Q4
-
తగ్గిపోయిన బంధన్ బ్యాంక్ లాభం
కోల్‌కతా: నాలుగో త్రైమాసికంలో బంధన్ బ్యాంక్ నికర లాభం రూ. 55 కోట్లకు పరిమితమైంది. క్రితం క్యూ4లో ఇది రూ. 808 కోట్లు. తాజాగా రైటాఫ్‌లు, మొండిబాకీలకు అధిక కేటాయింపులు జరపాల్సి రావడం వంటి అంశాలు లాభాలు తగ్గడానికి కారణం.జనవరి–మార్చి త్రైమాసికంలో ప్రొవిజనింగ్ రూ. 735 కోట్ల నుంచి రూ. 1,774 కోట్లకు పెరిగిందని బ్యాంక్ ఎండీ చంద్రశేఖర్ ఘోష్ తెలిపారు. అలాగే రూ. 3,852 కోట్లు రైటాఫ్ చేయాల్సి వచ్చిందని వివరించారు. క్యూ4లో నికర వడ్డీ మార్జిన్ 7.6 శాతంగా ఉంది.స్థూల నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏ) 4.9 శాతం నుంచి 3.8 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు 1.1 శాతంగా ఉన్నాయి. జూలైలో ఎండీ, సీఈవో పదవి నుంచి రిటైర్ కానున్న ఘోష్.. రిటైర్మెంట్ తర్వాత హోల్డింగ్ కంపెనీ బంధన్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌లో వ్యూహాత్మక బాధ్యతలు పోషించనున్నట్లు తెలిపారు. -
Q4: కార్పొరేట్ ఫలితాల సీజన్
న్యూఢిల్లీ: ఐటీ సేవల నంబర్‌వన్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) చివరి త్రైమాసిక(జనవరి–మార్చి) ఫలితాల సీజన్‌కు శ్రీకారం చుడుతోంది. నేడు (శుక్రవారం) క్యూ4తోపాటు.. మార్చితో ముగిసిన గత పూర్తిఏడాది(2023–24)కి సైతం పనితీరు వెల్లడించనుంది. అయితే క్యూ4సహా.. గతేడాదికి ఐటీ కంపెనీలు నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించే అవకాశమున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వెరసి సాఫ్ట్వేర్ రంగ కంపెనీల క్యూ4, పూర్తి ఏడాది పనితీరు వెల్లడికానుండగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2024–25) ఆదాయ అంచనాలు(గైడెన్స్) సైతం ప్రకటించనున్నాయి. అయితే పలు కంపెనీలు నిరుత్సాహకర ఫలితాలనే ప్రకటించనున్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇందుకు బలహీన ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ఐటీ వ్యయాలు తగ్గడం తదితర అంశాలు ప్రభావం చూపనున్నట్లు పేర్కొంటున్నాయి. ఆర్థిక అనిశి్చతుల కారణంగా టెక్నాలజీ సేవలకు డిమాండ్ మందగించడం, ఐటీపై క్లయింట్ల వ్యయాలు తగ్గడం ఈ ఏడాది అంచనాలను సైతం దెబ్బతీసే వీలున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వెరసి ఐటీ కంపెనీలు అప్రమత్తతతో కూడిన గైడెన్స్‌ను ప్రకటించనున్నట్లు తెలియజేశాయి. బ్రోకింగ్ వర్గాల అంచనాలు నేడు(12న) ఐటీ సేవల నంబర్‌వన్ కంపెనీ టీసీసీఎస్ క్యూ4సహా.. 2023–24 ఫలితాలను విడుదల చేయనుంది. ఈ బాటలో సాఫ్ట్వేర్ దిగ్గజాలు ఇన్ఫోసిస్ 18న, విప్రో 19న, టెక్ మహీంద్రా 25న, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 26న క్యూ4, గతేడాదికి పనితీరును వెల్లడించనున్నాయి. దేశీ ఐటీ కంపెనీలు క్యూ4లో అంతంతమాత్ర ఫలితాలను సాధించనున్నట్లు బ్రోకింగ్ సంస్థ ఎమ్కే ఇటీవల అంచనా వేసింది. ఈ ఏడాది ద్వితీయార్ధం(అక్టోబర్–మార్చి)లో మాత్రమే రికవరీ ఆశలనుపెట్టుకోవచ్చునంటూ పేర్కొంది. అయితే క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో సాధించిన నిరాశామయ పనితీరుతో పోలిస్తే క్యూ4లో త్రైమాసికవారీగా కాస్తమెరుగైన ఫలితాలు సాధించవచ్చని బ్రోకింగ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ అభిప్రాయపడింది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల రీత్యా ఐటీ సరీ్వసులకు డిమాండ్ మందగించినట్లు పేర్కొంది. వెరసి కరోనా మహమ్మారి తలెత్తిన 2019–20ను మినహాయిస్తే వార్షికంగా 2008–09 తదుపరి బలహీన ఫలితాలు విడుదలయ్యే వీలున్నట్లు తెలియజేసింది. వ్యయాలు తగ్గడం ప్రభావం చూపనున్నట్లు పేర్కొంది. ఐచి్చక వ్యయాలు తగ్గడంతో ఐటీ పరిశ్రమలో ప్రస్తావించదగ్గ మార్పులకు అవకాశంతక్కువేనని అభిప్రాయపడింది. కాగా.. యూఎస్ ఫెడ్ సానుకూల ధృక్పథం, పూర్తి చేయవలసిన భారీ ఆర్డర్లు వంటి అంశాలు ఈ ఏడాది(2024–25)లో ప్రోత్సాహక ఫలితాలకు దారిచూపవచ్చని అంచనా వేసింది. క్యూ4లో డీల్స్ ద్వారా సాధించే మొత్తం కాంట్రాక్టుల విలువ(టీసీవీ) సానుకూలంగానే కనిపిస్తున్నప్పటికీ ఆదాయంపై స్థూల ఆర్థిక పరిస్థితుల కారణంగా ఒత్తిడి కనిపించవచ్చని వివరించింది. ఐటీ సేవలకు ప్రధానమైన బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సరీ్వసులు, ఇన్సూరెన్స్(బీఎఫ్ఎస్ఐ)తోపాటు, రిటైల్, హైటెక్, కమ్యూనికేషన్స్ విభాగాలతోపాటు.. ప్రాంతాలవారీగా కూడా బలహీనతలు కనిపిస్తున్నట్లు ఐటీ విశ్లేషకులు పేర్కొన్నారు. గ్లోబల్ దిగ్గజాలు సైతం గ్లోబల్ దిగ్గజాలు యాక్సెంచర్, కాగి్నజెంట్ టెక్నాలజీ, క్యాప్‌జెమిని సైతం ఈ క్యాలండర్ ఏడాది(2024) ఓమాదిరి పనితీరును ఊహిస్తున్నాయి. ఫలితంగా తొలి అర్ధభాగం(జనవరి–జూన్)లో అంతంతమాత్ర వృద్ధిని అంచనా వేశాయి. అయితే ద్వితీయార్ధం(జూలై–డిసెంబర్)లో రికవరీకి వీలున్నట్లు అభిప్రాయపడ్డాయి. కాగా.. దేశీ ఐటీ దిగ్గజాలలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ రక్షణాత్మక బిజినెస్ మిక్స్ ద్వారా లబ్ది పొందే వీలున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ పేర్కొంది. ఇక డిజిటల్, బిజినెస్ ట్రాన్స్ఫార్మేషన్ విభాగాల కారణంగా టీసీఎస్, ఇన్ఫోసిస్ కీలక పురోగతిని సాధించవచ్చని అభిప్రాయపడింది. -
గత ఏడాదితో పోలిస్తే.. జొమాటోకు భారీగా తగ్గిన నష్టాలు!
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర నష్టం దాదాపు సగానికి తగ్గి రూ. 188 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 360 కోట్ల నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం సైతం రూ. 1,212 కోట్ల నుంచి రూ. 2,056 కోట్లకు జంప్‌చేసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 1,702 కోట్ల నుంచి భారీగా పెరిగి రూ. 2,431 కోట్లను తాకాయి. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి కన్సాలిడేటెడ్ నికర నష్టం రూ. 1,226 కోట్ల నుంచి తగ్గి రూ. 971 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం రూ. 7,079 కోట్లకు జంప్‌చేసింది. 2021–22లో రూ. 4,192 కోట్ల ఆదాయం నమోదైంది. ఫుడ్ డెలివరీ బిజినెస్ సీఈవోగా రాకేష్ రంజన్, సీవోవోగా రిన్షుల్ చంద్రను ఎంపిక చేసినట్లు జొమాటో పేర్కొంది. జొమాటో హైపర్‌ప్యూర్ సీఈవోగా రిషి అరోరాను నియమించినట్లు తెలియజేసింది. -
మహీంద్రా హాలిడేస్ లాభం హైజంప్
న్యూఢిల్లీ: ఆతిథ్య రంగ దిగ్గజం మహీంద్రా హాలిడేస్ అండ్ రిసార్ట్స్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం మూడున్నర రెట్లు జంప్‌చేసి రూ. 56 కోట్లను అధిగమించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో దాదాపు రూ. 16 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 543 కోట్ల నుంచి రూ. 712 కోట్లకు ఎగసింది. మొత్తం వ్యయాలు రూ. 551 కోట్ల నుంచి రూ. 658 కోట్లకు పెరిగాయి. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 67 శాతం దూసుకెళ్లి రూ. 114 కోట్లకు చేరింది. 2021–22లో రూ. 68 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. మొత్తం ఆదాయం రూ. 2,013 కోట్ల నుంచి రూ. 2,517 కోట్లకు ఎగసింది. మొత్తం ఆదాయం, నిర్వహణ లాభం తదితరాలలో కంపెనీ అత్యుత్తమ పనితీరు చూపినట్లు ఎండీ, సీఈవో కవీందర్ సింగ్ పేర్కొన్నారు. భౌగోళిక, రాజకీయ వివాదాల కారణంగా తలెత్తిన స్థూలఆర్థిక సవాళ్లలోనూ యూరోపియన్ కార్యకలాపాలలో టర్న్‌అరౌండ్‌ను సాధించినట్లు వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో మహీంద్రా హాలిడేస్ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 311 వద్ద ముగిసింది. చైర్మన్ పదవీ విరమణ మహీంద్రా గ్రూప్ నాయకత్వ శ్రేణిలో కీలక సభ్యుడు మహీంద్రా హాలిడేస్ అండ్ రిసార్ట్స్ చైర్మన్ అరుణ్ నందా పదవీ విరమణ చేయనున్నారు. 50 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకుంటున్న నందా 2023 జులై 25న నిర్వహించనున్న వాటాదారుల సాధారణ వార్షిక సమావేశంలో బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. నాన్‌ఎగ్జిక్యూటివ్ పదవుల విషయంలో వయసును పరిగణించి తిరిగి ఎంపిక చేయవద్దంటూ బోర్డుకు సూచించినట్లు నందా తెలియజేశారు. మహీంద్రా గ్రూప్‌లో నందా 1973లో అకౌంటెంట్‌గా కోల్‌కతాలో చేరారు. 1976లో సీఎఫ్‌వో, కంపెనీ సెక్రటరీ(మహీంద్రా సింటర్డ్ ప్రొడక్ట్స్‌గా పుణేలో బాధ్యతలు స్వీకరించారు. -
హెచ్‌సీఎల్ టెక్ లాభం ప్లస్
న్యూఢిల్లీ: ఐటీ సేవల దేశీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 11 శాతం బలపడి రూ. 3,983 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2021–22) క్యూ4లో రూ. 3,599 కోట్లు ఆర్జించింది. అయితే త్రైమాసికవారీగా అంటే గతేడాది క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో సాధించిన రూ. 4,096 కోట్లతో పోలిస్తే నికర లాభం 3 శాతం తగ్గింది. కాగా.. ఈ క్యూ4లో మొత్తం ఆదాయం 18 శాతం ఎగసి రూ. 26,606 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది క్యూ4లో రూ. 22,597 కోట్ల ఆదాయం నమోదైంది. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 10 శాతం మెరుగై రూ. 14,845 కోట్లను తాకింది. 2021–22లో రూ. 13,499 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. లక్ష కోట్లను దాటి రూ. 1,01,456 కోట్లకు చేరింది! అంతక్రితం ఏడాది రూ. 85,651 కోట్ల ఆదాయం అందుకుంది. భారీ డీల్స్ అప్ క్యూ4లో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 13 భారీ డీల్స్ గెలుచుకుంది. వీటి విలువ 207.4 కోట్ల డాలర్లుకాగా.. వార్షికంగా 18 శాతం క్షీణించింది. ఈ కాలంలో కంపెనీ 3,674 మంది ఉద్యోగులను కొత్తగా నియమించుకుంది. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 2,25,944కు చేరింది. ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు 19.5 శాతంగా నమోదైంది. డీల్ పైప్‌లైన్ దాదాపు కంపెనీ చరిత్రలోనే గరిష్టస్థాయికి చేరినట్లు కంపెనీ సీఈవో విజయ్‌కుమార్ పేర్కొన్నారు. గైడెన్స్ గుడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24)లో ఆదాయం 6–8 శాతం వృద్ధి చెందగలదని హెచ్‌సీఎల్ టెక్ తాజాగా అంచనా(గైడెన్స్) వేసింది. వాటాదారులకు షేరుకి రూ. 18 చొప్పున డివిడెండును ప్రకటించింది. వరుసగా 81వ త్రైమాసికంలోనూ డివిడెండును చెల్లిస్తున్నట్లు తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో హెచ్‌సీఎల్ టెక్ షేరు నామమాత్ర నష్టంతో రూ. 1,037 వద్ద ముగిసింది. -
టీసీఎస్.. భేష్.. క్యూ4 నికర లాభం రూ. 11,392 కోట్లు
ముంబై: సాఫ్ట్వేర్ సేవల నంబర్‌వన్ దేశీ దిగ్గజం టీసీఎస్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 15 శాతం ఎగసి రూ. 11,392 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 9,959 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 17 శాతం బలపడి రూ. 59,162 కోట్లకు చేరింది. అంతక్రితం రూ. 50,591 కోట్ల ఆదాయం నమోదైంది. రూ. 41,440 కోట్ల ఫ్రీ క్యాష్‌ఫ్లోను ఆర్జించినట్లు కంపెనీ వెల్లడించింది. పూర్తి ఏడాదికి మార్చితో ముగిసిన గతేడాదికి టీసీఎస్ 10 శాతం అధికంగా రూ. 42,147 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం 18 శాతం వృద్ధితో రూ. 2,25,458 కోట్లను తాకింది. కాగా.. కొత్త సీఈవో, ఎండీగా ఎంపికైన కె.కృతివాసన్ ప్రస్తుత సీఈవో రాజేష్ గోపీనాథన్ నుంచి జూన్1న బాధ్యతలు స్వీకరించనున్నట్లు టీసీఎస్ పేర్కొంది. ఆర్డర్ బుక్ జోరు గతేడాది ఆర్డర్‌బుక్ 34.1 బిలియన్ డాలర్లకు చేరినట్లు టీసీఎస్ వెల్లడించింది. క్యూ4లో 10 బిలియన్ డాలర్లు జమైనట్లు తెలియజేసింది. చరిత్రాత్మక స్థాయిలో భారీ డీల్స్ సాధించినట్లు పేర్కొంది. 10 కోట్లకుపైగా డాలర్ల క్లయింట్ల సంఖ్య 60కు చేరింది. బ్యాంకింగ్ రంగం సవాళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ ఉత్తర అమెరికా నుంచి 15 శాతంపైగా వృద్ధి సాధించినట్లు పేర్కొంది. ఇతర హైలైట్స్ ► షేరుకి రూ. 24 తుది డివిడెండ్ ప్రకటించింది. ► నిర్వహణ లాభ మార్జిన్లు 24.1 శాతం నుంచి 24.5 శాతానికి బలపడ్డాయి. ► నికర మార్జిన్లు సైతం 18.7 శాతం నుంచి 19.3 శాతానికి మెరుగుపడ్డాయి. ► క్యూ4లో నికరంగా 821మందిని, పూర్తిఏడాదిలో 22,600 మందిని జమ చేసుకుంది. ► మొత్తం సిబ్బంది సంఖ్య 6,14,795ను తాకింది. దీనిలో మహిళల వాటా 35.7 శాతం. ► ఉద్యోగ వలసల రేటు 20.1%గా నమోదైంది. ► ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) 40,000 మంది ఫ్రెషర్స్‌కు ఉపాధి కల్పించనుంది. ఫలితాల నేపథ్యంలో టీసీఎస్ షేరు ఎన్ఎస్ఈలో 1 శాతం బలపడి రూ. 3,246 వద్ద ముగిసింది. మరోసారి పటిష్ట ఫలితాలు ప్రకటించినందుకు సంతృప్తిగా ఉన్నాం. మా సర్వీసులకున్న డిమాండును ఆర్డర్‌బుక్ ప్రతిఫలిస్తోంది. రిటైల్, కన్జూమర్, లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ విభాగాలు 13–12 శాతం వృద్ధిని సాధించాయి. బీఎఫ్ఎస్ఐ 9 శాతంపైగా పుంజుకుంది. – రాజేష్ గోపీనాథన్, సీఈవో, టీసీఎస్ -
క్యూ4లో బ్యాంకుల జోరు.. టార్గెట్ లక్షకోట్లు
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో బ్యాంకింగ్ రంగం ప్రోత్సాహకర ఫలితాలు సాధించే వీలున్నట్లు ఫైనాన్షియల్ రంగ నిపుణులు భావిస్తున్నారు. జనవరి–మార్చి(క్యూ4) లాభాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్బీ)లు ప్రధాన పాత్రను పోషించనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ బ్యాంకుల మొత్తం లాభాలు రూ. లక్ష కోట్లను తాకవచ్చని అంచనా వేశారు. మొండి రుణాలు తగ్గడం, రుణ వృద్ధి పుంజుకోవడం ప్రభావం చూపనున్నట్లు తెలియజేశారు. రూ. 40,000 కోట్లకు మార్చితో ముగిసిన గతేడాదికి పీఎస్‌యూ దిగ్గజం ఎస్బీఐ రూ. 40,000 కోట్ల నికర లాభం ఆర్జించే వీలుంది. డిసెంబర్‌తో ముగిసిన 9 నెలల కాలంలోనే రూ. 33,538 కోట్లు సాధించింది. ఇది అంతక్రితం ఏడాది(2021–22)లో అందుకున్న రూ. 31,676 కోట్లకంటే రూ. 1,862 కోట్లు అధికంకావడం గమనార్హం! ఈ బాటలో ఇతర ప్రభుత్వ బ్యాంకులు సైతం పటిష్ట పనితీరు ప్రదర్శించనున్నాయి. ఇందుకు మొండి బకాయిలు(ఎన్పీఏలు), స్లిప్పేజీలు తగ్గడానికితోడు రెండంకెల రుణ వృద్ధి, పెరుగుతున్న వడ్డీ రేట్లు సహకరించనున్నాయి. గతేడాది తొలి 9 నెలల్లో(ఏప్రిల్–డిసెంబర్) 12 పీఎస్‌బీలు మొత్తంగా రూ. 70,166 కోట్ల నికర లాభాలను ప్రకటించాయి. 2021–22లో సాధించిన రూ. 48,983 కోట్లతో పోలిస్తే ఇది 43 శాతం అధికం. ఈ ట్రెండ్ క్యూ4లోనూ కొనసాగనున్నట్లు పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ ఎండీ స్వరూప్ కుమార్ సాహా పేర్కొన్నారు. దీంతో పీఎస్‌బీలు ఉమ్మడిగా రూ. 30,000 కోట్లు ప్రకటించే వీలున్నట్లు అంచనా వేశారు. వెరసి పూర్తి ఏడాదికి రూ. లక్ష కోట్ల నికర లాభాలను అందుకోనున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి. త్రైమాసికవారీగా ఇలా పీఎస్‌బీలు గతేడాది క్యూ1లో ఉమ్మడిగా రూ. 15,306 కోట్లు, క్యూ2లో రూ. 25,685 కోట్లు, క్యూ3లో రూ. 29,175 కోట్లు చొప్పున నికర లాభాలు ఆర్జించాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) మినహా మిగిలిన అన్ని పీఎస్‌బీల నికర లాభాలూ క్యూ3లో మెరుగయ్యాయి. ఎస్బీఐ అత్యధికంగా 68 శాతం వృద్ధితో రూ. 14,205 కోట్లు ఆర్జించగా.. క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో పీఎన్బీ లాభం మాత్రం 44 శాతం క్షీణించి రూ. 628 కోట్లకు పరిమితమైంది. అయితే డిపాజిట్ల రేట్లు పెరగడం, కాసా(సీఏఎస్ఏ) తగ్గుతున్న కారణంగా నికర వడ్డీ మార్జిన్లపై ఒత్తిడి పడనున్నట్లు సాహా అభిప్రాయపడ్డారు. వడ్డీ రేట్ల పెరుగుదలలోనూ క్యూ4లో రుణ వృద్ధి పుంజుకుకోవడం గమనార్హం. ఐసీఐసీఐ దూకుడు బ్రోకరేజీ.. ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ నివేదిక ప్రకారం త్రైమాసికవారీగా ప్రొవిజనింగ్ తగ్గనున్నట్లు అంచనా. ప్రొవిజనింగ్ కవరేజీ రేషియో(పీసీఆర్) భారీ బిల్డప్ నేపథ్యంలో ఎన్పీఏలు వెనకడుగు వేయనున్నాయి. అయితే ఆర్బీఐ నిబంధనల కారణంగా భారీ కార్పొరేట్ రుణాలుగల బ్యాంకులు అదనపు ప్రొవిజన్లు చేపట్టవలసి ఉంటుంది. కాగా.. ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ ఆకర్షణీయ లాభాలు సాధించనుండగా.. యాక్సిస్ బ్యాంక్ నష్టాలు ప్రకటించే వీలున్నట్లు ఎమ్కే గ్లోబల్ నివేదిక పేర్కొంది. సిటీబ్యాంక్ పోర్ట్‌ఫోలియో కొనుగోళ్లతో గుడ్‌విల్ రైటా ఫ్స్ చేపట్టవలసిరావడం ప్రభావం చూపనుంది. ఇక పటిష్ట వృద్ధి, తక్కువ ప్రొవిజన్లతో ఇండస్ఇండ్ బ్యాంక్ ఉత్తమ ఫలితాలు ప్రకటించవచ్చు. ఫెడరల్ బ్యాంక్ ఆశావహ ఫలితాలు వెల్లడించే వీలుంది. ప్రయివేట్ రంగ బ్యాంకులు క్యూ3లో 33% అధికంగా రూ. 36,512 కోట్ల నికర లాభాలు ప్రకటించిన విషయం విదితమే. బంధన్ బ్యాంక్, యస్ బ్యాంక్ మినహా అన్ని ప్రయివేట్ బ్యాంకులూ సానుకూల పనితీరు చూపాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అత్యధికంగా రూ. 12,259 కోట్లు ఆర్జించింది. -
మహీంద్రా అండ్ మహీంద్రా, సంస్థ చరిత్రలోనే తొలిసారే ఇలా!
ముంబై: మహీంద్రా అండ్ మహీంద్రా మార్చి త్రైమాసికంలో మెరుగైన పనితీరు చూపించింది. స్టాండలోన్ నికర లాభం భారీగా పెరిగి రూ.1,192 కోట్లకు చేరుకుంది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి లాభం రూ.245 కోట్లుగానే ఉండడం గమనార్హం. ఆదాయం 28 శాతం పెరిగి రూ.17,124 కోట్లకు చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.13,356 కోట్లుగా ఉంది. 2021–22 పూర్తి ఆర్థిక సంవత్సరానికి స్టాండలోన్ లాభం రూ.4,935 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.984 కోట్లుగానే ఉంది. ఇక ఆదాయం రూ.55,300 కోట్లుగా నమోదైంది. సంస్థ చరిత్రలో ఒక ఆర్థిక సంవత్సరంలో అత్యధిక స్టాండలోన్ లాభం ఇదేనని ఎంఅండ్ఎం ప్రకటించింది. అలాగే, కంపెనీ చరిత్రలోనే అత్యధిక సంఖ్యలో (ఒక త్రైమాసికానికి) యుటిలిటీ వాహనాలను మార్చి త్రైమాసికంలో విక్రయించినట్టు తెలిపింది. సాగు పరికరాలు, ట్రాక్టర్ల విభాగంలో (ఎఫ్ఈఎస్) కంపెనీ మార్కెట్ వాటా 40 శాతంగా ఉంది. ఎగుమతుల్లో సంస్థ 77 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2021–22లో 17,500 ట్రాక్టర్లను సంస్థ ఎగుమతి చేసింది. ఇది కూడా ఒక ఆర్థిక సంవత్సరంలో రికార్డు గరిష్టం కావడం గమనార్హం. క్యూ4లో ఎస్యూవీ ఆదాయం పరంగా చూస్తే నంబర్1 స్థానంలో ఉంది. ‘‘క్యూ4లో పనితీరు మా వ్యాపార బలానికి నిదర్శనం. కరోనా, కమోడిటీ ధరలు, సెమీ కండక్టర్ల కొరత, ఉక్రెయిన్ సంక్షోభం తదితర రూపాల్లో సవాళ్లు ఉన్నప్పటికీ బలమైన ఫలితాలను నమోదు చేశాం. వృద్ధి అవకాశాలను అందుకునేందుకు గ్రూపు కంపెనీలు అన్నీ మంచి స్థితిలో ఉన్నాయి’’ అని ఎంఅండ్ఎం ఎండీ, సీఈవో అనీష్‌షా తెలిపారు. -
ఐడీఎఫ్సీ బ్యాంక్ లాభం జూమ్
న్యూఢిల్లీ: గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో ప్రయివేట్ రంగ సంస్థ ఐడీఎఫ్సీ బ్యాంక్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 168 శాతం జంప్‌చేసి రూ. 343 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 128 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 4,811 కోట్ల నుంచి రూ. 5,385 కోట్లకు బలపడింది. నికర వడ్డీ ఆదాయం 36 శాతం ఎగసి రూ. 2,669 కోట్లకు చేరింది. ఫీజు, ఇతర ఆదాయం 40 శాతం వృద్ధితో రూ. 841 కోట్లను తాకింది. పూర్తి ఏడాదికి మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి మాత్రం ఐడీఎఫ్సీ బ్యాంక్ నికర లాభం 68 శాతం క్షీణించి రూ. 145 కోట్లకు పరిమితమైంది. 2020–21లో రూ. 452 కోట్లు ఆర్జించింది. కోవిడ్–19 రెండో దశ ప్రభావం లాభాలను దెబ్బతీసినట్లు బ్యాంక్ పేర్కొంది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 18,179 కోట్ల నుంచి రూ. 20,395 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం సైతం 32 శాతం ఎగసి రూ. 9,706 కోట్లకు చేరింది. కాగా.. రిటైల్ విభాగంలో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 4.01 శాతం నుంచి 2.63 శాతానికి దిగివచ్చినట్లు బ్యాంక్ ఎండీ, సీఈవో వి.వైద్యనాథన్ వెల్లడించారు. ఈ బాటలో నికర ఎన్పీఏలు సైతం 1.9 శాతం నుంచి 1.15 శాతానికి తగ్గినట్లు పేర్కొన్నారు. -
లాభాల్లోకి యస్ బ్యాంక్
ముంబై: ప్రయివేట్ రంగ సంస్థ యస్ బ్యాంక్ గతేడాది(2021–22) రూ. 1,066 కోట్ల నికర లాభం ఆర్జించింది. మూడేళ్ల(2019) తదుపరి బ్యాంక్ లాభాల్లోకి ప్రవేశించినట్లు బ్యాంక్ సీఈవో, ఎండీ ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. కాగా.. గతేడాది చివరి త్రైమాసికం(క్యూ4)లో బ్యాంక్ రూ. 367 కోట్ల నికర లాభం ప్రకటించింది. మొండి రుణాలకు కేటాయింపులు తగ్గడం ఇందుకు సహకరించింది. ఈ క్యూ4(జనవరి–మార్చి)లో నికర వడ్డీ ఆదాయం 84 శాతం జంప్‌చేసి రూ. 1,819 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 2.5 శాతానికి బలపడగా.. వడ్డీ యేతర ఆదాయం 28 శాతం ఎగసి రూ. 882 కోట్లకు చేరింది. పీఎస్‌యూ దిగ్గజం ఎస్బీఐ అధ్యక్షతన బ్యాంకుల కన్సార్షియం ఆర్థిక సవాళ్లలో ఇరుక్కున్న యస్ బ్యాంకుకు మూడేళ్ల క్రితం బెయిలవుట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 15.7 శాతం నుంచి 13.9 శాతానికి తగ్గాయి. ప్రస్తుత ఏడాది(2022–23)లో రూ. 5,000 కోట్లకుపైగా రికవరీలు, అప్గ్రేడ్లను సాధించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు ప్రశాంత్ వెల్లడించారు. ఈ బాటలో నికర వడ్డీ మార్జిన్లను 2.75 శాతానికి మెరుగుపరచుకునే ప్రణాళికలు అమలు చేయనున్నట్లు తెలియజేశారు. 2022 మార్చికల్లా కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 17.4 శాతంగా నమోదైనట్లు పేర్కొన్నారు. -
వచ్చింది మూడేళ్లే..! 84 ఏళ్ల కంపెనీకి గట్టిషాకిచ్చిన రియల్మీ..!
భారత మార్కెట్లోకి అడుగుపెట్టి జస్ట్ మూడేళ్లయ్యింది. బడ్జెట్ ఫ్రెండ్లీ, ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్స్ తక్కువ ధరకే అందిస్తూ రియల్మీ భారత్‌లో మరోసారి సత్తా చాటింది. క్యూ4లో నంబర్ 2 భారత్‌లో మొబైల్ సేల్స్‌కి సంబంధించి మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్ పాయింట్ 2021గాను క్యూ4 ఫలితాలను విడుదల చేసింది. ఇందులో 17 శాతం మార్కెట్ వాటాతో రియల్మీ శాంసంగ్‌ని వెనక్కి నెట్టి ఇండియాలో అత్యధిక మార్కెట్ రెండో కంపెనీగా రికార్డు సృష్టించింది. శాంసంగ్ నుంచి కొత్త మోడళ్ల రాక తగ్గిపోవడంతో కేవలం 16 శాతం మార్కెట్‌కే పరిమితమై మూడో స్థానంలో నిలిచింది. షావోమి నెంబర్ వన్..! ఇక భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో షావోమీ మరోసారి నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. గత కొన్నేళ్లుగా ఇండియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో షావోమి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తోంది. భారత మార్కెట్లో ఒక వెలుగు వెలిగినా శాంసంగ్‌కు షావోమి భారీగానే గండి కొట్టింది. 2021 క్యూ4లో షావోమీ ఏకంగా 24 శాతం మార్కెట్ వాటాతో నంబర్ వన్‌గా నిలిచింది. 2021లో టాప్ షావోమీ..! 2021గాను ఒవరాల్ చూసుకుంటే షావోమీ నంబర్ వన్ స్థానంలో నిలిచింది. షావోమీ 24 శాతం వాటాను ఆక్రమించింది. Mi 11 సిరీస్ అమ్మకాలతో కంపెనీ ఆదాయంలో 258 శాతం పెరుగుదల కన్పించింది. ఇక రెండో స్థానంలో శాంసంగ్ నిలిచింది. శాంసంగ్ 2021లో 8 శాతం క్షీణతను నమోదుచేసింది. రియల్మీ మూడో స్థానంలో నిలవగా, భారత్‌లో అత్యంత చురుకైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్ రియల్మీ అవతరించింది. Vivo, Oppo నాలుగు, ఐదవ స్థానాలను కార్నర్ చేయగలిగాయి. చదవండి: గంటకు 19 వేలకుపైగా స్మార్ట్‌ఫోన్స్ అమ్మకాలు..! ఇండియన్స్ ఫేవరెట్ బ్రాండ్ అదే..! -
పెట్రోల్ డిమాండ్ తగ్గేదేలే!
న్యూఢిల్లీ: కోవిడ్–19పరమైన ఆంక్షల సడలింపుతో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకునే కొద్దీ, ప్రస్తుత త్రైమాసికంలో దేశీయంగా ఇంధనానికి డిమాండ్ మెరుగుపడటం కొనసాగనుంది. అయితే, కొంగొత్త వేరియంట్లతో కేసులు పెరగడం, తత్ఫలితంగా మరిన్ని ఆంక్షలు విధించే అవకాశాల వల్ల ఆర్థిక వ్యవస్థ, ప్రయాణాలపై ప్రతికూల ప్రభావం పడే రిస్కులు కూడా పొంచి ఉన్నాయి. ఒక నివేదికలో ఫిచ్ రేటింగ్స్ ఈ అంశాలు వెల్లడించింది. ఇంధనానికి డిమాండ్, తద్వారా ధరల పెరుగుదలతో చమురు, గ్యాస్ ఉత్పత్తి కంపెనీల ఆర్థిక పరిస్థితులు మరింత మెరుగుపడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. క్యూ 4లో ‘‘జనవరి–మార్చి త్రైమాసికంలో పెట్రోలియం ఉత్పత్తులకు డిమాండ్ మళ్లీ కోవిడ్ పూర్వ స్థాయికి చేరవచ్చని అంచనా వేస్తున్నాం. అయితే పూర్తి ఆర్థిక సంవత్సరానికి చూస్తే మాత్రం 2020 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 2–4 శాతం తక్కువగానే ఉండవచ్చు’’ అని ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. ఫిచ్ నివేదిక ప్రకారం.. వార్షిక ప్రాతిపదికన చూస్తే ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో పెట్రోలియం ఉత్పత్తులకు డిమాండ్ 5 శాతం మేర పెరిగింది. అయితే, నెలవారీ సగటు మాత్రం కోవిడ్ పూర్వ స్థాయికన్నా 8–10 శాతం తక్కువగా సుమారు 16.4 మిలియన్ టన్నుల స్థాయిలో నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో దేశీయంగా ఇంకా కొన్ని ప్రాంతాల్లో మహమ్మారి కట్టడికి సం బంధించిన ఆంక్షలు అమలవుతుండటమే ఇందుకు కారణం. ‘‘ కోవిడ్–19 కేసుల ఉధృతి, ఫలితంగా ఆర్థిక కార్యకలాపాలు, ప్రయాణాలపై ప్రభావాల రిస్కులకు లోబడి నాలుగో త్రైమాసికంలో పెట్రోలియం ఉత్పత్తుల డిమాండ్‌కు సంబంధించిన రికవరీ కొనసాగవచ్చు’’ అని ఫిచ్ తెలిపింది. మరింతగా ఓఎంసీల పెట్టుబడులు.. రిఫైనింగ్ సామర్థ్యాలు, రిటైల్ నెట్‌వర్క్‌లను పెంచుకునేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ).. ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకునేందు కు తయారీ కంపెనీలు.. మరింతగా ఇన్వెస్ట్ చేయ డం కొనసాగించనున్నట్లు ఫిచ్ రేటింగ్స్ వివరించింది. ‘‘క్రూడాయిల్ ఉత్పత్తి స్థిరంగా కొనసాగవచ్చు. అన్వేషణ, అభివృద్ధి కార్యకలాపాలపై ఉత్పత్తి కంపెనీలు మరింతగా పెట్టుబడులు కొనసాగించడం వల్ల 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఇది ఒక మోస్తరుగా పెరగవచ్చు. దేశీయంగా ఉత్పత్తి పెర గడం, స్పాట్ ధరల్లో పెరుగుదల తదితర అంశాలు వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) దిగుమతులపై ప్రభావం చూపవచ్చు. అయితే, వినియోగం పుంజు కునే కొద్దీ మధ్యకాలికంగా చూస్తే ఎల్ఎన్జీ దిగుమతులు క్రమంగా పెరగవచ్చు’’ అని ఫిచ్ తన నివేదికలో పేర్కొంది. మెరుగుపడనున్న రిఫైనింగ్ మార్జిన్లు .. ఎకానమీ రికవరీ క్రమంలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగే కొద్దీ కీలకమైన చమురు రిఫైనింగ్ మార్జిన్లు ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో (అక్టోబర్ 2021–మార్చి 2022) మెరుగుపడనున్నాయని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. డిమాండ్, ఉత్పత్తి ధర–విక్రయ ధర మధ్య వ్యత్యాసం, తక్కువ రేటుకు కొని పెట్టుకున్న నిల్వల ఊతంతో ప్రథమార్ధంలో (ఏప్రిల్–సెప్టెంబర్ 2021) ప్రభుత్వ రంగ ఓఎంసీలు మెరుగైన మార్జిన్లు నమోదు చేశాయి. ఒక్కో బ్యారెల్‌పై బీపీసీఎల్ 5.1 డాలర్లు, ఐవోసీ 6.6 డాలర్లు, హెచ్‌పీసీఎల్ 2.9 డాలర్ల స్థాయికి మార్జిన్లు మెరుగుపర్చుకున్నాయి. క్రూడాయిల్ అధిక ధరల భారాన్ని వినియోగదారులకు బదలాయించడం కొనసాగించడం ద్వారా ద్వితీయార్ధంలో కూడా ఓఎంసీలు స్థిరంగా మార్కెటింగ్ మార్జిన్లను నమోదు చేయగలవని అంచనా వేస్తున్నట్లు ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. -
Xiaomi: మరో ఫోల్డబుల్ ఫోన్..త్వరలోనే
ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి అతి త్వరలోనే మరో ఫోల్డబుల్ మొబైల్‌ను లాంచ్ చేయనుంది. హై ఎండ్ ఫీచర్స్‌తో ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులో తీసుకురానుంది. తన కంపెనీ నుంచి ఎంఐ మిక్స్ ఫోల్డ్ సిరీస్‌లో భాగంగా ఏంఐ మిక్స్ ఫోల్డ్ 2ను కొనసాగింపుగా మార్కెట్లోకి రిలీజ్ చేయనుంది. కాగా ఈ ఫోల్డబుల్ ఫోన్లో ఆప్గ్రేడేడ్ హింజ్ మెకానిజం రానున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా ఏంఐ మిక్స్ ఫోల్డ్ 2 శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2 కు పోటీగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఎంఐ మిక్స్ ఫోల్డ్ 2 స్పాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో, 5000ఎంఏహెచ్ బ్యాటరీతో కంపెనీ రిలీజ్ చేయనుంది. వీటితో పాటుగా 108 ఎంపీ రియర్ కెమరాను అమర్చనుంది. అత్యధికంగా 120హెర్జ్ రిఫ్రెష్ రేటుతో ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ మొబైల్‌ను 2021 క్యూ4లో లాంచ్ చేయాలని కంపెనీ భావిస్తోంది. చదవండి: ఐటెల్ నుంచి అతి తక్కువ ధరకే 4జీ ఫోన్ -
నిఫ్టీ–500 స్టాక్స్‌లో డీఐఐల వాటా డౌన్
ముంబై: దేశీ స్టాక్స్‌లో ఓవైపు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) పెట్టుబడులకు దిగుతుంటే.. మరోపక్క దేశీ ఫండ్స్(డీఐఐలు) అమ్మకాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీంతో గతేడాది (2020– 21) చివరి త్రైమాసికంలో నిఫ్టీ–500 ఇండెక్సులో భాగమైన కంపెనీలలో ఎఫ్‌పీఐల వాటా పుంజుకోగా.. డీఐఐల వాటా డీలా పడింది. వెరసి జనవరి–మార్చి(క్యూ4)లో డీఐఐల వాటా 0.5 శాతం క్షీణించి 14.2 శాతానికి పరిమితమైంది. ఇది గత 7 త్రైమాసికాలలో కనిష్టంకావడం గమనార్హం. ఇక ఇదే కాలంలో ఎఫ్‌పీఐల వాటా 1.6 శాతం బలపడి 22.3 శాతానికి చేరింది. బ్రోకింగ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ క్రోడీకరించిన గణాంకాలివి. ఇతర వివరాలు చూద్దాం.. క్యూ3తో పోలిస్తే వార్షికంగా చూస్తే నిఫ్టీ–500 స్టాక్స్‌లో ఎఫ్‌పీఐల వాటా 20.7 శాతం నుంచి 1.6 శాతం పుంజుకోగా.. డీఐఐల వాటా 14.7 శాతం నుంచి 0.5 శాతం క్షీణించింది. అయితే క్యూ3(అక్టోబర్–డిసెంబర్) తో పోలిస్తే ఎఫ్‌పీఐల వాటా 0.2 శాతం వెనకడుగు వేయగా.. డీఐఐల వాటా సైతం 0.1 శాతం నీరసించింది. క్యూ4లో ఎఫ్‌పీఐలు 7.3 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేశారు. ఇదే సమయంలో డీఐఐలు 3.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. రంగాల వారీగా గత రెండు త్రైమాసికాలలో ఎఫ్‌పీఐలు టెలికం, మెటల్స్, కన్జూమర్ డ్యురబుల్స్, రియల్టీ, సిమెంట్ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వగా.. డీఐఐలు ఈ రంగాలలో అధిక అమ్మకాలు చేపట్టాయి. కన్జూమర్, హెల్త్‌కేర్, ప్రభుత్వ బ్యాంకులను పెట్టుబడులకు ఎంచుకున్నాయి. ఈ నేపథ్యంలో మార్చికల్లా ఎఫ్‌పీఐల వాటా 22.3 శాతానికి ఎగసింది. ఇది కోవిడ్–19 తలెత్తకముందు స్థాయికావడం గమనార్హం! గతేడాది ద్వితీయార్థంలో ఎఫ్‌పీఐలు నిఫ్టీ–500 ఇండెక్స్‌లోని 286 కంపెనీలలో వాటాలు పెంచుకున్నాయి. నిఫ్టీ–50లో 32 కంపెనీలున్నాయి. ఈ బాటలో డీఐఐలు 203–18(నిఫ్టీ) స్టాక్స్‌లో వాటాలు కొనుగోలు చేశాయి. ఇదే కాలంలో ఎఫ్‌పీఐలు 203–18 కంపెనీలలో వాటాలు తగ్గించుకోగా.. డీఐఐలు 271–31 స్టాక్స్ పెట్టుబడుల్లో వెనకడుగు వేశాయి. విలువ రీత్యా నిఫ్టీ–500 స్టాక్స్‌లో ఎఫ్‌పీఐల వాటా విలువ 593 బిలియన్ డాలర్లకు చేరింది. ప్రయివేట్ బ్యాంక్స్‌లో ఎఫ్‌పీఐల పెట్టుబడుల విలువ 139 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు డీఐఐల వాటాల విలువ 378 బిలియన్ డాలర్లకు చేరగా.. ప్రయివేట్ బ్యాంక్స్‌లో పెట్టుబడులు 59 డాలర్లుగా నమోదయ్యాయి. ఈ బాటలో టెక్నాలజీ స్టాక్స్ వాటా విలువ 43 బిలియన్ డాలర్లను తాకగా, కన్జూమర్ విభాగంలో 40 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశాయి. కాగా.. ప్రయివేట్ బ్యాంక్స్‌లో ఎఫ్‌పీఐలు 47.9% ఓనర్‌షిప్‌ను కలిగి ఉన్నారు. ఈ బాటలో ఎన్బీఎఫ్సీలలో 32.9 శాతం, ఆయిల్, గ్యాస్‌లో 23.1 %, బీమాలో 22.2 శాతం, రియల్టీలో 21.5% ఓనర్‌షిప్‌ను పొందారు. డీఐఐలు క్యాపిటల్ గూడ్స్ (21.9%), ప్రయివేట్ బ్యాంక్స్(20.4%), మెటల్స్ (18.3%), కన్జూమర్ డ్యురబుల్స్ (17.8%), పీఎస్బీ(17.6%)లలో ఓనర్‌షిప్‌ను కలిగి ఉన్నాయి. ఇటీవల డీఐఐలు అత్యధికంగా(1 శాతానికిపైగా) వాటా పెంచుకున్న కంపెనీల జాబితాలో బీపీసీఎల్, బజాజ్ ఆటో, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ చేరాయి. -
టాటా స్టీల్ టర్న్అరౌండ్
న్యూఢిల్లీ: మెటల్ రంగ టాటా గ్రూప్ దిగ్గజం టాటా స్టీల్ గతేడాది(2020–21) చివరి క్వార్టర్లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి–మార్చి)లో టర్న్అరౌండ్ అయ్యింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 7,162 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో రూ. 1,615 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 37,323 కోట్ల నుంచి రూ. 50,250 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 35,432 కోట్ల నుంచి రూ. 40,052 కోట్లకు పెరిగాయి. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 25 చొప్పున డివిడెండ్‌ను ప్రకటించింది. రికార్డ్ ఇబిటా: తొలి అర్ధభాగంలో కోవిడ్–19 ప్రభావం చూపినప్పటికీ ద్వితీయార్థం నుంచి దేశీయంగా లాక్‌డౌన్‌ను ఎత్తివేయడంతోపాటు.. ఆర్థిక రికవరీ ప్రారంభంకావడంతో స్టీల్ వినియోగం పెరిగినట్లు టాటా స్టీల్ సీఈవో, ఎండీ టీవీ నరేంద్రన్ పేర్కొన్నారు. దీంతో పటిష్ట ఫలితాలను సాధించగలిగినట్లు తెలియజేశారు. క్యూ4లో ముడిస్టీల్ ఉత్పత్తి 4.75 మిలియన్ టన్నులకు చేరి రికార్డును సృష్టించగా.. అమ్మకాలు 16 శాతం పెరిగి 4.67 మిలియన్ టన్నులను తాకినట్లు టాటా స్టీల్ పేర్కొంది. క్యూ4లో ఇబిటా 40 శాతం వృద్ధితో రూ. 12,295 కోట్లను తాకింది. కంపెనీ చరిత్రలోనే ఇది అత్యధికంకాగా.. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 14,290 కోట్ల ఇబిటాను సాధించినట్లు వెల్లడించింది. మార్జిన్లు 40.9 శాతంగా నమోదయ్యాయి. పెట్టుబడి వ్యయాల తదుపరి రూ. 8,800 కోట్ల ఫ్రీక్యాష్ ఫ్లోను సాధించినట్లు నరేంద్రన్ తెలియజేశారు. పూర్తి ఏడాదికి క్యాష్‌ఫ్లో రూ. 24,000 కోట్లకు చేరగా.. రూ. 28,000 కోట్లమేర రుణ భారాన్ని తగ్గించుకున్నట్లు వెల్లడించారు. వెరసి మొత్తం రుణ భారం 28 శాతం తగ్గి రూ. 75,389 కోట్లకు దిగివచ్చినట్లు వివరించారు. టాటా స్టీల్ షేరు ఎన్ఎస్ఈలో 0.7 శాతం బలపడి రూ. 1,071 వద్ద ముగిసింది. -
హీరో మోటోకార్ప్ లాభం రూ.621 కోట్లు
న్యూఢిల్లీ: టూవీలర్ దిగ్గజం హీరో మోటోకార్ప్ కంపెనీకి గత ఆర్థిక సంవత్సరం (2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.621 కోట్ల నికర లాభం(స్డాండ్‌అలోన్) సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2018–19) ఇదే క్వార్టర్లో రూ.730 కోట్ల నికర లాభం ఆర్జించామని, 15 శాతం క్షీణించిందని హీరో మోటోకార్ప్ తెలిపింది. కార్యకలాపాల ఆదాయం రూ.7,885 కోట్ల నుంచి 21 శాతం పతనమై రూ.6,235 కోట్లకు తగ్గిందని పేర్కొంది. అమ్మకాలు తక్కువగా ఉండటం వల్ల నికర లాభం, ఆదాయాలు తగ్గాయని వెల్లడించింది. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.25 తుది డివిడెండ్‌ను ఇవ్వాలని డైరెక్టర్ల బోర్డ్ సిఫార్సు చేసింది. వాహన అమ్మకాలు 25 శాతం తగ్గాయని కంపెనీ తెలిపింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో 17.81 లక్షలుగా ఉన్న వాహన విక్రయాలు గత క్యూ4లో 13.35 లక్షలకు తగ్గాయని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో హీరో మోటో షేరు స్పల్ప లాభంతో రూ.2,386 వద్ద ముగిసింది. -
క్యూ4 ఫలితాల తర్వాత ఎస్బీఐ టార్గెట్ ధర తగ్గింపు
ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బీఐ గతవారంలో శుక్రవారం త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. ఫలితాలు అంచనాలకు మించి నమోదయ్యాయి. రుణ వృద్ధి స్తబ్దుగా ఉండటం, నికర వడ్డీ మార్జిన్లు ఇప్పటికీ ఒత్తిళ్లను ఎదుర్కోంటున్న నేపథ్యంలో పలు బ్రోకరేజ్ సంస్థలు ఎస్బీఐ షేరు టార్గెట్ ధరను తగ్గించాయి. అయితే తక్కువ వాల్యూయేషన్లు, మంచి అసెట్ నాణ్యతను కలిగి ఉండటంతో చాలా బ్రోకరేజ్ సంస్థలు ‘‘బై’’ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు ప్రకటించాయి. యస్ బ్యాంక్ సంక్షోభం తర్వాత ఎస్బీఐ డిపాజిట్లు భారీగా పెరగడం కలిసొచ్చే అంశంగా ఉందని బ్రోకరేజ్ సంస్థలు చెప్పుకొచ్చాయి. డిపాజిట్లు, అండర్రైట్, డిజిటలైజేషన్ అంశాల కారణంగా ఎస్బీఐ అత్యుత్తమ ప్రమాణాలను కనబరుస్తోంది. అనుబంధ సంస్థల వాల్యూయేషన్లను అన్‌లాక్ చేయగల భారీ సామర్థ్యం, బ్యాంక్ నిర్వహణ లాభం 1.7-2.0 శాతంగా నమోదు కావడం తదితర సానుకూలాంశాలతో ఎస్బీఐ ఒత్తిళ్లను తట్టుకోగలుగుతుంది. ‘‘మార్చి తర్వాత ఎంసీఎల్ఆర్ 50బేసిస్ పాయింట్లు తగ్గడంతో నికర వడ్డీ మార్జిన్లకు మరింత ప్రమాదం పొంచి ఉంది. ఆకర్షణీయమైన వాల్యూయేషన్, బలమైన ఫ్రాంచైజీలు ఉన్నప్పటికీ.., ఆర్థిక / సామాజిక బాధ్యతల భారాన్ని భరించడంలో ముందంజలో ఉండటం ఎస్బీఐ మరింత ఒత్తిడిని పెంచుతుంది.’’ అని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ బ్రోకరేజ్ చెప్పుకొచ్చింది. మారిటోరియం పరిగణనలోకి తీసుకుంటే ఇతర రుణదాతలతో పోల్చితే ఎస్బీఐ తక్కువ కేటాయింపులు జరపడం నిరాశపరిచిందని ఎంకే గ్లోబల్ సంస్థ తెలిపింది. -
టీసీఎస్ లాభం 8,049 కోట్లు
ముంబై: ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) గత ఆర్థిక సంవత్సరం (2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.8,049 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్)సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2018–19) క్యూ4లో ఆర్జించిన నికర లాభం (రూ.8,126 కోట్లు)తో పోల్చి తే 1 శాతం మేర తగ్గిందని టీసీఎస్ తెలిపింది. ఆదాయం మాత్రం రూ.38,010 కోట్ల నుంచి 5 శాతం వృద్ధితో రూ.39,946 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, నికర లాభం 3 శాతం వృద్ధితో రూ.32,340 కోట్లకు, ఆదాయం 7 శాతం ఎగసి రూ.1,56,949 కోట్లకు పెరిగాయి. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.6 తుది డివిడెండ్‌ను(600 శాతం) ప్రకటించింది. మరిన్ని వివరాలు... ► ఇతర ఆదాయం తక్కువగా రావడం, అధిక వడ్డీ వ్యయాలు, లాక్డౌన్ విధింపు(దేశీయంగా, అంతర్జాతీయంగా) లాభదాయకతపై ప్రభావం చూపాయి. ► డాలర్ల పరంగా చూస్తే, ఆదాయం 3 శాతం తగ్గి 544 కోట్ల డాలర్లకు తగ్గింది. స్థిర కరెన్సీ పరంగా చూస్తే, ఆదాయం 3 శాతం పెరిగింది. ఆదాయం అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో 13 శాతం, గత క్యూ3లో 7 శాతం చొప్పున వృద్ధి చెందాయి. ► గత క్యూ4లో ఎబిట్ అర శాతం వృద్ధితో (సీక్వెన్షియల్‌గా) రూ.10,025 కోట్లకు పెరిగింది. మార్జిన్ 10 బేసిస్ పాయింట్లు పెరిగి 25.1 శాతానికి చేరింది. ► పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2019–20) ఎబిట్ 3 శాతం వృద్ధితో రూ.38,580 కోట్లకు పెరగ్గా, మార్జిన్ మాత్రం 1 శాతం మేర తగ్గి 24.58 శాతానికి చేరింది. ► గత క్యూ4లో మొత్తం 1,789 మందికి ఉద్యోగాలిచ్చింది. మొత్తం ఆర్థిక సంవత్సరానికి 24,179 మందికి కొలువులిచ్చింది. దీంతో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 4,48,464కు పెరిగింది. ఉద్యోగుల వలస (అట్రిషన్ రేటు) 12.1 శాతంగా ఉంది. ► గత ఆర్థిక సంవత్సరంలో నికరంగా రూ.37,702 కోట్ల మేర డివిడెండ్లు చెల్లించింది. ఈ మార్చి క్వార్టర్లో ఒక్కో షేర్‌కు రూ. 12 మధ్యంతర డివిడెండ్‌ను ఇచ్చింది. తాజాగా ప్రకటించిన రూ.6 తుది డివిడెండ్‌ను కూడా కలుపుకుంటే, ఈ మార్చి క్వార్టర్లో కంపెనీ మొత్తం డివిడెండ్ ఒక్కో షేర్‌కు రూ.18కు పెరుగుతుంది. మార్కెట్ ముగిసిన తర్వాత టీసీఎస్ ఫలితాలు వచ్చాయి. ఫలితాలపై అనిశ్చితితో బీఎస్ఈలో టీసీఎస్ షేర్ 1 శాతం నష్టంతో రూ. 1,715 వద్ద ముగిసింది. ఉద్యోగాల కోత ఉండదు.. కరోనా ప్రతికూలతలు ఉన్నప్పటికీ ఉద్యోగాల్లో కోత విధించే యోచనేదీ లేదని టీసీఎస్ ఎండీ రాజేశ్ గోపీనాథన్ వెల్లడించారు. అయితే, ఈ ఏడాది జీతాల పెంపు మాత్రం ఉండదని తెలిపారు. మరోవైపు, ముందుగా ఆఫర్లు ఇచ్చిన సుమారు 40,000 మందిని రిక్రూట్ చేసుకుంటామని స్పష్టం చేశారు. కరోనా కాటేసింది.... మార్చి క్వార్టర్ మొదట్లో చాలా వ్యాపార విభాగాలు శుభారంభం చేశాయి. కానీ ఆ సానుకూలతలన్నింటినీ కరోనా మహమ్మారి ధ్వంసం చేసింది. గుడ్డిలో మెల్లలా కొన్ని భారీ డీల్స్‌ను సాధించగలిగాం. కంపెనీ చరిత్రలోనే అత్యధిక ఆర్డర్లను ఈ క్వార్టర్‌లోనే సాధించాం. –రాజేశ్ గోపీనాథన్, టీసీఎస్ సీఈఓ, ఎమ్డీ సంతృప్తికరంగానే సేవలు... కార్యకలాపాల నిర్వహణలో కరోనా వైరస్ ప్రభావం ఉన్నప్పటికీ, క్లయింట్లకు సంతృప్తికరమైన స్థాయిల్లోనే ఐటీ సేవలందిస్తున్నాం. అత్యవసర సేవలే కాక, అన్ని విభాగాల సేవలను అందిస్తున్నాం. –ఎన్. గణపతి సుబ్రహ్మణ్యం, టీసీఎస్ సీఓఓ, ఈడీ -
క్యూ3, క్యూ4లలో బ్యాంకింగ్‌కు వెలుగురేఖలు!
ముంబై: భారత్ బ్యాంకింగ్ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ, నాల్గవ త్రైమాసికాల్లో చక్కటి ఫలితాలు నమోదుచేసుకునే అవకాశం ఉందని బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ రజ్నీష్ కుమార్ విశ్లేషించారు. భారీ మొండిబకాయిల (ఎన్పీఏ) సమస్య పరిష్కారం దీనికి ప్రధాన కారణమనీ వివరించారు. రుణాలకు సంబంధించి ఎడిల్వీస్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో బుధవారం ఆయన మాట్లాడారు. కొన్ని కీలక అంశాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే... రుణ వృద్ధి ‘పరుగు’ కష్టమే! ►ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలాన్ని (2019 ఏప్రిల్–సెప్టెంబర్) 2018లోని ఇదే కాలంతో పోలిస్తే ఎస్బీఐకి సంబంధించినంతవరకూ రుణ వృద్ధిలేకపోగా ప్రతికూలత నమోదయ్యింది. అయితే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకూ మాత్రం ఈ పరిస్థితి మెరుగుపడింది. వార్షిక ప్రాతిపదికన రుణ వృద్ధి దేశీయంగా 5 శాతానికి తగ్గితే, అంతర్జాతీయ మార్కెట్‌కు సంబంధించి ఈ శాతం 7గా ఉంది. మరికొంత కాలం రుణ వృద్ధి మందగమనంలోనే ఉండే అవకాశం ఉంది. 2018–19లో మొత్తం బ్యాంకింగ్ రుణ వృద్ధిరేటు 13.3 శాతం. అయితే 2019 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో అంతకు ముం దటి ఏడాదితో పోలి్చచూస్తే పెరుగుదల 7.1 శాతం మాత్రమే. విలువ రూపంలో రూ.92.87 లక్షల కోట్ల నుంచి రూ.99.47 లక్షల కోట్లకు చేరింది. 2019–20లో రుణ వృద్ధిరేటు అరవై సంవత్సరాల కనిష్టస్థాయి 6.5 – 7 శాతానికి పడిపోయే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ– ఇక్రా ఇటీవలే ఒక నివేదికలో పేర్కొంది. రుణ మంజూరీల విషయం లో బ్యాంకులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. ►చమురు గ్యాస్, సోలార్, రహదారుల రంగాల నుంచి బ్యాంకులకు రుణాల డిమాండ్ వస్తోంది. ►అమెరికా–ఇరాన్‌ల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు దేశంలో నిత్యావసర ధరల పెరుగుదలకు దారితీస్తాయి. ఇది కరెంట్ అకౌంట్‌లోటు, కరెన్సీ విలువపైనా ప్రభావం చూపే అంశం. ► కొన్ని ప్రతికూలతలు ఉన్నా మొత్తంగా ప్రభుత్వ ఫైనాన్షియల్ పరిస్థితులు బాగున్నాయి. ప్రభుత్వ ఆదాయ వ్యయాలకు సంబంధించి ద్రవ్యలోటు (జీడీపీలో 3.3 %) కట్టడిలో ఉండాలని డిమాండ్ ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో దీనిని ప్రభుత్వం పట్టంచుకుంటుందని భావించడం లేదు. 2019– 20 ఆరి్థక సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు రూ.7.03 లక్షల కోట్లుగా ఉండాలన్నది (జీడీపీలో 3.3%) బడ్జెట్ లక్ష్యం. కానీ అక్టోబర్ ముగిసే నాటికే ఈ మొత్తం రూ.7,20,445 కోట్లకు(బడ్జెట్ అంచనాల్లో 102.4 శాతానికి) చేరింది. -
మళ్లీ లాభాల్లోకి సెయిల్
న్యూఢిల్లీ: ఉక్కు దిగ్గజం సెయిల్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో లాభాల బాట పట్టింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.771 కోట్ల నికర నష్టాలు రాగా, గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.816 కోట్ల నికర లాభాలు (స్టాండ్అలోన్) వచ్చాయని సెయిల్ తెలిపింది. ఆదాయం బాగా పెరగడంతో ఈ స్థాయిలో లాభాలు వచ్చాయని వివరించింది. మొత్తం ఆదాయం రూ.14,544 కోట్ల నుంచి రూ.17,265 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.2,833 కోట్లుగా ఉన్న నికర నష్టాలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.482 కోట్లకు తగ్గాయని సెయిల్ తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో సెయిల్ షేర్ 2 శాతం నష్టంతో రూ.76 వద్ద ముగిసింది. -
ఎయిర్టెల్ లాభం 78% డౌన్
న్యూఢిల్లీ: మొబైల్ దిగ్గజం భారతీ ఎయిర్టెల్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో భారీగా తగ్గింది. టారిఫ్‌ల యుద్ధం తీవ్రంగా ఉండటం, అంతర్జాతీయ టెర్మినేషన్ చార్జీల్లో కోత కారణంగా గత క్యూ4లో నికర లాభం 78 శాతం తగ్గినట్లు భారతీ ఎయిర్టెల్ తెలిపింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.373 కోట్లుగా (ఒక్కో షేర్‌కు 93 పైసలు) ఉన్న నికర లాభం గత క్యూ4లో రూ.83 కోట్లకు (ఒక్కో షేర్‌కు 21 పైసలు) తగ్గిందని భారతీ ఎయిర్టెల్ ఎండీ, సీఈఓ (ఇండియా, సౌత్ ఏషియా) గోపాల్ విట్టల్ తెలిపారు. మొత్తం ఆదాయం రూ.21,935 కోట్ల నుంచి 11 శాతం తగ్గి రూ.19,634 కోట్లకు చేరింది. భారత ఆదాయం 8 శాతం తగ్గి రూ.14,796 కోట్లకు చేరిందని, ఆఫ్రికా ఆదాయం మాత్రం 11 శాతం ఎగసిందని గోపాల్ తెలియజేశారు. మొబైల్ డేటా ట్రాఫిక్ 505 శాతం వృద్ధితో 1,616 బిలియన్ మెగాబైట్లకు పెరిగింది. నికర రుణ భారం రూ.91,714 కోట్ల నుంచి రూ.95,228 కోట్లకు పెరిగింది. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ (ఆర్ఓసీఈ) 6.5 శాతం నుంచి 4.7 శాతానికి తగ్గిందని, ఇబిటా తక్కువగా ఉండటం, స్పెక్ట్రమ్ వ్యయాలు పెరగడం, భారత్‌లో పెట్టుబడులు కొనసాగడం, తదితర అంశాలు దీనికి కారణాలని గోపాల్ విట్టల్ వివరించారు. గత ఆర్థిక సంవత్సరానికి తుది డివిడెండ్‌గా రూ.2.5ను ఇవ్వనున్నామని, గతంలో ప్రకటించిన మధ్యంతర డివిడెండ్ రూ.2.84 కలుపుకుంటే, మొత్తం డివిడెండ్ గత ఆర్థిక సంవత్సరానికి రూ.5.34గా ఉంటుందని తెలియజేశారు. రూ. 24,000 కోట్ల పెట్టుబడులు... ఇంత తక్కువ నికర లాభం సాధించడం 14 ఏళ్లలో కంపెనీకి ఇదే తొలిసారి. 2004, ఏప్రిల్–జూన్ క్వార్టర్ తర్వాత అతి తక్కువ లాభం వచ్చిన క్వార్టర్ ఇదే. నికర లాభం తగ్గడం ఇది వరుసగా ఎనిమిదో క్వార్టర్. కొత్తగా కార్యకలాపాలు ప్రారంభించిన రిలయన్స్ జియో ఉచితవాయిస్ కాల్స్‌ను, కారు చౌకగా డేటా ఆఫర్లను ఇస్తుండటంతో ఈ కంపెనీ లాభాలు హరించుకుపోయాయి. కృత్రిమంగా తగ్గిస్తున్న ధరలతో టెలికం పరిశ్రమపై వ్యయాల భారం కొనసాగుతోందని గోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్నేషనల్ టెర్మినేషన్ చార్జీల తగ్గింపు వల్ల పరిశ్రమ ఆదాయం భారీగా తగ్గిందన్నారు. నేరుగా రిలయన్స్ జియోను ప్రస్తావించకుండా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.3,800 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 71% తగ్గి రూ.1,099 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 12% తగ్గి రూ.83,688 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.24,000 కోట్ల పెట్టుబడులు పెట్టామని, ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా ఇదే స్థాయిలో పెట్టుబడులు పెడతామని పేర్కొన్నారు. కొనసాగిన అగ్రస్థానం... టెలికం పరిశ్రమలో గత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లో అగ్రస్థానాన్ని కొనసాగించామని గోపాల్ పేర్కొన్నారు. గత క్యూ4లో కోటిన్నర మంది కొత్తగా ఎయిర్టెల్ వినియోగదారులయ్యారని, డేటా సామర్థ్యం పెంపునకు సంబంధించి వ్యూహాత్మక పెట్టుబడులు, ఎయిర్టెల్ టీవీ ద్వారా వినూత్నమైన డిజిటల్ కంటెంట్‌ను అందివ్వడం, వినియోగదారుల అభిరుచులకనుగుణంగా ఆఫర్లనందించడం, తదితర కారణాల వల్ల ఈ స్థాయిలో కొత్త వినియోగదారులు లభించారని వివరించారు. ప్రస్తుతం తమకు 16 దేశాల్లో 41.38 కోట్ల మంది వినియోగదారులున్నారని, వినియోగదారుల సంఖ్య 12 శాతం వృద్ధి చెందిందని వివరించారు. మార్కెట్ ముగిసిన తర్వాత ఆర్థిక ఫలితాలు వచ్చాయి. ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో బీఎస్ఈలో భారతీ ఎయిర్టెల్ షేర్ 0.6 శాతం లాభంతో రూ.406 వద్ద ముగిసింది. -
దూసుకుపోయిన ఎం అండ్ ఎం
ముంబై: మహీంద్రా అండ్ మహీంద్రా ఇవాల్టి (బుధవారం) మార్కెట్లో దూసుకుపోతోంది. క్యూ4 ఫలితాలు, 2018 ఆర్థిక సంవత్సరానికి మెరుగైన గైడెన్స్ అంచనాల నేపథ్యంలో ఎంఅండ్ ఎం 6 శాతానికిపైగా లాభపడింది. మార్చి క్వార్టర్లో 26.3 శాతం వృద్ధిని, రూ. 874 కోట్ల నికర లాభాలను నమోదు చేయడంతో ఫ్టాట్ మార్కెట్లో టాప్ గెయినర్‌గా నిలిచింది. తద్వారా 8 నెలల గరిష్టాన్ని నమోదుచేసింది. ఎం అండ్ ఎం మొత్తం ఆదాయం ఇతర ఆదాయంతో సహా 5 శాతం పెరిగి రూ .12,889 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో వార్షిక లాభం రూ .4050 కోట్లకు చేరింది. గత ఏడాది క్వార్టర్లో ఇది రూ.3,554 లుగా ఉంది. ఏకీకృత ఆదాయం 10.6 శాతం పెరిగి రూ .88,983 కోట్లకు చేరింది. దాదాపు 130,778 వాహనాలను విక్రయించింది. అంతకుముందు సంవత్సరంతో పోల్చితే ఇది ఫ్లాట్ దేశీయ మార్కెట్లో అమ్మకాలు 13.3 శాతం పెరిగి 46,583 యూనిట్లకు చేరాయి. ట్రాక్టర్ ఎగుమతులు 10, 831 యూనిట్లుగా నమోదయ్యాయి. అయితే సుప్రీంకోర్టు (2017 ఏప్రిల్ 1 నుంచి) ద్వారా బీఎస్-3 వాహనాల విక్రయాలపై ఆంక్షలు విధించటంతో ఈ కంపెనీ ఒక్కసారిగా రూ. 171 కోట్ల నష్టపోయిన సంగతి తెలిసిందే. సెడాన్, యుటిలిటీ వాహన విభాగంలో 30 శాతం మార్కెట్ వాటాలో తాము సంతోషంగా లేమనీ, తీవ్రమైన పోటీతో మార్కెట్ వాటాను కోల్పోయామ ని మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరింత మెరుగైన పనితీరును నమోదు చేసే అవకాశం ఉందన్నారు. మరోవైపు ఎంఅండ్ఎం షేరులో ట్రేడ్ పండితులు బై కాల్ ఇస్తున్నారు. బ్రోకింగ్ సంస్థ సీఎల్ఎస్ఏ తాజాగా రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేయడంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌పై ఆసక్తి చూపుతున్నట్టు ఎనలిస్టులు చెబుతున్నారు. -
ఐవోసీ లాభం 85% అప్
⇔ క్యూ4లో రూ.3,720 కోట్లు ⇔ కలిసొచ్చిన అధిక రిఫైనరీ మార్జిన్లు న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ చమురు కంపెనీ ఐవోసీ మార్చి త్రైమాసికానికి సంబంధించి బంపర్ ఫలితాలను ప్రకటించింది. అధిక రిఫైనరీ మార్జిన్ల అండతో కంపెనీ లాభం ఏకంగా 85 శాతం పెరిగి రూ.3,720 కోట్లకు చేరుకుంది. షేరు వారీ ఆర్జన రూ.7.85గా నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో సంస్థకు వచ్చిన లాభం రూ.2,000 కోట్లే. లాభాల్లో భారీ వృద్ధికి అధిక రిఫైనరీ మార్జిన్లకు తోడు ఇన్వెంటరీ గెయిన్స్ కారణమని ఐవోసీ చైర్మన్ బి.అశోక్ విలేకరులకు తెలిపారు. ఆదాయం 24 శాతం వృద్ధితో రూ.1,22,285 కోట్లుగా నమోదైంది. దేశంలో అతి పెద్ద రిఫైనరీ సంస్థ అయిన ఐవోసీ మార్చి త్రైమాసికంలో 17.1 మెట్రిక్ టన్నుల ముడి చమురును శుద్ధి చేసింది. ప్రతీ బ్యారెల్ ముడి చమురును ఇంధనంగా మార్చినందుకు 8.95 డాలర్లను ఆర్జించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఇది కేవలం 3 డాలర్లుగానే ఉండడం గమనార్హం. 2015–16 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో ఇన్వెంటరీ పరంగా కంపెనీ రూ.3,417 కోట్ల నష్టాలను ఎదుర్కోగా... తాజాగా మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.2,634 కోట్ల ఇన్వెంటరీ లాభాలు మెరుగైన ఫలితాలకు కారణమయ్యాయి. కంపెనీ ముడి చమురును కొనుగోలు చేసి శుద్ధి చేసి విక్రయించే లోపు ధరలు పెరిగితే దాన్ని ఇన్వెంటరీ లాభాలుగా పేర్కొంటారు. ఒకవేళ ధరలు తగ్గితే నష్టాలు ఎదురవుతాయి. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరంలో కంపెనీ స్టాండలోన్ లాభం 11,242 కోట్ల నుంచి రూ.19,160 కోట్లకు వృద్ది చెందింది. కంపెనీ చరిత్రలో ఇదే అత్యధిక వార్షిక లాభంగా ఐవోసీ చైర్మన్ అశోక్ పేర్కొన్నారు. ఎగుమతులు సహా 2016–17లో 83.49 మెట్రిక్ టన్నుల ఉత్పత్తులను విక్రయించినట్టు చెప్పారు. ఇంధన రిటైలింగ్ వ్యాపార విస్తరణ కొనసాగుతుందని అశోక్ చెప్పారు. కాగా, షేరు ఒక్కింటికీ రూ.1 తుది డివిడెండ్‌ను బోర్డు సిఫారసు చేసింది. -
బ్యాంకు ఆఫ్ ఇండియా మళ్లీ కుదేలు
ముంబై : దేశంలోనే ఆరో అతిపెద్ద రుణదాత బ్యాంకు ఆఫ్ ఇండియా లిమిటెడ్ మరోసారి భారీ నష్టాలను నమోదుచేసింది. మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్ లో ఈ బ్యాంకు నికర నష్టాలు 1,046 కోట్లగా ఫైల్ చేసింది. బ్యాడ్ లోన్స్ శాతం తగ్గకుండా అలానే అత్యధికంగా ఉండటంతో బ్యాంకుకు మరోసారి భారీ నష్టాలే నమోదయ్యాయి. అయితే ముందటి ఆర్థిక సంవత్సరం కంటే ఈ ఏడాది కొంత నష్టాలను బ్యాంకు ఆఫ్ ఇండియా తగ్గించుకుంది. గతేడాది ఈ బ్యాంకు నష్టాలు రూ.3,587 కోట్లు. డిసెంబర్ క్వార్టర్ లో బ్యాంకు రూ.102 కోట్ల నికర లాభాలను నమోదుచేసింది. గత క్వార్టర్ కంటే ఆస్తుల నాణ్యత క్షీణించిందని బ్యాంకు ఆఫ్ ఇండియా సోమవారం బీఎస్ఈ ఫైలింగ్ లో పేర్కొంది. నికర వడ్డీ ఆదాయం బ్యాంకుకు 9 శాతం పెరిగి రూ.3469 కోట్లగా నమోదయ్యాయని తెలిపింది. ముందటి ఆర్థిక సంవత్సరం ఈ వడ్డీ ఆదాయాలు రూ.3187 కోట్లు. బ్యాంకు ఆస్తుల నాణ్యత క్షీణించడానికి ప్రధాన కారణం స్థూల నిరర్థక ఆస్తులు పెరగడమేనని తెలిసింది. డిసెంబర్ క్వార్టర్ లో రూ.51,781 కోట్లగా ఉన్న ఈ స్థూల నిరర్థక ఆస్తులు, ఈ క్వార్టర్ లో రూ.52,044 కోట్లకు పెరిగాయి. ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్ లో ఇవి రూ.49,879 కోట్లు. మొత్తం రుణాల్లో బ్యాడ్ లోన్స్ అలానే అత్యధికంగా 13.22 శాతంగా ఉన్నాయి. గత క్వార్టర్ లో ఇవి 13.38 శాతం. ఫలితాల ప్రకటనాంతరం బ్యాంకు ఆఫ్ ఇండియా షేర్లు 7 శాతం మేర నష్టపోయి, రూ.166 వద్ద నమోదవుతున్నాయి. -
ఐడీబీఐకి బ్యాడ్ లోన్ల బెడద
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఐడీబీఐ బ్యాంక్ గత ఏడాది క్యూ4 ఫలితాల్లో ఢమాల్ అంది. గురువారం విడుదల చేసిన జనవరి-మార్చి క్వార్టర్ ఫలితాల్లో భారీగా నష్టపోయింది. ముఖ్యంగా తమ లోన్లలో అయిదుశాతం బాడ్ లోన్లుగా మారినట్టు కంపెనీ ప్రకటించింది. దీంతో క్యూ4లో బ్యాంకు నికర నష్టం 84శాతం ఎగిసి రూ. 3,200 కోట్లగా నమోదైంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.1,736 కోట్లగా నమోదైంది. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 14 శాతం పెరిగి రూ. 1633 కోట్లను తాకింది. స్థూల మొండిబకాయిలు(జీఎన్‌పీఏలు) 15.6 శాతం నుంచి 21.25 శాతానికి ఎగశాయి. ఐడిబిఐ బ్యాంక్ స్థూల నిరర్ధక ఆస్తులు 27 శాతం పెరిగి రూ. 44,753 కోట్లుగా ఉన్నట్టు బ్యాంకు రెగ్యులేటరీ ఫైలింగ్ లో వెల్లడించింది. ఐడీబీఐ బ్యాంకు మొత్తం అభివృద్ధిలో నికర అసంతృప్త ఆస్తులు భారీగా పెరిగాయి. డిసెంబర్ త్రైమాసికంలో 9.61 శాతంతో పోలిస్తే 13.21 శాతం పెరిగాయి. నికర ప్రొవిజన్లు రూ. 4450 కోట్ల నుంచి రూ. 6209 కోట్లకు పెరిగాయి. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఐడీబీఐ బ్యాంక్ షేరు 9శాతానికిపైగా పతనమైంది. గత మూడు నెలల్లో నిఫ్టి బ్యాంక్‌లో 12 శాతం లాభంతో పోలిస్తే ఐడిబిఐ బ్యాంకు షేర్లు 13 శాతం పడిపోయాయి. -
బజాజ్ ఆటో డీలా: భారీ డివిడెండ్
ముంబై: ఆటో రంగ దిగ్గజం బజాజ్ ఆటో లిమిటెడ్ గతేడాది క్యూ4 ఫలితాల్లో నిరాశపర్చింది. విశ్లేషకుల అంచనాలను అధిగమించిలేని నికర లాభాలు భారీగా పడిపోయాయి. క్యూ4 జనవరి-మార్చి ఫలితాలను గురువారం ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో నికరలాభంలో 16 శాతం క్షీణించి రూ .802 కోట్లు (124.50 మిలియన్ డాలర్లు)ను రిపోర్టు చేసింది. గత ఏడాది క్వార్టర్ లో ఇది రూ. 949 కోట్లగా ఉంది. బీఎస్ -4 వాహనాలు, ఇన్పుట్ ఖర్చులు పెరగడం తదితర కారణాలను సంస్థ లాభాలను దెబ్బతీసాయి. మార్చినాటి క్వార్టర్ ఆపరేషన్ల ఆదాయం రూ.5210లు, మొత్తం ఆదాయం రూ.5710 లుసాధించినట్టు బజాజ్ ఆటో రెగ్యులేటరీ ఫైలింగ్ లో తెలిపింది మార్చినాటి క్వార్టర్ ఆపరేషన్ల ఆదాయం రూ.5210లు, మొత్తం ఆదాయం రూ.5710 లుసాధించినట్టు బజాజ్ రెగ్యులేటరీ ఫైలింగ్ లో తెలిపింది. నికర అమ్మకాలు సైతం 9 శాతం తగ్గి రూ. 5,213 కోట్లకు చేరాయి. నిర్వహణ లాభం(ఇబిటా) 21 శాతం తిరోగమించి రూ. 905 కోట్లు అయ్యింది. మరోవైపు ప్రతి ఈక్విటీ షేరుకు రూ.55 డివిడెండ్‌ను బోర్డు ప్రతిపాదించింది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం బీఎస్ఈలో ఈ షేరు 2 శాతానికిపైగా క్షీణించింది. -
అదరగొట్టిన హెచ్‌యూఎల్
ముంబై: ఎఫ్ఎంసీజీ దిగ్గజం హెచ్‌యూఎల్ (హిందుస్తాన్ యూనీ లీవర్) క్యూ4 ఫలితాల్లో అదరగొట్టింది. మార్కెట్ విశ్లేషకులు అంచనాలను మించి లాభాలను నమోదుచేసింది. లాక్మే సౌందర్య సాధనాల, బ్రూ కాఫీ వరకు ఉత్పత్తుల తయారీదారు హిందుస్థాన్ యూనీలీవర్ లిమిటెడ్ క్యూల త్రైమాసిక లాభంలో 6.2 శాతం పెరుగుదలను నమోదు చేసింది. నికర లాభాలు భారీగా పుంజుకుని 1,183కోట్లు సాధించినట్టు రిపోర్ట్ చేసింది. అంతకుముందు సంవత్సరం ఇది 1,114 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం రూ.8773 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ఎబిట్టా మార్జిన్లు రూ.1738కోట్లుగా నిలిచాయి. ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ నాలుగు శాతంగా నిలిచినట్టు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్ లో తెలిపింది. పియర్స్, డోవ్ ఉత్పత్తుల యొక్క బలమైన విక్రయాలు సహాయపడ్డాయని పేర్కొంది. వ్యక్తిగత సంరక్షణ సెగ్మెంట్ వాసలైన్ ,పాండ్స్ లాంటి బ్రాండ్ల రెవెన్యూ 8 శాతం పెరిగి రూ .4,075 కోట్లకు చేరుకుందని ప్రకటించింది. అలాగే ఇటీవల లాంచ్ చేసిన ఫెయిర్ అండ్ లవ్లీ కూడా తమ ఆదాయాల్లో కీలక పాత్రపోషించిందని యాజమాన్యం ప్రకటించింది. అలాగే జీఎస్టీ ని స్వాగతిస్తున్నట్టు పేర్కొంది. -
అంచనాలను బీట్ చేసిన వేదాంత
ముంబై: ప్రముఖ మైనింగ్ సంస్థ వేదాంత లిమిటెడ్ క్యూ4 లో మెరుగైన ఫలితాలను ప్రకటించింది. అనిల్ అగర్వాల్ గ్రూప్ డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంత కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 2,988 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఏడాది రూ.21,104కోట్ల నష్టాలతో పోలిస్తే , మార్చి 31 తో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నికర లాభం 466.09 మిలియన్ డాలర్లుగా నమోదైంది. కమోడిటీ ధరలు, జింక్ వాల్యూములు పుంజుకున్న నేపథ్యంలో విశ్లేషకులు అంచనాలను బీట్ చేసింది. ముఖ్యంగా కైయిర్న్ ఇండియా లిమిటెడ్ కొనుగోలు తర్వాత రూ. 2,667 కోట్ల లాభాన్ని ఆర్జించనుందని విశ్లేషకులు అంచనా వేశారు. మొత్తం ఆదాయం సైతం 40 శాతం పెరిగి రూ. 23,691 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ఆదాయం 35 శాతం పెరిగి రూ .24,612 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం(ఇబిటా) రూ. 7,350 కోట్లు కాగా మార్జిన్లు 32.7 శాతంగా నమోదయ్యాయి. స్టాండెలోన్ ప్రాతిపదికన రూ. 1410 కోట్ల నికర లాభం ప్రకటించింది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం బీఎస్ఈలో వేదాంతా షేరు 2 శాతం లాభపడింది. -
కోల్గేట్ లాభం రూ.143కోట్లు
ముంబై: ఎఫ్ఎంసీజీ మేజర్ కోల్గేట్-పామోలివ్ ఇండియా 2016-17సంవత్సరానికి క్యూ4 ఫలితాలు ప్రకటించింది. మార్చి 31 ముగిసిన నాల్గవ త్రైమాసికంలో రూ .143 కోట్ల నికర లాభాలను నమోదుచేసింది. . కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి-మార్చి)లో రూ. 142.58 కోట్ల నికర లాభం ఆర్జించామని కాల్గేట్-పామోలివ్ రెగ్యులేటరీ ఫైలింగ్ లో కంపెనీ తెలిపింది. నిర్వహణ లాభం(ఇబిటా) రూ. 244 కోట్లను నివేదించింది. మొత్తం ఆదాయం రూ. 1177 కోట్లను తాకింది. ప్రకటనల వ్యయాలు 24 శాతం పెరిగి రూ. 144 కోట్లకు చేరగా.. ఇబిటా మార్జిన్లు 22.1 శాతం నుంచి 23.7 శాతానికి బలపడ్డాయి. అయితే అమ్మకాల పరిమాణం 3 శాతం క్షీణించినట్లు కంపెనీ తెలియజేసింది. టూత్‌పేస్ట్ మార్కెట్ వాటా మాత్రం 47 శాతం నుంచి 55 శాతానికి ఎగసినట్లు వెల్లడించింది. గత క్వార్టర్లో లిక్విడిటీ క్రంచ్ ప్రభావం నుంచి నాలుగవ త్రైమాసికంలో రికవరీ సాధించామని కోల్గేట్ పామోలివ్ (ఇండియా) ఎగ్జిక్యూటివ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇసాం బచలాని ఫలితాల వెల్లడి సందర్భంగా పేర్కొన్నారు. మొత్తం 2015-16 ఆర్థిక సంవత్సరంలో 581 కోట్ల లాభాలతో పోటిస్తే, ప్రస్తుతంరూ. 578 కోట్ల నికర లాభాలను సాధించినట్టు పేర్కొన్నారు. ఈ ఫలితాల నేపథ్యంలో కోల్గేట్ 2శాతంపైగా నష్టపోయింది -
కర్ణాటక బ్యాంక్ లాభాలు 30శాతం జంప్
ముంబై: ప్రయివేట్ రంగ సంస్థ కర్ణాటక బ్యాంక్ 2016-17సంవత్సరానికిగాను క్యూ4 ఫలితాలు ప్రకటించింది. జనవరి-మార్చి త్రైమాసికంలో భారీ లాభాలను సాధించింది. కంపెనీ నికర లాభం 30 శాతం జంప్‌చేసి రూ. 138 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో (2015-16 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి కాలంలో) 106.79 కోట్ల రూపాయల నికరలాభాన్ని నమోదు చేసింది. అయితే నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) మాత్రం 2 శాతం తగ్గి రూ. 352 కోట్లకు పరిమితమైంది. మార్చి త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ. 1,606.19 కోట్లకు పెరిగింది. గత ఏడాది రూ. 1,447.68 కోట్లగా ఉంది. మొత్తం ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 5,354.74 కోట్ల రూపాయల నుంచి రూ .5,535.07 కోట్లకు పెరిగింది. త్రైమాసిక ప్రాతిపదికన స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 4.3 శాతం నుంచి 4.2 శాతానికి స్వల్పంగా తగ్గాయి. నికర ఎన్పీఏలు మరింత అధికంగా 3 శాతం నుంచి 2.64 శాతానికి దిగివచ్చాయి. వార్షిక ప్రాతిపదికన ప్రొవిజన్లు రూ. 112 కోట్ల నుంచి రూ. 160 కోట్లకు పెరిగాయి. అలాగే ప్రతిషేరుకు 4 రూపాయల డివిడెండ్ చెల్లించేందకు బోర్డు ఆమోదం తెలిపిందని బ్యాంకు ప్రకటించింది -
జియో ఎఫెక్ట్: ఐడియా ఆశ్చర్యకర ఫలితాలు
ఉచిత ఆఫర్లతో సునామీ సృష్టించిన రిలయన్స్ జియో దెబ్బతో టెలికాం మేజర్ ఐడియా సెల్యులార్ మార్చి క్వార్టర్లో మరోసారి చతికిలబడింది. టెలికాం మార్కెట్ లోకి జియో ఎంట్రీ ఇచ్చిన తరువాత ఐడియా వరుసగా రెండవ త్రైమాసికంలో కూడా నష్టపోయింది. అయితే మార్కెట్ వర్గాలను ఆశ్చరపరుస్తూ నష్టాలనుంచి భారీగా కోలుకుంది. నష్టం రూ.765 కోట్లుగా ఉండనుందని ఎనలిస్టులు అంచనావేయగా బాటమ్ లైన్ లాభాలతో భారీగా పుంజుకుని రూ.328 కోట్లను నికర నష్టాలను నమోదుచేసింది. 2015-16 సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.2,714 కోట్ల లాభాలను ఆర్జించింది. ఆదాయం 8126.1 కోట్ల రూపాయల వద్దే నమోదైంది. ఆదాయం రూ .8,135 కోట్లుగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేశారు. వడ్డీకి ముందు ఆదాయాలు, పన్నులు, తరుగుదల , రుణ విమోచన (ఎబిటాలు) రూ. 2,196 కోట్లు, ఎబిటా మార్జిన్ 27 శాతంగా ప్రకటించింది. కాగా జియో మరో టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ఇండియా ఆదాయం కూడా 6.25 శాతం తగ్గిన సంగతి తెలిసిందే. భారతి ఎయిర్‌టెల్‌తో పోల్చితే, 100శాతం దేశీయ మార్కెట్‌పైనే ఆధారపడిన భారీగా నష్టపోయింది. అయితే వోడాఫోన్‌తో విలీనం కారణంగా 2017 లో స్టాక్ 22 శాతం పెరిగడంతో ఐడియా నష్టాలనుంచి భారీగా కోలుకుంది. -
మూడింతలు జంప్ చేసిన డాక్టర్ రెడ్డీస్
న్యూఢిల్లీ : దేశీయ ప్రముఖ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ లాభాల్లో మూడింతలు జంప్ చేసింది. శుక్రవారం ప్రకటించిన మార్చితో ముగిసిన క్వార్టర్ ఫలితాల్లో రూ.337.60 కోట్ల నికర లాభాలను నమోదుచేసింది. అయితే ఈ లాభాలు విశ్లేషకులు అంచనావేసిన రూ.340 కోట్ల కంటే కొంచెం తక్కువగా ఉన్నాయి. ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్ లో ఈ ల్యాబ్స్ నికర లాభాలు రూ.122.6 కోట్లగా ఉన్నాయి. అయితే కంపెనీ రెవెన్యూలు మాత్రం కిందటి ఆర్థిక సంవత్సరం కంటే తగ్గాయి. ఏడాది ఏడాదికి కంపెనీ రెవెన్యూలు 5.3 శాతం పడిపోయి రూ.3,498.50 కోట్లగా రికార్డయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్ లో ఇవి రూ.3,695.10 కోట్లగా ఉన్నాయి. అమెరికా మార్కెట్లో కొత్త ఉత్పత్తుల ఆమోదం తక్కువగా ఉండటంతో ఈ ఆర్థిక సంవత్సరం చాలా ఛాలెంజింగ్ గా ఉందని కంపెనీ కో-చైర్మన్ జీవీ ప్రసాద్ తెలిపారు. ఖర్చుల నిర్మాణంలో హేతుబద్దీకరణ, ఆర్గనైజేషన్ లో క్వాలిటీ కల్చర్ రూపొందించడానికే ఎక్కువగా దృష్టిసారించనున్నట్టు ప్రసాద్ పేర్కొన్నారు. క్యూ4 ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేర్లు మార్నింగ్ ట్రేడింగ్ నుంచి నష్టాల్లో కొనసాగుతూ వస్తున్నాయి. 52 వారాల కనిష్ట స్థాయిలకు పడిపోయిన షేర్లు, ప్రస్తుతం లాభాల బాట పట్టాయి. -
ఎయిర్టెల్ లాభం 72% డౌన్
♦ తీవ్ర స్థాయిలో రిలయన్స్ జియో ప్రభావం ♦ వరుసగా రెండో క్వార్టర్లోనూ క్షీణించిన నికర లాభం ♦ 12 శాతం తగ్గిన మొత్తం ఆదాయం; రూ.21,935 కోట్లు ♦ ఒక్కో షేర్‌కు రూ.1 డివిడెండ్ న్యూఢిల్లీ: భారతీ ఎయిర్టెల్ ఆర్థిక ఫలితాలపై రిలయన్స్ జియో ప్రభావం తీవ్రంగానే ఉంది. గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి క్వార్టర్లో ఎయిర్టెల్ నికర లాభం ఏకంగా 72 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2015–16) క్యూ4లో రూ.1,319 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్) గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.373 కోట్లకు తగ్గిందని ఎయిర్టెల్ తెలిపింది. రిలయన్స్ జియో పోటీ తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపించిందని కంపెనీ ఎండీ, సీఈఓ(భారత్, దక్షిణాసియా) గోపాల్ విఠల్ చెప్పారు. మొత్తం ఆదాయం రూ.24,960 కోట్ల నుంచి 12 శాతం తగ్గి రూ.21,935 కోట్లకు చేరిందని వివరించారు. గత ఆర్థిక సంవత్సరానికి గాను ఇక ఒక్కో షేర్‌కు రూ.1 తుది డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు. జియో ఇన్కమింగ్ కాల్స్ సునామీ... కొత్తగా వచ్చిన రిలయన్స్ జియో ఆకర్షణీయమైన ఆఫర్ల కారణంగా నికర లాభం వరుసగా రెండో క్వార్టర్లోనూ క్షీణించిందని విఠల్ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో కంపెనీ నికర లాభం 55 శాతం తగ్గిందన్నారు. మూలధన పెట్టుబడులను రూ.6,057 కోట్ల నుంచి రూ.3,808 కోట్లకు తగ్గించుకున్నప్పటికీ, నికర లాభంలో క్షీణత తప్పలేదని చెప్పారు. రిలయన్స్ జియో ఉచిత ఆఫర్ల కారణంగా ఇన్కమింగ్ కాల్స్ సునామీలా వెల్లువెత్తాయని చెప్పారు. తమ నెట్‌వర్క్‌లో ఈ ఇన్కమింగ్ ట్రాఫిక్‌ను తట్టుకోవడానికి చెప్పుకోదగ్గ స్థాయిలో పెట్టుబడులు పెట్టాల్సి వచ్చిందన్నారు. ఫలితంగా గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో ఆదాయం 7 శాతం తగ్గిందని, ఇబిటా మార్జిన్లు 2.9 శాతం మేర తగ్గిపోయాయని పేర్కొన్నారు. గత కొన్ని ఆర్థిక సంవత్సరాల్లో ఆదాయ వృద్ధి రెండంకెల్లో ఉండేదని, గత ఆర్థిక సంవత్సరంలో కేవలం 3.6 శాతం వృద్ధినే సాధించామని పేర్కొన్నారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2015–16లో రూ.6,077 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 38 శాతం తగ్గి రూ.3,800 కోట్లకు చేరింది. ఆదాయం 1 శాతం వృద్ధితో రూ.95,468 కోట్లకు పెరిగింది. కాగా మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వచ్చాయి. ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో బీఎస్ఈలో భారతీ ఎయిర్టెల్ షేర్ 1.7 శాతం క్షీణించి రూ.345 వద్ద ముగిసింది. జియోతో టెలికం వ్యవస్థ చిన్నాభిన్నం! ముకేష్ అంబానీ ప్రమోట్ చేస్తున్న రిలయన్స్ జియో గత ఏడాది సెప్టెంబర్‌లో ఉచిత వాయిస్, డేటా ప్లాన్లను ఆఫర్ చేసింది. మార్చిలో వాణిజ్యపరంగా కార్యకలాపాలు ప్రారంభించిన జియో మరింత దూకుడుగా తన ఆఫర్లను అందిస్తోంది. రిలయన్స్ జియో దూకుడు కారణంగా టెలికం కంపెనీలే కాకుండా మొత్తం టెలికం పరిశ్రమ ఆర్థిక పరిస్థితులను అస్తవ్యస్తం చేసిందని నిపుణులంటున్నారు. టెలికం పరిశ్రమ ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో మొదటిసారిగా క్షీణించింది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు టెలికం పరిశ్రమ బకాయిలు రూ.4.60 లక్షల కోట్లుగా ఉంటాయని అంచనా. ఫలితాలు కొన్ని ముఖ్యాంశాలు... ♦ ఈ ఏడాది మార్చి 31 నాటికి భారత్, దక్షిణాసియా, ఆఫ్రికాలో మొత్తం ఎయిర్టెల్ వినియోగదారుల సంఖ్య 35.6 కోట్లుగా ఉంది. ♦ మొత్తం ఆదాయంలో 77 శాతం ఉండే భారత్ మార్కెట్లో ఈ కంపెనీకి 27.4 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ♦ నిర్వహణ లాభాన్ని సూచించే ఇబిటా 13 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.9,188 కోట్లుగా ఉన్న ఇబిటా గత ఆర్థిక సంవత్సరం(2016–17) క్యూ4లో రూ.7,993 కోట్లకు తగ్గింది. ♦ డేటా ఏఆర్పీయూ(యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్) 17 శాతం క్షీణించి రూ.162కు, వాయిస్ ఏఆర్పీయూ కూడా 17 శాతం తగ్గి రూ.114కు చేరాయి. -
పడిపోయిన హౌసింగ్ ఫైనాన్స్ దిగ్గజం
హౌసింగ్ ఫైనాన్స్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ తన లాభాలను కోల్పోయింది. మార్చితో ముగిసిన క్వార్టర్ లో ఏడాది ఏడాదికి ఈ దిగ్గజం స్టాండలోన్ నికర లాభాలు 21.58 శాతం క్షీణించి రూ.2,044.20 కోట్లగా నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్ లో ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ నికర లాభాలు రూ.2,607.05కోట్లగా ఉన్నాయి. ఈ క్వార్టర్ లో కంపెనీ ఫైనాన్స్ కాస్ట్ గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 7.56 శాతం పెరిగి, రూ.5,237.94 కోట్లగా రికార్డైంది. ప్రొవిజన్లు కూడా క్వార్టర్ క్వార్టర్ కు 26.49 శాతం పెరిగాయి. కానీ గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్ తో పోలిస్తే ఇవి 73 శాతం తగ్గాయి. ప్రస్తుతం ఈ ప్రొవిజన్లు రూ.148 కోట్లు కాగ, గతేడాది ఇవి రూ.545 కోట్లగా ఉన్నాయి. నికర వడ్డీ ఆదాయాలు అంచనాల కంటే స్వల్పంగా తగ్గాయి. ఈటీ నౌ అంచనాల ప్రకారం ఈ ఆదాయాలు రూ.3,244కోట్లగా ఉంటాయని తెలియగా.. కంపెనీ ఫైలింగ్ ప్రకారం ఇవి రూ.3,215 కోట్లగా మాత్రమే రికార్డయ్యాయి. ఒక్కో షేరుపై ఆర్జించే ఆదాయం కూడా గతేడాది కంటే తగ్గి రూ.12.06గా నమోదైంది. ఫలితాల ప్రకటన సందర్భంగా ఒక్కో షేరుపై 15 రూపాయల డివిడెండ్ ఇవ్వాలని బోర్డు ఆమోదించినట్టు ఈ హౌసింగ్ ఫైనాన్స్ తెలిపింది. -
దూసుకుపోతున్న ఐసీఐసీఐ
ముంబై: ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంక్ ఫలితాల నేపథ్యంలో గురువారం నాటి మార్కెట్ లో దూసుకుపోతోంది. గతేడాది(2016-17) క్యూ4లో అంచనాలను మించిన ఫలితాలు ప్రకటించిన ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ లాభాల దుమ్మురేపుతోంది. నిన్న మార్కెట్ ముగిసిన తరువాత ఫలితలను ప్రకటించిన బ్యాంక్ షేరు ఆరంభంలోనే అదరగొట్టింది. ఒక దశలో 9శాతం ఎగిసి స్టార్ ఆఫ్ ద డేగా నిలిచింది. ప్రస్తుతం 8 శాతానికిపైగా జంప్‌చేసి రూ. 291 వద్ద ట్రేడవుతోంది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల మొండి బకాయిల(ఎన్‌పిఎ) సమస్య పరిష్కారం కోసం ఆర్డినెన్స్ తేవాలని నిర్ణయించడం బ్యాంకింగ్ సెక్టార్లో జోష్ పెంచింది. దాదాపు అన్ని బ్యాంక్ పేర్లు లాభాల్లో ట్రేడ్అవుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం(క్యూ4)లో రూ.2,025 కోట్ల నికర లాభం(స్టాండెలోన్) ఆర్జించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం(2015–16) క్యూ4లో రూ.702 కోట్ల నికర లాభం సాధించామని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. నికర వడ్డీ ఆదాయం అధికంగా ఉండటం, కేటాయింపులు తక్కువగా ఉండటం వల్ల నికర లాభం మూడు రెట్లు (188 శాతం) పెరిగిందని వివరించింది. ఇతర ఆదాయాలు బాగా తగ్గడంతో వృద్ధి తగ్గిందని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.18,591 కోట్ల నుంచి రూ.16,586 కోట్లకు తగ్గిందని పేర్కొంది. దీంతోపాటు రూ. 2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.2.5 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని, అలాగే ప్రతి పది ఈక్విటీ షేర్లకు ఒక బోనస్ షేర్(1:10)ను ఇవ్వడానికి బ్యాంక్ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని ఐసీఐసీఐ బ్యాంక్ పేర్కొంది. ప్రభుత్వ రంగ బ్యాంకు(పిఎస్బి)లకు గుది బండగా మారిన ఎన్పీఏ ల పరిష్కారంతో పాటు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక విషయాల కేంద్ర కేబినెట్ కమిటీ (సిసిఈ) సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. -
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం రూ.2,025 కోట్లు
♦ భారీగా పెరిగిన నికర ఎన్పీఏలు ♦ ప్రతి పది షేర్లకు ఒక బోనస్ షేర్ ♦ ఒక్కో షేర్‌కు రూ.2.50 డివిడెండ్ న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం(క్యూ4)లో రూ.2,025 కోట్ల నికర లాభం(స్టాండెలోన్) ఆర్జించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం(2015–16) క్యూ4లో రూ.702 కోట్ల నికర లాభం సాధించామని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. నికర వడ్డీ ఆదాయం అధికంగా ఉండటం, కేటాయింపులు తక్కువగా ఉండటం వల్ల నికర లాభం మూడు రెట్లు (188 శాతం) పెరిగిందని వివరించింది. ఇతర ఆదాయాలు బాగా తగ్గడంతో వృద్ధి తగ్గిందని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.18,591 కోట్ల నుంచి రూ.16,586 కోట్లకు తగ్గిందని పేర్కొంది. వడ్డీయేతర(ఇతర) ఆదాయం 41 శాతం క్షీణించి రూ.3,017 కోట్లకు చేరిందని, నిర్వహణ లాభం 28 శాతం క్షీణించి రూ.5,112 కోట్లకు తగ్గిందని పేర్కొంది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఇతర ఆదాయం భారీగా వచ్చిందని, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్, ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో వాటా విక్రయం వల్ల ఆ క్వార్టర్లో భారీగా ఇతర ఆదాయం సమకూరిందని వివరించింది. కాగా, క్యూ4లో కన్సాలిటేడెడ్ నికర లాభం ఐదు రెట్లు పెరిగి రూ.2,083 కోట్లకు చేరిందని బ్యాంక్ పేర్కొంది. ఎన్ఐఐ 10% అప్.. నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) 10% వృద్ధితో రూ.5,962 కోట్లకు, రుణ వృద్ధి 7% పెరుగుదలతో రూ.4.64 లక్షల కోట్లకు పెరిగినట్లు ఐసీఐసీఐ తెలిపింది. నికర వడ్డీ మార్జిన్ 3.12% నుంచి 3.57 శాతానికి పెరిగింది. దేశీయ రుణాలు 14%, మొత్తం రుణాల్లో 52%గా ఉన్న రిటైల్ రుణాలు 19% చొప్పున వృద్ది సాధించాయి. డిపాజిట్లు 16 శాతం వృద్ధితో రూ.4.9 లక్షల కోట్లకు పెరిగాయి. ఫీజు ఆదాయం 11% వృద్ధితో రూ.2,446 కోట్లకు పెరిగిందని బ్యాంక్ పేర్కొంది. తగ్గిన కేటాయింపులు... స్థూల మొండి బకాయిలు(ఎన్పీఏ) 12 శాతం వృద్ధితో రూ.42,552 కోట్లకు, నికర ఎన్పీఏలు 26 శాతం వృద్ధితో రూ.25,451 కోట్లకు పెరిగాయి. అంటే మొత్తం రుణాల్లో స్థూల స్థూల ఎన్పీఏలు 5.21 శాతం నుంచి 7.89 శాతానికి, నికర ఎన్పీఏలు 2.67% నుంచి 4.89%కి ఎగబాకాయి. సిమెంట్ రంగానికి చెందిన ఒక కంపెనీ రూ.5,378 కోట్ల రుణం కారణంగా మొండి బకాయిలు బాగా పెరిగాయని సమాచారం. ఎన్పీఏలకు కేటాయింపులు క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 7% వృద్ధితో రూ.2,898 కోట్లకు పెరిగాయని, అయితే ఏడాది ప్రాతిపదికన చూస్తే 13%ట క్షీణించాయని బ్యాంక్ పేర్కొంది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2015–16) క్యూ4లో కేటాయింపులు రూ.3,600 కోట్లుగా ఉన్నాయని వివరించింది. పూర్తి ఏడాది ఇలా... ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2015–16లో రూ.9,726 కోట్లుగా ఉన్న నికర లాభం 2016–17లో రూ.9,801 కోట్లకు పెరిగిందని ఐసీఐసీఐ బ్యాంక్ వివరించింది. ఆదాయం రూ. 68,062 కోట్ల నుంచి రూ.73,661 కోట్లకు ఎగసిందని పేర్కొంది. 1:10 బోనస్ రూ. 2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.2.5 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని, అలాగే ప్రతి పది ఈక్విటీ షేర్లకు ఒక బోనస్ షేర్(1:10)ను ఇవ్వడానికి బ్యాంక్ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని ఐసీఐసీఐ బ్యాంక్ పేర్కొంది. మార్కెట్ ముగిసిన తర్వాత ఆర్థిక ఫలితాలు వచ్చాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఐసీఐసీఐ బ్యాంక్ షేర్ 1.1 శాతం తగ్గి రూ.273 వద్ద ముగిసింది. మొండి బకాయిలు పెరగడం వల్ల నికర వడ్డీ మార్జిన్ తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నికర వడ్డీ మార్జిన్ 3 శాతానికి పైగానే సాధించగలమని అంచనా వేస్తున్నాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొండి బకాయిలు చెప్పుకోదగిన స్థాయిలో తక్కువగానే ఉండే అవకాశాలున్నాయి. గతంలోని కొన్ని మొండిబకాయిలు వసూలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. –చందా కొచర్, ఐసీఐసీఐ చీఫ్ -
అదరగొట్టిన ఐసీఐసీఐ, బోనస్ బొనాంజ!
న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద ప్రైవేట్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు లాభాల్లో అదరగొట్టింది. నాలుగో త్రైమాసికంలో ఏడాది ఏడాదికి లాభాలను మూడింతలు పెంచుకుంది. మార్చి క్వార్టర్ లో మూడింతలు లేదా 188 శాతం పెరిగిన తన నికర లాభాలు రూ.2.025 కోట్లగా ప్రకటించింది.ఈ లాభాలు విశ్లేషకులు అంచనాకు కొంచెం తగ్గాయి. గతేడాది ఇదే క్వార్టర్ లో ఈ దిగ్గజం రూ.702 కోట్ల నికర లాభాలను నమోదుచేసింది. నికర లాభాలను మూడింతలు పెంచుకోవడంతో కంపెనీ బోసస్ బొనాంజను ప్రకటించింది. ప్రతి పది షేర్లకు, ఒక బోనస్ షేరు, ఒక్కో షేరుకు రూ.2.50 డివిడెంట్ ను అందించనున్నట్టు ఐసీఐసీఐ తెలిపింది. లాభాలతో పాటు బ్యాంకు ఆర్జించే నికర వడ్డీ ఆదాయాలు(రుణాలపై ఆర్జించే వడ్డీరేట్లకు, డిపాజిట్లపై ఇచ్చే వడ్డీరేట్లకు మధ్య తేడా) కూడా 10.3 శాతం ఎగిసి, రూ.5,962 కోట్లగా నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఈ ఆదాయాలు రూ.5,405 కోట్లగా ఉన్నాయి. నాన్-ఇంటరెస్ట్ ఇన్ కమ్ లు కూడా ఈ క్వార్టర్ లో రూ.3,017కోట్లగా ఉన్నట్టు బ్యాంకు పేర్కొంది. ఇదేసమయంలో బ్యాంకు ప్రొవిజన్లు కూడా ఈ క్వార్టర్లో బాగానే పెరిగాయి. గత డిసెంబర్ క్వార్టర్ లో రూ.2,713 కోట్లగా ఉన్న ప్రొవిజన్స్ ఈ క్వార్టర్ లో రూ.2,898 కోట్లగా రికార్డ్ అయ్యాయి. అయితే ఇవి గత ఆర్థికసంవత్సరంతో పోల్చుకుంటే తక్కువే. స్థూల నిరర్థక ఆస్తులు కూడా ఈ క్వార్టర్ లో 7.89 శాతంగా ఉన్నట్టు తెలిసింది. గత క్వార్టర్ లో ఇవి 7.91శాతంగా ఉన్నాయి. నికరంగా చూసుకుంటే ఈ నిరర్థక ఆస్తులు 4.89 శాతం పెరిగాయి. ఫలితాల ప్రకటన నేపథ్యంలో బ్యాంకు షేరు నేటి ట్రేడింగ్ లో 1.16 శాతం పడిపోయి 272.75గా నమోదైంది. కాగ మార్కెట్ అవర్స్ తర్వాత బ్యాంకు తన ఫలితాలను ప్రకటించింది. -
ఫెడరల్ బ్యాంక్ లాభం 25 రెట్లు అప్
తగ్గిన నికర మొండి బకాయిలు ఒక్కో షేర్‌కు 90 పైసలు డివిడెండ్ న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఫెడరల్ బ్యాంక్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో దాదాపు 25 రెట్లు పెరిగింది. 2015–16 క్యూ4లో రూ.10 కోట్లుగా ఉన్న నికర లాభం 2016–17 క్యూ4లో రూ.257 కోట్లకు పెరిగిందని ఫెడరల్ బ్యాంక్ పేర్కొంది. నికర మొండి బకాయిలు తగ్గడం.. రిటైల్, కార్పొరేట్ బ్యాంకింగ్ విభాగాల మంచి పనితీరుతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని బ్యాంక్ ఎండీ, సీఈఓ శ్యామశ్రీనివాసన్ చెప్పారు. ఆదాయం రూ.2,263 కోట్ల నుంచి రూ.2,598 కోట్లకు పెరిగిందన్నారు. ఒక్కో షేర్‌కు 90 పైసలు (45%) డివిడెండ్‌ను ఇవ్వనున్నట్లు తెలిపారు. రూ.2,500 కోట్లు సమీకరణ: రూ.2,500 కోట్ల మూలధన నిధులు సమీకరించడానికి తమ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని శ్రీనివాసన్ పేర్కొన్నారు. రైట్స్ ఇష్యూ, ప్రిఫరెన్షియల్ ఇష్యూ, ఎఫ్‌పీఓ, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్(క్విప్).. ఇలా వివిధ మార్గాల్లో ఈ నిధులను సమీకరించనున్నామని చెప్పారు. మొత్తం విదేశీ వాటాను 74 శాతానికి పెంచుకునే ప్రతిపాదనను డైరెక్టర్ల బోర్డ్ ఆమోదించిందని తెలిపారు. బీఎస్ఈలో ఫెడరల్ బ్యాంక్ షేర్ ఇంట్రాడేలో ఏడాది గరిష్ట స్థాయి, రూ.109ను తాకింది. చివరకు 14 శాతం లాభంతో రూ.108 వద్ద ముగిసింది. -
బంధన్ బ్యాంక్ నికర లాభం రెట్టింపు
ముంబై: బంధన్ బ్యాంక్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం(2016–17) నాలుగో త్రైమాసిక కాలానికి రెట్టింపునకుపైగా పెరిగింది. రూ.323కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది(2015–16) క్యూ4లో లాభం రూ.142 కోట్లు. ఆదాయం పెరగడం, వ్యయాలు తగ్గడంతో ఈ స్థాయి నికర లాభం సాధించామని బంధన్ బ్యాంక్ ఎండీ, సీఈఓ సిఎస్ ఘోష్ చెప్పారు. రుణాలు 51 శాతం వృద్ధి సాధించడంతో నికర వడ్డీ ఆదాయం 50 శాతం వృద్ధితో రూ.687 కోట్లకు పెరిగిందని వివరించారు. వడ్డీయేతర ఆదాయం రూ.82 కోట్ల నుంచి రూ.132 కోట్లకు వృద్ధి చెందిందని తెలిపారు. 2015–16 ఆర్థిక సంవత్సరంలో రూ.500 కోట్లు, 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ.1,111 కోట్లు చొప్పున నికర లాభం సాధించామని ఘోష్ చెప్పారు. సూక్ష్మ రుణ సంస్థ నుంచి బ్యాంక్‌గా మారామని, అంతకు ముందటి, గత ఆర్థిక సంవత్సరాల ఫలితాలను పోల్చకూడదని వివరించారు. ప్రస్తుతం 840గా ఉన్న బ్రాంచ్‌ల సంఖ్యను వచ్చే ఏడాది మార్చి నాటికి 1,000కు పెంచుకోవడం లక్ష్యమని పేర్కొన్నారు. ప్రస్తుతం 24,000గా ఉన్న ఉద్యోగుల సంఖ్యను 30,000కు పెంచనున్నామని తెలిపారు. -
కోటక్ బ్యాంక్ లాభం 40 శాతం అప్
ఒక్కో షేర్‌కు 60 పైసలు డివిడెండ్ న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో 40 శాతం వృద్ధి చెందింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.696 కోట్లుగా ఉన్న నికర లాభం (స్టాండోలోన్) గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.976 కోట్లకు పెరిగిందని కోటక్ మహీంద్రా బ్యాంక్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.4,947 కోట్ల నుంచి 10 శాతం వృద్ధితో రూ.5,435 కోట్లకు పెరిగింది. స్థూల మొండి బకాయిలు 2.36 శాతం నుంచి 2.59 శాతానికి, నికర మొండి బకాయిలు 1.06 శాతం నుంచి 1.26 శాతానికి పెరిగాయి. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.200 కోట్ల నుంచి రూ.267 కోట్లకు పెరిగాయని తెలిపింది. ఒక్కో షేర్‌కు 60 పైసలు డివిడెండ్ ఇవ్వనున్నట్లు కంపెనీ పేర్కొంది.ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2015–16లో రూ.2,090 కోట్లుగా ఉన్న నికర లాభం 2016–17లో రూ.3,411 కోట్లకు, మొత్తం ఆదాయం రూ.18,996 కోట్ల నుంచి 21,176 కోట్లకు పెరిగాయి. రుణాలు రూ.1,92,260 కోట్ల నుంచి రూ.2,14,590 కోట్లకు పెరిగాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్ 1.5 శాతం లాభంతో రూ.915 వద్ద ముగిసింది. -
మారుతి ఫలితాలు ఒకే..భారీ డివిడెండ్
ముంబై: ఆటో దిగ్గజం మారుతి సుజుకి క్యూ4 ఫలితాలను ప్రకటించింది. గురువారం వెల్లడించిన సంస్థ త్రైమాసిక ఫలితాల్లో రూ. 1709కోట్ల నికర లాభాలు పోస్ట్ చేసింది. మొత్తం ఆదాయం రూ. 20,751 కోట్లను సాధించింది. ఎబిటా మార్జిన్లు 13.8 శాతంతో రూ. 2561కోట్లుగా నిలిచాయి. మారుతి విక్రయాలు మార్కెట్ అంచనాలను మించి నమోదు అయ్యాయి. మారుతి రూ. 5 ముఖ విలువ కలిగిన ప్రతి ఈక్విటీ షేరుకు రూ.75 డివిడెండ్ చెల్లించేందుకు బోర్డు ప్రతిపాదించింది. గత ఏడాది ఇది రూ. 35లు చెల్లించింది. ఈ ఫలితాల నేపథ్యంలో మారుతి సుజుకి షేర్ స్వల్ప నష్టపోయినా తిరిగి లాభాల్లోకి మారింది. -
ఆర్థిక ఫలితాలే దిక్సూచి
♦ ఫలితాలు బాగుంటే మార్కెట్లు ఇంకా పెరుగుతాయి ♦ కానీ క్యూ4లో డీమోనిటైజేషన్ ప్రభావం ఉండొచ్చు ♦ మార్కెట్లపై ఇన్వెస్టర్లలో అవగాహన పెరుగుతోంది ♦ బ్యాంకింగ్, నిర్మాణ రంగాలు ఆశావహంగా ఉన్నాయి ♦ సాక్షి’తో యూటీఐ మ్యూచువల్ ఫండ్ ఈవీపీ సంజయ్ డోంగ్రే హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డీమోనిటైజేషన్ ప్రభావాలు నాలుగో త్రైమాసికంలోనే పూర్తి స్థాయిలో ప్రతిఫలించనున్న నేపథ్యంలో క్యూ4లో ఆదాయాలపరంగా చూస్తే కంపెనీల ఆర్థిక ఫలితాలు ఒక మోస్తరుగానే ఉండొచ్చని తెలిపారు యూటీఐ మ్యూచువల్ ఫండ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ డోంగ్రే. ద్విచక్ర వాహనాలు, ఎఫ్ఎంసీజీ, సిమెంట్ రంగాలపై పెద్ద నోట్ల రద్దు గణనీయంగా పడిందని చెప్పారాయన. ఐఐపీ తగ్గుదల తదితర గణాంకాలు డీమోనిటైజేషన్ ప్రభావాలను కొంత ప్రతిబింబించేవిగా ఉన్నాయని, అయితే రీమోనిటైజేషన్ జరిగే కొద్దీ ప్రతికూల ప్రభావాలు క్రమంగా తొలగిపోయి పరిస్థితులు మెరుగుపడగలవని సంజయ్ పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్ల దిశానిర్దేశానికి ఆర్థిక ఫలితాలే కీలకంగా ఉండగలవని ఆయన వివరించారు. స్వల్పకాలికంగా మార్కెట్లలో హెచ్చుతగ్గులు ఉండొచ్చని, కార్పొరేట్ల ఫలితాలు మెరుగ్గా ఉంటే.. మరింత పైకి పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇన్ఫ్రా... బ్యాంకింగ్.. ప్రైవేట్ రంగ స్థితిగతుల దృష్ట్యా ప్రస్తుత పరిస్థితుల్లో మౌలిక రంగంలో పెట్టుబడులు ఎక్కువగా ప్రభుత్వం నుంచే రావాల్సి ఉంటుందని సంజయ్ చెప్పారు. మౌలిక సదుపాయాల కల్ప నకు తోడ్పడేలా వివిధ ప్రాజెక్టుల ద్వారా ప్రభుత్వం ఈ దిశగా ఇప్పటికే చర్యలు తీసుకుంటోందన్నారు. ఇక బ్యాంకింగ్ రంగం విషయానికొస్తే అధిక మొండిబకాయిల రూపంలో అసెట్ క్వాలిటీ సమస్యలు ప్రధానంగా ఉంటున్నాయన్నారు. అయితే కార్పొరేట్లకు ఎక్కువగా రుణాలిచ్చిన బ్యాంకులతో పోలిస్తే రిటైల్ రుణాలపై దృష్టి పెట్టిన బ్యాంకుల పరిస్థితి మెరుగ్గానే ఉండగలదన్నారు. రుణాల మంజూరీ వృద్ధి తక్కువగానే ఉండటంతో.. లాభాలు కూడా అందుకు తగ్గట్లుగానే ఉంటాయని, ఎకానమీ మెరుగుపడే కొద్దీ వచ్చే రెండు, మూడు త్రైమాసికాల్లో ఎన్పీఏలు కూడా తగ్గు ముఖం పట్టి కార్పొరేట్లకు రుణాలిచ్చిన బ్యాంకులు కూడా కొంత మెరుగైన ఆర్థిక ఫలితాలే ప్రకటించే అవకాశం ఉందని వివరించారు. పెరుగుతున్న దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు .. దేశీ ఇన్వెస్టర్లు మార్కెట్లలో గణనీయంగా పెట్టుబడులు పెడుతున్నారని సంజయ్ చెప్పారు. రియల్టీ తదితర రంగాల పరిస్థితి ఆశావహంగా లేకపోవడంతో గడిచిన రెండు మూడేళ్లలో మార్కెట్లలోకి పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. మార్కెట్ల తీరుతెన్నులు, వాటి హెచ్చుతగ్గుల గురించి ఇన్వెస్టర్లలో అవగాహన పెరుగుతోందని, దీంతో ఈక్విటీలకు అధిక కేటాయింపులు జరుపుతున్నారని వెల్లడించారు. కార్పొరేట్ల ఆర్థిక ఫలితాలు వచ్చే కొద్దీ మార్కెట్లలో కొంత చెప్పుకోతగ్గ కదలికలు ఉంటాయన్నారు. ప్రస్తుతం మార్కెట్ల వేల్యుయేషన్స్ మరీ ఖరీదైనవిగా గానీ లేదా మరీ చౌకైనవిగా గానీ అనుకోవడానికి లేదని సంజయ్ చెప్పారు. మొత్తం లాభాల్లో డిఫెన్సివ్ రంగాలతో పోలిస్తే సీజనల్ రంగాల వాటా ఎక్కువగా ఉంటోందన్నారు. రంగాలవారీగా చూస్తే ఆటోమొబైల్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, సిమెంటు, నిర్మాణం మొదలైన సీజనల్ రంగాల సంస్థలు మెరుగ్గా ఉండొచ్చని సంజయ్ చెప్పారు. -
ఇండియన్ బ్యాంక్ లాభం మూడింతలు
ఒక్కో షేర్‌కు రూ.6 డివిడెండ్ న్యూఢిల్లీ/చెన్నై: ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో మూడు రెట్లు పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో రూ.94 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.320 కోట్లకు పెరిగిందని ఇండియన్ బ్యాంక్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.4,523 కోట్ల నుంచి రూ.4,602 కోట్లకు చేరిందని పేర్కొంది. స్థూల మొండి బకాయిలు రూ.8,827 కోట్ల నుంచి రూ.9,865 కోట్లకు, నికర మొండి బకాయిలు రూ.5,419 కోట్ల నుంచి రూ.5,607 కోట్లకు పెరిగాయని తెలిపింది. శాతం పరంగా చూస్తే స్థూల మొండి బకాయిలు 6.66 శాతం నుంచి 7.47 శాతానికి, నికర మొండి బకాయిలు 4.2 శాతం నుంచి 4.39 శాతానికి చేరాయని వివరించింది. మొండి బకాయిలు పెరిగినప్పటికీ, కేటాయింపులు మాత్రం రూ.968 కోట్ల నుంచి రూ.608 కోట్లకు తగ్గాయని తెలిపింది. ఒక్కో షేర్‌కు రూ.6 డివిడెండ్‌ను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. త్వరలో ఎఫ్‌పీఓ... గత ఆర్థిక సంవత్సరంలో తమ బ్యాంక్ పనితీరు బాగా ఉందని ఇండియన్ బ్యాంక్ ఎండీ, సీఈఓ కిశోర్ ఖరత్ చెప్పారు. నిర్వహణ లాభాలు పెరగడం తదితర అంశాలు దీనికి కారణాలని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్‌పీఓ)ద్వారా 82 శాతంగా ఉన్న ప్రభుత్వ వాటాను75 శాతానికి తగ్గించుకోనున్నామని వివరించారు. నికర లాభం మూడు రెట్లు పెరిగిన నేపథ్యంలో బీఎస్ఈలో ఇండియన్ బ్యాంక్ షేర్ 9 శాతం లాభపడి రూ.311 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్ ఏడాది గరిష్ట స్థాయి, రూ.319ను తాకింది. -
విప్రో 1:1 బోనస్ షేర్లు
⇔ స్వల్పంగా పెరిగిన లాభం ⇔ క్యూ4లో రూ. 2,267 కోట్లు బెంగళూరు: దేశీయంగా మూడో అతి పెద్ద సాఫ్ట్వేర్ సేవల సంస్థ విప్రో గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ. 2,267 కోట్ల నికరలాభం ఆర్జించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో సంస్థ లాభం రూ. 2,257 కోట్లు. ఇక మొత్తం ఆదాయం సుమారు 5 శాతం వృద్ధితో రూ. 14,313 కోట్ల నుంచి రూ. 15,034 కోట్లకు చేరింది. ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా.. వచ్చే రెండు నెలల్లో బోనస్ షేర్లు జారీ చేయనున్నట్లు విప్రో ప్రకటించింది. పోటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్ తమ షేర్హోల్డర్లకు ప్రయోజనం చేకూర్చేలా ఇప్పటికే భారీ బైబ్యాక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. షేరు ఒక్కింటికి ఒక షేరు చొప్పున బోనస్‌గా ఇవ్వనున్నట్లు విప్రో పేర్కొంది. చిన్న ఇన్వెస్టర్లకు భాగస్వామ్యం కల్పించేందుకు, లిక్విడిటీని పెంచేందుకు, రిటైల్ షేర్‌హోల్డర్ల పరిమాణాన్ని పెంచేందుకు ఇది తోడ్పడనున్నట్లు తెలిపింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి లాభం 5% డౌన్ ... మరోవైపు, మార్చి 2017తో ముగిసిన పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను విప్రో నికర లాభం సుమారు 5 శాతం క్షీణించి రూ. 8,518 కోట్లుగా నమోదైంది. అయితే, మొత్తం ఆదాయం మాత్రం 7.4 శాతం పెరి?గ రూ. 57,995 కోట్లకు చేరింది. ఏప్రిల్ – జూన్ 2017 త్రైమాసికంలో తమ ఐటీ సర్వీసుల వ్యాపార విభాగం ఆదాయాలు 1,915–1,955 మిలియన్ డాలర్లుగా ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు విప్రో పేర్కొంది. విప్రో వ్యాపారంలో ఐటీ సర్వీసుల విభాగానికి సింహభాగం వాటా ఉంటుంది. మార్చి క్వార్టర్లో ఇది 3.9 శాతం పెరుగుదలతో 1,957 కోట్లకు చేరింది. ఇక, ఐటీ సేవల ఆదాయాలు 4.9 శాతం వృద్ధితో 7.7 బిలియన్ డాలర్లకు పెరిగాయి. అమెరికాలో స్థానికులకు మరిన్ని ఉద్యోగాలు .. వీసా నిబంధనలు కఠినతరం అయిన నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఆఖరు నాటికి అమెరికాలో తమ ఉద్యోగుల్లో సగభాగం పైగా స్థానికులే ఉండగలరని విప్రో సీఈవో ఆబిదాలి జెడ్ నీముచ్వాలా పేర్కొన్నారు. అమెరికాలో నియామకాలు, డెలివరీ సెంటర్స్ ఏర్పాటు మొదలైన కార్యకలాపాలపై గణనీయంగా పెట్టుబడులు పెట్టడం కొనసాగిస్తామని చెప్పారు. కాలిఫోర్నియా, మిషిగన్Sలో కొత్తగా రెండు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. 2016–17 ఆర్థిక సంవత్సరంలో విప్రో 7.7 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించగా అందులో 54 శాతం అమెరికా మార్కెట్ల నుంచే వచ్చింది. ఇక జూలై 31 నుంచి మరో రెండేళ్ల పాటు అజీం ప్రేమ్‌జీనే చైర్మన్, ఎండీగా కొనసాగించే ప్రతిపాదనను విప్రో బోర్డు ఆమోదించింది. అలాగే, అదనంగా 258.25 కోట్ల షేర్లను సృష్టించడం ద్వారా ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్‌ను రూ. 610 కోట్ల నుంచి రూ. 1,126.5 కోట్లకు పెంచే అంశానికీ ఆమోదముద్ర వేసింది. బైబ్యాక్ యోచన..: ప్రతిపాదిత బోనస్ షేర్లను జూన్ 24 నాటికల్లా కేటాయించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు, షేర్లను బైబ్యాక్ చేయాలని కూడా విప్రో యోచిస్తోంది. జూలైలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ ప్రతిపాదనను పరిశీలించే అవకాశం ఉందని జతిన్ దలాల్ తెలిపారు. గతేడాది సెప్టెంబర్‌లో విప్రో సుమారు రూ. 2,500 కోట్లతో 4 కోట్ల షేర్లను బైబ్యాక్ చేసింది.మంగళవారం బీఎస్ఈలో విప్రో షేరు స్వల్ప లాభంతో రూ. 494.55 వద్ద ముగిసింది. -
లాభాల్లో అదరగొట్టిన విప్రో, కానీ..
న్యూఢిల్లీ : టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ నిరాశజనకమైన ఫలితాలతో బోణి కొట్టినప్పటికీ, మరో టెక్ దిగ్గజం విప్రో లాభాల్లో అదరగొట్టింది. స్టాండలోన్ నికల లాభాలను 20 శాతం పెంచుకుంది. 2016-17 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన క్వార్టర్ లో కంపెనీ స్టాండలోన్ నికర లాభాలు 2,303.5 కోట్లగా నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్ లో కంపెనీ నికర లాభాలు కేవలం రూ.1,918.50కోట్లగానే ఉన్నాయి. అయితే కంపెనీ గైడెన్స్ అంచనాలు విశ్లేషకులను అందుకోలేక నిరాశపరిచాయి. 2018 ఆర్థిక సంవత్సరం క్యూ1లో కేవలం 1,915 మిలియన్ డాలర్ల నుంచి 1,955 మిలియన్ డాలర్ల వరకు మాత్రమే ఆర్జించనున్నట్టు కంపెనీ అంచనావేస్తోంది. అయితే ఇది విశ్లేషకులు అంచనాల కంటే తక్కువే. ఫలితాల సందర్భంగా 1:1 నిష్ఫత్తిలో బోనస్ షేర్లకు బోర్డు సభ్యులు ఆమోదం తెలిపినట్టు కంపెనీ వెల్లడించింది. మరోసారి అజిమ్ ప్రేమ్ జీనే కంపెనీ చైర్మన్ గా బోర్డు నియమించినట్టు తెలిపింది.. అదేవిధంగా క్వార్టర్ క్వార్టర్ బేసిస్ తో కంపెనీ కన్సాలిడేటెట్ నికర లాభాలు 7.19 శాతం పెరిగి రూ.2,267 కోట్ల ఉన్నట్టు కంపెనీ వెల్లడించింది. 2016 డిసెంబర్ 31 క్వార్టర్ లో ఈ లాభాలు రూ.2,114.80 కోట్లగా ఉన్నాయి. జనవరి-మార్చి కాలంలో కంపెనీ కన్సాలిడేటెడ్ మొత్తం ఆదాయం 4.87 శాతం పెరిగి రూ.15,033.80 కోట్లకు పెరిగాయి. ఒక్కో షేరులో ఆర్జించే కన్సాలిడేటెడ్ ఆదాయాలు 9.33 శాతం జంప్ చేసినట్టు కంపెనీ పేర్కొంది. మార్కెట్ అవర్స్ తర్వాత ఫలితాలను కంపెనీ ప్రకటించనుందనే నేపథ్యంలో విప్రో షేరు ధర 0.93 శాతం పెరిగి, 496.35 రూపాయల వద్ద ముగిసింది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంకు భారీగా ఉద్యోగాల కోత
ముంబై : ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటి హెచ్డీఎఫ్సీ. ఈ బ్యాంకు వరుసగా రెండో త్రైమాసికంలోనూ భారీగా ఉద్యోగులను తగ్గించుకుంది. వినియోగదారులను చేరుకోవడానికి డిజిటల్ టెక్నాలజీ అభివద్ధి బాటపట్టడంతో బ్యాంకు బ్రాంచుల విస్తరణ మందగించినట్టు తెలిసింది. ఈ బ్రాంచుల విస్తరణ మందగించడంతో ఈ క్వార్టర్లోనూ భారీగా ఉద్యోగాల కోత పెట్టినట్టు వెల్లడైంది. 2016 డిసెంబర్‌తో ముగిసిన క్వార్టర్లో 90,421గా ఉన్న బ్యాంకు ఉద్యోగులు, 2017 మార్చితో ముగిసిన క్వార్టర్లో 84,325గా ఉన్నారు. అంటే దాదాపు 6096 మంది ఉద్యోగులను బ్యాంకు బయటికి సాగనంపినట్టు వెల్లడైంది. ఈ తగ్గింపు ఈ క్వార్టర్‌లోనే అత్యధికమని తెలిసింది. 2016 డిసెంబర్‌తో ముగిసిన క్వార్టర్లోనూ బ్యాంకు 4581 మంది ఉద్యోగులను తగ్గించింది. అట్రిక్షన్ పేరుతో బయటికి వెళ్లిపోయిన వారిలో కొత్త స్టాఫ్‌ను భర్తీ చేసుకోవడం లేదని, డిజిటల్ లావాదేవీలు పెరుగుతుండటంతో తమ సామర్థ్యాలను రీబ్యాలెన్స్ చేసుకుంటున్నామని హెచ్డీఎఫ్సీ బ్యాంకు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ పరేష్ సుక్తాంకర్ చెప్పారు. అదేవిధంగా ఉద్యోగుల ఖర్చులను కూడా బ్యాంకు తగ్గించుకుంది. ఉద్యోగులను తగ్గించుకున్న విషయాన్ని సుక్తాంకర్ కూడా తెలిపారు. గత కొన్నేళ్లలో కనీసం 300 నుంచి 400 బ్రాంచులను ప్రారంభిస్తే, ఈ ఏడాది కేవలం 195 బ్రాంచులను మాత్రమే ప్రారంభించినట్టు పేర్కొన్నారు. కొత్త బ్రాంచుల ఏర్పాటు మందగించిందని, ఉద్యోగుల సంఖ్యలోనూ ముందస్తున్న వృద్ధి లేదని, తగ్గిపోయిందని చెప్పారు. అయితే ఉద్యోగులను తగ్గించుకునే ప్రభావం బ్యాంకు వద్దిపై పడదని స్పష్టంచేశారు. -
యస్ బ్యాంక్ లాభం రూ. 914 కోట్లు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగంలోని యస్ బ్యాంక్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో 30 శాతం పెరిగింది. మొండిబకాయిలు పెరిగినా, బ్యాంక్ లాభం ఈ స్థాయిలో పెరగడం విశేషం. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.702 కోట్లుగా ఉన్న తమ నికర లాభం(స్టాండలోన్) గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 30 శాతం వృద్ధితో రూ.914 కోట్లకు ఎగసిందని యస్ బ్యాంక్ తెలిపింది. ఇతర ఆదాయం, నికర వడ్డీ ఆదాయం, నిర్వహణలాభం పెరగడంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని బ్యాంక్ ఎండీ, సీఈఓ రాణా కపూర్ పేర్కొన్నారు. నికర వడ్డీ ఆదాయం 32 శాతం వృద్ధితో రూ.1,640 కోట్లకు పెరగ్గా, నికర వడ్డీ మార్జిన్ 3.6 శాతంగా ఉందని, ఈ స్థాయి నిమ్ సాధించడం ఇదే తొలిసారని చెప్పారు. మొత్తం ఆదాయం 29 శాతం అప్.. మొత్తం ఆదాయం రూ.4,331 కోట్ల నుంచి 29 శాతం వృద్ధితో రూ.5,606 కోట్లకు చేరిందని రాణా కపూర్ పేర్కొన్నారు. స్థూల మొండిబకాయిలు రూ.1,006 కోట్ల(0.76%) నుంచి రూ.2,019 కోట్లకు(1.52%), నికర మొండిబకాయిలు రూ.343 కోట్ల(0.29%) నుంచి రూ.1,072 కోట్లకు(0.81%) పెరిగాయని వివరించారు. కేటాయింపులు రూ.186 కోట్ల నుంచి రూ.310 కోట్లకు ఎగిశాయని తెలిపారు. ప్రైవేట్ ప్లేస్మెంట్ ప్రాతిపదికన డెట్ సెక్యూరిటీల జారీ ద్వారా రూ.20,000 కోట్లు సమీకరించడానికి బోర్డ్ ఆమోదించింది. గత ఆర్థిక సంవత్సరానికి గా ను ఒక్కో షేర్‌కు రూ.12 చొప్పున తుది డివిడెండ్‌ను ఇవ్వనున్నామని కపూర్ పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో యస్ బ్యాంక్ షేర్ స్వల్ప నష్టంతో రూ.1,605 వద్ద ముగిసింది. -
యస్ బ్యాంకు.. 30 శాతం జంప్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ యస్ బ్యాంకు లాభాల్లో అదరగొట్టింది. అంచనాలను బీట్ చేసింది. 30.2 శాతం జంప్ చేసిన బ్యాంకు క్యూ4 లాభాలు, రూ.941.1 కోట్లగా నమోదుచేసింది. 2017 మార్చి 31తో ముగిసిన త్రైమాసిక ఫలితాలను బ్యాంకు బుధవారం ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో బ్యాంకు నికర లాభాలు రూ.702.10 కోట్లగా ఉన్నాయి. ఈ ఫలితాల్లో బ్యాంకు లాభాలు 30.2 శాతం జంప్ అవ్వగా.. నికర వడ్డీ ఆదాయాలు 32.1 శాతం పెంచుకుంది. ఈ ఆదాయాలు రూ.1,639.70 కోట్లగా నమోదయ్యాయి. కాగ, బ్యాంకు నికరలాభాలు 875 కోట్లగా మాత్రమే ఉంటాయని విశ్లేషకులు అంచనావేశారు. మొత్తంగా బ్యాంకు ఆదాయం 56.6 శాతం పెరిగి, రూ.1257.40 కోట్లగా ఉన్నట్టు యస్ బ్యాంకు ప్రకటించింది. కానీ బ్యాంకు నికర ఎన్పీఏలు గతేడాది కంటే భారీగా పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 342.5 కోట్లగా ఉన్న ఎన్పీఏలు ఈ ఆర్థికసంవత్సరం ప్రస్తుతం త్రైమాసికంలో 1072.3 కోట్లగా ఉన్నట్టు కంపెనీ పేర్కొంది. అదేవిధంగా స్థూల ఎన్పీఏలు రెడింతలు కంటే పెరిగాయని తెలిపింది. ఈ ఎన్పీఏలు 2018.5కోట్లగా ఉన్నట్టు ప్రకటించింది. -
ఇన్ఫీ బోణీ.. ప్చ్!
క్యూ4 లాభం రూ.3,603 కోట్లు...; వృద్ధి నిల్! ► ఆదాయం రూ.17,120 కోట్లు; 3.4% వృద్ధి ► సీక్వెన్షియల్‌గా ఆదాయం, లాభాలు డౌన్ ► ఈ ఏడాది ఆదాయ గైడెన్స్‌లో భారీ కోత... ► రూ. 14.75 చొప్పున తుది డివిడెండ్ ► డివిడెండ్, షేర్ల బైబ్యాక్ కోసం రూ.13,000 కోట్లు కేటాయింపు బెంగళూరు: దేశీ సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ నిరుత్సాహకరమైన ఫలితాలతో బోణీ చేసింది. వ్యవస్థాపకుల ఒత్తిడితో ఒకపక్క ఇన్వెస్టర్లకు డివిడెండ్లు, షేర్ల బైబ్యాక్ రూపంలో భారీమొత్తంలోనే కేటాయింపులు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ.. కంపెనీ పనితీరు మాత్రం నిరాశకు గురిచేసింది. దీనికితోడు.. ఈ ఏడాది(2017–18) ఆదాయ వృద్ధి అంచనాను (గైడెన్స్) భారీగా తగ్గించేయడం కూడా మార్కెట్‌కు రుచించలేదు. దీంతో గురువారం ఒక్కరోజే కంపెనీ షేరు ధర 4 శాతంపైగా దిగజారింది. ఇన్ఫోసిస్ కన్సాలిడేటెడ్ నికర లాభం మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో (2016–17, క్యూ4) రూ.3,603 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన లాభం రూ.3,597 కోట్లతో పోలిస్తే.. వృద్ధి పూర్తిగా అడుగంటి 0.2 శాతానికి పడిపోయింది. మొత్తం ఆదాయం 3.4 శాతం వృద్ధితో రూ.17,120 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది క్యూ4లో ఆదాయం రూ.16,550 కోట్లుగా ఉంది. ప్రధానంగా అమెరికా, యూరప్ మార్కెట్లో అనిశ్చితికి తోడు.. డాలరుతో రూపాయి మారకం విలువ భారీగా బలపడటం రాబడులపై ప్రభావం చూపినట్లు కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. సీక్వెన్షియల్‌గా క్షీణత...: గడిచిన ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఇన్ఫీ నికర లాభం రూ.3,708 కోట్లతో పోలిస్తే (సీక్వెన్షియల్ ప్రాతిపదికన) క్యూ4లో 2.8 శాతం క్షీణించింది. అదేవిధంగా ఆదాయం కూడా క్యూ3లో నమోదైన రూ.16,969 కోట్లతో పోలిస్తే 0.9% దిగజారింది. మార్కెట్ విశ్లేషకులు క్యూ4లో రూ.3,570 కోట్ల నికర లాభాన్ని, రూ.17,235 కోట్ల ఆదాయాన్ని అంచనా వేశారు. కాగా, డాలరు ప్రాతిపదికన నికర లాభం మార్చి క్వార్టర్లో 1.8% వృద్ధి చెంది 543 మిలియన్ డాలర్లుగా నమోదైంది. ఆదాయం 5% వృద్ధి చెంది 2.5 బిలియన్ డాలర్లకు చేరింది. పూర్తి ఏడాదికి కంపెనీ డాలరు ఆదాయం 7.4% పెరిగి 10.4 బిలియన్ డాలర్లకు ఎగబాకింది. నికర లాభం 4.3% వృద్ధి చెంది 2.1 బిలియన్ డాలర్లుగా నమోదైంది. గైడెన్స్ డీలా... ప్రస్తుత 2017–18 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయ వృద్ధి అంచనాల(గైడెన్స్)ను తగ్గించేసింది. డాలరు ప్రాతిపదికన ఆదాయ గైడెన్స్ 6.1 శాతం నుంచి 8.1 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన చూస్తే.. 6.5–8.5 శాతం ఉండొచ్చని గైడెన్స్‌ను ప్రకటించింది. విశ్లేషకులు అంచనా వేసిన 7–9 శాతం గైడెన్స్ కంటే ఇది తక్కువే. కాగా, రూపాయిల్లో చూస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయ గైడెన్స్‌ను ఇన్ఫీ 2.5–4.5 శాతంగా ప్రకటించింది. 2016–17 పూర్తి ఏడాదికి డాలర్లలో ఆదాయ వృద్ధి 7.4 శాతం, రూపాయిల్లో ఆదాయ వృద్ధి 9.7 శాతం కావడం గమనార్హం. ఇతర ముఖ్యాంశాలివీ... ⇒ 2016–17 ఆర్థిక సంవత్సరానికి ఒక్కోషేరుపై రూ.14.75 చొప్పున తుది డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. దీంతో కలిపితే పూర్తి ఏడాదికి మొత్తం డివిడెండ్ రూ.25.75గా లెక్కతేలుతుంది. అంటే వాటాదారులకు డివిడెండ్ రూపంలో చెల్లిస్తున్న మొత్తం రూ.7,119 కోట్లుగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. ⇒ క్యూ4లో కంపెనీ మార్జిన్లు 49 బేసిస్ పాయింట్లు తగ్గి 24.60 శాతంగా నమోదయ్యాయి. ⇒ మార్చి క్వార్టర్లో కంపెనీ కొత్తగా 6 భారీ కాంట్రాక్టులను దక్కించుకుంది. వీటి విలువ 806 మిలియన్ డాలర్లు. ⇒ ఉత్తర అమెరికా వ్యాపారంలో సీక్వెన్షియల్‌గా 1.3 శాతం వృద్ధి నమోదైంది. ఇక యూరప్ వ్యాపారం 1.6 శాతం క్షీణించింది. భారత్ వ్యాపారంలో కూడా 5.4 శాతం క్షీణత నమోదైంది. మిగతా దేశాలకు సంబంధించి ఆదాయం 0.8 శాతం పెరిగింది. ⇒ అనుబంధ కంపెనీలతో కలిపితే మార్చి క్వార్టర్లో ఇన్ఫోసిస్ ఉద్యోగుల వలసల(అట్రిషన్) రేటు 17.1 శాతానికి తగ్గింది. క్రితం క్వార్టర్లో ఇది 18.4 శాతంగా ఉంది. అయితే, 2016–17 పూర్తి ఏడాదికి మాత్రం అట్రిషన్ రేటు 19.2%కి పెరిగింది. 2015–16లో ఇది 18.7%గా ఉంది. ⇒ క్యూ4లో నికరంగా కంపెనీ 601 మంది ఉద్యోగులను జతచేసుకుంది. దీంతో మార్చి చివరినాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,00,364కు చేరింది. నిరుత్సాహకరమైన ఫలితాలు, గైడెన్స్ నేపథ్యంలో ఇన్ఫీ షేరు గురువారం బీఎస్ఈలో ఇంట్రాడేలో 4% పైగా దిగజారి రూ.927 కనిష్టాన్ని తాకింది. చివరకు 3.8% నష్టపోయి రూ.931 వద్ద ముగిసింది. మార్కెట్ విలువ రూ.8,590 కోట్లు ఆవిరై... రూ.2,13,937 కోట్లకు పడిపోయింది. సీజనల్‌గా కాస్త నిస్తేజమైన త్రైమాసికం కావడంతోపాటు అనుకోనివిధంగా ఎదురైన కొన్ని నిర్వహణపరమైన సవాళ్లు, అవాంతరాలు కంపెనీ పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపాయి. రానున్న కాలంలో ఎదురయ్యే సవాళ్లను ధీటుగా అధిగమించేందుకు వీలుగా తగిన వ్యూహాలను అమలు చేయడంపై దృష్టిసారిస్తున్నాం. ఈ దిశగా అనేక సానుకూల సంకేతాలు కనబడుతున్నాయి. ఉద్యోగుల వలసలు కూడా తగ్గుముఖం పట్టాయి. దీర్ఘకాలంలో వాటాదారులకు మరింత విలువను చేకూర్చడమే మా లక్ష్యం. ఇక గడిచిన 15 ఏళ్లలో టెక్నాలజీ పరిశ్రమకు సంబంధించి వీసాల పాత్ర చాలా పటిష్టం కావడంతో పాటు గణనీయంగా పెరిగింది. అయితే, తాజాగా నెలకొన్న వీసా ఇబ్బందులను(అమెరికా అధ్యక్షడు ట్రంప్ హెచ్1బీ వీసాలపై విధిస్తున్న కఠిన నిబంధనల గురించి మాట్లాడుతూ) ఐటీ పరిశ్రమ తప్పించుకోలేదు. దీనికి అనుగుణంగా ముందుకెళ్లాల్సిందే. ఈ విధమైన సవాళ్లను ఎదుర్కొనేందుకు స్థానిక, గ్లోబల్ స్థాయిలో నిపుణులను తగిన రీతిలో నియమించుకోవాల్సిన అవసరం నెలకొంది . – విశాల్ సిక్కా, ఇన్ఫోసిస్ సీఈఓ కొత్త డివిడెండ్ పాలసీ.. రూ.13,000 కోట్ల బైబ్యాక్! కంపెనీ వద్దనున్న భారీ నగదు నిల్వలను ఇన్వెస్టర్లకు పంచాలంటూ గత కొంతకాలంగా ఇన్ఫీ వ్యవస్థాపకులు, మాజీ సీనియర్లు తీవ్రంగా ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో కంపెనీ యాజమాన్యం దిగొచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్లు లేదా షేర్ల బైబ్యాక్‌ల కోసం(లేదా ఈ రెండింటికి కలిపి) రూ.13,000 కోట్లు వెచ్చించనున్నట్లు ఇన్ఫీ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు కొత్త డివిడెండ్ పాలసీకి ఆమోదం తెలిపింది. ఇప్పటివరకూ నికర లాభాల్లో సగాన్ని డివిడెండ్ల కోసం ఇచ్చే విధానం ఉంది. ఈ ఏడాది నుంచి అమలయ్యే కొత్త పాలసీ మేరకు వార్షికంగా ఉండే ‘ఫ్రీ క్యాష్ ఫ్లో’లో 70 శాతాన్ని ఇన్వెస్టర్లకు డివిడెండ్ల కోసం కేటాయించనున్నారు. ఇన్ఫోసిస్ వద్ద ప్రస్తుతం 6 బిలియన్ డాలర్ల మేర నగదు నిల్వలున్నాయి. టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, కాగ్నిజెంట్ సహా పలు దేశీ ఐటీ కంపెనీలు ఇటీవల వరుసపెట్టి షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, తాజాగా ప్రకటించిన మొత్తాన్ని పూర్తిగా షేర్ల బైబ్యాక్ కోసం వినియోగిస్తారా లేదా డివిడెండ్లతో కలిపి ఖర్చుచేస్తారా అనే విషయాన్ని ఇన్ఫోసిస్ స్పష్టంగా వెల్లడించలేదు. కో–చైర్మన్‌గా రవి వెంకటేశన్ ఇన్ఫోసిస్‌లో ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా ఉన్న రవి వెంకటేశన్‌ను కో– చైర్మన్‌గా నియమించేందుకు బోర్డు ఆమోదం తెలి పింది. కంపెనీలో కార్పొరేట్ గవర్నె న్స్ దిగజారిందంటూ ఇన్ఫీ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. 2011 ఏప్రిల్ నుంచి వెంకటేశన్ ఇన్ఫీ బోర్డులో కొనసాగుతున్నారు. ‘బోర్డు విధుల్లో తగిన సహకారం అందించడంతో పాటు కంపెనీ వ్యూహాల అమలులో యాజమాన్యానికి రవి ఇక నుంచి మరింత చేదోడుగా నిలవనున్నారు’ అని ఇన్ఫీ చైర్మన్ ఆర్.శేషసాయి వ్యాఖ్యానించారు. రవిని ఈ పదవికి ప్రమోటర్లెవరూ సూచించలేదని స్పష్టం చేశారు. కార్పొరేట్ గవర్నెన్స్ దిగజారిందని, బోర్డును ప్రక్షాళన చేయాలంటూ ఇటీవల ప్రమోటర్లు చేసిన ఆరోపణలకు ఈ నియామకానికి ఎలాంటి సంబంధం లేదని శేషసాయి చెప్పారు. -
జియో దెబ్బ: ప్రత్యర్థులు మరింత కుదేలు
జియో దెబ్బకు మేజర్ టెలికాం రంగ దిగ్గజాలు భారతీ ఎయిర్ టెల్, ఐడియా సెల్యులార్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఒక్కసారిగా మూడో క్వార్టర్లో భారీగా కుప్పకూలిన సంగతి తెలిసిందే. అయితే నాలుగో క్వార్టర్లోనూ ఈ దిగ్గజాలకు పరిస్థితి ఇదే మాదిరే ఉంటుందని టెలికాం రంగ నిపుణులు చెబుతున్నారు. రిలయన్స్ జియో ఉచిత డేటా ఆఫర్లు కొనసాగించినంత వరకు టెలికాం దిగ్గజాలు మార్జిన్లకు భారీగానే గండికొడుతూ ఉంటుందని పేర్కొన్నారు. ఎప్పుడైతే జియో తన ఉచిత ఆఫర్లను విత్ డ్రా చేసుకుని, డేటా సర్వీసులపై ఛార్జీలు వసూలు చేయడం ప్రారంభిస్తుందో అప్పటినుంచి టెలికాం దిగ్గజాల పరిస్థితి కొంత మెరుగుపడవచ్చని టెలికాం ఇండస్ట్రి ప్రాక్టిస్, ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ ఇండియా అర్పితా పాల్ అగర్వాల్ చెప్పారు. 2016 సెప్టెంబర్ నుంచి వెల్ కమ్ ఆఫర్ కింద జియో ఉచిత ఆఫర్లు ఇవ్వడం ప్రారంభించింది. అనంతరం డిసెంబర్లో జియో తమ ఉచిత డేటా ఆఫర్లను 2017 మార్చి వరకు పొడిగిస్తున్నామని పేర్కొంది. దీంతో టెలికాం దిగ్గజాలు రెవెన్యూలు భారీగా కోల్పోతున్నాయి. భారతీ ఎయిర్ టెల్ 55 శాతం, ఐడియా సెల్యులార్ రూ.478.9కోట్లను, రిలయన్స్ కమ్యూనికేషన్ రూ.531 కోట్ల నష్టాలను నమోదుచేశాయి. మార్కెట్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన జియో దోపిడీ ధరల విధానం వల్లనే తాము రెవెన్యూలను భారీగా కోల్పోతున్నామని టెలికాం కంపెనీలు ఆరోపిస్తున్నాయి. రిలయన్స్ జియో ఉచిత డేటా ఆఫర్ల దూకుడే టెలికాం కంపెనీలకు భారీగా దెబ్బకొడుతుందనే దానికి ఎలాంటి సందేహం లేదని టెలికాం కన్సల్టెన్సీకి చెందిన ఓ సంస్థ డైరెక్టర్ మహేష్ ఉప్పల్ చెప్పారు. ధరల విధానంపై భారత మార్కెట్ ఆధారపడి ఉంటుందని, అలాంటి ఆఫర్లు మార్కెట్ లో విధ్వంసం సృష్టించేలా ఉన్నాయని గార్టనర్ టెలికాం బిజినెస్ స్ట్రాటజీ ప్రిన్సిపల్ రీసెర్చ్ అనలిస్టు రిషి తేజ్ పాల్ చెప్పారు. -
టాటా స్టీల్ నష్టం... రూ.3,214 కోట్లు
12 శాతం తగ్గిన ఆదాయం * ఒక్కో షేర్‌కు రూ.8 డివిడెండ్ న్యూఢిల్లీ: టాటా స్టీల్ సంస్థ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన గత ఆర్థిక సంవత్సం నాలుగో త్రైమాసిక కాలానికి రూ.3,214 కోట్ల నికర నష్టాల్ని ప్రకటించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2014-15) ఇదే క్వార్టర్లో వచ్చిన నష్టాలు రూ.5,702 కోట్లతో పోలిస్తే ఈ క్యూ4లో నష్టాలు తగ్గినట్లే. అయితే గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక నష్టాలు రూ.2,127 కోట్లతో పోలిస్తే 4వ త్రైమాసికంలో నష్టాలు పెరిగాయి. మొత్తం ఆదాయం రూ.33,666 కోట్ల నుంచి 12 శాతం క్షీణించి రూ.29,508 కోట్లకు తగ్గినట్లు టాటా స్టీల్ గ్రూప్ ఈడీ (ఫైనాన్స్ అండ్ కార్పొరేట్) కౌశిక్ చటర్జీ తెలిపారు. ఉక్కు డెలివరీలు 7.06 మిలియన్ టన్నుల నుంచి 6.94 మిలియన్ టన్నులకు తగ్గాయని చెప్పారు. ఒక్కో షేర్‌కు రూ.8 డివిడెండ్‌ను ప్రకటిస్తూ... కళింగనగర్ స్టీల్ ప్లాంట్ వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించిందన్నారు. రూ.20,514 కోట్ల నగదు నిల్వలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.11,486 కోట్ల మూలధన పెట్టుబడుల్లో కళింగనగర్ ప్లాంట్‌పై రూ.3,695 కోట్లు వెచ్చించినట్లు చటర్జీ తెలిపారు. నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.20,514 కోట్లుగా ఉన్నాయని పేర్కొన్నారు. కీలకం కాని ఆస్తుల విక్రయాన్ని కొనసాగించామని, ఇలాంటి ఆస్తుల విక్రయం ద్వారా రూ.4,478 కోట్లు సమీకరించామని చెప్పారాయన. యూరప్ కార్యకలాపాల పునర్వ్యస్థీకరణకు పలు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇక, 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.3,926 కోట్లుగా ఉన్న నికర నష్టాలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.3,049 కోట్లకు తగ్గాయని తెలిపారు. మొత్తం ఆదాయం రూ.1.40 లక్షల కోట్ల నుంచి రూ.1.17 లక్షల కోట్లకు తగ్గిందని చెప్పారు. -
అశోక్ లేలాండ్ లాభం 67 శాతం డౌన్
* క్యూ4లో రూ. 77 కోట్లు * ఒక్కో షేర్‌కు 95 పైసల డివిడెండ్ న్యూఢిల్లీ: హిందుజా గ్రూప్ ప్రధాన కంపెనీ అశోక్ లేలాండ్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి 67 శాతం క్షీణించింది. 2014-15 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.230 కోట్ల నికర లాభం రాగా, గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.77 కోట్ల నికర నష్టాలు వచ్చాయని అశోక్ లేలాండ్ తెలిపింది. ఇన్వెస్ట్మెంట్స్ విలువలో తరుగుదల కారణంగా ఈ స్థాయిలో నష్టాలొచ్చినట్లు అశోక్ లేలాండ్ ఎండీ, వినోద్ కె. దాసరి చెప్పారు. విదేశాల్లోని అనుబంధ సంస్థలు, జాయింట్ వెంచర్లలో పెట్టిన పెట్టుబడుల తరుగుదలకు కూడా కలుపుకొని మొత్తం రూ.389 కోట్ల అసాధరణమైన కేటాయింపులు జరిపినట్లు చెప్పారు. నికర అమ్మకాలు రూ.4,436 కోట్ల నుంచి 33 శాతం వృద్ధితో రూ.5,893 కోట్లకు పెరిగాయి. రూ.1 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.0.95 డివిడెండ్‌ను ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. ఈక్విటీ షేర్లు, సెక్యూర్డ్/అన్సెక్యూర్డ్ రిడీమబుల్ నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల జారీ ద్వారా రూ.700 కోట్ల నిధుల సమీకరణకు డెరైక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని దాసరి వెల్లడించారు. -
అమర రాజా బ్యాటరీస్ లాభం 6% అప్
టూ వీలర్ బ్యాటరీల ఉత్పత్తి పెంపుపై దృష్టి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆటోమోటివ్ బ్యాటరీల విభాగం తోడ్పాటుతో గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో అమర రాజా బ్యాటరీస్ నికర లాభం 6 శాతం వృద్ధితో సుమారు రూ.109 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఇది రూ. 102 కోట్లు. తాజా క్యూ4లో కంపెనీ ఆదాయం దాదాపు 10 శాతం పెరుగుదలతో రూ.1,067 కోట్ల నుంచి రూ. 1,170 కోట్లకు చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం 19 శాతం వృద్ధి చెంది రూ. 411 కోట్ల నుంచి రూ. 489 కోట్లకు పెరిగింది. ఆదాయం 11 శాతం పెరుగుదలతో రూ. 4,211 కోట్ల నుంచి రూ. 4,691 కోట్లకు చేరింది. కంపెనీ వృద్ధిని మరింత మెరుగుపర్చుకునే దిశగా పలు చర్యలు చేపడుతున్నట్లు అమర రాజా బ్యాటరీస్ ఎండీ జయదేవ్ గల్లా తెలిపారు. పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ద్విచక్ర వాహన బ్యాటరీల ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుకునే ప్రతిపాదనను బోర్డు పరిశీలించినట్లు కంపెనీ పేర్కొంది. నాలుగేళ్లలో నాలుగు దశలుగా విస్తరణ ఉంటుంది. ఇది మొత్తం పూర్తయితే ప్రస్తుతం వార్షికంగా 1.1 కోట్ల యూనిట్లుగా ఉన్న ఉత్పత్తి సామర్ధ్యం 2.5 కోట్లకు పెరుగుతుంది. పూర్తి విస్తరణకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన ప్రతిపాదనకు, తొలి దశలో 3 లైన్ల ఏర్పాటుకు బోర్డు ఆమోదముద్ర తెలిపింది. తొలి దశ పూర్తయితే వార్షిక సామర్ధ్యం 1.5 మిలియన్ టన్నులకు చేరుతుంది. కార్ల బ్యాటరీల తయారీ సామర్ద్యాన్ని 82.5 లక్షల యూనిట్ల నుంచి 1.1 కోట్ల యూనిట్లకు పెంచుకునే ప్రతిపాదనకు కంపెనీ బోర్డు ఇప్పటికే ఆమోదముద్ర వేసింది. బుధవారం బీఎస్ఈలో అమర రాజా బ్యాటరీస్ షేరు దాదాపు అయిదు శాతం క్షీణించి రూ. 851 వద్ద ముగిసింది. -
అపోలో హాస్పిటల్స్ క్యూ4 లాభం రూ.89 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హెల్త్‌కేర్ దిగ్గజం అపోలో హాస్పిటల్స్ మార్చి త్రైమాసికం కన్సాలిడేటెడ్ నికర లాభం క్రితంతో పోలిస్తే 4.8 శాతం వృద్ధి చెంది రూ.89 కోట్లకు చేరుకుంది. టర్నోవరు 18 శాతం పెరిగి రూ.1,558 కోట్లకు చేరింది. 2014-15తో పోలిస్తే ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 2.6 శాతం తగ్గి రూ.331 కోట్లుగా ఉంది. టర్నోవరు రూ.17.5 శాతం వృద్ధితో రూ.6,085 కోట్లకు చేరుకుంది. -
ఎల్ అండ్ టీ లాభం 19% అప్
క్యూ4లో రూ. 2,454 కోట్లు * మొత్తం ఆదాయం రూ.33,157 కోట్లు... న్యూఢిల్లీ: ఎల్ అండ్ టీ నికర లాభం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి 19 శాతం పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2014-15) క్యూ4లో రూ.2,070 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.2,454 కోట్లకు పెరిగిందని ఎల్ అండ్ టీ తెలిపింది. మౌలిక రంగ విభాగం అధికాదాయం ఆర్జించడంతో ఇది సాధ్యమైందని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.28,023 కోట్ల నుంచి 18 శాతం వృద్ధితో రూ.33,157 కోట్లకు ఎగసింది. ప్రాజెక్టుల అమల్లో పురోగతిని సాధించడంతో ఆదాయం పెరిగిందని పేర్కొంది. మొత్తం ఆదాయంలో 54 శాతం వాటా మౌలికరంగ విభాగం నుంచే వచ్చింది. నికర లాభం రూ.5,091 కోట్లు ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2014-15లో రూ.4,765 కోట్లుగా ఉన్న నికర లాభం (కన్సాలిడేటెడ్) గత ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధితో రూ.5,091 కోట్లకు పెరిగింది. స్థూల ఆదాయం 12 శాతం వృద్ధితో రూ.1,03,522కు చేరింది. అంతర్జాతీయ ఆదాయం 32 శాతం వృద్ధితో రూ.33,302 కోట్లకు ఎగసింది. దేశీయ మార్కెట్ పునరుజ్జీవన బాటలోనే ఉందని, ఇన్వెస్ట్మెంట్ సెంటిమెంట్ బలహీనంగా ఉండటంతో పారిశ్రామిక పెట్టుబడులు పుంజుకోవడానికి కొంత సమయం పడుతుందని సంస్థ పేర్కొంది. ‘‘పర్యావరణ, భూ సమీకరణ అనుమతులు పొందడంతో జాప్యం, ప్రాజెక్టులకు కావలసిన రుణాల సమీకరణలో సమస్యలు... కారణంగా ప్రాజెక్టులు నత్తనడకన నడుస్తున్నాయి. మౌలిక రంగం జోరు ప్రభుత్వ చర్యలపైననే ఆధారపడి ఉంది. దేశీయ, అంతర్జాతీయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాం కనక మధ్యకాలిక వ్యవధిలో చక్కని వృద్ధి సాధిస్తామన్న నమ్మకం మాకుంది’’ అని సంస్థ వివరించింది. ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడంతో ఈ కంపెనీ షేర్ బీఎస్ఈలో 4 శాతం లాభపడి రూ.1,291 వద్ద ముగిసింది. -
దూసుకుపోయిన యాపిల్ డిస్ట్రిబ్యూటర్
ఓ వైపు యాపిల్ ఉత్పత్తులు పడిపోతుండగా.. మరోవైపు యాపిల్ ఉత్పత్తులకు డిస్ట్రిబ్యూటర్ అయిన రెడింగ్ టన్ ఇండియా లాభాల్లో దూసుకుపోయింది. మార్కెట్ విశ్లేషకుల అంచనాలను అధిగమించి నికర లాభాలను నమోదుచేసింది. నాలుగో త్రైమాసికంలో రూ.10,474 కోట్ల అమ్మకాలపై రూ.138 కోట్ల నికరలాభాలు వచ్చినట్లు రెడింగ్ టన్ ప్రకటించింది. ఈ లాభాలు కేవలం రూ.126 కోట్లు మాత్రమే ఉంటాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేశారు. వీరి అంచనాలను అధిగమిస్తూ రెడింగ్ టన్ లాభాల్లో దూసుకుపోయింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.123 కోట్ల లాభాలను రెండింగ్ టన్ నమోదుచేసింది. నిర్వహణ లాభాలు సైతం 5శాతం పెరిగి రూ.221 కోట్లగా రెడింగ్ టన్ చూపించింది. ఈ లాభాలు గతేడాది రూ.211 కోట్లగా ఉన్నాయి. రెడింగ్ టన్ ప్రకటించిన మెరుగైన త్రైమాసిక ఫలితాలతో మార్కెట్లో ఈ కంపెనీ షేర్లు దూసుకుపోయాయి. ఒక్కసారిగా 12.03శాతం ఎగబాకి షేరు ధర రూ.122 గా ట్రేడ్ అయింది. -
స్ట్రైడ్స్ షాసున్ ఆదాయం రూ.1,008 కోట్లు
ఒక్కో షేర్‌కు రూ.4 డివిడెండ్ హైదరాబాద్: స్ట్రైడ్స్ షాసున్ ఫార్మా కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.1,003 కోట్ల ఆదాయం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2014-15) క్యూ4లో ఆర్జించిన ఆదాయం(రూ.702 కోట్లు)తో పోల్చితే 43 శాతం వృద్ధి సాధించామని స్ట్రైడ్స్ షాసున్ ఫార్మా ఒక ప్రకటనలో తెలిపింది. ఇబిటా రూ.125 కోట్ల నుంచి 61 శాతం వృద్ధితో రూ.201 కోట్లకు పెరిగాయని కంపెనీ ఎండీ, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అరుణ్ కుమార్ పేర్కొన్నారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2014-15లో 2,546 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో 25 శాతం వృద్ధితో 3,177 కోట్లకు పెరిగిందని తెలిపారు. ఇబిటా రూ.400 కోట్ల నుంచి 45 శాతం వృద్ధితో రూ.581 కోట్లకు ఎగసిందని వివరించారు. ఒక్కో షేర్‌కు రూ.4(40 శాతం) డివిడెండ్‌ను ఇవ్వనున్నామని పేర్కొన్నారు. -
భారీ నిరాశలో ఐసీఐసీఐ
న్యూఢిల్లీ : దేశంలోనే రెండో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు ఐసీఐసీఐ భారీ నిరాశను మూగట్టుకుంది. నాలుగో త్రైమాసికం ఫలితాల్లో ఈ దిగ్గజం చతికిలపడింది. మార్కెట్ విశ్లేషకుల అంచనాలను అందుకోలేక, నికర లాభాలు 76శాతం క్షీణించాయి. శుక్రవారం విడుదల చేసిన ఈ ఫలితాల్లో నికర లాభాలు రూ.702 కోట్లను మాత్రమే కంపెనీ చూపించింది. అయితే మార్కెట్ విశ్లేషకులు అంచనా వేసిన రూ.3,120 కోట్ల కంటే ఈ లాభాలు చాలా తక్కువగా నమోదయ్యాయి. గతేడాది ఇదే క్వార్టర్లో ఐసీఐసీఐ నికర లాభాలు రూ.2,922 కోట్లగా ఉన్నాయి. బ్యాంకుకు మొండి బకాయిలు పెరగడంతోనే నికర లాభాలు పడిపోయాయని ఐసీఐసీఐ వెల్లడించింది. బ్యాంకుకు స్థూల నిరర్ధక ఆస్తులు(ఎన్ పీఏ)లు 110 బేసిస్ పాయింట్లు పెరిగి, 5.82శాతంగా ఉన్నాయని పేర్కొంది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ ఎన్ పీఏలు 4.72శాతంగానే ఉన్నాయి. నికర ఎన్ పీలు కూడా గతేడాది కంటే పెరిగి 2.98 శాతంగా నమోదయ్యాయి. బ్యాంకు నికర లాభాలు పడిపోయినప్పటికీ రుణదాతలు 46 శాతంకు పెరిగి, రూ.5,110 కోట్లగా నమోదయ్యాయి. పన్ను చెల్లింపుల కంటే పన్ను లాభాలే ఎక్కువగా ఉన్నాయని, గతేడాది ఇదే క్వార్టర్లో రూ.1,200 కోట్లగా పన్ను చెల్లింపులుంటే, ఈ ఏడాది పన్ను లాభాలు రూ.521 కోట్లగా ఉన్నాయని ఐసీఐసీఐ తన త్రైమాసిక ఫలితాల్లో చూపించింది. నిరాశజనకమైన ఫలితాలతో ఐసీఐసీఐ బ్యాంకు బీఎస్ ఈ సెన్సెక్స్ లో స్వల్పంగా నష్టపోయింది. -
నాలుగో క్వార్టర్లో అల్ట్రాటెక్ అదుర్స్
ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ మాదిరిగానే భారత్ లో అతిపెద్ద సిమెంట్ కంపెనీగా పేరున్న అల్ట్రాటెక్ మార్కెట్ విశ్లేషకుల అంచనాలను అధిగమించి లాభాల్లో దూసుకెళ్లింది. నాలుగో త్రైమాసిక ఫలితాల్లో నికర లాభాలు 11శాతం జంప్ అయి రూ.681.4 కోట్లగా నమోదయ్యాయి. ఈ త్రైమాసికంలో రెవన్యూ కూడా 4.7 శాతం వృద్ధి చెంది, రూ.6,503.66 కోట్లగా ఫలితాలను చూపించాయి. గతేడాది ఈ త్రైమాసికంలో ఈ కంపెనీ రెవెన్యూ రూ.6,211 కోట్లగా ఉన్నాయి. దేశీయంగా ఈ కంపెనీ అమ్మకాల 15 శాతం వృద్ధిన్ని చూపించాయి. ఈ త్రైమాసికంలో బూడిద రంగు సిమెంట్ అమ్మకాలు 13.20 మిలియన్ టన్నులు ఉండగా, తెలుపు రంగు సిమెంట్ అమ్మకాలు 3.85 మిలియన్ టన్నులుగా ఉన్నాయని ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ తెలిపింది. నిర్వహణ లాభాలు(వడ్డీరేట్లు, తరుగుదలలు, రుణాలు పోగా మిగిలింది) 3.2 శాతం పెరిగి, 1,352.7 కోట్లగా నమోదయ్యాయి. నిర్వహణ ఖర్చు, ఇంధన ధరలు తగ్గుదల ఈ కంపెనీకి బాగా కలిసివచ్చింది. అల్ట్రాటెక్ ఫలితాలు వెల్లడయ్యాక ఈ కంపెనీ సేర్లు లాభాల బాట పట్టాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లో ఈ షేరు 6.75 పాయింట్లు లాభపడి 3277.60 వద్ద ముగిసింది. -
తీవ్ర హెచ్చుతగ్గులుంటాయ్..
డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు ప్రభావం * క్యూ4 ఫలితాలపై చూపు న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంక్, భారతి ఎయిర్టెల్ తదితర బ్లూచిప్ కంపెనీల నుంచి వెలువడే క్యూ4 ఫలితాలు ఈ వారం మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశిస్తుందని, అయితే డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు కారణంగా ఈక్విటీలు హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ల కదలికలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కూడా మన సూచీల కదలికల్ని శాసిస్తాయని వారన్నారు. అలాగే అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ సమావేశంలో తీసుకోబోయే నిర్ణయాల ప్రభావం ప్రపంచ మార్కెట్లపై పడుతుందని వారు వివరించారు. ఫెడ్ సమావేశం మంగళ, బుధవారాల్లో జరగనున్నది. ఈ వారం యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకి, భారతి ఎయిర్టెల్, ఐడియా, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర కంపెనీలు ఆర్థిక ఫలితాల్ని ప్రకటించనున్నాయి. రిలయన్స్ ఫలితాల ఎఫెక్ట్... గత శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత వెల్లడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ క్యూ4 ఫలితాలకు స్పందించడం ద్వారా ఈ సోమవారంనాటి ట్రేడింగ్ ఆరంభమవుతుందని, తద్వారా తదుపరి సూచీల దిశ నిర్దేశితమవుతుందని ట్రేడ్‌స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. 8 ఏళ్లలో రికార్డుస్థాయి క్వార్టర్లీ నికరలాభాన్ని రిలయన్స్ ప్రకటించింది. రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ మార్జిన్ల జోరు దీనికి ప్రధాన కారణం. అయితే రానున్న త్రైమాసికాల్లో ఈ స్థాయి మార్జిన్లను కంపెనీ సాధించగలుగుతుందా, లేదా అనే అంచనాలతో రిలయన్స్ షేర్లలో కొనుగోళ్లు, అమ్మకాలు జరుగుతాయని విశ్లేషకులు చెప్పారు. ఏప్రిల్ నెల డెరివేటివ్ కాంట్రాక్టులు వచ్చే గురువారం ముగియనున్నందున, మార్కెట్ హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ సీఈఓ రోహిత్ గాడియా చెప్పారు. పార్లమెంటు సమావేశాలపై దృష్టి... సోమవారం నుంచి ప్రారంభం కాబోయే పార్లమెంటు సమావేశాల్ని కూడా ఇన్వెస్టర్లు నిశితంగా గమనిస్తారని మార్కెట్ నిపుణులు తెలిపారు. ఈ సమావేశాల్లో దివాలా బిల్లు, జీఎస్టీ బిల్లులు ఆమోదానికి నోచుకోవచ్చన్న అంచనాలు మార్కెట్లో వున్నాయి. బోర్డ్ మీటింగ్స్ ఈ వారం.. 25-సోమవారం: ఆల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్పాంజ్ ఐరన్, వెల్స్పన్ ఇండియా ఏబీబీ, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ 26-మంగళవారం: యాక్సిస్ బ్యాంక్, భారతీ ఇన్ఫ్రాటెల్, మారుతీ సుజుకీ, రేమండ్ 27-బుధవారం: భారతీ ఎయిర్టెల్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, యస్ బ్యాంక్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ 28-గురువారం: హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఐడియా సెల్యులర్, ఏసీసీ, అంబుజా సిమెంట్, 29 -శుక్రవారం: ఐసీఐసీఐ బ్యాంక్, ఇండిగో, ఐడీఎఫ్సీ, జీఐసీ హౌసింగ్ ఫైనాన్స్ -
టీసీఎస్ లాభం జూమ్
క్యూ4లో రూ. 6,413 కోట్లు; 73% అప్ * ఆదాయం 17.5 శాతం వృద్ధి; రూ. 28,449 కోట్లు * షేరుకి రూ.27 చొప్పున తుది డివిడెండ్ ముంబై: దేశీ సాఫ్ట్వేర్ అగ్రగామి టీసీఎస్ ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం(2015-16, క్యూ4)లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ. 6,413 కోట్లకు ఎగబాకింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.3,713 కోట్లతో పోల్చితే.. 73 శాతం దూసుకెళ్లింది. ఇక మొత్తం ఆదాయం సైతం 17.5 శాతం వృద్ధి చెంది రూ.28,449 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది క్యూ4లో ఆదాయం రూ.24,220 కోట్లుగా నమోదైంది. సీక్వెన్షియల్‌గానూ జోరు... డిసెంబర్‌తో ముగిసిన మూడో క్వార్టర్(క్యూ3)లో నికర లాభం రూ. 6,083 కోట్లతో పోల్చితే క్యూ4లో(సీక్వెన్షియల్ ప్రాతిపదికన) 5.4 శాతం ఎగబాకింది. మొత్తం ఆదాయం కూడా క్యూ3లో రూ.27,364 కోట్లతో పోల్చిచూస్తే 4% వృద్ధి చెందింది. పరిశ్రమ వర్గాలు సగటున క్యూ4లో నికర లాభం సీక్వెన్షియల్‌గా 2.5% మేర, ఆదాయం 3.6 శాతం చొప్పున వృద్ధి చెందవచ్చని అంచనావేశారు. దీనికి మించిన మెరుగైన పనితీరునే టీసీఎస్ నమోదు చేయడం గమనార్హం. మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కూడా ఆకర్షణీయమైన ఫలితాలతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. పూర్తి ఏడాది చూస్తే... 2015-16 పూర్తి ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ నికర లాభం రూ.24,292 కోట్లుగా నమోదైంది. 2014-15 ఏడాదిలో లాభం రూ. 19,852 కోట్లతో పోల్చితే 22.4% వృద్ధి చెందింది. ఇక మొత్తం ఆదాయం కూడా 14.8 శాతం పెరుగుదలతో రూ.94,648 కోట్ల నుంచి రూ.1,08,646 కోట్లకు ఎగబాకింది. ఫలితాల్లో ముఖ్యాంశాలివీ... * 2015-16 ఆర్థిక సంవత్సరానికిగాను టీసీఎస్ రూ. 1 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.27 చొప్పున(2,700%) తుది డివిడెండ్‌ను ప్రకటించింది. దీంతో పూర్తి ఏడాదికి మొత్తం డివిడెండ్ రూ.43.5కు చేరింది. * కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్ నుంచి వ్యాపారంలో నాలుగో త్రైమాసికానికి 2.6 శాతం వృద్ధిని టీసీఎస్ నమోదు చేసింది. యూరప్ మార్కెట్ వ్యాపారంలో 3.6 శాతం వృద్ధి నమోదైంది. * పూర్తి ఏడాది ఆదాయాల్లో తొలిసారిగా భారత్ మార్కెట్ నుంచి బిలియన్ డాలర్ల మైలురాయిని అధిగమించామని, కొత్త విదేశీ మార్కెట్ల నుంచి 3.3 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు టీసీఎస్ వెల్లడించింది. * కంపెనీ 2015-16 ఆదాయాల్లో డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్ వాటా 15.5 శాతంగా నమోదైంది. * సోమవారం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ముగిసిన తర్వాత టీసీఎస్ ఫలితాలు వెలువడ్డాయి. బీఎస్ఈలో కంపెనీ షేరు ధర క్రితం ముగింపు స్థాయిలోనే రూ.2,522 వద్ద ముగిసింది. కాగా, వ్యాపారా రహస్యాల చోరీ కేసుకు సంబంధించి అమెరికా ఫెడరల్ కోర్టు టీసీఎస్, టాటా అమెరికా ఇంటర్నేషన్లపై 94 కోట్ల డాలర్ల జరిమానాను విధించిన సంగతి తెలిసిందే. అయితే, ఇవన్నీ నిరాధార ఆరోపణలని, ఉన్నత న్యాయస్థానాల్లో ఈ తీర్పును సవాలు చేస్తామని టీసీఎస్ ఇప్పటికే పేర్కొంది. ఈ వార్తల ప్రభావంతో సోమవారం ఆరంభంలో షేరు ధర 3 శాతం పైగా పడింది. ‘సీజనల్‌గా నాలుగో క్వార్టర్లో ఉండే బలహీన ధోరణిని అధిగమించి పటిష్టమైన ఫలితాలను ప్రకటించాం. కీలకమైన బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవలు; రిటైల్, తయారీ రంగాలకు చెందిన ఆదాయాలు పుంజుకోవడం దీనికి ప్రధానంగా దోహదం చేసింది. కొత్త ఆర్థిక సంవత్సరంలో మరింత ఉత్సాహంతో ముందుకెళ్లేందుకు ఈ ఫలితాలు తోడ్పాటునందించనున్నాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ), ఆటోమేషన్ వంటి సరికొత్త విభాగాల్లో కొత్త ఉత్పత్తులతోపాటు ‘డిజిటల్’ నైపుణ్యాలను పెంచడంలో మా పెట్టుబడుల జోరును కొనసాగిస్తాం. ఐదేళ్లలో డిజిటల్ బిజినెస్ ఆదాయాన్ని 5 బిలియన్ డాలర్ల స్థాయి పైకి చేర్చాలన్న లక్ష్యాన్ని అందుకోగలం’. - ఎన్. చంద్రశేఖరన్, టీసీఎస్ ఎండీ, సీఈఓ నియామకాల్లో రికార్డు... గడచిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ చరిత్రలో ఇప్పటివరకూ ఎన్నడూలేనంత స్థాయిలో(ఆల్‌టైమ్ హై) స్థూలంగా 90,182 మంది ఉద్యోగులను నియమించుకున్నట్లు టీసీఎస్ పేర్కొంది. ఇక నాలుగో త్రైమాసికం విషయానికొస్తే స్థూలంగా 22,576 నియామకాలు జరిగాయి. ఇదే కాలంలో 13,424 మంది సిబ్బంది వలసపోవడంతో నికరంగా 9,152 మంది ఉద్యోగులు జతయ్యారు. దీంతో మార్చి చివరినాటికి టీసీఎస్ మొత్తం సిబ్బంది సంఖ్య 3,53,843 మందికి చేరింది. కాగా, 2015-16లో దాదాపు 400 కొత్త డిజిటల్ టెక్నాలజీల్లో 1,20,000 మందికిపైగా టీసీఎస్ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చినట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, హెచ్ఆర్ గ్లోబల్ హెడ్ అజోయ్ ముఖర్జీ వెల్లడించారు. 8-12 శాతం వేతనాల పెంపు... కంపెనీ ఉద్యోగులకు ఈ ఏడాది 8-12 శాతం మేర వేతనాలను పెంచుతున్నట్లు అజోయ్ ముఖర్జీ చెప్పారు. ఈ నెల నుంచి ఈ వేతన పెంపు ప్రతిపాదన అమల్లోకి వస్తుందని తెలిపారు. కాగా, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది స్థూల నియామకాల సంఖ్య తగ్గవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా గత కొద్ది నెలలుగా వలసల రేటు తగ్గుముఖం పట్టడం, అధిక ఉత్పాదకత, ఆటోమేషన్ పెరగడం వంటివి దీనికి కారణమని చెప్పారు. రానున్న నెలల్లో దాదాపు 30,000-32,000 మంది ఫ్రెషర్స్‌ను చేర్చుకోనున్నట్లు ముఖర్జీ వెల్లడించారు. -
సన్ ఫార్మాకు ర్యాన్‌బాక్సీ ఎఫెక్ట్
క్యూ4లో రూ.888 కోట్ల నికర లాభం న్యూఢిల్లీ: ఔషధ రంగ దిగ్గజ కంపెనీ, సన్ ఫార్మా గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి రూ.888 కోట్ల నికర లాభాన్ని(కన్సాలిడేటెడ్) ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసిక కాలానికి రూ.1,587 కోట్ల నికర లాభం సాధించామని పేర్కొంది. ర్యాన్‌బాక్సీ విలీనం, అమెరికా మార్కెట్లలో కొన్ని ఔషధాల ధరలు తగ్గించడం వల్ల నికర లాభం తగ్గిందని కంపెనీ వివరించింది. నికర అమ్మకాలు 2013-14 క్యూ4లో రూ.4,044 కోట్లుగా, గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.6,145 కోట్లుగా ఉన్నాయని తెలిపింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి వస్తే... 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.3,141 కోట్లుగా ఉన్న నికర లాభం 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.4,541 కోట్లకు పెరిగిందని వివరించింది. నికర అమ్మకాలు రూ.16,004 కోట్ల నుంచి రూ.27,287 కోట్లకు పెరిగాయని పేర్కొంది. ర్యాన్‌బాక్సీ కంపెనీని కొనుగోలు చేసినందున ఆర్థిక ఫలితాల(పూర్తి సంవత్సరం, క్యూ4 కూడా)ను పోల్చడానికి లేదని కంపెనీ స్పష్టం చేసింది. మొత్తం అమ్మకాల్లో అమెరికా మార్కెట్ వాటా 50 శాతంగా ఉందని వివరించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో సన్ ఫార్మా షేర్ ఎన్ఎస్ఈలో 1 శాతం వృద్ధితో రూ.966 వద్ద ముగిసింది. -
లాభాల్లోకి స్పైస్‌జెట్..
న్యూఢిల్లీ: దాదాపు రెండేళ్ల తర్వాత స్పైస్‌జెట్ విమానయాన సంస్థ లాభాల బాట పట్టింది. 2013-14 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి క్వార్టర్‌కు రూ.322 కోట్ల నష్టాలు వచ్చాయని కంపెనీ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.22.5 కోట్ల నికర లాభం ఆర్జించామని తెలిపింది. అయితే ఆదాయం మాత్రంరూ.1,300 కోట్ల నుంచి 40 శాతం క్షీణించి రూ.786 కోట్లకు తగ్గిందని స్పైస్‌జెట్ చైర్మన్ అజయ్ సింగ్ చెప్పారు. ఇక ఇబిటా రూ.235 కోట్ల (ప్రతికూలం)నుంచి రూ.80 కోట్లకు చేరిందని వివరించారు. విమానాల లోడ్ ఫ్యాక్టర్ 81 శాతంగా ఉందని వివరించారు. కాగా ఈ సంస్థలో ఇప్పటివరకూ కొత్త ప్రమోటర్ (అజయ్ సింగ్)నూ. 650 కోట్లు పెట్టుబడులు పెట్టారు. -
కోల్ ఇండియా లాభం రూ.4,238 కోట్లు
కోల్‌కతా: ప్రభుత్వ రంగ దిగ్గజం కోల్ ఇండియా లాభాలు మందగించాయి. గతేడాది జనవరి-మార్చి నాలుగో త్రైమాసికం(2014-15, క్యూ4)లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.4,238 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.4,434 కోట్లతో పోలిస్తే లాభం 4.4 శాతం తగ్గింది. అధిక వ్యయాలు లాభాలపై ప్రభావం చూపినట్లు కంపెనీ తెలిపింది. కాగా, మొత్తం ఆదాయం రూ.20,564 కోట్ల నుంచి రూ.21,340 కోట్లకు పెరిగింది. 3.7% వృద్ధి చెందింది. సంస్థ మొత్తం వ్యయాలు క్యూ4లో రూ.14,850 కోట్ల నుంచి రూ.16,073 కోట్లకు ఎగబాకాయి. ఇక స్టాండెలోన్ ప్రాతిపదికన నికర లాభం రూ.646 కోట్ల నుంచి రూ.9,629 కోట్లకు ఎగసింది. 15 రెట్లు దూసుకెళ్లింది. సబ్సిడరీ కంపెనీల నుంచి డివిడెండ్ల రూపంలో భారీగా ఇతర ఆదాయం రావడమే దీనికి ప్రధాన కారణం. పూర్తి ఏడాదికి చూస్తే... 2014-15 పూర్తి ఏడాదికి కోల్ ఇండియా రూ.13,727 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాదిలో రూ.15,112 కోట్లతో పోలిస్తే లాభం 9.1 శాతం దిగజారింది. మొత్తం ఆదాయం రూ.70,608 కోట్ల నుంచి రూ.74,120 కోట్లకు పెరిగింది. 5 శాతం వృద్ధి చెందింది. గురువారం బీఎస్ఈలో కంపెనీ షేరు ధర నామమాత్ర లాభంతో రూ.383 వద్ద స్థిరపడింది. మార్కెట్ ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. -
ఓఎన్జీసీ లాభం 20% డౌన్
క్యూ4లో రూ. 3,935 కోట్లు... * అధిక నిర్వహణ వ్యయాలు, రైటాఫ్‌ల ప్రభావం * షేరుకి 50 పైసలు డివిడెండ్ న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు-గ్యాస్ దిగ్గజం ఓఎన్జీసీ నిరుత్సాహకరమైన ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం(2014-15, క్యూ4)లో కంపెనీ నికర లాభం 19.5 శాతం క్షీణించి రూ.3,935 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.4,889 కోట్లుగా ఉంది. ప్రధానంగా అధిక నిర్వహణ వ్యయాలు, నిరర్ధకమైన బావుల డ్రిల్లింగ్‌పై పెట్టుబడులను రైటాఫ్ చేయడం వంటివి లాభాల తగ్గుదలకు దారితీశాయి. ఇక మొత్తం ఆదాయం క్యూ4లో రూ.21,863 కోట్లుగా నమోదైంది. అంతక్రితం సంవత్సరం క్యూ4లో రూ.21,403 కోట్లతో పోలిస్తే స్వల్పంగా 1.3 శాతం పెరిగింది. మార్చి త్రైమాసికంలో కంపెనీ ఒక్కో బ్యారెల్ చమురు ఉత్పత్తిపై 55.63 డాలర్ల రాబడిని ఆర్జించింది. గతేడాది ఇదే క్వార్టర్లో ఈ రాబడి 44.87 డాలర్లు. ఇక నిర్వహణ వ్యయం రూ.1,278 కోట్లకు ఎగబాకింది. కొత్తగా తవ్విన కొన్ని బావుల్లో ఎలాంటి నిల్వలను కనుగొనలేకపోవడం(డ్రై వెల్స్)తో రూ.291 కోట్ల అన్వేషణ వ్యయాలను రైటాఫ్ చేసినట్లు ఫలితాల ప్రకటన సందర్భంగా ఓఎన్జీసీ చైర్మన్, ఎండీ దినేష్ కె.షరాఫ్ పేర్కొన్నారు. 2014-15 పూర్తి ఏడాదికి చూస్తే కంపెనీ రైటాఫ్ చేసిన మొత్తం రూ.10,000 కోట్లుగా ఉంది. ఇందులో డ్రై వెల్స్ కారణంగా జరిగింది రూ.2,700 కోట్లు కావడం గమనార్హం. క్యూ4లో కంపెనీ ముడిచమురు ఉత్పత్తి స్వల్పంగా తగ్గి 6.47 మిలియన్ టన్నుల నుంచి 6.45 టన్నులకు పరిమితమైంది. గ్యాస్ ఉత్పత్తి కూడా 5.83 బిలియన్ ఘనపు మీటర్ల నుంచి 5.81 ఘనపు మీటర్లకు తగ్గింది. క్యూ4లో తమపై ఎలాంటి సబ్సిడీ భారం పడలేదని, అయితే, పూర్తి సంవత్సరానికి సబ్సిడీ చెల్లింపు రూ.36,300 కోట్లుగా ఉన్నట్లు షరాఫ్ పేర్కొన్నారు. దీనివల్ల కంపెనీ లాభాలపై రూ.20,437 కోట్ల మేర ప్రభావం చూపినట్లు చెప్పారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కూడా తమపై సబ్సిడీ చెల్లింపుల భారం లేదని ఆయన తెలిపారు. వంటగ్యాస్, కిరోసిన్‌లను ప్రభుత్వ నియంత్రిత రేట్లకు విక్రయించడం వల్ల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ(ఓఎంసీ)లకు వస్తున్న ఆదాయ నష్టాల్లో సగానికిపైగా భారాన్ని ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా, గెయిల్‌లు భరిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, సబ్సిడరీ సంస్థ ఓఎన్జీసీ విదేశ్‌ను మార్కెట్లో లిస్టింగ్ చేసే ప్రతిపాదనేదీ ప్రస్తుతానికి లేదని షరాఫ్ స్పష్టం చేశారు. పూర్తి ఏడాదికి ఇలా... గడిచిన 2014-15 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఓఎన్జీసీ నికర లాభం 20 శాతం దిగజారి రూ.17,733 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది లాభం రూ.22,095 కోట్లు. మొత్తం ఆదాయం మాత్రం 1.3 శాతం క్షీణతతో రూ.84,201 కోట్ల నుంచి రూ.83,094 కోట్లకు తగ్గింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం 31 శాతం దిగజారింది. రూ.26,507 కోట్ల నుంచి రూ.18,334 కోట్లకు పడిపోయింది. టర్నోవర్ కూడా రూ.1,78,205 కోట్ల నుంచి రూ.1,66,067 కోట్లకు తగ్గింది. 6.8 శాతం క్షీణించింది. రూ.5 ముఖ విలువ గల ఒక్కో షేరుపై కంపెనీ 50 పైసలు చొప్పున తుది డివిడెండ్‌ను ప్రకటించింది. ఓఎన్జీసీ షేరు ధర గురువారం బీఎస్ఈలో 1 శాతం క్షీణించి రూ.328 వద్ద ముగిసింది. మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. -
భెల్ లాభం తగ్గింది
ఒక్కో షేర్‌కు రూ.0.62 డివిడెండ్ న్యూఢిల్లీ: విద్యుదుత్పత్తి పరికరాలు తయారు చేసే ప్రభుత్వ రంగ సంస్థ, భెల్ నికర లాభం(స్టాండ్‌లోన్) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో 52% తగ్గింది. 2013- 14 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.1,845 కోట్లుగా ఉన్న నికర లాభం 2014-15 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.888 కోట్లకు తగ్గిందని భెల్ పేర్కొం ది. నికర అమ్మకాలు రూ.14,755 కోట్ల నుంచి 16% క్షీణించి రూ.12,368 కోట్లకు పడిపోయాయని తెలిపింది. 31% డివిడెండ్(ఒక్కో షేర్‌కు రూ.0.62) ఇవ్వాలని తమ డెరైక్టర్ల బోర్డ్ రికమెండ్ చేసిందని పేర్కొంది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి వస్తే, 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ. 3,461 కోట్లుగా ఉన్న నికర లాభం 2014-15 ఆర్థిక సంవత్సరంలో 59% క్షీణించి రూ.1,419 కోట్లకు తగ్గిపోయిందని పేర్కొంది. నికర అమ్మకాలు రూ. 38,389 కోట్ల నుంచి 23% క్షీణించి రూ.29,542 కోట్లకు తగ్గాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో భెల్ షేరు ధర మంగళవారం ఎన్ఎస్ఈలో 2.8% లాభంతో రూ.214 వద్ద ముగిసింది. -
కర్నాటక బ్యాంక్లాభం 66% అప్
- ఒక్కో షేర్‌కు రూ.5 డివిడెండ్ - బేస్‌రేట్ పావు శాతం తగ్గింపు న్యూఢిల్లీ: కర్నాటక బ్యాంక్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 66 శాతం పెరిగింది. 2013-14 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ. 81 కోట్లుగా ఉన్న నికర లాభం 2014-15ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.134 కోట్లకు పెరిగిందని కర్నాటక బ్యాంక్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,173 కోట్ల నుంచి 12 శాతం వృద్ధితో రూ.1,308 కోట్లకు చేరిందని బ్యాంక్ ఎండీ, సీఈఓ పీ. జయరామ భట్ చెప్పారు. ఒక్కో షేర్‌కు రూ.5 డివిడెండ్ ఇస్తామని, బేస్ రేట్‌ను 10.75 శాతం నుంచి 10.50 శాతానికి తగ్గించామని తెలిపారు. -
ఐటీసీ లాభం రూ.2,361 కోట్లు
- క్యూ4లో 3.65 శాతం వృద్ధి - షేరుకి రూ.6.25 డివిడెండ్ న్యూఢిల్లీ: బహుళ వ్యాపార దిగ్గజం ఐటీసీ లాభాల జోరు తగ్గింది. మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్(2014-15, క్యూ4)లో సంస్థ నికర లాభం స్వల్పంగా 3.65 శాతం వృద్ధి చెంది రూ.2,361 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్లో లాభం రూ.2,278 కోట్లుగా ఉంది. ప్రధానంగా సిగరెట్ల వ్యాపారంలో వృద్ధి మందగించడం, వ్యవసాయోత్పత్తుల విభాగ ఆదాయాలు క్షీణించడం.. లాభాలపై ప్రభావం చూపాయి. క్యూ4లో మొత్తం ఆదాయం రూ.9,188 కోట్లుగా నమోదైంది. అంతక్రితం సంవత్సరం క్యూ4లో రూ.9,145 కోట్లతో పోలిస్తే నామమాత్రంగా 0.47 శాతమే ఆదాయం పెరిగింది. విభాగాల వారీగా...: - కంపెనీకి అత్యంత ప్రధానమైన ఎఫ్ఎంసీజీ(సిగరెట్లతో సహా) విభాగం ఆదాయం క్యూ4లో 6 శాతం పెరిగి రూ.6,771 కోట్లుగా నమోదైంది. ఇందులో సిగరెట్ల వ్యాపారం నుంచి ఆదాయం కేవలం 3.23 శాతం వృద్ధితో రూ.4,211 కోట్లుగా ఉంది. సిగరెట్లేతర ఎఫ్ఎంసీజీ వ్యాపారం ఆదాయం 10.88 శాతం వృద్ధి చెంది రూ.2,567 కోట్లను తాకింది. - హోటళ్ల వ్యాపారం క్యూ4 ఆదాయం 8.08 శాతం వృద్ధితో రూ.321 కోట్ల నుంచి రూ.346 కోట్లకు పెరిగింది. - అగ్రి(వ్యవసాయ సంబంధ) బిజినెస్ ఆదాయం 28.75 శాతం పడిపోయి రూ.1,428 కోట్లకు పరిమితమైంది. - పేపర్, పేపర్‌బోర్డులు, ప్యాకేజింగ్ వ్యాపారానికి సబంధించి ఆదాయం కూడా 4.64 శాతం దిగజారి రూ.1,203 కోట్లుగా నమోదైంది. - ఇక 2014-15 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఐటీసీ నికర లాభం రూ.9,608 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది రూ.8,785 కోట్లతో పోలిస్తే 9.4 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం 9.7 శాతం వృద్ధితో రూ.32,883 కోట్ల నుంచి రూ.36,083 కోట్లకు ఎగసింది. - కంపెనీ బోర్డు రూ.1 ముఖ విలువ గల ఒక్కో షేరుకి రూ.6.25 చొప్పున డివిడెండ్‌ను ప్రకటించింది. -
ఎస్బీఐ లాభం రయ్..
క్యూ4లో 23 శాతం జంప్; రూ. 3,742 కోట్లు - ఆదాయం రూ.48,616 కోట్లు; 15 శాతం పెరుగుదల - దిగొచ్చిన మొండి బకాయిలు... - షేరుకి రూ.3.5 చొప్పున డివిడెండ్... కోల్‌కతా: దేశీ బ్యాంకింగ్ అగ్రగామి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. మొండిబకాయిలు దిగిరావడం.. నికర వడ్డీ ఆదాయాల జోరుతో లాభాలు పుంజుకున్నాయి. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం(2014-15, క్యూ4)లో బ్యాంక్ స్టాండెలోన్ నికర లాభం రూ.3,742 కోట్లకు దూసుకెళ్లింది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్లో రూ.3,041 కోట్లతో పోలిస్తే లాభం 23% ఎగసింది. ఇక బ్యాంక్ మొత్తం ఆదాయం క్యూ4లో రూ.42,443 కోట్ల నుంచి రూ.48,616 కోట్లకు పెరిగింది. 14.6% వృద్ధి నమోదైంది. మొండిబకాయిలు తగ్గాయ్... మార్చి క్వార్టర్ చివరినాటికి ఎస్బీఐ మొత్తం రుణాల్లో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏ) 4.25 శాతానికి(రూ.56,725 కోట్లు) దిగొచ్చాయి. అంతక్రితం ఏడాది మార్చి చివరినాటికి ఈ నిష్పత్తి 4.95 శాతంగా(రూ.61,605 కోట్లు) ఉంది. నికర ఎన్పీఏలు 2.57 శాతం నుంచి 2.12 శాతానికి తగ్గాయి. కాగా, క్యూ4లో ఎన్పీఏలపై కేటాయింపులు(ప్రొవిజనింగ్) రూ.5,884 కోట్ల నుంచి రూ.4,635 కోట్లకు తగ్గాయి. ఇక కొత్తగా మొండిబకాయిలుగా మారిన రుణాలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.4,769 కోట్లుగా నమోదయ్యాయి. అంతక్రితం ఏడాది ఈ పరిమాణం రూ.7,947 కోట్లుగా ఉంది. పూర్తి ఏడాదికి ఇలా... 2014-15 పూర్తి ఏడాదిలో ఎస్బీఐ స్టాండెలోన్ నికర లాభం రూ.13,102 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది రూ.10,892 కోట్లతో పోలిస్తే 20% వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం 13% వృద్ధితో 1,54,904 కోట్ల నుంచి రూ.1,74,972 కోట్లకు ఎగసింది. ఎస్బీఐ గ్రూప్ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన(అనుబంధ సంస్థలతో కలిపి) నికర లాభం 2014-15 ఏడాదిలో 20% ఎగబాకి రూ.16,994 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది లాభం రూ.14,174 కోట్లు. కన్సాలిడేటెడ్ ఆదాయం రూ. రూ.2,26,944 కోట్ల నుంచి రూ.2,57,290 కోట్లకు పెరిగింది. 13.4% వృద్ధి చెందింది. క్యూ4 ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 14 శాతం ఎగబాకి రూ.12,903 కోట్ల నుంచి రూ.14,712 కోట్లకు చేరింది. మార్చి క్వార్టర్ నాటికి నికర వడ్డీ మార్జిన్ 3.16 శాతంగా నమోదైంది. బ్యాంక్ మొత్తం డిపాజిట్లు 13.08 శాతం పెరిగి మార్చి చివరినాటికి రూ.15,76,793 కోట్లుగా నమోదయ్యాయి. ఇక మొత్తం రుణాలు 7.25 శాతం వృద్ధితో రూ.13,35,424 కోట్లను తాకాయి. 2014-15 ఆర్థిక సంవత్సరానికిగాను వాటాదారులకు రూ.1 ముఖ విలువ గల ఒక్కో షేరుపై ఎస్బీఐ రూ.3.5(350%) డివిడెండ్‌ను ప్రకటించింది. రికవరీలపై మరింత దృష్టి... క్యూ4లో స్థూల, నికర ఎన్పీఏలు రెండూ తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొండి బకాయిల రికవరీపై మరింత దృష్టిసారిస్తున్నాం. రానున్న 10 నెలల్లో రూ.15,000 కోట్ల మేర నిధుల సమీకరణకు బ్యాంక్ అనుమతులు పొందింది. ఎస్బీఐ లైఫ్‌లో 10 శాతం వాటా విక్రయంపై దృష్టిపెట్టాం. - అరుంధతీ భట్టాచార్య, ఎస్బీఐ చైర్పర్సన్ ఎగసిపడిన షేరు... ఫలితాల నేపథ్యంలో ఎస్బీఐ షేరు భారీగా ఎగసిపడింది. మెరుగైన లాభాలు, మొండిబకాయిల తగ్గుదల ప్రభావంతో శుక్రవారం బీఎస్ఈలో బ్యాంక్ షేరు ధర ఒకానొక దశలో 5.4% ఎగసి రూ.305 గరిష్టస్థాయిని తాకింది. అయితే, పైస్థాయిల వద్ద లాభాల స్వీకరణ జరగడంతో చివరకు 2.38 శాతం దిగజారి రూ.282 వద్ద స్థిరపడింది. -
టాటా స్టీల్ నష్టం రూ. 5,674 కోట్లు
న్యూఢిల్లీ: ఉక్కు తయారీ దిగ్గజం టాటా స్టీల్ మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో రూ. 5,674 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో కంపెనీ రూ. 1,036 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. నగదుయేతర రైట్ డౌన్స్ తాజా నష్టాలకు కారణం. మరోవైపు తాజా క్యూ4లో ఆదాయం 21 శాతం క్షీణించి రూ. 42,428 కోట్ల నుంచి రూ. 33,666 కోట్లకు తగ్గింది. గ్రూప్‌లోని కొన్ని వ్యాపార విభాగాలు అంతగా పనితీరు ఆశించిన స్థాయిలో లేనందున వాటి విలువలను తగ్గించడం వల్ల నష్టాలు నమోదు చేయాల్సి వచ్చిందని టాటా స్టీల్ పేర్కొంది. -
డాక్టర్ రెడ్డీస్ లాభం 8% అప్
క్యూ4లో రూ. 519 కోట్లు ⇒ కరెన్సీ హెచ్చుతగ్గుల ప్రతికూల ప్రభావం ⇒ ఒక్కో షేరుకి రూ. 20 డివిడెండు.. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ నికర లాభం 8 శాతం పెరిగి రూ. 519 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఇది రూ. 481 కోట్లు. మరోవైపు ఆదాయం 11 శాతం వృద్ధితో రూ. 3,481 కోట్ల నుంచి రూ. 3,870 కోట్లకు పెరిగింది. వర్ధమాన మార్కెట్లలో కరెన్సీ తీవ్ర హెచ్చుతగ్గులకు లోను కావడం.. లాభాలపై దాదాపు రూ. 84 కోట్ల మేర ప్రతికూల ప్రభావం చూపిందని మంగళవారం ఇక్కడ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీ సీఈవో జీవీ ప్రసాద్ తెలిపారు. రష్యా కరెన్సీ డీవేల్యుయేషన్ తదితర అంశాలు ఇందుకు కారణమని వివరించారు. మరిన్ని కొత్త ఉత్పత్తులు ప్రవేశపెట్టడం ద్వారా రెండంకెల స్థాయి వృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఓటీసీ ఉత్పత్తుల ఊతంతో తొలిసారిగా అమెరికా జనరిక్స్ మార్కెట్లో తొలిసారిగా బిలియన్ డాలర్ల అమ్మకాలను సాధించినట్లు డాక్టర్ రెడ్డీస్ సీఎఫ్‌వో సౌమేన్ చక్రవర్తి తెలిపారు. యూసీబీ కొనుగోలు ప్రక్రియ ఈ త్రైమాసికంలో పూర్తి కాగలదని, దీంతో ఆదాయాలు మరో రూ. 150 కోట్ల మేర పెరగగలవని పేర్కొన్నారు. రూ. 5 ముఖవిలువ గల షేరుపై రూ.20 డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ బోర్డు ప్రతిపాదించింది. మెరుగుపడుతున్న యూరప్ మార్కెట్లు..: యూరప్‌లో పరిస్థితులు మెరుగుపడుతుండటంతో అక్కడి మార్కెట్లలో వ్యాపారం లాభాల్లోకి మళ్లిందని ప్రసాద్ తెలిపారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో అమెరికాలో 12, రష్యా తదితర దేశాలోల 14, భారత్‌లో 18 కొత్త ఔషధాలు ప్రవేశపెట్టినట్లు ఆయన వివరించారు. కొత్తగా 13 ఉత్పత్తులకు ఫైలింగ్ చేశామని, దీంతో అమెరికా ఎఫ్‌డీఏ వద్ద మొత్తం 68 ఏఎన్‌డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని ప్రసాద్ చెప్పారు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయాలు 12% వృద్ధితో రూ. 14,818 కోట్లకు పెరగ్గా, లాభాలు 3% పెరుగుదలతో రూ. 2,218 కోట్లకు చేరాయి. అమెరికాలో జనరిక్స్ ఆదాయం 17శాతం పెరిగి రూ. 6,472 కోట్లు, యూరప్‌లో 3% వృద్ధితో రూ. 719 కోట్లు, భారత్‌లో 14 శాతం వృద్ధితో రూ. 179 కోట్లు వచ్చాయి. కీలకమైన అమెరికా మార్కెట్లో ఔషధాలకు ఆమోదం లభించడంలో జాప్యం, భౌగోళిక-రాజకీయ అనిశ్చితి, వెనెజులా..రష్యా తదితర దేశాల్లో కరెన్సీ హెచ్చుతగ్గులు మొదలైన అంశాలు లాభాలపై ప్రతికూల ప్రభావం చూపాయని చక్రవర్తి తెలిపారు. చిన్న, మధ్య తరహా సంస్థల కొనుగోలుపై కసరత్తు జరుగుతూనే ఉందని ప్రసాద్ చెప్పారు. జపాన్ మార్కెట్లో భాగస్వామ్య సంస్థల కోసం అన్వేషిస్తున్నట్లు వివరించారు. కొత్త పెట్టుబడి ప్రణాళికలు..: గత ఆర్థిక సంవత్సరం తరహాలోనే ఈసారి మరో రూ. 1,000-1,200 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రసాద్ చెప్పారు. ప్రధానంగా నాణ్యతను మెరుగుపర్చుకోవడం, కొత్త టెక్నాలజీలను సమకూర్చుకోవడం వంటి వాటిపై ఇన్వెస్ట్ చేయనున్నట్లు వివరించారు. పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై(ఆర్అండ్డీ) ఈసారి కూడా 12% పైనే వెచ్చించనున్నట్లు ప్రసాద్ తెలిపారు. బయోసిమిలర్ల విషయంలో మెర్క్ సంస్థతో కలసి పనిచేస్తున్నామని, 2018 నాటికి మొదటిదాన్ని విడుదల చేసే అవకాశం ఉందని చెప్పారు. శ్రీకాకుళం ప్లాంటును యూఎస్ఎఫ్డీఏ పరిశీలించిన నేపథ్యంలో.. నిబంధనల పాటింపునకు సంబంధించి అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. దీనిపై ఎఫ్‌డీఏ నుంచి ఇంకా స్పందన రావాల్సి ఉందన్నారు. అయితే, ముందు జాగ్రత్త చర్యగా కొన్ని ఔషధాల తయారీని శ్రీకాకుళం ప్లాంటు నుంచి ఇతర ప్లాంట్లకు తరలించినట్లు ప్రసాద్ వివరించారు. ఫలితాల నేపథ్యంలో మంగళవారం బీఎస్ఈలో డాక్టర్ రెడ్డీస్ షేరు ధర 3 శాతం ఎగసి రూ.3,466 వద్ద స్థిరపడింది. -
బీఒబీ లాభం 48 శాతం డౌన్
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ) నికర లాభం(స్టాండోలోన్) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో 48% తగ్గింది. 2013-14 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.1,157 కోట్లుగా ఉన్న నికర లాభం గతేడాది క్యూ4లో రూ.598 కోట్లకు తగ్గిందని బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది. మొత్తం ఆదాయం రూ.11,615 కోట్ల నుంచి 4% వృద్ధితో రూ.12,057 కోట్లకు పెరిగింది. స్థూల మొండి బకాయిలు 3.85% నుంచి 3.72%కి, నికర మొండి బకాయిలు 2.11% నుంచి 1.89%కి తగ్గాయి. రూ.4,000 కోట్ల రుణాలను పునర్వ్యస్థీకరించామని వివరించారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం 25% క్షీణించి రూ.3,398 కోట్లకు, మొత్తం ఆదాయం 9% వృద్ధితో రూ.47,366 కోట్లకు పెరిగింది. నికర లాభం తగ్గినప్పటికీ, బీఓబీ షేరు దూసుకుపోయింది. ఆస్తుల నాణ్యత మెరుగుపడడమే దీనికి ప్రధాన కారణమని ట్రేడర్లు పేర్కొన్నారు. ఎన్ఎస్ఈలో ఈ షేరు 17% లాభపడి రూ.169.7 వద్ద ముగిసింది. -
హెచ్‌యూఎల్ లాభం జూమ్
క్యూ4లో 17 శాతం అప్; రూ. 1,018 కోట్లు... ⇒ ఆదాయం రూ.7,555 కోట్లు; 9% వృద్ధి ⇒ షేరుకి రూ. 9 తుది డివిడెండ్ న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) నికర లాభం దాదాపు 17 శాతం పెరిగి రూ. 1,018 కోట్లకు చేరింది. అంతక్రితం క్యూ4లో ఇది రూ. 872 కోట్లు. తాజాగా నాలుగో త్రైమాసికంలో ఆదాయం రూ. 6,936 కోట్ల నుంచి 9 శాతం వృద్ధి చెంది రూ. 7,555 కోట్లకు పెరిగింది. కొన్ని ప్రాపర్టీల విక్రయం ద్వారా రూ. 170 కోట్ల మేర అదనపు ఆదాయం వచ్చినట్లు సంస్థ తెలిపింది. మార్కెట్లో సవాళ్లు ఉన్నప్పటికీ పోటీ సంస్థలను మించి మెరుగైన లాభాలు ఆర్జించే దిశగా తాము నిలకడైన వ్యూహాన్ని అనుసరిస్తున్నామని హెచ్‌యూఎల్ చైర్మన్ హరీశ్ మన్వాని తెలిపారు. మార్జిన్లను మెరుగుపర్చుకుంటూ, మరోసారి మార్కెట్‌ను మించిన పనితీరును కనపర్చగలిగామన్నారు. మరోవైపు, పట్టణ మార్కెట్లను మించి గ్రామీణ ప్రాంత మార్కెట్లు ఎదుగుతూ వచ్చినప్పటికీ.. గత 2-3 ఏళ్లతో పోలిస్తే గ్రామీణ మార్కెట్లలో అమ్మకాలు కాస్త మందగించాయని సంస్థ సీఎఫ్‌వో పీబీ బాలాజీ తెలిపారు. షేరు ఒక్కింటికి రూ. 9 చొప్పున తుది డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ బోర్డు నిర్ణయించింది. రెండంకెల వృద్ధి..: సోప్స్, డిటర్జెంట్లతో పాటు శిశు సంరక్షణ ఉత్పత్తులు లాంటివి కొన్నింటిని మినహాయిస్తే మిగతా ఉత్పత్తుల అమ్మకాలు రెండంకెల స్థాయి వృద్ధిని నమోదు చేశాయి. సోప్స్, డిటర్జెంట్స్ విభాగం అమ్మకాల ఆదాయం 5 శాతం పెరిగి రూ. 3,674 కోట్లు, బేవరేజెస్ ఆదాయం 12 శాతం పెరిగి రూ. 976 కోట్లు, పర్సనల్ కేర్ విక్రయాలు 13 శాతం పెరిగి రూ.2,250 కోట్లు, ప్యాకేజ్డ్ ఫుడ్ అమ్మకాలు 14 శాతం పెరిగి రూ. 477 కోట్లు వచ్చాయి. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను హెచ్‌యూఎల్ నికర లాభం రూ.3,867 కోట్ల నుంచి రూ. 4,315 కోట్లకు పెరిగింది. ఆదాయం రూ.27,048 కోట్ల నుంచి రూ. 30,170 కోట్లకు ఎగిసింది. శుక్రవారం బీఎస్ఈలో హెచ్‌యూఎల్ షేరు 3.34% పెరిగి రూ. 894.60 వద్ద ముగిసింది. -
కోటక్ బ్యాంక్ 1:1 బోనస్ షేర్లు
⇒ క్యూ4లో నికర లాభం 38 శాతం అప్ ⇒ ఒక్కో షేర్‌కు 90 పైసలు డివిడెండ్ ముంబై: కోటక్ మహీంద్రా బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలం ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. జనవరి-మార్చి క్వార్టర్‌కు రూ.913 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభం ఆర్జించామని బ్యాంక్ తెలిపింది. అంతక్రితం ఏడాది క్యూ4 లాభం(రూ.663 కోట్లు)తో పోల్చితే 38% వృద్ధి సాధించామని బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, ఎండీ ఉదయ్ కోటక్ వెల్లడించారు. ఒక్కో ఈక్విటీ షేర్‌కు ఒక్కో బోనస్ షేర్‌ను ఇవ్వాలన్న ప్రతిపాదనను, రూ.5 ముఖ విలువ ఉన్న ఒక్కో షేర్‌కు 90 పైసలు డివిడెండ్ ఇవ్వడానికీ డెరైక్టర్ బోర్డ్ ఆమోదం తెలిపిందని వివరించారు. మొత్తం ఆదాయం 29 శాతం వృద్ధి: వడ్డీయేతర ఆదాయం రెట్టింపు కావడంతో ఈ స్థాయి నికర లాభం ఆర్జించామని ఉదయ్ కోటక్ వెల్లడించారు. మొత్తం ఆదాయం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 4,782 కోట్ల నుంచి 29 శాతం వృద్ధితో రూ.6,172 కోట్లకు ఎగసిందని తెలిపారు. నికర వడ్డీ ఆదాయం 16% వృద్ధితో రూ.1,123 కోట్లకు, ఇతర ఆదాయం 94% వృద్ధితో రూ.1,018 కోట్లకు పెరిగాయని వివరించారు. స్టాండోలోన్ ప్రాతిపదికన చూస్తే, నికర లాభం రూ.407 కోట్ల నుంచి 29% వృద్ధితో రూ.527 కోట్లకు, మొత్తం ఆదాయం రూ.2,553 కోట్ల నుంచి రూ.3,249 కోట్లకు పెరిగాయన్నారు. ఐఎన్జీ వైశ్యా విలీన ప్రభావంతో కూడిన ఆర్థిక ఫలితాలు జూన్ క్వార్టర్ నుంచి ఉంటాయని ఉదయ్ కోటక్ తెలిపారు. ఎన్ఎస్ఈలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్ 6.3 శాతం వృద్ధితో రూ.1,423కు చేరింది. -
కోరమాండల్ లాభం రూ.402 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎరువుల తయారీలో ఉన్న కోరమాండల్ ఇంటర్నేషనల్ 2014-15 కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికర లాభం క్రితం ఏడాదితో పోలిస్తే రూ.356 కోట్ల నుంచి రూ.402 కోట్లకు చేరింది. టర్నోవరు రూ.10,053 కోట్ల నుంచి రూ.11,306 కోట్లకు ఎగసింది. క్యూ4లో రూ.2,997 కోట్ల టర్నోవర్‌పై రూ.68 కోట్ల నికర లాభం పొందింది. 2013-14 క్యూ4లో రూ.2,184 కోట్ల టర్నోవర్‌పై రూ.81 కోట్ల నికర లాభం పొందింది. రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.2.50 తుది డివిడెండు చెల్లించాలని బోర్డు ప్రతిపాదించింది. -
ఎయిర్టెల్ లాభం జూమ్
⇒ క్యూ4లో 30 శాతం వృద్ధి; రూ.1,255 కోట్లు ⇒ డేటా ఆదాయాల జోరు ఆసరా... న్యూఢిల్లీ: దేశీ టెలికం అగ్రగామి భారతీ ఎయిర్టెల్ గతేడాది చివరి త్రైమాసికం(2014-15, క్యూ4)లో రూ.1,255 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.962 కోట్లతో పోలిస్తే లాభం 30 శాతం ఎగబాకింది. ప్రధానంగా భారీ సంఖ్యలో కొత్త యూజర్లు... మొబైల్ డేటా ఆదాయాలు పుంజుకోవడంతో కంపెనీ లాభాల జోరుకు దోహదం చేసింది. ఇక ఎయిర్టెల్ కన్సాలిడేటెడ్ ఆదాయం క్యూ4లో 3.6 శాతం వృద్ధితో రూ.23,016 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఆదాయం రూ.22,219 కోట్లుగా ఉంది. పూర్తి ఏడాదికి...: గడచిన 2014-15 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఎయిర్టెల్ నికర లాభం 87 శాతం దూసుకెళ్లి రూ.5,183 కోట్లకు ఎగసింది. 2013-14లో లాభం రూ.2,773 కోట్లే. మొత్తం ఆదాయం 7.3 శాతం వృద్ధి చెంది రూ.85,746 కోట్ల నుంచి రూ.92,039 కోట్లకు చేరింది. కంపెనీ ఆదాయ వృద్ధి విషయంలో మెరుగైన పనితీరును సాధించామని భారతీ ఎయిర్టెల్ ఎండీ, సీఈఓ(భారత్, దక్షిణాసియా) గోపాల్ విట్టల్ పేర్కొన్నారు. డేటా జోష్... మొబైల్ కస్టమర్ల నుంచి డేటా వినియోగం గణనీయంగా పెరగడంతో కంపెనీ క్యూ4 డేటా ఆదాయం(కన్సాలిడేటెడ్) 59.1% ఎగబాకి రూ.3,085 కోట్లుగా నమోదైంది. ఇక ఒక్క భారత్‌లో చూస్తే ఈ ఆదాయం 70.4% దూసుకెళ్లి రూ.2,324 కోట్లకు చేరింది. ఒక్కో యూజర్ నుంచి సగటు నెలవారీ సగటు డేటా ఆదాయం(ఏఆర్పీయూ) మార్చి క్వార్టర్లో రూ.43 పెరిగా రూ.176గా నమోదైంది. మార్చి చివరి నాటికి ఎయిర్టెల్ కన్సాలిడేటెడ్ రుణ భారం 10.68 బిలియన్ డాలర్లకు(రూ.66,800 కోట్లు) చేరింది. కాగా, 2014-15లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదిక మొత్తం రూ.18,668 కోట్ల పెట్టుబడులను కంపెనీ వెచ్చించింది. ఆఫ్రికా కార్యకలాపాలపై క్యూ4లో నికర నష్టాలు 10.5 కోట్ల డాలర్ల నుంచి రూ.18.3 కోట్ల డాలర్లకు చేరాయి. రూ. ముఖ విలువగల ఒక్కో షేరుపై రూ.2.22 చొప్పున తేది డివిడెండ్‌ను కంపెనీ బోర్డు ప్రతిపాదించింది. ఫలితాల నేపథ్యంలో మంగళవారం ఎయిర్టెల్ షేరు ధర బీఎస్ఈలో 2.26 శాతం ఎగసి రూ.401 వద్ద ముగిసింది. ఒకానొకదశలో రూ.409 గరిష్టాన్ని కూడా తాకింది. -
ఐడియా లాభం 60 శాతం జంప్
క్యూ4లో రూ.942 కోట్లు... న్యూఢిల్లీ: టెలికం సంస్థ ఐడియా సెల్యులార్ ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (2014-15, క్యూ4)లో కంపెనీ రూ.942 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని నమోదుచేసింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.590 కోట్లతో పోలిస్తే లాభం దాదాపు 60% వృద్ధి చెందింది. ఇక మొత్తం ఆదాయం రూ.7,044 కోట్ల నుంచి రూ.8,423 కోట్లకు పెరిగింది. 19.5% వృద్ధి నమోదైంది. కాగా, క్యూ4లో ఒక్కో యూజర్ నుంచి సగటు నెలవారీ ఆదాయం(ఏఆర్పీయూ) రూ.179కి పెరిగింది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్లో రూ.173గా ఉంది. పూర్తి ఏడాదికి ఇలా...: 2014-15 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఐడియా కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.3,193 కోట్లకు ఎగబాకింది. 2013-14లో నమోదైన రూ.1,968 కోట్లతో పోలిస్తే లాభం 62 శాతం మేర దూసుకెళ్లింది. మొత్తం ఆదాయం సైతం 19 శాతం వృద్ధితో రూ.26,519 కోట్ల నుంచి రూ.31,571 కోట్లకు పెరిగింది. కాగా, 2014-15లో 3జీ డేటా యూజర్ల సంఖ్య రెట్టింపై 1.45 కోట్ల మందికి చేరినట్లు కంపెనీ వెల్లడించింది.మెరుగైన ఫలితాల నేపథ్యంలో ఐడియా షేరు ధర మంగళవారం బీఎస్ఈలో 2.79 శాతం లాభపడి రూ.192 వద్ద స్థిరపడింది. -
టాప్‌గేర్‌లో మారుతీ...
క్యూ4లో లాభం 61 శాతం జంప్; రూ.1,284 కోట్లు - రికార్డు స్థాయిలో వార్షిక లాభం; రూ.3,711 కోట్లు - 500%(రూ.25) డివిడెండ్ ప్రకటన న్యూఢిల్లీ: దేశీ కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ.. బంపర్ ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం(2014-15, క్యూ4)లో కంపెనీ నికర లాభం రూ.1,284 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.800 కోట్లతో పోలిస్తే 60.5 శాతం దూసుకెళ్లింది. ఇక మొత్తం ఆదాయం కూడా 12.3 శాతం ఎగబాకి రూ.11,818 కోట్ల నుంచి రూ.13,273 కోట్లకు పెరిగింది. ప్రధానంగా అమ్మకాల జోరుతో పాటు ఉత్పాదక వ్యయం తగ్గడం, కమోడిటీ ధరల తగ్గుదల వంటివి భారీ లాభాలకు దోహదం చేశాయని కంపెనీ చైర్మన్ ఆర్సీ భార్గవ వ్యాఖ్యానించారు. విదేశీ మారకం(ఫారెక్స్) రేటు సానుకూలత కారణంగా రాయల్టీ రేటు కూడా తగ్గినట్లు ఆయన పేర్కొన్నారు. 2014-15 ఏడాదికి మాతృ సంస్థ సుజుకీకి మారుతీ రూ.2,788 కోట్ల రాయల్టీని చెల్లించింది. మొత్తం ఆదాయాల్లో ఇది 5.7 శాతం కింద లెక్క. అంతక్రితం ఏడాది రాయల్టీ రూ.2,604 కోట్లు(6.1 శాతం)గా నమోదైంది. మెరుగైన పనితీరు నేపథ్యంలో కంపెనీ బోర్డు గతేడాదికి రూ. 5 ముఖ విలువగల ఒక్కో షేరుపై రూ.25 చొప్పున(500 శాతం) డివిడెండ్‌ను ప్రతిపాదించింది. 2013-14లో డివిడెండ్ రూ.12(240 శాతం) మాత్రమే. పూర్తి ఏడాదికి జూమ్... 2014-15 పూర్తి ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 33.3 శాతం వృద్ధితో రూ.3,711 కోట్లకు ఎగసింది. కంపెనీ చరిత్రలో ఇదే అత్యధిక వార్షిక లాభం కావడం విశేషం. 2013-14 ఏడాదిలో లాభం రూ.2,783 కోట్లు(ఇప్పటిదాకా ఇదే అత్యధికం)గా నమోదైంది. ఇక మొత్తం వార్షిక ఆదాయం కూడా రికార్డు స్థాయిలోనే రూ.48,606 కోట్లకు దూసుకెళ్లింది. 2013-14లో ఆదాయం రూ.42,645 కోట్లతో పోలిస్తే 14 శాతం వృద్ధి నమోదైంది. అమ్మకాల జోష్... గడిచిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ చరిత్రలో అత్యధిక స్థాయి వార్షిక అమ్మకాలను నమోదు చేసింది. 11.9 శాతం వృద్ధితో మొత్తం 12,92,415 వాహనాలను విక్రయించింది. ఇందులో 1,21,713 వాహనాలు ఎగుమతి(20 శాతం అప్) అయినట్లు కంపెనీ వివరించింది. క్యూ4లో అమ్మకాలు 6.7 శాతం వృద్ధితో 3,46,712కి చేరాయి. ఇక ప్రస్తుత 2015-16 ఏడాదికి 10-11 శాతం అమ్మకాల వృద్ధి ఉండొచ్చని కంపెనీ అంచనా వేస్తోంది. గుజరాత్లో నెలకొల్పుతున్న ప్లాంట్ పనులు చురుగ్గా జరుగుతున్నాయని భార్గవ చెప్పారు. మాతృ సంస్థ సుజుకీకి పూర్తిగా దీన్ని అప్పగించాలని మారుతీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి వాటాదారుల అనుమతి తీసుకోవడానికి ఎలాంటి సమస్యా లేదని.. అయితే, కంపెనీల చట్టంలో సవరణలకు పార్లమెంటు ఆమోదం కోసం ఎదురుచూస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ఏడాది రూ.4,000 కోట్ల పెట్టుబడి... మార్కెట్లో తన అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకునే దిశగా ఈ ఏడాది(2015-16)లో రూ.4,000 కోట్ల మొత్తాన్ని పెట్టుబడిగా వెచ్చించనున్నట్లు మారుతీ తెలిపింది. ఆర్అండ్డీ, మార్కెటింగ్ ఇన్ఫ్రా తదితర విభాగాల్లో ఈ నిధులను ఖర్చు చేయనుంది. ఆకర్షణీయమైన ఫలితాల నేపథ్యంలో మారుతీ షేరు ధర సోమవారం బీఎస్ఈలో 3 శాతం దూసుకెళ్లి రూ.3,647 వద్ద స్థిరపడింది. -
ఐసీఐసీఐ లాభం 2,922 కోట్లు
క్యూ4లో 10 శాతం వృద్ధి... ⇒ నికర వడ్డీ ఆదాయం 5,079 కోట్లు; 17% అప్ ⇒ వదలని మొండిబకాయిల బెడద... ⇒ షేరుకి రూ. 5 డివిడెండ్ ప్రకటన... న్యూఢిల్లీ: దేశీ ప్రైవేటు రంగ బ్యాంకింగ్ అగ్రగామి ఐసీఐసీఐ బ్యాంక్‌ను మొండిబకాయిలు వెంటాడుతున్నాయి. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం(2014-15, క్యూ4)లో బ్యాంక్ స్టాండెలోన్ నికర లాభం 10.2 శాతం వృద్ధి చెంది రూ.2,922 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.2,652 కోట్లుగా ఉంది. మొండిబకాయిలకు ప్రొవిజనింగ్(కేటాయింపులు) పెరగడం, రుణ వృద్ధి మందగించడం వంటివి లాభాల వృద్ధిపై ప్రభావం చూపాయి. కాగా, క్యూ4లో బ్యాంక్ స్టాండెలోన్ ఆదాయం రూ.14,465 కోట్ల నుంచి రూ.16,235 కోట్లకు పెరిగింది. 12.2% వృద్ధి చెందింది. ఇక నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 17% పెరిగి రూ.5,079 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది క్యూ4లో ఎన్ఐఐ రూ.4,357 కోట్లుగా ఉంది. క్యూ4లో నికర వడ్డీ మార్జిన్(ఎన్ఐఎం) 3.46 శాతం నుంచి 3.57 శాతానికి చేరింది. ఇక పూర్తి ఏడాదికి చూస్తే(2014-15) స్టాండెలోన్ లాభం రూ.10 వేల కోట్లను అధిగమించింది. 2013-14లో నమోదైన రూ.9,810 కోట్లతో పోలిస్తే 14% వృద్ధి చెంది రూ.11,175 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ.54,606 కోట్ల నుంచి రూ.61,267 కోట్లకు ఎగసింది. 12.1% వృద్ధి నమోదైంది. కాగా, క్యూ4లో విదేశీ మారక(ఫారెక్స్) లావాదేవీలకు సంబంధించిన లాభాలు 3 రెట్ల జంప్‌తో రూ.245 కోట్ల నుంచి రూ.726 కోట్లకు దూసుకెళ్లాయి. లేదంటే... లాభాల వృద్ధి మరింత మందగించేది. కన్సాలిడేటెడ్‌గా చూస్తే...: బీమా, బ్రోకింగ్ ఇతరత్రా అనుబంధ సంస్థలన్నింటినీ కలిపి చూస్తే(కన్సాలిడేటెడ్) ఐసీఐసీఐ నికర లాభం క్యూ4లో 13.24% పెరిగి రూ.3,085 కోట్లకు చేరింది. ఆదాయం 15 శాతం వృద్ధితో రూ.21,652 కోట్ల నుంచి రూ.24,914 కోట్లకు ఎగసింది. మొండిబకాయిలు పెరిగాయ్... బ్యాంక్ మొత్తం రుణాల్లో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏ) క్యూ4లో 3.78 శాతానికి ఎగబాకాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 3.03 శాతమే. ఇక నికర ఎన్పీఏలు సైతం 0.82 శాతం నుంచి 1.4 శాతం పెరిగాయి. దీంతో ప్రొవిజనింగ్ మొత్తం కూడా రెట్టింపై రూ.714 కోట్ల నుంచి రూ.1,345 కోట్లకు చేరింది. క్యూ4లో కొత్తగా రూ.3,260 కోట్ల స్థూల ఎన్పీఏలు జతవగా.. ఇందులో పునర్వ్యవస్థీకరించిన రుణాల వాటా రూ.2,246 కోట్లుకావడం గమనార్హం. మరో రూ.1,500 కోట్ల రుణాలు పునర్వ్యవస్థీకరణ బాటలో ఉన్నట్లు బ్యాంక్ వెల్లడించింది. ఇతర ముఖ్యాంశాలివీ... ⇒ బ్యాంక్ రుణ వృద్ధి క్యూ4లో 14%గా ఉంది. దీంతో మార్చి, 2015 నాటికి మొత్తం రుణాల పరిమాణం రూ.3,87,522 కోట్లు. కాగా, రిటైల్ రుణాల్లో 25, కార్పొరేట్ రుణాలు 10% వృద్ధి చెందాయి. ⇒ డిపాజిట్లు 9 శాతం ఎగసి రూ.3,61,563 కోట్లకు చేరాయి. ⇒ జీవిత బీమా అనుంబంధ సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ నికర లాభం 2014-15లో స్వల్పంగా రూ.1,567 కోట్ల నుంచి రూ.1,634 కోట్లకు పెరిగింది. సాధారణ బీమా సంస్థ ఐసీఐసీఐ లంబార్డ్ నికర లాభం రూ. 511 కోట్ల నుంచి రూ.536 కోట్లకు చేరింది. ⇒ రూ. 2 ముఖవిలువ గల షేరుపై రూ. 5 డివిడెండ్ ప్రకటించింది. ఫలితాల నేపథ్యంలో బ్యాంక్ షేరు ధర సోమవారం బీఎస్ఈలో 1.85 శాతం క్షీణించి రూ.302.4 వద్ద స్థిరపడింది. కొన్ని వ్యాపార విభాగాలకు చెందిన రుణాల్లో సమస్యల కారణంగానే మొండిబకాయిలు పెరిగాయి. అయితే, ఎన్పీఏలకు ఇదే గరిష్టస్థాయి కావచ్చు. ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇవి తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయి. అదే విధంగా రుణాల్లో 20 శాతం, డిపాజిట్ల విషయంలో 16% వృద్ధిని అంచనా వేస్తున్నాం. కార్పొరేట్ రంగం నుంచి ఇంకా డిమాండ్ పుంజుకోవాల్సి ఉంది. దీంతో రిటైల్ రుణాలపైనే అధికంగా దృష్టిపెడుతున్నాం. - చందా కొచర్, ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ, ఎండీ -
ఇన్ఫోసిస్ అంచనాలు మిస్
దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్... అంచనాలు తప్పింది. మిగతా ఐటీ దిగ్గజాల మాదిరిగానే నిరాశాజనకమైన ఫలితాలను ప్రకటించింది. అయితే, బోనస్ షేర్ల ప్రకటన ద్వారా ఇన్వెస్టర్లను మాత్రం ఆశ్చర్యపరిచింది. ఫలితాల ప్రభావంతో కంపెనీ షేరు ధర ఒకే రోజు 6 శాతం దిగజారింది. క్యూ4లో నికర లాభం రూ.3,097 కోట్లు; 3.5% వృద్ధి ⇒ సీక్వెన్షియల్‌గా 4.7 శాతం డౌన్... ⇒ ఇన్వెస్టర్లకు 1:1 బోనస్ షేర్లు... ⇒ షేరుకి రూ.29.5 డివిడెండ్ ప్రకటన... ⇒ 6 శాతం కుప్పకూలిన షేరు ధర... బెంగళూరు: ఇన్ఫోసిస్ మార్చి క్వార్టర్ (2014-15, క్యూ4)లో రూ.3,097 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.2,992 కోట్లతో పోలిస్తే లాభం 3.5 శాతం పెరిగింది. మొత్తం ఆదాయం విషయానికొస్తే.. రూ.12,875 కోట్ల నుంచి రూ.13,411 కోట్లకు చేరింది. 4.2 శాతం వృద్ది నమోదైంది. మార్కెట్ విశ్లేషకులు సగటున క్యూ4లో రూ.3,161 కోట్ల నికర లాభం, రూ.13,818 కోట్ల ఆదాయాన్ని అంచనా వేశారు. ప్రైసింగ్ ఒత్తిడి, కరెన్సీ సంబంధ ఒడిదుడుకులు, ఇతరత్రా అంశాలు కంపెనీ పనితీరుపై ప్రభావం చూపాయి. సీక్వెన్షియల్‌గా డౌన్... క్రితం ఏడాది డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం(క్యూ3)తో పోలిస్తే సీక్వెన్షియల్ ప్రాతిపదికన నికర లాభం 4.7 శాతం దిగజారింది. క్యూ3లో లాభం రూ. 3,250 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం సైతం 2.8%(క్యూ3లో రూ.13,796 కోట్లు) క్షీణించింది. గెడైన్స్ ఇలా... ప్రస్తుత 2015-16 ఆర్థిక సంవత్సరంలో స్థిర కరెన్సీ విలువ ప్రకారం కంపెనీ ఆదాయాల్లో 10-12 శాతం వృద్ధి(గెడైన్స్) ఉండొచ్చని కంపెనీ ప్రకటించింది. ఇక రూపాయల్లో ఆదాయ వృద్ధి 8.4-10.4 శాతంగా, డాలర్ల ప్రాతిపదికన 6.2-8.2 శాతంగా అంచనా వేసింది. పరిశీలకులు గెడైన్స్ 9-11 శాతం మేర ఉండొచ్చని అంచనా వేశారు. దీనికన్నా ఇన్ఫీ గెడైన్స్ ఎక్కువే అయినా... ఐటీ పరిశ్రమ చాంబర్ నాస్కామ్... ఈ ఏడాది సాఫ్ట్వేర్ సేవల ఆదాయాల్లో వృద్ధి 12-14% ఉండొచ్చని అంచనా వేసింది. దీంతో పోలిస్తే ఇన్ఫీ గెడైన్స్ తక్కువగానే ఉంది. పూర్తి ఏడాదికి చూస్తే... 2014-15 పూర్తి ఆర్థిక సంవత్సరంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.12,329 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది రూ.10,648 కోట్లతో పోలిస్తే 15.8 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం 6.4 శాతం వృద్ధితో రూ.50,133 కోట్ల నుంచి రూ.53,319 కోట్లకు ఎగబాకింది. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... ⇒ రూ. 5 ముఖవిలువగల ఒక్కో షేరుపై రూ.29.5 చొప్పున తుది డివిడెండ్‌ను ప్రకటించింది (1:1 బోనస్ ఇష్యూను పరిగణనలోకి తీసుకుంటే షేరుకి రూ.14.75 చొప్పున). ⇒ క్యూ4లో కొత్తగా 52 క్లయింట్లను కంపెనీ జత చేసుకుంది. ⇒ ఈ ఏడాది మార్చినాటికి ఇన్ఫీ వద్ద నగదు, తత్సంబంధ నిల్వలు రూ.32,585 కోట్లకు చేరాయి. 2014 మార్చి నాటికి ఈ మొత్తం రూ.30,251 కోట్లు కాగా, డిసెంబర్ చివరికి రూ.34,873 కోట్లు. ⇒ క్యూ4లో 6.549 మంది ఉద్యోగులను కంపెనీ నికరంగా నియమించుకుంది. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య మార్చినాటికి 1,76,187కు చేరింది. ఉద్యోగుల వలసల(అట్రిషన్) రేటు క్యూ3లో 20.6 శాతం కాగా, క్యూ4లో 18.9 శాతానికి తగ్గింది. నిరుత్సాహకరమైన ఫలితాల ప్రభావంతో కంపెనీ షేరు ధర భారీగా పడిపోయింది. శుక్రవారం బీఎస్ఈలో ఒకానొక దశలో 6.5 శాతం మేర దిగజారి రూ.1,982 కనిష్టస్థాయిని తాకింది. చివరకు 5.95 శాతం నష్టపోయి రూ.1,996 వద్ద స్థిరపడింది. బోనస్ బొనాంజా... ఇన్వెస్టర్లలో మరింత విశ్వాసం పెంచడంపై ఇన్ఫోసిస్ దృష్టిపెట్టింది. దీనిలో భాగంగానే ప్రతి ఒక్క షేరుకి మరో షేరును(1:1 నిష్పత్తిలో) బోనస్‌గా ఇవ్వాలని బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టయిన అమెరికన్ డిపాజిటరీ షేర్(ఏడీఎస్)లకు కూడా ఇదే నిష్పత్తిలో బోనస్ వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. వాటాదారుల ఆమోదానికి లోబడి ఈ ప్రతిపాదన అమలవుతుందని వెల్లడించింది. కాగా, కంపెనీ కొత్త సీఈఓగా విశాల్ సిక్కా బాధ్యతలు చేపట్టాక ఇది రెండో బోనస్ ఇష్యూ కావడం విశేషం.గతేడాది అక్టోబర్‌లో(క్యూ2 ఫలితాల సందర్భంగా) ఇన్ఫీ 1:1 నిష్పత్తిలోనే బోనస్‌ను ప్రకటించింది. ‘కలిడస్’ కొనుగోలు... అమెరికాకు చెందిన డిజిటల్ ఎక్స్పీరియన్స్ సొల్యూషన్స్ కంపెనీ ‘కలిడస్’ను కొనుగోలు చేస్తున్నట్లు ఇన్ఫీ ప్రకటించింది. ఈ డీల్ విలువ 12 కోట్ల డాలర్లు(దాదాపు రూ.750 కోట్లు). దీంతోపాటు ఎయిర్విజ్లో మైనారిటీ వాటా కోనుగోలు కోసం 2 మిలియన్ డాలర్ల పెట్టుబడి ఒప్పందానికి కూడా బోర్డు ఓకే చెప్పినట్లు కంపెనీ వెల్లడించింది. ఫినాకిల్, ఎడ్జ్సర్వీసెస్ వ్యాపారాలను సబ్సిడరీ సంస్థ ఎడ్జ్వెర్వ్ సిస్టమ్స్‌కు బదలాయించే ప్రతిపాదనకు సైతం ఆమోదముద్ర పడింది. ఐటీ పరిశ్రమఫండమెంటల్గా, నిర్మాణాత్మకమైన మార్పులను సంతరించుకుంటోంది. గడిచిన త్రైమాసికంలో పలు సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ.. మేం కొత్తగా అనుసరిస్తున్న ‘రెన్యూ-న్యూ’ వ్యూహంలో ఆరంభ విజయాలను ఆస్వాదిస్తున్నాం. 2017కల్లా దేశీ ఐటీ పరిశ్రమ సగటు వృద్ధి రేటును అందుకోగలమన్న విశ్వాసం ఉంది. - విశాల్ సిక్కా, ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ జూమ్!
క్యూ4 లాభంలో 21 శాతం వృద్ధి; రూ. 2,807 కోట్లు - అధిక నికర వడ్డీ ఆదాయాల,మార్జిన్ల తోడ్పాటు - మొండిబకాయిలు తగ్గుముఖం... న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం(2014-15, క్యూ4)లో నికర లాభం 21 శాతం ఎగబాకి రూ.2,807 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.2,327 కోట్లుగా ఉంది. ప్రధానంగా నికర వడ్డీ ఆదాయాలు(ఎన్ఐఐ) పుంజుకోవడం లాభాల జోరుకు దోహదం చేసింది. కాగా, బ్యాంక్ మొత్తం ఆదాయం క్యూ4లో రూ.15,570 కోట్లకు ఎగబాకింది. అంతక్రితం సంవత్సరం ఇదే క్వార్టర్లో ఆదాయం రూ.12,790 కోట్లతో పోలిస్తే 21.7 శాతం వృద్ధి చెందింది. కాగా, గతేడాదివరకూ బ్యాంక్ త్రైమాసిక లాభాల్లో 30% స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తూ వచ్చింది. ఎన్ఐఐ 21 శాతం అప్... హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎన్ఐఐ మార్చి క్వార్టర్లో రూ.6,013 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్లో రూ.4,953 కోట్లతో పోలిస్తే 21.4 శాతం ఎగసింది. ఇక బ్యాంక్ ఎన్ఐఎం క్యూ4లో 4.4 శాతంగా నమోదైంది. బ్యాంకింగ్ పరిశ్రమలో ఇదే అత్యధికమని బ్యాంక్ డిప్యూటీ ఎండీ పరేష్ సుక్తాంకర్ చెప్పారు. బేస్ రేటులో 0.15 శాతం కోత ప్రకటించినప్పటికీ.. ఎన్‌ఐఎంను ఈ స్థాయిలోనే కొనసాగించగలమన్న విశ్వాసం వ్యక్తం చేశారు. వడ్డీయేతర ఆదాయం(ఫీజులు ఇతరత్రా) 30 శాతం ఎగసి రూ.2,564 కోట్లకు చేరింది. మొండిబకాయిలు తగ్గాయ్... బ్యాంక్ మొండిబకాయిలు(ఎన్పీఏ) క్యూ4లో మరింత మెరుగుపడ్డాయి. స్థూల ఎన్పీఏలు 1 శాతం నుంచి 0.93 శాతానికి తగ్గింది. నికర ఎన్పీఏలు 0.3 శాతం నుంచి 0.2 శాతానికి దిగొచ్చాయి. అయితే, ప్రొవిజనింగ్ మొత్తాన్ని బ్యాంక్ రూ.286 కోట్ల నుంచి రూ.577 కోట్లకు పెంచింది. రుణ పునర్వ్యవస్థీకరణ కంపెనీ(ఏఆర్సీ)లకు రూ.500 కోట్ల విలువైన రుణాలను క్యూ4లో విక్రయించింది. పూర్తి ఏడాదికి ఇలా...: 2014-15 పూర్తి ఏడాదిలో బ్యాంక్ నికర లాభం రూ. 10,216 కోట్లుగా నమోదైంది. రూ.10 వేల కోట్ల మార్కు దాటడం ఇదే తొలిసారి. అంతక్రితం ఏడాది రూ.8,478 కోట్లతో పోలిస్తే లాభం 20.5% వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం 17.1% వృద్ధితో రూ.49,055 కోట్ల నుంచి రూ.57,466 కోట్లకు ఎగసింది. ఇతర ముఖ్యాంశాలివీ.. ⇒ క్యూ4లో బ్యాంక్ 300 కొత్త బ్రాంచ్‌లను ఏర్పాటు చేసింది. పూర్తి ఏడాదిలో ఈ సంఖ్య 611గా ఉంది. 10 వేల మంది ఉద్యోగులను నియమించుకుంది. ⇒ మార్చి క్వార్టర్ రుణాల్లో 21.2% మెరుగైన వృద్ధి నమోదైంది. రిటైల్ విభాగంలో 17%, కార్పొరేట్ విభాగంలో 26% వృద్ధి సాధించింది. మొత్తం రుణాల విలువ రూ.3.65 లక్షల కోట్లకు చేరింది. ⇒ గురువారం బీఎస్ఈలో బ్యాంక్ షేరు ధర స్వల్పంగా క్షీణించి రూ.1,013 వద్ద స్థిరపడింది. గృహ రుణాలపై మహిళలకువడ్డీ తగ్గింపు... ఎస్బీఐ, ఐసీఐసీఐల బాటలోనే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కూడా మహిళలకు గృహ రుణాలపై స్వల్పంగా వడ్డీ తగ్గింపును ప్రకటించింది. మిగతా కస్టమర్లందరికీ 9.9 శాతం వడ్డీ రేటును అమలు చేస్తున్నామని.. మహిళలకు ఈ రేటును 9.85 శాతానికి తగ్గిస్తున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎండీ రేణు సూద్ కర్నాడ్ పేర్కొన్నారు. ‘మహిళా శక్తి’ పేరుతో ఈ ఆఫర్‌ను ఇస్తున్నట్లు చెప్పారు. జాయింట్ ఓనర్‌గా లేదా సింగిల్‌గా కొనుగోలు చేసే ప్రాపర్టీపైన మాత్రమే ఈ రేటు వర్తిస్తుంది అని అమె చెప్పారు. ప్లాట్లకు సంబంధించిన రుణాలపై రేటు 9.9 శాతమే ఉంటుందని కూడా కర్నాడ్ వివరించారు. -
యస్ బ్యాంక్ లాభం 28% అప్
క్యూ4లో రూ.551 కోట్లు న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ బ్యాంకింగ్ సంస్థ యస్ బ్యాంక్ మార్చి క్వార్టర్లో(2014-15, క్యూ4) రూ.551 కోట్ల స్టాండెలోన్ నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.430 కోట్లతో పోలిస్తే 28.1 శాతం వృద్ది చెందింది. వడ్డీ ఆదాయం జోరు.. డిపాజిట్లు, రుణాల్లో ప్రగతి ఇందుకు ప్రధానంగా దోహదం చేసింది. క్యూ4లో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.3,014 కోట్ల నుంచి రూ.3,679 కోట్లకు పెరిగింది. 22 శాతం వృద్ధి నమోదైంది. ఇక నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 35 శాతం పెరిగి రూ.977 కోట్లకు, వడ్డీయేతర ఆదాయం 32% వృద్ధితో రూ.590 కోట్లకు చేరాయి. మొండిబకాయిల విషయానికొస్తే.. నికర నిరర్థక ఆస్తులు(ఎన్పీఏ) అంతక్రితం ఏడాది క్యూ4లో 0.05% కాగా, ఈ క్యూ4లో 0.41%కి ఎగబాకాయి. స్థూల ఎన్పీఏలు కూడా 0.31% నుంచి 0.41 శాతానికి పెరిగాయి. విదేశీ, స్వదేశీ మార్కెట్లలో షేర్ల విక్రయం ద్వారా బిలియన్ డాలర్ల మేరకు(దాదాపు రూ.6,200 కోట్లు) నిధులను సమీకరించడంపై దృష్టిసారించినట్లు యస్ బ్యాంక్ పేర్కొంది. క్విప్/జీడీఆర్‌లు/ఏడీఆర్‌ల రూపంలో ఒకటి లేదా పలు విడతల్లో షేర్ల విక్రయం ఉండొచ్చని తెలిపింది. బుధవారం బీఎస్ఈలో బ్యాంక్ 1.43% పెరిగి రూ.796 వద్ద ముగిసింది. -
మెప్పించని విప్రో..!
క్యూ4 నికర లాభం రూ. 2,286 కోట్లు; 2.1% వృద్ధి ⇒ ఆదాయ వృద్ధి 3.9 శాతం; రూ. 12,171 కోట్లు ⇒ షేరుకి రూ.7 తుది డివిడెండ్... ⇒ బోర్డులోకి ప్రేమ్‌జీ కుమారుడు రిషద్ ప్రేమ్‌జీ... బెంగళూరు: భారత్‌లో మూడో అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ విప్రో.. మిశ్రమమైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. అయితే, విప్రో ప్రేమ్‌జీ పెద్ద కుమారుడు రిషద్ ప్రేమ్‌జీని బోర్డులోకి తీసుకురావడం ఈసారి ఫలితాల ప్రకటనలో కీలకంగా నిలిచింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం(2014-15, క్యూ4)లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 2.1 శాతం వృద్ధితో రూ.2,286 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ లాభం రూ.2,239 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం రూ.11,704 కోట్ల నుంచి రూ.12,171 కోట్లకు పెరిగింది. 3.9 శాతం వృద్ధి చెందింది. ఇక ప్రధానమైన ఐటీ సేవల ఆదాయం క్యూ3లో 6 శాతం వృద్ధి చెంది రూ.11,240 కోట్లకు చేరింది. డాలర్ల రూపంలో చూస్తే 1.77 బిలియన్ డాలర్లు(3.2% వృద్ధి)గా నమోదైంది. మార్కెట్ వర్గాలు సగటున క్యూ3లో ఐటీ సేవల ఆదాయం రూ.11,399 కోట్లు(డాలర్లలో 1.79 కోట్లు) ఉండొచ్చని అంచనా వేయగా.. దీనికంటే తక్కువగానే కంపెనీ ఫలితాలు వెలువడ్డాయి. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2015-16) తొలి త్రైమాసికం(క్యూ1, ఏప్రిల్-జూన్)కు ఆదాయ అంచనా(గెడైన్స్) తగ్గింది. 1.76-1.79 బిలియన్ డాలర్ల శ్రేణిలో ఉండొచ్చని కంపెనీ పేర్కొంది. సీక్వెన్షియల్‌గా చూస్తే... డిసెంబర్ క్వార్టర్‌తో పోలిస్తే(క్యూ2) కంపెనీ లాభం సీక్వెన్షియల్‌గా 3.7 శాతం పెరిగింది. క్యూ2లో లాభం రూ.2,203 కోట్లుగా ఉంది. ఇక మొత్తం ఆదాయం రూ.12,085 కోట్ల నుంచి నామమాత్రంగా 0.7 శాతం పెరిగింది. సీక్వెన్షియల్‌గా ఐటీ సేవల ఆదాయం డాలర్ల రూపంలో 1.2 శాతం, రూపాయి ప్రాతిపదికన 0.9 శాతం క్షీణించడం గమనార్హం. ‘డిజిటల్, ఓపెన్‌సోర్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాలు భవిష్యత్తు వ్యాపారాభివృద్ధిలో కీలక పాత్ర పోషించునున్నాయి. కొన్ని విభాగాల్లో ఇబ్బందులు నెలకొన్నప్పటికీ.. మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మేం సర్వసన్నద్ధంగా ఉన్నాం’ అని విప్రో సీఈఓ టీకే కురియన్ వ్యాఖ్యానించారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవల(బీఎఫ్ఎస్ఐ) రంగం నుంచి వ్యాపారంలో కాస్త మందగమనం ఉన్నప్పటికీ.. తయారీ, హెల్త్‌కేర్, రిటైల్‌లో పటిష్టమైన వృద్ధి కనబడుతోందన్నారు. పూర్తి ఏడాదికి ఇలా... 2014-15 పూర్తి ఆర్థిక సంవత్సరంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 11.03 శాతం ఎగబాకి రూ.8,706 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది లాభం రూ.7,840 కోట్లుగా ఉంది. ఇక ఆదాయం 8.14 శాతం వృద్ధితో రూ. 43,754 కోట్ల నుంచి రూ.47,318 కోట్లకు ఎగసింది. కాగా, ఐటీ సేవల ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో 10 శాతం వృద్ధి చెంది రూ.44,020 కోట్లుగా నమోదైంది. డాలర్ల రూపంలో చూస్తే ఈ మొత్తం 7.08 బిలియన్ డాలర్లు(7 శాతం వృద్ధి). ఇతర ముఖ్యాంశాలు... ⇒ మార్చి చివరినాటికి ఐటీ సేవల విభాగంలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,58,217కు చేరింది. ⇒ క్యూ4లో కొత్తగా 65 మంది క్లయింట్లను కంపెనీ దక్కించుకుంది. ⇒ రూ. 2 ముఖ విలువగల ఒక్కో షేరుపై కంపెనీ రూ.7 చొప్పున తుది డివిడెండ్‌ను ప్రకటించింది. ⇒ కంపెనీ షేరు మంగళవారం బీఎస్ఈలో 0.67% నష్టంతో రూ.579 వద్ద ముగిసింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిశాక ఫలితాలొచ్చాయి. వారసుడొచ్చాడు... విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ తన వారసత్వ పగ్గాలను అప్పగించేందుకు తొలి అడుగు పడింది. చాన్నాళ్లుగా వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ ఆయన పెద్ద కుమారుడు 38 ఏళ్ల రిషద్ ప్రేమ్‌జీని విప్రో డెరైక్టర్ల బోర్డులోకి తీసుకొచ్చారు. హోల్‌టైమ్ డెరైక్టర్‌గా ఆయనను నియమిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నియామకం ఈ ఏడాది మే 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. కంపెనీ వ్యూహాల్లో, విలీనాలు-కొనుగోలు డీల్స్ విషయంలో ఆయన కీలకమైన పాత్రను పోషిస్తూవస్తున్నారని కూడా వెల్లడించింది. కాగా, రిషద్ ఇప్పటికే విప్రో ఎంటర్ప్రైజెస్(ఎఫ్ఎంసీజీ, ఇన్ఫ్రా ఇంజనీరింగ్ సంస్థ), విప్రో-జీఈ జాయింట్ వెంచర్ సంస్థ, అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌లో బోర్డు సభ్యుడిగా కొనసాగుతుండటం గమనార్హం. హార్వర్డ్‌లో విద్యాభ్యాసం చేసిన రిషద్... 2007 జూన్‌లో తొలిసారిగా బిజినెస్ మేనేజర్ స్థాయిలో కంపెనీలోకి ప్రవేశించారు. బ్యాంకింగ్ ఫైనాన్షియల్ రంగంలో ప్రత్యేక ప్రాజెక్టులపై దృష్టిపెట్టారు. మూడేళ్ల తర్వాత కంపెనీ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టారు. కాగా, తాజా నియామకంతో ఇక టాప్ పోస్టుకు మార్గం సుగమమైనట్లేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా, చిన్న కొడుకు తారిక్ ప్రేమ్‌జీ విప్రో ఫౌండేషన్‌లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం విప్రోలో ప్రేమ్‌జీకి నేరుగా 3.78 శాతం వాటా ఉండగా.. ఆయనకు చెందిన ఇతర సంస్థల ద్వారా దాదాపు 70 శాతం వాటా ఉంది. మార్చి చివరినాటికి విప్రోలో రిషద్ వాటా 0.03 శాతం. 1945 డిసెంబర్లో అజీమ్ ప్రేజ్జీ(69 ఏళ్లు) విప్రోను నెలకొల్పారు. ప్రస్తుతం 17.1 బిలియన్ డాలర్ల సంపదతో ఆయన ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో 48వ స్థానంలో ఉన్నారు. కాగా, వాటాదారుల ప్రయోజనాలకు అనుగుణంగానే రిషద్‌కు బోర్డులో చోటు దక్కిందని సీఈఓ టీకే కురియన్ వ్యాఖ్యానించారు. -
రిలయన్స్ లాభం భేష్!
క్యూ4లో రూ.6,381 కోట్లు; 8.5 శాతం జూమ్ ⇒ రికార్డు రిఫైనింగ్ మార్జిన్ల తోడ్పాటు; జీఆర్ఎం 10.1 డాలర్లు ⇒ టర్నోవర్ రూ.70,863 కోట్లు; 33 శాతం డౌన్ ⇒ షేరుకి రూ.10 చొప్పున డివిడెండ్ న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) ఆకర్షణీయమైన ఫలితాలతో ఆకట్టుకుంది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం(2014-15, క్యూ4)లో కంపెనీ రూ.6,381 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.5,881 కోట్లతో పోలిస్తే 8.5 శాతం పెరిగింది. పెట్రోకెమికల్, చమురు-గ్యాస్ వ్యాపారం మందగించినప్పటికీ... రికార్డు స్థాయి రిఫైనింగ్ మార్జిన్లు లాభాల జోరుకు తోడ్పడ్డాయి. కాగా, గడచిన ఏడేళ్లకుపైగా కాలంలో ఈ కంపెనీ ఒక క్వార్టర్లో ఇంత భారీస్థాయి లాభాన్ని నమోదు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. క్యూ4లో రిలయన్స్ కన్సాలిడేటెడ్ టర్నోవర్ రూ.70,863 కోట్లుగా నమోదైంది. అంతక్రితం సంవత్సరం క్యూ4లో టర్నోవర్ రూ.1.06 లక్షల కోట్లతో పోలిస్తే 33.3 శాతం దిగజారింది. క్రూడ్ ధరల తగ్గుదల, ఎగుమతుల్లో క్షీణత ఆదాయాలపై ప్రభావం చూపిం ది. డిసెంబర్ క్వార్టర్(క్యూ3)లో నికర లాభం రూ. 5,256 కోట్లతో పోలిస్తే.. మార్చి(క్యూ4) క్వార్టర్ లాభం త్రైమాసింగా (సీక్వెన్షియల్) 21.4% ఎగసింది. దేశ కార్పొరేట్ రంగ లాభాల చరిత్రలో ఇదే అతిపెద్ద సీక్వెన్షియల్ వృద్ధి అని పరిశీలకులు పేర్కొంటున్నారు. స్టాండెలోన్ ప్రాతిపదికన చూస్తే... రిఫైనింగ్, పెట్రోకెమికల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ ఇతరత్రా ప్రధాన వ్యాపారాల(స్టాండెలోన్)కు సంబంధించి రిలయన్స్ క్యూ4 నికర లాభం 10.9 శాతం ఎగబాకి రూ.6,243 కోట్లుగా నమోదైంది. 2007-08 క్యూ3లో రూ.8,079 కోట్ల లాభం తర్వాత మళ్లీ ఇదే అత్యధిక లాభమని కంపెనీ తెలిపింది. పూర్తి ఏడాదికి ఇలా... 2014-15 పూర్తి ఏడాదికి ఆర్ఐఎల్ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.23,566 కోట్లకు పెరిగింది. 2013-14లో లాభం రూ.22,493 కోట్లతో పోలిస్తే 4.8% వృద్ధి చెందింది. ఇక టర్నోవర్ 13 శాతం క్షీణించి రూ.3.88 లక్షల కోట్లకు దిగజారింది. 2013-14లో టర్నోవర్ రూ.4.46 లక్షల కోట్లుగా నమోదైంది. ‘ముడి చమురు ధరల భారీ పతనం, హైడ్రోకార్బన్స్ మార్కెట్లో తీవ్ర అనిశ్చితి ఉన్నప్పటికీ.. గత ఆర్థిక సంవత్సరాన్ని విజయవంతంగా ముగించాం. ఇది మాకు చాలా కీలకమైన ఏడాదిగా కూడా నిలిచింది. రిఫైనింగ్ వ్యాపారంలో రికార్డు రాబడులు నమోదయ్యాయి. అధునాతన డిజిటల్ సర్వీసులు, హైడ్రోకార్బన్స్ వ్యాపారంలో భారీస్థాయి పెట్టుబడుల ద్వారా వృద్ధి జోరును కొనసాగిస్తాం. ఇక మా రిటైల్ వ్యాపారం అత్యంత వేగంగా పురోగమిస్తోంది’. - ముకేశ్ అంబానీ, ఆర్ఐఎల్ సీఎండీ రికార్డు జీఆర్ఎం మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్లో రిలయన్స్ స్థూల రిఫైనింగ్ మార్జిన్(జీఆర్ఎం- ఒక్కో బ్యారెల్ ముడిచమురును పెట్రోలియం ఉత్పత్తులుగా మార్చడం ద్వారా లభించిన రాబడి) రికార్డు స్థాయిలో 10.1 డాలర్లకు ఎగబాకింది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్లో జీఆర్ఎం 9.3 డాలర్లుగా ఉంది. ఇక 2014-15, డిసెంబర్ క్వార్టర్(క్యూ3)లో ఇది 7.3 డాలర్లే. ఇక 2015-16 పూర్తి ఏడాదికి జీఆర్ఎం 8.6 డాలర్లుగా నమోదైంది. ఫలితాల్లో ఇతర ప్రధానాంశాలు... ⇒ రూ.10 ముఖ విలువగల ఒక్కో షేరుకి కంపెనీ రూ.10 చొప్పున(100 శాతం) డివిడెండ్‌ను ప్రకటించింది. ⇒ 2014-15 క్యూ4లో పెట్రోకెమికల్స్ వ్యాపార ఆదాయం రూ. 26,541 కోట్ల నుంచి రూ.21,754 కోట్లకు తగ్గింది. రిఫైనింగ్ టర్నోవర్ రూ.96,668 కోట్లకు పడిపోయింది. అంతక్రితం ఏడాది క్యూ4లో ఈ టర్నోవర్ రూ.56,442 కోట్లు. ⇒ చమురు-గ్యాస్ ఉత్పత్తి విభాగం ఆదాయం రూ.2,798 కోట్ల నుంచి రూ.2,513 కోట్లకు క్షీణించింది. ఇక ఈ విభాగం పన్ను ముందు లాభం ఏకంగా 36 శాతం పడిపోయి రూ.489 కోట్లకు పరిమితమైంది. ⇒ కేజీ-డీ6లో గ్యాస్-క్రూడ్ ఉత్పత్తి క్షీణత, తక్కువ గ్యాస్ ధరలు కూడా ఈ విభాగంలో ఆదాయాన్ని దెబ్బతీశాయని ఆర్ఐఎల్ పేర్కొంది. క్యూ4లో ఇక్కడ 0.6 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురు, 36.5 బిలియన్ ఘనపుటడుగుల సహజవాయువును మాత్రమే ఉత్పత్తి చేసినట్లు తెలిపింది. క్యూ3తో పోలిస్తే... క్రూడ్ ఉత్పత్తి 3 శాతం, గ్యాస్ ఉత్పత్తి 5% తగ్గినట్లు వెల్లడించింది. ⇒ తాజాగా ముగిసిన స్పెక్ట్రం వేలంలో ఆర్ఐఎల్ టెలికం అనుబంధ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ 13 కీలక సర్కిళ్లలో స్పెక్ట్రంను దక్కించుకుంది. ఇందులో 800, 1,800 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌విడ్త్ స్పెక్ట్రం ఉంది. దీంతో తమకు ఇప్పుడు మొత్తం 22 సర్కిళ్లలో స్పెక్ట్రం ఉన్నట్లయిందని కంపెనీ తెలిపింది. కాగా, 2,300 మెగాహెర్ట్జ్ బ్యాండ్(4జీ)లో దేశవ్యాప్తం స్పెక్ట్రం ఇప్పటికే ఉన్న సంగతి తెలిసిందే. వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్ సేవల ప్రారంభానికి విస్తృతంగా సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ⇒ మార్చి చివరినాటికి ఆర్ఐఎల్ మొత్తం రుణ భారం రూ.1.6 లక్షల కోట్లకు ఎగసింది. 2014 డిసెంబర్‌నాటికి ఈ మొత్తం రూ.1.5 లక్షల కోట్లు. కాగా, కంపెనీ వద్దనున్న నగదు నిల్వలు మాత్రం రూ.78,691 కోట్ల నుంచి రూ.84,472 కోట్లకు పెరిగాయి. ⇒ శుక్రవారం బీఎస్ఈలో కంపెనీ షేరు ధర స్వల్ప నష్టంతో రూ.927 వద్ద ముగిసింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. రిటైల్ జూమ్... ఆర్ఐఎల్ రిటైల్ వ్యాపార విభాగం మెరుగైన పనితీరును ప్రదర్శించింది. ఈ వ్యాపార ఆదాయం క్యూ4లో రూ.3,653 కోట్ల నుంచి రూ.4,788 కోట్లకు ఎగబాకింది. ఏకంగా 31 శాతం దూసుకెళ్లింది. ఇక పన్ను ముందు లాభం క్యూ4లో రూ.24 కోట్ల నుంచి రూ.104 కోట్లకు ఎగసింది. 333 శాతం వృద్ధిని సాధించింది. ఇక 2014-15 పూర్తి ఏడాదికి ఈ విభాగం ఆదాయం రూ.14,556 కోట్ల నుంచి రూ.17,640 కోట్లకు(21 శాతం అప్) ఎగబాకింది. పన్ను ముందు లాభం రూ.118 కోట్ల నుంచి రూ.417 కోట్లకు పెరిగింది. అంటే 250 శాతం పైగా దూసుకెళ్లినట్లు లెక్క. గత ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ రిటైల్ కొత్తగా 930 స్టోర్లను ప్రారంభించింది. దీంతో మార్చి నాటికి కంపెనీ మొత్తం రిటైల్ స్టోర్ల సంఖ్య మొత్తం 200 నగరాల్లో 2,621కి చేరింది. -
టీసీఎస్ లాభాలు మై(బో)నస్
క్యూ4లో రూ. 3,713 కోట్లు, 31 శాతం తగ్గుదల ⇒ఉద్యోగులకు రూ. 2,628 కోట్ల భారీ బోనస్ ఫలితం... ⇒బోనస్ సర్దుబాటుకు ముందు నికర లాభం రూ .5,773 కోట్లు; 7.7% వృద్ధి ⇒మొత్తం ఆదాయం రూ. 24,220 కోట్లు; 12.3 శాతం అప్ ⇒షేరుకి రూ. 24 చొప్పున తుది డివిడెండ్... ముంబై: దేశీ సాఫ్ట్వేర్ అగ్రగామి టీసీఎస్ ఆర్థిక ఫలితాలపై ఉద్యోగుల బోనస్ ప్రభావం పడింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం(2014-15, క్యూ4)లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.3,713 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.5,358 కోట్లతో పోలిస్తే లాభం భారీస్థాయిలో 30.6 శాతం దిగజారింది. అయితే, సిబ్బందికి ప్రకటించిన వన్‌టైమ్ బోనస్ రూ. 2,628 కోట్లు ఇతరత్రా సర్దుబాట్ల ప్రకారం చూస్తే.. క్యూ4లో నికర లాభం రూ.5,773 కోట్లుగా నమోదైందని కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. గతేడాది క్యూ4తో పోలిస్తే వార్షిక ప్రాతిపదికన 7.7% ఎగబాకినట్లు లెక్క. ఇక కంపెనీ మొత్తం ఆదాయం క్యూ4లో రూ.21,551 కోట్ల నుంచి రూ.24,220 కోట్లకు పెరిగింది. 12.4 శాతం వృద్ధి నమోదైంది. కాగా, క్యూ4లో కంపెనీ నికర లాభం రూ.5,410 కోట్లు, ఆదాయం రూ.24,456 కోట్లుగా ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. దీన్నిబట్టిచూస్తే మెరుగైన ఫలితాలనే టీసీఎస్ ప్రకటించినట్లయింది. ఇదిలాఉండగా.. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌తో ఎప్పుడూ ఆర్థిక ఫలితాల ప్రధాన సీజన్ ప్రారంభం కావడం ఇప్పటిదాకా ఆనవాయితీగా వస్తోంది. ఈసారి మాత్రం అందుకుభిన్నంగా టీసీఎస్ ఫలితాలు ముందుగా వెలువడటం విశేషం. సీక్వెన్షియల్‌గా తగ్గిన ఆదాయం... 2014-15 డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం(క్యూ3)తో పోలిస్తే త్రైమాసికం ప్రాతిపదికన(సీక్వెన్షియల్‌గా) టీసీఎస్ మొత్తం ఆదాయం 1.1% తగ్గింది. క్యూ3లో మొత్తం ఆదాయం రూ.24,501 కోట్లుగా నమోదైంది. ఇక క్యూ3లో లాభం రూ.5,327 కోట్లతో సరిపోల్చితే క్యూ4 లాభం 30.3% పడిపోయింది. అయితే, బోనస్ సర్దుబాటు ప్రకారం మాత్రం సీక్వెన్షియల్‌గా లాభం 8.3 శాతం ఎగసింది. పూర్తి ఏడాదికి ఇలా... 2014-15 పూర్తి ఆర్థిక సంవత్సరానికిగాను టీసీఎస్ రూ.19,852 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.19,164 కోట్లుగా నమోదైంది. 3.5 శాతం పెరిగింది. అయితే, బోనస్ సర్దుబాటు ప్రకారం చూస్తే 2014-15 పూర్తి ఏడాదికి నికర లాభం రూ.21,912 కోట్లుగా ఉన్నట్లు కంపెనీ వివరించింది. అంటే 14.3 శాతం వృద్ధి చెందినట్లు లెక్క. ఇక మొత్తం ఏడాదికి కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.81,809 కోట్ల నుంచి రూ.94,648 కోట్లకు ఎగబాకింది. 15.7 శాతం పెరుగుదల నమోదైంది. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... ⇒ఒక్కో షేరుకి రూ.24 చొప్పున తుది డివిడెండ్‌ను టీసీఎస్ ప్రకటించింది. దీంతో 2014-15 ఏడాదికిగాను ఇన్వెస్టర్లకు మొత్తం డివిడెండ్ ఒక్కో షేరుకి రూ.79కి చేరింది. ⇒క్యూ4లో కంపెనీ స్థూలంగా రూ.14,395 మంది ఉద్యోగులను నియమించుకుంది. అయితే, 13,364 మంది ఉద్యోగులు వలసపోవడంతో నికరంగా క్యూ4లో జతైన సిబ్బంది సంఖ్య 1,031కే పరిమితమైంది. వలసల(అట్రిషన్) రేటు 14.9 శాతంగా నమోదైంది. ⇒ఇక 2014-15 పూర్తి ఏడాదిలో స్థూలంగా 67,123 మందిని, నికరంగా 19,192 మంది సిబ్బందిని కంపెనీ జతచేసుకుంది. దీంతో 2015 మార్చి చివరినాటికి టీసీఎస్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,19,656గా నమోదైంది. ⇒ఇక ప్రస్తుత 2015-16 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 60,000 మంది ఉద్యోగులను కొత్తగా నియమించుకోనున్నట్లు టీసీఎస్ హెచ్ఆర్ హెడ్ అజోయ్ ముఖర్జీ తెలిపారు. ఇందులో 35,000 క్యాంపస్ నియామకాలు ఉంటాయని చెప్పారు. అయితే, 2014-15తో పోలిస్తే మొత్తం స్థూల నియామకాల సంఖ్య తక్కువే. ⇒అదేవిధంగా భారత్‌లో సిబ్బందికి సగటున 8 శాతం, విదేశాల్లోని కంపెనీ ఉద్యోగులకు 2-4 శాతం మేర వేతనాలను పెంచుతున్నట్లు కూడా ముఖర్జీ ప్రకటించారు. ⇒ కంపెనీ వద్ద మార్చి నాటికి రూ.23,000 కోట్ల నగదు, తత్సంబంధ నిల్వలు ఉన్నాయి. గురువారం బీఎస్ఈలో టీసీఎస్ షేరు ధర 1.5 శాతం క్షీణించి రూ.2,585 వద్ద స్థిరపడింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిశాక కంపెనీ ఫలితాలను ప్రకటించింది. క్యూ4లో కరెన్సీ సంబంధ ఒడిదుడుకులు ఉంటాయని మేం ముందే సంకేతాలిచ్చాం. ప్రధానంగా టెలికం, బీమా, ఇంధన రంగాల నుంచి కొంత ప్రతికూలతలు ఎదురయ్యాయి. దీని ప్రకారం కొంత మార్జిన్లు తగ్గినప్పటికీ.. మొత్తంమీదచూస్తే మంచి పనితీరునే కనబరిచాం. క్లయింట్ల సానుకూల వ్యాపార సెంటిమెంట్ నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధిపై ఆశాజనకంగానే ఉన్నాం. - ఎన్. చంద్రశేఖరన్, టీసీఎస్ సీఈఓ, ఎండీ ఉద్యోగులకు బంపర్ బొనాంజా టీసీఎస్ తమ సిబ్బందికి రికార్డు స్థాయిలో బంపర్ బోనస్‌ను ప్రకటించింది. కంపెనీ పబ్లిక్ ఇష్యూ(ఐపీఓ-2004, ఆగస్టు)కి వచ్చి పదేళ్లయిన సందర్భంగా ప్రత్యేక ప్రోత్సాహకం కింద రూ.2,628 కోట్ల వన్‌టైమ్ బోనస్‌ను ఇస్తున్నట్లు గురువారం వెల్లడించింది. భారతీయ కార్పొరేట్ రంగ చరిత్రలో అతిపెద్ద బోనస్ చెల్లింపుల్లో ఒకటిగా దీన్ని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా తమకున్న సిబ్బందిలో కనీసం ఏడాది సర్వీసు పూర్తిచేసుకున్నవారందరూ బోనస్ తీసుకునేందుకు అర్హులేనని తెలిపింది. ఈ ఏడాది మార్చి చివరినాటికి కంపెనీలో దాదాపు 3.19 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. కాగా, ఒక్కో ఉద్యోగికి తన ఒక్కో ఏడాది సర్వీసు కాలానికి ఒక వారం జీతం చొప్పున బోనస్ ఇవ్వనున్నట్లు కంపెనీ వివరించింది. ఏప్రిల్/మే నెలల్లో చెల్లింపు ఉంటుందని పేర్కొంది. అనేక గ్లోబల్ కంపెనీలకు తాము వ్యూహాత్మక భాగస్వాములుగా వ్యవహరిస్తున్నామని.. ఆయా ప్రాజెక్టుల నిర్వహణ, నవకల్పనల విషయంలో తమ ఉద్యోగుల సామర్థ్యమేంటో అందరికీ సుపరిచితమేనని టీసీఎస్ సీఈఓ, ఎండీ ఎన్. చంద్రశేఖరన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అత్యంత విలువైన, గౌరవనీయమైన టెక్నాలజీ సేవల కంపెనీగా టీసీఎస్‌ను నిలబెట్టడంలో సిబ్బంది పోషించిన సమర్థవంతమైన పాత్రకుగాను ప్రత్యేక రివార్డుగా ఈ బోనస్‌ను ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. కాగా, 2004లో స్టాక్ మార్కెట్లో లిస్టయిన టీసీఎస్.. మార్కెట్ క్యాపిటలైజేషన్(కంపెనీ మొత్తం షేర్ల విలువ-రూ.5.06 లక్షల కోట్లు) పరంగా ప్రస్తుతం దేశంలోనే అగ్రస్థానానికి ఎగబాకింది. -
ఫండ్స్ ఫేవరెట్ షేరు ఐసీఐసీఐ
రెండో స్థానానికి ఇన్ఫోసిస్ - క్యూ4లో పెట్టుబడుల తీరిది - ఈ కాలంలో 13% ఎగసిన బ్యాంకు షేరు న్యూఢిల్లీ: గడిచిన క్వార్టర్(జనవరి-మార్చి)లో దేశీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఐసీఐసీఐ బ్యాంకు షేరును పెట్టుబడులకు అత్యధికంగా ఎంపిక చేసుకున్నాయి. దీంతో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఈ విషయంలో వెనకబడినట్లు ఒక నివేదిక పేర్కొంది. మార్చి చివరికల్లా ఈక్విటీ ఫండ్స్ పోర్ట్‌ఫోలియోలో చోటుచేసుకున్న ఐసీఐసీఐ బ్యాంకు షేర్ల విలువ రూ. 9,152 కోట్లను తాకింది. ఇదే సమయంలో ఫండ్స్ వద్ద ఉన్న ఇన్ఫోసిస్ స్టాక్స్ విలువ రూ. 7,339 కోట్లకు పరిమితమైంది. పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్ రీసెర్చ్ సంస్థ మార్నింగ్‌స్టార్ రూపొందించిన నివేదిక ఈ విషయాలను వెల్లడించింది. దీని ప్రకారం డిసెంబర్ చివరికి ఈక్విటీ ఫండ్స్ వద్ద ఉన్న ఐసీఐసీఐ బ్యాంక్ షేర్ల విలువ రూ. 8,194 కోట్లుకాగా, ఇన్ఫోసిస్ షేర్ల ఫోలియో విలువ రూ. 9,262 కోట్లుగా నమోదైంది. వెరసి ప్రస్తుతం ఐసీఐసీఐ బ్యాంక్ షేరు ఫండ్స్ ఫేవరెట్‌గా నిలిచింది. ఇందుకు ఐసీఐసీఐ షేరు విలువ పుంజుకోవడానికి దోహదపడింది. ఈ కాలంలో ఐసీఐసీఐ షేరు 13%పైగా ఎగసిన సంగతిని ఈ సందర్భంగా మార్నింగ్‌స్టార్ ప్రస్తావించింది. నిజానికి ఈ కాలంలో ఈక్విటీ ఫండ్స్ వద్ద ఉన్న ఐసీఐసీఐ షేర్ల సంఖ్య తగ్గినప్పటికీ, మార్కెట్ విలువరీత్యా పెట్టుబడుల విలువలో మొదటి స్థానాన్ని పొందడం విశేషం! 5% జారిన ఇన్ఫీ క్యూ4లో ఇన్ఫోసిస్ షేరు 5%పైగా క్షీణించింది. కంపెనీని వృద్ధి బాట పట్టించేందుకు గతేడాది జూన్‌లో కంపెనీ వ్యవస్థాపకులు ఎన్ఆర్ నారాయణ మూర్తిని తిరిగి చైర్మన్‌గా తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు దేశీ సాఫ్ట్వేర్ రంగ వృద్ధిలో అగ్రస్థానంలో నిలుస్తూ వచ్చిన ఇన్ఫోసిస్ ప్రస్తుతం అత్యున్నతస్థాయి అధికారుల రాజీనామాలతో సవాళ్లను ఎదుర్కొంటోంది. గత రెండేళ్లలో కంపెనీ నుంచి 9 మంది టాప్ ఎగ్జిక్యూటివ్‌లు వైదొలగిన విషయం విదితమే. ఇటీవల ఇతర పోటీ కంపెనీలకు మార్కెట్ షేరును సైతం కోల్పోతూ వస్తోంది కూడా. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2014-15)లో డాలర్ల రూపేణా ఆదాయం 7-9% స్థాయిలో పుంజుకోవచ్చునంటూ కంపెనీ అంచనా(గెడైన్స్)ను ప్రకటించింది. అయితే ఇది ఐటీ పరిశ్రమ వృద్ధిపై నాస్కామ్ వేసిన 13-15% అంచనాలకంటే తక్కువే కావడం గమనార్హం. -
అల్ట్రాటెక్ లాభం రూ. 838 కోట్లు
న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి-మార్చి(క్యూ4) కాలానికి సిమెంట్ రంగ దిగ్గజం అల్ట్రాటెక్ 15.5% అధికంగా రూ. 838 కోట్ల నికర లాభాన్ని సాధించింది. ఇంధనాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం, ఇతర వ్యయాలను అదుపు చేయడం వంటి చర్యల ద్వారా లాభదాయకతను మెరుగుపరచుకున్నట్లు కంపెనీ తెలిపింది. వీటికితోడు నికర అమ్మకాలు రూ. 5,391 కోట్ల నుంచి రూ. 5,832 కోట్లకు పెరగడం కూడా ఇందుకు దోహదపడింది. ప్రధానంగా బిల్డింగ్ మెటీరియల్స్ విక్రయాలు పుంజుకున్నట్లు కంపెనీ పేర్కొంది. కంపెనీ సిమెంట్ తయారీ సామర్థ్యం 53.95 మిలియన్ టన్నులుకాగా, 12.18 మిలియన్ టన్నుల గ్రే సిమెంట్, క్లింకర్లను విక్రయించింది. గతేడాది క్యూ4 అమ్మకాలతో పోలిస్తే ఇవి 9% అధికం. వాటాదారులకు ఒక్కో షేరుకి రూ. 9 డివిడెండ్‌ను ప్రకటించింది. సిమెంట్ విక్రయాలు అప్ క్యూ4లో సిమెంట్ తదితరాల విక్రయాలు 2.92 లక్షల టన్నుల నుంచి 3.29 లక్షల టన్నులకు పెరిగాయి. కాగా, ముడిసరుకులు, విద్యుత్, రవాణా తదితర వ్యయాలు కూడా రూ. 4,987 కోట్లకు పెరిగాయి. ఇక పూర్తి ఏడాదికి నికర లాభం రూ. 2,655 కోట్ల నుంచి రూ. 2,144 కోట్లకు క్షీణించింది. అమ్మకాలు దాదాపు యథాతథంగా రూ. 20,203 కోట్ల వద్దే నిలిచాయి. ఈ కాలంలో 41.47 మిలియన్ టన్నుల సిమెంట్, క్లింకర్లను విక్రయించింది. బొగ్గు దిగుమతి వ్యయాలు తగ్గినప్పటికీ, రూపాయి విలువ క్షీణించడంతో ఆ ప్రభావం పెద్దగా కనిపించలేదని కంపెనీ వివరించింది. విస్తరణ ప్రణాళికలపై రూ. 10,000 కోట్లను వెచ్చిస్తున్నట్లు వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో అల్ట్రాటెక్ సిమెంట్ షేరు 1.4% తగ్గి రూ. 2,170 వద్ద ముగిసింది.