను విక్రయించడం కాదు. వాడకంలోలేని ప్రభుత్వ సంస్థలకు చెందిన ప్రదేశాలు, భవనాలు, స్టేడియంలను మరిన్ని ప్రయోజనాల కోసం ఉపయోగించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది’ అన్నారు.#WATCH | #UnionBudget2024 | On changes in tax slab and other changes, Union Finance Minister Nirmala Sitharaman says, "It is not just because we have mentioned it in this budget but the attempt to widen the tax net is something which we have been repeatedly saying, that India's… pic.twitter.com/xrCO7EQD6b— ANI (@ANI) July 23, 2024 -
ఏడాదికి 78.5 లక్షల ఉద్యోగాలు!.. కేంద్రం కీలక ప్రకటన
2023-24 ఆర్థిక సర్వే ప్రకారం, పెరుగుతున్న శ్రామికశక్తికి అనుగుణంగా వ్యవసాయేతర రంగంలో 2030 వరకు భారత ఆర్థిక వ్యవస్థ ఏటా సగటున 78.5 లక్షల ఉద్యోగాలను సృష్టించాల్సి ఉంది. సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా దేశంలో ఉపాధి కల్పనలో ప్రైవేట్ రంగం పాత్రను గురించి వివరించింది.ఆర్థిక వ్యవస్థ సృష్టించాల్సిన ఉద్యోగాల సంఖ్య (సంవత్సరానికి 78.5 లక్షలు) గురించి సర్వే విస్తృత అంచనాను అందించింది. పని చేసే వయసులో ఉన్న ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు కోరుకోరని. ఇందులో కొందరు స్వయం ఉపాధి కోసం చూస్తే.. మ్నారికొందరు స్టార్టప్ వంటి వాటిని ప్రారంభించి యజమానులుగా మారుతారు. ఆర్థిక వృద్ధి అనేది జీవనోపాధిని సృష్టించడమేనని సర్వే పేర్కొంది.శ్రామికశక్తిలో వ్యవసాయం వాటా తగ్గుతుందని కేంద్రం వెల్లడించింది. దీంతో భారత ఆర్థిక వ్యవస్థ వ్యవసాయేతర రంగంలో 2030 వరకు ఏటా సగటున 78.5 లక్షల ఉద్యోగాలను సృష్టించాలి. పెరుగుతున్న శ్రామిక శక్తిని తీర్చడానికి ప్రైవేట్ సంస్థలు దోహదపడాలని సర్వే పేర్కొంది.వ్యవసాయేతర రంగంలో సంవత్సరానికి 78.5 లక్షల ఉద్యోగాల డిమాండ్‌ను, ప్రస్తుతం ఉన్న PLI (5 సంవత్సరాలలో 60 లక్షల ఉపాధి కల్పన), మిత్రా టెక్స్టైల్ పథకం (20 లక్షల ఉపాధి కల్పన), ముద్ర మొదలైన పథకాలను భర్తీ చేయడం ద్వారా తీర్చవచ్చని డేటాలో వెల్లడించింది. -
బడ్జెట్ 2024-25: ఏ రంగానికి ఎన్ని కోట్లు?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ 2024-25లో వివిధ రంగాలకు మొత్తం రూ.48,20,512 కోట్లు కేటాయించారు. వికసిత భారత్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్లో ఏ రంగానికి ఎంత కేటాయించిందని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.రక్షణ రంగం (డిఫెన్స్): రూ.4.56 లక్షల కోట్లు.గ్రామీణాభివృద్ధి (రూరల్ డెవలప్మెంట్): రూ.2,65,808 కోట్లు.వ్యవసాయం, అనుబంధ రంగాలు: రూ.1,51,851 కోట్లు.హోం వ్యవహారాలు: రూ.1,50,983 కోట్లు.విద్య: రూ.1,25,638 కోట్లు.ఐటీ, టెలికాం: రూ.1,16,342 కోట్లు.ఆరోగ్యం: రూ.89,287 కోట్లు.ఎనర్జీ: రూ.68,769 కోట్లు.సాంఘిక సంక్షేమం: రూ.56,501 కోట్లు.వాణిజ్యం, పరిశ్రమల రంగం: రూ. 47,559 కోట్లు -
బడ్జెట్ పై YSRCP MPs కామెంట్స్..
-
కోటి ఇళ్లకు 300 యూనిట్లు ఉచిత విద్యుత్!
రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ల ద్వారా దేశంలోని కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో స్పష్టం చేసింది. 2024-25 పూర్తి స్థాయి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ప్రవేశపెట్టారు.ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్లో చేసిన ప్రకటనకు అనుగుణంగా, రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా కోటి గృహాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించడానికి ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు.గ్రీన్ గ్రోత్ , పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించడానికి అనేక చర్యలను ప్రకటించిన ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో రూఫ్‌టాప్ సోలార్ స్కీమ్‌కు విశేష స్పందన వచ్చినట్లు చెప్పారు. ఈ పథకానికి ఇప్పటివరకు 1.28 కోట్ల రిజిస్ట్రేషన్లు, 14 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు.ఆ ఉచిత సౌర విద్యుత్ పథకం ద్వారా ఆయా కుటుంబాలకు సంవత్సరానికి రూ. 15,000-18,000 కోట్ల వరకు ఆదా అవుతుందని ప్రభుత్వం చెబుతోంది. అంతేకాకుండా మిగులు విద్యుత్‌ను పంపిణీ సంస్థలకు విక్రయించవచ్చు. సప్లయి, ఇన్స్టాలేషన్, మెయింటెనెన్స్ చేసే క్రమంలో అనేక మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొంటోంది. -
వేతనజీవికి ఊరట.. కేంద్ర బడ్జెట్ 2024 ముఖ్యాంశాలు (ఫొటోలు)
-
Union budget 2024 : తగ్గేవి, పెరిగేవి ఇవే..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఏడోసారి తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ పేదలు, మహిళలు, యువత, రైతులపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని వెల్లడించారు. అయితే మహిళలు, బాలికల కోసం ప్రత్యేక పథకాలను, ఉద్యోగుల కోసం ఒక కొత్త పథకాన్ని ప్రకటించిన ఆర్థిక మంత్రి ప్రస్తుత పన్నుల విధానం, పన్ను మినహాయింపులను కూడా ప్రతిపాదించారు. మొబైల్ ఫోన్ ధరలు, బంగారం, వెండి , రాగి ధరలు తగ్గింపునకు దారితీసే చర్యలను ఆర్థిక మంత్రి ప్రకటించారు. మొబైల్ ఫోన్లు, మొబైల్ ఛార్జర్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 15 శాతానికి తగ్గించారు. బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీని 6 శాతానికి, ప్లాటినంపై 6.4 శాతానికి తగ్గించారు. మూడు కేన్సర్ చికిత్స మందులు ప్రాథమిక కస్టమ్స్ సుంకం నుంచి మినహాయింపు నిచ్చారు. దీంతో కేన్సర్ బాధితులకు భారీ ఊరట లభించనుంది. బంగారం, వెండిపై సుంకాలు 6 శాతం తగ్గింపు రిటైల్ డిమాండ్‌ను గణనీయంగా పెంచు తుందన్నారు. ప్లాటినంపై కస్టమ్స్ డ్యూటీలను 6.5 శాతం తగ్గించాలని, రొయ్యలు, చేపల మేతతో కూడిన సీఫుడ్‌పై 5 శాతం తగ్గింపును ఆర్థికమంత్రి ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో ధరలు పెరిగేవి, తరిగేవి జాబితాను ఒకసారి చూద్దాం!ధరలు పెరిగేవి:ప్లాటినం వస్తువులుబంగారు కడ్డీలుకృత్రిమ ఆభరణాలుసిగరెట్వంటగది చిమ్నీలుకాంపౌండ్ రబ్బరుకాపర్ స్క్రాప్దిగుమతి చేసుకున్న టెలికాం పరికరాలుధరలు తగ్గేవి:కొన్ని రకాల కేన్సర్ మందులుమెడికల్ ఎక్స్-రే యంత్రాలుమొబైల్ ఫోన్లు, ఛార్జర్లుచేపలు, రొయ్యల మేతతోలు వస్తువులుపాదరక్షలువస్త్రాలుబంగారం, వెండి, ప్లాటినం తయారీ ఛార్జీలు -
ట్యాక్స్‌పేయర్లకు ఊరట కాస్తే..
ఎన్నో ఆశలు, ఆకాంక్షల నడుమ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2024-25 ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. వరుసగా ఏడోసారి ఆమె బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ పార్లమెంట్ ముందుకు తెచ్చారు.ఈ బడ్జెట్లో పన్ను విధానాల్లో మార్పులు చేసి వేతన జీవులకు ఊరట కల్పిస్తారని భావించారు. కానీ ఆశించిన స్థాయిలో ప్రయోజనాలేమీ మోదీ ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు కల్పించలేదు. కొత్త పన్ను విధానంలో పన్ను పరిమితిని రూ.4లక్షలకు పెంచుతారని భావించారు. కానీ అందులో ప్రభుత్వం ఎలాంటి మార్పు చేయలేదు. మిగతా శ్లాబుల్లో మాత్రం స్వల్ప మార్పులు చేసింది. ఇక స్టాండర్ట్ డిడక్షన్‌ను రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెంచి స్వల్ప ఊరట కల్పించింది.ఆదాయపు పన్ను కొత్త స్లాబులు ఇవేరూ. 3లక్షల వరకు నో ట్యాక్స్‌రూ.3 - 7 లక్షలు 5% పన్నురూ.7-10 లక్షలు 10%రూ.10-12 లక్షలు 15%రూ.12-15 లక్షలు 20%రూ.15 లక్షలు దాటితే 30% పన్ను -
స్టాక్ మార్కెట్‌కు బడ్జెట్ షాక్
భారతీయ స్టాక్‌మార్కెట్లకు కేంద్ర బడ్జెట్ సెగ తగిలింది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌పై కోటి ఆశలతో ఉన్న ఇన్వెస్టర్లు మార్కెట్ ఆరంభంలో సానుకూలంగా ఉన్నారు. కానీ బడ్జెట్ ప్రసంగంతో నిరాశ పడ్డారు. క్యాపిటల్ గెయిన్స్‌పై టాక్స్ తదితర పరిణామాల నేపథ్యంలో అమ్మకాలను దిగారు. దీంతో సెన్సెక్స్ ఏకంగా 750 పాయింట్లకు పైగా కుప్పకూలగా, నిఫ్టీ కూడా అదే బాటలోనడిచింది.ప్రస్తుతం కాస్త తెప్పరిల్లిన సెన్సెక్స్ 423 పాయింట్ల నష్టానికి పరిమితమే 80వేలకు ఎగువనకొనసాగుతుంది. అటు నిష్టీ 117 పాయింట్ల నష్టంతో 24, 392 వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే ఆ ర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యవసాయ రంగానికి రూ. 1.52 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించడంతో వ్యవసాయ రంగ షేర్లు 10 శాతం వరకు ర్యాలీ చేశాయి. కావేరీ సీడ్ కంపెనీ లిమిటెడ్, కోరమాండల్ ఆగ్రో ప్రొడక్ట్స్ అండ్ ఆయిల్స్ లిమిటెడ్, ధనుకా అగ్రిటెక్ లిమిటెడ్, నోవా అగ్రిటెక్ లిమిటెడ్ టాప్ గెయినర్స్‌లో ఉన్నాయి. ఓఎన్జిసి, శ్రీరామ్ ఫైనాన్స్, హిందాల్కో, ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, బిపిసిఎల్ , రిలయన్స్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి.ఎస్టీటీ దెబ్బఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O) వ్యాపారులకు షాకిచ్చేలా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సెక్యూరిటీ లావాదేవీల పన్ను (STT) రేటును 0.01 శాతం నుండి 0.02 శాతానికి పెంచేశారు. ఫలితంగా ఈ బడ్జెట్ ప్రతిపాదనను అమలు తరువాత ఈక్విటీ , ఇండెక్స్ ట్రేడర్లు వమ వ్యాపారంపై రెట్టింపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.రూపాయి ఢమాల్ క్యాపిటల్ గెయిన్స్‌పై పన్ను రేటును పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదనతో రూపాయి రికార్డు స్థాయిలో పతనమైంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 83.69కి క్షీణించింది. గత జీవితకాలపు కనిష్ట స్థాయి 83.67. కాగా కేంద్ర బడ్జెట్లో దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును 10-12.5శాతానికి పెంచారు. అలాగే , దిగువ, మధ్య-ఆదాయ తరగతుల ప్రయోజనాల కోసం కొన్ని ఆర్థిక ఆస్తులపై మూలధన లాభాల మినహాయింపు పరిమితిని సంవత్సరానికి రూ. 1.25 లక్షలకు పెంచాలని ప్రతిపాదించారు. -
కేంద్ర బడ్జెట్ 2024-25 : మహిళలు, బాలికలకు గుడ్ న్యూస్
కేంద్ర బడ్జెట్ 2024-25లో కేంద్ర మహిళలు, బాలికలకు ప్రయోజనం చేకూర్చేలా కొత్త పథకాలను ప్రకటించింది. మధ్యంతర బడ్జెట్లో మాదిరిగానే పేదలు, మహిళలు, యువత, రైతులపై కేంద్రం దృష్టి సారిస్తుందని అన్ని తెలిపిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మహిళల కోసం ప్రత్యేకంగా, మహిళలు ,బాలికలకు ప్రయోజనం చేకూర్చే పథకాల కోసం సీతారామన్ రూ. 3 లక్షల కోట్లను కేటాయిస్తున్నట్టు మంగళవారం ప్రకటించారు. శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, శ్రామిక మహిళల కోసం వర్కింగ్ విమెన్ హాస్ట్సల్‌ను ఏర్పాటు చేయనుందని వెల్లడించారు.కేంద్ర బడ్జెట్ 2024ను సమర్పిస్తూ వర్క్‌ఫోర్స్‌లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లను ఏర్పాటు చేస్తుందని ఆర్థికమంత్రి తెలిపరారు పరిశ్రమల సహకారంతో వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లను ఏర్పాటు చేయడం , క్రెచ్‌ల స్థాపన ద్వారా వర్క్‌ఫోర్స్‌లో మహిళల అధిక భాగస్వామ్యాన్ని సులభతరం చేస్తామన్నారు. అలాగే మహిళలకు నిర్దిష్ట నైపుణ్య కార్యక్రమాలు,మహిళా ఎస్‌హెచ్‌జి సంస్థలకు మార్కెట్ యాక్సెస్‌ను ప్రోత్సహించడానికి ఇది ప్రయత్నిస్తుందని కూడా చెప్పారు.ఈ ఏడాది విద్య, ఉపాధి, నైపుణ్యాల కోసం రూ.1.48 లక్షల కోట్లు కేటాయించామన్నారు నిర్మలా సీతారామన్. 'ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్' కోసం మూడు పథకాలను కూడా ప్రకటించారు. ఉపాధి మరియు నైపుణ్యం కోసం ప్రధానమంత్రి ప్యాకేజీ తొలి స్కీమ్ ‘ఎ’ ‘ఫస్ట్ టైమర్స్’ కోసం, ‘తయారీ రంగంలో ఉద్యోగాల కల్పన’ కోసం స్కీమ్ ‘బి’ , యజమానులకు మద్దతిచ్చేందుకు స్కీమ్ ‘సి’ని కేంద్రం ప్రకటించింది. ఈ మూడు స్కీంల ద్వారా ఉద్యోగాలను కల్పించనున్నారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారి కోసం ఈపీఎఫ్‌వో పథకం, 20 లక్షల మంది యువత శిక్షణకు సరికొత్త కార్యక్రమం లాంటివి ఇందులో ఉన్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మూడు కోట్ల అదనపు ఇళ్లు నిర్మించనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. -
ఇదేం సాయం?.. చంద్రబాబు అట్టర్ ఫ్లాప్
ఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో ఏపీకి మరోసారి మొండిచేయి ఎదురైంది. ఎన్డీఏ కూటమిలో ప్రధాన మిత్రపక్షంగా ఉన్న చంద్రబాబు.. ప్రత్యేక హోదా అంశంలో కేంద్రాన్ని ఒప్పించడంలో విఫలమయ్యారు. అలాగే భారీగా నిధులు రాబట్టలేకపోయారు. సరికదా.. రాష్ట్ర అభివృద్ధి కోసం కనీసం స్పష్టమైన హామీ ప్రకటనలు కూడా చేయించులేకపోయారు. సుమారు పదేళ్ల తర్వాత తెరపైకి ఏపీ విభజన అంశం వచ్చింది. అయితే ప్రత్యేక హోదా అనే పదాన్ని ప్రస్తావించకుండానే ప్రత్యేక సాయం ప్రకటన చేసింది కేంద్రం. ఈ క్రమంలో విభజన చట్టానికి కేంద్రం కట్టుబడి ఉందని చెబుతూ.. ఏపీ రాజధాని నిర్మాణానికి రూ.15వేల కోట్ల సాయం అందిస్తామని, అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు ఇస్తామని.. అది వివిధ ఏజెన్సీల ద్వారా అప్పుల రూపేణా అని ఒక విడ్డూరమైన ప్రకటన చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అలాగే.. కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు అందించే సాయం మీదా ఆమె స్పష్టత ప్రకటన చేయలేదు. ఇక.. ప్రత్యేక ప్యాకేజీ అంశం తెర మీదకు తెచ్చిన కేంద్రం.. ఈసారి రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు అంటూ కొత్త రాగం అందుకుంది. అదే సమయంలో టీడీపీ తర్వాత కూటమిలో ప్రాధాన్యత ఉన్న బీహార్ మాత్రం భారీగా నిధులు సాధించుకుంది. మొత్తంగా కేంద్రంలో చక్రం తిప్పేలా ఏపీ ప్రజలు చంద్రబాబుకి మెజారిటీ ఇచ్చినప్పటికీ.. కేంద్రం కంటి తుడుపు ప్రకటన ద్వారా నిధులు రాబట్టడంలో అట్టర్‌ప్లాఫ్ అయ్యారు. మరోవైపు.. జగన్ చొరవతోనే.. కేంద్రం వైఎస్సార్సీపీ ప్రభుత్వ పథకాలను ఆదర్శంగా తీసుకుందా? అనే చర్చ మొదలైంది. జగన్ మానసపుత్రికలైన డీబీటీ పథకాల ప్రస్తావనే అందుకు కారణం. ఉన్నత విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు రూ.10 లక్షల విద్యారుణాలు ఇస్తామని బడ్జెట్లో కేంద్రం ప్రకటించింది. దేశీయంగా చదువుకునే లక్ష మందికి ఏటా రుణ సదుపాయం కల్పిస్తామని తెలిపింది. ఇక.. వైఎస్సార్ జిల్లా కొప్పర్తి నోడ్.. విశాఖపట్నం, చెన్నై ఇండస్ట్రీయల్ కారిడార్, కర్నూల్ జిల్లా ఓర్వకల్లు నోడ్ హైదరాబాద్-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లకు బడ్జెట్ ద్వారా ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు. వైఎస్ జగన్ హయాంలోనే ఈ కారిడార్ పనులు మొదలైన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: జగన్ పాలనలో పారిశ్రామిక దూకుడు! -
Budget 2024-25: కొత్త ఉద్యోగులకు రూ.15 వేలు!
కేంద్ర బడ్జెట్ 2024-25 ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. వరుసగా ఏడోసారి బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు సమర్పించారు.మోదీ మూడో విడత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లో యువతను ఆకట్టుకునే దిశగా కొత్త పథకాలను ప్రకటించింది కేంద్రం. ఉపాధిని ప్రోత్సహించేందుకు కొత్త ఉద్యోగులకు, యాజమాన్యాలకు ఆర్థిక తోడ్పాటును అందిస్తూ మూడు స్కీములను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.మూడు స్కీములు ఇవే..స్కీమ్-ఎ: ఈపీఎఫ్‌వోలో నమోదైన కొత్త ఉద్యోగులకు రూ.15000 వరకు ఒక నెల జీతం. మూడు విడతల్లో చెల్లింపుస్కీమ్-బి: మ్యాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో ఉద్యోగులకు, యాజమాన్యాలకు ప్రోత్సాహకాలు. మొదటి నాలుగేళ్ల పాటు ఈపీఎఫ్‌వో కాంట్రిబ్యూషన్ ఆధారంగా చెల్లింపుస్కీమ్-సి: అధికంగా ఉద్యోగులను చేర్చుకున్న యాజమాన్యాలకు రెండేళ్లపాటు రూ.3000 వరకు ఈపీఎఫ్‌వో కాంట్రిబ్యూషన్ రీయింబర్స్మెంట్Prime Minister’s Package for employment and skilling: 3 schemes announced for ‘Employment Linked Incentive’🔆Scheme A: First Timers🔆Scheme B: Job Creation in manufacturing🔆Scheme C: Support to employers pic.twitter.com/NYDLNjEaea— Ministry of Finance (@FinMinIndia) July 23, 2024 -
వరుసగా ఏడోసారి కేంద్ర బడ్జెట్‌తో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ (ఫొటోలు)
-
నేడు పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్
ఢిల్లీ: కేంద్ర బడ్జెట్ 2024-25 నేడే పార్లమెంట్ ముందుకు రానుంది. ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికల ముగిసిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు సమర్పిస్తున్నారు.మోదీ ప్రభుత్వంలో వరుసగా ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు నిర్మలా సీతారామన్. ఎన్నికల నేపథ్యంలో గత ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపెట్టింది. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ రూపకల్పన చేశారు.నేడు ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌పై దేశంలోని వివిధ వర్గాలు అనేక ఆశలు, అంచనాలు పెట్టుకున్నారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల నేపథ్యంలో పన్ను ఉపశమనాలపై సామాన్యులు ఆశలు పెట్టుకున్నారు. ఉద్యోగులు పన్ను తగ్గింపును ఆశిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతూకంతో బడ్జెట్ ఉండాలని నిపుణులు కోరుకుంటున్నారు. -
Budget 2024-25: బడ్జెట్ ముఖ్యాంశాలు
Parliament Budget Session 2024 Highlights: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ దేశ చరిత్రలో ఏడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ రికార్డు నెలకొల్పారు. బడ్జెట్ 2024-25లో నిర్మలా సీతారామన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు, అప్డేట్లు.ఆదాయ సమీకరణ కేవలం పన్ను ఆధారితమైంది కాదు: నిర్మలా సీతారామన్మనీలాండరింగ్ను నిరోధించడంలో ఏంజెల్ ట్యాక్స్ రద్దు అంశం కీలక ప్రభావం చూపుతుంది. ఇన్ని రోజులు ఇది భారతదేశంలో పెట్టుబడులకు ఆటంకంగా మారింది.యూపీఏ 2లో ఏంజెల్ ట్యాక్స్ ప్రవేశపెట్టారు.దీర్ఘకాలిక మూలధన లాభాలపై తీసుకొచ్చిన 12.5% ట్యాక్స్‌ను నిజానికి సరాసరి పన్నురేటుతో పోలిస్తే చాలా తగ్గించాం.పన్నుల విధానాన్ని మరింత సరళతరం చేసేందుకు దీన్ని ప్రవేశపెట్టాం.ఎప్ అండ్ ఓల్లో ఎస్టీటీ ఛార్జీలు అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తాయి .కేంద్ర బడ్జెట్ 2024-25లో మొత్తం రూ.48,20,512 కోట్లు వ్యయం అంచనా వేశారు.మూలధన వ్యయం రూ.11,11,111 కోట్లు. ఇది 2023-24 అంచనాల కంటే 16.9% ఎక్కువ.ప్రభావవంతమైన మూలధన వ్యయం రూ.15,01,889 కోట్లుగా అంచనా.రెవెన్యూ వసూళ్లు రూ.31,29,200 కోట్లు.నికర పన్ను ఆదాయం రూ.25,83,499 కోట్లు.పన్నేతర ఆదాయం రూ.5,45,701 కోట్లు.మొత్తం మూలధన వసూళ్లు (రుణేతర రశీదులు, రుణ రసీదులతో కలిపి) రూ.15,50,915 కోట్లు.యువతకు నైపుణ్యాలు పెంచే బడ్జెట్: మోదీమహిళల స్వావలంబనకు దోహదం చేసే బడ్జెట్.ముద్ర రుణాల పరిమితిని రూ.20 లక్షలకు పెంచాం.ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యమిచ్చాం.భారత్‌ను గ్లోబల్ మ్యానుఫాక్చరింగ్ హబ్‌గా మారుస్తాం.పర్యాటక రంగాన్ని మరింత మెరుగుపరిచేలా చర్యలు తీసుకున్నాం.#WATCH | Post Budget 2024: Prime Minister Narendra Modi says "For MSMEs, a new scheme to increase ease of credit has been announced in the budget. Announcements have been made to take export and manufacturing ecosystem to every district in this budget...This budget will bring new… pic.twitter.com/C0615OJjdt— ANI (@ANI) July 23, 2024స్టాంప్ డ్యూటీ పెంచేందుకు రాష్ట్రాలకు అనుమతి.పన్ను సమస్యలకు సంబంధించిన అప్పీళ్ల ద్రవ్య పరిమితులు పెంచారు.ట్యాక్స్ ట్రిబ్యునల్స్, హైకోర్టులు, సుప్రీంకోర్టులో ప్రత్యక్ష పన్నులు, ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్‌కు సంబంధించిన అప్పీళ్లను దాఖలు చేయడానికి ద్రవ్య పరిమితులు వరుసగా రూ.60 లక్షలు, రూ.2 కోట్లు, రూ.5 కోట్లుగా నిర్ణయించారు.గత సంవత్సరం కంటే బడ్జెట్ కేటాయింపులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌కు నిధులు తగ్గించారు. 2024-25 బడ్జెట్లో రూ.951 కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయించిన రూ.968 కోట్లు కంటే 1.79 శాతం నిధులు తగ్గాయి.జమ్మూ కశ్మీర్‌కు బడ్జెట్లో రూ.42,277 కోట్లు.అండమాన్ నికోబార్ దీవులకు రూ.5,985 కోట్లు.చండీగఢ్‌కు రూ.5,862 కోట్లు.లద్దాఖ్‌కు రూ.5,958 కోట్లు.ప్రభుత్వం మూడు క్యాన్సర్ మందులను కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయించింది.విదేశీ కంపెనీలపై కార్పొరేట్ పన్ను రేటు 40% నుంచి 35%కి తగ్గించింది.క్యాపిటల్ గెయిన్‌లపై ప్రభుత్వం పన్ను పెంచిన తర్వాత రూపాయి రికార్డు స్థాయికి క్షీణించింది.యూఎస్ డాలర్‌తో పోలిస్తే రూపాయి 83.69కి పడిపోయింది.ఎంపిక చేసిన నగరాల్లో 100 స్ట్రీట్ ఫుడ్ హబ్‌ల అభివృద్ధి.30 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న 14 పెద్ద నగరాల కోసం రవాణా ఆధారిత అభివృద్ధి ప్రణాళికలు.ప్రధాన కేంద్ర పథకాలకు కేటాయింపులు..గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.86 వేలకోట్లు.రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లకు రూ.1,200 కోట్లు.న్యూ క్లియర్ ప్రాజెక్ట్‌లకు రూ.2,228 కోట్లు.ఫార్మాసూటికల్స్ రంగంలో పీఎల్ఐ పథకానికి రూ.2,143 కోట్లు.సెమికండక్టర్లు అభివృద్ధికి, తయారీ రంగానికి రూ.6,903 కోట్లు.సోలార్ పవర్(గ్రిడ్) రూ.10 వేలకోట్లు.ఎల్పీజీ డీబీటీ(రాయితీ)లకు 1,500 కోట్లు.రూపాయి రాక...ఇన్కమ్ ట్యాక్స్ 19 పైసలుఎక్సైజ్ డ్యూటీ 5 పైసలుఅప్పులు, ఆస్తులు 27 పైసలుపన్నేతర ఆదాయం 9 పైసలుమూలధన రశీదులు 1 పైసలుకస్టమ్స్ ఆదాయం 4 పైసలుకార్పొరేషన్ ట్యాక్స్ 17 పైసలుజీఎస్టీ, ఇతర పన్నులు 18 పైసలురూపాయి పోక..పెన్షన్లు 4 పైసలువడ్డీ చెల్లింపులు 19 పైసలుకేంద్ర పథకాలు 16 పైసలుసబ్సిడీలు 6 పైసలుడిఫెన్స్ 8 పైసలురాష్ట్రాలకు తిరిగి చెల్లించే ట్యాక్స్‌లు 21 పైసలుఫైనాన్స్ కమిషన్‌కు చెల్లింపులు 9 పైసలుకేంద్ర ప్రాయోజిక పథకాలు 8 పైసలుఇతర ఖర్చులు 9 పైసలుకొత్త పన్ను విధానంలో మార్పులు.. రూ.3 లక్షలలోపు ఎలాంటి పన్ను లేదు. రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షలలోపు 5 శాతం, రూ.7లక్షలు-రూ.10 లక్షలలోపు 10%, రూ.10లక్షలు- రూ.12 లక్షలలోపు 15%, రూ.12 లక్షలు-రూ.15 లక్షలలోపు 20%, రూ.15 లక్షలు అంతకంటే ఎక్కువ ఉంటే 30% పన్ను చెల్లించాలి. మొత్తంగా పన్నుదారులు రూ.17,500 మిగుల్చుకునే అవకాశం.పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000 నుంచి రూ.75,000కి పెంపు.ట్రేడింగ్ మార్కెట్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్లపై ఎస్టీటీ వరుసగా 0.02%, 0.01%కి పెంపు.దీర్ఘకాలిక మూలధన లాభాలపై 12.5 శాతం పన్ను.క్యాపిటల్ కనిష్ఠ పరిమితి రూ.1.25 లక్షలు.స్టార్టప్‌ల కంపెనీలకు ప్రోత్సాహకం.. ఏంజెల్ ట్యాక్స్ రద్దు.బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకం 6 శాతం, ప్లాటినంపై 6.4 శాతం తగ్గింపు.మొబైల్, యాక్ససరీస్‌పై 15 శాతం దిగుమతి సుంకం తగ్గింపు.జీఎస్టీలో పన్నుల నిర్మాణాన్ని హేతుబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. సామాన్యులకు జీఎస్టీ వల్ల గణనీయంగా లాభం చేకూరింది. జీఎస్టీ ప్రయోజనాలను మరింత మెరుగుపరచడానికి పన్ను నిర్మాణంపై నిర్ణయం తీసుకునేందుకు ప్రయత్నిస్తాం.ఆర్థిక ద్రవ్యలోటు జీడీపీలో 4.9%గా ఉంది.విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)ను పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.కాశీ విశ్వనాథ్ ఆలయం, నలంద, విష్ణుపాద్, మహాబోధి ఆలయం వంటి ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి ప్రత్యేక కారిడార్ల ఏర్పాటు.రాబోయే 10 సంవత్సరాలలో అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను ఐదు రెట్లు విస్తరిస్తాం.ఈ లక్ష్యానికి చేరుకోవడానికి రూ.1,000 కోట్ల క్యాపిటల్ ఫండ్ ఏర్పాటు చేస్తాం.ఫిబ్రవరిలో ప్రకటించిన విధంగా రూ.1 లక్ష కోట్ల ఫండ్‌తో ప్రైవేట్ ఆధారిత పరిశోధనలను ప్రోత్సహించడానికి ఒక యంత్రాంగాన్ని రూపొందిస్తాం.చిన్న, మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్ల అభివృద్ధి.ఇందుకు ప్రభుత్వం ప్రైవేట్ రంగంతో కలిసి పనిచేస్తుంది. న్యూక్లియర్ ఎనర్జీ కోసం కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేయాల్సి ఉంది.నేపాల్‌లో వరదలను నియంత్రించేలా మరిన్ని నిర్మాణాలు చేపట్టాలి. అసోం, బీహార్‌లోనూ తరచు వరదలు సంభవిస్తాయి. వరదల వల్ల హిమాచల్ ప్రదేశ్ తీవ్రంగా నష్టపోతుంది. కొండచరియలు విరిగిపడటం వంటి విపత్తుల నిర్వహణకు రూ.11,500 కోట్లు ఆర్థికసాయం.ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకానికి సంబంధించి విధాన పత్రాన్ని విడుదల చేస్తాం. ఈ పథకాన్ని రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ప్రారంభించారు. దీని ద్వారా 1 కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తారు. ఇప్పటికే 1.28 కోట్ల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. 14 లక్షల దరఖాస్తులు అందాయి.మౌలిక సదుపాయాలకు రూ.11.11 లక్షల కోట్లు.ఇది జీడీపీలో 3.4 శాతానికి సమానం.రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్‌లకు రూ.26,000 కోట్ల ప్రోత్సాహం.గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు.ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ (ఐబీసీ) పరిధిలో బ్యాంక్ రుణాల రికవరీని మెరుగుపరచడానికి ఇంటిగ్రేటెడ్ టెక్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు.ముద్ర రుణాలు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంపు.ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారెంట్ స్కీం.సులభంగా నిధులు అందేలా చర్యలు.గంగానదిపై మరో రెండు వంతెనల ఏర్పాటు.ఈశాన్యరాష్ట్రాల్లో ఎక్స్‌ప్రెస్ హైవేల నిర్మాణం.ఈశాన్యరాష్ట్రాల్లో 100 పోస్ట్పేమెంట్ బ్యాంకుల ఏర్పాటు.దేశవ్యాప్తంగా 12 ఇండస్ట్రీయల్ పార్క్‌ల ఏర్పాటు.బీహార్‌లో ఎక్స్‌ప్రెస్ హైవేలు నిర్మాణం.బీహార్, ఏపీలోనూ పూర్వోదయ పథకం అమలు.ఏపీకి అండగా ఉంటాం..ఏపీ రాజధాని నిర్మాణానికి నిధులు.వాటర్, పవర్, రైల్లే, రోడ్లు రంగాల్లో ఏపీకి అండగా ఉంటాం.పోలవరం ప్రాజెక్ట్‌కు పూర్తి సాయం అందించేలా చర్యలు.అమరావతి అభివృద్ధికి రూ.15 వేలకోట్లు.ఈ ఏడాదిలోనే ఆర్థిక సాయం.అవసరమైతే మరిన్ని నిధులు.విభజన చట్టం కింద పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటు.ఏటా 10 లక్షల మందికి విద్యారుణం.విద్యా, నైపుణ్యాభివృద్ధికి రూ.1.48 లక్షల కోట్లు.వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లు.మహిళల నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు.కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారికి ఈపీఎఫ్ఓ పథకం.ఈపీఎఫ్ఓ ద్వారా నగదు బదిలీ.వర్కింగ్ ఉమెన్ హాస్టళ్ల ఏర్పాటు.నాలుగు కోట్ల మందికి స్కిల్ పాలసీ.ఈ బడ్జెట్లో వికసిత్ భారత్‌కు రోడ్‌మ్యాప్.సమ్మిళిత అభివృద్ధికి పెద్దపేట.యువతకు ఐదు ఉద్యోగ పథకాలు.నాలుగు కోట్ల యువతకు ఉపాధి కల్పించేలా కృషి.వ్యవసాయం డిజిటలైజేషన్ కోసం ప్రత్యేక కార్యక్రమం.ఉద్యోగాల కల్పన, నైపుణ్యాల సృష్టి, సంస్థల ఏర్పాటుకు బడ్జెట్లో నిర్ణయాలు.కూరగాయల ఉత్పత్తి, సరఫరాలకు ప్రత్యేక చర్యలు.ప్రధానమంత్రి అన్నయోజన పథకాన్ని ఐదేళ్లు పొడిగించాం.ప్రధానిగా నరేంద్రమోదీ మూడోసారి చరిత్రాత్మక విజయం సాధించారు.ప్రజల ఆంకాక్షలు నెరవేర్చడంలో ఈ విజయం సాధ్యమైంది.దేశవ్యాప్తంగా మద్దతు ధరలు పెంచాం.అంతర్జాతీయ అనిశ్చితుల వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతున్నా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల స్థిరాభివృద్ధి సాధ్యమవుతుంది: నిర్మలా సీతారామన్పార్లమెంట్లో బడ్జెట్ 2024-25ను విడుదల చేయనున్న నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్రమోదీ లోక్‌సభకు చేరుకున్నారు.#WATCH | PM Modi in Parliament, ahead of the presentation of Union budget by Finance Minister Nirmala Sitharaman(Video source: DD News) pic.twitter.com/T0RD4hBO2z— ANI (@ANI) July 23, 2024బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పార్లమెంట్ చేరుకున్నారు.#WATCH | Congress MP and LoP in Lok Sabha, Rahul Gandhi reaches Parliament ahead of Union Budget presentation by Finance Minister Nirmala Sitharaman in Lok Sabha. pic.twitter.com/zNcijSYS4e— ANI (@ANI) July 23, 2024బడ్జెట్ 2024-25 పత్రాలను ‘యూనియన్ బడ్జెట్’ మొబైల్ యాప్ ఉపయోగించి పొందవచ్చు. ఈ యాప్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ఫామ్ల్లో లేదా యూనియన్ బడ్జెట్ వెబ్ పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పత్రాలు ఇంగ్లీష్, హిందీలో అందుబాటులో ఉంటాయి.బడ్జెట్ ప్రవేశపెట్టిన తేదీ నుంచి దాన్ని అమలు చేయాలంటే 1-2 నెలల సమయం పడుతుంది. గతంలో మార్చి చివరి నాటికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేవారు. దాంతో అది జూన్ వరకు అమలు అయ్యేది. కానీ ప్రస్తుతం ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. దాంతో ఏప్రిల్-మే వరకు అమలు అవుతుంది.ఫిబ్రవరి 1, 2020లో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో రెండు గంటల నలభై నిమిషాలపాటు ప్రసంగించి సీతారామన్ రికార్డు నెలకొల్పారు.మోడీ 3.0 మొదటి బడ్జెట్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి మండలిలో ఆమోదం లభించింది.సీతారామన్ ఈరోజు పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ 2024ను సమర్పించనున్నారు. ఆమె వరుసగా ఏడో బడ్జెట్‌ను విడుదల చేస్తూ రికార్డు సృష్టించనున్నారు.మరికాసేపట్లో కేంద్ర బడ్జెట్మరో గంటలో పార్లమెంట్లో బడ్జెట్స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్లు మరికాసేపట్లో కేంద్ర కేబినెట్ భేటీబడ్జెట్‌కు ఆమోదం తెలపనున్న కేబినెట్ఎనిమిది నెలల కాలానికి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్వికసిత్ భారత్ లక్ష్యంగా బడ్జెట్ ఉంటుదన్న ప్రధాని మోదీఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు చేరుకున్నారు. పార్లమెంటు భవనంలోని ప్రవేశిస్తూ బడ్జెట్ ట్యాబ్‌ను ఆమె ప్రదర్శించారు. కొత్తగా ఏర్పడిన మోదీ ప్రభుత్వంలో తొలి బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్నారు.#WATCH | Finance Minister Nirmala Sitharaman carrying the Budget tablet arrives at Parliament, to present the first Budget in the third term of Modi Government. pic.twitter.com/0tWut8mhEu— ANI (@ANI) July 23, 2024 పార్లమెంటులో ఈరోజు ఉదయం 11 గంటలకు బడ్జెట్ సమర్పణకు ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో రాష్ట్రపతి భవన్లో సమావేశమయ్యారు. తిరిగి పార్లమెంట్‌కు వెళ్లారు.#WATCH | Finance Minister Nirmala Sitharaman meets President Droupadi Murmu at Rashtrapati Bhavan, ahead of the Budget presentation at 11am in Parliament.(Source: DD News) pic.twitter.com/VdsKg5bSLG— ANI (@ANI) July 23, 2024జమ్మూకశ్మీర్ బడ్జెట్ కాపీలు పార్లమెంటుకు చేరుకున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ జమ్మూకశ్మీర్ బడ్జెట్ 2024-25 అంచనా రశీదులను సమర్పిస్తారు.#WATCH | Delhi | J&K budget copies arrive in Parliament; Union Finance Minister Nirmala Sitharaman will present the estimated receipts and expenditure (2024-25) of the Union Territory of Jammu and Kashmir (with legislature) in Parliament today. pic.twitter.com/gMIf8y31bU— ANI (@ANI) July 23, 2024నిర్మలా సీతారామన్ తన ‘బహి-ఖాతా’తో రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. గతంలో మాదిరిగానే ఆర్థిక మంత్రి సంప్రదాయ ‘బహి-ఖాతా’ రూపంలో ఉన్న టాబ్‌తోనే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.నిర్మలమ్మ ఈసారి మెజెంటా పట్టు బోర్డర్ ఉన్న తెల్లటి చీరను ధరించారు.కొవిడ్ పరిణామాల తర్వాత స్టాక్ మార్కెట్లోని డెరివేటివ్స్ ట్రేడింగ్ భారీగా పెరిగింది. ప్రభుత్వం, రెగ్యులేటర్లు దీన్ని ప్రమాదకరంగా భావిస్తున్నాయి. ఈసారి బడ్జెట్లో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం.బడ్జెట్ 2024-25 ప్రకటన సందర్భంగా ఈరోజు స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి.దేశంలో అతిపెద్ద సిగరెట్ తయారీదారు ఐటీసీ కంపెనీపై 5–7 శాతం కంటే తక్కువ పన్ను విధించే అవకాశం ఉందని ‘జెఫ్రీస్’ అభిప్రాయపడుతుంది.ఎలక్ట్రిక్ కార్ల వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఐదు సంవత్సరాల కాలంలో మొత్తం రూ.1.08 లక్షల కోట్ల సబ్సిడీలను ప్రభుత్వం పంపిణీ చేసింది. వీటిని మరింత పెంచే అవకాశం ఉంది.లోక్‌సభలో ఈరోజు ఉదయం 11 గంటలకు బడ్జెట్ సమర్పించనున్న నిర్మలా సీతారామన్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలవడానికి రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. రాష్ట్రపతి అనుమతి పొందిన తర్వాత తిరిగి పార్లమెంట్‌ను చేరుకుంటారు.బడ్జెట్‌ను ఆవిష్కరించిన నిర్మలా సీతారామన్ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బృందంతో కలిసి నార్త్ బ్లాక్‌లోని మంత్రిత్వ శాఖ వెలుపల బడ్జెట్ టాబ్‌ను ఆవిష్కరించారు. #WATCH | Finance Minister Nirmala Sitharaman heads to Rashtrapati Bhavan to call on President Murmu, ahead of Budget presentation at 11am in Parliament pic.twitter.com/V4premP8lL— ANI (@ANI) July 23, 2024ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్. బడ్జెట్లో కీలక ప్రకటనలు వచ్చే అవకాశం. నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటల సమయంలో నూతన పార్లమెంట్ భవనంలోని లోక్‌సభలో ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయానికి చేరుకున్నారు.Finance Minister Nirmala Sitharaman reaches Ministry ahead of Union Budget presentationRead @ANI Story | https://t.co/2pLE5R08Yh#Budget2024 #BudgetDay #NirmalaSitharaman pic.twitter.com/Vu9E7tqsio— ANI Digital (@ani_digital) July 23, 2024ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయానికి చేరుకున్న ప్రధాన ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్.#WATCH | Chief Economic Advisor V Anantha Nageswaran arrives at Ministry of Finance, ahead of Union Budget presentation pic.twitter.com/vWrU3LbcLz— ANI (@ANI) July 23, 2024ఈజ్ మై ట్రిప్ సహ వ్యవస్థాపకుడు రికాంత్ పిట్టి మాట్లాడుతూ..‘గత సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు దాదాపు 6.5% ఉంది. ఈసారి కూడా ఆర్థిక సర్వే 7% వృద్ధి రేటును సూచిస్తుంది. పర్యాటక రంగంలో చాలామంది ఉపాధి పొందుతున్నారు. ప్రజల సంప్రదాయాల విస్తరణకు ఈ రంగం వారధిగా ఉంటుంది. బడ్జెట్ 2024-25లో పర్యాటక రంగానికి ప్రోత్సాహకాలుంటాయని ఆశిస్తున్నాం’ అని తెలిపారు.#WATCH | Union Budget 2024 | Rikant Pitti, co-founder of EaseMy Trip says, "... Last year our GDP growth rate was around 6.5%, and this time as well, the economic survey suggests around 7% growth rate... In the coming time, our GDP growth rate will become even better... Tourism… pic.twitter.com/vZgPne4vyd— ANI (@ANI) July 23, 2024ఈరోజు బడ్జెట్ సమావేశాల్లో జమ్ము కశ్వీర్ బడ్జెట్‌ను కూడా ప్రవేశపెడుతారు.వ్యవసాయం రంగం వృద్ధికి నిర్ణయాలు..?ఆర్థికసర్వేలోని వివరాల ప్రకారం దేశాభివృద్ధికి తోడ్పడే వ్యవసాయం మరింత పుంజుకోవాలంటే వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచాలని నిపుణులు చెబుతున్నారు. ఈమేరకు బడ్జెట్లో నిర్ణయం వెలువడుతుందని ఆశిస్తున్నారు.వ్యవసాయ పద్ధతుల్లో ఆధునిక నైపుణ్యాలను తీసుకురావాలని కోరుతున్నారు.వ్యవసాయ మార్కెటింగ్ మార్గాలను మెరుగుపరచాలంటున్నారు.పంట ఉత్పత్తుల ధరను స్థిరీకరించాలని చెబుతున్నారు.వ్యవసాయంలో ఆవిష్కరణలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.ఎరువులు, నీటి వాడకంలో మార్పులు రావాలంటున్నారు.వ్యవసాయ-పరిశ్రమ సంబంధాలను మెరుగుపరిచేలా నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు.ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రకటన2024–25 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి కేంద్ర బడ్జెట్‌ను కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ఉదయం 11 గంటలకు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గత ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం తెలిసిందే. కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలకు ఇది రికార్డు స్థాయిలో వరుసగా ఏడో బడ్జెట్ కావడం విశేషం. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించాలన్న ప్రధాని మోదీ ఆకాంక్షలకు అనుగుణంగా వివిధ రంగాలకు ప్రాధాన్యతల మేరకు నిధులు కేటాయింపులు చేయనున్నారు. సోమవారం విడుదల చేసిన ఎకనామిక్‌సర్వేలో ‘వికసిత్ భారత్’ కోసం ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేస్తున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు కలిసి పనిచేస్తే జీడీపీ వృద్ధి చెందుతుందన్నారు.ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్లో నిర్మల ఎలాంటి కీలక నిర్ణయాలు ఏవీ చేయలేదు. ఈసారి నూతన పన్ను విధానంలో పన్ను మినహాయింపును ప్రస్తుత రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచడంతో పాటు పాత విధానంలో మినహాయింపులను కూడా పెంచుతారని అంచనాలున్నాయి.పాత పన్ను విధానానికే చాలామంది మొగ్గు చూపుతున్నందున వారిని కొత్త విధానానికి మారేలా ప్రోత్సహించేందుకు మరిన్ని పన్ను మినహాయింపులు వస్తాయని అంచనా. 80సీ కింద మినహాయింపు మొత్తం రూ.1.5 లక్షలను 2014 నుంచీ పెంచలేదు. ఈపీఎఫ్, పీపీఎఫ్, ఇంటి రుణాలు, జీవిత బీమా, ఈక్విటీ ఆధారిత సేవింగ్ పథకాల వంటివన్నీ దీని పరిధిలోకే వస్తాయి. -
Union Budget 2024-25: బడ్జెట్ మథనంలో అమృతం చిలికేనా!
అమృతకాల బడ్జెట్‌గా మోదీ అభివర్ణిస్తున్న కేంద్ర బడ్జెట్–2024 అన్ని వర్గాల ఆశలపైనా నిజంగానే అమృతం చిలికిస్తుందా? పన్ను వాతలు, ఎడాపెడా కోతలతో ఖేదమే మిగులుస్తుందా? 2047కల్లా వికసిత భారత లక్ష్యాన్ని సాకారం చేసుకునే దిశగా పడుతున్న బలమైన పునాదిగా ప్రధాని చెప్పుకున్న ఈ బడ్జెట్లో మధ్యతరగతిని ఎంతో కొంత మురిపిస్తారా? ముఖ్యంగా ఐటీ మినహాయింపులు పెంచి వేతన జీవులకు కాస్తయినా ఉపశమనం కలిగిస్తారా? కేవలం ప్రగతి పరుగులకే మరింత ఊపునిస్తారా? ఈ ప్రశ్నలన్నింటికీ మరికొద్ది గంటల్లో జవాబులు లభించనున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి కేంద్ర బడ్జెట్‌ను విత్త మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గత ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం తెలిసిందే. కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలకు ఇది రికార్డు స్థాయిలో వరుసగా ఏడో బడ్జెట్ కావడం విశేషం. మోదీ 3.0 సర్కారు తొలి బడ్జెట్ నుంచి ఏ రంగాలు ఏం ఆశిస్తున్నాయంటే... ఐటీ ఊరట.. ఈసారైనా...! ఆదాయ పన్ను చెల్లించే మధ్య తరగతి, వేతన జీవులు ఈ బడ్జెట్లోనన్నా ఎంతో కొంత ఊరట దక్కుతుందని ఆశిస్తున్నారు. ఐటీ శ్లాబులను సవరించాలన్నది వారి ప్రధాన డిమాండ్. ఓటాన్ అకౌంట్లో నిర్మల దీని జోలికి పోలేదు. నూతన పన్ను విధానంలో పన్ను మినహాయింపును ప్రస్తుత రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచడంతో పాటు పాత విధానంలో మినహాయింపులను కూడా పెంచుతారని అంచనాలున్నాయి. తద్వారా వేతన జీవుల చేతిలో మరిన్ని డబ్బులు ఆడతాయని, వారి కొనుగోలు సామర్థ్యం పెరిగి ఆర్థిక వ్యవస్థ మరింతగా కళకళలాడుతుందని నిపుణులు చెబుతున్నారు. చాలామంది పాత పన్ను విధానానికే మొగ్గుతున్నందున వారిని కొత్త విధానానికి మారేలా ప్రోత్సహించేందుకు మరిన్ని పన్ను మినహాయింపులకు చోటు దక్కవచ్చని అంచనా. 80సీ కింద మినహాయింపు మొత్తం రూ.1.5 లక్షలను 2014 నుంచీ పెంచలేదు. ఈపీఎఫ్, పీపీఎఫ్, ఇంటి రుణాలు, జీవిత బీమా, ఈక్విటీ ఆధారిత సేవింగ్ పథకాల వంటివన్నీ దీని పరిధిలోకే వస్తాయి. 80సీ తో పాటు స్టాండర్డ్ డిడక్షన్ పరిధిని కూడా పెంచాలన్న డిమాండ్ ఎప్పట్నుంచో ఉంది. అది నెరవేరితే రియల్టీ పరిశ్రమకు కూడా మరింత ఊపు వస్తుంది. రియల్టీ డేటా సెంటర్లతో పాటు రియల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టు (ఆర్ఈఐటీ)లకు పలు తాయిలాలు ప్రకటించవచ్చని భావిస్తున్నారు. ఆర్థిక వృద్ధికి ఊతమివ్వడమే గాక ఉద్యోగావకాశాల సృష్టికి ఇదెంతో దోహదపడుతుందన్నది రియల్టీ పరిశ్రమ ముఖ్యుల అభిప్రాయం. రియల్టర్లకు నగదు అందుబాటును పెంచేందుకు ఆర్‌ఈఐటీలను ఈక్విటీ ఇన్‌స్ట్రుమెంట్లుగా పరిగణించే అవకాశం ఉందంటున్నారు. ఈ రంగానికి జీఎస్టీ చట్టం కింద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను అనుమతించాలన్న ఆర్ఈఐటీ సంఘం డిమాండ్ ఏ మేరకు నెరవేరుతుందన్నదీ ఆసక్తికరమే. ఈవీలపై ఏం చేస్తారో...ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) జోరు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిశ్రమకు మరింతగా ప్రోత్సాహకాలను అందించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈవీలకు పనితీరు ఆధారిత ప్రోత్సాహకాల పథకం తెస్తే బాగుంటుందన్న అభిప్రాయముంది. అన్నిరకాల ఈవీ వాహనాల తయారీ పూర్తిగా భారత్‌లోనే జరిగేందుకు అనువైన వాతావరణాన్ని కలి్పంచాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. అలాగే ఆటో విడి భాగాలన్నింటిపై జీఎస్టీని 18 శాతానికి తగ్గించడంతో పాటు పలు రకాలైన మినహాయింపులను ఆశిస్తున్నాయి. ఈవీ రంగంలో స్టార్టప్‌లకు దన్నుగా నిలిచే దిశగా చర్యలు ఉండవచ్చంటున్నారు. తుక్కు విధానాన్ని కూడా మరింతగా సరళీకరిస్తారేమో చూడాల్సి ఉంది. ఫార్మా కరోనా అనంతర పరిస్థితుల నేపథ్యంలో మరింత కీలకంగా మారిన ఫార్మా రంగానికి పలు ప్రోత్సాహకాలు నిర్మల బడ్జెట్లో చోటుచేసుకునే అవకాశముంది. ముఖ్యంగా పరిశోధన, ఇన్నొవేషన్ కార్యక్రమాలను ప్రోత్సహించే చర్యలు ఉండవచ్చంటున్నారు. ఇప్పటికీ సంక్లిష్టంగానే ఉన్న పలురకాల అనుమతుల ప్రక్రియలను మరింత సరళతరం చేయవచ్చని చెబుతున్నారు. కీలకమైన ఔఫధాల తయారీ తదితరాలకు ఆర్థిక ప్రోత్సాహకాలకు సంబంధించిన ప్రకటనపై కూడా ఫార్మా దిగ్గజాలు ఆశలు పెట్టుకున్నాయి. ‘స్వదేశీ’ రక్షణ! అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు, చైనా దూకుడు తదితర నేపథ్యంలో రక్షణ రంగానికి కేటాయింపులను ఈసారి కూడా ఇతోధికంగా పెంచడం ఖాయంగా కని్పస్తోంది. అదే సమయంలో రక్షణ సంబంధిత ఉత్పత్తి, మౌలిక సదుపాయాల పరిశ్రమల్లో ‘ఆత్మ నిర్భరత’కు మరింత పెద్దపీట వేసేలా మరిన్ని చర్యలు ఉండనున్నాయి. ఇది ఆర్థిక రంగానికి మరింత ఊపునివ్వడమే గాక అపారమైన ఉపాధి అవకాశాలను కలి్పస్తుందని, అంతిమంగా ప్రజల జీవన నాణ్యతనూ పెంచుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
PM Narendra Modi: ప్రధాని గొంతే నొక్కజూస్తారా!
సాక్షి, న్యూఢిల్లీ: విపక్షాలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రతికూల రాజకీయాలకు పాల్పడుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. అందుకు పార్లమెంటును కూడా దురి్వనియోగం చేసే ప్రయత్నంలో పడ్డాయని మండిపడ్డారు. ఆ క్రమంలో ప్రధానమంత్రి గొంతునే నొక్కే పోకడలకు పాల్పడుతున్నాయని దుయ్యబట్టారు. కేంద్ర బడ్జెట్‌పై సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. ఇక రాజకీయాలను పక్కన పెట్టి వచ్చే ఐదేళ్లలో దేశాభివృద్ధి కోసం పారీ్టలన్నీ ఒక్కతాటిపైకి రావాలి’’ అని పిలుపునిచ్చారు. ‘‘పార్లమెంటు ఉన్నది ఏదో ఒక్క పార్టీ కోసం కాదు. మొత్తం దేశం కోసం’’ అంటూ విపక్షాలను ఉద్దేశించి హితవు పలికారు. ‘‘మళ్లీ 2029 జనవరిలో మరోసారి లోక్‌సభ ఎన్నికల క్షేత్రంలోకి దిగండి. కావలిస్తే అందుకు పార్లమెంటును కూడా వాడుకోండి. అప్పటిదాకా ప్రజా సంక్షేమం కోసం పాటుపడదాం’’ అని పిలుపునిచ్చారు. విపక్షాల తీరు మారాలి సభా కార్యకలాపాలను అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న కొన్ని విపక్షాల తీరుతో ఆయా పార్టీల ఎంపీలకు పార్లమెంటులో మాట్లాడే అవకాశమే రాలేదని మోదీ అన్నారు. ‘‘ఇది విచారకరం. అన్ని పారీ్టలు సభ్యులందరికీ, ముఖ్యంగా తొలిసారి ఎన్నికైన వారికి మాట్లాడే అవకాశమివ్వాలి. తొలి సమావేశాలకు విపక్షాలు అంతరాయం కలిగించాయి. దాంతో 140 కోట్ల భారతీయుల ఆదేశంతో ఎన్నికైన ప్రభుత్వ స్వరం పదేపదే మూగబోయింది. ఇవి ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదు. నిజానికి ప్రతికూల రాజకీయాలకు మన పార్లమెంటరీ వ్యవస్థలో ఎప్పుడూ స్థానం లేదు’’ అన్నారు.ఇది అమృతకాల బడ్జెట్ మేం ప్రవేశపెట్టబోతోంది అమృతకాల బడ్జెట్. వచ్చే ఐదేళ్లకే గాక 2047 నాటికి వికసిత్ భారత్‌ను సాకారం చేసుకునే కలకు పునాది. -
Economic Survey 2023-24: ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్ ప్రమాదకరం
న్యూఢిల్లీ: ప్రభుత్వం డెరివేటివ్స్ ట్రేడింగ్‌కు వీలుగా కమోడిటీల జాబితాను విస్తరించినప్పటికీ మార్కెట్లు మరింత అభివృద్ధి చెందేటంతవరకూ బియ్యం, గోధుమలుసహా ఇతర తృణధాన్యాలలో ఫ్యూచర్స్ ట్రేడింగ్ ప్రమాదకరమని ఆర్థిక సర్వే ప్రస్తావించింది. సున్నిత(సెన్సిటివ్) కమోడిటీలను ఫ్యూచర్స్ మార్కెట్లనుంచి ప్రస్తుతానికి పక్కనపెట్టడమే మేలు. అగ్రికల్చర్ ఫ్యూచర్స్ మార్కెట్ ఆయిల్‌సీడ్స్, కాటన్, బాస్మతి బియ్యం, మసాలా దినుసుల వంటి నాన్సెన్సిటివ్ కమోడిటీలపై దృష్టి పెట్టడం మంచిదని పేర్కొంది. ఇటీవల ప్రభుత్వం డెరివేటివ్స్‌లోకి కమోడిటీలను 91 నుంచి 104కు పెంచింది. యాపిల్స్, జీడిపప్పు, వెల్లుల్లి, పాలపొడి, వైట్ బటర్ తదితరాలను జాబితాలో కొత్తగా చేర్చింది. కాగా.. చిన్న రైతులతోకూడిన రైతు ఉత్పత్తి సంస్థల(ఎఫ్‌పీవోలు)ను కమోడిటీ మార్కెట్లతో అనుసంధానించాలి. ప్రభుత్వం, సెబీ, కమోడిటీ ఎక్సే్ఛంజీలు ఎఫ్‌పీవోలను ప్రోత్సహించాలి. ఆర్థిక అక్షరాస్యత ద్వారా వీటి నైపుణ్యం, నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపరచాలి. వెరసి అగ్రిడెరివేటివ్స్ ద్వారా రైతులు లబ్ది పొందేందుకు వీలు కలి్పంచాలి.అవకతవకలకు చాన్స్ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(ఎఫ్‌అండ్‌వో) విభాగంలో రిటైల్ ఇన్వెస్టర్ల లావాదేవీలు పెరిగితే జూదాల(గ్యాంబ్లింగ్)కు వీలు ఏర్పడుతుందని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. డెరివేటివ్స్‌లో రిటైలర్ల ఆసక్తి పుంజుకోవడం ఆందోళనకర అంశం. అభివృద్ధి చెందుతున్న దేశంలో స్పెక్యులేటివ్ ట్రేడింగ్‌కు అవకాశంలేదు. కొన్ని సందర్భాలలో అసాధారణ లాభాలకు డెరివేటివ్స్ వీలు కలి్పస్తాయి. అయితే ఇది జూదానికి దారితీస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆర్థిక మంత్రి, సెబీ చీఫ్, స్టాక్ ఎక్సే్ఛంజీలు సైతం రిటైల్ ఇన్వెస్టర్లను హెచ్చరించాయి. తక్కువ తలసరి ఆదాయంగల దేశాలలో ఎఫ్‌అండ్‌వో సమర్థనీయంకాదు. దిద్దుబాటుకు అవకాశమున్న మార్కెట్లలో రిటైలర్లకు ఎఫ్‌అండ్‌వో ద్వారా అధిక నష్టాలకు వీలుంది. ఇది ఆర్థిక వ్యవస్థకు సైతం చేటు చేస్తుంది. 2019లో రూ. 217 లక్షల కోట్ల టర్నోవర్ 2024కల్లా రూ. 8,740 ట్రిలియన్లకు చేరడం ఎఫ్‌అండ్‌వో విభాగ భారీ వృద్ధిని అద్దం పడుతోంది. అయితే ఇదే కాలంలో ఈక్విటీ నగదు టర్నోవర్ సగటు సైతం రూ. లక్ష కోట్ల నుంచి రూ. 330 లక్షల కోట్లకు ఎగసింది. ఇది కూడా ఆందోళనకర అంశమే. కుటుంబ పొదుపులో 20 శాతం ఫైనాన్షియల్ మార్కెట్లలో పెట్టుబడులకు తరలివస్తోంది. ప్రత్యక్షంగా, మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడులు భారీగా ప్రవహిస్తున్నాయి. దీంతో ఫండ్స్ నిర్వహణలోని ఆస్తుల విలువ గతేడాది రూ. 14 లక్షల కోట్లు ఎగసింది. ఏయూఎం రూ. 53.4 లక్షల కోట్లను తాకింది. ఇక సెబీ నివేదిక ప్రకారం 89 శాతంమంది రిటైలర్లు 2022లో డెరివేటివ్స్ ద్వారా సగటున రూ. 1.1 లక్షలు నష్టపోయారు.ఆరోగ్యంతోనే ఆశించిన ప్రయోజనాలు భారత్ అధిక జనాభా నుంచి ఆశించిన ఫలాలను పొందాలంటే ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లకుతోడు, మానసిక ఆరోగ్యంపై ప్రభుత్వం, ప్రజలు దృష్టి సారించాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే గుర్తు చేసింది. అధికంగా ప్రాసెస్ చేసిన, చక్కెరలు, కొవ్వులు అధికంగా ఉన్న ఆహారాల వినియోగంతో సమాజంలో స్థూలకాయం పెరుగుతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో 56.4 శాతం వ్యాధులకు అనారోగ్యకర ఆహార అలవాట్లే కారణమన్న ఐసీఎంఆర్ తాజా అంచనాలను వెల్లడించింది. ప్రజల ఆరోగ్యకర జీవనశైలి, స్థూలకాయం నివారణ కోసం తక్షణం చర్యలు తీసుకోవాలని కోరింది. పట్టణ ప్రాంతాల్లో 29.8 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 19.3 శాతం పురుషులు స్థూలకాయంతో బాధపడుతున్నట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గణాంకాలను ప్రస్తావించింది. కొన్ని రాష్ట్రాల్లో ఇది మరింత అధికంగా ఉందంటూ.. ఢిల్లీలో 41.3 శాతం మహిళలు, 38 శాతం పురుషుల్లో ఈ సమస్య ఉన్నట్టు పేర్కొంది. మానసిక ఆరోగ్యంపై సమాజంలో తగినంత చర్చ జరగడం లేదని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. వ్యక్తిగత, దేశాభివృద్ధిపై ఇది ప్రభావం చూపిస్తుందని తెలిపింది. వైవిధ్యమైన, భిన్నమైన ఆహారం దిశగా అడుగులు వేయాలని సూచించింది. ఈకామర్స్ వృద్ధికి అవరోధాలు డేటా ప్రైవసీ అంశాలు, ఆన్లైన్ మోసాలతో సవాళ్లు వ్యక్తిగత వివరాల గోప్యత సమస్యలు, పెరుగుతున్న ఆన్లైన్ మోసాలు దేశీయంగా ఈకామర్స్ వృద్ధికి ప్రధాన అడ్డంకిగా నిలుస్తున్నట్లు ఆర్థిక సర్వే పేర్కొంది. 2030కల్లా దేశీ ఈకామర్స్ మార్కెట్ విలువ 350 బిలియన్ డాలర్లకు చేరవచ్చని ఒక అంచనా. అయితే ఈకామర్స్ ప్లాట్‌ఫామ్స్ వినియోగంలో వినియోగదారులు మోసపోకుండా తగిన విధంగా సన్నద్దం(ఎడ్యుకేట్) చేయవలసి ఉంది. ఇదేవిధంగా ఆన్లైన్ విక్రయాలకు సైతం కేటలాగింగ్ తదితర నైపుణ్యాలను పెంచవలసి ఉంది. వీటికితోడు వ్యక్తిగత వివరాల గోప్యత అంశాలు, ఆన్లైన్లో పెరుగుతున్న మోసాలు ఈకామర్స్ వృద్ధిని దెబ్బతీస్తున్నాయి. వెరసి ఈకామర్స్ ప్లాట్‌ఫామ్స్‌ను రక్షణాత్మకంగా వినియోగించుకోవడంలో యూజర్లకు శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది. గత కొన్నేళ్లుగా దేశీ ఈకామర్స్ వేగవంతంగా వృద్ధి చెందుతోంది. ఇందుకు మెరుగుపడుతున్న సాంకేతికతలు, ఆధునికతరం బిజినెస్ విధానాలు, డి/æటల్ ఇండియా వంటి ప్రభుత్వ చర్యలు, ఓఎన్డీసీ, ఎఫ్‌డీఐ విధానాల్లో సరళత, వినియోగదారుల రక్షణ చట్టాలు సహకరిస్తున్నాయి.124 బిలియన్ డాలర్లకు రెమిటెన్సులు... సేవా రంగం ఎగుమతుల తర్వాత భారతదేశానికి అత్యధిక విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్న రెమిటెన్సులు 2024లో 3.7 శాతం పురోగతితో 124 బిలియన్ డాలర్లకు పెరుగుతాయని సర్వే పేర్కొంది. 2025లో 4 శాతం వృద్ధితో 129 బిలియన్ డాలర్లకు పురోగమిస్తాయని వివరించింది. విదేశాల్లో నివసిస్తున్న వ్యక్తులు తమ సొంత దేశానికి నిధులు పంపడానికి సంబంధించిన రెమిటెన్సుల విషయంలో ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే తొలి స్థానంలో నిలుస్తోంది. 2023లో 120 బిలియన్ డాలర్ల రెమిటెన్సులు దేశాలనికి వచి్చనట్లు ప్రపంచబ్యాంక్ ఇటీవలి నివేదిక పేర్కొంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్ వంటి కీలక దేశాలతో తన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ)ని అనుసంధానించడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలు వ్యయాలను తగ్గించి, చెల్లింపులను వేగవంతం చేయగలవని అంచనా వేసినట్లు సర్వే వివరించింది. ఆటో రంగంలో రూ. 67,690 కోట్ల పెట్టుబడులు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకంతో (పీఎల్ఐ) ఆటోమొబైల్, ఆటో విడిభాగాల పరిశ్రమలోకి ఇప్పటివరకు రూ. 67,690 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచి్చనట్లు ఆర్థిక సర్వే తెలిపింది. 2024 మార్చి ఆఖరు నాటికి రూ. 14,043 కోట్ల ఇన్వెస్ట్మెంట్ జరిగిందని వివరించింది. దరఖాస్తుదారులు 1.48 లక్షల ఉద్యోగాల కల్పనకు హామీ ఇవ్వగా ఇప్పటివరకు 28,884 ఉద్యోగాలు కల్పించినట్లు పేర్కొంది. ఈ స్కీము కింద 85 దరఖాస్తుదార్లకు ఆమోదం లభించినట్లు సర్వే తెలిపింది. 2023–27 ఆర్థిక సంవత్సరాల మధ్య ఆటో, ఆటో విడిభాగాల పరిశ్రమ కోసం పీఎల్ఐ స్కీము కింద రూ. 25,938 కోట్ల మేర బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా 49 లక్షల ప్యాసింజర్ వాహనాలు, 9.9 లక్షల త్రీ వీలర్లు, 2.14 కోట్ల ద్విచక్ర వాహనాలు, 10.7 లక్షల వాణిజ్య వాహనాల ఉత్పత్తి నమోదైంది. అసమానతల నివారణలో పన్నులు కీలకంకృత్రిమ మేథ (ఏఐ) సాంకేతికత ఉపాధి కల్పన, ఆదాయంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని ఆర్థిక సర్వే తెలిపింది. కనుక రాబోయే రోజుల్లో సమాజంలోని అసమానతల పరిష్కారంలో పన్ను విధానాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొంది. అంతర్జాతీయంగానూ అసమానతలు పెరిగిపోతుండడం విధాన నిర్ణేతలకు కీలక ఆర్థిక సవాలుగా పరిణమిస్తున్నట్టు తెలిపింది. ఈ అంశంపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెబుతూ.. ఉపాధి కల్పన, సంఘటిత రంగంతో అసంఘటిత రంగం అనుసంధానం, మహిళా కారి్మక శక్తి పెంచడం కోసం చర్యలు తీసుకున్నట్టు గుర్తు చేసింది. దేశంలో ఒక్క శాతం ప్రజలు 6–7 శాతం ఆదాయం పొందుతున్నట్టు, టాప్–10 శాతం వర్గం మొత్తం ఆదాయంలో ఒకటో వంతు వాటా కలిగి ఉన్నట్టు గుర్తు చేసింది. మరింత తగ్గనున్న వాణిజ్య లోటు .. రాబోయే రోజుల్లో వాణిజ్య లోటు మరింత తగ్గగలదని ఆర్థిక సర్వే తెలిపింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) పథకాలతో దేశీయంగా తయారీకి ఊతం లభించడం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో ఎగుమతులు పెరగడం వంటి అంశాలు ఇందుకు దోహదపడగలవని వివరించింది. అయితే, కమోడిటీల ధరల్లో, ముఖ్యంగా చమురు, లోహాలు, వ్యవసాయోత్పత్తులు మొదలైన వాటి ధరల్లో హెచ్చుతగ్గులనేవి వాణిజ్య సమతౌల్యత, ద్రవ్యోల్బణ స్థాయులపై ప్రభావం చూపవచ్చని పేర్కొంది. అలాగే, ప్రధాన వ్యాపార భాగస్వామ్య దేశాలు, భౌగోళిక రాజకీయ పరిణామాలు భారత ఎగుమతి అవకాశాలను ప్రభావితం చేయొచ్చని వివరించింది. భౌగోళిక రాజకీయ సవాళ్ల వల్ల ఉత్పత్తుల ఎగుమతులపై ప్రభావం పడినప్పటికీ, అంతర్జాతీయంగా కమోడిటీల ధరలు తగ్గడమనేది 2023 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య లోటు తగ్గడానికి తోడ్పడిందని సర్వే వివరించింది. ఉత్పత్తులపరమైన వాణిజ్య లోటు 2022–23లో 265 బిలియన్ డాలర్లుగా ఉండగా 2023–24లో 240 బిలియన్ డాలర్లకు తగ్గింది. వృద్ధుల సంక్షేమానికి ప్రాధాన్యం దేశంలో వృద్ధ జనాభా పెరుగుతున్న తరుణంలో వారి సంరక్షణ అవసరాలపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే తెలియజేసింది. వృద్ధుల సంరక్షణ మార్కెట్ ప్రస్తుతం దేశంలో రూ.58వేల కోట్లుగా ఉందంటూ.. మౌలిక వసతులు, వయసు రీత్యా వచ్చే అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే అంశంలో అంతరాలున్నట్టు గుర్తు చేసింది. 60–69 సంవత్సరాల వయసులోని వారి సామర్థ్యాలను దేశ ఉత్పాదకత పెంపునకు వినియోగించుకోవాల్సిన ప్రాముఖ్యతను హైలైట్ చేసింది. వృద్ధాప్య అనుకూల ఉద్యోగాలతో జీడీపీ 1.5 శాతం మేర పెంచుకోవచ్చన్న ఆసియా అభివృద్ధి బ్యాంక్ నివేదిక సూచనలను ప్రస్తావించింది. 60 ఏళ్లపైబడిన వయసులోని వారికి తగిన ఉపాధి కలి్పంచడం ద్వారా వారిని సమాజంలో చురుగ్గా, ఆర్థికంగా మెరుగ్గా ఉండేలా చూడొచ్చని, ఇది వారి సంరక్షణ అవసరాలను తగ్గిస్తుందని ఆర్థిక సర్వే సూచించింది. 2022 నాటికి దేశ జనాభాలో 14.7 కోట్ల మంది వృద్ధులు ఉంటే, 2050 నాటికి 34.7 కోట్లకు పెరుగుతారని అంచనా. వాస్తవానికి అద్దంఎకానమీ వాస్తవ పరిస్థితికి సర్వే అద్దం పట్టింది. ఈ అంశాల ప్రాతిపదికన భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించడానికి తగిన ‘‘ఆచరణాత్మకమైన’’ మార్గాన్ని సర్వే నిర్దేశించింది. – చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డైరెక్టర్ జనరల్ 7 శాతానికి మించి వృద్ధి భారత వృద్ధికి సంబంధించి సర్వే సానుకూలంగా ఉంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఎకానమీ 7 శాతం వరకూ ఉంటుందని సర్వే అంచనావేసినా, 8 శాతంగా ఉండే అవకాశం ఉందని విశ్వసిస్తున్నాను. – సంజీవ్ పురి, సీఐఐ ప్రెసిడెంట్సంక్షోభాన్ని దాటి స్థిరత్వం.. కోవిడ్ నేపథ్యంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నుంచి కోలుకున్న ఎకానమీ.. 2047 నాటికి ‘వికసిత భారత్’ ఆవిర్భావ లక్ష్యాన్ని సాకారం చేసుకునే దిశలో ముందుకు కదులుతోంది. సర్వే ఈ అంశాన్ని అద్దం పడుతోంది. – సంజీవ్ అగర్వాల్, పీహెచ్డీ చాంబర్సంస్కరణలు బాటన ముందుకు.. ఎకానమీ అవుట్‌లుక్ పరిణతి చెందినట్లు గమనిస్తున్నాము. ప్రపంచంలో వేగవంతమైన ఆర్థిక వృద్ధి రేటును దేశం కొనసాగిస్తుంది. జీఎస్టీ, ఐబీసీ తర్వాత తదుపరి సంస్కరణల బాటన నడవాల్సిన అవసరం ఉంది. – అనిష్ షా, ఫిక్కీ ప్రెసిడెంట్ సాహసోపేత డాక్యుమెంట్ సాహసోపేతమైనది. భారీ ఉపాధి కల్పనతోపాటు ఏఐ వంటి కొత్త సాంకేతికత సది్వనియోగం చేసుకుని 4వ ప్రపంచ పారిశ్రామిక విప్లవాన్ని సద్వినియోగం చేసుకోవాలనే సంకల్పాన్ని సూచిస్తోంది. – దీపక్ సూద్, అసోచామ్ సెక్రటరీ జనరల్ ఆర్థికాభివృద్ధి లక్ష్యంఅపూర్వ ఆర్థిక పరిస్థితిని అధిగమించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కార్పొరేట్ రంగం, విద్యాసంస్థల మధ్య ఒక ఒప్పందాన్ని ఆర్థిక సర్వే ప్రతిపాదించింది. అలాగే వివిధ నిబంధనలను ప్రభుత్వం విడనాడాలి. – రానెన్ బెనర్జీ, పార్ట్నర్, పీడబ్లు్యసీ ఇండియా. సహకారం కీలకంమధ్య కాలంలో వృద్ధికి ప్రైవేట్ కార్పొరేట్ రంగం, రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు అవసరమని సర్వే పరోక్షంగా నొక్కి చెప్పింది. ద్రవ్యోల్బణాన్ని నిర్వహించడం అనేది కేవలం ఆర్బీఐ, దాని ద్రవ్య విధాన కమిటీ ప్రత్యేకాధికారం కాదు. ముఖ్యంగా ఆహార ధరల నిర్వహణ రంగంలో కేంద్రం చురుకైన జోక్యం అవసరం. – అదితీ నాయర్, చీఫ్ ఎకనమిస్ట్, ఇక్రాఇన్ఫ్రా ఊతంఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వం పెద్ద బాధ్యతను భుజానికెత్తుకున్నప్పటికీ.. ఐపీ, మెషినరీలో ప్రైవేట్ పెట్టుబడి కూడా బలంగా ఉంది. గృహాలు, నిర్మాణాలలో పెట్టుబడులు అధికంగా ఉన్నాయి. భౌతిక ఆస్తులలో పొదుపు చేయడానికి కుటుంబాలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. – రుమ్కీ మజుందార్, ఎకనమిస్ట్, డెలాయిట్.చిన్న పరిశ్రమల మద్దతు కీలకంప్రభుత్వ దార్శనికత ప్రకారం భారత్ అతి త్వరలో మూడవ అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా కంపెనీలను ముందుకు నడిపిస్తే తప్ప ఈ దార్శనికతను సాధించలేము. ఎందుకంటే అవి భారతదేశానికి ప్రధాన ఉపాధి మార్గాలు, జీడీపీని నడిపించేవి. – వివేక్ జలన్, పార్ట్నర్, ట్యాక్స్ కనెక్ట్ అడ్వైజరీ సరీ్వసెస్. చిన్న పరిశ్రమల మద్దతు కీలకంప్రభుత్వ దార్శనికత ప్రకారం భారత్ అతి త్వరలో మూడవ అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా కంపెనీలను ముందుకు నడిపిస్తే తప్ప ఈ దార్శనికతను సాధించలేము. ఎందుకంటే అవి భారతదేశానికి ప్రధాన ఉపాధి మార్గాలు, జీడీపీని నడిపించేవి. – వివేక్ జలన్, పార్ట్నర్, ట్యాక్స్ కనెక్ట్ అడ్వైజరీ సరీ్వసెస్. సవాళ్ల అధిగమనంఅంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడులు విస్తరించి ఉన్న అభివృద్ధి మార్గంలో ఆర్థిక వ్యవస్థకు ఉన్న కొన్ని కీలక సవాళ్ల గురించి సర్వే చర్చించింది. ఉద్యోగాలను పెంచడం, గ్రామీణ పట్టణ విభజనను తగ్గించడంపై దృష్టి కేంద్రీకరించడం ప్రభుత్వ రాడార్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. – రిశి షా, పార్ట్నర్, గ్రాంట్ థాంటన్. పెట్టుబడుల పురోగతిసర్వేలో అంచనా వేసిన 6.5–7 శాతం వృద్ధికి 35–36 శాతం నిజమైన పెట్టుబడి రేటు అవసరం. తదనుగుణంగా 33–34 శాతం నిజమైన పొదుపు రేటు ఉండాలి. ప్రస్తుత పొదుపు, పెట్టుబడి రేట్లను బట్టి ఇది సాధ్యమయ్యేలా కనిపిస్తోంది. తగిన విధానపర జోక్యాల ద్వారా రెండు మూడు దశాబ్దాల్లో వృద్ధి ఈ స్థాయిలో కొనసాగాలి. – డి.కె.శ్రీవాస్తవ, చీఫ్ పాలసీ అడ్వైజర్, ఈవై ఇండియా. -
Union Budget 2024-25: ఉపాధికి ఊతం.. ధరలకు కళ్లెం!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25)లో వృద్ధి రేటు అంచనాలను ప్రభుత్వం అచితూచి నిర్ధేశించింది. స్థూలదేశీయోత్తత్తి (జీడీపీ) వృద్ధి 6.5–7 శాతం స్థాయిలో ఉండొచ్చని ఆర్థిక సర్వేలో లెక్కగట్టింది. ఉపాధి కల్పనను పెంచాల్సిన అవసరం ఉందని కూడా నొక్కిచెప్పింది. ధరాభారంతో అల్లాడుతున్న పేదలు, అల్పాదాయ వర్గాలకు ప్రత్యక్ష నగదు బదిలీ లేదా కూపన్ల రూపంలో నిర్ధిష్టంగా ఆర్థిక తోడ్పాటు కల్పించాల్సిఇన అవసరం ఉందని కూడా సర్వే సూచించింది. దేశంలో తయారీ రంగానికి తోడ్పాటు అందించడంతో పాటు ఎగుమతులను పెంచాలంటే చైనా నుంచి ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పెంచాల్సిందేనని స్పష్టం చేసింది. కాగా, గతేడాది (2023–24) 8.2 శాతం వృద్ధి రేటుతో పోలిస్తే, ఈ ఏడాది వృద్ధి రేటు అంచనాలు చాలా తక్కువగా ఉండటం విశేషం. ఆర్బీఐ నిర్దేశించిన 7.2 శాతం వృద్ధి రేటు అంచనాలతో పోలి్చనా సర్వేలో వృద్ధి అంచనా తగ్గింది. అనిశి్చత వర్షపాతం, ప్రైవేటు రంగంలో పెట్టుబడుల మందగమనం వంటివి వృద్ధి అంచనాల తగ్గుదలకు ప్రధాన కారణంగా సర్వే పేర్కొంది. ‘భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టమైన వృద్ధి బాటలో పయనిస్తోంది. ప్రపంచ భౌగోళిక, రాజకీయ సవాళ్లన్నింటినీ దీటుగా ఎదుర్కొంటోంది’ అని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ సర్వే ముందుమాటలో పేర్కొన్నారు. కాగా, నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేయడం ద్వారా మధ్యకాలం పాటు నిలకడగా 7% వృద్ధి రేటు కొనసాగవచ్చని సర్వే తేల్చిచెప్పింది.కార్మిక సంస్కరణలు వేగవంతం... కేంద్రంలో వరుసగా మూడోసారి కొలువుదీరిన మోదీ సర్కారు 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా 2024–25 పూర్తి స్థాయి బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వ ప్రాధాన్యతలను ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రైవేటు పెట్టుబడులను పెంచడం, చిన్న–మధ్య తరహా వ్యాపారాలకు చేయూతనందించడం, సాగును లాభసాటిగా మార్చేలా వ్యవసాయ సంస్కరణలు, వాతావరణ మార్పుల సమస్యను ఎదుర్కొనేందుకు వనరుల సమీకరణ, ఆర్థిక అసమానాతలను తగ్గించడం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. విద్య, ఉపాధి మధ్య అంతరాన్ని పూడ్చాలని కూడా సర్వే నొక్కిచెప్పింది. దేశంలో ఉద్యోగ కల్పనకు మరింత సానుకూల వాతావరణాన్ని సృష్టించాలంటే కార్మిక సంస్కరణల అమలును వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని కూడా పేర్కొంది. ‘దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి అనుగుణంగా 2030 నాటికి వ్యవసాయేతర రంగంలో ఏటా సగటున 78.5 లక్షల ఉద్యోగాలను కలి్పంచాల్సి ఉంటుంది’ అని సర్వే తెలిపింది. చైనా పెట్టుబడులు పెరగాలి... భారత్ ఎగుమతులు, దేశీ తయారీ రంగం మరింత పుంజుకోవాలంటే, చైనా నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పెరగాలని, లేదంటే చైనా సరఫరా వ్యవస్థతో భారత్ అనుసంధానం కావాల్సి ఉంటుందని సర్వే అభిప్రాయపడింది. మరోపక్క, చైనా నుంచి దేశంలోకి దిగుమతులు తగ్గాలని కూడా పేర్కొంది. ‘అమెరికా తదితర కీలక మార్కెట్లకు భారత్ ఎగుమతులు భారీగా పెరగాలంటే చైనా పెట్టుబడులపై మనం మరింత దృష్టి సారించాలి. తూర్పు ఆసియా దేశాలు గతంలో ఇదే విధంగా లబ్ధి పొందాయి’ అని సర్వే తెలిపింది. 2020లో గాల్వాన్‌లో చోటు చేసుకున్న సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా భారత్ టిక్‌టాక్, యూసీ బ్రౌజర్‌తో సహా 200 చైనా మొబైల్ యాప్‌లను నిషేధించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా చైనా ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం బీవైడీ భారీ పెట్టుబడి ప్రతిపాదనలను కూడా తిరస్కరించింది. 2000–2024 మధ్య భారత్ అందుకున్న మొత్తం ఎఫ్‌డీఐలలో చైనా కేవలం 0.37% (2.5 బిలియన్ డాలర్లు) వాటాతో 22 స్థానంలో ఉంది. కాగా, కీలక ఖనిజాల విషయంలో చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని సర్వే స్పష్టం చేసింది.పేదలకు కూపన్లు లేదా ప్రత్యక్ష నగదు బదిలీవడ్డీరేట్ల నిర్ణయంలో ఆహార ధరలను పక్కనబెట్టండి... ఆర్బీఐకి సర్వే సూచన వడ్డీ రేట్లను నిర్ణయించడంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆహార ద్రవ్యోల్బణాన్ని చూడటం మానేయాలని ఆర్థిక సర్వే సూచించింది. అధిక ఆహార ధరలను ఎదుర్కోవటానికి పేదలకు కూపన్లు లేదా ప్రత్యక్ష నగదు బదిలీని ప్రభుత్వం అన్వేíÙంచాలని సర్వే పేర్కొంది. ‘‘భారతదేశ ద్రవ్యోల్బణ లక్ష్య ఫ్రేమ్‌వర్క్.. ఫుడ్ ఆరి్టకల్స్‌ను పక్కనబెట్టాలి. అధిక ఆహార ధరలు చాలా సందర్భాల్లో సరఫరాలకు సంబంధించిన సమస్యే తప్ప, డిమాండ్ ప్రేరితం కాదు’’ అని ఆర్థిక సర్వే పేర్కొంది. మధ్య, దీర్ఘకాలిక ద్రవ్యోల్బణం అవుట్‌లుక్ ధరల యంత్రాంగం పటిష్టత, మార్కెట్ అంశాలు, నిత్యావసారాల దేశీయ ఉత్పత్తి, దిగుమతులు వంటి అంశాలపై ఆధారపడుతుందని వివరించింది. అననుకూల వాతావరణం, తక్కువ రిజర్వాయర్ స్థాయిలు, పంట నష్టం వ్యవసాయ ఉత్పత్తిని ప్రభావితం చేసి, గత రెండేళ్లలో ఆహార ధరలను పెంచడానికి దారితీసిందని కూడా సర్వే పేర్కొంది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు–రెపో (ప్రస్తుతం 6.5 శాతం) నిర్ణయానికి ఆర్బీఐ వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణంపై ఆధారపడే సంగతి తెలిసిందే. ప్లస్ 2 లేదా మైనస్ 2తో ఇది 4 శాతంగా ఉండాలే చూడాలని ఆర్బీఐకి కేంద్రం నిర్ధేశిస్తోంది. ఈ సూచీలో ఫుడ్ ఆరి్టకల్స్ ఒక భాగం. రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతం లక్ష్యాన్ని సాధించడంలో ఆహార ధరలు ఒడిదుడుకులు తీవ్ర అడ్డంకిగా మారుతున్నాయి. ఇదే అంశంపై ఆందోళన వ్యక్తంచేస్తూ ఆర్బీఐ 2023 ఫిబ్రవరి నుంచి యథాతథ వడ్డీరేట్ల వ్యవస్థను కొనసాగిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. దీనిని పక్కనపెట్టి... రుణ రేట్లను తగ్గిస్తే ఆ నిర్ణయం వృద్ధికి దోహదపడుతుందన్నది సర్వే అభిప్రాయం. ప్రయివేట్ రంగ పెట్టుబడులు కీలకం ప్రయివేట్ రంగ ఫైనాన్సింగ్, కొత్త వర్గాల నుంచి వనరుల సమీకరణ దేశీయంగా నాణ్యమైన మౌలిక సదుపాయాల(ఇన్ఫ్రా) నిర్మాణానికి కీలకమని ఆర్థిక సర్వే పేర్కొంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి పాలసీలు, సంస్థాగత మద్దతుతోపాటు.. రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు సైతం ప్రధాన పాత్ర పోషించవలసి ఉంటుంది. మౌలిక రంగంలోని వివిధ విభాగాలకు పెట్టుబడులు సమకూర్చడంలో గణాంకాలు, మార్గదర్శకాలు తదితర నివేదికలు అత్యవసరం. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కున్న డిమాండ్‌ను అంచనా వేయడం, ఉపవిభాగాల కల్పనలో సౌకర్యాల వినియోగం వంటి అంశాలకు ప్రస్తుత డేటాబేస్ సామర్థ్యం సరిపోదు. ఆర్థికపరమైన ఒత్తిడి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏకీకృత ప్రణాళికల నేపథ్యంలో ఆచరణసాధ్యమైన ప్రాజెక్టులను చేపట్టి పూర్తిచేయవలసి ఉంటుంది. ఇందుకు ప్రభుత్వ, ప్రయివేట్ భాగస్వామ్యం కీలకమవుతుంది.రైల్వేల సామర్థ్యం పెరగాలి.. సామర్థ్యాలను వేగంగా పెంచుకోవడం, కార్యకలాపాలను ఆధునీకరించుకోవడం, ఇంధన ఆదా తదితర అంశాలపై రైల్వేస్ ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఎకనమిక్ సర్వే సూచించింది. ఇందుకు అనుగుణంగా సరకు రవాణా కోసం ప్రత్యేక కారిడార్లు, హై స్పీడ్ రైళ్లు, వందే భారత్.. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ .. ఆస్థా స్పెషల్ ట్రెయిన్స్ వంటి ఆధునిక ప్యాసింజర్ సరీ్వస్ రైళ్లు, అధిక సామర్థ్యం ఉండే రైల్వే కోచ్‌లు, లాస్ట్–మైల్ రైల్ లింకేజీలు మొదలైన వాటిపై ఇన్వెస్ట్ చేయాలని పేర్కొంది. లాజిస్టిక్స్ వ్యయాలను, కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు రైల్వేస్ 3 ప్రధాన కారిడార్ల రూపకల్పనలో ఉందని వివరించింది. ట్రాఫిక్ సాంద్రత అధికంగా ఉండే కారిడార్లు, ఇంధన.. ఖనిజ.. సిమెంట్ కారిడార్లు, రైల్ సాగర్ (పోర్టు కనెక్టివిటీ) కారిడార్లు వీటిలో ఉన్నాయని పేర్కొంది.పర్యాటక రంగంలో అవకాశాలు అపారం..పర్యాటక రంగం కలి్పస్తున్న అవకాశాలను సొంతం చేసుకోవాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే సూచించింది. కరోనా విపత్తు తర్వాత పర్యాటక రంగం వేగంగా కోలుకోవడాన్ని ప్రస్తావించింది. ‘2023లో 92 లక్షల మంది విదేశీ పర్యాటకులు భారత్‌ను సందర్శించారు. క్రితం ఏడాదితో పోల్చి చూస్తే 43.5 శాతం ఎక్కువ. భారత పర్యాటక రంగం వేగంగా విస్తరిస్తోంది. ప్రపంచంలో 39వ ర్యాంక్ సొంతం చేసుకుంది. పర్యాటకం ద్వారా రూ. 2.3 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యం లభించింది. ఇది క్రితం ఏడాదితో పోలి్చతే 65.7% అధికం’అని సర్వే తెలిపింది. కృత్రిమ మేథ (ఏఐ) భారత సేవల ఎగుమతులపై ప్రభావం చూపిస్తుందన్న ‘క్యాపిటల్ ఎకనమిక్స్’ నివేదికను ప్రస్తావిస్తూ.. ఉపాధి కల్పన విషయంలో తక్కువ నైపుణ్యాలపై ఆధారపడిన పర్యాటకం ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తోందని పేర్కొంది. వృద్ధిలో క్యాపిటల్ మార్కెట్లు కీలకందేశీ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో క్యాపిటల్ మార్కెట్లు కీలకంగా మారుతున్నట్లు ఆర్థిక సర్వే పేర్కొంది. టెక్నాలజీ, ఇన్నొవేషన్, డిజిటైజేషన్ దన్నుతో మూలధన నిర్మాణం, పెట్టుబడుల విస్తరణలో క్యాపిటల్ మార్కెట్ల వాటా బలపడుతోంది. అంతేకాకుండా దేశీ స్టాక్ మార్కెట్లు ప్రపంచ భౌగోళిక, రాజకీయ, ఆర్థిక విపత్కర పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాయి. పెరుగుతున్న భౌగోళిక, రాజకీయ రిసు్కలు, వడ్డీ రేట్లుసహా కమోడిటీ ధరల హెచ్చుతగ్గుల నేపథ్యంలోనూ దేశీ క్యాపిటల్ మార్కెట్లు గతేడాది(2023–24) ఉత్తమ పనితీరు చూపిన వర్ధమాన మార్కెట్లలో ఒకటిగా నిలిచాయి. ఈ కాలంలో బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ ఇన్వెస్టర్లకు భారీ(25%కిపైగా) రిటర్నులు అందించాయి. ఇందుకు స్థూల ఆర్థిక పరిస్థితుల స్థిరత్వం, దేశీ ఇన్వెస్టర్ల బలిమి తోడ్పాటునిచి్చనట్లు సీతారామన్ పేర్కొన్నారు. 2024 మే నెలలో ఈక్విటీ మార్కెట్ల విలువ 5 ట్రిలియన్ డాలర్ల(రూ. 415 లక్షల కోట్లు)కు చేరింది. ప్రస్తుతం 9.5 కోట్లమంది రిటైల్ ఇన్వెస్టర్లు ప్రత్యక్షంగా 2,500 లిస్టెడ్ కంపెనీలలో 10% వాటాను కలిగి ఉన్నారు. గతేడాది ప్రైమరీ మార్కెట్ల ద్వారా రూ. 10.9 లక్షల కోట్ల మూలధన ఏర్పాటుకు సహకారమందింది.వ్యవసాయంలో సత్వర సంస్కరణలు వ్యవసాయ రంగంలో సంస్కరణలను వెంటనే చేపట్టాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే నొక్కి చెప్పింది. లేదంటే ఈ రంగంలో నెలకొన్న వ్యవస్థీకృత సమస్యలు దేశ వృద్ధికి అడ్డుపడతాయని విధానకర్తలను హెచ్చరించింది. తూర్పు ఆసియా దేశాలు, అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలతో పోలి్చతే.. దేశ వ్యవసాయరంగం సామర్థ్యాలను ఇంకా పూర్తి స్థాయిలో వెలుగులోకి తేవాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పనకు వ్యవసాయరంగ సామర్థ్యాలను ఉపయోగించుకోవాలని సూచించింది. ఈ రంగంపై దేశవ్యాప్తంగా చర్చలు అవసరమని నాగేశ్వరన్ పిలుపునిచ్చారు. ‘‘దేశ వ్యవసాయ రంగం ప్రస్తుతం ఎలాంటి సంక్షోభంలో లేదు. కాకపోతే నిర్మాణాత్మక మార్పు అవసరం. ఎందుకంటే వాతావరణ మార్పులు, నీటి సమస్య రానున్న రోజుల్లో పెద్దవి కానున్నాయి’’అని సర్వే స్పష్టం చేసింది. ప్రస్తుతం రైతులకు ఎరువులు, విద్యుత్, ఆదాయపన్ను, మద్దతు ధరల పరంగా సబ్సిడీలు, ప్రోత్సాహకాలు ఇస్తున్నప్పటికీ ప్రస్తుత విధానాలను తిరిగి సమీక్షించా లని అభిప్రాయపడింది. టెక్నాలజీ ఆధునికీకరణ, మార్కెటింగ్ మార్గాలను మెరుగుపరచడం, సాగులో ఆవిష్కరణలు, వ్యవసాయం–పరిశ్రమల మధ్య అనుసంధానత పెంపు దిశగా సంస్కరణలను సూచించింది. ఆర్థిక సర్వే హైలైట్స్..→ అసాధారణరీతిలో వరుసగా మూడోసారి ప్రజలు మోదీ 3.0 సర్కారుకు పట్టం కట్టడం దేశంలో రాజకీయపరమైన, విధానపరమైన స్థిరత్వాతనికి అద్దం పడుతోంది. → అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ దేశీయ వృద్ధి చోదకాలు 2023–24లో ఆర్థిక పురోగతికి దన్నుగా నిలిచాయి. → భౌగోళిక, రాజకీయ సవాళ్లను ధీటుగా ఎదుర్కొంటూ భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టమైన, స్థిరమైన ప్రగతిని సాధిస్తోంది. → కరోనా మహమ్మారి తదనంతరం దేశీయ వ్యాపార, వాణిజ్య రంగం రికవరీ కోసం ప్రభుత్వం అనేక కీలక చర్యలు తీసుకుంది. → వాణిజ్యం, పెట్టుబడులు, వాతావారణ మార్పుల వంటి ప్రపంచ సమస్యల విషయంలో వివిధ దేశాలతో ఒప్పందాలు క్లిష్టతరంగా మారాయి. → స్వల్పకాలానికి ద్రవ్యోల్బణం అంచనాలు తగ్గుముఖ ధరోణిలోనే ఉన్నప్పటికీ, పప్పుధాన్యాల కొరత , ధరల ఒత్తిడి నిలకడగా కొనసాగుతోంది. → సాధారణ వర్షపాతం, దిగుమతులకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ధరలు శాంతించడంతో ఆర్బీఐ సానుకూల ద్రవ్యోల్బణం అంచనాలకు దన్నుగా నిలుస్తోంది. → అధిక ఆహార ధరలతో అల్లాడుతున్న పేదలు, అల్పాదాయ వర్గాలకు ప్రత్యక్ష నగదు బదిలీలు, నిర్దిష్ట కొనుగోళ్లకు కూపన్ల రూపంలో కొంతకాలం పాటు ప్రయోజనాలను అందించాలి. → భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు ఆర్బీఐ ద్రవ్యపరపతి విధానంపై ప్రభావం చూపొచ్చు. → భారతదేశ ఆర్థిక సేవల రంగం పటిష్టమైన అవకాశాలున్నాయి. ఈ రంగంలో కీలకమైన మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా, దేశీయంగా తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలి. → కార్పొరేట్ కంపెనీలు, బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లు పటిష్టంగా ఉండటంతో ప్రైవేటు పెట్టుబడులు మరింత పుంజుకోనున్నాయి. → పన్ను నిబంధలనను సరళతరం చేయడం, వ్యయ నియంత్రణ, డిజిటైజేషన్ వంటివి ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణను సాధించేందుకు దోహదం చేస్తున్నాయి. → భారత వృద్ధి పథానికి క్యాపిటల్ మార్కెట్లు కీలకంగా నిలుస్తున్నాయి. ప్రపంచ రాజకీయ, ఆర్థిక షాక్‌లకు మన మార్కెట్లు ఎదురొడ్డి నిలుస్తున్నాయి. → చైనా నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) జోరందుకోవడం వల్ల ప్రపంచ సరఫరా వ్యవస్థలు మెరుగుపరచడంలో, ఎగుమతులను పెంచుకోవడంలో భారత్‌కు దన్నుగా నిలుస్తుంది. → 2024లో దేశంలోకి వచి్చన రెమిటెన్సులు (ప్రవాసులు స్వదేశానికి పంపిన నిధులు) 3.4 శాతం వృద్ధితో 124 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ ఏడాది ఈ మొత్తం 129 బిలియన్ డాలర్లను తాకనుంది.గ్రీన్ ఎనర్జీ @ రూ. 30 లక్షల కోట్ల పెట్టుబడులు దేశీయంగా 2024–2030 మధ్య కాలంలో పునరుత్పాదక ఇంధన (ఆర్ఈ) రంగంలో రూ. 30.5 లక్షల కోట్ల పెట్టుబడులు రాగలవని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఇందుకోసం స్థల సమీకరణ సమస్యలను పరిష్కరించుకోవడం, సానుకూల నిబంధనలతో నిధులను సమీకరించుకోవడం కీలకమని పేర్కొంది. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ లక్ష్యాలను సాధించే క్రమంలో వివిధ విభాగాలకు ఆర్థికంగా లబ్ధి చేకూరగలదని వివరించింది. మరోవైపు, ఉద్గారాల విషయంలో 2070 నాటికి తటస్థ స్థాయికి చేరుకోవాలంటే భారత్‌కు ఏటా సగటున 28 బిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరమవుతాయని సర్వే తెలిపింది. నిధులను సమకూర్చుకోవడమనేది ఒక అసాధారణ సవాలు కాగలదని వివరించింది.14 శాతం ఐఫోన్ల తయారీ ఇక్కడే ఎల్రక్టానిక్స్ తయారీలో అంతర్జాతీయంగా భారత్ తన వాటాను పెంచుకుంటున్నట్టు ఆర్థిక సర్వే తెలిపింది. 2023–24లో స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ యాపిల్ 14% ఐఫోన్లను భారత్‌లోనే అసెంబుల్ చేసినట్టు వెల్లడించింది. దేశ ఎలక్ట్రానిక్స్ తయారీ 2014 తర్వాత నుంచి గణనీయమైన వృద్ధిని చూస్తోందంటూ, 2021–22లో అంతర్జాతీయంగా మన వాటా 3.7%. దేశ జీడీపీలో 4% వాటాను ఆక్రమించింది. ఎల్రక్టానిక్స్ ఎగుమతుల్లో మొబైల్ ఫోన్ల విభాగం అధిక వృద్ధిని చూస్తోందని, అమెరికాకు మొబైల్ ఫోన్ల ఎగుమతులు 2022–23లో 2.2 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2023–24లో 5.7 బిలియన్ డాలర్లకు దూసుకుపోయినట్టు వివరించింది. 2022–23లో దేశీయంగా ఎల్రక్టానిక్స్ తయారీ రూ.8.22 లక్షల కోట్లకు చేరితే, ఎగుమతులు రూ.1.9 లక్షల కోట్లకు పెరిగినట్టు తెలిపింది.ఏటా 78 లక్షల కొలువులు సృష్టించాలి.. కార్మిక శక్తి పెరుగుతున్న నేపథ్యంలో వ్యవసాయేతర రంగాల్లో 2030 నాటికి ఏటా దాదాపు 78.5 లక్షల ఉద్యోగాలను కలి్పంచాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఈ విషయంలో ప్రైవేట్ రంగం కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని పేర్కొంది. ఆర్థిక వృద్ధి అనేది ఉద్యోగాల కల్పన కన్నా జీవనోపాధి కల్పించడంపై ఆధారపడి ఉంటుందని సర్వే వివరించింది. వ్యవసాయ రంగంలో కార్మిక శక్తి 2023లో 45.8 శాతం స్థాయి నుంచి 2047 నాటికి 25 శాతానికి తగ్గుతుందని తెలిపింది. ఇదంతా వ్యవసాయేతర రంగాల వైపు మళ్లు తుంది కాబట్టి ఆ మేరకు ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఏర్పడుతుందని సర్వే పేర్కొంది. పీఎల్ఐ స్కీములు, మిత్రా టెక్స్టైల్ స్కీము మొదలైనవి ఇందుకు కొంత తోడ్పడగలవని తెలిపింది. స్టాఫింగ్ కంపెనీల ద్వారా తాత్కాలిక సిబ్బంది నియామకాలు పెరుగుతున్నందున అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు దీన్నొక మాధ్యమంగా ఉపయోగించుకోవచ్చని వివరించింది. తయారీ రంగ శ్రేయస్సు, ఆర్థిక వృద్ధి సాధన దిశగా మెరుగైన ఫలితాలు సాధించేందుకు వ్యాపారసంస్థలకు ఇచ్చే ప్రోత్సాహకాలను పునఃసమీక్షించాలని సూచించింది. వర్కర్ల తొలగింపునకు కాకుండా ఉద్యోగాల కల్పనకు కృత్రిమ మేథ(ఏఐ)రెని ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై కార్పొరేట్లు మరింతగా దృష్టి పెట్టాలని ముందుమాటలో ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు. వికసిత భారత్ వైపు పయనంవికసిత భారత్‌ను నిర్మించే దిశగా ముందుకు సాగుతున్నందున ప్రస్తుత పటిష్టతలతోపాటు మరింత పురోగతికి అవకాశాలు ఉన్న మార్గాలను సర్వే గుర్తించింది. ఆర్థిక సర్వే మన ఆర్థిక వ్యవస్థ ప్రబలమైన పటిష్టతలతను హైలైట్ చేస్తోంది. మా ప్రభుత్వం తీసుకువచి్చన వివిధ సంస్కరణల ఫలితాలను కూడా సుస్పష్టం చేస్తోంది. – ఎక్స్ పోస్ట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అంచనాలు సుసాధ్యం7 శాతం వృద్ధి రేటు సాధన భారత్‌కు తేలికే. మేము నిరాశావాదులం కాదు. రుతుపవనాల పురోగతి సవాళ్లను కూడా మేము పరిగణనలోకి తీసుకుంటున్నాము. ఫైనాన్షియల్ రంగం అవుట్‌లుక్ పటిష్టంగా కనబడుతోందని, పొదుపులను ఫైనాన్షియల్ మార్కెట్లవైపునకు మళ్లించడాన్ని చూస్తే.. భారత్ కుటుంబాలు కష్టాల్లో లేవన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. – వి. అనంత నాగేశ్వరన్, సీఈఏ పార్లమెంట్లో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన నేపథ్యంలో బడ్జెట్ బృందంతో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, సహాయమంత్రి పంకజ్ చౌదరి -
Economic Survey 2023-24: ప్రతి ఊరికి కావాలి.. ఇలాంటి స్టీల్ బ్యాంక్
పెళ్లయినా శుభకార్యమైనా పార్టీ మీటింగ్ అయినా ప్రభుత్వ హెల్త్ క్యాంప్లైనా భోజనాల దగ్గర ప్లాస్టిక్ వాడకం ఉంటుంది. చెత్త పేరుకు పోతుంది. డబ్బు కూడా వృథా. అదే స్టీల్ గిన్నెలు ఉంటే? ఒకసారి కొంటే ప్రతిసారి ఉపయోగించుకోవచ్చు. ఈ ఆలోచనతో 2020లో తెలంగాణాలోని సిద్దిపేటలో ఏర్పడిన స్టీల్ బ్యాంక్ ‘ఎకానమిక్ సర్వే 2023–24 బుక్’లో తాజాగా చోటు సంపాదించుకుంది. ఇది మహిళా నిర్వహణకు వారి పర్యావరణ దృష్టికి దక్కిన విజయం.ఇది మహిళల విజయం. జాతీయంగా దక్కిన గుర్తింపు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సమయంలో ఎకనామిక్ సర్వే రిపోర్ట్‌ను విడుదల చేస్తారు. సోమవారం విడుదల చేసిన రిపోర్ట్ 12వ చాప్టర్లో మౌలిక సదుపాయాలు, వృద్ధిలో భాగంగా సిద్దిపేట స్టీల్ బ్యాంక్ వలన జరిగిన ఉపయోగం గురించి వివరించారు. దీనితో స్టీల్ బ్యాంక్ నిర్వాకులైన మహిళలతో పాటు సిద్దిపేట ఎం.ఎల్.ఏ. హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు.ప్లాస్టిక్ వద్దనుకుని2022లో సిద్దిపేట మున్సిపాలిటీలో ‘కంటి వెలుగు కార్యక్రమం’లో భాగంగా వైద్య సిబ్బందికి ఆయా గ్రామ పంచాయతీలు భోజన ఏర్పాట్లు చేశాయి. వైద్య సిబ్బంది భోజనం చేసేందుకు ప్లాస్టిక్‌ను వినియోగించాల్సి వచ్చింది. ఇది ఊళ్లో అనవసర చెత్తను పోగు చేస్తోంది. అదే సమయంలో పర్యావరణానికి హాని కూడా. ఈ పారేసిన ప్లాస్టిక్‌ని పశువులు తింటే ప్రమాదం. అందుకే డీపీఓ దేవకీదేవి ప్లాస్టిక్‌కు బదులు స్టీలు వాడాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో గ్రామ పంచాయతీ నుంచి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకూ సేకరించి స్టీల్ ప్లేట్లు, గ్లాస్లు, స్పూ¯Œ లు, వాటర్ బాటిల్లను కొనుగోలు చేశారు. ఇలా ఏ గ్రామానికి ఆ గ్రామం కొని జిల్లాలోని 499 గ్రామ పంచాయతీల్లో వినియోగించారు. దీంతో రోజుకు 6 కిలోల నుంచి 8 కిలోల ప్లాస్టిక్‌ను వినియోగించకుండా నిర్మూలించారు.సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 34 స్టీల్ బ్యాంక్‌లో ఉన్న పాత్రల వివరాలు భోజనం ప్లేట్లు 25,500, అల్పహార ప్లేట్లు 8,500, వాటర్ గ్లాస్లు 25,500, టీ గ్లాస్లు 8,500, చెంచాలు 25,500, చిన్న గిన్నెలు 25,500, స్టీల్ ట్రేలు 612, బకెట్లు 272, ఇతరములు 3వేలు వస్తువులున్నాయి.– గజవెల్లి షణ్ముఖ రాజు, సిద్దిపేట, సాక్షి– ఫొటోలు: కె. సతీష్ కుమార్సంతోషంగా ఉంది...ప్లాస్టిక్‌ను నిర్మూలించేందుకు గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో స్టీల్ బ్యాంక్‌లను ఏర్పాటు చేయించాం. మనం పాటించి తర్వాత ప్రజలు పాటించాలన్న స్ఫూర్తితో బ్యాంక్‌ల ఏర్పాటు. కంటి వెలుగు కార్యక్రమంలో వైద్య సిబ్బందికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేశాం. వీరికి స్టీల్ ప్లేట్, గ్లాస్లు, వాటర్ బాటిల్ల ద్వారానే అందించాం. మా కృషికి గుర్తింపు దొరకడం సంతోషంగా ఉంది– దేవకీదేవి, డీపీఓసంఘం మహిళలు‘మాది సిద్దిపేటలోని వెన్నెల సమైక్య మహిళా సంఘం. శ్రీసాయితేజ సమైక్య మహిళా సంఘంకు చెందిన గడ్డమీది నవ్య ఇద్దరం కలిసి గత నాలుగేళ్లుగా స్టీల్ బ్యాంక్‌ను కొనసాగిస్తున్నాం. మా ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు ప్రత్యేక చొరవతో సిద్దిపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 34 వార్డుల్లో స్టీల్ బ్యాంక్‌లను ఏర్పాటు చేశారు. 29, ఫిబ్రవరి 2020న మా స్టీల్ బ్యాంక్ ప్రారంభించారు. మా వార్డు పరిధిలో వివాహాలు, ఇతర శుభకార్యాలు, ఇతర కార్యక్రమాలు జరిగితే ముందుగానే సామాగ్రి కోసం సమాచారం ఇస్తారు. వారు ఎంత మందితో కార్యక్రమం నిర్వహిస్తున్నారో చెబితే వారికి సరిపడా సామాగ్రిని అందజేస్తాం. వీటిని ప్రత్యేక సంచిలో వేసి ఇస్తాం. వారి కార్యక్రమం అయిపోయిన తర్వాత క్లీన్ చేసి తీసుకువస్తారు. ఏదైనా వస్తువులు మిస్ అయితే వాటికి డబ్బులు తీసుకుంటాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాస్లు, కప్‌లు ధర కంటే తక్కువ అద్దెకే కిరాయికి ఇస్తున్నాం. ప్లాస్టిక్ నిర్మూలిస్తున్నామనే సంతోషంతో పాటు మాకు ఆర్థికంగా సైతం దోహదపడుతుంది. మా కమిషనర్ ప్రసన్న రాణి, చైర్పర్సన్ కడవేర్గు మంజుల, కౌన్సిలర్ దీప్తిల సహకారంతో ముందుకు వెళ్తున్నాం. పెళ్లిళ్ల సీజన్ అయితే ఎక్కువ మంది తాకిడి ఉంటుంది. మా దగ్గర అన్ని కిరాయికి పోతే మా పక్క వార్డులో ఉంటే తీసుకుని వారికి అద్దెను చెల్లిస్తాం. ప్రజల నుంచి బాగా స్పందన వస్తోంది. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి రేపటి తరాలకు మంచి పర్యావరణాన్ని బహుమతిగా ఇవ్వాలనే లక్ష్యంతో వీటి బాధ్యతలను నిర్వర్తిస్తున్నాం.– బాలగోని దీప్తి, వెన్నెల సమైక్య మహిళా సంఘం. -
బడ్జెట్ 3.0లోనైనా సంక్షేమం వికసించేనా?
మన దేశంలో బడ్జెట్‌ను ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెడతారు. ఈ సంవత్సరం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఫిబ్ర వరి నెలలో మధ్యంతర బడ్జెట్‌ను మాత్రమే ప్రవేశ పెట్టారు. అందుకే పూర్తి స్థాయిలో నేడు (జూలై 23న) 18వ లోక్ సభలో 2024–25 బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేశారు. గత బడ్జెట్లు అన్నీ సంపన్నులకు లాభం చేకూర్చే విగానే ఉన్నాయనీ, ఈసారైనా కాస్త సామా న్యులకు ఊరట కలిగించేవిగా ఉండాలనీ జనం ఎదురుచూస్తున్నారు. భాగస్వామ్య పక్షాల వెన్ను దన్నుతో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ దూకుడు తగ్గించి సామాన్యుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తుందనీ, ఇవ్వాలనీ ప్రజలు ఆశిస్తున్నారు. కోవిడ్ కాలం నుండి పేదల బతుకుల్లో ఆశించిన మార్పులు లేవు. ఉపాధి కోల్పోయి కొను గోలు శక్తి లేక ఆకలి సైతం తీర్చుకోలేక విలవిలలాడుతున్న దుర్భర పరిస్థితులు ఉండడం బాధాకరం. ఇప్పటికీ వ్యవసాయం, చేనేత,లఘు పరిశ్రమలు వంటివి సంక్షోభంలో పడిపోగా కోట్లాదిమంది అర్ధాకలితో, పస్తులతో గడుపుతున్నారు. 125 దేశాలను పరిగణనలోకి తీసుకున్న అంతర్జాతీయ ఆకలి సూచికలో 111వ స్థానంలో భారత్ ఉంది. దీన్ని బట్టి ఇక్కడ పేదరికం ఎంతగా ఉందో అర్థమవుతుంది. ఆకాశాన్నంటుతున్న నిత్యావసర సరుకుల ధరలు ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపిస్తు న్నాయి. ఎన్డీఏ ప్రభుత్వ పాలనలోనే గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఫలితంగా ఆహార ధాన్యాలతోపాటు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి.పెరిగిన ఆహార ద్రవ్యోల్భణం తగ్గించేలా 3.0 బడ్జెట్లో చర్యలు ఉండాలి. గత ఎన్నికలలో ఇచ్చిన హామీల మేరకు పేద ప్రజలందరికీ గృహ నిర్మాణ పథకాన్ని సక్రమంగా అమలు చేయాలి. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలి. 2022–23 బడ్జెట్‌తో పోలిస్తే 2024–25 మధ్యంతర బడ్జెట్లో వ్యవ సాయ అనుబంధ కార్యకలాపాలకు వేల కోట్ల రూపాయలు తగ్గించారు. ఇది సరికాదు. రైతన్నను ఆదుకోవడానికి తగిన కేటాయింపులు ఈసారన్నా జరగాలి. దేశ ప్రగతికి కీలక అవసరమైన విద్యపై గత బడ్జెట్లో ఆశించిన కేటాయింపులు లేవు. ప్రైవేటు విద్యను ప్రోత్సహించేలా ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయి. ప్రభుత్వ యూనివర్సిటీల అభివృద్ధికి నిధుల కేటాయింపు పెంచాలి.అలాగే ప్రభుత్వమే ఉచిత వైద్యం అందించేలా బడ్జెట్ రూపొందించాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం ప్రజారోగ్యంపై స్థూల జాతీయోత్పత్తిలో ఐదు శాతం నిధులు కేటాయించాల్సి ఉండగా కేవలం 2.1 శాతం మాత్రమే మన దేశంలో ఖర్చు పెడుతున్నారు. ఈ బడ్జెట్లోనైనా 5 శాతం నిధులు ప్రజారోగ్యంపై కేటాయించి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించేందుకు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేయాలి. స్టాండర్డ్ డిడక్షన్ కొత్త పన్ను విధానంలో 7 లక్షల నుండి 12 లక్షల వరకు పెంచాలి. అదేవిధంగా నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తక్షణమే అమలు చేయాలి. ‘బేటీ పఢావో బేటీ బచావో’ అనేది నినాదాలకు పరిమితం చేయకుండా మహిళా సాధికారత దిశగా బడ్జెట్లో కేటాయింపులు ఉండాలి. మహిళల పట్ల వేధింపులు లేకుండా ఉపాధి అవకాశాలు కల్పించడం, మహిళలకు రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే. గ్రామీణ ప్రాంతాలలో ఉపాధిని కల్పించడానికి ఏకైక మార్గమైన ‘ఉపాధి హామీ పథకా’నికి ఎక్కువ నిధులు కేటాయించాలి. మొత్తం మీద ఈ బడ్జెట్ నిరుపేద, మధ్య తరగతి వర్గాలను దృష్టిలో ఉంచుకుని ప్రవేశపెడతారని ప్రజలు ఎదురు చూస్తున్నారు.తండ సదానందం వ్యాసకర్త టీపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్మొబైల్: 99895 84665