Hindustan Petroleum
-
ఆయిల్ కంపెనీలకు చేదువార్త
న్యూఢిల్లీ: ఆయిల్ కంపెనీలను బడ్జెట్ నిరాశపరిచింది. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియంలకు 2023–24 ఆర్థిక సంవత్సరంలో వచి్చన రికార్డు లాభాల (దాదాపు రూ.81,000 కోట్లు) కారణంగా గత ఆర్థిక సంవత్సరం ప్రకటించిన రూ. 30,000 కోట్ల మూలధన మద్దతును ఆర్థికమంత్రి రద్దు చేశారు.నిజానికి ఈ మద్దతును రూ.15,000 కోట్లకు తగ్గించాలని 2024 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో ప్రతిపాదించిన నిర్మలా సీతారామన్, తాజా బడ్జెట్లో ఈ మద్దతును పూర్తిగా రద్దు చేయడం గమనార్హం.వ్యూహాత్మక నిల్వలకు రూ.5,000 కోట్లు ఇక సరఫరాల్లో అంతరాయాలను నిరోధించడానికి కర్ణాటకలోని మంగళూరు అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో నిర్మించిన వ్యూహాత్మక భూగర్భ నిల్వల క్షేత్రాలను నింపడానికి వీలుగా ముడి చమురును కొనుగోలు చేయడానికి రూ. 5,000 కోట్లను బడ్జెట్లో ప్రతిపాదించారు. షేర్లు డీలా... తాజా నిర్ణయం నేపథ్యంలో ఎన్ఎస్ఈలో ఐఓసీ షేర్ ధర క్రితం ముగింపుతో పోలి్చతే 2 శాతం నష్టపోయి రూ.166 వద్ద ముగిసింది. బీపీసీఎల్ షేర్ ధర 1 శాతం తగ్గి రూ.306 వద్ద ముగిసింది. హెచ్‌పీసీఎల్ షేరు ధర స్వల్ప నష్టంతో 347 వద్ద స్థిరపడింది.క్రూజ్ పర్యాటకానికి ప్రోత్సాహంవిదేశీ షిప్పింగ్ కంపెనీలపై సులభతర పన్ను దేశీ క్రూజ్ విభాగంలో కార్యకలాపాలు నిర్వహించే విదేశీ షిప్పింగ్ కంపెనీలకు సులభతర పన్నుల విధానాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. క్రూజ్ పర్యాటకంలో ఉపాధి అవకాశాలను పెంచేందుకు ఈ చర్య తీసుకున్నారు. సముద్ర జలాలపై నడిచే పర్యాటక ఓడలను క్రూజ్‌లుగా చెబుతారు. దేశంలో క్రూజ్ పర్యాటకానికి భారీ అవకాశాలున్నట్టు మంత్రి చెప్పారు.ఈ విభాగంలో భారత షిప్పింగ్ పరిశ్రమ వాటాను పెంచేందుకు, ఉపాధి అవకాశాలను పెంచేందుకు యాజమాన్యం, లీజింగ్ పరంగా సంస్కరణలు తీసుకొస్తామని ప్రకటించారు. క్రూజ్ పర్యాటకానికి భారత్‌ను ఆర్షణీయ కేంద్రంగా మారుస్తామని, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తామని చెప్పారు. ‘‘క్రూజ్ షిప్పింగ్‌ల నిర్వహణలో పాలు పంచుకునే ప్రవాసులకు ఊహాత్మకమైన పన్ను విధానం ప్రతిపాదిస్తున్నాం. విదేశీ కంపెనీ, నాన్ రెసిడెంట్ షిప్ ఆపరేటర్ రెండూ ఒకే హోల్డింగ్ కంపెనీ కింద ఉంటే లీజ్ రెంటల్ రూపంలో ఆర్జించే ఆదాయంపై పన్ను మినహాయింపును కలి్పస్తున్నాం’’అని వివరించారు. ఈ దిశగా సెక్షన్ 44బీబీసీని ప్రతిపాదించారు. 2025 ఏప్రిల్ 1 నుంచి సవరణలు అమల్లోకి వస్తాయని చెప్పారు. ఎన్పీఎస్పై మరింత పన్ను ప్రయోజనంనూతన పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చే దిశగా కేంద్ర సర్కారు జాతీయ పింఛను పథకంలో (ఎన్పీఎస్) పెట్టుబడులకు ప్రోత్సాహకాన్ని పెంచింది. ఉద్యోగి తరఫున ప్రైవేటు సంస్థలు జమ చేసే ఎన్పీఎస్ వాటాపై పన్ను మినహాయింపు పరిమితిని 14 శాతం చేసింది. ఉద్యోగి మూల వేతనం, కరువు భత్యంలో (గరిష్ట పరిమితి రూ.లక్ష) 10 శాతం జమలపైనే ప్రస్తుతం పన్ను మినహాయింపు ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం ఇది 14 శాతంగానే ఉండగా.. ప్రైవేటు రంగ ఉద్యోగులకు సైతం ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రయోజనాన్ని పెంచారు. ఆదాయపన్ను చట్టంలోని పాత పన్ను వ్యవస్థలో ఉద్యోగి తరఫున సంస్థలు చేసే ఎన్పీఎస్ జమలపై పన్ను మినహాయింపు 10 శాతంగానే కొనసాగుతుంది. ఉదాహరణకు పార్థసారథి మూలవేతనం, కరవు భత్యం రూ.1,00,000 ఉందనుకుంటే.. తాజా మార్పుతో ప్రతి నెలా రూ.4,000 చొప్పున ఏడాదికి రూ.48వేల మొత్తంపై పన్ను లేకుండా చూసుకోవచ్చు. మైనర్ల పేరిట తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఎన్పీఎస్ ఖాతా తెరిచేందుకు ‘ఎన్పీఎస్ వాత్సల్య’ ప్లాన్‌ను కూడా ప్రకటించారు. ఈకామర్స్ ఎగుమతులకు దన్నుహబ్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఈకామర్స్ రంగం ద్వారా ఎగుమతులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో హబ్‌ల ఏర్పాటుకు ప్రతిపాదించింది. ఇందుకు ప్రభుత్వ, ప్రయివేట్ విధానం(పీపీపీ)లో వీలు కలి్పంచనుంది. అవాంతరాలులేని నియంత్రణ, లాజిస్టిక్ మార్గదర్శకాల ద్వారా ఒకే గొడుగుకింద వాణిజ్యం, ఎగుమతి సంబంధ సరీ్వసులకు ఇవి తెరతీయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. వెరసి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు(ఎంఎస్ఎంఈలు), సంప్రదాయ చేనేత, హస్తకళలు తదితర శ్రామికులు తమ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించేందుకు వీలు చిక్కనున్నట్లు తెలియజేశారు.ప్రస్తుతం ఈకామర్స్ విభాగం ద్వారా దేశీ ఎగుమతులు కేవలం 5 బిలియన్ డాలర్లకు పరిమితంకాగా.. చైనా నుంచి వార్షికంగా 300 బిలియన్ డాలర్లు ఎగుమతులు నమోదవుతున్నాయి. రానున్న కాలంలో 50–100 బిలియన్ డాలర్లకు దేశీ ఎగుమతులను పెంచేందుకు అవకాశముంది. బడ్జెట్ ప్రతిపాదిత కేంద్రా(హబ్)ల ద్వారా తొలుత చిన్న తయారీదారులు ఈకామర్స్ సంస్థలు(అగ్రిగేటర్ల)కు ఉత్పత్తులను విక్రయిస్తారు.తదుపరి ఇతర మార్కెట్లలో అగ్రిగేటర్లు వీటిని విక్రయిస్తాయి. ప్రధానంగా ఆభరణాలు(జ్యువెలరీ), దుస్తులు, హస్తకళలు తదితరాలకు భారీ అవకాశాలున్నాయి. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకునే బాటలో ఆర్బీఐసహా సంబంధిత శాఖలతో వాణిజ్య శాఖ విభాగం డీజీఎఫ్టీ కలసి పనిచేస్తోంది. ఫలితంగా ఈ హబ్‌లకు ఎగుమతులు క్లియరెన్స్‌లను కలి్పస్తారు. అంతేకాకుండా వేర్‌హౌసింగ్, కస్టమ్స్ క్లియరెన్స్, రిటర్నుల ప్రాసెసింగ్, లేబిలింగ్, టెస్టింగ్, ప్యాకేజింగ్లను వీటికి జత చేస్తారు.డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం రూ. 50,000 కోట్లు ప్రభుత్వ సంస్థలలో వాటాల విక్రయం(డిజిన్వెస్ట్‌మెంట్) ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) రూ. 50,000 కోట్లు సమీకరించవచ్చని తాజా బడ్జెట్ అంచనా వేసింది. మధ్యంతర బడ్జెట్లోనూ ఇదేస్థాయిలో ప్రభుత్వం అంచనాలు ప్రకటించింది. ఇక కేంద్ర ప్రభుత్వ కంపెనీల(సీపీఎస్ఈలు) నుంచి రూ. 56,260 కోట్ల డివిడెండ్ లభించవచ్చని భావిస్తోంది.మధ్యంతర బడ్జెట్లో వేసిన అంచనాలు రూ. 48,000 కోట్లకంటే అధికంకావడం గమనార్హం! మరోవైపు ఆర్బీఐ, పీఎస్‌యూ బ్యాంకుల నుంచి ఈ ఏడాది రూ. 2,32,874 కోట్ల డివిడెండ్ అందుకునే చాన్స్ ఉన్నట్లు బడ్జెట్ ఊహిస్తోంది. ఇందుకు ప్రధానంగా ఆర్బీఐ నుంచి రూ. 2.11 లక్షల కోట్ల అనూహ్య డివిడెండ్ లభించడం ప్రభావం చూపింది. మధ్యంతర బడ్జెట్ ఈ పద్దుకింద రూ. 1.02 లక్షల కోట్లు మాత్రమే అంచనా వేసింది.దివాలా వ్యవహారాల్లో ఇక మరింత పారదర్శకతఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్ ఏర్పాటు దివాలా కోడ్ (ఐబీసీ) పక్రియను మరింత మెరుగుపరచడంపై బడ్జెట్ దృష్టి సారించింది. ఇందుకు సంబంధించి స్థిరత్వం, పారదర్శకత, సమయానుకూల ప్రాసెసింగ్, వాటాదారులకు సంబంధించి మెరుగైన పర్యవేక్షణ సాధన లక్ష్యంగా ‘ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్’ను ఆవిష్కరిస్తున్నట్లు ఆర్థికమంత్రి తెలిపారు. 2016 నుంచి అమల్లోకి వచ్చిన దివాలా కోడ్ పటిష్టత కోసం తగిన మార్పులను తీసుకురావడం జరుగుతుందని మంత్రి తెలిపారు. కోడ్‌ను ఇప్పటి వరకూ ఆరు సార్లు సవరించిన సంగతి తెలిసిందే. ఐబీసీ 1,000 కంటే ఎక్కువ కంపెనీల దివాల అంశాలను పరిష్కరించిందని, ఫలితంగా రుణదాతలకు నేరుగా రూ. 3.3 లక్షల కోట్ల రికవరీ జరిగిందని ఆమె చెప్పారు. ప్రస్తుతం దేశ రాజధానిలో ఉన్న ప్రధాన బెంచ్సహా 15 నగరాల్లో ఎన్సీఎల్టీ బెంచ్‌లు ఉన్నాయి. అంతేకాకుండా, నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఢిల్లీ, చెన్నైలలో బెంచ్‌లను కలిగి ఉంది. రికవరీని వేగవంతం చేసేందుకు మరిన్ని ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపారు. టెలికం పరికరాల దిగుమతులకు చెక్10 శాతం నుంచి 15 శాతానికి సుంకాల పెంపు దేశీయంగా టెలికం గేర్ తయారీకి దన్నుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్లో దిగుమతి సుంకాల పెంపునకు తెరతీశారు. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు(పీసీబీఏ)లుగా వ్యవహరించే మదర్‌బోర్డులపై 5 శాతం పెంపును ప్రతిపాదించారు. వెరసి టెలికం పీసీబీఏలపై బేసిక్ కస్టమ్ డ్యూటీ ప్రస్తుత 10 శాతం నుంచి 15 శాతానికి పెరగనుంది.అయితే కమ్యూనికేషన్ పరికరాల తయారీలో వినియోగించే కీలక 25 మినరల్స్‌పై డ్యూటీని పూర్తిస్థాయిలో మినహాయించింది. వీటిలో అణువిద్యుత్, పునరుత్పాదక ఇంధనం, రక్షణ, టెలికం రంగాలలో వినియోగించే లిథియం, కాపర్, కోబాల్ట్ తదితరాలున్నాయి.రూ.50 లక్షలు మించితేనే రిటర్నుల పునః మదింపుపన్ను చెల్లింపుదారులకు సంబంధించి కొన్ని సానుకూల చర్యలకు బడ్జెట్లో చోటు లభించింది. ఎగవేసిన పన్ను ఆదాయం రూ.50లక్షలకు మించి ఉన్నప్పుడే.. అసెస్మెంట్ సంవత్సరం ముగిసిన మూడు నుంచి ఐదేళ్లలోపు తిరిగి మదింపు చేయవచ్చని ప్రకటించారు. సోదాలకు సంబంధించి కూడా ప్రస్తుతం అసెస్మెంట్ సంవత్సరం ముగిసిన పదేళ్ల వరకు అవకాశం ఉండగా, దీన్ని ఆరేళ్లకు తగ్గించారు.పన్నుల విషయంలో అనిశి్చత, వివాదాలను ఈ చర్యలు తగ్గిస్తాయని మంత్రి చెప్పారు. ఎలాంటి కేసుల్లోనూ ఐదేళ్ల తర్వాత సంబంధిత పన్ను రిటర్నులను తిరిగి మదించకుండా నిబంధనల్లో సవరణలు తీసుకొస్తామని ప్రకటించారు. పన్ను వివాదాల పరిష్కారానికి వీలుగా ‘వివాద్ సే విశ్వాస్ పథకం 2.0’ను తీసుకొస్తామన్నారు. సమతౌల్యత సాధన..ప్రజాదరణ, విధాన చర్యల మధ్య సమతుల్యతను సాధించడానికి ప్రభుత్వం ప్రయతి్నంచింది. రైతులకు ద్రవ్య మద్దతు, వ్యక్తిగత ఆదాయపు పన్నులో అధిక మినహాయింపు పరిమితులు, పెరిగిన ప్రామాణిక తగ్గింపులు వంటి కార్యక్రమాలు ఖర్చు చేయదగ్గ అధిక ఆదాయాన్ని అందిస్తాయి. ఇది వ్యయాలను పెంచడానికి దారి తీస్తుంది. – కుమార్ రాజగోపాలన్, సీఈవో, రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా.కీలక పురోగతి..ఊహించినట్లుగా 2024 యూనియన్ బడ్జెట్ సౌర, పునరుత్పాదక ఇంధన రంగాలకు ప్రాధాన్యత ఇచ్చింది. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద ఒక కోటి రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేయాలనే లక్ష్యం ఒక ముఖ్యమైన పురోగతిగా నిలుస్తుంది. కస్టమ్ డ్యూటీ మినహాయింపు జాబితా నుండి సోలార్ గ్లాస్, గ్లాస్, కాపర్ వైర్ కనెక్టర్లను తొలగించడం వివేకవంతమైన చర్య. అభివృద్ధి చెందుతున్న దేశీయ పరిశ్రమకు మద్దతుగా ఈ నిర్ణయం కీలకం. – విశ్వేశ్వర రెడ్డి, సీఎండీ, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అద్భుతమైనది ఏమీ లేదు..ఆతిథ్య రంగానికి సంబంధించి ఎటువంటి నిర్దిష్ట చర్యలు లేకపోవడం నిరాశ కలిగించింది. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఈ రంగం వృద్ధిని వేగవంతం చేయడానికి బడ్జెట్లో అద్భుతమైనది ఏమీ లేదు. – ప్రదీప్ శెట్టి, ప్రెసిడెంట్, ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అసోసియేషన్స్వ్యవసాయానికి దన్నువ్యవసాయం భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచినందున ఆహార భద్రత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, అలాగే వ్యవసాయంలో ఉత్పాదకతను పెంపొందించడంపై కేంద్ర బడ్జెట్ ప్రాధాన్యతను స్వాగతిస్తున్నాము. ఉత్పాదకతను మెరుగుపరచడం, వాతావరణాన్ని తట్టుకునే పంటలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించడానికి ప్రతిపాదిత సమగ్ర సమీక్ష భారతీయ వ్యవసాయం వాతావరణ ప్రభావాన్ని తట్టుకోగలదని నిర్ధారించడానికి ఒక ప్రేరణనిస్తుంది. – అరుణ్ అలగప్పన్, కోరమాండల్ ఇంటర్నేషనల్.వృద్ధి ఆధారితంఅభివృద్ధి ఆధారిత బడ్జెట్. ఇది స్వల్పకాలిక డిమాండ్ ఉద్దీపన, ఆర్థిక క్రమశిక్షణను కొనసాగిస్తూ మధ్యకాలిక వృద్ధి ఆవశ్యకతలపై దృష్టి సారించింది. ఉద్యోగాల కల్పన, నైపుణ్యానికి బలమైన ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్ అందరినీ కలుపుకొని ఉంది. – అనీశ్ షా, ప్రెసిడెంట్, ఫిక్కీ.సాహసోపేతందీర్ఘకాలిక ఆర్థిక వివేకాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రూపొందించిన సాహసోపేత బడ్జెట్ ఇది. దేశంలో తయారీ, ఎంఎస్ఎంఈల పటిష్ట పాత్ర ద్వారా ఉద్యోగ కల్పన యొక్క సుదీర్ఘ, మరింత స్థిర మార్గంపై దృష్టి పెడుతుంది. – సంజయ్ నాయర్, ప్రెసిడెంట్, అసోచామ్.మౌలిక రంగ పురోగతి లక్ష్యంవివిధ ముఖ్య ప్రాజెక్టులు, కేటాయింపుల ద్వారా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం వల్ల నిస్సందేహంగా సిమెంట్, ఇతర నిర్మాణ సామగ్రికి డిమాండ్ పెరుగుతుంది. ఆర్థిక ఏకీకరణపై దృష్టి సారించి పరివర్తనాత్మకంగా, ముందుకు చూసేదిగా బడ్జెట్ ఉంది. ఇది మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉపాధి కల్పన, ఇంధన భద్రతపై బలమైన దృష్టిని కలిగి ఉంది. – నీరజ్ అఖౌరీ, ప్రెసిడెంట్, సిమెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్.ఉపాధి కల్పనకు ఊతంబడ్జెట్లో పురోగామి ప్రతిపాదనలు చేశారు. దీనితో ఉత్తరాంధ్రలో కనీసం 2,00,000 ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంది. వివిధ రంగాల అభివృద్ధికి గణనీయంగా అవకాశాలు కలి్పంచడం ద్వారా దేశీయంగా ఉపాధి కల్పన ముఖచిత్రాన్ని మార్చే విధంగా బడ్జెట్ ఉంది. – గేదెల శీనుబాబు, సీఈవో, పల్సస్ గ్రూప్ -
చమురు సంస్థలకు వేల కోట్ల నష్టం, ధరలు పెంచకపోవడం వల్లే?
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో మరోసారి నష్టాలు ప్రకటించే అవకాశమున్నట్లు బ్రోకింగ్ కంపెనీ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అంచనా వేసింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో ఉమ్మడిగా రూ. 21,270 కోట్ల నష్టాలు నమోదుకావచ్చని పేర్కొంది. వెరసి సరికొత్త రికార్డ్ నెలకొల్పుతూ వరుసగా రెండో త్రైమాసికంలోనూ నష్టాలు ప్రకటించనున్నట్లు తెలియజేసింది. చమురు పీఎస్‌యూలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్‌పీసీఎల్) ఉమ్మడిగా ఈ ఏడాది ఏప్రిల్–జూన్(క్యూ1)లో రూ. 18,480 కోట్ల నష్టాలు ప్రకటించాయి. పెట్రోల్, డీజిల్, దేశీ ఎల్పీజీ విక్రయాలలో మార్కెటింగ్ మార్జిన్లు క్షీణించడం ప్రభావం చూపింది. ఈ బాటలో క్యూ2లోనూ మార్కెటింగ్ మార్జిన్లు బలహీనపడటంతో లాభదాయకత క్షీణించనున్నట్లు తాజా నివేదికలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తెలియజేసింది. ఇతర వివరాలిలా.. నవంబర్‌లో చమురు పీఎస్‌యూలు ఈ నెలఖారు లేదా వచ్చే నెల(నవంబర్)లో క్యూ2 ఫలితాలు వెల్లడించనున్నాయి. క్యూ1లో రికార్డు రిఫైనింగ్ మార్జిన్లు సాధించినప్పటికీ పెట్రోల్, డీజిల్ రోజువారీ విక్రయ ధరలను సవరించకపోవడంతో లాభాలు ఆవిరయ్యాయి. నష్టాలు నమోదయ్యాయి. పెట్రోల్, డీజిల్ ఉత్పత్తి వ్యయాలు, రిటైల్ విక్రయ ధరల మధ్య వ్యత్యాసం తగ్గిపోవడంతో మార్జిన్లు క్షీణించాయి. ఈ పరిస్థితి మూడు చమురు పీఎస్‌యూలను ఆర్థికంగా దెబ్బతీస్తోంది. ఇది క్యూ2లోనూ కొనసాగడంతో ఆర్థిక పనితీరు మరింత నీరసించనుంది. త్రైమాసికవారీగా స్థూల రిఫైనింగ్ మార్జిన్ల(జీఆర్ఎం)లో బ్యారల్‌కు 5.6–15.9 డాలర్లమేర కోత పడనుంది. అయితే బ్లెండెడ్ రిటైల్ ఇంధన నష్టాలు తగ్గడంతో కొంతమేర కంపెనీలకు మేలు జరగనుంది. క్యూ1లో నమోదైన రూ. 14.4తో పోలిస్తే క్యూ2లో ఇవి రూ. 9.8కు పరిమితమయ్యే వీలుంది. ఇబిటా నష్టాలు మొత్తంగా క్యూ2లో చమురు పీఎస్‌యూల నిర్వహణ(ఇబిటా) నష్టాలు రూ. 14,700 కోట్లకు చేరనున్నాయి. నికర నష్టాలు మరింత అధికంగా రూ. 21,270 కోట్లను తాకవచ్చు. గత ఆరు నెలలుగా కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల సవరణను చేపట్టకపోవడం గమనార్హం! 2017లో రోజువారీ ధరల సవరణను అమల్లోకి తీసుకువచ్చాక ఆరు నెలలపాటు నిలిపివేయడం ఇదే ప్రథమం! ఇదే సమయంలో ముడిచమురు ధరలు పుంజుకోవడం, డాలరుతో మారకంలో రూపాయి బలహీనపడటంతో ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోయాయి. ఇక వంటగ్యాస్ ధరలను సైతం వ్యయాలకు అనుగుణంగా పెంచకపోవడం ప్రస్తావించ దగ్గ విషయం. కంపెనీలవారీగా... నివేదిక ప్రకారం క్యూలో ఐవోసీ రూ. 6,300 కోట్ల నష్టాలు నమోదు చేసే వీలుంది. ఈ బాటలో బీపీసీఎల్ రూ. 6,900 కోట్లు, హెచ్‌పీసీఎల్ రూ. 8,100 కోట్ల నష్టాలు ప్రకటించవచ్చు. వెరసి తొలిసారి మూడు పీఎస్‌యూలు వరుస త్రైమాసికాలలో నష్టాలు ప్రకటించడం ద్వారా రికార్డ్ నెలకొల్పనున్నాయి. క్యూ1లోనూ ఐవోసీ రూ. 1,995 కోట్లు, హెచ్‌పీసీఎల్ రూ. 10,197 కోట్లు(సరికొత్త రికార్డ్), బీపీసీఎల్ రూ. 6,291 కోట్లు చొప్పున నష్టాలు ప్రకటించాయి. దేశీయంగా చమురు కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలకు అనుగుణంగా రోజువారీ ఇంధన ధరల సవరణను చేపట్టే సంగతి తెలిసిందే. -
పెట్రోల్, డీజిల్ ‘కట్’కట
సాక్షి, నెట్వర్క్: భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్) రిటైల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. ఆయిల్ కంపెనీలు ఆయా బంకుల వాస్తవ కోటాకు కోత వేయడంతోపాటు క్రెడిట్ సదుపాయాన్ని రద్దుచేశాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పలు బంకులు వారంలో నాలుగు రోజులపాటు నో స్టాక్ బోర్డులు తగిలించుకునే పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ కొరత బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ బంకుల్లోనే తలెత్తుతుండటంతో ఆయా డీలర్లు లబోదిబోమంటున్నారు. క్రెడిట్ విధానం రద్దు చేయటంతో వారు నగదు చెల్లించి బుక్ చేసిన ట్యాంకర్లను సైతం నాలుగైదు రోజులు ఆలస్యంగా పంపుతున్నారు. అలాగే, వారి కోటాలో 50 నుంచి 75 శాతమే సరఫరా చేస్తుండటంతో డీలర్లు మరింత ఒత్తిడికి లోనవుతున్నారు. త్వరలో వ్యవసాయ, విద్యా సంవత్సరాలు ప్రారంభమవుతున్న సమయంలో డీజిల్, పెట్రోల్ కొరత సాధారణ ప్రజలపైనా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. బంక్‌ల నిర్వహణ కష్టంగా మారుతోందని డీలర్లే స్వచ్ఛందంగా బంకులు బంద్ చేసుకుంటున్నారు. కోటాకు కోతలొద్దు గత వారం రోజులుగా రేషనింగ్ విధానంతో ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పటికే పలు బంకులు మూతపడే స్థాయికి చేరాయి. క్రెడిట్ విధానం లేదంటున్న కంపెనీలు నగదు చెల్లించిన వారికి సైతం పూర్తి కోటాను ఇవ్వడం లేదు. వెంటనే పూర్తి కోటా కేటాయించి, డీలర్ల కమీషన్ సైతం పెంచాలి. – అమరేందర్రెడ్ది, రాష్ట్ర పెట్రోల్ డీలర్ల సంఘం అ«ధ్యక్షుడు, హైదరాబాద్ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి ఆయిల్ కంపెనీలు తమ నష్టాలను తగ్గించుకునేందుకు వినియోగదారుల కోటాకు కత్తెర వేస్తున్నాయి. దీంతో సరిపడా స్టాక్ లేక డీలర్లు ఇబ్బంది పడుతున్నారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం జోక్యం చేసుకోవాలి. – దినేష్‌రెడ్డి, డీలర్స్ అసోసియేషన్, నిజామాబాద్ సరిపడా సరఫరా లేదు గతంలో క్రెడిట్‌పై ఇండెంట్ పెట్టినా డిపోల నుంచి ఇంధన ట్యాంకర్లు పంపేవారు. ఇప్పుడు డబ్బులు కట్టినా పూర్తి కోటా ఇవ్వడం లేదు. ఉక్రెయిన్ యుద్ధప్రభావంతో డీజిల్‌పై రూ.26, పెట్రోల్‌పై రూ.8 భారం పడుతోందని ఒక్కో సేల్స్ ఆఫీసర్ కోటా పరిధిలో సగానికి చేశారు. బల్క్ సరఫరా కూడా బంక్‌ల నుంచే జరుగుతుండటంతో మరింత కొరత ఏర్పడింది. – పొన్నాల వినయ్, డీలర్, బీపీసీఎల్, క్యాతనపల్లి, మంచిర్యాల జిల్లా -
హెచ్‌పీ ఫ్లాంట్‌లో భారీ పేలుడు
ఉన్నవో: హిందుస్థాన్ పెట్రోలియం ఫ్లాంట్‌లో గురువారం పెట్రోల్ ట్యాంకర్లలో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఉత్తరప్రదేశ్ ఉన్నవోలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఫ్లాంట్‌లోని వాల్వ్ లీక్ అవడంతో ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. అకస్మాత్తుగా ట్యాంకర్ పేలడంతో ఫ్లాంట్‌లోకి సిబ్బంది ఉలిక్కిపడ్డారు. ఒక్కసారిగా వారంతా బయటకు పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. వెంటనే వారందర్ని అక్కడ నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. మరోవైపు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ముందు జాగ్రత్త చర్యగా లక్నో-కాన్పూరు మార్గమధ్యంలో నడిచే రైళ్లను నిలిపివేశారు. అలాగే ఫ్లాంట్ సమీపంలోని నాలుగైదు కిలోమీటర్ల పరిధిలో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా ప్రమాద తీవ్రత నేపథ్యంలో చుట్టుపక్కలున్న గ్రామాల్లోని వారిని అక్కడ నుంచి తరలించారు. హెచ్‌పీ పెట్రోలియం యాజమాన్యం కూడా ఫ్లాంట్‌లోని లీకేజీని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సిటీ గ్యాస్ బిడ్డింగ్‌లో ఐవోసీ టాప్
న్యూఢిల్లీ: నగరాల్లో గృహాలకు పైపుల ద్వారా వంట గ్యాస్, వాహనాలకు సీఎన్జీ సరఫరా కోసం నిర్వహించిన పదో విడత లైసెన్సుల వేలంలో ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) అత్యధిక స్థాయిలో బిడ్లు దాఖలు చేసింది. అదానీ గ్రూప్, హిందుస్తాన్ పెట్రోలియం, ఇంద్రప్రస్థ గ్యాస్ మొదలైనవి ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. పెట్రోలియం, గ్యాస్ రంగ నియంత్రణ సంస్థ (పీఎన్జీఆర్బీ) వెల్లడించిన వివరాల ప్రకారం ఐవోసీ మొత్తం 35 నగరాల్లో సొంతంగా, అదానీ గ్యాస్ భాగస్వామ్యంతో మరో ఏడు నగరాల్లో లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకుంది. అదానీ గ్యాస్ సొంతంగా 19 నగరాలకు, ఐవోసీ భాగస్వామ్యంతో ఏడు నగరాలకు బిడ్లు వేసింది. ప్రభుత్వ రంగ గెయిల్ గ్యాస్ ప్రాంతాలకు బిడ్స్ దాఖలు చేసింది. పదో విడతలో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు సహా మొత్తం 50 నగరాలకు బిడ్డింగ్ నిర్వహించారు. ఫిబ్రవరి 7–9 మధ్యలో బిడ్లు తెరిచారు. 14 రాష్ట్రాల్లో 124 జిల్లాలకు ఈ లైసెన్సుల ద్వారా సేవలు అందించవచ్చు. -
హెచ్‌పీసీఎల్ 37 శాతం డౌన్
న్యూఢిల్లీ: హిందుస్తాన్ పెట్రోలియం(హెచ్‌పీసీఎల్) నికర లాభం ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్లో 37% తగ్గింది. గత క్యూ2లో రూ.1,735 కోట్లుగా ఉన్న లాభం ఈ క్యూ2లో రూ.1,092 కోట్లకు తగ్గిందని హెచ్‌పీసీఎల్ తెలిపింది. క్రూడ్ ధరలు పెరగడం, రిఫైనింగ్ మార్జిన్లు తగ్గడం, విదేశీ మారక ద్రవ్య నష్టాల వల్ల నికర లాభం 37 శాతం తగ్గిందని కంపెనీ సీఎమ్‌డీ ముకేశ్ కె. సురానా తెలిపారు. రూ.887 కోట్ల కరెన్సీ నష్టాలు గత క్యూ2లో 7.61 డాలర్లుగా ఉన్న ఒక్కో బ్యారెల్ స్థూల రిఫైనింగ్ మార్జిన్(జీఆర్ఎమ్) ఈ క్యూ2లో 4.81 డాలర్లకు తగ్గిందన్నారు. అలాగే గత క్యూ2లో రూ.20 కోట్ల విదేశీ మారక ద్రవ్య లాభాలు రాగా, ఈ క్యూ2లో రూ.887 కోట్ల విదేశీ మారక ద్రవ్య నష్టాలు వచ్చాయని వివరించారు. -
భారతీ ఎయిర్‌టెల్‌కు మరో షాక్
ముంబై : ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకుకు మరో షాక్ తగిలింది. అక్రమంగా తన అకౌంట్లోకి వేసుకున్న వంట గ్యాస్ సబ్సిడీ మొత్తాలను వెంటనే వెనక్కి ఇచ్చేయడంటూ ఎయిర్‌టెల్‌ను ప్రభుత్వ ఆయిల్ కంపెనీ హిందూస్తాన్ పెట్రోలియం ఆదేశించింది. కస్టమర్ల బ్యాంకు అకౌంట్లకు లేదా ఆయిల్ కంపెనీలకు ఈ సబ్సిడీలను బదిలీ చేయాలని ఆదేశాలు జారీచేసింది. లక్షల కొద్దీ కస్టమర్ల ఎల్పీజీ సబ్సిడీ మొత్తాలను, ఎయిర్టెల్ ఎలాంటి అనుమతి లేకుండా తన పేమెంట్స్ బ్యాంకు అకౌంట్లోకి మరలించుకుంటుందని వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో హిందూస్తాన్ పెట్రోలియం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. మొబైల్ నెంబర్‌కు ఆధార్ లింకింగ్ కోసం వచ్చిన ఎయిర్టెల్ ఖాతాదారుల రిక్వెస్ట్‌లను వారికి తెలియకుండానే ఆధార్ నెంబర్ల సహాయంతో పేమెంట్ అకౌంట్లని సృష్టించింది. అలా సృష్టించడమే కాకుండా సబ్సిడీ ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ బుక్ చేసినప్పుడు వినియోగదారునికి అందాల్సిన సబ్సిడీని ఎయిర్ టెల్ పేమెంట్ ఖాతాలో చేరేలా చేసింది. వాస్తవానికి ఎయిర్టెల్ ఖాతాదారులు ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీని ఇతర బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేసినా.. ఆ ఖాతాలకు కాకుండా సబ్సిడీ మొత్తం ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు ఖాతాల్లో పడేలా అక్రమాలకు పాల్పడింది. ''ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకుకు మేము లేఖ రాశాం. కస్టమర్ల గ్యాస్ సబ్సిడీ మొత్తాలను కస్టమర్లకు చెందిన అంతకముందు బ్యాంకు అకౌంట్లకు లేదా సంబంధిత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు తక్షణమే బదిలీ చేయాలని ఆదేశించాం'' అని హెచ్‌పీసీఎల్ ప్రకటించింది. గత కొన్ని వారాలుగా ఎల్పీజీ సబ్సిడీ అనుసంధానించిన తమ బ్యాంకు అకౌంట్లలోకి సబ్సిడీలు రావడం లేదని సోషల్ మీడియా, ప్రింట్ వంటి ఛానల్స్ ద్వారా వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఎలాంటి సమాచారం లేకుండా 23 లక్షలకు పైగా కస్టమర్ల రూ.47 కోట్ల ఎల్పీజీ సబ్సిడీని ఎయిర్టెల్ తన పేమెంట్స్ బ్యాంకులోకి క్రెడిట్ చేసుకుందని జూన్‌లోనే రిపోర్టులు వెలువడ్డాయి. వీరిలో 11 లక్షల ఎల్పీజీ కస్టమర్లు ఇండియన్ ఆయిల్‌కు చెందిన వారు కాగ, మిగతా వారు భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియంకు చెందిన కస్టమర్లు. కస్టమర్ల అనుమతి లేకుండా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు అకౌంట్లను ప్రారంభిస్తుందని ఆయిల్ కంపెనీలు కూడా గుర్తించాయి. అంతేకాక ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టకుండా భారతీ ఎయిర్టెల్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకుపై యూఐడీఏఐ నిషేధం విధించింది. -
రోజుకోసారి పెట్రోల్, డీజిల్ ధరలు ఛేంజ్
న్యూఢిల్లీ : ఇన్ని రోజులూ పదిహేను రోజులకొక్కసారి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయో పెరిగాయో తెలిసేది. 15 రోజుల సమీక్షలో భాగంగా ఆయిల్ కంపెనీలు వాటి ధరలను ప్రకటించాయి. కానీ ఇకనుంచి రోజుకోసారి పెట్రోల్, డీజిల్ ధరలు మారబోతున్నాయి. అంతర్జాతీయ ధరలకనుగుణంగా రేట్ల సమీక్షలను ఇక ప్రతిరోజూ చేపట్టాలని ప్రభుత్వరంగ చమురు సంస్థలు యోచిస్తున్నాయి. దేశీయ ప్యూయల్ రిటైల్ మార్కెట్ ను 95 శాతం తమ చెప్పుచేతుల్లో ఉంచుకున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియంలు ఈ దిశగా అడుగులు వేస్తున్నట్టు ఓ ప్రభుత్వ రంగ చమురు సంస్థ టాప్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. రోజూ వారీ ధరల సమీక్ష చేపట్టి, పెట్రోల్, డీజిల్ ధరలను మార్చబోతున్నట్టు చెప్పారు. రోజువారీ ధరల విధానంపై చర్చించడానికి ఆయిల్ కంపెనీల ఎగ్జిక్యూటివ్ లు, ఆయిల్ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తో బుధవారం భేటీ అయ్యారు. దీనికి అవసరమైన టెక్నాలజీ కూడా అందుబాటులో ఉన్నట్టు ఆ టాప్ ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న డిజిటల్ టెక్నాలజీలు, సోషల్ నెట్ వర్క్ లు కూడా రోజువారీ ధరల మార్పుకు అనుగుణంగా ఉన్నాయని, 53 వేల ఫిలింగ్ స్టేషన్లలో ధరల మార్పు సులభతరమేనని తెలిపారు. అయితే కేవలం కొన్ని పైసల తేడాతోనే ధరల్లో మార్పులు చోటుచేసుకుంటాయని, కస్టమర్లకు ఎలాంటి షాక్ ను కంపెనీలు ఇవ్వబోవని అంటున్నారు. -
30 శాతం పెరిగిన హెచ్‌పీసీఎల్ నికర లాభం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ, హిందుస్తాన్ పెట్రోలియం కార్పొ(హెచ్‌పీసీఎల్) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో ఏకంగా 30 శాతం పెరిగింది. గత క్యూ1లో రూ.1,614 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.2,098 కోట్లకు పెరిగిందని హెచ్‌పీసీఎల్ పేర్కొంది. ఇంధన విక్రయాలు పెరగడం, ఇన్వెంటరీ లాభాలు అధికం కావడం, రిఫైనరీ మార్జిన్లు నిలకడగా ఉండడం వల్ల ఈ స్థాయి లాభాలు సాధించామని కంపెనీ సీఎండీ ముకేశ్ కె. సురానా వివరించారు. దేశీయంగా అమ్మకాలు 5 శాతం పెరిగి 8.89 మిలియన్ టన్నులకు చేరాయని పేర్కొన్నారు. గత క్యూ1లో రూ.600 కోట్లుగా ఉన్న ఇన్వెంటరీ లాభాలు ఈ క్యూ1లో రూ.1,100 కోట్లకు పెరిగాయని వివరించారు. అయితే ఇంధనం ధరలు తగ్గడంతో టర్నోవర్ రూ.54,822 కోట్ల నుంచి రూ.51,661 కోట్లకు పడిపోయిందని పేర్కొన్నారు. -
హిందుస్తాన్ పెట్రోలియంతో పేటీఎం జట్టు
హైదరాబాద్: ప్రముఖ మొబైల్ పేమెంట్స్ అండ్ కామర్స్ ప్లాట్‌ఫామ్ పేటీఎం.. తాజాగా హిందుస్తాన్ పెట్రోలియంతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో పేటీఎం వినియోగదారులు హిందుస్తాన్ పెట్రోలియం ఫ్యూయెల్ స్టేషన్స్‌లో పేటీఎం ద్వారా లావాదేవీలు నిర్వహించవచ్చు. అంటే హెచ్‌పీసీఎల్ పెట్రోల్ బంకుల్లో బండికి పెట్రోల్/డీజిల్ పట్టించుకొని జేబులో నుంచి డబ్బులు (నగదు) ఇవ్వాల్సిన అవసరం లేకుండా పేటీఎం వాలెట్ ద్వారా చెల్లిస్తే సరిపోతుంది. పేమెంట్స్‌ను సులభతరం చేయడమే తమ లక్ష్యమని పేటీఎం వైస్ ప్రెసిడెంట్ కిరణ్ వాసిరెడ్డి తెలిపారు. -
ఏపీలో హెచ్‌పీసీఎల్ యూనిట్
రూ. 75 వేల కోట్లతో హైడ్రోకార్బన్ క్రాకర్ విభాగం హిందుస్థాన్ పెట్రోలియం సూత్రప్రాయ అంగీకారం అంతర్జాతీయ భాగస్వామి కోసం హెచ్‌పీసీఎల్ నిరీక్షణ వైఎస్సార్ జిల్లాలో స్టీల్ ప్లాంటు ఏర్పాటుకై చర్యలు వివిధ ప్రతిపాదనలపై అధికారులకు సీఎస్ ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 75 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ అండ్ హైడ్రోకార్బన్ క్రాకర్ యూనిట్ ఏర్పాటుకు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన యూనిట్ల ఏర్పాటు అంశాలపై పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. క్రాకర్ యూనిట్ ఏర్పాటుకు హెచ్‌పీసీఎల్ అంతర్జాతీయ భాగస్వామి కోసం అన్వేషిస్తోందని పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి ఈ సందర్భంగా సీఎస్‌కు తెలిపారు. ఇందుకు అవసరమైన చర్యలను తీసుకోవాలని సీఎస్ సూచించారు. పెట్రోలియం, గ్యాస్ నిక్షేపాలను వెలికితీయడమే క్రాకర్ యూనిట్ లక్ష్యమని అధికార వర్గాలు పేర్కొన్నాయి. కేంద్ర వ్యవసాయ యూనివర్సిటీని రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్రానికి పంపాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. వైఎస్సార్ కడప జిల్లాల్లో సమీకృత స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతినిధు లు జిల్లాకు వచ్చి వెళ్లారని, వారు పలు అంశాలను ప్రస్తావించారని, వాటిపై వివరణలు ఇచ్చామని పరిశ్రమల శాఖ అధికారులు సీఎస్‌కు తెలిపారు. అయితే తరువాత స్టీల్ అథారిటీ నుంచి ఎటువంటి స్పందన లేదన్నారు. దీనిపై సీఎస్ స్పందిస్తూ.. అవసరమైతే స్టీల్ అథారిటీకి వెళ్లి ప్లాం ట్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయికి విస్తరించేందుకు అవసరమైన భూ సేకరణ చేయాల్సిందిగా ఆయా జిల్లాల కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. భూ సేకరణకు అయ్యే వ్యయాన్ని భరించాల్సిందిగా కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాయాలని మునిసిపల్ శాఖ ముఖ్యకార్యదర్శికి సీఎస్ సూచించారు. పెట్రోలియం మరియు సహజ వాయువు యూనివర్సిటీ ఏర్పాటుపై డెహ్రాడూన్ పెట్రోలియం యూనివర్సిటీకి చెందిన జె.పి.గుప్త కాకినాడ, రాజమండ్రిలో ప్రతిపాదితన స్థలాన్ని పరిశీలించారని, అయితే తరువాత ఎటువంటి స్పందన లేదని పరిశ్రమల శాఖ అధికారులు సీఎస్‌కు తెలిపారు. అక్కడి నుంచి స్పందన రాకపోయినా తదుపరి చర్యలను తీసుకోవాల్సిందిగా సీఎస్ ఆదేశించారు. రాయపూర్ నుంచి విశాఖపట్నానికి నాలుగు లేన్ల రహదారి నిర్మాణంపై త్వరలో జరిగే కేంద్ర జోనల్ మండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని అధికారులు సీఎస్‌కు వివరించారు. కృష్ణా జిల్లాలో కొండపల్లి దగ్గర మెగా పర్యాటక ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన భూమిని, అలాగే నెల్లూరు జిల్లాలో పర్యాటక ప్రాజెక్టుకు అవసరమైన భూమిని పర్యాటక శాఖకు అప్పగించాల్సిందిగా జిల్లాల కలెక్టర్లకు సీఎస్ సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో రైల్వే బోర్డు నుంచి ఎటువంటి చర్యలు లేవని, ఈ నేపథ్యంలో సీఎం చేత రైల్వే మంత్రికి లేఖ రాయించాలని సీఎస్ నిర్ణయించారు. ప్రతి నెలలో ఒక రోజు స్వచ్ఛాంధ్రప్రదేశ్ వచ్చే ఏడాది నుంచి ప్రతి నెలలో ఒక రోజు ‘స్వచ్ఛాంధ్రప్రదేశ్ డే’గా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు నిర్ణయించారు. ఇటీవల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. స్వచ్ఛాం ధ్రప్రదేశ్ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా పోర్టల్‌ను ఏర్పాటు చేయాలని, తద్వారా ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలతో కూడిన సర్క్యులర్ జారీ చేయనున్నారు. జనవరి 1వ తేదీ నుంచి 365 రోజులు సచివాలయంలోని కార్యాలయాలు, పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండేలాగ ఉద్యోగులు చర్యలు తీసుకోవాలని, దీన్ని గర్వకారణంగా ఉద్యోగులు భావించాలని సీఎస్ నిర్దేశించారు. -
తీరనున్న గ్యాస్ కష్టాలు
కరీంనగర్ సిటీ : జిల్లాకు మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు దక్కింది. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ కమలాపూర్ మండల కేంద్రం సమీపంలో ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్‌ను నిర్మించనుంది. సుమారు రూ.100 కోట్ల అంచనా వ్యయంతో 21 నెలల్లో ప్లాంట్ నిర్మాణం చేపట్టనుంది. ఈ ప్లాంట్ నుంచే కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ జిల్లాలకు ఎల్పీజీ సిలిండర్లను సరఫరా చేయనుంది. ప్లాంట్‌కు అవసరమైన 55 ఎకరాల భూమిని సేకరించి తమకు అప్పగించాలని జిల్లా రెవెన్యూ యంత్రాంగాన్ని కోరింది. గత ఏడాది నుంచి జరుగుతున్న సంప్రదింపులు.. ఉత్తర పత్యుత్తరాల నేపథ్యంలో భూ సేకరణకు సంబంధించి కంపెనీ తరఫున రూ.3.9 కోట్ల డిమాండ్ డ్రాఫ్ట్‌ను మంగళవారం ఎల్పీజీ చీఫ్ రీజనల్ మేనేజర్ మధుకర్ బి.ఇంగోలే జిల్లా జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌కు అప్పగించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఆర్డీవో చంద్రశేఖర్, హెచ్‌పీసీఎల్ సీనియర్ఆపరేషన్ ఆఫీసర్ మధు పురుషోత్తం, సేల్ఫ్ ఆఫీసర్ సతీష్‌కుమార్ పాల్గొన్నారు. తెలంగాణలో రెండో యూనిట్ తెలంగాణలో ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని చెర్లపల్లిలో హెచ్‌పీసీఎల్ ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్ ఉంది. కమలాపూర్‌లో నిర్మించే బాట్లిం గ్ ప్లాంట్ రెండోది. వరంగల్‌కు 30 కిలోమీటర్లు, కరీంనగర్ నుంచి 50 కిలోమీటర్ల దూరం లో ఉండటంతోపాటు ఉప్పల్ రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఉండటంతో కమలాపూర్‌లో ప్లాంట్ నిర్మాణానికి హెచ్‌పీసీఎల్ ముందుకొచ్చినట్టు మధుకర్ బి.ఇంగోలే తెలిపారు. గతేడాది మార్చిలోనే హెచ్‌పీసీఎల్ కంపెనీ కమలాపూర్‌లో ప్లాంట్ నిర్మాణానికి సర్వే చేసింది. అప్పటి కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ తన నియోజకవర్గంలో ఎల్పీజీ ప్లాంట్ నిర్మించాలని పలుమార్లు అప్పటి పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి వీరప్పమొయిలీకి విజ్ఞప్తి చేశారు. ఎన్నికలకు ముందే మంత్రిని ఆహ్వానిం చి ఈ ప్లాంట్ శంకుస్థాపనకు ప్రయత్నించారు. సర్వే, భూసేకరణ ఒప్పందం ఆలస్యం కావటం తో వాయిదా పడింది. పొన్నం ఓటమి పాలైనా బాట్లింగ్ ప్లాంట్ కోసం అటు కేంద్రానికి, ఇటు హెచ్పీసీఎల్తో పాటు సంబంధిత అధికారులకు లేఖల ద్వారా విన్నవిస్తూ వచ్చారు. ప్లాంట్ ప్రక్రియ వేగవంతం చేయాలంటూ ఈనెల 9న కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు లేఖ రాశారు. స్థానిక ఎమ్మె ల్యే ఈటెల రాజేందర్ పూర్తి సహాయ సహకారా లు అందించారు. ఈ నేపథ్యంలో ప్లాంట్ నిర్మాణానికి హెచ్‌పీసీఎల్ ముందుకు వచ్చింది. తీరనున్న గ్యాస్ కష్టాలు.. జిల్లాలో ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్ నిర్మాణంతో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. ఉపాధి సమస్య తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్లాంట్ నిర్మాణం కొంతలో కొంత నిరుద్యోగ సమస్య తీర్చనుంది. దీంతోపాటు ఈ ప్రాంత గ్యాస్ వినియోగదారుల కష్టాలు తీరనున్నాయి. ఇప్పటివరకు హైదరాబాద్‌లో మాత్రమే ఎల్పీజీ ప్లాంట్ ఉండడంతో గ్యాస్ వినియోగదారులకు సేవల్లో అప్పుడప్పుడు అంతరాయం ఏర్పడుతోంది. ఈ ప్లాంట్ నిర్మాణం పూర్తయితే కరీంనగర్‌తో సహా నాలుగు జిల్లాల్లోని వినియోగదారులకు గ్యాస్ బాధలు తప్పనున్నాయి. -
హెచ్‌పీసీఎల్ నుంచి క్లబ్ హెచ్‌పీ స్టార్ అవుట్లెట్లు
న్యూఢిల్లీ: ఉత్తమమైన ఇంధనం అందించడం లక్ష్యంగా హిందూస్తాన్ పెట్రోలియం కార్పొ(హెచ్‌పీసీఎల్) గురువారం క్లబ్ హెచ్‌పీ స్టార్ అవుట్లెట్లను ప్రారంభించింది. మరో నాలుగు రోజుల్లో ఈ అవుట్లెట్లను హైదరాబాద్, వైజాగ్ల్లో కూడా ప్రారంభిస్తామనిహెచ్పీసీఎల్ సీఎండీ నిషి వాసుదేవ చెప్పారు. తొలి క్లబ్ హెచ్‌పీ స్టార్ పెట్రోల్ పంప్‌ను ముంబైలో ఆయన ప్రారంభించారు. 2002లో క్లబ్ హెచ్‌పీ బ్రాండ్ కింద రిటైల్ అవుట్లెట్లను ప్రారంభించామని, ఇప్పుడు ప్రారంభిస్తున్న క్లబ్ హెచ్‌పీ స్టార్ అనేది వాటికి ప్రీమియం వెర్షన్ అని వాసుదేవ వివరించారు. ఈ అవుట్లెట్లన్నీ పూర్తిగా ఆటోమేటెడ్‌గా ఉంటాయని, ఆటోమేటెడ్ సిస్టమ్స్ ద్వారా ఎలక్ట్రానిక్ బిల్లింగ్ ఉంటుందని పేర్కొన్నారు. సమయయే సొమ్మని భావిస్తామని, అందుకే ఈ అవుట్లెట్లలో సత్వరంగా సర్వీసులనందిస్తామని వివరించారు. మరో నాలుగు రోజుల్లో హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు, ఢిల్లీ, నోయిడా, అహ్మదాబాద్, చెన్నైల్లో వీటిని ప్రారంభిస్తామని వాసుదేవ పేర్కొన్నారు.