రూ.30,000 కోట్ల మూలధన మద్దతు రద్దు
న్యూఢిల్లీ: ఆయిల్ కంపెనీలను బడ్జెట్ నిరాశపరిచింది. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియంలకు 2023–24 ఆర్థిక సంవత్సరంలో వచి్చన రికార్డు లాభాల (దాదాపు రూ.81,000 కోట్లు) కారణంగా గత ఆర్థిక సంవత్సరం ప్రకటించిన రూ. 30,000 కోట్ల మూలధన మద్దతును ఆర్థికమంత్రి రద్దు చేశారు.
నిజానికి ఈ మద్దతును రూ.15,000 కోట్లకు తగ్గించాలని 2024 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో ప్రతిపాదించిన నిర్మలా సీతారామన్, తాజా బడ్జెట్‌లో ఈ మద్దతును పూర్తిగా రద్దు చేయడం గమనార్హం.
వ్యూహాత్మక నిల్వలకు రూ.5,000 కోట్లు
ఇక సరఫరాల్లో అంతరాయాలను నిరోధించడానికి కర్ణాటకలోని మంగళూరు అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో నిర్మించిన వ్యూహాత్మక భూగర్భ నిల్వల క్షేత్రాలను నింపడానికి వీలుగా ముడి చమురును కొనుగోలు చేయడానికి రూ. 5,000 కోట్లను బడ్జెట్‌లో ప్రతిపాదించారు.
షేర్లు డీలా...
తాజా నిర్ణయం నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో ఐఓసీ షేర్ ధర క్రితం ముగింపుతో పోలి్చతే 2 శాతం నష్టపోయి రూ.166 వద్ద ముగిసింది. బీపీసీఎల్ షేర్ ధర 1 శాతం తగ్గి రూ.306 వద్ద ముగిసింది. హెచ్‌పీసీఎల్ షేరు ధర స్వల్ప నష్టంతో 347 వద్ద స్థిరపడింది.
క్రూజ్ పర్యాటకానికి ప్రోత్సాహం
విదేశీ షిప్పింగ్ కంపెనీలపై సులభతర పన్ను
దేశీ క్రూజ్ విభాగంలో కార్యకలాపాలు నిర్వహించే విదేశీ షిప్పింగ్ కంపెనీలకు సులభతర పన్నుల విధానాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. క్రూజ్ పర్యాటకంలో ఉపాధి అవకాశాలను పెంచేందుకు ఈ చర్య తీసుకున్నారు. సముద్ర జలాలపై నడిచే పర్యాటక ఓడలను క్రూజ్‌లుగా చెబుతారు. దేశంలో క్రూజ్ పర్యాటకానికి భారీ అవకాశాలున్నట్టు మంత్రి చెప్పారు.
ఈ విభాగంలో భారత షిప్పింగ్ పరిశ్రమ వాటాను పెంచేందుకు, ఉపాధి అవకాశాలను పెంచేందుకు యాజమాన్యం, లీజింగ్ పరంగా సంస్కరణలు తీసుకొస్తామని ప్రకటించారు. క్రూజ్ పర్యాటకానికి భారత్‌ను ఆర్షణీయ కేంద్రంగా మారుస్తామని, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తామని చెప్పారు. ‘‘క్రూజ్ షిప్పింగ్‌ల నిర్వహణలో పాలు పంచుకునే ప్రవాసులకు ఊహాత్మకమైన పన్ను విధానం ప్రతిపాదిస్తున్నాం. విదేశీ కంపెనీ, నాన్ రెసిడెంట్ షిప్ ఆపరేటర్ రెండూ ఒకే హోల్డింగ్ కంపెనీ కింద ఉంటే లీజ్ రెంటల్ రూపంలో ఆర్జించే ఆదాయంపై పన్ను మినహాయింపును కలి్పస్తున్నాం’’అని వివరించారు. ఈ దిశగా సెక్షన్ 44బీబీసీని ప్రతిపాదించారు. 2025 ఏప్రిల్ 1 నుంచి సవరణలు అమల్లోకి వస్తాయని చెప్పారు.
ఎన్‌పీఎస్‌పై మరింత పన్ను ప్రయోజనం
నూతన పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చే దిశగా కేంద్ర సర్కారు జాతీయ పింఛను పథకంలో (ఎన్‌పీఎస్) పెట్టుబడులకు ప్రోత్సాహకాన్ని పెంచింది. ఉద్యోగి తరఫున ప్రైవేటు సంస్థలు జమ చేసే ఎన్‌పీఎస్ వాటాపై పన్ను మినహాయింపు పరిమితిని 14 శాతం చేసింది. ఉద్యోగి మూల వేతనం, కరువు భత్యంలో (గరిష్ట పరిమితి రూ.లక్ష) 10 శాతం జమలపైనే ప్రస్తుతం పన్ను మినహాయింపు ఉంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం ఇది 14 శాతంగానే ఉండగా.. ప్రైవేటు రంగ ఉద్యోగులకు సైతం ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రయోజనాన్ని పెంచారు. ఆదాయపన్ను చట్టంలోని పాత పన్ను వ్యవస్థలో ఉద్యోగి తరఫున సంస్థలు చేసే ఎన్‌పీఎస్ జమలపై పన్ను మినహాయింపు 10 శాతంగానే కొనసాగుతుంది.
ఉదాహరణకు పార్థసారథి మూలవేతనం, కరవు భత్యం రూ.1,00,000 ఉందనుకుంటే.. తాజా మార్పుతో ప్రతి నెలా రూ.4,000 చొప్పున ఏడాదికి రూ.48వేల మొత్తంపై పన్ను లేకుండా చూసుకోవచ్చు. మైనర్ల పేరిట తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఎన్‌పీఎస్ ఖాతా తెరిచేందుకు ‘ఎన్‌పీఎస్ వాత్సల్య’ ప్లాన్‌ను కూడా ప్రకటించారు.
ఈకామర్స్ ఎగుమతులకు దన్ను
హబ్‌ల ఏర్పాటుకు ప్రతిపాదనలు
ఈకామర్స్ రంగం ద్వారా ఎగుమతులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో హబ్‌ల ఏర్పాటుకు ప్రతిపాదించింది. ఇందుకు ప్రభుత్వ, ప్రయివేట్ విధానం(పీపీపీ)లో వీలు కలి్పంచనుంది. అవాంతరాలులేని నియంత్రణ, లాజిస్టిక్ మార్గదర్శకాల ద్వారా ఒకే గొడుగుకింద వాణిజ్యం, ఎగుమతి సంబంధ సరీ్వసులకు ఇవి తెరతీయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. వెరసి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు(ఎంఎస్‌ఎంఈలు), సంప్రదాయ చేనేత, హస్తకళలు తదితర శ్రామికులు తమ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించేందుకు వీలు చిక్కనున్నట్లు తెలియజేశారు.
ప్రస్తుతం ఈకామర్స్ విభాగం ద్వారా దేశీ ఎగుమతులు కేవలం 5 బిలియన్ డాలర్లకు పరిమితంకాగా.. చైనా నుంచి వార్షికంగా 300 బిలియన్ డాలర్లు ఎగుమతులు నమోదవుతున్నాయి. రానున్న కాలంలో 50–100 బిలియన్ డాలర్లకు దేశీ ఎగుమతులను పెంచేందుకు అవకాశముంది. బడ్జెట్ ప్రతిపాదిత కేంద్రా(హబ్)ల ద్వారా తొలుత చిన్న తయారీదారులు ఈకామర్స్ సంస్థలు(అగ్రిగేటర్ల)కు ఉత్పత్తులను విక్రయిస్తారు.
తదుపరి ఇతర మార్కెట్లలో అగ్రిగేటర్లు వీటిని విక్రయిస్తాయి. ప్రధానంగా ఆభరణాలు(జ్యువెలరీ), దుస్తులు, హస్తకళలు తదితరాలకు భారీ అవకాశాలున్నాయి. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకునే బాటలో ఆర్‌బీఐసహా సంబంధిత శాఖలతో వాణిజ్య శాఖ విభాగం డీజీఎఫ్‌టీ కలసి పనిచేస్తోంది. ఫలితంగా ఈ హబ్‌లకు ఎగుమతులు క్లియరెన్స్‌లను కలి్పస్తారు. అంతేకాకుండా వేర్‌హౌసింగ్, కస్టమ్స్ క్లియరెన్స్, రిటర్నుల ప్రాసెసింగ్, లేబిలింగ్, టెస్టింగ్, ప్యాకేజింగ్‌లను వీటికి జత చేస్తారు.
డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం రూ. 50,000 కోట్లు
ప్రభుత్వ సంస్థలలో వాటాల విక్రయం(డిజిన్వెస్ట్‌మెంట్) ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) రూ. 50,000 కోట్లు సమీకరించవచ్చని తాజా బడ్జెట్ అంచనా వేసింది. మధ్యంతర బడ్జెట్‌లోనూ ఇదేస్థాయిలో ప్రభుత్వం అంచనాలు ప్రకటించింది. ఇక కేంద్ర ప్రభుత్వ కంపెనీల(సీపీఎస్‌ఈలు) నుంచి రూ. 56,260 కోట్ల డివిడెండ్ లభించవచ్చని భావిస్తోంది.
మధ్యంతర బడ్జెట్‌లో వేసిన అంచనాలు రూ. 48,000 కోట్లకంటే అధికంకావడం గమనార్హం! మరోవైపు ఆర్‌బీఐ, పీఎస్‌యూ బ్యాంకుల నుంచి ఈ ఏడాది రూ. 2,32,874 కోట్ల డివిడెండ్ అందుకునే చాన్స్ ఉన్నట్లు బడ్జెట్ ఊహిస్తోంది. ఇందుకు ప్రధానంగా ఆర్‌బీఐ నుంచి రూ. 2.11 లక్షల కోట్ల అనూహ్య డివిడెండ్ లభించడం ప్రభావం చూపింది. మధ్యంతర బడ్జెట్ ఈ పద్దుకింద రూ. 1.02 లక్షల కోట్లు మాత్రమే అంచనా వేసింది.
దివాలా వ్యవహారాల్లో ఇక మరింత పారదర్శకత
ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్ ఏర్పాటు
దివాలా కోడ్ (ఐబీసీ) పక్రియను మరింత మెరుగుపరచడంపై బడ్జెట్ దృష్టి సారించింది. ఇందుకు సంబంధించి స్థిరత్వం, పారదర్శకత, సమయానుకూల ప్రాసెసింగ్, వాటాదారులకు సంబంధించి మెరుగైన పర్యవేక్షణ సాధన లక్ష్యంగా ‘ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్’ను ఆవిష్కరిస్తున్నట్లు ఆర్థికమంత్రి తెలిపారు. 2016 నుంచి అమల్లోకి వచ్చిన దివాలా కోడ్ పటిష్టత కోసం తగిన మార్పులను తీసుకురావడం జరుగుతుందని మంత్రి తెలిపారు.
కోడ్‌ను ఇప్పటి వరకూ ఆరు సార్లు సవరించిన సంగతి తెలిసిందే. ఐబీసీ 1,000 కంటే ఎక్కువ కంపెనీల దివాల అంశాలను పరిష్కరించిందని, ఫలితంగా రుణదాతలకు నేరుగా రూ. 3.3 లక్షల కోట్ల రికవరీ జరిగిందని ఆమె చెప్పారు. ప్రస్తుతం దేశ రాజధానిలో ఉన్న ప్రధాన బెంచ్‌సహా 15 నగరాల్లో ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌లు ఉన్నాయి.
అంతేకాకుండా, నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఢిల్లీ, చెన్నైలలో బెంచ్‌లను కలిగి ఉంది. రికవరీని వేగవంతం చేసేందుకు మరిన్ని ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపారు.
టెలికం పరికరాల దిగుమతులకు చెక్
10 శాతం నుంచి 15 శాతానికి సుంకాల పెంపు
దేశీయంగా టెలికం గేర్ తయారీకి దన్నుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్‌లో దిగుమతి సుంకాల పెంపునకు తెరతీశారు. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు(పీసీబీఏ)లుగా వ్యవహరించే మదర్‌బోర్డులపై 5 శాతం పెంపును ప్రతిపాదించారు. వెరసి టెలికం పీసీబీఏలపై బేసిక్ కస్టమ్ డ్యూటీ ప్రస్తుత 10 శాతం నుంచి 15 శాతానికి పెరగనుంది.
అయితే కమ్యూనికేషన్ పరికరాల తయారీలో వినియోగించే కీలక 25 మినరల్స్‌పై డ్యూటీని పూర్తిస్థాయిలో మినహాయించింది. వీటిలో అణువిద్యుత్, పునరుత్పాదక ఇంధనం, రక్షణ, టెలికం రంగాలలో వినియోగించే లిథియం, కాపర్, కోబాల్ట్ తదితరాలున్నాయి.
రూ.50 లక్షలు మించితేనే రిటర్నుల పునః మదింపు
పన్ను చెల్లింపుదారులకు సంబంధించి కొన్ని సానుకూల చర్యలకు బడ్జెట్లో చోటు లభించింది. ఎగవేసిన పన్ను ఆదాయం రూ.50లక్షలకు మించి ఉన్నప్పుడే.. అసెస్‌మెంట్ సంవత్సరం ముగిసిన మూడు నుంచి ఐదేళ్లలోపు తిరిగి మదింపు చేయవచ్చని ప్రకటించారు. సోదాలకు సంబంధించి కూడా ప్రస్తుతం అసెస్‌మెంట్ సంవత్సరం ముగిసిన పదేళ్ల వరకు అవకాశం ఉండగా, దీన్ని ఆరేళ్లకు తగ్గించారు.
పన్నుల విషయంలో అనిశి్చత, వివాదాలను ఈ చర్యలు తగ్గిస్తాయని మంత్రి చెప్పారు. ఎలాంటి కేసుల్లోనూ ఐదేళ్ల తర్వాత సంబంధిత పన్ను రిటర్నులను తిరిగి మదించకుండా నిబంధనల్లో సవరణలు తీసుకొస్తామని ప్రకటించారు. పన్ను వివాదాల పరిష్కారానికి వీలుగా ‘వివాద్ సే విశ్వాస్ పథకం 2.0’ను తీసుకొస్తామన్నారు.
సమతౌల్యత సాధన..
ప్రజాదరణ, విధాన చర్యల మధ్య సమతుల్యతను సాధించడానికి ప్రభుత్వం ప్రయతి్నంచింది. రైతులకు ద్రవ్య మద్దతు, వ్యక్తిగత ఆదాయపు పన్నులో అధిక మినహాయింపు పరిమితులు, పెరిగిన ప్రామాణిక తగ్గింపులు వంటి కార్యక్రమాలు ఖర్చు చేయదగ్గ అధిక ఆదాయాన్ని అందిస్తాయి. ఇది వ్యయాలను పెంచడానికి దారి తీస్తుంది. – కుమార్ రాజగోపాలన్, సీఈవో, రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా.
కీలక పురోగతి..
ఊహించినట్లుగా 2024 యూనియన్ బడ్జెట్ సౌర, పునరుత్పాదక ఇంధన రంగాలకు ప్రాధాన్యత ఇచ్చింది. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద ఒక కోటి రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేయాలనే లక్ష్యం ఒక ముఖ్యమైన పురోగతిగా నిలుస్తుంది. కస్టమ్ డ్యూటీ మినహాయింపు జాబితా నుండి సోలార్ గ్లాస్, గ్లాస్, కాపర్ వైర్ కనెక్టర్లను తొలగించడం వివేకవంతమైన చర్య. అభివృద్ధి చెందుతున్న దేశీయ పరిశ్రమకు మద్దతుగా ఈ నిర్ణయం కీలకం. – విశ్వేశ్వర రెడ్డి, సీఎండీ, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్
అద్భుతమైనది ఏమీ లేదు..
ఆతిథ్య రంగానికి సంబంధించి ఎటువంటి నిర్దిష్ట చర్యలు లేకపోవడం నిరాశ కలిగించింది. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఈ రంగం వృద్ధిని వేగవంతం చేయడానికి బడ్జెట్‌లో అద్భుతమైనది ఏమీ లేదు. – ప్రదీప్ శెట్టి, ప్రెసిడెంట్, ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అసోసియేషన్స్
వ్యవసాయానికి దన్ను
వ్యవసాయం భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచినందున ఆహార భద్రత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, అలాగే వ్యవసాయంలో ఉత్పాదకతను పెంపొందించడంపై కేంద్ర బడ్జెట్ ప్రాధాన్యతను స్వాగతిస్తున్నాము. ఉత్పాదకతను మెరుగుపరచడం, వాతావరణాన్ని తట్టుకునే పంటలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించడానికి ప్రతిపాదిత సమగ్ర సమీక్ష భారతీయ వ్యవసాయం వాతావరణ ప్రభావాన్ని తట్టుకోగలదని నిర్ధారించడానికి ఒక ప్రేరణనిస్తుంది. – అరుణ్ అలగప్పన్, కోరమాండల్ ఇంటర్నేషనల్.
వృద్ధి ఆధారితం
అభివృద్ధి ఆధారిత బడ్జెట్. ఇది స్వల్పకాలిక డిమాండ్ ఉద్దీపన, ఆర్థిక క్రమశిక్షణను కొనసాగిస్తూ మధ్యకాలిక వృద్ధి ఆవశ్యకతలపై దృష్టి సారించింది. ఉద్యోగాల కల్పన, నైపుణ్యానికి బలమైన ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్ అందరినీ కలుపుకొని ఉంది. – అనీశ్ షా, ప్రెసిడెంట్, ఫిక్కీ.
సాహసోపేతం
దీర్ఘకాలిక ఆర్థిక వివేకాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రూపొందించిన సాహసోపేత బడ్జెట్ ఇది. దేశంలో తయారీ, ఎంఎస్‌ఎంఈల పటిష్ట పాత్ర ద్వారా ఉద్యోగ కల్పన యొక్క సుదీర్ఘ, మరింత స్థిర మార్గంపై దృష్టి పెడుతుంది. – సంజయ్ నాయర్, ప్రెసిడెంట్, అసోచామ్.
మౌలిక రంగ పురోగతి లక్ష్యం
వివిధ ముఖ్య ప్రాజెక్టులు, కేటాయింపుల ద్వారా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం వల్ల నిస్సందేహంగా సిమెంట్, ఇతర నిర్మాణ సామగ్రికి డిమాండ్ పెరుగుతుంది. ఆర్థిక ఏకీకరణపై దృష్టి సారించి పరివర్తనాత్మకంగా, ముందుకు చూసేదిగా బడ్జెట్ ఉంది. ఇది మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉపాధి కల్పన, ఇంధన భద్రతపై బలమైన దృష్టిని కలిగి ఉంది. – నీరజ్ అఖౌరీ, ప్రెసిడెంట్, సిమెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్.
ఉపాధి కల్పనకు ఊతం
బడ్జెట్‌లో పురోగామి ప్రతిపాదనలు చేశారు. దీనితో ఉత్తరాంధ్రలో కనీసం 2,00,000 ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంది. వివిధ రంగాల అభివృద్ధికి గణనీయంగా అవకాశాలు కలి్పంచడం ద్వారా దేశీయంగా ఉపాధి కల్పన ముఖచిత్రాన్ని మార్చే విధంగా బడ్జెట్ ఉంది. – గేదెల శీనుబాబు, సీఈవో, పల్సస్ గ్రూప్
Comments
Please login to add a commentAdd a comment