Bonus Issue
-
బోనస్ షేర్లు ప్రకటించిన ఎన్ఎండీసీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మైనింగ్ రంగ దిగ్గజం ఎన్ఎండీసీ 2:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు ప్రకటించింది. అంటే రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రెండు అదనపు షేర్లు జారీ చేస్తారు. అధీకృత మూలధన్నాన్ని రూ.400 కోట్ల నుంచి రూ.1,000 కోట్లకు పెంచాలని సోమవారం సమావేశమైన బోర్డు నిర్ణయించింది.సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో ఎన్ఎండీసీ నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 15 శాతం వృద్ధి చెంది రూ.1,030 కోట్ల నుంచి రూ. 1,189 కోట్లకు ఎగసింది. పన్నుకు ముందు లాభం రూ.1,404 కోట్ల నుంచి రూ.1,614 కోట్లుగా ఉంది. వ్యయాలు రూ.2,931 కోట్ల నుంచి రూ.3,665 కోట్లను తాకాయి. ఈపీఎస్ రూ.3.50 నుంచి రూ.4.13కు పెరిగింది. టర్నోవర్ 22% అధికమై రూ.5,280 కోట్లు నమోదైంది. ఫలితాల నేపథ్యంలో ఎన్ఎండీసీ షేరు ధర బీఎస్ఈలో సోమవారం 1.15% క్షీణించి రూ.233 వద్ద స్థిరపడింది. -
విప్రో నుంచి బోనస్ షేర్లు
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం విప్రో లిమిటెడ్ వాటాదారులకు తాజాగా బోనస్ షేర్లను జారీ చేయనుంది. ఈ నెల 16–17న నిర్వహించనున్న సమావేశంలో కంపెనీ బోర్డు బోనస్ షేర్ల ప్రతిపాదనను పరిశీలించనున్నట్లు స్టాక్ ఎక్స్చేంజీలకు తెలియజేసింది. ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసిక ఫలితాలను 17న విడుదల చేయనుంది. ఈ ఏడాది తొలి త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో కంపెనీ నికర లాభం 5 శాతం పుంజుకుని రూ. 3,003 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం మాత్రం 4 శాతం క్షీణించి రూ. 21,964 కోట్లకు పరిమితమైంది. వారాంతాన బీఎస్ఈలో విప్రో షేరు 0.8 శాతం బలపడి రూ. 529 వద్ద ముగిసింది.ఇదీ చదవండి: టీసీఎస్.. ఇన్ఫోసిస్‌కు ప్రత్యర్థి కాదా? -
రిలయన్స్ బోనస్ ఆఫర్.. ప్రతి షేర్‌కు మరో షేర్ ఫ్రీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) బోర్డు 1:1 బోనస్ ఇష్యూని ఆమోదించింది. 2017 సెప్టెంబర్ తర్వాత కంపెనీ మొదటి బోనస్ ఆఫర్ ఇదే. దీని ద్వారా షేర్ హోల్డర్లు ప్రతి షేర్‌కు ఒక షేరును ఉచితంగా పొందుతారు.భారతదేశపు అత్యంత విలువైన కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ రికార్డు తేదీకి సంబంధించిన వివరాలను తర్వాత తెలియజేయనున్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. కంపెనీ అధీకృత వాటా మూలధనాన్ని రూ.15,000 కోట్ల నుంచి రూ.50,000 కోట్లకు పెంచే ప్రతిపాదనకు ఆర్ఐఎల్ బోర్డు ఆమోదం తెలిపింది.షేర్హోల్డర్లకు బోనస్ షేర్లను బహుమతిగా ఇవ్వడానికి కంపెనీ ప్రణాళికలను ప్రకటించడం ఇది ఐదవసారి. 1983, 1997, 2009, 2017లో ఇలాగే బోనస్ షేర్లను రిలయన్స్ అందించింది. -
మార్కెట్లు పతనం- ఈ షేర్లు జూమ్
ముంబై, సాక్షి: కొద్ది రోజులుగా సరికొత్త రికార్డులతో ర్యాలీ చేస్తున్న దేశీ స్టాక్ మార్కెట్లలో ఉన్నట్టుండి అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో మార్కెట్లు పతన బాట పట్టాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 378 పాయింట్లు క్షీణించి 45,875కు చేరింది. నిఫ్టీ సైతం 102 పాయంట్లు కోల్పోయి 13,456 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ మౌలిక సదుపాయాల కంపెనీ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, ఐటీ సేవల మధ్యస్థాయి కంపెనీ మజెస్కో లిమిటెడ్ కౌంటర్లకు డిమాండ్ కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ మౌలిక రంగ హైదరాబాద్ కంపెనీ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాటాదారులకు బోనస్ షేర్ల జారీకి ప్రతిపాదించింది. నేడు సమావేశంకానున్న బోర్డు ఈ అంశంపై చర్చించనున్నట్లు కంపెనీ తాజాగా వెల్లడించింది. దీంతో కేఎన్ఆర్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 7.4 శాతం దూసుకెళ్లి రూ. 318ను తాకింది. ప్రస్తుతం 6.3 శాతం ఎగసి రూ. 315 వద్ద ట్రేడవుతోంది. గత నెల రోజుల్లో ఈ షేరు 23 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! మజెస్కో లిమిటెడ్ వాటాదారులకు షేరుకి రూ. 974 చొప్పున మధ్యంతర డివిడెండ్ చెల్లింపునకు బోర్డు అనుమతించినట్లు బీమా రంగ ఐటీ సేవల కంపెనీ మజెస్కో లిమిటెడ్ తాజాగా వెల్లడించింది. ఇందుకు ఈ నెల 25 రికార్డ్ డేట్‌గా నిర్ణయించింది. వెరసి రూ. 5 ముఖ విలువగల ఒక్కో షేరుపైనా 19,480 శాతం డివిడెండ్‌ను చెల్లించనుంది. ఇందుకు రూ. 2,788 కోట్లకుపైగా వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మజెస్కో షేరు తొలుత 4 శాతంపైగా జంప్‌చేసి రూ. 1,010కు చేరింది. ఇది 52 వారాల గరిష్టంకాగా ప్రస్తుతం 2 శాతం బలపడి రూ. 992 వద్ద ట్రేడవుతోంది. -
పండుగ బొనాంజా : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్‌ను అందించేందుకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. బోనస్‌ను అందించేందుకు తక్షణం రూ 3737 కోట్లను విడుదల చేసేందుకు నిర్ణయించింది. కేబినెట్ నిర్ణయంతో 30 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్ జారీతో పండుగ సీజన్లో డిమాండ్ పుంజుకుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. దసరా లోపు బోనస్ ఉద్యోగుల ఖాతాల్లో ఒకే వాయిదాలో జమవుతుందని ఈ నిర్ణయం ప్రకటిస్తూ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయంతో రైల్వేలు, పోస్ట్ ఆఫీసులు, ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐసీ వంటి ప్రభుత్వ రంగ సంస్ధల్లో పనిచేసే 17 లక్షల మంది నాన్ గెజిటెట్ ఉద్యోగులతో పాటు, మరో 13 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉత్పాదకతతో సంబంధంలేని బోనస్‌ను అందుకోనున్నారు. మరోవైపు దుర్గా పూజ లోగా సామర్ధ్యం ఆధారిత బోనస్‌ను విడుదల చేయనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని రెండు ప్రధాన రైల్వే ఉద్యోగ, కార్మిక సంఘాలు హెచ్చరించాయి. చదవండి : ఉద్యోగులకు 6 నెలల జీతం బోనస్ -
బోనస్, రైట్స్ ఇష్యూ- ప్రయోజనాలేంటి?
కొద్ది రోజులుగా దేశీ స్టాక్ మార్కెట్లలో రైట్స్ ఇష్యూల సందడి కనిపిస్తోంది. ఇదే విధంగా కొన్ని కంపెనీలు బోనస్ ఇష్యూలను సైతం ప్రకటిస్తుంటాయి. నిజానికి ఇవి రెండూ వాటాదారులకు లబ్ది చేకూర్చేవే. అయితే ఈ రెంటి మధ్య ప్రధాన తేడా ఏవిటంటే.. బోనస్ అంటే వాటాదారులకు ఫ్రీగా షేర్లులభిస్తాయి. రైట్స్ అంటే మార్కెట్ ధర కంటే తక్కువలో షేర్లను కొనుగోలు చేసేందుకు వీలు కలుగుతుంది. బోనస్, రైట్స్ ఇష్యూలపై మార్కెట్ విశ్లేషకులు ఇలా వివరిస్తున్నారు... రైట్స్- బోనస్ ఇలా శుక్రవారం సమావేశమైన బోర్డు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్ల జారీకి అనుమతించినట్లు అనుహ్ ఫార్మా తాజాగా ప్రకటించింది. అంటే వాటాదారులకు తమ వద్దగల ప్రతీ 1 షేరుకీ మరో షేరుని ఫ్రీగా జారీ చేయనుంది. ఇందుకు సెప్టెంబర్ 11 రికార్డ్ డేట్‌గా ప్రకటించింది. ఈ తేదీలోగా కంపెనీలో వాటా కలిగిన వాటాదారులకు ఫ్రీగా షేర్లు లభిస్తాయి. ఇక నెల రోజుల క్రితం ఎంఅండ్ఎం ఫైనాన్షియల్ 1:1 నిష్పత్తిలో రైట్స్ ఇష్యూ చేపట్టింది. ఇందుకు మార్కెట్ ధర కంటే 70 శాతం తక్కువగా రూ. 50 ధరను నిర్ణయించింది. జులై3 రికార్డ్ డేట్. అయితే వాటాదారులు తప్పనిసరిగా రైట్స్ ద్వారా షేర్లను కొనుగోలు చేయాలన్న నిబంధనేమీ లేదు. సర్దుబాటు ఇలా బోనస్ లేదా రైట్స్‌కు రికార్డ్ డేట్ దాటాక ఆయా కంపెనీల షేర్లు సర్దుబాటుకు లోనవుతుంటాయి. ఉదాహరణకు అనుహ్ ఫార్మా షేరు రికార్డ్ డేట్‌కు మందురోజు రూ. 300 వద్ద ముగిసిందనుకుందాం. తదుపరి రోజు నుంచీ రూ. 150 వద్ద ట్రేడింగ్ ప్రారంభమవుతుంది. ఎందుకంటే.. బోనస్ షేర్ల జారీతో కంపెనీ ఈక్విటీ రెట్టింపునకు చేరుతుంది కదా! ఇదే విధంగా రైట్స్ జారీ తదుపరి ఎంఅండ్ఎం ఫైనాన్స్ ఈక్విటీ సైతం డబుల్ అవుతుంది. దీంతో షేరు ధర సగానికి సర్దుబాటు అవుతుంది. రిజర్వ్ నిధులు సాధారణంగా పటిష్ట క్యాష్‌ఫ్లో కలిగి, నగదు నిల్వలు అధికంగా ఉన్న కంపెనీలు బోనస్ షేర్లను జారీ చేస్తుంటాయి. తద్వారా వాటాదారులకు కంపెనీపట్ల విశ్వాసం, బ్రాండ్ విలువ పెరుగుతుంది. ఇక మరోవైపు రైట్స్ చేపట్టడం ద్వారా కంపెనీలు చౌకగా నిధులను సమకూర్చుకోగలుతాయి. బ్యాంకు రుణాలైతే వడ్డీ చెల్లించవలసి ఉంటుంది. ఉదాహరణకు రైట్స్ ద్వారా ఎంఅండ్ఎం ఫైనాన్స్ రూ. 3,089 కోట్లు సమకూర్చుకుంది. ఈ నిధులను కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. తద్వారా కంపెనీ పనితీరు మరింత మెరుగయ్యే వీలుంది. ఇందువల్లనే రికార్డ్ డేట్ తదుపరి రోజునే ఎంఅండ్ఎం ఫైనాన్స్ షేరు 10 శాతం జంప్‌చేసింది. దీర్ఘకాలంలో ఉదాహరణకు 1:1 నిష్పత్తిలో బోనస్ లేదా రైట్స్ ఇష్యూలను చేపట్టినప్పుడు కంపెనీల ఈక్విటీ క్యాపిటల్ రెట్టింపునకు పెరుగుతుంది. దీంతో కంపెనీల షేరువారీ ఆర్జన(ఈపీఎస్) సగానికి తగ్గిపోతుంది. అంటే ఇష్యూకి ముందు రూ. 20 ఈపీఎస్ ఉంటే తదుపరి రూ. 10కు చేరుతుంది. ఇందువల్లనే షేరు ధర సైతం ఇదే విధంగా సర్దుబాటుకు లోనవుతుంది. అయితే ఇష్యూల తరువాత కంపెనీలు మెరుగైన పనితీరు చూపగలిగితే.. తిరిగి ఆయా షేర్ల ధరలు జోరందుకుంటాయి. దీర్ఘకాలంలో అంటే రిజర్వ్ నిధులను వినియోగించుకోవడం.. లేదా రైట్స్ ద్వారా సమకూర్చుకున్న నిధులను సమర్ధవంతంగా వెచ్చించడం ద్వారా కంపెనీలు స్థూల అమ్మకాలు, నికర లాభాలను పెంచుకోగలిగితేనే వాటాదారులకు లబ్డి చేకూరుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఒకవేళ ఆర్థిక పనితీరు నీరసిస్తే.. ఈక్విటీ పెరగడంతో షేర్ల విలువలు మరింత క్షీణించే రిస్కులు సైతం ఉంటాయని తెలియజేస్తున్నారు. -
రికార్డు స్థాయికి ఇన్ఫోసిస్ షేర్లు
న్యూఢిల్లీ : దేశీయ రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ షేర్లు సోమవారం దూసుకెళ్లాయి. 5 శాతానికి పైగా ర్యాలీ జరిపి ఆల్-టైమ్ గరిష్ట స్థాయిలను తాకాయి. ఇన్ఫీ తన తొలి త్రైమాసిక ఫలితాల్లో బోనస్‌లు జారీ చేయడంతో ఆ కంపెనీ షేర్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. 1:1 రేషియోలో ఈక్విటీ షేర్లపై బోనస్‌ను జారీ చేసింది. ఇన్ఫీ షేరు స్టాక్ మార్కెట్లో నమోదై 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వాటాదార్లకు రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై మరో బోనస్ షేరు(1:1 నిష్పత్తి)ను ఇచ్చేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. దీంతో ఈరోజు ఉదయం ఇన్ఫీ షేరు ధర 52 వారాల గరిష్ఠానికి చేరుకుంది. ఈ నేపథ్యంలోనే కంపెనీ మార్కెట్ విలువ తొలిసారిగా రూ.3 లక్షల కోట్లను చేరింది. బీఎస్ఈ ఇంట్రాడేలో ఇన్ఫీ షేరు ధర 5.75శాతం పెరిగి రూ.1384.4 వద్ద ఆల్-టైమ్ గరిష్టాన్ని చేరుకున్న సమయంలో మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈ మేర పెరిగింది. ఇక ఎన్ఎస్ఈలో ఆ కంపెనీ షేర్ ధర 5శాతం పెరిగి ఏడాది గరిష్ఠానికి చేరింది. ఆ అనంతరం చివరికి 1.41 శాతం లాభంలో రూ.1,336 వద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్‌లో ఇన్ఫోసిస్ అతిపెద్ద గెయినర్‌గా నిలిచింది. మొత్తం 1.29 కోట్లకు పైగా ఈక్విటీ షేర్లు, బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో ట్రేడయ్యాయి. సోమవారం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్కు రూ.17,114 కోట్లు జతయ్యాయి. శుక్రవారం ముగింపు రోజు ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,85,924 కోట్లగా ఉన్న సంగతి తెలిసిందే. 2019 టాప్ పర్ఫార్మెర్స్లో ఇన్ఫోసిస్‌లో ఒకటి. కాగ, గత వారం విడుదలైన ఇన్ఫీ క్వార్టర్ ఫలితాలు స్ట్రీట్ అంచనాలకు అనుగుణంగానే నమోదైన విషయం తెలిసిందే. ఏప్రిల్-జూన్‌లో ఇన్ఫీ ఏకీకృత నికర లాభం 3.7శాతం వృద్ధి చెంది రూ.3,612కోట్లకు చేరింది. ఇక మొత్తం కార్యకలాపాల ఆదాయం 12% పెరిగి రూ.17,078కోట్ల నుంచి రూ.19,128కోట్లకు చేరింది. -
అదరగొట్టిన ఐఓసీ: బోనస్, డివిడెండ్
సాక్షి,ముంబై: ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) క్యూ3 ఫలితాల్లో అదరగొట్టింది. ఎనలిస్టుల అంచనాలను అధిగమించి భారీ లాభాలను సాధించింది. ఈ ఏడాది క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో రెట్టింపు లాభాలను నమోదు చేసింది. మంగళవారం ప్రకటించిన ఐవోసీ ఫలితాల్లో నికర లాభం గత క్వార్టర్లోని రూ. 3994 కోట్ల తో పోలీస్తే ప్రస్తుతం రూ. 7883 కోట్లకు ఎగసింది. మొత్తం ఆదాయం 22.2 శాతం ఎగిసి రూ. 1.16 లక్షల కోట్ల నుంచి రూ.1.32 లక్షల కోట్లకు పెరిగింది. ఆపరేటింగ్ లాభం 8.1 శాతం పుంజుకుని రూ .7,373 కోట్లుగా నమోదైంది. ఇతర ఆదాయం రూ. 807 కోట్ల నుంచి రూ. 1353 కోట్లకు పుంజుకోగా... ఈ ఏడాది తొలి 9 నెలల కాలంలో స్థూల రిఫైనింగ్ మార్జిన్లు(జీఆర్ఎం) బ్యారల్‌కు 8.28 డాలర్లుగా నమోదైనట్లు ఐవోసీ తెలియజేసింది. అంతేకాదు తన వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్ల జారీకి ఐవోసీ బోర్డు అనుమతించింది. అంటే ప్రతీ 1 షేరుకీ మరో షేరుని అదనంగా జోడించనుంది. అంతేకాదు షేరుకి రూ. 19 చొప్పున డివిడెండ్ చెల్లించేందుకు నిర్ణయించింది. -
లాభాల్లో అదరగొట్టిన విప్రో, కానీ..
న్యూఢిల్లీ : టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ నిరాశజనకమైన ఫలితాలతో బోణి కొట్టినప్పటికీ, మరో టెక్ దిగ్గజం విప్రో లాభాల్లో అదరగొట్టింది. స్టాండలోన్ నికల లాభాలను 20 శాతం పెంచుకుంది. 2016-17 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన క్వార్టర్ లో కంపెనీ స్టాండలోన్ నికర లాభాలు 2,303.5 కోట్లగా నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్ లో కంపెనీ నికర లాభాలు కేవలం రూ.1,918.50కోట్లగానే ఉన్నాయి. అయితే కంపెనీ గైడెన్స్ అంచనాలు విశ్లేషకులను అందుకోలేక నిరాశపరిచాయి. 2018 ఆర్థిక సంవత్సరం క్యూ1లో కేవలం 1,915 మిలియన్ డాలర్ల నుంచి 1,955 మిలియన్ డాలర్ల వరకు మాత్రమే ఆర్జించనున్నట్టు కంపెనీ అంచనావేస్తోంది. అయితే ఇది విశ్లేషకులు అంచనాల కంటే తక్కువే. ఫలితాల సందర్భంగా 1:1 నిష్ఫత్తిలో బోనస్ షేర్లకు బోర్డు సభ్యులు ఆమోదం తెలిపినట్టు కంపెనీ వెల్లడించింది. మరోసారి అజిమ్ ప్రేమ్ జీనే కంపెనీ చైర్మన్ గా బోర్డు నియమించినట్టు తెలిపింది.. అదేవిధంగా క్వార్టర్ క్వార్టర్ బేసిస్ తో కంపెనీ కన్సాలిడేటెట్ నికర లాభాలు 7.19 శాతం పెరిగి రూ.2,267 కోట్ల ఉన్నట్టు కంపెనీ వెల్లడించింది. 2016 డిసెంబర్ 31 క్వార్టర్ లో ఈ లాభాలు రూ.2,114.80 కోట్లగా ఉన్నాయి. జనవరి-మార్చి కాలంలో కంపెనీ కన్సాలిడేటెడ్ మొత్తం ఆదాయం 4.87 శాతం పెరిగి రూ.15,033.80 కోట్లకు పెరిగాయి. ఒక్కో షేరులో ఆర్జించే కన్సాలిడేటెడ్ ఆదాయాలు 9.33 శాతం జంప్ చేసినట్టు కంపెనీ పేర్కొంది. మార్కెట్ అవర్స్ తర్వాత ఫలితాలను కంపెనీ ప్రకటించనుందనే నేపథ్యంలో విప్రో షేరు ధర 0.93 శాతం పెరిగి, 496.35 రూపాయల వద్ద ముగిసింది. -
బయోకాన్‌కు బోనస్ బూస్ట్
ముంబై: దేశీ ఫార్మా దిగ్గజం బయోకాన్ తాజాగా వాటాదారులకు డివిడెండ్ చెల్లించే యోచనలో ఉంది. దీంతో ఇవాల్టిమార్కెట్లో బయోకాన్ కౌంటర్‌కు డిమాండ్ ఏర్పడింది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో బయోకాన్ షేరు భారీగా లాభపడింది. 52 వారాల గరిష్టాన్ని నమోదు చేసింది. 8.45శాతానికిపైగా దూసుకెళ్లి రూ. 1,155వద్ద పాజిటివ్‌గా ఉంది. బయోకాన్ తన వాటాదారులకు బోనస్ జారీ చెల్లించనున్నామని మంగళవారం ప్రకటించింది. ఈ అంశాన్ని పరిశీలించేందుకు కంపెనీ బోర్డు ఈ నెల స 27న సమావేశంకానున్నట్లు కంపెనీ పేర్కొంది. దీంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్లో కొనుగోళ్లవైపు మొగ్గు చూపారు. ఇతర ఫార్మా షేర్లు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి లుపిన్, సన్‌ఫార్మా,డా.రెడ్డీస్, క్యాడిల్లా హెల్త్‌కేర్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. అటు స్టాక్‌మార్కెట్లు కూడా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.