సాక్షి,ముంబై: ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) క్యూ3 ఫలితాల్లో అదరగొట్టింది. ఎనలిస్టుల అంచనాలను అధిగమించి భారీ లాభాలను సాధించింది. ఈ ఏడాది క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో రెట్టింపు లాభాలను నమోదు చేసింది. మంగళవారం ప్రకటించిన ఐవోసీ ఫలితాల్లో నికర లాభం గత క్వార్టర్లోని రూ. 3994 కోట్ల తో పోలీస్తే ప్రస్తుతం రూ. 7883 కోట్లకు ఎగసింది. మొత్తం ఆదాయం 22.2 శాతం ఎగిసి రూ. 1.16 లక్షల కోట్ల నుంచి రూ.1.32 లక్షల కోట్లకు పెరిగింది. ఆపరేటింగ్ లాభం 8.1 శాతం పుంజుకుని రూ .7,373 కోట్లుగా నమోదైంది. ఇతర ఆదాయం రూ. 807 కోట్ల నుంచి రూ. 1353 కోట్లకు పుంజుకోగా... ఈ ఏడాది తొలి 9 నెలల కాలంలో స్థూల రిఫైనింగ్ మార్జిన్లు(జీఆర్‌ఎం) బ్యారల్‌కు 8.28 డాలర్లుగా నమోదైనట్లు ఐవోసీ తెలియజేసింది.
అంతేకాదు తన వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్ల జారీకి ఐవోసీ బోర్డు అనుమతించింది. అంటే ప్రతీ 1 షేరుకీ మరో షేరుని అదనంగా జోడించనుంది. అంతేకాదు షేరుకి రూ. 19 చొప్పున డివిడెండ్ చెల్లించేందుకు నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment