Surprises
-
భార్యను సర్ప్రైజ్ చేసిన భువీ (ఫోటోలు)
-
మీకు తెలుసా..? 'మిస్టర్ ఈట్ ఆల్' తను ఒక అద్భుతం!
ఈ సృష్టి ఓ అద్భుతం అనుకుంటే మనిషి అంతకుమించి అద్భుతాలు చేసి ఔరా! అనిపించుకుంటున్నాడు. ఇంతవరకు ఎన్నో వింతలు విశేషాలు చేసి ఉంటాం. అంతకు మించిన వింతలు, విడ్డూరాలు ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇంతకీ అవేంటంటే..? ► మిస్టర్ ఈట్ ఆల్.. ఫ్రాన్స్‌కు చెంది మైఖేల్ లోటిటోకు ‘మిస్టర్ ఈట్ ఆల్’ అని పేరు. ఇతడు ఐరన్, రబ్బరు, గాజులాంటివి కూడా తినేవాడు. ఈ వింత అలవాటుతో గిన్నిస్ వరల్డ్ బుక్‌లో చోటు సంపాదించాడు. ఇనుమును ఎలక్ట్రిక్ పసర్ సా తో చిన్న చిన్న ముక్కలు చేసి తినేవాడు. పదహారు సంవత్సరాల వయసులో తొలిసారిగా గాజు గ్లాస్‌ను పగలగొట్టి తిన్నాడు. తన యూనిక్ టాలెంట్‌తో ప్రపవచవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాడు. 2007లో చనిపోయాడు. ► బ్రెజిల్ కారాగారాలలో ఖైదీలకు ఎక్సర్ సైజ్ బైక్‌లను తొక్కే అవకాశం ఇస్తారు. ఈ బైక్‌లు కరెంట్‌ను ఉత్పత్తి చేస్తాయి. ► ‘ఫేస్ బుక్’ వచ్చాక ‘అన్‌ఫ్రెండ్’ అనే మాట ప్రాచుర్యం పొందింది. అయితే 1659లో వచ్చిన ‘ది అపీల్ ఆఫ్ ఇన్జ్యుర్డ్ ఇనోసెన్స్’ పుస్తకంలో ఈ పదాfన్ని కాయిన్ చేశారు. -
ఆమె షాకింగ్ సర్ప్రైజ్ మాములుగా లేదుగా! ఉబ్బి తబ్బిబైన ఫ్యామిలీ
ఒక్కోసారి అనుకోని పరిస్థితుల కారణంగా మనవాళ్లే అయిన వాళ్ల ఫంగ్షన్లకి అటెండెంట్ కాలేకపోతాం. ఆ బాధ మాములగా ఉండదు. బిజీ పరిస్థితులు ఒక కారణమైతే చాలా దూరంలో ఉండటం కారణంగా ఖర్చుతో కూడి ప్రయాణం అవ్వడంతో అటెండెంట్ కాలేకపోతాం. ఏ చిన్న అవకాశం దొరికినా చాలు వెళ్లిపోదాం అని వేయికళ్లతో ఎదురు చూస్తాం కూడా. అచ్చం అలాంటి సమస్యనే ఇక్కడొక మహిళ కూడా ఎదుర్కొంది. ఐతే తాను తన కుటుంబమే తన మొదటి ప్రయారిటీ అంటూ చాలా దూరంలో ఉన్న లెక్కచేయకుండా వచ్చేసింది. శ్రద్ధా షెలార్ అనే మహిళ తన కుటుంబంతో సహా రీసెంట్గా యూకేకి వెళ్లింది. ఐతే ఇంతలో తన తమ్ముడి మ్యారేజ్ కుదరడం, జరిగిపోవడం జరిగింది. ఐతే ఆమెకు ఆ పెళ్లికి అటెండెంట్ కాలేని పరిస్థితి. దీంతో కుటుంబసభ్యులు ఒకింత బాధ కలిగినా సరిపెట్టుకున్నారు. ఐతే ఆ మహిళ మాత్రం ఊహించని విధంగా తన తమ్ముడి పెళ్లి వచ్చి అందర్నీ సడెన్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఇక ఆ కుటుంబం ఆనందం అంత ఇంత కాదు. ఆ మహిళ అందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పంచుకుంది. అంతేగాదు ఎక్కడ ఉన్న మన కుటుంబం తర్వాతే ఏదైనా అంటూ అలాంటి అరుదైన సందర్భాన్ని మిస్ చేయొద్దు అంటూ ఒక క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టిట తెగ హల్చల్ చేస్తోంది. View this post on Instagram A post shared by Shraddha Shelar (@shraddha.shellar) (చదవండి: వరుడుకి డబ్బులు లెక్కించడం రాదని..పెళ్లికి నిరాకరించిన యువతి) -
ఆశ్చర్యపర్చిన పీఎన్బీ
సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణంలో చిక్కుకున్న ప్రభుత్వరంగ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) త్రైమాసిక ఫలితాల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చింది. 2018-19 మూడో త్రైమాసిక ఫలితాలను మంగళవారం ప్రకటించింది. దాదాపు రెండు మూడు క్వార్టర్ల తరువాత ప్రోత్సాహకర ఫలితాలను నమోదు చేసింది. అంచనాలను మించిన ఫలితాలను ప్రకటించడంతో ఈ కౌంటర్ ఇన్వెస్టర్లు కొనుగోళ్లతో జోరందుకుంది. 4 శాతం జంప్ చేసింది. ఈ ఏడాది క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో పీఎన్బీ 7 .12 శాతం వృద్ధితో రూ. 246.5 కోట్ల నికర లాభం ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) సైతం 7.6 శాతం పెరిగి రూ. 4290 కోట్లను తాకింది. రూ. 2754 కోట్లమేర ప్రొవిజన్లు చేపట్టింది. గతేడాది(2017-18) క్యూ3లో ఇవి రూ. 4467 కోట్లుగా నమోదయ్యాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 17.16 శాతం నుంచి 16.33 శాతానికి మెరుగుపడ్డాయి. నికర ఎన్పీఏలు సైతం 8.9 శాతం నుంచి 8.22 శాతానికి తగ్గాయి. ఫ్రాడ్కింద రూ. 2014 కోట్లమేర ప్రొవిజన్‌ను చేపట్టినట్లు బ్యాంక్ తెలిపింది. -
జియో ఎఫెక్ట్: ఐడియా ఆశ్చర్యకర ఫలితాలు
ఉచిత ఆఫర్లతో సునామీ సృష్టించిన రిలయన్స్ జియో దెబ్బతో టెలికాం మేజర్ ఐడియా సెల్యులార్ మార్చి క్వార్టర్లో మరోసారి చతికిలబడింది. టెలికాం మార్కెట్ లోకి జియో ఎంట్రీ ఇచ్చిన తరువాత ఐడియా వరుసగా రెండవ త్రైమాసికంలో కూడా నష్టపోయింది. అయితే మార్కెట్ వర్గాలను ఆశ్చరపరుస్తూ నష్టాలనుంచి భారీగా కోలుకుంది. నష్టం రూ.765 కోట్లుగా ఉండనుందని ఎనలిస్టులు అంచనావేయగా బాటమ్ లైన్ లాభాలతో భారీగా పుంజుకుని రూ.328 కోట్లను నికర నష్టాలను నమోదుచేసింది. 2015-16 సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.2,714 కోట్ల లాభాలను ఆర్జించింది. ఆదాయం 8126.1 కోట్ల రూపాయల వద్దే నమోదైంది. ఆదాయం రూ .8,135 కోట్లుగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేశారు. వడ్డీకి ముందు ఆదాయాలు, పన్నులు, తరుగుదల , రుణ విమోచన (ఎబిటాలు) రూ. 2,196 కోట్లు, ఎబిటా మార్జిన్ 27 శాతంగా ప్రకటించింది. కాగా జియో మరో టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ఇండియా ఆదాయం కూడా 6.25 శాతం తగ్గిన సంగతి తెలిసిందే. భారతి ఎయిర్‌టెల్‌తో పోల్చితే, 100శాతం దేశీయ మార్కెట్‌పైనే ఆధారపడిన భారీగా నష్టపోయింది. అయితే వోడాఫోన్‌తో విలీనం కారణంగా 2017 లో స్టాక్ 22 శాతం పెరిగడంతో ఐడియా నష్టాలనుంచి భారీగా కోలుకుంది. -
ఆర్బీఐ మరో సరప్రైజ్ ఇవ్వనుందా?
న్యూఢిల్లీ : ఆశ్చర్యకరమైన హాట్రిక్ సర్ప్రైజ్ ల తర్వాత, మరో ఆశ్చర్యకరమైన నిర్ణయాన్ని ఆర్బీఐ ప్రకటించనుందా? రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ రివ్యూ మార్కెట్లకు దిశా నిర్దేశం చేయనుంది. ఆర్బిఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) గురువారం మరోసారి తన ద్రవ్య, పరపతి విధానాన్ని మధ్యాహ్నం 2.30 తరువాత ప్రకటించనుంది. ఇందుకోసం ఆర్బిఐ గవర్నర్ ఉర్జిత పటేల్ అధ్యక్షతన ఈ కమిటీ బుధవారం సమావేశమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమీక్షలోనూ కీలకమైన రెపో రేటును యథాతథంగానే కొనసాగించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా. కీలక వడ్డీ రేటు లేదా రెపోరేటు 6.25 దగ్గర స్థిరంగా ఉంచే అవకాశం ఉందని ఎనలిస్టులు భావిస్తున్నారు. రాయిటర్స్ కు చెందిన 60మంది ఆర్థికవేత్తలు.. ఆరుగురు సభ్యులు ద్రవ్య విధాన కమిటీ రెపో రేటు అక్టోబర్ నాటి స్థాయినే యధాతధంగా కొనసాగించవచ్చని అంచనా వేశారు. అయితే ఆర్బీఐ అక్టోబర్ లో అనూహ్యంగా వడ్డీరేట్ల కోత విధించింది. ఫిబ్రవరిలో కూడా ఆర్బీఐ"తటస్థ" వైఖరితో ఆశ్చర్యపరిచింది.. ద్రవ్యోల్బణం, ఆర్థిక వ్యవస్థపై పెద్ద నోట్ల రద్దుపై స్పష్టమైన అవగాహన ఏర్పడిన తర్వాతే ‘రెపో’ రేటు తగ్గింపుపై నిర్ణయం తీసుకుంటామని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఫిబ్రవరి సమీక్షలోనే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆర్బిఐ కీలకమైన వడ్డీ రేట్లను పావు శాతం అటుఇటుగా మార్చే అవకాశం ఉందని అంచనా. జీఎస్టీ, 7వ వేతన సంఘం, ద్రవ్యోల్బణం, పెరుగుతున్నకూరగాయల ధరల ఆందోళనల నేపథ్యంలో ఆర్బీఐ తీసుకునే నిర్ణయం బ్యాంకులు బాండ్లపై నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తుందని విశ్లేషిస్తున్నారు. అలాగే ఎలనినో భయాలు ఆహార ధరలను పైకి నెట్టొచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 39 నెలల గరిష్ఠ స్థాయికి చేరింది. ఆహార, ఇంధన ధరలూ పెరుగుతున్నాయి. మరోవైపు అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వు కూడా వడ్డీ రేట్లు పెంచుకుంటూ పోతోంది. ఈ నేపథ్యంలో ఎంపిసి ఈ సారి కూడా రెపో రేటు తగ్గింపువైపు మొగ్గు చూపక పోవచ్చని భావిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత దాదాపు రూ.14 లక్షల కోట్ల నగదు చేరింది. దీంతో చలామణి నుంచి తొలగించేందుకు ఈ పరపతి సమీక్షలో ఆర్బిఐ చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నారు. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్డీఎఫ్) వంటి చర్యలను ఆర్బీఐ తీసుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. కేంద్ర బ్యాంకు యొక్క ప్రధాన దృష్టి తటస్థ విధానం కంటే బ్యాంకుల లిక్విడిటీని తొలగించే చర్య ఎక్కువగా ఉండనుందని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్త అభీక్ బారువా అభిప్రాయపడ్డారు.