సాక్షి,ముంబై: ప్రముఖ టెలికాం ఆపరేటర్, ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ ఐడియా సెల్యులర్ మళ్లీ ఫలితాల్లో నిరాశపర్చింది. ఆర్థిక సంవత్సరం క్యూ3లో నష్టాలను నమోదు చేసింది. మంగళవారం విడుదల చేసిన కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.1,284 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం రూ. 6510 కోట్లను తాకింది. క్యూ2లో రూ. 7466 కోట్ల ఆదాయం సాధించింది. ఆపరేటింగ్ మార్జిన్ 18.8శాతంగా ఉంది.గత ఏడాది ఇది 20శాతంగాఉంది. అయితే వినియోగరుదాల మార్కెట్‌లో వృద్ధిని సాధించింది. డిసెంబర్ నాటికి 20.3 కోట్లమంది వినియోగదారులను కలిగి ఉన్నట్లు వెల్లడించింది.
2017 డిసెంబర్ నాటికి నికర రుణాలు రూ. 55,780 కోట్లకు చేరినట్లు ఐడియా సెల్యులర్ ఫలితాల విడుదల సందర్భంగా వివరించింది. మరోవైపు యూకే దిగ్గజం వొడాఫోన్‌తో విలీన ప్రక్రియ తుది దశకు చేరిందని, 2018 మొదటి త్రైమాసిం నాటికి ఈ విలీనం పూర్తికావచ్చని పేర్కొంది. ఈ ఫలితాల నేపథ్యంలో మార్కెట్ ఆరంభంనుంచి నష్టాల్లో ఉన్న ఐడియా కౌంటర్ మరింత బలహీనపడి దాదాపు 5శాతం పతనాన్ని నమోదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment