జియో ఎఫెక్ట్: ఐడియా ఆశ్చర్యకర ఫలితాలు
ఉచిత ఆఫర్లతో సునామీ సృష్టించిన రిలయన్స్ జియో దెబ్బతో టెలికాం మేజర్ ఐడియా సెల్యులార్ మార్చి క్వార్టర్‌లో మరోసారి చతికిలబడింది. టెలికాం మార్కెట్ లోకి జియో ఎంట్రీ ఇచ్చిన తరువాత ఐడియా వరుసగా రెండవ త్రైమాసికంలో కూడా నష్టపోయింది. అయితే మార్కెట్ వర్గాలను ఆశ్చరపరుస్తూ నష్టాలనుంచి భారీగా కోలుకుంది. నష్టం రూ.765 కోట్లుగా ఉండనుందని ఎనలిస్టులు అంచనావేయగా బాటమ్ లైన్ లాభాలతో భారీగా పుంజుకుని రూ.328 కోట్లను నికర నష్టాలను నమోదుచేసింది. 2015-16 సంవత‍్సరం ఇదే క్వార్టర్‌లో రూ.2,714 కోట్ల లాభాలను ఆర్జించింది. ఆదాయం 8126.1 కోట్ల రూపాయల వద్దే నమోదైంది. ఆదాయం రూ .8,135 కోట్లుగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేశారు.
వడ్డీకి ముందు ఆదాయాలు, పన్నులు, తరుగుదల , రుణ విమోచన (ఎబిటాలు) రూ. 2,196 కోట్లు, ఎబిటా మార్జిన్ 27 శాతంగా ప్రకటించింది. కాగా జియో మరో టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ఇండియా ఆదాయం కూడా 6.25 శాతం తగ్గిన సంగతి తెలిసిందే. భారతి ఎయిర్టెల్తో పోల్చితే, 100శాతం దేశీయ మార్కెట్‌పైనే ఆధారపడిన భారీగా నష్టపోయింది. అయితే వోడాఫోన్తో విలీనం కారణంగా 2017 లో స్టాక్ 22 శాతం పెరిగడంతో ఐడియా నష్టాలనుంచి భారీగా కోలుకుంది.