న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ ఆర్‌ఈసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేర్‌కు రూ.11 (110 శాతం) మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. డివిడెండ్ చెల్లింపుల్లో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.1,143 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను ప్రభుత్వానికి చెల్లించింది. ఈ మొత్తానికి సమానమైన ఆర్‌టీజీఎస్ క్రెడిట్ అడ్వైస్‌ను ఆర్‌ఈసీ ప్రభుత్వానికి అందజేసింది.
రూ.96,357 కోట్ల రుణాలు: ఈ ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల కాలానికి కొత్త ప్రాజెక్ట్‌ల కోసం రూ.96,357 కోట్లు మంజూరు చేశామని, వీటిల్లో రూ.52,269 కోట్లు పంపిణీ చేశామని ఆర్‌ఈసీ వివరించింది. ఈ తొమ్మిది నెలల కాలంలో స్థూల లాభం 32 శాతం వృద్ధితో రూ.6,466 కోట్లకు, నికర లాభం 26 శాతం వృద్ధితో రూ.4,508 కోట్లకు పెరిగిందని పేర్కొంది.
కేంద్రానికి ఆర్‌ఈసీ 1,143 కోట్ల డివిడెండ్
Published Sat, Mar 23 2019 12:29 AM | Last Updated on Sat, Mar 23 2019 12:29 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment