లాభాల్లో అదరగొట్టిన విప్రో, కానీ..
లాభాల్లో అదరగొట్టిన విప్రో, కానీ..
Published Tue, Apr 25 2017 5:14 PM | Last Updated on Tue, Sep 5 2017 9:40 AM
న్యూఢిల్లీ : టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ నిరాశజనకమైన ఫలితాలతో బోణి కొట్టినప్పటికీ, మరో టెక్ దిగ్గజం విప్రో లాభాల్లో అదరగొట్టింది. స్టాండలోన్ నికల లాభాలను 20 శాతం పెంచుకుంది. 2016-17 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన క్వార్టర్ లో కంపెనీ స్టాండలోన్ నికర లాభాలు 2,303.5 కోట్లగా నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్ లో కంపెనీ నికర లాభాలు కేవలం రూ.1,918.50కోట్లగానే ఉన్నాయి. అయితే కంపెనీ గైడెన్స్ అంచనాలు విశ్లేషకులను అందుకోలేక నిరాశపరిచాయి. 2018 ఆర్థిక సంవత్సరం క్యూ1లో కేవలం 1,915 మిలియన్ డాలర్ల నుంచి 1,955 మిలియన్ డాలర్ల వరకు మాత్రమే ఆర్జించనున్నట్టు కంపెనీ అంచనావేస్తోంది. అయితే ఇది విశ్లేషకులు అంచనాల కంటే తక్కువే.
ఫలితాల సందర్భంగా 1:1 నిష్ఫత్తిలో బోనస్ షేర్లకు బోర్డు సభ్యులు ఆమోదం తెలిపినట్టు కంపెనీ వెల్లడించింది. మరోసారి అజిమ్ ప్రేమ్ జీనే కంపెనీ చైర్మన్ గా బోర్డు నియమించినట్టు తెలిపింది.. అదేవిధంగా క్వార్టర్ క్వార్టర్ బేసిస్ తో కంపెనీ కన్సాలిడేటెట్ నికర లాభాలు 7.19 శాతం పెరిగి రూ.2,267 కోట్ల ఉన్నట్టు కంపెనీ వెల్లడించింది. 2016 డిసెంబర్ 31 క్వార్టర్ లో ఈ లాభాలు రూ.2,114.80 కోట్లగా ఉన్నాయి. జనవరి-మార్చి కాలంలో కంపెనీ కన్సాలిడేటెడ్ మొత్తం ఆదాయం 4.87 శాతం పెరిగి రూ.15,033.80 కోట్లకు పెరిగాయి. ఒక్కో షేరులో ఆర్జించే కన్సాలిడేటెడ్ ఆదాయాలు 9.33 శాతం జంప్ చేసినట్టు కంపెనీ పేర్కొంది. మార్కెట్ అవర్స్ తర్వాత ఫలితాలను కంపెనీ ప్రకటించనుందనే నేపథ్యంలో విప్రో షేరు ధర 0.93 శాతం పెరిగి, 496.35 రూపాయల వద్ద ముగిసింది.
Advertisement