
న్యూఢిల్లీ: హిందుస్తాన్ పెట్రోలియం(హెచ్‌పీసీఎల్) నికర లాభం ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్లో 37% తగ్గింది. గత క్యూ2లో రూ.1,735 కోట్లుగా ఉన్న లాభం ఈ క్యూ2లో రూ.1,092 కోట్లకు తగ్గిందని హెచ్‌పీసీఎల్ తెలిపింది. క్రూడ్ ధరలు పెరగడం, రిఫైనింగ్ మార్జిన్‌లు తగ్గడం, విదేశీ మారక ద్రవ్య నష్టాల వల్ల నికర లాభం 37 శాతం తగ్గిందని కంపెనీ సీఎమ్‌డీ ముకేశ్ కె. సురానా తెలిపారు.
రూ.887 కోట్ల కరెన్సీ నష్టాలు
గత క్యూ2లో 7.61 డాలర్లుగా ఉన్న ఒక్కో బ్యారెల్ స్థూల రిఫైనింగ్ మార్జిన్(జీఆర్‌ఎమ్) ఈ క్యూ2లో 4.81 డాలర్లకు తగ్గిందన్నారు. అలాగే గత క్యూ2లో రూ.20 కోట్ల విదేశీ మారక ద్రవ్య లాభాలు రాగా, ఈ క్యూ2లో రూ.887 కోట్ల విదేశీ మారక ద్రవ్య నష్టాలు వచ్చాయని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment