net profit
-
స్పైస్‌జెట్ లాభం 26 కోట్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో బడ్జెట్ ఎయిర్‌లైన్ స్పైస్‌జెట్ రూ. 26 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత క్యూ3లో కంపెనీ రూ. 300 కోట్ల నష్టం నమోదు చేసింది. సమీక్షాకాలంలో ఆదాయం 35 శాతం పెరిగి రూ. 1,077 కోట్ల నుంచి రూ. 1,651 కోట్లకు పెరిగింది. అయితే క్యూ2లో నమోదైన రూ. 2,149 కోట్లతో పోలిస్తే మా త్రం ఆదాయం తగ్గింది. ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) 87%గా నమోదైనట్లు కంపెనీ తెలిపింది. వాస్తవానికి క్యూ3 ఆర్థిక ఫలితాలను మంగళవారమే ప్రకటించాల్సి ఉన్నా , బోర్డు సమావేశం అర్ధరాత్రి వరకు సాగడంతో బుధవారం తెల్లవారుఝామున ఒంటి గంటకు ఫైలింగ్ చేసినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు స్పైస్‌జెట్ తెలిపింది. -
తగ్గిపోయిన ఐటీసీ లాభం..
డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ (ITC) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 7 శాతం క్షీణించి రూ. 5,103 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 5,407 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 8 శాతంపైగా బలపడి రూ. 20,946 కోట్లను తాకింది.గత క్యూ3లో రూ. 19,309 కోట్ల టర్నోవర్ అందుకుంది. అయితే మొత్తం వ్యయాలు సైతం 12 శాతం పెరిగి రూ. 14,414 కోట్లకు చేరాయి. కాగా.. రెడీ టు కుక్ ఫుడ్స్ విభాగంలోని ప్రసూమాలో 100 శాతం వాటా కొనుగోలు చేయనున్నట్లు ఐటీసీ పేర్కొంది. ఇందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. తొలుత 62.5 శాతం వాటాకుగాను రూ. 187 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది.తదుపరి మూడేళ్లలో దశలవారీగా మిగిలిన 37.5 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు వివరించింది. తొలుత ప్రసూమా మాతృ సంస్థ యాంపిల్ ఫుడ్స్ నుంచి 43.8 శాతం వాటాకు రూ. 131 కోట్లు వెచ్చించనుంది. ఈ బాటలో మరో రూ. 56 కోట్లతో వాటాను 62.5 శాతానికి పెంచుకోనున్నట్లు తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో ఐటీసీ షేరు బీఎస్ఈలో 1.5 శాతం క్షీణించి రూ. 441 వద్ద ముగిసింది. -
Infosys Q3 Results: ఇన్ఫోసిస్ అదుర్స్..
దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) మూడో త్రైమాసిక ఫలితాలను (Q3 Results) వెల్లడించింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ రూ.6,806 కోట్ల నికర లాభాలను సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలోని రూ.6,506 కోట్లతో పోలిస్తే ఇది 11.4 శాతం అధికం. అదే ఇంతకుముందు త్రైమాసికంలో (Q2FY25) నమోదు చేసిన రూ.6,106 కోట్లతో పోలిస్తే 4.6 శాతం ఎక్కువ.ఇక అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఆదాయం రూ. 41,764 కోట్లుగా ఉంది. ఇది గతేడాది క్యూ3తో వచ్చిన రూ. 38,821 కోట్లతో పోలిస్తే 7.6 శాతం వృద్ధిని ప్రతిబింబిస్తుంది. అదే సమయంలో మునుపటి త్రైమాసికంలో ఆర్జించిన (Q2FY25) రూ.40,986 కోట్లతో పోలిస్తే 1.9 శాతం పెరుగుదల. స్థిరమైన కరెన్సీ పరంగా ఆదాయం సంవత్సరం మీద 6.1 శాతం, త్రైమాసికం మీద 1.7 శాతం పెరిగింది.త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో భవిష్యత్ ఆదాయ వృద్ధి అంచనాలను కూడా సైతం ఇన్ఫోసిస్ వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధి 4.5 నుంచి 5 శాతంగా నమోదు కావొచ్చని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది.సీఈవో ఏం చెప్పారంటే.."క్రమానుగతంగా బలహీనమైన త్రైమాసికంలో బలమైన రాబడి వృద్ధిని సాధించాం. మా విభిన్న డిజిటల్ ఆఫర్లు, మార్కెట్ పొజిషనింగ్, కీలక వ్యూహాత్మక కార్యక్రమాల విజయానికి ఇది స్పష్టమైన ప్రతిబింబం. సంస్థలో ఏఐ సామర్థ్యాలను బలోపేతం చేస్తూనే ఉంటాం. ముఖ్యంగా ఉత్పాదక ఏఐపై దృష్టి సారిస్తున్నాం. ఇదే క్లయింట్లు పెరగడానికి కారణం” అని ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీ సలీల్ పరేఖ్ అన్నారు.పెరిగిన క్లయింట్లుసెప్టెంబరు త్రైమాసికంలో 1,870గా ఉన్న క్లయింట్ల క్రియాశీలక సంఖ్య డిసెంబర్ త్రైమాసికంలో 1,876కి పెరిగిందని ఇన్ఫోసిస్ తెలిపింది. ఇక స్వచ్ఛంద అట్రిషన్ (ఉద్యోగుల సంఖ్యలో తరుగుదల) గత సెప్టెంబర్ త్రైమాసికంలో 12.9 శాతం ఉండగా ఈ త్రైమాసికంలో 13.7 శాతంగా ఉంది. మొత్తం ఉద్యోగుల సంఖ్య సెప్టెంబర్‌లో 3,17,788 ఉండగా ఈ త్రైమాసికంలో 3,23,379గా కంపెనీ పేర్కొంది. వరుసగా రెండవ త్రైమాసికంలో హెడ్‌కౌంట్ పెరిగింది. క్రితం సంవత్సరం త్రైమాసికంలో ఇది 3,22,663. -
అరబిందో లాభం అదిరింది!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీలో ఉన్న అరబిందో ఫార్మా సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 8.6 శాతం ఎగసి రూ.817 కోట్లు సాధించింది. ఎబిటా 11.6 శాతం దూసుకెళ్లి రూ.1,566 కోట్లు నమోదైంది. ఎబిటా మార్జిన్ 65 బేసిస్ పాయింట్లు మెరుగై 20.1 శాతంగా ఉంది. ఈపీఎస్ 9 శాతం వృద్ధి చెంది రూ.14 ఉంది. టర్నోవర్ 8 శాతం అధికమై రూ.7,796 కోట్లకు చేరింది.మొత్తం ఫార్ములేషన్స్ ఆదాయం 11.3 శాతం వృద్ధి చెంది రూ.6,640 కోట్లు సాధించింది. మొత్తం ఏపీఐ టర్నోవర్ 0.9 శాతం క్షీణించి రూ.1,156 కోట్లకు వచ్చి చేరింది. యూఎస్ ఫార్ములేషన్స్ వ్యాపారం 4.3 శాతం పెరిగి రూ.3,530 కోట్లు, యూరప్ ఫార్ములేషన్స్ ఆదాయం 19% ఎగసి రూ.2,105 కోట్లను తాకింది. వృద్ధి మార్కెట్ల నుంచి ఆదాయం 44% దూసుకెళ్లి రూ.812 కోట్లకు చేరింది. పరిశోధన, అభివృద్ధికి చేసిన వ్యయాలు రూ.410 కోట్లు. ఇది ఆదాయంలో 5.3 శాతానికి సమానం.సింహభాగం యూఎస్..మొత్తం వ్యాపారంలో విదేశీ మార్కెట్ల వాటా ఏకంగా 89% ఉంది. టర్నోవర్‌లో యూఎస్ 45.3% తో సింహభాగం వాటా కైవసం చేసుకుంది. యూరప్ 27%, ఏపీఐలు 14.8, వృద్ధి మార్కెట్లు 10.4, ఏఆర్వీ ఫార్ములేషన్స్ 2.5% వాటా దక్కించు కున్నాయి. ‘ఈ త్రైమాసికంలో కీలక వ్యాపార రంగాలలో రాబడుల నిరంతర వృద్ధితో సంతోషి స్తున్నాం. ఇది విభిన్న పోర్ట్‌ఫోలియో స్థితి స్థాపక తను ప్రతిబింబిస్తుంది. ప్రాథమికంగా కొన్ని వ్యా పార కార్యకలాపాల తాత్కాలిక స్వభావం కారణంగా లాభదాయకత స్వల్పంగా తగ్గినప్పటికీ, అంతర్లీన పనితీరు బలంగా ఉంది. బలమైన పునాది, కొనసాగుతున్న కార్యాచరణ మెరుగు దలలతో వృద్ధి పథాన్ని కొనసాగించగలమని, ప్రస్తుత సంవత్సరానికి వ్యూహాత్మక లక్ష్యాలను సాధించగ లమని విశ్వసిస్తున్నాం’ అని అరబిందో ఫార్మా వైస్ చైర్మన్, ఎండీ కె.నిత్యానంద రెడ్డి తెలిపారు. -
ఎల్ఐసీ లాభం తగ్గింది.. వాటి ప్రభావమే!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు వెలువరించింది. జులై–సెప్టెంబర్ (క్యూ2)లో నికర లాభం 4% క్షీణించి రూ. 7,621 కోట్లకు పరిమితమైంది. ఇతర ఆదాయం తగ్గడం, కుటుంబ పెన్షన్‌లో రూ. 464 కోట్ల పెరుగుదల ప్రభావం చూపాయి.గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 7,925 కోట్లు ఆర్జించింది. నికర ప్రీమియం ఆదాయం రూ. 1,07,397 కోట్ల నుంచి రూ. 1,19,901 కోట్లకు ఎగసింది. అయితే ఇతర ఆదాయం రూ. 248 కోట్ల నుంచి దాదాపు సగానికి తగ్గి రూ. 145 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 2,01,587 కోట్ల నుంచి రూ. 2,29,620 కోట్లకు జంప్ చేసింది. కాగా.. మొత్తం వ్యయాలు రూ. 1,94,335 కోట్ల నుంచి రూ. 2,22,366 కోట్లకు పెరిగాయి. స్థూల మొండిబకాయిలు 2.43 శాతం నుంచి 1.72 శాతానికి దిగివచ్చాయి.హెల్త్ ఇన్సూరెన్స్‌పై కన్ను ఈ ఆర్థిక సంవత్సరంలోగా స్టాండెలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో వాటా కొనుగోలు చేయనున్నట్లు ఎల్ఐసీ ఎండీ, సీఈవో సిద్ధార్థ మొహంతీ పేర్కొన్నారు. ఇప్పటికే పనులు మొదలుకాగా.. సరైన సంస్థ కోసం చూస్తున్నట్లు తెలియజేశారు. మార్చిలోగా వాటా కొనుగోలుకు తుది రూపునివ్వనున్నట్లు వెల్లడించారు. టార్గెట్ సంస్థ విలువనుబట్టి ఎంత వాటా కొనుగోలు చేసేదీ ఆధారపడి ఉంటుందని ఆయన వివరించారు. ఫలితాల నేపథ్యంలో ఎల్ఐసీ షేరు బీఎస్ఈలో 1.6% నష్టంతో రూ. 915 వద్ద ముగిసింది. -
టీవీఎస్ మోటార్ కొత్త రికార్డ్
న్యూఢిల్లీ: ద్విచక్ర, త్రిచక్ర వాహన రంగ దిగ్గజం టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 41 శాతం జంప్‌చేసి రూ. 588 కోట్లను అధిగమించింది. రికార్డ్ అమ్మకాలు ఇందుకు సహకరించాయి.గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 416 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 9,933 కోట్ల నుంచి రూ. 11,302 కోట్లకు ఎగసింది. మొత్తం వ్యయాలు రూ. 9,297 కోట్ల నుంచి రూ. 10,428 కోట్లకు పెరిగాయి. ఈ కాలంలో ఎగుమతులతోపాటు ద్విచక్ర, త్రిచక్ర వాహన అమ్మకాలు కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 12.28 లక్షల యూనిట్లను తాకాయి. గత క్యూ2లో నమోదైన 10.74 లక్షల యూనిట్లతో పోలిస్తే ఇది 14 శాతం వృద్ధి. వీటిలో మోటార్ సైకిళ్ల విక్రయాలు 14 శాతం పుంజుకుని 5.6 లక్షల యూనిట్లకు చేరగా.. స్కూటర్ అమ్మకాలు 17 శాతం ఎగసి 4.9 లక్షల యూనిట్లను తాకాయి.ద్విచక్ర వాహన ఎగుమతులు 16 శాతం బలపడి 2.78 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. ఇక త్రిచక్ర వాహన అమ్మకాలు 5,000 యూనిట్లు తగ్గి 38,000కు పరిమితమయ్యాయి. ఎలక్ట్రిక్ వాహనాలు 31 శాతం అధికంగా 75,000 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఫలితాల నేపథ్యంలో టీవీఎస్ మోటార్ షేరు బీఎస్ఈలో 3.6 శాతం పతనమై రూ. 2,565 వద్ద ముగిసింది. -
జీ ఎంటర్టైన్మెంట్ దూకుడు.. మళ్లీ పునీత్ గోయెంకానే
న్యూఢిల్లీ: మీడియా రంగ దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్(జీల్) ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 70 శాతంపైగా దూసుకెళ్లి రూ. 209 కోట్లను అధిగమించింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 123 కోట్లు ఆర్జించింది. పటిష్ట వ్యయ నియంత్రణల కారణంగా మార్జిన్లు 6 శాతంపైగా మెరుగుపడినట్లు కంపెనీ పేర్కొంది. అయితే మొత్తం ఆదాయం 19% క్షీణించి రూ. 2,034 కోట్లకు పరిమితమైంది. గత క్యూ2లో రూ. 2,510 కోట్ల టర్నోవర్ అందుకుంది. పునీత్ గోయెంకాను 2025 జనవరి1 నుంచి ఐదేళ్ల కాలానికి ఎండీ, సీఈవోగా బోర్డు తిరిగి నియమించినట్లు జీల్ పేర్కొంది. షేరు 5% జంప్ చేసి రూ. 132 వద్ద ముగిసింది. -
ఎల్‌టీమైండ్‌ట్రీ లాభం ప్లస్.. 2,504 మందికి ఉద్యోగాలు
ముంబై: ఐటీ సర్వీసుల కంపెనీ ఎల్‌టీమైండ్‌ట్రీ ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 8 శాతం పుంజుకుని రూ. 1,251 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 1,161 కోట్లు ఆర్జించింది.మొత్తం ఆదాయం సైతం 6 శాతం ఎగసి రూ. 9,432 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 8,905 కోట్ల టర్నోవర్ సాధించింది. వాటాదారులకు షేరుకి రూ. 20 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. కీలక విభాగాలలో 20 కోట్ల డాలర్ల డీల్సహా పలు కాంట్రాక్టులు కుదుర్చుకున్నట్లు కంపెనీ సీఈవో, ఎండీ దేవశిష్ చటర్జీ పేర్కొన్నారు.ఈ కాలంలో 2,504 మందిని ఉద్యోగాల్లోకి తీసుకున్నట్లు వెల్లడించారు. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 84,438ను తాకింది. సెప్టెంబర్ కల్లా 742 మంది యాక్టివ్ క్లయింట్లను కలిగి ఉంది. ఫలితాల నేపథ్యంలో ఎల్‌టీమైండ్‌ట్రీ షేరు బీఎస్ఈలో 0.7% బలపడి రూ. 6,402 వద్ద ముగిసింది. -
ఎల్&టీ టెక్నాలజీలో 2000 ఫ్రెషర్ జాబ్స్
ముంబై: ఇంజనీరింగ్ సర్వీసుల ఐటీ కంపెనీ ఎల్అండ్టీ టెక్నాలజీ సర్వీసెస్ ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జూలె–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం స్వల్పంగా 2 శాతం పుంజుకుని రూ. 320 కోట్లకు చేరింది. లాభాల మార్జిన్లు నీరసించడం ప్రభావం చూపింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 315 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం 8 శాతం ఎగసి రూ. 2,573 కోట్లను తాకింది.యూరోపియన్ మార్కెట్ నుంచి ఆటోమొబైల్, సస్టెయినబిలిటీ సొల్యూషన్లకు ఏర్పడిన డిమాండ్ ఇందుకు తోడ్పాటునిచ్చింది. వాటాదారులకు షేరుకి రూ. 17 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఇందుకు ఈ నెల 25 రికార్డ్ డేట్‌కాగా.. ఈ ఏడాది 2,000 మంది ఫ్రెషర్స్‌కు ఉద్యోగాలు ఆఫర్ చేయనున్నట్లు కంపెనీ ఎండీ, సీఈవో అమిత్ చద్దా పేర్కొన్నారు. ఈ కాలంలో 121 మందిని చేర్చుకోవడంతో సిబ్బంది సంఖ్య 23,698కు చేరింది.అమ్మకాలు, టెక్నాలజీలపై అధిక వ్యయాలతో నిర్వహణ లాభ మార్జిన్లు 17.1 శాతం నుంచి 15.1 శాతానికి బలహీనపడ్డాయి. 8–10 శాతం వృద్ధి ప్రస్తుత ఏడాది ఎల్అండ్టీ టెక్నాలజీ ఆదాయంలో 8–10 శాతం వృద్ధి నమోదుకానున్నట్లు అమిత్ చద్దా పేర్కొన్నారు. వార్షికంగా 2 బిలియన్ డాలర్ల ఆదాయ మార్క్‌ను అందుకోగలమనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇకపై మార్జిన్లు మెరుగుపడనున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఏడాది చివరికల్లా ఆదాయంలో 16 శాతం పురోగతిని అందుకోగలమని అంచనా వేశారు. ప్రస్తుత సమీక్షాకాలంలో 2 కోట్ల డాలర్ల విలువైన 2 డీల్స్తోపాటు కోటి డాలర్ల విలువైన 4 ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. -
హెచ్‌సీఎల్ టెక్ లాభం అప్
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్ క్యూ2లో నికర లాభం 11 శాతం వృద్ధితో రూ. 4,235 కోట్లుగా నమోదైంది. ఇక సమీక్షాకాలంలో ఆదాయం 8 శాతం వృద్ధితో రూ. 26,672 కోట్ల నుంచి రూ. 28,862 కోట్లకు చేరింది. రెవెన్యూ వృద్ధితో పాటు లాభదాయకత కూడా మెరుగ్గా ఉందని సంస్థ సీఈవో సి. విజయ్ కుమార్ తెలిపారు. వార్షికంగా ఆదాయ వృద్ధి 3.5–5.0 శాతంగా ఉంటుందని హెచ్‌సీఎల్ టెక్ గైడెన్స్ ఇచి్చంది. క్యూ2లో 780 మంది ఉద్యోగులను తగ్గించుకోవడంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,18,621కి చేరింది. 2024–25 ఆరి్థక సంవత్సరానికి గాను రూ. 2 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ. 12 చొప్పున కంపెనీ మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. సోమవారం బీఎస్ఈలో హెచ్‌సీఎల్ టెక్ షేరు స్వల్పంగా ఒక్క శాతం పెరిగి రూ. 1,856 వద్ద క్లోజయ్యింది. -
టీసీఎస్ భేష్.. వచ్చే ఏడాది క్యాంపస్ హైరింగ్ షురూ
ముంబై: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) మరోసారి పటిష్ట ఫలితాలు సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికం(జులై–సెప్టెంబర్)లో నికర లాభం 5 శాతం బలపడి రూ. 11,909 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలం(క్యూ2)లో రూ. 11,342 కోట్లు ఆర్జించింది.అయితే ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్–జూన్)లో ఆర్జించిన రూ. 12,040 కోట్లుతో పోలిస్తే లాభాలు నామమాత్రంగా తగ్గాయి. పన్నుకుముందు లాభం రూ. 15,330 కోట్ల నుంచి రూ. 16,032 కోట్లకు మెరుగుపడింది. ఇక మొత్తం ఆదాయం 7% పుంజుకుని రూ. 64,988 కోట్లకు చేరింది. గతేడాది క్యూ2లో రూ. 60,698 కోట్ల టర్నోవర్ సాధించింది. ఈ ఏడాది క్యూ1లో రూ. 63,575 కోట్ల అందుకున్న సంగతి తెలిసిందే. ఇతర విశేషాలు » ఆర్డర్ బుక్ విలువ (టీసీవీ) 8.6 బి. డాలర్లకు చేరింది. దీనిలో ఉత్తర అమెరికా నుంచి 4.2 బిలియన్ డాలర్లు లభించింది. » మొత్తం సిబ్బంది సంఖ్య 6,12,724కు చేరింది. » షేరుకి రూ. 10 చొప్పున రెండో మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది.» 2025–26కు క్యాంపస్ హైరింగ్ షురూఅనిశ్చితుల ఎఫెక్ట్ గత కొన్ని త్రైమాసికాలుగా కనిపిస్తున్న అప్రమత్తత తాజా క్వార్టర్లోనూ కొనసాగింది. ప్రపంచ భౌగోళిక, రాజకీయ అనిశ్చిత పరిస్థితుల్లోనూ మా అతిపెద్ద విభాగం బీఎఫ్ఎస్ఐ రికవరీ బాటలో సాగుతోంది. వృద్ధి మార్కెట్లలో పటిష్ట పనితీరు చూపాం. క్లయింట్లు, ఉద్యోగులు, వాటాదారుల విలువ పెంపుపై ప్రత్యేక దృష్టిని కొనసాగిస్తున్నాం. – కె.కృతివాసన్, సీఈవో, ఎండీ -
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు నిరాశ
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ మొదటి త్రైమాసికంలో నిరాశజనక ఫలితాలను నమోదు చేసింది. 2024 జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికం ఫలితాలను కంపెనీ సోమవారం (జూలై 15) వెల్లడించింది.గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే కంపెనీ నికర లాభం 6% క్షీణించి రూ.312.63 కోట్లకు చేరుకుంది. కాగా గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలోని రూ.414 కోట్లతో పోలిస్తే కార్యకలాపాల ద్వారా కంపెనీ ఆదాయం 9% పెరిగి రూ.417.8 కోట్లకు చేరుకుంది.మార్కెట్ సమయం ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ షేర్లు బీఎస్ఈలో రూ.4.90 లేదా 1.40% పెరిగి రూ.355.25 వద్ద ముగిశాయి. -
ఫస్ట్‌టైమ్.. ఐటీని వెనక్కినెట్టిన బ్యాంకింగ్
దేశంలో ఐటీ రంగాన్ని వెనక్కి నెట్టి బ్యాంకింగ్ రంగం సరికొత్త మైలురాయిని సాధించింది. తొలిసారిగా 2024 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ రంగం నికర లాభం రూ. 3 లక్షల కోట్లను అధిగమించింది. లిస్టెడ్ పబ్లిక్, ప్రైవేట్ రంగ బ్యాంకుల సంయుక్త నికర లాభం 2023 ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ. 2.2 లక్షల కోట్లతో పోలిస్తే 39 శాతం పెరిగి రూ. 3.1 లక్షల కోట్లకు చేరుకుందని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది.ఐటీ రంగాన్ని దాటి.. ఇటీవలి కాలంలో సాంప్రదాయకంగా అత్యంత లాభదాయక రంగంగా ఉన్న ఐటీ సేవల రంగాన్ని బ్యాంకుల లాభాలు అధిగమించాయి. 2024లో లిస్టెడ్ ఐటీ సేవల కంపెనీలు రూ. 1.1 లక్షల కోట్ల నికర లాభాన్ని నమోదు చేశాయి. ఇది బ్యాంకులు ఆర్జించిన లాభాల కంటే చాలా తక్కువ.ప్రభత్వ, ప్రైవేట్ బ్యాంకుల లాభాలు ఇలా.. ఏడాది కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు రికార్డు స్థాయిలో రూ.1.4 లక్షల కోట్ల నికర లాభాన్ని సాధించాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 34 శాతం పెరిగింది. ఇదిలా ఉండగా, ప్రైవేట్ రంగ బ్యాంకుల నికర లాభం 42 శాతం పెరిగి దాదాపు రూ.1.7 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది ఏడాది క్రితం రూ.1.2 లక్షల కోట్లుగా ఉంది.ప్రధాని ట్వీట్ దేశంలో బ్యాంకింగ్ రంగం రికార్డ్ స్థాయి లాభాలు సాధించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ‘గత 10 సంవత్సరాలలో చెప్పుకోదగ్గ మలుపు. భారతదేశ బ్యాంకింగ్ రంగ నికర లాభం మొదటిసారిగా రూ. 3 లక్షల కోట్లు దాటింది. బ్యాంకుల లాభాలు మెరుగుపడటం పేదలు, రైతులు, ఎంఎస్ఎంఈలకు రుణ లభ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది’ అని పేర్కొన్నారు.In a remarkable turnaround in the last 10 years, India's banking sector net profit crosses Rs 3 lakh crore for the first time ever.When we came to power, our banks were reeling with losses and high NPAs due to the phone-banking policy of UPA. The doors of the banks were closed…— Narendra Modi (@narendramodi) May 20, 2024 -
స్పీడ్ తగ్గిన హెచ్‌యూఎల్
న్యూఢిల్లీ: నాలుగో త్రైమాసికంలో హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) నికర లాభం స్వల్పంగా తగ్గి (1.53%) రూ. 2,561 కోట్లుగా నమోదైంది. తాజా సమీక్షాకాలంలో ఆదాయం రూ. 15,375 కోట్ల నుంచి స్వల్ప వృద్ధితో రూ. 15,441 కోట్ల కు పెరిగింది. వ్యయా లు రూ. 11,962 కోట్ల నుంచి రూ. 12,100 కోట్లకు చేరా యి.పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయం రూ. 61,092 కోట్ల నుంచి రూ. 62,707 కోట్లకు చేరింది. లాభం రూ. 10,143 కోట్లుగా నమోదైంది. బుధవారం సమావేశమైన కంపెనీ బోర్డు.. రూ.1 ముఖ విలువ చేసే షేరు ఒక్కింటికి రూ. 24 చొప్పున తుది డివిడెండ్ ఇవ్వాలని ప్రతిపాదించింది. తాత్కాలిక డివిడెండ్ రూ. 18 కూడా కలిపితే పూర్తి సంవత్సరానికి మొత్తం మీద ఒక్కో షేరుకి రూ. 42 డివిడెండ్ ఇచి్చనట్లవుతుందని సంస్థ తెలిపింది. బుధవారం బీఎస్ఈలో కంపెనీ షేరు స్వల్పంగా తగ్గి రూ. 2,259.15 వద్ద క్లోజయ్యింది. -
యాక్సిస్ లాభం రూ. 7,129 కోట్లు
ముంబై: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ. 7,129 కోట్ల నికర లాభం ప్రకటించింది. 2022–23 క్యూ4లో బ్యాంకు రూ. 5,728 కోట్ల నికర నష్టం నమోదు చేసింది. ఇక తాజాగా ఆదాయం రూ. 28,758 కోట్ల నుంచి రూ. 35,990 కోట్లకు ఎగిసింది. నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) 11 శాతం పెరిగి రూ. 13,089 కోట్లుగా నమోదైంది.మరోవైపు, 2023–24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను బ్యాంకు నికర లాభం 160 శాతం పెరిగి రూ. 24,861 కోట్లకు చేరింది. వ్యాపార పరిమాణం 12% వృద్ధి చెంది రూ. 14,77,209 కోట్లకు ఎగిసింది. గత ఆర్థిక సంవత్సరానికి రూ. 2 ముఖ విలువ గల షేరుపై రూ. 1 చొప్పున డివిడెండ్ ఇవ్వాలని బ్యాంకు బోర్డు నిర్ణయించింది. సిటీ బ్యాంకు వ్యాపార కార్యకలాపాలను అనుసంధానం చేసే ప్రక్రియ వచ్చే ఆరు నెలల్లో పూర్తి కావచ్చని బ్యాంకు సీఈవో అమితాబ్ చౌదరి తెలిపారు. భారత్‌లో సిటీబ్యాంక్ కన్జూమర్ వ్యాపారాన్ని యాక్సిస్ బ్యాంక్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. బుధవారం బ్యాంకు షేరు బీఎస్ఈలో 0.69% పెరిగి రూ. 1,063.70 వద్ద క్లోజయ్యింది.మరిన్ని విశేషాలు..► స్థూల మొండి బాకీలు 2.02% నుంచి 1.43 శాతానికి తగ్గాయి. ► పూర్తి ఆర్థిక సంవత్సరంలో 475, నాలుగో క్వార్టర్లో 125 శాఖలను తెరవడంతో దేశీ యంగా మొత్తం బ్రాంచీల నెట్వర్క్ 5,377కి చేరింది.► మార్చి క్వార్టర్లో 12.4 లక్షల క్రెడిట్ కార్డులను కొత్తగా జారీ చేయడం ద్వారా గత తొమ్మిది క్వార్టర్లలో దేశీయంగా అత్యధిక సంఖ్యలో క్రెడిట్ కార్డులను జారీ చేసిన బ్యాంకుల్లో ఒకటిగా బ్యాంక్ నిలి్చంది. -
హిందాల్కో లాభం జూమ్
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్ మెటల్ రంగ దిగ్గజం హిందాల్కో ఇండస్ట్రీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 71 శాతం జంప్‌చేసి రూ. 2,331 కోట్లను తాకింది. అల్యూమినియం, కాపర్ విభాగాలు పటిష్ట పనితీరు చూపడం లాభాలకు దోహదం చేసింది. గతేడాది (2022–23) ఇదే కాలంలో కేవలం రూ. 1,362 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 53,151 కోట్ల నుంచి 52,808 కోట్లకు బలహీనపడింది. కఠిన మార్కెట్ పరిస్థితుల్లోనూ వృద్ధి బాటలో సాగినట్లు కంపెనీ ఎండీ సతీష్ పాయ్ తెలియజేశారు. అల్యూమినియం, కాపర్ బిజినెస్‌లు ఆకర్షణీయ ఫలితాలు సాధించినట్లు పేర్కొన్నారు. ఇందుకు మెరుగైన ప్రొడక్ట్ మిక్స్, తగ్గిన ముడివ్యయాలు సహకరించినట్లు వెల్లడించారు. ఈ రెండు విభాగాల విస్తరణపై పెట్టుబడులను కొనసాగిస్తున్నట్లు తెలియజేశారు. వెరసి ఈ ఏడాది రూ. 4,500 కోట్లు వెచ్చిస్తున్నట్లు ప్రస్తావించారు. వచ్చే ఏడాది(2024–25) పెట్టుబడులను రూ. 5,500 కోట్లకు పెంచనున్నట్లు తెలియజేశారు. ఫలితాల నేపథ్యంలో హిందాల్కో షేరు బీఎస్ఈలో 12.5 శాతం పతనమై రూ. 510 వద్ద ముగిసింది. -
అపోలో హాస్పిటల్స్ లాభం 60 శాతం అప్..
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అధిక ఆదాయ ఊతంతో అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ (కన్సాలిడేటెడ్) నికర లాభం 60 శాతం పెరిగి రూ. 245 కోట్లకు చేరింది. క్రితం క్యూ3లో సంస్థ లాభం రూ. 153 కోట్లు. ఇక సమీక్షాకాలంలో ఆదాయం రూ. 4,264 కోట్ల నుంచి 14 శాతం పెరిగి రూ. 4,851 కోట్లకు చేరింది. షేరు ఒక్కింటికి రూ. 6 చొప్పున అపోలో హాస్పిటల్స్ మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ప్రివెంటివ్ హెల్త్‌కేర్, వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణ విషయంలో ప్రజలకు సాధికారత కల్పించడంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు సంస్థ అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి తెలిపారు. డిసెంబర్ 31 నాటికి అపోలో నెట్వర్క్ నిర్వహణలోని పడకల సంఖ్య 7,911కి చేరింది. ఆక్యుపెన్సీ 65 శాతానికి చేరింది. మూడో త్రైమాసికంలో ఫార్మసీకి సంబంధించి అపోలో హెల్త్ నికరంగా 119 కొత్త స్టోర్స్ ప్రారంభించడంతో మొత్తం స్టోర్స్ సంఖ్య 5,790కి చేరింది. గురువారం బీఎస్ఈలో కంపెనీ షేరు సుమారు 3 శాతం పెరిగి రూ. 6,432 వద్ద క్లోజయ్యింది. -
ఎల్ఐసీ లాభం జూమ్
న్యూఢిల్లీ: జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ మరోసారి పటిష్ట పనితీరు ప్రదర్శించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికానికి రూ.9,444 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.6,334 కోట్లతో పోలిస్తే 49 శాతం పెరిగింది. నికర ప్రీమియం ఆదాయం రూ.1,11,788 కోట్ల నుంచి రూ.1,17,017 కోట్లకు వృద్ధి చెందింది. ఎల్ఐసీ మొత్తం ఆదాయం రూ.1,96,891 కోట్ల నుంచి రూ.2,12,447 కోట్లకు చేరింది. ఒక్కో షేరుకు రూ.4 చొప్పున మధ్యంతర డివిడెండ్ పంపిణీ చేయాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇందుకు ఫిబ్రవరి 21 రికార్డు తేదీగా ప్రకటించింది. 30 రోజుల్లోపు డివిడెండ్ పంపిణీ చేస్తామని తెలిపింది. మొదటి ఏడాది ప్రీమియం ఆదాయం (కొత్త పాలసీల నుంచి)లో ఎల్ఐసీ ఇప్పటికీ జీవిత బీమా మార్కెట్లో 58.90 శాతం వాటాతో దిగ్గజ సంస్థగా కొనసాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ వరకు తొమ్మిది నెలల్లో ఎల్ఐసీ నికర లాభం అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఉన్న రూ.22,969 కోట్ల నుంచి రూ.26,913 కోట్లకు వృద్ధి చెందింది. ఫలితాల నేపథ్యంలో ఎల్ఐసీ షేరు ధర 6.50% ఎగసి రూ.1,112 వద్ద ముగిసింది. -
ఐటీసీ లాభం రూ. 5,401 కోట్లు
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 6 శాతంపైగా వృద్ధితో రూ. 5,401 కోట్లను తాకింది. గతేడాది (2022–23) ఇదే కాలంలో రూ. 5,070 కోట్లు ఆర్జించింది. సిగరెట్లుసహా ఎఫ్ఎంసీజీ బిజినెస్ లాభాలకు దన్నునిచి్చంది. వాటాదారులకు షేరుకి రూ. 6.25 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఇందుకు ఫిబ్రవరి 8 రికార్డ్ డేట్‌గా ప్రకటించింది. కాగా.. నాన్‌ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా అతుల్ సింగ్, స్వతంత్ర డైరెక్టర్‌గా పుష్ప సుబ్రహ్మణ్యంను బోర్డు ఎంపిక చేసినట్లు ఐటీసీ పేర్కొంది. 2024 ఏప్రిల్ 2 నుంచి ఐదేళ్లపాటు బాధ్యతలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఆదాయం అప్ ప్రస్తుత సమీక్షా కాలంలో ఐటీసీ స్థూల ఆదాయం 2 శాతం పుంజుకుని రూ. 19,338 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 18,902 కోట్ల టర్నోవర్ నమోదైంది. కాగా.. మొత్తం కార్యకలాపాల టర్నోవర్ రూ. 19,484 కోట్లుగా నమోదైంది. ఆదాయంలో సిగరెట్లతోపాటు ఎఫ్ఎంసీజీ బిజినెస్ నుంచి 4.5 శాతం అధికంగా రూ. 13,513 కోట్లు లభించగా.. సిగరెట్ల నుంచి 3 శాతం వృద్ధితో రూ. 8,295 కోట్లు సమకూర్చుకుంది. ఎఫ్ఎంసీజీలో ఇతర విభాగాలు 8 శాతం ఎగసి రూ. 5,218 కోట్ల టర్నోవర్‌ను సాధించాయి. ఐటీసీ హోటళ్ల నుంచి 18 శాతం అధికంగా రూ. 872 కోట్ల ఆదాయం లభించింది. ఫలితాల నేపథ్యంలో ఐటీసీ షేరు 1.5 శాతం నష్టంతో రూ. 449 వద్ద ముగిసింది. -
అదానీ పవర్ ఆకర్షణీయం
న్యూఢిల్లీ: అదానీ పవర్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.9 కోట్లతో పోల్చి చూసినప్పుడు ఎన్నో రెట్ల వృద్ధితో రూ.2,738 కోట్లకు దూసుకుపోయింది. మొత్తం ఆదాయం సైతం రూ.8,290 కోట్ల నుంచి రూ.13,355 కోట్లకు వృద్ధి చెందింది. మహన్ వద్ద 1,600 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణం ప్రణాళిక ప్రకారమే కొనసాగుతున్నట్టు కంపెనీ తెలిపింది. ఇనార్గానిక్ (ఇతర సంస్థల కొనుగోళ్లు) మార్గంలో తమ నాయకత్వ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోనున్నట్టు ప్రకటించింది. డిసెంబర్ త్రైమాసికంతోపాటు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తొమ్మిది నెలల్లో ముంద్రా, ఉడుపి, రాయిపూర్, మహన్ ప్లాంట్లు అధిక విక్రయాలకు సాయపడినట్టు తెలిపింది. అదే సమయంలో గొడ్డా ప్లాంట్ నుంచి అదనపు ఉత్పత్తి తోడైనట్టు వివరించింది. బంగ్లాదేశ్ విద్యుత్ సరఫరా వ్యవస్థలో ఇది (గొడ్డా ప్లాంట్) కీలక భాగంగా మారినట్టు పేర్కొంది. మూడో త్రైమాసికంలో 21.5 బిలియన్ యూనిట్ల విద్యుత్‌ను విక్రయించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 11.8 బిలియన్ యూనిట్లుగానే ఉంది. రుణాలకు చేసే వ్యయాలు క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.946 కోట్ల నుంచి రూ.797 కోట్లకు తగ్గాయి. ప్రస్తుత ఆర్థిక సంత్సరం డిసెంబర్‌తో ముగిసిన తొమ్మిది నెలల కాలానికి నికర లాభం 230 శాతం పెరిగి రూ.18,092 కోట్లకు చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది రూ.5,484 కోట్లుగా ఉంది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో అదానీ పవర్ షేరు 4 శాతానికి పైగా లాభపడి రూ.542 వద్ద ముగిసింది. -
కరూర్ వైశ్యా లాభం హైజంప్
ముంబై: ప్రైవేట్ రంగ సంస్థ కరూర్ వైశ్యా బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 43 శాతం జంప్‌చేసి రూ. 412 కోట్లను తాకింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో కేవలం రూ. 289 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 2,013 కోట్ల నుంచి రూ. 2,497 కోట్లకు చేరింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 1.12 శాతం మెరుగుపడి 1.58 శాతానికి చేరాయి. గత క్యూ3లో 2.7 శాతంగా నమోదయ్యాయి. నికర ఎన్పీఏలు సైతం 0.9 శాతం నుంచి 0.42 శాతానికి దిగివచ్చాయి. వృద్ధి, లాభదాయకత, రుణాల నాణ్యత తదితర అంశాలలో మరోసారి నిలకడైన, పటిష్ట పనితీరును ప్రదర్శించగలిగినట్లు బ్యాంక్ ఎండీ, సీఈవో బి.రమేష్ బాబు పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో శనివారం కరూర్ వైశ్యా బ్యాంక్ షేరు బీఎస్ఈలో 0.3 శాతం బలపడి రూ. 170 వద్ద ముగిసింది. -
ఐసీఐసీఐ లాభం జూమ్
ముంబై: ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 26 శాతం జంప్‌చేసి రూ. 11,053 కోట్లకు చేరింది. ప్రొవిజన్లు తగ్గడం ఇందుకు సహకరించింది. స్టాండెలోన్ నికర లాభం సైతం 24 శాతం ఎగసి రూ. 10,272 కోట్లను తాకింది. నికర వడ్డీ ఆదాయం 13 శాతం పుంజుకుని రూ. 18,678 కోట్లకు చేరగా.. నికర వడ్డీ మార్జిన్లు 4.65 శాతం నుంచి 4.43 శాతానికి స్వల్ప వెనకడుగు వేశాయి. ఇతర ఆదాయం 20 శాతం పురోగమించి రూ. 5,975 కోట్లయ్యింది. ఏఐఎఫ్‌ల ఎఫెక్ట్ ఆర్బీఐ ఆదేశాల ప్రకారం మదింపుచేస్తే ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్స్(ఏఐఎఫ్‌లు)లో పెట్టుబడులకు రూ. 627 కోట్లమేర దెబ్బతగిలినప్పటికీ ప్రొవిజన్లు రూ. 2,257 కోట్ల నుంచి రూ. 1,049 కోట్లకు తగ్గినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సందీప్ బాత్రా పేర్కొన్నారు. మొత్తం ఏఐఎఫ్‌లకు కేటాయింపులు చేపట్టినట్లు తెలియజేశారు. నిజానికి గతేడాది చేపట్టిన కంటింజెన్సీ ప్రొవిజన్లు, అవలంబించిన ప్రొవిజన్ విధానాలు కేటాయింపుల తగ్గింపునకు దోహదపడినట్లు తెలియజేశారు. కాగా.. ఐసీఐసీఐ బ్యాంక్ అనుబంధ సంస్థలలో లైఫ్ ఇన్సూరెన్స్ విభాగం నికర లాభం రూ. 227 కోట్లకు స్వల్పంగా పుంజుకుంది. సాధారణ బీమా నికర లాభం 22 శాతం జంప్‌చేసి రూ. 431 కోట్లను తాకగా.. అసెట్ మేనేజ్మెంట్ విభాగం నుంచి 30 శాతం అధికంగా రూ. 546 కోట్లు ఆర్జించింది. బ్రోకరేజీ బిజినెస్ నికర లాభం 66 శాతం దూసుకెళ్లి రూ. 466 కోట్లయ్యింది. వారాంతాన బీఎస్ఈలో ఐసీఐసీఐ బ్యాంక్ షేరు 1 శాతం బలపడి రూ. 1,008 వద్ద ముగిసింది. -
విప్రో లాభం డౌన్...
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం విప్రో లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం దాదాపు 12 శాతం క్షీణించి రూ. 2,694 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 3,053 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 4 శాతం వెనకడుగుతో రూ. 22,205 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 23,229 కోట్ల టర్నోవర్ సాధించింది. ఐటీ సర్విసుల విభాగం 4.5 శాతం తక్కువగా రూ. 22,151 కోట్ల ఆదాయం అందుకుంది. గైడెన్స్ ఇలా ఈ ఏడాది చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లో ఐటీ సర్విసుల బిజినెస్ 261.5–266.9 కోట్ల డాలర్ల(రూ. 21,845–22,296 కోట్లు) మధ్య టర్నోవర్‌ను సాధించే వీలున్నట్లు విప్రో తాజాగా అంచనా వేసింది. వాటాదారులకు ప్రతీ షేరుకీ రూ. 1 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. ఇతర విశేషాలు ♦ ఐటీ సర్వీసుల నిర్వహణ లాభం(ఇబిట్) త్రైమాసికవారీగా 2 శాతం తగ్గి రూ. 3,540 కోట్లుగా నమోదైంది. ♦బీఎఫ్ఎస్ఐ సర్విసుల విభాగం ఆదాయం 12.1% క్షీణించగా.. కన్జూమర్ 6.9%, తయారీ 9.1% చొప్పున నీరసించాయి. కమ్యూనికేషన్స్ నుంచి మాత్రం 18.8 శాతం జంప్‌చేసింది. ♦ ఆర్డర్ బుక్ 0.2 శాతం బలపడి 3.8 బిలియన్ డాలర్లుగా నమోదైంది. వీటిలో భారీ డీల్స్ విలువ 0.9 బిలియన్ డాలర్లు. ♦ ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు గత 6 క్వార్టర్లకల్లా కనిష్టంగా 14.2 శాతంగా నమోదైంది. ♦ డిసెంబర్‌కల్లా 4,473 మంది ఉద్యోగులు తగ్గారు. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 2,40,234గా నమోదైంది. ఫలితాల నేపథ్యంలో విప్రో షేరు దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 465 వద్ద ముగిసింది. -
టైటన్ లాభం అప్..
-
మళ్లీ లాభాల్లో ఇండిగో.. క్యూ2లో రూ. 189 కోట్లు
న్యూఢిల్లీ: ఎయిర్‌లైన్స్ దిగ్గజం ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో నష్టాలను వీడి లాభాల్లోకి ప్రవేశించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెపె్టంబర్(క్యూ2)లో రూ. 189 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 1,583 కోట్ల నికర నష్టం ప్రకటించింది. సామర్థ్యం పెంపు, అధిక ట్రాఫిక్ ఇందుకు సహకరించాయి. వెరసి ఇండిగో బ్రాండు సరీ్వసుల కంపెనీ వరుసగా నాలుగో త్రైమాసికంలోనూ లాభాలను ప్రకటించగలిగింది. అయితే ఈ కాలంలో విదేశీ మారక నష్టం రూ. 806 కోట్లను మినహాయించి లాభాలు ప్రకటించింది. కాగా.. మొత్తం ఆదాయం 21 శాతం జంప్‌చేసి రూ. 15,503 కోట్లను తాకింది. గత క్యూ2లో రూ. 12,852 కోట్ల టర్నోవర్ నమోదైంది. ఈ క్యూ2లో ప్రయాణికుల సంఖ్య 26.3 మిలియన్ల నుంచి 33.4 మిలియన్లకు ఎగసింది. సెపె్టంబర్‌కల్లా విమానాల సంఖ్య 334కు చేరగా.. రూ. 30,666 కోట్ల నగదు నిల్వలు కలిగి ఉంది. ఫలితాల నేపథ్యంలో ఇండిగో షేరు 1% బలపడి రూ. 2,509 వద్ద ముగిసింది. -
రెయిన్బో చిల్డ్రన్స్ లాభం రూ. 63 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ (ఆర్‌సీఎంఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో సుమారు రూ. 63 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత క్యూ2లో ఇది రూ. 61 కోట్లు. ఆదాయం రూ. 313 కోట్ల నుంచి రూ. 333 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కోవిడ్ అనంతరం అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, దానితో పోలిస్తే ప్రస్తుత క్యూ2లో కంపెనీ పటిష్టమైన పనితీరే కనపర్చిందని ఆర్‌సీఎంఎల్ సీఎండీ రమేష్ కంచర్ల తెలిపారు. హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్‌లో కొత్తగా ప్రారంభించిన శాఖ.. అంచనాలకు అనుగుణంగానే రాణిస్తోందని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మిగతా అయిదు నెలల్లో మూడు కొత్త ఆస్పత్రులను నెలకొల్పడంతో పాటు ప్రస్తుత ఆస్పత్రిలో అదనంగా మరో బ్లాకును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కంపెనీ చేతిలో నగదు, తత్సమాన నిల్వలు రూ. 472 కోట్ల మేర ఉన్నట్లు, ఆ నిధులను పెట్టుబడి ప్రణాళిక కోసం వెచి్చంచనున్నట్లు సంస్థ తెలిపింది. క్యూ2లో పెట్టుబడి వ్యయాల కింద రూ. 55 కోట్లు వెచి్చంచనున్నట్లు పేర్కొంది. రెండో త్రైమాసికం ఆఖరు నాటికి సంస్థ పడకల సంఖ్య 1,555 నుంచి 1,655కి పెరిగింది. -
ఫ్రెషర్స్‌కు గుడ్‌న్యూస్: 10,000 ఉద్యోగాలు ప్రకటించిన ఐటీ సంస్థ
న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 10 శాతం పుంజుకుని రూ. 3,833 కోట్లను తాకింది. గతేడాది (2022–23) ఇదే కాలంలో రూ. 3,487 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 8 శాతం వృద్ధితో రూ. 26,672 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 24,686 కోట్ల టర్నోవర్ నమోదైంది. వాటాదారులకు షేరుకి రూ. 12 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. కొత్త కాంట్రాక్టులు 67 శాతం జంప్‌చేసి కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 4 బిలియన్ డాలర్లను తాకినట్లు వెల్లడించారు. ఇతర విశేషాలు... ఈ ఏడాది తొలి ఆరు నెలల పనితీరు నేపథ్యంలో పూర్తి ఏడాదికి ఆదాయ అంచనాలను 5–6 శాతానికి తగ్గించింది. తొలుత 6–8 శాతం వృద్ధి అంచనాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ చివరికి సిబ్బంది సంఖ్య 1% తగ్గి 2,21,139కు చేరింది. ఈ ఏడాది 10,000 మంది ఫ్రెషర్స్‌కు ఉద్యోగాలివ్వనున్నట్లు కంపెనీ సీపీవో రామచంద్రన్ సుందరరాజన్ వెల్లడించారు. గతేడాది 27,000 మంది ఫ్రెషర్స్‌కు ఉపాధి కల్పించినట్లు ప్రస్తావించారు. సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి -
క్యూ 2 లో టీసి 'ఎ స్'!
ముంబై: దేశీ సాఫ్ట్వేర్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (టీసీఎస్).. మెరుగైన ఫలితాలతో బోణీ కొట్టింది. ఈ ఆరి్థక సంవత్సరం సెపె్టంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో (2023–24, క్యూ2) కంపెనీ రూ. 11,342 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ. 10,431 కోట్లతో పోలిస్తే 8.7 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం సైతం 7.9 శాతం పెరుగుదలతో రూ. 55,309 కోట్ల నుండి రూ.59,692 కోట్లకు ఎగబాకింది. ఇక వాటాదారులకు టీసీఎస్ మరోసారి భారీ బైబ్యాక్ ఆఫర్‌ను ప్రకటించడం విశేషం. మరోపక్క, మందకొడి ఆరి్థక పరిస్థితుల నేపథ్యంలో ఐటీ రంగానికి ప్రతికూలతలు కొనసాగుతాయని కూడా కంపెనీ స్పష్టం చేసింది. త్రైమాసిక ప్రాతిపదికన ఇలా... ఈ ఆరి్థక సంవత్సరం జూన్ క్వార్టర్ (క్యూ1లో) నమోదైన రూ.11,074 కోట్లతో పోలిస్తే త్రైమాసిక ప్రాతిపదికన క్యూ2లో నికర లాభం 2.5% వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం క్యూ1లో రూ.59,381 కోట్లతో పోలిస్తే క్యూ2లో అర శాతం పెరిగింది. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలు... ► క్యూ2లో కంపెనీ నిర్వహణ లాభం 9.1 శాతం వృద్ధితో రూ.14,483 కోట్లకు పెరిగింది. అదేవిధంగా నిర్వహణ మార్జిన్లు పావు శాతం పెరిగి 24.3 శాతానికి చేరాయి. ► భౌగోళికంగా చూస్తే, యూకే నుండి ఆదాయం 10.7 శాతం ఎగబాకగా, ఉత్తర అమెరికా నుండి స్వల్పంగా 0.1 శాతం వృద్ధి చెందింది. వర్ధమాన మార్కెట్లలో మధ్యప్రాచ్యం, ఆఫ్రికా ఆదాయం 15.9 శాతం వృద్ధి నమోదు కాగా, లాటిన్ అమెరికా 13.1 శాతం, ఆసియా పసిఫిక్ 4.1 శాతం, భారత్ ఆదాయం 3.9 శాతం చొప్పున పెరిగాయి. ► విభాగాల వారీగా.. ఇంధనం, వనరులు, యుటిలిటీల నుండి ఆదాయం 14.8 శాతం పెరిగింది. తయారీ రంగం నుండి ఆదాయం 5.8 శాతం, లైఫ్ సైన్సెస్–హెల్త్‌కేర్ 5 శాతం పెరగ్గా, బ్యాంకింగ్–ఫైనాన్షియల్ సరీ్వసెస్ (బీఎఫ్ఎస్ఐ) మాత్రం మైనస్ 0.5 శాతంగా నమోదైంది. ► సెపె్టంబర్ చివరి నాటికి టీసీఎస్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,08,985కు చేరింది. క్యూ2లో నికరంగా 6,000 మంది సిబ్బంది తగ్గారు. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలన్న లక్ష్యంలో ఎలాంటి మార్పు లేదని టీసీఎస్ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ చెప్పారు. క్యాంపస్ నియమకాలపై ఇప్పటికే దృష్టి పెట్టామన్నారు. ► క్యూ2లో కంపెనీ 11.2 బిలియన్ డాలర్ల విలువైన కొత్త కాంట్రాక్టులను కుదుర్చుకుంది. ఇందులో బీఎస్ఎన్ఎల్ 4జీ/5జీ, వాహన దిగ్గజం జేఎల్ఆర్కు సంబంధించిన డీల్స్ ప్రధానంగా ఉన్నాయి. ► ఇజ్రాయెల్‌లో 250 మంది కంపెనీ ఉద్యోగులు పని చేస్తున్నారని, యుద్ధ ప్రభావం అక్కడ తమ వ్యాపారాలపై పెద్దగా ప్రభావం చూపలేదని టీసీఎస్ సీఎఫ్ఓ ఎన్. గణపతి సుబ్రమణ్యం చెప్పారు. ► రూ. 1 ముఖ విలువ గల ఒక్కో షేరుపై కంపెనీ రూ. 9 చొప్పన రెండో మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. దీనికి రికార్డు తేదీ అక్టోబర్ 19 కాగా, నవంబర్ 7న చెల్లించనుంది. దాదాపు రూ.3,300 కోట్లు ఇందుకు వెచి్చంచనుంది. టీసీఎస్ షేరు ధర బుధవారం బీఎస్ఈలో అర శాతం నష్టంతో రూ. 3,610 వద్ద ముగిసింది. మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వచ్చాయి. బైబ్యాక్ బొనాంజా @ రూ.17,000 కోట్లు టీసీఎస్ బైబ్యాక్ పరంపరను కొనసాగిస్తోంది. రూ. 17,000 కోట్ల విలువైన షేర్లను వాటాదారుల నుంచి తిరిగి కొనుగోలు చేసేందుకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. బైబ్యాక్ షేరు ధరను రూ. 4,150గా నిర్ణయించింది. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ‘టాటా’ కరోనా మహమ్మారి కారణంగా కల్పించిన రిమోట్ వర్కింగ్ (వర్క్ ఫ్రమ్ హోమ్) సదుపాయానికి టీసీఎస్ టాటా చెప్పింది. ఇకపై తమ ఉద్యోగులందరూ ఆఫీసుల నుంచే విధులు నిర్వర్తించాలని కంపెనీ బుధవారం ప్రకటించింది. కో–వర్కింగ్ వల్ల వ్యవస్థ విస్తృతం అవుతుందని, ఉత్పాదకత పెరుగుతుందని టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ పేర్కొన్నారు. మా సరీ్వస్‌లకు కొనసాగుతున్న డిమాండ్, క్లయింట్లు దీర్ఘకాల ప్రాజెక్టులకు కట్టుబడి ఉండటం, జెన్ ఏఐ ఇంకా ఇతర కొత్త టెక్నాలజీలను ప్రయోగాత్మకంగా ఉపయోగించేందుకు చూపుతున్న ఆసక్తి.. మా దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలపై భరోసా కలి్పస్తోంది. ఆరి్థక అనిశ్చితి కొనసాగుతోంది. దీనివల్లే ఆదాయ వృద్ధి అంతంతమాత్రంగా నమోదైంది. అయితే పటిష్టమైన డీల్స్ జోరుతో ఆర్డర్ బుక్ భారీగా వృద్ధి చెందింది. మొత్తం కాంట్రాక్ట్ విలువ (టీసీవీ) పరంగా క్యూ2లో రెండో అత్యధిక స్థాయిని నమోదు చేసింది. – కె. కృతివాసన్, టీసీఎస్ సీఈఓ -
లాభాల్లోకి స్పైస్‌జెట్.. నష్టాలను వీడిన తక్కువ ధరల ఎయిర్‌లైన్స్!
న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన కంపెనీ స్పైస్‌జెట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో నష్టాలను వీడి లాభాల్లోకి ప్రవేశించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో రూ. 205 కోట్ల నికర లాభం ఆర్జించింది. దేశీయంగా విమాన ప్రయాణాలకు డిమాండ్ పెరగడం ఇందుకు సహకరించింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 789 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం నిర్వహణ ఆదాయం మాత్రం రూ. 2,457 కోట్ల నుంచి రూ. 2,002 కోట్లకు నీరసించింది. నిర్వహణ వ్యయాలు సైతం రూ. 2,072 కోట్ల నుంచి రూ. 1,291 కోట్లకు భారీగా తగ్గాయి. పలు సవాళ్ల నేపథ్యంలోనూ లాభాలు ఆర్జించగలిగినట్లు కంపెనీ చైర్మన్, ఎండీ అజయ్ సింగ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. తాము చేపట్టిన రూ. 500 కోట్ల పెట్టుబడులు కంపెనీ వృద్ధికి తోడ్పాటునిచ్చినట్లు తెలియజేశారు. ఈ కాలంలో లాజిస్టిక్స్ సంస్థ స్పైస్‌ఎక్స్‌ప్రెస్ అండ్ లాజిస్టిక్స్ ప్రయివేట్ లిమిటెడ్‌ను విడదీయడంతో స్పైస్‌జెట్ నెట్‌వర్త్ మెరుగుపడినట్లు వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో స్పైస్‌జెట్ షేరు బీఎస్ఈలో 7% జంప్‌చేసి దాదాపు రూ. 34 వద్ద ముగిసింది. -
గోద్రేజ్ ప్రాపర్టిస్ లాభం మూడింతలు
న్యూఢిల్లీ: గోద్రేజ్ ప్రాపర్టిస్ జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి రూ.125 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.45 కోట్లతో పోల్చి చూసినప్పుడు మూడు రెట్లు వృద్ధి చెందింది. కొత్త బుకింగ్‌లు (ఇళ్లు/ఫ్లాట్లు) 11 శాతం తగ్గి జూన్ త్రైమాసికంలో రూ.2,254 కోట్లుగా ఉన్నాయి. బుకింగ్‌ల పరిమాణం సైతం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పడు 20 శాతం తగ్గి 2.25 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.426 కోట్ల నుంచి రూ1,266 కోట్లకు దూసుకుపోయింది. ఎన్సీడీలు, బాండ్లను ప్రైవేటు ప్లేస్మెంట్ విధానంలో జారీ చేయడం ద్వారా రూ.2,000 కోట్లను సమీకరించాలని కంపెనీ నిర్ణయించింది. జూన్ త్రైమాసికంలో 4.9 మిలియన్ చదరపు అడుగుల పరిమాణంలో ఇళ్లను కస్టమర్లకు అందించింది. లక్ష్యం దిశగానే.. ‘‘బుకింగ్‌ల పరంగా ఇది స్తబ్దతతో కూడిన త్రైమాసికం. డెలివరీలు, వ్యాపార అభివృద్ధి, నగదు వసూళ్లు అన్నీ కూడా జూన్ క్వార్టర్లో మంచి వృద్ధిని చూశాయి. బలమైన కొత్త ప్రాజెక్టుల ఆరంభ ప్రణాళికలు, బలమైన బ్యాలన్స్ షీట్, చెక్కుచెదరని డిమాండ్ ఇవన్నీ కలసి 2023–24 సంవత్సరంలో రూ.14,000 కోట్ల బుకింగ్‌ల లక్ష్యాన్ని చేరుకునే దిశలోనే ఉన్నాం’’అని గోద్రేజ్ ప్రాపర్టిస్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ పిరోజ్షా గోద్రేజ్ తెలిపారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2022–23) గోద్రేజ్ ప్రాపర్టీస్ రూ.12,232 కోట్ల విలువైన ఇళ్లను విక్రయించడం గమనార్హం. జూన్‌లో నమోదైన తాజా బుకింగ్‌లలో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో రూ.656 కోట్లు, ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో రూ.548 కోట్లు, బెంగళూరు మార్కెట్లో రూ.509 కోట్లు, పుణె మార్కెట్లో రూ.446 కోట్ల చొప్పున ఉన్నాయి. ఈ నాలుగు మార్కెట్లలో గోద్రేజ్ ప్రాపర్టీస్ వ్యాపార కార్యకలాపాలు ఎక్కువగా ఉన్నాయి. జయశ్రీ వైద్యనాథన్‌ను అడిషనల్ డైరెక్టర్‌గా కంపెనీ నియమించింది. -
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ టర్న్అరౌండ్.. దశాబ్ద కాలంలోనే అత్యధిక లాభం
న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో రూ. 13,750 కోట్ల నికర లాభం(స్టాండెలోన్) ఆర్జించింది. ఇది గత దశాబ్ద కాలంలోనే అత్యధికంకాగా.. పెట్రోల్, డీజిల్‌పై లాభదాయకత(మార్జిన్లు) మెరుగుపడటం లాభాలకు కారణమైంది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 1,993 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది క్యూ4(జనవరి–మార్చి)లో నమోదైన రూ. 10,059 కోట్లతో పోల్చినా తాజా లాభం 37 శాతం జంప్‌చేసింది. వెరసి ఇంతక్రితం 2021–22లో ఆర్జించిన రికార్డ్ వార్షిక లాభం రూ. 24,184 కోట్లలో సగానికిపైగా క్యూ1లో సాధించింది. కాగా.. గతంలో అంటే 2012–13 క్యూ4లో అధిక ఇంధన సబ్సిడీని అందుకోవడం ద్వారా రూ. 14,153 కోట్ల నికర లాభం నమోదైంది. గతేడాది క్యూ1లో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను నిలిపిఉంచడంతో ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజాలు బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ సైతం నష్టాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుత సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం 2 శాతం నీరసించి రూ. 2.21 లక్షల కోట్లకు పరిమితమైంది. ప్రతీ బ్యారల్ చమురుపై స్థూల రిఫైనింగ్ మార్జిన్లు 8.34 డాలర్లకు చేరాయి. ఇంధన అమ్మకాలు 0.6 మిలియన్ టన్నులు పెరిగి 21.8 ఎంటీని తాకాయి. ఈ కాలంలో 18.26 ఎంటీ చమురును ప్రాసెస్ చేసింది. ఫలితాల నేపథ్యంలో ఐవోసీ షేరు బీఎస్ఈలో 0.5 శాతం క్షీణించి రూ. 95 వద్ద ముగిసింది. -
కోటక్ బ్యాంక్ పనితీరు భేష్
ముంబై: కోటక్ మహీంద్రా బ్యాంక్ జూన్ త్రైమాసికంలో బలమైన పనితీరు చూపించింది. స్టాండలోన్ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 67 శాతం వృద్ధితో రూ.3,452 కోట్లకు చేరుకుంది. కన్సాలిడేటెడ్‌గా చూసుకుంటే (బీమా, ఏఎంసీ, బ్రోకరేజీ తదితర వ్యాపారాలు కలిసిన) నికర లాభం 51 శాతం పెరిగి రూ.4,150 కోట్లుగా నమోదైంది. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 33 శాతం వృద్ధితో రూ.6,234 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్ 5.57 శాతంగా నమోదైంది. ఆర్బీఐ గతేడాది మే నుంచి రెపో రేటును 2.5 శాతం మేర పెంచగా, ఈ మొత్తాన్ని రుణగ్రహీతలకు బ్యాంక్ బదలాయించింది. కానీ, అదే సమయంలో డిపాజిట్లపై బదిలీ చేసిన ప్రయోజనం ఇంతకంటే తక్కుగానే ఉండడం గమనార్హం. అయితే డిపాజిట్లపై రేట్ల సవరణ ప్రభావం దృష్ట్యా నికర వడ్డీ మార్జిన్ ప్రస్తుత స్థాయిలో కొనసాగడం కష్టమేనని బ్యాంక్ డిప్యూటీ ఎండీ దీపక్ గుప్తా పేర్కొన్నారు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర వడ్డీ మార్జిన్ 5.25 శాతంగా ఉండొచ్చన్నారు. ఫీజుల ఆదాయంలో వృద్ధి : ఫీజులు, సేవల ఆదాయం 20 శాతం పెరిగి రూ.1,827 కోట్లుగా నమోదైంది. కాసా రేషియో 49 శాతానికి చేరుకుంది. మార్కెట్ గెయిన్ రూపంలో రూ.240 కోట్ల మొత్తం సమకూరింది. బ్యాంకు రుణాలు 19 శాతం పెరిగి రూ.3,37,031 కోట్లకు చేరాయి. అన్సెక్యూర్డ్ రిటైల్ రుణాలు (మైక్రోఫైనాన్స్ సహా) మొత్తం రుణాల్లో 10.7 శాతానికి పెరిగాయి. క్రెడిట్ కార్డుల రూపంలో రుణ పుస్తకంపై కొంత ఒత్తిడి ఉన్నట్టు దీపక్ గుప్తా తెలిపారు. అయినప్పటికీ ఈ విభాగం రెండంకెల వృద్ధిని సాధిస్తుందని చెప్పారు. ఇప్పటి వరకైతే ఈ విభాగం విషయంలో సౌకర్యంగానే ఉన్నట్టు తెలిపారు. రుణ ఆస్తుల నాణ్యత మెరుగు బ్యాంకు రుణ ఆస్తుల నాణ్యత కొంత మెరుగుపడింది. స్థూల ఎన్పీఏలు 1.77 శాతానికి (రూ.6,587కోట్లు) తగ్గాయి. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఇవి 2.24 శాతంగా ఉన్నాయి. ఇక నికర ఎన్పీఏలు 0.40 శాతానికి పరిమితమయ్యాయి. ఇవి క్రితం ఏడాది ఇదే కాలంలో 0.62 శాతంగా ఉన్నాయి. తాజాగా ముగిసిన జూన్ త్రైమాసికంలో రూ.1,205 కోట్లు ఎన్పీఏలుగా మారాయి. -
అదరగొట్టిన రిలయన్స్ జియో
Reliance Jio net profit grew 12 percent: బిలియనీర్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ టెలికాం విభాగం రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో అదరగొట్టింది.నికర లాభాల్లో 12.2శాతం పెరుగుదలను నమోదు చేసింది. అంతేకాదు చందాదారులకు సంబంధించి దేశీయంగా ఇప్పటికే టాప్ లో ఉన్న జియో ప్రస్తుత చందాదారులు కూడా భారీగా పెరిగారు. ( 22 ఏళ్లకే కంపెనీ పగ్గాలు, వేల కోట్ల సామ్రాజ్యం, 30వేలమందికి ఉపాధి) శుక్రవారం ప్రకటించిన క్యూ1 (ఏప్రిల్-జూన్) ఫలితాలలో జియో నికర లాభం రూ. 4,863 కోట్లకు పెరిగింది. ఇది ఏడాది క్రితం రూ. 4,335 కోట్లుగా ఉంది. జియో ఆదాయం 9.9శాతం పెరిగి రూ.24,042 కోట్లకు చేరుకుంది. గత ఏడాది క్రితం రూ.21,995 కోట్ల నుంచి రూ.24,127 కోట్లకు పెరిగింది. సీక్వెన్షియల్ ప్రాతిపదికన ఆదాయం, EBITDA, నికర లాభంలో 3శాతం పెరుగుదదల సాధించామని జియో ట నివేదించింది. కొత్తగా 30.4 లక్షల మంది సబ్స్క్రైబర్లు భారతీయ టెలికాం మార్కెట్‌పై రిలయన్స్ జియో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 2023, ఏప్రిల్ తాజా టెలికాం డేటా ప్రకారం, కంపెనీ 37.9 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉంది. ఏప్రిల్ 2023లో, రిలయన్స్ జియో 30.4 లక్షల మంది సబ్స్క్రైబర్లను సాధించింది. కాగా జియో ఇటీవల Jio Bharat ఫోన్లను రూ. 999కి ప్రారంభించింది. ఇందులో అపరిమిత వాయిస్ కాల్లు , 14 GB డేటా కోసం చౌకైన రూ. 123 నెలవారీ ప్లాన్‌ను కూడా జోడించింది. '2G ముక్త్ భారత్' పేరుతో తీసుకొచ్చిన ఈ ఆఫర్లో ఫీచర్ ఫోన్లతో ఇంకా 2 జీలో ఉన్న 250 మిలియన్ల మొబైల్ సబ్స్క్రైబర్లను కొత్త టెక్నాలజీకి మార్చడమే లక్ష్యమని జియో ప్రకటించిన సంగతి తెలిసిందే. (నేను అప్పుడే వార్నింగ్ ఇచ్చా.. ఏఐపై ప్రముఖ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు) -
ఇండస్ఇండ్ బ్యాంక్ లాభం జూమ్.. భారీగా పెరిగిన ఆదాయం
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం ఇండస్ఇండ్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికం(క్యూ1)లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం వార్షికంగా 30 శాతం జంప్‌చేసి రూ. 2,124 కోట్లను తాకింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 1,631 కోట్లు మాత్రమే ఆర్జించింది. ఇందుకు మొండి రుణాలు తగ్గడం, వడ్డీ ఆదాయం పుంజుకోవడం సహకరించాయి. మొత్తం ఆదాయం రూ. 10,113 కోట్ల నుంచి రూ. 12,939 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ ఆదాయం 18 శాతం పుంజుకుని రూ. 4,867 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు నామమాత్రంగా మెరుగుపడి 4.29 శాతానికి చేరాయి. ఇతర ఆదాయం 14 శాతం వృద్ధితో రూ. 2,210 కోట్లుగా నమోదైంది. ప్రొవిజన్లు రూ. 1,251 కోట్ల నుంచి రూ. 991 కోట్లకు తగ్గాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.35 శాతం నుంచి 1.94 శాతానికి దిగివచ్చాయి. నికర ఎన్పీఏలు 0.67 శాతం నుంచి 0.58 శాతానికి తగ్గాయి. ఫలితాల నేపథ్యంలో ఇండస్ఇండ్ షేరు నామ మాత్రంగా తగ్గి రూ. 1,390 వద్ద క్లోజైంది. -
అదానీ పోర్ట్స్ లాభం ఫ్లాట్.. 30 శాతం పెరిగిన మొత్తం ఆదాయం
న్యూఢిల్లీ: అదానీ పోర్ట్స్ అండ్ సెజ్(ఏపీసెజ్) గత ఆర్థిక సంవత్సరం (2022–23) చివరి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం 3 శాతం పుంజుకుని రూ. 1,141 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 1,112 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం మరింత అధికంగా 30 శాతం వృద్ధితో రూ. 6,179 కోట్లను అధిగమించింది. అంతక్రితం క్యూ4లో రూ. 4,739 కోట్ల టర్నోవర్ నమోదైంది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 3,497 కోట్ల నుంచి రూ. 3,994 కోట్లకు పెరిగాయి. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 5 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. పూర్తి ఏడాదికి సైతం మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఏపీసెజ్ దాదాపు 9 శాతం అధికంగా రూ. 5,393 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2021–22లో రూ. 4,953 కోట్ల లాభం నమోదైంది. ఫలితాల నేపథ్యంలో అదానీ పోర్ట్స్ షేరు ఎన్ఎస్ఈలో 0.5 శాతం నీరసించి రూ. 734 వద్ద ముగిసింది. అదానీ ట్రాన్స్మిషన్ లాభం జూమ్ అదానీ ట్రాన్స్మిషన్ చివరి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం 85 శాతం దూసుకెళ్లి రూ. 440 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 237 కోట్లు ఆర్జించింది. ఇక మొత్తం ఆదాయం సైతం రూ. 3,165 కోట్ల నుంచి రూ. 3,495 కోట్లకు ఎగసింది. నికర లాభాల్లో ట్రాన్స్మిషన్ విభాగం నుంచి 11 శాతం వృద్ధితో రూ. 221 కోట్లు లభించగా.. పంపిణీ విభాగం వాటా 478 శాతం జంప్‌చేసి రూ. 218 కోట్లకు చేరింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి అదానీ ట్రాన్స్మిషన్ నికర లాభం రూ. 1,281 కోట్లకు స్వల్పంగా బలపడింది. 2021–22లో రూ. 1,236 కోట్ల లాభం ప్రకటించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా రూ. 11,861 కోట్ల నుంచి రూ. 13,840 కోట్లకు జంప్ చేసింది. ఫలితాల నేపథ్యంలో అదానీ ట్రాన్స్మిషన్ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 3 శాతం పతనమై రూ. 810 వద్ద ముగిసింది. -
ఎస్బీఐ లాభం జూమ్
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బీఐ మార్చి త్రైమాసికానికి మెరుగైన పనితీరు చూపించింది. ఎన్పీఏలకు కేటాయింపులు తగ్గడంతో విశ్లేషకుల అంచనాలకు మించి ఫలితాలను ప్రకటించింది. స్టాండలోన్ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 83 శాతం వృద్ధితో రూ.16,695 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలానికి లాభం రూ.9,113 కోట్లుగా ఉంది. నికర వడ్డీ ఆదాయం 29 శాతం పెరిగి రూ.40,393 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలానికి నికర వడ్డీ ఆదాయం రూ.31,198 కోట్లుగా ఉండడం గమనార్హం. ఒక్కో షేరుకు రూ.11.30 చొప్పున డివిడెండ్ ఇవ్వాలని ఎస్బీఐ నిర్ణయించింది. మొండి రుణాలకు (ఎన్పీఏలు) కేటాయింపులు, కంటింజెన్సీలు 54 శాతం తగ్గి రూ.3,316 కోట్లకు పరిమితమయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో కేటాయింపులు రూ.7,237 కోట్లుగా ఉన్నాయి. ఆస్తుల నాణ్యత మెరుగుపడింది. స్థూల ఎన్పీఏలు 2.78 శాతానికి తగ్గాయి. ఇవి క్రితం ఏడాది ఇదే త్రైమాసికం నాటికి 3.97 శాతంగా ఉంటే, 2022 డిసెంబర్ చివరికి 3.14 శాతంగా ఉన్నాయి. నికర ఎన్పీఏలు 0.67 శాతానికి పరిమితమయ్యాయి. క్రితం ఏడాది మార్చి చివరికి ఇవి 1.08 శాతం, 2022 డిసెంబర్ చివరికి 0.77 శాతంగా ఉండడం గమనార్హం. దేశీయ వ్యాపారంపై నికర వడ్డీ మార్జిన్ 3.84 శాతానికి పుంజుకుంది. ♦ మార్చి త్రైమాసికానికి కన్సాలిడేటెడ్ నికర లాభం (అనుబంధ సంస్థలతో కలిపి) క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.9,994 కోట్ల నుంచి రూ.18,343 కోట్లకు వృద్ధి చెందింది. 90 శాతానికి పైగా పెరిగింది. కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.1,08,034 కోట్ల నుంచి, రూ.1,36,852 కోట్లకు పెరిగింది. ♦ మార్చి త్రైమాసికానికి నిర్వహణ లాభం 25 శాతం వృద్ధితో రూ.24,621 కోట్లకు చేరుకుంది. ♦ ప్రొవిజన్ కవరేజ్ రేషియో 1.35 శాతం మెరుగుపడి 76.39 శాతంగా ఉంది. ♦ రుణాల్లో 16 శాతం వృద్ధి నమోదైంది. మార్చి చివరికి రూ.32.69 లక్షల కోట్లకు చేరాయి. కార్పొరేట్ రుణాలు వార్షికంగా 12 శాతం పెరిగాయి. రిటైల్ రుణాలు 18 శాతం పెరిగాయి. ♦ డిపాజిట్లు 9 శాతం వృద్ధితో రూ.44.23 లక్షల కోట్లకు చేరాయి. ♦ 2022–23 ఆర్థిక సంవత్సరానికి ఎస్బీఐ స్టాండలోన్ నికర లాభం రూ.50,232 కోట్లకు చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2021–22)తో పోలిస్తే 58 శాతం పెరిగింది. స్టాండలోన్ ఆదాయం రూ.1,06,912 కోట్లుగా నమోదైంది. ♦ 2022–23 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కన్సాలిడేటెడ్ లాభం రూ.35,374 కోట్ల నుంచి రూ.56,558 కోట్లకు చేరింది. ఆదాయం రూ.4,06,973 కోట్ల నుంచి రూ.4,73,378 కోట్లకు చేరింది. ♦ బీఎస్ఈలో ఎస్బీఐ షేరు 2 శాతానికి పైగా నష్టపోయి రూ.574 వద్ద క్లోజ్ అయింది. ఇంట్రాడేలో రూ.571.40 కనిష్ట స్థాయిని చూసింది. -
ఎల్అండ్టీ రూ.24 డివిడెండ్
న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, నిర్మాణ రంగ దిగ్గజం ఎల్అండ్టీ మార్చి త్రైమాసికానికి నికర లాభంలో 10 శాతం వృద్ధిని నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.3,621 కోట్ల నుంచి రూ.3,987 కోట్లకు చేరింది. ఆదాయం రూ.52,851 కోట్ల నుంచి రూ.58,335 కోట్లకు వృద్ధి చెందింది. ఒక్కో షేరుకు రూ.24 చొప్పున డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకుంది. కంపెనీ గడిచిన ఆర్థిక సంవత్సరంలో 19 శాతం అధికంగా రూ.2,30,528 కోట్ల విలువైన ఆర్డర్లను సొంతం చేసుకుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షల కోట్లకు పైగా ఆర్డర్లను పొందడం ఇదే మొదటిసారి అని ఎల్అండ్టీ సీఈవో ఎస్ఎన్ సుబ్రమణ్యం తెలిపారు. మొత్తం ఆర్డర్ల పుస్తకం మార్చి చివరికి రూ.4 లక్షల కోట్లుగా ఉన్నట్టు చెప్పారు. ఎల్అండ్టీ కన్సాలిడేటెడ్ ఆదాయం 2022–23లో 17 శాతం వృద్ధితో రూ.1.83 లక్షల కోట్లకు చేరుకోగా, లాభం 21 శాతం పెరిగి రూ.10,471 కోట్లుగా నమోదైంది. చైర్మన్‌గా తప్పుకోనున్న ఏఎం నాయక్ ఎల్అండ్టీ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఏఎం నాయక్ 2023 సెప్టెంబర్ 30 నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. దీంతో ప్రస్తుతం సీఈవో, ఎండీగా ఉన్న ఎస్ఎన్ సుబ్రమణ్యం చైర్మన్, ఎండీగా 2023 అక్టోబర్ 1 నుంచి సేవలు అందించనున్నట్టు ఎల్అండ్టీ ప్రకటించింది. గౌరవ చైర్మన్‌గా నాయక్ కొనసాగుతారని తెలిపింది. -
డాక్టర్ రెడ్డీస్ లాభం 959 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్ఎల్) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 959 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో నమోదైన లాభం రూ. 87.5 కోట్లతో పోలిస్తే ఇది 996 శాతం అధికం. లో బేస్ ప్రభావం ఇందుకు కారణం. ఇక సమీక్షాకాలంలో ఆదాయం 25 శాతం పెరిగి రూ. 5,437 కోట్ల నుంచి రూ. 6,297 కోట్లకు చేరింది. ఆదాయాలు, లాభాల వృద్ధిపరంగా ఇది తమకు రికార్డు సంవత్సరమని కంపెనీ సహ–చైర్మన్ జీవీ ప్రసాద్ పేర్కొన్నారు. ఉత్తర అమెరికా,యూరప్, భారత మార్కెట్లు పటిష్టంగా ఉండటం ఇందుకు దోహదపడిందని బుధవారం ఆర్థిక ఫలితాల ప్రకటన సందర్భంగా విలేకరుల సమావేశంలో పాల్గొన్న కంపెనీ సీఎఫ్‌వో పరాగ్ అగర్వాల్ తెలిపారు. కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం, అన్ని వ్యాపార విభాగాలు పుంజుకోవడం తదితర అంశాలు ఆదాయ వృద్ధికి తోడ్పడ్డాయని ఆయన వివరించారు. ప్రస్తుతం కంపెనీ వద్ద రూ. 5,000 కోట్ల మిగులు నిధులు ఉన్నట్లు చెప్పారు. తాజా ఆర్థిక సంవత్సరంలోనూ కొత్త ఉత్పత్తులు, ఉత్పాదకతను పెంచుకోవడంపై మరింతగా దృష్టి పెట్టనున్నట్లు సంస్థ సీఈవో ఎరెజ్ ఇజ్రేలీ చెప్పారు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంస్థ బోర్డు షేరు ఒక్కింటికి రూ. 40 చొప్పున తుది డివిడెండ్‌ను ప్రతిపాదించింది. ఫలితాలకు సంబంధించి మరిన్ని వివరాలు .. ► గ్లోబల్ జనరిక్స్ విభాగం ఆదాయాలు క్యూ4లో 18 శాతం పెరిగి రూ. 5,426 కోట్లకు చేరాయి. కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్లో ఆదాయం 27 శాతం పెరిగి రూ. 2,532 కోట్లుగా నమోదైంది. ఉత్తర అమెరికా మార్కెట్లో నాలుగో త్రైమాసికంలో ఆరు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టగా, పూర్తి ఆర్థిక సంవత్సరంలో 25 ఔషధాలను ఆవిష్కరించింది. ► భారత్‌లో అమ్మకాలు 32 శాతం పెరిగి రూ. 1,283 కోట్లకు చేరాయి. ప్రస్తుత ఉత్పత్తుల ధరల్లో పెరుగుదలతో పాటు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం ద్వారా అదనపు ఆదాయం సమకూరింది. ► యూరప్ మార్కెట్ ఆదాయాలు 12% పెరిగి రూ. 496 కోట్లకు, వర్ధమాన మార్కెట్లలో ఆదాయం 7% క్షీణించి రూ. 1,114 కోట్లుగా నమోదైంది. ► ఫార్మా సర్వీసులు, యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్ (పీఎస్‌ఏఐ) విభాగం మూడు శాతం పెరిగి రూ. 756 కోట్ల నుంచి రూ. 778 కోట్లకు చేరాయి. ► పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయం రూ. 21,439 కోట్ల నుంచి 15% వృద్ధితో రూ.24,588 కోట్లకు చేరింది. లాభం రూ. 2,357 కోట్ల నుంచి 91% ఎగిసి రూ.4,507 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో పరిశోధన, అభివృద్ధి కార్య కలాపాలపై రూ.1,940 కోట్లు వెచ్చించింది. ఈసారి మొత్తం అమ్మకాల్లో 8–9% వెచ్చించనుంది. -
సైయంట్ లాభం 14 శాతం జంప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మార్చి త్రైమాసికంలో సైయంట్ నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 14 శాతం ఎగసి రూ.176 కోట్లు సాధించింది. ఎబిటా రూ.249 కోట్లు, ఎబిటా మార్జిన్ 14.2 శాతం నమోదైంది. గ్రూప్ ఆదాయం 48 శాతం అధికమై రూ.1,751 కోట్లకు చేరుకుంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో నికరలాభం 8.2 శాతం పెరిగి రూ.565 కోట్లు దక్కించుకుంది. గ్రూప్ టర్నోవర్ 32.7 శాతం దూసుకెళ్లి రూ.6,016 కోట్లను తాకింది. మొత్తం డివిడెండ్ ఇప్పటి వరకు అత్యధికంగా ఒక్కో షేరుకు రూ.26కు చేరడం విశేషం. -
HDFC Bank Q4 Results: లాభాలతో అదరగొట్టిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్..
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి (క్యూ4)లో నికర లాభం 21 శాతం ఎగసి రూ. 12,595 కోట్లకు చేరింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి సైతం నికర లాభం ఇదే స్థాయిలో బలపడి రూ. 45,997 కోట్లను అధిగమించింది. వాటాదారులకు షేరుకి రూ. 19 చొప్పున డివిడెండు ప్రకటించింది. మొత్తం బ్రాంచీల సంఖ్య 7,821కు చేరింది. క్యూ4లో 6,000 మందికి ఉపాధి కల్పించింది. మొత్తం సిబ్బంది సంఖ్య 1,73,222ను తాకింది. స్టాండెలోన్ సైతం క్యూ4లో స్టాండెలోన్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నికర లాభం 20 శాతం పుంజుకుని రూ. 12,048 కోట్లకు చేరగా.. నికర వడ్డీ ఆదాయం 24 శాతం జంప్‌చేసి రూ. 23,352 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 4.1 శాతంగా నమోదుకాగా.. 17 శాతం రుణ వృద్ధిని సాధించింది. ఇతర ఆదాయం రూ. 7,637 కోట్ల నుంచి రూ. 8,731 కోట్లకు పెరిగింది. మొత్తం ప్రొవిజన్లు రూ. 3,312 కోట్ల నుంచి రూ. 2,685 కోట్లకు తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి 0.4 శాతం బలపడి 19.3 శాతాన్ని తాకింది. అనుబంధ సంస్థలలో బ్రోకింగ్ విభాగం లాభం రూ. 236 కోట్ల నుంచి రూ. 194 కోట్లకు నీరసించగా.. హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ లాభం 28 శాతం ఎగసి రూ. 545 కోట్లను దాటింది. -
ఐషర్ మోటార్స్ లాభం జూమ్
న్యూఢిల్లీ: ఆటో రంగ దిగ్గజం ఐషర్ మోటార్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 62 శాతం దూసుకెళ్లి రూ. 741 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 456 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2,973 కోట్ల నుంచి రూ. 3,913 కోట్లకు జంప్ చేసింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 2,416 కోట్ల నుంచి రూ. 3,006 కోట్లకు పెరిగాయి. ఈ కాలంలో వాణిజ్య వాహన భాగస్వామ్య సంస్థ వోల్వో ఐషర్ కమర్షియల్ వెహికల్ 13 శాతం వృద్ధితో 18,162 యూనిట్లను విక్రయించినట్లు ఐషర్ మోటార్స్ పేర్కొంది. కంపెనీ చరిత్రలోనే ఇవి అత్యధికంకాగా.. ద్విచక్ర వాహన విభాగం రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాలు సైతం 31 శాతం జంప్‌చేశాయి. 2,19,898 మోటార్ సైకిళ్లను విక్రయించింది. గత కొద్ది నెలలుగా ప్రవేశపెట్టిన కొత్త మోడళ్లు హంటర్ 350, సూపర్ మీటియోర్ 650కు అంతర్జాతీయంగా డిమాండ్ కనిపిస్తున్నట్లు కంపెనీ ఎండీ సిద్ధార్థ లాల్ తెలియజేశారు. ఫలితాల నేపథ్యంలో ఐషర్ మోటార్స్ షేరు ఎన్ఎస్ఈలో 2.2 శాతం నీరసించి రూ. 3,180 వద్ద ముగిసింది. -
ఎంఅండ్ఎం లాభం రూ. 1,528 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) రూ. 1,528 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో నమోదైన రూ. 1,335 కోట్లతో పోలిస్తే ఇది సుమారు 14 శాతం అధికం. ఇక క్యూ3లో ఆదాయం రూ. 15,349 కోట్ల నుంచి సుమారు 41 శాతం వృద్ధి చెంది రూ. 21,654 కోట్లకు చేరింది. ఆటో విభాగం, ఫార్మ్ విభాగాలు మెరుగైన పనితీరు కొనసాగిస్తున్నాయని శుక్రవారమిక్కడ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా ఎంఅండ్ఎం ఎండీ అనీష్ షా చెప్పారు. నిర్వహణ సామర్థ్యాలు మెరుగుపర్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని కంపెనీ ఈడీ రాజేశ్ జెజూరికర్ తెలిపారు. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మహీంద్రా గ్రూప్ నికర లాభం 34 శాతం పెరిగి రూ. 2,677 కోట్లకు చేరింది. ఆదాయం రూ. 23,594 కోట్ల నుంచి రూ. 30,620 కోట్లకు ఎగిసింది. కాగా, జహీరాబాద్ ప్లాంటులో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రానికి సంబంధించిన పనులు వచ్చే రెండు, మూడు నెలల్లో ప్రారంభమవుతాయని జెజూరికర్ తెలిపారు. సుమారు రెండేళ్లలో యూనిట్ పూర్తిగా అందుబాటులోకి రాగలదన్నారు. -
ఎల్ఐసీ లాభం హైజంప్
న్యూఢిల్లీ: లైఫ్ ఇన్యూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. నికర లాభం అత్యంత భారీగా దూసుకెళ్లి రూ. 8,334 కోట్లను అధిగమించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 235 కోట్లు ఆర్జించింది. నికర ప్రీమియం ఆదాయం రూ. 97,620 కోట్ల నుంచి రూ. 1,11,788 కోట్లకు జంప్ చేసింది. అయితే గత కాలంలో కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్కానందున ఫలితాలు పోల్చి చూడటం తగదని ఎల్ఐసీ పేర్కొంది. కాగా.. పెట్టుబడుల ఆదాయం రూ. 76,574 కోట్ల నుంచి రూ. 84,889 కోట్లకు ఎగసింది. అదానీ గ్రూప్‌పై.. క్యూ3లో వాటాదారుల నిధికి రూ. 2,000 కోట్లను ప్రొవిజన్లకింద బదిలీ చేయడంతో నికర లాభం రూ. 6,334 కోట్లుగా నమోదైనట్లు ఎల్ఐసీ చైర్మన్ ఎంఆర్ కుమార్ వెల్లడించారు. అదానీ గ్రూ ప్ యాజమాన్యంతో సమావేశం కానున్నట్లు వెల్లడించారు. కొద్ది రోజులుగా అదానీ గ్రూప్ కంపెనీలలో తలెత్తిన సంక్షోభంపై ఇన్వెస్టర్ బృందం ద్వారా వివరణను కోరనున్నట్లు తెలియజేశారు. ఫలితాల నేపథ్యంలో ఎల్ఐసీ షేరు ఎన్ఎస్ఈలో 0.5% పుంజుకుని రూ. 614 వద్ద ముగిసింది. -
నాట్కో మధ్యంతర డివిడెండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ కంపెనీ నాట్కో ఫార్మా డిసెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 22 శాతం తగ్గి రూ.62 కోట్లు సాధించింది. టర్నోవర్ రూ.591 కోట్ల నుంచి రూ.513 కోట్లకు పడిపోయింది. డిసెంబర్ త్రైమాసికానికి ఒక్కో షేరుకు రూ.1.25 మధ్యంతర డివిడెండ్ చెల్లించాలని బోర్డు నిర్ణయించింది. క్రితం ముగింపుతో పోలిస్తే నాట్కో షేరు ధర బీఎస్ఈలో గురువారం 0.38 శాతం క్షీణించి రూ.529.10 వద్ద స్థిరపడింది. -
హీరో లాభం రూ.721 కోట్లు
న్యూఢిల్లీ: హీరో మోటో కార్ప్ డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి రూ.721 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన లాభంతో పోలిస్తే 2.41 శాతం పెరిగింది. ఆదాయం స్వల్ప వృద్ధితో రూ.8,118 కోట్లుగా ఉంది. 12.40 లక్షల యూనిట్ల మోటారు సైకిళ్లను విక్రయించినట్టు సంస్థ ప్రకటించింది. వ్యయాలు రూ.7,217 కోట్ల నుంచి రూ.7,373 కోట్లకు చేరాయి. ‘‘మా మార్కెట్ వాటా కాస్తంత కోలుకుంది. వచ్చే కొన్ని త్రైమాసికాల్లో ముఖ్యంగా ప్రీమియం విభాగంలో కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణతో మార్కెట్ వాటా పెంచుకుంటామని అంచనా వేస్తున్నాం’’అని హీరో మోటోకార్ప్ సీఎఫ్‌వో నిరంజన్ గుప్తా తెలిపారు. తమ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం ‘విదా’ని వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా పలు పట్టణాలకు చేరువ చేస్తామన్నారు. -
హెచ్డీఎఫ్సీ లాభం అప్ క్యూ3లో రూ. 7,078 కోట్లు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ మార్టిగేజ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్- డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 15 శాతం పుంజుకుని రూ. 7,078 కోట్లకు చేరింది. స్టాండెలోన్ నికర లాభం సైతం రూ. 3,261 కోట్ల నుంచి రూ. 3,691 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ ఆదాయం 13 శాతం మెరుగై రూ. 4,840 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 3.5 శాతంగా నమోదయ్యాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.32 శాతం నుంచి 1.49 శాతానికి దిగివచ్చాయి. వడ్డీ రేట్ల ఎఫెక్ట్ ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు నేపథ్యంలో లాభదాయకత మందగించినట్లు హెచ్డీఎఫ్సీ వైస్‌చైర్మన్, సీఈవో కేకి మిస్త్రీ వెల్లడించారు. అయితే రుణాలను కొత్త రేట్లకు వేగంగా అనుసంధానిస్తున్నట్లు, ఈ ప్రభావం రుణాలపై తదుపరి త్రైమాసికం నుంచీ ప్రతిఫలించనున్నట్లు తెలియజేశారు. వ్యక్తిగత రుణ విభాగం 26 శాతం వృద్ధిని సాధించగా.. సగటు టికెట్(రుణ) పరిమాణం రూ. 35.7 లక్షలకు బలపడినట్లు వెల్లడించారు. రూ. 18 లక్షలకుపైగా వార్షిక ఆదాయంగల రుణగ్రహీతలు 52 శాతంగా తెలియజేశారు. గ్రూప్ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంకు విలీనంపై ఆర్బీఐ, ఎన్సీఎల్టీ నుంచి నిర్ణయాలు వెలువడవలసి ఉన్నట్లు పేర్కొన్నారు. -
టీసీఎస్ ఆదాయం అదుర్స్..కానీ ఉద్యోగుల్లో..!
సాక్షి, ముంబై: దేశీయ దిగ్గజ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) త్రైమాసిక ఫలితాల లాభాల్లో అంచనాలను మిస్ చేసింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం నాలుగు శాతం వృద్ధితో రూ.10,846 కోట్లకు పరిమితమైంది. లాభాలుపెరిగినప్పటికీ రూ.11,200 కోట్ల మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయింది. అయితే ఆదాయం విషయంలో మాత్రం దూసుకుపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కన్సాలిడేటెడ్ ఆదాయం 5.3 శాతం పెరిగి రూ.58,229 కోట్లకు చేరింది. జనవరి 9న క్యూ3ఎఫ్వై23 ఫలితాలను ప్రకటించిన కంపెనీ, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి కొనసాగుతున్నా, లాంగ్‌టర్మ్ గ్రోత్ ఔట్‌లుక్‌లో ధృడమైన వృద్ధి సాధిస్తామని ప్రకటించింది. అలాగే స్పెషల్ డివిడెండ్ రూ.67తోపాటు, 8 రూపాయల మధ్యంతర డివిడెండ్‌ను టీసీఎస్ సీఎండీ రాజేశ్ గోపినాథన్ ప్రకటించారు. 10 త్రైమాసికాల్లో ఇదే తొలిసారి మరోవైపు క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన సంస్థ హెడ్‌కౌంట్ భారీగా క్షీణించింది. 2,197 మంది ఉద్యోగులను తగ్గించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో టీసీఎస్ 28,238 మంది ఉద్యోగులను చేర్చుకుంది. ప్రస్తుతం తమ ఉద్యోగుల సంఖ్య 6,16,171 నుంచి 613,974 మందికి తగ్గిందని పేర్కొంది. 10 త్రైమాసికాల్లో ఈ స్థాయిల్లో తగ్గడం ఇదే తొలిసారి. ఐటీ పరిశ్రమలో ఆందోళన కలిగించే ఎలివేటెడ్ అట్రిషన్ స్వల్పంగా క్షీణించింది. అట్రిషన్ 21.3 శాతంగా ఉంది, వార్షిక ప్రాతిపదికన గత ఏడాది 21.5 శాతం నుండి స్వల్పంగా క్షీణించింది. రానున్న త్రైమాసికాల్లో ఇది మరింత తగ్గుతుందని చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ వెల్లడించారు. అయితే డిమాండ్ క్షీణించినట్టు కాదనీ, భారీ డిమాండ్‌తో ప్రస్తుతం చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నామన్నారు. కస్టమర్ సంతృప్తే ప్రధాన లక్క్ష్యంగా గత కొన్ని త్రైమాసికాలుగా ఫ్రెష్ టాలెంట్, నైపుణ్య శిక్షణమీద ఎక్కువ దృష్టి పెట్టామని లక్కాడ్ ఒక ప్రకటనలో తెలిపారు. -
ఎక్సైడ్ ఆదాయంలో వృద్ధి
కోల్‌కతా: బ్యాటరీ తయారీ సంస్థ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ సెప్టెంబర్ క్వార్టర్లో పనితీరు పరంగా ఫర్వాలేదనిపించింది. రూ.3,719 కోట్ల ఆదాయంపై రూ.246 కోట్ల లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే లాభం 5 శాతం, ఆదాయం 13 శాతం చొప్పున పెరిగాయి. ఎబిట్డా పెద్దగా మార్పులేకుండా రూ.412 కోట్లుగా ఉంది. ఫలితాలపై అధిక తయారీ వ్యయాల ప్రభావం కొనసాగినట్టు కంపెనీ తెలిపింది. అయినప్పటికీ ఎబిట్డా మార్జిన్‌ను 9.9 శాతం నుంచి 11.1 శాతానికి పెంచుకుంది. ప్రస్తుత త్రైమాసికం నుంచి లాభదాయకత మెరుగుపడుతుందని, తయారీ వ్యయాలపై అధిక ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గుతున్నట్టు కంపెనీ ఎండీ, సీఈవో సుబీర్ చక్రవర్తి తెలిపారు. బెంగళూరులో లిథియం అయాన్ సెల్ తయారీ కేంద్రం నిర్మాణానికి తన అనుబంధ సంస్థ ఎక్సైడ్ ఎనర్జీ సొల్యూషన్స్ భూమి పూజ చేసినట్టు చెప్పారు. -
అశోక్ లేలాండ్ లాభం రూ.199 కోట్లు
న్యూఢిల్లీ: అశోక్ లేలాండ్ సెప్టెంబర్ క్వార్టర్‌కు మెరుగైన ఫలితాలను ప్రకటించింది. రూ.199 కోట్ల లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.83 కోట్ల నష్టం రావడం గమనార్హం. ఆదాయం దాదాపు రెట్టింపై రూ.8,266 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.4,458 కోట్లుగా ఉంది. దేశీ మార్కెట్లో మధ్య, భారీ స్థాయి వాణిజ్య విక్రయాలు 25,475 యూనిట్లుగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలం వీటి విక్రయాలు 11,988 యూనిట్లుగా ఉన్నాయి. మార్కెట్ వాటా 9.6 శాతంగా ఉంది. స్వల్ప స్థాయి వాణిజ్య వాహనాల విక్రయాలు 28 శాతం పెరిగి 17,040 యూనిట్లుగా ఉన్నా యి. ఎగుమతులు 25 శాతం పెరిగి 2,780 యూనిట్లుగా నమోదయ్యాయి. ‘‘అంతర్జాతీయంగా మాంద్యం ధోరణలు ఉన్నా, దేశీ వాణిజ్య వాహన మార్కెట్లో వృద్ధి చక్కగా ఉంది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మంచి విక్రయాలు పరిశ్రమ వ్యాప్తంగా నమోదయ్యాయి’’అని అశోక్‌లేలాండ్ చైర్మన్ ధీరజ్ హిందుజా తెలిపారు. మెరుగైన ఉత్పత్తులు, ప్రత్యామ్నాయ ఇంధన ఆధారిత భవిష్యత్తు ఉత్పత్తుల తయారీకి అవసరమైన సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటామని ప్రకటించారు. -
బజాజ్ ఎలక్ట్రికల్స్ లాభం రూ.62 కోట్లు
న్యూఢిల్లీ: ఎలక్ట్రికల్ ఉత్పత్తులు, ఉపకరణాల తయారీ దిగ్గజం బజాజ్ ఎలక్ట్రికల్స్ సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో రూ.62 కోట్ల నికరలాభం ఆర్జించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.62.5 కోట్లు నమోదు చేసింది. టర్నోవర్ 6.81 శాతం తగ్గి రూ.1,159 కోట్లుగా ఉంది. కన్జూమర్ ప్రొడక్ట్స్ ఆదాయం 2.45 శాతం తగ్గి రూ.883 కోట్లు, లైటింగ్ సొల్యూషన్స్ విభాగం 3.73 శాతం క్షీణించి రూ.276 కోట్లు, ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ సెగ్మెంట్ 39.4 శాతం పడిపోయి రూ.67 కోట్లకు వచ్చి చేరింది. ఆర్డర్ బుక్ అక్టోబర్ 1 నాటికి రూ.1,554 కోట్లు ఉందని కంపెనీ వెల్లడించింది. క్రితం ముగింపుతో పోలిస్తే బజాజ్ ఎలక్ట్రికల్స్ షేరు ధర బీఎస్ఈలో మంగళవారం 0.47 శాతం పెరిగి రూ.1,158.55 వద్ద స్థిరపడింది. -
లాభాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్ (క్యూ2)లో నికర లాభం 59 శాతం జంప్‌చేసి రూ. 3,313 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం రూ. 20,271 కోట్ల నుంచి రూ. 23,080 కోట్లకు బలపడింది. నికర వడ్డీ ఆదాయం మరింత అధికంగా 34 శాతం ఎగసి రూ. 10,714 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 0.48 శాతం మెరుగై 3.33 శాతాన్ని తాకాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 8.11 శాతం నుంచి 5.31 శాతానికి, నికర ఎన్పీఏలు 2.83 శాతం నుంచి 1.16 శాతానికి దిగివచ్చాయి. మొండి రుణాలకు ప్రొవిజన్లు రూ. 2,754 కోట్ల నుంచి భారీగా తగ్గి రూ. 1,628 కోట్లకు పరిమితమయ్యాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 15.25 శాతంగా నమోదైంది. ఐవోబీ లాభం జూమ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐవోబీ) ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 33 శాతం జంప్‌చేసి రూ. 501 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 376 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 5,028 కోట్ల నుంచి రూ. 5,852 కోట్లకు ఎగసింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 10.66 శాతం నుంచి 8.53 శాతానికి, నికర ఎన్పీఏలు 2.77 శాతం నుంచి 2.56 శాతానికి దిగివచ్చాయి. వడ్డీ ఆదాయం రూ. 4,255 కోట్ల నుంచి రూ. 4,718 కోట్లకు బలపడింది. -
ఎయిర్టెల్ లాభం జూమ్
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్టెల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 89% జంప్‌చేసి రూ. 2,145 కోట్లను తాకింది. అనూహ్య రాబడిని మినహాయిస్తే రూ. 2,052 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) క్యూ2లో కేవలం రూ.11,340 కోట్లు ఆర్జించింది. 4జీ లాభదాయకత, వినియోగదారుపై సగటు ఆదాయం (ఏఆర్పీయూ), డేటా వినియోగం పుంజుకోవడం అధిక లాభాలకు దోహదం చేసింది. మొత్తం ఆదాయం సైతం 22% ఎగసి రూ. 34,527 కోట్లకు చేరింది. ఈ కాలంలో ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల కస్టమర్లను అధిగమించడంతోపాటు.. నిలకడైన పటిష్ట పనితీరును చూపగలిగినట్లు కంపెనీ పేర్కొంది. పరిశ్రమలోనే అత్యుత్తమంగా రూ. 190 ఏఆర్పీయూను సాధించింది. గత క్యూ2లో ఇది రూ. 153 మాత్రమే. 20 జీబీ వినియోగం: 5జీ ప్రారంభించనున్న నేపథ్యంలో మరింత ఉత్తమ సేవలు అందించగలమని ఎయిర్టెల్ సీఈవో గోపాల్ విఠల్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే చౌక ధరల కారణంగా తక్కువ ఆర్వోసీఈని నమోదు చేస్తున్నట్లు తెలియజేశారు. కంపెనీ 8 పట్టణాలలో 5జీ సేవలకు శ్రీకారం చుట్టింది. కాగా ప్రస్తుత సమీక్షా కాలంలో 1.78 కోట్లమంది 4జీ కస్టమర్లు లభించగా.. ఒక్కొక్కరి నెలవారీ సగటు డేటా వినియోగం 20.3 జీబీకి చేరింది. ఫలితాల నేపథ్యంలో ఎయిర్టెల్ షేరు 2 శాతం లాభపడి రూ. 832 వద్ద ముగిసింది. -
అదానీ టోటల్: ఆసక్తికర ఫలితాలు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) తొలి త్రైమాసికంలో ప్రయివేట్ రంగ కంపెనీ అదానీ టోటల్ గ్యాస్ ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. ఏప్రిల్-జూన్(క్యూ1)లో నికర లాభం దాదాపు యథాతథంగా రూ. 138 కోట్లకు చేరింది. ఆటోమొబైల్స్‌కు సీఎన్జీ విక్రయాలు 61 శాతం జంప్‌చేసి 109 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్లను తాకాయి. పైప్డ్ వంట గ్యాస్ అమ్మకాలు 3 శాతం పుంజుకుని 74 ఎంఎంఎస్సీఎంకు చేరాయి. అయితే సీఎన్జీ, వంటగ్యాస్ తయారీకి కొనుగోలు చేసిన సహజవాయు ధరలు మూడు రెట్లు ఎగసి రూ. 785 కోట్లకు చేరినట్లు కంపెనీ వెల్లడించింది. కాగా.. ఈ కాలంలో మొత్తం ఆదాయం రెట్టింపై రూ. 1,110 కోట్లను తాకింది. నిర్వహణా లాభం 6 శాతం బలపడి రూ. 228 కోట్లుగా నమోదైంది. చదవండి : OnePlus10T 5G: వన్‌ప్లస్ 10 టీ వచ్చేసింది..ఆఫర్ అదిరింది! -
హావెల్స్ లాభం రూ.243 కోట్లు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ గృహోపకరణాల కంపెనీ హావెల్స్ ఇండియా జూన్ త్రైమాసికానికి మిశ్రమ పనితీరు చూపించింది. రూ.243 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని ప్రకటించింది. కమోడిటీల ధరలు (ముడి సరుకులు) పెరిగిపోవడంతో మార్జిన్లు గణనీయంగా ప్రభావితమైనట్టు కంపెనీ తెలిపింది. ఫలితంగా అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.236 కోట్లతో పోలిస్తే కేవలం 3 శాతం వృద్ధికి పరిమితమైంది. ఆదాయం 62 శాతం వృద్ధితో రూ.4,244 కోట్లకు చేరింది. స్విచ్గేర్ల విభాగం నుంచి ఆదాయం 37 శాతం పెరిగి రూ.517 కోట్లుగా, కేబుల్స్ విభాగం ఆదాయం 48 శాతం పెరిగి రూ.1,193 కోట్ల చొప్పున నమోదైంది. ఇక లైటింగ్ అండ్ ఫిక్సర్స్ ఆదాయం 74 శాతం వృద్ధితో రూ.374 కోట్లుగా ఉంది. ఎలక్ట్రికల్ కన్జ్యూమర్ విభాగం ఆదాయం 45 శాతం పెరిగి రూ.839 కోట్లకు చేరింది. లయడ్స్ కన్జ్యూమర్ నుంచి ఆదాయం రెండు రెట్లు పెరిగి రూ.1,094 కోట్లుగా నమోదైంది. -
హెచ్‌యూఎల్ లాభాలు భళా!
న్యూఢిల్లీ: ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ హిందుస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్) 2022–23 ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికం (క్యూ1)లో మెరుగైన పనితీరును ప్రదర్శించింది. ముడిపదార్థాల ధరలు పెరిగినప్పటికీ, వ్యయాలను సమర్థవంతంగా అధిగమించింది. నికర లాభం 14 శాతం వృద్ధితో రూ.2,391 కోట్లుగా నమోదైంది. ఆదాయం సైతం 20 శాతం వృద్ధితో రూ.14,757 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో నికర లాభం రూ.2,100 కోట్లు, ఆదాయం రూ.12,260 కోట్ల చొప్పున ఉన్నాయి. మొత్తం వ్యయాలు 21% పెరిగి రూ.11,531 కోట్లకు చేరాయి. హోమ్‌కేర్ విభాగం 30 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఫ్యాబ్రిక్ వాష్, గృహ సంరక్షణ ఉత్పత్తుల విక్రయాలు జోరుగా సాగాయి. రెండంకెల విక్రయాలు జరిగాయి. బలమైన పనితీరు.. ‘‘సవాళ్లతో కూడిన వాతావరణం, అసాధారణ స్థాయిలో ద్రవ్యోల్బణం ప్రభావం వినియోగంపై ఉన్నప్పటికీ.. ఆదాయం, నికర లాభంలో బలమైన వృద్ధిని నమోదు చేశాం. వ్యాపారాన్ని కాపాడుకుంటూనే, మార్జిన్లను ఆరోగ్యకర స్థాయిలో కొనసాగించాం. ద్రవ్యోల్బణానికి సంబంధించి సమీప కాలంలో ఆందోళన ఉంది. అయితే, కమోడిటీల ధరలు కొంత దిగిరావడం, ప్రభుత్వం తీసుకున్న ద్రవ్య, పరపతి చర్యలు, మంచి వర్షాలు పరిశ్రమకు సానుకూలిస్తాయి. మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి భారత ఎఫ్ఎంసీజీ రంగం వృద్ధి అవకాశాల పట్ల నమ్మకంగా ఉన్నాం. స్థిరమైన, పోటీతో కూడిన, లాభదాయక, బాధ్యతాయుత వృద్ధిని నమోదు చేయడంపై దృష్టి కొనసాగుతుంది’’అని హెచ్‌యూఎల్ సీఈవో, ఎండీ సంజీవ్ మెహతా తెలిపారు. -
మెప్పించని ఎల్అండ్టీ....
న్యూఢిల్లీ: లార్సెన్ అండ్ టుబ్రో (ఎల్అండ్టీ) మార్చితో ముగిసిన త్రైమాసికంలో మోస్తరు పనితీరు నమోదు చేసింది. కన్సాలిడేటెడ్ నికర లాభం 10 శాతం వృద్ధితో రూ.3,620 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.3,293 కోట్లుగా ఉండడం గమనించాలి. ఆదాయం మాత్రం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.49,116 కోట్ల నుంచి రూ.53,366 కోట్లకు వృద్ధి చెందింది. ఒక్కో షేరుకు రూ.22 చొప్పున డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ బోర్డు సిఫారసు చేసింది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.1,92,997 కోట్ల విలువ చేసే ఆర్డర్లను సంపాదించినట్టు సంస్థ తెలిసింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 10 శాతం అధికం. -
లాభాల్లో టాటా ఎలక్సీ జోరు..ఇన్వెస్టర్లకు భారీ నజరానా..!
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ టెక్నాలజీ సర్వీసుల కంపెనీ టాటా ఎలక్సీ గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 39 శాతం జంప్‌చేసి రూ. 160 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 115 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 31 శాతంపైగా ఎగసి రూ. 682 కోట్లకు చేరింది. గతేడాదికిగాను వాటాదారులకు షేరుకి రూ. 42.5 చొప్పున తుది డివిడెండును ప్రకటించింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 49 శాతం పురోగమించి రూ. 550 కోట్లయ్యింది. 2020–21లో కేవలం రూ. 368 కోట్ల లాభం ఆర్జించింది. ఇక మొత్తం ఆదాయం 35 శాతం వృద్ధితో రూ. 2,471 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది రూ. 1,826 కోట్ల టర్నోవర్ మాత్రమే సాధించింది. ఫలితాల నేపథ్యంలో టాటా ఎలక్సీ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 2 శాతం బలపడి రూ. 7,830 వద్ద ముగిసింది. -
నిరుత్సాహ పరిచిన ఎయిర్టెల్, క్యూ3లో
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో నికరలాభం 3శాతం క్షీణించి రూ.830 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 854 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం 13 శాతం పుంజుకుని రూ.29,867 కోట్లను తాకింది. పెట్టుబడి వ్యయాలు రూ. 6,864 కోట్ల నుంచి రూ. 6,102 కోట్లకు తగ్గాయి. కాగా.. వివిధ రుణ సాధనాల ద్వారా రూ.7,500 కోట్లను సమీకరించే ప్రతిపాదనకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు ఎయిర్టెల్ వెల్లడించింది. వీటిని ఒకేసారి లేదా దశలవారీగా సమీకరించే వీలున్నట్లు తెలియజేసింది. గత వారం గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ రూ. 7,500 కోట్లతో కంపెనీలో 1.28 శాతం వాటా కొనుగోలుకి ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. -
సారేగామా... డివిడెండ్ రూ. 30
మ్యూజిక్ లేబుల్ కంపెనీ సారేగామా ఇండియా ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 38 శాతం ఎగసి దాదాపు రూ. 44 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 32 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం 12 శాతం వృద్ధితో రూ. 150 కోట్లను అధిగమించింది. వాటాదారులకు షేరుకి రూ. 30 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. కాగా.. క్యూ3లో మొత్తం వ్యయాలు 5 శాతం పెరిగి రూ. 100 కోట్లను దాటాయి. మ్యూజిక్ విభాగం ఆదాయం రూ. 133 కోట్లుకాగా.. ఫిల్మ్‌లు, టీవీ సీరియల్స్ నుంచి దాదాపు రూ. 16 కోట్లు లభించింది. ఈ కాలంలో కరణ్ జోహార్ రాఖీ రాణీకి ప్రేమ్ కహానీ మ్యూజిక్ హక్కులను సొంతం చేసుకుంది. విభిన్న భాషలలో 165 సినిమా పాటలను విడుదల చేసింది. షార్ట్ వీడియో యాప్ చింగారీతో గ్లోబల్ మ్యూజిక్ లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. నెస్లే, అమెజాన్, ఫోన్‌పే తదితర దిగ్గజాలు తమ బ్రాండ్ ప్రకటనలకు కంపెనీ పాటలను వినియోగించుకుంటున్నట్లు సారేగామా తాజాగా పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో సారేగామా షేరు బీఎస్ఈలో 1.3 శాతం నష్టంతో రూ. 5,267 వద్ద ముగిసింది. -
మెట్రో బ్రాండ్స్ లాభం హైజంప్
న్యూఢిల్లీ: ఫుట్‌వేర్ రిటైల్ చైన్ మెట్రో బ్రాండ్స్ లిమిటెడ్ నికర లాభం మూడో త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 55 శాతం జంప్‌చేసి రూ. 101 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 65 కోట్లు మాత్రమే ఆర్జించింది. మెట్రో షూస్ బ్రాండుగల కంపెనీ మొత్తం ఆదాయం సైతం 59 శాతం దూసుకెళ్లి దాదాపు రూ. 484 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 304 కోట్ల టర్నోవర్ నమోదైంది. మొత్తం వ్యయాలు 47 శాతం పెరిగి రూ. 363 కోట్లయ్యాయి. త్రైమాసిక ప్రాతిపదికన ఇవి అత్యుత్తమ గణాంకాలని కంపెనీ సీఈవో నిస్సన్ జోసఫ్ పేర్కొన్నారు. 2021 డిసెంబర్‌కల్లా కంపెనీ 140 పట్టణాలలో 629 స్టోర్లను నిర్వహిస్తోంది. వారాంతాన బీఎస్ఈలో మెట్రో బ్రాండ్స్ షేరు 1.5 శాతం బలపడి రూ. 508 వద్ద ముగిసింది -
విప్రో క్యూ3 ఫలితాలు: ఆదాయంలో భేష్..అక్కడ మాత్రం..!
ప్రముఖ దేశీయ ఐటీ సేవల దిగ్గజం విప్రో 2021 ఆర్థిక సంవత్సరానికిగాను మూడో త్రైమాసిక ఫలితాలను బుధవారం రోజున ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం రూ. 2419.8 కోట్లను పొందింది. క్రితం ఏడాదిలో ఇదే త్రైమాసికంలో సంస్థ లాభాలు రూ. 2649.7 కోట్లను గడించింది. ఈ క్యూ3లో నికరలాభాలు 8.67 శాతం తగ్గాయి. ఇక కంపెనీకి కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం క్యూ3లో రూ.15,278 కోట్లకు పెరిగింది. క్రితం ఏడాదిలో ఇదే త్రైమాసికంతో పోల్చితే 21.29 శాతం పెరిగింది. గత ఏడాది క్యూ3లో ఆపరేషన్స్ రెవెన్యూ రూ. 12, 596 కోట్లను నమోదు చేసింది. కాగా రెవెన్యూలో విశ్లేషకుల అంచనాల కంటే తక్కువ రాబడిని విప్రో నివేదించింది. ఈ క్యూ3లో కంపెనీ 30 శాతం రాబడి వస్తోందని విశ్లేషకులు నివేదించారు. ► కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన కంపెనీ ఆదాయం రూ. 20,313 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాదితో పోలిస్తే 3.3 శాతం వృద్ధిని నమోదుచేసింది. ఈ విషయంలో విశ్లేషకుల అంచనాలను అందుకుంది. ► ఐటీ సేవల విభాగంలో 2.3 శాతం వృద్ధితో 2,639.7 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని విప్రో సాధించింది. కంపెనీ ఒక్కో షేరుకు రూ.1 మధ్యంతర డివిడెండును ప్రకటించింది. ► మూడో త్రైమాసిక ఫలితాల పట్ల విప్రో సీఈఓ, ఎండీ థియర్రీ డెలాపోర్ట్ హర్షం వ్యక్తం చేశారు. వేతనాల వంటి నిర్వహణ ఖర్చులు పెరిగినప్పటికీ... బలమైన ఫలితాలు నమోదు చేశామని తెలిపారు. ఈరోజు బీఎస్ఈలో షేరు విలువ (0.40 శాతం నష్టపోయి రూ.691.85 వద్ద ముగిసింది. చదవండి: భారీగా తగ్గిన వంటనూనె ధరలు.. రిటైల్ మార్కెట్లో రేట్లు ఇలా..! -
డాక్టర్ రెడ్డీస్ లాభం 30 శాతం అప్..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ (డీఆర్ఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 992 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నమోదైన రూ. 762 కోట్లతో పోలిస్తే ఇది 30 శాతం అధికం. మరోవైపు, ఆదాయం రూ. 4,897 కోట్ల నుంచి రూ. 5,732 కోట్లకు చేరింది. ఇతర ఆదాయం, అన్ని మార్కెట్లలో విక్రయాలు భారీగా పెరగడం తదితర అంశాలు కంపెనీ మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించడానికి దోహదపడ్డాయి. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఇతర నిర్వహణ ఆదాయం రూ. 15 కోట్లు ఉండగా.. తాజా క్యూ2లో రూ. 170 కోట్లకు పెరిగింది. -
బజాజ్ ఆటో లాభం 71 శాతం అప్..
న్యూఢిల్లీ: వాహనాల తయారీ దిగ్గజం బజాజ్ ఆటో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 2,094 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నమోదైన రూ. 1,194 కోట్లతో పోలిస్తే ఇది 71 శాతం అధికం. ఇక ఆదాయం రూ. 7,442 కోట్ల నుంచి రూ. 9,080 కోట్లకు చేరింది. కేటీఎం ఏజీలో 46.5 శాతం వాటాలను పీరర్ బజాజ్ ఏజీలో 49.9 శాతం వాటా కోసం తమ అనుబంధ సంస్థ బజాజ్ ఆటో ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ మార్పిడి చేసుకున్నట్లు కంపెనీ తెలిపింది. దీనితో సుమారు రూ. 501 కోట్ల మేర ప్రయోజనం చేకూరిందని పేర్కొంది. రెండో త్రైమాసికంలో కంపెనీ మొత్తం 11,44,407 వాహనాలు విక్రయించింది. గత క్యూ2లో విక్రయించిన 10,53,337 యూనిట్లతో పోలిస్తే 9 శాతం వృద్ధి నమోదు చేసింది. -
టెక్ మహీంద్రా లాభం 26% అప్..
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా నికర లాభం 26 శాతం ఎగిసింది. రూ. 1,339 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో లాభం రూ. 1,065 కోట్లు. ఇక తాజా సమీక్షాకాలంలో ఆదాయం 16 శాతం వృద్ధి చెంది రూ. 10,881 కోట్లుగా నమోదైంది. జూన్ క్వార్టర్‌తో పోలిస్తే 6.4 శాతం పెరిగింది. ఇది దశాబ్ద కాలంలోనే గరిష్ట వృద్ధి. టెక్ మహీంద్రా షేరు ఒక్కింటికి రూ. 15 చొప్పున ప్రత్యేక డివిడెండ్ ప్రకటించింది. క్యూ2లో కొత్తగా 750 మిలియన్ డాలర్ల డీల్స్ కుదిరాయని, వీటిలో సింహభాగం డిజిటలైజేషన్కి సంబంధించినవే ఉన్నాయని టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నానీ తెలిపారు. రాబోయే రోజుల్లోనూ ఇదే తరహా పనితీరు సాధించగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే 15.2 శాతంగా నమోదైన నిర్వహణ లాభాల మార్జిన్‌ను ఇకపైనా అదే స్థాయిలో లేదా అంతకు మించి సాధించే అవకాశాలు ఉన్నాయని గుర్నానీ చెప్పారు. రెండు సంస్థల కొనుగోలు .. డిజిటల్ ఇంజినీరింగ్ కంపెనీ లోడ్‌స్టోన్‌తో పాటు మరో సంస్థను కొనుగోలు చేస్తున్నట్లు టెక్ మహీంద్రా తెలిపింది. ఇందుకోసం సుమారు 105 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 789 కోట్లు) వెచ్చిస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు, బ్రిటన్‌కు చెందిన ఉయ్ మేక్ వెబ్‌సైట్స్ (డబ్ల్యూఎండబ్ల్యూ)ని 9.4 మిలియన్ పౌండ్లకు (సుమారు రూ. 97 కోట్లు) కొనుగోలు చేసినట్లు వివరించింది. అట్రిషన్‌తో సమస్యలు.. నిపుణులకు డిమాండ్ నెలకొనడంతో అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలసలు) ఐటీ సంస్థలకు సమస్యాత్మకంగా తయారైందని గుర్నానీ తెలిపారు. అయితే, తమ సంస్థ దీన్ని ఎదుర్కొంటున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. టెక్ మహీంద్రాలో అట్రిషన్ రేటు తాజా క్యూ2లో 21 శాతానికి పెరిగింది. ఇది గత క్యూ2లో 14 శాతంగా ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో 17 శాతానికి చేరింది. హైదరాబాద్, బెంగళూరు, పుణె వంటి పెద్ద నగరాల్లో అట్రిషన్ రేటు అధికంగా ఉండగా.. నాగ్‌పూర్, భువనేశ్వర్ వంటి ప్రాంతాల్లో తక్కువ స్థాయిలో ఉందని గుర్నానీ చెప్పారు. సెప్టెంబర్ క్వార్టర్లో కంపెనీ 14,000 మంది పైచిలుకు ఉద్యోగులను తీసుకోవడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 1.41 లక్షలకు చేరినట్లు గుర్నానీ చెప్పారు. సోమవారం బీఎస్ఈలో టెక్ మహీంద్రా షేరు స్వల్పంగా పెరిగి రూ. 1,524 వద్ద క్లోజయ్యింది. -
ఇండియా సిమెంట్స్ లాభం.. డబుల్
న్యూఢిల్లీ: ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ కన్సాలిడేటెడ్ నికర లాభం జూన్ త్రైమాసికంలో రెట్టింపునకు పైగా పెరిగి రూ.46.63 కోట్లుగా నమోదైంది. విక్రయాల ద్వారా ఆదాయం సైతం 37 శాతం వృద్ధితో రూ.1,045 కోట్లకు చేరుకుంది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి లాభం రూ.20 కోట్లు, ఆదాయం రూ.763 కోట్లుగా ఉండడం గమనార్హం. ‘‘లాక్డౌన్లు, రవాణాపై ఆంక్షలు, సరఫరా పరంగా సమస్యలు, ప్రయాణాలపై ఆంక్షలు, సామాజికంగా భౌతిక తూరం తదితర చర్యలు జూన్ త్రైమాసికంలో కంపెనీ సాధారణ వ్యాపార కార్యకలాపాలపై ప్రభావం చూపించాయి’’ అని ఇండియా సిమెంట్స్ తెలిపింది. బీఎస్ఈలో ఇండియా సిమెంట్స్ షేరు 2 శాతం తగ్గి రూ.179 వద్ద క్లోజయింది. -
లాభాల్లో ఎయిర్టెల్, 15శాతం పెరిగిన ఆదాయం
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి క్వార్టర్లో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో రూ. 284 కోట్ల నికర లాభం ఆర్జించింది. దీనిలో గ్రూప్‌లోని ఒక అనుబంధ సంస్థకు చెందిన టెలికం టవర్ల విక్రయం ద్వారా లభించిన రూ. 30.5 కోట్లు కలసి ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 15,933 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గత క్యూ1లో ఏజీఆర్ బకాయిల ప్రొవిజనింగ్ చేపట్టడం ప్రభావం చూపింది. కాగా.. ప్రస్తుత సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం సైతం 15 శాతంపైగా ఎగసి రూ. 26,854 కోట్లను తాకింది. ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) రూ. 146కు మెరుగుపడింది. గత క్యూ1లో రూ. 138గా నమోదైంది. నిర్వహణ లాభ(ఇబిటా) మార్జిన్లు 48.9 శాతం నుంచి 49.1 శాతానికి బలపడ్డాయి. దేశీయంగా..: క్యూ1లో భారతీ ఎయిర్టెల్ దేశీ టర్నోవర్ 19 శాతం ఎగసి రూ. 18,828 కోట్లుగా నమోదైంది. మొబైల్ ఆదాయం 22 శాతం పుంజుకున్నట్లు కంపెనీ తెలియజేసింది. 51 లక్షల మంది 4జీ కస్టమర్లు కొత్తగా జత కలసినట్లు వెల్లడించింది. హోమ్ బిజినెస్‌లో కొత్తగా 2.85 లక్షల మంది కస్టమర్లు జత కలసినట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తం గా కస్టమర్ల సంఖ్య దాదాపు 47.4 కోట్లకు చేరినట్లు తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో ఎయిర్టెల్ షేరు 2.3 శాతం లాభపడి రూ. 578 వద్ద ముగిసింది. -
లాభాల్లో ప్రభుత్వ రంగ బ్యాంక్, కోట్లల్లో నికర లాభం
ప్రభుత్వ రంగ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 206 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో నమోదైన రూ. 135 కోట్లతో పోలిస్తే ఇది 53 శాతం అధికం. ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో బ్యాంకు రూ. 1,349 కోట్ల నష్టం ప్రకటించింది. మరోవైపు, క్యూ1లో ఆదాయం రూ. 6,727 కోట్ల నుంచి రూ. 6,246 కోట్లకు తగ్గింది. నికర వడ్డీ ఆదాయం దాదాపు గత క్యూ1 స్థాయిలో రూ. 2,135 కోట్లుగా నమోదైంది. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) 18.10 శాతం నుంచి 15.92 శాతానికి, నికర ఎన్పీఏలు 6.76 శాతం నుంచి 5.09 శాతానికి తగ్గాయి. బుధవారం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు సుమారు 1.4 శాతం క్షీణించి రూ. 24.45 వద్ద ముగిశాయి. -
ఎస్బీఐలైఫ్ ఇన్సూరెన్స్, కోవిడ్–19 క్లెయిములు భారీగా పెరిగాయ్
ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నికర లాభం 43 శాతం క్షీణించి రూ. 220 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 390 కోట్లు ఆర్జించింది. కోవిడ్–19 క్లెయిములకు చెల్లింపులు పెరగడం లాభాలను దెబ్బతీసినట్లు కంపెనీ పేర్కొంది. క్యూ1లో 8,956 క్లెయిములు నమోదైనట్లు వెల్లడించింది. ఇవి 2020–21 పూర్తి ఏడాదితో పోలిస్తే దాదాపు 1.3 రెట్లు అధికమని తెలియజేసింది. దీంతో నికర రీఇన్సూరెన్స్ రూ. 570 కోట్లుగా నమోదైంది. ప్రీమియంల తీరు క్యూ1లో ఎస్బీఐ లైఫ్ స్థూల రిటెన్ ప్రీమియం 10 శాతం పుంజుకుని రూ. 8,380 కోట్లను తాకింది. కొత్త బిజినెస్ ప్రీమియం 9 శాతం వృద్ధితో రూ. 3,350 కోట్లకు చేరగా.. వ్యక్తిగత విభాగంలో 37 శాతం అధికంగా రూ. 1,840 కోట్లను తాకింది. కొత్త బిజినెస్ విలువ(వీవోఎన్‌బీ) 52 శాతం జంప్‌చేసి రూ. 390 కోట్లయ్యింది. రూ. 1,390 కోట్ల వ్యక్తిగత రేటెడ్ ప్రీమియంతో కంపెనీ ప్రయివేట్ మార్కెట్లో 18.9 శాతం వాటాతో అగ్రస్థానంలో నిలిచినట్లు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ వివరించింది. నిర్వహణలోని ఆస్తులు 32 శాతం బలపడి రూ. 2.3 లక్షల కోట్లను తాకగా.. కోవిడ్ సంబంధ క్లెయిముల కోసం రూ. 440 కోట్ల అదనపు రిజర్వులను ఏర్పాటు చేసింది. చదవండి: అదిరిపోయే ఫీచర్లు, మాస్కులోనే మైక్, స్పీకర్లు ఇంకా -
ఇన్ఫీ.. అంచనాలు అప్
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం దాదాపు 23 శాతం ఎగసింది. రూ. 5,195 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 4,233 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం 18 శాతం పుంజుకుని రూ. 27,896 కోట్లకు చేరింది. గతంలో రూ. 23,665 కోట్ల టర్నోవర్ సాధించింది. కాగా.. ఈ ఏడాది జూన్ 25న ప్రారంభించిన ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌లో భాగంగా 9.8 మిలియన్ షేర్లను కొనుగోలు చేసినట్లు తెలియజేసింది. వీటి విలువ రూ. 1,542 కోట్లుకాగా.. ఒక్కో షేరుకీ రూ. 1,569 సగటు ధరలో బైబ్యాక్ చేసినట్లు వెల్లడించింది. బైబ్యాక్‌కు ప్రకటించిన గరిష్ట బైబ్యాక్ ధర రూ. 1,750. భారీ డీల్స్ పూర్తి ఏడాదికి ఆదాయ అంచనాలను ఇన్ఫోసిస్ ఎగువముఖంగా సవరించింది. 14–16 శాతం స్థాయిలో వృద్ధి సాధించగలమని తాజాగా అంచనా వేసింది. ఇంతక్రితం 12–14 శాతం పురోగతిని ఊహించిన సంగతి తెలిసిందే. క్యూ1లో 2.6 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 19,250 కోట్లు) విలువైన కాంట్రాక్టులను కుదుర్చుకుంది. డిజిటల్ విభాగంలో టాలెంట్‌కు భారీ డిమాండ్ ఉన్నట్లు ఇన్ఫోసిస్ సీవోవో ప్రవీణ్ రావు పేర్కొన్నారు. ఐటీ పరిశ్రమలో పెరుగుతున్న ఉద్యోగ వలస (అట్రిషన్) సమీపకాలంలో సవాళ్లు విసరనున్నట్లు అభిప్రాయపడ్డారు. డిమాండుకు అనుగుణంగా ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 35,000 మందిని కొత్తగా ఎంపిక చేసుకోనున్నట్లు తెలియజేశారు. అంచనాలకు అనుగుణమైన మార్జిన్లను సాధించగలమని భావిస్తున్నట్లు సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్ పేర్కొన్నారు. వ్యయ నియంత్రణ, నిపుణులను నియమించుకోవడం తదితర అంశాలు ఇందుకు సహకరించనున్నట్లు తెలియజేశారు. ఐటీ పోర్టల్‌కు దన్ను ఆదాయ పన్ను శాఖ కొత్త పోర్టల్‌లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను శీఘ్రగతిన పరిష్కరిస్తున్నట్లు క్యూ1 ఫలితాల విడుదల సందర్భంగా ఇన్ఫోసిస్ పేర్కొంది. పోర్టల్‌కు ప్రస్తుతం కంపెనీ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలియజేసింది. సమస్యల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు చేపట్టినట్లు తెలియజేసింది. భారీ సంఖ్యలో రిటర్నులు దాఖలవుతున్నాయని, పోర్టల్‌లోని పలు విభాగాలు ఇప్పటికే సవ్యంగా పనిచేస్తున్నట్లు వివరించింది. ఇప్పటివరకూ 10 లక్షల ఐటీఆర్‌లు దాఖలైనట్లు వెల్లడించింది. ఆధునిక ఆదాయ పన్ను ఫైలింగ్ విధానాల అభివృద్ధి కోసం 2019లో ఇన్ఫోసిస్ కాంట్రాక్టును పొందింది. రిటర్నుల ప్రాసెసింగ్ సమయాన్ని 63 రోజుల నుంచి ఒకేరోజుకి తగ్గించడం, వేగవంత రిఫండ్స్ తదితరాలకు వీలుగా పోర్టల్‌ను అభివృద్ధి చేయవలసి ఉంది. అభివృద్ధి చేసిన పోర్టల్ సర్వీసులు ఈ జూన్‌లో ప్రారంభమయ్యాయి. అయితే కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. మార్కెట్లు ముగిశాక ఇన్ఫోసిస్ ఫలితాలు ప్రకటించింది. ఎన్ఎస్ఈలో ఇన్ఫోసిస్ షేరు 2 శాతం లాభపడి రూ. 1,577 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 1,583–1,538 మధ్య ఊగిసలాడింది. క్యూ1 హైలైట్స్.. ► మొత్తం ఆదాయంలో డిజిటల్ విభాగం 54 శాతం వాటాను ఆక్రమిస్తోంది. వార్షిక ప్రాతిపదికన 42 శాతానికిపైగా వృద్ధిని సాధించింది. ► నిర్వహణ లాభ(ఇబిట్) మార్జిన్ 22.7 శాతం నుంచి 23.7 శాతానికి బలపడింది. ► డాలర్ల రూపేణా ఆదాయం 21.2 శాతం ఎగసి 378.2 కోట్ల డాలర్లను చేరింది. త్రైమాసిక ప్రాతిపదికన 4.7 శాతం పుంజుకుంది. ► ఈపీఎస్ దాదాపు 23 శాతం జంప్‌చేసి రూ. 12.24ను తాకింది. ► ఉద్యోగులకు ఈ జనవరిలో ఒకసారి, జూలైలో మరోసారి అదనపు చెల్లింపులు, ప్రమోషన్లు. ► 2,67,953కు కంపెనీ మొత్తం సిబ్బంది సంఖ్య. ఉద్యోగ వలస 13.9 శాతం. నమ్మకాన్ని పెంచాయ్ ఉద్యోగుల అంకితభావం, క్లయింట్లకున్న విశ్వాసం సహకారంతో గత దశాబ్ద కాలంలోనే వేగవంత వృద్ధిని సాధించగలిగాం. వార్షిక ప్రాతిపదికన 17 శాతం, త్రైమాసికవారీగా దాదాపు 5 శాతం చొప్పున పురోగమించాం. ఫైనాన్షియల్, రిటైల్, తయారీ, లైఫ్ సైన్సెస్ విభాగాల్లో కాంట్రాక్టులకు డిమాండ్ కనిపిస్తోంది. క్యూ1లో భారీ డీల్స్‌ను సంపాదించాం. ఉద్యోగుల నిబద్ధత, పటిష్ట ఫలితాలు వంటి అంశాలు ఆదాయ వృద్ధి అంచనాలను పెంచేందుకు నమ్మకాన్ని కలిగించాయి. – సలీల్ పరేఖ్, సీఈవో, ఎండీ, ఇన్ఫోసిస్ -
Tcs : రూ.9వేల కోట్లు దాటిన ఆదాయం!
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం టీసీఎస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 28.5 శాతం ఎగసి రూ. 9,008 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 7,008 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 18.5 శాతం పుంజుకుని రూ. 45,411 కోట్లకు చేరింది. గత క్యూ1లో రూ. 38,322 కోట్ల టర్నోవర్ నమోదైంది. భాగస్వామ్యాలు.. క్యూ1లో యూఎస్‌కు చెందిన బయోఫార్మా కంపెనీ డిజైన్, ఆచరణ సేవలకుగాను టీసీఎస్‌ను భాగస్వామిగా ఎంపిక చేసుకుంది. జర్మనీలోని అతిపెద్ద వాణిజ్య బ్యాంకులలో ఒకటైన నార్డ్ ఎల్బీ ఐటీ ట్రాన్స్ఫార్మేషన్ సేవలకు వ్యూహాత్మక భాగస్వామిగా టీసీఎస్‌ను నియమించుకుంది. కమిన్స్ ఇంక్ గ్లోబల్ కాంటాక్ట్ సెంటర్ ట్రాన్స్ఫార్మేషన్ ప్రోగ్రామ్ కోసం టీసీఎస్ సేవలకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ట్రావెల్ కంపెనీలలో ఒకటైన కార్నివాల్ కార్పొరేషన్ అప్లికేషన్ మేనేజ్మెంట్ సర్వీసులకు టీసీఎస్‌తో జట్టు కట్టింది. అంతేకాకుండా గ్లోబల్ హెచ్ఆర్ వ్యవస్థకు సంబంధించిన సిస్టమ్ ఇంటిగ్రేటర్ భాగస్వామిగానూ ఎంపిక చేసుకుంది. క్యూ1 మైలురాళ్లు.. ♦ నికరంగా 20,409 మంది ఉద్యోగులను నియమించుకుంది. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 5,09,058కి చేరింది. వెరసి 5 లక్షల మంది ఉద్యోగుల మైలురాయిని తొలిసారి అధిగమించింది. ♦ ఒక త్రైమాసికంలో 6 బిలియన్ డాలర్ల(రూ. 44,700 కోట్లు) ఆదాయాన్ని తొలిసారి సాధించింది. ♦ 8.1 బిలియన్ డాలర్ల విలువైన(టీసీవీ) కాంట్రాక్టులను సంపాదించింది. నిర్వహణ మార్జిన్లు 2 శాతం బలపడి 25.5 శాతాన్ని తాకాయి. నికర మార్జిన్లు 19.8 శాతంగా నమోదయ్యాయి. ♦ షేరుకి రూ. 7 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. జూలై 16 రికార్డ్ డేట్. ♦ ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు 8.6 శాతంగా నమోదైంది. ♦ ఉద్యోగుల్లో 70 శాతం మందికి వ్యాక్సినేషన్– సెప్టెంబర్‌కల్లా సిబ్బంది కుటుంబాలకూ వ్యాక్సిన్లు ♦ వార్షిక ప్రాతిపదికన వివిధ విభాగాలలో లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ 25.4 శాతం, రిటైల్, సీపీజీ 21.7 శాతం, బీఎఫ్ఎస్ఐ 19.3 శాతం, తయారీ 18.3 శాతం, టెక్నాలజీ 12.3 శాతం, కమ్యూనికేషన్స్, మీడియా 6.9 శాతం చొప్పున ఎగశాయి. ♦ ప్రాంతాలవారీగా.. ఉత్తర అమెరికా 15.8 శాతం, యూకే 16.3 శాతం, యూరోప్ 19.7 శాతం, లాటిన్ అమెరికా 16 శాతం, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా 25.2 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇక దేశీయ బిజినెస్ 25.3 శాతం, ఆసియా పసిఫిక్ 9.3 శాతం చొప్పున వృద్ధి చూపాయి. అయితే కరోనా మహమ్మారి నేపథ్యంలో త్రైమాసిక ప్రాతిపదికన చూస్తే ♦ దేశీ ఆదాయం 14.1% క్షీణత చవిచూసింది. మార్కెట్లు ముగిశాక ఫలితాలను ప్రకటించింది. షేరు 0.7% క్షీణించి రూ. 3,253 వద్ద ముగిసింది. -
డాక్టర్ రెడ్డీస్ లాభం రూ. 557 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్ఎల్) నికర లాభం 29% క్షీణించి రూ. 557 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఇది రూ.781 కోట్లు. మరోవైపు, ఆదాయం రూ. 4,336 కోట్ల నుంచి రూ. 4,608 కోట్లకు పెరిగింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ నికర లా భం (కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) రూ. 2,026 కోట్ల నుంచి రూ. 1,952 కోట్లకు తగ్గింది. అయితే, నికర అమ్మకాలు మాత్రం రూ. 16,357 కోట్ల నుంచి రూ. 18,420 కోట్లకు పెరిగాయి. 2020–21 పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ. 5 ముఖ విలువ గల షేరు ఒక్కింటిపై రూ. 25 మేర తుది డివిడెండ్ ఇవ్వాలని బోర్డు నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. కొత్త ఉత్పత్తులపై మరింత దృష్టి.. ఉత్పాదకతను పెంచుకోవడం, కొంగొత్త ఉత్పత్తుల ఆవిష్కరణపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు సంస్థ కో–చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ తెలిపారు. కోవిడ్–19కి సంబంధించి స్పుత్నిక్–వి టీకాను దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని, అలాగే కోవిడ్–19 చికిత్సలో తోడ్పడే పలు ఔషధాలను అభివృద్ధి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అమెరికా అవినీతి నిరోధక చట్టాలకు విరుద్ధంగా పలు దేశాల్లో తమ కంపెనీ తరఫున హెల్త్‌కేర్ నిపుణులకు చెల్లింపులు జరిపినట్లు వచ్చిన ఆరోపణల మీద స్వయంగా విచారణ చేపట్టినట్లు కంపెనీ వెల్లడించింది. ఇదే విషయాన్ని అటు అమెరికాలోని సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ కమిషన్‌కి, న్యాయ శాఖకు, ఇటు సెబీకి తెలిపింది. గ్లోబల్ జనరిక్స్ 6 శాతం అప్.. క్యూ4లో గ్లోబల్ జనరిక్స్ విభాగం ఆదాయం 6 శాతం పెరిగి రూ. 3,639 కోట్ల నుంచి రూ. 3,873 కోట్లకు చేరింది. కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్లో ఔషధాల ధరల తగ్గుదల కారణంగా ఆదాయం 3 శాతం క్షీణించి రూ. 1,750 కోట్లకు పరిమితమైంది. సమీక్షాకాలంలో ఉత్తర అమెరికా మార్కెట్లో డీఆర్ఎల్ 6 కొత్త ఔషధాలు ప్రవేశపెట్టింది. మరోవైపు, యూరప్ మార్కెట్లో ఆదాయాలు 15 శాతం పెరగ్గా, భారత్‌లో 23 శాతం పెరిగాయి. అటు వర్ధమాన మార్కెట్లలో ఆదాయం 10 శాతం వృద్ధి చెందింది. ఇక ఫార్మా సర్వీసులు, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ (పీఎస్‌ఏఐ) విభాగం ఆదాయాలు క్యూ4లో వార్షికంగా 10 శాతం వృద్ధితో రూ. 790 కోట్లుగా నమోదయ్యాయి. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో డాక్టర్ రెడ్డీస్ షేరు 2% క్షీణించి రూ. 5,196 వద్ద ముగిసింది. -
హెచ్డీఎఫ్సీ పనితీరు భళా
ముంబై: ప్రయివేట్ రంగ మార్టిగేజ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ గతేడాది(2020–21) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 31 శాతం ఎగసి రూ. 5,669 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో రూ. 4,342 కోట్లు ఆర్జించింది. ఇక క్యూ4లో స్టాండెలోన్ నికర లాభం 42 శాతం జంప్‌చేసి రూ. 3,180 కోట్లకు చేరింది. వాటాదారులకు షేరుకి రూ. 23 చొప్పున తుది డివిడెండును హెచ్డీఎఫ్సీ బోర్డు ప్రకటించింది. ఇందుకు జూన్ 1 రికార్డ్ డేట్‌గా తెలియజేసింది. పూర్తి ఏడాదికి మార్చితో ముగిసిన పూర్తిఏడాదికి హెచ్డీఎఫ్సీ స్టాండెలోన్ నికర లాభం రూ. 17,770 కోట్ల నుంచి రూ. 12,027 కోట్లకు వెనకడుగు వేసింది. ఈ కాలంలో రూ. 2,788 కోట్లమేర పన్ను చెల్లింపులను చేపట్టింది. కాగా.. బంధన్ బ్యాంకుతో గృహ ఫైనాన్స్ విలీనం కారణంగా లాభాలను పోల్చతగదని హెచ్డీఎఫ్సీ పేర్కొంది. గతేడాది తొలి అర్ధభాగంలో వ్యక్తిగత రుణ విభాగం మందగించినట్లు కంపెనీ వైస్‌చైర్మన్, సీఈవో కేకి మిస్త్రీ పేర్కొన్నారు. అయితే ద్వితీయార్ధంలో పటిష్ట రికవరీ నమోదైనట్లు తెలియజేశారు. దీంతో అక్టోబర్–డిసెంబర్ మధ్య వ్యక్తిగత రుణ మంజూరీ 42 శాతం పెరిగినట్లు వెల్లడించారు. ఇది క్యూ4లో మరింత అధికమై 60 శాతాన్ని తాకినట్లు తెలియజేశారు. కాగా.. బోర్డు ఎంపికమేరకు 2021 మే 7 నుంచి మిస్త్రీ మరో మూడేళ్లపాటు ఎండీగా బాధ్యతలు నిర్వహించనున్నారు. మార్జిన్లు 3.5 శాతం మార్చికల్లా హెచ్డీఎఫ్సీ నికర వడ్డీ మార్జిన్లు 3.5 శాతంగా నమోదయ్యాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 22.2 శాతాన్ని తాకింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 1.99 శాతం నుంచి 1.98 శాతానికి స్వల్పంగా తగ్గాయి. ప్రొవిజన్లు రూ. 13,025 కోట్లకు చేరాయి. వ్యక్తిగత పోర్ట్‌ఫోలియో ఎన్పీఏలు 0.99 శాతంకాగా, వ్యక్తిగతేతర రుణ విభాగంలో 4.77 శాతంగా నమోదయ్యాయి. కోవిడ్–19 నేపథ్యంలో మార్గదర్శకాలకు మించి రూ. 7,534 కోట్లమేర అదనపు ప్రొవిజన్లు చేపట్టినట్లు మిస్త్రీ వెల్లడించారు. షేరు అప్: షేరు ఎన్ఎస్ఈలో 2.5 శాతం బలపడి రూ. 2,491 వద్ద ముగిసింది. తొలుత రూ. 2,507 వరకూ జంప్‌చేసింది. ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో కలిపి సుమారు 50.54 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. -
కాగ్నిజెంట్ క్యూ1 ఫలితాలు భేష్
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం కాగ్నిజెంట్ ఈ ఆర్థిక సంవత్సరం(2021) తొలి క్వార్టర్లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ1(జనవరి–మార్చి)లో నికర లాభం దాదాపు 38 శాతం జంప్‌చేసి 50.5 కోట్ల డాలర్ల(సుమారు రూ. 3,737 కోట్లు)ను తాకింది. గతేడాది(2020) తొలి త్రైమాసికంలో 36.7 కోట్ల డాలర్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం 4.2 శాతం పెరిగి 440 కోట్ల డాలర్ల(రూ. 32,560 కోట్లు)కు చేరింది. కంపెనీ జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. డిసెంబర్‌తో ముగిసే పూర్తి ఏడాదికి ఆదాయంలో 7–9 శాతం పురోగతిని అంచనా వేస్తోంది. యూఎస్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే కంపెనీకి దేశీయంగా 2 లక్షల మందికిపైగా ఉద్యోగులున్న సంగతి తెలిసిందే. క్యూ1లో డిజిటల్ విభాగంలో అభివృద్ధి, అంతర్జాతీయంగా విస్తరణ, కాగ్నిజెంట్ బ్రాండుకు ప్రాచుర్యం వంటి అంశాలను విజయవంతంగా పూర్తి చేసినట్లు కాగ్నిజెంట్ సీఈవో బ్రియాన్ హంఫ్రీస్ పేర్కొన్నారు. ప్రస్తుతం కాగ్నిజెంట్ 2,96,500 మంది ఉద్యోగులున్నారు. 2021పై కంపెనీ ఆశావహ అంచనాల్లో ఉంది. -
ఐడీబీఐ బ్యాంక్ టర్న్అరౌండ్
ముంబై: ప్రయివేట్ రంగ సంస్థ ఐడీబీఐ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం(2020–21)లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. రూ. 1,359 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2019–20) రూ. 12,887 కోట్ల నికర నష్టం నమోదైంది. వెరసి ఐదేళ్ల తరువాత టర్న్అరౌండ్ ఫలితాలు ప్రకటించింది. ఇక గతేడాది చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లో నికర లాభం 4 రెట్లు ఎగసి రూ.512 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది క్యూ4లో రూ. 135 కోట్లు మాత్రమే ఆర్జించింది. 2017 మేలో ఆర్బీఐ విధించిన దిద్దుబాటు చర్యల(పీసీఏ) నుంచి సైతం మార్చిలో బయటపడినట్లు ఎల్ఐసీ నియంత్రణ లోని ఐడీబీఐ బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. బ్యాంక్ అనుసరించిన టర్న్అరౌండ్ వ్యూహాలు ట్రాన్స్‌ఫార్మేషన్‌కు బాటను ఏర్పరచినట్లు బ్యాంక్ తెలియజేసింది. కాగా.. క్యూ4లో నికర వడ్డీ ఆదాయం 38 శాతం ఎగసి రూ. 3,240 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 1.34 శాతం బలపడి 5.14 శాతానికి చేరాయి. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం 166 కోట్ల నుంచి రూ. 548 కోట్లకు జంప్ చేసింది. ఈ మార్చి త్రైమాసికంతో కలిపి వరుసగా ఐదు క్వార్టర్లపాటు బ్యాంకు లాభాలు ఆర్జించినట్లు ఐడీబీఐ ఎండీ, సీఈవో రాకేష్ శర్మ వివరించారు. ఎన్పీఏలు తగ్గాయ్: మార్చికల్లా ఐడీబీఐ బ్యాంక్ స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 27.53% నుంచి 22.37%కి బలహీనపడ్డాయి. ఇదే విధంగా నికర ఎన్పీఏలు 4.19% నుంచి 1.97%కి భారీగా తగ్గాయి. అయితే మొండి ప్రొవిజన్లు రూ. 1,738 కోట్ల నుంచి రూ. 2,367 కోట్లకు పెరిగాయి. కోవిడ్ సెకండ్ వేవ్కుగాను రూ. 500 కోట్లమేర ప్రొవిజన్లు చేపట్టినట్లు బ్యాంకు తెలియజేసింది. టైర్–1 పెట్టుబడులు 13.06%కి, సీఆర్ఏఆర్ 15.59 శాతానికి మెరుగుపడినట్లు బ్యాంక్ పేర్కొంది. క్యూ4లో తాజా మొండిబాకీలు రూ. 2,281 కోట్లకు చేరగా.. రికవరీలు రూ. 1,233 కోట్లుగా నమోదయ్యాయి. ఫలితాల నేపథ్యంలో బ్యాంక్ షేరు 3 శాతం జంప్‌చేసి రూ. 36.25 వద్ద ముగిసింది. -
హెచ్‌సీఎల్ టెక్ లాభం 2,962 కోట్లు
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ గత ఆర్థిక సంవత్సరం(2020–21) చివరి త్రైమాసికంలో రూ. 2,962 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఇది 6 శాతం తక్కువకాగా.. అంతక్రితం ఏడాది క్యూ4(జనవరి–మార్చి)లో రూ. 3,154 కోట్లు ఆర్జించింది. యూఎస్ అకౌంటింగ్ ప్రమాణాల ప్రకారం ఆదాయం దాదాపు 6 శాతం పుంజుకుని 19,642 కోట్లను తాకింది. ఇక డాలర్ల రూపేణా నికర లాభం 5 శాతం క్షీణించి 41 కోట్ల డాలర్లకు పరిమితంకాగా.. ఆదాయం 6 శాతం పెరిగి 270 కోట్ల డాలర్లకు చేరింది. రికార్డ్: మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి హెచ్‌సీఎల్ టెక్ నికర లాభం 17.6% పుంజుకుని రూ. 13,011 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 6.7 శాతం బలపడి రూ. 75,379 కోట్లకు చేరింది. డాలర్ల రూపేణా నికర లాభం 13% పెరిగి 176 కోట్ల డాలర్లను తాకగా.. ఆదాయం 1,017.5 కోట్ల డాలర్లకు చేరింది. వాటాదారులకు షేరుకి రూ. 6 డివిడెండును ప్రకటించింది. దీనికి జతగా.. ఆదాయం తొలిసారి 10 బిలియన్ డాలర్ల మైలురాయిని అధిగమించడంతో మరో రూ. 10ను ప్రత్యేక మధ్యంతర డివిడెండుగా ప్రకటించింది. వెరసి వాటాదారులకు షేరుకి రూ. 16 చొప్పున చెల్లించనుంది. దీంతో గతేడాదికి మొత్తం రూ. 26 డివిడెండ్ చెల్లించినట్లయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22)లో ఆదాయం రెండంకెల వృద్ధిని సాధించే వీలున్నట్లు కంపెనీ అంచనా వేస్తోంది. షేరు ఫ్లాట్: మార్కెట్లు ముగిశాక హెచ్‌సీఎల్ టెక్ ఫలితాలు విడుదల చేసింది. ఎన్ఎస్ఈలో షేరు 0.6% నీరసించి రూ. 957 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ.975–950 మధ్య ఊగిసలాడింది. త్రైమాసిక ప్రాతిపదికన క్యూ4లో ఆదాయం 2.5 శాతం పుంజుకుంది. కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 3.1 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్ లభించాయి. విభిన్న విభాగాల నుంచి మొత్తం 19 భారీ డీల్స్‌ను కుదుర్చుకున్నాం. తద్వారా కొత్త ఏడాదిలోకి ఉత్సాహంగా అడుగుపెట్టాం. – సి.విజయ్‌కుమార్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ప్రెసిడెంట్, సీఈవో -
ఫేస్బుక్ ఇండియా లాభం రెట్టింపు
సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ఇండియా కంపెనీ గత ఆర్థిక సంవత్సరం(2019–20)లో రూ.1,277 కోట్ల ఆదాయం ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2018–19)లో ఆర్జించిన ఆదాయం (రూ.893 కోట్లు)తో పోల్చితే 43 శాతం వృద్ధి సాధించామని ఫేస్బుక్ ఇండియా తెలిపింది. నికర లాభం రూ.65 కోట్ల నుంచి రెట్టింపై (107 శాతం వృద్ధితో) రూ.136 కోట్లకు పెరిగిందని పేర్కొంది. భారత కార్యకలాపాల కోసం ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగిస్తామని ఫేస్బుక్ వెల్లడించింది. చిన్న, పెద్ద వ్యాపారాలు ఆర్థిక రికవరీ సాధించడంలో ఇతోధికంగా తోడ్పాటునందిస్తామని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, వాట్సాప్‌లను 250 కోట్లమంది ఉపయోగిస్తున్నారు. కోటి మంది యాక్టివ్ అడ్వర్టైజర్లున్నారు. (శాంసంగ్ మేకిన్ ఇండియా ఉత్పత్తులు) -
దివీస్ ల్యాబ్స్ Q2 భళా
ముంబై: ఫార్మా రంగ హైదరాబాద్ కంపెనీ దివీస్ ల్యాబొరేటరీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో కంపెనీ నికర లాభం 45 శాతానికిపైగా జంప్ చేసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 519.6 కోట్లను తాకింది. నికర అమ్మకాలు సైతం 21 శాతం పెరిగి రూ. 1,749 కోట్లను అధిగమించాయి. ఈ కాలంలో కంపెనీ కార్యకలాపాలు సాధారణ స్థాయికి చేరినట్లు దివీస్ ల్యాబ్స్ ఫలితాల విడుదల సందర్భంగా తెలియజేసింది. పీబీటీ జూమ్ క్యూ2లో దివీస్ ల్యాబ్స్ పన్నుకు ముందు లాభం(పీబీటీ) 42 శాతం ఎగసి రూ. 693 కోట్లను దాటింది. మొత్తం పన్ను వ్యయాలు దాదాపు 33 శాతం అధికంగా రూ. 174 కోట్లకు చేరాయి. ఈ కాలంలో రూ. 16 కోట్లమేర ఫారెక్స్ నష్టాలు నమోదైనట్లు దివీస్ వెల్లడించింది. ప్రస్తుత పెట్టుబడుల వ్యయ ప్రణాళికలు కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా మరో రూ. 400 కోట్లను వెచ్చించనున్నట్లు తెలియజేసింది. తద్వారా కస్టమ్ సింథసిస్ ప్రాజెక్టులలో కొత్త బిజినెస్ అవకాశాలను అందుకోనున్నట్లు పేర్కొంది. వీటిని త్వరితగతిన పూర్తి చేయవలసి ఉన్నట్లు వివరించింది. షేరు ఇలా ఏపీఐలు, ఇంటర్మీడియెట్స్ తదితర తయారీ కంపెనీ దివీస్ ల్యాబ్స్.. పలు దేశాలకు ప్రొడక్టులను ఎగుమతి చేస్తోంది. కాగా.. శుక్రవారం బీఎస్ఈలో దివీస్ ల్యాబ్స్ షేరు 1 శాతం బలపడి రూ. 3,238 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 3,265 వద్ద గరిష్టాన్ని తాకగా.. 3,189 దిగువన కనిష్టానికి చేరింది. ఈ ఏడాది ఇప్పటివరకూ దివీస్ షేరు 75 శాతంపైగా లాభపడటం గమనార్హం. -
ఎస్బీఐ లాభం 55% జూమ్
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ అగ్రగామి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (2020–21, క్యూ2)లో ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన (అనుబంధ సంస్థలన్నింటితో కలిపి) నికర లాభం రూ.5,246 కోట్లకు ఎగబాకింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.3,375 కోట్లతో పోలిస్తే 55 శాతం దూసుకెళ్లింది. మొత్తం ఆదాయం సైతం రూ.89,348 కోట్ల నుంచి రూ. 95,374 కోట్లకు పెరిగింది. దాదాపు 7 శాతం వృద్ధి చెందింది. ప్రధానంగా మొండిబాకీలు భారీగా తగ్గుముఖం పట్టడం లాభాల జోరుకు దోహదం చేసింది. స్టాండెలోన్‌గా చూస్తే... బ్యాంకింగ్ కార్యకలాపాలు మాత్రమే (స్టాండెలోన్‌గా) లెక్కలోకి తీసుకుంటే ఎస్బీఐ క్యూ2లో రూ.4,574 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది క్యూ2లో లాభం రూ. 3,012 కోట్లతో పోలిస్తే 52 శాతం వృద్ధి చెందింది. ఇక మొత్తం స్టాండెలోన్ ఆదాయం 3.5 శాతం పెరుగుదలతో రూ.72,851 కోట్ల నుంచి రూ. 75,342 కోట్లకు ఎగిసింది. నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) 15 శాతం వృద్ధితో రూ. 24,600 కోట్ల నుంచి రూ.28,181 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం (అసాధారణ అంశాలను తీసివేసిన తర్వాత) 12 శాతం ఎగబాకి రూ.14,714 కోట్ల నుంచి రూ.16,460 కోట్లకు పెరిగింది. ఇక నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) కూడా సెప్టెంబర్ క్వార్టర్లో 3.34 శాతానికి మెరుగుపడింది. గతేడాది ఇదే క్వార్టర్లో ఎన్ఐఎం 3.22 శాతంగా నమోదైంది. మొండిబాకీలు దిగొచ్చాయ్... ఈ ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో ఎస్బీఐ మొండిబాకీలు (ఎన్పీఏ) భారీగా తగ్గుముఖం పట్టాయి. మొత్తం రుణాల్లో స్థూల ఎన్పీఏలు 5.58 శాతానికి (పరిమాణం పరంగా రూ.1.25 లక్షల కోట్లు) తగ్గాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో ఇవి 7.19 శాతంగా (రూ.1.61 లక్షల కోట్లు) నమోదయ్యాయి. ఇక నికర ఎన్పీఏలు కూడా 2.79 శాతం నుంచి 1.59 శాతానికి దిగొచ్చాయి. కాగా, ఈ ఏడాది సెప్టెంబర్ 3న ఎన్పీఏల విభజనపై సుప్రీం కోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాల ప్రకారం లెక్కగడితే స్థూల ఎన్పీఏలు 5.88 శాతంగా, నికర ఎన్పీఏలు 2.08 శాతంగా ఉంటాయని ఎస్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తం కేటాయింపులు (ప్రొవిజనింగ్) 21.74 శాతం తగ్గుదలతో రూ.15,187 కోట్ల నుంచి రూ.11,886 కోట్లకు దిగొచ్చాయి. క్యూ2లో రుణవృద్ధి 6 శాతంగా నమోదుకాగా, డిపాజిట్లు 14.41 శాతం వృద్ధి చెందాయి. ఈ క్యూ2లో కొత్తగా రూ.2,756 కోట్ల విలువైన రుణాలు మొండిబాకీలుగా మారాయి. గతేడాది ఇదే క్వార్టర్లో కొత్తగా మొండిబాకీలుగా మారిన రుణాల పరిమాణం రూ.8,805 కోట్లుగా ఉంది. ఎన్పీఏలకు ప్రొవిజన్ కవరేజీ రేషియో క్యూ2లో 81.23 శాతం నుంచి 88.19 శాతానికి భారీగా మెరుగుపడింది. ఇప్పటివరకూ రూ.6,495 కోట్ల రుణాలకు సంబంధించి వన్‌టైమ్ పునర్వ్యవస్థీకరణ దరఖాస్తులను బ్యాంక్ అందుకుంది. వీటిలో రిటైల్ రుణాలు రూ.2,400 కోట్లు కాగా, మిగినవి కార్పొరేట్ రుణాలు. అందులోనూ రూ.2,400 కోట్లు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా కంపెనీలవేనని బ్యాంక్ ఎండీ (రిటైల్, డిజిటల్ బ్యాంకింగ్) సీఎస్ షెట్టి చెప్పారు. ఫలితాల నేపథ్యంలో బుధవారం బీఎస్ఈలో ఎస్బీఐ షేరు 1.12 శాతం లాభపడి రూ. 207 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో (ఇంట్రాడేలో) రూ.198 కనిష్ట స్థాయిని, రూ.209 గరిష్టాన్ని తాకింది. పేటీఎం ఎస్బీఐ కార్డ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ఎస్బీఐ కార్డ్, డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్ పేటీఎం చేతులు కలిపాయి. ఇందులో భాగంగా ఇరు సంస్థలు కలిసి పేటీఎం ఎస్బీఐ కార్డ్, పేటీఎం ఎస్బీఐ కార్డ్ సెలెక్ట్ పేరుతో తదుపరితరం క్రెడిట్ కార్డ్స్‌ను వీసా ప్లాట్‌ఫాంపై అందుబాటులోకి తెచ్చాయి. ఎస్బీఐ కార్డ్ యాప్‌తోపాటు పేటీఎం యాప్‌లోనూ ఈ కార్డులను నియంత్రించే సౌకర్యం ఉంది. కస్టమర్లు ఈ కార్డు ద్వారా పేటీఎం మాల్, మూవీ, ట్రావెల్ టికెట్లపై 5% క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. మా అంచనాల ప్రకారం ఆర్థిక కార్యకలాపాల్లో మళ్లీ పురోగతి నెలకొంది. చాలా కంపెనీలు కోవిడ్‌కు ముందున్నప్పటి కార్యకలాపాల స్థాయిల్లో 70–80 శాతాన్ని చేరుకున్నట్లు కనబడుతోంది. ట్రాక్టర్లతో సహా వాహన రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ రికవరీ సంకేతాలకు ఇది నిదర్శనం. కొత్త మొండిబకాయిలు ఎక్కువగా వ్యవసాయం, చిన్న మధ్యతరహా పరిశ్రమల రంగంలోనే నమోదయ్యాయి. కాగా, ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి మరో రూ.13,000 కోట్ల విలువైన రుణ పునర్వ్యవస్థీకరణ వినతులు రావచ్చని అంచనా వేస్తున్నాం. – దినేష్ ఖారా, ఎస్బీఐ చైర్మన్ -
ఎస్బీఐ నికర లాభం జూమ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ) ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. స్టాండెలోన్ ప్రాతిపదికన ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో నికర లాభం 52 శాతం ఎగసింది. రూ. 4,574 కోట్లను అధిగమించింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 14.6 శాతం వృద్ధితో రూ. 28,182 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 3.4 శాతం పెరిగి రూ. 75,342 కోట్లకు చేరింది. జీవిత బీమా అనుబంధ సంస్థలో వాటా విక్రయం కారణంగా ప్రొవిజన్లకు ముందు నిర్వహణ లాభం మెరుగుపడినట్లు బ్యాంక్ పేర్కొంది. పన్నుకుముందు లాభం 25 శాతం పుంజుకుని రూ. 6,341 కోట్లను దాటింది. ప్రొవిజన్లు 23 శాతం తక్కువగా రూ. 10,118 కోట్లకు చేరాయి. ఎన్పీఏలు ఓకే క్యూ2లో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 5.44 శాతం నుంచి 5.28 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు సైతం 1.86 శాతం నుంచి 1.59 శాతానికి క్షీణించాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎస్బీఐ షేరు ఎన్ఎస్ఈలో 0.7 శాతం క్షీణించి రూ. 203 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 206 వద్ద గరిష్టాన్ని తాకగా.. 201 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. -
డాక్డర్ రెడ్డీస్ ల్యాబ్ నికర లాభం డౌన్
ఫార్మా రంగ హైదరాబాద్ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఈ ఏడాది క్యూ2(జులై- ఆగస్ట్)లో నికర లాభం30 శాతం క్షీణించి రూ. 762 కోట్లకు పరిమితమైంది. అయితే మొత్తం ఆదాయం 2 శాతం పుంజుకుని రూ. 4,897 కోట్లను తాకింది. ఇబిటా 11 శాతం తక్కువగా రూ. 1,276 కోట్లుగా నమోదైంది. కాగా.. త్రైమాసిక ప్రాతిపదికన నికర లాభం 32 శాతం పుంజుకున్నట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ పేర్కొంది. ఇదేవిధంగా ఆదాయంలో 11 శాతం వృద్ధి సాధించినట్లు తెలియజేసింది. ఈ నెల 22న కంపెనీపై సైబర్ అటాక్ జరిగిన నేపథ్యంలో అన్ని కీలక కార్యకలాపాలనూ తగిన నియంత్రణతో తిరిగి ప్రారంభించినట్లు తెలియజేసింది. షేరు ఓకే ఫలితాల నేపథ్యంలో డాక్టర్ రెడ్డీస్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 1 శాతం వెనకడుగుతో రూ. 5,053 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 5,150 వద్ద గరిష్టాన్ని తాకగా.. రూ. 4,990 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. కాగా.. ఈ ఏడాది క్యూ2లో అన్ని మార్కెట్లలోనూ వృద్ధిని సాధించగలిగినట్లు ఫలితాల విడుదల సందర్భంగా డాక్టర్ రెడ్డీస్ సహచైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రొడక్టివిటీ మెరుగుపడటంతో ఆర్‌వోసీఈ బలపడినట్లు తెలియజేశారు. కోవిడ్-19కు ఇప్పటికే విడుదలైన ప్రొడక్టులకుతోడు తమ రీసెర్చ్ టీమ్ మరిన్ని ఉత్పత్తులు, నివారణ పద్ధతులపై పరిశోధన చేస్తున్నట్లు వివరించారు. మార్జిన్లు వీక్ క్యూ2లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ స్థూల మార్జిన్లు 3.6 శాతం క్షీణించి 53.9 శాతానికి చేరగా.. నికర లాభ మార్జిన్లు 22.8 శాతం నుంచి 15.6 శాతానికి బలహీనపడ్డాయి. ఈ కాలంలో పరిశోధన, అభివృద్ధి వ్యయాలు 9 శాతం పెరిగి రూ. 436 కోట్లకు చేరగా.. గ్లోబల్ జనరిక్స్ బిజినెస్ 21 శాతం ఎగసి రూ. 3,984 కోట్లను అధిగమించింది. అయితే ప్రొప్రీటరీ ప్రొడక్టుల ఆదాయం 92 శాతం క్షీణించి రూ. 62 కోట్లను తాకింది. -
డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ లాభం రూ. 579 కోట్లు
ఫార్మా రంగ హైదరాబాద్ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో నికర లాభం దాదాపు 13 శాతం క్షీణించి రూ. 579 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం 15 శాతం పుంజుకుని రూ. 4417 కోట్లను అధిగమించింది. సమస్యాత్మక వాతావరణంలోనూ సానుకూల పనితీరు చూపగలిగినట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ కోచైర్మన్ జీవీ ప్రసాద్ పేర్కొన్నారు. పలు విభాగాలలో పటిష్ట పనితీరు చూపినట్లు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం డాక్టర్ రెడ్డీస్ షేరు ఎన్ఎస్ఈలో 3.5 శాతం జంప్‌చేసి రూ. 4189 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో గరిష్టంగా రూ. 4209ను అధిగమించింది. వొకార్డ్ బిజినెస్‌పై దేశీ ఫార్మా కంపెనీ వొకార్డ్ నుంచి సొంతం చేసుకున్న ఫార్మా బిజినెస్‌ను కంపెనీలో విలీనం చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు ప్రసాద్ తెలియజేశారు. కాగా.. ప్రస్తుతం కోవిడ్-19 చికిత్సకు వీలుగా రెండు లైసెన్సింగ్ ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. తద్వారా పలు మార్కెట్లలో కోవిడ్-19 చికిత్సకు వినియోగించగల ఔషధాలను అందించనున్నట్లు వివరించారు. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభం 20% అప్
ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో బ్యాంక్ నికర లాభం 20 శాతం వృద్ధితో రూ. 6,659 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) సైతం 18 శాతం పెరిగి రూ. 15,665 కోట్లను అధిగమించింది. స్టాండెలోన్ ఫలితాలివి. ఈ కాలంలో రుణ మంజూరీ 21 శాతం పుంజుకోగా, డిపాజిట్లు 25 శాతం ఎగశాయి. వార్షిక ప్రాతిపదికన ప్రొవిజన్లు, కంటింజెన్సీలు 49 శాతం పెరిగి రూ. 3891 కోట్లను దాటాయి. కోవిడ్-19 నేపథ్యంలో ఫ్లోటింగ్ ప్రొవిజన్లకు రూ. 1451 కోట్లు, కంటింజెన్సీలకు రూ. 4002 కోట్లు కేటాయించినట్లు వెల్లడించింది. ప్రొవిజన్లకు ముందు నిర్వహణ లాభం 15 శాతం బలపడి రూ. 12,829 కోట్లను తాకింది. నిర్వహణ వ్యయాలు 2.9 శాతం తగ్గి రూ. 7117 కోట్లకు పరిమితమైనట్లు బ్యాంక్ తెలియజేసింది. ఎన్పీఏలు అప్ క్యూ1లో త్రైమాసిక ప్రాతిపదికన స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 1.26 శాతం నుంచి 1.36 శాతానికి పెరిగాయి. ఆర్థిక మందగమనం కారణంగా రిటైల్ రుణాలు, థర్డ్‌పార్టీ ప్రొడక్టుల విక్రయాలు, క్రెడిట్ కార్డుల వినియోగం నీరసించినట్లు బ్యాంక్ పేర్కొంది. దీంతో ఫీజు ఆధారిత ఆదాయం సుమారు రూ. 2000 కోట్లు తగ్గినట్లు తెలియజేసింది. కాగా.. శుక్రవారం ఎన్ఎస్ఈలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు 4 శాతం జంప్‌చేసి రూ. 1103 వద్ద ముగసింది. ఇంట్రాడేలో రూ. 1104 వద్ద గరిష్టాన్ని తాకగా.. 1058 వద్ద కనిష్టానికీ చేరింది. ఫలితాల ప్రభావం సోమవారం ట్రేడింగ్‌లో ప్రతిఫలించే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. -
బ్రిటానియాకు ‘బిస్కెట్ల’ దన్ను
న్యూఢిల్లీ: బ్రిటానియా ఇండస్ట్రీస్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం(2020–21) జూన్ క్వార్టర్లో రెట్టింపునకు మించి పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం (2019–20) క్యూ1లో రూ.249 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.543 కోట్లకు పెరిగింది. లాక్డౌన్ సమయంలో బిస్కెట్లకు డిమాండ్ పెరగడం, వలస కార్మికులు పట్టణాల నుంచి పల్లెలకు చేరడం కూడా ఈ కంపెనీ అమ్మకాలకు కలసివచ్చిందని నిపుణులంటున్నారు. మొత్తం ఆదాయం రూ.2,768 కోట్ల నుంచి 27 శాతం వృద్ధితో రూ.3,514 కోట్లకు పెరిగిందని కంపెనీ పేర్కొంది. అన్ని అంశాల్లోనూ ఈ కంపెనీ ఫలితాలు విశ్లేషకుల అంచనాలను మించాయి. ► నిర్వహణ లాభం రూ.395 కోట్ల నుంచి రూ.717 కోట్లకు ఎగసింది. ► నిర్వహణ లాభ మార్జిన్ 6.4 శాతం పెరిగి 21 శాతానికి చేరింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో బ్రిటానియా ఇండస్ట్రీస్ షేర్ 2 శాతం నష్టంతో రూ.3,784 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఏడాది గరిష్ట స్థాయి, రూ.3,949ను తాకింది. -
ఇన్ఫోసిస్ లాభం రూ.4,272 కోట్లు
న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020–21) జూన్ క్వార్టర్లో రూ.4,272 కోట్ల నికర లాభం సాధించింది. గతేడాది (2019–20) ఇదే క్వార్టర్లో రూ.3,802 కోట్ల నికర లాభం వచ్చిందని 12 శాతం వృద్ధి సాధించామని ఇన్ఫోసిస్ తెలిపింది. ఈ క్యూ1లో భారీ డీల్స్ సాధించడం వల్ల నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని పేర్కొంది. ఆదాయం రూ.21,803 కోట్ల నుంచి 9 శాతం వృద్ధితో రూ.23,665 కోట్లకు చేరిందని వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 1.5 శాతం మేర (స్థిర కరెన్సీ పరంగా) వృద్ధి చెందగలదని, నిర్వహణ మార్జిన్ 21–23 శాతం మేర ఉండొచ్చని కంపెనీ అంచనా వేస్తోంది. కాగా ఈ కంపెనీ ఫలితాలు విశ్లేషకుల అంచనాలను మించాయి. ► డాలర్ల పరంగా నికర లాభం 3 శాతం వృద్ధితో 56 కోట్ల డాలర్లకు పెరిగింది. ఆదాయం మాత్రం స్వల్పంగా తగ్గి 312 కోట్ల డాలర్లకు చేరింది. ► డిజిటల్ విభాగం ఆదాయం 25 శాతం వృద్ధితో 138 కోట్ల డాలర్లకు పెరిగింది. క్యూ1లో 170 కోట్ల డాలర్ల డీల్స్‌ను సాధించింది. ► గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 360 కోట్ల డాలర్ల నగదు నిల్వలున్నాయి. రుణభారం లేదు. ► ఈ ఏడాది జూన్ నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,39,233గా ఉంది. ఆట్రిషన్ రేటు (ఉద్యోగుల వలస) 11.7 శాతంగా ఉంది. 20,000 మంది ఫ్రెషర్స్‌కు ఉద్యోగాలు జాబ్ ఆఫర్లు ఇచ్చిన వారిలో దాదాపు 90% మంది ఉద్యోగాల్లో చేరారని కంపెనీ సీఓఓ ప్రవీణ్ రావు పేర్కొన్నారు. మిగిలిన వాళ్లు ఈ క్వార్టర్లో చేరతారని పేర్కొన్నారు. 20,000 మంది ఫ్రెషర్స్‌కు ఉద్యోగాలు ఇవ్వనున్నామని వివరించారు. హెచ్1–బి వర్క్ వీసాలపై నిషేధం మతిలేని చర్య అని వ్యాఖ్యానించారు. ఇది తమపై పెద్దగా ప్రభావం చూపదని వివరించారు. మార్కెట్ ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలపై సానుకూల అంచనాలతో ఇన్ఫోసిస్ షేర్ 6% లాభంతో రూ.831 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై, రూ.848ను తాకింది. -
డాక్టర్ రెడ్డీస్ నికర లాభం జూమ్
గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికం(క్యూ4)లో ఫార్మా రంగ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. దీంతో ఈ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో మధ్యాహ్నం 2.25 ప్రాంతంలో డాక్టర్ రెడ్డీస్ షేరు ఎన్ఎస్ఈలో 4.5 శాతం జంప్‌చేసి రూ. 3865 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 3,883ను సైతం అధిగమించింది. కాగా.. గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో హైదరాబాద్ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ రూ. 764 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఇది 76 శాతం వృద్ధికాగా.. మొత్తం ఆదాయం సైతం 10 శాతం పెరిగి రూ. 4,432 కోట్లను తాకింది. గతేడాది సానుకూలం గత ఆర్థిక సంవత్సరంలో సానుకూల ఫలితాలు సాధించగలిగినట్లు క్యూ4 ఫలితాల విడుదల సందర్భంగా డాక్టర్ రెడ్డీస్ సహచైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ పేర్కొన్నారు. ఇందుకు కొత్త ప్రొడక్టుల విడుదల, ఉత్పాదకత పెంపు, వివిధ విభాగాలలో పటిష్ట పనితీరు వంటి అంశాలు దోహదం చేసినట్లు తెలియజేశారు. సీటీవో-6కు సంబంధించి వీఏఐ పురోగతి సైతం ఇందుకు సహకరించినట్లు వివరించారు. కాగా.. క్యూ4లో డాక్టర్ రెడ్డీస్ ఇబిటా మార్జిన్లు 0.6 శాతం బలపడి 22.6 శాతాన్ని తాకాయి. నికర లాభ మార్జిన్లు మరింత అధికంగా 10.8 శాతం నుంచి 17.2 శాతానికి జంప్‌చేశాయి. అతిపెద్ద జనరిక్స్ మార్కెట్‌గా నిలుస్తున్న ఉత్తర అమెరికా నుంచి రూ. 1807 కోట్ల ఆదాయం సమకూరినట్లు కంపెనీ పేర్కొంది.యూరప్ నుంచి రూ. 345 కోట్ల అమ్మకాలు సాధించగా..దేశీ బిజినెస్ వాటా రూ. 684 కోట్లుగా నమోదైనట్లు వెల్లడించింది. ఇతర వర్ధమాన మార్కెట్ల నుంచి రూ. 804 కోట్ల ఆదాయం లభించినట్లు తెలియజేసింది. -
మారుతీ లాభం 28 శాతం డౌన్
న్యూఢిల్లీ: దేశీయ వాహన దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం గత ఆర్థిక సంవత్సరం(2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో 28 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2018–19) క్యూ4లో రూ.1,831 కోట్లుగా ఉన్న నికర లాభం గత క్యూ4లో రూ.1,322 కోట్లకు తగ్గిందని మారుతీ సుజుకీ తెలిపింది. అమ్మకాలు తగ్గడం, ప్రమోషన్ వ్యయాలు పెరగడం, తరుగుదల వ్యయాలు కూడా అధికం కావడంతో నికర లాభం తగ్గిందని వివరించింది. నికర అమ్మకాలు రూ.21,473 కోట్ల నుంచి 15 శాతం క్షీణించి రూ.18,208 కోట్లకు తగ్గాయని పేర్కొంది. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ. 60 డివిడెండ్‌ను ప్రకటించింది. ► గత క్యూ4లో మొత్తం కార్ల అమ్మకాలు 16 శాతం తగ్గి 3.85 లక్షలకు చేరాయి. ► పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2018–19లో రూ.7,651 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 26 శాతం క్షీణించి రూ.5,678 కోట్లకు తగ్గింది. ► నికర అమ్మకాలు రూ.86,069 కోట్ల నుంచి రూ.75,661 కోట్లకు తగ్గాయి. ► ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో మారుతీ షేర్ 1.8 శాతం లాభంతో రూ.5,035కు పెరిగింది. ఉద్యోగాలు, వేతనాల్లో కోత లేదు: గత ఏడాది నుంచి వాహన పరిశ్రమ సుదీర్ఘ సంక్షోభాన్ని ఎదుర్కొంటొందని, కరోనా ప్రభావం ఉన్నప్పటికీ ఉద్యోగాల్లో, వేతనాల్లో ఎలాంటి కోత విధించలేదని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్.సి. భార్గవ వ్యాఖ్యానించారు. -
రిలయన్స్‌పై కోవిడ్-19 ఎఫెక్ట్
సాక్షి, న్యూఢిల్లీ : మార్చి త్రైమాసంలో కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) నికర లాభం 39 శాతం తగ్గి రూ 6,348 కోట్లుగా నమోదైంది. కోవిడ్-19 వ్యాప్తితో ముడిచమురు ధరల భారీ పతనం ప్రభావం ఆర్ఐఎల్ ఫలితాలపై చూపింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో కంపెనీ రూ 10,362 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో రిలయన్స్ గ్రూప్ రాబడి రూ 1,42,565 కోట్లు కాగా ప్రస్తుతం 2.3 శాతం తగ్గి రూ 1,39,283 కోట్లకు పరిమితమైంది. ఇక దేశంలోనే అతిపెద్ద రైట్స్ ఇష్యూ ద్వారా రూ 53,125 కోట్ల నిధులు సమీకరించేందుకు ఆర్ఐఎల్ ఆమోదముద్ర వేసింది. కాగా ఈ క్వార్టర్లో చమురు ధరలు అనూహ్యంగా తగ్గడంతో ఇంధన వ్యాపారంలో రూ 4245 కోట్ల నష్టం వాటిల్లిందని కంపెనీ పేర్కొంది. చదవండి : ట్రెండ్ సెట్ చేసిన అంబానీ -
హెక్సావేర్ లాభం 26 శాతం అప్
న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ హెక్సావేర్ టెక్నాలజీస్ నికర లాభం ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్లో 26 శాతం పెరిగింది. గత ఏడాది క్యూ1లో రూ.138 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.175 కోట్లకు పెరిగింది. ఈ కంపెనీ జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పాటిస్తోంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయ అంచనాలను సస్పెండ్ చేసింది. కరోనా వైరస్ కల్లోలంతో అనిశ్చితి నెలకొనడమే దీనికి కారణమని వెల్లడించింది. గత ఏడాది మార్చి క్వార్టర్లో రూ.1,264 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ ఏడాది ఇదే క్వార్టర్లో 22 శాతం ఎగసి రూ.1,542 కోట్లకు పెరిగిందని పేర్కొంది. డాలర్ల పరంగా చూస్తే, నికర లాభం 18 శాతం వృద్ధితో 2.3 కోట్ల డాలర్లకు, ఆదాయం 17 శాతం వృద్ధితో 21 కోట్ల డాలర్లకు పెరిగిందని తెలిపింది. 26 శాతం పెరిగిన ఈపీఎస్... ఈ క్యూ1లో ఒక్కో షేర్ రాబడి(ఈపీఎస్) 26 శాతం వృద్ధితో రూ.5.86కు పెరిగిందని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వికాస్ కుమార్ జైన్ వెల్లడించారు. నిర్వహణ సామర్థ్యాలపై దృష్టి పెట్టటంతో ఒక్కో షేర్ రాబడి ఈ స్థాయిలో పెరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ప్రకటించకముందే వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ప్రారంభించామని తెలిపారు. ఐటీ విభాగంలో 99 శాతం మంది, బీపీఎస్ విభాగంలో 80 శాతం మంది ఇంటి నుంచే పనిచేస్తున్నారని వివరించారు. ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 19,998గా ఉందని, ఆట్రీషన్ రేటు 15.1 శాతమని పేర్కొన్నారు. నికర లాభం 26 శాతం పెరగడంతో హెక్సావేర్ టెక్నాలజీస్ షేర్ లాభపడింది. బీఎస్ఈలో ఈ షేర్ 3 శాతం లాభంతో రూ.296 వద్ద ముగిసింది. -
హెచ్డీఎఫ్సీ లాభం 4,196 కోట్లు
న్యూఢిల్లీ: హెచ్డీఎఫ్సీ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 24 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.3,377 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ క్యూ3లో రూ.4,196 కోట్లకు పెరిగిందని హెచ్డీఎఫ్సీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.24,653 కోట్ల నుంచి రూ.29,073 కోట్లకు పెరిగిందని కంపెనీ వైస్ చైర్మన్, సీఈఓ కేకి మిస్త్రీ వెల్లడించారు. స్టాండ్అలోన్ పరంగా చూస్తే, నికర లాభం నాలుగు రెట్లు పెరిగిందని పేర్కొన్నారు. గత క్యూ3లో రూ.2,114 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.8,372 కోట్లకు ఎగసిందని తెలిపారు. గృహ్ ఫైనాన్స్‌లో 9.9 శాతం వాటాకు సమానమైన 15.9 కోట్ల షేర్లను బంధన్ బ్యాంక్‌కు కేటాయించిన కారణంగా రూ.9,020 కోట్ల లాభాన్ని సాధించింది. ఇది నోషనల్ (భావాత్మక) లాభమేనని, కానీ ఖాతా పుస్తకాల పరంగా లెక్కల్లో చెప్పడం తప్పనిసరి అని వివరించారు. రుణాలు తొలిసారిగా రూ.5 లక్షల కోట్ల మైలురాయిని దాటాయని మిస్త్రీ వెల్లడించారు. ఫలితాల్లో మరిన్ని వివరాలు ఇవీ... నికర వడ్డీ మార్జిన్ 3.3 శాతం స్టాండ్అలోన్ పరంగా ఆదాయం రూ.10.582 కోట్ల నుంచి రూ.20,291 కోట్లకు పెరిగింది. వ్యక్తిగత రుణాలు 24 శాతం ఎగిశాయి. గత రెండు క్వార్టర్లలో ఉన్నట్లుగానే నికర వడ్డీ మార్జిన్ 3.3 శాతంగా నమోదైంది. ఇక నికర వడ్డీ ఆదాయం 10 శాతం వృద్ధితో రూ.3,297 కోట్లకు ఎగబాకింది. మార్కెట్లో ప్రతికూల పరిస్థితులున్నా, ఆర్థిక వ్యవస్థ మందగమనంగా ఉన్నప్పటికీ... సంస్థ స్థూల మొండి బకాయిలు 1.36 శాతం(రూ.5,950 కోట్లు) రేంజ్‌లోనే ఉన్నాయి. వ్యక్తిగత రుణాలకు సంబంధించిన మొండి బకాయిలు మాత్రం స్వల్పంగా 2 బేసిస్ పాయింట్లు పెరిగి 0.75 శాతానికి చేరాయి. సగటున నెలకు 9,400 గృహ రుణాలను మంజూరు చేస్తోంది. నిబంధనల ప్రకారం రూ.3,624 కోట్ల కేటాయింపులు ఉండాల్సి ఉండగా, రూ.9,934 కోట్ల మేర కేటాయింపులు జరిపింది. మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో హెచ్డీఎఫ్సీ షేర్ 2.2 శాతం నష్టంతో రూ.2,396 వద్ద ముగిసింది. ఇది 16 వారాల కనిష్ట స్థాయి. -
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం రూ.4,670 కోట్లు
ముంబై: ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం(2019–20) మూడో త్రైమాసిక కాలంలో రెండు రెట్లు పెరిగింది. గత క్యూ3లో రూ.1,874 కోట్లుగా ఉన్న నికర లాభం (కన్సాలిడేటెడ్)ఈ క్యూ3లో రూ.4,670 కోట్లకు పెరిగిందని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. ఎస్సార్ స్టీల్ రుణాలు రికవరీ కావడం, కీలక ఆదాయం పెరగడం దీనికి కారణమని వివరించింది. స్టాండ్అలోన్ పరంగా చూస్తే, నికర లాభం రూ.1,605 కోట్ల నుంచి రూ.4,146 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మరిన్ని వివరాలు.... నికర వడ్డీ ఆదాయం 24 శాతం అప్... ఈ క్యూ3లో బ్యాంక్ 16 శాతం రుణ వృద్ధిని సాధించింది. నికర వడ్డీ మార్జిన్(ఎన్ఐఎం) 3.77 శాతానికి పెరిగింది. దీంతో నికర వడ్డీ ఆదాయం 24 శాతం వృద్ధితో రూ.8,545 కోట్లకు ఎగబాకింది. ఇక ఇతర ఆదాయం 19 శాతం పెరిగి రూ.4,043 కోట్లకు చేరింది. ఫీజు ఆదాయం 17 శాతం వృద్ధి చెందింది. నిర్వహణ లాభం 23 శాతం వృద్ధితో రూ.7,017 కోట్లకు పెరిగింది. తగ్గిన మొండి బకాయిలు.... గత క్యూ3లో 7.75 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో 5.95 శాతానికి తగ్గాయి. ఈ క్యూ3లో తాజా మొండి బకాయిలు రూ.4,363 కోట్లకు ఎగిశాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇదే అత్యధికం. అయితే ఎస్సార్ స్టీల్ రుణాలు రూ.2,000 కోట్ల మేర రికవరీ అయ్యాయి. దీంతో నికరంగా చూస్తే, తాజా మొండి బకాయిల ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. ఇక కేటాయింపులు 51 శాతం తగ్గి రూ.2,083 కోట్లకు చేరాయి. ఐసీఐసీఐ బ్యాంక్ క్యూ3 ఆర్థిక ఫలితాలను శనివారం వెల్లడించింది. ఫలితాలపై సానుకూల అంచనాలతో గత శుక్రవారం 1.1 శాతం లాభంతో రూ.533.95 వద్ద ముగిసింది. -
కెనరా బ్యాంక్‌కు తగ్గిన మొండి బకాయిలు
ముంబై: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం (2019–20) మూడో త్రైమాసిక కాలంలో రూ.330 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో లాభం, రూ.318 కోట్లుతో పోల్చితే 4% వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం రూ.13,513 కోట్లతో నుంచి రూ.14,002 కోట్లకు పెరిగింది. బ్యాంక్ మొండి బకాయిలు తగ్గాయి. గత క్యూ3లో 6.37 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో 5.05 శాతానికి తగ్గాయి. నికర మొండి బకాయిలు 10.25% నుంచి 8.26 శాతానికి చేరాయి. గత క్యూ3లో రూ.1,977 కోట్లుగా ఉన్న కేటాయింపులు ఈ క్యూ3లో రూ.1,803 కోట్లకు తగ్గాయి. -
హెచ్డీఎఫ్సీ ఏఎమ్‌సీ లాభం 45% అప్
న్యూఢిల్లీ: హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎమ్‌సీ) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019–20) డిసెంబర్ క్వార్టర్లో 45% పెరిగింది. గత క్యూ3లో రూ.243 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.352కోట్లకు పెరిగిందని హెచ్డీఎఫ్సీ ఏఎమ్‌సీ తెలిపింది. ఆదాయం రూ.533 కోట్ల నుంచి 11% వృద్ధితో రూ.592 కోట్లకు చేరింది. నిర్వహణ ఆస్తులు రూ.3.35 లక్షల కోట్ల నుంచి 14% వృద్ధితో రూ.3.83 లక్షల కోట్లకు పెరిగాయి. జీ ఎంటర్టైన్మెంట్ లాభం 38% డౌన్ జీ ఎంటర్టైన్మెంట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో రూ.349 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత క్యూ3లో ఆర్జించిన లాభం రూ.563 కోట్లతో పోలిస్తే 38% క్షీణించింది. ప్రకటనల ఆదాయం రూ.1,427 కోట్ల నుంచి రూ.1,231 కోట్లకు తగ్గిందని కంపెనీ ఎమ్డీ, సీఈఓ పునీత్ గోయెంకా పేర్కొన్నారు. మొత్తం ఆదాయం రూ.2,253 కోట్ల నుంచి రూ.2,120 కోట్లకు తగ్గిందన్నారు. -
12 శాతం తగ్గిన కర్ణాటక బ్యాంక్ లాభం
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ కర్ణాటక బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019–20) మూడో త్రైమాసిక కాలంలో 12 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.140 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.123 కోట్లకు తగ్గిందని కర్ణాటక బ్యాంక్ వెల్లడించింది. మొండి బకాయిలు పెరగడంతో నికర లాభం తగ్గిందని పేర్కొంది. మొత్తం ఆదాయం మాత్రం రూ.1,816 కోట్ల నుంచి రూ.2,024 కోట్లకు పెరిగిందని వివరించింది. గత క్యూ3లో 4.45 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో 4.99 శాతానికి పెరిగాయని బ్యాంక్ తెలియజేసింది. నికర మొండి బకాయిలు 3 శాతం నుంచి 3.75 శాతానికి చేరాయి. కేటాయింపులు రూ.209 కోట్ల నుంచి రూ.315 కోట్లకు పెరిగాయని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో కర్ణాటక బ్యాంక్ షేర్ 0.6 శాతం లాభంతో రూ.78 వద్ద ముగిసింది. సౌత్ ఇండియన్ బ్యాంక్ ఆదాయం రూ.2,188 కోట్లు ప్రైవేట్ రంగ సౌత్ ఇండియన్ బ్యాంక్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019–20) డిసెంబర్ క్వార్టర్లో రూ.91 కోట్ల నికర లాభం వచ్చింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో వచ్చిన నికర లాభం రూ.84 కోట్లతో పోలిస్తే 8 శాతం వృద్ధి సాధించామని సౌత్ ఇండియన్ బ్యాంక్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,922 కోట్ల నుంచి రూ.2,188 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఈ బ్యాంక్ స్థూల మొండి బకాయిలు స్వల్పంగా పెరిగాయి. గత క్యూ3లో 4.88 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో 4.96 శాతానికి పెరిగాయి. అయితే నికర మొండి బకాయిలు మాత్రం 3.54 శాతం నుంచి 3.44 శాతానికి తగ్గాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో సౌత్ ఇండియన్ బ్యాంక్ షేర్ 1.5 శాతం లాభంతో రూ.11 వద్ద ముగిసింది. -
ఆర్‌కామ్ నష్టాలు రూ.30,142 కోట్లు
న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్ కంపెనీకి ఈ ఆర్థిక సంవత్సరం సెపె్టంబర్ క్వార్టర్లో రూ.30,142 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. ప్రస్తుతం దివాలా ప్రక్రియ నడుస్తున్న ఈ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.1,141 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఏజీఆర్(సవరించిన స్థూల రాబడి) విషయమై సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు కారణంగా రూ.28,314 కోట్ల కేటాయింపులు జరపడంతో ఈ కంపెనీకి ఈ క్యూ2లో ఈ స్థాయి నష్టాలు వచ్చాయి. కాగా గత క్యూ2లో రూ.977 కోట్లుగా ఉన్న కార్యకలాపాల ఆదాయం ఈ క్యూ2లో రూ.302 కోట్లకు తగ్గింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఆర్‌కామ్ షేర 3.2 శాతం నష్టపోయి రూ.0.59 వద్ద ముగిసింది. ఐవీఆర్సీఎల్... నిర్మాణ రంగ కంపెనీ ఐవీఆర్సీఎల్ సెప్టెంబరు త్రైమాసికం స్టాండలోన్ ఫలితాల్లో రూ.394 కోట్ల నష్టం ప్రకటించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీకి రూ.443 కోట్ల నష్టం వాటిల్లింది. టర్నోవరు రూ.245 కోట్ల నుంచి రూ.115 కోట్లకు వచ్చి చేరింది. -
వేదాంత లాభం రూ. 2,158 కోట్లు
న్యూఢిల్లీ: మైనింగ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019–20) సెప్టెంబర్ క్వార్టర్లో 61 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.1,343 కోట్లుగా ఉన్న నికర లాభం (కన్సాలిడేటెడ్) ఈ క్యూ2లో రూ.2,158 కోట్లకు పెరిగిందని వేదాంతా తెలిపింది. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించడం కలిసి వచ్చిందని, దీనికి ఇతర ఆదాయం 49 శాతం పెరగడం తోడయిందని, అందుకే నికర లాభం ఈ క్యూ2లో ఈ స్థాయిలో పెరిగిందని కంపెనీ సీఈఓ శ్రీనివాసన్ వెంకటకృష్ణన్ పేర్కొన్నారు. ఆదాయం మాత్రం రూ.23,279 కోట్ల నుంచి రూ.22,814 కోట్లకు తగ్గిందన్నారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం... కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు ప్రయోజనాలు రూ.1,891 కోట్లుగా ఉన్నాయి. గత క్యూ2లో రూ.574 కోట్లుగా ఉన్న ఇతర ఆదాయం ఈ క్యూ2లో రూ. 856 కోట్లకు పెరిగింది. ఈ క్యూ2లో రూ.3,279 కోట్ల మేర స్థూల రుణ భారం తగ్గింది. ఇక నికర రుణ భారం రూ.8,322 కోట్ల మేర తగ్గింది. నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.35,817 కోట్లుగా ఉన్నాయి. బీఎస్ఈలో వేదాంత షేర్ 3 శాతం నష్టంతో రూ.144 వద్ద ముగిసింది. -
4.6% పెరిగిన అరబిందో లాభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ సంస్థ అరబిందో ఫార్మా నికరలాభం పెరిగింది. సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం క్రితం ఏడాది ఇదే కాలంలోని రూ.611.4 కోట్లతో పోలిస్తే 4.6 శాతం పెరిగి రూ.639.5 కోట్లుగా నమోదయింది. టర్నోవర్ రూ.4,751.4 నుంచి 18 శాతం వృద్ధితో రూ.5,600.6 కోట్లకు ఎగసింది. ‘‘అమెరికా, యూరప్ మార్కెట్లలో చక్కని వృద్ధి నమోదు కావటంతో ఈ త్రైమాసికంలోనూ ఆరోగ్యకరమైన ఫలితాలు సాధించాం.మా తొలి బయో సిమిలర్ ఉత్పాదనకు సంబంధించి వచ్చే ఏడాది మూడో త్రైమాసికంలో క్లినికల్ ట్రయల్స్ మొదలుపెడతాం’’ అని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.గోవిందరాజన్ చెప్పారు. రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.1.25 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. -
మహీంద్రాకు మందగమనం సెగ
ముంబై: మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ నికర లాభం(కన్సాలిడేటెడ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసిక కాలంలో 78 శాతం తగ్గి రూ.368 కోట్లకు చేరింది. అమ్మకాలు బాగా పడిపోవడంతో నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. ఆదాయం 6 శాతం తగ్గి రూ.23,936 కోట్లకు తగ్గిందని పేర్కొంది. మార్కెట్ అంచనాలకు అందని విధంగా ఉన్నందున అమ్మకాలు, ఆదాయ అంచనాలను వెల్లడించడం లేదని కంపెనీ ఎమ్డీ పవన్ గోయెంకా వ్యాఖ్యానించారు. అక్టోబర్‌లో మాత్రం అమ్మకాలు పుంజుకున్నాయని చెప్పారు. -
అశోక్ లేలాండ్ లాభం 93 శాతం డౌన్
న్యూఢిల్లీ: హిందుజా గ్రూప్‌నకు చెందిన ప్రధాన కంపెనీ అశోక్ లేలాండ్ నికర లాభం ఈ ఆరి్థక సంవత్సరం సెపె్టంబర్ క్వార్టర్లో 93 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.528 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.39 కోట్లకు తగ్గిందని అశోక్ లేలాండ్ తెలిపింది. ఆదాయం రూ.7,621 కోట్ల నుంచి 48 శాతం తగ్గి రూ.3,939 కోట్లకు చేరిందని కంపెనీ చైర్మన్ ధీరజ్ జి. హిందుజా తెలిపారు. వాహన పరిశ్రమ అమ్మకాలు ఈ క్యూ2లో 53 శాతం మేర తగ్గాయని ధీరజ్ హిందుజా పేర్కొన్నారు. ఈ క్యూ2లో తమ కంపెనీ అమ్మకాలు గణనీయంగానే తగ్గినప్పటికీ, 5.8 శాతం నిర్వహణ లాభ మార్జిన్ సాధించామని తెలిపారు. -
హెచ్‌పీసీఎల్‌కు రిఫైనరీ మార్జిన్ల షాక్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ హెచ్‌పీసీఎల్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో 3 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.1,092 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.1,052 కోట్లకు తగ్గిందని హెచ్‌పీసీఎల్ తెలిపింది. రిఫైనరీ మార్జిన్లు సగం తగ్గడం, ఇన్వెంటరీ లాభాలు కూడా భారీగా తగ్గడం వల్ల నికర లాభం కూడా తగ్గిందని కంపెనీ సీఎమ్‌డీ ఎమ్.కె. సురానా వివరించారు. బీఎస్–సిక్స్ పర్యావరణ నిబంధనలు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి రానున్నాయని చెప్పారు. అప్పటికల్లా బీఎస్–సిక్స్ నిబంధనలకు అనుగుణ్యమైన ఇంధనాన్ని సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఆ మేరకు తమ రిఫైనరీలను అప్‌గ్రేడ్ చేస్తున్నామని పేర్కొన్నారు. -
జేఎస్పీఎల్ నష్టాలు రూ.399 కోట్లు
న్యూఢిల్లీ: జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్(జేఎస్పీఎల్) కంపెనీకి రెండో త్రైమాసిక కాలంలో రూ.399 కోట్ల నికర నష్టాలు(కన్సాలిడేటెడ్) వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.279 కోట్ల నికర లాభం వచ్చిందని జేఎస్పీఎల్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.9,983 కోట్ల నుంచి రూ.8,940 కోట్లకు తగ్గిందని పేర్కొంది. ధరలు, లాభదాయకత బాగా తగ్గినా, రెయిల్స్, ప్లేట్స్ వంటి విభిన్నమైన విలువాధారిత ఉత్పత్తుల తోడ్పాటుతో ఒకింత ఊరట లభించిందని వివరించింది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి రుణ భారం రూ.36,501 కోట్లుగా ఉందని పేర్కొంది. -
టైటాన్... లాభం రూ.312 కోట్లు
న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌నకు చెందిన టైటాన్ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో 4 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.301 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ క్యూ2లో రూ.312 కోట్లకు పెరిగిందని టైటాన్ కంపెనీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.4,595 కోట్ల నుంచి రూ.4,693 కోట్లకు పెరిగిందని కంపెనీ ఎమ్డీ సి.కె. వెంకటరామన్ పేర్కొన్నారు. డిమాండ్, వినియోగదారుల సెంటిమెంట్స్ అంతంతమాత్రంగానే ఉన్నా, తమ అన్ని వ్యాపార విభాగాలు మంచి వృద్ధిని సాధించాయని వివరించారు. ఇతర కంపెనీలతో పోలి్చతే జ్యూయలరీ వ్యాపారం వృద్ధినే సాధించిందని పేర్కొన్నారు. వాచ్‌లు, కళ్లజోళ్ల వ్యాపారాలు మాత్రం మంచి వృద్ధిని సాధించాయని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగిలిన నెలల్లో డిమాండ్ పుంజుకునేలా వివిధ బ్రాండ్లలో కొత్త కొత్త కలెక్షన్లను అందించనున్నామని, తెలిపారు. మార్కెట్ ముగిసిన తర్వాత ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలపై అనిశ్చితి కారణంగా బీఎస్ఈలో టైటాన్ కంపెనీ షేర్ 1.2 శాతం తగ్గి రూ.1,284 వద్ద ముగిసింది. -
డాబర్ ఆదాయం రూ.2,212 కోట్లు
న్యూఢిల్లీ: ఎఫ్ఎమ్సీజీ దేశీయ దిగ్గజం డాబర్ ఇండియా రెండో త్రైమాసిక కాలంలో రూ.404 కోట్ల నికర లాభం సాధించింది. గత క్యూ2లో ఆర్జించిన నికర లాభం, రూ.378 కోట్లుతో పోల్చితే 7 శాతం వృద్ధి సాధించామని డాబర్ ఇండియా తెలిపింది. పెట్టుబడుల విలువకు సంబంధించి రూ.40 కోట్ల వన్‌టైమ్ ఇంపెయిర్మెంట్ కారణంగా నికర లాభం ఒకింత తగ్గిందని పేర్కొంది. కార్యకలాపాల ఆదాయం రూ.2,125 కోట్ల నుంచి రూ.2,212 కోట్లకు పెరిగిందని వివరించింది. 140 శాతం మధ్యంతర డివిడెండ్... ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.1.40 మధ్యంతర డివిడెండ్ (140 శాతం) ఇవ్వాలని కంపెనీ డైరెక్టర్ల బోర్డ్ నిర్ణయించింది. పన్నులతో కలుపుకొని మొత్తం డివిడెండ్ చెల్లింపులు రూ.298 కోట్లకు చేరతాయి. -
టెక్ మహీంద్రా లాభం 1,124 కోట్లు
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా ఈ ఆర్థిక సంవత్సరం(2019–20) సెపె్టంబర్ క్వార్టర్లో రూ.1,124 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో వచ్చిన నికర లాభం(రూ.1,064 కోట్లు)తో పోలి్చతే 6 శాతం వృద్ధి సాధించామని టెక్ మహీంద్రా ఎమ్డీ, సీఈఓ సీపీ గుర్నాని తెలిపారు. కార్యకలాపాల ఆదాయం రూ.8,630 కోట్ల నుంచి 5 శాతం వృద్ధితో రూ.9,070 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఆదాయం 128 కోట్ల డాలర్లకు.... డాలర్ల పరంగా చూస్తే, నికర లాభం 14 శాతం వృద్ధితో 16 కోట్ల డాలర్లకు, ఆదాయం 3 శాతం వృద్ధితో 128 కోట్ల డాలర్లకు పెరిగాయి. స్థిర కరెన్సీ పరంగా చూస్తే, ఆదాయం 4 శాతం పెరిగింది. డిజిటల్ విభాగం ఆదాయం సీక్వెన్షియల్‌గా 12 శాతం ఎగసింది. నిర్వహణ లాభం 7 శాతం తగ్గి రూ.1,501 కోట్లకు చేరింది. నిర్వహణ లాభ మార్జిన్ 2.3 శాతం తగ్గి 16.50 శాతానికి చేరింది. అయితే సీక్వెన్షియల్‌గా చూస్తే, నిర్వహణ లాభం 14 శాతం, నిర్వహణ లాభ మార్జిన్ 1.3 శాతం చొప్పున పెరిగాయి. ఏటీఅండ్‌టీ కంపెనీతో బహుళ సంవత్సరాల ఒప్పందాన్ని ఈ క్యూ2లో కుదుర్చుకుంది. ఈ క్యూ2లో కంపెనీ నికరంగా 5,749 ఉద్యోగాలిచి్చంది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,31,522కు పెరిగింది. ఉద్యోగుల వలస(ఆట్రీషన్ రేటు) ఎలాంటి మార్పు లేకుండా 21 శాతంగా ఉంది. టెక్ మహీంద్రా చేతికి బార్న్ గ్రూప్... అమెరికాకు చెందిన బార్న్ గ్రూప్ కంపెనీని రూ.671 కోట్లకు టెక్ మహీంద్రా పూర్తి అనుబంధ సంస్థ, టెక్ మహీంద్రా (సింగపూర్) పీటీఈ లిమిటెడ్ కొనుగోలు చేయనున్నది. ఈ డీల్ ఈ నెల 15 కల్లా పూర్తవ్వనున్నది. న్యూయార్క్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీకి లండన్, సింగపూర్, హాంకాంగ్, భారత్‌ల్లో కార్యాలయాలు ఉన్నాయి. మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,100గా ఉంది. -
పీఎన్బీని వెంటాడుతున్న మొండిబాకీలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో రూ.507 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.4,532 కోట్ల నికర నష్టాలు వచ్చాయని పంజాబ్ నేషనల్ బ్యాంక్ తెలిపింది. ఇతర ఆదాయం అధికంగా ఉండటం, కేటాయింపులు తక్కువగా ఉండటంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని వివరించింది. ఆదాయం రూ.14,036 కోట్ల నుంచి రూ. 15,557 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం 7% వృద్ధితో రూ.4,264 కోట్లకు పెరిగింది. డిపాజిట్లు 7% పెరిగినా, రుణాలు 0.7 % తగ్గాయి. పెరిగిన మొండి బకాయిలు.. గత క్యూ2లో 17.16 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో 16.76 శాతానికి తగ్గాయి. ఈ క్యూ1లో స్థూల మొండి బకాయిలు 16.49 శాతంగానే ఉన్నాయి. ఈ క్యూ1లో 7.17 శాతంగా ఉన్న నికర మొండి బకాయిలు ఈ క్యూ2లో 7.65 శాతానికి పెరిగాయి. ఈ క్యూ1లో రూ.5,412 కోట్లుగా ఉన్న తాజా మొండి బకాయిలు ఈ క్యూ2లో రూ.7,460 కోట్లకు పెరిగాయి. అయితే మొండి బకాయిలకు కేటాయింపులు బాగా తగ్గాయి. గత క్యూ2లో రూ.7,733 కోట్లుగా ఉన్న ఈ కేటాయింపులు ఈ క్యూ2లో రూ.3,253 కోట్లకు తగ్గాయి. ఇక పూర్తి ఆరి్థక సంవత్సరానికి మొండి బకాయిలు రూ.19,000 కోట్లకు పెరుగుతాయని పీఎన్బీ అంచనా వేస్తోంది. . -
ఐపీఓకు సౌదీ ఆరామ్కో
దహ్రన్(సౌదీ అరేబియా): సౌదీ అరేబియాకు చెందిన చమురు దిగ్గజం సౌదీ ఆరామ్కో కంపెనీ ఐపీఓ (ఇనీశీయల్ పబ్లిక్ ఆఫర్) వివరాలను ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యంత లాభదాయకమైన ఈ కంపెనీ 2016లోనే ఐపీఓకు వచ్చే ప్రయత్నాలు చేసింది. వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఈ ఐపీఓ ఎట్టకేలకు సాకారమవుతోంది. బుక్ బిల్డింగ్ విధానంలో షేర్లను జారీ చేస్తామని, కంపెనీ చైర్మన్ యాసిర్ అల్–రుమయ్యన్ ఆదివారం వెల్లడించారు. ఆఫర్ ధరను, ఎన్ని షేర్లను విక్రయించేది ఈ బుక్ బిల్డింగ్ పీరియడ్ చివర్లో ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ ఐపీఓకు సంస్థాగత ఇన్వెస్టర్లు దరఖాస్తు చేయవచ్చని తెలిపారు. సౌదీ వాసులు, సౌదీ అరేబియాలో నివాసం ఉంటున్న విదేశీయులు, ఇతర గల్ఫ్ వాసులు కూడా దరఖాస్తు చేయవచ్చని వివరించారు. ఈ నెల 9న ఐపీఓకు సంబంధించిన మరిన్ని వివరాలను కంపెనీ వెల్లడించనున్నది. సౌదీ ఆరామ్కో షేర్ల ట్రేడింగ్ సౌదీ స్టాక్ ఎక్సే్చంజ్(తాదావుల్)లో వచ్చే నెల(బహుశా డిసెంబర్ 11న) మొదలు కావచ్చని అంచనా. ప్రపంచంలోనే అతి పెద్ద ఐపీఓ! ప్రపంచంలోనే అతి పెద్ద ఐపీఓ బహుశా ఇదే కానున్నది. ఎంత వాటాను ఈ కంపెనీ విక్రయించనున్నదో అనే నిర్ణయాన్ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. విశ్లేషకులైతే ఈ కంపెనీ విలువను 1.7–1.5 లక్షల కోట్ల డాలర్లుగా అంచనా వేశారు. 1% వాటా విక్రయిస్తే, ఐపీఓ సైజు సుమారుగా 1,500 కోట్ల డాలర్లు అవుతుందని, ప్రపంచంలోనే 11వ అతి పెద్ద ఐపీఓ అవుతుందని అంచనా. ఒకవేళ 2 శాతం వాటా విక్రయిస్తే, ఇష్యూ సైజు 3,000 కోట్ల డాలర్ల అవుతుందని, ప్రపంచంలోనే అతి పెద్ద ఐపీఓ ఇదే అవుతుందని అంచనా. ప్రపంచంలో అతి పెద్ద ఐపీఓ రికార్డ్ ఇప్పటిదాకా అలీబాబా కంపెనీ(2,500 కోట్ల డాలర్లు) పేరిట ఉంది. కాగా, ప్రస్తుతానికి విదేశీ స్టాక్ ఎక్సే్చంజ్‌లో లిస్టింగ్ ఆలోచనను సౌదీ ఆరామ్కో పక్కనపెట్టింది. కాగా మన దేశంలో ఇప్పటివరకూ వచ్చిన అతి పెద్ద ఐపీఓ కోల్ ఇండియాదే (రూ.15,100 కోట్లు–సుమారుగా 200 కోట్ల డాలర్లు) 11,110 కోట్ల డాలర్ల నికర లాభం... గత ఏడాదిలో సౌదీ ఆరామ్కో కంపెనీకి 11,110 కోట్ల డాలర్ల నికర లాభం వచ్చింది. ఇది దిగ్గజ కంపెనీలు–యాపిల్, గూగుల్, ఎక్సాన్ మొబిల్ కంపెనీల మొత్తం నికర లాభం కంటే కూడా ఎక్కువే కావడం విశేషం. -
సిగ్నిటీ టెక్నాలజీస్‌కు 36 కోట్ల లాభం
హైదరాబాద్: సిగ్నిటీ టెక్నాలజీస్ సంస్థ సెప్టెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో రూ.215 కోట్ల టర్నోవర్‌పై రూ.36 కోట్ల లాభాన్ని ప్రకటించింది. క్రితం ఆరి్థక సంవత్సరం ఇదే కాలంలో ఉన్న రూ.205 కోట్ల ఆదాయంతో పోలిస్తే 5 శాతం వృద్ధి నమోదైంది. కానీ, నికర లాభం మాత్రం క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఉన్న రూ.49.52 కోట్లతో పోలిస్తే 25 శాతం వరకు తగ్గినట్టు తెలుస్తోంది. కానీ, సీక్వెన్షియల్‌గా చూస్తే మాత్రం కూ1లో నికర లాభం రూ.28.5 కోట్లతో పోలిస్తే వృద్ధి నమోదైంది. క్యూ2లో ఎబిటా రూ.68.52 కోట్లకు పెరిగింది. ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ టెస్టింగ్ సేవల్లో సిగ్నిటీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. -
బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభం 266 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో రూ.266 కోట్ల నికర లాభం సాధించింది. కేటాయింపులు తగ్గడం, నికర వడ్డీ ఆదాయం బాగా ఉండటం, ఇతర ఆదాయం పెరగడంతో ఈ స్థాయి లాభం నమోదైంది. గతేడాది ఇదే క్వార్టర్లో రూ.1,156 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. ఆదాయం రూ.10,800 కోట్ల నుంచి రూ.11,986 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్ 2.27% నుంచి 2.99%కి పెరిగింది. ఇది 18 క్వార్టర్ల గరిష్ట స్థాయి. గత క్యూ2లో 16.36%గా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో 16.31%కి తగ్గాయి. నికర మొండి బకాయిలు 7.64% నుంచి 5.77%కి చేరాయి. -
డాక్టర్ రెడ్డీస్ లాభం రెట్టింపు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ (డీఆర్ఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 1,093 కోట్ల నికర లాభం ప్రకటించింది. ఇది గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నమోదైన రూ. 504 కోట్లతో పోలిస్తే 117 శాతం అధికం. క్యూ2లో ఆదాయం రూ. 3,798 కోట్ల నుంచి 26 శాతం పెరిగి రూ. 4,801 కోట్లకు చేరింది. పన్నులపరమైన సర్దుబాట్లు, కొన్ని ప్రాంతాలకు సంబంధించి మూడు ఉత్పత్తుల హక్కులను విక్రయించడం వంటి వన్‌టైమ్ అంశాలు.. ఆదాయాలు, లాభాలు పెరగడానికి కారణమయ్యాయని సంస్థ సీఈవో ఎరెజ్ ఇజ్రేలీ, సీఎఫ్‌వో సౌమెన్ చక్రవర్తి శుక్రవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. మూడు ఔషధాల విక్రయ హక్కుల బదలాయింపునకు గాను అప్షర్–స్మిత్ లాబరేటరీస్ నుంచి రూ. 720 కోట్లు లైసెన్సు ఫీజు కింద రాగా, సుమారు రూ. 326 కోట్ల మేర ఆదాయపు పన్నుపరమైన ప్రయోజనం లభించినట్లు చక్రవర్తి తెలిపారు. ఈ క్వార్టర్లో అత్యధిక లాభాలు, ఆదాయాలు నమోదు చేసినట్లు వివరించారు. నిర్దిష్ట మలినాల కారణంగా .. రానిటిడిన్ ఔషధాన్ని అమెరికా మార్కెట్ల నుంచి స్వచ్ఛందంగా రీకాల్ చేశామని, ప్రస్తుతం దీన్ని ఎక్కడా విక్రయించడం లేదని చక్రవర్తి వివరించారు. చైనా మార్కెట్లో క్యాన్సర్ ఔషధాలతో పాటు 70 ఉత్పత్తులు ప్రవేశపెట్టడంపై దృష్టి సారిస్తున్నామని ఇజ్రేలీ తెలిపారు. ద్వితీయార్థంలో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలకు కేటాయింపులు పెరగనున్నట్లు చెప్పారు. వృద్ధి లేని ఉత్తర అమెరికా.. యూరప్, వర్ధమాన మార్కెట్లు, భారత్ తదితర దేశాల ఊతంతో గ్లోబల్ జనరిక్స్ విభాగం ఆదాయం వార్షికంగా 7 శాతం వృద్ధితో రూ. 3,280 కోట్లుగా నమోదైంది. కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్లో వృద్ధి లేకపోగా.. ధరలు తగ్గించాల్సి రావడం, విక్రయాలు తగ్గడం వంటి అంశాల కారణంగా సీక్వెన్షియల్‌గా చూస్తే 13 శాతం క్షీణించి రూ. 1,430 కోట్లకు పరిమితమైంది. సెపె్టంబర్ త్రైమాసికంలో ఉత్తర అమెరికా మార్కెట్లో ఎనిమిది కొత్త ఉత్పత్తులు ప్రవేశపెట్టామని, ప్రస్తుతం 99 జనరిక్ ఔషధాలకు అమెరికా ఆహార, ఔషధ రంగ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) వద్ద పెండింగ్‌లో ఉన్నాయని చక్రవర్తి చెప్పారు. మెరుగ్గా యూరప్... కొత్త ఉత్పత్తులు, అమ్మకాల వృద్ధి ఊతంతో యూరప్ మార్కెట్ ద్వారా ఆదాయం 44 శాతం వృద్ధి చెంది రూ. 280 కోట్లుగా నమోదైంది. ఇక, దేశీ మార్కెట్లో ఆదాయం 9 శాతం వృద్ధితో రూ. 750 కోట్లకు చేరినట్లు చక్రవర్తి తెలిపారు. రెండో త్రైమాసికంలో భారత మార్కెట్లో కొత్తగా 5 ఉత్పత్తులు ప్రవేశపెట్టినట్లు వివరించారు. మరోవైపు వర్ధమాన మార్కెట్ల ద్వారా ఆదాయం 10 శాతం వృద్ధి చెందింది. పీఎస్‌ఏఐ విభాగం 18 శాతం అప్.. ఫార్మా సరీ్వసెస్, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ (పీఎస్‌ఏఐ) విభాగం వార్షికంగా 18 శాతం, సీక్వెన్షియల్‌గా 57 శాతం వృద్ధి నమోదు చేసింది. ప్రస్తుత ఉత్పత్తుల విక్రయాలు పెరగడం ఇందుకు దోహదపడింది. సెప్టెంబర్ త్రైమాసికంలో పరిశోధన అభివృద్ధి కార్యకలాపాలపై రూ. 370 కోట్లు వెచ్చించగా.. పెట్టుబడి వ్యయాల కింద ప్రథమార్ధంలో మొత్తం రూ. 214 కోట్లు వెచ్చించినట్లు చక్రవర్తి తెలిపారు. ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో శుక్రవారం బీఎస్ఈలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ షేరు 1 శాతం క్షీణించి రూ. 2,755 వద్ద ముగిసింది. -
రెట్టింపైన ధనలక్ష్మీ బ్యాంక్ లాభం
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ధనలక్ష్మీ బ్యాంక్ నికర లాభం సెప్టెంబర్ క్వార్టర్లో రెట్టింపైంది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.12 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.22 కోట్లకు పెరిగిందని ధనలక్ష్మీ బ్యాంక్ తెలిపింది. మొండి బకాయిలు తగ్గడంతో నికర లాభం దాదాపు రెట్టింపైందని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.227 కోట్ల నుంచి రూ.277 కోట్లకు, నికర వడ్డీ ఆదాయం రూ.245 కోట్ల నుంచి రూ.253 కోట్లకు పెరిగాయని తెలిపింది. -
టాటా మోటార్స్ నష్టాలు రూ.188 కోట్లు
న్యూఢిల్లీ: దేశీయ వాహన దిగ్గజం టాటా మోటార్స్ కంపెనీకి ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో రూ.188 కోట్ల నికర నష్టాలు(కన్సాలిడేటెడ్) వచ్చాయి. దేశీయ మార్కెట్లో నెలకొన్న మందగమనం ఈ కంపెనీపై బాగానే ప్రభావం చూపించినప్పటికీ, గత క్యూ2లో వచి్చన నష్టాలు(రూ.1,009 కోట్లు)తో పోలి్చతే నష్టాలు బాగానే తగ్గాయి. గత క్యూ2లో రూ.71,981 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.65,432 కోట్లకు తగ్గిందని టాటా మోటార్స్ తెలిపింది. అయితే స్డాండ్‌అలోన్ పరంగా చూస్తే, గత క్యూ2లో రూ.109 కోట్ల నికర లాభం రాగా ఈ క్యూ2లో మాత్రం రూ.1,282 కోట్ల నికర నష్టాలు వచ్చాయని టాటా మోటార్స్ సీఈఓ గుంటర్ బశ్చెక్ చెప్పారు. దేశీయంగా హోల్‌సేల్స్ వాహన విక్రయాలు 44 శాతం తగ్గి 1,06,349కు తగ్గాయని తెలిపారు. సుదీర్ఘ మందగమనం కారణంగా వాహన విక్రయాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. డిమాండ్ అంతంతమాత్రంగానే ఉండటం, కొత్త యాక్సిల్ లోడ్ నిబంధనలు, నిధుల కొరత, వినియోగదారుల సెంటిమెంట్ బలహీనంగా ఉండటం... ఇవన్నీ ప్రభావం చూపుతున్నాయన్నారు. ఫలించిన ‘ప్రాజెక్ట్ ఛార్జ్’..... లగ్జరీ కార్ల విభాగం, జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) హోల్‌సేల్స్ అమ్మకాలు 3 శాతం పెరిగి 1,34,489 కు పెరిగాయని జేఎల్ఆర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాల్ఫ్ స్మెత్ చెప్పారు. రూ.10,000 కోట్ల సమీకరణ రూ.10,000 కోట్ల నిధుల సమీకరణకు డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని టాటా మోటార్స్ వెల్లడించింది. మాతృ కంపెనీ టాటా సన్స్‌కు ఒక్కో షేర్‌ను రూ.150 ధరకు ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన షేర్లు, వారంట్ల జారీ ద్వారా రూ.6,494 కోట్లు సమీకరిస్తామని, అలాగే విదేశీ వాణిజ్య రుణాల ద్వారా రూ.3,024 కోట్లు చొప్పున ఈ నిధులను సమీకరిస్తామని తెలిపింది. ఆరి్థక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో టాటా మోటార్స్ షేర్ 5 శాతం నష్టంతో రూ.127 వద్ద ముగిసింది -
ఐటీసీ లాభం 4,173 కోట్లు
న్యూఢిల్లీ: ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం ఐటీసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో రూ.4,174 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో ఆర్జించిన నికర లాభం (రూ.3,045 కోట్లు)తో పోల్చితే 37 శాతం వృద్ధి సాధించామని ఐటీసీ తెలిపింది. పేపర్ బోర్డ్స్, హోటళ్లు, ఎఫ్ఎమ్సీజీ ఇతర వ్యాపారాల జోరు కారణంగా నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని ఐటీసీ వెల్లడించింది. కంపెనీ సాధించిన అత్యధిక త్రైమాసిక లాభం ఇదే. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు ప్రయోజనం (రూ.166 కోట్ల మేర) సానుకూల ప్రభావం చూపించిందని ఐటీసీ పేర్కొంది. నికర అమ్మకాలు రూ.12,019 కోట్ల నుంచి 6% వృద్ధితో రూ.12,759 కోట్లకు పెరిగిందని పేర్కొంది. సిగరెట్ల వ్యాపారం ఆదాయం 7 శాతం వృద్ధితో రూ.5,842 కోట్లకు, ఎఫ్ఎమ్సీజీ వ్యాపారం(సిగరెట్లు కలుపుకొని) 6 శాతం వృద్ధితో రూ.9,138 కోట్లకు, ఎఫ్‌ఎమ్‌సీజీయేతర వ్యాపారాల ఆదాయం 4 శాతం పెరిగి రూ.3,286 కోట్లకు చేరాయి. ఇక హోటళ్ల వ్యాపారం ఆదాయం 17 శాతం వృద్ధితో రూ.446 కోట్లకు, వ్యవసాయ వ్యాపార విభాగం ఆదాయం 19 శాతం వృద్ధితో రూ.2,674 కోట్లకు, పేపర్ బోర్డ్స్, పేపర్, ప్యాకేజింగ్ విభాగం ఆదాయం 10 శాతం పెరిగి రూ.1,565 కోట్లకు పెరిగాయని పేర్కొంది. -
మారుతీకి మందగమనం దెబ్బ
న్యూఢిల్లీ: వాహన విక్రయాల మందగమనం దేశీ కార్ల దిగ్గజం మారుతీ సుజుకీపై తీవ్రంగానే ప్రభావం చూపించింది. ఈ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో 39% తగ్గింది. గత క్యూ2లో రూ.2,280 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.1,391 కోట్లకు తగ్గింది. గత ఎనిమిదేళ్లలో ఇదే అత్యంత భారీ తగ్గుదల. ఆదాయం రూ.21,554 కోట్ల నుంచి 25% తగ్గి రూ.16,123 కోట్లకు చేరింది. క్యూ2లో వాహన విక్రయాలు 30% తగ్గి 3,38,317కు చేరాయని కంపెనీ చైర్మన్ ఆర్. సి. భార్గవ వెల్లడించారు. ఎలక్ట్రిక్ కారు ఇప్పుడే కాదు... : ఎలక్ట్రిక్ కారు ప్రస్తుతం తయారీ దశలో ఉందని, విక్రయాల నిమిత్తం ఈ కారును వచ్చే ఏడాది మార్కెట్లోకి తెచ్చే అవకాశాల్లేవని భార్గవ చెప్పారు. ఎలక్ట్రిక్ కార్లకు సంబంధించిన మౌలిక సదుపాయాలు దేశంలో ఇంకా అందుబాటులోకి రాలేదని, ప్రభుత్వ తోడ్పాటు కూడా తగిన విధంగా లేదన్నారు. -
బజాజ్ ఆటో లాభం రూ.1,523 కోట్లు
న్యూఢిల్లీ: బజాజ్ ఆటో కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.1,523 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) సాధించింది. గత ఆరి్థక సంవత్సరం ఇదే క్వార్టర్లో ఆర్జించిన నికర లాభం (రూ.1,257 కోట్లు)తో పోలి్చతే 21 శాతం వృద్ధి సాధించామని బజాజ్ ఆటో తెలిపింది. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు ప్రయోజనం కారణంగా రూ.182 కోట్ల పన్ను ఆదా కావడం కలసి వచ్చిందని తెలిపింది. మొత్తం ఆదాయం రూ.8,036 కోట్ల నుంచి 4 శాతం తగ్గి రూ.7,707 కోట్లకు చేరిందని పేర్కొంది. పన్నులు, డివిడెండ్లు కలిసి మొత్తం రూ.2,072 కోట్ల చెల్లింపులు పోను ఈ ఏడాది సెపె్టంబర్ 30 నాటికి నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.15,986 కోట్లుగా ఉన్నాయని తెలిపింది. కాగా, గత క్యూ2లో 13.4 లక్షలుగా ఉన్న మొత్తం వాహన విక్రయాలు ఈ క్యూ2లో 11.73 లక్షలకు తగ్గాయని బజాజ్ ఆటో తెలిపింది. మోటార్ బైక్‌ల విక్రయాలు 11.26 లక్షల నుంచి 12 శాతం తగ్గి 9.84 లక్షలకు తగ్గాయని పేర్కొంది. -
‘హీరో’ లాభం 10 శాతం డౌన్
న్యూఢిల్లీ: టూ వీలర్ దిగ్గజం హీరో మోటొకార్ప్ నికర లాభం రెండో త్రైమాసిక కాలంలో 10 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.982 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.884 కోట్లకు తగ్గిందని హీరో మోటొకార్ప్ తెలిపింది. కార్యకలాపాల ఆదాయం రూ.9,168 కోట్ల నుంచి రూ.7,661 కోట్లకు తగ్గిందని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, నిరంజన్ గుప్తా తెలిపారు. ఈ క్యూ2లో స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్ఎస్) పథకాన్ని తెచ్చామని, వీఆర్ఎస్కు అంగీకరించిన ఉద్యోగుల కోసం రూ.60 కోట్లు కేటాయింపులు జరిపామని, ఆ మేరకు నికర లాభం ప్రభావితమైందని వివరించారు. గత క్యూ2లో 15.2 శాతంగా ఉన్న నిర్వహణ లాభ మార్జిన్ ఈ క్యూ2లో 14.5 శాతానికి తగ్గిందని పేర్కొన్నారు. గత క్యూ2లో 21.3 లక్షలుగా ఉన్న వాహన విక్రయాలు ఈ క్యూ2లో 21 శాతం తగ్గి 16.91 లక్షలకు చేరాయని గుప్తా తెలిపారు. కాగా, పండుగల సీజన్ ముగిసిన తర్వాత భారత్ స్టేజ్–సిక్స్ (బీఎస్–సిక్స్) మోటార్ బైక్‌లను కంపెనీ అందుబాటులోకి తేనుంది. -
జేకే లక్ష్మీ సిమెంట్ లాభం రూ.43 కోట్లు
న్యూఢిల్లీ: జేకే లక్ష్మీ సిమెంట్ నికర లాభం మార్చి క్వార్టర్లో 28 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం (2017–18) క్యూ4లో రూ.34 కోట్లుగా ఉన్న నికర లాభం గత క్యూ4లో రూ.43 కోట్లకు పెరిగిందని జేకే లక్ష్మీ సిమెంట్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.923 కోట్ల నుంచి 29 శాతం వృద్ధితో రూ.1,189 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఒక్కో ఈక్విటీ షేర్‌కు 75 పైసలు డివిడెండ్‌గా ఇవ్వనున్నామని తెలిపింది. పూర్తి ఆర్థిక సంవత్సరం ç 2017–18లో రూ.84 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 5 శాతం తగ్గి రూ.80 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ.3,583 కోట్ల నుంచి 10% పెరిగి రూ.3,939 కోట్లకు పెరిగింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో షేర్ 1.6 శాతం లాభంతో రూ.372 వద్ద ముగిసింది. -
నాలుగు రెట్లు పెరిగిన బజాజ్ ఎలక్ట్రికల్స్ లాభం
న్యూఢిల్లీ: బజాజ్ ఎలక్ట్రికల్స్ కంపెనీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2018–19)మార్చి క్వార్టర్లో నాలుగు రెట్లు పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) క్యూ4లో రూ.7 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.29 కోట్లకు పెరిగిందని బజాజ్ ఎలక్ట్రికల్స్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,606 కోట్ల నుంచి 10 శాతం వృద్ధితో రూ.1,773 కోట్లకు పెరిగిందని కంపెనీ సీఎమ్‌డీ శేఖర్ బజాజ్ చెప్పారు. మొత్తం వ్యయాలు రూ.1,496 కోట్ల నుంచి 17 శాతం వృద్ధితో రూ.1,755 కోట్లకు పెరిగాయని వివరించారు. రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.3.50 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు. స్థూల లాభంలో ఎలాంటి వృద్ధి లేదని నిర్వహణ లాభం రూ.38 కోట్ల నుంచి 22 శాతం వృద్ధితో రూ.46 కోట్లకు పెరిగిందని వివరించారు. రెట్టింపైన ఏడాది లాభం.... ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18లో రూ.84 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రెండు రెట్లు పెరిగి రూ.167 కోట్లకు పెరిగిందని శేఖర్ బజాజ్ చెప్పారు. మొత్తం అమ్మకాలు రూ.4,716 కోట్ల నుంచి 41 శాతం పెరిగి రూ.6,673 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. రాజీవ్ బజాజ్‌ను అదనపు డైరెక్టర్‌గా నియమించామని, ఈ నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో బజాజ్ ఎలక్ట్రికల్స్ షేర్ 2 శాతం నష్టంతో రూ.550 వద్ద ముగిసింది. -
డీఎల్ఎఫ్ లాభం 76% అప్
న్యూఢిల్లీ: రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం(2018–19) నాలుగో క్వార్టర్లో 76 శాతం ఎగసింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) క్యూ4లో రూ.248 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.437 కోట్లకు పెరిగిందని డీఎల్ఎఫ్ తెలిపింది. అమ్మకాల బుకింగ్స్ దాదాపు రెట్టింపై రూ.2,435 కోట్లకు పెరగడంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని వివరించింది. మొత్తం ఆదాయం రూ.1,846 కోట్ల నుంచి రూ.2,661 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఏడాది లాభం.. రూ.1,319 కోట్లు.... పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18లో రూ.4,464 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,319 కోట్లకు తగ్గిందని డీఎల్ఎఫ్ తెలిపింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో రెంటల్ ఆదాయాన్ని విక్రయించడం వల్ల అప్పుడు విశేషమైన లాభాలు వచ్చాయని, దీంతో పోల్చితే గత ఆర్థిక సంవత్సరంలో నికర లాభం తగ్గిందని వివరించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.7,664 కోట్ల నుంచి రూ.9,029 కోట్లకు పెరిగిందని తెలిపింది. నికర అమ్మకాలు రూ.1,000 కోట్ల నుంచి రూ.2,435 కోట్లకు పెరిగాయని పేర్కొంది. రెసిడెన్షియల్ సెగ్మెంట్లో అమ్మకాలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయని వివరించింది. ప్రీమియమ్, లగ్జరీ సెగ్మెంట్లలో నివసించడానికి సిద్ధంగా ఉన్న ఫ్లాట్లను విక్రయించడం ఆరంభించామని పేర్కొంది. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్(క్యూఐపీ) ద్వారా రూ.3,173 కోట్ల నిధులను విజయవంతంగా సమీకరించామని కంపెనీ తెలిపింది. ప్రమోటర్లు రూ.11,250 కోట్ల మేర పెట్టుబడులు అందించారని వివరించింది. మెరుగైన ఫలితాలతో బీఎస్ఈలో డీఎల్ఎఫ్ షేర్ 1.5% లాభంతో రూ.173 వద్ద ముగిసింది. -
నిరాశపరిచిన టెక్ మహీంద్రా
న్యూఢిల్లీ: ఐటీ రంగ కంపెనీ టెక్ మహీంద్రా మార్చి త్రైమాసిక ఫలితాలు ఇన్వెస్టర్లను మెప్పించలేకపోయాయి. కంపెనీ నికర లాభం అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 8 శాతానికి పైగా క్షీణించి రూ.1,126 కోట్లకు పరిమితం అయింది. ఆదాయం మాత్రం 10 శాతం పెరిగి రూ.8,892 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ.1,230 కోట్ల లాభాన్ని, రూ.8,054 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. 2018–19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ నికర లాభం 13 శాతం వృద్ధితో రూ.4,288 కోట్లకు చేరింది. ఆదాయం సైతం 13% పెరిగి రూ.34,742 కోట్లుగా నమోదైనట్టు కంపెనీ ప్రకటించింది. పనితీరుపై సంతృప్తి ‘‘గడిచిన ఆర్థిక సంవత్సరం మాకు సంతృప్తిని ఇచ్చింది. మార్జిన్లు మెరుగుపడ్డాయి. డిజిటల్ పోర్ట్‌ఫోలియో వృద్ధి చెందడం, చెప్పుకోతగ్గ కాంట్రాక్టులను సొంతం చేసుకోవడం మేలు చేశాయి. కమ్యూనికేషన్ వ్యాపారం పుంజుకోవడం మాకు ఉత్సాహాన్నిచ్చింది’’ అని టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నానీ తెలిపారు. కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య మార్చి నాటికి 1,21,082కు చేరింది. గత ఆర్థిక సంవత్సరంలో నికరంగా 8,275 మంది ఉద్యోగులు పెరిగారు. కంపెనీ యాక్టివ్ క్లయింట్ల సంఖ్య మార్చి త్రైమాసికంలో 938గా ఉంది. ‘‘ఎన్నో విభాగాల్లో నిర్వహణ పనితీరు మెరగుపడిన సంవత్సరం ఇది(2018–19). దీనివల్ల ఎబిట్డా మార్జిన్ గణనీయంగా విస్తరించింది. తగినన్ని నగదు నిల్వలు ఉండడంతో వాటాదారులకు మెరుగైన విలువను తిరిగి అందించేందుకు షేర్ల బైబ్యాక్ కార్యక్రమాన్ని కూడా చేపట్టాం’’ అని టెక్ మహీంద్రా సీఎఫ్‌వో మనోజ్భట్ పేర్కొన్నారు. ఒక్కో షేరుపై 2019 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.14 చొప్పున డివిడెండ్ చెల్లించేందుకు టెక్‌మహీంద్రా బోర్డు నిర్ణయం తీసుకుంది. -
ఫలితాల్లో అదరగొట్టిన భారత్ఫోర్జ్
న్యూఢిల్లీ: భారత్ ఫోర్జ్ 2018–19 మార్చి త్రైమాసికం (క్యూ4) ఫలితాలతో మెప్పించింది. స్టాండలోన్ లాభం మూడు రెట్లు పెరిగి రూ.299 కోట్లకు చేరింది. ఆదాయం సైతం రూ.1,718 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో(2017–18, క్యూ4) లాభం రూ.100 కోట్లు, ఆదాయం రూ.1,500 కోట్లుగా ఉన్నాయి. 2018–19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.10,348 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ.1,032 కోట్ల లాభాన్ని కంపెనీ ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.8,556 కోట్లు, లాభం రూ.753 కోట్లుగా ఉన్నాయి. ఒక్కో షేరుకు తుది డివిడెండ్ రూ.2.5 ఇచ్చేందుకు కంపెనీ నిర్ణయం తీసుకుంది. -
డాక్టర్ రెడ్డీస్ లాభం 44% అప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం(2018–19, క్యూ4)లో దేశీ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ (డీఆర్ఎల్) నికర లాభం 44 శాతం ఎగిసింది. రూ. 434.4 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం(2017–18) ఇదే కాలంలో లాభం రూ.302.2 కోట్లు. మరోవైపు, తాజాగా నాలుగో త్రైమాసికంలో ఆదాయం 14% వృద్ధి చెందింది. రూ.3,535 కోట్ల నుంచి రూ.4,017 కోట్లకు పెరిగింది. పూర్తి ఏడాదికి గాను రూ.5 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.20 తుది డివిడెండు ఇవ్వాలని కంపెనీ బోర్డు నిర్ణయించింది. శుక్రవారమిక్కడ విలేకరుల సమావేశంలో ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా డీఆర్ఎల్ సీఎఫ్‌వో సౌమేన్ చక్రవర్తి ఈ విషయాలు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 20 ఔషధాలు మార్కెట్లోకి ప్రవేశపెట్టామని, ఈసారి కూడా సుమారు అదే స్థాయిలో కొత్త ఉత్పత్తులు అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. అమెరికాలో మూడు డెర్మటాలజీ బ్రాండ్స్ విక్రయాలకు సంబంధించి నాలుగో త్రైమాసికంలో ఎన్కోర్ డెర్మటాలజీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక పనితీరును గణనీయంగా మెరుగుపర్చుకోగలిగినట్లు సంస్థ సీఈవో జీవీ ప్రసాద్ తెలిపారు. నాణ్యతా ప్రమాణాలను మెరుగుపర్చుకోవడంలోనూ పురోగతి సాధించినట్లు వివరించారు. ‘రాబోయే రోజుల్లో లాభదాయక వృద్ధిని సాధించడంతో పాటు కార్యకలాపాల నిర్వహణను మెరుగుపర్చుకోవడంపై మరింతగా దృష్టి పెట్టాలని నిర్దేశించుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా పేషంట్లకు అధిక ప్రయోజనం చేకూర్చే నూతన ఆవిష్కరణలపైనా దృష్టి పెడతాం‘ అని ప్రసాద్ చెప్పారు. సుబాక్సోన్ జనరిక్ ఔషధ విక్రయాలను నిలిపివేయాలంటూ అమెరికా కోర్టులో కేసు వేసిన ఇండీవియర్ సంస్థ.. ఒకవేళ కేసు వీగిపోయిన పక్షంలో పరిహారంగా చెల్లించేందుకు 72 మిలియన్ డాలర్ల బాండు సమర్పించినట్లు పేర్కొన్నారు. తుది తీర్పు తమకు అనుకూలంగా వచ్చిన పక్షంలో అంతకుమించి పరిహారం కోరనున్నట్లు తెలిపారు. జనరిక్స్‌కు వర్ధమాన మార్కెట్ల ఊతం.. యూరప్, వర్ధమాన మార్కెట్ల ఊతంతో గ్లోబల్ జనరిక్స్ విభాగం నాలుగో త్రైమాసికంలో మెరుగైన పనితీరు కనపర్చింది. వార్షికంగా తొమ్మిది శాతం వృద్ధితో ఆదాయం రూ. 3,038 కోట్లకు పెరిగింది. అటు కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్ కేవలం మూడు శాతం వృద్ధికి పరిమితమైంది. ఈ మార్కెట్ నుంచి క్యూ4లో ఆదాయం రూ. 1,449 కోట్ల నుంచి రూ. 1,496 కోట్లకు పెరిగింది. నాలుగో త్రైమాసికంలో కొత్తగా 5 ఉత్పత్తులను ఉత్తర అమెరికా మార్కెట్లో కంపెనీ ప్రవేశపెట్టింది. వీటిలో యాడ్సిర్కా, సయాలిస్ ప్రధానమైనవని సంస్థ తెలిపింది. భారత మార్కెట్ నుంచి క్యూ4లో ఆదాయాలు 6 శాతం పెరిగి రూ. 650 కోట్లకు, వార్షికంగా 12 శాతం వృద్ధితో రూ. 2,620 కోట్లకు పెరిగాయి వార్షికంగా రూ. 1,880 కోట్ల లాభం.. 2018–19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను డీఆర్ఎల్ ఆదాయం రూ. 15,385 కోట్లు కాగా.. లాభం రూ. 1,880 కోట్లుగా నమోదైంది. కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం, ప్రస్తుతమున్న ఉత్పత్తుల మార్కెట్ వాటా పెరగడంతో పాటు సానుకూల విదేశీ మారక రేటు తదితర అంశాలు ఉత్తర అమెరికా మార్కెట్ నుంచి ఆదాయాలు మెరుగుపడటానికి దోహదపడినట్లు చక్రవర్తి తెలిపారు. పూర్తి ఆర్థిక సంవత్సరంలో పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) కార్యకలాపాలపై రూ. 1,560 కోట్లు వెచ్చించినట్లు వివరించారు. -
ఐఓసీ నికర లాభం రూ.6,099 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) గత ఆర్థిక సంవత్సరం (2018–19) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.6,099 కోట్ల నికర లాభం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో ఆర్జించిన నికర లాభం రూ.5,218 కోట్లతో పోలిస్తే 17 శాతం వృద్ధి సాధించామని ఐఓసీ తెలిపింది. షేర్ వారీ ఆర్జనను చూస్తే నికర లాభం రూ.5.51 నుంచి రూ.6.46కు పెరిగిందని ఐఓసీ చైర్మన్ సంజీవ్ సింగ్ తెలిపారు. రిఫైనరీ మార్జిన్లు తక్కువగా ఉన్నా, ఇన్వెంటరీ లాభాలు, కరెన్సీ మారకంలో లాభాలు కారణంగా నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని వివరించారు. స్థూల రిఫైనరీ మార్జిన్ (జీఆర్ఎమ్–బ్యారెల్ ముడి చమురును ఇంధనంగా మార్చడం వల్ల వచ్చే మార్జిన్) 9.12 డాలర్ల నుంచి 4.09 డాలర్లకు తగ్గిందని తెలిపారు. టర్నోవర్ రూ.1.36 లక్షల కోట్ల నుంచి రూ.1.44 లక్షల కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఇన్వెంటరీ లాభాలు రూ.4,172 కోట్లు.. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.676 కోట్ల కరెన్సీ మారకం నష్టాలు రాగా, గత క్యూ4లో రూ.837 కోట్ల కరెన్సీ మారకం లాభాలు వచ్చాయని సంజీవ్ సింగ్ తెలిపారు. అయితే ఇన్వెంటరీ లాభాలు మాత్రం రూ.4,172 కోట్ల నుంచి రూ.2,655 కోట్లకు తగ్గాయని వివరించారు. ముడి చమురును ఈ కంపెనీ కొనుగోలు చేసిన ధర కంటే, ఈ చమురును ప్రాసెస్ చేసి ఇంధనంగా రిఫైనరీలకు సరఫరా చేసే సమయానికి ధర అధికంగా ఉంటే, వచ్చే లాభాలను ఇన్వెంటరీ లాభాలుగా పరిగణిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ, కిరోసిన్ సబ్సిడీలు చెల్లించడంలో జాప్యం జరుగుతుండటంతో రుణాలు తీసుకోవాల్సి వచ్చిందని, కంపెనీ రుణభారం రూ.86,359 కోట్లకు పెరిగిందని కంపెనీ డైరెక్టర్ (ఫైనాన్స్) ఏ.కె. శర్మ తెలిపారు. కేంద్రం నుంచి వంట ఇంధనం సబ్సిడీలు రూ.19,000 కోట్లు రావలసి ఉన్నాయని వివరించారు. ఏడాది లాభం 21 శాతం డౌన్.... ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18లో రూ.21,346 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 21 శాతం తగ్గి రూ.16,894 కోట్లకు తగ్గిందని సింగ్ తెలిపారు. టర్నోవర్ మాత్రం రూ.5.06 లక్షల కోట్ల నుంచి రూ.6.05 లక్షల కోట్లకు ఎగసిందని వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఐఓసీ షేర్0.7 శాతం నష్టంతో రూ.150 వద్ద ముగిసింది. -
హెచ్‌సీఎల్ టెక్ లాభం 2,550 కోట్లు
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ గత ఆర్థిక సంవత్సరం(2018–19) మార్చి క్వార్టర్లో రూ.2,550 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్)సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) ఇదే క్వార్టర్లో రూ.2,230 కోట్ల నికర లాభం వచ్చిందని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తెలిపింది. ఆదాయం రూ.13,178 కోట్ల నుంచి 21% వృద్ధితో రూ.15,990 కోట్లకు పెరిగిందని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రెసిడెంట్, సీఈఓ సి. విజయ్‌కుమార్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 14–16 శాతం రేంజ్లో వృద్ధి చెందగలదన్న అంచనాలున్నాయని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 1,000 కోట్ల డాలర్ల(రూ.70,258 కోట్లు) ఆదాయం సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. ఒక్కో షేర్‌కు రూ.2 మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు. డిమాండ్ జోరుగానే.... ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2018–19లో నికర లాభం 16 శాతం వృద్ధితో రూ.10,120 కోట్లకు, ఆదాయం 19% వృద్ధితో రూ.60,427 కోట్లకు పెరిగాయని విజయ్‌కుమార్ పేర్కొన్నారు. స్థిర కరెన్సీ ప్రాతిపదికగా చూస్తే, గత ఆర్థిక సంవత్సరంలో 12% ఆదాయ వృద్ధిని సాధించామని, అంచనాలను అందుకున్నామని వివరించారు. డాలర్ల పరంగా చూస్తే, నికర లాభం 6% వృద్ధితో 36.4 కోట్ల డాలర్లకు, ఆదాయం 12% వృద్ధి తో 220 కోట్ల డాలర్లకు పెరిగాయని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తమకే కాకుండా, ఐటీ పరిశ్రమకు కూడా ఉత్తమ సంవత్సరం కానున్నదని పేర్కొన్నారు. టెక్నాలజీ సర్వీసులు, ఉత్పత్తులకు డిమాండ్ జోరుగా ఉండనున్నదని పేర్కొన్నారు. ఇక గత క్యూ4లో స్థూలంగా 14,249 మందికి ఉద్యోగాలిచ్చామని, మొత్తం ఉద్యోగుల సంఖ్య ఈ ఏడాది మార్చినాటికి 1,37,965కు పెరిగిందని విజయకుమార్ వివరించారు. ఏడాది కాలంలో ఆట్రీషన్ రేటు (ఉద్యోగుల వలస) 17.7%గా ఉందని పేర్కొన్నారు. మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బీఎస్ఈలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్ ఫ్లాట్‌గా రూ.1,132 వద్ద ముగిసింది. -
టైటాన్ లాభం రూ.348 కోట్లు
న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌నకు చెందిన టైటాన్ కంపెనీ నికర లాభం (కన్సాలిడేటెడ్) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో 14 శాతం పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) క్యూ4లో రూ.304 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం(2018–19) క్యూ4లో రూ.348 కోట్లకు పెరిగిందని టైటాన్ కంపెనీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.4,126 కోట్ల నుంచి రూ.4,945 కోట్లకు పెరిగిందని కంపెనీ ఎమ్డీ భాస్కర్ భట్ తెలిపారు. రూ.1 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.5 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని చెప్పారాయన. నికర అమ్మకాలు రూ.3,917 కోట్ల నుంచి 19 శాతం ఎగసి రూ.4,672 కోట్లకు పెరిగాయి. నిర్వహణ లాభం రూ.475 కోట్ల నుంచి 7 శాతం వృద్ధితో రూ.511 కోట్లకు పెరిగింది. 9.8 శాతం మార్జిన్ సాధించామని భట్ పేర్కొన్నారు. రూ.19,961 కోట్లకు మొత్తం ఆదాయం... పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18లో రూ.1,102 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,389 కోట్లకు పెరిగింది. మొత్తం ఆదాయం రూ.16,245 కోట్ల నుంచి రూ.19,961 కోట్లకు చేరుకుంది. గత కొన్నేళ్లుగా ఉన్నట్లే వృద్ధి జోరు గత ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగిందని భాస్కర్ భట్ వివరించారు. కీలకమైన వ్యాపార విభాగాల్లో ఆదాయం, లాభం అంశాల్లో పటిష్టమైన వృద్ధిని సాధించామన్నారు. అత్తరు బ్రాండ్ స్కిన్, భారత దుస్తులకు సంబంధించిన బ్రాండ్ తనైరాలను భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రానున్న సంవత్సరాల్లో మంచి వృద్ధి సాధించడానికి అవసరమైన చర్యలను తీసుకుంటున్నామని తెలిపారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో టైటాన్ కంపెనీ షేర్ 0.2 శాతం లాభంతో రూ.1,088 వద్ద ముగిసింది. ఫలితాలు మార్కెట్ ముగిశాక వెలువడ్డాయి. -
వేదాంత లాభం 34% డౌన్
న్యూఢిల్లీ: లోహ, మైనింగ్ దిగ్గజం వేదాంత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం(2018–19) నాలుగో త్రైమాసిక కాలంలో 34 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2017–18) క్యూ4లో రూ.3,956 కోట్లుగా ఉన్న నికర లాభం (కన్సాలిడేటెడ్) గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.2,615 కోట్లకు తగ్గిందని వేదాంత తెలిపింది. ఆదాయం తక్కువగా రావడంతో నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని వేదాంత లిమిటెడ్ చైర్మన్ నవీన్ అగర్వాల్ తెలిపారు. మొత్తం ఆదాయం రూ.28,547 కోట్ల నుంచి 12 శాతం క్షీణించి రూ.25,096 కోట్లకు తగ్గిందని పేర్కొన్నారు. మొత్తం వ్యయాలు కూడా రూ. 22,824 కోట్ల నుంచి రూ.20,992 కోట్లకు తగ్గాయని వివరించారు. ఎబిటా 20 శాతం తగ్గి రూ.6,135 కోట్లకు, ఎబిటా మార్జిన్ 1.7 శాతం తగ్గి 26.1 శాతానికి చేరాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి పునర్వ్యవ స్థీకరణ జోరుగా జరిగిందని, ఆర్థిక అంశాలు పటిష్టంగా ఉన్నాయని, వాటాదారులకు పరిశ్రమలోనే ఏ కంపెనీ ఇవ్వనంతటి రాబడులు ఇచ్చామని అగర్వాల్ పేర్కొన్నారు. తాము కొనుగోలు చేసిన ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్ కంపెనీని విజయవంతంగా లాభాల బాట పట్టించామని తెలిపారు. విభిన్నమైన సహజ వనరుల వ్యాపారాలకు సంబంధించి ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీల్లో ఒకటిగా అవతరించామని కంపెనీ సీఈఓ శ్రీనివాసన్ వెంకటకృష్ణన్ చెప్పారు. ఈ ఏడాది మార్చి నాటికి కంపెనీ స్థూల రుణ భారం రూ.8,066 కోట్లు పెరిగి రూ.66,225 కోట్లకు ఎగసిందని శ్రీనివాసన్ వివరించారు. నికర రుణ భారం రూ.5,000 కోట్లు పెరిగి రూ.26,956 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. మార్కెట్ ముగిసిన తర్వాత వేదాంత కంపెనీ ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. బీఎస్ఈలో వేదాంత షేర్ 2 శాతం నష్టంతో రూ.163 వద్ద ముగిసింది. -
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం 1,170 కోట్లు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంక్‌కు గత ఆర్థిక సంవత్సరం(2018–19) నాలుగో క్వార్టర్లో రూ.1,170 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) వచ్చింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) ఇదే క్వార్టర్లో ఆర్జించిన నికర లాభం (రూ.1,141 కోట్లు) తో పోల్చితే 2 శాతం వృద్ధి సాధించామని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. దీంట్లో ట్యాక్స్ రిఫండ్ ప్రయోజనాల కారణంగా రూ.440 కోట్లు, అనుబంధ కంపెనీల లాభం రూ.489 కోట్ల మేర ఉండటం విశేషం. అయితే స్టాండ్అలోన్ పరంగా చూస్తే, నికర లాభం తగ్గిందని బ్యాంక్ వెల్లడించింది. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.1 డివిడెండ్‌ను కంపెనీ ఇవ్వనున్నది. తగ్గిన స్టాండ్అలోన్ లాభం... అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.1,020 కోట్లుగా ఉన్న నికర లాభం(స్టాండ్అలోన్) గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 5 శాతం తగ్గి రూ.969 కోట్లకు చేరిందని బ్యాంక్ ఈడీ సందీప్ బాత్రా పేర్కొన్నారు. స్టాండ్అలోన్ పరంగా నికర లాభం తగ్గినా, అనుబంధ కంపెనీల తోడ్పాటుతో ఈ బ్యాంక్ కన్సాలిడేటెడ్ నికర లాభం స్వల్పంగా పెరిగిందని తెలిపారు. మొత్తం ఆదాయం రూ.33,760 కోట్ల నుంచి రూ.36,784 కోట్లకు పెరిగిందని వివరించారు. నికర వడ్డీ ఆదాయం రూ.6,022 కోట్ల నుంచి 27 శాతం ఎగసి రూ.7,620 కోట్లకు, నికర వడ్డీ మార్జిన్ 3.40 శాతం నుంచి 3.72 శాతానికి పెరిగాయని పేర్కొన్నారు. ఫీజు ఆదాయం 15 శాతం పెరగ్గా, రుణాలు 17 శాతం, డిపాజిట్లు 16 శాతం చొప్పున వృద్ధి చెందాయని వివరించారు. గత క్యూ4లో రూ.7,300 కోట్ల బకాయిలను రద్దు చేశామని, ప్రొవిజన్ కవరేజ్ రేషియో 60 శాతం నుంచి 80 శాతానికి ఎగసిందని తెలిపారు. స్థూల మొండి బకాయిలు 7.75 శాతం నుంచి 7.38 శాతానికి తగ్గాయి. ఇతర ఆదాయం రూ.5,679 కోట్ల నుంచి 36 శాతం క్షీణించి రూ.3,621 కోట్లకు చేరింది. సగం తగ్గిన తాజా మొండి బకాయిలు.. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, ఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభం భారీగా తగ్గింది. గత ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 40 శాతం తగ్గి రూ.3,363 కోట్లకు చేరింది. తాజా మొండి బకాయిలు దాదాపు సగం తగ్గాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో రూ.28,730 కోట్లుగా ఉన్న తాజా మొండి బకాయిలు గత ఆర్థి క సంవత్సరంలో రూ.11,039 కోట్లకు తగ్గాయి. మెరుగుపడిన రుణ నాణ్యత... బ్యాంక్ రుణ నాణ్యత మెరుగుపడింది. గత ఏడాది మార్చి 31 నాటికి 8.84 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ ఏడాది మార్చి 31 నాటికి 6.70 శాతానికి తగ్గాయని ఐసీఐసీఐ బ్యాంక్ పేర్కొంది. అలాగే నికర మొండి బకాయిలు 4.77 శాతం నుంచి 2.06 శాతానికి తగ్గాయని వివరించింది. ఇది 13 క్వార్టర్ల కనిష్ట స్థాయి అని పేర్కొంది. గత క్యూ4లో తాజా మొండి బకాయిలు రూ.3,547 కోట్లుగా నమోదయ్యాయి. కేటాయింపులు వార్షికంగా తగ్గగా, సీక్వెన్షియల్‌గా మాత్రం పెరిగాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.6,626 కోట్లుగా ఉన్న కేటాయింపులు గత క్యూ4లో రూ.5,451 కోట్లకు తగ్గాయి. గత క్యూ3లో కేటాయింపులు రూ.4,244 కోట్లుగా ఉన్నాయి. మార్కెట్ ముగిసిన తర్వా:త ఫలితాలు వెలువడ్డాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఐసీఐసీఐ బ్యాంక్ షేర్0.11 శాతం నష్టంతో రూ.401 వద్ద ముగిసింది. అధ్వాన కాలం ముగిసింది మొండి బకాయిలు భారీగా పెరగడం, అవినీతి ఆరోపణలపై సీఈఓ చందా కొచర్ వైదొలగడం వంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్న ఈ బ్యాంక్.... అధ్వాన కాలం ముగిసినట్లేనని పేర్కొంది. రుణ నాణ్యతకు సంబంధించిన సైకిల్లో చివరి దశలో ఉన్నామని బ్యాంక్ ఈడీ సందీప్ బాత్రా పేర్కొన్నారు. రానున్న కాలంలో మొండి బకాయిలు పేరుకుపోవడం తగ్గగలదన్న అంచనాలున్నాయన్నారు. వడ్డీ వ్యయాలు 1–1.2 శాతం రేంజ్లో ఉండేవని, కానీ మొండి బకాయిలకు కేటాయింపుల కారణంగా ఈ వ్యయాలు 3.5 శాతానికి ఎగిశాయని పేర్కొన్నారు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే ఈ వ్యయాలు చెప్పుకోదగ్గ స్థాయిలో మెరుగుపడి సాధారణ స్థాయికి వస్తాయని వివరించారు. -
ఎయిర్టెల్ లాభం 29 శాతం అప్
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2018–19) జనవరి–మార్చి క్వార్టర్లో 29 శాతం ఎగసి రూ.107 కోట్లకు చేరింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) ఇదే క్వార్టర్లో ఈ కంపెనీకి రూ.83 కోట్ల నికర లాభం వచ్చింది. నష్టాలను ప్రకటించగలదన్న విశ్లేషకుల అంచనాలను తల్లకిందులు చేస్తూ ఈ కంపెనీ లాభాన్ని ప్రకటించడం విశేషం. భారత మొబైల్ సర్వీసుల వ్యాపారంలో నష్టాలు వచ్చినా, ఆఫ్రికా వ్యాపారం పుంజుకోవడం, అసాధారణ ఆదాయ లాభాల కారణంగా ఈ స్థాయి నికర లాభాన్ని ఈ కంపెనీ సాధించింది. చాలా క్వార్టర్ల తర్వాత నికర లాభంలో పెరుగుదల నమోదు కావడం ఇదే మొదటిసారి. సీక్వెన్షియల్‌గా చూస్తే, నికర లాభం 24 శాతం ఎగసింది. ఇక ఆదాయం 6 శాతం ఎగసి రూ.20,602 కోట్లకు పెరిగింది. గత క్యూ4లో రూ.2,022 కోట్ల మేర అసాధారణ ఆదాయ లాభాలు (నెట్వర్క్ రీ–ఫార్మింగ్, అప్‌గ్రెడేషన్ ప్రోగ్రామ్‌కు సంబంధించిన చార్జీలు, లెవీల పున:మదింపుకు సంబంధించిన మొత్తం) వచ్చాయని కంపెనీ పేర్కొంది. రూ.25,000 కోట్ల రైట్స్ ఇష్యూ ప్రస్తుతం నడుస్తోంది. ఈ నెల 17న ఈ రైట్స్ ఇష్యూ ముగియనున్నది. రెట్టింపైన ‘భారత’ నష్టాలు... ఈ కంపెనీ భారత వ్యాపారంలో అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లో రూ.482 కోట్ల నష్టాలు వచ్చాయి. ఇక గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో ఈ నష్టాలు దాదాపు రెట్టింపై రూ.1,378 కోట్లకు పెరిగాయి. ఇదే కాలంలో ఆఫ్రికా మొబైల్ సర్వీసుల్లో లాభం రూ.1,129 కోట్ల నుంచి 1,317 కోట్లకు పెరిగింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.1,099 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు సగం తగ్గి రూ.410 కోట్లకు పడిపోయింది. ఆదాయం కూడా రూ.82,639 కోట్ల నుంచి 2 శాతం తగ్గి రూ.80,780 కోట్లకు తగ్గింది. ముకేష్ అంబానీ రిలయన్స్ జియో నుంచి ఎదురవుతున్న పోటీ తట్టుకోవడానికి టెలికం కంపెనీలు టారిఫ్‌లను భారీగా తగ్గించాయి. ఫలితంగా ఆ కంపెనీల లాభదాయకతపై తీవ్రమైన ప్రభావం పడుతోంది. వాయిస్, డేటా వినియోగం రికార్డ్ స్థాయిల్లో ఉన్నా, టెలికం కంపెనీలకు పెద్దగా లాభాలు రావడం లేదని మరోసారి ఎయిర్టెల్ ఫలితాలు రుజువు చేశాయని నిపుణులంటున్నారు. మార్కెట్ ముగిసిన తర్వాత ఎయిర్టెల్ ఫలితాలు వెలువడ్డాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో భారతీ ఎయిర్టెల్ షేర్ 0.6 శాతం లాభంతో రూ.333 వద్ద ముగిసింది. -
బ్రిటానియా ఇండస్ట్రీస్ లాభం రూ.294 కోట్లు
న్యూఢిల్లీ: బ్రిటానియా ఇండస్ట్రీస్ నికర లాభం(కన్సాలిడేటెడ్) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో 12 శాతం పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) క్యూ4లో రూ.263 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2018–19) క్యూ4లో రూ.294 కోట్లకు పెరిగిందని బ్రిటానియా ఇండస్ట్రీస్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.2,582 కోట్ల నుంచి రూ.2,861 కోట్లకు పెరిగిందని కంపెనీ ఎమ్డీ, వరుణ్ బెర్రి చెప్పారు. తమ ప్రధాన వ్యాపారం జోరు కొనసాగుతోందని పేర్కొన్నారు. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ విస్తరణ, కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తేవడం, వ్యయ నియంత్రణ పద్ధతులు దీనికి ప్రధాన కారణాలని వివరించారు. పూర్తి ఆహార కంపెనీగా అవతరించడం తమ ప్రధాన లక్ష్యమని, ఈ లక్ష్య సాధన కోసం కొత్త కేటగిరీల్లో ఉత్పత్తులను అందిస్తున్నామని వివరించారు. రూ. 1 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.15 డివిడెండ్(1500%)ను ఇవ్వనున్నామని తెలిపారు. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18లో రూ.1,004 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 15% వృద్ధితో రూ.1,155 కోట్లకు పెరిగిందని వరుణ్ వెల్లడించారు. ఆదాయం రూ.10,156 కోట్ల నుంచి రూ.11,261 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. -
టీవీఎస్ మోటార్ లాభం 19 శాతం డౌన్
న్యూఢిల్లీ: టీవీఎస్ మోటార్ కంపెనీ నికర లాభం (స్టాండ్అలోన్) గత ఆర్థిక సంవత్సరం (2018–19) జనవరి–మార్చి క్వార్టర్లో 19 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) క్యూ4లో రూ.166 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.134 కోట్లకు తగ్గిందని టీవీఎస్ మోటార్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.4,007 కోట్ల నుంచి 9 శాతం వృద్ధితో రూ.4,384 కోట్లకు పెరిగింది. మొత్తం టూ వీలర్, త్రీ వీలర్ అమ్మకాలు 8.89 లక్షల నుంచి 9.07 లక్షలకు పెరిగాయి. ఎబిటా రూ.295 కోట్ల నుంచి 4.4 శాతం వృద్ధితో రూ.308 కోట్లకు పెరిగింది. ఎబిటా మార్జిన్ 7 శాతంగా నమోదైంది. ఏడాది అమ్మకాలు 37.57 లక్షలు ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18లో రూ.663 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 1 శాతం పెరిగి రూ.670 కోట్లకు పెరిగిందని కంపెనీ తెలిపింది.ఆదాయం రూ.15,519 కోట్ల నుంచి రూ.18,210 కోట్లకు ఎగసిందని వివరించింది. మొత్తం టూ వీలర్ అమ్మకాలు 33.67 లక్షల నుంచి 37.57 లక్షలకు చేరాయని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో టీవీఎస్ మోటార్ కంపెనీ 4 శాతం నష్టంతో రూ.486 వద్ద ముగిసింది. -
కోటక్ బ్యాంక్ లాభం 2,038 కోట్లు
న్యూఢిల్లీ: కోటక్ మహీంద్రా బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం (2018–19) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.2,038 కోట్ల నికర లాభాన్ని సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం( 2017–18) ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం రూ.1,789 కోట్లతో పోలిస్తే 14 శాతం వృద్ధి సాధించామని కోటక్ బ్యాంక్ తెలిపింది. ఇతర ఆదాయం పెరగడం, తక్కువ కేటాయింపుల కారణంగా నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఉదయ్ కోటక్ పేర్కొన్నారు. మొత్తం ఆదాయం రూ.10,874 కోట్ల నుంచి రూ.13,823 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్కో ఈక్విటీ షేర్‌కు 80 పైసలు డివిడెండ్‌ను ఇవ్వనున్నామని కోటక్ తెలిపారు. నికర వడ్డీ మార్జిన్ 4.48 శాతం స్డాండ్ఎలోన్ పరంగా చూస్తే గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో నికర లాభం రూ.1,408 కోట్లకు ఎగసింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో నికర లాభం రూ.1,124 కోట్లు. నికర వడ్డీ ఆదాయం రూ.2,580 కోట్ల నుంచి 18 శాతం వృద్ధితో రూ.3,048 కోట్లకు పెరిగింది. స్థూల మొండి బకాయిలు 2.07 శాతం నుంచి 2.14 శాతానికి, నికర మొండి బకాయిలు 0.71 శాతం నుంచి 0.75 శాతానికి పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లో స్థూల మొండి బకాయిలు రూ.4,468 కోట్లుగా, నికర మొండి బకాయిలు రూ.1,544 కోట్లుగా ఉన్నాయి. నికర వడ్డీ మార్జిన్ 4.48 శాతంగా నమోదైంది. కేటాయింపులు రూ.171 కోట్లుగా ఉన్నాయి. నిర్వహణ లాభం రూ.2,018 కోట్ల నుంచి 13 శాతం వృద్ధితో రూ.2,282 కోట్లకు చేరింది. ఇతర ఆదాయం స్వల్ప వృద్ధితో రూ.1,270 కోట్లకు పెరిగింది. కేటాయింపులు దాదాపు సగానికి తగ్గాయి. రూ.307 కోట్లుగా ఉన్న కేటాయింపులు రూ.171 కోట్లకు తగ్గాయి. 21 శాతం రుణ వృద్ధి ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18లో రూ.6,201 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.7,204 కోట్లకు పెరిగింది. ఆదాయం రూ.38,724 కోట్ల నుంచి రూ.45,903 కోట్లకు పెరిగింది. గత ఏడాది మార్చి నాటికి 1.95 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ ఏడాది మార్చి నాటికి 1.94%కి, నికర మొండి బకాయిలు 0.86% నుంచి 0.70%కి తగ్గాయి. గత ఏడాది మార్చి నాటికి రూ.1,69,718 కోట్లుగా ఉన్న రుణాలు ఈ ఏడాది మార్చి నాటికి 21 శాతం వృద్ధితో రూ.2,05,695 కోట్లకు పెరిగాయి. తొలిసారిగా బ్యాలన్స్ షీట్ సైజు రూ.3,00,000 కోట్లకు చేరింది. ఆ కంపెనీలకు రుణాలివ్వలేదు... లిక్విడిటీ సమస్యల కారణంగా రుణ మార్కెట్లో సవాళ్లున్నా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20 శాతానికి మించి రుణ వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కోటక్ పేర్కొన్నారు. నికర వడ్డీ మార్జిన్ 4.2–4.5 శాతం రేంజ్లో కొనసాగగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కాగా దివాలా తీసిన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్‌నకు గానీ, సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్కు గానీ, అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలకు గానీ ఎలాంటి రుణాలివ్వలేదని కోటక్ స్పష్టం చేశారు. ప్రమోటర్ షేర్ హోల్డింగ్‌కు సంబంధించిన కేసు తొమ్మిది నెలల తర్వాత విచారణకు రానున్నదని పేర్కొన్నారు. ఈ విషయంలో అన్నీ నిబంధనల ప్రకారమే ఉన్నాయని వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్ 0.65 శాతం లాభంతో రూ.1,379 వద్ద ముగిసింది. ఏడాది కాలంలో ఈ షేర్ 16 శాతం లాభపడింది. -
హెచ్డీఎఫ్సీ లైఫ్ లాభం రూ.364 కోట్లు
ముంబై: ప్రైవేట్ రంగ బీమా కంపెనీ, హెచ్డీఎఫ్సీ లైఫ్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లో 5 శాతం పెరిగింది. గత క్యూ4లో రూ.364 కోట్ల నికర లాభం సాధించామని హెచ్డీఎఫ్సీ లైఫ్ తెలిపింది. పరిశ్రమని మించిన వృద్ధిని సాధిస్తున్నామని, లాభదాయకతలో అగ్రస్థానాన్ని కొనసాగిస్తున్నామని కంపెనీ ఎమ్డీ, సీఈఓ విభా పడాల్కర్ తెలిపారు. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18లో రూ.1,109 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 15 శాతం వృద్ధితో రూ.1,277 కోట్లకు పెరిగిందని విభా పేర్కొన్నారు. మార్కెట్ వాటా పరంగా కొత్త వ్యాపార ప్రీమియమ్ 19.1 శాతం నుంచి 20.7 శాతానికి పెరిగిందని తెలిపారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో హెచ్డీఎఫ్సీ లైఫ్ షేర్ స్వల్పంగా నష్టపోయి రూ. 399.35 వద్ద ముగిసింది. -
‘హీరో’ లాభం 25 శాతం డౌన్
న్యూఢిల్లీ: టూవీలర్ దిగ్గజం హీరో మోటోకార్ప్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 25 శాతం తగ్గి రూ.730 కోట్లకు చేరింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) క్యు4లో రూ.967 కోట్ల నికర లాభం వచ్చిందని హీరో మోటోకార్ప్ చైర్మన్ పవన్ ముంజల్ పేర్కొన్నారు. గత క్యూ4లో అమ్మకాలు తగ్గడంతో నికర లాభం కూడా తగ్గిందని, ఆదాయం రూ.8,564 కోట్ల నుంచి 8 శాతం పతనమై రూ.7,885 కోట్లకు తగ్గిందని తెలిపారు. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం క్యూ4లో 20 లక్షల వాహనాలు విక్రయించగా, గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో 17.8 లక్షల వాహనాలు విక్రయించామని, అమ్మకాలు 11 శాతం తగ్గాయని తెలిపారు. రూ. 2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.32 డివిడెండ్‌ను ప్రకటించారు. కాగా ఈ ఏడాది జనవరి 31న ఒక్కో షేర్‌కు రూ.55 మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. 78 లక్షల వాహన విక్రయాలు.. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.3,697 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 8 శాతం తగ్గి రూ.3,385 కోట్లకు చేరింది. ఆదాయం మాత్రం రూ.32,872 కోట్ల నుంచి 2 శాతం వృద్ధితో రూ.33,651 కోట్లకు పెరిగింది. వాహన విక్రయాలు రూ.75.87 లక్షల నుంచి 78.20 లక్షలకు పెరిగాయి. వివిధ ప్రాంతాల్లో పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, రికార్డు విక్రయాలు సాధించామని ముంజల్ వ్యాఖ్యానించారు. మార్కెట్లో ఇబ్బందులున్నా, అగ్రస్థానాన్ని కొనసాగించామన్నారు. కష్టాలు కొనసాగుతాయ్..... దేశీయ మార్కెట్లో సమీప భవిష్యత్తులో కష్టాలు కొనసాగుతాయని ముంజల్ పేర్కొన్నారు. పండుగల సీజన్లో అమ్మకాలు పుంజుకుంటాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. భారత్ స్టేజ్ (బీఎస్)–6 ప్రమాణాలు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తాయని, ఈ నిబంధనలు పాటించే బైక్‌లను, స్కూటర్లను అంతకంటే ముందే మార్కెట్లోకి తెస్తామని తెలిపారు. అయితే బీఎస్ సిక్స్ నిబంధనలు కఠినంగా ఉన్నాయని, ఈ నిబంధనల కారణంగా వాహన పరిశ్రమకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కూడా సమస్యాత్మకమేనని పేర్కొన్నారు. కంపెనీ ఆర్థిక ఫలితాలు అంతంతమాత్రంగానే ఉంటాయన్న అంచనాలతో కంపెనీ షేరు బీఎస్ఈలో 0.5 శాతం నష్టంతో రూ.2,604 వద్ద ముగిసింది. -
హెక్సావేర్ టెక్నాలజీస్ లాభం రూ.138 కోట్లు
న్యూఢిల్లీ: మిడ్– సైజ్ ఐటీ సేవల కంపెనీ హెక్స్‌వేర్‌టెక్నాలజీస్ ఈ ఏడాది జనవరి– మార్చి క్వార్టర్లో రూ.138 కోట్ల నికర లాభం సాధించింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో రూ.134 కోట్ల నికర లాభం వచ్చిందని, 3 శాతం వృద్ధి సాధించామని హెక్సావేర్ టెక్నాలజీస్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,049 కోట్ల నుంచి 21 శాతం వృద్ధితో రూ.1,264 కోట్లకు పెరిగిందని కంపెనీ చైర్మన్ అతుల్ నిశార్ చెప్పారు. మరోసారి రెండంకెల వృద్ధిని సాధించామని, పరిశ్రమకే తలమానికమైన వృద్ధిని సాధించాలన్న తమ తపనకు ఇదే నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. సీజనల్‌గా బలహీనంగా ఉన్నప్పటికీ, మంచి వృద్ధిని సాధించామని కంపెనీ సీఈఓ, ఈడీ ఆర్. కృష్ణ తెలిపారు. ఈ క్వార్టర్‌కు గాను ఒక్కో షేర్‌కు రూ.2.50 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు. ఈ కంపెనీ జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పాటిస్తోంది. డాలర్ల పరంగా చూస్తే, ఈ మార్చి క్వార్టర్లో నికర లాభం 5 శాతం క్షీణించి 1.97 కోట్ల డాలర్లకు, ఆదాయం 11 శాతం వృద్ధి చెంది 18 కోట్ల డాలర్లకు చేరిందని నిశార్ తెలిపారు. గత ఆరు నెలల్లో 304 మందికి కొత్తగా ఉద్యోగాలిచ్చామని, మొత్తం ఉద్యోగుల సంఖ్య 16,509గా ఉందని తెలిపారు. ఉద్యోగుల వలస(ఆట్రీషన్ రేటు) 18.2 శాతంగా ఉందని కృష్ణ వివరించారు. ఈ ఏడాది మార్చి క్వార్టర్ నాటికి నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.870 కోట్లుగా ఉన్నాయని తెలిపారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో హెక్సావేర్ టెక్నాలజీస్ షేర్ 4 శాతం నష్టంతో రూ.333 వద్ద ముగిసింది. -
మైండ్ ట్రీ 200% స్పెషల్ డివిడెండ్
న్యూఢిల్లీ: మిడ్– సైజ్ ఐటీ కంపెనీ మైండ్ ట్రీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో 9 శాతం పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.182 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.198 కోట్లకు పెరిగిందని మైండ్‌ట్రీ తెలిపింది. ఆదాయం రూ.1,464 కోట్ల నుంచి 26% వృద్ధితో రూ.1,839 కోట్లకు పెరిగిందని పేర్కొంది. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, నికర లాభం 32% వృద్ధితో రూ.754కు, మొత్తం ఆదాయం 29 శాతం వృద్ధితో రూ.7,021 కోట్లకు పెరిగాయని మైండ్‌ట్రీ సీఈఓ, ఎమ్డీ రోస్టో రావణన్ తెలిపారు. వంద కోట్ల డాలర్లు దాటిన వార్షికాదాయం.... ఒక్కో షేర్‌కు రూ.3 మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని రావణన్ తెలిపారు. ఈ మధ్యంతర డివిడెండ్‌ను వచ్చే నెల 10లోగా చెల్లిస్తామని, అలాగే ఒక్కో షేర్‌కు రూ.4 తుది డివిడెండ్‌ను కూడా చెల్లించనున్నామని వివరించారు. అంతే కాకుండా రూ.20 (200%) స్పెషల్ డివిడెండ్‌ను కూడా ఇవ్వనున్నామని పేర్కొన్నారు. వార్షికాదాయం వంద కోట్ల డాలర్లు దాటిందని, కంపెనీ 20వ వార్షికోత్సవం జరుపుకుంటోందని, దీని కారణంగా ఈ స్పెషల్ డివిడెండ్‌ను ఇస్తున్నామని వివరించారు. రూ.368 కోట్ల డివిడెండ్ చెల్లింపులు... మొత్తం 16 కోట్ల ఈక్విటీ షేర్లున్నాయని, స్పెషల్ డివిడెండ్ కింద ప్రమోటర్లకు, వాటాదారులకు రూ.320 కోట్ల మేర చెల్లించనున్నామని ఈ సందర్భంగా రావణన్ తెలిపారు. మధ్యంతర డివిడెండ్‌ను కూడా కలుపుకుంటే మొత్తం డివిడెండ్ చెల్లింపులు రూ.368 కోట్లకు పెరుగుతాయని వివరించారు. ఈ స్పెషల్ డివిడెండ్ ప్రతిపాదనకు జూన్/జూలైల్లో జరిగే వార్షిక సాధారణ సమావేశంలో వాటాదారుల ఆమోదం పొందాల్సి ఉందని పేర్కొన్నారు. (అప్పటికల్లా ఎల్ అండ్ టీ ఓపెన్ ఆఫర్ ముగుస్తుంది) గత ఆర్థిక సంవత్సరంలోనూ, గత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లోనూ చెప్పుకోదగ్గ స్థాయి పనితీరు సాధించామని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కంపెనీని ఎల్అండ్టీ బలవంతంగా టేకోవర్ చేస్తోన్న విషయం తెలిసిందే. -
లాభం 38 శాతం జంప్...
న్యూఢిల్లీ: దేశంలో మూడో అతిపెద్ద ఐటీ కంపెనీ విప్రో... గడిచిన ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం(2018–19, క్యూ4)లో కంపెనీ రూ.2,494 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ1,801 కోట్లతో పోలిస్తే 38.4 శాతం ఎగబాకింది. ఇక కంపెనీ మొత్తం ఆదాయం 8.9 శాతం వృద్ధితో రూ.13,769 కోట్ల నుంచి రూ.15,006 కోట్లకు చేరింది. కాగా, డిసెంబర్ క్వార్టర్ (క్యూ3)లో నికర లాభం రూ.2,544 కోట్లతో పోలిస్తే సీక్వెన్షి యల్ ప్రాతిపదికన క్యూ4లో లాభం 1.9 శాతం తగ్గింది. పూర్తి ఏడాదికి చూస్తే... 2018–19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి విప్రో నికర లాభం రూ.9,018 కోట్లుగా నమోదైంది. 2017–18లో నికర లాభం రూ.8,003 కోట్లతో పోలిస్తే 12.6 శాతం ఎగబాకింది. ఇక మొత్తం ఆదాయం కూడా 7.5 శాతం వృద్ధితో రూ.54,487 కోట్ల నుంచి రూ.58,585 కోట్లకు పెరిగింది. ఐటీ సేవలు ఇలా... విప్రో కీలక వ్యాపారమైన ఐటీ సేవల విభాగం ఆదాయం డాలర్ల రూపంలో క్యూ4లో 2,075 మిలియన్ డాలర్లుగా నమోదైంది. క్యూ3తో పోలిస్తే 1.4 శాతం తగ్గింది. మార్కెట్ విశ్లేషకులు 2,082 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని అంచనా వేశారు. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్(2019–20, క్యూ1)లో ఐటీ సేవల వ్యాపార విభాగం ఆదాయం 2,046–2,087 మిలియన్ డాలర్ల స్థాయిలో ఉండొచ్చని కంపెనీ అంచనా వేసింది. సీక్వెన్షియల్‌గా చూస్తే వృద్ధి మైనస్ 1 నుంచి 1 శాతంగా లెక్కతేలుతోంది. కాగా, మార్కెట్ విశ్లేషకుల వృద్ధి అంచనా 0–3 శాతంతో పోలిస్తే కంపెనీ అంచనా తక్కువగా ఉండటం గమనార్హం. ఉద్యోగుల అకౌంట్లు హ్యాకింగ్‌కు గురైనట్లు విప్రో ప్రకటించడం, గైడెన్స్ బలహీనంగా ఉండటంతో మంగళవారం కంపెనీ షేరు బీఎస్ఈలో 2.5 శాతం క్షీణించి రూ.281 వద్ద ముగిసింది. ‘పటిష్టమైన ఆర్డర్ల ఆసరాతో పాటు డిజిటల్ సైబర్ సెక్యూరిటీ, ఇంజనీరింగ్ సేవలు, క్లౌడ్ వంటి కీలక విభాగాల్లో మేం చేస్తున్న పెట్టుబడులు మంచి ఫలితాలను అందిస్తున్నాయి. ప్రతి త్రైమాసికంలో నిలకడగా ఆదాయాలు, లాభాలు పుంజుకోవడమే దీనికి నిదర్శనం.’ – అబిదాలి నీముచ్వాలా, విప్రో సీఈఓ–ఎండీ -
కేంద్రానికి ఆర్ఈసీ 1,143 కోట్ల డివిడెండ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ ఆర్ఈసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేర్‌కు రూ.11 (110 శాతం) మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. డివిడెండ్ చెల్లింపుల్లో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.1,143 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను ప్రభుత్వానికి చెల్లించింది. ఈ మొత్తానికి సమానమైన ఆర్టీజీఎస్ క్రెడిట్ అడ్వైస్‌ను ఆర్ఈసీ ప్రభుత్వానికి అందజేసింది. రూ.96,357 కోట్ల రుణాలు: ఈ ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల కాలానికి కొత్త ప్రాజెక్ట్‌ల కోసం రూ.96,357 కోట్లు మంజూరు చేశామని, వీటిల్లో రూ.52,269 కోట్లు పంపిణీ చేశామని ఆర్ఈసీ వివరించింది. ఈ తొమ్మిది నెలల కాలంలో స్థూల లాభం 32 శాతం వృద్ధితో రూ.6,466 కోట్లకు, నికర లాభం 26 శాతం వృద్ధితో రూ.4,508 కోట్లకు పెరిగిందని పేర్కొంది. -
స్టాక్స్ వ్యూ
ప్రస్తుత ధర: రూ.49 టార్గెట్ ధర: రూ.69 బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ఎందుకంటే: నాల్కో ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు కొన్ని అంశాల్లో అంచనాలను మించాయి. అయితే ఉత్పత్తి వ్యయాలు పెరగడం కొంత నిరాశపరిచింది. ఈ క్యూ3లో రూ.620 కోట్ల ఎబిటా రాగలదని అంచనా వేశాం. కానీ ఈ కంపెనీ రూ.510 కోట్ల ఎబిటానే సాధించింది. వార్షికంగా చూస్తే, ఎబిటా 10% పెరిగినా, సీక్వెన్షియల్‌గా చూస్తే, 40% క్షీణించింది. అమ్మకాలు, రియలైజేషన్లు తక్కువగా ఉండటం, ఉత్పత్తి వ్యయాలు అధికంగా ఉండటం దీనికి ప్రధాన కారణాలు. నికర లాభం 9% ఎగసి రూ.300 కోట్లకు పెరిగింది. అయితే సీక్వెన్షియల్‌గా చూస్తే, 41% క్షీణత నమోదైంది. ఈ క్యూ2తో పోల్చితే ఈ క్యూ3లో అల్యుమినా ఉత్పత్తి 12% పెరిగినా, అమ్మకాలు మాత్రం 10% తగ్గాయి. అల్యూమినియం ఉత్పత్తి 8%, అమ్మకాలు 10% చొప్పున తగ్గాయి. కొనొచ్చు ఇటీవల గరిష్ట స్థాయికి చేరిన అల్యుమినా ధరలు తగ్గడం, అమ్మకాలు తగ్గడంతో స్థిర వ్యయాల ప్రభావం అధికంగానే ఉండటం నాల్కో పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపించింది. అమ్మకాలు పెరిగే అవకాశాలున్నాయి. దీంతో ఉత్పత్తి వ్యయాలు తగ్గుతాయి. అయితే చైనా నుంచి సరఫరాలు పెరుగుతుండటంతో అల్యుమినా ధరలు మరింత తగ్గొచ్చు. రెండేళ్లలో ఎబిటా రూ.1,600 కోట్లకు, నికర లాభం రూ.1,000 కోట్లకు పెరగవచ్చని అంచనా వేస్తున్నాం. గతంలో ఇచ్చిన అంచనాల కంటే వీటిని 20–30% తగ్గిచాం. అల్యూమినా ధరలు తక్కువగా ఉండటంతో ఇలా అంచనాలను తగ్గిస్తున్నాం. అయినప్పటికీ, కొనచ్చు రేటింగ్‌ను కొనసాగిస్తున్నాం. ఏడాదిలో ఈ షేర్ రూ.69ను చేరుతుందని భావిస్తున్నాం. ధరలు పెరిగితే ఈ రంగంలో అత్యధికంగా లాభపడే కంపెనీ ఇదే కానున్నది. రెప్కో హోమ్ ఫైనాన్స్ బ్రోకరేజ్ సంస్థ: ఎడెల్వీజ్ ఫైనాన్స్ ప్రస్తుత ధర: రూ.325 టార్గెట్ ధర: రూ.498 ఎందుకంటే: భారత ప్రభుత్వానికి చెందిన రిపాట్రియేట్స్ కోపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ (రెప్కో)బ్యాంక్ ప్రమోట్ చేస్తున్న రెప్కో హోమ్ ఫైనాన్స్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు అంచనాల కంటే బలహీనంగా ఉన్నాయి. ఆదాయం అంతంతమాత్రంగానే ఉండటం, కేటాయింపులు అధికంగా ఉండటంతో రూ.56 కోట్ల నికర లాభాన్ని మాత్రమే సాధించగలిగింది. రుణాల మంజూరు సీక్వెన్షియల్‌గా చూస్తే 6 శాతం తగ్గి రూ.7,300 కోట్లకు పరిమితమైంది. దీంతో నిర్వహణ ఆస్తులు 12 శాతం మాత్రమే పెరిగాయి. సీజనల్ ట్రెండ్‌కు అనుగుణంగానే స్థూల మొండి బకాయిలు పెరిగాయి. ఈ క్యూ2లో 3.6 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో 3.9 శాతానికి పెరిగాయి. అధిక విలువ ఉన్న రుణాలను మంజూరు చేయడాన్ని నిలిపేసిన ఈ కంపెనీ రికవరీలపై దృష్టి పెట్టింది. ఈ చర్యల ఫలితాలు, ఫలాలు రానున్న క్వార్టర్లలో కనిపిస్తాయి. ఈ కంపెనీ లోన్‌బుక్‌లో 60 శాతానికి పైగా తమిళనాడు నుంచే ఉన్నాయి. ఆ రాష్ట్రంలో భూమి రిజిస్ట్రేషన్ సమస్య కారణంగా రుణ రికవరీలు మందగమనంగా ఉన్నాయి. మరోవైపు మహారాష్ట్ర మార్కెట్ 25 శాతం, గుజరాత్ మార్కెట్ 45 శాతం చొప్పున వృద్ధి సాధించాయి. సాధారణంగా వేతన ఉద్యోగులకే పలు గృహ రుణ సంస్థలు రుణాలిస్తాయి. కానీ ఈ కంపెనీ స్వయం ఉపాధి వ్యక్తులకు కూడా రుణాలిస్తోంది. ప్రస్తుత నిధుల లభ్యత సమస్య, గృహ రుణాల రంగంలో రికవరీ మందకొడిగా ఉండటం వంటి ప్రతికూలతలు రెప్కో హోమ్ ఫైనాన్స్‌పై సమీప భవిష్యత్తులో ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఫలితంగా వృద్ధి, నికర వడ్డీ మార్జిన్‌పై ఒత్తిడి కొనసాగవచ్చు. అయినప్పటికీ, ఈ షేర్‌ను విక్రయించకుండా, అట్టేపెట్టుకోవాలని రికమెండ్ చేస్తున్నాం. లోన్ క్యాంప్స్ ద్వారా విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించడం, మార్కెటింగ్ దళారీ వ్యవస్థ లేకపోవడం సానుకూలాంశాలు. -
భారీగా తగ్గిన ఎవరెడీ ఇండస్ట్రీస్ నికర లాభం
న్యూఢిల్లీ: బ్యాటరీలు, ఫ్లాష్లైట్లు తయారు చేసే ఎవరెడీ ఇండస్ట్రీస్ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో భారీగా తగ్గింది. గత క్యూ3లో రూ.21 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.18 లక్షలకు తగ్గిందని ఎవరెడీ ఇండస్ట్రీస్ తెలిపింది. చెన్నైలోని తిరువొత్తియూర్ ప్లాంట్‌లో కార్మికుల స్వచ్చంద పదవీ విరమణ(వీఆర్ఎస్) వ్యయాలు రూ.23 కోట్లుగా ఉండటంతో నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని వివరించింది. ఈ క్యూ3లోనే ఈ వీఆర్ఎస్ ప్రక్రియ పూర్తయిందని, ఈ భూమిని అళ్వార్‌పేట్ ప్రొపర్టీస్‌కు రూ.100 కోట్లకు విక్రయించడానికి గత డిసెంబర్లోనే ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపింది. మొత్తం ఆదాయం రూ.374 కోట్ల నుంచి రూ.388 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఈ క్యూ3లో బ్యాటరీ అమ్మకాలు 6 శాతం పెరిగాయని తెలిపింది. లైటింగ్ సెగ్మెంట్ టర్నోవర్ 11 శాతం తగ్గి రూ.88 కోట్లకు చేరిందని వివరించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఎవరెడీ ఇండస్ట్రీస్ షేర్ 0.17 శాతం తగ్గి రూ.202 వద్ద ముగిసింది. -
అశోక్ లేలాండ్ లాభం 21% డౌన్
న్యూఢిల్లీ: హిందుజా గ్రూప్‌నకు చెందిన ప్రధాన కంపెనీ అశోక్ లేలాండ్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 21 శాతం తగ్గింది. గత క్యూ3లో రూ.485 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.381 కోట్లకు తగ్గిందని అశోక్ లేలాండ్ తెలిపింది. ఇతర ఆదాయం తక్కువగా ఉండటం, అమ్మకాలు కూడా తగ్గడంతో నికర లాభం తగ్గింది. మొత్తం ఆదాయం రూ.7,191 కోట్ల నుంచి 12 శాతం క్షీణించి రూ.6,325 కోట్లకు తగ్గిందని పేర్కొంది. అమ్మకాలు 6 శాతం తగ్గగా, ఇతర ఆదాయం 43 శాతం తగ్గి రూ.80 కోట్లకు చేరిందని వివరించింది. ఎబిటా 23 శాతం తగ్గి రూ.650 కోట్లకు చేరగా, ఎబిటా మార్జిన్ 1.4 శాతం తగ్గి 10.3 శాతంగా ఉందని కంపెనీ పేర్కొంది. పన్ను వ్యయాలు 56 శాతం తగ్గి రూ.106 కోట్లకు తగ్గాయని తెలిపింది. పూర్తి రేంజ్ ఎల్‌సీవీలు... ధరల ఒత్తిడి, ఉత్పత్తి వ్యయాలు పెరగడం వంటి సమస్యలున్నప్పటికీ, ఈ క్యూ3లో మంచి ఫలితాలు సాధించామని కంపెనీ సీఎఫ్ఓ గోపాల్ మహదేవన్ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ, రెండంకెల ఎబిటా మార్జిన్ సాధించగలిగామన్నారు. తేలిక రకం వాణిజ్య వాహనాల (ఎల్సీవీ) వ్యాపారాన్ని అశోక్ లేలాండ్లో విలీనం చేశామని కంపెనీ ఎమ్డీ వినోద్ కె దాసరి చెప్పారు. 2020 నుంచి పూర్తి రేంజ్ ఎల్‌సీవీలను ఆఫర్ చేస్తామని తెలిపారు. ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడంతో బీఎస్ఈలో అశోక్ లేలాండ్ షేర్ 7 శాతం లాభంతో రూ.84.50 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్ 4 శాతం నష్టంతో తాజా ఏడాది కనిష్ట స్థాయి, రూ.77.75ను తాకింది. -
గోద్రేజ్ ఇండస్ట్రీస్ లాభం రెండు రెట్లు
న్యూఢిల్లీ: గోద్రేజ్ ఇండస్ట్రీస్ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రెండు రెట్లకు పైగా పెరిగింది. గత క్యూ3లో రూ.51 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.121 కోట్లకు ఎగసిందని గోద్రేజ్ ఇండస్ట్రీస్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.2,169 కోట్ల నుంచి రూ.2,576 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ.2,197 కోట్ల నుంచి 17 శాతం పెరిగి రూ.2,580 కోట్లకు చేరాయని తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో గోద్రేజ్ ఇండస్ట్రీస్ షేర్ 1.6 శాతం నష్టపోయి రూ.483 వద్ద ముగిసింది. భారత్ ఫోర్జ్ లాభం రూ.310 కోట్లు వాహన విడిభాగాలు తయారు చేసే భారత్ ఫోర్జ్ లాభం ఈ క్యూ3లో 36 శాతం పెరిగింది. గత క్యూ3లో రూ.228 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.310 కోట్లకు పెరిగిందని కంపెనీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,412 కోట్ల నుంచి రూ.1,740 కోట్లకు పెరిగింది. అన్ని విభాగాల్లో మంచి పనితీరు సాధించామని కంపెనీ సీఎమ్‌డీ బి.ఎన్. కళ్యాణి పేర్కొన్నారు. వాణిజ్య వాహనాలు, పారిశ్రామిక రంగాల నుంచి 65 లక్షల డాలర్ల విలువైన కొత్త ఆర్డర్లను సాధించామని తెలిపారు. నాలుగో క్వార్టర్లో కూడా డిమాండ్ జోరు కొనసాగగలదని ఆయన అంచనా వేస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా అమిత్ బి. కళ్యాణి పునః నియామాకాన్ని డైరెక్టర్ల బోర్డ్ ఆమోదించిందని, ఈ ఏడాది మే 11 నుంచి ఐదేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగుతారని పేర్కొన్నారు. బీఎస్ఈలో కంపెనీ షేర్ 1.4 శాతం నష్టపోయి రూ.477 వద్ద ముగిసింది. టేక్ సొల్యూషన్స్ డివిడెండ్ 30 పైసలు జీవ శాస్త్ర, సరఫరా చెయిన్ మేనేజ్మెంట్ కంపెనీ టేక్ సొల్యూషన్స్ ఈ ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్లో రూ.36 కోట్ల నికర లాభం సాధించింది. గత క్యూ3లో రూ.42 కోట్ల నికర లాభం వచ్చిందని వెల్లడించింది. మొత్తం ఆదాయం రూ.409 కోట్ల నుంచి రూ.524 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఒక్కో షేర్‌కు 30 పైసలు (30 శాతం) మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని పేర్కొంది. తొమ్మిది నెలల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే, నికర లాభం రూ.114 కోట్ల నుంచి రూ.151 కోట్లకు, మొత్తం ఆదాయం రూ.1,137 కోట్ల నుంచి రూ.1,529 కోట్లకు పెరిగాయని తెలిపింది. ఈ క్యూ3లో నికర లాభం తగ్గడంతో బీఎస్ఈలో ఈ షేర్ 5 శాతం పతనమై రూ.119 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో తాజా ఏడాది కనిష్ట స్థాయి, రూ.116ను తాకింది. అదానీ ట్రాన్సిమిషన్ లాభం రూ.189 కోట్లు అదానీ ట్రాన్సిమిషన్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో రూ.189 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) సాధించింది. గత క్యూ3లో రూ.842 కోట్ల నికర లాభం వచ్చిందని అదానీ ట్రాన్స్మిషన్ పేర్కొంది.రూ.742 కోట్ల వన్–టైమ్ ఇన్కమ్ కారణంగా ఈ స్థాయిలో గత క్యూ3లో లాభం సాధించామని వివరించింది. దీనిని పరిగణనలోకి తీసుకుకంటే గత క్యూ3లో రూ. 100 కోట్ల లాభమే వచ్చినట్లవుతుందని తెలిపింది. గత క్యూ3లో రూ.1,806 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో రూ.2,921 కోట్లకు పెరిగిందని పేర్కొంది. 2022 కల్లా అందరికీ విద్యుద్తును అందించాలనేది భారత ప్రభుత్వం లక్ష్యమని, అందుకే తాము కీలకమైన జిల్లాల్లో విద్యుత్ పంపిణీ వ్యాపారంలోకి ప్రవేశించాలనుకుంటున్నామని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తెలిపారు. ఫలితాలు సానుకూలంగా ఉండటంతో బీఎస్ఈలో అదానీ ట్రాన్సిమిషన్ షేర్ 2 శాతం లాభపడి రూ.216 వద్ద ముగిసింది. మరింత పెరిగిన సీజీ పవర్ నష్టాలు సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ కంపెనీ నికర నష్టాలు ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో మరింతగా పెరిగాయి. గత క్యూ3లో రూ.28 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ3లో రూ.150 కోట్లకు ఎగిశాయని సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,537 కోట్ల నుంచి రూ.1,731 కోట్లకు పెరిగిందని పేర్కొంది. అయితే ఏప్రిల్–డిసెంబర్ కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే, నికర నష్టాలు రూ.584 కోట్ల నుంచి రూ.262 కోట్లకు తగ్గాయని తెలిపింది. మొత్తం ఆదాయం రూ.4,569 కోట్ల నుంచి రూ.4,884 కోట్లకు పెరిగిందని పేర్కొంది. నికర నష్టాలు భారీగా పెరగడంతో ఈ షేర్ భారీగా నష్టపోయింది. ఇంట్రాడేలో తాజా ఏడాది కనిష్ట స్థాయి, రూ.23.5ను తాకిన ఈ షేర్ చివరకు 30 శాతం నష్టంతో రూ.23.75 వద్ద ముగిసింది. బాష్ లాభం రూ.335 కోట్లు వాహన విడిభాగాలు తయారు చేసే బాష్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో రూ.335 కోట్ల నికర లాభం (స్డాండోలోన్)సాధించింది. గత క్యూ3లో ఆర్జించిన నికర లాభం(రూ.281 కోట్లు)తో పోల్చితే 19 శాతం వృద్ధి సాధించామని బాష్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.3,174 కోట్ల నుంచి రూ.3,274 కోట్లకు పెరిగిందని పేర్కొంది. వ్యయాలు రూ.2,784 కోట్లకు చేరాయని తెలిపింది. భాస్కర్ భట్‌ను ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా రెండోసారి నియామకానికి కంపెనీ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆయన ఐదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారని వెల్లడించింది. జాయింట్ ఎమ్‌డీగా ఆండ్రియాస్ ఓల్ఫ్ను మళ్లీ డైరెక్టర్ల బోర్డ్ నియమించిందని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో బాష్ షేర్ 4 శాతం నష్టపోయి రూ.17,898 వద్ద ముగిసింది. రుచి సోయా లాభం రూ.6 కోట్లు దివాళా ప్రక్రియను ఎదుర్కొంటున్న రుచి సోయా కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.6 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.1,960 కోట్ల నికర నష్టాలు వచ్చా యని రుచి సోయా తెలిపింది. మొత్తం ఆదాయం రూ.3,050 కోట్ల నుంచి రూ.3,500 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఈ కంపెనీ రుణభారం రూ.12,000 కోట్లుగా ఉంది. న్యూట్రెలా, మహా కోశ్, సన్‌రిచ్, రుచి స్టార్, రుచి గోల్డ్ బ్రాండ్ల వంటనూనెలను ఈ కంపెనీ విక్రయిస్తోంది. ఫారŠూచ్యన్ బ్రాండ్ వంటనూనెలు విక్రయించే అదానీ విల్మర్, బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి కంపెనీలు ఈ కంపెనీ కొనుగోలు రేసులో ఉన్నాయి. బీఎస్ఈలో రుచి సోయా షేర 0.3 శాతం నష్టంతో రూ.6 వద్ద ముగిసింది. ఫోర్టిస్‌కు రూ.180 కోట్ల నష్టాలు ఫోర్టిస్ హెల్త్‌కేర్ కంపెనీకి ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.180 కోట్ల నికర నష్టాలు(కన్సాలిడేటెడ్) వచ్చాయి. గత క్యూ3లో నష్టాలు రూ.19 కోట్లని ఫోర్టిస్ హెల్త్‌కేర్ తెలిపింది. అసాధారణమైన వ్యయాల కారణంగా ఈ క్యూ3లో భారీగా నష్టాలు వచ్చాయని వివరించింది. ఆదాయం రూ.1,121 కోట్ల నుంచి రూ.1,103 కోట్లకు తగ్గిందని పేర్కొంది. బోర్డులోకి ఐదుగురు ఐహెచ్‌హెచ్ నామినీలు డైరెక్టర్ల బోర్డ్‌ను పునర్వ్యస్థీకరించామని, ఐహెచ్‌హెచ్ నామినీలను ఐదుగురిని డైరెక్టర్లుగా నియమించామని కంపెనీ చైర్మన్ రవి రాజగోపాల్ చెప్పారు. కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా వివేక్ కుమార్ గోయల్‌ను నియమించామని తెలిపారు. ఆయన నియామకం ఈ ఏడాది మే 1 నుంచి అమల్లోకి వస్తుందని వివరించారు. నికర నష్టాలు భారీగా రావడంతో బీఎస్ఈలో ఫోర్టిస్ హెల్త్‌కేర్ షేర్ 0.26 శాతం తగ్గి రూ.135 వద్ద ముగిసింది. -
రిలయన్స్ క్యాపిటల్ లాభం రూ.213 కోట్లు
ముంబై: రిలయన్స్ క్యాపిటల్ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.213 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.6 కోట్ల నికర లాభం వచ్చిందని రిలయన్స్ క్యాపిటల్ తెలిపింది. సాధారణ బీమా విభాగం మంచి లాభాలు సాధించడంతో ఈ క్యూ3లో ఈ స్థాయి నికర లాభం వచ్చిందని వివరించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.5,386 కోట్ల నుంచి రూ.5,016 కోట్లకు తగ్గిందని తెలిపింది. మొత్తం ఆస్తులు 7 శాతం పెరిగి రూ.89,400 కోట్లకు పెరిగాయని వివరించింది. ఈ క్యూ3లో మ్యూచువల్ ఫండ్ విభాగం, రిలయన్స్ నిప్పన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ రూ.110 కోట్ల నికర లాభం సాధించిందని రిలయన్స్ క్యాపిటల్ తెలిపింది. నిర్వహణ ఆస్తులు 7% పెరిగి రూ.4,14,362 కోట్లకు పెరిగాయని పేర్కొంది. హోమ్ ఫైనాన్స్ విభాగం, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లోన్ బుక్ 26 శాతం ఎగసి రూ.16,160 కోట్లకు పెరిగిందని తెలిపింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో రిలయన్స్ క్యాపిటల్ షేర్ 1.7% లాభంతో రూ.139 వద్ద ముగిసింది. -
పీఎఫ్సీ లాభం రూ.2,075 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ, పవర్ ఫైనాన్స్ కంపెనీ నికర లాభం 70 శాతం ఎగసింది. గత క్యూ3లో రూ.1,217 కోట్లుగా ఉన్న నికర లాభం (స్డాండోలోన్) ఈ క్యూ3లో రూ. 2,076 కోట్లకు పెరిగిందని పవర్ ఫైనాన్స్ కంపెనీ తెలిపింది. ఆదాయం అధికంగా రావడంతో ఈ స్థాయిలో నికర లాభం పెరిగిందని వివరించింది. మొత్తం ఆదాయం రూ.6,248 కోట్ల నుంచి రూ.7,364 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రుణ పరిమితిని రూ.97,000 కోట్లకు పెంచుకోవడానికి కంపెనీ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని పేర్కొంది. దీంట్లో భాగంగా దీర్ఘకాల రూపీ రుణాలు రూ.67,000 కోట్లు, దీర్ఘకాలిక విదేశీ కరెన్సీ రుణాలు రూ.10,000 కోట్లు, కమర్షియల్ పేపర్ రుణాలు రూ.13,000 కోట్లు, స్వల్ప కాలిక రుణాలు రూ.7,000 కోట్ల మేర ఉన్నాయని వివరించింది. కాగా ఈ ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల కాలంలో రూ.4,804 కోట్ల నికర లాభం వచ్చిందని, గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి రూ.3,565 కోట్ల నికర లాభం ఆర్జించామని తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో పీఎఫ్సీ షేర్ 1.3 శాతం నష్టంతో రూ.99.75 వద్ద ముగిసింది. -
అమరరాజా లాభం రూ.129 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టాండలోన్ ఫలితాల్లో అమరరాజా నికరలాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రూ.134 కోట్ల నుంచి రూ.129 కోట్లకు వచ్చి చేరింది. టర్నోవరు రూ.1,570 కోట్ల నుంచి రూ.1,707 కోట్లకు ఎగసింది. ఏప్రిల్–డిసెంబరు పీరియడ్‌లో రూ.5,267 కోట్ల టర్నోవరుపై రూ.363 కోట్ల నికరలాభం ఆర్జించింది. హెచ్‌బీఎల్ పవర్ లాభం రూ.7.3 కోట్లు.. క్యూ3లో హెచ్‌బీఎల్ పవర్ సిస్టమ్స్ నికరలాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రూ.7.4 కోట్ల నుంచి రూ.7.3 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు రూ.417 కోట్ల నుంచి రూ.314 కోట్లకు వచ్చి చేరింది. ఏప్రిల్–డిసెంబరులో రూ.958 కోట్ల టర్నోవరుపై రూ.18 కోట్ల నికరలాభం సాధించింది. రెండింతలైన ఆంధ్రా సిమెంట్స్ నష్టాలు.. గడిచిన త్రైమాసికంలో ఆంధ్రా సిమెంట్స్ నష్టం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రెండింతలకుపైగా పెరిగి రూ.79 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు రూ.114 కోట్ల నుంచి రూ.75 కోట్లకు వచ్చి చేరింది. ఏప్రిల్–డిసెంబరు పీరియడ్‌లో రూ.247 కోట్ల టర్నోవరుపై రూ.146 నష్టం నమోదైంది. -
స్పైస్‌జెట్‌కు ఇంధన సెగ
ముంబై: చౌక ధరల విమానయాన సంస్థ, స్పైస్‌జెట్ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 77 శాతం తగ్గింది. గత క్యూ3లో రూ.240 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.55 కోట్లకు చేరిందని స్పైస్‌జెట్ తెలిపింది. విమానయాన ఇంధనం ధరలు 34 శాతం పెరగడం, రూపాయి 11 శాతం పతనం కావడం వంటి కారణాల వల్ల ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని స్పైస్‌జెట్ చైర్మన్ అజయ్ సింగ్ తెలిపారు. మొత్తం ఆదాయం రూ.2,096 కోట్ల నుంచి రూ.2,531 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. భవిష్యత్తు అంచనాలు ఆశావహమే.... ప్యాసింజర్ ఈల్డ్స్ 8 శాతం పెరగడం వల్ల నష్టాలు తగ్గాయని అజయ్ సింగ్ వివరించారు. ఇంధన వ్యయాలు భారీగా పెరిగినా, కరెన్సీ మారకం పతనమైనా, ఆదాయం పెరుగుదల, పటిష్టమైన వ్యయ నియంత్రణ పద్ధతుల కారణంగా ఈ క్యూ3లో మంచి ఫలితాలు సాధించామని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రంగంలోని సమస్యలు ఇప్పుడిప్పుడే ఒక కొలిక్కి వస్తున్నాయని, భవిష్యత్తు అంచనాలు ఆశావహంగానే ఉన్నాయని పేర్కొన్నారు. -
ఎస్బీఐ లాభం రూ.4,709 కోట్లు
ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.4,709 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.1,887 కోట్ల నికర నష్టాలు వచ్చాయని ఎస్బీఐ తెలిపింది. కేటాయింపులు భారీగా తగ్గడం, రుణ నాణ్యత మెరుగుపడటం వల్ల భారీ నికర లాభం సాధించామని ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ వెల్లడించారు. మొత్తం ఆదాయం రూ.74,191 కోట్ల నుంచి రూ.84,350 కోట్లకు పెరిగిదన్నారు. స్టాండో లోన్ పరంగా చూస్తే, గత క్యూ3లో రూ.2,416 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.3,955 కోట్లకు పెరిగిందని వివరించారు. నికర వడ్డీ ఆదాయం 21 శాతం వృద్ధితో రూ.22,691 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. దీంతో నికర వడ్డీ మార్జిన్ 2.67 శాతం నుంచి 2.92 శాతానికి చేరిందన్నారు. మెరుగుపడిన రుణనాణ్యత ఈ క్వార్టర్లో నికర లాభం, వ్యాపార వృద్ధి, రుణ నాణ్యత.. ఇలా అన్ని అంశాల్లో అద్భుతమైన పనితీరు సాధించామని రజనీశ్ కుమార్ వెల్లడించారు. గత క్యూ3లో 10.35 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో 8.71 శాతానికి తగ్గాయని తెలిపారు. నికర మొండి బకాయిలు 5.61 శాతం నుంచి 3.95 శాతానికి చేరాయని వివరించారు. మరికొన్ని మొండి బకాయిల రిజల్యూషన్ దాదాపు చివరి దశకు చేరిందని, ఇవి పరిష్కారమైతే స్థూల మొండి బకాయిలు 7 శాతానికి, నికర మొండి బకాయిలు 3 శాతానికి దిగివస్తాయని పేర్కొన్నారు. గత క్యూ3లో రూ.17,964 కోట్లుగా ఉన్న కేటాయింపులు ఈ క్యూ3లో రూ.14,144 కోట్లకు తగ్గాయని, అలాగే మొత్తం కేటాయింపులు కూడా మూడో వంతుకు తగ్గాయని వివరించారు. 10కి 9 మార్కులు: ఫ్యాప్సీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బడ్జెట్ బాగుందని ఫ్యాప్సీ అభివర్ణించింది. సమతుల బడ్జెట్ అని ఫ్యాప్సీ ప్రెసిడెంట్ అరుణ్ లుహారుకా అభిప్రాయపడ్డారు. 10కిగాను 9 మార్కులు ఇస్తున్నట్టు చెప్పారు. అన్ని రంగాలను ప్రోత్సహించేలా ఉందని సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కరుణేంద్ర జాస్తి తెలిపారు. రూ.5 లక్షల వార్షిక వేతనం వరకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వడం మధ్యతరగతికి పెద్ద ఊరట అని అన్నారు. జీఎస్టీ వసూళ్లు పెరుగుతున్నాయి కాబట్టి బడ్జెట్ హామీల భారం పెద్దగా ఉండకపోవచ్చని చెప్పారు. పరిశ్రమలకు ఇప్పటికే పలు ప్రయోజనాలను ఈ ప్రభుత్వం అందిస్తోందని ఫ్యాప్సీ ప్రతినిధులు తెలిపారు. ఈ ప్రయోజనాలను కొనసాగించడం కూడా పెద్ద ఉపశమనమని వివరించారు. -
బజాజ్ ఫైనాన్స్ 54% జంప్
న్యూఢిల్లీ: నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగానికి చెందిన బజాజ్ ఫైనాన్స్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018–19) క్యూ3 ఫలితాలను ప్రకటించింది. కంపెనీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని ఆశాజనక త్రైమాసిక ఫలితాలను నమోదు చేసింది. గడేడాది మూడో త్రైమాసిక కాలంలో నికర లాభం రూ.690 కోట్లు కాగా, తాజా క్యూ3లో రూ.1,060 కోట్లను ఆర్జించి.. ఏకంగా 54 శాతం వృద్ధిరేటును సాధించింది. వార్షిక ప్రాతిపదికన మొత్తం ఆదాయం 48 శాతం వృద్ధితో రూ.4,995 కోట్లకు ఎగసింది. అంతకుముందు ఏడాది క్యూ3లో రూ.3,374 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది. -
గ్రాన్యూల్స్ మధ్యంతర డివిడెండు 25 శాతం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: 2018–19 ఆర్థిక సంవత్సరానికి రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై 25 శాతం మూడవ మధ్యంతర డివిడెండు చెల్లించాలని గ్రాన్యూల్స్ బోర్డు నిర్ణయించింది. డిసెంబరు త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 71 శాతం అధికమై రూ.60 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు రూ.411 కోట్ల నుంచి రూ.637 కోట్లకు చేరింది. ఏప్రిల్–డిసెంబరులో రూ.1,690 కోట్ల టర్నోవరుపై రూ.172 కోట్ల నికరలాభం పొందింది. బీఎస్ఈలో మంగళవారం కంపెనీ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే 0.73 శాతం తగ్గి రూ.88.40 వద్ద స్థిరపడింది. -
పోకర్ణ లాభం రెండింతలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిసెంబరు త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో పోకర్ణ లాభం క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే రెండింతలైంది. లాభం రూ.13.6 కోట్ల నుంచి రూ.26 కోట్లకు ఎగసింది. టర్నోవరు రూ.89 కోట్ల నుంచి రూ.121 కోట్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకు రూ.319 కోట్ల టర్నోవరుపై రూ.54 కోట్ల నికరలాభం నమోదైంది. బీఎస్ఈలో మంగళవారం కంపెనీ షేరు ధర క్రితంతో పోలిస్తే 5.84 శాతం పెరిగి రూ.175.85 వద్ద స్థిరపడింది -
హెచ్డీఎఫ్సీ లాభం రూ. 2,114 కోట్లు
న్యూఢిల్లీ: గృహ రుణాల దిగ్గజం హెచ్డీఎఫ్సీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో స్టాండెలోన్ ప్రాతిపదికన రూ. 2,114 కోట్ల నికర లాభం నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో కంపెనీ నికర లాభం రూ. 5,300 కోట్లు. అయితే, అప్పట్లో హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ పబ్లిక్ ఇష్యూలో వాటాలను విక్రయించడం ద్వారా రూ. 5,250 కోట్ల నిధులు వచ్చినందున రెండు త్రైమాసికాల ఫలితాలను పోల్చి చూడటానికి లేదని సంస్థ తెలిపింది. మరోవైపు, క్యూ3లో మొత్తం ఆదాయం రూ. 8,824 కోట్ల నుంచి రూ. 10,569 కోట్లకు చేరింది. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) నిబంధనల ప్రకారం స్థూల నిరర్ధక ఆస్తులు 1.22 శాతంగా ఉన్నాయని, మూలధన నిల్వల నిష్పత్తి (సీఏఆర్) 18.9%గా ఉందని హెచ్డీఎఫ్సీ వివరించింది. ఇందులో టియర్ 1 మూలధన నిష్పత్తి 17.2 శాతంగా ఉండగా, టియర్ 2 నిష్పత్తి 1.7%గా ఉన్నట్లు పేర్కొంది. సాధారణంగా నియంత్రణ సంస్థ నిబంధనల ప్రకారం సీఏఆర్ 12 శాతంగాను, టియర్ 1 నిష్పత్తి 6 శాతంగాను ఉంటే సరిపోతుంది. అటు, స్వతంత్ర డైరెక్టర్‌గా ఇరీనా విఠల్ నియామకానికి బోర్డు ఆమోదముద్ర వేసింది. జనవరి 30 నుంచి అయిదేళ్ల పాటు ఆమె ఈ హోదాలో ఉంటారు. -
బ్యాంక్ ఆఫ్ బరోడా లాభం నాలుగు రెట్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) నికర లాభం నాలుగు రెట్లు ఎగిసి, రూ. 471 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో లాభం రూ. 112 కోట్లు. మరోవైపు, మూడో త్రైమాసికంలో ఆదాయం రూ. 12,976 కోట్ల నుంచి రూ. 14,563 కోట్లకు పెరిగింది. క్యూ3లో స్థూల మొండిబాకీలు (ఎన్పీఏ) 11.31% నుంచి 11.01%కి, నికర ఎన్పీఏలు 4.97 శాతం నుంచి 4.26%కి తగ్గాయి. విలువపరంగా చూస్తే.. డిసెంబర్ 31 నాటికి స్థూల మొండిబాకీలు రూ. 53,184 కోట్లుగా ఉన్నాయి. మొండిబాకీలకు కేటాయింపులు రూ. 3,155 కోట్ల నుంచి రూ. 3,416 కోట్లకు పెరిగాయి. రుణ నాణ్యత మెరుగుపడటం, లో బేస్ ఎఫెక్ట్ కారణంగా లాభాలు మెరుగుపడ్డాయని బ్యాంక్ ఎండీ పి.ఎస్. జయకుమార్ తెలిపారు. నికర వడ్డీ మార్జిన్ 1.99 శాతం నుంచి 2.69 శాతానికి చేరింది. సంక్షోభంలో చిక్కుకున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ రుణాలు ఇందులో రూ. 1,169 కోట్లుగా ఉన్నాయి. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు బీవోబీ మొత్తం రూ. 4,677 కోట్లు రుణమిచ్చింది. మరోవైపు రూ. 31,000 కోట్ల ఫ్రాడ్‌లో చిక్కుకున్న డీహెచ్ఎఫ్ఎల్ గ్రూప్‌నకు బీవోబీ రూ. 4,000 కోట్ల రుణాలిచ్చింది. -
యాక్సిస్ లాభం రెట్టింపు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ నికర లాభం రెట్టింపై రూ. 1,681 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఇది రూ. 726 కోట్లు. సమీక్షాకాలంలో నికర వడ్డీ ఆదాయం 18 శాతం వృద్ధితో రూ. 5,604 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ. 14,315 కోట్ల నుంచి రూ. 18,130 కోట్లకు ఎగిసినట్లు యాక్సిస్ బ్యాంక్ వెల్లడించింది. మరోవైపు, స్థూల మొండి బాకీలు (ఎన్పీఏ) 5.28 శాతం నుంచి 5.75 శాతానికి పెరిగాయి. అయితే, నికర ఎన్పీఏలు మాత్రం 2.56 శాతం నుంచి 2.36 శాతానికి తగ్గాయి. పరిమాణం పరంగా చూస్తే స్థూల ఎన్పీఏలు రూ. 25,001 కోట్ల నుంచి రూ. 30, 855 కోట్లకు పెరిగాయి. నికర ఎన్పీఏలు రూ. 11,769 కోట్ల నుంచి రూ. 12,233 కోట్లకు చేరాయి. క్యూ3లో రుణాల వృద్ధి 18 శాతం పెరగ్గా.. రిటైల్ రుణాల విభాగం 20 శాతం వృద్ధి చెందింది. మొత్తం రుణాల్లో రిటైల్ రుణాల వాటా 49 శాతంగా ఉన్నట్లు యాక్సిస్ బ్యాంక్ తెలిపింది.