Dividend
-
మస్క్ ప్రతిపాదన నచ్చింది: ట్రంప్
వాషింగ్టన్: ఫెడరల్ వ్యవస్థ తగ్గింపుతో పొదుపు చేసిన డబ్బు ఖర్చుపై డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సమర్థించారు. వ్యయ తగ్గింపుతో మిగిల్చిన మొత్తంలోని కొంత డబ్బును అమెరికా పౌరులకు డివిడెండ్ రూపంలో తిరిగి ఇచ్చే ఆలోచన తనకు నచ్చిందన్నారు. మయామీలో జరిగిన ఇన్వెస్టర్స్ మీట్లో ఆయన మాట్లాడారు. అనంతరం విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. మస్క్ ప్రతిపాదనకు మద్దతిచ్చారు. వ్యయ తగ్గింపులతో మిగిలే మొత్తంలో 20 శాతాన్ని అమెరికా పౌరులకు డివిడెండ్‌గా ఇవ్వాలని, మరో 20 శాతాన్ని జాతీయ రుణాలను చెల్లించడానికి ఉపయోగించాలని డోజ్ ప్రతిపాదించింది. ఈ సొమ్ము ప్రజల ఖాతాల్లోకి వెళ్లడం ద్వారా.. వృధాను అరికట్టేందుకు వారే ముందుకొస్తారన్నారు. -
డివిడెండ్@రూ.2.56లక్షల కోట్లు
కేంద్ర బ్యాంకు ఆర్బీఐ సహా ప్రభుత్వ రంగ ఫైనాన్షియల్ సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆర్థిక సంవత్సరం(2025–26)లో రూ.2.56 లక్షల కోట్లు డివిడెండ్‌గా అందనున్నట్లు తాజా బడ్జెట్ అంచనా వేసింది. ప్రస్తుత ఏడాది(2024–25)లో డివిడెండ్, మిగులు ద్వారా రూ. 2.34 లక్షల కోట్లమేర లభించనున్నట్లు అభిప్రాయపడింది. గత అంచనాలకంటే ఇది రూ.1,410 కోట్లు ఎక్కువకాగా.. వచ్చే ఏడాది ఇవి మరింత బలపడనున్నట్లు ఆర్థిక శాఖ భావిస్తోంది. ఇక ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర పెట్టుబడుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అందనున్న మొత్తం వసూళ్లు రూ.3.25 లక్షల కోట్లను తాకనున్నట్లు అంచనా. గతంలో నమోదైన రూ.2.89 లక్షల కోట్లను దాటనున్నాయి.ఎల్రక్టానిక్స్ ప్రాజెక్టులకు రూ.18,000కోట్లువచ్చే ఆర్థిక సంవత్సరంలో కీలకమైన టెక్నాలజీ ప్రాజెక్టులకు కేటాయింపులను 84 శాతం అధికంగా రూ. 18,000 కోట్లకు పెంచినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మొబైల్ ఫోన్లు, ఐటీ హార్డ్‌వేర్, సెమీకండక్టర్లు మొదలైన వాటి తయారీని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం, ఇండియాఏఐ మిషన్ మొదలైనవి వీటిలో ఉన్నాయి. మొత్తం మీద ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖకు కేటాయింపులు 48 శాతం పెరిగి రూ.17,566 కోట్ల నుంచి రూ.26,026 కోట్లకు చేరాయి.ఇదీ చదవండి: రూ.13 లక్షలు ఆదాయం ఉంటే ట్యాక్స్ ఇలా..అత్యధికంగా మొబైల్ ఫోన్ల తయారీకి సంబంధించిన లార్జ్ స్కేల్ ఎల్రక్టానిక్స్ మాన్యుఫాక్చరింగ్ పీఎల్ఐకి రూ. 8,885 కోట్లు కేటాయించారు. యాపిల్ ఉత్పత్తుల తయారీ సంస్థలు ఫాక్స్‌కాన్, టాటా ఎలక్ట్రానిక్స్ మొదలైనవి ఈ పథకం లబ్ధిదార్లుగా ఉన్నాయి. మరోవైపు, సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు కేటా యింపులు, సవరించిన అంచనాలకు దాదాపు రెట్టింపై, దాదాపు రూ. 2,500 కోట్లకు చేరాయి. ఇండియాఏఐ మిషన్కి కేటాయింపులు 11 రెట్లు పెరిగి రూ. 2,000 కోట్లకు చేరాయి. డిజైన్ ఆధారిత ప్రోత్సాహక పథకానికి రెట్టింపు స్థాయిలో రూ. 200 కోట్లు కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎలక్ట్రానిక్ రంగ ప్రాజెక్టులకు కేటాయింపులను రూ. 9,766 కోట్లకు సవరించారు. -
బైబ్యాక్, డివిడెండ్ పాలసీలో మార్పులు
కేంద్ర ప్రభుత్వ సంస్థ(సీపీఎస్ఈ)లకు మూలధన పునర్వ్యవస్థీకరణపై సవరించిన మార్గదర్శకాలను ఆర్థిక శాఖ జారీ చేసింది. దీపమ్(డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్) విడుదల చేసిన విధానాల ప్రకారం ఇకపై సీపీఎస్ఈలు తమ నికర లాభాల్లో కనీసం 30 శాతం లేదా నెట్‌వర్త్‌లో 4 శాతాన్ని(ఏది అధికమైతే దాన్ని) వార్షిక డివిడెండుగా చెల్లించవలసి ఉంటుంది. ఎన్బీఎఫ్సీ తదితర ఫైనాన్షియల్ రంగ సీపీఎస్ఈలు తప్పనిసరిగా నికర లాభాల్లో కనీసం 30 శాతాన్ని డివిడెండుగా చెల్లించాలి. ఇంతకుముందు 2016లో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారమైతే నికర లాభాల్లో 30 శాతం లేదా నెట్‌వర్త్‌లో 5 శాతాన్ని(ఏది ఎక్కువైతే అది) డివిడెండుగా చెల్లించవలసి ఉంటుంది. అయితే అప్పట్లో ఫైనాన్షియల్ రంగ సీపీఎస్ఈల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. బైబ్యాక్ ఇలా..గత ఆరు నెలల్లో పుస్తక విలువ(బీవీ) కంటే షేరు మార్కెట్ విలువ తక్కువగా ఉన్న సీపీఎస్ఈ.. ఈక్విటీ షేర్లను బైబ్యాక్ చేయవలసి ఉంటుంది. అయితే ఇందుకు కనీసం రూ.3,000 కోట్ల నెట్‌వర్త్, రూ.1,500 కోట్లకంటే అధికంగా నగదు, బ్యాంక్ నిల్వలు కలిగి ఉండాలి. కంపెనీ రిజర్వులు, మిగులు నిధులు చెల్లించిన ఈక్విటీ మూలధనానికి సమానంగా లేదా 20 రెట్లు అధికంగా ఉన్న కంపెనీలు బోనస్ షేర్లను జారీ చేయవలసి ఉంటుంది. గత ఆరు నెలల్లో షేరు ముఖ విలువకంటే మార్కెట్ ధర 150 రెట్లు అధికంగా పలుకుతున్న లిస్టెడ్ సీపీఎస్ఈ.. షేర్ల విభజనను చేపట్టవలసి ఉంటుంది. ఈ బాటలో షేర్ల విభజన మధ్య కనీసం మూడేళ్ల వ్యవధిని పాటించవలసి ఉంటుంది. తాజా మార్గదర్శకాలు సీపీఎస్ఈల అనుబంధ(51 శాతానికిపైగా వాటా కలిగిన) సంస్థలకు సైతం వర్తించనున్నాయి.ఇదీ చదవండి: ఎస్బీఐ రూ.10 వేలకోట్లు సమీకరణ.. ఏం చేస్తారంటే..వీటికి మినహాయింపుదీపమ్ విడుదల చేసిన తాజా మార్గదర్శకాలు ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా రంగ కంపెనీలకు వర్తించబోవు. అంతేకాకుండా కంపెనీల చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం లాభాలను పంచిపెట్టడాన్ని నిషేధించిన సంస్థలకు సైతం మార్గదర్శకాలు అమలుకావని దీపమ్ స్పష్టం చేసింది. సవరించిన తాజా మార్గదర్శకాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) నుంచి అమలవుతాయని తెలియజేసింది. సీపీఎస్ఈలు మధ్యంతర డివిడెండ్ల చెల్లింపులను ప్రతీ త్రైమాసికానికీ లేదా ఏడాదిలో రెండుసార్లు చేపట్టేందుకు వీలుంటుంది. అన్ని లిస్టెడ్ సీపీఎస్ఈలు.. వార్షిక అంచనా డివిడెండ్‌లో కనీసం 90 శాతం ఒకే దశలో లేదా దశలవారీగా చెల్లించవచ్చు. అయితే గడిచిన ఏడాదికి తుది డివిడెండ్‌ను ఏటా సెప్టెంబర్‌లో నిర్వహించే వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం) ముగిసిన వెంటనే చెల్లించవలసి ఉంటుంది. అన్‌లిస్టెడ్ సంస్థలు గతేడాది ఆడిటెడ్ ఆర్థిక ఫలితాల ఆధారంగా ఏడాదిలో ఒకసారి తుది డివిడెండుగా చెల్లించాలి. -
ఓఎన్జీసీ లాభం అదుర్స్.. షేరుకి రూ.6 డివిడెండ్
న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్జీసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 17 శాతం జంప్‌చేసి రూ. 11,948 కోట్లను తాకింది. చమురు ధరలు నీరసించినప్పటికీ విండ్ఫాల్సహా ఇతర పన్నులు తగ్గడం ఇందుకు సహకరించింది.గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 10,238 కోట్లు మాత్రమే ఆర్జించింది. చట్టబద్ధ సుంకాలు రూ. 10,791 కోట్ల నుంచి రూ. 7,830 కోట్లకు క్షీణించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరిగితే ప్రభుత్వం విండ్‌ఫాల్ లాభాల పన్ను విధిస్తుంది. వాటాదారులకు షేరుకి రూ. 6 చొప్పున తొలి మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది.78.33 డాలర్లు తాజా సమీక్షా కాలంలో ఓఎన్జీసీ ఒక్కో బ్యారల్ చమురు విక్రయంపై 78.33 డాలర్ల ధరను అందుకుంది. గత క్యూ2లో 84.84 డాలర్లు చొప్పున లభించింది. అయితే కంపెనీ ఉత్పత్తి చేసిన గ్యాస్ ధరలు ఒక్కో ఎంబీటీయూకి 6.5 డాలర్లుగా కొనసాగాయి. చమురు వెలికితీత నామమాత్ర వృద్ధితో 4.576 మిలియన్ టన్నులుగా నమోదైంది. 2 శాతం తక్కువగా 4.912 బిలియన్ ఘనపు మీటర్ల గ్యాస్‌ను ఉత్పత్తి చేసింది.ఇకపై ముడిచమురు ఉత్పత్తి పెరగనున్నట్లు కంపెనీ తెలియజేసింది. కేజీ బేసిన్ బ్లాక్ కేజీ–డీడబ్ల్యూఎన్ 98/2లో ఉత్పత్తి పుంజుకోనుండటం ఇందుకు తోడ్పడనున్నట్లు పేర్కొంది. కాగా.. మొత్తం ఆదాయం రూ. 35,163 కోట్ల నుంచి రూ. 33,881 కోట్లకు క్షీణించింది. అయితే ఇతర ఆదాయం రెట్టింపై రూ. 4,766 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో ఓఎన్జీసీ షేరు బీఎస్ఈలో 2 శాతం క్షీణించి రూ. 257 వద్ద ముగిసింది. -
పెరుగుతున్న సంస్థల విలువ..
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల డివిడెండ్ చెల్లింపులు, బోనస్ ఇష్యూలు, బైబ్యాక్‌లకు సంబంధించిన మార్గదర్శకాలను సర్కారు సమీక్షించనుంది. ప్రభుత్వరంగ సంస్థలు ఇటీవల కాలంలో భారీగా లాభాలు సంపాదిస్తున్నాయి. దాంతో కేంద్ర ఆర్థికశాఖ ఆయా సంస్థల వద్ద పోగవుతున్న లాభాల నిర్వహణకు నియమాల్లో మార్పులు తీసుకొస్తుంది.గతంలో కేంద్రం ప్రభుత్వరంగ సంస్థలను మెరుగ్గా నిర్వహించేందుకు 2016లో మార్గదర్శకాలు జారీ చేసింది. అప్పటి నుంచి ప్రభుత్వరంగ సంస్థల బ్యాలన్స్ షీట్లు భారీగా పెరిగాయి. దాంతోపాటు కంపెనీల మార్కెట్ విలువ సైతం గణనీయంగా వృద్ధి చెందింది. దీంతో మూలధన పునర్వ్యవస్థీకరణ మార్గదర్శకాల సమీక్షపై ఆర్థిక శాఖ దృష్టి సారించినట్టు ఓ అధికారి తెలిపారు. సవరించిన మార్గదర్శకాలు ఈ నెలలోనే విడుదల అవుతాయని చెప్పారు. గతంలో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు ఏటా వాటి పన్ను చెల్లింపుల అనంతరం సమకూరే లాభాల్లో 30 శాతం లేదా తమ నెట్‌వర్త్ (నికర విలువ)లో 5 శాతాన్ని డివిడెండ్ కింద చెల్లించాలి. నికర విలువ కనీసం రూ.2,000 కోట్లు, నగదు/ బ్యాంక్ బ్యాలన్స్ రూ.1,000 కోట్లు ఉన్న కంపెనీలు బైబ్యాక్ చేపట్టాల్సి ఉంటుంది. సంస్థల మూలధనం కంటే మిగులు నిల్వలు 10 రెట్లు చేరితే బోనస్ షేర్లను జారీ చేయాలి. షేరు ముఖ విలువ కంటే మార్కెట్ ధర లేదా పుస్తక విలువ 50 రెట్లు చేరితే స్టాక్ విభజన చేపట్టాలని మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి.ఇదీ చదవండి: స్థిరాస్తి అమ్మి ఇల్లు కొంటున్నారా..?మార్కెట్ విలువలో గణనీయమైన వృద్ధికేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, బ్యాంక్‌లు, బీమా సంస్థల మార్కెట్ విలువ గత మూడేళ్లలో రూ.15 లక్షల కోట్ల నుంచి రూ.58 లక్షల కోట్లకు చేరుకోవడం గమనార్హం. భారీగా నగదు నిల్వలు కలిగిన ప్రభుత్వరంగ సంస్థలు డివిడెండ్లు చెల్లించాల్సి ఉంటుందని.. దీంతో ఈ స్టాక్స్ పట్ల ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తారని అధికారి పేర్కొన్నారు. -
టీడీఎస్ విధించకూడదంటే ఏం చేయాలో తెలుసా..
పన్నుదారులకు టీడీఎస్(ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్) విధించకుండా పాన్ కార్డు వివరాలు సమర్పించాలని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) తన వాటాదార్లను కోరింది. రూ.10 ముఖ విలువ ఉన్న ఒక్కో షేరుపై ఎల్ఐసీ రూ.6 డివిడెండ్ ప్రకటించింది. వ్యక్తులకు అందే డివిడెండ్ మొత్తం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.5,000 లోపు ఉంటే టీడీఎస్ ఉండదని పేర్కొంది. ఒకవేళ పాన్ వివరాలు ఇవ్వకపోయినా, ఇచ్చిన వివరాలు చెల్లకపోయినా (ఆధార్-పాన్ అనుసంధానం అవ్వకపోతే పాన్ చెల్లదు) డివిడెండ్‌పై 20 శాతం టీడీఎస్ కట్ చేసేకునే అవకాశం ఉందని తెలిపింది.డివిడెండ్ కోసం జులై 19ని రికార్డు తేదీగా ఎల్ఐసీ ప్రకటించింది. ఆ రోజు వరకు ఇన్వెస్టర్లు తమ డీమ్యాట్ అకౌంట్లో ఎల్ఐసీ షేర్లు కలిగి ఉంటే, సెప్టెంబరు 20 లోపుగా డివిడెండ్ మొత్తం బ్యాంకు ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంది. వాటాదార్లు తమ డిపాజిటరీ పార్టిసిపెంట్ల దగ్గర బ్యాంకు ఖాతా వివరాలను మరోసారి తనిఖీ చేసుకోవాలని ఎల్ఐసీ తెలిపింది. అవసరమైతే వాటిని అప్డేట్ చేసుకోవాలని కోరింది. అదే సమయంలో బ్యాంకు ఖాతాకు పాన్‌ను అనుసంధానం చేసుకోవాలని చెప్పింది. ఒకవేళ బ్యాంకు ఖాతా అందుబాటులో లేకపోతే, అనుమతించిన మార్గాల్లో డివిడెండ్ చెల్లిస్తామని స్పష్టం చేసింది. ఇదిలాఉండగా, ఆగస్టు 22న వార్షిక సాధారణ సమావేశంలో ఈ అంశంపై మరిన్ని వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.ఇదీ చదవండి: బడ్జెట్లో రైతన్న కోరుకుంటున్నవి.. -
డిజిన్వెస్ట్మెంట్కు ఆర్బీఐ దన్ను
ముంబై: కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) భారీ డివిడెండును అందించడంతో ఈ ఏడాది డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం పెరగకపోవచ్చని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. వెరసి ఈ నెలలో వెలువడనున్న సార్వత్రిక బడ్జెట్లో రూ. 50,000 కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని ప్రకటించవచ్చని రేటింగ్స్ దిగ్గజం కేర్ రేటింగ్స్ అంచనా వేసింది. ఎన్నికల ముందు తీసుకువచి్చన మధ్యంతర బడ్జెట్లో ఇదే లక్ష్యాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇటీవల ప్రభుత్వానికి ఆర్బీఐ రూ. 2.1 లక్షల కోట్ల డివిడెండును అందించిన నేపథ్యంలో కేర్ అభిప్రాయాలకు ప్రాధాన్యత ఏర్పడింది. దీంతో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి సానుకూలంగా మారినట్లు కేర్ పేర్కొంది. ఫలితంగా పీఎస్‌యూలలో భారీ స్థాయి వాటా విక్రయ పరిస్థితులు తలెత్తకపోవచ్చని తెలియజేసింది. ఒకవేళ వనరుల అవసరాలు ఏర్పడితే.. ఆస్తుల మానిటైజేషన్‌పై దృష్టి పెట్టే అవకాశమున్నట్లు వివరించింది. జాబితాలో.. ఈ ఆర్థిక సంవత్సరం(2024–25)లో షిప్పింగ్ కార్పొరేషన్(ఎస్సీఐ) విక్రయం పూర్తికావచ్చని అంచనా. దీంతో ప్రభుత్వ డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యానికి వీలు చిక్కవచ్చని కేర్ రేటింగ్స్ పేర్కొంది. ఎస్సీఐకి గల భూములను విడదీయడంతో ఈ ఏడాది కంపెనీ విక్రయానికి మార్గమేర్పడనున్నట్లు తెలియజేసింది. ఇందుకు సానుకూల స్టాక్ మార్కెట్ పరిస్థితులు సైతం తోడ్పాటునివ్వనున్నట్లు అభిప్రాయపడింది. ఎస్‌సీఐలో పూర్తి వాటాను విక్రయిస్తే ప్రభుత్వానికి రూ. 12,500–22,500 కోట్లు సమకూరే వీలుంది.ఈ బాటలో ఇతర దిగ్గజాలు కంకార్, పవన్ హన్స్ ప్రయివేటీకరణకు సైతం తెరతీయవచ్చని పేర్కొంది. గత పదేళ్లలో ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 5.2 లక్షల కోట్లను సమీకరించిన విషయం విదితమే. పీఎస్‌యూలలో 51 శాతానికికంటే తగ్గకుండానే వాటాల విక్రయం ద్వారా ప్రభుత్వం రూ. 11.5 లక్షల కోట్లు సమకూర్చుకునేందుకు వీలున్నట్లు కేర్ మదింపు చేసింది. పీఎస్‌యూల నుంచి రూ. 5 లక్షల కోట్లు, బ్యాంకులు, బీమా సంస్థలలో వాటాల విక్రయం ద్వారా మరో రూ. 6.5 లక్షల కోట్లు చొప్పున అందుకునే వీలున్నట్లు అంచనా వేసింది. -
ప్రభుత్వానికి ఎస్బీఐ డివిడెండ్ @ రూ.6,959 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బీఐ 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.6,959 కోట్ల డివిడెండ్‌ను శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి చెల్లించింది. ఈ మేరకు డివిడెండ్ చెక్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖరా అందించారు. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ ఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుపై రూ.13.70 చొప్పున ఎస్బీఐ వాటాదారులకు డివిడెండ్ ప్రకటించడం గమనార్హం. -
రూ. 2.1 లక్షల కోట్లు.. ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డ్ డివిడెండ్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్‌గా రూ. 2.1 లక్షల కోట్లను అత్యధిక మిగులును చెల్లించనుంది. ఈ మేరకు సెంట్రల్ బ్యాంక్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.మార్చి 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి బదిలీ చేసిన రూ.87,420 కోట్లతో పోలిస్తే ఈసారి రెండితలు కన్నా అధికం. రికార్డ్ మొత్తంలో ఆర్బీఐ చెల్లించనున్న డివిడెండ్ ప్రభుత్వం తన బడ్జెట్ లోటు లక్ష్యమైన 5.1 శాతం జీడీపీని చేరుకోవడంలో సహాయపడుతుంది.ఆర్బీఐ చెల్లించనున్న డివిడెంట్‌తో కొత్తగా అధికారం చేపట్టే ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని సమకూర్చనుంది. దీంతో ప్రభుత్వం వివిధ అంశాలల్లో గణనీయమైన ఖర్చు చేసేందుకు మరింత సౌలభ్యం కలగనుంది. పెట్టుబడులపై వచ్చే మిగులు ఆదాయం, కరెన్సీ ముద్రణ కోసం తీసుకునే రుసుము, తమ వద్ద డాలర్ల విలువలో హెచ్చుతగ్గులపై వచ్చే ఆదాయం నుంచి ఆర్బీఐ ఏటా డివిడెండ్ రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తుంది. -
లక్ష కోట్ల డివిడెండ్?.. కేంద్రానికి చెల్లించనున్న ఆర్బీఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 2024-2025 ఆర్ధిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వానికి దాదాపు లక్ష కోట్ల రూపాయల డివిడెండ్‌ను చెల్లించనున్నట్లు ఎకనమిక్స్ టైమ్స్ నివేదించింది. కేంద్రం ట్రెజరీ బిల్లుల ద్వారా తన రుణాలను గణనీయంగా తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఈ మొత్తం రూ .60,000 కోట్లుగా ఉంది. ఇప్పుడు ఆమొత్తాన్ని కేంద్రం ఆర్బీఐకి చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే సెంట్రల్ బ్యాంక్ .. కేంద్రానికి లక్షకోట్ల డివిడెండ్‌ను చెల్లించనుంది.అయితే దీనిపై ఆర్ధిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఆర్బీఐ దగ్గర ఎన్ని నగదు నిల్వలుంటే అంత మంచిదని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. అనిశ్చితి సమయాల్లో దేశ ఆర్ధిక వ్యవస్థకు అండగా ఉంటాయి. కానీ కేంద్రం ముక్కుపిండి వసూలు చేస్తున్న డివిడెండ్లు.. ప్రమాదం తెచ్చిపెట్టవచ్చని హెచ్చరిస్తున్నారు. రికార్డు స్థాయిలో తీసుకుంటున్న డివిడెండ్లు సరికాదన్న అభిప్రాయాన్ని వారు వెలిబుచ్చుతున్నారు. -
రూ.194 డివిడెండ్ ప్రకటించిన కంపెనీ
ప్రముఖ టైర్ల తయారీ కంపెనీ ఎంఆర్ఎఫ్ తన ఇన్వెస్టర్లకు రూ.10 ముఖవిలువ కలిగిన ప్రతి షేరుకు రూ.194 డివిడెండ్ ప్రకటించింది.2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఎంఆర్ఎఫ్ నికరలాభం రూ.2081 కోట్లుగా నమోదైంది. 2022-23 నికరలాభం రూ.769 కోట్లుగా కంపెనీ పోస్ట్ చేసింది. కార్యకలాపాల ఆదాయం కూడా రూ.23,008 కోట్ల నుంచి రూ.25,169 కోట్లకు వృద్ధి చెందినట్లు చెప్పింది.మార్చి త్రైమాసికంలో రూ.396 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.341 కోట్లతో పోలిస్తే ఇది 16% ఎక్కువ. కంపెనీ తాజాగా ప్రకటించిన డివిడెండ్‌తోపాటు ఇప్పటికే మధ్యంతర డివిడెండ్‌ను రెండుసార్లు రూ.3 చొప్పున సంస్థ అందించింది.ఇదీ చదవండి: నేపాల్‌లో నిలిచిన ఇంటర్నెట్ సేవలు.. కారణం..బ్రిటానియా రూ.73.50 డివిడెండ్బ్రిటానియా ఇండస్ట్రీస్ మార్చి త్రైమాసికంలో రూ.536.61 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే కాలంలో నమోదుచేసిన లాభం రూ.557.60 కోట్ల కంటే ఇది తక్కువ. ఇదే సమయంలో కార్యకలాపాల ఆదాయం రూ.4023.18 కోట్ల నుంచి 1.14% పెరిగి రూ.4069.36 కోట్లకు చేరింది. రూ.1 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు రూ.73.50 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. -
వయస్సు 5 నెలలే.. కానీ ఇన్ఫోసిస్ ద్వారా 4.2 కోట్లు సంపాదించాడు
ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి మనువడు ఏకాగ్రహ్ రోహన్ కేవలం ఐదు నెలల వయస్సులో ఇన్ఫోసిస్ నుంచి రూ.4.2 కోట్లు దక్కించుకున్నాడు. నారాయణ మూర్తి గత నెలలో తన మనవడు ఏకాగ్రహ్ రోహన్‌కు రూ. 240 కోట్ల కంటే ఎక్కువ విలువైన 15 లక్షల ఇన్ఫోసిస్ షేర్లను (0.04% వాటా) రాసిచ్చారు. ఈ తరుణంలో ఇన్ఫోసిస్ గురువారం క్యూ 4 ఫలిteతాలను ప్రకటించింది. క్యూ 4 ఫలితాలతో పాటు ఒక్కో ఈక్విటీ షేర్ పై రూ. 28 డివిడెండ్‌ను కూడా ప్రకటించింది. దీంతో ఇన్ఫోసిస్‌లో తన పేరు మీద ఉన్న మొత్తం 15లక్షల షేర్ల ద్వారా డివిడెండ్ రూపంలో ఏకాగ్రహ్ రోహన్ ఇప్పుడు రూ.4.2 కోట్లు అర్జించాడు. నారాయణ్ మూర్తి, సుధా మూర్తి దంపతులకు ఇద్దరు పిల్లలు. కూతురు అక్షతా మూర్తి, కొడుకు రోహన్ మూర్తి. అక్షతా మూర్తి, 2009లో రిషి సునాక్(ప్రస్తుత బ్రిటన్ ప్రధాని)ను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కూతుళ్లు. ఇక రోహన్ మూర్తికి 2011లో టీవీఎస్ కంపెనీ ఛైర్మన్ వేణుశ్రీనివాస్ కుమార్తె లక్ష్మితో వివాహం జరిగింది. ఈ జంట 2015లో విడిపోయారు. 2019లో అపర్ణ కృష్ణన్‌ను వివాహం చేసుకున్నాడు. వీరి సంతానమే ఏకాగ్రహ్. -
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ రూ. 4.50 డివిడెండ్
న్యూఢిల్లీ: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి పనితీరు పరంగా రాణించింది. క్రితం ఏడాది ఇదే కాలంలోని లాభం రూ.3,645 కోట్లతో పోల్చి చూసినప్పుడు 11 శాతం పెరిగి రూ.4,028 కోట్లకు చేరింది. ఆదాయం సైతం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.11,530 కోట్ల నుంచి రూ.11,820 కోట్లకు పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో రూ.7,690 కోట్ల మూలధన వ్యయాలను వినియోగించింది. డిసెంబర్ త్రైమాసికంలో ఆరు అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ సిస్టమ్ ప్రాజెక్టులను బిడ్డింగ్‌లో గెలుచుకుంది. వీటి నిర్మాణ అంచనా వ్యయం రూ.20,479 కోట్లుగా ఉంది. డిసెంబర్ చివరికి పవర్‌గ్రిడ్ సంస్థ నిర్వహణలోని ట్రాన్స్మిషన్ ఆస్తుల నిడివి 1,76,530 సర్క్యూట్ కిలోమీటర్లుగా ఉంది. అలాగే, 276 సబ్ స్టేషన్లు, 5,17,860 మెగావోల్ట్ యాంపియర్స్ ట్రాన్స్ఫార్మేషన్ సామర్థ్యం కలిగి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు రెండో మధ్యంతర డివిడెండ్ కింద రూ.4.50 చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయించింది. -
ఆర్బీఐ, బ్యాంకింగ్, ఆర్థిక సంస్థల నుంచి కేంద్రానికి రూ.70,000 కోట్లు!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), బ్యాంకింగ్, ఆర్థిక సంస్థల (ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్) ద్వారా ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే 2024–25 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.70,000 కోట్ల డివిడెండ్‌ను పొందవచ్చని కేంద్రం భావిస్తున్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఈ మేరకు అంచనాలు ఉండవచ్చన్నది సమాచారం. నిజానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషనల్స్ నుంచి రూ.48,000 కోట్ల డివిడెండ్లను కేంద్ర బడ్జెట్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే ఈ మొత్తం లక్ష్యాన్ని మించి వనగూడాయి. ఒక్క ఆర్బీఐ రూ.87,416 కోట్ల డివిడెండ్‌ను అందించింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి ఇదే సానుకూల అంకెలు వచ్చాయి. దీనితో 2023–24 కన్నా 2024–25 ఆర్థిక సంవత్సరంలో భారీ డివిడెండ్లు వెలువడుతాయన్న అంచనాలు ఉన్నాయి. ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి 2023–24లో ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు జీడీపీలో 5.9 శాతంగా బడ్జెట్ అంచనా. 2025–26లో దీనిని 4.5 శాతానికి తగ్గించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం 5.4 శాతంగా ద్రవ్యలోటు ఉండాలన్నది ప్రభుత్వ రోడ్‌మ్యాప్స్‌లో భాగంగా ఉంది. -
నిరర్థక ఆస్తులు తగ్గితేనే డివిడెండ్..! ఆర్బీఐ కొత్త నిబంధన
ముంబై: వాటాదారులకు డివిడెండ్ పంపిణీ విషయంలో బ్యాంక్‌లకు ఆర్బీఐ కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. నికర నిరర్థక ఆస్తులు (వసూలు కాని రుణాలు) 6 శాతం కంటే తక్కువగా ఉంటే, అవి డివిడెండ్ పంపిణీ చేసుకోవచ్చని పేర్కొంది. చివరిగా 2005లో సవరించిన నిబంధనల ప్రకారం ఇప్పటి వరకు బ్యాంక్‌లు వాటి నికర ఎన్పీఏలు 7 శాతంలోపుంటే డివిడెండ్ పంపిణీ చేసుకోవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరానికి డివిడెండ్ పంపిణీ చేసుకోవాలంటే నికర ఎన్పీఏలు 6 శాతంలోపు ఉండాలని ముసాయిదా ప్రతిపాదనల్లో ఆర్బీఐ పేర్కొంది. అలాగే, డివిడెండ్ పంపిణీలో గరిష్ట పరిమితిని లాభాల్లో 40 శాతం నుంచి 50 శాతానికి పెంచింది. కాకపోతే ఈ గరిష్ట పరిమితి మేరకు డివిడెండ్ పంచాలంటే నికర ఎన్పీఏలు సున్నాగా ఉండాలి. డివిడెండ్ పంపిణీకి సంబంధించి తాత్కాలిక ఉపశమనం అభ్యర్థనలను అమోదించేది లేదని పేర్కొంది. ఇదీ చదవండి: అన్నింటికి ఒకే కార్డు.. ప్రత్యేకతలివే.. డివిడెండ్ పంపిణీకి అర్హత పొందాలంటే వాణిజ్య బ్యాంక్ క్యాపిటల్ అడెక్వెసీ రేషియో 11.5 శాతంగా ఉండాలి. అదే ఫైనాన్స్ బ్యాంక్‌లు, పేమెంట్ బ్యాంక్‌లకు 15 శాతంగా, లోకల్ ఏరియా బ్యాంక్‌లు, రీజినల్ రూరల్ బ్యాంక్‌లకు 9 శాతంగా ఉండాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. విదేశీ బ్యాంక్‌లు ఆర్బీఐ అనుమతి లేకుండానే తమ లాభాలను మాతృ సంస్థకు పంపుకునేందుకు కూడా అనుమతించనుంది. 2024–25 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ప్రతిపాదిత నిబంధనలు అమల్లోకి రానున్నాయి. వీటిని బ్యాంక్‌ల బోర్డులు కచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. బాసెల్ 3 ప్రమాణాలు, కచ్చితమైన దిద్దుబాటు కార్యాచరణ (పీసీఏ) అమలు నేపథ్యంలో మార్గదర్శకాలను ఆర్బీఐ సమీక్షించింది. -
కేంద్రానికి ఎల్ఐసీ రూ.1,831 కోట్ల డివిడెండ్
LIC rs1 831 Crore dividend లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) గురువారం రూ. 1,831.09 కోట్ల డివిడెండ్ చెక్కును కేంద్రానికి అందజేసింది. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఎల్ఐసీ చైర్మన్ సిద్ధార్థ మొహంతి ఈ డివిడెండ్ చెక్కును అందజేశారు. ఆర్థిక సేవల శాఖ అదనపు కార్యదర్శి ఎంపీ తంగిరాల తదితర అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆగస్టు 22న జరిగిన వార్షిక సాధారణ సమావేశంలో డివిడెండ్‌ను షేర్హోల్డర్లు ఆమోదించినట్లు ఒక ప్రకటనలో ఎల్ఐసీ పేర్కొంది. (ఎస్బీఐ మాజీ చైర్మన్ రజనీష్ సంపాదన ఎంతో తెలిస్తే!) రూ.5 కోట్ల తొలి మూలధన పెట్టుబడితో 1956లో ఎల్ఐసీ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఇన్సూరెన్స్ రంగంలోకి ప్రైవేటుపెట్టుబడులకు ద్వారాలు తెరచి రెండు దశాబ్దాలు గడిచినప్పటికీ, భారత్ జీవిత బీమా మార్కెట్లో ఎల్ఐసీ మార్కెట్ లీడర్‌గా కొనసాగుతోందని ఎల్ఐసీ ప్రకటన పేర్కొంది. (దిగొచ్చిన చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి: సంచలన నిర్ణయం) -
రూ.5,000 కోట్లతో రష్యా చమురు కొనుగోలు
న్యూఢిల్లీ: రష్యా వద్ద నిలిచిపోయిన 600 మిలియన్ డాలర్ల (సుమారు రూ.5వేల కోట్లు) డివిడెండ్‌తో అక్కడి నుంచి చమురు కొనుగోలు చేయాలనే ప్రతిపాదనతో ప్రభుత్వరంగ చమురు సంస్థలు ఉన్నాయి. రష్యా ఆయిల్ అండ్ గ్యాస్ క్షేత్రాల్లో తమ పెట్టుబడులకు సంబంధించిన డివిడెండ్ ఆదాయం ఇండియన్ ఆయిల్, ఆయిల్ ఇండియా, ఓఎన్జీసీ విదేశ్ రావాల్సి ఉంది. రష్యా బ్యాంకు ఖాతాల్లో ఈ మొత్తం ఉండిపోయింది. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణతో పశి్చమ దేశాలు ఆంక్షలు విధించడంతో భారత చమురు సంస్థలు రష్యా బ్యాంకుల నుంచి డివిడెండ్ నిధులను తెచ్చుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో న్యాయపరమైన, ఆర్థిక పరమైన చిక్కుల గురించి అధ్యయనం చేస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు. రష్యాలోని ఆయిల్ అండ్ గ్యాస్ క్షేత్రాల్లో భారత కంపెనీలు 5.46 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టాయి. ఆయా క్షేత్రాల నుంచి ఉత్పత్తయ్యే చమురు, గ్యాస్ విక్రయంపై వచ్చే లాభాల నుంచి తమ వంతు వాటా వీటికి వస్తుంటుంది. రష్యాపై ఆంక్షల తర్వాత అక్కడి నుంచి నిధుల బదిలీకి అవకాశం లేకుండా పోయింది. కరెన్సీ విలువల్లో అస్థిరతలకు చెక్ పెట్టేందుకు తమ దేశం నుంచి డాలర్లను వెనక్కి తీసుకెళ్లే విషయంలో రష్యా ఆంక్షలు విధించడం కూడా ఇందుకు కారణం. రష్యా బ్యాంకుల్లోని ఖాతాల్లో తమకు రావాల్సిన 150 మిలియన్ డాలర్ల డివిడెండ్ ఆదాయం చిక్కుకుపోయినట్టు ఆయిల్ ఇండియా లిమిటెడ్ చైర్మన్, ఎండీ రంజిత్ రథ్ తెలిపారు. ఐవోసీ, భారత్ పెట్రో రీసోర్సెస్‌తో కలిపితే రావాల్సిన డివిడెండ్ 450 మిలియన్ డాలర్లుగా ఉన్నట్టు చెప్పారు. -
ఎన్డీఏ సర్కార్‌పై బాంబు పేల్చిన ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)మాజీ డిప్యూటీ గవర్నర్ విరేల్ ఆచార్య సంచలన విషయాలు ప్రకటించారు. నిర్దేశిత గడువు కంటే ముందే ఆరు నెలల పదవీకాలం ఉండగానే 2019లో తన పదవికి రాజీనామా చేసిన ఆచార్య తన పుస్తకంలో కొన్ని విషయాలను తొలిసారి బహిర్గతం చేశారు. ముఖ్యంగా 2018లో కేంద్రం, ఆర్బీఐ మధ్య బహిరంగ ఘర్షణకు దారితీసిన సంఘటనల వివరాలను పంచుకున్నారు. అంతేకాదు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కొన్ని విషయాలను మూసి తలుపుల వెనుక చర్చించడం కంటే బహిరంగంగా చర్చించడం మేలని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికలకు ముందు 2.-3 లక్షలు అడిగిని ఎన్డీఏ సర్కార్ ప్రధానంగా 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎన్నికలకు ముందు ఖర్చు కోసం 2018లో బ్యాలెన్స్ షీట్ నుండి 2-3 లక్షల కోట్ల రూపాయలను ఉపసంహరించుకోవాలని ఎన్‌డిఎ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను (ఆర్బిఐ) తిరస్కరించిందని విరాల్ ఆచార్య వెల్లడించారు. మింట్ నివేదిక ప్రకారం 2020లో పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ప్రచురించిన క్వెస్ట్ ఫర్ రిస్టోరింగ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనే పుస్తకానికి అప్డేట్ ప్రిల్యూడ్ బుక్‌లో దీనికి సంబంధి చాలా విషయాలను ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ, ప్రభుత్వం మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. రికార్డు లాభాలు బదిలీ గత ప్రభుత్వాల హయాంలో ఆర్బిఐ కి చెందిన నగుదును ప్రభుత్వ ఖాతాకు బదిలీకి సంబంధిచి బ్యూరోక్రసీ అండ్ ప్రభుత్వంలోని క్రియేటివ్ మైండ్స్ రూపొందించిన ప్రణాళిక ప్రకారం ప్రతీ ఏడాది ఆర్బీఐ తన లాభంలో కొంత భాగాన్ని ప్రభుత్వానికి పంచిపెట్టే బదులు, నోట్ల రద్దుకు దారితీసిన మూడేళ్లలో, ప్రభుత్వానికి రికార్డు లాభాలను బదిలీ చేసిందని చార్య చెప్పారు. అలాగే ఆర్బిఐపై ఒత్తిడి తీసుకురావడానికి మరో కారణం డివెస్ట్మెంట్ రాబడులను పెంచడంలో ప్రభుత్వం వైఫల్యం అని పేర్కొన్నారు. అలాగే 2023లో బ్యాంకుల బ్యాలెన్స్ షీట్ మెరుగుపడటాన్ని ప్రస్తావించిన ఆయన బ్యాడ్ లోన్స్ గుర్తింపు, దిద్దుబాటు చర్యల అమలు లక్ష్యంగా 2015లో రిజర్వ్ బ్యాంక్ ప్రారంభించిన ఆస్తుల నాణ్యత సమీక్ష నిరంతరం అమలుతోనే సాధ్యమైందన్నారు. ఆర్బీఐ సెక్షన్ -7 వివాదం నిధుల బదిలీలో ఆర్బీఐ 80 ఏళ్ల చరిత్రలో సెక్షన్ 7ను సెక్షన్‌ను అమలు చేయడం అనూహ్యమైన చర్య అని ఆర్థిక నిపుణులు భావించారు. ఈ విభేదాలు, ఒత్తిడి నేపథ్యంలోనే ఆప్పటి ఆర్బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తన మూడేళ్ల పదవీకాలం పూర్తి కావడానికి తొమ్మిది నెలల ముందు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీనికి ఆయన వ్యక్తిగత కారణాలను ఉదహరించినప్పటికీ, సెంట్రల్ బ్యాంక్ స్వయంప్రతిపత్తిపై ప్రభుత్వం ఒత్తిడి క్రమంలోనే పటేల్ రాజీనామా అని అంతా భావించారు. కాగా 2022లో రూ.30,307 కోట్లతో పోలిస్తే FY23లో, సెంట్రల్ బ్యాంక్ ప్రభుత్వానికి రూ. 87,416 కోట్ల డివిడెండ్ చెల్లించింది. .2019లో ఆర్బీఐ అత్యధికంగా రూ.1.76 లక్షల కోట్ల మిగులును ప్రభుత్వానికి బదిలీ చేసింది. ఆర్బిఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలోని కమిటీ సిఫార్సుకు అనుగుణంగా, ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్, ఎంత మూలధన నిల్వ ఎంత ఉండాలనేది నిర్ణయిస్తారు. -
ప్రభుత్వానికి బీవోఐ డివిడెండ్ రూ. 668 కోట్లు చెల్లింపు
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరానికి(2022–23)గాను పీఎస్‌యూ.. బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) ప్రభుత్వానికి డివిడెండ్ చెల్లించింది. షేరుకి రూ. 2 చొప్పున ప్రభుత్వానికి రూ. 668 కోట్లకుపైగా అందించింది. బ్యాంక్ ఎండీ రజనీష్ కర్ణాటక్ ఆర్థిక సర్వీసుల కార్యదర్శి వివేక్ జోషి సమక్షంలో డివిడెండ్ చెక్కును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అందజేశారు. 2023 మే 30న బ్యాంకు డైరెక్టర్ల బోర్డు షేరుకి 20 శాతం చొప్పున డివిడెండ్ చెల్లించేందుకు అంగీకరించింది. గతేడాది బీవోఐ నికర లాభం 18 శాతంపైగా బలపడి రూ. 4,023 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2021–22)లో రూ. 3,405 కోట్లు మాత్రమే ఆర్జించింది. మార్చితో ముగిసిన గతేడాది బ్యాంక్ నిర్వహణ లాభం 34 శాతం జంప్‌చేసి రూ. 9,988 కోట్లకు చేరింది. -
మహీంద్రా సూపర్.. రూ. 2,637 కోట్ల లాభం
ముంబై: మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) నాలుగో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 2,637 కోట్ల నికర లాభం ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం(2021–22) క్యూ4లో నమోదైన రూ. 2,237 కోట్లతో పోలిస్తే ఇది 18 శాతం అధికం. ఆదాయం రూ. 25,934 కోట్ల నుంచి రూ. 32,366 కోట్లకు చేరింది. ఇక, పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను లాభం రూ. 6,577 కోట్ల నుంచి 56 శాతం ఎగిసి రికార్డు స్థాయిలో రూ. 10,282 కోట్లకు చేరిందని సంస్థ తెలిపింది. ఆదాయం రూ. 90,171 కోట్ల నుంచి 34 శాతం పెరిగి రూ. 1,21,269 కోట్లకు చేరింది. రూ. 5 ముఖ విలువ గల షేరు ఒక్కింటికి రూ. 16.25 (325 శాతం) డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ బోర్డు సిఫార్సు చేసింది. ఫలితాల నేపథ్యంలో మహీంద్రా షేరు బీఎస్ఈలో స్వల్ప లాభంతో రూ. 1,282 వద్ద ముగిసింది. ఇదీ చదవండి: ఎఫ్డీ రేట్ల పెంపు.. అత్యధికంగా 7.65 శాతం వడ్డీ -
కేంద్రానికి ఆర్బీఐ రూ. 87 వేల కోట్ల డివిడెండ్ .. గతేడాది కంటే ట్రిపుల్
ముంబై: గత ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వానికి రూ. 87,416 కోట్ల మొత్తాన్ని డివిడెండ్‌గా చెల్లించే ప్రతిపాదనకు రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం ఆమోదముద్ర వేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో చెల్లించిన దానితో పోలిస్తే ఇది దాదాపు మూడు రెట్లు. 2021–22లో డివిడెండ్ కింద ఆర్బీఐ రూ. 30,307 కోట్లు చెల్లించింది. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ సారథ్యంలో శుక్రవారం జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 602వ సమావేశంలో డివిడెండ్‌పై నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. బోర్డు సమావేశంలో దేశీ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులను, సవాళ్లను కూడా సమీక్షించినట్లు పేర్కొంది. 2022–23లో ఆర్బీఐ పనితీరును చర్చించి, వార్షిక నివేదికను ఆమోదించారు. -
ఎల్అండ్టీ రూ.24 డివిడెండ్
న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, నిర్మాణ రంగ దిగ్గజం ఎల్అండ్టీ మార్చి త్రైమాసికానికి నికర లాభంలో 10 శాతం వృద్ధిని నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.3,621 కోట్ల నుంచి రూ.3,987 కోట్లకు చేరింది. ఆదాయం రూ.52,851 కోట్ల నుంచి రూ.58,335 కోట్లకు వృద్ధి చెందింది. ఒక్కో షేరుకు రూ.24 చొప్పున డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకుంది. కంపెనీ గడిచిన ఆర్థిక సంవత్సరంలో 19 శాతం అధికంగా రూ.2,30,528 కోట్ల విలువైన ఆర్డర్లను సొంతం చేసుకుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షల కోట్లకు పైగా ఆర్డర్లను పొందడం ఇదే మొదటిసారి అని ఎల్అండ్టీ సీఈవో ఎస్ఎన్ సుబ్రమణ్యం తెలిపారు. మొత్తం ఆర్డర్ల పుస్తకం మార్చి చివరికి రూ.4 లక్షల కోట్లుగా ఉన్నట్టు చెప్పారు. ఎల్అండ్టీ కన్సాలిడేటెడ్ ఆదాయం 2022–23లో 17 శాతం వృద్ధితో రూ.1.83 లక్షల కోట్లకు చేరుకోగా, లాభం 21 శాతం పెరిగి రూ.10,471 కోట్లుగా నమోదైంది. చైర్మన్‌గా తప్పుకోనున్న ఏఎం నాయక్ ఎల్అండ్టీ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఏఎం నాయక్ 2023 సెప్టెంబర్ 30 నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. దీంతో ప్రస్తుతం సీఈవో, ఎండీగా ఉన్న ఎస్ఎన్ సుబ్రమణ్యం చైర్మన్, ఎండీగా 2023 అక్టోబర్ 1 నుంచి సేవలు అందించనున్నట్టు ఎల్అండ్టీ ప్రకటించింది. గౌరవ చైర్మన్‌గా నాయక్ కొనసాగుతారని తెలిపింది. -
యూపీఎల్ లాభాలకు గండి
ముంబై: సస్య సంరక్షణ ఉత్పత్తులను అందించే యూపీఎల్ మార్చి త్రైమాసికానికి నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ (అనుబంధ సంస్థలు కలిపి) నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 43 శాతం తగ్గి రూ.792 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి లాభం రూ.1,379 కోట్లుగా ఉండడం గమనార్హం. ఆదాయం 5 శాతం పెరిగి క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.15,861 కోట్ల నుంచి రూ.16,569 కోట్లకు వృద్ధి చెందింది. 2022–23 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కన్సాలిడేటెడ్ ఆదాయం 16 శాతం పెరిగి రూ.53,576 కోట్లుగా నమోదైంది. నికర లాభం పెద్దగా వృద్ధి లేకుండా రూ.4,437 కోట్ల నుంచి రూ.4414 కోట్లకు చేరింది. ఒక్కో షేరుకు రూ.10 చొప్పున డివిడెండ్‌ను కంపెనీ బోర్డ్ సిఫారసు చేసింది. గత త్రైమాసికంలో తాము ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నట్టు యూపీఎల్ సీఈవో మైక్ ఫ్రాంక్ తెలిపారు. ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గడం, సాగు సీజన్ ఆలస్యం కావడం లాభాలపై ప్రభావం చూపించినట్టు చెప్పారు. స్థూల రుణ భారం 600 మిలియన్ డాలర్లు మేర, నికర రుణ భారం 440 మిలియన్ డాలర్ల మేర తగ్గించుకున్నట్టు ప్రకటించారు. 2023–24లో మార్కెట్ అవరోధాలను అధిగమించి, లాభాల్లో మెరుగైన వృద్ధి నమోదు చేస్తామని పేర్కొన్నారు. -
లారస్ లాభం 55 శాతం డౌన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ సంస్థ లారస్ ల్యాబ్స్ రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు మధ్యంతర డివిడెండ్ రూ.1.2 చెల్లించాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. మార్చి త్రైమాసికంలో నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 55 శాతం క్షీణించి రూ.103 కోట్లు నమోదు చేసింది. మార్జిన్స్ 7.5 శాతం సాధించింది. ఎబిటా 28 శాతం తగ్గి రూ.287 కోట్లు, ఎబిటా మార్జిన్ 20.8 శాతంగా ఉంది. ఈపీఎస్ రూ.1.9 నమోదైంది. టర్నోవర్ 3% తగ్గి రూ. 1,381 కోట్లకు వచ్చి చేరింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.6,041 కోట్ల టర్నోవర్‌పై రూ.790 కోట్ల నికరలాభం పొందింది. క్రితం ముగింపుతో పోలిస్తే బీఎస్ఈలో లారస్ షేరు ధర గురువారం 2.60 శాతం క్షీణించి రూ.292.25 వద్ద స్థిరపడింది. -
నష్టాల్లోకి యాక్సిస్ బ్యాంక్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం (2022–23) చివరి త్రైమాసికంలో లాభాలను వీడి నష్టాలలోకి ప్రవేశించింది. జనవరి–మార్చి (క్యూ4)లో రూ. 5,728 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది (2021– 2022 ఇదే కాలంలో రూ.4,118 కోట్ల నికర లాభం ఆర్జించింది. కాగా.. మొత్తం ఆదాయం రూ.22,000 కోట్ల నుంచి రూ.28,865 కోట్లకు ఎగసింది. వడ్డీ ఆదాయం సైతం రూ. 17,776 కోట్ల నుంచి రూ.23,970 కోట్లకు బలపడింది. బ్యాంకు బోర్డు వాటాదారులకు షేరుకి రూ.1 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4లో రూ. 5,361 కోట్ల నికర నష్టం నమోదైంది. అంతక్రితం ఏడాది క్యూ4లో రూ. 4,417 కోట్ల నికర లాభం ఆర్జించింది. సిటీఇండియా రిటైల్ బిజినెస్ కొనుగోలు నేపథ్యంలో నష్టాలు నమోదైనట్లు బ్యాంక్ పేర్కొంది. ఈ ప్రభావాన్ని (రూ. 12,490 కోట్లు) మినహాయిస్తే నికర లాభం 61% వృద్ధి సాధించినట్లని బ్యాంక్ సీఈవో అమితాబ్ చౌదరీ చెప్పారు. ఎన్పీఏలు డౌన్ క్యూ4లో యాక్సిస్ బ్యాంక్ స్థూల మొండిబకాయిలు (ఎన్పీఏలు) 2.82 శాతం నుంచి 2.02 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు సైతం 0.73 శాతం నుంచి 0.39 శాతానికి దిగివచ్చాయి. మొండిరుణాలు తగ్గడంతో ప్రొవిజన్లు, కంటిజెన్సీలు రూ. 987 కోట్ల నుంచి తగ్గి రూ. 306 కోట్లకు పరిమితమయ్యాయి. నికర వడ్డీ మార్జిన్లు 0.73 శాతం మెరుగై 4.22 శాతానికి చేరాయి. ఫలితాల నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ షేరు 0.8 శాతం క్షీణించి రూ. 881 వద్ద ముగిసింది. -
అదరగొట్టిన మారుతి సుజుకి: భారీ డివిడెండ్
సాక్షి,ముంబై: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఏడాది ప్రాతిపదికన నికర లాభం 43శాతం పెరిగి రూ. 2,623.6 కోట్లకు చేరింది. ఆదాయం రూ.32,365 కోట్ల అంచనాతో పోలిస్తే 20శాతం పెరిగి రూ.32,048 కోట్లకు చేరుకుంది. నిర్వహణ లాభం 38శాతం పెరిగి రూ.3,350.3 కోట్లకు చేరుకుంది. ఈమేరకు సంస్థ బుధవారం ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వివరాలు అందించింది. ఇదీ చదవండి: వినియోగదారులకు మరో షాక్: వీటి ధరలు త్వరలోనే పెరగనున్నాయ్! సెమీకండక్టర్ల కొరత ఈ త్రైమాసికం, గత సంవత్సరం పోల్చదగిన కాలం రెండింటిలోనూ కంపెనీ ఉత్పత్తిని ప్రభావితం చేసింది.త్రైమాసికంలో ఎగుమతులు 5.5శాతం క్షీణించి 64,000 యూనిట్లకు పైగా ఉన్నప్పటికీ, అప్‌గ్రేడ్ చేసిన బ్రెజ్జాగ్రాండ్ విటారా వంటి కొత్త మోడల్ లాంచ్‌లు, కార్‌మేకర్ అమ్మకాల వృద్ధిని సంవత్సరానికి 5.3శాతం నుండి 5.15 లక్షల యూనిట్లకు నమోదు చేయడంలోసహాయపడ్డాయి. అలాగే తన 40వ వార్షికోత్సవ సంవత్సరంలో, ఎలక్ట్రానిక్ భాగాల కొరత ఉన్నప్పటికీ, కంపెనీ అత్యధిక వార్షిక అమ్మకాలను నమోదు చేసిందనీ కంపెనీ వార్షిక టర్నోవర్ లక్ష కోట్ల రూపాయల మార్కును అధిగమించిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. భారీ డివిడెండ్ కంపెనీ ఎక్సేంజ్ ఫైలింగ్ ప్రకారం ఒక్కో షేరుకు రూ.90 అత్యధిక డివిడెండ్‌ను డైరెక్టర్ల బోర్డు సిఫార్సు చేసింది. 2,718.7 కోట్ల రూపాయలకు తుది డివిడెండ్‌ను ఈ ఆర్థిక సంవత్సరానికి FY23లో ఒక్కో షేరుకు 5 నామమాత్రపు విలువ కలిగిన ఈక్విటీ షేరు చెల్లిస్తామని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. డివిడెండ్ చెల్లింపు తేదీ సెప్టెంబర్ 6, 2023న షెడ్యూల్ చేసింది. జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించబడిన హోల్-టైమ్ డైరెక్టర్ పదవికి షిగెటోషి టోరీ రాజీనామా చేసినట్లు కార్ల తయారీదారు ప్రకటించారు. (ముంబై ఇండియన్స్ బాస్ గురించి తెలుసా? అంబానీని మించి సంపాదన) 10 లక్షల యూనిట్ల సామర్థ్యం విస్తరణ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 10 లక్షల యూనిట్ల వరకు విస్తరించే ప్రతిపాదనను కంపెనీ బోర్డు ఆమోదించింది. ఇన్వెస్ట్మెంట్ కోసం అంతర్గత నిల్వలను ఉపయోగిస్తామని కంపెనీ తెలిపింది.ప్రస్తుతం, మారుతీ సుజుకి సామర్థ్యం మనేసర్ , గురుగ్రామ్‌లలో దాదాపు 13 లక్షల యూనిట్లుగా ఉంది. (ఓర్నీ వయ్యారం..ఇదేమి ట్రైన్ భయ్యా! ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్న వీడియో) -
ఆయిల్ ఇండియా లాభం రికార్డ్.. షేరుకి రూ.10 డివిడెండ్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఆయిల్ ఇండియా పటిష్ట ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 40 శాతం జంప్‌చేసి రూ. 1,746 కోట్లను అధిగమించింది. ఒక త్రైమాసికంలో ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధికంకాగా.. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 1,245 కోట్లు మాత్రమే ఆర్జించింది. ఇందుకు ఉత్పత్తి సహా చమురు, గ్యాస్ విక్రయ ధరలు పుంజుకోవడం సహకరించింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 10 చొప్పున రెండో మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఇప్పటికే రూ. 4.5 చెల్లించింది. కాగా.. ప్రస్తుత సమీక్షా కాలంలో కంపెనీ ప్రతీ బ్యారల్ చమురుకు 88.33 డాలర్ల ధరను పొందింది. గత క్యూ3లో 78.59 డాలర్ల ధర లభించింది. ఇక నేచురల్ గ్యాస్ ఒక్కో బీటీయూకి 8.57 డాలర్ల చొప్పున అందుకుంది. గత క్యూ3లో గ్యాస్ విక్రయ ధర 6.1 డాలర్లుగా నమోదైంది. చమురు ఉత్పత్తి 0.75 మిలియన్ టన్నుల నుంచి 0.81 ఎంటీకి ఎగసింది. గ్యాస్ ఉత్పత్తి సైతం 0.79 బిలియన్ ఘనపు మీటర్ల నుంచి 0.8 బీసీఎంకు పుంజుకుంది. చమురు విక్రయాలు 1.35 ఎంటీ నుంచి 1.41 ఎంటీకి వృద్ధి చూపాయి. మొత్తం టర్నోవర్ 27 శాతం పురోగమించి రూ. 5,982 కోట్లను తాకింది. -
బ్యాం‘కింగ్’ నుంచి రూ.48,000 కోట్ల డివిడెండ్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల నుంచి 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.48,000 కోట్ల డివిడెండ్‌ను అంచనా వేస్తున్నట్లు బడ్జెట్ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) ఈ తరహా రాబడి బడ్జెట్ లక్ష్యం రూ.73,948 కోట్లుకాగా, చాలా తక్కువగా రూ.40,953 కోట్లు ఒనగూడుతుందన్నది తాజా అంచనా. ఈ లెక్కన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంకన్నా వచ్చే ఆర్థిక సంవత్సరం డివిడెంట్ దాదాపు 17 శాతం అధికం. 2022 మేలో జరిగిన బోర్డ్ సమావేశంలో ప్రభుత్వానికి రూ.30,307 కోట్ల డివిడెండ్ పేమెంట్లను చెల్లించడానికి ఆర్బీఐ ఆమోదముద్ర వేసింది. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రూ.43,000 కోట్లు.. బడ్జెట్ డాక్యుమెంట్ ప్రకారం, ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర ఇన్వెస్ట్మెంట్ల నుంచి 2023–24 సంవత్సరంలో రూ.43,000 కోట్ల డివిడెండ్లు రానున్నాయి. 2022–23 సవరిత అంచనాల ప్రకారం, రూ. 43,000 కోట్లు ఒనగూరుతున్నాయి. 2022–23 బ డ్జెట్ అంచనా రూ.40,000 కోట్లకన్నా ఇది అధికం. మొత్తం డివిడెండ్ ఇలా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) సవరిత అంచనా (ఆర్ఈ) ప్రకారం, మొత్తంగా రూ.1,08,592 కోట్ల డివిడెండ్ ఒనగూరనుంది. రానున్న 2023–24లో ఈ వసూళ్లు రూ.1,15,820 కోట్లకు చేరనున్నాయి. బ్యాంకింగ్ చట్టాలకు సవరణలు ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు, బ్యాంకుల నిర్వహణను మెరుగుపర్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకింగ్ రెగ్యులేషన్, బ్యాంకింగ్ కంపెనీస్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టాల్లో నిర్దిష్ట సవరణలను ప్రతిపాదించారు. మరిన్ని వినూత్న ఫిన్‌టెక్ సేవలను అందించేందుకు డిజిలాకర్‌లో ఉండే పత్రాల వినియోగ పరిధిని పెంచనున్నట్లు ఆమె తెలిపారు. చదవండి: Union Budget 2023-24: కొత్త ఇన్‌కం టాక్స్ ప్రశ్నలేంటీ? సమాధానాలేంటీ? -
కేంద్రానికి ఓఎన్జీసీ రూ.5,001 కోట్ల డివిడెండు
న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం ఓఎన్జీసీ నుంచి ప్రభుత్వానికి డివిడెండ్ రూపేణా రూ. 5,001 కోట్లు లభించింది. వెరసి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ(సీపీఎస్ఈ)ల నుంచి ఈ ఆర్థిక సంవత్సరం(2022–23)లో ఇప్పటివరకూ ప్రభుత్వం డివిడెండ్ల ద్వారా దాదాపు రూ. 23,797 కోట్లు అందుకుంది. ఈ విషయాలను దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంతా పాండే తాజాగా ట్వీట్ ద్వారా వెల్లడించారు. 2020లో నిలకడైన డివిడెండ్ల చెల్లింపు విధానాలను అవలంబించమంటూ సీపీఎస్ఈలకు దీపమ్ సూచించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా లాభదాయకత, పెట్టుబడి అవసరాలు, నగదు నిల్వలు, నెట్‌వర్త్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటూనే అధిక డివిడెండ్ చెల్లింపులకు ఆదేశించింది. ప్రభు త్వ మార్గదర్శకాల ప్రకారం సీపీఎస్ఈలు వార్షికంగా నికర లాభాల నుంచి కనీసం 30% లేదా నెట్‌వర్త్‌లో 5% డివిడెండ్లుగా ప్రకటించవలసి ఉంటుంది. -
వేదాంత డివిడెండ్ రూ.17.50
న్యూఢిల్లీ: మైనింగ్ కంపెనీ వేదాంత లిమిటెడ్ మరోసారి భారీ డివిడెండ్‌ను వాటాదారులకు ప్రకటించింది. ఒక్కో షేరుకు రూ.17.50 చొప్పున 2022–23 సంవత్సరానికి మూడో మధ్యంతర డివిడెండ్ ఇవ్వాలని మంగళవారం నాటి బోర్డు సమావేశంలో నిర్ణయించింది. ఈ రూపంలో కంపెనీ రూ.6,505 కోట్లను చెల్లించనుంది. సెప్టెంబర్ 30 నాటికి కంపెనీ స్థూల రుణ భారం రూ.58,597 కోట్లుగా ఉంది. రుణాలు తీర్చడానికి బదులు వాటాదారులకు భారీ మొత్తంలో డివిడెండ్ ఇవ్వడానికి కంపెనీ ప్రాధాన్యం ఇవ్వడం గమనించాలి. ఎందుకంటే కంపెనీలో ప్రమోటర్లకు పెద్ద మొత్తంలో వాటా ఉంది. దీంతో డివిడెండ్ రూపంలో ప్రమోటర్లకు పెద్ద మొత్తంలో నిధులు సమకూరనున్నాయి. డివిడెండ్ చెల్లింపునకు రికార్డ్ తేదీగా నవంబర్ 30ని ప్రకటించింది. వేదాంత లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మొదటి మధ్యంతర డివిడెండ్ కింద రూ.31.50, రెండో మధ్యంతర డివిడెండ్ కింద రూ.19.50 చొప్పున ఇవ్వడం గమనించాలి. ఈ మొత్తం కలిపి చూస్తే ఏడాది కాలంలో రూ.68.50 వరకు డివిడెండ్ కింద ఇచ్చినట్టయింది. -
రిషి సతీమణి అక్షతకు ఇన్ఫీ ద్వారా ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?
న్యూఢిల్లీ: బ్రిటన్ తదుపరి ప్రధాన మంత్రిగా రిషి సునాక్ రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ఆయన సతీమణి అక్షతా మూర్తికి సంబంధించిన వ్యాపారాలు, ఆస్తులకు సంబంధించిన వివరాలు వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. భారతదేశంలోని రెండవ అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌లో వాటాద్వారా భారీ ఆదాయాన్ని ఆర్జించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా 2022లో ఇన్పీ అందించిన డివిడెండ్ ద్వారా రూ. 126.61 కోట్లు (15.3 మిలియన్ డాలర్లు) సొంతం చేసుకున్నారు. అంతేకాదు 730 మిలియన్ల పౌండ్స్ సంపదతో రిషి సునాక్, అక్షత జంట యూకే ధనవంతుల జాబితా 2022లో 222వ స్థానంలో ఉన్నారు. స్టాక్ ఎక్స్ఛేంజీలకు కంపెనీ దాఖలు చేసిన సమాచారం ప్రకారం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షతమూర్తి సెప్టెంబర్ చివరి నాటికి ఇన్ఫోసిస్‌లో 3.89 కోట్ల షేర్లు లేదా 0.93 శాతం వాటాను కలిగి ఉన్నారు. బీఎస్ఈ మంగళవారం ట్రేడింగ్ రూ. 1,527.40 వద్ద ఆమె వాటా విలువ రూ. 5,956 కోట్లుకు చేరింది. ఇదీ చదవండి: రిషి సునాక్ విజయం: ఇన్ఫీ నారాయణమూర్తి తొలి రియాక్షన్ ఇన్ఫోసిస్ ఈ ఏడాది మే 31న 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు 16 రూపాయల తుది డివిడెండ్ చెల్లించింది. అలాగే ప్రస్తుత సంవత్సరానికి, ఇటీవల ఫలితంగా సందర్భంగా రూ. 16.5 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. రెండు డివిడెండ్లు కలిపి మొత్తం రూ. 126.61 కోట్లు అక్షత ఖాతాలో చేరాయి. భారతదేశంలో అత్యుత్తమ డివిడెండ్ చెల్లించే కంపెనీలలో ఇన్ఫోసిస్ ఒకటి. 2021లో, ఇది ఒక్కో షేరుకు మొత్తం రూ. 30 డివిడెండ్‌ని చెల్లించింది. ఫలితంగా అక్షత 119.5 కోట్లను దక్కించుకున్నారు. అలాగే ఇన్ఫోసిస్ ఫైలింగ్స్ ప్రకారం, కంపెనీలో ప్రమోటర్లు 13.11 శాతం వాటా కలిగి ఉన్నారు. ఇందులో మూర్తి కుటుంబానికి 3.6 శాతం (నారాయణ మూర్తికి 0.40 శాతం, ఆయన భార్య సుధకు 0.82 శాతం, కుమారుడు రోహన్‌కు 1.45 శాతం, కుమార్తె అక్షతకు 0.93 శాతం) వాటా ఉంది. కాగా ఉత్తర కర్ణాటకలోని తన తల్లి సుధా మూర్తి స్వస్థలమైన హుబ్బల్లిలో1980లో పుట్టారు అక్షత. కాలిఫోర్నియాలోని క్లేర్మాంట్ మెక్కెన్నా కాలేజీకి వెళ్లడానికి ముందు బెంగళూరులో పాఠశాల విద్యను అభ్యసించారు. అక్కడ ఆమె ఆర్థికశాస్త్రం , ఫ్రెంచ్‌లో డ్యూయల్ మేజర్‌తో పట్టభద్రురాలయ్యారు. తరువాత లాస్ ఏంజిల్స్‌లోని ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండ్ మర్చండైజింగ్ నుండి ఫ్యాషన్ డిజైనింగ్ డిప్లొమా , స్టాన్‌ఫోర్డ్‌లో ఎంబీఏ పట్టా పొందారు. అక్షత మూర్తి ఎంబీఏ చదువుతున్న సమయంలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో సునాక్, అక్షత మూర్తికి పరిచయం పెళ్లికి దారి తీసింది. 2009లో వివాహం చేసుకున్న ఈ దంపతులు కెన్సింగ్టన్లోని నివసిస్తున్నారు. వీరికి కృష్ణ, అనౌష్క అనే ఇద్దరు అమ్మాయిలున్నారు. ప్రస్తుతం అక్షత వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. -
నెస్లే డివిడెండ్ రూ.120
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం(2022) మూడో త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ దిగ్గజం నెస్లే ఇండియా ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్(క్యూ3)లో నికర లాభం 8 శాతం బలపడి రూ. 668 కోట్లను అధిగమించింది. గతేడాది(2021) ఇదే కాలంలో రూ. 617 కోట్లు ఆర్జించింది. నికర అమ్మకాలు సైతం 18 శాతం వృద్ధితో రూ. 4,591 కోట్లను తాకాయి. గత క్యూ3లో రూ. 3,883 కోట్ల టర్నోవర్ సాధించింది. కంపెనీ క్యాలండర్ ఏడాదిని ఆర్థిక సంవత్సరంగా పరిగణించే సంగతి తెలిసిందే. వాటాదారులకు రెండో మధ్యంతర డివి డెండ్ కింద షేరుకి రూ.120 చెల్లించేందుకు బోర్డు అనుమతించినట్లు నెస్లే ఇండియా వెల్లడించింది. త్రైమాసిక రికార్డ్..: గత ఐదేళ్లలో ఒక త్రైమాసికానికి అమ్మకాల్లో అత్యధిక వృద్ధిని అందుకున్నట్లు ఈ సందర్భంగా నెస్లే ఇండియా చైర్మన్, ఎండీ సురేష్ నారాయణన్ తెలియజేశారు. దేశీ అమ్మకాలు 18 శాతంపైగా ఎగసి రూ. 4,361 కోట్లను దాటాయి. కస్టమర్ల వద్దకే నెస్లే మైనెస్లే పేరుతో డైరెక్ట్ టు కంజ్యూమర్ (డీ2సీ) విభాగంలోకి (ఆన్లైన్) కంపెనీ ప్రవేశించింది.తొలుత ఢిల్లీ రాజధాని ప్రాంత కస్టమర్లకు ఈ సేవలను పరిచయం చేయనున్నారు. తరువాత దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామని నెస్లే ఇండియా సీఎండీ సురేశ్ నారాయణన్ వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో నెస్లే ఇండియా షేరు 2 శాతం లాభపడి రూ. 19,800 వద్ద ముగిసింది. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు! -
సైయంట్ మధ్యంతర డివిడెండ్ రూ.10
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంజనీరింగ్ సేవల కంపెనీ సైయంట్ 2022–23 ఆర్థిక సంవత్సరానికిగాను ఒక్కో షేరుకు రూ.10 మధ్యంతర డివిడెండ్ చెల్లించాలని బోర్డ్ నిర్ణయించింది. సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో లాభం అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 34.8 శాతం తగ్గి రూ.79 కోట్లు నమోదు చేసింది. ఎబిటా 10.2 శాతం తగ్గి రూ.186 కోట్లు, ఎబిటా మార్జిన్ 532 బేసిస్ పాయింట్లు తగ్గి 13.4 శాతంగా ఉంది. టర్నోవర్ 25 శాతం ఎగసి రూ.1,396 కోట్లు సాధించింది. చదవండి: బ్యాంక్ కస్టమర్లకు వార్నింగ్.. ఆ యాప్‌లు ఉంటే మీ ఖాతా ఖాళీ,డిలీట్ చేసేయండి! -
అంచనాలు మించి అదరగొట్టిన హెచ్‌సీఎల్ టెక్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఐటీ సర్వీసుల దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ (హెచ్‌సీఎల్‌టెక్) అంచనాలకు మించి లాభాలను ప్రకటించింది. క్యూ2లో లాభం 7 శాతం వృద్ధి చెంది రూ. 3,489 కోట్లకు చేరింది. గతేడాది సెప్టెంబర్ త్రైమాసికంలో ఇది రూ. 3,259 కోట్లు. ఇక ఆదాయం 19.5 శాతం పెరిగి రూ. 24,686 కోట్లకు చేరింది. సీక్వెన్షియల్‌గా చూస్తే ఆదాయం 5 శాతం, లాభం 6 శాతం పెరిగాయి. జూన్ త్రైమాసికంతో పోలిస్తే క్యూ2లో లాభం 2.7 శాతం, ఆదాయం 3.4 శాతం పెరగవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. కొత్త ఆర్డర్ల బుకింగ్ పటిష్టంగా ఉందని, భవిష్యత్ వృద్ధికి గణనీయంగా ఊతమివ్వగలదని సంస్థ సీఈవో సి. విజయకుమార్ ధీమా వ్యక్తం చేశారు. షేరుకు రూ. 10 చొప్పున కంపెనీ మధ్యంతర డివిడెండు ప్రకటించింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయ గైడెన్స్‌ను 13.5–14.5 శాతానికి పెంచింది. సమీక్షాకాలంలో కొత్తగా 8,359 మంది ఉద్యోగులు చేరారు. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 2,19,325కి చేరింది. ఇందులో 10,339 మంది ఫ్రెషర్స్ ఉన్నారు. ఐటీ సేవల విభాగంలో అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలసలు) 23.8 శాతంగా ఉంది. ఫలితాల నేపథ్యంలో గురువారం నాటి మార్కెట్లో హెచ్‌సీఎల్ షేరు 3 శాతం ఎగిసింది. -
ప్రభుత్వానికి పీఎస్‌యూల డివిడెండ్..తాజాగా రూ. 1,203 కోట్లు జమ
న్యూఢిల్లీ: పీఎస్‌యూల నుంచి డివిడెండ్ రూపేణా కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ. 1,203 కోట్లు అందుకుంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) ఇప్పటివరకూ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి డివిడెండ్ రూపేణా కేంద్రానికి రూ. 14,778 కోట్లు లభించాయి. ప్రధానంగా సెయిల్ నుంచి రూ. 604 కోట్లు, హడ్కో నుంచి రూ. 450 కోట్లు, ఐఆర్ఈఎల్ రూ. 37 కోట్లు చొప్పున దశలవారీగా దక్కినట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. ఇతర సంస్థలలో ఐఆర్సీటీసీ రూ. 81 కోట్లు, భారతీయ రైల్ బిజిలీ రూ. 31 కోట్లు చొప్పున చెల్లించినట్లు వెల్లడించారు. -
క్యూ1లో టీసీఎస్ భేష్
ముంబై: సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 5 శాతంపైగా బలపడి రూ. 9,478 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 16 శాతం ఎగసి రూ. 52,758 కోట్లకు చేరింది. వాటాదారులకు షేరుకి రూ. 8 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. ఆదాయంలో రిటైల్, సీపీజీ 25 శాతం, కమ్యూనికేషన్స్, మీడియా 19.6 శాతం, తయారీ విభాగం, టెక్నాలజీ సర్వీసులు 16.4 శాతం, బీఎఫ్ఎస్ఐ 13.9 శాతం, లైఫ్‌సైన్సెస్, హెల్త్‌కేర్ 11.9 శాతం చొప్పున వృద్ధి చూపాయి. ప్రాంతాలవారీగా చూస్తే.. ఉత్తర అమెరికా బిజినెస్ 19.1 శాతం, యూరప్ 12.1 శాతం, యూకే 12.6 పురోగతి సాధించగా.. దేశీయంగా 20.8 శాతం వృద్ధిని అందుకుంది. ఈ బాటలో లాటిన్ అమెరికా బిజినెస్ 21.6 శాతం ఎగసింది. మార్జిన్లు డౌన్ క్యూ1లో ఉద్యోగ వలస(అట్రిషన్) రేటు 19.7 శాతానికి చేరినట్లు టీసీఎస్ సీఎఫ్‌వో సమీర్ సేక్సారియా వెల్లడించారు. గతేడాది క్యూ4(జనవరి–మార్చి)లో 17.4%తో పోలిస్తే ఇది అధికంకాగా.. వార్షిక వేతన పెంపు, నైపుణ్య గుర్తింపు తదితరాలతో మార్జిన్లపై ప్రభావం పడినట్లు తెలియజేశారు. తాజాగా కంపెనీ మొత్తం సిబ్బంది సంఖ్య 6 లక్షలను మించినట్లు పేర్కొన్నారు. ఈ కాలంలో వ్యయ నిర్వహణ సవాళ్లు విసిరినట్లు తెలియజేశారు. వెరసి నిర్వహణా మార్జిన్లు 23.1%గా నమోదైనట్లు తెలియజేశారు. క్యూ1లో మొత్తం 8.2 బిలియన్ డాలర్ల(రూ. 64,780 కోట్లు) విలువైన కాంట్రాక్టులు కుదుర్చుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. వీటిలో 40 కోట్ల డాలర్లకుపైబడిన రెండు భారీ డీల్స్ ఉన్నట్లు తెలిపింది. కీలక మార్కెట్లలో ఆర్థిక మాంద్య ఆందోళనలు కంపెనీపై ప్రభావం చూపే అవకాశాలు తక్కువేనని సమీర్ పేర్కొన్నారు. ఇతర హైలైట్స్ ► క్యూ1లో కొత్తగా 14,136 మంది ఉద్యోగులను నియమించుకుంది. ► జూన్‌కల్లా మొత్తం సిబ్బంది సంఖ్య 6,06,331కు చేరుకుంది. ► ఈ ఏడాది కొత్తగా 40,000 మందికి ఉద్యోగాలు ► డివిడెండుకు రికార్డ్ డేట్ జూలై 16కాగా, ఆగస్ట్3కల్లా చెల్లించనుంది. ► 10 కోట్ల డాలర్ల విభాగంలో కొత్తగా 9 క్లయింట్లు జత 5 కోట్ల డాలర్ల విభాగంలో జత కలసిన 19 కొత్త క్లయింట్లు కంపెనీ క్యూ1 ఫలితాలను మార్కెట్లు ముగిశాక విడుదల చేసింది. బీఎస్ఈలో టీసీఎస్ షేరు 0.7% బలపడి రూ. 3,265 వద్ద ముగిసింది. ఆల్‌రౌండ్ గ్రోత్... కొత్త ఏడాదిని పటిష్టంగా ప్రారంభించాం. అన్ని విభాగాల్లోనూ వృద్ధితోపాటు ప్రోత్సాహకర స్థాయిలో ఆర్డర్లు సంపాదించాం. డీల్స్ కుదుర్చుకోవడంలో వేగాన్ని ప్రదర్శిస్తున్నాం. కొత్త వ్యవస్థాగత నిర్మాణంతో క్లయింట్లకు చేరువవుతున్నాం. ఈ ఏడాది కొత్తగా 40,000 మందిని నియమించుకోనున్నాం. క్లయింట్లతో చర్చల నేపథ్యంలో డిమాండ్ కొనసాగనున్నట్లు భావిస్తున్నాం. హై అట్రిషన్ మరో క్వార్టర్పాటు కొనసాగవచ్చు. ఆపై ద్వితీయార్ధం నుంచి నిలకడకు వీలుంది. –రాజేశ్ గోపీనాథన్, సీఈవో, ఎండీ, టీసీఎస్. -
రష్యాలో చిక్కుకుపోయిన దేశీ ఆయిల్ కంపెనీల ఆదాయం
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై యుద్ధానికి ప్రతిగా రష్యాపై ప్రపంచ దేశాలు విధించిన ఆంక్షలు ప్రస్తుతం భారత ఆయిల్ కంపెనీలకు తలనొప్పిగా మారాయి. ఆర్థిక ఆంక్షల నుంచి గట్టెక్కడంలో భాగంగా రష్యా తన దగ్గరున్న డాలర్లను భద్రపర్చుకోవడంపై మరింతగా దృష్టి పెడుతోంది. విదేశాలకు డాలర్లను పంపడంపై ఆంక్షలు విధించింది. దీంతో రష్యాలో ఇన్వెస్ట్ చేసిన దేశీ ఆయిల్ కంపెనీలకు రావాల్సిన 8 బిలియన్ రూబుళ్ల (రూ. 1,000 కోట్ల) మేర డివిడెండ్ ఆదాయం చిక్కుబడిపోయింది. ‘ఇన్వెస్ట్ చేసిన ప్రాజెక్టుల నుంచి మాకు తరచుగా డివిడెండ్ వచ్చేసేది. కానీ, ఉక్రెయిన్‌తో యుద్ధంతో విదేశీ మారకం రేట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ దేశం నుంచి డాలర్లను ఇతర దేశాలకు పంపడంపై రష్యా ఆంక్షలు విధించింది. ఫలితంగా భారత కన్సార్షియంకు రావాల్సిన దాదాపు 8 బిలియన్ రూబుళ్ల డివిడెండ్ ఆదాయం రష్యాలో ఆగిపోయింది‘ అని ఆయిల్ ఇండియా డైరెక్టర్ హరీష్ మాధవ్ తెలిపారు. యుద్ధం మొదలు కావడానికి ముందు డివిడెండ్ ఆదాయం అంతా వచ్చేసిందని, కానీ ఆ తర్వాత నుంచి ఆగిపోయిందని పేర్కొన్నారు. అయితే, దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. పరిస్థితి చక్కబడిన తర్వాత నిధులు తిరిగి రాగలవని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, తమ పెట్టుబడులపై రష్యా–ఉక్రెయిన్ యుద్ధ ప్రభావమేమీ లేదని ఓఐఎల్ (ఆయిల్ ఇండియా) చైర్మన్ ఎస్సీ మిశ్రా తెలిపారు. ఓఐఎల్, ఐవోసీ, ఓఎన్జీసీ విదేశ్ తదితర దేశీ చమురు కంపెనీలు రష్యాలో నాలుగు వేర్వేరు అసెట్లలో 5.46 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేసాయి. వాంకోర్‌నెఫ్ట్ ఆయిల్ అండ్ గ్యాస్ క్షేత్రం లో 49.9 శాతం, టీఏఏఎస్–యూర్యాఖ్ క్షేత్రంలో 29.9 శాతం వాటాలు కొనుగోలు చేశాయి. ఆయా క్షేత్రాల గ్యాస్, చమురు విక్రయాల ద్వారా వచ్చే లాభాలపై డివిడెండ్లు అందుకుంటున్నాయి. -
బీఎస్ఈ డివిడెండ్ రూ. 13.5
న్యూఢిల్లీ: దిగ్గజ స్టాక్ ఎక్సేంజీ బీఎస్ఈ గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి క్వార్టర్లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 72 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో కేవలం రూ. 32 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 152 కోట్ల నుంచి రూ. 205 కోట్లకు జంప్‌చేసింది. వాటాదారులకు షేరుకి రూ. 13.50 చొప్పున తుది డివిడెండు ప్రకటించింది. మార్చిలో ప్రకటించిన బోనస్ ఇష్యూ తదుపరి పూర్తి ఈక్విటీపై డివిడెండు చెల్లించనుంది. గత కొన్నేళ్లుగా సంస్థలు, ఇన్వెస్టర్ల కోసం మార్కెట్లు, ప్రొడక్టులను బీఎస్ఈ నిర్మిస్తూ వచ్చినట్లు ఎక్సేంజీ ఎండీ, సీఈవో అశిష్‌కుమార్ చౌహాన్ పేర్కొన్నారు. తద్వారా అన్ని రకాల ఆర్థిక పరిస్థితుల్లోనూ వృద్ధికి ఊతమిచ్చినట్లు తెలియజేశారు. ఈ ఏడాది (2022–23)లోనూ వివిధ వృద్ధి అవకాశాలపై దృష్టి సారించనున్నట్లు తెలియజేశారు. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి బీఎస్ఈ నికర లాభం 73 శాతం దూసుకెళ్లి రూ. 245 కోట్లను తాకింది. 2020–21లో రూ. 142 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం 48 శాతం వృద్ధితో రూ. 743 కోట్లకు చేరింది. అంతక్రితం రూ. 501 కోట్ల టర్నోవర్ నమోదైంది. చదవండి: ఐసీఈఎక్స్‌పై సెబీ కొరడా! -
సైయంట్ తుది డివిడెండ్ రూ.14
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంజనీరింగ్ సేవల కంపెనీ సైయంట్ 2021–22 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.14 తుది డివిడెండ్ ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం అంత క్రితం ఏడాదితో పోలిస్తే మార్చి త్రైమాసికంలో 49% అధికమై రూ.154 కోట్లు నమోదు చేసింది. నికరలాభం మూడేళ్లలో ఇదే గరిష్టం అని కంపెనీ వెల్లడించింది. ఎబిటా రూ.171 కోట్లు, ఎబిటా మార్జిన్ 14.5 శాతంగా ఉంది. టర్నోవర్ 8 శాతం అధికమై రూ.1,181 కోట్లు సాధించింది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి నికరలాభం 43 శాతం దూసుకెళ్లి రూ.522 కోట్లు నమోదు చేసింది. టర్నోవర్ 9.7 శాతం పెరిగి రూ.4,534 కోట్లు దక్కించుకుంది. చదవండి:నిధుల బాటలో ఐనాక్స్ విండ్..ఎన్ని వందల కోట్లంటే! -
లాభాల్లో టాటా ఎలక్సీ జోరు..ఇన్వెస్టర్లకు భారీ నజరానా..!
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ టెక్నాలజీ సర్వీసుల కంపెనీ టాటా ఎలక్సీ గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 39 శాతం జంప్‌చేసి రూ. 160 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 115 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 31 శాతంపైగా ఎగసి రూ. 682 కోట్లకు చేరింది. గతేడాదికిగాను వాటాదారులకు షేరుకి రూ. 42.5 చొప్పున తుది డివిడెండును ప్రకటించింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 49 శాతం పురోగమించి రూ. 550 కోట్లయ్యింది. 2020–21లో కేవలం రూ. 368 కోట్ల లాభం ఆర్జించింది. ఇక మొత్తం ఆదాయం 35 శాతం వృద్ధితో రూ. 2,471 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది రూ. 1,826 కోట్ల టర్నోవర్ మాత్రమే సాధించింది. ఫలితాల నేపథ్యంలో టాటా ఎలక్సీ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 2 శాతం బలపడి రూ. 7,830 వద్ద ముగిసింది. -
కేంద్రానికి రూ.16,517 కోట్ల డివిడెండ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్ఈ) నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటి వరకూ రూ.16,517.24 కోట్ల డివిడెండ్ లభించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ సెక్రటరీ తుహిన్ కాంత పాండే ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు. తాజాగా సెయిల్ నుంచి రూ.483 కోట్లు, మాంగనీస్ ఓర్ ఇండియా నుంచి రూ.63 కోట్లు, ఎంఎస్టీసీ నుంచి రూ.20 కోట్ల డివిడెండ్ అందినట్లు తుహిన్ కాంత పాండే వివరించారు. -
పీఎస్‌యూల నుంచి రూ. 2,593 కోట్ల డివిడెండ్
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజాలు ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్(పీజీసీఐఎల్) సంయుక్తంగా ప్రభుత్వానికి రూ. 2,593 కోట్ల డివిడెండ్‌ను అందించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2021–22)గాను ఎన్టీపీసీ రూ. 1,560 కోట్లు, పీజీసీఐఎల్ రూ. 1,033 కోట్లు చొప్పున ప్రభుత్వానికి డివిడెండ్ చెల్లించినట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే తాజాగా పేర్కొన్నారు. వెరసి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ పీఎస్‌యూల నుంచి డివిడెండ్ల రూపేణా ప్రభుత్వానికి రూ. 7,515 కోట్లు అందినట్లు వెల్లడించారు. ఇదే సమయంలో మరోపక్క ప్రభుత్వ రంగ కంపెనీలలో మైనారిటీ వాటాల డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 9,110 కోట్లు సమకూర్చుకున్నుట్లు తెలియజేశారు. -
డివిడెండ్ ప్రకటించిన ఎంఆర్ఎఫ్
న్యూఢిల్లీ: టైర్ల తయారీ దిగ్గజం ఎంఆర్ఎఫ్ లిమిటెడ్ గతేడాది(2020–21) నాలుగో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 51 శాతం పడిపోయింది. రూ. 332 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో రూ. 679 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 3,685 కోట్ల నుంచి రూ. 4,816 కోట్లకు ఎగసింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 94 చొప్పున తుది డివిడెండును ప్రకటించింది. ప్రత్యేక డివిడెండ్సహా దీంతో కలిపి గతేడాది మొత్తం రూ. 150 డివిడెండ్ చెల్లించినట్లు కంపెనీ పేర్కొంది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఎంఆర్ఎఫ్ రూ. 1,277 కోట్ల నికర లాభం సాధించింది. 2019–20లో రూ. 1,423 కోట్ల లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 16,239 కోట్ల నుంచి స్వల్ప వెనకడుగుతో రూ. 16,163 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. ఎంఆర్ఎఫ్ షేరు ఎన్ఎస్ఈలో 3% పతనమై రూ. 82,310 వద్ద ముగిసింది. -
కోవిడ్ టీకాకు ఆర్బీఐ నిధులు!
కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తూ, థర్డ్ వేవ్ ముప్పు కూడా పొంచి ఉన్న తరుణంలో టీకాల ఆవశ్యకత, ప్రాధాన్యం మరింతగా పెరిగింది. అందరికీ టీకాలు వేయాలని నిర్దేశించుకున్నప్పటికీ కొరత ఏర్పడుతోంది. 18 నుంచి 44 ఏళ్ల మధ్య వారి కోసం టీకాలు కొనుగోలు చేసి, వేసే భారాన్ని కేంద్రం రాష్ట్రాలపై మోపింది. ఇది సరికాదని, ప్రజలందరికీ వ్యాక్సిన్లు వేయాల్సిన అంశానికి సంబంధించి ఆర్థికపరమైన బాధ్యతలను కేంద్రమే తీసుకోవాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకోసం రిజర్వ్ బ్యాంక్ కేంద్రానికి డివిడెండుగా ఇస్తున్న నిధులను వినియోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. రిజర్వ్ బ్యాంక్ చట్టం ప్రకారం మార్కెట్ లావాదేవీలు, పెట్టుబడులు మొదలైన వాటిపై వచ్చే లాభాలను కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐ బదలాయిస్తుంది. ఇదే క్రమంలో ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన తొమ్మిది నెలల కాలానికి రూ. 99,122 కోట్ల మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వానికి బదలాయించాలని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది. మే 21న ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు ఆర్బీఐ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో నిర్ణయం తీసుకుంది. కేంద్రం బడ్జెట్లో అంచనా వేసిన రూ. 53,510 కోట్ల కన్నా ఇది దాదాపు 85 శాతం అధికం. కోవిడ్–19 వేళ ఈ నిధులు చర్చనీయాంశంగా మారాయి. 18–44 ఏళ్ల మధ్య వారికి టీకాలను కొనుగోలు చేసే బాధ్యతను రాష్ట్రాల మీద పెట్టడం వల్ల వాటిపై ఆర్థిక భారం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. డేటా జర్నలిజం సంస్థ ఇండియాస్పెండ్ అంచనాల ప్రకారం దీనివల్ల.. దేశంలోని 8 అత్యంత పేద రాష్ట్రాలు.. తమ హెల్త్ బడ్జెట్లకు కేటాయించిన నిధుల్లో ఏకంగా 30 శాతం దాకా నిధులను కేవలం కోవిడ్–19 టీకాల కొనుగోలు కోసమే వెచ్చించే పరిస్థితి ఉంటుంది. ఫలితంగా అవి మిగతా పథకాలకు కోత విధించుకోవాల్సి వస్తుంది. అలా జరగకుండా ప్రజలందరికీ సరిపడేంతగా టీకాలను కొనుగోలు చేసేంతగా కేంద్ర ప్రభుత్వానికి వనరులు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇంకా మిగులుతుంది .. 2021–22 ఆర్థిక సంవత్సరానికి కోవిడ్–19 వ్యాక్సినేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 35,000 కోట్ల్ల నిధులను బడ్జెట్లో కేటాయించింది. మే దాకా గణాంకాలను బట్టి ఇందులో సుమారు 8.5 శాతమే వినియోగించిందని.. మరో రూ. 32,000 కోట్ల మేర నిధులు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. దీన్ని అటుంచితే.. తాజాగా కేంద్రానికి ఆర్బీఐ బదలాయించే రూ. 99,122 కోట్లపై అందరి దృష్టి ఉంది. ఈ నిధుల్లో కొంత కేటాయించినా.. దేశ జనాభా మొత్తానికి కేంద్రమే ఉచిత టీకాలు వేయొచ్చని పరిశీలకులు లెక్కలు కడుతున్నారు. కేరళ హైకోర్టు కూడా ఇదే అంశాన్ని పరిశీలించి, అభిప్రాయం చెప్పాలని ప్రభుత్వానికి సూచించింది. కేంద్ర ప్రభుత్వం రూ. 150 లేదా రూ. 250 రేటు చొప్పున టీకాలు కొన్నా.. దేశ జనాభా మొత్తానికి రూ. 34,000 కోట్లే అవుతుందని .. ఆర్బీఐ ఇచ్చే నిధుల్లో ఇంకా మిగులుతుందని ఒక వార్తా కథనాన్ని ఉటంకిస్తూ పేర్కొంది. తద్వారా రాష్ట్రాలపై భారం తగ్గుతుందని అభిప్రాయపడింది. -
మార్కెట్లు పతనం- ఈ షేర్లు జూమ్
ముంబై, సాక్షి: కొద్ది రోజులుగా సరికొత్త రికార్డులతో ర్యాలీ చేస్తున్న దేశీ స్టాక్ మార్కెట్లలో ఉన్నట్టుండి అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో మార్కెట్లు పతన బాట పట్టాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 378 పాయింట్లు క్షీణించి 45,875కు చేరింది. నిఫ్టీ సైతం 102 పాయంట్లు కోల్పోయి 13,456 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ మౌలిక సదుపాయాల కంపెనీ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, ఐటీ సేవల మధ్యస్థాయి కంపెనీ మజెస్కో లిమిటెడ్ కౌంటర్లకు డిమాండ్ కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ మౌలిక రంగ హైదరాబాద్ కంపెనీ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాటాదారులకు బోనస్ షేర్ల జారీకి ప్రతిపాదించింది. నేడు సమావేశంకానున్న బోర్డు ఈ అంశంపై చర్చించనున్నట్లు కంపెనీ తాజాగా వెల్లడించింది. దీంతో కేఎన్ఆర్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 7.4 శాతం దూసుకెళ్లి రూ. 318ను తాకింది. ప్రస్తుతం 6.3 శాతం ఎగసి రూ. 315 వద్ద ట్రేడవుతోంది. గత నెల రోజుల్లో ఈ షేరు 23 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! మజెస్కో లిమిటెడ్ వాటాదారులకు షేరుకి రూ. 974 చొప్పున మధ్యంతర డివిడెండ్ చెల్లింపునకు బోర్డు అనుమతించినట్లు బీమా రంగ ఐటీ సేవల కంపెనీ మజెస్కో లిమిటెడ్ తాజాగా వెల్లడించింది. ఇందుకు ఈ నెల 25 రికార్డ్ డేట్‌గా నిర్ణయించింది. వెరసి రూ. 5 ముఖ విలువగల ఒక్కో షేరుపైనా 19,480 శాతం డివిడెండ్‌ను చెల్లించనుంది. ఇందుకు రూ. 2,788 కోట్లకుపైగా వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మజెస్కో షేరు తొలుత 4 శాతంపైగా జంప్‌చేసి రూ. 1,010కు చేరింది. ఇది 52 వారాల గరిష్టంకాగా ప్రస్తుతం 2 శాతం బలపడి రూ. 992 వద్ద ట్రేడవుతోంది. -
ఎల్అండ్టీ నుంచి భారీ డివిడెండ్?
ముంబై: మౌలిక సదుపాయాల దిగ్గజం లార్సెన్ అండ్ టుబ్రో(ఎల్అండ్టీ) వాటాదారులకు ప్రత్యేక డివిడెండ్‌ను ప్రకటించనుంది. బుధవారం(28న) సమావేశంకానున్న కంపెనీ బోర్డు ఈ అంశంపై నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. 28న నిర్వహించనున్న సమావేశంలో బోర్డు ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసిక(జులై- సెప్టెంబర్) ఫలితాలను సైతం విడుదల చేయనున్నట్లు తెలియజేసింది. బుధవారం బోర్డు ప్రకటించనున్న ప్రత్యేక డివిడెండ్‌కు నవంబర్ 5 రికార్డ్ డేట్‌గా నిర్ణయించినట్లు తాజాగా తెలియజేసింది. ఇంతక్రితం 2008 మార్చిలో ఎల్అండ్టీ ప్రత్యేక డివిడెండ్‌ను చెల్లించింది. ఎలక్ట్రికల్, ఆటోమేషన్ బిజినెస్‌ను ష్నీడర్ ఎలక్ట్రిక్‌కు ఆగస్ట్‌లో విక్రయించింది. ఈ విక్రయం పూర్తికావడంతో ప్రత్యేక డివిడెండ్ యోచన చేపట్టి ఉండవచ్చని ఈ సందర్భంగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
భారీ డివిడెండ్‌కు ఆర్బీఐ ఆమోదం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఆర్బీఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) పలు కీలక చర్యలు చేపట్టింది. తాజాగా కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐ రూ.57,128కోట్ల డివిడెండ్‌ను ఆమోదించింది. శుక్రవారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో నిర్ణయాన్ని ప్రకటించారు. మరోవైపు కరోనాతో ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలను సమావేశంలో చర్చించారు. బ్యాంక్‌ల పనితీరుపై ఆర్బీఐ అధికారులు అధ్యయనం చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ గవర్నర్లు బీ.పీ.కనుంగో, మహేష్ కుమార్ జైన్, మైఖేల్ దేబబ్రాతా పాట్రా, ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి తరుణ్ బజాజ్, ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి దేబసీష్ పాండా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్రవ్య లోటుపై దృష్టి సారించాలని ఆర్బీఐ తెలిపింది. -
క్లారియంట్ భారీ డివిడెండ్- షేరు గెలాప్
స్పెషాలిటీ కెమికల్ దిగ్గజం క్లారియంట్ కెమికల్స్ వాటాదారులకు భారీ బొనాంజా ప్రకటించింది. షేరుకి రూ. 140 చొప్పున ప్రత్యేక మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించనున్నట్లు తెలియజేసింది. ఇందుకు రికార్డ్ డేట్‌ను ఈ నెల 18గా వెల్లడించింది. దీంతో ఒక్కసారిగా ఈ కౌంటర్‌కు భారీ డిమాండ్ నెలకొంది. వెరసి ఎన్ఎస్ఈలో క్లారియంట్ షేరు దాదాపు 17 శాతం దూసుకెళ్లింది. రూ. 80 జంప్‌చేసి రూ. 565 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 575 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టంకావడం గమనార్హం! ర్యాలీ బాటలో గత మూడు నెలలుగా గ్లోబల్ పేరెంట్ కలిగిన క్లారియంట్ కెమికల్స్ ర్యాలీ బాటలో సాగుతోంది. స్విట్లర్లాండ్ కంపెనీ క్లారియంట్ మాతృ సంస్థకాగా.. ప్రధానంగా టెక్స్టైల్స్, లెదర్ కెమికల్స్ తయారీలో పేరొందింది. గత మూడు నెలల్లో క్లారియంట్ షేరు 106 శాతం లాభపడింది. ఇదే సమయంలో మార్కెట్లు కేవలం 20 శాతం పుంజుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరం(2019-20)లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఈ కౌంటర్‌కు మరింత బలమొచ్చినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. గతేడాది నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 71 కోట్లను తాకింది. అంతక్రితం(2018-19)లో రూ. 30 కోట్లు మాత్రమే ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం మాత్రం 5 శాతం పెరిగి 757 కోట్లను తాకింది. అత్యంత నాణ్యమైన ప్రొడక్టులతో మార్కెట్లో మరింత విస్తరించడం ద్వారా కంపెనీ పటిష్ట పనితీరు చూపినట్లు క్లారియంట్ యాజమాన్యం ఫలితాల సందర్భంగా పేర్కొంది. దీంతో క్యాష్‌ఫ్లో బాగా మెరుగుపడినట్లు వెల్లడించింది. కాగా.. ముందుగా అనుకున్నట్లు ఆగస్ట్ 13న కాకుండా 20న కంపెనీ 63వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని(ఏజీఎం) నిర్వహించనున్నట్లు క్లారియంట్ తాజాగా పేర్కొంది. -
ఇక డివిడెండ్ షేర్లపై దృష్టి పెట్టవచ్చా?
కోవిడ్-19 ధాటికి మార్చిలో కుదేలైన దేశీ స్టాక్ మార్కెట్లు తదుపరి ఒక్కసారిగా జోరందుకున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్‌సహా పలు దేశాల కేంద్ర బ్యాంకులు అమలు చేస్తున్న సహాయక ప్యాకేజీలతో వ్యవస్థలో లిక్విడిటీ భారీగా పెరిగింది. దీంతో చౌక నిధులు మార్కెట్లలోకి ప్రవహిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదే సమయంలో కొన్ని బ్లూచిప్ కంపెనీలు సానుకూల ఫలితాలు సాధించడంతో సెంటిమెంటు మెరుగుపడినట్లు తెలియజేశారు. ఇటీవల డిజిటల్, టెలికం విభాగం రిలయన్స్ జియో ఫ్లాట్‌ఫామ్స్‌లో వాటా విక్రయం ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 1.15 లక్షల కోట్లను సమీకరించింది. తద్వారా ఫేస్‌బుక్‌సహా పలు విదేశీ దిగ్గజాలు జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడులకు క్యూకట్టడంతో టెలికం రంగ కంపెనీలకు జోష్‌వచ్చినట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. కాగా.. రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో అంతర్గతంగా అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీంతో ఇన్వెస్టర్లు అధిక డివిడెండ్లు చెల్లించే బలమైన కంపెనీలవైపు కొంతవరకూ దృష్టిసారించవచ్చని తెలియజేస్తున్నారు. వివరాలు చూద్దాం.. ఫిక్స్డ్ కంటే అధికం ప్రస్తుతం బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లపై దాదాపుగా 4-6 శాతం వడ్డీ లభిస్తోంది. అయితే పటిష్ట ఫండమెంటల్స్ కలిగి అధిక డివిడెండ్లు పంచే కంపెనీలు ఇంతకంటే అధిక రిటర్నులు అందించగలవని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతంలో అమలైన డివిడెండ్ పంపిణీ పన్ను(డీడీటీ) స్థానే ప్రస్తుతం వీటిని అందుకునే వాటాదారులు, ఇన్వెస్టర్లపై పన్ను పడుతోంది. డివిడెండ్ మొత్తం రూ. 5000 మించితే కంపెనీలు మూలం వద్దే పన్ను(టీడీఎస్) విధిస్తాయి. దేశీ ఇన్వెస్టర్లపై 10 శాతం, ఎన్ఆర్ఐలపై 20 శాతం చొప్పున డివిడెండ్లపై పన్ను విధింపు ఉంటున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇలా చూస్తే కొన్ని కంపెనీలు చెల్లించే డివిడెండ్లు బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్లకంటే అధిక ఈల్డ్స్(రిటర్నులు) అందించగలవని అభిప్రాయపడ్డారు. బలమైన బ్యాలన్స్‌షీట్, పటిష్ట ఫండమెంటల్స్ కలిగిన కొన్ని కంపెనీలు అధిక డివిడెండ్లను చెల్లిస్తుంటాయని.. ఇలాంటి కౌంటర్లవైపు కొంతమేర పెట్టుబడులను మళ్లించవచ్చని సూచిస్తున్నారు. పీఎస్‌యూలు నిజానికి పలు ప్రభుత్వ రంగ కంపెనీలు అధిక డివిడెండ్లను పంచుతుంటాయని నిపుణులు చెబుతున్నారు. గతంలో ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, బీపీసీఎల్, కంకార్, ఆర్ఈసీ తదితర దిగ్గజాలు భారీ డివిడెండ్లను చెల్లించినట్లు తెలియజేశారు. ప్రయివేట్ రంగంలో సాధారణంగా ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఎంఎన్‌సీలు అధిక డివిడెండ్లను ప్రకటిస్తుంటాయని పేర్కొన్నారు. అయితే గతంతో భవిష్యత్‌ను పోల్చతగదని.. ఇకపై కోవిడ్-19 పరిస్థితుల్లోనూ అధిక డివిడెండ్లను పంచగల సత్తా తక్కువ కంపెనీలకే ఉంటుందని తెలియజేశారు. లాక్‌డవున్, ఆర్థిక మందగమనం, డిమాండ్ క్షీణత తదితర ప్రతికూలతలతో పలు రంగాల కంపెనీలకు పెట్టుబడుల అవశ్యకత పెరుగుతుందని, దీంతో డివిడెండ్ చెల్లింపులు తగ్గే వీలున్నదని ఐడీబీఐ క్యాపిటల్ రీసెర్చ్ హెడ్ ఏకే ప్రభాకర్ వివరించారు. ఐటీ కంపెనీలు సైతం నగదును డివిడెండ్, బైబ్యాక్‌ల నుంచి ఇతర అవసరాలకు వినియోగించేందుకు ప్రణాళికలు వేస్తున్న అంశాలను ఈ సందర్భంగా నిపుణులు ప్రస్తావిస్తున్నారు. ఐటీసీ భళా వడ్డీ రేట్లు, మార్కెట్ అనిశ్చితులు వంటి అంశాలను పరిగణిస్తే.. 4-6 శాతం డివిడెండ్ ఈల్డ్ ఇచ్చే కంపెనీలలో పెట్టుబడులు తెలివైన నిర్ణయమేనని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రయివేట్ రంగంలో ఇటీవల ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ క్యూ4(జనవరి-మార్చి) ఫలితాలు వెల్లడిస్తూ.. వాటాదారులకు షేరుకి రూ. 10.15 డివిడెండ్‌ను ప్రకటించింది. ఇది 5 శాతం ఈల్డ్‌కు సమానంకాగా.. గత రెండు నెలల్లో ఐటీసీ షేరు 17 శాతం ర్యాలీ చేసింది. అధిక ఈల్డ్స్ ఇలా గతేడాది అధిక డివిడెండ్లు పంచిన కంపెనీలలో ఎస్కేఎఫ్, హడ్కో, బామర్ లారీ, ఆర్సీఎఫ్ తదితరాలు చోటుచేసుకున్నాయి. ఎస్కేఎఫ్ దాదాపు 8 శాతం డివిడెండ్ ఈల్డ్ అందించగా.. హడ్కో, బామర్ లారీ, ఆర్సీఎఫ్, హెచ్ఎస్ఐఎల్, ఐఆర్బీ ఇన్ఫ్రా, ఆన్‌మొబైల్ గ్లోబల్, టిమ్కెన్ ఇండియా 7-5 శాతం మధ్య డివిడెండ్ రిటర్నులు ఇచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇతర కౌంటర్లలో కొచిన్ షిప్‌యార్డ్, జీఎండీసీ వంటి కంపెనీలు సైతం 5 శాతం ఈల్డ్‌కు కారణమైనట్లు తెలియజేశారు. అయితే భవిష్యత్‌లో అధిక డివిడెండ్లు ప్రకటించగల రంగాలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవలసి ఉంటుందని ప్రభాకర్ సలహా ఇస్తున్నారు. -
ఇకపై ఐటీ కంపెనీల డివిడెండ్లలో కోత.!
కార్పోరేట్ వ్యవస్థలో మిగతా రంగాలతో పోలిస్తే ఐటీ రంగంలో డివిడెండ్ చెల్లింపులు కాస్త ఎక్కువగానే ఉంటాయి. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి ఐటీ కంపెనీల డివిడెండ్ చెల్లింపుల్లో భారీ కోత ఉండవచ్చని మార్కెట్ పండితులు అంచనా వేస్తున్నారు. కోవిడ్-19 వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో అదనపు వ్యయాలు పెరగడం, నికర లాభం తగ్గడంతో నగదు ప్రవాహం క్షీణించడం, భవిష్యత్తు అవసరాలకు కంపెనీలు నగదు నిల్వలను అట్టిపెట్టికోవడం లాంటి చర్యలతో మునుపటిలా డివిడెండ్ చెల్లింపులు ఉండకపోవచ్చని వారు చెబుతున్నారు. ‘‘ఈ ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్ చెల్లింపు పాలసీని మార్పు చేయవలసి ఉంటుంది. ప్రతికూల వృద్ధిని అధిగమించే ప్రక్రియలో భాగంగా కంపెనీలు నగదు నిల్వలను పెంచుకోవాల్సిన అవసరం ఉంది.’’ అని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ, బోర్డు సభ్యుడు బాలకృష్ణన్ తెలిపారు. అధిక నగదును కలిగిన పరిశ్రమలో ఐటీ అగ్రస్థానంలో ఉంటుంది. ఐటీ సంస్థలు మిగులు నగదును తమ షేర్ హోల్డర్లకు మధ్యంతర, వార్షిక డివిడెండ్ల రూపంలో చెల్లిస్తుంటాయి. రెగ్యూలర్‌గా డివిడెండ్ చెల్లింపులతో పాటు షేరు ధర ఆకర్షణీయ విలువల వద్ద ట్రేడ్ అవుతుండటంతో స్టాక్ మార్కెట్ ఇన్వెసర్లు ధీర్ఘకాలిక దృష్టా్య ఈ రంగ షేర్ల కొనుగోళ్లకు ఎక్కువగా మొగ్గుచూపుతుంటారు. గత ఆర్థిక సంవత్సరంలో డిమాండ్ మందగించడంతో ఒక్క టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మినహా ఐటీ కంపెనీలు డివిడెండ్ చెల్లింపులో కోత పెట్టాయి. టీసీఎస్ ఆర్థిక సంవత్సరం 2019-20లో తన షేర్హోల్డర్లకు రూ.31,895 కోట్ల నిధులను డివిడెండ్ రూపంలో చెల్లించింది. ఈ మొత్తం విలువ కంపెనీ ఫ్రీ క్యాష్ ఫ్లోలో 108.9శాతంగా ఉంది. అలాగే ఎఫ్వై 19, ఎఫ్వై 18లో డివిడెండ్ చెల్లింపు నిష్పత్తి వరుసగా 110.2శాతం, 106శాతంగా ఉంది. "టీసీఎస్ మినహా, ఆర్థిక సంవత్సరం 2019, 2020లో అగ్రశ్రేణి ఐటీ కంపెనీలు బైబ్యాక్‌లతో సహా తమ చెల్లింపుల నిష్పత్తిని తగ్గించాయి. కోవిడ్-19 వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా చెల్లింపు నిష్పత్తి భారీగా తగ్గేందుకు అవకాశం ఉంది. ఐటీ కంపెనీలు వ్యయాలను భరించేందుకు నగదు పరిరక్షణ చర్యలకు పూనుకోవచ్చు.’’ అని షేర్‌ఖాన్ బ్రోకరేజ్ సంస్థ హెడ్ రీసెర్చ్ సంజీవ్ హోతా తెలిపారు. ‘‘ సాధ్యమైనంత వరకు ఐటీ కంపెనీలు మూలధన కేటాయింపు పాలసీను మార్చుకోవు. అయితే వారి సంప్రదాయ విధానాలకు కోవిడ్-19 గండికొట్టింది. ఇదే సందర్భంలో వ్యవస్థలో నెలకొన్న సంక్షోభంతో విలీన అవకాశాలను కల్పిస్తున్నాయి. కాబట్టి సాధ్యనమైంత వరకు ఐటీ కంపెనీలు నగదు నిల్వలకే మొగ్గు చూపాయి.’’ ప్రముఖ ఐటీ అవుట్సోర్సింగ్ అడ్వైజర్ పరీఖ్ తెలిపారు. -
22శాతం క్షీణించిన హెచ్డీఎఫ్సీ నికరలాభం
హౌసింగ్ డెవెలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్డీఎఫ్సీ) సోమవారం గత ఆర్థిక సంవత్సరపు మార్చి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. వార్షిక ప్రాతిపదిక మార్చి 31తో ముగిసిన క్వార్టర్లో నికరలాభం 22 శాతం క్షీణించి రూ.2,233 కోట్లుగా నమోదైంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో రూ.2,862 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. ఈ త్రైమాసికంలో డివిడెండ్ ఆదాయం కేవలం రూ.2 కోట్ల కావడంతో లాభం పడిపోయింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ.537 కోట్లుగా ఉంది. ఈ త్రైమాసికంలో పెట్టుబడుల అమ్మకంపై లాభం రూ.2 కోట్లు కాగా, అంతకుముందు త్రైమాసికంలో ఇది రూ.321 కోట్లుగా ఉంది. కంపెనీ బోర్డు ఆర్థిక సంవత్సరం 2020కు సంబంధించి ఒక్కో షేరుకు రూ .21 డివిడెండ్ ప్రకటించింది. వార్షిక ప్రాతిపదిక నికర వడ్డీ ఆదాయం 17శాతం పెరిగి రూ.3,780 కోట్లగా నమోదైంది. అంతకు ఇదే నాలుగో క్వార్టర్లో ఎన్ఐఐ రూ.3,238 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ మార్జిన్ 3.4శాతం నుంచి 3.3శాతానికి దిగివచ్చింది. రికవరీ అంశంపై కంపెనీ స్పందిస్తూ మార్చి చివరి భాగంలో దెబ్బతిన్నాయని, దీని ఫలితంగా వ్యక్తిగత నిరర్ధక రుణాలు పెరిగాయని తెలిపింది. -
మారుతీ లాభం 28 శాతం డౌన్
న్యూఢిల్లీ: దేశీయ వాహన దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం గత ఆర్థిక సంవత్సరం(2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో 28 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2018–19) క్యూ4లో రూ.1,831 కోట్లుగా ఉన్న నికర లాభం గత క్యూ4లో రూ.1,322 కోట్లకు తగ్గిందని మారుతీ సుజుకీ తెలిపింది. అమ్మకాలు తగ్గడం, ప్రమోషన్ వ్యయాలు పెరగడం, తరుగుదల వ్యయాలు కూడా అధికం కావడంతో నికర లాభం తగ్గిందని వివరించింది. నికర అమ్మకాలు రూ.21,473 కోట్ల నుంచి 15 శాతం క్షీణించి రూ.18,208 కోట్లకు తగ్గాయని పేర్కొంది. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ. 60 డివిడెండ్‌ను ప్రకటించింది. ► గత క్యూ4లో మొత్తం కార్ల అమ్మకాలు 16 శాతం తగ్గి 3.85 లక్షలకు చేరాయి. ► పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2018–19లో రూ.7,651 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 26 శాతం క్షీణించి రూ.5,678 కోట్లకు తగ్గింది. ► నికర అమ్మకాలు రూ.86,069 కోట్ల నుంచి రూ.75,661 కోట్లకు తగ్గాయి. ► ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో మారుతీ షేర్ 1.8 శాతం లాభంతో రూ.5,035కు పెరిగింది. ఉద్యోగాలు, వేతనాల్లో కోత లేదు: గత ఏడాది నుంచి వాహన పరిశ్రమ సుదీర్ఘ సంక్షోభాన్ని ఎదుర్కొంటొందని, కరోనా ప్రభావం ఉన్నప్పటికీ ఉద్యోగాల్లో, వేతనాల్లో ఎలాంటి కోత విధించలేదని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్.సి. భార్గవ వ్యాఖ్యానించారు. -
మైండ్ ట్రీ డివిడెండ్ రూ.10
న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ మైండ్‌ట్రీకి గత ఆర్థిక సంవత్సరం (2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.206 కోట్ల నికర లాభం వచ్చింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2018–19) ఇదే క్వార్టర్లో రూ.198 కోట్ల నికర లాభం వచ్చిందని, 4 శాతం వృద్ధి సాధించామని మైండ్‌ట్రీ తెలిపింది. ఆదాయం మాత్రం రూ.1,839 కోట్ల నుంచి 12 శాతం వృద్ధితో రూ.2,051 కోట్లకు పెరిగిందని కంపెనీ సీఈఓ, ఎమ్డీ దేబాశిష్ చటర్జీ పేర్కొన్నారు. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.10 తుది డివిడెండ్‌ను ఇవ్వనున్నామని వివరించారు. డాలర్ల పరంగా చూస్తే, నికర లాభం ఫ్లాట్‌గా 2.8 కోట్ల డాలర్లకు చేరగా, ఆదాయం మాత్రం 6 శాతం వృద్ధితో 28 కోట్ల డాలర్లకు పెరిగిందని తెలిపారు. నిర్వహణ లాభ మార్జిన్ ఒకటిన్నర శాతం పెరిగిందని, 40 కోట్ల డాలర్ల విలువైన డీల్స్ సాధించామని వివరించారు. పూర్తి సంవత్సరానికి లాభం తగ్గింది: పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, నికర లాభం 16% తగ్గి రూ.631 కోట్లకు చేరగా, ఆదాయం మాత్రం 11% ఎగసి రూ.7,764 కోట్లకు పెరిగిందని చటర్జీ తెలిపారు. మార్చి నాటికి యాక్టివ్ క్లయింట్ల సంఖ్య 307కు చేరిందని, మొత్తం ఉద్యోగుల సంఖ్య 21,991గా ఉందని, అట్రిషన్ రేటు(ఉద్యోగుల వలస) 17.4%గా ఉందని వివరించారు. -
ఆర్బీఐ సంచలన నిర్ణయం
సాక్షి, ముంబై : రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కేంద్రానికి భారీ బొనాంజా ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 1.76 లక్షల కోట్లను కేంద్రానికి అందించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ఆర్బీఐ బోర్డు సోమవారం నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ నివేదికను బోర్డు ఆమోదించింది. రికార్డు స్థాయిలో ఈ మొత్తాన్ని ప్రకటించడం చర్చనీయాంశమైంది. 2018-19 సంవత్సరానికి ఎకనామిక్ కాపిటల్ ఫ్రేమ్‌వర్క్ (ఇసిఎఫ్)గుర్తించిన 1,23,414 కోట్ల రూపాయల డివిడెండ్‌కు అదనంగా రూ.52,637కోట్ల మిగులు నిల్వను జోడించి మొత్తం రూ.1,76,051 కోట్లను భారత ప్రభుత్వానికి బదిలీ చేయాలని సెంట్రల్ బ్యాంక్ బోర్డు నిర్ణయించిందని బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. ఇది ఊహించని పరిణామమని ఎనలిస్టులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఆర్బీఐ వద్ద స్థూల ఆస్తుల్లో 28 శాతానికి సమానమైన (రూ.9 లక్షల కోట్లు) మిగులు నిధులున్నాయని సమాచారం. అంతర్జాతీయంగా పలు దేశాల సెంట్రల్ బ్యాంకులకు ప్రామాణికమైన 14 శాతంతో పోలిస్తే ఆర్బీఐ వద్ద రెట్టింపు మిగులు నిధులున్నాయన్నది ఆర్థిక శాఖ వాదన. ఆర్బీఐ మిగులు నిధుల నిర్వహణ కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని, మిగులు నిధుల్లోంచి రూ.3-4 లక్షల కోట్లు తమ ఖజానాకు బదిలీ చేయాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆర్బీఐ వద్ద ఎంత పరిమాణంలో మిగులు నిధులు ఉండవచ్చన్న అంశాన్ని పరిశీలించిన బిమల్ జలాన్ నాయకత్వంలోని కమిటీ తన నివేదికలను అందించింది. మరోవైపు బాండ్ల మార్కెట్‌కు, సోమవారం భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లలో ఆర్బీఐ డివిడెండ్ ప్రకటన ఇన్వెస్టర్లకు మరింత ఉత్సాహానివ్వనుంది. -
ఆ లక్ష కోట్లతో సంక్షేమం పరుగులు
సాక్షి, న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ సర్కార్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ డివిడెండ్‌ను ఆర్బీఐ త్వరలో ప్రభుత్వానికి బదిలీ చేయనుందనే అంచనాలు వెల్లడవుతున్నాయి. ఆర్బీఐ మిగులు నిల్వల నిర్వహణపై కీలక కమిటీ సిఫార్సులు బహిర్గతం కాకముందే కేంద్రానికి ఆర్బీఐ నుంచి రూ లక్ష కోట్లు రానున్నాయని డచ్ బ్యాంక్ అంతర్గత నివేదిక వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఆర్బీఐ భారత ప్రభుత్వానికి భారీ డివిడెండ్ ఇవ్వనుందని డచ్ బ్యాంక్ ఇండియా చీఫ్ ఎకనమిస్ట్ కౌశిక్ దాస్ ఈ నివేదికలో పేర్కొన్నారు. ఆర్బీఐ నుంచి సమకూరే రూ లక్ష కోట్లను ప్రభుత్వం సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించడంతో పాటు బడ్జెట్లో వివిధ పద్దుల కింద పొందుపరిచే వ్యయాలకు వెచ్చిస్తారని నివేదిక పేర్కొంది. ఆర్బీఐ నిధుల ఊతంతో రానున్న బడ్జెట్లో వ్యవసాయం, గ్రామీణ మౌలిక ప్రాజెక్టులు, విద్య, వైద్యం సహా పలు అభివృద్ధి కార్యక్రమాలపై నిధుల కేటాయింపు పెంచుతారని కౌశిక్ దాస్ పేర్కొన్నారు. ఆర్బీఐ మిగులు నిల్వలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్లో పన్నేతర రాబడిని పెంచే అవకాశం ఉందని డచ్ బ్యాంక్ నివేదిక అంచనా వేసింది. మరోవైపు ఆర్బీఐ వద్ద పోగుపడిన మిగులు నిధుల వినియోగంపై బిమల్ జలాన్ కమిటీ సమర్పించనున్న నివేదిక కూడా ఈ నిధుల వినియోగంలో కీలకం కానుంది. -
బజాజ్ ఆటో లాభం రూ.1,408 కోట్లు
న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లో మోటార్ బైక్‌ల అమ్మకాల జోరుతో బజాజ్ ఆటో కంపెనీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలం(2018–19, క్యూ4) లో 20 శాతం ఎగసింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2017–18) క్యూ4లో రూ.1,175 కోట్లుగా ఉన్న నికర లాభం గత క్యూ4లో రూ.1,408 కోట్లకు పెరిగిందని బజాజ్ ఆటో తెలిపింది. మొత్తం ఆదాయం రూ.6,788 కోట్ల నుంచి రూ.7,395 కోట్లకు ఎగసిందని కంపెనీ ఈడీ రాకేశ్ శర్మ వెల్లడించారు. కంపెనీ మొత్తం అమ్మకాలు 10.45 లక్షల యూనిట్ల నుంచి 14 శాతం వృద్ధితో 11.93 లక్షల యూనిట్లకు చేరాయని వివరించారు దేశీయంగా బైక్‌ల విక్రయాలు 4.97 లక్షల నుంచి 23 శాతం వృద్ధితో 6.10 లక్షలకు పెరిగాయని పేర్కొన్నారు. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.60 డివిడెండ్‌ను(600 శాతం) ఇవ్వనున్నామని చెప్పారు. మోటార్ బైక్‌ల జోరు...: వాణిజ్య వాహనాలకు సంబంధించిన త్రీ వీలర్ సెగ్మెంట్లో సమస్యలున్నప్పటకీ, మోటార్ బైక్‌ల ముఖ్యంగా దేశీయ మోటార్ బైక్ సెగ్మెంట్ మంచి పనితీరు సాధించిందని రాకేశ్ శర్మ చెప్పారు. ఎంట్రీ లెవల్, టాప్ ఎండ్ ప్రీమియమ్ స్పోర్ట్స్ సెగ్మెంట్లలలో మంచి అమ్మకాలు సాధించా మని పేర్కొన్నారు. బైక్‌ల ఎగుమతులు 3.58 లక్షల నుంచి 3.91 లక్షల కు పెరిగాయని వివరించారు. వాణిజ్య వాహనాల అమ్మకాలు 1.22 లక్ష ల నుంచి 16శాతం తగ్గి 1,02 లక్షలకు పరిమితమయ్యాయని ఆయన తెలిపారు. ఏడాది లాభం రూ.4,928 కోట్లు... ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18లో రూ.4,219 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 17 శాతం వృద్ధితో రూ.4,928 కోట్లకు పెరిగిందని రాకేశ్ శర్మ వివరించారు. మొత్తం ఆదాయం రూ.25,617 కోట్ల నుంచి రూ.30,250 కోట్లకు చేరింది. అమ్మకాలు 40.06 లక్షల నుంచి 25 శాతం వృద్ధితో 50.19 లక్షలకు పెరిగాయి. దేశీయ మార్కెట్లో మోటార్ బైక్‌ల అమ్మకాలు 19.74 లక్షల నుంచి 29 శాతం వృద్ధితో 25.41 లక్షలకు చేరాయని రాకేశ్ శర్మ పేర్కొన్నారు. రానున్న మూడు, నాలుగు నెలల్లో ప్రస్తుత మోడళ్లలో అప్‌గ్రేడ్ వేరియంట్లను అందుబాటులోకి తెస్తామని వివరించారు. అన్ని విభాగాల్లో ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తెచ్చే విషయమై కసరత్తు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతమున్న తమ మోడళ్లన్నింటినీ గడువులోగా బీఎస్–సిక్స్ ప్రమాణాలకు అనుగుణంగా అందించనున్నామని పేర్కొన్నారు.ఆర్థిక ఫలితాలు బాగా ఉండటంతో బీఎస్ఈలో బజాజ్ ఆటో షేర్ 3.3 శాతం లాభంతో రూ.3,042 వద్ద ముగిసింది. -
హెక్సావేర్ టెక్నాలజీస్ లాభం రూ.138 కోట్లు
న్యూఢిల్లీ: మిడ్– సైజ్ ఐటీ సేవల కంపెనీ హెక్స్‌వేర్‌టెక్నాలజీస్ ఈ ఏడాది జనవరి– మార్చి క్వార్టర్లో రూ.138 కోట్ల నికర లాభం సాధించింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో రూ.134 కోట్ల నికర లాభం వచ్చిందని, 3 శాతం వృద్ధి సాధించామని హెక్సావేర్ టెక్నాలజీస్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,049 కోట్ల నుంచి 21 శాతం వృద్ధితో రూ.1,264 కోట్లకు పెరిగిందని కంపెనీ చైర్మన్ అతుల్ నిశార్ చెప్పారు. మరోసారి రెండంకెల వృద్ధిని సాధించామని, పరిశ్రమకే తలమానికమైన వృద్ధిని సాధించాలన్న తమ తపనకు ఇదే నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. సీజనల్‌గా బలహీనంగా ఉన్నప్పటికీ, మంచి వృద్ధిని సాధించామని కంపెనీ సీఈఓ, ఈడీ ఆర్. కృష్ణ తెలిపారు. ఈ క్వార్టర్‌కు గాను ఒక్కో షేర్‌కు రూ.2.50 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు. ఈ కంపెనీ జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పాటిస్తోంది. డాలర్ల పరంగా చూస్తే, ఈ మార్చి క్వార్టర్లో నికర లాభం 5 శాతం క్షీణించి 1.97 కోట్ల డాలర్లకు, ఆదాయం 11 శాతం వృద్ధి చెంది 18 కోట్ల డాలర్లకు చేరిందని నిశార్ తెలిపారు. గత ఆరు నెలల్లో 304 మందికి కొత్తగా ఉద్యోగాలిచ్చామని, మొత్తం ఉద్యోగుల సంఖ్య 16,509గా ఉందని తెలిపారు. ఉద్యోగుల వలస(ఆట్రీషన్ రేటు) 18.2 శాతంగా ఉందని కృష్ణ వివరించారు. ఈ ఏడాది మార్చి క్వార్టర్ నాటికి నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.870 కోట్లుగా ఉన్నాయని తెలిపారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో హెక్సావేర్ టెక్నాలజీస్ షేర్ 4 శాతం నష్టంతో రూ.333 వద్ద ముగిసింది. -
అల్ట్రాటెక్ సిమెంట్ లాభం రూ.1,014 కోట్లు
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లాగ్రూప్‌నకు చెందిన అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం (2018–19) నాలుగో క్వార్టర్లో రూ.1,014 కోట్ల నికర లాభం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) ఇదే క్వార్టర్లో రూ.446 కోట్ల నికర లాభం వచ్చిందని అల్ట్రాటెక్ సిమెంట్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.9,401 కోట్ల నుంచి రూ.11,031 కోట్లకు పెరిగిందని పేర్కొంది. రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.11.50 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని వివరించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో మొత్తం వ్యయాలు రూ.9,554 కోట్లని తెలిపింది. ఇతర ఆదాయం 27 శాతం పెరిగి రూ.140 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం రూ.2,213 కోట్లుగా, ఎబిటా మార్జిన్ 21 శాతంగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం, గత ఆర్థిక సంవత్సరం క్యూ4 ఫలితాలను అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఫలితాలతో పోల్చడానికి లేదని కంపెనీ తెలిపింది. బినానీ సిమెంట్స్ కంపెనీని విలీనం చేసుకున్నామని, అందుకే ఆర్థిక ఫలితాలను పోల్చడానికి లేదని వివరించింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.2,224 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,432 కోట్లకు పెరిగిందని కంపెనీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.32,461 కోట్ల నుంచి రూ.37,817 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఆర్థిక ఫలితాలు బాగా ఉండటంతో ఈ షేర్ జోరుగా పెరిగింది. బీఎస్ఈలో అల్ట్రాటెక్ సిమెంట్ షేర్ 5.5 శాతం లాభంతో రూ. 4,435 వద్ద ముగిసింది. -
డివిడెండ్ కావాలా..!
ఎవరూ క్లెయిమ్ చేయని డివిడెండ్లు భారీగా ఐఈపీఎఫ్ఏ వద్ద పేరుకుపోతున్నాయి. దాదాపు రూ.2,000 కోట్ల విలువైన క్లెయిమ్ చేయని డివిడెండ్ చెల్లింపులు ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ(ఐఈపీఎఫ్ఏ) వద్ద ఉన్నాయి. అలాగే క్లెయిమ్ చేయని షేర్లు కూడా రూ.19,000 కోట్ల మేర ఈ సంస్థ వద్ద ఉన్నాయని అంచనా. 29.5 లక్షల మంది ఇన్వెస్టర్లు రూ.19,000 కోట్ల విలువైన షేర్లను క్లెయిమ్ చేసుకోలేదని అంచనా. 25 లక్షల వాటాదారులకు అందని డివిడెండ్లు.. సాధారణంగా కంపెనీలు డివిడెండ్లు ప్రకటిస్తాయి. రికార్డ్ తేదీలోపు తమ ఖాతా పుస్తకాల్లో ఉన్న వాటాదారులకు డివిడెండ్‌ను చెల్లిస్తాయి. డీమ్యాట్ ఖాతాలున్న ఇన్వెస్టర్లకు డివిడెండ్లు వారి ఖాతాల్లోకి వచ్చేస్తాయి. అయితే కాగితం రూపం (షేర్ సర్టిఫికెట్) వాటాదారులకు మాత్రం డివిడెండ్లు చెల్లింపు కొంచెం వ్యయ ప్రయాసలతో కూడుకున్న వ్యవహారమే. ఇక ఎవరూ క్లెయిమ్ చేయని డివిడెండ్లను కంపెనీలు ఈ సంస్థకు బదిలీ చేస్తాయి. ఇలా ఐఈపీఎఫ్ఏకు దాదాపు 25 లక్షలకు పైగా వాటాదారులకు చెందాల్సిన రూ.2,000 కోట్ల విలువైన డివిడెండ్లు బదిలీ అయ్యాయి. షేర్లు డీమ్యాట్ రూపంలో కాకుండా కాగితం రూపంలో ఉన్న ఇన్వెస్టర్లే ఈ 25 లక్షల మంది ఇన్వెస్టర్లలో అధికంగా ఉంటారని ప్రభుత్వ ఉన్నతాధికారొకరు పేర్కొన్నారు.. చాలా షేర్లు కాగితం రూపంలో ఉన్నాయని, మరణించిన వారి షేర్లు వారి వారి వారసులకు బదిలీ చేయకపోవడం వల్లనే ఈ స్థాయిలో డివిడెండ్ చెల్లింపులు పేరుకుపోయాయని ఆ అధికారి వివరించారు. కాగా కాగితం రూపంలో ఉన్న అన్ని షేర్లను డీమ్యాట్ రూపంలోకి తప్పనిసరిగా మార్చుకోవాలని సెబీ ఆదేశాలు జారీ చేసింది. కాగితం రూపంలో ఉన్న షేర్లు డీమ్యాట్రూపంలోకి మారడానికి ఈ నెల 31ను గడువు తేదీగా సెబీ నిర్దేశించింది. క్లెయిమ్ చేసుకోవచ్చనీ తెలీదు: అసలైన వాటా దారు మరణించిన తర్వాత వారి వారసులకు షేర్ల బదిలీ జరగడం లేదని, అందుకే ఇలా డివిడెండ్లు పేరుకుపోతున్నాయని అలంకిత్ సంస్థ ఎమ్డీ అంకిత్ అగర్వాల్ పేర్కొన్నారు. ఐఈపీఎఫ్ఏ వద్ద పేరుకుపోయిన డివిడెండ్లను సంబంధిత ఇన్వెస్టర్లు పొందడానికి అలంకిత్ సంస్థ సాయం చేస్తోంది. ఒక వేళ షేర్ల బదిలీ జరిగినా, సంతకాలు సరిగ్గా మ్యాచ్ కాకపోవడం వల్ల, చాలా మంది షేర్ సర్టిఫికెట్లను పోగొట్టుకోవడం వల్ల కూడా అన్క్లెయిమ్డ్ డివిడెండ్లు పేరుకుపోతున్నాయని తెలిపారు. కాగా ఐఈపీఎఫ్ఏ వద్ద పోగుపడిన డివిడెండ్లను క్లెయిమ్ చేసుకొని పొందవచ్చనే విషయం కూడా చాలా మందికి తెలియదని నిపుణులంటున్నారు. సెన్సెక్స్ షేర్ల డివిడెండ్లూ అన్క్లెయిమ్డే... ఏదో ఊరు, పేరులేని కంపెనీల, లేదా ఆషామాషీ కంపెనీల డివిడెండ్లే కాకుండా, సెన్సెక్స్ కంపెనీల డివిడెండ్లు కూడా ఈ సంస్థ వద్ద పేరుకుపోవడం విశేషం. 2016–17 ఆర్థిక సంవత్సరంలో 3,329 మంది భారతీ ఎయిర్టెల్ వాటాదారులు రూ.11 లక్షల విలువైన డివిడెండ్లను క్లెయిమ్ చేసుకోలేదని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఇదే ఆర్థిక సంవత్సరంలో హీరో మోటా కార్ప్‌కు చెందిన రూ.8 కోట్ల డివిడెండ్లు కూడా ఈ సంస్థ వద్ద పోగుపడ్డాయి. ఇక ఐటీసీ విషయానికొస్తే, దాదాపు రూ.32 కోట్ల డివిడెండ్లను ఎవరూ ఆ ఏడాది క్లెయిమ్ చేయలేదు. ఓఎన్జీసీ డివిడెండ్ల విషయంలో 2,000కు పైగా ఇన్వెస్టర్లు డివిడెండ్లను క్లెయిమ్ చేయలేదు. బజాజ్ ఆటో విషయంలో డివిడెండ్లు క్లెయిమ్ చేయని ఇన్వెస్టర్ల సంఖ్య 1,500 వరకూ ఉంది. ఈ క్లెయిమ్ చేయని డివిడెండ్ల విలువ రూ.4 కోట్ల వరకూ ఉంటుంది. అన్క్లెయిమ్డ్ షేర్ల విలువ రూ.19,000 కోట్లు కంపెనీల చట్టం, 2013, సెక్షన్125 కింద కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఐఈపీఎఫ్ఏను 2016లో ఏర్పాటు చేసింది. ఇన్వెస్టర్లకు అవగాహన కల్పించడం, నిధుల పరిరక్షణ నిమిత్తం ఈ సంస్థను ఏర్పాటు చేశారు. షేర్ల రిఫండ్, అన్క్లెయిమ్డ్ డివిడెండ్లు, మెచ్యూరైన డిపాజిట్లు, డిబెంచర్లు ఈ సంస్థ ఆధీనంలోకి వస్తాయి. ఏడేళ్లుగా ఎవరూ క్లెయిమ్ చేయని షేర్లను ఐఈపీఎఫ్ఏకు బదిలీచేయాలని ప్రభుత్వం గతేడాది కంపెనీలను ఆదేశించింది. ఈ ఆదేశాల పర్యవసానంగా ఇప్పటివరకూ 1,355కంపెనీలు 48.6 కోట్ల షేర్లను బదిలీ చేశాయి. వీటి విలువ రూ.19,000 కోట్లుగా అంచనా. ఇక గత ఏడాది కాలంలో ఐఈపీఎఫ్ఏ మొత్తం రూ.2 కోట్ల డివిడెండ్లను మాత్రమే రీఫండ్ చేయగలిగింది. ఐఈపీఎఫ్ఏ నుంచి డివిడెండ్ క్లెయిమ్ ఇలా... ►ఐఈపీఎఫ్ఏ వెబ్సైట్లో లభించేఫామ్–5 దరఖాస్తును నింపాలి. ►ఇండెమ్నిటీ బాండ్, ఇతర నిర్ధారణ డాక్యుమెంట్లను జత చేసి, కంపెనీ రిజిస్టర్డ్ ఆఫీస్‌కు పంపాలి. ►ఈ క్లెయిమ్ దరఖాస్తులను కంపెనీ వెరిఫై చేస్తుంది. 15 రోజుల్లోఐఈపీఎఫ్ఏకు నివేదిక పంపిస్తుంది. ► కంపెనీ నివేదిక ఆధారంగా ఐఈపీఎఫ్ఏ డివిడెండ్లను ఎలక్ట్రానిక్ రూపంలో సదరు ఇన్వెస్టర్‌కు 60 రోజుల్లో చెల్లిస్తుంది. -
కేంద్రానికి ఆర్ఈసీ 1,143 కోట్ల డివిడెండ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ ఆర్ఈసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేర్‌కు రూ.11 (110 శాతం) మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. డివిడెండ్ చెల్లింపుల్లో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.1,143 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను ప్రభుత్వానికి చెల్లించింది. ఈ మొత్తానికి సమానమైన ఆర్టీజీఎస్ క్రెడిట్ అడ్వైస్‌ను ఆర్ఈసీ ప్రభుత్వానికి అందజేసింది. రూ.96,357 కోట్ల రుణాలు: ఈ ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల కాలానికి కొత్త ప్రాజెక్ట్‌ల కోసం రూ.96,357 కోట్లు మంజూరు చేశామని, వీటిల్లో రూ.52,269 కోట్లు పంపిణీ చేశామని ఆర్ఈసీ వివరించింది. ఈ తొమ్మిది నెలల కాలంలో స్థూల లాభం 32 శాతం వృద్ధితో రూ.6,466 కోట్లకు, నికర లాభం 26 శాతం వృద్ధితో రూ.4,508 కోట్లకు పెరిగిందని పేర్కొంది. -
ఐవోసీ, ఓఎన్జీసీపై డివిడెండ్ ఒత్తిడి
న్యూఢిల్లీ: పన్ను ఆదాయాలు ఆశించినంత స్థాయిలో కనిపించని నేపథ్యంలో ఆ లోటును భర్తీ చేసుకునే మార్గాలపై కేంద్రం దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండోసారి మధ్యంతర డివిడెండ్ ఇచ్చేలా ప్రభుత్వ రంగ దిగ్గజాలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ)లపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ అంశంపై చర్చించేందుకు మార్చి 19న ఐవోసీ బోర్డు సమావేశం కానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు, నెల రోజుల వ్యవధిలో మరోసారి మధ్యంతర డివిడెండ్ చెల్లించేంతగా మిగులు నిధులు తమ వద్ద లేవని కేంద్రానికి ఓఎన్జీసీ తెలిపినట్లు సమాచారం. ఐవోసీ డిసెంబర్లో షేరు ఒక్కింటికి రూ. 6.75 చొప్పున మధ్యంతర డివిడెండ్ చెల్లించడంతో పాటు షేర్ల బైబ్యాక్ ద్వారా రూ. 4,435 కోట్ల ప్రభుత్వానికి అందించింది. ఇక ఫిబ్రవరి 14న ఓఎన్జీసీ షేరుకి రూ. 5.25 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. అలాగే రూ. 4,022 కోట్ల మేర షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనకు కూడా ఆమోదముద్ర వేసింది. నిబంధనల ప్రకారం కేవలం నెల రోజుల వ్యవధిలో రెండుసార్లు మధ్యంతర డివిడెండ్ ఇవ్వడం కుదరదు. ఇందుకోసం మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుందని, ఒకవేళ ఆమోదం లభించినా.. ఇప్పటికే ప్రకటించిన మధ్యంతర డివిడెండు, షేర్ల బైబ్యాక్‌కు నిధులు ఖర్చు చేసేస్తే రెండో మధ్యంతర డివిడెండ్ ఇచ్చేంత నిధులు ఉండవని ఓఎన్జీసీ చెబుతోంది. వస్తు, సేవల పన్నుల వసూళ్లు రూ. 30,000–40,000 కోట్లు, ప్రత్యక్ష పన్నుల వసూళ్లు కూడా దాదాపు అదే స్థాయిలో తక్కువగా ఉంటాయన్న అంచనాల నేపథ్యంలో నిర్దేశిత ద్రవ్య లోటు లక్ష్యం 3.4 శాతంలోపు కట్టడి చేసేందుకు కేంద్రం నానా తంటాలు పడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆదాయ లోటు భర్తీకి మార్గాలు అన్వేషిస్తోంది. -
స్వల్పంగా పెరిగిన ‘హెక్సావేర్’ లాభం
న్యూఢిల్లీ: ఐటీ సేవల కంపెనీ హెక్సావేర్ టెక్నాలజీస్ నికర లాభం డిసెంబర్ త్రైమాసికంలో 2 శాతం పెరిగి, రూ.123.4 కోట్లుగా నమోదయ్యింది. 2017 ఇదే కాలంలో ఈ మొత్తం రూ.120.9 కోట్లు. ఇక ఆదాయాలు 24.6 శాతం వృద్ధితో రూ.1,004.8 కోట్ల నుంచి రూ.1,252.4 కోట్లకు పెరిగాయి. కంపెనీ జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా భావిస్తోంది. ఈ ప్రాతిపదికన మొత్తం ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 16.8 శాతం పెరిగి రూ.583.5 కోట్లకు చేరింది. కాగా డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ షేర్‌కు రూ.2.50 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. -
ఇన్ఫీ అంచనాలు మిస్..!
న్యూఢిల్లీ: రికార్డు లాభాలతో దేశీ ఐటీ దిగ్గజం టీసీఎస్ మూడో త్రైమాసిక ఫలితాల (క్యూ3) సీజన్‌కు శుభారంభాన్నివ్వగా.. రెండో అతి పెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ మాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. శుక్రవారం ప్రకటించిన ఆర్థిక ఫలితాల ప్రకారం ఆదాయం 20 శాతం ఎగిసినప్పటికీ ... నికర లాభం 30 శాతం క్షీణించింది. మరోవైపు, రూ.8,260 కోట్లతో రెండోసారి షేర్ల బైబ్యాక్ ప్రణాళికతో పాటు షేరుకి రూ. 4 చొప్పున ప్రత్యేక డివిడెండ్ చెల్లించ నున్నట్లు ఇన్ఫీ ప్రకటించింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన వార్షికంగా చూస్తే రెండంకెల స్థాయిలో 10.1 శాతం మేర క్యూ3లో వృద్ధి సాధించినట్లు ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీ సలిల్ పరేఖ్ తెలిపారు. ‘చాలా మటుకు విభాగాలన్నీ మెరుగ్గా రాణిస్తున్నాయి. భారీ డీల్స్ దక్కించుకున్నాం. మరిన్ని కుదుర్చుకోనున్నాం. ఇవన్నీ మరింత ధీమానిస్తున్నాయి‘ అని ఆయన పేర్కొన్నారు. ఫలితాలు వివరంగా చూస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికం ఆర్థిక ఫలితాలు వివరంగా చూస్తే.. నికర లాభం 30 శాతం క్షీణించి రూ. 3,610 కోట్లకు పరిమితమైంది. 2017–18 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో ఇది రూ. 5,129 కోట్లు. అటు ఆదాయం 20.3 శాతం పెరిగి రూ. 17,794 కోట్ల నుంచి రూ. 21,400 కోట్లకు చేరింది. మార్కెట్ వర్గాలు నికర లాభం రూ. 4,115 కోట్లుగా ఉండొచ్చని అంచనా వేశాయి. కీలకమైన డిజిటల్ వ్యాపార విభాగం 33.1 శాతం వృద్ధి సాధించింది. సీక్వెన్షియల్‌గా చూస్తే.. నికర లాభం 12 శాతం క్షీణించింది. సెప్టెంబర్ క్వార్టర్లో ఇది రూ. 4,110 కోట్లు. ఆదాయం 3.8 శాతం పెరిగింది. త్రైమాసికాల వారీగా చూస్తే.. రూపాయి మారకంలో ఆదాయం 3.8 శాతం పెరగ్గా, డాలర్ మారకంలో 2.3 శాతం వృద్ధి నమోదైంది. 2018–19కి సంబంధించిన గైడెన్స్‌ను కరెన్సీ విలువ స్థిరంగా ఉండే ప్రాతిపదికన 8.5–9 శాతానికి పెంచింది. ఇది 6–8 శాతంగా ఉండొచ్చ ని గతేడాది ఏప్రిల్‌లో కంపెనీ అంచనా వేసింది. ఇక తాజాగా ఆపరేటింగ్ మార్జిన్ గైడెన్స్ మాత్రం యథాతథంగా 22–24శాతంగా ఉంచింది. క్యూ3 లో ఆపరేటింగ్ మార్జిన్ సుమారు 110 బేసిస్ పాయింట్లు క్షీణించి 22.6 శాతంగా నమోదైంది. డిసెంబర్ క్వార్టర్లో 1.57 బిలియన్ డాలర్ల డీల్స్ దక్కించుకుంది. మొత్తం మీద చూస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడు త్రైమాసికాల్లో 4.7 బిలియన్ డాలర్ల డీల్స్ సాధించినట్లవుతుంది. రెండో త్రైమాసికంలో ఇన్ఫీ 2 బిలియన్ డాలర్ల కాంట్రాక్టులు దక్కించుకుంది. బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్–షాను లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టరుగా మరోసారి నియమించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. రెండో దఫా పదవీకాలం 2019 ఏప్రిల్ 1 నుంచి 2023 మార్చి దాకా ఉంటుంది. కొత్త సీఎఫ్‌వోగా నీలాంజన్ రాయ్ మార్చి 1 నుంచి బాధ్యతలు చేపడతారు. సీఈవో సలిల్ పరేఖ్‌కు రూ. 3.25 కోట్ల విలువ చేసే షేర్లు కేటాయించడానికి బోర్డు ఆమోదం తెలిపింది. వివాదాస్పదమైన పనయాతో పాటు మరో రెండు అనుబంధ సంస్థలైన స్కావా, కాలిడస్ కొనుగోలుకు ఏ సంస్థా ముందుకు రాకపోవడంతో వీటి విక్రయ ప్రతిపాదనలను ఉపసంహరించుకున్నట్లు ఇన్ఫీ తెలిపింది. ఈ ఏడాది మార్చికల్లా వీటి విక్రయం పూర్తి కాకపోవచ్చన్న అంచనాతో.. వాటికి సంబంధించిన తరుగుదల మొదలైనవి కూడా క్యూ3 ఫలితాల్లో చేర్చినట్లు పేర్కొంది. డివిడెండ్‌కు రూ. 2,107 కోట్లు.. షేరు ఒక్కింటికి రూ.4 ప్రత్యేక డివిడెండ్ చెల్లింపుల కోసం ఇన్ఫీ సుమారు రూ.2,107 కోట్లు వెచ్చించనుంది. దీనికి రికార్డు తేదీ జనవరి 25 కాగా, చెల్లింపు తేదీ జనవరి 28. గతేడాది జూన్‌లో చెల్లించిన రూ. 2,633 కోట్ల డివిడెండ్‌తో పాటు తాజా స్పెషల్ డివిడెండ్, బైబ్యాక్ ఆఫర్ కూడా కలిపితే ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో నిర్దేశించుకున్నట్లుగా మొత్తం రూ.13,000 కోట్ల మేర షేర్హోల్డర్లకు చెల్లించినట్లవుతుందని ఇన్ఫీ తెలిపింది. 2019 జనవరి 9 నాటికి ఇన్ఫీలో ప్రమోటర్లు, ప్రమోటర్ల గ్రూప్‌నకు 12.82% వాటాలు ఉన్నాయి. బైబ్యాక్ రేటు@ రూ. 800.. ఇన్ఫోసిస్ మరోసారి షేర్ల బైబ్యాక్ ప్రకటించింది. దేశీ ఎక్సే్ఛంజీల్లో ఓపెన్ మార్కెట్ మార్గంలో కొనుగోలు జరిపే షేర్లకు సంబంధించి ఒక్కో షేరుకు గరిష్టంగా రూ. 800 ధర నిర్ణయించింది. రూ.8,260 కోట్లతో షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనకు కంపెనీ బోర్డు ఆమోదముద్ర వేసింది. దీనికింద 10.32 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయనుంది. ఇది 2018 డిసెంబర్ 31 నాటికి కంపెనీ పెయిడప్ క్యాపిటల్‌లో సుమారు 2.36 శాతంగా ఉంటుంది. అమెరికన్ డిపాజిటరీ షేర్లను (ఏడీఎస్) కూడా షేర్హోల్డర్లు.. ఈక్విటీ షేర్ల కింద మార్చుకుని, దేశీ ఎక్సే్చంజీల్లో బైబ్యాక్ ఆఫర్లో పాల్గొనవచ్చని ఇన్ఫీ తెలిపింది. దీనికి సంబంధించిన విధివిధానాలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. ఇన్ఫోసిస్ 2017 డిసెంబర్లో తొలిసారి బైబ్యాక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పట్లో షేరు ఒక్కింటికి రూ. 1,150 చొప్పున మొత్తం 11.3 కోట్ల షేర్లను బైబ్యాక్ చేసింది. ఇందుకోసం రూ.13,000 కోట్లు వెచ్చించింది. మూడు దశాబ్దాల కంపెనీ చరిత్రలో తొలిసారిగా ప్రకటించిన షేర్ల బైబ్యాక్‌లో వ్యవస్థాపకులు ఎన్ఆర్ నారాయణ మూర్తి కుమారుడు రోహన్ మూర్తి, క్రిష్ గోపాలకృష్ణన్ భార్య సుధా గోపాలకృష్ణన్ మొదలైన వారితో పాటు ఎల్ఐసీ కూడా షేర్లను విక్రయించింది. -
సైయంట్ మధ్యంతర డివిడెండ్ రూ.6
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంజనీరింగ్ సేవల కంపెనీ సైయంట్ 2018–19 సంవత్సరానికిగాను రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.6 మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం క్రితంతో పోలిస్తే 14.4 శాతం పెరిగింది. లాభం రూ.111 కోట్ల నుంచి రూ.127 కోట్లకు ఎగసింది. టర్నోవర్ రూ.1,006 కోట్ల నుంచి రూ.1,244 కోట్లకు చేరింది. ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో రూ.2,341 కోట్ల టర్నోవరుపై కంపెనీ రూ.209 కోట్ల నికరలాభం పొందింది. -
డబ్బుల్లేవ్.. డివిడెండ్ ఇవ్వలేం..!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఉక్కు సంస్థ సెయిల్ .. గత ఆర్థిక సంవత్సరానికి గాను డివిడెండ్ చెల్లించలేమంటూ కేంద్రానికి స్పష్టం చేసింది. నగదు గానీ, బ్యాంక్ బ్యాలెన్స్ గానీ లేకపోవడమే ఇందుకు కారణమని పేర్కొంది. మిగతా అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే కేంద్రానికి సెయిల్ రూ. 2,171 కోట్లు చెల్లించాల్సి ఉంది. ‘మా దగ్గర నగదు గానీ బ్యాంక్ బ్యాలెన్స్ గానీ లేదు. డివిడెండ్ చెల్లించాలంటే రుణం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో రుణ సమీకరణ అనేది చాలా కష్టతరం. ఉక్కు పరిశ్రమలకు ఆర్థిక సంస్థలు, బ్యాంకులు మరిన్ని రుణాలివ్వడానికి సుముఖంగా లేవు‘ అని కేంద్రానికి రాసిన వివరణ లేఖలో సెయిల్ పేర్కొంది. ఈ పరిణామాలతో ప్రభుత్వ రంగ సంస్థల నుంచి డివిడెండ్లు, లాభాల్లో వాటాల రూపంలో రూ.1.06 లక్షల కోట్లు సమీకరిం చాలని బడ్జెట్లో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించడం కేంద్రానికి కష్టతరంగా మారనుంది. 2017–18లో కంపెనీ నష్టాల నేపథ్యంలో డివిడెండ్ చెల్లించే పరిస్థితులు లేవని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
ఇండియన్ బ్యాంకు ఫలితాలు..ప్చ్..
సాక్షి,ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకు ఇండియన్ బ్యాంకు నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. క్యూ4(జనవరి-మార్చి)లో ఇండియన్ బ్యాంక్ నికర లాభం 59 శాతం క్షీణించి రూ. 1,259 కోట్లకు పరిమితమైంది. గత ఏడాది 1405 రూపాయల నికర లాభాలను సాధించింది. మొత్తం ఆదాయం19,520కోట్లుగా నమోదు చేసింది. మార్చి 31, 2018 నాటికి ఇండియన్ బ్యాంక్ స్థూల స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 6.27 శాతం నుంచి 7.37 శాతానికి పెరిగి11,990 కోట్ల రూపాయలుగా ఉంది. నికర ఎన్పీఏలు సైతం 3.3 శాతం నుంచి 3.81 శాతం పెరిగి 5,960.57 కోట్ల రూపాయలుగా ఉంది. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) మాత్రం 18 శాతం పెరిగి రూ. 1638 కోట్లకు చేరింది. మొండి రుణాలకుగాను రూ. 1770 కోట్ల మేర ప్రొవిజన్లు చేపట్టింది. మరోవైపు రూ .10 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేరుకు రూ .6 డివిడెండ్ చెల్లించేందుకు బోర్డ్ ప్రతిపాదించింది. -
రిలయన్స్ క్యాపిటల్ డివిడెండ్ రూ.11
న్యూఢిల్లీ: రిలయన్స్ క్యాపిటల్ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి రూ.428 కోట్ల నికర లాభం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి ఆర్జించిన నికర లాభం (రూ.428 కోట్లు)తో పోల్చితే 36 శాతం వృద్ధి సాధించామని రిలయన్స్ క్యాపిటల్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.5,007 కోట్లుగా ఉందని పేర్కొంది. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.1,086 కోట్లుగా ఉన్న నికర లాభం 2017–18లో 21% వృద్ధితో రూ.1,309 కోట్లకు పెరి గిందని తెలిపింది. మొత్తం ఆదాయం రూ.19,898 కోట్లుగా ఉందని పేర్కొంది. ఒక్కో షేర్‌కు -
హెచ్డీఎఫ్సీ బ్యాంకు భారీ డివిడెంట్
ఆస్తుల పరంగా రెండో అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఫలితాల్లో అదరగొట్టింది. నేడు(శనివారం) వెల్లడించిన మార్చి క్వార్టర్ ఫలితాల్లో బ్యాంకు నికర లాభాలు 20 శాతం జంప్ చేసి రూ.4799 కోట్లగా రికార్డైనట్టు వెల్లడించింది. కాగ గతేడాది ఇదే క్వార్టర్లో కంపెనీ లాభాలు రూ.3990 కోట్లగా ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా హెచ్డీఎఫ్సీ బ్యాంకు భారీ డివిడెంట్ ప్రకటించింది. 2 రూపాయల గల ఒక్కో షేరుకు 13 రూపాయల డివిడెంట్ ఇచ్చేందుకు బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ప్రతిపాదించినట్టు పేర్కొంది. ఇది షేర్ల ఫేస్ విలువకు 650 శాతం అధికం. గతేడాది ఇదే క్వార్టర్లో 11 రూపాయల డివిడెంట్ ప్రకటించింది. వచ్చే వార్షిక సాధారణ సమావేశంలో పెట్టుబడిదారులు దీన్ని ఆమోదించనున్నారు. విశ్లేషకుల అంచనాల ప్రకారం హెచ్డీఎఫ్సీ బ్యాంకు రూ.4,838 కోట్ల లాభాలను ఆర్జిస్తుందని తెలిసింది. కానీ విశ్లేషకుల అంచనాలకు కాస్త దగ్గర్లోనే బ్యాంకు తన ఫలితాలను ప్రకటించింది. బ్యాంకు నికర ఆదాయాలు ఏడాది ఏడాదికి 17.7 శాతం పెరిగి రూ.10,657.71 కోట్లగా ఉన్నాయి. బ్యాంకుల ఆస్తుల నాణ్యత స్థిరంగా ఉన్నట్టు హెచ్డీఎఫ్సీ తెలిపింది. స్థూల నిరర్థక ఆస్తులు 1.30 శాతంగా ఉన్నాయి. అంతేకాక నికర ఎన్పీఏలు గత డిసెంబర్ క్వార్టర్లో 0.44 శాతంగా ఉంటే, ఈ మార్చి క్వార్టర్లో 0.40 శాతంగా నమోదయ్యాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా శుక్రవారం హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లు 0.98 శాతం పెరిగి, రూ.1,960.95 వద్ద ముగిశాయి. -
మీ డివిడెండ్ మీకు చేరిందా?
లేదంటే కంపెనీ దగ్గరే ఉండి ఉంటుంది వివరాలు కంపెనీవెబ్సైట్లో ఉంటాయి ఏడేళ్ల వరకూ కంపెనీ డివిడెండ్ ఖాతాలోనేఆ తర్వాత ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్‌కు బదిలీ ఈ లోపు ఎప్పుడైనా క్లెయిమ్ చేసుకోవచ్చు వ్యాపార కార్యకలాపాలు సజావుగా సాగించే కంపెనీలన్నీ దాదాపుగా తమ వాటాదారులకు ఏటా కొంత లాభాన్ని డివిడెండ్ రూపంలో పంపిణీ చేస్తుంటాయి. కొన్ని కంపెనీలు ప్రతి మూడు నెలలకూ ఎంతో కొంత డివిడెండ్ చెల్లిస్తాయి కూడా. ఇప్పుడు ఆన్లైన్ డీమ్యాట్ ఖాతాలు వచ్చాయి కనక దాదాపు అన్ని కంపెనీలూ డివిడెండ్లను నేరుగా బ్యాంకు ఖాతాలకే జమ చేస్తున్నాయి. కొన్ని కంపెనీలు మాత్రం ఇంకా డివిడెండ్ వారెంట్లను జారీ చేయటం జరుగుతోంది. ఈ డివిడెండ్ వారెంట్లు వాటాదారు చిరునామాకు నేరుగా వెళతాయి. వాటిని బ్యాంకులో జమ చేసుకోవాల్సి ఉంటుంది. చిరునామా మారినా కొత్తది తెలియజేయని వారు... మరణించిన వాటాదారుల పేరిట జారీ అయిన డివెండ్ వారెంట్లు క్లెయిమ్ చేసుకోకుండా అలాగే ఉండిపోతాయి. ఏడేళ్ల తరవాత ఆ మొత్తాన్ని కంపెనీలు ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్‌కు (ఐఈపీఎఫ్) బదిలీ చేస్తాయి. ఈ ఫండ్‌ను సెబీ ఏర్పాటు చేసింది. ఇన్వెస్టర్లలో అవగాహన కల్పించడమే కాక వారి ప్రయోజనాల పరిరక్షణకు ఈ నిధులు ఖర్చు చేస్తారు. ఈ నేపథ్యంలో చట్ట ప్రకారం తమకు రావాల్సిన డివిడెండ్‌ను పొందడం ఎలాగో ఒకసారి చూద్దాం... లిస్టెడ్ కంపెనీలు డివిడెండ్‌ను క్లెయిమ్ చేసుకోని వాటాదారుల వివరాలను కచ్చితంగా తమ వెబ్సైట్లలో ప్రదర్శించాలి. పేరు, రికార్డుల్లో నమోదై ఉన్న వారి చిరునామా, ఎంత మేర డివిడెండ్ పెండింగ్‌లో ఉంది తదితర వివరాలను ప్రతి కంపెనీ ఏటా వార్షిక వాటాదారుల సమావేశం ముగిసిన తర్వాత 90 రోజుల్లోపే వెబ్సైట్లో ఉంచాలి. ఇలా క్లెయిమ్ చేసుకోని వాటాదారుల వివరాలను వరుసగా ఏడేళ్ల పాటు వెబ్సైట్లో ప్రదర్శించాల్సి ఉంటుంది. ఈ వివరాలను సరిచూసుకుని తమ పేరు గనక ఉంటే సంబంధిత డివిడెండ్ కోసం క్లెయిమ్ చేసుకోవాలి. లేదంటే ఏడేళ్ల తర్వాత ఆ మొత్తం ఐఈపీఎఫ్‌కు బదిలీ అవుతుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అసోసియేట్ డైరెక్టర్ కె.వి.సునీల్ కుమార్ చెప్పారు. డివిడెండే కాదు, రిఫండ్లు కూడా... ఒక్క డివిడెండే కాదు, షేర్ల కోసం ఇన్వెస్టర్లు దరఖాస్తు చేసుకున్నప్పుడు చెల్లించిన మొత్తాన్ని ఒకవేళ ఆ మేరకు షేర్లు అలాట్ చేయలేకపోతే కంపెనీలు వెనక్కిచ్చేయాల్సి ఉంటుంది. అలా చెల్లించాల్సి ఉన్న నిధులు, కాల వ్యవధి తీరిన డిపాజిట్లు, డిబెంచర్లు, వాటిపై వడ్డీ సైతం కంపెనీ వద్దే ఉండిపోతే ఆ నిధులను కూడా నిబంధనల మేరకు ఐఈపీఎఫ్‌కు బదిలీ చేయాలని సునీల్ వెల్లడించారు. ‘‘సెక్షన్ 124(5) ప్రకారం ఏడు సంవత్సరాల వ్యవధిలోపు ఎప్పుడు ఇన్వెస్టర్ క్లెయిమ్ చేసుకున్నా ఆ మొత్తం వారికి చెల్లించడం జరుగుతుంది’’ అని ఆయన తెలిపారు. క్లెయిమ్ ప్రక్రియ ఇలా... ఐఈపీఎఫ్–5 అనే డాక్యుమెంట్‌ను (జ్టి్టp://ఠీఠీఠీ.జ్ఛీpజ.జౌఠి.జీn) వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇన్వెస్టర్లు లేదా డివిడెండ్ ఆదాయం కోసం క్లెయిమ్ చేసుకునే వారు దరఖాస్తులో అన్ని వివరాలనూ పొందు పరచాల్సి ఉంటుంది. ఇందులో క్లెయిమ్ చేసుకుంటున్న వారి పేరు, కంపెనీ పేరు, షేర్లకు సంబంధించిన వివరాలు, ఆధార్ నంబర్, ఎన్ని క్లెయిమ్‌లు, బ్యాంకు ఖాతా, డీమ్యాట్ ఖాతా వివరాలు అన్నీ ఇవ్వాలి. ఈ వివరాలన్నీ పూర్తి చేసిన తర్వాత ఆ దరఖాస్తును తిరిగి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అనంతరం ఎంసీఏ21కు పేజీ రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ జారీ అవుతుంది. దీన్ని భవిష్యత్తులో విచారణల కోసం సేవ్ చేసుకోవడం మంచిది. ఇక్కడే పేమెంట్ ఆప్షన్ ఉంటుంది. ఫీజు ఉన్నా, లేకపోయినా గానీ పే ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. అప్పుడు ఆన్లైన్ అక్నాలెడ్జ్మెంట్ అందుతుంది. ఆ తర్వాత క్లెయిమ్ ఫామ్, అక్నాలెడ్జ్మెంట్ కాపీలను, ఇండెమ్నిటీ బాండ్‌తో కలిపి ఐఈపీఎఫ్ నోడల్ ఆఫీసర్‌కు అందజేయాలి. క్లెయిమ్ అందిన తర్వాత కంపెనీ 15 రోజుల్లోపు ఐఈపీఎఫ్‌కు వెరిఫికేషన్ రిపోర్ట్ అందచేస్తుందని సునీల్‌కుమార్ తెలిపారు. ఒకవేళ షేర్లు బకాయి ఉంటే వాటిని డీమ్యా ట్ ఖాతాకు బదిలీ చేయడం లేదా ఫిజికల్ సర్టిఫికెట్లను అందజేయడం జరుగుతుందన్నారు. వెరిఫికేషన్ రిపోర్ట్ అందిన తేదీ నుంచి 60 రోజుల్లోపు తిరిగి చెల్లించడం పూర్తవుతుంది. -
అదరగొట్టిన ఐఓసీ: బోనస్, డివిడెండ్
సాక్షి,ముంబై: ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) క్యూ3 ఫలితాల్లో అదరగొట్టింది. ఎనలిస్టుల అంచనాలను అధిగమించి భారీ లాభాలను సాధించింది. ఈ ఏడాది క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో రెట్టింపు లాభాలను నమోదు చేసింది. మంగళవారం ప్రకటించిన ఐవోసీ ఫలితాల్లో నికర లాభం గత క్వార్టర్లోని రూ. 3994 కోట్ల తో పోలీస్తే ప్రస్తుతం రూ. 7883 కోట్లకు ఎగసింది. మొత్తం ఆదాయం 22.2 శాతం ఎగిసి రూ. 1.16 లక్షల కోట్ల నుంచి రూ.1.32 లక్షల కోట్లకు పెరిగింది. ఆపరేటింగ్ లాభం 8.1 శాతం పుంజుకుని రూ .7,373 కోట్లుగా నమోదైంది. ఇతర ఆదాయం రూ. 807 కోట్ల నుంచి రూ. 1353 కోట్లకు పుంజుకోగా... ఈ ఏడాది తొలి 9 నెలల కాలంలో స్థూల రిఫైనింగ్ మార్జిన్లు(జీఆర్ఎం) బ్యారల్‌కు 8.28 డాలర్లుగా నమోదైనట్లు ఐవోసీ తెలియజేసింది. అంతేకాదు తన వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్ల జారీకి ఐవోసీ బోర్డు అనుమతించింది. అంటే ప్రతీ 1 షేరుకీ మరో షేరుని అదనంగా జోడించనుంది. అంతేకాదు షేరుకి రూ. 19 చొప్పున డివిడెండ్ చెల్లించేందుకు నిర్ణయించింది. -
డాబర్ ఫలితాలు భేష్: రూ.1.25 డివిడెండ్
సాక్షి,ముంబై: ఎఫ్ఎంసీజీ దిగ్గజం డాబర్ ఇండియా క్యూ2 నికర లాభాల్లోవృద్ధిని నమోదు చేసింది. సెప్టెంబర్ 30 తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో నికర లాభంలో 5.46 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి రూ. 268.72 కోట్ల నుంచి రూ .283.41 కోట్లకు పెరిగింది. క్యూ 2 లో మొత్తం ఆదాయం 3.96 శాతం పెరిగి రూ.1,492.62 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఇది రూ. 1,435.75 కోట్లను ఆర్జించింది. 2017-18 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో దేశీయ వినియోగదారుల వృద్ధిలో బలమైన వృద్ధిని సాధించినట్టు కంపెనీ ప్రకటించింది. అయితే, ఈజిప్టు, టర్కీ, నైజీరియాలో కరెన్సీ బాగా విలువ తగ్గడం, కీ భౌగోళిక పరిస్థితుల్లో కొనసాగుతున్న అవాంతరాల కారణంగా విదేశీ వ్యాపారం దెబ్బతిందని ఒక ప్రకటనలో తెలిపింది. ఏకీకృత ఆధారంగా, 2017-18 క్వార్టర్లో కంపెనీ నికర లాభం 1.20 శాతం పెరిగి రూ .362.67 కోట్లకు చేరింది. సెప్టెంబర్ 30 తో ముగిసిన త్రైమాసికంలో మొత్తం ఆదాయం 1.33 శాతం క్షీణించి రూ .2,043.25 కోట్లకు చేరుకుంది. దేశీయ వినియోగదారుల డిమాండ్ రాబోయే నెలల్లో మరింత పెరిగిపోతుందని విశ్వసిస్తున్నామని డాబర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీల్ దుగ్గల్ చెప్పారు. 2017-18 నాటికి డైరెక్టర్ల బోర్డు 125 శాతం డివిడెండ్‌ను కూడా ప్రకటించింది. ప్రతీ షేరుకు రూ.1.25 మధ్యంతర డివిడెండ్ చెల్లించనున్నట్టు డాబర్ ఇండియా చైర్మన్ ఆనంద్ బర్మన్ చెప్పారు. దీంతో డాబర్ ఇండియా షేరు లాభాల్లో ముగిసింది. -
మూడేళ్లలో అత్యధికంగా భెల్ డివిడెండ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విద్యుత్‌పరికరాల తయారీ దిగ్గజం భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ (భెల్) 2016–17లో మొత్తం 79 శాతం మేర డివిడెండ్ చెల్లించింది. తొలి విడతగా 40 శాతం, మలివిడతలో 39 శాతం చెల్లించింది. గడిచిన మూడేళ్లలో ఇదే అత్యధికమని, గతేడాది చెల్లించిన దానికన్నా నాలుగు రెట్లు అధికమని భెల్ తెలిపింది. దీంతో నాలుగు దశాబ్దాల నుంచి నిరాటంకంగా ఇన్వెస్టర్లకు డివిడెండ్లు అందిస్తున్న సంస్థగా నిల్చింది. విలువపరంగా చూస్తే 2016–17లో భెల్ మొత్తం మీద రూ. 386.72 కోట్లు, కేంద్రానికి రూ.244 కోట్లు డివిడెండ్ చెల్లించినట్లయింది. మలి విడతకు సంబంధించి రూ.120.39 కోట్ల చెక్కును భెల్ సీఎండీ అతుల్ సోబ్ది.. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అనంత్ జి. గీతేకి బుధవారం అందించారు. -
ఆర్బీఐ డివిడెండ్ చిక్కి సగమైంది!
కేంద్రానికి రూ.30,659 చెల్లించడానికి ఓకే ♦ 2015–16లో మాత్రం ఈ మొత్తం 65,876 కోట్లు ♦ కొత్త నోట్ల ముద్రణకు భారీ వ్యయం ఓ కారణం ♦ రూపాయి విలువ పెరగటమూ మరో కారణం ♦ రాబడికి ప్రత్యామ్నాయాలపై కేంద్రం దృష్టి! ముంబై: కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చెల్లించే డివిడెండ్ గడిచిన ఆర్థిక సంవత్సరం భారీగా సగానికి సగం పడిపోయింది. ఆర్బీఐకి ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగుస్తుంది. ఈ కాలానికి సంబంధించి ఆర్బీఐ రూ.30,659 కోట్లు మాత్రమే కేంద్రానికి చెల్లించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం రూ.65,876 కోట్లు. కొత్త నోట్ల ముద్రణ కారణం... విశ్లేషకుల అంచనా ప్రకారం భారీగా డివిడెండ్ పడిపోడానికి ప్రధాన కారణాల్లో... డీమోనిటైజేషన్ నేపథ్యంలో– కొత్త నోట్ల ముద్రణకు అయిన వ్యయం ఒకటి. రూ.500 నోటు ముద్రణకు సగటున రూ.2.87 నుంచి రూ.3.09 శ్రేణిలో వ్యయమయితే రూ.2,000 నోటు ముద్రించడానికి సగటున రూ.3.54 నుంచి రూ.3.77 మధ్యలో ఖర్చయిందని ఇటీవలే ఆర్థిక శాఖ సహాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. అయితే డీమోనిటైజేషన్ అనంతరం కొత్త నోట్ల ముద్రణకు ఆర్బీఐ మొత్తంగా ఎంత వెచ్చించిందన్నది మాత్రం ఆయన వెల్లడించలేదు. ‘గురువారం జరిగిన ఆర్బీఐ బోర్డ్ సమావేశంలో... కేంద్రానికి రూ.30,659 డివిడెండ్ చెల్లించడానికి బోర్డు ఆమోదముద్ర వేసింది’అని ఆర్బీఐ అధికారిక ప్రకటనలో తెలియజేసింది. అయితే గత ఏడాదికన్నా తక్కువ డివిడెండ్ చెల్లించడానికి గల కారణాలను మాత్రం ప్రకటన వెల్లడించలేదు. అయితే కొత్త నోట్ల ముద్రణ, రివర్స్ రెపో ద్వారా అధిక చెల్లింపులు, డాలర్ మారకంలో రూపాయి విలువ గణనీయ పెరుగుదల వంటి అంశాలు కూడా కారణాలు కావచ్చని విశ్లేషణలు ఉన్నాయి. ప్రత్యామ్నాయంపై ప్రభుత్వం చూపు... 2017–18లో కనీసం రూ.58,000 కోట్లు ఆర్బీఐ నుంచి వస్తాయని ప్రభుత్వం భావించింది. బడ్జెట్ అంచనాల ప్రకారం ఆర్బీఐ, జాతీయ బ్యాంకులు ఆర్థిక సంస్థల నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.74,901 కోట్లు డివిడెండ్ రూపంలో అందుకోవచ్చని భావించారు. ఆర్బీఐ నుంచి డివిడెండ్ భారీగా పడిపోవడంతో, కేంద్ర ఆర్థిక ప్రణాళికపై కొంత ఒత్తిడి నెలకొనే పరిస్థితి ఏర్పడింది. 2017–18 ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటును (ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య వ్యత్యాసం) నిర్దేశిత 3.2 శాతం వద్ద కట్టడి చేయడానికి అదనపు కసరత్తు చేయాల్సి ఉంది. తాజా పరిణామంపై ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఆర్.గాంధీ మాట్లాడుతూ... గడచిన ఐదేళ్లలో బ్యాంకింగ్ రాబడి తగ్గుతూ వస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతికూల వడ్డీరేట్లు దీనికి కారణమని అన్నారు. వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) పెరగడం వల్ల రివర్స్ రెపో (బ్యాంకులు తన వద్ద ఉంచిన డిపాజిట్‌పై ఆర్బీఐ ఇచ్చే వడ్డీ), సంబంధిత చెల్లింపులు రెవెన్యూపై ప్రభావం చూపుతున్నట్లూ ఆయన విశ్లేషించారు. -
మ్యూచువల్ ఫండ్స్ డివిడెండ్‌పై పన్ను పోటు!
ముంబై: కేంద్ర ప్రభుత్వం మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్ల డివిడెండ్ ఆదాయంపై కన్నేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి 10 శాతం పన్ను విధించే యోచనలో ఉంది. దీంతో వార్షికంగా రూ.740 కోట్ల ఆదాయం పన్ను రూపంలో ప్రభుత్వానికి లభించనుంది. ఆదాయపన్ను శాఖ ఇటీవలే ఆదాయపన్ను చట్టం – 2017లో సెక్షన్ 115బీబీడీఏను సవరణతో నోటిఫై చేసింది. ఒక అసెస్సీ (రిటర్నులు దాఖలు చేసే వారు) మొత్తం ఆదాయం ఒక ఏడాదిలో రూ.10 లక్షలు దాటితే... సంబంధిత అసెస్సీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల డివిడెండ్‌పై 10 శాతం పన్నును వసూలు చేయాలని నిబంధన చెబుతోంది. ప్రస్తుతం ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్ ఆస్తులు రూ.7 లక్షల కోట్లుగా ఉన్నాయి. వ్యక్తులు, సంస్థలు, హిందూ అవిభక్త కుటుంబాలు ఓ ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలకు పైగా దేశీయ కంపెనీల నుంచి డివిడెండ్ రూపంలో ఆదాయం అందుకుంటే దానిపై 10 శాతం పన్ను ప్రస్తుతం అమల్లో ఉంది. కంపెనీ ప్రమోటర్లు, అధిక నికర విలువ కలిగిన ఇన్వెస్టర్ల లక్ష్యంగా దీన్ని అమలు చేస్తున్నారు. కానీ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీల నుంచి అందుకునే డివిడెండ్లపై పన్ను మినహాయింపు వుంది. అయితే, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దీన్ని ఆదాయపన్ను చెల్లింపుదారులు అందరికీ అమలు చేయనున్నారు. పన్ను ఎగ్గొట్టేందుకు కొందరు ప్రమోటర్లు ట్రస్ట్‌లను ఏర్పా టు చేస్తుండడంతో అటువంటి అవకాశం లేకుండా ఈ నిబంధనను అందరికీ వర్తింపజేయనున్నారు. అయితే, ఈ విషయాన్ని ఇప్పటికే ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్లిన మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేన్ ‘యాంఫి’ మాత్రం... తమ డిమాండ్ మేరకు డివిడెండ్‌పై పన్ను ప్రతిపాదనను ప్రభుత్వం పక్కన పెడుతుందని ఆశిస్తోంది. -
హెచ్డీఎఫ్సీ క్యూ4 ఫలితాలు, డివిడెండ్
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నాలుగవ త్రైమాసిక ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. ఫలితాలు మెరుగ్గానే ఉన్నప్పటికీ బ్యాడ్ లోన్ బెడద మాత్రం వెన్నాడుతోంది. క్యూ4(జనవరి-మార్చి)లో నికర లాభం 18.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. రూ. 3,990 కోట్లను నికార లాభాలను పోస్ట్ చేసింది. మొత్తం ఆదాయం రూ. 21,560 కోట్లుగా ప్రకటించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో 18,862 కోట్ల రూపాయలను రిపోర్ట్ చేసింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 21.5 శాతం పెరిగి రూ. 9,055 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు(ఎన్ఐఎం) 4.1 శాతం నుంచి 4.3 శాతానికి బలపడ్డాయి. ఇతర ఆదాయం 20 శాతం పుంజుకుని రూ. 3446 కోట్లను అధిగమించగా.. నిర్వహణ లాభం(ఇబిటా) 27 శాతం జంప్‌చేసి రూ. 7,279 కోట్లయ్యింది. మార్చితో ముగిసిన త్రైమాసికానికి బ్యాంకు మొత్తం స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పిఏ) 1.05 శాతం పెరగ్గా, 2015-15 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో 0.94 శాతం గా ఉన్నాయి. రుణాలు రూ. 1,261 కోట్లుగా ఉన్నాయని , 2015-16 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి కాలంలో రూ.662 కోట్లగా బ్యాంకు బిఎస్ఇ ఫైలింగ్ లో తెలిపింది.ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కౌంటర్ 2.4శాతానికిపైగా లాభపడింది. మరోవైపు గత ఐదు సంవత్సరాలుగా మంచి డివిడెండ్ ట్రాక్ రికార్డు ఉన్న బ్యాంకు మరోసారి వాటాదారులకు డివిడెండ్ ప్రకటించింది. షేరుకి రూ. 11 చొప్పున డివిడెండ్ చెల్లించనున్నట్లు బ్యాంక్ పేర్కొంది. గత ఏడాది ప్రతి ఈక్విటీ షేరుకి రూ.9.5 లు అందించింది. -
హయ్యస్ట్ డివిడెండ్ ప్రకటించిన కంపెనీ
న్యూఢిల్లీ: వేదాంత గ్రూపునకు చెందిన హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్‌జెడ్‌ఎల్) భారీ డివిడెండ్ ప్రకటించింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికిగాను రూ 13.985 కోట్ల మధ్యంతర డివిడెండ్ బుధవారం ప్రకటించింది. దీంతో మొత్తం చెల్లించిన డివిడెండ్ విలువ రూ.27,157 కోట్లకు చేరింది.దీంతో దేశంలో అతి పెద్ద డివిడెండ్ చెల్లించిన కంపెనీగా హిందుస్థాన్ జింక్ నిలిచింది. స్పెషల్ వన్ టైం మధ్యంతరం డివిడెండ్‌ను చెల్లించేందుకు డైరెక్టర్ల బోర్డు నిర్ణయించింది. 1,375 శాతం మధ్యంతర డివిడెండ్ లేదా డివిడెండ్ పంపిణీ పన్ను (డిడిటి) సహా, రూ 13.985 కోట్లను ప్రకటించింది. దీని ప్రకారం రూ .2 విలువగల ప్రతి ఈక్విటీ షేరుకు రూ.27.50లను చెల్లించనుంది. 2016 ఏప్రిల్ లో చెల్లించిన గోల్డెన్ జుబ్లీ డివిడెండ్, అక్టోబర్ లో చెల్లించిన డివిడెండ్ కలిపి ఒక ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా ఉన్నట్టు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. తమ వాటాదారులకు స్పెషల్ డివిడెండ్ చెల్లించడం సంతోషంగా ఉందని, విలువ పంపిణీలో కంపెనీ నిబద్ధతను, విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని కంపెనీ ఛైర్మన్ అగ్నివేశ్ అగర్వాల్ చెప్పారు. కాగా మార్చిలో రూ.2 విలువగల ప్రతి ఈక్విటీ షేరుపై రూ.24 డివిడెండ్ చెల్లించింది. ఏడాదికి 1 మిలియన్ టన్నుల సామర్ధ్యంతో జింక్, వెండి ఉత్పత్తిలో దేశంలోని అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ కంపెనీ హిందుస్థాన్ జింక్. -
గెయిల్ బోనస్ షేర్లు
• ప్రతి మూడు షేర్లకు ఒక షేర్ బోనస్ • ఒక్కో షేర్‌కు రూ.8.5 మధ్యంతర∙డివిడెండ్ న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ గ్యాస్ సంస్థ.. గెయిల్ బోనస్ షేర్లను ఇవ్వనుంది. రూ.10 ముఖవిలువ గల ప్రతి 3 షేర్లకు 1 షేర్‌ను బోనస్‌గా ఇవ్వడానికి డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపింది. దీనికి వాటాదారుల ఆమోదం పొందాల్సి ఉంది. ఇక ఈ ఆర్థిక సంవత్సరానికి 85% (ఒక్కో షేర్‌కు రూ.8.50) మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. బోనస్ షేర్ల జారీతో కంపెనీ చెల్లించిన వాటా మూలధనం రూ.1,268 కోట్ల నుంచి రూ.1,691 కోట్లకు పెరుగుతుంది. దాదాపు పదేళ్ల తర్వాత గెయిల్ బోనస్ షేర్లను జారీ చేస్తోంది. 2008, అక్టోబర్‌లో ప్రతి రెండు షేర్లకు ఒక షేర్‌ను బోనస్‌గా గెయిల్ జారీ చేసింది. స్టాక్ మార్కెట్లో లిస్టయిన తర్వాత బోనస్ షేర్లనివ్వడం ఇది రెండోసారి. మరోవైపు రూపీ బాండ్ల ద్వారా రూ.750 కోట్ల సమీకరణకు బోర్డ్ ఆమోదం తెలిపింది. -
బ్యాంకుల నుంచి కేంద్రానికి తగ్గనున్న డివిడెండ్
• ఈసారి రూ. 1,000 కోట్ల కన్నా తక్కువే • కొంతైనా చెల్లించలేమని చేతులెత్తేసిన కొన్ని బ్యాంకులు • డీమోనిటైజేషన్, ఎన్పీఏలే కారణం న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు ప్రభావాలు, మొండిబకాయిల (ఎన్పీఏ) భారం తదితర అంశాల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) నుంచి కేంద్రానికి వచ్చే డివిడెండ్ తగ్గవచ్చని తెలుస్తోంది. ఇది రూ. 1,000 కోట్ల కన్నా తక్కువే ఉండొచ్చని సమాచారం. కొన్ని పీఎస్‌బీలు ఈ ఆర్థిక సంవత్సరం మొత్తానికే డివిడెండ్ చెల్లించకపోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. రుణ మంజూరీ అంతంత మాత్రంగా ఉండటం, ఎన్పీఏల భారం తదితర అంశాలతో లాభాలు తగ్గనుండటంతో తాము డివిడెండ్ చెల్లించలేమంటూ పలు పీఎస్‌బీల అధిపతులు.. ఆర్థిక శాఖకు ఇప్పటికే తెలియజేసినట్లు వివరించాయి. గతేడాది జూన్ ఆఖరు నాటికి రూ. 5,50,346 కోట్లుగా ఉన్న పీఎస్‌బీల స్థూల ఎన్పీఏలు సెప్టెంబర్ 30 నాటికి రూ. 6,30,323 కోట్లకు పెరిగాయి. ఇక పెద్ద నోట్ల రద్దు దరిమిలా బ్యాంకింగ్ కార్యకలాపాలపై రెండు నెలల పాటు ప్రతికూల ప్రభావం పడటంతో వాటి ఆదాయం ఆ మేర తగ్గినట్లు పరిశీలకుల అంచనా. నోట్ల రద్దు అనంతరం రుణాల మంజూరీ రికార్డు కనిష్టం 5.3 శాతం స్థాయిని తాకింది. మరింత మూలధనం కావాలంటూ కోరుతున్న బ్యాంకులు.. ఈ పరిస్థితుల్లో డివిడెండ్ చెల్లించలేకపోవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పీఎస్బీల్లో ప్రభుత్వానికి మెజారిటీ వాటాలు ఉంటాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం లాభాల్లో ఉన్న బ్యాంకులు తమ ఈక్విటీలో కనీసం 20%మైనా లేదా పన్ను అనంతర లాభాల్లో 20 శాతం గానీ (ఏది ఎక్కువైతే అది) డివిడెండ్ కింద ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అయితే, వివిధ అంశాల కారణంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ సహా 16 పీఎస్‌బీలు 2015–16లో డివిడెండ్ చెల్లించలేదు. దీంతో కేంద్రానికి పీఎస్‌బీల నుంచి రావాల్సిన డివిడెండ్ ఆదాయం సుమారు 67% క్షీణించి రూ. 1,445 కోట్లకు తగ్గిపోయింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 4,336 కోట్లు. గత ఆర్థిక సంవత్సరం కాస్త తక్కువ ఇచ్చినా.. ఎస్బీఐ సహా ఆరు బ్యాంకులు మాత్రమే డివిడెండ్ చెల్లించాయి. ఆర్థిక శాఖ గణాంకాల ప్రకారం 2015–16లో ఎస్బీఐ అత్యధికంగా రూ. 1,214.6 కోట్లు కట్టింది. ఇది అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 22% తక్కువే. మరోవైపు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రితం కట్టిన దాంట్లో మూడింట ఒక్క వంతు రూ. 85 కోట్లు, ఓరియంటల్ బ్యాంక్ ఐదో వంతు రూ. 12.4 కోట్లు కట్టింది. అలహాబాద్ బ్యాంక్, బీఓబీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటివి డివిడెండ్ చెల్లించనే లేదు. -
అరబిందో ఫార్మా లాభం 606 కోట్లు
33 శాతం అప్ రూ. 1.25 మధ్యంతర డివిడెండ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా నికర లాభం దాదాపు 33 శాతం ఎగిసి సుమారు రూ. 606 కోట్లకు (కన్సాలిడేటెడ్) చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో కంపెనీ లాభం సుమారు రూ. 454 కోట్లు. మరోవైపు, ఆదాయం రూ. 3,365 కోట్ల నుంచి రూ. 3,775 కోట్లకు పెరిగింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 1 ముఖవిలువ గల షేరు ఒక్కింటిపై రూ. 1.25 (సుమారు 125 శాతం) కంపెనీ మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. అధునాతన సాంకేతికత ఊతంతో వైవిధ్యమైన ఉత్పత్తులను రూపొందించడం ద్వారా దీర్ఘకాలిక వృద్ధి సాధించే దిశగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు కంపెనీ ఎండీ ఎన్ గోవిందరాజన్ తెలిపారు. ఫార్ములేషన్‌స వాటా 80%..: మొత్తం ఆదాయాల్లో ఫార్ములేషన్‌స విభాగం వాటా 80 శాతంగా ఉంది. వివిధ వ్యాపార విభాగాల పనితీరు పరంగా చూస్తే.. ఫార్ములేషన్‌స విభాగం ఆదాయాలు 12 శాతం వృద్ధితో రూ. 3,004 కోట్లకు పెరగ్గా, ఏపీఐ విభా గం ఆదాయం దాదాపు 11% పెరుగుదలతో రూ. 769 కోట్లకు చేరింది. ఫార్ములేన్సకి సంబంధించి కీలకమైన అమెరికా మార్కెట్లో అమ్మకాలు సుమారు 18 శాతం పెరిగి రూ. 1,735 కోట్లుగా నమోదైంది. అమ్మకాల్లో సుమారు 3.9 శాతాన్ని పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాల కోసం వ్యయం చేసినట్లు అరబిందో ఫార్మా తెలిపింది. విదేశీ మారక రుణ భారం ఈ ఏడాది మార్చిలో 640 మిలియన్ డాలర్లుగా ఉండగా.. సెప్టెంబర్ ఆఖరు నాటికి 484 మిలియన్ డాలర్లకు తగ్గినట్లు పేర్కొంది. సమీక్షాకాలంలో కొత్తగా 9 జనరిక్ ఔషధాల తయారీకి అమెరికా ఔషధ రంగ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ)కు దరఖాస్తు చేసుకున్నట్లు సంస్థ వివరించింది. 17 ఉత్పత్తులకు అనుమతులు లభించినట్లు, 11 కొత్త ఉత్పత్తులను అమెరికా మార్కెట్లో ప్రవేశపెట్టినట్లు పేర్కొంది. -
రెగ్యులర్ ప్లానుల్లోనే అధిక డివిడెండ్లు ఎందుకు?
నేను కొద్దికాలంగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాను. రెగ్యులర్ ప్లాన్‌ల్లో, డెరైక్ట్ ప్లాన్‌ల్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాను. అయితే డెరైక్ట్ ప్లాన్‌ల్లో కంటే రెగ్యులర్ ప్లాన్‌ల్లోనే అధికంగా డివిడెండ్లు లభిస్తున్నాయి. దీనికి కారణమేమిటి? - సుధారాణి, సికింద్రాబాద్ మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి రెగ్యులర్ ప్లాన్లు ఎప్పటినుంచో ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉన్నాయి. కానీ డెరైక్ట్ ప్లాన్లు 2013 నుంచే అందుబాటులోకి వచ్చాయి. ఇక రెగ్యులర్ ప్లాన్లు దీర్ఘకాలం నుంచి ఉన్నందున వాటి కార్పస్‌లు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా దీర్ఘకాలం అమల్లో ఉన్నందున అధిక డివిడెండ్లు ఇస్తాయి. ఇక 2013 నుంచే డెరైక్ట్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వీటి లాభాలు తక్కువగా వుండొచ్చు. లేదా కొన్ని సందర్భాల్లో లాభాలు వుండకపోవొచ్చు కూడా. రెగ్యులర్ ప్లాన్లతో పోల్చితే తక్కువగా ఉంటాయి. గతంలో మ్యూచువల్ ఫండ్స్ తమ పూర్వపు రిజర్వ్‌ల నుంచి కూడా డివిడెండ్లను చెల్లించేవి. అలా కాకుండా మ్యూచువల్ ఫండ్స్ తమ తమ పోర్ట్‌ఫోలియోల్లో ఆర్జించిన వాస్తవిక లాభాల నుంచే డివిడెండ్లు చెల్లించాలని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ, 2010 మార్చిలో ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల వల్ల రెగ్యులర్ ప్లాన్ల డివిడెండ్లు కూడా అంతకు ముందు నుంచి పోలిస్తే, తగ్గాయి. నేను ఇటీవలే సొంత వ్యాపారం ప్రారంభించాను. ఖర్చులు పోను పొదుపు చేయడానికి రూ.30,000 వరకూ మిగులుతున్నాయి. ఈ మొత్తాన్ని 4-5 మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఏ తరహా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమంటారు? ఒక్కో సిప్‌కు ఒక్కో తేదీలో ఇన్వెస్ట్ చేయమంటారా? లేకుంటే అన్ని ఫండ్ల సిప్‌లకు ఒకే తేదీన ఇన్వెస్ట్ చేయమంటారా? - వేణు, విజయవాడ దీర్ఘకాల ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్(సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులు వస్తాయి. పైగా పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఇక సిప్ల నిర్వహణకు ఇదే సరైన పద్ధతి అంటూ ఏదీ లేదు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ల్లో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి నెలవారీ సిప్‌ల్లో ఏ తేదీల్లో ఇన్వెస్ట్ చేసినా మీకు వచ్చే రాబడుల్లో పెద్దగా తేడా ఏమీ ఉండదు. అందుకని ఒక్కో సిప్‌కు ఒక్కో తేదీన ఇన్వెస్ట్ చేయడం వల్ల ఒనగూరే ప్రయోజనాలేమీ ఉండవు. పైగా వేర్వేరు తేదీల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల వ్యయ ప్రయాసలు అధికంగా ఉంటాయి. అందుకని ఒకే తేదీన అన్ని సిప్‌ల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల వ్యయ ప్రయాసలు తగ్గుతాయి. ఇక సాధారణంగా నెల మొదట్లో వేతనాలు రావడం, వ్యాపారం ఎక్కువగా జరగడం జరుగుతుంది. కాబట్టి నెల మొదటి వారంలో సిప్‌ల్లో ఇన్వెస్ట్ చేయడం సముచితంగా ఉంటుంది. నేను ఇటీవలనే ఒక మ్యూచువల్ ఫండ్‌కు చెందిన ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్)లో సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాను. వీటికి లాక్ ఇన్ పీరియడ్ మూడేళ్లు కదా ! మూడేళ్లు దాటిన తర్వాత ఈ యూనిట్లన్నింటినీ ఉపసంహరించుకోవచ్చా? ఏడాది దాటి, మూడేళ్లలోపు ఈ యూనిట్లను ఉపసంహరించుకుంటే ఏమైనా పన్నులు చెల్లించాల్సి ఉంటుందా? - రాజు, విశాఖపట్టణం ఈఎల్ఎస్ఎస్లో సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తే, దీర్ఘకాలంలో మంచి రాబడులు పొందవచ్చు. అయితే ఈఎల్ఎస్ఎస్లో ప్రతి ఇన్‌స్టాల్‌మెంట్‌కు మూడేళ్ల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. అంటే ప్రతి సిప్ కాలపరిమితి మూడేళ్లు దాటిన తర్వాతనే వాటిని ఉపసంహరించుకోవడానికి వీలవుతుంది. మీ విషయంలో మీరు ఇన్వెస్ట్మెంట్స్ ప్రారంభించి మూడేళ్లయింది. కాబట్టి మీరు మొదటి సిప్ యూనిట్లను మాత్రమే రిడీమ్ చేసుకునే వీలుంటుంది. ఇలా ప్రతి సిప్‌కు మూడేళ్లు దాటిన తర్వాతనే మీరు వాటిని రిడీమ్ చేసుకోవచ్చు. ఈఎల్ఎస్ఎస్ వంటి పన్ను ఆదా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు మూడేళ్ల లాక్ఇన్ పీరియడ్ ఉంటుంది. కాబట్టి వీటిని మీరు మూడేళ్లలోపు, ఏడాది దాటిన తర్వాత రిడీమ్ చేసుకోలేరు. మూడేళ్లు దాటిన తర్వాతనే వీటిని ఉపసంహరించుకునే వీలు ఉంటుంది. ఎస్బీఐ ఫార్మా, ఎస్బీఐ స్మాల్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్ల్లో గత కొంత కాలంగా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఏమైనా పన్ను మినహాయింపులు ఉన్నాయా? ఏ మేరకు పన్ను మినహాయింపులు పొందవచ్ఛు? - అనంత్, బెంగళూరు అన్ని మ్యూచువల్ ఫండ్స్‌కు పన్ను మినహాయింపులు లభించవు. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్)లకు మాత్రమే ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ ప్రకారం పన్ను మినహాయింపులు లభిస్తాయి. వీటికి మూడేళ్ల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న రెండు ఫండ్స్-ఎస్బీఐ ఫార్మా, ఎస్బీఐ స్మాల్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్లు-ఈ కేటగిరి కిందకు రావు కాబట్టి, మీకు ఎలాంటి పన్ను మినహాయింపులు లభించవు. పన్ను మినహాయింపులు లభించాలంటే ఈఎల్ఎస్ఎస్లలో ఇన్వెస్ట్ చేయాలి. ఈఎల్ఎస్ఎస్లలో ఇన్వెస్ట్ చేస్తే పన్ను ప్రయోజనాలతో పాటు దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులను కూడా పొందవచ్చు. పిల్లల చదువు, సొంత ఇల్లు సమకూర్చుకోవడం, రిటైర్మెంట్ నిధి ఏర్పాటు తదితర దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఈఎల్ఎస్ఎస్ స్కీముల్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు.